Activities calendar

14 August 2017

22:01 - August 14, 2017

పల్లెకలె : పల్లెకెలె టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. భారత్‌ ఆల్‌రౌండర్‌ ఇన్నింగ్స్‌తో శ్రీలంక ఓటమి చవిచూసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 487 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆటగాళ్లు... తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకు కుప్పకూలింది. తర్వాత ఫాలో ఆన్‌ ఆడిన లంక... రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌ 171 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసి... విదేశీ గడ్డపై సిరీస్‌ను దక్కించుకున్న జట్టుగా టీమిండియా రికార్డ్‌ సృష్టించింది.

21:59 - August 14, 2017

ఢిల్లీ : అసోం, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లో వరదలు ముంచెత్తాయి. బ్రహ్మపుత్ర, బాగ్‌మతి, గండకి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో వరద తాకిడి పెరిగింది.ఈశాన్య రాష్ట్రం అసోంలో భారీ వర్షాలకు బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి ఉధృతి 37వ జాతీయ రహదారి నీట మునిగింది. 23 లక్షల మంది వరదలు ప్రభావం చూపాయి. 2 లక్షల మంది నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. గడచిన 24 గంటల్లో 9 మంది మృతి చెందారు. అసోం నుంచి ఇతర ప్రాంతాలకు రైలు ప్రయాణం తెగిపోయింది. 20 రైళ్లను రద్దు చేశారు. కజిరంగా నేషనల్‌ పార్కు 80 శాతం నీట మునగడంతో జంతువులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. సైనికులు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. త్రిపురలో కూడా లక్షలాది మంది వరద ప్రభావానికి గురయ్యారు.

బిహార్‌లో వరదలు ముంచెత్తాయి
గత కొన్ని రోజులుగా నేపాల్‌లోని తరాయి, బిహార్‌లోని సీమాంచల్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు నేపాల్‌లోని వాల్మీకీనగర్‌ గండక్ బ్యారేజీలో భారీగా నీరు చేరడంతో సుమారు 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో బిహార్‌లో వరదలు ముంచెత్తాయి. కిషన్‌గంజ్‌, గోపాల్‌గంజ్, పూర్ణియా, అరరియ, కటిహార్ తదితర 12 జిల్లాలు వరదలకు ప్రభావితమయ్యాయి. అధికారులు తీరప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.భారీ వర్షాల కారణంగా రైలు, కరెంట్, టెలికాం సేవలు నిలిచిపోయాయి. పలుచోట్ల రైల్వే ట్రాక్‌లు నీట మునగడంతో యూపీ-బిహార్‌ల మధ్య 30 రైళ్లను రద్దు చేశారు.వరద ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని బిహార్‌ సిఎం నితీష్‌కుమార్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

సరిహద్దుల్లో ఎడతెరపి లేని వాన
ఉత్తరప్రదేశ్‌-బిహార్‌-నేపాల్‌ సరిహద్దులో గత 72 గంటలుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. గంగ, కోసి, మహానంద నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.వేలాది ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. గోరఖ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులో రన్‌వే నీట మునగడంతో విమానాల రాకపోకలను రద్దు చేశారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రను నిలిపివేశారు. మల్సా జిల్లాలో వరదల కారణంగా ముగ్గురు మృతి చెందారు. యాత్రకు వెళ్లిన వారిలో ఏడుగురు తప్పిపోయినట్లు సమాచారం. ప్రయాణికులతో పాటు నలుగురు పారాఫోర్స్ జవాన్లు గల్లంతయ్యారు. ప్రయాణికులు, పారాఫోర్స్ జవాన్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

21:55 - August 14, 2017

ఢిల్లీ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదిని కలుసుకున్నారు. అరగంటసేపు వీరి సమావేశం జరిగింది. అన్నాడిఎంకెలో రెండు వర్గాల విలీనం, తదితర అంశాలపై సెల్వం ప్రధానితో చర్చలు జరిపినట్లు సమాచారం. తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పన్నీర్‌ సెల్వం ప్రధానికి వివరించినట్లు ఆ పార్టీ నేత మైత్రేయన్ తెలిపారు. రెండు రోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ప్రధానితో సమావేశం జరిపిన విషయం తెలిసిందే. ఎఐఎడిఎంకేని పన్నీర్‌, పళని స్వామి వర్గాలను ఏకం చేసి ఎన్డీయే చేర్చుకోవడానికి బిజెపి యత్నిస్తోంది.

21:54 - August 14, 2017

ఢిల్లీ : గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. చిన్నారుల మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని యోగి సర్కార్‌ను ఆదేశించింది. ఈ ఘటన జీవించే హక్కుకు విఘాతం కల్పించిందని ఎన్‌హెచ్‌ఆర్‌సి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీఆర్డీ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఐదు రోజుల్లోనే 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం విదితమే. మరో తొమ్మిది మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 72కి చేరింది.

21:53 - August 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కింగ్‌పిన్ కెల్విన్...కెల్విన్ అరెస్టుతో తుట్టె కదులుతుంది..ఇప్పటికే టాలివుడ్‌తో పాటు కాలేజీలు..ప్రముఖుల పిల్లలున్న స్కూళ్ల వ్యవహారం బయటకు వచ్చింది...అయితే కెల్విన్‌ ఖాతాలో ఒక్క టాలివుడ్‌ ప్రముఖులే కాదు..ఎందరో ఉన్నారని తేలింది..దీంతోనే తాను దందాను విస్తరించేందుకు రకరకాలుగా ఎందరినో ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది.గాబ్రియల్...గతంలో డ్రగ్స్‌ కేసులో అరెస్టు కాగా బెయిల్‌పై వచ్చాక కూడా ఇదే దందాను కొనసాగిస్తున్నాడు..అప్పటి నుంచి కన్పించని గాబ్రియల్ పేరు అనూహ్యంగా బయటకు రావడంతో పోలీసులు ఓ దశలో నాలుక్కరుచుకున్నారు కూడా... గాబ్రియల్‌ను అరెస్టు చేసేవరకు మాత్రమే దృష్టి పెట్టిన పోలీసులు ఆ తర్వాత అతను బెయిల్‌పై వచ్చాక ఏం చేస్తున్నాడు...? ఎక్కడున్నాడన్న విషయాలపై నిఘా పెట్టలేదు..దీంతో నగరంలో మత్తు సామ్రాజ్యం విస్తరించేందుకు గాబ్రియల్ కూడా కీలకంగా మారాడని తెలియడంతో పోలీసులు ఖంగుతిన్నారు....బెయిల్‌పై బయటకు వచ్చాక సికింద్రాబాద్‌లో సుస్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న గాబ్రియల్‌...తన గర్ల్‌ ఫ్రెండ్‌తో ఎస్తేరును పెళ్లి చేసుకుని యాప్రాల్‌...గ్రీన్‌వుడ్ రెసిడెన్సీలో ఉంటూ అక్కడి నుంచే దందా కొనసాగిస్తున్నాడు... గోవా,ముంబాయి,పూణేల నుంచి డ్రగ్స్‌ తెప్పించి హైదరాబాద్‌లో కస్టమర్లకు..సరఫరా చేస్తూనే నైజీరియన్ డ్రగ్స్ ముఠాలో కీలకంగా మారాడు...ఒక్కో గ్రాముకు 6 వేలకు విక్రయిస్తూ గర్ల్‌ ఫ్రెండ్‌ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తూ దందా చేస్తున్నట్లు తేలింది...ఢిల్లీ, ముంబాయి, గోవాలకు వెళ్తూ అక్కడి ముఠాలతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు...బంజారాహిల్స్‌ పబ్స్‌లలో ఎక్కువగా సరఫరా...చేస్తూనే పబ్‌లకు వచ్చేవారు ఎక్కడైనా పార్టీలు రేవ్‌లాంటివి ఏర్పాటు చేసుకుంటే వారికి సరఫరా చేస్తుంటాడు.

బెజవాడ కిలాడీ సంగీతతో ప్రేమాయణం
గాబ్రియల్‌ గతంలో బెజవాడ కిలాడీ సంగీతతో కొన్నాళ్లు ప్రేమాయణం కొనసాగించాడు..ఆ తర్వాత తన ప్రేయసి ఎస్తేర్‌ను పెళ్లి చేసుకుని ఉంటూనే ఎంజాయ్ లైఫ్ కొనసాగిస్తున్నాడు...ఈ మధ్యకాలంలో దొరికిన సంగీత ద్వారా గాబ్రియల్ సమాచారం బయటపడింది.ఇక తాజాగా దొరికిన గాబ్రియల్ గ్యాంగ్‌లో కీలకమైన డ్రగ్స్ పెడ్లర్‌ నవ్యత్....హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ ...కమలానగర్లో నివాసముంటున్న నవ్యత్‌ గీతాంజలి కాలేజీలో బీటెక్ చదువుతూనే డ్రగ్స్‌కు అలవాటు పడి ఆ తర్వాత దందాలోకి దిగాడు...ఆన్‌లైన్‌లో డ్రగ్స్ ఆర్డర్లు తీసుకుని సరఫరా చేస్తున్న నవ్యత్ ఖాతాలో సినీ ప్రముఖులు..ఇతర రంగాలకు చెందిన పెద్దోళ్లే కస్టమర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది......ఇక నవ్యత్ సెల్‌ఫోన్లో దాదాపు 50 మందికి పైగా అమ్మాయిల ఫోన్ నంబర్లున్నాయి..దీన్ని బట్టి అమ్మాయిలకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుఅనుమానిస్తున్నారు...అయితే వారెవరు..? ఏం చేస్తున్నారన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆన్‌లైన్, వాట్సాప్‌ గ్రూపుల ద్వారానే
ప్రధానంగా ఆన్‌లైన్, వాట్సాప్‌ గ్రూపుల ద్వారానే దందా చేస్తున్న నవ్యత్ కొకైన్, ఆప్టమైన్‌పిల్స్...ఎం డీఎంఏ,ఎల్‌ఎస్‌డీ... హెరాయిన్...సప్లై చేస్తారు...హైదరాబాద్,గోవాలకు సరఫరా...చేస్తున్నారు...ఒక్కో పిల్‌కు 1500 రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది...ఇక ఆర్డర్ల డబ్బు పేటీఎం ద్వారా కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారని తేలింది..ఇలా కొద్ది కాలంలోనే నవ్యత్‌ లక్షల్లో డబ్బు సంపాదించాడు. అంకిత్‌ పాండే...వెల్‌ ఎడ్యూకేట్... అతని చదువు చూసిన పోలీసులే ఆశ్చర్యపోయారు...నాగ్‌పూర్, మహారాష్ట్ర చెందిన అంకిత్ పాండే డ్రగ్స్‌కు అలవాటు పడి బంజారాహిల్స్‌లోని పబ్‌లో పనిచేసేవాడు...అక్కడికి వచ్చే నైజీరియన్లతో సంబంధాలు పెట్టుకుని డ్రగ్స్ దందా చేస్తున్నాడు...ప్రస్తుతం రాజేంద్రనగర్‌లోని నలందనగర్ లో ఉంటున్నాడు..ఇక గణత్‌కుమార్...కెపీహెచ్‌బీ...మలేషియా టౌన్‌షిప్ నివాసముంటూ...డ్రగ్స్ దందా చేస్తున్నాడు..ఇతను ప్రధానంగా...మాదాపూర్,గచ్చిబౌలి...తదితర ప్రాంతాల్లో డ్రగ్స్‌ సప్లై.. చేస్తన్నాడు...కెల్విన్,గాబ్రియల్,నవ్యత్‌లకు రెగ్యులర్ టచ్‌లో ఉంటూ వ్యాపారంలో బిజీగా మారాడు.

21:51 - August 14, 2017

విజయవాడ : విజయవాడలో కాపుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు మంత్రివర్గంలోని కాపు మంత్రులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కాపు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాపుల రిజర్వేషన్లు, జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ నివేదిక, ముద్రగడ పద్మనాభం పాదయాత్ర, ఈవర్గం రిజర్వేషన్లపై వైసీపీ, కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రకటనలు తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. బీసీలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

తర్వలో కాపు భవన నిర్మిణం
తర్వలో కాపు భవనాన్ని నిర్మించాలని నిర్ణయించామన్నారు. కాపు సామాజిక వర్గాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, కాపుల రిజర్వేషన్లపై మొసలి కన్నీరు కారుస్తున్న ప్రతిపక్ష నేత జగన్‌... గుంటూరు లో జరిగిన వైసీపీ ప్లీనరీలో ఈ అంశంపై ఎందుకు తీర్మానం చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల ప్రణాళికలో ఎందుకు చేర్చలేదో చెప్పలాని నిలదీశారు. అన్ని విధాల వెనుకబడి ఉన్నామన్న భావనతో ఉన్న కాపులను విద్య, ఉద్యోగ, ఆర్థికపరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్న విషయాన్ని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. కాపులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీల నేతల మాటలు విశ్వసించొద్దని, ఇటువంటివారిపట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

21:49 - August 14, 2017

ఢిల్లీ : 71వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలు సమాజం, జాతి నిర్మాణానికి దోహదం చేశాయని...ఇప్పటికి ఆయన సిద్ధాంతాలు అనుసరణీయమని రాష్ట్రపతి అన్నారు. జాతి నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 2022 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నందున... న్యూ ఇండియా దిశగా అడుగులు వేయాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. న్యూ ఇండియా అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు, అవసరానికి సరిపడే విద్యుత్‌, మంచి రోడ్లు, ఆధునిక రైల్వే నెట్‌వర్క్‌ లాంటి అభివృద్ధి లక్ష్యాలను సాధించాలన్నారు. 

21:33 - August 14, 2017

హైదరాబాద్ : టీఆర్ఎస్ వ్యతిరేకంగా విపక్షాలు విమర్శల దాడిని పెంచుతున్నాయి. నేరెళ్ల ఘటనలో అధికార పార్టీని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు మాటల దాడి మరింత పెంచాయి. ప్రభుత్వ తీరు ఎండగడతూ గులాబీ పార్టీకి చుక్కలు చూపిస్తాన్నాయి. గత మూడేళ్లుగా ప్రభుత్వ వైఫల్యాలపై విపక్షాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఎంసెట్ లీకేజీ, మియాపూర్ భూకుంభకోణం ప్రతిపక్షాల పోరాటం అధికార పార్టీని పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయింది. కానీ కరీంగనర్ జిల్లా నేరెళ్ల ఘటన విపక్షాలను ఒకేతాటిపై నిలిపింది. ముఖ్యంగా వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్ దూకుడుతో గులాబీ పార్టీ ఉక్కిరిబికిరౌతుంది. ప్రతిపక్ష పార్టీలన్ని నేరెళ్ల ఘటనలో బాదితులకు అండగా నిలవడంతో అధికార పార్టీ దిగిరాక తప్పలేదు. బాదితులకు అండగా ఉంటమంటూ ఓదార్పు మొదలు పెట్టింది గులాబీ దళం. అయిన ప్రతిపక్ష పార్టీలు మరో అడుగు ముందకెసి ప్రభుత్వ వైఖరి మరింత ఎండట్టేందుకు సిద్ధమౌతుండడం కేసీఆర్ టీం రుచించడం లేదు.మరోవైపు టీఆర్ఎస్ మిత్రపక్షంగా వ్యవరిస్తున్న ఎంఐఎం సైలెంట్ గా ఉన్న నిన్నమొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీతో అవగాహనలో ఉన్నట్లు కనిపించిన బీజేపీ క్రమంగా వ్యతిరేక గళం వినిపిస్తోంది.

దిద్దుబాటు చర్యలు...
ప్రతిపక్ష పార్టీలకు కళ్లేం వేసేందుకు టీఆర్ఎస్ నేతలు సమయాత్తం అవుతున్నారు. నేరెళ్ల వ్యవహరం రాజకీయంగా ఇబ్బందులు సృష్టిస్తుండడంతో క్షేత్రస్థాయిలో కూడా దిద్దుబాటు చర్యలపై అధికార పార్టీ దృష్టిసారిస్తుంది. విక్షాలను ఎదుర్కొనే వ్యూహాలు తోచక పార్టీ దాదాపు డిఫెన్స్ లో పడుతుందని గులాబీ నేతలే చెప్పుకుంటున్నారు.

20:20 - August 14, 2017

తెలంగాణలున్న ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు వొయ్యి గవర్నర్ నర్సింహన్ సారు తాన మొత్తుకున్నరట.. తెలంగాణల దళితులు బీసీలు, మైనార్టీలకు అన్యాయం అయితున్నది..? మీరు దయచేసి ఇది అడ్డుకోవాలె లేకపోతె ఈ ప్రభుత్వం వాళ్లను సంపేశెతట్టే ఉన్నదని చెప్పిండ్రట.. ఈ ముచ్చట ఎట్లున్నదంటే.. డోలొచ్చి మద్దెలతోని మొత్తుకున్నట్టులేదు..

అయ్యా ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చినరాజప్పగారు.. మీరు కడ్పుకు అన్నమే తింటున్నరుగదా..? ఆ ఎందుకంటె అందరికి అనుమానమొస్తున్నది.. సారు అన్నమే తింటున్నడా ఇంకేమన్న తింటున్నడా అని..? మరి ఎందుకొచ్చింది ఆ అనుమానం అంటే.. ఇగో ఇయ్యాళ తమరు జేశిన ఉద్దార్కానికి రాకపోతె పర్శాను...

హురక వానలు వడాల్నంటే.. మేఘాలు సల్లవడి మొగులు మీదికెళ్లి నీళ్లువడ్తయని తెల్సుగదా మనకు.? ఇప్పుడు అట్లవడ్తలేవట వర్షాలు.. మేఘాలతోని పనేలేదు.. ఆకాశంల వాతావరణ మార్పుల యవ్వారమే లేదు.. అంతటేమోగని.. తెలంగాణల వానలు మాత్రం కేసీఆర్ జేస్తున్న యాగాలతోనే వడ్తున్నయట.. మాన్య ఖమ్మం ఎమ్మెల్యే సారు జెప్తున్నడు..

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలళ్ల బీజేపీ అభ్యర్థులను ఓడగొట్టె ఛాన్సు ఓటర్లకు ఇచ్చెతట్టు లేరుగదా..? బీజేపీ కార్యకర్తలు వాళ్లే ఆ బాధ్యతను బుజాన ఏస్కున్నట్టనిపిస్తున్నది.. మా పార్టీని మేమే సావుదెబ్బగొడ్తం.. డిపాజిట్లు రాకుంట జేస్తం.. అని బీజేపీ ఆఫీసుకాడ ప్రతిజ్ఞ జేశిండ్రు.. ఓటర్లు గూడ మా బాధ్యత మీరే దీస్కున్నరా..? అని ఫీలైతున్నరట..

ఆంధ్రప్రదేశ్ పోలీసోళ్లకు నిజంగ ధమ్ముంటే.. ఎంటనే చంద్రబాబు మీద ఒక కేసు బుక్ జెయ్యాలే.. తాగువోతుల శాఖా మంత్రి మీద ఇంకో కేసు బుక్కు జెయ్యాలే.. ఎందుకంటె ఒక కానిస్టేబుల్ సీఐ మీదికి ఎగిరెగిరి దుంకుతున్నడు.. పోలీసు స్టేషనంత ఆగమాగం జేస్తున్నడు.. అగో గదానికి గిదానికి ఏం సంబంధం అంటరా సూడుండ్రి మీకే తెలుస్తది..

తాగితె ఎవ్వడు ఏం జేస్తడో తెల్వది..? ఇప్పుడు సూస్తిరిగదా..? పత్తికొండ పోలీసు కానిస్టేబుల్ యవ్వారం.. ఇగో ఇది ఇంకోటి.. తెలంగాణల అయ్యింది.. ఆడ కానిస్టేబుల్ కయ్యం దీస్తే.. ఈడ తాగిన పోరగాళ్లు తన్నుకున్నరు.. నడిరోడ్డు మీద ట్రాఫికును ఎక్కడికక్కడ ఆపేశి.. తాగువోతు వీఐపీలంత.. వీరంగ జేశిండ్రు సూడుండ్రి..

అప్పట్ల పోలీసోళ్ల తుపాకి మిస్ ఫైర్ అని వార్తలొస్తుండే.. ఇప్పుడు అవ్వి తక్వైనయ్.. సెల్ ఫోన్ ఫైరింగులు వెర్గినయ్.. ఎప్పుడు ఏ ఫోన్ పేలిపోతున్నదో అర్థమైతలేదు.. చైనా మాల్ అగ్వకొస్తున్నదని కొంటె.. అవ్వి వేలవట్టే.. ఇండియా తయ్యారీ ఫోన్లు మాకు పేలుడు శాతగాదా అన్నట్టు అవ్విగూడ బ్లాస్ట్ అయితున్నయ్.. పశ్చిమగోదావరి జిల్లాల ఒక పోరని జేవుల వేలింది ఫోను..

భారతదేశానికి గాంధీతాత జాతిపిత ఎట్లనో... అదే భారతావనికి అల్లుని అసొంటి మన్షి విజయ్ మాల్యా సారు.. అత్తాగారింటిమీద అల్గినట్టు దేశం మీద అల్గి లండన్కువాయేగదా... ఇగ అల్గులళ్ల కెళ్లి దించి ఇండియాకు వట్కొచ్చె పని మొదలు వెట్టిండ్రట.. నవగ్రహాలన్ని ఒక్కటే కక్షలకొచ్చి దీవెనార్తి వెట్టంగనే సారును దీస్కొస్తరట.. ఇగ అల్లునికోసం అన్ని ఏర్పాట్లు పూర్తైనయట ఇప్పటికే..

 

20:13 - August 14, 2017

శ్రీకాకుళం : అది క్విట్‌ ఇండియా ఉద్యమం హోరెత్తుతోన్న రోజులవి. మహాత్మగాంధీ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా అప్పుడు సిక్కోలులో అడుగుపెట్టారు. ఆముదాలవలస మండలం దూసీ రైల్వేస్టేషన్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సమయంలో గాంధీ నాటిన మొక్క నేడు మహావృక్షంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాటి గుర్తులను గ్రామస్తులు నెమరేసుకుంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

20:12 - August 14, 2017

విశాఖ : సిపాయిల తిరుగుబాటు మొదటి స్వాతంత్ర్య పోరాటం. కానీ దానికంటే ముందుగానే విశాఖ జిల్లాలో.. బ్రిటీష్‌ సైన్య సహకార పద్ధతికి వ్యతిరేకంగా శిస్తు కట్టడానికి విజయనగర రాజులు నిరాకరించారు. దీంతో మద్రాస్‌ బ్రిటీష్‌ ప్రభుత్వం అప్పట్లో శిస్తు కట్టకపోతే విజయయనగర సంస్థానంపై దాడి చేస్తామని ప్రకటించింది. దీనికి విజయనగర రాజు అయిన రెండో విజయరామ గజపతి నిరాకరించాడు. సంస్థానాన్ని వదిలి వెళ్లకపోతే దాడి చేస్తామని బ్రిటీష్‌వారు హెచ్చరించినా పట్టించుకోలేదు.

బ్రిటిష్ సైన్యాంతో యుద్ధం
1974 జులై 10న విశాఖ జిల్లా పద్మనాభం వద్ద బ్రిటీష్‌ సైన్యానికి.. రెండో విజయరామ గజపతి రాజుకు యుద్ధం జరిగింది. అధునాతన ఫిరంగులు, తుపాకులు వాడి బ్రిటీష్‌ వారు యుద్ధం చేశారు. విజయనగర సంస్థనాధీశులు సంప్రదాయ కత్తులతో యుద్ధం చేశారు. ఈ యుద్ధం కేవలం ఒక్క రోజులో ముగిసింది. కానీ విజయనగర రాజులు బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా చేసిన పోరాటం భవిష్యత్‌ తరాలకు దారి చూపింది. పద్మనాభం యుద్ధానికి గుర్తుగా పద్మనాభం వద్ద స్మారకాన్ని నిర్మించారు. మన్యం పితూరి ద్వారా రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు పుట్టింది ఇక్కడే. 1987 జులై 4న పాండ్రంగిలో పుట్టాడు. మల్లుదొర, అగ్గిదొర, అల్లూరి బ్రిటీష్‌ వారి వెన్నులో వణుకు పుట్టించారు. అయితే బ్రిటీష్‌ ప్రభుత్వం 1924 మే 7న అల్లూరిని కాల్చి చంపింది. అల్లూరితో పాటు ఆయన అనుచరుడు మల్లుదొర సమాధులను ఒకే చోట ఏర్పాటు చేశారు. ఇక గొప్పగొప్పవాళ్లెందరో విశాఖ నుంచి స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమయ్యారు.

విడదీయరాని అనుబంధం...
ఇక గాంధీకి విశాఖ జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన భీమిలిలో రెండుసార్లు పర్యటించారు. మహాత్మా గాంధీ భీమిలి రొట్టెల వీధిలోని శ్రీరామ మందిరానికి ఈ మార్గంలోనే కాలినడకన వచ్చారు. అంతవరకూ అంటరానివారిగా దూరంగా ఉంచిన దళితులను, మత్స్యకారులను ఈ మందిరంలోకి ప్రవేశం కల్పించి పూజలు నిర్వహించారు. అప్పటి నుంచి ఈ రామ మందిరంలో మహాత్ముని చిత్రపటం ఉంటుంది. గాంధీజీ గురువారం ఇక్కడకు రావడంతో ఆ రోజు నుంచి భీమిలి మత్స్యకారులు గురువారం మాంసాహారం ముట్టుకోరు. వేటకు వెళ్లరు. 

20:10 - August 14, 2017

ప్రకాశం : తెలుగు ప్రజలకు ఆరాధ్యుడు... ఉద్యమకారుడు.. టంగుటూరు ప్రకాశం పంతులు! స్వాతంత్ర్యోద్యమంలో తెలుగువారి పోరాటానికి ఆయన ప్రతీకగా నిలిచారు. ఎన్నో జాతీయ ఉద్యమాలకు నాంది పలికారు. మహాత్మా గాంధీ సైతం టంగుటూరి త్యాగ నిరతికి మెచ్చి తెలుగువారి ప్రతినిధిగా ఉద్యమ బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం జిల్లా.. నాగులుప్పలపాడు మండలం వినోదిరాయునిపాలెంలో ప్రకాశం పంతులు జన్మించారు. సనాతన పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా... పోరాటాలకు వెనకడుగు వేయలేదు. ఎన్నో అవస్థలు పడుతూ చదువుకుని ఉన్నత స్థితికి చేరారు. లాయర్‌గా స్థిరపడి... మద్రాసులో రెండు చేతులా సంపాదించారు. కొన్న ఆస్తులన్నీ పోరాటాలకే ధారపోశారు. తాను పుట్టి పెరిగిన గ్రామంలో ఉన్న సొంతింటి స్థలం కూడా అమ్ముకున్నారు.

నిరాండంబ జీవితం....
పేరున్నా... డబ్బున్నా..పదవుల్లో ఉన్నా... ప్రకాశం పంతులు నిరాండంబరంగానే జీవించారు. అందరం మనుషులమనే భావనతో అతి సాధారణ జీవితాన్నే గడిపాడు. అందుకే దేశం ఆయన్ని ఆంధ్రకేసరి అని సంబోధించినా వినోదిరాయునిపాలెం మొత్తం అప్పట్లో పంతులుగారు అని వినమ్రంగా పిలుచునేవారు. ఈ ఉద్యమ యోధునితో వినోదిరాయుని పాలెంకు ఉన్న అనుబంధం మాత్రం విడదీయరానిది. అప్పట్లో ఆ ప్రాంతం నుంచి మాదాల నారాయణ స్వామిపై .. ప్రకాశం పంతులు ఎమ్మెల్యేగా పోటీ కూడా చేశారు. ప్రకాశం పంతులు ఎప్పుడూ సాధారణంగా ఉండేవారని.. అందరితోనూ కలిసిపోయేవారని గ్రామంలో పత్యక్షంగా ఆనాడు చూసినవారు చెబుతున్నారు.ప్రకాశం పంతులుగారు.... 1957లో అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అయినా ఆయన ఉద్యమ స్ఫూర్తి నేటికే కాదు భవిషత్య్ తరాలకు కూడా ఆచరణీయమనే చెప్పుకోవాలి.

20:08 - August 14, 2017

నెల్లూరు : అది ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ సమయం. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా భారతజాతి ఒక్కటైన వేళ. నిరసనలతో యావత్‌ భారతావని అట్టుడికి పోతున్న సమయం. దండియాత్ర సెగలు ప్రకాశం జిల్లాకు వ్యాపించాయి. నాగులుప్పలపాడు మండలం దేవరంపాడులోనూ దండియాత్ర వేడి రాజుకుంది. జాతీయ నాయకుల సమావేశాలు దేవరంపాడు తీరంలో జరుగుతుండేవి. అర్థరాత్రి ఇక్కడ సమావేశాలు నిర్వహించి సమాచారాన్ని గాంధీ మహాత్మునికి చేరవేసేవారు. ఇక్కడ జరిగిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం ఆధారంగానే దక్షిణాదిలో పరవళ్లు తొక్కుతున్న మొత్తం ఉద్యమాన్ని బేరీజు వేసేవారు.దేవరంపాడు వచ్చిన బాబూ రాజేంద్రప్రసాద్, టంగుటూరి ప్రకాశం పంతులు స్వాత్రంత్ర్య ఉద్యమాన్ని భుజాలకెత్తుకెత్తున్నారు.

దేవరంపాడులో30 అడుగుల గాంధీ స్థూపాం
వందలాదిమంది భారతీయులు రేయింబవళ్లు ఉద్యమానికి ఊపిరులూదారు. ఈ ఉద్యమం కోసం దేవరంపాడు గ్రామస్తులు ఆర్థిక, ఆహార వసతులు కల్పించారు. ఇక్కడి సత్యాగ్రహ ఉద్యమానికి గాంధీ సైతం ముగ్దులయ్యారు. ఇందుకు చిహ్నంగా ఒక స్థూపాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దండి యాత్ర, గాంధీ ఇర్విన్ ఒడంబడిక విజయాలకు చిహ్నంగా దేవరంపాడులో30 అడుగుల గాంధీ స్థూపాన్ని నిర్మించారు. దీన్ని నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. భారత జాతీయోద్యమ చరిత్రలో దేవరంపాడు చిరస్థాయిగా నిలిచిపోతుందని రాజేంద్రప్రసాద్‌ తన సొంత దస్తూరిలో పొందుపర్చారు.

కాలగర్భంలో దేవరంపాడు చరిత్ర
జాతీయోద్యమ కాలంలో ఎందరో ఉద్యమకారులకు వేదికగా మారిన దేవరంపాడు చరిత్ర కాలగర్భంలో కలిసిపోతోంది. కాల క్రమేణా ఈ స్థలం గొప్పతనాన్ని మరిచిపోతున్నారు. అధికారులకు ఏడాకోసారి మాత్రమే దేవరంపాడు గుర్తుకువస్తోంది. నాటి చిహ్నాలను అన్నింటిని కలిపి దేవరంపాడు మ్యూజియంగా ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామీలు అమలుకు నోచుకోలేదు. అంతేకాదు... మ్యూజియం కోసం దాతలు ఇచ్చిన భూమిని కాజేసేందుకు అక్రమార్కులు బయలుదేరారు. ఇప్పటికైనా ప్రభుత్వం మ్యూజియం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

20:06 - August 14, 2017

చిత్తూరు : జనగణమణ గీతానికి ఎంతో శక్తి ఉంది. ఈ పాటవినగానే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుస్తాయి. యావత్‌ భారత జాతిని కదిలించే శక్తి ఈ పాటకు ఉంది. అలాంటి జాతీయ గీత రచనకు చిత్తూరు జిల్లాలో బీజాలు పడ్డాయి.విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కు చిత్తూరుజిల్లాలోని మదనపల్లితో విడదీయరాని సంబంధమే ఉంది. బీసెంట్‌ థియోసాఫికల్‌ కాలేజీకి రవీంద్రుడు తరచూ వస్తుండేవారు. 1919 ఫిబ్రవరిలో ఐదు రోజులు ఈ కాలేజీలోనే ఉన్నారు. అప్పుడే ఆయన బెంగాలీలో ఉన్న జనగణమణ గీతాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. ద మార్నింగ్‌ సాంగ్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో అక్కడి కాలేజీ స్టూడెంట్స్‌కు ఈ గీతం పరిచయం చేశారు. 1919 ఫిబ్రవరి 28న ఠాగూర్‌ జనగణమణకు బాణీకట్టి తన స్వరంతో వినిపించారు కూడా. అదే బాణీ నేటికీ కొనసాగుతోంది. బెంగాలీలో ఉన్న ఈ గీతం ఆంగ్లంలోకి తర్జుమా చేసిన ప్రతి.. ఇప్పటికీ ఇక్కడ భద్రం ఉంది. రవీంద్రుడు బాణీకట్టి వినిపించిన ఆడియో టేపులు కూడా భద్రంగా ఉన్నాయి.

ఓ చిన్న గదిలో రవీంద్రుడి కలం నుంచి జనగణమణ
థియోసాఫికల్‌ కాలేజీలోని ఓ చిన్న గదిలో రవీంద్రుడి కలం నుంచి జనగణమణ పురుడుపోసుకుంది. ఆ గది అంటే రవీంద్రుడికి ఇష్టమైనదిగా చెబుతారు. ఆయన ఎప్పుడు వచ్చినా ఆ గదిలోనే బసచేసేవారట. సందర్శకులకూ ఈ గదిలోకి అనుమతిస్తారు. ఆ గదినిండా రవీంద్రుడి చిత్రపటాలే మనకు దర్శనమిస్తాయి. మహనీయులతో ఠాగూర్‌ తీసుకున్న బ్లాడ్‌ అండ్‌ వైట్‌ చిత్రాలు ఎంతో ఆకర్షిస్తాయి. ఇక కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన రవీంద్రుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

తోసిపుచ్చిన సుప్రీం కోర్టు....
జాతీయ గీతంపై మొదట్లో కొన్ని విమర్శలు, వివాదాలు చెలరేగాయి. ఠాకూర్ నాటి ఐదో జార్జ్ చక్రవర్తిని కీర్తిస్తూ గీత రచన చేసాడని, దీనిని జాతీయ గీతం చేయడం ఏంటని కొన్ని విమర్శలు చెలరేగాయి. అయితే ఠాగూర్... ఓ లేఖతో ఈ వివాదానికి అడ్డుకట్ట వేశారు. తాను ఈ గీతం ఈ దేశాన్ని నడిపించే విధాత గురించి రాశానే తప్ప, కింగ్ జార్జ్ గురించి కాదని స్పష్టం చేయడంతో వివాదం ముగిసింది. అటు తర్వాత కూడా ఈ గీతంలో కొన్ని పదాలు తొలగించాలని, కొన్ని చేర్చాలని... అనేక వివాదాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. అయితే భారత అత్యున్నత న్యాయస్థానం అలాంటి పిటిషన్లను నిర్థ్వందంగా తోసి పుచ్చడంతో జాతీయగీతంగా రూపుదిద్దుకుంది. స్వాతంత్రోద్యమ సమయంలో జనగణమణ... రగిల్చిన స్పూర్తి నేటికీ దేశ ప్రజలను ముందుకు నడుపుతోంది. ప్రజల్లో సౌభాతృత్వమన్న భావనకు ఈ గీతమే పురుడుపోసింది. 

20:04 - August 14, 2017

గుంటూరు : ఇది గుంటూరు నగరం నడిబొడ్డున ఉన్న గాంధీ పార్కు. దీనికి ఘనచరిత్రే ఉంది. ఈ పార్క్‌కు గాంధీ పేరును నామకరణం చేసిన నుంచి ఇందులో ఏర్పాటు చేసిన ఆటబొమ్మల వరకు.. ప్రతీదానికో చరిత్ర ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పార్కు గాంధీ పాదంతో పునీతమైంది. స్వాతంత్ర్య పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న రోజులవి.. కొండా వెంకటప్పయ్య లాంటి సమరయోధులు గుంటూరు జిల్లాలో ముందుండి ఉద్యమాన్ని నడిపారు. స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రజలకు వివరించేందుకు గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆ క్రమంలోనే గుంటూరు జిల్లాకూ గాంధీ మహాత్ముడు వచ్చారు. గుంటూరు నడిబొడ్డునున్న పెద్ద స్థలంలో 1899 ఏప్రిల్‌ 6న భారీ సభను నిర్వహించారు. విదేశీ వస్తులను బహిష్కరించాలని, స్వదేశీ వస్తువులను మాత్రమే వినియోగించాలని గాంధీజీ పిలుపునిచ్చారు. అనంతరం అక్కడి నుంచి బాపట్ల వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత కూడా అనేక సమావేశాలకు, సభలకు ఈ స్థలం కేంద్ర బిందువు అయ్యింది.

అమరులకు గుర్తుగా స్థూపం
1936 పిబ్రవరి 22న ఇదే స్థలంలో సమావేశం భారతీయులు సమావేశం నిర్వహిస్తుండగా పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. అంతటితో ఆగకుండా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా... మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనకు నిదర్శనంగా ఇక్కడ ఓ స్థూపం దర్శనమిస్తుంది. అనంతరం మద్రాసు గవర్నర్‌ ఇదే ప్రాంతంలో ఓ క్లాక్‌ టవర్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గాంధీ ప్రసంగించిన దానికి గుర్తుగా గాంధీ పార్కుగా మార్చారు. దీంతో అప్పటి నుంచి ఈ పార్కు కొనసాగుతోంది.ఎంతో ఘన చరిత్ర ఉన్న గాంధీ పార్కు నేడు ఆలనాపాలనా చూసేవారు లేక వెలవెలబోతోంది.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది. దీంతో నగర వాసులు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జాతిపిత గాంధీ మహాత్ముడు నడయాడిన ప్రదేశానికి గుర్తుగా ఏర్పాటు చేసిన గాంధీ పార్కును అభివృద్ధి చేయాలని నగర వాసులు కోరుతున్నారు. నాటి ఉద్యమ స్ఫూర్తిని తెలియజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సైనిక పతాకలకు రాష్ట్రపతి ఆమోదం

ఢిల్లీ : సాయుధ, పారామిలిటరీ బలగాల సిబ్బందికి 112గ్యాలంట్రీ అవార్డులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అలాగే 5కీర్తిచక్ర, 16శౌర్యచక్ర, 85సేవా,3నవ్ సేవా, 2వాయుసేన పతకాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 

రాష్ట్రపతి తొలి ప్రసంగం

ఢిల్లీ : దేశాధినేతగా నూతనంగా ఎన్నికైన రాంనాథ్ కోవింద్ జాతి ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలకు 71వ స్వాతంత్రదినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. తన తొలి ప్రసంగంలో గాంధీ, అంబేద్కర్, నెహ్రూలను ప్రస్తావించారు. స్వాతంత్రం కోసం పోరాడిన వారికి మనం రుణపడి ఉన్నామని రాష్ట్రపతి తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

పారా అథ్లెట్ మధుబాగ్రిని అవమానించ్చిన స్పైస్ జెట్

 

చిత్తూరు : తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో పారా అథ్లెట్ మధుబాగ్రికి అవమానం జరిగింది. స్పైస్ జెట్ విమాన సిబ్బంది మధు తో దురుసుగా ప్రవర్తించారు. మధు వీల్ చైర్ లో ఉన్నందుకు విమానంలో మొదటి సీటు కావాలన్నారు. కానీ సిబ్బంది మాత్రం మూడో వరుసలో కేటాయించిన సీటులో కూర్చోవాలని చెప్పినట్టు ఆమె ఒక సేల్ఫీ వీడియో ద్వారా తెలపారు. తనను అవమానించారని మధుబాగ్రి తీవ్ర ఆవేదనకు లోనైయ్యారు. అటు స్పైట్ జెట్ మధుబాగ్రి ఆరోపణలను ఖండించింది. 

19:19 - August 14, 2017

ఢిల్లీ : దేశాధినేతగా నూతనంగా ఎన్నికైన రాంనాథ్ కోవింద్ జాతి ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలకు 71వ స్వాతంత్రదినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. తన తొలి ప్రసంగంలో గాంధీ, అంబేద్కర్, నెహ్రూలను ప్రస్తావించారు. స్వాతంత్రం కోసం పోరాడిన వారికి మనం రుణపడి ఉన్నామని రాష్ట్రపతి తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

19:07 - August 14, 2017

చిత్తూరు : తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో పారా అథ్లెట్ మధుబాగ్రికి అవమానం జరిగింది. స్పైస్ జెట్ విమాన సిబ్బంది మధు తో దురుసుగా ప్రవర్తించారు. మధు వీల్ చైర్ లో ఉన్నందుకు విమానంలో మొదటి సీటు కావాలన్నారు. కానీ సిబ్బంది మాత్రం మూడో వరుసలో కేటాయించిన సీటులో కూర్చోవాలని చెప్పినట్టు ఆమె ఒక సేల్ఫీ వీడియో ద్వారా తెలపారు. తనను అవమానించారని మధుబాగ్రి తీవ్ర ఆవేదనకు లోనైయ్యారు. అటు స్పైట్ జెట్ మధుబాగ్రి ఆరోపణలను ఖండించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

తిరుపతికి చేరకున్న ఏపీ సీఎం చంద్రబాబు

చిత్తూరు : ఏపీ చంద్రబాబు తిరుపతికి చేరుకున్నారు. అవిలాల వద్ద నూతనంగా నిర్మించిన 360 ఇళ్ల సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. 

18:54 - August 14, 2017

నెల్లూరు : భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో మహానుభావులు తమ సర్వస్వాన్ని ధారబోయడంతో పాటు విద్యా సాహిత్య రంగాల్లోనూ ఎనలేని సేవలు అందించారు. అలాంటి వారిలో ఒకరిగా నిలిచి తనదైన ముద్ర వేసుకొని జాతీయ ఖ్యాతి తెచ్చిన ధీర వనిత నెల్లూరు జిల్లాకు చెందిన పొనకా కనకమ్మ. 1892 జూన్‌ 10 న పొట్లపూడి గ్రామంలో మరుపూరు కొండారెడ్డి, కావమ్మలకు జన్మించిన కనకమ్మకు తొమ్మిదేళ్ల ప్రాయంలోనే మేనమామ పొనకా సుబ్బరామిరెడ్డితో వివాహం జరిగింది. కాపురానికి వెళ్లే నాటికి పొనకా కుటుంబానికి 150 ఎకరాల స్తిరాస్థి ఉంది. అయినప్పటికీ అందరి సంపన్నుల్లా కాకుండా సంఘసేవ కోసం ఇల్లు విడిచి ఉద్యమబాట పట్టారు కనకమ్మ. పొట్లపూడి గ్రామానికి ప్రముఖులు ఎవరు వచ్చినా కనకమ్మ ఆతిథ్యం స్వీకరించి వెళ్లేవారు. 1907లో వందేమాతరం ఉద్యమం సందర్భంగా ఆంధ్రదేశానికి వచ్చిన మహావక్త బిపిన్‌ చంద్రపాల్‌ ఒక రోజంతా పొట్లపూడిలోనే గడిపారు.

పాఠశాల ఏర్పాటు.....
1913 పొట్లపూడిలో సుజనరంజని సమాజం స్థాపన, వివేకానంద గ్రంథాలయం, బాల బాలికల విద్య కోసం జాతీయ పాఠశాల ఏర్పాటుకు పొనకా కనకమ్మే కారణం. అంతేకాదు గ్రామాల్లో ఆరోగ్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 1917లో ఆంధ్ర మహాసభ జూన్‌ మొదటి వారంలో నెల్లూరులో జరిగింది. ఆ సభలో మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావాలనే తీర్మాణం జరిగింది. ఆ సభలో కనకమ్మ ప్రసంగించారు. అదే సమయంలో ప్రారంభమైన అనిబిసెంట్‌ హోంరూల్‌ ఉద్యమానికి ఈ పోట్లపూడి గ్రామమే కేంద్రమైంది. కనకమ్మ స్వయంగా చరఖా చేపట్టారు. స్వదేశీ చేనేత కేంద్రం ఏర్పాటవడంతో తానే స్వయంగా ఖద్దరు పంచెను నేసి మహాత్మా గాంధీకి కనకమ్మ కానుకగా పంపారు. పల్లెపాడులో సత్యాగ్రహ ఆశ్రమాన్ని 1921 ఫిబ్రవరి 7న మహాత్మాగాంధీ ప్రారంభించినప్పుడు, ఆశ్రమం కోసం కనకమ్మ తన ఒంటిపైనున్న బంగారు నగలను అమ్మి విరాళంగా ఇచ్చారు. ఆనాటి నుండి తుది శ్వాస విడిచే వరకు ఆమె బంగారు నగలను ధరించలేదు. భారత జాతీయ కాంగ్రెస్‌ సంస్థలో లోక్‌ మాన్య బాలగంగాధర్‌ తిలక్‌ స్వరాజ్యం నా జన్మహక్కు అంటూ చాటిన విప్లవ మార్గం నెల్లూరు యువతను ఆకర్శించింది. ఆ యువతకు కనకమ్మ వెన్నుదన్నుగా నిలిచింది. వారి కోసం నిషిద్ధ సాహిత్యాన్ని రహస్య స్థలాల్లో భద్ర పరచడమే కాకుండా పాండిచ్చేరి నుండి ఆంగ్లేయులపై పోరాటానికి పిస్టళ్లను తెప్పించింది. 1919లో గద్దర్‌ పార్టీ విప్లవకారుడు దర్శి చెంచయ్య జైలు నుండి విడుదలై కనకమ్మను కలిశారు. ఆ ఏడాదే ఆమె తన గ్రామంలో హరిజన బాలుర వసతి గృహం ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోట్లపూడికి వచ్చి ఆమె ఆతిథ్యం స్వీకరించారు. కనకమ్మలోని ఆవేశాన్ని గుర్తించిన నాటి నాయకులు ఆమెను కణకణ మండే విప్లవ కణికగా అభివర్ణించారు.

ఆరు నెలల జైలు జీవితం...
1922 ఏప్రిల్‌ 4న ఆంధ్రప్రదేశ్‌లో తొలి సత్యాగ్రహ, దేశబంధు దువ్వూరి సుబ్బమ్మ తొలిసారిగా అరెస్టైన ఘటన కనకమ్మను కలిచి వేసింది. 1930లో పల్లెపాడులో జరిగిన ఉప్పు సత్యాగ్రహం కార్యక్రమంలో కనకమ్మ ప్రముఖ పాత్ర వహించడంతో మైపాడుకు భారీ స్థాయిలో మహిళలు తరలి వచ్చారు. దీంతో కనకమ్మ 1930 జులై 27న అరెస్టై, ఆరు నెలలు నెల్లూరు, వేలూరులో జైలు శిక్ష అనుభవించారు. 1932 మే 24న శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా సారా దుకాణాల వద్ద పికెటింగ్‌ చేస్తుండగా కనకమ్మ అరెస్ట్‌ అయ్యారు. పోలీసుల లాఠీ చార్జిలతో ఆమె భజంపై బలమైన గాయాలు తగిలాయి. ఈ కేసులో ఆమెకు 18 నెలలు జైలు శిక్ష పడింది. అనారోగ్యం కారణంగా 1933 జూన్‌ 30న ఆమె జైలు నుండి విడుదలయ్యారు. జమీందార్లకు వ్యతిరేకంగా నడిచిన జమీన్‌ రైతు సంఘం పోరాటంలో కనకమ్మ అపర రుద్రమదేవిలా పోరాడారు. అనంతరం జరిగిన రైతు సభకు అధ్యక్షత వహించి జమీందారి వ్యవస్థను రద్దు చేయాలని తీర్మానించారు. 1917 నుండే పొనకా కనకమ్మ ఎన్నో సాహిత్య రచనలు ,వ్యాసాలు కవితలు రాశారు. ఆమెకు ప్రతిష్టాత్మకమైన గృహలక్ష్మీ స్వర్ణ కలం లభించింది.

1963 సెప్టెంబర్‌ 15న కన్నుమూశారు
1923లో బాలికా విద్య కోసం కనకమ్మ కస్తూరి విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే నిధుల లేమితో అదే ఏడాది ఈ విద్యాలయం మూతపడింది. దేశభక్తులైన తిక్కవరపు రామిరెడ్డి, బెజవాడ గోపాల్‌రెడ్డి విరాళాల ద్వారా నిధుల సేకరణలో 1944 జూన్‌ 17న కస్తూరిబా విద్యాలయం తిరిగి ప్రారంభమై ఎంతో మంది పేద విద్యార్థినులకు విద్యాదానం చేస్తుంది.దేశ స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసి 1963 సెప్టెంబర్‌ 15న కన్నుమూశారు పొనకా కనకమ్మ. ఇంతటి త్యాగశీలి, స్వాతంత్ర్య సమరయోధురాలైన కనకమ్మను పట్టించుకోవడంలేదని, చనిపోయిన ఇన్నేళ్లకు కనీసం ఒక్కసారైనా స్మరించుకున్న పాపాన పోలేదని పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా జాతికి వెలుగు చుక్క అయిన కనకమ్మ సృతికి నెల్లూరు నగరంలో ఆమె శిలా ఫలకాన్ని ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని విద్యావేత్త ఆచార్య ఆదిత్య అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

18:52 - August 14, 2017

గుంటూరు : యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు గుంటూరు నగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. అంబేద్కర్ విగ్రహం నుండి మార్కెట్ సెంటర్ లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా ఇంకా సాధించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ఎమ్మెల్సీ డొక్కా అన్నారు. ఆర్థిక అసమానతలను రూపుమాపి.. మతసామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 

18:51 - August 14, 2017

విజయవాడ : జస్టిస్‌ మంజునాథ నేతృత్వంలోని బీసీ కమిషన్‌ నివేదిక వచ్చిన తర్వాత కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కాపు రిజర్వేషన్లకు చట్టపరమైన అవరోధాలు ఎదురుకాకుండా న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. కాపు నేతలు, మంత్రులు విజయవాడంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాపు రిజర్వేషన్లపై చర్చించారు. ఇచ్చిన హామీని నెరవేర్చే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

18:48 - August 14, 2017

తూర్పు గోదావరి : నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత జగన్‌ ప్రవర్తిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపణ వ్యక్తం చేశారు. జగన్‌ వాడుతున్న భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. జగన్‌ ఉన్మాదిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంకు చెందిన వైసీపీ నేత గుత్తుల వెంకట సాయి శ్రీనివాసరావు ఆ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. గుత్తుల సాయితో పాటు పార్టీలో చేరిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు చంద్రబాబు పసుపు కండువాకప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. 

18:47 - August 14, 2017

కర్నూలు : చంద్రబాబుకు అభివృద్ధి అంటే ఏంటే కూడా తెలియదని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. నంద్యాల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. టీడీపీ పాలనపై మండిపడ్డారు. చంద్రబాబు దృష్టిలో అభివృద్ధి అంటే ఇళ్లు కూల్చడమేనన్నారు. నంద్యాలలో వైసీపీని గెలిపిస్తే.. పులివెందులలో చేసినట్లు అభివృద్ధి చేసి చూపిస్తానని జగన్‌ అన్నారు.

 

కృష్ణా జిల్లాలో టాటా ఏస్ బోల్తా

కృష్ణా : జిల్లా చల్లపల్లి మండలం వెలివోలులో కృష్ణా కరకట్టపూ టాటాఏస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్రగాయలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వైద్యులు ఆసుపత్రిలో క్షతగాత్రులను పట్టించుకోకపోవడంతో వారు ఆందోళనకు దిగారు.

17:59 - August 14, 2017
17:58 - August 14, 2017

వరంగల్ : జిల్లాలో శ్రీకృష్ణాష్టమి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వహించారు. పోత‌నన‌గ‌ర్ లోని భ‌గ‌వ‌న్ శ్రీ ముర‌ళీ కృష్ణ మందిరంలో ప్రత్యేక పూజ‌లు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి 111 ర‌కాల ప్రసాదాలను నైవేద్యంగా స‌మ‌ర్పించారు. 

17:57 - August 14, 2017

సిరిసిల్ల : ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులతో పాటు శ్రావణ మాసం నాల్గో సోమవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శశించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామికి రుద్రాభిషేకం చేశారు. భక్తుల రద్దీకి తగ్గట్టు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముందుజాగ్రత్తగా ఆర్జితసేవలు రద్దుచేశారు.

17:56 - August 14, 2017

సూర్యాపేట : జిల్లా తిరుమలగిరి వాసవి క్లబ్‌ ఆధ్వర్యంలో 104 మీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీ జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నేటి తరం విద్యార్థుల్లో జాతీయ సమగ్రత మరియు జాతీయ జెండా యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

17:55 - August 14, 2017

పెద్దపల్లి : జిల్లా సిరిపురంలో సుందిళ్ల బ్యారేజీ పనులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. గోలివాడ నిర్వాహితులను చెల్లించిన పరిహారాన్నే తమకు కూడా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్రాజెక్టు వద్ద స్థానికులు ధర్నాకు దిగారు. ఆందోళనకారులను ప్రాజెక్టు పరిసరాల్లోకి రానివ్వకుండా ప్రైవేటు సెక్యూరిటీతో కాంట్రాక్టుర్లు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పరిహారం కోసం ఆందోళన చేసిన ఒక నిర్వాసితుణ్ని టీఆర్ఎస్ యువజన విభాగం ఉపాధ్యక్షుడు మనోహర్‌ చితకబాదడంతో పోలీసులు కేసు పెట్టారు. 

17:54 - August 14, 2017

 

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి.  గాబ్రియల్..ఈ పేరు ఎప్పుడో నగర పోలీసులు విన్నట్లు గుర్తు...గతంలో గాబ్రియల్ అరెస్టయిన సమయంలో డ్రగ్స్ ప్రభావం తక్కువే..అయితే పోలీసులు దీన్ని లైట్ తీసుకుని గాబ్రియల్‌ను అరెస్టు చేసి చేతులు దులపుకున్నారు..ఆ తర్వాత కొద్ది కాలానికి బెయిల్‌పై బయటకు వచ్చిన గాబ్రియల్ తన దేశానికి వెళ్లిపోలేదు..ఇక్కడే ఉన్నాడు..నగరంలోనే ఉంటూ గర్ల్‌ ఫ్రెండ్‌ ఎస్తేర్‌ను పెళ్లి చేసుకున్నాడు... సికింద్రాబాద్‌లో సుస్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు...ఆ ఇంటి నుంచే దందా మొదలుపెట్టాడు...కస్టమర్లను ..ప్రముఖులను ఆకర్షించేందుకు గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా వాడుకున్నాడు..ఇలా నగరంలో మత్తు సామ్రాజ్యం విస్తరించుకున్న గాబ్రియల్‌ కెల్విన్‌ ఊడల్లో ఒకడు కూడా... ఈ రేంజ్‌లో ఎదిగిపోయేందుకు కారణం ఎవరో తెలుసా..?? పోలీసులే...నిఘా వైఫల్యం వల్లే గాబ్రియల్ ఈ రోజు డ్రగ్స్‌ డాన్‌గా మారాడు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

17:52 - August 14, 2017

చిత్తూరు : టీటీడీ ఆస్తులు, భక్తులకు భద్రత కల్పించడం కత్తిమీద సాములాంటిదన్నారు నూతన ముఖ్య భద్రతాధికారి రవికృష్ణ. తిరుమల భద్రత విషయంలో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని.. వచ్చే బ్రహ్మోత్సవాలలోపు అత్యాధునిక టెక్నాలజీతో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు. తిరుమలలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా నిఘాను మరింత పటిష్టం చేసినట్లు తెలిపారు. తిరుమలలో తప్పిపోయిన మూడేళ్ల బాలుడిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు రవికృష్ణ తెలిపారు. 

పారా అథ్లెట్ మధుభాగ్రికి అవమానం

హైదరాబాద్: తిరుపతి-రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో తిరుపతిపారా అథ్లెట్ మధుభాగ్రికి అవమానం జరిగింది.-మధుభాగ్రి పట్ల దురుసుగా ప్రవర్తించారు. స్పైస్ జెట్ విమాన సిబ్బంది వీల్ ఛైర్ లో ఉన్నందున విమానం మొదటి వరుసలో సీటు కావాలని పారా అథ్లెట్ మధు బాగ్రి కోరారు. అయితే స్పైస్ జెట్ సిబ్బంది నిరాకరించింది. 3వ వరుసలో సీటు కేటాయించామని దాంట్లో కూర్చోవాలని ఆదేశించింది. తన పట్ల స్పైస్ జెట్ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారని పారల్ అథ్లెట్ మధుబాగ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మధు భాగ్రి ఆరోపణలను స్పైస్ జెట్ ఖండిచింది.

కార్మిక సంఘాలతో సింగరేణి యాజమన్యం చర్చల్లో అవాంతరం...

హైదరాబాద్: కార్మిక సంఘాలతో సింగరేణి యాజమాన్యం చర్చలు జరగకుండా కాంట్రాక్ట్ కార్మికులు అడ్డుకున్నారు. సమావేశ మందిరంలో బైఠాయించిన కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. కనీసం వేతనం, బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

డ్రగ్స్ ముఠాలో అమ్మాయిలే కీలకం...

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో కెల్విన్ తో సంబంధాలున్న నూక నవ్యత్, గ్రాబియేల్ ను అరెస్ట్ చేశారు. గోవా, ముంబై, బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో సరఫరా చేస్తున్న నూక నవ్యత్, గ్రాబియేల్ ల నుంచి రాచకొండ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. డ్రగ్స్ ముఠాలో అమ్మాయిలు కీలక పాత్ర వహించారని, డ్రగ్స్ విచారణలో సినిమా ప్రముఖుల పేర్లే కాకుండా కొత్త పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. పబ్ లలో పని చేసే డీజేల ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

17:30 - August 14, 2017

టాలీవుడ్ క్రేజీ హీరో 'బాహుబలి' తరువాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్‌లోనూ 'బాహుబలి', 'బాహుబలి-2' సూపర్ హిట్ కావడంతో ప్రభాస్ నటించబోయే కొత్త సినిమాలపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న 'సాహో' సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తి కాకుండానేఆన్ లైన్ హక్కులను కొనుగోలు చేసేందుకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 50 కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో నిర్మిస్తున్న నేపథ్యంలో రికార్డు స్థాయిలో 4 మిలియన్ యూఎస్ డాలర్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ ఆన్ లైన్ రైట్స్ సొంతం చేసుకుందనే వార్త ప్రభాస్ ఫ్యాన్స్‌ను పండగ చేసుకునేలా చేసింది. ఈ డీల్‌కు సంబంధించి త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సమాచారం..

17:07 - August 14, 2017

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా వాయిదాపై వచ్చిన వార్తలన్నీ కేవలం పుకార్లని చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ తేల్చేసింది. అనుకున్న తేదీ సెప్టెంబరు 21న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని చెప్పింది. ‘లవ’ పాత్రకు సంబంధించిన టీజర్‌ను కొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇందులో ఎన్టీఆర్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల ‘లవ’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రాలకు సోషల్‌మీడియాలో విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. కల్యాణ్‌రామ్‌ నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

 

2019 వరకు టి. కాంగ్రెస్ సారధి ఉత్తమ్: కుంతియా...

హైదరాబాద్: వచ్చే నెలలో టి.పీసీసీలో భారీ మార్పులు జరగనున్నాయని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా తెలిపారు. ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టి. కాంగ్రెస్ సమన్వయ కమిటీని కుదిస్తామన్నారు. పార్టీలో ఉత్తమ్ మాటే ఫైనల్ అని స్పష్టం చేశారు. 2019 వరకు టి. కాంగ్రెస్ సారధి ఉత్తమ్ కుమార్ అని, ఉత్తమ్ పని తీరుపై రాహుల్ సంతృప్తిగా ఉన్నాడని తెలిపారు. ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని, పార్టీ గీత దాటితే ఎంతటి వారైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పొత్తులపై హైకమాండ్ దే తుది నిర్ణయం అన్నారు.

సుప్రీంలో కార్తీ చిందబరానికి ఎదురుదెబ్బ

ఢిల్లీ: అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ విచారణకు హాజరుకాకుండా విదేశీ పర్యటనలకు వెళ్లొద్దని అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు ఆదేశించింది. కార్తీని విచారణకు హాజరు కావాల్సిందిగా మే 18, మే 21 తేదీల్లో సీబీఐ ఆదేశించింది.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 235 పాయింట్ల లాభంతో 31,449 వద్ద సెన్సెక్స్ ముగియగా, 83 పాయింట్ల లాభంతో 9,794 వద్ద నిఫ్టీ ముగిసింది.

జేడీయూ నుంచి 21 మంది సస్పెండ్

బీహార్:జేడీయూ నుంచి 21 మంది పార్టీ నేతలను తొలగించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వీరి పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

16:04 - August 14, 2017

పెద్దపల్లి : జిల్లా సిరిపురంలోని సుందిళ్ల బ్యారేజీ పనులను భూమి కోల్పోతున్న నిర్వాసితులు అడ్డుకున్నారు. గోలివాడ నిర్వాసితులతో సమానంగా పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల ప్రైవేటు సెక్యూరిటీ ఆందోళనకారులను బెదిరిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

వైసీపీ ఉన్మాద పార్టీ: సీఎం చంద్రబాబు

అమరావతి: సీఎం చంద్రబాబు సమక్షంలో ముమ్మిడి వరం వైసీపీ నేత గుత్తుల సాయి టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ఉన్మాద పార్టీ అని విమర్శించారు. ఇక వైసీపీలో ఎవరూ మిగలరని, జగన్ నన్ను రోడ్డు మీద కాలుస్తాడంట అని మండిపడ్డారు. జగన్ వయసు నా అనుభవం అంత లేదన్నారు.

15:59 - August 14, 2017

వంశీ పైడి పల్లి దర్శకత్వంలో టాలీవుడ్ శ్రీమంతుడు మ‌హేశ్ బాబు 25 వ చిత్రం ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం 'స్పైడ‌ర్' మూవీ తో మహేష్ బిజీ బిజీగా ఉన్నాడు. దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వం లో భరత్ అను నేను మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తి అయ్యాక వంశీ చిత్రాన్ని సెట్స్ ఫైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రానికి దేవి సంగీతం అందిస్తున్నాడు. కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా ఇవాళ ఆ మూవీ కి సంబంధించి పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాడు. స్పైడ‌ర్ మూవీ బిజీ షెడ్యూల్ వ‌ల్ల మ‌హేశ్ పూజా కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కాలేక‌పోయారు. ఈ మూవీ ని అశ్వినీ ద‌త్, దిల్ రాజు నిర్మించ‌నున్నారు. మ‌హేశ్ కొడుకు గౌత‌మ్ క్లాప్ కొట్ట‌గా.. మ‌హేశ్ గారాల‌ప‌ట్టి సితార కెమెరా స్విచ్ ఆన్ చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో మ‌హేశ్ భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్, దేవిశ్రీ ప్ర‌సాద్, దిల్ రాజు, అశ్వనీద‌త్, రాఘ‌వేంద్ర‌రావు, వీవీవినాయ‌క్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

15:54 - August 14, 2017

ముంబై : సహారా గ్రూప్‌కు చెందిన లగ్జరీ యాంబీ వ్యాలీని బాంబే హైకోర్టు వేలానికి పెట్టింది. ఈ మేరకు వార్తాపత్రికల ద్వారా నోటీసులు ఇచ్చి బిడ్డర్లను ఆహ్వానించింది. లోనావాలా ప్రాంతంలో గల అత్యంత ఖరీదైన ఈ వ్యాలీకి 37 వేల 392 కోట్ల ధరను న్యాయస్థానం రిజర్వ్‌ చేసింది. ఈ వ్యాలీ 6 వేల 761 ఏకరాల్లో ఉంది. సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ఉన్న ఈ వ్యాలీలో గోల్ఫ్‌ కోర్స్‌, ఎయిర్‌పోర్టు, హాస్పిటల్‌, అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌, రీటేల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వంటి అధునాతన సదుపాయాలున్నాయని నోటీసుల్లో కోర్టు పేర్కొంది. సహారా గ్రూప్‌ అధినేత సుబ్రతారాయ్‌ ఇన్వెస్టర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో యాంబీ వ్యాలీని వేలం వేయాలని గతవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

15:53 - August 14, 2017

ఢిల్లీ : గోరఖ్‌పూర్‌ బాబా రాఘవ దాస్ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చిన్నారుల మరణాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇది ఓ రాష్ట్రంలోని జిల్లాకు చెందిన ఆసుపత్రి వ్యవహారమని కోర్టు పేర్కొంది. పరిస్థితిని స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని...ఈ అంశంలో అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ జెఎస్‌ ఖేహార్‌, జస్టిస్‌ డీవై చంద్రచూద్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌కు సూచించింది. ఆక్సిజన్ సరఫరా కొరత కారణంగా గోరఖ్‌పూర్‌ బీఆర్డీ ఆసుపత్రిలో మృతి చెందిన చిన్నారుల సంఖ్య 72కి చేరింది.

15:51 - August 14, 2017

ఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ఇండిపెండెన్స్‌ డే వేడుకలపై ఉగ్రవాదులు గురి పెట్టారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ జాతీయ పతాకం ఆవిష్కరించే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో 150 సీసీ టీవీ కెమెరాలతో నిఘా విస్తృతం చేశారు. ఢిల్లీలో నాలుగువేల సీసీ టీవీ కెమెరాలతో నిఘా ఉంచారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:51 - August 14, 2017

గుంటూరు : పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తైనంత వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం నిర్మాణ పురోగతిపై చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల్లో అలసత్వాన్ని సహించేదిలేదని హెచ్చరించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రణాళికా బద్ధంగా పనులు జరిగితే చెప్పిన సమయానికి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వొచ్చని అధికారుల దృష్టికి తెచ్చారు. పోలవరం పనులను సవాల్‌గా తీసుకుని పూర్తి చేయడంలోనే ఇంజినీర్ల సమర్థత బయటపడుతుందని చెప్పారు. 

15:50 - August 14, 2017

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్‌ కమలా ఆసుపత్రిలో దారుణం వెలుగుచూసింది. బ్రెయిన్ ట్యూమర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన విజయలక్ష్మి అనే మహిళను స్కానింగ్ నిమిత్తం తీసుకెళ్లిన తరువాత... ఆమె మెడలో మంగళసూత్రం చోరీకి గురైంది. దీనిపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రి యాజమాన్యం దిగివచ్చి... దొంగను గుర్తించి మంగళసూత్రం తిరిగి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే... ఖనన సమయంలో చనిపోయిన విజయలక్ష్మి మెడలో.. మంగళసూత్రం ఉండాలన్నది తమ కుటుంబ ఆచారమని... మంగళసూత్రం ఇస్తేనే.. మృతదేహం తీసుకెళ్తామని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.  

15:49 - August 14, 2017

గుంటూరు : మోడ్రన్ టెక్నాలజీ.. సకల సౌకర్యాలు.. పచ్చని ప్రకృతి ఒడిలో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఏపీ డీజీపీ కార్యాలయం. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో రెండెకరాల స్థలంలో ఐదు అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. గతేడాది అక్టోబర్‌లో హోం మంత్రి చినరాజప్ప చేతుల మీదుగా.. కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. 40కోట్ల ఖర్చుతో 1.10లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన కార్యాలయ నిర్మాణానికి కేవలం 10 నెలల వ్యవధి పట్టింది.

జీ ప్లస్ 4గా నిర్మాణం
నూతన డీజీపీ కార్యాలయాన్ని జీ ప్లస్ 4గా నిర్మాణం చేశారు. నాలుగు అంతస్థులను వివిధ విభాగాలకు కేటాయించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్తు సీఐడీ విభాగానికి అప్పగించారు. ఇక రెండు, మూడు, నాలుగు అంతస్తుల్ని డీజీపీ కార్యాలయానికి కేటాయించారు. అన్ని ప్లోర్స్ లో ప్రత్యేకంగా ఛాంబర్స్ ఏర్పాటు చేశారు.. చేతి వేలిముద్రల ద్వారానే డోర్స్ తెరుచుకొని విధంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు...సిబ్బంది రాకపోకలు ఎప్పటికప్పుడు తెలిసేలా బయోమెట్రిక్ విధానంతో పాటు..పూర్తిగా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు..నాల్గవ అంతస్తులో డీజీపీ కార్యాలయం, పేషీతోపాటు కాన్ఫరెన్స్‌ హాల్‌, ఎస్పీలతో మాట్లాడేందుకు సాంకేతికపరమైన ఏర్పాట్లు చేశారు. కారిడార్‌ నుంచి డీజీపీ పేషీ వరకూ చక్కటి కొటేషన్లతో డిస్‌ప్లే బోర్డులు అమర్చారు. కార్పొరేట్ ఆఫీస్‌ను తలదన్నేలా డీజీపీ కార్యాలయం తీర్చిదిద్దారు. డీజీపీ సాంబశివరావు నిరంతరం పర్యవేక్షిస్తూ కేవలం 10 నెలల్లో మొత్తం నిర్మాణం పూర్తి చేయించారు.ఈనెల 16న ఉదయం 11 గంటలకు కొత్త డీజీపీ కార్యాలయం సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. కొత్త కార్యాలయం ద్వారా ప్రజలకు తమ సేవలను మరింత విస్తరిస్తామని ఏపీ డీజీపీ చెబుతున్నారు. 

15:47 - August 14, 2017

కర్నూలు : అసభ్యకరమైన భాషను మాట్లాడుతున్నారని వైసీపీ అధినేత జగన్‌పై.. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మండిపడ్డారు. భాష మార్చుకోకపోతే నంద్యాల ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని చెప్పారు. ఉప ఎన్నిక వచ్చింది కాబట్టే నంద్యాలను జిల్లా కేంద్రంగా చేస్తామంటున్నారా అని ప్రశ్నించారు. హద్దులు మీరి మాట్లాడటం కరెక్ట్‌ కాదన్నారు. 

15:45 - August 14, 2017

హైదరాబాద్: సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తెలుగు అమ్మాయి. ఈ మధ్య సినిమాల కన్నా ప్రేమ వ్యవహారం తో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటికే రోజా, నగ్మా, కుష్బు వంటి నటీమణులు రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. వారి వరుసలో కొత్తగా అంజలి చేరే అవకాశాలు కనిపిస్తున్నట్లు సోషల్‌ మీడియాల్లో ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. సంచలన నటిగా పేరొందిన అంజిలి కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక స్థాయిని అందుకున్నారు. రాజకీయాలకు, చిత్ర పరిశ్రమకు విడదీయరాని అనుబంధం ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్‌ ప్రముఖులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. అంజలి ఈ మధ్య దేశ రాజధానిలో ఉన్న పార్లమెంట్ను విజిట్ చేసి వచ్చింది. ఎవరిని కలవడానికి వెళ్లింది ఎందుకు వెళ్లింది అనేది తెలియదు కానీ ఏదో పార్టీ అధినేతతో మంతనాలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీనితో మీడియా అంతా ఆమె రాజకీయ రంగప్రవేశంపై దృష్టిపెట్టారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో నాకు రాజకీయాలు అంటే చాలా ఆసక్తి అని నేను వాటిని క్రమం తప్పకుండా ఫాలో అవుతాను అని చెప్పింది. దానితో అంజలి ఏదో ప్రాంతీయ పోలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినవస్తున్నాయి. ఈ అంశంపై అంజలి స్పందిస్తుందే మో వేచి చూడాల్సిందే...

ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్..

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని హంద్వారాలో భద్రతా బలగాలు సోమవారం ఉదయం తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో భాగంగా ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల నుంచి రెండు గన్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. వీరిద్దరూ హర్కత్ ఉల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాదులు అని భద్రతా బలగాలు తెలిపాయి.

15:30 - August 14, 2017

మహిళలపై హింస అనాదిగా కొనసాగుతునే ఉంది. ప్రస్తుతం అది పలు రూపల్లో విస్తరిస్తోంది. ఈ విషయం ప్రతి సందర్భంలో మాట్లాడుకుంటున్నాం. దీనికి పరిష్కరం కనుచూపు మేర కానరావడం లేదు. మహిళల కోసం ఎన్నో చట్టలున్నాయి. అవి మహిళ హక్కుల కోసం పోరాడి సాధించుకున్నాయి. ఈ నేపథ్యంలో అత్తింట హింసలకు గురౌతున్న మహిళ రక్షణ కోసం రూపొంందించిన చట్టం 498ఏ చట్టం. ఈ చట్టం సాక్ష్యత్ దేశ సర్వోన్నత న్యాయస్థానం పురుషులకు ఊరట కలిగిస్తూ మార్గదర్శకాలు విడుదలు చేసింది. ఈ అంశంపై నేటి మానవి ఫోకస్ మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

మొక్కుబడిగా రిజర్వేషన్ ఇస్తే తర్వాత సమస్యలొస్తాయి:చంద్రబాబు

విజయవాడ: సీఎంతో మంత్రులు, కాపు సంఘాలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... వెనకబడిపోయామనే ఆవేదన కాపుల్లో ఉందని,పిఠాపురంలో కాపు రిజర్వేషన్ హామీ ఇచ్చానని, ఇచ్చిన హామీని అమలు చేయడం నా బాధ్యత అని అన్నారు. మొక్కుబడిగా రిజర్వేషన్ ఇస్తే తర్వాత సమస్యలొస్తాయన్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా రిజర్వేషన్ ఇస్తామన్నారు. రాజకీయ రిజర్వేషన్లు వద్దని విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలని కాపు నేతలు అడుగుతున్నారని స్పష్టం చేవారు. అన్యాయం చేస్తే కాపులు ఊరుకోరని, కొంత మంది కావాలనే బీసీలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

సిరిపురంలో భూ నిర్వాసితులు ఆందోళన

పెద్దపల్లి: మంథని మండలం సిరిపురంలో భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు.గోలివా రైతుకలు చెల్లించిన పరిహారమే తమకూ చెల్లించాలంటూ ప్రాజెక్టు క్యాంపు కార్యాలయం వద్ద భూ నిర్వాసితుతుల ధర్నా చేపట్టారు. ప్రైవేటు సెక్యూరిటీతో నిర్వాసితులకు బెదిరింపులు చేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేశారు.

పెందుర్తి మండలం ఎస్ ఆర్ పురంలో సిట్ దర్యాప్తు

విశాఖ: పెందుర్తి మండలం ఎస్ ఆర్ పురంలో సిట్ దర్యాప్తు ప్రారంభించింది. భూ ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదు మేరకు స్థలాల పరిశీలన చేస్తున్నారు. సర్వే నంబర్ 112/4, 113/4 లోని భూములు ఆక్రమణలకు గురయినట్లు స్థానికులు సిట్ కు తెలిపారు.

15:13 - August 14, 2017

గుంటూరు : వెనకబడిపోయాం అనే ఆవేదన కాపుల్లో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కాపులను వెనబడిన వర్గాల్లో చేర్చాలనే ఉద్దేశ్యంతో రిజర్వేషన్ల హామీ ప్రకటించా అని ఆయన తెలిపారు. మొక్కుబడిగా రిజర్వేషన్లు ఇచ్చేస్తే తర్వాత అనేక సమస్యలు వస్తాయిన చంద్రబాబు అన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా, రాకుండా రిజర్వేషన్లు ఇస్తామని ఆయన తెలిపారు. మరంత సమాచారం కోసం వీడియో చూడండి.

యోగీ సర్కార్ కు ఎన్ హెచ్ ఆర్సీ నోటీసులు...

ఢిల్లీ : గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఐదు రోజుల్లోనే 63 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) స్పందించింది. ఈ మేరకు యోగి ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. చిన్నారుల మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

శ్రీలంకపై భారత్ ఘన విజయం

క్యాండీ: ఇండియ‌న్ టీమ్ చ‌రిత్ర సృష్టించింది. శ్రీలంక‌తో జ‌రిగిన మూడో టెస్ట్‌లో ఇన్నింగ్స్ 171 ర‌న్స్ తేడాతో గెలిచి ఘన విజయం సాధించింది..విదేశీ గ‌డ్డ‌పై మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఓ ఇండియ‌న్ టీమ్ క్లీన్‌స్వీప్ చేయ‌డం ఇదే తొలిసారి. తొలి రెండు టెస్ట్‌ల‌ను నాలుగో రోజు ముగించిన విరాట్ సేన‌.. మూడో టెస్ట్‌ను మాత్రం మూడు రోజుల్లోపే ముగించేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 135 ప‌రుగులకు ఆలౌటైన లంక‌.. రెండో ఇన్నింగ్స్‌లో 181 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 4, ష‌మి 3, ఉమేష్ యాద‌వ్ 2 వికెట్లు తీసుకున్నారు.

14:59 - August 14, 2017

కాంగ్రెస్ హయాంలోనే కాపు రిజర్వేషన్లు తొలగించారు:చంద్రబాబు

విజయవాడ: కాంగ్రెస్ హయాంలోనే కాపు రిజర్వేషన్లు తొలగించారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. కాపుల గురించి ఇపుడు మాట్లాడేవాళ్లు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

14:16 - August 14, 2017

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుతో కాపు నేతల సమావేశమయ్యారు. రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలని సీఎంకు నేతలు విన్నవించారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేసన్ ఇస్తే మాకు చాలని మంత్రి జ్యోతుల నెహ్రూ అన్నారు. కాపులు ఆర్థికంగా ఎదగడమే మాకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రిజర్వేషన్ అంశంపై చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకుంటారని నెహ్రూ ఆశభావం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

14:14 - August 14, 2017

హైదరాబాద్ : మియాపూర్ డపింగ్ యార్డ్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి అక్కడే ఉన్న గేదె తల తెగిపడింది. పేలుడు విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. జెలిటిన్ స్టిక్స్ పేలి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుడుతో స్థానికులు భయదోళనకు గురౌతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

పాలకుర్తి సోమేరశ్వర దేవస్థానం ప్రసాదంలో పురుగులు

జనగామ: పాలకుర్తి సోమేరశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రసాదంలో పురుగుల అవశేషాలు కనిపించాయి. దీంతో భక్తులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు.

నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్

హైదరాబాద్: నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీలో కీలకంగా వ్యవహరించిన ప్రైవేట్ బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రభుత్వ స్కూల్ హెడ్మాస్టర్ ను టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. వారి వద్ద నుండి 430 నకిలీ ఎస్ ఎస్ సీ, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ సర్టిఫికెట్లు, వివిధ వర్శిటీలకు చెందిన స్టాంపులు, కలర్ ప్రింటర్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.

కాపులు ఆర్థికంగా ఎదగడమే మాకు ముఖ్యం :జ్యోతుల నెహ్రూ

విజయవాడ: చంద్రబాబుతోనే కాపుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, రిజర్వేషన్ అంశంపూ సీఎం మంచి నిర్ణయం తీసుకుంటారని విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తే చాలు అని జ్యోతుల నెహ్రూ అన్నారు. కాపులు ఆర్థికంగా ఎదగడమే మాకు ముఖ్యం అని నెహ్రూ స్పష్టం చేశారు.

13:40 - August 14, 2017

విజయవాడ : నవ్యాంధ్ర ప్రగతి పథంలో మరో మైలురాయి ఆవిష్కారం కాబోతోంది. తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో.. చేపడుతున్న ఎత్తిపోతల పథకం పనులను 15వ తేదీన .. సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా విశాఖపట్నంలో నీటి ఎద్దడి తీరనుంది. అలాగే పరిశ్రమలకు నీటి కొరత సమస్య గణనీయంగా తగ్గబోతుంది. అదేవిధంగా రెండు లక్షల 15వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. రెండు దశలలో ఈ ప్రాజెక్ట్‌ పనులు సాగనున్నాయి. 

13:38 - August 14, 2017

హైదరాబాద్‌ : మరో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టయ్యింది. భారీ ఎత్తున గంజాయి, మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ట్యాబ్లెట్లు, బిస్కిట్లు, చాక్లెట్ల రూపంలో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. ఓ నైజీరియన్‌తో పాటు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్‌ పార్టీలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

13:36 - August 14, 2017

హైదరాబాద్ : సింగరేణిపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై సోమవారం శివం రోడ్‌, ఏటీఐలో కార్మిక సంఘాలతో సింగరేణి యాజమాన్యం చర్చలు జరుపుతోంది. ఇదిలా ఉంటే కాంట్రాక్టు కార్మికులు ఒక్కసారిగా నినాదాలు చేస్తూ హాల్ లోకి దూసుకొచ్చారు. సమావేశ మందిరంలో బైఠాయించారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయాలని...కనీస వేతనం లేకుండా పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేస్తామని చెప్పిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని..ప్రతి కార్మికుడికి రెండు ఓట్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 

13:35 - August 14, 2017

విశాఖపట్టణం : ఓ బైక్ అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లడంతో భార్య..కుమార్తె మృతి చెందారు. భర్తకు గాయాలయ్యాయి. ఈఘటన చీడికాడ మండలం పెద్ద భోగాడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నూక రాజు లక్ష్మీ దంపతులు కుమార్తె దేహీ బైక్ పై కొత్తపల్లికి వెళుతున్నారు. మార్గమధ్యంలో బైక్ అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. లక్ష్మీ..దేహి అక్కడికక్కడనే మృతి చెందారు. నూకరాజుకు స్వల్పగాయాలయ్యాయి. ఇతడిని ఆసుపత్రికి తరలించారు.

కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే లక్ష్మీ కాపురానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈఘటన జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భర్త నూకరాజు కావాలనే ఈ విధంగా చేశాడని లక్ష్మీ కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. 

వాహిని నగర్ డంపింగ్ యార్డులో పేలుడు

హైదరాబాద్: మియాపూర్ వాహిని నగర్ డంపింగ్ యార్డులో పేలుడు సంభవించింది. జెలిటిన్ స్టిక్స్ పేలి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

13:27 - August 14, 2017

మరో డ్రగ్ రాకెట్ ముఠాను అరెస్ట్ చేశాం: రాచకొండ సీపీ

సైబరాబాద్: మరో డ్రగ్ రాకెట్ ముఠాను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ మహేష్ భగత్ తెలిపారు. నైజీరియన్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారునప మరో పెడ్లర్ పవన్ కుమార్ పరారీలో ఉన్నాడని, పట్టుబడ్డ ముఠా నుంచి కొకైన్, ఎంపీటమిన్ పిల్స్ 450, ఎండీఎంఏ 45 గ్రాములు, ఐఎన్ డీ 60 స్ట్రిప్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ వారంతా కీలక డ్రగ్స్ పెడ్లర్లుగా వ్యవహరించారని, పట్టుబడ్డ వారిలో నూక నావ్యంత్ కీలక సూత్రదారి అని పేర్కొన్నారు.

ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టిన కారు: ఇద్దరి మృతి

నల్లగొండ : వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కట్టంగూర్ మండలం ఎరసానిగూడెం వద్ద జరిగింది. సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు కొత్తగూడెంకు చెందినవారని పోలీసులు తెలిపారు.

పోలవరం పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: పోలవరం పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తయిన పనుల మేరకు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు జరపాలని సీఎం ఆదేశించారు. పనుల విషయంలో అలసత్వం సహించం అని చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనలు జరగాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం పనులు సాగితేనే సమయంలోగా ప్రాజెక్టు నుంచి గ్రావిటీతో నీళ్లు ఇవ్వగలమని చంద్రబాబు తెలిపారు.

హుస్నాబాద్ లో హరీష్ రావు, మహేందర్ రెడ్డి పర్యటన

సిద్ధిపేట: హుస్నాబాద్ లో హరీష్ రావు, మహేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు. రూ.11.30 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

 

12:34 - August 14, 2017

హైదరాబాద్ : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై జరుగుతున్న చర్చల్లో గందరగోళం నెలకొంది. సోమవారం శివం రోడ్‌, ఏటీఐలో కార్మిక సంఘాలతో సింగరేణి యాజమాన్యం జరిపిన చర్చలు జరుపుతున్నారు. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని..ప్రతి కార్మికుడికి రెండు ఓట్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బైటాయించిన కార్మికులు ఆందోళన చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

చిన్నారుల మృతి ఘటనపై సుప్రీంలో పిటిషన్

ఢిల్లీ: గోరఖ్ పూర్ బీఆర్డీ ఆస్పత్రిలో చిన్నారుల మృతి ఘటనపై సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. చిన్నారుల మృతి ఘటనను సమోటోగా స్వీకరించాలని, ఈ ఘటనపై సిట్ విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. అయితే పిటిషనర్ వినతిని సుప్రీం కోర్టు తిరస్కరించి హైకోర్టు ఆశ్రయించాలని పిటిషనర్ కు సూచించింది.

12:30 - August 14, 2017

హైదరాబాద్ : తెలంగాణ అఖిపక్షం నేతలు గవర్నర్‌ను కలిశారు. నేరెళ్ల ఘటన, పోలీసుల దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దళితులు, గిరిజనులు బీసీలపై జరుగుతున్న దాడులపై అన్ని పార్టీల రిప్రజెంటెటీవ్స్‌ కలిసి గవర్నర్‌కు మెమోరాండం ఇచ్చారు. నేరెళ్ల ఘటనలో దళితులను హింసించడంపై నేతలంతా తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంలో కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని.. కేటీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో జానారెడ్డి, ఉత్తమ్‌, షబ్బీర్‌, మోత్కుపల్లి, రేవంత్‌, చాడ, కోదండరాం ఉన్నారు. 

ఈ ఏడాదికి తమిళనాడు విద్యార్థులకు నీట్ నుండి మినహాయింపు...

చెన్నై: తమిళనాడు విద్యార్థులు నీట్‌ గండం నుంచి గట్టెక్కారు. ఆ రాష్ట్రాన్ని నీట్‌-2017 నుంచి మినహాయిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. 

12:28 - August 14, 2017
12:26 - August 14, 2017

హైదరాబాద్ : ప్రాజెక్టులపై 12శాతం GSTతో తెలంగాణ ప్రభుత్వం కిందామీదా పడుతోంది.. పెరిగిన భారంతో మిషన్‌ కాకతీయ, భగీరథ పనులు ఎలా పూర్తిచేయాలో తెలియక సతమతమైపోతోంది.. కేంద్రానికి మరోసారి విజ్ఞప్తిచేసి.. అప్పటికీ స్పందించకపోతే కోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. మిషన్ భగీరథపై జిఎస్టీతో దాదాపు 6 వేల కోట్లవరకూ టీఎస్‌ సర్కారుపై అదనపు భారం పడనుంది.. మిషన్‌ కాకతీయపై 4వేల కోట్లవరకూ ఉంది.. ఈ స్థాయిలో భారంమోయడం కష్టమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్కీంలపై జీఎస్‌టీ తగ్గించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.. అయినా కేంద్రంనుంచి సానుకూల స్పందన రాలేదు.. కేంద్రంతీరుపై అసంతృప్తికి గురైన కేసీఆర్‌ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారానికి వెళ్లకుండా నిరసన వ్యక్తం చేశారు..

కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టిపెట్టింది. ఏటా 25 వేల కోట్ల వరకూ కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టులపైనే సర్కారు ఖర్చు చేస్తోంది.... ఈ పనులకు సంబంధించి గతంలో 5శాతం వ్యాట్‌ ఉండేది.. జీఎస్‌టీ వచ్చాక ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులు, మౌళిక సదుపాయాలపై కేంద్రం 18శాతం పన్నువేసింది.... తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు ఈ పన్నుశాతం తగ్గించాలని జీఎస్‌టీ కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేశాయి.. దీనిపై స్పందించిన కౌన్సిల్‌... పన్ను శాతాన్ని 12శాతానికి మార్చింది.. అయినా తెలంగాణపై దాదాపు 19వేల కోట్ల రూపాయల వరకూ భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా.. జీఎస్‌టీ పెరిగిపోవడంతో ఈ ప్రభావం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పడనుంది..

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత జీఎస్‌టీకి ముందు వేగంగా సాగింది.. అయిదు దశల్లో 46 వేల చేరువుల్లో పూడిక తీయాలని సర్కారు నిర్ణయించింది.. ఇప్పటికే రెండు దశల మిషన్ కాకతీయ పనులు పూర్తి కాగా ప్రస్తుతం మూడోదశ పనులు కొనసాగుతున్నాయి. రెండు దశల్లో రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం వ్యాట్‌ను మాత్రమే చెల్లించింది. 9వేల 3 చెరువులకు గాను 70శాతం పనులు పూర్తయ్యాయి.. మరో 30 శాతం పనులకు జీఎస్‌టీ ఎఫెక్ట్‌ పడింది.. ఈ పన్నుకింద 1600 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సివస్తోంది.. ఇక మూడోదశకింద 6వేల 150 చేరువులకు టెండర్ల ప్రక్రియ నడుస్తోంది.. జీఎస్‌టీతో ఒక్క మిషన్ కాకతీయపైనే నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చవుతాయని అధికారులు అంచనావేస్తున్నారు.. ఈ స్థాయిలో నిధులతో మిషన్‌ కాకతీయను పూర్తిచేయడం సర్కారుకు మరింత సమస్యగా మారింది..

ఇంటింటికి సురక్షిత మంచినీరు ఇచ్చే మరో పథకం మిషన్ భగీరథ... ఈ డిసెంబర్ నాటికి పలు ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు ఇవ్వాలని టీఎస్‌ ప్రభుత్వం ప్లాన్‌ చేసింది.. ఈ ప్రాజెక్టుకు అవసమైన నిధులను నాబార్డు, హడ్కోతోపాటు 18 జాతీయ బ్యాంకులు రుణంగా ఇస్తున్నాయి... మార్చి 2017 నాటికి సుమారు 12 వేల కోట్ల రుణాలు వివిధ అర్థిక సంస్థలు అందించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 6వేల 660 కోట్లను మార్జిన్ మనీగా చెల్లిస్తోంది.. మిగిలిన 5వేల 366 కోట్లను రుణంగా తీసుకునేందుకు జాతీయ బ్యాంకులతో చర్చలు సాగుతున్నాయి.. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ పనుల కోసం 3వేల కోట్లు కేటాయించింది..

మిషన్‌ భగీరథను 42 వేల 853 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం చేపట్టింది.. ఈ ప్రాజెక్టులో 26 మెయిన్ సెగ్మెంట్లు, లక్షా 44 వేల కిలో మీటర్ల దూరంవరకూ పైప్‌ లైన్లు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.. పైప్‌లైన్లు, ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు కావాల్సిన ఆన్‌గోయింగ్ ఇంజనీరింగ్ పనులు, యంత్రాలపై జీఎస్‌టీ ప్రభావం ఎక్కువగా పడుతోంది.. పెరిగిన పన్నుతో ఈ డిసెంబర్‌కల్లా ఇంటింటికీ మంచినీరు ఇవ్వడం సాధ్యమవుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి..

మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాన్ని సీఎం కేసీఆర్‌ ముందుండి నడిపిస్తున్నా నిధులు సేకరణ కష్టంగా మారింది.. ఆగమేఘాలపై నిధులు సమీకరించేందుకు కేసీఆర్‌ ప్లాన్‌లు చేస్తున్నా... భవిష్యత్తులో నిధులకు ఇబ్బందులు తప్పేలా లేవు.. ఇప్పటివరకు కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉన్న కేసీఆర్‌... జీఎస్‌టీ తర్వాత కాస్త స్వరం పెంచారు. చివరిసారి ప్రధానితో చర్చలు జరపాలని భావిస్తున్నారు.... తెలంగాణ కొత్త రాష్ట్రమని... 12శాతం జీఎస్‌టీపై మరోసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేయనున్నారు.. ఆలోపే జీఎస్‌టీ ప్రభావం ఏఏ శాఖలపై పడుతుందో పూర్తి వివరాలతో ప్రధానికి లేఖరాసే పనిలో సీఎం ఉన్నారు.. సెప్టెంబర్‌లో జరగబోయే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో కూడా ఈ విషయం ప్రస్తావించాలని చూస్తున్నారు. మొత్తానికి కేంద్రానికి విజ్ఞప్తుల ద్వారా సమస్యలు చెప్పాలని చూస్తున్న కేసీఆర్‌.. సానుకూల నిర్ణయం రాకపోతే న్యాయపోరాటానికి దిగాలని చూస్తున్నారు 12 శాతం జీఎస్టీపై కోర్టులో సవాల్ చేయాలని చూస్తున్నారు.. 

కంప్యూటర్ల చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్...

హైదరాబాద్: హయత్ నగర్, వనస్థలీపురం ఏరియాల్లో కంప్యూటర్ల చోరీలకు పాల్పడుతున్న దొంగ ను పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి 14 కంప్యూటర్లు, ఎల్ ఈడీ ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు.

మరో డ్రగ్స ముఠా గుట్టు రట్టు...

హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయ్యింది. ఓనైజీరియన్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 30 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

కార్మిక సంఘాలతో సింగరేణి యాజామాన్యం చర్చలు

హైదరాబాద్: కార్మిక సంఘాలతో సింగరేణి యాజామాన్యం చర్చలు జరుపుతోంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై చర్చిస్తున్నట్లు సమాచారం. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రతి కార్మికుడికి రెండు ఓట్లు కల్పించాలని,రెండేళ్లకోసారి ఎన్నికలు జరిపించాలంటూ కార్మిక సంఘాలు పట్టిబట్టిన్లు తెలుస్తోంది. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్దీకరణ చేయాలని కార్మిక సంఘాలు బైఠాయించి ఆందోళన చేపట్టాయి.

కేసీఆర్ కుటుంబం ధన దోపిడీకి పాల్పడుతోంది: ఎల్.రమణ

హైదరాబాద్: నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలని గరవ్నర్ ను కోరినట్లు టిడిపి నేత ఎల్ రమణ తెలిపారు. ఈ మేరకు అఖిల పక్షం బృందం నేతలు ఈ రోజు గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం ధన దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఇసుక మాఫియాకు సీఎం ఫ్యామిటీ అండగా ఉందని, నైతిక ఉంటే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

నేరెళ్లలో పోలీసులు దమనకాండకు పాల్పడ్డారు: లక్ష్మణ్

హైదరాబాద్: నేరెళ్లలో పోలీసులు దమనకాండకు పాల్పడ్డారని బిజెపి నేత లక్ష్మణ్ విమర్శించారు. నేరెళ్ల ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎస్సైను తప్పించి చేతులు దులుపుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. సర్కార్ స్పందించకపోతే అందరితో కలిసి పోరాడతామని హెచ్చరించారు.

కాపు నేతలతో భేటీ అయిన సీఎం చంద్రబాబు

విజయవాడ: వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో కాపు నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, కాపు సంఘాల నేతలు హాజరయ్యారు. కాపు రిజర్వేషన్ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

 

కేటీఆర్ ప్రమేయంతోనే నేరెళ్ల ఘటన: ఉత్తమ్

హైదరాబాద్: సిరిసిల్లలో ఇసుక మాఫియాకు అండగా ఉండి దళితులను చిత్రహింసలకు గురి చేశారని టీఎస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ మీడియాకు వెల్లడించారు. రాజ్ భవన్ లో అఖిల పక్షం ఆధ్వర్యంలో గవర్నర్ నరసింహన్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్ ప్రయోమంతోనే నేరెళ్ల ఘటన జరిగిందని ఆరోపించారు. నేరెళ్ల ఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని లేదాకేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

బావిలోకి దూసుకెళ్లిన బైక్ : ఇద్దరి మృతి

విశాఖ: బీడికా మండలం పెదగోగాడలో బైక్ బావిలోకి దూసుకెళ్లింది. భార్య, కూతురు మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు లక్ష్మి (25), దేవి(5) గుర్తించారు.

11:23 - August 14, 2017

 

హైదరాబాద్ : సిరిసిల్ల ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు. నేరెళ్ల ఘటన..ప్రొ.కోదండరాం అరెస్టు వ్యవహారాలను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దృష్టికి తెలంగాణ అఖిలపక్షం తీసుకెళ్లింది. గవర్నర్ తో భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బీసీలు అనేక సందర్భాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారని తెలిపారు. ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లారని, సిరిసిల్లలో ఇసుక మాఫియా బరి తెగించిందన్నారు. ముఖ్యమంత్రి ఫ్యామిలీ మొత్తం ఇసుక మాఫియాలో ఉందని, ఈ నేపథ్యంలో కొంతమందిపై థర్డ్ డిగ్రీని పోలీసులు ప్రయోగించారన్నారు. ఈ చర్యకు పాల్పడిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎస్పీతో సహా అందర్నీ సస్పెండ్ చేయాలని..బాధితులకు పరిహారం అందచేయాలని డిమాండ్ చేశారు. జరిగిన విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. 

11:18 - August 14, 2017
11:17 - August 14, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ ను తెలంగాణ అఖిలపక్ష నేతలు కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నేరెళ్ల ఘటన..ప్రొ.కోదండరాం అరెస్టు విషయాలపై గవర్నర్ కు తెలిపారు. నేరెళ్ల ఘటనలో ఎస్ఐపై మాత్రమే చర్యలు తీసుకున్నారని, ఎలాంటి కేసులు పెట్టకపోవడంలో ఆంతర్యం ఏంటీ అని..వెంటనే దీనిపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను నేతలు కోరారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే నిజనిజాలు బయటకు వస్తాయని అఖిలపక్ష నేతలు పేర్కొంటున్నారు. నేరెళ్ల ఘటనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని, వారి అండదండలతోనే ఇసుక మాఫియా చెలరేగిపోతోందంటున్నారు. దళిత, బడుగు బలహీన వర్గాలపై దాడులు చేస్తున్నారని, దాడులు చేస్తున్న వారి వెనుక టీఆర్ఎస్ నేతలున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం ట్యాంక్ బండ్ వద్ద అఖిలపక్షం నిరసన చేపట్టనుంది. జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు అఖిలపక్షం సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ను కలిసిన వారిలో జానారెడ్డి, ఉత్తమ్, షబ్బీర్, మోత్కుపల్లి, చాడ, కోదండరాం, రేవంత్ రెడ్డి ఇతరులున్నారు. 

11:11 - August 14, 2017

విజయవాడ : కాపు రిజర్వేషన్ అంశానికి సంబంధించిన విషయానికి తాము ఫుల్ స్టాప్ పెట్టే విధంగా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి చిన రాజప్ప పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని తాము చెప్పినా ఆయన నిర్ణయం తీసుకోలేదన్నారు. కావాలనే రాజకీయ దురుద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారని, ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం ముద్రగడకు తెలియ చేయలేదన్నారు. పిలిచినా ఆయన రాడని విమర్శించారు. కాపు రిజర్వేషన్ కు సంబంధించి మంజునాథ కమిషన్ 13 జిల్లాలు కూడా తిరిగిందన్నారు. తొందరలోనే నివేదిక వస్తుందని పేర్కొన్నారు. బీసీలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు తూర్పుగోదావరి జిల్లాలోని నేతలతో తాను మాట్లాడడం జరిగిందన్నారు.

 

టీఎస్ ఇంటర్ బోర్డుకు జాతీయ అవార్డు..

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలికి అత్యుత్తమ డిజిటల్ సేవల వినియోగంపై జాతీయస్థాయి అవార్డు దక్కింది. ఢిల్లీలో జరిగిన ప్రపంచ విద్యాసదస్సులో శ్రీలంక విద్యామంత్రి వీఎస్ రాధాకృష్ణన్ నుంచి రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి ఏ అశోక్ ఈ అవార్డు అందుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పరీక్షల్లో సంస్కరణలు, అకడమిక్, పరిపాలనలో విద్యార్థులకు విశిష్ట సేవలు అందించినందుకు ఈ అవార్డు వచ్చిందని కార్యదర్శి అశోక్ తెలిపారు. 

ఏపీఎస్ ఆర్టీసికి జాతీయ స్తాయి పురస్కారం...

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ)కు జాతీయస్థాయి పురస్కారం లభించింది. కొత్త ఆవిష్కరణల విభాగంలో అల్ట్రా డీలక్స్‌ బస్సులను ప్రవేశపెట్టినందుకుగాను ఈ అవార్డు వరించింది. దిల్లీలో జరిగిన అఖిల భారత రోడ్డు రవాణా సంస్థల సదస్సులో ఈ అవార్డును ప్రకటించగా... ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 

గవర్నర్ ను కలిసిన అఖిలపక్ష నేతలు

హైదరాబాద్: అఖిలపక్షం నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. నేరెళ్ల ఘటన, పోలీసుల దాడులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో జానా, ఉత్తమ్, మోత్కుపల్లి, చాడ వెంకట్ రెడ్డి, కోదండరాం పాల్గొన్నారు.

ముద్రగడకు మద్దతుగా నల్లజెండాలతో కాపుల నిరసన..

తూ.గో: కిర్లంపూడిలో పాదయాత్ర చేసేందుకు ముద్రగడ పద్మనాభం యత్నించారు. అయితే అనుమతి లేదని ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడకు మద్దతుగా నల్లజెండాలతో కాపులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాపులకు ప్రభుత్వం శుభవార్త చెబుతానన్నదని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధీతం చేస్తానని ముద్రగడ హెచ్చరించారు.

ఆటో డ్రైవర్ హత్య చేసిన దుండగులు...

నల్లగొండ: నాంపల్లి మండలం తుంగపాడు గ్రామ శివారులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ మహేందర్‌రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి చంపారు. మృతుడు మర్రిగూడెం మండలం శివన్న గూడెం వాసిగా గుర్తించారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని స్థానికుల సమాచారం.

10:25 - August 14, 2017

ఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాసులు మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ బస్సులపై కొండ చరియలు విరిగి పడటంతో 46 మంది సజీవ సమాధి అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5లక్షలు ప్రకటించింది.

మనాలి - కట్ర..మనాలి - చంబా ప్రాంతాలకు రెండు బస్సులు వెళుతున్నాయి. ఓ ప్రాంతంలో ఈ బస్సులు నిలిచి ఉన్నాయి. ఈ రెండు బస్సుల్లో 56 మంది ప్రయాణీకులున్నారు. ఒక్కసారిగా ఈ రెండు బస్సులపై కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 48 మంది మృతి చెందగా 23 మృతదేహాలను గుర్తించారు. మృతులు నల్గొండకు చెందిన కొండల్ రెడ్డి, యాదాద్రి నివాశి , రాజారెడ్డిగా గుర్తించారు. వీరు సుషీ హైటెక్ సంస్థలో పనిచేస్తున్నారు. ఓ కాంట్రాక్టు నేపథ్యంలో వీరు హిమాచల్ కు వెళ్లి ప్రమాదంలో మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

హిమాచల్ ప్రదేశ్ లో విషాదం:48 మంది మృతి

హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ లో విషాదం నెలకొంది. మండి-పఠాన్ కోట్ జాతీయరహదారిపై రెండు బస్సులపై కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ బస్సుల్లో 56 మంది ప్రయాణీకులు ఉన్నారు. కొండ చరియలు విరిగిపడి 48 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు 23 మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు నల్గొండ, యాదాద్రి జిల్లా వాసులు ఉన్నట్లు తెలుస్తోంది.

రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ

హైదరాబాద్ : గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రేపు ఉదయం 7 గంటల నుం చి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట రోడ్డును మూసివేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. పరేడ్ గ్రౌండ్‌లో జరిగే వేడుకల సందర్భంగా తివో లి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను బ్రూక్‌బండ్, ఎన్‌సీసీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు అమలులో ఉంటాయి.

నైజీరియా డ్రగ్స్ ముఠా అరెస్ట్

హైదరాబాద్: నైజీరియా డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 30 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

10:13 - August 14, 2017

విజయవాడ :కొద్ది రోజుల్లో మంజునాథ కమిషన్ నివేదిక వస్తుందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజనేయ పేర్కొన్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడితో కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలని కోరనున్నారు.

అదే సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన పాదయాత్ర చేయడానికి యత్నించడం..పోలీసులు అడ్డుకోవడం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాపు ప్రజాప్రతినిధులు సీఎం బాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజనేయ టెన్ టివితో మాట్లాడారు. ఎన్నికల్లో కాపుల రిజర్వేషన్ పై హామీనిచ్చామని అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాపులను బీసీల్లో పెట్టడానికి బాబు సిద్ధంగా ఉన్నారని, అందులో భాగంగా మంజునాథ కమిషన్ నివేదిక కొద్ది రోజుల్లో వస్తుందన్నారు. బీసీల్లో చేర్చడానికి తమిళనాడు తరహాలో రిజర్వేషన్ ఇవ్వడానికి బాబు సుముఖత వ్యక్తం చేస్తున్నారని, రిజర్వేషన్ విషయంలో కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. బీసీలకు నష్టం వాటిల్లకుండా న్యాయం చేస్తారని ఇటీవల ఓ సమావేశంలో మంత్చి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కాపుల రిజర్వేషన్ అంశంపై ఉద్యమం చేస్తున్న ముద్రగడది జగన్ వర్గమని, ఒక గదిలో ప్రకటనలు చేయడం చెల్లుబాటు కాదన్నారు. 

ఇనాంగూడలో వ్యక్తి దారుణ హత్య..

రంగారెడ్డి: అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇనాంగూడలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహానికి బండరాళ్లు కట్టి దుండగులు చెరువులో పడేశారు.

09:10 - August 14, 2017

విజయవాడ : కాపు రిజర్వేషన్ అంశంపై టిడిపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందా ? గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కాపు వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు భేటీ అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 11గంటలకు ఈ సమావేశం జరగనుంది.

గత ఎన్నికల్లో హామీనిచ్చిన కాపు జర్వేషన్ అంశంపై చర్చించనున్నారు. మంజునాథ కమిషన్ నివేదిక ఎప్పుడొస్తుంది ? విధి విధానాలు ఏంటీ ? అనే దానిపై కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీలను ఒప్పించి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని కాపు నేతలు బాబును కోరనున్నట్లు తెలుస్తోంది.

అదే సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన పాదయాత్ర చేయడానికి యత్నించడం..పోలీసులు అడ్డుకోవడం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాపు ప్రజాప్రతినిధులు..సీఎం బాబుతో జరిగే భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకొంటారో వేచి చూడాలి. 

08:30 - August 14, 2017

46 మృతదేహాల వెలికి తీత..

హిమచల్ ప్రదేశ్ : రాష్ట్రంలో మండీ - పఠాన్ కోట్ జాతీయ రహదారిపై కొట్రుపి వద్ద జరిగిన ప్రమాదంలో 46 మృతదేహాలను బయటకు తీశారు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు సమాధి అయ్యాయి. ఈఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

08:11 - August 14, 2017

తూర్పుగోదావరి : పాతకక్షలు భగ్గుమన్నాయి. ఇరు కుటుంబాలు తలపడ్డాయి. 9 మందికరి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరు కుటుంబాల మధ్య గతకొన్ని రోజులుగా సిరిహద్దు విషయంలో గొడవ చెలరేగింది. చిన్న గొడవ కాస్త పెద్దదై పోయింది. కత్తులు..ఇతర మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. 9 మందికి తీవ్రమైన గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. 

07:59 - August 14, 2017

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారుల మృత్యుఘోష తీవ్ర కలకలం రేగుతోంది. గోరఖ్ పూర్ చిన్నారుల మరణాలపై నిరసన సెగలు భగ్గుమన్నాయి. ఇప్పటి వరకు 70 మంది మృతి చెందారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో దళితులపై దాడులు..ప్రొ.కోదండరాం అరెస్టు..తదితర అంశాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో టి.కాంగ్రెస్ నేతలు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలువనున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో రాకేష్ (టీఆర్ఎస్), ప్రకాష్ రావు (బీజేపీ), బాబురావు (సీపీఎం), దుర్గాప్రసాద్ (టిడిపి), దాసోజి శ్రవణ్ (టి.కాంగ్రెస్)లు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

ప్రాణాలు కోల్పోయిన 50 మంది..

హిమచల్ ప్రదేశ్ : రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. మండీ - పఠాన్ కోట్ జాతీయ రహదారిపై కొట్రుపి వద్ద భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. రెండు బస్సులు సమాధి కావడంతో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. 

తిరుపతిలో భక్తుల అగచాట్లు..

చిత్తూరు : తిరుపతికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు..వారాంతం కావడంతో తండోపతండాలుగా యాత్రికులు తరలివస్తున్నారు. అద్దె గదులు దొరక్క భక్తులు అగచాట్లు పడుతున్నారు. 

కుటుంబాల ఘర్షణ..పలువురికి గాయాలు..

తూర్పుగోదావరి : ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మందికి గాయలయ్యాయి. 

సిద్ధిపేటకు హరీష్..మహేందర్ రెడ్డి..

సిద్ధిపేట : నేడు హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో మంత్రులు హరీష్ రావు, మహేందర్ రెడ్డిలు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేయనున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి...

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. నేడు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తాంధ్రలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ పేర్కొంది. 

బాబుతో కాపు ప్రజాప్రతినిధుల భేటీ..

విజయవాడ : నేడు సీఎం చంద్రబాబు నాయుడుతో కాపు ప్రజాప్రతినిధులు భేటీ కానున్నారు. రిజర్వేషన్ల అంశాన్ని త్వరగా తేల్చాలని నేతలు కోరనున్నారు. 

23న చలో సచివాలయం..

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ కార్మిక ఉద్యోగ వర్గాలు కదం తొక్కుతున్నాయి. ఇదే డిమాండ్ పై ఈ నెల 23న చలో సచివాలయం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఇ

06:49 - August 14, 2017

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ కార్మిక ఉద్యోగ వర్గాలు కదం తొక్కుతున్నాయి. ఇదే డిమాండ్ పై ఈ నెల 23న చలో సచివాలయం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా ఫెడరేషన్ నాయకులు విడుదల చేశారు. సమాన పనికి సమాన వేతనం అన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తే, తెలంగాణలో లక్షా 40వేల మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేలు జరిగే అవకాశం వుంది. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జె వెంకటేశ్ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

భారత్ జట్టు ఎంపిక..

ఢిల్లీ : శ్రీలంకతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. కోహ్లీ కెప్టెన్సీలో టీమ్‌ ఇండియా శ్రీలంకతో తలపడనుంది. అయితే యువరాజ్‌ సింగ్‌కు జట్టులో స్థానం లభించలేదు. వన్డేతోపాటు టీ20 సిరీస్‌లోనూ యువీకి చోటు లభించలేదు. ఇక అశ్విన్‌ , జడేజాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. మనీష్‌ పాండే మళ్లీ జట్టులోకి వచ్చారు. ఈనెల 20 నుంచి ఐదు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది.

06:45 - August 14, 2017

హైదరాబాద్ : తీజ్ పండుగంటే మనం పల్లెలోనే జరుపు కోవడం చూస్తుంటాం. బంజరాల ఇష్టమైన పండుగకు భాగ్యనగరం వేదికైంది.రాష్టం నలుమూల నుంచి వచ్చిన బంజారాలు ఒకే చోటా చేరి పండుగ జరుపుకున్నారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో కన్నుల పండువగా సాగిన తీజ్‌ ఉత్సవాలపై టెన్‌టీవీ స్టోరీ..ప్రత్యేక కథనం..గిరిజనుల సంప్రదాయ పండుగ తీజ్‌ ఉత్సవాలు భాగ్యనగరంలో కన్నుల పండువగా సాగాయి. రాష్ట్రం నలుమూల నుంచి తరలి వచ్చిన బంజారాలు హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున సందడి చేశారు. బంజారాల సంస్క్నతి సంప్రాదాయాలు ఉట్టి పడే విధంగా దుస్తులను ధరించి తీజ్ బతుకమ్మను తలపై పెట్టుకుని, ఆటా పాటాలతో హోరెత్తించారు. సేవాలాల్ బంజరా సేన ఆద్వర్యంలో హైదరాబాద్‌ నక్లెస్ రోడ్డులో తీజ్ పండుగ వేడులకు వైభవంగా జరిగాయి. బతుకమ్మ ఘాట్‌లో ఏర్పాటు చేసిన తీజ్ ఉత్సవాల్లో వేలాది మంది బంజారా మహళలు, పురుషులు పాల్గోన్నారు..

తీజ్ పర్వం దీనంలో భాగంగా బంజరాలు తొమ్మిది రోజుల పాటు నిష్టగా పూజలు చేసి, పదవ రోజు, తీజ్ బతుకమ్మను నిమ్జనం చేస్తారు..సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన తండాల్లో తీజ్ వేడుకలు ఘనంగా సాగుతాయి.. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరు ఒక చోటుకి చేరుకుని, బంజర పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తారు.. ఈసారి తెలంగాణ ప్రాంతంలోని బంజరాలందరు హైదరాబాద్‌లోని నక్లెస్ రోడ్డు లో ఏర్పాటు చేసిన తీజ్ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారంతపు సెలవులు కావడంతో తీజ్‌వేడుకలు ఇటు నగరవాసులను బాగా అలరించాయి. పెద్ద సంఖ్యలో వచ్చిన పర్యాటకులు ఉత్సవాల ను ఆస్వాదించారు.

మొత్తానికి గిరిజన తండాలు, పల్లెలకే పరిమితం అయిన తీజ్‌ ఉత్సవాలు, ఇపుడు నగర ప్రజలను అలరించాయి. తమదైన సంస్కృతి, సంప్రదాయాలను నగరానికి పరిచయం చేస్తూ ఆనందాన్ని, పండుగ విశిష్టతను ఘనంగా చాటారు.

06:36 - August 14, 2017

కరీంనగర్ : కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలోని వావిగాల గ్రామం. ఖద్దరు వస్త్రాల తయారీలో దేశంలోనే పేరుగాంచిన ఊరు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇచ్చినప్పుడు జాతిపిత అనుచరులు ఖాదీ ప్రతిప్ఠాన్‌ను స్థాపించిన గ్రామం ఇదే. వావిలాల ఖాదీ పరిశ్రమకు ఘన చరిత్ర ఉంది. గాంధీజీ అనుచరులు ద్వారకా లేలే, సహస్రబుద్ధి, ఫ్రాంకేకర్‌ 1929లో ఈ ఊళ్లోనే ఖాదీ ప్రతిష్ఠాన్‌ను స్థాపించారు. అయితే స్వామి రామానందతీర్థ అఖిల భారత చరఖా సంఘం ఏర్పాటు చేసిన తర్వాతే 1947-50 మధ్య ఇక్కడ ఖాదీ వస్త్రాల ఉత్పత్తికి ఊతం లభించింది. 1951లో హైదరాబాద్‌ గాంధీ భవన్‌ వేదికగా హైదరాబాద్‌ చరఖా సంఘం, ఆ తర్వాత భాగ్యనగర్‌ ఖాదీ సమితిగా రూపుదిద్దుకుంది. ఆ తర్వాత మెట్‌పల్లి ఖాదీ పరిశ్రమ ఏర్పడటంతో 1983లో వావిలాల ఖాదీ పరిశ్రమ విడిపోయింది. వావిలాల ఖాదీ ప్రతిష్ఠాన్‌ పేరుతో ముంబయి ఖాదీ కమిషన్‌ ఆధ్వర్యంలో ఇప్పటికీ కొనసాగుతోంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవించి ఉన్నంతకాలం ఈ సొసైటీకి చైర్మన్‌గా కొనసాగారు.

యాభైకి పైగా ఉత్పత్తి కేంద్రాలు..
నాణ్యమైన ఖాదీ వస్త్రాల తయారీకి వావిలాల ఖాదీ ప్రతిష్ఠాన్‌కు మంచి పేరు ఉంది. యాభైకి పైగా ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణ, ఏపీలో 13 ఖాదీ విక్రయశాలు ఉన్నాయి. వావిలాల ఖాదీ ప్రతిష్ఠాన్‌ జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంది. ఇటువంటి వావిలాల ఖాదీకి ఇప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. చేనేతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఖాదీ వస్త్రాలపై 20 శాతం రిబేటు ఇస్తున్నా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పైసా కూడా ఇవ్వడంలేదు. 1997 ప్రకటించిన ఐదు శాతం రాయితీ బకాయిలు 8.50 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం నుంచి ఇంకా విడుదల కాకపోవడంతో వావిలాల ఖాదీ ప్రతిష్ఠాన్‌ కుదేలైంది. ఖాదీ వస్త్రాలు కొనే నాథులు లేకపోవడంతో ఈ పరిశ్రమ కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతోంది.

మనుగడే ప్రశ్నార్థకం..
ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, వాజ్‌పేయిలు ప్రధానులుగా పనిచేసినప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ఎగురవేసిన జాతీయ జెండాను వావివాల నుంచి తీసుకెళ్లారు. ఇటువంటి వావిలాల ఖాదీ ప్రతిష్ఠాన్‌ సభ్యులకు ఇప్పుడు తినటానికి తిండిలేదు. కట్టుకోడానికి సరైన బట్టలేదు. ఖాదీకి ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో పస్తులుండే పరిస్థితుల దాపురించాయని నేత కార్మికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాదీ కూడు పెడుతుందని ఈ పరిశ్రమనే పట్టుకుని వేలాడటం వలన ఇప్పుడు తమ బతుకులు దర్భరంగా మారాయని వావిలాల నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 1200 మందికి ఉపాధి కల్పించిన వావిలాల ఖాదీ పరిశ్రమలో ఇప్పుడు పట్టుమని పది మంది కూడా పనిచేయడంలేదు. కేవలం మూడు కుటుంబాలు మాత్రమే ఈ వృత్తితో భుక్తి గడుపుకుంటున్నాయి. రోజంతా కష్టపడ్డా 150 రూపాయల కూలీ కూడా గిట్టుబాటు కాకపడంతో నేత వృత్తిని వదలి వేరే పనుల వైపు మళ్లుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఖాదీ పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. 

06:32 - August 14, 2017

హైదరాబాద్ : ఉత్సాహంపై నీళ్లు చల్లొద్దు... ఇచ్చినమాటకు కట్టుబడండి... పరుగులు పెడుతున్న రాష్ట్ర ఐటీ రంగాన్ని నిరుత్సాహ పరచొద్దు...రావాల్సిన నిధులను వెంటనే విడుదుల చేయండి.. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు నిధుల కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. కేంద్ర మంత్రి శివశంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధుల విడుదలపై జరుగుతున్న అపార జాప్యం గురించి లేఖలో వివరించారు. 2013 సెప్టెంబర్ లో ప్రతిష్టాత్మక ఐటీఐఆర్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కాని 4ళ్లు అవుతున్నా నామమాత్రపు నిధులు కూడా విడుదల కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తించిందని చెప్పారు. అయితే గత నాలుగు సంవత్సరాలలో కేంద్రం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో ఐటీఐఆర్ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై విధాన పరమైన స్పష్టత ఇవ్వడంతోపాటు ఇప్పటికే ప్రాజెక్టులో భాగంగా నాలుగేళ్ల కిందట ఆమోదించిన నిధులను వెంటనే విడుదల చేయాలని మంత్రి కేటీఆర్ లేఖలో కోరారు.

ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు 2008లో కేంద్రం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐటీఐఆర్ లను మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ లేఖలో గుర్తు చేశారు. విధానపరమైన నిర్ణయం మేరకు మౌలిక వసతుల కల్పనకు అవసరమైన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ లోని 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐటీఐఆర్ చేపట్టాలని రాష్ట్ర ఐటీ శాఖ 2010లో ప్రతిపాదనలు ఇచ్చిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీపీఆర్‌ను రెండు సార్లు కేంద్రానికి సమర్పించామని చెప్పారు. ఈ మేరకు మౌలిక వసతుల కల్పన కోసం 4,863 కోట్లరూపాయలను ఇవ్వాలని ఐటీ శాఖ కోరినట్టు కేటీఆర్‌ లేఖలో వివరించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించి మొత్తం 3,275 కోట్లరూపాయలను మంజూరు చేశారని పేర్కొన్నారు. దీన్లో భాగంగా మొదటి దశలో 165 కోట్లు, రెండో దశ 3,110 కోట్లును ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని లేఖలో కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు మంత్రి కేటీఆర్‌. అయితే ఇప్పటికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పూర్తి స్థాయి నిధుల విడుదల మాత్రం జరగలేదని కేటీఆర్ లేఖలో స్పష్టం చేశారు.

ఐటీ, అనుబంధ రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని మంత్రి కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. అన్ని కోణాల్లో ఐటీ పరిశ్రమను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తే.. రాష్ట్రంలో పరిశ్రమల ప్రగతి మరింత ముందుకు పోతుందన్నారు. ఇప్పటికే కేంద్రం అంగీకరించిన మేరకు నిధులను విడుదల చేయాలని లేఖలో కోరారు. మంత్రి కేటీఆర్‌ లేఖపై కేంద్రం ఏవిధంగా స్పందిస్తుందనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది. 

ఇద్దరు మావోయిస్టుల మృతి..

చత్తీస్ ఘడ్ : సుకుమా జిల్లాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాశారం అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. 

భారీ వర్షాలు కురుస్తాయి..

హైదరాబాద్ : ఈనెల 16, 17వ తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తున్నాయని, 16, 17 తేదీల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

పేలిన రెడ్ ఎంఐనోట్ 4..

తూర్పుగోదావరి : రావులపాలెంలో సెల్ ఫోన్ పేలింది. బైక్ పై వెతున్న వ్యక్తి జేబులో సెల్ ఫోన్ పేలడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. 20 రోజుల క్రితమే రెడ్ ఎంఐనోట్ 4 కొన్నాడు. సెల్ ఫోన్ పేలుడుపై కోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నాడు. 

శ్రీలంక 135..ఆలౌట్..

ఢిల్లీ : తొలి ఇన్నింగ్స్ లో 135 పరుగులకే శ్రీలంక జట్టు ఆలౌట్ అయ్యింది. భారత్ బౌలింగ్ లో కుల్దీర్ 4, అశ్విన్, షమీకి రెండేసి వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 487 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 

Don't Miss