Activities calendar

15 August 2017

బోరుబావి ఘటనాస్థలికి చేరుకున్న కలెక్టర్‌

గుంటూరు : జిల్లాలో మరోసారి మానవ తప్పిదం ఓ బాలుడి ప్రాణాలమీదికి తెచ్చింది. వినుకొండ మండలం ఉమ్మడివరంలో తెరిచిఉన్న బోరు బావిలో రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్‌ పడిపోయాడు. బాలుడు 15 అడుగుల లోతులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. జేసీబీలతో బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఘటనా స్థలానికి కలెక్టర్‌ కోన శశిధర్‌ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

బోరుబావి ఘటనపై చంద్రబాబు సైతం ఆరా

గుంటూరు : వినుకొండ మండలం ఉమ్మడివరంలో ప్రమాదవశాత్తు బాలుడు బోరు బావిలో పడ్డాడు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం ఆరా తీశారు. బోరుబావి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. 

21:49 - August 15, 2017

గుంటూరు : జిల్లాలో మరోసారి మానవ తప్పిదం ఓ బాలుడి ప్రాణాలమీదికి తెచ్చింది. వినుకొండ మండలం ఉమ్మడివరంలో తెరిచిఉన్న బోరు బావిలో రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్‌ పడిపోయాడు. బాలుడు 15 అడుగుల లోతులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. జేసీబీలతో బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఘటనా స్థలానికి కలెక్టర్‌ కోన శశిధర్‌ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు సీఎం చంద్రబాబుసైతం బోరుబావి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:44 - August 15, 2017

గుంటూరు : జిల్లాలో మరోసారి మానవ తప్పిదం ఓ బాలుడి ప్రాణాలమీదికి తెచ్చింది. వినుకొండ మండలం ఉమ్మడివరంలో తెరిచిఉన్న బోరు బావిలో రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్‌ పడిపోయాడు. బాలుడు 15 అడుగుల లోతులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. జేసీబీలతో బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఘటనా స్థలానికి కలెక్టర్‌ కోన శశిధర్‌ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు సీఎం చంద్రబాబుసైతం బోరుబావి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:34 - August 15, 2017

ఎర్రకొటమీద ఎగిరిన తిరంగ జెండ...అత్తుకున్నరు జనం గుండెల నిండ, జెండా ఇడిసిపెట్టి తాగేటందుకు పోయిండు....ఉల్టా ఎగిరేసిన అనుముల ఎమ్మార్యో, ఎమ్మెల్సీ గారి రాజీనామా ఆమోదం...మరి ఎమ్మెల్యేల సంగతేందో ఆల్చం, ప్రతిపక్షాలొల్లు ప్రాజెక్టులు కట్టొదంటున్నరు..అన్నీ అవద్దాలేచెప్తున్న మంత్రి హరీష్, నంద్యాల ఉప ఎన్నికలకు బాలయ్య రాక...పబ్లిక్కు భయపడేరు సుమా చూడలేక...మాల్యా కోసం ముంబై జైలు వెయిటింగ్..కసబ్ బ్యారక్ ను శుభ్రం చేసిన అధికారులు.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:22 - August 15, 2017
21:18 - August 15, 2017

స్వేచ్ఛా పతాకాన్ని ఎగరేయాలని తపించాం.. స్వేచ్ఛ, సమానత్వం భాసిల్లే సుందర ప్రపంచాన్ని నిర్మించుకోవాలని కలలుగన్నాం.. ఏడు దశాబ్దాలు గడిచింది. ఏం సాధించాం? కులం అంతే ఉంది.. మతం అంటే మండిపొయే పరిస్థితి.. అసమానతలు వందల రెట్లు పెరిగాయి.  అసహనం టన్నులు టన్నులుగా పేరుకుపోతోంది. మరి ఈ పరిస్థితుల్లో స్వతంత్ర భారతదేశం ఏడు దశాబ్దాలుగా సాధించినదేమిటి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టొరీ..
ఇదేనా ఏడు దశాబ్దాల ఫలితం? 
ఇదేనా ఏడు దశాబ్దాల ఫలితం? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. ఇది స్వరం మారిన వందేమాతర గీతం. వరస తప్పిన స్వతంత్ర భారతం. కార్పొరేట్లు గానం చేస్తోన్న సామ్రాజ్యవాద స్తోత్రగీతం. మతపిచ్చి తలకెక్కిన కొందరు ఆలపిస్తున్న ఆధిపత్యగానం.. పక్కవాడి నీడను భరించలేని అసహన భారతం.. దేభశక్తి పేరుతో స్వేచ్ఛా గీతాన్ని బంధించే ప్రయత్నం చేస్తున్న కాలం.. అంతిమంగా ఏడుదశాబ్దాలుగా నెరవేరని స్వప్నం.. అవునా?
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:12 - August 15, 2017

సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజతో టెన్ టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు తెలిపారు. ఆయన రాసిన పలు పాటలను పాడి వినిపించారు. అశోక్ తేజ తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:09 - August 15, 2017

గుంటూరు : జిల్లాలోని వినుకొండ మండలం ఉమ్మడివరంలో విషాదం చోటుచేసుకుంది. బోరు బావిలో రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్‌ పడిపోయాడు. బాలుడు 15 అడుగుల లోతులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా...

 

21:07 - August 15, 2017
21:05 - August 15, 2017

గుంటూరు : జిల్లాలోని వినుకొండ మండలం ఉమ్మడివరంలో విషాదం చోటుచేసుకుంది. బోరు బావిలో రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్‌ పడిపోయాడు. బాలుడు 15 అడుగుల లోతులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

21:03 - August 15, 2017

కర్నూలు : పార్టీ మారాలనుకుంటే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారొచ్చని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే వైసీపీలో చేరానని చెప్పారు. 

 

20:55 - August 15, 2017

బ్రిటీష్ వారి బానిన సంకెళ్లను తెంచి భరతమాత దాస్య విముక్తి కోసం భారతీయులు చేపట్టిన స్వాతంత్ర్య సమరంలో ఎన్నో కీలక ఘట్టాలు. మరెన్నో స్ఫూర్తిదాయక పిలుపులు. ఈ చారిత్రక ఘట్టాలలో పురుషులతో పాటు స్త్రీలు కూడా అద్భుతమైన సాహసాలను ప్రదర్శించారు. బ్రిటీష్ పాలకుల నుండి విముక్తి పొంది స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను జరుపుకుంటున్న ఈ తరుణంలో స్వాతంత్ర్య సమయంలో ఉద్యమ పోరాటపటిమను ప్రదర్శించిన మహిళల కీర్తి కేతనాలపై  మానవి స్పెషల్ ఫోకస్..

మహిళలు బయటికి రావడమే అరుదైన తరుణంలో స్వాతంత్య్ర సంగ్రామ ఉద్యమంలో పురుషులతో సమానంగా ఉద్యమంలో పాల్గొన్నారు. భరతమాత దాస్య సంకెళ్లను తెంచేందుకు  స్వతంత్ర పోరాట ఉద్యమానికి ఊపిరిగా నిలిచారు. తమ ప్రసంగాలతో, పాటలతో, నాటకాలతో, కవితలతో, బుర్రకథలో ఎవరికి వారు బ్రిటీష్‌ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రజలలో స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని రగిలించారు. వీరిలో సరోజినీ నాయుడిని ప్రముఖంగా చెప్పుకోవాలి. 

ఆడపిల్ల అంటే పెండ్లి చేసుకుని పిల్లల్ని కని ఇంటిలో పడివుండే పరిస్థితి ఆనాటి సమాజానిది. బాల్యంలో భర్తను కోల్పోయి వితంతువయినా బేలగా మారలేదు. బేజారుపడలేదు. దేశమాతకోసం స్వతంత్ర్య సమరంలో పాల్గొని జైలు వెళ్ళిన  ధీశాలి దువ్వూరి సుబ్బమ్మ. 

భయం అంటే ఏమిటో తెలియని స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గాభాయి దేశ్ ముఖ్.  మహిళా సాధికారత కోసం పాటుపడిన సామాజిక కార్యకర్తగా ఆమె  పేరుపొందారు. భారత సామాజిక సర్వీస్ మదర్ గా పేరొందిన ఆమె మహిళలకు చేసిన సేవలు అసామాన్యమైనవి.

మాతా శిశుల ఆరోగ్యంగా వుంటేనే దేశం అభివృద్ది చెందుతుంది అని నమ్మే వ్యక్తి వైద్యురాలు  కొమర్రాజు అచ్చమాంబ. వారి ఆరోగ్యమే దేశాభివృద్దికి కొలమానం అని చాటి చెప్పిన ఉద్యమకారణి,  స్వాతంత్ర్య సమర యోధురాలు డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ.  

కెప్టెన్ లక్ష్మీ సెహగల్.  భారత స్వతంత్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ తరఫున కదంతొక్కిన వీర వనిత. అభినవ ఝాన్సీ లక్ష్మీబాయిగా పేరుతెచ్చుకున్న ధీరవనిత లక్ష్మీ సెహగల్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపు మేరకు ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ఝాన్సీరాణి రెజిమెంట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలిమహిళగా లక్ష్మీ సెహగల్ చరిత్రలో నిలిచిపోయారు. 

 

ధైర్యంలో నేటి యువత సైతం స్ఫూర్తిగా తీసుకునే వీర వనిత ఝాన్సీ లక్ష్మీ భాయి. అసామాన్య ధైర్యసాహసాలు ప్రదర్శించినవారిని ఈమెతోనే పోలుస్తారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె సాహసాలు మహిళలపై ఎంత ప్రభావాన్ని చూపుతున్నాయో. మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో ముఖ్య భూమిక పోషించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి. 

స్వాతంత్రోద్యమంలో  గాంధీకి వెన్నుదన్నుగా నిలిచి అర్థాంగి అనే పదానికి అసలైన నిర్వచనం ఇచ్చిన చైతన్య శీలి, అద్భుతమైన, అరుదైన మహిళ కస్తూరిబాయి. అంతేకాదు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు నాయకత్వం వహించిన మహిళ కస్తూర్భా గాంధీ. 

భరతమాతను దాస్యశృంఖలాల నుంచి విముక్తి చేయటానికి బ్రిటిష్‌ పాలకుల వలస విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలో కుల, మత, వర్ణ, వర్గ విచక్షణ లేకుండ, స్త్రీ-పురుష లింగభేదం లేకుండ భారతీయులు ఏకత్రాటిపై పోరాడారు. స్వతంత్ర సమరంలో పురుషులు జైళ్లకెళితే వారి భార్యల మీద సంసారభారం పడింది. అత్తమామల సంరక్షణ, పిల్లల పెంపకం అన్నీ వారి భార్యలే భరించారు. ఆర్థికస్తోమత లేనివారు పేదరికంతో అష్టకష్టాలు పడి భర్తలు వచ్చేవరకు కుటుంబాలను సాకారు. ఒకప్రక్క పోలీసుల జులుం, మరోప్రక్క గూఢచారుల నిఘా అన్నీ భరించారు.ఈ క్రమంలో వైవాహిక జీవితాలను సైతం వదులుకున్నవారు. 

అరుణ అసఫ్ అలీ స్వాతంత్రోద్యమంలో ఆమె పాత్ర చెప్పుకోదగినది. గాంధీ నమ్మకాన్ని పొంది ఆయన జైలుకెళ్లిన సందర్భంగా ఉద్యమానికి నాయకత్వం వహించిన వనిత అరుణ అసఫ్ అలీ. 

భారత స్వాతంత్య్ర సమరోజ్వల చరిత్రలో ముస్లిం మహిళలు కూడా పురుషులతో దీటుగా తమదైన వీరోచిత పాత్ర నిర్వహించారు. స్వాతంత్రసమరంలో ప్రధాన పాత్ర వహించిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన స్త్రీలు తమ అపూర్వ త్యాగాలతో..చరిత్ర పుటలను ఎరుపెక్కించారు. వారిలో అవధ్‌ రాణి బేగం హజరత్‌ మహల్‌ ను  అగ్రగామిగా చెప్పుకుని తీరాల్సిందే. 

ఆనాటి పోరాటంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి శత్రువును మట్టు పెట్టేందుకు కదనరంగానికి కదలిన వారిలో బేగం అజీజున్‌ ఒకరు. సాహసిగా పేరొందిన హబీబా బేగం, ఝూన్సీ రాణి కోసం ప్రాణాలర్పించిన ముందర్‌, బ్రిటీషు సైనిక మూకలను సాయుధంగా ఎదుర్కొన్న బేగం రహిమా, మాతృభూమికోసం  సజీవదహనమైన అస్గరి బేగం, ఆంగ్ల సైన్యాలను  ముప్పుతిప్పలు పెట్టిన  బేగం జవిూలా, కత్తిపట్టి కదనరంగాన శతృవును సవాల్‌ చేసిన సాహసి బేగం ఉమ్‌ద్దా.. ఇలా ఎందరో ఎందరో  వీరనారీమణుల పోరాటపటిమను వర్ణించేందుకు మాటలు చాలవు. చరిత్ర నమోదు ప్రకారం స్వతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వందలాది ముస్లిం మహిళలు కాల్చివేయబడ్డారు, ఉరితీయబడ్డారు. తీవ్రమైన  అవమానాలకు,అత్యాచారాలకు గురయ్యారు. 

అలనాటి ముస్లిం మహిళామణుల త్యామయపోరాట చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని బ్రిటీష్‌ అధికారుల డైరీలు, లేఖలు బహిర్గతం చేస్తున్నాయంటే, ఆ వీరనారీమణుల త్యాగాలు ఎంతటి మహత్తరమైనవో అర్థం చేసుకోవచ్చు.

ఆబాది బానో బేగం  బాటలో నడిచిన ఎందరో మహిళా మణులున్నారు.  నిషాతున్నీసా బేగం, షౌకత్‌ అలీ భార్య  అంజాదీ బేగం, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కు స్ఫూర్తిగా నిల్చిన జులేఖా బేగం, స్వాతంత్రేచ్ఛను రగిల్చే సాహిత్యాన్ని సృష్టించిన కవయిత్రి జాహిదా ఖాతూన్‌, ఆలోచనాత్మక ప్రసంగాలకు పెట్టింది పేరైన అక్బరీ బేగం. బ్రిటీష్‌ పోలీసులు గుర్రాలచేత తొక్కించినా, లాఠీలతో రక్తసిక్తం చేసినా పోరుబాట వీడని  హవిూదా తయ్యాబ్జీ, అవిూనా తయ్యాబ్జీ, షఫాతున్నిసా బేగం, ఆదర్శ జాతీయవాదిగా ఖ్యాతిగాంచిన మజీదా బాను, బానిసత్వం కంటే మరణమే మేలని చాటిన బేగం మహమ్మద్‌ ఆలంలు జాతీయోద్యమంలో ప్రముఖపాత్ర వహించారు.  మాతృదేశ విముక్తికోసం ప్రాణాలర్పించిన  మహిళా కేతనాలకు మానవి జోహార్లర్పిస్తోంది. 

20:47 - August 15, 2017
20:45 - August 15, 2017

బోరు బావిలో బాలుడు ఘటనపై చినరాజప్ప ఆరా

 గుంటూరు : జిల్లాలో బోరు బావిలో బాలుడు పడిన ఘటనలో హోంమంత్రి చినరాజప్ప ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

 

రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం

హైదరాబాద్ : రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, సీఎం చంద్రబాబుతోపాటు పవన్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు. 

 

డ్రగ్స్ కేసులో నైజీరియన్లపై చర్యలకు ఉపక్రమించిన పోలీసులు

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నైజీరియన్లపై చర్యలకు పోలీసులు ఉపక్రమించారు. మరో నలుగురు నైజీరియన్ల పేర్లు బయటపెట్టకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. డ్రగ్స్ కేసుతోపాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు.

20:29 - August 15, 2017

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో జాతీయ జెండా రెపరెపలాడింది... హైదరాబాద్‌ గోల్కొండ కోటలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ జెండా ఆవిష్కరించగా... తిరుపతిలో ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ పతాకం ఎగురవేశారు. జెండా వేడుకలతో రెండు రాష్ట్రాలు సందడిగా మారాయి..  
ఏపీలో 
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి.... తిరుపతిలోని తారకరామ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు.... పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.. సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీసులకు అవార్డులు, పురస్కారాలు అందజేశారు. ఈ ఉత్సవాల్లో ప్రభుత్వ శకటాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.. సీఆర్‌డీఏ శకటం స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. నవ్యాంధ్ర ఏర్పాటైనప్పటినుంచీ ఒక్కో ఏడాది ఒక్కో జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.. తిరుపతి తనకు జన్మనిస్తే.. వెంకటేశ్వరస్వామి పునర్జన్మ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు..
ఏపీ అభివృద్ధి దిశగా సాగుతుందని చెప్పారు..
తెలంగాణలో
ఇక తెలంగాణలోనూ పంద్రాగస్టు పండుగను అట్టహాసంగా జరుపుకున్నారు.. జెండా వేడుకలతో గోల్కొండ కోట సందడిగా మారింది.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం కేసీఆర్‌... జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కేసీఆర్ అన్నారు. వచ్చే రబీ నుంచి రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ అందించేందుకు కృషి చేస్తున్నమని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇంటింటికీ అందుతాయని ప్రకటించారు.. త్వరలో 84 వేల 877 ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపడతామని తెలిపారు.. జెండా వేడుకల్లో సాహస విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

 

20:01 - August 15, 2017

ప్రకాశం : జిల్లాలోని కందుకూరు సాయినగర్‌లో కాపురానికి తీసుకుపోవడం లేదని భర్త ఇంటి ముందు బైఠాయించి నిరాహారదీక్ష చేస్తోంది భార్య మౌనిక. మౌనికకు ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన పూనాటి బ్రహ్మయ్య కుమారుడు ప్రవీణ్‌తో వివాహం జరిగింది. వివాహం అయిన నెల రోజులకే భార్యభర్తల మధ్య వివాదాలు రావడంతో మౌనికను తన ఇంటికి పంపించేశాడు. ఆనాటి నుండి భర్త తనను వేధిస్తున్నాడని, విడాకుల నోటీసులు పంపించారని మౌనిక తెలిపింది. కందుకూరులో తమ బంధువుల ఇంట్లో ఉన్న తనను ప్రవీణ్‌ తరచూ వేధిండేవాడని, ఆవిషయమై అడగడానికి ప్రవీణ్‌ ఇంటికి వెళ్తే, కొందరు వ్యక్తులతో కొట్టించి, బయటకు గెంటేశారని మౌనిక ఆవేదన వ్యక్తం చేసింది. అయితే.. 3రోజులుగా జోరువానలోనూ మౌనిక దీక్ష చేయడం అందరినీ కలిచివేస్తోంది. 
మౌనికకు అండగా ఉంటాం : నన్నపనేని 
ఇది చాలా దారుణమైందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఇది మంచి పద్దతి కాదని తెలిపారు. పెళ్లి తర్వాత వాడుకుని వద్దనడం సరికాదు. అన్యాయం చేసినవారిని ఎట్టిపరిస్థితిలో వదిలిపెట్టబోమని చెప్పారు. సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. అమ్మాయికి అండగా ఉంటామని తెలిపారు. 

 

19:34 - August 15, 2017

హైదరాబాద్ : ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా  తెలంగాణ అమరుల స్ఫూర్తి యాత్ర కొనసాగించిన తీరతానని  టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు.ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ పరిరక్షణ కోసం ఈనెల 21న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరిగే ధర్నాలో పాల్గొనాలని టీ జాక్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. అలాగే టీఆర్ ఎస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 22న ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కోదండరామ్‌ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఈనెల 23న ఢిల్లీలో జరిగే ధర్నాలో పాల్గొనాలని టీజేఏసీ నిర్ణయించింది. 

19:32 - August 15, 2017

హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన దేశ, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను పాఠశాల స్థాయి నుంచే దేశ స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలు చదివానని, వారు చేసిన త్యాగాలు, పోరాటాలు తెలుసుకొని ఎంతో స్ఫూర్తి పొందానన్నారు. ప్రతిఒక్కరూ దేశానికి విలువ, గౌరవం ఇవ్వాలన్నారు. 

 

19:27 - August 15, 2017

కడప : మంత్రి ఆదినారాయణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మలమడుగులోని ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన మంత్రి, దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. దళితులుకు చదువు రాదని.. శుభ్రత తెలియదని..అందుకే వారు వెనుకబడ్డారని వ్యాఖ్యానించారు. వారికి పట్టా భూములుండవని అవహేలనగా మాట్లాడారు. దళితులకు రిజర్వేషన్లు కల్పించి 70 సంవత్సరాలు గడిచినా వారు అభివృద్ధి కాలేదని అసహనం వ్యక్తం చేశారు. 

 

మంత్రి ఆదినారాయణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

కడప : జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన మంత్రి దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. దళితులుకు చదువు రాదని.. శుభ్రత తెలియదని..అందుకే వారు వెనుకబడ్డారని వ్యాఖ్యానించారు.

 

18:50 - August 15, 2017

ప్రకాశం : జిల్లాలోని కందుకూరు సాయినగర్‌లో కాపురానికి తీసుకుపోవడం లేదని భర్త ఇంటి ముందు బైఠాయించి నిరాహారదీక్ష చేస్తోంది భార్య మౌనిక. మౌనికకు ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన పూనాటి బ్రహ్మయ్య కుమారుడు ప్రవీణ్‌తో వివాహం జరిగింది. వివాహం అయిన నెల రోజులకే భార్యభర్తల మధ్య వివాదాలు రావడంతో మౌనికను తన ఇంటికి పంపించేశాడు. ఆనాటి నుండి భర్త తనను వేధిస్తున్నాడని, విడాకుల నోటీసులు పంపించారని మౌనిక తెలిపింది. కందుకూరులో తమ బంధువుల ఇంట్లో ఉన్న తనను ప్రవీణ్‌ తరచూ వేధిండేవాడని, ఆవిషయమై అడగడానికి ప్రవీణ్‌ ఇంటికి వెళ్తే, కొందరు వ్యక్తులతో కొట్టించి, బయటకు గెంటేశారని మౌనిక ఆవేదన వ్యక్తం చేసింది. అయితే.. 3రోజులుగా జోరువానలోనూ మౌనిక దీక్ష చేయడం అందరినీ కలిచివేస్తోంది.

 

బోరు బావిలో పడిన బాలుడు.. సహాయక చర్యలు

గుంటూరు : వినుకొండ మండలం ఉమ్మడివరంలో విషాదం నెలకొంది. చంద్రశేఖర్ అనే రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరు బావిలో పడ్డాడు. 15 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు స్థానికుల చెబుతున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

 

18:46 - August 15, 2017

ఢిల్లీ : ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రధాని మోదీ నాలుగోసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎర్రకోట దగ్గర మోదీ త్రివిధ దళాల సైనిక వందనం స్వీకరించారు. మరోవైపు దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్ని అంటాయి. 
71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 
దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర్య సమరంలో ప్రాణాలర్పించిన మహనీయులను అందరూ స్మరించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. 125 కోట్ల మంది భారతీయులందరూ ఒక్కటైతే.. సంకల్పంతో ఏదైనా సాధించగలమని ప్రధాని అన్నారు. 
కొత్త సంకల్పంతో దూసుకుపోవాలి : ప్రధాని 
21వ శతాబ్దంలో జన్మించిన నవ యువకులకు ఈ జనవరి 1 కొత్త అవకాశాన్ని ఇస్తోందని మోదీ అన్నారు. దేశ యువత నిరాశ నిస్పృహలను వీడి ముందుకు నడవాలన్నారు. కొత్త సంకల్పంతో దూసుకుపోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. సముద్రం, సరిహద్దు, సైబర్‌.. ఏ విషయంలోనైనా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 
జీఎస్టీతో సహకార వ్యవస్థకు జవసత్వాలు : మోదీ 
జీఎస్టీని తీసుకొచ్చి సహకార వ్యవస్థకు జవసత్వాలు అందించామని మోదీ అన్నారు. జీఎస్ టీని ఇంత తక్కువ సమయంలో ఎలా అమలు చేశారని ప్రపంచం ఆశ్చర్యపోతోందని చెప్పారు. ప్రభుత్వ వ్యవహారాలను సులభతరం చేసే కార్యక్రమంలో వేగం పుంజుకున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల బంధనాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించే ప్రయత్నం కొనసాగుతోందని స్పష్టం చేశారు. దేశంలోని నలుమూలలకు విద్యుత్‌ వెలుగులు ప్రసరిస్తున్నాయన్నారు. ఇంటింటికీ గ్యాస్‌ పొయ్యిల ద్వారా కోట్లాది పేద మహిళలకు పొగ నుంచి విముక్తి కల్పించామన్నారు. ప్రభుత్వ వ్యవహారాలను సులభతరం చేసే కార్యక్రమంలో వేగం పుంజుకున్నామన్నారు. కశ్మీర్‌ అభివృద్ధి, ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ దేశం కట్టుబడి ఉందన్నారు. 
రైతులకు సాగునీరు ఇస్తే బంగారం పండిస్తారన్న మోడీ  
రైతులకు సాగునీరు ఇస్తే బంగారం పండిస్తారన్నారు.  ప్రధానమంత్రి కృషి యోజన ద్వారా రైతులకు సాగునీరందించే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రైతన్నకు చేయి అందించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తోందన్నారు. యువతకు ఆర్థిక సాయమందిస్తే ఉద్యోగం కోసం ఎదురుచూడరన్నారు. ముద్ర యోజన ద్వారా అనేక మంది యువత కొత్త ఉద్యోగాలు సృష్టించారని మోదీ పేర్కొన్నారు. ట్రిపుల్‌ తలాక్‌పై దేశం మొత్తం ఆందోళన చెందిందన్నారు. దీనిపై కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రజలందరూ అండగా నిలిచారన్నారు. దేశంలో ఉన్న ప్రతీ పౌరుడు సంపూర్ణ హక్కులతో జీవించే అవకాశం ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. 

18:41 - August 15, 2017

హైదరాబాద్ : టి.జేఏసీ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో తాజా పరిణామాలపై టీ.జేఏసీ స్టీరింగ్‌ కమిటీ నాంపల్లిలోని జేఏసీ కార్యాలయంలో సమావేశమైంది. నిజామాబాద్‌, నేరెళ్ల, ఘటనలపై ఢిల్లీ పెద్దలతో చర్చించడానికి జేఏసీ నేతలు సిద్ధమయ్యారు. 

 

18:39 - August 15, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని జగ్గంపేట ప్రాంతంలో నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. గోదావరిని ఏలేరు జలాశయానికి అనుసంధానం చేసే ప్రాజెక్టు ఇది. 1683 కోట్ల రూపాయలతో దీనిని నిర్మించారు. గోదావరి నీరు తోడిపోసేందుకు పది పంపులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 3,500 క్యూసెక్కుల నీరు పంపింగ్‌ చేసే విధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల  నిర్మిస్తున్నారు.  తొలిదశలో రెండు పంపుల ద్వారా  700 క్యూసెక్కుల నీటిని తోడిపోస్తున్నారు. ఏలేరు జలాశయం పరిధిలోని గొల్లప్రోలు, పిఠాపురం ఆయకట్టుకు సాగునీరు ఇస్తారు. అలాగే ఏలేరు రిజర్వాయర్‌ ప్రాజెక్టు కెనాల్‌పై ఆధారపడిన విశాఖపట్నం స్టీల్‌ ప్లాట్‌కు నీరు అందిస్తారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు అవసరమైన విద్యుత్‌ను పుష్కర-1 ద్వారా సరఫరా చేస్తున్నారు. 

 

పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులు పూర్తి : సీఎం చంద్రబాబు

తూ.గో : పురుషోత్తపట్నం ఎత్తిపోతల, పట్టిసీమ ప్రాజెక్టులను పూర్తి చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేస్తోందన్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కిందని పేర్కొన్నారు. 

18:32 - August 15, 2017

తూ.గో : పురుషోత్తపట్నం ఎత్తిపోతల, పట్టిసీమ ప్రాజెక్టులను పూర్తి చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేస్తోందన్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కిందని పేర్కొన్నారు. 

18:30 - August 15, 2017
18:26 - August 15, 2017

తూర్పుగోదావరి : గరగపర్రు వివక్షను నిరసిస్తూ.. అక్కడి దళితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు సంపూర్ణంగా అమలు కాలేదు. ఏలికల మాటలు ఎప్పుడూ నీటిమూటలే అన్నది మరోసారి గరగపర్రు ఘటనలోనూ నిరూపితమైంది. 

గరగపర్రు బాధితులకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేరాయి..? ఈ ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషిస్తూ గ్రామంలోకి అడుగుపెట్టిన 10టీవీకి నిరాశాజనకమైన పరిస్థితే కనిపించింది. ఇచ్చిన హామీలేవీ ప్రభుత్వం సంపూర్ణంగా నెరవేర్చలేదు... దాదాపుగా 350 కుటుంబాలు ఉన్న దళితులలో 226 మందికి లక్ష రూపాయలు చప్పున చెక్కులు పంపిణీ చేసి మిగిలిన వారిని క్రైస్తవ మతం తీసుకున్నారు మీరు బీసీ-సీ  అంటూ చెక్కులు ఇవ్వడానికి నిరాకరించారు... ఇచ్చిన పది హామీల్లో కొందరికి లక్ష రూపాయల చెక్కులు పంపిణీ తప్ప ఏ హామీ కూడా నెరవేరే లేదు ... 

పాలకులు ఇచ్చిన మాట తప్పడాన్ని నిరసిస్తూ నాలుగు రోజుల క్రితం ఏలూరులో కలెక్టర్ ని కలవడానికి వెళ్లిన గరగపర్రు దళితులను పోలీసులు మార్గమద్యంలోనే అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు...దళిత సంఘాల ఆందోళనతో కలెక్టర్ దిగివచ్చి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు...

స్వాతంత్ర దినోత్సవం రోజున గరగపర్రు సందర్శించిన వారికి.. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకున్న దళితులు కనిపిస్తున్నారు. దీన్ని బట్టే ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను ఏమేరకు అమలు చేసిందో అర్థమవుతోంది. తమకు ఇంకా స్వాతంత్రం రాలేదంటూ దళితులు విస్పష్టంగా తమ నిరసన తెలిపారు. మంత్రులు ఇచ్చిన హామీలను అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలసి దళితులను రెండుగా చీల్చి గొడవలు పెడుతున్నారని ఏ హామీ కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరోపక్క గరగపర్రులో మృతి చెందిన యాకోబు కుటుంబానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థిక సహాయము అందలేదు ... చంద్రన్న బీమా నుంచి 5లక్షలు, ప్రభుత్వం నుంచి 2లక్షలు, ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివ 3లక్షలు మొత్తం 10 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో యాకోబు భార్య కన్నీటి పర్యంతం అవుతుంది. 

గరగపర్రు దళితుల బహిష్కరణ తర్వాత ప్రభుత్వం నుండి హామీలు అయితే ఇచ్చారు కానీ అమలు చేయడాన్ని మాత్రం మరచిపోయారు... ప్రభుత్వ సాయంగా మూడు నెలలకు కుటుంబానికి 15కేజీల రేషన్ బియ్యం ఇచ్చి మమ అనిపించారు... ప్రభుత్వం వెంటనే తమకు ఇచ్చిన అన్ని హామీలని నెరవేర్చకపోతే మళ్లీ ఉద్యమాన్ని చేపడతామని గరగపర్రు దళితులు హెచ్చరిస్తున్నారు.

18:20 - August 15, 2017

తూర్పుగోదావరి : గరగపర్రులోని బాధిత దళితులకు "ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యాయా?" అన్న టెన్ టీవీ ప్రశ్నకి తెల్లబోవడం బాధితుల వంతయ్యింది. గరగపర్రు బాధితులకి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమిటి, వాటిలో అమలయినవి ఎన్ని?
దళితుల వెలివేత
నాలుగు నెలల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో దళితులను అగ్రవర్ణాలు వెలివేశాయి ...రెండు నెలల తర్వాత 10టీవీ ఈ అమానుష సంఘటనను వెలుగులోకి తీసుకురావడంతో ఒక్కసారిగా ఉద్యమ జ్వాలలు వెన్నంటాయి ...గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు దేశంలో ఉన్న అనేక ప్రాంతాల నుండి దళితులు గరగపర్రుకు క్యూ కట్టారు... దాదాపుగా 10 రోజుల తీవ్ర ఆందోళనల తర్వాత ప్రభుత్వంలోని మంత్రుల బృందం, జాతీయ ఎస్సీ కమీషన్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ ల పర్యటనలు, చర్చల అనంతరం రాష్ట్ర మంత్రులు నక్కా ఆనందబాబు, పితాని సత్యనారాయణ, sc కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ లు రెండు రోజులు సుదీర్ఘ చర్చల అనంతరం దళితుల పది డిమాండ్లను అంగీకరించి ఇరు వర్గాల నాయకుల చేత చేయి చేయి కలిపించి చేతులు దులుపుకొన్నారు.
పాలక పెద్దలు...హామీలు 
ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చినప్పుడు అదుర్స్‌ అనే హామీలనే గుప్పించారు పాలక పెద్దలు.    
    1. అంబేడ్కర్‌ విగ్రహాన్ని యధా స్థానంలో ఏర్పాటు చేయాలి
    2. బహిష్కరణకు గురైన ప్రతి కుటుంబానికి రూ. లక్ష  పరిహారం ఇవ్వాలి
    3. కౌలు భూములను రైతులకు ఇవ్వాలి. ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి. ఇళ్ళు లేని వారికి        ఇళ్ళు కట్టించాలి. 
    4. బహిష్కరణకు గురైన దళితులందరికీ పనులు కల్పించాలి 
    5. దళిత కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, మరుగుదొడ్లు కట్టించాలి
    6. దళిత కాలనీలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేయాలి
    7. పౌరసరఫరాల చౌక డిపోను దళిత కాలనీలో ఏర్పాటు చేయాలి 
    8. మంచినీటి వసతి ఏర్పాటు చేయాలి 
ఇలాంటి ఎన్నో డిమాండ్లతో పాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి కల్పనకు యువతకు రుణాలు అందిస్తామనీ పాలక పెద్దలు హామీ ఇచ్చారు. 

 

18:18 - August 15, 2017
18:11 - August 15, 2017

తూర్పుగోదావరి : మనది డెబ్భై ఏళ్ల స్వాతంత్ర్య దేశం. స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందుతున్నాయా..? స్వయంపాలిత సమసమాజం స్థాపితమైందా..? ఈ ప్రశ్నలకు లేదు అన్న సమాధానాలే వస్తున్నాయి. దశాబ్దాల తర్వాత కూడా స్వతంత్ర ఫలాలు అందరికీ అందలేదని, కొన్ని వర్గాలు ఇంకా పర పీడనని తలపించే పాలనలోనే కనీస హక్కులకు దూరంగా బతుకుతున్నాయని తేటతెల్లమవుతోంది. పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు దీనికి చక్కటి ఉదాహరణ. సామాజిక బహిష్కరణకి నిరసనగా చేపట్టిన ఉద్యమానంతరం గరగపర్రులో దళితుల పరిస్థితులు ఎలా ఉన్నాయి... వారి జీవన స్థితిగతుల్లో కొంతైనా మార్పు వచ్చిందా... అసలు వారికి ప్రభుత్వం ఏం చేసింది...? ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషిస్తూ.. 10టీవీ అందిస్తోన్న గ్రౌండ్‌ రిపోర్ట్‌..! 
గరగపర్రు ఘటన
పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు..! దేశమాత దాశ్య శృంఖలాలు తెగిపడిన డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా ఇక్కడి దళితులు వెలికి గురికావడం అన్నది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఈ ఘటన వెలుగులోకి వచ్చినా పాలకుల నుంచి కనీస స్పందన కరువవ్వడం, దళితుల హక్కుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 
వెలుగులోకి తెచ్చిన టెన్ టీవీ 
దళితుల సంఘ బహిష్కరణ అన్న అమానవీయ ఘటనని టెన్ టీవీ సాహసోపేతంగా వెలుగులోకి తెచ్చిన తర్వాత పాలకపక్షం నాయకులు, అధికారులు ఒక్కసారిగా ఉలికి పడ్డారు. గ్రామానికి పయనమయ్యారు. నాయకులు ఎప్పటిలాగే హామీలు గుప్పిస్తే, అధికారులు యధాశక్తిగా వాటిని 'నోట్' చేసుకున్నారు. తర్వాత ఏం జరిగింది? ఇది తెలుసుకోడానికే, స్వతంత్ర దినోత్సవం రోజున టెన్ టీవీ మళ్ళీ గరగపర్రులో అడుగుపెట్టింది. 

 

ఉమ్మడివరంలో విషాదం

గుంటూరు : వినుకొండ మండలం ఉమ్మడివరంలో విషాదం నెలకొంది. చంద్రశేఖర్ అనే రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరు బావిలో పడ్డాడు. 15 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు స్థానికుల చెబుతున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

17:18 - August 15, 2017

శ్రీనగర్ : 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోది తన ప్రసంగంలో కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించడంపై నేషనల్‌ కాన్ఫరెన్స్ నేత ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. ఆరోపణలు, తూటాలతో సమస్యలు పరిష్కారం కావని...కశ్మీరీలతో ఆత్మీయ ఆలింగనంతో మమేకమైనపుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రధాని అన్నారు. కశ్మీర్‌ సమస్య తూటాలు, ఆరోపణలతో పరిష్కారం కాదని మోది చెప్పారని...ఆయన వ్యాఖ్యలు ఉగ్రవాదులు... భద్రతాదళాలకు కూడా వర్తిస్తుందని ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్‌ ద్వారా అభిప్రాయపడ్డారు. 

 

అమరుల స్ఫూర్తియాత్ర నిర్వహించి తీరుతాం : ప్రొ.కోదండరాం

హైదరాబాద్ : టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ప్రభుత్వం ఎన్ని విధాలుగా అడ్డుకున్నా అమరుల స్ఫూర్తియాత్రను నిర్వహించి తీరుతామని ప్రొ.కోదండరాం తేల్చి చెప్పారు. 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పారు. కేసీఆర్ 3 ఏళ్ల పాలనపై ఢిల్లీలో సెమినార్ నిర్వహిస్తామన్నారు. 

 

16:54 - August 15, 2017

అస్సాం : రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నా...ప్రజలు దేశభక్తిని మాత్రం మరువలేదు. వరద నీటిలో టీచర్లు, విద్యార్థులు 71 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. చుట్టూ మోకాళ్లలోతు నీళ్లున్నా...దాన్ని లెక్క చేయకుండా స్కూలుకు వెళ్లి మువ్వన్నెల జెండాను ఎగరవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

 

 

16:49 - August 15, 2017

తూర్పు గోదావరి : జిల్లాలోని జగ్గంపేట ప్రాంతంలో నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. గోదావరిని ఏలేరు జలాశయానికి అనుసంధానం చేసే ప్రాజెక్టు ఇది. 1683 కోట్ల రూపాయలతో దీనిని నిర్మించారు. గోదావరి నీరు తోడిపోసేందుకు పది పంపులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 3,500 క్యూసెక్కుల నీరు పంపింగ్‌ చేసే విధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల నిర్మిస్తున్నారు.  తొలిదశలో రెండు పంపుల ద్వారా  700 క్యూసెక్కుల నీటిని తోడిపోస్తున్నారు. ఏలేరు జలాశయం పరిధిలోని గొల్లప్రోలు, పిఠాపురం ఆయకట్టుకు సాగునీరు ఇస్తారు. అలాగే ఏలేరు రిజర్వాయర్‌ ప్రాజెక్టు కెనాల్‌పై ఆధారపడిన విశాఖపట్నం స్టీల్‌ ప్లాట్‌కు నీరు అందిస్తారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు అవసరమైన విద్యుత్‌ను పుష్కర1 ద్వారా సరఫరా చేస్తున్నారు. 

భర్త ఇంటి ముందు భార్య నిరాహార దీక్ష

ప్రకాశం : జిల్లాలోని కందుకూరులో భర్త ఇంటి ముందు భార్య నిరాహార దీక్ష చేపట్టింది. కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మూడు రోజులుగా వర్షంలోనూ నిరాహార దీక్ష చేపట్టింది. 

16:33 - August 15, 2017

భద్రాద్రి కొత్తగూడెం : ఆయనో బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి. నేడు స్వాతంత్ర్య దినోత్సవం అన్న సంగతి మరిచారు. కార్యాలయంలో జెండా ఎగురవేయాలన్న ఇంగితం మరిచి పూటుగా మద్యం సేవించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అచ్చుతాపురంలో  అతిపెద్ద ఫారెస్ట్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఉంది.  ఈ సెంటర్‌లో ఇవాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగలేదు.  సెంటర్‌ రేంజర్‌ సదానందచారి జెండా ఎగురవేయకుండా రీసెర్చ్‌ సెంటర్‌ సమీపంలోని బెల్ట్‌షాపులో మద్యం సేవించారు. పీకలదాకా తాగి జెండా ఎగురవేయడమే మరిచిపోయారు.  మహాత్మాగాంధీ ఫోటోలు, దండలు రూమ్‌లో పెట్టుకుని ఉదయం నుంచి మద్యం మత్తులో మునిగితేలుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. డ్రై డే రోజు కూడా మద్యం అమ్మకాలు జరుగుతుండడంతో ఆబ్కారీశాఖపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:23 - August 15, 2017
16:15 - August 15, 2017

అదిలాబాద్ : జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వాడ, వాడల మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకలకు అటవీశాఖ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. 21 శాతం ఆదాయ వృద్ధిరేటుతో తెలంగాణ.. దేశంలోనే అగ్రభాగాన నిలిచిందన్నారు జోగు రామన్న. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజన సాంస్కృతి కార్యక్రమాలు, విద్యార్థులు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 

 

జాతీయజెండాను ఎగురవేయడం మరిచిన అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. అచ్చుతాపురంలోని ఫారెస్టు రీసెర్చ్ సెంటర్ లో స్వాతంత్య్ర వేడుకలు జరుగలేదు. మద్యం మత్తులో అధికారులు జాతీయ జెండాను ఎగురవేయడం మరిచారు.

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభం

తూగో : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ వద్ద పురుషోత్త పట్నం ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

రేపు విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు భారీ ప్రదర్శన

విజయవాడ : విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు సమ్మెబాట పట్టారు. రేపు విజయవాడలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. విద్యుత్ కార్మికులు రేపు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. భారీ బహిరంగ సభకు కార్మికులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. 

త్వరలో 48,070 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ : టీసర్కార్ త్వరలో 48,070 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆర్టీసీ 3,950, రెవెన్యూ 2,506, పోలీసు శాఖ 27,440 పోస్టులు, ఉపాధ్యాయులు 12,005, రెసిడెన్షియల్ స్కూళ్లు 12,436, వైద్యారోగ్యశాఖ 8,347, సింగరేణి 1970 పోస్టులు, వ్యవసాయ శాఖ 1,418, అటవీశాఖ 2,033 పోస్టులు. 

 

13:31 - August 15, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలి డిప్యూటీ చైర్మన్‌ సుబ్రహ్మణ్యం శాసనమండలి భవనంపై జాతీయ జెండాను ఎగరేశారు. తరవాత అసెంబ్లీ భవనంపై స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు జెండా ఆవిష్కరించారు. దేశంలోని యువశక్తిని, మానవ వనరులను ఉపయోగించుకొని దేశం అభివృద్ధి చెందాలని కోడెల ఆకాంక్షించారు. మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోందని, రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల కృషి ఎంతో ఉందని స్పీకర్‌ అన్నారు.

13:30 - August 15, 2017

చిత్తూరు : రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.. తిరుపతి అంటే తనకు ప్రత్యేక అభిమానమని గుర్తు చేసుకున్నారు.. అలిపిరిలో తనపై దాడి జరిగిందని.. వేంకటేశ్వర స్వామి పునర్జన్మ ఇచ్చారని చెప్పారు.

 

 

నవీన్ పట్నాయక్ కు స్వల్ప అస్వస్థత

భువనేశ్వర్ : ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్వల్ప అస్వస్థతకు లోనైయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గౌరవ వందనం స్వీకరిస్తుండగా అస్వస్థతకు గురై కుప్పకూలిపాయారు. నవీన్ వెంటనే కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

 

పురుషాత్తపట్నం నిర్వాసితులపై పోలీసుల ఉక్కుపాదం

తూర్పు గోదావరి : పురుషాత్తపట్నంఎత్తిపోతల పథకం భూనిర్వాసితులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పురుషోత్తం ఎంత్తిపోతల పథకం ప్రారంభోత్సవానకి సీఎం రానున్న నేపథ్యంలో పోలీసులు నిర్వాసితులను గృహనిర్బంధం చేశారు.

నేడు సాయంత్రం గవర్నర్ విందు

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నేడు సాయంత్రం అన్ని పార్టీ నాయకులకు విందు ఇవ్వబోతున్నారు. ఈ విందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆహ్వానం అందింది. గవర్నర్ ఆహ్వానం మేరకు పవన్ విందుకు హాజరుకానున్నారు.

 

 

 

12:41 - August 15, 2017

హైదరాబాద్ : శాసనమండలిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ జాతీయా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

12:39 - August 15, 2017

పశ్చిమ గోదావరి : స్వాతంత్ర్య దినోత్సవం రోజున.. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితులు నిరసన చేపట్టారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ఆందోళన చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా మాకు ఇంకా స్వాతంత్ర్యం రాలేదని.. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:36 - August 15, 2017

చిత్తూరు : తిరుమలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యాత్రికుల సేవలో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే టీటీడీ అధికారులు, సిబ్బంది తిరుమలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. జేఈఓ క్యాంపు కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. తిరుమల జేఈవో శ్రీనివాసరాజు జెండా ఎగరేసి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ విజిలెన్స్‌, ఇంజనీరింగ్‌, ఆరోగ్యశాఖ, శ్రీవారి ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

12:35 - August 15, 2017

హైదరాబాద్ : ఎంహెచ్ భవన్‌లో 10టీవీ, నవ తెలంగాణ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను 10టీవీ ఎండీ వేణుగోపాల్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నవ తెలంగాణ ఎడిటర్‌ వీరయ్యతో పాటు 10టీవీ, నవ తెలంగాణ సిబ్బంది పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చుకున్న భారతదేశంలో... ఈరోజు ఒకే సంస్కృతిని నమ్ముకున్నవాడు, ఒప్పుకున్నవాడే భారతీయుడనే కుట్ర జరుగుందన్నారు వేణుగోపాల్‌. దేశ సంపద అంతా కొంతమంది చేతిలోనే ఉందని... ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే జరుగుతుందని వీరయ్య అన్నారు.  

12:34 - August 15, 2017

హైదరాబాద్ : ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురి కావొద్దన్న ఉదార్థ ఆశయంతో ప్రభుత్వం తపన పడుతుంటే... కొన్ని సంకుచిత శక్తులు అడ్డుపడుతున్నాయన్నారు కేసీఆర్‌. అయినా వెనకడుగు వేయకుండా ప్రభుత్వం వారి జీతాలు పెంచిందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం ఊపందుకుందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

12:32 - August 15, 2017

హైదరాబాద్ : మిషన్‌ భగీరథ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు కేసీఆర్. శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా కేజీ టూ పీజీ విద్యలో భాగంగా... రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 522 గురుకుల పాఠశాలలను ప్రారంభించామన్నారు. గురుకుల పాఠశాలలో నాణ్యమైన ఇంగ్లీష్‌ విద్యను అందిస్తున్నామని కేసీఆర్‌ అన్నారు. 

12:31 - August 15, 2017

హైదరాబాద్: విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామన్నారు సీఎం కేసీఆర్‌. వ్యవసాయ రంగానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని.. యాసంగి నుంచి 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం మిగులు విద్యుత్‌ను సాధిస్తుందని కేసీఆర్‌ అన్నారు.

12:30 - August 15, 2017

హైదరాబాద్ : గోల్కొండ కోటలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించారు. ఈ ఏడాది రాష్ట్రం 21.7 శాతం వృద్ధి సాధించి.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు కేసీఆర్‌. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తుందన్నారు. అనేక కార్యక్రమాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని కేసీఆర్‌ అన్నారు.

 

12:29 - August 15, 2017

ఢిల్లీ : 21వ శతాబ్దంలో జన్మించిన నవ యువకులకు ఈ జనవరి 1 కొత్త అవకాశాన్ని ఇస్తోందని మోదీ అన్నారు.. దేశ యువత నిరాశ నిస్పృహలను వీడి ముందుకు నడవాలి. కొత్త సంకల్పంతో దూసుకుపోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. సముద్రం, సరిహద్దు, సైబర్‌.. ఏ విషయంలోనైనా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

12:28 - August 15, 2017

ఢిల్లీ : రాముడు, కృష్ణుడు ఆదర్శ పురుషులని.... ఆలమందను కాపాడేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడని ప్రధాని గుర్తుచేశారు... పరిపానల అంటే ఇలా ఉండాలంటూ రాముడు ఆచరించి చూపారని మోదీ చెప్పారు.. 125 కోట్ల మంది భారతీయులందరం ఒక్కటై కొత్త సంకల్పంతో ఏదైనా సాధించగలమని.. ఆ దిశగా అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

12:27 - August 15, 2017

ఢిల్లీ : ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రధాని మోదీ నాలుగోసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎర్రకోట దగ్గర మోదీ త్రివిధ దళాల సైనిక వందనం స్వీకరించారు. అనంతరం మోదీ చిన్నారులతో కరచాలనం చేసి... స్వాతంత్ర్య దినోత్సవ వేడుక శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి మోదీ నివాళులర్పించారు. మరోవైపు దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. 

12:24 - August 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఆగస్టు 15 వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ స్పీకర్ మధుసుదనాచారి జెండా ఎగరేశారు. అంతా కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. దాస్య శృంఖలాలు తెంచుకొని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు.. ఎంతో శుభప్రదమైనదని స్పీకర్ అన్నారు. 

టీజేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ

హైదరాబాద్ : టీ జేఏసీ కార్యాలయంలో జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఢిల్లీ టూర్, నేరెళ్ల ఘటన, నిజామాబాద్, గజ్వేల్ పర్యటన గురించి చర్చించనున్నారు.

 

11:10 - August 15, 2017

వచ్చే యాసంగి నుంచి 24 గంటల వ్యవసాయ కరెంట్ : కేసీఆర్

హైదరాబాద్ : వచ్చే యాసంగి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24గంటల కరెంట్ అందించేందుకు కృషి చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాతో పారిశ్రామిక ఉత్పత్తి పెరిగిందని సీఎం పేర్కొన్నారు. డబల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఊపందుకుందని, గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ప్రవేశ పెట్టిందని కేసీఆర్ తెలిపారు.
 

గాంధీ భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ : గాంధీ భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పీసీసీ చీప్ ఉత్తమ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకులకు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరైయ్యారు.

 

త్వరలో 48,070వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ : కేసీఆర్

హైదరాబాద్ : త్వరలో 48,070వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్టు జారీ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలపారు. ఇప్పటికే 27,660ఉద్యోగాలను భర్తీ చేశామని, 36,806 ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోందని సీఎం అన్నారు. మొత్తం 1,12,536 ఉద్యోగాలు కల్పిస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు.

 

10:27 - August 15, 2017

హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కులవృత్తులను తమ ప్రభుత్వం పొత్సహిస్తుందని, యాదవ సోదరులకు గోర్రెలు, ముదిరాజ్ లకు చేపలు, నాయిబ్రహ్మన్లకు సెలున్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. వచ్చే బతుకమ్మ పండుగకు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు పంపిణీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈజ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:25 - August 15, 2017

చిత్తూరు : భారత్ దేశం ఎక్కువగ అభివృద్ధి చెందె అవకాశం ఉందని, ఎందుకంటె భారత్ యువతతో నిండి ఉందని, యువత తలుచుకుంటే ఎదైనా సాధిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. స్వాతంత్ర్య సమయోధులకు పించన్ రూ.7 నుంచి 15 పెంచుతామని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఇంగ్లీష్ భష మాట్లాడే దేశాల్లో భారత్ ముందుంటుదని చంద్రబాబు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:08 - August 15, 2017

ఎప్పుడు పాత్రల్లో వైవిధ్యం కోసం తపించే నటుల్లో విక్రమ్‌ మొదటి వరుసలో ఉంటారని చెప్పవచ్చు. పాత్రలో జీవించడానికి ఎంతకైనా రెడీ అనే గొప్ప నటుడు విక్రమ్‌. ఆయన తాజాగా నటించిన చిత్రం ఇరుముగన్‌ మంచి విజయం సాధించింది. అయితే ఇరుముగన్ చిత్రం ముందు వరకు అపజయాలు చవిచూసిన విక్రమ్ ప్రస్తుతం సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవరిస్తునట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం విక్రమ్‌ రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి స్కెచ్‌. రెండవది ధృవనక్షత్రం. గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధృవనక్షత్రం చిత్రం ఇంకా షూటింగ్‌ దశలోనే ఉంది. దీంతో ముందుగా స్కెచ్‌ చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. స్కెచ్ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయని చెపొచ్చు. ఈ సినిమాలో విక్రమ్‌కు జంటగా నటి తమన్నా తొలిసారిగా నటిస్తోంది.

విజయ్‌చందర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా ఎస్‌ఎస్‌.థమన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సంగీతదర్శకుడు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా చిత్రాన్ని నవంబర్‌లో విడుదలకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం తరువాత విక్రమ్‌ ధృవనక్షత్రం చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారు. 

10:06 - August 15, 2017
10:05 - August 15, 2017

వివాహిత అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ : బోరబండలో దారుణం చోటు చేసుకుంది. భార్గవి అనే వివహిత సోమవారం మధ్యాహ్నం అనుమానాస్పదంగా మృతి చెందింది. కాగా భర్త శ్రీనివాస్ భార్గవిని హత్య చేసాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

తెలంగాణ అసెంబ్లీ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. శాసన సభ స్వీకర్ మధుసూదనాచారి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

జాతిని ఉద్దేశించి ప్రసగించిన మోడీ

ఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసగించారు. ఆయన దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరులకు తన నివాళులు అర్పించారు. ఈ ఏడాదికి ఎంతో విశిష్టత ఉందని మోడీ అన్నారు. 

08:21 - August 15, 2017

 

మెగా స్టార్ చిరంజీవి 'ఖైదీనెం 150 తో తన సత్తా చాటుకున్నారు. ఐతే ఆ సినిమా విడుదలై ఏడు నెలలు దాటుతున్నా చిరు తర్వాతి సినిమా మొదలు కాలేదు. చిరు తర్వాతి సినిమాగా‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కన్ఫమ్ అయింది కానీ.. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నది క్లారిటీ లేదు. వేసవికే ప్రారంభోత్సవం అన్నారు కానీ.. అలా జరగలేదు. తర్వాత చిరంజీవి పుట్టిన రోజున కొబ్బరికాయ కొడతారని గట్టి ప్రచారమే జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 22కు కూడా సినిమా పట్టాలెక్కేలా లేదు. కారణం ప్రి ప్రొడక్షన్ వర్క్ మరింత ఆలస్యమవుతుండడం. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో చిరు అభిమానులు నిరాశ పడకుండా చిరు పుట్టిన రోజు సందర్బంగా ఉయ్యాలవాడ నరసింహరెడ్డి లోగో ను విడుదల చేయబోతున్నారు.

ఈ నెల 22న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ లోగోను లాంచ్ చేస్తారని తెలిసింది. ఇప్పటికే ఓ పవర్ ఫుల్ లోగో రెడీ అయినట్లు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని చిరు తనయుడు రామ్ చరణే నిర్మించనున్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్  రెడీ అయినప్పటికీ ప్రి ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతున్నాయి. ఇంకో రెండు నెలల తర్వాత కానీ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ చిత్రానికి సంగీతాన్నందించేందుకు ఎ.ఆర్.రెహమాన్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ.. తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరున్న టెక్నీషియన్లనే తీసుకుంటున్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా రవి వర్మన్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. రాజీవన్ ఆర్ట్ డైరెక్షన్ చేయనున్నాడు.

ఘనంగా 71వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

ఢిల్లీ : దేశరాజధానిలో 71వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

07:47 - August 15, 2017
07:46 - August 15, 2017

హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా హైదరాబాద్‌లో ఫ్రీడం వాక్‌ నిర్వహించారు. హైటెక్‌ సిటీ లో జరిగిన ఈ ఫ్రీడం వాక్‌లో అడిషనల్‌ సీపీ స్వాతి లక్రా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మహిళా సాధికారతకు, నగరంలో స్త్రీల భద్రతను కాంక్షిస్తూ ఈ వాక్‌ను ఏర్పాటు చేసినట్టు నిర్వహకులు తెలిపారు. 

07:45 - August 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కింగ్‌పిన్ కెల్విన్...కెల్విన్ అరెస్టుతో తుట్టె కదులుతుంది..ఇప్పటికే టాలివుడ్‌తో పాటు కాలేజీలు..ప్రముఖుల పిల్లలున్న స్కూళ్ల వ్యవహారం బయటకు వచ్చింది...అయితే కెల్విన్‌ ఖాతాలో ఒక్క టాలివుడ్‌ ప్రముఖులే కాదు..ఎందరో ఉన్నారని తేలింది..దీంతోనే తాను దందాను విస్తరించేందుకు రకరకాలుగా ఎందరినో ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది...ఇందులో ప్రధానంగా గాబ్రియల్...గాబ్రియల్...గతంలో డ్రగ్స్‌ కేసులో అరెస్టు కాగా బెయిల్‌పై వచ్చాక కూడా ఇదే దందాను కొనసాగిస్తున్నాడు..అప్పటి నుంచి కన్పించని గాబ్రియల్ పేరు అనూహ్యంగా బయటకు రావడంతో పోలీసులు ఓ దశలో నాలుక్కరుచుకున్నారు కూడా... గాబ్రియల్‌ను అరెస్టు చేసేవరకు మాత్రమే దృష్టి పెట్టిన పోలీసులు ఆ తర్వాత అతను బెయిల్‌పై వచ్చాక ఏం చేస్తున్నాడు...? ఎక్కడున్నాడన్న విషయాలపై నిఘా పెట్టలేదు.

సికింద్రాబాద్‌లో సుస్థిర నివాసం
దీంతో నగరంలో మత్తు సామ్రాజ్యం విస్తరించేందుకు గాబ్రియల్ కూడా కీలకంగా మారాడని తెలియడంతో పోలీసులు ఖంగుతిన్నారు....బెయిల్‌పై బయటకు వచ్చాక సికింద్రాబాద్‌లో సుస్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న గాబ్రియల్‌...తన గర్ల్‌ ఫ్రెండ్‌తో ఎస్తేరును పెళ్లి చేసుకుని యాప్రాల్‌...గ్రీన్‌వుడ్ రెసిడెన్సీలో ఉంటూ అక్కడి నుంచే దందా కొనసాగిస్తున్నాడు... గోవా,ముంబాయి,పూణేల నుంచి డ్రగ్స్‌ తెప్పించి హైదరాబాద్‌లో కస్టమర్లకు..సరఫరా చేస్తూనే నైజీరియన్ డ్రగ్స్ ముఠాలో కీలకంగా మారాడు...ఒక్కో గ్రాముకు 6 వేలకు విక్రయిస్తూ గర్ల్‌ ఫ్రెండ్‌ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తూ దందా చేస్తున్నట్లు తేలింది...ఢిల్లీ, ముంబాయి, గోవాలకు వెళ్తూ అక్కడి ముఠాలతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు...బంజారాహిల్స్‌ పబ్స్‌లలో ఎక్కువగా సరఫరా...చేస్తూనే పబ్‌లకు వచ్చేవారు ఎక్కడైనా పార్టీలు రేవ్‌లాంటివి ఏర్పాటు చేసుకుంటే వారికి

బెజవాడ కిలాడీ సంగీతతో ప్రేమాయణం
గాబ్రియల్‌ గతంలో బెజవాడ కిలాడీ సంగీతతో కొన్నాళ్లు ప్రేమాయణం కొనసాగించాడు..ఆ తర్వాత తన ప్రేయసి ఎస్తేర్‌ను పెళ్లి చేసుకుని ఉంటూనే ఎంజాయ్ లైఫ్ కొనసాగిస్తున్నాడు...ఈ మధ్యకాలంలో దొరికిన సంగీత ద్వారా గాబ్రియల్ ఇక తాజాగా దొరికిన గాబ్రియల్ గ్యాంగ్‌లో కీలకమైన డ్రగ్స్ పెడ్లర్‌ నవ్యత్....హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ ...కమలానగర్లో నివాసముంటున్న నవ్యత్‌ గీతాంజలి కాలేజీలో బీటెక్ చదువుతూనే డ్రగ్స్‌కు అలవాటు పడి ఆ తర్వాత దందాలోకి దిగాడు...ఆన్‌లైన్‌లో డ్రగ్స్ ఆర్డర్లు తీసుకుని సరఫరా చేస్తున్న నవ్యత్ ఖాతాలో సినీ ప్రముఖులు..ఇతర రంగాలకు చెందిన పెద్దోళ్లే కస్టమర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది......ఇక నవ్యత్ సెల్‌ఫోన్లో దాదాపు 50 మందికి పైగా అమ్మాయిల ఫోన్ నంబర్లున్నాయి..దీన్ని బట్టి అమ్మాయిలకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు...అయితే వారెవరు..? ఏం చేస్తున్నారన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు...ప్రధానంగా ఆన్‌లైన్, వాట్సాప్‌ గ్రూపుల ద్వారానే దందా చేస్తున్న నవ్యత్ కొకైన్, ఆప్టమైన్‌పిల్స్...ఎం డీఎంఏ,ఎల్‌ఎస్‌డీ... హెరాయిన్...సప్లై చేస్తారు...హైదరాబాద్,గోవాలకు సరఫరా...చేస్తున్నారు...ఒక్కో పిల్‌కు 1500 రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది...ఇక ఆర్డర్ల డబ్బు పేటీఎం ద్వారా కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారని తేలింది..ఇలా కొద్ది కాలంలోనే నవ్యత్‌ లక్షల్లో డబ్బు సంపాదించాడు...

అంకిత్‌ పాండే...
అంకిత్‌ పాండే...వెల్‌ ఎడ్యూకేట్... అతని చదువు చూసిన పోలీసులే ఆశ్చర్యపోయారు...నాగ్‌పూర్, మహారాష్ట్ర చెందిన అంకిత్ పాండే డ్రగ్స్‌కు అలవాటు పడి బంజారాహిల్స్‌లోని పబ్‌లో పనిచేసేవాడు...అక్కడికి వచ్చే నైజీరియన్లతో సంబంధాలు పెట్టుకుని డ్రగ్స్ దందా చేస్తున్నాడు...ప్రస్తుతం రాజేంద్రనగర్‌లోని నలందనగర్ లో ఉంటున్నాడు..ఇక గణత్‌కుమార్...కెపీహెచ్‌బీ...మలేషియా టౌన్‌షిప్ నివాసముంటూ...డ్రగ్స్ దందా చేస్తున్నాడు..ఇతను ప్రధానంగా...మాదాపూర్,గచ్చిబౌలి...తదితర ప్రాంతాల్లో డ్రగ్స్‌ సప్లై.. చేస్తన్నాడు...కెల్విన్,గాబ్రియల్,నవ్యత్‌లకు రెగ్యులర్ టచ్‌లో ఉంటూ వ్యాపారంలో బిజీగా మారాడు...

07:42 - August 15, 2017

పెద్దపల్లి : జిల్లాలో పోలీస్‌ యంత్రాంగం భారతీయ జాతీయతను చాటుతూ నిర్వహించిన కార్యక్రమానికి ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు దక్కింది. ఈ మేరకు పోలీసులు మేరా భారత్‌ మహాన్‌ పేరుతో ఇరవై వేల జాతీయ పతాకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్దపల్లి జూనియర్‌ కాలేజీ విద్యార్థులు భారతదేశ పటాన్ని ఆవిష్కరించారు. ఇరవై వేల విద్యార్థులతో కలిసి ఒకేసారి జాతీయ పతాకాన్ని ప్రదర్శించడంతో పెద్దపల్లి జిల్లా పోలీసులకు ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్ ఆఫ్‌ రికార్డు కోఆర్డినేటర్‌ జ్యోతి మెమోంటోను అందజేశారు.

 

07:40 - August 15, 2017

కోమరంభీం : హరితహారం పేరుతో కేసీఆర్‌ సర్కార్‌ గిరిజనుల భూముల జోలికి వస్తే ఊరుకోబోమని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య హెచ్చరించారు. పోడు భూములను గుంజుకోవాలని చూస్తే పోరుబాట పడుతామన్నారు. కేసీఆర్‌ జేజమ్మ వచ్చినా గిరిజనుల భూమిని ఒక్క అంగుళం కూడా తీసుకోలేరని తేల్చి చెప్పారు. కోమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో జరిగిన ఆదివాసీ దినోత్సవ వారోత్సవ ముగింపు వేడుకలకు సున్నం రాజయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన... వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పోడు భూములపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎండగతామన్నారు.

 

07:39 - August 15, 2017

హైదరాబాద్: 2019 ఎన్నికలు..తమ పాలనకు రెఫరెండంగా భావిస్తున్న గులాబీ పార్టీ..మరోసారి అధికార పీఠం కైవసం చేసుకునేందుకు ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తోంది. అందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. అభివృద్ధి నినాదాన్ని తీసుకోవ‌డంతో పాటు పార్టీకి సినీ గ్లామ‌ర్ తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. విజ‌యశాంతి పార్టీకి దూర‌మైనా గ‌త ఎన్నిక‌ల్లో హాస్యనటుడు బాబూ మోహ‌న్‌ అధికార పార్టీ త‌ర‌పున పోటీ చేసి విజ‌యం సాధించారు.

ఫిదా సినిమా చూసిన సీఎం
తెలంగాణ యాస‌, భాష‌తో విజ‌యం సాధించిన ఫిదా సినిమాను ఇటీవల చూసిన సీఎం కేసీఆర్‌...నటీనటులు చక్కగా నటించారని ప్రశంసలు గుప్పించారు. అంతేకాదు ఆ సిన్మా నిర్మాత దిల్‌రాజును పార్టీలోకి ఆహ్వానించాలని సీఎం నిర్ణయించినట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన దిల్ రాజుకు టీఆర్‌ఎస్‌ ప్రముఖుల‌తో స‌న్నిహిత సంబంధాలున్నాయి. దిల్‌రాజ్‌ కారుపార్టీలో చేరితే సినీ గ్లామ‌ర్ లోటును పూడ్చవ‌చ్చన్న అభిప్రాయం నేత‌ల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు తమ పార్టీవైపు మొగ్గుచూపే సినీ ప్రముఖులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునే వ్యూహాంలో భాగంగానే.. మంత్రి కెటిఆర్ సినిమా ఫంక్షన్లకు హాజ‌ర‌వుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దిల్ రాజు చేర్చుకునేందుకు ప్రయత్నం
దిల్‌రాజు అధికార పార్టీలో చేరినట్లయితే..నిజామాబాద్ లేదా జ‌హీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు అవ‌కాశం కల్పించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారట. ప్రస్తుతం ఆ రెండు స్థానాల్లో టిఆర్ఎస్ ఎంపీలే ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. అయితే నిజామాబాద్ ఎంపీగా కొన‌సాగుతున్న క‌విత రాష్ట్ర రాజ‌కీయాల‌పై మొగ్గు చూపిస్తున్నట్లు టాక్‌.. జ‌హీరాబాద్ ఎంపీగా ఉన్న బిబి పాటిస్‌పై సీఎం కేసీఆర్‌ అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వ‌ర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో దిల్‌రాజ్‌ను 2019 ఎన్నికల్లో ఎంపీ స్థానానికి పోటీచేయించేందుకు లైన్‌ క్లీయర్‌ చేస్తున్నారట పార్టీ పెద్దలు. మరి దిల్‌ రాజ్‌ కారు ఎక్కుతారో లేదో చూడాలి. 

07:34 - August 15, 2017

కర్నూలు : జిల్లా నంద్యాలలోని పొన్నాపురంలో ఉద్రిక్త పరిస్థితులే ఏర్పడ్డాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సుబ్బరాయుడిని ఆస్పత్రిలో వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి పరామర్శించారు. వైసీపీ నేతలపై దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

07:32 - August 15, 2017

నిజామాబాద్ : వృతి ఐఏఎస్‌ ఆఫీసర్‌... ప్రవృత్తి పరోపకారం. ఉద్యోగం ద్వారా లభించిన ఆర్థిక వెసులుబాటును సమాజం బాగుకోసం వినియోగిస్తున్నారు నిజామాబాద్‌ కలెక్టర్‌ యోగితారాణా. 108 మంది అనాధ చిన్నారులను చేరదీశారు. విద్యాబుద్ధులు నేర్పిస్తూ అమ్మలా ఆదుకుంటున్నారు. 2015లో నిజామాబాద్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ యోగితా రాణా..జిల్లాలోని అనాధచిన్నారుల పాలిట అమ్మగా మారారు. డిచ్‌పల్లిలో మానవతా సదన్‌ పేరుతో స్వచ్చంద సంస్థను స్థాపించారు. మొదట ఓ పాతభవనాన్ని తీసుకుని దానికి తన సొంత డబ్బు 50 లక్షల రూపాయలను ఖర్చు చేసి మరమ్మతు చేయించారు. తర్వాత మరో 50లక్షలతో మరో కొత్త బిల్డింగ్‌ను నిర్మించారు. తర్వాత పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ సహకారంతో దాదాపు 90లక్షల నిధులు సేకరించారు. వాటి నుంచి ఓ 20 లక్షల రూపాయలతో పిల్లలకు కంప్యూటర్లు , బెడ్లు, ఫ్యాన్లు, కూలర్లతోపాటు ఇతర డార్మెటరీ సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం మానవతా సదన్‌లో 108 మంది అనాధ పిల్లలు ఆశ్రయం పొందారు. వీరిందరికీ రాజీవ్‌ విద్యామిషన్‌ద్వారా భోజనం అందిస్తున్నారు.

రెండు సంవత్సరాల్లో మూడు అవార్డ్స్
కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాల్లో ఒక జాతీయ అవార్డు, రెండు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న యోగితారాణా.. తాజాగా ఉత్తమసేవా అవార్డుకు ఎంపికయ్యారు. 2015లో ఉపాధి హామీపథకాన్ని సమర్థవంతంగా నిర్వహించిన కలెక్టర్ల జాతీయ స్థాయిలో 5వస్థానంలో నిలిచారు యోగితారాణా. అప్పట్లో ఏపీ, తెలంగాణల్లో ఒక్క నిజామాబాద్‌ కలెక్టర్‌కే ఈ అవార్డు దక్కింది. తర్వాత 2016లో లక్ష్యాన్ని మించి మొక్కలు నాటించి హరితహారం అవార్డును కూడా అందుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లలో అమలు చేస్తున్న ఇ-నాం విధానం నిర్వహణలో కూడా కలెక్టర్‌ యోగితా రాణా సమర్థంగా పనిచేసి కేంద్రం నుంచి ప్రశంశలు పొందారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తాజాగా అనాధ చిన్నారులను అక్కున చేర్చుకుని మానవతా అవార్డుకు ఎంపికయ్యారు. గోల్కొండ కోటలోని ఆగష్టు 15 వేడుకల్లో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుంటున్నారు. చాలా మందికి పదవులు, అధికార హోదా ఉంటాయి. కాని నూటికో కోటికో ఒక్కరు అన్నట్టు కలెక్టర్‌ యోగితా రాణా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అటు విధి నిర్వహణ, ఇటు సమాజ సేవలో సాగుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న కలెకర్ట్‌ యోగితారాణాకు టెన్‌టీవీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతోంది.

 

07:30 - August 15, 2017

హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవాలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ఎర్రకోటపై ప్రధాని మోదీ మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పలు పాఠశాలల నుంచి విద్యార్థులు, పౌరులు తరలి రానున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎర్రకోటతో పాటు పలు ప్రాంతాలను అందంగా ముస్తాబు చేశారు. ఇక ఇండిపెండెన్స్‌ డే వేడుకలపై ఉగ్రవాదులు గురి పెట్టారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశవ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసర ప్రాంతాలలో 10 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ నగరంలో 4వేల సీసీ టీవీ కెమెరాలతో నిఘా నిర్వహిస్తుండగా... ఎర్రకోట చుట్టూ 150 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

తెలంగాణలో....
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ గోల్కొండకోటలోనూ పంద్రాగస్టు వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేశారు. కోటలోని ప్రాంతాలన్నింటిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కోటను మొత్తం తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు... అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర పోలీసులు నిఘా పెట్టారు. స్వాతంత్ర్య వేడుకల కోసం దాదాపు 5వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. డీసీపీలు, ఏసీపీలు, సీఐలతో పాటు ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఇప్పటికే పారామిలటరీ, సీఐఎస్ఎఫ్, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ బలగాలతో కూంబింగ్‌ నిర్వహించారు.

ఆంధ్రలో....
ఆంధ్రప్రదేశ్‌ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తిరుపతి ముస్తాబవుతోంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా... కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని అధికారులు తెలిపారు. ఇదిలావుంటే.. పంద్రాగస్టు వేడుకలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాట్లు చేశారు. ఇక దేశంలోని ప్రముఖ కట్టడాలు, ప్రభుత్వ కార్యాలయాలు, సుందరమైన ప్రాంతాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య ఈ భవనాలు, ప్రాంతాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 

హైటెక్ సిటీలో ఫ్రీడం వాక్ ప్రారంభించిన స్వాతిలక్రా

హైదరాబాద్ : స్వాతంత్ర్యదినోత్సవం సందర్బంగా హైటెక్ సీటీలో అడిషనల్ సీపీ స్వాతిలక్రా ఫ్రీడమ్ వాక్ ను ప్రారంభించారు.

 

శాసనమండలిలో స్వాతంత్ర్య వేడుకలు

హైదరాబాద్ : శాసనమండలిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ జాతీయా పతాకాన్ని ఆవిష్కరించారు.

నేడు తూర్పుగోదావరిలో సీఎం చంద్రబాబు పర్యటన

తూర్పుగోదావరి : నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పురుషోత్తం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం జగ్గంపేటలో బహిరంగ సభలో పాల్గొననున్నారు.

నేడు జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం

హైదరాబాద్ : నేడు నగరంలోని నాంపల్లిలో ఉదయం11గంటలకు టీ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో జేఏసీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

తిరుపతిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

చిత్తూరు : జిల్లా తిరుపతి ఎస్వీయూ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ సందర్బంగా సీఎం ఏడుగురికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ బహుకరించనున్నారు.

Don't Miss