Activities calendar

16 August 2017

నారాయణ ఒలింపియాడ్ స్కూల్ లో అగ్నిప్రమాదం

విజయవాడ : మొఘల్ రాజ్ పురం నారాయణ ఒలింపియాడ్ స్కూల్ లో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్ తో ఏసీ మిషనల్ లో మంటలు చెలరేగాయి. రెండు తరగతి గదులు, దగ్ధం అయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. 

 

తల్లీకొడుకులు హత్య

కృష్ణా : గన్నవరం మండలంలో తల్లీకొడుకులు హత్య గావించబడ్డారు. కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న తల్లి, కొడుకులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. మృతులు జొన్నలగడ్డ నాగలక్ష్మీ, అవినాష్. పాతకక్షలే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 

22:14 - August 16, 2017
22:06 - August 16, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని నేరెళ్లలో బలహీనవర్గాలను పోలీసులు చిత్రిహింసలకు గురిచేసిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనపై వరంగల్‌ ఎంజిఎం ఆస్పత్రి డాక్టర్లు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను ప్రభుత్వం సీల్డు కవర్‌లో హైకోర్టుకు అందజేసింది. ఎస్ ఐ రవీందర్‌ సస్పెన్షన్‌పై నివేదిక ఇవ్వాలని కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. 
హైకోర్టులో విచారణ 
నేరెళ్ల బాధితులను పోలీసులు చిత్రహింసలకు గురిచేసిన ఘటన కేసుపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పౌరహక్కుల సంఘం వేసిన కేసులో బెంచ్‌ వాదనలు విన్నది. బాధితులను పరీక్షించి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వం తరుపున అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు సీల్డు కవర్‌లో కోర్టుకు అందజేశారు.
హైకోర్టు బెంచ్‌ కు నివేదిక 
ఎంజీఎం వైద్యులు ఇచ్చిన నివేదికను పరిశీలించిన హైకోర్టు బెంచ్‌... బాధితులందరికీ ఒకేచోట గాయాలు ఎలా అయ్యాయని ప్రశ్నించింది. బాధితులు కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందడంతో, గాయాలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సూరింటెండెంట్‌ను ఆదేశించింది. అలాగే బాధితులు కరీంనగర్‌ సబ్‌ జైల్లో ఉన్నప్పటి... వారెంట్‌తో పాటు మెడికల్‌ రిపోర్టును ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. దీంతో పాటు నేరెళ్ల కేసులో ఎస్‌ఐ రవీందర్‌ను సస్పెండ్‌ చేయడానికి దారితీసిన పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీని ఆదేశించింది. ఈ కేసులో డీఐజీని ప్రతివాదిగా చేర్చింది. నేరెళ్ల ఘటనపై అందిన అన్ని ఫిర్యాదులను కూడా కోర్టుకు  సమర్పించాలని కోరింది. వీటిని పరిశీలించిన తర్వాత ఎస్పీ విశ్వజిత్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తామని హైకోర్టు చెప్పింది. నేరెళ్ల బాధితలును పోలీసులు చిత్రహింసలకు గురిచేయలేదని, ఈ ఘటనను రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని ఇంతకు ముందు కోర్టు దృష్టికి తెచ్చిన ప్రభుత్వం... తాజా పరిణామాలతో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. 
 

22:04 - August 16, 2017
22:01 - August 16, 2017

హైదరాబాద్ : ఖైదీ నంబర్‌ 150తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరు.. మరో సినిమాతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలంగా అభిమానులను ఊరిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా... కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ఆఫీస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. మెగాస్టార్ పుట్టిన రోజున సినిమా ప్రారంభించాలనుకున్నా, సరైన మూహూర్తం లేకపోవడంతో ముందే ప్రారంభించారు. బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఈ సినిమా ఫస్ట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

21:58 - August 16, 2017

ఢిల్లీ : కేరళలో హిందూ మహిళను ఇస్లాంలోకి మార్చి ముస్లిం యువకుడు వివాహం చేసుకున్న 'లవ్‌ జిహాదీ' కేసు వ్యవహారంలో విచారణ చేపట్టాలని జాతీయ దర్యాప్తు సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విచారణను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ వి రవీంద్రన్ పర్యవేక్షిస్తారని కోర్టు పేర్కొంది. పెద్దవాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా హిందూ బాలికలను ఇస్లాంలోకి మార్చిన పలు సందర్భాలున్నాయని ఎన్‌ఐఏ కోర్టుకు విన్నవించింది.ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అమ్మాయి అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు కోర్టు ముందు హాజరుపరచాలని సూచించింది. 2016లో కేరళకు చెందిన ఓ హిందూ యువతి ముస్లిం వ్యక్తిని ప్రేమించి ఇస్లాం మతం స్వీకరించిన తర్వాత అతడిని పెళ్లి చేసుకోవడం వివాదాస్పదమైంది. ఈ వివాహం చెల్లదంటూ కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సదరు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనరు తరపున ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తున్నారు. వీరి వివాహాన్ని రద్దు చేయడంతో పాటు సదరు మహిళను తన భర్తతో కలిసేందుకు అనుమతించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. 

 

21:55 - August 16, 2017

బెంగళూరు : తమిళనాడులో అమ్మ క్యాంటీన్ల తరహా కర్ణాటకలో పేదల ఆకలి తీర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిర క్యాంటీన్‌లను ప్రారంభించింది. అతి తక్కువ ధరకే కార్మికులు, పేదలకు టిఫిన్‌, భోజనం అందజేయనుంది. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బెంగళూరులో ఇందిరా క్యాంటీన్లను ప్రారంభించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇందిరా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. తొలిదశలో బెంగళూరులో101 క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ క్యాంటీన్లలో ఉదయం ఐదు రూపాయలకు టిఫిన్... మధ్యాహ్నం, రాత్రి వేళలో 10 రూపాయలకు భోజనం అందజేస్తారు. బెంగళూరులో క్యాంటీన్ల పనితీరుపై అధ్యయనం చేసి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో వీటిని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

 

21:52 - August 16, 2017

నల్గొండ : కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియాపై నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. 2019 ఎన్నికల వరకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డే పీసీసీ చీఫ్‌గా కొనసాగుతారన్న కుంతియా వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. కుంతియా చెప్పినంత మాత్రాన అదేమీ జరుగదంటూ  కొట్టిపారేశారు. జనాలకు దగ్గరగా ఉండే నాయకుడిని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు.  దీనిపై త్వరలోనే సోనియా, రాహుల్‌గాంధీని కలుస్తానన్నారు. త్వరలోనే పార్టీకి యువరక్తం వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యువనాయకుడి నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు. 

 

21:50 - August 16, 2017

అనంతపురం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైన అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు నంద్యాల ఉప ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కులేదని ఏపీపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాతోపాటు రైల్వే జోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయాలను కేంద్రంతో చర్చించేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లే తేదీలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

 

21:46 - August 16, 2017

గుంటూరు : ఉప ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొద్దీ నంద్యాల పాలిటిక్స్‌ శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నవేళ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది.  వైసీపీనేత గంగుల ప్రతాప్‌రెడ్డి ఆ పార్టీకి షాక్‌ ఇచ్చారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వెలగపూడిలోని సచివాలయంలో చంద్రబాబును కలిసిన ఆయన టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గంగుల ప్రతాప్‌రెడ్డికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గంగులను  మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి  చంద్రబాబు దగ్గరికి వెంట తీసుకెళ్లారు.  గంగుల టీడీపీలో చేరడం వైసీపీకి గట్టి ఎదురుదెబ్బే. 

 

21:44 - August 16, 2017

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రిపుర ముఖ్యమంత్రి మానిక్‌ సర్కార్‌ రాష్ట్ర ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేసేందుకు దూరదర్శన్, ఆకాశవాణి నిరాకరించడం వివాదానికి దారితీసింది. సిఎం ప్రసంగాన్ని నిరాకరించడం అప్రజాస్వామికం, అసహనం, నిరంకుశత్వమని సిపిఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దూరదర్శన్‌ బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ సొంత ప్రాపర్టీ కాదని మండిపడింది.
ప్రసారం చేయకపోవడం పట్ల విమర్శలు 
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ రాష్ట్రప్రజల నుద్దేశించి చేసిన ప్రసంగాన్ని దూరదర్శన్‌, ఆకాశవాణిలు ప్రసారం చేయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 12న దూరదర్శన్, ఆకాశవాణి సిఎం మాణిక్‌ సర్కార్‌ ప్రసంగాన్ని రికార్డు చేశాయి. ఈ ప్రసంగాన్ని ఆగస్టు 15న ప్రసారం చేయాల్సి ఉంది. అయితే సిఎం ప్రసంగం అభ్యంతరకరంగా ....ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని...దీన్ని యథాతథంగా ప్రసారం చేయడం కుదరదని  చెబుతూ సిఎం కార్యాలయానికి ప్రసారభారతి లేఖ రాసింది. సిఎం ప్రసంగ పాఠాన్ని మార్చుకుంటే ప్రసారం చేయడానికి తమకు అభ్యంతరం లేదని దూరదర్శన్, ఆకాశవాణి అగర్తలా విభాగం తెలిపింది. 
ప్రసార భారతి, ఆలిండియా రేడియో తీరుపై త్రిపుర ప్రభుత్వం ఫైర్  
ప్రసార భారతి, ఆలిండియా రేడియో తీరుపై త్రిపుర ప్రభుత్వం నిప్పులు చెరిగింది. సిఎం ప్రసంగాన్ని యథాతథంగా ప్రసారం చేయడానికి నిరాకరించడం అప్రజాస్వామికం, అసహనం, నిరంకుశత్వమని  మాణిక్‌ సర్కార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన ప్రసంగపాఠాన్ని మార్చే ప్రసక్తే లేదన్నారు. దీంతో మాణిక్‌ సర్కార్‌ ప్రసంగాన్ని డిడి, ఆకాశవాణి ప్రసారం చేయలేదు.
సిపిఎం ఖండన
త్రిపుర సిఎం ప్రసంగాన్ని ప్రసారం చేయకపోవడాన్ని సిపిఎం ఖండించింది. దూరదర్శన్‌, ఆకాశవాణి బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ సొత్తు కాదని ధ్వజమెత్తింది. ప్రసంగాన్ని మార్చుకోవాలనడం ఎమెర్జెన్సీ నాటి పరిస్థితుల కన్నా దారుణమని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. ఇది రాష్ట్రాల హక్కులపై కేంద్రం జోక్యం చేసుకోవడమేనని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇండియాను హిందుత్వ దేశంగా మార్చేందుకు కేంద్రం- ప్రభుత్వ సంస్థలను వినియోగించుకుంటోందని విమర్శించారు.
మాణిక్‌ సర్కార్‌ ప్రసంగంలో పేర్కొన్న అంశాలు 
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ తన ప్రసంగంలో దేశంలో గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులు, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రస్తావించారు. కుల మతాల ప్రాతిపదికన సమాజంలో విభజనలు తీసుకురావడానికి కుట్ర జరుగుతోందని సిఎం అన్నారు. భారతదేశాన్ని ఓ మతరాజ్యంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని...  స్వాతంత్ర ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని కొన్ని శక్తులు దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు.  

21:37 - August 16, 2017

హోరెత్తే ప్రచారం.. ఘాటైన విమర్శలు..పదునైన కామెంట్లు.. దుమ్మురేపుతున్న రోడ్ షోలు.. మీటింగ్ లు..వెరసి గెలుపుకోసం ఆరాటం.. నంద్యాల ఉపఎన్నికను సెమీఫైనల్ గా భావించవచ్చా? నంద్యాలలో గెలుపెవరిదో.. వాళ్లదే వచ్చే ఎన్నికల్లో కూడా పైచేయి అనుకోవచ్చా? ఇరు పార్టీల నేతలంతా ఒక్కదగ్గర పోగై సాగిస్తున్న సమరం ఏ దిశగా తేలనుంది? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. నంద్యాల ఉప ఎన్నిక పోరు ఓ రేంజ్ లో కాక పుట్టిస్తోంది. చంద్రబాబు సర్కారుకు మూడేళ్లు పూర్తయిన సందర్బంగా.. ఈ ఎన్నిక ఫలితం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు ఒక ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల జాతకాలు మారిపోతాయా..? నేతల నాయకత్వాలపై ప్రజలు ఓ అభిప్రాయానికి వచ్చేస్తారా..? ఇప్పుడివే ప్రశ్నలు ఏపీ పొలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారుతున్నాయి...!! మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:33 - August 16, 2017

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని దూరదర్శన్ ప్రసారం చేయకపోవడం భావ్యం కాదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బీజేపీ నేత శ్రీదర్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, సామాజిక విశ్లేషకులు ప్రొ.హరగోపాల్ పాల్గొని, మాట్లాడారు. దూరదర్శన్, ఆకాశవాణి బీజేపీ సొత్తుకాదని...ప్రజలదని చెప్పారు. మాణిక్‌ సర్కార్‌ స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని దూరదర్శన్‌లో ప్రసారం చేయకపోవడాన్ని వక్తలు తీవ్రంగా తప్పుపట్టారు. మాణిక్‌ సర్కార్‌ సందేశాన్ని సెన్సార్‌ చేయనిదే ప్రసారం చేయడం సాధ్యం కాదని ప్రసార భారతి కార్పొరేషన్‌ చెప్పడాన్ని తప్పుపట్టారు. ప్రసంగాన్ని యథాతథంగా ప్రసారం చేయడానికి నిరాకరించడం అప్రజాస్వామికం, అసహనం, నిరంకుశత్వమని అన్నారు. మళ్లీ ఎమర్జెన్సీ కాలంనాటి ఆంక్షలు వస్తున్నాయన్నారు. సంఘ్‌ పరివార్‌ శక్తుల ప్రసంగాలను యథావిధిగా ప్రసారం చేసే దూరదర్శన్‌... మాణిక్‌ సర్కార్‌ విషయంలో వివక్ష చూపడంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వపోకడలు అవలంభిస్తోందని విమర్శించారు. మోదీ సర్కారు విధానాలు ఎమర్జెన్సీని మించిపోయాయన్నారు. కేంద్రం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

కొత్తగా 84వేల ఉద్యోగాలు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీ ద్వారా కొత్తగా 84వేల ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. లక్షా 12 వేల ఉద్యోగ నియామకాలే లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే 58 నోటిఫికేషన్ల ద్వారా 5 వేల మందికి ఉద్యోగాలు...మరో నెల రోజుల్లో 12 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు. 

 

21:04 - August 16, 2017

యువత డ్రగ్స్ కు బానిస అవుతోంది. ఈమధ్య డ్రగ్స్ మాఫియా సినీ రంగాన్ని కుదిపేసింది. ఈనేపథ్యంలో రఘు కుంచె  'ఓ యువత' పేరుతో పాట రూపొందించారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ఓ యువత పాట రూపొందించారు. ఈమేరకు రఘు కుంచె, సంజీవరెడ్డిలతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  పలు అసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

20:50 - August 16, 2017

గవర్నర్ విందుల బైటికొచ్చిన బాగోతం, నీళ్లు ఇయ్యంకుంటే ఓట్లు అడ్గమన్న మంత్రి, దళితుల మీద నోరువారేస్కున్నడు, దేశంల ఎక్కడ లేని పథ్యాలు అమలైతున్నయ్, దగా పడ్డ ఎమ్మెల్యే దత్తత గ్రామం... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్

తూ.గో : వై.రామవరం మండలం చౌటుదిబ్బ కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 20 మంది విద్యార్థినులకు అస్వస్థత కలిగింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

 

టీడీపీలో చేరిన గంగుల ప్రతాప్ రెడ్డి

అమరావతి : నంద్యాలలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు సమక్షంలో గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరారు. గంగులను సీఎం వద్దకు అచ్చెన్నాయుడు తీసుకొచ్చారు. 

 

శంషాబాద్ తహశీల్దార్ ఆఫీస్ లో దొంగలు బీభత్సం

రంగారెడ్డి : శంషాబాద్ తహశీల్దార్ ఆఫీస్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. తహశీల్దార్ కార్యాలయం తాళాలు పగలగొట్టి, ముసుగు ధరించి ఇద్దరు దొంగలు దోపిడీకి యత్నించారు. సీసీ కెమెరాలకు కవర్లు కప్పి దోపిడీకి యత్నించారు. తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

20:16 - August 16, 2017

కర్నూలు : టీడీపీ నాయకులు, కార్యకర్తల వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. నంద్యాల ఉప ఎన్నికలో ప్రచారం నిర్వహించిన ఆమె.. టీడీపీ సర్కార్‌ తీరుపై మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల్లో అత్యాచారం చేసే వారిపై దేశంలో సర్వే జరిపిస్తే.. అందులో ఇద్దరు నేతలు టీడీపీ కేబినెట్‌లో ఉన్నారన్నారు. అటు బాలకృష్ణ అమ్మాయిలు కనిపిస్తే ముద్దుపెట్టండి.. కడుపు చేయండి.. కమిట్‌ అవ్వండి అని అంటారని... అలాంటివారు ప్రచారం చేస్తే ఎవరు ఓట్లు వేస్తారని రోజా మండిపడ్డారు. 

20:13 - August 16, 2017

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుకు సంబంధించి మరో కొత్త కంపెనీ ముందుకొచ్చింది. సంస్థ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తమకు ఇస్తే.. వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు కొత్త కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే డాక్యుమెట్లు ఇవ్వాలంటే ముందుగా 100కోట్లు డిపాజిట్ చేయాలని హైకోర్టు తెలిపింది. మరోవైపు గతంలో వేలం వేసిన ఆస్తుల బిడ్లకు పదిరెట్లు ఎక్కువ చెల్లించే పార్టీని.. తీసుకొస్తామని గతంలో అగ్రిగోల్డ్ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఇప్పటివరకు ఎవరిని తీసుకురాలేకపోయింది. హైకోర్టు ఈనెల 31 వరకు అగ్రిగోల్డ్‌కు గడువు ఇచ్చింది. లేదంటే పాత పద్ధతిలోనే బిడ్ల వేలం ప్రక్రియ ముందుకు వెళ్తుందని కోర్టు సూచించింది. తదుపరి విచారణ ఈనెల 31కి వాయిదా పడింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుకు ముందుకొచ్చిన కొత్త కంపెనీ

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుకు సంబంధించి మరో కొత్త కంపెనీ ముందుకొచ్చింది. సంస్థ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తమకు ఇస్తే.. వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు కొత్త కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 

20:07 - August 16, 2017

భార్యభర్తలు విడాకులు... విడాకులు తీసుకోవడానికి కారణాలు...? అనే అంశంపై మానవి నిర్వహించిన మైరైట్ చర్చా కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. విడాకులు సర్వసాధారణం అయిందన్నారు. వివాహ వ్యవస్థ కల్లోలంగా ఉందని తెలిపారు. ఆర్థిక పరమైన కారణాలు, వరకట్న వేధింపులు, గృహ హింస కారణాలతో భార్యభర్తలు విడాకులు కోరుతున్నారని పేర్కొన్నారు. అసమానతలు, పురుషుడి ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారని తెలిపారు. అసమానతలు, మహిళలను కించపర్చడంతో కూడా విడాకులు తీసుకుంటున్నారన్నారు. మద్యం, దురు వ్యసనాలు, అవగాహన రాహిత్యం వల్ల కూడా విడాకులు కోరుకుంటున్నారని వివరించారు. భార్యభర్తలు ఇరువురి పట్ల నమ్మకం కల్గి ఉండాలని, అవగాహన కల్గిఉండాలని సూచించారు. ఒకరినొకరు అండర్ స్టాండింగ్ తో ఉండాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:54 - August 16, 2017

కర్నూలు : ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు.. నంద్యాల ఓటర్లను కొనుగోలు చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తారని.. వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. టీడీపీ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకుని ధర్మానికి, న్యాయానికి ఓటేయాలని ప్రజలను కోరారు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్‌.. తన దగ్గర అధికారం, డబ్బు లేదని ప్రజా ఆశీస్సులు మాత్రమే ఉన్నాయన్నారు.  

19:40 - August 16, 2017

సంగారెడ్డి : జిల్లాలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌పై రేపటి నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నట్టు తెలిపారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డికి రావాల్సిన మెడికల్‌ కాలేజ్‌ను మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటకు తరలించుకుపోయారని ఆరోపించారు. సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ వచ్చే వరకు తన పోరాటం ఆగదని చెప్పారు. 

 

19:30 - August 16, 2017

హైదరాబాద్ : న్యాక్ బృందం రేపటి మూడు రోజుల పాటు ఉస్మానియా యూనివర్శిటీలో పర్యటించనుంది. ఓయూ గత నాలుగేళ్లుగా న్యాక్ అక్రిడేషన్ కోల్పోవడంతో ఇప్పుడు న్యాక్ బృందం ఏ ర్యాంకు ఇవ్వనుందనే ఆందోళన యూనివర్శిటి వర్గాల్లో వుంది. ఈమేరకు ఓయూ వీసి రాంచంద్రంతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓయూలో సాగుతున్న విద్యాబోధన, ఉత్తమ పరిశోధనలతో ఏ ప్లస్‌ ర్యాంకు వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
 

19:24 - August 16, 2017

పెద్దపల్లి : జిల్లాలోని మంథని మండలం సిరిపురం గ్రామంలో సుందిళ్ల బ్యారేజి భూనిర్వాసితులతో మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు సమావేశమయ్యారు. ప్రాజెక్టు నిర్మాణపనులకు అడ్డువస్తున్నాడనే నెపంతో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న నిర్వాసితుడు దాసరి చంద్రమోహన్‌ శ్రీధర్‌ బాబు పరామర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతే రాజుగా ఉండేవాడని, నేడు తెలంగాణ ప్రభుత్వం రైతులను పోలీసులతో చిత్రహింసలకు గురి చేస్తుందని ఆరోపించారు.

 

19:18 - August 16, 2017

హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల ఘటనలో ఎస్పీ విశ్వజిత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పౌరహక్కుల సంఘం నేతల హైకోర్టులో పిటిషన్‌ వేశారు. బాధితులను చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై వరంగల్‌ ఎంజీఎం వైద్యుల మెడికల్‌  రిపోర్టును ప్రభుత్వం హైకోర్టుకు అందజేసింది. ఈమేరకు బాధితుల తరుపు న్యాయవాది రఘునాథ్‌తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ విశ్వజిత్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

19:05 - August 16, 2017

గుంటూరు : కాంగ్రెస్‌ మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి టీడీపీలో చేరనున్నారు. కాసేపట్లో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి అమరావతిలో చంద్రబాబును కలవనున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ప్రతాప్‌రెడ్డి గతంలో కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా పనిచేశారు. 

 

టీడీపీ గూటికి గంగుల ప్రతాప్ రెడ్డి ?

గుంటూరు : కాంగ్రెస్ మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. అమరావతిలో కాసేపట్లో అచ్చెన్నాయుడుతో కలిసి చంద్రబాబును కలవనున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన గంగుల ప్రతాప్ రెడ్డి.

18:39 - August 16, 2017

శ్రీకాకుళం : వంశధార నిర్వాసితులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. హిరామండలం పాడలి వద్ద పొలం పనులు చేసుకుంటున్న వంశధార నిర్వాసితులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిర్వాసితుల మధ్య తోపులాట జరిగింది. ముగ్గురు ఎస్సైలతోపాటు ఐదుగురు కానిస్టేబుళ్లకు, 20 మంది నిర్వాసితులకు గాయాలయ్యాయి. 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

వంశధార నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత

శ్రీకాకుళం : వంశధార నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. పాడలి, దుగ్గుపురం గ్రామాల్లోని పొలాల్లో పని చేస్తున్న వందలాది మంది నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. 200 మందికిపైగా అరెస్టు చేసి, పోలీసు స్టేషన్ కు తరలించారు. 

 

అమరావతిలో కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ పర్యటన

గుంటూరు : అమరావతిలో కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ పర్యటించారు. అసెంబ్లీ, సచివాలయాన్ని పరిశీలించారు. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం గురించి మంత్రి నారాయణ అనుప్రియకు వివరించారు. 

18:06 - August 16, 2017
17:37 - August 16, 2017
17:35 - August 16, 2017

ఢిల్లీ : త్రిపుర ముఖ్కమంత్రి మాణిక్‌ సర్కార్‌ స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని దూరదర్శన్‌లో ప్రసారం చేయకపోవడాన్ని సీపీఎం తీవ్రంగా ఆక్షేపించింది. మాణిక్‌ సర్కార్‌ సందేశాన్ని సెన్సార్‌ చేయనిదే ప్రసారం చేయడం సాధ్యం కాదని ప్రసార భారతి కార్పొరేషన్‌ చెప్పడాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుపట్టారు. సంఘ్‌ పరివార్‌ శక్తుల ప్రసంగాలను  యథావిధిగా ప్రసారం చేసే దూరదర్శన్‌... మాణిక్‌ సర్కార్‌ విషయంలో వివక్ష చూపడంపై ఏచూరి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వపోకడలు అవలంభిస్తోందని విమర్శించారు. మోదీ సర్కారు విధానాలు ఎమర్జెన్సీని మించిపోయాయన్నారు. కేంద్రం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. త్రిపుర సీఎంకు ఎదురైన చేదు అనుభవంపై పోరాటం చేస్తామని చెప్పారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులతో సంప్రదిస్తున్నామని తెలిపారు. 

 

17:25 - August 16, 2017

త్రిపుర : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రిపుర ముఖ్యమంత్రి మానిక్‌ సర్కార్‌  రాష్ట్ర ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగాన్ని దూరదర్శన్, ఆకాశవాణి అగర్తలా విభాగం ప్రసారం చేయడానికి నిరాకరించడం వివాదానికి దారితీసింది. తన ప్రసంగాన్ని యథాతథంగా ప్రసారం చేయడానికి నిరాకరించడం అప్రజాస్వామికం, అసహనం, నిరంకుశత్వమని సీఎం మాణిక్‌ సర్కార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వయం ప్రతిపత్తి గల దూరదర్శన్‌, ఆకాశవాణిలు కేంద్ర సమాచార ప్రసార శాఖలో భాగమైనట్లు వ్యవహరించడమేంటని వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మళ్లీ ఎమర్జెన్సీ కాలంనాటి ఆంక్షలు వస్తున్నాయని హెచ్చరించాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 12న దూరదర్శన్, ఆకాశవాణి సిఎం మాణిక్‌ సర్కార్‌ ప్రసంగాన్ని రికార్డు చేశాయి. దీన్ని ఆగస్టు 15న ప్రసారం చేయాల్సి ఉంది. అయితే ప్రసంగం అభ్యంతరకరంగా ఉందని....ప్రసంగ పాఠాన్ని మార్చేవరకు ప్రసారం చేసే ప్రసక్తే లేదని ప్రసారభారతి తెలిపింది. తన ప్రసంగాన్ని మార్చే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేయడంతో మాణిక్‌ సర్కార్‌ ప్రసంగాన్ని డిడి, ఆకాశవాణి ప్రసారం చేయలేదు.

 

17:17 - August 16, 2017

వెంకయ్యకు కేసీఆర్ సన్మానం !..

హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి సన్మానం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

17:14 - August 16, 2017

నిజామాబాద్‌ : జిల్లాలోని నంది పేట మండలం అయిలాపూర్‌లో... ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌పై విద్యార్థులు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని... వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణా రాష్ర్ట మైనారిటీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్‌ డిమాండ్ చేసింది.  కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ యకినోద్దిన్‌.. కాళ్లకు వేసుకున్న షూను విడవకుండా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ జెండాను.. ఎగురవేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ప్రిన్సిపాల్‌ను బయటకు తీసుకొచ్చి.. ధర్నా చేశారు. ఈ చర్యపై ఆగ్రహించిన మైనారిటీ ఎంప్లాయిస్ సర్వీస్‌ అసోసియేషన్‌ సభ్యులు దురుసుగా ప్రవర్తించిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ... కలెక్టర్‌ యోగితా రాణాకు వినతిపత్రం అందజేశారు. ప్రిన్సిపాల్‌పై కావాలనే దాడి చేశారని మండిపడ్డారు.

 

సుప్రీంని ఆశ్రయించిన మెడికల్ విద్యార్థులు..

చెన్నై : మెడికల్ కౌన్సెలింగ్ ను నిలిపివేయాలంటూ తమిళనాడు రాష్ట్ర వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ట్రేడింగ్ ప్రారంభం దగ్గరి నుండి సెన్సెక్స్ లాభాల బాటలోనే కొనసాగింది. సెన్సెక్స్ 31,770.89 వద్ద ముగియగా నిఫ్టీ 9,897 వద్ద ముగిసింది. 

ఆక్షేపించిన సీపీఎం...

ఢిల్లీ : త్రిపుర ముఖ్కమంత్రి మాణిక్‌ సర్కార్‌ స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని దూరదర్శన్‌లో ప్రసారం చేయకపోవడాన్ని సీపీఎం తీవ్రంగా ఆక్షేపించింది. మాణిక్‌ సర్కార్‌ సందేశాన్ని సెన్సార్‌ చేయనిదే ప్రసారం చేయడం సాధ్యంకాదని ప్రసార భారతి కార్పొరేషన్‌  చెప్పడాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుపట్టారు. సంఘ్‌ పరివార్‌ శక్తుల ప్రసంగాలను  యథావిధిగా ప్రసారం చేసే దూరదర్శన్‌...  మాణిక్‌ సర్కార్‌ విషయంలో వివక్ష చూపడంపై ఏచూరి తీవ్రంగా విమర్శించారు. 

 

17:02 - August 16, 2017

కృష్ణా : విజయవాడలోని బల్లెంవారి వీధిలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు. జనావాసాల మధ్య క్రాంతి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు అధికారులు అనుమతి ఇచ్చారు. దీన్ని నిరసిస్తూ స్థానిక మహిళలు ఐద్వా ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు ఎదురుగా టెంట్‌వేసి ధర్నా నిర్వహించారు. ఎక్సైజ్‌ అధికారులు ఇచ్చిన పర్మిషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 

16:56 - August 16, 2017

వరంగల్ : డ్రగ్స్‌ కేసులో విచారణ కొనసాగుతోందని ఎక్సైజ్‌  డైరెక్టర్‌ అకున్‌సబర్వాల్‌ స్పష్టం చేశారు. డ్రగ్స్‌ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని అధికారులతో ఆయన ఇవాళ సమీక్ష నిర్వహించారు. వరంగల్‌లో గుడుంబా అమ్మకాలను అరికట్టామని చెప్పారు. గుడుంబా విక్రయించే ఆరుగురిపై పీడీయాక్ట్‌ నమోదు చేశామన్నారు. 

 

16:53 - August 16, 2017

ఖమ్మం : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన పచ్చి బూటకమని టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ విమర్శించారు. ఖమ్మంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగ సదస్సులో ఆయన మాట్లాడారు. సింగరేణి కాలరీస్‌, ఆర్టీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థల్లోని ఖాళీలను కూడా ప్రభుత్వ శాఖ ఖాతాలో వేశారని మండిపడ్డారు. ఇంతవరకు పాతికవేల ఉద్యోగాలను మాత్రమే ప్రకటించారన్నారు. అంకెలగారడీతో కేసీఆర్  నిరుద్యోగులకు మభ్యపెడుతున్నారని కోదండరాం విమర్శించారు.  

16:49 - August 16, 2017

ఖమ్మం : అటవీశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని టీ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  ఈశాఖలో 15 నుంచి 35 ఏళ్లుగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులున్నారన్నారు. వీరందరిచేత ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటోందని విమర్శించారు.  తక్షణమే అటవీశాఖలోని  తాత్కాలిక ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయాలన్నారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు ఓ లేఖరాశారు. రెగ్యులరైజేషన్‌కు ఇబ్బందులు ఉంటే... విద్యుత్‌ ఉద్యోగుల తరహాలో వారందరినీ అటవీశాఖలో విలీనం చేయాలన్నారు. కేసీఆర్‌ దీనిపై స్పందించకుంటే ప్రభుత్వంపై పోరాడుతామని హెచ్చరించారు. 

డీపీఆర్ తయారీకి రూ. 98 లక్షలు..

విజయవాడ : మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతలను గుర్గావ్ కు చెందిన మాస్ ట్రాన్సిటీ కంపెనీకి ఏపీ ప్రభుత్వం అప్పగించింది. డీపీఆర్ తయారీకి రూ. 98 లక్షలను ప్రభుత్వం చెల్లించనుంది. 

నక్కలవాగులో యువతుల మృతదేహాలు..

విజయవాడ : నరుకుల పాడు వద్ద నక్కలవాగులో ఇద్దరు యువతులు అనుమానస్పదంగా మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 

16:46 - August 16, 2017

కర్నూలు : తెలుగుదేశం పార్టీది జవాబుదారీ ప్రభుత్వమని ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా రోడ్‌షో నిర్వహించిన ఆయన.. తెలుగుదేశానికి ఉన్న కార్యకర్తలు ఈ ప్రపంచంలో ఏపార్టీకీ లేరన్నారు. ప్రతిపక్షం కుల మతాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తుందని దీన్ని ప్రజలంతా గమనించాలని బాలకృష్ణ అన్నారు. నంద్యాల ప్రచారంలో బాలకృష్ణతో పాటు సినీనటుడు వేణుమాధవ్‌ కూడా పాల్గొన్నారు. తనదైన శైలిలో మాట్లాడుతూ ఓటర్లును ఆకర్శించే ప్రయత్నం చేశారు.

 

16:43 - August 16, 2017

హైదరాబాద్ : నంద్యాల ఉపఎన్నికలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన వైఖరిని స్పష్టం చేశారు. నంద్యాల ఉపఎన్నికల్లో తాము తటస్థంగా ఉంటామని పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. జనసేన పార్టీ ఇంకా నిర్మాణ దశలోనే ఉందన్న ఆయన.. 2019 వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీచేయమన్నారు. అలాగే..ఏ పార్టీకి, ఏ వ్యక్తికి మద్దతివ్వబోమన్నారు. క్షేత్రస్థాయిలో జనసేన బలపడిన తర్వాత పోటీకి వెళ్తామని పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:42 - August 16, 2017

అందాన్ని మరింత మెరుగుపరుచుకొనేందుకు మహిళలు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా బ్యూటీషియన్లను ఆశ్రయిస్తుంటారు. కానీ ఇంట్లోనే ఎన్నో ప్యాక్ లు తయారు చేసుకోవచ్చు. అందులో క్యారెట్ కూడా ఒకటి. ఈ క్యారెట్ ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

క్యారెట్‌ పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇది ఒక గిన్నెలో తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ శనగపిండి, కొద్దిగా పసుపు వేయాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత నీటితో కడుక్కోవాలి.

ఒక గిన్నెలో క్యారెట్ జ్యూస్..టేబుల్ స్పూన్ ఎగ్ వైట్ తీసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ ఆలీవ్ ఆయిల్, టేబుల్ స్పూన్ పెరుగు వేయాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం..మెడకు రాసుకోవాలి. అనంతరం కొద్ది సేపటి అనంతరం గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.

క్యారెట్ జ్యూస్..అరటిపండు గుజ్జు..ఎగ్ వైట్ లు తీసుకోవాలి. ఇవన్నీ రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. అందులో నాలుగు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. కొద్దిసేపటి అనంతరం కడుక్కోవాలి.

క్యారెట్..బొప్పాయి లను సరిసమానంగా తీసుకోవాలి. వీటిని పేస్ట్ చేయాలి. ఇందులో కొద్దిగా పాలు వేసి మిక్స్ చేయాలి. అనంతరం ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల అనంతరం కడుక్కోవాలి. 

16:38 - August 16, 2017

నిర్మల్‌ : జిల్లాలోని ముదోల్‌ మండల కేంద్రానికి చెందిన సవిత అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. గంగాధర్‌ అనే రైతు కుమార్తైన సవిత ఎంబిబిఎస్ పూర్తి చేసి హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో మెడికల్‌ పిజి ఫైనలియర్‌ చదువుతోంది. ఆదివారం స్వస్థలానికి వచ్చిన సవిత సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనకు తానే మత్తు ఇంజక్షన్‌ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోవారు గమనించి భైంసా ఆస్పత్రికి తరలించడంతో అప్పడికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. త్వరలో పెళ్లి కాబోతుండగా తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

 

16:34 - August 16, 2017

విశాఖ : మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులపై చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్ధులు, దళిత సంఘాలు  భగ్గుమన్నాయి. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఆందోళన నిర్వహించిన విద్యార్ధులు మంత్రి ఆదినారాయణరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయన వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రభుత్వం ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. 

16:26 - August 16, 2017

టాలీవుడ్ యంగ్ టైగర్ 'జై లవ కుశ' సినిమాతో..బుల్లితెరపై ప్రసారం అవుతున్న 'బిగ్ బాస్' షోతో బిజీ బిజీగా ఉన్నాడు. చిత్ర టీమ్ గ్యాప్ లేకుండా వరుస షెడ్యూళ్లతో షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఏకంగా 'ఎన్టీఆర్' మూడు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

బాబీ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' సోదరుడు 'కళ్యాణ్ రామ్' నిర్మిస్తోన్న ఈ సినిమాలో నివేదా థామస్, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్స్..టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని 'జై' పాత్రకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలయ్యింది. ప్రతినాయక ఛాయలతో ఉన్న 'జై' పాత్రలో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మరో టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. 'లవ' పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దసరా కానుకగా సెప్టెంబర్ 21న విడుదల కాబోతోంది. 

16:22 - August 16, 2017

హైదరాబాద్ : నేరెళ్ల ఘటనపై హైకోర్టులో విచారణ సాగింది. ఎంజీఎం వైద్యుల నివేదికను సీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. బాధితులకు తీవ్రగాయాలైనట్లు నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. అందరికీ ఒకేచోట తీవ్రగాయాలు ఎలా అయ్యాయని కోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఈ ఘటనకు బాధ్యుడైన ఎస్ ఐ రవీంద్రను సస్పెండ్‌ చేశామని కోర్టుకు ప్రభుత్వ అడ్వకేట్‌ రామచంద్రరావు తెలిపారు. ఎస్ ఐ పై సస్పెన్షన్‌పై పూర్తి నివేదిక ఇవ్వాలని కరీంనగర్‌ డీఐజీని కోర్టు ఆదేశించింది. బాధితుల మెడికల్‌ రిపోర్ట్‌ను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే రెండో వారాల్లో నివేదిక సమర్పించాలని కరీంనగర్‌ సూపరింటెండెంట్‌‌ను ఆదేశించింది. కేసును రెండు వారాలపాటు వాయిదా వేసింది.

 

16:12 - August 16, 2017

పెన్సుల్వేనియా : రెడ్‌బుల్‌ నిర్వహించిన ఫ్లగ్‌ టగ్‌ చాలెంజ్‌ ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌ ఫ్యాన్స్‌ను అలరించింది. ఈ ఫన్నీ కాంపిటీషన్‌లో అట్టపెట్టలు,థెర్మాకోల్‌ షీట్లతో చేసిన బొమ్మ వాహనాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సరదా సరదా కాంపిటీషన్‌లో 70 మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు.ఈ అరుదైన పోటీనీ  చూసేందుకు 10వేల మంది అభిమానులు హాజరయ్యారు. పక్షులు, జంతువులు, కార్టూన్‌ క్యారెక్టర్స్ ఆకారాలతో స్పెషల్‌గా రూపొందించిన స్లెడ్‌లతో పాల్గొన్న పోటీదారులు చేసిన  సందడి అంతా ఇంతా కాదు.పిట్స్‌బర్గ్‌ పైలెట్స్‌ టీమ్‌ పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌ ప్లేస్‌లో నిలిచి  టైటిల్‌ ఎగరేసుకుపోయింది. 

కేసీఆర్ కు రేవంత్ లేఖ..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై స్పష్టత ఇవ్వాలని లేఖలో కోరారు. 

ఖాళీ పోస్టుల భర్తీపై చర్చ..

హైదరాబాద్ : సీఎస్ ఎస్పీ సింగ్, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ వివిధ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భేటీ అయ్యారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నారు. 

16:01 - August 16, 2017

కర్నూలు : వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా చేశారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'మీరు చూసిస్తున్న అభిమానానికి కృతజ్ఞతుల తెలుపుకుంటున్నానని' ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

బ్లూ, గ్రీన్ రాజధాని మనది - బాబు..

విజయవాడ : డీజీపీ ఆఫీసు వద్ద ఆక్టోపస్ విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ విన్యాసాలను సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల, డీజీపీలు తిలకిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని వనరులు మనకున్నాయని, అమరావతిలో సౌరవంతమైన భూమి ఉందన్నారు. బ్లూ, గ్రీన్ రాజధాని మనదని, మన ఆక్టోపస్, గ్రే హౌండ్స్ అద్బుత ప్రతిభ కనబరుస్తోందన్నారు. నేరస్తులు భయపడేలా పోలీసుల ఫిజికల్ ఫిట్ నెస్ ఉండాలని సూచించారు. పోలీసులందరికీ ఇళ్లు ఇస్తామని..అన్ని విధాలా సహకరిస్తామన్నారు. 

'ఒక్క ఏడాదిలో ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారు' ?

నల్గొండ : కుంతియా చెప్పినంత మాత్రానా అయ్యేదేమీ లేదని, ప్రజలకు దగ్గరగా ఉండే నాయకత్వాన్ని కార్యకర్తలు కోరుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. యువరక్తం ఉన్న నాయకత్వంలోనే కాంగ్రెస్ ముందుకెళుతుందని, గత మూడున్నరేళ్లుగా భర్తీ చేయలేని ఉద్యోగాలు ఒక్క ఏడాదిలో ఎలా భర్తీ చేస్తారని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 

15:56 - August 16, 2017

శ్రీనగర్ : ఉగ్రవాదులకు నిధులు ఆపేందుకు గాను జమ్ముకశ్మీర్‌లో 12 చోట్ల ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులకు, రాళ్లు విసిరే అల్లరి మూకలకు నిధులు సమాకూర్చుతున్నారన్న ఆరోపణల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఈ దాడులు చేసింది. శ్రీనగర్‌, హంద్వాడా, బారాముల్లా లోని 12 చోట్ల ఎన్‌ఐఏ బృందం సోదాలు నిర్వహించింది. ఎన్‌ఐఏ నిర్వహించిన సోదాల్లో వేర్పాటువాద నేతల బంధువులు, హవాలా వ్యాపారుల ఇళ్లు కూడా ఉన్నాయి. ఎన్‌ఐఏ హురియత్‌ నేత గిలానీని టార్గెట్‌ చేస్తోంది. హవాలా వ్యాపారులకు వేర్పాటువాద నేతలతో సంబంధాలున్నాయని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చకుండా విచారణ జరపాలన్న కేంద్రం ఆదేశాల మేరకు ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. గిలానీ పాత్రపై ఆయన కుమారులు నయీం, నసీంలను ఎన్‌ఐఏ విచారిస్తోంది. త్వరలోనే గిలానీని కూడా విచారించే అవకాశం ఉంది. ఉగ్రవాదుల నిధులకు సంబంధించి ఎన్‌ఐఏ ఇప్పటికే చాలామందిని విచారించింది. ఏడుగురు వేర్పాటువాద నేతలను అరెస్ట్‌ చేసింది.

 

2019వరకు ఎన్నికల్లో పోటీ చేయమన్న పవన్..

హైదరాబాద్ : 2019వరకు ఎన్నికల్లో పోటీ చేయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తాము తటస్థంగా ఉంటామని, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరిగాకే ఎన్నికలకు వెళుతామన్నారు. తమ పార్టీ ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, నంద్యాల ఉప ఎన్నికల్లో మద్దతిస్తున్నట్లు వస్తున్న ప్రచారానిన్ నమ్మవద్దని సూచించారు. 

15:26 - August 16, 2017

విజయవాడ : నగరాభివృద్ధి, కృష్ణా పుష్కరాల పేరుతో.. ఏపీ ప్రభుత్వం గతంలో పలు దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసింది. విజయవాడలో దేవుళ్ల విగ్రహాలను తొలగించడం అప్పట్లో పెద్ద దుమారాన్నే లేపింది. ఈ విషయంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే స్థాయికి మాటల తూటాలు పేలాయి. ఆలయాలు కూల్చి ఏడాది గడుస్తున్నా వాటి స్థానంలో దేవాలయాలు నిర్మించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఆలయాలను, విగ్రహాల తొలగింపు
ప్రముఖ ఆలయాలను, విగ్రహాలను గతంలో టీడీపీ ప్రభుత్వం తొలగించింది. ఈ విషయంపై ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వ చర్యను వ్యతిరేకించారు. విజయవాడలో దేవుళ్ల విగ్రహాల కూల్చివేతతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. 
30కి పైగా ఆలయాల కూల్చివేత 
కృష్ణా పుష్కరాల పేరుతో ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు, మంత్రులు, ఎంపీల హడావుడి చర్యలతో ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా పుష్కరాల పేరుతో కృష్ణానదీ తీరంలోని ఆలయాలను ఇష్టం వచ్చినట్టు కూల్చేశారు. విజయవాడలో ఏకంగా 30కి పైగా ఆలయాలను కూల్చివేశారు. 
ప్రముఖ ఆలయాలు నేలమట్టం 
పురాతన దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయం, భూగర్భ వినాయకుడి గుడి, భావాజీ మఠం, సీతమ్మవారి పాదాలు, సాయిబాబాగుడి ఇలా ప్రముఖ ఆలయాలను ప్రభుత్వం నేలమట్టం చేసింది. శనీశ్వరాలయ గర్భగుడిని మాత్రం మిగిల్చింది. అప్పట్లో ఆయా ఆలయాల కమిటీలు, పీఠాధిపతులు, హిందూ పరిరక్షణ సమితి ఆందోళనకు దిగడంతో పుష్కరాలు పూర్తయ్యాక పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పుష్కరాలు ముగిసి ఏడాది కావస్తున్నా ప్రభుత్వం ఆలయాల పునర్నిర్మాణం చేపట్టలేదు. 
నోటీసు ఇవ్వకుండా కూల్చివేత 
సీతమ్మవారి పాదాలు సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చివేశారు. కృష్ణాతీరంలోని ఆలయాలను కూల్చి  ప్రభుత్వం అపచారానికి పాల్పడిందని భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. ఆలయాలు తొలగించే ముందు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకుండానే.. అర్థరాత్రి పొక్లెయినర్లతో కూల్చివేశారు. ఆ సమయంలో విగ్రహాలను శాస్త్రోక్తంగా తొలగిస్తామన్న అర్చకుల విజ్ఞప్తిని సైతం పాలకులు పెడ చెవిన పెట్టారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, అప్పటి కలెక్టర్ బాబు. ఎ, దుర్గగుడి ఈవో ఆజాద్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఆలయాల తొలగింపు ప్రక్రియను ఆగమేఘాల మీద చేశారు. దీనిపై టీడీపీ మిత్ర పక్షమైన బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 
ఆలయాల ధ్వంసంపై వ్యతిరేకత
ఆలయాల ధ్వంసంపై ప్రజలు, ఇతర పార్టీల నుంచే కాకుండా ఆయా పీఠాధిపతులు, స్వామీజీల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రలు సభ్యులుగా ఉన్నారు. కమిటీ అప్పట్లో ఆలయాల పునర్నిర్మాణంపై ఎన్నో హామీలు ఇచ్చింది. హామీలైతే ఇచ్చారు కానీ... వాటి అమలుపై మాత్రం ఇంతవరకు దృష్టిపెట్టలేదు. వెంటనే కూల్చివేసిన ఆలయాలను వెంటనే నిర్మించాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి కోరుతోంది. లేకుంటే  ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తోంది.

 

నంద్యాల ఉప ఎన్నికపై పవన్ ప్రకటన..

విజయవాడ : నంద్యాల ఉప ఎన్నిక విషయంలో జనసేన ఓ నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించిన కీలక ప్రకటనను సినీ నటుడు, ఆ పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ కాసేపట్లో చేయనున్నారు. 

స్వైన్ ప్లూ కేసుల కలకలం..

ఒడిశా : భువనేశ్వర్ లో స్వైన్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. 155 పాజిటవ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు వైద్యులు కూడా ఉన్నట్లు సమాచారం. 

ఛార్జీషీట్లు దాఖలు చేస్తాం - అకున్ సబర్వాల్..

హైదరాబాద్ : సెప్టెంబర్ నెలాఖరు నుండి డిసెంబర్ 15వ తేదీలోగా ఛార్జీషీట్లు దాఖలు చేయడం జరుగుతుందని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. విచారణనను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని, ఐదు జిల్లాల్లో ఇప్పటి వరకు 8వేల కేసులు నమోదయ్యాయన్నారు. గుడుంబా తయారు చేస్తున్న 6900 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆరుగురిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు, వరంగల్ జిల్లాలో 98 శాతం గుడుంబా నియంత్రణలో ఉందన్నారు. 

14:50 - August 16, 2017

టాలీవుడ్ యంగ్ హీరో 'శర్వానంద్' మరోసారి రిస్క్ చేయబోతున్నాడంట. తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ అభిమానులు ఆదరణ చూరగొంటున్నాడు. అగ్ర హీరోల సినిమాల రిలీజ్ టైంలోనే తన సినిమాలను కూడా విడుదల చేస్తున్నాడు. గతంలో 'ఖైదీ నెంబర్ 150', 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాల రిలీజ్ లోనే ఆయన నటించిన 'శతమానం భవతి' చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మంచి టాక్ నే తెచ్చుకుంది.

ఈసారి కూడా అదే ఫీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న 'మహానుభావుడు' సినిమాలో 'శర్వానంద్' నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దసరా బరిలో 'జూ.ఎన్టీఆర్' నటించిన 'జై లవ కుశ'..'మహేష్ బాబు' నటించిన 'స్పైడర్' సినిమాలు కూడా నిలుస్తున్నాయి. ఇంతా భారీ కాంపిటీషన్ లో 'శర్వా' తన సినిమా రిలీజ్ చేస్తుండటంతో మరోసారి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాడు. మరి ఈ రిస్క్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి. 

14:47 - August 16, 2017

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని... నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామంటూ ప్రభుత్వం చెప్తున్నా... అవి కేవలం మాటలకే పరిమితం అవుతున్నాయి. గతుకుల రోడ్లు, ట్రాఫిక్ సమస్యకు తోడు... నగరంలో విద్యుత్‌ వైర్ల పరిస్థితి మరి ఘోరంగా తయారైంది... ఎప్పుడు ఎవరికి షాక్‌ ఇస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.
విద్యుత్ వైర్ల సమస్యతో నగరం
హైదరాబాద్‌లో విద్యుత్‌ వైర్ల సమస్య రోజురోజుకి తీవ్రమవుతుంది. వేసవి కాలంలో అయితే ట్రాన్స్‌ ఫార్మర్లు చిచ్చుబుడ్ల తరహాలో పేలిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి.. ట్రాన్స్‌ఫార్మర్ల నుండి ఒక్కసారిగా మంటలు ఎగసిపడి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అంతే కాకుండా ఎలాంటి రక్షణ లేకుండా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు చూస్తే ప్రజల ప్రాణాలను హరించేలా ఉన్నాయి... అదేవిధంగా విద్యుత్‌ స్తంభాలపై ఉన్న ఇతర కేబుల్స్‌ కూడా అదే స్థాయిలో ప్రమాదకరంగా ఉన్నాయి.. వీటి ద్వారా సిటిజన్స్‌కు ప్రమాదం పొంచి ఉంది. సిటిలో ఈదురు గాలులు వస్తే చాలు ఎక్కడ ఏ స్తంభం నేలకొరుగుతుందో... ఎవరిపై వైర్లు తెగిపడుతాయో  తెలియని పరిస్థితి ఉంది.
హైటెన్షన్‌ వైర్ల కింద బస్తీలను తొలగించాలని నిర్ణయం
ఇక గ్రేటర్‌ పరిధిలో ఉన్న విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం డిప్యూటి సీఎం మహమూద్‌ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటినీ ఏర్పాటు చేసింది. ఇప్పటికి కమిటీ వేసి రెండేళ్లు పూర్తి అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పురాలేదు. ప్రధానంగా సిటిలో ఉన్న హైటెన్షన్‌ వైర్లు ఇళ్లపై నుండి ఉండటంతో వాటిని మార్చాలని ... అలా వీలు కాని పక్షంలో వైర్ల కింద ఉన్న ఇళ్లను తొలగించాలని కమిటీ సూచించింది. నగరంలో ఉన్న హైటెన్షన్‌ వైర్లలో ఎక్కువగా బస్తీలపై నుండి ఉన్నాయి. ఏ మాత్రం ప్రమాదం సంభవించినా పెద్ద ఎత్తున ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
అమలుకు నోచుకోని నిర్ణయాలు 
అయితే నగరంలో పూర్తి స్థాయిలో అండర్‌ గ్రౌండ్‌ ఎలక్ట్రికల్‌  కేబుల్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. కానీ ఆ ప్రణాళికలు అమలుకు నోచుకోవడం లేదు. కొన్ని మార్గాల్లో పనులు ప్రారంభించినా చాలా ప్రాంతాల్లో పనుల్లో వేగం మందగించింది. అంతే కాకుండా డిప్యూటి సీఎం కమిటీ ఇచ్చిన సూచనలు కూడా అమలుకు నోచుకోకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలొస్తున్నాయి. ఇప్పటికైనా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద రక్షణ గురించి.. స్తంభాలపై ఉన్న వైర్లతో జరిగే ప్రమాదాలపై.. విద్యుత్‌ శాఖ అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే పెనువిపత్తు తలెత్తే అవకాశాలు లేకపోలేదు.

 

14:43 - August 16, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరిలో దాదాపు ఆరెకరాల విస్తీర్ణంలో ఈ భవనం నిర్మించారు... ఇకనుంచి డీజీపీ కార్యాలయం పరిధిలోని అన్ని విభాగాల అధిపతులు ఇక్కడినుంచే కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, డీజీపీ సాంబ‌శివ‌రావు, పోలీసు ఉన్నతాధికారులు పాల్లొన్నారు. 

 

రోహిత్ వేముల ఆత్మహత్యపై నివేదిక..

ఢిల్లీ : రోహిత్ వేముల ఆత్మహత్యపై అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే రూపన్ వాల్ నివేదిక సమర్పించారు. హెచ్ ఆర్డీ మంత్రిత్వ శాఖకు ఈ నివేదిక అందించారు. హెచ్ సీయూ చర్యల వల్ల ఆత్మహత్య చేసుకోలేదని, వ్యక్తిగత కారణాలు, అసంతృప్తితోనే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రోహిత్ సూసైడ్ నోట్ ఆధారంగా ఏకే రూపన్ నివేదిక రూపొందించారు. 

బోయిన్ పల్లిలో పోలీసుల తనిఖీలు..

సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 12 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఆధునాతన సాఫ్ట్ వేర్ పై మంత్రి లోకేష్ చర్చ..

విజయవాడ : ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్..కమ్యూనికేషన్స్ అధికారుఅలతో మంత్రి లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈ - ప్రగతి రూపొందించిన ఆధునాతన సాఫ్ట్ వేర్ పై చర్చ జరిగింది. ప్రభుత్వ రుణమార్పిడి విధానంపై ఆధునాతన సాఫ్ట్ వేర్ ఈ - ప్రగతి రూపొందించింది. ఈ ప్రగతి కోర్ ఫ్లాట్ ఫార్మ్ ను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. 

విద్యుత్ భవన్ లో ఏసీబీ..

కర్నూలు : విద్యుత్ భవన్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ. 6 వేలు లంచం తీసుకుంటున్న లైన్ ఇన్ స్పెక్టర్ ప్రభాకర్ ఏసీబీకి చిక్కాడు. 

అమ్మవారి ఉత్సవ విగ్రహ తరలింపుపై పోలీసుల విచారణ..

నిర్మల్ : బాసర అమ్మవారి ఉత్సవ విగ్రహం ఆచూకీపై సస్పెన్ష్ ఇంకా కొనసాగుతోంది. స్టోర్ ఇన్ ఛార్జీ సుశీల స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. విగ్రహ తరలింపుపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. ఇప్పటికే ఇద్దరు పూజారులపై సస్పెన్షన్ వేటు వేశారు. 

13:31 - August 16, 2017

విజయవాడ : విద్యుత్‌ కార్మికులు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్‌ చేశారు. విజయవాడలో రైల్వేస్టేషన్‌ నుంచి అలంకార్‌ ధర్నా చౌక్‌ వరకు వందలాది మంది కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనకు సిఐటియు రాష్ట్ర నాయకులు ఎమ్‌డి గఫూర్‌ హాజరై తమ మద్దతు తెలిపారు. విద్యుత్‌ రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో.. ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:30 - August 16, 2017

మేడ్చల్ : మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తామని... మంత్రి కేటీఆర్ తెలిపారు.. ప్రజలపై ఎలాంటి భారం పడకుండానే ఈ పనులు చేపడుతున్నామని ప్రకటించారు.. కొంపల్లిలో మిషన్‌ భగీరథ పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.. ఈ ప్రాజెక్టుద్వారా అవుటర్‌ రింగ్‌ రోడ్‌ గ్రామాలకు తాగునీరు అందనుంది.. లక్షా 50వేల కుటుంబాలు లబ్ది పొందనున్నారు.. 628 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు.. ఏడాదిలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

13:27 - August 16, 2017

నిర్మల్ : జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రికి వాణిజ్యపరంగా 13 దుకాణాలు ఉన్నాయి. బస్‌స్టాండ్‌కు సమీపంలో ఉండటంతో వాటి మధ్య తీవ్ర పోటి నెలకొంటుంది. 1997లో టెండర్లు నిర్వహించిన తరువాత... మళ్లీ వాటికి టెండర్లు చేపట్టలేదు. అప్పట్లో నిర్ణయించిన అద్దెనే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. దీంతో ఆసుపత్రి ఆదాయానికి భారీగా గండి పడుతోంది. టెండర్లు దక్కించుకున్న దుకాణదారులకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వీటి కోసం ప్రతి మూడేళ్లకు ఓసారి టెండర్లు నిర్వహించి అద్దె పెంచుతారు. నెలనెల అద్దె చెల్లించని పక్షంలో 18శాతం వడ్డీ చెల్లించాలని అలాగే వేలం పాటలో పాల్గొన్న వ్యక్తే అక్కడ వ్యాపారం చేసుకోవాలని నిబంధన ఉంది. అయితే 2వేల 500 నుండి 5వేల అద్దెకు దుకాణాలు దక్కించుకుని... ఎక్కువ ధరకు బయటి వ్యక్తులకు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు కొంతమంది. ఒక్కో దుకాణానికి నెలకు 12 వేల నుండి 15 వేలు వసూలు చేస్తున్నారని సమాచారం. ఇవన్ని తెలిసినా అధికారులు వారిపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

2 కోట్ల 16 లక్షల అద్దె
అయితే ఇప్పటికీ అద్దెదారులు నెలనెల అద్దె కూడా చెల్లించడం లేదని తెలుస్తోంది. దీంతో 2 కోట్ల 16 లక్షల రూపాయలు అద్దె బాకీ ఆసుపత్రికి రావాల్సి ఉంది. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు లోపాయికార ఒప్పందాలు చేసుకొని... టెండర్‌లు నిర్వహించకుండా చేస్తున్నారని స్థానికులు, విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి.. ఆసుపత్రి ఆదాయానికి గండి కొడుతున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని... ఆసుపత్రి అభివృద్ధికి దోహదపడాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

హైదరాబాద్ కలెక్టర్ గా..

హైదరాబాద్ : కలెక్టర్ గా యోగితా రాణను నియమిమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం యోగితా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. 

రెస్క్యూ బోటులో ప్రసవం..

బీహార్ : ఓ గ‌ర్భిణి రెస్క్యూ బోటు లోనే పురుడు పోసుకుంది. గత కొన్ని రోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మ‌ధుబ‌ని జిల్లాలోనూ వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టించాయి. అక్క‌డ నీటిలో చిక్కుకున్న ఓ గర్భిణీని రక్షించి బోటులో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ బోటులోనే ప్రసవమైంది. 

10 లక్షల మందికి మంచినీరు -కేటీఆర్..

హైదరాబాద్ : ఏడాదిలోపు ఓఆర్ఆర్ ప‌రిధిలోని గ్రామాలన్నింటికీ అంటే దాదాపు 10 ల‌క్ష‌ల మందికి మంచినీరు అందుతుంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొంప‌ల్లి ద‌గ్గ‌ర మిష‌న్ భ‌గీర‌థ పైప్ లైన్ ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. రూ. 628 కోట్ల‌తో ఈ ప్రాజెక్టు ప‌నులు చేప‌ట్టామ‌ని, గ్రామాల్లోనూ ప్ర‌తి మ‌నిషికి ప్ర‌తి రోజు 135 లీట‌ర్ల సుర‌క్షిత మంచినీరు అందిస్తామన్నారు. 

సీఎం యోగి ఏరియల్ సర్వే..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలోని వరద ప్రాంతాల పరిస్థితిని సీఎం యోగి ఆదిత్య నాథ్ సమీక్షిస్తున్నారు. బుధవారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. 

పోలీసు హెడ్ క్వార్టర్స్ ప్రారంభం..

విజయవాడ : మంగళగిరిలో ఏపీ ఎస్పీ బెటాలియన్ లో పోలీసు హెడ్ క్వార్టర్స్ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మంత్రులు చిన్న రాజప్ప, నక్కా ఆనంద బాబు పాల్గొన్నారు. భవనం వివరాలపై డీజీపీ ప్రజెంటేషన్ ఇచ్చారు. 

కొంపల్లి వద్ద మిషన్ భగీరథ పనులు..

హైదరాబాద్ : కొంపల్లి సినీ ప్లానెట్ వద్ద మిషన్ భగీరథ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న 183 గ్రామాలు, 7 మున్సిపాల్టీలకు రూ. 628 కోట్లతో ప్రభుత్వం మంచినీటి వసతి కల్పించనుంది. ఈ పథకం ద్వారా 1.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 

12:38 - August 16, 2017

గుంటూరు : అధికారులు సకాలంలో స్పందించడం వల్ల బోరుబావి నుంచి బాలుడు సురక్షితంగా బయటకొచ్చాడని..... ఏపీ మంత్రి కామినేని అన్నారు.. ఏపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బోరుబావి ఘటన ఇదే మొదటిదని చెప్పారు.. రాష్ట్రంలో ఎక్కడా బోరుబావులు తెరిచి వుండకుండా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.. బాలుడు కోలుకుంటున్నాడని... ప్రాణాపాయం లేదని తెలిపారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని మంత్రి పరామర్శించారు... బాలుడికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. 

12:37 - August 16, 2017

కర్నూలు : టీడీపీతోనే నంద్యాల అభివృద్ధి సాధ్యమని.... ఆ పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.. ఈ ఎన్నిక న్యాయానికి, అవినీతికి జరుగుతున్న యుద్ధమని... ఓటు తూటాతో వైసీపీకి బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు.. నంద్యాలలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా బాలయ్య బాబు ప్రచారం చేస్తున్నారు.. నంద్యాల మండలం వెంకటేశ్వరపురంలో బాలయ్య రోడ్‌ షో నిర్వహించారు.

12:23 - August 16, 2017
12:21 - August 16, 2017

హైదరాబాద్ : నేరెళ్ల ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎంజీఎం వైద్యులు నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించారు. బాధితులకు తీవ్రగాయాలైనట్లు నివేదికలో వైద్యులు వెల్లడించారు. కోర్టు అందరికి ఒకే చోట తీవ్రగాయాలు ఎలా జరిగాయని అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. ఈ కేసులో ఎస్ఐ రవీంద్రను సస్పెండ్ చేశామని అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కోర్టు తెలిపారు. ఎస్ఐ సస్పెన్షన్ పై పూర్తి నివేదిక ఇవ్వాలని కరీంనగర్ డీఐజీకి కోర్టు ఆదేశించింది. కరీంనగర్ ఆసుపత్రి సూరింటెండెంట్ ను బాధితుల మెడికల్ రిపోర్ట్ ను రెండో వారాల్లో సమర్పించాలని హై కోర్టు ఆదేశించింది. ఈ కేసును హై కోర్టు రెండు వారాలు వాయిదా వేసింది.

12:20 - August 16, 2017

హైదరాబాద్ : నగరంలోని మెహదీపట్నంలో గోడకూలి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. భవన నిర్మాణ పనులు చేస్తుండగా సరిగా బేస్ మిట్ లేని గోడ కూలినట్టు తెలుస్తోంది. మృతుల్లో ఒకరు మహబూబ్ నగర్ చెందినవారు. మరొకరు ముంబైకి చెందినవారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

పెట్టుబడులొస్తున్నాయి - బాబు..

విజయవాడ : రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెంలో ఇండో - యూకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ హెల్త్ సిటీకి బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రానికి 20 మెడికల్‌ కాలేజీలు రాబోతున్నాయని, ఏపీని హెల్త్‌ హబ్‌గా మారుస్తామన్నారు. యూకే ఆసుపత్రికి 200 ఏళ్ల చరిత్ర ఉందని, విద్యాసంస్థల ఏర్పాటుకు ఇప్పటికే ఒప్పందాలు జరిగాయన్నారు. 

నేరేళ్ల..హైకోర్టుకు ఎంజీఎం వైద్యుల నివేదిక..

హైదరాబాద్ : నేరేళ్ల ఘటనపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎంజీఎం వైద్యుల నివేదికను సీల్డ్ కవర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. బాధితులకు తీవ్రగాయాలైనట్లు నివేదికలో వెల్లడించింది. అందరికీ ఒకేచోట తీవ్రగాయాలు ఎలా జరిగాయని కోర్టు ప్రశ్నించింది. ఎస్ఐ రవీంద్ర ను సస్పెండ్ చేశామని హైకోర్టుకు ప్రభుత్వ అడ్వకేట్ రామచంద్రరావు పేర్కొన్నారు. ఎస్ఐ సస్పెన్షన్ పై పూర్తి నివేదిక ఇవ్వాలని కరీంనగర్ డీఐజీకి ఆదేశాలు జారీ చేసింది. బాధితుల మెడికల్ రిపోర్టు ను సమర్పించాలని, కరీంనగర్ సూపరింటెండెంట్ రెండు వారాల్లో సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది.

12:04 - August 16, 2017

హైదరాబాద్ : ఓమన్‌ దేశం నుంచి గల్ఫ్‌ కార్మికులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఓమన్ పెట్రోస్‌ గల్ఫ్‌ కంపెనీలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన దాదాపు 400 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఈ కార్మికులకు గత 6 నెలల నుంచి యాజమాన్యం వేతనాలు ఇవ్వకపోడంతో.. తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. వీరికి కంపెనీ నుండి ఒక్కొక్క కార్మికునికి 4 లక్షల జీతాలు రావలసి ఉంది. ఓమన్‌లో ఇబ్బందులు ఎదురుకుంటున్న కార్మికులు భారత దేశ రాయబార సంస్థకు మొర పెట్టుకున్నారు. తెలంగాణ గల్ఫ్ వర్కర్స్‌ అసోసియేషన్‌ కల్పించుకొని వీరికి ఉచితంగా విమాన టికెట్‌లు ఇప్పించి స్వదేశానికి తీసుకువచ్చారు. గల్ఫ్‌ దేశంలో మోసపోయి వచ్చిన ఈ కార్మికులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ఉపాధి కల్పించాలని కోరారు. 

12:03 - August 16, 2017

తూర్పు గోదావరి : కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోసారి పాదయాత్రకు ప్రయత్నించారు.. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన ఇంటినుంచి బయటకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు.. పాదయాత్రకు అనుమతిలేదని స్పష్టం చేశారు.. పోలీసులతో ముద్రగడ అనుచరులు వాగ్వాదానికి దిగారు.. ఎన్నిరోజులు తమ ఉద్యమాన్ని ఇలా అడ్డుకుంటారని ప్రశ్నించారు.

కేరళలో లవ్ జిహాద్ ఘటనపై సుప్రీం ఆదేశాలు...

ఢిల్లీ : కేరళలో లవ్ జిహాద్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మత మార్పిడిలు, వివాహాలపై దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

11:57 - August 16, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 'కాటమరాయుడు' సినిమా డిజాస్టర్ అనంతరం 'పవన్' నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. 'పవన్' ఈ సినిమాలో ఇంజినీర్ గా కనిపించనున్నాడని టాక్. సినిమాకు సంబంధించిన టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదనే విషయం తెలిసిందే. పవన్ సరసన కీర్తి సురేష్..అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తేదీని ఖరారు చేసినట్లు టాక్. చిత్ర ఫస్ట్ లుక్ ను సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక చిత్రం విడుదలకాకముందే రూ. 150 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు ఇన్ని కోట్లు రాబట్టిన తొలి తెలుగు చిత్రం 'బాహుబలి' రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత రికార్డు పవన్ కళ్యాణ్ దేనని టాలీవుడ్ టాక్. ఈ సినిమాకు సంబంధించిన తదితర వివరాలు చిత్ర బృందం త్వరలోనే తెలియచేయనున్నట్లు తెలుస్తోంది. 

11:51 - August 16, 2017

కొత్తగూడెం : జిల్లా పాల్వంచ మండలం నర్సంపేటలో దారుణం జరిగింది. రాయల భాస్కర్ అనే వ్యక్తి హత్యకు గురైయ్యాడు. అతన్ని న్యూడెమోక్రసీ రవి దళసభ్యులు హత్య చేసినట్లు ప్రచారం జరుగుతుంది. భూమి విషయంలో హత్య జరినట్టు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

183 గ్రామాలకు రూ. 628 కోట్లతో ప్రాజెక్టు..

మేడ్చల్ : ఓఆర్ఆర్ లోని గ్రామాలకు తాగునీటిని అందించే ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 183 గ్రామాలకు రూ. 628 కోట్లతో తాగునీటిని అందించే పథకానికి శ్రీకారం చుట్టినట్లైంది. ఈ పథకం ద్వారా 1.50లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఏడాదిలో ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన..

విజయవాడ : విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని, న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రైల్వే స్టేషన్ నుండి ధర్నా చౌక్ వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు గఫూర్ పాల్గొన్నారు. 

అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు..

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూమి పూజ జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెంలో ఇండో - యూకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ హెల్త్ సిటీకి ఆ సంస్థ సీఈవో అజయ్ రాజన్ గుప్తా కుటుంబసభ్యులతో కలిసి భూమి పూజ చేశారు. 

11:16 - August 16, 2017

'బాహుబలి'..'బాహుబలి-2' సినిమాల అనంతరం 'ప్రభాస్' నటిస్తున్న న్యూ ఫిల్మ్ 'సాహో' చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. చిత్రం షూటింగ్ ప్రారంభం కాకముందే చిత్ర టీజర్ విడుదలయిన సంగతి తెలిసిందే. కానీ సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రం బయటకు పొక్కడం లేదు. 'ప్రభాస్' సరసన హీరోయిన్ ఎవరు నటిస్తారనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. 

'ప్రభాస్' సరసన నయనతార, అనుష్క, కాజల్ నటిస్తారని, బాలీవుడ్ హీరోయిన్స్ లను ఎంపిక చేస్తారని టాక్ వినిపించింది. దీనికంతటికీ ఫుల్ స్టాప్ పడింది. 'సాహో' లో హీరోయిన్ గా 'శ్రద్ధాకపూర్' నటించబోతోంది. 'ఆషికి-2'తో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి పేరే తెచ్చుకుంది. ఆమె తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం 'సాహో' కావడం విశేషం.

సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చిత్రం నిర్మితమౌతోంది. ఈ చిత్రం కోసం అంతర్జాతీయ నిపుణులు పనిచేస్తున్నట్లు టాక్. యాక్షన్ కి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ స్టైలిష్ గా ఇదివరకటి కంటే భిన్నంగా తెరపై కనిపించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. 

నర్సంపేటలో వ్యక్తి హత్య..

భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచ (మం) నర్సంపేటలో రాయల భాస్కర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. న్యూ డెమోక్రసీ రవి దళ సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగానికి సెన్సార్..

ఢిల్లీ : త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని సెన్సార్ చేయడాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో ఖండించింది. మాణిక్ సర్కార్ ప్రసంగం ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లో ప్రసారం కాకుండా కేంద్రం అడ్డుకొంది. సీఎం ప్రసంగాన్ని రికార్డు చేయగా దానిని యథాతథంగా ప్రసారం చేయలేమని మార్పులు చేయాలని ప్రసార భారతి సమాచారం ఇచ్చింది. సీఎం సందేశాన్ని అడ్డుకోవడం హక్కుల ఉల్లంఘన అని పొలిట్ బ్యూరో పేర్కొంది. సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

వైసీపీకి బుద్ధి చెప్పాలి - బాలకృష్ణ..

కర్నూలు : నంద్యాల (మం) వెంకటేశ్వరపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రోడ్ షో నిర్వహిస్తున్నారు. టిడిపితోనే అభివృద్ధి సాధ్యమని, ఓటు తూటాతో వైసీపీకి బుద్ధి చెప్పాలని సూచించారు. 

10:58 - August 16, 2017

టాలీవుడ్ మన్మథుడు 'నాగ చైతన్య' జోరు పెంచేస్తున్నాడు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకెళుతున్నాడు. ఆయన నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా విజయవంతం కావడంతో ఏ దర్శకుడి సినిమాలో నటిస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారాహి చలన చిత్రం పతాకంపై కృష్ణ ఆర్.వి.మారి దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మిస్తున్న 'యుద్ధం శరణం గచ్చామి' చిత్రంలో చైతూ నటిస్తున్నాడు. 'లావణ్య త్రిపాఠి' హీరోయిన్ గా సీనియర్ నటి 'రేవతి' కీలక పాత్రలో శ్రీకాంత్ ప్ర‌తినాయ‌క పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాలో 'నాగ చైతన్య' నటించబోతున్నాడు. దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'ప్రేమమ్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'సవ్యసాచి' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. చిత్ర టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. రెండు బలమైన చేతులు పదునైన ఆయుధాలను ధరించివున్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. రెండు చేతులతో బాణాలు సమర్ధవంతంగా వేసే అర్జునుడిని.. 'సవ్వసాచి' అని పిలుస్తారు. చీకట్లో సైతం గురితప్పక బాణాన్ని సంధించే ఆయనకి 'సవ్యసాచి' అనే బిరుదు ఉంది. ఈ సినిమాలో కూడా ఏదో డిఫరెంట్ పాయింట్ డీల్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదేదో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా అని టాక్. 

రిమోట్ ద్వారా శిలాఫలకం ఆవిష్కరణ..

విజయవాడ : ఎర్రబాలెంలో ఇండో - యూకే హెల్త్ మెడిసిటీ శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. వెన్యూ కన్వెన్షన్ నుండి రిమోట్ ద్వారా శిలాఫలకాన్ని బాబు ఆవిష్కరించనున్నారు. 

పాక్ మళ్లీ కాల్పులు..

ఢిల్లీ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ పదే పదే ఉల్లంఘిస్తోంది. పూంచ్ సెక్టార్ లో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పులను భారత్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టింది. 

మళ్లీ ముద్రగడ పాదయాత్ర..అడ్డుకున్న పోలీసులు..

తూర్పుగోదావరి : ముద్రగడ పాదయాత్రను పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా కాపులు నినాదాలు చేశారు. 

10:24 - August 16, 2017
10:14 - August 16, 2017

గుంటూరు : బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడిని.. అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. చంద్రశేఖర్‌ మృత్యుంజయుడిగా బయటికి రావడంతో తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయారు. 11 గంటలకు పైగా జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌కు సత్ఫలితం రావడంతో.. స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా, వినుకొండ మండలంలోని ఉమ్మడివరానికి చెందిన అనూష మంగళవారం సాయంత్రం.. పశుగ్రాసం కోసం వెళ్తూ తన రెండేళ్ల బాబుని వెంట తీసుకెళ్లింది. పిల్లాడిని పశువుల కొట్టంలో వదిలి.. తాను పొలంలోకి వెళ్లింది. ఇంతలో చంద్రశేఖర్ ఆడుకుంటూ వెళ్లి.. తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయాడు. చంద్రశేఖర్ గట్టిగా కేకలు వేయడంతో.. తల్లి అనూష అప్రమత్తమైంది.. అయితే అప్పటికే చిన్నారి బోరుబావిలోకి జారిపోయాడు..

13 అడుగుల లోతులో బాలుడు
వెంటనే బాలుడు బోరు బావిలోపడిపోయిన విషయాన్ని అనూష గ్రామంలో తెలియజేసింది.. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. లోపల ఉన్న బాలుడికి ఆక్సిజన్ అందించారు. బోరు బావిలో 13 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.. ప్రొక్లయిన్ల సహాయంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు. వర్షంలోనూ ఆయా శాఖల సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగించారు. ఆధునిక పరికరాలను ఉపయోగించి.. బోరుబావిలో ఉన్న బాలుడి కదలికలను గమనిస్తూ వచ్చారు. తెల్లవారుజామున 2 గంటల 40 నిమిషాలకు బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. బోరు బావికి సమాంతరంగా 20 అడుగుల లోతులో మరో గొయ్యి తవ్వి.. బాలుడిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం బయటకు తీసింది. చంద్రశేఖర్ మృత్యుంజయుడిగా బయటకు రావడంతో అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఏదేమైనా నోరు తెరిచిన బోరు బావికి చంద్రశేఖర్‌ బలి కాకుండా.. సురక్షితంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

10:13 - August 16, 2017

కర్నూలు : జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది. ఈ రోజు హీరో, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నంద్యాలలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. బాలయ్య పోటీగా రోజా కూడా ప్రచారానికి దిగనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

జమ్మూకాశ్మీర్ లో ఎన్ఐఏ తనిఖీలు

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్, బారాముల్లా హంద్వారాలో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. ఉగ్రవాదుల నిధుల వ్యవహారంపై 12 ప్రాంతాల్లో ఎన్ ఐఏ తనిఖీలు నిర్విహించినట్టు తెలుస్తోంది.

09:54 - August 16, 2017

హైదరాబాద్ : యూత్‌ కాంగ్రెస్‌ నేతలు నో డ్రగ్స్‌ అని అవగాహన కల్పిస్తూ.. క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. డ్రగ్స్‌ తీసుకోవడం మాని స్పోర్ట్స్‌ పై దృష్టి పెట్టాలని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ కార్ఖాన ప్లే గ్రౌండ్‌లో ఎన్‌ఎన్‌యుఐ ఆధ్వర్యంలో.. యువతకు క్రికెట్ పోటీలను నిర్వహించారు. జంట నగరాల్లోని క్రీడాకారులు ఇందులో పాల్గొనగా.. రెండు రోజుల పాటు పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన నేతలు వారికి బహుమతులను ప్రధానం చేశారు. తెలంగాణ యువత డ్రగ్స్‌పై దృష్టి పెట్టకుండా.. యువ నేతలు చేస్తున్న ప్రయత్నాన్ని అతిధులు అభినందించారు. 

09:52 - August 16, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో మళయాళీలు ఓనం ఉత్సవాలు జరుపుకుంటున్నారు.. సంప్రదాయ దుస్తుల్లో ఉత్సవాలకు వచ్చిన మళయాళీలు... ఆట పాటలతో సందడిగా గడిపారు.. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.. కేరళ సంప్రదాయ వంటలతో సహపంక్తి భోజనాలు చేశారు.

09:51 - August 16, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు చికెన్‌గున్యా, డెంగ్యూ, స్వైన్‌ ఫ్లూ లాంటి విష జ్వరాలు సోకడంతో ఇప్పటికే అనేక మంది రోగులు ఆస్పత్రి పాలవుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు విషజ్వరాల బారినపడి అవస్థలు పడుతున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలడంతో ప్రైవేటు , ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. కొన్ని ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులకు గురవతున్నారు. క్యూలైన్లు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో..జ్వర పీడితులు అసహనం చెందుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం
అటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. హైదరాబాద్‌లో సీజనల్‌ జ్వరాలు ప్రబలడంతో.. ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులు క్యూకడుతున్నారు. కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని రోగాల బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఏకొద్దిపాటి జలుబు, దగ్గు అనిపించినా చిన్న పిల్లల్ని వైద్యులకు చూపించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. వర్షాలు జోరుగా పడుతుండటంతో దోమలు విజృభిస్తున్నాయి. జనం రోగాలభారిన పడి విలవిల్లాడుతున్నారు. బల్దియా అధికారులు స్పందించి..పారిశుద్ధ్యకార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దోమల నివారణకు పాగింగ్‌ చర్యలు విస్తృతంగా చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.  

09:49 - August 16, 2017

హైదరాబాద్ : సర్కార్‌ బడుల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పంచాజెండా ఊపింది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారిగా డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. టీచర్ పోస్టులను పెంచాల్సిందేనని ముఖ్యమంత్రి కేసిఆర్ పాఠశాల విద్యాశాఖను ఆదేశించడంతో అధికారులు నోటిఫికేషన్ పై కసరత్తు మొదలుపెట్టారు. ఉపాధ్యాయ ఖాళీల సంఖ్యపై ప్రాథమికంగా ప్రభుత్వం అవగాహనకు రావడంతో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 2015 వరకు ఉన్న 8వేల 972 ఖాళీలు భర్తీ చేయడానికి సర్కార్‌ సన్నద్ధమవుతోంది. 2016 నుంచి ఇప్పటి వరకు ఏర్పడిన ఖాళీలతో మరో డీఎస్సీ చేపట్టాలని భావిస్తున్నారు. అయితే పాతజిల్లాలు, కొత్త జిల్లాలకు సంబంధించిన అంశంపై న్యాయస్థానాల్లో చిక్కులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు విద్యాశాఖ మంత్రి కడియం సూచించారు. టీచర్‌ పోస్టులు మరీ తక్కువగా ఉండటంతో.. ఖాళీ పోస్టులపై పూర్తి వివరాలతో రావాల్సిందిగా కడియం అధికారులను ఆదేశించారు.

రెండు సార్లు డీఎస్సీ
5 ఏళ్లుగా డీఎస్సీ నిర్వహించకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ సర్కార్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచింది. డీఎస్సీపై ప్రభుత్వం పలు ప్రకటనలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో సర్కార్‌పై నిరుద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కేసీఆర్‌ సర్కార్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిరుద్యోగుల్లో నెలకొన్న వ్యతిరేకత నుంచి బయటపడేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఒకేసారి మెగా డీఎస్సీ నిర్వహించాలా. లేక వెంటవెంటనే రెండు డీఎస్సీలు వేయాలా అన్నదానిపై తర్జన భర్జన పడింది. చివరికి రెండు డీఎస్సీలు వేయడంవైపే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈనెల 17న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో జరిగే సమావేశంలో దీనిపై క్లారిటీ రానుంది.

09:48 - August 16, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక పోరు కాక పుట్టిస్తోంది. టీడీపీ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన సందర్బంగా.. ఈ ఎన్నిక ఫలితం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు ఒకే ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల జాతకాలు మారిపోతాయా..? నేతల నాయకత్వాలపై ప్రజలు ఓ అభిప్రాయానికి వచ్చేస్తారా..? ఇప్పుడివే ప్రశ్నలు ఏపీ పొలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. 2014 ఎన్నికల ఫలితాల్లో అధికార టీడీపీకి ప్రతిపక్ష వైసీపీ మధ్య ఓట్ల తేడా 2 శాతం లోపే.. టీడీపీకి వచ్చిన మొత్తం ఓట్లతో పోల్చితే వైసీపీకి తగ్గినవి కేవలం 5 లక్షలే.. టీడీపీ మెజార్టీ సీట్లు గెలుచుకొని అధికారం చేజిక్కుంచుకొంది... ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ 67 సీట్లు సాధించినా.. ఆ తర్వాత 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి జై కొట్టేశారు... అలా పార్టీ మారిన వారిలో భూమా అండ్ ఫ్యామిలీ కూడా ఉన్నారు.. అయితే ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా ప్రజలు తమ వైపే ఉన్నారనే సంకేతాలు పంపడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీంతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించి పార్టీ క్యాడర్‌లో నూతన ఉత్తేజం నింపాలని తహతహలాడుతోంది. ముఖ్యంగా వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి వ్యక్తిగత ఇమేజ్ ఉందని.. దీనికి ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే విజయం తమదేనన్నది వైసీపీ అంచనా..ఈ విజయం ద్వారా చంద్రబాబును మానసికంగా దెబ్బకొట్టాలనేది ఆ పార్టీ వ్యూహాంగా కనిపిస్తోంది.

జగన్ 12 రోజులు ప్రచారం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 9 నుంచి నంద్యాలలో మకాం వేశారు. ఈ నెల 21 వరకు అంటే 12 రోజులు ప్రచారం నిర్వహించనున్నారు. దాదాపు వైసీపీ అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నంద్యాలలోనే ఉన్నారు. ఇక టీడీపీ విషయానికోస్తే.. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇప్పటికే రెండు సార్లు నంద్యాల వచ్చి వెళ్లారు.. ఈ నెల 17 నుంచి 21 వరకు ఐదు రోజులు ఇక్కడే మకాం వేయనున్నారు.. అలాగే సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ మూడు రోజుల పాటు రోడ్ షో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏడుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు , అగ్రనేతలు నంద్యాల ప్రచారంలో తలమునకలయ్యారు. వైసీపీ నుంచి నువ్వా నేనా అన్న పోటీ మాత్రం ఉందని టీడీపీ వర్గాలు ఒప్పుకుంటున్నాయి..అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చనే భావన తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది.

తొందర పాటే
అయితే వైసీపీ గెలిస్తే మరింత దూకుడు పెంచుతారని..ఈ పరిణామాలు టీడీపీకి ఇబ్బందేనని మరికొందరు టీడీపీ నేతలంటున్నారు.. మరోవైపు 2019 ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్ అనే వాదన మాత్రం టీడీపీ నేతలు తోసిపుచ్చుతున్నారట. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే.. మానసికంగా చంద్రబాబుపై జగన్ ది పై చేయి అవుతుందన్నది పొలిటికల్‌ విశ్లేషకుల టాక్‌. ఈ ఒక్క ఫలితంతో ప్రజలు తమవైపు ఉన్నారన్న ప్రచారానికి జగన్‌ మరింత పదును పెట్టోచ్చని భావిస్తున్నారు. ఒక వేళ టిడీపీ ఓడినా.. ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం లేకపోయినా..జనంలో కొత్త ఆలోచనకు ఈ ఫలితం నాంది పలికే అవకాశముంది. అయితే కేవలం ఒక్క ఎన్నిక ఫలితం 2019 ఎన్నికలనే శాసిస్తుందనడం తొందర పాటే అనేవారు లేకపోలేదు. 

బాలకృష్ణకు పోటీగా రోజా

కర్నూలు : జిల్లా నంద్యాల్లో బాలకృష్ణ ప్రచారానికి పోటీగా వైసీపీ నుంచి రోజు ప్రచారం చేయనున్నారు. ఆమె నంద్యాల రూరల్, గోప్పాడు మండలాల్లో ప్రచారం చేయబోతున్నారు.

నామినేషన్ల ఉపసంహరణకు నేడే చివరి రోజు

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు కావడంతో పోటీలో ఎంత మంది మిగులుతారో చూడాలి. ఎన్నికలు ఈ నెల 29న, సెప్టెంబర్ 1న ఫలితాలు విడుదల కానున్నాయి.

నేడు హెల్త్ మెడిసిటీకి చంద్రబాబు శంకుస్థాపన

గుంటూరు : నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇండో యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెడిసిటీకి ఉదయం 11గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.

సమ్మె బాటలో ఏపీ విద్యుత్ కార్మికులు

విజయవాడ : ఏపీ విద్యుత్ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. నేడు విజయవాడలో విద్యుత్ కాంట్రాఖ్ట కార్మికుల భారీ ప్రదర్శన అనంతరం వారు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.

గుంటూరులో రోడ్డు ప్రమాదం

గుంటూరు : జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామం దగ్గర ఆగివున్న లారీని టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది వల్లే బాలుడు సురక్షితం

గుంటూరు : ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సంయుక్త కృషి వల్లే బాలుడు సురక్షితంగా బయటపడ్డాడడని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు.

07:39 - August 16, 2017

ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూస్తామని, దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఒక దళితుడిగా పుట్టాలని ఎవరు అనుకుంటరని ఆదినారాయణ రెడ్డి అనడం దురదృష్టకరమని, టీడీపీ దళితులను అవమానించిందని వైసీపీ నేత పద్మజ రెడ్డి అన్నారు. బీరు ను హెల్త్ డ్రింక్ అని మంత్రి చెబుతున్నారని ఆమె అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆదినారాయణ రెడ్డి చేసిన లేక ఎవర్ చేసిన ఖండించాల్సిన అవసరం ఉంటుందని, ఆది నారాయణ రెడ్డి మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఆయన క్షమాపణ చెప్పారని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:38 - August 16, 2017
07:36 - August 16, 2017

పాట అనేది లక్ష్యం కోసం ఎంచుకున్నాను. సమాజంలో అసమానతలను, ప్రజల సమస్యలపై పోరాటని ఉపయోగపడతాయని, కవి నవరసలను కల్గి ఉంటాడు. సంతోషానికి, దుఃఖనికి అతితంగా ఉంటుందని ప్రముఖ కవి జయరాజ్ అన్నారు. ఆయన టెన్ టివి జనపథంలో పాల్గొన్నారు. ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వీడియో క్లిక్ చేయండి. 

07:35 - August 16, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర్య సమరంలో ప్రాణాలర్పించిన మహనీయులను అందరూ స్మరించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. 125 కోట్ల మంది భారతీయులందరూ ఒక్కటైతే.. సంకల్పంతో ఏదైనా సాధించగలమని ప్రధాని అన్నారు. 21వ శతాబ్దంలో జన్మించిన నవ యువకులకు ఈ జనవరి 1 కొత్త అవకాశాన్ని ఇస్తోందని మోదీ అన్నారు. దేశ యువత నిరాశ నిస్పృహలను వీడి ముందుకు నడవాలన్నారు. కొత్త సంకల్పంతో దూసుకుపోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. సముద్రం, సరిహద్దు, సైబర్‌.. ఏ విషయంలోనైనా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

జీఎస్టీని ఇంత తక్కువ సమయంలో
జీఎస్టీని తీసుకొచ్చి సహకార వ్యవస్థకు జవసత్వాలు అందించామని మోదీ అన్నారు. జీఎస్టీని ఇంత తక్కువ సమయంలో ఎలా అమలు చేశారని ప్రపంచం ఆశ్చర్యపోతోందని చెప్పారు. ప్రభుత్వ వ్యవహారాలను సులభతరం చేసే కార్యక్రమంలో వేగం పుంజుకున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల బంధనాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించే ప్రయత్నం కొనసాగుతోందని స్పష్టం చేశారు. దేశంలోని నలుమూలలకు విద్యుత్‌ వెలుగులు ప్రసరిస్తున్నాయన్నారు. ఇంటింటికీ గ్యాస్‌ పొయ్యిల ద్వారా కోట్లాది పేద మహిళలకు పొగ నుంచి విముక్తి కల్పించామన్నారు. ప్రభుత్వ వ్యవహారాలను సులభతరం చేసే కార్యక్రమంలో వేగం పుంజుకున్నామన్నారు. కశ్మీర్‌ అభివృద్ధి, ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ దేశం కట్టుబడి ఉందన్నారు.

సాగునీరు ఇస్తే బంగారం....
రైతులకు సాగునీరు ఇస్తే బంగారం పండిస్తారన్నారు. ప్రధానమంత్రి కృషి యోజన ద్వారా రైతులకు సాగునీరందించే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రైతన్నకు చేయి అందించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తోందన్నారు. యువతకు ఆర్థిక సాయమందిస్తే ఉద్యోగం కోసం ఎదురుచూడరన్నారు. ముద్ర యోజన ద్వారా అనేక మంది యువత కొత్త ఉద్యోగాలు సృష్టించారని మోదీ పేర్కొన్నారు. ట్రిపుల్‌ తలాక్‌పై దేశం మొత్తం ఆందోళన చెందిందన్నారు. దీనిపై కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రజలందరూ అండగా నిలిచారన్నారు. దేశంలో ఉన్న ప్రతీ పౌరుడు సంపూర్ణ హక్కులతో జీవించే అవకాశం ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. 

07:33 - August 16, 2017

హైదరాబాద్ : 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన తేనేటి విందు సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు హాజరయ్యారు. ఇద్దరు చంద్రులు రాజ్‌భవన్‌ వేదికగా మరోసారి కలిశారు. గవర్నర్‌ దంపతులు ఇద్దరు సీఎంలను ఆత్మీయంగా ఆహ్వానించారు. గవర్నర్‌ నరసింహన్‌ ఇద్దరిని వెంటతీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరితో కాసేపు ముచ్చటించారు.గవర్నర్‌ దంపతులు ఇతర అతిథులను ఆహ్వానించేందుకు వెళ్లగా ఇద్దరు చంద్రులకు కాసేపు ఏకాంతం దొరికింది. ఈ సమయంలో ఇద్దరు సీఎంలు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ తర్వాత పలు అంశాలపైనా చర్చించుకున్నారు.

సమస్యలపై ఇద్దరి మధ్య చర్చ
రాష్ట్ర విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాజకీయ అంశాలపైనా ఇద్దరు మాట్లాడుకున్నట్టు సమాచారం. ఇద్దరు ముఖ్యమంత్రుల సంభాషణలో పలుమార్లు చిరునవ్వులు విరబూసాయి. ఇంతకు ముందెప్పుడూ లేనట్టుగా సీఎంలు ఉల్లాసంగా కనిపించారు. గవర్నర్‌ తేనేటి విందులో అల్ఫాహార విందుకు తొలిసారిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హాజరయ్యారు. గవర్నర్‌ నుంచి ఆహ్వానం వెళ్లడంతో పవన్‌ హాజరయ్యారు. దీంతో గవర్నర్‌ విందులో పవన్‌ కల్యాణ్‌ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆయనతో మాట్లాడేందుకు విందుకు వచ్చిన వారిలో కొందరు ప్రయత్నించారు.

అకర్షణగా పవన్ కళ్యాణ్
గవర్నర్‌ తేనీటి విందుకు రాజకీయ నాయకులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య, ఏపీ స్పీకర్‌ కోడెల, తెలంగాణ ప్రతిపక్షనేత జానారెడ్డి, మంత్రులు కడియం, కేటీఆర్‌, నాయిని, మహమూద్‌ అలీ, కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనాచౌదరి పాల్గొన్నారు. వచ్చిన అతిథులందరినీ గవర్నర్‌ దంపతులు ఆత్మీయంగా పలకరించారు. 

07:31 - August 16, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ఆస్పత్రుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. దిగ్గజ ఆస్పత్రి యాజమాన్యాలు క్యాపిటల్‌ సిటీలో తమ బ్రాంచులు నెలకొల్పేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. వారం క్రితం బి.ఆర్. శెట్టి మెడ్ సిటీకి శంకుస్థాపన కాగా... బుధవారం ఉదయం ఇండో యూ.కే ఇన్సిటిట్యూట్‌ ఆఫ్ హెల్త్ మెడ్ సిటికి పునాదిరాయి పడనుంది. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో మెడ్ సిటీ నిర్మాణానికి సీఆర్డీఏ అధికారులు భూమి పూజ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని విజయవాడ వెన్యూ ఫంక్షన్ హాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు రిమోట్‌ ద్వారా ఆవిష్కరించనున్నారు. ఇండో యూ.కే ఇన్సిటిట్యూట్‌ ఆఫ్ హెల్త్ మెడ్ సిటీ ఆస్పత్రి నిర్మాణానికి ఎర్రబాలెంలో రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాల భూమి కేటాయించింది. మొత్తం వెయ్యి కోట్ల నిధులతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కానుంది. 2023 నాటికి ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.

10 వేల మందికి ఉపాధి
ఆస్పత్రి ఏర్పాటుతో మొత్తం 10 వేల మందికి ఉపాధి లభించనుంది. దేశంలో మొత్తం 11 ఇండో యూకే మెడిసిటీలు నెలకొల్పేందుకు ఇటీవలే భారత్ , బ్రిటన్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్య, విద్యా బోధనతో పాటు పరిశోధన , వాటి అనుబంధ రంగాల ఏర్పాటు, లండన్ కింగ్స్ కాలేజీ ఆస్పత్రి పర్యవేక్షణలో దేశ ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందేలా చూడడం ఈ ఒప్పందం లక్ష్యం. దేశంలో ఏర్పాటయ్యే మిగతా అన్ని కేంద్రాలకు అమరావతిలో నిర్మించనున్న మెడ్ సిటీ ప్రధాన కేంద్రంగా ఉండబోతుంది. ఈ ఆస్పత్రికి కింగ్స్ కాలేజ్ హాస్పిటల్-ఇండో యూకే ఇన్సిటిట్యూట్‌ ఆఫ్ హెల్త్‌గా పిలవనున్నారు. ఒకే ప్రాంగణంలో ఇండో యూకే హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్, పిజీ ట్రైనీంగ్ అకాడమీలు, 250, 500 పడకల ఆస్పత్రులు, ల్యాబ్‌, మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. 2023 నాటికి అందుబాటులోకి వచ్చేలా విడివిడిగా వీటి నిర్మాణాలు చేపట్టనున్నారు. 

07:29 - August 16, 2017

గుంటూరు : జిల్లా ఉమ్మడివరంలో బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు జిల్లా అధికార యంత్రాంగం వేగంగా స్పందించింది. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ బాలుడు చంద్రశేఖర్‌ను కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డారు. 

07:28 - August 16, 2017

గుంటూరు : బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్‌ను అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. బాలుడిని క్షేమంగా బోరుబావి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే సీఎస్‌ఆర్‌ ఆంజనేయులు నిరంతరం పర్యవేక్షించారు. సహాయక బృందాలకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు చేస్తూ వచ్చారు. 

07:26 - August 16, 2017

గుంటూరు : బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్‌ను అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. చంద్రశేఖర్‌ మృత్యుంజయుడిగా బయటకి రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బోరుబావికి సమాంతరంగా 20 అడుగుల లోతులో... మరో గొయ్యి తవ్వి బాలుడిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం బయటకు తీసింది. 11 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగింది. బోరు బావిలో 13 అడుగుల లోతున బాలుడు ఉన్నట్లు గుర్తించారు. వర్షంలోనూ ఆయా శాఖల సిబ్బంది సమన్వయంతో సహాయ చర్యలు కొనసాగించారు. ఆధునిక పరికరాలను ఉపయోగించి... బోరుబావిలో ఉన్న బాలుడి కదలికలను గమనిస్తూ వచ్చారు. తెల్లవారుజామున 2:40 నిమిషాలకు బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు.

07:25 - August 16, 2017

గుంటూరు : బోరుబావిని బాలుడు చంద్రశేఖర్‌ జయించడంతో.. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన కొడుకు బోరుబావి నుంచి సజీవంగా తిరిగి రావడంతో తల్లి అనూష హర్షం వ్యక్తం చేస్తోంది. 

07:23 - August 16, 2017

గుంటూరు : బోరు బావి నుంచి రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్‌ను సురక్షితంగా బయటకు తీయడంతో.. గుంటూరు జిల్లా ఉమ్మడివరంలో ఆనందోత్సహాలు మిన్నంటాయి. పిల్లాడిని క్షేమంగా బయటకు తీసిన అధికారులు, సహాయక బృందాలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

07:22 - August 16, 2017

గుంటూరు : బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్‌ను అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. చంద్రశేఖర్‌ మృత్యుంజయుడిగా బయటకి రావడంతో తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయారు. బోరుబావికి సమాంతరంగా 20 అడుగుల లోతులో... మరో గొయ్యి తవ్వి బాలుడిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం బయటకు తీసింది. 11 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగింది. బాలుడు మృత్యుంజయుడిగా రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని ఉమ్మడివరానికి చెందిన అనూష మంగళవారం సాయంత్రం.. తన రెండేళ్ల కుమారుడు చంద్రశేఖర్‌తో పశు గ్రాసం కోసం వెంట తీసుకెళ్లింది. పిల్లాడిని పశువుల కొట్టంలో వదిలిపెట్టి.. తాను పొలంలోకి వెళ్లింది. ఇంతలో చంద్రశేఖర్‌ ఆడుకుంటూ వెళ్లి తెరిచి ఉన్న బోరుబావిలోకి పడిపోయాడు. అదే సమయంలో గట్టిగా కేకలు వేయడంతో... తల్లి అనూష గమనించింది. ఆమె అక్కడికి చేరుకునేలోపే చంద్రశేఖర్‌ బోరుబావిలోకి జారిపోయాడు. ఈ సమాచారాన్ని అనూష గ్రామంలో తెలియజేయడంతో.. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. లోపల ఉన్న బాలుడికి నింరతరం ఆక్సిజన్‌ అందించారు. బోరు బావిలో 13 అడుగుల లోతున బాలుడు ఉన్నట్లు గుర్తించారు. ప్రొక్లయిన్‌ల సహాయంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు. వర్షంలోనూ ఆయా శాఖల సిబ్బంది సమన్వయంతో సహాయ చర్యలు కొనసాగించారు. ఆధునిక పరికరాలను ఉపయోగించి... బోరుబావిలో ఉన్న బాలుడి కదలికలను గమనిస్తూ వచ్చారు. తెల్లవారుజామున 2:40 నిమిషాలకు బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. చంద్రశేఖర్ మృత్యుంజయుడిని బయటకు రావడంతో అధికారులను అభినందించారు.

బోరు బావిలో పడ్డ చిన్నారి క్షేమం

గుంటూరు : జిల్లా ఉమ్మడివరంలో బోరు బావిలో పడ్డ చంద్రశేఖర్ సురక్షితంగా బయటపడ్డాడు. నిన్న మధ్యాహ్నం 3గంటలకు బోరు పడ్డ చిన్నారిని రాత్రి 2గంటల సమయంలో బయటకు తీశారు.

Don't Miss