Activities calendar

17 August 2017

జనాలపైకి దూసుకెళ్లిన వ్యాన్..ఇద్దరు మృతి

స్పెయిన్ : బార్సిలోనాలో వ్యాన్ జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఇద్దరు సాయుధులు ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డారు. ఉగ్రవాదుల చర్యగా పోలీసులు వెల్లడించారు. 

 

21:47 - August 17, 2017
21:46 - August 17, 2017

చెన్నై : ఐరన్ లేడిగా పేరొందిన మణిపురి మహిళ ఇరోమ్ షర్మిలా తమిళనాడులోని కొడైకెనాల్‌లో వివాహం చేసుకున్నారు. తన చిరకాల స్నేహితుడు ఇంగ్లాండ్‌కి చెందిన భారతీయుడు డెస్మాండ్ కొటినోను ఇక్కడి రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహమాడారు. మణిపాల్ హక్కుల కార్యకర్తగా సుమారు 16 సంవత్సరాలపాటు నిరాహారదీక్ష ద్వారా పోరాడిన షర్మిలా... గత ఎన్నికల్లో పార్టీని స్థాపించి పోటీ చేసినా... మణిపాల్ ఓటర్లు ఆమెకు మద్దతివ్వలేదు. దీంతో నిరాశకు గురైన షర్మిలా మణిపూర్‌ నుండి వెళ్లిపోయింది. వివాహానంతరం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రాలను చూపిస్తూ.. ఇక్కడే కొడైకెనాల్ లో స్థిరపడనున్నట్లు తెలిపారు.

 

21:41 - August 17, 2017

హైదరాబాద్‌ : నగరంలో 16ఏళ్ల ముస్లిం బాలికను 65 ఏళ్ల ఒమన్ దేశీయుడు పెళ్లాడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక పిన్ని, బాబాయ్‌లు రూ. 5 లక్షలకు తమ కూతుర్ని ఒమన్ దేశీయుడికి కట్టబెట్టారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు తెలియకుండా మూడు నెలల క్రితమే ఈ వివాహం జరిగినట్లు ఆమె పోలీసులకు చెప్పింది. పెళ్లి సమయంలో చెల్లించిన రూ. 5 లక్షలు వెనక్కి పంపితే బాలికను తిరిగి హైదరాబాద్‌కు పంపుతానని ఒమన్ దేశీయుడు చెబుతున్నట్లు బాలిక తల్లి పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

21:37 - August 17, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఉమ్మడి జిల్లాల ప్రకారమే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఈడీ, డీఈడీ విద్యార్థులు విద్యా శాఖ కమిషనర్‌ కార్యాయాలన్ని ముట్టడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి  హైదరాబాద్‌ చేరుకున్న  విద్యార్థులుగా ర్యాలీగా తరలివచ్చిన విద్యార్థులు విద్యా శాఖ కమిషనర్‌ కార్యాలయం ముందు బైఠాయించారు. పాత జిల్లాల వారీగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేస్తూ,.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

21:32 - August 17, 2017

కర్నూలు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్షనేత జగన్‌ మరోసారి నిప్పులు చెరిగారు.  ఎన్నికలు జరుగుతున్నందునే నంద్యాల అభివృద్ధిపై చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకువస్తారని విమర్శించారు.  చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా నంద్యాల ప్రజలు ఓటువేయాలని కోరారు. రాజకీయ వ్యవస్థలో మార్పురావాలని... అందుకు నంద్యాల నాంది కావాలన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో జగన్‌ పలుచోట్ల రోడ్‌షోలు నిర్వహించారు. 

 

పోయెస్ గార్డెన్ మా వారసత్వ ఆస్తి : దీప

చెన్నై : పోయెస్ గార్డెన్ ను స్మారకంగా మార్చే అధికారం పళనిస్వామికి లేదని జయలలిత మేనకోడలు దీప అన్నారు. పోయెస్ గార్డెన్ తమ వారసత్వ ఆస్తి అని అన్నారు. సీఎం పదవిని కాపాడుకునేందుకే విచారణ కమిటీ వేశారని విమర్శించారు. పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని స్పష్టం చేశారు.

పోయెస్ గార్డెన్ మా వారసత్వ ఆస్తి : దీప

చెన్నై : పోయెస్ గార్డెన్ ను స్మారకంగా మార్చే అధికారం పళనిస్వామికి లేదని జయలలిత మేనకోడలు దీప అన్నారు. పోయెస్ గార్డెన్ తమ వారసత్వ ఆస్తి అని అన్నారు. 

 

21:11 - August 17, 2017

వెంకయ్యసారుకు పౌరసన్మానాలు... 21నాడు ఇందువెట్టిండ్రంట, పైసలువంచుకుంటా దొరికిపోయిన బాలయ్య...జిందాబాదన్న అభిమాని గూబ గుయ్యి, పీసీసీ చీఫ్ లం మేమే కాబోతున్నం...కుంతియా మాటలు నమ్మొదంటున్న కోమటిరెడ్లు, సంగారెడ్డికాడ జగ్గారెడ్డి సారు అరెస్టు...మెడికల్ కాలేజీ కోసం నిరాహార దీక్ష, రోహిత్ వేముల కేసు జీవ సమాధి... కమిషన్ జేసిన ఎంక్వరీ కథ ఒట్టిదే. ఆడొళ్ల జుట్టు కట్ జేస్తున్న దయ్యాలు...బీహార్ ల రెడ్ హ్యాండెడ్ గా దయ్యం అరెస్టు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

సమస్యల గురించే మాట్లాడా : గంగుల

విజయవాడ : గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో గంగుల ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ సమస్యల గురించే మాట్లాడానని తెలిపారు. భూమాతో విబేధాలు ఉండేవి కానీ ఇప్పుడాయన లేరని...భూమా పిల్లలతో విబేధాలేముంటాయని పేర్కొన్నారు. 

టీడీపీలో చేరిన గంగుల ప్రతాప్ రెడ్డి

విజయవాడ : గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో గంగుల ఆ పార్టీలో చేరారు. గంగుల ప్రతాప్ రెడ్డికి సీఎం చంద్రబాబు టీడీపీ కండువా కప్పారు. 

20:23 - August 17, 2017

నెల్లూరు : జిల్లాలో సుత్తి సైకో హత్యల కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువడించింది. ప్రభావతి అనే మహిళను హత్య చేసిన కేసులో వెంకటేశ్వర్లు అనే దోషికి నాల్గో అదనపు జడ్జి శ్రీనివాస్‌రావు ఉరిశిక్ష విధించారు. 2016లో జరిగిన ఈ హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. 

 

20:10 - August 17, 2017

కర్నూలు : నంద్యాల రాజకీయం రసవత్తర మలుపులతో సాగుతోంది. ఓవైపు పాలక, ప్రతిపక్షాల అగ్రనేతలు రోడ్‌షోలతో హోరెత్తిస్తుంటే.. తెరవెనుక రాజకీయాలూ ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి అనూహ్యంగా సైకిలెక్కేశారు. దీన్ని టీడీపీ అగ్రనేతలు స్వాగతిస్తుంటే.. భూమా వర్గం మాత్రం గుర్రుగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. గంగుల రాకతో గరం గరం గా మారిన నంద్యాల రాజకీయాలపై స్పెషల్ స్టోరీ....
ఊహించని మలుపులు
నంద్యాల ఉప ఎన్నిక ఘట్టం.. ఊహించని మలుపులతో సాగుతోంది. శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ పదవిని వీడి 
మరీ.. అన్నయ్య శిల్పా మోహనరెడ్డికి బాసటగా నిలవడం టీడీపీకి పెద్ద షాక్‌ అనుకుంటే.. ఇప్పుడు గంగుల ప్రతాపరెడ్డి వైసీపీకి షాక్‌ ఇస్తూ టీడీపీలో చేరారు. అమరావతిలో.. బుధవారం సోదరుడు సుదర్శన్‌రెడ్డితో కలిసి గంగుల చంద్రబాబును కలిసి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 
గంగుల కుటుంబానికి కీలకమైన పాత్ర
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాల్లో గంగుల కుటుంబానికి కీలకమైన పాత్రే ఉంది. గంగుల తిమ్మారెడ్డి మృతితో 1978 ఎన్నికల్లో ఆయన తనయుడు గంగుల ప్రతాపరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అలా రాజకీయ అరంగేట్రం చేసిన ప్రతాపరెడ్డి, 1985, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగాను, 1991లో నంద్యాల ఎంపీగా, రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే.. అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 1992లో కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా గెలిపించింది. 2004లో కాంగ్రెస్‌ తరఫున ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2009 సాధారణ, 2012 ఉపఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 
గంగుల కుటుంబానికి కంచుకోటలా గోస్పాడు 
గంగుల ప్రతాపరెడ్డి కుటుంబానికి నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లోని గోస్పాడు మండలం పెట్టని కోట లాంటింది. స్థానిక నేతలతో అనుబంధాలు, కుటుంబ బంధుత్వాలు, స్నేహాలు, ముఖ్యులతో పరిచయాలు.. గోస్పాడును గంగుల కుటుంబానికి కంచుకోటలా మార్చాయి. ఒకప్పుడు ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలో ఉన్న గోస్పాడు మండలం.. గడచిన ఎన్నికలకు ముందు నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా.. నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లోకి వచ్చింది. గంగుల కుటుంబానికి ఉన్న ఓటు బ్యాంకు కారణంగా.. నంద్యాల ఉప ఎన్నికల్లో గంగుల ప్రతాపరెడ్డినే పోటీ చేయించాలని జగన్‌ తొలుత భావించారు. ఆ ఉద్దేశంతోనే.. గంగుల ప్రతాపరెడ్డి తమ్ముడు ప్రభాకరరెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయించారు. అయితే.. చంద్రబాబు భూమా వర్గానికే ఎమ్మెల్యే టికెట్‌ ఖరారు చేయడంతో.. శిల్పా బ్రదర్స్‌ వైసీపీలో చేరారు. 
మాకు ఏకపక్షం అవుతుంది : వైసీపీ
శిల్పా సోదరులు వైసీపీలో చేరడం.. గంగుల ప్రభాకరరెడ్డి ఎమ్మెల్సీగా ఉండడంతో.. గోస్పాడు మండలం తమకు ఏకపక్షం అవుతుందని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.. అయితే, గంగుల ప్రతాపరెడ్డి అనూహ్యంగా టీడీపీలో చేరడం.. వైసీపీ నాయకత్వాన్ని పెద్ద షాక్‌కే గురిచేసింది. ప్రస్తుతం.. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి గోస్పాడు మండలంలో వైసీపీని గెలిపించే బాధ్యతలను చేపట్టారు. ఇలాంటి తరుణంలో.. ఇదే మండలంలో టీడీపీని గెలిపించే బాధ్యతలు తీసుకుంటానని చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ అన్నదమ్ముల మధ్య పోరు సాగుతుందా..? లేక అన్నయ్యకు అనుకూలంగా తమ్ముడు ప్రభాకరరెడ్డి సైలెంట్‌ అవుతారా అన్న చర్చ సాగుతోంది.
భూమా వర్గీయుల్లో ఆగ్రహం 
గంగుల ప్రతాపరెడ్డి టీడీపీలో చేరడం పట్ల భూమా వర్గీయుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థాయిలో.. గంగుల, భూమా వర్గాల మధ్యే తీవ్రమైన ఫ్యాక్షన్‌ కొనసాగింది. ఈ నేపథ్యంలో.. ఇరు వర్గాలూ ఒకే పార్టీలో కలసి సాగడం ఏంటని భూమా వర్గం ప్రశ్నిస్తోంది. గంగుల ప్రతాపరెడ్డి ఎన్నికల వ్యూహంలో భాగంగా టీడీపీలో చేరారా..? ఆయనకు ఏదైనా పదవిని ఎర వేశారా..? అసలు సీఎం చంద్రబాబు గంగులకు ఇచ్చిన హామీ ఏంటి అన్న అంశాలపై విస్తృత చర్చ సాగుతోంది. ఏది ఏమైనా.. గంగుల ప్రతాపరెడ్డి టీడీపీలో చేరడం.. నంద్యాల ఉప ఎన్నికలపై పెద్ద ప్రభావాన్నే చూపుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. 

 

తెలంగాణ నుంచి 14 స్కూళ్లు ఎంపిక

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి తెలంగాణ నుంచి 14 స్కూళ్లు ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 172 స్కూళ్లను ఎంపిక చేశారు. 

19:53 - August 17, 2017

హైదరాబాద్ : నగరంలోని చిక్కడపల్లిలో లేబర్ కార్యాలయం వద్ద కలకలం ఏర్పడింది. 108 ఉద్యోగుల సమస్యలపై... రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌తో .. జీవీకే యాజమాన్యం, ఉద్యోగులు చర్చలు జరుగుతుండగా..సస్పెండైన ఓ ఉద్యోగి... పురుగుల మందు తాగాడు. ఆయన పరిస్థితి విషమంగా మారడంతో... గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

 

19:38 - August 17, 2017

హైదరాబాద్ : కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా విమర్శించారు. ఈ మేరకు ఎస్‌వీకేలో సీఐటీయూ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. షెడ్యూలు పరిశ్రమల్లో జీవోల కాలపరిమితి దాటినా కొత్త జీవోలు విడుదల చేయడం లేదన్నారు. కనీస వేతనం 18వేలు చెల్లించి, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 19న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు సాయిబాబా తెలిపారు. సెప్టెంబర్‌ 11న మండల, క్లస్టర్‌ కేంద్రాలు, లేబర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామన్నారు.

 

శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం

అమరావతి : ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శి బులెటిన్ విడుదల చేశారు. 

తమిళనాడు పాలిటిక్స్ లో కొత్త మలుపు

చెన్నై : తమిళనాడు పాలిటిక్స్ లో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జయలలిత మృతిపై జ్యుడీషియల్ విచారణ జరుపనున్నారు. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం పళనిస్వామి చెప్పారు. పోయెస్ గార్డెన్ ను స్మారక కేంద్రంగా మార్చుతామని సీఎం అన్నారు. పళనిస్వామి నిర్ణయాన్ని పన్నీర్ సెల్వం స్వాగతించారు. 

 

19:04 - August 17, 2017

చెన్నై : జయలలిత మృతిపై విచారణకు తమిళనాడు సీఎం పళని స్వామి ఆదేశించారు. ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని తెలిపారు. అంతే కాదు.. పోయెస్ గార్డెన్‌ను స్మారక కేంద్రంగా మార్చాలని కూడా నిర్ణయించారు. 

 

19:02 - August 17, 2017

హైదరాబాద్ : హీరో మోటార్స్‌ సంస్థ షీ టీమ్స్‌కు స్కూటీలు పంపిణీ చేసింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింది  మహిళా కానిస్టేబుళ్లకు వీటిని అందజేశారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు చెందిన 159 మందికి స్కూటీలను పంపిణీ చేసింది. హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, సైబరాద్‌బాద్‌ పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్య, రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌తో పాటు హీరో మోటార్స్‌ సంస్థ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జంటనగరాల్లో   75 వేల సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుతో  దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా  హైదరాబాద్‌ నిలుస్తోందని పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. 

 

18:59 - August 17, 2017

నిజామాబాద్ : జిల్లాలోని బాన్స్‌వాడ నియోజకవర్గంలోని భైరాపూర్ గ్రామంలో 40 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి పోచారంతో పాటు లబ్ధిదారులు క్షీరాభిషేకం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కిందన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. అదే విధంగా సంక్షేమ పథకాల అమలులో కూడా తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందుందని ఆయన చెప్పారు.  

 

18:45 - August 17, 2017

ఢిల్లీ : శ‌ర‌ద్ యాద‌వ్ నిర్వహిస్తున్న 'స‌భా విరాస‌త్ బ‌చావో స‌మ్మేళ‌న్‌'కు హాజ‌రైన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ .. మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. మోది ప్రభుత్వం అన్ని సంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తులతో నింపేస్తోందని ధ్వజమెత్తారు. పోలీస్‌, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, మీడియా ఇలా అన్ని సంస్థల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ తమ వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటోందని మండిపడ్డారు. మరోవైపు మోది చెప్పేటివన్నీ అబద్ధాలేనని రాహుల్‌ తెలిపారు. మోదీ  'స్వచ్ఛ భార‌త్ కావాలంటున్నారు.. కానీ మాకు మాత్రం స‌చ్ భార‌త్‌' కావాల‌ని రాహుల్ ఎద్దేవా చేశారు.  మేకిన్‌ ఇండియా, నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంతో మోది ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పాటు ప్రతిపక్ష నేతలు సీతారాం ఏచూరి, అఖిలేష్‌ యాదవ్ తదితరులు హాజరయ్యారు. నితీష్‌కు తమ బలమేంటో చూపడానికే శరద్‌ యాదవ్‌ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

 

మెరిట్ లిస్ట్ ఆధారంగా ఖాళీలు భర్తీకి సుప్రీంకోర్టు అనుమతి

హైదరాబాద్ : ట్రాన్స్ కో, తెలంగాణ డిస్కంలో 239 ఏఈ పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు గ్రీన్ సీగ్నల్ ఇచ్చింది. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతి తెలిపింది. మెరిట్ లిస్ట్ ప్రకారం కాకుండా కొత్తగా పరీక్ష పెట్టాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

 

భారత రక్షణ రంగంలో భారీ ఒప్పందం

ఢిల్లీ : భారత రక్షణ రంగంలో భారీ ఒప్పందం జరిగింది. 6విదేశీ యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలుకు ఒప్పందం జరిగింది. రూ. 4,168 కోట్లతో 6 అపాచి ఏహెచ్ -64 హెలికాప్టర్లను అమెరికా నుంచి భారత ఆర్మీ కొనుగోలు చేయనుంది.

ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ : చిక్కడపల్లిలో లేబర్ కార్యలయం వద్ద కలకలం ఏర్పాడింది. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ తో జీవీకే యాజమాన్యం, 108 ఉద్యోగుల చర్చలు నిర్వహించారు. చర్చల జరుగుతుండగా ఓ సస్పెండైన 108 ఉద్యోగి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని వేంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ల్ తెలిపారు.

17:16 - August 17, 2017

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నిర్మాణంపై ఫోకస్‌ పెట్టారు. అక్టోబర్‌ నుంచి ప్రజల్లోకి రానున్న పవన్‌.. ఇప్పటికే జిల్లాల వారీగా జనసైనికుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. ఇవాళ జనసేన సేవాదల్‌ను ఏర్పాటు చేశారు.  అక్టోబర్‌ తర్వాత విద్యార్థి, మహిళా విభాగాలను ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాదిలోనే ఈ విభాగాల కార్యక్రమాలనూ ప్రారంభిస్తామన్నారు. తన దగ్గరకు వచ్చే వాళ్లంతా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నారని పవన్‌ చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

17:06 - August 17, 2017

తూర్పుగోదావరి : కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరపాలని ఆదేశించింది. 50 వార్డులకు గాను.. 48 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారని... వెంటనే షెడ్యూల్ రద్దు చేయాలని హైకోర్టు పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పాత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. 

 

జయలలిత మృతిపై రిటైర్డ్ జడ్జిలతో విచారణ: పళనిస్వామి

తమిళనాడు: జయలలిత మృతిపై విచారణకు తమిళనాడు సీఎం ఆదేశం ఇచ్చారు. రిటైర్డ్ జడ్జిలతో విచారణ జరిపిస్తామని సీఎం పళనిస్వామి అన్నారు. స్మారక కేంద్రంగా పోయెస్ గార్డన్ నిర్మింస్తామని తెలిపారు.

 

17:00 - August 17, 2017

మెదక్‌ : జిల్లాలో కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చట్టం ప్రకారమే భూసేకరణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. వాలెంటరీ అగ్రిమెంట్‌ను పిటిషనర్‌ ప్రశ్నించారు. బలవంతపు భూసేకరణకే వాలెంటరీ అగ్రిమెంట్‌ అని పిటిషనర్‌ పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

సైకోకు ఉరి శిక్ష....

నెల్లూరు: సుత్తి సైకో కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సైకో వేంకటేశ్వర్లుకు 4వ అదనపు కోర్టు ఉరి శిక్ష విధించింది. వెంకటేశ్వర్లు 2016లో ప్రభావతి అనే మహిళను హత్య చేశాడు. ఆ కేసుకు సంబంధించిన తీర్పును కోర్టు వెల్లడించింది.

16:47 - August 17, 2017

ఢిల్లీ : హైకోర్టును గంటలో పేల్చేస్తామని ఓ ఆగంతకుడు చేసిన ఫోన్‌ కాల్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసు కంట్రోలు రూముకు వచ్చి ఫోన్‌కాల్‌తో హుటాహుటీన హైకోర్టుకు చేరుకున్న పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లతోపాటు అగ్నిమాపక సిబ్బంది హైకోర్టుకు చేరుకుని సోదాలు నిర్వహించారు.  దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

16:44 - August 17, 2017

మోసపూరిత హెల్త్ డ్రింక్స్ ను బ్యాండ్ చేయాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన మానవి వేదిక చర్చా కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకురాలు రమ, సామాజిక కార్యకర్త దేవి పాల్గొని, మాట్లాడారు. హెల్త్ డ్రింక్స్ తోపాటు ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ కు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పానియాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. మోసపూరితమైన ప్రకటనలను నమ్మవద్దన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:38 - August 17, 2017

ఢిల్లీ : ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురు మీసా భారతి, ఆమె భర్త శైలేష్‌కు తాజాగా ఐటి శాఖ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 21 లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీలో వంద కోట్ల విలువ చేసే భూమిని అక్రమ కంపెనీల ద్వారా కేవలం కోటి 41 లక్షలకు భూమి ఖరీదు చేసినట్లు రాజ్యసభ సభ్యురాలు మీసా ఆమె భర్త శైలేష్‌పై ఆరోపణలున్నాయి. షెల్‌ కంపెనీల పేరిట ఢిల్లీ, పట్నా తదితర ప్రాంతాల్లో అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు లాలు కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీనిపై ఐటి విచారణ జరుపుతోంది. 

16:36 - August 17, 2017

ఢిల్లీ : మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్నల్‌ శ్రీకాంత్‌ ప్రసాద్‌ పురోహిత్ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. పురోహిత్‌కు బెయిల్‌ ఇవ్వడానికి జాతీయ దర్యాప్తు సంస్థ  నిరాకరిస్తోంది. పురోహిత్‌కు వ్యతిరేకంగా తగినన్ని ఆధారాలు ఉన్నాయని...బాంబే హైకోర్టు తీర్పును కొనసాగించాలని ఎన్‌ఐఏ చెబుతోంది. పురోహిత్‌కు బెయిలు మంజూరు చేయాలని ఆయన తరపున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది హరీష్‌ సాల్వే కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌కు బెయిలు ఇచ్చారని, పురోహిత్‌కు ఎందుకివ్వరని ప్రశ్నించారు. ఈ కేసులో సాక్షుల సాక్ష్యాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. పురోహిత్‌కు బాంబే హైకోర్టు బెయిలు నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్‌ 29, 2008లో నాసిక్‌ జిల్లా మాలేగావ్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో ఏడుగురు మృతి చెందారు.

ఎన్నికలు వాయిదా వేయించేలా వ్యవహరిస్తున్న వైసీపీ : బాబు

అమరావతి : టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో నంద్యాల బైపోల్ పై చర్చ నిర్వహించారు. ఓటమి భయంతోనే ఎన్నిక వాయిదా వేయించేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తాస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ ఎంతగా రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఇదే విషయం క్షేత్రస్థాయిలో పనిచేసే పత్రి కార్యకర్తకు చేరవేయాలని అయన తెలిపారు.

16:21 - August 17, 2017

హైదరాబాద్‌ : నగరంలోని... గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన మరో మహిళా పోలీస్‌ స్టేషన్‌ను హోంమంత్రి నాయినీ నర్సింహరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

 

రూ.50లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.50 లక్షల విదేశీ కరెన్సీని పోలీసులు గుర్తించారు. ప్లైఎమిరేట్స్ దుబాయ్ కి చెందిన విమానంలో యూఏఈ, సౌదీకి చెందిన రియాల్స్ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మహిళా కానిస్టేబుళ్లకు 159 స్కూటీల పంపిణీ

హైదరాబాద్ : హీరో మోటర్స్ సంస్థ ఆధ్యర్యంలో మహిళా కానిస్టేబుళ్లకు స్కూటీలు పంపిణీ చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద 159 స్కూటీలను సంస్థ పంపిణీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మహిళా కానిస్టేబుళ్లకు స్కూటీల పంపిణీ చేశారు.

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు తొలిగిన అడ్డంకులు

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు అడ్డంకులు తొలిగాయి. షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల నిలుపుదల కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. నోటిఫికేషన్ ప్రకారం 29న పోలింగ్, సెప్టెంబర్ 1న కౌంటింగ్ అని తెలిపింది. రిజరేషన్లలో అభ్యంతరాలను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్ హెచ్ ఏ ఐ జరుపుతున్న భూసేకరణ పై హైకోర్టు స్టే విధించింది. పోరంకి మంచిలీపట్నం హైవేలో 2009 భూనేకరణకు ఇంతవరకు నష్ట పరిహారం చెల్లించలేదని 72 మంది బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. భూసేకరణకు సంబంధించిన కార్డులన్నీ సెప్టెంబర్ 5 వరకు కోర్టుకు సమర్పించాలని ఎన్ హెచ్ ఏఐ, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భూసేకరణ ప్రక్రియ నిలిపివేయాలని కోర్టు తెలిపింది.

15:41 - August 17, 2017

ఢిల్లీ : హైకోర్టులో బాంబు కలకలం రేపింది. హైకోర్టులో బాంబు పెట్టినట్లు అగంతకుడు ఫోన్‌ చేసి హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణమే స్వాత్‌ టీమ్స్‌, బాంబ్‌ స్క్వాడ్‌ హైకోర్టుకు  చేరుకుని తనిఖీలు చేపట్టాయి. మరిన్ని వివరాలను వీడియోలోచూద్దాం...

 

ప్రజాసేవ కోసమే జనసేన సేవాదళ్ : పవన్

హైదరాబాద్ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. అక్టోబర్ నుంచి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వేళ్లనున్నారు. జనసైనికులను ఎంపికలు ఇప్పటికే పూర్తి చేశారు. ప్రజాసేవ కోసమే ప్రజల వద్దకు వస్తున్నామని ఆయన అన్నారు. ప్రజాసేవ కోసమే జనసేన సేవాదళ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అక్టోబర్ తర్వాత జనసేన విద్యార్థి మహిళా విభాగాలను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

 

 

15:38 - August 17, 2017

సంగారెడ్డి : మెడికల్‌ కాలేజీ తరలింపును నిరసిస్తూ కలెక్టరేట్‌ ఎదుట జగ్గారెడ్డి నిరాహారదీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. జగ్గారెడ్డికి మద్దతుగా భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అయితే... దీక్షకు కూర్చునేముందే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కలెక్టరేట్‌ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

పురుగుమందు కొట్టిన కాసేపటికే రైతులకు అస్వస్థత

భద్రాద్రి : బూర్గంపాడు మండలంలో రైతులకు అస్వస్థత కలిగింది. ఉప్పుసాక, టేకులచెరువు, గోపాలపురానికి చెందిన 15 
మంది రైతులు పురుగుమందు కొట్టిన కాసేపటికే అస్వస్థతకు గురయ్యారు. వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. 

రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా భూసేకరణ జరపాలి : హైకోర్టు

మెదక్: జిల్లా కొండపోచమ్మ ప్రాజెక్టు బలవంతపు భూ సేకరణపై తనేదారుపల్లి భూ నిర్వాసితులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. భూసేకరణ చట్టానికి విరుధ్ధంగా, రైతులను బెదిరించి, బలవంతంగా భూములు సేకరిస్తున్నారని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశాడు. భూసేకరణపై స్టే ఉన్నా కొత్త నోటిపికేషన్ ద్వారా భూ సేకరణ జరుపుతున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. భూసేకరణ చట్టం ప్రకారమే భూములు సేకరించాలని కోర్టు పేర్కొంది. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా భూసేకరణ జరపాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇచ్చింది.

సంగారెడ్డిలో ఉద్రిక్తత

సంగారెడ్డి : జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెడికల్‌ కాలేజీ తరలింపును నిరసిస్తూ కలెక్టరేట్‌ ఎదుట జగ్గారెడ్డి నిరాహారదీక్ష చేసేందుకు సిద్దమయ్యారు. జగ్గారెడ్డికి మద్దతుగా భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అయితే... దీక్షకు కూర్చునేముందే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కలెక్టరేట్‌ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

మెడికల్ కాలేజీని ఎందుకు తరలించారో చెప్పాలి : జగ్గారెడ్డి

సంగారెడ్డి : మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం కాంగ్రెస్ నేత జగ్గరెడ్డి దీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన 10టీవీతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సంగారెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కేటాయించిన మెడికల్ కాలేజీని సిద్దిపేటకు ఎందుకు తరలించారని ఆయన ప్రశ్నించారు. మెడికల్ కాలేజీని ఎందుకు తరలించారో హరీష్ రావు చెప్పాలని ఆయన పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ సాధించేవరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

 

ఎమ్మార్ వ్యాక్సిన్ వికటించి ఐదుగురు చిన్నారులకు అస్వస్థత

మంచిర్యాల : మందమర్రిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలలో ఎమ్మార్ వ్యాక్సిన్ వికటించి ఐదుగురు చిన్నారులకు అస్వస్థత కలిగింది. చికిత్స నిమిత్తం చిన్నారులను ఏరియా ఆస్పత్రికి తరలించారు.

జగ్గారెడ్డి దీక్ష భగ్నం...

సంగారెడ్డి : జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేయాలని టి.కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు.

13:29 - August 17, 2017

సంగారెడ్డి : జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేయాలని టి.కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఈ అంశంపై ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. సంగారెడ్డికి మంజూరైన కాలేజీని మంత్రి హరీష్ రావు సిద్ధిపేటకు తరలించుకపోయాడని ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమరణ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. పోలీసులు అనుమతినివ్వలేదు. దీక్ష ఎలాగైనా చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కలెక్టరేట్ వద్ద జగ్గారెడ్డికి మద్దతుగా కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అప్పటికే మోహరించిన పోలీసులు దీక్ష చేసేందుకు జగ్గారెడ్డిని అడ్డుకున్నారు. బలవంతంగా తరలించేందుకు ప్రయత్నించారు. జగ్గారెడ్డిని తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ప్రయత్నంలో తోపులాట చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జగ్గారెడ్డిని నర్సాపూర్ వైపు ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:20 - August 17, 2017
13:18 - August 17, 2017

హైదరాబాద్ : పర్యావరణహితంగా గణేష్ ఉత్సవాలు జరుపుకుందామని ఐటీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మాదాపూర్ లోని శిల్పా కళా వేదికలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఏకో ఫ్రెండ్లీ గణేష్ స్టాల్ ను ప్రారంభించారు. నదులు..చెరువులను కాపాడుకొనేందుకు మట్టి గణేష్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో 14 చోట్ల ఏకో ఫ్లెండ్లీ గణేష్ స్టాల్స్ లను ఏర్పాటు చేయడం జరిగింది. 

13:13 - August 17, 2017

హైదరాబాద్ : లోథా బిల్డర్స్ తమను మోసం చేసిందంటూ ప్లాట్ల యజమానులు జీహెచ్ఎంసీ మేయర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో సినీ నటుడు జగపతి బాబు కూడా ఉండడం గమనార్హం. పదిన్నర ఎకరాల్లో అపార్ట్ మెంట్ నిర్మిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చారని ప్లాట్ల యజమానుల్లో ఒకరైన సినీ నటుడు జగపతి బాబు పేర్కొన్నారు. అక్రమంగా మెరిడియన్ అపార్ట్ మెంట్ కడుతూ తమ ప్రైవసీని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. శుక్రవారం జీహెచ్ఎంసీ మేయర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. 

13:06 - August 17, 2017

ఢిల్లీ : దేశ రాజధాని హైకోర్టు వద్ద తీవ్ర కలకలం రేగింది. హైకోర్టులో బాంబు పెట్టామన్న ఆగంతకుల ఫోన్ కాల్ తో పోలీసులు పరుగులు పెట్టారు. హైకోర్టులో ఉన్న జడ్జీలు..న్యాయవాదులను తరలించారు. హైకోర్టు పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి ప్రమాదం జరుగకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్వాత్ టీమ్స్, బాంబ్ స్వ్కాడ్స్ చేరుకుని తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఫోన్ కాల్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు.
2011లో ఢిల్లీ హైకోర్టు గేట్ నెంబర్ 5 వద్ద బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.

నగరంలో రూ. కోటి 30 లక్షలు రద్దయిన నోట్లు..

హైదరాబాద్ : పంజాగుట్టలోని ఓ హోటల్ పై టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. ఇద్దరిని అరెస్టు చేశారు. వీరివద్ద రూ. కోటి 30 లక్షలు రద్దయిన నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 

ఇకో ఫ్లెండ్లీ గణేష్ స్టాల్..

హైదరాబాద్ : మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో ఇకో ఫ్లెండ్లీ గణేష్ స్టాల్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 14 చోట్ల మట్టి గణేష్ స్టాల్స్ ను ఏర్పాటు చేసింది. 

12:34 - August 17, 2017
12:31 - August 17, 2017

నిర్మల్ : చిన్న చిన్న కారణాలతో ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇందులో చిన్నారుల ప్రాణాలను తీసేస్తున్నారు. తాజాగా బాసరలో ఓ తల్లి ఇద్దరు చిన్నారులతో సహా ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. భర్త గల్ఫ్ లో ఉండడంతో అర్చన (27) అనే వివాహిత తల్లి వద్దే ఉంటోంది. ఈమెకు సోని (6), కన్నయ్య (3 నెలలు) సంతానం. రెగ్యులర్ చెకప్ నిమిత్తం కన్నయ్యను ఆసుపత్రికి అర్చన తీసుకెళ్లింది. సోనిని కూడా వెంట తీసుకెళ్లింది. కానీ తిరిగి అర్చన ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం ఉదయం నిర్మల్ జిల్లాలోని గోదావరి నదిలో అర్చన, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎలాంటి ఆర్థిక ఇబ్బందు లేవని పోలీసులు భావిస్తున్నారు.

12:30 - August 17, 2017

సంగారెడ్డి : మెడికల్ కాలేజీ కోసం కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆమరణ నిరహార దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీక్షకు అనుమతినివ్వాలని జగ్గారెడ్డి కోరినట్లు..అందుకు పోలీసులు అనుమతి లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం జగ్గారెడ్డి ఇంటికి భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఎలాగైనా దీక్ష చేపడుతానని జగ్గారెడ్డి పేర్కొనడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. సంగారెడ్డికి వచ్చిన మెడికల్‌ కాలేజీని సిద్దిపేటకు తరలించి మూడు నెలలు గడిచిపోయాయని, ఇప్పటికీ జిల్లాకు సంబంధించి ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఆందోళనకు వెళుతున్నామని జగ్గారెడ్డి పేర్కొంటున్నారు. దీనితో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

మండపాల వద్ద డీజేకు అనుమతి లేదు - సీపీ..

హైదరాబాద్ : గణేష్ మండపాలు నిర్వహించే వారు స్థానిక పీఎస్ లో అనుమతి తీసుకోవాలని సీపీ సందీప్ శాండిల్యా పేర్కొన్నారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారు 25 నుండి 31 లోపు క్లియరెన్స్ సర్టిఫికెట్లు తీసుకోవాలని సూచించారు. నిర్వాహకులు ఐడీలు పెట్టుకోవాలని, మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదన్నారు. 

12:24 - August 17, 2017

ఛత్తీస్ గడ్ : విప్లవ నినాదాలతో దండకారుణ్యం హోరెత్తింది. 50 వసంతాల నక్సల్ బరి వేడుక జనసంద్రంగా మారింది. మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. మే 25-26 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 80 వేల మంది ఆదివాసీలు హాజరయ్యారు. 2000 వేల మంది ప్రజా విముక్తి గెరిల్లాలతో కలిసి కదం తొక్కారు. దక్షిణ బస్తర్ లోని ప్రతి పల్లె దండకారుణ్యం వైపుకు మళ్లింది. నక్సల్ బరిలో అమరుల స్మృతిలో మావోయిస్టు భారీ స్థూపాన్ని ఆవిష్కరించింది. దండకారుణ్యం, సెంట్రల్ రీజియన్ కు చెందిన పలువురు అగ్ర నేతలు హాజరయ్యారు. 50 ఏళ్ల విప్లవోద్యమంలో అమరులైన 15వేల మందిని స్మరిస్తూ విప్లవ గీతాలు ఆలపించారు. 50 ఏళ్ల నక్సల్ బరి పోరాట పంథాను ఉద్యమకారులకు వివరించారు. మొదటి రోజు తెల్లవార్లూ సాంప్రదాయ నృత్యాలు..ఆటపాటలతో వేడుకకు కొత్త ఉత్తేజాన్ని తెచ్చారు. వేడుకలు పూర్తయిన అనంతరం పలువురు ఆదివాసీలను ఛత్తీస్ గడ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. వీరిని సుకుమా, జగదల్ పూర్, దంతెవాడ జిల్లాలో నిర్భందించినట్లు తెలుస్తోంది. 

గోదావరిలోకి పిల్లలతో సహా దూకిన తల్లి..

నిర్మల్ : బాసరలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులతో సహా గోదావరిలోకి తల్లి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. 

48గంటల్లో 4 సార్లు కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పూంఛ్ సెక్టార్ లో పాకిస్తాన్ రేంజర్ల కాల్పులకు తెగబడ్డారు. 48గంటల్లో నాలుగుసార్లు పాక్ సైన్యం కాల్పులకు దిగింది. 

తెలంగాణను ఆదుకుంటామన్న రాజేన్ గోహైన్...

హైదరాబాద్ : బీజేపీ కార్యాలయంలో గణపతి హోమం జరిగింది. కేంద్ర మంత్రి రాజేన్ గోహైన్, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ లు పాల్గొన్నారు. 2020లోపు తెలంగాణలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్లు, సికింద్రాబాద్ స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరిస్తామన్నారు. ఓఆర్ఆర్ వెంట 162 కి.మీ. మేర సర్క్యులర్ రైల్వే లైన్ వేస్తామన్నారు. తెలంగాణను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. 

11:28 - August 17, 2017

వరంగల్ : గిరిజన గ్రామాల్లో తీజ్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పట్టణాల్లోనూ ఈ ఉత్సవాలను సంతోషంగా జరుపుకుంటున్నారు. తమ ఆచారా..సంప్రదాయాల ప్రకారం ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. 9 రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవాల గురించి మరింత తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

11:24 - August 17, 2017

హైదరాబాద్ : రాజ్ భవన్ స్కూల్ లో నేడు టీకాల కార్యక్రమాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. తట్టు, రూబెల్లా వ్యాధుల నివారణకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. 9-15 ఏళ్ల లోపు పిల్లలకు ఐదు వారాల పాటు టీకాలు వేయనున్నారు. అన్ని స్కూళ్లు, అంగన్ వాడీ కేంద్రాల్లో టీకాలు వేస్తారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని 90 లక్షల మంది చిన్నపిల్లలకు వ్యాక్సిన్ అందచేయడం జరుగుతుందని, 9-15 పిల్లలకు వేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ లో ఉన్న 60 లక్షల మంది, అంగన్ వాడీ కేంద్రాల్లో ఉన్న 20 లక్షల మంది..మిగతా విద్యార్థులకు టీకాలు వేసేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. 

11:19 - August 17, 2017

హైదరాబాద్ : ఛత్రినాకా పీఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుల్తాన్ షామీ, ఆర్ అండ్ కాలనీ, భజ్జీ నగర్ లో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 52 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రెండు తల్వార్లు, 70 బైక్ లు, 14 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. రెండు బెల్ట్ షాపులపై దాడి చేసి 150 మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగేలా చేస్తామంటూ మంత్రాలు చేస్తున్న ముగ్గురిని..ప్రజల మధ్య గుర్రాలు పరుగెత్తిస్తూ అందర్నీ హఢలెత్తిస్తున్న ఆరుగురు పోకిరీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

11:12 - August 17, 2017

పశ్చిమగోదావరి : నిడదవోలు మండలం విజ్ఞేశ్వరం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. డెల్టా ప్రధాన కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. రాజమండ్రి నుండి నిడదవోలు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు కాల్వలో ఉన్న కారును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కారులో ఇద్దరు ఉన్నారా ? ఇంకెంత మంది ఉన్నారనేది తెలియరాలేదు. 
60 మీటర్ల లోతులో కాల్వ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరగడం రెండోసారి. నెల రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో కారు నెంబర్ బట్టి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాల్వలోకి దూసుకెళ్లిన కారు..

పశ్చిమగోదావరి : నిడదవోలు మండలం విజ్ఞేశ్వరం వద్ద డెల్టా ప్రధాన కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. రాజమండ్రి నుండి నిడదవోలు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

నల్లచొక్కాతో ముద్రగడ..

తూర్పుగోదావరి : కిర్లంపూడిలో ముద్రగడ పాదయాత్ర చేపట్టేందుకు ప్రయత్నించారు. నల్లచొక్కా ధరించి బయటకు వచ్చిన ముద్రగడను మళ్లీ పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. 

రాజ్ భవన్ లో టీకాల కార్యక్రమం ప్రారంభం..

హైదరాబాద్ : రాజ్ భవన్ స్కూల్ లో టీకాల కార్యక్రమాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. తట్టు, రూబెల్లా వ్యాధుల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 9-15 ఏళ్ల లోపు పిల్లలకు ఐదు వారాల పాటు టీకాలు వేయనున్నారు. 

10:26 - August 17, 2017
10:24 - August 17, 2017

హైదరాబాద్ : న్యాక్ బృందం ఉస్మానియా వర్సిటీకి చేరుకుంది. కాసేపటి క్రితం 9మంది సభ్యులు వర్సిటీకి చేరుకున్న అనంతరం వీసీ ఛాంబర్ లో సమావేశమయ్యారు. వీరు క్యాంపస్ లో ఉన్న కాలేజీలను సందర్శించనున్నారు. ఆయా కాలేజీల్లో సౌకర్యాలు, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అటెండెన్స్ ఎలా ఉందో పరిశీలించనున్నారు. న్యాక్ బృంద పర్యటనతో ఉస్మానియాను అందంగా తీర్చిదిద్దారు.

కానీ గ్రేడింగ్ పై ఉత్కంఠ నెలకొంది. 2013 వరకు గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఉద్యమ సమయంలో నివేదికను సమర్పించలేదు. గురువారం నుంచి మూడు రోజుల పాటు న్యాక్ బృందం పర్యటన నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. న్యాక్‌లో ఉత్తమ గ్రేడ్ సాధిస్తే కేంద్రం నుంచి అధిక నిధులు పొందే అవకాశం ఉంటుంది. అంతేగాకుండా వర్సిటీలో చదివే విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.

విద్యాప్రమాణాలు, వసతులు, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు, చేస్తున్న పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, పరీక్షా విధివిధానాలను పరిశీలించి, అధ్యయనం చేసి న్యాక్ గ్రేడ్‌లను అందజేస్తుంది. ప్రస్తుతం ఏ ప్లస్ ప్లస్, ఏ ప్లస్, ఏ, బీ ప్లస్ ప్లస్, బీ ప్లస్, బీ, సీ, డీ గ్రేడ్‌లు అందజేస్తున్నారు. ఉన్నత విద్యాసంస్థలకు న్యాక్ అందజేసే గుర్తింపు ఐదేళ్ల పాటు అమలులో ఉంటుంది.

10:10 - August 17, 2017

గుంటూరు : ఓ ప్రైవేటు బస్సు మొరాయించడంతో అర్ధరాత్రి నుండి ఉదయం వరకు నడిరోడ్డుపై ప్రయాణీకులు పడిగాపులు పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. విశాఖపట్టణం నుండి బెంగళూరుకు కోమిట్ల ట్రావెల్స్ బస్సు వెళుతోంది. ఇందులో 40 మంది ఉన్నారు. నాగార్జున వర్సిటీ వద్దకు రాగానే బస్సు మొరాయించింది. సాంకేతిక లోపం తలెత్తడంతో బస్సు కదలలేదు. దీనితో ప్రయాణీకులు రోడ్డుపై పడిగాపులు పడ్డారు. యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో అర్ధరాత్రి నుండి గురువారం ఉదయం వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ప్రయాణీకులను వేరే బస్సులో పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. 

10:05 - August 17, 2017

పొందూరులో స్వల్ప భూ ప్రకంపనాలు..

శ్రీకాకుళం : పొందూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రాపాక, పొందూరు, లోలుగు, తోలాపీలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. 

వైద్య సేవలపై మంత్రి కామినేని సంతృప్తి..

తూర్పుగోదావరి : తుని సీతారామపురంలో సీఎం పట్టణ ఆరోగ్య కేంద్రంలో మంత్రి కామినేని శ్రీనివాసరావు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. వైద్య సేవలపై రోగులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఓపీ బావుందని, డాక్టర్లు అందుబాటులో ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. 

రోడ్డుపై ప్రయాణీకుల పడిగాపులు..

గుంటూరు : నాగార్జున వర్సిటీ వద్ద కోమిట్ల ట్రావెల్స్ బస్సు నిలిచిపోయింది. విశాఖ నుండి బెంగళూరుకు బస్సు వెళుతోంది. బస్సు ఆగిపోవడంతో కొన్ని గంటలుగా ప్రయాణీకులు రోడ్డుపై పడిగాపులు పడుతున్నారు. కోమిట్ల ట్రావెల్స్ సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు.

09:34 - August 17, 2017

ఢిల్లీ : ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో టీమిండియా డామినేషన్‌ కొనసాగుతోంది. టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న టీమిండియా లంకతో మూడు టెస్టుల్లోనూ పోటీనే లేకుండా పోయింది. యాంగ్రీ యంగ్‌ విరాట్‌ కొహ్లీ..టీమిండియాను టెస్ట్‌ ఫార్మాట్‌లో ముందుండి నడిపిస్తున్నాడు. భారత్‌కు వరుసగా 8 టెస్ట్‌ సిరీస్‌ విజయాలందించిన కెప్టెన్‌గా రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. టెస్టుల్లో టీమిండియా జైత్రయాత్రపై టెన్‌ స్పోర్ట్స్ ప్రత్యేక కథనం..

ప్రస్తుతం టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న టీమిండియా...ఎక్స్‌పెక్టేషన్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా అదరగొడుతోంది. టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న టీమిండియా లంకతో మూడు టెస్టుల్లోనూ పోటీనే లేకుండా పోయింది. తొలి రెండు టెస్ట్‌లను నాలుగు రోజుల్లోనే నెగ్గిన భారత్‌...మూడో టెస్ట్‌లోనూ అంచనాలకు మించి రాణించింది. థర్డ్‌ టెస్ట్‌ను కేవలం మూడు రోజుల్లోనే నెగ్గి చరిత్రను తిరగరాసింది. తొలి టెస్ట్‌లో 304 పరుగుల భారీ తేడాతో నెగ్గిన భారత్‌....మిగతా రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్‌ విజయాలు సాధించింది. శ్రీలంకను వారి సొంతగడ్డపై టెస్టుల్లో క్లీన్‌స్వీప్‌ సాధించిన జట్టుగా భారత్‌ చరిత్ర సృష్టించింది.వరుసగా 8 టెస్టు సిరీస్‌లు నెగ్గిన జట్టుగా సైతం భారత్‌ అరుదైన రికార్డ్‌ నమోదు చేసింది.

యాంగ్రీ యంగ్‌ విరాట్‌ కొహ్లీ..టీమిండియాను టెస్ట్‌ ఫార్మాట్‌లో ముందుండి నడిపిస్తున్నాడు. భారత్‌కు వరుసగా 8 టెస్ట్‌ సిరీస్‌ విజయాలందించిన కెప్టెన్‌గా రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. 29 టెస్టుల్లో టీమిండియాకు సారధ్యం వహించిన విరాట్‌ కొహ్లీ...19 టెస్టుల్లో భారత్‌ను విజేతగా నిలిపాడు. విరాట్‌ కెప్టెన్సీలో భారత్‌ కేవలం 3 టెస్టుల్లో మాత్రమే ఓడగా....7 టెస్టులను డ్రాగా ముగించింది. టెస్టుల్లో టీమిండియా ఏ స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శిస్తుందో చెప్పడానికి ఈ ప్రదర్శనే నిదర్శనం.వరుసగా 8 సిరీస్‌ల్లో ఓటమంటూ లేని టీమిండియా...ట్రెడిషనల్‌ ఫార్మాట్‌లో ఇదే స్థాయిలో రాణిస్తే, మరి కొన్నేళ్లు టాప్‌ ర్యాంక్‌లోనే కొనసాగడం ఖాయం.

09:31 - August 17, 2017
09:31 - August 17, 2017

సినీ నటుడు బాలకృష్ణకు మళ్లీ కోపం వచ్చింది. మరోసారి అభిమాని చెంప చెళ్లుమనిపించాడు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా చూసేందుకు వచ్చిన 'బాలకృష్ణ'ను సెల్ఫీలో బంధించేందుకు ప్రయత్నించిన అభిమాని చెంప చెళ్లుమనిపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఇటీవలే ఓ చిత్ర షూటింగ్ ప్రారంభంలో సహాయకుడి నెత్తిపై మొట్టికాయలు వేసి షూ లేస్ కట్టించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

తాజాగా నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని రాత్రి ఓ హోటల్ కు బాలకృష్ణ చేరుకున్నాడు. అప్పటికే అక్కడ అభిమానులు భారీగా చేరుకున్నారు. గజమాలతో సత్కరించాలని అభిమానులు అనుకుని ముందుకొచ్చారు. పూలమాల వేస్తుండగా ఓ అభిమాని 'బాలయ్య' ముందుకొచ్చాడు. కోపంతో అభిమాని చెంప చెళ్లుమనిపించి అక్కడి నుండి తాపీగా వెళ్లిపోయారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో బాలకృష్ణ ఫ్యాన్స్ విస్తుపోయారు. 

భారీగా టౌన్ ప్లానింగ్ అధికారుల బదిలీలు..

హైదరాబాద్ : తెలంగాణలో భారీగా టౌన్ ప్లానింగ్ అధికారుల బదిలీలయ్యారు. జీహెచ్ఎంసీ నుండి 14 మంది, ఏసీపీ, టీపీఓ, టీపీఎస్ అధికారులు ఇతర జిల్లాలకు బదిలీయ్యారు.

08:52 - August 17, 2017

ప్రముఖ నటుడు 'నందమూరి బాలకృష్ణ' నేడు ఖమ్మంకు రానున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం 'పైసా వసూల్' చిత్ర ఆడియో వేడుక జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం హీరో బాలకృష్ణతో పాటు నటి శ్రియ, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత వెనిగండ్ల ఆనంద్ ప్రసాద్ లు హాజరు కానున్నారు. సర్ధార్ పటేల్ స్టేడియంలో ఈ ఆడియో వేడుక అట్టహాసంగా జరుగనుంది.

బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఘన విజయం అనంతరం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన పోస్టర్స్..టీజర్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా ప్రారంభోత్సవం రోజునే విడుదల తేదీ ప్రకటిస్తూ కొత్త నాందికి తెరతీశారు. కానీ ప్రకటించిన తేదీ కంటే నెల ముందుగానే సినిమా విడుదల చేస్తుండడం గమనార్హం. సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ డేట్ గా ప్ర‌కటించారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌–హాలీవుడ్‌ నటుడు కబీర్‌ బేడి ప్రత్యేక పాత్ర పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని పాటలు అభిమానుల్ని ఏ మేరకు అలరిస్తాయో చూడాలి.

08:30 - August 17, 2017

జమ్ము కాశ్మీర్‌ : పుల్వామాలో బాందెర్‌పొరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన టాప్‌ ఉగ్రవాది అయూబ్‌ లల్‌హారి హతమయ్యాడు. లల్‌హారి లష్కరే రీజనల్‌ కమాండర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహించాయి. ఉగ్రవాదులు తొలుత భద్రతాదళాలపై కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లష్కరే ఉగ్రవాది అయూబ్‌ మృతి చెందాడు. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు..

07:31 - August 17, 2017

ఉద్యోగాల భర్తీకి రోడ్ మ్యాప్..నియామకాల ప్రక్రియ ఇక వేగవంతం చేయాలని టి.సర్కార్ నిర్ణయం తీసుకుంది. న్యాయపర ఇబ్బందుల్లేకుండా నోటిఫికేషన్లు ఉండే విధంగా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులు సూచిస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్, టీఎస్పీఎస్సీ, ఉన్నతాధికారులతో డిప్యూటి సీఎం కడియం భేటీ అయ్యారు. ఈ ప్రకటన కేవలం కాలయాపననేనని, ఎన్నికల జిమ్మిక్కేననే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), రాజమోహన్ (టీఆర్ఎస్, సున్న కైలాష్ (కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:21 - August 17, 2017

తెలంగాణలో నిర్మాణ రంగం తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఒకవైపు ఇసుక మాఫియా..మరోవైపు జీఎస్టీ బాదుడు..ఇంకో వైపు నేరా నిబంధనలు..దీనితో నిర్మాణ రంగం భవిష్యత్ ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ అనిశ్చితి వాతావరణం నిర్మాణ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికుల ఉపాధిని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు - నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఎదరవుతున్న కొత్త కష్టాలపై టెన్ టివి జనపథంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్ స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ నాయకులు కోటం రాజు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఓపెన్ స్కూల్ ప్రవేశాల నోటిఫికేషన్...

హైదరాబాద్ : తెలంగాణలో నేడు ఓపెన్ స్కూల్ ప్రవేశాల నోటిఫికేషన్ వెలువడనుంది. సెప్టెంబర్ 14వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 

బీ ఫార్మసీ చివరి దశ కౌన్సెలింగ్...

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుండి బీ ఫార్మసీ చివరి దశ కౌన్సెలింగ్ జరుగనుంది. నేడు, రేపు వెబ్ ఆప్షన్లు ఎంచుకొనే అవకాశాన్ని కల్పించారు. 20న సీట్ల కేటాయింపు జరగనుంది. 

నగరానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు..

హైదరాబాద్ : నేడు ఐఐసీటీ ఆడిటోరియంలో సదస్సు జరగనుంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ఈ సదస్సులో పాల్గొననున్నారు. 

రాజ్ భవన్ లో నేడు టీకాల కార్యక్రమం..

హైదరాబాద్ : రాజ్ భవన్ స్కూల్ లో నేడు టీకాల కార్యక్రమాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. తట్టు, రూబెల్లా వ్యాధుల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 9-15 ఏళ్ల లోపు పిల్లలకు ఐదు వారాల పాటు టీకాలు వేయనున్నారు. 

ప్రొ.కబడ్డీ లీగ్ మ్యాచ్ లు..

ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్ లో నేడు ఢిల్లీ దబాంగ్ తో తమిళ తలైవాస్ ఢీకొననుంది. మరో మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ తో బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

 

ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు..

హైదరాబాద్ : నేటి నుండి 28 వరకు ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాలతో సహా వివిధ ప్రాంతాల్లో 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 78 పోస్టుల భర్తీ జరగనుంది. ఈ పరీక్షకు 3,900 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 

06:46 - August 17, 2017

హైదరాబాద్ : దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన... ఖైరతాబాద్‌ గణనాథుడు ఈసారి భక్తులకు ముందుగానే కనువిందు చేయనున్నాడు. పండుగ కంటే ముందే... శ్రీ ఛండీ కుమార గణపతిగా దర్శనమివ్వనున్నాడు. వినాయక చవితికి మూడు రోజుల ముందుగానే 60 అడుగుల ఈ భారీ వినాయక విగ్రహం భక్తులకు దర్శనం ఇవ్వనుంది.

వినాయక చవితి సందర్భంగా...ఈ ఏడాది కూడా... ఖైరతాబాద్‌లో భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. 60 అడుగుల ఏకదంతుని విగ్రహ ఏర్పాటు దాదాపు పూర్తైంది. ఈ మేరకు భారీ విగ్రహం.. తుది మెరుగులు దిద్దుకుంటోంది. గణనాథుడు ఈసారి... శ్రీ ఛండీ కుమార గణపతిగా దర్శనమివ్వనున్నారు. మహాశివుడు, ఛండీమాత, కుమారస్వామిలతో కలసి.. వినాయకుడు కనిపించనున్నాడు. అలాగే పండుగ కంటే మూడు రోజుల ముందుగానే.. విగ్రహ ప్రతిష్టాపనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 500 కేజీల కేడా లడ్డును స్వామివారికి నైవేద్యంగా నివేదించనున్నారు.

12 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామివారికి మొదటి పూజ గవర్నర్‌ దంపతులు నిర్వహించనున్నారు. ఈ పూజా కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌, రాష్ట్రమంత్రులు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఖైరతాబాద్‌ కేంద్రంగా 1954లో ప్రారంభమైన.. వినాయక చవితి ఉత్సవాలు... 63 ఏళ్లుగా సాగుతున్నాయి. పదేళ్లుగా శిల్పి రాజేంద్రన్‌ ఆధ్వర్యంలో అనేకమంది కళాకారులు వినాయక విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.  

06:44 - August 17, 2017

హైదరాబాద్ : లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన శ్వాసకోశ నాళ ట్యూమర్ సమస్యతో బాధపడుతున్న బాలుడికి గాంధీ ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్సతో స్వస్థత చేకూర్చారు. కార్పొరేట్‌ ఆస్పత్రులు కూడా చేతులెత్తేసిన కేసును గాంధీ ఆస్పత్రి వైద్యులు ఛాలెంజ్‌గా తీసుకుని బాలుడి ప్రాణాలను నిలబెట్టారు.

ఆదిలాబాద్‌కి చెందిన శ్రీకాంత్ అనే 16 ఏళ్ల బాలుడు..కొంతకాలంగా శ్వాసకోశ నాళంలో ట్యూమర్‌తో బాధపడుతున్నాడు. శ్వాస తీసుకోడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో శ్రీకాంత్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సర్జరీకి లక్షల్లో అడగడంతో.. శ్రీకాంత్ కుటుంబ సభ్యులు బాలుడిని గాంధీకి తీసుకొచ్చారు. డాక్టర్ రవీందర్ బృందం ఈ ట్యూమర్‌ని దాదాపు 7 గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.

మరోవైపు ఇటువంటి కేసులు చాలా అరుదుగా వస్తుంటాయని నిజానికి తాము కూడా చాలా ఆందోళన చెందుతూనే ఈ కేసు చేపట్టడం జరిగిందని డాక్టర్లు అంటున్నారు. ప్రైవేటుకు ధీటుగా ఎన్నో అధునాతన సౌకర్యాలు గాంధీలో ఉన్నాయని వాటిని సద్వినియోగపరుచుకోవాలంటున్నారు. శ్రీకాంత్ ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం బైపిసి చదువుతున్నాడు.. తాను డాక్టర్ కోర్సు చేసి గాంధీ ఆస్పత్రిలో వైద్యుడిగా అడుగుపెడతానంటూ ధీమా వ్యక్తం చేశాడు.

శ్రీకాంత్‌కు గాంధీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించడం పట్ల బాలుడి బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల ఆస్పత్రిలో 65 పడకలతో ఏర్పాటైన ఐసియూలో మరిన్ని సేవలు అందించాలని...అరుదైన ఆపరేషన్లు నిర్వహించాలని నగరవాసులు కోరుతున్నారు. 

06:42 - August 17, 2017

హైదరాబాద్ : ఉద్యోగులు, వారి వేతన సంబంధిత విషయాల్లో ఇప్పటి వరకు కేంద్రంపై ఆధారపడ్డ తెలంగాణ సర్కార్ త్వరలో సొంత అస్థిత్వంతో అడుగులు వేయబోతోంది. రాష్ట్రంలో తొలిసారిగా పీఆర్సీ కమిషన్ నియమించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదననూ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమౌతోంది. ఈ మేరకు కసరత్తు కూడా ప్రారంభించినట్లు సమాచారం. అంతా కలిసి వస్తే వచ్చే ఏడాది జూలై నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపును అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదననూ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఇక పీఆర్సీ ఛైర్మన్‌గా మాజీ చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ ప్రదీప్‌ చంద్రను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. పదో పీఆర్సీ అమలు సమయంలో, తెలంగాణ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ రూపకల్పనలోనూ ప్రదీప్ చంద్ర కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, వేతన సంబంధిత వ్యవహారాల్లో ఆయనకి ఉన్న అనుభవాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 1998 జూలై నుంచి ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణను అమలు చేస్తున్నారు. దాని ప్రకారం పదో పీఆర్సీ కాల పరిమితి 2018 జూలై ఒకటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ తేదీ కంటే ఏడాది ముందుగానే ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

అలా ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిషన్ ఆరునెలల పాటు కసరత్తు చేస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు, ప్రతిపాదనలను తీసుకుంటుంది. వాటన్నింటినీ అధ్యయనం చేసి సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. వీటిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుంది. అన్ని అంశాల్లో తనదైన ముద్రతో ముందుకు పోతున్న ప్రభుత్వం.. పీఆర్సీ విషయంలో ఓ అడుగు ముందుకు వేస్తోంది. అయితే ప్రభుత్వ ప్రతిపాదనలకు ఉద్యోగులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

06:39 - August 17, 2017

హైదరాబాద్ : ప్రతి ఇంటికీ మంచి నీళ్లు ఇచ్చిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్ ఔటర్‌ రింగ్ రోడ్‌ పరిధిలోని 183 గ్రామాలకు మంచి నీటిని అందించే ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. 628 కోట్లతో చేపడుతున్న మంచినీటి ప్రాజెక్టుతో నీటి కరువు తీరుతుందన్నారు. సిటీలోని పేదలకు ఏడాది లోపు లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

భాగ్యనగరానికి తాగునీరు అందిస్తున్న వాటర్‌ బోర్డు మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అవుటర్ రింగ్ రోడ్‌ పరిధిలో ఉన్న గ్రామాలకు తాగునీరు అందించే ప్రాజెక్టుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.628 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో 7 మున్సిపాలిటీల్లోని 183 గ్రామాలకు త్రాగునీరు అందబోతోంది. వ‌చ్చే ఏడాదిలోపు ఓఆర్ఆర్ ప‌రిధిలోని గ్రామాలన్నింటికీ మంచినీరు అందుతుంద‌ని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో 83 గ్రామాల్లోని 10 లక్షల మందికి మేలుకలుగుతుందని చెప్పారు.


ఏడాదిలోగా ఈ ప‌నుల‌న్నీ పూర్తి చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. హైద‌రాబాద్‌లో 30 లక్షల విలువ చేసే ఇంటిని ప్రభుత్వం పేదలకు పూర్తిగా ఉచితంగా ఇస్తోందని కేటీఆర్‌ అన్నారు. సంవత్సరంలో లక్ష బెడ్ రూం ఇళ్లు కట్టి చూపిస్తామన్నారు. స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్న జలమండలికి కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. అనంతరం గండి మైసమ్మలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 

06:36 - August 17, 2017

సిరిసిల్ల : కరెంట్‌ సమస్య తీర్చండి మహాప్రభో అని రైతులు వేడుకుంటే ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని స్వయంగా మంత్రే సూచించారు. మెమోరాండాలతో పనికాదని.. రోడ్డెక్కితేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో మంత్రి కేటీఆర్‌ ఓ పంక్షన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమకు 24 గంటల కరెంట్‌ వద్దని, 24 గంటలు కరెంట్‌ ఇవ్వడంతో మోటార్లు కాలిపోతున్నాయని..నీరు వృధాగా పోతోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రం ఇవ్వబోయారు. అయితే కేటీఆర్‌ వినతిపత్రాలతో పనికాదని.. మీ సమస్య తీరాలంటే ముఖ్యమంత్రికి తెలిసేలా ధర్నా చేయాలని సూచించారు. ఇదే విషయం దేశం మొత్తం తెలవాలంటే తమకోసమైనా రైతులు ధర్నా చేయాలని చెప్పారు. దీంతో అవాక్కవ్వడం రైతుల వంతయ్యింది.

06:34 - August 17, 2017

రాజన్న సిరిసిల్ల : నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు కులపెద్దలు శిక్షవేశారు. కులబహిష్కరణ విధించి కసి తీర్చుకున్నారు. దళితుల పక్షాన సాక్ష్యం చెప్పనందుకు కులం నుంచి వెలివేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళారైతు ఇందిరారెడ్డి కుటుంబం కులపెద్దల వేధింపులతో నానా కష్టాలు పడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని మల్లారం గ్రామంలో అగ్రకుల పెత్తందారుల ఆగడాలు మితిమీరుపోతున్నాయి. దళితులను నోటికి వచ్చినట్టు తిట్టిన కేసులో సాక్ష్యం చెప్పినందుకు..కులపెద్దలు ఇందిరారెడ్డి కుటుంబానికి కులబహిష్కారం శిక్ష విధించారు. ఇందిరారెడ్డి కుటుంబంతో ఎవరు మాట్లాడినా, సహాయం చేసినా 20వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అంతేకాదు ఇందిరారెడ్డి కుటుంబానికి సాయం చేస్తే వారిని కూడా కులం నుంచి వెలివేస్తామని హుకుం జారీ చేశారు. దీంతో ఇందిరారెడ్డి కుటుంబంతో సొంత బంధువులు కూడా మాట్లాడ్డానికి సాహసించడంలేదు.

భర్త చనిపోయినా .. కృంగిపోలేదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు ఇందిరారెడ్డి. ఇదే సొంత కులస్తులకు కంటగింపుగా మారింది. ఈ నేపథ్యంలో గ్రామంలో దళితులతో వచ్చిన విభేదాలను ఆసరగా చేసుకుని ఇందిరా రెడ్డిని వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టారు. దళితులను దూషించిన కేసులో సాక్షిగా ఉన్న ఇందిరారెడ్డి సొంత కులస్తులకు వ్యతిరేకంగా ఉన్నవిషయాన్ని పోలీసులకు వివరించారు. దీంతో కొందరు రెడ్డి కులస్తులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టిన పోలీసులు తూతూ మంత్రంగా విచారణ సాగించి చేతులు దులుపుకున్నారు. తర్వాత దళితులకు అనుకూలంగా సాక్ష్యం చెబుతావా అంటూ ఇందిరా రెడ్డి కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారు.

ఇందిరారెడ్డి కుటుంబాన్ని బహిష్కరించడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మల్లారం గ్రామాన్ని సందర్శించిన ఐద్వా అధ్యక్షురాలు కేఎన్‌ ఆశాలత బాధితులను పరామర్శించారు. మహిళా రైతు కుటుంబానికి బాసటగా ఉంటామని తెలిపారు. నిష్పక్షపాతంగా వ్యవహరించిన ఇందిరారెడ్డి కుటుంబానికి గ్రామంలో దళితులు కృతజ్ఞతలు చెబుతున్నారు. కులబహిష్కారం పేరుతో వేధిస్తున్న పెత్తందారులపై కఠిన చర్యలు తీసుకోవాని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

06:29 - August 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 84 వేలకు పైగా ఉద్యోగ నియామకాల ప్రక్రియపై సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సీఎస్ నేతృత్వంలోని అధికారులు కనీసం వారానికోసారి భేటీ కావాలన్నారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యా సంస్థల్లోనూ వేలాది మంది ఉపాధ్యాయుల నియామకం జరపాల్సి వున్నందున దానికి సంబంధించి వెంటనే కార్యాచరణ రూపొందించాలని డిప్యూటి సిఎం కడియం శ్రీహరిని ఆదేశించారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. నోటిఫికేషన్లకు ముందే న్యాయ శాఖ అధికారులతో చర్చించాలన్నారు. ఎవరైనా కోర్టులో కేసులు వేస్తే వాటిని సమర్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండాలన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియకు అవలంభించాల్సిన మార్గదర్శకాలపై చర్చించారు. శాఖల వారీగా ఉద్యోగాల భర్తీకి వెంటవెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయించారు. ఉద్యోగాల భర్తీకి రోడ్‌మ్యాప్‌ రూపొందించాలని నిర్ణయించారు. న్యాయపరమైన అడ్డంకులు లేకుండా నోటిఫికేషన్లు జారీ చేసి వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని కార్యాచరణ రూపొందించారు.

ప్రస్తుతం అమలులో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పాత 10 జిల్లాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలా? లేక కొత్తగా ఏర్పాటైన 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని నోటిఫికేషన్లు జారీ చేయాలా అన్న అంశంపై చర్చించారు. ఇందుకోసం సాధారణ పరిపాలన శాఖ, న్యాయశాఖ ప్రతిపాదనలు, సలహాలు వెంటనే ఇవ్వాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశించారు. కొత్త జిల్లాల ప్రకారమైతే రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేయాల్సి వస్తుందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. శాఖల వారీగా ఖాళీల సంఖ్యను గుర్తించి, క్యాడర్‌ వారీగా వివరాలు, అభ్యర్థుల విద్యార్హతలు, రోస్టర్‌ పాయింట్లను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 21వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మరోసారి సమావేశం కావాలని కడియం శ్రీహరి నిర్ణయించారు. 

తయారవుతున్న మాస్టర్ ప్లాన్ నివేదిక..

విజయవాడ : సీఆర్డీఏపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈనెల 24, 25 తేదీల్లో పరిపాలన నగరానికి సంబంధించిన 400 పేజీల మాస్టర్ ప్లాన్ నివేదికను సీఎంకు నార్మన్ పోస్టర్ ప్రతినిధులు అందచేయనున్నారు. 

టిడిపిలో గంగుల చేరికపై రాని స్పష్టత..

విజయవాడ : నేడు మరోసారి సీఎం చంద్రబాబుతో గంగుల ప్రతాప్ రెడ్డి భేటీ కానున్నారు. టిడిపిలో గంగుల చేరికపై స్పష్టత రాలేదు. భేటీ అనంతరం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. 

రాంనగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్..

కరీంనగర్ : రాంనగర్ లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 31 మందిపై కేసులు నమోదు చేశారు. 7 కార్లతో పాటు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.

 

నేడు జగ్గారెడ్డి నిరహార దీక్ష..

సంగారెడ్డి : నేడు కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆమరణ నిరహార దీక్ష చేపట్టనున్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేయనున్నారు. 

Don't Miss