Activities calendar

18 August 2017

కంటైనర్ లో డబ్బు

కర్నూలు : నంద్యాల శివారులో గాజులపల్లి వద్ద కంటైనర్ లో డబ్బు ఉందని ఆర్టీసీ అధికారులకు సమాచారం అందిచారు. కంటైనర్ ను ఆర్డీఓ కార్యాలయానికి అధికారులు తరలించారు. 

గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వంచారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. 

 

21:59 - August 18, 2017
21:47 - August 18, 2017
21:44 - August 18, 2017

పాట్నా : బీహార్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. వరదలతో 16 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 230 మంది మృతి చెందారు. 98 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారు. మరోవైపు అసోంలోని కజిరంగా పార్కు జలమయం కావడంతో 140 జంతువులు మృత్యువాత పడ్డాయి.

గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బిహార్‌ను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కోసి, సీమాంచల్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. నదులు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. పంటలు పూర్తిగా నీట మునిగాయి.

అరారియా జిల్లాలో వరద కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బాద్‌ ప్రాంతంలో వరద ధాటికి ఓ వంతెన కూలిపోయి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరదలో కొట్టుకుపోయారు. 

వంతెన అంచువరకు నీరు చేరడంతో ప్రజలు అవతలివైపుకు వెళ్లేందుకు ఒక్కొక్కరుగా దాటుతూ ప్రయత్నించారు. ఓ కుటుంబం కూడా వంతెన దాటే యత్నం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. రెప్పపాటు కాలంలో ఓ చిన్నారితో పాటు ముగ్గురు కుటుంబసభ్యులు మృత్యువు పాలయ్యారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్‌ అయింది.

బిహార్‌లో 16 జిల్లాలపై వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. వరదల కారణంగా  230 మంది మరణించారు. గురువారం వరకు 119 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు సుమారు 3 లక్షల 60 వేల మందిని వరదల నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో 3 లక్షల 20 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వర్షాలు నెమ్మదించడంతో వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. 

మరోవైపు అసోంలో వరదలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. నెలలో రెండుసార్లు వరదలు సంభవించడంతో బ్రహ్మపుత్ర నదితో పాటు 6 నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. గత 12 గంటల్లో మరో పది మంది వరదలకు బలయ్యారు. ఇప్పటివరకు వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 134కు చేరింది. అసోంలోని 24 జిల్లాల్లోని 32 లక్షల మంది ప్రజలపై వరదలు తీవ్ర ప్రభావం చూపాయి.

కజిరంగా జాతీయ పార్కు 80 శాతం నీటితో నిండిపోయింది. వరదల కారణంగా ఆగస్టు పది నుంచి ఇప్పటివరకు 140 జంతువులు మృత్యువాత పడ్డాయని ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు. ఏడు రైనోలు, 122 జింక‌లు, రెండు ఏనుగులు, ఇంకా ర‌క‌ర‌కాల జంతువులు ఉన్నాయి. వరదల్లో చిక్కుకున్న జంతువులను అటవీశాఖ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

21:40 - August 18, 2017

అగర్తల : త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌పై ఫేస్‌బుక్‌లో ఫత్వా జారీ అయింది. సిఎం మాణిక్‌సర్కార్‌ తల నరికి తెచ్చిన వారికి 5.5 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు. రియారాయ్‌ పేరిట ఉన్న ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఈ ఫత్వా జారీ అయింది. ఈ అకౌంట్‌లో ఓ అమ్మాయి డిస్‌ప్లే ఫొటో కూడా ఉంది. ఫేస్‌బుక్‌లో తనకి తాను వరల్డ్‌ యాంటీ కమ్యూనిస్టు కౌన్సిల్‌ యాక్టివిస్టుగా ప్రకటించుకున్నారు. ప్రొఫైల్‌ సెక్షన్‌లో ఇంతకు మించిన వివరాలు లేవు. ఈ ఫత్వాపై త్రిపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐటి యాక్టు కింద్‌ కేసు రిజిస్టర్‌ చేసినట్లు పశ్చిమ త్రిపుర డిస్ట్రిక్ట్‌ పోలీస్‌ చీఫ్‌ అభిజిత్‌ సప్తర్ష తెలిపారు. ఈ కేసులో సైబర్‌ క్రైం నిపుణుల సహాయాన్ని తీసుకుంటామన్నారు.

 

21:38 - August 18, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ సమయం దగ్గర పడుతోండటంతో రాజకీయ పార్టీల ప్రచారం  తారా స్థాయికి చేరింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు మహోద్ధృతంగా ప్రచారం చేస్తున్నాయి. హోరాహోరీ పోరులో నంద్యాల ఉప ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. రేపటి నుంచి చంద్రబాబు 2 రోజుల పాటు ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు  ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. టీడీపీ, వైసీపీలు.. ఈసీకి ఫిర్యాదు చేశాయి.

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారానికి ఇంకా 3 రోజుల సమయమే ఉండటంతో.. ప్రచారం తారాస్థాయికి చేరింది. గెలుపే ధ్యేయంగా రెండు పార్టీలు పని చేస్తున్నాయి. వారం రోజులుగా నంద్యాలలోనే మకాంవేసి.. ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ అధినేత జగన్.. టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో ఆరోగ్య శ్రీ అధ్వానంగా తయారైందని మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ కింది సరైన వైద్యం అందక చిన్నపిల్లలు, హుద్రోగులు, కిడ్నీ పేషెంట్లు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి  వచ్చిందని  ఆవేదన వ్యక్తం చేశారు.  

టీడీపీ మంత్రులు ప్రతిపక్ష నేత జగన్‌ను టార్గెట్‌ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అభివృద్ధే నినాదంగా ముందుకు సాగుతున్నారు. తమ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్న టీడీపీ, వైసీపీలు.. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని... ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. నంద్యాల గాంధీచౌక్‌లో డబ్బు పంపణీ చేస్తున్న 25 మందిని పోలీసులు అరెస్టుచేసి, 90 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.  వీరంతా కడప, పులివెందుల, నెల్లూరుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో 11 మందిని అరెస్టుచేసి, ఆరు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాలలో వైసీపీ డబ్బులు పంచుతోందని ఆరోపిస్తూ... టీడీపీ ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ఉప ప్రధానాధికారి అనూప్‌సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీపై చర్యలు తీసుకోవాలని కోరింది.  

దీనిపై వైసీపీ కౌంటర్ దాడికి దిగింది. టీడీపీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ఎన్నిక కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. నంద్యాల  ఎన్నికల ప్రచారంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా డబ్బుల పంపిణీ చేసిన విషయాన్నిఫిర్యాదులో ప్రస్తావించింది. శనివారం నుంచి చంద్రబాబు కూడా రంగంలోకి దిగుతుండటంతో... ప్రచార పర్వం వేడెక్కనుంది. 

21:30 - August 18, 2017

హైదరాబాద్ : కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుకు సింగరేణి యాజమాన్యం అంగీకారం తెలిపింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసింది. పెరిగిన వేతనాలు జనవరి 2017 నుంచి అమలవుతాయని స్పష్టం చేసింది. పెరిగిన వేతనాలు రోజుకి అన్ స్కిల్డ్ రూ.350 , సెమీ స్కిల్డ్ రూ.420, స్కిల్డ్ రూ.506, హైలీ స్కిల్డ్‌ రూ.593 గా అమలు కానున్నాయి. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచడం పట్ల సీఐటీయూ హర్షం వ్యక్తం చేసింది. జేఏసీ ఆధ్వర్యంలో కార్మికుల పోరాటాల ఫలితంగానే వేతనాల పెంపు సాధ్యమైందని సీఐటీయూ నేతలు అన్నారు. 

 

మొబైల్ షాపులో కానిస్టేబుల్ చేతివాటం

కృష్ణా : విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లోని సోలంకి మొబైల్ షాపులో ఓ కానిస్టేబుల్ చేతివాటం ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. కానిస్టేబుల్ గల్లాపెట్టెలో డబ్బులు దొంగిలిస్తున్న దృశ్యాలు షాపులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా కానిస్టేబుల్‌ను పట్టుకున్న షాపు యజమానులు పోలీసులకు అప్పగించారు.

21:24 - August 18, 2017

కృష్ణా : విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లోని సోలంకి మొబైల్ షాపులో ఓ కానిస్టేబుల్ చేతివాటం ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. కానిస్టేబుల్ గల్లాపెట్టెలో డబ్బులు దొంగిలిస్తున్న దృశ్యాలు షాపులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా కానిస్టేబుల్‌ను పట్టుకున్న షాపు యజమానులు పోలీసులకు అప్పగించారు. సీఎం బందోబస్తు కోసం వచ్చిన కానిస్టేబుల్ ఉదయం నుంచి ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో తచ్చాడుతున్నట్లు షాపు యజమానులు చెబుతున్నారు. 

 

21:17 - August 18, 2017

పంద్రాగస్టు గొలిగ అవద్దంజెప్పిన సీఎం, నషాలానికెక్కిన నంద్యాల లడాయి, తెలంగాణ దేశానికే పాఠం నేర్పుతున్నది, బీజేపీకి దగ్గరైతున్న కోమటిరెడ్డి బ్రదర్స్, వందల కోట్లు వసూలు జేశ్న పార్టీలు, ముసలామె మీద దాడి జేశ్న పంది... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:09 - August 18, 2017

కుట్ర ప్రకారంగా ప్రొమోషన్ అడ్డుకున్నారని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బాధిత ఉద్యోగి డా.కిరణ్ కుమార్, దళిత సంఘం నేత రాజాసుందర్ బాబు పాల్గొని, మాట్లాడారు. తన పట్ల కొంతమంది కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని డా.కిరణ్‌కుమార్‌ అన్నారు. రోస్టర్ పాయింట్ విధానం సక్రమంగా అమలు కాలేదని చెప్పారు. 'ఏపీ వైద్య విద్యాశాఖ ప్రమోషన్లలో అక్రమాలు బయటపడ్డాయి. దళిత అధికారికి ప్రమోషన్‌ రాకుండా కొంతమంది అగ్రవర్ణ ఉద్యోగులు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పొందాల్సిన రిజర్వేషన్లను వారికి ఇవ్వకుండా అగ్రకుల ఉద్యోగులకు కట్టబెట్టారని పలువురంటున్నారు'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:53 - August 18, 2017

మహివీ రాఘవ డైరెక్ట్ చేసిన సినిమా ఆనందో బ్రహ్మ. ఈ సినిమాకు నిర్మాత విజయ్ చిల్లా. ఈ చిత్రంలో హీరోయిన్ తాప్సీ, నటులు వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్ తదితరులు నటించారు. సినిమా ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. సినిమా రివ్యూ, రేటింగ్ విశేషాలను వీడియోలో చూద్దాం... 

ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా డబ్బులు పంచారు : వైసీపీ

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా డబ్బులు పంచారని పేర్కొన్నారు. 

20:42 - August 18, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా డబ్బులు పంచారని పేర్కొన్నారు. 

 

20:34 - August 18, 2017

హైదరాబాద్ : ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 8వ జాతీయ మహాసభలు ఎస్వీకేలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి 350కి పైగా ప్రతినిధులు మహాసభలకు హాజరయ్యారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బిజేపీ ప్రభుత్వంపై ఐక్యంగా ఉద్యమించాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.

ఎస్వీకేలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ మహాసభలు మొదలయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న మహాసభలకు 350కి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందు ఈఫీ జాతీయ అధ్యక్షులు హబీద్ ముందుగా పతాకావిష్కరణ చేశారు. ఈఫీ ప్రతినిధులు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. 

భాగ్యనగరంలో ఈఫీ జాతీయ మహాసభలు జరగడం సంతోషకరమన్నారు విద్యావేత్త చుక్కారామయ్య. కార్మిక వర్గ సమస్యలపై ఐక్య పోరాటాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు. బిజెపి సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలను, సంస్కరణలను వేగంగా అమలు చేస్తోందని సీఐటియూ జాతీయ అధ్యక్షురాలు కె.హేమలత అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మికులు, ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసేలా దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ఆమె అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కార్మికుల సమ్మెలు, పోరాటాలపై  కొనసాగుతున్న నిర్బంధంపై కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని ఆమె కోరారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 9 నుండి 11 వరకూ ఢిల్లీలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. 

20:29 - August 18, 2017
20:06 - August 18, 2017

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో లోధా బిల్డర్, బాధితుల సమావేశం ముగిసింది. ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టనందుకు లోధా బిల్డర్‌పై కమిషనర్‌ సీరియస్ అయ్యారు. 15రోజుల్లో పూర్తి రివైజ్ ప్లాన్‌తో రావాలని ఆదేశించారు. కమిషనర్ చర్యలతో తమకు న్యాయం జరుగుతుందని బాధితులు భావిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం వీడియోలో చూద్దాం...

శశికళ మద్దతుదారులు సమావేశం

తమిళనాడు : శశికళ మద్దతుదారులు చెన్నైలోని ఓ హోటళ్లో సమావేశమయ్యారు. ఇరువర్గాలు ఏ క్షణమైన మెరీనా బీచ్‌ వద్దకు చేరుకోవచ్చని సమాచారం. ఈ క్రమంలో మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద అలంకరణ పనులు కూడా జరుగుతున్నాయి. 

19:57 - August 18, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుకు రంగం సిద్ధమైంది. అన్నాడీఎంకే వర్గాల విలీన ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఈ మేరకు పన్నీర్‌ సెల్వం.. సీనియర్‌ నేతలతో, మంత్రులతో, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మరోవైపు శశికళ మద్దతుదారులు చెన్నైలోని ఓ హోటళ్లో సమావేశమయ్యారు. ఇరువర్గాలు ఏ క్షణమైన మెరీనా బీచ్‌ వద్దకు చేరుకోవచ్చని సమాచారం. ఈ క్రమంలో మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద అలంకరణ పనులు కూడా జరుగుతున్నాయి. 

పెరిగిన వేతనాల అమలుకు సింగరేణి యాజమాన్యం అంగీకారం

హైదరాబాద్ : సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు పెరిగిన వేతనాల అమలుకు సింగరేణి యాజమాన్యం అంగీకారం తెలిపింది. సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్ జారీ చేసింది. పెరిగిన వేతనాలు జనవరి, 2017 నుంచి అమలు కానున్నాయి. పెరిగిన వేతనాల ప్రకారం... అన్ స్కిల్డ్ కార్మికులకు రోజుకు రూ.359 వేతనం, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.420, స్కిల్డ్ కార్మికులకు రూ.506, హైలీ స్కిల్డ్ కార్మికులకు రోజుకు రూ.593 వేతనం. వేతనాల పెంపుపై సీఐటీయూ హర్షం వ్యక్తం చేసింది. 

 

కాపేసట్లో ఏఐఏడీఎంకే వర్గాలు విలీనం

చెన్నై : కాపేసట్లో ఏఐఏడీఎంకే వర్గాలు విలీనం కానున్నాయి. మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి వద్ద విలీన సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

19:39 - August 18, 2017

తూర్పుగోదావరి : తూర్పున రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దఎత్తున ... వైసీపీ వైపు వలసలు సాగుతున్నాయి. మాజీలు జగన్‌ గూటికి చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. చేరికలతో.. గత ఎన్నికల్లో డీలా పడ్డ పార్టీ ఇప్పుడు జవసత్వాలు కూడదీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది.
తూర్పువైపు దృష్టి సారిస్తున్న పార్టీలు
తూర్పున సత్తా చాటుకుంటున్న...పార్టీనే.. ఏపీలో అధికార పీఠం దక్కించుకుంటుంది. గతంలో జరిగిన అనేక ఎన్నికల ఫలితాల్లో ఇదే తేలింది. అందుకే ఎన్నికల బరిలో నిలుచున్న పార్టీలన్నీ తూర్పువైపు దృష్టి సారిస్తాయి. తూర్పుగోదావరి జిల్లా.. రాష్ట్రంలోనే అత్యధిక శాసనసభా స్థానాలతో కీలకమైన జిల్లా.. గడచిన ఎన్నికల్లో మొత్తం 19 స్థానాలకు గానూ 14 చోట్ల టీడీపీ కూటమి విజయకేతనం ఎగురవేసింది. అధికారంలోకి వచ్చింది. దీంతో వైసీపీ ఇక్కడ పట్టు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.  
గతంలో 5 స్థానాలకు మాత్రమే పరిమితమైన వైసీపీ
గతంలో ఐదు స్థానాలకు మాత్రమే పరిమితమైన వైసీపీ... ఈసారి ఇక్కడ విజయాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి తగ్గట్టుగా.. స్థానిక నాయకులు కూడా వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. 2014 ఎన్నికల నాటికి ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో కురసాల కన్నబాబు, రౌతు సూర్యప్రకాశరావు, పాముల రాజేశ్వరి వంటి వారు ఇటీవల వైసీపీలో చేరారు. ఇక ఆ ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున పోటీ చేసిన కందుల దుర్గేష్‌ ఇప్పటికే వైసీపీలో చేరారు. మాజీ ఏపీఐఐసీ చైర్మన్‌ శ్రీఘా కోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం అదే బాట పట్టారు. అలాగే జగ్గంపేట టీడీపీ నేత జ్యోతుల చంటిబాబు, ముమ్మిడివరంలో పొన్నాడ సతీష్‌ వైసీపీలో చేరడం ఖాయమనే ప్రచారం సాగుతోంది.
వైసీపీలో జంప్‌ చేస్తున్న స్థానిక నేతలు
అదే సమయంలో వైసీపీ నుంచి ఇద్దరు నేతలు వీడిపోయారు. వారిలో ముమ్మిడివరం నుంచి పోటీచేసి ఓడిపోయిన గుత్తుల సాయి టీడీపీలో చేరగా.. మండపేట నుంచి బరిలోదిగి పరాజయం పాలైన వెంకటస్వామి నాయుడు వైసీపీకి గుడ్‌ బై చెప్పేశారు. అయితే వైసీపీని వీడిన నాయకులకంటే... ఆ పార్టీలోకి వస్తున్న నేతలు పెద్ద సంఖ్యలో ఉండడం విశేషం. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా వైసీపీలోకి జంప్‌ చేశారు.
జగన్‌ సేనలో కొత్త ఉత్సాహం
మొత్తానికి చేరికలతో.. జగన్‌ సేనలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అందులోనూ కీలక సామాజిక వర్గాలకు చెందిన నేతలు తరలి వస్తుండడంతో.. బలం పుంజుకుంటుంది. అయితే కొత్త నీరు రాకతో... పార్టీలో ఉన్న పలువురు నేతల్లో కలవరం మొదలైంది. తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోననే బెంగ పట్టుకుంది. 

 

19:29 - August 18, 2017

కృష్ణా : జిల్లాలోని కంచికచర్ల మండలం పరిటాల సమీపంలో అక్రమంగా మైనింగ్‌ చేస్తున్న క్వారీలపై గనుల శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. క్వారీల్లో నిర్వహిస్తున్న పేలుళ్లతో బండరాళ్లు ఇళ్లపై పడుతున్నాయని దొనబండ వాసులు చేసిన ఫిర్యాదుతో అధికారులు కదిలారు. పేల్చివేత సమయంలో భద్రతా చర్యలు పాటించని గనుల యజమానులపై మైనింగ్‌ సేఫ్టీ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. మైనింగ్‌ సేఫ్టీ అధికారులు విజయ్‌కుమార్‌, మహేశ్‌కుమార్‌... గనులను తనిఖీ చేశారు.  బ్లాస్టింగ్స్‌  సమయంలో భద్రతా చర్యలు చేపట్టకపోవడంపై నివేదిక రూపొందిస్తున్నారు. 

 

19:27 - August 18, 2017

కృష్ణా : విజయవాడలోని...భవానీపురంలోని నకిలీ ఇంజన్‌ ఆయిల్‌ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేసి... 800 లీటర్ల నకిలీ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్‌లు లేకుండా... నకిలీ జీటీ ఆయిల్‌ను తయారు చేస్తున్న మూడు ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరు లక్షల విలువ వేసే ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఈ కేంద్రాలను సీజ్ చేశామని, సిబ్బందిని అదుపులోకి తీసుకుని పోలీసులు చెప్పారు.

 

19:23 - August 18, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ప్రచారం హోరెత్తుత్తోంది. ప్రచారంలో మహిళా మంత్రులు అఖిల ప్రియ, పరిటాల సునీత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అభివృద్ధే నినాదంగా నంద్యాల ఉప ఎన్నికల్లో రోడ్‌ షో నిర్వహించారు. ప్రజలు అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని... వైసీపీ మాయమాటలు కాదని మంత్రులు ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. అభివృద్ధి నినాదంతో నంద్యాల ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని మంత్రి పరిటాల సునీత అన్నారు. చంద్రబాబు పాలనలో నంద్యాల ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి విజయం తథ్యమన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ అభివృద్ధి నిరోధకుడని చెప్పారు. జగన్‌ ఇంటింటికి తిరిగినా విజయం టీడీపీదే అని మంత్రి అఖిల ప్రియ అన్నారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి వెంటపెట్టుకోకుండా జగన్‌ ప్రచారం చేయడంతో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడు  నంద్యాల అభివృద్ధికి శిల్పా కృషి చేయలేదని విమర్శించారు.

 

19:21 - August 18, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం ఎపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ నేతృత్వంలోని టీడీపీ ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ఉప ప్రధానాధికారి అనూప్‌సింగ్‌ను కలిసి వైపీసీపై ఫిర్యాదు చేశారు.  వైపీసీ నేతలు డబ్బుల పంపిణీ, ఎన్నికల ప్రచారంలో జగన్‌ వాడుతున్న అభ్యంతరకరమైన భాష.. తదితర విషయాలను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తెచ్చారు. 
 

కొత్త రూ.50 నోటు డిజైన్ ను సిద్ధం చేసిన ఆర్ బీఐ

ఢిల్లీ : ఆర్ బీఐ కొత్త రూ.50 నోటు డిజైన్ ను సిద్ధం చేసింది. త్వరలో కొత్త రూ.50 నోటు విడుదల చేయనున్నారు. 

తుది దశకు ఏఐఏడీఎంకే వర్గాల విలీన ప్రక్రియ

 చెన్నై : ఏఐఏడీఎంకే వర్గాల విలీన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి వద్ద విలీన సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

ఎన్ సీఏఈఆర్..2017 సర్వేలో ఏపీకి 19 వ స్థానం

గుంటూరు : ఎన్ సీఏఈఆర్..2017 సర్వేలో ఏపీకి 19 వ స్థానం లభించిందని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ కుటుంబరావు తెలిపారు. ఎన్ సీఏఈఆర్ 2016 సర్వేలో ఏపీ మొదటి స్థానంలో ఉందని ప్రతిపక్ష నేత జగన్ హడావిడి చేశారని...అది ఉమ్మడి రాష్ట్రానికి వచ్చిన సర్వే అని అన్నారు. 

18:29 - August 18, 2017
18:27 - August 18, 2017

నల్గొండ : రాష్ట్రాన్ని చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం పాలిస్తుందో.. లేక దోపిడి దొంగలు పరిపాలిస్తున్నారో అర్థం కావడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో రైతుల భూములను అక్రమంగా రాంకీ సంస్థ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వైనంపై టీమాస్‌ ఫోరం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఈమేరకు తమ్మినేనితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామని చెప్పారు. న్యాయం జరిగేంత వరకూ రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

 

 

18:15 - August 18, 2017

వికారాబాద్ : రాష్ట్రంలో సభలు, సమావేశాలు జరుపుకునే హక్కుపై దాడులు జరుగుతున్నాయని జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ ఆరోపించారు. మీరాకుమార్‌ నేరెళ్లకు వచ్చినప్పుడు శాంతి భద్రతలకు సమస్య వస్తుందని అడ్డుకోవడం.. తాను నిజామాబాద్‌ సభకు వెళ్తుంటే అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. సభలు, సమావేశాలు అడ్డుకోవడం రాజ్యంగ విరుద్ధమన్నారు.

17:42 - August 18, 2017

ఈసీకి ఫిర్యాదు చేసిన టిడిపి

హైదరాబాద్: ఎన్నికల అధికారి అనూప్ సింగ్ కు టిడిపి ఫిర్యాదు చేసింది. నంద్యాలలో ఓటర్లను వైసీపీ డబ్బులతో ప్రలోభ పెడుతోందని ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని ఫిర్యాదు చేశారు.

17:36 - August 18, 2017

ఢిల్లీ : ఉగ్రవాద వ్యాప్తి, మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌ జాతీయ దర్యాప్తు సంస్థపై ఆరోపణలు చేశారు. తాను ముస్లింను అయినందుకే ఎన్‌ఐఏ తనను టార్గెట్‌ చేసిందని నాయక్‌ ఇంటర్‌పోల్‌తో చెప్పారు. జకీర్‌ నాయక్‌కు రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయాలని ఎన్‌ఐఏ ఇంటర్‌పోల్‌ను కోరింది. 2016 జులైలో ఢాకాలో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఎన్‌ఐఏ జకీర్‌ నాయక్‌పై నజర్‌ పెట్టింది. జకీర్‌ నాయక్‌ ప్రసంగాలు తమను ఉత్తేజ పరిచడంతోనే దాడులకు పాల్పడ్డామని అప్పట్లో ఉగ్రవాదులు పేర్కొన్నారు. ఈ ఘటనతో జకీర్‌ నాయక్‌ భారతదేశం విడిచి విదేశాలకు పారిపోయారు.  తన ప్రసంగాలు జిహాద్‌ను ప్రేరేపించవని...కేవలం శాంతికోసమే ఉపన్యాసాలిస్తానని జకీర్‌నాయక్‌ తెలిపారు.

 

17:33 - August 18, 2017

ఢిల్లీ : దేశంలో స్వైన్‌ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌, పంజాబ్, ఒడిషా, తెలంగాణ తదితర దక్షిణాది రాష్ట్రాల్లో స్వైన్‌ ఫ్లూ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ఆగస్టు 13 వరకు 18,855 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదు కాగా...మహారాష్ట్రలో ఈ సంఖ్య అత్యధికంగా ఉంది. మహారాష్ట్రలో 4,011, తమిళనాడులో 2969, కర్ణాటకలో 2892, గుజరాత్‌లో 1609, తెలంగాణలో 1509, కేరళలో 1353, ఢిల్లీలో 1307, రాజస్థాన్‌లో 538 కేసులు నమోదయ్యాయి. సాధారణంగా స్వైన్‌ఫ్లూ చలికాలం అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో విజృంభిస్తుంది కానీ రెండు నెలల ముందే పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో స్వైన్‌ ఫ్లూ మృతుల సంఖ్య 14కి చేరింది.

 

17:31 - August 18, 2017

రాజమండ్రి : పులస..! ఇదో వలస చేప. మార్కెట్‌లో ఈ చేపకున్న డిమాండే వేరు. పుస్తెలు తాకట్టు పెట్టయినా పులస తినాలన్న నానుడి గోదావరి జిల్లాల్లో  ఉంది. కానీ, ఈసారి వలస పులసలు రానేలేదు. పులస ప్రియుల ఆశలు అడియాసలే అవుతున్నాయి. భోజనప్రియులనే కాదు.. పులస వేట మీద ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులూ ఈసారి నిరాశ పడక తప్పడంలేదు. గోదావరి జిల్లాల స్పెషల్‌.. పులస చేప కష్టాలపై ప్రత్యేక కథనం...
పులస.. పేరు వింటేనే నోరూరిపోతోంది..  
పులస.. ఈ పేరు వింటేనే భోజన ప్రియుల నోరూరిపోతుంది. ఈ చేప గురించి తెలిసిన వారు పులస రుచిని ఎప్పుడు ఆస్వాదిద్దామా అని ఎదురుచూస్తుంటారు. పుస్తెలమ్మైనా సరే పులస తినాలనే నానుడి కూడా వాడుకలో ఉందంటే ఈ చేప ప్రత్యేకత ఏమిటో ఆర్థం చేసుకోవచ్చు. ఇది అంత ఆషామాషీగా దొరికే చేపేమీ కాదు. నిజానికిది మన దేశపు చేపే కాదు. 
పసిఫిక్‌ మహాసముద్రంలో జీవం 
ఆస్ట్రేలియా సమీపంలో పసిఫిక్‌ మహాసముద్రంలో జీవం పోసుకొని అక్కడి నుండి హిందూ మహాసముద్రం మీదుగా బంగాళాఖతంలోకి వచ్చి చేరుతుంది పులస. సముద్రంలో ఉన్నంత కాలం దానిని విలసగా పిలుస్తారు. ఆ తర్వాత జులై, ఆగష్టు మాసాల్లో వరద నీటికి ఎదురీదుతూ గోదావరిలోకి పయనిస్తుంది. అప్పటి నుంచి విలస కాస్తా పులసగా నామాంతరం చెందుతుంది. గోదావరిలో వేటకు వెళ్లే మత్స్యకారులు దీని పేరును పులసగా స్థిరీకరించారు. 
వరదల కాలంలో పులస చేప లభ్యం
ఒకప్పుడు, సాదాసీదా చేపగా పులసను గోదావరి వాసులు భావించేవారు. కేవలం మూడు, నాలుగు నెలల వరదల కాలంలో లభ్యమయ్యే ఈ చేపను స్థానికంగా వినియోగించుకునేవారు. పులసను వండటం కూడా ఒక ప్రత్యేకమే. ప్రత్యేకమైన మట్టిపాత్రలో కట్టెల పొయ్యి మీద ఈ చేపను వండితే దీని రుచి రెట్టింపవుతుందని చేప ప్రియుల అభిప్రాయం. ఇటీవల కాలంలో ఈ చేప ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. పులసకు భారీగా ప్రచారం లభించడంతో మామూలుగానే దీని ధర అమాంతం పెరిగిపోయింది. ఒక్క చేప ధరే ఐదారువేల కంటే ఎక్కువ ఉంటుంది. దీంతో స్థానికులు, సామాన్యులకు ఈ చేపను చూడటమే తప్ప జిహ్వచాపల్యం తీర్చుకునే అవకాశం లేకుండా పోయింది. 
గోదావరి తీరానికి చేప ప్రియులు  
ప్రస్తుతం పులసల సీజన్‌ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి చేప ప్రియులు గోదావరి తీరానికి తరలివస్తున్నారు. అయితే వీరిని నిరుత్సాహ పరుస్తోంది పులస. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా, గోదావరికి వరద స్థాయిలో ప్రవహించలేదు. దీంతో పులస చేపలు సముద్రం నుంచి గోదాట్లోకి రానే లేదు. పైగా కాలుష్యం పెరగడం కూడా.. పులస వలసకు అడ్డంకిగా మారిపోయింది. పులస వేటకువెళ్లిన మత్స్యకారులు నిరాశతోనే వెనుదిరిగి వస్తున్నారు. ఒక్క పులస చేపను పట్టుకుంటే వారమంతా గడిచిపోతుందని, కాని ఇప్పుడు అసలు పులసే లేకపోవడంతో తమ సీజనల్‌ ఆదాయానికి గండిపడిందని మత్య్సకారులంటున్నారు. 
పులస లభ్యం కాకపోవడంపై చేప ప్రియులు అసంతృప్తి
అటు పులస చేప కోసం లొట్టలేస్తూ వచ్చిన వారు కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. పులస కోసం ఎంతో ఆశతో వస్తే.. చేపే లభ్యం కావడం లేదని, అక్కడక్కడా ఒకటీ అరా దొరికినా అనూహ్యంగా పెరిగిపోయిన ధర కారణంగా రుచి చూడలేక  పోతున్నామని అంటున్నారు. మొత్తానికి పులస ఇటు మత్స్యకారులను, పులస ప్రియులను ఈఏడాది తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. పులస లేకపోవడంతో నోరు కట్టేసుకోవడం తప్ప చేసేదేముందంటూ వెనుదిరుగుతున్నారు..  పులస ప్రియులు.

 

మేత లేక మృత్యువాత పడ్డ ఆవులు

ఛత్తీ స్ గఢ్: మేత లేక ఆవులు ప్రాణాలు విడిస్తున్నాయి. కేవ‌లం రెండు రోజుల్లోనే 200 ఆవులు చ‌నిపోయిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ ఘ‌ట‌న దుర్గ్ స‌మీపంలో ఉన్న రాయ్‌పూర్‌ గోశాల‌లో జ‌రిగింది. తిండి లేక‌నే ఆవులు మృతిచెందిన‌ట్లు గ్రామ స‌ర్పంచ్ సేవారామ్ సాహూ తెలిపారు.

హరిత హారం పై సమీక్ష...

హైద‌రాబాద్: హ‌రిత‌హారంపై స‌చివాల‌యంలో అట‌వీ శాఖ ఉన్న‌తాధికారులు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. అన్ని జిల్లాల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. మొక్క‌లు చ‌నిపోతే వాటి స్థానంలో కొత్త మొక్క‌లు నాటాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. నాటిన మొక్క‌ల సంర‌క్ష‌ణకు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని చెప్పారు. ఒకే చోట ఎక్కువ మొక్క‌లు ఉంటే ఫెన్సింగ్ ఏర్పాటే చేయాల‌ని సూచించారు. 

వినాయక చవితి, బక్రీద్ ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

హైదరాబాద్ : సౌత్ జోన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలపై గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు మండపాల నిర్వాహకులతో సీపీ మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలను, బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంత వాతావారణంలో జరుపుకోవాలని సీపీ మహేందర్ రెడ్డి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు అన్ని శాఖలు సహకరించాలని ఆయన పేర్కొన్నారు.

మైనర్ బాలిక కేసులో ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్: పాదబస్తీలో మైనర్ బాలిక పెళ్లి కేసు లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒమన్ కు చెందిన 65 ఏళ్ల షేక్ తో బాలికకు పెళ్లి చేసిన ముగ్గురు బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

కమిషనర్ తో లోధా బిల్డర్, బాధితుల సమావేశం

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ కమిషనర్ తో లోధా బిల్డర్, బాధితుల సమావేశం ముగిసింది. ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టనందుకు లోధా బిల్డర్ పై జీహెచ్ ఎంసీ కమిషనర్ సీరియస్ అయ్యారు. 15 రోజుల్లో పూర్తి రివైజ్డ్ ప్లాన్ తో రావాలని బిల్డర్ కు కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కమిషనర్ స్పందించిన తీరుపై లోధా బాధితులు సంతృప్తి చెందినట్లు సమాచారం.

 

17:22 - August 18, 2017

పెద్దపల్లి : అధికారం లేదు..ఆర్భాటం లేదు..హోదా లేదు..జై కొట్టిన క్యాడర్‌ లేదు. నిరాశ, నిస్తేజంలో మునిగిపోయిన పెద్దపల్లి తెలుగు తమ్ముళ్లు.. రాజకీయ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే పనిలో పడ్డారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గోడదూకేందుకు సిద్ధమవుతున్నారు. పెద్దపల్లి టిడిపి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు సైకిల్‌ పార్టీకి టాటా చెప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవకాశం వస్తే టిఆర్ఎస్...లేదంటే కాంగ్రెస్‌లో చేరెందుకు సుముఖంగా ఉన్నట్లు పార్టీలోను...నియోజక వర్గంలోను జోరుగా చర్చ సాగుతోంది.  
పెద్దపల్లి నియోజకవర్గంలో టీడీపీ డీలా 
రాష్ట్ర విభజన, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌ హవాతో పెద్దపల్లి నియోజకవర్గంలో టీడీపీ డీలా పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో సైకిల్‌ పార్టీ ప్రాధాన్యత తగ్గుతూవచ్చింది. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన పార్టీగా ఉన్న టిడిపి పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. టిడిపికి ప్రజాధరణ కరవవుతుండడంతో ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్న నేతలంతా రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీలో చేరేందుకు సిద్దపడుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో టిడిపి క్యాడర్ గోడదూకడంతో.. పార్టీలో లీడర్లే మిగిలిపోయారు. క్యాడర్ లేని పార్టీలో ఉండడం కన్నా పార్టీని వీడటమే మేలు అని భావిస్తున్నారు. ఇప్పటికే టిఆర్ఎస్,కాంగ్రెస్ నేతలతో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు రహస్య మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. 
గత సార్వత్రిక ఎన్నికల్లో విజయ రమణారావు ఘోర ఓటమి 
గత సార్వత్రిక ఎన్నికల్లో విజయ రమణారావు ఘోర ఓటమిని చవిచూశారు. టిఆర్ఎస్ అభ్యర్థిగా దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి భాను ప్రసాద్ రావు రెండో స్థానంలో...విజయ రమణారావు మూడో స్థానంతో నిలిచారు. తాజాగా పెద్దపల్లి టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమనడం...ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై ప్రజా వ్యతిరేక పెరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన భాను ప్రసాద్ రావు కారు పార్టీలో చేరడంతో.. రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 
కాంగ్రెస్ సీనియర్ నేతలతో విజయ రమణారావు రహస్య మంతనాలు 
విజయ రమణారావు టీడీపీలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు టిడిపిలోనే కొనసాగుతున్నారు. 1993-94 సంవత్సరాల్లో తెలుగు యువత జిల్లా అద్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా 1995లో జూలపల్లి జడ్పిటిసిగా పనిచేశారు. 2009లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ గూటికి వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పెద్దపల్లి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్...పార్టీ నిర్మాణం ఉన్నా..ప్రజాదరణ పొందిన నాయకుడు లేకపోవడం మైనస్‌ పాయింట్‌గా మారింది. విజయ రమణారావుకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ కాంగ్రెస్ పార్టీకి తోడైతే 2019 ఎన్నికల్లో గెలుపు సులభతరం అవుతుందనేది హస్తం నేతల అభిప్రాయం. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలతో రహస్య మంతనాలు జరిపారన్న వార్తలు వినిపిస్తున్నాయి. 
కారు పార్టీతో బెడిసికొట్టిన దోస్తీ ప్రయత్నాలు 
మరోవైపు హస్తం పార్టీతో మంతనాలకు ముందే ముందే కారు పార్టీతో దోస్తీ చేసేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయట. ఇందుకు కారణం పెద్దపల్లి ఎమ్మెల్యే టికెట్‌పై కన్నెసిన ఆశావహుల జాబితా పెరగడమే అని తెలుస్తోంది. ఇప్పటికే సిట్టింగ్‌ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో పాటు ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డిలు పార్టీ టికెట్ కోసం పట్టుబడుతున్నారట. మొత్తంగా డైలామాలో ఉన్న విజయ రమణారావు అడుగులు కాంగ్రెస్ పార్టీ వైపా..లేక టిఆర్ఎస్ వైపా పడతాయా అన్నది సస్పెన్స్‌గా మారింది. 

 

17:14 - August 18, 2017

కర్నూలు : నంద్యాలలో టీడీపీ గెలుపు తథ్యమని... ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ తన మాటలతో విశ్వసనీయతను కోల్పోతున్నాడని ... జగన్‌కు ఎంత ఆస్తి ఉందో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. ప్రజలను మోసం చేయాలనుకోవడం సరికాదన్నారు. ఏది ఏమైనా నంద్యాలలో టీడీపీ గెలిచితీరుతుందని స్పష్టం చేశారు.

 

17:12 - August 18, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ప్రచారం హోరెత్తుత్తోంది. ప్రచారంలో మహిళా మంత్రులు అఖిల ప్రియ, పరిటాల సునీత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అభివృద్ధే నినాదంగా నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటున్న పరిటాల సునీత, అఖిప్రియతో టెన్ టీవీ ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో నంద్యాల ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి విజయం తథ్యమని తెలిపారు. ప్రతిపక్ష నేత జగన్‌ అభివృద్ధి నిరోధకుడని విమర్శించారు. జగన్‌ ఇంటింటికి తిరిగినా విజయం టీడీపీదే అని అఖిల ప్రియ
అన్నారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి వెంటపెట్టుకోకుండా జగన్‌ ప్రచారం చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్శించారు. మంత్రిగా ఉన్నప్పుడు నంద్యాల అభివృద్ధికి శిల్పా కృషి చేయలేదని పేర్కొన్నారు.

 

16:45 - August 18, 2017

పెద్దపల్లి : బీడు భూములకు సాగునీరందించాలన్న ప్రభుత్వ సంకల్పం నీరుగారిపోతోంది. ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించడానికి అవసరమైన నిధులు కేటాయించినప్పటికీ, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నాయి. పంటలకు సాగునీరందక చివరి ఆయకట్టు రైతాంగం యేటా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎత్తిపోతల ప్రాజెక్టులతో తమ రాతలు మారతాయని.. వాటికోసం ఎదురు చూస్తున్న పెద్దపల్లి జిల్లా గ్రామాలపై స్పెషల్‌ ఫోకస్‌....
ఏళ్లు గడిచినా అందని నీరు
పెద్దపల్లిలో గోదావరి, మానేరు నదుల పరివాహక ప్రాంతాల్లోని బీడు భూములకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ఎత్తిపోతల పథకం మాటలకే పరిమితం అవుతోంది.  ఏళ్ల తరబడి చివరి ఆయకట్టు రైతులు కేవలం వర్షాన్ని నమ్ముకొని పంటలను సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాల అవసరాలను గుర్తించి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంది ప్రభుత్వం. ప్రాజెక్టు పూర్తైతే తమ పంటలకు నీరందుతుందని సంబరపడ్డారు ఆయా గ్రామాల ప్రజలు. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు నుండి చుక్క నీరు కూడా అందలేదు. 
అధికారుల చిత్తశుద్ధి లోపంతో నిలిచిన పనులు
ఓదెల మండలం, మానేరు వాగు నుంచి పోత్కపల్లి, ఇందుర్తి, శానగొండ, మడక, రూప్‌ నారాయణ పేట, గూడెం గ్రామాల్లోని 12 వందల ఎకరాలకు సాగునీందించడానికి అప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 2008లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి 420కోట్లతో ఎత్తిపోతల ప్రాజెక్టుకు పునాదిరాయి వేశారు. పనులు ప్రారంభం అయినప్పటికీ అధికారులకు ప్రాజెక్టుపై చిత్త శుద్ధిలోపించడంతో పనులు నిలిచిపోయాయి. పనులు ఆగిపోవడంతో మూడేళ్లుగా రైతులు పంటలు పండించక తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు నిర్మాణ పనుల గురించి రైతులు మంత్రి హరీష్‌ రావు దృష్టికి తీసుకెళ్లగా ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హమీ ఇచ్చారు. అయినప్పటికీ పనులు ప్రారంభం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.5.60 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు
మరోవైపు ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని చివరి ఆయకట్టుకు నీరందించేందుకు ఈ ఏడాది మార్చిలో అప్పటి కలెక్టర్‌ అలుగు వర్షిణి పెద్దరాతి పల్లి వద్ద గుంటి మడుగు ప్రాంతంలో 5.60 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హుస్సేన్‌ మియ వాగు, చలివాగు, నక్కల వాగుల నుంచి నీటిని ఎత్తిపోసి గుంటిమడుగు వద్ద నీరు నిలిచేలా కొండపై బ్యారేజిని నిర్మించేందుకు ప్రణాళికలను సైతం రూపొందించారు. మానేరు నదితోపాటు మూడు వాగుల నుండి 5 టీఎంసీల నీటిని గుంటి మడుగు రిజర్వాయర్‌లో  నిల్వ చేసి చివరి ఆయకట్టుకు నీరందించాలన్నది ప్రాజెక్టు చేపట్టడంలో ప్రధాన ఉద్దేశం. కలెక్టర్‌ ఆదేశాలతో సర్వే పనులు పూర్తిచేసిన అధికారులు ఇంతవరకు నిర్మాణ పనులను ప్రారంభించలేదు. గుంటి మడుగు నిర్మాణంతో రైతాంగానికి మేలు జరుగుతుందని, ప్రజెక్టును వెంటనే పూర్తిచేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రాజెక్టు పనుల కోసం రూ.24 కోట్లు ఖర్చు
అలాగే మంథని నియోజక వర్గంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉప్పట్ల, గుంజపడుగ, పోతారం, నాగారం, మల్లేపల్లి గ్రామాల్లోని 5వేల ఎకరాల ఆయకట్టుకు శ్రీధార కాసిపేట ఎత్తిపోతల పథకం కింద నీరందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  పిబ్రవరి వరకు పనులను పూర్తి చేయాల్సిందిగా అప్పటి కలెక్టర్‌ అలుగు వర్షిణి, ఐడిసి చైర్మన్‌ ఈద శంకర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటివరకు 24కోట్లు ఖర్చు చేశారు. 5 నెలలు గడుస్తున్నా పనులు పూర్తికావడం లేదు. ఆయకట్టుకు పైపులైన్ల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. గేట్‌ వాల్వ్‌ను బిగించలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌ కేంద్ర సమస్య అలానే ఉంది. దీంతో చివరి ఆయకట్టుకు నీరందించాలనే సంకల్పం నీరుగారిపోతోంది. 
ప్రతిపాదనలకే పరిమితమైన పోతారం
ఒక ఇదే నియోజకవర్గంలో పోతారం ప్రాజెక్టు పనులు ప్రతిపాదనలకే పరిమితం అయ్యాయి. 5 ఏళ్ల క్రితం కోటి 20లక్షల రూపాయలతో పోతారం ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. యేడాది క్రితం పనులు చురుగ్గా సాగినప్పటికీ వరదల ఉధృతికి గేట్లు, వాల్వులు, సామాగ్రి దెబ్బతినడంతో 14 లక్షల రూపాయలతో మరమత్తు పనులు చేపట్టారు. మరోసారి వచ్చిన వరదలతో పెద్దనష్టం జరగడంతో అధికారులు పర్యటించి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మరమతులు చేయకుండా ఉప్పట్ల వద్ద గోదావరి నదినుండి ఎత్తిపోతల పథకం నిర్మిస్తూ, కాసిపేట నుండి నాగారం, మల్లేపల్లి మీదుగా పోతారానికి 2 కిలోమీటర్ల మేర పైప్‌ లైన్‌ వేయాల్సిందిగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనుకున్నా... ఆశించిన స్థాయిలో ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపించడంలేదు. చివరి ఆయకట్టులో రైతులు భూములను సాగుచేసుకోవాలంటే ఎత్తిపోతల పథకాలే కీలకం, అలాంటి పథకాలు అధికారుల నిర్లక్ష్యంతో అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. దీంతో సాగుకు నీరందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టును పూర్తి చేయాలని చివరి ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

16:39 - August 18, 2017

ప్రకాశం : తమ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పదవి వరించడంతో తమ నియోజకవర్గం దశ తిరుగుతుందని భావించారు దర్శి ప్రజలు. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా భారీ ప్రాజెక్టులకే గాలం వేశారు. మరి ఏమైంది? ఆయన వాగ్ధానాలు ఎంత వరకు కార్యరూపం దాల్చాయి? ఈ మూడేళ్లలో దర్శిలో శిద్ధా రాఘవరావు సాధించిన ప్రోగ్రెస్ ఏమిటి? ఇదే ఇవాళ్టి ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్టు. 
దర్శి చరిత్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం దర్శి ప్రకాశం జిల్లాలో అత్యంత వెనకబడ్డ నియోజకవర్గం. దర్శి, మండ్లమూరు, కురిచేడు, తాళ్లూరు, దొనకొండ మండలాలు దర్శి నియోజకవర్గంలో అంతర్భాగాలు. లక్షా 90వేల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో సామాజికవర్గాలు కీలకపాత్ర పోషిస్తాయి. 35వేల మంది రెడ్డి కులస్తులుండగా, 24వేల మంది కమ్మకులస్తులున్నారు. బిసిలు 40వేలమంది , ఎస్సీలు 22వేల మంది ఉన్నారు. బలిజలు 22 వేల మంది, వైశ్యులు 10వేల మంది వుంటారు. దర్శి నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరిగితే, ఎనిమిదిసార్లు కాంగ్రెస్, అయిదుసార్లు టిడిపి విజయం సాధించాయి. ఒకసారి కమ్యూనిస్టులు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పై టిడిపి అభ్యర్థిగా రంగంలోకి దిగిన శిద్ధా రాఘవరావు విజయం సాధించారు. 
శిద్ధా రాఘవరావు ముఖ్యమైన హామీలు
దొనకొండ పారిశ్రామిక కారిడార్, దొనకొండ అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూలు, దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎర్ర చెరువును తాగునీటి చెరువుగా మార్చడం గత ఎన్నికల్లో శిద్ధా రాఘవరావు ఇచ్చిన ముఖ్యమైన హామీలు. అయితే, ఇవి కార్యరూపం దాల్చకపోవడం ఆయనకు మైనస్ పాయింట్ గా మారుతోంది. అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ శిలాఫలకాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయిదు ప్రధాన హామీలు నెరవేరకపోవడంతో విపక్షాలు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. 
శిద్ధారాఘవరావు... ప్లస్ పాయింట్స్ 
అయితే, ఈ మూడేళ్లలో శిద్ధారాఘవరావు తన ఖాతాలో కొన్ని ప్లస్ పాయింట్స్ వేసుకున్నారు. నాలుగు కోట్ల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటు, ట్యాంకర్లు నియోజకవర్గంలో కొంత దాహార్తిని తీరుస్తున్నాయి. మరోవైపు వైసిపి నేత బూచేపల్లి సుబ్బారెడ్డి కుటుంబం కూడా సొంత నిధులతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నిస్తుండడం విశేషం. రోడ్ల నిర్వహణ విషయంలోనూ దర్శి ఎమ్మెల్యే, మంత్రి శిద్ధా రాఘవరావుకి  ప్లస్ మార్కులే పడుతున్నాయి. అద్దంకి దర్శి రోడ్డు వెడల్పు చేయడం, ఫైర్ స్టేషన్ బిల్డింగ్ నిర్మాణం, బొట్లపాలెం బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడంతో రాఘవరావు గుడ్ ఇంప్రెషన్ సాధించుకున్నారు. దోర్నపు వాగు బ్రిడ్జి, చందవరం గుండ్లకమ్మ వాగుపై బ్రిడ్జి నిర్మాణం పనులు సాగుతుండడం ఆయనకు కలిసొచ్చే అంశమే. అయితే కొన్ని చోట్ల అనుచరవర్గం రోడ్ల విషయంలో చేసిన అవినీతి రాఘవురావుకి ఇబ్బందికరంగా మారుతోంది.
హామీలన్నీ పూర్తి చేస్తాం : మంత్రి శిద్ధా 
దర్శి నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలన్నీ రాబోయే రెండేళ్లలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామంటున్నారు మంత్రి శిద్ధా రాఘవరావు. మరో రెండు నెలల్లో దొనకొండ, అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూలు, పార్కు పనులు మొదలవుతాయంటున్నారాయన. రాబోయే రెండేళ్లలో చేపట్టబోయే కార్యక్రమాలు శిద్ధారాఘవరావు భవిష్యత్ ను నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు. 

 

16:29 - August 18, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ప్రభుత్వం కంటే బీజేపి ప్రభుత్వం, కార్మిక వ్యతిరేక విధానాలు, సంస్కరణలను వేగంగా అమలు చేస్తుందని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు హేమలత అన్నారు. ఈమేరకు ఆమెతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్‌ 9 నుండి 11 వరకు ఢిల్లీలో మూడు రోజుల పాటు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కార్మికుల పోరాటాలు, సమ్మెలపై నిర్భందాలు  కొనసాగుతున్నాయని తెలిపారు. నిర్బంధాలను ఎదుర్కొని..కార్మికుల సమస్యలపై పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

వేతనంతో కూడిన సెలవు: ఏపీ ప్రభుత్వం

అమరావతి : ఈ నెల 23 నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా నియోజకవర్గాల పరిధిలో ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థలకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. 

 

అందుకే టీడీపీకి పవన్ మద్దతు తెలపలేదు: రోజా

కర్నూలు : ఓటమి భయంతోనే చంద్రబాబు నంద్యాల ప్రచారానికి వస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమె '10టీవీ'తో  మాట్లాడుతూ...నంద్యాలలో టీడీపీ ఓడిపోతుందని కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు నివేదికలు ఇచ్చాయని ఆమె పేర్కొన్నారు. దమ్ముంటే నివేదకలను చంద్రబాబు బయట పెట్టాలని సూచించారు. నివేదిక ఆధారంగానే నంద్యాలలో టీడీపీకి పవన్ మద్దతు ప్రకటించలేదు అని స్పష్టం చేశారు

 

16:17 - August 18, 2017

జగిత్యాల : జిల్లా కేంద్రం జగిత్యాలలో భారీ వర్షం కురిసింది. గంట పాటు కురిసిన భారీ వర్షానికి టవర్ సర్కిల్, తహసిల్ చౌరస్తా, రాంబజార్లలో రోడ్లు జలమయమయ్యాయి. జమ్మిగద్దె ప్రాంతంలో నాలాలు నిండి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 

 

నైజీరియన్ అరెస్ట్

హైదరాబాద్: గోల్కొండ పీఎస్ పరిధిలో నైజీరియన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 20 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. 271 పాయింట్ల నష్టంతో 31,524 వద్ద సెన్సెక్స్, 67 పాయింట్ల నష్టంతో 9,837 పాయింట్ల వద్ద నిఫ్టీ ముగిసింది.

16:13 - August 18, 2017

విశాఖ : చోడవరం నియోజకవర్గంలోని అన్నవరంలో కళ్యాణ మండపం నిర్మాణం విషయంలో టీడీపీ, వైసిపి శ్రేణుల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. ఏడు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో కళ్యాణ మండపం నిర్మాణానికి మొదటిసారి శంకుస్థాపన జరిగింది. ఇప్పటి వరకూ ఎమ్మెల్యే కెఎస్ ఎన్ రాజు 5 సార్లు శంకుస్థాపనలు చేసినా నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే వైసిపి నేత కరణం ధర్మశ్రీ మండప నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. తమ ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన చోట వైసిపి నేత మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారంటూ టీడీపీ నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వైసిపి కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. 

 

మహ్మద్ బిన్ సలేహ్ వాలాకు బెయిల్

హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై కాల్పుల కేసులో ఏ-12 నిందితుడు మహ్మద్ బిన్ సలేహ్ వాలాకు బెయిల్ వచ్చింది. సలేహ్ వాలా శిక్షణు కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది.

16:10 - August 18, 2017

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయానికి లోధా బాధితులు చేరుకున్నారు. లోధా బిల్డర్ తమని మోసం చేశారని బాధితులు అంటున్నారు. న్యాయం చేయాలని లోధా బెల్లజా, లోధా మెరిడియన్ సంక్షేమ సంఘాల ప్రతినిధులు కమిషనర్ ను కలిశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

కృష్ణా జిల్లాలో అక్రమైనింగ్ పై ఆరా

కృష్ణా:జిల్లాలో అక్రమ మైనింగ్ పై మైనింగ్ శ్రీకారం చుట్టింది. పరిటాల, దొనకొండ సమీపంలోని క్వారీల్లో తనిఖీలు, క్వారీల్లో బ్లాస్టింగ్ లు, కార్మికుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులు విచారణ చేపట్టారు. బ్లాస్టింగ్ ల వల్ల కలిగే ఇబ్బందులను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. క్వారీల్లో నిబంధనలు పాటించకుండా బ్లాస్టింగ్ లు జరుపుతున్నట్లు మైనింగ్ అధికారులు గుర్తించారు.

పెట్రోల్ కు బదులు నీళ్లు... ఆందోళన

తూ.గో: తుని ఎన్ హెచ్ పై పెట్రోల్ బంక్ లో కల్తీ దందా బయటపడింది. పెట్రోలుకు బదులు నీళ్లు రావడంతో వాహనదారులు ఆందోళన చేపట్టారు. పెట్రోల్ బంక్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

నంద్యాలలో టిడీపీదే విజయం:జేసీ

కర్నూలు : నంద్యాలలో విజయం టీడీపీదేనన్ని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. మెజార్టీ ఎంత అనేది చెప్పలేం అన్నారు. తప్పుడు మాటలతో జగన్ విశ్వసనీయత కోల్పోయారని, జగన్ అత్యంత ధనికుడని ఆయన తెలిపారు. జగన్ కు పేపర్, ఛానల్ ఉందని అదరికీ తెలిసిన విషయమే అని ఎద్దేవా చేశారు.

 

15:37 - August 18, 2017
15:34 - August 18, 2017

మహిళా వార్తల సమాహారం..మానవి న్యూస్ తో మీ ముందుకు వచ్చింది.. ఇవాళ్టి మానవి...కామాంధుడి అఘాయిత్యానికి బలైన అబల, చదువుకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించిన 91 సం. వృద్ధురాలు, వివాహానికి మేకప్ లేకుండా రెడీ అయితే ఫోటోలు దిగమన్న వధువు కుటుంబీకులు, మేకప్ లేకుండా వివాహానికి హాజరైన వధువు, భారత్, అమెరికన్ దౌత్యవేత్తపై భారతీయుల ప్రశంసలు, కారును వద్దన్న క్రికెటర్ రాజేశ్వరీ గైక్వాడ్, హైదరాబాద్ లో మహిళా కానిస్టేబుల్స్ కు మోటర్ బైక్స్, పెట్రోల్ పంప్ లో 50 రోజులు...3 కోట్లు...చంచల్ గూడ మహిళా ఖైదీలు.....
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

15:25 - August 18, 2017

హైదరాబాద్ : సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆమె ఎండగట్టారు. చంద్రబాబు..రాయలసీమ ద్రోహి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. బాబుది నీతి మాలిన పాలన అని విమర్శించారు. సీఎం స్వంత చిత్తూరు జిల్లాలో మన్నవరం ప్రాజెక్టును ముందుకు సాగనివ్వకుండా చంద్రబాబు చేశారని.. నిరుద్యోగులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు....కరవును కూడా తనకు అనువుగా మార్చుకున్నారని చెప్పారు. రెయిన్ గన్ పేరుతో రూ.200 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. బాబు...నీతి మాలిన ముఖ్యమంత్రి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలుకు సెంట్రల్ యూనివర్సిటీ ఇంతవరకు రాలేదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని వదులుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారని...వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. వాగ్ధానాలను అమలు చేయుకుండా తనపై, జగన్ పై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు..గజిని అని ఎద్దేవా చేశారు. త్రిపుల్ ఐటీ జాడలేదని, ప్రతి జిల్లాకు ఎయిర్ పోర్టు తీసుకొస్తానని చెప్పిన బాబు..ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. పెద్ద ఆస్పత్రిని కిమ్స్ ఆస్పత్రిగా మార్చుతామని చెప్పారని..కానీ ఇప్పటికి వరకు మార్చలేదని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 300 ఎలుకలను పట్టేందుకు 60 లక్షల రూపాయలను ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను కాకి ఎత్తుకుపోయిందా అని ఎద్దేవా చేశారు. రెండు నెలలుగా నంద్యాలలో ఏపీ కేబినెట్ మకాం వేసిందన్నారు. రాష్ట్రంలోని సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. కుట్రలకు పేటెంట్ రైట్ చంద్రబాబు..అని ఎద్దేవా చేశారు. ఏదో ఒక రకంగా నంద్యాల ఉప ఎన్నికలను ఆపాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ పట్ల నంద్యాల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నంద్యాల.. వైఎస్ ఆర్ కుటుంబానికే సొంతమన్నారు. 

 

జయ మృతి పై న్యాయవిచారణకు డిమాండ్ చేశా:దినకరన్

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం పై న్యాయ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని నేనే కోరా అని దినకరన్ పేర్కొన్నారు. చాలామంది నాతో టచ్ లో ఉన్నారని, అవసరమైనప్పుడు మా బలాన్ని నిరూపించుకుంటామని స్పష్టం చేశారు.

చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయం: జేసీ...

కర్నూలు: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనంతపురం టీడీపీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడుతూ... తన దగ్గర డబ్బులు లేవని చెప్పుకుంటున్నజగన్‌... జైలుకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. అలాగే జీవితంలో జగన్‌ సీఎం కాలేరని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై రాష్ట్ర ప్రజలకు నమ్మకముందన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. అంతేగాక నాయకుడు చెప్పే మాటల్లో విశ్వాసం ఉండాలని, నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీదే గెలుపు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజూ అబద్ధాలు చెబితే ఎవరు నమ్ముతారని జేసీ అన్నారు.

14:58 - August 18, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దుశ్శాసన పర్వం వెలుగు చూసింది. ఎయిరోసిటీలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో పనిచేస్తున్న ఓ మహిళ పట్ల తోటి ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన సిసిటివి ఫుటేజీ బయటకు వచ్చింది. హోటల్‌లో సెక్యూరిటీ మేనేజర్‌గా పనిచేస్తున్న పవన్‌ దహియా అదే హోటల్‌లో గెస్ట్‌ రిలేషన్‌ విభాగంలో పనిచేస్తున్న 33 ఏళ్ల మహిళ చీరను లాగి దుస్తులు విప్పేందుకు ప్రయత్నించాడు. తనతో శారీరక సంబంధం ఏర్పరచుకోవాలని పవన్‌ దహియా గత కొంత కాలంగా మహిళను వేధిస్తున్నాడు. జులై 29న తన బర్త్‌డే సందర్భంగా హోటల్‌లో గది తీసుకుని ఓ రోజంతా గడుపుదామని, తనకిష్టమైన గిఫ్ట్‌ కొనుక్కోమని క్రెడిట్‌ కార్డు తీశాడని బాధితురాలు తెలిపింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో హోటల్‌కు చెందిన మరో ఉద్యోగి అక్కడికి రావడంతో బాధితురాలు తప్పించుకుంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సెక్యూరిటీ మేనేజర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా...బాధితురాలిని ఉద్యోగం నుంచి టర్మినేట్‌ చేయడం గమనార్హం.

 

14:55 - August 18, 2017

రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్‌ హయాంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ భవన సముదాయాన్ని మంత్రులు పోచారం, కేటీఆర్‌ ప్రారంభించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని కేటీఆర్ చెప్పారు. రైతులకు త్వరలోనే 24 గంటలు ఉచిత విద్యుత్‌ అందిస్తామని... సాగుకు పెట్టుబడి కూడా ఇస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు.

 

మహిళా మావో దళ కమాండర్ లొంగుబాటు

చత్తీస్ గఢ్ : మహిళా మావోయిస్టుల దళ్ కమాండర్ లొంగిపోయింది. మల్కన్ గిరి పోలీసుల ఎదుట దళ కమాండర్ లొంగిపోయినట్లు తెలుస్తోంది.

 

14:48 - August 18, 2017

గుంటూరు : అమరావతిలో పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులపై కమిటీ సభ్యులకు చంద్రబాబు వివరించారు. ఇక ఈ భేటీ అనంతరం... ఎంపీల బృందం పోలవరం ప్రాజెక్ట్‌ సైట్‌ను పరిశీలించనుంది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కమిటీకి చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్ట్‌ పూర్తికి సంపూర్ణ సహకారమందించాలని పార్లమెంటరీ కమిటీ సభ్యులను చంద్రబాబు కోరారు.

 

14:44 - August 18, 2017

నెల్లూరు : కావలిలోని కలుగోళమ్మపేట అయ్యప్పగుడి సమీపంలో పందులు రెచ్చిపోయాయి. రోడ్డుపై వెళ్తున్న బీబీజాన్‌పై పందులు దాడి చేశాయి. పందుల దాడిలో వృద్ధురాలికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న స్థానికులు వృద్ధురాలిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. అయితే... మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగరంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జీహెఏంసీ కార్యాలయంలో లొధా బాధితులు

హైదరాబాద్ :  లోధా బిల్డర్ తమను మోసం చేశారంటు బాధితులు జీహెఏంసీ కార్యాలయనికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని కమిషనర్ ను లోధా బెల్లజా, లోధా మెరిడియన్ సంక్షేమ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. 

 

వ్యవసాయం అంటే పండగే :మంత్రి కేటిఆర్

 రాజన్న సిరిసిల్ల: వ్యవసాయ కాలేజీ ఏర్పాటు చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్ ను మంత్రి కేటిఆర్ కోరారు. జిల్లా రైతాంగానికి వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ పరికరాల కోసం ఉదారత చూపాలని కేటీఆర్ తెలిపాలి. వ్యవసాయం దండగ అన్న భావన నుండి పండగ అనే భవనను కల్పించే దిశగా సీఎం కార్యాచరణ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

 

పిచ్చికుక్కల దాడి:15మందికి గాయాలు..

నిర్మల్ : లోకేశ్వరం మండలం పుష్పుల్ గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. పిచ్కి కుక్కల దాడిలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుక్కల దాడిలో 15 ఆవులకు గాయాలయ్యాయి. ఆవులను పశువుల దవాఖానకు తరలించారు.

వృద్ధురాలిపై పందుల దాడి

నెల్లూరు : కావలిలో రోడ్డు పై వెళ్తున్న జీబీజాన్ అనే వృద్ధురాలిపై పందులు దాడి చేశాయి. గమనించిన స్థానికులు గాయాలతో వున్న వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పందులు స్వైర విహారం చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల మధ్య వివాదం

కడప: ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల మధ్య వివాదం పొడచూపింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మీ ప్రసాద్ పై హెచ్ ఐవీ సిరంజితో డాక్టర్ డేవిడ్ రాజు దాడి చేశాడు. వారించిన నర్సులపై కూడా దాడికి యత్నించాడు. భయంతో నర్సులు, సిబ్బంది పరుగులు తీశారు. డాక్టర్ డేవిడ్ రాజు పరారీలో ఉండగా, సిబ్బంది, డాక్టర్లు ఆందోళన చేపట్టారు.

13:41 - August 18, 2017

నిజామాబాద్ : ధర్మపురి శ్రీనివాస్.. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన కొన్ని రోజులుగా పార్టీ మారుతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. డీఎస్ కాంగ్రెస్‌కు టచ్‌లో ఉన్నారని.. సోనియా గాంధీతో మాట్లాడారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్ని డీఎస్ ఖండించారు. తనకు టీఆర్‌ఎస్‌లో ఎటువంటి అసంతృప్తి లేదని చెప్పుకొచ్చారు. తన ఇమేజ్‌ డ్యామేజ్ చేస్తున్నారంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఆయన పార్టీ మారతారన్న వార్తలకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు. దీంతో లాభంలేదనుకున్న డీఎస్ ఏకంగా తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మళ్లీ ఖండించారు. అయినా డీఎస్ పార్టీ మారతారన్న వార్తలు మాత్రం హైలైట్ అవుతూనే ఉన్నాయి.

అమిత్‌ షాకి టచ్‌లో
ఓవైపు డీఎస్ పార్టీ మారే అంశంపై తెగ చర్చ జరుగుతుంటే.. తాజాగా ఆయన చిన్నకొడుకు ధర్మపురి అరవింద్ ఇచ్చిన ఓ ప్రకటన ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. దేశభక్తిని నిరూపించుకోవడమంటే..మోదీని బలపరచడమేనంటూ స్వాతంత్ర్య దినోత్సవం రోజు తెలుగు, ఇంగ్లీష్‌ పేపర్లలో అరవింద్ ఇచ్చిన ప్రకటన పెద్ద చర్చకు తెరలేపింది. కేవలం దేశభక్తి అంశంపైనే ఇచ్చామని అరవింద్ చెప్పినా.. దీనిని ఎవరూ తేలికగా కొట్టిపారేయలేదు. కేవలం అరవింద్ మాత్రమే బీజేపీకి దగ్గరవుతున్నారా? లేక డీఎస్ కుటుంబం మొత్తం బీజేపీలో చేరుతున్నారా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ధర్మపురి అరవింద్ బీజేపీలో చేరతారని నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తారని కొందరు ఏకంగా ప్రచారం చేసేస్తున్నారు. అరవింద్ కొన్ని రోజులుగా అమిత్‌ షాకి టచ్‌లో ఉన్నారని.. పార్టీలో చేరికలో భాగంగానే పేపర్లలో భారీ యాడ్స్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అరవింద్ యాడ్ చూసి జిల్లా బిజేపి నేతలు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటు జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు సైతం అరవింద్ ఇచ్చిన ప్రకటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

యాక్షన్ ప్లాన్ రెడీ
ఇప్పటికే అమిత్‌ షా తెలంగాణలో బిజెపి బలోపేతం దిశగా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా గేమ్ ప్లాన్ మొదలుపెట్టేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో అధికార పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో అరవింద్ ఇచ్చిన ప్రకటన వెనుక సారాంశమేంటో కొద్దిరోజుల్లో తేలిపోనుంది. 

13:39 - August 18, 2017

హైదరాబాద్ : లక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా 8వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఈ నెల 20వ తేదీ వరకు సభలు జరుగనున్నాయి. కార్యక్రమానికి వచ్చిన సీనియర్‌ నేత కేవో హబీద్‌ పతాక ఆవిష్కరణ చేశారు. సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలతతో పాటు మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య హాజరయ్యారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి 350 మందికి పైన ప్రతినిధుల హాజరయ్యారు.

13:37 - August 18, 2017

తూర్పుగోదావరి : రోజూ పాదయాత్రకు ప్రయత్నించడం... పోలీసులు అడ్డుకోవడంపై విసుగుచెందిన కాపు నేత ముద్రగడ.. ఏదో ఒక రోజు గోడ దూకుతానని హెచ్చరించారు.. గోడదూకి పాదయాత్ర చేస్తానని పోలీసులకు తెలియజేశారు.. సీఎం చంద్రబాబు తీరుకు నిరసనగా తన నివాసంలోని గేటు దగ్గర ఉదయంనుంచి సాయంత్రంవరకూ కూర్చుని ఆందోళన చేశారు.. ముద్రగడ మద్దతుదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.--

13:31 - August 18, 2017

సిరిసిల్ల : జిల్లా తంగేళ్లపల్లి మండలంలో మంత్రి కేటీఆర్ వ్యవసాయ పాలిటేక్నిక్ కాలేజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మరో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక ఎంపీ వినోద్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చడూండి.

13:24 - August 18, 2017

కడప : జిల్లాలోని ప్రొద్దటూరు ప్రభుత్వ ఆసపత్రిలో వైద్యుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ పై మరో వైద్యుడు డేవిడ్ రాజ్ సిరంజితో డాడి చేశాడు. డేవిడ్ రాజు సిరంజితో లక్ష్మీప్రసాద్ కు హెచ్ ఐవీ వైరస్ ఎక్కించడానికి ప్రయత్నించాడు. డేవిడ్ రాజు హెచ్ ఐవీ రోగి నుంచి బలవంతంగా రక్తనమూనాలను సేకరించారు. వారించిన నర్సులపై కూడా ఆయన దాడికి యత్నించారు. దీంతో అక్కడ ఉన్న వారంత పరారైయ్యారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:22 - August 18, 2017

సినీ ప్రముఖులు సాక్షులా? నిందితులా? చెప్పలేం:అకున్ సబర్వాల్

హైదరాబాద్ : డ్రగ్స్ కేసు విచారణ చురుగ్గా కొనసాగుతుందని.. డిసెంబర్ చివరి నాటికి కోర్టులో ఛార్జీషీట్లు దాఖలు చేస్తామని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు, న్యాయనిపుణులతో చర్చించి ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. సిట్ ఇప్పటి వరకు 11 కేసుల్లో 22 మందిని అరెస్టు చేసిందని చెప్పారు. సాక్షుల విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. సినీ ప్రముఖులు సాక్షులా? నిందితులా? అనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. సినీ ప్రముఖుల విషయంలో చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని ఆయన తెలిపారు.

13:08 - August 18, 2017

బాలీవుడ్ లో సీనియర్ స్టార్ అయిన ‘టబు’ అతిథి పాత్రలో కనిపించబోతోంది. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ అనంతరం సినిమాలు చేయలేదు. పాండురంగడు చిత్రంలో టాలీవుడ్‌లో చివరిసారిగా కనిపించింది టబు. బాలకృష్ణ పక్కన భక్తి చిత్రంలో కూడా నటించిన సంగతి తెలిసిందే.  ఈ మధ్య తల్లి పాత్రలో ఫితూర్ – హైదర్ వంటి సినిమాల్లో టబు నటించింది. తాజాగా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సంజయ్ పాత్రలో యంగ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తుండగా అతిథి పాత్రలో ‘టబు’ నటిస్తోంది. 2004 రిలీజ్ అయిన మున్నాభాయ్ ఎంబీబీయస్ సినిమాకు గానూ టబు చేతుల మీదుగా సంజయ్ అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు అదే సినిమా కోసం అతిథి పాత్రలో నటించేందుకు టబు అంగీకరించింది. తన రియల్ లైఫ్ క్యారెక్టర్ లోనే రీల్ లైఫ్ లోనూ నటించనుంది. పరేశ్ రావల్, మనీషా కోయిరాల, సోనమ్ కపూర్, దియా మీర్జా, అనుష్క శర్మ తదితర నటులు నటిస్తున్నారు. 

12:49 - August 18, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న ఉద్యోగ ప్రకటనల అంశం ఇప్పుడు ఇటు నిరుద్యోగులు, అటు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నిరుద్యోగులపై ఒక్కసారిగా ప్రేమ పుట్టుకురావడంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల చుట్టూనే సాగింది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించగానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులు ఆకట్టుకున్నారు. విద్యార్థులు లాఠీలు, తూటాలను ఎదురొడ్డి తెలంగాణ కోసం నిప్పుకణికల్లా పోరాడారు. కానీ అధికారంలోకి మూడేళ్లు గడిచిపోయినా... ఉద్యోగాల ఊసే ఎత్తలేదు. వేసిన కొన్ని నోటిఫికేషన్లు కూడా అస్తవ్యస్తంగా ఉండటంలో కోర్టులు తప్పపట్టాయి. కొన్ని పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించినా ఫలితాలు ప్రకటించలేదు. రిజల్ట్ ప్రకటించిన వాటికీ ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. అరకొర ఉద్యోగాలు భర్తీ చేసి చేతులు దులుపుకుందన్న విమర్శలను కేసీఆర్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. లక్ష ఉద్యోగాల మాటేంటని అసెంబ్లీలో ప్రతిపక్షాలు నిలదీస్తే... తానెప్పుడే ఆ మాట అనలేదని.. అయినా కాలేజీల్లో చదివేవారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా ? ఇవ్వడం ఏ సర్కారుకైనా సాధ్యమేనా ? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ఒకింత వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.

ఒక్కసారిగా మార్పు....
అటువంటి కేసీఆర్‌ వైఖరిలో ఇప్పుడు ఒక్కసారిగా మార్పు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్నాయి. నిరుద్యోగులను మచ్చిక చేసుకోవాలి. లేకపోతే అది గెలుపు, ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఆందోళన కేసీఆర్‌తోపాటు, టీఆర్‌ఎస్‌ మంత్రులు, ప్రజా ప్రతినిధులను కలవరపెడుతోంది. లక్ష ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో వీరిలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌ ముట్టడులు జరుగుతున్నాయి. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ఊరిస్తూ, మభ్యపెడుతున్న ప్రభుత్వ వైఖరి ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి. ప్రభుత్వంపై జరుగుతున్న ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు ఒక్కసారిగా ఉద్యోగాల భర్తీ నాటకానికి తెర తీశారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు తప్పుపట్టింది. దీనిపై సుప్రీంకోర్టులోనూ కేసీఆర్‌ సర్కారుకు చుక్కెదురైంది. గురుకుల విద్యాలయాల్లో అధ్యాపకుల భర్తీ, గ్రూప్‌-2 పోస్టుల రాతపరీక్షల్లో ఓఎంఆర్‌ షీట్ల మార్పు వ్యవహారం.. ఇలా అన్ని విషయాల్లో సర్కారుకు ఎదురుదెబ్బ తగలడంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తలబొప్పికట్టినట్టు అయింది.

వేడెక్కుతున్న రాజకీయం
మరోవైపు రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంగారెడ్డి పర్యటన, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహాజన పాదయాత్ర, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణ టూర్‌తో సర్కారు వెన్నులో వణుకు పుట్టించాయి. ఇక తెలంగాణ ఉద్యమంలో ప్రజా సాంఘాలను ఏకంచేయడంతో కీలక పాత్ర పోషించిన టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పక్కన పెట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కోదండరామ్‌ ఎండగడుతూ వస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో పెట్రేగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు... పోలీసు వాహనాల కొనుగోలు వ్యవహారంలో కేటీఆర్‌ డైరెక్టర్‌గా ఉన్న హిమాన్షు మోటార్స్‌ పాత్ర, భూ నిర్వాసితుల పోరాటాలు.. సర్కారుపై వ్యతిరేకత ప్రబలడానికి కారణమవుతున్నాయి. వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చడంతో పాటు, నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యమాల బాట పట్టకుండా చూసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మళ్లీ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లకు తెరతీశారని విశ్లేషిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ నిర్ణయం హర్షణీయమైనా... ఎంతవరకు ఆచరణలో పెడతారన్న అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు జారీ చేసి 85 వేల పోస్టులను భర్త చేస్తారా ? లేక ఇవన్నీ కంటితుడపు చర్యలుగానే మిగిలిపోతాయా ? అన్నది మున్ముందు తేలుతుంది.

----------------------------

12:49 - August 18, 2017

అజిత్ చిత్రం వివేగం రిలీజ్ కు సిద్ధమౌతోంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కుతోంది. సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్ విడుదలై హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో చిత్ర ట్రైలర్ ను యూ ట్యూబ్ లో విడుదల చేశారు. 2.24 నిమిషాల పాటు ట్రైలర్‌ సాగింది. 
నేను ఎవరనేది.. ఎదుటివాడిని బట్టే ఉంటుంది.. అంటూ అజిత్‌ చెప్పే ప్రారంభ డైలాగు ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ట్రైలర్ లో రోమాంటిక్ సన్నివేశాలు కూడా చూపించారు. అజిత్ సరసన కాజల్ నటిస్తోంది. ట్రైలర్‌ విడుదలైన 18 గంటల్లో ఏకంగా 40 లక్షల మంది వీక్షించడం విశేషం. 24వ తేదీన విడుదలవుతున్న సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందా 

12:46 - August 18, 2017

గుంటూరు : ఏపీ వైద్య విద్యాశాఖ ప్రమోషన్లలో అక్రమాలు బయటపడ్డాయి. దళిత అధికారికి ప్రమోషన్‌ రాకుండా కొంతమంది అగ్రవర్ణ ఉద్యోగులు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పొందాల్సిన రిజర్వేషన్లను వారికి ఇవ్వకుండా అగ్రకుల ఉద్యోగులకు కట్టబెట్టారని పలువురంటున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని దళిత ఉద్యోగులంటున్నారు. ఇదే అంశంపై కోర్టుకు వెళ్లినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్‌ అధికారులు.... ప్రమోషన్లలో అక్రమాలు జరిగాయని నివేదిక ఇచ్చారు. అయితే... కేసు వెనక్కి తీసుకునేందుకు ప్రమోషన్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ అంటున్నారు. దీనిపై ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు 8 మంది ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేశారు. తన పట్ల కొంతమంది కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ అంటున్నారు. 

ప్రొద్దుటూరులో డాక్టర్ల మధ్య ఘర్షణ

కడప:ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల మధ్య ఘర్షణ జరిగింది. డాక్టర్ పై సూదితో మరో డాక్టర్ దాడి చేశారు.

టీటీడి పరిపాలన భవనం వద్ద సిఐటీయూ ధర్నా

తిరుపతి: టిటిడిలో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీటీడి పరిపాలన భవనం వద్ద సిఐటీయూ ధర్నా చేపట్టింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి, సిఐటియు నేత మురళి పాల్గొన్నారు.

ఉప్పల్ కార్పొరేటర్ భర్త పై కేసు నమోదు

హైదరాబాద్: ఉప్పల్ కార్పొరేటర్ భర్త పై కేసు నమోదు అయ్యింది. భార్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని పంద్రాగస్టు సందర్భంగా ఉప్పల్ లోని పురాతన కోటపై హన్మంత్ రెడ్డి జెండా ఎగురవేశారు. దీంతో ఉప కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మేకల హన్మంత్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.

12:14 - August 18, 2017

కర్నూలు : జిల్లా నంద్యాలలో వైసీపీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. గాంధీనగర్ చౌక్ లో డబ్బులు పంచుతున్న 22 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు కడప, పులివెందుల, నెల్లూరు, వైసీపీ కార్యకర్తలుగా తెలిసింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

అన్నవరంలో ఉద్రిక్తత

విశాఖ: చోడవరం నియోజకవర్గం అన్నవరంలో ఉద్రిక్తత నెలకొంది. కల్యాణ మండపం నిర్మాణం విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య వివాదం నెలకొంది. కల్యాణ మండపానికి 4 సార్లు టీడీపీ ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు.

బిల్డర్ కమ్ ఫైనాన్షియర్ సునీల్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు...

హైదరాబాద్: కేపీహెచ్ కాలనీలో బిల్డర్ కమ్ ఫైనాన్షియర్ సునీల్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

ఉధృతంగా ప్రవహిస్తోన్న కంతనపల్లి వాగు

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో భారీ వర్షం పడింది. కన్నయ్యగూడెం, కంతనపల్లి వద్ద కంతనపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

12:09 - August 18, 2017

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో టూరిస్ట్ పై గుర్తుతెలియని దుండగులు అత్యచారానికి పాల్పడ్డారు. యువతి నగరాన్ని చూసేందుకు ఢిల్లీ నుంచి వచ్చారు. యువతి హోటల్ సర్వీస్ బాయ్ రేప్ చేశాంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రేప్ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.

ప్రొద్దుటూరులో అగ్ని ప్రమాదం

కపడ: ప్రొద్దుటూరులో అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీ వెంకటేశ్వర ఫర్నిచర్ షాపులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఈ ఘటనలో సుమారు రూ.50లక్షల మేర ఆస్థినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ టీకాలు వికటించి బాలిక మృతి

అమరావతి: రూబెల్లా, మిజిల్స్ టీకా వికటించి తాడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. నిన్న పాఠశాలలో అంగన్ వాడీ సిబ్బంది టీకాలు వేశారు. బాలిక తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

సుప్రీం ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేస్తున్నారు: ముకుంద్

కరీంనగర్ : 2007 భూ పోరాటం కేసులో 11 మంది ని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఏడుగురిని బేడీలతో తీసుకెళ్లడం పై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ముకుంద్ మాట్లాడుతూ... సుప్రీం ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు.

డబ్బు పంపిణీ చేస్తున్న 22 మంది అరెస్ట్....

కర్నూలు : నంద్యా లలో గాంధీ నగర్ చౌక్ లో ఓటర్లకు డబ్బులు పంపినణీ చేస్తున్న 22 మందిని అరెస్టు చేశారు. వీరు కడప, పులివెందుల, నెల్లూరు కు చెందిన వైసీపీ కార్యకర్తలుగా గుర్తించారు.

11:50 - August 18, 2017

కారు బోల్తా : ముగ్గురి మృతి

మహారాష్ట్ర : ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  నాందేడ్ లో కారు బోల్తాపడి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చేందారు.  ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు కర్నూలు వాసులని తెలుస్తోంది. మృతుల్లో అనురాధ (35) హని(5) డ్రైవర్ ఉన్నారు. షిరిడికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

బీహార్ లో వరదల బీభత్సం

హైదరాబాద్: బీహార్ లో వరద బీభత్సం కొనసాగుతుంది.  ఈ వరదల వల్ల ఇప్పటి వరకు 119 మరణించారు.  504 రిలీఫ్ క్యాంపులను ప్రభుత్వం ఏర్పాటు చేసి వరద సహాయక చర్యలు కొనసాగిస్తోంది. బోట్ అంబులెన్స్ ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 16 జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. 3.60 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో జనజీవనం స్థంబించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం నితీష్ కుమార్ ఏరియల్ సర్వే నిర్వహించారు.

11:12 - August 18, 2017

మహబూబ్ నగర్ : జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా పడింది. ఈ లారీ తిమ్మాపూర్ నుంచి కర్నూలు వెళ్తుతుంది. డ్రైవర్ క్లీనర్ లకు స్వల్ప గాయాలయ్యాయి. మరంత సమాచార కోసం వీడియో చూడండి.

8మంది విద్య,వైద్యశాఖ అధికారులపై కేసు

గుంటూరు: వైద్య, విద్యాశాఖ లోజరిగిన అక్రమాలపై ఎస్సీ కమిషన్ కోర్టును ఆశ్రయించింది. . కోర్టు ఆదేశాల మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న 8మంది వైద్య ,విద్యా శాక అధికారులపై కేసు నమోదు చేశారు. వారిపై సెక్షన్ 120, 506, రెడ్ విత్ 149తో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యింది. ఈ అక్రమాలపై విజిలెన్స్ నివేదక ఇచ్చినప్పటికీ వైద్య, విద్యాశాఖలు పట్టించుకోలేదని బాధితుడు డాక్టర్ కిరణ్ కుమార్ ఆరోపిస్తున్నారు.

11:08 - August 18, 2017

బెంగళూరు : దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీ విశాల్‌ సిక్కా తన పదవికి రాజీనామా చేశారు. సీఈవోగా తప్పుకున్న సిక్కాను కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌గా నియమించినట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. తాత్కాలిక ఎండీ, సీఈవోగా యూబీ ప్రవీణ్‌ రావ్‌ను నియమించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే కొత్త ఎండీ, సీఈవోను బోర్డు ఎన్నిక చేస్తుందని చెప్పారు. 2014 జూన్‌ 12న సిక్కా ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టారు. అభిప్రాయబేధాల కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు కంపెనీకి రాసిన లేఖలో సిక్కా తెలిపినట్లు సమాచారం. కాగా.. చరిత్రలోనే తొలిసారిగా ఇన్ఫోసిస్‌ షేర్ల తిరిగి కొనుగోలుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో సిక్కా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. 

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు...

ముంబై: ఈ రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. 250 పాయింట్లకు పైగా నష్టంతో 31,587 వద్ద సెన్సెక్స్, 70 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడవుతన్నాయి. 

మరోసారి ముద్రగడ పాదయాత్రకు బ్రేక్

తూ.గో: కిర్లంపూడిలో మరోసారి ముద్రగడ పాదయాత్ర కు బ్రేక్ పడింది. పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడ పోలీసులు అడ్డుకోవడంతో తన నివాసం వద్ద ఉన్న గేటు ముందే బైఠాయించి నిరసన చేపట్టారు.  ఈ సందర్భ:గా ముద్రగడ మాట్లాడుతూ... సాయంత్ర వరకు దీక్ష చేపడతానని స్పష్టం చేశారు.

శరవేగంగా పోలవరం నిర్మాణం: ఏపీ సీఎం

అమరావతి: జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, పోలవరం నిర్మాణం శరవేగంగా సాగేలా కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రోజు జలవనరుల పార్లమెంటరీ కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం పనులు సాగుతున్న తీరు, ప్రాజెక్టు పురోగతిపై కమిటీ సభ్యులకు చంద్రబాబు వివరించారు. ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష నిర్వహిస్తున్నామని ఆయన సూచించారు. ప్రతి నెలా మూడో సోమవారం పనులను పరిశీలిస్తున్నామని తెలిపారు. టెక్నాలజీ సాయంతో భూగర్భజలాలను, వర్షపాతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నాం సీఎం చంద్రబాబు అన్నారు.

 

 

తెలంగాణ లో విస్తారంగా వర్షాలు...

హైదరాబాద్‌: ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 18, 19, 20వ తేదీల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షం కురుస్తుందని తెలిపింది.

10:50 - August 18, 2017

హైదరాబాద్ : కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు హుద్రోగంతో బాధపడుతున్న 15 ఏళ్ల బాలికకు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. గుండెజబ్బుతో బాధపడుతున్న ఆదిలాబాద్‌కు చెందిన త్రిషకు తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. వ్యాధి తీవ్రంకావడంతో చివరికి హైదరాబాద్‌ కాంటినెంటల్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు చేసిన వైద్యులు గుండె మార్చాలని నిర్ణయించారు. ఆరోగ్య శ్రీ, జీవన్‌ధాన్‌ ట్రస్ట్‌ కింద నమోదు చేశారు. అవేర్‌ గ్లోబల్‌ ఆస్పత్రిలో గుండె ఉందని తెలుసుకున్న వైద్యులు అక్కడ నుంచి తీసుకొచ్చి అమర్చారు. ఇప్పుడు త్రిష పూర్తిగా కోలుకుంది. 

10:49 - August 18, 2017

తూర్పుగోదావరి : జిల్లా రాజమహేంద్రవరంలో అగ్ని ప్రమాదం జరిగింది... కార్పొరేషన్‌ కార్యాలయంలో మంటలు అంటుకున్నాయి.. అడ్మినిస్ట్రేషన్‌ గదిలోని మంటల్లో కాలిబూడిదైంది.. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు.

10:48 - August 18, 2017

వనపర్తి : జిల్లా శ్రీరంగపురం మండలం శేరుపల్లిలో దారుణం జరిగింది. మూడో తరగతి విద్యార్థి ఆనంద్‌ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే... తెలుగు పద్యం నేర్చుకోవాలని టీచర్‌ మందలించడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు ఆనంద్‌ తెలిపారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. 

టీడీఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

హైదరాబాద్: యాదాద్రి జిల్లా బీబీనగర్ లో ర్యాగింగ్ కలకలం రేగింది. టీడీఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫస్ట్ఇయర్ విద్యార్ధిపై సీనియర్లు దాడి చేశారు. ముగ్గరు విద్యార్థులు గిరిధర్ అనే విద్యార్థిని బీబీనగర్ నుంచి ఉప్పల్ వరకు బస్సులో కొట్టుకుంటూ తీసుకువచ్చారు.ఈ దాడిలో గిరిధర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్న విచారణ చేపట్టారు.

10:22 - August 18, 2017

యాదాద్రి : జిల్లా బీబీనగర్ లో ర్యాగింగ్ కలకలం సృష్టించింది.  స్థానిక టీడీఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేశారు. ముగ్గురు సీనియర్లు గిరిధర్ అనే విద్యార్థిని చితక్కొట్టారు. గిరిధర్ ను బీనగర్ నుంచి ఉప్పల్ వరకు బస్సులో కొట్టుకుంటూ తీసుకువచ్చారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:18 - August 18, 2017

 

'మేరా నామ్ తేడా..తేడా సింగ్..36 దోపిడీలు..24 మర్డర్లు..36 స్టాపింగ్‌లు..దిస్ ఈజ్ మై విజిబుల్ రికార్డ్ ఇన్ వికీపీడియా’ అంటూ బాలయ్య పలికిన డైలాగ్స్ దుమ్ము రేపుతున్నాయి. ఆయన నటించిన తాజా చిత్రం 'పైసా వసూల్' సినిమా థ్రియాట్రికల్ ట్రైలర్ ను గురువారం ఖమ్మంలో విడుదల చేశారు. చివరిలో 'శవాన్ని పైకి లేపి మళ్లీ చంపేస్తా' అంటూ పంచ్ డైలాగ్ విసిరారు.

బాలయ్య వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' విజయం అనంతరం ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 101వ సినిమా 'పైసా వసూల్' చిత్రం చేస్తున్నాడు. పూర్తిగా మాస్ గా బాలయ్య కనిపిస్తుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టేసుకుంటున్నారు.

సినిమా ప్రారంభోత్సవం రోజునే విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ప్రకటించిన తేదీ కంటే నెల ముందుగానే సినిమా విడుదల చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ డేట్ గా ప్ర‌కటించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన మరోసారి 'శ్రియ' జత కట్టగా ప్రముఖ బాలీవుడ్‌–హాలీవుడ్‌ నటుడు కబీర్‌ బేడి ప్రత్యేక పాత్ర పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంచనాలు సృష్టిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

@page { margin: 2cm } p { margin-bottom: 0.25cm; line-height: 120% }

బంజారాహిల్స్ లో దారుణం....

హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది.  హైదరాబాద్ నగరాన్నిచూసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన యువతి పై అత్యాచారం జరిగింది.  బంజారాహిల్స్ లోని హోటల్ సర్వీస్ బాయ్ రేస్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు.

ఇన్ఫోసిన్ వైస్ ఛైర్మన్ గా విశాల్ సిక్కా నియామకం

హైదరాబాద్: ఇన్ఫోసిన్ వైస్ ఛైర్మన్ గా విశాల్ సిక్కానియమితులయ్యారు. ఇన్ఫో సిస్ తాత్కాలిక సీఆవోగా ప్రవీణ్ రావు గా నియామించబడ్డాడు. గతంలో విశాల్ సిక్కా  ఈ కంపెనీకి ఛైర్మన్ వ్యవహరిచిన సంగతి తెలిసిందే.

హయత్ నగర్ బస్ స్టాప్ వద్ద వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్  : హయత్ నగర్ బస్ స్టాప్ వద్ద ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నల్లగొండ జిల్లా చౌటుప్పల్ కు చెందిన కనకయ్యగా పోలీసులు గుర్తించారు. 

09:33 - August 18, 2017

హైదరాబాద్ : హయత్ నగర్ బస్ స్టాప్ వద్ద ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నల్లగొండ జిల్లా చౌటుప్పల్ కు చెందిన కనకయ్యగా పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం వీడియో చడూండి.

09:32 - August 18, 2017

స్పెయిన్ : ఆగ్రదాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తున్నందుకు దాడులకు చేసినట్లు వారు తెలిపారు. ఉగ్రదాడిని అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు తీవ్ర ఖండించారు. ఒకే రోజు రెండు సార్లు ఉగ్రదాడుల జగటడంతో స్పెయిన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

బ్రిడ్జ్ దాటేలోగా ప్రాణం పోయింది...

పాట్నా : చూస్తుండగానే ఒక ప్రాణం పోయింది. బీహర్ కురుస్తున భారీ వర్షాలకు వరదలు రావడంతో చాలా చోట్ల రోడ్లు, బ్రీడ్జీలు తెగిపోయాయి. ఒక కూలడానికి సిద్దంగా ఉన్నా ఓ బ్రిడ్జీ పై నుంచి ఓ కుటుంబం దాటే ప్రయత్నం బ్రిడ్జీ కుప్పకూలిపోవడంతో వారు నీటిలో కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరి ప్రాణాలు కాపాడగలిగారు. 

09:12 - August 18, 2017

పాట్నా : చూస్తుండగానే ఒక ప్రాణం పోయింది. బీహర్ లో కురుస్తున భారీ వర్షాలకు వరదలు రావడంతో చాలా చోట్ల రోడ్లు, బ్రిడ్జ్ లు తెగిపోయాయి. కూలడానికి సిద్దంగా ఉన్నా ఓ బ్రిడ్జ్ పై నుంచి ఓ కుటుంబం దాటే ప్రయత్నం చేసింది. ఒకేసారి బ్రిడ్జ్ కుప్పకూలిపోవడంతో వారి కుటుంబం నీటిలో కొట్టుకుపోయింది. స్థానికులు వారిలో ఇద్దరి ప్రాణాలు కాపాడగలిగారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

సిరిసిల్లలో మంత్రుల పర్యటన

సిరిసిల్ల : జిల్లాలో మంత్రులు కేటీఆర్, పోచారం పర్యటించనున్నారు. సర్దాపూర్ లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని వారు ప్రారంభించనున్నారు.

నేడు ప్రొకబడ్డీ మ్యాచ్ లు

ప్రొకబడ్డీ లీగ్  : నేడు రాంత్రి 8గంటలకు యూపీ యోధతో యూ ముంబా మ్యాచ్, రాత్రి 9గంటలకు బెంగళూరు బుల్స్ తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనున్నాయి.

నేడు తిరుపతిలో చంద్రబాబు పర్యటన

చిత్తూరు : నేడు తిరుపతిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 

08:23 - August 18, 2017

స్పెయిన్ : పోర్ట్ ఆఫ్ కామ్ బ్రిల్స్ రెండో ఉగ్రదాడిని పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు పర్యటక కేంద్రం బార్సిలోనా సిటీలో పాదచారులపై ఉగ్రవాదుల దాడి చేశారు. వ్యాన్ తో పాదచారులను ఢీకొట్టిన ఉగ్రవాది తర్వాత దాడికి దిగాడు. ఈ ఉగ్రదాడిలో 13 మంది మృతి చెందారు. 100పైగా గాయాలయ్యాయి. ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. బార్సిలోనా దాడిపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

వనపర్తి జిల్లాలో దారుణం

వనపర్తి : జిల్లా శ్రీరంగపురం మండలం శేరుపల్లిలో దారుణం జరిగింది. మూడో తరగతి విద్యార్థి ఆనంద్ కిరోసిను పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తెలుగు పద్యం నేర్చుకోవాలని టీచర్ చెప్పినందుకు భయంతో ఆత్మహత్యాయత్నం చేశాడని బంధువులు తెలిపారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.

08:15 - August 18, 2017

వనపర్తి : జిల్లా శ్రీరంగపురం మండలం శేరుపల్లిలో దారుణం జరిగింది. మూడో తరగతి విద్యార్థి ఆనంద్ కిరోసిను పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తెలుగు పద్యం నేర్చుకోవాలని టీచర్ చెప్పినందుకు భయంతో ఆత్మహత్యాయత్నం చేశాడని బంధువులు తెలిపారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

స్పెయిన్ లో ఉగ్రదాడి

స్పెయిన్ : ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బార్సిలోనా పట్టణంలో వ్యాన్‌తో బీభత్సం సృష్టించారు. వాహనంతో పాదచారులను ఢీకొట్టారు. ఈ ఘటనలో 13 మంది స్పాట్‌లోనే మృతి చెందగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం ఓ ఉగ్రవాది సమీపంలో ఉన్న రెస్టారెంట్లోలోకి దూరడంతో ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు రెస్టారెంట్‌ను చుట్టుముట్టి.. ఉగ్రవాదిని బంధించాయి. మరోవైపు ఉగ్రదాడి ఘటనలో యూరప్‌ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. తమ భద్రతా దళాలను అప్రమత్తం చేశాయి. 

07:58 - August 18, 2017

జయలలిత మరణం అనుమానాస్పదం, దీనిపై ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. వెంకయ్య నాయుడు స్వంత పార్టీ నాయుకురాలు చనిపోయినట్టు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారని, అక్కడ అన్నాడీంకే లో రెండు గ్రూప్ లుగా విభజించారని నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య అన్నారు.తమిళనాడు విషయంలో బీజేపీ అంత ఉత్సహాం లేదని, జయలలిత ఆరు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని. ఆమె ఒక నియంతగా ఉండి భవిష్యత్ నాయకులను తయారు చేసుకోలేకపోలేదని బీజేపీ నేత కుమార్ అన్నారు. తోపులాటలో భాగంగానే ఆయన అనుకోకుండా కొట్టారని టీడీపీ నేత దుర్గాప్రసాద్ అన్నారు.మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

07:56 - August 18, 2017

ప్రాచీన సంప్రదాయాల్లో ఎన్నో ఉన్నాయని, పురావస్తు శాఖలో ఉన్న తాళపత్రగ్రంథలను కొన్ని సంవత్సరాల నుంచి పరిశోధానలు చేస్తున్నాని, తన పరిశోధనలో చరిత్రలో తెలియని కవులు ఉన్నారని, ఆయుర్వేద గురించి కూడా గ్రంథలను వెలుగులోకి తీసుకొచ్చా అని తను 11దేవస్థానాలను కనుగొన్నానని తెలంగాణ పర్యటక శాఖలో పరిశోధనలు చేస్తున్న కావూరి శ్రీనివాస్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:55 - August 18, 2017

విజయవాడ : విజయవాడలో వినయక చవితి సంబరాలకు సర్వం సిద్ధమౌతోంది. భక్తులు, గణేషుని సేవలో తరించేందుకు పందిళ్లను సకల హంగులతో తీర్చిదిద్దుతున్నారు. వివిధ ప్రాంతాల్లో చవితి పండగ ఏర్పాట్లకు యువత సిద్ధంగా ఉంది. తొమ్మిది రోజుల పాటు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. గతంలోలాగానే ఈ ఏడాది కూడా వేల సంఖ్యల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా... విజయవాడలోని జింఖానా గ్రౌండ్‌లో ఈ సారి 72 అడుగుల వినాయకుడు కొలువుదీరబోతున్నాడు. ఇందుకు సంబంధించి గణనాథుని నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇక పండుగ సమయం సమీపించడంతో విగ్రహాల తయారీ కూడా జోరందుకుంది.

వివిధ ఆకృతుల్లో గణపయ్యలు
కళాకారులు తమ కళా నైపుణ్యంతో వివిధ ఆకృతుల్లో గణపయ్యను అందంగా తీర్చిదిద్దుతున్నారు. వివిధ రూపాల్లో వినాయకున్ని సర్వాంగ సుందరంగా తయారు చేస్తున్నారు. విజయవాడలో పందిళ్ల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలని కార్పొరేషన్‌, పోలీసు శాఖలకు దరఖాస్తు చేసుకొని, అనుమతులు పొందాలని అధికారులు సూచిస్తున్నారు. మండపాల ఏర్పాటుకు అగ్నిమాపక సిబ్బంది అనుమతి కూడా తప్పనిసరి చేశారు. ఇక వేడుక నిర్వహణకు భారీ మొత్తంలో వెచ్చించేందుకు యువత ఉత్సాహం చూపిస్తున్నారు. దాదాపు నాలుగు లక్షల నుండి ఇరవై లక్షలకు పైగా ఖర్చు చేసేందుకు ఆయా కమిటీ సభ్యులు ఆసక్తి కనబరుస్తున్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా, విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరున్ని పూజించేందుకు నగరంలోని పందిళ్లు శోభాయమానంగా తయారవుతున్నాయి. విజయవాడ తలమానికంగా ఉన్న బందరు రోడ్‌, ఏలూరు రోడ్‌, బీసెంట్‌ రోడ్‌, పాతబస్తీ, తదితర ప్రాంతాల్లో చవితి సందడి మొదలైంది. పండుగ రావడమే తరువాయి అన్నట్టు ఊరంతా చవితి వైభవాన్ని సంతరించుకుంది.

07:52 - August 18, 2017

నిజామాబాద్ : వర్షాలు ముఖం చాటేశాయి. ప్రవాహం లేక నదులు వెలవెలబోతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి చుక్కనీరు రాక ఉత్తరతెలంగాణ వరదాయని శ్రీరాంసాగర్‌ వట్టిపోతోంది. ఉత్తరతెలంగాణ జిల్లాల కల్పతరవు శ్రీరాంసాగర్‌ ఎండిపోతోంది. గోదావరిలో జలసిరులు కరువైపోవడంతో ప్రాజెక్టులోకి చుక్కనీరు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రాజెక్టులో ఉన్ననీరుకూడా క్రమంగా తరిగిపోతుండటంతో ఆయకట్టు రైతాంగంలో ఆందోళన మొదలయింది. వర్షాల సీజన్‌ ప్రారంభమై రెండున్నర నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ప్రాజెక్టులోకి వచ్చిన నీరు కేవలం 1.64 టీంసీలేనని ఇరిగేషన్‌ అధికారులు అంటున్నారు. 90టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీరాంసాగర్‌లో ప్రస్తుతం 9టీఎంసీలు నీరుమాత్రమే ఉంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు కింది ఈసారి పంటల సాగు ప్రశ్నార్ధకంగా మారింది.

2400 క్యూసెక్కుల నీరు మాత్రమే
సాధారణంగా జూలై నుంచి అక్టోబర్‌ చివరి వరకు శ్రీరాంసాగర్‌లోకి వరదనీరు వస్తుంది. దీని ఆధారంగానే జూలై 1నుంచి అక్టోబర్‌ 28 వరకు బాబ్లీప్రాజెక్టు గేట్లు ఎత్తివేసే ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం బాబ్లీగేట్లు ఎత్తివేసినా శ్రీరాంసాగర్‌లోకి 2400 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చింది. ఎగువప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా గోదావరిలో ప్రవాహాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. మరోవైపు జలాశయంలో ఉన్ననీరుకూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. శ్రీరాంసాగర్‌ డెడ్‌స్టోరేజీ 5 టీంఎసీలు పోగా ఇక మిగిలేది 4 టీఎంసీలు మాత్రమే. దీంతో ప్రాజెక్ట్‌ అధికారుల్లో ఆందోళన మొదలయింది. కనీసం ఉత్తర తెలంగాణ జిల్లాలకు తాగునీరు కూడా అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఎడారిగా మారే ప్రమాదం...
ఎస్సారెస్పీ ఆధారంగా దాదాపు 16లక్షల ఎకారాల ఆయకట్టు సాగవుతోంది. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ ప్రధాన కాలువలతోపాటు పలు ఎత్తిపోత పథకాల ద్వారా మొత్తం 18లక్షల 66వేల 765 ఎకరాలకు ఈసారి నీరందించాలని ఇరిగేషన్‌ అధికారులు నిర్దేశించుకున్నారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో చుక్కనీరు కూడా రాకపోవడంతో ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఒక్క కాలువలో కూడా నీటి విడుదల కొనసాగడం లేదు. ఇప్పటికే వర్షాకాలం దాదాపు సగం కాలం తుడిచిపెట్టుకు పోయింది. మిగిలిన మరో నెలన్నరలోపు వర్షాలు పడితే సరే.. లేకుంటే ఈసారి కరువుతప్పదని ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు ఆందోళన పడుతున్నారు. వర్షాల కోసం ఆకాశంవంక ఆశగా చూస్తున్నారు. 

07:49 - August 18, 2017

కర్నూలు : నంద్యాల ఉపఎన్నికలో కులాల ఓటు బ్యాంకు కీలకంగా మారింది. పార్టీలు కులాలు, మతాల వారీగా ఓట్లను అంచనాలు వేసుకుంటున్నాయి. ఏ కులం ఓట్లు ఏపార్టీకి పడతాయి. కీలకంగా ఉన్న ఏరియాల్లో ఆయా సామాజిక వర్గాలను, కులపెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు పక్కా ప్రణాళికలతో అన్నిపార్టీలు ముందుకు సాగుతున్నాయి. గత 2014 ఎన్నికల్ల్లో పోల్‌ అయిన ఓట్లను దృష్టిలో పెట్టుకుని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌పార్టీలు ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. బూత్‌ల వారీగా గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు నమోదు అయ్యాయి అన్న వివరాలతో ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. తమకు నమోదైన ఓటింగ్ శాతాన్ని కాపాడు కుంటూనే , ప్రత్యర్థి పార్టీకి నమోదైన ఓటింగ్ ను దెబ్బకొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. నంద్యాల బరిలో 15 మంది అభ్యర్దులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టిడిపి అభ్యర్ది భూమా బ్రహ్మానందరెడ్డి , వైసీపీ అభ్యర్ది శిల్పా మోహన్ రెడ్డీల మధ్యనే ఉంది. ఇద్దరూ కూడా సమవుజ్జీలు కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో విజయానికి సామాజికవర్గా ఓట్లు కీలకంగా మారాయి.

మైనార్టీ ఓట్లు 52 వేలు
నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 18వేల 858 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1 లక్షా 7వేల 778 మంది.. మహిళలు 1లక్షా 10వేల 18 మంది ఉన్నారు. ఇక కులాల వారీగా ఓటర్ల వివారాలు పరిశీలిస్తే ముస్లిం మైనార్టీ ఓట్లు 52 వేలులు ఉండగా బలిజలు 41 వేలు, వైశ్యులు ఓట్లు 25వేల వరకు ఉన్నాయి. మాలసామాజిక వర్గ ఓట్లు 21000, మాదిగ సామాజిక వర్గం ఓటర్లు 7500 వరకు ఉన్నారు. అటు బోయ వాల్మీకుల ఓటర్లు 10, 500 , రజకులు 4500 ఉండగా ఈడిగ సామాజిక వర్గం ఓట్లు 3100 ఉన్నాంయి. ఇక యాదవుల ఓట్లు ఏడు వేలవరకు ఉండగా.. ఎస్టీలు , కమ్మ, కుమ్మరి సామాజికవర్గా ఓట్లు దాదాపు 10వేలు వరకు ఉన్నాయి. ఇక ఇతరుల ఓట్లు 15 వేల వరకు ఉన్నాయి. ఈ కులాల్లో ముస్లింలు, బలిజలు, వైశ్యులు, మాలసామాజిక వర్గం ఓట్లే సుమారు లక్షన్నర వరకు ఉన్నాయి. దీంతో అన్నిపార్టీలు కులపెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అన్నిపార్టీల నేతలు సొంతకులాల ఓటర్లకు గాలం వేస్తూ ఆశలపల్లకి ఎక్కిస్తున్నారు.

డీపీ, వైసీపీ పోటాపోటీ
కుల పెద్దలను ఆకట్టుకోవడంలో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార టీడీపీ ముందస్తుగానే ముస్లిం నాయకులకు పదవులు కేటాయించింది. మాజీమంత్రి ఎన్ ఎమ్ డి ఫరూక్ కు ఎమ్మెల్సీ పదవి, మరో ముస్లీం నేత నౌమాన్ కు ఉర్దూ అకాడమీ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టింది. ఇక వైసీపీ నేత జగన్ ముస్లింలకు అనేక హామీలను ఇచ్చారు. భవిష్యత్తులో నంద్యాలలో ముస్లింలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ ప్రకటించారు. ఇదిలా ఉండగా ముస్లింలలో కొందరు కాంగ్రెస్ వైపు కూడా ఉన్నారు. మొదటి నుంచి వీరి ఓటు బ్యాంకు హస్తం పార్టీకి ఉండటంతో ఆ వర్గం ఓట్లు..ఈసారికూడా తమకే పడతాయన్న ఆశ కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్దిగా అబ్దుల్ ఖాదర్ ను బరిలోకి దింపింది. అన్నిపార్టీల అభ్యర్దుల్లో నెలకొంది. మొత్తానికి సామాజిక వర్గాల ఓట్లపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టినప్పటికీ చివరి దాకా తమ వెంట నడిచే దెవరోననే ఆందోళన చెందుతున్నారు.

07:46 - August 18, 2017

కొమరంభీం :కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండంలం ఈస్‌గాం లో మట్టిగణపతులు కనువిందు చేస్తున్నారు. చెరువు మట్టి, సహజరంగులతో పర్యావరణ హిత గణపతి విగ్రహాలను కొనడానికి స్థానికులు ఉత్సహపడుతున్నారు. ప్లాస్టర్‌ఆఫ్‌ప్యారిస్‌ తో తయారయ్యే విగ్రహాలు పర్యవరణానికి హాని కలుగుతున్న నేపథ్యంలో ఈజ్‌గాంలో తయారవుతున్న మట్టిగణపతులకు డిమాండ్‌ పెరిగింది. ప్రజల్లో వస్తున్న చైతన్యానికి ఇది నిదర్శనమని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. మొదట వెదురు బొంగులు, వరిగడ్డితో ఓ రూపాన్ని తయారు చేసుకుని..దానికి చెరువుమట్టిని పైపూతగా రాస్తారు. ఇలా బొమ్మలు నునుపుదేరే వరకు మట్టిని పలు దఫాలుగా వాడుతూ పూర్తి గణనాథుని రూపాన్ని తీసుకొస్తున్నారు ఈ కళాకారులు. ప్లాస్టర్‌ఆఫ్‌ప్యారిస్‌ విగ్రహాలకు ఏమాత్రం తీసిపోని విధంగా , చూడముచ్చటగా గణనాథుల విగ్రహాలు తయారవుతున్నాయి.

ప్రజల్లో పర్యావరణంపై అవగాహన
పశ్చిమబెంగాల్‌ నుంచి ఇక్కడికి వచ్చిన ఎందరో కళాకారులు.. మట్టిగణపతులతో ప్రజల్లో పర్యావరణంపై అవగాహన తెస్తున్నారు. వీరు తయారు చేసిన గణపతి విగ్రహాలను ఆసిఫాబాద్‌, మంచిర్యాలతోపాటు మహరాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు ఇచ్చి మరి తయారు చేయించుకుంటున్నారు. ఉపాధితోపాటు పర్యావరణానికి మేలు చేస్తున్న ఈ కళాకారులను అందరూ మెచ్చుకుంటున్నారు. మట్టిగణనాథులతోపాటు ఈ కళాకారులకూ జేజేలు పలకుతున్నారు భక్తజనం. 

07:45 - August 18, 2017

హైదరాబాద్ : రాబోయే సాధారణ ఎన్నికలకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రచిస్తున్న కమలనాథులు తెలంగాణాలో గులాబి పార్టీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆరుగురు టిఆర్ఎస్‌ ఎంపీలను తమ వైపు తిప్పుకునేందుకు బిజెపి రంగం సిద్ధం చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న ఎంపీలను కమల దళంలో చేర్చుకుంటే తెలంగాణాలో కూడా పట్టు చిక్కినట్లువుతుందని బిజెపి అగ్రనేతలు భావిస్తున్నారట.

తెలంగాణపై ఫోకస్‌
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణపై ఫోకస్‌ చేశారన్న అంశంపై కమలం పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో కారుపార్టీ జోరుకు బ్రేకులు వేసే దిశగా పావులు కదుపుతున్నారు. దీనికి అమిత్ షా ఇప్పటికే తెర‌వెన‌క మంత్రాంగం న‌డిపిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో గులాబీ ఎంపీలను లాగేందుకు స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. అర‌డ‌జ‌ను ఎంపీలతో అమిత్ షా ట‌చ్‌లో ఉన్నారట. టిఆర్ఎస్ గూటికి చేరిన వ‌ల‌స ఎంపీలు ముందువరుసలో ఉన్నార‌ని తెలుస్తోంది. అసంతృ ఎంపీలు బీజేపీ అధ్యక్షుడితో మంత‌నాలు జరిపిన‌ట్లు ప్రచారం జ‌ర‌గుతోంది.

ఆరుగురు టిఆర్ఎస్ ఎంపీలు
ఇప్పటివరకు ఆరుగురు టిఆర్ఎస్ ఎంపీలు అమిత్ వ‌ల‌లో ఉన్నట్లు కమలం పార్టీలో చర్చ సాగుతోంది. అంతా అనుకూలంగా జరిగి అమిత్‌ షా మంత్రాగం ఫలిస్తే.. త్వరలోనే ఆరుగురు ఎంపీలు క‌మ‌లం గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది. అమిత్ షా పక్కా ప్లాన్‌తో రాష్ట్రానికి వ‌స్తున్నారని సమాచారం. కమలం గూటికి చేరేది ఎవరా ఆరుగురు ఎంపీలు అన్న అంశం గులాబి పార్టీలో గుబులు పుట్టిస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డిఎస్ కుమారుడు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ప్రకటనలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఎంపీల వలసల ప్రచారంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

07:42 - August 18, 2017

విజయవాడ : పాలిటిక్స్‌ అంటేనే ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించడం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం. ఎదుటి పార్టీ వ్యూహాలను తిప్పికొట్టడం. ఇలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తేనే పార్టీ మనగలుగుతుంది. పార్టీ క్యాడర్‌లో భరోసా పెరుగుతుంది. ఇన్నాళ్లూ తన అభిప్రాయాలు ట్విట్టర్‌, యూట్యూబ్ వేదికగా వెల్లడించిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగిడబోతున్నారు. దీంతో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా
గత ఎన్నికల సమయంలో పవన్‌ కల్యాణ్‌ టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను గద్దె దింపేందుకు పసుపు, కాషాయ దళంతో చేతులు కలిపారు. సభా వేదికలనూ పంచుకున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానన్న హామీని మోదీ విస్మరించారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఊదరగొడుతుండడంతో పవన్‌ వారితో విభేదిస్తున్నారు. ఇక టీడీపీ ప్రభుత్వాన్ని కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తున్నా.... ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూనే ఉన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యను పవన్‌ కల్యాణ్‌ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించి పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీడీపీతో పవన్‌ రహస్య ఒప్పందాలేంటో చెప్పాలంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీంతో ఇక నుంచి టీడీపీకి దూరంగా ఉండాలనే నిర్ణయానికి పవన్‌ వచ్చినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పవన్‌ ఒంటరిగానే పోటీలోకి దిగుతారన్న సంకేతాలు వస్తున్నాయి. ఇందులో భాగమే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పవన్‌ టీడీపీకి మద్దతు ఇవ్వకపోడం. తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని టీడీపీ నుంచి ఒత్తిడి వచ్చినా ఆయన తటస్థ వైఖరే తీసుకున్నారు.2019లో జరిగే సాధారణ ఎన్నికలే తన టార్గెట్‌ అని... అంతవరకు ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీచేయబోమంటూ పవన్‌ చేసిన ప్రకటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అక్టోబర్‌ తర్వాత విద్యార్థి, మహిళా విభాగాల ఏర్పాటు

పార్టీ నిర్మాణంపైనే
పవన్‌ ప్రస్తుతం పార్టీ నిర్మాణంపైనే దృష్టిపెట్టారు. ఇప్పటికే జనసేన సైనికుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. పార్టీ తరపున సేవాదళ్‌ను ఏర్పాటు చేశారు. అక్టోబర్‌ తర్వాత విద్యార్థి, మహిళా విభాగాలను ఏర్పాటు చేయనున్నట్టు పవన్‌ తెలిపారు. ఈ ఏడాదిలోగా మహిళా, విద్యార్థి విభాగాల కార్యక్రమాలు మొదలుపెట్టనున్నట్టు చెప్పారు. మొత్తానికి జనసేనాని పార్టీ నిర్మాణంపై సీరియస్‌గా వర్క్‌ చేస్తున్నారు. 2019 ఎన్నికల నాటికి పటిష్టమైన పార్టీగా జనసేనను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

07:29 - August 18, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక ఘట్టం.. ఊహించని మలుపులతో సాగుతోంది. శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ పదవిని వీడి మరీ.. అన్నయ్య శిల్పా మోహనరెడ్డికి బాసటగా నిలవడం టీడీపీకి పెద్ద షాక్‌ అనుకుంటే.. ఇప్పుడు గంగుల ప్రతాపరెడ్డి వైసీపీకి షాక్‌ ఇస్తూ టీడీపీలో చేరారు. అమరావతిలో.. బుధవారం సోదరుడు సుదర్శన్‌రెడ్డితో కలిసి గంగుల చంద్రబాబును కలిసి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాల్లో గంగుల కుటుంబానికి కీలకమైన పాత్రే ఉంది. గంగుల తిమ్మారెడ్డి మృతితో 1978 ఎన్నికల్లో ఆయన తనయుడు గంగుల ప్రతాపరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అలా రాజకీయ అరంగేట్రం చేసిన ప్రతాపరెడ్డి, 1985, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగాను, 1991లో నంద్యాల ఎంపీగా, రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే.. అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 1992లో కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా గెలిపించింది. 2004లో కాంగ్రెస్‌ తరఫున ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2009 సాధారణ, 2012 ఉపఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.

తొలుత గంగుల ప్రతాపరెడ్డినే
గంగుల ప్రతాపరెడ్డి కుటుంబానికి నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లోని గోస్పాడు మండలం పెట్టని కోట లాంటింది. స్థానిక నేతలతో అనుబంధాలు, కుటుంబ బంధుత్వాలు, స్నేహాలు, ముఖ్యులతో పరిచయాలు.. గోస్పాడును గంగుల కుటుంబానికి కంచుకోటలా మార్చాయి. ఒకప్పుడు ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలో ఉన్న గోస్పాడు మండలం.. గడచిన ఎన్నికలకు ముందు నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా.. నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లోకి వచ్చింది. గంగుల కుటుంబానికి ఉన్న ఓటు బ్యాంకు కారణంగా.. నంద్యాల ఉప ఎన్నికల్లో గంగుల ప్రతాపరెడ్డినే పోటీ చేయించాలని జగన్‌ తొలుత భావించారు. ఆ ఉద్దేశంతోనే.. గంగుల ప్రతాపరెడ్డి తమ్ముడు ప్రభాకరరెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయించారు. అయితే.. చంద్రబాబు భూమా వర్గానికే ఎమ్మెల్యే టికెట్‌ ఖరారు చేయడంతో.. శిల్పా బ్రదర్స్‌ వైసీపీలో చేరారు. శిల్పా సోదరులు వైసీపీలో చేరడం.. గంగుల ప్రభాకరరెడ్డి ఎమ్మెల్సీగా ఉండడంతో.. గోస్పాడు మండలం తమకు ఏకపక్షం అవుతుందని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.. అయితే, గంగుల ప్రతాపరెడ్డి అనూహ్యంగా టీడీపీలో చేరడం.. వైసీపీ నాయకత్వాన్ని పెద్ద షాక్‌కే గురిచేసింది. ప్రస్తుతం.. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి గోస్పాడు మండలంలో వైసీపీని గెలిపించే బాధ్యతలను చేపట్టారు. ఇలాంటి తరుణంలో.. ఇదే మండలంలో టీడీపీని గెలిపించే బాధ్యతలు తీసుకుంటానని చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ అన్నదమ్ముల మధ్య పోరు సాగుతుందా..? లేక అన్నయ్యకు అనుకూలంగా తమ్ముడు ప్రభాకరరెడ్డి సైలెంట్‌ అవుతారా అన్న చర్చ సాగుతోంది.

భూమా వర్గీయుల్లో ఆగ్రహం
గంగుల ప్రతాపరెడ్డి టీడీపీలో చేరడం పట్ల భూమా వర్గీయుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థాయిలో.. గంగుల, భూమా వర్గాల మధ్యే తీవ్రమైన ఫ్యాక్షన్‌ కొనసాగింది. ఈ నేపథ్యంలో.. ఇరు వర్గాలూ ఒకే పార్టీలో కలసి సాగడం ఏంటని భూమా వర్గం ప్రశ్నిస్తోంది. గంగుల ప్రతాపరెడ్డి ఎన్నికల వ్యూహంలో భాగంగా టీడీపీలో చేరారా..? ఆయనకు ఏదైనా పదవిని ఎర వేశారా..? అసలు సీఎం చంద్రబాబు గంగులకు ఇచ్చిన హామీ ఏంటి అన్న అంశాలపై విస్తృత చర్చ సాగుతోంది. ఏది ఏమైనా.. గంగుల ప్రతాపరెడ్డి టీడీపీలో చేరడం.. నంద్యాల ఉప ఎన్నికలపై పెద్ద ప్రభావాన్నే చూపుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. 

07:27 - August 18, 2017

విజయవాడ : నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి భయంతో వైసీపీ అధినేత జగన్‌ శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని టీడీపీ ఆరోపించింది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో నంద్యాల ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలకు పార్టీ నాయకత్వం సూచించింది. శాంతి భద్రతల సమస్య సృష్టించడం ద్వారా నంద్యాల ఉప ఎన్నిక వాయిదా వేయించాలన్న వైసీపీ కుట్రలు, కుతంత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులను ఆదేశించింది. వైసీపీ రెచ్చగొట్టినా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరింది. 

07:25 - August 18, 2017

స్పెయిన్ : ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బార్సిలోనా పట్టణంలో వ్యాన్‌తో బీభత్సం సృష్టించారు. వాహనంతో పాదచారులను ఢీకొట్టారు. ఈ ఘటనలో 13 మంది స్పాట్‌లోనే మృతి చెందగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం ఓ ఉగ్రవాది సమీపంలో ఉన్న రెస్టారెంట్లోలోకి దూరడంతో ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు రెస్టారెంట్‌ను చుట్టుముట్టి.. ఉగ్రవాదిని బంధించాయి. మరోవైపు ఉగ్రదాడి ఘటనలో యూరప్‌ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. తమ భద్రతా దళాలను అప్రమత్తం చేశాయి. ఈ ఏడాది లండన్‌ బ్రిడ్జి వద్ద, ఏడాది క్రితం ఫ్రాన్స్‌లోని నీస్‌లోనూ ఇదే తరహాలో దాడికి పల్పడిన ఉగ్రవాదులు బీభత్స సృష్టించారు. బార్సిలోనా ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్లో భారతీయులెవరూ లేరని ఆమె ట్వీట్‌ చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో స్పెయిన్‌కు దౌత్యపరమైన సా యం అందించేందుకు సిద్ధమేనని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌ ప్రకటించారు. అమెరికా మిత్రదేశాలపై ఉగ్రదాడులను సహించబోమని ఆయన తెలిపారు.

నేడు పోలవరం సందర్శించనున్న పార్లమెంట్ స్టాడింగ్ కమిటీ

ఏపీ : నేడు పోలవరం ప్రాజెక్టునను పార్లమెంట్ స్టాడింగ్ కమిటీ సందర్శించనున్నారు. ఉదయం సీఎంతో భేటీలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు వివరించనున్నారు.

Don't Miss