Activities calendar

19 August 2017

నంద్యాల ఉపఎన్నిక వ్యవహారంపై సీఈసీకి లేఖ రాసే యోచనలో టీడీపీ

అమరావతి : నంద్యాల ఉప ఎన్నిక వ్యవహారవంపై సీఈసీకి లేఖ రాసే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమావేశం

హైదరాబాద్ : జలసౌధలో ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. 

వర్ధమాన నటిపై దర్శకుడు చలపతి, హీరో సృజన్ అత్యాచారయత్నం

విజయవాడ : వర్ధమాన నటిపై దర్శకుడు చలపతి, హీరో సృజన్ లు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. దర్శకుడు చలపతి, హీరో సృజన్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.

హైదరాబాద్ శివారు సిటీజెన్ కాలనీలో భారీ చోరీ

హైదరాబాద్ : శివారు సిటీజెన్ కాలనీలో భారీ చోరీ జరిగింది. బీఎస్ ఎన్ ఎల్ రిటైర్ట్ ఉద్యోగి నాగేశ్వర్ రావు ఇంట్లో 
కిలో బంగారాన్ని దొంగలు అపహరించారు. 

22:03 - August 19, 2017
22:01 - August 19, 2017
22:00 - August 19, 2017

ఢిల్లీ : రెండు సార్లు వన్డే వరల్డ్ చాంపియన్‌ ఇండియా విదేశీ గడ్డపై మరో కీలక వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది. భారత్‌, శ్రీలంక జట్ల మధ్య 5 వన్డేల సిరీస్‌లోని తొలి వన్డేకు రంగిరీలోని దంబుల్లా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో  రంగం సిద్ధమైంది.యాంగ్రీ యంగ్‌ గన్‌ విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు ఉపుల్ తరంగ సారధ్యంలోని శ్రీలంక టీమ్‌ సవాల్‌ విసురుతోంది.  తొలి వన్డేలో నెగ్గి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని విరాట్‌ ఆర్మీ పట్టుదలతో ఉంది.

శ్రీలంకతో కీలక వన్డే సిరీస్‌కు కొహ్లీ అండ్‌ కో సై అంటే సై అంటోంది. టెస్ట్‌ సిరీస్‌లో శ్రీలంకను బ్రౌన్‌ వాష్‌ చేసిన భారత్...వన్డే సిరీస్‌ను సైతం క్లీన్‌ స్వీప్‌ చేయాలని తహతహలాడుతోంది. భారత్‌-శ్రీలంక మధ్య 5వన్డేల సిరీస్‌లోని తొలి  వన్డేకు రంగిరీలోని దంబుల్లా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో  రంగం సిద్ధమైంది.

ఇండియా ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 3వ స్థానంలో ఉండగా ...శ్రీలంక 8వ ర్యాంక్‌లో ఉంది. ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో శ్రీలంక తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన భారత జట్టు సిరీస్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది.విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు అటు అనుభవజ్ఞులు, ఆల్‌రౌండర్లు, ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో పవర్‌ఫుల్‌గా ఉంది.

టాప్ ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కొహ్లీ, మిడిలార్డర్‌లో రహానే,రాహుల్‌లతో పాటు  లోయర్‌ ఆర్డర్‌లో ధోనీ,కేదార్‌ జాదవ్‌,హార్డిక్‌ పాండ్య  వంటి హార్డ్‌ హిట్టర్లతో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ ఎప్పటిలానే పటిష్టంగా ఉంది.

భువనేశ్వర్‌ కుమార్‌,బుమ్రాలతో పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ పదునుగా ఉంది. కానీ మ్యాజిక్‌ స్పిన్నర్లు అశ్విన్‌,జడేజా లేకుండానే భారత్‌ బరిలోకి దిగనుంది.వీరి స్థానంలో జట్టులోకొచ్చిన అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌,యజ్వేంద్ర చహాల్‌ ఏ స్థాయిలో రాణిస్తారో చూడాలి.  టీమ్‌ కాంబినేషన్‌ ఎలా ఉండబోతున్నా...భారత జట్టు విజయావకాశాలు మాత్రం బ్యాట్స్‌మెన్‌ రాణించడం మీదనే ఆధారపడి ఉన్నాయి.

మరోవైపు  వన్డే సిరీస్‌లో నెగ్గి టెస్ట్‌ సిరీస్‌ ఓటమికి భారత్‌పై బదులు తీర్చుకోవాలని శ్రీలంక ప్లాన్‌లో ఉంది.  ఉపుల్‌ తరంగ నాయకత్వంలోని శ్రీలంక జట్టు....ఏంజెలో మాథ్యూస్‌,తిసెరా పెరీరా, లసిత్‌ మలింగా వంటి సీనియర్‌ ఆటగాళ్ల మీదే భారం వేసింది. 

ప్రస్తుత టీమ్ కాంబినేషన్‌, ట్రాక్‌ రికార్డ్‌ పరంగా తొలి వన్డేలో టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో సందేహమే లేదు. మరి మొదటి వన్డేలో నెగ్గి 5వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసే జట్టేదో తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్‌ చేయాల్సిందే.

21:58 - August 19, 2017

ఛత్తీస్‌గడ్‌ : దుర్గ్‌ జిల్లాలోని గోశాలలో 30 ఆవులు మృతి చెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి గోశాల యజమాని, బిజెపి నేత హరీష్‌వర్మను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హరీష్‌వర్మ ఏడేళ్లుగా గోశాలను నడుపుతున్నారు. ఇక్కడ వందల సంఖ్యంలో ఆవులు జీవనం సాగిస్తున్నాయి. సౌకర్యాలు సరిగా లేకపోవడం, మందుల కొరత, ఆవులకు మేత పెట్టకపోవడం వల్ల ఆకలితో అలమటించి మృతి చెందాయి. గోసేవ ఆయోగ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు హరీష్‌వర్మను అరెస్ట్‌ చేశారు. పలు సెక్షన్ల కింద వర్మపై కేసు నమోదు చేశారు. 569 ఆవులను ఆ గోశాల నుంచి ఇతర గోశాలలకు తరలించారు. వర్మ ఆవులను తస్కరించి బొక్కల కంపెనీకి అమ్ముతున్నట్లు ఆరోపణలున్నాయి.

 

21:56 - August 19, 2017

శ్రీనగర్ : కశ్మీర్‌లోని షోపియా జిల్లాలో దాక్కున్న ఆరుగురు ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా 9 గ్రామాలను భద్రతాదళాలు చుట్టు ముట్టాయి. భారీగా ఎత్తున మోహరించి పోలీసులు, ఆర్మీ కలిసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టారు. చకూరా, మాత్రిబుగ్, ప్రతాప్‌పోరా, టకీపోరా, రత్నీపోరా, రాణిపోరా, దాన్‌గామ్, వన్‌గామ్‌ గ్రామాల్లో భద్రతాదళాలు ప్రతి ఇంటిని సోదా చేస్తున్నాయి. గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు బయటవ్యక్తులను అనుమతించడం లేదు. గత రాత్రి వాహనాల్లో ఉగ్రవాదులు సంచరించారన్న సమాచారం మేరకు పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి.

21:54 - August 19, 2017

యూపీ : ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. పూరి నుంచి హరిద్వార్‌ వెళ్తున్న కళింగ ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ వద్ద  రైలు పట్టాలు తప్పింది. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు జరిగిన ఈ ఘటనలో 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయినట్టు  తెలుస్తోంది. మరో 60 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  పోలీసులు, రైల్వే అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా ప్రమాద స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి. తీవ్రంగా గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. రైలు దుర్ఘటనపై రైల్వేమంత్రి సురేష్‌ ప్రభు విచారణకు ఆదేశించారు.

 

21:52 - August 19, 2017

హైదరాబాద్ : తెలంగాణలో మాదకద్రవ్యాలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. డ్రగ్స్‌, గంజాయి సప్లై చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. గుడుంబాను రూపుమాపినట్టే డ్రగ్స్‌, గంజాయిని నామరూపాల్లేకుండా చేస్తున్నామన్నారు. సికింద్రాబాద్‌ హరిహరా కళాభవన్‌లో నార్త్‌జోన్‌ డీసీపీ సుమతి ఆధ్వర్యంలో నిర్వహించిన కిడ్స్‌ అండ్‌ కాప్స్‌ అనే కార్యక్రమానికి హోంమంత్రి హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సినీ దర్శకుడు శేఖర్‌కమ్ముల... దేశ భవిష్యత్‌ అంతా యువత చేతుల్లోనే ఉందన్నారు. విద్యార్ధులు సన్మార్గంలో ప్రయాణిస్తూ కన్నవారికి, దేశానికి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 

21:50 - August 19, 2017

హైదరాబాద్ : కేసీఆర్ నిరంకుశ పాలనపై ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని టీజీక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు. సభలు, సమావేశాలపై జరుగుతున్న ఆంక్షలపై హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన సెమినార్‌కు కోదండరామ్ హాజరయ్యారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు నిర్భయంగా తమ సమస్యలపై పోరాడే హక్కును కోల్పోతున్నారని విమర్శించారు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. వారి సమస్యలను తీర్చాల్సిన కేసీఆర్ సర్కార్ వారికి బాసటగా నిలుస్తున్న ప్రతిపక్షాలపై నోరు పారేసుకుంటూ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇందిరాపార్క్ కేంద్రంగా ధర్నా చౌక్‌ను తిరిగి సాధించుకునేంత వరకూ అందరూ కలిసి కట్టుగా పోరాడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌ కోరారు. 

 

21:47 - August 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన గౌరవం లభించింది. రైతన్నల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తున్నారంటూ.. అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌-2017 అవార్డును ప్రకటించారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ ఆధ్వర్యంలోని కమిటీ ఈ అవార్డుకు కేసీఆర్‌ను ప్రతిపాదించింది. సెప్టెంబర్‌ 5న న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలస్‌లో కేసీఆర్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కీలక అవార్డు లభించింది. అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌-2017 అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో కృషి చేసే వారికి.. ఈ అవార్డును అందిస్తారు. 2008 నుండి భారత ఆహార వ్యవసాయ మండలి ఈ  అవార్డును ప్రధానం చేస్తూ వస్తోంది. ఈ ఏడాది అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ అవార్డుకు కేసీఆర్‌ ఎంపికయ్యారు.. 

రైతులకు 24 గంటల విద్యుత్‌, రైతు రుణమాఫీ అంశాల్లో కేసీఆర్‌ ప్రభుత్వ పనితీరు ఆధారంగా.. ఈ అవార్డును ప్రకటించారు. విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ నేతృత్వంలోని కమిటీ.. తెలంగాణలో జరుగుతున్న రైతు అనుకూల కార్యక్రమాలను బేరీజు వేసి ఈ అవార్డుకు కేసీఆర్‌ను ఎంపిక చేసింది. సెప్టెంబర్‌ 5న న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలస్‌లో.. భారత ఆహార, వ్యవసాయ మండలి నుంచి కేసీఆర్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. 

21:44 - August 19, 2017

కేసీఆర్ జీవిత చరిత్ర సీన్మ త్వరలో, ఓడగొట్ట జూస్తున్న సొంత పార్టోళ్లు , సుద్దపూస లెక్కున్న రోజా రమణి, రైతు కూలీలకు బేడీలేశిన పోలీసులు, దొంగతనం జేశి దొర్కిన కానిస్టేబుల్... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

21:42 - August 19, 2017

హైదరాబాద్‌ : నగరంలో దారుణం జరిగింది. అనారోగ్యం బాధ తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిజాంపేట్‌లోని బండారీ కాలనీలో చుక్క సాయిలు అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతనికి కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే చుక్క సాయిలు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వివిధ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మనస్తాపం చెందిన అతను ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు అతడికి స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలింంచారు. చికిత్స పొందుతూ సాయిలు మృతి చెందారు. సాయిలు మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.

 

21:37 - August 19, 2017

హైదరాబాద్ : రోహిత్‌ వేముల మృతిపై నియమించిన రూపన్‌ వాలా కమిషన్‌  కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, వీసీ అప్పారావును కాపాడుకోవటానికే నివేదిక ఇచ్చిందని తెలంగాణ వడ్డెర జేఏసీ నేతలు ఆరపించారు. రోహిత్‌ మరణానికి కుల వివక్ష, వీసీ అప్పారావే ప్రధాన కారణమన్నారు. రోహిత్‌ వడ్డెర కులస్తుడంటూ ప్రకటనలు ఇవ్వడం కేసును పక్కదారి పట్టించడానికి జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. రూపన్‌ వాలా కమిషన్‌ ఇచ్చిన రిపోర్టును రద్దు చేయాలన్నారు. కేంద్రమంత్రులు ఇద్దరిపైనా కేసు నమోదు చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 

21:26 - August 19, 2017

ప్రముఖ సినీ నిర్మాత డి.సురేష్ బాబుతో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు అసక్తికరమైన విషయాలు తెలిపారు. టీఆర్ ఎస్ పార్టీపై సినీ పరిశ్రమకు మంచి అభిప్రాయం ఉందన్నారు. కంటెంట్ లేని సినిమాలు ఆడడం లేదని..వాటికి థియేటర్లు దొరకడం లేదన్నారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:20 - August 19, 2017

నటుడు, కమెడియన్ నవీన్ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నవీన్ తన సినీ కెరీర్ గురించి వివరించారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్ అనుభవాలను తెలిపారు. ఆయన తెలిపిన పలు ఆసక్తిరమైన విషయాలను వీడియోలో చూద్దాం..

 

పార్టీ నిర్మాణంపై పవన్‌ కల్యాణ్‌ దృష్టి

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఇప్పటికే ఏపీలో జన సైనికుల ఎంపిక పూర్తి చేసిన పవన్‌... తెలంగాణలోనూ జనసేన శిబిరాలు ఏర్పాటు చేయబోతున్నారు. 

21:10 - August 19, 2017

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఇప్పటికే ఏపీలో జన సైనికుల ఎంపిక పూర్తి చేసిన పవన్‌... తెలంగాణలోనూ జనసేన శిబిరాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈనెల 23న నిజామాబాద్‌లో, సెప్టెంబర్‌ 7న ఖమ్మంలో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు జనసేన తెలిపింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ-మెయిల్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా శిబిరానికి సంబంధించిన వివరాలు తెలియజేయనున్నారు. 

 

ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

హైదరాబాద్ : ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కోస్తా నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి ఆవిరించింది. తెలంగాణ, కోస్తా ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

 

అనుమానాస్పద పేలుడు..వ్యక్తి మృతి

రంగారెడ్డి : హయత్ నగర్ పీఎస్ పరిధిలో తొర్రూర్ లో అనుమానాస్పద పేలుడు సంభవించింది. పురుషోత్తం అనే వ్యక్తి మృతి చెందారు. పేలుడుకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిని రాచకొండ సీపీ పరిశీలించారు. 

20:58 - August 19, 2017

యూపీ : ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. పూరి నుంచి హరిద్వార్‌ వెళ్తున్న కళింగ ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ వద్ద  రైలు పట్టాలు తప్పింది. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు జరిగిన ఈ ఘటనలో 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పోలీసులు, రైల్వే అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. 

 

20:55 - August 19, 2017

హైదరాబాద్ : సినిమా ప్రభావంతో యువత పెడధోరణి పడుతోందని రచయితలు ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌, మద్యానికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మానవ సంబంధాలు అనే అంశంపై చర్చా గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రచయితలు ప్రస్తుత మానవ సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మానవ సంబంధాలు పూర్తిగా దిగజారుతున్నాయన్నారు.  యువకులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడంతోనే  వారు చెడుమార్గం పడుతున్నారన్నారు.  విద్యార్థి దశ నుంచే వారికి క్రమశిక్షణ నేర్పించాలని కోరారు. సెల్‌ఫోన్‌తో కుటుంబాల మధ్య దూరం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

20:49 - August 19, 2017

విశాఖ : ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత ధనిక నియోజకవర్గంగా పేరొందిన గాజువాకకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సొంత ఇమేజ్ పెంచుకోవడంలో వెనకబడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఆయన హయాంలో కొన్ని పనులు పూర్తయినా, మరికొన్ని ముఖ్యమైన హామీలు నెరవేరలేదు. గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు సాధించిన ప్లస్ పాయింట్స్ ఏమిటి? మైనస్ పాయింట్స్ ఏమిటి? ఇదే ఇవాళ్టి ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్టు.     

విశాఖ జిల్లా గాజువాక ఆంధ్రప్రదేశ్ లోనే ధనిక నియోజకవర్గంగా పేరొందింది. సగటు తలసరి ఆదాయం 264332 రూపాయలు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు, బిహెచ్ పివి, విశాఖ ప్రత్యేక ఆర్థిక మండలి, ఆటోనగర్ పారిశ్రామికవాడ,  ఇలా పెద్ద పారిశ్రామిక ప్రాంతమంతా గాజువాక నియోజకవర్గంలోనే వుండడం విశేషం. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, ఒడిషా, చత్తీస్ గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఓటర్లు గాజువాకలో వుండడం విశేషం. 

ఈ నియోజకవర్గంలో గాజువాక, పెదగంట్యాడ మండలాలున్నాయి. 2,74, 115మంది ఓటర్లుండగా, వీరిలో 1,41,934మంది పురుషులు. 1,32,181మంది మహిళా ఓటర్లు. 

గాజువాకలో సామాజిక సమీకరణలు కీలకపాత్ర పోషిస్తాయి. కాపులు, యాదవులు, ఎస్సీ, గవర, రెడ్డిక, మత్స్యకారులు అధిక సంఖ్యలో వుంటారు. ముస్లింల ప్రభావమూ కనిపిస్తుంది. కాపులు, యాదవులు ఫలితాలను ప్రభావితం చేయగల స్థితిలో వున్నారు. 2014లో టిడిపి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు.

ఈ మూడేళ్ల కాలంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కొన్ని ప్లస్ పాయింట్లు నమోదు చేసుకోగా, మరికొన్ని ముఖ్యమైన హామీలు తీర్చాల్సిన అవసరం వుంది.

గాజువాక హౌస్ కమిటీ సమస్యను పరిష్కరించడంలో మంచిమార్కులే స్కోర్ చేశారు ఎమ్మెల్యే పల్లా. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నాలుగు వేలమందికి పట్టాలు పంపిణీ చేయడం ఎమ్మెల్యే ఇమేజ్ గ్రాఫ్ ను పెంచింది. అయితే, ఇనాం భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే పనితీరుపై కొంత అసంతృప్తి, నిరుత్సాహం కనిపిస్తున్నాయి. 

నిత్యం రద్దీగా వుండే గాజువాక మెయిన్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం వాహనదారులకు పెద్ద రిలీఫ్. ఫ్లీట్ రివ్యూ నిధులు కూడా  ఈ సమస్య పరిష్కారానికి కలిసొచ్చాయి.  కణితిరోడ్డు విస్తరణ, మార్కెట్ తరలింపు లాంటి సమస్యలను ఎమ్మెల్యే పరిష్కరించాల్సి వుంది.

గాజువాకలో ప్రధాన సమస్యగా వున్న కొండవాలు ఇళ్లకు నీటి సరఫరా సమస్య చాలా వరకు తగ్గిపోవడం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి మరో ప్లస్ పాయింట్. అగనంపూడి సమీపంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న గత ప్రభుత్వ నిర్ణయం అమలవ్వడం ఎమ్మెల్యేకి కలిసొచ్చిన మరో ప్లస్ పాయింట్. 

స్టీల్ ప్లాంట్ నిర్వాసిత కుటుంబాలకు రీ హేబిలిటేషన్ కార్డులిస్తారు. విడతలవారీగా ఇప్పటికి 7543మంది ఆర్ కార్డులివ్వగా, ఇంకా 9వేలమంది ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పథకం నిదానంగా అమలవుతుండడంతో కొంతమంది నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. దీంతో థర్డ్ జనరేషన్ లబ్ధిదారులకు సైతం ఆర్ కార్డులు బదిలీ జరిగేలా చూడాలంటూ ఎమ్మెల్యేను కోరుతున్నారు. 

గాజువాకను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమస్యల్లో అత్యంత జఠిలమైనది కాలుష్యం. రసాయన పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్ నుంచి వెలువడే కాలుష్యంతో పాటు గంగవరం పోర్టు వెదజల్లే దుమ్మూధూళి గాజువాక ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం విషయంలో ఎమ్మెల్యే ప్లస్ మార్కులు సంపాదించలేకపోతున్నారు.

తాను ఇచ్చిన హామీల్లో అత్యంత ముఖ్యమైన గంగవరం జెట్టీ నిర్మాణం ఆచరణ రూపం దాల్చకపోవడంతో ఎమ్మెల్యే పనితీరుపై మత్స్యకారుల్లో అసంతృప్తి రాజేస్తోంది. 

గాజువాక ఎమ్మెల్యేకి మైనస్ మార్కులేస్తున్న మరో సమస్య తుంగ్లాం. భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ కంపెనీ నిర్మాణం కోసం ప్రభుత్వం 400 ఎకరాల భూమిని సేకరించింది. తుంగ్లాంతో పాటు నాలుగు గ్రామాలకు జాతీయ రహదారిని కలుపుతూ బిహెచ్ పివి టౌన్ షిప్ మధ్యలో నుంచి రహదారి సౌకర్యం కల్పించారు. భద్రతా కారణాలతో బిహెచ్ పి వి యాజమాన్యం గేటును మూసివేసింది. దీంతో ఆ దారిలో వెళ్లేవారు పది కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలవారు న్యాయపోరాటం చేస్తున్నారు. అర్బన్ హౌసింగ్, మౌళిక సదుపాయల కల్పన, ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఘోరంగా విఫలమయ్యారన్నది వైసిపి నేతల ఆరోపణ.

ఎమ్మెల్యే వ్యవహార శైలిపై సొంతపార్టీలోనూ అసంతృప్తి కనిపిస్తోంది. ప్రతిపక్షంలో వున్నప్పుడు పదేళ్లు పార్టీని మోసిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. చెప్పుడు మాటలకే ఎక్కువ విలువనిస్తున్నారన్నది మరో ఫిర్యాదు. ఆయన అప్రమత్తంగా వ్యవహరించకపోతే వచ్చే ఎన్నికల్లో గట్టి సవాలును ఎదుర్కోకక తప్పదన్నది టిడిపిలో వినిపిస్తున్న 

20:41 - August 19, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ఏపీ వ్యవవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూస్తున్న నంద్యాల ఓటర్లు టీడీపీకి అనుకూలంగా ఉన్నారని తెలిపారు. 

20:24 - August 19, 2017

కర్నూలు : తన రాజకీయ జీవితంలో ఏ ప్రభుత్వం ఇంత దౌర్జన్యంగా ఎన్నికలు జరపడం చూడలేదన్నారు వైసిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. 3 సంవత్సరాల కాలంలో నంద్యాలలో టీడీపీ ఏ  వర్గానికి  న్యాయం చేయలేదని విమర్శించారు. టీడీపీతో ఎవరు జత కట్టినా వారు ఆత్మహత్య చేసుకున్నట్లేనంటున్న బొత్స సత్యనారాయణతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి ఓటమి తప్పదన్నారు. 

 

20:19 - August 19, 2017

కర్నూలు : చంద్రబాబుకి తన కొడుకు, మంత్రులపై నమ్మకం లేకే నంద్యాల ఉపఎన్నికల ప్రచారానికి వచ్చారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. నంద్యాల రోడ్‌షోలో పాల్గొన్న రోజా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లోకేష్‌ పర్యటించి టీడీపీని ఖాళీ చేయించారని గుర్తు చేశారు. వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మిగిలిన రెండేళ్లయినా జాగ్రత్తగా పని చేస్తారని రోజా అన్నారు..

 

20:05 - August 19, 2017

కర్నూలు : నంద్యాలలో ఉప ఎన్నికలు దగ్గరికి వస్తుంటే ఒక్కసారిగా ప్రచారం ఊపందుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించడంతో కార్యకర్తల్లో జోష్‌ అందుకుంది. నంద్యాల అభివృద్దే భూమా నాగిరెడ్డి  ఆత్మకు శాంతి కలుగుతుందని, ఆయన చిరకాల కోరిక కూడా నంద్యాల అభివృద్ధి అని  అన్నారు. ప్రస్తుతం ఆ అభివృద్ధిని టీడీపీ చేస్తుందని... భూమాకి ప్రజా సమస్యల పట్ల కమిట్‌మెంట్‌తో పని చేసేవాడని అందుకే  ఓకేసారి 3600 మందికి ఫించన్లు ఇచ్చానని అన్నారు. టీడీపీకి ఓటు వేసి గెలిపించి భూమా నాగిరెడ్డి ఆత్మకి శాంతి కలిగించాలని చంద్రబాబు కోరారు.

 

19:45 - August 19, 2017

విజయనగరం : జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఘాతుకానికి పాల్పడ్డాడు.  నిండుగర్భిణి అని చూడకుండా తన భార్య కడుపుపై తన్నాడు. పెద్ద మనుషుల ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  విజయనగరంలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న వెంకటేష్‌, సునీత భార్యాభర్తలు. వెంకటేష్‌కు కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. సునీతకు ప్రెగ్నెన్సీ రావడంతో దాన్ని తీయించుకోవాలని ఒత్తిడి చేశాడు. రోజూ ఆమెను మానసికంగా వేధిస్తుండడంతో పుట్టింటికి వెళ్లింది. దీంతో కోపోద్రిక్తుడైన వెంకటేష్‌... కాపురానికి రావాలంటూ పెద్దమనుషులతో పంచాయతీ పెట్టాడు.  అందరిముందే అబార్షన్‌ చేయించుకోవాలంటూ భార్య కడుపుపై తన్నాడు. దీంతో సున్నీత అక్కడికక్కడే కుప్పకూలిపోగా... ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 

19:42 - August 19, 2017

కరీంనగర్ : తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేని వారంతా కేసీఆర్‌ కేబినెట్‌లో ఉండడం దురదృష్టకరమని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ తిరుమలి అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్‌ పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలనసాగడం లేదన్నారు. కరీంనగర్‌ జిల్లాలో టీ మాస్‌ ఫోరం ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. దీనికి హాజరైన తిరుమలి... కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై టీమాస్‌ పోరాడుతోందని హెచ్చరించారు. ప్రజా ఆందోళనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ధ్వజమెత్తారు.

 

19:31 - August 19, 2017

కర్నూలు : నంద్యాలను సుందరంగా తీర్చిదిద్దుతానని సీఎం చంద్రబాబు అన్నారు. నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. నంద్యాలను మోడల్ నియోజకవర్గంగా చేస్తానని చెప్పారు. 7 వేల కోట్లతో సోలార్ పార్క్,  త్రిపుల్ ఐటీ వచ్చిందని తెలిపారు. సీడ్ క్యాపిటల్ గా నంద్యాలను తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. 

నంద్యాలను మోడల్ నియోజకవర్గంగా చేస్తా : సీఎం చంద్రబాబు

కర్నూలు : నంద్యాలను మోడల్ నియోజకవర్గంగా చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. నంద్యాలను సుందరంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. 

 

రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి

యూపీ : ముజఫర్ నగర్ లోని ఖతౌలి వద్ద రైలు ప్రమాదం జరిగింది. పూరీ...ఉత్కల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. 

 

ముజఫర్ నగర్ లో రైలు ప్రమాదం

యూపీ : ముజఫర్ నగర్ లో రైలు ప్రమాదం జరిగింది. పూరీ, ఉత్కల్ ఎక్స్ ప్రెస్ ఖతౌలి వద్ద పట్టాలు తప్పింది. రైలు పట్టాలు తప్పడంతో పలువురికి గాయాలయ్యాయి.

 

18:31 - August 19, 2017

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. టీఆర్‌స్‌ పార్టీ బలోపేతం కోసం పని చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. గులాబి పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక తమకు అన్నీ మంచి రోజులేనని.. పాలమూరు జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు అనుకున్నారు. కానీ ఇప్పటికీ తమ బతుకుల్లో ఎలాంటి మార్పు లేదని.. పార్టీ అధినేత పని చేయించుకున్నారే తప్ప తమను పట్టించుకోవడం లేదని ఇప్పుడు వాపోతున్నారు. 
అసంతృప్తితో టీఆర్ఎస్‌ నేతలు 
గులాబి అధినేత కేసీఆర్‌పై మహబూబ్‌నగర్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమకు ఇప్పటికీ ఎలాంటి గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్‌ సర్కార్‌ ఏర్పడితే తమకు రోజులు కలిసి వస్తాయనుకున్నవారికి ఈ రోజుకీ ఎలాంటి పదవులు రాలేదు. ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు తాము పనికి వచ్చామని.. ఇప్పుడు అధికార పార్టీ కాగానే పక్క పార్టీలో నుంచి వచ్చిన నాయకులే కనిపిస్తున్నారని లోలోపల మధనపడిపోతున్నారు. 
పెరిగిన గ్రూపు రాజకీయాలు 
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు.. రానున్న ఎన్నికల్లో సీటు వస్తుందని ఆశించినవారు ఇప్పుడు తలలు పట్టుకొని కూర్చున్నారు. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని చెప్పి పక్క పార్టీల నాయకులను తీసుకువచ్చి తమ పార్టీలో చేర్చుకున్నా.. ఇప్పుడు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగేలా లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 10 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ముగ్గురు చొప్పున ఎమ్మెల్యే సీటును కోరుకుంటున్నారు. దీంతో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. 
రాజేందర్‌ రెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ 
మక్తల్, నారాయణ్‌ పేట, కల్వకుర్తి, గద్వాల్‌లో.. గులాబి పార్టీలో గ్రూప్‌ పాలిటిక్స్‌ ఎక్కువగా పెరిగాయి. గతంలో శివకుమార్ నారాయణ్‌ పేట్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. టీడీపీ నుంచి గెలిచిన రాజేందర్‌ రెడ్డి పార్టీ ఫిరాయించి గులాబీ కండువా కప్పుకున్నాడు. దీంతో శివకుమార్‌ వర్గం ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉంది. అలాగే ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ అయ్యాడు.  
కల్వకుర్తిలో మరీ ఎక్కువైన గ్రూప్‌ రాజకీయాలు  
ఇక కల్వకుర్తిలో గ్రూప్‌ రాజకీయాలు మరీ ఎక్కువయ్యాయి. ఎన్నికల ముందు టీడీపీ నుంచి బాలాజీ సింగ్‌ నాయక్‌ టీఆర్‌ఎస్‌లోకి వచ్చి అసెంబ్లీ ఇంచార్జ్‌గా పని చేశాడు. ఎన్నికల తరువాత అదే టీడీపీ నుంచి జైపాల్ యాదవ్‌ గులాబీ గూటికి చేరాడు. మరోవైపు ఇప్పుడు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి టికెట్ వచ్చే ఎన్నికల్లో తనదే అంటున్నాడు. దీంతో కల్వకుర్తిలో బాలాజీ సింగ్, జైపాల్ యాదవ్‌లు తీవ్ర అసహనంతో ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో ఎంత పని చేసినా ఉద్యమకారులకి గుర్తింపు రావడం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు వాపోతున్నారు. మరి పాలమూరులోని గులాబీ నేతలను ముఖ్యమంత్రి ఎలా సమన్వయ పరుస్తాడో చూడాలి. 

 

18:19 - August 19, 2017

వరంగల్ : జిల్లాలోని నల్లబెల్లి మండలం సర్వాపురం పక్కవాగులో నాగేశ్వరరావు అనే  కానిస్టేబుల్ చిక్కుకుపోయాడు. వరద ఉధృతి ఎక్కువ కావడంతో వాగు మధ్యలో ఓ చెట్టు పట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. నాగేశ్వరరావు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:16 - August 19, 2017

హైదరాబాద్ : కాల్పుల కేసులో యువజన కాంగ్రెస్‌ నేత విక్రమ్‌గౌడ్‌కు బెయిల్‌ మంజూరైంది. నాంపల్లి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రతీ ఆదివారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. విక్రమ్‌గౌడ్‌ను ఈనెల 3న కాల్పుల కేసు ఘటనలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో బెయిల్‌ కోసం విక్రమ్‌గౌడ్‌ పిటిషన్‌ వేయగా.. నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

 

డ్రగ్స్ కు అమాయక విద్యార్థులు బలి: నాయిని

హైదరాబాద్: డ్రగ్స్ కు అమాయక విద్యార్థులు బలవుతున్నారని హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు కోసం సమాజాన్ని కలుషితం చేస్తున్నారని, ఇలాంటి వారు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం అన్నారు. డ్రగ్స్ అంటూ ఎవరైనా కాలేజీలకు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

పొంగుతున్న వాగులు..17గ్రామాలకు నిలిచిన రాకపోకలు

భూపాలపల్లి : మహదేవ్ పూర్ కాటారం, పలిమెల మండలాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో పెద్దంపేట, సంకెన, సర్వాయిపేట వాగులు పొంగి పొర్లుతున్నాయి. 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

 

ఎయిరిండియా విమానంలో గంజాయి కలకలం

హైదరాబాద్: ఎయిరిండియా విమానంలో గంజాయి కలకలం రేగింది. ఎయిరిండియా విమానంలో భోజనం సరఫరా ట్రాలీలో 1.9 కిలోల గంజాయిని ఎయిర్ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమాన సిబ్బందిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

17:45 - August 19, 2017

కర్నూలు : ఓటు మహా ఆయుధమని సీఎం చంద్రబాబు అన్నారు. నంద్యాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. భూమా నాగిరెడ్డి చిరకాల కోరిక నంద్యాల అభివృద్ధి అని పేర్కొన్నారు. నంద్యాల అభివృద్ధికి భూమా ఎంతో కృషి చేశారని చెప్పారు. ఎవరు అభివృద్ధి చేశారు..ఎవరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారో తెలుసుకోవాలని చెప్పారు. 

 

17:38 - August 19, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అశ్వరావుపేట నియోజకవర్గంలో రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు పడుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదనీరు రోడ్లపైకి రావడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెదవాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 2820 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 

 

17:34 - August 19, 2017

చెన్నై : అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సిఎం పన్నీర్‌సెల్వం వర్గాల విలీనం మరోసారి వాయిదా పడింది. విలీనం విషయంలో చర్చలు జరుగుతున్నాయని....ఒకటి రెండు రోజుల్లో విలీనంపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని మాజీ సిఎం పన్నీర్‌ సెల్వం తెలిపారు. గత కొన్నిరోజులుగా విలీనంపై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు ఇరు వర్గాలు శుక్రవారంనాడు జరిపిన సుదీర్ఘ చర్చలు విఫలమయ్యాయి. కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. రెండు వర్గాల విలీనానికి మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద ఏర్పాట్లు చేశారు. చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఇరువర్గాల నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి పళని స్వామి జయలలిత మృతిపై విచారణకు ఆదేశించడం, వేద నిలయాన్ని స్మారక కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్న ప్రకటనతో విలీనం దిశగా అడుగులు పడ్డాయి.

 

17:31 - August 19, 2017

ఢిల్లీ : జెడియు నితీష్‌ వర్గం మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరింది. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నేతృత్వంలో జరిగిన జాతీయ ఎక్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఈమేరకు జెడియు తీర్మానం చేసింది. నితీష్‌ బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై అసంతృప్తితో ఉన్న జెడియు సీనియర్‌ నేత శరద్‌యాదవ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. శరద్‌ యాదవ్‌, ఆర్జేడి చీఫ్‌ లాలు యాదవ్‌లకు చెందిన అనుచరులు ఆందోళనకు దిగారు. నితీష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిహార్‌లో బిజెపి-జెడియు 17 ఏళ్లపాటు ఎన్డీయేలోనే ఉన్నాయి. 2013లో జెడియు ఎన్డీయే నుంచి విడిపోయింది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జెడియు, ఆర్జేడి, కాంగ్రెస్‌ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి బిజెపిని ఓడించాయి. నితీష్‌ సిఎంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. లాలు తనయుడు డిప్యూటి సిఎం తేజస్వీయాదవ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో నితీష్‌కుమార్‌ సిఎం పదవికి రాజీనామా చేశారు. బిజెపితో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. నితీష్‌ బిజెపితో జతకట్టడాన్ని శరద్‌యాదవ్‌ తప్పుపడుతున్నారు.

 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల అందోళన

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు అందోళన చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు అత్యవసరంగా చెన్నై-ఢిల్లీ ఎయిరిండియా విమానం ల్యాండ్ అయింది. అప్పటి నుండి ఎయిర్ పోర్ట్ లోనే ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బంది పడుతున్న ఎయిరిండియా సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఆదోళన చేస్తున్నారు.

17:29 - August 19, 2017

యూపీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గోరఖ్‌పూర్‌లో పర్యటించారు. బిఆర్‌డి ఆసుపత్రిలో ఇటీవల మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను పరామర్శించారు. పిల్లలు మృతి చెందడానికి గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. రాహుల్‌ వెంట కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ కూడా ఉన్నారు. ఆక్సీజన్‌ కొరత కారణంగా 36 మంది మృతి చెందారు. పిల్లల మరణాలకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అంతకుముందు గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిని పిక్‌నిక్‌ స్పాట్‌గా మార్చొద్దని రాహుల్ పర్యటననుద్దేశించి ఉత్తరప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు.

 

17:23 - August 19, 2017

వరంగల్ : జిల్లాలోని నల్లబెల్లి మండలం సర్వాపురం పక్కవాగులో నాగేశ్వరరావు అనే కానిస్టేబుల్ చిక్కుకుపోయాడు. వరద ఉధృతి ఎక్కువ కావడంతో వాగు మధ్యలో ఓ చెట్టు పట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. నాగేశ్వరరావు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. 

 

నోట్ల మార్పిడి చేస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్ : బర్కత్ పురాలో పాత నోట్ల మార్పిడి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాత నోట్లు మారుస్తున్న రాజ్ కుమార్ అనే వ్యక్తితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని రిమాండ్ కు తరలించారు.

17:16 - August 19, 2017

కర్నూలు : జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దినదేవరపాడులోని కట్టమంచి రెసిడెన్షియల్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న ఆమె బంధువులు స్కూల్‌ యాజమాన్య వేధింపులే కారణమంటూ ఆందోళనకు దిగారు. స్కూల్‌ అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ప్రీతి బంధువుల దాడిలో ప్రైవేట్‌ స్కూల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి గాయాలు అయ్యాయి. విద్యార్థిని ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

17:13 - August 19, 2017

విశాఖ : జిల్లాలోని భీమిలిలో దారుణం జరిగింది. డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోన్న రూప అనే విద్యార్థినిపై ప్రేమోన్మాది హరిసంతోష్‌ దాడికి తెగబడ్డాడు. కాలేజీ నుంచి వస్తున్న రూపపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. దీంతో రూప అక్కడికక్కడే చనిపోయింది. అడ్డుకోబోయిన రూప తమ్ముడికీ గాయాలు కాగా అతడిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రేమోన్మాది హరిసంతోష్‌ కూడా రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

17:02 - August 19, 2017

సన్నీలియోన్ కేరళ పర్యటనపై రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో స్పందించారు. కొచ్చిలోని ఎంజీరోడ్ లో ఉన్న షాప్ ఓపెనింగ్ కి సన్నీ రావ‌డం చాలా ఆల‌స్య‌మ‌వుతుంద‌ని తెలిసిన కూడా ఆమె కోసం గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేశారు అభిమానులు. సన్నీలియోన్ కేరళ పర్యటనపై రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో స్పందించారు. వారి ప్రేమను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని ఓ కామెంట్‌తో వీడియోను, కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సన్ని. అది చూసిన రామ్ గోపాల్ వర్మ పై విధంగా స్పందించారు. మ‌రి కేరళలో స‌న్నీ లియోన్ కి అంతటి ప్రజా స్పందన రావ‌డం చూసి మమ్ముట్టి, మోహన్ లాల్ జలస్ తో ఏడుస్తారని వర్మ అన్నాడు. కేరళలో వారి ప్రోగ్రాంమ్స్ కి ఎప్పుడు ఇంతగా జనం హాజరై ఉండరు. కేరళ ప్రజల నిజాయితీకి, వారి ఆదరణకి నేను సెల్యూట్ చేస్తున్నాను అంటూ వర్మ సెటైర్స్ వేశాడు.

పోలీసుల అదుపులో మాజీ మావోయిస్టు

మేడ్చల్ : కీసర (మం) నాగారంలో మాజీ మావోయిస్టు నేత శ్రీరాముల శ్రీనివాస్ అలియాస్ సుదర్శన్ ను సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

16:48 - August 19, 2017

విశాఖ : ఇదిగో పరిహారం.. అదిగో పునరావాసం అన్నారు. సర్వే పూర్తయ్యింది. భూములకు ఇచ్చే పరిహారం ఖరారయ్యింది. కానీ రైతులకు మాత్రం పరిహారం అందలేదు. అసలు తమకు నష్టపరిహారం అందుతుందో లేదోనని.. ఆ గ్రామాల ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. 
పెట్రో కెమికల్ కారిడార్‌ ఏర్పాటు 
విశాఖ నుంచి చెన్నై వరకూ పెట్రో కెమికల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలి. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ సేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. నక్కపల్లి మండలంలోని రాజయ్య పేట, బుచ్చిరాజు పేట, చందనాడ, అమలాపురం, డీఎల్‌ పురం గ్రామాల్లో 2, 310 ఎకరాల భూములకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ గ్రామాల పరిధిలో ఉన్న మరో 2, 500 ఎకరాలు డీ ఫారం భూములు కూడా ప్రభుత్వం సేకరించాలనుకుంది. 
భూ సేకరణను వ్యతిరేకించిన రైతులు 
అప్పట్లో రైతులు ఈ భూ సేకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఉద్యమంలో కూడా పాల్గొంది. ప్రభుత్వం బలవంతంగా భూములను తీసుకోవడానికి సిద్ధపడటంతో ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వాలు మారాయి. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అధికారంలోకి వచ్చింది. హైకోర్టు 2016 ఏప్రిల్‌ 19న స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
భూసేకరణ ప్రక్రియ వేగవంతం
చంద్రబాబు అధికారంలోకి రాగానే భూ సేకరణ ప్రక్రియ వేగవంతమయ్యింది. రైతులను భయపెట్టో బ్రతిమాలో భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం భూములు సర్వే చేయకపోతే ఆ భూములు ప్రభుత్వ భూములుగా పరిగణిస్తామని, నష్ట పరిహారం కోర్టులో జమ చేస్తామని రైతాంగాన్ని భయాందోళనకు గురి చేసింది. అధికారులు, ప్రజా ప్రతినిధుల మాటలు నమ్మిన ప్రజలు తమ భూములు ఇవ్వడానికి అంగీకరించారు. 18 లక్షల పరిహారం నిర్ణయమైంది. ఈ పరిహారం లెక్క ప్రకారం 2, 310 ఎకరాల భూములకు, 416 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇవాళ్టికీ 800 ఎకరాలకు 150 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా చెల్లించాల్సింది రెండు వందల కోట్లకు పైగానే ఉంది. దీంతో భూములు సేకరించి ఏళ్లు గడుస్తున్నా తమకు పరిహారం అందటం లేదనే ఆవేదన భూములు ఇచ్చిన గ్రామస్థులలో వ్యక్తమవుతోంది. 
భూ సేకరణ జరిగి 6 నెలలు 
భూ సేకరణ సర్వే జరిగి 6 నెలలకు పైగా అయ్యింది. కానీ ఇంతవరకూ నష్ట పరిహారం విషయంలో అటు అధికారులు ఇటు ప్రజా ప్రతినిధుల నుంచి ఎటువంటి సమాచారం గ్రామస్థులకు తెలియడం లేదు. ఇదిలా ఉంటే డీ ఫాం భూములకు టీడీపీ.. అమలాపురం నెల్లిపుడి తదితర ప్రాంతాలలో ప్రభుత్వ బంజరు భూముల రికార్డులు తారుమారు చేసింది. ఇలా 300 ఎకరాలకు పైగా అక్రమార్కులపాలయ్యాయి. ఈ విషయంపై స్వయంగా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత.. విశాఖ జిల్లాలో భూ అక్రమాలకు ఏర్పాటు చేసిన సిట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి వీఆర్‌వో బాబురావును సస్పెండ్ చేశారు. దీని వెనక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మరి రైతులకు ఇప్పటికైనా పరిహారం అందుతుందో లేదో చూడాలి. 

 

16:43 - August 19, 2017

విజయవాడ : అమ్మలగన్న అమ్మ.. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం.. ఆ కనకదుర్గమ్మ తల్లి విగ్రహానికే ముప్పు వాటిల్లే పరిస్థితి తలెత్తింది. అభివృద్ధి పేరుతో ఇంద్రకీలాద్రిపై అధికారులు చేస్తున్న హడావిడి.. అమ్మవారి దేవాలయానికి, విగ్రహానికి ముప్పు వాటిల్లేలా చేస్తోంది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి విగ్రహానికి పొంచి ఉన్న ప్రమాదంపై 10 టీవీ ప్రత్యేక కథనం. 
అభివృద్ధి పేరుతో భక్తులకు నానా ఇబ్బందులు 
విజయవాడ ఇంద్రకీలాద్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భక్తులు దర్శించుకునే అతి పెద్ద రెండవ పుణ్యక్షేత్రం. సాధారణ రోజుల్లో 30 వేల మంది, పండగ రోజుల్లో 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే దుర్గగుడి అధికారులు అభివృద్ధి పేరుతో భక్తులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండపై భాగం అంతా పగలగొట్టి ఘాట్‌ రోడ్డుపై.. జలపాతం, కోనేరు నిర్మాణానికి దుర్గగుడి అధికారులు శ్రీకారం చుట్టారు.
1.5 మీటర్ల లోతులో కోనేరు నిర్మాణం 
ఇక్కడ 21 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల లోతులో కోనేరును నిర్మిస్తున్నారు. ఈ కోనేరులోకి నీరు వచ్చేలా జలపాతం ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం అమ్మవారి నిధులు 3 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కోనేరు తవ్వకానికి భారీ యంత్రాలు వాడుతుండటంతో కొండంతా ప్రకంపణలు వస్తున్నాయి. అర్చకులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. పొక్లెయినర్లతో తవ్వినప్పుడు డ్రిల్లింగ్ చేసినప్పుడు ఆలయంలోనే భారీగా ప్రకంపణలు వస్తున్నాయని.. అమ్మవారి విగ్రహం కూడా అదిరే అవకాశం ఉందని భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. 
అర్చకులు, అధికారుల అభ్యంతరం 
గతంలో ఘాట్‌ రోడ్డు విస్తరణలో భాగంగా ఇంద్రకీలాద్రిని భారీ యంత్రాలతో పగలగొడుతున్నప్పుడు ఇలాంటి సమస్యే వచ్చేది. దీనిపై అర్చకులు, అధికారులు అభ్యంతరం తెలపడంతో తవ్వకాలను ఆపేశారు. ఇప్పుడు ఆలయానికి దగ్గరలోనే కోనేరు, జలపాతం కోసం కొండను పగలగొడుతోంటే మాత్రం దేవస్థానం అధికారులు మాట్లాడటం లేదు. దసరాలోగా కోనేరు, జలపాతాన్ని సిద్దం చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. 
విగ్రహానికి దగ్గరలోనే వెలిగే దీపాలు 
అమ్మవారి అంతరాలయంలో విగ్రహానికి దగ్గరలోనే.. 24 గంటలు దీపాలు వెలుగుతున్నాయి. దీనివల్ల అమ్మవారి తేజస్సు తగ్గుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు. అమ్మవారిని విద్యుత్ కాంతులలో నుంచి దీప కాంతుల్లోకి తీసుకురావడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా అధికారులు దీపాల మధ్యే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని హుకుం జారీ చేశారు. అయితే ఇప్పటికైనా అధికారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా వెళ్తే మాత్రం జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 

 

యూట్యూబ్ లో వీడియోలతో పాటు 'బ్రేకింగ్ న్యూస్' !

హైదరాబాద్: యూట్యూబ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వినోద వీడియోలతోపాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు అందించేందుకు ‘బ్రేకింగ్ న్యూస్’ పేరుతో ప్రత్యేకంగా వార్తలు అందించే ఏర్పాట్లు చేస్తోంది. వెబ్ హోంపేజీతోపాటు మొబైల్ యాప్‌లోనూ ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యాబ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యూట్యూబ్ యోచిస్తోంది. ఇందులో అన్ని రంగాలకు చెందిన వార్తలను అందించనున్నట్టు సమాచారం. అయితే యూట్యూబ్ అందించే వార్తలు గూగుల్‌లో వచ్చినవా? లేక ప్రత్యేకంగా రాయిస్తుందా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

 

16:38 - August 19, 2017

జగిత్యాల : రోజూ కాలేజీకి ఆలస్యంగా వస్తున్నారు.. ఇది సరికాదని చెప్పినా మార్పులేదు... ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగతా విద్యార్థులూ క్రమశిక్షణ తప్పుతారు.. అందుకే విద్యార్థులకు బుద్ధి చెప్పాలనుకున్నాడో లెక్చరర్‌.. పనిష్‌మెంట్‌పేరుతో ఏకంగా జుట్టే కత్తిరించాడు.. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో జుట్టు కత్తిరింపుకూ తమకూ సంబంధం లేదన్నారు.. ఇందులో ఎవరిది నిజం?
కామర్స్‌ లెక్చరర్‌ జుట్టు కత్తిరింపు
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో 450 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.. వీరిలో 350మంది బాలికలు, వందమంది బాలురున్నారు.. కొద్దిరోజులుగా కొందరు విద్యార్థుల సమయానికి కాలేజీకి రావడంలేదని జువాలజీ అధ్యాపకుడు మందలించారు.. అయినా ఎలాంటి మార్పూ రాకపోవడంతో తన క్యాబిన్‌కు పిలిపించారు.. రాజిరెడ్డి ఆదేశాలతో కామర్స్‌ లెక్చరర్‌ విద్యార్థుల జుట్టు కత్తిరించారు.. 
గుండు చేయించుకున్న కొందరు విద్యార్థులు
కాలేజీలో ఇలా ఇష్టంవచ్చినట్లు జుట్టును కట్‌ చేయడంతో విద్యార్థులు మనస్తాపం చెందారు.... తోటి విద్యార్థులు ఎగతాళి చేస్తారని కొందరు సెలూన్‌కువెళ్లి గుండు చేయించుకున్నారు... మరికొందరు కాలేజీకి రావడమే మానేశారు. అయితే జుట్టు కత్తిరింపుకు తమకు ఎలాంటి సంబంధంలేదని లెక్చరర్లు స్పష్టం చేస్తున్నారు.. విద్యార్థులు టీసీ అడిగారని... ఇవ్వనందుకే ఇలా చేస్తున్నారని సమాధానమిస్తున్నారు. ఏది ఏమైనా నిజానిజాలు తేలాలంటే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.. ఇంటర్‌ బోర్డు అధికారులు విచారణ జరిపి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.. 
 

 

పూడూరులో మణిందర్ ఆచూకీ లభ్యం...

మేడ్చల్ : కిష్టాపూర్ లో కిడ్నాపైన మణీందర్ (14) ఆచూకీ లభ్యం అయ్యింది. ఈ రోజు ఉదయం స్కూల్ కు వెళ్తుండగా మణిందర్ కిడ్నాప్ చేసి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. పూడూరు మణిందర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

16:33 - August 19, 2017

అదిలాబాద్‌ : జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. టికెట్ల గోల్‌ మాల్‌లో ఆలయ ఉద్యోగుల హస్తం ఉన్నప్పటికీ రోజువారి కూళీని సస్పెండ్‌ చేసి అధికారులు చేతులెత్తేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉత్సవ విగ్రహం తరలింపు విషయంలో పూజారులతో పాటు అధికారుల హస్తం ఉందని, వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేవదాయ శాఖ వైఫల్యం అవినీతి ఉద్యోగులకు వరంగా మారిందని వారిపై చర్యలు తీసుకొని బాసర పవిత్రతను కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూడండి. 

16:25 - August 19, 2017

ప్రకాశం : భర్త, అత్తమామాలు, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో ఓ యువతి భర్త ఇంటి ముందే ధర్నా చేస్తోంది. ప్రకారం జిల్లా చీరాల రామ్‌నగర్‌కు చెందిన దేవూరి అనూష...  బాపట్ల అబ్బాయి వికాస్‌ను ఏడాది క్రితం పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయంలో పది లక్షల రూపాయల కట్నంతోపాటు బంగారం కానుకగా ఇచ్చారు. అనూష కాపురానికి వచ్చిన రెండో నెల నుంచే భర్త వికాస్‌.. అత్తమామలు, ఆడపడుచు అదను కట్నం కోసం వేధిస్తూ ఇంటి నుంచి గెంటివేశారు. వికాశ్‌తోపాటు కుటుంబ సభ్యులకు ఎంత నచ్చచెప్పినా  వినిపించుకోపోగా.. రెండో పెళ్లికి సిద్ధమైనట్టు తెలచుకున్న అనూష.. భర్త ఇంటి ముందు ధర్నా చేస్తోంది. 

 

16:15 - August 19, 2017

విశాఖ : జిల్లాలోని భీమిలో దారుణం జరిగింది. డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోన్న రూప అనే విద్యార్థినిపై ప్రేమోన్మాది హరికిషోర్‌ దాడికి తెగబడ్డాడు. కాలేజీ నుంచి వస్తున్న రూపపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. దీంతో రూప అక్కడికక్కడే చనిపోయింది. అడ్డుకోబోయిన రూప తమ్ముడికీ గాయాలు కాగా అతడిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రేమోన్మాది హరికిషోర్‌ కూడా రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

16:12 - August 19, 2017

కర్నూలు : నంద్యాలలో గెలుపు టీడీపీదే అంటున్నారు మాజీ మంత్రి ఎండి.ఫరూఖ్. మైనార్టీలకు టీడీపీ ఎప్పుడూ అండగా నిలబడుతుందని ఆయన చెప్పారు. నంద్యాలలో మైనార్టీల మద్దతు టీడీపీకే అంటున్న ఎండీ.ఫరూఖ్‌తో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలను టీడీపీ అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు. టీడీపీ తనకు చాలా పదవులు ఇచ్చిందని తెలిపారు. 

 

16:05 - August 19, 2017

హైదరాబాద్‌ : నగరంలో దారుణం జరిగింది. అనారోగ్యం బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిజాంపేట్‌లోని బండారీ కాలనీలో చుక్క సాయిలు అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతనికి కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే చుక్క సాయిలు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వివిధ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మనస్తాపం చెందిన అతను ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు అతడికి స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయిలు పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నల్లబెల్లి నర్సాపురం వాగులో చిక్కుకున్న కానిస్టేబుల్

వరంగల్ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. నల్లబెల్లి నర్సాపురం వాగులో కానిస్టేబుల్ చిక్కుకున్నాడు. చెట్టు కొమ్మలపై కూర్చుని సమాయం కోసం ఎదురు చూస్తున్నాడు.

ప్లాస్టిక్ కంపెనీలపై ఎస్ వోటీ పోలీసులు దాడులు

రంగారెడ్డి : కాటేదాన్ పారిశ్రామిక వాడలో ప్లాస్టిక్ కంపెనీలపై ఎస్ వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో నాలుగు కంపెనీలు సీజ్ చేసి, వాటి నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

బిజెపి ఎమ్మెల్యేలపై నాన్ బెయిలబుల్ వారెట్లు..

ముజుఫర్‌నగర్: రైలు సర్వీసులకు అంతరాయం కలిగించిన ఇద్దరు ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేలపై స్థానిక కోర్టు శనివారంనాడు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ముజఫర్ నగర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కపిల్ అగర్వాల్‌, బుధనా నియోజకవర్గం ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్‌ను సెప్టెంబర్ 30న కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేటు ఆదేశించారు. 2012 ఏప్రిల్ 3న రైళ్ల రాకపోకలను అడ్డుకున్న పలువురు బీజేపీ కార్యకర్తలు, ఇద్దరు ఎమ్మెల్యేలపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

15:52 - August 19, 2017

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ కార్పొరేటర్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారు.. ..   అవినీతి పనులు చేస్తూ పార్టీ పరువు తీయొద్దని హెచ్చరించారు.. అప్పటికీ మార్పు రాకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చినట్లు సమాచారం.
చిక్కుల్లో టీ.ప్రభుత్వం 
గ్రేటర్  హైదరాబాద్‌లో టీఆర్ ఎస్ కార్పొరేటర్ల అవినీతి పనులు ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేస్తున్నాయి.. వ్యక్తిగత పైరవీలతో సర్కారుకు చెడ్డపేరు తెస్తున్నారు గ్రేటర్‌ నేతలు..... ముఖ్యంగా శివారు ప్రాంతాల నేతలతీరు మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతోంది.. కొత్త భవనం నిర్మాణం ప్రారంభిస్తే చాలు...  భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు.. ఇవ్వకపోతే అనుమతులు ఎలా వస్తాయో చూస్తామంటూ బెదిరిస్తున్నారంటూ ఆరోపణలొస్తున్నాయి.... 
కార్పొరేటర్ల తీరుపై వరుసగా ఫిర్యాదులు
ఇక ఈ మధ్యే ఓ కార్పొరేటర్‌ జీహెచ్‌ఎంసీ అధికారిక వాట్సప్‌ గ్రూప్‌లో నీలి చిత్రాలను ఉంచారు.. 
ఇది వివాదాస్పదం కావడంతో కార్పొరేటర్‌ సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు.. కార్పొరేటర్లు ఇలాంటి పనులతో పార్టీ పరువు బజారున పడుతోంది.. ఇలా వరుసగా కార్పొరేటర్ల తీరుపై వస్తున్న 
ఫిర్యాదులతో సీఎం కేసీఆర్‌  సీరియస్‌ అయ్యారు.. గ్రేటర్‌ ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లువేస్తే  కార్పొరేటర్లు ఇలాంటి పనులు చేస్తూ పార్టీని అభాసు పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.. 
కార్పొరేటర్ల తీరును ప్రస్తావించిన సీఎం 
గ్రేటర్ పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రావాలంటూ సీఎంను ఆహ్వానించారు.. దీనిపై స్పందించిన సీఎం కార్పొరేటర్ల తీరు విషయం ప్రస్తావించినట్లు సమాచారం.. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కార్పొరేటర్లు వ్యవహరిస్తే వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని ఆదేశాలిచ్చారని ప్రచారం జరుగుతోంది.. గ్రేటర్లో పరిస్థితి మారే వరకు తాను జీహెచ్ ఎంసీ ఆహ్వానించే కార్యక్రమాలకు హాజరుకానని సిఎం స్పష్టం చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రేటర్ నేతల అసలు రూపం తెలుసుకున్న కెసిఆర్ భీష్మ ప్రతిజ్ఙ చేసినా.......... ఆ లీడర్ల తీరు మారడం కష్టమేనన్న అభిప్రాయం   వ్యక్తమవుతోంది.

 

'రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు'

హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి ఆవరించిందని, ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా కదులుతుండడంతో తెలంగాణ, కోస్తా ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. దీని కారణంగా రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

విక్రమ్ గౌడ్ కు షరతులతో కూడిన బెయిల్

హైదరాబాద్: కాల్పుల కేసులో విక్రమ్ గౌడ్ కు షరతులతో కూడిన బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. ప్రతి ఆదివారం బంజారాహిల్స్ పీఎస్ కు హాజరు కావాలని విక్రమ్ గౌడ్ కు నాంపల్లి కోర్టు ఆదేశించింది.

15:43 - August 19, 2017

వరంగల్ : నగరంలో పలుచోట్ల  మోస్తారు వర్షం కురిసింది. రెండు రోజులుగా నగరంలో చదురుమొదురు వర్షాలు కురుస్తున్నాయి. కాశిబుగ్గ, లేబర్‌ కాలనీలలో రహదారులు జలమయం కాగా... తపాల కూడలి వద్ద మురుగు నీరు రోడ్లపై చేరింది. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిల్వ ఉండడంతో రాకపోకలకు విఘాతం కలిగింది.

 

 

టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

కర్నూలు: దినదేవరపాడులోని కట్టమంచి రెసిడెన్షియల్ స్కూల్ లో టెన్త్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. స్కూల్ యాజమాన్యమే కారణమంటూ ప్రీతి బంధువులు ఆరోపిస్తూన్నారు. ప్రీతి బంధువులు స్కూల్ యాజమాన్యంపైకి దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దాడిలో ప్రైవేటు స్కూల్ అసోసియోషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

టెన్త్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య..బంధువుల ఆందోళన

కర్నూలు :చినదేవరపాడులోని కట్టమంచి రెసిడెన్షియల్ స్కూల్ లో టెన్త్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు స్కూల్ యాజమాన్యమే కారణమంటూ స్కూల్ యాజమాన్యం పై ప్రీతి బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం కాగా, ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి తీవ్ర గాయలయ్యాయి. విద్యార్థి ఆత్మహత్య పై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

రాహుల్ గాంధీ పై విరుచుకుపడ్డ స్మృతీ ఇరానీ

యూపీ: 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌పై అమేథిలో పోటీ చేసి ఓడిపోయిన స్మృతీ ఇరానీ తనదైన శైలిలో కాంగ్రెస్ నేత రాహుల్‌పై విరుచుకుపడ్డారు. శుక్రవారం జరిగిన మెయిల్ టుడే ‘ఫిమైల్ సమ్మిట్’లో ఆమె మాట్లాడుతూ... ‘‘రాహుల్ గాంధీ తన పార్లమెంటరీ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారు. ఇక దాన్ని వదిలిపెడితే మంచిది. అక్కడ పనిచేసేందుకు ఆసక్తి లేకపోతే... సమర్ధులకు బాధ్యతలు అప్పగించండి ’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

105కు చేరిన చిన్నారుల మృతుల సంఖ్య

ఉత్తర ప్రదేశ్‌: బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజిలో శుక్రవారం నాటికి మృతిచెందిన చిన్నారుల సంఖ్య 105కు చేరుకుంది. ఆగస్టు 10న ఆక్సిజన్ నిలిపివేయడంతో ఒక్కరోజులో 30 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అది మొదలు ఇప్పటిదాకా పరిస్థితి అదుపులోకి రాకపోవడం గమనార్హం. మెదడువాపు వ్యాధి వార్డుతో పాటు మరికొన్ని వార్డుల్లో కూడా మరణాలు నమోదయ్యాయని ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ పీకే సింగ్ వెల్లడించారు. ‘‘ఆస్పత్రికి తీసుకొచ్చిన చాలామంది పిల్లల్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు...’’ అని ఆయన వెల్లడించారు.

 

జీహెచ్ ఎంసీ సిబ్బందికి సెలవులు రద్దు

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. వర్షాల నేపథ్యంలో ఇవాళ రేపు సెలవులు రద్దు చేస్తున్నట్లు జీహెచ్ ఎంసీ పేర్కొంది.

టీఎస్ సచివాలయంలో సిఐల ఆందోళన

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయంలో సీఐలు ఆందోళనకు దిగారు. తమకు పదోన్నతులు ఇవ్వడం లేదంటూ 89-91 బ్యాచ్‌కు చెందిన సీఐలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌, 5వ జోన్‌లో డీఎస్పీలుగా పదోన్నతులు ఇవ్వాలని సీఐలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే హోంమంత్రి దగ్గర ఫైల్‌ ఉన్నా. కావాలనే అనుమతులు ఇవ్వటం లేదంటూ సీఐలు మండిపడుతున్నారు.

 

 

విలీనంపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం:పన్నీర్

చెన్నై: అన్నాడీఎంకే లోని వర్గాల్లో ఎలాంటి విభేదాలు లేవని మాజీ సీఎం పన్నీర్ సెల్వం ప్రకటించారు. ఇరువర్గాల విలీనంపై చర్చలు జరుగుతున్నాయని విలీనంపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. ఎంజీఆర్, జయలలిత ఆశయాలను కొసాగిస్తామని తెలిపారు.

 

అనారోగ్య బాధ తాళలేక ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: నిజాంపేటలోని బండారి కాలనీలో చుక్క సాయిలు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతన్న చుక్క సాయిలు అనారోగ్య బాధ తాళలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన బంధువులు సాయిలను ఆస్పత్రికి తరలించారు. అయితే సాయి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

కిరోసిన్ పోసి నిప్పటించిన ప్రేమోన్మాది..రూప మృతి

విశాఖ : భీమిలి మండలం టి. నగరపాలెంలో దారుణం జరిగింది. తగరపు వలస బాసర డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రూప పై ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పటించాడు. రూప అక్కడికక్కడే మంటల్లో కాలి బూడిదైంది. రక్షించేందుకు వెళ్లిన సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం విజయనగరంలో రైలు కింద పడి ప్రేమోన్మాది ఆత్మహత్య చేసుకున్నాడు.

 

15:00 - August 19, 2017

రంగారెడ్డి : జిల్లాలోని విషాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రానిక్ కుక్కర్‌ పేలడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అబ్దుల్లాపూర్‌ మండలం తొర్రూరు గ్రామంలో ఉంటున్న పరశురాం అనే వ్యక్తికి ఏడాది క్రితమే పెళ్లయ్యింది. 5 రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లడంతో.. పరశురాం ఇంట్లో తాను ఒక్కడే ఉంటున్నాడు. ఇవాళ ఉదయం ఇంట్లో ఒక్కసారిగా మంటలు రావడంతో పక్కనే ఉంటోన్న తన అన్న, తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్లి చూసే సరికి ఒళ్లంతా కాలిపోయి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏదైనా పేలుడా.. ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

 

14:53 - August 19, 2017

మేడ్చల్‌ : 14 ఏళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం సృష్టిస్తోంది. మిత్రుడితో కలిసి మణిందర్‌ స్కూల్‌కు వెళ్తుండగా కిడ్నాపర్లు.. బాలుడిని అహరించారు. కిడ్నాపర్లు 10 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

చంద్రగిరి ఎస్ బీఐ సమీపంలో చోరీ

తిరుపతి: చంద్రగిరి ఎస్ బీఐ సమీపంలో చోరీ జరిగింది. మిట్టూరుకు చెందిన దేవరాజుల నాయుడు అనే రైతు నుంచి బైకు పై వచ్చిన దుండుగులు రూ. 3లక్షలు ఎత్తుకెళ్లారు. బ్యాంకులో డబ్బులు డ్రా చేసి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ప్రమోషన్లలో అన్యాయం జరిగింది : 1991పోలీస్ బ్యాచ్

హైదరాబాద్ :1991 పోలీస్ బ్యాచ్ అధికారులు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మను కలిశారు.ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరిగిందని, తమకు న్యాయం జరిగేలా చూడలని వారు  విజ్ఞప్తి చేశారు.

 

విశాఖ ఈఎన్ టీ హాస్పిటల్ లో తప్పిన ప్రమాదం...

 

విశాఖ: ఈఎన్ టి హాస్పిటల్ ఆక్సిజన్ ప్లాంట్ లో మంటలు చలరేగాయి. టెక్నీషియన్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. భారీగా పొగరావడంతో రోగులు పరుగులు తీశారు.

14:21 - August 19, 2017

హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించిన భల్లాలదేవ ఇప్పుడు వెబ్ మీడియాలోకి అడుగుపెడుతున్నాడు. నెంబర్ వన్ యారి విత్ రానా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వియూ సంస్థ ఇప్పటికే పలు వెబ్ సీరీస్ లతో ఆకట్టుకుంటోంది. తాజా రానా, నవీన్ కస్తూరియాలతో ఓ 'సోషల్' పేరుతో మరో వెబ్ సీరీస్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. సోషల్ మీడియాకు అలవాటు పడిన యువత ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటోంది అన్న నేపథ్యంలో ఈ వెబ్ సీరీస్ ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

14:05 - August 19, 2017

భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ఆనంద ప్రసాద్‌ నిర్మిస్తున్న ‘పైసావసూల్’ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని ఒక పాట రిలీజ్ అయ్యింది. హీరో బాలకృష్ణ- శ్రేయ మధ్య పోర్చుగల్ లొకేషన్‌లో తెరకెక్కించిన ‘‘కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి అంటూ సాగే పాట విడుదలయ్యింది.

 

13:43 - August 19, 2017

తూర్పు గోదావరి : పోలవరం నిర్వాసిత గ్రామాల్లో అఖిలపక్షం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగుతోంది.. ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్‌కు మద్దతు తెలిపారు.. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలంటూ ఈ బంద్‌ చేపట్టారు.. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:41 - August 19, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ విజయం తథ్యమంటున్నారు మంత్రి నక్కా ఆనంద్‌బాబు. మూడేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గుర్తించారని... ఖచ్చితంగా తమ అభ్యర్థి భారీ మెజారిటీ సాధిస్తారంటున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. అతనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని నక్కా ఆనంద్‌బాబు అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:41 - August 19, 2017

హైదరాబాద్ :సీఎం కేసీఆర్‌కు ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్ -2017 అవార్డు వరించింది. పాలసీ లీడర్‌షిప్ కేటగిరీ కింద కేసీఆర్‌కు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కోసం సీఎం కేసీఆర్ పేరును ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతిపాదించింది. సెప్టెంబర్ 5న రాత్రి 7.30 గంటలకు న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలస్‌లో అవార్డు ప్రదానం కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భారత ఆహార వ్యవసాయ మండలి అవార్డును అందజేయనుంది.

13:40 - August 19, 2017

కర్నూలు : ప్రతిపక్షాలు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని... AP మంత్రి అఖిలప్రియ ఆరోపించారు.. TDPవల్లే నియోజక వర్గంలో అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు.. అభివృద్ధినిచూసి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.. ప్రచారంలోభాగంగా నంద్యాల నియోజకవర్గంలోని అయ్యలూరి మెట్టలో చంద్రబాబుతోకలిసి అఖిలప్రియ ప్రచారం చేశారు.

 

కేసీఆర్ కు అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డ్....

హైదరాబాద్ :సీఎం కేసీఆర్‌కు ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్ -2017 అవార్డు వరించింది. పాలసీ లీడర్‌షిప్ కేటగిరీ కింద కేసీఆర్‌కు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కోసం సీఎం కేసీఆర్ పేరును ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతిపాదించింది. సెప్టెంబర్ 5న రాత్రి 7.30 గంటలకు న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలస్‌లో అవార్డు ప్రదానం కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భారత ఆహార వ్యవసాయ మండలి అవార్డును అందజేయనుంది.

14 ఏళ్ల బాలుడు కిడ్నాప్

మేడ్చల్ : కిష్టాపూర్ లో మనిందర్ అనే 14 ఏళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. ఈ రోజు ఉదయం స్కూల్ కు వెళ్తుండగా కిడ్నాపర్లు మనిందర్ ని ఎత్తుకెళ్లారని, మనిందర్ ని విడిచిపెట్టేందుకు కిడ్నాపర్లు రూ. లక్ష డిమాండ్ చేస్తున్నారని బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు.

 

13:32 - August 19, 2017
13:21 - August 19, 2017

ధనియాలు అంటే తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. వంటిట్లో పోపుల పెట్టెలో ఉండే ఔషధం…. మనకు తెలియని ధనియం….! కేవలం వంటింటి దినుసుగానే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడవచ్చు. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో ధనియాలు కార్మినేటివ్‌గా (గ్యాస్‌నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తేలింది.అలాగే రిఫ్రిజిరెంట్‌గా (శరీరాన్ని చల్లపరిచేదిగా), డైయూరిటిక్‌గా (మూత్రాన్ని జారిచేసినదిగా), ఏఫ్రోడైజియాక్‌గా (లైంగిక శక్తిని పెంచేదిగా), యాంటీ స్పాస్‌మోడిక్‌గా (అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా), హైపోగ్లైసీమిక్‌గా (రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించేదిగా) పనిచేస్తుందని తేలింది. ఇన్ని సుగుణాలున్న ధనియాలను చూస్తుంటే ప్రకృతి ప్రసాధించిన ఒక వరంగా మనం భావించాలి. కొత్తిమీర చెట్టునుండి కాచే ఈ ధనియాల కాయలను ఎండవెట్టి, తర్వాత గింజల రూపంలో లేదా, పౌడర్ రూపంలో వీటిని ఉపయోగించుకుంటారు. ధనియాల్లో అనేక పోషకాంశాలున్నాయి. న్యూట్రీషియన్ చార్ట్ ప్రకారం ఇందులో ఫైబర్ 8%, కాల్షియం 2.9%, ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

జలుబును నయం చేసే లక్షణాలు...

ధనియాల కషాయం తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది.జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం, విరేచనాలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కడుపులో ఏలికపాముల్ని బయటపడేస్తుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ శక్తి...

ప్రకృతిపరంగా లభించిన ధనియాలలో అనేక వైద్యపరమైన లక్షణాలు కలిగి ఉండటం వల్ల సహజ రూపంలో మన తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గిచవచ్చని అనేక పరిశోధనులు, అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేమం రాకుండా నిరోధించడానికి మరియు ఉన్న వ్యాధిని నయం చేయడానికి ఉపయోగపడుతుంది.

టైఫాయిడ్ నుండి కోలుకొనేలా

టైఫాయిడ్ కు కారణం అయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడుతుందని రుజువయ్యింది. ఆహారం వల్ల కలిగే అనారోగ్యంకు సాల్మొనెల్లా కారణం అవుతుంది.

మచ్చల నివారణలో...

ధనియాల పొడి మరియు పసుపు లేదా ధనియాల రసంతో మిక్స్ చేసి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కొలెస్ట్రాల్ నియంత్రలణలో...

కొలెస్టరాల్ ఆధిక్యత ధనియాల పొడి కొలెస్టరాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. రెండు చెంచాలు ధనియాలను నలగ్గొట్టి ఒక గ్లాసు నీళ్లకు చేర్చి మరిగించి చల్లారిన తరువాత వడపోసుకొని తాగాలి. ఇలా రెండుపూటలా కొన్ని నెలలపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

అంటువ్యాధుల నివారణలో....

అంటువ్యాధులకు కారణం అయ్యే జర్మ్ (సూక్మక్రిముల)తో పోరాడటానికి మరియు చంపడానికి ధనియాల్లోని ఔషధగుణాలు అద్భుతంగా సహాయపడుతాయని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.

ఫీరాడికల్స్ ను తొలగించడంలో...

ధనియాలు(కొత్తిమీర, ధనియాలు, లేదా పొడి) ఇలా ఏరూపంలోనైనా సరే తీసుకోవడం వల్ల వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్ ను మన శరీరానికి అందిస్తుంది. దాంతో మన శరీరంలోని ఫ్రీరాడికల్స్ ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

మరి ఇంక ఎందుకు ఆలస్యం... రోజు వారీ ఆహారంలో ధనియాలను చేర్చుకుంటే పోలా.

స్టార్ హోటళ్ల టెండర్లకు సీఆర్డీఏ ఆహ్వానం

అమరావతి : రాజధానిలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు సీఆర్డీఏ టెండర్లకు ఆహ్వానం పలికింది. రెండు పైవ్ స్టార్ హోటళ్లు, రెండు ఫోర్ స్టార్ హోటళ్లు, నాలుగు త్రీస్టార్ హోటళ్ల ఏర్పాటు చేసేందుకు సీఆర్డీఏ నిర్ణయించింది. ఏడు ఎకరాల్లో ఎనిమిది హోటళ్లు ఏర్పాటు చేస్తామని, ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ 15 వరకు బిడ్లను స్వీకరిస్తామని సీఆర్డీఏ స్పష్టం చేసింది.

12:33 - August 19, 2017

ఇట్స్‌ షూట్‌ టైమ్‌.. నాలుగన్నరేళ్ల బాహుబలి ప్రయాణం తర్వాత సాహో అనే యాక్షన్‌ ప్రపంచంలోకి ఎంటర్ కావడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని హీరో ప్రభాస్ ఫేస్‌బుక్‌ ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. బాహుబలి2 తర్వాత రకరకాల పిక్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు నటుడు ప్రభాస్. ఆయన నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్ ‘సాహో’ శుక్రవారం మొదలైంది. ప్రస్తుతం షూట్‌ హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు సమాచారం. హాలీవుడ్‌కి చెందిన నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారని, యాక్షన్‌ సన్నివేశాల్ని ఫారెన్‌లో తెరకెక్కించేలా డైరెక్టర్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సుజీత్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్‌లో ప్రభాస్ పక్కన శ్రద్ధాకపూర్ హీరోయిన్ నటిస్తున్నారు.

'పోలవం' రాజకీయ లబ్ది కోసమే: మల్లాది విష్ణు

విజయవాడ :పోలవం ప్రాజెక్టును ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం వాడుకుంటోందని వైసీపీ నేత మల్లాది పేర్కొన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ హుకుంసింగ్ తో అఖిలపక్ష నేతలు భేటీ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్ సహా పలు అంశాలపై స్టాండింగ్ కమిటికి అఖిలపక్షం వినతిపత్రం సమర్పించింది. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ... జాతీయ ప్రాజెక్టును కేంద్రం నిర్మించడమే మంచిదే కానీ రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా అంచనా వ్యయాలు పెంచేసిందని, పోలవరం నిర్మాణానికి నిధులపై షరతులు పెట్టడం అన్యాయమని ఆరోపించారు.

గోశాలలో ఆవుల మృతి... బిజెపి నాయకుడి అరెస్ట్...

రాయ్ పూర్ : గోశాలలో సరైన సదుపాయాలు కల్పించకుండా ఆవుల మృతికి కారణమైన బీజేపీ నాయకుడు హరీష్ వర్మను పోలీసులు అరెస్టు చేసిన ఘటన చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలోని గోశాలలో జరిగింది.

 

12:21 - August 19, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక పోరు కాక పుట్టిస్తోంది. టీడీపీ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన సందర్బంగా.. ఈ ఎన్నిక ఫలితం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు ఒకే ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల జాతకాలు మారిపోతాయా..? నేతల నాయకత్వాలపై ప్రజలు ఓ అభిప్రాయానికి వచ్చేస్తారా..? ఇప్పుడివే ప్రశ్నలు ఏపీ పొలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. 2014 ఎన్నికల ఫలితాల్లో అధికార టీడీపీకి ప్రతిపక్ష వైసీపీ మధ్య ఓట్ల తేడా 2 శాతం లోపే.. టీడీపీకి వచ్చిన మొత్తం ఓట్లతో పోల్చితే వైసీపీకి తగ్గినవి కేవలం 5 లక్షలే.. టీడీపీ మెజార్టీ సీట్లు గెలుచుకొని అధికారం చేజిక్కుంచుకొంది... ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ 67 సీట్లు సాధించినా.. ఆ తర్వాత 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి జై కొట్టేశారు... అలా పార్టీ మారిన వారిలో భూమా అండ్ ఫ్యామిలీ కూడా ఉన్నారు.. అయితే ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా ప్రజలు తమ వైపే ఉన్నారనే సంకేతాలు పంపడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీంతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించి పార్టీ క్యాడర్‌లో నూతన ఉత్తేజం నింపాలని తహతహలాడుతోంది. ముఖ్యంగా వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి వ్యక్తిగత ఇమేజ్ ఉందని.. దీనికి ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే విజయం తమదేనన్నది వైసీపీ అంచనా..ఈ విజయం ద్వారా చంద్రబాబును మానసికంగా దెబ్బకొట్టాలనేది ఆ పార్టీ వ్యూహాంగా కనిపిస్తోంది.

నువ్వా నేనా అన్న పోటీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 9 నుంచి నంద్యాలలో మకాం వేశారు. ఈ నెల 21 వరకు అంటే 12 రోజులు ప్రచారం నిర్వహించనున్నారు. దాదాపు వైసీపీ అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నంద్యాలలోనే ఉన్నారు. ఇక టీడీపీ విషయానికోస్తే.. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇప్పటికే రెండు సార్లు నంద్యాల వచ్చి వెళ్లారు.. ఈ నెల 17 నుంచి 21 వరకు ఐదు రోజులు ఇక్కడే మకాం వేయనున్నారు.. అలాగే సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ మూడు రోజుల పాటు రోడ్ షో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏడుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు , అగ్రనేతలు నంద్యాల ప్రచారంలో తలమునకలయ్యారు. వైసీపీ నుంచి నువ్వా నేనా అన్న పోటీ మాత్రం ఉందని టీడీపీ వర్గాలు ఒప్పుకుంటున్నాయి..

2019 సెమీ ఫైనల్
అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చనే భావన తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. అయితే వైసీపీ గెలిస్తే మరింత దూకుడు పెంచుతారని..ఈ పరిణామాలు టీడీపీకి ఇబ్బందేనని మరికొందరు టీడీపీ నేతలంటున్నారు.. మరోవైపు 2019 ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్ అనే వాదన మాత్రం టీడీపీ నేతలు తోసిపుచ్చుతున్నారట. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే.. మానసికంగా చంద్రబాబుపై జగన్ ది పై చేయి అవుతుందన్నది పొలిటికల్‌ విశ్లేషకుల టాక్‌. ఈ ఒక్క ఫలితంతో ప్రజలు తమవైపు ఉన్నారన్న ప్రచారానికి జగన్‌ మరింత పదును పెట్టోచ్చని భావిస్తున్నారు. ఒక వేళ టిడీపీ ఓడినా.. ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం లేకపోయినా..జనంలో కొత్త ఆలోచనకు ఈ ఫలితం నాంది పలికే అవకాశముంది. అయితే కేవలం ఒక్క ఎన్నిక ఫలితం 2019 ఎన్నికలనే శాసిస్తుందనడం తొందర పాటే అనేవారు లేకపోలేదు. 

12:15 - August 19, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలంతా బిజీగా గడుపుతున్నారు. ఓవైపు మంత్రులు ప్రచారంలో దూసుకుపోతుంటే.. మొన్నటి దాకా పదవులు దక్కక అసంతృప్తిలో గడిపిన నేతలంతా.. గతాన్ని మర్చిపోయి ప్రచార బాధ్యతల్లో పాలు పంచుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు తమకు పదవి దక్కుతుందని ఆశపడి భంగపడ్డారు. దీంతో వారంతా అలకబూనడమే కాదు.. సీఎం చంద్రబాబుపై బహిరంగ విమర్శలు కూడా చేశారు. చాలామంది రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరించడమే కాదు.. లేఖలు కూడా రాయడంతో స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు వారిని బుజ్జగించారు. ఎట్టకేలకు నేతలు అలకవీడినా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొన్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నిక బాధ్యతల్ని అప్పగించడంతో వారంతా బిజీ అయిపోయారు.

ఉప ఎన్నికపై ఫోకస్ 
మంత్రి వర్గ విస్తరణలో పదవులు ఆశించిన వారిలో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందు వరుసలో ఉన్నారు. పదవి దక్కకపోవడంతో వీరంతా పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికను మానిటరింగ్ చేస్తూ చంద్రబాబుకు నివేదికలు అందిస్తున్నారు. వీరితో పాటు తోట త్రిమూర్తులు, బోండా ఉమ, జ్యోతుల నెహ్రూ, బండారు సత్యనారాయణ, పార్ధసారథి వంటి ఎమ్మెల్యేలకు కూడా నంద్యాల ప్రచార బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. వీరంతా కూడా మంత్రి కాలేకపోయాం అంటూ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినవారే.. అయితే ఇప్పుడదంతా మర్చిపోయి నంద్యాల ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు. అసంతృప్తి పక్కన పెట్టి అంతా ఒక్కటై అధినేత ఆజ్ఞ ప్రకారం నంద్యాల ఉప ఎన్నికకు టీడీపీ నేతలంతా కలిసి పని చేస్తున్నారు. మరి రిజల్ట్ ఎలా వస్తుందో? వేచి చూడాలి. 

12:13 - August 19, 2017

రైలు ఢీకొని పులి మృతి....

లక్నో : ఉత్తరప్రదేశ్ బహెరైచ్ లోని బిచియా రైల్వే గేట్ సమీపంలో దారుణం జరిగింది. ఓ రైలు పులిని ఢీకొట్టింది. దీంతో పులి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు పులి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమీపంలో ఉన్న కతర్నియాఘాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి పులి బయటకు వచ్చినట్లు తెలుస్తుంది.

మహిళా హెల్ప్ లైన్ నెం.181ను ప్రారంభించిన తుమ్మల

హైదరాబాద్ : మహిళ అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహిళా హెల్ప్ లైన్  నంబరు 181ను మంత్రి తుమ్మల ప్రారంభించారు. తెలంగాణ సచివాలయంలో ఈ కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గృహహింస,వరకట్నం వేధింపులపై పనిచేస్తుందని, పని చేసే చోట వేధింపులు, మహిళలు సమస్యలపై హెల్ప్ లైన్ పనిచేయనుందని పేర్కొన్నారు.

 

12:00 - August 19, 2017

మంచు మనోజ్ లేటెస్ట్ మూవీ ‘ఒక్కడు మిగిలాడు’ ట్రైలర్ విడుదలైంది. యాక్షన్ .. ఎమోషన్‌తో కూడిన సన్నివేశాలతో కూడిన ట్రైలర్‌ను తయారు చేసి రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. ఈ చిత్రాన్ని అజయ్ ఆండ్రూస్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్‌గా, ఓ స్టూడెంట్‌గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఈ సినిమాలో మనోజ్ జోడీగా అనీషా ఆంబ్రోస్ నటించింది. భారతదేశంలో ఇంకా స్వతంత్ర పోరాటం జరుగుతూఉంటే అల్లూరి, భగత్‌‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఏమని పిలిచుకునేవారు? తీవ్రవాదులనా? లేక దేశ భక్తులనా? అనే వాయిస్‌‌తో ట్రైలర్‌ మొదలైంది. శ్రీలంకలో తమిళులు అనుభవించిన మానసిక క్షోభను కళ్లకు కట్టినట్లు చూపించినట్టు తెలుస్తోంది. స్వేచ్ఛ కోసం సాయుధ పోరాటం తీవ్రవాదమైతే..మనం తీవ్రవాదులమే అనే మరో డైలాగ్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 

ఏసీబీ వలలో సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల ప్రిన్సిపల్

విశాఖ : అచ్యుతాపురంలో ఏసీబీ దాడులు చేసింది. రూ.8వేలు లంచం తీసుకుంటూ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ సాల్మన్ రాజు ఏసీబీకి పట్టుబడ్డాడు. దీంతో సాల్మన్ రాజు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 

11:50 - August 19, 2017

సౌత్ బ్యూటీ, మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అయ్యింది. కొద్దికాలం క్రితమే తన బాయ్ ఫ్రెండ్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త ముస్తఫా రాజ్ తో బెంగుళూరులో నిశ్చితార్థం చేసుకున్న ఆమె , ఈ నెల 23న పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెల్సిందే. ప్రైవేట్ వేడుకగా జరగనున్న ఈ పెళ్లి వేడుక సందడి మొదలైంది. ఈవెంట్ మెనెజ్మెంట్ బిజినెస్ రంగం లో ఉన్న ముస్తఫా ఐపీఎల్ మ్యాచ్ లో ప్రియమణి కి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది.. ముస్తఫా వ్యక్తిత్వం నాకు నచ్చింది.. అందుకనే అతని ప్రేమలో పడ్డాను అని ప్రియమణి ఓ సమయంలో వెల్లడించింది..

11:28 - August 19, 2017

యోగా బ్యూటీ అనుష్క నటిస్తున్న సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ‘భాగమతి’ షూట్ ఇప్పటికే పూర్తయింది. యువీక్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసున్నట్లు సమాచారం.. ఇక మూవీని డిసెంబర్‌లో రిలీజ్ ‌కి ముహూర్తం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సప్సెన్స్ థ్రిల్లర్ గా ఉండనుంది. ఇందులో ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి ప్రధాన ప్రతి నాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత అనుష్క నుండి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో, సినీ జనాల్లో మంచి క్రేజ్ నెలకొని ఉంది.

సోపియాన్ జిల్లాలో భద్రతాదళాల సోదాలు

జమ్మూకాశ్మీర్ : ఉద్రవాదులు సంచరిస్తున్నారే అనుమానంతో సోపియాన్ జిల్లాలో భద్రతాదళాలు సోదాలు నిర్వహించాయి. మొత్తం 9గ్రామాల్లో భద్రతాదళాలు తనిఖీలు చేసినట్లు సమాచారం.

 

11:21 - August 19, 2017

కర్నూలు :  నంద్యాల ఉప ఎన్నికల్లో పాల్గొనేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు నంద్యాలకు బయలుదేరారు. నంద్యాలలో వైసీపీ అభ్యర్థి తరుపున జగన్ ఇప్పటికే ప్రచారం సాగిస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఈసీకి టీడీపీ, వైసీపీలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. కంటైనర్ లో డబ్బులు ఉన్నాయని వైసీపీ నేతలు ఫిర్యాదు మేరకు కంటైనర్ ను తనిఖీ చేశారు. అందులో డబ్బులు లేవని సీఎం సంబంధించిన సామాగ్రి ఉందని వారు తెలిపారు. మరో వైపు నంద్యాల డీఎస్పీ పై ఈసీ వేటు వేసింది. గోపాలకృష్ణపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేయడంతో ఈసీ విచారించి ఈ డీఎస్పీ పై బదిలీ వేటు వేసింది.  మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:15 - August 19, 2017

హైదరాబాద్: త్వరలో కొత్త రూ.50 నోటు విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ నోటు బ్యాంకుల ద్వారా ప్రజల్లోకి అందుబాటులోకి రానుంది. భారతీయ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథం, స్వచ్ఛ్‌భారత్‌ లోగో ఈ నోటు వెనుక వున్నాయి. మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌ నోట్లపై ఆర్బీఐ గవర్నరు సంతకం ఉంటుంది. ఫీచర్స్ విషయానికొస్తే.. ఫ్లోరెసెంట్‌ బ్లూ కలర్‌లోవున్న ఈ నోటు ముందు మహాత్మాగాంధీ ఫొటో, దేవనాగరి లిపిలో 50 సంఖ్య వుంది. ఆర్బీఐ అని మైక్రోలెటర్స్‌, ఇండియా అని దేవనాగరి లిపిలో రాసి వుంది. నోటు ముందు భాగాన కుడివైపు జాతీయ చిహ్నం, ఎలక్ట్రోటైప్‌ వాటర్‌మార్క్‌, ఆరోహణ క్రమంలో నెంబరు ప్యానెల్‌ ఉండనుంది. కొత్తగా విడుదల కానున్న రూ.50 నోటు 66 ఎంఎం X 135 ఎంఎం పరిమాణంలో డిజైన్‌ చేశారు. కొత్త నోట్లు వచ్చినా, పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ పేర్కొంది.

 

11:04 - August 19, 2017

సెన్సిబుల్ సినిమాల దర్శకుడు మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో సినిమాలో అఖిల్ నటిస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ లోపే సినిమా పోస్టర్ లీక్ అవడం సంచలనం గా మారింది. నిజానికి ఆగస్టు 21న పేరుతో సహా రావాల్సిన ఈ పోస్టర్, ఆ డేట్ కంటే ముందుగానే బయటకు రావడం తో , నిర్మాత నాగార్జున టైటిల్ లేకుండానే సినిమా స్టిల్ ను రిలీజ్ చేశాడు.ఈ స్టిల్ లో తన గాళ్ ఫ్రెండ్ కళ్యాణి ప్రియదర్శన్ కోసం అఖిల్ మాఫియా దుండగులను కొడుతున్నట్లు కాస్త డిఫరెంట్ గా అఖిల్ కనిపిస్తున్నాడు. కాకపోతే పోస్టర్ చూస్తుంటే ఈ మధ్యన రిలీజైన హిందీ ‘ఏ జెంటిల్మన్’ సినిమా పోస్టర్ థీమ్ కు దగ్గరగా ఉంది. ఒక క్లాస్ లుక్కింగ్ బాయ్.. తన గాళ్ ఫ్రెండ్ కోసం దుండగులతో ఫైటింగ్, పెద్ద పెద్ద చేజులూ, ఫైట్లు, బిల్డింగులూ, హెలికాప్టర్లూ ఇవ్వన్నీ చూస్తుంటే విక్రమ్ పెద్ద సినిమానే చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ”రంగుల రాట్నం” అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ టైటిల్ బయట పెట్టనున్నారు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ ఫై నాగార్జున ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

కొత్త డీఎస్పీగా ఓఎస్డీ రవిప్రకాష్

కర్నూలు: నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణపై ఈసీ వేటు వేసింది. గోపాలకృష్ణపై పలు ఆరోపణలు రావడంతో పదవి నుంచి తొలగించారు. ఇన్ ఛార్జి డీఎస్పీగా ఓఎస్డీ రవిప్రకాష్ బాధ్యతలు చేపట్టారు.

తెలంగాణ,కోస్తా, రామలసీమ ప్రాంతాల్లో భారీ వర్షలు

హైదరాబాద్: రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

వైసీపీ నేత ఇంట్లో రూ.47.40లక్షల పట్టివేత...

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు దస్తగిరిరెడ్డి ఇంట్లో శనివారం నందివర్గం పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.47.40 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని నంద్యాల ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందించనున్నట్లు ఎస్సై హనుమంత్‌రెడ్డి తెలిపారు.

ఏపీ సచివాలయంలో ఒ వ్యక్తి ఆత్మహత్య

అమ‌రావ‌తి: ఏపీ స‌చివాల‌యంలో ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. శుక్ర‌వారం నెల్లూరు జిల్లాకు చెందిన‌ ఆర్ఎంపీ డాక్ట‌ర్ రాజ‌గోపాల్ కు అప్పులు ఎక్కువ‌వ‌డంతో బాధ‌ను త‌ట్టుకోలేక‌.. త‌న బాధ‌ను సీఎం చంద్ర‌బాబునాయుడు తో పంచుకుందామ‌ని వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యానికి శుక్ర‌వారం ఉద‌యం వ‌చ్చాడు. సీఎం అపాయింట్ మెంట్ దొర‌క‌లేదు. దీంతో జీవితం పై విర‌క్తి చెందిన రాజగోపాల్ త‌న అప్పుల బాధ‌ను త‌ట్టుకోలేక త‌న‌తో పాటు వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగేశాడు. దీన్ని గ‌మ‌నించిన స‌చివాల‌య సిబ్బంది రాజ‌గోపాల్ ను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

సమాయానికి కాలేజీకి రాలేదని జుట్టు కత్తిరించారు

జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అమానుషం చోటుచేసుకుంది. సమయానికి కాలేజీకి రావడంలేదంటూ పదిమంది విద్యార్థుల జుట్టును లెక్చరర్లు కత్తిరించారు. ఈ అవమానం భరించలేక విద్యార్థులు కాలేజీ మానేశారు. ఇష్టం వచ్చినట్లు జుట్టు కత్తిరించడంతో విద్యార్థులు మనస్తాపం గురయ్యారు. ఈ విషయంపై స్పందించిన లెక్చరర్లు జట్టు కత్తిరింపుతో తమకు సంబంధంలేదని, టీసీకోసం విద్యార్ధులే ఇలాంటివి సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

10:25 - August 19, 2017

జగిత్యాల : జిల్లా ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అమానుషం జరిగింది. లెక్చరర్లు సమయానకి కాలేజీకి రాలేదని విద్యార్థుల జుట్టు కత్తిరించారు. లెక్చరర్లు పదిమంది విద్యార్థుల జుట్టు కత్తిరించారు. విద్యార్థులు సమయానికి కాలేజీ రావడంలేదంటూ, జుట్టును భారీగా పెంచి జులాయి లాగా కాలేజీ వచ్చినందుకు జుట్టు కత్తిరించినట్టు తెలుస్తోంది. ఇష్టంవచ్చినట్లు జుట్టు కత్తిరించడంతో విద్యార్థులు మనస్తాపం చెంది కాలేజీ మానేసినట్టు వారి తల్లిదండ్రులు తెలిపారు. లెక్చరర్లు మాత్రం జుట్టు కత్తిరింపుతో తనకు సంబంధలేదంటున్నారు. విద్యార్థులు టీసీల కోసం ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

10:10 - August 19, 2017

కర్నూలు : జిల్లా నంద్యాల డీఎస్పీ పై ఈసీ వేటు వేసింది. గోపాలకృష్ణపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేయడంతో ఈసీ విచారించి ఈ డీఎస్పీ పై బదిలీ వేటు వేసింది. మరోవైపు నేడు, రేపు ఏపీ సీఎం చంద్రబాబు నంద్యాలలో ప్రచారం చేయనున్నారు. నంద్యాలలో జగన్ ఇప్పటికే ప్రచారం సాగిస్తూన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఎన్నికల తేది దగ్గరపడుతుండంతో నాయకులు డబ్బులను ఏరుల పారిస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని టీడీపీ, వైసీపీలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. మరొవైపు నిన్న అర్ధరాత్రి ఓ కంటైనర్ నంద్యాలలో హల్ చల్ చేసింది. కంటైనర్ లో డబ్బులు ఉన్నాయని వైసీపీ నేతలు ఫిర్యాదు చేసి దాన్ని తనిఖీ చేసేవరకు పట్టువీడలేదు. కంటైనర్ ను తనిఖీ చేసిన అధికారులు అందులో డబ్బులు లేవని సీఎం సంబంధించిన సామాగ్రి ఉందని వారు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

నంద్యాల డీఎస్పీ పై ఈసీ వేటు

కర్నూలు : నంద్యాల  డీఎస్పీ గోపాలకృష్ణపై ఈసీ వేటు వేసింది. గోపాలకృష్ణపై పలు ఆరోపణలు రావడంతో ఈసీ అతన్ని తప్పించింది. ఆయన స్థానంలో ఇన్ ఛార్జి డీఎస్పీగా ఓఎస్డీ రవిప్రకాష్ ను నియమించింది.

09:11 - August 19, 2017

కర్నూలు : నంద్యాల ఉపఎన్నికల ప్రచారం వేడెక్కింది. నేడు, రేపు ఏపీ సీఎం చంద్రబాబు నంద్యాలలో ప్రచారం చేయనున్నారు. నంద్యాలలో జగన్ ఇప్పటికే ప్రచారం సాగిస్తూన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఎన్నికల తేది దగ్గరపడుతుండంతో నాయకులు డబ్బులను ఏరుల పారిస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని టీడీపీ, వైసీపీలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. మరొవైపు నిన్న అర్ధరాత్రి ఓ కంటైనర్ నంద్యాలలో హల్ చల్ చేసింది. కంటైనర్ లో డబ్బులు ఉన్నాయని వైసీపీ నేతలు ఫిర్యాదు చేసి దాన్ని తనిఖీ చేసేవరకు పట్టువీడలేదు. కంటైనర్ ను తనిఖీ చేసిన అధికారులు అందులో డబ్బులు లేవని సీఎం సంబంధించిన సామాగ్రి ఉందని వారు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

08:48 - August 19, 2017

విజయవాడ : అమరావతి నిర్మాణానికి అటవీభూముల మళ్లింపునకు సంబంధించి స్పష్టత వచ్చింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 12వేల 444 హెక్టార్ల అటవీ భూమిని రాజధాని అవసరాల కోసం వినియోగించుకోడానికి కేంద్ర అటవీ సలహా సమితీ సమ్మతిని తెలియజేసింది. దీంతో రాష్ట్రప్రభుత్వంలో హర్షం వ్యక్తం అవుతోంది. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి మార్గం సుగమం అవుతోందని చంద్రబాబు ప్రభుత్వం అంటోంది. అటవీ భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు కేంద్ర అటవీ విభాగానికి విన్నవించారు. అయితే భారీగా అటవీ సంపద నాశనం అవుంతుందని , పర్యావరణానికి హాని కలుగుతుందన్న కోణంలో కేంద్రం నుంచి మొదట ఆమోదం లభించలేదు.

ఇప్పటికే 34వేల ఎకరాలు
ఇప్పటికే రాజధాని నిర్మాణం పేరుతో 34వేల ఎకరాలు తీసుకోవడం, సుప్రీంకోర్టులో కేసులు, జాతీయ హరిత ట్రిబ్యునల్‌ అభ్యంతరాలు ఉండటంతో కేంద్ర అటవీశాఖ అనుమతులు ఇవ్వడానికి నిరాకరించింది. అయితే మేనెలలో ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన అటవీశాఖ .. దీనిపై అధ్యయనానికి ఓ నిపుణుల కమిటీని నియమించింది. దీన్లో భాగంగా జూన్‌నెలలో కేంద్రకమిటీ సీఆర్‌డీఏ ప్రాంతంలో పర్యటించింది. కేంద్ర అటవీశాఖకు నివేదిక అందించింది. నివేదికను పరిశీలించిన అటవీసలహా సమితి ఎట్టకేలకు అటవీభూములను ఏపీ ప్రభుత్వానికి అప్పగించడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. అటవీభూములను వినియోగించుకోవడానికి అనుమతించడంపై పర్యావరణ వేత్తలు తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటికే వాతావరణ మార్పులతో వర్షాలకు ముఖం వాచిన రాష్ట్రంలో వేల హెక్టార్లలో అడవి నాశనం అయితే .. పర్యావరణానికి మరింత చేటు కలుగుతుందంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అనాలోచితంగా పర్యావరణానికి పెనుముప్పు తెచ్చిపెడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

పర్యావణ సమతుల్యం దెబ్బతింటుంది
ఇప్పటికే రాజధాని భూముల్లో లాభపడిన టీడీపీ నేతలు..ఇపుడు అటవీభూములపై కన్నేశారని వైసీపీ, వామపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. అటవీ భూములను డెవలప్‌ చేసి పారిశ్రామిక వేత్తలకు ఇస్తామంటున్న చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ప్రస్తుతం అనుమతి ఇచ్చిన 12,444 హెక్టార్లలో రాజధాని పరిధిలోని తాడేపల్లిలో 251.77 హెక్టార్లు, వెంకటాయపాలెం పరిధిలో 1,835.32 హెక్టార్ల అటవీ భూములున్నాయి. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం 347.64 హెక్టార్ల అటవీభూమి మళ్లింపునకూ కేంద్రం అటవీ సలహాదారుల సమితి ఆమోదముద్ర వేసింది.అభివృద్ధిపేరుతో విలువైన అటవీసంపదను నాశనం చేస్తే.. పర్యావణ సమతుల్యం దెబ్బతిని భవిష్యత్తులో మరింత కష్టాలు ఎదురవుతాయన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 

08:46 - August 19, 2017

హైదరాబాద్ : హోదా పేరుతో లోధా బిల్డర్స్‌ చీట్‌ చేసింది. లోదా అపార్ట్‌మెంట్స్‌ ఓ స్టేటస్‌ సింబల్‌ అని కోతలు కోశారు. వీవీఐపీలు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులకు స్వర్గధామం అంటూ మస్కా కొట్టారు. ఆకర్షణీయమైన ప్రకటనలతో అదరగొట్టారు. ఇలా ఎన్నో మాయమాటలు చెప్పి సంపన్నులకు గాలం వేశారు. కూక‌ట్ ప‌ల్లి హౌసింగ్ బోర్డు కాల‌నీలో గేటెడ్ కమ్యూనిటీ, హైఎండ్ అపార్ట్ మెంట్స్‌ను లోదా బిల్డర్స్‌ సంస్థ 2009లో నిర్మించింది. ఇక్కడ ఫ్లాట్ ద‌క్కించుకోవాలంటే అర్హత కావాల్సిందే. కోట్లాది రూపాయ‌ల‌ ట‌ర్నోవ‌ర్‌, స‌మాజంలో వారికో హోదా ఉండాల్సిందే. అత్యంత విలాసవంతమైన సదుపాయాలు అంటూ ఒక్కో వ్యక్తి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు.

ప్లాన్ ప్రకారం కాకుండా
అయితే ప‌ర్మిష‌న్ ప్లాన్ ప్రకారం కాకుండా దాన్ని మార్చడంతో వివాదం మొదలైంది. నిర్మాణాల‌ను అడ్డుకున్న లోధా బెల్లెజా ప్లాట్ల యాజ‌మానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయితే సదుపాయాల్లో ఎక్కడా రాజీపడమన్న బిల్డర్స్‌ హామీతో లోధా మెరిడియ‌న్ నిర్మాణాల‌కు అంగీకరించారు. ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కి ఎలాంటి స‌మాచారం లేకుండా ప్లాన్‌ మార్చారని అపార్ట్‌మెంట్‌వాసులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఒకే లేఔట్‌లో మరో ప్రాజెక్టు ప్రారంభించి అపార్ట్‌మెంట్‌ వాసులకు కేటాయించిన కామన్‌ ప్లేస్‌ను ఇతరులకు కేటాయిస్తున్నారని బాధితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. త‌మ‌కు అగ్రిమెంట్ ప్రకారం ఇస్తామ‌న్న స‌దుపాయాలు క‌ల్పించ‌కుండా 750 ఫ్లాట్లలో కేవ‌లం 350 మందికి మాత్రమే పార్కింగ్ స్థలం కేటాయించారని చెబుతున్నారు. క్లబ్‌ హౌజ్ నిర్మాణాన్ని త‌క్కువ‌ స్థలంలో చేపట్టారని అరోపిస్తున్నారు. దీంతో లోధా బిల్డర్స్‌ తమను మోసం చేశారని బల్దియా కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

24 గంటల్లో వివ‌ర‌ణ ఇవ్వాలి
లోదా నిర్మాణ సంస్థ ప్రతినిధుల‌తో పాటు బెల్లెజా, మెరిడియ‌న్ ప్లాట్స్ య‌జామానుల‌తో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ప్రత్యేక స‌మావేశం నిర్వహించారు. ఇరువ‌ర్గాల వాదనలు విన్నారు. 10రోజుల్లో అన్ని వివ‌రాల‌తో రావాల‌ని బిల్డర్లను ఆదేశించినట్లు చెప్పారు. అన్ని సౌక‌ర‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని చెప్పిన బిల్డర్లు త‌మ‌ను అడ్డంగా మోసం చేశార‌ని బాధితులు పెదవి విరుస్తున్నారు. అయితే లోధా బెల్లెజా అపార్టుమెంట్స్ వద్ద నిర్మించిన వాల్ తొల‌గించడానికి ఈనెల‌16న‌ జిహెచ్ఎంసి నోటీస్‌ ఇచ్చింది. 24 గంటల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని లేదంటే గోడను కూల్చేస్తామని హెచ్చరించింది. చ‌ర్చల పేరుతో దానిని వాయిదా వేసింది. ఏదీ ఏమైనా లోధా బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

08:44 - August 19, 2017

హైదరాబాద్ : గణేష్‌ ఉత్సవాల సందడితో హైదరాబాద్‌లో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితి, బక్రీద్‌, ఒకేసారి రావడంతో వేలాది మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించనున్నారు. గణేష్‌ విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకూ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరిస్తారు. వినాయక చవితి, బక్రీద్‌ పండగల బందోబస్తు ఏర్పాట్లపై పోలీసులు సమావేశం నిర్వహించారు. సౌత్‌జోన్‌లోని ఠాణాల పరిధిలోని గణేష్‌ మండపాల నిర్వహకులు, ముస్లిం మత పెద్దలతో సాలర్‌జంగ్‌ హాల్‌లో కోఆర్డినేషన్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. సమావేశంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, జాయింట్ సీపీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గణేష్‌ మండపాల దగ్గర, నిమజ్జనానికి వెళ్లే దారిలో తలెత్తుతున్న సమస్యలను మండపాల నిర్వహకులు అధికారుల దృష్టికి తెచ్చారు. డీజే సౌండ్‌ సిస్టమ్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. మండపాల దగ్గర పారిశుధ్యం, లైటింగ్‌, రహదారులపై చెట్ల సమస్యలను వివరించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని నిర్వాహకులకు పలుశాఖల అధికారులు హామీ ఇచ్చారు.

25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
రెండు పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు పోలీసులకు,అన్ని శాఖల అధికారులు సహకరించాలని సీపీ కోరారు. గణేష్ ఉత్సవాల కోసం 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాల నుండి వచ్చే పోలీసుల తో పాటు కేంద్ర బలగాలు, గ్రే హౌండ్స్ ,ఆక్టోపస్,RAF,CRPF, పారామిలాటరీ బలగాలు కూడా పాల్గొంటాయన్నారు...గణేష్ మండపాల దగ్గర ఈ సారి జియో ట్యాగింగ్ Q ,R కోడ్ లతో పర్యవేక్షణ చేస్తూ సీసీటీవీ ల ద్వారా మానిటరింగ్ చేస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. ట్యాంక్‌బండ్‌ వద్ద గణేష్ నిమజ్జనం కోసం 36 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా వినాయక ఉత్సవాలు, బక్రీద్‌ పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటోంది. 

08:43 - August 19, 2017

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్ట్ ను మరో ఏడాదిలో పూర్తిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెగ హడావిడి చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకున్న గ్రావిటీ ద్వారా నీరు కూడా అందిస్తామని ప్రకటించారు. దీంతో నిర్వాసిత గ్రామాల్లో మరోసారి అలజడి మొదలయ్యింది. పోలవరం, దేవిపట్నం మండలాలతో పాటు కూనవరం , వీఆర్ పురం మండలాల్లో ఇవాళ బంద్‌కు పిలుపు నిచ్చారు.

నిర్వాసితుల ఆగ్రహం
ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ పరిహారం ఇవ్వడంలో చూపడంలేదని సీఎం చంద్రబాబుపై నిర్వాసితులు ఆగ్రహంగా ఉన్నారు. నిజానికి పరిహారం చెల్లించడానికి దాదాపు 32వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని చంద్రబాబు ఇంతకు ముందే ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తిగా అమలు చేసిన గ్రామం ఒక్కటి కూడా లేదు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం దానికి భిన్నంగా గత ప్రభుత్వ హయాంలో చెప్పిన లెక్కల ప్రకారమే నిర్వాసితులకు నష్టపరిహారం అంటున్నారు. ఓవైపు ప్రాజెక్ట్ నిర్మాణ అంచనాలు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ కాంట్రాక్టర్లకు ప్రయోజనాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. నిర్వాసితుల నష్టపరిహారం దగ్గరకు వచ్చేసరికి పాత లెక్కల ప్రకారమే అనడంపై నిర్వాసితులు మండిపడుతున్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం చట్ట విరుద్ధమని గిరిజనులు ఆందోళనకు దిగుతున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేసిన తర్వాత మాత్రమే ప్రాజెక్ట్ కట్టాల్సి ఉన్నా దానికి భిన్నంగా ప్రభుత్వం సాగడం అన్యాయమన్నారు. గిరిజనులకు తగిన న్యాయం జరిగే వరకూ ప్రాజెక్ట్ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతు
నిర్వాసితులు ఇప్పటికే పలు రూపాల్లో తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. అయినా ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సర్కారు తీరుకి వ్యతిరేకంగా నేడు పోలవరం విలీన మండలాల బంద్ కి పిలుపునిచ్చారు. వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్ కి మద్ధతు ప్రకటించాయి. దాంతో విలీన గ్రామాల్లో ఉద్యమ వేడి రాజేసే పనిలో నిర్వాసితులున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని పోలవరం నిర్వాసితులు కోరుతున్నారు. లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

08:41 - August 19, 2017

కర్నూలు : నువ్వానేనా అన్నట్టు సాగుతున్న నంద్యాల ఉప ఎన్నికల పోరులో వైసీపీ -టీడీపీ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశాయి. ఇవాళ సీఎం చంద్రబాబు కూడా రంగంలోకి దిగుతుండటంతో నంద్యాల పోరులో హీట్‌ పెరిగింది. శని, ఆదివారం.. రెండు రోజుల పాటు సీఎం క్యాంపెయిన్‌ ఉండటంతో.. టీడీపీ శ్రేణుల్లో జోష్‌ కనిపిస్తోంది. మరోవైపు నంద్యాల శివారులో గాజులపల్లి వద్ద ఓ కంటైనర్‌లో డబ్బు ఉందన్న వదంతులు తీవ్ర కలకలం రేపాయి. అధికారులు కంటైనర్‌ను స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా వంటసామాన్లు కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు. అటు వారం రోజులుగా నంద్యాలలోనే మకాంవేసి.. ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ అధినేత జగన్.. టీడీపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు పాలనలో ఆరోగ్య శ్రీ అధ్వానంగా తయారైందని తూర్పార పడుతున్నారు.

25 మంది అరెస్టు
టీడీపీ మంత్రులు కూడా ప్రతిపక్ష నేత జగన్‌కు కౌంటర్‌ అటాక్‌ ఇస్తున్నారు. అభివృద్ధికి ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిస్తున్నారు. టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, వైసీపీలు డబ్బులు పంచుతున్నారని పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో ఉపపోరు మరింత వేడెక్కింది. మరోవైపు నంద్యాల గాంధీచౌక్‌లో డబ్బు పంపణీ చేస్తున్న 25 మందిని పోలీసులు అరెస్టుచేసి, 90 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో 11 మందిని అరెస్టుచేసి, ఆరు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాలలో వైసీపీ డబ్బులు పంచుతోందని ఆరోపిస్తూ... టీడీపీ ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ఉప ప్రధానాధికారి అనూప్‌సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది.

నేడు నంద్యాలకు చంద్రబాబు
దీనిపై వైసీపీ కౌంటర్ దాడికి దిగింది. ఓటర్లను టీడీపీ ప్రలోభాలకు గురి చేస్తోందని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా డబ్బుల పంపిణీ చేసిన విషయాన్నిఫిర్యాదులో ప్రస్తావించారు. ఇప్పటికే హోరెత్తుతున్న ప్రచారంలోకి ఇవాళ చంద్రబాబుకూడా దిగుతుండటంతో అందరిచూపు నంద్యాలవైపే మళ్లింది. ప్రచారానికి రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో నంద్యాల రాజకీయం రసవత్తరంగా మారింది. 

నేడు కరీంనగర్ లో టీమాస్ ఫోరం అవిర్భావ సభ

కరీంనగర్ : నేడు కరీంనగర్ జిల్లాలో టీమాస్ అవిర్భావ సభ జరగనుంది. ఈ సభలో రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని, ప్రజాగాయకుడు గద్దర్, విమలక్క, తదితరులు పాల్గొననున్నారు.  

నేడు పోలవరం విలీన మండలాల బంద్

తూర్పుగోదావరి : పోలవరం విలీన మండలాల భూ నిర్వాసితుల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు నిర్వాసితులు బంద్ పిలుపునిచ్చారు.

నేడు రేపు నంద్యాలలో చంద్రబాబు పర్యటన

కర్నూలు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు రేపు నంద్యాలలో పర్యటించనున్నారు. ఆయన నంద్యాల ఉపఎన్నికల ప్రచరాంలోమ పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఆయన ప్రచారంలో పాల్గొంటారు. 

07:20 - August 19, 2017

నంద్యాల ఉప ఎన్నిక పోటాపోటీగా జరుగుతుందని, డబ్బులకు సంభదించి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. మద్యం, డబ్బు పంపిణీ తెలిసిన విషయమే అయితే ఎన్నికల కమిషన్ పై పూర్తి బాధ్యత ఉందని, ఎన్నికల ప్రస్థానం లో వైసీపీ ప్రచారం ఎలా మొదలైందో చూశామని, కమలపురం ఎమ్మెల్యే, జగన్ మామ పీఏ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారని, తొమ్మిది చోట్ల వైసీపీ వారు దొరికిపోయారని. చంద్రబాబు సంబంధించిన ప్రచార సామాగ్రి, ఆయనకు ఫుడ్, కూరగాయాలు, ఆ కంటేనర్ లో ఉన్నాయని, టీడీపీ నేత దినకరన్ అన్నారు. నంద్యాలలో వన్ సైడ్ వార్ లేదా వన్ సైడ్ పోలీసులు ఉన్నారని, చంద్రబాబు తన వేసిన రోడ్లపై నడిచి తనకు ఓట్లు ఎందుకు వేయ్యరాని, జగన్ మోహన్ రెడ్డికి 25వేల మంది రాఖీ కట్టారని, వైసీపీ నేత కొండరాఘవరెడ్డి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:01 - August 19, 2017

దశరథ్ గడ్డి ని హెడ్జ్ లోస్అంటారని, మమూలు గడ్డిలగా ఇది పెరుగదని, రోడ్లు వెడల్పు చేయడానికి చెట్లను కొట్టుతున్నారని, ప్రొటిన్ ఉండే మొక్కల్లో పంటను వేస్తే దాన్ని తొలగించాలంటే ఖర్చు అవుతుందని, హెడ్జ్ లోస్ ఉంటే కోళ్లను, మేకలను పెచ్చుకోవచ్చని, రకరకాల గడ్డిని వెసుకుంటూ చివరికి ఓ డాక్టర్ సలహాతో హెడ్జ్ లోస్ గడ్డి వేశామని రైతు బ్రహ్మయ్య అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Don't Miss