Activities calendar

20 August 2017

22:05 - August 20, 2017

కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తిరమైన విషయాలు తెలిపారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని విమర్శించారు. గవర్నర్ నరసింహన్ పై విమర్శలు చేశారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:58 - August 20, 2017

నెల్లూరు : జిల్లాలోని ముత్తుకూరు మండలం పాములవారిపాలెంలో రొయ్యల ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు ఆరోపించారు. రొయ్యల ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థ జలాలు కలిసిన పంట కాలువలను ఆయన పరిశీలించారు. ఫ్యాక్టరీల యజమానులు వెంటనే కాలుష్య నీటిని కాలువల్లో వదలడం ఆపాలని లేదంటే ఈనెల 24న ఫ్యాక్టరీలను ముట్టడిస్తామని మధు హెచ్చరించారు. 

 

21:55 - August 20, 2017

హైదరాబాద్ : ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమం మరింత ఉధృతం కానుంది. కేసీఆర్ సర్కార్ పౌర హక్కుల్ని కాలరాస్తోందని మండిపడుతున్న విపక్షనేతలు... ఢిల్లీ కేంద్రంగా తమ గళం వినిపించనున్నారు. ధర్నాచౌక్‌ను పునరుద్ధరించుకునేందుకు హస్తిన కేంద్రంగా పోరుకు సిద్ధమయ్యారు. 

ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాచౌక్‌ ఎత్తివేయడాన్ని నిరసిస్తూ ధర్నాచౌక్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విపక్షాలు పోరు ఉధృతం చేయాలని నిర్ణయించాయి. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వేదికగా సోమవారం నిరసన గళం విప్పనున్నారు. 

ధర్నా చౌక్ పునరుద్ధరణ కోసం ధర్నాచౌక్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నెలరోజులుగా పలు ప్రజా స్వామ్య సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కేసీఆర్ సర్కార్‌లో కదలిక రాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఢిల్లీ పెద్దలకు తెలిపేందుకు సమితి సభ్యులు సిద్ధం అయ్యారు. సోమవారం ఉదయం ధర్నాకార్యక్రమం నిర్వహించడంతో పాటు.. కేంద్ర హోం మంత్రిని కలిసి మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించారు. 

కేసీఆర్ ప్రభుత్వం భావ స్వేచ్ఛను హరిస్తూ.. ప్రజాస్వామ్యం గొంతునొక్కుతోందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణలో పోలీసుల పహారా మధ్య, నిర్భంధ పరిపాలన సాగుతోందన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని.. వారి స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తామని చాడ వెంకటరెడ్డి చెప్పారు. 

జంతర్ మంతర్ ధర్నా తరువాత కూడా తెలంగాణ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుంటే తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం చేపడతామన్నారు ధర్నాచౌక్ పరిరక్షణ సమితి కో కన్వీనర్ కె.విశ్వేశ్వరరావు. జంతర్ మంతర్‌ వద్ద జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున జేఏసీ నేతలు, రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఈ సందర్భంగా ధర్నాచౌక్ పరిరక్షణ సమితి నేతలు సూచించారు. 

21:52 - August 20, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ప్రాజెక్టులు అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. కోర్టులకు వెళ్లి ఆపాలని ప్రయత్నించినా న్యాయస్ధానాలు తమకే న్యాయం చేస్తాయని చెప్పారు. 2018 నాటికల్లా ప్రాజెక్టుల్లో 80 శాతం పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 

 

21:49 - August 20, 2017

మహబూబ్ నగర్ : 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా టీ.మాస్‌ ఫోరం ఎదుగుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీమాస్‌ ఫోరం  ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి జరగకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదన్నారు. ఈ సందర్భంగా జిల్లా టీమాస్‌ ఫోరం కమిటీలను ప్రకటించారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల టీమాస్‌ఫోరం కమిటీల ఏర్పాటు చేశారు. జిల్లా టీమాస్‌ఫోరం ఆవిర్భావం సభ సందర్భంగా కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. 

21:45 - August 20, 2017

నెల్లూరు : నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారం రసవత్తరంగా సాగుతున్నవేళ వైసీపీకి షాక్‌ తగిలింది. నెల్లూరులో క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల హస్తమున్నట్టు పోలీసులు తేల్చారు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌లకు పోలీసులు నోటీసులు పంపారు. ఈనెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు రేపు నోటీసులు పంపే అవకాశముంది. 

 

21:42 - August 20, 2017

ఢిల్లీ : శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 217 పరుగుల విజయ లక్ష్యాన్ని28.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. శిఖర్ ధవన్ అద్భుత సెంచరీకి తోడు కెప్టెన్ కోహ్లీ దూకుడుతో భారత్ సునాయాస విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బరిలోకి భారత్ రోహిత్ శర్మ వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 132 పరుగులు, కెప్టెన్‌ కోహ్లీ 82 పరుగులతో  నాటౌట్‌గా నిలిచి టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు.

కాల్పుల ఘటనను పోలీసులు వక్రీకరించారు : విక్రమ్‌గౌడ్‌

హైదరాబాద్ : కాల్పుల ఘటనను పోలీసులు వక్రీకరించారని విక్రమ్‌గౌడ్‌ చెప్పారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్ నిర్వహించింది. తానే కావాలని కాల్పులు జరిపించుకున్నానన్న వార్తలు అవాస్తవమన్నారు. నాకు కోట్లలో అప్పులున్నాయన్న మాట అబద్ధమని..సన్నిహితుల దగ్గరే కొద్దిమొత్తంలో అప్పులున్నాయని తెలిపారు. డ్రగ్స్‌ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 

21:36 - August 20, 2017

హైదరాబాద్ : ఆర్థిక వ్యవహారానికి సంబంధించే నందు అనే వ్యక్తి తనపై కాల్పులు జరిపినట్లు విక్రమ్‌గౌడ్‌ స్పష్టం చేశారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్ నిర్వహించింది. తానే కావాలని కాల్పులు జరిపించుకున్నానన్న వార్తలు అవాస్తవమన్నారు. కాల్పుల ఘటనను పోలీసులు వక్రీకరించారని చెప్పారు. నాకు కోట్లలో అప్పులున్నాయన్న మాట అబద్ధమని..సన్నిహితుల దగ్గరే కొద్దిమొత్తంలో అప్పులున్నాయని తెలిపారు. డ్రగ్స్‌ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 

 

21:31 - August 20, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ అభ్యర్థి శిల్ప మోహన్‌రెడ్డి కుమారుడు అంటున్నారు. చంద్రబాబు పర్యటనతో టీడీపీ పెద్దగా ఒరిగేందేం లేదంటున్నారు. బైఎలక్షన్స్‌లో వైసీపీ విజయ తథ్యం అంటున్న శిల్పా కిషోర్‌రెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:23 - August 20, 2017

హైదరాబాద్‌ : నగరంలో ఏపీ టీడీపీ నేతలు ఈసీ భన్వర్‌లాల్‌ను కలిశారు. నంద్యాలలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న వైసీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. సీఎంపై అనుచితవ్యాఖ్యలు  చేస్తున్న జగన్‌ను అరెస్ట్ చేయాలని కోరామన్నారు. 

 

21:16 - August 20, 2017
21:10 - August 20, 2017

మాస్టకీ ఆధ్యర్యంలో 'ఆధునిక సమాజంలో అంబేద్కరిజం' అనే నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. అంబేద్కర్ కు కమ్యూనల్ అవార్డు ఇవ్వడాన్ని గాంధీజీ వ్యతిరేకించారని పేర్కొన్నారు. ఎస్సీలకు ప్రత్యేక నియోజకవర్గాలను గాంధీజీ వ్యతిరేకించారని తెలిపారు. ఆర్థిక అసమానతలకు పూణె ఒడంబడిక కారణమన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:00 - August 20, 2017

కడప : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో చట్టాన్ని కాపాడాల్సిన ఓ హోంగార్డు మద్యం మత్తులో కట్టుకున్న భార్యను హత్య చేసిన ఘటన కడపలో చోటుచేసుకుంది. కడప జిల్లా సుండుపల్లి కి చెందిన  ఆదిలక్ష్మి, బకారాపేటకు చెందిన రాజశేఖర్ తో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు సంతానం కాగా ఒకరు మగ పిల్లాడు ముగ్గురు ఆడ పిల్లలు. వివాహం అయిన కొన్ని సంవత్సరాలకు మద్యానికి బానిస అయి... తరచుగా భార్యతో గొడవ పడుతూ ఆమెను హింసించే వాడు. శనివారం రాత్రి కూడా మద్యం మత్తులో భార్యతో గొడవ పడుతూ ఆమెను రోకలి బండతో తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రాజశేఖర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

20:48 - August 20, 2017

కర్నూలు : నంద్యాల్లో చంద్రబాబు పర్యట విజయవంతం అయిందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అంటున్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథాకాలే తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయని మంత్రి అంటున్నారు. నంద్యాల సమగ్రాభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కృషిచేస్తోందంటున్న మంత్రి కాల్వశ్రీనివాసులుతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:42 - August 20, 2017

కృష్ణా : ఆక్వా చెరువులపై రైతుల్లో వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక నుంచి వ్యవసాయ భూముల్లో ఆక్వా సాగుకు అనుమంతించేది లేదని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఆక్వా సాగుకు సహకరించాలని  అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో మొదలైన ఆక్వాజోన్ల గుర్తింపుపై టెన్‌టీవీ ఫోకస్‌.. 
ఏపిలో ఆక్వాసాగుకు కట్టుదిట్టం 
ఏపిలో ఆక్వాసాగును  కట్టుదిట్టం చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. వ్యవసాయ భూముల్లో ఆక్వాసాగుకు అనుమతుల్లేకుండా చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఒక ఏరియాలో  60 నుండి 70 శాతం భూముల్లో  ఆక్వాసాగు ఉంటే వాటిని జోన్‌గా గుర్తిస్తారు. ఆక్వాజోన్ల గుర్తింపు ఈ నెలాఖరుకు పూర్తికానుంది.  సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి రైతులు, గ్రామస్తుల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఆక్వాజోన్ల పరిధిలో ఉండే వారికి సబ్సీడిలు, రుణ, బీమా సదుపాయాన్ని కల్పించనున్నారు. నీటి ముంపు భూములు, లోతట్టు ప్రాంతాలతోపాటు కాలువలు, డ్రెయిన్ల పక్కన ఉన్న భూములను గుర్తించి వాటిలోనే ఆక్వాసాగుకు అనుమతిస్తారు. సారవంతమైన వ్యవసాయభూములను ఆక్వాసాగుకు ఉపయోగించకుండా,  ఇందుకు సంబంధించిన కమిటీలో నిష్టాతులు, సైంటిస్టులు చేసే సూచనలకు అనుగుణంగా ఆక్వాసాగు చేయాలని అధికారులు నిర్ణయించారు. 
జిల్లాలో 111 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం 
జిల్లాలో 111 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. దీనికి తోడు 3వేల హెక్టార్లలో కృష్ణా బ్యారేజ్‌ జలాశయం, 228 మధ్యతరహా చెరువులు, 44.88 చదరపు కిలోమీటర్ల మేర కొల్లేరు సరస్సు, 2, 660 కిలోమీటర్ల మేర నదులు, కాలువలు, 2,825 పంచాయితీ చెరువులు ఉన్నాయి. కైకలూరు, కలిదండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల పరిధిలో 49,645 హెక్టార్ల భూమి ఉంది. ఇందులో వ్యవసాయం కింద 19,695 హెక్టార్లు, ఆక్వా సాగులో 30,063 హెక్టార్లు ఉంది. ఈ మొత్తం భూమిలో 60.55 శాతం ఆక్వాసాగు కింద ఉంది. అటు నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల పరిధిలో 51044 హెక్టార్ల భూమి ఉండగా .. దీనిలో   25,232 హెక్టార్లలో పంటలు,  5,393 హెక్టార్లలో ఆక్వాసాగవుతోంది.  మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన మండలాల పరిధిలో 1,26,175 హెక్టార్ల భూమిలో 55,504 హెక్టార్లు వ్యవసాయం,15,597  హెక్టార్లు ఆక్వా సాగువుతోంది.  ఇక గుడివాడ, నందివాడ, పెదపారుపూడి, బాపులపాడు మండలాల పరిధిలో ఉన్న 31,815 హెక్టార్ల భూమిలో 13,783 హెక్టార్లలో  వ్యవసాయం, అంతే విస్తీర్ణంలో ఆక్వా సాగు ఉంది. ఈ గణాంకాల మేరకు నెలాఖరులోగా ఆక్వా జోన్ల గుర్తింపును జారీ చేయనున్నారు. 
ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు 
మొత్తానికి వ్యవసాయ భూముల్లో ఆక్వా సాగుకు రైతులు, గ్రామస్తుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక నుంచి వ్యవసాయానికి పనికి రాని భూముల్లోనే ఆక్వా సాగుకు అనుమతి ఆస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. అమల్లో ఎంత మేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి అంటున్నారు ఆంధ్రప్రదేవ్‌ రైతాంగం. 

దుంబుల్లా వన్డే మ్యాచ్ లో భారత్ ఘన విజయం

ఢిల్లీ : దుంబుల్లా వన్డే మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించారు. 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. శ్రీలంక, భారత్ మధ్య వన్డే క్రికెట్ మ్యాచ్ జరిగింది. 

 

20:32 - August 20, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ జోరుగా చేస్తోంది. మంత్రులు కూడా రంగంలో దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప 3,4 వార్డుల్లో పర్యటించి ఓటర్లను అభ్యర్ధించారు. టీడీపీ గెలుపుతోనే కాకినాడ కార్పొరేషన్ అభివృద్ధి సాధ్యమంటున్నారు చినరాజప్ప. దీనిపై పూర్తి సమాచారం వీడియోలో చూద్దాం...

 

20:19 - August 20, 2017

కర్నూలు : చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచడంలో విఫలమైయ్యారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అభివృద్ధి పేరిట మోసపూరిత వ్యాఖ్యలు చేశారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీకే మొగ్గుచూపుతారంటున్న ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

20:13 - August 20, 2017

కర్నూలు : వైసీపీ అధినేత జగన్‌.. తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. నంద్యాలలో రోడ్‌ షో నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆయన మంత్రివర్గం నంద్యాల రోడ్లపై కనిపించారా అని జగన్‌ ప్రశ్నించారు. మూడున్నర ఏళ్లలో ఒక్క ఇళ్లైనా కట్టించారా అని నిలదీశారు. ఆయన సీఎం కాకముందు  9 రకాల రేషన్‌ సరుకులు ఇచ్చారని.. ఇప్పుడు బియ్యం ఒక్కటే ఇస్తున్నారని చెప్పారు. ఏ ఒక్క ఎన్నికలహామీని నెరవేర్చలేదని..ఆరోగ్యశ్రీ పథకం అంపశయ్యపై ఉందని  ఆరోపించారు. 

 

శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ

దంబుల్లా వన్డే : శ్రీలంకతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేశాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. 

ఎవరి పట్ల పక్షపాతంగా వ్యవహరించడం లేదు : భన్వర్ లాల్

హైదరాబాద్ : ఎవరి పట్ల పక్షపాతంగా వ్యవహరించడం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ అన్నారు. సర్వే చేయడాన్ని నిషేధించిన మాట వాస్తవమేనని చెప్పారు. సర్వేల పేరుతో ఎవరికి ఓటు వేస్తారని అడగటం తప్పు అని పేర్కొన్నారు. స్వేచ్చ, పారదర్శక ఎన్నికకు ఇది విఘాతం కలిగించడమే అని చెప్పారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుతో డీఎస్పీని బదిలీ చేయలేదన్నారు. తమ విచారణలో డీఎస్సీ తప్పు చేశాడని తేలిందని పేర్కొన్నారు. 

 

3 రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు : ఎంపీ కొనకళ్ల

హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ను ఏపీ టీడీపీ నేతలు కలిశారు. 3 రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. రేపటిలోగా స్పందించాలని కోరామని చెప్పారు. 

 

కేసీఆర్ కు వ్యవసాయ లీడర్ అవార్డు మిలీనియం జోక్ : దాసోజు

హైదరాబాద్ : కేసీఆర్ కు వ్యవసాయ లీడర్ అవార్డు రావడం మిలీనియం జోక్ అని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. సీఎం గవర్నర్ శుభాక్షాంక్షలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. అవార్డును ఓ ప్రైవేట్ కంపెనీ ఇస్తోందన్నారు. సీడ్ కంపెనీల బ్రోకర్ ఈ అవార్డు ఇస్తున్నారని పేర్కొన్నారు. 

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పశ్చిమగోదావరి : తణుకులోని చిత్తూరు ఇంద్రయ్య డిగ్రీ కళాశాలలో దండి మార్చ్ విగ్రహాల తరలింపునకు నిరననగా వైసీపీ రాస్తారోకో నిర్వహించారు. కిరోసిన్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.  

 

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పశ్చిమగోదావరి : తణుకులోని చిత్తూరు ఇంద్రయ్య డిగ్రీ కళాశాలలో దండి మార్చ్ విగ్రహాల తరలింపునకు నిరననగా వైసీపీ రాస్తారోకో నిర్వహించారు. కిరోసిన్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.  

 

19:26 - August 20, 2017
19:21 - August 20, 2017

హైదరాబాద్ : వర్షాకాలం కావడంతో గ్రేటర్‌లో రోడ్ల డ్యామేజీని కంట్రోల్‌ చేయడంపై జీహెచ్ ఎంసీ దృష్టి పెట్టింది. ఇప్పటికే రోడ్ల తవ్వకాలపై నిషేధం విధించిన బల్దియా..రోడ్లపై నీరు వదులుతున్న వారిపై భారీగా చలాన్లు వేస్తున్నారు. వర్షం నీరు మెట్రో పిల్లర్లపై నుంచి రోడ్డుపై పడటంపై జీహెచ్ ఎంసీ ఫోకస్‌ చేసింది.

గ్రేటర్‌లో రోడ్లను కాపాడుకునేందుకు జీహెచ్ ఎంసీ సిద్ధమైంది. వర్షాకాలం కావడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు నీటికుంటను తలపిస్తున్నాయి. రెండు రోజులు ఏకధాటిగా వర్షం కురిస్తే చాలు రోడ్లన్నీ గుంతల్లా మారుతున్నాయి. వర్షం కురిసినప్పుడు రోడ్లపై నీరు పారుతుంటే అక్కడి రోడ్డు దెబ్బతింటుంది. ఇక రోడ్డు మధ్యలో నిర్మితమవుతోన్న మెట్రో వయోడక్టు నుంచి భారీగా నీరు రోడ్లపై పడుతోంది. కొంత ఎత్తునుండి ఈ నీరు రోడ్లపై పడటంతో రోడ్లు త్వరగా పాడవుతున్నాయి. వయోడక్టుకు ఉన్న రంద్రాల గుండా వర్షం నీరు రోడ్డుపై పడటంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మెట్రో పిల్లర్‌పై నుంచి పడే వర్షం నీటితో.. రోడ్లు డ్యామేజి అవుతున్నాయి. అయితే రోడ్ల డ్యామేజీ కంట్రోలింగ్‌పై దృష్టి పెట్టిన జీహెచ్ ఎంసీ వర్షం నీటిని రోడ్లపైకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ మెట్రో రైల్‌ అధికారులకు లేఖ రాసింది. వయోడక్టుపై నుంచి కాని, పైపుల ద్వారా కాని రోడ్లపై వర్షం నీరు రాకుండా చూడాలని బల్దియా ఆదేశించింది. 

గ్రేటర్‌లో అన్ని విభాగాల మధ్య సమన్వయంగా సమావేశాలు జరుగుతున్నప్పటికీ, ఆయా విభాగాలు కోఆర్డినేషన్‌తో పని చేయడంలేదనే ఆరోపణలున్నాయి. దాంతో ఒకరు రోడ్డు నిర్మాణ పనులు చేపడితే, మరొకరు రోడ్లను తవ్వే పనిలో ఉన్నారు. ఇలా అధికారుల మధ్య సఖ్యత లేక... రోడ్డు డ్యామేజికి కారణమవుతున్నా మెట్రో పద్దతులను ఆపే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడిప్పుడే స్పందించిన అధికారులు రోడ్డు డ్యామేజిని కంట్రోల్‌ చేసే పనిలో ఉన్నారు. 

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. 

18:41 - August 20, 2017
18:40 - August 20, 2017

మేడ్చల్  : రెండు నెలల క్రితం అదృశ్యమైన సాయి సృజన్‌ కేసు మిస్టరీ వీడింది. మేడ్చల్‌ జిల్లా మీర్పేట్‌ హౌసింగ్‌ బోర్డ్‌లో ఇంట్లో నుండి క్రికెట్‌ పై మోజుతో ఇంట్లో చెప్పకుండా తప్పించుకున్నాడు. అనంతరం ఎక్కడికి వెళ్లాలో తెలియక క్రికెట్‌ కోసం ముంబై వెళ్లిఉంటాడని పోలీసులు అనుమానించారు. దీంతో ముంబై పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడి పోలీసులు గుర్తించి హైదరాబాద్ పోలీసులకు సమాచారం తెలిపారు. దీంతో నిన్న రాత్రి ముంబైలో పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. 2నెలల తరువాత కుమారుడు క్షేమంగా ఇంటికి తీసుకురావడంతో... కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

18:37 - August 20, 2017
18:35 - August 20, 2017

మేడ్చల్‌ : జిల్లాలో ఓ ఇంట్లో భారీ చోరి జరిగింది. నేరెడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సైనిక్‌ విహార్‌లో ఓ ఇంటికి తాళం పగుల కొట్టి బంగారు ఆభరణాలు, వెండి నగదు దోచుకెళ్లారు దుండగులు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ తో పరిశీలిస్తున్నారు.

 

18:33 - August 20, 2017

హైదరాబాద్ : చిలకలగూడలో నిర్మించిన మెట్రో స్టీల్ బ్రిడ్జిని సేఫ్‌గా బిగించారు ఎల్ అండ్ టీ ఇంజినీర్లు. ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌ వద్ద ఈ బ్రిడ్జ్‌ను నిర్మాణం చేసిన ఇంజినీర్లు.. దాని పటుత్వాన్ని అక్కడే పరిశీలించి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఒలిఫెంటా బ్రిడ్జికి 200 మీటర్ల దూరంలో స్టీల్ బ్రిడ్జ్‌ను మళ్లీ బిగించి.. దక్షిణ మధ్య రైల్వే  పట్టాలపై నుంచి 60 అడుగుల ఎత్తులో ఫిక్స్ చేశారు. 11 వందల టన్నుల భారీ స్టీల్ బ్రిడ్జ్‌ను పట్టాలెక్కించేందుకు రెండునెలలు పట్టింది. 

 

18:26 - August 20, 2017

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌ సర్కార్‌ ప్రజలను మభ్యపెడుతోందని తెలంగాణ రైతు ఐక్యాకార్యాచరణ సంఘం విమర్శించింది. ప్రాజెక్టు నిర్మాణంపై చేపడుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో అరకొర సమాచారమే అందిస్తున్నారని  సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల తలెత్తే పర్యావరణ సమస్యలను పూర్తిస్థాయిలో ప్రజలకు వివరించాలని కోరారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రాజెక్టు నిర్మాణ ప్రభావాలను వివరించే వరకు ప్రజాభిప్రాయ సేకరణ ఆపాలని డిమాండ్‌ చేశారు. 

18:17 - August 20, 2017

కర్నూలు : సీఎం చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైసీపీ అధినేత జగన్ నంద్యాల ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరో ఒక వ్యక్తిని ఎమ్మెల్యేను చేయడానికి మీరు ఓటు వేయడం లేదని..మూడున్నరసంవ్సతరాల చంద్రబాబు పాలనపై ఓటు వేయబోతున్నారని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మోసానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలోని అవినీతి, అన్యాయం, దుర్మార్గానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు. చెడి పోయిన రాజకీయాల్లో విశ్వసనీయత తీసుకొచ్చేందుకు ఓటు వేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పారు.. మూడున్నర సంవత్సరాలు కాలంలో ఏం చేశారో మీరే చెప్పండని అన్నారు. మూడున్నర సం.రాల పరిపాలన కాలంలో చంద్రబాబు, మంత్రులు నంద్యాల రోడ్ల మీద కనిపించారా అని ప్రశ్నించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఖైదీలతో ఇంట్లో పని చేయించుకుంటున్న సూపరింటెండెంట్

కృష్ణా : గుడివాడ సబ్ జైల్ సూపరింటెండెంట్ ఆగడాలు మితిమీరాయి. ఆయనకు చట్టమంటే లెక్కలేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అనుమతి లేకుండా ఖైదీలను బయటికి తరలించారు. రిమాండ్ ఖైదీలతో సూపరింటెండెంట్ దుర్గారావు తన ఇంట్లో సొంతపనులు చేయించుకుంటున్నారు. ఖైదీల చేత ఇంట్లో పనులు చేయించుకుంటూ మీడియాకు చిక్కారు. 

 

17:58 - August 20, 2017

కృష్ణా : గుడివాడ సబ్ జైల్ సూపరింటెండెంట్ ఆగడాలు మితిమీరాయి. ఆయనకు చట్టమంటే లెక్కలేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అనుమతి లేకుండా ఖైదీలను బయటికి తరలించారు. రిమాండ్ ఖైదీలతో సూపరింటెండెంట్ దుర్గారావు తన ఇంట్లో సొంతపనులు చేయించుకుంటున్నారు. ఖైదీల చేత ఇంట్లో పనులు చేయించుకుంటూ మీడియాకు చిక్కారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:48 - August 20, 2017

కామారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గాంధారి మండలంలోని గుజ్జుల్‌ గ్రామానికి చెందిన యువకుడు.. వాగులో గల్లంతయ్యాడు. గుజ్జుల్ గ్రామానికి చెందిన దేవిసింగ్‌.. గాంధారిలోని తన ఎరువుల దుకాణాన్ని మూసేశాడు. తరవాత బైక్‌పై గుజ్జుల్‌కు వెళ్తుండగా.. దారిలో వాగు దాటుతూ వరద ఉధృతికి బైక్‌తో సహా గల్లంతయ్యాడు. వాగులో బైక్‌ పైకి తేలగా.. దేవిసింగ్‌ ఆచూకీ తెలియలేదు. దేవిసింగ్‌ కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. 

17:42 - August 20, 2017

కృష్ణా : జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ఓ నిండు ప్రాణం తీసింది. సన్‌డే రోజు సరదాగా ఈతకొట్టడానికి చెరువులోకి దిగిన విద్యార్థి మృత్యువాత పడ్డాడు. కృష్ణాజిల్లా అవనిగడ్డలోని పాలిటెక్నిక్‌ కాలేజీ విద్యార్థులు నలుగురు పులిగడ్డ బ్రిడ్జిదగ్గర రేవులోఈతకొట్టడానికి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో హరిప్రసాద్‌ అనే విద్యార్థి నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. స్నేహితుణ్ని కాపాడేందుకు  మిగతా విద్యార్థులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌సిబ్బంది మునిగిపోయిన విద్యార్థిని మృతదేహాన్ని బయటకు తీశారు.  ప్రకాశంజిల్లా మార్కాపురంలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

 

17:24 - August 20, 2017

ఢిల్లీ : తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలను కేసీఆర్‌ కాలరాస్తున్నారని ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ చాడ వెంకట రెడ్డి ఆరోపించారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో జరుగుతున్న దుర్మార్గాలను క్షేత్ర స్థాయిలో తెలిపేందుకు ప్రజా సంఘాలతో కలిసి ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 11 గంటలకు జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:09 - August 20, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం సీపీఎం దూసుకుపోతోంది. రెండవ డివిజన్‌ను పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్ధి తిరుమలశెట్టి నాగేశ్వరరావు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. వార్డుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఆయన చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం...

 

17:05 - August 20, 2017

కర్నూలు : బలిజలకు, కాపులకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చింది ఒక్క తెలుగుదేశం పార్టీ అని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో బలిజ సంఘీయుల ఆత్మీయుల సభలో పాల్గొన్న సీఎం.. ప్రతిపక్ష వైసీపీపై నిప్పులు చెరిగారు. మనలో ఐక్యతను దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం చేయడం విద్యార్థి దశలో నేర్చుకున్నట్లు తెలిపారు.  సంక్షేమంలో తమతో ఎవరూ పోటీ పడలేరన్నారు. 

 

నాల్గో వికెట్ కోల్పోయిన శ్రీలంక

దంబుల్లా వన్డే : శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న వన్డే క్రికెట్ మ్యాచ్ లో శ్రీలకం నాల్గో వికెట్ కోల్పోయింది. 166 పరుగుల వద్ద తరంగా (13) ఔట్ అయ్యాడు.

 

ముగిసిన 'ఇఫీ' జాతీయ మహాసభలు

హైదరాబాద్ : నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఇఫీ) జాతీయ  మహాసభలు ముగిశాయి. నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా హజీద్, పీఎన్ చౌదరిలు ఎన్నికయ్యారు. 90 మంది నూతన కమిటీని ఎన్నుకున్నారు. విద్యుత్ రంగంలోని సమస్యలను పరిష్కరించాలని 2018 ఆగస్టు 1న దేశ వ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు.

 

16:43 - August 20, 2017

ఆదిలాబాద్ : ఉమ్మడి జిల్లాలో.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు నిండుకుండలా మారాయి. బోథ్‌ మండలంలోని ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి.. కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్ట్‌ పూర్తి సామర్థ్యం ఏడు వందల అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై మూడు అడుగులలో ఉంది. వర్షాలకు వరద నీరు ఇన్‌ ఫ్లో 84 వేల క్యూసెక్స్‌ జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ఈ ఇన్‌ ఫ్లో ఇలాగే కొనసాగితే డ్యామ్‌ పూర్తి స్థాయి నీటిమట్టానికి 6 గంటల్లో చేరుతుంది. ఆరు వందల తొంబై ఎనిమిది లెవల్స్‌ రాగానే గేట్లు ఆపరేట్‌ చేస్తామని కడెం ఇరిగేషన్‌ జెఈ శ్రీనాథ్‌ అన్నారు. కడెం ఆయకట్టు రైతులు పంటలు వేసుకోవచ్చని ఆయన తెలిపారు. కడెం ప్రాజెక్ట్‌  ఎడమ కాలువ ద్వారా 540 క్యూసెక్స్‌ నీటిని సాగు కొరకు వదులుతున్నట్టు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. 

 

మహబూబ్ నగర్ లో టీమాస్ ఫోరం ఆవిర్బావ సభ

మహబూబ్ నగర్ : జిల్లా కేంద్రంలో టీమాస్ ఫోరం ఆవిర్భావ సభ జరిగింది. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. 

మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక

దంబుల్లా వన్డే : శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న వన్డే క్రికెట్ మ్యాచ్ లో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. 150 పరుగుల వద్ద మెండిస్ (36) ఔట్ అయ్యారు. 

 

16:35 - August 20, 2017
16:33 - August 20, 2017

కర్నూలు : నంద్యాలలో జోరుగా ఉప ఎన్నిక ప్రచారం జరుగుతోంది. ప్రచార కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. జగన్ పై విమర్శలు గుప్పించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:27 - August 20, 2017

కామారెడ్డి : జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలో.. 2 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2 నెలలుగా వర్షాలు లేకపోవడంతో.. చాలా చోట్ల వరి నాట్లు ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. అక్కడక్కడా బోరు బావులలో కూడా నీరు తగ్గింది. రైతులు వరుణ దేవుడి కోసం పూజలు చేశారు. శ్రావణ మాసం కావడంతో వర్షాలు కురవాలని ఎన్నో చోట్ల ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఇప్పుడు వర్షాలు కురవడంతో రైతన్నలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 

 

16:22 - August 20, 2017

కృష్ణా : విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో విషాదం నెలకొంది. విష జ్వరాల బారినపడి యశ్వంత్‌ అనే మూడేళ్ల బాలుడు చనిపోవడం స్థానికుల హృదయాలను కలచివేస్తోంది. ఐదు రోజులుగా యశ్వంత్‌ జ్వరంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు ప్రైవేట్‌ ఆస్పత్రిలో చూపించారు. అయితే రాత్రి ఒక్కసారిగా జ్వరం పెరగడంతో బాలుడు చనిపోయాడు.  సీపీఎం నేతలు తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం బాలుడి మృతదేహంతో ఆందోళనకు దిగారు. దోమలు విజృంభిస్తున్నాయని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని సీపీఎం నేత సీహెచ్‌ బాబూరావు ఆరోపించారు. చిన్నారి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించి... అతడి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూడండి. 

 

తెలంగాణలో కుటుంబ పాలన : తమ్మినేని

నాగర్ కర్నూల్ : తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.  జిల్లా కేంద్రంలో టీమాస్ ఫోరం ఆవిర్బావ సభ జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీమాస్ ఫోరం రాజకీయ శక్తిగా ఎదుగుతోందన్నారు. 

 

నాగర్ కర్నూల్ లో టీమాస్ ఫోరం ఆవిర్బావ సభ

నాగర్ కర్నూల్ : జిల్లా కేంద్రంలో టీమాస్ ఫోరం ఆవిర్బావ సభ జరిగింది. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. 

16:04 - August 20, 2017

హైదరాబాద్ : చావే సమస్యకు పరిష్కారమైతే... నేను ఎన్నిసార్లు చావాలో?..! అని ఓ సినీ రచయిత... కథనాయికతో అడిగించిన ఈ ప్రశ్న... ఆత్మహత్యలో ఉన్న పిరికితనాన్ని వెక్కిరిస్తోంది. బతుకు పోరాటాన్ని... ఒక్క మాటలో... ఆవిష్కరిస్తోంది. ఎన్నో సమస్యలు... మరెన్నో సవాళ్లు.. కలగలసినదే జీవితం..! ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక... యువత అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు...! చిన్నచిన్న కారణాలకే... ప్రాణాలు తీసుకుంటున్నారు.! దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలపై... స్పెషల్‌ ఫోకస్‌..
ఆత్మహత్యలు.. మూడో స్థానంలో భారతదేశం
బలవన్మరణం... అనేది వ్యక్తి సమస్యగా కాక... వ్యవస్థ సమస్యగా పరిణమించింది. ఆత్మహత్యల సంఖ్య పెరగడంతో... సమాజం ఎటుపోతుందోననే కలవరం పెరుగుతుంది. ఆత్మహత్యల పరంపరలో... మనదేశం  ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది..  15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులే.. బలవంతంగా ఊపిరి తీసుకుంటున్నారనే కఠిన వాస్తవాన్ని... ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. యువకుల ఆత్మహత్యల్లో అమెరికా..ఆస్ట్రేలియా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉందని పేర్కొంది. మన దేశంలో ప్రతి గంటకు ... ఒక విద్యార్థి ప్రాణాలు తీసుకుంటున్నట్టు జాతీయ నేరగణాంక సంస్థ లెక్కలు చెబుతున్నాయి. 
పదేళ్లలో రెట్టింపైన ఆత్మహత్యలు
భారతదేశంలో... 2015 ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం 1998-1999 మధ్య 800 మంది టీనేజర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదే 2006-2007 నాటికి ఆ సంఖ్య 5 వేల 8 వందల 57కి పెరిగింది.  పదేళ్ల కాలంలో టీనేజర్ల ఆత్మహత్యల శాతం రెట్టింపైందని నేషనల్‌ క్రైం రికార్డ్జ్‌ బ్యూరో గణాంకాలు చెబతున్నాయి. 
జీవితంపై...సమాజంపై అవగాహన లోపం
బలవంతంగా తనువు చాలిస్తున్నవారిలో 80శాతం మంది డిప్రెషన్‌కు గురైనవారే ఉంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇతరులతో పోలిక... మితిమీరిన పోటీ తత్త్వం...భావితరాన్ని కుంగదీస్తున్నాయని అంటున్నారు. ఉద్వేగాలను... బ్యాలన్స్‌ చేసుకోలేకపోవడం... జీవితం మీద.. సమాజంపైనా సరైన అవగాహన లేకపోవడం కూడా కారణాలుగా చెబుతున్నారు. 
పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన బాధ్యత పెద్దదే.. 
ఈ తరుణంలో పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన బాధ్యత పెద్దలకు... ఎన్ని సమస్యలు వచ్చినా ... రేపటిపై ఆశను పెంచుకోవాల్సిన స్పృహ యువతకు ఉంది. సమస్యలన్నిటికీ...చావే పరిష్కారమైతే... సమస్యలు ఉండవు...మనుషులూ ఉండరు.. అనే స్టాలిన్‌ మాటను గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపైనా ఉంది. 

 

స్కార్పియో బోల్తా..అపెక్స్ కమిటీ సభ్యుడు మృతి

కర్నూలు : ఆదోని మండలం పెద్దతుమ్మలం వద్ద స్కార్పియో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏపీ రాష్ట్ర అపెక్స్ కమిటీ సభ్యులు కుమార్ గౌడ్ మృతి చెందారు. కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని అస్పత్రికి తరలించారు. 

 

తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక

దంబుల్లా వన్డే : శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న వన్డే క్రికెట్ మ్యాచ్ లో శ్రీలకం తొలి వికెట్ కోల్పోయింది. 71 పరుగుల వద్ద గుణతిలక (35) ఔట్ అయ్యాడు. 

అదృశ్యమైన విద్యార్థి సాయి ఆచూకీ లభ్యం

మేడ్చల్ : కాప్రా మండలం మీర్ పేట్ హౌసింగ్ బోర్డ్ లో 2నెలల క్రితం అదృశ్యమైన విద్యార్థి సాయి సృజన్ ఆచూకీ లభ్యం అయింది. సాయి సృజన్ ముంబైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలో నిన్న రాత్రి సాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. క్రికెటర్ కావాలనే కోరికతో సాయి మంబై వెళ్లాడు. 

 

15:24 - August 20, 2017

హైదరాబాద్ : తిట్టారనో..? కొట్టారనో..? సెల్‌ కోసమో..? రిమోట్‌ కోసమో..? ప్రేమించలేదనో..? పలకరించలేదనో..? ప్రాణాలు తీసుకోవడం పరిపాటిగా మారింది. చిన్న పిల్లల నుంచి ..సెలబ్రిటీల వరకూ.. అదే ఆత్మహత్య బాట. నాణెంలోని రెండో వైపును చూడకుండానే...జీవితంలోని మాధుర్యాన్నీ అనుభవించకుండానే.. చేజేతులారా ఊపిరి తీసుకుంటున్నారు.. కన్నవాళ్లకు .. కడుపుకోతను మిగిలిస్తున్నారు.  
ఆత్మహత్యలే శరణ్యమనుకుంటున్న యువత
దేశంలో.... రోజూ ఎక్కడో ఒకచోట...ఎవరో ఒకరు... ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. టీచర్‌ కొట్టాడనే కారణంతో... మూడో తరగతి విద్యార్థి  ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన వనపర్తి జిల్లా....శేరిపల్లిలో జరిగింది. నిండా తొమ్మిదేళ్లు కూడా ఉండని ఆనంద్‌  ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ప్రాణాలు తీసుకోబోయాడు. అలాగే హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో.. అనారోగ్యంతో బాధపడుతున్న తన కొడక్కి... వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేదనే కారణంతో.. సత్తయ్య అనే ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. 
పలువురు ఆత్మహత్య
అదే విధంగా... అనంతపురంలో ఓ మెడికల్‌ కాలేజ్‌ విద్యార్థి యశ్వంత్‌  ఆత్మహత్యకు చేసుకున్నాడు. స్థానిక రహమత్‌ నగర్‌ రైల్వేట్రాక్‌పై బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెడిసిన్‌ చదవలేక తనువు చాలిస్తున్నానని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. అదేరోజు నిర్మల్‌ జిల్లా... బాసరలో ఇద్దరు చిన్నారులతో సహా గోదావరిలో దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలకు ...ఇవన్నీ నిదర్శనాలు. ఊళ్లు వేరు.. కారణాలు వేరు.. కానీ వాళ్లంతా...తమకు..తాముగా మృత్యు మార్గాన్నే ఎంచుకున్నారు. ఈ బలవన్మరణాలపై .. అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్షణికావేశానికి... జీవితాన్ని బలి చేయకుండా...బతుకుపోరాటానికి ధైర్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 

 

నంద్యాలలో సీఎం చంద్రబాబు ప్రచారం

కర్నూలు : నంద్యాలలో జోరుగా ఉప ఎన్నిక ప్రచారం జరుగుతోంది. ప్రచార కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. జగన్ పై విమర్శలు గుప్పించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

14:58 - August 20, 2017

హైదరాబాద్‌ : రాజీవ్‌ గాంధీ 74వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా జరిపారు. రాజీవ్‌ విగ్రహానికి పూల మాల వేసి టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నివాళులు అర్పించారు. రాజీవ్‌ తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన మహనీయుడు అని.. శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత రాజీవ్‌ కే దక్కుతుందని అన్నారు. అనంతరం మాజీ ఎం.పి వీహెచ్‌ హనుమంతరావు 16వ సద్భావనా రన్‌ నిర్వహించారు. 

 

14:56 - August 20, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. దీంతో టీడీపీ, వైసీపీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయమై మంత్రి ఆదినారాయణ రెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:53 - August 20, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ ఆందోళనకు దిగింది. నంద్యాల ఉప ఎన్నికను వాయిదా వేయాలని కాంగ్రెస్‌ నేతలు నినాదాలు చేశారు. అనంతరం ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు రిటర్నింగ్‌ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. విచ్చల విడిగా మద్యం, డబ్బును పంచుతున్నాయని  రిటర్నింగ్‌ అధికారికి దృష్టికి తీసుకెళ్లారు. ఉప ఎన్నికను వాయిదా వేయాలని కోరారు. 

 

అందుకే ప్రాజెక్టుల రీడిజైనింగ్ : కర్నె ప్రభాకర్

హైదరాబాద్ : కోటి ఎకరాలను నీరిచ్చే లక్ష్యంతో భాగంగానే ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేసినట్లు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. 2018 కల్లా ప్రాజెక్టులు 80 శాతం పూర్తి చేయాలనేది సంకల్పలం అన్నారు. కాంగ్రెస్ నీచ బుద్ధితో ప్రాజెక్టులను అడ్డుకుంటోందని విమర్శించారు. 

 

13:38 - August 20, 2017

వనపర్తి : జిల్లా మధనాపురం మండలంలో విషాదం జరిగింది. పాము కాటుతో ఇద్దరు అన్నాతమ్ముళ్లు మృతి చెందారు. నర్సింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ, ఆశన్నల దంపతులకు హరికృష్ణ, మహేష్‌లు ఇద్దరు సంతానం. తల్లిదండ్రులిద్దరూ పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లగా పిల్లలిద్దరూ నానమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నారు. పిల్లలిద్దరూ ఇంట్లో నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి సమయంలో పాము కరిచింది. హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా.. మహేష్‌ను మహబూబ్‌ నగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేష్‌ కూడా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గ్రామానికి చేరుకున్నారు. పిల్లలిద్దరూ మృతిచెందడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి.

13:37 - August 20, 2017

చెన్నై : మహానటుడు ఎన్టీఆర్‌ సినీ రంగానికి వచ్చాక తాను నివాసముండేందుకు.. చెన్నై హబిబుల్లా రోడ్‌లో ఓ ఇంటిని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో మూడు గ్రౌండ్ల విస్తీర్ణంలో 9 వేల చదరపు అడుగుల ఇంటిని నిర్మించుకున్నారు. ఈ నివాసం 128 మీటర్ల పొడవు, 63 మీటర్ల వెడల్పు ఉండేది. ఎంత మహానటుడిగా ఎదిగినా.. ఆయన ఇదే నివాసంలో ఉన్నారు. ఎన్టీఆర్‌ ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఆంధ్రరాష్ట్రం నుంచి తరలివచ్చే అభిమానులకు కొన్నేళ్లు ఈ ఇంటి బాల్కనీలో నుంచి అభివాదం చేశారు.

తిరుపతి నుంచి భక్తులు
అన్నగారిని చూసేందుకు రోజూ వేలాది మంది అభిమానులు ఈ ఇంటి ముందు బారులు తీరేవారు. ఆయనను చూసేందుకు తిరుపతి నుంచి భక్తులు నేరుగా ఇక్కడకు వచ్చేవారంటే ఆయనపై అభిమానం ఎంతలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీని పెట్టిన ఎన్టీఆర్‌.. సీఎం అయ్యాక తన నివాసాన్ని హైదరాబాద్‌కు మార్చారు. అయినా ఆయన బతికున్నంతకాలం ఈ ఇల్లు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులతో కళకళలాడేది. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఈ నివాసంపై ఉన్న ఇష్టంతో ఇక్కడకు వచ్చి వెళ్తుండేవారు.

అన్నగారి నివాసం అమ్మకానికి
ఎన్టీఆర్‌ చనిపోయాక ఆయన కుటుంబ సభ్యులు ఈ ఇంటికి దూరమయ్యారు. అయితే చంద్రబాబు, కొందరు అభిమానులు ఎన్టీఆర్‌ జ్ఞాపకార్థంగా ఇంటికి మరమ్మతులు చేయించి స్మారక మందిరంగా మార్చాలని కోరారు. పార్టీ కావాలి ఆయన వారసత్వం కావాలి కానీ ఆయన ఇల్లు మాకెందుకు అనుకున్నారేమో.. ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. ఏళుమలై పేరుతో ఓ ఫోన్‌ నంబర్‌ పెట్టి అన్నగారి నివాసం అమ్మకానికి ఉంచారు. ఈ ఇంటి ధరను 25 కోట్లుగా నిర్ణయించారు. ఏళుమలై మీడియేటర్‌గా పని చేస్తున్నారు. ఇదే ఇప్పుడు అన్నగారి అభిమానుల బాధకు కారణమైంది. అన్నగారు 40 ఏళ్లు నివసించిన ఈ ఇల్లు అంటే ఎంతో ఇష్టమని.. ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతుంటుందని అభిమానులు చెబుతున్నారు. వెన్నుపోటుతో పార్టీని దక్కించుకున్నవారికి.. వారికి మద్దతిచ్చిన వారసులకు అన్నగారి ఆత్మక్షోభ ఏం తెలుస్తుందని అభిమానులు వాపోతున్నారు. 

13:35 - August 20, 2017

కర్నూలు : నంద్యాల ప్రజలపై జగన్‌ ఎనలేని ప్రేమ చూపెడుతున్నట్టు నాటకమాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన ప్రేమ ప్రజలపై కాదని... ఓట్లపైనే జగన్‌ ప్రేమని విమర్శించారు. ఉప ఎన్నికలు అయిపోగానే జగన్‌ మళ్లీ మీకు కనిపించడంటూ ఎద్దేవా చేశారు. నంద్యాలలో జరిగిన ముస్లిం మత పెద్దల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... జగన్‌పైనున్న కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్‌... ఇప్పటి వరకు ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. జగన్‌ చెప్పేమాటలకు.. చేసే పనులకు సంబంధమే ఉండదని ధ్వజమెత్తారు. ముస్లింల అభవృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

13:12 - August 20, 2017

హైదరాబాద్ : నగరంలోని మసాజ్ సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. మాదాపూర్, గచ్చిబౌలిలోని తంత్ర, ఔరా, సప్త, రివేర, మొహు, బ్లీజ సెంటర్లలో పోలీసులు సోదాలు చేశారు. తనిఖీల్లో 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 14 మంది థాయ్ లాండ్ చెందిన వారు, మరో ఐదుగురు నార్త్ ఇండియాకు చెందిన వారు ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియోమ క్లిక్ చేయండి.

సినిమా తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్యాయత్నం

విజయవాడ : ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. సినిమా వెళ్లే విషయంలో భార్యభర్తల మధ్య వివాదం తలెత్తడంతో మనస్తాపం చెందిన భార్య లెనిన్ సెంటర్ దగ్గర ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. భర్య వెంటే వచ్చన భర్త ఈత రాకపోయినా భార్యను కాపాడేందుకు కాలువలోకి దూకాడు. వీరిద్దరు కాలువలో కొట్టుకుపోతుండడం చూసిన ఎపీఎస్పీ కానిస్టేబుల్ వారిని కాపాడారు. 

12:33 - August 20, 2017

విజయవాడ : ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. సినిమా వెళ్లే విషయంలో భార్యభర్తల మధ్య వివాదం తలెత్తడంతో మనస్తాపం చెందిన భార్య లెనిన్ సెంటర్ దగ్గర ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. భర్య వెంటే వచ్చన భర్త ఈత రాకపోయినా భార్యను కాపాడేందుకు కాలువలోకి దూకాడు. వీరిద్దరు కాలువలో కొట్టుకుపోతుండడం చూసిన ఎపీఎస్పీ కానిస్టేబుల్ వారిని కాపాడారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

నంద్యాల ఉపఎన్నిక వాయిదా వేయాలి : కాంగ్రెస్

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళనకు దిగారు. రఘువీర రెడ్డి టీడీపీ, వైసీపీ నింబంధనలు ఉల్లంఘిస్తున్నాయిని రిటర్నింగ్ అధికారిని కలసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

12:16 - August 20, 2017

కర్నూలు : నంద్యాలలో టీడీపీ విజయం ఖాయమని ఏపీ ఎస్సీకార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌ అన్నారు. టీడీపీకి అపూర్వ ఆదరణ లభిస్తోందన్నారు. ప్రజలంతా అభివృద్ధికే ఓటు వేస్తారని జూపూడీ ప్రభాకర్‌, మాజీమంత్రి మారెప్ప అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:14 - August 20, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళనకు దిగారు. రఘువీర రెడ్డి టీడీపీ, వైసీపీ నింబంధనలు ఉల్లంఘిస్తున్నాయిని రిటర్నింగ్ అధికారిని కలసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నంద్యాల ఉప ఎన్నిక వాయిదా వేయాలని ఆయన రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:07 - August 20, 2017

కర్నూలు : చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచడంలో విఫలమైయ్యారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అభివృద్ధి పేరిట మోసపూరిత వ్యాఖ్యలు చేశారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీకే మొగ్గుచూపుతారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:58 - August 20, 2017
11:57 - August 20, 2017
11:56 - August 20, 2017

కర్నూలు : విచ్చల విడిగా డబ్బులు పంపిణీ చేస్తూ పాలకపక్షం ఎన్నికలు నిర్వహించిన తీరు తానెప్పుడూ చూడలేదన్నారు వైసిపి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ముస్లింలకు టీడీపీ న్యాయం చేశాననడం అర్థరహితమైన వాదన అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:54 - August 20, 2017

కర్నూలు : నంద్యాలలో టీడీపీ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. అభివృద్ధి పనులు చేస్తున్న టీడీపీకి డబ్బులు పంచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. స్థానికులు మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్న విపక్ష నేతలు ఎందుకు అంతమంది బయటినుంచి వచ్చారని ప్రశ్నించారు. మంచి మెజార్టీతో గెలుస్తామని భూమా బ్రహ్మానందరెడ్డి అంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:50 - August 20, 2017

యాదాద్రి : ముషీరాబాద్ నుంచి తిరుపతికి.. సిగరెట్‌ లోడ్‌తో వెళ్తోన్న కంటైనర్‌ లారీలోని సిగరెట్లు చోరీకి గురయ్యాయి. పెద్ద అంబర్‌పేట్‌ వద్ద రెండు సుమోలలో 20 మంది దుండగులు వచ్చి.. లారీని ఆపేశారు. యాదాద్రి జిల్లా, చౌటుప్పల్ మండలం, మల్కాపూర్‌ శివారులోకి రాగానే.. డ్రైవర్‌ని కొట్టి గుట్టల్లోకి తీసుకెళ్లి వదిలేశారు. తమ వెంట తెచ్చుకున్న మరో కంటెయినర్‌లో.. సిగరెట్‌ లోడ్‌ డంప్‌ చేసుకొని దుండగులు పరారయ్యారు. 

దొంగల బీభత్సం

యాదాద్రి : జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ శివారులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సిగరెట్లతో వెళ్తున్న కంటైనర్ ను అడ్డుకుని డ్రైవర్ పై దాడి కంటైనర్ ఎత్తుకెళ్లారు. కంటైనర్ లో రూ.4కోట్ల విలువైన సిగరెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కంటైనర్ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుతుంది.

11:17 - August 20, 2017

నెల్లూరు : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసు సంచలనం రేపుతోంది. బెట్టింగ్ కేసులో విచారణ కొసాగుతున్న తరుణంలో క్రికెట్ బుకీలకు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సహకారం అందించినట్టు సమాచారం ఉంది. దీంతోమ పోలీసులు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు సెక్షన్ 160కింద నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న వారిలో అనికుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొనట్టు పోలీసులు తెలిపారు. ఇదిఇలా ఉంటే రేపు మరోర ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:15 - August 20, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో చర్ల మండలం చింతకుంప వాగు పొంగి పొర్లుతుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా సౌకర్యంలేక ఆటోలో 7నెలల గర్భిణి ప్రసవించింది. ఆమెను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

కొత్తగూడెం జిల్లాలో పొంగుతున్న వాగులు

భద్రాది కొత్తగూడెం : జిల్లా చర్ల మండలం చింతకుంప వాగు పొంగడంతో రాపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఓ మహిళ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా వాగు పొండంతో ఆటో నిలిచిపోయింది. దీంతో మహిళ ఆటోలోనే ప్రసవించింది. అనంతరం ఆమెను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

హైదరాబాద్ : రాజీవ్ గాంధీ 74 వ జయంతి వేడుకల సందర్బంగా సోమాజీగూడ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో సద్భావన్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, వీహెచ్, షబ్బీర్ అలీ, దానం పాల్గొన్నారు. 

10:11 - August 20, 2017

నెల్లూరు : హైదరాబాద్ చింతల్ చెందిన శాంతి అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త మహేష్ గుట్ట చప్పుడు కాకుండా మృతదేహాన్ని నెల్లూరుకు తరలించాడు. అక్కడ ఉడ్ కాంప్లెక్స్ లో మృతదేహాన్ని వదిలి పరారైయ్యాడు. మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. భర్త శాంతి హత్య చేశారని శాంతి బంధువుల ఆరోపిస్తున్నారు. మహేష్ పై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ధీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులకు 22 కంపార్టుమెంట్లలో వేచివున్నారు. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం పడుతుంది. నడక దారిని వచ్చే భక్తులకు 3గంటల సమయం పడుతుంది.

09:37 - August 20, 2017

హైదరాబాద్ : నగరంలోని చింతల్ చెందిన శాంతి అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త గుట్ట చప్పుడు కాకుండా మృతదేహాన్ని నెల్లూరుకు తరలించాడు. అక్కడ ఉడ్ కాంప్లెక్స్ లో మృతదేహాన్ని వదిలి పరారైయ్యాడు. భర్త శాంతి హత్య చేశారని శాంతి బంధువుల ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

వివాహిత అనుమానాస్పద మృతి

హైదరాబాద్ : నగరంలోని చింతల్ చెందిన శాంతి అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త గుట్ట చప్పుడు కాకుండా మృతదేహాన్ని నెల్లూరుకు తరలించాడు. అక్కడ ఉడ్ కాంప్లెక్స్ లో మృతదేహాన్ని వదిలి పరారైయ్యాడు. భర్త శాంతి హత్య చేశారని శాంతి బంధువుల ఆరోపిస్తున్నారు. 

09:32 - August 20, 2017

బీహర్ : ధారణంగా బైక్‌పై వెళ్లేప్పుడు అందరూ హెల్మెట్‌ పెట్టుకుంటాం. కానీ ఆఫీస్‌లోనూ హెల్మెట్‌ పెట్టుకుని పనిచేయడం మీరెప్పుడైనా చూశారా. కానీ బీహార్‌లోని ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫీస్‌లోకి వెళ్లిన తర్వాత కూడా హెల్మెట్‌ తీసే పరిస్థితి లేదు. అదేంటీ బీహార్‌ పోలీసులేమన్నా కొత్త రూల్‌ తీసుకొచ్చారా అంటే అదేం కాదు. బీహార్‌లోని చంపారన్‌ జిల్లాలో ఆరెరాజ్‌లోని ఒక ప్రభుత్వ భవనం శిథిలావస్థకు చేరుకుంది. రెండేళ్లుగా పైకప్పు పెచ్చులూడుతోంది. అయినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఆ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ప్రాణరక్షణ కోసం హెల్మెట్‌లు ధరించి మరీ విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు ఇంతలా ఇబ్బందిపడుతున్నా అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

09:31 - August 20, 2017

హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీభవన్‌లో నిర్వహించిన బాడీ బిల్డింగ్‌ పోటీలు ఆకట్టుకున్నాయి. రాజీవ్‌గాంధీ మెమోరియల్‌ కమిటీ ఆధ్వర్యంలో సీహెచ్‌ బాలరాజు ఈ పోటీలను నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న పలువురు యువకులు 55,65,80 కిలోల విభాగాల్లో పోటీపడ్డారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తమ ప్రదర్శన చేసిన బాడీ బిల్డర్లను అభినందించారు. అనంతరం వారికి బహుమతులు ప్రదానం చేశారు. 

09:30 - August 20, 2017

గుంటూరు : గుంటూరు జిల్లా తెనాలి మండలం నాజరుపేటలోని విజ్ఞాన్‌ లారా కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతోనన రవి శంకర్‌.. మరికొంత మంది విద్యార్థులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో రవిశంకర్‌కు గాయాలయ్యాయి. దీంతో అతడిని తెనాలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో అతడిని గుంటూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

09:29 - August 20, 2017

కర్నూలు : నంద్యాల ఓటర్లు సక్రమంగా ఓటు వేయడానికి అన్ని చర్యలు చేపట్టామని కర్నూలు కలెక్టర్ సత్యనారాయణ చెప్పారు. ఈవీఎంలు, వీవీ ప్యాడ్స్ ఎలా ఉపయోగించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో పార్టీలపై ఆరోపణలు రావడం సహజమేనని.. ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రత్యేక మైన టీమ్స్ వాటిపై ఎంక్వైరీ నిర్వహిస్తున్నట్లు సత్యనారాయణ చెప్పారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:28 - August 20, 2017

హైదరాబాద్ : ఎయిర్‌టెల్‌ హైదరాబాద్‌ ఫుల్‌ మారథాన్‌ -2017 ఘనంగా ప్రారంభమైంది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా దగ్గర సెవెన్త్‌ ఎడిషన్‌ మారథాన్‌ను హైదరాబాద్‌ సీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. నెక్లెస్‌రోడ్డు నుంచి గచ్చిబౌలి వరకు ఈ రన్‌ సాగనుంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:26 - August 20, 2017

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాలైన విజయవాడ, గుంటూరు నగరాల్లో కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. తినే తిండి దగ్గర్నుంచి.. వాడే ప్రతి వస్తువు వరకు కల్తీ చేసేస్తున్నారు. అక్రమంగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా కల్తీ రాజ్యం విస్తరిస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి కల్తీ మాఫియా సొమ్ము చేసుకుంటోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విజయవాడలో ఇప్పటికే అనేక కల్తీ దందాలు బయటపడ్డాయి. ఇప్పుడు భవానీపురంలో నకిలీ ఇంజన్‌ ఆయిల్‌, టూటీ ఆయిల్‌ తయారు చేస్తోన్న ముఠా పోలీసులకు చిక్కింది. భవానీపురం దర్గా ప్లాట్‌ ప్రాంతంలో కల్తీరాయుళ్లు ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ ఆయిల్స్ తయారు చేస్తున్నారు. ఆయిల్‌ తయారీ కోసం మెషీన్లు ఏర్పాటు చేసి గుట్టుచప్పుడు కాకుండా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో ఈ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్‌, పోలీస్‌ సిబ్బంది సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో 800 లీటర్ల నకిలీ ఇంజన్‌ ఆయిల్‌ , 5లక్షల రూపాయల విలువైన ప్యాకింగ్‌ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. విజయవాడలో రోజుకో నకిలీ దందా బయటపడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కల్తీగాళ్ల దందాను అరికట్టాలని కోరుతున్నారు.

వృద్ధురాలిపై వీఆర్ వో అత్యాచారయత్నం

కరీంనగర్ : జిల్లా వీణవంకలో ఓ వీఆర్ వో ప్రసాద్ వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన 4 రోజుల క్రింద జరిగింది. వృద్ధురాలు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో వీఆర్ వో పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. విషయం బయటకు రాకుండా చేసిన పెద్ద మనుషులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

08:48 - August 20, 2017

కృష్ణా : ఏపిలో ఆక్వాసాగును కట్టుదిట్టం చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. వ్యవసాయ భూముల్లో ఆక్వాసాగుకు అనుమతుల్లేకుండా చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఒక ఏరియాలో 60 నుండి 70 శాతం భూముల్లో ఆక్వాసాగు ఉంటే వాటిని జోన్‌గా గుర్తిస్తారు. ఆక్వాజోన్ల గుర్తింపు ఈ నెలాఖరుకు పూర్తికానుంది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి రైతులు, గ్రామస్తుల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఆక్వాజోన్ల పరిధిలో ఉండే వారికి సబ్సీడిలు, రుణ, బీమా సదుపాయాన్ని కల్పించనున్నారు. నీటి ముంపు భూములు, లోతట్టు ప్రాంతాలతోపాటు కాలువలు, డ్రెయిన్ల పక్కన ఉన్న భూములను గుర్తించి వాటిలోనే ఆక్వాసాగుకు అనుమతిస్తారు. సారవంతమైన వ్యవసాయభూములను ఆక్వాసాగుకు ఉపయోగించకుండా, ఇందుకు సంబంధించిన కమిటీలో నిష్టాతులు, సైంటిస్టులు చేసే సూచనలకు అనుగుణంగా ఆక్వాసాగు చేయాలని అధికారులు నిర్ణయించారు.

111 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం
జిల్లాలో 111 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. దీనికి తోడు 3వేల హెక్టార్లలో కృష్ణా బ్యారేజ్‌ జలాశయం, 228 మధ్యతరహా చెరువులు, 44.88 చదరపు కిలోమీటర్ల మేర కొల్లేరు సరస్సు, 2, 660 కిలోమీటర్ల మేర నదులు, కాలువలు, 2,825 పంచాయితీ చెరువులు ఉన్నాయి. కైకలూరు, కలిదండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల పరిధిలో 49,645 హెక్టార్ల భూమి ఉంది. ఇందులో వ్యవసాయం కింద 19,695 హెక్టార్లు, ఆక్వా సాగులో 30,063 హెక్టార్లు ఉంది. ఈ మొత్తం భూమిలో 60.55 శాతం ఆక్వాసాగు కింద ఉంది. అటు నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల పరిధిలో 51044 హెక్టార్ల భూమి ఉండగా .. దీనిలో 25,232 హెక్టార్లలో పంటలు, 5,393 హెక్టార్లలో ఆక్వాసాగవుతోంది. మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన మండలాల పరిధిలో 1,26,175 హెక్టార్ల భూమిలో 55,504 హెక్టార్లు వ్యవసాయం,15,597 హెక్టార్లు ఆక్వా సాగువుతోంది. ఇక గుడివాడ, నందివాడ, పెదపారుపూడి, బాపులపాడు మండలాల పరిధిలో ఉన్న 31,815 హెక్టార్ల భూమిలో 13,783 హెక్టార్లలో వ్యవసాయం, అంతే విస్తీర్ణంలో ఆక్వా సాగు ఉంది. ఈ గణాంకాల మేరకు నెలాఖరులోగా ఆక్వా జోన్ల గుర్తింపును జారీ చేయనున్నారు.

రైతులు, గ్రామస్తుల్లో వ్యతిరేకత
మొత్తానికి వ్యవసాయ భూముల్లో ఆక్వా సాగుకు రైతులు, గ్రామస్తుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక నుంచి వ్యవసాయానికి పనికి రాని భూముల్లోనే ఆక్వా సాగుకు అనుమతి ఆస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. అమల్లో ఎంత మేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి అంటున్నారు ఆంధ్రప్రదేవ్‌ రైతాంగం.

 

08:47 - August 20, 2017

హైదరాబాద్ : కేంద్రంలో మోదీప్రభుత్వ తీరుతో కేసీఆర్‌ సర్కార్‌ కు కళ్లుబైర్లు కమ్ముతున్నాయి. రాష్ట్రంలో చేపట్టిన వివిధ పథకాలకు కేంద్రం మొండిచెయ్యి చూపుతుండటం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మింగుడు పడని విషయంగా మారింది. కేంద్రం వైఖరిపై కారాలు మిరియాలు నూరుతున్న సీఎం, ఇతర మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. జీఎస్టీ విషయంలో మోదీ ప్రభుత్వానికి ఫుల్‌ సపోర్ట్‌ ఇచ్చి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇపుడు ఇరకాటంలో పడింది. కొత్తగా తీసుకొచ్చిన పన్నుల విధానం ఇపుడు టీసర్కార్‌కు గుదిబండగా మారింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి మొదట్లో ఒకే చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు విషయం బోధపడిన తర్వాత అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. జూలై ఒకటి నుంచి అమ‌లులోకి జీఎస్టీ వ‌చ్చాక‌... నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై ఎఫెక్ట్‌ పడనుందని తెలిశాక సీఎం కేసీఆర్‌ నాలిక్కరుచుకున్నారు. ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా 19వేలకోట్ల మేర నష్టం వస్తుందని గుర్తించారు. దీంతో కేంద్ర ప్రభత్వంపై పోరాటానికి సిద్ధం అవుతామని సీఎం చెబుతున్నారు. ముందుగా నిర్ణయించిన 18శాతం జీఎస్టీని 12 శాతానికి తగ్దించినప్పట్టికీ తాము భారీగా నష్ణపోతామని టీసర్కర్‌ ఆందోళన చెందుతోంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి కొత్తగా డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రం దిగిరాకుంటే న్యాయపోరాటానికి కూడా వెనుకాడేది లేదని తేల్చి చెబుతున్నారు.

కాళ్లరిగేలా తిరుగున్నారు
ఒక్క జీఎస్టీ విషయంలోనే కాదు.. రాష్ట్రంలో చేపట్టిన పలు పథకాలు పెండింగ్‌లో ఉన్నాయి. పథకాల అమలుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పలుచబడ్డాయి. ముఖ్యమంత్రి తోపాటు, రాష్ట్ర మంత్రులు కూడా ఇప్పటికే ఢిల్లీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగున్నారు. అయినా కేంద్రం నుంచి సానుకూలత లోపించింది. తాజాగా రాష్ట్రంలో ఐటీ పరిశ్రమకు మరింత ఊపును ఇచ్చే ఐటీఐఆర్‌ ప్రాజెక్టు విషయంలోనూ కేంద్రం తాత్సారం చేయడంపై మంత్రి కేటీఆర్‌ మండిపడుతున్నారు. గత నాలుగేళ్లుగా కేంద్రం నుంచి సరియైన సహకారం లేక ప్రతష్టాత్మక ఐటిఐఆర్ ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నగా తయారైంది. 2013 లో ఐటీఐఆర్‌కు అనుతించిన కేంద్రం ఇప్పటి వరకు నామమాత్రపు నిదులే విదిలించింది. వసతుల కల్పన కోసం .4,863 కోట్లరూపాయలు సాయం చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ కోరితే కేంద్రం రెండు విడదలుగా 3,275 కోట్లను మాత్రమే మంజూరు చేసింది . ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పూర్తి స్థాయి నిధుల విడుదల మాత్రం జరగలేదని కేటీఆర్ ఇటీవల కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు రాసిన లేఖలో స్పష్టం పేర్కొన్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కేంద్రం నుంచి తెలంగాణ‌కు రావాల్సిన 1250 కోట్ల రూపాయ‌ల ఐటీ నిధుల కోసం కేంద్రం చూట్టు ప్రద‌క్షిణ‌లు చేయాల్సి వ‌చ్చింది. అంతేకాదు... బడ్జెట్‌ కేటాయింపుల పరిమితి ..ఎఫ్ఆర్బీఎంకు సంబంధించి 3 నుంచి 3.5 శాతానికి పెంచాల‌న్న విష‌యంలో కూడా రాష్ట్ర స‌ర్కార్ కు, తిప్పలు త‌ప్పలేదు.

కేంద్ర ప్రభుత్వ తీరుతో ఖంగుతిన్నారు
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని, అలాగే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై జీఎస్టీ భారం పడకుండా చూడాలని టీసర్కార్‌ డిమాండ్‌ చేస్తోంది. లేదంటే మరిన్ని రాష్ట్రాలను కలుపుకుని న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరికలు చేస్తోంది. మొత్తానికి జీఎస్టీ విషయంలో మొదట తెగ హడావిడి చేసి..దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే అసెంబ్లీతో ఆమోద ముద్రవేయించిన సీఎం కేసీఆర్‌ ఇపుడు కేంద్ర ప్రభుత్వ తీరుతో ఖంగుతిన్నారని .. విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. 

08:45 - August 20, 2017

గుంటూరు : ఏపీ పాలన హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలివచ్చి ఏడాది అవుతోంది. తాత్కాలికంగా సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించారు. విజయవాడ, గుంటూరుల్లో విభాగాధిపతుల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అమరావతికి తరలివచ్చినా వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టిన ప్రభుత్వం... ఇప్పుడు వీరందరికి ఫ్లాట్ల నిర్మాణం కోసం టెండర్లు ఆహ్వానించింది.

కోట్లాది రూపాయలు ఖర్చు
మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల బసకోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. శాశ్వత నిర్మాణాలు చేపడితే ఈ ఖర్చును తగ్గించుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఈ దిశగా ముందడుగు వేసింది. ఫ్లాట్ల నిర్మాణ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి, సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులకు అపార్ట్‌మెంట్లు నిర్మిస్తారు. జీ ప్లస్‌ 12 పద్ధతిలో వీటి నిర్మాణం చేపడతారు. హోదాను బట్టి ఫ్లాట్లు కేటాయిస్తారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 16 వరకు బిడ్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 30న విజయదశమి నాడు నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన పాలనా నగరంలోనే వీటిని నిర్మిస్తారు.

12 టవర్లలో ఫ్లాట్లు నిర్మిణం
పరిపాలనా నగరంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాసం సమీపంలోనే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు అపార్ట్‌మెంట్లు నిర్మాణం చేపట్టనున్నారు. ప్రజా ప్రతినిధులకు ఒక్కో ఫ్లాటు 3,550 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే విధంగా 12 టవర్లలో ఫ్లాట్లు నిర్మిస్తారు. ఇందు కోసం 386 కోట్లు వ్యయం చేస్తారు. అఖిల భారత సర్వీసు అధికారుల కోసం ఒక్కో ఫ్లాటు 3,550 అడుగుల విస్తీర్ణం ఉండేలా ఆరు టవర్లు నిర్మిస్తారు. ఇందు కోసం 167 కోట్లు ఖర్చు చేస్తారు. ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులకు ఒక్కో అంతస్థులో రెండే ఫ్లాట్లు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. టైప్‌ వన్‌ గెజిటెడ్‌ అధికారులకు 1800 అడుగులు, టైప్‌ టూ గెజిటెడ్‌ అధికారులకు 1500 చదరపు అడుగులు, ఉద్యోగులకు 1200 చదరపు అడుగుల విస్తీర్ణయంలో ఫ్లాట్లు నిర్మిస్తారు. ఈ మూడు కేటగిరీలకు ఒక్కో టవర్‌లో ఆరు అంతస్థులు ఉండే విధంగా 27 టవర్లు కడతారు. నాల్గవ తరగతి ఉద్యోగులకు 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో టవర్‌లో ఎనిమిది అంతస్థులు ఉండే విధంగా ఆరు టవర్లు నిర్మిస్తారు. అమరావతిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల ఫ్లాట్ల నిర్మాణం కోసం టెంటర్లు పిలవడంతో వీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి
మరోవైపు అమరావతిలో స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి కూడా సీఆర్‌డీఏ టెండర్లు ఆహ్వానించింది. ఏడు ఎకరాల్లో ఎనిమిది హోటళ్లు నిర్మిస్తారు. ఫైవ్‌ స్టార్‌, ఫోర్‌ స్టార్‌ హోటళ్లు రెండేసి వంతున, నాలుగు త్రీ స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. ఈనెల 22 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు బిడ్లు స్వీకరిస్తారు. కొత్త నిర్మాణాలతో రాజధాని అమరావతికి ఒక స్వరూపం తీసుకురాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

విశాఖలో దారుణ హత్య

విశాఖ : నగరంలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. రైడీ షీటర్ సంపత్ ను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఆరివలోలవలో ప్రత్యర్థులు మాటువేసి అంతమొందించారు. 

08:05 - August 20, 2017

విశాఖ : నగరంలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. రైడీ షీటర్ సంపత్ ను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఆరివలోలవలో ప్రత్యర్థులు మాటువేసి అంతమొందించారు. పాతకక్షలే సంపత్ హత్యకు కారణమని తెలుస్తోంది. మరంత సమాచారం కోసం వీడియో చూడండి.

 

07:52 - August 20, 2017

మేమ మొదటి నుంచి శాంతియుతంగా ఎన్నికలు జరగాలని కోరుకున్నమని, వైసీపీ వారే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, చంద్రబాబు కాల్చి చంపాలని జగన్ అంటున్నారని, ఓటుమి చెందుతామని భయంతో వారు అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత రామకృష్ణ అన్నారు. నెల రోజుల ముందే టీడీపీ ఓటుకు ఐదు వేల ఇవ్వడంయ మొదలు పెట్టారని, పోలీసులను అడ్డుపెట్టుకుని డబ్బులు పంచుతున్నారని వైసీపీ నేత భవ కుమార్ అన్నారు. నంద్యాల ఉపఎన్నిక అయిన అక్కడ డబ్బులు పోటీ చెప్పొచ్చు అని బయట వారు ఎదైనా పనులపై నంద్యాల వెళ్లేవారికి షెల్టర్ కూడా దొరకడం లేదని, ఇక్కడ అధికార పార్టీ పై చేయ్యిగా ఉంటుందని విశ్లేషకులు తులసిదాస్ అన్నారు మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:50 - August 20, 2017

ప్రస్తుత వ్యసాయ విధానంలో సేంద్రియ విధానాన్ని ప్రవేశపెట్టడంలో మన దేశం వెనకుపడిందని, సేంద్రియ ఎరువులు ఎలా వాడాలి, ఎంత మోతదులో వాడాలో రైతులకు తెలియదని, కానీ ప్రతిభ బయోటెక్ వారు సేంద్రియ ఎరువులకు రైతులకు తెలపడంలో సక్సెస్ అయిందని, మొదటిగా మనం సాగు చేసే నేల స్వభావాన్ని గుర్తించాలని, నేల కాలవల్సిన పదార్థం ఎమిటో గుర్తించాలని, ఒకప్పుడు రసాయనాలు లేవు లప్పుడు కూడా మంచి దిగుపడులు సాధించారని, రసాయనాలను ఎక్కువగా వడకుండా సహజ ఎరువులను వడడం వల్ల నేల స్వభావం దెబ్బతిటుందని ప్రతిభ బయోటెక్ రాజశేఖర్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Don't Miss