Activities calendar

21 August 2017

21:31 - August 21, 2017

ఢిల్లీ : వివాదస్పద ట్రిపుల్ త‌లాక్‌పై రేపు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. చీఫ్‌ జస్టిస్‌ సీజే.ఖెహర్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం గత మే నెలలో ఆరు రోజుల పాటు విచారణ జరిపింది. త‌న తీర్పును మాత్రం రిజ‌ర్వ్‌లో పెట్టింది. మంగళవారం ఉదయం 11 గంటలకు తీర్పు వెలువడే అవకాశం ఉంది.

వివాదస్పదంగా మారిన ట్రిపుల్‌ తలాక్‌ అంశంపై కేంద్రం, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, ఆల్‌ ఇండియా ముస్లిం వుమెన్‌ పర్సనల్‌ లా బోర్డు దాఖలు చేసిన పలు పిటీషన్‌లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సీజే.ఖెహర్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మే 11న ప్రారంభమైన విచారణ మే 18తో ముగిసింది. ఆరు రోజుల విచారణ అనంతరం అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఆగస్టు 22న సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.

సుప్రీంకోర్టు ధర్మాసనంలో సిక్కు, క్రైస్తవ, పార్శీ, హిందు, ముస్లిం ఇలా అన్య మతస్థులు సభ్యులుగా ఉన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగబద్ధమైన అంశమా...? మతపరమైన హక్కా..? అన్న కోణంలో విచారణ జరిపారు... నిఖా హలాలా, బహుభార్యత్వంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ట్రిపుల్‌ తలాక్‌పై మహిళల అభిప్రాయం తెలుసుకుని నిఖా నామాలో చేర్చేందుకు కాజీలందరికీ సూచిస్తామని ఆల్‌ ఇండియా పర్సనల్‌ లా బోర్టు కోర్టు సమక్షంలో ఒప్పుకుంది.

ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా షయారా బానో 2016లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ట్రిపుల్‌ తలాఖ్‌, బహు భార్యత్వం చట్టవిరుద్ధంగా పేర్కొనాలని కోరారు. ట్రిపుల్‌ తలాఖ్‌ ఇస్లాంలో భాగం కాదని... ట్రిపుల్‌ తలాక్‌ ఖురాన్‌లో ఎక్కడా లేదని..అది ఆమోదయోగ్యం కాదని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ ముస్లిం మహిళల చేతులు కట్టేస్తోందని...తలాక్‌ కత్తి ఎప్పుడు మెడపై వేలాడుతూనే ఉంటుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ట్రిపుల్‌ తలాక్‌....దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముస్లిం మ‌త సాంప్రదాయంలో మూడు సార్లు త‌లాక్ అంటే భార్యాభ‌ర్తల మ‌ధ్య బంధం తెగిపోయిన‌ట్లే. ఈ ఆచారం పట్ల ముస్లిం మహిళలు సైతం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్‌ తలాక్‌పై సుప్రీంకోర్టు ఇచ్చే కీలక తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కమ్యూనిటీ పారామెడిక్స్ గా ఆర్ఎంపీలు, పీఎంపీలు..

విజయవాడ : ఆర్ఎంపీలు, పీఎంపీలకు చట్టపరమైన ఉద్యోగ హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శిక్షణ తరువాత చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై కమ్యూనిటీ పారామెడిక్స్ గా ఆర్ఎంపీలు, పీఎంపీలు కానున్నారు.

ఏపీ ఆర్ఎంపీలు, పీఎంపీలకు చట్టబద్ధత..

విజయవాడ : ఆర్ఎంపీలు, పీఎంపీలకు చట్టపరమైన ఉద్యోగ హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి కామినెని వెల్లడించారు. 44 ఏళ్ల నుండి ఆర్ఎంపీలు, పీఎంపీలపై నిషేధం ఉందని, అధికారికంగా వారు విధులు చేసుకొనేలా కమ్యూనిటీ పారా మెడికల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవచ్చని, దీనికి సంబంధించి జీవో మంగళవారం విడుదల చేస్తామన్నారు. 

21:24 - August 21, 2017

ఢిల్లీ : ధర్నా చౌక్ పరిరక్షణ ఉద్యమం దేశ రాజధానికి చేరింది. హైదరాబాద్‌లో ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వేదికగా విపక్షాలు నిరసన గళం విప్పాయి. కేసీఆర్ సర్కార్ అవలంబిస్తున్న విధానాలను నేతలు దుయ్యబట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రజాస్వామ్య సంఘాలు.. జాతీయ పార్టీల నేతలు, ప్రొఫెసర్లు, విద్యార్ధులు హాజరయ్యారు. ప్రజాస్వామ్య గొంతును నొక్కేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నేతలు మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ నిరంకుశ పాలన నడుస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారెవరూ కేసీఆర్ పాలన సహించబోరని ఏచూరి అన్నారు.

కేసీఆర్‌కు తెలంగాణ హిట్లర్‌ అవార్డు ఇవ్వాలని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ధర్నా చౌక్‌ను ఎత్తివేయడం ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడమే అవుతుందని తమ్మినేని అన్నారు. ఢిల్లీలో ధర్నా చౌక్ పరిరక్షణ సమితి ధర్నా ద్వారా కేసీఆర్ సర్కార్ వైఖరిలో మార్పు వస్తుందని భావిస్తున్నట్లు టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు. ధర్నా చౌక్ లేకపోవడం వల్ల ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తెలిపే అవకాశం లేకుండా పోయిందని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకు.. తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తోందని సీపీఐ నాయకుడు చాడ వెంకట్‌ రెడ్డి విమర్శించారు. అనంతరం ధర్నా చౌక్ పరిరక్షణ సమితి నేతలు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితిని, ప్రభుత్వ వైఖరిని వివరించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ధర్నా చౌక్ అంశంపై కేసీఆర్‌కి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. 

21:20 - August 21, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు సహకరించుకుంటూ అభివృద్ధి పథంలో సాగాలని.... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు సహజమేనని... సీఎంలు కూర్చొని వాటిని పరిష్కరించుకోవాలన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత తొలిసారి హైదరాబాద్‌ వచ్చిన వెంకయ్యను తెలంగాణ సర్కార్ ఘనంగా సన్మానించింది. ఉపరాష్ట్రపతి అయ్యాక తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన వెంకయ్యకు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు వెంకయ్యకు స్వాగతం పలికారు... అక్కడినుంచి రాజ్‌భవన్‌కు తీసుకువెళ్లి సన్మానించారు.

వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కావడం తెలుగుజాతికే గర్వకారణమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వెంకయ్య ఈ స్థాయికి ఎదగటం వెనుక ఎంతో కఠోర శ్రమ ఉందని గుర్తు చేశారు. వెంకయ్యనాయుడిని సన్మానించుకున్న ఈ రోజు తెలుగు వారందరికీ శుభదినమని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. వెంకయ్య ప్రసంగాలతో తానుకూడా స్ఫూర్తిపొందానని గుర్తు చేసుకున్నారు. ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్య వన్నెతెస్తారని ఆయన ఆకాంక్షించారు. ఆకలి, అవినీతి, అక్రమాలకు తావులేని దేశాన్ని మనం నిర్మించుకోవాలని వెంకయ్య చెప్పారు. అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం కల్పించాలని నేతలకు సూచించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు.

రాజ్ భవన్ లో జరిగిన ఈ వేడుకకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహముద్ అలీ, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 

21:16 - August 21, 2017

కర్నూలు : నంద్యాలలో ప్రచార ఘట్టం ముగిసింది. మైకులు మూగబోయాయి. ఘాటు విమర్శలు చేసుకున్న నేతలు సైలెంటైపోయారు. మరోవైపు ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈసీ ప్రకటించింది. ఓటర్లు నిర్భయంగా, స్వచ్ఛందంగా ఓటువేయాలని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ కోరారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

నంద్యాల ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. 13 రోజులుగా అధికార, ప్రతిపక్షాలు హోరాహోరీగా చేసిన ప్రచారానికి తెర పడింది. దీంతో నంద్యాలలో బయటి నేతలెవరూ ఉండకూడదని రిటర్నింగ్ అధికారి ఆదేశాలు జారీ చేశారు. ప్రచారం ముగియడంతో టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలు తమ ప్రచారాన్ని ముగించుకొని తిరుగు ప్రయాణం అయ్యారు.

ఈనెల 23న నంద్యాల ఉపఎన్నికకు పోలింగ్ జరగనుండగా, 28వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 19 వేల 108 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకోసం 255 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. ఓటర్లంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఓటు ఎవ‌రికి వేశార‌నేది ఓట‌రుకు మాత్రమే తెలుస్తుంద‌ని భన్వర్‌లాల్‌ చెప్పారు.

ఎన్నిక సందర్భంగా 23వ తేదీ సాయంత్రం వరకు వైన్స్‌ షాపులు మూసివేసి ఉంటాయని భన్వర్‌లాల్‌ తెలిపారు. అలాగే ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఎలాంటి ఒపీనియన్‌ పోల్స్‌ను సర్వేలను ప్రసారం చేయరాదన్నారు. బల్క్‌ ఎస్సెమ్మెస్‌లను కూడా నిషేధించినట్లు ఆయన తెలిపారు. పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల‌పై చ‌ర్యలు తీసుకున్నామని భన్వర్‌లాల్‌ అన్నారు. చంద్రబాబుపై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్యలకు ఈసీ నిర్ణయం తీసుకుంటుంద‌ని ఆయన చెప్పారు. బాలకృష్ణ డ‌బ్బులు పంచార‌న్న దానిపై క‌లెక్టర్‌ను రిపోర్టు అడిగామన్నారు.

మరోవైపు ఎన్నికపై ఎలాంటి సర్వేలు నిర్వహించొద్దన్న ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి, నంద్యాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.

26న అమరావతికి వెంకయ్య..

హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈనెల 26న అమరావతికి వెళ్లనున్నారు. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంకయ్య నాయుడికి ఆత్మీయ సన్మానం జరగనుంది. అనంతరం రాష్ట్ర అర్బన్ హౌసింగ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం తెనాలిలో జరిగే పుస్తకావిష్కరణలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు. 

తమిళనాడు మంత్రివర్గ విస్తరణ..

చెన్నై : తమిళనాడు మంత్రివర్గ విస్తరణ జరిగింది. పన్నీర్ స ఎల్వం, పాండ్యరాజన్ కు స్థానం కలిగింది. పన్నీర్ కు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పచెప్పగా పాండ్య రాజన్ కు తమిళ భాషాభివృద్ధి శాఖ బాధ్యతలు అప్పచెప్పారు. 

శ్రీరాంసాగర్ కు వరద ఉధృతి..

హైదరాబాద్ : శ్రీరాంసాగర్ కు వరద ఉధృతి పెరుగుతోంది. 1063 అడుగులకు శ్రీరాం సాగర్ నీటి మట్టం చేరుకుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,16,765 క్యూసెక్కులుంది. ఇన్ ఫ్లో ఇంకా కొనసాగుతోంది. 

ఉడుకులకుర్తిలో విషాదం..

అనంతపురం : తలుపుల (మం) ఉడుకులకుర్తిలో విషాదం చోటు చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. తల్లిని పట్టుకొనేందుకు వెళ్లి 7 నెలల చిన్నారి మృతి చెందింది. 

నెలాఖరు నుండి జలహారతి - దేవినేని..

ఢిల్లీ : శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు రాగానే మచ్చుమర్రి ద్వారా రాయలసీమకు నీళ్లు అందిస్తామని మంత్రి దేవినేని పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్నాటక వ్యవహారంపై కేంద్ర జలవనరుల మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు నుండి జలహారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. 

ఎంఎల్ఎస్ పాయింట్ ను తనిఖీ చేసిన ప్రత్తిపాటి..

తూర్పుగోదావరి : కరవ (మం) వేలంగిలో ఎంఎల్ఎస్ పాయింట్ ను మంత్రి ప్రత్తిపాటి అకస్మిక తనిఖీ చేశారు. గోడౌన్ లోని రేషన్ స్టాక్, రికార్డులను ఆయన పరిశీలించారు. రాష్ట్రం అంతటా నాణ్యమైన సరుకుల పంపిణీకి కృషి చేయడం జరుగుతోందని, అక్రమాలు చెక్ పెట్టేందుకు ఈ పాస్ తో పాటు జీపీఆర్ఎస్ నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. 

20:13 - August 21, 2017

నందిని జెయ్యవోతె పందైనట్టు.. తెలంగాణ ప్రభుత్వం మొన్న ఒక ఛానెళ్ల ప్రదర్శించిన ప్రాయోజిత కార్యక్రమం తొవ్వదప్పి.. రెడ్డి కులస్థుల మీదికి మర్రెవర్కళ్ల.. వాళ్లు భగ్గున మండుతున్నరు.. సూస్కుందాం ఇగ చంద్రశేఖర్ రావా..? తెలంగాణ రెడ్ల.. తేల్చుకుందాం అనుకునేంత లడాయి అయితున్నది.. అమ్మో మొదటికే మోసం వచ్చెతట్టున్నదని సర్కారు మళ్లేం జేశిందో వీడియోలో సూడుండ్రి...

20:09 - August 21, 2017

అది నిరసనలకు అడ్డా.. ఆందోళనలకు ఊపిరి.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు ఉదాహరణ. కానీ, ప్రభుత్వం... నిరసనలే కదా.. ఎక్కడ చేస్తే పోయేదేంటి అంటోంది. ఆందోళనలు ట్రాఫిక్ కి అడ్డం అంటోంది. ఇందిరా పార్క్ లాంటి చోట కాదు.. ఊరిబయట మీ బాధలను వెళ్లగక్కుకోండి అంటోంది. ఇది నిరంకుశత్వమా? అసహనమా? లేక ప్రజబాహుళ్యంనుండి విమర్శలను ఎదుర్కోలేని అశక్తతా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..

మమ్మల్ని విమర్శించే గళాలకు ఇక్కడ చోటు లేదు.. మా విధానాలకు తప్పు పట్టే రాజకీయపక్షాలకు స్థానంలేదు. వాళ్లను ఊరిబయటకు నెట్టేస్తాం.. బంగారు తెలంగాణకు వ్యతిరేకమని తెలంగాణ ద్రోహులని తేలుస్తాం.. ఇవేనా తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు..అసహనం.. అడుగడుగునా అసహనం..ఏ ప్రజా ఉద్యమాలను ఆసరాగా చేసుకుని తెలంగాణ సాధించి అధికారంలోకి వచ్చారో.... ఆ ఉద్యమాలనే అణచివేసే ప్రయత్నం... ఏరు దాటి తెప్పతగలేసిన తీరుగా... నిరసన స్వరాలను అణచివేసే ప్రయత్నం కెసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహామహా నగరాలకే లేని సమస్య ఇప్పుడు హైదరాబాద్ లో ఉందంటోంది ఇక్కడి సర్కారు..

ధర్నాచౌక్ ట్రాఫిక్ జామ్ లకు కారణంగా మారుతోంది.. ధర్నా చౌక్ వల్ల స్థానికులకు ఇబ్బంది కలుగుతోంది. అయినా, అసలు ధర్నా చౌక్ ఎక్కడుంటే ఏమిటి ఇవీ సీఎం చెప్తున్న మాటలు. మరి కెసీఆర్ వాదనలో సహేతుకత ఎంత? ధర్నా చౌక్ తరలింపుతో వచ్చే నష్టం ఏమిటి?. అసహనం.. అడుగడుగునా అసహనం.. వామపక్షాలు సూటిగా నిలదీస్తున్న సమస్యలకు సమాధానం ఇవ్వలేని అశక్తత తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ దిశగా నడిపిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రజా ఉద్యమాలు, వామపక్ష పోరాటాలను విలువను ఊకదంపుడు ఉపన్యాసాలతో విమర్శలతో తక్కువ చేసే ప్రయత్నాలకు దిగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రజలను ఆకాంక్షలను గౌరవించని ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవటం కష్టం.. ప్రజల నిరసనలకు స్థానం ఇవ్వని ఏలికల అసహనం అంతిమంగా వారికే చేటుతెస్తుంది. ఇప్పుడు టియ్యారెస్ ప్రభుత్వం ధర్నా చౌక్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామిక మౌలిక లక్షణాలకు వ్యతిరేకం. ఈ తీరు మార్చుకోవాల్సిన అవసరం బలంగా ఉంది. పూర్తి విశ్లేషణ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:00 - August 21, 2017

అమ్మయ్య మొత్తం మీద ఒక పెద్ద శని వొయ్యింది.. సీన్మ నటుడు కం కమేడియన్ వేణు మాధవ్ ఉన్నడుగదా..? అదే గింతుండడా... అగో ఆయిననట కొట్టి సంపుతమంటున్నరట కొంతమంది ఫోన్ జేశి..? నందిని జెయ్యవోతె పందైనట్టు.. తెలంగాణ ప్రభుత్వం మొన్న ఒక ఛానెళ్ల ప్రదర్శించిన ప్రాయోజిత కార్యక్రమం తొవ్వదప్పి.. రెడ్డి కులస్థుల మీదికి మర్రెవర్కళ్ల.. వాళ్లు భగ్గున మండుతున్నరు..పశ్చిమగోదావరి జిల్లా తణుకు కాడ ఒక తమాష అయ్యింది.. నిజామాబాద్ జిల్లాల ఒక ఊర్లె ముప్పై ఏండ్ల సంది గొడ్వలు లేవు పంచాదులు లేవు కీసులాటలు లేవు..కొండ చిల్వ కోతిని మింగిందని కొట్టి సంపిండ్రు జగిత్యాల జిల్లాల జనం..గీ ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:58 - August 21, 2017
19:33 - August 21, 2017

ఛత్తీస్ గడ్ : ఆక్సిజన్‌ అందక చిన్నారులు మృతి చెందిన ఘటన ఛత్తీస్‌గడ్‌లోనూ వెలుగు చూసింది. రాయ్‌పూర్‌లోని భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ ఆసుపత్రిలో ఆదివారం ఆక్సిజన్‌ అందక ముగ్గురు పిల్లలు మృతి చెందారు. డ్యూటీలో ఉన్న ఓ ఉద్యోగి తాగిన మైకంలో ఆక్సిజన్‌ సప్లయ్‌ను ఆపివేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ విచారణకు ఆదేశించారు. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగి రవిచంద్రను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లోని బిఆర్‌డి మెడికల్‌ కాలేజీలో ఆక్సీజన్‌ అందక 60కిపై చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. చిన్నారుల మరణాలకు ఆక్సీజన్‌ కారణం కాదని యోగి సర్కార్‌ చెబుతోంది.

 

19:32 - August 21, 2017

ఢిల్లీ : మాలెగావ్‌ పేలుడు కేసులో లెఫ్టినెంట్‌ కల్నల్‌ శ్రీకాంత్‌ ప్రసాద్‌ పురోహిత్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గత 9 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్న పురోహిత్‌కు ఎట్టకేలకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.. పురోహిత్‌కు బెయిలు ఇవ్వడానికి బాంబే హైకోర్టు తిరస్కరించింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పురోహిత్‌ సుప్రీంను ఆశ్రయించారు. పురోహిత్‌కు బెయిల్ ఇవ్వడాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ వ్యతిరేకించింది. ఈ కేసులో పురోహిత్‌కు వ్యతిరేకంగా తగిన ఆధారాలున్నాయని ఎన్‌ఐఏ కోర్టుకు తెలిపింది. తొమ్మిదేళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న పురోహిత్‌పై ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని పురోహిత్‌ తరపున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. సెప్టెంబర్‌ 29, 2008లో నాసిక్‌ జిల్లా మాలేగావ్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో ఏడుగురు మృతి చెందారు. ఈ కేసులో పురోహిత్‌, సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ ప్రధాన సూత్రధారులు కాగా...సాధ్వి ఇదివరకే బెయిలుపై విడుదలయ్యారు. 

19:30 - August 21, 2017

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పడుతున్నారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రైవేటు బ్యాంకులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మండిపడుతున్న బ్యాంకు యూనియన్ నేతలతో టెన్ టివి ముచ్చటించింది. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:28 - August 21, 2017

చెన్నై : తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకేలోని పళని, పన్నీర్‌ వర్గాలు విలీనమయ్యాయి. అమ్మ ఆశయాల కోసం పనిచేస్తామని ఇరువర్గాలు ప్రకటించాయి. విలీన ఒప్పందం మేరకు పన్నీర్‌సెల్వం ఉపముఖ్యమంత్రిగా... ఆయన వర్గానికి చెందిన మరో ముగ్గురు మంత్రులుగా ప్రమాణం చేశారు. గత కొన్ని రోజులుగా నడుస్తున్న అన్నాడిఎంకె వర్గాల విలీన వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. జయలలిత మరణం తర్వాత రెండుగా చీలిన పార్టీలోని పన్నీర్‌సెల్వం- పళనిస్వామి వర్గాలు మళ్లీ ఒక్కటయ్యాయి. చెన్నైలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇరువర్గాలు భేటి అయ్యాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చేతులు కలిపారు.

విడిపోయిన పార్టీలు తిరిగి కలవడం చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. తమ పార్టీని ఇక ఎవరూ చీల్చలేరని చెప్పారు. పార్టీని ఇకపై మార్గదర్శక కమిటి నిర్వహిస్తుందని... పన్నీర్‌ సెల్వం కన్వీనర్‌గా వ్యవహరిస్తారని సిఎం వెల్లడించారు. సంయుక్త ప్రకటన అనంతరం పళని, పన్నీర్‌లు కలిసి ఎంజీఆర్‌, జయలలిత మెమోరియల్‌ వద్దకు వెళ్లారు. ఎంజీఆర్, జయలలిత స్మారకం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.

ఇరువర్గాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ముఖ్యమంత్రి పళనిస్వామి తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మాజీ సిఎం పన్నీర్‌ సెల్వం ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో గవర్నర్‌ విద్యాసాగర్‌రావు పన్నీర్‌సెల్వం, ఇతర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పన్నీర్‌ సెల్వం వర్గానికి చెందిన రాధాకృష్ణన్‌, పాండ్య రాజన్, బి. రెడ్డి మంత్రులుగా ప్రమాణం చేశారు. పన్నీర్‌ సెల్వం ఆర్థిక, గృహ నిర్మాణ శాఖలు చేపట్టనున్నారు.

అన్నాడిఎంకేలోని రెండు వర్గాలు విలీనం కావడంతో శశికళను పార్టీ నుంచి తొలగించనున్నారు. త్వరలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను పదవి నుంచి తప్పిస్తారని అన్నాడిఎంకె వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు శశికళకు మద్దతు ఇస్తున్న 20 మంది ఎమ్మెల్యేలు ఆమె మేనల్లుడు టిటివి దినకరన్‌తో సమావేశపై తాజా పరిణామాలపై చర్చించారు.

అన్నాడిఎంకె చీలిక వర్గాల విలీనం వెనక బిజెపి డ్రామా నడిపిందన్న విషయం అందరికి తెలిసిందే. అన్నాడిఎంకె త్వరలోనే ఎన్డీయేలో భాగస్వామ్యం కానుంది. విలీన ప్రక్రియ పూర్తి కావడంతో పార్టీ సింబల్‌ రెండాకుల కోసం అన్నాడిఎంకే ఈసీని కలవనుంది.

19:24 - August 21, 2017

హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. క్వాలిటీ ఆఫ్ లివింగ్‌లో హైదరాబాద్ బెస్ట్ సిటీగా ఉందన్నారు. అయితే హైదరాబాద్ అభివృద్ధి ... ఒక్కసారిగా జరిగిపోదన్నారు. సీఎం కేసీఆర్ ప‌క్కా ప్రణాళికతో... న‌గ‌రంలో ఎన్నో అభివృద్ది ప‌నులు చేపట్టారని చెప్పారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు చేపట్టిన బాలానగర్ ఫ్లై ఓవ‌ర్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం 400 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

నంద్యాల..హైకోర్టులో పిటిషన్..

హైదరాబాద్ : నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు..ఓటములపై ఎలాంటి సర్వేలు నిర్వహించవద్దని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఓ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఎన్నికల ప్రధాన అధికారి, రిటర్నింగ్ అధికారికి పలు ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. 

గంగుల ఇంట్లో సోదాలు..

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ప్రచారం ముగిసిన అనంతరం వైసీపీ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.

19:08 - August 21, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ప్రచారం ముగిసిన అనంతరం వైసీపీ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి గంగుల ఫ్యామిలీకి అందచేసి సోదాలు చేశారు. ఈ సందర్భంగా గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు టెన్ టివితో మాట్లాడారు. తాము సోదాలకు సహకరించామని, ఏమీ దొరక్కపోవడంతో పోలీసులు వెనక్కి వెళ్లిపోయారని తెలిపారు. తాము ఉదయం నుండి ఫిర్యాదు చేస్తున్నా స్పందించకుండా తమ నివాసాలపై సోదాలు చేస్తున్నారని తెలిపారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు..డిప్యూటి సీఎంలతో..

ఢిల్లీ : బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు..డిప్యూటి సీఎంలతో ప్రధాని మోడీ, అమిత్ షాలు సమావేశమయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతోన్న అభివృద్ధి, కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు, పార్టీ పరిస్థితులపై చర్చిస్తున్నారు.

సెప్టెంబర్ 23 నుండి సాలకట్ల బ్రహ్మోత్సవాలు...

చిత్తూరు : తిరుమలలో కలెక్టర్, ఉన్నతాధికారులతో టిటిడి ఈవో అనీల్ కుమార్ సింఘాల్ సమన్వయ సమావేశం జరిగింది. సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 1 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగున్నాయని, సెప్టెంబర్ 23న స్వామి వారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. 27న గరుడ సేవ, ద్విచక్ర వామనాలకు అనుమతి రద్దు చేయనున్నట్లు, గరుడ సేవ రోజున ఆర్టీసీ బస్సులు 4 వేల ట్రిప్పులు తిరిగేలా ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. 

స్కావెంజర్ కాలనీని ఖాళీకి ప్రయత్నం - ఎంపీ చిరంజీవి..

చిత్తూరు : తిరుపతి 18వ వార్డులోని స్కావెంజర్స్ కాలనీని ఖాళీ చేయించేందుకు కుట్ర జరుగుతోందని ఎంపీ చిరంజీవి వ్యాఖ్యానించారు. 70 ఏళ్లుగా 160 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయని, పేదల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాన్ని ప్రభుత్వం..తిరుపతి కార్పొరేషన్ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 

బ్యాంకు ఉద్యోగుల సమ్మె బాట..

డిల్లీ : దేశ వ్యాప్తంగా మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పడుతున్నారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది.

18:46 - August 21, 2017

కాకినాడ : కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీపీఎం విస్తృతంగా ప్రచారం చేస్తోంది.. 20 డివిజన్‌ అభ్యర్థి బీఎస్ ఆర్ కృష్ణకు మద్దతుగా పార్టీ నేతలు, కార్యకర్తలు డప్పుల దరువుతో ప్రచారం నిర్వహించారు.. కృష్ణకు అవకాశం ఇస్తే నగర శివారులోఉన్న డివిజన్‌ అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు.. సీపీఎం ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:44 - August 21, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి లీవ్‌పై వెళ్లనున్నారు. ఇసుక మాఫియాకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్పీ... అకస్మాత్తుగా లీవ్‌పై వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆయనను చండీఘ్‌డ్‌లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయన రేపటి నుంచి 45రోజుల పాటు చండీఘడ్‌కు లీవ్‌లో వెళ్లనున్నారు. మరోవైపు సిరిసిల్ల లా అండ్ ఆర్డర్ బాధ్యతలను ప్రభుత్వం.. కరీంనగర్ కమిషనర్ కమలాసన్ రెడ్డికి అప్పగించారు. 

18:43 - August 21, 2017

హైదరాబాద్‌ : గణేశ్‌ ఉత్సవాలకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.. క్విక్‌ రియాక్షన్‌ టీం, క్రైం పార్టీలు, సిటీ కమాండోస్‌, షీటీమ్స్‌, ఇతర ఎమర్జన్సీ బృందాల సేవలను ఉపయోగించుకుంటున్నారు.. ఉత్సవాలకు భద్రతక సంబంధించి సెంట్రల్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ టెన్ టివితో మాట్లాడారు. 

18:41 - August 21, 2017

కడప : జిల్లా కాశినాయన మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని.. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. దాదాపు 18వేల ఎకరాల సర్కారు భూమిని.. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు చెందిన పెట్టుబడిదారులు ఆక్రమించారని ఆరోపించారు. ఈ భూమిని పేదలకు పంచాలని ప్రభుత్వాన్ని డిమండ్ చేశారు.. జిల్లాలో పర్యటించిన ఆయన... ఆక్రమణకు గురైన భూముల్ని పరిశీలించారు.. 

'ఐటీబీపీ జవాన్ల పోరాట పటిమ, చిత్తశుద్ధి ప్రశంసనీయం'..

ఢిల్లీ : ఇండో టిబిటెన్ బోర్డర్ ఫోర్స్ (ఐటీబీపీ) నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఐటీబీపీ జవాన్ల పోరాట పటిమ, చిత్తశుద్ధి ప్రశంసనీయమన్నారు. జవాన్ల కార్యదీక్షత తనను ముగ్ధుడిని చేసిందన్నారు. 

18:33 - August 21, 2017

హైదరాబాద్ : తమది మాటల ప్రభుత్వం కాదని..చేతల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఇది ప్రారంభం మాత్రమేనని..సీఎం కేసీఆర్ మనస్సులో చాలా ఆలోచనలున్నాయన్నారు. తాగునీటికి..మౌలిక సౌకర్యాలకు సంబంధించిన ఎన్నో ఆలోచనలున్నాయన్నారు. ఒక్కోటి అమలు చేస్తూ విశ్వనగరంగా మార్చుకొనేందుకు కృషి చేస్తామని, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ కొన్ని డిమాండ్స్ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. 

సీఈసీతో టిడిపి ఎంపీలు..

ఢిల్లీ : నంద్యాల ఉప ఎన్నికలపై సీఈసీని టిడిపి ఎంపీలు రామ్మోహన్, మాల్యాద్రి, నిమ్మల కిష్టప్పలు కలిశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నారని తెలిపారు. 

18:22 - August 21, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం కొద్దిసేపటి క్రితం ముగిసింది. మైక్ లు మూగబోయాయి. ప్రచారం ముగిసిన అనంతరం నేతలు ఇతర వాటిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 
ఎన్నికలకు సంబంధించిన విశేషాలు..మొత్తం అభ్యర్థులు 15 మంది.
మొత్తం ఓటర్లు 2,19,108 255.
23న పోలింగ్..28న ఓట్ల లెక్కింపు..
255 పోలింగ్ స్టేషన్స్. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్.
పోలింగ్ బూతుల్లో లైవ్ కెమెరాలు.
అధికార దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు.
8 కంపెనీల సెంట్రల్ ఆర్ముడ్ .. ఏపీఎస్పీ పోలీస్ తో భద్రత.
ప్రతి ఓటర్ ను ఫోటో తీసుకొంటారు. 

18:15 - August 21, 2017

హైదరాబాద్ : నంద్యాల ఉప ఎన్నికలో ఓ ప్రధాన ఘట్టం ముగిసిపోయింది. సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగిసింది. దీనితో స్థానికేతరులు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. ప్రచారం ముగిసిన అనంతరం ఎన్నికల అధికారి భన్వర్ లాల్ మీడియాతో మాట్లాడారు. 23పోలింగ్ జరుగుతుందని, 28న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఎల్లుండి సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో లైనులో ఉన్నవారంద‌రూ ఓట్లు వేయ‌వ‌చ్చని, ఆరు దాటాక పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చిన వారికి ఓటు వేసే అవ‌కాశం ఉండ‌దని చెప్పారు. ఓట‌ర్ల‌ను ప్ర‌భావ‌పెట్టాల‌ని చూస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వని చెప్పారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఎవరికి వేశారో ఎవరికీ తెలియదన్నారు. ఎవరైనా డబ్బులు పంపిణీ..ఎన్నికల నియావళికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో కోటి 16 లక్షల రూపాయలు సీజ్ చేసినట్లు, విచారణ జరుగుతోందన్నారు. పోలింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఎవ‌రైనా తాము ఎవ‌రికి ఓటు వేశామో చెబితే కూడా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. 

17:58 - August 21, 2017

ఢిల్లీ : ధర్నా చౌక్ పరిరక్షణ ద్వారా సీఎం కేసీఆర్ వైఖరిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు టీజాక్ ఛైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. ధర్నా చౌక్ పరిరక్షణ పేరిట ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేతలు భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో టీజాక్ కోదండరాం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం టెన్ టివితో మాట్లాడారు. ధర్నా చౌక్ లేకపోవడం వల్ల ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోతున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఈ విషయంపై చర్చించడం జరిగిందని, ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తామని రాజ్ నాథ్ హామీనిచ్చారని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:54 - August 21, 2017

ఢిల్లీ : తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ధర్నా చౌక్ పరిరక్షణ పేరిట ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష నేతలు భారీ ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాలో పాల్గొన్న ఏచూరి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారెవరూ కేసీఆర్ పాలనను సహించబోరని తెలిపారు. ధర్నా చౌక్ పునరుద్దరణ జరిగి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

17:51 - August 21, 2017

కాకినాడ: కార్పొరేషన్ ఎన్నికలు కొద్ది రోజుల్లో జరగనున్నాయి. గెలుపే ధ్యేయంగా ప్రధాన పార్టీలు పని చేస్తున్నాయి. కాకినాడలో రాజకీయ నేతలు మకాం వేశారు. వైసీపీ..టిడిపి అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి తరపున బోత్స సత్యనారాయణ గల్లీ గల్లీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టెన్ టివితో బోత్స మాట్లాడారు. మూడేళ్లుగా కార్పొరేషన్ ను అభివృద్ధి చేయలేదని, టిడిపికి ఓటు వేస్తే వృదా అయిపోతోందన్నారు. తమకు ఓటు వేస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీనిచ్చారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:47 - August 21, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో ఆశా వర్కర్లు కదం తొక్కారు. జంతర్ మంతర్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆశా వర్కర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆశా వర్కర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో పలువురు ఆశా వర్కర్లు మాట్లాడారు. కనీస వేతనాలు ఇవ్వమని చెబితే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అన్ని పనులు కూడా ఆశా వర్కర్లతో

365 రోజులు పనిచేయాల్సి వస్తోందని, రాత్రి..పగలు తేడా లేకుండా పిలుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నెలంతా పనిచేస్తే రూ. 2వేలు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యను తీర్చాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:42 - August 21, 2017

నిర్మల్ : బాసర అమ్మవారి ఉత్సవ విగ్రహ తరలింపు అనే దానిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తహశీల్దార్ ఆధ్వర్యంలో ఆలయ బీరువాలను తెరిచారు. రెండో బీరువాలో అమ్మవారి ఉత్సవ విగ్రహం లభ్యం కావడం విశేషం. ఉత్సవ విగ్రహం తీసుకెళిఆ్ల మళ్లీ తీసుకొచ్చి బీరువాలో పెట్టినట్లు ప్రధాన అర్చకుడు సంజీవ్ పై ఆరోపణలున్నాయి.

బాసర అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని నల్గొండ అక్షరాభ్యాసానికి తరలించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మీడియాతో మాత్రం అధికారులు మాట్లాడడం లేదు. తరలించిన విగ్రహం..లభ్యమైన విగ్రహం ఒకటేనా ? కాదా ? అనేది తెలియాల్సి ఉంది. 

17:37 - August 21, 2017

కర్నూలు : నంద్యాల నియోజకవర్గంలో హోరెత్తిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. మైక్ లు మూగబోయాయి. గత రెండు వారాలుగా ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికకు సాయంత్రం 5గంటలతో ప్రచారం సమయం ముగిసింది. ఈనెల 23న పోలింగ్ జరగనుంది. 28న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

నాన్ లోకల్స్ ఉన్న వారంతా నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్లాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో నేతలు తమ లగేజ్ తో బయటకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. 250 పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 217 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. నియోజకవర్గాన్ని 20 సెక్టార్లుగా విభజించి ఒక్కొక్క సెక్టా రుకు జిల్లా స్థాయి అధికారిని నియమించారు. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లోనే తొలిసారిగా నంద్యాల ఉప ఎన్నికల్లో వీవీ ప్యాడ్‌లను వాడుతున్నారు. వీటి ద్వారా ఓటరు తాము ఎవరికి ఓటు వేశామో తెలుసుకునే అవకాశం కల్పించారు.

భూమా నాగిరెడి హఠాన్మరణం అనంతరం ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున శిల్పా మోహన్‌ రెడ్డి, టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేయనున్నారు. వీరి గెలుపు కోసం పార్టీ అధినేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. టిడిపి నుండి మంత్రులు..ఎమ్మెల్యేలు..ఇతరులు నంద్యాలలో మకాం వేసి ప్రచారం నిర్వహించారు. మంత్రులు తిష్ట వేసి ప్రచారం నిర్వహించడం పట్ల వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇక జగన్ కూడా కొన్ని రోజులుగా ఇక్కడే బస చేసి ప్రచారాన్ని నిర్వహించారు. టిడిపిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ? ఎవరు ఓడుతారో వేచి చూడాలి. 

17:29 - August 21, 2017

చెన్నై : తమిళనాడు కేబినెట్ విస్తరించారు. రాజ్ భవన్ లో గవర్నర్ విద్యా సాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటి సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణం చేశారు.  పన్నీర్ కు ఆర్థిక..గృహ నిర్మాణ శాఖలను కేటాయించారు. మంత్రులుగా పాండ్య రాజన్, రాధాకృష్ణన్, జీరెడ్డిలు ప్రమాణం చేశారు. 
జయ మరణానంతరం అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. శశికళ వర్గానికి పళనీ స్వామి నేతృత్వం వహించి సీఎం పదవిని అధిష్టించిన సంగతి తెలిసిందే. పన్నీర్ సెల్వం వర్గం తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయాలను వేడెక్కించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈపీఎస్..ఓపీఎస్ గ్రూపులు భేటీ అయ్యాయి. మొదటి నుంచి పన్నీర్‌ వర్గం శశికళను పార్టీ పదవి నుంచి తొలగించాలని కోరుతున్న సంగతి తెలిసిందే. చర్చల అనంతరం చివరకు పార్టీలు ఒక్కటైపోయాయి. దీనితో తమిళనాడులో కొత్త రాజకీయానికి తెరలేచినట్లైంది. సాయంత్రం 5గంటలకు కేబినెట్ విస్తరణ జరిగింది. మరోవైపు ప్రధాన కార్యదర్శి పదవి నుండి తొలగించడం పట్ల దినకరన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. 16 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. శశికళను పార్టీ పదవి నుంచి తొలగిస్తే ప్రభుత్వాన్ని అస్థిరపర్చుతామని దినకరన్‌ హెచ్చరిస్తున్నారు. 

నంద్యాల లో ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. 28న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగనుంది.

రూ.57లక్షలతో దోపిడీ దొంగలు పరార్

జైపూర్ : రాజస్థాన్ బిల్వారాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ ను బెదిరించి, దుండగులు రూ.57 లక్షలు అపహరించింకు పోయ్యారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

17:21 - August 21, 2017

డిప్యూటీ సీఎం పన్నీర్ ప్రమాణం...

చెన్నై: త‌మిళ‌నాడు డిప్యూటీ సీఎంగా ప‌న్నీర్ సెల్వం ప్ర‌మాణం చేశారు. ఇవాళ రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్‌రావు ఆయ‌న చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. అన్నాడీఎంకే రెండు వ‌ర్గాల విలీనంలో భాగంగా ప‌న్నీర్‌ను పార్టీ క‌న్వీన‌ర్‌ను చేయ‌డంతోపాటు డిప్యూటీ సీఎం ప‌ద‌వి కూడా క‌ట్ట‌బెట్టారు ప‌ళ‌నిస్వామి. దీంతోపాటు కీల‌క‌మైన ఆర్థిక‌శాఖ‌ను కూడా ఆయ‌న‌కు కేటాయించారు.

సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ కంపాలి పై వేటు

కరీంనగర్ : సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ కంపాలి పై వేటు పడింది. దీర్షకాలిక సెలవుపై విశ్వజిత్ కంపాలి వెళ్లారు. నెల రోజుల పాటు విశ్వజిత్ చంఢీగడ్ కు వెళ్తున్నారు. నేరెళ్ల ఘటనకు ఎస్పీనే బాధ్యుడంటూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇటీవలే ఎస్ ఐ ని పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు.

అంబులెన్స్ లో గంజాయి..నలుగురి అరెస్ట్....

తూ.గో: చింతూరు మండలం కూనవరం జంక్షన్ దగ్గర అంబులెన్స్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రూ.20లక్షల విలువైన 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రైలుకింద పడి ఇద్దరు చిన్నారుల మృతి

కామారెడ్డి : నరసన్నపల్లిలో విషాదం నెలకొంది. నరసన్నపల్లి శివారులో ఉన్న రైలు పట్టాలపైకి కవలలు ఆడుకుంటూ వెళ్లారు. ఇంతలోనే రైలు కిందపడి ఇద్దరు కవలలు మృతి చెందారు. కవలలను విద్వేష్(2), విఘ్నేష్(2)గా రైల్వే పోలీసులు గుర్తించారు. వీరి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిపై ఈసీకి ఫిర్యాదు : టిడిపిఎంపిలు

ఢిల్లీ: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పక్షపాతంతో వ్యహరిస్తున్నారని సీఈసికి టీడీపీ ఎంపిలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో టిడిపి ఎంపీలు రామ్మోహన్న్, మాల్యాద్రి, నిమ్మల కిష్టప్ప ఉన్నారు. మేము ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం లేదని, వైసీపీ ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నారని వారు ఆరోపించారు. సీఎం పై ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యల పై చర్యలు లేవని, అన్ని అంశాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏకే జ్యోతి, రావత్ కు వివరించినట్లు ఎంపిలు తెలిపారు.

16:29 - August 21, 2017

ఆత్మహత్యలకు దారితీస్తున్న బ్లూ వేల్‌ ఛాలెంజ్‌ ఇంటర్‌నెట్‌ గేమ్‌కు బ్రేకులు వేసేందుకు ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రమాదకర క్రీడకు సంబంధించిన సమాచారాన్ని తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రముఖ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఇండియా చర్యలను వేగవంతం చేసింది. లింకుల తొలగింపుపై గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్, వాట్సప్‌ తదితర సంస్థలకు కేంద్రం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ బ్లూవేల్‌ను ప్రమాదకర క్రీడగా పిలవడానికి కారణాలేంటి?

బ్లూవేల్‌ ఛాలెంజ్‌.. ఇదో ఇంటర్‌నెట్‌ గేమ్‌. కుంగుబాటు, ఆత్మన్యూనత, ఒంటరితనం అనుభవిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని ఆత్మహత్యకు ప్రోత్సహించేదే బ్లూవేల్‌ ఛాలెంజ్‌. ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు ఉన్నవారికి ఇదో అనుసంధాన వేదికలా ఉపయోగపడుతుంది. చావుకు 50 మెట్లను నిర్దేశించి వారిని ఆ అఘాయిత్యానికి పాల్పడేలా చేస్తుంది. ఈ క్రీడకు సంబంధించి ఓ నిర్వాహకుడు పనిచేస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ఆటను ఆడేవారికి ప్రమాదకరమైన టాస్క్‌లను నిర్దేశిస్తుంటాడు. బ్లేడుతో శరీరంపై వివిధ ఆకారాలతో గాట్లు పెట్టుకొని, గాయపరుచుకోవాలని ఆదేశిస్తుంటాడు. ఈ టాస్క్‌లను ఆట ఆడేవారు ఎప్పటికప్పుడు పూర్తి చేసిన తర్వాత చివరకు నిర్వాహకుడి ఆదేశాల మేరకు ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది.

ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో 16 ఏళ్ల బాలుడు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. బుధవారం జరిగిన ఈ ఘటనకు బ్లూవేల్‌ ఛాలెంజే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలోనే విచారణను జరిపారు. బాలుడి శరీరంపై బ్లూవేల్‌కు సంబంధించి క్రీడలో పాల్గొన్నట్లు సూచించే గాయాలు లేవని పోలీసులు తెలిపారు. పాస్‌వర్డ్‌ రక్షణ ఉండటంతో బాలుడి ఫోన్‌లోని సమాచారం రాబట్టలేకపోయామన్నారు. ప్రస్తుతం బాలుడు మాట్లాడలేని స్థితిలో ఉండటంతో, కోలుకున్న అనంతరం ఈ కేసుపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.

అయితే ఇలాంటి ప్రమాదకర గేమ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. బ్లూవేల్‌కు ప్రచారం కల్పించే వారి సమాచారాన్ని పోలీసులు, శాంతిభద్రత పర్యవేక్షణ సంస్థల దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం కోరింది. బ్లూవేల్‌ నిషేధం విధించడంతో పాఠశాలల్లో ఇంటర్‌నెట్‌ వినియోగంపై కేంద్ర మాధ్యమిక విద్యామండలి మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రమాదకర, చట్టవిరుద్ధమైన అంశాల బారిన పడకుండా చిన్నారులను సరైన ఫైర్‌వాల్‌, వడపోత వ్యవస్థలను ఉపయోగించాలని పాఠశాలలను కోరింది. చిన్నారుల ఇంటర్‌నెట్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగంపై నియంత్రణ, పర్యవేక్షణ పెట్టాలని సూచించింది.

విచిత్ర ప్రవర్తన, అలవాట్ల ఆధారంగా ఈ ఆట ఆడేవారిని సులభంగానే గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. సామాజిక మాధ్యమాల్లో పిల్లలు పెట్టే పోస్టులను గమనిస్తూ, నెట్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలను వినియోగిస్తున్న తీరుపైనా దృష్టి సారించాలని సూచిస్తున్నారు. బ్లూవేల్‌కు ఆకర్శితులైన వారిని రక్షించడంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల చొరవ అవసరముందంటున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలంటున్నారు. 

16:27 - August 21, 2017

కృష్ణా : ఇప్పటి వరకు దొంగలు, బ్లేడ్‌ బ్యాచ్‌ల అరాచకాలతో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్న విజయవాడ వాసులను మరో సమస్య వేధిస్తోంది. బెజవాడలో విషజ్వరాలు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. కాలనీలకు కాలనీలు విషజ్వరాలతో అల్లాడుతున్నాయి. విజయవాడలో రోజురోజుకీ సమస్యలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. రోజూ కష్టపడితే గాని పూట గడవని పరిస్థితిలో ఉన్న ప్రజలను కరకట్ట ప్రాంతాల నుండి సొంత ఇళ్లు ఇస్తామని రాజరాజేశ్వరీపేటకు తరలించారు అధికారులు. సొంత ఇంట్లో సంతోషంగా బతకొచ్చని కలలుగన్న వారికి అడుగడుగునా సమస్యలు సుడిగుండంలా మారాయి. ఆ ప్రాంతం మాస్‌ కల్చర్‌గా మారడం, గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌, మందుబాబుల వీరంగాలతో కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా మరో సమస్య వచ్చిపడింది. వర్షాకాలం కావడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దీంతో విషజ్వరాలు ప్రబలి ప్రజలు మృత్యవాత పడుతున్నారు. తినడానికే పూట గడవని పరిస్థితిలో ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరగలేక, సర్కారీ మందులతో సరిపెట్టుకుంటున్నారు. అధికారులు సందర్శకుల్లా కాలనీలో తచ్చాడటం తప్పితే ఆపద సమయాల్లో కాలనీ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. పారిశుద్ద్య కార్మికులు అక్కడక్కడ బ్లీచింగ్‌ వేసి చేతులు దులుపుకుంటున్నారు.

చిన్నపిల్లలు అంతుచిక్కని జ్వరాలతో బాధపడుతున్నారు. గతంలో కూడా చాలా మంది చిన్నారులు జ్వరాలతో మృతి చెందినా అధికారుల తీరు మాత్రం మారలేదు. ఇదే కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనారోగ్యంతో మృతి చెందారు. ధనుంజయ, సోనియా దంపతులకు ఉన్న నలుగురు కుమారుల్లో విషజ్వరాల బారిన పడి చనిపోయారు. ఇప్పుడు యశ్వంత్‌ అనే మూడేళ్ల కుమారుడు కూడా జ్వరంతోనే చనిపోవడంతో ఆకుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇది ఒక యశ్వంత్‌ కుటుంబ సభ్యుల రోదనలే కావు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఇదే పరిస్థితి. రోడ్లపై పేరుకుపోయిన చెత్త తీయకపోవడం, శానిటేషన్‌ అధ్వాన్నంగా మారినా పట్టించుకోకపోవడం, జ్వరాలతో అల్లాడుతున్నా ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి గాని, ప్రజాప్రతినిధి గాని స్పందించలేదు.

న్యూ రాజరాజేశ్వరీ పేటలో విషజ్వరాలు ప్రబలుతున్నా అటు అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించడలేదని సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని అంటున్నారు. చనిపోయిన బాలుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిచాలన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాజరాజేశ్వరీపేటలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

16:24 - August 21, 2017

కృత్రిమ మేధస్సు.. రోబో మైండ్. రోబో మనిషి కాదు.. కానీ మనిషి కన్నా ఎక్కువ పనులు చేయగలదు. తన పనులతో అందరినీ అబ్బురపరచగలదు. ఎన్నో పనులను చిటికెలో చేయగలదు. కానీ దానివల్ల మనుషుల మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి. కంప్యూటర్లు వచ్చిన కొత్తలో.. ఇక చాలా ఉద్యోగాలు పోతాయని అందరూ తెగ భయపడిపోయారు. కానీ ఈ విషయంలో చాలా మంది అంచనాలు తలకిందులయ్యాయి. మొదట్లో కొంత ఇబ్బంది ఎదురైనా.. తరువాత ఉద్యోగాల సంఖ్య పెరిగింది. ఈ మార్పుకు ప్రజలు నెమ్మదిగా అలవాటు పడిపోయారు.

కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్‌ విప్లవం చాలా వేగంగా ప్రపంచాన్ని చుట్టు ముడుతున్నాయి. దీనివల్ల ఉద్యోగాలు పోతాయని, ఇప్పటికే ఎక్కువగా ఉన్న నిరుద్యోగ సమస్య ఇంకా పెరిగి పెద్దదవుతుందనే ఆందోళన మొదలైంది. మరి ఇది నిజమేనా? ఈ రోబోటిక్‌ విప్లవం వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినప్పటికీ.. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ స్థానంలో ఇంకా ఎక్కువ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు దొరికే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. కాకపోతే ఇందుకోసం ఎన్నో ఏర్పాట్లు చేయాలి. సాంకేతిక మార్పులకు అనుగుణంగా తగిన నైపుణ్యాన్ని నేర్చుకున్నవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.

రోబోలు ఉద్యోగాలు పోగొడుతాయా? రోబోల మేధస్సుతో పోలిస్తే.. మనుషుల ఆలోచన అంత తక్కువ స్థాయిలో ఉంటుందా? మరి వాటిని ఎదురుకోవడం ఎలా? ఏం చేస్తే రోబోలను దాటుకొని.. మనుషులకు ఉద్యోగం వస్తుంది. పని చేసే చోట ఒక రోబోట్‌ను ఏర్పాటు చేస్తే.. అక్కడ ఆరుగురు ఉద్యోగాలను పోగొట్టాల్సి వస్తుంది. ఉద్యోగాలు కోల్పోయినవారికి వెంటనే కొత్త ఉద్యోగాలు దొరకవు. కొత్త ఉద్యోగాలు చేయడానికి అవసరమైన నైపుణ్యం, పరిజ్ఞానం ఉండకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతుంది.

కృత్రిమ మేధస్సుతో కూడిన ఆటోమెషిన్‌ విస్తరించే కొద్దీ.. ఎక్కువ నైపుణ్యమున్నవారికే ఉద్యోగాలు, అధిక వేతనాలు లభిస్తాయి. మొదట ఈ ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన అనుభవం, విజ్ఞానం గల వారికి కొరత ఉంటుంది. కొత్త తరహా ఉద్యోగాల సంఖ్య మొదట్లో తక్కువగా ఉంటుంది. నెమ్మదిగా వీటి సంఖ్య పెరుగుతుంది. గతంలో ఇటువంటి సాంకేతిక మార్పులు వచ్చిన సందర్భాల్లో ఇది నిర్ధారణ అయ్యింది.

కృత్రిమ రోబోటిక్స్‌ తీసుకువస్తున్న మార్పులను నాలుగో పారిశ్రామిక విప్లవంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనివల్ల ప్రస్తుత వ్యవస్థలు, విధానాలు భారీగా మార్పులకు లోనవుతాయి. పాత తరహా పద్ధతులు, పనులు, ఉద్యోగాలకు కాలం చెల్లిపోతుంది. దీనివల్ల కొంతకాలం పాటు సాంఘిక అశాంతి చోటు చేసుకునే అవకాశం ఉంది. మనం రోజువారీ చేసే పనుల్లో.. చాలా పనులను కంప్యూటర్లు పూర్తి చేసే పరిస్థితి వస్తుంది.

మధ్యస్థంగా ఉండే ఉద్యోగాలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఓఈసీడీ అంచనా ప్రకారం అమెరికాలో 9 శాతం ఉద్యోగాలకు ఆటోమేషిన్‌తో ముప్పు ఎదురవుతుంది. వినూత్నంగా ఆలోచిస్తే గానీ వాటి నుంచి బయటపడటం సాధ్యం కాదు. చదువు, అనుభవం ద్వారా ఇలాంటి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనొచ్చు. దీన్ని అలవాటు చేసుకున్న వారు కృత్రిమ మేధస్సుతో కూడిన వాతావరణంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

రోబోల అభివృద్ధి నిర్ణయానికి వచ్చే ముందు ఒత్తిళ్లను, ఇష్టాఅయిష్టాలను పట్టించుకోకుండా వ్యవహరించాలి. ఒకే వ్యక్తి అన్ని పనులు చేయలేడు. బృందంగా ఎన్నో పనులు సాధించవచ్చు. ఒక వ్యక్తి తనలోని భావాలను, ఎదుటివారిలోని భావాలను గుర్తించగలిగే శక్తి ఉద్యోగార్ధుల్లో ఎంత ఉందనేది పరిశీలిస్తారు. హేతుబద్ధంగా విషయాన్ని చెప్పగలిగిన వ్యక్తికి ఇతరులతో పోలిస్తే ఎక్కువ విలువ ఉంటుంది. 

16:16 - August 21, 2017

చెన్నై : అందరూ ఊహించిందే జరిగిపోయింది. పళనీ..పన్నీర్ వర్గాలు కలుసుకున్నాయి. గత కొన్ని రోజులుగా తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. జయ మరణానంతరం రెండు వర్గాలుగా చీలిపోయాయి. శశికళ వర్గానికి పళనీ స్వామి నేతృత్వం వహించి సీఎం పదవిని అధిష్టించిన సంగతి తెలిసిందే. పన్నీర్ సెల్వం వర్గం తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయాలను వేడెక్కించాయి.

ఈ నేపథ్యంలో సోమవారం ఈపీఎస్..ఓపీఎస్ గ్రూపులు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొదటి నుంచి పన్నీర్‌ వర్గం శశికళను పార్టీ పదవి నుంచి తొలగించాలని కోరుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు పళనిస్వామి వర్గం కూడా సుముఖత వ్యక్తం చేసింది. కానీ వీరి విలీనానికి శశికళను తొలగింపు ప్రధాన అడ్డంకిగా మారింది.

చివరకు పార్టీలు ఒక్కటైపోయాయి. దీనితో తమిళనాడులో కొత్త రాజకీయానికి తెరలేచినట్లైంది. సాయంత్రం 5గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ విస్తరణలో డిప్యూటి సీఎంగా పన్నీర్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మసాచారం. మరోవైపు ప్రధాన కార్యదర్శి పదవి నుండి తొలగించడం పట్ల దినకరన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. 16 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. శశికళను పార్టీ పదవి నుంచి తొలగిస్తే ప్రభుత్వాన్ని అస్థిరపర్చుతామని దినకరన్‌ హెచ్చరిస్తున్నారు. 

పూజారి బీరువాలో కనిపించని ఉత్సవ విగ్రహం

నిర్మల్: బాసరలో ఉత్సవ విగ్రహం తరలింపు వివాదం కొనసాగుతుంది. తహశీల్దార్ ఆధ్వర్యంలో ప్రధాన పూజారి సంజీవ్ కుమార్ ఆధీనంలో ఉన్న బీరువాను ఆలయ సిబ్బంది తెరిచారు. అందులో ఉత్సవ విగ్రహం కనిపించకపోవడంతో మరో బీరువాను ఆలయసిబ్బంది తెరుస్తున్నారు. అయితే ఉత్సవ విగ్రహం బీరువాలో పెట్టినట్లు సంజీవ్ వెల్లడిస్తున్నారు.

26 న అమరావతికి ఉపరాష్ట్రపతి వెంకయ్య

అమరావతి: ఈనెల 26న అమరావతికి ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు రానున్నారు. అమరావతిలో రాష్ట ప్రభుత్వం తరపున ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. సన్మాన కార్యక్రమ అనంతరం రాష్ట్ర అర్బన్ హౌసింగ్ కార్యక్రమం లో పాల్గొని, సాయంత్రం తెనాలిలో పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెంకయ్య హాజరుకానున్నుట్లు తెలుస్తోంది.

మధ్యాహ్న భోజన పథకంలో కుళ్లిన గుడ్లు.. ఆందోళన

ప.గో: ఏలూరు సెయింట్ జేవియర్ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో కుళ్లిపోయిన గుడ్లను పంపిణీ చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

15:48 - August 21, 2017

అనంతపురం : తమ సమస్యలు తీర్చాలని రైతులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు స్పందించకపోవడంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుండగా మరికొందరు వినూత్నంగా నిరసన తెలియచేస్తూ అధికారుల అలసత్వాన్ని బాహ్య ప్రపంచానికి తెలియచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగే ఓ రైతు సెల్ టవర్ ఎక్కాడు. తనకు పాస్ బుక్ మంజూరు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఓ రైతు సెల్ టవర్ ఎక్కాడు. సమచారం అందుకున్న అధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకుని రైతుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పాస్ బుక్ ఇప్పించే విధంగా చేస్తామని అధికారులు పేర్కొన్నా ఆ రైతు వినిపించుకోలేదు. తనకు పాస్ బుక్ చూపిస్తే కాని కిందకు దిగి రానని రైతు తేల్చి చెప్పడంతో అధికారులు తల పట్టుకున్నారు. 

15:44 - August 21, 2017

పశ్చిమగోదావరి : నంద్యాలలో టిడిపికి ఓటు వేయొద్దు అంటూ తుందుర్రు మహిళలు పిలుపునిచ్చారు. తుందుర్రులో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. తాము టిడిపికి ఓటు వేసి తప్పు చేశామని..టిడిపిని గెలిపిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అలాంటి తప్పు నంద్యాల ప్రజలు చేయొద్దని సూచించారు. చీరలు లాగి..రోడ్లపై ఈడ్చి..లాఠీలతో కొట్టించి జైళ్లో పెట్టించిందని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా చేయాలని సూచించారు. 

15:41 - August 21, 2017

కర్నూలు : బీజేపీతో అక్కడ కౌగిలింతలు చేసుకుంటారని...నంద్యాల వచ్చే వరకు బీజేపీని టిడిపి దూరం పెడుతోందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికల్లో బీజేపీ జెండాలు కనిపించకుండా టిడిపి అధినేత చంద్రబాబు చాలా మానేజ్ చేసిందని, నంద్యాల ముస్లిం ఓట్లు పోతాయనే బీజేపీ దూరం ఉన్నట్లు చంద్రబాబు నటిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రభుత్వ వ్యతిరేకత చీలిపోయి టిడిపి లాభ పడుతుందని, ఈ విషయంలో నంద్యాల ఓటర్లు మెళుకవుగా ఉండాలని సూచించారు. 

ఉగ్రవాది అరెస్ట్..

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ లోని జైనపోరాలో భద్రతా బలగాలు నిర్వహించిన తనిఖీల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది షాహిద్ అహ్మద్ వానిని అరెస్టు చేశాయి. ఉగ్రవాది నుంచి ఒక చైనీస్ పిస్తోల్, 9 రౌండ్ల బుల్లెట్లు, ఒక మ్యాగజైన్ ను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూలోని గందేర్బాల్ లో ఉగ్రవాదుల స్థావరాన్ని బలగాలు ధ్వంసం చేశాయి. స్థావరం నుంచి ఒక ఏకే 56 రైఫిల్, 2 మాగజైన్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు బలగాలు తెలిపాయి.

సంతోషంగా విలీనానికి అంగీకరించా: పన్నీర్ సెల్వం....

చెన్నై: తమిళనాడు చరిత్రలో విడిపోయిన పార్టీలు ఏవీ తిరిగి కలవలేదని పళనిస్వామి అన్నారు. పార్టీ ఐకమత్యం కోసం శాయశక్తులా కృషి చేస్తాం అని పన్నీర్ సెల్వం ప్రకటించారు. నేటితో నా పై ఉన్న భారం తొలిగిపోయిందని, సంతోషంగా విలీనానికి అంగీకరించాని పన్నీర్ పేర్కొన్నారు.

సాయంత్రం 5 గంటలకు తమిళనాడు మంత్రివర్గ విస్తరణ

చెన్నై : ఆ రోజు సాయంత్ర 5 గంటలకు తమిళనాడు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. పళనిస్వామి కేబినెట్ లో పన్నీర్ సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తీసుకోనున్నారు. పన్నీర్ సెల్వంకు డిప్యూటీ సెఈం పదవిని కోరినట్లు సమాచారం.

15:34 - August 21, 2017

నంద్యాల : వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఫైర్ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా ఆమె ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాటల తూటాలు పేల్చారు. లోకేష్ కు అర్హత లేకున్నా మంత్రి పదవి కట్టబెట్టారని, ముస్లిం మైనార్టీ అభివృద్ధి అంటూ బాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని, ముస్లిం లీడర్లను పట్టించుకోలేదన్నారు. టిడిపిలో ప్రతిభావంతులైన ముస్లిం లీడర్లు ఉన్నా బాబు పట్టించుకోలేదని విమర్శించారు. 

జంతర్ మంతర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ధర్నా

ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద సిఐటియూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల చలో పార్లమెంట్ నిర్వహించి ధర్నా చేపట్టారు. వివిధ రాష్ట్రాల నుండి 5 వేల మంది ఆశా వర్కర్లు హాజరయ్యారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 19 వేలు అమలు చేయాలని, పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

15:28 - August 21, 2017

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జలకళ...

నిజామాబాద్ : రాష్ట్రంలో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1066.40 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు.

నంద్యాల ఉప ఎన్నిక పై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్‌: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో సోమవారం రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. కిరణ్‌బాబు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి అధికార పార్టీ ప్రచారం నిర్వహిస్తోందని పిటిషనర్‌ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ప్రలోభానికి గుర్తిచేస్తోందని తెలిపారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

15:23 - August 21, 2017

కర్నూలు : తన నాన్నపై లేనిపోని ఆరోపణలు చేశారని ఏపీ మంత్రి అఖిలప్రియ పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం నేడు సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మంత్రి అఖిల ప్రియ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె టెన్ టివితో మాట్లాడారు. చాలా బ్రహ్మాండంగా ప్రచారం నిర్వహించడం జరిగిందని, తాము చెప్పిన మాటలను ప్రజలు వింటున్నారని తెలిపారు. నీతి..అవినీతికి మధ్య పోటీ జరుగుతోందని, భారీ మెజార్టీతో గెలుస్తామని ఆమె జోస్యం చెప్పారు. అప్పుడు మాట్లాడలేని వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నారని, రాజకీయ విషయంలో చాలా చిన్నవారమని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో మాట్లాడాలే కానీ వ్యక్తిగతంగా విమర్శించడం సబబు కాదన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:20 - August 21, 2017

తుందుర్రులో భారీ ర్యాలీ....

ప.గో: తుందుర్రులో ఆక్వాఫుడ్ ఫార్క్ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి కి ఓటు వేయొద్దంటూ పిలుపునిచ్చారు. మేం చేసిన తప్పు మీరు చేయొద్దని నంద్యాల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

15:08 - August 21, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు తీసుకున్నాయి. గత కొన్ని రోజులుగా రాజకీయాలు రోజుకో విధంగా టర్నింగ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం కొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకున్నాయి. ఈపీఎస్..ఓపీఎస్ గ్రూపులు విలీనం కావడానికి రంగం సిద్ధమౌతోంది. ఉదయం నుండి ఈ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. విలినానికి సంబంధించి పన్నీర్ సెల్వం పలు డిమాండ్స్ వినిపిస్తున్నారు. పార్టీ నుండి శశికళను..దినకర్ లను తొలగించాలని..ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని..కేబినెట్ మూడు మంత్రి పదవులు ఇవ్వాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శశికళను తొలగిస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని పళని పేర్కొంటున్నట్లు సమాచారం. అందులో భాగంగా అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి పన్నీర్ సెల్వం చేరుకున్నారు.

కాసేపట్లో పన్నీర్ - పళని వర్గాలు భేటీ కానున్నాయి. ఇదిలా ఉంటే దినకరన్ కూడా వ్యూహాలు రచిస్తున్నారు. ఆయన వెంట 15 మంది ఎమ్మెల్యేలున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. రాజకీయ సమీక్షరణాలు మారుతున్న నేపథ్యంలో గవర్నర్ చెన్నైలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. పన్నీర్..పళనీ వర్గాలకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు, నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం జరుగనున్నట్లు సమాచారం. 

పాస్ బుక్ ఇవ్వడం లేదని సెల్ టెవర్ ఎక్కిన రైతు

అనంతపురం: సింగనమల మండలం మరువకొమ్మ క్రాస్ దగ్గర ముదిరేపల్లికి చెందిన రైతు వెంకట సుబ్బయ్య సెల్ టవర్ ఎక్కాడు. తనకు పాస్ పుస్తకం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు.

14:55 - August 21, 2017

ఆదివాసీలు అమాయకత్వానికి నిజాయితికి మారు పేరు. అడవితల్లి ముద్దుబిడ్డలుగా అడవినే నమ్ముకుని జీవించడానికే వారు ఇష్ట పడుతుంటారు. కష్టమైనా..నష్టమైనా అడవి తల్లి ఒడిలో ఆనందంగా జీవితం కొనసాగిస్తుంటారు. లింగ వివక్ష లేని స్వచ్చమైన సంప్రదాయలు ఆదివాసీల ప్రత్యేకత. అడవి నుండి వారిని వేరుగా చూడలేం. ఈ నేపథ్యంలో ఆదివాసీల చదువుల తల్లిగా ఎదిగిన ఓ అమ్మాయి కథనం..మానవి 'స్పూర్తి'లో..మరి ఆ అమ్మాయి ఎవరు ? తదితర వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

పన్నీర్ సెల్వం కాసేపట్లో ప్రమాణ స్వీకారం

చెన్నై: అన్నాడీఎంకే లో రెండు వర్గాలు విలనమయ్యేందుకు సన్నద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్నాడీఎంకే పార్టీ కార్యలయానికి పన్నీర్ సెల్వం బయల్దేరారు. కాసేపట్లో మంత్రి వర్గ విస్తరణ, ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజావైద్యనాథన్ గవర్నర్ తో సమావేశమయ్యారు.

 

14:51 - August 21, 2017
14:37 - August 21, 2017

ఢిల్లీ : హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ను ఇందిరాపార్క్‌ దగ్గరే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ చేపట్టిన ఆందోళన దేశ రాజధానికి చేరింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఢిల్లీకి చేరి... జంతర్‌మంతర్‌ దగ్గర ధర్నా నిర్వహించారు. సీతారాం ఏచూరి.. తమ్మినేని వీరభద్రం..సురవరం సుధాకర్‌రెడ్డి, చాడా వెంకట్‌రెడ్డి వంటి నాయకులు ధర్నాకు హాజరై... తెలంగాణ సర్కార్‌ అవలంబిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య గొంతును నొక్కేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని .. విమర్శించారు.

గొంతు నొక్కేందుకే..
కేసీఆర్‌కు తెలంగాణ హిట్లర్‌ అవార్డు ఇవ్వాలని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఢిల్లీలో ధర్నా చౌక్‌ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. హైదరాబాద్‌లో ధర్నా చౌక్‌ను ఎత్తివేయడం ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడమే అవుతుందని తమ్మినేని అన్నారు. అలాగే.. ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకు.. తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తుందని సీపీఐ నాయకుడు చాడా వెంకట్‌ రెడ్డి విమర్శించారు.

14:36 - August 21, 2017

హైదరాబాద్: సి. కల్యాణ్ నిర్మాణంలో, కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య 102వ సినిమా తెరకెక్కుతోంది. బాలయ్య సరసన అందాల తార నయనతార నటిస్తోంది. సింహా, శ్రీరామ రాజ్యం సినిమాల తర్వాత మూడో సారి బాలయ్యతో జత కడుతున్న ఈ భామ.. తాజా సినిమాలో మరింత అందంగా కనిపించబోతోంది. టాలీవుడ్ స్టయిలిస్ట్ నీరజా కోన సెట్స్‌లో నయనతారతో దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. బాలయ్య 102వ సినిమాలో నయనతార లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో బాలయ్య-నయనతార జోడీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

14:35 - August 21, 2017

కరీంనగర్ : సింగరేణిలో ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్‌ 5 నుండి ఎన్నికలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ డిప్యూటి లేబర్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌ అధ్యక్షతన సింగరేణి అధికారులు, కార్మిక సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్‌ 14 నుండి నామినేషన్‌లు ఉపసంహరించనున్నారు. 20ను పార్టీలకు గుర్తును కేటాయిస్తున్నట్లు తెలిపారు. అయితే ఏడాది తర్వాత మళ్లీ సింగరేణిలో ఎన్నికలు జరుగనున్నాయి.

 

14:34 - August 21, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం ఎప్పుడో ఖాయమైపోయిందని ఆపార్టీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి తెలిపారు. 30వేల మెజార్టీతో తమ అభ్యర్థి గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్నారు. మరింతసమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:31 - August 21, 2017

చెన్నై : బెంగళూరులోని పరప్పన జైలులో తమిళనాడు దివంగత సిఎం జయలలిత నెచ్చెలి శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నారని ఆరోపణలు చేసిన ఐపిఎస్‌ అధికారిణి రూప దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టారు. జైలులోని సిసిటివి ఫుటేజీని అవివీతి నిరోధక శాఖకు అందజేశారు. శశికళ, ఆమె బంధువు ఇళవరసి జైలు బయటకి వెళ్లి.. కొద్దిసేపటి తర్వాత లోపలికి వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇద్దరూ జైలు దుస్తుల్లో కాకుండా సాధారణ దుస్తుల్లో ఉండడడం గమనార్హం. శశికళ వెంట ఓ బ్యాగ్‌ ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. శశికళ అధికారులకు లంచం ఇచ్చి జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారని జైళ్ల శాఖ డిఐజిగా ఉన్న సమయంలో రూప ఆరోపణలు చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఆమెను ట్రాఫిక్‌ విభాగానికి బదిలీచేశారు. అక్రమ ఆస్తుల కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

14:30 - August 21, 2017

చెన్నై : తమిళనాడులో రాజకీయం మరింతగా వేడెక్కుతోంది. పన్నీరు - పళనిస్వామి కలయికకు మరో సమస్య అడ్డుతగిలింది. మొదటి నుంచి పన్నీర్‌ వర్గం శశికళను పార్టీ పదవి నుంచి తొలగించాలని కోరుతోంది. ఇందుకు పళనిస్వామి వర్గం కూడా సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ రెండు వర్గాలు విలీనైపోతాయని ప్రచారం జరిగింది. కానీ వీరి విలీనానికి శశికళను తొలగింపే ప్రధాన అడ్డంకిగా మారింది. శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడం కుదరదని పళనిస్వామి తేల్చిచెప్పారు. మరోవైపు దినకరన్‌ ఇంటికి ఎమ్మెల్యేలు క్యూకడుతున్నారు. శశికళను పార్టీ పదవి నుంచి తొలగిస్తే ప్రభుత్వాన్ని అస్థిరపర్చుతామని దినకరన్‌ హెచ్చరిస్తున్నారు. దీంతో తమిళ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. 

హీటెక్కుతోన్న తమిళ రాజకీయం

చెన్నై : తమిళ రాజకీయం హీటెక్కుతోంది. పన్నీరు, పళని స్వామి కలయికకు మరో సమస్య ఎదురైది. శశికళను పార్టీ పదవి నుంచి తొలగింస్తూ అధికారికంగా ప్రకటించాలని పన్నీర్ సెల్వం అన్నారు. ఈ విషయంపై పళనిస్వామి స్పందిస్తూ శశికళను పార్టీ పదవి నుంచి తొలగించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. దినకరన్ ఇంటికి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. కన్నీరు, పళనిస్వామి కలవకుండా దినకరన్ వ్యూహాలు చేస్తున్నారంటూ అరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తామంటూ దినకరన్ హెచ్చరిక జారిచేశారు.

ఫసల్ బీమా పథకంపై ప్రధాని సమీక్ష...

న్యూఢిల్లీ: వ్య‌వ‌సాయ రంగానికి చెందిన సాయిల్‌ హెల్త్ కార్డులు, ఫ‌స‌ల్ బీమా యోజ‌న ప‌థ‌కాలపై ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. మొద‌టి ద‌శలో ఇప్ప‌టివర‌కు 16 రాష్ట్రాల్లో సాయిల్ హెల్త్ కార్డుల‌ను జారీ చేసిన‌ట్లు అధికారులు ప్ర‌ధాని మోదీకి తెలియ‌జేశారు. మ‌రికొన్ని వారాల్లోనే మిగితా రాష్ట్రాల్లో ఈ స్కీమ్‌ను పూర్తి చేయ‌నున్న‌ట్లు అధికారులు చెప్పారు. వే

అక్సిజన్ అందక చిన్నారులు మృతి

ఛత్తీస్ గఢ్ : రాయపూర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. కలుషిత నీరు తాగడంతో అస్వస్థతకు గురై పది మంది చిన్నారులు అదివారం ఆస్పత్రిలో చేరారు. అందులో ముగ్గురు చిన్నారులు అక్సిజన్ అందక మృతి చెందారు. చిన్నారులు మృతి పై సీఎం రమణ్ సింగ్ విచారణకు ఆదేశించారు.

 

 

'ప్రభుత్వ చర్యలకు నిరసనగా రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె'

హైదరాబాద్: ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ చర్యలకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నామని బ్యాంక్ యూనియన్ కన్వీనర్ ఎస్ ఆర్ శర్మ తెలిపారు. 80 శాతం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేలా ప్రభుత్వ చర్యలకు నిరసనగా, బ్యాంకు రుణాలను ఎగవేస్తున్న కార్పొరేట్ల ను కఠినంగా శిక్షించేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు.

 

13:43 - August 21, 2017

రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

హైదరాబాద్: రేపు దేశవ్యాప్తంగా ప్రబుత్వ బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. ఈ సమ్మెలో 10 లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. దీంతో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి.

13:41 - August 21, 2017

హైదరాబాద్ : అనంతరం మాట్లాడిన ఉపరాష్ట్రపతి వెంకయ్య.. తెలుగు రాష్ట్రాలు రెండూ సహకరించుకుంటూ అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. రాష్ట్రవిభజన జరిగింది ఒకరికి వ్యతిరేకంగా కాదన్నారు. తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించడానికేనని తెలిపారు. కలిసి కలహించుకోవడంకన్నా... విడిపోసి సహకరించుకోవడం మిన్నని సూచించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు సహజమేనని... వాటిని సీఎంలు కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఇద్దరు సీఎంలు వ్యహరించాలన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒకటేనని.. తెలుగువారైనందుకు గర్వించాలన్నారు.

సింగరేణి లో ఎన్నికల నగారా

కరీంనగర్ : సింగరేణి లో ఎన్నిక నగారా మోగింది. అకోటబ్ర్ 5న ఎన్నికలు జరగనుండగా, సెప్టెంబర్ 14 నుంచి నామినేషన్ల ప్రకియ, 19న నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది. 20న గుర్తు లు కేటాయించనున్నారు. ఏడాది తర్వాత సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరగుతున్నాయి.

13:40 - August 21, 2017

హైదరాబాద్ : వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించడం తెలుగుజాతికే గర్వకారణమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వెంకయ్య ఈ స్థాయికి ఎదగటం వెనుక ఎంతో కఠోర శ్రమ ఉందన్నారు. తెలుగుజాతికి ఎన్టీఆర్‌ దేశస్థాయిలో గుర్తింపు తీసుకొస్తే... దాన్ని వెంకయ్యనాయుడు మరింతగా ఇనుమడింపచేశారని కొనియాడారు. వెంకయ్య ఉపరాష్ట్రపతి అవ్వడంతో ఆ పదవికే వన్నెవచ్చిందన్నారు. వెంకయ్యనాయుడిని సన్మానించుకోవడం తెలుగువారందరికీ శుభదినమని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. తానుకూడా వెంకయ్య ప్రసంగాలతో స్ఫూర్తిపొందానని గుర్తు చేసుకున్నారు. ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్య వన్నెతెస్తారని ఆయన ఆకాంక్షించారు. 

పోలవరం సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: పోలవరం పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం పనులు వర్చువల్ ఇన్ స్పెక్షన్ ద్వారా చంద్రబాబు పరిశీలించారు.

13:36 - August 21, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడుకు ఘనంగా పౌరసన్మానం జరిగింది. వెంకయ్యకు సీఎం కేసీఆర్ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. వేదపండితులు వెంకయ్యను ఆశీర్వదించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ వేడుకకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహముద్ అలీ, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 

13:33 - August 21, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శిల్పా మోహన్‌రెడ్డి మోసాలపై దళితులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని... వారికి న్యాయం చేస్తామని తెలిపారు. నంద్యాలలో ప్రజలు తమవెంటే ఉన్నారని నక్కా ఆనంద్‌బాబు అన్నారు. మరిన్ని వివరాలకు వీడియో చూడండి. 

13:32 - August 21, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో అధికార టీడీపీ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తోందని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తానమని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:31 - August 21, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి అధికారపార్టీ విచ్చల విడిగా డబ్బులు పంచుతోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బహిరంగంగా డబ్బులు పంచుతోంటే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్స్‌లో తనిఖీలు నిర్వహిస్తే కోట్లాది రూపాయలు బయటపడుతాయని రోజా అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

రాజకీయంగా పెరిగింది, ఒదిగింది తెలంగాణలోనే: వెంకయ్య

హైదరాబాద్:  రాజకీయంగా పెరిగింది, ఒదిగింది తెలంగాణలోనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడ అన్నారు. రాజ్ భవన్ లో వెంకయ్యకు టీసర్కార్ ఆధ్వర్యంలో పౌరసన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రజలకు అర్థమైన భాషలో పరిపాలన సాగలని సూచించారు.  తెలంగాణ, ఏపీ కలిసి ముందుకు సాగాలని అన్నారు. సాహిత్య ప్రపంచలో సినారె రారాజు అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు విష్టమైనవని, ఇరు రాష్టాల సీఎంలు తెలుగు భాషా ప్రాధాన్యాత తగ్గకుండా వ్యవహారిక పరిపాలన భాషగా అమలు చేయాలి అని వెంకయ్య అన్నారు. ఇతర భాషలకు మేం వ్యతిరేకం కాదని, భాషాభావం కలిసి ఉండాలని ఆయన సూచించారు.

13:21 - August 21, 2017

ఒక‌ప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేసి, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ త‌న‌కంటూ క్రేజ్ సంపాదించుకుంటున్న‌ గోవా బ్యూటీ ఇలియానాకు కోప‌మొచ్చింది. త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన అభిమానికి ట్విట్ట‌ర్‌లో క్లాస్ తీసుకుంది. తాను పబ్లిక్ ఫిగ‌ర్‌నే త‌ప్ప ప‌బ్లిక్ ప్రాప‌ర్టీ కాదంటూ కాస్త ఘాటుగానే స్పందించింది. మ‌న‌మో నీచ‌మైన ప్ర‌పంచంలో బ‌తుకుతున్నామ‌ని ఇలియానా ట్వీట్ చేసింది. తాను హీరోయినే అయినా.. ఓ ఆడ‌దాన్నే అంటూ ఆ అభిమానికి లెఫ్ట్ అండ్ రైట్ వాయించింది. నేనో మహిళను..దయచేసి మహిళలను గౌరవప్రదంగా చూడండి అని కోరింది. అయితే ఏ సందర్భంలో సదరు ఫ్యాన్ ఈమె పట్ల మిస్ బిహేవ్ చేశాడో తెలియలేదు. గతంలో విద్యా బాలన్, స్వర భాస్కర కూడా ఇలా తమ అభిమానుల అసభ్య ప్రవర్తనపై మండిపడినవాళ్ళే .

13:20 - August 21, 2017

హైదరాబాద్: దాదాపు 50 చిత్రాల్లో బాలనటుడిగా తెరపై కనువిందు చేసిన బాలనటుడు మాస్టర్‌ తేజ... ఇప్పుడు అతడు హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. బెక్కెం వేణుగోపాల్‌(గోపి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి సంస్థలో దర్శకత్వం విభాగంలో ఎనిమిదేళ్లు పనిచేసిన హరి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత గోపి మాట్లాడుతూ.. ‘కథ అద్భుతంగా కుదిరింది. పల్లెటూరి నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ఇది. కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. సెప్టెంబరు 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది. ‘ఉయ్యాల జంపాల’, ‘స్వామిరారా’ చిత్రాలకు స్వరాలు సమకూర్చిన సంగీత దర్శకుడు ఎం.ఆర్‌.సన్నీ దీనికి బాణీలు సమకూరుస్తున్నారు.

13:10 - August 21, 2017

చెన్నై : అన్నాడీంఎకే ప్రధాన కార్యదర్శి శశికళ ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. పన్నీర్ సెల్వం, పళని స్వామి వర్గాలు విలీనం తర్వాత శశికళను తొలగిస్తూ తీర్మానం చేయనున్నారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

కేసీఆర్ దొరల తెలంగాణ సృష్టిస్తున్నారు: వీహెచ్

ఢిల్లీ: ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి ధర్నా చౌక్ ఉండాలని, ధర్నా చౌక్ కోసం పోరాడుతామని వీహెచ్ అన్నారు. ఢిల్లీలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నా లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అందరూ కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలపై పోరాడాలన్నారు. నిషేధం లేదంటూనే ధర్నా చౌక్ లో నిషేధం లేదంటూనే ధర్నా చౌక్ లో టెంట్లు, మైక్ లు పీకేస్తున్నారని, న్యాయవ్యవస్థ దీనిపై దృష్టి పెట్టానని వీహెచ్ సూచించారు. కేసీఆర్ దొరల తెలంగాణ సృష్టిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ లో టీఆర్ ఎస్ ను విలీనం చేయకుండా దిగ్విజయ్ తప్పు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపన్యాసాన్ని పండించడంలో వెంకయ్య దిట్ట: కేసీఆర్

హైరదరాబాద్: ప్రజల తరుపున ఉపరాష్ట్రపతి వెంకయ్యకు సీఎం కేసీఆర్ కృతజ్ఙతలు తెలిపారు. రాజ్ భవన్ లో టీ సర్కార్ ఆధ్వర్యంలో పౌర సన్మాన కార్యక్రమంజరిగింది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ... ఉపన్యాసాన్ని పండించడంలో వెంకయ్య దిట్ట అని పేర్కొన్నారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి ఉన్నతమైన స్థాయిని పొందారని కేసీఆర్ తెలిపారు.

 

12:32 - August 21, 2017

వంటకాలకు రుచి, వాసన రావాలంటే కొతిమీర ఆ వంటల్లో కొతిమీర ఆకు వేయాల్సిందే. చూడడానికి సున్నితంగా, మంచి లేత ఆకుపచ్చని రంగు మంచి వాసనతో ఇట్లే ఆకర్షిస్తుంది కొతిమీర ఆకులు. ప్రతినిత్యం మనం వంటకాలలో వాడే కొతిమీర వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం.

కొత్తిమీరలో పొటాషియం, ఇనుము, విటమిన్ ఎ, కె మరియు C, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం మరియు కాల్షియం అధికంగా ఉన్నాయి. దీనికి ఉన్న ఔషధ లక్షణాల వలన దీనిని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. మనలో జీర్ణక్రియ సజావుగా జరిగేట్లుగా చేస్తాయి. మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి. జీర్ణక్రియకు కావాలిసిన యంజైమ్స్ మరియు రసాల ఉత్పత్తి చేయటంలో సహాయపడతాయి.

కొత్తిమీరలో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ సి, విటమిన్ ఎ మరియు బేటా-కెరోటిన్ వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి. కొత్తిమీర ఆకులు మరియు ధనియాల్లో మనకు రోజువారీ మధుమేహంతో బాధపడేవారు రోజూ క్రమం తప్పకుండా కొత్తిమీర రసం త్రాగితే మంచిది.

కలుషిత ఆహారం, నీరు వల్ల కలిగే కలరా, టైఫాయిడ్, విరేచనాలు వంటి వ్యాధులు కూడా రోజూ మీరు కొత్తిమీరను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే, ఆ వ్యాధులు మీ దరిదాపుల్లోకి కూడా రావు.

దీనిలో ఐరన్ పదార్ధం ఎక్కువగా ఉండటం వలన, ముఖ్యంగా స్త్రీలు కొత్తిమీర ఎక్కువగా తీసుకోవటం చాలా మంచిది. స్త్రీల ఋతుక్రమంలో, వారు రక్తాన్ని కోల్పోతుంటారు. దీనివలన స్త్రీలలో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు తీసుకునే ఆహారంలో కొత్తిమీర ఎక్కువగా వాడటం వలన ఈ లోపాన్ని చాలావరకు సరిదిద్దుకోవచ్చు.

కొత్తిమీరవాడకం వలన కండ్లకలక, కళ్ళఎరుపు, దురద మరియు వాపు వంటి వాటికి ఉత్తమ ఉపశమనం కలుగుతుందని పరిశోధనలు చెపుతున్నాయి. కొత్తిమీర తామర, దురద చర్మం, దద్దుర్లు మరియు మంట వంటి వివిధ చర్మ వ్యాధుల ఉపశమనానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉడికించిన కొత్తిమీర నీటితో పుక్కిలించి ఉమ్మివేయటం వలన నోటిపూత నయమవుతుంది.

ధనియాలు లేదా కొత్తిమీర పేస్ట్ కు కొద్దిగా తేనె, పసుపు కలపండి. ఈ పేస్ట్ ను ముఖానికి మాస్క్ లాగా వేయండి. ఇలా చేయటం వలన ముఖం మీద ఉండే మొటిమలు, ఆక్నే, బ్లాక్ హెడ్స్ వంటివి మటుమాయమవుతాయి.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న కొత్తిమీర, ధనియాలను ఎక్కువగా తీసుకున్నందువలన అప్రయోజనాలు కూడా ఉన్నాయండోయి! వీటిని ఎక్కువగా తీసుకుంటే లివర్ లో సమస్యలు మొదలవుతాయి. గర్భిణి స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా వీటిని తీసుకోకుండా ఉండటమే మంచిది. తీసుకున్నా చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

వెంకయ్యకు సన్మానం గర్వంచదగ్గ విషయం: దత్తాత్రేయ

హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి వెంకయ్య సన్మానం తెలంగాణ ప్రజలు గర్వంచదగ్గ విషయం అని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. రాజ్ భవన్ లో వెంకయ్య నాయుడికి తెలంగాణ సర్కార్ పౌర సన్మానం నిర్వహించింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ..అనుక్షణం సమాజాభివృద్ధికి పాటుపడిన వ్యక్తి వెంకయ్య అని అయన పేర్కొన్నారు.

 

రైతుల సమస్యల పరిష్కారానికి కమిషన్ : హైకోర్టు

హైదరాబాద్ : తెలంగాణలో రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. ఐదుగురు సభ్యులతో కూడిన కమిషన్ ఏర్పాటు చేసి, అందులో ఒకరు హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఉండాలని న్యాయస్థానం సూచించింది. రైతుల సమస్యల పరిష్కరించాలని గతంలో బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి పిటిషన్ విషయం తెలిసిందే.

 

నంద్యాల నుంచి వెళ్లిపోవాలి: కలెక్టర్

నంద్యాల: ఈ రోజు సాయంత్రంతో నంద్యాల ఉపఎన్నిక ప్రచారం ముగుస్తుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు స్థానికేతరులు నంద్యాల నుంచి వెళ్లిపోవాలని కలెక్టర్ సూర్యనారాయణ సూచించారు. అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యకు పౌరసన్మానం...

హైదరాబాద్: రాజ్ భవన్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పౌరసన్మాన కార్యక్రమం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం తరపున వెంకయ్యకు సన్మానం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ముస్లిం ఓట్ల కోసం తెరవెనుక రాజకీయం: శిల్పామోహన్

కర్నూలు : ముస్లిం ఓట్ల కోసం బీజెపీ తో టీడీపీ తెరవెనుక రాజకీయం చేస్తోందని నంద్యాల వైసీపీ అభ్యర్థ శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. అమె 10టీవీతో మాట్లాడుతూ.....కాకినాడలో టీడీపీ బీజేపీతో పొత్తు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఇది ముస్లిం సోదరులు గుర్తించాలి అని సూచించారు.

నేటితో ముగియనున్న నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం...

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలకు ఈ రోజు సాయంత్రం తో ముగియనుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు స్థానికేతరులు నంద్యాల నుంచి వెళ్లి పోవాలని కలెక్టర్ సూర్యనారాయణ ఆదేశించారు.

ముస్లిం ఓట్ల కోసం బిజెపితో టిడిపి తెరవెనుక రాజకీయం: శిల్పా

కర్నూలు : ముస్లిం ఓట్ల కోసం బిజెపితో టిడిపి తెరవెనుక రాజకీయం చేస్తోందని నంద్యా ల వైసీపీ అభ్యర్థి మోహన్ రెడ్డి అన్నారు. ఆయన '10టివి'తో మాట్లాడుతూ... కాకినాడలో బిజెపితో పొత్తు కొనసాగుతుందని, దీన్ని ముస్లిం సోదరులు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

11:41 - August 21, 2017

కాసేపట్లో వెంకయ్యకి పౌరసన్మానం

హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్ భవన్ కు చేరుకున్నారు. కాసేపట్లో టీఎస్ ప్రభుత్వం తరపున వెంకయ్యకి పౌరసన్మానం జరగనుంది.

11:39 - August 21, 2017

చెన్నై : జయలలిత మరణం తర్వాత పళని, పన్నీరు రెండు వర్గాలుగా చీలిన అన్నాడీంఎకే పార్టీ నేడు విలీనం కాబోతున్నాయి. మధ్యాహ్నం 3గంటలకు రాజ్ భవన్ లో డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణస్వీకారం చేయనున్నారు. పన్నీర్ తో పాటు ఆయన వర్గానికి చెందిన మాఫై, సెంగొట్టియన్ లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీని కంటే ముందు శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తూ తీర్మానం చేసే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రిగా పన్నీర్ సెల్వం!

చెన్నై : రాజ్ భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రి గా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అలాగే పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన మాఫై, సెంగొట్టియన్ లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.

ప్రతినెలా 100 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి : ఎపీ సీఎం

అమరావతి : ప్రతి మండలంలో ప్రతినెలా 100ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. 2016-17 మంజూరైన 76 వేల ఇళ్ల నిర్మాణం పూర్తైందని, 3.20లక్షల ఇళ్లు మంజూరు చేయాల్సివుందని సీఎం పేర్కొన్నారు. లబ్దిదాల ఎంపిక వెంటనే జరపాలని సూచించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురంలో పశ్రుగ్రాస కేత్రాల అభివృద్ధి మరింత పెరగాలని అన్నారు.వ్యర్ధాల నుంచి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి భూముల గుర్తింపు పనులు వేగవంతం కావాలని ఆయన తెలిపారు. స్వచ్ఛ ఏపీకి సంబంధించి ఉన్నత ప్రమాణాలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

శశికళ వీవీఐపీ ట్రీట్ మెంట్ ఆధారాలు సమర్పించిన రూప...

బెంగళూరు: అక్రమాస్తుల కేసులో కర్ణాటలో జైల్లో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు రాజభోగాలు అందుతున్నాయంటూ ఆరోపణలు చేసిన ఐపీఎస్‌ అధికారిణి రూప దానికి తగిన ఆధారాలు బయటపెట్టారు. శశికళ అధికారులకు లంచం ఇచ్చి జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారని రూప గతంలో ఆరోపణలు చేశారు. దీనిపై కర్ణాటకలో పెద్ద దుమారమే రేగింది. రూప అప్పుడు జైళ్ల శాఖ డీఐజీ హోదాలో ఉన్నారు. రూప ఆరోపణలపై ఆగ్రహించిన ఉన్నతాధికారులు ఆమెను ట్రాఫిక్‌ విభాగానికి బదిలీ చేశారు. అయితే తాజాగా రూప తన ఆరోపణలకు సంబంధించిన సీసీ కెమెరా పుటేజీని అవినీతి నిరోధక శాఖ విభాగానికి అందజేశారు.

మాలేగావ్ పేలుళ్ల కేసులో కల్నల్ పురోహిత్ కు బెయిల్

ఢిల్లీ: మాలేగావ్ పేలుళ్ల కేసులో కల్నల్ పురోహిత్ కు బెయిల్ మంజూరు అయ్యింది. షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. పురోహిత్ కు బెయిల్ ఇవ్వడంపై ఎన్ ఐఏ వ్యతిరేకించింది. 2008 పేలుళ్ల కేసులో పురోహిత్ 9 ఏళ్లు జైలు జీవితం గడిపాడు.

11:23 - August 21, 2017

ఢిల్లీ : కేసీఆర్ పరిపాలనలో ప్రజాస్వామ్యం లేదని, పాదయాత్ర చేసుకుంటమంటే అనుమతి ఇవ్వడంలేదని తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా చౌక్  నిర్భందిస్తామని చెప్పి మరి చేశామని, ధర్నా చౌక్ పునరుద్ధరించే వరకు పోరాటం ఆగదని, ఖబర్దార్ కేసీఆర్ అని తమ్మినేని హెచ్చరించారు. రాష్ట్రంలో డ్రగ్స్ చిన్న పిల్లలకు సరఫరా చేసే పరిస్థితి వచ్చిందని,  యాదాద్రి జిల్లాలో రాంకీ కంపెనీ పెద్ద మొత్తంలో భూమి కాజేయాలని చూసిందని ఆయన అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:22 - August 21, 2017

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా వస్తున్న సినిమా ‘మహానటి’లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ‘సావిత్రి’ కెరీర్‌ని నాడు తీర్చిదిద్దిన నిర్మాత చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించబోతున్నాడు. విజయ వాహినీ స్టూడియో బ్యానర్స్‌లో భాగస్వామిగా, రచయిత, విమర్శకుడిగా చక్రపాణి మార్క్ ఆ తరానికి తెలిసిందే. కీర్తి సురేష్ మెయిన్ లీడ్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో సమంత, దుల్కర్ సల్మాన్ ప్రధాన తారాగణం. అశ్వినీదత్ అల్లుడు నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.

నేడు బిజెపి పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ : బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎం లతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా మరికాసేపట్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి 13 రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర కేబినెట్ లోని కొందరు కీలకమంత్రులు హాజరుకానున్నారు. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి.

ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ఘనస్వాగతం

హైదరాబాద్: ఉపరాష్ట్రపతి గా ఎన్నికై మొదటిసారిగా హైదరాబాద్ కు వచ్చిన వెంకయ్యనాయుడుకు ఘన స్వాగతం లభించింది. సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ,మంత్రులు ఆయనకు బేగంపేట పోర్టులో ఘన స్వాగతం పలికారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు: ఇద్దరి మృతి

న్యూఢిల్లీ : ఢిల్లీకి సమీపంలోని అలీపూర్ వద్ద సోమవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పశుగ్రాస క్షేత్రాల అభివృద్ధి మరింత పెరగాలి: సీఎం చంద్రబాబు

గుంటూరు: ప్రకాశం, నెల్లూరు, అనంతపురంలో పశుగ్రాస క్షేత్రాల అభివృద్ధి మరింత పెరగాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి భూముల గుర్తింపు వేగవంతం కావాలని సీఎం సూచించారు. స్వచ్చ ఏపీకి సబంధించి ఉన్నత ప్రమాణాలను ప్రోత్సహించాలన్నారు. అక్టోబర్ 2న అవార్డులిచ్చి సత్కరించాలన్నారు.

11:04 - August 21, 2017

ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజీ

తూ.గో : సఖినేటిపల్లి మండలం బెల్లంకొండవారిపాలెంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజీ అయింది. స్థానికుల సమాచారంతో అధికారులు అప్రమత్తమై గ్యాస్ సరఫరాను అధికారులు నిలిపివేశారు.

 

నేడు విలీనం పై ప్రకటన చేయనున్న పళని, పన్నీరు వర్గాలు

తమిళనాడు : అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనంపై నేడు ఇరువర్గాల నేతలు ప్రకటన చేయనున్నారు. మధ్యాహ్నం అన్నాడీఎంకే కార్యాలయంలో పళనీస్వామి, పన్నీర్ సెల్వం సమావేశంకానున్నారు. చర్చల అనంతరం విలీనంపై ఇరువర్గాల నేతలు అధికారికంగా ప్రకటన చేయనున్నారు. పన్నీర్ వర్గంలోని ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందిని సమాచారం రావడంతో ఈ విషయం చర్చనియమైన అంశంగా మరింది. 

10:26 - August 21, 2017

ఢిల్లీ : హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ పునరిద్ధరించాలని ధర్నా చౌక్ పరిరక్షణ సమితి కాసేపట్లో దేశ రాజధానిలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. వీరి ధర్నాకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ఏన్సీపీ అధినేత శరద్ పవార్ మద్దతు తెలపనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

10:14 - August 21, 2017

కర్నూలు : జిల్లా నంద్యాల ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. నేటితో ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. 23న పోలింగ్‌ జరుగనుంది. ఈనెల 28న ఓట్లను లెక్కిస్తారు. దీంతో ఇప్పటికే ప్రభుత్వం నంద్యాల కేంద్ర బలగాలను మోహరించింది. దాదాపు 3,500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రచారం నేటితో ముగియనుండడంతో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఇరుపార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

10:09 - August 21, 2017

హైదరాబాద్ : విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీఆర్ కే ప్రసాద్‌ కన్నుమూశారు. శనివారం రాత్రి గుండెపోటు రావడంతో బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ అక్కడే తుదిశ్వాస విడిచారు. కాసేపట్లో హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గతంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక అధికారిగా ఆయన పనిచేశారు. తిరుమల ప్రాశస్త్యంపై పలు పుస్తకాలు రాశారు. మాజీ ప్రధాని పివి నర్సింహారావు సలహాదారుగా పివిఆర్‌కెకు సుధీర్ఘ అనుభవం ఉంది.

120 కిలోల గంజాయి స్వాధీనం

హైదరాబాద్ : కోణార్క్, ఎక్స్ ప్రెస్ ఎల్ టీటీ ఎక్స్ ప్రెస్ లో 120 కిలోల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి పీస్ కు తరలించారు. బరంపూర్ నుంచి గుల్బర్గాకు గంజాయిని తరలిస్తునట్లుగా పోలీసులు గుర్తించారు.

జంట అనుమానాస్పద మృతి

గుంటూరు : జిల్లా మంగళగిరి మండలం పెద్దవడ్లపూడిలో ఓ జంట అనుమానాస్పద మృతి చెందారు. మృతులు దుర్గ, జాన్ గా పోలీసులు గుర్తించారు. వీరి మరణానికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.

కొండాపూర్ లో బ్యూటీషియన్ అదృశ్యం

హైదరాబాద్ : కొండాపూర్ శ్రీరాంనగర్ లో బ్యూటీషియన్ అదృశ్యం అయింది. బ్యూటీషియన్ ఎంజీ జ్యోతిక శనివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

09:12 - August 21, 2017

కర్నూలు : జిల్లా నంద్యాల ఉపఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. నెటి సాయంత్ర 5 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ఎల్లుండి నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నెల 28న ఓట్ల లెక్కింపు చేయననున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాలలో కేంద్ర బలగాలను భారీగా మోహరించారు. ఇక్కడ 3,500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లును జిల్లా ఏస్పీ సమీక్షిస్తున్నారు. ప్రచారానికి చివరి రోజు కావడతో టీడీపీ, వైసీపీ ప్రచారంతో హోత్తెస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధంతో వాతావరణం వెడెక్కిస్తున్నారు. మరోవైపు సాయంత్రం 5గంటలోపు ఇతర జిల్లా నుంచి వచ్చిన నేతలను వెళ్లిపోవాలని ఈసీ ఆదేశిచింది. అలాగే సర్వేలు, ఓపీనియన పోల్స్ పై ఈసీ నిషేధం విధించింది. ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలుంటాయని ఈసీ హెచ్చరించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

08:58 - August 21, 2017

హిందీ సినిమా : బాలీవుడ్ ప్రముఖ హీరోల్లో ఒక్కడైనా అక్షయ్ కుమార్ తాజా హీరో నటించిన చిత్రం ''టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ'' బాక్సాఫీస్ వద్ద నుంచి మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ మూవీ కేవలం ఎనిమిది రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరిందంటే అర్ధం చేసుకోవచ్చు ఏ విధంగా ఉందో...చిత్రం ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై 8 రోజుల్లో రూ.100.05 కోట్లు వసూళ్లు చేసింది. అయితే విషయమేమిటంటే ''టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ'' కేవలం రూ.18 కోట్లతో తెరక్కి ఇప్పటికే నాలుగింతలు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సిని విశ్లేషకుల నుంచి మిశ్రమ సమీక్షలు వచ్చినటప్పటికి ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. రెండో వారం కూడా నిలకడ వసూళ్లు సాధిస్తూ నిర్మాతలకు, బయ్యర్లకు ''టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ'' కసుల వర్షం కురిపిస్తుంది.

ఈ మూవీ మొదటి రోజు రూ.13.10 కోట్లు, రెండవ రోజు రూ.17.10 కోట్లు, మూడవ రోజు 21.25 కోట్లు, నాలుగో రోజు రూ.12కోట్లు, ఐదో రోజు రూ.20 కోట్లు, ఆరో రోజు 6.50 కోట్లు, ఏడో రోజు రూ.6.10కోట్లు, ఎనిమిదో రోజు 4 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. చివర్లో కొంత తగ్గినట్టు కనిపించిన ప్రస్తుతం అగ్రహీరోల సినిమా లేకపోండంతో మరిన్ని కలెక్షన్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హిట్ సినిమా అంటే ఇదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అగ్ర హీరోలు తీసిన సినిమాలు నిరాశ పరిచిన సమయంలో ఈ చిత్ర విజయం బయ్యర్లకు ఊరటనిచ్చింది కాబట్టి. 'స్వచ్ఛ్ భారత్ అభియాన్ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఆధారంగా తీసిన ''టాయ్ టెట్ ఏక్ ప్రేమ్ కథ'' చిత్రానికి నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అక్షయ్ సరసన భూమి పడ్నేకర్ నటిచింది.

 

07:54 - August 21, 2017

ఈసీ చెప్పటాన్ని తము స్వాగతిస్తున్నామని, నిన్న సీఎం ఏ విధంగా మాట్లాడారు, సీఎం నంద్యాలకు, భూమ నాగిరెడ్డి ఇచ్చిన హామీలను వివరిస్తూ మాత్రమే ప్రచారం చేశారని, ఎక్కడ అన్ పార్లమెంటరీ లాగ్వేజ్ వాడలేదని, ఎన్నికలలో అనుసరించ విధానం ఎలా ఉండాలో సీఎం తెలిపాతున్నారని, కానీ కొందరు నరుకుత, ఉరితీస్తా అని అంటున్నారని టీడీపీ నేత దుర్గాప్రసాద్ అన్నారు. ప్రజలకు రకరకాల హామీలు ఇచ్చి అందులో ఏవి కూడా అమలు చేయకపోవయారని, మహిళలకు రుణాలు ఇస్తామని చెప్పిన సీఎం అలాంటి ఏమి చెయలేదని దాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ అలా మాట్లాడారే తప్ప కావాలని అన్నది కాదని వైసీపీ నేత వెంకట్ రెడ్డి అన్నారు. ఇరుపక్షాలు గెలుస్తామని చెబుతున్నారని, ఏకంగా సీఎం రెండు రోజులు అక్కడే ఉండి ప్రచారం చేశారని, జగన్ 12 రోజులు అక్కడే ఉండి ప్రచారం చేశారని, జగన్ మాట్లాడిన విధానం బాగాలేదని, డబ్బులు మాత్రం విపరితంగా పంచుతున్నారని, నంద్యాలలో ఓడిపోతే అధికారం కోల్పోపోయే ప్రమాదం లేదని, ప్రముఖ విశ్లేషకులు తెలకల్లి రవి అన్నారు. జగన్ బీజేపీలో చేరుతుడాని ఊహాజనితమని, భారతీయ జనతా పార్టా పాలన చూసి అందురు బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ నేత శ్రీనివాస్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

   https://youtu.be/5OWuXXXjwXM              https://youtu.be/WOmw8QDIEoc

 

నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా

ఢిల్లీ : నేడు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయనున్నారు.

 

రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్ కే ప్రసాద్ కన్నుమూత

హైదరాబాద్ : మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఆర్ కే ప్రసాద్ కన్నుమూశారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన గుండె పోటుతో తుదిశ్వాస విడిచాడు. ఉదయం 8 గంటలకు పంజాగుట్ట శ్మశానవాటికలో పీవీఆర్ కే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్

గ్లాస్గో : నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మీంటన్ ఛాంపియన్ షిప్ ప్రారంభం కానుంది. ఛాంపియన్ షిప్ లో భారత్ నుంచి పీవీ సింధు, సైనా, శ్రీకాంద్ బరిలో ఉన్నారు.

నేడు బాలనగర్ ఫ్లైఓవర్ కు శంకుస్థాపన

హైదరాబాద్ : నేడు మంత్రి కేటీఆర్ బాలనగర్ ఫ్లైఓవర్ కు శంకుస్థాపన చేయనున్నారు. నర్సాపూర్ లో ఆయన శంకుస్థాపన చేస్తారు.

07:37 - August 21, 2017

జన్యుమార్పిడి పంటలపై సీరియస్ చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారం మీద సుప్రీంకోర్టు విచారణ కూడా నడుస్తోంది. జన్యుమార్పిడి చేసిన విత్తనాలను దేశంలోకి అనుమతించవద్దంటూ రైతు సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అక్టోబర్ 17 వరకు ఆవాల అనుమతిపై స్టే పొడిగించింది. అసలు జన్యుమార్పిడి పంటలంటే ఏమిటి? జన్యుమార్పిడి పంటల విషయంలో ప్రపంచ అనుభావాలేమిటి? భారత్ అనుభవాలేమిటి? పత్తి లాంటి వాణిజ్యపంటల్లో జన్యుమార్పిడి విధానాన్ని అనుమతించిన భారత్ ఆహార పంటలు, నూనెగింజల విషయంలో అనుమతించకపోవడానికి కారణం ఏమిటి? ఆవ గింజల్లో జన్యుమార్పిడి విధానం ప్రోత్సహిస్తే ఏమవుతుంది? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, రైతు సంఘం నాయకులు అరిబండి ప్రసాదరావుగారు 10టీవీ స్టూడియోకి వచ్చారు. జన్యుమార్పిడి అనుమతి ఇచ్చింది కేవలం పత్తి మాత్రమే, పత్తి గింజల నుంచి నూనె తీస్తారని, జన్య సంకేతికి పరిజ్ఞానంలో పూర్తి ఫలితం సాధించాలేదని, వంకయ కూడా జన్యుమార్పిడి చేస్తున్నారని మనం వంకయ తీసుకొవడం వల్ల అందులో కొత్త విషపదార్ధం ఉంటుందని అది మన శరీరంలో సూక్ష్మీజీవులను చంపుతాయని, మనం తినే ఆహారంలో క్రిమిసంహారక మందుల అవశేషలు ఉంటున్నాయని, జన్యుమార్పిడిలో ఆహార పంటలకు ఏ దేశం కూడా అనుమతి ఇవ్వలేదని వ్యసాయ శాస్త్రవేత్త హరిదండి ప్రసాద్ అన్నారు.మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

07:36 - August 21, 2017

డంబూల్లా : టీమిండియా విజయ పరంపర కొనసాగుతోంది. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. శిఖర్‌ దావన్‌ సిక్సర్లు, కోహ్లీ షాట్లు భారత్‌ను సునాయాసంగా గెలిచేలా చేశాయి.ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా... దంబూల్లా వన్డేలో కోహ్లీ సేన 217 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి... 28.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ లంక బౌలర్లను ఉతికి ఆరేశాడు. శ్రీలంక బౌలర్లు ఎంత శ్రమించినా... భారత బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయలేకపోయారు. దీంతో.. ధవన్‌ 90 బంతుల్లోనే 132 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధవన్‌ కేవలం 71 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డ్‌ సాధించాడు. రోహిత్‌శర్మ 4 పరుగులకే వెనుదిరగడంతో... క్రీజులోకి వచ్చిన విరాట్‌.. ధావన్‌లు చెలరేగి ఆడారు. కోహ్లీ 70 బంతుల్లో 82 పరుగులు చేసి... నాటౌట్‌గా నిలిచాడు. హాఫ్‌ సెంచరీ చేసేవరకు నిలకడగా ఆడిన కోహ్లీ.. తర్వాత విరుచుకుపడి వరుస బౌండరీలు బాదాడు. దీంతో భారత్‌ 28.5 ఓవర్లలోనే విజయలక్ష్యాన్ని సాధించింది.

లంక 216 పరుగులకు ఆలౌట్‌
తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. అదిరే ఆరంభం ఇచ్చింది. ఓపెనర్లు నిరోషన్‌ డిక్వెలా, గుణతిలకలు చెలరేగి ఆడారు. చాహల్‌ ప్రమాదకర జోడిని విడదీయడంతో తొలి వికెట్‌కు 74 పరుగులు చేశారు. అనంతరం కుశాల్‌ మెండిస్‌తో డిక్వెలా దూకుడు కొనసాగించాడు. ఆ తర్వాత... లంక వికెట్ల పతనం మొదలైంది. చివరి ఏడు వికెట్లు 11 ఓవర్లలోనే కుప్పకూలిపోయాయి. కేదార్‌ జాదవ్‌, అక్షర్‌ పటేల్‌, చౌహల్‌ స్పిన్‌ దాటికి.. లంక బ్యాట్స్‌మెన్లు తట్టుకోలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో లంక 216 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.

సునాయసంగా గెలుపు...
తక్కువ పరుగుల లక్ష్యమే కావడంతో... కోహ్లీ సేన సునాయసంగా గెలుపొంది ఐదు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. అత్యుత్తమంగా బ్యాటింగ్‌ చేసి.. సెంచరీ చేసిన శిఖర్‌ ధావన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. గురువారం రెండో వన్డే పల్లెకల్‌లో జరగనుంది. 

07:33 - August 21, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో కళింగ ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘోర ప్రమాదానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విచారణ చేపట్టి.. నిజనిజాలను నిగ్గు తేల్చేందుకు రైల్వేమంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. అనుమతి లేకుండా నిర్వహణ పనులు చేపట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. మరోవైపు సిబ్బంది వైఫల్యం ఉన్నట్లయితే చర్యలు తప్పవని రైల్వేమంత్రి సురేష్‌ప్రభు ట్విట్టర్‌లో తెలిపారు. ఇదిలావుంటే... రైలు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని రైల్వే ఉన్నతాధికారులు కలిసి వివరాలు సేకరించారు. ఈ రోజు నుంచి ప్రమాదంపై రైల్వే భద్రత కమిషనర్‌ శైలేష్‌కుమార్‌ పాఠక్‌ నేతృత్వంలో దర్యాప్తు మొదలుకానుంది.

ధ్వంసమైన ట్రాక్‌ను పునరుద్దరించారు..
ఇక ఘటనాస్థలంలో 200 మీటర్ల మేర ధ్వంసమైన ట్రాక్‌ను పునరుద్దరించినట్లు అధికారులు తెలిపారు. 24 గంటలు కష్టపడి శకలాలను తొలగించామన్నారు. మొత్తం 23 బోగీలు ఉంటే... అందులో 13 బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు ప్రకటించారు. ఇక ఈ ప్రమాదంపై ఖతౌలీ ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యంత్రాలను నిర్లక్ష్యంగా వదిలేయడం, తమ చర్యలతో ఇతరుల ప్రాణాలకు ప్రమాదం తీసుకువచ్చారనే అభియోగాలపై గుర్తు తెలియని వ్యక్తులపై సెక్షన్‌ 287, సెక్షన్‌ 337 కింద కేసు నమోదు చేశారు. ప్రమాద ఘటనపై కేంద్రం విచారణ చేపట్టగా... కాంగ్రెస్‌ విమర్శలకు దిగింది. రైలు ప్రమాదాల్లో మోదీ ప్రభుత్వం రికార్డ్‌ నెలకొల్పిందంటున్నారు. 2014 మే నుంచి ఇప్పటివరకు మొత్తం 22 రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయన్నారు. రైల్వేలో భద్రతను గాలికొదిలేసిన సురేష్‌ప్రభు.. రాజీనామా చేయాలని హస్తం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

07:31 - August 21, 2017

హైదరాబాద్ : విద్యుత్‌ రంగంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరముందని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జాతీయ మహాసభల్లో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. 'ఈపీ' నూతన జాతీయ అధ్యక్షులుగా హబీబ్‌, ప్రధాన కార్యదర్శిగా చౌదరి ఎన్నికయ్యారు. విద్యుత్‌ రంగంలోని సమస్యల పరిష్కారం కోసం... వచ్చే ఏడాది ఆగస్టు 1న దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని మహాసభ నిర్ణయించింది. విద్యుత్‌ రంగంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ సంస్థల ప్రమేయం ఎక్కువైందని.. ఇందుకోసం కార్మిక సంఘాలన్నీ ఉద్యమాలు చేయాల్సిన అవసరముందని 'ఇపి' జాతీయ ప్రధాన కార్యదర్శి చౌదరి, సీఐటీయూ నేత సుధాభాస్కర్‌ పిలుపునిచ్చారు. 

07:29 - August 21, 2017

హైదరాబాద్ : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్న హరీష్‌రావు చెరువులు, తూములు తెగిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేయాలని అధికారులను కోరారు. ఒకవేళ ముంపు పరిస్థితి తలెత్తితే ఆయా ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. 

07:28 - August 21, 2017

కర్నూలు : తనకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని కమెడియన్‌ వేణుమాధవ్‌ కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని... పోలీసులకు వేణుమాధవ్‌ తెలిపారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని... తనను ఇబ్బంది పెట్టొద్దని ఆయన అన్నారు.

 

07:26 - August 21, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో ఇవాళ మరో ఘట్టం ముగియనుంది. గెలుపు కోసం టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా నిర్వహించిన ప్రచారానికి నేటితో తెరపడనుంది. కేవలం కొద్ది గంటలు మాత్రమే ప్రచారానికి సమయం ఉండడంతో... మరింత కొత్త వ్యూహాలతో పార్టీలు ప్రచారం సాగిస్తున్నాయి. నంద్యాలలో రెండు రోజులపాటు మకాం వేసి ప్రచారం నిర్వహించిన సీఎం చంద్రబాబు.. అన్ని సామాజికవర్గ నేతలతో సమావేశాలు నిర్వహించారు. గెలుపు కోసం అనేక వ్యూహాలు రచిస్తున్నారు. ముస్లిం ఓట్ల కోసం.. ఆ సామాజికవర్గ నేతలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు... ముస్లింలను విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పైకి తీసుకువస్తామన్నారు. నంద్యాలలో శిల్పా కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందన్నారు.ఇక ప్రతిపక్ష వైసీపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు.... సంక్షేమంలో తమతో ఎవరూ పోటీ పడలేరన్నారు. మన ఐక్యతను దెబ్బతీసేందుకు అనేకమంది కుట్రలు చేస్తున్నారన్నారు.

జగన్‌ రోడ్‌షో...
మరోవైపు నంద్యాలలో జగన్‌ రోడ్‌షో కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా నంద్యాలవైపు కన్నెత్తి చూడని నేతలంతా... ఇప్పుడు ఎన్నిక కోసం నంద్యాలకు క్యూకట్టారన్నారు. అవినీతితో సంపాదించిన సొమ్మును ఓటర్లకు పంచిపెడుతున్నారన్నారు జగన్‌. మరోవైపు నంద్యాల ఉప ఎన్నిక రద్దు చేయాలంటూ... కాంగ్రెస్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నంద్యాలలో డబ్బు, మద్యం పంపిణీ జరుగుతుందని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా ఆరోపించారు. మొత్తానికి నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో... టీడీపీ, వైసీపీ మరింత పదునైన వ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. మరి... ఈ ఎన్నికలో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి. 

06:20 - August 21, 2017
06:17 - August 21, 2017
06:14 - August 21, 2017

Don't Miss