Activities calendar

22 August 2017

21:28 - August 22, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్యాంకులు స్తంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ రుణాల రద్దు, బ్యాంకింగ్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా పదిలక్షల మంది ఎంప్లాయిస్‌ సమ్మెబాట పట్టారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోబోమని ఉద్యోగంఘాలు హెచ్చరించాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనం, నష్టాలపేరుతో బ్యాంకుల మూసివేత, నిరర్థక ఆస్తుల రైటాఫ్‌ను వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెకు దిగారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాకింగ్‌ కార్యాకలాపాలు స్తంభించాయి. హైదరాబాద్‌లో వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు ధర్నాలకు దిగారు. కోటిలోని ఎస్‌బీఐ దగ్గర నిరసనలో పలువురు నేతలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నినాదాలు చేశారు. విజయవాడలో జరిగిన బ్యాంకు ఉద్యోగుల ధర్నాలో వందలాది మంది ఉద్యోగులు పాల్గొన్నారు. సీఐటీయూ ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చింది.

పబ్లిక్‌సెక్టార్‌ బ్యాంకింగ్‌ రంగాన్ని దెబ్బతీసేందుకే కేంద్ర ప్రభత్వం కుట్రలు చేస్తోందని కార్మికసంఘాల నేతలు విమర్శించారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఉద్యోగులు సమ్మెకు దిగారు. కంబాల చెరువు వద్దనున్న ఎస్.బి.ఐ మెయిన్ బ్రాంచ్ వ్దద నిర్వహించిన కార్యక్రమంలో వందలాది మంది బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. బ్యాంకింగ్‌ రంగాన్ని కుంగదీసే కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జీవీఎంసీ వద్ద బ్యాంకు ఎంప్లాస్‌ పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేట్‌ రుణాల రద్దు చేయకుండా ఉండడం, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలను నేరపూరిత చర్యగా ప్రకటించడం, ఎన్‌పీఏల వసూలుకు పార్లమెంటరీ కమిటీ సూచించిన సిఫారసులను అమలు చేయాలన్న డిమాండ్‌లతో సమ్మెకు దిగినట్టు బ్యాంక్ ఉద్యోగులు తెలిపారు.

అటు కడప, అనంతపురం జిల్లాలో ప్రభుత్వ రంగబ్యాంకులు మూతపడ్డాయి. పలుచోట్ల బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు. బ్యాంకులను ప్రవేటు పరం చేయడం, పదమూడు లక్షలకోట్ల ప్రవేటు సంస్థల మొండి బకాయిలను వసూలుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. భారీ మొత్తంలో రుణాలు ఎగవేస్తున్న కార్పొరేట్‌ బడాబాబుల ఆస్తులు జప్తు చేసి బ్యాంకింగ్‌ వ్యవస్థను కాపాడాలని నినాదాలు చేశారు. ప్రకాశంజిల్లాలో బ్యాంకు ఎంప్లాయిస్‌ పెద్ద ఎత్తున సమ్మెకు దిగారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. విలీనాల పేరుతో బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని యూనియన్‌ నేతలు ఆరోపించారు.

కారుణ్య నియమకాలు వెంటనే చేపట్టాలని బ్యాంకు బొర్డులలో ఉద్యొగ డైరెక్టర్లను వెంటనే నియమించాలని డిమాండ్‌చేస్తూ .. నిజామాబాద్‌ జిల్లాలో బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఎస్.బి.ఐ.మెయిన్ బ్రాంచ్ ముందు ఉద్యొగులు ఆందోలన చేపట్టారు ఈ ఆందోళనకు సిఐటియు మద్దతు తెలిపింది. తక్కువ వేతనాలతో ప్రవేటు బ్యాంకులు ఉద్యోగుల యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నాయని గుంటూరు జిల్లా బ్యాంకు ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పోరేట్ కంపెనీలు కోట్లాది రూపాయల రుణాలను ఎగవేస్తువుంటే వారిపై చర్యలు తీసుకోకుండా.. నష్టాలు వస్తున్నాయంటూ ఉద్యోగులను టార్గెట్‌ చేస్తున్నారని విమర్శించారు.

1969లో బ్యాంకుల జాతీయకరణతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలందరికీ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయని.. ఇపుడు కేంద్ర ప్రభుత్వ విధానాలతో సామాన్యుడికి బ్యాంకులు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఉద్యోగ సంఘాలనేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్‌ రంగానికి నిరర్థక ఆస్తులు కేన్సర్‌లా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల కష్టఫలితంగా వచ్చిన ప్రాఫిట్‌ను బడాబాబులకు ధారపోశారని విమర్శించారు. రెండున్నర లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాల రద్దు చేసి..నష్టాలు వస్తున్నాయంటూ ఉద్యోగులను బలిపశువులను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిన్నిటకి వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 15న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో భారీఎత్తున నిరసనకు దిగుతామని బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక హెచ్చరించింది. 

21:23 - August 22, 2017

విజయవాడ : ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇసుక ఫ్రీగా ఇస్తున్నామని వ్యాపారం చేస్తే మాత్రం సహించేది లేదన్నారు. ఇసుక ట్రాన్స్‌పోర్ట్‌ పేరిట అధిక చార్జీలు వసూలు చేయడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాలకి ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే అరెస్ట్‌లకు సిద్ధమని హెచ్చరించారు. అలాగే బెల్ట్‌ షాపులపై కఠిన చర్యలు చేపట్టామని దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టగా.. 80శాతంకి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. 

21:21 - August 22, 2017

కర్నూలు : నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఫిర్యాదుల పాలిటిక్స్‌కు తెరతీశాయి. ఎన్నికల నిబంధలను ఉల్లంఘిస్తూ డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న నేతలను నంద్యాల నుంచి పంపేయాలని అధికారులను కోరారు.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. అధికారపార్టీ గుట్టుచప్పుడు కాకుండా ప్రచారం నిర్వహిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. బయటి వ్యక్తులు నంద్యాల నియోజకవర్గంలో ఉండరాదన్న ఎన్నికల సంఘం ఆదేశాలను సాక్షాత్తు మంత్రులే ఉల్లంఘించారని, బనగానపల్లెలోని అధికారపార్టీ ఎమ్మెల్యే ఇంట్లో మకాం వేసిన నలుగురు మంత్రులు..డబ్బు, మద్యం పంపిణీని పర్యవేక్షిస్తున్నారని వైసీపీ నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

అటు ప్రతిపక్షంపై పాలక పక్షంకూడా ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌ వాడిన భాష.. హింసను రెచ్చగొట్టేలా ఉందని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై చర్యలు కోవాలని ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కోరారు. తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి హామీ ఇచ్చారని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. మొత్తానికి పరస్పర ఫిర్యాదులతో పాలక, ప్రతిపక్ష నేతలు.. పోలింగ్‌ ముందు రోజూ ఉపఫైట్‌ హీట్‌ను తారస్థాయిలో కొనసాగించారు. 

21:20 - August 22, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభంకానుంది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు కొన్ని గంటలే మిగిలి ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది సామాగ్రితో తరలివెళ్లారు. పోలింగ్‌ సిబ్బందిసహా దాదాపు 6వేలమంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

నంద్యాల నియోజకవర్గం పరిధిలో మొత్తం 255 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 141 కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. మరో 71 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేకదృష్టి పెట్టిన అధికారులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు చేపడుతున్నారు. ఓటరు తాను ఎవరికి ఓటు వేసినది చూసుకునే వెసులుబాటు ఈ ఉప ఎన్నికలో కల్పిస్తున్నారు. తొలిసారి ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌, ఆడిట్‌ ట్రై, వీవీపీఏటీ యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈవీఎంలలో ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరిస్తామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు.

నంద్యాల నియోజకవర్గం మొత్తం దాదాపు సమస్యాత్మకంగా ఉండటంతో ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని పారామిలటరీ బలగాలకు అప్పగించారు. ఇప్పటికే 6 కంపెనీల కేంద్ర పోలీస్‌ బలగాలు నంద్యాలకు చేరుకున్నాయి. తొలిసారిగా పోలింగ్‌ కేంద్రాల దగ్గర పారామిలటరీ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్‌ కేంద్రాలన్నిటిలో వెబ్‌క్యాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. నంద్యాల ఉప ఎన్నిక కోసం మూడు డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తున్నారు. నంద్యాల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి భద్రత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఇప్పటికే ఓటర్లందరికీ ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్‌ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈవీఎంలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఎప్పటికప్పుడు పోలింగ్‌ సరళిని పరిశీలించేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు.  

విశాఖ రైల్వే జోన్ సాధనకై బహిరంగసభ..

విశాఖపట్టణం : ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణ..విశాఖ రైల్వే జోన్ సాధనకై బహిరంగసభ జరగనుంది. ఆగస్టు 26వ తేదీన విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగే బహిరంగసభలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పాల్గొననున్నారు.

 

ఆ రోజున అబూసలెంకు శిక్ష ఖరారు..

ఢిల్లీ : 1993 నాటి ముంబాయి వరుస పేలుళ్ల కేసులో గ్యాంగ్ స్టర్ అబూ సలెంతో సహా ఐదుగురు దోషులకు శిక్ష ఖరారు కానుంది. సెప్టెంబర్ 7వ తేదీన ముంబాయి ప్రత్యేక టాడా కోర్టు శిక్ష విధించనుంది. 

ఉప ఎన్నికకు సిద్ధం..

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక‌కు బుధవారం పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం ఎన్నిక‌ల‌ అధికారులు స‌ర్వం సిద్ధం చేశారు. మొత్తం 255 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ ఈ నెల 28న జరగనుంది.

21:10 - August 22, 2017

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సెప్టెంబర్ 10వ తేదనీ భోపాల్ లో ప్రత్యేకంగా సమావేశం కానుంది. తీర్పును అధ్యయనం చేసి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని బోర్డు వర్కింగ్ కమిటీ సభ్యుడు, న్యాయవాది జాఫర్ తెలిపారు. తీర్పును అధ్యయనం చేయకుండా ఏమీ మాట్లాడలేమని, బోర్డు మీటింగ్ ఏజెండాలో అయోధ్య బాబ్రీ మసీదు కేసు విచారణ కూడా ఉందన్నారు. 

21:06 - August 22, 2017

హైదరాబాద్ : మరోసారి టీఎస్పీఎస్సీ డొల్లతనం బయటపడింది. గురుకుల పీడీ మెయిన్ పరీక్ష నిర్వాహణలో నిర్లక్ష్యం బయటపడింది. ప్రశ్నాపత్రంలో ఒకే పేజీ లేకుండానే పరీక్ష పూర్తి చేశారు. ఈ విషయంలో టీఎస్పీఎస్సీ ఆలస్యంగా తేరుకుంది. వెంటనే చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది. జులై 18వ తేదీన జరిగిన గురుకుల పీడీ ప్రధాన పరీక్షను రద్దు చేసి సెప్టెంబర్ 7వ తేదీన పీడీ ప్రధాన పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షల్లో ఏదో ఒక తప్పు దొర్లుతూనే ఉంది. గ్రూప్ 2 పరీక్ష నిర్వాహణలో కూడా ఏదో ఒక విధంగా తప్పులు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై కోర్టుకు వెళ్లడం..పరీక్షలు రద్దు జరుగుతున్నాయి. దీనితో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

టీఎస్పీఎస్సీ డొల్లతనం..

హైదరాబాద్ : మరోసారి టీఎస్పీఎస్సీ డొల్లతనం బయటపడింది. గురుకుల పీడీ మెయిన్ పరీక్ష నిర్వాహణలో నిర్లక్ష్యం బయటపడింది. ప్రశ్నాపత్రంలో ఒకే పేజీ లేకుండానే పరీక్ష పూర్తి చేశారు. ఈ విషయంలో టీఎస్పీఎస్సీ ఆలస్యంగా తేరుకుంది. జులై 18వ తేదీన జరిగిన గురుకుల పీడీ ప్రధాన పరీక్షను రద్దు చేసి సెప్టెంబర్ 7వ తేదీన పీడీ ప్రధాన పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం..

ఢిల్లీ : మోస్ట్ వాంటెడ్ ఐసీస్ టెర్రరిస్టు షఫీ అర్మర్ మృతి చెందాడు. సిరియాలో జరిగిన డ్రోన్ దాడిలో ఉగ్రవాది అర్మర్ హతమయ్యాడు. ఇండియాలో 300 మంది యువతను సోషల్ మీడియా ద్వారా ఇతను ఆకట్టుకున్నాడు. అర్మర్ ది కర్నాటకలోని బత్కల్ గ్రామం. 

నిజాం పాలన మళ్లీ వచ్చిందా - సురవరం..

ఢిల్లీ : ఇచ్చిన హామీలు అమలులో సీఎం కేసీఆర్ విఫలం చెందారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం విమర్శించారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అవినీతిమయమన్నారు. కోర్టులకు వెళితే అభివృద్ధి నిరోధకలంటూ ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారని తెలిపారు. ధర్నాలు చేయకుండా దర్నా చౌక్ మూసివేశారని, నిజాం పాలన మళ్లీ వచ్చిందా అన్నట్లు ఉందని విమర్శించారు. 

ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు - కోదండరాం...

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమాన్ని ఒక వ్యక్తికి..కుటుంబానికి అధికారం ఇవ్వడానికి చేయలేదని ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణలో జాగిర్దారీ వ్యవస్థ నెలకొందని దుయ్యబట్టారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని, సీఎం సచివాలయానికి రాకుండా ఇష్టం వచ్చినట్లు నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు. సమగ్ర వ్యవసాయ విధానం అంటూ లేదని, ప్రభుత్వం మీడియాను నియంత్రిస్తోందన్నారు. 

పీడీ ప్రధాన పరీక్ష రద్దు..

హైదరాబాద్ : గురుకుల పాఠశాలలో పీడీ ప్రధాన పరీక్ష తిరిగి నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. జులై 18న నిర్వహించిన పీడీ పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీన పీడీ ప్రధాన పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 

20:37 - August 22, 2017

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించవచ్చేమో కానీ.. తమిళ పాలిటిక్స్ మాత్రం అనూహ్యంగానే కపిస్తున్నాయి. అమ్మలేని ఖాళీని భర్తీ చేయటానికి తగిన స్థాయి ఉన్న నేతలు కనిపించకపోవటం పార్టీ ప్రయోజనాలకంటే... పదవులు కావాలనే దాహం వెరసి ఆదిపత్య పోరులో అధికార పార్టీ నానా చిక్కుల్లో ఉంది. ఇక విపక్షం తన ఆయుధాల్ని సిద్ధం చేసుకుంటుంటే... తెరవెనుక మత్రాంగంతో తమిళనాడుపై పట్టు సాధించే ప్రయత్నం మరొకరిది. వెరసి తమిళ్ పాలిటిక్స్ చాలా హాట్ గా మారాయి. దీనిపై టెన్ టివి ప్రత్యేక కథనం..శరవేగంగా మారిపోతున్న తమిళనాడు రాజకీయ పరిణామాలు. ప్రభుత్వానికి షాకులమీద షాకులిస్తున్న దినకరన్. పళని ప్రభుత్వాన్ని కూలగొట్టాలని తీవ్ర ప్రయత్నాలు. మరోవైపు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారంటూ పెరుగుతున్న వార్తలు..విమర్శలతో, పొలిటికల్ సీన్ పై కనిపిస్తున్న కమల్ హాసన్ .. వెరసి చెన్నై పాలిటిక్స్ చాలా హాట్ గా మారాయి.

అందర్నీ కట్టిపడేసేలా.. ఒక బలమైన నేత లేకపోతే ఎలా ఉంటుందో తమిళనాడు రాజకీయాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. పదవులు, ఎత్తులు, పై ఎత్తుల తప్ప బాధ్యత పట్టని నేతలు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు ఎలా ఉంటాయో తమిళనాడు ఉదాహరణగా నిలుస్తోంది. అందుకే ఎవరెవరు కలుస్తారో... ఎవరెవరు విడిపోతారో.. అర్ధంకాని విధంగా తమిళడ్రామా సాగుతోంది. దినకరన్ వర్గం ఏం చేయబోతోంది? రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? మద్దతు ఉపసంహరించుకుంటే ఏం జరుగుతుంది? డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పెరుగుతున్నాయా? మ్యాజిక్ ఫిగర్ సాధించే సత్తా ఎవరికుంది?

నిజానికి పన్నీర్, పళనిలు ఏకంగా కావటమే చాలా చిత్రంగా సాగింది. ఆర్నెళ్ల పాటు అనేక వివాదాలు సాగిన తర్వాత.. మాజీ సీఎంగా మారిన పన్నీర్...తాజా డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టారు. ఇక శశికళకు పార్టీలో ఎదురేలేదనుకుంటున్న తరుణంలో జైలుపాలై సీన్ యూ టర్న్ తీసుకుంది. అంతా సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో దినకరన్ తెరపైకి వచ్చి నేనున్నా అంటూ కథను మరో మలుపు తిప్పాడు.. అసలు అన్నా డీఎంకే ఎప్పటికైనా కోలుకోగలదా? ఈ వివాదాలనుండి తేరుకోగలదా?

ఈ పరిణామాల వెనుక కమలదళం ఉందా? బీజెపీ తమిళనాట పాగా వేయటానికి అన్నాడీఎంకే లుకలకలను వాడుకుంటోందా? కేంద్రం కనుసన్నల్లోనే తమిళ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయా? అమిత్ షా పర్యటన ఉద్దేశ్యం ఏమిటి? రద్దుకు కారణాలేంటి? అసలు తమిళ రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న మంత్రాంగం ఏమిటి? ఎత్తులు, పైఎత్తులు, పదవీ దాహం కలిసి సాగితే ఎలా ఉంటుందో తమిళ రాజకీయాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. జయ మరణంతో ఒక్కసారిగా ఏర్పడిన గందరగోళం.. అన్నా డీఎంకేను అతలాకుతలం చేస్తోంది. ఎవరికి వారు కుర్చీకోసం ఎత్తులు వేస్తున్నారు. ఓ పక్క రిసార్టు రాజకీయాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. అమ్మ నామస్మరణ చేస్తూ ఎవరికి వారు పైచేయికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలు ఇప్పట్లో సద్దుమణిగే అవకాశాలు కనిపించటం లేదు. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

కాకినాడకు పాకిన క్రికెట్ బెట్టింగ్..

తూర్పుగోదావరి : నెల్లూరులో క్రికెట్ బెట్టింగులు కాకినాడకు పాకాయి. కొందరు నేతలకు బెట్టింగ్ తో లింకులున్నట్లు సమాచారం. 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

20:27 - August 22, 2017

అప్పట్ల లోకేశమే ఉండే.. ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు తయ్యారైండు.. టిట్టర్లు వాడెతందుకు..? ఎక్వ సమస్యలు ట్విట్టర్లనే తెల్సుకుంటరు.. ట్విట్లర్లనే అర్సుకుంటరు.. ట్విట్లర్లనే ఆదేశాలు... ట్విట్లర్లనే ముగింపులు.. సరే ఆ సాధనాన్ని మంచిగనే వాడుకుంటున్నడుగని..? ఇయ్యాళ సారు ట్విట్టర్ల వెట్టిన పోట్వలు సోషల్ మీడియా గిర్ర గిర్రా తిర్గుతున్నయ్ ఏంటియో తెలుసుకోవాలంటే వీడియోలో సూడుండ్రి.. 

20:24 - August 22, 2017

మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే పంద్రాగష్టి జెండా గోల్గె అవద్దం జెప్పిండేమో అనుకున్నంగదా..? అటు ఎర్రకోట మీద జెండా ఎగిరేశిన మోడీ గూడ..? మోసమే జేశిండు జనాన్ని..? ఈడ కేసీఆర్ సారేమో.. ఆర్టీసీల ముప్పైతొమ్మిది వందల ఉద్యోగాలు భర్తీ జేశ్నమని అవద్దం జెప్తె.. మోడీ ఏం జెప్పిండో సూడుండ్రి.. సోషల్ మీడియల జోర్గ తిర్గుతున్నది ఈ ముచ్చట గూడ..గీ ముచ్చట చూడాలంటే వీడియో క్లిక్ చేయండి..

20:21 - August 22, 2017

అయ్యా శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రిగారూ.. మీ పనితనం నచ్చుతలేదు సారు పబ్లీకుకు..వారెవ్వ.?...మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే పంద్రాగష్టి జెండా గోల్గె అవద్దం జెప్పిండేమో అనుకున్నంగదా..? అప్పట్ల లోకేశమే ఉండే.. ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు తయ్యారైండు.. టిట్టర్లు వాడెతందుకు..? హురక తమిళ నాడుల అమ్మ తంబీలంత గల్చిపోయిండ్రు.. ఇగ అన్నాడీఎంకే ఆకులు ఇగురువెట్టినట్టే అనుకున్నయాళ్లకు మళ్లోక కుందనం మోపైందిగదా..? ఏగిళ్లు వారంగ ఏతులు.. పొద్దు గూట్లె వడ్డంక నీతులు అన్నట్టే ఉన్నది సిద్దిపేట అభివృద్ధి ముచ్చట గూడ..జోడెడ్ల నాగలి గట్టినప్పుడు.. బుర్దల దిగినంక ఒక ఎద్దు సతాయిస్తుంటే ఏం జేస్తం..? ఇంతకు ఆంధ్ర రాష్ట్రంల పోలీసోళ్లు ప్రజల కోసం పనిజేస్తున్న ప్రజాప్రతినిధుల కోసమా..? మామూల్గ మన భారతదేశంల సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వస్తే ఏం జేస్తరు..? గిసొంటి గరం గరం ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయుండి. 

19:45 - August 22, 2017

వివాదస్పద ట్రిపుల్‌ తలాక్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ట్రిపుల్‌ తలాక్‌పై పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం 6 నెలల గడువు ఇచ్చింది. ట్రిపుల్‌ తలాక్‌ విధానంపై 6 నెలల పాటు నిషేధం విధించింది. తమిళనాడు పొలిటిక్స్ సస్పెన్స్ థ్రిలర్‌ను తలపిస్తున్నాయి. అన్నాడీఎంకే మాజీ సీఎం ఒ.పన్నీర్‌ సెల్వం వర్గం, సీఎం పళనిస్వామి వర్గం విలీనమై ఆనందోత్సాహాల్లో మునిగితెలుతుండగానే శశకళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చలో తెలకపల్లి రవి (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:42 - August 22, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పరిపాలనపై టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేసీఆర్ మూడేళ్ల పాలనపై టి.జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అధికారం అనేది ఒక కుటుంబం..కొంతమందితో నడవడం దురదృష్టకరమని, మొత్తంగా నిరంకుశ పద్ధతిలో పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. పాతకాలం నాటి జాగిర్దారి వ్యవస్థ గుర్తుకొస్తోందన్నారు. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, సెక్రటేరియట్ కు సీఎం కేసీఆర్ రారని తెలిపారు. పరిపాలన యంత్రాంగం కుప్పకూలిపోయిందని, ఒక పద్దతి..కట్టుబడి లేకుండా..రాజ్యాంగ విలువలు గుర్తించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, అనేక గ్రామాల్లో మంచినీటి పథకాలు ఉన్నాయని..వీటిని మిషన్ భగీరథ పేరిట మళ్లీ చేస్తున్నారని తెలిపారు. ఎవరూ ప్రశ్నించడానికి..సూచనలు చేయడానికి వీలు లేదని పరిస్థితి నెలకొందన్నారు. 

టీఆర్ఎస్ పాలనపై కోదండరాం విమర్శలు..

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర పరిపాలనపై టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేసీఆర్ మూడేళ్ల పాలనపై టి.జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అధికారం అనేది ఒక కుటుంబం..కొంతమందితో నడవడం దురదృష్టకరమని, మొత్తంగా నిరంకుశ పద్ధతిలో పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. 

తెలంగాణలో అత్యంత అవినీతి ప్రభుత్వం - ప్రశాంత్ భూషణ్..

ఢిల్లీ : తెలంగాణలో కేసీఆర్ మూడేళ్ల పాలనపై టి.జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణలో ప్రజాధనాన్ని ప్రభుత్వం కొల్లగొడుతోందని సామాజిక వేత్త ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. తెలంగాణలో అత్యంత అవినీతిపరమైన ప్రభుత్వం ఉందని, రాష్ట్రం ఏర్పాడ్డాక పరిస్థితులు దిగజారాయన్నారు. మరో ఉద్యమానికి దారి తీస్తాయని, అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. 

భన్వర్ లాల్ ను కలిసిన ఏపీ టిడిపి నేతలు..

హైదరాబాద్ : ఎన్నికల ప్రధాన అధికారిని ఏపీ టిడిపి నేతలు కలిశారు. నంద్యాలలో వైసీపీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోందని, భన్వర్ లాల్ ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని ఎంపీ కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. సాక్షి పేపర్, చానెల్ పై అనేక సార్లు ఫిర్యాదు చేయడం జరిగిందని, సాక్షి మీడియాలో వచ్చేవి పెయిడ్ ఆర్టికల్స్ అని తెలిపారు. 

కాకినాడ బీజేపీలో విబేధాలు..

తూర్పుగోదావరి : కాకినాడ బీజేపీలో విబేధాలు పొడచూపాయి. 35వ డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థి తరపున బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడి తీరును నిరసిస్తూ నగర అధ్యక్షుడు నాయకత్వంలో బీజేపీ అభ్యర్థి ప్రచారం నిర్వహించారు. 

19:15 - August 22, 2017

హైదరాబాద్ : తెలంగాణ గర్వించదగిన నాయకుడు రాజ్ బహద్దూర్ వెంకటరామిరెడ్డి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో శ్రీ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి (రెడ్డి) ఎడ్యుకేషనల్ క్యాంపస్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఆయన ఎంతో మందికి జీవితం ప్రసాదించారని, వెంకటరామిరెడ్డి నెలకొల్పిన హాస్టల్ లో చదవి ఎంతో మంది ప్రయోజకులయ్యారని తెలిపారు. రెడ్డి హస్టల్ అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందింది కాదని, ఇందులో అన్ని కులస్తుల వారికి స్థానం కల్పించారన్నారు. అందుకే రెడ్డి హస్టల్ ను తెలంగాణ వారసత్వ సంపదగా చూడాలని, దీనికి ప్రభుత్వం ఇచ్చే నిధులను అలాగే చూస్తామన్నారు. హైదరాబాద్ పోలీసు అకాడమీకి వెంకట రామిరెడ్డి పేరు పెడుతామన్నారు.

సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన ఎడ్యుకేషనల్ క్యాంపస్‌ లో రెడ్డి బాలుర, బాలికల వసతి గృహం, కెరీర్ కోచింగ్ సెంటర్, కన్వెన్షన్ హాల్స్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఇందులో ఏర్పాటు కానున్నాయి. శంకుస్థాపన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రెడ్డి సంఘాల నేతలు, ఆర్‌బీవీఆర్‌ఆర్ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వైసీపీవి నిరాధార ఆరోపణలు - ఎంపీ కేశినేని..

కర్నూలు : టిడిపి డబ్బులు పంచుతోందని వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. 

భన్వర్ లాల్ హెచ్చరికలు..

హైదరాబాద్ : నంద్యాలలో నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. కోడ్ ఉల్లంఘనలపై ఆధారాలు తమకివ్వాలని సూచించారు. 

శిల్పా ఇంటికి పోలీసులు..

కర్నూలు : శిల్పా చక్రపాణి ఇంటికి పోలీసులు వెళ్లారు. పోలీసులు, చక్రపాణి వర్గీయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శిల్పా స్థానికేతరుడని, ఇక్కడ ఉండవద్దంటూ పోలీసులు పేర్కొన్నారు. 

19:01 - August 22, 2017

కృష్ణా : ప్రేమించాడు..నువ్వంటే ప్రాణమన్నాడు..పదమూడేళ్ల వయస్సు కదా..ఆగుదామన్నా..వద్దు..నిండు నూరేళ్లు..ప్రేమగా చూసుకుంటానని పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నాడు..కానీ ఏడేళ్లకే వదిలించుకోనేందుకు సిద్ధమయ్యాడు..విజయవాడకు చెందని అశోక్ యాదవ్..నాగరాణిలు ఏడేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. పిల్లలు పుట్టలేదనే సాకుతో అదనపు కట్నం తేవాలంటూ భార్యను ఇంటి నుండి గెంటేశాడు. దీనితో తనకు న్యాయం చేయాలంటూ నాగరాణి వేడుకొంటోంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:52 - August 22, 2017

కాకినాడ : ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలు అక్కడే మకాం వేశారు. పద్మనాభ ఫంక్షన్ హాల్ లో వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని, కాకినాడ యువత చాలా తెలివైన వారని రాజకీయ చతురత కలిగిన వారు అని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. 

18:34 - August 22, 2017

నెల్లూరు : క్రికెట్ బెట్టింగ్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. 20వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్ లకు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో క్రికెట్ బుకీలకు వీరు సహకరించారని అనుమానాలు వ్యక్తం చేస్తూ సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఎస్పీ కార్యాలయానికి మంగళవారం చేరుకున్నారు. తొలుత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు విచారించారు. కృష్ణ సింగ్ తో పరిచయం..ఇతరత్రా అంశాలపై పోలీసులు ఆరా తీసినట్లు తెలిపారు. తమకు క్రికెట్ బెట్టింగ్ తో ఎలాంటి సంబంధాలు లేవని ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, అందులో భాగంగానే నోటీసులు ఇచ్చారన్నారు. ఎన్ని రోజులు పిలిచినా తాను వస్తానని..ఎన్ని రోజులు పిలిచినా..వెతికినా ఇదే సమాధానం వస్తుందని ఎమ్మెల్యే అనీల్ పేర్కొన్నారు. 

ట్రిపుల్ తలాక్ తీర్పుపై రాహుల్ స్పందన..

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. తీర్పును స్వాగతిస్తున్నట్లు, ఇందులో పోరాటం చేసిన మహిళలకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. 

18:24 - August 22, 2017

విజయవాడ : ఇసుకపై కొత్త మార్గదర్శకాలు అమలు చేసిన తరువాత 82 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన పాలన ఇవ్వడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు అర్హులకు అందాలని సూచించారు. మెరుగైన సేవలు అందించేందుకు 100 కాల్ సెంటర్ సేవలను ప్రారంభించినట్లు, ప్రజలతో అనునిత్యం అనుసంధానమవుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలపై లబ్దిదారులను నేరుగా అడిగి తెలుసుకుంటున్నట్లు, ఇసుక విధానం..మద్యం దుకాణాల విషయంలో ఇబ్బందులు వచ్చాయన్నారు. ప్రభుత్వం స్పష్టతగా ఉందని, ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి అవినీతి..అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు పలు చర్యలు తీసుకుంటామన్నారు.

మద్యం..ప్రజల అభిప్రాయం..
మద్యం విషయంలో ప్రజల అభిప్రాయాలు చెప్పడం ఈసారి పెరిగిందని, 89.4 శాతానికి పెరిగిందన్నారు. పలు ప్రాంతాల్లో ఉన్న బెల్ట్ షాపులను తొలగించాలని పలువురు కోరడం జరిగిందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల బెల్టుషాపులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. 

ఇసుక విధానంపై 82 శాతం తృప్తి - బాబు..

విజయవాడ : ఇసుకపై కొత్త మార్గదర్శకాలు అమలు చేసిన తరువాత 82 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన పాలన ఇవ్వడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

18:01 - August 22, 2017

మంచిర్యాల : జిల్లాలో ఓ దళిత యువకుడు అదృశ్యం అయ్యాడు. మూడు రోజులుగా కనిపించకుండా పోయాడు. మందమర్రి మండలం సారంగపల్లికి చెందిన సాగర్‌... 4నెలల కిందట అగ్రకులానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన అమ్మాయి బంధువులు సాగర్‌ కుటుంబ సభ్యులపై దాడిచేశారు. ఇదిలా ఉండగా మూడు రోజులుగా సాగర్‌ కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. అమ్మాయి తల్లిదండ్రులే తమ కుమారుడిని కిడ్నాప్‌ చేశారని సాగర్‌ పేరెంట్స్‌ ఆరోపిస్తున్నారు.
వివాదాలకు దూరంగా దాదాపు రెండు..మూడు నెలలుగా హైదరాబాద్ లో సాగర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంటికి వస్తానని ఫోన్ చేసిన సాగర్ తరువాత అదృశ్యమయ్యాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగ్గా స్పందిస్తలేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

17:58 - August 22, 2017

హైదరాబాద్ : తాను ప్రజల కోరికను తీర్చానని..కానీ తనకో కోరిక ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో శ్రీ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి (రెడ్డి) ఎడ్యుకేషనల్ క్యాంపస్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాజా బహదూర్ క్యాంపస్ కు ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసిందని..ఇంకా కావాలంటే రూ. 10 కోట్లు..మంజూరు చేస్తామన్నారు. కానీ ఈ ప్రాంతంలో అద్భుతమైన ఎడ్యుకేషన్ టవర్ రావాలనే కోరిక ఉందన్నారు.

తెలంగాణలో ఎన్నో విషయాల్లో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. వెంకటరామిరెడ్డి ఆశయాలను..కలలను కొనగిస్తామన్నారు. ఇక నుండి తెలంగాణ పోలీసు అకాడమీ రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డిగా పిలుస్తారని తెలిపారు. పది ఎకరాలకు అదనంగా ఐదు ఎకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు జీవో బుధవారం జారీ చేస్తామన్నారు. బాలికల హాస్టల్ పక్కనే ఐపీఎంకు చెందిన 1500 గజాల ఖాలీ స్థలం ఉందని..ఈ స్థలం కూడా వచ్చే విధంగా చూడాలని ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డికి సూచించారు.

ప్రస్తుతం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన ఎడ్యుకేషనల్ క్యాంపస్‌ లో రెడ్డి బాలుర, బాలికల వసతి గృహం, కెరీర్ కోచింగ్ సెంటర్, కన్వెన్షన్ హాల్స్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఇందులో ఏర్పాటు కానున్నాయి. శంకుస్థాపన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రెడ్డి సంఘాల నేతలు, ఆర్‌బీవీఆర్‌ఆర్ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

17:49 - August 22, 2017

ఖమ్మం : మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ ఖమ్మం నగర ప్రజలు మట్టి విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. విషరసాయనాలు వాడకుండా మట్టితో విగ్రహాలు తయారు చేస్తూ మార్పు కోసం కృషి చేస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కాబోతుండటంతో ప్రతి ఒక్కరూ ఆలోచించి మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.

మట్టి విగ్రహాల తయారీలో ఖమ్మం వాసులు ముందుకు సాగుతున్నారు. భావి తరాలకు భవిష్యత్తునిద్దామంటూ జీవశాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రేమికులు మట్టి విగ్రహాలను తయారు చేస్తూ ప్రజలకు ఉచింతంగా పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల వల్ల జరిగే నష్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

మన ముందు తరంలో వారు మట్టితో తయారు చేసిన విగ్రహాలనే పూజించేవారు. తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టితో విగ్రహాలను తయారు చేసేవారు. ఈ విధంగా తయారు చేసిన విగ్రహాలు సుమారుగా 41 రోజుల వరకు నిలకడగా, ధృడంగా ఉండేవి. విగ్రహ ప్రతిష్ట అనంతరం కేవలం ఔషధ మొక్కలతోనే పూజలు చేసేవారు. ఈ విధంగా చేయడం వల్ల పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా ప్రకృతి విపత్తు రాకుండా వ్యవసాయం మంచిగా సాగాలనే సంకల్పంతో పూజలు నిర్వహించేవారు.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా గణనాథుడి విగ్రహాలను వివిధ రకాల రసాయనాలతో తయారు చేస్తూ అందంగా తీర్చిదిద్దుతున్నారు. పర్యావరణం కంటే తమ గణపతి విగ్రహం ఎంత అందంగా ఉందనే దానిపై దృష్టి పెట్టారు. అయితే దీనివల్ల నష్టాలను గమనించిన పర్యావరణ ప్రేమికులు మట్టి విగ్రహాల ప్రాముఖ్యతను గుర్తించారు. ఆ దిశగానే ప్రతిమలను రూపొందించే పనిలో పడ్డారు. విగ్రహాల తయారీ కోసం చెరువు మట్టిని సేకరించి, అందులో ఉన్న రాళ్లను వేరు చేసి, మెత్తని మట్టిని తీస్తారు. వరిగడ్డి, వెదురు బొంగులు, పీచు, ఉనుక, జనుపనారతో కావాల్సిన ఆకృతులను తయారు చేసి, మట్టిని బొమ్మచుట్టూ అతికిస్తూ అందమైన విగ్రహాలుగా మలుస్తున్నారు. చవితికి రెండు రోజుల ముందు మాత్రమే విగ్రహాలకు వాటర్‌ కలర్స్‌ను అద్ది అమ్ముతారు.

మట్టి విగ్రహ విశిష్టతను గుర్తించిన 10 టివీ ఖమ్మంలో విగ్రహాల తయారు చేయాలన్న సూచనలతో తయారీ దారులు మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. వీటిని ఉచితంగా పంపిణీ చేసేందుకు స్తంబాద్రి కమిటీ ముందుకు వచ్చింది. మొత్తం మీద మట్టి విగ్రహాల తయారీకి విపరీతంగా ఆదరణ పెరిగింది. దీంతో మట్టి విగ్రహాలను పూజించేందుకు భక్తులు సన్నద్ధం అవుతున్నారు.

వెంకటరామిరెడ్డి పేదల విద్య కోసం ఆలోచించారు: కేసీఆర్

రంగారెడ్డి : సమైక్య రాష్ట్రంలో మహానుభావుల పేర్లు కనుమరుగయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో శ్రీ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి (రెడ్డి) ఎడ్యుకేషనల్ క్యాంపస్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ లో మనకు సంబంధించిన పేర్లు ఉండవని, సంబంధం లేని వ్యక్తుల పేర్లు ఇక్కడ ఉన్నాయన్నారు. మాయమైపోయిన మన వారి పేర్లను పునరుద్ధరించుకోవాలని, రాష్ట్రం ఏర్పడిన కొన్ని రోజులకే పోలీస్ అకాడమీకి రాజబహుదూర్ వెంకటరామిరెడ్డి పేరు పెట్టామన్నారు.

17:46 - August 22, 2017

ఖమ్మం : ఈ సారి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వినాయక చవితి పండగను జరుపుకోవడానికి సిద్ధమయ్యింది. అయితే ఈ సారి మట్టి గణపయ్య విగ్రహాలను పూజించేందుకు భక్తులు మొగ్గు చూపుతున్నారు. మరి మట్టి విగ్రహాలు ఎక్కడ తయారవుతాయి. అసలు వాటినెలా తయారు చేస్తారు ?

చాదర్‌ఘాట్‌ గణేశ్‌ తయారీ కేంద్రంలో మట్టి గణేశుడి విగ్రహాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి. దివ్యమైన తేజస్సు మూర్తీభవించిన విగ్రహాలు ఇవి. వీటిని చూడగానే ఎవరికైనా ఒక పవిత్ర భావన కలుగుతుంది. బంకమట్టి, వరపట్టు, గడ్డి, చెక్కలు, కలకత్తా వర్కర్లు, కలకత్తా గంగామట్టి ఇవన్నీ కలిస్తేనే మట్టి విగ్రహం సాధ్యమవుతుందని విగ్రహ తయారీదారులు చెబుతున్నారు. ఈ ఏడాది 400 విగ్రహాలను తయారు చేసినట్లు మట్టి విగ్రహాల తయారీ కేంద్రం యజమాని తెలిపారు. స్కూళ్లు, అపార్ట్‌మెంట్‌లలో మట్టి విగ్రహాలను కొనడానికి మక్కువ చూపిస్తున్నట్లు చెప్పారు.

మట్టి గణేశుడిని పెట్టడం వల్ల నీళ్లలో నిమజ్జనం చేసేటప్పుడు.. సులభంగా నీళ్లల్లో కలిసిపోతుంది. అదే ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలైతే నీళ్లల్లో కరగడానికి చాలా సమయం పడుతుంది. నీళ్లు కలుషితమవుతాయి. దీంతో భక్తులు చాలా వరకు మట్టి విగ్రహాలను పెట్టడానికే ఇష్టపడుతున్నారు. 60 అడుగుల మట్టి విగ్రహాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వినాయకుడి ప్రతిమలు ఎన్నో ఆకృతుల్లో దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ఎన్నో స్టాళ్లు ఏర్పాటయ్యాయి. పర్యావరణాన్ని కాపాడదాం. మట్టి విగ్రహాలనే పూజిద్దాం. మట్టి విగ్రహాలకే జై కొడదాం.  

17:40 - August 22, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజు రోజుకు శరవేగంగా మలుపులు తిరుగుతున్నాయి. రెండాకుల విలీన ప్రక్రియ జరిగిన కొన్ని గంటల్లోనే టీటీవీ దినకరణ్‌ షాక్‌ ఇచ్చారు. 19 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ను కలిసిన ఆయన...పళనిస్వామి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు బాంబు పేల్చారు. అంతేకాదు అసెంబ్లీలో బలనిరూపణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.

తమిళనాడు పొలిటిక్స్ సస్పెన్స్ థ్రిలర్‌ను తలపిస్తున్నాయి. అన్నాడీఎంకే మాజీ సీఎం ఒ.పన్నీర్‌ సెల్వం వర్గం, సీఎం పళనిస్వామి వర్గం విలీనమై ఆనందోత్సాహాల్లో మునిగితెలుతుండగానే శశకళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ ఊహించని షాక్ ఇచ్చారు. టీటీవీ దినకరన్ వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలు రాజ్ భవన్‌లో గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ తో భేటీ అయ్యారు. పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదని కీలక ప్రకటన చేశారు. సీఎంను మార్చాలి ఈ సర్కార్ మాకొద్దు అని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరిలో పళినిస్వామిపై ఉన్న నమ్మకంతోనే మద్దతిచ్చామని..అయితే ఆ విశ్వాసం ఇప్పుడు పోయిందని గవర్నర్‌కు వివరించారు.

19 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు దినకరన్‌ స్పష్టం చేయడంతో పళనిస్వామి సర్కార్‌ మైనార్టీలో పడిపోయింది. అయితే పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు డీఎంకే నేత స్టాలిన్ రంగంలోకి దిగారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి, బల నిరూపణకు ఆదేశాలు ఇవ్వాలని స్టాలిన్ గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వానికి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు తగ్గిందని స్టాలిన్ తెలిపారు.

ఇప్పటివరకు పళనిస్వామికి మద్దతుగా ప్రతిపక్షాలు, దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు కలిపి 117 మంది ఉన్నారు. డిఎంకె మిత్ర పక్షానికి 86 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు పళని వర్గం నుంచి శశికళ వర్గం దూరం కావడంతో 95 స్థానాలకు అన్నాడింఎకె వర్గం పడిపోయింది. అసెంబ్లీలో బలనిరూపణకు 117 మంది ఎమ్మెల్యేలు ఉండాలి.

దినకరన్ కు చెందిన 19 మందితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో, ఇప్పటికిప్పుడు బల ప్రదర్శన జరిగితే ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా తెలుస్తోంది. ఈ పరిణామాలను పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం ఎలా ఎదుర్కోబోతున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది. బలనిరూపణ కోసం దినకరన్‌ వర్గం నుంచి ఎమ్మెల్యేలను లాగేందుకు లాబీయింగ్‌ చేస్తారా? లేక దినకరన్ కు చెక్‌పెట్టేందుకు ఎత్తుకు పై ఎత్తు వేస్తారో చూడాలి. 

17:37 - August 22, 2017

ఢిల్లీ : వివాదస్పద ట్రిపుల్‌ తలాక్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ట్రిపుల్‌ తలాక్‌పై పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం 6 నెలల గడువు ఇచ్చింది. ట్రిపుల్‌ తలాక్‌ విధానంపై 6 నెలల పాటు నిషేధం విధించింది. సుప్రీంకోర్టు తీర్పుపై పిటిషనర్‌ షయిరా బానోతో పాటు ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

ముస్లిం సామాజికవర్గంలో అమలులో ఉన్న ట్రిపుల్‌ తలాక్‌ విధానంపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని చీఫ్‌ జస్టిస్‌ ఖేహార్‌ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 3:2తో తీర్పు వెలువరించింది. ట్రిపుల్‌ తలాఖ్‌ను జస్టిస్‌ ఖేహార్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ సమర్థించగా...జస్టిస్‌ కురియన్, జస్టిస్‌ లలిత్‌, జస్టిస్‌ నారిమన్‌లు వారి తీర్పుతో విభేదించారు.

తలాక్‌ అంశం రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను ఉల్లంఘించడం లేదని, ఇది వెయ్యి ఏళ్లకు పైగా ఉన్న ఆచారమని...దీన్ని పార్లమెంట్‌కే వదిలేయాలని జస్టిస్‌ ఖేహార్‌ పేర్కొన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగబద్దం కాదని ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్‌ కురియన్, జస్టిస్‌ లలిత్‌, జస్టిస్‌ నారిమన్‌ అభిప్రాయపడ్డారు. ఇస్లాం దేశాల్లోనే ఈ ఆచారం లేనపుడు భారత్‌లో ఎందుకు కొనసాగించాలని వారు ప్రశ్నించారు.

ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులకు ట్రిపుల్‌ తలాఖ్‌ భంగం కలిగిస్తోందని...రాజీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకంగా వివాహాన్ని రద్దు చేయడం ఎంతమాత్రం సమ్మతం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని...6 నెలల్లోగా దీనిపై చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం చట్టం చేసేముందు షరియా చట్టాలను, ముస్లిం సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈ చట్టానికి రాజకీయ పార్టీలన్నీ కేంద్రానికి సహకరించాలని పేర్కొంది. చట్టం రూపొందేవరకు ట్రిపుల్‌ తలాక్‌ విధానంపై 6 నెలల పాటు నిషేధం విధించింది.

సుప్రీంకోర్టు తీర్పును ఆల్‌ ఇండియా ముస్లిం వుమెన్‌ పర్సనల్‌ లా బోర్డు అధ్యక్షురాలు షాయిస్తా అంబర్‌ స్వాగతించారు. ట్రిపుల్‌ తలాక్‌ పేరిట ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయానికి ఇక ఫుల్‌స్టాప్‌ పడనుందని ఆమె అభిప్రాయపడ్డారు. ముస్లిం మహిళలకు ఇది చారిత్రాత్మక రోజని ట్రిపుల్‌ తలాక్ బాధితురాలైన పిటిషనర్‌ షాయరా బాను అభివర్ణించారు. సాధ్యమైనంత త్వరగా ట్రిపుల్‌ తలాఖ్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకురావాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ట్రిపుల్‌ తలాఖ్‌ విధానానికి వ్యతిరేకంగా షాయరా బానుతో పాటు పలువురు మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సీజే.ఖెహర్‌ నేతృత్వంలో విభిన్న మతాలకు చెందిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మే 11న ప్రారంభమైన విచారణ మే 18తో ముగిసింది. ఆరు రోజుల విచారణ అనంతరం అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఇవాళ తుది తీర్పును వెలువరించింది. ముస్లిం మ‌త సాంప్రదాయంలో మూడు సార్లు త‌లాక్ అంటే భార్యాభ‌ర్తల మ‌ధ్య బంధం తెగిపోయిన‌ట్లే. ఈ ఆచారం పట్ల ముస్లిం మహిళలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. 

సారంగపల్లి లో యువకుడు అదృశ్యం

మంచిర్యాల : మందమర్రి మండలం సారంగపల్లి లో యువకుడు అదృశ్యం అయ్యాడు. 4 నెలల క్రితం అగ్రకులానికి చెందిన యువతితో పెళ్లి అయ్యింది. యువకుడి పై అమ్మాయి తరపు బంధువులు దాడి చేశారు. అయితే గత 3 రోజులుగా యువకుడు మిస్సయ్యాడు. అమ్మాయి తరపు బంధువులే కిడ్నాప్ చేశారని యుడకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

17:04 - August 22, 2017

రంగారెడ్డి : రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో శ్రీ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి (రెడ్డి) ఎడ్యుకేషనల్ క్యాంపస్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రెడ్డి బాలుర, బాలికల వసతి గృహం, కెరీర్ కోచింగ్ సెంటర్, కన్వెన్షన్ హాల్స్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఇందులో ఏర్పాటు కానున్నాయి. శంకుస్థాపన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రెడ్డి సంఘాల నేతలు, ఆర్‌బీవీఆర్‌ఆర్ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

రెడ్డి ఎడ్యుకేషనల్ క్యాంపస్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

రంగారెడ్డి : రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో శ్రీ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి (రెడ్డి) ఎడ్యుకేషనల్ క్యాంపస్‌కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. రెడ్డి బాలుర, బాలికల వసతి గృహం, కెరీర్ కోచింగ్ సెంటర్, కన్వెన్షన్ హాల్స్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రెడ్డి సంఘాల నేతలు, ఆర్‌బీవీఆర్‌ఆర్ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కలెక్టర్ల కు నిధులు విడుదల చేసిన టీ.సర్కార్

హైదరాబాద్ : రాష్ట్రంలోని 31 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అత్యవసరాల కోసం నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జిల్లాకు రూ. 75 లక్షల చొప్పున రూ. 23.25 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్ల అత్యవసర పనుల కోసం ఉపయోగించనున్నారు.

16:39 - August 22, 2017

ఖమ్మం : మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ ను కస్టడీకి తీసుకోవాలంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ విషయంలో తాను అప్పీల్ కు వెళుతానని కమిషనర్ సత్యబాబు పేర్కొంటున్నారు. ఓ కమర్షియల్ కాంప్లెక్సు పన్ను విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను కమిషనర్ సత్యబాబు ధిక్కరిస్తున్నారని కోర్టు పేర్కొంది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొంటూ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు తీర్పుచెప్పింది. అంతేగాకుండా వారం రోజుల కస్టడీ, రెండు వేల జరిమాన విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. సవాల్ చేసేందుకు హైకోర్టు సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ఆయన అప్పీల్ కు వెళుతానని సత్యబాబు పేర్కొంటున్నారు. 

సుప్రీం తీర్పుపై స్పందించిన ఎంపి అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్‌: ట్రిపుల్‌ తలాక్‌ ఆలిండియా మజ్లిస్‌ ఇతేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ మాత్రం తీర్పును గౌరవిస్తూనే భిన్నంగా స్పందించింది. సుప్రీం తీర్పుపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనం తప్పక గౌరవించాలి. అయితే ఇది ఏకపక్షంగా వచ్చిన తీర్పుకాదని గుర్తుంచుకోవాలి. తలాక్‌ రద్దు తీర్పును క్షేత్రస్థాయి అమలు చేయాలంటే చాలా కఠినమైన సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది’’ అని అసద్‌ అన్నారు.

16:32 - August 22, 2017

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 151వ మూవీ ‘సైరా-నరసింహారెడ్డి’ టైటిల్‌పై అప్పుడే వివాదం మొదలైపోయింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్టోరీతో సినిమా చేస్తూ.. ఆయన పేరును పెట్టకుండా ‘సైరా’అనే పేరు ఓకే చేయడంపై ఉయ్యాలవాడ వారసులు ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. టైటిల్‌పై తమకు అభ్యంతరాలున్నాయని, దీనిపై ఫిర్యాదు చేస్తామని సీమలోవున్న ఉయ్యాలవాడ వారసులు చెబుతున్నారు. పేరు మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

16:31 - August 22, 2017

కాకినాడ : కారుకు నల్లటి అద్దాలు..బ్లాక్ ఫిల్మ్ ఉండకూడని సుప్రీంకోర్టు ఆదేశాలను ఓ ఎమ్మెల్యే ఏ మాత్రం అవలించడం లేదు. ఆమె తనయుడు కూడా దర్జాగా ఎమ్మెల్యే స్టిక్కర్..బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారులోనే దర్జాగా తిరిగేస్తున్నాడు. ఇదంతా అధికారులు..పోలీసుల ఎదుటే చోటు చేసుకోవడం గమనార్హం.

కాకినాడలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పాల్గొంటున్నారు. కానీ ఆమె ప్రయాణిస్తున్న కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండడం గమనార్హం. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఈ కారులో ఆమె తనయుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిపై నగర ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తనయుడు కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

'కృష్ణా నీళ్లను అన్ని రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలి'

విజయాడ: కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. కృష్ణా నీళ్లను అన్ని రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని కృష్ణా రివర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉందని, కింది రాష్ట్రాలకు నీటిని విడుదల చేయాలని బజాజ్ కమిటీకి లేఖ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ ఛైర్మన్ శ్రీవాస్తావ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో నీటి కొరత ఉన్న మాట వాస్తమని, అపెక్స్ కమిటీ వేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే లేఖ రాశాయన్నారు. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

16:26 - August 22, 2017

కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో కీలక నేతలు పర్యటిస్తున్నారు. వైసీపీ, టిడిపి పార్టీలకు చెందిన నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఆపార్టీ నేత లక్ష్మీ పార్వతి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె టెన్ టివితో మాట్లాడారు. టిడిపికి ఓటు వేసి మోసపోయారని...మూడు సంవత్సరాల్లో 600 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేరిందా అని ప్రశ్నిస్తే ప్రజలు లేదు అని జవాబిస్తున్నారన్నారు. వార్డుల్లో డ్రైనేజీ అస్తవ్యస్థంగా ఉందని, స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఎన్నికలు రాగానే నాయకులు వస్తున్నారని, ఎవరు న్యాయం చేస్తారో వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ సిటీ పక్కకు పోయిందని...భూ కబ్జాలు మాత్రం నిజమయ్యాయని ఆరోపించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

సుప్రీం కోర్టులో తమిళనాడు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

చెన్నై: సుప్రీం కోర్టులో తమిళనాడు సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. నీట్ అడ్మిషన్లను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లను వెంటనే చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది.

16:17 - August 22, 2017

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయన 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' మోషన్‌పోస్టర్ దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి చేతులమీదుగా చిత్రయూనిట్ విడుదల చేపించింది . ఈ సందర్భంగా 'సైరా నరసింహారెడ్డి మోషన్‌పోస్టర్ విడుదల కార్యక్రమంలో నేను పాలుపంచుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను, చిత్రయూనిట్‌తో పాటు నటీనటులు అత్యద్భుతంగా ఉన్నారు. యూనిట్ మొత్తానికి అభినందనలు' అని పేర్కొంటూ ట్వీట్ పోస్ట్ చేసి దానితో పాటు 'సైరా నరసింహారెడ్డి' మోషన్‌పోస్టర్ కూడా జతచేశాడు. ఈ ట్వీట్ చూసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

16:12 - August 22, 2017

నెల్లూరు : క్రికెట్ బెట్టింగ్ కేసులో రాజకీయ కారణాలతోనే తనకు నోటీసులు జారీ చేశారని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. కాసేపటి క్రితం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచారణ ముగిసింది. క్రికెట్ బెట్టింగ్ కేసులో కోటంరెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. రెండున్నర గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. 27న మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

క్రికెట్ బెట్టింగ్ లో తన ప్రమేయం ఎక్కడా లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే తనకు నోటీసులు అందచేశారని, నంద్యాల ఉప ఎన్నికల్లో గెలించేందుకు ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

20వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్ లకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో క్రికెట్ బుకీలకు వీరు సహకరించారని అనుమానాలు వ్యక్తం చేస్తూ సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఎస్పీ కార్యాలయానికి మంగళవారం చేరుకున్నారు. తొలుత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు విచారించారు. కృష్ణ సింగ్ తో పరిచయం..ఇతరత్రా అంశాలపై పోలీసులు ఆరా తీసినట్లు తెలిపారు. తమకు క్రికెట్ బెట్టింగ్ తో ఎలాంటి సంబంధాలు లేవని ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. 

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ బేబీ పౌడర్‌ వల్ల క్యాన్సర్..

హైదరాబాద్ :జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీకి మరోసారి భారీ షాక్‌ తగిలింది. లాస్ ఏంజిల్స్ జ్యూరీ జాన్సన్ & జాన్సన్ రికార్డు స్థాయిలో పెనాల్టీ విధించింది. కంపెనీకి చెందిన బేబీ పౌడర్‌ వల్లే ఈవా ఎచివెరియా అనే మ‌హిళ‌కు ఒవేరియ‌న్ (అండాశ‌య‌) క్యాన్స‌ర్ సోకిందని నమ్మిన కోర్టు ఆమెకు రూ. 2700 కోట్లు(417 మిలియ‌న్ల డాల‌ర్లు) న‌ష్ట‌ప‌రిహారంగా చెల్లించాల‌ని ఆదేశించింది.

10రోజుల కస్టడీకి మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్

నల్గొండ: మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ హైకోర్టు ఓ కమర్షియల్ కాంప్లెక్స్ పన్ను వసూలు విషయంలో కోర్టు దిక్కరణకు పాల్పడినందుకు మున్సిపల్ కమిషనర్ సత్యం బాబుకు 10 రోజుల కష్టడీ విధించింది. అంతే కాకుండా రూ.2వేలు జరిమానా కూడా విధించింది.

సిద్ది అంబర్ బజార్ లో అక్రమ కట్టడాలపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్: సిద్ది అంబర్ బజార్ లో రోడ్డు పక్కన అక్రమ కట్టడాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. రోడ్డు పక్కన ఎలాంటి అక్రమణలు చేయలేదని ఓనర్లు తెలుపగా మేము వచ్చి చూస్తామని ఆక్రమణలు జరగేలేనది చూపిస్తారా అని జడ్జి ప్రశ్నించారు. ఆక్రమణలు జరిగాయని రుజువైతే జైల్లో పెడతామని హెచ్చరించింది.

16:04 - August 22, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లపై ఆయన టెన్ టివితో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రశాంత వాతావరణం, స్వేచ్చగా ఓటు వేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నిక నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు భద్రతలో భాగంగా మూడు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 250 పోలింగ్ సెంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతా సరళనిని పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:49 - August 22, 2017

ఖమ్మం : కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ భారం భద్రాద్రి రామయ్యకీ తప్పలేదు. కొత్త పన్నుల విధానంతో స్వామివారి ఆదాయం మరింత తగ్గిపోనుంది. అసలే అంతంత మాత్రంగా నెట్టుకొస్తున్న ఆలయాలకు ఈ పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది. భద్రాచలం శ్రీరామచంద్ర స్వామికి జీఎస్టీ భారం తప్పేలా లేదు. వస్తు సేవల పన్నుల విధానం వలన రాముడిపై సుమారు 50 లక్షల మేర భారం పడనున్నట్లు తెలుస్తోంది. ఆలయం తరపున జీఎస్టీ సకాలంలో చెల్లించకపోతే నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. సిబ్బందికి జీతాలు చెల్లించి పన్నులు కట్టేసరికి ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి. ఇదే విధానం గనుక కొనసాగితే దూప దీప నైవేద్యాలకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో సుమారు 150 మంది కార్మికులు పని చేస్తారు. ఈ విభాగాన్ని సేవారంగంలో ఉంచి నెలకు 15 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం సేవారుసుం 15 శాతం ఉండగా జీఎస్టీ నిబంధనలతో మరో 3 శాతం పెరగనుంది. ఆలయం నుండి నెలకు సుమారు 50 వేలు, సంవత్సరానికి 6 లక్షలు అదనంగా ప్రభుత్వానికి చెల్లించాలి. ఇందులోనే 15 శాతం సేవాపన్ను కలిసి ఉంటుంది. పన్ను 3 శాతం కలిపితే ఏటా సుమారు అదనంగా ప్రభుత్వానికి 5 లక్షల రూపాయలు దేవస్థానం చెల్లించాలి.

ముఖ్యంగా ప్రసాదంపై జీఎస్టీ భారం ఎక్కువగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రసాదం వినియోగించే బ్రాండెడ్‌ సరుకులకు అధికంగా పన్నులు చెల్లించాలి. దాని వల్ల ప్రసాదం ఖరీదు పెరగి భక్తులపై భారం పడనుంది. ఇప్పటికే 100 గ్రాములు ఉన్న లడ్డు ప్రసాదాన్ని 80 గ్రాములకు తగ్గించారు. ప్రసాదం ధరలు పెంచినా, ప్రసాదం పరిమాణం తగ్గించినా దాని ప్రభావం మాత్రం పడేది భక్తులపైనే. అయితే జీఎస్టీ భారాన్ని భక్తులపై వేయకుండా ఉంటే భద్రాద్రి రాముడికి కష్టాలు తప్పవు.

శ్రీరామ నవమి ముక్కోటి ఉత్సవాలకు తప్పనిసరిగా దేవాలయంను రంగులతో అలంకరించాలి. ప్రస్తుతం రంగులపై కూడా పన్నువేయడం వలన, రానున్న ఉత్సవాలకు దేవాలయం శోభాయమానంగా జరగాలంటే భారీ ఖర్చులు తప్పేలాలేవు. ఆలయానికి మొత్తం 180 గదులు ఉన్నాయి. వీటి ద్వారా దేవస్థానానికి ఏటా కోటి రూపాయల వరకు ఆదాయం వస్తుంది. భద్రాద్రి ఆలయానికి ఏటా 30 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.

ఆదాయానికి తగ్గట్టే వ్యయాలు సమంగా ఉన్నాయి. నికర ఆదాయం 18 కోట్లలోపే ఉంది. నికర ఆదాయం నుండి నాలుగు విధానాల్లో 21.5 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. సర్వశ్రేయానిధి 5 శాతం, ఆడిట్‌ ఫీజు 1.5 శాతం, ఎండోన్మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫీజు 12 శాతం, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ 3 శాతం దేవస్థానం నుండి చెల్లించడం జరుగుతోంది. ఇలా ఏడాదికి సుమారు 4 కోట్ల రూపాయలు ప్రభుత్వ శాఖలకు చెల్లిస్తుంది. ఈ చెల్లింపులు చేసినప్పుడు ఒక్కోసారి సిబ్బంది జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోంది.

ఈ పరిస్థితుల్లో జిఎస్‌టీ అమలు జరిగితే రామయ్య ఖాతాకు భారీగా గండి పడటం ఖాయమంటున్నారు భక్తులు. ఎంత లేదన్నా ఏడాదికి 50 లక్షల వరకు ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే భక్తులపై అధిక భారం వేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ నుండి దేవాలయాలను మినహాయించాలని కేంద్రాన్ని కోరుతున్నారు.

15:44 - August 22, 2017

విజయవాడ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సంస్కరణలను ఆపాలని డిమాండ్ చేస్తూ ఆల్‌ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు విజయవాడలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రుణాలు ఎగ్గొట్టిన కార్పొరేట్‌ కంపెనీల నుండి రుణాలు వసూలు చేయడానికి చట్టం తీసుకురావాలని బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ ప్రసిడెంట్‌ అజయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. బ్యాంకింగ్‌ రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు ఉన్నందున నిరుద్యోగులకు ఉపాధిని కల్పించేవిధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. బ్యాంకుల సమ్మెకు సిఐటియూ, సీపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మద్దతు తెలిపారు. 

పెందారలో రోడ్డుప్రమాదంలో ముగ్గురి మృతి

కుమ్రంభీం : జిల్లాలోని వాకిండి మండలం పెందారలో రోడ్డుప్రమాదం జరిగింది. లారీ - ఆటో ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

15:42 - August 22, 2017

నిజామాబాద్ : నైరుతీ రుతుపవనాలకు అల్పపీడన ద్రోణి ప్రభావం తోడవడంతో నిజామాబాద్‌ జిల్లాలో వర్షాలు కురిశాయి. దీంతో సాగునీటి ప్రాజెక్టులకు కొద్దిగా జలకళ సంతరించుకుంది. మిషన్‌ కాకతీయలో భాగంగా పూడిక తీసిన చెరువుల్లో నీరు చేరుతోంది. భూగర్భ జలమట్టాలు పెరుగుతున్నాయి. దీంతో అన్నదాతల మోములో ఆనందం వెల్లి విరుస్తోంది.

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో మురిపించిన వర్షాలు ఈ తర్వాత ముఖం చాటేశాయి. వరుణ దేవుడుని నమ్ముకుని పైర్లు సాగు చేసిన రైతులు వర్షాభావంతో దిగులు పడిపోయారు. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, ప్రాజెక్టుల్లో నీరు చేరలేదు. దీంతో సాగుచేసిన పంటలు ఎండిపోతున్న దశలో ఇప్పుడు కురిసిన వర్షాలకు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి.

నైరుతీ రుతువనాలకు అల్పపీడన ద్రోణి తోడవడంతో రెండు రోజులు పాటు వర్షాలు పడ్డాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదుకావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతోంది. ఎస్‌ఆర్‌ఎస్‌పీ పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు. ప్రస్తుతం 9.65 టీఎంసీల నీరు నిల్వవుంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో నలభై టీఎంసీలకుపైగా నీరు నిల్వ ఉంది. కానీ వర్షాభావంతో ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1055.50 అడుగుల మేర నీరు చేరింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఎస్‌ఆర్‌ఎస్‌పీలోకి కొద్ది కొద్దిగా నీరు వచ్చి చేరుతోంది.

కామారెడ్డి జిల్లాలో కూడా సాగునీటి ప్రాజెక్టుల్లో కొద్దిగా పరిస్థితి మెరుగవుతోంది. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్‌లోకి 1899 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నిజాంసాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు. కాగా ప్రస్తుతం 1382 అడుగుల మేర నీరు చేరింది. కల్యాణి ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరగడంతో ఒక గేటు ఎత్తి 750 క్యూసెక్కుల నీటి మంజీరానదిలోకి మళ్లించారు. మరో 500 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్‌ ప్రధాన కాల్వలోకి విడుదల చేస్తున్నారు. సింగీతం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 416 మీటర్లు కాగా... ఇప్పుడు 418 మీటర్ల మేర నీరు చేరింది. సాగునీటి ప్రాజెక్టుల్లోకి నీరు చేరడంతో ఈసారి ఖరీఫ్‌ సీజన్‌లో సాగుచేసిన పంటలకు సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. 

15:37 - August 22, 2017

హైదరాబాద్ : పేరుకు మాత్రం స్పా కేంద్రాలు..అందులో జరిగేది మాత్రం వేరు. మసాజ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలు..బోర్డులు వేలాడదీస్తూ లోన మాత్రం పక్కా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసులు దాడుల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో స్పా..మసాజ్ సెంటర్ల గుట్టును పోలీసులు విప్పారు. ఈ ఘటనలో పలువురు యువతులను, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రముఖుల కుమారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కీలక నిందితుడిగా భావిస్తున్న సెంటర్ నిర్వాహకుడు సిద్ధార్ద్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించాడు. ఎంసీఏ పూర్తి చేసిన సిద్దార్థ్ థాయి మసాజ్, బాడీ మసాజ్ లపై ఇతర రాష్ట్రాల్లో పరిశోధనలు చేశాడు. ఇలా పరిశోధనలు చేసిన సిద్ధార్థ్ నగరంలో స్పా సెంటర్లను నెలకొల్పాడు. ఈ తరుణంలో థాయిలాండ్ కు చెందిన కేక అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. థాయిలాండ్ యువతులను కేక సహకారంతో నగరానికి సిద్దార్థ్ రప్పించాడు. ఇలా నగరంలో మరో 6 స్పా సెంటర్లను తెరిచేందుకు యత్నించాడు. స్పా ముసుగులో హైటెక్ వ్యభిచారం నిర్వహించాడు. ఒక్కో అమ్మాయికి నెలకు రూ. 30 వేలు ఇచ్చాడు. సిద్ధార్ద్ అకౌంట్ లో భారీగా నగదు గుర్తించారు. 

సుప్రీం తీర్పు పై ప్రధాని హర్షం...

ఢిల్లీ: ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘ట్రిపుల్ తలాక్‌పై గౌరవనీయమైన సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు చరిత్రాత్మకం. ఈ నిర్ణయం ముస్లిం మహిళలకు స‌మాన‌త్వాన్ని తీసుకొచ్చింది. మహిళాసాధికారతకు ఇదో నిదర్శనం’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

అక్రమ బెల్లం పట్టివేత...

నల్లగొండ : మిర్యాలగూడలోని శాంతినగర్‌లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శ్రీను అనే వ్యక్తి ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 15 క్వింటాళ్ల బెల్లం, 20 కేజీల స్ఫటికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బెల్లం, స్ఫటికంను పోలీసులు ఎక్సైజ్ ఆఫీస్‌కు తరలించారు.

గవర్నర్ కు స్టాలిన్ లేఖ...

చెన్నై : గవర్నర్ విద్యాసాగర్ రావుకు డీఎంకే నేత స్టాలిన్ లేఖ రాశారు. ప్రభుత్వానికి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. పళని ప్రభుత్వాన్ని బలనిరూపణకు ఆహ్వానించాలని స్టాలిన్ కోరారు.

15:21 - August 22, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో మళ్లీ నంబర్ గేమ్ మొదలైంది. అధికార పీఠం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తమిళనాడు సీఎం పళనీ స్వామి బలనిరూపణ చేసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జయ మృతి అనంతరం పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే వర్గం రెండుగా చీలిపోయింది. సీఎంగా పళని స్వామి పగ్గాలు చేపట్టడం..ఆయనపై పన్నీర్ వర్గం తీవ్ర విమర్శలు గుప్పించాయి. మళ్లీ పళనీ స్వామి..పన్నీర్ స్వామి పార్టీలు విలీనమయ్యాయి. అనంతరం మంత్రివర్గ విస్తరణ కూడా జరిగిపోయింది. శశికళ..దినకరన్ లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

మంగళవారం పూర్తిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. పళనీ స్వామికి వ్యతిరేకంగా 19 మంది ఎమ్మెల్యేలు లేఖ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. పళని ప్రభుత్వంలో తన ఎమ్మెల్యేలున్నారని, అవసరమైన సమయంలో ఎమ్మెల్యేలు బయటకొస్తారని దినకరన్ పేర్కొనడంతో ఒక్కసారిగా రాజకీయాలు మళ్లీ సంక్షోభం దిశగా వెళుతున్నట్లు కనిపిస్తోంది.

గవర్నర్ విద్యాసాగర్ రావుకు డీఎంకే నేత స్టాలిన్ కూడా లేఖ రాశారు. ప్రభుత్వానికి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. పళని ప్రభుత్వాన్ని బల నిరూపణకు ఆహ్వానించాలని స్టాలిన్ కోరారు. మరి గవర్నర్ విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

15:12 - August 22, 2017

కొమరం భీం : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. వాంకిడి మండలంలో జరిగే సంతకు వెళ్లేందుకు ఎనిమిది మంది ఆటోలో వెళుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొంది. దీనితో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

కొమరం భీం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఆదిలాబాద్ : కొమరం భీం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వాంకేడి మండలం బెండార గ్రామ శివారులో ఆటోను ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 

రాజకీయ కారణాలతోనే నోటీసులు - కోటంరెడ్డి..

నెల్లూరు : క్రికెట్ బెట్టింగ్ కేసులో రాజకీయ కారణాలతోనే తనకు నోటీసులు జారీ చేశారని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
కాసేపటి క్రితం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచారణ ముగిసింది. క్రికెట్ బెట్టింగ్ కేసులో కోటంరెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. రెండున్నర గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. 27న మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. 

రాజీవ్ ఖేల్ రత్న 2017 అవార్డులు..

హైదరాబాద్ : రాజీవ్ ఖేల్ రత్న 2017 అవార్డులు ప్రకటించారు. పారా అథ్లెట్ దేవేంద్ర, హాకీ ప్లేయర్ సర్దార్ సింగ్ లకు ఖేల్ రత్న అవార్డులు వరించాయి. ఏడుగురికి ద్రోణాచార్య, 17 మందికి అర్జున అవార్డులు, ముగ్గురు క్రీడాకారులకు ధ్యాన్ చంద్ అవార్డులు వరించాయి. ఆర్చరీలో జ్యోతి సురేఖ, టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి అర్జున అవార్డులు లభించాయి. 

ముగిసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి విచారణ

నెల్లూరు: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచారణ ముగిసింది. క్రికెట్ బెట్టింగ్ కేసులో కోటం రెడ్డిని రెండున్నర గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. 27న మరోసారి విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.

స్పా సెంటర్ల నిర్వాహకుడు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..

హైదరాబాద్: స్పా సెంటర్ నిర్వాహకుడు సిద్ధార్ద్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించాడు. నగరంలో మరో 6 స్పా సెంటర్లను తెరిచేందుకు యత్నించాడు. సిద్ధార్ద్ అకౌంట్ లో భారీగా నగదు గుర్తించారు. ఎంసీఏ పూర్తి చేసిన సిద్ధార్ద్ కు థాయిలాండ్ కు చెందిన కేక అనే యువతితో పరిచయం ఏర్పడింది. థాయిలాండ్ యువతనులను కేక సహకారంతో సిద్ధార్ద్ నగరానికి రప్పించాడు. ఒక్కో అమ్మాయికి నెలకు రూ. 30 వేలు ఇచ్చాడని, ఇతర రాష్ట్రాల్లో థాయ్ మసాజ్, బాడీ మసాజ్ లపై పరిశోదనలు చేసి నగరంలో స్పా సెంటర్లను తెరిచాడు.

14:36 - August 22, 2017

సంసారం వ్యాపార వస్తువుగా మారిపోతుందా ? కుటుంబాల్లో వచ్చే కలహాలు కొంతమందికి పెట్టుబడిగా మారిపోతున్నాయా ? ఆలుమగల మధ్య వచ్చే కలహాలు వ్యాపార వస్తువుగా మార్చివేసే ధోరణి ఇటీవలి కాలంలో పెచ్చరిల్లుతున్నాయి. కలహాలతో రండి..కుటుంబంతో కలిసి వెళ్లండి అనే ధీమాను ఇచ్చేస్తున్నారు. కౌన్సెలింగ్ వ్యాపారులుగా అవతారమెత్తిన కొంతమంది పెద్దమనుషులు కొన్ని ఛానెల్స్ లో ఇలాంటి కార్యక్రమాలు బాధితులకు న్యాయం జరుగుతోందా ? దంపతుల మధ్య వచ్చే కలహాలు సదరు వ్యక్తులకు కాసులు కురిపిస్తున్నాయా ? వ్యాపారమౌతున్న సంసారంపై టెన్ టివి 'మానవి' ప్రత్యేక చర్చ కార్యక్రమం చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో దేవి (సామాజిక కార్యకర్త), రవికుమార్ (సైకాలజిస్టు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:23 - August 22, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలోని బ్యాంకులన్నీ మూతబడ్డాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనం, కార్పొరేట్‌ రుణమాఫీ చేయడమే కాకుండా ఇటీవల ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ బిల్లు...12017ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడాన్ని బ్యాంకు సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా నేడు సమ్మె చేపడుతున్నారు. ఈ సందర్భంగా రవీంద్ర గుప్తా టెన్ టివి తో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

బిజెపికి షాకిచ్చిన టిడిపి

తూ.గో: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి కి టిడిపి షాక్ ఇచ్చింది. బిజెపికి కేటాయించిన 35వ డివిజన్ లో టిడిపి రెబల్ అభ్యర్థి తరపున టిడిపి ఎమ్మెల్యే కొండబాబు ప్రచారం నిర్వహిస్తున్నాడు. దీంతో బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

14:20 - August 22, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక బుధవారం జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 255 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నిక జరగనుంది. సమస్యాత్మాక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వెబ్ క్యాస్టింగ్, వీవీ ప్యాక్ లపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఈవీఎంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయినా వెంటనే పరిష్కరిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేశ్ పేర్కొన్నారు. నంద్యాల డిగ్రీ కాలేజీలో ఆయన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

భూగర్భ విద్యుత్ కేబుళ్ల నుంచి మంటలు

విజయవాడ: విజయాటాకీస్‌ సమీపంలో భూమిలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భూగర్భ విద్యుత్ కేబుళ్ల నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కలున్న జనాలంతా పరుగులు తీశారు. ఈ ఘటనలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళకు తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైరింగ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

14:11 - August 22, 2017

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక బ్యాంకింగ్‌ సంస్కరణలకు నిరసనగా యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్ల పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీనితో ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాళాలు పడ్డాయి. ఆంధ్రా బ్యాంకు పరిధిలోని 2900 శాఖలన్నీ క్లోజ్ అయ్యాయి. లావాదేవీలు నిలిచిపోయాయి. 21వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని, లావాదేవీలన్నీ నిలిచిపోయాయని పలువురు పేర్కొన్నారు. బ్యాకింగ్ వ్యవస్థను జాతీయం చేయడం..ప్రస్తుతం ఉన్న పాలకులు ఈ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

అవిశ్వాస తీర్మానం కోరిన స్టాలిన్

చెన్నై: అవిశ్వాస తీర్మానం కోరుతూ గవర్నర్ కు ప్రతిపక్ష నేత స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు లేఖ రాశారు. టివివి దినకరన్ 19 మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎం ను తొలగించాలని కోరిన విషయం తెలిసిందే.

ప్రైవేటు కాలేజీల ఒత్తిడికి లొంగేది లేదు: మంత్రి కడియం

హైదరాబాద్: కొత్త ఒకేషనల్ కోర్సులను ప్రవేశ పెడతామని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. 404 జూనియర్ కాలేజీల ప్రొఫైళ్లను వెబ్ సైట్ లో ఉంచుతామని, నిబంధనలు పాటించని ప్రైవేటు కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రైవేటు కాలేజీల ఒత్తిడికి లొంగేది లేదని పేర్కొన్నారు. ప్రైవేటు కాలేజీలను నియంత్రించే స్థాయికి ఇంటర్ బోర్డు చేరుకుందని కడియం స్పష్టం చేశారు.

14:00 - August 22, 2017

సిద్ధిపేట : సిద్ధిపేట అర్బన్ మండలం పొన్నూరు శివారులోని లక్ష్మీవిలాస్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. గోడకు కన్నం వేసి లోపలికి చొరబడిన దొంగలు రూ.97 లక్షలు దోచుకెళ్లారు. సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

పాకిస్థాన్ కు ట్రంప్ వార్నింగ్

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే సహించబోమని హెచ్చరించారు. ఆప్ఘన్‌ అమెరికన్‌ ఆపరేషన్‌లో భాగస్వామిగా పాక్ ఎంతో లాభపడిందన్న ట్రంప్.. నేరస్తులు, క్రిమినల్స్‌కు ఆశ్రయం కల్పించడం ద్వారా ఆ దేశం దెబ్బతింటుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులపై కఠినవైఖరి అవలంభించని పక్షంలో పాక్ కు… అమెరికా అందించే సైనిక, ఇతర సాయాలు నిలిచిపోతాయని ట్రంప్ హెచ్చరించారు.

13:53 - August 22, 2017

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. చిరు పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 'సైరా నరసింహారెడ్డి' మోషన్ పోస్టర్ రిలీజ్ మెగా అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా.. సైరా నరసింహారెడ్డి గా మార్పు చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. అదే విధంగా ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు నటిస్తున్నారు. 

13:36 - August 22, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాలు ఇంకా చల్లారలేదు. పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాలకు చెక్ పేట్టేందుకు పావులు దినకరన్ కదుపుతున్నారు. 19 ఎమ్మెల్యేలతో దినకరన్ గవర్నర్ విద్యాసాగర్ ను కలిశారు. 

13:34 - August 22, 2017

హైదరాబాద్ : ఇస్లాం మతాచారమైన ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్రిపుల్ తలాక్‌పై పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చేంత వరకు ఎలాంటి పిటిషన్లు తీసుకోబోమని స్పష్టం చేసింది. చట్టం చేసిన తర్వాతే దానికి లోబడి కేసులను విచారిస్తామని వెల్లడించింది. చట్టం చేయడానికి కేంద్రానికి ఆరు నెలల గడువిచ్చింది. అప్పటివరకూ ట్రిపుల్ తలాక్‌ చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహార్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పుపై విశ్లేషకులు తెలకపల్లి రవి స్పందించారు. త్రిపుల్ తలాక్ అంశాన్ని ముస్లిం మతపరంగా కాకుండా మహిళాకోణంలో చూడాలన్నారు. 

 

13:27 - August 22, 2017

త్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వక్తలు అన్నారు. త్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఆరు నెలలపాటు నిషేధం విధించింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు లక్ష్మీనారాయణ, న్యాయవాది ఆజాద్, సలీమా పాల్గొని, మాట్లాడారు. త్రిపుల్ తలాక్ అంశం సున్నితమైన అంశమన్నారు. అయితే హిందూ మహిళలపై వరకట్న వేధింపులు, గృహ హింస లాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:00 - August 22, 2017

హైదరాబాద్: నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా 151 సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ 'సై రా' అని పెట్టారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. సై రా.. మెగా లుక్ వచ్చేసింది..! ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రవివర్మన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, సీనియర్ హీరో జగపతి బాబు, సాండల్ వుడ్ స్టార్ సుధీప్, కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా లేడీ సూపర్ స్టార్ నయనతార చిరుకు జోడిగా నటిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

12:55 - August 22, 2017

ఢిల్లీ : ఇస్లాం మతాచారమైన ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్రిపుల్ తలాక్‌పై పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చేంత వరకు ఎలాంటి పిటిషన్లు తీసుకోబోమని స్పష్టం చేసింది. చట్టం చేసిన తర్వాతే దానికి లోబడి కేసులను విచారిస్తామని వెల్లడించింది. చట్టం చేయడానికి కేంద్రానికి ఆరు నెలల గడువిచ్చింది. అప్పటివరకూ ట్రిపుల్ తలాక్‌ చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహార్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. ట్రిపుల్ తలాక్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను ఉల్లంఘించడం లేదని జస్టిస్‌ ఖేహార్‌ అన్నారు. ఇది వెయ్యేళ్లకు పైగా ఉన్న అచారమని అభిప్రాయపడ్డారు. వాట్సాప్‌, సోషల్‌మీడియా, పోస్టుకార్డు, న్యూస్‌పేపర్‌ ద్వారా ట్రిపుల్ తలాక్‌ చెప్పి భార్యలకు విడాకులిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. దీంతో ట్రిపుల్ తలాక్‌ న్యాయబద్ధం కాదని, దాని వల్ల తాము జీవితాలను కోల్పోతున్నామని ముస్లిం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 14 వందల ఏళ్లనాటి మతాచారంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మహిళల ప్రాథమిక హక్కులను ఉల్లంఘింస్తున్న ట్రిపుల్ తలాక్‌ ఆచారాన్ని తొలగించేలా చట్టం తీసుకురావాలని పిటిషన్ దారులు కోరారు. ఈ పిటిషన్లపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. మత సంబంధమైన వ్యవహారాలపై కోర్టు జోక్యం సరికాదని చెప్పింది. దీనిపై పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇవాళ  తుది తీర్పు వెల్లడించింది.

'ఫాతిమా' వివాదం కేంద్ర మంత్రికి వివరించాం: కామినేని

అమరావతి: ఫాతిమా మెడికల్ కాలేజీ వివాదంపై కేంద్ర మంత్రికి మరోసారి వివరించామని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. నీట్ లో ఏపీ విద్యార్థులకు సంబంధించి ఆర్టికల్ 371 డిలో ఉన్న ఇబ్బందులపై సీఎం కూడా నడ్డాకు వివరించారని తెలిపారు. అధికారులతో మాట్లాడి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఫాతిమా మెడికల్ కాలేజీ పై కోర్టు నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామని కామినేని స్పష్టం చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామన్నారు.

ఎయిమ్స్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయి:జేపీ నడ్డా

అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు హెల్త్ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయని కేంద్ర మంత్రి అన్నారు. తాడికొండలోరూరల్ హెల్త్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సేవల విషయంలో ప్రభుత్వ సేవలు అభినందనీయమన్నారు. ఎయిమ్స్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. వచ్చేఏడాది ఎయిమ్స్ ప్రారంభిస్తామన్నారు.

రూరల్ హెల్త్ సెంటర్, వసతి గృహాలను ప్రారంభించిన జేపీ నడ్డా

అమరావతి: తాడికొండలో కేంద్రమంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. రూ.4 కోట్లతో నిర్మించిన రూరల్ హెల్త్ సెంటర్ ను విద్యార్థుల అదనపు వసతి గృహాలను జేపీ నడ్డా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కామినేని, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు.

గవర్నర్ ను కలిసిన టిటివి దినకరన్

చెన్నై: 19 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ ను దినకరన్ కలిశారు. పళనిస్వామి ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వడం లేదని గవర్నర్ కు తెలిపి, సీఎంను మార్చాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

12:12 - August 22, 2017
12:07 - August 22, 2017

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రిపుల్ తలాక్ పై ఆరు నెలలపాటు నిషేధం విధించింది. 6 నెలలపాటు చట్టం తేవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ట్రిపుల్ తలాఖ్ పై నిర్ణయాన్ని కోర్టు పార్లమెంట్ కే వదిలేసింది. ట్రిపుల్ తలాఖ్ పై అభ్యంతరాలపై పార్లమెంట్ లోనే చట్టం చేయాలని సూచించింది. చట్టంలో మార్పుల ద్వారానే వ్యవస్థను మార్చాలని అభిప్రాయపడింది. తలాక్ పై జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై పీవోడబ్ల్యు నాయకురాలు సంధ్య, అడ్వకేట్ రఘు భిన్నవాదనలు వినిపించారు. హిందూమతంలో కూడా మహిళలకు వ్యతిరేకంగా అనేక ఆచార వ్యవహారాలు, సాంఘిక కట్టుబాట్లు ఉన్నాయన్నారు. త్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు పూర్తిగా విచారణ జరిపి, కేంద్రానికి అప్పగించకుండా సుప్రీంకోర్టే పూర్తి స్థాయిలో తీర్పును వెల్లడిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:06 - August 22, 2017

ముస్లిం సమాజంతో పాటు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ తలాక్ విషయంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పిచ్చింది. ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే, ఈ విషయంలో పార్లమెంట్ లో ఓ చట్టం చేయాల్సి వుందని, అంతవరకూ తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేస్తూ, ఇంజక్షన్ ఆర్డర్ వేసింది. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం చేసేంత వరకూ తమ ఆర్డర్ అమలవుతుందని పేర్కొంది. అసలు కేసులో తాము కల్పించుకోవాలన్న ఉద్దేశం లేదని, అయితే, కేసు తీవ్రత దృష్ట్యా, తాత్కాలిక ఆదేశాలు ఇస్తూ, నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ కే వదిలేస్తున్నట్టు తెలిపింది.. సుదీర్ఘకాలంగా వాదనలు విన్న న్యాయస్థానం, ట్రిపుల్ తలాక్ పై ఆరు నెలల పాటు స్టే విధిస్తున్నామని, ఈలోగా చట్ట సవరణ చేసి, ట్రిపుల్ తలాక్ చెల్లకుండా పార్లమెంటులో నూతన చట్టం తేవాలని కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. షరియా చట్టాలను పరిగణనలోకి తీసుకొని ముమ్మారు తలాక్‌ను చట్టం చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచనలు చేసింది. చట్టం చేసే సమయంలో ముస్లిం సంఘాల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని సూచించింది. దీనిపై రాజకీయ పక్షాలన్నీ కేంద్రానికి సహకరించాలని తెలిపింది.

భిన్నాభిప్రాయాలు..

అయితే ట్రిపుల్ తలాక్‌పై ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. తలాక్‌ అంశాన్ని పార్లమెంట్‌కే వదిలాయని చీఫ్‌ జస్టిస్‌ఖేహర్‌ చెబుతుండగా.. అది రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనంలో మెజార్టీ సభ్యులు అంటున్నారు. ముమ్మారు తలాక్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను ఉల్లంఘించడం లేదని జస్టిస్‌ ఖేహర్‌ పేర్కొన్నారు. ఇది 1000ఏళ్లకు పైగా ఉన్న ఆచారమని చెప్పారు. అయితే ముమ్మారు తలాక్‌ రాజ్యంగబద్ధం కాదని ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్‌ కురియన్‌, జస్టిస్‌ లలిత్‌, జస్టిస్‌ నారిమన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇస్లాం దేశాల్లోనే ఈ ఆచారం లేనప్పుడూ భారత్‌లో ఎందుకు కొనసాగించాలని ప్రశ్నించారు. ముమ్మారు తలాక్‌ సమానత్వ హక్కును అతిక్రమిస్తోందన్నారు.

సోషల్ మీడియా ద్వారా....

వాట్సాప్‌, సోషల్‌మీడియా, పోస్టుకార్డు, న్యూస్‌పేపర్‌ ద్వారా ముమ్మారు తలాక్‌ చెప్పి భార్యలకు విడాకులిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. దీంతో ముమ్మార్‌ తలాక్‌ న్యాయబద్ధం కాదని, దాని వల్ల తాము జీవితాలను కోల్పోతున్నామని ముస్లిం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 1400 ఏళ్ల నాటి మతాచారంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

ఆగ్రహం వ్యక్తం చేసిన ముస్లిం పర్సనల్ లా బోర్డు...

మహిళల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ట్రిపుల్ తలాక్‌ పద్ధతి ఉందని.. ఈ విధానాన్ని తొలగించేలా చట్టం తీసుకురావాలని పిటిషన్‌దారులు కోరారు. అయితే పిటిషన్లపై ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. మత సంబంధమైన వ్యవహారాలపై కోర్టు జోక్యం సరికాదని చెప్పింది.

11:53 - August 22, 2017

అమరావతి: ఏపీ సర్కార్‌కి ఎంపీ చిరంజీవి లేఖ రాశారు. తిరుపతి 18వ వార్డులోని స్కావెంజర్స్‌ కాలనీని ఖాళీ చేయించడాన్ని ప్రశ్నిస్తూ ఆయన అందులో ప్రస్తావించారు. తిరుపతి పట్టణం నడిబొడ్డున ఆ కాలనీ ఉండటం ఇష్టంలేకే ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్నారని విమర్శించారు. అంతేకాదు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకే ఈ పనిచేస్తోందని చిరంజీవి ఆరోపించారు.

11:53 - August 22, 2017

ఢిల్లీ : వివాదాస్పద ట్రిపుల్ త‌లాక్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రిపుల్ తలాక్ పై ఆరు నెలలపాటు నిషేధం విధించింది. 6 నెలలలోపు చట్టం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ట్రిపుల్ తలాఖ్ పై నిర్ణయాన్ని కోర్టు పార్లమెంట్ కే వదిలేసింది. ట్రిపుల్ తలాఖ్ పై అభ్యంతరాలపై పార్లమెంట్ లోనే చట్టం చేయాలని సూచించింది. చట్టంలో మార్పుల ద్వారానే వ్యవస్థను మార్చాలని అభిప్రాయపడింది. తలాక్ పై జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. చీఫ్‌ జస్టిస్‌ సీజే.ఖెహర్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం గత మే నెలలో ఆరు రోజుల పాటు విచారణ జరిపింది. నేడు తీర్పు వెలువరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కీలక సమావేశం

హైదరాబాద్: ఆబ్కారీ భవన్ లో సిటీ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలన, దర్యాప్తు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న డ్రగ్స్ పై చర్చించినట్లు సమాచారం.

విచారణకు వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: క్రికెట్ బెట్టింగ్ కేసులో వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏఎస్పీ శరత్ బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు.

11:47 - August 22, 2017

ప్రకృతి ప్రసాదించిన వరాల్లో సహజ సిద్ధమైన ఔషధం 'తేనె' ఒకటి..చక్కెర తియ్యగా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి హానికరం. తేనె కూడా తియ్యగానే ఉంటుంది. కానీ ఔషధభరితం. ఎందుకంటే పూలల్లోని మకరందం, పుప్పొడి పరిమళం కలగలిసిన అద్భుతమైన రుచి దీని సొంతం. అందుకే తేనె మధురాతి మధురం... అమృతాన్ని మరిపించే దివ్యౌషధం. అనాదినుంచి కూడా వాడుకలో ఉంది. శిలాయుగం చివర్లోనే అడవి తేనె సేకరణ జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయి. అంటే సుమారు పది వేల సంవత్సరాల మొదలు, యాభై వేల సంవత్సరాల ముందునుంచి ఈ తేనె మాధుర్యాన్ని చవి చూస్తూ ఉన్నారని చెప్పవచ్చు. నిజానికి తేనెటీగ జీవన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన కీర్తి స్పెయిన్ శాస్తజ్ఞ్రుడు హ్యూబర్‌కు దక్కుతుంది.

తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్... లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. ఒక్కో తేనె ఒక్కో రకమైన రుచినీ సుగంధాన్నీ వెదజల్లుతుంది. యూకలిప్టస్‌, నిమ్మ జాతి పూల తేనె ఘాటైన రుచినీ వాసననీ కలిగి ఉంటుంది. అందుకే బేకింగ్‌ ఉత్పత్తుల్లో చక్కెరకు బదులు తేనె వాడటంవల్ల అవి మరింత రుచిగానూ సువాసనభరితంగానూ ఉంటాయి.

వూబకాయంతో బాధపడేవాళ్లకు క్రమం తప్పకుండా 30 రోజులపాటు రోజూ 70 గ్రా. తేనెను ఇచ్చి చూడగా వాళ్ల బరువులో 1.3 శాతం తేడా ఉండగా కొలెస్ట్రాల్‌ మాత్రం మూడు శాతం వరకూ తగ్గిందట. తేనెలో నిమ్మరసం, దాల్చినచెక్క పొడి కలిపి తీసుకున్నా బరువు తగ్గుతారు. అంతేకాదు, తేనెని గోరువెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవడంవల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు త్వరగా జీర్ణమవుతాయి.

ముడి తేనె బీపీని తగ్గిస్తుందన్నది మరో పరిశోధన. అంతేకాదు, శరీరంలో ఇన్సులిన్‌ శాతాన్నీ క్రమబద్ధీకరిస్తుంది. రక్తంలో చక్కెరనిల్వలు తగ్గకుండా చూస్తుంది. వ్యాయామం తరవాత దీన్ని తీసుకోవడంవల్ల అలసట ఉండదు.

యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు అధికంగా ఉండే తేనె మంచి యాంటీసెప్టిక్‌ కూడా.

తేనెలోని న్యూట్రాసూటికల్స్‌ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తూ శరీరంలో హానికరమైన ఫ్రీ-రాడికల్స్‌ను తొలగిస్తాయి. దాంతో క్యాన్సర్‌, హృద్రోగాలను తట్టుకునే శక్తి పెరుగుతుంది.

తేనె పుండ్లనీ గాయాలనీ త్వరగా తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ మైక్రోబియల్‌ లక్షణాలవల్ల ఇది ఆటోలిటిక్‌ డెబ్రిడిమెంట్‌గా పనిచేస్తుంది. పుండ్ల నుంచి వచ్చే చెడువాసనని తొలగిస్తుంది. పచ్చిగాయాలమీద ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే మాంఛెస్టర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు క్యాన్సర్‌ రోగులకు శస్త్రచికిత్స అనంతరం తేనెను వాడే ఆలోచనలో ఉన్నారు.

మచ్చల్ని మాయం చేయడంలో తేనెని మించింది లేదు.

స్థానికంగా దొరికే తేనెను తాగడంవల్ల అలర్జీలు త్వరగా రావట. తేనెటీగలు చుట్టుపక్కల మొక్కల నుంచే తేనెను సేకరించడంవల్ల ఆ పరాగరేణువులు శరీరంలో చేరి రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

11:28 - August 22, 2017

అనంతపురం : క్రీడలను అభివృద్ధి చేసేందుకు ఆర్డీటీ కృషి చేస్తోందని అనంతపురం జిల్లా ఎస్పీ జివిజి అశోక్‌ కుమార్‌ అన్నారు. అనంతపురం ఆర్డీటీ క్రీడా గ్రామంలో అంతర్‌ జిల్లాల సబ్‌ జూనియర్‌ ఫుట్‌ బాల్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఆర్డీటీ క్రీడా గ్రామంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని వసతులు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అశోక్‌ అన్నారు.

 

11:25 - August 22, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 255 పోలింగ్ కేంద్రాల్లో జరగనున్న ఉప ఎన్నికకు కేంద్ర బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఉప ఎన్నికల పోరులో 15 మంది అభ్యర్థులు తలపడుతుంటే ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్య జరగనుంది. మరోవైపు పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలు ప్రలోభాలకు తెరలేపుతున్నాయి. మహిళలకు చెవిదిద్దులు, ముక్కుపుడకలు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

 

11:20 - August 22, 2017

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక బ్యాంకింగ్‌ సంస్కరణలకు నిరసనగా యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్ల పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. 10 లక్షల మంది బ్యాంకు సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేపడుతున్నారు. సిబ్బంది సమ్మెతో బ్యాకింగ్ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి..  ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనం, కార్పొరేట్‌ రుణమాఫీ చేయడమే కాకుండా ఇటీవల ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ బిల్లు...12017ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడాన్ని బ్యాంకు సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. తమ సమ్మెకు సహకరించాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నారు. 

 

11:09 - August 22, 2017

మెగా 151 టైటిల్ 'సై రా'!

హైదరాబాద్: నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా టైటిల్ 'సై రా' అని పెట్టినట్లు సమాచారం. అయితే దీన్ని చిత్ర యూనిట్ వర్గాలు మాత్రం ఈ అంశంపై క్లారిటీ ఇవ్వలేదు....

11:07 - August 22, 2017

హైదరాబాద్ : సింగరేణిలో ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్‌ 5న ఎలక్షన్స్‌ నిర్వహించడానికి కార్మికశాఖ ఓకే చెప్పింది. ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్నగుర్తింపు సంఘం ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించడంతో.. కోల్‌బెల్ట్‌ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి మొదలైంది. 
సింగరేణిలో ఎన్నికల హడావిడి 
సింగరేణి కార్మికుల నిరీక్షణకు తెరపడింది. ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న గుర్తింపుసంఘం ఎన్నికలకు కేంద్ర కార్మికశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. షెడ్యూల్‌ విడుదల కావడంతో కార్మికసంఘాలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. 
అక్టోబర్‌5న సింగరేణిలో గుర్తింపుసంఘం ఎన్నికలు 
గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను అక్టోబర్ 5న నిర్వహించనున్నట్లు డిప్యూటి లేబర్ కమిషనర్ శ్యామ్ సుందర్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపిన అధికారులు..ఎన్నికల నిర్వహణకు  షెడ్యుల్ట్‌ను విడుదల చేశారు. సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 19న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. 20న అభ్యర్థుల తుది జాబితాలతో పాటు గుర్తులను కేటాయిస్తారు. అనంతరం అక్టోబర్ 5 ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు కౌంటింగ్ మొదలు పెడతారు. 6 తేదీన తుదిఫలితాలను వెల్లడి కానున్నాయి. 
2016 జూన్‌తో ముగిసిన గుర్తింపు సంఘం కాలపరిమితి 
గతంలో 2012 జూన్ 28 ఎన్నికలను నిర్వహించగా... 2016 జూన్‌లో గుర్తింపు సంఘం నాలుగేళ్ళ కాల పరిమితి ముగిసింది. ఇక అప్పటి నుంచి ప్రతిపక్ష కార్మిక సంఘాలు ఎన్నికల కోసం ఒత్తిడి తీసుకు వస్తున్నా .. కార్మిక శాఖ ముందుకు రాక పోవడంతో ఎన్నికలు యేడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే  కొన్ని కార్మిక సంఘాలు కోల్ బెల్ట్ వ్యాప్తంగా ముందస్తు ప్రచారానికి తెర లేపాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగడం, వారసత్వ ఉద్యోగాలపై ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. 16 కార్మిక సంఘాలు తమ వార్షిక నివేదికలతో పాటు సభ్యత్వ నమోదు పత్రాలను అందించడంతో ఎట్టకేలకు కార్మిక శాఖ గుర్తింపుసంఘం ఎన్నికలకు  ఓకే చెప్పింది. 
పరిష్కారానికి నోచుకోని సమస్యలు 
ఏడాది కాలంగా గుర్తింపు సంఘం లేకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా పోయాయి. కార్మికుల పదోన్నతులతో పాటు భద్రత, ఇతర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి.  ప్రశ్నించే  వారు లేక పోవడంతో సింగరేణి యాజమాన్యం ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తోందని కార్మికసంఘాలు మండిపడుతున్నాయి. ఎన్నికలు జరిగితే నియమావళి ప్రకారం అధికార సంఘం సమస్యలను నేరుగా యాజమాన్యంతో  చర్చించే అవకాశం ఏర్పాడుతుంది...దీంతో సమస్యలు సత్వరం పరిష్కారం అవుతాయి. మొత్తానికి ఎన్నికల నగారా మోగడంతో.. కార్మిక సంఘాలు ప్రచారం ముమ్మరం చేసే పనిలో పడ్డాయి. 

 

11:01 - August 22, 2017

నెల్లూరు : ఆక్వా కాలుష్యం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలాన్ని వణికిస్తోంది. రొయ్యల పరిశ్రమ కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో గ్రామాల్లో ప్రజలు మంచాన పడుతున్నారు. అయినా బాధితుల గోడును పట్టించుకున్న వారు లేరు. వారి ఆక్రందనలు, వినతులు బుట్టదాఖలయ్యాయి. దీంతో ఆక్వా పరిశ్రమలకు వ్యతిరేకంగా రైతులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. వీరి పోరాటానికి వ్యవసాయ కార్మిక సంఘాలు బాసటగా నిలిచాయి. 
ఆక్వా కాలుష్యం తీవ్రత 
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో ఆక్వా కాలుష్యం తీవ్రత గురించి నాయకుల దగ్గర నుంచి అధికారుల వరకు అందరికీ తెలుసు. స్థానిక నేతల నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కలెక్టర్ , మంత్రులతో స్థానికులు, రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 
రైతులు అడ్డుకట్ట...యాజమాన్యం తొలగింపు 
ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు కాలువల్లో కలిసిన తరువాత ఆ  నీరు కిందికి రాకుండా రైతులు ఓదశలో అడ్డుకట్ట వేశారు. అయినా అధికారుల ప్రమేయంతో ఆ అడ్డుకట్టను కొన్నాళ్లకే ఆక్వా ఫ్యాక్టరీల యాజమాన్యాలు తొలగించేశాయి. రైతులు పంటలు  కోల్పోతున్నా, ప్రజలు జబ్బుల బారిన పడుతున్నా ఎవరూ చర్యలు తీసుకోవడంలేదు. ఫ్యాక్టరీలవైపు కన్నెత్తి చూడడంలేదు. రొయ్యల ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీలన్నీ ప్రజాప్రతినిధులకు చెందినవి  కావడంతో..అధికారులు తనిఖీ చేసేందుకు సాహసించడం లేదన్న ఆరోపణలున్నాయి. కనీసం యూనిట్లలో శుద్ధి ప్లాంట్లు ఉన్నాయో లేవో కూడా చూసేందుకు వెళ్లిన వారు లేరన్న  వాదనలు వినిపిస్తున్నాయి. 
ఆక్వా కాలుష్యంపై వినతుల వెల్లువ 
జలకాలుష్యం, రకరకాల వ్యాధులు, పంట దిగుబడుల తగ్గిపోవడానికి కారణమవుతున్న ఫ్యాక్టరీల విషవ్యర్థాలపై కొన్నేళ్లుగా రైతులు పోరాటం చేస్తూనేవున్నారు. గ్రామస్థాయి నాయకుల  నుంచి కలెక్టర్ వరకు ఎంతోమందికి విజ్ణప్తులు ఇస్తూనేవున్నారు. అయినా ఎవరూ స్పందించడంలేదు.  గతంలో కలెక్టర్ జానకి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రైతులు గోడు  వెళ్లబోసుకున్నారు. అయినా సమస్య నేటికీ తీరలేదు. 
ఏపీ వ్య.కా.సను ఆశ్రయించిన బాధితులు 
ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయిన ఆక్వా పరిశ్రమల బాధితులు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో సంఘం నాయకులు, మూడు  రోజుల పాటు ఇందుకూరుపేట మండలంలోని పర్యటించి రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్ల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలను పరిశీలించారు.  రైతులు, ప్రజలు పడే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పీసీబీ నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫ్యాక్టరీలు నిర్మించారని.. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఈ నెల 24న ఫ్యాక్టరీలు ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. అంతేకాదు పైపు లైన్లను మూసేస్తామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా పరిశ్రమలు నడుపుతున్న యాజామాన్యాలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. లేనిపక్షంలో పోరుబాట తప్పదంటున్నారు. 

 

ట్రిపుల్ తలాఖ్ పై 6 నెలల పాటు నిషేధం

ఢిల్లీ :: ట్రిపుల్ తలాక్ పై 6 నెలల పాటు సుప్రీం కోర్టు నిషేధం విధించింది 6 నెలలోపు చట్టం తేవాలని సుప్రీం ఆదేశించింది. చట్టంలో మార్పుల ద్వారానే వ్యవస్తను మార్చాలని సుప్రీం సూచించింది. ట్రిపుల్ తలాఖ్ పై అభ్యంతరాల పై పార్లమెంట్ లోనే చట్టం చేయాలని, దీనిపై జోక్యం చేసుకోబోమని సుప్రీం తేల్చి చెప్పింది.

10:45 - August 22, 2017

నెల్లూరు : రొయ్యల పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు కలవరపడుతున్నారు. దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అనారోగ్యంతో మంచం పడుతున్నారు. మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.  పండే పంటలు విషతుల్యంగా మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోవడం లేదు. రొయ్యల పరిశ్రమ యాజమాన్యం నిబంధనలకు నీళ్లొదిలినా చర్యలు తీసుకోవడం లేదు. 
పరిశ్రమల కాలుష్యంతో స్థానికులు ఇబ్బందులు 
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని ఆక్వా పరిశ్రమల కాలుష్యంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నా.. యాజమాన్యాలకు ఏమాత్రం పట్టడం లేదు. అటు కాలుష్య నియంత్రణ  మండలి కూడా యాజమాన్యాల నిర్వాకంపై చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. పరిశ్రమల వల్ల కాలుష్యం బారిన పడుతున్నామని జనం గగ్గోలు పెడుతున్నా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు-పీసీబీ ఏమాత్రం చలించడం లేదు. ఆక్వా పరిశ్రమల యాజమాన్యంతో పాటు అధికారుల తీరుపైనా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
ప్రజల జీవితాలు అతలాకుతలం 
కొన్నేళ్ల క్రితం ఉపాధి కల్పిస్తాం..అభివృద్ధి చేస్తామంటూ ఏర్పడిన రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు ఇక్కడి ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. ఉపాధి మాట దేవుడెరుగు వాతావరణమే  కాలుష్యమై స్థానికుల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. నెల్లూరుజిల్లాలో వేల ఎకరాల్లో రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు. సాగు చేసిన రొయ్యలను ప్రాసెసింగ్ చేసి ఇతర  దేశాలకు పంపేందుకు రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పారు. ఇందుకూరుపేట మండలంలోని డేవిస్ పేట, జగదేవిపేట వద్ద ప్రధాన కాలువ పక్కనే సాయి మెరైన్, స్టార్ ఆగ్రో మెరైన్,  5 స్టార్ మెరైన్ పరిశ్రమలు ఏర్పాడ్డాయి. వీటిలో ఒకటి టిడిపికి చెందిన నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ది. రోజూ ఇక్కడి నుంచి చెన్నైకి అక్కడి నుంచి విదేశాలకు భారీగా రొయ్యల ఎగుమతి జరుగుతోంది. కొనుగోలు చేసిన రొయ్యలను ప్రాసెసింగ్ యూనిట్లకు తెచ్చి రసాయనాలతో ప్రాసెసింగ్ చేస్తారు. ఈ ప్రాసెసింగ్ ప్రక్రియలో ఘన, ద్రవ వ్యర్థాలు ఏర్పడతాయి. ప్రాసెసింగ్‌లో మిగిలిన పొట్టును పలు పరిశ్రమలకు తరలిస్తుండగా వ్యర్థజలాలను మాత్రం స్థానికంగా పొలాల్లోకి విడిచిపెడుతున్నారు.
శుద్ధి చేయకుండానే వ్యర్థజలాలు విడుదల 
నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియలో ఏర్పడిన ఘన, ద్రవ వ్యర్థాలను శుద్ధి చేసి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పైపు లైన్లద్వారా విడుదల చేయాలి. అయితే ఈ ఫ్యాక్టరీలు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. వ్యర్థజలాలను శుద్ధి చేయకుండా నేరుగా జాఫర్ సాహెబ్ , గంగపట్నం కాలువల్లోకి కలిపేస్తున్నాయి. ఫలితంగా ఈ కాలువల్లోని నీరు విషతుల్యమై రైతుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పరిశ్రమ నుంచి విడుదలవుతున్న దుర్గంధంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులతోపాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 
కాలువల్లోకి ఫ్యాక్టరీల వ్యర్థాలు: పీసీబీ 
మరోవైపు ఫ్యాక్టరీల వ్యర్థాలు కాలువల్లోకి కలుస్తున్న మాట వాస్తవమేనని పీసీబీ అధికారులు అంగీకరిస్తున్నారు. ఆయా ఫ్యాక్టరీలపై చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదించామంటున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై విజయవాడ నుంచి ఒక ప్రత్యేక కమిటీని కూడా వేసినట్లు చెబుతున్నారు. వ్యర్థజలాలు పంటపొలాలకు విడుదల చేస్తుండటంతో రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆక్వా పరిశ్రమల కాలుష్యంపై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు తక్షణమే స్పందించాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం టెలికాన్ఫరెన్స్

అమరావతి: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో కాకినాడ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని డివిజన్లలో టిడిపి గెలిచితీరాలని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్ధేశం చేశారు. బిజెపికి కేటాయించిన డివిజన్లలోనూ అబ్యర్థుల గెలుపుకు టిడిపి కృషి చేయాలని సూచించారు. సామాజికంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని కాకినాడలో గెలుపునకు అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటున్నామని మంత్రి యనమల తెలిపారు. స్థానిక బృందాలు విశేషంగా కృషి చేస్తున్నాయని వివరణ ఇచ్చారు.

10:41 - August 22, 2017

నెల్లూరు : సంపాదనే ధ్యేయంగా కొందరు అక్రమార్కులు...పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు. ప్రజల జీవితాలను పణంగా పెట్టి అధికారుల అండదండలతో కోట్లకు పడగలెత్తుతున్నారు. తాగే  నీరు, పీల్చే గాలి, పండే పంటలను విషతుల్యం చేస్తున్నారు. రాజకీయ అండదండలతో నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న ఆక్వా వ్యాపారంపై ప్రత్యేక కథనం. 
అక్వా పరిశ్రమల విషకౌగిలి
పుడమితల్లి పచ్చనిచీర కట్టినట్లుగా ఎటు చూసినా పచ్చదనం. చల్లని గాలులు వీచే కొబ్బరి చెట్లు.. మదిని దోచే ప్రకృతి అందాలు... ప్రకృతి సోయగాలతో పరిఢవిల్లిన ఈ ప్రాంతం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోనిది. ఈప్రాంతాన్ని రెండో కోనసీమగా చెప్పుకుంటారు. ఇదంతా గత చరిత్రగా మిగిలిపోతోంది.. సహజసిద్ధమైన అందాలు, పచ్చని పంటలతో ఎంతో ఆహ్లాదంగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు అక్వా పరిశ్రమల విషకౌగిలిలో చిక్కి విలవిలలాడుతోంది. 
పంటకాలువల్లోకి వ్యర్ధాలు 
నెల్లూరు జిల్లాలోని మూడు రొయ్యల కర్మాగారాలు వ్యర్ధాలను పంటకాలువల్లోకి వదిలేస్తున్నాయి. దీంతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. ఎటువంటి శుద్ధి చేయకుండా యధేచ్ఛగా  విష వ్యర్థాలను భూగర్భ పైపులద్వారా పంట కాల్వల్లో కలిపేస్తున్నారు. విషతుల్యమైన నీరు పంట పొలాల్లోకి చేరడంతో పంటలు దెబ్బతింటున్నాయి. అంతేకాదు ఈ గరళాన్ని తాగిన  పశువులు రోగాలబారిన పడుతున్నాయి. మూగజీవాలు చనిపోతున్నాయి. రొయ్యల ప్రాసెసింగ్‌ పరిశ్రమలతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  తాగునీరు,  పీల్చేగాలి కలుషితం కావడంతో స్థానికుల జీవనం దుర్భరంగా మారింది. భరించలేని దుర్వాసనతో వీరు జబ్బుల బారినపడుతున్నారు. 
ఆక్వా పరిశ్రమ నిర్వాహకుల అక్రమాలు
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో 22 పంచాయతీలు, 62 గ్రామాలున్నాయి.  ఈ మండలంలో 6,786 మంది చిన్నకారు, 2,230 మంది సన్నకారు, 299 మంది కౌలు రైతులు  వ్యవసాయం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పెన్నా నుంచి నెల్లూరు మీదుగా జాఫర్ సాహెబ్ పంటకాలువ ప్రవహిస్తోంది. డేవిస్ పేట వద్ద ఇది 3 ఉపకాలువలుగా చీలి 62 గ్రామాలకు  సాగునీరందిస్తోంది. జాఫర్ సాహెబ్ , గంగపట్నం కాలువల పరిధిలో దాదాపు 35 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ నీటిపై ఆధారపడి వరి, కొబ్బరిచెట్లతోపాటు రకరకాల పంటలు సాగుచేస్తున్నారు స్థానిక రైతులు. అయితే శుద్ధి చేయని అక్వా పరిశ్రమల వ్యర్థాలు నేరుగా పంటకాలువలోకి వదలడంతో...పంటలు నాశనమైపోతున్నాయి. వరి పొట్టదశకు వచ్చేసరికి వాడిపోతోంది. సీజన్ ముగిసేనాటికి దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   
ఆందోళనలో రైతులు 
రొయ్యల ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్య వ్యర్ధాల వల్ల ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట, డేవిస్ పేట, గంగపట్నం, జేజే పేటతో పాటు పలు గ్రామాల అవస్థలు పడుతున్నారు. అక్వా పరిశ్రమ రాకతో స్థానికుల ప్రశాంత జీవనం చెదిరిపోయింది. ఇంట్లో సంతృప్తిగా తిండి తినలేకపోతున్నారు. భరించరాని దుర్గంధంతో ఆరుబయట సేదతీరలేకపోతున్నారు. చివరకు ప్రశాంతంగా నిద్రించలేకపోతున్నారు. దోమలు విజృంభిస్తుండటంతో.. విషజ్వరాల బారిన పడి అల్లాడిపోతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు, విషజ్వరాలు, కీళ్లనొప్పులు తదితర రోగాలతో సతమతమవుతున్నారు. ఇటీవల పాములవారిపాలెంలో 600 మందికి జ్వరం సోకడంతో..ఆగ్రహించిన జనం పంట కాలువల్లో విష వ్యర్థాలు వదలొద్దంటూ కదం తొక్కారు. ఆక్వాపరిశ్రమలకు వ్యతిరేకంగా గళమెత్తారు. 

 

కాకినాడలో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం

తూ.గో: కాకినాడలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టిడిపి తరపున ఏడుగురు మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ తరపున ఎంపి విజయసాయి రెడ్డి తో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరపున మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు ప్రచారంలో పాల్గొన్నారు.

ఢిల్లీ బయలు దేరిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొద్దిసేపటి క్రితం దిల్లీ బయలుదేరి వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పౌరసన్మానం కోసం సోమవారం ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. రాజ్‌భవన్‌లో సన్మానం ముగిసిన తర్వాత రాత్రి ఇక్కడే బస చేసి ఈరోజు ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో దిల్లీ బయలుదేరి వెళ్లారు. గవర్నర్‌ నరసింహన్‌, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్‌, డీజీపీ అనురాగ్‌శర్మ ఉపరాష్ట్రపతికి వీడ్కోలు పలికారు.

కేంద్ర మంత్రికి అల్పాహార విందు ఇచ్చిన చంద్రబాబు

అమరావతి: ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీనడ్డా కలిశారు. సీఎం చంద్రబాబు జేపీ నడ్డాకు అల్పాహార విందు ఇచ్చారు.

కొనసాగుతున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

హైదరాబాద్: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది.

త్రిబుల్ తలాక్ తీర్పు పై ఉత్కంఠ...

ఢిల్లీ : వివాదస్పద ట్రిపుల్ త‌లాక్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. చీఫ్‌ జస్టిస్‌ సీజే.ఖెహర్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం గత మే నెలలో ఆరు రోజుల పాటు విచారణ జరిపింది. త‌న తీర్పును మాత్రం రిజ‌ర్వ్‌లో పెట్టింది. మంగళవారం ఉదయం 11 గంటలకు తీర్పు వెలువడే అవకాశం ఉంది.

09:34 - August 22, 2017

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక బ్యాంకింగ్‌ సంస్కరణలకు నిరసనగా యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్ల పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. 10 లక్షల మంది బ్యాంకు సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేపడుతున్నారు. సిబ్బంది సమ్మెతో బ్యాకింగ్ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి..  ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనం, కార్పొరేట్‌ రుణమాఫీ చేయడమే కాకుండా ఇటీవల ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ బిల్లు- 2017ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడాన్ని బ్యాంకు సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. తమ సమ్మెకు సహకరించాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నారు. 

 

09:33 - August 22, 2017

నల్లగొండ : జిల్లాలోని కనగల్లు మండలం, కురంపల్లిలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరు యువకులను దుందగలు నరికి చంపారు. మృతులు దాసరి అన్నమయ్య (24), దాసరి ఆంజనేయులు (22)గా తెలుస్తోంది. భూ తగాదాలే హత్యలకు కారణంగా స్థానికులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:23 - August 22, 2017

నేడు సీఎం చంద్రబాబుతో జేసీ నడ్డా భేటీ

అమరావతి : నేడు ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో జేసీ నడ్డా భేటీ కానున్నారు. తాడికొండలో రూరల్ హెల్త్ సెంటర్ ప్రారంభించనున్నారు. 

 

నేడు యువ సీఈవోలతో ప్రధాని మోడీ సమావేశం

ఢిల్లీ : నేడు యువ సీఈవోలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో 200 మంది యువ సీఈవోలు పాల్గొననున్నారు. 

నల్గొండ జిల్లాలో జంట హత్యలు

నల్గొండ : కనగల్లు మండలం కురంపల్లిలో అన్నదమ్ములు హత్య గావించబ్డారు. ఇద్దరు యువకులను దుండగలు నరికి చంపారు. ఈ హత్యలకు భూవివాదాలే కారణమని అనుమానిస్తున్నారు. 

 

08:44 - August 22, 2017

బ్యాంకులు ప్రభుత్వరంగంలో ఉండాలని వక్తలు అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో సంస్కరణలు, బ్యాంకుల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నేడు బ్యాంకు ఉద్యోగులు దేశ వ్యాప్త సమ్మె చేపట్టారు. ఇదే అంశంపై ఇవాళ నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, బిజెపి నాయకురాలు కొల్లి మాధవి, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్ పాల్గొని, మాట్లాడారు. బ్యాంకులను ప్రైవేట్ పరం చేయడం దేశ సార్వభౌమత్వానికి ముప్పు అని అన్నారు. బ్యాంకులను ప్రైవేట్ పరం చేయొద్దన్నారు. సీఎం కేసీఆర్ ధోరణి నియంత కంటే అన్యాయంగా ఉందన్నారు. 
ధర్నా చౌక్ విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:32 - August 22, 2017

బ్యాంకింగ్ రంగాన్ని ప్రభుత్వరంగంలోనే ఉంచాలని బ్యాంకింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే సంస్కరణలు చేయాలన్నారు. 'బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు వ్యతిరేకంగా బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఇప్పటికే తొమ్మిది సంఘాలు ఒకే గొడుగు కిందకు వచ్చి, ఆగస్టు 22 సమ్మెకు పిలుపునిచ్చాయి. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల సారాంశం ఏమిటి? బ్యాకింగ్ రంగంలో ఎలాంటి సంస్కరణలు అమలవుతున్నాయి? ఈ సంస్కరణల వల్ల లాభపడుతున్నదెవరు? బాధపడుతున్నదెవరు? బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించడానికి కారణం ఏమిటి? బ్యాంకింగ్ రంగంలో నిజంగా రావాల్సిన మార్పులేమిటి'?  అంశాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:19 - August 22, 2017

వాషింగ్టన్ : నింగిలో అద్భుతం ఆవిష్కరించింది. అమెరికా, యూరప్‌, ఆఫ్రికా దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. 1979 తర్వాత ఏర్పడ్డ అతిపెద్ద సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు...అమెరికా ప్రజలంతా పోటీపడ్డారు. జనాలంతా రోడ్లమీదనే చేరుకోవడంతో.. నగర వీధుల్లో పండుగ వాతావరణం నెలకొంది.  విదేశాల నుంచి కూడా చాలామంది ఈ అద్భుతాన్ని చూసేందుకు అమెరికా చేరుకున్నారు. వాయువ్య రాష్ట్రమైన ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో మొట్టమొదటగా సంపూర్ణ గ్రహణం ఆవిష్కృతమైంది. ఉదయం 9 గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం... సుమారు 75 నిమిషాల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం ఆవిష్కృతమైంది. ఇదాహో, వ్యోమింగ్‌, నెబ్రస్కా, మిస్సోరీ, ఇల్లినాయిస్‌, కాన్సస్‌, కెంటకీ, టెన్నెస్సీ, నార్త్‌ కరోలినా, జార్జియా రాష్ట్రాల గుండా గ్రహణం ముందుకు సాగింది. చివరకు సౌత్‌ కరోలినా రాష్ట్రంలో ఈ ఘట్టం ముగిసింది. నాసా ఈ అద్బుతాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. 

 

08:15 - August 22, 2017

కృష్ణా : బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం రోజు రోజుకు గగన కుసుమంగా మారుతోంది. దర్శనం టికెట్ల రేట్లను ఈవో సూర్యకుమారి ఏకపక్షంగా పెంచడంతో దుర్గగుడికి భక్తులు రావాలంటేనే భయపడుతున్నారు. దర్శనం, సేవలు, అర్చన టికెట్ల రేట్లు చుక్కలు చూపిస్తోండటంతో దుర్గమ్మ దర్శనం అంటేనే భక్తులు విముఖత చూసే పరిస్థితి వచ్చింది. భక్తుల దోపిడీకి తెరతీసిన బెజవాడ దుర్గ గుడి టికెట్లపై 10 టీవీ ప్రత్యేక కథనం.. 
అర్చకులు, ఈవోకు మధ్య పంచాయితీ
బెజవాడ కనకదుర్గమ్మ... ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఇంద్రికీలాద్రిపై వెలసిన అమ్మవారి దేవాలయం ఒకప్పుడు భక్త జనుల ఆదరణకు నోచుకుంది. ఇప్పుడు కమ్రంగా ప్రాబవం కోల్పోతోందన్న విమర్శలు ఎక్కువ అయ్యాయి. తిరుమల వెంకన్న తర్వాత రాష్ట్రంలో రెండో పెద్ద ఆలయం బెజవాడ కనకదుర్గమ్మ గుడి. ఇక్కడ సిబ్బంది, ఈవో, అర్చకుల మధ్య ఎప్పుడూ వివాదాలే రాజ్యమేలేవి. దీంతో ఈ సమస్యకు ముగింపు పలకాలన్న లక్ష్యంతో రాష్ట్ర విభజన తర్వాత బెజవాడ దుర్గగుడి ఈవో స్థాయిని ఐఏఎస్‌ కేడర్‌కు పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.   సూర్యకుమారిని ఈవోగా నియమించింది.  సూర్యకుమారి ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దుర్గగుడి వివాదాల పుట్టగా మారింది. అర్చకులు, ఈవోకు మధ్య రోజూ పంచాయితీలే. ఈవోకు పాలక మండలికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఆలయ ఆదాయం పెంచేందుకు ఈవో, ఆలయ పాలకమండలి తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. 
టికెట్ల రేట్లు ఏకపక్షంగా పెంచిన ఈవో సూర్యకుమారి
తిరుమల, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి దేవాలయాలతో పోల్చుకుంటే బెజవాడ దుర్గగుడి ఆలయంలో సౌకర్యాలు చాలా తక్కువ. కానీ టికెట్ల రేట్లు ఎక్కువ. సూర్యకుమారి ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏకపక్షంగా టికెట్ల రేట్లు పెంచారు. దర్శనానికి వంద రూపాయలు, మూడు వందల రూపాయలుగా నిర్ణయించారు. ఐదు వందల రూపాయల టికెట్ ప్రవేశపెట్టారు. ఆదాయార్జనే ధ్యేయంగా పెట్టుకున్న సూర్యకుమారి చండీయాగం టికెట్లతో పాటు ఇతర పూజల టికెట్ల రేట్లను కూడా ఇష్టారాజ్యంగా పెంచారు. ఐదు వందల రూపాయల టికెట్‌ ను 1500 రూపాలకు పెంచారు. వెయ్యి రూపాయల టికెట్‌ను  రెండు వేల రూపాయలకు హెచ్చించారు. ఖడ్గమాల సేవకు టికెట్ రేటును  ఐదు వేల రూపాయలుగా నిర్ణయించారు. ఈ రేట్లు ఎవరో కొద్దిమందికి మినహా మిగిలినవారికి అందుబాటులో లేవు. దీంతో ఆదాయార్జన లక్ష్యంగా నెరవేకపోగా, రోజు రోజుకు తగ్గిపోవడం ప్రారంభించింది. దర్శనం రేట్లకు భయపడి భక్తులు రావడమే మానేశారు. ఇటీవల పాలక మండలి కొలువుతీరింది. అంతరాలయ దర్శనం టికెట్‌ను 300 రూపాయల నుంచి 150 రూపాయలకు తగ్గించాలని పాలక మండలి చేసిన ప్రతిపాదనపై ఈవో సూర్యకుమారి అభ్యంతరం వ్యక్తం చేడయం వివాదాస్పదంగా మారింది. ఐదు వందల రూపాయల దర్శనం టికెట్‌ రేటును 300 రూపాయలకు తగ్గించాలన్న పాలక మండలి ప్రతిపాదనను ఈవో సూర్యకుమారి తోసిపుచ్చడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయం మంత్రి దేవినేని ఉమ వరకు వెళ్లడంతో పాలకమండలి ప్రతిపానదను సమర్ధించారు. పాలకమండలి చైర్మన్‌తోపాటు సభ్యులు, ఈవో సూర్యకుమారి... ఇటీవల మంత్రి దేవినేనితో భేటీ అయినప్పుడు టికెట్ల రేట్లు తగ్గింపు అంశం చర్చకు వచ్చింది. దర్శనం టికెట్‌ రేట్ల తగ్గింపు ప్రతిపాదనను పాలక మండలిలో ఆమోదించి అమలు చేయాలన్న మంత్రి దేవినేని సూచనను కూడా సూర్యకుమారి బేఖాతర్‌ చేయడం అటు ప్రభుత్వం, ఇటు దేవాలయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దుర్గ గుడి ఈవో సూర్యకుమారి వైఖరిపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి దేవినేని ఉమ... రేట్లు తగ్గించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆలయ ఈవోగా సూర్యకుమారి బాధ్యతలు చేపట్టిన తర్వాత భక్తుల నిలువుదోపిడీకి తెరతీశారన్న విమర్శలు వెల్లు  వెత్తున్నాయి. 
ఇప్పుడు ఆరు నుంచి ఏడు వేల మంది మాత్రమే దర్శనం   
బెజవాడ దుర్గగుడి ఈవో సూర్యకుమారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆలయానికి వచ్చే ఆదాయంతోపాటు భక్తుల సంఖ్య తగ్గిపోయిన విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. టికెట్ల రేట్లు పెంచకముందు పండుగుల సీజన్‌లో రోజుకు పాతిక వేల నుంచి ముప్పైవేల మంది అమ్మవారిని దర్శించుకునేవారు. సాధారణ రోజుల్లో పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది భక్తులు అమ్మవారి దర్శనాకి వచ్చేవారు. కానీ ఇప్పుడు రోజుకు ఆరేడు వేల మంది కూడా బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి రాకపోవడానికి టికెట్‌ రేట్ల బాదుడే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయం పెంపుతోపాటు, భక్తులను రప్పించే విషయంలో బెజవాడ దుర్గగుడి ఆలయానికి  పూర్వ వైభవం తీసుకురావాలంటే టికెట్ల రేట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని  కోరుతున్నారు. 

ప్రొకబడ్డీ లీగ్ లో నేటి మ్యాచ్ లు

హైదరాబాద్ : ప్రొకబడ్డీ లీగ్ లో భాగంగా నేడు యూపీ యోధ, బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. గుజరాత్ తో పూణెని పల్డన్ తలపడనుంది. 

 

08:04 - August 22, 2017

విజయవాడ : 2014 ఎన్నికల్లో ఎడాపెడా హామీలు గుప్పించారు. మూడేన్నరేళ్లు గడుస్తున్నా అవి నెరవేర్చిన దాఖలాలు లేవు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో.. నిరుద్యోగ భృతి హామీపై చంద్రబాబు స్పందించారు. నిరుద్యోగులకు ఖచ్చితంగా భృతి చెల్లిస్తామని ప్రకటించారు. అయితే.. నిరుద్యోగ భృతిని ఎప్పటినుండి అమలు చేస్తారు... ? విధి విధానాలు ఏంటో ఖరారు చేయకపోవడంతో విద్యార్థి, యువజన సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
సర్కార్‌ తీరుపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి 
ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ తీరుపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2014 ఎన్నికల్లో బాబు వస్తే జాబు వస్తుందని హామీలు గుప్పరించడమే కాకుండా.... యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లేకుంటే.. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అయితే... మూడేన్నరేళ్లు గడుస్తున్నా తమకు ఎలాంటి భృతి చెల్లించడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఇప్పటివరకు 60,776 మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకుంటే.. ఒక్కరికి కూడా ప్రయోజనం చేకూరలేదని ప్రతిపక్షాలు, యువజన, విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నమ్మి టీడీపీకి అధికారం కట్టబెడితే... చంద్రబాబు ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదంటున్నారు. 
మళ్లీ టీడీపీ నిరుద్యోగ భృతి పల్లవి 
ఇక... నిరుద్యోగ భృతిపై ప్రతిపక్షాలు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం... 2019 ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీ మళ్లీ నిరుద్యోగ భృతి పల్లవి అందుకుంది. అయితే... 18 నుంచి 35 ఏళ్లలోపు నిరుద్యోగులకు మాత్రమే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని సర్కార్‌ ప్రకటించింది. ఇంటర్‌లోపు విద్యార్థులకు 900 రూపాయలు, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తామని వెల్లడించింది. ఇందుకోసం బడ్జెట్‌లో 500 కోట్లు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే... నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం స్పష్టమైన విధానాలు ప్రకటించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుద్యోగ భృతి ఖచ్చితంగా ఎప్పటినుండి చెల్లిస్తారో చెప్పాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తానికి 2019 ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్ధ మవుతోంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా... నిరుద్యోగ భృతి చెల్లించేందుకు సిద్ధ మవుతోంది. అయితే... ఇది ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో చూడాలి. 

 

07:58 - August 22, 2017

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఇవాళ సమ్మెబాట పడుతున్నారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది. 
ఎన్డీయే హయాంలో ఇప్పటికే 4సార్లు సమ్మె 
ఎన్డీయే హయాంలో ఇప్పటికే నాలుగుసార్లు సమ్మె బాట పట్టిన బ్యాంకు ఉద్యోగులు.. మరోసారి సమ్మెకు దిగుతున్నారు. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల పేరుతో ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు మొగ్గుచూపుతున్నాయన్నది బ్యాంక్ ఉద్యోగ సంఘాల ప్రధాన ఆరోపణ. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలు ఏకమై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పేరుతో ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేయాలని ఐక్యవేదిక పిలుపునిచ్చింది. 
సేవింగ్స్‌లో 75 లక్షల కోట్లు  
దేశంలో 80 శాతం ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో దాదాపు 75 లక్షల కోట్లు సేవింగ్స్‌లో ఉన్నాయని.. ఆ మొత్తాన్ని ప్రైవేటు రంగంలోకి మరల్చడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పావులు కదుపుతున్నాయని బ్యాంకు యూనియన్ నేతలు మండిపడుతున్నారు. ప్రైవేటు రంగంలో సామాన్యుల ధనానికి భద్రత కొరవడిందని.. అందుకోసం దేశమంతా తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు బ్యాంకు సిబ్బంది. దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్న నేపథ్యంలో రోజంతా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. 

 

07:54 - August 22, 2017

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల కుమ్ములాట‌లు .. ఇప్పుడు హ‌స్తిన‌కు చేరాయి. పార్టీలో కోల్డ్ వార్ తో ర‌గిలిపోతున్న రాష్ట్ర ముఖ్య  నేత‌లంతా ఇప్పుడు ఢిలీలో మ‌కాంవేశారు. ఎవ‌రికి వారు త‌మ పంతం నెగ్గించుకునేందుకు ఢిల్లీపెద్దల చుట్టూ చ‌క్కర్లు కొడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఇపుడు ఢిల్లీ బాటపట్టారు. ఆధిపత్యపోరును హస్తినకు చేర్చారు. ఫిర్యాదులు, విన్నపాలతో అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ముఖ్య నేత‌లు  అందరూ ఢిల్లీలో మకాం వేసి టీకాంగ్రెస్‌ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు.  
నేతల మధ్య కోల్డ్‌వార్‌ 
కొన్ని రోజుల నుండి రాష్ట్ర నేత‌ల మ‌ధ్య కొన‌సాగుతున్న కోల్డ్ వార్ పీక్‌స్టేజ్‌కు చేరింది. ప్రస్తుతం ఉత్తమ్ వ‌ర్సెస్ కోమ‌టిరెడ్డి బ్రద‌ర్స్,  ఉత్తమ్ వ‌ర్సెస్ జానారెడ్డి  ఆధిప‌త్య పోరు పార్టీలో సెగ‌లు రేపుతుంది. ఇదిచాల‌ద‌న్నట్టు .. కోమ‌టిరెడ్డి బ్రద‌ర్స్ ఏకంగా ..పార్టీ రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జ్ ఆర్ సి కుంతీయాను టార్గెట్ చేయ‌డంతో .. ఇది మ‌రింత ముదిరింది. ఈ నేప‌థ్యంలో ముఖ్య నేత‌లంతా ఢిల్లీలో మాకాం వేయ‌డం.. ఇప్పుడు హాట్ హాట్ గా మారింది.
ఢిల్లీలో మకాం వేసిన నేతలు 
ఉత్తమ్ , జానారెడ్డి , ష‌బ్బీర్ ఆలీ, కోమ‌టిరెడ్డి బ్రద‌ర్స్‌తోపాటు పొన్నాల‌ ల‌క్ష్మయ్య తదితర నేతలు ఢిల్లీలో మకాం వేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ను కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త‌న‌కు పీసీసీ భాధ్యత‌లు అప్పగించాల‌ని .. ఇప్పటికే  అదిష్టానానికి రిక్వెస్ట్ పెట్టుకున్న జానారెడ్డి.. దీనిపై మ‌రోసారి రాహుల్ ను కలవడానికి యత్నిస్తున్నారు. ఇక పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డితో ఉప్పూ- నిప్పుగా ఉన్న కోమ‌టి రెడ్డి బ్రద‌ర్స్ .. ఫిర్యాదుల చిట్టాతో రాహుల్ ను క‌లిసేందుకు రెడీ అయ్యారు. ఉత్తమ్ నాయ‌కత్వాన్ని బ‌ాహాటంగానే వ్యతిరేకిస్తున్న కోమ‌టిరెడ్డి సోదరులు .. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతీయాపై విమర్శలు చేయడంపై అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. కుంతియాపై తమ విమర్శలకు వివరణ ఇవ్వడంతోపాటు .. ఎప్పటి నుంచో పీసీసీ పీఠంపై పెట్టుకున్న ఆశలను కూడా రాహుల్‌ సమక్షంలో ఓపెన్‌చేయాలని కోమటిరెడ్డి సోదరులు రెడీ అయ్యారు. 
ఏఐసీసీ పదవుల కోసం టీ కాంగ్ నేతల ఆరాటం
మరోవైపు ఏఐసీసీ పదవుల కోసం కూడా టీకాంగ్రెస్‌ నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ పదవులు ఆశిస్తున్న వారిలో పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్‌లు ముందు వరుసలో ఉన్నారు. వీరితో పాటు మరికొందరు లీడర్లు కూడా ఢిల్లీ పెద్దల దగ్గర లాబీయింగ్‌ చేస్తున్నట్టు సమాచారం. 
ఉత్తమ్‌కు తలనొప్పిగా జానా, కోమటిరెడ్డి తీరు
ఈ పరిస్థితి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు ఇరకాటంగా మారింది. జానా, కోమటిరెడ్డి సోదరుల తీరుపై రాహుల్‌కు వివరించేపనిలో ఉత్తమ్‌ హస్తిన బాటపట్టారు. నేతల తీరుతో  తాను వేగలేని పరిస్థితి వస్తోందని, తనకు పార్టీలో ఫ్రీహ్యాండ్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షునికి వివరించేందుకు ఉత్తమ్‌ సమాయత్తం అయ్యారు.
కోర్కెలు తీరేది ఎవరికి..? క్లాస్‌పడేది ఎవరికి..?
మొత్తానికి ఫిర్యాదుల చిట్టాతో కొంద‌రు.. వివ‌రణ‌ల‌తో మ‌రికొంద‌రు.. కొత్త కోర్కెలతో ఇంకొంద‌రు ఇలా.. అంద‌రూ  ఢిల్లీలో చ‌క్కర్లు కొడుతున్నారు. మ‌రి వీరిలో రాహుల్ ..ఎవ‌రి కోర్కెలు తీరుస్తారో.. ఎవరికి క్లాస్‌పీకుతారో అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. 

 

07:47 - August 22, 2017

విజయవాడ : ఈ ఏడాది చివరి నాటికి 28 ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం వహిస్తే సహించేది లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని జలాశయాల వద్ద 'జలసిరికి హారతి' పేరుతో కార్యక్రమం నిర్వహించడానికి ప్రభత్వం రెడీ అవుతోంది.
పనుల్లో జాప్యం జరగొద్దు : సీఎం
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. పనుల్లో జాప్యం జరగొద్దని అధికారులకు సూచించారు. ఈనెలలో చేపట్టనున్న జలహారతి కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జలాశయాల వద్ద హారతి ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రకృతితో ప్రతి ఒక్కరూ మమేకం కావాలన్నదే తమ ఆకాంక్షని సీఎం  చెప్పారు. అందుకే ఏరువాక, వనం-మనం, తాజాగా 'జలసిరికి హారతి' వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని  చంద్రబాబు తెలిపారు.  'జలసిరికి హారతి' కార్యక్రమం జరిగినన్ని రోజులు ఆయా ప్రాంతాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకట్టుకోవాలని అన్నారు.  మైనర్ ఇరిగేషన్ సహా పూర్తయిన ప్రాజెక్టులన్నింటినీ ఈ సమయంలోనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు. 
పోలవరంపై నెలనెలా నివేదిక ఇవ్వాలన్న సీఎం 
పోలవరం సహా  నిర్మాణంలో ఉన్న 28 ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి   సమీక్ష నిర్వహించారు. గడిచిన వారంలో వివిధ ప్రాజెక్టుల్లో జరిగిన పనుల వివరాలను సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, నిధుల వినియోగం, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు వంటి వాటికి సంబంధించిన వివరాలతో నెలనెలా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలు పెద్దసంఖ్యలో ప్రాజెక్టులు నిర్మించుకోవడంతో దిగువకు నీరు రావడం గగనమవుతోందన్న చంద్రబాబు ..అందుబాటులో ఉన్న నీటివనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సి ఉందన్నారు.  
ఈ ఏడాది చివరికి 28 ప్రాజెక్టులు కంప్లీట్‌ 
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించకున్న లక్ష్యం మేరకు 28 ప్రాజెక్టులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని చెప్పారు. ప్రాజెక్టుల పనులపై వివిధ జిల్లాల ఛీఫ్ ఇంజనీర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల , వంశధార  స్టేజి 2  పనులు వచ్చే ఏడాది జనవరి 5 నాటికి పూర్తికావాలని సీఎం డెడ్‌లైన్ విధించారు. అటు పోగొండ రిజర్వాయర్,  ఎర్రకాలువ ఆధునీకరణ పనులు మరో రెండు నెలల్లో పూర్తిఅవుతాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.  పెదపాలెం, కండలేరు ఎత్తిపోతల పథకం  గోరుకల్లు రిజర్వాయర్, అవుకు టన్నెల్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని అధికారులు వివరించారు.  అటు ఎగువ రాష్ట్రాలు నీటి విడుదల విషయంలో సరిగా వ్యవహరించడం లేదని, త్రిసభ్య కమిటీని అడ్డుపెట్టుకుని  నీటివిడుదలను అడ్డుకుంటున్నాయని మంత్రి దేవినేని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై  ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖతో మాట్లాడామని అవసరమైతే న్యాయపోరాటం చేయాలని సమీక్షలో చర్చించామని  మంత్రి దేవినేని తెలిపారు. మొత్తానికి రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణం తీరుతెన్నులు ఎప్పటికపుడు ప్రజలకు చెప్పాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీన్లో భాగంగానే ఈనెలాఖరు నుంచి జలహారతి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు అధికారులు అంటున్నారు. ప్రభుత్వం చేపట్టే జలహారతి మరో ప్రచార కార్యక్రమం మాత్రమే అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 

నేడు గవర్నర్ ను కలవనున్న దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు

చెన్నై : నేడు దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలవనున్నారు. ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని ఎమ్మెల్యేలు కోరనున్నారు. అవిశ్వాస తీర్మానం కోరే యోచనలో దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు. 

 

నేడు త్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు తీర్పు

ఢిల్లీ : వివాదస్పద ట్రిపుల్ త‌లాక్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. చీఫ్‌ జస్టిస్‌ సీజే.ఖెహర్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం గత మే నెలలో ఆరు రోజుల పాటు విచారణ జరిపింది. త‌న తీర్పును మాత్రం రిజ‌ర్వ్‌లో పెట్టింది. ఉదయం 11 గంటలకు తీర్పు వెలువడే అవకాశం ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

టీఎస్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై నేటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. 26 వరకు 15 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగనుంది. 

నేటి నుంచి 'మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ'

హైదరాబాద్ : నేటి నుంచి మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ జరుగనుంది.  

 

నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె

ఢిల్లీ : నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు. 10 లక్షలమంది ఉద్యోగులు విధులకు దూరం కానున్నారు. కార్పొరేట్ కంపెనీల మొండి బాకాయిల రద్దుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

 

Don't Miss