Activities calendar

23 August 2017

21:42 - August 23, 2017

ఢిల్లీ : కేంద్రంలోని నరేంద్రమోది ప్రభుత్వం త్వరలో క్యాబినెట్‌ విస్తరించనుంది. ఆగస్ట్‌ 27 లేదా 28 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ విస్తరణలో బిజెపికి చెందిన కొంతమంది మంత్రులను తొలగించే అవకాశం ఉంది. రైల్వేమంత్రి సురేష్‌ ప్రభును మంత్రి పదవి నుంచి తప్పించవచ్చు. వరుస రైల్వే ప్రమాదాలు చోటుచేసుకోవడంతో కేంద్ర రైల్వేమంత్రి సురేష్‌ ప్రభు రాజీనామాక సిద్ధపడ్డ విషయం తెలిసిందే. మంత్రివర్గ విస్తరణలో బిహార్‌లో బిజెపితో జతకట్టిన జెడియుకు చోటు దక్కనుంది. నూతనంగా రక్షణమంత్రిని నియమించే అవకాశం ఉంది. మనోహర్‌ పారీకర్‌ రాజీనామాతో అరుణ్‌జైట్లీ అదనంగా రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

21:40 - August 23, 2017

తిరుగునంతపురం : ఎస్ఎన్ సీ లావలిన్ కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కేరళ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అవినీతి కేసులో పినరయి విజయన్‌ పేరును సీబీఐ చేర్చడం సరికాదని హైకోర్టు తేల్చిచెప్పింది. విజయన్‌కు వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించడంలో సిబిఐ విఫలమైందని కోర్టు పేర్కొంది. దీంతో 20 ఏళ్లుగా పినరయి విజయన్‌ను వెంటాడుతున్న ఎస్ఎస్‌సీ-లావలిన్ కేసు నుంచి ఆయనకు విముక్తి లభించింది. కోర్టు తీర్పు పట్ల సిఎం విజయన్‌ హర్షం వ్యక్తం చేశారు. రాజకీయంగా తనను ఇరికించేందుకు కుట్ర జరిగిందని చివరకు నిజమే విజయం సాధించిందని పేర్కొన్నారు. 1996-98లో విజయన్‌ విద్యుత్‌శాఖ మంత్రిగా ఉన్నారు. కెనడియన్ సంస్థ ఎన్‌ఎన్‌సీ-లావలిన్ గ్రూప్‌కు విద్యుత్ ఆధునికీకరణ కాంట్రాక్టును అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి 374 కోట్ల నష్టం జరిగిందని సిబిఐ ఆరోపణ. 2013లో సీబీఐ కోర్టు విజయన్, మరో ఆరుగురుని నిర్దోషులుగా ప్రకటించింది. సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. 

21:39 - August 23, 2017

హైదరాబాద్ : వైద్య పరీక్షల నిమిత్తం గవర్నర్‌ నరసింహన్‌ సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. కొద్దికాలంగా కాల్లో ఏర్పడిన కంతితో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ చేయించుకున్నారు. సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పడంతో... త్వరలోనే సర్జరీ చేయించుకుంటానని వారికి తెలిపారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఓ సామాన్యుడులా గవర్నర్‌ ఆస్పత్రికి రావడంతో...గాంధీ సిబ్బంది ఆశ్చర్యపోయారు.

21:38 - August 23, 2017

కర్నూలు : నంద్యాలలో భారీ స్థాయిలో ఓటింగ్‌ నమోదు కావడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా గెలుపు తమదేనన్నారు.  

21:37 - August 23, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీదే విజయమన్నారు.. మంత్రి అఖిలప్రియ... పోలింగ్‌ శాతం పెరగడం మంచి పరిణామం అని చెప్పుకొచ్చారు.. చాలాచోట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.. అయినా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించి... ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు సహకరించారని చెప్పుకొచ్చారు.

21:36 - August 23, 2017

కర్నూలు : నంద్యాల ఉపఎన్నికకు పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. నంద్యాల నియోజక వర్గంలో మొత్తం 2 లక్షల 19 వేల 108 మంది ఓటర్లున్నారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌తో కలిపి మొత్తంగా 15మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. పోలింగ్‌ కోసం ఎన్నికల కమిషన్‌ 255 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సాయంత్రం 5 గంటల వరకు 77.66 శాతం పోలింగ్ నమోదైంది.

పోలింగ్ కేంద్రాల ముందు బారులు
ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరారు. మరోవైపు ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌క్యాస్టింగ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మూడు డ్రోన్‌ కెమెరాల ద్వారా అధికారులు ఓటింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. నంద్యాలలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 72 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్ పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించాయి.వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి నంద్యాలోని సంజీవనగర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటువేశారు. శిల్పాతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కలిసివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు.

అఖిలప్రియ సోదరి నాగమౌనిక పోలింగ్‌ బూత్‌లో హల్‌చల్
ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి నాగమౌనిక పోలింగ్‌ బూత్‌లో హల్‌చల్‌ చేశారు. పోలింగ్‌ ఏజెంట్ల ఓటరు కార్డులు తీసుకుని వివరాలు చెప్పాలని అడిగారు... దీంతో వైసీపీ కార్యకర్తలు నాగ మౌనికపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మకూరు బస్టాండ్‌ దగ్గర భూమా, శిల్ప కుటుంబాలు గొడవపడ్డాయి.. రెండువర్గాలమధ్య వాగ్వాదం జరిగింది..నంద్యాల బైపోల్‌లో అక్కడక్కడా ఘర్షణలు చెలరేగాయి. గాంధీనగర్‌లోని ఓ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారని వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ నిరసనను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు..ఎన్నికల విధుల్లో గుండెపోటుతో మృతిచెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి ఈసీ పదిలక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది..ఓటింగ్‌ మొత్తం పూర్తయ్యాక ఈవీఎం యంత్రాలను అధికారులు జాగ్రత్తగా ప్యాక్‌ చేశారు.. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలో వీటిని జాగ్రత్తగా భద్రపరిచారు.. ఈ నెల 28న కౌంటింగ్‌ జరగనుంది.

20:19 - August 23, 2017

ఏ ప్రయాణం ఏ విషాదానికి దారి తీస్తుందో ఊహించలేని పరిస్థితి..ఏ నిర్లక్ష్యం ఎన్ని ప్రాణాలు తీస్తుందో తెలియని పరిస్థితి.. అసలు భారతీయ రైల్వే భద్రతా ప్రమాణాలు ఎంత. రచు ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? మన రైలు ప్రయాణంలో సేఫ్టీ గాల్లో దీపమేనా? వరుస ప్రమాదాలు ఎన్నో ప్రశ్నలు మిగులుస్తున్నాయి. ఎందరో ప్రయాణికులు.. ఎన్నో కన్నీటి గాథలు.. పెళ్లికి వెళ్లే వాళ్లు.. సొంతింటికి వెళ్లే వాళ్లు.. వ్యాపార నిమిత్తం ప్రయాణించేవాళ్లు.. ఇలా ఎన్నో కలలను మోసుకుంటూ వెళ్లే అమాయకులు ఎందరో .. కానీ ఒక్క క్షణంలో అకస్మాత్తుగా పట్టాలు తప్పిన రైల్లో ఆ జీవితాలు చితికిపోతే... ఆ కన్నీటికి బాధ్యులెవరు? ఆ విషాదానికి పరిహారం ఎవరు చెల్లించగలరు? ఉత్కళ్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌.. అనేక కుటుంబాల్లో చీకటినింపిన రైలు.. ఒక్క ప్రయాణంతో అనేక కుటుంబాల తలరాతలు మార్చిన రైలు..ప్రాణాలు పోయిన వాళ్లు, గాయాల పాలైన వాళ్లు....గుర్తు తెలియని వాళ్లు.. వందలాదిమంది.. ఉత్కళ్ ఎక్స్ ప్రెస్, కైఫియత్ ఎక్స్ ప్రెస్ లకు జరిగిన ప్రమాదాలు మనరైళ్ల భద్రత గాల్లో దీపమా అనే ప్రశ్నను గుర్తు చేస్తున్నాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

 

20:18 - August 23, 2017

ఏమాట కామాట జెప్పుకోవాలెగని.. తెలంగాణ ప్రభుత్వం ఒక మంచిపనిజేశిందమ్మ ఇన్నొద్దులకు.. ఆ బత్కమ్మ పండుగకు చీరలు వంచుడు కథ ఏమోగని.. ఆ చీరెలు తయ్యారు జేస్తున్న నేతకార్మికులకు మాత్రం జర్రంత చేతినిండ పనిదొర్కింది నాల్గొద్దులు.. సిరిసిల్లల..ఇంక వేరే జాగలళ్ల మగ్గాల మోతమోగుతున్నది.. ఈ చీరెల తయ్యారి మీదనే..

డాక్టరు తానికి వోతే.. నొప్పొచ్చినోనికి వైద్యం జేయాల్నా లేకపోతె ఎంటొచ్చినోనికి వైద్యం జేస్తడా..? రోగికి చికిత్స జేయాలేగదా..? మరి కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జేయాల్నా లేకపోతె గుంటెడు భూమి వోని ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయం సేకరించాల్నా మీరే జెప్పుండ్రి..? ప్రాజెక్టుల నష్టపోతున్న జనాన్ని అవుతల వెట్టి కావాలె అనెటోళ్లను లోపట వెట్టి అభిప్రాయం సేకరిస్తున్నరంటే ఇగ ఏమంటరో మీరే అనుండ్రి సూశినంక..

గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మీరు మళ్లొక అవద్దం జెప్పిండ్రు సారూ..? నిన్న రెడ్డీ హాస్టల్ శంకుస్థాపన కార్యం కాడికి వొయ్యి మైకందుకోని మాట్లాడిండ్రుగదా..? సరే ఎందుకు మాట్లాడిండ్రు అనేది మీకెర్క వాళ్లకెర్కగని..? ఆ మాటలళ్ల ఒక పెద్ద అవద్దం ఇప్పుడు సోషల్ మీడియకు ఎక్కింది.. అట్లనే మల్లన్న ముచ్చట్ల తానికొచ్చింది.. ఇగ ఈడికొచ్చినంక దాసుడు ఉండది గావట్టి సూపెడ్తున్నం సారూ.. చిన్నవుచ్చుకోకు మన్సు..

తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సక్కగలేదు.. పైన పటారం లోపట లొటారం లెక్కనే ఉన్నది.. ఇది ప్రజల పరిపాలన గాదు.. జాగిర్దారుల పరిపాలన అంటున్నడు జేఏసీ చైర్మన్ కోదండరామయ్య సారు.. మీదికి గనిపిస్తున్నది ఒకటి లోపటి యవ్వారం ఇంకొకటి.. తెలంగాణను సత్తెనాశ్నం జేశిండు కేసీఆర్ అని చెప్పకనే జెప్పిండు ఢిల్లీల..

మన తెల్గురాష్ట్రంల ఊరికో నాల్గు విగ్రహాలున్నయ్.. గాంధీ తాతదో..? లేకపోతె వైఎస్ రాజశేఖర్ రెడ్డిదో.. ఎన్టీరామారావుదో.. ఇంద్రాగాంధీదో.. ఆంధ్ర రాష్ట్రమంత గల్పి.. కనీసం యాభై వేల విగ్రహాలకు ఇన్ని ఎక్వనే ఉంటయ్.. మరి అవ్వన్ని విగ్రహాలు వెట్టెతప్పుడు పర్మీషన్ దీస్కోనే పెట్టిండ్రంటరా..? ముప్పావు విగ్రహాలకు గూడ పర్మీషన్ ఉండది.. కని మరి ఈ అధికారులకు ఎందుకో అంత పైశ్చం.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు పర్మీషన్ లేదని ఎత్కపోయిండ్రు ఒకతాన..

అబ్బా డ్రామా అంటే.. డ్రామనే పోండ్రి.. ఫిదా సీన్మ గూడ ఏం పన్కిరాదు ఈ డ్రామా మీదికి.. ఇసొంటి డ్రామ ఎన్కట సురభి నాట్యమండలోళ్లే ఏశిండ్రు.. మళ్ల ఇప్పుడు నిజాంసాగర్ ఎస్ఐ అంతిరెడ్డి ఏశిండు..? కథ క్లైమాక్సు.. స్క్రిప్టు.. దర్శకత్వం.. నిర్మాత అంత అంతిరెడ్డే వహించిండు.. నటినటులు మాత్రం సామాన్య జనం అయ్యిండ్రు.. సూడుండ్రి ఆ సీన్మ కథ..

ఒక్కటే దావఖాండ్ల ఒక్కటే యాళ్లకు రెండు కాన్పులైనయ్.. ఇద్దరికి ఆడివిల్లలే వుట్టిండ్రు.. మరి ఒకలి తల్లి గన్న బిడ్డెను.. ఇంకో తల్లికి.. ఇంకో తల్లి గన్న బిడ్డను ఇంకోతల్లికి ఇస్తె..? ఎంత పరేషాన్ అయితది..? అదే పొరపాటు అయ్యింది విజయనగరం జిల్లాల.. కన్పుకొచ్చినోళ్లకు కన్నబిడ్డలను మార్చి ఒకరి పిల్లను ఒకరికిచ్చిండ్రు పూర్తి వివరాలకు వీడియో చూడండి.

సాక్షి టివి ఛానల్ పై కేసు

హైదరాబాద్ : సీసీఎస్ లో సాక్షి టివి ఛానల్ పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 126కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల చట్టం ఉల్లంఘించారని భన్వర్ లాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

19:43 - August 23, 2017

నంద్యాల ఉపఎన్నిక ఒక ప్రత్యేక సందర్బాంలో జరిగిందని, ఈ ఎన్నికలకు బీజేపీ, జనసేన దురంగా ఉందని, రాయలసీమలలో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి ఎలా ఉందో అనే అంశంతో ఈ ఎన్నిక జరిగనట్టు తెలుస్తోందని విశ్లేషకులు లక్ష్మీనారాయణ అన్నారు. 1952 తర్వాత అత్యధికంగా పోలింగ్ నమోద అయిందని, 13వేళ ఇల్లు, 30 సంవత్సరాల ట్రాఫిక్ ను సులభంగా చేశామని, అలాగే శిల్పామోషన్ రెడ్డి పై వ్యతిరేకతతో ఓటింగ్ ఇంత పెరగడానికి కారమణమని టీడీపీ నేత దినకర్ అన్నారు. ఎన్నికల్లో ఆశవాహుల్లో ఉంటారని, తమ నాయకుడు లక్ష యాభై వేల మందని మ్యాన్ టూ మ్యాన్ కలిశారని, టీడీపీ మూడున్నర సంవత్సరాల్లో చేసిన పనిని ప్రజలకు వివరించామని వైసీపీ నేత రాఘవరెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

19:30 - August 23, 2017
19:29 - August 23, 2017
19:26 - August 23, 2017
19:18 - August 23, 2017

హైదరాబాద్ : నంద్యాల ఉప ఎన్నిక ముగిసిందని ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ తెలిపారు. పోలింగ్ శాతం 82 శాతంగా నమోద అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో లైన్లో ఓటర్లు ఉంటే వారు ఓటు వేసేవరకు పోలింగ్ కొసాగుతుందని కమిషనర్ తెలిపారు. ఈ నెల 28న కౌటింగ్ జరుగుతుందని భన్వర్ లాల్ తెలిపారు.

18:37 - August 23, 2017
18:32 - August 23, 2017

వైసీపీ అధ్యక్షుడు జగన్ పై కేసు నమోదు

కర్నూలు : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలపై ఈసీ సిరియస్ గా స్పందించింది. ఈసీ ఆదేశంతో జగన్ పై నంద్యాల త్రీటౌన్ పీఎస్ ఐపీసీ 188, 504, 506 సెక్షన్లతో పాటు ప్రజాపాతినిధ్య చట్టం 125 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ముగిసిన నంద్యాల ఉపఎన్నిక పోలింగ్

కర్నూలు : జిల్లా నంద్యాల ఉపఎన్నిక ముగిసింది. ప్రస్తుతం క్యూలైన్లులో ఉన్న ప్రతిఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

18:23 - August 23, 2017

కర్నూలు : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలపై ఈసీ సిరియస్ గా స్పందించింది. ఈసీ ఆదేశంతో జగన్ పై నంద్యాల త్రీటౌన్ పీఎస్ ఐపీసీ 188, 504, 506 సెక్షన్లతో పాటు ప్రజాపాతినిధ్య చట్టం 125 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:22 - August 23, 2017

కర్నూలు : జిల్లా నంద్యాల ఉపఎన్నిక ముగిసింది. ప్రస్తుతం క్యూలైన్లులో ఉన్న ప్రతిఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 75శాతానికి పైగా పోలింగ్ జరిగినట్టు, పలు గ్రామల్లో 80 శాతం పైగా పోలింగ్ నమోదైనట్టు వారు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

17:52 - August 23, 2017

ఖమ్మం : 10టీవీ ఎస్టేట్‌ మేనేజర్‌ మధుసూదన్‌రెడ్డి అకాలమృతి చెందారు. ఇంట్లో మెట్లెక్కుతూ ఆయన కిందపడడంతో తలకు తీవ్రమైన గాయాల్యాయి. దీంతో ఆయనను విద్యానగర్‌లోని దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఆయన చనిపోయారు. మధుసూదన్‌రెడ్డి మృతి వార్త తెలుసుకున్న పలువురు ఆస్పత్రికి చేరుకుని నివాళులర్పించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు... పలువురు మధుసూదన్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అంత్యక్రియల కోసం మధుసూదన్‌రెడ్డి భౌతికకాయాన్ని ఖమ్మం తరలించారు. నేడు ఖమ్మంలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.

17:51 - August 23, 2017

ఢిల్లీ : తెలంగాణలోని విపక్ష నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. టీఎస్ ప్రభుత్వ ఆప్రజాస్వామిక విధానాలు, నేరెళ్ల ఘటన, దళితులపై దాడులు, ధర్నా చౌక్‌ ఎత్తివేత సమస్యలను రాష్ట్రపతికి దృష్టికి తెచ్చారు. నేరెళ్ల ఘటన జరిగి 50రోజులు దాటినా.. ఇప్పటివరకూ బాధ్యులపై చర్యలు తీసుకోలేదని వివరించారు. టీఆర్ఎస్ పార్టీ నేతల బంధువులు ఇసుక మాఫియాలో ఉన్నారంటూ ఫిర్యాదుచేశారు. దళితుల హక్కులపై జరుగుతున్న దాడుల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. సీపీఐ ఎంపీ డీ రాజా ఆధ్వర్యంలో చాడ వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎల్ రమణ, కోదండరాం, ఎమ్మెల్యే సంపత్‌తో కూడిన 12మంది నేతల బృందం రాష్ట్రపతిని కలిసి పలు అంశాలను వివరించారు.

17:49 - August 23, 2017

గుంటూరు : తాను టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని...... ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. జీవితాంతం బీజేపీలోనే ఉంటానని ప్రకటించారు. తన గెలుపుకోసం టీడీపీ, పవన్‌ కల్యాణ్ చాలా కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. ఈ నెల 26న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అమరావతిలో పర్యటిస్తారని... ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం తరపున ఆయనకు సన్మానం చేస్తామని తెలిపారు.

17:48 - August 23, 2017

ఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయం సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు దాడులు చేయడాన్ని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం ఖండించారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతుండగా... దాడులు జరిగాయని.. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తమ అభిప్రాయాలను చెప్పుకునే స్వేచ్ఛలేకుండా పోయిందని కోదండరాం విమర్శించారు. 

17:47 - August 23, 2017

హైదరాబాద్ : సెంట్రల్‌ యూనివర్సిటీలో రోహిత్‌ వేముల ఆత్మహత్యపై రూపన్‌వాలా కమిటీ నివేదిక విషయాన్ని తప్పుదోవ పట్టించిందన్నారు సెంటర్‌ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ నేతలు. హెచ్‌సీయూలో జరిగిన చర్చలో పలువురు వక్తలు మాట్లాడారు. రూపన్‌వాలా కమిటీ రిపోర్టును పార్లమెంట్‌ తిరస్కరించాలని డిమాండ్‌చేశారు. రూపన్‌వాలా కమిటీ రిపోర్టును దళిత సంఘాలు అంగీకరించవని సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ నేత మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. రూపన్‌వాలా కమిటీ రిపోర్టును నిషేధించి..కొత్త కమిటీనీ ఏర్పాటు చేసి నిజానిజాలను వెలికి తీయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త చుక్కారామయ్య తదితరులు మాట్లాడారు. 

17:46 - August 23, 2017

కర్నూలు : నంద్యాల నియోజకవర్గంలో ఈసారి భారీగా పోలింగ్‌ నమోదయ్యే అవకాశముందని... వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి అన్నారు..ఎన్టీవో కాలనీలో పోలింగ్‌ సరళిని ఆయన పర్యవేక్షించారు. ప్రతిపక్ష నేతలు కొందరు పోలింగ్‌ ప్రక్రియకు ఇబ్బంది కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామంలున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

17:44 - August 23, 2017

హైదరాబాద్ : సచివాలయం ముట్టడికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ప్రయత్నం చేశారు. అయితే జీహెచ్‌ఎంసీ కార్యాలయం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. తమను రెగ్యులరైజ్‌ చేయాలని.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. 

17:43 - August 23, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్‌ భారీగా నమోదవుతోంది. ఇప్పటివరకు 75 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. పోలింగ్‌ ముగిసేందుకు ఇంకా గంట సమయమే ఉండటంతో... పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. సాయంత్రం 6 తరువాత క్యూలైన్లలో ఉన్న వారందరికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఓటర్ల రద్దీతో సాయంత్రానికి పోలింగ్‌ 80శాతం మించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రైల్వేబోర్డు ఛైర్మన్ గా ఆశ్వనీ లోహని

ఢిల్లీ : రైల్వేబోర్డుకు కొత్త ఛైర్మన్ గా అశ్వనీ లోహని నియమితులయ్యారు. యూపీలో వరుస రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వేబోర్డు ఛైర్మన్ పదవికి ఏకే మిట్టల్ రాజీనామా చేసిన విషయం తెలీసిదే. ఎయిరిండియా సీఎండీగా బాధ్యతలు నిర్వహింస్తున్న అశ్వనీ లోహని రైల్వేబోర్డు బాధ్యతలు పుచ్చుకున్నారు.

 

17:10 - August 23, 2017


కర్నూలు : మరో గంటలో నంద్యాల ఉపఎన్నిక ముగుస్తుందనగా గాంధీ నగర్ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని వైసీపీ ఆందోళనకరు దిగింది. దీంతో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణకు దిగారు వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారి చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు పోలింగ్ భారీగా నమోదౌతోంది. సాయంత్రం 5గంటల వరకు 75 శాతం పోలింగ్ నమోద అయినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ప్రభుత్వం బేషరత్ గా క్షమాపణ చెప్పాలి:భట్టి

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రజాభిప్రాయ సేకరణలో టీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ నేతల అరెస్ట్ లను ఖండిస్తున్నామని, రైతుల పక్షాన ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం బేషరత్ గా క్షమాపణ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

 

బీసీసీఐ కార్యదర్శికి సుప్రీం నోటీసులు

ఢిల్లీ : బీసీసీఐ కార్యదర్శి, ఇద్దరు సభ్యులకు సుప్రీంకోర్టు నోటీసులు జారిచేసింది. లోధా కమిటీ సిఫార్సులు అమలు చేయనందుకు నోటీసులు జారీ చేసింది.

 

సబ్రీనా పై సైనా గెలుపు

హైదరాబాద్ : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫ్రీక్వార్టర్ ఫైనల్ లో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. రెండో రౌండ్ లో స్విట్జర్లాండ్ షట్లర్ సబ్రీనా పై సైనా విజయం సాధించింది. సబ్రీనా పై 21-11,21-12 తేడాతో సైనా నెహ్వాల్ గెలుపు కైవశం చేసుకుంది

కాచిగూడ బిగ్ బజార్ లో ప్రమాదం...

హైదరాబాద్ : కాచిగూడ బిగ్ బజార్ లో ప్రమాదం జరిగింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అభిరామ్ అనే మూడేళ్ల బాలుడు రైడర్ కార్ తో ఆడుకుంటూ ఎస్కలేటర్ నుంచి కిందపడ్డాడు. అభిరామ్ కు తీవ్ర గాయాలు కావడంతో లక్డికపూలోని లోటస్ ఆసుపత్రికి తరలించి వెరుగైన చికిత్స అందిస్తున్నారు. అభిరామ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మెరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

16:32 - August 23, 2017

కర్నూలు : నంద్యాల ఉపఎన్నికలో పోలింగ్ భారీగా నమోదౌతుంది. సాయంత్రం 3గంటల వరకు 60 శాతానికి పైగా పోలింగ్ నమోద అయినట్టు తెలుస్తోంది. టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఓటర్లను పోటాపోటిగా పోలింగ్ బుత్ లకు తరలిస్తుండడంతో ఓటర్లు పోలింగ్ సెంటర్ల వద్ద బారులు తీరారు. పోలింగ్ ముగిసేలోపు 80 శాతం దాటే అవకాశం ఉంది. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

16:27 - August 23, 2017

హైదరాబాద్ : నగరంలోని కాచిగూడ బిగ్ బజార్ లో సిబ్బంది నిర్లక్ష్యంతో మూడేళ్ల బాలుడు అభిరామ్ రైడర్ కార్ తో ఆడుకుంటూ ఎస్కలేటర్ నుంచి కిందపడ్డాడు. బాలునికి తీవ్రగాయాలు కావడంతో లక్డికపూల్ లోని లోటస్ ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ఆదిలాబాద్ : బోథ్ మండలం టివిటి సమీపంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతులను ధర్మేంద్ర(14), సాయి(13)గా గుర్తించారు.

కాంగ్రెస్ నేతల ఆరోపణల్లో పస లేదు:శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకోవాలని చూస్తోందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని, కేసీఆర్ కు పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్ తట్టుకోలేకపోతొందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణలో టీఆర్ఎస్ బల ప్రదర్శన అంటున్న కాంగ్రెస్ నేతల ఆరోపణల్లో పస లేదని విమర్శించారు. ప్రజల అండతో ఇప్పటికే బలవంతులుగా ఉన్నామని, ప్రత్యేకంగా బలప్రదర్శన చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

'తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘనా జరుగుతోంది'

ఢిల్లీ: సీపీఐ నేత డి.రాజా నేతృత్వంలో రాష్ట్రపతిని అఖిలపక్ష నేతలు కలిశారు. చాడ, ఉత్తమ్, ఉత్తమ్. ఎల్ రమణ టీఆర్ ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, నెరేళ్ల ఘటన దళితులపై దాడులు, ధర్నాచౌక్ ఎత్తివేత అంశాలను రాష్ట్రపతి కోవింద్ కు వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. నేరెళ్ల ఘటన జరిగి 50 రోజులు దాటినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ బంధువులు ఇసుక మాఫియాలో ఉన్నారని దళితులపై జరుగుతున్న దాడులపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరామని అఖిలపక్ష నేతలు తెలిపారు.

16:00 - August 23, 2017

ప్ర‌ముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగ‌జైన్ ఫోర్బ్స్ ప్ర‌తి ఏడాది అత్య‌ధిక పారితోషికం అందుకున్న న‌టుల జాబితాను విడుద‌ల చేస్తుంది. ఈ ఏడాది కూడా టాప్ 10 జాబితాను విడుద‌ల చేసింది. బాలీవుడ్ హీరోలు షారుక్‌ ఖాన్‌- 38 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.243 కోట్లు), సల్మాన్‌ ఖాన్‌- 37 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.237 కోట్లు), అక్షయ్‌కుమార్‌- 35.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.227 కోట్లు) లు 8,9, 10 స్థానాల‌లో చోటు దక్కించుకున్నారు. 68 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.435కోట్లు)తో మార్క్‌ వాల్‌బర్గ్ టాప్ పొజీష‌న్ లో ఉండ‌గా,దంగ‌ల్ చిత్రంతో దాదాపు 2000 కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టిన అమీర్ ఖాన్ ఇందులో లేక‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం. 2016 జూన్ 1 నుండి సేక‌రించిన నివేదిక ప్ర‌కారం ఫోర్బ్స్ ఈ జాబితాని విడుద‌ల చేసిన‌ట్టు తెలుస్తుంది.

డ్వెయిన్‌ జాన్సన్‌- 65 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.416 కోట్లు), విన్‌ డీజిల్‌- 54.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.349 కోట్లు), ఆడమ్‌ శాండ్లర్‌- 50.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.323 కోట్లు) , జాకీ చాన్‌- 49 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.314 కోట్లు), జూ.రాబర్ట్‌ డౌనీ- 48 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.307 కోట్లు), టామ్‌ క్రూజ్‌- 43 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.275 కోట్లు) లు 2,3,4,5,6,7 స్థానాల‌లో ఉన్నారు.

బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారు: జీవన్ రెడ్డి

హైదరాబాద్ : కాళేశ్వరం పై ప్రజాభిప్రాయ సేకరణ టీఆర్ఎస్ బలసమీకరణ కార్యక్రమంగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఒప్పంద పత్రాలపై బాధితులతో బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం నిర్వాసితుల పరిహారాన్ని తగ్గిస్తోందని విమర్శించారు.

 

15:28 - August 23, 2017

కర్నూలు : కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా నంద్యాల ఉప ఎన్నికను భావిస్తుండడంతో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. ఇరుపార్టీలు జనాన్ని భారీగా తరలిస్తున్నారు. దీంతో పోలింగ్‌ భారీగా నమోదవుతోంది. మధ్యాహ్నాం ఒంటి గంట వరకు 53శాతం పోలింగ్ నమోద అయినట్టు అధికారులు ప్రకటించారు. సాయంత్రానికి పోలింగ్‌ 80శాతం మించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

15:26 - August 23, 2017

ఢిల్లీ : కేంద్రరైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రాజీనామాకు సిద్ధపడ్డారు. ఈ రోజు ప్రధాని మోడీని కలిసిన ఆయన వరుస రైలు ప్రమాదాలు దురదృష్టకరని, తనకు బాధకలిగించాయని మోడీతో అన్నట్లు తెలుస్తోంది. ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనుకున్నట్లు మోడీ తెలిపారు. దీంతో ప్రధాని స్పందిస్తూ తొందరపడవద్దని సురేష్ ప్రభును వారించారు. మరోవైపు వినాయక చవితికి ముందే కేంద్ర కేబినెట్ మరోసారి వస్తరించే అవకాశం ఉందని తెలస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:22 - August 23, 2017

హీరో నందమూరి బాలయ్య, పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న " పైసా వసూల్ " చిత్రంలో ఇదో రీ-మిక్స్ సాంగ్. నాటి జీవిత చక్రం మూవీలో ఎన్టీఆర్, వాణిశ్రీలపై చిత్రీకరించిన " కంటి చూపు చెబుతోంది, కొంటె నవ్వు చెబుతోంది ఓ పిల్లా " పాటను రీ-మిక్స్ చేసి బాలకృష్ణ, ముస్కాన్‌ సేథీలపై షూట్ చేశారు. తండ్రి డ్యాన్స్‌‌లో బాలయ్య పూర్తిగా ఒదిగిపోయాడు. పైసా వసూల్ మూవీ యూనిట్ ఈ సాంగ్ వీడియోని రిలీజ్ చేసింది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నారు.

15:13 - August 23, 2017

ప్రముఖ దర్శకుడు, ఎపుడూ వివాదాల్లో వుంటూ తనకంటూ ఓ ముద్ర వేసుకున్న రామ్ గోపాల్ వర్మ.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావుపై కామెడీ చేశాడు. పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ నడుస్తున్న 'అర్జున్‌ రెడ్డి' సినిమా పోస్టర్లు చించేసిన హనుమంతరావు దుస్తులు చించెయ్యాలని.. ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండకు సూచించారు. అంత అందమైన అమ్మాయి తనను ఎప్పుడూ ముద్దు పెట్టుకోలేదని వీహెచ్‌ ఈర్ష్యపడుతున్నారా? అన్న వర్మ.. తాతయ్య వయస్సులో చిన్నపిల్లల చేష్టలేంటని ప్రశ్నించారు. అర్జున్‌ రెడ్డి… పోస్టర్‌లో తప్పేముందని మునవళ్లు, మనవరాళ్లు వీహెచ్ తాతయ్యను అడగాలంటూ సూచించారు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన వీహెచ్‌కు ఇలాంటివి ఎలా తెలుస్తాయన్న వర్మ.. మైండ్ సెంట్ మార్చుకోవాలని హితువు పలికారు. తాతయ్య వీహెచ్.. డబుల్ తాతయ్య అయిన అతడి పార్టీకి ఇప్పటి మనవళ్లు, మనవరాళ్లు ఓట్లు వేయరని వ్యాఖ్యానించారు'. అసభ్యకరంగా ఉందంటూ ఓ బస్సుకు అతికించిన అర్జున్‌ రెడ్డి సినిమా పోస్టర్‌ను హనుమంతరావు చించేసిన విషయం తెలిసిందే. వీహెచ్‌ పోస్టర్‌ చింపేస్తున్న ఫొటో వైరల్‌ అవడంతో పోస్టర్‌లోని నటుడు విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. ‘చిల్‌ తాతయ్యా’ అంటూ తన ఫేస్‌బుక్‌లో పోస్టర్ చించుతున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ కామెంట్లపై వీహెచ్‌ ఎలా స్పందిస్తారో.....

సీఎంను కలిసిన న్మార్మర్ ప్రతినిధుల బృదం

అమరావతి : నార్మన్ ఫాస్టర్ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు. సచివాలయం, హెచ్ వోడీల కార్యాలయ భవనాల నిర్మాణాల పై ప్రజెంటేషన్ సీఎంకు ఇచ్చారు. సెప్టెంబరు 13కల్లా తుది ఆకృతులు అందజేస్తామని న్మార్మన్ ఫాస్టర్ ప్రతినిధులు తెలిపారు.  

జగన్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి: మంత్రి సోమిరెడ్డి

కడప: సీఎం చంద్రబాబు పై జగన్ వ్యాఖ్యల పట్ల సీఈసీ స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి సోమిరెడ్డి అన్నారు. జగన్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, జగన్ ఉన్మాదిలా మారాడని, పార్టీని నడిపే నైతిక హక్కు జగన్ కు లేదని సోమిరెడ్డి ఆరోపించారు.

14:53 - August 23, 2017
14:52 - August 23, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా నంద్యాల ఉప ఎన్నికను భావిస్తుండడంతో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. ఇరుపార్టీలు జనాన్ని భారీగా తరలిస్తున్నారు. దీంతో పోలింగ్‌ భారీగా నమోదవుతోంది. సాయంత్రానికి పోలింగ్‌ 80శాతం మించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

జగన్ కు సీఈసీ నోటీసులు ఇవ్వడం చెంపపెట్టు:కాల్వ

కడప: జగన్ కు సీఈసీ నోటీసులు ఇవ్వడం చెంపపెట్టు అని మంత్రి కాల్వ శ్రీనివాస్ అన్నారు.ఓ పార్టీ అధ్యక్షుడికి సీఈసీ నోటీసులివ్వడం అదరు అని, తన మీడియా ద్వారా మంత్రులపై దుష్ర్పచారం చేసి మంత్రుల ప్రతిష్టను దిగజార్చారని మంత్రి కాల్వ శ్రీనివాస్ లు మండిపడ్డారు.

ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ లో ఉద్రిక్తత

పెద్దపల్లి : రాఘవాపూర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ లో ఉద్రిక్తత నెలకొంది. టిఆర్ ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. పరస్పరం కుర్చీలు విసిరేసుకోవడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల మధ్య ఎందుకు నిర్వహించడం లేదని నిర్వాసితుల తరుపున మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఆందోళన చేపట్టారు. శ్రీధర్ బాబును అరెస్ట్ చేసి పీఎస్ కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

14:42 - August 23, 2017

పెద్దపల్లి : జిల్లా ఉద్రిక్తత నెలికొంది. రాఘవపూర్ రెడ్డి ఫంక్షన్ హల్ లో కాళేశ్వరం ప్రాజేక్టు ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళ: మొదలైంది. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరిగి ఒకరిపై మరొకరు కూర్చీలు విసురుకున్నారు. నిర్వాసితుల తరుపున వచ్చిన కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబును పోలీసులు అరెస్టు చేశారు. శ్రీధర్ బాబును వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసంమ వీడియో చూడండి.

జైళ్ల శాఖ తో హిమాలమ డ్రగ్స్ కంపెనీ ఎంవోయూ

హైదరాబాద్ : తెలంగాణ జైళ్లలో ఔషధ మొక్కల సాగు చేసేందుకు హిమాలయ డ్రగ్స్ కంపెనీ ఎంవోయూ కుదుర్చుకుంది. చర్లపల్లి ఓపెన్ జైలులోని ఐదు ఎకరాల స్థలంలో ఔషధ మొక్కల పెంపకాన్ని చేపట్టున్నారు. దీంతో ఖైదీలకు పునరావాసం కల్పించేందుకు హిమాలయ కంపెనీతో ఒప్పందం కుదిరింది. దశల వారీగా సంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జైళ్లలో ఔషధ మొక్కల పెంపకం చేపట్టనున్నట్లు జైళ్ల శాఖ ఐజీ నర్సింహ తెలిపారు. హిమాలయ కంపెనీ ఆధ్వర్యంలో నగరంలో ఔట్‌లెట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

 

14:39 - August 23, 2017

ట్రిపుల్ తలాక్ చెల్లదు ఇది రాజ్యంగా విరుద్దం అని సుప్రీం తెలిపిందని అడ్వకేట్ పార్వతి గారు అన్నారు. తలాక్ విషయంలో ముస్లిం మహిళలు చాల నష్టపోతున్నారని, కొందరు ఫోన్ లో కొందరు మెయిల్ లో , కొందరు వాట్సప్ తలాక్ చెబుతున్నారని పార్వతి గారు అన్నారు. తనకు తెలిసి 15 దేశాల్లో ట్రిపుల్ తలాక్ కొంత వెసులుబాటు ఉందని ఆమె తెలిపారు. సుప్రీం తీర్పు ఆహ్వానించాల్సిన విషయమని ఆమె అన్నారు. మరింత సమాచారం వీడియో క్లిక్ చేయండి.

13:48 - August 23, 2017

హైదరాబాద్‌ : లకిడికపూల్‌ నిలోఫర్‌ ఆసుపత్రిలో.. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో ఏఐటీయూసీ  జనరల్‌ సెక్రటరీ నారాయణ రెడ్డి, స్టేట్‌ జనరల్ సెక్రటరీ హసీనా పలువురు ధర్నాలో పాల్గొన్నారు. నారాయణ రెడ్డి మాట్లాడుతూ 2 నెలల నుండి శానిటేషన్‌ వర్కర్స్‌, వార్డ్‌ బాయ్స్, మహిళలు, కాంట్రాక్ట్‌ నర్సులకు జీతాలు లేవు. సూపరింటెండెంట్‌ను అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని.. ఈ రోజు అన్ని పనులను నిలిపివేస్తామన్నారు. జీతాలపై హామీ ఇచ్చే వరకూ సమ్మె కొనసాగుతుందన్నారు. 

 

నేను జీవితాంతం బీజేపిలోనే ఉంటా: మంత్రి కామినేని

అమరావతి : నేను జీవితాంతం బీజేపిలోనే ఉంటానని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. టీడీపీలోకి వెళ్తున్నానన్న వార్తలు అవాస్తవమని మంత్రి కామినేని కొట్టిపారేశారు. నేను ఈ స్థాయికి రావడానికి బీజేపీ, వెంకయ్యనే కారణమని పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులను సస్పెండ్ చేయ్యాలని సీఎం చంద్రబాబు అదేశించారని కామినేని అన్నారు.

కరెంట్ షాక్ తో రైతు, గేదె మృతి

చిత్తూరు: విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యానికి జాన్ అనే రైతు, గేదె మృతి చెందారు. గేదెను పొలంలో మేపుతుండగా స్టే వైర్ తగిలి కరెంట్ షాక్ కొట్టడంతో గేదె, జాన్ అనే రైతు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో జాన్ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులంతా రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. ఈ ఘటన నారాయణవరం మండలం, తిరువట్టంలో చోటు చేసుకుంది.

13:46 - August 23, 2017

హైదరాబాద్‌ : నాంపల్లిలోని ఏపీపీఎస్సీ ముట్టడించేందుకు బీసీ సంఘాల నేతలు ప్రయత్నించారు. ఏపీలో గ్రూప్‌ 2 పరీక్షను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. బీసీ నేతలు ఏపీపీఎస్సీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం బీసీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి గోషామహల్‌ పీఎస్‌కు తరలించారు. దీంతో ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 

 

13:42 - August 23, 2017

సమోసా గిన్నిస్ బుక్ లో రికార్డు చోటు సంపాదించుకుంది. అంతే కాదు ఈ సమోసా గత రికార్డులను కూడా బద్దలు కొట్టిందట. వివరాల్లోకి వెళితే... లండన్ లోని ఓ మసీదు వద్ద కొందరు వలంటీర్లు ఈ అతిపెద్ద సమోసాను మంగళవారం తయారు చేశారు. 153.1 కిలోల బరువైన ఇది.. గతంలో ఇంగ్లండ్ లోని ఓ కాలేజీవారు తయారు చేసిన 110.8 కిలోల బరువైన సమోసా రికార్డును బద్దలు కొట్టేసింది. దీనికి గిన్నిస్ బుక్ రికార్డులవారు సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. ఇది చాలా టేస్టీగా ఉందని కితాబిచ్చారు. అసలు ఇంత పెద్ద సమోసా చేయగల్గుతామా అని మొదట సందేహించామని, అయినా వెనుకాడలేదని ఆర్గనైజర్ ఇస్లాం అన్నారు.

రైల్వేబోర్డు ఛైర్మన్ పదవికి ఏకే మిట్టల్ రాజీనామా

ఢిల్లీ: యూపీలో వరుస రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్త రైల్వేబోర్డు ఛైర్మన్ పదవికి ఏకే మిట్టల్ రాజీనామా చేశారు.

13:23 - August 23, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదు అయింది. 12 గంటల వరకు 39 శాతం పోలింగ్ దాటింది. పలు గ్రామాల్లో 40 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. సాయంత్రానికి 80 శాతం పోలింగ్ దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ సెంటర్ల దగ్గర ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు గంటలకొద్దీ నిరీక్షణ చేస్తున్నారు. ఓటు వేసేందుకు మహిళలు భారీగా క్యూలో నిల్చున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు వేయలేదని, మంచినీరు ఏర్పాటు చేయలేదని ఓటర్లు అంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల దగ్గర బారులు తీరారు. నంద్యాలలో గెలుపును టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుండడంతో ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఓటర్లను భారీగా తరలించే ఏర్పాట్లు చేస్తుండడంతో పోలింగ్‌ శాతం భారీగా పెరిగే అవకాశముంది. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌తో కలిపి మొత్తంగా 15మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. నియోజకవర్గం మొత్తాన్ని సమస్యాత్మకంగా భావిస్తుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  రాష్ట్ర పోలీసులు 3500 మంది, 10 కంపెనీల కేంద్ర బలగాలను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి నంద్యాలోని సంజీవనగర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటువేశారు. శిల్పాతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కలిసివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంలు మొరాయించడంతో పలుచోట్ల పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:21 - August 23, 2017

మార్కెట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఆకుకూరలో రాణి వంటిదని అంటారు. దీనిలో పెరుగు తోటకూర, ఎర్ర తోటకూర, కొయ్యితోటకూర, వంటి పలు రకాలు ఉన్నాయి. ఆకు కూరలలో పీచు పదార్థంతో ఐరన్, పలు రకాల పోషక విలువలు నిండి ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కెరోటిన్‌ అనే పదార్ధం సమృద్ధిగా ఉం టుంది. శరీరంలో కెరోటిన్‌ విటమిన్‌ 'ఎ'గా మారుతుంది. విటమిన్‌ 'ఎ' చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కళ్ళకు సరైన చూపును ఇస్తూ రేచీకటి రాకుండ కాపాడుతుంది.

రెగ్యులర్ గా తోటకూర తింటే రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది.

బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ ఆకుకూరను భుజించడం ఉత్తమం. పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికి తోడు కొవ్వును తగ్గిస్తుంది.

తోటకూర తక్షణశక్తినివ్వడంలో తోడ్పడుతుంది. కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివీ సమకూరుతాయి.

తోటకూరలోని 'విటమిన్‌ సి' రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక.. తలకు పట్టించుకుంటే మంచిది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే జుట్టు రాలదు. మాడు మీద చుండ్రు తగ్గుతుంది.

విటమిన్ల ఖని తోటకూర అని చెప్పవచ్చు. విటమిన్‌ ఎ, సి, డి, ఇ, కె, విటమిన్‌ బి12, బి6 వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు. ఇవన్నీ సమకూరుతాయి.వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీలశక్తి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ దొరుకుతాయి.

40% పోలింగ్

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ జరుగుతుంది. ఇప్పటి వరకు పలు గ్రామాల్లో 40 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. పోలింగ్ సెంటర్ల దగ్గర ఓటర్లు బారులు తీరి, గంటలకొద్దీ నీరీక్షణ చేస్తున్నారు. సాయంత్రానికి పోలింగ్ 80 శాతం దాటే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

 

13:07 - August 23, 2017
13:01 - August 23, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల దగ్గర బారులు తీరారు. 11 గంటల వరకు 33శాతం పోలింగ్‌ నమోదైంది. నంద్యాలలో గెలుపును టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుండడంతో ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఓటర్లను భారీగా తరలించే ఏర్పాట్లు చేస్తుండడంతో పోలింగ్‌ శాతం భారీగా పెరిగే అవకాశముంది. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌తో కలిపి మొత్తంగా 15మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. నియోజకవర్గం మొత్తాన్ని సమస్యాత్మకంగా భావిస్తుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  రాష్ట్ర పోలీసులు 3500 మంది, 10 కంపెనీల కేంద్ర బలగాలను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి నంద్యాలోని సంజీవనగర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటువేశారు. శిల్పాతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కలిసివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంలు మొరాయించడంతో పలుచోట్ల పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.

 

ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన బీసీ సంఘాలు..

హైదరాబాద్ : నాంపల్లిలోని ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని బీసీ సంఘాల ప్రతినిధులు ముట్టడించేందుకు యత్నించారు. ఏపీలో గ్రూప్ -2 పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న పలువురు నేతలను అరెస్టు చేసిన పోలీసులు వారిని గోషామహల్ కు తరలించారు.

సమగ్ర భూ సర్వే పై సీఎం కేసీఆర్ సమీక్ష...

హైదరాబాద్: సమగ్ర భూ సర్వే రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు, భూ రికార్డుల నిర్వహణపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా సమగ్ర భూ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. భూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్ విధానం పారదర్శకంగా, సరళంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు.

చికిత్స నిమిత్తం గాంధీకి చేరుకున్న గవర్నర్ నరసింహన్

సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వచ్చారు.

మున్సిపల్ జేఏసీ సమ్మె నోటీసుపై చర్చలకు సర్కార్ ఆహ్వానం...

హైదరాబాద్: మున్సిపల్ జేఏసీ సమ్మె నోటీసుకు సర్కార్ స్పందించింది. సా.6 గంటలకు మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏర్పాటు చేసిన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సమావేశం ఏర్పాటు చేశారు. హైదరబాద్ లో పెంచిన జీతాన్ని అమలు చేయాలని మున్సిపాలిటీ కార్పొరేషన్లలో కార్మికుల వేతనాలు పెంచాలని మున్సిపల్ జేఏసీ ఈ నెల 3న సమ్మె నోటీసు ఇచ్చింది.

12:23 - August 23, 2017

మంచిర్యాల : నాలుగు నెలల క్రితం మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలంలో.. సాగర్‌ కులాంతర వివాహం చేసుకున్నాడు. కానీ అమ్మాయి తరపు బంధువులు.. సాగర్‌ను కొట్టి అమ్మాయిని తీసుకెళ్లారు. తప్పించుకొని హైదరాబాద్‌ వెళ్లి.. తిరిగి ఆదివారం ఊరికి బయల్దేరిన సాగర్‌ కనిపించకుండాపోయాడు. సాగర్‌ తల్లి అతని కోసం తల్లడిల్లిపోతోంది. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:14 - August 23, 2017

భద్రాద్రి : జిల్లాలోని అశ్వరావుపేటలోని బాలికల బీసీ గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ అయ్యింది. ఉదయం పాలు తాగిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకుగురయ్యారు. దీంతో 14మంది బాలికలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. విద్యార్థినులు పాలు తాగిన వెంటనే శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. ఆయాసపడుతుండడంతో వారిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పాలల్లో బూస్ట్‌ కలిపి ఇచ్చామని వార్డెన్‌ చెబుతున్నారు.  ప్యాకెట్‌ పాలలో హిస్టజన్‌ శాతం ఎక్కువగా ఉండంతో బాలికలు శ్వాస తీసుకోవాడానికి ఇబ్బందిపడ్డారని వైద్యులు తెలిపారు. 

 

12:12 - August 23, 2017

అదిలాబాద్‌ : గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ బాపూజి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది.  ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. హైదరాబాద్‌లో మూడు, అదిలాబాద్‌లో రెండు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్‌, సోమాజిగూడ, బండ్లగూడ ప్రాంతాల్లో ప్లాట్‌ను కలిగి ఉన్నట్లు గుర్తించారు. బండ్లగూడలో రెండు కోట్ల విలువైన విల్లాను గుర్తించారు.

సచివాలయ ముట్టడికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల యత్నం.. అరెస్ట్

 

హైదరాబాద్: తమను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రయత్నించారు. జీహెచ్ ఎంసీ కార్యాలయం దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

తలోజు జైలు నుండి పురోహిత్ విడుదల

ముంబై: మాలేగావ్ పేలుళ్ల కేసులో బెయిల్ పై తలోజు జైలు నుండి కల్నన్ ప్రసాద్ పురోహిత్ విడుదలయ్యారు. తొమ్మిదేళ్ల పాటు పురోహిత్ జైలు శిక్ష అనుభవించారు.

12:06 - August 23, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి మూడు గంటల్లో 25శాతం పోలింగ్‌ నమోదయ్యింది. పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. ఓటు వేసేందుకు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పారామిలటరీ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.   నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 255 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు వెబ్‌క్యాస్టింగ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనల జరినా వెంటనే  తెలుసుకునేలా  ఏర్పాట్లు చేశారు. నంద్యాలలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి  ఓటుహక్కును వినియోగించుకున్నారు. నంద్యాల సంజీవ్‌నగర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశారు. మరోవైపు పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. నంద్యాలలోని ఎన్జీవో కాలనీలోని 94వ బూత్‌లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌ నిలిచిపోయింది. పాలిటెక్నిక్‌ కళాశాలలోని పోలింగ్‌ బూత్‌లోనూ ఈవీఎంలు మొరయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.

సిలిండర్ పేలి 15 మంది విద్యార్థులకు అస్వస్థత

మధ్యప్రదేశ్ : చింద్వారాలో అమ్మోనియం గ్యాస్ సిలిండర్ పేలి 15 మంది విద్యార్థులకు అస్వస్థత ఏర్పడింది.

జీవో 14 ప్రకారం వేతనాలు చెల్లించడం లేదనే ముట్టడి...

హైదరాబాద్: జీవో 14 ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని ప్రభుత్వ ఉద్యోగులపై నిర్బంధ పద్ధతులు అవలంభిస్తోందని, తమ సమస్యలు పరిష్కరించనందుకే ముట్టడి కార్యక్రమం చేపట్టినట్లు తెలంగాణ కాంట్రాక్ట్, ఓట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ తెలిపింది.

12:01 - August 23, 2017

కర్నూలు : ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి నాగమౌనిక పోలింగ్‌ బూత్‌లో హల్‌చల్‌ చేశారు. పోలింగ్‌ ఏజెంట్ల ఓటరుకార్డులు తీసుకుని వివరాలు చెప్పాలని అడిగారు. ఇంత తంతు జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోలేదు. దీంతో వైసీపీ కార్యకర్తలు నాగ మౌనికపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు నాగమౌనికపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

కెనడాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం

హైదరాబాద్ :కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎర్రగడ్డ లోని సూర్య కన్సల్టెన్సీ సుమారు వంద మందిని మోసం చేసింది. ఈ మేరకు బాధితులు సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష చొప్పున వసూలు చేసినట్లు బాధితులు వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు విన్నవించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

11:59 - August 23, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో 22శాతం పోలింగ్‌ నమోదయ్యింది. పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. ఓటు వేసేందుకు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పారామిలటరీ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.   నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 255 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు వెబ్‌క్యాస్టింగ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనల జరిగిన వెంటనే  తెలుసుకునేలా  ఏర్పాట్లు చేశారు. నంద్యాలలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి  ఓటుహక్కును వినియోగించుకున్నారు. పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. నంద్యాలలోని ఎన్జీవో కాలనీలోని 94వ బూత్‌లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌ నిలిచిపోయింది. పాలిటెక్నిక్‌ కళాశాలలోని పోలింగ్‌ బూత్‌లోనూ ఈవీఎంలు మొరయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.

 

11:56 - August 23, 2017

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్షనేత జగన్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. జగన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఈసీ పరిగణించింది. జగన్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని తెలిపింది. జగన్‌ వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఈసీ ఆదేశించింది. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదని జగన్‌ వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:53 - August 23, 2017

హైదరాబాద్: భారత దేశ చ‌రిత్ర‌లో తొలిసారి రూ.200 నోటును ప్ర‌వేశ‌పెట్ట‌డానికి జ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సిద్ధమైంది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌తదేశ చరిత్ర‌లో 100 నుంచి 500 మధ్య ఎలాంటి నోటు లేదు. అందుకే 200 నోటు మార్కెట్‌లో బాగా పాపుల‌ర్ అవుతుంద‌ని ఆర్బీఐ భావిస్తున్న‌ది. అందుకు త‌గిన‌ట్లే వాటి కొర‌త లేకుండా చూసుకుంటున్న‌ది అని ఆర్బీఐ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. సుమారు 50 కోట్ల 200 నోట్ల‌ను ఆర్బీఐ మార్కెట్‌లోకి తీసుకురానున్న‌ది. మార్కెట్‌లో ఈ నోట్ట‌కు కొర‌త లేకుండా, బ్లాక్ మార్కెట్‌కు త‌ర‌ల‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. మార్కెట్లోకి బ్యాంకుల ద్వారా విడుదల తేదీని కూడా నిర్ణయించేసింది. వారం, 10 రోజుల్లో ప్రజల దగ్గరకు వస్తాయని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారం విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

ఏసీబీ వలలో ఫుడ్ ఇన్సెపెక్టర్...

ఆదిలాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ బాపూజీ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్‌ పట్టణం ద్వారకానగర్‌లోని నివాసం, ఆహార భద్రత, ప్రమాణాల కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. రికార్డులను సీజ్‌ చేసి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఎనిమిది జిల్లాలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న బాపూజీని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు ఏసీబీ డీఎస్పీ పాపాలాల్‌ తెలిపారు. హైదరాబాద్ లో 3, ఆదిలాబాద్ జిల్లాలో 2 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

జగన్ పై కేసు నమోదుకు సీఈసీ ఆదేశం...

ఢిల్లీ: నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత, ఎమ్మెల్యే జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఏపీ సీఎంపై జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఎన్నికల సంఘం.. ఆయన పై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది. బాబును నడిరోడ్డుపై కాల్పినా తప్పులేదన్న జగన్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని సీఈసీ స్పష్టం చేసింది. జగన్ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. జగన్ వ్యాఖ్యలపై తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఈసీ ఆదేశాలిచ్చింది.

ప్రశాంతంగా కొనసాగుతున్న నంద్యాల పోలింగ్

కర్నూల్ : నంద్యాల నియోజకవర్గం ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 225 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే 37,236 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

ప్రేమ జంట ఆత్మహత్య....

నాగర్ కర్నూల్ : జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి సమీపంలోని గుట్ట వద్ద ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ప్రేమికులిద్దరూ చెట్టుకు ఉరేసుకున్నారు. యువతీయువకుడు నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

11:29 - August 23, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో 22శాతం పోలింగ్‌ నమోదయ్యింది. పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. ఓటు వేసేందుకు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పారామిలటరీ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.   నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 255 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు వెబ్‌క్యాస్టింగ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనల జరిగిన వెంటనే  తెలుసుకునేలా  ఏర్పాట్లు చేశారు. నంద్యాలలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి  ఓటుహక్కును వినియోగించుకున్నారు. పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. నంద్యాలలోని ఎన్జీవో కాలనీలోని 94వ బూత్‌లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌ నిలిచిపోయింది. పాలిటెక్నిక్‌ కళాశాలలోని పోలింగ్‌ బూత్‌లోనూ ఈవీఎంలు మొరయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై: నేడు స్టాక్‌మార్కెట్లు లాభాలతో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ మళ్లీ 9,800 మార్క్‌ను దాటింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 147 పాయింట్ల లాభంతో 31,439 వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 9,802 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

నీలోఫర్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన

హైదరాబాద్:నీలోఫర్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మూడు నెలలవుతున్నా జీతాలు చెల్లించడం లేదని విధులు బహిష్కరించి కార్మికులు ధర్నా చేపట్టారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.

తిరుప‌తి: తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ సాధార‌ణంగా ఉంది. 2 కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నారు. శ్రీవారి స‌ర్వ ద‌ర్శనానికి దాదాపు 3 నుంచి 4 గంట‌ల స‌మ‌యం ప‌డుతున్న‌ది. న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు దాదాపు 2 నుంచి 3 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది.

జగన్ అనుచిత వ్యాఖ్యల పై సీఈసీ ఆగ్రహం

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం లో సీఎం చంద్రబాబు పై వైసీపీ నేత జగన్ అనుచిత వ్యాఖ్యల పై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం ను నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదన్న జగన్ వ్యాఖ్యలను సీఈసీ తీవ్రంగా పరిగణించింది. జగన్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

14 బ్యాగుల్లో గంజాయి..5గురి అరెస్ట్....

రంగారెడ్డి: 14 బ్యాగుల్లో గంజాయి ని త‌ర‌లిస్తున్న వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘ‌ట‌న శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓఆర్ఆర్ పై జ‌రిగింది. బొలెరో వాహ‌నంలో ఓఆర్ఆర్ పై 14 బ్యాగుల్లో గంజాయిని త‌ర‌లిస్తుండ‌గా పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకొని.. గంజాయి త‌ర‌లిస్తున్న ఐదుగురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసి కేసు న‌మోదు చేశారు.

09:50 - August 23, 2017

కర్నూలు : నంద్యాలలో ఉప ఎన్నికకు పోలింగ్‌ మొదలైంది. ఓట్లు వేయడానికి ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నంద్యాల పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో పోలింగ్ ప్రారంభం కాలేదు. 117, 118, 121 కేంద్రాల్లోనూ పోలింగ్‌ ప్రారంభం కాలేదు. 121వ పోలింగ్‌ కేంద్రంలోని ఈవీఎంలో.. సాంకేతిక లోపం తలెత్తింది. 

 

09:47 - August 23, 2017

కర్నూలు : నంద్యాలలో ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల దగ్గర బారులు తీరారు. నియోజక వర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల పందొమ్మిది వేల నూట ఎనిమిది మంది ఉండగా, వీరిలో పురుషుల ఓటర్లు  లక్ష ఏడువేల ఏడువందల డెబ్బై ఎనిమంది ఉన్నారు. ఇక మహిళా ఓటర్లు లక్షా పదకొండు వేల పద్దెనిమంది ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో మొత్తం 255 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 171 పోలింగ్‌ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. సమస్యాత్మకమైనవి మరో 74 ఉన్నాయి. నంద్యాల అర్బన్‌లో 42 వార్డులుండగా వీటిలో 159 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నంద్యాల రూరల్‌లో మరో  57 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గోస్పాడు మండలంలో  39 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయగా...  28 వేల 844 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల్లో 1600 మంది సిబ్బంది ఉన్నారు. సా. 6 గంటల వరకు పోలింగ్‌
కొనసాగనుంది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 

 

నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ లో సిబ్బంది మృతి

కర్నూలు : నంద్యాల మండలం పోలూరులో పోలింగ్ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. 

నంద్యాలలో బారులు తీరిన ఓటర్లు

కర్నూలు : నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 2, 19 వేల 108 ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓటర్లు 1,07,778 మంది, మహిళా ఓటర్లు 1,11,018 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 250 మంది, ఇతరులు 62 మంది ఉన్నారు. మొత్తం 225 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

 

కొనసాగుతున్న నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్

కర్నూలు : నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 2, 19 వేల 108 ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓటర్లు 1,07,778 మంది, మహిళా ఓటర్లు 1,11,018 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 250 మంది, ఇతరులు 62 మంది ఉన్నారు. మొత్తం 225 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

 

నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో ప్రారంభంకాని పోలింగ్

కర్నూలు : నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో, 117, 118, 121 కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభం కాలేదు. మొత్తం 2, 19 వేల 108 ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓటర్లు 1,07,778 మంది, మహిళా ఓటర్లు 1,11,018 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 250 మంది, ఇతరులు 62 మంది ఉన్నారు. మొత్తం 225 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 

 

09:18 - August 23, 2017

కర్నూలు : నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో, 117, 118, 121 కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభం కాలేదు. మొత్తం 2, 19 వేల 108 ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓటర్లు 1,07,778 మంది, మహిళా ఓటర్లు 1,11,018 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 250 మంది, ఇతరులు 62 మంది ఉన్నారు. మొత్తం 225 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 

 

09:10 - August 23, 2017


కర్నూలు : నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 2, 19 వేల 108 ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓటర్లు 1,07,778 మంది, మహిళా ఓటర్లు 1,11,018 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 250 మంది, ఇతరులు 62 మంది ఉన్నారు. మొత్తం 225 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 141 అత్యంత సమస్యాత్మక, 74సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ప్రతి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలింగ్‌ కేంద్రం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. భద్రత కోసం 6 కంపెనీల పారా మిలటరీ బలగాలను ఉపయోగిస్తున్నారు. బైపోల్ కు 2500 పోలింగ్ సిబ్బంది, 3500 పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. తొలిసారి ఓటర్ వెరిఫైడ్ పేపర్, ఆడిట్ ట్రై, వీవీపీఏటీ యంత్రాలను వినియోగిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర పారామిలిటరీ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. ఆరు కంపెనీల కేంద్ర బలగాలు నంద్యాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాలన్నింటిలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. మూడు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:57 - August 23, 2017

ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ దినపత్రిక ఎడిటర వీరయ్య, బీజేపీ అధికారి ప్రతినిధి రఘునందన్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

08:50 - August 23, 2017

కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి కృష్ణారెడ్డి పాల్గొని, మాట్లాడారు. కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ను రెగ్యులరైజ్ చయాలని కోరారు. 'సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ కార్మిక ఉద్యోగ వర్గాలు కదం తొక్కుతున్నాయి. ఇదే డిమాండ్ పై ఇవాళ చలో సచివాలయం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. సమాన పనికి సమాన వేతనం అన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తే, తెలంగాణలో లక్షా 40వేల మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేలు జరిగే అవకాశం వుంది'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:43 - August 23, 2017

హైదరాబాద్ : 10టీవీ ఎస్టేట్‌ మేనేజర్‌ మధుసూదన్‌రెడ్డి కన్నుమూశారు. దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మదుసూదన్‌రెడ్డి నిన్న రాత్రి కన్నుమూశారు. సమాచారం తెలుసుకున్న పలువురు... ఆస్పత్రికి చేరుకుని నివాళులర్పించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు... పలువురు మధుసూదన్‌రెడ్డి కుటుంబానికి సంతాపం తెలిపారు. అంత్యక్రియల కోసం మధుసూదన్‌రెడ్డి భౌతికకాయాన్ని ఖమ్మం తరలించారు. 

08:42 - August 23, 2017

హైదరాబాద్ : పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ షాక్‌ ఇచ్చింది. గత నెల నిర్వహించిన గురుకుల పీడీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఓ సిరీస్‌లోని పరీక్షా పత్రంలో ఒక పేజీ మిస్‌ కావడంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వచ్చే నెల 7వ తేదీన మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే కమిషన్‌ తీరు పట్ల నిరుద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమిషన్‌ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాటుతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
గురుకుల పీడీ మెయిన్స్‌ పరీక్ష రద్దు 
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పట్ల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ టీఎస్‌పీఎస్సీ డొల్లతనం మరోసారి బయటపడింది. జులై 18న నిర్వహించిన గురుకుల పీడీ మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. రాత పరీక్ష నిర్వహణలో పొరపాట్లు జరిగాయని ఆలస్యంగా గుర్తించిన కమిషన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 
ఒక పేజీ లేకుండానే పరీక్ష నిర్వహణ 
జులై 17న నిర్వహించిన గురుకుల పీజీటీ, పీడీ పరీక్షలో.. ఓ సిరీస్‌ ప్రశ్నాపత్రంలో ఒక పేజీ లేకుండానే పరీక్ష నిర్వహించినట్లు టీఎస్‌పీఎస్సీ ఆలస్యంగా గుర్తించింది. దీంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షను సెప్టెంబర్‌ 7న తిరిగి నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. 
టీఎస్‌పీఎస్సీ తీరుపై అభ్యర్థుల నిరసన 
టీఎస్‌పీఎస్సీ తీరుపై అభ్యర్థుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. పరీక్ష రాసి కీ కోసం ఎదురుచూస్తున్న సమయంలో టీఎస్‌పీఎస్సీ పరీక్షను రద్దు చేయడం దారుణమంటున్నారు. టీఎస్‌పీఎస్సీ అధికారులకు చిత్తశుద్ది లేకుండా వ్యవహరించడం వల్ల తాము నష్టపోతున్నామని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయని... ఇప్పుడు పరీక్ష రాసి... ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో టీఎస్‌పీఎస్సీ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం దారుణమంటున్నారు. పరీక్షలు రాసి రిలాక్స్‌గా అవుతున్న సమయంలో పరీక్షను రద్దు చేసి అతి తక్కువ సమయంలో మళ్లీ పరీక్ష నిర్వహించడం వల్లే తాము అనేక విధాలుగా నష్టపోతామని అభ్యర్థులు వాపోతున్నారు. 
అభ్యర్థుల జీవితాలతో టీఎస్‌పీఎస్సీ చెలగాటం 
టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని నిరుద్యోగ జేఏసీ ఆరోపిస్తోంది. ఉద్యోగ పరీక్షలు నిర్వహించడం పట్ల చిత్తశుద్ది లేకపోవడం ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారంటున్నారు. ఇప్పటికైనా వీటిని గుర్తించి భవిష్యత్‌లో మళ్లీ పొరపాట్లు జరగకుండా చూడాలని అభ్యర్థులు కోరుతున్నారు. 

08:31 - August 23, 2017

విజయవాడ : ఏపీ ప్రభుత్వం జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం మడత పేచీలు పెడుతోంది. ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు, కేంద్రం ఇవ్వజూపుతున్న నిధులకు పొంతన లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే 2018 నాటికి పోలవరంను పూర్తిచేసి సాగు నీరు ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరుతుందా ? లేదా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈనెల 24న పోలవరంలో ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరుగునున్న నేపథ్యంలో 10 టీవీ ప్రత్యేక కథనం... 
పోలవరం... ఏపీ జీవనాడి
పోలవరం... ఏపీ జీవనాడి. కేంద ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా, నిధులు విడుదల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. దీంతో నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా ప్రాజెక్టు పూర్తి చేయడంపై నీలి నీడలు అలముకుంటున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి.  
వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం 
పోలవరంను వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2019 జూన్‌ నుంచి గురుత్వాకర్షణ శక్తి.. గ్రావిటీ ద్వారా సాగునీరు ఇవ్వాలని నిర్దేశించుకుంది. కానీ జరుగుతున్న పనులు చూస్తుంటే ఈ ప్రాజెక్టు  అనుకున్న లక్ష్యంగా ప్రకారం పూర్తయ్యే అవకాశంలేదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం  చేపట్టిన ఈ ప్రాజెక్టును ఆ తర్వాత కేంద్రం తీసుకుని నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. కానీ అనుకున్న ప్రకారం ప్రాజెక్టు ముందుకుసాగకపోవడంతో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుని నిర్మాణాలు కొనసాగిస్తోంది. ఇంతవరకు బాగానేవున్నా...  అసలు సమస్య అంతా నిధులతోనే వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసినంత ఖర్చును ఇస్తామని చెప్పిన కేంద్రం.. ఆతర్వాత ఏపీ పంపుతున్న ఖర్చుల వివరాలను చూసి విస్తుపోతున్న కేంద్ర నీటిపారుదల శాఖ అధికారులు కొర్రీలు వేస్తూ వస్తోంది.  దీంతో కేంద్రం నుంచి నిధులు సరిగా  అందకపోవడంతో రాష్ట్రమే ఖర్చు చేసుకుంటూపోతోంది. 
సవరించిన అంచనా వ్యయం రూ.58,319 కోట్లు 
పోలవరం అంచనా వ్యయం భారీగా పెరుగుతోంది. తాజా అంచనాల ప్రకారం 58,319 కోట్ల వ్యయం అవుతుందని రాష్ట్రం నివేదిక రూపొందించింది. పోలవరంకు ఇంత భారీ వ్యయమా.. అంటూ కేంద్రం నిలదీయడంతో సమాధానం చెప్పలేక రాష్ట్రం నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కొత్తగా నిధులు మంజూరు చేయాలంటే... గతంలో ఇచ్చిన నిధులకు లెక్కలు చూపాలని కేంద్రం కోరుతోంది. ఏయే పనులకు ఎంతెంత ఖర్చు చేశారో పక్కాగా లెక్కలు చూపుతూ నివేదికలు పంపాలని కోరుతోంది. 2014 ఏప్రిల్‌ 1 నాటికి ఎంత ఖర్చు అవుతుందో  అంచనాలు రూపొందించాలని  కేంద్రం ఆదేశించడంతో నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పుడు ఈ పనిలో బిజీగా ఉన్నారు. 
జల విద్యుత్‌ కేంద్రానికి నిధులు ఇవ్వబోమంటున్న కేంద్రం 
పోలవరం అంచనా వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. 2010-11లో సవరించిన అంచనాల ప్రకారం పోలవరం అంచనా వ్యయం 16,010.45 కోట్ల రూపాయలు. 2013-14 లెక్కల ప్రకారం ఇది 58 వేల కోట్లకు చేరింది. ఈ మూడేళ్లలో మరింతి పెరిగింది. పోలవరం జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని కేంద్రం చెబుతోంది. 2014 ఏప్రిల్‌ 1 నాటికి మిగిలివున్న పనులకు మాత్రమే జాతీయ ప్రాజెక్టు కింది నిధులు అందిస్తామని చెప్పి, నాబార్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ పూర్తి స్థాయి సమావేశం ఈనెల 24న పోలవరంలో జరుగనుంది. నిర్మాణ పురోగతితోపాటు అన్ని విషయాలపై ఆరోజు చర్చ జరుగుతుంది.   సవరించిన అంచనాల ప్రకారం నిధులు మంజూరు చేయాలా ? లేక పాత అంచనాల మేరకే నిధులు ఇవ్వాలా ? అన్న అంశం  అదేరోజు తేలే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పనులు చూస్తుంటే పోలవరం పూర్తవ్వాలంటే మరో మూడు, నాలుగేళ్లు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు. 
పోలవరం పనుల్లో పాదర్శకత లోపించిందన్న విమర్శలు 
పోలవరం పనుల్లో పాదర్శకత లోపించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించడంతో ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీతోపాటు పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ఈ పథకం పనులను పరిశీలించబోంది. నిధుల సమస్యను ఎలా తేలుస్తారో చూడాలి. 

 

08:24 - August 23, 2017

కరీంనగర్ : భారీ పోలీసుల బందోబస్తు మధ్య కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. పాలకపక్షం అగ్రనేతలు, అధికారపార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో భారీఎత్తున పాల్గొన్నారు. కరీంనగర్‌లో, పబ్లిక్‌ హియరింగ్ జరిగిన తీరుపై రైతు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.  

కాళేశ్వరం ,మేడిగడ్డ ప్రాజెక్టులపై కరీంనగర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సమక్షంలో నిర్వాసిత గ్రామాల ప్రజలు, నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గంగుల కమాలకర్‌, బొడిగేశోభ, రసమయి బాలకిషన్‌ తోపాటు ఎమ్మెల్సీ నారదాసు లక్షణరావు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుపడవద్దని నిర్వాసిత గ్రామాల ప్రజలను కోరారు.  

ప్రజాభిప్రాయం సేకరణ సభ మొత్తం అధికారపార్టీ కార్యక్రమంగానే ముగిసిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఓవైపు ప్రాజెక్టు పనులు జరుపుతూనే.. మరోవైపు అభిప్రాయాలు చెప్పలంటూ హడావిడి చేశారని అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రజాభిప్రాయ సేకరణపై నిర్వాసిత గ్రామాలకు సమాచారం  కూడా అందించక పోవడాన్ని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. 

మొత్తానికి భారీగా పోలీసుల మోహరింపు.. అధికారపార్టీ నేతల కనుసన్నలో .. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ప్రాజెక్టుకు అనుకూలంగానే మెజారిటీ ప్రజలు ఉన్నారని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. 

08:20 - August 23, 2017

కర్నూలు : నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 225 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 141 అత్యంత సమస్యాత్మక, 71 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. భద్రత కోసం 6 కంపెనీల పారా మిలటరీ బలగాలను ఉపయోగిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఓటు హక్కు వినియోగించుకున్న ఎస్పీవైరెడ్డి

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల్లో గాంధీనగర్ పోలింగ్ కేంద్రంలో ఎస్పీవైరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

 

నంద్యాల బైపోల్ పోలింగ్‌ ప్రారంభం

కర్నూలు : నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 225 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 

క్యాట్ జడ్జిగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కాంతారావు

హైదరాబాద్ : క్యాట్ జడ్జిగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కాంతారావు నియమించారు. నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. 

 

06:35 - August 23, 2017

కర్నూలు : కాసేపట్లో నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 225 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 141 అత్యంత సమస్యాత్మక, 71 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. భద్రత కోసం 6 కంపెనీల పారా మిలటరీ బలగాలను ఉపయోగిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

కాసేపట్లో నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్‌

కర్నూలు : కాసేపట్లో నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

06:31 - August 23, 2017

యూపీ : ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. అరియా వద్ద ఖైఫియత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు 6 బోగీలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 40 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 2 గంటల 40 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

యూపీలో పట్టాలు తప్పిన రైలు

యూపీ : ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. అరియా వద్ద ఖైఫియత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు 6 బోగీలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 40 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. 

Don't Miss