Activities calendar

24 August 2017

21:49 - August 24, 2017

బెంగళూరు : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకడైన నందన్ నీలేకని తిరిగి మాతృ సంస్థలో చేరిపోయారు. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్‌గా ఆయన్ను నియమించారు. సిఈఓ పదవికి విశాల్ సిక్కా రాజీనామాతో ఇన్ఫోసిస్ తీవ్ర సంక్షోభంలో పడిపోయిన నేపథ్యంలో నందన్ నీలేకని నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది. సంస్థ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆరోపణలతో కలత చెంది రాజీనామా చేసినట్లు సిక్కా గత వారం ప్రకటించారు. మరోవైపు ఇన్ఫోసిస్ బోర్డ్ సభ్యులైన శేషసాయి, విశాల్ సిక్కా, రవి వెంకటేశన్ కూడా తమ పదవుల నుంచి తప్పుకున్నారు.

21:48 - August 24, 2017

హైదరాబాద్ : ఏపీ ఐపీఎస్‌ అధికారి సునీల్‌ కుమార్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. సునీల్ కుమార్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నడంటూ ఆయన భార్య అరుణ హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయనపై 498 ఏతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సునీల్‌ కుమార్ ప్రస్తుతం ఏపీ సీఐడీలో ఐజీగా పనిచేస్తున్నారు.

21:47 - August 24, 2017

హైదరాబాద్ : నాంపల్లి కోర్టులో అనంతపురం ఫ్యాక్షనిస్టు మద్దెల చెరువు సూరి హత్య కేసు విచారణ కీలక దశకు చేరింది. ఈ కేసులో కీలకసాక్షిఅయిన సూరి డ్రైవర్‌ మధుమోహన్‌ రెడ్డి వాంగ్మూలం, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టును తెలంగాణ సీఐడీ పోలీసులు కోర్టుకు సమర్పించారు.. డ్రైవర్‌ చెప్పిన వివరాలప్రకారం హత్య జరిగిన విధానాన్ని నివేదికలో పొందుపరిచారు.. అటు ఫోరెన్సిక్‌ రిపోర్టులో పాయింట్‌ బ్లాంక్‌లో సూరిప కాల్పులు జరిగాయని తేలింది.. దీనిని కూడా కోర్టు ముందుంచారు.

21:47 - August 24, 2017

హైదరాబాద్ : కాళోజీ, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాల్లో మెడికల్ సీట్ల భర్తీ అంశంపై కొంతకాలంగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు విశ్వవిద్యాలయాల్లో సీట్లను జాతీయ మెడికల్ కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన ఆదేశాలను తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. దీనిని సవాల్ చేస్తూ ఇరు రాష్ట్రాలకు చెందిన 17 మంది అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

కోర్టులలో సుదీర్ఘ వాదనలు
ఆర్టికల్ 371 డి ప్రకారం కాళోజీ సీట్లను 85 శాతం తెలంగాణ అభ్యర్ధులతో, 15 శాతం సీట్లను ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులతో భర్తీ చేయాలని.. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో 85 శాతం స్ధానికులతో 15 శాతం తెలంగాణ అభ్యర్థులతో భర్తీ చేయాలని అభ్యర్ధులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులు సుదీర్ఘ వాదనలు జరిగాయి. చివరికి సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ ద్వారానే మెడికల్ సీట్లను భర్తీ చేయాలని హైకోర్టు సూచించింది. రాష్టాలకు కౌన్సిలింగ్ చేసే విధంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెడికల్ సీట్లపై రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలన్న అభ్యర్ధుల వాదనను హైకోర్టు తోసిపుచ్చడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని బాధితులు చెబుతున్నారు. మరి అక్కడైనా బాధితులకు న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి. 

21:45 - August 24, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మిషన్‌ భగీరథ జీవన్మరణ సమస్య అని... అధికారులు ఈ ఏడాది డిసెంబర్ నాటికే పనులు పూర్తి చేసి... గ్రామాలకు నీరు అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మిషన్ భగీరథపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ... ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 43 వేల కోట్ల వ్యయంతో... దేశంలో మరెక్కడా లేని విధంగా మిషన్ భగీరథను చేపట్టామని..ఇకపై తానే స్వయంగా కార్యక్షేత్రాలను సందర్శిస్తానని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అదేవిధంగా నిరంతరం పనులను సమీక్షించాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలని కోరారు.

21:44 - August 24, 2017

గుంటూరు : రైతులకు మూడో విడత రుణమాఫీ కింద 3వేల 6వందల కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి చెప్పారు. త్వరలోనే వాటిని రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. రుణమాఫీ అంశంలో టెక్నికల్ సమస్యల కారణంగా అర్హత ఉండి రాని 7వేల 7 వందల 93 ఖాతాల్లో 18 కోట్ల 87 లక్షలు రిలీజ్ చేసినట్లు సోమిరెడ్డి చెప్పారు. 

21:42 - August 24, 2017

కర్నూలు : ఉప ఎన్నిక పూర్తయినా ఇంకా నంద్యాలలో పొలిటికల్‌ వార్‌ కొనసాగుతూనే ఉంది.. నంద్యాలలోని సూర‌జ్‌గ్రాండ్ స‌మీపంలోని టీడీపీ, వైసీపీ వర్గాలమధ్య ఘర్షణ స్థానికుల్ని హడలెత్తించింది.. గురువారం వైసీపీ కార్యకర్త బాషా కుటుంబాన్ని పరామర్శించేందుకు శిల్పా చక్రపాణి రెడ్డి వారి ఇంటికి వెళ్లారు.. తిరిగి వస్తుండగా.. టీడీపీ నేత అభిరుచి మధు వాహనం ఎదురుపడింది.. ఇరుకు రోడ్డు కావడంతో రెండు వాహనాలు ఆగిపోయాయి.వెనక్కితీసేందుకు ఒప్పుకోని ఇద్దరు నేతలు.. పరస్పరం వాగ్వాదానికి దిగారు.. దీంతో ఆగ్రహించిన శిల్పా అనుచరులు... మధు కారుపై దాడి చేశారు.. రాళ్లు రువ్వి, కారు అద్దాలు ధ్వంసం చేశారు.. వాహనంలోనుంచి మధును బయటకు లాక్కువచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మధును కాపాడేందుకు ఆయన గన్‌మెన్‌ వెంటనే గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.. ఇదే సమయంలో ప్రాణరక్షణ కోసం మధు అక్కడే ఉన్న కొబ్బరి బోండాల దుకాణంలోనుంచి ఓ కత్తి తీసుకునిప్రత్యర్థులపై దూసుకు వెళ్లాడు. ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుతున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేశారు.. రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

చక్రపాణిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
తర్వాత నంద్యాల రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన మధు... శిల్పా చక్రపాణి రెడ్డి, ఆయన అనుచరులు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు.. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు శిల్పా చక్రపాణి రెడ్డితోపాటు మరో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు..శిల్పా చక్రపాణి రెడ్డి పక్కా ప్లాన్‌తో తనపై ఎటాక్ చేయించారని మధు ఆరోపించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పారు..మధు ఆరోపణలపై వైసీపీ నేత వైసీపీ నేత శ్రీకాంత్‌ రెడ్డి సీరియస్‌గా స్పందించారు... ఎన్నికల కోడ్ వచ్చాక.. లైసెన్స్‌ ఉన్న తుపాకులన్నీ పోలీస్‌ స్టేషన్‌లో డిపాజిట్‌ చేయాలన్న ఆదేశాలుంటే.. మధు వర్గీయుల దగ్గర గన్‌ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.. పైగా 4 వాహనాల్లో కత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ తరపున భూమా బ్రహ్మానంద రెడ్డి, వైసీపీ నుంచి శిల్పా మోహన్‌ రెడ్డి పోటీ చేశారు.. ఈ నెల 28న ఈ ఎన్నిక ఫలితం తేలనుంది.. తాజా ఘటన నేపథ్యంలో.. కౌంటింగ్‌ తర్వాత.. ఇరు వర్గాల మధ్య ఘర్షణాత్మక వైఖరి మరే స్థాయిలో ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఇరు వర్గాలను గట్టిగా నియంత్రించాలని కోరుతున్నారు. 

21:40 - August 24, 2017

ఢిల్లీ : వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. చీఫ్‌ జస్టిస్‌ ఖేహార్‌ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ప్రైవసీ ప్రాథమిక హక్కేనంటూ ఏకగ్రీవంగా తేల్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కిందకే వస్తుందని స్పష్టం చేసింది. 1954, 1962లో గోప్యతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తుత ధర్మాసనం కొట్టి పారేసింది.ఆధార్‌ కార్డు వ్యక్తిగత వివరాలను తెలుపుతుంది కనుక సుప్రీం కోర్టు తీర్పుతో ఇకపై ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ కార్డును జతచేయాలా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందే కానీ...ఆధార్‌ అనుసంధానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ చెప్పారు. ఆధార్‌ అనుసంధానికి సంబంధించి ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ నిర్ణయిస్తుందన్నారు.

తీర్పుపై సిపిఎం హర్షం
వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సిపిఎం స్వాగతించింది. సుప్రీంకోర్టు తీర్పు మంచి పరిణామమని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మోదీ ప్రభుత్వం..వ్యక్తిగత గోప్యత హక్కును కాలరాయడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. వ్యక్తిగత గోప్యతపై చర్చ జరగడం ఇదే తొలిసారి కాదు. వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా రాజ్యాగం పేర్కొనలేదని 1954లో ఎంపి శర్మ కేసులో 8 మంది సభ్యుల ధర్మాసనం, 1962లో ఖారక్‌సింగ్‌ కేసులో ఆరుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ పథకాలకు కేంద్రం ఆధార్‌ అనుసంధానం చేయడంతో మరోసారి ఈ ప్రశ్న తలెత్తింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 21 పిటిషన్లు దాఖలయ్యాయి.

9 మందితో కూడిన ధర్మాసనం
వ్యక్తిగత గోప్యతపై గతంలో తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని విస్త్రతమైన రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించాల్సిన అవసరం ఉందని ఇంతకుముందు అటార్నీ జనరల్‌గా ఉన్న ముకుల్‌ రోహత్గీ కోర్టుకు నివేదించారు. దీంతో తొమ్మిది మంది న్యాయమూర్తులతో విస్త్రత రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. 9 మంది ధర్మాసనంలో చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌తో పాటు.. న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్‌, ఎస్‌ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్‌, ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, ఆర్‌కే అగర్వాల్‌, రోహిన్‌టన్‌ ఫాలీ నారీమన్‌, అభర్‌ మనోహర్‌ సాప్రే, సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ఉన్నారు. దీనిపై 7 రోజుల పాటు వాదనలు విన్న ధర్మాసనం ఆగస్టు 2న తీర్పును రిజర్వ్‌ చేసింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని తీర్పు వెలువరించింది.

ఇన్ఫోసిస్ చైర్మన్ గా నందన్ నీలేకని

బెంగళూరు : ఇన్ఫోసిస్ చైర్మన్ నూతన చైర్మన్ గా నందన్ నీలేకని నయామితులయ్యారు. ఇన్ఫోసిస్ బోర్డు నుంచి ఆర్.శేషసాయి, విశాల్ సిక్కా, రవి వెంకటేశన్ వైదొలిగారు.

 

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

మహారాష్ట్ర : నాందేడ్ జిల్లా వన్నాలిపాట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు, 11 మందికి గాయాలయ్యాయి. బస్సు దెగ్లూర్ నుంచి నందేడ్ వెళ్తుడంగా ప్రమాదం జరిగింది. 

20:16 - August 24, 2017

వ్యక్తిగత గోప్యత ఇఫ్పుడు ప్రాధమిక హక్కు..అవును సుప్రీం తేల్చేసింది. గల్లా పట్టుకుని వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తే, కుదరదంటోంది. మరి కొన్నేళ్లుగా కేంద్రం పౌరుల వ్యక్తిగత వివరాలు చుట్టూ చేస్తున్న హడావుడి సంగతేంటి?బ్యాంక్ ఎకౌంట్ నుంచి గ్యాస్ కనెక్షన్, పాన్ కార్డ్, ఆఖరికి మొబైల్ సిమ్ వరకు కస్టమర్ జాతకాన్ని చేతిలో పెట్టాల్సిందే అంటూ సాగుతున్న నిబంధనల సంగతేంటి? ఆధార్ కార్డ్ పై కేంద్రం ఇచ్చే బిల్డప్ ని సుప్రీం తిప్పికొట్టిందా? ఇదే ఈ రోజువైడాంగిల్ స్టోరీ..వ్యక్తిగతం అంటూ ఏదీ లేదంటూ సాగుతున్న సర్కారీ తీరుకు ఇది నిజంగా ఎదురుదెబ్బే అని చెప్పాలి. పైగా ఆధార్ పేరుతో సాగుతున్నది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కాదని సర్కారు చెప్పుకుంటోంది.. పైగా రాజ్యాంగం వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదని కూడా అడ్డంగా వాదిస్తోంది. ఈ పరిణామాలు ఎటు దారితీయనున్నాయి. ఇప్పటికే అన్నిటికీ ఆధార్ తో లింక్ చేస్తున్నారు. చేయని వాళ్ల మొబైల్ కు రోజూ మెసేజ్ లు, కాల్స్ వస్తున్నాయి. ఆధార్ ని మెళ్లో కట్టుకోకపోతే తప్ప బతకలేనట్టు పరిస్థితి మారుతోంది. ఈ పరిణామాల మధ్య సుప్రీం తీర్పు ఆసక్తికరంగా మారింది. ఇది ఇప్పటికే ఇచ్చిన ఆధార్ లింక్ ను, భవిష్యత్తులో చేయబోయేవాటిని ప్రభావితం చేస్తుందా?ఆధార్ ఆలోచన వచ్చిన నాటినుంచి దాని చుట్టూ అనేక విమర్శలు. కానీ ఇప్పటికే వందకోట్లమందికి పైగా ఐరిస్ స్కాన్స్ ని, వేలిముద్రల్ని ఆధార్ డేటాబేస్ తో అనుసంధానం చేశారు. బ్యాంకు ఖాతా తెరవడానికి, సంక్షేమ పథకాల లబ్ది పొందడానికి, టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి, చివరకు పదిరూపాయలు నగదు లావాదేవీ జరపడానికి కూడా ఆధార్ ను తప్పనిసరి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పరిస్థతిలో మార్పు వస్తుందా? ఇదే కొనసాగితే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగే అవకాశాలున్నాయా?

 

20:13 - August 24, 2017

నంద్యాల ఉప ఎన్నికలళ్ల ఎవ్వలో గెలుస్తరో తెల్సిందా..? నాకు తెల్సిపోయింది అంటున్నడు రాజకీయ సన్నాశి శ్రీ లగడపాటి రాజగోపాల్ సారూ.. సర్వే జేపిచ్చిన మొత్తం లెక్కలన్న దీపిచ్చిన.. ఎన్నికల ఫలితాల కంటె ముందే ఎవ్వలు గెలుస్తున్నరో పశిగట్టేశినా అంటున్నడు.. మరి మీకు గూడ తెల్సుకోలనున్నదా..? నంద్యాల కాడ ఎవ్వలు గెలుస్తరనేది..? సూడుండ్రి..

సమగ్ర కుటుంబ సర్వే అయిపోయింది ఫలితాలు ఏరులై పారుతున్నయ్ తెలంగాణల.. ఇగ ఇప్పుడు ఇంకో సర్వేనటనుల్లో.. అదే భూముల సర్వే.. తెలంగాణల ఏ రైతు తాన ఎంత భూమున్నది..? ఎవ్వలి సర్వేనెంబర్ ఎంత..? ఎవ్వలిది పోరంబొక్కు.. ఎవ్వలిది..? పట్టభూమి అనేది లెక్కలు దీశి పక్కా జేస్తడట ముఖ్యమంత్రి కేసీఆర్ సారు.. సూడుండ్రి ఆ లెక్కల తమాష..

హురక తెలంగాణ భూముల లెక్కలే అనుకున్న విద్యాశాఖ లెక్కలు గూడ దీయవోతున్నరట వచ్చెనెల ఒక్కటి తారీఖు సంది..? ప్రైవేటు బడులళ్ల సద్వెపోరగాళ్లెంత మంది.?. వాళ్లకు సద్వుజెప్పెటోళ్లు ఎంతమందున్నరు..? సర్కారు బడిగానీ.. ప్రైవేటు బడి టీచర్లు గానీ.. కచ్చితంగ టీచర్ ఎలిజిబులిటీ టెస్టు పాసైనోళ్లే ఉండాలే అన్న నిబంధన మీద జేస్తరట..

చెర్కు రైతుల రుణాలు మాఫీ జేశే ముచ్చట ముఖ్యమంత్రి గారికి చెప్పిచెప్పి చెప్పి యాస్టొస్తున్నది అంటున్నడు ముఖ్యమంత్రి గారి బిడ్డె దేవనపల్లి కవితమ్మ.. రాష్ట్రంల నడుస్తున్నదే మీ నల్గురి ముచ్చటనాయే.. ఇగ బిడ్డమాట తండ్రే ఇనకపోతె మరి..? ఇగ జనం మాట ఏడ ఇంటడు శెల్లే..? జర్ర సముదాయించి చెప్పిసూడకపోయినవ్..?

లోకంల అనేక కళలుంటయంటరు.. మరి అండ్ల దొంగతనం గూడ ఒక కళకిందకే వస్తుండొచ్చు.. వస్తుండొచ్చేంది... బాజప్తొస్తది.. అయితే దొంగతనం జేయాల్నంటే గూడ.. కళఉండాలే.. దొర్కిపోయే తీర్గ ఉండొద్దు.. సగం సగం కోర్సు నేర్చి పొయ్యి దొంగతనం జేస్తె.. ఈజీగ దొర్కిపోతరు.. పూనెం లచ్చినారిగానిలెక్క.. అగో వీడెవ్వడనుకుంటున్నరా..? సూడుండ్రి వాడే సౌట దొంగ..

నమ్మితిరా శివ్వా అంటే ముంచితినే అవ్వా అన్నట్టు జేశిండు ఒకడు.. పాపం రూపాయి రూపాయి కుడవెట్టి ఒకనితాన చిట్టీలేస్కున్న పేదోళ్లకు పెద్దటోపే వెట్టిండు జగిత్యాల పట్నంల ఒకడు.. పాపం కట్టినోళ్లంత కూలినాలి జేస్కోని బత్కెటోళ్లేనట.. పాపం మస్తు బాధపడ్తున్నరు.. చిట్టీల వ్యాపారి కుచ్చుటోపి ముచ్చట జూడుండ్రి..

ఒక్కటే దావఖాండ్ల ఒక్కటే యాళ్లకు రెండు కాన్పులైనయ్.. ఇద్దరికి ఆడివిల్లలే వుట్టిండ్రు.. మరి ఒకలి తల్లి గన్న బిడ్డెను.. ఇంకో తల్లికి.. ఇంకో తల్లి గన్న బిడ్డను ఇంకోతల్లికి ఇస్తె..? ఎంత పరేషాన్ అయితది..? అదే పొరపాటు అయ్యింది విజయనగరం జిల్లాల.. కన్పుకొచ్చినోళ్లకు కన్నబిడ్డలను మార్చి ఒకరి పిల్లను ఒకరికిచ్చిండ్రు.. 

20:05 - August 24, 2017

విజయనగరం: పట్టణంలో మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ సమితి, స్పార్క్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాల బదులుగా మట్టి వినాయకుడి విగ్రహాలను పూజించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. దీనివల్ల భగవంతుని ఆరాధనతో పాటు.. పర్యావరణ పరిరక్షణ జరుగుతందన్నారు. స్వాతంత్ర్య సమర యోధుడు బాలగంగాధర్‌ తిలక్‌.. ప్రజల ఐక్యత కోసం వినాయక వేడుకలను ఆరంభించారని గుర్తు చేశారు.

 

20:04 - August 24, 2017

హైదరాబాద్‌ : నగరంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ఊపందుకుంది. జీహెచ్‌ఎంసీ ఈ ఏడాది 2 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తోంది. వివిధ సంస్థలు పెద్ద ఎత్తున మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాలు చేపట్టాయి. ఇందిరా పార్క్‌ వద్ద ఎమరాల్డ్‌ ఆధ్వర్యంలో.. మట్టి విగ్రహాలను జీహెచ్‌ఎంసీ మేయర్‌ సతీమణి శ్రీదేవి.. స్థానిక కార్పొరేటర్లతో కలిసి పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాలుష్యం చేసే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసిన విగ్రహాలను కాకుండా.. మట్టి విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. 

20:03 - August 24, 2017

తూర్పుగోదావరి : వినాయక చవితి కోసం.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోని కళాకారుడు ఈశ్వర్‌ సృష్టించిన స్వాతంత్ర్య గణపతి అందరిని ఆకర్షిస్తోంది. మనకు స్వతంత్ర్యం సిద్ధించడానికి పోరాడిన దేశభక్తులను వినాయకుని చెంతన చేర్చి స్వతంత్ర్య గణనాధున్ని తయారు చేశారు. కేవలం మూడు అంగుళాల పాలవెల్లితో పాటు దాంట్లో అతి చిన్నవైన సహజ పండ్లు, భగవద్గీతతో పాటు ఉండ్రాళ్లతో పూర్తిగా మట్టితోనే తయారు చేశాడు. దీంతో ఈ గణనాధుని రూపొందించిన ఈశ్వర్‌లోని సృజనాత్మకతకు, కళానైపుణ్యానికి భక్తులు ముగ్ధులవుతున్నారు.

20:02 - August 24, 2017

అనంతపురం : జిల్లా శింగనమలలో గాజుల గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. పామిడికి చందిన ఎమ్మెస్సీ విద్యార్థి నాగతేజ..20 రోజుల పాటు శ్రమించి గాజుల గణపతిని రూపొందించాడు. విగ్రహ తయారీ కోసం 75 వేల రూపాయలు వెచ్చించినట్లు చెబుతున్నాడు. గాజుల గణపతిని పర్యావరణానికి హాని కలిగించని విధంగా తీర్చిదిద్దినట్లు చెబుతున్నాడు.

 

20:01 - August 24, 2017
20:00 - August 24, 2017

సిద్దిపేట : పట్టణంలో అమర్‌నాధ్‌ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక చవిత సందర్భంగా మట్టివినాయకులను మంత్రి హరీష్‌రావు పంపిణీ చేశారు. ప్రకృతిని కాపాడాల్సిన బాద్యత మనందరిపై ఉందని మంత్రి హరిష్‌ రావు అన్నారు. పెద్ద పెద్ద రంగుల విగ్రహాలను పెట్టి పర్యావరణాన్ని దెబ్బతీయోద్దని.. భక్తి శ్రద్ధలతో వినాయకుడికి పూజలు చేయాలని అన్నారు.

19:50 - August 24, 2017

తూర్పుగోదావరి : అయినవిల్లి వరసిద్ధ వినాయక ఆలయం... ఉత్సవాలకు సిద్ధమైంది. వినాయక చవితి పండుగ సందర్భంగా.. ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పండుగ రోజు ప్రత్యేక పూజలు.. నిర్వహణకు అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం అనేక సౌకర్యాలు కల్పించారు. ఇప్పటికే టెంట్‌లు.. క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయంలో వినాయక చవితి తొమ్మిది రోజులు నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వివిధ రకాల పండ్ల రసాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించనున్నారు.

కొబ్బరికాయల మొక్కులు
అయినవిల్లిలోని వరసిద్ధ వినాయక ఆలయానికి ప్రత్యేక పేరు ఉంది. ఇక్కడ సిద్ధి వినాయకుడిని తలచుకుని ఏ శుభకార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ మొక్కుకుంటే... కచ్చితంగా అది తీరుతుందని భక్తులు విశ్వసిస్తారు. కోర్కెలు నెరవేరిన భక్తులు ఆలయానికి వచ్చి... స్వామికి ఇష్టమైన కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మేరకు ఏటా సుమారు పాతిక లక్షలు పైబడి కొబ్బరికాయలు మొక్కులు తీర్చుకుంటారని అంచనా. ఆలయంలో నిత్యం ఏకాదశ రుద్రాభిషేకం, మహాన్యాసాభిషేకం, లఘున్యాసాభిషేకం, అష్టోత్తరములతో పాటు పుస్తక పూజ, అన్నప్రాసన అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతుంటాయి. అలాగే సంకటచతుర్థినాడు స్వామివారికి విశేష గరిక పూజలు చేస్తారు. లక్ష్మీ గణపతి హోమాలు నిత్యం నిర్వహిస్తారు.

19:49 - August 24, 2017

హైదరాబాద్ : జీఎస్టీ..! వస్తు సేవల పన్ను ఇప్పటికే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలను కుదిపేస్తోంది. జీఎస్టీ వల్ల లాభాలెంతో, నష్టాలెంతో తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నవారి జాబితా చాలానే ఉంది. జీఎస్టీ దెబ్బతో చాలా రంగాలు కుదేలవుతున్నాయి. ఇప్పుడీ జీఎస్టీ బాంబు వినాయక విగ్రహాల తయారీపైన పడింది. వినాయక ప్రతిమల తయారీకి వాడే ముడిసరుకులపై జీఎస్టీ ప్రభావం చాలా ఎక్కువగా పడుతోంది. విగ్రహానికి వాడే రంగులు లీటర్‌కు 500 నుంచి 720 రూపాయలకు ఎగబాకాయి. 170గా ఉన్న చమికిల ధర 220 రూపాయలకు పెరిగింది. అచ్చు యంత్రాల అద్దె 5000కి చేరింది. పౌడర్‌, నారా, లకిడి, అల్యూమినియం, ప్లాస్టిక్‌ ధరలు గతంలో కన్నా భారీగా పెరిగాయి. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌పై అదనంగా 28 శాతం జీఎస్టీ పడుతోంది.

15 వేలనుంచి 25 వేల రూపాయలు
వినాయక చవితికి కొన్ని నెలల ముందుగానే రాజస్థాన్,మహరాష్ట్ర ప్రాంతాలకు చెందిన వందలాది కళాకారులు గణేష్ విగ్రహాల తయారీలో నిమగ్నమవుతారు. గతంలో ముడిసరుకులు తక్కువ ధరలకు లభించడంతో లాభాలు ఆర్జించేవారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ముడిసరుకుల దిగుమతికి ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. వినాయక ప్రతిమల తయారీకి వాడే ముడిసరుకును ఇతర రాష్ట్రాలనుంచి దిగుమతి చేసుకుంటారు. మహరాష్ట, గుజరాత్ నుంచి ముడిసరుకులు హైదరాబాద్‌కు తరలించాలంటే టన్నుకు 15 వేలనుంచి 25 వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని తయారీదారులు చెబుతున్నారు.

తగ్గిన విగ్రహాల అమ్మకాలు
జీఎస్టీ కారణంగా ఈసారి విగ్రహాల అమ్మకాలు కూడా బాగా తగ్గాయంటున్నారు. ఒక్కో విగ్రహాం తయారీకి సుమారు 10 వేల నుంచి 25 వేల రూపాయల దాకా ఖర్చవుతుంది..సైజును బట్టి ధర మారిపోతుంది. ప్రతిమలపై జీఎస్టీని కూడా జోడిస్తే ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరుగుతాయో లేదోనని తయారీ దారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కంటే ఈసారి రంగుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్క ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ ధర జీఎస్టీ ప్రభావంతో మూడింతలైంది. ఒక విగ్రహానికి 10 వేలు వెచ్చిస్తే..జీఎస్టీ కారణంగా 5 వేల రూపాయల అదనపు భారం పడుతోంది. గణేష్‌ విగ్రహాల తయారీదారులను జీఎస్టీని మినహాయించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.    

19:48 - August 24, 2017

హైదరాబాద్ : వినాయక ప్రతిమల తయారీకి నిలయంగా ధూల్‌పేట..ప్రతిమల తయారీదారుల కుటుంబాల్లో కానరాని వెలుగులు ప్రతిమల కళాకారులుగా మారిన గుడుంబా తయారీదారులు సంప్రదాయిక కళాకారులపై అదనంగా జీఎస్‌టీ భారం. వైవిద్యమైన వినాయక విగ్రహాల తయారీకి హైదరాబాద్‌ ధూల్‌పేట పెట్టింది పేరు. ప్రతిమల ఆకృతిని చూడగానే ఇది ధూల్‌పేటలో తయారైందని కనిపెడతారంటే... ఇక్కడి కళాకారుల చేతి నైపుణ్యం ఎలాంటిదో అర్థమవుతుంది. అయితే వినాయక చవితికి కొన్ని గంటలే సమయమున్నా..ధూల్‌పేటలో జనసందోహం కనిపించడం లేదు. పండుగకు కొన్ని రోజుల ముందే జనం రద్దీతో కిటకిటలాడే విక్రయ కేంద్రాలు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి.

విగ్రహాల తయారీపై వేలాది కుటుంబాలు
ధూల్‌పేటలో వినాయక విగ్రహాల తయారీపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. స్థానికులే కాకుండా పలు రాష్ట్రాల కళాకారులను పిలిపించి గణేష్‌ విగ్రహాలను తయారుచేయిస్తుంటారు. భారీ వినాయక విగ్రహాలు ఆకర్షణీయమైన ఆకృతుల్లో లభ్యమవుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి విగ్రహాల కొనుగోలుకు ఇక్కడికి వస్తుంటారు. వినాయక చవితికి పదిరోజుల ముందు నుండి దూల్ పేట కొనుగోలుదారులతో కోలాహలంగా మారుతుండేది. కానీ గతంతో పోలిస్తే మాత్రం ఈసారి సందడి తగ్గిందని తయారీదారులు అంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే విగ్రహాల అమ్మకం ధరలు బాగా పెరిగాయి. ఎందుకిలా అంటే.. జీఎస్టీ దెబ్బ అంటున్నారు అమ్మకం దారులు. భారీ విగ్రహాల అమ్మకాలు ఓమోస్తరుగానే ఉన్నా.. ధూల్‌పేట కళాకారులు తయారుచేసే చిన్న ప్రతిమల అమ్మకాలు అతి దారుణంగా పడిపోయాయంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఓ మంచి నిర్ణయమే దీనికి కారణమంటున్నారు.

గుడుంబాపై ఉక్కుపాదం
ధూల్‌పేట గుడుంబాపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయం కోసం.. ఆర్థిక సాయం అందించింది. దాంతో.. స్థానికులు కొందరు.. ప్రతిమల తయారీని ఉపాధిగా ఎంచుకున్నారు. ఒకరిని చూసి మరొకరుగా.. చాలామంది ఇదే బాట పట్టారు. దీంతో.. గణపతి చిన్న ప్రతిమలు విచ్చలవిడిగా దొరుకుతుండడంతో.. దాని ప్రభావం సంప్రదాయికంగా ఏళ్లతరబడి ఇదే వృత్తితో జీవిస్తోన్న కళాకారులపై పడుతోంది. వినాయకచవితికి ముందు విక్రయాలు ఎలా ఉన్నా.. పండగ రోజు అమ్మకాలు ఊపందుకుంటాయని ధూల్‌పేట్‌ వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు. 

19:47 - August 24, 2017

విశాఖ : మట్టి విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని ఈ విగ్రహాల కొనుగోలుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:46 - August 24, 2017

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేషుడు ఉత్సవాలకు ముస్తాబయ్యాడు. ఈ ఏడాది 57 అడుగుల ఎత్తులో శ్రీచండీ కుమార అనంత మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. రేపు ఉదయం గవర్నర్ దంపతుల తొలిపూజతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామంటున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:45 - August 24, 2017

పశ్చిమగోదావరి : జిల్లా పాలకొల్లులో వినాయక ఉత్సవాల సందడి మొదలైంది. రెల్లి సంఘం ఆధ్వర్యంలో 60 అడుగుల మట్టివిగ్రహాన్ని నిర్వాహకులు ప్రతిష్టించారు. రెండు నెలలు పాటు శ్రమించి తయారు చేసిన ఈ మట్టివినాయకుడు వరపుత్ర వినాయకుడిగా రేపు దర్శనం ఇవ్వనున్నారు. ఉభయ రాష్ట్రాల్లోనే అతిపెద్ద మూడో విగ్రహంగా ఏర్పడిన ఈ 60 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ నీళ్లు

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త సంవత్సరం కానుకగా మిషన్ భగీరథ నీళ్లు ఇస్తామని తెలిపారు. డిసెంబర్ లోగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని ప్రకటించారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్ కు స్వల్ప అస్వస్థత

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థత గురైయ్యారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ వర్షంలో తడవడంతో జ్వరం, గొంతు నొప్పి, ఒంటినొప్పులతో బాధపడుతున్నారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని జగన్ కు వైద్యులు సూచించారు.

క్వార్టర్స్ కు చేరిన కిదాంబి శ్రీకాంత్

స్పోర్ట్స్ : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్ ఫైనల్ చేరుకున్నాడు. ప్రీక్వార్టర్స్ లో డెన్మార్క్ షట్లర్ అండర్స్ ఆంటోన్స్ పై విజయం సాధిచండంతో క్వార్టర్స్ లోకి అడుగుపెట్టాడు.

 

విశాఖ జిల్లాలో భారీ వర్షం

విశాఖ : జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

18:37 - August 24, 2017
18:23 - August 24, 2017

హైదరాబాద్ : మూఢ నమ్మకాల నిర్మూలనకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని మహారాష్ట్ర అపశ్రద్ధ నిర్మూలన సమితి, జన విజ్ఞాన వేదిక సభ్యులు నిర్ణయించారు. హైదరాబాద్‌ ఎస్ వీకేలో సమావేశమైన సభ్యులు... తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో మూఢనమ్మకాల నిర్మూలన చట్టంకోసం పోరాడాలని తీర్మానించారు.... చట్టం తేవాలంటూ సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందజేస్తామని సభ్యులు తెలియజేశారు.. అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామని అపశ్రద్ధ నిర్మూలన సమితి నేతలు ప్రకటించారు.

18:20 - August 24, 2017

మెదక్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.. కలెక్టర్‌ భారతి హళ్లికేరి ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు... ఈ సమావేశంలో మాట్లాడిన ప్రతి మాట రికార్డవుతుందని... అందరూ తమ అభిప్రాయాలు చెప్పొచ్చని కలెక్టర్‌ సూచించారు.. కలెక్టర్‌ తర్వాత పలువురు అన్నదాతలు తమ సమస్యలు తెలియజేశారు.. అయితే రైతులకు సమాచారం ఇవ్వకుండా సమావేశం ఏర్పాటు చేశారని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు.

గుజరాత్ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ను ప్రకటించిన అమిత్ షా

ఢిల్లీ : బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్ ఎన్నికల ఇంచార్జ్ ని ప్రకటించారు. గుజరాత్ ఎన్నికల ఇంచార్జ్ గా అరుణ్ జైట్లీని నియామించారు.

రాంకీకి ఒప్పందం పై జీహెచ్ఎంసి దృష్టి

హైదరాబాద్ : 279వాహనాలు పాతవి కావడంతో వాటిని అధికారులు తొలగించారు. కొత్తగా 40 వాహనాల కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. నిర్దయగా నిర్ణయానికి ప్రభుత్వం నో చెప్పడంతో చెత్త తరలింపు కాంట్రాక్ట్ ను రాంకీకి అప్పగించేలా ఒప్పందం సిద్ధమౌతోంది. రాంకీతో ఒప్పందంపై జీహెచ్ఎంసీ అసక్తి చూపడంతో ఒప్పదానికి సన్నాహాలు చేస్తోంది. దీంతో బల్దియాలో శానిటేషన్ ప్రైవేట్ పరంవడానికి మార్గం సుగుమం అయ్యింది. ఉద్యమ సమయంలో వ్యతిరేకించి ఇప్పుడు సై అంటున్న కేసీఆర్ సర్కార్ నిర్ణయంపై కార్మికసంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ వద్ద చెత్త తరలింపునకు 704 వాహనాలు మాత్రమే వున్నాయి.

 

17:25 - August 24, 2017

హైదరాబాద్ : బల్దిలియా మరో నిర్ణయానికి సిద్ధపడింది. నగరంలోని చెత్త తరలింపు కాంట్రాక్ట్ రాంకీకి అప్పగించేలా సిద్ధమౌతు ఒప్పందం చేసుకునేందుకు రెడీ అయింది. బల్దియా నిర్ణయంపై కార్మికసంఘాలు మండిపడుతున్నాయి. ఉద్యమ సమయంలో ప్రైవేట్ కు అప్పగిచడాన్ని వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం సై అంటున్నారు. మరిన్ని వివరాలకు కోసం వీడియో చూడండి.

ముగిసిన ఇరురాష్ట్రాల ఆర్టీసీ బోర్టు సమావేశం

విజయవాడ : తెలుగురాష్ట్రాల ఆర్టీసీ బోర్టు సమావేశం ముగిసింది. ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఎండీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్రం తరపు ముగ్గురు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. డీమెర్టర్ ప్లాన్ పై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆస్తులు, అప్పులపై భిన్నాభిప్రాయాలు ఉండడంతో ఈ అంశం వచ్చేనెల 15న మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉద్యోగుల విభజనపై ఏకాభిప్రాయనికి వచ్చారు.

 

17:03 - August 24, 2017

సినిమాలు మానేస్తా...అంటూ 'పవన్ కళ్యాణ్' చెప్పిన వ్యాఖ్యలతో సినీ అభిమానులు ఎంతగానే నిరుత్సాహం చెందారు. ఇటీవలే ఆయన జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే పూర్తిగా రాజకీయాల్లో ఉంటానని పేర్కొన్నారు. దీనితో ఆయన సినిమాల్లో నటించరని..ఫుల్ స్టాప్ పెడుతారనే ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో 'పవన్' సినిమాలపై ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమాలు మానేయడంపై పవన్ యూ టర్న్ తీసుకున్నారని టాక్.

సంవత్సరానికి..రెండు...మూడు చేసుకుంటూ వస్తున్న 'పవన్' ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని బాహాటంగానే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయన నిర్మాతగా వచ్చిన సినమాలు కూడా అంతగా విజయవంతం కాకపోవడంతో నటన విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో 'పవన్' నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

వీలైనంత త్వరగా విడుదల చేయాలని పవన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అనంతరం ఎం.ఎం.రత్నం, మైత్రి మూవీ మేకర్స్ వారి చిత్రాలను పూర్తి చేయాలని 'పవన్' భావిస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే మాత్రం 'పవన్' అభిమానులకు ఫుల్ ఖుషీలాంటిదే..మరి ఆయన సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టే అంశంపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. 

17:00 - August 24, 2017
16:59 - August 24, 2017

అనంతపురం : ఆంధ్ర అండర్‌-14 రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ టోర్నీలో ఆతిథ్య జట్టు అనంతపురం విశాఖ జట్టుపై 3-0 తో విజయం సాధించి విజేతగా నిలిచింది. అనంతపురం జట్టు గెలిచినందుకు సంతోషంగా ఉందని రూరల్‌ డెవలప్‌ మెంట్‌ ట్రస్ట్‌ డైరక్టర్‌ మాంచు ఫ్రెరర్‌ అన్నారు. టోర్నీలో ప్రతిభ కనబరిచిన కొంత మంది ఫ్లేయర్లను ఆంధ్ర టీమ్‌ కి సెలక్ట్‌ చేశామని అన్నారు. అలాగే వారికి ఇక్కడే ప్రత్యేక కోచింగ్‌ ఇచ్చి జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ టీంకి పంపుతామని తెలిపారు.

16:57 - August 24, 2017

కడప : న్నైకి చెందిన అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్ అహమ్మద్ తంబీ మైథిన్ అలియాస్ ఏ.టి.ఎంను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మైథిన్.. రెడ్ శాండల్ స్మగ్లర్ గంగిరెడ్డి అత్యంత సన్నిహితుడు. నిందితుడి నుంచి కోటి రూపాయల విలువైన 68 ఎర్రచందనం దుంగలతో పాటు కోటి 23 లక్షల విలువైన నాలుగు కార్లతో పాటు పికప్ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటుగా వివిధ బ్యాంకుల ఎటిఎం కార్డులు, చెక్కులతో పాటు 50వేల నగదును స్వాదీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బాబుజీ తెలిపారు. మైథిన్‌కు... ఇతర దేశాల్లో ఎర్రచందనం వ్యాపారం చేసే చైనీయులతో సంబంధాలు ఉన్నాయని, ఇప్పటివరకు11 దేశాలను సందర్శించాడని తెలిపారు. ఇప్పటి వరకు 3000 టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణా చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుని వద్ద 78 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

16:56 - August 24, 2017

విశాఖ : విశాఖను డ్రోన్‌ల తయారీ కేంద్రంగా మారనున్నట్లు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఈ పరిశ్రమ ప్రారంభానికి తాను 60 రోజుల్లో మళ్లీ విశాఖకు వస్తానని స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో ఉన్న లోకేశ్ ఎనిమిది ఐటీ కంపెనీలను ప్రారంభించారు. విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్న ఈ కంపెనీలు 770 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి. 

16:53 - August 24, 2017

తూర్పుగోదావరి : నంద్యాలతోపాటు.. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ వైసీపీదే విజయమన్నారు.. ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి.. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా విజయసాయి రెడ్డి ప్రచారం చేస్తున్నారు.. ఇంటింటికీ తిరిగి తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:52 - August 24, 2017

సినిమాలో అవకాశాలు ఎలా వస్తాయి ? వారి నటన..ప్రతిభ..ఇతరత్రా కారణాలతో అవకాశాలు వాటంతటవే వస్తుంటాయి. ఇందులో హీరోయిన్లకు అందం ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఏ మాత్రం గ్లామర్ తగ్గినా అవకాశాలు తగ్గుముఖం పడుతుంటాయి. బొద్దుగా ఉండే వారు స్లిమ్ గా మారేందుకు యమ శ్రమ పడుతుంటారు. ఈ జాబితాలో 'రాశి ఖన్నా' కూడా చేరింది.

'ఊహలు గుసగుసలాడే' సింపుల్ లవ్ స్టోరీతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈమె నటన..గ్లామర్ చూసిన ఇతర దర్శకులు..నిర్మాతలు ఆయా చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. ఇలా వరుస సినిమాలు చేస్తూ వచ్చిన 'రాశీ ఖన్నా' పెద్దగా విజయాలు మాత్రం దక్కించుకోలేకపోయింది. వచ్చిన ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మలో బాగా మార్పు వచ్చిందంట. ఎన్టీఆర్ సరసన 'జై లవ కుశ' చిత్రం..'టచ్ చేసి చూడు' చిత్రం..వరుణ్ తేజ హీరోగా తెరకెక్కబోయే కొత్త సినిమాల్లో అమ్ముడు ఛాన్స్ కొట్టేసింది.

కానీ ఆమెకు ఆఫర్లు ఇచ్చిన వారంతా స్లిమ్ గా కావాలని సూచించారంట. దీనితో 'రాశీ ఖన్నా' స్లిమ్ గా మారేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందంట. బొద్దుగా ఉన్న 'రాశీ' తక్కువ సమయంలోనే స్లిమ్ గా మారిపోయిందని టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయంట. ఆమె నటించిన చిత్రాలు రిలీజ్ అయితే మాత్రం తెలియదు..ఎంత స్లిమ్ అయ్యిందో...అప్పటి వరకు వెయిట్ అండ్ సి...

16:52 - August 24, 2017

సిద్దిపేట : జిల్లా చిన్న కోడూర్‌ మండలం రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితులు రోడ్డెక్కారు. ఎకరాకు 13లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. ప్రాజెక్టుకు నాలుగు గ్రామాల నుంచి భూములు సేకరించారని ఆరోపించారు. పక్కనే ఉన్న లింగారెడ్డిపల్లి గ్రామస్తులకు 13లక్షలు ఇస్తున్నారని.. తమకు మాత్రం 6లక్షల 50వేలు ఎలా ఇస్తారని అధికారుల్ని ప్రశ్నించారు.  

16:51 - August 24, 2017

హైదరాబాద్ : ఓవైపు గణేశ్ ఉత్సవాలు.. మరోవైపు బక్రీద్.. రెండు పండుగల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. 24 వేలమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జియో ట్యాగింగ్,క్యూఆర్ కోడ్‌ టెక్నాలజీ ద్వారా గణేశ్ మండపాల వద్ద అనుక్షణం పర్యవేక్షణ చేస్తామని మహేందర్ రెడ్డి అన్నారు. పోలీసులకు అన్ని శాఖల అధికారులతో పాటు ప్రజలు సహకరించాలని కోరారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:50 - August 24, 2017

హైదరాబాద్ : ప్రాజెక్టుల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని సీఎల్పీ నేత జానారెడ్డి స్పష్టం చేశారు.. నిర్వాసితుల సమస్యలు తీర్చి ఆ తర్వాతే ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాలని సూచించారు. నిర్వాసితులు అడుగుతున్న నష్టపరిహారంపై మాట్లాడకుండా... ప్రాజెక్టులు కట్టాలా? వద్దా? అని సర్కారు అడగడమేంటని మండిపడ్డారు.

తమిళనాడు స్పీకర్ ను కలిసిన చీప్ విప్ రాజేంద్రన్

చెన్నై: తమిళనాడు స్పీకర్ ను చీప్ విప్ రాజేంద్రన్ కలిశారు. దినకరన్ వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

16:11 - August 24, 2017

చాలా మందికి ఎప్పుడో ఒకసారి నోటిపుండ్లు అవుతుంటాయి. భోజనం..ఇతర పదార్థాలు తీసుకోవాలన్నా చాలా అవస్థలు పడుతుంటారు. కొద్దిగా కారం తగిలినా విలవిలలాడుతుంటారు. నాలుక..పెదాలు..నోటిపై భాగం..చిగుళ్లలో ఈ ఎర్రటి పుండ్లు వస్తుంటాయి. అనుకోకుండా కొరుక్కోవడం లేదా నోట్లో ఏర్పడ్డ గాయం వల్ల పుండ్లు ఏర్పడతాయి. విటమిన్‌ లోపం వల్ల కూడా పుండ్లు ఏర్పడతాయి. కొన్ని టిప్స్ పాటిస్తే ఈ సమస్య నుండి బయటపడొచ్చు.

గ్లాసు వేడి నీటిలో కొన్ని కొత్తిమీర ఆకులు వేయాలి. కొన్ని నిమిషాలు అలా ఉన్న తరువాత దానిని చల్లార్చాలి. రోజుకు మూడుసార్లు చొప్పున ఈ ద్రవాన్ని పుక్కిలించాలి. కొత్తిమీరలో మంటను తగ్గించే, యాంటిసెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి.
అరకప్పు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కలపాలి. ఈ నీటిని పుక్కిలించాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేయాలి. బేకింగ్ సోడాలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. 
ఒక గ్లాసులో చల్లటి నీళ్లను, ఇంకో గ్లాసులో వేడి నీళ్లను తీసుకోండి. ఒక సారి చల్లనీళ్లు, ఇంకోసారి వేడి నీళ్లు ఇలా మార్చి మార్చి పుక్కిలించండి.
ఉల్లిపాయ ముక్కను తీసుకుని పుండు ఉన్న ప్రాంతంలో అదిమి పెట్టి ఉంచాలి. ఉల్లిరసంతో రోజుకోసారి పుక్కిలించినా మంచి ఫలితం ఉంటుంది.
ఐదారు తులసి ఆకులను నమిలి, కొద్దిగా నీళ్లు తాగాలి. ఇలా రోజుకు ఐదారుసార్లు చేయాలి.
టమోటాలను పచ్చిగా తినడం వల్ల నోట్లో పుండ్లను నివారించొచ్చు. టమోట రసాన్ని రోజుకు 3 నుంచి 4 సార్లు పుక్కిలించి ఉమ్మేయాలి.

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. 276 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌.. 31,596 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా అత్యల్పంగా 4 పాయింట్లు లాభపడి 9,857 వద్ద ముగిసింది.

16:07 - August 24, 2017

కర్నూలు : జిల్లా నంద్యాల టూటౌన్ పీఎస్ లో శిల్పా చక్రపాణి రెడ్డిపై టీడీపీ నేత అభిరుచి మధు ఫిర్యాదు చేశారు. శిల్పా చక్రపాణి రెడ్డితో పాటు ముగ్గురు కౌన్సిలర్లపై ఫిర్యాదు చేశారు. తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని మధు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

పిడుగు పడి మహిళ మృతి

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం: పిడుగు ప‌డ‌టంతో ఓ మహిళ మృతి చెందింది. జిల్లాలోని జూలూరుపాడు మండ‌లం కాక‌ర్ల కు చెందిన పాముల ర‌జిని(25) మిర్చి తోట‌లో ప‌ని చేస్తుండ‌గా ఆమె మీద పిడుగు ప‌డ‌టంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది.

శిల్పా చక్రపాణి పై అభిరుచి మధు ఫిర్యాదు

కర్నూలు : నంద్యాల టూటౌన్ పీఎస్ లో శిల్పా చక్రపాణి రెడ్డి, మరో ముగ్గురు కౌన్సిలర్లపై టిడిపి నేత అభిరుచి మధు ఫిర్యాదు చేశారు. తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని అభిరుచి మధు ఫిర్యాదు చేశారు.

15:59 - August 24, 2017

ఆదిలాబాద్ : సామాజిక అసమానతలు, మతోన్మాదంతో దేశంలో అణగారిన వర్గాలు అణచివేతకు గురవుతున్నాయని... టీ మాస్‌ ఫోరం రాష్ట్ర నేత జాన్‌ వెస్లీ అన్నారు. పూలే, అంబేద్కర్‌ ఆశయాల సాధనకోసం దళితులు, బహుజనులంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందని చెప్పారు. ఆదిలాబాద్‌లో టీ మాస్‌ ఫోరం జిల్లా సమావేశానికి వెస్లీతోపాటు... ఫోరం జిల్లా నేత మల్లేశ్, సీపీఎం నేతలు బండి దత్తాత్రి, లంకా రాఘవులు, పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు.

15:50 - August 24, 2017

జగిత్యాల : తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పాలిట శాపంగా మారింది. ఘన చరిత్ర కలిగిన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ మూత పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంత కాలం చెరుకు సాగు చేసిన రైతులు ఇప్పుడు ఇతర పంటలను సాగు చేస్తూ ఆర్థికంగా నష్టాలపాలవుతున్నారు. మూత పడిన చక్కెర కార్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ముత్యంపేట రైతులు కోరుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:38 - August 24, 2017

కోమరంభీమ్ అసిఫాబాద్‌ : జిల్లా, చింతలమానేపల్లి మండలం, గూడెం గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిపై అంతర్‌రాష్ట్ర బ్రిడ్జి నిర్మాణాన్ని గతేడాది ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం 53 కోట్లతో వంతెన నిర్మాణం జరుగుతోంది. ఈ వంతెన పూర్తైతే అక్కడి గిరిజనులకు, మహారాష్ట్రలోని అహెరి ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. సరిహద్దు మారుమూల ప్రాంతమైన సిర్పూర్‌ నియోజకవర్గ ప్రాంతంలోని ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగులోకి వస్తుంది. నాలుగు రాష్ట్రాలకు చెందిన వారధిగా నిలిచే వంతెనను వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే కొండి కోణప్ప అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

గణేష్ ఉత్సవాలకు భద్రత ఏర్పాట్లు పూర్తి : సీపీ

హైదరాబాద్ : నగరంలో గణేష్ ఉత్సవాలకు భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఉత్సవాలకు 24 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డీజేకు అనుమతి లేదు.. సోషల్ మీడియా పుకార్లు నమ్మొద్దని నగరవాసులకు సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాల్న సీపీ.. మండల నిర్వాహకులకు సలహాలు, సూచనలు చేశామని తెలిపారు. సెప్టెంబర్ 5న గణేష్ నిమజ్జనం ఉంటుందని సీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. నిమజ్జనం కూడా ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

15:34 - August 24, 2017

కొత్తగూడెం : జిల్లా అశ్వారావుపేటలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. రెండురోజులుగా ఎండ తీవ్రతకి అల్లాడుతున్న తరుణంలో గాలిదుమారం, వర్షం బీభత్సం సృష్టించాయి. ఆసుపాక, వినాయకపురం, నారంవారిగూడెం గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోవడంతోపాటు, తాగునీటికి ఇబ్బంది కావడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. 

15:33 - August 24, 2017

చిత్తూరు : తిరుమలలో గత రాత్రి నుంచి ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. శ్రీవారి ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. భారీగా కురిసిన వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఆర్జిత సేవలకు హాజరు కావాల్సిన భక్తులు వర్షంలోనే తడుస్తూ ఆలయానికి చేరుకున్నారు. రెండో ఘాట్ రోడ్డులో రెండు ప్రాంతాల్లో చిన్నపాటి కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే అధికారులు వాటిని తొలగించేలా చర్యలు చేపట్టారు. 

15:32 - August 24, 2017

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలు గతంలో నిర్ణయించుకున్న నీటి వాటాలను సక్రమంగా అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం చూడాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన భూముల సర్వేను.. పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఉందని తమ్మినేని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని భూముల కబ్జాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదని ఆయన అన్నారు.

15:28 - August 24, 2017

నెల్లూరు : జిల్లాలో రొయ్యల ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, స్థానికులు ఆందోళనకు దిగారు. డేవిస్ పేట వద్ద రొయ్యల ఫ్యాక్టరీల ముట్టడికి వారు యత్నించారు. స్థానికులు ఫ్యాక్టరీల పైప్ లైన్లు ధ్వంసం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రైతు సంఘం నేతలు వాగ్వాదానికి దిగారు. రైతు సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:16 - August 24, 2017

కర్నూలు : నంద్యాల సురాజ్ గ్రాండ్ హోటల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత అభిరుచి మధు మరణించిన వ్యక్తి కొడుకును పరామర్శించడానికి వచ్చారు. అదే సమయంలో శిల్పాచక్రపాణి రెడ్డి అటు వెళ్లుతున్నారు. దారిలో మధు కారు అడ్డుగా ఉండడంతో వాహనాన్ని పక్కకు తీయాలని వైసీపీ కార్యర్తలు కోరారు. మధు అనుచరులు కారు తీయకపోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో మధు ప్రైవేట్ గన్ మన్ గాల్లోకి ఐదు రౌడ్లు కాల్పులు జరిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:13 - August 24, 2017

చిత్తూరు : జిల్లా సబ్ జైలులో ఎర్రచందనం లేడీ స్మగ్లర్ సంగీత చటర్జీ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు గత మార్చిలో సంగీత చటర్జీని అరెస్టు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:52 - August 24, 2017

వ్యాపారంలో పోటీతత్వం సాధారణం..ఆ పోటీని తట్టుకుని ముందుకు కొనసాగితేనే తమ ప్రొడక్టుకు తమ కంపెనీకి పేరు తెచ్చుకొగలం..లాభాల బాట పట్టేందుకు అవకాశం కూడా ఉంటుంది. ఏ ప్రొడక్టు సక్సెస్ కావాలంటే అది మహిళలకు నచ్చినట్టు ఉండాలి, వారికి అందుబాటులో ఉండాలి అలా ఉంటే ఆ వస్తువు మార్కెట్లో విజయం ఖాయం..వ్యాపారవేతలుగా రాణించాలనే మహిళల కోసం ఓ కంపెనీ తమ ప్రొడక్టును చేరువచేసేందుకు నిర్వహించిన ఓ కార్యక్రమం పై మానవి ఫోకస్...మహిళల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం విజయవంత కాదని అనుభజ్ఞులు చెప్పిన మాటలు..ఏ కంపెనీ తయారుచేసిన వస్తువవైన పదార్దమైన అన్ని వర్గాల మహిళలకు అందుబాటులో ఉంటే అది మరింత విజయవంతమై తీరుతుంది. అలా ఒకవైపు తమ ప్రొడక్టును మార్కెట్ చేసుకుంటూ తద్వారా మహిళలకు చాక్లెట్ తయారీలో మెలుకువలు తెలిపెందుకు వర్క్ షాపు నిర్వహించారు టూ ఎం డీపీ చాక్లెట్ కంపెనీ యాజమాన్యం... చాక్లెట్ ఈ మాట వినగానే అందరికి నోరురుతుంది. చాక్లెట్ అంటే ఇష్టపడనివారుండారు. దీన్ని మూలధనంగా చేసుకున్న వ్యాపారాలు లాభాల బాటలో ప్రయాణిస్తున్నాయి. అంటే చాక్లెట్ ఉండే డిమాండ్ ఏమిటో అర్ధం అవుతుంది. చాక్లెట్ వివిధ రకాల ప్లేవర్లను జోడించి ట్రెండ్ తగ్గట్టు ఆకర్షణీయమైన ప్యాకింగ్ లతో అకుట్టుకునే ఆకృతులతో మార్కెట్ చేసేందకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఏ పొడక్టు తయారు చేయారు చేయాడానికి పడిన కష్టం కన్నా దాన్ని మార్కెట్ చేయడమే కోసం మరింతగా కష్టపడాలి పూర్తి వివరాలకు వీడియో చూడండి.

ఎర్రచందనం స్మగ్లర్ సంగీతా ఛటర్జీ ఆత్మహత్యా యత్నం

చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్ సంగీతా ఛటర్జీ చిత్తూరు సబ్ జైలులో ఆత్మహత్యా యత్నం చేసింది. . ఆమెను చికిత్స కోసం వెంటనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందన్ని డాక్టర్ లు తెలిపారు. కోల్ కతాకు చెందింది సంగీతా ఛటర్జీ ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టై చిత్తూరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తోంది.

 

14:36 - August 24, 2017

రైల్వే మంత్రిగా సురేష్ ప్రభు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని ఆక్సిడెంట్స్..ఎంతమంది మరణించారో తెలుసా ? దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 2014 నవంబర్ లో సురేష్ ప్రభు రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. వరుసుగా జరుగుతున్న రైలు ప్రమాదాల నేపథ్యంలో ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారించినట్లు తెలుస్తోంది.

2016-17 దశబ్దాలంలోనే అత్యధికంగా 193 మంది ప్రయాణీకులు రైలు ప్రమాద ఘటనలో మృతి చెందారు. ముజఫర్ నగర్ ప్రమాద మృతులతో కలిసి మొత్తం 249 మంది ప్రయాణీకులు ఈయన హాయాంలోనే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

యూపీఏ చివ‌రి మూడేళ్ల పాల‌న‌లో 157 ప్ర‌మాదాల్లో 84 మంది మ‌ర‌ణించారు. వీరిలో 2011-12లోనే 73 మంది మృత్యువాత ప‌డ్డారు. అలాగే గ‌డ‌చిన మూడేళ్ల‌లో జ‌రిగిన 207 ప్ర‌మాదాల్లో దాదాపు 1,135 మంది మ‌ర‌ణించిన‌వారు, గాయ‌ప‌డిన‌వారు ఉన్నారు. కానీ రైల్వే భద్రతకు మాత్రం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు..ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొనడం గమనార్హం. అధికారికంగా విడుదల చేసిన నివేదికలో మాత్రం రైలు ప్రమాదాలు..వాటి వల్ల మరణించిన వారి సంఖ్యను పేర్కొనకపోవడం పట్ల వివర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కాకినాడలో 9మంది క్రికెట్‌ బుకీలు అరెస్ట్...

తూ.గో: కాకినాడలో 9మంది క్రికెట్‌ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశామని ఎస్పీ విశాల్‌ గున్నీ తెలిపారు. వాట్సప్‌ ద్వారా ప్రజల నుంచి వచ్చిన సమాచారంతో ప్రధాన బుకీలను అరెస్ట్‌ చేశామనిపేర్కొన్నారు. త్వరలో మరి కొంతమంది బుకీలను అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు. బుకీలతో సంబంధాలున్న అందరిపైనా నిఘా ఉంచామని తెలిపారు.

మిషన్ భగీరథ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : మిషన్ భగీరథ పనులు పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ పనులను సవాల్ గా తీసుకుని పూర్తిచేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలందరికీ సురక్షిత తాగునీరు ఇవ్వడమే లక్ష్యమని ఆయన తెలిపారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి నీరందిచాలని, ప్రభుత్వానికి మిషన్ భగీరథ పథకం జీవన్మరణ సమస్య అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్లు రాత్రింబవళ్లు పని చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి మిషన్ భగీరథ పనులను పరిశీలిస్తామని అన్నారు.

 

14:08 - August 24, 2017

కర్నూలు : జిల్లా నంద్యాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద టీడీపీ నేత మధు వాహనంపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. మధు ప్రైవేట్ గన్ మెన్ గాల్లోకి ఐదురౌడ్లు కాల్పులు జరిపారు. తనపై దాడికి పాల్పడింది వైసీపీ నేతలని ఆరోపించారు. దీనిపై శిల్పామోహన్ రెడ్డి స్పందిస్తూ ఉద్దేశ్యపూర్వకంగానే మధు ప్రైవేట్ గన్ మన్ కాల్పులు జరిపారని అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

నిర్వాసితులపై లాఠీఛార్జ్ దారుణం: జానారెడ్డి.

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సభలో నిర్వాసితులపై లాఠీఛార్జ్ సహించరాని విషయమని ఆయన అన్నారు. ప్రాజెక్టు కావాలా...వద్దా అని నిర్వాసితులను అడగడంలో అర్థం లేదని ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్‌పై నెపం మోపి కాలయాపన చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

బీఆర్డీ ఆస్పత్రికి ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్న కంపెనీపై ఎఫ్ఐఆర్

లక్నో : గోరఖ్‌పూర్ చైల్డ్ డెత్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. బీఆర్డీ ఆస్పత్రికి ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్న కంపెనీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆక్సిజన్ బీఆర్డీ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రా, ఆక్సిజన్ కంపెనీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ రాష్ర్ట సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. కంపెనీతో పాటు బీఆర్డీ ఆస్పత్రి డాక్టర్ ఖఫీల్ ఖాన్ మరో ఏడుగురిపై కేసులు నమోదు అయ్యాయి.ఆక్సిజన్ అందక 63 మంది పిల్లలు మృతి చెందిన విషయం విదితమే. గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) కూడా ఆగస్టు 14న స్పందించింది.

'రేపటి నుంచే రూ.200నోటు చలామణిలోకి'

హైదరాబాద్ : రేపు రూ.200 నోటు ను ఆర్బీఐ రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా రేపటి నుంచే చలామణిలోకి వస్తుందని పేర్కొంది.

 

13:35 - August 24, 2017

రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత

నెల్లూరు :రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత నెలకొది. పంట కాల్వలో వ్యర్థ జలాలను కలుపుతున్న పైపు లైన్లను స్థానికులు , వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పగలగొట్టేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.

 

13:33 - August 24, 2017

కర్నూలు : నంద్యాల సూరజ్‌గ్రాండ్‌ హోటల్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత మధు వాహనంపై కొంతమంది దుండగుల దాడిచేశారు. వైసీపీ కార్యకర్తలే దాడి చేశారని టీడీపీ నేత మధు ఆరోపించాడు. దీంతో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సమయంలోనే మధు ప్రైవేట్‌ గన్‌మెన్‌ గాల్లోకి ఐదురౌండ్లు కాల్పులు జరిపాడు, దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఘటనాస్థలానికి వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి చేరుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:27 - August 24, 2017

నిజామాబాద్ : మనిషి.. మానవత్వాన్ని మరచి నేర ప్రవృత్తిని పెంచుకుంటున్న కాలమిది. రకరకాల నేరగాళ్లను నియంత్రించేందుకు.. నవీన వ్యవస్థలను రూపొందించుకుంటోన్న తరుణమిది. ఇలాంటి రోజుల్లోనూ.. ఓ గ్రామం అహింసా పరమో ధర్మః అంటూ ప్రవచిస్తోంది.. అదే ధర్మాన్ని అక్షరాలా పాటించి చూపుతోంది. ఫలితంగా.. మూడు దశాబ్దాలుగా పోలీసు కేసన్నదే ఎరుగని గ్రామంగా భాసిల్లుతోంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది..? తెలుసుకోవాలనుకుంటున్నారా..? వాచ్‌ దిస్‌ స్టోరీ  
డికంపల్లి...ఆదర్శ గ్రామం 
ఈ ఊరందరిదీ ఒకే గొంతు...ఊరుమ్మడిగా నిర్దేశించుకున్న స్వీయ క్రమశిక్షణ....అహింస, అన్యాయం, అక్రమాలకు అందనంత దూరం.. ఆగ్రామం. నిజామాబాద్ జిల్లా మాక్లురు మండలంలోని డికంపల్లి.. ఐకమత్యంలో.. సాటి గ్రామాలకు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈర్ష్యాద్వేషాలకు ఈ గ్రామం వ్యతిరేకం. జగమంత కుటుంబం మనది అంటూ ఐక్యతారాగం పాడుతోంది. ఇక్కడి ప్రజలు ప్రతిపనిలోనూ క్రమశిక్షణ పాటిస్తారు. ఫలితంగా.. ఈ గ్రామంలోని ప్రజలు... ముప్పై ఏళ్ల కాలంలో ఎన్నడూ పోలీసు స్టేషన్‌  ముఖం చూడాల్సిన అవసరం రాలేదు. 
గ్రామ జనాభా 2 వేలపై చిలుకు 
డికంపల్లి గ్రామ జనాభా 2 వేలపై చిలుకు మాత్రమే.. ఓటర్ల సంఖ్య 1600 మాత్రమే. 70 శాతం మంది వ్యవసాయంపై  ఆధారపడి జీవిస్తున్నారు. ఉదయం 6 గంటలకే పొలాల దగ్గరికి వెళ్తారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి 10 గంటల వరకు గ్రామానికి చేరుకుంటారు. ఇంటిపనులు ముగించుకుని.. సాయంత్రం కాగానే స్వాధ్యాయ కేంద్రానికి వెళతారు. ఇక్కడ తమలోని సేవాతత్పరతను, ఆధ్యాత్మిక చింతనను.. సామాజిక స్పృహను ఇక్కడే ఇనుమడింప చేసుకుంటారు. 
డికంపల్లిలో సర్వమత సామరస్యం 
డికంపల్లి గ్రామం సర్వమత సామరస్యాన్ని పాటిస్తోంది. అన్ని పండగలు శాంతియుతంగా ఐకమత్యంగా జరుపుకుంటారు. రెండు వేల మంది జీవిస్తున్న ఈ గ్రామంలో పరస్పర గొడవలు, చిన్నపాటి తగాదాలు ఉండకుండా ఉంటాయా..? కచ్చితంగా ఉంటాయి. అయితే.. ఎలాంటి గొడవలు జరిగినా ప్రజలంతా ఊరినడిబొడ్డున ఉన్న చెట్టు  వద్దే ఆ తగాదాలను పరిష్కరించుకుంటారు. ఎలాంటి సమస్యనైనా సమావేశంలోని తీర్మానాల ద్వారానే సర్దుబాటు చేస్తారు. 
ఠాణాలో ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాకపోవడం గమనార్హం 
డికంపల్లి మాక్లురు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. 30 ఏళ్లుగా గ్రామం నుంచి ఎలాంటి ఫిర్యాదులు ఠాణాలో నమోదు కాకపోవడం గమనార్హం. తాము అధికంగా విశ్వసించేది  భూతల్లినని..ప్రశాంతంగా ఉండేందుకు స్వాద్యాయ కేంద్రానికి వెళ్లడం వల్ల కోపతాపాలకు తావుండని స్థానికులు అంటున్నారు. మనిషి తలుచుకుంటే అసాధ్యమనేది లేదు. ఐక్యంగా ముందడుగు వేయాలి.  కలిసి కదిలితే ఏదైనా సాధ్యమే అని డికంపల్లి గ్రామం ఇస్తున్న సందేశమిదే. 

 

మరోసారి గాంధీ ఆస్పత్రికి గవర్నర్

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రికి గవర్నర్ నరసింహన్ మరోసారి వచ్చారు. గవర్నర్ కాలికి ఆపరేషన్ చేయించుకోవడానికి గాంధీ ఆస్పత్రకి వచ్చారు.

 

టీడీపీ నేత అభిరుచి మధు కత్తితో హల్ చల్

కర్పూలు :నంద్యాల సూరాజ్ గ్రాండ్ హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత అభిరుచి మధుపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. వైసీపీ వర్గీయులు దాడి చేసి అభిరుచి మధు కారు అద్దాలు ధ్వసం చేశారు. టీడీపీ నేత అభిరుచి మధు కత్తి బయటకు తీసి హల్ చల్ చేశారు.అభిరుచి మధు గన్ మన్ గాల్లో కి రెండు రౌండ్లు గాల్లో కి కాల్పులు జరిపాడు. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తతగా మారడంతో ఘటనా స్థలి నుంచి ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

 

13:07 - August 24, 2017

నంద్యాల బైపోల్ ఎన్నికలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో వైసీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్, టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు వెంకటేష్ పాల్గొని, మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపుపై ఇరువురు ధీమా వ్యక్తం చేశారు. పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

సీట్ల భర్తీలో ఆర్టికల్ 371-డి వర్తించదు:హైకోర్టు

హైదరాబాద్ :కాళోజీ, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని సూపర్ స్పెషాలిటీ సీట్ల భర్తీపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ ద్వారానే సూపర్ స్పెషాలిటీ సీట్ల భర్తీ చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. సూపర్ స్పెషాలిటీ సీట్లను తెలుగు అభ్యర్థులతోనే భర్తీ చేయాలని గతంలో హైకోర్టులో 12 పిటిషన్లు దాఖలు చేసింది. సూపర్ స్పెషాలిటీ సీట్ల భర్తీలో ఆర్టికల్ 371 -డి వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది.

 

13:02 - August 24, 2017

ఢిల్లీ : నంద్యాల ఉప ఎన్నికలలో టీడీపీ గెలుస్తుందని.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. రాజకీయాలు ప్రాణమైనా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానన్నారు. ఖచ్చితంగా తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదన్నారు. కాకపోతే రాజకీయ విశ్లేషణ చేస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ విశ్లేషణ చేస్తామని తెలిపారు. 

13:00 - August 24, 2017

హైదరాబాద్ : సెన్సార్‌ బోర్డు కార్యాలయం ఎదుట.. కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు ఆధ్వరంలో ఆందోళన జరుగుతోంది. అర్జున్‌ రెడ్డి సినిమాలో అశ్లీల దృశ్యాలను తొలగించాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. అర్జున్‌ రెడ్డి సినిమా నిర్మాతలు కేసీఆర్‌ బంధువులు కావడం వల్లే.. సెన్సార్‌ బోర్డు అనుమతిచ్చిందని ఆయన ఆరోపించారు. సినిమాలో అశ్లీల దృశ్యాలు తొలగించేవరకూ.. అక్కడి నుంచి కదిలేది లేదని వీహెచ్‌ హెచ్చరించారు. 

 

12:57 - August 24, 2017

జగిత్యాల : జిల్లాలో విషాదం చోటుచేసుకొంది. పైస్థాయి అధికారి కుల దూషణలకు ఓ అధికారి బలయ్యాడు. కులం పేరుతో చేస్తున్న వేధింపులకు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని ఎండపల్లి గ్రామంలో నివాసముంటున్న శ్రీకాంత్‌...మూడు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లాలో శ్రీకాంత్ పంచాయతీరాజ్ ఏఈ గా పనిచేస్తున్నాడు. అయితే గతకొన్ని రోజులుగా ఉన్నతాధికారి రఘువీరారెడ్డి శ్రీకాంత్ ను కులం పేరుతో దూషణలు, కుల వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో మనస్థాపం చెందిన శ్రీకాంత్...పలుమార్లు ఆత్మహత్యాయాత్నానికి పాల్పడ్డాడు. గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.. స్థానికులు కాపాడారు. అ తర్వాత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కానీ ఆత్మహత్య ప్రయత్నం విఫలమైంది. తాజాగా తన చావుకు పైస్థాయి అధికారి రఘువీరారెడ్డి కుల దూషణలు, వేధింపులే కారణమని...సూసైడ్ నోట్ రాసి శ్రీకాంత్ ఉరేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. సూసైడ్ నోట్ చాలా విషాదభరితంగా ఉంది. అయితే అధికారుల వేధింపులవల్లే శ్రీకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపించారు. మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. శ్రీకాంత్ మృతికి కారకులపై కేసు నమోదు చేసుకుంటామని, చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో బంధువులు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఎర్ర స్మగ్లర్ గంగిరెడ్డి అనుచరుడు అరెస్ట్..

కడప : ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి అనుచరుడు మైదీన్ ను మైదుకూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగలు, రూ.1.5 కోట్ల విలువైన వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మైదీన్ కు రూ.78 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు పోలీసులు గుర్తించారు. మైదీన్ 3వేల టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణా చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.

 

నంద్యాలలో ఉద్రిక్తత

కర్నూలు : నంద్యాల సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత మధు వాహనంపై దుండగులు దాడి చేశారు. వైసీపీ కార్యకర్తలే దాడి చేశారని టీడీపీ నేత మధు ఆరోపిచారు. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగిన అనంతరం దాడులు చేసుకున్నారు. ఘటనా స్థలికి వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

12:39 - August 24, 2017

వరంగల్ : కాకతీయ యూనివర్సిటీని 40 ఏళ్ల కాలంలో అనేక భూకుంభకోణాలు చుట్టుముట్టాయి. విలువైన భూములను కేయూ అధికారులు అప్పన్నంగా ధారాదత్తం చేశారు. మరోవైపు అధికారుల అండదండలతో కబ్జాసురులు రెచ్చిపోయారు. నకిలీ పత్రాలు సృష్టించి కోట్లాది విలువైన భూములను ఆక్రమించారు. ఇక డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణ యూనివర్సిటీ పరువును గంగలో కలిపాయి. అధికారుల నిర్వాకం ముక్కున వేలేసుకునేలా చేసింది.   
కేయూలో భూస్కాంలు, ఆక్రమణలు 
భూకుంభకోణాలు, భూ ఆక్రమణలు కాకతీయ యూనివర్సిటీ ఘనమైన చరిత్రకు మకిలి పట్టించాయి. న్యాక్‌ గ్రేడ్‌తో పాటు ఉన్నతవిద్యలో దేశంలోనే 38వ స్థానంలో నిలిచిన కాకతీయ యూనివర్సిటీ పరువును దిగజార్చాయి. కేయూ ఏర్పాటైన 38 ఏళ్ల కాలంలో పలు ప్రభుత్వ సంస్ధలకు అధికారులు భూములను ధారాదత్తం చేశారు. వీటికి తోడు భూ ఆక్రమణలు పెచ్చుమీరాయి. వరంగల్‌లో భూముల ధరలకు రెక్కలు రావడంతో నగరం నడిబొడ్డున ఉన్న యూనివర్సిటీ భూములపై రియల్టర్ల కన్నుపడింది. పాత రికార్డులు సృష్టించి సుమారు 50 కోట్లు విలువ చేసే 10 ఎకరాల భూమిని కబ్జాచేశారు. మరికొందరు అధికారుల అండదండలతో నకిలీ పత్రాలతో కేయూ భూములను కొట్టేశారు. 
భూకబ్జాలపై ఫిర్యాదుల వెల్లువ 
పలివేల్పులలో కేయూ భూములు ఆక్రమణకు గురయ్యాయని పోలీస్‌ ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. పలివేల్పుల, పెగడపల్లి, దూరవిద్యా కేంద్రం పాతభవనం ప్రాంగణంలో భూములు అన్యాక్రాంతమయ్యాయి. సర్వే నెంబర్ 214, 413, 414లో అక్రమ కట్టడాలు వెలిశాయని విద్యార్థి సంఘాలతో పాటు అధ్యాపక సంఘాలు పోరుబాట పట్టాయి. ఫార్మసీ కళాశాల వెనుకభాగంలోని 214  సర్వే నెంబర్ లోని భూమి కూడా కబ్జా చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 5.38 ఎకరాల ఈ ప్రభుత్వ భూమిపై కోర్టులో వివాదం కొనసాగుతోంది. 
కేయూ భూముల ఆక్రణలపై 10టీవీ వరుస కథనాలు 
కేయూ భూముల ఆక్రమణలపై టెన్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతోపాటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఉద్యమాలకు అండగా నిలవడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది.  కేయూ భూముల సమగ్ర సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు కేయూ పరిధిలో ఉన్న భూమి ఎంతో తెలియక అధికారులు తికమకపడుతున్నారు. గత్యంతరం లేక భూముల సమగ్ర సర్వే చేయాలని అప్పటి కలెక్టర్ కిషన్‌, వీసీ వెంకటరత్నం లేఖ రాశారు. అయినా ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ప్రభుత్వం ఆదేశించినా సర్వేకు కేయూ అధికారులకు సమన్వయం లేదు. ప్రస్తుతం పలివేల్పుల శివారులోని 412, 413, 414 లోని సర్వే నెంబర్లలో సుమారు 2.20 ఎకరాల భూమి కబ్జాకు గురైందని యూనివర్సిటీ అధికారులు చెబుతుండగా.. అవి తమ భూములంటూ ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకెక్కడం చర్చనీయాంశమైంది. 
అధికారుల నిర్లక్ష్యం
యూనివర్సిటీకి ఉన్న భూములెన్నో సరైన రికార్డులు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విద్యార్ధిసంఘాలు మండిపడుతున్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం 640 నుంచి 650 ఎకరాల యూనివర్సిటీ భూమిలుగా ఉండగా.. కాకతీయ కెనాల్ ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతంలో ఆక్రమణలు భారీగా జరిగాయి. క్యాంపస్ చుట్టూ హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో కబ్జారాయుళ్లకు హద్దే లేకుండా పోయింది. వీరిలో పలువురు కేయూ ఉద్యోగులు ఉన్నారన్న ఆరోపణలున్నాయి. 
పరీక్షల నిర్వహణలో లోపాలు 
కేయూలో భూకుంభకోణాల విషయం అలా ఉంటే.. పరీక్షల నిర్వహణ లోపాలు యూనివర్సిటీ పరువుని మంటగలిపాయి. తప్పుల మీద తప్పులు జరుగుతున్నా మార్పులు రావడం లేదు. సాంకేతిక కారణాలతో తోసిపుచ్చుతున్నా.. అసలు కారణాలను అన్వేషించడంలో పరీక్షల విభాగం అధికారులు విఫలం అవుతున్నారు. 2016-2017 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ  సంవత్సరాల ఫలితాలను విడుదల చేశారు. కానీ అందులో దొర్లిన తప్పులు విద్యార్థులకు చుక్కలు చూపించాయి. కొందరికి గైర్హాజరు అయినట్లు  మెమోలు రాగా.. మరికొందరికి ఇంటర్నల్‌ మార్కులు లేక ఫెయిల్‌ మార్కుల జాబితాలు అందాయి. ఇంకొందరికి ప్రాక్టికల్‌ ఎగ్జామ్‌ మార్కులు పడలేదు. సుమారు 300 మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాసినా గైర్హాజరు అయినట్లు చూపించారు. ఈ వార్షిక పరీక్షలు 1.25 లక్షల మంది భవిష్యత్తుకు సంబంధించినవైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో...మార్కుల అంశం తప్పుల తడకగా మారింది. 
రీవాల్యూయేషన్‌ నిర్వాహణపై ఆరోపణలు 
ఇక 100 మార్కుల పేపర్‌కు 105 మార్కులు ఇచ్చిన ఘనత కేయూ పరీక్షల విభాగపు అధికారులకే దక్కింది. ఊహ అనే బీఎస్సీ విద్యార్థిని తనకు మ్యాథ్స్‌ పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని పున:మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకుంటే..  105 మార్కులు వచ్చినట్లు మెమోను పంపించారు. ఆశ్చర్యపడ్డ విద్యార్థిని పరీక్షల విభాగానికి మళ్లీ ఫిర్యాదు చేయడంతో.. అధికారులు అవాక్కయి చేసిన తప్పును ఆఘమేఘాల మీద సరిదిద్దుకున్నారు. రీవాల్యూయేషన్‌ నిర్వాహణపై ఆరోపణలు ఉన్నాయి. అధికారుల చేయితడిపితే ఈజీగా పాస్‌ చేయిస్తారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల బీటెక్‌ రీవాల్యూయేషన్‌ ఫలితాల్లో అభ్యర్థులకు అధికంగా మార్కులు వేసి మెమోలను పంపడమే ఆరోపణలకు బలం చేకూర్చుతుంది. పరీక్షల విభాగంలో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి రావడంతో.. విద్యార్థులు ఉద్యమించారు. 
కేయూ నిత్యం ఆందోళనలు 
కేయూ నిత్య ఆందోళనలతో అట్టుడుకుతోంది. వీసీ సహా బాధ్యులైన అధికారులను వెంటనే తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కంటి తుడుపు చర్యగా ఇద్దరు కింది స్థాయి అధికారులను దీనికి బాధ్యులుగా  వేటు వేయడం అగ్నికి ఆజ్యం పోసింది. రిజిస్ట్రార్‌ హయాంలోనే ఇలాంటి అక్రమాలకు తెరతీశారని.. ఆయనను వెంటనే తొలగించాలని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
డిగ్రీ వార్షిక పరీక్ష ఫలితాల్లో తప్పిదాలు
డిగ్రీ వార్షిక పరీక్ష ఫలితాల్లో వెలుగు చూసిన తప్పిదాలు, పీహెచ్డీ, ఎంఫిల్ ప్రవేశ ఫలితాల్లో అధికారుల నిర్లక్ష్యం, ఇంజినీరింగ్ విద్యార్థుల పున:మూల్యాంకనంలో చోటుచేసుకున్న అక్రమాలు.. కేయూ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చిపెట్టాయి. పరీక్షల అదనపు అధికారులు ఆచార్య పి.మల్లారెడ్డి, ఆచార్య టి.శ్రీనివాసరావు రాజీనామా, కంప్యూటర్ ఇన్ఛార్జి ఎండీ.జహీర్అహ్మద్ బదిలీ,  విద్యార్థి సంఘాల నిత్య ఆందోళనలపై ఒకవైపు ముఖ్యమంత్రి కార్యాలయం, మరోవైపు గవర్నర్ కార్యాలయం ఆరా తీస్తున్నాయి. ఇంటిలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నాయి. కేయూ ఉప కులపతి ఆచార్య ఆర్.సాయన్న తీరుపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ స్నాతకోత్సవం ఏటా పండుగలా జరిగేది. అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఘనంగా నిర్వహించేవారు. కొన్నేళ్లుగా స్నాతకోత్సవం రెండు, మూడేళ్లకోసారి మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. సమస్యలతో సహవాసం చేస్తూనే.. కాకతీయ విశ్వవిద్యాలయం.. 40 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. 41వ పడిలోనైనా తప్పులు సరిదిద్దే చర్యలకు.. విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను ఇనుమడింప చేసేందుకు.. అధికారులు పునరంకితం కావాలని, విద్యావేత్తలు, ఉత్తర తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. 

ఇద్దరు అరబ్ షేక్ లు అరెస్ట్....

రంగారెడ్డి : మైలార్ దేవ్ పల్లి అక్బర్ నగర్ లో ఇద్దరు అరబ్ షేక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. 15 రోజుల క్రితం యువతికి డబ్బులిచ్చి పెళ్లి చేసుకున్న అరబ్ షేక్, తన సోదరుడికీ మైనర్ బాలికతో పెళ్లి జరిపించేందుకు యత్నం చేశారు. పెళ్లి ఒప్పంద పత్రలు, పెళ్లి ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రోకర్ లకు కూడా అరెస్ట్ చేసి విచారింస్తున్నారు.

 

12:29 - August 24, 2017

వరంగల్ : రాష్ట్రంలో యువత బంగారు భవితకు బాటలు వేయాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయం పూర్తిగా వట్టిపోతోంది. పరిశోధనలకు ప్రాణం పోయాల్సిన వర్సిటీ నిర్వీర్యమైపోతోంది. సరైన సంఖ్యలో అధ్యాపకుల్లేక, కనీస స్థాయిలో సిబ్బందిలేక, చివరికి నడిపించే సారథులే లేక వాడిపోతున్నాయి.. విజ్ఞాన కేంద్రాలు విలసిల్లాల్సిన చోట అడ్డగోలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.. కనీస మౌలిక సదుపాయాలూ లేక కునారిల్లిపోతున్నాయి. 
కేయూ మనుగడ ప్రశ్నార్థకం 
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కాకతీయ విశ్వవిద్యాలయం మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎంతో ప్రఖ్యాతి గాంచిన కేయూ రానురాను తన ప్రాభవాన్ని కోల్పోతోంది. కాకతీయ విశ్వవిద్యాలయంలో మంజూరైన పోస్టుల్లో సగం సిబ్బంది కూడా లేరు. ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలో 4 బ్రాంచీలు ఉన్నాయి. వాటికి 60 మంది బోధనా సిబ్బంది కావాలి. కానీ ఉన్నది 11 మందే. దీంతో రూ.16 కోట్ల వరకు అందాల్సిన టెక్విప్ నిధులు రాని పరిస్థితి.
మసకబారుతున్న కేయూ ప్రాభవం 
మొన్నటి దాక రెగ్యులర్ వీసీ లేరన్న సాకుతో నెట్టుకొచ్చిన యూనివర్సిటీలో.. ప్రస్తుతం ఆ లోటు భర్తీ చేసినా....  సమస్యలు, ఆందోళనలు, ఘర్షణలు, కుంబకోణాలు నిత్యకృత్యమయ్యాయి. గతేడాది జులై 25వ తేదీన కేయూ 11వ వీసీగా ఓయూ భౌతికశాస్త్రం విశ్రాంత ఆచార్యులు రొడ్డ సాయన్న బాధ్యతలు స్వీకరించారు. ఏడాది పాలనలో సాయన్న యూనివర్సిటీకి చేసేందేమి లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీలో ఎక్స్‌పర్ట్‌ కమిటీ జాడే లేదు. దీంతో విధాన పరమైన నిర్ణయాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏటా సమయానికి కౌన్సెలింగ్ జరగాలి. దీనికి భిన్నంగా అధికారులు వ్యవహరించడంతో తరగతులు చాలా ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. విద్యార్థులు, బోధనేతర సిబ్బంది సమస్యలతో సహవాసం చేస్తున్నారు. 
సెమిస్టర్ విధానంపై విమర్శల వెల్లువ  
2001లో అప్పటి ఉపకులపతి ఆచార్య చంద్రకాంత్‌కోకాటే పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే కొన్నాళ్లకే ఈ విధానం అభాసుపాలైంది. సకాలంలో ప్రవేశాలు నిర్వహించకపోవడం, తరగతులు, బోధన ఆలస్యం కావడం,  పరీక్షల నిర్వహణలో లోపాలు, ఫలితాల వెల్లడిలో జాప్యం సెమిస్టర్ విధానానికి శాపంగా మారాయి. కేయూ అందిస్తున్న 46 కోర్సుల్లో సెమిస్టర్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు ఎంబీఏ, ఎంసీఏ, లా, ఫార్మసీ, ఇంజినీరింగ్, విద్యా కోర్సుల్లో ఈ విధానం అమల్లో ఉంది. అయితే సెమిస్టర్‌ విధానం ప్రవేశపెట్టి ఏళ్లు గడుస్తున్నా ప్రగతి సాధించలేకపోయారన్న విమర్శలున్నాయి. కేయూలో వీసీలు, పరీక్షల నియంత్రణ అధికారులు మారినా సెమిస్టర్ పరీక్షలు మాత్రం అనుకున్న సమయానికి జరగడంలేదు. ప్రవేశాలు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగకపోవడంతో ఈ నూతన విధానం విద్యార్థులకు భారంగా మారిందనే విమర్శలున్నాయి. 
ప్రైవేట్ కాంట్రాక్టర్, విద్యార్ధులకు మధ్య గొడవలు 
కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతిగా ప్రొఫెసర్ వెంకటరత్నం మూడేళ్ల పదవి కాలంలో అనేక వివాదస్పద నిర్ణయాలు తీసుకున్నారు. 2012లో యూనివర్సిటీలోని కామన్ మెస్‌ను ప్రైవేట్ పరం చేయడం విద్యార్థుల్లో అగ్గిరాజేసింది. దీనికి వ్యతిరేకంగా విద్యార్ధి సంఘాలు రెండేళ్లుగా పోరు కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్, విద్యార్ధులకు మధ్య గొడవలు నిత్యకృత్యమయ్యాయి. 
వీసీ వెంకటరత్నం పదవికాలంలో వివాదాస్పద నిర్ణయాలు  
కేయూ పరిధిలోని కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో స్కాలర్ షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు దుర్వినియోగం కావడంతో..నలుగురు ఉద్యోగులపై కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండా బోధన, బోధనేతర సిబ్బందిని వీసీ ఇష్టారీతిన నియమించారన్న ఆరోపణలున్నాయి. వివిధ విభాగాల్లో సుమారు 200 మందికి పైగా నియామకాలు చేపట్టారని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అక్రమ నియామకాల అంశం కేయూను కుదిపేస్తోంది.

 

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు...

ముంబై :స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 15 పాయింట్ల స్వల్ప లాభంతో ఉండగా, నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.

12:21 - August 24, 2017

వరంగల్ : ఉత్తర తెలంగాణ విద్యాలయాలకు పెద్ద దిక్కు.. ఉద్యమ చైతన్యానికి పురిటిగడ్డ. ప్రతిభకు పట్టం కట్టే ఆలయంగా భాసిల్లింది. మెరికల్లాంటి ప్రతిభావంతులను దేశానికి అందించింది. అంతటి ఘనమైన కీర్తిని సాధించిన కాకతీయ విశ్వవిద్యాలయం..నేడు ప్రాభవాన్ని కోల్పోతోంది. నిత్యం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారుతోంది. కనీసం స్నాతకోత్సవం కూడా జరుపుకోలేని దుస్థితికి చేరింది. కేయూ పురుడు పోసుకుని నలభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా 10టీవీ ప్రత్యేక కథనం. 
విశ్వ విద్యానిలయం.. నాలుగు దశాబ్దాల ప్రస్థానం 
ఇదీ... కాకతీయుల కాలంలో పురుడుపోసుకున్న కాకతీయ విశ్వ విద్యానిలయం నాలుగు దశాబ్దాల ప్రస్థానం తీరు. నాక్ ఏ గ్రేడ్‌ను సొంతం చేసుకోవడమే కాదు... ఉన్నత విద్యలో దేశంలోనే 38వ స్థానంలో నిలిచి దేశ, విదేశీ విద్యార్థులను ఆకర్షించింది. ఇంతటి ఘనకీర్తి సాధించిన కాకతీయ విశ్వవిద్యాలయం భూకుంభకోణాలు, ఆక్రమణలు, పరీక్షల నిర్వహణ లోపాలు యూనివర్సిటీ పరువును గంగలో కలిపాయి. 
1976 ఆగస్టు 19న  కేయూ ఆవిర్భావం 
తెలుగు రాష్ట్రాల్లో వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులను తీర్చిదిద్దింది. విద్యా వ్యవస్థలో తెలంగాణలో ఉస్మానియా తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయానిదే అగ్ర తాంబూలం. విలువలతో కూడిన విద్యనందిస్తూ విద్యార్థుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది. కాకతీయుల కాలంలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించిన విద్యారణ్యుడి పేరుతో..  హన్మకొండకు మూడు కిలోమీటర్ల దూరంలో.. 1976 ఆగస్టు 19న కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. నాలుగు కోర్సులతో ప్రస్థానాన్ని మొదలుపెట్టి 42 కోర్సులను అందించే స్థాయికి ఎదిగింది. 
అంచెలంచెలుగా ఎదిగిన కేయూ 
ఎన్ని అవరోధాలు ఎదురైనా అంచెలంచెలుగా ఎదిగిన కేయూ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులకు వరంగా మారింది. ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పడ్డ ఈ విశ్వ విద్యాలయంలో 20 దేశాలకు చెందిన విద్యార్థులు ఈ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు. కేయూ పరిధిలో 230 డిగ్రీ, 66 పీజీ ఏడు ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి, 28 ఎంబీఏ, 22 ఎంసీఏ, 32 ఫార్మసీ, 48  బీఈడీ కాలేజీలున్నాయి. సర్టిఫికెట్ , డిప్లమో, యూజీ, పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు, ఫార్మసీ, ఇంజినీరింగ్, పీహెచ్ డీ కోర్సులను అందిస్తోంది. వర్సిటీ పరిధిలో 570 అఫిలియేటెడ్  కాలేజీలున్నాయి. కేయూ పరిధిలో రెండున్నర లక్షల మంది విద్యార్థులు పలు కోర్సులు చదువుతున్నారు. దీంతోపాటు దూర విద్యా కేంద్రం ద్వారా డిగ్రీ, పీజీ కోర్సులు అందిస్తోంది. 270 మంది అధ్యాపకులు, మరికొంత మంది పార్ట్ టైం, కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. 750 మంది బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 
బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఓ వేదిక
కాకతీయ యూనివర్సిటీలో చదవడం ప్రతి విద్యార్థికి ఓ కల...బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఓ వేదిక. నిపుణులైన ఆచార్యులు, అధునాతనమైన ప్రయోగశాలలు, జాతీయ అంతర్జాతీయ సదస్సులు, వేల పుస్తకాలతో కూడిన లైబ్రరీ, సకల సదుపాయాలు కేయూ సొంతం. అవకాశాల స్వర్గధామం అనే అభిప్రాయంతో ప్రతీ విద్యార్థి భావిస్తాడు. యూనివర్సిటీలో సీటు కోసం డిమాండ్ ఎక్కువ. సైన్స్ లో సీటు కోసం వేల మంది పోటీ పడేవారు. క్రమ క్రమంగా ఎదిగి నాక్ ఏ గ్రేడ్ సాధించిన ఘనత కేయూది. దేశంలోనే 38 వ స్థానంలో నిలిచి ఉన్నత విద్యకు, ఉత్తమ ప్రమాణాల అందించే విశ్వవిద్యాలయంగా ఖ్యాతి గడించింది. అయితే రాను రాను విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. విద్యార్థుల అంచనాలను అందుకోవడంలో వర్సిటీ విఫలమవుతోంది. యువతలో స్థైర్యం నింపడంలో కేయూ పూర్తిగా చతికిల పడుతుందన్న విమర్శలు వెల్లువెతుతున్నాయి. 

 

పంచాయితీరాజ్ ఏఈ జేవి శ్రీకాంత్ ఆత్మహత్య...

జగిత్యాల: జిల్లాలో ఎండపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పంచాయితీరాజ్ ఏఈ జేవి శ్రీకాంత్ ఉరేసుకొని ఆత్యహత్య చేసుకుంన్నాడు. మంచిర్యాల జిల్లాలో ఏఈగా పనిచేస్తున్న శ్రీకాంత్ 3నెలల కిత్రమే ప్రేమ వివాహం చేసుకున్నాట్లు సమాచారం. శ్రీకాంత్ మరణనికి అధికారుల వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.

 

12:17 - August 24, 2017

కొన్ని సంవత్సరాల అనంతరం 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన 'చిరంజీవి' తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఫైట్స్..డ్యాన్స్ లతో అదరగొట్టేశాడు. అనంతరం 151వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా విరామం తీసుకున్న 'చిరు' మళ్లీ మేకప్ వేసుకోబోతున్నాడు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ తేజ నిర్మాణ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా పూజా కార్యక్రమాలు నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆగస్టు 22వ తేదీన 'చిరంజీవి' బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకర్షించింది. 'సైరా నరసింహారెడ్డి' ఎవరు నటించనున్నారో చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ సందర్భంగా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించే వారు, సాంకేతిక నిపుణుల జాబితాను కూడా ప్రకటించారు.

బాహుబలి మించేలా చిత్రం ఉంటుందని, ఇందుకు పేరొందిన హాలీవుడ్ టెక్నీషీయన్స్ పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'చిరంజీవి' స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ మెగాస్టార్ 'అమితాబ్ బచ్చన్' ఈ సినిమాలో నటిస్తున్నారు. ఏ పాత్రలో నటించబోతున్నారనేది తెలియ రావడం లేదు. స్టైలిష్ విలన్ గా పేరొందిన 'జగపతి బాబు' కూడా నటిస్తున్నారు.

క‌న్నడ స్టార్ 'కిచ్చా సుదీప్' కూడా ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేయబోతున్నారు. 'బాహుబలి' సినిమాలోనూ కిచ్చా సుదీప్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. క్వీన్ ఆఫ్ ఆఫ్ సౌతిండియా సిల్వర్ స్క్రీన్ నయనతార ఈ చిత్రంలో నటిస్తోంది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. పలు భాషల్లో సినిమాను రూపొందించనున్నట్లు, అక్కడి మార్కెట్ ను కూడా కొల్లగొట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోందంట. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి. 

భారీగా నక్సల్స్ డంప్ స్వాధీనం...

చత్తీస్ గఢ్ : సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయి. సుక్మాలోని జంపెడ్ ప్రాంతంలో భారీగా నక్సల్స్ డంప్ ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. భారీగా తుపాకులు, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, గ్రెనేడ్లు, మందుగుండు సామాగ్రి, టిఫిన్ బాంబులు, విద్యుత్ వైర్లతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి.

8ఐటీ కంపెనీలను ప్రారంభించిన మంత్రి లోకేష్...

విశాఖ:ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విశాఖ లో 8 ఐటీ కంపెనీలను ప్రారంభించారు. ‘ఏపెక్స్‌’ కంటెంట్‌ సొల్యూషన్స్‌, వెంటర్‌ ఆఫ్‌షోర్‌ ఇన్‌ఫర్మాటిక్స్‌, ఐడీఏ ఆటోమేషన్‌, జీవా డిజిటల్‌ సర్వీసెస్‌, అవ్యా ఇన్‌వెట్రాక్స్‌, వర్చువల్‌ గార్డ్‌ సర్వీసెస్స్‌, అమ్‌జూర్‌ ఇన్ఫోటెక్‌, విస్మయ ప్రీమీడియా సంస్థలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. ఈ కంపెనీలు 770 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి.

ఓయూలో వీసీ లాడ్జ్ వద్ద ఎస్ ఎఫ్ఐ ఆందోళన

హైదరాబాద్ : ఓయూలో వీసీ లాడ్జ్ వద్ద ఎస్ ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన చేశారు. మెస్ డిపాజిట్లను రద్దు చేసి మెస్ లు, హాస్టళ్లను వెంటనే ప్రాంరంభించాలని డిమాండ్ చేశారు.

 

12:00 - August 24, 2017

ఢిల్లీ : వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యక్తిగత గోప్యతపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు తదితర వాటికి ఆధార్‌ కార్డును తప్పనిసరి చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆధార్‌పై విచారించేందుకు ఏర్పాటుచేసిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఈ విషయంలో ముందుగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా, కాదా అన్న అంశంపై చర్చ జరగాలని తేల్చింది. దీంతో ఈ విషయంపై చర్చించేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. కొద్ది రోజులపాటు వాదోపవాదాలు విన్న విస్త్రత రాజ్యాంగ ధర్మాసనం.. ఆగస్టు 2న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కిందకు వస్తుందని తీర్పు వెల్లడించింది. 

 

11:58 - August 24, 2017

ఢిల్లీ : కేంద్రంలోని నరేంద్రమోది ప్రభుత్వం త్వరలో క్యాబినెట్‌ విస్తరించనుంది. ఆగస్ట్‌ 27 లేదా 28 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ విస్తరణలో బిజెపికి చెందిన కొంతమంది మంత్రులను తొలగించే అవకాశం ఉంది. రైల్వేమంత్రి సురేష్‌ ప్రభును మంత్రి పదవి నుంచి తప్పించవచ్చు. వరుస రైల్వే ప్రమాదాలు చోటుచేసుకోవడంతో కేంద్ర రైల్వేమంత్రి సురేష్‌ ప్రభు రాజీనామాక సిద్ధపడ్డ విషయం తెలిసిందే. మంత్రివర్గ విస్తరణలో బిహార్‌లో బిజెపితో జతకట్టిన జెడియుకు చోటు దక్కనుంది. నూతనంగా రక్షణమంత్రిని నియమించే అవకాశం ఉంది. మనోహర్‌ పారీకర్‌ రాజీనామాతో అరుణ్‌జైట్లీ అదనంగా రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

11:53 - August 24, 2017

యంగ్ టైగర్ నటించిన 'జై లవ కుశ' సినిమా అప్పుడే షూటింగ్ పూర్తయిందా ? సెప్టెంబర్ 3న రిలీజ్ అవుతుందా ? అని ఆశ్చర్యపోతున్నారా ? అసలు విషయం అది కాదు.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా దర్శకుడు 'బాబీ' దర్శకత్వంలో 'ఎన్టీఆర్' సోదరుడు 'కళ్యాణ్ రామ్' 'జై లవ కుశ' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో ఎన్టీఆర్ ఏకంగా మూడు పాత్రలు పోషిస్తుండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా టీజర్..పోస్టర్స్ విడుదలై విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది.

వినాయక చవితి సందర్భంగా 24న 'లవ' టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. నెలాఖరు కల్లా 'కుశ' టీజర్ ను విడుదల చేయాలని చిత్ర బృందం శరవేగంగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ రిలీజ్ చేసిన అనంతరం ఆడియో రిలీజ్ వేడుకను అట్టహాసంగా జరిపించాలని చిత్ర యూనిట్ యోచిస్తోందంట. సెప్టెంబర్ 3వ తేదీన హైదరాబాద్ లో ఆడియో విడుదల చేయాలని ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఎన్టీఆర్ సరసన 'నివేదా థామస్', 'రాశీ ఖన్నా'లు హీరోయిన్ లు గా నటించిన ఈసినిమా సెప్టెంబర్ 21 రిలీజ్ కానుంది. 

నంద్యాలలో గెలుపు టీడీపీదే : లగడపాటి

ఢిల్లీ : నంద్యాలలో టీడీపీదే గెలుపని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని, సర్వే అంచనా అని పేర్కొన్నారు. సాధారణంగా ఉపఎన్నికకు అంత ప్రాధాన్యం ఉండదు. మూడేళ్ల నుంచి ఎలాంటి ఎన్నిక జరగనందున నంద్యా ఉపఎన్నికకు ప్రాధ్యానత ఏర్పడిందని లగడపాటి రాజగోపాల్ తెలిపారు.

 

11:51 - August 24, 2017

సిరిసిల్ల : ఒకప్పుడు ఆత్మహత్య ఖిల్లాగా పేరు పొందిన సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇప్పుడు చేతినిండా పని లభిస్తోంది. నేత వస్త్రాలు ఆదరణకు నోచుకోకపోవడంతో పొట్టగడవక పస్తులున్న చేనేత కార్మికుల నోట్లోకి ఇప్పుడు నాలుగువేళ్లు వెళ్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సిరిసిల్ల చేనేత కార్మికలు జీవితాల్లో వెలుగులు నింపుతోంది. సిరిసిల్ల నేతన్నలకు బతుకునిస్తున్న బతుకమ్మ చీరల తయారీపై 10 టీవీ ప్రత్యేక కథనం.. 
సిరిసిల్ల చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి
సిరిసిల్ల చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. ఒకప్పుడు సిరుల ఖిల్లా. ఆ తర్వాత చేనేత వస్త్రాలకు ఆదరణ కరవు అవ్వడంతో  ఆత్మహత్యల ఖిల్లాగా మారింది. నేత వస్త్రాల తయారీ కోసం చేసిన అప్పులు తీరక చాలా మంది  చేనేత కార్మికులు  తనవుచాలించారు. వీరి బతుకులు ఛిద్రమైపోయాయి. ఈ సంక్షోభానికి తరుణోపాయం లేకపోవడంతో నేతన్నలు చాలా కాలం అష్టకష్టాలు పడ్డారు. కానీ  తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బతుకమ్మ చీరల కార్యక్రమం  సిరిసిల్ల చేనేత కార్మికులను పస్తులు, ఆత్మహత్యల దుస్థితి నుంచి గట్టెక్కించింది. 
తెలంగాణలో పెద్ద పండుగ బతుకమ్మ 
తెలంగాణలో బతుకమ్మ పెద్ద పండుగ. వచ్చే నెలలో జరిగే ఈ పండుగకు ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బతుకమ్మ చీరల తయారీకి అన్ని చేనేత సహకార సంఘాలకు ఆర్డర్లు ఇచ్చింది. దీంతో రకరకాల డిజైన్లతో రంగు రంగుల చీరలు రూపుదిద్దుకుంటున్నాయి. దాదాపు 40 వేల మగ్గాలకు పని లభిస్తోంది. ముప్పైవేల మంది కార్మికులకు ఉపాధి  దొరుకుతోంది. మూడున్నర కోట్ల రూపాయల వస్త్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయిచింది. బతుకమ్మ పండుగ కోసం 80 లక్షల చీరలు తయారు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ బతుకుల్లో  మళ్లీ వెలుగులు నిండుతున్నాయని నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
బతుకమ్మ చీరలతో మీ.2.25 రూ. 
గతంలో రోజులో 12 గంటలు కష్టపడ్డా మీటరు వస్త్రం తయారీకి డెబ్బై పైసలు కూడా లభించేదికాదు. బతుకమ్మ చీరలతో ఇప్పుడు మీటరుకు 2.25 రూపాయలు లభిస్తోంది. గతంలో వారం రోజులు కష్టపడితే 15 వందల రూపాయలు వచ్చేవి. ఇప్పుడు నాలుగు వేల రూపాయలు లభిస్తోంది. 
చేనేత వస్త్రాల కొనుగోలుకు శాశ్వత చర్యలు 
ఒక బతుకమ్మకే కాకుండా ఎప్పుడూ ఇలాగే చీరలు పంచే విధంగా చర్యలు తీసుకుకోవడంతోపాటు, చేనేత వస్త్రాల కొనుగోలుకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. బతుకమ్మ చీరలే కాదు... రాజీవ్‌ విద్యా మిషన్‌ కింద కూడా కోటి ఇరవై లక్షల మీటర్ల వస్త్రాన్ని సిరిసిల్ల నేత కార్మికల నుంచే కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో కార్మిక ఉపాధికా ఢోకా ఉండదని భావిస్తున్నారు. 

 

11:42 - August 24, 2017

హీరో..హీరోయిన్లకు ఎంతో మంది అభిమానులు ఉంటుంటారు. వారి చిత్రాలు విడుదలవుతుంటే వారి ఆనందానికి అవధులుండవు. థియేటర్లను అందంగా తీర్చిదిద్దేస్తారు. హీరో..హీరోయిన్ల కటౌట్లకు పాలాభిషేకాలు..పూలమాలలతో ముంచెత్తుతుంటారు. ముఖ్యంగా తమిళ అభిమానుల ఈ విషయంలో ముందుంటారు. అగ్ర హీరోల సినిమాలు విడుదలవుతున్న సందర్భంలో ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తాజాగా 'అజిత్' హీరోగా నటించిన 'వివేగం' సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు వినూత్నంగా సంబరాలు చేసుకున్నారు.

తమిళనాడులో అగ్ర హీరోల్లో ఒకరైన 'అజిత్' తాజా చిత్రం 'వివేగం' ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైంది. 'వేదాళం' సినిమా విడుదలై దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తోంది. సత్యజోతి ఫిలింస్ బ్యానర్ పై 'సిరుతై శివ' దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో 'వివేగం' చిత్రం తెరకెక్కింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, అక్షరలతో పాటు పలువురు హాలీవుడ్ స్టంట్ ఆర్టిస్టులు నటించారు.

ఇదిలా ఉంటే చిత్రం రిలీజ్ సందర్భంగా ఆయన అభిమానులు ఏకంగా 57 కిలోల బరువున్న ఇడ్లీని 'అజిత్' ఆకృతిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు సమైయల్ కలై తాలజాలర్ మున్నేట్ర సంఘం కార్యదర్శి ఇనియావన్ మీడియాతో మాట్లాడారు. ఇది అజిత్ కు 57వ సినిమా కావడంతో 57 కిలోల ఇడ్లీని తయారు చేసినట్లు పేర్కొన్నారు. మరి వివేగం అజిత్ అభిమానులను అలరిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

జ‌మ్మూక‌శ్మీర్‌లో స్వ‌ల్ప భూకంపం...

శ్రీన‌గ‌ర్ : జ‌మ్మూక‌శ్మీర్‌లో స్వ‌ల్ప స్థాయి భూకంపం వ‌చ్చింది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 5.0గా న‌మోదు అయ్యింది. తెల్ల‌వారుజామున 2.28 గంట‌ల‌కు భూ ప్ర‌కంన న‌మోదు అయిన‌ట్లు అధికారులు చెప్పారు. ప్రాణ‌, ఆస్తి న‌ష్టం ఏమీ జ‌ర‌గ‌లేద‌న్నారు.

రోయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను ముట్టడించిన కార్మికులు....

నెల్లూరు: ఇందుకూరుపేట మండలంలోని రొయ్యల ప్రాసెపింగ్ ఫ్యాక్టరీలను రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు ముట్టడించారు. సాయి మైరైన్, స్టార్ ఆగ్రో మెరైన్, ఫైవ్ స్టార్ న్ రోయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల ఎదుట ఆందోళన నిర్వహించారు. వ్యర్థ జలాలను పంట కాల్వలో కలపడం వల్ల పంట పొలాలు నాశనం అవుతున్నాయని, ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపిస్తున్నారు. జగదేవ్ పేట, దేవిపెట, గంగపట్నం, జేజేపేట గ్రామస్తులు కలిసి ఆందోళన చేశారు.

 

11:33 - August 24, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని గుండాల వైన్‌ షాపులో చోరీ జరిగింది. ఆ చోరీ అంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ నెల 21న అర్ధరాత్రి వైన్‌ షాపులో చోరీ జరిగింది. ముత్తాపురం గ్రామానికి చెందిన యువకుడు పూనెం లక్ష్మీ నారాయణ.. సుమారు 40 వేల నగదు అపహరించాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయ్యింది. బనియన్‌ని ముఖానికి కట్టుకొని అర్ధనగ్నంగా షాపు వెంటిలేటర్‌ నుండి దూరాడు. కౌంటర్‌లో ఉన్న డబ్బును ప్యాంటు జేబులో వేసుకున్నాడు. డబ్బు చాలా ఉన్నప్పటికీ ప్యాంట్‌ జేబులో పట్టకపోవడంతో.. 40 వేలు తీసుకెళ్తూ చివరగా ఒక మద్యం బాటిల్‌ని కిటికీ నుంచి బయటకు విసిరాడు. తరవాత వెంటిలేటర్‌ నుంచి బయటకు వెళ్లిపోయాడు. మరుసటి రోజు షాపు యజమాని వచ్చి చూసే సరికి దొంగతనం జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులను  ఆశ్రయించారు. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో పూనెం లక్ష్మీనారాయణ పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 26 వేలు రికవరీ చేశారు. చోరీ జరిగిన 24 గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. 

 

వైసీపీ ఎమ్మెల్యేగిడ్డి ఈశ్వరి కాలికి గాయం...

విశాఖ : పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మెట్లపై నుంచి జారిపడటంతో కాలుకు తీవ్ర గాయమైంది. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించడంలో భాగంగా ఆమె కాకినాడలో ఉన్నారు. మంగళవారం ఉదయం కాకినాడలో ఆమె ఉన్న భవనంలోని మెట్లు దిగుతుండగా అకస్మాత్తుగా కాలు జారి పడిపోయారు. దీంతో ఆమె ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది. కాలు లోపల ఎముక విరిగిపోవడంతో చికిత్సలు చేయించుకున్నారు. విశ్రాంతి పొందేందుకు మంగళవారం రాత్రి పాడేరు చేరుకున్నారు.

11:31 - August 24, 2017

హాంకాంగ్‌ : మకావు దీవులతో పాటు చైనాలోని హాంకాంగ్‌ను.. హటో తుపాన్‌ అతలాకుతలం చేస్తోంది. పెర్ల్‌ నది డెల్టాకు పశ్చిమదిశగా ఉన్న మకావులో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. జలమయమైన లోతట్టు ప్రాంతాల్లోని వేల మంది ప్రజలను.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హాంకాంగ్‌లోని ప్రముఖ విక్టోరియా హార్బర్‌లో హటో తుపాన్ ఏర్పడింది. తుపానుతో భారీగా ఆస్తినష్టం సంభవించింది. విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుపాను కారణంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు మూతపడ్డాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:27 - August 24, 2017

కడప : జిల్లాలో రాత్రి నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా నగరంలోని చిన్న చౌకు, అప్సరా సర్కిల్‌, జయానగర్‌ కాలనీ, చిన్న చౌకు పోలీసు స్టేషన్‌ నీటిలో మునిగిపోయాయి. అప్సరా సర్కిల్‌ నుండి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే రహదారి చెరువును తలపిస్తోంది. సరైన మురుగు నీటి వసతి లేక, వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలపై నీరు ఉధృతంగా ప్రవహించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు, అధికారులను కోరుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:24 - August 24, 2017

ఢిల్లీ : భారత్‌, శ్రీలంక జట్ల మధ్య సెకండ్‌ వన్డేకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.క్యాండీలోని పల్లెకల్లె ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో రెండో వన్డే సమరానికి రంగం సిద్ధమైంది.తొలి వన్డేలో తిరుగులేని టీమిండియా రెండో వన్డేలోనూ నెగ్గి సిరీస్‌పై పట్టు బిగించాలని పట్టుదలతో ఉంది. ట్రాక్‌ రికార్డ్‌తో పాటు, ఆల్‌రౌండ్‌ పవర్‌తో పటిష్టంగా ఉన్న భారత్‌...పల్లకల్లె వన్డేలో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.

శ్రీలంకతో సెకండ్‌ వన్డేకు కొహ్లీ అండ్‌ కో పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.తొలి వన్డేలో తిరుగులేని భారత్‌ జట్టు జోరు మీదుండగా.... రెండో వన్డేలోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. భారత్‌-శ్రీలంక 5 మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండో వన్డేకు  క్యాండీలోని పల్లెకల్లె ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా 3వ ర్యాంక్‌లో ఉండగా ... శ్రీలంక 8వ స్థానంలో ఉంది. 

తొలి వన్డేలో ఎదురులేని విరాట్‌ ఆర్మీ...ఆల్‌రౌండ్‌ పవర్‌తో పటిష్టంగా ఉంది.టాప్ ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కొహ్లీ, మిడిలార్డర్‌లో  రాహుల్‌,ధోనీతో పాటు  లోయర్‌ ఆర్డర్‌లో ,కేదార్‌ జాదవ్‌,హార్డిక్‌ పాండ్య  వంటి హార్డ్‌ హిట్టర్లతో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ ఎప్పటిలానే పటిష్టంగా ఉంది. శిఖర్‌ ధావన్‌, విరాట్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండటం భారత జట్టు పెద్ద ప్లస్‌ పాయింట్‌. భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా, చహాల్‌,అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌లతో భారత బౌలింగ్‌ ఎటాక్‌ సైతం పదునుగా ఉంది. 

మరోవైపు వరుస వైఫల్యాలతో ఢీలా పడిన శ్రీలంక...ప్రస్తుతం డైలమాలో ఉంది. ఉపుల్‌ తరంగ నాయకత్వంలోని శ్రీలంక జట్టు....ఏంజెలో మాథ్యూస్‌,తిసెరా పెరీరా, లసిత్‌ మలింగా వంటి సీనియర్‌ ఆటగాళ్ల మీదే భారం వేసింది. 

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో శ్రీలంకతోనే ఆడినన్నీ వన్డేలు భారత్‌ మరే జట్టుతోనూ ఆడలేదు. వన్డే ఫార్మాట్‌లో ఓవరాల్‌ ఫేస్ టు ఫేస్‌ రికార్డ్‌లోనూ లంకపై భారత్‌దే  పై చేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకూ 151 వన్డేల్లో పోటీపడగా....84 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. 55 మ్యాచ్‌ల్లో మాత్రమే శ్రీలంక నెగ్గింది.

సెకండ్‌ వన్డేలోనూ విరాట్ ఆర్మీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. రెండో వన్డేలో అయినా శ్రీలంక కొహ్లీసేనకు కనీస పోటీ అయినా ఇవ్వగలదో లేదో చూడాలి. 

సెన్సార్ బోర్డు కార్యాలయం ముందు వీహెచ్ ఆందోళన

హైదరాబాద్ : సెన్సార్ బోర్డు కార్యలయం ఎదుట కాంగ్రెస్ నేత వీహె ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అర్జున్ రెడ్డి సినిమాలో అశ్లీల దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా నిర్మాతలు కేసీఆర్ బంధువులు కావడం వల్లే సెన్సార్ బోర్డు అనుమతిచ్చిందని విహెచ్ ఆరోపించారు. సినిమాల ప్రభావంతో క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతోందన్నారు. కొందరు లాభాపేక్షతో అశ్లీల చిత్రాలను ప్రోత్సహిస్తున్నారని, అర్జున్ రెడ్డి సినిమాలో అశ్లీ దృశ్యాలను తొలగించే వరకు ఆందోళన కొనసాగిస్తానని విహెచ్ హెచ్చరించారు.

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే : సూప్రీంకోర్టు

ఢిల్లీ: సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆధార్ వ్యక్తిగత వివరాల గోప్యతకు భంగం కలిగిస్తోందంటూ 2015లో సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీని పై విస్తృత విచారణ అనంతరం సుప్రీం ఈ తీర్పును వెలువరించింది..

 

శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన ఉరద...

నిజామాబాద్ :శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గింది. ప్రాజెక్టులోకి 13 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1068.50 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు.

పాలకుర్తి రహదారి పనుల్లో ఆలసత్వం..సీపీఎం ఆందోళన

జనగామ : స్టేషన్ ఘనపూర్ పాలకుర్తి రహదారి పనుల్లో ఆలసత్వాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఇప్పగూడెం దగ్గర మూడు గ్రామాల ప్రజల భారీ రాస్తారోకో చేశారు.  దీంతో రోడ్డు పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సీఎం ఆదేశించినా రోడ్డు పూర్తికాకపోవడం దారుణం అని, అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమస్వయ లోపం వల్లే అలస్యం అవుతోందని, దీని వల్ల  అనేక ప్రమాదాలు జరుగుతున్నా ప్రభత్వానికి పట్టడంలేదని సీపీఎం నేత ఎ.రామ్ నర్సయ్య ఆరోపించారు.

కడపలో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం...

కడప: కపడలో రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రహదారులు, వీధులు, కాలనీలు నీట మునిగాయి. ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం, కోర్డు రోడ్డు, అంబేడ్కర్‌ కూడలి, ఓంశాంతినగర్‌, రోడ్డపై మోకాలి లోతులో వర్షపు నీరు ప్రవహిస్తోంది. మురుగు కాలువలన్నీ పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోర్డు ఎదుట ఉన్న రోడ్‌పైకి నడుము లోతు వరకు నీరు రావడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

కర్ణాటక సంగీత విద్వాంసుడు కన్నుమూత

అనంతపురం : కర్ణాటక సంగీత విద్వాంసుడు వడియార్ పంపాపతి స్వామి (105) మృతి చెందారు. బొమ్మనహళ్ మండలం గోవిందవాడలోని తన నివాసంలోనే కన్నుమూశారు.

ఓపెన్ ప్లాట్ లో కొండచిలువ..

హైదరాబాద్ : శేరిలింగంపల్లి గుల్ మోహర్ కాలనీలోని ఓపెన్ ప్లాట్ లో కొండచిలువ కలకలం రేగింది. స్నేక్ సొసైటీ సభ్యులకు స్థానికులు సమాచారం అందించారు. స్నేక్ బృందం కొండచిలువను పట్టుకుంది. 

10:20 - August 24, 2017

'పెళ్లి చూపులు' చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం 'అర్జున్ రెడ్డి'పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించారు. శావలిని అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'అర్జున్ రెడ్డి' సినిమా టీజర్ కు..రిలీజైన ట్రైలర్ కు భారీ స్పందన కనిపించింది. టీజర్ లో బూతు డైలాగ్స్ ఉండడం అందర్నీ ఆశ్చర్యపడేసింది. తమ సినిమాలో అటువంటి భాష ఉపయోగించడానికి వున్న కారణాలని చెబుతూ కొన్ని కట్స్ తో సెన్సార్ చేయించుకున్నట్లు టాక్. హీరో హీరోయిన్ ముద్దు సీన్ ప్రాక్టీస్ చేస్తున్న పుటేజీ లీక్ చేసి సంచలనం క్రియేట్ చేశారు. అనంతరం టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ వినూత్నంగా వదులుతూ హైప్ భారీగా పెంచేశారు.

కానీ సినిమాలోని డైలాగ్స్..పోస్టర్స్ పై అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఏకంగా పోస్టర్స్ చించేశారు. దీనిపై దర్శకుడు సందీప్ వంగ స్పందించారు. 'అర్జున్‌ రెడ్డి' ఎమోషనల్‌ ప్రతీకార కథ అని, రొమాన్స్ కూడా సహజంగా ఉండేలా చిత్రించామన్నారు. కొన్ని కారణాల వల్ల ముద్దు సన్నివేశాలను పెట్టాల్సి వచ్చిందని, అవి కూడా సన్నివేశపరంగానే ఉంటాయన్నారు. సినిమాలో ముద్దు సన్నివేశాలంటే.. మోడ్రన్‌ సొసైటీలో ఇలాగే ఉంటుందన్నారు. పబ్లిసిటీలో ఆ సీన్‌ ఉండడంతో చాలా బోల్డ్ గా పెట్టేశారేమిటి? అని ప్రశ్నిస్తున్నారని కానీ నాకైతే బోల్డ్ అనిపించడం లేదన్నారు. మరి 'అర్జున్ రెడ్డి' ఎలాంటి రిజల్ట్ రాబడుతాడో వేచి చూడాలి. 

పంపావతి స్వామి కన్నుమూత..

అనంతపురం : కర్ణాటక సంగీత విధ్వాంసుడు వడియాల పంపావతి స్వామి (105) కన్నుమూశారు. బొమ్మన హాళ్ మండలం గోవిందవాడలోని తన నివాసంలో కన్నుమూశారు.

 

బండ్లగూడ సర్పంచ్ కు షోకాజ్ నోటీసు..

రంగారెడ్డి : గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో బండ్లగూడ సర్పంచ్ హరికృష్ణకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. పది రోజుల్లో సంజాయిషీ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని డీపీవో పద్మజరాణి ఆదేశాలు జారీ చేశారు. రూ. 3.16 కోట్ల గ్రామ పంచయతీ నిధులను సర్పంచ్ దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి.

ఇప్పుగూడెం వద్ద గ్రామాల ప్రజలు రాస్తారోకో..

జనగామ : స్టేషన్ ఘన్ పూర్ - పాలకుర్తి రహదారి పనుల్లో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఇప్పుగూడెం వద్ద మూడు గ్రామాల ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. భారీగా సీఎం ఆదేశించినా పనులు జరగడం లేదని, అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం లోపం వల్లే ఇదంతా జరుగుతోందని సీపీఎం నేత ఎ.రామ్ నర్సయ్య పేర్కొన్నారు.

సెన్సార్ బోర్డు ఆఫీస్ కు వెళ్లనున్న వీహెచ్..

హైదరాబాద్ : అర్జున్ రెడ్డి సినిమా లిప్ లాక్ అంశంపై నేడు మాసబ్ ట్యాంక్ సెన్సార్ బోర్డు ఆఫీసుకు టి.కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వెళ్లనున్నారు. 

ఉరేసుకుని పంచాయతీరాజ్ ఏఈ ఆత్మహత్య

జగిత్యాల : వెలగటూరు మండలం డపల్లిలో విషాదం నెలకొంది. ఉరేసుకుని పంచాయతీరాజ్ ఏఈ జేవీ శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు శ్రీకాంత్ మంచిర్యాల జిల్లాలో ఏఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. 3 నెలల క్రితమే ఆయన ప్రేమ వివాహం చేసుకున్నాడు. 

ఎల్లుండి మ.2 గం.లకు టీఆర్ ఎస్ ప్రతినిధుల సమావేశం

హైదరాబాద్ : టీఆర్ ఎస్ భవన్ లో ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ ఎస్ ప్రతినిధుల సమావేశం నిర్వహణకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. భూసర్వేల విజయవంతానికి ప్రజా ప్రతినిధుల బాధ్యతలపై చర్చించనున్నారు. టీఆర్ ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పక హాజరుకావాలని కేసీఆర్ ఆదేశించారు.

08:47 - August 24, 2017

మట్టి గణేష్ విగ్రహాలను ప్రతిష్టించాలని హైదరాబాద్ జిందాబాద్ సంస్థ నాయకులు ఎం. శ్రీనివాసరావు సూచించారు. కాలుష్యాన్ని తగ్గించాలని కోరారు. ఇదే అంశంపై జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'రేపు  వినాయక చవితి. 11 రోజుల పాటు బొజ్జగణపయ్యల కోలాహలమే కనువిందు చేయబోతోంది. భక్తి ప్రవృత్తులతో సాగాల్సిన వినాయక పూజలో అట్టహాసాలు పెరుగుతున్నాయి. వినాయక విగ్రహాల తయారీలో ఇష్టానుసారంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగులు, రసాయనాలు వాడుతున్నారు. ఇది పర్యావరణ సమస్యలకు కారణం అవుతోంది. దీంతో పర్యావరణానికి హాని కలగని రీతిలో , మట్టి విగ్రహాలే వాడాలంటూ కొన్ని సంవత్సరాలు పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సేవకులు , జన విజ్ఇాన వేదిక లాంటి సంస్థలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయక విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల వచ్చే నష్టాలేమిటి? రంగులు, రసాయనాలు పర్యావరణం పై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? వినాయక ఉత్సవాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:43 - August 24, 2017

నల్గొండ : తెలుగు రాష్ట్రాల రైతాంగం వరప్రదాయిన నాగార్జునసాగర్‌ జలాశయం ఒట్టిపోయింది. వర్షకాలంలో నిండుకుండలా తొణికిసలాడాల్సిన ఈ డ్యామ్‌ ఇప్పుడు నీరు లేక వెలవెలపోతోంది. దీంతో 21 లక్షల ఎకరాల ఆయకట్టు రైతుల పరిస్థితి దీయనీయంగా మారింది. పుష్కరకాలం తర్వాత డెడ్‌ స్టోరేజ్‌కి చేరుకున్న నాగార్జునసాగర్‌ జలాశయంపై 10 టీవీ ప్రత్యేక కథనం...
నీరు లేక నాగార్జునసాగర్ వెలవెల  
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల రైతులు ఆధునిక దేవాలయంలా కొలిచేవారు. రెండు పంటలకు నీరిచ్చి రైతుల జీవితాలను మార్చేసిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు నీరు లేక పూర్తిగా కళ తప్పింది. ఐదు జిల్లా  ఆయకట్టు రైతులకు దుఖఃదాయిగా మిగిలిపోతోంది. 
కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో వర్షాభావం 
నాగార్జునసాగర్‌ ద్వారా నల్గొండ, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఖమ్మం జిల్లాల్లో లక్షలాది ఎకరాలు సాగు అయ్యేది. ఒకప్పుడు సాగర్‌గేట్లు ఎత్తితే జాలువారే నీటిని చూసి పర్యాటకులు మురిసిపోయేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పూర్తిగా డెడ్‌ స్టోరేజీకి చేరుకుంది. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో సరిగా వర్షాలు లేవు. దీనికితోడు కర్నాటక ప్రభుత్వం అల్‌మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచినప్పటి నుంచి సాగర్‌ ఆయకట్టు రైతులకు కష్టల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. 2013 తర్వాత ప్రాజెక్టు క్రెస్ట్‌ గేట్లు ఎత్తలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. సాగర్‌ కుడి, ఎడమ కాల్వల పరిధిలోని తెలుగు రాష్ట్రాల రైతులకు అడపా దడపా నీటిని విడుదల చేయడం మినహా, రోజువారీ నీరు వదిలిన సందర్భాలు ఈ మధ్యకాలంలో లేవు. సాగునీరు కాదు కదా... తాగు నీటిని కూడా విడుదల చేసే పరిస్థితి లేకుండా పోయింది. 
సాగర్‌లోకి ఇన్‌ఫ్లో లేదు 
సాగర్‌లోకి ఇన్‌ఫ్లో లేదు. కృష్ణా బేసిన్‌లో వర్షాలతో వచ్చే నీరు మొత్తాన్ని కర్నాటకలోని అల్‌మట్టీ, నారాయణపూర్‌ ప్రాజెక్టుల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. దిగువకు విడుదల చేయకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నాయి. నాగార్జునసాగర్‌ పరిస్థితైతే మరీ దయనీయంగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 590 అడుగులు. కనీస నీటిమట్టం 510 అడుగులు ఉండాలి. నీటిమట్టం 504 అడుగుల దిగువకు చేరితే  తాగునీటి అవసరాలకు కూడా వాడుకునే వీలులేదు.  కానీ ఇప్పుడు 500 అడుగుల దిగువకు చేరుకుంది.  గతంలో 494 అడుగుల వద్ద తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల చేసిన సందర్భాలు అదురుగా ఉన్నాయి. కానీ ఇప్పుడా పరిస్థితిలేదు. సాగర్‌ నుంచి సాగునీరు, తాగునీరు విడుదలచేసే అవకాశం లేకపోవడంతో ఇటు ప్రజలు, అటు ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది. 
మంచినీటికి 600 క్యూసెక్కుల నీరు విడుదల 
ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు, నల్గొండ జిల్లాల మంచినీటి అవరాల కోసం 600 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. సాగర్‌ కాల్వల్లో నీరు లేకపోవడంతో అన్నదాతలు దిగాలుపడిపోతున్నారు. సాగర్‌లో నీరు లేకపోవడంతో తమ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందని  లక్షలాది ఎకరాల ఆయకట్టు రైతులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
దిగువకు నీటిని విడుదల చేయని కర్నాటక ప్రభుత్వం 
కర్నాటకలోని అల్‌మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో పూర్తి సామర్థ్యంలో నీరు చేరింది. కృష్ణానది ఎగువ భాగంలో అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో వస్తున్న నీటికి కాల్వలకు విడుదల చేస్తున్న కర్నాటక ప్రభుత్వం... దిగువకు ఒక్క చుక్క నీరుగా కూడా విడుదల చేయడంలేదు. వరుణుడు కరుణించి వచ్చే నెలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిస్తే మినహా..  సాగర్‌ డ్యామ్‌ నిండే అవకాశంలేదని నిపుణలు చెబుతున్నారు. 
 

నేడు సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లపై హైకోర్టు తీర్పు

హైదరాబాద్ : సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లపై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఎన్ టీఆర్, కాళోజీ వర్సిటీల్లో సీట్ల భర్తీ వివాదంపై తీర్పు వెల్లడించనుంది. 

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

ప్రకాశం : కొరిశపాడు మండలం తిమ్మలపాలెం దగ్గర యాత్రాజన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. 

08:16 - August 24, 2017

తూర్పుగోదావరి : కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు తమ నేతలందర్నీ ఇక్కడే మోహరింపచేశాయి. నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌ పూర్తవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కాకినాడలో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. 
ఏడేళ్ల తర్వాత కేఎంసీ ఎన్నికలు   
కాకినాడ నగరపాలక సంస్థకు ఏడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కేఎంసీలో పాగా వేసేందుకు రెండు పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. 
48 డివిజన్లకు ఎన్నికలు 
కాకినాడలోని 48 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కోస్తా జిల్లాలకు చెందిన టీడీపీ, వైసీపీ నేతలంతా నగరంలోనే తిష్ఠవేశారు. టీడీపీకి చెందిన పది మంది  మంత్రులు,  40 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు,  వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు కాకినాడలోనే మకాంవేసి తమ పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు వీలుగా ప్రచారం చేస్తున్నారు. ర్యాలీలు తీస్తున్నారు. నగర పాలక సంస్థ ఎన్నికలకు జరుగుతున్న ప్రచారం గతంలో కాకినాడ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు కూడా జరగలేదు. రెండు పార్టీల నేతలు వాడీవేడీ విమర్శలు, పరస్పర ఆరోపణలతో ఓటర్లకు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. జిల్లాకు చెందిన మంత్రులు యనమల రామకృష్ణుడు, చిమ్మకాయల చినరాజప్ప దగ్గరుండి టీడీపీ అభ్యర్థుల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నంద్యాల  ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్‌... ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యాలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా తీసుకుని కేసు నమోదుకు ఆదేశించిన అంశం ఇప్పుడు టీడీపీ ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది. 
టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు మండిపాటు
కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రచారం చేసే నైతిక హక్కు జగన్‌కు లేదంటున్న టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. కాకినాడకు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో అమలుకు నోచుకోనివాటిని ఎత్తి చూపుతున్నారు. స్మార్ట్‌ సిటీ నిథలు ఖజానాలో మూలుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 
ఎన్నికల్లో పట్టు బిగించేందుకు బీజేపీ ప్రయత్నం
మరోవైపు కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పట్టు బిగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీకి తొమ్మిది డివిజన్లు కేటాయించింది. కానీ కమలనాథులకు కేటాయించిన స్థానాల్లో టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేయడం బీజేపీకి తలనొప్పిగా మారింది. రెబల్స్‌తో నామినేషన్లు ఉపసంహరింప చేసే విషయంలో టీడీపీ నేతలు ప్రయత్నించకపోవడాన్ని బీజేపీ నాయకులు తప్పుపడుతున్నారు. పొత్త ధర్మానికి ఇది విరుద్ధమని మండిపడుతున్నారు. 35 వ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఉపసంహరించుకున్నట్టు ప్రకటించిన కమలదళం జిల్లా అధ్యక్షుడు.. ఈ స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు పలికారు. కానీ బీజేపీకి చెందిన మంత్రి మాణిక్యాలరావు మాత్రం 35 వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం కమలనాథుల్లో ఉన్న విబేధాలను ఎత్తిచూపుతోంది. 39వ వార్డులో కూడా ఇదేరకమైన తంతు నెలకొంది. 
ఈనెల 29న పోలింగ్‌ 
కాకినాడ నగర పాలక సంస్థకు ఈనెల 29న పోలింగ్‌ జరుగుతుంది. ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు మిగిలివుంది. నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ పూర్తవడంతో ఇప్పుడు టీడీపీ, వైసీపీ అగ్రనేతలంతా కాకినాడపైనే దృష్టి పెట్టారు. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల సమరాంగణంలో ఓటర్లు ఎవరి పక్షాన నిలుస్తారో చూడాలి. 

 

08:07 - August 24, 2017

పెద్దపల్లి : జిల్లాలోని కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడికి దిగడంతో గందరగోళం నెలకొంది. కుర్చీలు విసిరేస్తూ.. ముష్టిఘాతాలతో ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ కాస్తా.. రణరంగంగా మారింది. 
ప్రజాభిప్రాయ సభలో ప్రజల వ్యతిరేకత 
కాళేశ్వరం ప్రాజెక్టులపై చేపట్టిన ప్రజాభిప్రాయ సభలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెద్దపల్లిజిల్లా కేంద్రంలో జరిగిన సభ పార్టీల యుద్ధంగా మారింది. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కుర్చీలు విసురుకుని చితకబాదుకున్నారు. పెద్దపల్లిలోని రాఘవరెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు, కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించారు. కలెక్టర్‌ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభించిన అభిప్రాయ సేకరణ సభకు పలువురు అధికారులు హాజరయ్యారు. మంథని ప్రాంతంలో జరగాల్సిన ప్రజాభిప్రాయ సేకరణసభను పెద్దపల్లిలో ఎందుకు ఏర్పాటు చేశారని భూ నిర్వాసితులు అధికారులను నిలదీశారు. పైగా ఇప్పటికే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం.. పరిహారం విషయంలో నోరుమెదపడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం చెల్లించాలని కోరిన రైతులపై పోలీసులతో దాడులు చేయించి.. మళ్లీ ఏమి జరగనట్టే ప్రజాభిప్రాయం ఎందుకుపెట్టారని నిగ్గదీశారు. 
పరిహారం కోసం రైతులు, ప్రజలు నిలదీత 
పరిహారం కోసం రైతులు, ప్రజలు నిలదీస్తుంటే.. అధికారులు సమాధానం చెప్పలేక ఇబ్బందిపడ్డారు. దీంతో సభలోనే ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఒక్కసారిగా గొడవకు దిగారు. నిర్వాసితుల తరపున మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులపై దూసుకొచ్చారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఆర్‌ఎస్‌ కార్యర్తల దాడిలో పలువురు కాంగ్రెస్‌ నేతలు గాయపడ్డారు.  కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
పర్యావరణ అనుమతులు లేకండానే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
పర్యావరణ అనుమతులు లేకండానే  కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టారని భూ నిర్వాసితులు వాపోతున్నారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా పనులు ప్రారంభించి.. తీరా ఇబ్బందులు చెబుతుంటే పోలీసులతో బెదిరిస్తూ.. దాడులకు దిగుతున్నారని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

నేడు అన్నాడీఎంకే అత్యవసర కార్యవర్గ సమావేశం

చెన్నై : నేడు అన్నాడీఎంకే అత్యవసర కార్యవర్గ సమావేశం జరుగనుంది. దినకరన్ కు చెక్ పెట్టే యోచనలో పళనీ, పన్నీర్ సెల్వం ఉన్నారు. పార్టీలో ఉన్న శశికళవర్గంపై అన్నాడీఎంకే వేటు వేయనుంది. ఎమ్మెల్యేలు చెన్నై రావాలని సీఎం పళనీస్వామి ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు చెన్నై రావాలని సీఎం పళనీస్వామి ఆదేశాలు జారీ చేశారు. 

నేడు రాజ్ నాథ్ సింగ్ తో తమిళనాడు గవర్నర్ భేటీ

ఢిల్లీ : కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో నేడు తమిళనాడు గవర్నర్ విద్యాసాగరరావు భేటీ అయ్యారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. 

 

07:45 - August 24, 2017

హైదరాబాద్ : భూముల సర్వే రికార్డుల ప్రక్షాళనకు తెలంగాణ సర్కార్‌ తేదీలను ప్రకటించింది. సెప్టెంబర్‌ 1 నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మొత్తం 3600 బృందాలతో ఈ సర్వే నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అత్యంత పారదర్శకంగా సర్వే చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ సర్వే ఆధారంగానే రైతులకు 8 వేల రూపాయల పెట్టుబడి పథకాన్ని అమలు చేయనున్నారు. 
భూ రికార్డులను ప్రక్షాళన చేయాలని కేసీఆర్‌ ఆదేశం
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా తెలంగాణలో భూ రికార్డులను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. సమగ్ర భూ సర్వే నిర్వహణ తదితర అంశాలపై ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన కేసీఆర్‌... భూమి రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్‌ విధానం అత్యంత పారదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు. భూ రికార్డుల ప్రక్షాళనకు అవలంబించాల్సిన పద్ధతులపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు నేతృత్వంలోని కమిటీ చేసిన అధ్యయనంపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా భూముల సర్వే రికార్డుల ప్రక్షాళన తేదీలను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. 
రెవెన్యూ గ్రామ యూనిట్‌గా భూరికార్డుల ప్రక్షాళన 
భూ సర్వే రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రైతు సంఘాల ఏర్పాటు, రైతు సదస్సుల నిర్వహణ తేదీలను సీఎం నిర్ణయించారు. సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు గ్రామరైతు సంఘాల సమన్వయ సమితులు ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబర్ 10 నుంచి 15 వరకు మండల స్థాయిలో రైతు సమన్వయ సమితులు, సదస్సులు నిర్వహణ చేపట్టనున్నారు. సెప్టెంబర్‌ 15 నుండి డిసెంబర్‌ నెలాఖరు వరకు రెవెన్యూ గ్రామం యూనిట్‌గా భూరికార్డుల ప్రక్షాళన చేయనున్నారు. 
3600 బృందాలతో రికార్డుల ప్రక్షాళన
మొత్తం 3600 బృందాలతో రికార్డుల ప్రక్షాళన చేపట్టాలని సీఎం నిర్ణయించారు. రెవెన్యూ అధికారి, వ్యవసాయ అధికారి, రైతు సంఘం సమన్వయంతో భూరికార్డుల సవరణ కొనసాగనుంది. నెలరోజుల పాటు గ్రామ సభ నిర్వహించి భూ రికార్డుల సవరణ చేపట్టనున్నారు. సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఒక్కో యూనిట్ బాధ్యత తీసుకుని భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పర్యవేక్షించనున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి రికార్డులు సరిచేసి వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. ఆన్‌లైన్‌లో వివరాల ఆధారంగానే ఏడాదికి ఎకరాకు 8 వేల రూపాయలు పెట్టుబడి పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

07:36 - August 24, 2017

గుంటూరు : ఏపీ సచివాలయం భవనాల డిజైన్లలో సీఎం చంద్రబాబు పలు మార్పులు సూచించారు. ఫోస్టర్ బృందం నివేదిక, తన సూచనలపై మంత్రులు, కార్యదర్శుల అభిప్రాయాలు సేకరించాలని అధికారుల్ని ఆదేశించారు. గూగుల్, ఇన్ఫోసిస్ తరహా ఐటీ కార్పొరేట్ కార్యాలయాలకు ధీటుగా ఆఫీసు భవనాలు నిర్మించాలన్నారు. ఈ మార్పులన్నీ పూర్తిచేసి సెప్టెంబర్‌ 13కు ఫైనల్‌ డిజైన్లు అందిస్తామని.. ఫోస్టర్ బృందం చంద్రబాబుకు తెలిపింది.
వేగంగా భవనాల డిజైన్ల రూపకల్పన 
ఏపీ సచివాలయ భవనాల డిజైన్ల రూపకల్పన వేగంగా సాగుతోంది. వివిధ విభాగాల కార్యదర్శులు, హెచ్ ఓడీ ఆఫీసుల నిర్మాణంపై ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో భేటీఅయిన ఫోస్టర్‌ ప్రతినిధులు.. భవనాలు, కార్యాలయాల డిజైన్‌ వివరాల్ని తెలిపారు. గతంలో కార్యదర్శులు, హెచ్‌వోడీల స్థానాలు ఒకే ప్రదేశంలో ఉండాలన్న సీఎం ఆదేశాలప్రకారం భవనాల డిజైన్లలో మార్పులు చేశారు. 
అత్యుత్తమ భవంతులుగా డిజైన్‌ చేయాలని ఆదేశాలు
సచివాలయం, డైరెక్టరేట్లు, కమిషనరేట్ల ఏర్పాటును ఏదో ఒక నిర్మాణ ప్రక్రియగా చూడొద్దని ఫోస్టర్‌ ప్రతినిధులకు సీఎం సూచించారు.. ఉద్యోగులు, అధికారుల్లో సృజనను వెలికితీసేలా... చక్కని పని వాతావరణం కలిగించేలా ఆఫీసులు తీర్చిదిద్దాలన్నారు.. గూగుల్‌, ఇన్ఫోసిస్‌ తరహా ఐటీ కార్పొరేట్‌ కార్యాలయాలకు ధీటుగా భవనాలు నిర్మించాలని చెప్పారు.. వినోద, ఆహ్లాద, క్రీడా వసతులతో ప్రపంచంలోనే అత్యుత్తమ భవంతులుగా డిజైన్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే పోస్టర్‌ బృందం నివేదికలు, తన సూచనలపై మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఆర్‌డీఏ అధికారుల్ని సీఎం ఆదేశించారు.. ఆ భేటీలో వచ్చిన అభిప్రాయాలును ఫోస్టర్‌ బృందానికి అందించాలన్నారు.. వాటికి అనుగుణంగా తుది ఆకృతులు సిద్ధం చేయాలన్నారు. మంత్రులు, అధికారుల సూచనలన్నీ తీసుకొని సెప్టెంబర్‌ 13కు ఫైనల్‌ డిజైన్లు అందజేస్తామని ఫోస్టర్‌ ప్రతినిధులు సీఎంకు తెలియజేశారు..

 

07:29 - August 24, 2017

హైదరాబాద్ : చంద్రబాబు మీద జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్‌ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.  జగన్‌ వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. జగన్‌పై చర్యలు తీసుకోవాలని సీఈసీ ఆదేశించింది. ఈ మేరకు జగన్‌పై నంద్యాలలో కేసు నమోదైంది.
జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఎన్నికల సంఘం
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ జగన్‌ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబును ఉద్దేశిస్తూ.. జగన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కాల్చిచంపాలి, ఉరితీయాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జగన్‌ వ్యాఖ్యలను పరిశీలించిన ఎన్నికల సంఘం జగన్‌ మాటలు నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అభిప్రాయపడింది. వెంటనే జగన్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
జగన్‌పై కేసు నమోదు
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నంద్యాల త్రీటౌన్ పీఎస్‌లో జగన్‌పై కేసు నమోదైంది. ఐపీసీ 188, 504, 506 సెక్షన్లతో పాటు..ప్రజాప్రాతినిధ్య చట్టం 125 కింద జగన్‌పై కేసు నమోదు చేశారు. కాగా సీఈసీ ఆదేశాలపై టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. 

నేడు భారత్, శ్రీలంక రెండో వన్డే మ్యాచ్

ఢిల్లీ : నేడు భారత్, శ్రీలంక రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. పల్లెకెలెలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

 

Don't Miss