Activities calendar

25 August 2017

21:45 - August 25, 2017

హైదరాబాద్: షట్లర్‌ పీవీ సింధు మరో ఘనత సాధించింది.. ప్రపంచ కప్‌ బ్యాడ్మింటన్‌లో సెమీ ఫైనల్‌ చేరి పతకం ఖాయం చేసుకుంది.. క్వార్టర్‌ ఫైనల్‌లో చైనా షట్లర్‌ సన్‌ యూపై వరుస సెట్లలో విజయం సాధించి సింధు రికార్డు సృష్టించింది..వరల్డ్ ఛాంపియన్‌ షిప్‌లో మూడోసారి పతకాన్ని సాధించబోతోంది.. 

ప్రియాంకా గాంధీకి డెంగ్యూ

ఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా కుమార్తె ప్రియాంక గాంధీకి డెంగ్యూ వ్యాధి సోకింది.. స్వల్ప అస్వస్థతకు గురైన ప్రియాంక.. ఈ నెల 23న ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు.. డెంగ్యూ సోకినట్లు నిర్ధారించారు. ప్రియాంక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. త్వరగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.. ఇప్పటి వరకు ఢిల్లీలో 657 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క ఢిల్లీ నుంచే 325 మందికి డెంగ్యూ వ్యాధి సోకగా.. పొరుగు రాష్ర్టాల వారు 332 మంది ఉన్నారు.

 

గుర్మీత్ కి ఎంపీ సాక్షి మహారాజ్ మద్దతు

హైదరాబాద్: రేప్‌ కేసులో దోషిగా పేర్కొన్న గుర్మిత్ బాబాకు... బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ మద్దతుగా నిలిచారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు పట్టించుకోకుండా కోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం విధ్వంసానికి కోర్టు తీర్పే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా ఒకరు చేసిన ఆరోపణలను పరిగణలోకి తీసుకోవడం సరికాదన్నారు. గుర్మిత్‌ సింగ్‌ బాబాను దోషిగా ప్రకటించి భారతీయ సంస్కృతికి విఘాతం కలిగిస్తున్నారని ఎంపీ సాక్షి మహారాజ్‌ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. 

21:29 - August 25, 2017

హైదరాబాద్: బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌..! ఇప్పుడీ పేరు దేశమంతటా మారుమోగి పోతోంది. ఆశ్రమ సాధ్వులిద్దరిపై అత్యాచారం, హత్యాయత్నాల కేసులో ఈయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇంతకీ ఎవరీ రామ్‌రహీమ్‌ సింగ్‌..? సిక్కుల్లో అంతటి అభిమానాన్ని ఎలా చూరగొన్నాడు? వాచ్‌ దిస్‌ స్టోరీ.

గుర్మీత్‌ను ఓ దేవుడిలా ఆరాధిస్తారు.

బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌..! డేరా సచ్చా సౌదా అనే సిక్కు మత సంస్థకు ఈయనే చీఫ్‌. డేరా సచ్చా సౌదా సంస్థ ద్వారా గుర్మీత్‌.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లోని లక్షలాది మంది నిమ్న జాతీయులు.. గుర్మీత్‌ను ఓ దేవుడిలా ఆరాధిస్తారు.

1948లోనే డేరా సచ్చా సౌధ సంస్థ స్థాపన....

నిజానికి డేరా సచ్చా సౌధ సంస్థను 1948లోనే.. మస్తానా బెలూచిస్థానీ అనే మత గురువు నెలకొల్పాడు. అప్పట్లో ఆయన బోధనలకు లక్షలాది మంది నిమ్న జాతీయులు ఆకర్షితులయ్యారు. సమాజం తమపై చూపుతున్న వివక్షను భరించలేని అత్యధికులు ఈ సంస్థలో చేరుతుంటారు. ఈ గ్రూపులో చేరిన వారందరినీ డేరాలుగా పిలుస్తారు. వీరి సంప్రదాయంలో కులాల పట్టింపు ఉండదు. ప్రార్థనల కోసం నామ్‌ చర్చాఘర్‌లను నిర్మించుకున్నారు. డేరాల్లో శ్రీమంతుడైనా.. పేదవాడైనా ఒకేరకంగా పరిగణిస్తారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌, బర్నాలా, మాన్స, భటిండా, ఫజిల్కా, ఫరీద్‌ కోట్‌, ఫిరోజ్‌పూర్‌ జిల్లాల్లో డేరా వర్గీయులు అధికంగా ఉన్నారు.

డేరా సచ్చా సౌధ సంస్థ ద్వారా సేవాకార్యక్రమాలను

బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌.. డేరా సచ్చా సౌధ సంస్థ ద్వారా సేవాకార్యక్రమాలను బాగా విస్తరించారు. డేరాల్లోని సభ్యులకు సబ్సిడితో కూడిన ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం రేషన్‌ ద్వారా అందించే వాటి కన్నా ఇవి ఎంతో నాణ్యంగా ఉంటాయంటారు. డేరాల్లోని పేదలందరికీ ఈ సేవ ఆహార భద్రతను కల్పిస్తోంది. క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు కూడా సిర్సాలో ఉచితంగా చికిత్సను అందిస్తున్నారు. దీనికోసం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పెద్ద ఆసుపత్రినే నిర్వహిస్తున్నారు. ఇక్కడన్ని చికిత్సలూ ఉచితమే. ఇలా పలు ప్రజోపయోగమైన కార్యక్రమాలు చేపడుతుండటంతో డేరా సచ్చాసౌధాలో లక్షలాది మంది సభ్యులుగా చేరారు. గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను డేరాలోని సభ్యులందరూ నడిచే దేవుడిగానే పరిగణిస్తారు. అందుకే.. ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందేమోనని అంతగా కలవర పడ్డారు. 

లొంగిపోయిన శిల్పా చక్రపాణి రెడ్డి బావమరిది....

కర్నూలు : నంద్యాల సూరజ్ హోటల్ వద్ద ఘర్షణ కేసులో టూటౌన్ పీఎస్ లో శిల్పా చక్రపాణి రెడ్డి బావమరిది ఆదిరెడ్డి, కౌన్సిలర్ జాకీర్, చండ్రాయుడు లొంగిపోయారు.

అమెరికాలో కర్నూలు జిల్లా కు చెందిన పృధ్వీ ఆత్మహత్య

కర్నూలు : అమెరికాలో కర్నూలు జిల్లాకు చెందిన కందూరి పృధ్వీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 3 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న పృధ్వీని స్వస్థలానికి చేర్చేందుకు తానా ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు రాత్రికి కర్నూలు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

21:17 - August 25, 2017

హైదరాబాద్: గుర్మీత్‌ రాం రహీం బాబా అనుచరులు అరాచకం సృష్టించారు. బాబాను కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో విధ్వంసానికి దిగారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలను బుగ్గిపాలు చేశారు. పంచకుల కోర్టు ఆవరణలో పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసు కాల్పుల్లో కొందరు బాబా అనుచరులు మృతి చెందగా .. పంజాబ్‌, హర్యాణాల్లో చెలరేగిన హంసలో 23 మంది మృతిచెందగా .. 250 మందికిపైగా గాయాల పాలయ్యారు.

అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేల్చిన కోర్టు...

అత్యాచారం, హత్య కేసులో వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు, డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. 2002లో ఆశ్రమంలో ఇద్దరు సాధ్వీలపై గుర్మీత్‌ బాబా అత్యాచారానికి పాల్పడినట్టు విచారణలో రుజువయింది. దీంతో బాబాను దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం తీర్పు నిచ్చింది. శిక్షను ఈనెల 28న ఖరారు చేయనుంది.

ప్రభుత్వ ఆఫీసులే లక్ష్యంగా దాడులు...

తీర్పు వెలువరించే సమయంలో గుర్మీత్ న్యాయస్థానంలోనే ఉన్నారు. తీర్పు వెలువడిన వెంటనే గుర్మీత్‌ను హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో... అనుచరులు రెచ్చిపోయారు. కోర్టు బయట వేలాది సంఖ్యలో గుమికూడిన బాబా అనుచరులు రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. ఆందోళన కారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు, నీటిఫిరంగులు ప్రయోగించారు. అయినా ఆందోళనలు సద్దుమణగక పోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో మరింత రెచ్చిపోయిన బాబాఅనుచరగణం వాహనాలను లక్ష్యంగా చేసుకుంది. పక్కనే ఉన్నమీడియా వాహనాలను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేశారు. స్పాట్ ...

పంజాబ్‌, హర్యాణా, ఢిల్లీలో అరచాకాలకు

పంజాబ్‌, హర్యాణా, ఢిల్లీలో అరచాకాలకు దిగారు. పలు చోట్ల వాహనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. వీధుల్లో కర్రలు పట్టుకుని వీరం సృష్టించారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసలో 25 మంది మృతి చెందగా 250 మందికి పైగా గాయాల పాలయ్యారు. 

వంద కార్ల భారీ కాన్వాయ్ మధ్య ఆయన కోర్టుకు

అంతకు ముందు కేసు విచారణలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 2.30కు గుర్మిత్‌బాబా కోర్టుకు హాజరయ్యారు. దాదాపు వంద కార్ల భారీ కాన్వాయ్ మధ్య ఆయన కోర్టుకు రావడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం 2 కార్లను మాత్రమే కోర్టులోనికి అనుమతించారు. ముందుజాగ్రత్తగా పంచకుల కోర్టు పరిధిలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్‌, మొబైల్‌ఫోన్‌ సేవలను నిలిపివేశారు. అయితే తీర్పు వెలువడనున్న నేపథ్యంలో రెండు రోజుల నుంచే బాబా అనుచరులు దాదాపు 5లక్షల మంది పంచకులకు చేరుకున్నారు. తీర్పు వెలువడిన వెంటనే బాబా అనుచరులు దారుణమైన విధ్వంస కాండకు దిగారు. ప్రభుత్వం ఆఫీసులు, వాహనాలే లక్ష్యంగా దాడులతో చెలరేగిపోయారు. ఆందోళన కారుల దాడిలో వందలాది వాహనాలు,ఆఫీసులు బుగ్గిపాలయ్యాయి. పంజాబ్‌లో రైల్వేస్టేషన్‌, పెట్రోల్‌ బంకుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. బర్నాలా జిల్లా చనన్‌వాల్‌లో టెలిఫోన్‌ కార్యాలయాన్ని తగలబెట్టారు. ఆందోళనల నేపథ్యంలో భటిండా, మన్సా, ఫిరోజ్‌పూర్‌లో కర్ఫ్యూ విధించారు. ప్రజలు సంయమనం పాటించాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రెండు రాష్ట్రాల శాంతిభద్రతల పరిస్థితిని ఆరా

డేరాబాబా అనుచరగణం విధ్వంసం నేపథ్యంలో కేంద్రం హోం శాఖ స్పందించింది. రెండు రాష్ట్రాల శాంతిభద్రతల పరిస్థితిని ఆరా తీసింది. మరో వైపు అల్లర్లపై పంజాబ్‌ హైకోర్టు సీరియస్‌ అయింది. హింసకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. గుర్మిత్‌ బాబా ఆస్తలును అటాచ్‌చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అల్లర్లతో సంభవించిన నష్టాన్ని డేరాఆశ్రమ ఆస్తులు అమ్మి భర్తి చేయాలని సూచింది. మరోవైపు తీర్పు అనంతరం... రాంరహీం బాబాను అదుపులోకి తీసుకున్న హర్యాణా పోలీసులు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో రోహ్‌తక్‌లోని జైలుకు తరలించారు.

28న గుర్మిత్‌ సింగ్‌బాబాకు శిక్షఖరారు

ఇదిలావుంటే ఈనెల 28న గుర్మిత్‌ సింగ్‌బాబాకు శిక్షఖరారు చేయనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సున్నిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలను భారీ ఎత్తున మోహరిస్తోంది. పంచకుల అల్లర్లపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సమీక్షించారు. పంజాబ్‌, హర్యానాలో ఆర్పీఎఫ్‌ బలగాలు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

21:13 - August 25, 2017

హైదరాబాద్: రేప్‌ కేసులో దోషిగా పేర్కొన్న గుర్మిత్ బాబాకు... బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ మద్దతుగా నిలిచారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు పట్టించుకోకుండా కోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం విధ్వంసానికి కోర్టు తీర్పే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా ఒకరు చేసిన ఆరోపణలను పరిగణలోకి తీసుకోవడం సరికాదన్నారు. గుర్మిత్‌ సింగ్‌ బాబాను దోషిగా ప్రకటించి భారతీయ సంస్కృతికి విఘాతం కలిగిస్తున్నారని ఎంపీ సాక్షి మహారాజ్‌ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. 

సంయమనంతో వ్యవహరించాలి: రాష్ట్రపతి

న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌పై తీర్పు అనంతర ఘటనలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్పందించారు. పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలను, ప్రజల ఆస్తులకు నష్టం చేకూర్చడాన్ని ఆయన ఖండించారు. సంయమనంతో వ్యవహరించాలని కోరుతూ ట్వీట్‌ చేశారు.

 

20:35 - August 25, 2017

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి గది-2’ టైటిల్‌ లోగో విడుదలైంది. ఈ మూవీకి ఓంకార్‌ దర్శకత్వం వహిస్తుండగా సమంత, సీరత్‌కపూర్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్ర. చిన్న చిత్రంగా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న ‘రాజుగారి గది’కి సీక్వెల్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తుండగా, పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఓఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్నాయి. ఆగస్టు 29న ‘రాజుగారి గది2’ ఫస్ట్‌లుక్‌ విడుదల కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

20:04 - August 25, 2017

పెళ్ళి చూపులు సినిమాతో హీరోగా స్టార్ డమ్ సంపాధించుకున్న విజయ్ దేవరకొండ లేట్ అయినా పర్వాలేదు హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యి... చాలా ఓపికగా.. అర్జున్ రెడ్డీ మూమూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.. టీమ్ అంతా ఎంతో ఎఫర్ట్ పెట్టి తీసిన అర్జున్ రెడ్డీ ప్రేక్షకులను ఏ మేరకు అలరించాడు. టీమ్ నమ్మకాన్ని ఎంత వరకు నిలబెట్టాడు ఇప్పుడు చూద్దాం...

ఈ సినిమా కథ విషయానికి వస్తే మెడికో అయిన అర్జున్ రెడ్డీ అస్సలు కోపం కంట్రోల్ చేసుకోలేడు.. అలాంటి అతను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయిన ప్రీతీని తొలి చూపులోనే ప్రేమిస్తాడు... అర్జున్ తన మీద చూపిస్తున్న కేరింగ్, ఎఫెక్షన్ చూసి ఆమె కూడా లవ్ లో పడుతుంది... అయితే శారీరకంగా ఒకటై చాలా కాలం రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్ళ పెళ్లికి హీరోయిన్ ఫాదర్ అడ్డు పడతాడు.. ఆమెను వేరే ఒకరికి ఇచ్చి పెళ్ళి చేస్తారు... అయితే ఆమెను పిచ్చిగా ప్రేమించిన అర్జున్ రెడ్డీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు.. ఆమె జ్ఞాపకాలనుండి బయట పడ్డాడా లేదా చివరికి అతని జీవితం ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే...

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచాడు విజయ్ దేవరకొండ సినిమా చూస్తున్నంత సేపు మనకు స్క్రీన్ పై అర్జున్ రెడ్డే కనిపిస్తాడు.. అంతగా ఆ పాత్రను ఓన్ చేసుకుని నటించాడు విజయ్.. బ్లడ్ అండ్ హార్ట్ పెట్టి పని చేశాడు.. ఇక హీరోయిన్ షాలినీ జస్ట్ ఒక నార్మల్ అమ్మాయిగా విత్ అవుట్ మేకప్ తో ప్రజంట్ చేశారు హీరో లవ్ లో సింన్సియర్ గా ఉన్నాడు తప్పా.. ఆ అమ్మాయి అందం చూసి లవ్ చేయలేదు అని అలా డిజైన్ చేసినట్టు ఉన్నారు..అయితే క్లైమాక్స్ ఒక్క సీన్ లో తన నటనకు మంచి అప్లాజ్ వచ్చింది... పెళ్ళి చూపులు ఫేమ్ ప్రియదర్శి ఏదో సెంటి మెంట్ కోసం కనిపించాడు.. ఇక ఈ సినిమాతో పరిచయం అయిన కొత్త కమెడియన్ రాహుల్ రామకృష్ణ నాచ్యూరల్ స్లాంగ్ తో కామెడీ పండించి సినిమాకు చాలా ప్లస్ అయ్యాడు.. ఇక మిగతా నటీనటులు పాత్రల పరిది మేరకు బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు..

టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఇలాంటి కల్ట్ సినిమాను టేకప్ చేసిన రైటర్ అండ్ డైరక్టర్ సందీప్ రెడ్డీని మెచ్చుకోవాల్సిందే.. ఎంచుకున్న పాయింట్ ను కామెడీ, ఎమోషన్స్ తో మిక్స్ చేసి చెప్పిన విధానం బావుంది.. సినిమాను క్లారిటీగా తీసిన విధానంలో కమిట్ మెంట్ రిప్లేక్ట్ అవుతుంది.. ఇక అంత అరచి కోల చేసిన లిప్ కిస్ సీన్స్ కథలో బాగంగా వచ్చాయి.. పైగా హీరో హీరోయిన్ కు మధ్య వల్గర్ రొమాన్స్ లేకుండా ఆ ముద్దులతో లవ్ లో డెప్త్ ను ప్రజంట్ చేశారు.. ఈ సినిమాలో సాంగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు రాధన్.. రాజుతోట కెమేరా వర్క్ చాలా బాగుంది.. నిర్మాణ విలువలకు డొకా లేదు. కథకు తగ్గట్టు వెనకాడకుండా డిమాండింగ్ లొకేషన్స్ లో తీశారు..

ఓవర్ ఆల్ గా చెప్పాలంటే ప్రజంట్ యూత్ ట్రెండ్ ను రిప్లెక్ట్ చేస్తు కొత్త డైరక్టర్ సందీప్ రెడ్డీ వంగా తీసిన ఈ కల్ట్ మూవీ అన్ని వర్గాలను అలరించి మంచి విజయాన్ని అందుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే మోడ్రన్ అండ్ రియలిస్ట్ ఆలోచనలు ఉన్న ఆడియన్స్ ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి..

ప్లస్ పాయింట్స్

విజయ్ దేవరకొండ

డైరక్షన్

రియలిస్టిక్ స్క్రీన్ ప్లే

కామెడి

కెమెరా వర్క్


 

మైనస్ పాయింట్స్

రొటీన్ కథ

రొటీన్ క్లైమాక్స్

అనవసరమైన లాగ్స్

ఫోర్స్ డు సీన్స్


 

టెన్ టివి రేటింగ్ కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్న పీవీ సింధు

హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సెమీస్ లో పీవీ సింధు పతకం ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్ లో చైనా షట్లర్ సన్ యూ పై సింధు విజయం సాధించింది. సన్ యూ పై21-14,21-9 తేడాతో సింధు విజయం సాధించింది.

డేరాల హింసలో 28 మంది మృతి

హైదరాబాద్: డేరాల హింసలో ఇప్పటివరకు సుమారు 28 మంది మృతిచెందగా...200 మందికి పైగా గాయపడ్డారు. పంచకులలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉన్న వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. హత్య, అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు, డేరా సచ్చా సౌధ అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను దోషిగా ప్రకటించిన నేపథ్యంలో పంచకులలో హింస చెలరేగింది. ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరుపుతూ, భాష్పవాయువును ప్రయోగించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ, మీడియా వాహనాల అద్దాలను పగులగొట్టారని ఓ మీడియాకు చెందిన ప్రతినిధి చెప్పారు.

గుర్మీత్‌ ఆస్తుల అటాచ్ కు హైకోర్టు ఆదేశం...

చండీగఢ్‌: గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ దోషిగా తేలిన అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పంజాబ్‌, హరియాణా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తీర్పు అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో కలిగిన నష్టాన్నిపూడ్చేందుకు గుర్మీత్‌ ఆస్తులను వినియోగించాలని సూచించింది. ఇందుకు గాను ఆయన ఆస్తులను అటాచ్‌ చేయాలని ఆదేశించింది.

19:26 - August 25, 2017
18:58 - August 25, 2017

హైదరాబాద్: పంజాబ్‌, హర్యాణా రాష్టాల్లు అగ్నిగుండంగా మారాయి. ప్రతిచోటా గుర్మీత్‌ బాబా గూండాలు రెచ్చిపోతున్నారు. పంజాబ్‌ హర్యాణాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. వందల సంఖ్యలో వాహనాలకు నిప్పుపెట్టారు. పంచకుల కోర్టు దగ్గర విధ్వంసానికి దిగారు. పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. 10కి పైగా మీడియా వాహనాను ధ్వంస చేశారు. బాబా అనుచరులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్‌గ్యాస్‌ , వాటర్‌క్యానన్‌లు ప్రయోగించారు. అయినా గుర్మిత్‌ అనుచరులు వినకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. పంచకులతోపాటు రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల విధ్వంసం జరుగుతోంది. పంజాబ్‌లో రెండు రైల్వేస్టేషన్లు, ఇన్‌కం ట్యాక్స్‌ ఆఫీసుకు నిప్పుపెట్టారు. పలు చోట్ల పెట్రోల్‌బంకులను అగ్నికి ఆహుతి చేశారు. ఒక్క పంచకుల అల్లరల్లలోనే ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. 200 మందికి పైగా గాయపడ్డారు. అటు కోర్టు దోషిగా తేల్చిన గుర్మీత్ బాబాను హెలికాఫ్టర్‌లో రోహత్‌కు జైలుకు తరలించారు. పంచకులలో బీఎస్‌ఎఫ్‌ బలగాలను రంగంలోకి దించారు. పలు చోట్ల సైన్యం ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహిస్తోంది. అటు అల్లర్లపై కేంద్ర హోం శాఖా ఆరా తీసింది. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతలపై హర్యాణా, పంజాబ్‌ మంత్రివర్గాలు అత్యవసరంగా బేటీ అయ్యాయి. అల్లర్లకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. ఢిల్లీలో కూడా గుర్మీత్‌బాబా గూండాలు రెచ్చిపోతున్నారు. ఆనంద్‌విహార్‌లో రైలుకు నిప్పుపెట్టారు. మరోవైపు బాబు అనుచరుల విధ్వంసంపై చండీగడ్ హైకోర్టు సీరియస్ అయింది. గుర్మీత్ ఆస్తులు జప్తు చేయాలని ఆదేశించింది.  

రోహ్ తక్ జైలుకు గుర్మీత్ బాబా.....

హర్యానా: గుర్మిత్ సింగ్ అనుచరుల హింస ఢీల్లీ,యూపీకి పాకింది. పంచకుల అల్లర్లలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పట్టికే 12 మంది మృతి చెందాగా 200 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. బర్నాలాలో టెలిఫోన్ కార్యలయానికి బాబా అనుచరులు నిప్పు పెట్టారు. హెలికాఫ్టర్లో రోహ్ తక్ జైలుకు గుర్మీబాబా ను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. శాంతిభత్రలపై హర్యాణా మంత్రి వర్గం అత్యవసర సమావేశం నిర్వహించారు. 

గుర్మీత్ అనుచరుల దాడి లో 12కు చేరిన మృతుల సంఖ్య

హర్యానా: డేరా సచ్చా సౌదా గురువు బాబా గుర్మీత్ రామ్ రహీమ్ అనుచరులో మృతుల సంఖ్య 12 కు చేరింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి.

ఘజియాబాద్ లో బస్సుకు నిప్పు

హర్యనా: డేరా సచ్చా సౌదా గురువు బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ అనుచరుల హింస క్షణక్షణానికి మీతిమిరి పోతోంది. యూపీలో ఘజియాబాద్ లో బస్సుకు నిప్పు పెట్టారు. పంజాబ్ హర్యానా హైకోర్టు రామ్ రహీం కేసులో బాగంగా కీలక ఆదేశం ఇచ్చింది. రామ్ రహీం ఆస్తులను జప్తు చేయాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది.

ఢిల్లీకి వ్యాపించిన గుర్మీత్ అనుచరుల విధ్వంసం

హర్యానా: రామ్ రాహీం అనుచరుల ఆందోళనలు ఢిల్లీ వరకు వ్యాపించడంతో వాతావరణమత ఉద్రిక్తతంగా మారింది. ఢిల్లీలో 3 బస్సులకు రహీం అనుచరులు నిప్పుపెట్టిచారు. ఆనంద్ విహార్ స్టేషన్ లో రెండు బోగీలకు నిప్పుపెట్టారు. రోహ్ తక్ వైపు వెళ్లాల్సిన 236రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఆందోళనకారులు శాంతి పాటించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి చేస్తున్నారు.

 

17:25 - August 25, 2017

హైదరాబాద్: అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా గురువు బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చి కోరుక్టు తరలించింది. దీంతో డేరా బాబా అనుచరులు పలు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. వీరివిధ్వంసం లో 11 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యం గా ఆందోళన కారులు రాళ్లదాడికి దిగారు. పలు చోట్ల వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు పలువురు జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి విధ్వంసకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నా… ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గడంలేదు. పోలీసులపై రాళ్లు రువ్వారు… దీంతో పంచకుల కోర్టు సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంచకులలో కర్రలు పట్టుకుని వీధుల్లో తిరుగుతున్నారు డేరా అనుచరులు. షాపుల దగ్గర భారీగా గుమ్మికూడిన వారిని పోలీసులు చెదరగొడుతున్నారు. మరోవైపు పంచకుల సమీపంలో ప్లాగ్ మార్చ్ నిర్వహించింది సైన్యం. పంజాబ్, హర్యానాలో 35 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించాయి. సీబీఐ కోర్టు పరిసర ప్రాంతాలను బీఎస్ఎఫ్‌ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. బాబా అనుచరులను పంచకుల నుంచి వెనక్కి పంపుతున్నారు. ఇరు రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మరో వైపు పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలు అప్రమత్తమై, రాష్ట్ర మంత్రులతో ముఖ్యముఖ్యమంత్రులు అత్యవసర భేటీలు నిర్వహిస్తున్నారు.

17:07 - August 25, 2017

తీపి పదార్థాలు అంటే చాలా మందికి ఇష్టమే. కానీ ఇష్టం కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం జర భద్రం అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా పురుషులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంట. చక్కెర ఎక్కువగా తీసుకుంటే బుద్ధి మాంద్యం..మానసిక ఆందోళన.. లాంటి సమస్యలు వస్తాయంట. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిని అధ్యయనం చేయగా డయాబెటీస్ తో పాటు అధిక కొలెస్ట్రాల్..ఒబెసిటీ..గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నట్లు తేలిందంట. ఇది వరకే పలు అధ్యయాలు ఈ విషయాన్ని చెప్పాయి కూడా. తాజాగా 22 ఏండ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న 8 వేల మందిని పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది. చక్కెర అధికంగా వాడితే బుద్ధిమాంధ్యం, మానసిక ఆందోళన సమస్యలు ఉత్పన్నం కావడానికి 23 శాతం అవకాశం ఉందంట. సో..చక్కెర ఎక్కువగా తీసుకోకండి...

16:58 - August 25, 2017

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అత్యంత వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. అంతేకాకుండా. ఆ ప్రాజెక్టు పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు 78.55 కిలోమీటర్ల మేర సొరంగం పనులు పూర్తికావడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో పనులు పూర్తిచేసి రైతులకు త్వరగా సాగునీరు ఇవ్వాలని నీటిపారుదల అధికారులకు సూచించారు. అదేవిధంగా జలాశయాల నిర్మాణం పూర్తికాక ముందే చెరువులు నింపే పనులు చేపట్టాలని చెప్పారు. ప్రాజెక్టు అన్ని పనులు సమాంతరంగా చేయడంతో పాటు అన్ని బ్యారేజీల పనులు 2018 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. కాళేశ్వరం పనులు జరుగుతుండగానే ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు నీరు తరలించాలని సూచించారు. కాగా దేవాదుల ప్రాజెక్టు కోసం రూ. 8 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇదే అంశంపై '10టివి' గ్రౌండ్ రిపోర్టు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

11కు చేరిన మృతుల సంఖ్య...

చండీగఢ్ : రాష్ట్ర మంత్రులతో సీఎం అత్యవసర సమావేశం నిర్వహించారు. రామ్ రహీం అనుచరుల ఆందోళనలు..జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రహీం అనుచరుల హింసకు 11మంది మృతి చెందగా పలువురు గాయాల పాలయ్యారు. 

 

16:55 - August 25, 2017

కీళ్ల నొప్పులు..వయస్సు పెరుగుతున్న వారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఈ సమస్య వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఏ పని చేయలేకపోతున్నామని వయస్సు పెరిగిన వారు అంటుంటారు. ఈ కీళ్ల నొప్పులను కొన్ని చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు.

ఉల్లిపాయ..ఆవాలు సరిసమానంగా తీసుకోవాలి. ఇవి బాగా నూరుకోవాలి. ఈ ముద్దను కీళ్లపై మర్దన చేసుకుంటే బాగుంటుంది.
దానిమ్మ చిగుళ్లు..సైంధవ లవణం కలిపి నూరుకోవాలి. ఈ ముద్దను పప్పు బద్దంత మాత్రలుగా చేసుకోవాలి. వీటిని మూడు పూటలా తీసుకోవాలి.
ఆవనూనెతో క్రమం తప్పకుండా రోజూ రెండు పూటలా మర్దన చేస్తుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
కప్పు నువ్వుల నూనె తీసుకుని అందులో నాలుగు వెల్లుల్లి రిబ్బలను వేసి బాగా మరిగిలించాలి. ఈ నూనెను వడగట్టి కీళ్ల నొప్పులున్న చోట మర్దన చేయాలి. 

 

16:51 - August 25, 2017

హైదరాబాద్: రేప్‌కేసులో గుర్మీత్‌ రామ్‌రహీమ్‌బాబాను సీబీఐకోర్టు దోషిగా తేల్చడంతో.. పంచ్‌కులలో బాబా అనుచరులు రెచ్చిపోయారు. కోర్టు సమీపంలోని వాహనాలపై దాడికి దిగారు. పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. బాబా అనుచరుల దాడిలో రెండు మీడియా వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో కోర్టు పరిసరాల్లో ఆర్మీ ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించింది. అంతకు ముందు దోషిగా తేలిన గుర్మీత్‌బాబాను అంబాల సెంట్రల్‌జైలుకు తరలించారు. ఈనెల 28న గుర్మీత్‌ రామ్‌రహీమ్‌ కు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. మరోవైపు బాబా అనుచురులు దాడులకు దిగొచ్చన్న సమాచారంతో హర్యాణా, పంజాబ్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. 150 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు.

హర్యాణాలో పంచకుల కోర్డు వద్ద ఉద్రిక్తత

అంతకు ముందు అత్యాచారం, హత్య కేసులో వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు, డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. ఈ నెల 28న శిక్ష ఖరారు చేయనుంది. తీర్పు వెలువరించే సమయంలో ఆయన న్యాయస్థానంలోనే ఉన్నారు. తీర్పు వెలువడిన వెంటనే గుర్మీత్‌ను హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 50 నుంచి 60వేల మంది వరకు మద్దతుదారులు న్యాయస్థానం ఆవరణలో ఉన్నారు. కోర్టు ఆవరణలోనే వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు... తరువాత అంబాలా జైలుకు తరలించారు. తీర్పు వెలువడిన అనంతరం పంచకులలోని సెక్టార్‌-3 ప్రాంతంలో ఆందోళనలు చెలరేగాయి. డేరా మద్దతుదారులు ఆ ప్రాంతంలో నిలిపి ఉంచిన కొన్ని కార్లకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

16:48 - August 25, 2017

అనంతపురం : హంద్రినీవా పనులను రైతులు అడ్డకున్నారు. పుట్టపర్తి సమీపంలోని జరుగుతున్న ప్రాజెక్టు తొమ్మిదవ ప్యాకేజీ పనులను అడ్డుకున్నారు. ముందస్తుగా ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. పరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వంటిపై కిరోసిన్‌పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

16:46 - August 25, 2017

హైదరాబాద్: ఎట్టకేలకు దళిత యువకుడు సాగర్‌ను కిడ్నాపర్లు విడిచిపెట్టారు. సాగర్‌ బీసీ వర్గానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు సాగర్‌పై దాడి చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోవడమే కాకుండా అతనిపై కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న సాగర్‌ను అమ్మాయి తరపు బంధువులు కిడ్నాప్ చేశారు. అయితే తనను బెదిరించిన కిడ్నాపర్లు..ఇవాళ విడిచిపెట్టినట్లు సాగర్ తెలిపాడు. 

బలవంతపు భూసేకరణ ఆపాలి....

అనంతపురం: బలవంతపు భూసేకరణ ఆపాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. పరిహారం చెల్లించకుండా తమ భూమిలో తవ్వకాలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తి వద్ద హంద్రీనీవా కాల్వ పనులను రైతులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ 9 వ ప్యాకేజీ పనులకు రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హంద్రీనీవా 9వ ప్యాకేజీలో 14 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతోంది.

 

16:29 - August 25, 2017

మీడియా వాహనాలపై దాడి..

చండీగఢ్: హర్యానాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. డేరాసచ్చాసౌదా సంస్థ నిర్వాహకుడు గుర్మిత్‌ రామ్‌రహీమ్‌ బాబాను దోషిగా అని కోర్టు తీర్పు చెప్పడంతో ఆయన అనుచరులు హంగామా చేశారు. పంచకులాలో లక్ష మంది బాబా అనుచరులు మకాం వేసినట్లు తెలుస్తోంది. రామ్ రాహీం మద్దతుదారులు మీడియా వాహనాలను ధ్వంసం చేసి, రిపోర్టర్లపై దాడి చేశారు. పోలీసులు వాటర్ కాన్లు, బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. 

 

ఇంకా కొనసాగుతున్న ఉద్రిక్తత......

అనంతపురం: పుట్టపర్తిలో ఉ. 10గంటల నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. రైతులకు, రెవెన్యూ అధికారులకు మధ్య ఘర్షణ జరుగుతోంది. భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. కాలువలు తవ్వుతున్న రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఇద్దరు రైతులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.

 

15:39 - August 25, 2017

హైదరాబాద్: మహిళలపై అత్యాచారం కేసులో దోషిగా ప్రకటించిబడ్డ.. డేరాసచ్చాసౌదా సంస్థ నిర్వాహకుడు గుర్మిత్‌ రామ్‌రహీమ్‌ బాబా తెలంగాణలోనూ భూములు ఉన్న విషయం బయటపడుతోంది. నల్లగొండజిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఈ భూములు కొనుగోలు చేశారు. 2009 నుంచి 2013 మధ్య మొత్తం 55 ఎకరాల ఎకరాలను కొనుగోలు చేసి దాని చుట్టూ ప్రహరీ నిర్మించారు. సర్వేనం -100, 101,102, 103, 104, 105, 107..సర్వేనం - 108 109 111 113 116 118 119 120 121 లో ఆశ్రమం ల్యాండ్స్‌  2009 నుంచి 2013 మధ్య డేరా సచ్చా నిర్వాహకులు భూమి కొనుగోళ్లు చేశారు.

 

తెలంగాణలో గుర్మిత్ సింగ్ ల్యాండ్స్....

హైదరాబాద్: గుర్మిత్ సింగ్ రామ్ రహీం బాబాకు తెలంగాణలో ల్యాండ్స్ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో భూములు భారీగా కొనేసినట్లు తెలుస్తోంది. చిట్యాల మండలంలో వెలిమినేడులో 55ఎకరాలు స్థలం ఉన్నట్లు, సౌదా ఆశ్రమం పేరుతో భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేసినట్లు సమాచారం. సర్వేనం 100, 101, 102, 103, 104, 105, 107లో ఉన్నట్లు గుర్తించారు. 

 

15:18 - August 25, 2017

చండీగఢ్: పదిహేనేళ్ల క్రితం ఇద్దరు శిష్యురాళ్ల పై లైంగిక దాడి కేసులో డేరా సచ్చా సౌదా గురువు బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. 2002 నాటి కేసులో రామ్ రహీమ్ను దోషిగా తేల్చింది. హర్యానాలోని పంచకుల సీబీఐ కోర్టుకి ఆయ‌న భారీగా చేరుకున్న నేప‌థ్యంలో అక్క‌డ ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా భ‌ద్ర‌తాబ‌ల‌గాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. పంజాబ్, చండీగఢ్ రాష్ట్రాల్లో ఇప్ప‌టికే హై అల‌ర్ట్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ నెల 28న రామ్ రహీంకు శిక్ష ఖరారు చేయనుంది. ఈ శిక్ష పై కోర్టులకు వెళ్లే అవకాశం కూడా వుంది.

ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఆయనను హర్యానా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కట్టుదిట్టుమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పంచకుల సీబీఐ కోర్టు ముందు మధ్యాహ్నం 2.30 గంటలకు గుర్మీత్ హాజరయ్యారు. ఆయనకు సంఘీభావం ప్రకటిచేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన గుర్మీత్ అనుచరులు రెండ్రోజులుగా 5 లక్షల మంది పంచకులకు చేరుకోవడంతో పెద్దఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా ఎదుర్కొనేందుకు ఆర్మీని కూడా రంగంలోకి దింపారు. 

పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో లక్షలాది మంది ఆయనను అనుసరిస్తారు. నడిచే దేవుడిగా భావిస్తారు. గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ పేరు మీద 2003 నుంచి 2015 మ‌ధ్య‌ 19 గిన్నిస్ బుక్ రికార్డులు రిజిస్ట‌రై ఉన్నాయి. 15,432 మంది ర‌క్త‌దాత‌ల‌తో క్యాంప్ ఏర్పాటు చేసి 2003, డిసెంబ‌ర్ 3న గుర్మీత్ మొద‌టి గిన్నిస్ రికార్డు న‌మోదు చేశారు. 2004లో మ‌ళ్లీ ర‌క్త‌దానంలో 17,921 దాత‌లతో పాత రికార్డును బ్రేక్ చేశారు. త‌ర్వాత 2009లో 9,38,007 చెట్లు నాటించే కార్య‌క్ర‌మంతో ద్వారా రెండు రికార్డులు, మ‌ళ్లీ 2010లో ర‌క్త‌దానంలో 43,732 దాత‌ల‌తో మ‌రో రికార్డు, 4,603 మంది ఉచిత కంటి ప‌రీక్ష‌లు చేసే క్యాంపు ఏర్పాటు చేసి ఒక రికార్డు ఆయ‌న పేరు మీద ఉన్నాయి. 

రామ్ రహీం కు దోషి..

చండీగఢ్ : ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డేరా సచ్ఛాసౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీంను దోషి అంటూ పంచకులా సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. ఈ నెల 28 న రామ్ రహీంకు శిక్ష ఖరారు చేయనుంది. 

 

కాసేపట్లో తీర్పు......

చండీగఢ్ : పంచకులా సీబీఐ ప్రత్యేక కోర్టుకు రామ్ రహీం చేరుకున్నారు. ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేశాడని డేరా చీఫ్ రామ్ రహింపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ రేప్ కేసు సంబంధించి తీర్పు కాసేపట్లో వెలువడనుంది. 

ఓట్ల లెక్కింపుకు బందోబస్తు - ఎస్పీ..

కర్నూలు : నంద్యాలలో 28న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ గోపినాథ్ పేర్కొన్నారు. 29న గణేష్ నిమజ్జనం ఉన్నందున భద్రత మరింత పటిష్టం చేసినట్లు, నంద్యాలలో కాల్పుల ఘటన యాదృచ్చికంగా జరిగిందన్నారు. గన్ మెన్ సమయస్పూర్తితో వ్యవహరించారని తెలిపారు. 

14:13 - August 25, 2017

హైదరాబాద్: దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో... ఢీ’ ఇప్పుడు 12మంది కలర్ ఫుల్ కపుల్స్ తో ఢీ జోడి గా కొనసాగుతుంది. ప్రదీప్ యాంకర్ గా... రష్మి, సుడిగాలి సుధీర్ లు టీమ్ లీడర్స్ గా... శేఖర్ మాస్టర్ , హీరోయిన్ సదా లు . జెడ్జెస్ గా బిగెస్ట్ డాన్స్ వార్ మొదలయ్యింది. అందులో పాల్గొన్న యశ్వంత్ తో '10టివి'లో చిట్ చాట్ నిర్వహించింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

14:01 - August 25, 2017

చెర్కు రైతుల రుణాలు మాఫీ జేశే ముచ్చట ముఖ్యమంత్రి గారికి చెప్పిచెప్పి చెప్పి యాస్టొస్తున్నది అంటున్నడు ముఖ్యమంత్రి గారి బిడ్డె దేవనపల్లి కవితమ్మ.. రాష్ట్రంల నడుస్తున్నదే మీ నల్గురి ముచ్చటనాయే.. ఇగ బిడ్డమాట తండ్రే ఇనకపోతె మరి..? ఇగ జనం మాట ఏడ ఇంటడు శెల్లే..? జర్ర సముదాయించి చెప్పిసూడకపోయినవ్..? గీ ముచ్చట చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

13:38 - August 25, 2017

సామాన్యుల వెసులుబాటు కోసమే...

ఢిల్లీ : కొత్త రూ.200, రూ.50నోట్లు ఆర్ బీఐ విడుదల చేసింది. సామాన్యుల వెసులుబాటు కోసమే ఈ నోట్లలని రిలీజ్ చేసినట్లు ఆర్ బీఐ పేర్కొంది.

 

13:25 - August 25, 2017

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరంలో వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేశ్‌ చౌక్‌ సెంటర్‌ వద్ద 116 సంవత్సరాల నుండి ఉత్సవాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ యేడు పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గణేశుడిని ప్రతిష్టించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:23 - August 25, 2017

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభ సభ్యులుగా.. ప్రమాణ స్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు వీరితో ప్రమాణ స్వీకారం చేయించాడు. అమిత్‌షా మొదటి సారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. స్మృతి ఇరానీ రెండోసారి ఎన్నికయ్యారు. వీరిద్దరూ గుజరాత్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం...

ఢిల్లీ: రాజ్యసభ సభ్యులుగా అమిత్ షా, స్మృతి ఇరానీలు ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వీరిద్దరి చేత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు.

 

13:07 - August 25, 2017
13:00 - August 25, 2017
12:59 - August 25, 2017
12:53 - August 25, 2017
12:50 - August 25, 2017

హైదరాబాద్‌ : కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి  ఏకదంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉత్తమ్‌కుమార్‌ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అన్నీ సమస్యలు తొలగి తెలంగాణ ప్రజలంతా.. సంతోషంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.  
బీజేపీ కార్యాలయంలో 
హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పూజలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఏ శుభ కార్యానికైనా మొదట విఘ్నేశ్వరుడినే పూజిస్తామని దత్తాత్రేయ అన్నారు. 

 

12:49 - August 25, 2017

భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు 'శంకర్'...తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' కాంబినేషన్ లో రూపొందుతున్న 'రోబో 2.0’ చిత్ర షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ యాక్షన్ హీరో 'అక్షయ్ కుమార్' ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.

'రోబో' సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. 'శంకర్‌' దేశంలోనే టాప్‌మోస్ట్ డైరెక్టర్‌.. ఇండియన్ స్పీల్‌బర్గ్‌గా అభిమానులు పిలుచుకునే శంకర్‌.. జంటిల్‌మెన్‌ నుంచి రోబో వరకూ ఎన్నో అత్యుత్తమ చిత్రాలు తీశాడు. కొత్త కొత్త వెరైటీ కాన్‌సెప్ట్‌లతో సినిమాలుతీసే శంకర్‌ అంటే దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌. రోబో 2.0 భారీ బడ్జెట్‌ చిత్రం కావడం కూడా మూవీపై అంచనాల్ని పెంచేస్తోంది.. ఈ సినిమాకు 450కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారని సినీవర్గాల టాక్‌.. 'బాహుబలి' రెండు భాగాల ఖర్చు కంటే 'రోబో2.0'కే ఖర్చు ఎక్కువ. తక్కువ ఖర్చుతోనే రాజమౌళికి అంతటి సక్సెస్‌ వస్తే ఇంత భారీ బడ్జెట్‌తో వస్తున్న 'రోబో 2.0'లో ఎంతటి స్థాయిలో గ్రాఫిక్స్ ఉంటాయోనని సినీ అభిమానులు చూడకముందే థ్రిల్ అవుతున్నారు.

సినిమాకు సంబంధించిన ఏ విషయం బయటకు పొక్కడం లేదు. సినిమాకు సంబంధించిన లుక్స్..ఇతరత్రా కొన్ని లీక్ అయినా అసలు విషయం మాత్రం బయటకు రావడం లేదు. తాజాగా శంకర్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్ డేట్ తెలిసే విధంగా వీడియో ఉంటుందని తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. 'రోబో 2.0’, 'బాహుబలి 2’ రెండూ ఒకేసారి షూటింగ్‌ స్టార్ట్ అయినా 'బాహుబలి' ముందుగా రిలీజైంది. 'బాహుబలి 2'ను చూసిన సినీ అభిమానులు అంతకంటే అద్భుతమైన గ్రాఫిక్స్‌తో రూపొందిస్తున్న 'రోబో 2.0'కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

12:46 - August 25, 2017

భద్రాద్రి : జిల్లాలో పండుగ రోజు విశాదం చోటుచేసుకుంది. ఆళ్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు గొగ్గెల సంపత్‌ అనే మూడేళ్ల బాలుడు జిల్లెల వాగులో పడి మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబీకులు రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

విద్యుత్ షాక్ తో ఇద్దరు చిన్నారుల మృతి..

వనపర్తి: జిల్లాలో శ్రీనివాసపురంలో విషాదం చోటుచేసుకుంది. వినాయకచవితి సందర్భంగా మొక్కజొన్న కంకుల కోసం పొలానికి వెళ్లిన శ్రీకాంత్, కిషోర్ అనే ఇద్దరు బాలురు విద్యుత్ షాక్ తో మృతి చెందారు.

 

12:40 - August 25, 2017
12:38 - August 25, 2017
12:37 - August 25, 2017

హైదరాబాద్‌ : నగరంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ఊపందుకుంది. జీహెచ్‌ఎంసీ ఈ ఏడాది 2 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తోంది. వివిధ సంస్థలు పెద్ద ఎత్తున మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాలు చేపట్టాయి. ఇందిరా పార్క్‌ వద్ద ఎమరాల్డ్‌ ఆధ్వర్యంలో..  మట్టి విగ్రహాలను జీహెచ్‌ఎంసీ మేయర్‌ సతీమణి శ్రీదేవి.. స్థానిక కార్పొరేటర్లతో కలిసి పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాలుష్యం చేసే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసిన విగ్రహాలను కాకుండా.. మట్టి విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. 

 

12:32 - August 25, 2017

మహారాష్ట్ర : మట్టి వినాయకున్ని చూశాం.. ప్లాస్టర్‌ ఆఫ్‌పారిస్‌ వినాయకుడు తెలుసు.. కానీ అక్కడ మాత్రం కర్రవినాయకుడు కొన్నేళ్లుగా కొలువై అందరినీ ఆకర్షిస్తున్నాడు. అక్కడి కర్ర గణనాథుడిని ఆరాధిస్తే రోగాలు రావని.. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని గ్రామస్తుల విశ్వాసం. ఇంతకీ ఆ గణేషుడు కొలువుదీరిందెక్కడ? వాచ్‌ దిస్‌ స్టోరీ. 
కర్ర వినాయకుడు 70 ఏళ్ల చరిత్ర 
ఇది తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పాలజ్‌ గ్రామం. ఈ గ్రామం స్పెషాలిటీ ఏంటంటే.. ఈ ఊళ్లో కర్ర వినాయకుడి విగ్రహం ఉండటమే. ఈ వినాయక ప్రతిమకు సుమారు 70 ఏళ్ల చరిత్ర ఉంది. నాందేడ్ జిల్లా, పాలజ్‌ గ్రామంలో కొన్నేళ్ల క్రితం ప్రజలు కలరా వ్యాధి సోకి వాంతులు, విరేచనాలతో మంచాన పడ్డారు. గ్రామ పెద్దలు గణపతి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే మంచి జరుగుతుందని భావించారు. 
1945లో కర్ర వినాయక విగ్రహం ఏర్పాటు 
వెంటనే నిర్మల్‌కు చెందిన గుండాజి వర్మ అనే కళాకారుడితో.. 1945లో కర్ర వినాయక విగ్రహాన్ని రూపొందించారు. వినాయక ప్రతిమను పాలజ్‌ గ్రామానికి తీసుకువచ్చి నియమ నిష్టలతో పూజించారు. తరవాత గ్రామంలో వ్యాధులు అదుపులోకి వచ్చి వర్షాలు సమృద్ధిగా కురిశాయని గ్రామస్తులు అంటున్నారు. ఇదంతా గణేష్‌ విగ్రహం ప్రతిష్టించడం వల్లే జరిగిందని, కోరిన కోరికలు తీర్చే సత్య గణేషుడిగా భక్తులు చెబుతున్నారు. 
తరలివస్తున్న భక్తులు  
ఈ పాలజ్‌ గ్రామం నిర్మల్‌ జిల్లా, కుబీర్‌ మండలం, సిర్పెల్లి గ్రామ శివారులో ఉన్న.. మహారాష్ట్ర పరిధిలో ఉంది. పాలజ్‌ గ్రామానికి ప్రతీ యేడూ భక్తులు పెద్ద మొత్తంలో తరలివస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ముంబైలాంటి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తుంటారు. 
11 రోజుల పాటు పూజలు 
ఇక్కడ భక్తుల సౌకర్యం కోసం ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ గణేశుడికి ఒక ప్రత్యేకత ఉంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడిని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువు వద్ద నీళ్లు చల్లి దాన్ని ఒక బీరువాలో భద్రపరుస్తారు. భక్తుల సౌకర్యం కోసం అటు మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 
పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు 
నిర్మల్‌ జిల్లా భైంసా నుంచి పాలజ్‌కి వెళ్లడానికి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. భైంసా డిపో అధికారులు, ఆలయం వద్ద పార్కింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్‌లలో లైవ్‌ టెలికాస్ట్‌ చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. ప్రతీ యేడు గణేశ్‌ నవరాత్రులలో రోజుకు 30 క్వింటాళ్ల బియ్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

 

12:23 - August 25, 2017

హైదరాబాద్ : వినాయక చవితి పండగ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి.. గణనాథుడిని దర్శించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం, అయినవిల్లి, విశాఖలోని సంపత్‌ వినాయక ఆలయం సహా.. ప్రముఖ ఆలయాలన్నీ పండగా వాతావరణంతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ వినాయక ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా వెలసిన గణేషులతో సందడి నెలకొంది. 

12:22 - August 25, 2017

'పవన్ కళ్యాణ్' ఏదైనా సినిమా ఒప్పుకున్నాడని టాక్ వచ్చినప్పటి నుండి చిత్రం విడదలయ్యే వరకు అభిమానులు సందడి..అంతా..ఇంతా కాదు. సినిమాకు సంబంధించిన విశేషాలు తెలుసుకోవడానికి సోషల్ మాధ్యమాల్లో తెగ వెతికేస్తుంటారు. తమ అభిమాన హీరో ఫస్ట్ లుక్..టీజర్ ఎప్పుడు విడదలవుతుందా ? అని తెగ ఉత్కంటకు గురవుతుంటారు. తాజాగా 'పవన్ కళ్యాణ్' నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారంట.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ రూపొందుతున్న సినిమాలో 'పవన్ కళ్యాణ్' హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు హీరోయిన్స్ గా నటించారు. శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాలో పవన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. సీనియర్ నటి 'ఖుష్బూ' ఓ కీలక పాత్ర పోషిస్తోంది. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ డేట్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పవన్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి ఆ లుక్ ఎలా ఉండనుందో తెలియాలంటే అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. 

పుట్టపర్తిలో రైతుల ఆత్మహత్యాయత్నం...

అనంతపురం : పుట్టపర్తిలో ఉద్రికత నెలకొంది. కోర్టు ఆదేశాలను రెవెన్యూ అధికారులు ధిక్కరించారు. హంద్రీనీవా నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా రెవెన్యూ అధికారులు భూములను లాక్కొటున్నారు. దీనితో రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ ప్రయత్నంలో ఆత్మహత్యకు యత్నం చేసిన ఇద్దరు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనా స్థలి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 

 

12:18 - August 25, 2017

హైదరాబాద్ : ఖైరతాబాద్‌ వినాయకుడికి గవర్నర్‌ దంపతులు తొలిపూజ నిర్వహించారు. గణనాథుడికి ఘనంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ.. గవర్నర్‌ నరసింహన్‌ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడు అందరినీ సంతోషంగా, సుఖంగా ఉండేలా చూస్తాడని ఆశించారు. వచ్చే ఏడాది నుంచి ఖైరతాబాద్‌లో మెటల్ గణేషుడి విగ్రహం కాకుండా.. ఎకో ఫ్రెండ్లీ విగ్రహం పెడతారని గవర్నర్ తెలిపారు. 

 

12:15 - August 25, 2017

ఢిల్లీ : డేరా స‌చ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్‌పై నమోదైన రేప్‌ కేసులో  ఇవాళ తీర్పు  వెలువడనుంది. తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలివేశారు. 2002లో ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారం జరిపినట్లు గుర్మీత్‌ రామ్‌రహీంపై  ఆరోపణలున్నాయి. 2007లో ఇద్దరు మహిళల నుంచి వాంగ్మూలం సేకరించిన పంచకుల సిబిఐ కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించనుంది. తీర్పు సందర్భంగా డేరా చీఫ్‌ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు చట్టాన్ని తాను గౌరవిస్తానని...వెన్ను నొప్పి ఉన్నా...తాను కోర్టు ముందు హాజరు కానున్నట్లు గుర్మీత్‌ ట్వీట్‌ చేశారు. అందరూ శాంతియుతంగా ఉండాలని తన అనుచరులకు సందేశమిచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా రెండు రాష్ట్రాల్లో 150 కంపెనీల పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించారు. డ్రోన్‌ల సహాయంతో నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

 

12:11 - August 25, 2017

హైదరాబాద్‌ : నగరంలో పండుగల సందడి మొదలైంది. గణేష్ చవితి, బక్రీద్‌ పండుగలు ఒకేసారి వస్తుడటంతో భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జంటపండుగలను ప్రశాంతమైన వాతావరణంలో  జరుపుకునేలా నగర పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సిటీలో ఉగ్రదాడులు జరుగుతాయన్న ఐబీ హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు పోలీసులు. 
వినాయక చవితి, బక్రీద్
ఓ వైపు వినాయక చవితి.. మరోవైపు బక్రీద్‌..జంట పండుగలతో హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. వినాయక విగ్రహాల కొనుగోళ్లతో విక్రయ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. మంటపాల ఏర్పాట్లలో  పిల్లలు, యువకులు నిమగ్నమయ్యారు. పూజసామగ్రి దుకాణాలు, పూల అంగళ్లు జనంతో కిక్కిరిసాయి. బక్రీద్‌ పండుగ నేపథ్యంలో బట్టల షాపులు జనసందోహంగా మారాయి. జంట పండుగల నేపథ్యంలో  సిటీలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 
24 వేల మంది పోలీసు బందోబస్తు 
ఐబీ హెచ్చరికల నేపథ్యంలో.. గణేష్ ఉత్సవాల కోసం 24 వేల మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించారు. కేంద్ర బలగాలు, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, ర్యాఫిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, సీఆర్పీఎఫ్‌, పారామిలటరీ  బలగాలను మోహరించనున్నారు. వీరితో పాటు క్రైమ్‌ టీమ్‌, షీటీమ్స్‌, సిటి కమాండోస్, క్విక్ రియాక్షన్ టీమ్స్, ఐడి పార్టీలు, మఫ్టీ పోలీసులను వినియోగించనున్నారు. అంతేకాదు గణేష్‌ మండపాల దగ్గర కొత్తగా జియో ట్యాగింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. క్యూఆర్ కోడ్‌లతో సీసీటీవీల ద్వారా పర్యవేక్షించనున్నారు. గణేష్ మండపాల వద్ద బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపడుతున్నారు. 
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం : సీపీ మహేందర్‌ రెడ్డి 
ఇక వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీపీ మహేందర్‌ రెడ్డి చెబుతున్నారు. విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు 36 క్రేన్ల వినియోగం..ఇందుకోసం మూడు షిప్టుల్లో సిబ్బంది విధులు  నిర్వహిస్తారని చెప్పారు. నిమజ్జనం కోసం విగ్రహాలను ట్యాంక్‌బండ్‌కు తరలించే రహదారుల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానించి పరిస్థితిని  ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. 
సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు 
పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాలను పోలిసులు ఇప్పటికే గుర్తించారు. గణేష్ చవితి, బక్రీద్‌ పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని.. హైదరాబాద్‌  బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడాలని పోలీసులు కోరుతున్నారు. 

 

12:09 - August 25, 2017

'పెళ్లి చూపులు' చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు 'విజయ్ దేవరకొండ' తన తాజా చిత్రం 'అర్జున్ రెడ్డి'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. విజయ్ సరసన షాలిని షాండే హీరోయిన్ గా నటించారు. విడుదల కాకముందే పలు వివాదాలు చుట్టుముట్టుకున్నాయి. బోల్డ్ సీన్స్ ఉండడం..లిప్ లాక్ సీన్స్ ఉండడం..పోస్టర్స్ కూడా అదే విధంగా ఉండడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హీరో హీరోయిన్ ముద్దు సీన్ ప్రాక్టీస్ చేస్తున్న పుటేజీ లీక్ చేసి సంచలనం క్రియేట్ చేశారు. అనంతరం టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ వినూత్నంగా వదులుతూ హైప్ భారీగా పెంచేశారు. ఇదంతా సినిమాకు భారీగా ప్రచారం కల్పించినట్లైంది.

ఇక చిత్ర విషయానికి వస్తే అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) బెస్ట్ స్టూడెంట్. ఇతనికి కోపం చాలా ఉంటుంది. కోపం వస్తే మాత్రం ఏదీ ఆలోచించడు. ఇతను కీర్తి (షాలిని)ని చూసి ప్రేమిస్తాడు. ఆమె వెంట తిరుగుతాడు. తాను ప్రేమిస్తున్నానంటూ పేర్కొనడంతో చివరకు కీర్తి కూడా అతడిని ప్రేమిస్తుంది. అన్ని చిత్రాల్లో లాగానే ఈ సినిమాలో కూడా వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించరు. కీర్తికి వేరే మరొకరితో వివాహం చేస్తారు. దీనితో అర్జున్ రెడ్డి మద్యానికి బానిసగా మారుతాడు. డ్రగ్స్ అలవాటు చేసుకుంటూ ఎక్కడో..ఒంటిరిగా బతికేస్తుంటాడు. మరి అర్జున్ ఏమయ్యాడు..చివరకి ఏమైంది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ సినిమాలో రియలిస్టిక్ గా..బోల్డ్ గా చూపించారని తెలుస్తోంది. తెలుగు సినిమాను ఇంత బోల్డ్ గా తీయవచ్చా ? సన్నివేశాలను అలా చూపించొచ్చా ? అనిపిస్తుందని టాక్. కానీ ఈ తరానికి మాత్రం 'అర్జున్ రెడ్డి' నచ్చుతాడని అనిపిస్తోంది. కథలో మాత్రం ఏ మాత్రం కొత్తదనం లేదని తెలుస్తోంది. ఈ సినిమాలో 'విజయ్ దేవరకొండ' మంచి నటనే కనబర్చారని, షాలిని కూడా అదరగొట్టేసిందని సోషల్ మాధ్యమాల్లో ప్రివ్యూలు పేర్కొంటున్నాయి. కుటుంబ ప్రేక్షకులకు మాత్రం ఇబ్బంది కలిగించే సినిమా అని తెలుస్తోంది. మరి సినిమా ఎలా ఉంది ? రివ్యూ..రేటింగ్ తదితర విషయాల కోసం టెన్ టివిలో ప్రసారమయ్యే 'నేడే విడుదల' కార్యక్రమం చూసేయండి....

'పిడుగు పాటు మరణాలను తగ్గించడానికి.'.

అమరావతి: అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగుపాటు మరణాల నివారకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటోదని డిప్యూటీ సీఎం చినరాజప్ప పేర్కొన్నారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఇచ్చే సమాచారం మేరకు రెవెన్యూ, గ్రామపంచాయితీ అధికారులు సమన్వయంతో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. దండోరా వేసి పిడుగుపాటు మరణాలను తగ్గించేందుకు గ్రామ పంచాయతీలు చర్యలు చేపట్టాలన్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో నిన్న పడిన పిడుగుపాటు వల్ల మృతి చెందిన కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు.

 

12:03 - August 25, 2017

విశాఖ : వినాయక నవరాత్రులకు విశాఖ ముస్తాబయ్యింది. చిన్నా పెద్దా అంతా లంబోదరుడ్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఉండ్రాలయ్యకు దండాలంటూ భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తున్నారు. విశాఖలో ప్రసిద్ది గాంచిన సంపత్‌ వినాయగర్‌ ఆలయానికి తెల్లవారు జామునుంచే భక్తులు పోటెత్తారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:00 - August 25, 2017

హైదరాబాద్‌ : నగరంలోని లుంబినీ పార్క్‌, గోకుల్‌చాట్‌  బాంబు పేలుళ్లకు నేటితో పదేళ్లు  నిండాయి.  ఆగస్టు 25, 2007న  ఈ పేలుళ్లు జరిగాయి. ఇందులో 42 మంది మృతి చెందగా.. మరో 72 మంది గాయపడ్డారు. కోఠిలో ఉన్న గోకుల్‌చాట్‌ వద్ద జరిగిన పేలుడులో 33 మంది మరణించారు. మక్కా మసీద్‌ పేలుళ్లకు ప్రతీకారంగా ఉగ్రవాదులు.. ఈ నగరంలో పేలుళ్లకు పెద్ద ఎత్తున రంగం సిద్ధం చేసినట్లు సిట్ పేర్కొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:57 - August 25, 2017

టాలీవుడ్ యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' వినాయక చవితికి సందడి..సందడి చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'జై లవ కుశ' చిత్రానికి సంబంధించిన విశేషాలు సోషల్ మాధ్యమాల్లో విడుదలు చేస్తూ అభిమానులను సంతృప్తి పరుస్తున్నారు. బాబి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో 'జై లవ కుశ' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ‘జై'..’లవ'..’కుశ' పాత్రల్లో కనిపించననున్నారు. ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా..నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

శుక్రవారం వినాయక చవితి సందర్భంగా 'లవ'కు సంబంధించిన టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ‘లవ' బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తాడని టీజర్ పేర్కొన్నారు. కాగా మూడో పాత్ర 'కుశ'కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ పొడుగాటి వెంట్రుకలతో చాలా ట్రెండగా..ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

'జై'కి విలన్ లక్షణాలు..’లవ'కు మంచి బాలుడు లక్షణాలు ఉంటే 'కుశ' మాత్రం అట్రాక్టివ్ బాయ్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే జై ..లవ పాత్రలకు సంబంధించిన టీజర్లు విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. సెప్టెంబర్ 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. 

11:44 - August 25, 2017

హైదరాబాద్ : ఖైరతాబాద్ లో గణేష్ ఉత్సవాలు ఘనం జరుగుతున్నాయి. గణనాథుని మంటపం భక్తులతో కిటకిటలాడుతోంది. గణనాథునికి గవర్నర్ నరసింహన్ దంపతులు తొలిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నగేందర్ గౌడ్ పాల్గొని, పూజలు నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

రెండు రాష్ట్రాల్లో హైఅలర్ట్...

హైదరాబాద్: డేరా చీఫ్ రామ్ రహీం కేసుపై పంచకులాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కాసేపట్లో తీర్పు వెల్లడించనుంది. ఇద్దరు మహిళలను అత్యాచారం చేశాడని రామ్ రహీంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనితో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

 

11:37 - August 25, 2017

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నేత కుమార్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:34 - August 25, 2017

నెల్లూరు : సూళ్లూరుపేట మండలంలోని కొమ్మనేతూరులో విషాదం నెలకొంది. వినాయక చవితి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది.  
విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు. గణేష్ మండపం వద్ద రాత్రి 12 గంటల ప్రాంతంలో లైటింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో ఇద్దరు మరణించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఘోర అగ్నిప్రమాదం..

ప్రకాశం: పామూరులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా గోదాములో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలార్పుతున్నారు..

 

పట్టాలు తప్పిన రైలు...

ముంబై: దక్షణ మహీమ్ ప్రాంతంలో ఓ రైలు పట్టాలు తప్పింది. అంధేరి- ఛత్రపతి శివాజీ టెర్మినస్ లోకల్ రైలు 4 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

 

మాణిక్యాలరావు అనుచరుల ఆగ్రహం...

చిత్తూరు: కాణిపాక వినాయక స్వామికి ప్రభుత్వం తరపున మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమం అనంతరం ఈవో చాంబర్ వద్ద మంత్రి మాణిక్యారావు అనుచరులు ఆందోళన నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ఆహ్వన పత్రికలో మంత్రి పేరు లేకపోవడంతో అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

10:51 - August 25, 2017

'హాయ్ ..నా పేరు లవ కుమార్..ఓ.. ప్రైవేటు బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్నా'...అంటూ జూనియర్ ఎన్టీఆర్ కొత్త టీజర్ తో ముందుకొచ్చాడు. జూనీయర్ ఎన్టీఆర్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'జై లవ కుశ' సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా..నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

వరుస హిట్స్ తో జోరు మీదున్న 'ఎన్టీఆర్' చేస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఏకంగా 'ఎన్టీఆర్' మూడు పాత్రలు పోషిస్తుండడం విశేషం. జై..లవ..కుశ..పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాత్రలకు సంబంధించి టీజర్స్..ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. ‘జై' పాత్ర చాలా భయంకరంగా ఉంటుందని.... అత్యంత కర్కశమైన విలనిజంతో కూడుకుని ఉంటుందని తెలుస్తోంది. జై' పాత్రకు కాస్త నత్తి కూడా ఉంటుందని ఈ టీజర్లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ వింటే స్పష్టమవుతుంది. ఈ రావణుడిని చంపాలంటే సముద్రమంత దదదధై...ర్యం ఉండాలి అంటూ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన విషయాన్ని మనం గమనించవచ్చు.

తాజాగా 'లవ'కు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఇందులో బ్యాంకు మేనేజర్ పాత్రను పోషిస్తున్నారు. యంగ్ లుక్ తో ఆకట్టుకున్నాడు. 'నాకో వీక్ నెస్ ఉంది..మంచితనం..అది పుస్తకాల్లో ఉంటే పాఠమౌతుంది..అదే మనలో ఉంటే గుణపాఠమౌతుంది..అదే నా జీవితాన్ని తలకిందులు చేసింది’...అంటూ టీజర్ లో డైలాగ్స్ ఉన్నాయి. వినాయక చవితి సందర్భంగా ఈ టీజర్ విడుదల చేశారు. 

పేలుళ్లకు పదేళ్లు...

హైదరాబాద్ : లుంబినీ పార్క్, గోకుల్ చాట్ వద్ద వరుస బాంబు పేలుళ్లు జరిగి పదేళ్లు కావస్తోంది. ఆగస్టు 25, 2007న జరిగిన ఈ ఘటనలో 42 మంది మృతి చెందగా మరో 72 మందికి గాయాలైన విషయం తెలిసిందే. లుంబినీ వద్ద 9 మంది మృతి చెందగా గోకుల్ చాట్ వద్ద 33 మంది మృతి చెందారు.

 

గవర్నర్ దంపతులు తొలిపూజలు...

హైదరాబాద్ : ఖైరతాబాద్ లో ప్రతిష్టించిన వినాయక విగ్రహానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ దంపతులు తొలి పూజలు చేశారు. శ్రీ చండీకుమార అనంత మహాగణపతిగా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనమిస్తున్నాడు. గవర్నర్ వెంట మంత్రులు, ఎమ్మెల్యే, ఇతరులున్నారు. విగ్రహానికి కుడివైపు సదాశివుడు, ఎడమవైపు మహిషాసురమర్ధిని విగ్రహాలు ఉన్నాయి. 57 అడుగు ఎత్తుతో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు కొలువుదీరాడు.

 

10:35 - August 25, 2017

తూర్పుగోదావరి : విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే ఆది దేవుడు గణనాధుడు..భారతదేశంలోని ప్రసిద్ధ గణనాధుని క్షేత్రంలో ప్రత్యేకమైనది విశిష్టమైనది తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు క్షేత్రం. పంట పొలాల్లో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్న ఈ స్వామివారిని దర్శిస్తే సకల మనోబిష్టాలు నేరవేరుతాయని భక్తుల నమ్మకం. ప్రకృతిని పీఠంగా మలుచుకుని వెలసిన ఈ గణనాధుడు ఆలయం శుక్రవారం జరిగే చవితి వేడుకలకు సిద్ధమవుతుంది.
తూర్పుచాలుక్యరాజుల రాజధాని బిక్కవోలు
బిక్కవోలు గ్రామాన్ని ఒకప్పుడు బిరుదాంకినవోలుగా పిలిచేవారు. తూర్పుచాలుక్యరాజులకు ఈ గ్రామం రాజధానిగా ఉండేది. 849-892 సంవత్సరాల మధ్యకాలంలో ఈ గ్రామంలో అప్పటి రాజులు పలు ఆలయాలు నిర్మించారు. ఆయా పురాతన ఆలయాలలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఒకటిగా విరాజిల్లుతుంది. అతి ప్రాచీనమైన ఈ ఆలయం 9వ శతాబ్దానికి చెందినదిగా ఇక్కడ స్థలపురాణాలు చెబుతున్నాయి. తరువాత నవాబుల పరిపాలన కాలంలో ఆలయాలను ధ్వంసం చేయడంతో స్వామివారి మూర్తి భూమిలో కలవడం జరిగింది.
తొండం కుడివైపునకు తిరిగిఉండటం విశేషం
ఇదిలా ఉండగా 50సంవత్సరాల క్రితం స్వామివారి మూర్తి  భూమిలోంచి పైకి వచ్చినట్లు ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ స్వామి వారికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ తొండం కుడివైపునకు తిరిగిఉండటం విశేషం. రజత కవచాలంకృతుడైన స్వామి ఒక చేత అభయవరద హస్తంతో రెండవ చేతిలో ఉండ్రాయితో కుడి చేయివైపు ఉన్న తొండంతో కొలువుదీరారు. స్వామి వారు ఇక్కడ గజానన రూపంగా వెలిసారు. ఇక్కడ నాగాభరణం దరించిన స్వామి నయన శోభితంగా దర్శనమిస్తారు. ఇక్కడ లక్ష్మీగణపతి స్వామి వారి ప్రధాన గోపురం కలశ ముక్తంగా ఉంటుంది. ఈ గోపురం పై బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర మూర్తులు దర్శనమిస్తారు. ఈ స్వామివారి చెవిలో భక్తుల కోర్కెలు చెప్పుకుంటే తక్షణమే తీరిపోతాయని భక్తుల నమ్మకం. 
ఆలయం ముస్తాబు 
ఇక వినాయక చవితి సందర్భంగా ఈ ఆలయం ముస్తాబయ్యింది. శ్రీలక్ష్మీగణపతి స్వామివారి ఆలయం విద్యుత్‌దీపకాంతులు, చలువ పందిళ్లతో అలంకరిస్తున్నారు. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్‌ 3 వరకు చవితి ఉత్సవాలు నిర్వహించనున్నారు. మొదటి రోజున అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దంపతులు కలశస్థాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా దేవస్థాన కమిటి ఏర్పాట్లు చేస్తున్నారు.

10:25 - August 25, 2017

హైదరాబాద్ : మట్టి గణపతులకే... జై కొడుతున్నారు నగరవాసులు... పర్యావరణ హితంగా ... వినాయక చవితిని జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, యువత గో గ్రీన్‌ నినాదంతో ముందుకు సాగుతున్నాయి. దీంతో భాగ్య నగరంలో మట్టి గణపతులకు డిమాండ్ పెరుగుతోంది. 
పర్యావరణానికి పెద్దపీట
మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటు పెంచేందుకు ప్రభుత్వం, పర్యావరణ వేత్తలు చేపట్టిన ప్రచారంపై ఫలితాలు కనిపిస్తున్నాయి. గతంలో కంటే ఈ ఏడాది మట్టి గణపతులతో... పర్యావరణానికి పెద్దపీట వేస్తున్నారు నగరవాసులు. డిమాండ్‌కు తగ్గట్టుగా... పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు.. జీహెచ్‌ఎంసీ మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది కాలుష్య నియంత్రణ మండలి, స్వచ్ఛంద, ప్రైవేట్‌ సంస్థలు పది లక్షల మట్టి విగ్రహాలకు ఉచితంగా పంపిణీకి లక్ష్యంగా పెట్టుకున్నాయి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ రెండు లక్షల మట్టి గణపతులను తయారు చేసి.. ప్రత్యేక కౌంటర్ల ద్వారా  వాటి పంపిణీకి ఏర్పాటు చేసింది.
ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌పై జీఎస్‌టీ భారం
ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌పై జీఎస్‌టీ భారం పడడం.. ఎక్కడ ప్రతిష్ట చేస్తామో అక్కడే నిమజ్జనం చేసే వీలు ఉండడంతో... తయారీదారులు మట్టి గణపతులనే తయారు చేస్తున్నారు. తయారీలో అధునాతన మెలకువలు పాటిస్తున్నారు.  చెరువు మట్టి  సేకరించి, వరిగడ్డి, వెదురు బొంగులు, పీచు, ఉనుక, జనపనారతో కావాల్సిన ఆకృతులను తయారు చేసి.. అందంగా తీర్చిదిద్దుతున్నారు. 
మట్టి గణనాథుల ఏర్పాటుకు సిద్ధమవుతున్న నిర్వాహకులు 
మండపాల్లో కూడా మట్టి గణనాథులనే ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. మోతిలాల్‌నగర్‌లోని నెహ్రునగర్‌లో ఈసారి 35 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. కొన్ని చోట్ల వినూత్న వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా జవహర్‌లాల్‌ ఆర్కిటెక్‌ విద్యార్థులు ప్రత్యేకంగా న్యూస్‌ పేపర్లతో భారీ వినాయక విగ్రహాన్ని తయారు చేశారు.  

 

10:22 - August 25, 2017
10:20 - August 25, 2017

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు...

ప్రకాశం: ఎర్రగొండపాలెం(మ) బోయలపల్లిలో పంట పొలాల్లోకి మేఘన ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. ప్రయాణీకులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. 

అందువల్లే నంద్యాల ఉప ఎన్నిక సులభతరం: సీఎం చంద్రబాబు

తూర్పుగోదావరి : కలిసికట్టుగా పని చేయడం వల్ల నంద్యాల ఉప ఎన్నిక సులభతరమైందని సీఎం చంద్రబాబు అన్నారు. అదే జోష్ కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ కొనసాగించాలన్నారు. నంద్యాలలో మంచి ఫలితం సాధిస్తున్నామని చెప్పారు. సర్వే ఫలితాలన్నీ కూడా టీడీపీ మెజారిటీ గెలుస్తుందని స్పష్టం చేస్తున్నాయన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో నేతలు ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకుని ముందుకుసాగాలని సూచించారు.

రోడ్డు ప్రమాదంలో తల్లి..కొడుకు మృతి..

కామరెడ్డి : బిక్నూరు మండలం అంతంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకును షిఫ్ట్ కారు ఢీకొనడంతో తల్లీ, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి, కూతురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ లు తెలిపారు. దంపతులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తారని పోలీసులు గుర్తించారు.

 

కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

తూర్పుగోదావరి : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, క్లస్టర్ కో ఆర్డినేటర్లు, 1400 మంది బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

 

కాణిపాక వినాయకునికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి మాణిక్యాలరావు

చిత్తూరు : కాణిపాక వినాయక స్వామికి ప్రభుత్వం తరపున మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలు సమర్పించారు.

 

ప్రకాశం జిల్లాలో తప్పిన తప్పిన ప్రమాదం

ప్రకాశం : ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో ప్రమాదం తప్పింది. పంటపొలాల్లోకి మేఘనట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. 

 

09:44 - August 25, 2017

హైదరాబాద్ : వినాయకుడు...సర్వ విఘ్నాలు తొలగిస్తారని భక్తుల నమ్మిక....కానీ లంబోదరుడినీ వస్తు సేవల పన్ను వెంటాడుతోంది. వదల వినాయక వదల అంటూ వెంబడిస్తోంది. గతంలో వాడవాడలా భారీ రూపాల్లో కొలువుదీరిన గణపయ్య..జీఎస్టీ ప్రభావంతో ఈసారి అత్తెసరు పూజలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. 
జీఎస్టీ ప్రభావంతో గణపయ్య ఉక్కిరిబిక్కిరి 
జీఎస్టీ ప్రభావం గణపయ్యను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విశేష పూజలందుకునే వినాయకుడిని వేధిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో జీఎస్టీ ప్రభావం వినాయక విగ్రహాల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విగ్రహాల తయారీకి ఉపయోగించే ముడిసరుకుల ధరలు అమాంతం ఎగబాకాయి. విగ్రహాల ధరలు భారీగా  పెరిగిపోయాయి. దీంతో విక్రయ కేంద్రాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఏటా 38 మండలాల్లో సుమారు పన్నెండు వేల వరకూ గణేష్‌ విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. అంతేకాదు వైవిద్యమైన, భారీ విగ్రహాలు  ఏర్పాటు చేయడంలో యువకులు, మండప నిర్వాహకులు పోటీ పడేవారు. కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా తారుమారైంది. 
విగ్రహాల తయారీదారులపై పెద్దనోట్ల రద్దు, జిఎస్టి పోటు 
విగ్రహాల తయారీదారులను పెద్దనోట్ల రద్దు, జిఎస్టి పోటు బాగానే దెబ్బతీశాయి. గతంలో పది అడుగుల విగ్రహం 12 వేల రూపాయలు గరిష్టంగా పలకగా.. ఈ ఏడాది 20 వేలకు ఎగబాకింది. దీంతో భారీ విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకుల సంఖ్య తగ్గిపోతోంది. అమ్మకాలు మందగించడంతో తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. రాజస్తాన్, ఒడిషా తదితర రాష్ట్రాల కళాకారులు..  టెక్కలి, పలాస, రాజాం, రణస్థలం, శ్రీకాకుళంలో గణేష్‌ విగ్రహాల తయారీపై జీవనం సాగిస్తున్నారు. ముడిసరుకుల ధరలు పెరిగిపోవడంతో ఏళ్ల తరబడి ఇదే వృత్తిని నమ్ముకున్న కళాకారుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. మరోవైపు విగ్రహాలతో పాటు పూలు, పండ్లు, పూజ సామాగ్రి ధరలు పెరిగిపోవడం తమకు ఇబ్బందిగా మారిందంటున్నారు సామాన్య ప్రజలు. గతేడాది వరకు వినాయక చవితిని అంగరంగ వైభవంగా నిర్వహించిన సిక్కోలు వాసులు..జీఎస్టీ ప్రభావంతో ఈసారి సాదాసీదాగా జరుపుకోబోతున్నారు. 

 

09:37 - August 25, 2017

వరంగల్‌ : నగరాల్లో, పల్లెల్లో మట్టి గణపతుల సందడి నెలకొంది. మట్టి విగ్రహాల పంపిణీ జోరుగా సాగుతోంది. వరంగల్‌లో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం కనబడుతుంది. మార్కెట్లలో ప్లాస్ట్‌ ఆఫ్‌ పారీస్‌ విగ్రహాలే దర్శనమిస్తున్నాయి. మట్టి గణపతి విగ్రహాల తయారీ గణనీయంగా పడిపోయింది. 
పర్యావరణానికి పెద్దపీట వేయాలంటున్న ప్రభుత్వం
ఒక పక్క పర్యావరణానికి పెద్దపీట వేసి... మట్టి గణపతులకే జై కొట్టాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. కానీ వరంగల్‌లో మాత్రం అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నట్టు కనబడడం లేదు. ప్రభుత్వ పిలుపును అధికార యంత్రాంగం చాలా లైట్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. 
అట్టహాసంగా వరంగల్‌లో గణేష్‌ ఉత్సవాలు 
తెలంగాణలో పెద్దస్థాయిలో గణేష్‌ ఉత్సవాలు నిర్వహించే ప్రాంతంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు... అందునా వరంగల్ నగరానికి ప్రత్యేకత ఉంది. హైదరాబాద్‌ తర్వాత ఎక్కువ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేది వరంగల్‌లోనే. దాదాపు ఆరువేలకు పైగా మండపాల్లో భారీ విగ్రహాలను నెలకొల్పి నవరాత్రులు నిర్వహిస్తారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాల వ్యాప్తంగా పదివేల విగ్రహాలపైనే కొలువుదీర్చి పూజలు చేస్తారు. నగరంలో వినాయకులను తయారుచేసే కేంద్రాలు పదికిపైనే ఉన్నాయి.
ప్లాస్ట్‌ ఆఫ్‌ పారీస్‌ వినాయక విగ్రహాలే దర్శనం
అంతటి ప్రత్యేకత గల వరంగల్‌లో అధికారులు కూడా .. పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించేవారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసేవారు. మట్టి వినాయక విగ్రహాల పంపిణీ .. విగ్రహాల తయారీదారులకు ఉచితంగా మట్టిని అందించడం లాంటి కార్యక్రమాలు చేసేవారు. కానీ ఈ ఏడాది అధికారులు ఆ విషయాన్నే మరిచారు. ఫలితంగా ఎక్కడ చూసినా  ప్లాస్ట్‌ ఆఫ్‌ పారీస్‌ వినాయక విగ్రహాలే దర్శనమిస్తున్నాయి.  వరంగల్ అర్బన్ జిల్లాలో అందునా కాజీపేట, వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో మట్టి విగ్రహాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
మట్టి విగ్రహాలు ఎక్కువ ఖరీదు  
మట్టి వినాయకుల విగ్రహాల తయారీకి ఎక్కువ రోజులు పట్టడం.. తగిన మట్టి దొరకకపోవడంతో... ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌ విగ్రహాలనే తయారు చేసినట్టు తయారీదారులు చెబుతున్నారు. మట్టి విగ్రహాలు ఎక్కువ ఖరీదు ఉండడం వల్లే... ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌ విగ్రహాలనే పెట్టడం జరుగుతుందని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. పీవోపీ విగ్రహాలపై ప్రజల్లో విస్త్రతమైన అవగాహన కల్పించాల్సిన అధికారులు కేవలం ప్రెస్‌మీట్‌లకు పరిమితమవడంపై.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

09:15 - August 25, 2017

విజయనగరం : వినాయక చవితి సందర్భంగా విజయనగరంలో మార్కెట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పట్టణంలోని కోటగుమ్మ, గంటస్తంభం మార్కెట్లలో కొనుగోలుదారులతో రద్దీ పెరిగింది. వినాయ విగ్రహాలతోపాటు పూలు, పండ్లు, పత్రి, పూజా సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు. పండుగను అదునుగా తీసుకున్న కొందరు వ్యాపారులు అన్ని రకాల వస్తువులు, సామాగ్రి రేట్లను భారీగా పెంచేశారు. ఆది దేవుని పండుగను తప్పనిసరిగా జరుపుకోవాల్సి ఉండటంతో రేట్లు ఎక్కువైనా వినాయక విగ్రహాలు, పత్రి, పూజా సామాగ్రిను కొనుగోలు చేస్తూ సర్దుకుపోతున్నారు. 

 

గుర్మీత్ రామ్ రహీంపై నమోదైన రేప్ కేసులో నేడు తీర్పు

హైదరాబాద్ : ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీంపై నమోదైన రేప్ కేసులో నేడు తీర్పు వెలువడనుంది. ఇద్దరు మహిళలను రేపు చేశారని రామ్ రహీంపై కేసు నమోదు అయింది. పంచకులాలోని సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. 

07:07 - August 25, 2017

చిత్తూరు : టెంపుల్‌ సిటీ తిరుపతిలో వినాయక చవితి సందడి నెలకొంది. జనమంతా వీధుల్లోకి వచ్చిన గణేశ్ ప్రతిమలు, పత్రి, పూజా సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు. తిరుపతిలో గణేశ్‌ ఉత్సవాలపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

07:05 - August 25, 2017

సూర్యాపేట : జిల్లాలో వినూత్న రీతిలో గణేశ్‌ చతుర్థి పండుగను నిర్వహిస్తున్నారు. జనహిత పేరులో పదివేల మట్టి విగ్రహాలను తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. వీఐపీలు ఎవరూ రంగు విగ్రహాలను పూజించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 
 

07:02 - August 25, 2017

విశాఖ : నగరంలో మట్టితో చేసిన గణేశ్‌ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. కాలుష్య నియంత్రణ మండలి తయారు చేసిన మట్టి గణేశ్‌ను ఎంవీపీ కాలనీలో పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే పూజించాలని గంటా కోరుతున్నారు.  
 

07:01 - August 25, 2017

మహబూబాబాద్‌ : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణేశ్‌లను పూజించాలంటూ మహబూబాబాద్‌లో నేను సైతం స్వచ్ఛంద సంస్థ వినూత్న రీతిలో ప్రచారం చేపట్టింది. పట్టణానికి చెందిన ముస్లిం దంపతులు సుభానీ, సలీమా ఈ కార్యక్రమం చేపట్టారు. మట్టితో చేసిన వినాయకుడి ముఖాన్ని సుభానీ తన తలకు పెట్టుకుని రిక్షాపై కూర్చుని ప్రచారం చేస్తున్నా అందర్ని ఆకర్షిస్తున్నాడు. 

06:58 - August 25, 2017

కృష్ణా : గణేశ్‌ చతుర్థి ఉత్సవాలకు విజయవాడ ముస్తాబైంది. నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వాడవాడనా, వీధివీధినా విఘ్నరాజులు దర్శనం ఇస్తున్నారు. ఆది దేవునికి కుడుములు, ఉండ్రాళ్లు సమర్పించి, ప్రకృతి సిద్ధమైన పత్రిలో పూజించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. 

వినాయక చవితి ఉత్సవాలకు విజయవాడ సిద్ధమైంది. ఎక్కడ చూసినా చలువ పందిళ్లు, అరటిబోదెల మండపాలు, పత్రి, వినాయక విగ్రహాల అమ్మకాలు కనిపిస్తున్నారు. రంగు రంగుల గణనాథుల విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. 

గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి బెజవాడలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అంగరంగ వైభవంగా మండపాలను సిద్ధం చేశారు. ఆది దేవుడు, విఘ్నాలకు అధిపతి కావడంతో చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా అందరూ గణనాథుడ్ని కొలుస్తున్నారు. 

ఇళ్లలో పూజ కోసం మట్టి ప్రతిమలను కొంటున్నారు. వీధుల్లోని మండపాల్లో మాత్రం రంగు రంగుల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. విజయవాడ జింఖానా మైదానంలో 72 అడుగుల భారీ గణనాథుడు కొలువుతీరాడు. గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు  వివరిస్తున్నారు. 

గణేశ్‌ నవరాత్రులతోపాటు నిమజ్జనోత్సవం సజావుగా జరిగేందుకు వీలుగా నగరంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

06:56 - August 25, 2017

హైదరాబాద్ : నేడు వినాయక చవితి. వినాయకుడి రూపం ఓంకారం. సకల దేవతలతోపాటు త్రిమూర్తుల తేజస్సు సంతరించుకున్న దేవుడు గణనాథుడు. గణపతిని పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే. గజవదనుడు పత్రి పూజను స్వీకరిస్తాడు. పత్రితో పూజ చేయడమంటే ప్రకృతిని ఆరాధించడమే. వర్షా కాలంలో వచ్చే సర్వ రోగాలు ప్రతాల వాసనతో నయమతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే  ఆది దేవుడిని ఆకులతో పూజిస్తారు. ఆకులు, అలములు సమర్పించినా మహద్భాగ్యంగా స్వీకరిస్తాడు లంబోదరుడు. పాలు, మీగడ, పంచదార, తేనే, పండ్లు, కూరగాయాలు, చెరకు గడలు.. ఇలా ప్రకృతి సిద్ధమైన పూజా సామాగ్రితో ఆరాధనలు అందుకుంటాడు విఘ్ననాథుడు. కుడుములు, ఉండ్రాళ్లు,  పానకం, వడపప్పు, కొబ్బరి... బొజ్జ నిండా తిని భక్తులందరికీ సులువుగా చేరువవుతాడు. శ్రద్ధగా తన వ్రతం ఆచరించేవారిని సకల విఘ్నాల నుంచి కాపాడుతాడు. సకల శుభాలను ప్రసాదిస్తాడు లంబోదరుడు. వినాయకుడు, గణపతి, ఏకదంతుడు... ఇలా ఏ పేరుతో పిలిచినా ఇట్టే పలకడంతోపాటు వచ్చి వాలిపోతాడు గణేశ్‌.
 

ప్రొ కబడ్డీలో నేటి మ్యాచ్ లు

ఢిల్లీ : ప్రొ కబడ్డీలో భాగంగా నేటి రాత్రి 8 గంటలకు యు ముంబైతో జైపూర్ తలపడనుంది. రాత్రి 9 గంటలకు బెంగాల్ తో పాట్నా ఢీకొట్టనుంది. 

నేడు హైదరాబాద్ కు రానున్న నేపాల్ ప్రధాని

హైదరాబాద్ : నేడు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా హైదరాబాద్ కు రానున్నారు. ఇన్ఫోసిస్ క్యాంపస్, టీహబ్ లను ఆయన సందర్శించనున్నారు. 

Don't Miss