Activities calendar

26 August 2017

21:36 - August 26, 2017

కొత్తగూడెం : సామాజిక తెలంగాణే లక్ష్యంగా దశలవారీగా ఉద్యమాలు కొనసాగుతాయని... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.. కార్మిక చట్టాలను అమలుచేసి కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. కొత్తగూడెంలో టీ మాస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీకి తమ్మినేని హాజరయ్యారు.. ర్యాలీ తర్వాత కొత్తగూడెం క్లబ్‌లో సదస్సు ఏర్పాటు చేశారు.. ఈ సదస్సులో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి..

నగరంలో కుండపోత వర్షం..

హైదరాబాద్‌ : నగరంలో కుండపోత వానతో జనజీవనం అస్తవ్యస్థమైంది. రహదారులన్నీ గోదారిని తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాలాలు, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో ఆఫీసులకు వెళ్లే వారంతా అష్టకష్టాలు పడ్డారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకిదిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

21:18 - August 26, 2017

హర్యానా : గుర్మిత్‌ సింగ్‌ అనుచరుల వీరంగంపై హరియాణా-పంజాబ్‌ హైకోర్టు ఖట్టర్‌ సర్కార్‌ను తప్పుపట్టింది. కేవలం రాజకీయ లబ్ది కోసం హింసను రగిలించారని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రేప్‌ కేసులో దోషిగా తేలిన గుర్మిత్‌సింగ్‌ రామ్‌రహీమ్‌కు కోర్టు సోమవారం శిక్షను ఖరారు చేయనుంది. హర్యానాలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. మరోవైపు హర్యానా హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 36కి చేరింది. మృతి చెందిన వారంతా గుర్మీత్‌ అనుచరులేనని, వారంతా బయట నుంచి వచ్చిన వాళ్లేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

28న కోర్టు శిక్షను ఖరారు

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన చేసిన కేసులో సిబిఐ కోర్టు గుర్మీత్‌ రామ్‌రహీంను దోషిగా తేల్చిన నేపథ్యంలో ఈనెల 28న కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ప్రస్తుతం పంచకులలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ను జైలు నుంచి కోర్టుకు తరలించే అవకాశాలు కనిపించటం లేదు. దీంతో న్యాయమూర్తి జగ్దీప్‌సింగ్‌నే రోహతక్‌ జైలుకు తీసుకెళ్తామన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గుర్మీత్‌కు శిక్ష ఖరారు చేసే అవకాశముందని పేర్కొంది.

హర్యానాలో పరిస్థితిని కేంద్ర హోంశాఖ సమీక్ష..

హర్యానాలో పరిస్థితిని కేంద్ర హోంశాఖ సమీక్షించింది. డేరా అనుచరుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూనే శాంతి భద్రతలు పరిరక్షించాలంటూ హర్యానా ప్రభుత్వానికి సూచనలు జారీ చేసింది. గుర్మీత్‌ను దోషిగా తేల్చిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్‌ సింగ్‌కు హైలెవల్‌ సెక్యూరిటీ కల్పించాలని హర్యానా పోలీస్ శాఖకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పంజాబ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉండటంతో కర్ఫ్యూను ఎత్తివేసినట్లు పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

రాజకీయ లబ్ది కోసం హింసను రగిలించారని

శుక్రవారం రేప్‌ కేసులో గుర్మిత్‌ సింగ్‌ను కోర్టు దోషిగా తేల్చడంతో ఆయన అనుచరులు పంచకులలో సృష్టించిన వీరంగంపై హరియాణా-పంజాబ్‌ హైకోర్టు ఖట్టర్‌ సర్కార్‌పై మండిపడింది. కేవలం రాజకీయ లబ్ది కోసం హింసను రగిలించారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. తీర్పు అనంతరం రెచ్చిపోతున్న డేరా సచ్చా సౌధా అనుచరులను కట్టడి చేయకుండా ప్రభుత్వం గుర్మిత్‌ సింగ్‌ రామ్‌రహీమ్ ముందు మోకరిల్లిందని ధ్వజమెత్తింది. పంచకుల తగులబడడానికి కారకులైన ఆరుగురు అంగరక్షకులు, ఇద్దరు గుర్మీత్‌ అనుచరులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఆర్మీ..

సిర్సాలోని గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌కు చెందిన డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయాన్ని ఆర్మీ చుట్టుముట్టింది. డేరా కార్యాలయం సమీపంలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయి. ఏకె 47తో పాటు 8 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. అయితే డేరా కార్యాలయంలోకి సైనికులు వెళ్లలేదని ఆర్మీ అధికారి రాజ్‌పాల్‌ పునియా తెలిపారు.

31 మంది మృతి...

హర్యానాలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 31 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మృతి చెందిన వారంతా గుర్మీత్‌ అనుచరులేనని, వారంతా బయట నుంచి వచ్చిన వాళ్లేనని ప్రభుత్వం పేర్కొంది. హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు 524 మందిని అరెస్ట్‌ చేశారని పేర్కొంది. కోర్టు తీర్పు నేపథ్యంలో గుర్మీత్‌ బాబాకు కల్పించిన జడ్‌ప్లస్‌ కేటగిరిని ప్రభుత్వం తొలగించింది. గుర్మీత్‌కు చెందిన 36 ఆశ్రమాలను సీజ్‌ చేశారు. డేరా సచ్చా సౌదా అనుచరుల హింసను ఆపడంలో విఫలమైన పంచకుల జిల్లా డిఎస్పీని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

కాకినాడలో యధేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన

తూ.గో: కాకినాడలో యధేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోంది. అంబేద్కర్ భవన్ టిడిపి నేతలు సమావేశం నిర్వహిస్తున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

20:40 - August 26, 2017

వ్యక్తిగత గోప్యత హక్కు అనేది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల కిందకు వస్తుందని సుప్రీం కోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీని పై దేశంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రాథమిక హక్కుల కిందకు వచ్చినప్పటికీ దానికి కొన్ని పరిమితులున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ సందర్భంలో ఆధార్ తప్పని సరి తప్పని సరేనా అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ అంశం పై పద్మశ్రీ, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత డాక్టర్ శాంత సిన్హా వన్ టూవన్... ఆధారకార్డు తప్పని సరి కాదు అని శాంతా సిన్హా గారు సుప్రీంలో పిటిషన్ వేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

20:14 - August 26, 2017

హైదరాబాద్: హైదరాబాద్ కొచ్చిన హిమాని పర్వతాలు, ఇంకెన్ని చూడాలో ఈ విచిత్రాలు, వీఆర్వోని టోకర పెట్టిన ఆన్ లైనోడు...అకౌంట్లో పైసలన్నీ అర్థగంటలో ఖాళీ, సిన్మలలో గెలిచిండు... జీవితంలో ఓడిండు.. 110 సిన్మాలలో నటించినోడికి పూట కరువు, ఇల్లెందు మీద కోతుల దండయాత్రలు...చెయ్యాలే వాటికి కు.ని ఆపరేషన్లు, రోడ్ల మీద తీన్మారేస్తున్న డ్యాన్సర్లు...తెలంగాణ ఆప్కారీ వారి సమర్పణ, కుందేలుని మింగిన కొండ శిలువ.. చూపెట్టిండ్రు వారి చలువ ఇత్యాది అంశాలతో మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సెమీస్‌లో సైనా ఓటమి

హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సెమీస్‌లో సైనా ఓటమి చెందింది. ఛాంపియన్‌షిప్ సెమీస్‌లో తొలిగేమ్‌లో సైనా నెహ్వాల్ గెలిచింది. తొలిగేమ్‌లో జపాన్ షట్లర్ ఒకుహరపై 21-12 తేడాతో సైనా గెలుపొందింది. రెండో గేమ్‌లో సైనా ఓటమి చెందింది. రెండో గేమ్‌లో 21-17 తేడాతో జపాన్ షట్లర్ ఒకుహర విజయం సాధించింది. సెమీస్‌లో 1-1తో సైనా నెహ్వాల్-నొజోమీ ఒకుహర సమంగా ఉన్నారు. మూడో గేమ్‌లో సైనాపై 14-7 తీడాతో నొజోమీ ఒకుహర విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

19:47 - August 26, 2017

ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ దోషిగా తేలాడు. 15 సంవత్సరాల క్రితం నాటి కేసులో హరియాణాలోని పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు గుర్మీత్‌ను దోషిగా తేల్చింది. ఈ నెల 28న గుర్మీత్‌కు శిక్ష ఖరారు చేయనుంది. అనంతరం జరిగిన అనుచరుల విధ్వంసకాండలో 31 మంది చినిపోయారు.అంతేకాకుండా ప్రభుత్వ ఆస్థులే లక్ష్యంగా అనుచరులు విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు కర్వ్యూ విధించారు. ఇదే అంశం పై 'హెడ్ లైన్ షో' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో జనవిజ్ఞాన వేదిక నేత రమేష్, బిజెపి అధికార ప్రతినిధి రమేష్, శ్రీదర్ రెడ్డి, సామాజిక విశ్లేషకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

19:45 - August 26, 2017

హైదరాబాద్ : మాటల్లో మానవతా విలువలు... కోటల్లాంటి భవనాల్లో విలాస జీవితం. ఎదుటి వారికి నీతులు చెబుతారు.. అందినకాడికి ఆస్తులు మూటగడతారు. అదేమని అడిగితే.. గూండాల బలగం , రాజకీయ బలంతో దాడులు చేస్తారు. ఆధ్యాత్మిక ముసుగులో గుర్మీత్‌ రామ్‌రహీం బాబా వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న గుర్మీత్‌ బాబా ఆస్తులు చూసి జనానికి కళ్లు తిరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో

రేప్‌ కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌సింగ్‌ రామ్‌రహీమ్‌ బాబా ఆస్తుల వివారాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భూములు, బిల్డింగ్‌లు ,హోటళ్లు బాబా సంపాదించారు. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం, అనుచరగణంతో గుర్మీత్‌ బాబా మినీ కింగ్‌గా మారారు.

రాజసౌధాల్లాంటి భవనాలు

డేరాబాబా ఆస్తుల వివరాలు తెలుసుకుని అధికారులు నోరువెళ్ల బెడుతున్నారు. డేరాసచ్చా సంస్థకు చెందిన రాజసౌధాల్లాంటి భవనాలు , ఏసీ మార్కెట్‌ , షాహ్‌ సత్నామ్‌ సూల్స్‌ , కాలేజీలు, ఇంటర్నేషనల్ బిజినెస్‌ స్కూల్‌ , ఎంఎస్‌జీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఉన్నాయి. వీటితోపాటు వందల కోట్ల రూపాయల విలువైన క్రికెట్‌ స్టేడియం , ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ,కషిక్‌ రెస్టారెంట్‌ , ఫ్యాక్టరీలు ఉన్నాయి. అంతేకాదు షాహ్‌సత్నామ్‌ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి , ఎంఎస్‌జీ ప్రొడక్షన్స్‌ , ఫిల్మ్‌సిటీ సెంటర్‌ , మాహీ సినిమా సంస్థలతో వేలకోట్ల రూపాయల వ్యాపార సామ్యాజ్యం నిర్మించాడు గుర్మీత్‌ బాబా . వందల సంఖ్యలో వాహనాలు, ఇంద్రభవనాన్ని తలపించే డేరా బాబా అంతరాలయం విస్మయాన్ని కలిగించక మానవు. వీటితోపాటు ప్రస్తుత నిర్మాణంలో ఉన్న స్పోర్ట్స్‌ విలేజ్‌ చూస్తే కళ్లు తిరుగుతాయి. అంతేకాదు ..ఆర్గానిక్‌ అగ్రికల్చరల్‌ ఫీల్డ్స్‌, వివిధ రాష్ట్రాల్లో వందలాది ఎకరాల్లో భూములు కూడబెట్టారు.. డేరా బాబా. భక్తి , మానవతా విలువల పేరుతో వేలకోట్ల రూపాయల సంపదను పోగేశారు గుర్మీత్‌ బాబా.

డేరా సంస్థను స్థాపించిన షాహ్‌ మస్తాన్‌ ...

వాస్తవానికి డేరా సంస్థ పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రాంతానికి చెందిన షాహ్‌మస్తాన్‌ అనే ఆధ్యాత్మిక గురువు ప్రారంభించారు. మానవతా విలువల పరిరక్షణ పేరిట 1948 లో హర్యాణాలోని సిర్సా పట్టణంలో డేరా సచ్చాసౌధా సంస్థ స్థాపన జరిగింది. షా మస్తాన్‌ మరణం తర్వాత 1960లో ఈసంస్థకు వారసుడిగా షా సత్నామ్‌సింగ్‌ వచ్చారు. అతర్వాత తన 23వ ఏట గుర్మీత్‌సింగ్‌ బాబా సత్నామ్‌ సింగ్‌ను ఆశ్రయించాడు. ఆయనతో సన్నిహితంగా మెలిగి ఆశ్రమవర్గాల్లో పలుకుబడి సంపాదించాడు . సత్నామ్‌ సింగ్‌ మరణం తర్వాత 1990లో డేరా సంస్థకు గుర్మీత్‌ సింగ్‌ అధిపతి అయ్యాడు. గుర్మీత్ సింగ్‌ వచ్చిన తర్వాతే డేరా సంస్థకు ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు పోగయ్యాయని స్థానికులు చెబుతారు.

ఆస్తుల కాపాలా కోసం వేలాదిగా అనుచరగణం

మరి ఇంతటి అపార సంపదను కాపాడ్డానికి కూడా బాబా ప్రత్యేక చర్యలే తీసుకున్నాడు. వేలాదిగా అనుచరగణాన్ని తన ఆస్తులకు రక్షణగా పెట్టుకున్నాడు. చీమ చిటుక్కుమంటే గూండాలు రెచ్చిపోతారు. బాబా విషయంలో కలుగజేసుకోకుండా భయభ్రాంతులకు గురిచేయడం వారి డ్యూటీ. ఇదంతా ఎలా సాధ్యం.. అనుకుంటే.. బాబా సామ్రాజ్యం వెనుక పలువురు అధికారులు, రాజకీయ నాయకుల ప్రయోజనాలుకూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వాలను, చట్టాలను తన కనుసన్నల్లో పెట్టుకుని.. విస్తృతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు గుర్మీత్‌సింగ్‌ రామ్‌ రహీమ్‌ .. ఉరఫ్‌ గుర్మీత్‌ బాబా .

19:42 - August 26, 2017

హైదరాబాద్: డేరా బాబా గుర్మీత్‌ అనుచరుల ఆగడాలతో.. నాలుగు ఉత్తరాది రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. పలుజిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. గుర్మీత్‌ రేప్‌ కేసులో తీర్పునిచ్చిన జడ్జిపైనా దాడులు జరగొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ఆయనకూ భద్రతను పెంచారు. శుక్రవారం పంచకులలో జరిగిన దాడులను కాంగ్రెస్‌, సీపీఎం పొలిట్‌బ్యూరో ఖండించాయి. హర్యానా సీఎంను తప్పించాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి.

నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో

డేరా బాబా అనుచరుల విధ్వంసకాండ నేపథ్యంలో.. నాలుగు ఉత్తరాది రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అల్టర్‌ చేసింది. రేప్‌కేసులో గుర్మిత్‌బాబా దోషిగా తేలడంతో ఆయన అనుచరగణం శుక్రవారం దాడులకు తెగబడింది. ఈ దాడులు కొనసాగే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో, హోంమంత్రి రాజనాథ్‌సింగ్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి భద్రత కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమైంది. పంజాబ్‌, హర్యాణాతోపాటు యూపీ, ఢిల్లీల్లోనూ తీసుకోవాల్సిన భద్రత చర్యలపై ఈకమిటీ పలు సూచనలు చేసింది. కేంద్ర హోంశాఖ, ఐబీ హెచ్చరికల నేపథ్యంలో.. తీర్పు చెప్పిన పంచకుల కోర్టు న్యాయమూర్తికి హర్యాణా ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కల్పించింది.

కురుక్షేత్రలో ఉన్న డేరాసచ్చసౌదా సంస్థకు చెందిన రెండు ఆశ్రమాలుసీజ్..

మరోవైపు హర్యాణాలోని కురుక్షేత్రలో ఉన్న డేరాసచ్చసౌదా సంస్థకు చెందిన రెండు ఆశ్రమాలను పోలీసులు సీజ్‌ చేశారు. ఆశ్రమం ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అటు శుక్రవారం సాయంత్రం నుంచి చెలరేగిన అల్లర్లలో ఇప్పటివరకు 31 మంది వరకు మృతి చెందారు. ప్రస్తుతం పంచకుల జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని హర్యాణా పోలీసులు చెబుతున్నారు.

హింస పై విచారం వ్యక్తం చేసిన సీపీఎం...

గుర్మీత్‌ బాబా దోషిగా తేలిన తర్వాత హింస చెలరేగడంపై సీపీఐఎం పొలిట్‌బ్యూరో విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. హింసను అణచడంలో హర్యాణా ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని సీపీఎం నేతలు మండిపడ్డారు. గతంలో కూడా హర్యాణా సర్కార్‌ అల్లర్లను అణచడంలో ఘోరంగా విఫలం అయిందన్నారు. గతంలో రాంపాల్‌ కేసు, జాట్‌సామాజిక వర్గం నిరసన సందర్భంలోనూ హర్యాణా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. తాజాగా గుర్మీత్‌ బాబా అనుచరులు గూండాగిరికి పాల్పడుతున్నా.. ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోహ్‌తక్‌ జైల్లో రాచమర్యాదలు

మరోవైపు రేప్‌కేసులో దోషిగా తేలిన రాంరహీంబాబాకు రోహ్‌తక్‌ జైల్లో రాచమర్యాదలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వివిఐపీలకు ఇచ్చే సౌకర్యాలన్నీ జైల్లో ఉన్న బాబాకు కల్పించినట్టు వార్తలొస్తున్నాయి. అయితే.. వీటిని ఆ రాష్ట్ర జైళ్లశాఖ తోసిపుచ్చింది.

టిడిపితో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయ్: అమిత్ షా

హైదరాబాద్: టిడిపితో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. టిడిపికి బిజెపి దూరమవుతుందన్న వార్తలను అమిత్ షా ఖండించారు. బిజెపితో అన్ని పార్టీలు టచ్ లో ఉన్నాయని, తెలంగాణ లో ఎవరితోనూ సంప్రదింపుల్లో లేమన్నారు. మా సొంత బలంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. తెలంగాణ లో మా బలాన్ని పెంచుకుంటామని స్పష్టం చేశారు.

2019లో టీఆర్ ఎస్ దే అధికారం: సీఎం కేసీఆర్

హైదరాబాద్:విపక్షాలను ప్రజలు నమ్మడం లేదని, 2019లో టీఆర్ ఎస్ దే అధికారం అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయన తెలంగాణ భవన్ లో టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్షేత్ర స్థాయిలో సమగ్ర భూ సర్వే పై ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... భూ సర్వేకు ప్రతి 3 గ్రామాలకు ఒక అధికారుల బృందం ఉంటుందని, ఒక్కో ప్రజాప్రతినిధి తలా 3 గ్రామాలు యూనిట్ గా పని చేయాలని కేసీఆర్ సూచించారు. భూ సర్వే పూర్తయ్యే వరకు ఎవరూ హైదరాబాద్ కు రావొద్దన్నారు. సిట్టింగ్ లందరికి టిక్కెట్లిచ్చి గెలిపించుకుంటానన్నారు.

జీహెచ్ ఎంసీలో మరో సమ్మె నోటీసు.

హైదరాబాద్: జీహెచ్ ఎంసీలో మరో సమ్మె నోటీసు. మున్సిపల్ కార్మికుల రెగ్యులరైజ్ హామీని నెరవేర్చాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ కు ఎంప్లాయీస్ యూనియన్ నోటీసు ఇచ్చింది. హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, జీహెచ్ ఎంసీలోని వ్యవస్థలను ప్రైవేటీకరించొద్దని ఈయూ డిమాండ్ చేస్తోంది. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఏ క్షణమైన సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

ముగిసిన టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో భూసర్వే, రైతు సమాఖ్య ఏర్పాటుపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో భూసర్వే అమలుపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.. సర్వేలో ప్రత్యక్షంగా పాల్గొని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే చేయాలని సర్కారు తీర్మానించింది.. ఈ ఏర్పాట్లు, సర్వే వివరాలను కేసీఆర్‌ నేతలకు వివరించారు..

18:34 - August 26, 2017

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో భూసర్వే, రైతు సమాఖ్య ఏర్పాటుపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో భూసర్వే అమలుపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.. సర్వేలో ప్రత్యక్షంగా పాల్గొని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే చేయాలని సర్కారు తీర్మానించింది.. ఈ ఏర్పాట్లు, సర్వే వివరాలను కేసీఆర్‌ నేతలకు వివరించారు..

18:32 - August 26, 2017

డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఆర్మీ

హర్యానా: సిర్సాలోని గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌కు చెందిన డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయాన్ని ఆర్మీ చుట్టుముట్టింది. డేరా కార్యాలయం సమీపంలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయి. అక్కడే ఉన్న ఓ కారులో రెండు ఏకె 47లు, 5 తుపాకులను స్వాధీనం చేసుకున్నాయి. అయితే డేరా కార్యాలయంలోకి సైనికులు వెళ్లలేదని ఆర్మీ అధికారి రాజ్‌పాల్‌ పునియా తెలిపారు. హింసాత్మక ఘటనల్లో మృతి చెందిన వాళ్లంతా గుర్మీత్‌ సమర్థకులేనని, వారంతా బయట నుంచి వచ్చారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఎస్‌ దేసి, డిజిపి బిఎస్‌ సంధూ వెల్లడించారు.

అసంపూర్తిగా ముగిసిన కాళేశ్వరం పై ప్రజాభిప్రాయం

సిద్ధిపేట: వయోలా గార్డెన్స్ లో కాళేశ్వరం పై ప్రజాభిప్రాయం అసంపూర్తిగా ముగిసింది. ప్రజల అభిప్రాయాలు పూర్తిగా తెలుసుకోకుండానే అర్ధాంతరంగా అధికారులు వెళ్లిపోయారు. అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఖైరతాబాద్ లో తగలబడ్డ కారు..

హైదరాబాద్: ఖైరతా బాద్ చౌరస్తా లో డస్టర్ కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధం అయ్యింది. అయితే కారులో ఎవరైనా ఉన్నారా అనే అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికుల కథనం ప్రకారం కారులో నుంచి అరుపులు వినిపించాయి తెలుస్తున్నాయి. కారు వెనుక డోర్ తీసి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారని సమాచారం. అయితే కారులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా..? దీని వెనుకాల ఏమైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

17:35 - August 26, 2017
17:20 - August 26, 2017

తూ.గో :టిడిపి గెలిస్తేనే కాకినాడ అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. పాల్గొని ప్రసంగించారు. కాకినాడను ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని, కాకినాడను పారిశ్రామిక నగరంగా మార్చాలని తమ లక్ష్యం అని, దేశంలోనే కాకినాడను ఉత్తమ సిటీగా మార్చుతామని సీఎం స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే లక్షా యాభైవేలు కాకుండా రాష్ట్రం నుండి మరో లక్షా యాభైవేలు ఇచ్చి ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టిస్తానని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

17:15 - August 26, 2017

హైదరాబాద్: ఖైరతా బాద్ చౌరస్తా లో డస్టర్ కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధం అయ్యింది. అయితే కారులో ఎవరైనా ఉన్నారా అనే అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికుల కథనం ప్రకారం కారులో నుంచి అరుపులు వినిపించాయి తెలుస్తున్నాయి. కారు వెనుక డోర్ తీసి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారని సమాచారం. అయితే కారులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా..? దీని వెనుకాల ఏమైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

16:48 - August 26, 2017

హైదరాబాద్‌ : నగరంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో జీహెచ్ ఎంసీ కమిషనర్ అన్ని శాఖల అధికారులతో జనార్థన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. గ్రేటర్‌ పరిధిలో 395 ప్రాంతాల్లో ఇంకా వర్షపు నీరు నిలిచి ఉండగా.. 370 ప్రాంతాల్లో వర్షపు నీటిని తొలగించినట్లు జనార్ధన్‌రెడ్డి చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు అందిన వంద ఫిర్యాదుల్లో 95 పరిష్కరించామని.. తెలిపారు. వర్షం వల్ల ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి..ఎలక్ట్రికల్‌, ఫైర్‌, వాటర్‌బోర్టు, పోలీసులు సిద్ధంగా ఉన్నారని.. శేరిలింగంపల్లిలోని దీప్తిశ్రీనగర్‌కాలనీలో వర్షం నీరు.. ఇళ్లలోకి చేరడంతో వెయ్యిమందికి భోజనాలు పెట్టినట్లు జీహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు.

16:45 - August 26, 2017

తూ.గో : కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కాకినాడ చేరుకున్నారు. ఇవాళ, రేపు కాకినాడలో చంద్రబాబు పర్యటించనున్నారు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలలో చంద్రబాబు పాల్గొననున్నారు.

16:44 - August 26, 2017

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు.. రాష్ట్రంలో భూసర్వే, రైతు సమాఖ్య ఏర్పాటుపై చర్చించారు.. క్షేత్ర స్థాయిలో భూసర్వే అమలుపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.. సర్వేలో ప్రత్యక్షంగా పాల్గొని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే చేయాలని సర్కారు తీర్మానించింది.. ఈ ఏర్పాట్లు, సర్వే వివరాలను కేసీఆర్‌ నేతలకు వివరించారు..

16:11 - August 26, 2017

రంగారెడ్డి : కూకట్‌పల్లిలో భారీ వర్షానికి ధరణీనగర్‌ను కాలుష్యపు నురగ ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎడతెరపి లేకుండా కుండపోతగా వర్షం కురవడంతో కాలనీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. అక్కడ ఉన్న పరికి చెరువు నుంచి భారీగా కాలుష్యపు నురగ వెలువడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. గతంలో ఎన్ని సార్లు అధికారులకు చెప్పిన చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నురగ నుంచి రక్షించాలంటూ ఆ ప్రాంతపు ప్రజలు అధికారులను కోరుతున్నారు.

16:08 - August 26, 2017

రంగారెడ్డి : రాజేంద్ర నగర్‌ సులేమాన్‌ నగర్‌లో విషాదం నెలకొంది. నిర్మాణంలోఉన్న భవనంగోడ కూలి ఒకరు మృతి చెందారు. మృతుడు మహబూబ్‌నగర్‌ లింగాపల్లికిచెందిన వెంకటయ్యగా గుర్తించారు. మృతునికి భార్య , ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మరోవైపు ప్రమాదం జరగగానే భవన యజమాని, కాంట్రాక్టర్‌ పరారయ్యారు.

 

16:06 - August 26, 2017

హర్యానా : అత్యాచార కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు జైల్లో వీవీఐపీ ట్రీట్‌మెంట్‌ లభిస్తోంది. శుక్రవారం సాయంత్రం ఆయనకు జైలులో కాకుండా సునారియా గెస్ట్‌హౌస్‌లో వైద్య పరీక్షలు జరిపారు. ఆయన డిమాండ్‌ మేరకు టీ కూడా ఇచ్చారు. అనంతరం గుర్మీత్‌ను రోహతక్‌ జైలుకు తరలించారు. రాత్రి తేలికపాటి భోజనం, మినరల్‌ వాటర్‌ ఇచ్చారు. ఆయన కోసం ఓ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేశారు. ఖైదీ దుస్తుల్లో కాకుండా సాధారణంగా తాను వేసుకునే దుస్తులనే గుర్మీత్‌ వేసుకున్నారు. ఆధునిక హంగులతో కూడిన మహల్‌లో ఉండే బాబా జైలులో నిద్ర లేకుండానే గడిపారు. తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆయన డిమాండ్‌ చేశారు. గుర్మీత్‌కు జైలులో వివిఐపి ట్రీట్‌మెంట్‌ లభిస్తోందన్న వార్తలను పంచకుల జైళ్ల డీజీ కేపీ సింగ్‌ ఖండించారు. గుర్మీత్‌కు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు లేవని.. ఆయనను సాధారణ ఖైదీలాగే చూస్తున్నామని తెలిపారు.

 

16:02 - August 26, 2017

ఢిల్లీ: రేప్‌ కేసులో జైలుకు వెళ్లిన గుర్మిత్‌ సింగ్‌ అనుచరుల వీరంగంపై హరియాణా-పంజాబ్‌ హైకోర్టు సీరియస్‌ అయింది. కేవలం రాజకీయ లబ్ది కోసం హింసను రగిలించారని మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. సిబీఐ కోర్టు తీర్పు అనంతరం రెచ్చిపోతున్న డేరా సచ్చా సౌధా అనుచరులను కట్టడి చేయకుండా ప్రభుత్వం గుర్మిత్‌ సింగ్‌ రామ్‌రహీమ్ ముందు మోకరిల్లిందని పేర్కొంది. గుర్మీత్‌ కోర్టుకు వెళ్తున్న సమయంలో వందకు పైగా వాహనాలను ఎందుకు అనుమతించరాని ప్రశ్నించింది. పంచకుల తగులబడడానికి కారకులైన ఆరుగురు అంగరక్షకులు, ఇద్దరు గుర్మీత్‌ అనుచరులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని, గుర్మీత్‌ ఆస్తుల వివరాలను ఆగస్టు 29లోగా కోర్టు ముందు ఉంచాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

16:00 - August 26, 2017

సిద్ధిపేట : కాళేశ్వరం ప్రాజెక్టుపై అభిప్రాయాలు చెప్పేందుకు వచ్చిన రైతుల అరెస్ట్‌ను ఖండిస్తూ టిడిపి ధర్నా చేపట్టింది.. ప్రతాప్‌ రెడ్డి ఆధ్వర్యంలో రంగధాంపల్లి చౌరస్తా దగ్గర నిరసన చేపట్టారు.. ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు మాట్లాడుతుంటే మైక్‌ ఎలా కట్‌ చేస్తారని మండిపడ్డారు.. తమ సమస్యలను చెప్పకముందే నిర్వాసిత రైతుల్ని ఎలా అరెస్ట్‌ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. అరెస్ట్ చేసిన అన్నదాతల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు..

15:58 - August 26, 2017

భద్రాద్రి కొత్తగూడెం : అశ్వారావుపేట మండలం ఆసుపాక సమీపంలో ఒకేచోట రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లా నుంచి టీనర్సాపురం వైపు వెళ్తున్న బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో తల్లీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ కొడుకు చనిపోగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. అంతకు ముందు అదే ప్రాతంలో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఒకే చోట రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అటువైపుగా వెళ్లేవారంతా భయాందోళనలకు గురౌతున్నారు.

15:57 - August 26, 2017

సికింద్రాబాద్ :బోయిన్‌పల్లిలో దారుణం జరిగింది. సంతోషి అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. సంతోషి భర్త మధుస్వరుపే ఆమెను చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలు సంతోషికి 2012 ఫిబ్రవరిలో మధుస్వరూప్‌తో వివాహం జరిగింది. వివాహ సమయంలో అన్నీ కలిపి 40 లక్షల కట్నం ముట్టచెప్పామని అయినా అదనపు కట్నం తేవాలంటూ వేదించే వాడని సంతోషి తల్లి ఆరోపించింది. నాలుగు నెలల క్రితం వీరు సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. కొద్ది కాలం నుంచి తమ కూతుర్ని అదనపు కట్నం తేవాలంటూ వేదిస్తున్నాడని సంతోషి తల్లి ఆరోపించింది. నాగోల్‌లోని మృతురాలి భర్త స్వంత ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో మృత దేహాన్ని పెట్టి బంధువులు నిరసన తెలిపారు. మధు స్వరూప్‌ తండ్రి ఏఎస్ఐ కావడంతో పోలీసులు కూడా కేసును నిర్లక్ష్యం వహించి పట్టించుకోవడం లేదని బంధువులు ఆరోపించారు. తమ కూతురి మృతికి కారణమయిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

15:53 - August 26, 2017

తూ.గో: కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రజలను కోరారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా కాకినాడను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. అందుకే ప్రజలు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని రోజా పిలుపునిచ్చారు. ఎక్కడ చూసినా దోమలు, పందులు ఉండటమే అభివృద్ధా, మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. కాకినాడను స్మార్ట్ సిటిగా కేంద్రం ప్రకటించింది. ఇచ్చిన హామీల్లో ఓ ఒక్కదాన్ని అమలు చేయలేదన్నారు. టిడిపికి ప్రజలే బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

15:45 - August 26, 2017

సమగ్ర భూసర్వేపై టీఆర్ ఎస్ నేతలకు శానిర్దేశం చేయనున్న కేసీఆర్

హైదరాబాద్ : కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సమగ్ర భూసర్వేపై టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం సీఎం కేసీఆర్ చేయనున్నారు.

ప్రభుత్వనికి వ్యతిరేకంగా వేములఘాట్ గ్రామస్థుల ఆందోళన

సిద్ధిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత నెలకొంది. ప్రతిపక్షాలు, వేములఘాట్ ప్రజల ఆందోళన చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో తమను పాల్గోనకుండా అడ్డుకున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. నిరసనలు చేస్తున్న వేములఘాట్ గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ తీరుపై గ్రామస్తులు ఆగ్రహం చేంది, అధికారులకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేస్తున్నారు.

15:00 - August 26, 2017

కృష్ణాజిల్లా: చందర్లపాడు మండలం, పొక్కునూరు గ్రామంలో.. ఏపీ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు పర్యటించారు. గ్రామంలో రైతులు ఎదురుకుంటున్న సమస్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యమయ్యాయని అన్నారు. నందిగామ ప్రాంతంలో రైతులకు 11 కోట్ల సుబాబుల బకాయిలు చెల్లించలేదని మండిపడ్డారు.

14:58 - August 26, 2017

అమరావతి: ఉపరాష్ట్రపతి పదవి ఔన్నత్యాన్ని పెంచే విధంగా.. నిజాయితీగా బాధ్యతలను నిర్వర్తిస్తాననని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అమరావతిలో ఆయనకు ఏపీ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా చట్ట ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్ట సభల పాత్ర చాలా ప్రధానమైనదని.. చట్ట సభలు ఘర్షణలకు వేదిక కాకూడదని ఆయన అన్నారు. చట్ట సభల్లో అర్థవంతమైన చర్చలు జరిగేలా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని వెంకయ్యనాయుడు అన్నారు.

వేములఘట్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత...

సిద్ధిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత నెలకొంది. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు కలెక్టర్ మైక్ ఆఫ్ చేయించారు. ప్రతిపక్ష నాయకులు నిరసనగా బయటకు వెళ్లిపోయారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వేములఘట్ గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి రాజగోపాలపేట పీఎస్ కు తరలించారు. వేములఘట్ గ్రామస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తు, రాజగోపాలపేట పీఎస్ ఎదుట టీడీపీ నేత ప్రతాప్ ఆందోళన చేస్తున్నారు.  

14:55 - August 26, 2017

అమరావతి: తెలుగువారి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి వెంకయ్యనాయుడు అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును... సీఎం చంద్రబాబునాయుడును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 40 ఏళ్లపాటు అవిశ్రాంతంగా పనిచేసి... ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు అని చంద్రబాబునాయుడు అన్నారు. నమ్ముకున్న విలువలతో ముందుకు వెళ్లారని... ఎంతోమంది విశ్వసనీయతను పొందారని ప్రశసించారు. అలాంటి వ్యక్తి అందరికీ ఆదర్శప్రాయుడు అని అన్నారు.

14:54 - August 26, 2017

మెదక్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వేములఘాట్‌ గ్రామస్తులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. వారిని బలవంతంగా అరెస్ట్‌ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేములఘాట్‌ వాసులు నినాదాలు చేశారు. సర్కార్‌ తీరుపై మండిపడ్డారు. అనంతరం వారిని పోలీసులు రాజగోపాలపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

 

14:53 - August 26, 2017

ఢిల్లీ :కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నివాసంలో జరుగుతోన్న అత్యున్నత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హర్యానా, పంజాబ్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమావేశానికి హాజరైన హర్యానా డీజీపీ పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. పంజాబ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌లోనూ పరిస్థితులు అదుపులోనే ఉన్నట్టు కేంద్రహోంశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.

ఉపరాష్ట్రపతికి విందు ఇచ్చిన సీఎం చంద్రబాబు

అమరావతి: సచివాలయం ఒకటో బ్లాక్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి సీఎం చంద్రబాబు విందు ఇచ్చారు. ఈ విందులో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు హాజరయ్యారు.

పంచకుల డీఎస్పీ సస్పెన్షన్

హర్యానా : పంచకుల డీఎస్పీ అశోక్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. డేరా అల్లర్ల నేపథ్యంలో సస్పెన్ష్ చేశారు. డేరా బాబా ఇద్దరు అనుచరులపై దేశ ద్రోహం కేసు వేసినట్లు తెలుస్తోంది.

'కులం, మతాల పేరుతో వెలివేయడం మంచిదికాదు'

అమరావతి : సభను నడిపేవారు ప్రతిపక్షానికి సమయం ఇవ్వాలని, ప్రతిపక్షం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు. కులం, మతాల పేరుతో వెలివేయడం మంచిదికాదని సూచించారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జరిగిన దానికి చింతించకుండా అభివృద్ధి కోసం పనిచేయాలని తెలిపారు. ప్రధాని నాయకత్వంలో అందరూ టీమిండియాగా పనిచేసి అభివృద్ధి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపుఇచ్చారు.

14:12 - August 26, 2017

చంఢీఘర్ : హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సర్కార్ పై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రగంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయలబ్ది కోసమే పట్టణాన్ని బుగ్గిపాలు చేశారని తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తింది. గుర్మిత్ సింగ్ ముందు ప్రభుత్వం మోకల్లిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై వెంటనే నివేదిక సమర్పించాలని ఖట్టర్ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

సీఎం ఖట్టర్ కు చండీగఢ్ హైకోర్టు అక్షింతలు

చండీగఢ్: హర్యానా సీఎం ఖట్టర్ కు చండీగఢ్ హైకోర్టు అక్షింతలు వేసింది. నిన్న అన్ని వాహనాలను ఎందుకు అనుమతించారని ప్రశ్నించింది. పంచకుల తగలబడుతుంటే ప్రేక్షకుల్లా చూశారని సీరియస్ అయ్యింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక పట్టణాన్నే తగలబడనిస్తారా అని మండిపడింది. సీఎం ఖట్టర్ ప్రభుత్వం రాజకీయంగా లొంగిపోయిందని కోర్టు పేర్కొంది. పదుల సంఖ్యలో ప్రాణాలుపోయినా ఆపే ప్రయత్నం చేయలేదని నిలదీసింది. ఘటనపై హర్యానా ప్రభుత్వం నివేదిక సమర్పించాలని చండీగఢ్ హైకోర్టు సూచించింది.

14:05 - August 26, 2017

ఢిల్లీ : పంజాబ్, హర్యానాల్లో డెరా అనుచరుల అల్లర్లపై కేంద్ర హోంశాఖ అత్యవసర సమావేశం నిర్వహిస్తుంది. అల్లర్లపై హర్యానా సీఎం కట్టర్ తో కూడా వీరు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

14:04 - August 26, 2017

పంజాబ్ : సిర్సా, పంచకులలో ప్రభుత్వం కానిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న డెరా అనుచరులు జరిపిన అల్లర్లలో 32 మందికి పై సామాన్య పౌరులు చనిపోవడంతో 144సెక్షలన్ విధించడంతో పాటు కనిసిస్తే కాల్చివేత అర్డర్స్ ఇచ్చారు.

13:55 - August 26, 2017

హైదరాబాద్ : నగరంలో కురిసన వర్షంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యం అయ్యాయి. నాలాలు, మ్యాన్‌హోల్స్‌ పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలవడంతో ఆఫీసులకు వెళ్లే వారు అష్టకష్టాలు పడ్డారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకిదిగి సహాయక చర్యలు ముమ్మరం చేసింది. 

13:54 - August 26, 2017

హైదరాబాద్ : నగరంలో కురిసిన కుండపోత వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచిపోయింది. దీంతో స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగస్తులు అష్టకష్టాలు పడుతున్నారు. తాజా పరిస్థితి పై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి అధ్యక్షతన అత్యవసర భేటీ నిర్వహించనున్నారు.

13:53 - August 26, 2017

కరీంనగర్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విషాదం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ చంద్రయ్య తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఇంక తెలియరాలేదు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:52 - August 26, 2017

ఢిల్లీ : ఇవాళ ఉదయం 11 గంటలకు రాజ్‌నాథ్‌సింగ్ నివాసంలో అత్యవసర భేటీ జరగనుంది. భేటీలో హోంశాఖ, ఐబి అధికారులు పాల్గొననున్నారు. పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. గుర్మిత్‌ అనుచరుల అల్లర్ల వల్ల ఇప్పటివరకు 32 మంది మృతి చెందగా.. 250 మందికి గాయాలయ్యాయి. వెయ్యి మందికి పైగా గుర్మిత్‌ అనుచరులు అరెస్ట్‌ అయ్యారు. అల్లర్ల నేపథ్యంలో పంజాబ్, హర్యానా వ్యాప్తంగా రైళ్లు, బస్సు సేవలు స్తంభించాయి. పంచకుల, సిర్సా సహా సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. 3 వందలకు పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, నోయిడా యూపిలోని కొన్ని పాఠాశాలలకు సెలవు ప్రకటించారు. 

13:51 - August 26, 2017

హైదరాబాద్ : జంట నగరాల్లో గత రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయి తటాకాలను తలపిస్తున్నాయి. వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో గంట, గంటన్న వ్యవధిలోనే 9 నుంచి 12 సెంటీ మీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. డ్రెయిన్లు, నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోని నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వల్ల 30 ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో.. ప్రజలు అంధకారంలో మగ్గిపోయారు. వెంటనే రంగంలోకి దిగిన విద్యుత్‌ సిబ్బంది మరమ్మతులు చేసి విద్యుత్‌ను పునరుద్ధరించారు. మాదాపూర్‌, బాలాన‌గ‌ర్‌లో 12 సెంటీమీట‌ర్లు, బండ్ల‌గూడ‌, బేగంపేట‌, మైత్రీవ‌నం, రామ‌చంద్రాపురంలో 10 సెంటిమీటర్లు, శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీ, అంబ‌ర్‌పేట్‌, కుత్బుల్లాపూర్‌లో 9 సెంటీమీట‌ర్ల చొప్పున వ‌ర్షాపాతం న‌మోదైంది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 18 చోట్ల చెట్లు నేలకొరిగాయి. 42 చోట్ల నిలిచిన నీటిని సిబ్బంది తొల‌గించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌ రెడ్డి, డిప్యూటీ జోనల్ కమిషనర్లు వరద ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:43 - August 26, 2017

చంఢీఘర్ : గుర్మీత్ అనుచరుల విధ్వంసంతో తర్వాత పంజాబ్, హర్యానాలో పోలీసులు భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టాం చేశారు. పంచకుల, సిర్సారలో 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ, నోయిడా, యూపీలో అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో అక్కడి స్థానికి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరింత సమాచాం కోసం వీడియో చూడండి.

13:41 - August 26, 2017

హైదరాబాద్ : నగంలో గత రాత్రి కుండపోత వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో గంట, గంటన్నర వ్యవధిలో 9 నుంచి 12సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపు నీటితో నాలాలు, డ్రెయినేజీలు పొంగిపోర్లుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:39 - August 26, 2017

హైదరాబాద్ : జంట నగరాల్లో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షంతో ఉత్పన్నమైన సమస్యలను పరిశీలించి, పరిష్కరించేందుకు అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు.

13:37 - August 26, 2017

ఢిల్లీ : ఈ రోజు ఉదయం 11గంటలకు రాజ్ నాథ్ సింగ్ నివాసంలో అత్యవసర భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో హోంశాఖ, ఐబీ ఉన్నతధికారులు పాల్గొననున్నారు. అటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. గుర్మిత్ సింగ్ అనుచరులు అల్లర్ల వల్ల ఇప్పటివరకు 32 మంది మృతి చెందారు మరోమ 250 మందికి గాయాలయ్యాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:36 - August 26, 2017

స్పోర్ట్స్ : షట్లర్‌ పీవీ సింధు మరో ఘనత సాధించింది.. ప్రపంచ కప్‌ బ్యాడ్మింటన్‌లో సెమీ ఫైనల్‌ చేరి పతకం ఖాయం చేసుకుంది.. క్వార్టర్‌ ఫైనల్‌లో చైనా షట్లర్‌ సన్‌ యూపై వరుస సెట్లలో విజయం సాధించి సింధు రికార్డు సృష్టించింది..వరల్డ్ ఛాంపియన్‌ షిప్‌లో మూడోసారి పతకాన్ని సాధించబోతోంది.

13:34 - August 26, 2017

 

హైదరాబాద్ : నగంలో గత రాత్రి కుండపోత వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో గంట, గంటన్నర వ్యవధిలో 9 నుంచి 12సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపు నీటితో నాలాలు, డ్రెయినేజీలు పొంగిపోర్లుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:32 - August 26, 2017

గుర్మీత్ సింగ్ కు శిక్ష ఖరారు అనంతరం జరిగిన సంఘటనలలో ప్రభుత్వం పాత్ర కూడా సంఘటనలో ఉంది. బాబాలు కొంత మంది కోట్లు సంపదిస్తున్నారు. ప్రభుత్వాలు బాబాలపై నిఘా ఉంచితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లుతున్నాయని భయపడుతున్నారు. దేశంలో ఒకట రెండో స్థానంలో ఉన్నవారు బాబాల కాళ్లు పట్టుకుంటే ఏం చేస్తారని, వారిని అనవసరంగా పెంచి పోషిస్తున్నారు. బీజేపీలో ఏ మంత్రి ఎలా మాట్లాడుతారోర తెలియాదు అని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. సమాజంలో ప్రజల బలహీనతలు బాబాలు క్యాష్ చేసుకుంటున్నారని, గుర్మీత్ సింగ్ రెండు రాష్ట్రాలను ప్రభవితం చేస్తున్నారని, అక్కడ ప్రభుత్వాలకు తెలుసునని అయిన చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నేత కైలాష్ అన్నారు. గతంలో ఇందిరాగాంధీ దేశంలో ఏం జరిగిన అందులో విదేశి ఆస్తం ఉందనేవారు, ఇప్పుడు రాష్ట్రాల్లో ఏం జరిగిన కేంద్రాన్ని నింధిస్తున్నారని, ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం భద్రత చర్యలు తీసుకుంటుందని బీజేపీ నేత లక్ష్మినారాయణ అన్నారు. మరిన్ని

వివరాలకు వీడియో చూడండి.

13:30 - August 26, 2017

పూల మొక్కల పెంపకం పై వివరించడానికి రైతు కుమ్మరి గోపాల్ మట్టి మనిషి కార్యక్రమానికి వచ్చారు. పూల మొక్కల పెంపకం చేయాలంటే నీటి వసతి ఉండాలని, క్రమపద్దతిలో పాలీహౌస్ లో పూల మొక్కలు పెంచ్చవచ్చని అన్నారు. పూవ్వులు ఉత్పిత్తి చేయడమే కాకుండా మార్కెట్ చేసుకోవడం అవసరమని గోపాల్ తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:29 - August 26, 2017

విజయవాడ : సెప్టెంబర్ 1 నుంచి విజయవాడ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్‌ నిబంధనను అమల్లోకి తెచ్చేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారికి భారీ జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రహదారి భద్రతా నియమాలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోబోతున్నారు. కొత్త నిబంధనపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

బ్రెయిన్‌ డ్యామేజ్‌తోనే మరణాలలు
ద్విచక్ర వాహన ప్రమాదాల్లో అత్యధికంగా బ్రెయిన్‌ డ్యామేజ్‌తోనే మరణాల సంఖ్య ఎక్కువ అని ఘణాంకాలు చెబుతున్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో ఐఎస్‌ఐ బ్రాండ్‌ కలిగిన హెల్మెట్లు ధరించినట్లయితే.. బ్రెయిన్‌ డ్యామేజీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్టయిల్‌గా కనిపించాలని కొందరు, జుట్టు ఊడిపోతుందన్న అపోహతో మరికొందరు హెల్మెట్‌ ధరించడానికి సుముఖత చూపడం లేదు. కానీ శిరస్త్రాణం తమ విలువైన ప్రాణాలు కాపాడుతుందన్న నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. బైకిస్టులు హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ లేకుండా కారు నడిపినా వారికి భారీ జరిమానాలు విధించాలని ఉన్నతాధికారులు ట్రాఫిక్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రోడ్‌సెప్టీ నిబంధనలు పాటించని వారిపై ఆర్టీఏ, ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టనున్నారు. ఆర్సీ, లైసెన్స్‌, పొల్యూషన్‌ సర్టిఫికేట్‌, ఇన్సూరెన్స్‌ పత్రాలను పరిశీలిస్తారు. వీటిలో ఏ పత్రం లేకున్నా ఫైన్‌ విధిస్తారు. వాహన నెంబర్‌ సాయంతో డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఉన్నాయో లేదో తెలుసుకుంటారు.

హెల్మెట్‌ తప్పనిసరి సబబుకాదు
మరోవైపు బెజవాడలో బైకిస్టులకు సరిపడా హెల్మెట్లు అందుబాటులో లేవని విక్రయదారులు అంటున్నారు. వాస్తవ విషయాలు తెలుసుకోకుండా హెల్మెట్‌ తప్పనిసరి చేయడం సబబుకాదంటున్నారు. బెదిరింపులు, హెచ్చరికల ద్వారా కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలంటున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పలుమార్లు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. హెల్మెట్ వాడకం విషయంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు పటిష్టంగా అమలుకాకపోవడంతో..రోడ్డు ప్రమాదాలు యథాతథంగా మారాయి. ఇక ద్విచక్ర వాహనంతో పాటే నాణ్యమైన హెల్మెట్‌ కూడా విక్రయించాలని సుప్రీం కోర్టు 2010లో ఉత్తర్వులిచ్చింది. ఆచరణలో డీలర్లు, వాహనదారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి షరా మామూలే అన్నట్లుగా మారింది. సెప్టెంబర్‌ ఒకటి నుంచి హెల్మెట్‌ వాడకం, ట్రాఫిక్ నిబంధనలు అమలుపై ఆడియో, వీడియోల ద్వారా వాహనదారులకు అవగాహన కల్పించేందుకు బెజవాడ పోలీసులు సన్నద్ధమయ్యారు. 

13:26 - August 26, 2017

విజయవాడ : కేంద్రం పేల్చిన జీఎస్టీ బాంబు..పేద, మధ్య తరగతి వర్గాలను అతలాకుతలం చేస్తోంది. అత్తెసరు జీతాలు, పూటగడవని దుస్థితిలో జీవితాలు నెట్టుకొస్తున్న బడుగుజీవులపై జీఎస్టీ గుదిబండగా మారుతోంది. నిత్యావసరాలపైనే కాకుండా వైద్య సేవలు, మందులపై జీఎస్టీ విధించడంతో...వారి పరిస్థితి మూలిగే నక్కమీద రోకలి పోటు చందంగా మారింది.

మందులపై 5 నుంచి 28 శాతం
ఔషధాలపై జిఎస్టీ విధించడంతో..సామాన్య రోగుల పరిస్థితి వర్ణానతీతంగా మారింది. మందులకు సంబంధించి నాలుగు రకాలుగా జీఎస్టీని అమలు చేస్తోంది కేంద్రం. ఆయా మందులపై 5 నుంచి 28 శాతం వసూలు చేస్తోంది. ప్రధానమైన మందులపై 28 శాతం పన్ను విధిస్తుండటంతో..పేద వర్గాలు మందులు కొనలేక, మంచంపైనే యాతన పడుతున్నారు. దీర్ఘకాలిక జబ్బులైన క్యాన్సర్, ఎయిడ్స్, టీబి, సుగర్, బిపి తదితర జబ్బులతో పాటు, అత్యవసర మందులపై 28 శాతం జీఎస్టీ భారం పడుతోంది. ఇవే కాక ల్యాబ్‌ కిట్లు, రక్త పరీక్షలు, వైద్య పరికరాలు జిఎస్టీ పరిధిలోకి రావడం...సామాన్య రోగులకు పెనుభారంగా మారిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలిక మందులు వాడుతున్న రోగులు..మధ్యలో వాటిని ఆపేస్తే వ్యాధి నిరోధకత తగ్గి కొత్త జబ్బులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

జీఎస్టీని మినహాయించాలి
మరోవైపు వైద్యరంగంపై జిఎస్టీని మినహాయించాలని ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యాలు కోరుతున్నాయి. జీఎస్టీ అమలుతో ఆసుపత్రుల నిర్వాహణ భారం మరింత పెరిగిపోయిందని వాపోతున్నారు. జీఎస్టీ బాదుడుతో ఆస్పత్రులు చెల్లించే పన్నులు

రోగుల నుంచే వసూలు చేయడంతో వారిపై అధిక భారం పడుతుందని చెబుతున్నారు. ఆమ్‌ ఆద్మీ సర్కార్‌గా చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం.. పేద రోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైద్యరంగంపై జీఎస్టీని తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

13:22 - August 26, 2017

చెన్నై : టీ-నగర్‌లోని వినాయక ప్రతిమ మూడు దశాబ్దాలుగా తనదైన విశిష్టతను సంతరించుకుంది. 31 సంవత్సరాలుగా ఇక్కడ వినాయక ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు అందిస్తున్నారు. తొలినాళ్లలో ఓ మూడేళ్లు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో రూపొందించిన విగ్రహాలే ప్రతిష్ఠించినా.. తర్వాతి రోజుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచే క్రమంలో.. విభిన్న గణపతిని ప్రతిష్ఠిస్తూ వస్తున్నారు. ప్రధానంగా జీవరాశులకు ఆహారమయ్యే పదార్ధాలతోనే విగ్రహ ఏర్పాట్లు చేస్తూ వచ్చారు.

జీవరాశులకు ఆహారంగా
ఈ ఏడాది చెన్నై టీనగర్‌లో ఆరెంజ్ మిఠాయితో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 600 కిలోల బరువుతో 15 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం చేయటానికి 15 రోజుల పాటు శ్రమించారు. ఇక దీనికి 300కిలోల ఆరెంజ్ మిఠాయి, 300 కిలోల పంచదార, నెయ్యి పాకం వినియోగించారు. దీనిని ఈనెల 31వ తేదిన మెరీనా తీరంలో జీవరాశులకు ఆహారంగా నిమజ్జనం చేయనున్నారు. మిఠాయి వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు చెన్నై నగరం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. 

13:20 - August 26, 2017

చత్తీస్ గఢ్ : మగధీర సినిమాలో ఎత్తైన కొండపై ... మహా శివుడు కొలువుదీరినట్టు చూపిన సన్నివేశం గ్రాఫిక్స్‌ ప్రస్తుతం ఇక్కడ వేల అడుగుల ఎత్తులో ప్రకృతి రహస్యంగా ఉన్న ఈ గణేష్‌ విగ్రహం మాత్రం పచ్చి నిజం.చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా... ప్రకృతి రహస్యాలకు నిలయం. అటువంటి బైలడిల్లా అడవుల్లోని ధోల్‌కాల్‌ గుట్టలపై ఉన్న వినాయకుడి విగ్రహం... అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు వేయి సంవత్సరాల క్రితం నాగవంశస్తులు ఈ ప్రాంతంలో వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారని ఇక్కడి ప్రజల విశ్వాసం. అయితే ఈ ప్రాంతానికి చేరుకోవడం చాలాకష్టం. నిటారుగా ఉండే కొండలు... వాటిని దాటాక వచ్చే జలపాతాలు... వాటిని దాటి ముందుకు వెళ్తే... వచ్చే మరో పెద్దకొండ.. ఆ కొండ చిట్టచివరి ప్రాంతంలోనే ఈ గణేష్‌ విగ్రహం కొలువై ఉంది. రోడ్డు మార్గం నుంచి 16 కిలో మీటర్లు గుట్టలపై ప్రయాణిస్తే కానీ... దీనికి దగ్గరకు చేరుకోలేం.

విగ్రహ ప్రతిష్టాపన ఆద్యంతం రహస్యంగానే
ఇంద్రావతి నది పక్కన ఉన్న ఈ థోల్‌కాల్‌ కొండలపై ఉన్న ఈ విగ్రహం.. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉందని చత్తీస్‌గఢ్‌ వాసుల నమ్మకం. మునులు, రుషులు ఈ వినాయకుడిని పూజించారని ఇక్కడి ఆదివాసీల నమ్మకం. నారద మునీంద్రుడు.. కూడా ఈ గణపతిని దర్శించేవాడని స్థానికుల విశ్వాసం. ఇప్పటి వరకూ కేవలం వందల సంఖ్యలో మాత్రమే భక్తులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. భక్తుల విశ్వాసం ఎదైనప్పటికీ ఈ గణేశుడు విగ్రహ ప్రతిష్టాపన ఆద్యంతం ఒక రహస్యంగానే ఉంది. ఈ గణేష్‌ ఇక్కడ ఎలా వెలిశాడు? ఎవరైనా చెక్కారా? తీసుకొచ్చి ప్రతిష్టించారా? కొన్ని వందల కిలోల బరువు ఉండే ఈ విగ్రహం అక్కడికి ఎలా చేరిందనేది మాత్రం మిష్టరీగానే ఉంది. 

13:18 - August 26, 2017

హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా... నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా...పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే గణేశ్‌ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, రాజకీయ పార్టీల నేతలు, మండపాల నిర్వాహకులతో పోలీస్‌ శాఖ సమావేశం నిర్వహించి... పలు సూచనలు చేశారు. నగర మంతటా 25 వేలమంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. గతేడాదితో పోలీస్తే ఈసారి మూడింతలు భద్రతను పెంచింది పోలీస్‌ శాఖ.

36 అధునాతన సీసీ కెమెరాలు
మొత్తం మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో సైబరాబాద్‌లో 6 వేల మంది పోలీసులు, రాచకొండ కమిషనరేట్‌లో 6 వేల మంది పోలీసులతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని ఖైరతాబాద్‌, బాలాపూర్‌, పాతబస్తీ కవాడిగూడాలోని భారీ గణేశ్‌ విగ్రహాల వద్ద 400కు పైగా పోలీసులు భద్రత చర్యలు తీసుకున్నారు.  ఉత్సవాలు ముగిసేవరకు రౌండ్‌ ది క్లాక్‌ సెక్యూరిటీ అందుబాటులో ఉండనుంది. ఈసారి వినూత్నంగా షాడో టీమ్స్‌ను రంగంలోకి దించారు పోలీసులు. ఒక్క ఖైరాతాబాద్‌ భారీ గణనాథుని వద్దే మొత్తం 36 అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటిని సెంట్రల్‌ జోన్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేయనున్నారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ ద్వారా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన వినాయక మండపాల వద్ద అంబులెన్స్‌, అగ్నిమాపక యంత్రం, తాగునీరు, విద్యుత్తు దీపాలు అందుబాటులో ఉండేలా ఇతర శాఖలతో సమన్వయం చేశారు. ఉత్సవాల అనంతరం.. వినాయక నిమజ్జనం రోజున ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. 

13:17 - August 26, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో పేదమహిళలకు బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తవుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌లో బతుకమ్మచీరల పంపిణీ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే చీరలకు ఆర్డర్లు ఇచ్చామని.. సెప్టెంబర్‌ రెండో వారానికి అన్ని జిల్లా కేంద్రాలకు చీరలు చేరతాయిన్నారు. సెప్టెంబర్‌ 18, 19, 20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్‌ షాపుల్లో చీరల పంపిణీ ఉంటుందన్నారు. మహిళలు తమ రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు చూపించి చీరలు తీసుకోవచ్చన్నారు. ఒకవేళ ఎవరైనా మ‌హిళ షాపుకు రాలేని ప‌రిస్థితి ఉంటే... ఆమె భ‌ర్తకానీ, త‌ల్లిగానీ, తండ్రిగానీ తీసుకుపోవ‌చ్చు. రేష‌న్ షాపుల్లో ఈ మొత్తం కార్యక్రమాన్ని జిల్లా క‌లెక్టర్లు ప‌ర్యవేక్షిస్తారని సీఎం తెలిపారు. 

13:16 - August 26, 2017

హైదరాబాద్ : జంట నగరాల్లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయి తటాకాలను తలపిస్తున్నాయి. వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో గంట, గంటన్న వ్యవధిలోనే 9 నుంచి 12 సెంటీ మీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. డ్రెయిన్లు, నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోని నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రజలు అంధకారంలో మగ్గిపోయారు. 

Don't Miss