Activities calendar

27 August 2017

21:33 - August 27, 2017

కిషన్ రెడ్డి..బీజేపీ పార్టీలో కీలక నేత. అంబర్ పేట నియోజకవర్గం నుండి ఈయన గెలుపొందారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పాలన..బీజేపీ పార్టీ పరిస్థితి..ఇతరత్రా విషయాలపై ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

21:29 - August 27, 2017
21:28 - August 27, 2017

ఢిల్లీ : అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు సీబీఐ కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రోహ్‌తక్‌లోకి డేరా అనుచరులు, మద్దతుదారులను అనుమతి లేకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. గుర్మీత్‌ ఉంటున్న జైలునే న్యాయస్థానంగా మార్చారు. గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు శిక్ష ఖరారు చేసేందుకు సీబీఐ న్యాయమూర్తి ప్రత్యేక విమానంలో రోహ్‌తక్‌ వస్తున్నారు. అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా వ్యవస్థాపకుడు గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌కు సీబీఐ కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. గుర్మీత్‌ అనుచరులు రోహ్‌తక్‌ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంలో హర్యానా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డేరా అనుచరలకు రోహ్‌తక్‌లోకి అనుమతిలేకుండా ఆదేశాలు జారీ చేసింది.


హర్యానాలోని పంచకుల కోర్టు తీర్పు తర్వాత గుర్మీత్‌ సింగ్‌ను రోహ్‌తక్‌లోని సునారియా జైలుకు తరలించారు. గుర్మీత్‌ ఉంటున్న సునారియా జైలులోని ఒక గదిని సీబీఐ న్యాయస్థానంగా మార్చారు. శిక్ష ఖరారు చేసేందుకు సీబీఐ కోర్టు న్యాయమూర్తి జైలుకు రానున్నారు. ఇందుకోసం సీబీఐ జడ్జి ప్రత్యేక విమానంలో రోహ్‌తక్‌ రప్పించే ఏర్పాటు చేశారు. డేరా బాబాను శుక్రవారం దోషిగా తేల్చిన తర్వాత పంజాబ్‌, హర్యానా, ఢిలీ, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో గుర్మీత్‌ అనుచరలు భారీ విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో రోహ్‌తక్‌తోపాటు, సునారియా జైలు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. డేరాల హింసలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మందికిపైగా గాయపడ్డారు. బీఎస్‌ఎఫ్‌ జవాన్లు, హరియాణా పోలీసు సిబ్బంది గుర్మీత్‌ ఉంటున్న జైలు పరిసర ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. జైలుకు చుట్టూ దాదాపు 10కి.మీ మేర ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

మరో వైపు డేరా బాబా ఆశ్రమ ప్రధాన కార్యాలయం ఉన్న సిర్సాలో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆశ్రమంలో ఇప్పటికీ దాదాపు 30వేల మంది అనుచరులు, మద్దతుదారులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రోహ్‌తక్‌లో మొత్తం 28 కంపెనీలకు చెందిన పారామిలటరీ బలగాల సిబ్బంది భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు డేరా బాబాకు సునారియా జైల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలు హర్యానా జైలు అధికారులు తోసిపుచ్చారు.

అందరూ చట్టాలకు లోబడి ఉండాలన్నారు ప్రధాని మోదీ.... చట్టం ముందు అందరూ సమానులే అని... దోషులకు శిక్ష తప్పదని హెచ్చరించారు.... ఏ రూపంలో హంసను సహించబోమని పరోక్షంగా డేరా బాబా ఘటనపై వ్యాఖ్యానించారు.. స్వచ్ఛత పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2కు ముందు నుంచే స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలకు సూచించారు..

గుర్మీత్ కు కొద్ది గంటల్లో శిక్ష ఖరారు..

ఢిల్లీ : అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు సీబీఐ కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 

సింధు పరాజయం...

ఢిల్లీ : ప్రపంచ బ్యాడ్మింటెన్ చాంపియన్ షిప్ లో సింధు ఓటమి పాలైంది. జపాన్ షట్లర్ ఒకుహరాపై ఒక్కపాయింట్ తో సింధు పరాజయం చెందింది. సింధుకు సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

డీఎస్పీ రామారావు సస్పెండ్..

తూర్పుగోదావరి : ముద్రగడ ఇంటివద్ద పోలీసులు భద్రతా వైఫల్యంపై డీజీపీ సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన పెద్దాపురం డీఎస్‌పీ రామారావును సస్పెండ్‌ చేశారు.  

29న కాకినాడ కార్పొరేషన్ పోలింగ్...

తూర్పుగోదావరి : కాకినాడలో మైకులు మూగబోయాయి..ప్రచార హోరు సద్దుమణిగింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం కొద్దిసేపటి క్రితం ముగిసింది. 48 డివిజన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 241 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎల్లుండి పోలింగ్ జరుగనుంది. సెప్టెంబర్ 1వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. 

సోమవారం నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్..

కర్నూలు : సోమవారం నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగనుంది. నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈసందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 10గంటల వరకు ఫలితం తేలే అవకాశం ఉంది. మొత్తం 19 రౌండ్లు..రౌండ్ కు 14 టేబుళ్ల ఏర్పాటు చేశారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించనున్నారు. 

21:16 - August 27, 2017

తూర్పుగోదావరి : కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసు వలయాన్ని ఛేదించుకుని కిర్లంపూడి నుంచి రాజుపాలెం మీదుగా వీరవరం చేరుకున్న ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. కాపు జేఏసీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేసి, ముద్రగడతోపాటు ఆయన అనుచరులను అరెస్టు చేశారు. మరోవైపు కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం వద్ద పోలీసుల భద్రతా వైఫల్యంపై డీజీపీ సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన పెద్దాపురం డీఎస్పీ రామారావును సస్పెండ్‌ చేశారు.


కిర్లంపూడిలోని నివాసం నుంచి పాదయాత్ర ప్రారంభించిన ముద్రగడ పద్మనాభంతో పాటు కాపు జేఏసీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఆయన ఇంటి వద్దే అడ్డుకున్నారు. పాదయాత్రకు వేలాది మంది తరలిరావడంతో ముద్రగడ అనుచరులు... పోలీసు వలయాన్ని ఛేదించుకుని ముందుకు సాగారు. ఈ దశలో పోలీసులు, ముద్రగడ అనుచరులకు మధ్య తీవ్రవాగ్వాదం, తోపులాట జరింది. కాపు జేఏసీ నేతలు, కార్యకర్తలు కిర్లంపూడిలో ఏలూరు రేంజ్‌ డీఐజీ రామకృష్ణను తోసేసి ముందుకు సాగడంతో గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముద్రగడ పాదయాత్రను పోలీసులు పలుసార్లు నిలువరించేందుకు ప్రయత్నించినా... అదుపుచేయడం సాధ్యం కాలేదు. కిర్లంపూడి నుంచి రాజుపాలెం చేరుకున్న ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు. అయినా ముద్రగడ అనుచరులు పోలీసులను తోసుకుని ముందుకుసాగారు. రాజుపాలం నుంచి వీరవరం వద్ద ముద్రగడను అడ్డుకుని కాపు జేఏసీ నేతలు, కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేశారు. ముద్రగడతో పాటు పలువురిని అరెస్టు చేశారు. ముద్రగడ అరెస్టుతో మనస్తాపానికి గురై వీరవరంలో కాపు జేఏసీ కార్యకర్తల కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. మరోవైపు ముద్రగడ ఇంటివద్ద పోలీసులు భద్రతా వైఫల్యంపై డీజీపీ సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన పెద్దాపురం డీఎస్‌పీ రామారావును సస్పెండ్‌ చేశారు.  

21:14 - August 27, 2017
21:10 - August 27, 2017

అజారుద్దీన్ కు బెదిరింపులు..

హైదరాబాద్ : అజారుద్దీన్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సీపీ మహేందర్ రెడ్డికి అజారుద్దీన్ ఫిర్యాదు చేశారు. నిందితుడు మసూద్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

21:03 - August 27, 2017

సినీ విశ్లేషకులు మహేష్ కత్తిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అగ్గిలం మీద గుగ్గిలమవుతున్నారు. ఆయన చెప్పిన అభిప్రాయాలపై పవన్ అభిమానులు తీవ్రంగా సీరియస్ అవుతున్నారు. ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతుండడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మహేష్ కత్తితో టెన్ టివి ముచ్చటించింది. జరుగుతున్న పరిణామాలపై ఆయన ఘాటుగా స్పందించారు. తనకు వేలాదిగా ఫోన్స్ కాల్స్ వస్తున్నాయని..చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. పవన్ ఫ్యాన్స్ ను ఎవరు కంట్రోల్ చేస్తారు ? ఎవరు పట్టించుకుంటారో తెలియడం లేదన్నారు. ఏ ధైర్యంతో ఇలా చేస్తున్నారు ? అని ప్రశ్నించారు.  ఈవిషయంలో పవన్ కళ్యాన్ స్పందించాల్సిందేనని స్పష్టం చేశారు. హాట్ హాట్ గా సాగిన ఈ కార్యక్రమం పూర్తిగా చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:58 - August 27, 2017
20:30 - August 27, 2017

పవన్ కళ్యాణ్ అభిమానులు తనను ఎంతో బెదిరిస్తున్నారని..ఏకంగా చంపేస్తుమంటున్నారని సినీ విశ్లేషకులు మహేష్ కత్తి పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా మహేష్ కత్తిని పవన్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న వారు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. తన ఫోన్ కు సుమారు ఐదు..ఆరు వేల కాల్స్ వచ్చినట్లుందని, అందులో కొన్ని బ్లాక్..కొన్ని రికార్డ్ చేయడం జరిగిందన్నారు. విదేశాల నుండి ఫోన్స్ వచ్చాయన్నారు. ఉన్మాద రహిత ఫ్యాన్స్ నుండి వస్తున్నాయని, విచిత్ర పరిస్థితుల్లో ఉన్నానన్నారు. గత 48 గంటలుగా ఈ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. మరి దీనిపై పవన్ స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

మధుసూధన్ రెడ్డి నిజమైన కమ్యూనిస్టు - తమ్మినేని..

ఖమ్మం :మంచికంటి భవన్ లో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో మధుసూధన్ రెడ్డి జ్ఞాపకాలలో ఓ సాయంత్రం పేరిట ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. మధుసూధన్ కుటుంబానికి రాష్ట్ర కమిటీ తరపున సంతాపం తెలియచేస్తున్నట్లు, మధుసూధన్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని తెలిపారు. ఆయన అకాల మరణం తనను బాధించిందని, నిజమైన కమ్యూనిస్టు మధుసూధన్ రెడ్డి అని అభివర్ణించారు. టెన్ టివి ఆస్తుల పరిరక్షకుడు మధుసూధన్ రెడ్డి అని అన్నారు. 

19:42 - August 27, 2017

ఎంవీ రఘు...దక్షిణ భారతదేశంలో ఉత్తమ సినిమాట్రోగ్రాఫర్ గా నిరూపించుకన్నారు. దర్శకుడిగా 'కళ్లు' సినిమాతో 'నంది' సహా పలు అవార్డులను అందుకున్నారు. ఆర్ట్స్ సినిమాలకు మనుగడ తక్కువని ప్రముఖ సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎంవీ రఘు పేర్కొన్నారు. ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. ఎస్.గోపాలరెడ్డి దగ్గర తొలి అసిస్టెంటుగా చేరినట్లు, చిరంజీవి, సుహాసిని జంటగా వచ్చిన ‘మగమహారాజు’తో సినిమాటోగ్రాఫర్‌గా తనకు తొలి అవకాశం వచ్చిందన్నారు. యంగ్ జనరేషన్ వారు సినిమాలు మంచిగా చేస్తున్నారని, కొత్త ఒరవడి వస్తోందన్నారు. ఇలాంటి మార్పును తాను స్వాగతిస్తామని, మూసలాంటి సినిమాలతో ప్రేక్షకులు విసుగు చెందారన్నారు. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:30 - August 27, 2017

హైదరాబాద్ : ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అండ్‌ వర్క్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు ఆలిండియా లెవల్‌లో 24 ర్యాంకులు సాధించారన్నారు మాస్టర్‌ మైండ్స్‌ డైరెక్టర్‌ మట్టుపల్లి మోహన్‌. సీఎంఏఇంటర్‌ పరీక్షా ఫలితాలలో కె.రేవతి మొదటిర్యాంక్‌, ఇంద్రకుమారి రెండో ర్యాంక్‌, చైతన్యకుమార్‌రెడ్డి 16వ ర్యాంక్‌, ప్రవల్లిక 17వ ర్యాంక్‌ సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఆలిండియా లెవల్‌లో మంచి ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులకు మోహన్‌ అభినందనలు తెలిపారు. 

19:29 - August 27, 2017

హైదరాబాద్ : అక్షరాలను ఒడిసి పట్టి... అనేక ప్రతులకు ప్రాణం పోసిన పవిత్ర స్థలం అది... ఎన్నో పుస్తకాలకు... మరెన్నో గ్రంథాలకు కేరాఫ్‌. అంతటి చరిత్ర ఉన్నా... నేడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఆదాయం ఉన్నా.. సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం లేక నిస్తేజంగా మారింది. 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నా.. డమ్మిగానే మిగిలిపోయిన తెలుగు అకాడమీపై 10టీవీ ప్రత్యేక కథనం. తెలుగు రాష్ట్రాభివృద్ధికి... ఉన్నత విద్యలో తెలుగు మాధ్యమం విస్త్రతికి విశేషంగా కృషి చేసిన తెలుగు అకాడమి రూపు మారిపోతుంది. తెలుగు విద్యలో కలికితురాయిగా పేరు ప్రఖ్యాతులు గడించిన తెలుగు అకాడమీ కేవలం నామమాత్రంగానే మిగిలిపోతోంది. కేవలం పాఠ్య పుస్తకాల ముద్రణా కేంద్రంగా మారిపోవడంతో భాషాభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1968 ఆగస్టు 4న తెలుగు అకాడమీ పురుడు పోసుకుంది. అప్పటి నుంచి తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుగు అకాడమీ కృషి చేసింది. వేల గ్రంథాలకు ప్రాణం పోసింది. ఇతర భాషల పుస్తకాలను తెలుగులోకి అనువదించేందుకు తెలుగు అకాడమీ ప్రత్యేక చొరవ చూపింది. 4 వేల రకాల గ్రంథాలను, పుస్తకాలను ముద్రించింది. 35 నిఘంటువులను రూపొందించింది. పుస్తకాల ముద్రణలో ఏ శాఖపై ఆధారపడకుండా అప్పటి ప్రభుత్వం తెలుగు అకాడమీకి స్వయం ప్రతిపత్తి కల్పించింది. తెలుగు అకాడమీ సొంతంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకుని.. పాఠ్య పుస్తకాల ముద్రణలో రాష్ట్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

తెలుగు అకాడమీ కొన్ని ఏళ్ల పాటు విరామం ఎరగకుండా తెలుగు వారి కోసం పని చేసింది. తెలుగు పండితులతో ప్రత్యేక పరిశోధనలు సాగించింది. అయితే కొంతకాలంగా తెలుగు అకాడమీ నిస్తేజంగా మారిపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు అకాడమీలో రాజకీయ నాయకుల పాత్ర ఎక్కువ కావడం... ఉన్నతస్థాయి అధికారుల పోస్ట్‌లు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్నా.. వాటి భర్తీకి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తున్నాయి. శాశ్వత డైరెక్టర్‌ లేకపోవడం.. దీనికి కారణమని.. పలువురు భాషాభిమానులు అంటున్నారు. అకాడమీ కార్యకలాపాలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ఏది ఏమైనా 2005 నుంచి తెలుగు అకాడమీ పేరు ప్రతిష్టలు మసకబారుతూ వస్తున్నాయి. 2013 నుంచి ఇంచార్జ్‌ పాలనలోనే సాగుతోంది. 50 ఏళ్ల ఉత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇతర అధికారుల పర్యవేక్షణలో కాలం వెల్లదీస్తోంది. ఇప్పటికైనా తెలుగు అకాడమీకి గత వైభవాన్ని తెచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

19:27 - August 27, 2017

హైదరాబాద్ : భక్తులందరితో పూజలందుకున్న గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భాగ్యనగరవాసులు సిద్ధమయ్యారు. గణేశ ఉత్సవాలు మూడో రోజుకి చేరుకోవడంతో ట్యాంక్‌ బండ్‌పై నిమజ్జన కోలాహలం మొదలైంది. నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంతరాలు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

హైదారాబాద్‌లోని అతిపెద్ద గణేశ్‌ విగ్రహమైన ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఇప్పటికే ఎన్టీఆర్ మార్గ్‌ వద్ద నిమజ్జన ప్రాంతంలో భారీ క్రేన్ సిద్ధం చేశారు. ఆ క్రేన్‌నే మూడో రోజు నిమజ్జనానికి వినియోగిస్తున్నారు. నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా జీహెచ్‌ఎంసి, హెఎండీఏ , రెవెన్యూ, పోలీస్‌, ఇరిగేషన్, రెస్క్యూ, విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్సవ మూర్తులను నిమజ్జనం చేయగానే విగ్రహాల నుంచి వెలువడే వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేకంగా నీటి శుద్ధి యంత్రాలను సైతం ఏర్పాటు చేశారు. 11వరోజు జరిగే భారీ నిమజ్జన ఘట్టానికి సుమారు 3 వందలకు పైగా చిన్న, అతి భారీ క్రేన్‌లను వినియోగించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

కరీంనగర్ కు సీబీసీఐడీ..

రాజన్న సిరిసిల్ల : నేరెళ్ల ఘటనపై సీబీసీఐడీ విచారణ జరుగనుంది. కరీంనగర్ లో సోమవారం బాధిత కుటుంబీకులను సీఐడీ డీఐజీ శికా గోయల్ విచారించనున్నారు. వేములవాడలో బాధితులకు సీఐడీ సీఐ సమాచారం ఇచ్చారు. 

మిధాని..బీడీఎల్ లో కార్యక్రమాలు..

హైదరాబాద్ : మిధాని, బీడీఎల్ లో పలు కార్యక్రమాలను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. నూతనంగా రూపొందించిన మిస్సైల్, యుద్ద ట్యాంకర్ ను రక్షణ శాఖకు అంకితం చేశారు. 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను జైట్లీ ప్రారంభించారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం రక్షణ రంగంలోనూ వినియోగిస్తున్నామని, మన రక్షణ రంగం సామర్థ్యం బలోపేతం అవుతుందన్నారు. రక్షణ రంగ సామాగ్రీని స్వయంగా ఉత్పత్తి చేసే స్థాయికి భారత్ ఎదగాలన్నారు. 

999 గ్రాముల బంగారం స్వాధీనం..

ఢిల్లీ : ఎయిర్ పోర్టులో 999 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. ఇటలీ నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి రూ. 27 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  

ఒంగోలు నగరానికి తీరనున్న నీటి కష్టాలు..

ప్రకాశం : గుండ్లకమ్మ రిజర్వాయర్ పైప్ లైన్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు పరిశీలించారు. ఆర్డీవో శ్రీనివాస రావు, కమిషనర్ వెంకటకృష్ణలు కూడా ఉన్నారు. ఏడుగుండ్ల పాడు నుండి తక్షణం నగరానికి తాగునీరందిస్తామని, కొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయి పైపులైన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఒంగోలు నగరానికి తాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. 

వినాయక నిమజ్జనోత్సవంలో అపశృతి..

విజయవాడ : వినాయక నిమజ్జనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. తాడికొండ (మం) రావెల గ్రామంలో నిమజ్జనం సందర్భంగా విద్యుత్ షాక్ తో అభినందనరావు (40) అనే వ్యక్తి మృతి చెందాడు. 

19:10 - August 27, 2017

ఆధునిక సమాజంలో అంబేద్కరిజం..కుల వ్యవస్థకు సంబంధించిన వివక్ష తగ్గుతుంది..ఆర్థిక అసమానతలు పెరిగిపోతుందని స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఎందుకీ పరిస్థితి ఉంది ? దీనికి కారణాలు ఏంటీ ? అంబేద్కరిజం కోణంలో నేటి ఆధునిక సమాజానికి ఇచ్చిన సందేశం..ఇతరత్రా వివరాలపై ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు విశ్లేషించారు.

రావెల కిషోర్ బాబు ఏపీ ప్రభుత్వంలో సాంఘీక గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు.. అంబేద్కర్ వాది..కాన్షిరాం అనుచరులైన రావెల కిషోర్ బాబుతో మాస్టర్ కీ ఆధ్వర్యంలో టెన్ టివిలో 'ఆధునిక సమాజంలో అంబేద్కరిజం' అనే చర్చ ప్రసారమౌతోంది. 1932 సంవత్సరం..సెప్టెంబర్ 24వ తేదీన జరిగిన పూణా ఒడంబడిక దృష్టాంతాన్ని పురస్కరించుకుని ఈ అంశంపై కవులు..రచయితల నుండి కవిత్వాలను..రచనలను ఆహ్వనిస్తున్నారు..సెప్టెంబర్ 10వ తేదీలోపు తమ కవిత్వాలను..రచనలను..masterkey.ambedkarprogramme@gmail.comకు మెయిల్ చెయ్యండి...ఇందులో విజేతలకు ప్రశంసా పత్రం..సత్కారం రావెల కిషోర్ బాబు చేతుల మీదుగా జరుగుతుంది. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి..

లంక 217/9..

ఢిల్లీ : మూడో వన్డే మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. డిక్ వెల్లా (13), చండీమాల్ (36), మెండీస్ (1), తిరుమన్నె (80), మ్యాథ్యూస్ (11), కప్గదెరె (14), సిరివర్ధన(29), ధనన్ జయ (2), చమీరా (6), ఫెర్నాండో 5 పరుగులు..మలింగా ఒక్క పరుగుతో నాటౌట్ గా నిలిచారు.

ఐఎన్ టీయూసీ జనరల్ సెక్రటరీగా..

హైదరాబాద్ : ఐఎన్ టీయూసీ జనరల్ సెక్రటరీగా మహమూద్ ఎన్నికయ్యారు. గతంలో ఆర్టీసీ బోర్డు డైరెక్టర్ గా ఆయన పనిచేసిన సంగతి తెలిసిందే. 

సోమవారం నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్..

కర్నూలు : సోమవారం నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగనుంది. నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈసందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 10గంటల వరకు ఫలితం తేలే అవకాశం ఉంది. మొత్తం 19 రౌండ్లు..రౌండ్ కు 14 టేబుళ్ల ఏర్పాటు చేశారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించనున్నారు. 

17:32 - August 27, 2017

కరీంనగర్ : పేదల..మధ్య తరగతి పథకాల్లో లబ్ది పొందాలంటే అధికారులు..సిబ్బందికి డబ్బులు అందచేయాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. స్వయంగా మంత్రి కేటీఆర్ ఇలాఖాలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే సిరిసిల్లలో ఇసుక మాఫియా ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే.

తాజాగా సిరిసిల్లలో సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. వివాహ ధృవీకరణ పత్రాల కోసం వస్తున్న వారి నుండి డబ్బులు దండుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లకు మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఇందుకు సిబ్బంది రుసుం కింద రూ. 200 తీసుకోవాల్సి ఉంటుంది. కానీ రూ. 200 బదులు రూ. 500 వసూలు చేస్తుండడంతో లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. మరి ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

17:20 - August 27, 2017

తూర్పుగోదావరి : కాకినాడలో మైకులు మూగబోయాయి..ప్రచార హోరు సద్దుమణిగింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం కొద్దిసేపటి క్రితం ముగిసింది. 48 డివిజన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 241 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎల్లుండి పోలింగ్ జరుగనుంది. సెప్టెంబర్ 1వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.

ఏడేళ్ల విరామం అనంతరం ఎన్నికలు జరుగుతుండడంతో ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నాలుగు పార్టీల అధ్యక్షులు మోహరించి ప్రచారం నిర్వహించారు. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహించడం విశేషం. రెండు వార్డుల్లో సీపీఎం, మరో రెండు వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు బరిలో నిలిచారు.

ప్రచారం ముగిసిన అనంతరం ప్రలోభాల పర్వంపై నేతలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బహిరంగంగానే టిడిపి ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయలు..ఒక్కో నోటుకు ఐదొందల రూపాయలను వైసీపీ పంచుతోందనే ప్రచారం జరుగుతోంది. 

17:15 - August 27, 2017

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడను పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. పాదయాత్ర చేస్తున్న ఆయన్ను అడ్డుకుని పోలీసు వాహనంలో తరలిస్తున్నారు. పాదయాత్రను అడ్డుకోవడం..ముద్రగడను అరెస్టు చేయడాన్ని కాపు నేతలు..జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు..కాపు జేఏసీ నేతల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. జగ్గంపేటకు ముద్రగడను తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

కాపు ఉద్యమ నేత ముద్రగడ చలో అమరావతి పేరిట పాదయాత్ర చేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. కానీ ఈ పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇలా 33 రోజుల పాటు వేచి చూసిన ఆయన ఆదివారం మాత్రం పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాకినాడలో సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్ పర్యటిస్తుండడంతో పోలీసులు బందోబస్తు నిమిత్తం అక్కడకు భారీగా వెళ్లారు. పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండడంతో దీనిని అదునుగా భావించిన ముద్రగడ పాదయాత్ర చేపట్టారు. పోలీసులను తోసివేస్తూ..బారికేడ్లను నెట్టివేస్తూ ముద్రగడ అనుచరులు ముందుకు దూసుకెళ్లారు. ముద్రగడ పాదయాత్ర వీరవరం వద్దకు చేరుకోగానే పోలీసులు భారీగా మోహరించి పాదయాత్రను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. ఐదు కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగింది. వీరవరం వద్దకు చేరుకోగానే ముద్రగడను..కాపు జేఏసీ నేతలను అరెస్టు చేసి తెలియని ప్రాంతానికి తరలిస్తున్నారు.

ఇదిలా ఉంటే ముద్రగడ పాదయాత్ర చేపట్టడంపై పోలీసు బాస్ డీజీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ.. పోలీసుల తీరుపై డీజీపీ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో ఉండగా ముద్రగడ పాదయాత్ర చేయడం పట్ల డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసుల వైఫల్యంతోనే ఇదంతా జరిగిందని, విధి నిర్వాహణలో విఫలమైన వారిపై చర్యలుంటాయని డీజీపీ హెచ్చరించారు. 

కాకినాడలో ముగిసిన ఎన్నికల ప్రచారం..

తూర్పుగోదావరి : కాకినాడ ఎన్నికల ప్రచారం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఎన్నికల ప్రచారంలో అగ్రనేతలు పాల్గొన్నారు. ఎల్లుండి పోలింగ్ జరుగుతుండగా సెప్టెంబర్ 1వ తేదీన కౌంటింగ్ జరుగనుంది. 

ముద్రగడ పాదయాత్రపై డీజీపీ ఆగ్రహం..

తూర్పుగోదావరి : కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి వద్ద భద్రత సిబ్బందిపై డీజీపీ ఫైర్ అయ్యారు. పోలీసుల వైఫల్యం వల్లే ముద్రగడ పాదయాత్రకు బయలుదేరానని, విధి నిర్వాహణలో విఫలమైన వారిపై చర్యలుంటాయని డీజీపీ హెచ్చరించారు. 

ముద్రగడ అరెస్టు..

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడను పోలీసులు అరెస్టు చేశారు. వీరవరంలో ఆయన పాదయాత్రను అడ్డుకుని ఆయనతో పాటు కాపు జేఏసీలను పోలీసు వాహనంలో తరలించారు. 

16:53 - August 27, 2017

కరీంనగర్ : తెలంగాణలో సంచలనం రేపిన నేరెళ్ల ఘటనను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో టీ కాంగ్రెస్‌ విఫలమైందా? బాధితులకు బాసటగా పోరాటం చేసినా... క్రెడిట్‌ను దక్కించుకోవడంలో వెనకబడిందా? మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ దీక్ష నేరళ్ల ఘటనపై పోరాటాన్ని నీరుగార్చిందా? అధికారపార్టీ వ్యూహాలతోనే పొన్నం ప్రభాకర్‌ దీక్ష చేపట్టారా? టీ కాంగ్రెస్ డీలా పడితే ఆ క్రెడిట్‌ను కమలం పార్టీ దక్కించుకుందా?

కరీంనగర్‌ జిల్లాలో నేరెళ్ల ఘటన...రాష్ట్రంలో ఇసుకాసురుల ఆగడాలకు నిలువెత్తుసాక్ష్యంగా నిలిచింది. అక్రమార్కులకు ఎదురుతిరిగిన దళితులపై పోలీసులు లాఠీన్యాన్ని ప్రదర్శించడం కలకలం రేపింది. నేరళ్ల ఘటనపై తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ తర్వాత పార్టీ జాతీయనేతలు స్వరం పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం నేరళ్ల ఘటనను సీరియస్‌గా తీసుకుని జాతీయ స్థాయిలో ఆందోళనలు చేస్తోంది. అయితే రాష్ట్రంలో హస్తం పార్టీకి మైలేజ్ వచ్చే అంశాన్ని నేతలు ఎందుకు పక్కన పెట్టారనేది చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ దీక్షే కాంగ్రెస్‌ పార్టీకి చేటు చేసిందా అనే ప్రశ్న రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారింది.

తెలంగాణలో పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి నేరెళ్ల ఘటన జాతీయ స్థాయిలో ఉద్యమానికి అస్త్రంగా మారింది. అటు నేరెళ్ల ఘటన కేసీఆర్‌ సర్కార్‌ను గజగజలాడించింది. ప్రభుత్వం ఇరకాటంలో పడేలా చేసింది. విపక్షాలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు సంధించిన ప్రశ్నలకు గట్టిగా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. జాతీయ స్థాయిలో ఏఐసీసీ పెద్దలు ఇప్పటికీ న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. బాధితులకు బాసటగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయల్లో పరిణామాలు వేగంగా మారాయి. ఆలస్యంగా నేరళ్ల ఘటనపై స్పందించిన కేసీఆర్‌ సర్కార్‌ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

నేరెళ్ల బాధితులపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారనే వార్తలను వెలుగులోకి తెచ్చింది మాజీ ఎంపి పొన్నం ప్రభాకరే. తీవ్ర గాయాలపాలైన భాదితులను ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించిన ఆయన.. నేరెళ్ల ఘటనపై న్యాయ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఇందుకుతగ్గట్టే టీపీసీసీ...దళిత నేత అయిన మల్లు భట్టి విక్రమార్కను రంగంలోకి దింపి రాష్ట్ర స్థాయిలో ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. నేరెళ్ల ఘటన రాష్ట్రంలోనే కాక.. దేశంలోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే సమయంలో కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజీ సాధన కోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆమరణ దీక్షకు దిగారు. ఆయన ఇంట్లోనే 4 రోజులు కొనసాగించిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నేరెళ్ల ఘటనను మరుగున పడేసేందుకే పొన్నం దీక్ష చేపట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార పార్టీతో ఉన్న రహస్య స్నేహం వల్లే ఇదంతా చేశాడన్న ప్రచారం వినిపిస్తోంది.

పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకపోవడంతో పొన్నం తన ఇంటి వద్దే ఆమరణ దీక్ష చేపట్టారు. ప్రభుత్వ అండతోనే 4 రోజులు దీక్ష కొనసాగించారనేది మరో ఆరోపణ. మరోవైపు పొన్నం దీక్షతో నేరేళ్ల బాధితులను కమలం పార్టీ తమ వైపునకు తిప్పుకుని పోరాటం సాగిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన మైలేజ్ కాస్త బిజెపి దక్కించుకుంది. నేరెళ్ల ఘటనపై హస్తం పార్టీ ఫోకస్‌ తగ్గించేందుకు దీక్ష పేరుతో హైడ్రామా చేశారని పొన్నంపై కాంగ్రెస్‌ శ్రేణులు కారాలు మిరియాలు నూరుతున్నారట. 

16:33 - August 27, 2017

కడప : నంద్యాల ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని, గెలుపు అనంతరం వైసీపీ నుండి టిడిపిలోకి వలసలుంటాయని..త్వరలోనే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని మంత్రి ఆది నారాయణ పేర్కొన్నారు. అడ్డుపుల్ల వేస్తే ఎలా ఉంటుందో తెలిసి వస్తుందని నంద్యాల తీర్పు రాష్ట్రంలో సంచలన మార్పులకు తెరలేస్తుందన్నారు. 

ముద్రగడ కోసం కాల్వలో దూకిన యువకుడు..

కాకినాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ చేపడుతున్న పాదయాత్రను వీరవరం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఓ యువకుడు కాల్వలోకి దూకాడు. స్థానికులు..పోలీసులు గాలిస్తున్నారు. 

16:21 - August 27, 2017

కడప : గడప గడపకు ప్రభుత్వ పథకాలను తీసుకెళుతామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళుతోందని, అభివృద్ధిని ప్రతిపక్షం అడ్డుకొంటోందన్నారు. కడపలో వర్షపాతం అధికంగా ఉందని..నీరు - ప్రగతి పథకంలో భాగంగా చెక్ డ్యామ్ లో నీళ్లు ఉంటున్నాయన్నారు. అభివృద్ధిని చూసి నంద్యాలలో టిడిపిని గెలిపిస్తారని పేర్కొన్నారు. వెంకయ్య సన్మాన కార్యక్రమంలో ప్రతిపక్ష నేత జగన్ పాల్గొనక పోవడాన్ని సీఎం రమేష్ తప్పుపట్టారు. 

కాకినాడలో సీఎం బాబు ప్రచారం..

కాకినాడ : కార్పొరేషన్ ఎన్నిక ప్రచారంలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్ షోలు నిర్వహిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శలు గుప్పించారు.

16:10 - August 27, 2017

కాకినాడ : హార్యానాలో డేరా బాబ..ఇక్కడ జగన్ బాబ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. కార్పొరేషన్ ఎన్నిక ప్రచారంలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్ షోలు నిర్వహిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శలు గుప్పించారు. టిడిపిని గెలిపిస్తే అభివృద్ధి మరింత చేసి చూపిస్తామని హామీనిచ్చారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న 90 లక్షల మందికి రూ. పది వేల రూపాయలిచ్చిన ఘనత టిడిపిదేనని, ఆడబిడ్డల కోసం ఎంత డబ్బులైనా ఖర్చు చేస్తానన్నారు. పేదరికం నుండి బయటపడాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుండి డబ్బులు కేటాయిస్తానన్నారు. నెలకు సంపాదించే విధంగా వారిని పైకి తీసుకొస్తానన్నారు.

నోటికొచ్చినట్లు జగన్ మాట్లాడడం తీవ్ర అభ్యంతరకరమని, చిన్నప్పటి నుండి జగన్ ఇంతేనని తెలిపారు. చిన్నతనంలో జగన్ టివీలను పలగగొట్టే వాడని..సీఎం అయిన అనంతరం జగన్ ను వైఎస్ బెంగుళూరుకు తరలించాడన్నారు. అక్కడ దోచుకొనే వాడని, వైఎస్ మరణానంతరం ఇక్కడకు జగన్ వచ్చాడన్నారు. ఇంకా జగన్ ను ఎలా విమర్శించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

కాకినాడలో ముగియనున్న ప్రచారం..

కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం కాసేపట్లో ముగియనుంది. సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్ రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారం నిర్వహించారు. 

బాబుకు మాజీ సీఎస్ లేఖ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు 19 పేజీల లేఖ రాశారు. ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా సింగపూర్ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొంటోందని, అమరావతి నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ సరైంది కాదని లేఖలో పేర్కొన్నారు. ఈ విధానంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. దేశంలో నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకొనేందుకు సింగపూర్ ఒక హబ్ గా మారిందన్నారు. 

15:50 - August 27, 2017

విఫలమైన ఎన్నికల కమిషన్ - సీపీఐ..

విజయవాడ : రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ దారుణంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. గెలిచేందుకు చంద్రబాబు డబ్బులు పంచుతున్నారని, రూ. కోట్లలో బెట్టింగ్ లు జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. 

ముద్రగడను అడ్డుకున్న పోలీసులు..

తూర్పుగోదావరి : ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. వీరవరం వద్ద పాదయాత్రను పోలీసులు అడుడకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు..కాపులకు మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. 

డేరా ఘటనపై మోడీ స్పందన..

ఢిల్లీ : అందరూ చట్టాలకు లోబడి ఉండాలన్నారు ప్రధాని మోదీ. చట్టం ముందు అందరూ సమానులే అని దోషులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఏ రూపంలో హంసను సహించబోమని పరోక్షంగా డేరా బాబా ఘటనపై వ్యాఖ్యానించారు.

మేవెదర్ గెలుపు..

ఢిల్లీ : మెక్ గ్రెగర్ ను మేవెదర్ మట్టి కరిపించాడు. రూ. 1,280 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. ఓడిపోయిన మెక్ గ్రెగర్ కు రూ. 400 కోట్లు వచ్చాయి. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 50 మ్యాచ్ లు గెలిచి అరుదైన రికార్డును మేవెదర్ నెలకొల్పాడు. 

15:15 - August 27, 2017

కడప : వినాయక నిమజ్జనోత్సవంలో ఘర్షణ జరిగింది. మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సొంతూరు గొరిగనూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గొరిగెనూరు టిడిపిలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గానికి మంత్రి ఆదినారాయణరెడ్డి, మరో వర్గానికి టిడిపి ఎమ్మెల్సీ పొన్నాల రామసుబ్బారెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. రామసుబ్బారెడ్డి వర్గం గణేశ్‌ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో ఊరేగింపు ఆనవాయితీలేదని అడ్డుకోవడంతో రామసుబ్బారెడ్డి వర్గం ఘర్షణకు దిగింది. రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానగా మారి పరస్పర రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. 

15:12 - August 27, 2017

తూర్పుగోదావరి : ఎట్టకేలకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్ర చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఆయన పాదయాత్ర చేయాలని ప్రయత్నించడం...పోలీసులు నిలువరించడం..ఆయన్ను హౌస్ అరెస్టు చేస్తున్న సంగతి తెలిసిందే. కాపులను బీసీల్లో చేర్చాలని ఆయన చలో అమరావతి పేరిట పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే.

33 రోజులుగా ఆయన ఇంటిలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆదివారం మాత్రం పరిస్థితులు మారిపోయాయి. ఎప్పటిలాగానే పాదయాత్ర చేయడానికి ముద్రగడ ఇంటి నుండి బయటకు రావడం..పోలీసులు అడ్డుకోవడం జరిగాయి. ముద్రగడ పాదయాత్రకు మద్దతుగా వందలాదిమంది కాపులు తరలివచ్చారు. బారికేడ్లను తోసుకొని దూసుకొచ్చారు. ముద్రగడ పాద్రయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

కాపులను పోలీసులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సర్దిచెప్పేందుకు వచ్చిన ఆర్డీవో, డీఐజీలను తోసేశారు. ఈ తోపులాటలో డీఐజీ కింద పడిపోయారు. తోపులాటలో ముద్రగడ చాలా నీరసపడిపోగా పలువురు కాపు నేతలు సృహ తప్పిపడిపోయారు. భారీగా కాపులు రావడంతో పోలీసులు చేతులేత్తేశారు. దీనితో ముద్రగడ పాదయాత్ర ప్రారంభమైంది. రాజుపాలెం నుండి కొనసాగుతున్న ఈ పాదయాత్ర వీరవరం వైపుగా సాగుతోంది. తాను పాదయాత్ర చేయాలని సంకల్పించినా పోలీసులు అడ్డుకున్నారని ఎంతో శాంతిగా తాను నిరసన వ్యక్తం చేసినట్లు ముద్రగడ పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. మరి ఈ పాదయాత్ర ఎక్కడ వరకు జరుగుతుందో వేచి చూడాలి. 

హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం సందడి..

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం సందడి నెలకొంది. మూడో రోజు నిమజ్జనం చేసేందుకు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ మార్గ్ కు గణనాథులు చేరుకున్నారు. 

14:49 - August 27, 2017

అనంతపురం : తాగటానికి గుక్కెడు నీరు దొరక్క అవస్థలు పడుతున్న అనంతపురం జనానికి గణేశ నిమజ్జనం ఆందోళనకరంగా మారింది. వర్షాభావ పరిస్థితులు ఓవైపు.. తుంగభద్ర జలాశయం నుంచి నీటి విడుదల వాయిదా వెరసి.. అనంతపురం జిల్లాలో వినాయక నిమజ్జనానికి నీరు లేని దయనీయ పరిస్థితి నెలకొంది.

అనంతపురంలో ఈ ఏడాది ఐదువేలకు పైగా వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. జిల్లాలో సాగు, తాగు నీటి అవసరాలకే నీరు కొరవడిన నేపథ్యంలో వినాయక నిమజ్జనం ఎలా చేయాలా అనే సందిగ్థంలో పడ్డారు జనాలు. నిజానికి ఆగస్టు మొదటి వారంలోనే తుంగభద్ర జలాశయం నుంచి హెచ్‌ఎల్సీకి నీరు విడుదల కావాల్సి ఉండగా.. అది కాస్తా వాయిదా పడింది. విడుదల చేసినా సాగునీటి అసరాలకు మంగళం పాడి కేవలం తాగునీటి అవసరాలకే నీటిని విడుదల చేస్తామని తేల్చి చెప్పారు తుంగభద్ర బోర్డు అధికారులు. అదేవిధంగా శ్రీశైలం జలాశయంలో సైతం నీటి మట్టం లేక పోవడంతో హంద్రీనీవా ద్వారా కూడా జిల్లాకు నీటి విడుదలలో ఆలస్యమవుతోంది. జిల్లా సాగు,తాగునీటి అవసరాలకు నీటిని అందించే రెండు ద్వారాలు మూసుకుపోయిన నేపథ్యంలో వినాయక నిమజ్జనం జనంలో ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు వినాయక నిమజ్జనం కోసం జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శింగనమల చెరువులో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 29న వినాయక నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. రెండు మూడురోజుల్లో వర్షాలు కురిస్తే కొంత వరకైనా నీటి ఇబ్బందులు తీరే అవకాశం ఉంది. లేదంటే వినాయక నిమజ్జనానికి కష్టాలు తప్పవు. 

14:44 - August 27, 2017

హైదరాబాద్ : సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం కృషి చేసేదే టీమాస్‌ అని.. తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇంత మంచి టీమాస్‌ని గదులకే పరిమితం కాకుండా.. జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌లో ఉన్న 150 మున్సిపల్‌ వార్డుల్లో కూడా టీమాస్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కోరికల కోసం ప్రభుత్వంతో యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. 

వరిగెనూరులో ఉద్రిక్తత...

కడప : జమ్మలమడుగు (మం) వరిగెనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం ఇరువర్గాలు రాళ్లతో దాడులు చేసుకున్నారు. 

ముగిసిన కోటంరెడ్డి విచారణ..

నెల్లూరు : క్రికెట్ బెట్టింగ్ కేసులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచారణ ముగిసింది. కోటంరెడ్డిని గంటన్నర పాటు ప్రశ్నించారు. బెంగళూరులో బ్యాంక్ అకౌంట్ ఉందా అని అడిగారని, తన బ్యాంక్ స్టేట్ మెంట్స్ అన్నీ పోలీసులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఒక్క ఆధారం కూడా లేకుండా ఇన్నిసార్లు విచారణకు పిలవడం వెనుక ఆంతర్యం ఏమిటనీ ప్రశ్నించారు. ఇదంతా చంద్రబాబు కుట్ర అని, పోలీసులతో పొలిటికల్ డ్యూటీలు చేయిస్తున్నారని విమర్శించారు. 

నంద్యాలలో గెలుపు మాదే - ఆది నారాయణ..

కడప : నంద్యాల ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని, గెలుపు అనంతరం వైసీపీ నుండి టిడిపిలోకి వలసలుంటాయని..త్వరలోనే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని మంత్రి ఆది నారాయణ పేర్కొన్నారు.

 

14:20 - August 27, 2017
14:14 - August 27, 2017

హైదరాబాద్ : రాజ్యాంగంలో రిజర్వేషన్ పదం ఉంటుంది కానీ రాజ్యాంగానికే ప్రమాదం వస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. రాజ్యాంగం - సామాజిక న్యాయం సవాళ్లు అనే అంశంపై ఎస్వీకేలో సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ రంగంలోనే రిజర్వేషన్ అమలు ఉందని, ప్రైవేట్ లో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్య..వైద్య రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించాలని పేర్కొన్నారు.

రాజ్యాంగాన్ని పూజిస్తారని..కానీ స్పూర్తి లేకుండా పోతుందన్నారు. సామాజిక న్యాయానికి మొట్టమొదట ప్రమాదం జరుగుతోందని, దేశ రక్షణ కోసం ఆయుధాల కొనుగోలు కోసం ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. ఇందుకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయని రాఘవులు ప్రశ్నించారు. 

సోమవారం న్యాయవాదుల నిరసన ర్యాలీలు..

గుంటూరు : కేంద్రం న్యాయవాదుల చట్ట సవరణ బిల్లు 2017 ను తీసుకరావడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆలిండియా లాయర్స్ యూనియన్స్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ వెల్లడించారు. విదేశీ న్యాయవాదులను దేశంలోకి అనుమతించవద్దని, కక్షి దారులను న్యాయవాదులపై ఉసిగొల్పేలా కేంద్రం చట్ట సవరణ చేస్తోందన్నారు. సోమవారం విజయవాడ, హైదరాబాద్, గుంటూరులో న్యాయవాదులతో కలిసి నిరసన ర్యాలీలు, సంతకాల సేకరణ చేయనున్నట్లు తెలిపారు. 

అనీల్ కుమార్ యాదవ్ కు మినహాయింపు..

నెల్లూరు : క్రికెట్ బెట్టింగ్ కేసు విచారణలో ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ కు మినహయింపు లభించింది. విచారణకు రావొద్దని జిల్లా పోలీసు కార్యాలయం నుండి ఫోన్ వచ్చింది. 

ఏఎస్పీ ఎదుట ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి...

నెల్లూరు : క్రికెట్ బెట్టింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఏఎస్పీ ఎదుట ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. శ్రీధర్ రెడ్డి బుకీలకు సహకరించారన్న ఆరోపణలపై విచారణ జరుగుతోంది. 

బీసీ పార్టీ కోసం ఆలోచన - ఆర్.కృష్ణయ్య...

గుంటూరు : బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. బీసీలకు అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నాయని, బీసీ హక్కుల సాధన కోసం బీసీ పార్టీ పెట్టేందుకు చర్చిస్తున్నట్లు ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. కాపులను బీసీల్లో ఏ విధంగా చేరుస్తారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

కిర్లంపూడిలో హైటెన్షన్..

తూర్పుగోదావరి : కిర్లంపూడిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బారికేడ్లను కాపులు తీసుకొని ముందుకు దూసుకొచ్చారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు - కాపులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆర్డీవో, డీఐజీలపై కాపులు తిరగబడ్డారు. దీనితో డీఐజీ కిందపడిపోయారు. కిర్లంపూడికి భారీగా కాపులు వస్తుండడంతో హెటెన్షన్ వాతావరణం నెలకొంది. 

పార్లమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ పర్యటన..

 

హైదరాబాద్ : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో పార్లమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ పర్యటించింది. నాయకన్ గూడెం వద్ద కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. వెలుగుమట్లలోని ఫారెస్టు భూములను స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రేణుకా చౌదరి పరిశీలించి మొక్కలు నాటారు.

 

 

వెలిసిన మావోయిస్టు పోస్టర్లు..

ఖమ్మం : చర్ల ఎంఈవో ఆఫీసు వద్ద మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. ప్రజా కోర్టుకు హాజరు కావాలని లేకపోతే శిక్ష తప్పదని హెచ్చరించారు. చర్ల మండలంలో పోలీసు క్యాంపులు ఎత్తివేయాలని చర్ల శబరి ఏరియా కమిటీ పేరిట పోస్టర్లు వెలిశాయి. 

13:36 - August 27, 2017
13:35 - August 27, 2017
13:33 - August 27, 2017
13:32 - August 27, 2017
13:30 - August 27, 2017
13:19 - August 27, 2017

కిర్లంపూడిలో కాపుల హల్ చల్

తూర్పుగోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో తీవ్ర ఉద్రక్తత నెలకొంది. కాపు నేతలు బారికెడ్లను తోసుకొచ్చారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు, కాపులకు మధ్య తోపులాట జరిగింది. కాపులకు సర్దిచెప్పేందకు ఆర్ డీవో, డీఐజీ ప్రయత్నం చేశారు. ఆర్ డీవో, డీఐజీలను కాపులు పక్కకు తోసేశారు. తోపులాటలో డీఐజీ కిందపడిపోయారు.

13:07 - August 27, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో తీవ్ర ఉద్రక్తత నెలకొంది. కాపు నేతలు బారికెడ్లను తోసుకొచ్చారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు, కాపులకు మధ్య తోపులాట జరిగింది. కాపులకు సర్దిచెప్పేందకు ఆర్ డీవో, డీఐజీ ప్రయత్నం చేశారు. ఆర్ డీవో, డీఐజీలను కాపులు పక్కకు తోసేశారు. తోపులాటలో డీఐజీ కిందపడిపోయారు. మరోవైపు కిర్లంపూడికి కాపులు భారీగా తరలివస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

కిర్లంపూడిలో ఉద్రిక్తత

తూర్పు గోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముద్రగడ తన ఇంటినుంచి పోలీసులను తోసుకుని ఛలో అమరావతి పాదయాత్రకు బయలుదేరారు. రాజుపాలెం వద్ద ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడ వెంట భారీ సంఖ్యలో కాపు నేతలు ఉండడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు మద్రుగడ మీడియాతో మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ కల్పించేవరకు ఉద్యమం ఆగదని అన్నారు.

విచారణకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే

నెల్లూరు : జిల్లాలో క్రికెట్ బుకీల కేసు విచారణ భాగంగా క్రికెట్ బుకీలకు సహరించారనే ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి విచారణకు హాజరైయ్యారు. 

12:44 - August 27, 2017

తూర్పు గోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముద్రగడ తన ఇంటినుంచి పోలీసులను తోసుకుని ఛలో అమరావతి పాదయాత్రకు బయలుదేరారు. రాజుపాలెం వద్ద ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడ వెంట భారీ సంఖ్యలో కాపు నేతలు ఉండడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు మద్రుగడ మీడియాతో మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ కల్పించేవరకు ఉద్యమం ఆగదని అన్నారు. రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:42 - August 27, 2017

నెల్లూరు : జిల్లాలో క్రికెట్ బుకీల కేసు విచారణ భాగంగా క్రికెట్ బుకీలకు సహరించారనే ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి విచారణకు హాజరైయ్యారు. ఏఎస్పీ శరత్ బాబు ఎదుట ఎమ్మెల్యే విచారణకు హాజరైయ్యారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

10:52 - August 27, 2017
10:51 - August 27, 2017

గోదావరిఖనిలో దారుణం

పెద్దపల్లి : జిల్లా గోదావరిఖని ఉదయ్ నగర్ లో దారుణం జరిగింది. పాత కక్షలతో ఆరుకోళ్ల శ్రీనివాస్ ను గుర్తితెలియని దుండగులు హత్య చేశారు. శ్రీనివాస్ పై కత్తులతో పదిమంది దుండగులు దాడి చేశారు. మృతుడు శ్రీనివాస్ పలు కేసుల్లో నింధితుడిగా ఉన్నాడు.

10:45 - August 27, 2017

పెద్దపల్లి : జిల్లా గోదావరిఖని ఉదయ్ నగర్ లో దారుణం జరిగింది. పాత కక్షలతో ఆరుకోళ్ల శ్రీనివాస్ ను గుర్తితెలియని దుండగులు హత్య చేశారు. శ్రీనివాస్ పై కత్తులతో పదిమంది దుండగులు దాడి చేశారు. మృతుడు శ్రీనివాస్ పలు కేసుల్లో నింధితుడిగా ఉన్నాడు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:20 - August 27, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో నువ్వానేనా అన్నట్టుగా తలపడిన టీడీపీ-వైసీపీలు ఇప్పుడు ఫలితాలపై దృష్టిపెట్టాయి. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపై జోరుగా లెక్కలు వేస్తున్నారు. నంద్యాల టౌన్‌లో తమకే మెజారిటీ అని టీడీపీ అంటుంటే.. రూరల్‌లో తమకు తిరుగేలేదని వైసీపీ ఢంకా భజాయిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలో ఎన్నడూ లేనంతగా పోలింగ్‌ శాతం పెరిగింది. 2014ఎన్నికల్లో 72.09శాతం పోలింగ్‌ నమోదవగా ఈసారి ఏకంగా 79.20శాతానికి పెరిగింది. అసలు 1952 నుంచి ఇప్పటి వరకు నంద్యాల నియోజకవర్గంలో 15 పర్యాయాలు ఎన్నికలు జరిగినా ఎన్నడూ ఇంత పెద్దస్థాయిలో ఓటింగ్‌ నమోదు కాలేదు.

పట్టణంలోనే 74.06శాతం పోలింగ్‌
నంద్యాల అసెంబ్లీ స్థానంలో మొత్తం 2లక్షల 18వేల858 మంది ఓటర్లు ఉంటే..వారిలో 1లక్షా 73వేల 335 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్క నంద్యాల టౌన్‌లోనే 1లక్షా 42వేల 628 ఓటర్లు ఉండగా .. 1లక్షా 5వేల 628 వేల ఓట్లు పోలయ్యాయి. వాటిలో 51వేల 410 ఓట్లు పురుషులవి కాగా.. 54వేల 410 మహిళా ఓట్లు ఉన్నాయి. ఒక్క నంద్యాల పట్టణంలోనే 74.06శాతం పోలింగ్‌ నమోదయింది. అయితే మొదటి నుంచి నంద్యాల టౌన్‌ ఓట్లపైనే నమ్మకం పెట్టుకున్న టీడీపీ.. పట్టణంలో భారీ పోలింగ్‌ తమకు లాభిస్తుందని చెబుతోంది. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోనే ప్రజలు భారీగా టీడీపీకి ఓట్లు వేశారని అంటున్నారు. ప్రధానంగా మెప్మా పొదుపుసంఘాల మహిళలకు బకాయిఉన్న పసుపు కుంకుమ నిధులు, వడ్డీమాఫీ నిధుల్లో భాగంగా ఒక్కొక్క మహిళ ఖాతాలో 10వేల రూపాయలు వేశారు. దాంతోపాటు కుట్టుమిషన్లు, ఇతర చేతివృత్తుల సామాగ్రి అందించారు. అందుకే నంద్యాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా టీడీపీకి ఓటేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

గ్రామీణ మండలాల్లో 87.61శాతం
అటు వైసీపీకూడా గెలుపుపై తమదైన అంచానాలు వేస్తోంది. ప్రధానంగా నంద్యాల టౌన్లో సగం సగం ఓట్లు వచ్చినా.. రూరల్‌ ఏరియాల్లో తమ పార్టీకి భారీగా ఓట్లు పోలయ్యాయని వైసీపీ నేతలు అంచానా వేస్తున్నారు. గోస్పాడు మండలంలో 90.81శాతం, నంద్యాల గ్రామీణ మండలాల్లో 87.61శాతం పోలింగ్‌ నమోదయింది. గోస్పాడు, నంద్యాల రూరల్‌ మండలాల్లోనే తమపార్టీకి 10వేలకు పైగా మెజారిటీ ఖాయం అంటున్నారు. భారీ పోలింగ్‌ తమకు లాభిస్తుందంటే ..కాదు తమకే కలిసి వస్తుందని టీడీపీ, వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి పోలింగ్‌పై ఎవరి అంచనాలు వారికి ఉండగా.. సోమవారం రానున్న ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

10:19 - August 27, 2017

శ్రీకాకుళం :  జిల్లాలో భారీ వర్షాలు హోరెత్తిపోతున్నాయి.. పాలకొండ మండలం ఒనిగడ్డ కాలువకు గండిపడింది.. వరదనీరు కాలనీల్లోకి ప్రవేశించింది.. గారంకాలనీ, పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌ నీట మునిగాయి.. వరదనీటితో జనాలు అవస్థలు అనుభవిస్తున్నారు.. బయటకువచ్చే పరిస్థితిలేక ఇబ్బందులు పడుతున్నారు.

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

సిద్దిపేట : జిల్లా కొండపాకలోని మెదక్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజీవ్ రహాదారిపై ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, మరోమ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించారు.

10:11 - August 27, 2017

 

సిద్దిపేట : జిల్లా కొండపాకలోని మెదక్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజీవ్ రహాదారిపై ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, మరోమ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:06 - August 27, 2017

రంగారెడ్డి : జిల్లా నాదర్ గుల్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో విషాదం నెలకొంది. పాఠశాలలోని మూడో అంతస్తులో ఆదర్స్ మృతి చెందాడు. స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమంటూ బాలుడి బంధువులు ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

స్నేహితుల ఆత్మహత్య

నల్లగొండ : జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు స్నేహితులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు త్రిపురారం మండలం బాబుసాయిపేటకు చెందిన చరణ్, నాగరాజుగా గుర్తించారు. ఇద్దరు ప్రాణ స్నేహితులని గ్రామస్తులు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:35 - August 27, 2017

నల్లగొండ : జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు స్నేహితులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు త్రిపురారం మండలం బాబుసాయిపేటకు చెందిన చరణ్, నాగరాజుగా గుర్తించారు. ఇద్దరు ప్రాణ స్నేహితులని గ్రామస్తులు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

08:47 - August 27, 2017
08:45 - August 27, 2017

పల్లెకెలె : చప్పగా సాగుతున్న శ్రీలంక-భారత్‌ వన్డే సిరీస్‌... రెండో వన్డే రసవత్తరంగా మార్చింది. భారత్‌కు పోటీ లేదనుకుంటున్న తరుణంలో శ్రీలంకలో ఒక యువ స్పిన్నర్‌ ధనుంజయ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తన బౌలింగ్‌ మాయాజాలంతో రెండో వన్డేలో శ్రీలంకను గెలుపు వరకు తీసుకువచ్చి... కోహ్లీ సేనకు గట్టి పోటీనిచ్చాడు. మ్యాచ్‌ ఓడిపోయినా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కించుకున్నాడు. ఇక ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్‌... ఇవాళ శ్రీలంకతో మూడో వన్డే ఆడనుంది. ఈ వన్డే కూడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది. అయితే.. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే శ్రీలంక చావోరేవో తేల్చుకోక తప్పదు. ఇక శ్రీలంక ఆశలన్నీ ధనుంజయపైనే ఉన్నాయి. ఇదిలావుంటే భారత్‌ బ్యాటింగ్‌లో ప్రయోగాలు చేయనుంది. ఇది శ్రీలంకకు కలిసివచ్చే అవకాశం ఉంది. రెండో వన్డేలోనూ మార్పులు చేర్పులు చేసిన టీమిండియా... ఈరోజు కేదార్‌జాదవ్‌, లోకేష్‌ రాహుల్‌లను ముందు వరుసలో బ్యాటింగ్‌కు దింపనుంది. విరాట్‌కోహ్లీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇక ఫిట్‌నెస్‌ సాధించిన హార్దిక్‌ పాండ్యా తుదిజట్టులోకి రానున్నాడు. పల్లెకెలెలో నేడు జరగనున్న మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో వన్డేలో సుమారు రెండు గంటల పాటు అంతరాయం కలిగించిన వరణుడు... మూడో వన్డేలోనూ వదిలేలా లేడు. ఈరోజు కూడా వర్షం పడే సూచనలు కనిపించడంతో.. మ్యాచ్‌ జరుగుతుందా ! లేదా అనే టెన్షన్‌ నెలకొంది. 

08:44 - August 27, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదులు పోలీస్‌ భవన సముదాయంలోకి చొరబడి దాడి చేశారు. కాల్పులు జరుపుతూ... గ్రనేడ్లు విసిరారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 8మంది జవాన్లు మృతిచెందారు. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లా పోలీస్‌ లైన్స్‌ బిల్డింగ్‌లో దాక్కున్న మరో ఉగ్రవాది కోసం ఆపరేషన్‌ కొనసాగుతోంది. పోలీస్‌ లైన్లో ఉన్న వారి కుటుంబాలను సురక్షితంగా బయటకు పంపినట్లు అధికారులు తెలిపారు.

 

08:43 - August 27, 2017

పాట్నా : ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిహార్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను మోదీ పరిశీలించారు. అనంతరం సీనియర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించిన మోది... బిహార్‌కు వెంటనే 500కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇటీవల బిహార్‌లో భారీ వరదల కారణంగా అనేక గ్రామాలు నీటమునిగాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటివరకు 400 మందికి పైగా ప్రజలు వరదల్లో మృతిచెందారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతులకు 2 లక్షలు, గాయపడ్డవారికి 50 వేల రూపాయల సహాయాన్ని ప్రకటించారు. 

08:41 - August 27, 2017

చంఢిఘర్ : గుర్మిత్‌ సింగ్‌ అనుచరుల వీరంగంపై హరియాణా-పంజాబ్‌ హైకోర్టు ఖట్టర్‌ సర్కార్‌ను తప్పుపట్టింది. కేవలం రాజకీయ లబ్ది కోసం హింసను రగిలించారని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రేప్‌ కేసులో దోషిగా తేలిన గుర్మిత్‌సింగ్‌ రామ్‌రహీమ్‌కు కోర్టు సోమవారం శిక్షను ఖరారు చేయనుంది. హర్యానాలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. మరోవైపు హర్యానా హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 36కి చేరింది. మృతి చెందిన వారంతా గుర్మీత్‌ అనుచరులేనని, వారంతా బయట నుంచి వచ్చిన వాళ్లేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

08:40 - August 27, 2017

విశాఖ : ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎర్రదండు కదిలింది. భారీ నిరసన.. ర్యాలీగా సాగింది. ప్రజా సంక్షేమానికి విరుద్ధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయని సీపీఎం నాయకులు అన్నారు. లక్షలాది మందికి అన్నం పెట్టే.. సంస్థలను బహుళజాతి సంస్థలకు కట్టబెడితే ఊరుకునేది లేదని... కార్మికోద్యమం... ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖపట్నం ప్రభుత్వ రంగ సంస్థల వల్లే అభివృద్ధి చెందిందని... అటువంటి సంస్థలను నేడు ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేసేందుకు యత్నిస్తుందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. పాలకులు... దళారులుగా వ్యవహరిస్తూ... ప్రభుత్వ కర్మాగారాలను, ఆస్తులను బహుళజాతి సంస్థలకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు.

సేవ్‌ పబ్లిక్‌ సెక్టార్‌ - సేవ్‌ విశాఖ
విశాఖలో డెగ్జింగ్‌ కార్పొరేషన్‌తో పాటుగా పోర్ట్‌లో పలు బెర్త్‌లను ... జింక్‌ పరిశ్రమను అమ్మేశారని ఇదంతా సామాన్యుడికి మేలు జరగడానికేనా అని ప్రశ్నించారు. విశాఖ, విజయవాడ, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లు అమ్మకాన్ని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్లే స్టీల్ ప్లాంట్‌ నష్టాల్లోకి వెళ్లిందని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ నరసింగరావు అన్నారు. ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వ రంగ సంస్థలే కీలకమని ఆయన అన్నారు. ప్రభుత్వాలు ప్రైవేటీకరణ జపం చేస్తున్నాయని విమర్శించారు. కాగా ప్రభుత్వ తీరుకు నిరసనగా విశాఖపట్నంలో... సెప్టెంబర్‌ 1 నుంచి సేవ్‌ పబ్లిక్‌ సెక్టార్‌ - సేవ్‌ విశాఖ పేరుతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

 

08:38 - August 27, 2017

రంగారెడ్డి :  జిల్లాలో మరోసారి అగ్రవర్ణాల దౌర్జన్యం బయటపడింది.. చాదర్‌గూడెం మండలం వీరన్నపేటలోని అగ్ర వర్ణాల యువకులు.. పెద్దెల్కపల్లిలోని దళితులపై దాడి చేశారు... మూడేళ్లక్రితం ఈ రెండు గ్రామాలకు చెందిన ప్రేమ జంట ఒక్కటైంది.. ఇద్దరి కులాలు వేరుకావడంతో గ్రామ పెద్దలు అగ్రహం వ్యక్తం చేశారు.. ఈ విషయం మనసులో పెట్టుకొని యువకుడిని అగ్ర కులాలవారు చితకబాదారు..... పైగా పోలీసులపై ఒత్తిడి చేసి దళితులపైనే కేసులు పెట్టేలా చేశారు.. ఈ విషయం తెలుసుకున్న కులవివక్ష పోరాట సమితి సభ్యులు బాధితుల్ని పరామర్శించారు.. దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

08:37 - August 27, 2017

హైదరాబాద్ : కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నా.. టీఆర్ఎస్‌ ప్రభుత్వం వినియోగించుకోవడంలేదని బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ విమర్శించారు. గత మూడేళ్లలో కేంద్రం నుంచి 65వేల కోట్లు ఇస్తే కేసీఆర్‌ సర్కార్‌ ఏంచేసిందని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాద్‌ లోని ఇంపీరియల్‌ గార్డెన్‌ జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పలువురు జాతీయ నాయకులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుందన్నారు. 

08:35 - August 27, 2017

సిద్దిపేట : ప్రాజెక్టులపై ఏర్పాటుచేసిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా సిద్ధిపేట జిల్లాలో కాళేశ్వరం కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది.. ఈ కార్యక్రమానికి వచ్చిన వేములఘాట్‌ గ్రామస్తులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. వారిని బలవంతంగా అరెస్ట్‌ చేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్కార్‌ తీరుపై మండిపడ్డారు. అరెస్ట్‌ చేసిన గ్రామస్తులను పోలీసులు రాజగోపాలపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.రైతుల అరెస్ట్‌ను నిరసిస్తూ TDP ధర్నా చేపట్టింది.. ప్రతాప్‌ రెడ్డి ఆధ్వర్యంలో రంగదాంపల్లి చౌరస్తా దగ్గర నిరసన చేపట్టారు.. ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు మాట్లాడుతుంటే మైక్‌ ఎలా కట్‌ చేస్తారని మండిపడ్డారు.. తమ సమస్యలను చెప్పకముందే నిర్వాసిత రైతుల్ని ఎలా అరెస్ట్‌ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. అరెస్ట్ చేసిన అన్నదాతల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 పెద్దసంఖ్యలోప్రజలు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలోకూడా కాళేశ్వరంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.. ప్రాజెక్టు నిర్మాణంపై రైతులు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు స్వీకరించేందుకు కేంద్రంనుంచి అధికారుల బృందంకూడా ఈ సమావేశానికి హాజరైంది.. పలువురు స్థానికులు, రైతులు తమ సమస్యలను ఈ సమావేశంలో వినిపించారు.. ఈ కార్యక్రమంలోపాల్గొన్న కాంగ్రెస్‌ నేతలు సమావేశ నిర్వహణ సరిగాలేదని ఆరోపించారు.. ఇది టీఆర్‌ఎస్‌ పార్టీ సభగా ఉందని నినాదాలు చేశారు.. వీరందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.జయశంకర్‌ భూపాలపల్లిలోనూ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.. ఈ కార్యక్రమానికి జిల్లాలోని 20 మండలాలనుంచి భారీగా ప్రజలు హాజరయ్యారు.. కాళేశ్వరం ప్రాజెక్టు గ్రామాలైన మహదేవ్‌పూర్‌, అన్నారం, మేడిగడ్డ గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో సమావేశానికి వచ్చారు.. ఎమ్మెల్యే పుట్ట మధు, జిల్లా కలెక్టర్‌ మురళి, జాయింట్‌ కలెక్టర్‌, పర్యావరణ అధికారుల ఆధ్వర్యంలో సమావేశం కొనసాగింది.. కాళేశ్వరం నిర్మాణంద్వారా వేలాదిమంది రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు.. అయితే 2013 భూసేకరణ చట్టంప్రకారం రైతులకు నష్టపరిహారం ఇచ్చాకే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని కాంగ్రెస్‌ నేత శ్రీధర్‌ బాబు డిమాండ్ చేశారు.రైతుల అభ్యంతరాలను పట్టించుకోని ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్నివర్గాల వారూ మద్దతు తెలిపారని ప్రకటించుకుంది. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే 15 జిల్లాల్లోనూ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

కాంగ్రెస్‌ విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం సాగిన ప్రజాభిప్రాయ సేకరణపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది.. ఇవి టీఆర్‌ఎస్‌ కార్యకర్తల బహిరంగ సమావేశాల్లా ఉన్నాయంటూ ఆక్షేపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం సాగిన ప్రజాభిప్రాయ సేకరణపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది.. ఇవి టీఆర్‌ఎస్‌ కార్యకర్తల బహిరంగ సమావేశాల్లా ఉన్నాయంటూ ఆక్షేపించింది.

 

08:31 - August 27, 2017

హైదరాబాద్ : ఇదీ భాగ్యనగరమేనా అన్నట్లుగా మారిపోయింది హైదరాబాద్‌. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ రూపు రేఖలు మారిపోయాయి. రోడ్లన్నీ చెరవులను తలపించాయి. ఎక్కడివారు అక్కడే వానలో చిక్కుకుపోయారు. పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. వాహనాలపై వెళ్లేవారు నానా ఇబ్బందులు పడ్డారు. బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలో పలు కాలనీలు నీట మునిగాయి. ద్వారకా నగర్‌, సాయిరాం నగర్‌, అక్షనగర్‌, సుద్ధాల గుంట కాలనీల్లో ఇండ్లలోని వారు ఇంకా బయటకు రావడానికి భయపడుతున్నారు. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపడటంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నాచారంలో పెద్ద ఎత్తున గుంతపడటంతో జనం ఆందోళన చెందుతున్నారు. కూకట్‌పల్లిలో భారీ వర్షానికి ధరణీనగర్‌ను కాలుష్యపు నురగ ముంచెత్తింది. అక్కడ ఉన్న పరికి చెరువు నుంచి భారీగా కాలుష్యపు నురగ వెలువడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్ని సార్లు అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నురగ నుంచి రక్షించాలంటూ ఆ ప్రాంతపు ప్రజలు అధికారులను కోరుతున్నారు.

మీటర్ల మేర ట్రాఫిక్ జామ్
రాత్రి కురిసిన వాన నీరు ఇంకా నిలిచి ఉండటంతో స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు అష్టకష్టాలు పడ్డారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో ప్రజలకు సహకరిస్తూ వాననీటిలో నిలబడే విధులు నిర్వహించారు ట్రాఫిక్ సిబ్బంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అన్ని శాఖల అధికారులతో GHMC కమిషనర్ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గ్రేటర్‌ పరిధిలో 395 ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి ఉంటే.. 370 ప్రాంతాల్లో ఆ నీటిని తొలగించినట్లు జనార్దన్‌రెడ్డి చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు. వర్షం వల్ల ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి..ఎలక్ట్రికల్‌, ఫైర్‌, వాటర్‌బోర్టు, పోలీసులు సిద్ధంగా ఉన్నారని జనార్దన్ రెడ్డి తెలిపారు. మరోవైపు నాలాల విస్తరణ సరిగా జరగడం లేదని స్థానికులు వాపోతున్నారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు ఉండటం వల్లే లోతట్టు ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు నాలాల విస్తరణపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

08:30 - August 27, 2017

తూర్పు గోదావరి : కాకినాడ మున్సిపల్‌ ఎన్నికను టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే టీడీపీ, వైసీపీ నేతలు రంగంలోకి ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఒకరోజు రోడ్‌షో చేపట్టిన బాబు... ఈరోజు కూడా ప్రచారం నిర్వహించనున్నారు. కాకినాడ అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. కాకినాడను ప్లాన్డ్‌ సిటీగా డెవలప్‌చేసి స్మార్ట్‌గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇక విపక్షంపై విరుచుకుపడ్డ చంద్రబాబు... వైసీపీకి ఓటు వేస్తే మురిగిపోయినట్లేనన్నారు. పులివెందుల మాదిరిగా కాకినాడను మార్చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అనేక వ్యూహాలు
అంతకుముందు నేతలతో భేటీ అయిన చంద్రబాబు... గెలుపు కోసం అనేక వ్యూహాలను సూచించారు. అంతేకాకుండా... ఈ ఎన్నికల్లో విజయం సాధించకపోతే... చెప్పే కుంటిసాకులు తాను విననని నేతలకు వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయబోతుంది. ఇదిలావుంటే... వైసీపీ కూడా టీడీపీకి దీటుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు ప్రచారం నిర్వహిస్తుండగా... ఎమ్మెల్యే రోజా కూడా రంగంలోకి దిగారు. ప్రచారంలో చంద్రబాబు అండ్‌ కో పై తీవ్రంగా విరుచుకుపడ్డారు స్మార్ట్‌ సిటీ పేరుతో అవినీతి తప్ప కాకినాడకు చేసిందేమీ లేదన్నారు. టీడీపీకి బుద్దిచెబుతూ ప్రజలంతా వైసీపీ అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.

నేడు జగన్ ప్రచారం
ఇక ఈరోజు ప్రచారానికి చివరిరోజు కావడంతో... ప్రచారం మరింత హీటెక్కబోతుంది. వైసీపీ అధినేత జగన్‌ కూడా ఈరోజు ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే నేతలంతా ఆయన ప్రచారం కోసం ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎన్నికల కోడ్‌ను ఇరుపార్టీలు దిక్కరిస్తున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాకుండా ఓటర్లను ప్రలోభాలకు కూడా గురి చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మొత్తానికి ఈ ఎన్నికను టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో... గెలుపు కోసం ఇరుపార్టీల నేతలు అనేక వ్యూహాలు రచిస్తున్నారు. మరి... ఓటరు మహాశయుడు ఎవరికి అధికారం కట్టబెడతాడో చూడాలంటే మరో రోజులు ఆగక తప్పదు. 

08:27 - August 27, 2017

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న భూ సర్వే విషయంలో పార్టీ నేతలను కీలకంగా మార్చేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలను అమలు చేయనున్నారు. రైతులతో ఏర్పాటయ్యే సంఘాల నుంచి పార్టీ భాగస్వామ్యాన్ని పెంచే విధంగా శాసనసభ్యులు వ్యవహరించాలని సూచించారు. సమగ్ర సర్వే కోసం రైతులతో దాదాపు మూడు నెలల పాటు శాసనసభ్యులు కలిసేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. శాసనసభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి దిశా నిర్దేశం చేశారు.

రైతు సంఘాలు ఏర్పాటు
తెలంగాణా భవన్‌లో జరిగిన పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ప్రభుత్వ కార్యాచరణను నేతలకు కేసీఆర్‌ వివరించారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 9వ తేదీ వరకు గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంతరం నాలుగు రోజుల పాటు మండల స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడంతో పాటు మండల సమాఖ్యల ఏర్పాటు చేయడం... అనంతరం.... జిల్లా కమిటీలను ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పార్టీ నేతలకు మెజార్టీ భాగస్వామ్యం కలిగేలా చూడాల్సిన బాధ్యత ఆయా ఎమ్మెల్యేలపైనే ముఖ్యమంత్రి ఉంచారు. జిల్లా కమిటీల ఎంపిక అనంతరం..... రాష్ట్ర కమిటీ ఎంపిక కానుంది. వివాదాలు లేని భూములను మొదటి క్యాటగిరీలోకి తీసుకుని అందుకు సంబంధించి సర్వే పూర్తి చేయాలని, రెండో విడత సర్వేలో వివాదాల్లో ఉన్న భూములపై పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకుందామన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్లు సమాచారం.
సిట్టింగ్‌లందరికీ టికెట్లు
వచ్చే ఎన్నికల్లో కూడా టిఆర్ ఎస్ దే విజయం అన్న ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని అయినా.... ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను సమర్దవంతంగా ప్రజల్లోకి తీసుకెళితే..... మిగితా విషయాలు తాను చూసుకుంటానన్న సిఎం భరోసా ఇచ్చారు. సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటానన్నారు ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులున్న నియోజకవర్గాల్లో ఐదారు నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులను పరిశీలిస్తే చాలన్న అభిప్రాయాన్ని కేసీఆర్‌ వ్యక్తం చేశారు.

08:06 - August 27, 2017

టీడీపీ గెలవడం అనేది ఖాయమని, మెజార్టీ ఎంత వస్తుందో చెప్పలేమని, వైసీపీ వారు ఎప్పుడు చంద్రబాబును విమర్శించేందుకే అని, సీఎం కాల్చిచంపమని అనే వ్యక్తి ఓట్లు అడిగే హక్కులేదనియ టీడీపీ నేత రామకృష్ణ అన్నారు.జగన్ సీఎం తిట్టింది హామీల గురించి అని 2014ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారని, టీడీపీ అసలు విషయం పక్కకుపెట్టుతారని వైసీపీ నేత రోశయ్య అన్నారు. ఎన్నికల ఫలితాలు పోటాపోటిలు ఉన్నట్టు తెలుస్తోందని, కానీ ఎమ్మెల్యేలను పార్టీలు మార్చడం, సీఎం రెండు రోజులు ప్రచారం చేశారని, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నంద్యాలకు వెళ్లి రోడ్డుపై వెళ్లోద్దని అనడం మంచిది కాదని సీపీఎం నేత బాబురావు అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

08:04 - August 27, 2017

 

మిరప పంట సాగు వివరించేందుకు మట్టిమనిషి కార్యక్రమానికి రైతు మధుబాబు గారు వచ్చారు. రైతులు మొదటగా మంచి విత్తనాలను ఎన్నుకోవాలని, దీంతో వ్యాధుల నుంచి మొక్కలు కాపాడుకోవాడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

Don't Miss