Activities calendar

28 August 2017

22:09 - August 28, 2017

అమెరికా : హరికేన్‌ హార్వే తుపాను ధాటికి అమెరికాలోని టెక్సాస్ విలవిలలాడింది. భారీ వర్షాలు, ఈదురు గాలులకు ఐదుగురు మృతి చెందారు. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. ఇళ్లు, ఆఫీసులు నీట మునిగాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అమెరికాలోని టెక్సాస్‌లో చక్రవాత తుపాను 'హార్వే' బీభత్సం సృష్టించింది. భారీ వర్షం కురియడంతో వరదలు సంభవించాయి. గంటకు 130 మైళ్ల వేగంతో వీచిన గాలుల కారణంగా  చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్లు, కార్యాలయాలు, కార్లు నీట మునిగాయి. హార్వే ధాటికి రాక్‌పోర్ట్‌ నగరంలోని కార్ల షోరూంలో 12 వాహనాలు దెబ్బతిన్నాయి. 

హార్వే ధాటికి హ్యూస్టన్‌లోని 60 లక్షల మంది ఇబ్బందులకు గురయ్యారు. ఫోర్ట్‌ బెండ్‌ కౌంటీలో 50 ఇళ్లు ధ్వంసమయ్యాయి.  కనీసం మూడు లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సహాయక కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్మీ రంగంలోకి దిగింది.

భారీ వర్షాలకు ఐదుగురు మృతి చెందినట్లు, 14 మంది గాయపడ్డట్లు సమాచారం. వరదల కారణంగా బ్రజోస్‌లో నదిలో నీటిమట్టం పెరిగడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. మూడు జైళ్ల నుంచి 4,500 మంది ఖైదీలను సురక్షిత ప్రాంతాల్లోని జైళ్లకు తరలించారు.

నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ రిపోర్టు ప్రకారం హూస్టన్‌, హారిస్‌కౌంటీలలో గత 24 గంటల్లో 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో వంద సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కానుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 2004లో హరికేన్‌ చార్లీ ఫ్లోరిడాలో తన ప్రతాపం చూపిన తరువాత, అమెరికాలో ఆ స్థాయిలో విరుచుకుపడింది హార్వేనే కావడం గమనార్హం. 

22:06 - August 28, 2017

మహబూబాబాద్ : ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్‌ ప్రీతి మీనా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు ఎంపీడీవో కార్యాలయంలో పెద్దవంగర మండలాల అభివృద్ధి పనుల పురోగతి సమీక్షించిన ఎర్రబెల్లి.... కలెక్టర్‌ పని తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అయితే... తాము అన్నీ పనులు సక్రమంగానే చేస్తున్నామని ప్రీతిమీనా సమాధానమిచ్చారు. దీంతో ఎర్రబెల్లి, కలెక్టర్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

 

22:03 - August 28, 2017

ఢిల్లీ : అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ కటకటాల పాలయ్యారు. రెండు కేసులకు సంబంధించి గుర్మీత్‌కు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు తీర్పు చెప్పింది.  తనను క్షమించాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. సిబిఐ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బాబా తరపు లాయర్లు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. తీర్పు నేపథ్యంలో హర్యానా, పంజాబ్‌, ఢిల్లీలో హై అలర్ట్‌ ప్రకటించారు.


ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ను ఆగస్టు 25న దోషిగా తేల్చిన  సీబీఐ కోర్టు-ఇవాళ శిక్షను ఖరారు చేసింది. గత వారం హర్యానాలో చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో రోహతక్‌లోని సునారియా జైలులోనే సిబిఐ కోర్టు విచారణ జరిపింది. ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో న్యాయమూర్తి అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత... రేప్ కేసులో దోషిగా తేలిన గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌కు న్యాయమూర్తి జగ్‌దీప్‌సింగ్‌ 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 65 వేల జరిమానా విధించారు.

తనకు పదేళ్ల శిక్ష పడగానే గుర్మీత్‌సింగ్‌ భోరున విలపించారు. గుర్మీత్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని... ఆయనకు తక్కువ శిక్ష విధించాలని గుర్మీత్‌సింగ్‌ తరపు లాయర్‌ న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. సిబిఐ మాత్రం 50 ఏళ్ల గుర్మీత్‌కు జీవిత ఖైదు విధించాలని వాదించింది.

శిక్ష ఖరారు కాగానే జైలులోనే గుర్మీత్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఆయనకు సెల్‌ కేటాయించి ఖైదీలకు ఇచ్చే తెల్లటి దుస్తులను అందజేస్తారు. సిబిఐ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ గుర్మీత్‌ తరపు లాయర్లు పంజాబ్‌-హరియాణా హైకోర్టును ఆశ్రయించే అవకాశముంది. తీర్పుపై స్టే కోరుతూ బెయిలు కోసం ప్రయత్నించవచ్చు.

తీర్పు నేప‌థ్యంలో హ‌ర్యానాలో  భారీగా బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. రోహతక్‌, సిర్సాలో ఆర్మీ భద్రతా చర్యలు చేపట్టింది. విధ్వంసానికి పాల్పడే వారిపై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి.  కోర్టు తీర్పు నేపథ్యంలో సిర్సాలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. డేరా బాబా అనుచరులు  రెండు వాహనాలను తగులబెట్టారు. 

15 ఏళ్ల క్రితం ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడ్డట్లు గుర్మీత్‌పై ఆరోప‌ణ‌లున్నాయి. ఈ కేసులో గత శుక్రవారం గుర్మీత్‌ను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు..  ఐపిసి 376, 506 సెక్షన్ల కింద ఇవాళ శిక్ష ఖ‌రారు చేసింది. గత శుక్రవారం పంజాబ్‌, హరియాణాల్లో గుర్మీత్‌ మద్దతుదారులు చేపట్టిన అల్లర్లు హింసాత్మకంగా మారి 38 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

21:59 - August 28, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సాల్లో మునిగి తేలాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బాణాసంచా కాల్చి, స్వీట్స్‌ పంచుకుని సంబరాలు జరుపుకున్నాయి. నంద్యాల ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు  టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు నంద్యాల గెలుపును టీడీపీ విజయంగా  భావిస్తే అది దిగజారుడు రాజకీయమే అవుతుందని వైసీపీ అధినేత జగన్‌ వ్యాఖ్యానించారు. 

నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఆనందోత్సాహంతో బాణాసంచా కాల్చి, స్వీట్స్‌ పంచుకున్నారు. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపుపై... సీఎం చంద్రబాబునాయుడు సంతోషం వ్యక్తం చేశారు.  అమరావతిలో మంత్రుల సమక్షంలో సీఎం కేక్‌ను కట్‌ చేసి అందరికీ తినిపించారు. 

నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ను డేరా బాబాతో పోల్చారు. నంద్యాలలో టీడీపీ విజయం  అభివృద్ధికి దోహదం చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ  చెప్పుకొచ్చారు. 

మరోవైపు నంద్యాలలో ఓటమిపై వైసీపీ అధినేత జగన్‌ స్పందించారు. టీడీపీ దౌర్జన్యంతో గెలిచిందన్నారు. నంద్యాల ప్రజలు చంద్రబాబుకు భయపడి టీడీపీకి ఓట్లేశారని వ్యాఖ్యానించారు. నంద్యాలలో టీడీపీ గెలుపుతో... కర్నూలు జిల్లాలో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. బాణాసంచా కాల్చి ర్యాలీలు నిర్వహించారు. మిఠాయిలు పంచారు. 

విజయవాడ లెనిన్ సెంటర్‌లో గుండుతో ఉన్న రోజా ఫ్లెక్సీలను పట్టుకుని.... టపాసులు పేలుస్తూ స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. గుంటూరులోని నేతలు, కార్యకర్తలు పరస్పరం అభినందించుకుని స్పీట్లు పంచుకున్నారు. 

బ్రహ్మానందరెడ్డి విజయంతో ఒంగోలులో ఆపార్టీ  నేతులు, కార్యకర్తలు ఆనందోత్సాహంతో సంబరాలు చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నంద్యాల విజయోత్సవం నిర్వహించారు. 

కడప జిల్లా పులివెందులలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి బస్టాండ్‌ వరకు  ఈ ర్యాలీ జరిగింది. నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ ద్వారా అభినందించారు. మొత్తం నంద్యాల ఉప ఎన్నిక ఫలితం టీడీపీలో ఆనందోత్సాహాలు నింపితే, వైపీసీలో అంతర్మథనానికి దారితీసింది. 

21:54 - August 28, 2017

వినాయక చవితి సందర్భంగా మానవి స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ వివరాలను వారిమాటల్లోనే.. 'పండుగ పేరుతో చందాల దందాలు. వీధికి నాలుగు వి(నా)యకుల విగ్రహాలు. విగ్రహాల ఎత్తులో పోటీలు, భక్తి పేరుతో బేజారెత్తించే వాతావరణం. ప్రకృతి సిద్ధమైన పత్రాల పండుగతో రసాయన వినియోగాలు. ఇవేనా పండుగలంటే.? మనుష్యులను, మనసులను దగ్గర చేసే పండగలనే చేసుకుందాం. అసహజ వాతావరణంలో ఆర్టిఫిషియల్ పండగలను నిషేదిద్దామని' అని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:14 - August 28, 2017

నేరం రుజువయ్యింది. శిక్ష ఫైనలయ్యింది. గుర్మిత్ బాబా కేసులో రిజల్ట్ ఇది. గతంలో ఆశారాం బాపు, నిత్యానందులా ఈ బాబా కూడా జైలు రుచి చూడబోతున్నారు. ప్రజల బలహీనతలు, భక్తిని అడ్డుపెట్టుకుని ఎలా నేర సామ్రాజ్యాలను స్థాపిస్తున్నారు. వీటికి కారణాలేంటీ..? కారకులెవరు..? ఇప్పుడు జరగాల్సిన చర్చ ఇదే.. ఈ అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:04 - August 28, 2017

నంద్యాల కాడా ఫ్యాన్ నట్లు లూజు...జనం దుల్పిండ్రు సర్వేల బూజు, కాకినాడకు తరలిన పార్టీ జెండాలు..తిట్టుకోకుండ్రిరా వారి మీకు దండాలు, సిరిసిల్ల కాడ కాయిదానికి ఐదొందలు... బాజాప్త లంచాలు తీస్కుంటున్నరు, గణపతిని గావర వెట్టిన పోరగాళ్లు...ర్యాలీల లాఠీచార్జీ జేసిన పోలీసోళ్లు, ముఖ్యమంత్రి మీద మళ్లొక సినిమా... దేవుని సినిమాల రాక్షసులేరన్నా, కుక్కకాటుకు చెప్పుదెబ్బ... వెన్నునొప్పికి సుత్తెదెబ్బ.... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

20:54 - August 28, 2017

నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు..అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమం వైసీపీ నేత కొండ రాఘవరెడ్డి, టీడీపీ నేత దినకర్, సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు ఎం.ఏ గఫూర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కొన్ని డిమాండ్లకు నవీన్ మిట్టల్ అంగీకారం

హైదరాబాద్ : మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలో మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ చర్చలు ముగిశాయి. కొన్ని డిమాండ్లకు నవీన్ మిట్టల్ అంగీకరించారు. మరికొన్ని సమస్యలపై ఏడో తేదీలోపు చర్చిస్తామని నవీన్ మిట్టల్...మున్సిపల్ కార్మిక సంఘాలు పరస్పరం అంగీకారం చేసుకున్నాయి. మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. 

 

దళితులను గ్రామ బహిష్కరణ చేసిన అగ్రవర్ణాలు

నెల్లూరు : ఏఎన్ పేట మండలం కుప్పూరుపాడులో అగ్రవర్ణాల దురంభహకారం బయటపడింది. అగ్రవర్ణాలు దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. నిన్న వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. గణేష్ విగ్రహాలను తమ ఇళ్ల ముందు నుంచి తీసుకొచ్చిన దళితులను అగ్రవర్ణాలు అడ్డుకున్నారు. దుకాణాల్లో నిత్యావసర వస్తువులు ఇవ్వకుండా, తాగునీరు అందకుండా అగ్రవర్ణాలు ఇబ్బంది పెడుతున్నారు. దళితులు పోలీసులను ఆశ్రయించారు. 

గుర్మిత్ రామ్ రహీంకు 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు

హర్యానా : డేరా సచ్ఛా సౌధా చీఫ్, వివాదాస్పద గురువు గుర్మిత్ రామ్ రహీంకు 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. 2002లో ఇద్దరు శిష్యురాళ్లపై రామ్ రహీం లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2 కేసులకు గానూ ఒక్కో కేసులో పదేళ్ల చొప్పున జైలు శిక్ష ఖరారు చేశారు. రామ్ రహీం మొత్తం 20ఏళ్ల పాటు జైలు జీవితం   గడపనున్నాడు. వ పదేళ్ల శిక్ష పూర్తైన వెంటనే మరో పదేళ్ల శిక్ష ప్రారంభం కానుంది. 2 కేసుల్లో రూ.15 లక్షల చొప్పున రామ్ రహీంకు జరిమానా విధించారు. ఇద్దరు బాధిత మహిళలకు చెరో రూ.14 లక్షల పరిహారం.

20:13 - August 28, 2017

పనాజీ : గోవాలో రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో బిజెపి విజయం సాధించింది. ముఖ్యమంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ ప‌నాజీ ఉప ఎన్నిక‌ల్లో గెలుపొందారు.  4803 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గిరిష్ చొద‌న్కర్‌ను పారీకర్‌ ఓడించారు. చొద‌న్కర్ కు 5059 ఓట్లు రాగా.. పారీకర్‌కు 9862 ఓట్లు వ‌చ్చాయి.  అసెంబ్లీకి ఎన్నిక కావడంతో వచ్చేవారం రాజ్యస‌భ సభ్యత్వానికి  రాజీనామా చేయ‌నున్నట్లు గోవా సిఎం మనోహర్‌ పారీకర్‌ ప్రకటించారు. వాల్పోయ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి విశ్వజిత్‌ రాణె తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి రాయ్‌నాయక్‌పై 10 వేల 66 ఓట్లతో విజయం సాధించారు. రాణె కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఇటీవల బిజెపిలో చేరారు.

20:12 - August 28, 2017

ఢిల్లీ : ఉప ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. బవానాలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించడం ద్వారా ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఊరట లభించింది. ఆప్‌ అభ్యర్థి రామచంద్ర 24 వేల ఓట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థి వేదప్రకాష్‌ను ఓడించారు.  ఈ ఎన్నికల్లో విజయంపై ఆశలు పెట్టుకున్న బిజెపికి పరాజయం తప్పలేదు. కాంగ్రెస్‌ మూడో స్థానంతో సరిపుచ్చుకుంది.

20:11 - August 28, 2017

కర్నూలు : నంద్యాలలో వార్‌ వన్‌ సైడ్‌ అయిపోయింది... వైసీపీ అధినేత జగన్‌కు నంద్యాల ఓటర్లు షాక్ ఇచ్చారు... మెజారిటీ ఓటర్లు సైకిల్‌కే జై కొట్టారు... నియోజకవర్గంలో తిష్టవేసి జగన్‌ ఎంతగా ప్రచారం చేసినా.... సైకిల్‌ జోరుకు ఫ్యాన్‌ గాలి తేలిపోయింది....  తాజా ఓటమితో వైసీపీ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు..

నంద్యాలలో గెలుపు ఉత్సాహంతో సార్వత్రిక ఎన్నిలకు వెళ్లాలన్న వైసీపీకి ఆశలు అడియాసలయ్యాయి.... సైకిల్‌ స్పీడ్‌కు ఫ్యాన్‌ రెక్కలూడాయి. ఉత్కంఠరేపిన ఉప ఎన్నికలో ఫలితం టీడీపీకే విజయాన్ని చేకూర్చింది. ఏ ఒక్క రౌండ్‌లోనూ అధిక్యంలో నిలవని శిల్పా మోహన్‌ రెడ్డి ... నంద్యాలలో ఓటమిపాలయ్యారు.. తొలి రౌండ్‌ నుంచే మొదలైన టీడీపీ ఆధిక్యం.. అప్రతిహతంగా సాగింది. 

కనీసం గెలవకపోయినా.... గట్టి పోటీఅయినా ఇస్తామనుకున్న వైసీపీ నేతలకు నంద్యాల ఫలితం నిరాశలో ముంచింది...  నంద్యాలలోనే జగన్‌ 13రోజులు మకాంవేసినా పార్టీని గెలుపువైపు నడిపించలేకపోయారు... ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదంటూ జగన్‌ పదే పదే ప్రచారం చేసినా నంద్యాలవాసులు పెద్దగా పట్టించుకోలేదు.. ఇక రోజా ప్రచారమూ మహిళా ఓట్లను ఆకట్టుకోలేకపోయింది.. పల్లెలు, పట్టణాలు అన్న తేడాలేకుండా పెద్దసంఖ్యలో ఓటర్లు సైకిల్‌కు  జై కొట్టారు.. పట్టణం కాకపోయినా కనీసం పల్లెల ఓటర్లయినా తమను ఆదరిస్తారని భావించిన వైసీపీకి తాజా ఓటమి పెద్ద షాక్‌నిచ్చింది. 

వైసీపీ ఈ స్థాయి ఓటమికి చాలా కారణాలున్నాయని పార్టీలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి... ప్రధానంగా జగన్‌ నోటి దురుసు ఎక్కువ ప్రభావం చూపిందన్న విమర్శలున్నాయి..  చంద్రబాబును ఉరితీయాలంటూ చేసిన కామెంట్స్‌  వివాదాస్పదమయ్యాయి..  

ఎంత ప్రతిపక్ష నేతైనా  ఇలా సీఎంను ఉరితీయాలంటూ మాట్లాడటం సరికాదని చాలా మంది సూచించారు.. పైగా టీడీపీ వైఫల్యాలను ఎత్తిచూపిన జగన్‌..... తాము విజేతగా నిలిస్తే  ఏం చేస్తామన్నదానిపై పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు... చంద్రబాబును తిట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లుగా జగన్‌ ప్రచారం సాగడం ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది.. జగన్‌ ఇచ్చిన హామీలపై జనాలనుంచి అంతా స్పందన రాలేదు..  వాటిని ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదని ఈ ఓటమి చెప్పకనే చెప్పింది.. 

అటు రోజా ప్రచారం వైసీపీకి మైనస్‌ అయింది...... అఖిల ప్రియ వస్త్రధారణ, తండ్రి కర్మ కార్యక్రమాలు పూర్తికాకముందే అసెంబ్లీ వెళ్లారంటూ చేశారంటూ చేసిన కామెంట్స్‌ పార్టీకి నష్టం చేకూర్చాయి... తల్లి, తండ్రి కోల్పోయిన తమను దారుణంగా అవమానిస్తున్నారన్న అఖిలప్రియ ఆవేదనవైపే ఓటర్లు మొగ్గుచూపారు.. బాలకృష్ణకు పోటీగా రోజా బరిలోకిదిగినా  బాలయ్య వైపే ఓటర్లు నిలిచారు... మరోవైపు కనీసం గ్రామీణ ప్రాంతాల్లో అయినా తమకు ఎక్కువ ఓట్లు పడతాయని వైసీపీ భావించింది... అక్కడా వారికి   ఆశాజనకంగా ఫలితం రాలేదు.. యువత, మహిళలు, వృద్ధులు అంతా చంద్రబాబువైపే మొగ్గుచూపారు.. మైనారిటీలపై జగన్‌ పార్టీ పెట్టుకున్న నమ్మకం కూడా వమ్మయింది. పైగా ఇక్కడ నంద్యాల మాజీ ఎమ్మెల్యే ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఎమ్మెల్సీతో పాటు.. మండలి చైర్మన్‌ పదవి ఇస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ మైనారిటీల్లో బాగా ప్రభావం చూపిందంటున్నారు. చంద్రబాబు వ్యూహాలకు ఫిదా అయిన మైనారిటీలు టీడీపీకి ఏకపక్షంగా ఓటేసినట్లు తెలుస్తోంది. 

ప్రచారంలో టీడీపీ బృందం చూపిన స్పీడ్‌ను వైసీపీ అందుకోలేకపోయింది.. ఈ స్థాయిలో ప్రచారంచేసేవారులేకపోవడం వైసీపీకి మైనస్‌గా మారింది.. ఒక్క జగన్‌.... ఆ తర్వాత రోజా తప్ప పార్టీలో ఆ స్థాయిలో ప్రచారం చేసేవారు లేకపోవడంవల్ల ఇబ్బందులు తప్పలేదు.. అన్నీతానై జగన్‌ వ్యవహరించినా.... ఆయన మాటను నంద్యాలవాసులు నమ్మలేదు.. పైగా పార్టీ అభ్యర్థి శిల్పా మోహనరెడ్డిని ప్రచారం జరిగినన్ని రోజులూ తన వెంటే తిప్పుకోవడం ద్వారా.. ఆయనకు స్థానిక వ్యూహాలు రచించే అవకాశం జగన్‌ ఇవ్వలేదన్న భావనా వ్యక్తమవుతోంది. శిల్పామోహనరెడ్డి,  అడపాదడపా కుల సంఘాలతో సమావేశమై వారి ఓట్లను పొందే ప్రయత్నం చేసినా.. అనంతపురం జిల్లాకు చెందిన కాల్వ శ్రీనివాసులు, కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తదితరులను మోహరించడం ద్వారా.. టీడీపీ ఆయా కులాలు, నేతల బంధువుల ఓట్లను కూడా భారీగానే పొందగలిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

ఇక వైసీపీకి ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలు దారుణంగా బెడిసికొట్టాయి... .. పీకే సర్వేలు.... ప్రజల నాడిని పట్టుకోలేకపోయాయి.. పీకే ప్లానింగ్‌లు ఎక్కడా  ప్రభావం చూపలేకపోయాయి... ప్రస్తుత ఓటమికి ఎన్ని కారణాలున్నా ఈ స్థాయిలో పరాజయం పాలవడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు..  నంద్యాలలో వెనకబడటానికి కారణాలను విశ్లేషిస్తున్నారు.. మొత్తానికి, నంద్యాల ఉప ఎన్నికలో  గెలుపు ద్వారా.. చంద్రబాబుతో పాటు, టీడీపీ శ్రేణుల స్థైర్యాన్నీ దెబ్బతీసి.. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న వైసీపీ అధినాయకత్వం ఆశలు దారుణంగా వమ్మయ్యాయనడంలో సందేహం లేదు. 

20:01 - August 28, 2017

విశాఖ : నగర పరిధిలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తిన్నింటి వాసాలే లెక్కెట్టారు జీవీఎంసీ ఉద్యోగులు. పేదలకు రావాల్సిన ఇళ్లను బినామీ పేర్లతో ఇతరులకు అమ్మేశాడో ఘనుడు. ఓ బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు తీగ లాగగా డోంకంతా కదిలింది. ఏకంగా 33మంది దళారులపై కేసు నమోదు చేసి 13 మందిని అరెస్ట్‌ చేశారు. 
నకిలీ డాక్యుమెంట్లతో అమ్మిన దళారులు
గాజువాక నియోజక వర్గంలోని మధీనబాగ్‌లో 2006 సంవత్సరంలో 2048 జెఎన్ ఎన్ యుఆర్ ఎమ్ భవనాలను అప్పటి ప్రభుత్వం నిర్మించింది. వాటికోసం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకున్న 1248 మందికి ఇళ్లు మంజూరు చెయ్యగా, 780 ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో కొన్ని ఇళ్లను హుద్ హుద్ తుఫానులో నష్టపోయిన వారికి కేటాయించారు.. మిగిలిన వాటిపై అక్రమార్కుల కన్ను పడింది. గతంలో జీవీఎంసీ యూడిసీ విభాగంలో పనిచేసిన ఏపిడి అధికారి మోహన్ రావు అక్రమాలకు స్కేచ్ వేశాడు. ఖాళీగా ఉన్న 363 ఇళ్లకు ఫోర్జరీ డాక్యుమెంట్ల సృష్టించి దళారుల సాయంతో అమ్మేశారు. ఒక్కో ఇంటికోసం లక్ష రూపాయాల వరకు వసూలు చేశాడు. జెఎన్ ఎన్ యుఆర్ ఎమ్ నిజమైన లబ్ధిదారుడు తన ప్లాట్ లోకి వెళ్ళి చూడగా ఇంకొక వ్యక్తి నివసించడం చూసి జీవీఎంసీ హౌసింగ్ కార్పోరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసాడు. దీంతో ఈ భారీ కుంభకోణం బయటపడింది.
అక్రమాలు జరిగాయని ప్రాథమిక నిర్ధారణ 
బాధితుడి ఫిర్యాదు అందుకున్న జీవీఎంసీ అధికారులు జెఎన్ ఎన్ యుఆర్ ఎమ్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించగా ఖంగుతున్నారు. అక్రమాలు జరిగాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన  జీవీఎంసీ ఉన్నత అధికారులు గాజువాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కొంతమంది ఉన్నతాధికారుల్ని అడ్డం పెట్టుకోని అనధికార వ్యక్తులకు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కోట్ల రూపాయల్ని దండుకున్నారని పోలీసులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న ఇద్దరు మహిళ నేతలతో పాటుగా కొందరు మీడియా ప్రముఖులు కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణ అనంతరం ప్రధాన నిందితుడు మోహనరావుతో పాటుగా జీవీఎంసీలోని ఇద్దరు ఉద్యోగులను మరియు పదమూడు మంది దళారులను అరెస్ట్ చేసారు.. మోహనరావు అరెస్టు విషయం తెలుసుకున్న మిగతా నిందితులు పరారయ్యారు. ముఖ్యంగా ఇందులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు మహిళల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

 

19:59 - August 28, 2017

కర్నూలు : నంద్యాలలో పచ్చజెండా రెపరెపలాడింది.  ఉప ఎన్నిక ఫలితాల్లో టీడీపీ విజయ దుందుభి మోగించింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగిన రసవత్తర పోరులో చివరకు టీడీపీ అభ్యర్థికే ప్రజలు పట్టంకట్టారు. తొలి రౌండ్‌ నుంచి అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి భారీ ఆధిక్యంతో దూసుకెళ్లి విజయ బావుటా ఎగురవేశారు. 

నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల్లో సైకిల్‌ పార్టీ హవా కొనసాగింది. 2019 ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించిన ఈ ఎన్నికలో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తన ప్రత్యర్థి,  వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై 27,466 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీకి 97,076 ఓట్లు రాగా.. ప్రతిపక్ష వైసీపీకి 69,610 ఓట్లు వచ్చాయి. ఇక కౌంటింగ్‌లో తొలిరౌండ్‌ నుంచి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఆధిక్యం కనబరిచారు. 19 రౌండ్ల కౌంటింగ్ జరిగితే 16వ రౌండ్‌ మినహా..సైకిల్ జోరు ముందు వైసీపీ నిలవలేక పోయింది. నంద్యాల రూరల్‌, అర్బన్‌లే కాదు.. తమకు గట్టి పట్టుందని వైసీపీ భావించిన గోస్పాడు మండలంలోనూ సైకిల్‌ జోరుకు అడ్డులేకుండా పోయింది. 

నంద్యాల గెలుపును భూమా నాగిరెడ్డి గెలుపుగా టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అభివర్ణించారు. ప్రజలు అభివృద్ధికి ఓటేశారని...వారు తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సేవ చేస్తానన్నారు. 

నంద్యాల ఉప ఎన్నికలో ప్రజాతీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి. ఈ ఎన్నికలో టీడీపీ డబ్బుప్రవాహం, సానుభూతి ప్రభావం చూపించిందన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో సైకిల్‌ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఒక్క నంద్యాలలోనే కాదు.. తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ తెలుగుదేశం కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. 

19:50 - August 28, 2017

కర్నూలు : నంద్యాలలో ఏకపక్ష తీర్పు ఇచ్చారని టీడీపీ నేత నిమ్మల కిష్టప్ప అన్నారు. ఇప్పటికైనా జగన్‌ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. 2019లో ప్రతిపక్షం ఉండదని స్పష్టం చేశారు. జగన్‌ చేసే కుటిల రాజకీయాలు ప్రజలకు తెలుసని... అందుకే ఆలోచించి సరైన తీర్పు ఇచ్చారని ఢిల్లీలో చెప్పారు.

 

19:38 - August 28, 2017

వరంగల్ : తమ డిమాండ్ల పరిష్కారం కోసం వరంగల్‌లో కేజీబీవీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తమ డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నారు. గతంలో తమ డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌.. ఇంతవరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కేజీబీవీ ఉద్యోగులంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:37 - August 28, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌శాఖ ఇంజనీర్లు హైదరాబాద్‌లో మహాధర్నా చేపట్టారు. విద్యుత్‌సౌదాలో వందలాది మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి నినాదాలు చేపట్టారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థలో ఉద్యోగుల విభజన తక్షణమే చేపట్టాని డిమాండ్‌ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:35 - August 28, 2017

హైదరాబాద్ : విద్యుత్‌ రంగం ప్రైవేటీకరణకు కేంద్రం ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. బషీర్‌బాగ్‌ విద్యుత్‌ ఉద్యమం 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా..విద్యుత్‌ అమరవీరుల స్థూపం వద్ద వామపక్ష నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ విద్యుత్‌ రంగంలో మళ్లీ సంస్కరణలు తెచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. నాటి విద్యుత్‌ పోరాటవీరుల బలిదానాల కారణంగానే, నేటి పాలకులు విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వెనకడుగు వేస్తున్నారని చెప్పారు. పోరాటాలతో పాలకుల యత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

 

19:30 - August 28, 2017

ఆదిలాబాద్ : హ్యాట్రిక్ వీరుడు జోగు రామన్నకు ఆదిలాబాద్ లో ఈసారి గెలుపు అంత ఈజీ కాకపోవచ్చు. 2019లో గెలుపు కోసం ఆయన తీవ్రంగానే శ్రమించాల్సి వుంటుంది. ఓ వైపు కాంగ్రెస్ , మరో వైపు బిజెపి ఆయన కు  గట్టి సవాలు విసురుతున్నాయి.  ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జోగు రామన్నకున్న ప్లస్ పాయింట్లేమిటి? మైనస్ పాయింట్లేమిటి? నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేయబోతున్న అంశాలేమిటి? ఇదే ఇవాళ్టి ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్.

సిట్టింగ్ లు ఓడిపోవడం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం చరిత్ర. గతకాలపు చరిత్రను తిరగరాసిన ఖ్యాతి జోగు రామన్నది. ఆయన వరుసగా మూడుసార్లు ఆదిలాబాద్ నుంచి విజయం సాధించి, సిట్టింగ్ లు గెలవరన్న అభిప్రాయాన్ని తుడిచేశారు. 2009 సాధారణ ఎన్నికల్లోనూ, 2012 ఉప ఎన్నికల్లోనూ, 2014 సాధారణ ఎన్నికల్లోనూ జోగు రామన్ననే విజయం సాధించింది. తెలంగాణ సెంటిమెంట్, ప్రత్యర్థి పార్టీల బలహీనతలు 2014లో ఆయనకు కలిసొచ్చిన అంశాలు.

ఆదిలాబాద్ నియోజకవర్గంలో గట్టి పట్టున్న సి. రాంచందర్ రెడ్డికి కాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యువనేత బార్గవ్ దేశ్ పాండే కి టిక్కెట్టిచ్చింది. ఇది జోగురామన్నకు ఆయాచిత వరంగా మారింది. కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకోగా,  బిజెపి అభ్యర్థి పాయల శంకర్ రెండో స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచారు. 

గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం కనిపించగా, ఈసారి ఎమ్మెల్యే పనితీరే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం వుంది. జోగురామన్న పనితీరు పై సొంత పార్టీలోనే అసంతృప్తి కనిపిస్తోంది. నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న అసంతృప్తి జనంలో వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఘోరంగా దెబ్బతిన్న రోడ్లను బాగు చేయించడంలో జోగురామన్న విఫలమయ్యారన్నది జనాభిప్రాయం. ఆయనను ఇబ్బందిపెడుతున్న మరో అంశం ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు. 

ఆదిలాబాద్ నియోజకవర్గంలో సేద్యానికి  సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు కీలకం. వీటికి నిధులు మంజూరైనా పనులు సాగకపోవడంతో ఎమ్మెల్యే వైపే జనం వేళ్లెత్తి చూపిస్తున్నారు. మత్తడివాగు కాల్వల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. కాలువలు దెబ్బతినడంతో సాగు తగ్గిపోతోంది.

ఆదిలాబాద్ నియోజకవర్గపు సుదీర్ఘ స్వప్నం పెన్ గంగా ప్రాజెక్టు. ఇది పూర్తయితే మూడు మండలాలకు సాగు నీరు అందుతుంది. 65వేల ఎకరాలకు పుష్కలంగా నీళ్లొస్తాయి. 5 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించాల్సిన పెన్ గంగా ప్రాజెక్టును రెండు టిఎంసిల బ్యారేజీ గా మార్చడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నయి.

ఆదిలాబాద్ నియోజకవర్గంలోని సిమెంట్ ఫ్యాక్టరీ, స్పిన్నింగ్ మిల్లు మూతపడడం జోగురామన్నకు మరో మైనస్ పాయింట్. ఇవి మూతపడడంతో ఎనిమిది వేల మంది రోడ్డున పడ్డారు. వీటిని తెరిపించేందుకు చాలాసార్లు ఢిల్లీ వెళ్లిన్నట్టు ఎమ్మెల్యే జోరురామన్న చెబుతున్నా ఫలితం లేదు. 

జిల్లాకు వచ్చిన టెక్స్ టై ల్ పార్క్, ట్రైబల్ యూనివర్సిటీలను కాపాడాలేకపోయారన్న విమర్శలను కూడా జోగురామన్న ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే జోగురామన్నను ధీటుగా ఎదుర్కోగలమన్న ధీమా లో వున్నారు కాంగ్రెస్ బిజెపి నేతలు.

రాబోయే ఎన్నికల్లో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ రసవత్తరంగా సాగే అవకాశం వుంది. జైనథ్, బేల, ఆదిలాబాద్ ఈ మూడు మండలాలున్న నియోజకవర్గం ఓటర్ల సంఖ్య 2 లక్షల 15 వేల 236 మంది. ఈ నియోజకవర్గంలో పురుష ఓటర్ల సంఖ్య కాస్త ఎక్కువ. లక్షా 9 వేల 367 మంది పురుష ఓటర్లుండగా, లక్షా 5వేల 856 మంది మహిళా ఓటర్లున్నారు. 

ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 30శాతం మంది బీసీలు. 20శాతం మంది వున్న ఎస్టీలు అభ్యర్థుల గెలుపు ఓటమిలలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎస్సీ లు 17శాతం మంది వుండగా, మైనార్టీలు మరో 17శాతం మంది వుండడం విశేషం. 

19:23 - August 28, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలుపును విజయంగా భావిస్తే అది దిగజారుడు రాజకీయం అవుతుందని ప్రతిపక్ష నేత జగన్‌ వ్యాఖ్యానించారు. నంద్యాలలో పార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి ఓటమిపై జగన్‌ స్పందిచారు. ప్రజలు భయపడి టీడీపీకి ఓటేశారన్నారు. టీడీపీకి ఓటేయకపోతే పెన్షన్లు ఇవ్వమని, ఇళ్లు రావని బెదరించడంతోనే టీడీపీకి అనుకూలంగా ఓటేశారని చెప్పారు. ఎన్నికల్లో చంద్రబాబు కొట్టిన దెబ్బను స్వీకరిస్తున్నామని, సమయం వచ్చినప్పుడు తామూ కొడతామంటున్నారు. నంద్యాల ఉప ఎన్నిక రిఫరెండం కాదని చెప్పారు. 21 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తే రిఫరెండంగా భావిస్తామని తెలిపారు. టీడీపీలో చేరిన 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని పేర్కొన్నారు. 

 

19:14 - August 28, 2017

గుంటూరు : వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత జగన్‌ను డేరా బాబాతో పోల్చారు. ఆయన డేరా బాబా...ఇక్కడ జగన్ బాబా అని ఎద్దేవా చేశారు. ఈమేరకు చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో జగన్ మాటలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు. జగన్ విమర్శలు శృతిమించాయని మండిపడ్డారు. ఏదో చేస్తానని జగన్ అభాసుపాలయ్యాడు తెలిపారు. జగన్‌.. రాష్ట్రానికి నష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్‌ ప్రవర్తన అసభ్యకరంగా ఉంటోందని తెలిపారు. అసెంబ్లీలో విద్వేషాలను రెచ్చగొట్టారని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. నంద్యాల ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారని పేర్కొన్నారు. నంద్యాలలో టీడీపీ గెలుపు చారిత్రక విజయమని అన్నారు. తాను గెలుపును ముందే ఊహించానని తెలిపారు. తమ పనితీరే టిడిపిని గెలిపించిందని తెలిపారు. ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యత ఉండదన్నారు. మంచి ఎన్నికలను ఎదుర్కొవడం తనకు మొదటి సారి కాదన్నారు. నడవడికను బట్టే విశ్వసనీయత వస్తుందని వ్యాఖ్యానించారు. బాబా రూపంలో ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి దుర్మార్గానికి డేరా బాబా ఒడిగట్టిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.

మా పని తీరే టీడీపీని గెలిపించింది : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : తమ పని తీరే టీడీపీని గెలిపించిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలను ఎదుర్కొవడం తనకు మొదటిసారి కాదన్నారు. ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యత ఉండదని స్పష్టం చేశారు. ఏదో చేస్తానని జగన్ అభాసుపాలయ్యాడని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు. 

 

18:59 - August 28, 2017

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కుల దురంహాకార హత్యలు, దళితులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని డీఎస్ ఎమ్ ఎమ్ నాయకులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు రోజుల పాటు సాగిన దళిత్‌ శోషన్ ముక్త్‌  మంచ్‌ జాతీయ సమావేశాలు ముగిశాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. దళితులు, ఆదివాసీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయని.. కేరళ మాజీ స్పీకర్‌ రాధాకృష్ణన్‌ అన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో కుల దురంహకార హత్యలు , సాంఘిక బహిష్కరణకు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని.. డీఎస్‌ఎమ్‌ఎమ్‌ జాతీయ నాయకురాలు మమత డిమాండ్‌ చేశారు.

 

18:56 - August 28, 2017

సంగారెడ్డి : డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బురదబాట పట్టారు. సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేటలో పాలిటెక్నిక్‌ కళాశాల భవనాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆయన రోడ్డు సక్రమంగా లేకపోవడంతో బురద రోడ్డులోనే ప్రయాణించాల్సి వచ్చింది. అయితే ఈ విషయాన్ని కవర్ చేస్తున్న మీడియాపై కడియం రుసరుసలాడారు. 

18:53 - August 28, 2017

నల్గొండ : ఆల్మట్టి నుంచి సాగర్‌కు  నీటిని రప్పించడంలో విఫలమైన రాష్ట్ర సర్కార్ తీరును నిరసిస్తూ.. సీపీఎం ఆధ్వర్యంలో  సాగర్ డ్యామ్‌ను ముట్టడించారు. పోలీసులను అడ్డుకున్నా.. గేట్లను తోసుకుని ఎర్త్ డ్యామ్ మీద భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రైతాంగానికి ఆధునిక దేవాలయంగా నిలిచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటిని విడుదల చేయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.  

18:51 - August 28, 2017

కరీంనగర్ : సంచలనం సృష్టించిన నేరెళ్ల ఘటనపై సిఐడి విచారణ చేపట్టింది. ఆ శాఖ డిఐజి షికా గోయల్ ఆద్యర్యంలోని అధికారుల బృందం నేరెళ్ల భాదితుల కుటుంబ సభ్యులను కరీంనగర్ సిఐడి కార్యాలయంలో విచారించారు. నిన్న వేములవాడలో చికిత్స పొందుతున్న నేరెళ్ల భాదితులకు సిఐడి అధికారులు ముందస్తు సమాచారం అందించడంతో నేడు విచారణకు హజరయ్యారు. ఇప్పటికే భాదితులంతా జరిగిన ఘటనపై న్యాయ పోరాటం కొనసాగిస్తుండగా...మరో వైపు కేసుకు సంబందించిన పూర్తి స్థాయి నివేదికను సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో సిసిఎస్ ఎస్ ఐ రవీందర్‌ను సస్పెండ్ చేస్తు ఐజి నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 

 

18:48 - August 28, 2017

జయశంకర్ భూపాలపల్లి : భారీవర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కోల్‌బెల్ట్ ప్రాంతంలో కెటికె సెక్టార్ ప్రాజెక్ట్ ఒపెన్ కాస్ట్‌లో  రెండు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో గనిలోకి నీరు చేరి.. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇప్పటివరకు సుమారు 6వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని సింగరేణి అధికారులు తెలిపారు. 

 

18:46 - August 28, 2017

హైదరాబాద్ : భూసర్వేలో ప్రతిపక్షాలు లేకుండా మంత్రులతో కమిటీ వేయడం మంచి పద్ధతి కాదని తెలంగాణ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు. భూసర్వేకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం కాదని... గతంలో చేసిన సమగ్ర సర్వేను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. 

18:43 - August 28, 2017


హైదరాబాద్ : ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బషీర్‌బాగ్‌ చౌరస్తాలో విద్యుత్‌ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన ఉత్తమ్‌... నాటి చంద్రబాబు పాలన మాదిరే నేడు కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్నారు. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిన కేసీఆర్‌.. ప్రైవేట్‌ సంస్థతో అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ అవార్డు ఇప్పించుకోవడం సిగ్గుచేటన్నారు.

 

18:23 - August 28, 2017
18:22 - August 28, 2017
17:42 - August 28, 2017

విజయనగరం : నంద్యాల ఉప ఎన్నికలో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని ఏపీహెచ్ ఆర్ డీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు టీడీపీకి మలుపు అని అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితమే 2019 సాధారణ ఎన్నికల్లో పునరావృతం అవుతుందన్నారు. టీడీపీ ఘన విజయం సాధించి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. జగన్‌ మాట తీరు మార్చుకోపోతే భవిష్యత్‌లో మనుగడ కష్టమని తెలిపారు.

 

17:36 - August 28, 2017

విజయవాడ : నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయంపై... విజయవాడలో టీడీపీ నేతల సంబరాలు జరుపుకున్నారు. లెనిన్ సెంటర్‌లో గుండుతో ఉన్న రోజా ఫ్లెక్సీలను పట్టుకుని.... టపాసులు పేలుస్తూ స్వీట్లు పంచి పెట్టి సందడి చేశారు. నంద్యాలలో టీడీపీ గెలుస్తుందని ముందే చెప్పామని, 25 వేల మెజార్టీ సాధించడం సంతోషంగా ఉందని టీడీపీ నాయకులు అన్నారు.

 

17:34 - August 28, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. ప్రజలు అభివృద్ధికి ఓటేశారని బ్రహ్మానందరెడ్డి చెబుతున్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సేవ చేస్తానని చెప్పారు. భూమా నాగిరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. నంద్యాల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:22 - August 28, 2017

కర్నూలు : నంద్యాలలో  టీడీపీ విజయాన్ని భూమా నాగిరెడ్డికి అంకితం చేస్తున్నట్టు మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. ఈమేరకు ఆమె టెన్ టివితో ఫేస్‌టూఫేస్‌ నిర్వహించింది. నంద్యాలలో ఇప్పటికే ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేరుస్తామని అన్నారు. అలాగే నంద్యాల అభివృద్ధికి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. నంద్యాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. 

 

16:59 - August 28, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుర్మిత్‌ బాబా కేసులో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. గుర్మిత్‌బాబాకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఆశ్రమ సాధ్వులపై అత్యాచారం కేసులపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి జగదీప్‌సింగ్‌ తీర్పు వెల్లడించారు. ఇది క్షమించరాని నేరమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. తనను క్షమించాలని న్యాయమూర్తి ఎదుట గుర్మిత్‌ బాబా బోరున విలపించారు. అయితే... గుర్మిత్‌బాబా విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. పదేళ్ల జైలు శిక్ష విధించాలన్న సీబీఐ లాయర్‌ వాదనను సమర్ధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. న్యాయమూర్తి తీర్పు విన్న గుర్మిత్‌ బాబా కోర్టులోనే కుప్పకూలిపోయారు. మరోవైపు తీర్పు నేపథ్యంలో సిర్సాలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. రెండు వాహనాలను బాబా అనుచరులు తగలబెట్టారు. 

చిన్నారి కాలేయమార్పికి సీఎం రిలీఫ్ ఫండ్

మెదక్: గజ్వేల్ కు చెందిన 11 నెలల బాలుడు శ్రీమాన్ కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 25 లక్షలు మంజూరు అయ్యాయి. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స నిమిత్తం ప్రభుత్వ సాయం చేసింది. ఈ చెక్కును శ్రీమాన్ తల్లిదండ్రులకు కలెక్టర్ అందించారు.

జగన్ విమర్శలు శృతిమించాయి: చంద్రబాబు

అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో జగన్ మాటలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ విమర్శలు శృతిమించాయని మండిపడ్డారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. నంద్యాల ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారని పేర్కొన్నారు.

మా పనితీరే టిడిపిని గెలిపించింది:సీఎంచంద్రబాబు

అమరావతి: ఎన్నికలను ఎదుర్కొవడం తనకు మొదటి సారి కాదని, తమ పనితీరే టిడిపిని గెలిపించిందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. నంద్యాల ఎన్నికల ఫలితాల పై ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యత ఉండదని, ఏదో చేస్తానని జగన్ అభాసుపాలయ్యాడు అని ఎద్దేవా చేశాడు.

'గుర్మీత్ కు జైలు శిక్ష తీర్పుపై హైకోర్టులో సవాల్'

ఢిల్లీ: అత్యాచారం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన 10 సంవత్సరాల జైలు శిక్ష తీర్పును హైకోర్టులో సవాలు చేయనున్నట్లు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ తరఫు న్యాయవాదులు సూచన ప్రాయంగా తెలిపారు. కోర్టు తీర్పు పూర్తి కాపీ చదివిన తరువాత తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని రోహ్‌తక్‌ జైలు వెలుపల మీడియా ప్రతినిధులతో అన్నారు.

16:14 - August 28, 2017

ఢిల్లీ : గుర్మిత్ బాబా రామ్ రహీంకు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఆశ్రమసాధులపై అత్యాచారం కేసులో డేరా బాబాకు కోర్టు పదేళ్లు జైలు శిక్ష విధించింది. సీబీఐ
ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ గుర్మిత్ కు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో గుర్మిత్ కుప్పకూలిపోయాడు. తనను క్షమించాలంటూ జడ్డి ముందు గుర్మిత్ కన్నీరుపెట్టుకున్నారు. బాబా విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. జీవిత ఖైదు విధించాలని సీబీఐ న్యాయవాదులు వాధించారు. క్షమించి శిక్ష తగ్గించాలని గుర్మిత్ తరపు న్యాయవాదులు వాధించారు. తీర్పు నేపథ్యంలో సిర్సాలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సిర్సాలో బాబా అనుచురులు వాహనాలను తగులబెట్టారు. హర్యానా, పంజాబ్ లలో హైఅలర్ట్ ప్రకటంచారు. రెండు రాష్ట్రాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐద్వా లాంటి మహిళ సంఘాలు ఈ తీర్పును స్వాగతిస్తున్నాయి.
సామాజిక కార్యకర్త దేవి..
'తీర్పును స్వాగతిస్తున్నాం. గుర్మిత్ కు పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడాన్ని హర్షిస్తున్నాం. హర్యానా బిజెపి ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పించకుండా 30 మంది చావుకు కారణమైంది. పత్రికలో గుర్మిత్ భాగోతాలను ప్రచురించినందుకు 2002సం.లో జర్నలిస్టును హత్య చేయించారని ఆరోపించారు. ఒక రేపిస్టుకు కోర్టు తీర్పు ఇస్తే హర్యానా ప్రభుత్వానికి బాధ ఎందుకని ప్రశ్నించారు. ఆడవారి శరీరాలపై ఓట్లు ఏరుకోవడం బీజేపీ లాంటి ప్రభుత్వాలు మానుకోవాలన్నారు' అని అన్నారు. 

 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 150 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ మళ్లీ 9,900 మార్క్‌ను దాటింది.మార్కెట్‌ ముగిసే సమయానికి 155 పాయింట్ల లాభంతో 31,751 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 56 పాయింట్లు లాభపడి.. 9,913 వద్ద ముగిసింది. 

యావజ్జీవ శిక్ష విధించాలని సీబీఐ పిటీషన్ వేసే అవకాశం...

హర్యానా: 2002లో ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో గుర్మీత్‌రామ్‌ రహీమ్‌సింగ్‌ పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే గుర్మీత్ కు పదేళ్ల జైలు శిక్ష సరిపోదని సీబీఐ వాదిస్తోంది. గుర్మీత్ కు యావజ్జీవ శిక్ష విధించాలని సీబీఐ పిటీషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అత్యాచార కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్ఛా సౌధా’ అధినేత గుర్మీత్‌ రామ్‌ రాహీమ్‌సింగ్‌కు ఉరి శిక్ష విధించాలంటూ ఉత్తరప్రదేశ్‌లో కొందరు సాధువులు ఆందోళనకు దిగారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో ఆందోళన చేపట్టిన సాధువులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఆయనకు మరణదండన విధించాలని డిమాండ్‌ చేశారు.

15:59 - August 28, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక 2019 ఎన్నికలకు రెఫరెండం కాదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. 21 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తే రిఫరెండంగా భావిస్తామని తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు సుమారు 200 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబుది విజయం అనుకుంటే పొరపాటు అని అన్నారు. టీడీపీలో చేరిన 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని పేర్కొన్నారు. రాజీనామా చేయించి.. గెలిస్తే అది రెఫరెండం అవుతుందని తెలిపారు. ఇది రెఫరెండం ఎలా అవుతుందని ప్రశ్నించారు. నంద్యాల నేతలు గెలుపు కోసం కృషి చేశారని పేర్కొన్నారు. పాలిటిక్స్ లో ధైర్యం ఉండాలన్నారు. 

 

 

గుర్మీత్ కు ఖైదీ నంబర్ 1997 కేటాయింపు

హర్యానా: అత్యాచారం కేసులో గుర్మీత్ బాబాకి పదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే రోహ్ తక్ జైలులో గుర్మీత్ కు1997 ఖైదీ నంబర్ ను కేటాయించారు. రోహ్ తక్ జైలు వద్ద కన్పిస్తే కాల్చివేతను ఉత్తర్వులు జారీ అయ్యాయి.

15:43 - August 28, 2017

కర్నూలు : జగన్‌ ఎన్ని కుట్రలు పన్నినా చివరకు చంద్రబాబు అభివృద్ధి పథకాలే  టీడీపీకి విజయం సాధించి పెట్టాయని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. నంద్యాల ఓటర్లు తీర్పు రాబోయే సాధారణ ఎన్నికల్లో టీడీపీ విజయానికి నాంధి అంటున్న మంత్రితో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించారు. జగన్‌ ఎన్ని కుట్రలు పన్నినా అభివృద్ధిదే అంతిమ విజయమన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

గుర్మీత్ బాబాకు పదేళ్లు జైలు శిక్ష

ఢిల్లీ : అత్యాచారం కేసులో గుర్మీత్ బాబాకి సీబీఐ న్యాయమూర్తి జగదీప్ సింగ్ శిక్షను ఖరారు చేశారు. పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించారు. 2002లో ఇద్దరు శిష్యురాళ్ల పై రామ్ రహీం లైంగక దాడి చేశాడు.

15:30 - August 28, 2017

కన్నీరు పెట్టుకున్న గుర్మీత్ బాబా

హర్యానా : తనను క్షమించాలంటూ జడ్జి ఎదుట డేరా సచ్చా సౌధా చీప్ గుర్మీత్ రామ్ రహీం కన్నీరు పెట్టుకున్నారు. పదేళ్ల శిక్ష విధించాలని సీబీఐ లాయర్ విజ్ఞప్తి చేశారు. 

15:26 - August 28, 2017

కర్నూలు : నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. వార్‌ వన్‌సైడ్‌లా మారిన ఈ ఉప సమరంలో సైకిల్‌ జోరు పెంచింది. మొత్తం 19 రౌండ్లలో ఒక్క 16వ రౌండ్‌ మినహా అన్నింటిలోనూ టీడీపీ సంపూర్ణ ఆధిక్యాన్ని కనబరిచింది.16వ రౌండ్‌ ముగిసేసరికే టీడీపీ విజయం ఖాయమైంది. ఇంకా మూడు రౌండ్ల లెక్కింపు ఉండగానే 50శాతం ఓట్లను భూమా బ్రహ్మానందరెడ్డి సాధించారు. గోస్పాడ్‌ మండల పరిధిలోని 17, 18, 19 రౌండ్లలో వైసీపీకి ఆధిక్యం వస్తుందని ఆ పార్టీ నేతలు ఆశించారు. అయితే అక్కడ కూడా వైసీపీకి నిరాశే ఎదురైంది. గోస్పాడ్‌లోనూ టీడీపీనే మెజార్టీ ఓట్లను సాధించింది. మొత్తానికి టీడీపీ 27 వేల 466 ఓట్ల మెజార్టీతో టీడీపీ విజయం సాధించింది. నంద్యాలతో టీడీపీ విజయంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

వాహనానికి నిప్పు పెట్టిన డేరా మద్దతు దారులు

హర్యానా: సిర్సాలో డేరా మద్దతుదారులు హింసకు తెగించారు. ఓ వాహనానికి డేరా మద్దతు దారులు నిప్పు పెట్టారు.

15:22 - August 28, 2017

పంజాబ్, హర్యానా, ఢిల్లీలో హైటెన్షన్

ఢిల్లీ : అత్యాచారం కేసులో గుర్మీత్ బాబాకి సీబీఐ న్యాయమూర్తి జగదీప్ సింగ్ శిక్షను ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానా ఢిల్లీ రాష్ట్రాల్లో హై టెన్షన్ నెలకొంది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మెట్రో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. రోహత్ క్ లో 23 బృందాల పారామిలరటీ బలగాలు మోహరించాయి. ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు పూర్తయ్యాయి.

గుర్మీత్ శిక్ష పై ముగిసిన వాదనలు...

హర్యానా: డేరా సచ్చా సౌధా చీప్ గుర్మీత్ రామ్ రహీంకు శిక్ష ఖరారుపై రోహతక్ జైలులో వాదనలు ముగిశాయి. గుర్మీత్ కు జీవిత ఖైదు విధించాలని సీబీఐ కోర్టు తరపు లాయర్ వాదించగా, గుర్మీత్ సమాజ సేవకు, ప్రజల కోసం పని చేశారని గుర్మీత్ తరపు న్యాయవాది వాదించారు.

అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరన్ బహిష్కరణ..

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ చీఫ్ పదవి నుంచి వీకే శశికళను బహిష్కరిస్తూ ఆ పార్టీ సోమవారం తీర్మానించింది. శశకళ చేపట్టిన పార్టీ నియామకాలన్నీ రద్దు చేసింది. తమిళనాడులోని రొయపెట్టా వేదికగా సీఎం పళనిస్వామి నేతృత్వంలో సోమవారం ఆ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శశికళతో పాటు ఆమె మేనల్లుడు టిటివి దినకర్‌ను అన్ని పార్టీ పదవుల నుంచి బహిష్కరిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. త్వరలో పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించి వీరి బహిష్కరణను అధికారికంగా ఆమోదించనున్నట్టు వెల్లడించారు.

చాపర్ లో రోహ్ తక్ జైలుకు సీబీఐ కోర్టు జడ్జి

ఢిల్లీ: కాసేపట్లో గుర్మిత్ బాబా కేసులో తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో చాపర్ లో రోహ్ తక్ జైలుకు సీబీఐ కోర్టు జడ్జి వెళ్లారు.

నంద్యాల ఉప ఎన్నిక రెఫరెండం అంటే ఎలా: జగన్

హైదరాబాద్ : వైసీపీ ఎపుడూ విలువలకు కట్టుబడి వుందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఇతర పార్టీల నుంచి రాజీనామా చేసి వస్తేనే వైసీపీలో చేరుకుంటున్నాం. నంద్యాలలో శిల్పా సోదరులు చాలా కష్టపడ్డారు. టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన శిల్పా చక్రపాణికి హ్యాట్సాప్ చెప్పారు. చంద్రబాబుది విజయం అనుకుంటే పొరపాటేనని ప్రజలు భయపడి చంద్రబాబుకు ఓటు వేశారని తెలిపారు. వేరే గత్యంతరం లేక టిడిపికి ఓటు వేశారని, నంద్యాల ఉప ఎన్నిక రెఫరెండం ఎలా అవుతుందని ప్రశ్నించారు. టిడిపిలో చేరిన 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రమ్మనండి రెఫరెండంగా తీసుకుంటామన్నారు.

14:06 - August 28, 2017

ఢిల్లీ : దేశ రాజధాని శివారు ప్రాంతమైన బవానాలో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవలే జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ ఎన్నికలో ఆప్ అభ్యర్థి రాంచందర్ ఘన విజయం సాధించారు. సమీప బీజేపీ ప్రత్యర్థి వేద ప్రకాష్ పై 24వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

వేద ప్రకాష్ ఆప్ పార్టీ నుండి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. దీనితో బవానాకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ విజయం సాధిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ చేసిన తరువాత ఆప్ పరిస్థితి కొంత గందరగోళంగా మారిపోయింది. బీజేపీ వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో బవానా ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది.

తొలి రౌండ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ ఆధిక్యం కనబరిచారు. ఐదు రౌండ్ల వరకు కొనసాగిన ఆయన అధిక్యం తరువాతి రౌండ్లలో నెమ్మదించారు. బీజేపీ రెండో స్థానంలో నిలవగా కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ రైతు ఓట్లే కీలకంగా మారాయి. విద్యుత్..ఇతరత్రా అంశాల్లో ఆమ్ ఆద్మీ ప్రజలకు చేరువకావడం చెప్పుకోవచ్చు. బవానా నియోజకవర్గంలో బీజేపీ కీలక నేతలు మోహరించి ప్రచారం నిర్వహించినా ఏ మాత్రం ఉపయోగపడలేదు. బవానా పరాజయంపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

13:55 - August 28, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో సానుభూతి ఎందుకు ఉండదని ఏపీ మంత్రి భూమా అఖిల సూటిగా ప్రశ్నించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించారు. సమీప వైసీపీ ప్రత్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై 27456 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి అఖిల ప్రియ టెన్ టివితో ముచ్చటించారు. ఎన్నికల్లో గెలవడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. ఆళ్లగడ్డ ప్రజలు అమ్మను బతికించుకున్నారని..ఇప్పుడు నంద్యాల ప్రజలు నాన్న బతికించారని పేర్కొన్నారు. గెలుపు అనంతరం బాధ్యత మరింత పెరిగిందని, నమ్మకాన్ని వమ్ము మాత్రం చేయమన్నారు. అభివృద్ధి విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా కృషి చేస్తామన్నారు. సానుభూతి ఎందుకు ఉండదు ? సమస్యలపై పోరాటం..ప్రజల గురించి ఆలోచిస్తే సానుభూతి ఉండదా ? మరి పోటీకి ఎందుకు వచ్చారని సూటిగా ప్రశ్నించారు. ఓడిపోతే తాను బాధ్యత తీసుకుంటానని..రాజీనామా చేస్తానని స్వయంగా తానే చెప్పడం జరిగిందన్నారు. కడపకు వెళ్లి రాజకీయాలు చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. కొత్త హామీలకు బదులు..పాత హామీల అమలుకు కృషి చేయడం జరుగుతుందని, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడుతామన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:38 - August 28, 2017

హీరో నాగ చైత‌న్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారహి బ్యానర్ పై కృష్ణ ఆర్వి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో యుద్ధం శ‌ర‌ణం అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా మూవీ రిలీజ్ డేట్ ని సెప్టెంబ‌ర్ 8కి ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ నటుడు శ్రీకాంత్ పూర్తి స్థాయి విలన్ గా కనిపించనున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు ‘పెళ్లి చూపులు’ ఫేమ్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక‌.. ఈ మూవీ టీజ‌ర్ ను ఇదివ‌ర‌కే రిలీజ్ చేసిన మూవీ యూనిట్ తాజాగా మూవీ అఫీషియ‌ల్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసింది. 

13:37 - August 28, 2017

విజయవాడ : అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని టిడిపి ఎమ్మెల్యే అనిత పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించారు. సమీప వైసీపీ ప్రత్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై 27456 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గోస్పాడూలోనూ 17, 18, 19 మండల పరిధిలోని టిడిపి అనూహ్యంగా అధిక్యాన్ని కనబర్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిత టెన్ టివితో ముచ్చటించారు. తమదే గెలుమని ఆనాడే చెప్పడం జరిగిందని, ఓటమి చెందితే మాట మార్చడం వైసీపీకి చెల్లిందన్నారు. 2019 ఎన్నికల్లో కూడా టిడిపి గెలుస్తుందని, కాకినాడ మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామన్నారు. డబ్బులు పంచామని అంటున్నారని అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, అభివృద్ధికే పట్టం కట్టామన్నారు. 

13:35 - August 28, 2017

విజయవాడ : నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి భారీ మెజార్టీతో దూసుకెళుతుండడంపై ఆ పార్టీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సంతోషం వ్యక్తం చేశారు. పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లను టిడిపి సాధించింది. 17వ రౌండ్ లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 915 ఓట్ల ఆధిక్యం కనబరిచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నంద్యాల ప్రజలు ఏపీ సీఎం చంద్రబాబును విశ్వసించారని, అలాంటి వ్యక్తి రావాలని..బాబు చేసిన ప్రయత్నాలను స్వాగతించారన్నారు. ఇలాంటి నాయకత్వానికి వైసీపీ సూచనలు..సలహాలు ఇస్తే బాగుండేదని కానీ..భాష ఎలా ఉందన్నారు. ఇప్పటికైనా ఆలోచించాలని..ముస్లిం..మైనార్టీలు ఎక్కడున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇక నుండి అంతా ఏకపక్షమే జరుగుతుందని..ప్రవర్తనలో మార్పు వస్తే ప్రజలు వైసీపీని గుర్తించే అవకాశం ఉందన్నారు. 

నంద్యాలలో టిడిపి విజయదుందుభి

కర్నూలు: నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘనవిజయం సాధించారు. 17 రౌండ్లు ముగిసేసరికే తెదేపా విజయం ఖాయమైంది. ఇంకా రెండు రౌండ్ల లెక్కింపు ఉండగానే 50శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన భూమా బ్రహ్మానందరెడ్డి.. వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగిన తెలుగుదేశం అదే హవాను చివరి వరకు కొనసాగించింది. 17 రౌండ్ల లెక్కింపు ముగిసేసరికి 26,523 ఓట్ల ఆధిక్యం టిడిపికి లభించింది.

రూ.కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత

నెల్లూరు: జిల్లాలో రూ.కోటి విలువైన ఎర్రచందనాన్ని అధికారులు పట్టుకున్నారు. రాపూరు, కలువాయి, అనంతసాగరం మండలాల్లో 21 మంది అంతర్ రాష్ట్ర, స్థానిక స్మగ్లర్ల ను అరెస్ట్ చేశారు. అంతేకాక వారి వద్ద నుండి 1.1 టన్నుల ఎర్రచందనం దుంగలు, 11 వాహనాలు, రెండు నాటు తుపాకులు, 13 సెల్ ఫోన్లు, రూ.5030 లు స్వాధీనం చేసుకున్నారు.

మందడంలో టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహం

గుంటూరు : మందడంలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. నంద్యాలలో మెజార్టీ సాధించడంతో సంబరాలు చేసుకుంటూ సీఎం కాన్వాయ్ ను ఆపేందుకు కార్యకర్తలు యత్నించారు. అప్రమత్తమైన సీఎం సెక్యూరిటీ సిబ్బంది కార్యకర్తలను పక్కకు పంపి కాన్వాయ్ ను పంపించారు.

'డ్యామ్ నుంచి సాగర్ కు నీటిని విడుదలకు చర్యలు తీసుకోవాలి'

ఖమ్మం: ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు తమ్మినేని, జూలకంటి, పోతినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. తాగు, సాగు నీటి అవసరాల ఆల్మట్టి డ్యామ్ నుంచి సాగర్ కు నీటిని విడుదల చేయించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని

16వ రౌండ్ లో వైసీపీ ఆధిక్యం

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల్లో 16వ రౌండ్ లో వైసీపీ ఆధిక్యం సాధించింది. టిడిపి అభ్యర్థి పై 768 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి ఉన్నారు, 16వ రౌండ్ ముగిసే సమయానికి టిడిపి 25,393 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

12:42 - August 28, 2017

కామెడీ షో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని, చిన్న చిన్న సినిమాల్లో హీరోగా చేస్తూ, నిర్మాతగా మారి, కొద్దిరోజులుగా బిగ్‌బాస్ హౌస్‌లో అందరినీ అలరించిన ధన్‌రాజ్ మరో సారి తండ్రి అయ్యాడు. శనివారం బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ అనంతరం ఆయన తనఇంటికి చేరుకోగానే తనకి కుమారుడు పుట్టాడనే శుభవార్త విన్నాడు. కుమారుడిని చూసిన ధన్‌రాజ్ ఎంతో ఆనందపడ్డాడు. వెంటనే ఈ ఫోటోలను సోషల్‌మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు. ఈ ఫోటోలు చూసినవారంతా ధన్‌రాజ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

12:34 - August 28, 2017

'నెం.1 యారి' ప్రోగ్రామ్ తో బిజీగా వున్న రానా బాలీవుడ్‌కి వెళ్తున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాహుబలి సినిమా తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మరో హిట్ టాక్ అందుకున్నాడు. .పూర్తి వివరాల్లోకి వెళితే... ఇటీవల ఓ ఛానల్‌.. రానా ఇక తెలుగు సినిమాల్లో నటించరంటూ ప్రసారం చేసింది. దాంతో రానా అభిమాని ఒకరు ‘అన్నా ఇది నిజమేనా’ అంటూ ఏడుస్తున్న ఇమోజీలను జతచేస్తూ ట్వీట్‌ పెట్టారు. దీనిపై రానా స్పందిస్తూ.. ‘ఎవరు చెప్పారమ్మా నీకు. నేను తెలుగు సినిమాలతోనే హిందీకి, తమిళ్‌కి వెళ్తా. నేను నటించిన ‘ఘాజి’, ‘బాహుబలి’ తెలుగు సినిమాలు కావా?’ అని ట్వీట్‌ చేశారు. రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం రానా.. ‘నెంబర్‌ 1 యారి’ అనే టీవీ షోతో బిజీగా ఉన్నారు. త్వరలో ఆయన ‘హిరణ్య కశ్యప’ అనే చిత్రంలో నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

కిలోన్నర బంగారం స్వాధీనం...

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కౌలాలంపూర్ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తుల నుంచి కిలోన్నర బంగారం స్వాధీనం చేస్తున్నారు.

నేరేళ్ల ఘటనపై సీబీసీఐడీ విచారణ

కరీంనగర్: సీబీసీబైడీ డీఐజీ శిఖా గోయల్ నేరెళ్ల ఘటనపై సీబీసీఐడీ విచారణ కొనసాగుతుంది. కరీంనగర్ సీబీసీఐడీ ఆఫీస్ లో బాధిత కుటుంబ సభ్యులను విచారిస్తోంది. 

12:17 - August 28, 2017

కర్నూలు : తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ మిన్నకుండిపోయింది. నంద్యాల ఉప ఎన్నికల కౌంటింగ్ లో టిడిపి జోరు కొనసాగింది. అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి మెజార్టీ దిశగా దూసుకెళుతున్నారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. 12వ రౌండ్ ముగిసే సరికి టిడిపి 1580 ఓట్ల మెజార్టీ సాధించింది. మొత్తంగా టిడిపి అభ్యర్థి 21841 ఓట్ల అధిక్యాన్ని కనబరిచారు.

తొలి రౌండ్ : టిడిపి - 5477, వైసీపీ - 4279, టిడిపి మెజార్టీ - 1198.

రెండో రౌండ్ : టిడిపి - 5160, వైసీపీ - 3400, టిడిపి మెజార్టీ - 2960.

మూడో రౌండ్ : టిడిపి - 7058, వైసీపీ - 3945, టిడిపి అధిక్యం - 3113

నాలుగో రౌండ్ : టిడిపి - 6465, వైసీపీ - 2868, టిడిపి మెజార్టీ - 3597..

ఐదో రౌండ్ : టిడిపి - 6955, వైసీపీ - 3463 ఓట్లు,

ఆరో రౌండ్ : టిడిపి - 6161, వైసీపీ - 2858 ఓట్లు.

ఏడో రౌండ్ : టిడిపి - 4859 ఓట్లు, వైసీపీ - 4312 ఓట్లు, కాంగ్రెస్ - 362 ఓట్లు.

ఎనిమిదో రౌండ్ : టిడిపి - 4436 ఓట్లు, వైసీపీ - 4088 ఓట్లు. టిడిపి మెజార్టీ - 340 ఓట్లు.

తొమ్మిదో రౌండ్ : టిడిపి - 4309 ఓట్లు, వైసీపీ - 3430 ఓట్లు.

పదో రౌండ్ : టిడిపి - 4682 ఓట్లు, వైసీపీ - 3156 ఓట్లు.

పదకొండో రౌండ్ : టిడిపి - 4426, వైసీపీ - 3722 ఓట్లు.

పన్నెండో రౌండ్ : టిడిపి - 5629, వైసీపీ - 4049 ఓట్లు. 

నంద్యాలలో వార్ వన్ సైడే

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల్లో వార్ వన్ సైడే కోనసాగుతుంది. ఏ రౌండ్ లో నూ వైసీపీ ఆధిక్యత సాధించలేదు. 12వ రౌండ్ లో టిడిపికి 1580 ఓట్ల మెజార్టీ లభించింది. 12 రౌండ్లు ముగిసే సమయానికి టిడిపికి 21,814 ఓట్ల మెజార్టీ లభించింది.

11:57 - August 28, 2017

విజయవాడ : నంద్యాల ప్రజల తీర్పుతో వైఎస్ జగన్ దుకాణం మూత పడిందని ఏపీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. అంతిమ విజయం తమదేనని, 2019 ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని తెలిపారు. ప్రజలు అభివృద్ధిని..సంక్షేమ కార్యక్రమాలు కోరుకున్నారని, నంద్యాల ఎన్నిక ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ దుర్మార్గంగా మాట్లాడారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడిని కాల్చేయాలని...ఉరి వేయాలని జగన్..రోజా..అంబటి ఇతరులు మాట్లాడిన మాటలు నంద్యాల ప్రజలు విన్నారని పేర్కొన్నారు. ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పారన్నారు. వైసీపీ వ్యూహకర్త పీకే ఏం పీకలేడని పేర్కొన్నారని..చివరకు వైసీపీపిని పీకాడని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అడ్డు పడుతున్నారని..అమరావతి విషయంలో కూడా కోర్టుల్లో కేసులు వేస్తున్నారని తెలిపారు. మొత్తంగా వైసీపీ దుకాణం మూతపడిందని తెలిపారు. 

ప్రజలు న్యాయానికి- ధర్మానికి పట్టం కట్టారు: మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి: ఎన్నో ఉప ఎన్నికలు జరిగినా ఇంతటి ప్రాధాన్యం దేనికి లభించలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నంద్యాల ప్రజలు న్యాయానికి- ధర్మానికి పట్టం కట్టారని తెలిపారు. చంద్రబాబు నాయకత్వం ఏపీకి అవసరం అనే విషయాన్ని నంద్యాల ప్రజలు మరోసారి రుజువు చేశారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ ఫలితంతో వైసీపీ కనుమరుగు కావడం ఖాయం అని తెలిపారు.

11:50 - August 28, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 19 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. ప్రతి రౌండ్‌కు తొమ్మిది వేల ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. మొదటి రౌండ్ నుండి టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అధిక్యంలో కొనసాగుతూ కనబరుస్తూ వచ్చారు. పదో రౌండ్ లో కూడా అదే హావా కొనసాగుతుండడంతో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కౌంటింగ్ నుండి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. లాస్ట్ వరకు ఏమి చెప్పలేమని, ఏడు రౌండ్ల వరకు టిడిపి అధిక్యత కనబరిచిందన్నారు. డబ్బు పంపిణీ..సానుభూతి ఈ ఎన్నికలో పని చేసిందన్నారు. 

నంద్యాల ప్రజలు జగన్ బృందానికి బుద్ధి చెప్పారు: సోమిరెడ్డి

అమరావతి: సీఎం చంద్రబాబు కష్టానికి ఫలితమిదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల ప్రజలు జగన్ బృందానికి బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు: మంత్రి నారాయణ

అమరావతి: నంద్యాల ఉప ఎన్నికలో టిడిపికి 40వేల నుంచి 50వేల మెజార్టీ రాబోతుందని మంత్రి నారాయణ తెలిపారు. అభివృద్ధికి నంద్యాల ప్రజలు ఓట్లు వేశారని, జగన్ నంద్యాలలో తిష్ట వేసినా ఫలితం లేకపోయిందని జగన్ మాటలే ఆయనకు నష్టం చేకూర్చాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకొ ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.

11:45 - August 28, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో సానూభూతి పవనాలు వీచడంతోనే టిడిపి దూసుకెళుతోందని వైసీపీ పేర్కొంటోంది. సానుభూతి కాదని..అభివృద్ధి ప్రముఖ పాత్ర పోషించిందని టిడిపి పేర్కొంటోంది. నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్ నుండి టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతుండగా..వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోవడం విశేషం. వరుసగా పదో రౌండ్ లోనూ టిడిపి అభ్యర్థి భూమా అధిక్యంలో కొనసాగుతుండడం గమనార్హం. 10వ రౌండ్ లో టిడిపిఇ 1486 ఓట్ల ఆధిక్యం కనబర్చగా మొత్తంగా టిడిపి 19557 ఓట్ల ఆధిక్యం కనబరుస్తోంది. టిడిపి హావా వీస్తుండడంతో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయారు. కేవలం సానుభూతి పవనాల వల్లే టిడిపి ఓట్లు పడ్డాయన్నారు.

తొలి రౌండ్ : టిడిపి - 5477, వైసీపీ - 4279, టిడిపి మెజార్టీ - 1198.

రెండో రౌండ్ : టిడిపి - 5160, వైసీపీ - 3400, టిడిపి మెజార్టీ - 2960.

మూడో రౌండ్ : టిడిపి - 7058, వైసీపీ - 3945, టిడిపి అధిక్యం - 3113

నాలుగో రౌండ్ : టిడిపి - 6465, వైసీపీ - 2868, టిడిపి మెజార్టీ - 3597..

ఐదో రౌండ్ : టిడిపి - 6955, వైసీపీ - 3463 ఓట్లు,

ఆరో రౌండ్ : టిడిపి - 6161, వైసీపీ - 2858 ఓట్లు.

ఏడో రౌండ్ : టిడిపి - 4859 ఓట్లు, వైసీపీ - 4312 ఓట్లు, కాంగ్రెస్ - 362 ఓట్లు.

ఎనిమిదో రౌండ్ : టిడిపి - 4436 ఓట్లు, వైసీపీ - 4088 ఓట్లు. టిడిపి మెజార్టీ - 340 ఓట్లు.

తొమ్మిదో రౌండ్ : టిడిపి - 4309 ఓట్లు, వైసీపీ - 3430 ఓట్లు.

పదో రౌండ్ : టిడిపి - 4682 ఓట్లు, వైసీపీ - 3156 ఓట్లు.

11:37 - August 28, 2017

‘రాజా ది గ్రేట్’, ‘టచ్ చేసి చూడు’ సినిమాలతో బిజీగా వున్న మాస్ మహారాజ రవితేజ తమిళంలో ప్రభుదేవా నిర్మించిన ‘భోగన్’ మూవీని తెలుగులో రవితేజతో రీమేక్ చేయనున్నారట. ఈ తెలుగు రీమేక్‌లో హీరోయిన్‌గా కేథరిన్ పేరు వినిపిస్తోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నా.. కేథరిన్ కెరీర్‌కి ఇప్పటివరకూ సరైన బూస్టప్ రాలేదు. రీసెంట్ హిట్ ‘నేనే రాజు.. నేనే మంత్రి’లో నెగటివ్ టచ్ వున్న రోల్లో కనిపించిన కేథరిన్‌కి మంచి మార్కులే పడ్డాయి. అలాగే ‘జయ జానకీ నాయక’లో చేసిన ఐటెంసాంగ్ కూడా బాగానే వర్కవుట్ అయింది. ‘సరైనోడు’ సినిమాతో యంగ్ ఎమ్మెల్యేగా పాపులర్ అయిన కేథరిన్‌కి హీరో రవితేజతో హీరోయిన్‌గా చేసే ఆఫర్ కొట్టేసింది. దీంతో అయినా అమ్మడు కెరీర్ పట్టాలెక్కుతుందో లేదా వేచి చూడాల్సిందే...

11:32 - August 28, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఉప ఎన్నిక లెక్కింపును అధికారులు చేపట్టారు. తొలి రౌండ్ నుండి బ్రహ్మానందరెడ్డి అధిక్యంలో కొనసాగుతుండడంతో వైసీపీ నేతలు నిరుత్సాహానికి గురయ్యారు. 7వ రౌండ్ వచ్చే సరికి టిడిపి అధిక్యం తగ్గుతూ వస్తుండడం గమనార్హం. ఈ రౌండ్ లో టిడిపి అభ్యర్థి 512 ఓట్ల అధిక్యం కనబరిచారు. 

బాబు మూడేళ్ల పాలనకు నిదర్శనం: సోమిరెడ్డి

అమరావతి: సీఎం చంద్రబాబు మూడేళ్ళ పాలనకు ఈ ఎన్నిక ఫలితాలు నిదర్శనమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికోసం బాబు పడుతున్న కష్టాన్ని నంద్యాల ప్రజలు గుర్తించారని అన్నారు. ఈ ఎన్నిక ప్రచారంలో జగన్ వాడిన భాష అక్కడి ప్రజలకు ఆగ్రహం కలిగించిందని, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ హవా కనిపించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.

హర్షం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు

అమరావతి: నంద్యాల ఉపఎన్నిక ఫలితాలు తమకు అనుకూలంగా ఉండడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటివద్ద పార్టీ కార్యకర్తలు పటాసులు కాల్చి తమ ఆనందోత్సాహాలను ప్రకటించారు.

10వ రౌండ్ లో టిడిపి ఆధిక్యం

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల్లో టిడిపి ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. 10వ రౌండ్ ముగిసే సమయానికి 1486 ఓట్ల ఆధిక్యం సాధించింది. కౌంటింగ్ హాల్ నుంచి వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు.

డబ్బు, సానుభూతి వల్లే టిడిపి గెలుపు: శిల్పా

కర్నూలు : విచ్చలవిడి డబ్బు పంపిణీ, సానుభూతి వల్లే టిడిపి గెలుపు అని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు.అంతే కాకుండా కౌంటింగ్ హాల్ నుంచి శిల్పా బయటకు వెళ్లిపోయారు.

 

11:19 - August 28, 2017

కర్నూలు : ఆళ్లగడ్డ తల్లి..నంద్యాల తండ్రితో సమానమని ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్ నుండి టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి అఖిల ప్రియతో టెన్ టివి మాట్లాడింది. వార్డుల వారీగా..బూత్ ల వారీగా..వర్కవుట్ చేయడం జరిగిందని, తాము ఊహించినట్లే ఓట్లు వస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ప్రచారం నిర్వహించడం జరిగిందని, వ్యక్తిగతంగా ఎక్కడా విమర్శలు చేయలేదన్నారు. అభివృద్ధి విషయం..తల్లిదండ్రులు చెప్పిన మాటలను ప్రజలకు చెప్పడం జరిగిందని చెప్పుకొచ్చారు. కేవలం నంద్యాల విషయంలో టిడిపి గురించి మాట్లాడవసరం లేదని, అభివృద్ధి ఇంకా జరగాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృద్ధి విషయంలో ప్రతొక్కరూ సహకరించాలని మంత్రి అఖిల ప్రియ సూచించారు.

సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని చెప్పిన వెంటనే ఎవరూ వెనక్కి వెళ్లరని తెలిపారు. రాజీనామా చేయాలని అనుకుంటే రాజీనామా చేస్తానని..కేవలం అభివృద్ధి విషయంలోనే తాను పార్టీ మారనడం జరిగిందన్నారు. భూమా కుటుంబాన్ని నమ్ముకున్న వారు ఎవరూ వైసీపీ పార్టీలోకి వెళ్లలేదన్నారు. పార్టీలకన్నా..వ్యక్తులకు ప్రాధాన్యతనిస్తారని..ఇక్కడ కూడా అదే జరిగిందన్నారు. ఎవరూ తనను కోశ్చన్ చేయలేరని...ప్రజలు కొశ్చన్ చేస్తే సమాధానం ఇస్తానన్నారు. గోస్పాడు మండలంలో ఎక్కువ మెజార్టీ వచ్చినా ఆశ్చర్యపడాల్సినవసరం లేదని, ఈ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు సపోర్టు చాలా ఉందని..ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు మంత్రి అఖిల తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

రైల్వే కోర్టుకు మంత్రులు కేటీఆర్, నాయిని, పద్మారావు

సికింద్రాబాద్: రైల్ రోకో కేసులో రైల్వే కోర్టు మంత్రులు నాయిని, కేటీఆర్, పద్మారావు హాజరయ్యారు. 2011 ఉద్యమ సమయంలో రైల్ రోకో కేసులో వీరు కోర్టుకు హాజరయ్యారు.

9వ రౌండ్ లో 19,135 ఓట్ల ఆధిక్యంలో టిడిపి

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల్లో టిడిపి ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. 9వ రౌండ్ ముగిసే సమయానికి 19,135 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది.

10:49 - August 28, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్ గాలి వీచలేదు. సైకిల్ దూసుకెళుతోంది. ఉప ఎన్నిక కౌంటింగ్ ఉదయం నుండి కొనసాగుతోంది. తొలి రౌండ్ నుండి టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి వెనుకంజలో ఉండిపోయారు. ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి 16,912 ఓట్ల అధిక్యంలో టిడిపి కనబరిచింది. ఈ రౌండ్ లో టిడిపికి 512 ఓట్ల అధిక్యంలో కొనసాగింది. ఈ ఫలితాలపై టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ సాయిరాం విశ్లేషణ అందించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

మహారాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది మృతి

హైదరాబాద్: మహారాష్ట్రలో వేగంగా వస్తున్న ట్ర‌క్కు ఓ డస్సు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. వారిని దగ్గరలోని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

దూసుకుపోతున్న టిడిపి

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల్లో టిడిపి దూసుకుపోతోంది. ఏడో రౌండ్ లో టిడిపి 512 ఓట్ల ఆధిక్యం సంపాదించింది. ఆ రౌండ్ పూర్తయ్యే సరికి టిడిపికి మొత్తం 16,880 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

 

10:38 - August 28, 2017

వికెఎ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ తన ద్వితీయ చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం "ఇగో". విజయ్ కరణ్-కౌసల్ కరణ్-అనిల్ కరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆశిష్ రాజ్-సిమ్రాన్ లు జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ను గోదావరి పరిసర ప్రాంతాల్లో తీయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రోమాంటిక్ సస్పెన్స్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "ఇగో" రెండు షెడ్యూల్స్ పూర్తయ్యిందని తెలిపారు. . భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయకుడి క్యారెక్టరైజేషన్ సరికొత్తగా ఉంటుందన్నారు. అనుకొన్నదానికంటే ముందుగానే షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీపడకుండా ప్రేక్షకులకు క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చేందుకు సర్వ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం.. ఆశిష్ రాజ్, సిమ్రాన్, దీక్షాపంత్, రావురమేష్, పోసాని కృష్ణమురళి, పృధ్వి, గౌతంరాజు, షకలక శంకర్, చంద్ర, వేణు, శివన్నారాయణ, భద్రం, రైజింగ్ రాజు, గుండు మురళిలు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ జి.కె, ఆర్ట్: ఆర్.కె, ఫైట్స్: నందు, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, నిర్మాతలు: విజయ్ కరణ్-కౌసల్ కరణ్-అనిల్ కరణ్, రచన-దర్శకత్వం: సుబ్రమణ్యం. 

10:31 - August 28, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల్లో ఫలితాలను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందని స్వర్గీయ భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్ నుండి టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరో రౌండ్ లో కూడా ఆయన ముందంజలో కొనసాగుతుండడం..వైసీపీ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో భూమా మౌనిక ముచ్చటించారు. తమ ఫ్యామిలీ ర్రాతింబవళ్లు కష్టపడ్డామని, నాన్న చనిపోయినా ఒకే నినాదంపై నిలవడం జరిగిందన్నారు.

తమతో పాటు టిడిపి మంత్రులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారని, వారికందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. గత 30 సంవత్సరాలుగా ప్రజల్లో నాన్న భూమా నాగిరెడ్డి..అమ్మ భూమా శోభనాగిరెడ్డి ప్రజల్లో ఉన్నారని, ఆ ప్రేమ తమపై ఉందన్నారు. ఆ నమ్మకమే ఎన్నికల్లో తమను నిలబెట్టే విధంగా చేసిందన్నారు. శిల్పా మోహన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో నాన్న భూమా నాగిరెడ్డి చూశారని పేర్కొన్నారు. బెదిరించే సంస్కారం తమకు లేదని భూమా మౌనిక పేర్కొన్నారు. ఇంకా ఏమి మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నసీఎం పారికర్

గోవా: ఉప ఎన్నిక‌ల్లో విజయ దుందుబి మోగించిన సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్ ప‌నాజీ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి గిరిష్ చొద‌న్క‌ర్ పై ఎమ్మెల్యే గా మ‌నోహ‌ర్ 4803 ఓట్ల మెజారిటీ తోగెలుపొందారు. గెలుపొందిన విషయం తెలిసిందే.

10:23 - August 28, 2017

హైదరాబాద్: ‘గంగ’లాంటి హారర్ కామెడీలతో హిట్ కొట్టిన లారెన్స్ తాజాగా ముని సీక్వెల్ తీయబోతున్నారని అందులో కాజల్ అగర్వాల్ లాడ్ రోల్ లో నటిస్తోందని టాలీవుడ్ టాక్.‘గంగ’ మూవీలో నిత్య మీనన్ రోల్ హైలైట్ అయినట్టే.. ఈ సీక్వెల్‌లో కాజల్ రోల్ హైలైట్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ సీక్వెల్‌లో కాజల్ నటిస్తుందా లేదా అనేది విషయంలో అఫిషియల్‌గా క్లారిటీ రావాల్సి వుంది. 

సింధూకు రూ.10లక్షలు, సైనాకు రూ.5లక్షలు...

ఢిల్లీ: ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్ షిప్ 2017 లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన పీవీ సింధు, కాంస్య ప‌త‌కం గెలిచిన సైనా నెహ్వ‌ల్ కు బ్యాడ్ మింట‌న్ అసోషియేష‌న్ ఆఫ్ ఇండియా (బీఏఐ) రివార్డులు ప్ర‌క‌టించింది. సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన సింధు కు రూ. 10 ల‌క్ష‌లు, కాంస్యం గెలిసిన సైనాకు రూ. 5 ల‌క్ష‌లు ప్ర‌క‌టించిన‌ట్లు బీఏఐ తెలిపింది.

10:11 - August 28, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక..ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారు ? అనేది కాసేపట్లో తేలనుంది. 2019 ఎన్నికలకు సెమీ ఫైనల్ అంటూ విపక్షాలు పేర్కొన్నాయి. తామే గెలుస్తామని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పేర్కొంది. ధర్మ..అధర్మం మధ్య పోరు కొనసాగుతోందని ఆ పార్టీ అధినేత జగన్ ప్రచారంలో పేర్కొన్నారు.

సోమవారం ఉదయం పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. తొలి రౌండ్ నుండి టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. మొత్తంగా 19 రౌండ్లు ఉన్నాయని..రానున్న రౌండ్లలో తాము ముందుకెళుతామని వైసీపీ నేతలు పేర్కొన్నారు. కానీ ఐదో రౌండ్ లో కూడా భూమా ముందుకు కొనసాగుతుండడం..వైసీపీ శిల్పా మోహన్ రెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు. టిడిపి అభ్యర్థి 12వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా టిడిపి 24, 162 ఓట్లు సాధించగా వైసీపీకి 14, 492 ఓట్లు సాధించగలిగింది. ఇక్కడ కాంగ్రెస్ మాత్రం ఏలాంటి ఫలితం చూపించలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఖాదీర్ కేవలం 278 ఓట్లతో ఉండడం విశేషం.

తొలి రౌండ్ : టిడిపి - 5477, వైసీపీ - 4279, టిడిపి మెజార్టీ - 1198.

రెండో రౌండ్ : టిడిపి - 5160, వైసీపీ - 3400, టిడిపి మెజార్టీ - 2960.

మూడో రౌండ్ : టిడిపి - 7058, వైసీపీ - 3945, టిడిపి అధిక్యం - 3113

నాలుగో రౌండ్ : టిడిపి - 6465, వైసీపీ - 2868, టిడిపి మెజార్టీ - 3597.. 

నేడు తెలుగు రాష్ట్రాల సీఎస్ ల భేటీ

హైదరాబాద్: నేడు ఇరు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశం కానున్నారు. తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్, ఏపీ సీఎస్ దినేశ్‌కుమార్ తెలంగాణ సచివాలయం సీబ్లాక్‌లోని సమావేశ మందిరంలో ఉద్యోగుల విభజనకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా రాష్ర్టానికి చెందిన నాలుగోతరగతి ఉద్యోగులను వెనక్కి తీసుకువచ్చే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన దీపక్ మిశ్రా

న్యూఢిల్లీ: 45వ సుప్రీం కోర్టు ప్రధాన న్యామూర్తిగా జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్, ప్ర‌ధాని మోడీ, ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు హాజ‌ర‌య్యారు. దీప‌క్ మిశ్రాతో రాష్ట్ర‌ప‌తి కోవింద్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. 1977 లో లాయ‌ర్ గా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు మిశ్రా. 1996 లో ఒరిస్సా హైకోర్ట్ అడిష‌న‌ల్ జ‌డ్జ్ గా ఆయ‌న‌ను నియ‌మించారు. ఆ త‌ర్వాత మ‌ధ్య ప్ర‌దేశ్ లో ప‌ని చేశారు. 2009 లో పాట్నా హైకోర్టు కు చీఫ్ జ‌స్టిస్ గా ప‌ని చేశారు. 2010 లో ఢిల్లీ హైకోర్టు కు చీఫ్ జ‌స్టిస్ గా ప‌నిచేశారు.

10:06 - August 28, 2017

యూపీ: లక్నోలోని రాంమనోహర్ లోహియా దవాఖానలోని మార్చురీ వార్డులో ఉంచిన మహిళ మృతదేహం శరీర భాగాలను ఓ కుక్క పీక్కుతింది. ప్రభుత్వ దవాఖానల్లో నిరక్ష్యం ఎలా ఉంటుందో చూపే ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్నది. ఈ ఘటనపై తీవ్ర ఆరోపణలు రావడంతో హాస్పిటల్ భద్రతా సూపర్‌వైజర్‌తోపాటు ఓ గార్డును విధుల్లో నుంచి తొలిగించారు. చిన్‌హట్ వాసి పుష్పా తివారీ (40) విషప్రయోగంతో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందింది. ఇది మెడికో లీగల్ కేసు కావడంతో శవపరీక్ష కోసం మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. 

నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలను నిశితంగా పరిశీలిస్తోన్న సీఎం

అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలను సీఎం చంద్రబాబు తన నివాసం నుండి పరిశీలిస్తున్నారు. ఈ పాటికిఏ సీఎం నివాసాని మంత్రులు కూడా చేరుకున్నారు. 11 గంటలకు సీఎం సచివాలయానికి చేరుకోనున్నారు.

10:00 - August 28, 2017

కర్నూలు : నంద్యాల బై పోల్ కౌంటింగ్ కొనసాగుతోంది. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ముందంజలో కొనసాగుతుండగా వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వెనుకంజలో కొనసాగుతున్నారు. ఉదయం 8గంటలకు పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం ప్రారంభమైన తొలి నుండి టిడిపి అభ్యర్థి భూమా ముందంజలో కొనసాగారు. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి టిడిపి అభ్యర్థి భూమా 3597 ఓట్ల ఆధిక్యం కనబరిచారు. మొత్తంగా నాలుగో రౌండ్ తరువాత టిడిపి 9370 ఓట్ల ఆధిక్యం కనబరిచినట్లైంది.

తొలి రౌండ్ : టిడిపి - 5477, వైసీపీ - 4279, టిడిపి మెజార్టీ - 1198.

రెండో రౌండ్ : టిడిపి - 5160, వైసీపీ - 3400, టిడిపి మెజార్టీ - 2960.

మూడో రౌండ్ : టిడిపి - 7058, వైసీపీ - 3945, టిడిపి అధిక్యం - 3113

నాలుగో రౌండ్ లో కూడా టిడిపి అభ్యర్థి భూమా ముందంజలో కొనసాగుతున్నారు. 

09:53 - August 28, 2017
09:53 - August 28, 2017

హైదరాబాద్: నాలుగు రాష్ట్రాలను వణికించిన డేరా బాబ కు అత్యాచారం కేసులో నేడు శిక్షను కోర్టు ఖరారు చేయనుంది. బాబాలకు రాజకీయ పార్టీల అండదండలు వుండటం, బిజెపి ఎంపి సాక్షి మహారాజ్ డేరా బాబాకు మద్దతు తెలిపారు. ఈ సంస్కృతిని ఎలా అర్థం చేసుకోవాలి. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. నంద్యాల ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాలను తీవ్ర ప్రభావం చేయనున్నాయా? ఈ అంశాలపై 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిడిపి అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, వైసిపి నేత మదన్ మోహన్ రెడ్డి, బిజెపి నేత వేణుగోపాల్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి

09:50 - August 28, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. తొలుత పొస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. మొత్తంగా 250 ఓట్లు ఉన్నాయి. ఇందులో 211 మంది ఉద్యోగులు ఓటు వేయలేదు. 39 ఓట్లు చెల్లనవిగా గుర్తించారు. ఓటు వేయలేకపోవడం..చెల్లనివి ఓట్లు రావడంతో అధికారులు ఆశ్చర్య వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులే తమ ఓటు హక్కు సరిగ్గా వినియోగించుకోకపోవడం విడ్డూరం. కౌంటింగ్ కేంద్రంలోకి మీడియాను అనుమతించకపోవడంతో ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

నియోజకవర్గంలోని 225 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 1,73,335 ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 19 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. ప్రతి రౌండ్‌కు తొమ్మిది వేల ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. చివరి రౌండ్‌లో మాత్రం అదనంగా మరికొన్ని ఓట్లు చేరే అవకాశం ఉంది. 

నాల్లో రౌండ్ లోనూ టిడిపి ఆధిక్యం

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో టిడిపి ఆధిక్యం కొనసాగుతుంది. నాల్గో రౌండ్ పూర్తయ్యే సరికి 9700 ఓట్ల ఆధిక్యంలో టిడిపి కొనసాగుతుంది. నాల్గో రౌండ్ లో టిడిపి కి 3800 ఓట్ల ఆధిక్యం కనబర్చింది.

09:44 - August 28, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో ఈ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు. నియోజకవర్గంలోని 225 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 1,73,335 ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 19 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. ప్రతి రౌండ్‌కు తొమ్మిది వేల ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. చివరి రౌండ్‌లో మాత్రం అదనంగా మరికొన్ని ఓట్లు చేరే అవకాశం ఉంది. ఇక ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కౌంటింగ్‌లో.. 10.30 గంటల వరకు ఫలితం వెలువడే అవకాశం ఉంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

6073 ఓట్ల ఆధిక్యంలో టిడిపి..

కర్నూలు : నంద్యాల బై పోల్ లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ పూర్తయ్యే సరికి 6073 ఓట్ల మెజార్టీ సాధించారు. 

09:30 - August 28, 2017

కర్నూలు : ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి...వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిలు బరిలో నిలుచున్న సంగతి తెలిసిందే. ఆయా పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు బరిలోకి దిగి విస్తృతంగా పర్యటించారు. తమదే గెలుపంటే..తమదే గెలుపని ఆయా పార్టీల నేతలు పేర్కొన్నారు.

సోమవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. ప్రారంభంలోనే టిడిపి అధిక్యంలో కొనసాగుతుండడం గమనార్హం. రెండో రౌండ్ లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 2వేలకు పైచిలకు పైగా ఓట్లు సంపాదించారు. ప్రస్తుతం మూడో రౌండ్ ముగిసింది. ఈ రౌండ్ లో సైతం సైకిల్ దూసుకెళ్లింది. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 11802 ఓట్లతో ముందుకెళుతుండగా వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి 9039 ఓట్లతో వెనుకంజలో ఉండిపోయారు. కానీ దీనిపై వైసీపీ భిన్నంగా స్పందిస్తోంది. మొత్తం 19 రౌండ్లు ఉన్నాయని..కేవలం మూడు రౌండ్లకే ఎలా ఫలితం చెబుతారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. 

మూడో రౌండ్ లోనూ టిడిపిదే ఆధిక్యం..

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో రౌండ్ లోనూ టిడిపిదే ఆధిక్యం కొనసాగుతోంది. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 11802 ఓట్లు..వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి 9039 ఓట్లతో వెనుకంజలో ఉండిపోయారు.

 

నగరానికి రానున్న రాజ్యసభ కమిటీ..

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై అధ్యయనం చేయడానికి కేంద్రప్రభుత్వం నియమించిన రాజ్యసభ కమిటీ సోమవారం హైదరాబాద్‌కు రానుంది. 15 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ హోటల్ మారియట్‌లో సమావేశం కానుంది. 

09:20 - August 28, 2017

నెల్లూరు : క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపనుందా ? పోలీసుల విచారణానంతరం వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్  రెడ్డి ఎందుకంత ఘాటుగా స్పందించారు ? డైరెక్టుగా సీఎం చంద్రబాబు పైనే  విమర్శలు ఎందుకు సంధించినట్టు?  ఎమ్మెల్యే  శ్రీధర్ రెడ్డిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశముందా?  నెల్లూరుజిల్లాలో  ఉత్కంఠ  రేపుతున్న క్రికెట్‌ బెట్టింగ్‌ పొలిటికల్‌ హీట్‌పై 10టీవీ కథనం చదవండి..

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసే ఛాన్స్‌?
 క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం నెల్లూరు రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ను పోలీసులు విచారించారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని విచారించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. పక్కా ఆధారాలు సేకరించినట్టు సమాచారం. సేకరించిన ఆధారాల ఆధారంగా వైసీపీ ఎమ్మెల్యేలపై  చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరో మూడు, నాలుగు రోజుల్లో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసే అవకాశాలున్నట్టు పోలీస్‌ వర్గాల నుంచి సంకేతాలు వస్తున్నాయి. 

రాజకీయ కక్షతోనే..!

 క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో తన ప్రమేయం లేదని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు. ప్రభుత్వం తనను రాజకీయంగా ఎదుర్కోలేకే క్రికెట్‌ బెట్టింగ్‌లోకి లాగిందంటూ ఆరోపిస్తున్నారు. అయినా ప్రభుత్వంతో పోరాడేందుకు రెడీ అంటున్నారు. తనను అరెస్ట్‌ చేస్తారన్న ప్రచారంతో దాన్ని రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. విచారణ ముగిసిన తర్వాత ఆయన చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.  వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు భయపెట్టి, బెదిరించి.. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని,  తనపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని ప్రకటించారు. చంద్రబాబు పొలీసులతో పొలిటికల్‌ డ్యూటీలు చేయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

చర్యలు ఖాయం!
 కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే  రెండు అంశాలు స్పష్టమవుతున్నాయి.. కోటం రెడ్డిపై చర్యలు ఖాయమన్న భావనతో పాటు దీన్ని రాజకీయంగా న్యాయస్థానాల నుంచి కూడా  బయటపడేందుకు సిద్దమవుతున్నట్లు స్పష్టమ వుతోంది.. కోటంరెడ్డి పై పోలీసు యంత్రాంగం  చర్యలకు సిద్దమైతే ఇది రాజకీయ దుమారాన్ని లేపే అవకాశాల కనిపిస్తున్నాయి. 9 మంది బుకీలకు చెందిన వన్ ఇయర్ కాల్ డేటాను బయటికి తీయాలన్న కోటంరెడ్డి డిమాండ్ వ్యవహారం రాజకీయ వివాదం అవుతుందనే చర్చ జరుగుతోంది.  మొత్తం మీద  ఈ బెట్టింగ్  వ్యవహారం ఎమ్మెల్యే  విచారణ అనంతరం కూడా ఉత్కంఠను కొనసాగిస్తోంది .

నేడు ఇరు రాష్ట్రాల సీఎస్ ల భేటీ..

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమవారం సమావేశం కానున్నారు. తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్, ఏపీ సీఎస్ దినేశ్‌కుమార్ లు భేటీ కానున్నారు. తెలంగాణ సచివాలయం సీబ్లాక్‌లోని సమావేశ మందిరంలో ఉద్యోగుల విభజనకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. 

సంగారెడ్డికి కడియం శ్రీహరి..

సంగారెడ్డి : రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, విద్యా శాఖ మంత్రి క‌డియం శ్రీహ‌రి సంగారెడ్డికి రానున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు సంగారెడ్డి లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఆయ‌న ప్రారంభించనున్నారు. 

లంకపై 3-0తో సిరీస్ భారత్ కైవసం..

హైదరాబాద్ : భారత్ అదరగొట్టేసింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో లంకను చిత్తు చేసి మూడో వన్డేను గెలవడమే కాకుండా సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. రోహిత్, ధోనితో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా (5/27) విజృంభించడంతో భారత్ కు ఎదురు లేకుండా పోయింది. లంక 50 ఓవర్లలో 9వికెట్లకు 217 పరుగులకే పరిమితం కాగా లక్ష్యాన్ని భారత్ 45.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. 

09:12 - August 28, 2017

విజయవాడ : నంద్యాల ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇవాళ జరిగే కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్‌... 11.30  వరకు ఫలితం తేలే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ, వైసీపీలు గెలుపు మాదంటే.. మాది అని చెబుతుండడంతో కౌంటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

విస్తృత ఏర్పాట్లు.. 
నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటలకు స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌంటింగ్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలోని 225 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 1,73,335 ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 19 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. ప్రతి రౌండ్‌కు తొమ్మిది వేల ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. చివరి రౌండ్‌లో మాత్రం అదనంగా మరికొన్ని ఓట్లు చేరే అవకాశం ఉంది. ఇక ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్‌లో.. 10.30 గంటల వరకు ఫలితం తేలే అవకాశం కనిపిస్తోంది.

144 సెక్షన్
ఇక ఓట్ల లెక్కింపులో తొలుత నంద్యాల మండలం ఓట్లను లెక్కించి తరువాత నంద్యాల పట్టణం, గోస్పాడు మండలం ఓట్లను లెక్కిస్తారు. అనంతరం మిగతా ప్రాంతాల ఓట్ల కౌంటింగ్‌ జరగనుంది. ఇక కౌంటింగ్‌ కేంద్రంలోకి పోటీలో ఉన్న అభ్యర్థులు, జనరల్‌ ఏజెంట్లు, పోలింగ్‌ సిబ్బంది, అధికారులకు తప్ప మరేవరికీ ప్రవేశం లేదు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. పాసులు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతించనున్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ విధించారు. లెక్కింపు కేంద్రం దగ్గర, సమీప ప్రాంతంలో సుమారు 200 మంది వివిధ స్థాయి పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. 

ఏర్పాట్లు పూర్తి..
ఇక ఓట్ల లెక్కింపు పకడ్బందీగా, జాగ్రత్తగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్న భన్వర్‌లాల్‌... ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఒక్కో టేబుల్‌ వద్ద ఎంపీడీవో, తహశీల్దార్‌, డిప్యూటీ తహశీల్దార్ల స్థాయి అధికారులను ఏర్పాటు చేశామన్నారు. త్తానికి నెలరోజుల పాటు ఎంతో ఉత్కంఠగా కొనసాగిన నంద్యాల బైపోల్‌ వార్‌ ఫలితం.. కొన్ని గంటల్లో తేలనుంది. అధికార, ప్రతిపక్షం ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించడంతో... విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. 

నేడు గుర్మీత్ శిక్ష ఖరారు..

హార్యానా : అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు సీబీఐ కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 

భూమా బ్రహ్మానందరెడ్డి ముందంజ..

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. రెండో రౌండ్ లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ముందంజలో ఉన్నారు. 5477 ఓట్లతో భూమా కొనసాగుతుండగా శిల్పా మోహన్ రెడ్డి 4279 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

కొనసాగుతున్న నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్..

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక ఫలితం కౌంటింగ్ కొనసాగుతోంది. రెండో రౌండ్ లోనూ టిడిపిదే ఆధిక్యం దిశగా ముందుకెళుతోంది. రెండో రౌండ్ లో టిడిపి అభ్యర్థి 1634 ఓట్ల ఆధిక్యం కనబరిచాడు. 

Don't Miss