Activities calendar

29 August 2017

22:07 - August 29, 2017
22:05 - August 29, 2017
22:04 - August 29, 2017
22:01 - August 29, 2017

హైదరాబాద్ : పనామా పేపర్స్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ నేతలు హాజరయ్యారు. నల్లధనం దొంగల పేర్లు బయటపెట్టకుండా ప్రభుత్వం వారిని కాపాడుతోందని సురవరం విమర్శించారు. దీనిపై సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకూ దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. 

21:57 - August 29, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ అగ్రికల్చర్‌ బీఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయకపోతే పోరాటం చేస్తామని  జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఏపీకి చెందిన ఏజీ బీఎస్సీ విద్యార్ధులు హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్‌ను కలిశారు. జీవో 64ను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు 25 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడంతో విద్యార్థులు పవన్‌కల్యాణ్‌ను కలిసి మద్దతు కోరారు. వివరాలన్నీ తెలుసుకున్న జనసేనాని... విద్యార్థుల డిమాండ్‌లో వాస్తవం ఉందని... సమస్యను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయకపోతే పోరాటం చేస్తామని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. 

 

21:52 - August 29, 2017
21:51 - August 29, 2017
21:50 - August 29, 2017

ఏ ప్రయాణం ఏ విషాదానికి దారి తీస్తుందో ఊహించలేని పరిస్థితి..భారతీయ రైల్వే భద్రతా ప్రమాణాలు ఎంత? తరచు ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? మన రైలు ప్రయాణంలో సేఫ్టీ గాల్లో దీపమేనా? వరుస ప్రమాదాలు ఎన్నో ప్రశ్నలు మిగులుస్తున్నాయి. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. 
ఎన్నో కన్నీటి గాథలు.. 
ఎందరో ప్రయాణికులు.. ఎన్నో కన్నీటి గాథలు.. పెళ్లికి వెళ్లే వాళ్లు.. సొంతింటికి వెళ్లే వాళ్లు.. వ్యాపార నిమిత్తం ప్రయాణించేవాళ్లు.. ఇలా ఎన్నో కలలు మోసుకుంటూ వెళ్లే ఎందరో అమాయకులు..  అకస్మాత్తుగా పట్టాలు తప్పిన రైల్లో చితికిపోయే జీవితాలు.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:46 - August 29, 2017

కేసీఆర్ను ఎక్కిరిస్తున్న అగ్రీ అవార్డు, హైద్రావాదు కొచ్చేశిన రెండువందల నోటు, లేని నీళ్ల కోసం ఉన్న లీడర్ల పంచాది, కలెక్టర్ను కశిరిచ్చుకున్న ఎర్రబల్లి, ఇర్వై లక్షల కారు లక్ష రూపాలకే అమ్మకం, ఆకులు తింటే జ్ఞానం పెర్గుతదట... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం....

21:39 - August 29, 2017

యాదాద్రి : భువనగిరిలోని ఏఆర్ గార్డెన్స్‌లో టీ.మాస్‌ ఫోరం ఆవిర్భావ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర  కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రజా గాయకుడు గద్దర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏ లక్ష్యంతో తెలంగాణ ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని పాలకులు మరిచిపోయారని నేతలన్నారు. ఈ కార్యక్రమానికి 72 సామాజిక, ప్రజా సంఘాల నేతలతో పాటు.. నాలుగు వేల మంది కార్యకర్తలు హాజరయ్యారు. 

 

21:37 - August 29, 2017

విజయవాడ : కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున హైదరాబాద్, నల్లగొండ జిల్లాల ప్రజలు ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వాడుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. కృష్ణానది నీటిపై ఆధారపడిన హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో మంచినీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కేసీఆర్ అన్నారు. మంచినీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సింగూర్ నుంచి హైదరాబాద్‌కు నీరు వదలాలని ఆదేశించారు.  నాగార్జునసాగర్ నుంచి అక్కంపల్లి ద్వారా ఉదయ సముద్రానికి నీరు వదిలి నల్లగొండ జిల్లా ప్రజలకు మంచినీరు ఇవ్వాలని సూచించారు. 

21:27 - August 29, 2017

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలో అదనపు కమిషనర్ జయరాజ్ కెనడీ ఏఎంసీని దుర్భాషలాడారు. చెప్పుతో కొడతానని కింది స్థాయి అధికారిని తిట్టడంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు కెనడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు ఉద్యోగ సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. వెంటనే కెనడీపై చర్యలు తీసుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

21:06 - August 29, 2017
20:50 - August 29, 2017
20:46 - August 29, 2017
20:46 - August 29, 2017

పెద్దపల్లి : జిల్లాలోని మంథని మండలం సిరిపురంలో ఇసుక తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. మంచిర్యాల జిల్లా నుంచి నడవాల్సిన లారీలు ఆ వైపు నుంచి తిరగకుండా.. తమ గ్రామం నుంచి వెళ్లడంతో రోడ్లు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా... గ్రామ పంచాయతీకి ఎలాంటి సీనరేజ్‌ చెల్లించకుండా.. ధర్మారంలో నిర్మిస్తున్న కాళేశ్వరం టన్నెల్‌కు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని లారీలను పంపించారు. 

 

20:44 - August 29, 2017

చండీఘర్ : హర్యానాకు చెందిన మరో బాబా రాంపాల్‌కు హిస్సార్‌ కోర్టులో ఊరట లభించింది. 2014లో సత్‌లోక్‌ ఆశ్రమానికి సంబంధించిన రెండు కేసుల్లో  రాంపాల్‌ను నిర్దోషిగా తేల్చింది. ఆశ్రమంలో మహిళలను బంధించారని, రాంపాల్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారాలను అడ్డుకున్నందుకు ఆయనపై కేసులు నమోదయ్యాయి. 426, 427 కింద నమోదైన రెండు కేసుల్లో రాంపాల్‌ నిర్దోషిగా తేలినప్పటికీ ఇంకా ఆయన జైలులోనే ఉండాల్సి ఉంటుంది. రాంపాల్‌కు వ్యతిరేకంగా హత్య కేసు, దేశద్రోహం కేసు కొనసాగనున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో హిస్సార్‌లో 144 సెక్షన్‌ విధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తనని తాను దేవుడిగా చెప్పుకున్న రాంపాల్‌పై 2006లో హత్యకు సంబంధించి ఓ కేసు ఉంది. 2014, న‌వంబ‌ర్‌లో ఇదే కేసుకు సంబంధించి కోర్టుకు తీసుకెళ్లడానికి సత్‌లోక్‌ ఆశ్రమానికి పోలీసుల వ‌స్తే.. వేల సంఖ్యలో ఉన్న అత‌ని అనుచ‌రులు అడ్డుకున్నారు. విధ్వంసం సృష్టించారు. అలా అడ్డుకున్నందుకు అత‌నిపై మ‌రో మూడు కేసులు న‌మోద‌య్యాయి. జూనియర్‌ ఇంజనీర్‌గా ఉన్న రాంపాల్‌ 1996లో బాబాగా అవతరించాడు.

 

20:41 - August 29, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోన్నారని కాంగ్రెస్ నేత మల్లుభట్టివిక్రమార్క విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులను సీఎం హరిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయా పార్టీల పేరుతో వారి హక్కులను కాలరాస్తున్నారని తెలిపారు.

20:39 - August 29, 2017

విజయవాడ : మీరు బెజవాడ వాసులా? హెల్మెట్‌ లేకుండా బైకును నడుపుతున్నారా? త్రిబుల్‌ రైడింగ్‌తో ఫ్రెండ్స్‌తో షికార్లు చేస్తున్నారా? లైసెన్స్‌, వాహనపత్రాలు లేకున్నా లైట్‌ తీసుకుంటున్నారా? తస్మాత్‌ జాగ్రత్త. సెప్టెంబర్‌ 1 నుంచి ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్న రూల్‌ను ఆర్టీఏ, పోలీస్‌ అధికారులు అమల్లోకి తేనున్నారు. లేదంటే ఫైన్ల మోత మోగించనున్నారు. 
సెప్టెంబర్ 1 నుంచి హెల్మెట్ నిబంధన అమలు
సెప్టెంబర్ 1 నుంచి విజయవాడ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్‌ నిబంధనను అమల్లోకి తెచ్చేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారికి  భారీ జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రహదారి భద్రతా నియమాలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోబోతున్నారు. కొత్త నిబంధనపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
ద్విచక్ర వాహన ప్రమాదాలు
ద్విచక్ర వాహన ప్రమాదాల్లో అత్యధికంగా బ్రెయిన్‌ డ్యామేజ్‌తోనే మరణాల సంఖ్య ఎక్కువ అని ఘణాంకాలు చెబుతున్నాయి.  ప్రమాదాలు జరిగిన సమయంలో ఐఎస్‌ఐ బ్రాండ్‌ కలిగిన హెల్మెట్లు ధరించినట్లయితే.. బ్రెయిన్‌ డ్యామేజీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.  స్టయిల్‌గా కనిపించాలని కొందరు, జుట్టు ఊడిపోతుందన్న అపోహతో మరికొందరు హెల్మెట్‌ ధరించడానికి సుముఖత చూపడం లేదు. కానీ శిరస్త్రాణం తమ విలువైన ప్రాణాలు కాపాడుతుందన్న నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. బైకిస్టులు హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ లేకుండా కారు నడిపినా  వారికి భారీ జరిమానాలు విధించాలని ఉన్నతాధికారులు ట్రాఫిక్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రోడ్‌సెప్టీ నిబంధనలు పాటించని వారిపై ఆర్టీఏ, ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టనున్నారు. ఆర్సీ, లైసెన్స్‌, పొల్యూషన్‌ సర్టిఫికేట్‌, ఇన్సూరెన్స్‌ పత్రాలను పరిశీలిస్తారు. వీటిలో ఏ పత్రం లేకున్నా ఫైన్‌ విధిస్తారు. వాహన నెంబర్‌ సాయంతో డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఉన్నాయో లేదో తెలుసుకుంటారు. 
సరిపడా హెల్మెట్లు అందుబాటులో లేవు : విక్రయదారులు 
మరోవైపు బెజవాడలో బైకిస్టులకు సరిపడా హెల్మెట్లు అందుబాటులో లేవని విక్రయదారులు అంటున్నారు. వాస్తవ విషయాలు తెలుసుకోకుండా హెల్మెట్‌ తప్పనిసరి చేయడం సబబుకాదంటున్నారు. బెదిరింపులు, హెచ్చరికల ద్వారా కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలంటున్నారు.  
హెల్మెట్ ధరించాలని పలుమార్లు హైకోర్టు ఆదేశాలు 
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పలుమార్లు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. హెల్మెట్ వాడకం విషయంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు పటిష్టంగా అమలుకాకపోవడంతో..రోడ్డు ప్రమాదాలు యథాతథంగా మారాయి. ఇక ద్విచక్ర వాహనంతో పాటే నాణ్యమైన హెల్మెట్‌ కూడా విక్రయించాలని సుప్రీం కోర్టు 2010లో ఉత్తర్వులిచ్చింది. ఆచరణలో డీలర్లు, వాహనదారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి షరా మామూలే అన్నట్లుగా మారింది. సెప్టెంబర్‌ ఒకటి నుంచి హెల్మెట్‌ వాడకం, ట్రాఫిక్ నిబంధనలు అమలుపై ఆడియో, వీడియోల ద్వారా వాహనదారులకు అవగాహన కల్పించేందుకు బెజవాడ పోలీసులు సన్నద్ధమయ్యారు. 

20:36 - August 29, 2017

అనంతపురం : ప్రభుత్వాలు మారుతున్నా నాయకులు మారుతున్నా అక్కడి ప్రజల బతుకులు మాత్రం మారటం లేదు. ఆ కాలనీ పంచాయితీగా ఏర్పడి 15 సంవత్సరాలైనా అభివృద్ధి మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అనంతపురం జిల్లా రాజీవ్‌ కాలనీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై 10 టీవీ ప్రత్యేక కథనం...
కాలనీలో కనిపించని అభివృద్ధి
అనంతపురము నగరానికి కూత వేటు దూరంలో ఉండే రాజీవ్ కాలనీ పంచాయితీలో ఎక్కువ శాతం కూలీ నాలీ చేసుకునే వారే నివాసం ఉంటున్నారు. రాజీవ్ కాలనీ పంచాయితీ ఏర్పడి 15 సంవత్సరాలు కావస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధి కుంటుపడింది.  ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ్‌ భారత్ పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా రాజీవ్ కాలనీని అనంతపురము ఎమ్మెల్యే వైకుంటం ప్రభాకర్ చౌదరి దత్తత తీసుకున్నారు. కాని పంచాయితీ పరిధిలో ఏలాంటి అభివృద్ధి జరగలేదని ఏదో చుట్టపుచూపుగా అలావచ్చి ఇలా పోతారేగాని అభివృద్ది గురించి పట్టించుకునే వారే లేరని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.
వర్షం పడితే ఇంట్లోకి చేరుతున్న నీరు
వర్షం వస్తే కాలనీలోని నీళ్ళన్నీ ఇళ్లలోకి వస్తాయని గత వారం రోజులనుంచి వర్షాలు ఏకదాటిగా కురుస్తుండటంతో ఇళ్లలోకి వర్షపు నీటితోపాటు మురుగు నీరుకూడా చేరుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మురుగు నీటితో దోమల బెడద ఎక్కువైందని ..డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులబారిన పడుతున్నామని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఎవరూ తమని పట్టించుకోవడం లేదని కాలనీవాసులు అంటున్నారు. 
నీటి సమస్యతో అల్లాడుతున్న జనం
కాలనీలో గత మూడు నెలలుగా త్రాగు నీటి సమస్యఎక్కువగా ఉందని వారానికి ఒక్కసారి మాత్రమే ఇంటికి నీటి సరఫరా అవుతుందంటూ మండిపడుతున్నారు. దీని వల్ల కాలనీలో గొడవలు జరుగుతున్నాయని  ఇంతకు ముందు ట్యాంకర్లతో త్రాగునీటి అందించేవారని.. ఇప్పుడు ట్యాంకర్లు కూడా రావటం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. దీంతో తమ సమస్యలను ఎవ్వరికి చెప్పుకున్నా తీర్చేవారు లేరని గ్రామ పంచాయితీ వారు మాత్రం నీటి బిల్లులు వసూల్ చేస్తున్నారని అంటున్నారు. 
వర్షం పడితే కరెంట్ కూడా ఉండదని 
వర్షం పడితే కరెంట్ కూడా ఉంటదని చీకటిలో ఇంటినుంచి బయటికి రావాలన్నా బురదలో ఎక్కడ కింద పడతామో అని బయటికి రావాలంటే బయమేస్తోందని కాలనీ వాసులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాజీవ్ కాలనీ లోని త్రాగు నీటి సమస్యను, రోడ్లను వేసి తమ సమస్యలను తీర్చాలని కాలనీవాసులు వేడుకుంటుంన్నారు.

 

దాదాపు ముగిసిన డోక్లాం ప్రతిష్టంభన

ఢిల్లీ : డోక్లాం ప్రతిష్టంభన దాదాపు ముగిసింది. ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. జూన్ 16 నుంచి రెండున్నర నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగాయి. వివాదాస్పద ప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు చైనా, భారత్ అంగీకారం తెలిపాయి. మరోవారం రోజుల్లో చైనాలో బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో డోక్లాం సమస్యకు ముగింపు ఇవ్వాలని ఇరు దేశాలు భావించినట్లు సమాచారం. 

 

ప్రధాని మోడీ చైనా పర్యటన ఖరారు

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటన ఖరారు అయింది. సెప్టెంబర్ 3న మోడీ చైనా బయల్దేరారు. 5వ తేదీ వరకు చైనాలోని జియెమెన్ లో జరిగే 9వ బ్రిక్స్ సమావేశాల్లో మోడీ పాల్గొననున్నారు. చైనా పర్యటన ముగిసిన వెంటనే అటు నుంచి మయన్మార్ వెళ్లనున్నారు. మయన్మార్ లో 7వ తేదీ వరకు నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. మయన్మార్ అధ్యక్షుడితో ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. 

 

ఏఎంసీని దుర్భాషలాడిన జయరాజ్ కెనడీ

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలో అదనపు కమిషనర్ జయరాజ్ కెనడీ ఏఎంసీని దుర్భాషలాడారు. చెప్పుతో కొడతానని కింది స్థాయి అధికారిని తిట్టడంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు కెనడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు ఉద్యోగ సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. వెంటనే కెనడీపై చర్యలు తీసుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

20:21 - August 29, 2017

ఆశ్రమ సాధ్విలపై అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ సందర్భంగా మావని వేదికలో ప్రత్యేక చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాజిక కార్యకర్త దేవి, టీకాంగ్రెస్ నాయకురాలు ఇందిరాశోభన్ పాల్గొని, మాట్లాడారు. భక్తి పేరుతో మహిళలపై బాబాలు దారుణాలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. భక్తి ముసుగులో మోసాలు చేస్తున్నారని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

హార్టికల్చర్ డీడీ జయచంద్రారెడ్డి సస్పెండ్

గుంటూరు: హార్టికల్చర్ డీడీ జయచంద్రారెడ్డి సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ చేసిన వ్యవసాయశాఖ కమిషనర్ చిరంజీవి సబ్సిడీ పథకాల్లో అవినీతికి పాల్పడాడ్డని డీడీ జయచంద్రఆరెడ్డి పై ఆరోపణలు వెల్లువెత్తాయి.

జీవో 39ని వెంటనే రద్దు చేయాలి: భట్టి

హైదరాబాద్: 39 జీవోతో రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా తయారవుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. రెవెన్యూ వ్యవసాయ శాఖల ద్వారా చేయాల్సిన పనిని టీఆర్ ఎస్ నేతలకు ఎందుకు అప్పగిస్తున్నారన్నారు. రెవెన్యూ వ్యవసాయ శాఖలపై సీఎకం నమ్మకం లేదా భూ సమస్యలను నామినేటెడ్ సభ్యులు ఎలా పరిస్కరిస్తారు. చట్ట వ్యతిరేకమైన జీవో 39ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తాం అని హెచ్చరించారు.

16:43 - August 29, 2017

నిజామాబాద్‌ : జిల్లా ప్రభుత్వాస్పత్రిని సిబ్బంది కొరత వేధిస్తోంది. రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసినా ఫలితం నీరుగారిపోతోంది. రోజు రోజుకీ ఆస్పత్రిలో రోగుల తాకిడి ఎక్కువైపోతుండడంతో తగిన సిబ్బంది లేక,  ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. 
ఆస్పత్రిలో సిబ్బందిలేమితో రోగుల ఇబ్బందులు
నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలన్న ప్రభుత్వం ఆశలు అడయాశలవుతున్నాయి. వైద్యసేవల కోసం కోట్లు ఖర్చు చేసినప్పటికినీ ఫలితం మాత్రం శూన్యం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుండి ఆరోగ్య మంత్రిల వరకు హామీల వర్షం కురిపించినా ఆస్పత్రిలో సిబ్బంది కొరత మాత్రం తీరడంలేదు. ఏడంతస్తుల భవనంలో మెరుగైన సేవలందక రోగులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రైవేటు వైద్యులతో సేవలు
ఆస్పత్రికి అభివృద్ధి కమిటీ ఉన్నప్పటికీ రెగ్యులర్‌గా సమీక్షా, సమావేశాలు నిర్వహించడంలేదు. టీచింగ్‌ ఆస్పత్రిగా ఉన్నప్పటికీ వైద్యులను మాత్రం నియమించడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల నుండి వైద్యులను పిలిపించి సేవలు అందించాల్సిన దుస్తితి నెలకొంది. ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న వైద్య కళాశాల ప్రారంభమై నాలుగు సంవత్సరాలు దాటినా కళాశాలకు అనుబంధంగా జిల్లా కేంద్ర ఆస్పత్రికి మార్చారు. ఈ ఆస్పత్రిలో ఐదువందలున్న పడకలను 750కి పెంచారు. 250 కోట్లకు పైగా వెచ్చించి వైద్య కళాశాల భవనాలు, ఆస్పత్రి కోసం ఏడంతస్తుల మేడను కట్టారు. రోగులకు మెరుగైన వసతులు కల్పించారు.
ఆస్పత్రిలో వందల సంఖ్యలో ఖాళీలు
నిత్యం 1200లకు పైగా ఔట్ పేషెంట్లతో ఆస్పత్రి ప్రాంగణం కిటికిటలాడుతుంటుంది. ప్రతి నెల కనీసం 750కి పైగా ప్రసవాలు జరుగుతుంటాయి. రోగుల తాకిడితో ఆస్పత్రిలో ఉన్న 500 పడకలు సరిపోవడంలేదు. ఇంత పెద్ద ఆస్పత్రిలో అన్ని విభాగాలలోనూ వందల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. కీలక విభాగమైన రేడియోలజీలో మూడు నెలల నుండి సిబ్బంది లేరు. ప్రతి రోజు ప్రైవేటు ఆస్పత్రి వైద్యులను పిలిపించి పరీక్షలు చేయిస్తున్నారు. వీరికి ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుండి చెల్లింపులు చేస్తున్నారు. సిటీ స్కాన్‌, ఎక్స్‌రే యూనిట్‌తో పాటు ఇతర విభాగాలలో టెక్నీషియన్లు లేక రోగులను బయటికి పంపుతున్నారు. టెస్టులకు అయ్యే ఖర్చులను పేద రోగులకు ఆస్పత్రి నిధుల నుండి కేటాయిస్తున్నారు. ప్రభుత్వ మందులకు కొదువ లేకుండా చేస్తున్నప్పటికీ రోగుల పరీక్షలకు మాత్రం ఇబ్బందులు పడకతప్పడంలేదు. ఓ వైపు ప్రభుత్వ ఆస్పత్రి దుస్తితిపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఆస్పత్రి సిబ్బందిని నియమించి ప్రజలకు వైద్య సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. 
ఆస్పత్రిలో లేని క్యాంటిన్‌ సదుపాయం
నెలకు 30వేలకు పైగా వచ్చే ఈ ఆస్పత్రిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి అభివృద్ధి కమిటీ సమావేశం కావాలి. జెడ్పి చైర్మన్‌ ఈ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. ఆయనతో పాటు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్‌, జీవన్‌ రెడ్డిలతో పాటు కలెక్టర్‌, సూపరిండెంట్‌ ఆస్పత్రి కమిటీ సభ్యులుగా ఉన్నారు.  ఈ ఆస్పత్రిలో కనీసం రోగులకు ఉపయోగపడే విధంగా క్యాంటీన్‌ కూడా లేదు. అత్యవసర మందుల కోసం కూడా రోగులకు ఇబ్బంది పడక తప్పడంలేదు.  
ఇంకా కోర్సులకు మోక్షం లభించలేదు 
అయితే మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాలకు అనుగుణంగా ఆస్పత్రిలోని ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం నోటిఫికేషన్లు జారీ చేసినా ఇంకా కోర్సులకు మోక్షం లభించలేదు. ఆస్పత్రిలో మొత్తం 26 మంది ప్రొఫెసర్లు వివిధ విభాగాలలో పని చేయాలి, కాని ప్రస్తుతం 10 మంది ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. 26 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఉండాలి, కాని 12 మంది మాత్రమే ఉన్నారు. ఈ ఆస్పత్రికి అనుభందంగా ఉన్న కళాశాలతో కలిపి మొత్తం 51 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి, కాని కేవలం 21 మంది మాత్రమే ఉన్నారు. కీలకమైన జనరల్‌ మెడిసిన్‌లో మూడు పోస్టులకు కలిపి ఒక్కరే ఉన్నారు. అసోసియేట్‌లు అసలే లేరు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు నలుగురు మాత్రమే ఉన్నారు. సర్జరీలో అసోసియేట్‌ ప్రొఫెసర్లు ముగ్గురు ఉండాల్సింది కాని ఒక్కరు కూడా లేరు. అసిస్టెంట్‌లు నలుగురు మాత్రమే ఉన్నారు. అనిస్తిషియాలో ఉండాల్సిన మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా లేరు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఆరుగురు ఉండాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ రోగులకు కావల్సిన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు. రోజు రోజుకీ ఆస్పత్రిలో రోగుల తాకిడి పెరిగిపోతున్నందున సిబ్బంది కొరతతో ఇబ్బంది పడే పరిస్తితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. 

మధురవాడలో వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

విశాఖ:మధురవాడలో వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. 3 కిలోల బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. మహాకాష్ట్ర కు చెందిన దోపిడీ బృందంగా అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రధాని చైనా పర్యటన ఖరారు.

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 3న మోదీ చైనా బయల్దేరనున్నారు. 3-5వ తేదీ వరకు చైనాలోని జియెమెన్‌లో జరిగే 9వ బ్రిక్స్ సమావేశాల్లో మోదీ పాల్గొననున్నారు. 

రాష్ట్రపతి భవన్ జాతీయ క్రీడా పురస్కారల ప్రదానం

ఢిల్లీ: రాష్ట్రపతి భవన్ జాతీయ క్రీడా పురస్కారల ప్రదానం జరిగింది. తెలుగు క్రీడాకారులు జ్యోతి సురేఖ (ఆర్చరీ), అర్జున అవార్డు, సాకేత్ మైనేని (టెన్నిస్) అర్జున అవార్డు గెలుపొందారు.

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: మార్కెట్లను వెంటాడిన నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం చేసింది. స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. 362 పాయింట్లు నష్టపోయి 31,388 దగ్గర సెన్సెక్స్, 117 పాయింట్లు నష్టపోయి 9,796 దగ్గ నిఫ్టీ నష్టపోయాయి. 52 వారా కనిష్ట స్థాయికి 100 స్టాక్స్ తాకాయి.

16:25 - August 29, 2017

గుంటూరు : ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్టు అటకెక్కిందా ? ఈ రోడ్డు సర్వేని అర్థాంతరంగా ఆపేయడంలోని ఆంతర్యం ఏంటి ? ఈ ఎక్స్‌ప్రెస్‌ వే భూసేకరణకు నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పండంతో ప్రాజెక్టు ముందుకు సాగే అవకాశం లేదా ? ఈ అంశాలపై ఇప్పుడు చర్చోపచర్చలు సాగుతున్నాయి. 
ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం ఆలస్యానికి అనేక కారణాలు
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు.. ఏపీ రాజధానిని అనుసంధానం చేసే అమరావతి అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం ఆలస్యానికి అనేక కారణాలున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచీ అన్నీ ఆటంకాలే. అధిక పరిహారం కోసం రైతులు పట్టు, నిధుల కొరత సమస్యలు ఈ రోడ్డును వెంటాడుతున్నాయి. 
ఎక్స్‌ప్రెస్‌వేకి భారీగా భూ సేకరణ  
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వేకి భారీగా భూమి సేకరించాల్సి ఉంది.  దాదాపు 22 వేల ఎకరాల భూమి  అవసరం అవుతుందని లెక్క తేల్చారు. భూసేకరణ వ్యయాన్ని ఏపీ ప్రభుత్వమే భరించాలని కేంద్రం తెగేసి చెప్పింది. ప్రాథమిక అంచనా ప్రకారం భూసేకరణకు మూడువేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. భూసేకరణకు చెల్లించే పరిహారం విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. జాతీయ రహదారుల చట్టం కింది భూసేకరణ చేపట్టాలా.. లేక 2013 భూసేకరణ చట్టాన్ని వర్తింప చేయాలా.. అన్న విషయాన్ని ప్రభుత్వం తేల్చలేదు.  చాలా ప్రాంతాల్లో రైతులు అధిక పరిహారం కావాలని డిమాండ్‌ చేస్తున్నారు.  నిర్వాసితుల కోర్కెలకు ఒప్పుకుంటే భూసేకరణ వ్యయం తడిసిపోపెడయ్యే అవకాశం ఉంది. ఈ రోడ్డు సర్వేకి వెళ్తున్న అధికారులను రైతులు అడ్డుకోవడంతో గుంటూరు జిల్లా పరిధిలో సర్వేని తాత్కాలికంగా నిలిపివేశారు.
నిర్మాణ అంచనా వ్యయం రూ.27,635 కోట్లు 
అమరావతి అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే కోసం గుంటూరు జిల్లాలో ఎక్కువగా భూమి సేకరించాల్సి ఉంది. ఈ జిల్లా 91 కిలోమీటర్ల పొడవువ భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు 34.5 కిలోమీటర్ల పొడవున మాత్రమే సర్వే పూర్తి చేశారు. తాండికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో మరో 56 కిలోమీటర్ల పొడవున సర్వేకి హద్దులు నిర్ణయించారు. మొత్తం 599 కిలోమీటర్ల మేర నాలుగు, ఆరు వరుసల్లో ఈ రోడ్డును నిర్మించేందుకు కేంద్ర సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం 27,635 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. గంటకు 120 కిలో మీటర్ల వేగంతో వాహనాలు నడిచే విధంగా డిజైన్‌ చేశారు. భూసేకరణ ఖర్చుపై కేంద్ర ప్రభుత్వం పెట్టిన మెలికే అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి అవరోధంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా.... భూ సేకరణ పరిహారం సమస్యతో ఈ రోడ్డు ముందుకు సాగుతుందా.. లేదా... అన్న అనుమానాలు కలుగుతున్నాయి.  

16:20 - August 29, 2017

శ్రీకాకుళం : పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. ఈ అక్షర సత్యాన్ని ఓ బాలిక నిజం చేసి చూపించింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినా.. చివరకు కాలు తొలగించినా.. అధైర్య పడలేదు. జీవితంలో అలుముకున్న చీకట్లను చెరుగని చిరునవ్వుతో ఛేదించింది. ఆత్మవిశ్వాసంతో గజ్జకట్టి నర్తించి నాట్యమయూరిగా ఎదిగింది.  
మయూరి సినిమాలో హీరోయిన్‌లా..
అచ్చం మయూరి సినిమాలో హీరోయిన్‌లా..ఆత్మవిశ్వాసంతో సిక్కోలుకు చెందిన పావని అంగవైకల్యాన్ని జయించింది. విధి బస్సు ప్రమాదం రూపంలో వెంటాడిన చెరుగని చిరునవ్వుతో లక్ష్యం  వైపు అడుగులు వేసింది. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుని నాట్యమయూరిగా మారి అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. 
ఓవైపు పేదరికం..మరోవైపు  అంగవైకల్యం..    
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకి చెందిన జనార్దన్‌, లక్ష్మి దంపతుల గారాల పట్టి పావని. వృత్తిరిత్యా వీరు ఒడిషాలోని పర్లాఖిమిడిలో నివాసం ఉంటున్నారు. తండ్రి డ్రైవర్‌గా..తల్లి టైలర్‌గా పనిచేస్తున్నారు. పావని నాల్గో తరగతి చదువుతున్న సమయంలో.. రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొట్టింది. దీంతో పావని కుడికాలు తొలగించాల్సి వచ్చింది. ఓవైపు పేదరికం..మరోవైపు  అంగవైకల్యం..అయినా పావని ఏ మాత్రం నెరవలేదు. పట్టుదలతో పర్లాఖిమిడిలోని నటరాజ డాన్స్ స్కూల్‌లో..తండ్రి పోత్సాహంతో చేరింది. కృత్రిమ కాలు సాయంతో కూచిపూడి,  భరతనాట్యం మెలకువలు నేర్చుకుంది. 
ఆహుతులను రంజింపజేసిన నాట్య ప్రదర్శనలు 
ఓ వైపు నాట్యంపై పట్టుసాధిస్తూనే..మరోవైపు స్థానిక కాలేజీలో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. ఇక పావని ఇచ్చిన నాట్య ప్రదర్శనలు ఆహుతులను రంజింపజేశాయి. జెమిని ఛానెల్‌  నిర్వహించిన ఛాంపియన్‌ షోలోనూ తన ప్రదర్శన ఇచ్చింది. తనకు ఆర్ధికంగా చేయూత అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని  ధీమా వ్యక్తం చేస్తోంది. 
అసాధారణమైన ప్రతిభ కనబరుస్తోన్న పావని : నాట్య గురువు 
ఇక నాట్య శిక్షణలో పావని అసాధారణమైన ప్రతిభ కనబరుస్తోందని ఆమె నాట్య గురువు అంటున్నారు. అంగవైకల్యం ఉందన్న విషయాన్నే మరిచిపోయి నాట్యమే ఊపిరిగా జీవిస్తుందని చెబుతున్నారు. అంగవైకల్యాన్ని జయించి నాట్య మయూరిగా మారిన పావనిని పర్లాఖిమిడి వాసులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

 

15:59 - August 29, 2017

హైదరాబాద్‌ : ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలుచుకున్న తెలుగమ్మాయి పీవీ సింధు హైదరాబాద్‌ చేరుకున్నారు. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన ప్రదర్శన ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇదంతా కోచ్‌ గోపీచంద్‌, తల్లిదండ్రుల సహకారంతోనే సాధ్యమైందని చెప్పారు. జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరాతో జరిగిన ఫైనల్‌ ఫోరు చాలా కఠినంగా సాగిందని సింధు పేర్కొన్నారు. హోరాహోరీ జరిగిన పోరులో తృటిలో స్వర్ణాన్ని కోల్పోయినా, ప్రదర్శన పట్ల సింధు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రేక్షకుల నుంచి  లభించిన మద్దతు మరువలేనిదన్నారు. వరల్డ్‌ నంబర్‌ వన్‌  స్థానానికి చేరుకోవడమే లక్ష్యమన్నారు. ప్రస్తుతం వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్‌లో సింధు నాల్గో ర్యాంకులో కొనసాగుతున్నారు. 

 

15:57 - August 29, 2017

హైదరాబాద్ : మైనార్టీల కోసం పెద్ద ఎత్తున పాటుపడుతున్నట్లు కేసీఆర్ సర్కార్ ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప వారికి ఇవ్వాల్సిన రక్షణ, అందాల్సిన నిధులు అందించడం లేదని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్. వక్ఫ్ ల్యాండ్ కబ్జా విషయంలో కానీ, క్రిస్టియన్ మిషనరీ భూముల కబ్జా అంశంలో కానీ ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ఆరోపించారు. ఈరోజు కమిటీ మీటింగ్‌లో ఈ అంశాలు అధికారికంగా నిర్ధారణ అయినట్లు సంపత్‌కుమార్ చెప్పారు. 

 

15:54 - August 29, 2017

ఉత్తరకొరియా : అమెరికా హెచ్చరికలను పెడచెవిన పెడుతున్న ఉత్తర కొరియా...మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈసారి జపాన్‌ లక్ష్యంగా క్షిపణి ప్రయోగం జరిపింది. ఇవాళ ఉదయం బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించగా...అది జపాన్‌ మీదుగా ప్రయాణించి హోక్కైడోలోని ఉత్తర ప్రాంతంలోని సముద్రంలో పడింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి 550 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరిందని... 2,700 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించగలదని సియోల్‌కు చెందిన నిపుణులు చెబుతున్నారు. అమెరికా భూభాగమైన గువామ్‌ ప్రాంతానికి సులువుగా చేరుకోగలదని అంచనా వేస్తున్నారు. తాజాగా క్షిపణి ప్రయోగంపై మండిపడ్డ జపాన్‌ ప్రధాని షింజో అబే... తమ దేశ ప్రజల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తర కొరియాపై ఒత్తిడి తేవాలని అమెరికాను ఆయన కోరారు. ఉత్తర కొరియా 2009 తర్వాత జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి.

 

15:51 - August 29, 2017

మహారాష్ట్ర : ముంబైలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. బంద్రా, ఠానా, అంధేరి సబ్‌వే, మాలాడ్‌ సబ్‌ వే, కుర్లా, ఎలిఫిస్టన్‌ స్టేషన్, దాదర్‌, హింద్‌మాతాలో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, రైల్వే ట్రాక్‌లు జలమయమయ్యాయి. వర్షాలకు బాంద్రా రైల్వే స్టేషన్ సిగ్నల్‌ పనిచేయడం లేదు. మాతుంగా రైల్వేట్రాక్‌ నీట మునిగింది. వర్షాల కారణంగా విమాన ప్రయాణానికి కూడా అంతరాయం కలిగింది. రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వచ్చే 24 గంటల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గణేష్‌ మండపాల్లో నీరు చేరితే విద్యుత్‌ సప్లయ్‌ నిలిపివేయాలని ముంబైలోని సార్వజనిక్‌ గణేష్‌ ఉత్సవ సమితి సూచించింది. గత మూడు రోజులుగా ముంబైలో వర్షాలు కురుస్తున్నాయి. శాంతాక్రూజ్‌లో 175 మి.మీ, కొలాబాలో 165 మి.మీ వర్షపాతం నమోదైంది.

 

15:37 - August 29, 2017

హర్యానా : బాబా రాంపాల్ కు ఊరట లభించింది. 2014 లో జరిగిన అల్లర్ల కేసులో రాంపాల్ ను హిసార్ కోర్టు నిర్దోషిగా తేల్చింది. సంత్ రామ్ పాల్ బాబాపై రెండు కేసులలో హిసార్ కోర్టు తీర్పు వెల్లడించింది. 2006లో ఆర్య సమాజ్ కు వ్యతిరేకంగా బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా రోహతక్ గ్రామస్తులపై జరిపిన కాల్పుల కేసులో కూడా తీర్పు చెప్పింది. 48 సార్లు కోర్టుకు హాజరు కాకపోవడంతో 2014లో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. సత్ లోక్ ఆశ్రమ వ్యవస్థాపకుడిగా రామ్ పాల్ బాబా ఉన్న సంగతి తెలిసిందే. 

సింహపురి ఆస్పత్రిలో అవయవదానం

నెల్లూరు: సింహపురి ఆస్పత్రిలో అవయవదానం 3 రోజుల క్రితం శ్రీనివాసుల రెడ్డికి మెదడులో రక్తస్రావం అయ్యి బ్రెయిన్ డెడ్ గా వైద్యులు నిర్ధారించారు. అవయవదానానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. కిడ్నీలు నెల్లూరు సింహపురి, తిరుపతి స్విమ్స్ కు తరలించారు. కళ్లను నెల్లూరు అగర్వాల్ ఐ ఆస్పత్రికి తరలించారు.

బాబా రాంపాల్ కు ఊరట

హైదరాబాద్: బాబా రాంపాల్ కు ఊరట లభించింది. రెండు కేసులో రాంపాల్ నిర్ధోషిగా హర్యానా కోర్టు తేల్చింది. 2014 నుంచి హిస్సార్ జైలులో బాబా రాంపాల్ ఉన్నారు. 2014 అల్లర్ల కేసు, అల్లర్లు, హత్య కేసులో బాబా రాంపాల్ పై రెండు కేసులు నమోదు అయ్యాయి. అభియోగాలు నిరూపించడంలో పోలీసులు విఫలం అయ్యారు. 1999 లో సత్ లోక్ ఆశ్రమాన్ని రాంపాల్ స్థాపించారు. 2014 బల్వారాలో జరిగిన అల్లర్ల కేసులో రాంపాల అరెస్ట్ అయ్యారు.

15:19 - August 29, 2017

సిరిసిల్ల : పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలు కొంతమంది దండుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు వివాహ రిజిస్ట్రేషన్‌ పత్రం తప్పనిసరి కావడంతో రిజిస్ట్రేషన్‌ సిబ్బంది అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. అసలు ఫీజు కంటే అధిక మొత్తం వసూలు చేస్తూ దండుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే... పత్రాలు సరిగాలేవని తిరస్కరిస్తున్నారు. దీంతో అడిగిన మొత్తం ఇచ్చి పత్రాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్వాకమంతా మంత్రి కేటీఆర్‌ ఇలాఖాలోని రాజన్న సిరిసిల్లలోనే జరగడం విశేషం. 
వివాహ సర్టిఫికేట్ల కోసం అధిక డబ్బు వసూలు 
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రములోని సబ్‌ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోని కొంతమంది సిబ్బందికి  కళ్యాణలక్ష్మి, షాది ముభారాక్  పథకాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రభుత్వం పేద వర్గాల కోసం తలపెట్టిన ఈ పథకాలు వారికి లాభాల పంటగా మారింది. అట్టడుగు వర్గాల వారికి కొండంత అండగా ఉంటుందని ప్రభుత్వం.. వారిని ఆదుకునేందుకు డెబ్భై ఐదు  వేల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తుంది. అయితే వీటిని అందుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీసు లో వివాహం జరిగినట్టు ధ్రువ పత్రం అవసరం. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది ఉద్యోగులు వచ్చిన వారి దగ్గరి నుండి దండుకోవడం మొదలు పెట్టారు. అడిగినంత ఇచ్చుకోలేని వారిని పత్రాలు సరిగా లేవంటూ తిప్పిపంపడం సర్వ సాధారణంగా మారింది. 
రూ.200 బదులుగా రూ.500 వసూలు 
సాధారణముగా వివాహ ధ్రువ పత్రం తీసుకోవాలంటే రెండు వందల రూపాయలు కట్టి, రశీదుతో పాటుగా, వివాహ ధ్రువ పత్రం పొందడం ఎక్కడైనా బాధితులకు ఆనావాయితి. కాని సిరిసిల్ల పట్టణం లోని సబ్‌ రిజిస్టార్ ఆఫీసులో మాత్రం ఐదు వందల రూపాయలు ఇస్తేనే వివాహ ధ్రువ పత్రం చేతికి అందుతుంది. కాని ఇచ్చిన  డబ్బులకు రశీదు ఇవ్వరు. సుమారు రోజుకు పది నుండి పన్నెండు వరకు ఈ కార్యాలయానికి వివాహ ధ్రువ పత్రం కోసం దరఖాస్తు చేసుకునేందుకు లబ్ది దారులు  వస్తుంటారు. ఈ లెక్కన ప్రతి రోజు వీరి పైపై సంపాదన ఎంతో ఉహించుకోవచ్చు. ఇక్కడి ఉద్యోగి ఒక వ్యక్తి నుండి వివాహ ధ్రువ పత్రం ఇవ్వడానికి ఐదు వందల రూపాయలు తీసుకొని, రశీదు ఇచ్చేందుకు  నిరాకరించాడు.. ఈ దృశ్యాలన్నీ వీడియోలో రికార్డ్‌ అయ్యాయి. 
నిబంధనలు ఉల్లంఘిస్తున్న సిబ్బంది
మంత్రి కేటీఆర్. ఇలాఖాలో ఇలా జరగడం చర్చనీయాంశమయ్యింది. మంత్రి ప్రతి సందర్భములోనూ పేదల కోసం కళ్యాణ లక్ష్మి, షాది ముభారాక్ పథకాలను ప్రవేశ పెట్టామని, దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెబుతుండేవారు. కానీ ఇక్కడి సిబ్బంది మాత్రం ఎవరేమన్నా మా లెక్కలు మాకు రావాలి అంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇదిలావుంటే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రతిరోజు 10 నుంచి 15 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని... రిజిస్ట్రేషన్‌కు కేవలం ప్రభుత్వం నిర్ణయించిన సొమ్ము కడితే సరిపోతుందంటున్నారు సబ్‌ రిజిస్ట్రార్‌. 
మంత్రి కేటీఆర్‌ ఇలాఖాలోనే సిబ్బంది అక్రమాలు
సాక్ష్యాత్తు మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఏలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇకనైనా ప్రభుత్వం మేల్కోని అవినీతిని అరికడతామంటూ మాటలు చెప్పకుండా అవినీతికి పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 

 

సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల: సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ప్రణాళికా బద్ధంగా జరుగుతున్నాయని, గరుడ సేవ రోజు తిరుమలకు పరిమిత సంఖ్యలో కార్లకు, పరిమితి దాటి వచ్చే కార్ల కోసం తిరుపతి అలిపిరి సమీపంలోని భారతీయ విద్యా భవన్, దేవలోక్ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు.అక్కడే భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు సిద్ధంగా ఉంచుతామన్నారు. భక్తుల సౌకర్యం కోసం సప్తగిరి సత్రాల నుంచి ఆస్థాన మండపం వరకు నూతన బ్రిడ్జి నిర్మాణం చేపడతామని, సెప్టెంబర్ 20 లోపు బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామన్నారు.

15:10 - August 29, 2017

కృష్ణా : బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ అంతరాలయ దర్శనం టికెట్‌ ధర పంచాయతీ సీఎం దగ్గరికి చేరింది. దుర్గమ్మ దర్శనం టికెట్ల వివాదాన్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది. 
దర్శనం టికెట్ల లొల్లికి పుల్‌స్టాప్‌ పెట్టేలా  ప్రభుత్వ చర్యలు 
విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ అంతరాలయం దర్శనం టికెట్‌ ధర వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. ఈ పంచాయతీ అటూ ఇటూ తిరిగి చివరికి సీఎం చంద్రబాబు దగ్గరికి చేరింది. దర్శనం టికెట్ల లొల్లికి పుల్‌స్టాప్‌ పెట్టేలా  ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆరుగురు సభ్యులతో తాత్కాలికంగా ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.  ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,  ఇతరత్రా కార్యక్రమాలపై ఈ కమిటీ రిపోర్ట్ తయారుచేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది.
రూ.300లకు పెరిగిన దర్శనం టికెట్‌ ధర 
దర్శనం టికెట్ల ధరను పాలక మండలి 300 రూపాయలు చేసింది. ఇది భక్తులకు భారంగా మారింది. దర్శనం టికెట్ల ధరను తగ్గించాలని భక్తులు కోరారు.  300 నుంచి 150 రూపాయలకు తగ్గించాలని ఆలయ అధికారులకు, ఈవో దృష్టికి భక్తజనం తీసుకెళ్లారు. ఈవో సూర్యకుమారిపై తగ్గే ప్రసక్తేలేదని తేల్చిచెప్పడంతో వివాదం మొదలైంది. దర్శనం టికెట్‌ ధర భారమవ్వడంతో భక్తుల సంఖ్య కూడా తగ్గింది. దీంతో ఇంద్రకీలాద్రికి ఆదాయంకూడా తగ్గింది. దర్శనం టికెట్ల ధరలను తగ్గించాలని సాక్షాత్తు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విన్నపాన్ని ఈవో బేఖాతరు చేశారు. ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని చెప్పడం పాలక పెద్దలను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా దుర్గగుడిలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. ఈవోకు వ్యతిరేకంగా నివేదికలు వెళ్లడంతో ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేదిలేదని, ఈవో, ఆలయ సిబ్బంది, ఉన్నతాధికారులు, పాలక మండలి కలిసికట్టుగా సమన్వయంతో ముందుకెళ్లాలని.. అమ్మవారి చెంత రాజకీయాలుచేస్తే చర్యలు తప్పవంటూ తనదైన శైలిలో మందలించారు. వెంటనే దుర్గగుడిలో నెలకొన్ని వివాదాలపై నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
దసరాకు నిధులు విడుదల చేయని ప్రభుత్వం
సెప్టెంబర్‌ 21 నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై జరుగనున్నాయి. నవ్యాంధ్రలో దసరాను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించినా నిధులను విడుదల చేయలేదు.  దీంతో దుర్గమ్మ ఆలయ నిధులు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చవుతున్నాయి. ఈ ఏడాది 10కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని పాలక మండలి ప్రభుత్వాన్ని కోరుతుంది.

 

సెప్టెంబర్ 1గ్రామ రైతు సమన్వయ సంఘాలు ఏర్పాటు: పోచారం

నిజామాబాద్: సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు గ్రామ రైతు సమన్వయ సంఘాలు ఏర్పాటు చేస్తామని మంత్రి పోచారం తెలిపారు. ఈ సంఘాలతో 1/3 వ వంతు మహిళలు ఉంటారని, సెప్టెంబర్ 10 నుండి 14 లోగా మండల రైతు సమన్వయ సంఘాల ఏర్పాటు ఉంటుందన్నారు. రాష్ట్ర సమన్వయ రైతు సంఘం దగ్గర రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్ లో మద్దతు ధర నిర్ణయంలో రైతు సంఘాలదే నిర్ణయాత్మక పాత్ర ఉంటుందన్నారు. గ్రామాల్లో భూ సర్వే చేసి రికార్డులను రూపొందిస్తామన్నారు. ఈ రికార్డుల ఆధారంగానే వచ్చే మే 18 నుంచి ఎకరాకు రూ. 4వేలు ఇస్తామన్నారు.

14:58 - August 29, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని పోలవరం మండలం, కొత్త రామయ్య పేటలో.. ఇసుక కాలువకు గండి పడింది. దీంతో నీరు ఉధృతంగా ప్రవహించడం వల్ల.. 10 ఎకరాల్లోని పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. మరో 30 ఎకరాలు నీట మునిగాయి. కాలువకు పడిన గండిని గమనించిన రైతులు, అధికారులు.. దాన్ని పూడ్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇసుక కాలువకు గండి పడడం వల్ల తమ పంటలు నష్టపోయామని.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతు పనులు చేపట్టి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.

 

49వ డివిజన్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

తూ.గో : కాకినాడ కార్పొరేషన్ 49వ డివిజన్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ అభ్యర్థి తరపున డబ్బులు పంచుతున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ మహిలలపై దౌర్జన్యం చేశారంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

14:56 - August 29, 2017

నల్గొండ : మెడికల్ కాలేజ్‌ల యాజమాన్యాలు.. విద్యార్ధుల భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నాయి. సెకండ్‌ ఇయర్‌ ఫీజుకు బ్యాంక్‌ గ్యారంటీ సమర్పించడానికి వారం రోజుల గడువున్నా.. ఇవాళే సమర్పించాలని మెలిక పెడుతున్నారు. సాయంత్రం 4 గంటలతో బీ కేటగిరీ సీట్ల జాయినింగ్‌కు గడువు ముగియనుంది. ఇప్పటికిప్పుడు బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వలేమని బ్యాంక్‌ సిబ్బంది చెబుతున్నారు. కనీసం 3 రోజుల సమయం పడుతుందని బ్యాంకు సిబ్బంది అంటున్నారు. బ్యాంకు గ్యారంటీ ఇవ్వలేకపోతే 11 లక్షల 50 వేల డీడీ సమర్పించాలని.. కాలేజీ యాజమాన్యాలు హుకుం జారీ చేశాయి. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా అని.. విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

అర్జున్ రెడ్డి సినిమాను నిషేధించాలి: వీహెచ్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ 'అర్జున్ రెడ్డి' సినిమా బాగుందనడం దారుణం అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి.హన్మంతరావు అన్నారు. డ్రగ్స్ తీసుకునే వారిపై చర్యలు తీసుకుంటామంటున్న కేటీఆర్ సినిమాల్లో డ్రగ్స్ వాడకాన్ని హీరోయిజంగా చూపిస్తే మెచ్చుకోవడమేంటి అని ప్రశ్నించారు. అర్జున్ రెడ్డి సినిమాను సెన్సార్ బోర్డు నిషేధించాలని డిమాండ్ చేశారు.

ఏపీ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలపై హైకోర్టు విచారణ

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు అడ్వాన్స్డ్ టెలీకమ్యూనికేషన్స్ కు ఇవ్వడంపై ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

132 జీవో జారీ చేయడం పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: టిడిపి నేతలపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం 132 జీవో జారీ చేయడం పై హైకోర్టులో విచారణ జరిగింది. 278 మందిపై కేసుల ఉపసంహరణకు ఏపీ సర్కార్ జీవో జారీ చేసింది. జీవో 132ను కొట్టివేయాలని ఎమ్మెల్యే రామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

మ.2గంటలకు 55శాతం పోలింగ్ నమోదు

తూ.గో: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 55 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు.

లాభాల బాటలోకి టీఎస్ ఆర్టీసి: మంత్రి మహేందర్ రెడ్డి

హైదరాబాద్: ఆర్టీసీ పనితీరుపై మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇపుడిపుడే టీఎస్ ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని తెలిపారు. ఆర్టీసీ ఆస్తుల విభజనపై త్వరలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

13:59 - August 29, 2017

హైదరాబాద్: కింగ్ నాగార్జున తన పుట్టిన రోజు సందర్భంగా హర్రర్ థ్రిల్లర్ చిత్రం రాజుగారి గది 2 చిత్రం మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ ను సమంత చేతుల మీదుగా విడుదల కావడం విశేషం. ఓంకార్ దర్శకత్వంలో రాజుగారిగదికి సీక్వెల్ గా రాజు గారి గది 2 చిత్రం తెర‌కెక్కుతుంది. ఇందులో నాగ్ మోడ్రన్ మాంత్రికుడిగా కనిపించనున్నాడు. సీరత్ కపూర్, సమంతలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. థ‌మన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పీవిపి సినిమా మరియు ఓఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అక్టోబ‌ర్ 13న ఈ మూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

13:31 - August 29, 2017

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు కొత్తేమి కాదు ..నేమ్ ఫేమ్ ఉన్న హీరోలతో ఒకే సినిమాలో ఇద్దరు హీరోలని పెట్టి హిట్ కొట్టిన ఫిలిం మేకర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆడియన్స్ లో క్రేజ్ ఉన్న కమెడియన్స్ తో సినిమా ఒకటి రాబోతుంది అనే వార్త వినిపిస్తోంది. టాలీవుడ్ లో మల్టీస్టారర్లు ఊపందుకున్నాయి. క్రేజ్ లేని హీరోలంతా కలిసి కట్టుగా సినిమాలు చేస్తూ వాటినే మల్టీస్టారర్ అంటూ ప్రచారాలు చేయడం స్టార్ట్ చేశారు. కమెడియన్ 'పృథ్వీ' సెకండ్ హీరోగా నటించిన సినిమా 'మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ సినిమాలో ఏకంగా హీరో లెవెల్ రోల్ ని ప్లే చేశాడు. సలోని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మంచి వేరియేషన్స్ చూపించాడు. ఈ సినిమాలో 'నవీన్ చంద్ర' నటించినా పేరు మాత్రం 'పృథ్వీ'కే వచ్చింది.

కమెడియన్ గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తున్న ‘30 ఇయర్స్ పృథ్వీ' క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు ప్రతి సినిమాలో కనిపిస్తున్న 'పోసాని కృష్ణమురళి' కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుందని ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. క్రేజీ మల్టీస్టారర్ అనే కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి. తనకంటూ వైవిధ్యమైన నటనని ప్రదర్శిస్తున్న 'పోసాని కృష్ణ మురళి' ఆల్రెడీ హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మరి వీరి ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.

తండ్రికి ఫిర్యాదు చేశాడని విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: ప్రగతి నగర్ లోని నారాయణ కాలేజీ హాస్టల్ లో సెకండియర్ విద్యార్థి నాగసాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగసాయి నిజామాబాద్ జిల్లా పంటకుదురు వాసి అని తెలుస్తోంది. జూనియర్ విద్యార్థులను వేధించడంపై తన తండ్రికి ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశాడన్న మనస్తాపంతో నాగసాయి అనే విద్యార్థి ఆత్మహత్యకు చేసుకున్నాడని తెలుస్తోంది.

13:27 - August 29, 2017

మహబూబ్ నగర్ : జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ప్రస్తుతం సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారులు ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు. దుక్కులు దున్ని వరినార్లు వేసిన తర్వాత నీటిని ఆపివేయడంతో ఆగ్రహం చెందుతున్నారు. నారాయణపూర్‌ నుంచి నీటిని విడుదల చేసి తమ పంటలను రక్షించాలని కోరుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం పడిపోతోంది. ఎగువనున్న కర్నాటకలోని ప్రాజెక్టుల నుంచి నీరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దీంతో అధికారులు సోమవారం నుంచి వారబంధీని ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. దాన్ని వెంటనే అమల్లోకి తీసుకొచ్చారు.

జూరాల ప్రాజెక్టు కింద లక్షా రెండువేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి రైతులంతా జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడే సాగు చేసుకుంటారు. ఖరీఫ్‌ సీజన్‌లోనూ రైతులంతా దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసుకున్నారు. వరినాట్లు వేస్తున్నారు. ఇవి ఇంకా పూర్తికూడా కాలేదు. అంతలోనే అధికారులు వారబంధీని ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టుకు నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులో గరిష్ట నీటినిల్వ 9.66 టీఎంసీలు, ప్రస్తుతం 6.19 టీఎంసీల నీరు జలాశయంలో అందుబాటులో ఉంది. ఇందులో 2.450 టీఎంసీల నీరు మాత్రమే సాగు అవసరాలకు వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. దుక్కులు దున్ని వరినారు సిద్ధం చేసిన తర్వాత అధికారులు నీరు విడుదల ఆపేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కర్నాటక ప్రాంతంలోని నారాయణపూర్‌ ప్రాజెక్టు నిల్వ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకున్నా... అక్కడి అధికారులు మాత్రం ఆయకట్టుకు వారబంధీ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా కిందికి నీటిని విడుదల చేయకుండా ఆ నీటితో అక్కడి చెరువులు, కుంటలు నింపుకుంటున్నారు. దిగువనున్న జూరాలకు మాత్రం చుక్కనీరు వదలడం లేదు. దీంతో జూరాల ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు జూరాలకు కర్నాటక ప్రభుత్వం నీరు విడుదల చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ రైతు సంఘం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కర్నాటక నారాయణపూర్‌ నుంచి జూరాలకు నీటిని విడుదల చేసేలా కేసీఆర్ ప్రయత్నాలు చేయాలని రైతులు కోరుతున్నారు. 

13:22 - August 29, 2017

హైదరాబాద్ : జీడిమెట్ల బాచుపల్లి పీఎస్ పరిధిలోని ప్రగతి నగర్ లో విషాదం చోటు చేసుకుంది. నారాయణ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. నిజామాబాద్ బోధన్ మండలం పంటకుదురు గ్రామానికి చెందిన నాగసాయి నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వంశీధర్..తో పాటు మరో ముగ్గురు విద్యార్థులను నాగసాయి వేధించే వాడు. ఈ విషయం తెలియడంతో నాగసాయిని ప్రిన్స్ పాల్ హెచ్చరించాడు. వేధింపుల విషయాన్ని నాగసాయి తండ్రికి ప్రిన్స్ పల్ తెలియచేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన నాగసాయి హాస్టల్ లో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:12 - August 29, 2017

నెల్లూరు : డెబ్భై వసంతాల స్వాతంత్య్రం సందర్భంగా దేశం సంబరాలు జరిగాయి. కానీ గరగపర్రులాంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంబేద్కర్‌ విగ్రహం పెట్టుకుంటామంటే ఏకంగా దళిత జాతినే వెలివేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శాసనసభ నియోజకవర్గంలోని భీమవరం పట్టణానికి అతి సమీపాన ఉన్న గరగపర్రు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.

ఏఎస్ పేట మండలం కుప్పురుపాడులో అగ్రవర్ణాల దురంహాకారం బయటపడింది. దళితులను అగ్రవర్ణాలు గ్రామ బహిష్కరించారు. వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. తమ నివాసాల ముందట నుండి వినాయక విగ్రహాలను తీసుకెళ్లవద్దని అగ్రవర్ణాలు హుకుం జారీ చేశారు. స్థానికులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిపించేందుకు ప్రయత్నించారు. సమీపంలో ఉన్న కాల్వలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసి దళితులు వెనుదిరిగారు. మార్గమధ్యంలో అగ్రవర్ణాలు మళ్లీ అడ్డుకుని ఊరి నుండి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు.

అగ్రవర్ణాలు కక్ష పెట్టుకుని సహాయ నిరాకణ చేయడంతో పాటు గ్రామ బహిష్కరణ చేశారు. కర్రలు పట్టుకుని బెదిరించడంతో దళితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దళితులకు నీళ్లు..నిత్యావసర వస్తువులు ఇవ్వకుండా నిరాకరించారు. దీనితో దళితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

టిప్పరు ఢీకొని విద్యార్థిని మృతి...

ఓర్వకల్లు: రోడ్డు పక్కన నడుచుకుంటూ కాలేజీకి వెళ్తున్న విద్యార్థులను టిప్పర్‌ ఢీకొట్టింది.ఈ ఘటనలో ఓ ఇంటర్‌ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందింది. మృతిచెందిన విద్యార్థిని ఉసేనాపురం గ్రామానికి చెందిన శాంతి అని తెలుసోత్ంది. మరో ఆరుగురు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

13:08 - August 29, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం వర్షం పడడంతో మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. కొద్దిసేపటి అనంతరం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. జగన్నాథపురంలో ఏఏస్పీ దామోదర్ ఓటింగ్..భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. చిన్న ఘటన ఎక్కడా కూడా లేదని, క్యాడెంట్ ప్రచారం నిర్వహిస్తున్నారంటూ వివాదం నెలకొందని, ఏటిమొగలో ఎక్కడా ఎలాంటి ఘర్షణలు తలెత్తలేదన్నారు. 

ముంబైలో భారీవర్షం.. స్థంభించిన జనజీవనం

హైదరాబాద్: ముంబైలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్ల పైకి భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

డిసెంబర్ కల్లా రూ.1000 నోటు..

హైదరాబాద్: భారతీయ రిజర్వ్‌బ్యాంక్ (ఆర్బీఐ) కొత్తగా రూ.1000 నోటు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. గత ఏడాది పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రకటించడంతో రూ.1000 నోట్లు చెల్లకుండాపోయిన విషయం తెలిసిందే. నూతన డిజైన్‌తో, సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లతో రూ.1000 నోట్లను డిసెంబర్‌కల్లా మా ర్కెట్‌లోకి తేవాలని ఆర్బీఐ భావిస్తున్నది.

12:49 - August 29, 2017

డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరైన ఓ హీరో మరో మంచి స్టోరీ లైన్ తో రాబోతున్నాడు. చిన్న సినిమాలతో హిట్ కొట్టి తన నేమ్ నే ఒక బ్రాండ్ గా మార్చుకున్న డైరెక్టర్ ఈ హీరో తో జతకట్టబోతున్నాడు. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న హీరో 'శర్వానంద్'కి 'రాధ' సినిమా బ్రేక్ పడింది. సంక్రాంతి బరిలో 'శతమానం భవతి'తో భారీ హిట్ అందుకున్న 'శర్వా' తరువాత 'రాధా' సినిమాతో వచ్చాడు. కధలో కత్తదనం లేదని, 'శర్వానంద్' రెగ్యులర్ మూస సినిమాలని నెత్తిన వేసుకుని ఫ్లాప్స్ ని మూటకట్టుకుంటున్నాడని ఫిలిం నగర్ టాక్. ఇప్పటివరకు పలు విభిన్నమైన పాత్రలు పోషించాడు 'శర్వానంద్' మళ్లీ రెగ్యులర్ స్టోరీస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాడో అని ఫిలిం లవర్స్ అనుకుంటున్నారట. జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టు ఇప్పుడు కొత్త సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 'శతమానం భవతి' సినిమాకి గాను నేషనల్ అవార్డు రావడం కూడా మంచి ఉత్సహాన్ని ఇచ్చినట్టుంది.

స్టోరీ ని నమ్ముకోకుండా కేవలం హాస్యానికే పెద్ద పీట వేసి ఫ్లాప్ సినిమాని తీసాడు అని డైరెక్టర్ 'మారుతీ' గురించి ఫిలింనగర్ అనుకుంటుంది అంట. 'బాబు బంగారం' సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేదని అనుకుంటుంటారు. తన దగ్గర ఉన్న కథలని మంచి స్క్రీన్ ప్లే తో రాసుకుని ప్రెసెంట్ చేసే డైరెక్టర్స్ లో 'మారుతీ' ఒకడు. చిన్న సినిమాతో పెద్ద హిట్ ఇవ్వడం 'మారుతీ' టాలెంట్. మరి 'మారుతీ' ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరో 'శర్వానంద్' కావడం విశేషం .

దర్శకుడు 'మారుతీ’.. ‘భలే భలే మగాడివోయ్’లో హీరోను మతిమరుపు వాడిగా చూపించి అదిరిపోయే వినోదాన్నందించాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు. 'భలే భలే..’లో 'నాని' మతిమరుపు వాడైతే.. 'మారుతీ' కొత్త సినిమా ‘మహానుభావుడు’లో హీరో 'శర్వానంద్' ఓసీడీతో బాధపడే కుర్రాడిగా నటిస్తున్నాడు. ఓసీడీ అంటే.. అతి శుభ్రతతో బాధపడే ఒక డిసార్డర్ అన్నమాట. ‘భలే భలే..’ సినిమా నిర్మాణంలో భాగస్వాములైన యువి క్రియేషన్స్ వాళ్లే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటం విశేషం. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఫేమ్ మెహ్రీన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ‘మహానుభావుడు’ దసరా కానుకగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన ఫిలిం క్రిటిక్స్ మాత్రం 'భలే భలే మగాడివోయ్' సినిమాని అటు ఇటు తిప్పి పాచిపోయిన పాత చింతకాయ పచ్చడిని కొత్త ప్యాకెట్ లో పెట్టి అమ్మబోతున్నారు అని అనుకుంటున్నారంట. కొందరైతే ఏకంగా 'మారుతీ' పని అయిపోయింది అని అనుకుంటున్నారంట. 

12:35 - August 29, 2017

హైదరాబాద్ : ఫీవర్ ఆసుపత్రికి జనాలు క్యూ కడుతున్నారు. గత కొన్ని రోజులుగా వర్షం కురుస్తుండడంతో జనాలు రోగాల బారిన పడుతున్నారు. మురికవాడల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వైరల్ ఫీవర్ లు వ్యాపిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా రోగులు ఫీవర్ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. పరిస్థితిని తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. జ్వరం, మలేరియా రోగులతో ఆసుపత్రి కిటకటలాడుతోంది. ఫార్మసీ వద్ద మందులు తీసుకోవడానికి రోగులు..వారి ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

ఫీవర్ ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై సూపరిటెండెంట్ శంకర్ తో టెన్ టివి మాట్లాడింది. గత వారం రోజులుగా వాతావరణంలో మార్పు రావడంతో వైరల్ ఫీవర్ లు వ్యాపిస్తున్నాయని..అంతేగాక జనాల్లో ఆందోళన నెలకొనడంతో ఫీవర్ ఆసుపత్రికి వస్తున్నారని పేర్కొన్నారు. స్వైన్ ఫ్లై వచ్చే అవకాశం ఉందని..ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. 1200-1500 మంది ఓపీకి వస్తారని..వీరందరికీ వైద్యం..మెడికల్స్ ఇవ్వడం జరుగుతోందన్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని సరిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు. 

12:23 - August 29, 2017

హర్యానా : హిసార్ కోర్టులో మరో బాబా కేసుపై తీర్పు వెలువడనుంది. గుర్మీత్ బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తాజాగా సంత్ రామ్ పాల్ బాబాపై రెండు కేసులలో హిసార్ కోర్టు తీర్పు చెప్పనుంది. 2006లో ఆర్య సమాజ్ కు వ్యతిరేకంగా బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా రోహతక్ గ్రామస్తులపై జరిపిన కాల్పుల కేసులో కూడా తీర్పు చెప్పనుంది. 48 సార్లు కోర్టుకు హాజరు కాకపోవడంతో 2014లో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఇప్పటికే తీర్పును కోర్టు రిజర్వ్యు చేసింది.

సత్ లోక్ ఆశ్రమ వ్యవస్థాపకుడిగా రామ్ పాల్ బాబా ఉన్న సంగతి తెలిసిందే. బర్వలా ఆశ్రమం వద్ద రామ్ పాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ పోలీసులపై బాబా అనుచరులు దాడికి దిగారు. ఆయన్ను అరెస్టు చేసే సమయంలో ఐదుగురు మహిళలు..ఒక చిన్నారి మృతి చెందారు. ప్రస్తుతం రామ్ పాల్ హిసార్ జైలులో ఉన్నారు.

లక్నోలో పట్టుబడ్డ భారీగా రద్దయిన నోట్లు

ఉత్తరప్రదేశ్: లక్నోలో భారీగా రద్దయిన నోట్లు పట్టుబడ్డాయి. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని రూ.50 లక్షల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి కారు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఏ బ్యాంకు అధికారి సహకరిస్తున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

12:15 - August 29, 2017
12:14 - August 29, 2017

కాకినాడ : కార్పొరేషన్ తమదేనని, ఓటర్లు టిడిపికి పట్టం కడుతారని ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు. మంగళవారం కార్పొరేషన్ ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. ప్రశాంతంగా కొనసాగుతున్నా అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు పోలింగ్ బూత్ లను పరిశీలిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే కొండబాబుతో టెన్ టివి ముచ్చటించింది. కొంత మంది రెబల్స్ ఉంటే వారిని బరి నుండి తప్పించే ప్రయత్నం చేయడం జరిగిందని, బీజేపీ వారికి కూడా అవకాశం ఇచ్చామన్నారు. వారి గెలుపుకు ప్రయత్నించామన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:11 - August 29, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే కొండబాబు సోదరుడు సత్యనారాయణతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఘర్షణ తలెత్తడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. 20వ వార్డులో ఇద్దరు అభ్యర్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు 12 శాతం పోలింగ్ నమోదైంది. 39వ వార్డులో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. జాబితాలో తమ పేర్లు లేవంటూ ఓటర్లు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఎన్నికల అధికారులు..నేతలను స్థానికులు నిలదీశారు. 

హైదరాబాద్ కు చేరుకున్న పీవీ సింధు, సైనా

హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజితం గెలుపొందిన పీవీ సింధు, కాంస్యం గెలిచిన సైనా నెహ్వాల్, కోచ్ గోపిచంద్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ... ఫైనల్స్‌లో స్వర్ణం చేజారటంతో కొంచెం నిరాశ చెందాను అని తెలిపారు.

12:09 - August 29, 2017

హైదరాబాద్: అక్టోబర్ 6 పెళ్లి తో నాగచైతన్య, సమంత ఒకటి కానున్నారు. తాజాగా తన కొడుకు చైతు పెళ్లి విషయం పై బర్త్ డే బాయ్ నాగార్జున ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అక్టోబర్ 6 న చైతు, సామ్ ల పెళ్లి .. గోవాలో అని ఖరారు చేశాడు. ఒకే రోజు హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరగనున్నదని చెప్పాడు.. పెళ్లి అనంతరం హైదరాబాద్ రిసెష్పన్ ఘనంగా ఉంటుంది అని చెప్పాడు.. పెళ్లి సింపుల్ గా చేసుకోవడం అనేది మాత్రం వారిద్దరి నిర్ణయం అని నాగ్ చెప్పారు..

విజయవాడలో తగలబడ్డ బస్సు...

విజయవాడ : రామవరప్పాడు మెడికల్ కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సు తగలబడింది. రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడాన్ని గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే దాన్ని నిలిపేశారు. ప్రయాణికులంతా కిందకు దిగేయడంతో ప్రాణాపాయం తప్పింది. 

12:00 - August 29, 2017

తెలుగు సినిమాల పరిధి పెరిగింది. కొత్తదనంతో సినిమాలు తీస్తే ప్రేక్షకాదరణ ఉంటుంది అని నిరూపిస్తున్నాయి కొన్ని సినిమాలు. రెగ్యులర్ ఫార్ములా కధలను పక్కన పెట్టి కొత్తదనంతో వస్తున్న ఈ స్టార్ హీరో సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. రెగ్యులర్ కధలను పక్కకు నెట్టి డిఫెరెంట్ స్టోరీస్ తో దూసుకెళ్తున్నారు 'మహేష్ బాబు'. సూపర్ స్టార్ ఇమేజ్ ని కాపాడుకోవడంలో మంచి స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమా 'మహేష్' మార్కెట్ ని పెంచింది. క్లాస్ కి మాస్ కి దగ్గరైన 'మహేష్ బాబు' ప్రతి సినిమాలో వైవిధ్యం చూపెట్టడానికి రెడీ అయ్యాడు. గ్రామం, కుటుంబ విలువలతో ముడిపడి ఉన్న లవ్ స్టోరీ తో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ హిట్ తో 'మహేష్' నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద హోప్స్ బాగా పెరిగాయి. అనంతరం వచ్చిన 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ మూటగట్టుకుంది.

తాజాగా భారీ బడ్జెట్ తో పవర్ ఫుల్ స్టోరీతో 'మహేష్ బాబు' కొత్త సినిమా ‘స్పైడర్’ తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలోకి అనువాదం చేసి విడుదల చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు ఈ చిత్రాన్ని అరబిక్ భాషలోకి అనువాదం చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు మురుగదాసే స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం ‘స్పైడర్’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సెప్టెంబరు 27న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి 'మహేష్ బాబు' అరబిక్ లో మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో..అది డబ్బింగ్ అయినా సరే చూడాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే

11:56 - August 29, 2017

డాన్సర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి, నటుడిగా, ఇప్పుడు దర్శకుడిగా ఎదిగిన హీరో కం డైరెక్టర్ కొత్త సినిమా రెడీ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఆల్రెడీ తాను చేసిన హారర్ సినిమాలు హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ ని టచ్ చేసాయి. అదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ మరో హారర్ కామెడీకి తెరతీయబోతున్నాడు ఈ డైరెక్టర్.

ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్ గా ఎంత పేరు సంపాదించాడో.. దర్శకుడిగా హార్రర్ కామెడీ సినిమాలతో అదే స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు 'రాఘవ లారెన్స్’. అతను తీసిన కాంచన.. గంగ సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. ‘ముని’తో మొదలుపెట్టి ఈ సిరీస్ లో మూడు సినిమాలు తీసిన లారెన్స్.. త్వరలోనే ఈ కోవలో మరో సినిమా చేయబోతున్నాడు. ‘గంగ’ బ్లాక్ బస్టర్ అయినప్పుడే ఈ సిరీస్ లో మరో సినిమా చేస్తానని ప్రకటించిన లారెన్స్.. గత రెండేళ్లలో ఆ దిశగా ప్రయత్నాలేమీ చేయలేదు.

రెండేళ్లకు పైగా దర్శకత్వం పక్కన పెట్టేసి హీరోగా మొట్ట శివ కెట్ట శివ.. శివలింగ లాంటి సినిమాలు చేసిన లారెన్స్.. మళ్లీ కొత్త కథపై దృష్టిపెట్టాడు.హారర్ కామెడీ తో అదే తరహా కధని ఎంచుకుని సినిమా రెడీ చేయబోతున్నట్లు చెప్పాడట. మరి లారెన్స్ ఇలా దొరికిందే డొంక ర అని ఒకే కథని అటు తిప్పి ఇటు తిప్పి మాడిపోయిన మసాలా దోసల సినిమాలు తీస్తే ఆడియన్స్ ఇంటికి పంపిస్తారు అని ఫిలిం నగర్ వాసులు అనుకుంటున్నారట. కథలు పాతవా కొత్తవా అనేది పక్కన పెడితే లారెన్స్ మాత్రం కలక్షన్స్ బాగానే రాబడుతున్నాడు.

11:50 - August 29, 2017

ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయితే పోటీ అనే చెప్పాలి. థియేటర్స్ కొరత, స్క్రీన్ లు పంచుకోడంలో తికమకలు ఇవన్నీ ఉంటాయి. తెలిసిందే. కదా. మరి అలాంటిది నేమ్ ఫేమ్ ఉన్న హీరోల సినిమాలు రెండు ఒకే రోజు ఉంటె...ఆటా రసవత్తరంగా ఉంటుంది కదా. 'బెంగాల్ టైగర్' సినిమా తరువాత 'రవితేజ'కి సినిమాలు ఫ్లో తగ్గిపోయింది అని టాక్. అలానే 'సాయి ధరమ్ తేజ్' కూడా తన రీసెంట్ వన్ 'నక్షత్రం' తో కొంచెం వెనుకబడ్డాడు అని అనుకుంటున్నారు అంతా.

అలానే సాయి ధరమ్ తేజ్ విన్నర్ సినిమా కూడా అనుకున్నంత ఆడలేదు అని టాక్. 'రవితేజ' రీసెంట్ గా 'దిల్' రాజు నిర్మాణం లో 'రాజా ది గ్రేట్' సినిమాతో రాబోతున్నాడు. 'దిల్' రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న 'రవితేజ' సినిమా 'రాజా ది గ్రేట్' ని దీపావళి కానుకగా అక్టోబర్ 13న విడుదల చేసేందుకు ప్లానింగ్ నడుస్తుంది. అయితే ఇదే రోజున 'సాయిధరమ్ తేజ్' 'జవాన్' ను కూడా రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో 'దిల్' రాజు ఉన్నట్లు సమాచారం.మరి ఫిలిం నగర్ టాక్ ఏంటంటే ఈ రెండు సినిమాల వెనుక 'దిల్' రాజు ఉన్నాడని అనుకుంటున్నారట. అఫీషియల్ గా అయితే 'రాజా ది గ్రేట్' కి 'దిల్' రాజే బ్యాక్ బోన్. మరి 'జవాన్' గురించి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. ఏది ఏమైనా ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఒకే రోజు ఉండటం కొంచం ఆలోచించాల్సిన విషయమే.

స్కూల్ బస్సుపై విద్యుత్ తీగలు పడి డ్రైవర్ మృతి

ప.గో: మొగల్తూరు మండలం కాళీపట్నంలో ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సుపై విద్యుత్ తీగలు పడి డ్రైవర్ మృతి చెందాడు. స్కూలు పిల్లలను తీసుకెళ్లేందుకు ఈ ఘటన చోటు చేసుకుంది.

ఏటి మొగ లో మరోసారి ఉద్రిక్తత

తూ.గో: కాకినాడ ఏటి మొగ లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కొండబాబు సోదరుడు సత్యనారాయణతో వైసీపీ కార్యకర్తలు వాగ్యాదానికి దిగడంతో తోపులాట నెలకొంది. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు చెదరగొట్టారు.

విద్యుత్ కోతతో నిలిచిన వెబ్ కాస్టింగ్

తూ.గో : కాకినాడలో విద్యుత్ కోతతో పోలింగ్ స్టేషన్ లో వెబ్ కాస్టింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలలో నోటా ఆప్షన్ కనిపించలేదు. నోటా ఆప్షన్ లేకపోవడంతో ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికలు కావడంతో నోటా ఆప్షన్ పెట్టలేదని అధికారులు తెలిపారు.

నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి : కూకట్‌పల్లి ప్రగతినగర్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో సెకండియర్‌ విద్యార్థి నాగసాయి హాస్టల్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగసాయి మృతికి నారాయణ జూనియర్ కాలేజీ యజమాన్యమే కారణమని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహన్ని పోస్టుమార్టం కొరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

కాకినాడలో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్..

తూ.గో : కాకినాడ కార్పోరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ ఉండటంతో గుంపులుగా ఉండేవారిని పోలీసులు చెదరగొడుతున్నారు. మధ్యాహ్నం నుంచి పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

11:39 - August 29, 2017
11:38 - August 29, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ప్రశాంతంగా మొదలైందని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా రాజకీయ వేడి తగిలింది. 20వ బూత్ లో ఏటిమొగ ప్రాంతంలో ఘర్షణ తలెత్తింది. ఇక్కడ ఎమ్మెల్యే కొండబాబు సోదరుడు సత్యనారాయణ తనయుడు బరిలో నిలుచున్నారు. ఇక్కడ వైసీపీ పార్టీకి చెందిన బలమైన నేత బరిలో ఉన్నారు. పోలింగ్ బూత్ వద్ద సత్యనారాయణ..వైసీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాలను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. నిబంధనలు ఉల్లంఘించవద్దని..పోలింగ్ బూత్ వద్ద ప్రచారం నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం వర్షం పడడంతో మందకొడిగా పోలింగ్ స్టార్ట్ అయ్యింది. అనంతరం వర్షం తగ్గడంతో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివెళుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేకపోవడంతో ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలు కావడంతో నోటా ఆప్షన్ పెట్టలేదని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు విద్యుత్ కోతతో పోలింగ్ కేంద్రాల్లో కొంత ఇబ్బందులు..కొద్దిసేపు వెబ్ కాస్టింగ్ కూడా నిలిచిపోయిన్నట్లు సమాచారం. 

11:37 - August 29, 2017

నిర్మల్ జిల్లా : కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారిపోయింది. భారీగా వరదనీరు పోటెత్తుతోంది. మహారాష్ట్ర..ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో కడెం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులుగా ఉండగా ప్రస్తుతం 698 అడుగులకు చేరుకుంది. ముందస్తుగా గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు వదిలారు. ఇన్ ఫ్లో 12.31 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 13.41 క్యూసెక్కులుగా ఉంది. 12 ఫీట్ల మేర గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎడమ కాల్వ నుండి 907 క్యూసెక్కులు, కుడి కాల్వ నుండి 19 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..గోదావరి నదిలోకి దిగవద్దని హెచ్చరించారు.

11:35 - August 29, 2017

విజయవాడ : ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన కొత్త ప్రభుత్వాసుపత్రి వద్ద చోట చేసుకుంది. పదో నెంబర్ బస్సు నిత్యం రద్దీతో వెళుతుంటుంది. కాలేజీకి వెళ్లే విద్యార్థులు..ఇతరులు ఈ బస్సులో వెళుతుంటారు. రైల్వే స్టేషన్ నుండి రామాపురం వరకు ఈ బస్సు వెళుతోంది. బందర్ రోడ్డు మీదుగా వెళుతున్న ఈ బస్సు కొత్త ప్రభుత్వాసుపత్రి వద్దకు రాగానే బస్సు ఇంజిన్ నుండి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఓ పక్కకు ఆపేసి దిగి ప్రయాణీకులను అప్రమత్తం చేశారు. వెంటనే బస్సులో ఉన్న వారందరూ కిందకు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. 

10:50 - August 29, 2017

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో వంద సీట్లలో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారే అవకాశం ఉందన్న అభద్రతా భావంతోనే ముఖ్యమంత్రి ఇలాంటి మైండ్‌గేమ్‌ అడుతున్నారన్నది తెలంగాణ కాంగ్రెస్‌ నేతల వాదన. ధైర్యం ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికులు నిర్వహించాలని సవాల్‌ విసురుతున్నారు. సమగ్ర భూసర్వే గురించి చర్చించేందుకు ఈనెల 26న నిర్వహించిన టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో... వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ వంద సీట్లు గెలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యేందరికీ సీట్లు ఇవ్వడంతోపాటు, గెలిపించుకునే బాధ్యత తీసుకుంటానని ముఖ్యమంత్రి చెప్పడం రాజకీయంగా కలకలం సృష్టించింది. కేసీఆర్‌ ప్రకటనపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా స్పదిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ప్రబలిన నేపథ్యంలో సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్‌ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నది తెలంగాణ కాంగ్రెస్‌ నేతల వాదన. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కొందరు పార్టీ మారే అవకాశం ఉందన్న భయంతోనే కేసీఆర్‌ ఇలాంటి మైండ్‌గేమ్‌కు తెరతీశారని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు హడావుడిగా చేపడుతున్న సమగ్ర భూ సర్వేపై కూడా కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకి దీనికి పెద్ద తేడా ఉందన్న వాదాన్ని వినిపిస్తున్నారు. సమగ్ర భూసర్వేపై విపక్షాల సూచనలు, సలహాలు తీసుకునేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఖరిని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తప్పుపడుతున్నారు. శాసనసభ, శాసనమండలిని సమావేశపరిచి, భూ సర్వేపై చర్చించాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చారు.

కడెం ప్రాజెక్టుకు వరద నీరు

నిర్మల్ : కడెం ప్రాజెక్టుకు వరద నీరు పెరుగుతోంది. ఇన్ ఫ్లో 12.31 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 13.41 క్యూసెక్కులుగా ఉంది. ఒక గేట్ ను 12 ఫీట్ల మేర ఎత్తి నీటిని కిందకు వదిలారు. పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులుగా ఉంది. 

10:47 - August 29, 2017

కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 7గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. ఈవీఎంలలో నోటా ఆప్షన్ లేకపోవడంపై ఓటర్లు తీవ్ర అభ్యంతరం తెలియచేస్తున్నారు. స్థానిక ఎన్నికలు కావడంతో నోటా ఆప్షన్ పెట్టలేదని అధికారులు పేర్కొన్నారు.

ఉదయం వర్షం పడుతుండడంతో మందకొడిగా పోలింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఉదయం 9గంటలకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నారు. మున్సిపల్ స్కూల్ వద్ద ఓటర్లు బారులు తీరి నిలుచున్నారు. బూత్ నెంబర్ 36, 37లలో భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామని టెన్ టివితో డీఎస్పీ పేర్కొన్నారు. మరోవైపు విద్యుత్ కోతతో పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వెబ్ కాస్టింగ్ కూడా నిలిచిపోయింది. 

కానిస్టేబుల్ కు సీఎం శివరాజ్ రివార్డు..

భోపాల్ : పది కిలోల బరువున్న బాంబును మోసుకెళ్లి ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడవేసి 400 మంది విద్యార్థులను కాపాడిన కానిస్టేబుల్ అభిషేక్ పటేల్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన్ను అభినందించి రూ. 50 వేల రివార్డు అందచేశారు. 

08:26 - August 29, 2017

మహారాష్ట్ర : మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా పలు రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పది రోజుల్లో మూడు రైలు ప్రమాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రైలు ప్రమాదాల నేపథ్యంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాజీనామా చేయాలని యోచించారు.

తాజాగా మహారాష్ట్రలో ఓ రైలు పట్టాలు తప్పింది. టిట్ వాల్ సమీపంలో నాగపూర్ - ముంబై దురంతో ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో ఆరు బోగీలు పట్టాల మీద నుండి తప్పాయి. ఇంజిన్ తో సహా ఐదు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. చాలా మందికి గాయాపడ్డారని తెలుస్తోంది. ఎవరైనా మృతి చెందారా అనేది తెలియ రావడం లేదు. వర్షాలు పడుతుండడం..వరద నీరు రైలు పట్టాల మీద నుండి వెళ్లడంతో ట్రాకింగ్ కింద నున్న రాళ్లు తొలగిపోయాయని తెలుస్తోంది. భారీ ప్రమాదాన్ని నివారించే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బోగీలు పట్టాలు తప్పాయని తెలుస్తోంది. గతంలో రైలు ప్రమాద ఘటనలపై వెంటనే స్పందించే మంత్రి సురేష్ ప్రభు ఈ ఘటనపై స్పందించకపోవడం చర్చనీయాశంమౌతోంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

08:11 - August 29, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. వర్షం కారణంగా మందకొడిగా పోలింగ్ సాగుతోంది. పలు ప్రాంతాల్లో కరెంటు లేకపోవడంతో చీకటిలోనే పోలింగ్ కొనసాగిస్తున్నారు. ఐదో నెంబర్ బూత్ లో కొవ్వొత్తుల వెలుగులో పోలింగ్ జరుగుతోంది.

7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. కాకినాడ నగరపాలక సంస్థలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి. ఇందులో రెండు వార్డులపై వివాదాలు కొనసాగుతుండడంతో 48 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాకినాడ మేయర్‌ పీఠం కోసం టీడీపీ, బీజేపీ మిత్రపక్షం పోటీపడుతుండగా... ప్రతిపక్ష వైసీపీ కూడా దీనిపై కన్నేసింది. కాకినాడలో మొత్తం 2 లక్షల 30వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 41వ డివిజన్ రిటర్నింగ్ అధికారి టెన్ టివితో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

మందకొడిగా పోలింగ్..

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ పోలింగ్ కొనసాగుతోంది. వర్షం కారణంగా మందకొడిగా పోలింగ్ కొనసాగుతోంది. ఐదో నెంబర్ బూత్ లో చిమ్మ చీకటి ఉండడంతో కొవ్వొత్తుల వెలుగులో పోలింగ్ జరుగుతోంది. 

07:57 - August 29, 2017

కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఇన్న గని..ఈ నడుం దెబ్బకు సుత్తి దెబ్బ వినకపోతి..చూడకపోతి..సుత్తె..సానం తీసుకుని నడుంపై కొడితే ఉంటదా వెన్నుపూస...కొండ నాలుకకు మందస్తే ఉన్న నాలుక ఊడిచ్చినట్లు వెన్నుపూస నొప్పి బాగు చేయపోతే మొత్తం విరగొట్టిందే అనుకో...ఎట్లుంటది..తలచుకొంటేనే భయం అవుతున్నది. ఒక ముసలాయన వైద్యం చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

07:50 - August 29, 2017

అసలు సర్పంచ్ అంటే ఏందీ ? ఒక గ్రామానికి ప్రథమ పౌరుడు. దేశానికి ప్రధాన మంత్రి ఎట్లనో..రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో..ఒక ఊరికి గ్రామ సర్పంచ్ అట్లే. అసొంటి సర్పంచ్ ఆధ్వర్యంలో ఏ మీటింగ్ అయినా..ఏ అభివృద్ధి కార్యక్రమమమైనా జరగాలి..అది ప్రొటోకాల్. కానీ సంగారెడ్డి జిల్లాలో అధికారుల అత్యుత్సాహమా ? లేక అధికార పార్టీ ఓవర్ యాక్షన్ తెల్వదు. ఒక దళిత మహిళ సర్పంచ్ ఉన్న ఊర్లే ఆమెకు తెల్వకుంట అభివృద్ధి కార్యక్రమాలు చేసిండంటే ఆమెను అవమానించుడు కాకపోతే ఏందో చెప్పండి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

పట్టాలు తప్పిన దురంతో ఎక్స్ ప్రెస్..

మహారాష్ట్ర : దురంతో ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. టిట్ వాల్ సమీపంలో నాగపూర్ - ముంబై దురంతో ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో ఆరు బోగీలు పక్కకు తప్పాయి. 

07:41 - August 29, 2017

అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ కటకటాల పాలయ్యారు. రెండు కేసులకు సంబంధించి గుర్మీత్‌కు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు తీర్పు చెప్పింది. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది. వైసీపీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఈ అంశాలపై జరిగిన టెన్ టివి చర్చా వేదికలో రాకేష్ (బీజేపీ), వీరయ్య (నవ తెలంగాణ ఎడిటర్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:36 - August 29, 2017

రిటైర్మెంట్ తర్వాతి జీవితాన్ని ప్రశ్నార్ధకంగా మార్చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వ్యతిరేక పోరాటం మరింత తీవ్రమవుతోంది. ఇప్పటికే విభిన్న రూపాల్లో ఆందోళనలు నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి. సెప్టెంబర్ 1 ఖిలావత్ దివాస్ గా పాటించేందుకు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 1న సామూహిక సెలవులు పెడుతున్నట్టు ఇప్పటికే సంఘాలు ప్రకటించాయి. ఇదే అంశంపై టెన్ టివి జనపథంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు స్థితప్రజ్ణ విశ్లేషించారు. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

07:33 - August 29, 2017

చెన్నై : తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవైపు ప్రభుత్వంపై అవిశ్వాసానికి ప్రధాన ప్రతిపక్షంతో పాటు శశికళకు చెందిన దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా... పళణిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే పార్టీ నేతలు సమావేశమై మరో ఎత్తుగడ వేశాయి. శశికళ, దినకరన్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించాలని పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈసీకి ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలని తీర్మానం చేశారు. అలాగే జయ టీవీ, నమదు ఎంజీఆర్‌ పత్రికను కూడా తమ స్వాధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇక దినకరన్‌ వర్గంలోని ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసి వారిని అనర్హులుగా ప్రకటించి.... తమపై పెట్టిన అవిశ్వాసాన్ని తప్పించుకోవాలని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. 

07:23 - August 29, 2017

విజయవాడ : మొన్నటి దాకా నంద్యాల ఉప ఎన్నిక.. మూడేళ్ల టీడీపీ పాలనకు రెఫరెండమన్న వైసీపీ అధినేత జగన్‌ ఇప్పుడు మాటమార్చారు. 200 కోట్ల డబ్బు ప్రవాహంతో సాగిన ఈ ఉప ఎన్నిక రెఫరెండం కానేకాదంటున్నారు. ఓట‌మిని అంగీకరించకపోగా...ఫిరాయింపు నేతలతో రాజీనామా చేయించి మళ్లీ ఉప ఎన్నికలకు రావాలని సీఎం చంద్రబాబుకు సవాల్‌ విసురుతున్నారు.

నంద్యాల ఉప ఎన్నికల పోరు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య హోరాహోరీగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా మాటలదాడితో నేతలు పొలిటికల్‌ హీట్‌ పెంచారు. నంద్యాల బైపోల్‌ను ప్రతిష్టాత్మకంగా భావించిన టీడీపీ, వైసీపీ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 13 రోజులు ప్రచారం కోసం నంద్యాలలో మకాం వేశారు. ప్రచారం కోసం మంత్రులను రంగంలోకి దింపిన సీఎం చంద్రబాబు.. రెండు రోజులు తాను క్యాంపెయిన్‌ చేశారు. ప్రజలు అభివృద్ధి మంత్రానికే ఓటు వేయడంతో.. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ప్రభంజనం సృష్టించారు. దీంతో నంద్యాల ఉపఎన్నిక రెఫరెండం అని ప్రచారంలో హోరెత్తించిన వైసీపీ...సడెన్‌గా యూ టర్న్‌ తీసుకుంది. నంద్యాల ఉపఎన్నికల్లో 200 కోట్లు ఖర్చు చేశారని.. డబ్బు ప్రవాహంతో గెలిచారని.. ఇది ముమ్మాటికీ రెఫరెండం కాదని వైసీపీ అధినేత అంటున్నారు.

ఇక నంద్యాల ఉపఎన్నికల ఫలితాల్లో ఆది నుంచి ప్రతి రౌండ్లో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం కనబరిచారు. 16వ రౌండ్‌ మినహా టీడీపీకి ఫ్యాన్‌ పార్టీ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఒకవేళ ఓడిపోయినా స్వల్ప మెజార్టీతోనే అని భావించిన వైసీపీ నేతలకు.. ఫలితాలు షాక్‌ ఇచ్చాయి. 27,466 ఓట్ల భారీ మెజార్టీతో భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించడంతో...వైఎస్సార్‌ కాంగ్రెస్ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయించి ఎన్నిక‌లకు రావాలని... అప్పుడు తమ సత్తా ఎంటో చూపిస్తామని జ‌గ‌న్ స‌వాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో అయితే టీడీపీ గెలిచేది కాదని.. ఉప ఎన్నిక అయినందుకే విజయం సాధించిందని జగన్‌ అంటున్నారు. మరి జగన్‌ సవాల్‌ను సైకిల్‌ పార్టీ నేతలు ఎలా స్వీకరిస్తారో చూడాలి.  

07:20 - August 29, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సాల్లో మునిగి తేలాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బాణాసంచా కాల్చి, స్వీట్స్‌ పంచుకుని సంబరాలు జరుపుకున్నాయి. నంద్యాల ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు నంద్యాల గెలుపును టీడీపీ విజయంగా భావిస్తే అది దిగజారుడు రాజకీయమే అవుతుందని వైసీపీ అధినేత జగన్‌ వ్యాఖ్యానించారు.

నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపుపై... సీఎం చంద్రబాబునాయుడు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతిలో మంత్రుల సమక్షంలో సీఎం కేక్‌ను కట్‌ చేసి అందరికీ తినిపించారు. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ను డేరా బాబాతో పోల్చారు. నంద్యాలలో టీడీపీ విజయం అభివృద్ధికి దోహదం చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పుకొచ్చారు. మరోవైపు నంద్యాలలో ఓటమిపై వైసీపీ అధినేత జగన్‌ స్పందించారు. టీడీపీ దౌర్జన్యంతో గెలిచిందన్నారు. నంద్యాల ప్రజలు చంద్రబాబుకు భయపడి టీడీపీకి ఓట్లేశారని వ్యాఖ్యానించారు.

నంద్యాలలో టీడీపీ గెలుపుతో... కర్నూలు జిల్లాలో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. బాణాసంచా కాల్చి ర్యాలీలు నిర్వహించారు. మిఠాయిలు పంచారు. విజయవాడ లెనిన్ సెంటర్‌లో గుండుతో ఉన్న రోజా ఫ్లెక్సీలను పట్టుకుని.... టపాసులు పేలుస్తూ స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. గుంటూరులోని నేతలు, కార్యకర్తలు పరస్పరం అభినందించుకుని స్పీట్లు పంచుకున్నారు. బ్రహ్మానందరెడ్డి విజయంతో ఒంగోలులో ఆపార్టీ నేతులు, కార్యకర్తలు ఆనందోత్సాహంతో సంబరాలు చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నంద్యాల విజయోత్సవం నిర్వహించారు. కడప జిల్లా పులివెందులలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి బస్టాండ్‌ వరకు ఈ ర్యాలీ జరిగింది. నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ ద్వారా అభినందించారు. మొత్తం నంద్యాల ఉప ఎన్నిక ఫలితం టీడీపీలో ఆనందోత్సాహాలు నింపితే, వైపీసీలో అంతర్మథనానికి దారితీసింది. 

07:15 - August 29, 2017

తూర్పుగోదావరి : మరో గంటలో కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌... సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అయితే కాకినాడ ఓటరు ఎవరిపై కరుణ చూపుతారన్నదరి ఉత్కంఠ రేపుతోంది.

కాకినాడ నగరపాలక సంస్థలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి. ఇందులో రెండు వార్డులపై వివాదాలు కొనసాగుతుండడంతో 48 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాకినాడ మేయర్‌ పీఠం కోసం టీడీపీ, బీజేపీ మిత్రపక్షం పోటీపడుతుండగా... ప్రతిపక్ష వైసీపీ కూడా దీనిపై కన్నేసింది. కాకినాడలో మొత్తం 2 లక్షల 30వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

48 వార్డులకుగాను 196 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ విధించారు. భద్రతా దళాలు భారీగా మోహరించాయి. కాకినాడలో 28 అత్యంత సమస్యాత్మక, మరో 52 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఆ పోలింగ్‌ కేంద్రాల దగ్గర అదనపు భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 3025మంది సిబ్బంది పాల్గొంటున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. ఇరుపార్టీల మధ్య హోరాహోరీగా పోటీ ఉండడంతో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను నియమించారు.

కాకినాడ ఎన్నికల ఫలితాలు సెప్టెంబర్‌ 1న వెలువడనున్నాయి. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపు తమదంటే తమదేనని తేల్చి చెబుతున్నాయి. మరి కాకినాడ ఓటరు ఎవరిపై కరుణ చూపుతాడో వేచి చూడాలంటే సెప్టెంబర్‌ 1 వరకు వేచి చూడాలి. కాకినాడ కార్పేషన్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో పోలింగ్‌ కూడా ప్రారంభంకానుంది. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

నేడు అర్జున అవార్డుల ప్రధానం..

ఢిల్లీ : నేడు అర్జున అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అవార్డులను అందచేయనున్నారు. 17 మంది క్రీడాకారులు అవార్డులను అందుకోనున్నారు.

 

రాజస్థాన్ లో ప్రధాని పర్యటన..

ఢిల్లీ : రాజస్థాన్ లో నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయరన శంకుస్థాపన చేయనున్నారు. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా..

ఢిల్లీ : నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దీపక్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 45వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ప్రమాణ చేయనున్నారు. 

బాబును కలువనున్న అఖిల..భూమా బ్రహ్మానందరెడ్డి..

విజయవాడ : నేడు మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో మంత్రి భూమా అఖిల, నూతన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలు భేటీ కానున్నారు. 

నిర్మల్..మంచిర్యాలలో కడియం పర్యటన..

హైదరాబాద్ : నేడు నిర్మల్, మంచిర్యాలలో డిప్యూటి సీఎం కడియం, మంత్రులు జోగు రామన్న, ఐకే రెడ్డిలు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపన చేయనున్నారు. 

నగరానికి మధ్యప్రదేశ్ జలవనరుల ఇంజినీర్లు...

హైదరాబాద్ : నేడు మధ్యప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్లు నగరానికి రానున్నారు. మిషన్ భగీరథ పై రాష్ట్ర ఇంజనీర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 

వేణుమాధవ్ కు బాబు అండ..

విజయవాడ : నటుడు వేణుమాధవ్ కు నంద్యాల ప్రచారంలో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ నేతల బెదిరింపులు మాములేనని, వేణుమాధవ్ కు అండగా ఉంటామన్నారు. 

డోక్లామ్ సంక్షోభానికి తెర..

ఢిల్లీ : డోక్లామ్ సంక్షోభానికి భారత్ - చైనా తెరపడింది. డోక్లామ్ బోర్డర్ నుండి సైన్యం ఉపసంహరణకు ఇరుదేశాలు అంగీకరించాయి. డోక్లామ్ లో రోడ్డు నిర్మాణ పనులను చైనా నిలిపివేసింది. 

భువనగిరికి కేంద్రీయ విద్యాలయం..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా కొత్తగా 50 కేంద్రీయ విద్యాలయాలను కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించింది. తెలంగాణాలో భువనగిరికి కేంద్రీయ విద్యాలయం కేటాయించింది. 2017-18 సంవత్సరానికి గాను తరగతులు ప్రారంభం కానున్నాయి. తొలి సంవత్సరం 1 నుండి 5 వరకు తరగతులను ప్రారంభించనున్నారు. 

అగ్రవర్ణాల దురంహాకారం..

నెల్లూరు : ఏఎస్ పేట మండలం కుప్పురుపాడులో అగ్రవర్ణాల దురంహాకారం బయటపడింది. దళితులను అగ్రవర్ణాలు గ్రామ బహిష్కరించారు. వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. తమ నివాసాల ముందట నుండి వినాయక విగ్రహాలను తీసుకెళ్లవద్దని అగ్రవర్ణాలు హుకుం జారీ చేశారు. 

మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ చర్చలు.

హైదరాబాద్ : మున్సిపల్ శాఖ సెక్రటరీలో మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ చర్చలు ముగిశాయి. కొన్ని డిమాండ్లకు నవీన్ మిట్టల్ అంగీకారం తెలిపారు. మరికొన్ని సమస్యలపై ఏడో తేదీలోపు చర్చిస్తామని నవీన్ మిట్టల్ - మున్సిపల్ కార్మిక సంఘాల పరస్పర అంగీకారానికి వచ్చారు. సమ్మెను వచ్చే నెల 7కు వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పేర్కొంది. 

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికకు పోలింగ్...

తూర్పుగోదావరి : నేడు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. 50 వార్డుల్లో 48 వార్డులకు ఎన్నిక జరగనుంది. 196 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. 

Don't Miss