Activities calendar

30 August 2017

22:07 - August 30, 2017

హైదరాబాద్ : ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో సిల్వర్‌ పతకం సాధించిన పీవీ సింధు... ఇవాళ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. సింధు, గోపిచంద్‌ను కేసీఆర్‌ సత్కరించారు. సింధు భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. 

22:01 - August 30, 2017

అమెరికా : భారీ వర్షాలకు అమెరికాలోని టెక్సాస్‌ అతాలకుతలమవుతోంది. హరికేన్‌ తుపాన్‌ ధాటికి భారతీయ విద్యార్థి 24 ఏళ్ల నిఖిల్‌ భాటియా బలయ్యాడు. రాజస్థాన్‌ జైపూర్‌కు చెందిన నిఖిల్‌ ఏ ఆండ్ ఎమ్ యునివర్సిటీలో చదువుతున్నాడు. భారత్‌కు చెందిన నిఖిల్‌ భాటియా, షాలిని సింగ్‌ నీటిలో కొట్టుకుపోతుండగా వారిని కాపాడి అత్యవసర వైద్య సేవల విభాగంలో చేర్చారు. కాగా.. వీరిలో నిఖిల్‌ భాటియా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఢిల్లీకి చెందిన షాలిని పరిస్థితి కూడా విషమంగానే ఉంది.  హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయంలో చదువుతున్న 200 మంది భారతీయ విద్యార్థులు వరదల్లో చిక్కుకున్నారు. వీరిని అక్కడి అధికారులు కాపాడి.. సురక్షిత ప్రాంతానికి తరలించారు. టెక్సాస్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు 13 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారు. హూస్టన్‌లో దాదాపు లక్ష మంది భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు. వరదల కారణంగా ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. 

 

21:59 - August 30, 2017

ఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో వాటిపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించేది లేదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టంచేశారు. అవసరమైనప్పుడు ఈ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు అనేది ప్రభుత్వం చేతిలో లేదని, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా అవి మారుతుంటాయని పేర్కొన్నారు. రోజువారీ సవరించడం ప్రారంభమైనప్పటి నుంచి పెట్రోల్‌ ధర 6రూపాయలు, డీజిల్‌ ధర 3 రూపాయల 68 పైసల వరకు పెరిగింది. 

 

21:57 - August 30, 2017

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లలో 99 శాతం తిరిగొచ్చాయని రిజర్వు బ్యాంకు ప్రకటించింది. మొత్తం 15.44 ల‌క్షల కోట్ల విలువైన వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లు రద్దు కాగా... 15.28 ల‌క్షల కోట్ల రూపాయలు తిరిగి వ‌చ్చాయ‌ని ఆర్బీఐ త‌న వార్షిక నివేదిక‌లో వెల్లడించింది. ర‌ద్దైన కరెన్సీలో 8,900 కోట్ల రూపాయల విలువైన వెయ్యి నోట్లు తిరిగి రాలేద‌ని రిజర్వు బ్యాంకు ప్రకటించింది.  ఇక ప్రస్తుతం చెలామణిలో ఉన్న కొత్త నోట్లలో  2000 నోట్లు యాభై శాతం పైగా ఉన్నాయి.  గత ఏడాదితో పోలిస్తే ఈసారి మార్కెట్లో క‌రెన్సీ చెలామ‌ణి  20 శాతం త‌గ్గింద‌ని కూడా ఆర్బీఐ వార్షిక నివేదిక వెల్లడించింది.  

 

21:54 - August 30, 2017

యూపీ : ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరడం సరికాదన్నారు. రాబోయే రోజుల్లో పిల్లలను కూడా ప్రభుత్వమే చూసుకోవాలని అనేలా ఉన్నారని ఆయన ప్రజలనుద్దేశించి అన్నారు. గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో పిల్లల మరణాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

21:51 - August 30, 2017

యూపీ : ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లో బిఆర్‌డి ఆసుపత్రిలో చిన్నారుల మరణ మృదంగం కొనసాగుతోంది. గత మూడు రోజుల్లో 63 మంది పిల్లలు మృత్యు ఒడికి చేరుకున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే 290 పసిపిల్లలు కన్నుమూశారు. చిన్నారుల మరణాలకు అడ్డుకట్ట పడేదెపుడు?
చిన్నారుల మృత్యుఘోష 
ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ దాస్ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చిన్నారుల మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. గడిచిన 48 గంటల్లో మరో 37 మంది చిన్నారులు మరణించారు. వారిలో ఏడుగురు మెదడువాపు వ్యాధి, మిగిలినవారు రకారకాల వైద్య కారణాలతో చనిపోయారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 
290మంది పిల్లలు మృతి
ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకూ 290మంది పిల్లలు మరణించారు. ఆగస్టు 10-11 తేదీల్లో 33 మంది పిల్లలు మరణించిన విషయం తెలిసిదే. ఆక్సిజన్‌ కొరత వల్లే పిల్లలు మృతి చెందినట్లు ఈ ఘటనపై విచారణ జరిపిన నివేదికలో స్పష్టమైంది. బీఆర్డీ ఆస్పత్రి దుర్ఘటనపై విచారణకు ఆదేశించిన యూపీ సిఎం యోగి ఆదిత్యానాథ్‌ బిఆర్‌డి కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజీవ్‌ మిశ్రాను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మిశ్రాతో పాటు ఆయన భార్యను స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అరెస్ట్‌ చేసింది.
పిల్లల మరణాలకు రకరకాల కారణాలు : ఆస్పత్రి వర్గాలు 
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1,250మంది చిన్నారులు మృతి చెందారని బిఆర్‌డి మెడికల్‌ కాలేజీకి చెందిన డాక్టర్ పికె సింగ్‌ తెలిపారు. ఈ నెల 28 ఆగస్టు వరకు ఎన్ ఐసీయూ వార్డులో 213, ఇన్‌సెఫెలైటిస్‌ వార్డులో 77 మంది పిల్లలు చనిపోయారు. పిల్లల మరణాలకు రకరకాల కారణాలున్నాయని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా తక్కువ బరువు, పచ్చకామెర్లు, నిమోనియా తదితర వ్యాధులు గల పిల్లలను  ఆసుపత్రికి తీసుకొస్తుంటారు. తమ పిల్లల ఆరోగ్యం పూర్తిగా విషమించిన తర్వాత చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకు వస్తారని... చిన్నారులకు తమ శాయశక్తులా చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని వైద్యులు తెలిపారు. ఎక్కువశాతం మంది పిల్లలు మెదడువాపు వ్యాధితో మరణించినట్లు ఆస్పత్రివర్గాలు తెలిపాయి. పిల్లలను సకాలంలో ఆసుపత్రికి తీసుకువస్తే నవజాత శిశువుల మరణాలను అరికట్టే అవకాశముందని చెబుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది చిన్నారుల మరణాలు తక్కువేనని పేర్కొన్నారు. 

 

21:46 - August 30, 2017

గుంటూరు : అమరావతిలోని ప్రతిపాదిత 13 జోన్లలో మూడు జోన్లను 'హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌'లో అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. సచివాలయంలోని సీఆర్‌డీఏ సమీక్ష సమావేశం నిర్వహించిన చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయవాడ అభివృద్ధి పనులపైనా సీఎం దృష్టి సారించారు.
మంత్రులకు ఆదేశాలు, సూచనలు చేసిన చంద్రబాబు
అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబు సీఆర్‌డీఏ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజధాని నిర్మాణం, పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు, అధికారులతో చంద్రబాబు చర్చలు జరిపారు. పలు అంశాలపై మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. 
అమరావతిలో 29 గ్రామాల అభివృద్ధికి ఆదేశాలు
అమరావతిలోని ప్రతిపాదిత 13 జోన్లలో మూడు జోన్లను 'హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌'లో అభివృద్ధి చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ 13 జోన్లలో  4, 5, 9 జోన్లకుగానూ మొత్తం రూ. 6వేల 900 కోట్లతో రహదారులు, వంతెనలు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్ వంటి మౌలిక వసతులను హెచ్ఏఎం ద్వారా కల్పించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల అభివృద్ధి చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ గ్రామాల్లో పరిశుభ్రత, రహదారుల నిర్మాణం వంటి వసతుల కల్పన కోసం నరేగా నిధులు వినియోగించాలని సూచించారు. 
280 ఎకరాల్లో శాఖమూరు పార్కు తీర్చిదిద్దాలన్న సీఎం
అమరావతిలోని శాఖమూరు పార్కు ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి నమూనాలపైనా సమావేశంలో చర్చకు వచ్చింది. 280 ఎకరాలలో ఈ పార్కును ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇరువైపులా, శాఖమూరు పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం సెప్టెంబర్ రెండో వారంలో పెద్దఎత్తున చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. మరోవైపు విజయవాడలోని రాజీవ్‌గాంధీ పార్క్ ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ఇంద్రకీలాద్రి తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. కనకదుర్గమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, కేశఖండన శాల, క్యూలైన్ల ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

21:32 - August 30, 2017
21:31 - August 30, 2017

ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయాన్ని జప్తు చేయాలని సివిల్ కోర్టు

సూర్యపేట : ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయాన్ని జప్తు చేయాలని సివిల్ కోర్టు ఆదేశించింది. రైతు నుంచి ప్రభుత్వానికి భూమి విక్రయించిన వ్యవహారంలో డబ్బులు చెల్లించకపోవడంతో కోర్టు ఆగ్రహించింది. రూ.7 లక్షలు చెల్లించాలంటూ గతంలోనే కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో తిరిగి పాతర్లపాడు రైతు నర్సింహారావు కోర్టును ఆశ్రయించారు. 

21:09 - August 30, 2017

మాసులకు దూస్కొస్తున్నటీ మాస్, మహిళా సీఐని వేధిస్తున్న పోకిరీలు, సుక్కనీళ్లు రాక పరేషానైతున్నపబ్లీక్ ఆప్రీషన్ థియేటర్ల డాక్టర్ల కీసులాట, మోరీలెత్తి ఇండ్లల్ల పోసుకున్నరు... ఇంటిపక్కోళ్ల కయ్యాలు ఇట్లనే ఉంటయ్.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:54 - August 30, 2017
20:52 - August 30, 2017

నెల్లూరు : శ్రీహరికోటలోని సతీస్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ ఎల్ వీ సీ 39 ఉపగ్రహం ద్వారా ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ 1 హెచ్ ఉప్రగ్రహాన్ని గురువారం రాత్రి 7 నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం కోసం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ 29 గంటలపాటు కొనసాగుతుంది. పీఎస్‌ఎల్‌వీ సీ39 రాకెట్‌ ప్రయోగానికి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం సిద్ధమైంది. ఈ రాకెట్‌ ద్వారా ఇండియన్‌ రీజినల్‌ నేవిగేషనల్‌ శాటిలైట్ సిస్టంకు చెందిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ 1 హెచ్‌ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెడతారు.
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ 1హెచ్‌ ఉపగ్రహం 
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ 1హెచ్‌ ఉపగ్రహం భారత రోడ్డు, జల రవాణ వ్యవస్థకు దిక్సూచిగా పని చేస్తుంది. ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. ఇరవైతొమ్మిది గంటలపాటు కౌంట్‌డౌన్‌ కొనసాగిన తర్వాత గురువారం రాత్రి 7 గంటలకు ఉపగ్రహ ప్రయోగం జరుగుతుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ39 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహం బరువు 1425 కిలోలు. ఈ ప్రయోగం కోసం షార్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మెరుగైన రవాణ సమాచార వ్యవస్థకు ఉపగ్రహం దోహదం చేస్తుంది. మన దేశంతోపాటు చుట్టుపక్కల 1500 కి.మీ. పరిధిలో  నేవిగేషన్‌ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఇస్రో చైర్మన్‌ కిరణ్‌కుమార్‌, షార్‌ డైరెక్టర్‌ కున్హి కృష్ణన్‌ ప్రయోగ ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. 2013 జులైలో పీఎస్‌ఎల్‌వీ ద్వారా కక్షలో ప్రవేశపెట్టిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఏ ఉపగ్రహంలో సాంకేతికలోపం తలెత్తి పనిచేయకపోవడంతో దాని స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ని పంపుతున్నారు.  సీఎస్‌ఎల్‌వీ-సీ39 రాకెట్‌ ప్రయోగం నేపథ్యంలో శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో భద్రత కట్టుదిట్టం చేశారు. 

 

20:48 - August 30, 2017
20:42 - August 30, 2017
20:40 - August 30, 2017

మహారాష్ట్ర : ముంబైలో వర్షాలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ రాత్రి కురిసిన భారీవర్షానికి గోడకూలి ఐదుగురు మృతి చెందారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా ప్రజలకు ఊరట లభించలేదు. స్కూళ్లు కళాశాలలు మూసివేశారు. డబ్బావాలాలు సెలవు తీసుకోవడంతో రెండు లక్షల మంది ఉద్యోగులకు లంచ్ సేవలు రద్దయ్యాయి. వారిపై ఆధారపడే ఉద్యోగులు భోజనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది.  అక్కడక్కడ కొన్ని రైళ్లు నడుస్తున్నాయి. దాదర్‌లోని మాట్‌కర్‌ రోడ్డులో మ్యాన్‌హోల్‌ తెరచుకోవడంతో ఓ డాక్టర్‌ అందులో పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని లోతట్టు ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల నేవి సిబ్బంది వరద బాధితులకు ఆహారం అందించారు. వరదల పరిస్థితి తీవ్రంగా ఉన్నా  సిఎం సెలవు ప్రకటించలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు మున్సిపల్‌ ఉద్యోగులకు సెలవు రద్దు చేశారు. కువైత్‌, జెడ్డా, చండీగఢ్, ఉదయ్‌పూర్, భుజ్‌, గోవా, అహ్మదాబాద్‌, వడోదరకు వెళ్లే విమానాలను నిలిపివేశారు.

 

20:36 - August 30, 2017

ఢిల్లీ : కేబినెట్ పునర్‌ వ్యవస్థీకరణకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారు. ఈసారి కేబినెట్లో భారీ మార్పులుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 1 లేదా రెండవ తేదీల్లో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశముంది. ఈసారి కేబినెట్లోకి ఏఐఏడీఎంకే, జేడీయూ చేరే అవకాశాలున్నాయి. విస్తరణ, మార్పులపై.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రేపు.. ప్రధానితో భేటీ కానున్నారు. 

కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు..?

ఢిల్లీ : కేబినెట్ పునర్‌ వ్యవస్థీకరణకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారు. ఈసారి కేబినెట్లో భారీ మార్పులుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 1 లేదా రెండవ తేదీల్లో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశముంది. 

20:29 - August 30, 2017

హైదరాబాద్ : భూ రికార్డుల ప్రక్షాళనపై తెలంగాణ సర్కార్‌ వేగం పెంచింది. రేపు కలెక్టర్లు, ఆర్డీవోలతో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఇవాళ రెవెన్యూ అధికారులతో సమావేశమైన కేసీఆర్‌... అనేక అంశాలపై చర్చించారు. భూరికార్డుల ప్రక్షాళన పారదర్శకంగా జరగాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. తొలుత చిక్కులు, సమస్యలు లేని 95 శాతం వివరాలను ఖరారు చేయాలని... తుది జాబితాపై రైతులందరి సంతకాలు తీసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. ఇక భూరికార్డుల సరళీకరణ, ప్రక్షాళనపై రేపు కలెక్టర్లు, ఆర్డీవో సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. భూరికార్డుల ప్రక్షాళన కోసం 1193 బృందాలు ఏర్పాటు చేశారు.

 

రేపు కలెక్టర్లు, ఆర్డీవోలతో సీఎం కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్ : భూ రికార్డుల ప్రక్షాళనపై తెలంగాణ సర్కార్‌ వేగం పెంచింది. రేపు కలెక్టర్లు, ఆర్డీవోలతో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఇవాళ రెవెన్యూ అధికారులతో సమావేశమైన కేసీఆర్‌... అనేక అంశాలపై చర్చించారు. భూరికార్డుల ప్రక్షాళన పారదర్శకంగా జరగాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. 

20:23 - August 30, 2017

వికారాబాద్‌ : జిల్లాలోని తాండూర్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్త అయూబ్‌ ఖాన్‌ కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కార్యకర్తలకు పదవులు ఇవ్వడం లేదని మనస్తాపంతో ఆయూబ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. మంత్రి మహేందర్‌రెడ్డితో మొరపెట్టుకొని.. అనంతరం బయటకు వచ్చి కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆయూబ్ ఆసుపత్రిలో చికిత్స పొంతున్నాడు. ఆయనకు ప్రాణాపాయం లేదని సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

పదవులు ఇవ్వడం లేదని టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

వికారాబాద్‌ : జిల్లాలోని తాండూర్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్త అయూబ్‌ ఖాన్‌ కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసాడు. కార్యకర్తలకు పదవులు ఇవ్వడం లేదని మనస్తాపంతో ఆయూబ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. 

ఇంకా వరదనీటిలోనే ముంబై

మహారాష్ట్ర : దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇంకా వరదనీటిలోనే ఉంది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముంబైలో కురిసిన వర్షాలకు ఐదుగురు మృతి చెందారు. భారీ వర్షాలు, వరదలతో డబ్బావాలాలు సెలవు తీసుకున్నారు. 

త్వరలో ఏఐసీసీలో టీకాంగ్రెస్ నేతలకు కీలక పదవులు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : త్వరలో ఏఐసీసీలో టీకాంగ్రెస్ నేతలకు కీలక పదవులు ఉంటాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీడబ్ల్యూసీలో ఒకరికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఒకరికి అవకాశం ఇస్తారని పేర్కొన్నారు. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఒకరికి ఛాన్స్ వస్తుందని చెప్పారు. కార్యదర్శులుగా ఇద్దరికి అవకాశం ఉంటుందన్నారు. టీపీసీసీలో కీలక మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. ఇకపై ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండనున్నారని తెలిపారు.

 

19:49 - August 30, 2017

శ్రీకాకుళం : 2014 వరకు గృహిణిగా వున్నా, ఇప్పుడు పిలిస్తే పలికే లక్ష్మీదేవిగా ప్రజాభిమానం సంపాదించుకున్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరితోనూ కలివిడిగా వుండే లక్ష్మీదేవి ఎన్నికల హామీలు నెరవేర్చే విషయంలో ప్లస్ పాయింట్లు సాధించలేకపోతున్నారు. ఇవాళ్టి ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్టులో శ్రీకాకుళం నియోజకవర్గం పై ఓ లుక్కేద్దాం. 
మంచిపేరు తెచ్చుకున్న లక్ష్మీదేవి 
2014 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన టిడిపి ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అందరికీ అందుబాటులో వుంటారన్న మంచిపేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేయించిన సర్వేలలోనూ ఆమె టాప్ ర్యాంక్ సాధించడం విశేషం. నిజానికి 2014 వరకు గుండ లక్ష్మీదేవి గృహిణిగానే వుండేవారు. ఆమె భర్త గుండ అప్పల సూర్యనారాయణ 1985 నుంచి 1999 వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ కేబినెట్ లో కొద్దికాలం మంత్రిగా సైతం పనిచేశారు. ముక్కుసూటి మనిషి, నిజాయితీపరుడన్న పేరు ప్రతిష్టలు సాధించారు. అయితే, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి  ధర్మాన ప్రసాదరావు విజయం సాధించి, పదేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాతి పరిణామాల్లో వైసిపిలో చేరిన ధర్మాన గుండ లక్ష్మీదేవి చేతిలో ఓటమి చవిచూశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి గుండ లక్ష్మీదేవి నిత్యం కార్యకర్తలకు అందుబాటులో వుంటూ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిత్యం జనంలో వుంటూ ఎవరు పిలిచినా పలుకుతారన్న మంచి పేరు సంపాదించుకున్నారు లక్ష్మీదేవి. 
మైనస్ పాయింట్
వ్యక్తిగతగా ఎంత మంచిపేరు తెచ్చుకున్నా, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల నెరవేర్చే విషయంలో ఆమెకు ప్లస్ పాయింట్లు పడడం లేదు. శ్రీకాకుళంలో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, కోడి రామ్మూర్తి స్టేడియం పునర్ నిర్మాణం, నిరుపేద కుటుంబాలకు ఎన్టీఆర్ గృహాలు, అరసవిల్లి మాస్టర్ ప్లాన్, శ్రీకాకుళం మండలానికి రక్షిత మంచినీటి పథకం, గార మండలానికి ఎత్తిపోతల పథకం, బైరిదేశి గెడ్డ పనులు పూర్తి చేసి, చిట్టచివరి పొలాలకు సాగునీరందించడం లాంటి హామీలిచ్చారు. అయితే, ఇంకా కార్యరూపం దాల్చకపోవడం పెద్ద మైనస్ పాయింట్. అవుటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రతిపాదనల దగ్గరే ఆగిపోయాయి. కోడి రామ్మూర్తి స్టేడియం పునర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే రెండేళ్ల క్రితం శిలాఫలకం వేసినా, ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదు. ఏడాది క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించిన అల్లి చెరువు అభివృద్ధి పనులు కూడా ముందుకు సాగడం లేదు. గార మండలంలో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల నిధులు విడుదలైనా, ఇంకా టెండర్ల దశ దాటలేదు. ఇవన్నీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి మైనస్ పాయింట్లుగా మారుతున్నాయి.  
వివాదస్పదమైన వార్డుల విభజన 
కార్పొరేషన్ గా అవతరించిన శ్రీకాకుళం మేయర్ కుర్చీలో తన భర్తను కుర్చోపెట్టాలన్న ఆకాంక్షతో చేసిన వార్డుల విభజన వివాదస్పదమైంది. వార్డులు విభజించినతీరుపై ప్రతిపక్షాలే కాదు స్వపక్షీయులు సైతం విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో టిడిపి నాయకులు వ్యవహరిస్తున్నతీరు తనకు మేలు చేస్తాయన్న భావనతో వున్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. 
సామాజికవర్గాలు ప్రధానపాత్ర 
రెండు లక్షల 33 వేల మందికిపైగా ఓటర్లున్న శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజికవర్గాలు ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ నియోజకవర్గంలో వెలమ ఓటర్లు అధికం. రెండో స్థానంలో వైశ్యులు, మూడో స్థానంలో కాళింగ, నాలుగో స్థానంలో మత్స్యకారులు, ఐదో స్థానంలో శిష్ట కరణాలు వున్నారు. 1995లో ఈ నియోజకవర్గం ఏర్పడగా తొలి విజయం ఇండిపెండెంట్ ను వరించడం విశేషం. ఆ తర్వాత జనతాపార్టీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు ప్రాతినిథ్యం వహించారు. 1985 నుంచి టిడిపికి కంచుకోటగా మారింది శ్రీకాకుళం. 85, 89, 94, 99 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే భర్త అప్పల సూర్యనారాయణ వరుస విజయాలు సాధించారు. ఆ తర్వాత రెండుసార్లు ధర్మాన ప్రసాదరావును విజయం వరించింది. 2014 నుంచి ప్రాతనిథ్యం వహిస్తున్న లక్ష్మీదేవి 2019లోనూ విజయహాసం చేయాలంటే హామీలను నెరవేర్చడం మీద దృష్టిసారించాల్సి వుంటుంది. 

19:42 - August 30, 2017

గుంటూరు : బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ప్లేమీ వెలగపూడిలోని అసెంబ్లీని సందర్శించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు దగ్గరుండి అసెంబ్లీ భవనాన్ని చూపించారు. అనంతరం స్పీకర్‌,  బ్రిటీష్ హై కమిషనర్ బృందం భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పోలవరం, అమరాతి నిర్మాణ పనులను స్పీకర్ వారికి వివరించారు. కొత్త రాజధాని డిజైన్లలో ఇంగ్లాండ్ నుంచి నార్మన్ పోస్టర్ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని, రాష్ట్రంలో అన్ని రంగాలతో కలిసి పనిచేయడానికి సహకారం అందిస్తామని బ్రిటిష్ హై కమిషనర్ చెప్పినట్లు కోడెల తెలిపారు. 

 

19:39 - August 30, 2017

విశాఖ : నగరంలోని మాధవధార వుడా కాలనీలోని గోదాములపై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. సూర్యకుమారి ఏజెన్సీస్‌ గోదాముల్లో అక్రమంగా నిల్వచేసిన నకిలీ నిత్యావసర సరకులను గుర్తించారు. వీటి విలువ పది లక్షల రూపాయలు ఉంటుందని లెక్కకట్టారు. గోదాములను సీజ్‌ చేశారు. నకిలీ సరకుల నిల్వదారులపై కేసు నమోదు చేశారు. 

19:37 - August 30, 2017

విజయనగరం : జిల్లాలోని చీపురుపల్లి మండలం నెల్లిమర్లలో రాజేశ్వరి అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే... రాజేశ్వరిని అత్తింటివారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా... ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. నిందితులకే వత్తాసు పలుకుతున్నారని వాపోతున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ నెల్లిమర్ల పీఎస్‌ ముందు మృతురాలి బంధువులు రాస్తారోకో చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఐదు నెలల క్రితమే రాజేశ్వరికి వివాహం అయింది. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

విజయనగరం జిల్లాలో విషాదం

విజయనగరం : జిల్లాలోని చీపురుపల్లి మండలం నెల్లిమర్లలో రాజేశ్వరి అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే... రాజేశ్వరిని అత్తింటివారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. 

19:32 - August 30, 2017

చిత్తూరు : జిల్లాలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. అరుదైన వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్న కుమార్తెను చూడలేని తల్లిదండ్రులు తమ బిడ్డకు కారుణ్య మరణాన్ని ప్రసాదించమంటూ జిల్లా జడ్జికి లేఖ రాశారు. తెట్టుగ్రామం, పుల్లగూరవారిల్లకి చెందిన చినరెడ్డెప్ప, సునీతల పెద్ద కుమార్తె ఆరేళ్ల శృతిహాసన్. శృతితో పాటు వారికి ఇంకో ఇద్దరు పిల్లలున్నారు. న్యూరో పైబ్రోమా అనే వ్యాధితో శృతి మూడేళ్లుగా నరకయాతన అనుభవిస్తోంది. తిరుపతి, బెంగళూరు, వేలూరుల్లో ఆమెకు జరిగిన చికిత్స కోసం రూ.3 లక్షలు ఖర్చుపెట్టినా ఫలితం దక్కలేదు. కూలిపనులకు వెళ్తేకానీ ఇల్లు గడవని ఆ కుటుంబం ఇప్పుడు ఆమెకు చికిత్స చేసే పరిస్థితుల్లో లేదు. తమ కూతురు పడుతున్న మనోవేదన చూసి తట్టుకోలేకపోతున్నామని..తమ కూతురికి కారుణ్య మరణం ప్రసాదించమని కోరుతూ చిత్తూరు జిల్లా రెండవ అదనపు జడ్జికి శృతిహాసన్ తల్లిదండ్రులు అర్జి పెట్టుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

19:25 - August 30, 2017

హైదరాబాద్ : 10టీవీ ఎస్టేట్‌ మేనేజర్‌ మధుసూదన్‌రెడ్డి సంతాపసభ.. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ నిర్వహించింది.  సంతాపసభలో 10టీవీ సిబ్బంది, ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. మధుసూదన్‌ అకాల మరణం ప్రజానాట్యమండలికి, 10టీవీకి తీరని లోటని... 10టీవీ ఎండీ వేణుగోపాల్‌ అన్నారు. 10టీవీ స్టూడియో నిర్మాణంలో మధు పాత్ర మరువలేనిదన్నారు. మధుసూదన్‌తో తమకున్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. అందరితో ఎంతో కలిసి మెలిసి ఉండే మధుసూదన్‌.. అకాలంగా మృతి చెందడం తమను ఎంతో కలిచి వేసిందని పలువురు అభిప్రాయపడ్డారు. 

 

చిత్తూరు జిల్లాలో హృదయాన్ని కలచివేసే ఘటన

చిత్తూరు : జిల్లాలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. అరుదైన వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్న కుమార్తెను చూడలేని తల్లిదండ్రులు తమ బిడ్డకు కారుణ్య మరణాన్ని ప్రసాదించమంటూ జిల్లా జడ్జికి లేఖ రాశారు. 

18:42 - August 30, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని బూర్గంపాడులో రోడ్డు పక్కన ఆపివున్న లారీలపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఐటీసీ భద్రాచలం పేపర్‌ బోర్డుకు ముడిసరుకులు తీసుకొచ్చిన లారీలను డ్రైవర్లు రోడ్డు పక్కన ఆపారు. పేపర్‌ బోర్డులో యార్డులో నిలపకుండా రోడ్డపై నిలపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు లాఠీలతో యాభై లారీల అద్దాలు పగులగొట్టారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ లారీల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. 
 

 

18:40 - August 30, 2017

వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి ... ఉమ్మడి వరంగల్‌కు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు... ఐదు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. శాఖలవారీగా సమీక్ష నిర్వహించిన కడియం... ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై అధికారులను నిలదీశారు. తీరు మార్చుకోకపోతే... చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించారు. ప్రధానంగా మూడు పథకాలపై చర్చ జరిగిందని...  ప్రతి నెలా మిషన్‌ భగీరథ పనులపై ఇదే విధంగా సమావేశం జరుగుతుందన్నారు.

18:33 - August 30, 2017

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో మెడికల్ సీట్ల భర్తీ లోపాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్టీఆర్, కాళోజీ యూనివర్సిటీల్లో సీట్ల భర్తీలో లోపాలు జరిగాయని హైకోర్టులో 20కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై తెలంగాణలో జరిగిన మెడికల్ సీట్ల భర్తీతో పాటు బి, సి కేటగిరీ నివేదికను కాళోజీ యూనివర్సిటీ హైకోర్టుకు అందించింది. జీవో నెంబర్ 550 క్లాజ్‌ 5(2)ను కోర్టు సస్పెండ్ చేసింది. మెరిట్ ద్వారా పొందిన సీటును మెరిట్‌తోనే భర్తీ చేయాలని ఆదేశించింది. మరోవైపు ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటాలో అవకతవకలపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. మరికొన్ని పిటిషన్లపై రేపు కూడా విచారణ జరపనుంది. 

18:15 - August 30, 2017

వరంగల్ : జిల్లా కేంద్రంలో డ్రగ్స్‌ మాఫియాపై 10 టీవీ కథనాలతో అధికార యంత్రాంగం స్పందించింది. రంగంలోకి దిగిన ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు.. నిట్‌ విద్యార్థుల గుట్టురట్టు చేశారు. ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. మరో ఐదుగురి నిట్‌ విద్యార్థులపై విచారణ జరుపుతున్నారు. ఒక వెబ్‌సైట్‌ నుంచి ముఠా డ్రగ్స్‌ కొనుగోలు చేస్తోందని పోలీసులు గుర్తించారు.

 

17:26 - August 30, 2017

పశ్చిగోదావరి : పోలవరం ప్రాజెక్టు కోసం కోర్టు వివాదంలో ఉన్న గిరిజనుల భూములను తీసుకుంటే సహించేదిలేదని సీపీఎం నాయకులు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివాదాస్పద భూములను సేకరించొద్దని డిమాండ్‌ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలోని ఐటీడీఏ కార్యాలయాన్ని సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు ముట్టడించారు. భూస్వాములు, రైతుల పేరుతో గిరిజనుల భూములను సేకరించేందుకు అధికారులు చేస్తున్న  ప్రయత్నాలను విరమించుకోపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. 

17:16 - August 30, 2017

అనంతపురం : జిల్లా చరిత్రలో దశాబ్దాలుగా.. వర్షాభావంతో ఎన్నో కరవులు వచ్చాయి. డొక్కల కరవు, పచ్చి కరవు, వట్టి కరవు వంటి భయానకమైన పరిస్థితులను అనుభవించారు. అయితే ఈ ఏడాది తాగునీటి కరవు తప్పేలా లేదు. తుంగభద్ర జలాశయం పరివాహక ప్రాంతంలో ఎప్పుడూ లేనంతగా.. వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యాయి. రానున్న తాగునీటి కరవుపై ప్రత్యేక కథనం. 
ప్రతీ ఏడాది జులై మాసంలోనే నీటి విడుదల 
కరవు జిల్లా సాగు, తాగు నీటి అవసరాలను తీర్చడానికి ఉన్న ఒకే మార్గం హెచ్చెల్సీ నీరు. తుంగభద్ర జలాశయం నుంచి విడుదలయ్యే నీటి ఆధారంగానే ఆయకట్టు సాగుతో పాటు.. జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ప్రతీ యేటా జులై మాసంలోనే తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు ముగుస్తున్నా.. నీటిని విడుదల చేసేందుకు తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకోలేని సందిగ్ధంలో ఉంది. 
నీటి విడుదలపై తీసుకున్న నిర్ణయం 3 దఫాలుగా వాయిదా   
ఇప్పటికే నీటి విడుదలపై తీసుకున్న నిర్ణయం 3 దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. జిల్లా తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని నీటిని విడుదల చేయాలని.. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తాజాగా తుంగభద్ర బోర్డు అధికారులను కోరారు. 
ప్రస్తుతం 58 టీఎంసీల నీరు 
తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం 58 టీఎంసీల నీరుంది. గతేడాది ఆగస్టు అయిపోయేటప్పడికి జలాశయంలో 100 టీఎంసీల నీరుంది. అయితే ప్రస్తుత నీటి నిల్వల ఆధారంగా అనంతపురం జిల్లాకు 9 టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉందని అనంతపురం ఇంజనీర్లు అంటున్నారు. ఇక జిల్లాలో 12 టీఎంసీల నీరు అవసరమవుతుంది. తుంగభద్ర నుంచి జిల్లాకు 9 టీఎంసీల నీరు కేటాయించినా.. జిల్లాకు చేరేలోపు లీకేజీలు, నీటి ఆవిరి, ఇంకిపోవడం వంటి నష్టాలతో జిల్లాకు చేరేది కేవలం 6 టీఎంసీలు మాత్రమే. 
గణనీయంగా పడిపోయిన నీటి నిల్వలు 
ఇక హంద్రీనీవా నుంచి గతేడాది 22 టిఎంసిల నీరు వచ్చినప్పటికీ.. జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఈ సారి శ్రీశైలం జలాశయంలో కూడా వరద నీరు చేరక పోవడంతో.. నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం హంద్రీనీవా కాలువ ద్వారా జిల్లాకు నీటిని పంపింగ్ చేసే అవకాశాలు లేవు. కృష్ణాలో ఇప్పటివరకు నీరు రాకపోవడంతో శ్రీశైలం జలాశయంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని అందించే తుంగభద్ర జలాశయం, శ్రీశైలం జలాశయాల్లో నీటి నిల్వలు లేకపోవడం భవిష్యత్తులో ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతోంది. ప్రభుత్వం అనంత తాగునీటి ఎద్దడిపై ముందుచూపుతో వ్యవహరించకపోతే.. ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం పడనుంది.
ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం 
పోలవరం ప్రాజెక్టు కోసం కోర్టు వివాదంలో ఉన్న గిరిజనుల భూములను తీసుకుంటే సహించేదిలేదని సీపీఎం నాయకులు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివాదాస్పద భూములను సేకరించొద్దని డిమాండ్‌ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలోని ఐటీడీఏ కార్యాలయాన్ని సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు ముట్టడించారు. భూస్వాములు, రైతుల పేరుతో గిరిజనుల భూములను సేకరించేందుకు అధికారులు చేస్తున్న  ప్రయత్నాలను విరమించుకోపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. 

 

శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు

శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. పలాస, మందస మండలాల్లో భూమి కంపించింది. శివాజీ నగర్, రోటరీ నగర్, పల్లి వీధి, హరిపురం, సూదికొండ ప్రాంతాల్లో 5 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో జనం ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.

కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ పిటిషన్

తిరుపతి: శృతి హాసిని అనే బాలిక కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ మదనపల్లె కోర్టులో తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. చిన్నారి శృతిహాసిని క్యాన్సర్ తో బాధపడుతోంది.

కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ పిటిషన్

తిరుపతి: శృతి హాసిని అనే బాలిక కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ మదనపల్లె కోర్టులో తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. చిన్నారి శృతిహాసిని క్యాన్సర్ తో బాధపడుతోంది.

మధురవాడలో ప్రైవేట్ గోదాంల పై దాడులు...

విశాఖ : మధురవాడ వుడా కాలనీలో ప్రైవేట్ గోదాంల పై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు నిర్వహించింది. రూ. 10 లక్షల విలువైన నకిలీ నిత్యావసర సరుకులను పట్టుకున్నారు.

17:06 - August 30, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ భూముల లీజు రద్దుపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ భూముల లీజును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రద్దు చేయడాన్ని కాంగ్రెస్‌ తప్పుపట్టింది. ఎగ్జిబిషన్‌ సొసైటీ జోలికి వస్తే ఊరుకునేదిలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు హెచ్చరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ భూముల లీజు రద్దుపై ఉద్యమం చేస్తామన్నారు. ప్రభుత్వం వెంటనే లీజు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎగ్జిబిషన్‌ సొసైటీకి పర్మినెంటుగా భూములు లీజుకిస్తామని ప్రభుత్వం ప్రకటించినట్లు వీహెచ్ తెలిపారు.

 

భూ రికార్డుల సరళీకరణ, ప్రక్షాళనపై కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: భూ రికార్డుల సరళీకరణ, ప్రక్షాళనపై ప్రగతి భవన్ లో రెవెన్యూ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పూర్తి పారదర్శకతో వ్యహరించాలని, తుది జాబితా పై గ్రామంలోని రైతుల సంతకాలు తీసుకుని బహిర్గతం చేయాలని కేసీఆర్ సూచించారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో భూ రికార్డుల ప్రక్షాళన జరపాలని, ప్రక్షాళనలో భాగంగా మొదట ఏ విధమైన చిక్కులు లేని 95 శాతానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు.

16:51 - August 30, 2017

కృష్ణా : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సమయం దగ్గర పడుతున్నా ఇంద్రకీలాద్రిపై ఇంత వరకు పనులు ప్రారంభంకాలేదు.  నేటికీ అధికారులు టెండర్లు కూడా పిలవకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఈ ఏడాది దసరా ఉత్సవాలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుర్గగుడిలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై 10టీవీ కథనం.
వచ్చే నెల 21 నుంచి దసరా మహోత్సవాలు
బెజవాడలోని కనకదుర్గ ఆలయం విజయ దశమి ఉత్సవాలు ప్రతిఏటా అంగరంగవైభవంగా జరుగుతాయి. ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడు  సెప్టెంబర్‌ 21 నుంచి  దసరా మహోత్సవాలు ఇంద్రకీలాద్రిపై ప్రారంభంకానున్నాయి. 10 రోజులపాటు దుర్గామాత భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. 
నేటికీ మొదలుకాని దసరా ఉత్సవాల పనులు
ఇంద్రకీలాద్రిపై జరిగే విజయదశమి ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తారు. అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్తారు. దసరా ఉత్సవాలకు మరో నెల రోజుల సమయం కూడా లేదు. అయినా ఆలయ అధికారులు  ఇంత వరకు ఉత్సవ పనులే ప్రారంభించలేదు.  ఉత్సవ ఏర్పాట్లపై ఏ విధమైన సమావేశాలు జరుపలేదు.  దసరా పనులకు కనీసం టెండర్లు పిలిచి, పనులు ఏమేరకు చేయాలన్న దానిపై స్పష్టత లేదు. 
తూతూమంత్రంగా ఆలయ అభివృద్ధి పనులు
దుర్గమ్మ దేవస్థాయ అభివృద్ధి పనులు సైతం తూతూమంత్రంగానే నడుస్తున్నాయి. ప్రస్తుతం మల్లికార్జున మహామండపం నుంచి కొండపైకి చేరుకునేందుకు మెట్ల మార్గంతోపాటు రెండు లిఫ్టులు మాత్రమే ఉన్నాయి. ఈ లిఫ్టుల్లో వెళ్లాలంటే భక్తులు పడిగాపులుకాయాల్సిందే.  భక్తుల తాకిడి ఎక్కువైతే తోపులాటలూ జరుగుతుంటాయి.  ఈ ఇబ్బందిని గమనించిన అధికారులు రెండున్నర కోట్ల రూపాయాలతో నాలుగు లిఫ్టులను నిర్మిస్తున్నారు. ఒక్కో లిఫ్టులో ఒకేసారి 25మంది భక్తులు వెళ్లవచ్చు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న లిఫ్టుపనుల వేగం మందగించింది. 
రూ.3కోట్లతో డార్మెటరీ నిర్మాణం
సీవీరెడ్డి చారిటీస్‌ స్థలంలో భక్తుల కోసం దేవస్థానం మూడుకోట్లతో డార్మెటరీ నిర్మాణం చేపట్టింది.  అయితే ముందు నిర్ణయించిన పనులను పక్కనబెట్టి అక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టాలని పాలకమండలి నిర్ణయించింది.  ఈ పనులు కూడా ఆశించిన స్థాయిలో జరుగడం లేదు.  నాలుగు షెడ్లతో నిర్మిస్తున్న డార్మెటరీ దసరా ఉత్సవాలకు పూర్తిచేస్తా లేద ఆన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఘాట్‌రోడ్డులో గ్రీనరీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన నేటికీ అమలుకు నోచుకోలేదు.
ఇంద్రకీలాద్రిపై నూతనంగా మల్లేశ్వరస్వామి దేవాలయం  
ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరస్వామి దేవాలయం నూతనంగా నిర్మిస్తున్నారు.  దసరా నాటికే గ్రానైట్‌తో దేవాలయం నిర్మించాలని అధికారులు భావించారు.  దసరా దగ్గర పడుతుండడంతో అధికారులు మల్లేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆలయ అధికారులు సైతం ఓ అంచనాకు రాలేకపోతున్నారు. కనకదుర్గమ్మ ఆలయ అధికారులు ఇకనైనా దసరా ఉత్సవాలపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. 
 

 

ఆన్‌లైన్ లాటరీ..మోసగాడు అరెస్ట్....

హైదరాబాద్: నగరంలో ఆన్‌లైన్ లాటరీ పేరిట మోసాలకు పాల్పడుతున్న కేరళ యువకుడు హంజాను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో మోసగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.కోటి లాటరీ పేరుతో హంజా పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.11 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆన్‌లైన్ లాటరీ..మోసగాడు అరెస్ట్....

హైదరాబాద్: నగరంలో ఆన్‌లైన్ లాటరీ పేరిట మోసాలకు పాల్పడుతున్న కేరళ యువకుడు హంజాను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో మోసగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.కోటి లాటరీ పేరుతో హంజా పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.11 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బైక్ ను ఢీకొన్న ఆర్టీసి బస్సు: ఇద్దరి మృతి

య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి: బైక్ ను ఓ ఆర్టీ సీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో బైక్ మీద వెళ్తున్న‌ ఇద్ద‌రు మృతి చెందారు. జిల్లాలోని వెంక‌టాపురం మండ‌లం యాక‌న్న గూడెం వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మృతులను వెంక‌టాపురం మండ‌లం సూర‌వీడు వాసులు శివ‌(26), ల‌క్ష్మ‌ణ్ రావు(45) గా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

16:45 - August 30, 2017

హైదరాబాద్ : 2012లో మౌలాలీ వద్ద తెలంగాణ ఉద్యమకారులు రైల్ రోకో నిర్వహించిన కేసులో సికింద్రాబాద్ రైల్వే కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో 11 మంది ఉద్యమకారులతో పాటు ఇప్పుడు మంత్రులుగా ఉన్న కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, కత్తి పద్మారావులు ఉన్నారు. అయితే వీరిలో ముగ్గురు మంత్రులతో పాటు మరొకరిపై ఎటువంటి సాక్ష్యాధారాలు లేనందున కేసును కొట్టివేస్తూ తుది తీర్పు ప్రకటించింది. 5 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం కేసును కొట్టివేసినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది విద్యాకర్ చెప్పారు. 

 

16:42 - August 30, 2017

హైదరాబాద్ : వినాయక ఉత్సవాల్లో డప్పు దరువులతో భాగ్యనగరంలో ఫుల్ జోష్‌ నింపుతారు డప్పు కళాకారులు. ఉపాధి కోసం సుదూర ప్రాంతాల నుంచి వలస వస్తున్న తమకు ఉత్సవాల సమయంలో అరకొర ఆదాయంతప్ప.. సరైన ఆదరణ లభించడం లేదని డప్పు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కనికరించి తమకు ఉపాధి కల్పించాలని వారు కోరుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

మిషన్ భగీరథ ద్వారా తాగునీరు: కడియం...

వరంగల్‌: వచ్చే ఏడాది జనవరి నాటికి మిషన్ భగీరథ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తామని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. 5 సెగ్మెంట్లలో ఉమ్మడి జిల్లాలో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. పాలేరు, ఎల్ఎండీ సెగ్మెంట్లలో పనుల వేగం పెంచాలని ఆయన అన్నారు.కలెక్టర్లు వారానికోసారి పనుల పురోగతిపై సమీక్షించాలని సూచించారు. భగీరథ పనులను 15రోజులకోసారి ఎమ్మెల్యేలు సమీక్షించాలని చెప్పారు.

16:38 - August 30, 2017

మహారాష్ట్ర : ముంబైలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో మళ్లీ సాధారణ స్థితి నెలకొంటోంది. వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా ప్రజలకు ఊరట లభించలేదు. స్కూళ్లు కళాశాలలు మూసివేశారు. డబ్బావాలాలు సెలవు తీసుకోవడంతో రెండు లక్షల మంది ఉద్యోగులకు లంచ్ సేవలు రద్దయ్యాయి. వారిపై ఆధారపడే ఉద్యోగులు భోజనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది.  అక్కడక్కడ కొన్ని రైళ్లు నడుస్తున్నాయి. దాదర్‌లోని మాట్‌కర్‌ రోడ్డులో మ్యాన్‌హోల్‌ తెరచుకోవడంతో ఓ డాక్టర్‌ అందులో పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని లోతట్టు ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల నేవి సిబ్బంది వరద బాధితులకు ఆహారం అందించారు. వరదల పరిస్థితి తీవ్రంగా ఉన్నా  సిఎం సెలవు ప్రకటించలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు మున్సిపల్‌ ఉద్యోగులకు సెలవు రద్దు చేశారు. కువైత్‌, జెడ్డా, చండీగఢ్, ఉదయ్‌పూర్, భుజ్‌, గోవా, అహ్మదాబాద్‌, వడోదరకు వెళ్లే విమానాలను నిలిపివేశారు.

 

ఆస్ట్రేలియా పై బంగ్లాదేశ్ ఘన విజయం...

మిర్ పూర్ : ఆ స్ట్రేలియాతో షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయకేతనం ఎగుర వేసింది. ఆస్ట్రేలియా జట్టుపై 20 పరుగుల తేడాతో గెలిచింది. . దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యం సాధించింది.

16:27 - August 30, 2017

ఢిల్లీ : హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాతో భేటి అయ్యారు. రేప్‌ కేసులో డేరా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీంకు శిక్షపై తీర్పు సందర్భంగా పంచకులలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను ఆయనకు వివరించారు. హింసాత్మక ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ సిఎం తోసిపుచ్చారు. రాజీనామా కోరేవాళ్లను కోరనివ్వండని ఖట్టర్‌ అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు తమ ప్రభుత్వం పనిచేసిందని....రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. హర్యానాలో హింసాత్మక ఘటనలపై కేంద్రం కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.

 

వరంగల్ నిట్ లో డ్రగ్స్ కలకలం..

వరంగల్‌ : నేషనల్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల వద్ద.. ఎల్ ఎస్ డి ప్యాకెట్లు పట్టుబడ్డాయి.

15:48 - August 30, 2017

చెన్నై : తమిళ తంబీల రాజకీయం ఢిల్లీ చేరింది. అన్నాడీఎంకేలో సంక్షోభం కొనసాగుతోంది. దినకరన్ వర్గం ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. వెంటనే బలపరీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పళనిస్వామకి దినకరన్ వార్నింగ్ ఇచ్చారు. తనకు అనుకున్నదానికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. వెంటనే పళనిస్వామి సీఎం పదవి నుంచి దిగిపోవాలని దినకరన్ అన్నారు. పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించే హక్కు పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గానికి లేదని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

15:39 - August 30, 2017

మహిళలపై రోజురోజుకూ లైంగిక దాడులు పెరుగుతున్నాయి. ఇదే అంశంపై మానవి నిర్వహించిన మైరైట్ చర్చా కార్యాక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే... 'మహిళలపై దాడులు జరుగుతున్నాయి. చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. విద్యార్థినులపై గురువులు పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. వ్యవస్థ సరిగ్గా లేదు. బాగా తెలిసిన వ్యక్తులే మహిళలపై లైంగికదాడులకు పాల్పడుతున్నారు. మహిళలపై వేధింపుల నిరోధక చట్టం ఉంది. చట్టం అంటే భయం లేకుండా పోయింది' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
  

రాజీనామా ఊహాగానాలను కొట్టిపారేసిన ఖట్టర్

ఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను హర్యానా సీఎం ఖట్టర్ కలిశారు. సీఎం పదవికి రాజీనామా ఊహాగానాలను ఖట్టర్ కొట్టిపారేశారు. హర్యానాలో సాధారణ పరిస్థితి నెలకొందని, డేరా మద్దతు దారుల హింసాత్మక చర్యలపై అమిత్ షాకు నివేదిక అందజేసినట్లు తెలిపారు. గుర్మీత్ రామ్ రహీం బిజెపి కి మద్దతిచ్చారని, అంతమాత్రాన చట్టాన్ని ధిక్కరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు.

15:21 - August 30, 2017

కృష్ణా : బెజవాడకు మెట్రో రైలు యోగం ఉందా..? ఇదీ ట్రాఫిక్‌ నరకాన్ని ఎదుర్కొంటోన్న విజయవాడ పౌరుల్ని వేధిస్తోన్న ప్రశ్న. సర్వేలు.. టెండర్లు.. అంటూ ప్రభుత్వం ప్రాజెక్టు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ.. ప్రాజెక్టు మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడలేదు. పైగా ఇప్పుడు.. ఈ ప్రాజెక్టు సలహాదారుగా ఉన్న ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ కూడా.. వెనక్కి తగ్గింది. ఇప్పుడు.. చంద్రబాబు సర్కారు.. లైట్‌రైల్‌ అంటూ కొత్త పల్లవిని ఎత్తుకుంది. 
విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు వ్యవహారం..
విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు వ్యవహారం.. ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. సర్వే కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం.. దీన్ని ఆచరణలోకి తేవడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పైగా ప్రాజెక్టు సలహాదారు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ - డిఎంఆర్‌సీకి పారితోషికం చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం చేస్తోంది. ఈ క్రమంలోనే.. ప్రాజెక్టు ప్రధాన సలహాదారు బాధ్యతల నుంచి.. ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ తప్పుకోవాలని భావిస్తోంది. దీంతో ప్రభుత్వం లైట్‌రైల్‌ ప్రాజెక్ట్‌ అంటూ కొత్త పాట పాడుతోంది. 
ముందుకు సాగని మెట్రో రైలు పనులు  
విజయవాడ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదించినప్పుడే.. ప్రభుత్వం.. ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌తో... డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ను తయారు చేయించింది. ఆ తర్వాత.. ప్రాజెక్టు సలహాదారుగా నియమించింది. ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ.. ఈ బాధ్యతలు నిర్వహించాలని, అందుకుగాను, ప్రతినెలా ఆరు కోట్ల రూపాయల పారితోషికం చెల్లిస్తామని ప్రభుత్వం డిఎంఆర్‌సీతో ఒప్పందం చేసుకుంది. దీంతో.. డిఎంఆర్సీ.. బెజవాడలో ఆఫీసు ఏర్పాటు చేసి.. సిబ్బందిని నియమించి, లైన్‌ అలైన్‌మెంట్‌ సర్వే చేసింది. అదే ఊపులో ప్రభుత్వమూ హడావుడి చేస్తూ ఓ రెండు సార్లు టెండర్లను పిలిచి.. ఆ వెంటనే రద్దు చేసింది. అంతకు మించి పనులు ఏమాత్రం ముందుకు సాగలేదు. 
డిఎంఆర్సీకి.. ఏటా రూ. 72 కోట్ల చొప్పున ప్రభుత్వం చెల్లింపు 
2015 నుంచి సలహాదారుగా ఉన్న డిఎంఆర్సీకి.. ఏటా 72 కోట్ల రూపాయలు చొప్పున ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే.. రెండేళ్లుగా ప్రభుత్వం సదరు మొత్తాన్ని బకాయి పెట్టింది. తమకు రావలసిన మొత్తం కోసం డిఎంఆర్సీ కోరితే.. ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు కాబట్టి.. వాస్తవ ఖర్చులు మాత్రమే చెల్లిస్తామని ఎఎంఆర్సీ ఎండీ రామకృష్ణారెడ్డి వెల్లడించినట్లు సమాచారం. పైగా.. ప్రభుత్వ ప్రమేయం లేకుండా ప్రైవేటు భాగస్వామ్యంతోనే పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేయాల్సి ఉంది. దీంతో కేంద్రం నుంచి నిధులు అందే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో.. డిఎంఆర్సీ రూపొందించిన మీడియం మెట్రో ప్రాజెక్టు ప్రస్తుతానికి వృథాయే కాబట్టి.. కొత్తగా లైట్‌ రైల్‌ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. దీని సర్వే బాధ్యతలను డిఎంఆర్సీకి అప్పగించకుండా.. ఓపెన్‌ టెండర్‌కు వెళ్లాలని నిర్ణయించింది.  ఈపరిణామంతో.. డిఎంఆర్సీ.. ప్రాజెక్టు నుంచి వెనక్కి తగ్గాలని తీర్మానించుకున్నట్లు సమాచారం. జరుగుతున్న పరిమాణాలు చూస్తే..  ప్రాజెక్టుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
డీపీఆర్‌ తయారు చేసిన డీఎంఆర్‌సీయే 
విజయవాడ నగరంలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేయాలని ప్రతిపాదించి డీపీఆర్‌ తయారు చేసిన మొదటి సంస్థ డీఎంఆర్‌సీయే. అయితే టెండర్లను పిలవడంలో తీవ్ర జాప్యంతో పాటు, పలు సాంకేతిక కారణాల వల్ల విజయవాడ మెట్రో ప్రాజెక్టు మొదటికే ఎసరు వచ్చింది. ప్రస్తుతం మెట్రో ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్రం నూతన విధానం తీసుకువచ్చింది. విజయవాడకు లైట్‌ మెట్రో సరిపోదని, పీపీపీలో మనుగడ సాధ్యం కాదని...ప్రభుత్వ పరంగానే ప్రాజెక్టు చేపట్టాలని డీఎంఆర్‌సీ ఎండీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

'ఫాతిమా' యాజమన్యంపై చర్యలు: మంత్రి కామినేని

విజయవాడ: కడపలోని వైద్య కళాశాల యాజమాన్యంపై చర్య తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యార్థులను సర్దుబాటు చేస్తామన్నారు. మొత్తం ఫాతిమా బాధిత విద్యార్థులు 99 మంది ఉన్నారని మంత్రి తెలిపారు. తప్పకుండా వైద్య విద్యార్ధులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

పాక్ క్రికెటర్ ష‌ర్జీల్ ఖాన్‌పై ఐదేళ్ల నిషేధం

లాహోర్‌:పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్ప‌డిన ఓపెన‌ర్ ష‌ర్జీల్ ఖాన్‌పై ఐదేళ్ల నిషేధం విధించింది పాక్ యాంటీ క‌రప్ష‌న్ ట్రిబ్యున‌ల్‌. కేసు విచార‌ణ త‌ర్వాత నిషేధం విధించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ట్రిబ్యున‌ల్ హెడ్‌ ఆస్ఘ‌త్ హైద‌ర్ వెల్ల‌డించారు. ఈయ‌న లాహోర్ హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి. ఇదే కేసుకు సంబంధించి త్వ‌ర‌లోనే ఖాలిద్ ల‌తీఫ్ భ‌విత‌వ్యాన్ని కూడా ట్రిబ్యునల్ తేల్చనుంది. దుబాయ్‌లో జ‌రుగుతున్న పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ రెండో రోజే ష‌ర్జీల్, ఖాలిద్‌లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డారంటూ ఇంటికి పంపించేశారు. 

15:04 - August 30, 2017

ఫిలిం మేకింగ్ లో స్పీడ్ పెంచారు సీనియర్ హీరోలు. యంగ్ హీరోల తాకిడి తట్టుకోవాలి అంటే డిఫెరెంట్ స్టోరీలను ఎంచుకోవాలనుకున్న థాట్ తో ప్లానింగ్ తో వెళ్తున్నాడు సీనియర్స్. రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ స్టోరీ లైన్ తో రాబోతున్న ఈ హీరోకి హీరోయిన్స్ కొరత ఏర్పడింది. తమిళ్ సినిమా 'కత్తి' కి రీమేక్ గా వచ్చిన 'ఖైదీ నెంబర్ 150'కి 'చిరు' ఫాన్స్ కలెక్షన్స్ తో వెల్కమ్ చెప్పారు. 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' అంటూ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు 'మెగాస్టార్'. ఇంతకు ముందులా సంవత్సరానికి ఒక సినిమా తియ్యకుండా ఫిలిం మేకింగ్ లో స్పీడ్ పెంచాడు మెగా స్టార్. నిర్మాతగా 'రామ్ చరణ్' తొలి సినిమా 'ఖైదీ నంబర్ 150'తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇప్పుడు మెగా 151ని కూడా తానే నిర్మించబోతున్నాడు రామ్ చరణ్.

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా 'సైరా నరసింహారెడ్డి'లో కథానాయికగా 'నయనతార' ఎంపికైన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రంలో 'నయనతార' ఒక్కరే హీరోయినా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే వాస్తవానికి 'ఉయ్యాలవాడ' ముగ్గురిని పెళ్లి చేసుకున్నారంట. ఆ ముగ్గురు భార్యల పేర్లు సిద్ధమ్మ.. పేరమ్మ.. ఓబులమ్మ అంట. 'చిరు' సరసన ఒక హీరోయిన్ ను ఎంచుకోవడానికే చాలా కష్టమైంది. చాలా పేర్లను పరిశీలించి చివరికి ఆమెను ఫైనలైజ్ చేశారు. ఇంకో ఇద్దరమ్మాయిల్ని సెలక్ట్ చేయడం కూడా కష్టమే. మరి 'సైరా..' టీం ఏం చేస్తుందో చూడాలి

15:01 - August 30, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజీల్లో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఓయూ అడ్మిన్‌స్ట్రేషన్ బిల్డింగ్‌ను ముట్టడించారు. వందలాదిగా వచ్చిన విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయల్దేరి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద బైఠాయించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:56 - August 30, 2017

హైదరాబాద్ : హైకోర్టులో నేరెళ్ల ఘటన కేసు విచారణ కొనసాగింది.. కోర్టు ఆదేశాలప్రకారం కరీంనగర్ సివిల్‌ హాస్పిటల్‌ మెడికల్‌ రిపోర్టు, కరీంనగర్ సబ్‌జైలులో వారెంట్‌.... గాయాలకు సంబంధించిన రిపోర్టును తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది.. ఈ రిపోర్టులన్నింటినీ పరిశీలిస్తామన్న కోర్టు... విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. 

 

14:55 - August 30, 2017

ఒకే ఒక సినిమాతో స్టార్ డైరెక్టర్ రేంజ్ కి వెళ్లిన డైరెక్టర్ మరో స్టోరీతో రాబోతున్నాడు. ఈ సారి మరో సినిమా స్క్రిప్ట్ ని లాక్ చేసుకున్నాడు. విశేషం ఏంటంటే ఈ సారి టోటల్ కామెడీ తో రాబోతున్నాడు. యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు కూడా. కొత్త డైరెక్టర్ గా ఫస్ట్ స్టెప్ 'పెళ్లి చూపులు' సినిమాతో టాప్ లిస్ట్ లో చేరిపోయాడు తరుణ్ భాస్కర్. హీరోగా 'విజయ్ దేవరకొండ' కూడా 'పెళ్ళిచూపులతో' హిట్ హీరో జాబితాలో చేరిపోయాడు. రెగ్యులర్ మూస కథల్లా కాకుండా డిఫరెంట్ జోనర్ లో స్టోరీ సెలక్షన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇదే స్పీడ్ ని కంటిన్యూ చేస్తూ తరుణ్ భాస్కర్ మరో సినిమాతో రాబోతున్నాడు.

'పెళ్లి చూపుల్లో' కూడా మంచి లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీకి హాస్యాన్ని జోడించిన తరుణ్ ఈసారి మరో కామెడీ స్క్రిప్ట్ తో రాబోతున్నాడు. 'పెళ్లి చూపులు' మూవీతో దర్శకుడు తరుణ్ భాస్కర్ సాధించిన సక్సెస్ చిన్నదేమీ కాదు. చిన్న సినిమాలకు ఇది ట్రెండ్ సెట్టర్ అనాల్సిందే. తన రెండో సినిమా విషయంలో కూడా అంతా తన స్క్రిప్ట్ ప్రకారమే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. ఈ దర్శకుడు ఇచ్చిన క్యాస్టింగ్ కాల్ కు 1100కు పైగా ప్రొఫైల్స్ వచ్చాయట. ఈ స్థాయి రెస్పాన్స్ ఊహించలేదని.. అయితే అక్టోబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభించి.. కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేస్తామని చెబుతున్నాడు తరుణ్ భాస్కర్.

14:53 - August 30, 2017

కొత్త సినిమాలతో హిట్ ట్రాక్ లో నడుస్తుంది టాలీవుడ్. కొత్త టాలెంట్ కొత్త వరదలా వచ్చేస్తూ హిట్స్ కొట్టేస్తుంది. కథల్లో కొత్తదనం, కథనం లో వైవిధ్యం. వీటిని బేస్ చేసుకొని ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు న్యూ ఫిలిం మేకర్స్. మరి ఇలాంటి టైం లో హాట్ హాట్ కామెంట్స్ తో ఆన్లైన్ లోకి వచ్చాడు ఈ డైరెక్టర్. 'విజయ్ దేవరకొండ' 'అర్జున్ రెడ్డి' సినిమా రిలీజ్ అయింది ఒక ప్రభంజనం సృష్టిస్తుంది. 'విజయ్ దేవరకొండ' హీరోగా..వంగ సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమాను ఆకాశానికెత్తేశారు. ఈ సినిమా తెలుగు సినిమా గమనాన్నే మార్చేస్తుందని నమ్మిన ఫిలిం మేకర్ నమ్మకాన్ని నిలబెట్టింది. ప్రెజెంట్ ఆడియన్స్ తెలుగు సినిమాల్లో వచ్చిన మార్పు ఇప్పటికే చూస్తున్నారు. ఈ అర్జున్ రెడ్డి సినిమా మరో స్థాయికి తీసుకువెళ్లేది లా ఉంది అని అంటున్నారు ఇండస్ట్రీ పీపుల్.

విలక్షణ దర్శకుడు 'రామ్ గోపాల్ వర్మ' ప్రతి సెన్సేషన్ లో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 'సర్కార్ 3' తో మళ్లీ ఫ్లాప్ టాక్ తో ఉన్న డైరెక్టర్ 'వర్మ' ఇప్పుడు ఇలా రీసెంట్ సినిమాలపైన కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో తెలంగాణలో తప్పకుండా ఓ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పడుతుందని చెప్పేశాడు. ఎందుకంటే తెలంగాణలో కూడా యువ దర్శకులు హీరోలు చాలా వినూత్నంగా సినిమాలు తీస్తూ.. అందరిని ఆకట్టుకుంటున్నారని చెప్పాడు. 'వర్మ' ఈ కామెంట్స్ తో ఎం సందేశం ఇచ్చాడో మరి.

బీడీ కార్మికురాలిపై టిఆర్ ఎస్ ఎంపీటీసీ దుర్భాషలు...

నిజామాబాద్: వేల్పూరు మండలం తడిగల్ లో టీఆర్ ఎస్ ఎంపీటీసీ హన్మంతరావు ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. తన భూమి ఎంపీటీసీ హన్మంతరావు ఆక్రమించుకున్నాడని గ్రామాభివృద్ధి కమిటీ సమావేశంలో సత్యగంగు అనే బీడీ కార్మికురాలు నిలదీసింది. దీంతో బీడీ కార్మికురాలిపై ఎంపీటీసీ, అతని కుమారులు దాడి చేశారు. అంతే కాకుండా మరో 10 మంది బీడీ కార్మికులను బెదిరించి ఎంపీటీసీ దుర్భాషలాడాడు.

పుట్టపర్తిలో హంద్రీనీవా కాలువ పనులపై స్టే

అనంతపురం: పుట్టపర్తిలో హంద్రీనీవా కాలువ పనులపై హైకోర్టు స్టే ఇచ్చింది. హంద్రీనీవా కాలువ 9వ ప్యాకేజీలో రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

'టీఎస్ సర్కార్ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది'

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, భూ ప్రక్షాళన అంటూ గ్రామ, మండల స్థాయి కమిటీల పేరుతో టీఆర్ ఎస్ కార్యకర్తలకు అన్ని హక్కులు ఇస్తున్నారని టిడిపి నేత రావుల ఆరోపించారు. భూ సర్వే విధానంపై పోరాటం చేయడంతో పాటు కోర్టులు కేసు వేస్తామని రావుల హెచ్చరించారు.

ఎగ్జిబిషన్ సొసైటీ లీజు రద్దు నిర్ణయం దారుణం: వీహెచ్

హైదరాబాద్: ఎగ్జిబిషన్ సొసైటీ లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణం అని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. సొసైటీ రద్దుతో ఎంతో మంది విద్యార్థులకు, ఎగ్జిబిషన్ నిర్వాహకులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఎగ్జిబిషన్ సొసైటీ భూమి జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. అన్ని పార్టీలతో కలసి ఎగ్జిబిషన్ భూమిని కాపాడుకుంటామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆంధ్రా వారిపై ప్రేమ చూపిస్తూ తెలంగాణ వారిపై వివక్ష చూపుతున్నారని వీహెచ్ పేర్కొన్నారు.

హైకోర్టులో నేరెళ్ల ఘటన విచారణ వాయిదా

హైదరాబాద్: హైకోర్టులో నేరెళ్ల ఘటన కేసు విచారణ జరిగింది. కరీంనగర్ సివిల్ హాస్పిటల్ మెడికల్ రిపోర్టును, కరీంనగర్ సబ్ జైలులో వారెంట్, గాయాలకు సంబంధించిన రిపోర్టులను తెలంగాణ సర్కార్ హైకోర్టులో సమర్పించింది. అన్ని రిపోర్టులను పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది. విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

13:57 - August 30, 2017

ఏమో సరిగ్గా నిద్ర పట్టడం లేదు..అంతా నలతగా ఉంది..సరిగ్గా నిద్ర పోక వారం అయ్యింది. అంటూ కొంతమంది తోటి వారితో అంటుంటారు. మహిళలు ఎక్కువగా కలత నిద్ర పోతుంటారు. కారణాలు ఎన్నున్నా..పరిష్కారాలు మాత్రం మన చేతుల్లో ఉన్నాయంటారు నిపుణులు...గృహిణిలు..ఇంట్లో..ఆఫీసు..బయటి వ్యవహారాలు చూసుకుంటూ బిజీ బిజీగా గడుపుతుంటారు. సమయం దొరికిన సమయంలో అలా నిద్ర పోదామని అనుకున్నా వారికి సరియైన నిద్ర పట్టదు.

నిద్ర పట్టడం లేదు..టీవీ..లేదా మొబైల్..కంప్యూటర్ చూస్తే నిద్ర పడుతుందని భావిస్తూ గంటల తరబడి కాలక్షేపం చేస్తుంటారు. ఈ మాయలో పడిపోతే పడుకొనే సమయం మారిపోతుంది.

పడుకొనే గదిలో వెలుతురు తక్కువగా ఉండే విధంగా చూసుకోండి. గదిని సాధ్యమైనంత వరకు చల్లగా ఉండాలి. బెడ్ రూంలో టీవీ ఉండకూడదు. కండరాల నొప్పి ఉన్న వారు రాత్రి పడుకొనే ముందు గోరెవెచ్చని నీటితో స్నానం చేయండి.

దిండ్ల కింద ఎలాంటి వస్తువులు..ఇతరత్రా ఉంచకండి. తలగడ లేకుండా పడుకోవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుందని వైద్యులు పేర్కొంటుంటారు.

కలత నిద్ర వస్తే దుప్పట్లు..దిండ్లు పడుకొనే దిశ మార్చి ట్రై చేయండి.

రాత్రి భోజనంలో క్యాల్షియం, కార్పొహైడ్రేట్లు, ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. 

13:35 - August 30, 2017

హైపర్ టెన్షన్...చెప్పాలంటే బీపీ.. ఈ బీపీతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఇందుకు పెద్దగా భయపడాల్సినవసరం లేదని.. చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

ధ్యానం..శ్వాసక్రియను క్రమబద్ధం చేసి చూడండి. ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు.

కాఫీ అలవాటు ఉన్న వారు ఎక్కువ సార్లు తీసుకోకండి. ఒక కప్పుకు మించకుండా కాఫీ తాగే అలవాటు చేసుకోండి

నువ్వుల నూనె వంటల్లో వాడటం అలవాటు చేసుకోండి. ఈ నూనె వాడిన వారిలో బీపీ తగ్గినట్లు పరిశోధనల్లో వెల్లడైనట్లు తెలుస్తోంది.

చేపలు అధికంగా తీసుకోండి. చేపల్లో ఉండే మాంసకృత్తులు, ఒమేగా-3, ఫ్యాటీ ఆమ్లాలు రక్తనాళాలను చక్కగా వ్యాకోచింపచేస్తాయి.

ఇక పొగతాగే వారిలో రక్తపోటు అధికంగా పెరుగుతుందనే విషయం తెలిసిందే. ఈ అలవాటును తగ్గించుకుంటూ మానేసే విధంగా ప్రయత్నించండి. 

13:33 - August 30, 2017

విజయనగరం : వెన్నులో వణుకు పుట్టిస్తున్న పిడుగులు..పిడుగుపాటుతో రైతులు, పశువులు మృత్యువాత..రెండు రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి...విజయనగరం జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మెరుపువేగంతో వచ్చి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. పొలం పనులు చేసుకుంటున్న అన్నదాతలపై విరుచుకుపడుతున్నాయి. వారిమీదే ఆధారపడిన కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి. విజయనగరం జిల్లాలో ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కలవరం సృష్టిస్తున్నాయి. రెండో రోజుల వ్యవధిలోనే పిడుగుల దాటికి ఏడుగురు రైతులు బలైపోయారు. ఎల్‌.కోట మండలం ఖాసాపేట గ్రామానికి చెందిన రైతుతో పాటు.. రంగాపురం పంచాయతీ కూర్మవరానికి చెందిన వృద్ధురాలు, జామి మండలం కలగాడకు చెందిన పశువుల కాపరి పిడుగు పాటుతో మృతి చెందారు. ఈ ప్రమాదంలో అతని గేదెకూడా చనిపోయింది.

పనికి వెల్లలేకపోతున్న రైతులు
లక్కవరపుకోట మండలం కూర్మవరం గ్రామానికి చెందిన వృద్ధురాలు కేల్ల దాలమ్మ పిడుగుపాటుకు బలైపోయింది. ఇక ఖాసాపేట గ్రామానికి చెందిన బాడితబోని ఎర్నాయుడు పొలం పనులు చేస్తుండగా.. పిడుగుపడటంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. పెద్ద కూతురుకు పెళ్లి కాగా.. రెండో కూతురుకు పెళ్లి చేయాల్సి ఉంది. ఈ సమయంలో ఇంటి పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. లక్కవరపుకోట మండలం ఖాసాపేటలోనూ పిడుగుల వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామంలో కోళ్ల రామునాయుడు, కొటాన అప్పలనాయుడు, బాడితబోని ఎర్నాయుడు మృత్యువాత పడ్డారు. వరుసగా పడుతున్న పిడుగులతో ఖాసాపేట వాసులు హడలెత్తిపోతున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు.

అధికారుల నిర్లాక్ష్యం
పిడుగుపాటుతో మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. మరోవైపు పిడుగులు ఏ ప్రాంతంలో పడుతాయో ముందస్తు సమాచారం అందుతున్నా.. ఆయా గ్రామాల వాసులను అప్రమత్తం చేయడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

13:31 - August 30, 2017

నల్లగొండ : తెలుగు రాష్ట్రాలకు, రైతాంగానికి.. ఆధునిక దేవాలయంగా నిలిచిన నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్ నీరులేక వట్టిపోతోంది. లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సిన సాగర్‌ వెలవెలబోతోంది. ఎగువ నుంచి నీరు వచ్చే అవకాశం లేకపోవడంతో.. తాగునీటి విడుదల కూడా నిలిచిపోనుంది. ఓ వైపు ఇప్పటికే సాగు పనులు ప్రారంభించిన ఆయకట్టు రైతాంగం.. సాగర్‌ దుస్థితితో ఆందోళనకు గురవుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:30 - August 30, 2017

నల్లగొండ : డేరా బాబా భూముల్లో సీపీఎం జెండాలు పాతింది.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని డేరా బాబా భూముల్లో ఎర్రజెండాలు వెలిశాయి. సీపీఎం వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ఈ జెండాలను పాతారు.. ఈ భూముల్ని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.. ఆశ్రమం పేరుతో ఈ భూముల్ని డేరాబాబా అనుచరులు ఆక్రమించుకున్నారు..

 

గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ తో ఒకరి మృతి

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ తో ఒకరు మృతి చెందారు. మృతుడు గణస్త్రస్ (65) నామాలగుండు వాసిగా గుర్తించారు. ఈ నెల 38న గాంధీ ఆస్పత్రిలో చేరిన గణేష్ స్వైన్ ఫ్లూతో పాటు అనేక రోగాలతో చికిత్సపొందుతూ మృతి చెందాడు.

మంత్రి కేటీఆర్ కు కాజీపేట రైల్వే కోర్టు నోటీసులు

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కు కాజీపేట రైల్వే కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 20న కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ కేసు నమోదు అయ్యింది.

మోదీ, అమిత్ షాలను కలవనున్న హర్యాసీఎం

హర్యానా: ప్రధాని మోదీ, అమిత్ షాలను హర్యానా సీఎం కలవనున్నారు. డేరా అల్లర్లపై సీఎం ఖట్టర్ నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.

13:06 - August 30, 2017

ఢిల్లీ : కడప ఫాతిమా మెడికల్ కాలేజ్ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కేంద్రానికి, ఎంసీఐకి కోర్టు నోటిసులు జారీ చేసింది. వంద మంది విద్యార్థులకు ఏ కళాశాలల్లో సీట్లు ఇస్తారో నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 21కి వాయిదా వేసింది. 2015, 2016లో సరైన సదుపాయాలు లేవని ఫాతిమా మెడికల్ కాలేజీ అనుమతులు రద్దుచేసిన విషయం తెలిసిందే.

కర్ణాటక మంత్రి శివకుమార్ ఇంటిపై ఐటీ దాడులు

బెంగళూరు: కర్ణాటక మంత్రి శివకుమార్ ఇంటి పై ఐటి దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరు, చెన్నై సహా మొత్తం 10 చోట్ల సోదాలు చేపట్టింది.

పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భద్రతా బలగాలు..

జమ్మూకశ్మీర్ : నౌషెరా సెక్టార్ లో పాక్ కాల్పులకు తెగబడింది. పాక్ కాల్పులను భారత్ భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి.

12:28 - August 30, 2017

హైదరాబాద్ : ఇంజనీరింగ్ విద్యలో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అలాగే ఓకేరోజు రెండు పరీక్షల విధానం రద్దు చేయాలని, అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు అర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయల్దేరి పరిపాలన భవనం ముందు ధర్నాకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:27 - August 30, 2017

నల్లగొండ : జిల్లా హాలియా జెడ్ పిహెచ్ఎస్ స్కూలులో ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తిపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ విద్యార్థినిపై లైంగిక దాడి చేస్తున్నాడని కొంత మంది విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు. 14 మంది విద్యార్థునులు ఎంఈవో, డీఈవోలకు లేఖ రాశారు. ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ కొంత మంది ఉపాధ్యాయులు కావాలని ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

డేరా బాబా భూముల్లో ఎర్ర జెండాలు

నల్గొండ : చిట్యాల మండలం వెలిమినేడు శివారుల్లో వున్న డేరా బాబా భూముల్లో సీపీఎం ఎర్రజెండాలను పాతింది. ఆశ్రమం పేరుతో ఆక్రమించుకున్న అసైన్డ్ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేస్తోంది.

రైల్వే కేసులో మంత్రులకు ఊరట

హైదరాబాద్: మౌలాలి రైల్ రోకో కేసులో మంత్రులకు ఊరట లభించింది. మంత్రులు నాయిని, కేటీఆర్, పద్మారావ్ లపై ఉన్న కేసులను సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రులు కేటీఆర్, నాయిని, పద్మారావు పై కేసు నమోదు అయ్యింది. ఐదేళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది.

12:12 - August 30, 2017

రైల్ రోకో కేసులో కాసేపట్లో తీర్పు

సికింద్రాబాద్: మౌలాలి రైల్ రోకో కేసులో కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఈమేరకు మంత్రులు కేటీఆర్, నాయిని, పద్మారావు కోర్టుకు హాజరయ్యారు.

12:09 - August 30, 2017

ఢిల్లీ : కడప ఫాతిమా మెడికల్ కాలేజ్ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కేంద్రానికి, ఎంసీఐకి కోర్టు నోటిసులు జారీ చేసింది. వంద మంది విద్యార్థులకు ఏ కళాశాలల్లో సీట్లు ఇస్తారో నివేదిక సామర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 21కి వాయిదా వేసింది. 2015, 2016లో సరైన సదుపాయాలు లేవని ఫాతిమా మెడికల్ కాలేజీ అనుమతులు రద్దుచేసిన విషయం తెలిసిందే. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

సీఆర్డీఏ పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ పై సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని రాజీవ్ గాంధ ఈపార్క్ తో సహా మిగిలిన ప్రాంతాలను ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో అమరావతి ప్రాంతంలోని 27 గ్రామాల్లో అభివృద్ధి జరగాలని, 27 గ్రామాల్లో పరిశుభ్రత, రహదారుల నిర్మాణం, వసతుల కల్పనకు నరేగా నిధులు వినియోగించాలన్నారు.

 

చెన్నై ఎయిర్ పోర్టులో 3 కిలోల బంగారంపట్టివేత...

తమిళనాడు: చెన్నై ఎయిర్ పోర్టులో 3 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుంచి 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

12:04 - August 30, 2017

టాలీవుడ్ యంగ్ టైగర్ నటిస్తున్న 'జై లవ కుశ' చిత్రంపై ఆసక్తి నెలకొంటోంది. అభిమానులతో పాటు టాలీవుడ్ పరిశ్రమ దృష్టిని ఈ చిత్రం ఆకర్షిస్తోంది. వరుస విజయాలతో దూసుకెళుతున్న యంగ్ టైగర్ సినిమాలో ఏకంగా మూడు పాత్రలు పోషిస్తుండడంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర మూడు పాత్రలకు సంబంధించిన ఫొటోలు..టీజర్స్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఆయా టీజర్స్ వేటికవే భిన్నంగా ఉన్నాయి.

‘జై' పాత్ర మాస్, ‘లవ' పాత్ర క్లాస్ గా ఉంది. త్వరలో విడుదల కాబోతున్న ‘కుశ' కు సంబంధించిన ఫొటో విడుదల చేశారు. ఎలాంటి డిఫరెంట్ షేడ్స్ చూపించబోతున్నారో అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రత్యేక గీతం ఉంటుందని..అందులో మిల్క్ బ్యూటీ 'తమన్నా' నర్తించనుందని ప్రచారం జరుగుతోంది. 'తమన్నా' కొత్త అవతారంలో కనిపిస్తారని చిత్ర వర్గాల టాక్. 'తమన్నా' ఇప్పటికే 'జాగ్వార్‌', 'అల్లుడు శీను' తదితర చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో ఆడిపాడిన సంగతి తెలిసలిందే. గతంలో 'ఎన్టీఆర్‌', 'తమన్నా' జంటగా వచ్చిన 'ఊసరవెల్లి' చిత్రంలో నటించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఈ నెలాఖరున 'కుశ' టీజర్ ను కూడా రిలీజ్ చేసి సెప్టెంబర్ 3న అభిమానుల సమక్షంలో ఆడియో రిలీజ్ ను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు.

త్వరలో మత్స్యకారుల సొసైటీ ఎన్నికలు:మంత్రి తలసాని

సంగారెడ్డి: రాష్ట్రంలో మత్స్యకారుల సొసైటీని పటిష్ట పరుస్తామని మంత్రి తలసాని తెలిపారు. త్వరలో మత్స్యకారుల సొసైటీ ఎన్నికలు వుంటాయని, మత్స్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కేటాయించిందని తెలిపారు. చేపలు సంవృద్ధిగా దొరికే ప్రాంతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో 24 గంటలు విద్యుత్ అందిస్తామని తలసాని పేర్కొన్నారు.

హెడ్మాస్టర్ పై విద్యార్థినుల ఫిర్యాదు.. విచారణ

నల్గొండ: అనుముల మండలం హాలియా జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కృష్ణ మూర్తి వేధిస్తున్నాడని ఎంఈవో, డీఈవోకలు 14 మంది విద్యార్థినులు లేక రాశారు. విద్యార్థినుల ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు.

11:47 - August 30, 2017
11:46 - August 30, 2017

గుంటూరు : రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. రాష్ట్రాన్ని విభజించిందన్న కారణంతో ఏపీ ప్రజలు హస్తం పార్టీని గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా శిక్షించారు. 2014 ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటి చేస్తే.. అన్నిచోట్లా ఓడించిన ఏపీ ఓటర్లు కాంగ్రెస్‌పై ఉన్న కసిని తీర్చుకున్నారు. 132 ఏళ్ల పార్టీ చ‌రిత్రలో ఎన్నడు లేనంతాగా గత ఎన్నికల్లో ఓట‌మిని మూట‌క‌ట్టుకుంది.

తగ్గని విభ‌జ‌న ఆగ్రహం
గత మూడేళ్లుగా టీడీపీ ప్రభుత్వంపై తన దైన శైలిలో పోరాటాన్ని సాగిస్తోంది కాంగ్రెస్‌పార్టీ. ఏపీ ప్రత్యేక హోదాపై పోరాటంతో ప్రజల్లో వచ్చిన స్పందన.. హస్తంపార్టీ నేత‌ల్లో ఆశ‌ల‌ చిగురించేలా చేసింది. హోదా కోసం కోటి సంతకాలు.. డిల్లీలో ధర్నాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయ‌డం..ప్రజ‌ల్లోకి వెళ్ళిన‌ప్పుడు పార్టీలో కొంత జోష్ నింపింది. దీంతో ఇక ప్రజ‌ల్లో త‌మ‌పై ఉన్న విభ‌జ‌న ఆగ్రహం త‌గ్గిందని భావించారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలో పార్టీ పుంజుకుంటుంద‌ని పార్టీనేతలు భావించారు. భ‌విష్యత్ ఎన్నిక‌ల నాటికి .. ఇక పార్టీకి మంచి రోజులు వ‌స్తాయని విస్వాసంతో ఉన్న హ‌స్తం నేత‌ల‌కు నంధ్యాల ఉపఎన్నిక‌ ఊహించ‌న షాక్ ఇచ్చింది. గెలుపుపై ఎలాగూ ఆశలు పెట్టుకోని హస్తంపార్టీ నేతలు కనీసం గౌరవప్రదంగా ఓట‌మి ఉంటుంద‌ని నమ్మారు. కాని..నంద్యాల ఓటర్లు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్‌ నేతలకు దిమ్మతిరిగినట్టైంది. మొత్తం నియోజకవర్గంలో 1,73, 187 ఓట్లు పోలయితే.. కాంగ్రెస్‌పార్టీకి దక్కింది 1382 వందల ఓట్లు మాత్రమే. కనీసం 2014లో తెచ్చుకున్న ఓట్లు కూడా దక్కక్కంచుకోలేక కాంగ్రెస్‌పార్టీ చతికిలపడింది. దీంతో ఏపీ ఓటర్లో విభజన ఆగ్రహం ఇంకా చల్లారలేదనేది మరోసారి రుజువైందంటున్నారు.

భష్యత్తుపై బెంగ
నంద్యాల ఉప ఎన్నిక ఇచ్చిన షాక్‌తో ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న లీడర్లకు తమ భష్యత్తుపై బెంగ మొదలైంది. పార్టీ ఇప్పట్లో కోలుకునేలా లేదన్న నైరాశ్యంలో పడిపోయారు. ఇప్పటికే చాలామంది నేతలు టీడీపీ , వైసీపీలోకి వెళ్లిపోగా.. మెల్లమెల్లగా మార్పు వస్తుందని వేచి చూసిన తమకు భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తోందని పలువురు కాంగ్రెస్‌పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.

 

 

11:44 - August 30, 2017

హైదరాబాద్ : వర్షాకాలం వచ్చిందంటే గ్రేటర్‌ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఏ రోజు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలీక భయంతో కాలం గడిపేస్తున్నారు. ముఖ్యంగా నగర వాసులను వరద గండం పట్టిపీడిస్తోంది. నగర శివారు ప్రాంత కాలనీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అపార్ట్‌మెంట్‌ వాసుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. చిన్న వర్షం పడ్డా అపార్ట్‌మెంట్‌ సెల్లార్లు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీటిని వెలికి తీయాంటే రోజుల సమయం పడుతుండటంతో అపార్ట్‌మెంట్‌ వాసులు నానా అవస్థలు పడుతున్నారు.

అధికారుల కాసుల కక్కుర్తి
నగరంలోని అన్ని కాలనీల పరిస్థితి ఇలాగే ఉంది. చిన్న పాటి వర్షాలకే కాలనీలు, ఇండిపెండెంట్‌ ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు తటాకాలను తలపిస్తున్నాయి. దీనికి కారణం..చెరువులు, నాలాలను ఆక్రమించి ఇష్టారాజ్యంగా ఇళ్ల నిర్మాణం చేయడమే. జీహెచ్ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సైతం కాసుల కక్కుర్తితో ఎడాపెడా అనుమతులు ఇవ్వడంతో ఏడాదికి వేల సంఖ్యలో అపార్ట్‌మెంట్‌ల నిర్మాణం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. లక్షలు వెచ్చించి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఆశతో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు బాధితులు. తీరా వర్షాకాలంలో కాలనీలోని నీరు చేరడంతో బిల్డర్లు తమని మోసం చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. ఇటీవల మియాపూర్‌, లింగంపల్లి కేపీహెచ్ పీ వంటి శివారు ప్రాంతాల్లో వందల కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు వరద నీటిలో చిక్కుకున్నాయి. మదినా గూడలో ఏకంగా ఓ అపార్టుమెంట్‌ బేస్‌మెంట్‌లోని మట్టి కొట్టుకుపోవడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు జీహెచ్ఎంసీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అపార్ట్‌మెంట్‌లో సుమారు 80 మంది కుటుంబీకులను ఖాళీ చేయించారు.

నాలాల సమగ్ర సర్వే
నగరంలో ఇలాంటి ఘటనలు కొత్తేమీకాదు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న తంతే. వర్షాకాలంలో నాలాల పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కురిసిన వర్షాలతో జీహెచ్ఎంసీ అనేక పాఠాలు నేర్చుకుంది. రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులతో పాటు నాలాల సమగ్ర సర్వేకు కమిషనర్‌ బి. జనార్దన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సుమారు పది నెలల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించిన యంత్రాంగం పలు అక్రమ కట్టడాలను గుర్తించింది. వర్షాకాలం కావడంతో కట్టడాలన్నిటినీ కూల్చేయడం సాధ్యం కాదని..ముందుగా ప్రవాహానికి ఎక్కువగా ఆటంకం కలిగించే 16.6 కిలోమీటర్ల పరిధిలోని 1,002 నిర్మాణాలను తొలగించాలని...ప్రణాళికా విభాగం నిర్ణయించింది. ఆ ప్రకారం ఇంజనీరింగ్‌ విభాగం నివేదిక సిద్ధం చేసింది. యజమానులకు నష్టపరిహారం చెల్లించి కూల్చివేత, విస్తరణ పనులు పూర్తిచేస్తామని ప్రకటించింది. ఈ పనుల కోసం 230 కోట్లు ఖర్చు చేసేందుకు సర్కారు అంగీకారం తెలపడంతో ముసాయిపేట సర్కిల్‌లో పనులు వెంటవెంటనే జరిగాయి. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఈ పనులు ఆగిపోయాయి.

700 నిర్మాణాలను కూల్చివేస్తాం
ఇటీవల బల్దియా అధికారులు యుద్ధప్రాతపదికన కూకట్‌పల్లి, ముసాయిపేట ప్రాంతాల్లో నాలాలపై ఉన్న 700 నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రకటించింది. అయితే ప్రారంభించిన రెండురోజులకే పనులను నిలిపివేశారు. ఇదేంటని అడిగితే యజమానులకు పరిహారం ఎలా చెల్లించాలనే అంశంపై సందిగ్ధతే కారణమని చెబుతున్నారు. భారీగా చేపట్టాల్సి ఉన్న కూల్చివేతలో స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతాయని, ఆపేసి ప్రత్యమ్నాయం ఆలోచించాలని స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు..బల్దియాపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే రెండు రోజుల్లో పనులు నిలిపి వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే వాదనకు అధికారులు తలొగ్గినట్టు తెలుస్తోంది. అయితే అధికారులు...నేతల ఒత్తిడికి తలొగ్గకుండా వర్షాకాల కష్టాల నుండి తమను గట్టెక్కించాలని నాలా పరివాహక ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. 

ఓయూలో ఇంజనీరింగ్ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్: ఓయూ అడ్మినిస్ట్రేషన్ భవన్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇంజనీరింగ్ లో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహించొద్దని డిమాండ్ చేస్తున్నారు.

11:42 - August 30, 2017

హైదరాబాద్ : గులాబీపార్టీలో సీఎం కేసీఆర్‌ తర్వాత అంతటి పలుకుబడి ఉన్న నేత మంత్రి హరీశ్‌రావు. కీలకమైన ఇరిగేషన్‌ శాఖను నిర్వహిస్తూ.. మిషన్‌ కాకతీయపేరుతో వేలాది చెరువుల మరమ్మతులు చేయిస్తూ దూసుకు పోతున్న హరీశ్‌కు ఇపుడు పార్టీలో అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయని గులాబీపార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

క్రమంగా తగ్గుతున్న ప్రాధాన్యత
పార్టీలో ఎక్కడ స‌మ‌స్యలు వ‌చ్చినా....ట్రబుల్ షూట‌ర్‌గా రంగంలోకి దిగి అన్నీ చక్కబెట్టేస్తారు హరీశ్‌రావు. కాని.. పార్టీలో ఆయనకు ప్రాధాన్యత క్రమంగా తగ్గించే పనిలో గులాబీబాస్‌ ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలకు పార్టీ సమాయత్తం అవుతున్న తరుణంలో తన కుమారుడు మంత్రి కేటీఆర్‌ను పార్టీలొ మరింతగా ప్రమోట్‌ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రాబోయే ఎన్నికల నాటికి కేటీఆర్‌ను సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌గా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ ఆదిశగా అడుగులు వేస్తున్నారన్న చర్చలు నడుస్తున్నాయి. దీన్లో భాగంగానే ఇటీవల జరిగిన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో కూడా గులాబీబాస్‌ హరీశ్‌ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడ్డం గులాబీశ్రేణుల్లో చర్చనీయాంశం అయింది.

గులాబీవర్గాల్లో విస్మయం
అంతేకాదు భూ స‌ర్వే కార్యక్రమంపై నిర్వహించిన పార్టీనేతల సమావేశంలో కూడా మంత్రి హరీశ్‌రావును టార్గెట్‌ చేస్తూ సీఎం మాట్లాడ్డం చర్చనీయాంశం అయింది. ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న హరీశ్‌రావు వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసిన్టు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన లేకుండా మాట్లాడటం మంచిది కాదని హితవు చెప్పటిన్టటు సమాచారం. తన తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ నడిపించడంలో ముందుండే హరీశ్‌రావుపై కేసీఆర్‌ హఠాత్తుగా కస్సుబుస్సులాడటంతో గులాబీవర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. గులాబీబాస్‌ వ్యాఖ్యలు హరీశ్‌రావు అనుచర వర్గంలో కలకలం రేపుతోంది. ఇప్పటికే హరీశ్‌వర్గంగా ముద్రపడిన నేతలకు పదవులు దక్కకపోవడం, తాజాగా ముఖ్యమంత్రి వ్యాఖ్యల వెనకు ఆంతర్యం ఏంటనే చర్చలు నడుస్తున్నాయి. యువ‌నేత‌కు ప్రాధాన్యత పెంచేంచేందుకే ముఖ్యమంత్రి ఇలా హరీశ్‌పై అందరు పార్టీ నేతల సమక్షంలోనే వ్యాఖ్యలు చేస్తున్నరన్న అభిప్రాయాలు టీఆర్‌ఎస్‌ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. కెటిఆర్‌కు పార్టీపై మ‌రింతప‌ట్టు దొరికేలా చేసుందుకే .. కీలక నేతగా ఉన్న హరీశ్‌ ప్రాధాన్యతను తగ్గిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికి హరీశ్‌ అండ్‌ టీం సైలెంట్‌గానే ఉన్నా.. వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోన్నన్న ఆందోళనలు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. 

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం

నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమక్రమంగా పెగుతుంది. ప్రాజెక్టులోకి 30,664 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1071.9 అడుగులు, పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుత నీటినిల్వ 32.9 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటినిల్వ 90 టీఎంసీలు.

11:28 - August 30, 2017

ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరం భారీ వర్షాలతో వణుకుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ముంబై వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. వరదల కారణంగా లోకల్‌ రైళ్లు, బస్సులు నడవటం లేదు. విమానాలు కూడా ఆగిపోయాయి. రోడ్లపై వాహనాలు చిందరవందరగా నిలిచిపోయాయి. రోడ్డుకి ఇరుపక్కలా ఉండే చెట్లు కూలిపోయాయి. దీంతో ముంబై ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. టైఫూన్‌ తరహా వాతావరణం' నగరాన్ని చుట్టేయడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముంబైలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

యూపీలో బీఆర్డీ ఆస్పత్రిలో ఆగని చిన్నారుల మృత్యుఘోష

గోరఖ్‌పూర్ : గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో చిన్నారుల మరణాలు ఆగడం లేదు. గడిచిన 48 గంటల్లో 42 మంది చిన్నారులు మృతి చెందారు. చిన్నారుల మృతిపై బీఆర్డీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పీకే సింగ్ స్పందించారు. 42 మంది చిన్నారుల్లో.. ఏడుగురు మెదడువాపు వ్యాధితో, మరో 35 మంది చిన్నారులు ఇతర కారణాలతో మృతి చెందినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఆగస్టు 27న చిన్నపిల్లల విభాగంలో 342 మంది చిన్నారులు చికిత్స కోసం చేరారు. అందులో 17 మంది మృతి చెందారు. ఆగస్టు 28న 344 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా.. 25 మంది చిన్నారులు మృతి చెందినట్లు పీకే సింగ్ తెలిపారు.

11:25 - August 30, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి జ్వరాలు సోకడంతో వందల సంఖ్యలో రోగులు ఆస్పత్రి పాలవుతున్నారు. ఒక్క ఫీవర్ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్‌ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రోజుకు దాదాపు 3 వేల మంది పేషెంట్స్ వస్తున్నారంటే జ్వరాల తీవ్రత ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు
సీజనల్‌ వ్యాధులు ప్రబలడంతో ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని ఆసుపత్రులలో బెడ్స్ ఖాళీ లేక రోగులను తిప్పి పంపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న వారు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఫీవర్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ కొంతవరకు బాగానే ఉన్నా.. సిబ్బంది కొరత కారణంగా గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉందని రోగులు వాపోతున్నారు. మరోవైపు సరిపడా మందులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం సరిపడా మందులు ఇవ్వడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.

స్వైన్ ఫ్లూ ప్రబలే ప్రమాదం
వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే జ్వరాలు విజృంభిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. స్వైన్ ఫ్లూ ప్రబలే ప్రమాదమున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫీవర్ ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు వైద్యులు అందుబాటులో ఉండి పేషెంట్స్‌కి చికిత్స అందిస్తున్నారని.. ఫార్మసీ కౌంటర్లను పెంచామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్.శంకర్ చెబుతున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొద్దిగా జలుబు, దగ్గు అనిపించినా నిర్లక్ష్యం వహించవద్దని వైద్యులు చెబుతున్నారు. దాంతో పాటు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. 

11:22 - August 30, 2017

ముంబై : భారీ వర్షాల నుంచి ముంబై ఇంక తెరుకొలేదు. కొన్ని చోట్ల మాత్రమే రవాణాను పునరుద్ధరించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపుడుతున్నారు. విద్యాసంస్థలకు మహాప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మరో రెండు రోజులపాటు ముంబైలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ముంబైలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:20 - August 30, 2017

నల్లగొండ : జిల్లామిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. రైలు కిందపడి కానిస్టేబుల్‌ శ్రీనివాసచారీ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాసచారీ మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేశాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని.. ఈ నెల 12వ తేదీతో సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టాడు. ఆరోగ్యం బాగాలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు.. శ్రీనివాసచారీ సూసైడ్‌ నోట్‌లో రాశాడు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:18 - August 30, 2017

ఇంట్లోకి వర్షపు నీళ్లు వస్తే ఏం చేస్తారు ? ఏం చేస్తాం..అడ్డుగా ఏదో ఒకటి పెట్టేస్తాం..అంటారు కదా...కానీ ఏదైనా ఓ వ్యక్తి ఇష్టంగా దాచుకున్న వాటిని ఉపయోగించి నీరు లోనికి రాకుండా చేస్తే ఎలా ఉంటుంది...అలా ఎలా చేస్తాం..ఇష్టంగా దాచుకున్న వాటితో అలా చేస్తామా ? అంటారు కదా..కానీ ప్రముఖ టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి సతీమణి లారా దత్తా అలాగే చేసింది...ఎంటో తెలుసుకోవాలంటే..చదవండి..

మహేష్ భూపతి..ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు..వింబుల్డన్..ఆస్ట్రేలియన్..యూఎస్..ఫ్రెంచ్ ఓపెన్లు ఎన్నో మ్యాచ్ లను ఆడాడు. బాలీవుడ్ మాజీ నటి, 2000విశ్వసుందరి లారా దత్తాను ఆయన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు ముంబైలో నివాసం ఉంటున్నారు. మ్యాచ్ ల్లో ఆడిన సందర్భంలో ఉపయోగించిన టవల్స్..ను మహేష్ భూపతి మధురస్మృతులుగా దాచుకున్నాడు.

గత కొన్ని రోజులుగా ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వరదనీరు నగరాన్ని ముంచెత్తింది. సామాన్యుడి నుండి ప్రముఖుల వరకు ఎంతో మంది వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహేష్ భూపతి..లారా దత్తాలు ఉంటున్న నివాసంలోకి కూడా వరద నీరు చేరింది. దీనితో మహేష్ దాచుకున్న టవల్స్ ను నీరు రాకుండా అడ్డు పెట్టింది. దీనికి సంబంధించిన ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఇలాగైనా పనికొచ్చాయని కామెంట్ కూడా పెట్టారు. దీనిపై మహేష్ వెంటనే బదులిచ్చాడు. ఎంత పనిచేశావు ? వేళాకోళంగా ఉందా ? ఎంత కష్టపడ్డానో తెలుసా ? అంటూ ట్విట్టర్ లోనే బదులిచ్చాడు. 

ఫాతిమా కళాశాల కేసు విచారణ వాయిదా....

ఢిల్లీ : కడప ఫాతిమా కళాశాల కేసు విచారణ వాయిదా పడింది. విచారణను సెప్టెంబర్ 21కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది.

ముంబైలో తగ్గుముఖం పట్టిన వర్షం

హైదరాబాద్: ముంబైలో వర్షం తగ్గుముఖం పట్టడంతో లోక్ రైళ్ల సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అంతే కాకుండా రహదారులపై నీరు తగ్గడంతో బస్సు సర్వీసులు కూడా ప్రారంభం అయ్యాయి. నేడు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది

11:12 - August 30, 2017

ముంబై : దేశవాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెతున్నాయి. ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితులను అదుపులోకి తెంచెందుకు ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు రంగంలోకి దిగాయి. విద్యాసంస్థలకు మహాప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మరో రెండు రోజులపాటు ముంబైలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ముంబైలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:11 - August 30, 2017

ముంబై : దేశవాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెతున్నాయి. ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితులను అదుపులోకి తెంచెందుకు ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు రంగంలోకి దిగాయి. విద్యాసంస్థలకు మహాప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మరో రెండు రోజులపాటు ముంబైలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ముంబైలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:10 - August 30, 2017

సోనాక్షి సిన్హా.. బాలీవుడ్ అలనాటి హీరో 'శతృఘ్నసిన్హా' కుమార్తె. 'దబాంగ్'..'రౌడీ రాథోడ్' లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. తన సినిమాలతోనే కాకుండా కొన్ని కామెంట్స్ చేస్తూ వార్తల్లోకి ఎక్కుతుంటుంది. ఇటీవలే హీరోలతో సమానంగా హీరోయిన్లకు రెమ్యునరేషన్ ఇవ్వాలంటూ సోనాక్షి కామెంట్స్ చేసినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.

తాజాగా ఆమె చేసిన పలు వ్యాఖ్యలతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారంట. తనకు ఇతరులని హింసించే లక్షణాలున్నాయని..ఎవరినైనా చంపడమే తన కోరికంటూ సరదాగా మాట్లాడారు. ఈ వింత కోరికను తెలుసుకున్న ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారంట. సెల్ఫీ ట్రెండ్ ను ప్రారంభించింది తానేనని, తన దగ్గర ఎప్పుడూ డిజిటల్ కెమెరా ఉంటుందని..నా ఫొటో నేనే తీసుకొనేదానినంటూ పేర్కొంది ఈ ముద్దుగుమ్మ. ఆమె నటించిన 'నూర్' చిత్రం బాక్సాపీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేదన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సిద్దార్థ్ మల్హోత్రాతో ఓ సినిమాలో నటిస్తున్నారు. 

11:07 - August 30, 2017

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత చేపల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. ఇవాళ్టి నుంచే ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. గత సంవత్సరం 27 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయగా ఈ ఏడాది 70 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. చేప పిల్లల పంపిణీలో చాలా అక్రమాలు జరుగుతున్నట్టు మత్స్యకారుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత సంవత్సరం చేప పిల్లల పంపిణీలో ఎదురైన అనుభవాలేమిటి? చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిజంగా మత్స్యకారుల అవసరాలు తీరుస్తోందా? దళారీల కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారా? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు తెలంగాణ మత్స్యకారుల సంఘం నాయకులు లెల్లల బాలకృష్ణగారు 10టీవీ స్టూడియోకి వచ్చారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

11:06 - August 30, 2017

హైదరాబాద్ : ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర భూ సర్వేపై ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సర్వేను గులాబీపార్టీ సొంతకార్యక్రమంగా చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నాయి. ఎకపక్షంగా సర్వేకి వెళ్లితే ప్రభుత్వంపై పోరుబాటపడతామంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం త్వరలో సమగ్ర భూ సర్వేకి సిద్దం అవుతున్నది. రెవిన్యూ రికార్డుల ప్రకారం భౌగోళికంగా తెలంగాణ ఉన్న ప్రభుత్వ భూమి ఎంత? అందులో రికార్డు ప్రకారం ఎంత ఉంది. వాస్తవం లో ఎంత ఉంది. భవిష్యత్ లో నెలకోల్పబోయే అభివృద్ది అవసరాలకు వినియోగించుకునేందుకు ఉన్న భూమి ఎంత అనేదాని పై ఇప్పటి వరకు సరైన స్పష్టత లేకపోవడంతో ..ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది కూడా సమగ్ర కుటుంబ సర్వే తరహాలో మొత్తం ప్రభుత్వ, ప్రవైట్ భూముల లెక్కలన్నీ తెల్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కోర్టు వివాదాలతోపాటు ఇరత వివాదాస్పదంగా భూముల సంగతేంటనే దాని పై మాత్రం ఇంకా క్లారీటి రావాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం వివాదాలను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సర్వే కి ముందే క్లీయర్ చేసే అవకాశం ఉందంటున్నారు.

ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు 
భూ సర్వే కోసం ప్రత్యేక మార్గదర్శాకాలు రూపకల్పన చేసే పనిలో తెలంగాణ ప్రభత్వం బిజీగా ఉంది. ఇప్పటికే రూల్స్ అండ్ రెగ్యులరైజైషన్ డ్రాప్ట్ కాఫీ సీఎం అనుమతి కోసం రెవిన్యూ అధికారులు పంపినట్లు సమాచారం. దీని పై సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలను విడుదలచేసే అవకాశం ఉంది. ప్రజల సమక్షంలోనే భూమి రికార్డులను నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఒక్కో గ్రామంలో ఇంటింటికీ తిరిగి రైతుల వాస్తవ భూముల సమాచారం తెలుసుకొని, ఆ తరువాత రైతులతో గ్రామ సభలు నిర్వహించి, సేకరించిన సమాచారాన్ని వారి ముందు పెట్టి వారి అభిప్రాయాలు తీసుకోనున్నారు. భూ సర్వేతో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని టీ సర్కార్‌ చెబుతోంది. చాల కాలంగా వారసత్వ భూములు, భాగాల పంపిణీలతో కమతాల ఏకీకరణ, సర్వే నంబర్లలో ఉన్న భూమిలో ఎక్కువ తక్కువలు అన్నీ సమస్యలు సద్దుసద్దుమణుగుతాయని అంటున్నారు. ప్రక్షాళన పూర్తి కాగానే అత్యంత భద్రతా ఫీచర్లతో భూ యజమాన్య హక్కుల పత్రంతో కూడిన పట్టాదార్ పాసుపుస్తకాలను రైతులందరికీ అందజేస్తారు. ట్యాంపరింగ్ కు వీల్లేనివిధంగా , నీళ్లలో పడినా, చింపినా పాడుకాని విధంగా కొత్త పాసుపుస్తకాలుంటాయని అధికారులు చెబుతున్నారు.

గ్రామాల్లో భూ సంబంధ గొడవలు
అయితే ప్రభుత్వం హడావిడిగా భూ సర్వేను చేపడుతోందని విపక్షాలు అంటున్నాయి. భూ సర్వేను గులాబీపార్టీ అంతర్గత సమస్యగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చూస్తోందని విమర్శిస్తున్నారు. కేవలం టిఆర్ఎస్ ఎల్పీ నేతలతో చర్చించిన నిర్ణయం తీసుకోకుడదని..దీని పై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. హడావిడిగా కార్యక్రమాన్ని పూర్తిచేస్తే.. గ్రామాల్లో భూ సంబంధ గొడవలు మరింత పెరిగే అవకాశం ఉందని విపక్షపార్టీలు హెచ్చరిస్తున్నాయి. 

11:03 - August 30, 2017

విజయవాడ :నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా ఎక్కువ శాతం అధికార పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతారని అన్నారు. నంద్యాల ప్రజలను చంద్రబాబు అయోమయానికి గురిచేశాడని... ఉప ఎన్నికల ముందు రూ. రెండువేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి వదిలేశాడని.. దీంతో ప్రజలు వైసీపీ గెలిస్తే అభివృద్ధి పనులు నిలిపేస్తారనే భయానికి గురయ్యారన్నారు. 

తిరుమలలో ఎల్ -1 బ్రేక్ దర్శనాల టికెట్ల జారీ నిలిపివేత

తిరుమల: శ్రీవారి ఆలంయలో సిఫారసు ఉత్తరాలపై ఎల్ -1 బ్రేక్ దర్శనాల టికెట్ల జారీ నిలిపివేసింది. టిటిడి నిర్ణయానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

11:02 - August 30, 2017

గుంటూరు : నంద్యాల ఉప ఎన్నికల్లో మంత్రుల పని తీరును ప్రశంసించారు సీఎం చంద్రబాబునాయుడు. నంద్యాల విజయం కొత్త ఉత్సాహాన్నించిందని అన్నారు. నంద్యాలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుద్దామని భూమా అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డికి చంద్రబాబు చెప్పారు. జగన్ అవినీతి, అక్రమాలు, దుర్మార్గమైన ప్రేలాపనలే నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి కలిసివచ్చాయన్నారు మంత్రి కాల్వ శ్రీనివాసులు. ఇక ఉప ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్ విసిరిన శిల్పా మోహన్ రెడ్డి, చక్రపాణి రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాని ప్రశ్నించారు మంత్రి అఖిలప్రియ. 

తిరుమలకు రాష్ట్రపతి కోవింద్

చిత్తూరు: సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుమలకు వస్తున్నారు. 2వ తేదీన రామనాథ్ శ్రీవారిని దర్శించుకోనున్నారు.దీంతో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.

11:01 - August 30, 2017

విశాఖ : బంగాళాఖాతంలో అల్పపీడనం..కోస్తా నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం..నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో..ఉత్తరాంధ్రలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. అటు జలాశయాలకూ వరదనీరు పోటెత్తుతోంది. రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు విజయనగరం జిల్లాను కుదిపేశాయి. పార్వతీపురం డివిజన్ అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా.. వరద నీరు పోటెత్తడంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో పంటపొలాలు నీటమునిగాయి. గరుగుబిల్లి మండలంలో వర్షాలకు తడిసిన గోడ కూలి ఓ మహిళ మృతిచెందడం విషాదం నింపింది. పార్వతీపురం మండలంలో సాకిగెడ్డకు వరద నీరు పోటెత్తడంతో జమదాల, పుట్టూరు, తాళ్లబురిడి ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల రహదారులు నీట మునిగాయి. భారీ ఈదురుగాలులతో కురుపాంలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఏజెన్సీ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంధకారంలో జనం అల్లాడిపోయారు. తోటపల్లి బ్యారేజీకి వరద నీరు వచ్చిచేరడంతో 23వేల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరింది. జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామం, పార్వతీపురం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

ఉప్పొంగిన వంశధార, నాగావళి నది
అటు శ్రీకాకుళం జిల్లాలోనూ ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వంశధార నది, నాగావళి నది, మహేంద్ర తనయ, ఓనిగెడ్డకు వరదనీరు పోటెత్తడంతో.. సుమారు 10 వేల ఎకరాల పంటలు నీటమునిగాయి. పలు చోట్ల రహదారులు, కరకట్టలు కోతకు గురయ్యాయి. పాలకొండ డివిజన్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పాతపత్నం, మెలియపుట్టి, పాలకొండ, పలాస, వీరఘట్టం మండలాల్లో పంటపొలాలు నీటమునిగాయి. ఒడిషాలో ఎగువన కురుస్తున్న వర్షాలతో హిరమండంలోని గొట్టా బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. ఇక్కడి నుంచి 29 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అటు తోటపల్లి జలాశయానికీ 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఓనిగెడ్డ ఉగ్రరూపం దాల్చడంతో పాలకొండలోని గారం కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. అటు విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.   

10:58 - August 30, 2017

టెక్సాన్ : అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో హెరికేన్‌ బీభత్సం సృష్టిస్తోంది. గడిచిన 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు కురుస్తున్నాయి. హర్వే హెరికేన్‌ ధాటికి టెక్సాస్‌ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. అమెరికాలోనే నాలుగో అతిపెద్ద నగరం హూస్టన్‌ ఇంకా నీటిలోనే నానుతోంది. గత శుక్రవారం తుపాను తీరం దాటగా... ఇప్పటి వరకు వర్షం విరామం లేకుండా కురుస్తూనే ఉంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హూస్టన్‌ సహా పలు పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి
కంట్రీల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. మూడు అడుగుల మేర ముంచేసిన నీళ్లగుండా లక్షల మంది ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. హెరికేన్‌ ధాటికి ఇప్పటి వరకు 10మంది ప్రాణాలు కోల్పోయారు. హూస్టన్‌, హారిస్‌కౌంటీసహా పలు ప్రాంతాల్లో 76 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.టెక్సాస్‌ను ముంచెత్తిన హార్వే హెరికేన్‌.. అక్కడి విద్యుత్‌ వ్యవస్థను సమూలంగా కుప్పకూల్చింది. రవాణా, కమ్యూనికేషన్‌ తదిరత వ్యవస్థలు దెబ్బతిన్నాయి. వేలాదిగా ఇళ్లు, కట్టడాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నష్టం.. 2005నాటి కట్రినా హెరికేన్‌ విపత్తుకు సమానంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

క్యాంపస్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు
టెక్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ హూస్టన్‌లోకి వరద నీరు చొచ్చుకురావడంతో దాదాపు 200 మంది భారతీయ విద్యార్థులు క్యాంపస్‌లో చిక్కుకున్నట్లు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్విట్టర్‌లో తెలిపారు. షాలిని, నిఖిల్‌ భాటియా అనే విద్యార్థులను ఆస్పత్రిలో చేర్చినట్లు పేర్కొన్నారు. అక్కడి భారత కాన్సుల్‌ జనరల్‌ అనుపమ్‌ రే సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. టెక్సాస్‌లో బీభత్సం సృష్టించిన హార్వే హెరికేన్‌ ప్రస్తుతం ఉత్తరదిశగా కదులుతూ లూసియానా వైపునకు పయనిస్తోంది. దీంతో లూసియానా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. టెక్సాస్‌లో మాదిరే లూసియానాలోనూ లక్షల మందిని ఇళ్లు ఖాళీచేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేలాది నేషనల్‌ సెక్యూరిటీ గార్డు బృందాలు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది, సాధారణ పౌరులు, స్వచ్ఛంద కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నారు. వరదల్లో చిక్కుకుపోయినవారిని కాపాడేందుకు పెద్ద సంఖ్యలో హెలికాప్టర్లు, బోట్లు, హై వాటర్‌ ట్రక్కులను వినియోగిస్తున్నారు.

10:56 - August 30, 2017

ముంబై : ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై మహానగరం చిగురుటాకులా వణుకుతోంది. ఎక్కడ చూసినా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీగా వరదలు సంభవించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెంబూర్‌ ప్రాంతంలో ఎడతెరపిలేని వర్షాలతో పెద్ద ఎత్తున నీరు చేరడంతో ఆ ప్రాంతం సముద్రాన్ని తలపిస్తోంది. విలే పార్లెలోని వెస్టర్న్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనాల దారులు గంటలపాటు నరకయాతన అనుభవించారు. రైల్వే స్టేషన్లలో ఎక్కడికక్కడ వరదనీరు వచ్చిచేరడంతో రైళ్లు నిలిచిపోయాయి. పలు రైల్వే సర్వీసులను నిలిపివేశారు. వరదముంపులోని రైళ్లలో చిక్కుకున్న ప్రయాణీకులను ప్రత్యేక సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబై విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి.

అధికారుల సెలవులు రద్దు
వర్షం తీవ్రత అంతకంతకూ పెరుగుతుండడంతో బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ అధికారులకు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ముంబైలోని అతిపెద్ద మున్సిపల్‌ హాస్పిటల్‌ కేఈఎంలోకి వరదనీరు చేరింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి నీరు చేరడంతో అక్కడ ఉన్న 30మంది రోగులను వేరే ప్రదేశానికి చేర్చారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ముంబై వాసులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. వర్షాల ధాటికి ముంబైలో 200 చెట్లకుపైగా నేలకొరిగాయి. చెట్లు విరిగిపడడంతో 70 ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

దేవేంద్ర పడ్నవీస్‌ సమీక్షి
ముంబైలో వరద పరిస్థితిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్‌ సమీక్షించారు. అత్యవసర పరిస్థితిలో మినహా ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. సీఎం ఆదేశాలతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

విమానం రెక్కల్లో పక్షి...

వైజాగ్ : విశాఖ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ఇండిగో విమానం నిలిచిపోయింది. ఎందుకంటే టేకాఫ్ సమయంలో ఆ విమానం రెక్కల్లో పక్షి చిక్కుకుపోవడమే కారణం. పక్షి చిక్కుకోవడాన్ని గమనించిన పైలట్.. టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే తిరిగి దించేశారు. ఇండిగో విమానం విశాఖ నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉండగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.

వైద్యుల వాగ్వాదంతో చిన్నారి మృతి

రాజస్థాన్: జోథ్ పూర్ ఉమైద్ ఆస్పత్రిలో విద్యుల నిర్వాకంతో బయపటడింది. గర్భిణీకి ఆపరేషన్ చేస్తుండగా ఇద్దరు వైద్యులు వాగ్వాదానికి దిగారు. దీంతో శిశువు మృతి చెందింది. ఘర్షణ పడ్డ ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు వేశారు.

మళ్లీ యూపీలో 2 రోజుల్లో 42మంది చిన్నారుల మృతి

యూపీ: గోరఖ్ పూర్ బీఆర్డీ ఆస్పత్రిలో రెండు రోజుల్లో 42 మంది చిన్నారులు మృతి చెందారు. మెదడు వ్యాపు వ్యాధితో ఏడుగురు చనిపోగా, ఇతర కారణాలతో మరో 35 మంది చిన్నారులు మృతి చెందారు.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 3 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.

రైలు కిందపడి కానిస్టేబుల్ ఆత్మహత్య...

నల్గొండ : మిర్యాలగూడ రైల్వేస్టేషన్ సమీపంలోని ట్యాంక్ తండా వద్ద రైలు కింద పడి టి. శ్రీనివాసచారి (49)అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఎవరు భాద్యులు కాదని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాసచారి మిర్యాలగూడలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ట్యాంక్ తండా వద్ద రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలు, మతిమరుపు సమస్య కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. శ్రీనివాసచారికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.

Don't Miss