Activities calendar

31 August 2017

22:43 - August 31, 2017
22:41 - August 31, 2017
22:39 - August 31, 2017
22:03 - August 31, 2017

నెల్లూరు : అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పీఎస్‌ఎల్‌వీ సీ39 ప్రయోగం విఫలమైంది. ఈ రాకెట్‌ ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ 1హెచ్ ఉప్రగహాన్ని మోసుకెళ్లింది. అయితే రాకెట్‌ ఉష్ణకవచం నుంచి ఉపగ్రహం వేరుకాకపోవడంతో ప్రయోగం విఫలమైంది. ఇటీవల కాలంలో ఇస్రోకు ఇది తొలి పరాజయం. పీఎస్‌ఎల్‌వీ సీ39 ప్రయోగం తొలి మూడు దశలు విజయవంతమైనా, చివరి దశలో రాకెట్‌ నుంచి ఉపగ్రహం వేరుకాకపోవడంతో ప్రయోగం ఫెయిలైంది. హీట్‌ షీల్డు తెరుచుకోపోవడంతో ఉపగ్రహాన్ని నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టలేకపోయారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్‌ సొంత దిక్సూటీ నావిక్.. మరింత మెరుగ్గా సేవలు అందించేంది. పీఎస్‌ఎల్‌వీ సీ39 ప్రయోగం వైఫల్యానికి కారణాలపై ఇస్రో సమీక్షిస్తోంది.  
 

22:01 - August 31, 2017

విజయవాడ : నంద్యాల ఓటమిని అంగీకరించకుండా జగన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ మంత్రి జవహర్ విమర్శించారు. ఉప ఎన్నికల ప్రచారంలో నోటికి వచ్చినట్లు మాట్లాడిన జగన్ ఇప్పుడు కొడాలి నానితో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే కొడాలి నాని తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నుంచి సామాన్య కార్యకర్తను నిలబెట్టి  కొడాలి నానిపై గెలిచి చూపిస్తామని మంత్రి జవహర్ సవాల్ విసిరారు. 

 

హైకోర్టులో జగన్ కు చుక్కెదురు

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ కు చుక్కెదురు అయింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. జగన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.

21:41 - August 31, 2017
21:38 - August 31, 2017
21:36 - August 31, 2017
21:35 - August 31, 2017
21:30 - August 31, 2017

ఏం చెప్పారు? ఏం జరిగింది? నోట్లరద్దు దేశానికి ఏం మిగిల్చింది? సామాన్యుడికి ఏ అనుభవాలిచ్చింది? ఎంత నల్లధనం వెలికి తీశారు? ఆర్బీఐ గణాంకాలు ఏం చెప్తున్నాయి? జైట్లీ వాదనల్లో అసంబద్ధత ఎంత? మోడీ సర్కారు డీమానిటైజేషన్ తో తప్పులో కాలేసిందా?   తగ్గిన జీడీపీ గణాంకాలేం చెప్తున్నాయి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టొరీ.. నల్లధనం ఎక్కడున్నా తీసుకొస్తాం..అందరి ఎకౌంట్లలో పంచేస్తాం.. మోడీ సర్కారు మూడేళ్ల క్రితం మీటింగుల్లో ఊదరగొట్టిన మాట. నల్లధనం అడ్రస్ ఆధారాలతో సహా వెల్లడైనా పట్టించుకోలేదు.. కానీ, నోట్ల రద్దు జనాల జేబుల్లో సొమ్మును మాత్రం గుంజుకున్నారు. ఈ చర్యలతో దేశం పదినెలలుగా చూసిన అనుభవాలేంటి? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:25 - August 31, 2017

మీడియా మీద సోషల్ మీడియా ఫైర్, రేపు భూమి అంతం గావోతున్నదట, టీఆర్ఎస్ పార్టీల ముదిరిన పంచాది, దొంగ నోట్ల రద్దుతోని దొర్కిపోయిన వాడీ, మంత్రమేస్తె పాత బాకీలు వసూలైతయ్... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:19 - August 31, 2017
21:17 - August 31, 2017

ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

శ్రీకాకుళం : జిల్లా ఇచ్చాపురంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. దక్షిణాఫ్రికాలో ఉద్యోగాలు ఇస్తామంటూ డొంకూరు ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులను ఇచ్చాపురం వాసి మోసం చేశాడు. దీంతో న్యాయం చేయాలంటూ బాధితులు 10టీవీని ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఇచ్చాపురం మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన నేత హస్తం ఉందని తెలుస్తోంది. 

21:09 - August 31, 2017

శ్రీకాకుళం : జిల్లా ఇచ్చాపురంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. దక్షిణాఫ్రికాలో ఉద్యోగాలు ఇస్తామంటూ డొంకూరు ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులను ఇచ్చాపురం వాసి మోసం చేశాడు. దీంతో న్యాయం చేయాలంటూ బాధితులు 10టీవీని ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఇచ్చాపురం మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన నేత హస్తం ఉందని తెలుస్తోంది. 

 

21:02 - August 31, 2017

పీఎస్ ఎల్ వీ సీ 39 రాకెట్ ప్రయోగంపై వక్త పలు అంశాలను ప్రస్తావించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ డా.చెన్నారెడ్డి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:58 - August 31, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బెల్టు షాపులు ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయం అక్రమార్కులకు వరంగా మారింది. బెల్టు షాపుల రద్దుతో తమ ఆదాయం తగ్గిపోతుందని భావించిన కొందరు వ్యక్తులు... గుట్టు చప్పుడు కాకుండా అక్రమ వ్యాపారానికి తెరతీస్తున్నారు. 

2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు బెల్టు షాపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఎక్సైజ్‌ శాఖ వరుస దాడులు నిర్వహించి బెల్టు యజమానులను బెంబెలెత్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 15 బెల్టు షాపులు, రెండు బార్ల లైసెన్స్‌లను రద్దు చేశారు. బెల్టు షాపులకు సంబంధించి 172 మందిని అరెస్ట్‌ చేశారు. మరో 1860 మందిపై బైండోవర్‌ కేసు పెట్టారు. టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు మాత్రం దాడుల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. బడ్డీకొట్ల ముసుగులో నడుస్తున్న బెల్టు షాపుల బెండు తీస్తున్నారు అధికారులు. ఐనప్పటికీ మరికొన్ని చోట్ల బెల్టు నిర్వాకం ఇంకా జరుగుతూనే ఉందన్న ఆరోపనలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో బెల్టు బాబులు సరికొత్త ఆలోచనతో కొత్త పంథాకు తెరతీశారు. బెల్టు షాపులతో వచ్చే ఆదాయాన్ని రుచిమరిగిన వ్యాపారులు కొందరు చాటుమాటుగా బెల్టు అమ్మకాలు చేస్తున్నారు. 
 
కొందరు ప్రముఖుల అండదండలతో బెల్టు వ్యవహారం అత్యంత రహస్యంగా నడుస్తోంది. మద్యం విధానం కృష్ణా జిల్లాలో ఏ విధంగా అమలవుతుందో తెలుసుకునేందుకు ప్రజల నుండి ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఈ సర్వేలో మొబైల్స్‌ ద్వారా ఆర్డర్లు చేస్తూ అసలు ధరలపై 20 నుండి 30 రూపాయల వరకు మద్యం అమ్మకాలపై ఎక్కువ వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈ విషయంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

బెల్టు షాపులను తొలగిస్తామన్న హామీలు ప్రకటనలకు పరిమితం చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అడ్డదార్లో బెల్టు వ్యాపారాలు చేస్తున్న వారిపై నిఘా పెట్టాలంటున్నారు. బెల్టుతో పాటు మద్యం మహమ్మారిని తరిమి కొట్టాలని మహిళాలోకం ఉద్యమాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేవలం ఆదాయం కోసమే కాకుండా ప్రజల క్షేమం గురించి ఆలోచించాలని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. 

20:51 - August 31, 2017

కృష్ణా : విజయవాడ నగరాన్ని విష జ్వరాలు వణికిస్తున్నాయి. వాతావరణంలో వినూత్న మార్పులు, దోమల స్వైర విహారంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఫలితంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.  ప్రభుత్వం, అధికారులు మాత్రం పట్టించుకోకుండా... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 
ప్రజలను పట్టి పీడుస్తున్న విష జ్వరాలు
నగర ప్రజలను విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వైరల్, డెంగీ లక్షణాలతో ప్రజలు మంచాన పడుతున్నారు. రోగులతో ప్రభుత్వాస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 23 వరకూ 617 మలేరియా కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నాలుగు నెలల్లోనే జిల్లాలో 18 వందల 50 వైరల్ జ్వరాల కేసులు నమోదయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారమే ఈ ఏడాది ఇప్పటి వరకూ 90కుపైగా డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి.  ఇక మైలవరం, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, తోట్లవల్లూరు, జక్కంపూడి ప్రాంతాల్లో జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్నాయి. 
వాతావరణంలోని మార్పులతో ప్రబలుతున్న జ్వరాలు
అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీటి నిల్వలు... వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు ... జ్వరాలు ప్రబలడానికి కారణంగా తెలుస్తోంది. నగరంలో సరిగ్గా పారిశుధ్య పనులను నిర్వహించకపోవడంతో... ప్రజలు రోగాలు పడుతున్నట్టు తెలుస్తోంది. కాలువల వెంబడి బ్లీచింగ్ పౌడర్ వేయకపోవడం, దోమల మందులు స్ర్పే చల్లకపోవడం వల్ల దోమలు విజృంభించి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ప్రజల బాగోగులను పట్టించుకోవాల్సిన పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్యం కోసం ఏటా రూ.120 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మలేరియా నిర్మూలన కోసం మరో రూ.2 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారు. అయినా ఎటువంటి ఫలితం ఉండటం లేదు. 

 

20:46 - August 31, 2017

ప్రకాశం : ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు పార్టీ మారతారన్న ప్రచారం ఒంగోలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండో విడత కేబినేట్‌ విస్తరణలో టిడిపి తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పార్టీని వీడే యోచనలో శీనయ్య ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు చీరాల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా మాగుంటను బరిలోకి దింపాలని లోటస్‌పాండ్‌లో చర్చలు జరుగుతున్నాయి.
టీడిపిలోకి చేరిన మాగుంట శ్రీనివాసులు
మాగుంట శ్రీనివాసులు రెడ్డి... కాంగ్రెస్‌ నేత, పారిశ్రామికవేత్త మాగుంట సుబ్బరామిరెడ్డికి సొంత తమ్ముడు. మాగుంట కుటుంబానికి రాజకీయ వారసుడు. కాంగ్రెస్‌తో రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన హస్తం పార్టీని వీడి వైసీపీవైపు అడుగులు వేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి..అయితే కొన్ని కారణాల వల్ల శీనయ్య సైకిలెక్కాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం.. ఓడిపోవడం జరిగిపోయాయి.. అయినా తెలుగుదేశం అధిష్ఠానం మాగుంటకు ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడి పదవిలో కూడా కూర్చోబెట్టింది..
మాగుంటకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం
సీఎం చంద్రబాబు.... మాగుంటకు ఇస్తోన్న ప్రాధాన్యతను చూసి మంత్రి పదవి ఖాయమని పార్టీలో ప్రచారం జరిగింది.. కానీ అలా జరగలేదు... రెండో మంత్రి వర్గ విస్తరణలోనూ మంత్రి పదవి రాకపోవడంతో శీనయ్య అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది.. ఎమ్మెల్సీగాఉన్నా ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానంటూ అనుచరులతో చాలాసార్లు ప్రస్తావించారు..  జిల్లాలో బలమైన నేతల మధ్య తానేమీ చేయలేకపోతున్నానని ఆవేదన చెందారు..
మాగుంట వర్గాలు టీడిపీలో చేరేందుకు విముఖత
మాగుంట వర్గానికి చెందిన వారు టిడిపిలో చేరతానంటే మాగుంట స్పందింక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు జిల్లాలో టీడిపి అధ్యక్ష పదవికి ఎంపిక చేసేందుకు కొంతమంది పార్టీ శ్రేణులు ఏకమైనా మాగుంట విముఖత చూపడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సారి పార్టీ మారితే గనక ఆ పార్టీ నుండి ఓ హామీని తీసుకోవాలనే ఆలోచనలో శీనయ్య ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామన్న హామీ లభిస్తే మాగుంట సైకిల్‌ దిగేస్తారన్న ప్రచారం ఊపందుకుంటోంది. చీరాల నియోజకవర్గం నుండి శాసన సభ వైసీపీ సీటు మాగుంటకి ఇచ్చేందుకు ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. నంద్యాలలో రాజకీయాలు సద్దుమనగడంతో ఇప్పుడా ప్రయత్నాలకు బాలినేని పదునుపెడుతున్నారు. ఇందుకోసం వైసీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో మాగుంట తీసుకునే నిర్ణయం ఒంగోలు రాజకీయాల్లో పెద్ద మార్పును తీసుకురానుంది.

 

20:40 - August 31, 2017

గుంటూరు : పట్టణంలోని ఆర్ అండ్‌ బీ సూపరిండెంట్ కారంపూడి రాఘవరావు ఇంటిపై ఏసీబీ దాడి చేసింది.... మచిలీపట్నం, మంగళగిరిలో పదకొండుచోట్ల పది బృందాలు సోదాలు జరుపుతున్నాయి.. ఏసీబీ డీఎస్పీ దేవానంద్‌ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.. రాఘవరావు కుటుంబసభ్యులు, బినామీల పేరుతో పొలాలు, ఇళ్ల స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.. అలాగే ముప్పై లక్షల రూపాయల విలువైన బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.. ఈ అక్రమాస్తుల విలువ 20 కోట్లు ఉంటుందని అధికారులు అంచనావేశారు.. 

 

20:35 - August 31, 2017

విజయవాడ : రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో 4 వందల స్మార్ట్ విలేజ్‌లను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తద్వారా ఏపీని దేశంలోనే నంబర్ వన్ స్ధానంలో ఉంటుందన్నారు. విజయవాడలో కే.ఎల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సంయుక్తంగా నిర్వహించిన ఓపెన్ ఇన్నోవేషన్ ఫోరం సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. డిజిటల్ పరిజ్ఞానం ద్వారా గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి లోకేష్ అన్నారు.
 

 

 

20:32 - August 31, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ గృహ నిర్మాణ కార్యక్రమం చాలా విస్తృతంగా చేపట్టినట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయంలో 13 జిల్లాల ప్రాజెక్టు ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాల పురోగతిపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని..  మొత్తం 11 లక్షల ఇళ్లను వచ్చే ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. 

 

మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో రైల్లో యువతిపై పోకిరి వేధింపులు

విజయవాడ : మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో రైల్లో.. ఉత్తరాది యువకుల పోకిరి చేష్టలకు ఓ యువతి తీవ్రగాయాల పాలైంది. రైల్లో వేధిస్తుండటంతో... సింగరాయకొండ స్టేషన్ వద్ద.. అజ్మల్ అనే యువతి రైలులోంచి దూకింది. తీవ్రంగా గాయపడ్డ యువతిని.. ఒంగోలు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతిని వేధించిన ముగ్గురు యువకులను ..బెజవాడ స్టేషన్‌లో పట్టుకున్న రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అజ్మల్ చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది.

20:29 - August 31, 2017

విజయవాడ : మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో రైల్లో.. ఉత్తరాది యువకుల పోకిరి చేష్టలకు ఓ యువతి తీవ్రగాయాల పాలైంది. రైల్లో వేధిస్తుండటంతో...సింగరాయకొండ స్టేషన్ వద్ద.. అజ్మల్ అనే యువతి రైలులోంచి దూకింది. తీవ్రంగా గాయపడ్డ యువతిని.. ఒంగోలు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతిని వేధించిన ముగ్గురు యువకులను ..బెజవాడ స్టేషన్‌లో పట్టుకున్న రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అజ్మల్ చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. 

 

20:26 - August 31, 2017

కృష్ణా : అర్జున్‌రెడ్డి మూవీపై వివాదం రాజుకుంటోంది. సినిమాను బ్యాన్ చేయాలని కోరుతూ విజయవాడలో మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. రాజ్‌, యువరాజ్‌ వద్ద మహిళా సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. థియేటర్‌ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:22 - August 31, 2017

కరీంనగర్ : హరితహారం సభను ఘనంగా నిర్వహించారు.. ఏరుదాటాక తెప్ప తగలేశారు. ప్రభుత్వ కార్యక్రమం కోసం చక్కగా ఉన్న స్టేడియాన్ని మట్టిదిబ్బగా మార్చారు. సీఎం సభ ముగిశాక పట్టించుకోవడం మానేశారు. ముఖ్యమత్రి సభకోసం ట్రాక్‌ను తవ్విపోసిన అధికారులు .. అడ్రస్‌లేకుండా పోయారు. నడవడానికి కూడా వీలుకానంతగా  మారిపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. కరీంనగర్‌లో ఉన్న అంబేద్కర్‌ స్టేడియం దుస్థితిపైటెన్‌టీవీ ఫోకస్‌.

ఇక్కడ మీరు చూస్తున్నది కరీంనగర్‌ పట్టణంలోని అంబేద్కర్‌ స్టేడింయం. గత జూలై నెలవరకు అన్ని సౌకర్యాలతో కళకళ్లాడిని స్టేడియం ప్రస్తుతం.. ఎలుకలు తోడిన దిబ్బలా తయారైంది. హరితహారం రెండో విడత సందర్భంగా  అధికారులు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చక్కగా తీర్చిదిద్దిన రన్నింగ్‌ ట్రాక్‌ను ముఖ్యమంత్రి సభకోసం తవ్విపోశారు. 

సీఎం కేసీఆర్‌ వచ్చారు.గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహించారు. హరితహారంలో ప్రజలందరూ బాధ్యతగా పాల్గొని మొక్కలు నాటాలని లెక్చర్‌ ఇచ్చారు. అంతా బాగానే ఉన్నా.. కార్యక్రమం ముగిన తర్వాత.. ఇదిగో ఇలా వదిలేశారు. క్రీడాకారుల ప్రాక్టీస్‌కు ఏమాత్రం పనికిరాని విధంగా మట్టిదిబ్బలను ఇలాగే వదిలేశారు. ఫలితంగా వర్షాలు పడుతుండటంతో స్టేడియం మొత్తం బురదమయంగా మారింది.  కనీసం నడవడానికి కూడా వీలుకానంతగా స్డేడియం మొత్తాన్ని తవ్విపోశారని క్రీడాకారులు వాపోతున్నారు.  

నిజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడలకు ...క్రీడకారులకు పుట్టిల్లు...ఎంతో మంది క్రీడకారులు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు.  ఆ లెవల్లో ఇక్కడ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేసేవారు. కాని ప్రభుత్వ నిర్వాకంతో ప్రస్తుతం మైదానంలోకి అడుగుపెట్టడానికే వీలు లేకుండా పోయింది. ఇంతకు మందు ఈ స్టేడియంలో  ప్రతిరోజూ వందలాది మంది వచ్చి ప్రాక్టీస్‌చేసే వారు. ప్రస్తుతం మైదనాం మొత్తం అస్తవ్యస్థంగా మారడంతో వాకర్స్‌కూడా అడుగుపెట్టలేక పోతున్నారు.  

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని..  ట్రాక్‌ను పూర్తిస్తాయిలో పురుద్ధరించాలని కరీంనగర్‌ క్రీడాకారులు కోరుతున్నారు. 

పార్కింగ్ విధానంపై పూర్తి వివ‌రాలు కోరిన బ‌ల్దియా క‌మిష‌న‌ర్

హైదరాబాద్‌ : నగరంలో పార్కింగ్ దోపిడిపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. బ‌ల్దియా క‌మిష‌న‌ర్ పార్కింగ్ విధానంపై పూర్తి వివ‌రాలు కోరారు. ప్రస్తుతం ప్రైవేటు మాల్స్, క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌ల‌లో... య‌జమానులు ముక్కుపిండి ఫీజు వ‌సూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం... వాణిజ్య భ‌వ‌నాల్లో  44శాతం పార్కింగ్ త‌ప్పనిసరిగా ఉండాలి.. కానీ దానిని కూడా కమర్షియల్ గా వినియోగించుకుంటూ.. పార్కింగ్‌ వసూళ్లు చేస్తున్నారు. 

 

20:18 - August 31, 2017

హైదరాబాద్‌ : నగరంలో పార్కింగ్ దోపిడిపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. బ‌ల్దియా క‌మిష‌న‌ర్ పార్కింగ్ విధానంపై పూర్తి వివ‌రాలు కోరారు. ప్రస్తుతం ప్రైవేటు మాల్స్, క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌ల‌లో... య‌జమానులు ముక్కుపిండి ఫీజు వ‌సూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం... వాణిజ్య భ‌వ‌నాల్లో  44శాతం పార్కింగ్ త‌ప్పనిసరిగా ఉండాలి.. కానీ దానిని కూడా కమర్షియల్ గా వినియోగించుకుంటూ.. పార్కింగ్‌ వసూళ్లు చేస్తున్నారు.

 

20:16 - August 31, 2017

హైదరాబాద్ : నగరంలోని విక్టోరియా మెమోరియల్ ట్రస్టు భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య. ఆ ప్రాంతాన్ని రెసిడెన్షియల్ పాఠశాలకు ఉపయోగించాల్సిందిగా ఆయన ప్రభుత్వానికి సూచించారు. విక్టోరియా మెమోరియల్ ట్రస్ట్ భూముల పరిరక్షణ కోసం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ ఎంల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్ధులు హాజరయ్యారు. 

 

20:13 - August 31, 2017

అర్జున్ రెడ్డి మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డితో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మూవీ విశేషాలు తెలిపారు. తన సినీ అనుభవాలను వివరించారు. పలువురు కాలర్స్ ఫోన్ చేసి, ఆయనతో మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

19:44 - August 31, 2017
19:40 - August 31, 2017

రూఫ్ గార్డెన్ పై మానవి ఫోకస్ లో వివరించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

పీఎస్ ఎల్ వీ సీ 39 రాకెట్ ప్రయోగం విఫలం

నెల్లూరు : పీఎస్ ఎల్ వీ సీ 39 రాకెట్ ప్రయోగం విఫలమైంది. పీఎస్ ఎల్ వీ సీ 39 రాకెట్ నుంచి హీట్ షీల్డ్ వేరుపడలేదు. వైఫల్యానికి కారణాలను ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

 

18:36 - August 31, 2017

భద్రాద్రి కొత్తగూడెం : ఒకప్పుడు న్యూడెమోక్రసీకి కంచుకోటగా వున్న ఇల్లెందు నియోజవకర్గం గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. కానీ, ఆ పార్టీ ఎమ్మెల్యే కారు ఎక్కి, గులాబీ గూటిలో చేరిపోయారు. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా వున్న ఇల్లెందు నియోజకవర్గం ఇప్పుడు మూడు జిల్లాల్లో అంతర్భాగమైంది. ఇన్ని విశిష్టతలున్న ఇల్లెందు నియోజకవర్గం ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. 

ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాల్లో విస్తరించి వుండడం విశేషం. గార్ల, బయ్యారం మండలాలు మహబూబ్ బాద్ జిల్లాలో, కారేపల్లి, కామేపల్లి మండలాలు ఖమ్మం జిల్లాలో, ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి మండలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వున్నాయి. 

ఇల్లెందు నియోజకవర్గం న్యూడెమోక్రసీకి ఒకప్పుడు కంచుకోటగా వుండేది. ఆ పార్టీ నేత గుమ్మడి నర్సయ్య అయిదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.   ఇల్లెందులో 1972  నుంచి వరుసగా ఓడిపోతున్న కాంగ్రెస్  గత ఎన్నికల్లో సునాయస విజయం సాధించింది. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య కొద్దిరోజులకే టిఆర్ఎస్ లో చేరారు. దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ప్రియ శిష్యుడిగా పేరొందిన కనకయ్య ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా కొనసాగుతున్నారు. 

ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య నాలుగు కోట్ల రూపాయలు తీసుకుని టిఆర్ ఎస్ కు అమ్ముడుపోయారన్నది కాంగ్రెస్  విమర్శ. అయితే తాను మాత్రం నియోజకవర్గ అభివృద్ధి కోసమే టిఆర్ ఎస్ లో చేరానంటున్నారు కనకయ్య. 

నియోజకవర్గంలోని రోళ్లపాడు ప్రాజెక్టు దగ్గర సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చి శంకుస్థాపన చేయడం, 476 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పథకాలు సాధించుకోవడం కనకయ్య సాధించిన విజయాలుగా చెబుతుంటారు. 

కోయగూడెం కోల్ మాఫియాతో అక్రమ సంబంధాలున్నాయన్నది కోరం కనకయ్యపై వున్న ప్రధాన ఆరోపణ. కోయగూడెం ఓసిలో లారీల ట్రాన్స్ పోర్టు వివాదం చాలాకాలంగా రగులుతోంది. 2004 నుంచి సిండికేట్ కోల్ ట్రాన్స్ పోర్ట్ దందా సాగుతోంది. ఈ వివాదాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లడం వల్లనే గిట్టనివాళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నది కనకయ్య జవాబు. 

అభివృద్ధి పనుల్లో 5 నుంచి 10 శాతం పర్సంటేజీలు తీసుకుంటారన్నది ఇల్లెందు ఎమ్మెల్యేలపై వున్న మరో ఆరోపణ. పోలీస్ స్టేషన్లలో, ప్రభుత్వ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో ఆయన అనుచరవర్గం పైరవీల దందాలు సాగిస్తోందన్న ఫిర్యాదులున్నాయి. మధ్యతరగతికి చెందిన కనకయ్య ఇప్పుడు బాగా సంపాదించారన్న టాక్ వినిపిస్తోంది. అయితే, తాను తిరిగే ఫార్చునర్ కారును సన్నిహిత మిత్రులు ఇప్పించినట్టు చెబుతున్నారు కనకయ్య.

ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం మండలాలు ఖనిజ సంపదకు ప్రసిద్ధి. బయ్యారంలో అపారమైన ఇనుప ఖనిజ నిల్వలుండగా, గార్లలో బైరైటిస్ నిల్వలున్నాయి. బయ్యారంలో మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులున్నాయి. ఇల్లెందులో బొగ్గు నిల్వలు, బయ్యారంలో నీరు, రవాణా సౌకర్యాలు, ఐరన్ ఓర్ లభిస్తుండడంతో ఉక్కు కర్మాగారం నిర్మించడానికి అవకాశాలున్నాయి. అయితే, బయ్యారం, గార్ల మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలుపుతున్నా టిఆర్ఎస్ నేతలు నోరుమెదపలేదన్న విమర్శలున్నాయి. 

ఇల్లెందులో మంచినీటి సమస్య తీవ్రంగా వుంది. బ్రిటీష్ కాలం నాటి చెరువు, కోటి లింగాల ధార ఉన్నప్పటికీ తాగునీటి కష్టాలు తప్పడం లేదు. చెరువులో పూడికతీత పేరుతో కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇల్లెందులో రైతు బజారు లేకపోవడం మరో లోపం. ఇల్లెందులో 30 పడకల ఆస్పత్రి వున్నా అక్కడ సౌకర్యాలు లేవు. ఇవన్నీ ఎమ్మెల్యే కోరం కనకయ్య పనితీరు పై నియోజకవర్గ ప్రజల్లో అసంతృప్తి రాజేస్తున్నాయి. 

1929లో  బ్రిటీషోళ్ల కాలంలో ఏర్పాటు చేసిన  ఇల్లెందు రైల్వే స్టేషన్ 2015లో పూర్తిగా మూతపడింది. 2006 నుంచి ఉన్న ఒక్క ప్యాసెంజర్ రైలూ రద్దయ్యింది. రైలు పునరుద్ధరణ కోసం కృషి చేస్తానంటున్న కనకయ్య హామీ నెరవేరడం లేదు.  ఓపెన్ కాస్ట్ గనులతో ఇల్లెందు బొందలగడ్డగా మారుతుండడం, సీతారామ ప్రాజెక్టు కింద భూములు, ఇళ్లు కోల్పోయినవారికి పరిహారం అందకపోవడం, ఓపెన్ కాస్ట్ నిర్వాసితుల్లో ఇంకా కొందరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందకపోవడం ఎమ్మెల్యే కనకయ్యకు ప్రతికూలాంశాలుగా మారుతున్నాయి. 

18:03 - August 31, 2017

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనం పూర్తిగా నిర్మూలన అయిందని ఎవరూ చెప్పడం లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. రద్దయిన నోట్లన్నీ బ్యాంకుల్లోకి తిరిగి చేరాయంటే...ఆ సొమ్మంతా చట్టబద్ధమైనట్లు కాదని తెలిపారు. నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు చేయడం వల్ల ప్రత్యక్ష పన్నుల ఆదాయం పెరిగిందని చెప్పారు. దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని జైట్లీ తెలిపారు. రద్దయిన పెద్దనోట్లలో దాదాపు 90 శాతం బ్యాంకింగ్‌ వ్యవస్థలో చేరాయని ఆర్బీఐ బుధవారం ఆర్బీఐ ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణమని ప్రతిపక్షాలు విమర్శించాయి.

 

17:59 - August 31, 2017

మహారాష్ట్ర : భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆర్థిక రాజధాని ముంబై క్రమంగా కోలుకుంటోంది. మంగళవారం కురిసిన భారీవర్షాలకు గల్లంతైన ఏడుగురిలో డాక్టర్‌ మృతదేహం లభించింది. డాక్టర్‌ దీపక్‌ అమరాపుర్కర్‌ మృతదేహం వర్లీలోని నాలా వద్ద లభించింది. దాదర్‌లోని మాట్‌కర్‌ రోడ్డులో డాక్టర్‌ దీపక్‌ అమరాపుర్కర్‌ మ్యాన్‌హోల్‌లో పడిపోయిన విషయం తెలిసిందే. డాక్టర్ ఆసుపత్రి నుంచి ఇంటికి వరద నీటిలో నడచి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన పట్టుకున్న గొడుగు ఆధారంగా గుర్తించారు.  ప్రసిద్ధి చెందిన గ్యాస్ట్రో ఎంట్రాలాజిస్ట్‌లలో దీపక్‌ అమరాపుర్కర్‌ ఒకరు. ముంబై వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 15కు చేరింది. వర్షాలకు రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. ముంబైలో ఈ దుస్థితి ఏర్పడడానికి నగర పాలక సంస్థ బిఎంసియే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు.

 

17:58 - August 31, 2017

హైదరాబాద్ : నదుల పరిరక్షణ కోసం కేరళకు చెందిన ఈశా స్వచ్ఛంద సంస్థ నడుం బిగించింది. ఈ మేరకు వినూత్న రీతిలో ప్రదర్శనలు చేస్తూ... ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా  శుక్రవారం నుంచి దేశంలోని పలు నగరాల్లో ప్ల కార్డులతో ప్రదర్శన నిర్వహించబోతున్నామంటున్న ఈశా ఫౌండేషన్ నిర్వాహకులతో 10 టివి ఫేస్‌ టూ ఫేస్‌...నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:46 - August 31, 2017

చత్తీస్ ఘడ్ : ఆ ఊళ్లో తాగేందుకు గుక్కెడు నీళ్లు లేని దయనీయ స్థితి. మంచినీళ్ల కోసమే రోజుల తరబడి వేట. దప్పిక తీరాలంటే కిలోమీటర్లు నడవాల్సిందే. వాగులు, వంకల్లో నీటి చెలిమెలను ఒడిసిపట్టుకోవాల్సిందే. కరువు రక్కసి దాడిచేయడంతో జనమే కాదు.. మూగజీవాలూ అల్లాడిపోయాయి. చుక్క నీరు లేక తల్లడిల్లుతున్న పల్లెజనుల దాహార్తిని ఓ బాలుడు తీర్చాడు. ఊరిజనం కష్టాలను ఆ పిల్లాడు ఎలా తీర్చాడో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ కథనాన్ని చూసేయండి.. 

తల్లిదండ్రుల మోక్షప్రాప్తి కోసం ఆనాటి భగరథుడు ఆకాశగంగను భువిపైకి తీసుకొస్తే.. ఊరి జనం దాహార్తి తీర్చేందుకు ఈనాటి భగీరథుడు పాతళగంగను పైకి తెచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు 27 ఏళ్లు మొక్కవోని దీక్షతో జలయజ్ఞం చేశాడు. ఒక్కడే చెరువును తవ్వి చివరకు అనుకున్నది సాధించాడు. 

అతడి లక్ష్యం అనితరసాధ్యం. ఒక్కడే 27 ఏళ్ల పాటు సాగించిన భగీరథ ప్రయత్నం చివరకు ఫలించింది. సొంత ఊరి కోసం అలుపెరగని శ్రమదానం చేసిన ఇతనే శ్యామ్‌ లాల్‌. సొంత ఊరు చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం కోరియా జిల్లాలోని సాజా పహడ్‌ గ్రామం. కోరియా జిల్లా చత్తీస్‌ఘడ్‌లో అత్యధికంగా నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రాంతం. కరువు రక్కసి కోరలు చాచడంతో..తాగునీటి కోసం జనమేకాదు.. మూగజీవాలు అల్లాడిపోయాయి. గుక్కెడు నీటి కోసం సాజా పహడ్‌ ప్రజలు అష్టకష్టాలు పడుతూ కిలోమీటర్ల మేర పరుగులు తీశారు. 15 ఏళ్ల ప్రాయంలో ఉన్న శ్యామ్‌లాల్‌.. ఊరిజనం నిత్యం పడుతున్న నీటి కష్టాలను చూసి చలించిపోయాడు. ఊరి చివర్లో చెరువు తవ్వాలనే ఆలోచనతో ముందుకు కదిలాడు. 

సాజాపహడ్‌లో నీటి ఎద్దటి తాండవిస్తున్నా ప్రభుత్వం తరఫు నుంచి పట్టించుకునే నాథుడే లేడు. గ్రామ ప్రజల దుస్థితి శ్యామ్‌ను కదిలించింది. అయితే శ్యామ్‌ ఆలోచనకు గ్రామంలో ఎవరూ మద్దతు ఇవ్వలేదు. అంతేకాకుండా ఆ ఆలోచనను విరమించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. అయినా, తన ఆలోచనను విరమించుకోని శ్యామ్‌లాల్‌.. తనొక్కడే రోజు కొంతభాగం చెరువును తవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా గ్రామ పొలిమేర్లలో ఓ ప్రాంతాన్ని ఎన్నుకుని తవ్వకాన్ని ప్రారంభించాడు. రోజూ తన జీవనం కోసం పనికి వెళ్లొచ్చిన అనంతరం... చెరువు కోసం 27 ఏళ్లుగా శ్రమదానం చేస్తూ వచ్చాడు శ్యామ్‌.

మొత్తానికి 27 ఏళ్ల శ్రమదానానికి ఫలితం దక్కింది. వర్షాలు కురిసిన సమయంలో చెరువులోకి నీరు భారీగా వచ్చి చేరుతోంది. సాజాపహడ్‌ వాసులు చెరువు నీటిని అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఛత్తీస్‌ఘడ్‌ మహేందర్‌ఘడ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్యామ్‌ బిహారి జైస్వాల్‌..శ్యామ్‌లాల్ శ్రమను గుర్తించి 10 వేల నగదును అందజేశారు. జిల్లా కలెక్టర్‌ కూడా శ్యామ్‌లాల్‌కు తగిన ప్రోత్సాహం అందిస్తామని భరోసా ఇచ్చారు. మొత్తానికి మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు.. శ్యామ్‌లాల్‌. గ్రామ ప్రజల కష్టాలు తీర్చేందుకు ఈ అపర భగీరథుడు చేసిన ప్రయత్నం.. అందరికీ స్ఫూర్తి దాయకం. 

యువకుల పోకిరీ చేష్టలు భరించలేక రైలు నుంచి దూకేసింది..

ప్రకాశం : చెన్నై నుండి నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ లో ఉత్తరాది యువకుల పోకిరీ చేష్టలు భరించలేక రైలు నుంచి అజ్మిల్ అనే యువతి దూకింది. ఈ ఘటన సింగరాయకొండ స్టేషన్ వద్ద చోటు చేసుకింది. తీవ్రగాయాలైన యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన జీఆర్సీ పోలీసులు విచారణ చేపట్టారు. అజ్మిల్ చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తోంది. యువతిని వేధించిన ముగ్గురు యువకులను బెజవాడ స్టేషన్ లో రైల్వే పోలీసులు పట్టుకున్నారు.

క్రికెటర్ అంబటిరాయుడు వీరంగం...

హైదరాబాద్: క్రికెటర్ అంబటి రాయుడు వీరంగం సృష్టించాడు. హబ్సీగూడలోని జన్ పాక్డ్ కాలనీలోసీనియర్ సిటిజన్ పై అంబటి రాయుడు చేయిచేసుకున్నాడు. ర్యాష్ డ్రైవింగ్ తో సీనియర్ సిటిజన్ కు రాయుడి కారు తాకింది. నెమ్మదిగా వెళ్లమని చెప్పిన సీనియర్ సిటిజన్ పై దౌర్జాన్యానికి దిగాడు.

అర్జున్ రెడ్డి సినిమా బ్యాన్ చేయాలి: మహిళా సంఘాలు..

విజయవాడ: అర్జున్ రెడ్డి సినిమా బ్యాన్ చేయాలని రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. థియేటర్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించాయి. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన కారుల్ని అడ్డుకుని పలువురిని అరెస్ట్ చేశారు.

76 బంతుల్లో సెంచరీ చేసిన కోహ్లీ...

కొలంబో: నాలుగో వ‌న్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచ‌రీ చేశాడు. అత‌ను కేవ‌లం 76 బాల్స్‌లోనే 14 ఫోర్లు, ఓ సిక్స్‌తో వ‌న్డేల్లో 29వ సెంచ‌రీ పూర్తి చేశాడు. క్రీజులో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచీ లంక బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డిన విరాట్.. బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. 6 ప‌రుగుల‌కే ధావ‌న్ (4) రూపంలో తొలి వికెట్ కోల్పోయినా.. త‌ర్వాత వ‌చ్చిన కోహ్లి లంక బౌల‌ర్ల‌ను ఆటాడుకుంటున్నాడు. కేవ‌లం 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన విరాట్‌.. మ‌రో 38 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్నాడు. అటు రోహిత్ కూడా అదే రేంజ్‌లో చెల‌రేగుతున్నాదు. అత‌ను కూడా కేవ‌లం 45 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేశాడు.

బెజీర్ భుట్టో హత్య కేసులో ముషారఫ్ ప్రధాన ముద్దాయి...

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు షర్రఫ్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి బేనజీర్ భుట్టో 2007 డిసెంబరు 27న రావల్పిండిలో జరిగిన హత్య కేసులో నిందితుడైన ముషర్రఫ్ దేశం నుంచి పరారీ అయినట్లు కోర్టు ప్రకటించింది. ఆయనను ప్రకటిత నేరస్థుడిగా పేర్కొంది. బేనజీర్ హత్యకు జరిగిన కుట్ర వివరాలు ముషర్రఫ్‌కు తెలుసునని, ఆమె హత్యలో ఆయన పాత్ర ఉందని కోర్టు నిర్ధారించింది. బేనజీర్ హత్యకేసులో మరో ఐదుగురు నిందితులు నిర్దోషులని పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు నిర్థారించింది.

16:05 - August 31, 2017

హైదరాబాద్ : ముస్లిం సోదరుల పండగల్లో బక్రీద్‌ ఎంతో ప్రత్యేకమైనది. ఈ పండగను ఈదుల్, అజహా, ఈ దుజ్జహో, బక్రీద్ అని అంటారు. ఇస్లాం మతం ఆచారం ప్రకారం బక్రీద్ రోజు మేకలు, పొట్టేల్లను ఖుర్బానీ చేయడం ముస్లింల సంప్రదాయం. దీంతో మేకలు, గొర్రెలు, పొట్టేల్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. 
చురుగ్గా బక్రీద్‌ పండగకు ఏర్పాట్లు 
బక్రీద్‌ పండగకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. భాగ్యనగరంలోని మసీదులు, ఈద్గాలు సుందరంగా ముస్తాబయ్యాయి. బక్రీద్ పండగ రోజు ఇచ్చే ఖుర్బానీకి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే మేకలు, గొర్రెలు, పొట్టేల్లు నగరానికి విచ్చేశాయి. చార్మినార్, సైదాబాద్, చంచల్‌గూడ, ఖర్బలా మైదాన్, మెహదీపట్నం, టోలీచౌకీ, నాంపల్లి, సికింద్రాబాద్, ముషీరాబాద్‌ ప్రాంతాలలో గొర్రెలు, మేకలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 
ఒంటె, మేక, గొర్రె, పొట్టేలతో ఖుర్బానీ 
బక్రీద్‌ పండగరోజు మేకలు, గొర్రెలను సంప్రదాయబద్ధంగా ఖుర్బానీ ఇచ్చేందుకు.. ముస్లింలు వాటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో నగరం ఒక్కసారిగా సందడిగా మారింది. ఇస్లాంలోని 5 ప్రధాన సూత్రాలలో ఒకటైన తరంజాన్‌లాగే బక్రీద్ పండగను కూడా ఖుద్బాతో ఈద్గాలో సామూహిక ప్రార్థనలు జరుపుతారు. తరవాత ఒంటె, మేక, గొర్రె, పొట్టేల్లను ఖుర్బానీ చేస్తారు. అంటే అల్లాకు బలిస్తారు. 
మనిషి త్యాగ నిరతిని తెలిపే పండగ బక్రీద్ 
ఈదుల్‌ జుహా మనిషి యొక్క త్యాగ నిరతిని గురించి తెలియజేసే పండగ బక్రీద్. అందుకే దీనిని త్యాగాల పండగ అని కూడా అంటారు. దీన్ని బక్రీద్ అని పిలుస్తారు. అయితే బక్రీద్ పండగ రోజు బలిచ్చే మేకలు, గొర్రెలను కొనుగోలు చేస్తూ.. వారం రోజుల ముందు నుంచే ముస్లింలు బిజీ అయ్యారు. గతేడాదితో పోలిస్తే మేక, పొట్టెల్లు, గొర్రెల ధరలు చుక్కలు చూపుతున్నాయి.
రూ. 6 వేల నుంచి రూ. 15 వేలు 
ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి గొర్రెలు, మేకలు దిగుమతి అయ్యాయి. ధరలు ఎక్కువగా ఉన్న సాధారణ రకం స్థాయి మేక నుంచి గొర్రెలు, పొట్టెల్ల ధరలు 6 వేల నుంచి 15 వేల వరకు పలుకుతున్నాయి. తెలంగాణలో పలు చోట్ల నుంచి అధిక సంఖ్యలో యాదవులు వస్తుంటారు. అమ్మకాలు జరిపే ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో గొర్రెల పెంపకందారులు.. దళారులు అడిగినంతకు అమ్మి తిరిగి ఊళ్లకు పయనమవుతున్నారు.
చుక్కలు చూపుతున్న జంతువుల ధరలు  
బక్రీద్ పండగ సందర్భంగా జంతువుల ధరలు చుక్కలు చూపుతున్నాయి. పెరిగిన ధరలు ముస్లిం సోదరులను అసహనానికి గురి చేస్తున్నాయి. సాధారణ మేక 6 వేలు కాగా.. పొట్టేలు ధర 15 నుంచి 20 వేల ఖరీదు ఉండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఒంటెను కూడా ఖుర్బానీ ఇవ్వడంతో వీటి ధరలు గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగాయి. అయితే కొందరు గొర్రెల అమ్మకందారులు బక్రీద్ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని.. నగరవాసులను ఆకర్షించేందుకు ప్రధాన సెంటర్లలో ఆఫర్ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. 

 

కర్ణాటక సీఎంను కలవనున్న టీ.పీసీసీ బృందం

హైదరాబాద్ : రేపు కర్ణాటక సీఎం ను తెలంగాణ కాంగ్రెస్ బృందం కలవనుంది. ఈ బృందంలో ఉత్తమ్, జానా, షబ్బీర్, మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు. పాలమూరు జిల్లా నీటి అవసరాల కోసం నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు 15 టీఎంసీల నీరు విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు కోరనున్నట్లు సమాచారం. ఆర్డీఎస్ స్పిల్ వే పనులను వేగవంతం చేయాలని కోరనున్నారు.

'ఏపీలో మరో లక్షా 45 వేల ఇళ్లకు ఉత్తర్వులు'

అమరావతి: రాష్ట్రంలో 98 వేల ఇళ్ల నిర్మాణాల పూర్తికి అధికారులను ఆదేశించినట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. సెప్టెంబర్ 2 నాటికి లక్ష గృహాలకు గృహప్రవేశ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏపీలో మరో లక్షా 45 వేల ఇళ్లకు ఉత్తర్వులు మంజూరు చేశామన్నారు. లబ్ధిదారుల సమస్యలపై మాట్లాడేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ 1100 ఏర్పాటు చేశామన్నారు.

'మెగా డీఎస్సీ కోసం కేయూ నుంచి ఓయూ వరకు పాదయాత్ర'

వరంగల్: మెగా డీఎస్సీ కోసం సెప్టెంబర్ 5న కేయూ నుంచి ఓయూ వరకు పాదయాత్ర చేపడతామని విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ మానవతారయ్ హెచ్చరించారు. డీఎస్సీ కోసం ఆత్మహత్య రామకృష్ణ కుటుంబానికి రప. 50లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

15:42 - August 31, 2017

రంగారెడ్డి : పోలీసుల చిత్ర హింసలతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తాండూర్ కు చెందిన క్రిస్టోఫర్ గత నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే క్రిస్టోఫర్ కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడని సరూర్ నగర్ పోలీసులకు అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేశారు. క్రిస్టోఫర్ పై 498, 307 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 498 కేసులో మూడురోజులుగా క్రిస్టోఫర్ ను విచారిస్తున్న పోలీసులు క్రిస్టోఫర్ ను చిత్రహింసలు పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కొడుతున్నారన్న భయంతో రాచకొండ కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రన్నింగ్ బస్ ముందు క్రిస్టోఫర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అతని కాలికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఓమ్ని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ...

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో కోహ్లీ కేవలం 38 బంతుల్లోనే 9 ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ధవన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ వచ్చీ రావడంతోనే బాదుడు మొదలుపెట్టాడు. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. కోహ్లీ 51, రోహిత్ శర్మ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.

15:20 - August 31, 2017

గ్రేట్‌ అమెరికన్ సోలార్‌ ఎక్లిప్స్ రోజున క్లిఫ్‌ డైవర్లు హెలెనా మెర్టెన్‌, ఓర్లాండో డ్యూకే, డేవిడ్‌ కోల్టురీ, యాండీ జోన్స్... చేసిన హై డైవింగ్‌ స్టంట్‌ ప్రస్తుతం ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌ వరల్డ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

15:17 - August 31, 2017

మహారాష్ట్ర : ముంబై ఐదు అంతస్తుల భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. బిండి బజార్‌లో అకస్మాత్తుగా ఈ భవనం కుప్పకూలింది.. ఈ ఘటనలో పదిమంది చనిపోగా..... 16మందికి గాయాలయ్యాయి... మృతదేహాలను బయటకుతీసిన ఎన్ డీఆర్ ఎఫ్ సిబ్బంది... వారి బంధువులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు.. శిథిలాల కింద చిక్కుకున్న పదిహేను మందిని రెస్క్యూ టీం బయటకు తీసింది.. శిథిలాలకింద చిక్కుకున్నవారిని బయటకుతీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

 

15:13 - August 31, 2017

టెక్నాలజీ..రోజు రోజుకు మారుతోంది. కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోంది. అందులో సెల్ ఫోన్ ఒకటి. సెల్ ఫోన్ లేని వ్యక్తి ఈ రోజుల్లో లేడనే చెప్పుకోవచ్చు. మనిషికి నిత్యావసరాల్లో సెల్ ఫోన్ ఒక భాగమై పోయింది. మాట్లాటడానికి..క్షేమ సమాచాలు తెలుసుకోవడానికి ఫోన్లు అవసరమే కానీ ఇంటరెన్నట్ పుణ్యమా అని రకరకాల వీడియోలు..గేమ్స్..యాప్ లు ప్రపంచాన్నే మార్చేశాయి. కానీ ఈ సెల్ ఫోన్ సంసార జీవితాల్లో చిచ్చు రేపుతున్నాయి. తాజాగా ఫోన్‌ కాల్స్ పై భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని భార్య నిప్పంటించుకుంది. కాలిన గాయాలు ఎక్కువగా ఉండడంతో ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. ఈ ఘటన తాటిపల్లిలో చోటు చేసుకుంది.

రక్త సంబంధాలు..భార్య..భర్తల మధ్య అనురాగానికి..ఆత్మీయతల నడుమ సెల్ ఫోన్ వచ్చి చేరింది. దీనితో వారి సంసారిక జీవితంలో ఏదో ఒక గొడవ చెలరేగుతోంది. అనేక విబేధాలకు, అపోహలకూ కారణమవుతున్న సెల్‌ఫోన్ల నుండి విముక్తి లేదా ? ఈ మధ్యకాలంలో అనేకమంది దంపతులు సాంకేతిక పరికరాలకు సంబంధించిన సమస్యలతోనే తమ వద్దకు వస్తున్నారని ప్రముఖ మానసిక వైద్యులు పేర్కొంటున్నారు.

తరచూ స్నేహితులను కలవడం..శుభకార్యాలకు..విహార యాత్రలపై ఆసక్తి సన్నగిల్లుతోంది. ఒకే ఇంట్లో నలుగురు ఉంటే ఆ నలుగురి వద్ద సెల్ ఫోన్ ఉంటోంది. వీరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొనే సందర్భాలు తక్కువగా ఉంటున్నాయి. మానవ సంబంధాలు తగ్గిపోవడం..ఒంటరి తనానికి దారి తీస్తుంది. అంతేగాకుండా ఆత్మహత్యలు కూడా అధికమౌతున్నాయి. స్పీడ్ యుగంలో సాంకేతిక పరికరాల అవసరమే. దాంపత్య సంబంధాలనే విచ్చిన్నం చేస్తే ఎలా ? దీనిపై ఆలోచించి అందుకనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే వారి వారి జీవితాలు సాఫీ లేకుండా సాగిపోతాయి...

15:12 - August 31, 2017

విశాఖ : పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ప్రాణాలు పోయాల్సిన అంబులెన్స్ ప్రాణాలు తీసింది. ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రికి చేర్చాల్సిన అంబులెన్స్ ఇద్దరి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ప్రైవేట్‌ అంబులెన్సు ఢీ కోట్టడంతో.. ఓ జంట అక్కడికక్కడే చనిపోయిన ఘటన కశీంకోట మండలం, ఆనందపురంలో జరిగింది. ప్రైవేట్ ఆంబులెన్సు అదుపుతప్పి రోడ్డుపై నిలుచున్న భార్యభర్తలను ఢీ కొట్టడంతో.. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

 

14:58 - August 31, 2017

ఖమ్మం : తొలి నుండి వివాదాల సుడిగుండంలో కొట్టు మిట్టాడుతున్న అర్జున్‌ రెడ్డి సినిమా.. ఖమ్మం వేదికగా మరోసారి వివాదానికి తెరలేపింది. అసలు కథ ఏమిటి? ఆ కథను ఎలా కాపీ కొట్టారో తెలుసుకునేందుకు.. కథా రచయితతో 10టివి ఫేస్‌ టూ ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా రచయిత పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. తన సినిమాను కాపీ కొట్టారని పేర్కొన్నారు. తన కథకు బూతులు జత చేసి అర్జున్ రెడ్డి సినిమా తీశారని ఆరోపించారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

సందిగ్ధంలో కేంద్ర కేబినెట్ విస్తరణ

ఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణ ఇప్పట్లో కష్టమే అని తెలుస్తోంది. రేపటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రపతి ఏపీ పర్యటనకు రానున్నారు. 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రపతి ఏపీ పర్యటనతో కేబినెట్ విస్తరణ సందిగ్ధంలో పడింది. సెప్టెంబర్ చివరి వారంలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

భూ రికార్డుల ప్రక్షాళన, సరళీకరణ కోసం నిధులు మంజూరు...

హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన, సరళీకరణ కోసం17 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మినహా 30 జిల్లాలకు రూ. 50 లక్షల చొప్పున నిధులు మంజూ రు అయ్యాయని, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనాకు రూ. కోటి, భూ రికార్డుల ఆధునీకరణ మిషన్ డైరెక్టర్ కు రూ. కోటి విడుదల చేసినట్లు తెలిపారు.

14:43 - August 31, 2017

హైదరాబాద్ : తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన, సరళీకరణ కోసం నిధులు విడుదల అయ్యాయి. భూ రికార్డుల ప్రక్షాళన, సరళీకరణ పనుల కోసం 17 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ మినహా 30 జిల్లాలకు 50 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి కోటి, భూ రికార్డుల ఆధునీకరణ మిషన్ డైరెక్టర్‌కు కోటి విడుదల చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ప్రభుత్వం తీసుకున్న భూములు ఇంకా రైతుల వద్దే: సీఎం కేసీఆర్

హైదరాబాద్: రైతుల దగ్గర నుంచి వివిధ పనుల కోసం ప్రభుత్వం లక్షలాది ఎకరాలు సేకరించిందని కేసీఆర్ అన్నారు. రైల్వే ప్రాజెక్టులు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, ఆస్పత్రులు, కాలువలు నిర్మించడానికి వ్యవసాయ భూములు తీసుకున్నామని.. కానీ ఈ వివరాలు రికార్డుల్లో నమోదు కాలేదన్నారు. ఇంకా ఆ భూములు రైతుల వద్దే ఉన్నట్లు రికార్డుల్లో ఉందని తెలిపారు. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, భూముల విషయంలో స్పష్టత రావాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

అస్తవ్యస్తంగా భూ రికార్డుల నిర్వహణ : కేసీఆర్

హైదరాబాద్: ఎకరాకు రెండు పంటలు పెట్టుబడికి గాను ఏడాదికి రూ. 8వేలు పెట్టుబడిని రైతుల అకౌంట్ లో వేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే భూములన్న రైతులెవరు అని లెక్కలు తీస్తే రెవెన్యూ రికార్డుల్లో ఒకలా, వ్యవసాయశాఖ రికార్డుల్లో మరొకలా ఉన్నాయని తెలిపారు. భూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం వల్లే ఈ సమస్య తలెత్తిందని, ఇపుడు ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో తేల్చి భూ హక్కులపై స్పష్ట ఇవ్వాలన్నారు.

వచ్చే 3 నెలలు భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రాధాన్యం :కేసీఆర్

హైదరాబాద్: ప్రగతి భవన్ లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... భూ రికార్డుల ప్రక్షాళన, సరళీకరణ పై చర్చించినట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉండే రెవన్యూ అధికారులు తమ ప్రాథమిక విధి అయిన భూముల నిర్వహణను నిర్లక్ష్యం చేయాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు. భూ రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వివాదాలకు, గందరగోళానికి, ఘర్షణలకు దారితీసిందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.

14:27 - August 31, 2017

నగరం...ఒక్కో నగరానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది..ముంబై..హైదరాబాద్..ఢిల్లీ..కోల్ కతా...బెంగళూరు..ఇలా దేశంలో ఎన్నో నగరాలు..అభివృద్ధి దిశగా నగరాలు ముందుకెళుతున్నాయంటూ ఆయా రాష్ట్ర పాలకులు చంకలు గుద్దుకుంటుంటారు. ఈ నగరాలన్నీ జిగేల్..జిగేల్ మంటు వెలుగుతుంటాయి. కానీ ఈ నగర పరిస్థితి ఒక్క 'వాన' చెప్పేస్తుంది. కుంభవృష్టి పడితే దేశంలోని పలు నగరాల పరిస్థితులు దయనీయంగా మారుతుంటాయి. ముంబైలో కురుస్తున్న భారీ వర్షం నగరాల పరిస్థితులపై దృష్టి మళ్లింది.

చెన్నై దక్షిణాది నగరాల్లో పేరొందిన నగరం. ఈ నగరంలో భవనాలు..ఐటీ కారిడార్..పరిశ్రమలు.. కోట్ల రూపాయల్లో ఎగమతులు..దిగుమతులు జరుగుతుంటాయి. కానీ ఈ చెన్నై నగరంలో ఒక్క భారీ వర్షం కురిస్తే అంతే. 2015 భారీ వర్షాలకు రూ. 32వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇక్కడ వర్షం పడితే రహదారులన్నీ చెరువులుగా మారుతాయి. హైదరాబాద్, బెంగళూరు, ఇతర నగరాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.

వర్షం పడితే నీరు ఎటు వైపు వెళ్లాలి ? వరద నీరు సాఫీగా వెళ్లేందుకు సరైన ప్రక్రియ ఉందా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ ముసుగులో అక్రమాలకు పాల్పడి చెరువులు..కాల్వలను కబ్జాలు చేసేస్తున్నారు. కాంక్రీట్ జంగిల్ గా మారిన సిటీలో నీరు ఇంకే పరిస్థితి ఉందా ? ఎన్నో ఏళ్ల నాటి డ్రైనేజీ వ్యవస్థను ఇంకా బాగుపర్చకపోవడం పాలకుల పాలనను ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరియైన ప్రణాళిక లేకుండా..ముందస్తు అవసరాలు గుర్తించకుండా వ్యవహరించడం ఒక కారణమని చెప్పవచ్చు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను మార్చడం లేదు. డ్రైనేజీల్లో పూడిక తీయడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో వరదనీరు సాఫీగా పోవడం లేదు. దీనితో రహదారులు..నివాసాల్లోకి నీరు చేరుతోంది.

లక్ష కోట్ల బడ్జెట్ అంటూ చెప్పుకుంటున్న నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమౌతున్నాయి. భారీ వర్షాలకు మహా నగరాలు చిగురుటాకులా వణికిపోవడం...కాలనీల్లోకి నీరు చేరడం అన్నది కేవలం నీరు పోవడానికి నాలాలు లేకుండా చేయడం వల్లనే అని గుర్తించాలి. నాలాల కబ్జాలను తక్షణం తొలగించాల్సి ఉంది. కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఎన్నో సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా...

కొలంబో: ఇండియా శ్రీలంక మధ్య కొలంబోలో జ‌రుగుతున్న నాలుగో వ‌న్డేలో టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది మిస్ట‌ర్ కూల్ ధోనీకి 300వ వ‌న్డే కావ‌డం విశేషం. ఈ ఘ‌న‌త సాధించిన ఆరో ఇండియ‌న్ ప్లేయ‌ర్ ధోనీ. ఈ సిరీస్‌లో మ్యాచ్‌మ్యాచ్‌కూ కెప్టెన్ల‌ను మారుస్తున్న శ్రీలంక త‌ర‌ఫున నాలుగో వ‌న్డేలో మ‌రో కెప్టెన్ బ‌రిలోకి దిగనున్నాడు. ఈసారి స్టాండిన్ కెప్టెన్‌గా మ‌లింగ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అటు ఇప్ప‌టికే సిరీస్ గెల‌వ‌డంతో టీమ్‌లో మూడు మార్పులు చేశాడు విరాట్‌. కుల్‌దీప్ యాద‌వ్‌, మ‌నీష్ పాండే, శార్దూల్ ఠాకూర్‌లు టీమ్‌లోకి వ‌చ్చారు.

కేంద్ర మంత్రివర్గంలో 9మంది ఔట్..7గురు ఇన్...!

ఢిల్లీ: శనివారం కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు జగరనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 9 మంది మంత్రులు ఉద్వాసనకు గురికాబోతున్నట్లు తెలుస్తోంది. మరో 7గురిని మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉద్వాసన పలికిన వారికి పార్టీ పదవులు ఇవ్వబోతున్నట్లు సమాచారం.

పోలీసుల దెబ్బలు తాళలేక బస్సుకింద పడి ఆత్మహత్యాయత్నం...

రంగారెడ్డి: క్రిస్టోఫర్ తాండూరులో ప్రేమ పెళ్లి వ్యవహారంలో యువకుడిని సరూర్ నగర్ పోలీసులు చితకబాదారు. పోలీసుల దెబ్బలు తాళలేక బస్సు కింద పడి బాధితుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సరూర్ నగర్ పోలీసులు కొత్త పేట, ఓమ్నీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కేసీఆర్ అవార్డు పై కాంగ్రెస్ రాద్ధాంతం సిగ్గుచేటు: జగదీష్ రెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు జాతీయ సంస్థ ఇచ్చిన అవార్డు పై కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేయడం సిగ్గుచేటు అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అవార్డులు, కాంగ్రెస్ సీఎంలకు ఎందుకు రాలేదు, మా సర్వేలు నిజమని అన్ని ఎన్నికల్లో నిరూపితమైంది అన్నారు. రైతు సమన్వయ కమిటీల ద్వారా అద్భుత ఫలితాలొస్తాయన్నారు. రైతులను ఆదుకునే చర్యలు చేపడుతుంటే కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైందని పేర్కొన్నారు. భవిష్యత్ లో కాంగ్రెస్ అసెంబ్లీలో కనిపించదన్నారు.

రాష్ట్రపతిని కలిసిన తమిళ ప్రతిపక్ష నేతలు...

ఢిల్లీ: రాష్ట్రపతి తమిళనాడు ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతిని కలిశారు.తమిళనాడు పరిస్థితులను రాష్ట్రపతికి వివరించారు. అసెంబ్లీని సమావేశ పరిధిలో బలపరీక్ష నిర్వహించేలా గవర్నర్ కు సూచించాలని రాష్ట్రపతిని కోరాం అని సీపీఎం నేత సీతారం ఏచూరిత స్పష్టం చేశారు. ఏఐఏడీఎంకు 21 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంమరించుకున్నారని రాష్ట్రపతికి తెలిపినట్లు ఆనంద్ శర్మ పేర్కొన్నారు.

కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలతో సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: ప్రగతి భవన్ లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ రికార్డుల ప్రక్షాళన, సరళీకరణ, నవీకరణపై చర్చించినట్లు సమాచారం.

13:49 - August 31, 2017

హైదరాబాద్ : అంబర్ పేట లోని తిలక్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. సెయింట్ ఆన్ హైస్కూల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 10వ తరగతి చదువుతున్న జాన్సన్ అనే విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్కూల్ ఫీజు కట్టలేదని టీసీ ఇచ్చారని స్కూలు ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థినాయకులు ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:48 - August 31, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. రెండు రోజుల్లో ఇద్దరిని బలిగొన్నది.. గాంధీ ఆస్పత్రిలో రోజుకో మరణం సంభవించడంతో జనాల్లో భయభ్రాంతులు తీవ్రమవుతున్నాయి. అసలు ఎందుకు స్వైన్‌ఫ్లూ మరణాలు సంభవిస్తున్నాయి? స్వైన్‌ఫ్లూపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని గాంధీ సూపరిండెంట్ శ్రావణ్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:33 - August 31, 2017

ఢిల్లీ : తమిళనాడులో రాజకీయ అస్థిరత చోటుచేసుకున్న ప్రతిపక్షాలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశాయి. పళనిస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినందున తక్షణమే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసేలా గవర్నర్‌ను ఆదేశించాలని ప్రతిపక్షాలు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాయి. అసెంబ్లీలో పళనిస్వామి మెజారిటీ నిరూపించుకోవాలని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. 21 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు వ్యక్తిగతంగా ప్రభుత్వానికి లేఖ రాశారని... దీంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మ అన్నారు. ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగా అధికారంలో కొనసాగే హక్కు లేనందున అసెంబ్లీ మెజారిటీ నిరూపించుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అంతర్గత సమస్యలతో అన్నాడిఎంకే పార్టీ కొట్టుమిట్టాడుతోందని...వెంటనే గవర్నర్‌ చర్యలు చేపట్టాలని సిపిఐ నేత డి.రాజా డిమాండ్‌ చేశారు. డిఎంకె, సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన నేతలు రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.

యశోద లో స్వైన్ ఫ్లూతో మరో వ్యక్తి వృతి

హైదరాబాద్: తెలంగాణ లో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. యశోద ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ప్రకాశ్ (45) జగిత్యాల కోరుట్ల వాసి అని తెలుస్తోంది. ఈరోజు ఉదయం గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ తో మహిళ మృతి చెందింది. ఈ ఏడాదిలో ఇప్పటవరకు స్వైన్ ఫ్లూతో 36 మంది మృతి చెందారు.

13:06 - August 31, 2017

బాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. హీరోలు..హీరోయిన్లు...ఆయా చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. పలువురు ప్రముఖుల జీవిత కథల ఆధారంగా పలు సినిమాలు ఇటీవలే విడుదలై బాక్సాపీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి. ఇందులో హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. అందులో 'విద్యా బాలన్' ఒకరు.

విద్యా బాలన్...వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ అభిమానుల సొంతం చేసుకుంటున్నారు. 1947లో భారత దేశ విభజన సమయంలో పంజాబ్ లో బ్రోతల్ హౌస్ నడిపిన మహిళ పాత్రపై తెరకెక్కిన 'బేగమ్ జాన్' పాత్రలో 'విద్యా' కనిపించిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో బయోపిక్ లో కనిపించబోతున్నారు. అలనాటి బాలీవుడ్ నటి 'మీనా కుమారి' బయోపిక్ తీయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పాత్ర కోసం తొలుత కంగనా రనౌత్...ప్రియాంక చోప్రాలను అనుకున్నారు. కానీ మీనా పాత్రకు కంగనా రనౌత్ సరిపోదని ఆమె సోదరుడు అభ్యంతరం చెప్పడంతో సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. మీనా కుమారి పాత్రలో విద్యా బాలన్ అయితే సరిగ్గాపోతుందని చిత్ర బృందం అనుకొంటోందంట. కానీ విద్య ఇంకా ఈ బయోపిక్ కు ఓకే చెప్పలేదని తెలుస్తోంది. ప్రస్తుతం విద్యా 'తుమారీ సులు' సినిమాలో నటిస్తోంది. మరి మీనాకుమారి బయోపిక్ లో విద్యా నటిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

13:05 - August 31, 2017

ముంబై : నగరంలోని బెండిబజార్ ఓ ఐదంస్తుల భవనం కూలింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. శిథిలాలకింద 30 మంది వరకు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వెంటనే స్పందించిన బీఎంసీ సిబ్బంది సహాయచర్యలు చేపట్టింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

ముంబై లో భవనం కూలిన ఘటనలో 10 మంది మృతి

హైదరాబాద్: ముంబై లో భవనం కూలిన ఘటనలో 10 మంది మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. మరో 11 మందిని రెస్క్యూ టీమ్ సిబ్బంది రక్షించారు. శిధిలా కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.

బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన కేంద్రంలో సాంకేతిక లోపం

చెన్నై: బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన కేంద్రంలో సాంకేతిక లోపం ఏర్పడింది. సాంకేతిక లోపంతో ఐదు రాష్ర్టాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు నిలిచిపోయాయి. నిన్న ఉదయం నుంచి అంతరాయం కొనసాగుతోంది. ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ర్టాల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది.

నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల మధ్య ఘర్షణ

కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 30 మంది విద్యార్థులను సీనియర్ విద్యార్థులు చితకబాదారు. అడ్డు వెళ్లిన ఫ్యాకల్టీలను సీనియర్లను బెదిరించారు. పోలీసుల పర్యవేక్షణలో నూజివీడు ట్రిపుల్ ఐటీ వుంది.

12:18 - August 31, 2017
12:11 - August 31, 2017

ఖద్దరు దుస్తులు అనగానే మనకు నేతలు ముందుగా గుర్తుకొస్తారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటుంటారు. రాజకీయ నేపథ్యంలో సినిమాలు కూడా రూపొందుతుంటాయి. అందులో హీరోలు కూడా ఖద్దరు దుస్తులు వేసుకుని షూటింగ్ చేస్తుంటారు. తాజాగా ప్రిన్స్ 'మహేష్ బాబు' కూడా ఖద్దరు దుస్తులు వేసుకుని షూటింగ్ లో పాల్గొన బోతున్నారంట.

'శ్రీమంతుడు' బ్లాక్ బస్టర్ అనంతరం వచ్చిన 'బ్రహ్మోత్సవం' అంతగా ఆడలేదు. మురుగదాస్ కాంబినేషన్ లో 'స్పైడర్' సినిమాలో నటిస్తున్న 'మహేష్' కొరటాల శివ చిత్రానికి కూడా సైన్ చేసిన సంగతి తెలిసిందే. 'భరత్ అనే నేను' పేరిట రూపొందుతున్న ఈ సినిమాలో 'మహేష్' ఏకంగా రాజకీయ నాయకుడిగా..ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. రాజకీయ చిత్రంలో మహేష్ నటిస్తుండడంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ సెట్ ను భారీగా నిర్మించారని అందులో మహేష్ పాల్గొంటారని తెలుస్తోంది. వచ్చే నెల నుండి 'మహేష్' ఖద్దరు దుస్తులతో చిత్రీకరణకు హాజరు కానున్నాడు. 'మహేష్' సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

డీవీవీ దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. సమాజానికి ఏదో ఒక మెసెజ్ ఇచ్చే విధంగా కొరటాల సినిమాలు రూపొందిస్తాడనే సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఇవ్వనున్నారు ? అనేది తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

12:06 - August 31, 2017

ముంబై : నగరంలోని బెండిబజార్ లో కుప్పకూలి ఐదు అంతస్తుల భవనం కూలిన సంఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పదకొండు మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. శిథిలాలకింది మరో 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

సీలేరు రిజర్వాయర్ లో పూర్తిస్థాయి నీటి మట్టం

తూ.గో: సీలేరు రిజర్వాయర్ లో పూర్తిస్థాయి లో నీటి మట్టం చేరింది. 1,037 అడుగులకు నీటి మట్టం చేరింది. 9 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చింతూరు దగ్గర 27 అడుగలకు శబరి నది నీటి మట్టం చేరింది. చింతూరు మండలంలోని లోతట్టు గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉండడంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

12:03 - August 31, 2017

యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' అభిమానులకు చేదు వార్త. 'ఎన్టీఆర్' తాజా చిత్రంపై ఆయన ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న 'జై లవ కుశ' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్  శరవేగంగా కొనసాగుతోంది. చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయా పాత్రలకు సంబంధించిన ఫొటోలు..టీజర్స్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రెండు టీజర్స్ విడుదలయ్యాయి కూడా.

ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా, నివేదా థామస్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియోను సెప్టెంబర్ 3వ తేదీన అట్టహాసంగా విడుదల చేయాలని చిత్ర బృందం యోచించింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ అకస్మాత్తుగా వేడుకను వాయిదా వేసుకున్నట్లు..ఎలాంటి ఆర్భాటం లేకుండా నేరుగా మార్కెట్ లోకి ఆడియోను విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. భారీ వర్షాలు..వినాయక నిమజ్జనోత్సవంలాంటివి ఉండడం..పోలీసు శాఖ ఇందులో నిమగ్నం అవుతుండడంతో వేడుకను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. కానీ అభిమానుల మధ్య చిత్ర ట్రైలర్ ను ఆవిష్కరించాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

గణేష్ విగ్రహాల నిమజ్జనం పై సమీక్షా సమావేశం

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గణేష్ ఉత్సవ కమిటీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

స్మార్ట్ విలేజెస్ డిజిటలైజేషన్ పై ముగిసిన సెమినార్

అమరావతి: కేఎల్ వర్శిటీలో స్మార్ట్ విలేజెస్ డిజిటలైజేషన్ పై 3 రోజుల సెమినార్ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అంతే కాకుండా కాలిఫోర్నియా యూనివర్శిటీ బర్కిలీ, కేఎల్ వర్శిటీ విద్యార్థులు పాల్గొన్నారు.

11:56 - August 31, 2017

బాలీవుడ్ అలనాటి హీరో 'సంజయ్ దత్' చాలా ఏళ్ల అనంతరం మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నాడు. ప్రస్తుతం 'భూమి' సినిమాలో నటిస్తున్న 'సంజు' మరో చిత్రానికి సైన్ చేసేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైల ర్ ఇటీవలే విడుదలైంది. గత చిత్రాల్లో సంజయ్ ఎలా కనిపించారో అలాగే ట్రైలర్ లో కనిపించడం అభిమానులను సంతోష పరుస్తోంది.

ఇదిలా ఉంటే 'భూమి' చిత్రాన్ని రూపొందిస్తున్న ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో మరో చిత్రం రూపొందనుంది. 'ద గుడ్ మహారాజ' పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'సంజయ్' నటించబోతున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్, నవానగర్ మహారాజా సాహిబ్ దిగ్విజయ్ సింగ్జీ రజింత్ సింగ్జీ పాత్రలో కనిపించనున్నాడు.

సాహిబ్ చరిత్ర పుటల్లో నిలిచిన సంగతి తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వందలాది మంది చిన్నారులకు ఆశ్రయం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ కథను వెండి తెరపై చూపించబోతున్నారు. మహారాజాకు సంబంధించిన కొన్ని ఫోటోలు లభ్యమయ్యాయని తెలిపిన దర్శకుడు వాటి ఆధారంగానే సంజయ్ దత్ లుక్ ను డిజైన్ చేసినట్టుగా తెలిపారు. సినిమాను భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ చిత్రంగా తెరకెక్కించనున్నారు.

11:53 - August 31, 2017

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ప్లూతో మరో ప్రాణం పోయింది. స్వైన్ ప్లూతో కమలమ్మ అనే మహిళ మృతి చెందింది. మృతురాలు మెదక్ జిల్లా తూప్రాన్ చెందినమెగా గుర్తించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:48 - August 31, 2017

హైదరాబాద్ : కోటి మందిని గమ్యస్థానాలకు చేర్చుతోన్న టీఎస్‌ ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు మంచి పేరుంది. టీఎస్‌ ఆర్టీసి 10వేల 600 బస్సులు, 96 డిపోలను కలిగి ఉంది. 52వేల సిబ్బంది ఇందులో పనిచేస్తున్నారు. ప్రతిరోజు దాదాపు 35 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ కోటి మందికిపైగా ప్రజలను వారి గమ్య స్థానాలకు చేర్చుతోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో టీఎస్‌ ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి ఏటా రవాణా అవసరాలు దాదాపు 12శాతం పెరుగుతాయి. కానీ టీఎస్‌ ఆర్టీసీ మాత్రం తన సేవలను మెరుగుపర్చుకోవడం లేదు. పెరుగుటమాట అటుంచితే.. ఈ మూడేళ్లలో దాదాపు 480 షెడ్యూళ్లను కుదించింది. ప్రజలకు అవసరమైన రవాణా సేవలందించే ప్రధాన లక్ష్యానికి తూట్లుపొడుస్తూ పాలకులు లాభనష్టాలను బేరీజు వేస్తున్నారు. రాష్ట్రంలోని పదివేల గ్రామాల్లో కేవలం 1500 గ్రామాలు మినహా అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించామని యాజమాన్యం చెబుతోంది. పరిస్థితి దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉందన్నది బహిరంగ సత్యమే.

పక్క రాష్ట్రమైన తమిళనాడులో
రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ సేవలు ఉండడం లేదు. అందుకే ఆర్టీసికి లాభాలు తగ్గాయి. అయితే యాజమాన్యం మాత్రం ఆర్టీసిక నష్టాలు తగ్గాయని, కొన్ని డిపోలు లాభాల్లోకి వస్తున్నాయని చెబుతోంది. పక్క రాష్ట్రమైన తమిళనాడులో 500 జనాభా కలిగిన ప్రతి గ్రామానికీ బస్సును నడుపుతున్నారు. ఆర్టీసీకి అక్కడి ప్రభుత్వం ఎంవీ ట్యాక్స్‌ మినహాయింపునిచ్చింది. డీజిల్‌ భారం ప్రభుత్వమే భరిస్తుంది. గత ఆరు సంవత్సరాలుగా తమిళనాడులో ఆర్టీసీ ఒక్కపైసా కూడా చార్జీలు పెంచలేదు. అందుకే ప్రయాణీకులకు నమ్మకమైన సేవలు అందించడంలో మనరాష్ట్రంకంటే తమిళనాడు ఆర్టీసీ ముందుంది. టీఎస్‌ ఆర్టీసికి డీజిల్‌ భారం, ప్రభుత్వానికి కడుతున్న పన్నులు గుదిబండగా మారాయి. మోటార్ వెహికిల్ టాక్స్ పేరుతో ఆర్టీసి నుండి ప్రతీ సంవత్సరం ప్రభుత్వం వందలాది కోట్లు దండుకుంటోంది. ఆర్టీసి నుండి కూడా ప్రైవేట్‌ వాహనాలతో సమానంగా ఎంవి టాక్స్ వసూలు చేస్తోంది. భారతదేశంలోనే అత్యదిక ఎంవి టాక్స్ వసూలు చేస్తోంది కూడా తెలంగాణలోనే. విద్యార్థులు , ఉద్యోగులు, వృద్దులకు ప్రయాణంలో రాయితీలు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం... ఆర్టీసి నుండి ముక్కు పిండి మోటార్ వాహన పన్ను వసూలు చేయడం ఆ సంస్థ నష్టాలకు ఓ కారణం. తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా డీజల్‌భారం, పన్నులను ప్రభుత్వం భరిస్తే ఆర్టీసీ లాభాలబాట పడుతుంది. రూరల్‌ ప్రాంతాల్లో ఆపరేషన్లపై సంస్థ దృష్టిసారిస్తే ప్రయాణీకులకు మెరుగైన సేవలందుతాయని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.

ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుండడం
ఆర్టీసీకి వస్తున్న నష్టాలు బస్సులు నడిపితే వచ్చనవి కావని కూడా అనేక కమిటీలు తేల్చాయి. ఆపరేషనల్‌ నష్టాలు లేనేలేవు. ఆర్టీసీ నష్టాలకు అధికారుల తీరుకూడా ప్రధాన కారణం. ప్రభుత్వం కూడా తనకు పట్టనట్టు వ్యవహరిస్తుండడం ఆర్టీసీ దుస్థితికి మరోకారణం. ఆర్టీసీ అద్దెబస్సులపై ఆధారపడటం మరో కారణం. ఆర్టీసీ ప్రజలకు మెరుగైన సేవలందించాలంటే అదనంగా కనీసం 5వేల బస్సులను కొనుగోలు చేయాలని కార్మికంఘాల నేతలు చెబుతున్నారు. బస్సుల కొనుగోలు అనేది నిరంతర ప్రక్రియ కొనసాగాలని సూచిస్తున్నారు. ఆర్టీసీని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్‌ సంవత్సరం క్రితం హామీనిచ్చారు. ఇంత వరకు ఆహామీలు ఆచరణకు నోచుకోలేదు. ప్రభుత్వం ఎంవీ ట్యాక్స్‌ను వసూలు చేయకుండా ఉండాలని కార్మికులు కోరుతున్నారు. డీజిల్‌ భారాన్ని భరిస్తే ఆర్టీసీ నష్టాల బాటపడుతుందని సూచిస్తున్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలు పట్టించుకోకపోయినా.... ఈ రెండు హామీలు నెరవేర్చితే చాలని కోరుతున్నారు.

 

పెరుగుతున్న గోదావరి ఉధృతి...

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం: జిల్లాలోని భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి ఉధృతి పెరుగుతున్న‌ది. గోదావ‌రి న‌ది ఉగ్ర రూపం దాల్చుతున్న‌ది. ఇప్ప‌టికే 27 అడుగుల‌కు గోదావ‌రి చేరుకున్న‌ది. దీంతో అటువైపు ఎవ‌రూ వెళ్ల‌కుండా అధికారులు జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారు.

11:47 - August 31, 2017

ప్రిన్స్ 'మహేష్ బాబు' న్యూ ఫిల్మ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సినిమా మొదలై రోజులు గడుస్తున్నా ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంటుండడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నట్లు టాక్. సినిమాకు సంబంధించిన పోస్టర్స్..టీజర్స్ కూడా ఆలస్యంగానే విడుదలయ్యాయి. తాజాగా ఈ సినిమాపై ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

గ్రామం, కుటుంబ విలువలతో ముడిపడి ఉన్న లవ్ స్టోరీ తో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ హిట్ తో 'మహేష్' నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద హోప్స్ బాగా పెరిగాయి. అనంతరం వచ్చిన 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ మూటగట్టుకుంది. 'మహేష్ బాబు', 'రకూల్ ప్రీత్ సింగ్' జంటగా 'మురుగదాస్' దర్శకత్వంలో 'స్పైడర్' సినిమా రూపొందుతోంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమా తెరకెక్కుతోంది. రా ఏజెంట్ గా కనిపించనున్న 'మహేష్' నటన ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రాన్ని హిందీలోకి అనువాదం చేసి విడుదల చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

పెండింగ్ లో ఉన్న ఓ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసినట్టేనని ప్రచారం జరుగుతోంది. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఓబీసీ రిజర్వేషన్ల పై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం...

ఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాల్లో ఓబీసీలకు క్రిమీలేయర్ వర్తింపు తప్పనిసరి చేసింది. రూ.8 లక్షలపైనా ఆదాయం ఉంటే రిజర్వేషన్లు వర్తించవని, రాజ్యాంగ పదవులు, గ్రూప్-ఏ, గ్రూప్-బీ ఉద్యోగుల కుటుంబసభ్యులకు ఓబీసీ రిజర్వేషన్లు ఉండవని తేల్చి చెప్పింది. సూపర్ లగ్జరీ కార్ల సెస్ 15 నుంచి 20 శాతానికి పెంచుకునే అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి త్వరలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది.

11:46 - August 31, 2017

నెల్లూరు : ల్లూరు జిల్లాలో మొత్తం 22 పోలీసు సర్కిళ్ల పరిధిలో 64 పోలీస్టేషన్లు ఉన్నాయి. వీటిలో మొత్తం 45 మంది జనరల్ డ్యూటీ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అత్యధికంగా నెల్లూరు నగరంలో 15 మంది పనిచేస్తున్నారు. మొత్తంమీద నెల్లూరు నగరంలో 6 లా అండ్ ఆర్డర్ పోలీస్టేషన్లలో 12 మంది , మహిళా పోలీస్టేషన్ లో ఒకరు, ట్రాఫిక్ లో ఇద్దరు పనిచేస్తున్నారు. జిల్లాలో అక్రమ, అసాంఘిక వ్యవహారాలన్నీ మొట్టమొదటిగా జీడీ కానిస్టేబుల్స్‌ దృష్టికి రావాల్సిందే...వారి నిర్ణయంతోనే ఎంట్రీ చేయాల్సిందే. ఒకప్పుడు సదుద్దేశ్యంతో ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థ రాను రాను రూటు మార్చింది...ప్రస్తుతం జీడీలు సిఐలకు.. స్టేషన్ ఎస్సైలకు మామూళ్లు వసూలు చేసి ఇవ్వడం, వారి వ్యక్తిగత పనులు చూడడానికే పరిమితమమైపోతున్నారు.

క్రిమినల్స్‌పై దృష్టి
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో...ఎందరో నేరగాళ్లు నెల్లూరు జిల్లాలో మాటువేసి ఉన్నారు..ఈ మధ్యనే జిల్లా ఎస్పీగా రామకృష్ణ బాధ్యతలు తీసుకున్న తర్వాత క్రిమినల్స్‌పై దృష్టిష్టి పెట్టారు..బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపి ఏకంగా రెండు వందల మందిని అరెస్టులు చేశారు...తుట్టెను కదలించేపనిలో పడ్డారు..ఇక ఎర్రచందనం విషయంలో కూడా అంతే..అక్రమరవాణా చేస్తున్న అక్రమార్కులను ఏరిపారేయడంలో ప్రత్యేక దృష్టి పెట్టారు జిల్లా పోలీసు బాస్....అయితే ఇలాంటి నేరగాళ్లను పెంచి పోషించడంలో కీలక పాత్ర వహించిన పోలీసులు కూడా ఉన్నారన్న సంగతి ఈ మధ్యనే బయటపడింది...ఇక జీడీ కానిస్టేబుల్స్‌ ప్రమేయం ఎంత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదేమో.పోలీస్టేషన్ లో ఆఫీసర్లకు సంబంధించిన ప్రతీ పనిని చూసుకునే జీడీలు ఇక స్వలాభం చూసుకోకుండా ఉంటారా... కేసులకు సంబంధించి ఛార్జిషీటు వేసేందుకు కావలసిన పేపరు, స్టేషనరీ దగ్గర నుంచి ప్రతీ పనికీ జీడీలే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా పోలీసు ఉన్నతాధికారులు స్టేషన్ విజిట్ చేసినా..ఎవరైనా విఐపిలు స్టేషన్ కు వచ్చినా..వారికి మర్యాదలు చేసేందుకు పెట్టాల్సిన ఖర్చంతా జీడీలదే. వసూలు చేసిన డబ్బుల్లోనే ఈ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో పోలీస్టేషన్లో పెత్తనమంతా జీడీలదేనన్నది స్పష్టంగా అర్ధమవుతోంది. అంతెందుకు ఒక్కమాటలో చెప్పాలంటే జీడీలే పోలీస్టేషన్లకు షాడో సిఐలు..షాడో యస్ ఐ లు.

ఎర్రచందనం అక్రమరవాణా
జిల్లాలోనే కాక రాష్ట్రంలోనే సంచలనంగా మారిన క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంతోపాటు ఎర్రచందనం అక్రమరవాణాలో కూడా జీడీలు కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలున్నాయి. కొందరు జీడీలు క్రికెట్ బుకీలతో సంబంధాలు నడిపితే..మరికొందరు జీడీలు ఎర్రచందనం అక్రమరవాణాకు పైలెట్లుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు జీడీలను యస్పీ పిహెచ్ డి రామకృష్ణ ప్రత్యేక టీం గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా యస్పీ రామకృష్ణ జీడీ పోలీసులపై ప్రత్యేక దృష్టి పెట్టి పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బాసర అమ్మవారి విగ్రహం తరలింపు పై విచారణ

నిర్మల్ : బాసర అమ్మవారి విగ్రహం తరలింపు పై విచారణ కొనసాగుతుంది. ఉదయం 4 గంటలకు ఆలయానికి అధికారులు వచ్చారు.అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ఐదుగురు అధికారుల బృందం విచారణ చేపట్టారు.

11:44 - August 31, 2017

నెల్లూరు : అవును వారికి అన్నీ తెలుసు...కాని వారు మాత్రం ఎక్కడా ఫోకస్ కారు...ఒక్కమాటలో చెప్పాలంటే వారు పోలీసులే కాదన్నట్లుంటారు...నిత్యం పోలీసుల బాస్‌లకంటే ఎక్కువ సమాచార సేకరణలో వారే ఉన్నా వారు మాత్రం పోలీసు డ్రస్‌లో కన్పించరు.. కాదు..కాదు..ఎన్నేళ్లయిందో వారు డ్రస్ వేసుకుని కూడా...వారే జనరల్ డ్యూటీ కానిస్టేబుల్స్.... జీడీ కానిస్టేబుల్స్‌ అనేది పోలీసు డిపార్ట్‌మెంట్లో సృష్టించుకున్న ఓ వ్యవస్థ...ప్రతీ పోలీసు స్టేషన్‌కో జీడీ ఉంటాడు..అతను ఏది చెబితే అది ఆయా స్టేషన్ ఇన్‌స్పెక్టర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్ వినాల్సిందే..నమ్మాల్సిందే..ఎందుకంటే వారికున్న నెట్‌వర్క్‌ వేరొకరికి ఉండదు.. ప్రతీ చిన్న విషయం వారికి తెలియకుండా జరగదు.

జీడీ కానిస్టేబుల్స్ వ్యవస్థ
పోలీస్టేషన్ పరిధిలో జరిగే కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని స్టేషన్ సిఐ...యస్ ఐ లకు అందించేందుకు కొన్నేళ్ల క్రితం నెల్లూరు జిల్లాలో కూడా జీడీ కానిస్టేబుల్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు... మొదట్లో వీరంతా స్టేషన్‌ పరిధిలోని అన్యాయాలు..అక్రమాలను తెలుసుకుని ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేవారు...దీంతో కాస్త ప్రయోజనాలు కలిగేవి...కాల క్రమంలో ఈ జీడీ కానిస్టేబుల్స్ తమ ప్రయోజనాల కోసం పనిచేయడం మొదలుపెట్టారు...ముందుగా ఆఫీసర్ల పని..ఆ తర్వాత వారి పని చక్కదిద్దుకోవడంలో ఆరితేరిపోయారు...ఎక్కడేం జరిగినా అన్నీ తెలుసుకుని చక్కదిద్దడంతో ఇక ఇన్‌స్పెక్టర్..లేదా..ఎస్సైలకు కాస్త భారం తగ్గడంతో పాటు రావాల్సినవి వచ్చేయడంతో పెద్దగా పట్టించుకోవడం లేదు.

వసూళ్లపై దృష్టి....
స్టేషన్ పరిధిలో జరిగే కార్యకలాపాలపై నిఘా పెట్టాల్సిన ఈ జీడీలు దందాలు, మాఫియాలు, వసూళ్లపై దృష్టి పెడుతున్నారు. జనరల్ డ్యూటీ పేరుతో కలెక్షన్ ఏజంట్లుగా పనిచేస్తున్నారు. పోలీస్టేషన్ పరిధిలో ఎక్కడ ఏ మాఫియాలున్నారో..ఎక్కడ ఏ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయో.. ఎక్కడ ఏ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో వారి వివరాలు సేకరించి అక్కడ వాలిపోయి భారీగా దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. రాను రాను జీడీల వ్యవహారం ముదిరిపోతున్నా పోలీసు అధికారులు కూడా ఏదీ చేయలేని పరిస్థితి..ఎందుకంటే వారి ప్రయోజనాలు వెళ్లాలంటే మాత్రం వీరు ఉండాల్సిందే.

11:43 - August 31, 2017

విజయవాడ : ఏ వ్యాపారానికైనా నమ్మకమే ప్రధానం. అది నాణ్యతతోనే వస్తుంది. ఈ రెండింటి మేళవింపుతో కొనసాగింది విజయడైరీ వ్యాపార ప్రస్థానం. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా పాలను తయారు చేయడం..వాటిని నాణ్యతతో అందించడంలో విజయడైరీకి మంచి పేరుంది. కానీ వ్యాపారంలో పెరుగుతున్న పోటీని ధీటుగా ఎదుర్కొలేకపోవడం..ఆధునాతన పద్ధతులు అవలంభించకపోవడం..సంస్థ తిరోగమనానికి కారణమైంది. రాష్ట్రంలోనే సహకార వ్యవస్థలో తొలి పాల డెయిరీగా ఖ్యాతిగడించినా.. పోటీ వ్యాపారాన్ని తట్టుకుని నిలబడటంలో సంస్థ నెమ్మదించింది. సొంతంగా వనరులు సమకూర్చుకునే విషయంలోనే కాక, ప్రభుత్వ సహకారం పొందడంలోనూ విఫలమైందన్న ఆరోపణలున్నాయి. పాడి అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రైతుల చెంతకు తీసుకెళ్లడంలో చొరవ చూపలేదన్నది మరో ఆరోపణ. పాలకవర్గ సమావేశాల్లో చర్చకు వస్తున్న సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోవడంలేదు. పాత ఉత్పత్తుల మినహా కొత్త ఉత్పత్తులను తెచ్చే ప్రయత్నాలు చేయకపోవడం సంస్థ మైనస్‌ పాయింట్‌గా కనిపిస్తోంది.

590 సంఘాలు
పరస్పర సహకార పద్ధతిలో 50 ఏళ్ల క్రితం కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య ఏర్పాటైంది. 590 సంఘాలు ఈ సమాఖ్య కింద పనిచేస్తున్నాయి. ఈ సంఘాల ద్వారా పాలను సేకరించి వ్యాపార సామ్రాజాన్ని విస్తరించుకుంటూ ప్రజలకు చేరువైంది. రోజూ 2.75 లక్షల లీటర్ల పాలను అమ్ముతుండగా... రైతుల నుంచి 1.50 లక్షల లీటర్ల పాలను మాత్రమే సేకరిస్తోంది. పాల ఉత్పత్తుల తయారీకి రోజూ 30 నుంచి 50 వేల లీటర్ల వరకు పాలు అవసరం కావడంతో... 1.50 లక్షల లీటర్ల పాల కొరత ఉంటుంది. గత్యంతరం లేక ప్రైవేట్ డెయిరీలు, వ్యాపారుల నుంచి పాలను కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా రైతుల నుంచి పాలను సేకరించే విషయంలో వెనకంజ వేస్తోంది. క్షేత్రస్థాయిలో పాడి రైతులను ప్రోత్సహించి పాలను సేకరించ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

రైతులకు సబ్సిడీపై పాడి పశువులు
పాడి రైతులను ప్రోత్సహించి.. సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయడం లేదు. రైతులకు సబ్సిడీపై పాడి పశువులను అందజేస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంది. గుంటూరు, విజయవాడతో కలిపి ఏపీ రాజధానిగా అవతరించడంతో.. పాల వినియోగం అధికమైంది. ఈ రెండు నగరాల్లో సకాలంలో పాలను అందిస్తూ మిగతా డెయిరీలు దూసుకెళ్తున్నాయి. విజయ డెయిరీకి మంచి పేరున్నా..వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలేవి చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. పాత ప్లాంట్ల స్థానంలో ఆధునాతన యంత్రాల ఏర్పాటు..కొత్త నిల్వ బ్లాక్ నిర్మాణం.. దాణా మిక్సింగ్ ప్లాంటు నిర్మాణానికి తోటపల్లిలో 15 నుంచి 20 ఎకరాల స్థలం కేటాయించాలని జిల్లా యంత్రాంగానికి డెయిరీ సంస్థ నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ దీనిపై ఇంకా నిర్ణయం వెలువడలేదు. మరి విజయడైరీ సంస్థ మనుగడ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేక ప్రైవేట్‌ డెయిరీల లాబీయింగ్‌లకు తలొగ్గుతుందో చూడాలి. 

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు...

తిరుమల: శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. పీఎస్ ఎల్వీ సీ -39 నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు పీఎస్ ఎల్వీ సీ 39 రాకెట్ ప్రయోగం జరగనుందిన.

11:41 - August 31, 2017

 

హైదరాబాద్ : ఖైరతాబాద్‌లో ప్రతిఏటా ఏర్పాటు చేసే భారీ గణేషుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసే లంబోదరుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. ప్రతి రోజూ హైదరాబాద్‌ నుంచేకాదు... శివారు ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ ఏడాది భక్తజనం భారీగా వస్తుండడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్‌ గణేషుడి దగ్గర నాలుగంచెల భద్రత కొనసాగుతోంది.

500మంది పోలీసులు
ఖైరతాబాద్‌ వినాయకుడి దగ్గర 36 అధునాతన సీసీ కెమెరాలు అమర్చారు. దాదాపు 500మంది పోలీసులు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికితోడు మరికొన్ని భద్రతాటీమ్స్‌ పనిచేస్తున్నాయి. సెంట్రల్‌జోన్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా ఖైరతాబాద్‌ గణేషుడి దగ్గరి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏకదంతుడి దగ్గరి నాలుగు దిక్కులా మెటల్‌ డిటెక్టర్స్‌ ఏర్పాటు చేశారు. మెయిన్‌వింగ్‌తోపాటు ఎంట్రీ, ఎగ్జిట్‌, బ్యాక్‌ ఎగ్జిట్‌ దగ్గర దాదాపు 30మంది సిబ్బంది భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి దర్శనానికి అనుమతిస్తున్నారు. షాడో టీమ్స్‌, షీటీమ్స్‌, తెలంగాణ స్టేట్‌ బెటాలియన్‌, కేంద్ర బలగాలు, టాస్క్‌ఫోర్స్‌, క్రైం, మఫ్టి, ఐడీ పార్టీ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు.. స్నిప్ఫర్‌ డాగ్‌ స్క్వాడ్‌, బాంబు స్క్వాడ్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఖైరతాబాద్‌ వినాయక నిర్వహణ కమిటీ పూర్తిగా సహకరిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

ప్రత్యేక అక్టోపస్‌ బృందాలు
పోలీసులు భద్రతను విజువలైజేషన్‌ చేస్తున్నారు. మొత్తం సీసీ కెమెరాలు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌తోపాటు ప్రత్యేక అక్టోపస్‌ బృందాలు ఈ ఏడాది ఉత్సవాల విధుల్లో నిమగ్నమయ్యాయి. మొత్తానికి ఖైరతాబాద్‌ వినాయక ఉత్సవాలు నిఘా నీడన ప్రశాంతంగా జరుగుతున్నాయి.

మృత్యుకూపంగా బీఆర్డీ ఆసుపత్రి

యూపీ : గోరఖ్ పూర్ బీఆర్డీ ఆసుపత్రి మృత్యుకూపంగా మారింది.8 నెలల్లో 1250 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఆగస్టు నెలలో 290 మంది విద్యార్థులు మృతి చెందారు. నెలలు నిండకుండా పుట్టడం, పోహకాహార లోపం, బరువుతక్కువగా ఉండటం నిమోనియా, కామెర్లు, అంటురోగాలు, మలేరియా జ్వరాలతో చిన్నారులు చనిపోతున్నారు.

11:36 - August 31, 2017

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదు ? ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఘోరాలు బీహార్ రాష్ట్రంలో కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి దురాగతాలపై వెంటనే స్పందించే సీఎం నితీష్ కుమార్ ప్రస్తుతం ఎందుకు కినుకు వహిస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

లాలూ ప్రసాద్ యాదవ్ తో చెట్టాపెట్టాల్ వేసుకుని నడిచిన నితీష్ తరువాత ఆయనతో తెగదెంపులు చేసుకుని ఏకంగా సీఎం పదవికి రాజీనామా చేసేశారు. వెంటనే కాషాయ దళం ఒడిలో చేరిపోయారు. రాజీనామా చేసిన కొద్ది గంటలకే సీఎం పీఠాన్ని మరోసారి అధిరోహించారు. మద్దతిచ్చిన బీజేపీ నేతలకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చేశారు. అధికారంలో కూర్చున్న వారం తిరగకుండానే సంఘ్ పరివార్ తన వ్యూహాలను బయట పెట్టింది.

ఆగస్టు మూడో తేదీన భోజ్ పురా జిల్లా శాహ్ పూర్ లో పెట్రోల్ బంక్ లో నిలబడి ఉన్న ఓ లారీని బంజర్గీలు అటకాయించారు. అందులో గో మాంసాన్ని తరలిస్తున్నారంటూ ముగ్గురు వ్యక్తులను చితకబాదేశారు. వీహెచ్ పీ కి చెందిన కొందరు వ్యక్తులు గో మాంసం తింటున్నారంటూ పశ్చిమ్ చంపారణ్ జిల్లాలో ఆరు కుటుంబాల వారిని విచక్షణారహితంగా చితకబాదినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన 17న చోటు చేసుకందని సమాచారం.

2015 సంవత్సరం..దాద్రిలో ఒక మైనార్టీకి చెందిన వ్యక్తి కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పుడు సీఎంగా నితీష్ కుమార్ ఉన్నారు. అప్పుడు ఆయన బీజేపీకి పక్క వ్యతిరేకి. ఆ సమయంలో ప్రధాన మంత్రి మోడీ మౌనాన్ని ప్రశ్నిస్తూ వ్యంగ్యాస్రాలు సంధించారు. కానీ నేడు సొంత రాష్ట్రంలోనే గో రక్షక మూకలు చెలరేగుతున్నా స్పందించకపోవడం చర్చనీయాశమౌతోంది. బీహార్ కూడా ఉత్తర్ ప్రదేశ్ బాట పట్టిందా అనే అనుమాలు వ్యక్తమౌతున్నాయి. గోరక్షకుల హింస..దాడులున్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే చోటు చేసుకుంటుండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. గోరక్షకులుగా చెప్పుకొనే ఈ ముఠాలు ప్రధాని మాటను పెడచెవిన పెట్టేస్తున్నాయి. ఒక నెలలోపే బీహార్ లో రెండుసార్లు మైనార్టీలపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. సీఎం నితీశ్ ప్రశ్నిస్తారా ? ఏదైనా చర్యలు తీసుకుంటారా ? మౌనంగా ఉంటారా ? అనేది రానున్న రోజుల్లో తెలియనుంది. 

11:27 - August 31, 2017

గుంటూరు : జిల్లా ఆర్అండ్ బీ సూపరిండెంట్ ఇంజనీర్ కారంపూడి రాఘవరావు ఇంటిలో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఏకకాలంలో గుంటూరు, కృష్ణా, మచిలీపట్నం, మంగళగిరితో సహా పదకొండు చోట్ల సోదాలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ దేవానంద్ ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

డబుల్ బెడ్ రూం పథకం కేసీఆర్ మాసపుత్రిక: కేటీఆర్

మేడ్చల్: ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక డబుల్ బెడ్ రూమ్ పథకమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారక రామారావు పేర్కొన్నారు. గురువారం మేడ్చల్ నియోజకవర్గంలోని రాంపల్లిలో 6వేల డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణ పనులకు మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి కేటీఆర్ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ... పేద‌లు ఆత్మగౌరవంతో బతికేందుకే అన్ని వసతులతో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోందన్నారు. మొత్తం 18 వేల కోట్లతో 2 లక్షల 65 వేల ఇళ్లను నిర్మిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

11:20 - August 31, 2017

హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిలో కారు బీభవత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి రోగులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని వెంటనే ఐసీయూలోకి తరలించారు. మరంత సమాచారం కోసం వీడియో చూడండి.

11:11 - August 31, 2017

హైదరాబాద్ : కాసేపట్లో కలెక్టర్లు, ఆర్డీవోలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భూప్రక్షాళన, సరళీకరణపై చర్చించనున్నారు. పారదర్శకంగా భూరికార్డుల ప్రక్షాళన జరగాలని, 95 శాతం భూముల వివరాలు ముందు ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించనున్నారు. జాబితపై రైతులందరి సంతకాలు తీసుకోవాలని ఆయన సూచించారు. భూప్రక్షాళన పకడ్బందీగా చేసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం ఇప్పటికే నిర్ణయించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

కాకినాడ పీఠం మాదే: మంత్రి చినరాజప్ప

తూ.గో: కాకినాడ పీఠం మాదే అని హోం మంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. 35 డివిజన్లలోనూ విజయం సాధిస్తామని, ముద్రగడువుతో మాకు సంబంధం లేదని, కాపులకు న్యాయం చేయడానికే కట్టుబడి ఉన్నామన్నారు. జగన్ డబ్బును నమ్ముకుని ముద్రగడ బోల్తా పడ్డాడు అని ఎద్దేవా చేశాడు.

11:04 - August 31, 2017

గుంటూరు ఆర్ అండ్ బీ సూపరింటెండెంట్ ఇంటి పై ఏసీబీ దాడులు..

గుంటూరు : ఆర్ అండ్ బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాఘవేంద్ర రావు ఇంటి పై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏక కాలంలో 11 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. సత్తెనపల్లి, మంగళగిరి, మచిలీపట్నంలోని బందువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఈ దాడులో భారీగా అక్రమాస్తులు బయటపడినట్లు సమాచారం.

ముంబైలో భవనం కూలిన ఘటనలో ముగ్గురి మృతి

హైదరాబాద్: ముంబై భీవండి లో భవనం కూలిగిన ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 11 మంది క్షేమంగా బయటపడ్డారు. ఇంకా శిధిలాల కింద పలువురు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

గాంధీ ఆస్పత్రిలో స్ల్వైన్ ఫ్లూతో మహిళ మృతి

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో స్ల్వైన్ ఫ్లూతో మరో మహిళ మృతి చెందింది. మృతురాలు తూప్రాన్ కు చెందిన కమలమ్మ(55) గా గుర్తించారు.

10:39 - August 31, 2017

భారతదేశంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మౌనం వహిస్తుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర వాటిపై స్పందిస్తున్నారు కానీ..జరుగుతున్న ఘోరాలపై మాత్రం స్పదించడం లేదని సోషల్ మీడియాలో కేంద్ర పాలనపై నెటిజన్లు వ్యంగ్యాస్రాలు సంధిస్తున్నారు. గతంలో ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్ ను మౌన మునిగా కాషాయ దళాలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

దేశంలో ప్రస్తుతం దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలు అందర్నీ కలిచివేస్తున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో దళితులపై దాడులు..వివక్ష కొనసాగుతోంది. గోరక్షక్ పేరిట కొంతమంది గూండాలు విచక్షణారహితంగా దాడులకు తెగబడుతూ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఈ ఘటనలపై ప్రధాన మంత్రి మోడీ హెచ్చరించినా దాడుల ఘటనలు మాత్రం ఆగకపోవడం విచారకరమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లో బిఆర్‌డి ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఎలా పాలన కొనసాగుతోందో అక్కడ జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అర్థమౌతుంది. గత మూడు రోజుల్లో 63 మంది పిల్లలు మృత్యు ఒడికి చేరుకున్నా ప్రధాన మంత్రి మోడీ స్పందించకపోవడంపై పలువురు మండి పడుతున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే 290 పసిపిల్లలు కన్నుమూయడం విచారకరం.  మృతి చెందిన చిన్నారులో ఏడుగురు మెదడువాపు వ్యాధి, మిగిలినవారు రకారకాల వైద్య కారణాలతో చనిపోయారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆక్సిజన్‌ కొరత వల్లే పిల్లలు మృతి చెందినట్లు ఈ ఘటనపై విచారణ జరిపిన నివేదికలో స్పష్టమైంది. ఘటనపై సీఎం స్పందించి ఓ అధికారిని సస్పెండ్ చేశారు.

మొన్న నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచిన టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏకంగా అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ప్రతి చిన్నదానికీ అలవోకగా చాయ్ పే బాత్‌, మన్‌ కీ బాత్‌లు నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గోరఖ్‌పూర్‌ దురంతంపై ఎందుకు మౌనం దాల్చినట్టు ? ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నోరు లేని ఆవుల రక్షణకు ప్రత్యేక దళాలను నెలకొల్పి నడిపిస్తున్న సీఎం యోగికి ఆవుల కంటే పసికందుల ప్రాణాలు లెక్కలేదని సోషల్ మీడియాలో పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. వెంటనే రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై సీఎం యోగి రాజీనామా చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. 

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు..

తిరుమల :తిరుమలలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకువద్దకు చేరుకున్న గవర్నర్‌ దంపతులకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న గవర్నర్‌కు రంగనాయకుల మండపంలో అర్చకులు శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనాలు ఇచ్చారు. తితిదే అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

పవన్ కల్యాన్ ఇంటి వద్ద ఓ మహిళ ఆందోళన

హైదరాబాద్‌: సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వకుండా భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఓ అభిమాని ఆందోళనకు దిగింది. నగరానికి చెందిన జ్యోతి బుధవారం నందగిరిహిల్స్‌లోని పవన్‌ నివాసం వద్దకు వెళ్లింది. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇంటి ముందు బైఠాయించింది. సమాచారమందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆమెను అదుపులోకి తరువాత వదిలేశారు. గతంలో కూడా జ్యోతి ఇలాగే హల్‌చల్‌ చేసినట్లు సమాచారం.

యూపీలో కోటి విలువైన గంజాయి పట్టివేత...

హైదరాబాద్: యూపీలో కోటి రూపాయ‌ల విలువైన 800 కిలోల గంజాయిని పోలీసులు. స్వాధీనం చేసుకున్నారు. మ‌థుర‌ రాష్ట్రంలో గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని పట్టుకునీ సీజ్ చేశారు. డ్రైవ‌ర్ ప‌రారిలో ఉండ‌గా.. క్లీన‌ర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

10:12 - August 31, 2017

ముంబై : నగచంలోని బెండిబజార్ ఓ ఐదంస్తుల భవనం కూలింది. శిథిలాలకింద 30 మంది వరకు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వెంటనే స్పందించిన బీఎంసీ సిబ్బంది సహాయచర్యలు చేపట్టింది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఐదుగురిని రక్షించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:07 - August 31, 2017
10:06 - August 31, 2017

 

గుంటూరు : నంద్యాల ఉపఎన్నిక విజయంతో జోష్‌ మీదున్న తెలుగు దేశం పార్టీ... ఇప్పుడు అనుసరించిన వ్యూహానికి మరింత పదును పెడుతోంది. భవిష్యత్తులో వచ్చే ప్రతి ఎన్నికలోనూ గెలుపే లక్ష్యంగా.. ఈ వ్యూహాలను రచిస్తోంది. ఓటర్ల మనసును గెలుచుకునేందుకు.. వారి నాడిని గుర్తించడం.. దానికి తగ్గట్లుగా స్థానిక విధానాలు మార్చుకోవడం.. ఎన్నికలయ్యాక కూడా వారితో మమేకం కావడంపై దృష్టి సారించాలని టీడీపీ అధినాయకత్వం.. ఇప్పటికే పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నంద్యాల ఓటర్లను కలిసి ధన్యవాదాలు చెప్పడం ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అధినేత చంద్రబాబు సూచించారు.

సమష్ఠిగా కృషి గెలుపు
నంద్యాల ఉప ఎన్నికలో గెలుపును టీడీపీ నాయకత్వం సాదాసీదాగా చూడడం లేదు. వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమలోనే ఆ పార్టీ ఆధిపత్యానికి బ్రేకులు వేయగలిగామని భావిస్తోంది. స్థానిక సంస్థల కోటాలో.. బిటెక్‌ రవిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం.. ఇప్పుడు నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి విజయం.. శ్రేణుల మనోధైర్యాన్ని బాగా పెంచిందని టీడీపీ అధినాయకత్వం అంచనా వేస్తోంది. బూత్‌ స్థాయి నేత వరకూ సమష్ఠిగా కృషి చేయడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందని.. ఇకపైనా ఇదే విధంగా అంతా కలిసి సాగితే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికార పీఠం తథ్యమని శ్రేణులకు సూచిస్తోంది.

భవిష్యత్తు కోసం వ్యూహాలు
మొత్తానికి వివిధ సమస్యలపై విరుచుకుపడిపోతోన్న విపక్షం ధాటికి.. బాగా కలవరపడ్డ తెలుగుదేశం పార్టీకి, నంద్యాల ఉప ఎన్నిక విజయం.. పెద్ద ఊరటనే ఇచ్చింది. ఈ ఉత్సాహంతో.. భవిష్యత్తు కోసం వ్యూహాలకు ఇప్పటి నుంచే పదును పెడుతోంది. నంద్యాలలో తిట్ల దండకాలకే పరిమితమైన ప్రతిపక్ష పార్టీ.. 2019 ఎన్నికలనాటికి.. తమ స్ట్రాటజీని మార్చుకుని టీడీపీ వ్యూహాలకు చెక్‌పెడుతుందో..లేదో చూడాలి. 

సిద్ధిపేట నియోజకవర్గంలో మంత్రి హరీష్ పర్యటన

సిద్ధిపేట : సిద్ధిపేట నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

వరంగల్ నిట్ లో డ్రగ్స దందాపై హెచ్ ఆర్టీ అధికారుల ఆరా

హైదరాబాద్: వరంగల్ లో మత్తు మాఫియా కలకలం రేగింది. డ్రగ్ డెన్ పై 10టివి ముందే నిట్ డ్రగ్ వ్యవహారాలపై హెచ్ ఆర్డీ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. నిట్ కేంద్రంగా డ్రగ్ దందా వివరాలపై హెచ్ ఆర్డీ అధికారులు ఆరా తీస్తున్నారు. డ్రగ్ సంస్కృతి పై నిట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నిట్ విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ కలవరపడుతున్నారు. డ్రగ్ వ్యవహారంపై అంతర్గతంగా ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగి వివరాలను సేకరిస్తోంది. డ్రగ్ దందా సాగిస్తోన్న విద్యార్థుల కోసం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. స్టడీ మెటీరియల్ ముసుగులో డ్రగ్స్ పార్సిల్ తెప్పించుకుంటున్నారు.

ఉస్మానియా ఆసుపత్రిలో కారు బీభత్సం...

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి ఆవరణంలో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి రోగులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆగురుకి తీవ్రగాయాలయ్యాయి.

09:33 - August 31, 2017

అమెరికా : ఓ ఫిట్‌నెస్‌ మాస్టర్‌ పుల్లప్స్‌లో గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు. నిమిషంలో ఎక్కువ పుల్లప్స్‌ చేసిన వ్యక్తిగా రికార్డులో నిలిచాడు. వాషింగ్టన్‌ నగరానికి చెందిన 31 ఏళ్ల ఆడమ్‌ శాండెల్‌.. 60 సెకన్లలో 51 పుల్లప్స్‌ చేసి గిన్నిస్‌ బుక్‌లోకెక్కాడు. పుల్లప్స్‌లో వీలైనన్ని గిన్నిస్‌ రికార్డులు సాధించడమే తన లక్ష్యమని ఆడమ్ చెప్పాడు. గతంలో 50 పుల్లప్స్‌ చేసిన వ్యక్తిగా కూడా ఆడమ్‌ శాండెల్ పేరే ఉంది. ఈ రికార్డు వెనక ఎలాంటి కృషి ఉందంటూ గిన్నిస్‌ ప్రతినిధులు అడగగా.. శరీరాన్ని బాణంలా నిలువుగా ఉంచడమే రికార్డు వెనకున్న సీక్రెట్‌ అని చెప్పాడు. నిమిషంలో 53 పుల్లప్స్ చేసినా కానీ.. అందులో రెండు డిస్‌క్వాలిఫై అయ్యాయన్నాడు. దీంతో రికార్డు 51కే పరిమితమైంది. భవిష్యత్తులో 60 సెకన్లలో 60 పుల్లప్స్‌ చేయడమే తన లక్ష్యమని శాండెల్‌ ధీమా వ్యక్తం చేశాడు. 

09:32 - August 31, 2017

ముంబై : భార్యాభర్తలు గొడవ పడటం సహజం. కానీ పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లిన ఓ జంట.. సంతోషంగా ఇంటికి వెళ్లిన వీడియో వైరల్ అయ్యింది. ఓ జంట గొడవపడి అది కాస్తా పెద్దదవ్వడంతో.. విషయం పోలీస్‌ స్టేషన్‌ దాకా వెళ్లింది. దీంతో భర్తకు ఏం కావాలో అర్ధం కాక.. తన భార్యను ఎలాగైనా ఓదార్చాలనుకున్నాడు. అంతే ఓ సెంటిమెంట్‌ సాంగ్ అందుకున్నాడు. పాట పాడి ఆమెను కూల్ చేశాడు. అంతే వెంటనే అతని భార్య ఆయన మీద వాలడంతో.. కథ సుఖాంతమయ్యింది. 

తమిళనేతల ఢిల్లీ బాట

ఢిల్లీ : తమిళ తంబిలు ఢిల్లీ బాట పట్టారు. తమిళనాడు ప్రతిపక్షనేత డీఎంకే పార్టీకి చెందిన స్టాలిన్ నేడు తన ఎమ్మెల్యేలతో రాష్ట్రపతిని కలవనున్నారు. ఆయన తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ పై ఫిర్యాదు చేయనున్నారు. మరొవైపు శశికళ మేనల్లుడు, అన్నాడీంఎకే బహిష్కృత నేత దినకరన్ రేపు రాష్ట్రపతిని కలవనున్నారు. 

బాసర అమ్మవారు నల్లగొండకు

ఆదిలాబాద్ : బాసరలో అమ్మవారి విగ్రహం తరలింపుపై అధికారులు రహస్య విచారణ జరుపుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున 4గంటలకు అధికారులు ఆలయానికి వచ్చారు. అధికారుల బృందంలో అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఐదుగురు ఉన్నారు. అధికారుల బృందం అర్చకులను ప్రశ్నించారు. అమ్మవారి విగ్రహాన్ని నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఓ పాఠశాలకు తరలించినట్టు వార్తాలు వస్తున్నాయి. 

09:24 - August 31, 2017

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబయిని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ముంబై నగరం సముద్రాన్ని తలపించింది. సాధారణం కన్నా 9 రెట్లు ఎక్కువగా వర్షం కురియడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. బుధవారం వర్షం తగ్గుముఖం పట్టడంతో ట్రాఫిక్‌ సాధారణ స్థితికి చేరింది. వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా ప్రజలకు ఊరట లభించలేదు. డబ్బావాలాలు సెలవు తీసుకోవడంతో రెండు లక్షల మంది ఉద్యోగులకు లంచ్ సేవలు రద్దయ్యాయి. వారిపై ఆధారపడే ఉద్యోగులు భోజనానికి ఇబ్బంది పడ్డారు. వరదల పరిస్థితి తీవ్రంగా ఉన్నా సిఎం సెలవు ప్రకటించలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద బాధితుల కోసం భారత నేవీ సిబ్బంది కమ్యూనిటీ కిచెన్లు, ఫుడ్‌ కౌంటర్లను తెరిచారు.రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ సిబ్బంది చెత్త చెదారాన్ని తొలగించింది.

ఉద్యోగులకు సెలవు రద్దు
సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు మున్సిపల్‌ ఉద్యోగులకు సెలవు రద్దు చేశారు. వరదల నేపథ్యంలో క్యాబ్‌ సర్వీసులు ఓలా, ఉబర్‌లు ఛార్జీలను తగ్గించాయి. వరదల దృష్ట్యా విద్యాసంస్థలను మూసివేశారు. రైళ్లు, విమానాలు యథావిధిగా నడిచాయి. ముంబై ఎయిర్‌పోర్టులో వాతావరణం సరిగా లేకపోవడం వల్ల పది విమానాలు ఆలస్యంగా నడిచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే రెండు రోజుల్లో కొంకణ్‌ పరిధిలోని ముంబై, థానే, పాల్‌ఘర్‌, రాయగడ్‌, రత్నగిరి, గోవా, గుజరాత్‌లోని కచ్‌, సౌరాష్ట్రలో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది.

09:19 - August 31, 2017
09:17 - August 31, 2017

ఢిల్లీ : తమిళ తంబిలు ఢిల్లీ బాట పట్టారు. తమిళనాడు ప్రతిపక్షనేత డీఎంకే పార్టీకి చెందిన స్టాలిన్ నేడు తన ఎమ్మెల్యేలతో రాష్ట్రపతిని కలవనున్నారు. ఆయన తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ పై ఫిర్యాదు చేయనున్నారు. మరొవైపు శశికళ మేనల్లుడు, అన్నాడీంఎకే బహిష్కృత నేత దినకరన్ రేపు రాష్ట్రపతిని కలవనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:16 - August 31, 2017

ఆదిలాబాద్ : బాసరలో అమ్మవారి విగ్రహం తరలింపుపై అధికారులు రహస్య విచారణ జరుపుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున 4గంటలకు అధికారులు ఆలయానికి వచ్చారు. అధికారుల బృందంలో అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఐదుగురు ఉన్నారు. అధికారుల బృందం అర్చకులను ప్రశ్నించారు. అమ్మవారి విగ్రహాన్ని నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఓ పాఠశాలకు తరలించినట్టు వార్తాలు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

నేడు భారత్ శ్రీలంక నాలుగో వన్డే

కొలంబో : నేడు భారత్, శ్రీలంక మధ్య నాలుగో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 2.30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ వన్డేతో ధోని తన కేరిర్ లో 300 వ వన్డే అడనున్నాడు.

చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ

గుంటూరు : నేడు ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ కానున్నారు. ఈ సమావేశంలో టీటీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణ, తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. 

07:38 - August 31, 2017

గతంలో సమగ్రసర్వే ప్రకారం చాల ఉపయోగపడిందని, ఎకరాకు నాలుగు వేల రూపాయల ఇవ్వడం కోసం ఈ సర్వే చేపడుతున్నామని టీఆర్ఎస్ నేత మన్నే గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సర్వే కొత్తది కాదని, దీంతోని అయ్యేది లేదని, నిజాం కాలంలో ఉన్న భూముల గురించి ఏం చెయబోతున్నారని, నిజాం కాలం పన్నులు ఎక్కువగా ఉండడంతో భూమిని తక్కువ చేసి చూపెట్టారని, 4వేల రూపాయలు ఎవరికి ఇస్తారు, కౌలు రైతులకు ఇస్తారా లేక పట్టదారుకు ఇస్తారా అనేది స్పష్టలేకుండా సర్వే చేయడం వల్ల ఫలితం శూన్యం తప్ప మరేది లేదని బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఏక పక్షంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నేతలతో కమిటీలు వేస్తున్నారని, ఏ లబ్ది అయిన టీఆర్ఎస్ పార్టీ వారికే తప్ప ఎవరికి ఫలితం లేదని, భూసర్వే విషయంలో గాని, ఎకరాకు 4వేల విషయాంలో గాని ప్రభుత్వం నియతృత్వంగా వ్యవహిరిస్తుందని జూలకంటి రంగారెడ్డి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:36 - August 31, 2017

దేశవ్యాప్తంగా వికలాంగుల సమస్యల సాధన కోసం పోరాడుతున్న ఎన్ పిఆర్ డి తెలంగాణ రాష్ట్ర మహాసభలు రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలో జరిగాయి. తెలంగాణలో వికలాంగులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై చర్చించిన మహాసభల్లో 17 తీర్మానాలు చేశారు. వికలాంగుల పెన్షన్ ను 5000 రూపాయలకు పెంచి, విద్యా ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు గురుకుల విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలన్నది మరో ముఖ్యమైన డిమాండ్. తెలంగాణలో వికలాంగులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కార్యదర్శి గోరెంకల నర్సింహా మాట్లాడుతూ సంగారెడ్డి ఈ నెల 27,28 రెండో రాష్ట్రమహాసభలు జరిగాయి. ఈ సభలో అనేక అంశలు చర్చించి తీర్మాణాలు చేశామని, తెలంగాణలో మొత్తం 10లక్షల 46 వేల మంది ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేశామని నర్సిసింహ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

07:33 - August 31, 2017

నెల్లూరు : పీఎస్‌ఎల్‌వీ-సీ39 రాకెట్‌ ప్రయోగానికి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం సిద్ధమైంది. ఈ రాకెట్‌ ద్వారా ఇండియన్‌ రీజినల్‌ నేవిగేషనల్‌ శాటిలైట్ సిస్టంకు చెందిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1 హెచ్‌ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెడతారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ ఉపగ్రహం భారత రోడ్డు, జల రవాణ వ్యవస్థకు దిక్సూచిగా పని చేస్తుంది. ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. ఇరవైతొమ్మిది గంటలపాటు కౌంట్‌డౌన్‌ కొనసాగిన తర్వాత గురువారం రాత్రి 7 గంటలకు ఉపగ్రహ ప్రయోగం జరుగుతుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ39 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహం బరువు 1425 కిలోలు. ఈ ప్రయోగం కోసం షార్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మెరుగైన రవాణ సమాచార వ్యవస్థకు ఉపగ్రహం దోహదం చేస్తుంది. మన దేశంతోపాటు చుట్టుపక్కల 1500 కి.మీ. పరిధిలో నేవిగేషన్‌ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఇస్రో చైర్మన్‌ కిరణ్‌కుమార్‌, షార్‌ డైరెక్టర్‌ కున్హి కృష్ణన్‌ ప్రయోగ ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. 2013 జులైలో పీఎస్‌ఎల్‌వీ ద్వారా కక్షలో ప్రవేశపెట్టిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఏ ఉపగ్రహంలో సాంకేతికలోపం తలెత్తి పనిచేయకపోవడంతో దాని స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ని పంపుతున్నారు. సీఎస్‌ఎల్‌వీ-సీ39 రాకెట్‌ ప్రయోగం నేపథ్యంలో శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో భద్రత కట్టుదిట్టం చేశారు. 

07:32 - August 31, 2017

హైదరాబాద్ : గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో గిడుగు పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది...ప్రముఖ కవి బిక్కి కృష్ణ ఆధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం, రిటైర్డ్‌ జస్టిస్ చంద్రకుమార్‌తో పాటు గిడుగు ఫౌండేషన్ చైర్మన్ కాంతికృష్ణ,నాళేశ్వరం శంకరం, బైసదేవదాస్,యడ్లపల్లి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు...ఈ సందర్భంగా ప్రభాకర్ జైన్, లక్ష్మీనర్సయ్యలకు గిడుగు పురస్కారాలు అందజేశారు.

07:31 - August 31, 2017

వరంగల్ : వరంగల్‌లోని నిట్‌లో జరుగుతున్న డ్రగ్స్‌ దందాపై అధికారయంత్రాంగం కదిలింది. 10టీవీ వరుస కథనాలతో ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. నిట్‌లో డ్రగ్స్‌ భూతంపై 10టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. డ్రగ్స్‌ భూతాన్ని తరిమివేసేందుకు అక్షర యజ్ఞం చేసింది. విశ్వవిద్యాలయాల్లో చాపకింద నీరులా వ్యాపిస్తోన్న డ్రగ్స్‌ విషబీజాలను మొగ్గలోనే తుంచివేసేందుకు సామాజిక సమరం చేసింది. అందుకే డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో అధికారులు స్పందించి నిట్‌లో డ్రగ్స్‌ మాఫియా గుట్టురట్టు చేశారు.

ఇద్దరు విద్యార్థుల అరెస్ట్‌
ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, పోలీసులు, రైల్వే జీఆర్‌పీ రంగంలోకి దిగింది. అమాయక విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠా సభ్యులను పట్టుకున్నారు. గుట్టుగా సాగుతున్న డ్రగ్స్‌ ముఠా గుట్టును రట్టు చేశారు. నిట్‌ హాస్టల్‌ గదులను తనిఖీలు చేసి... కీలక సమాచారం సేకరించారు. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. ఐదు ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ స్ట్రిప్స్‌తోపాటు ఓ ల్యాప్‌టాప్‌, రెండు సెల్‌ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిట్‌లో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న రమేష్‌, ఎలక్ట్రానికస్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న ద్విజ్‌ ఇద్దరూ స్నేహితులు. వన్‌ కె హాస్టల్‌లో ఉంటున్న రమేష్‌ - ద్విజ్‌ కొంతకాలంగా డార్క్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఎల్‌ఎస్‌డీ దిగుమతి చేసుకుంటున్నారు. వాటిని అమాయక విద్యార్థులకు అంటగడుతున్నారు.

రెడ్‌ హ్యాండెడ్‌గా
నిట్‌ సమీపంలో వీరిద్దరూ డ్రగ్స్‌ విక్రయిస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సురేష్‌ రాథోడ్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ కొనుగోలు చేసిన విద్యార్థులు... కొత్తపేటలో కొరియర్‌ ద్వారా వాటిని దిగుమతి చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మెట్రో నగరాలకే పరిమితమైన డ్రగ్స్‌ వ్యవహారం వరంగల్‌లో వెలుగు చూడడం కలకలం సృష్టించింది. దేశానికి ఎంతోమంది మేథావులను అందించిన జాతీయ సాంకేతిక విద్యాసంస్థ విద్యార్థులు పట్టుబడటం క్యాంపస్‌లో హాట్‌టాఫిక్‌గా మారింది.

07:29 - August 31, 2017

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జీవనాధరం అయినభూములను నాశనం చేయకుండా ఆపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిల్‌ దాఖలు చేశారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తోంది. సహజంగా మా భూములు ఇవ్వం అని పలు రకనా పేచీలు పెట్టే గ్రామీణులు.. భూములిస్తాం మొర్రో అంటున్నా..ప్రభుత్వ తీరు మారడం లేదు. మాకు గొడవలు వద్దు.. పరిహారం ఇచ్చి భూములు తీసుకోండి అని మొరపొట్టుకున్నా.. పాలకులు పోలీసులతో బలప్రయోగం చేయస్తున్నారు. దీనిపై వంశధార నిర్వాసితులు భగ్గున మండిపడితున్నారు. అధికారపార్టీ నాయకుల కమీషన్లకోసం పచ్చనిపల్లెల్లో చిచ్చుపెడుతున్నారని వాపోతున్నారు. గత ఇరవై రోజులుగా పోలీసు పహారా నడుమ వంశధార ప్రాజెక్ట్ పనులు జరిపించడంతో పాటు.. నిర్వాసిత గ్రామాల్లో బలగాల మోహరింపు స్థానికుల ఆగ్రహావేశాలకు కారణంగా మారింది.

వినిపించుకోని అధికారులు
శ్రీకాకుళం జిల్లా హిరమండలం దుగ్గుపురం, పాడలి, చిన్నకొల్లివలస, ఇరపాడు, తులగాం గ్రామాలకు చెందిన నిర్వాసిత రైతులు ప్రభత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగువందల ఎకరాలను పంటతో సహా జేసిబి, ట్రాక్టర్లతో నాశనం చేశారని కన్నీరుపెట్టుకుంటున్నారు. పరిహారం ఇస్తే .. భూములు ఖాళీ చేస్తామని చెప్పినా వినిపించుకోవడంలేదని నిర్వాసిత గ్రామాల ప్రజలు అంటున్నారు.

హైకోర్టులో పిల్‌
మరోవైపు పచ్చని పంట పొలాలను ద్వంసం చేయడాన్ని వ్యతరేకిస్తూ హ్యూమన్ రైట్స్ ఫోరం తరపున కే.వీ.జగన్నాథరావు హైకోర్టులో పిల్‌ వేశారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిల్‌ లో కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం వారం రోజుల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభభుత్వాన్ని, మరో 7గురు ప్రతివాదులను ఆదేశించిందని జగన్నాథరావు తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో అయినా.. రాష్ట్రప్రభుత్వం బలప్రయోగాన్ని మానుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. 

07:27 - August 31, 2017

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో పదవులు ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న పదవులకు తోడు మరికొన్ని కొత్త పదవులు నేతలను వరించనున్నాయి. ఏఐసీసీ వరకు తెలంగాణ నేతలు కొత్త పదవులు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీపీసీసీలో ఎలాంటి మార్పులేకుండా... అదనంగా మరికొంత మందికి పార్టీ పదవులు దక్కనున్నాయి. రాహుల్‌గాంధీ ఇందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో... కాంగ్రెస్‌ నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

రాహుల్‌గాంధీకి అధ్యక్ష బాధ్యతలు
కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్‌గాంధీ రెడీ అవుతున్నారు. తన టీమ్‌ ఎలా ఉండాలన్నదానిపై రాహుల్‌ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్ష బాధ్యతలు అక్టోబర్‌ రెండో వారంలో తీసుకునేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ పునర్వ్యస్థీకరణలో తెలంగాణలో పెద్దపీట వేయాలని హైకమాండ్‌ డిసైడ్‌ అయినట్టు సమాచారం. దీనిలో భాగంగానే... కాంగ్రెస్‌ అత్యున్నత బాడీ సీడబ్ల్యూసీలో తెలంగాణ నేతలకు పదవులు దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సీడబ్ల్యూసీలో ఒకరికి... మరొకరికి ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ పదవులు దక్కనున్నాయి. ఇద్దరిని కార్యదర్శి పదవులు వరించనున్నాయి. మరొకరికి ఏఐసీసీ అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించేందుకు అధిష్టానం సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది.

సామాజికవర్గ నేతలకు ప్రాధాన్యత
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. అన్ని సామాజికవర్గ నేతలకు ప్రాధాన్యత కల్పించేలా కూర్పు చేసినట్టు సమాచారం. సీడబ్ల్యూసీలో మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డికి అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. జనరల్‌ సెక్రెటరీ పదవి కోసం చాలామంది నేతలు క్యూలో ఉన్నా... పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు అవకాశం దక్కినట్టు సమాచారం. ఇక పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ విజయశాంతిని యాక్టివ్‌ చేసేందుకు అధిష్టానం డిసైడ్‌ అయ్యింది. ఇప్పటికే హైకమాండ్‌ ఆమెతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇద్దరు ఏఐసీసీ సెక్రెటరీలలో విజయశాంతికి అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్‌ కూడా అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్‌కు ప్రమోషన్‌ ఇవ్వాలని నిర్ణయించిన అధిష్టానం... ఆయనను ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఢిల్లీకి పంపనుంది.

పదవులకు రాహుల్ గ్రీన్‌సిగ్నల్‌
ఏఐసీసీ పదవులతోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త పదవులకు రాహుల్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పీసీసీ సారథ్య బాధ్యతలు మోస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలకు అదనంగా మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను నియమించబోతున్నట్టు సమాచారం. ఈ పదవి బీసీకి ఇవ్వాలని డిసైడ్‌ అయిన రాహుల్‌... మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేరును ఇందుకు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పేరును ఖరారు చేశారు. మైనార్టీలకు దగ్గర కావాలని భావిస్తున్న కాంగ్రెస్‌.. మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ను పార్టీ కార్యక్రమాల్లో బిజీ చేయాలని డిసైడ్‌ అయ్యారు. మొత్తానికి 2019లో అధికారమే లక్ష్యంగా టీపీసీసీ పనిచేసేందుకు రాహుల్‌ సిద్ధం చేస్తున్నారు. సమర్థులైన నాయకులకు పార్టీ పదవులిచ్చి ఖుషీ చేయాలని చూస్తున్నారు.

 

07:25 - August 31, 2017

విజయవాడ : నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ఏపీలో రాజకీయ సమీకరణల మార్పుకు నాంది పలుకుతోంది. టీడీపీ భారీ మెజార్జీతో గెలవడంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీలోని ఒక వర్గం ఇప్పుడు పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేశాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో రెండు పార్టీలు అధికార భాగస్వాములుగా ఉన్నాయి. అయితే బీజేపీలోని ఒకవర్గం టీడీపీ ప్రభుత్వ విధానాలను ఎప్పుడూ వ్యతిరేకిస్తూ రావడంతో పాటు, విమర్శలు చేస్తూ వచ్చింది. రాష్ట్రం ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పోలవరంకు నిధులు ఇచ్చే విషయంలో రెండు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినా రెండు పార్టీ అధినాయకత్వాలు వాటంన్నిటికీ ఫుల్‌స్టాఫ్‌ పెట్టి, బంధాన్ని కొనసాగిస్తూ వచ్చాయి.

టీడీపీ, బీజేపీల మధ్య దూరం
అయితే వైసీపీ అధినేత జగన్‌ గత జూన్‌లో ప్రధాని మోదీని కలిసి, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకి మద్దతు ప్రకటించిన తర్వాత టీడీపీ, బీజేపీల మధ్య మళ్లీ కొద్దిగా దూరం పెరిగింది. వైసీపీ.. బీజేపీకి చేరువ అవుతున్నట్టు ప్రచారం జరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీతో ప్రయాణమంటూ ఏపీ కమలనాథుల్లో కొందరు ప్రచారం కూడా చేశారు. కొన్నిసందర్భాల్లో ఒంటరిపోరు అంటూ బాహాటంగానే ప్రకటించారు. పొత్తుల విషయం ఎన్నికలప్పుడంటూ చెప్పుకొచ్చారు. అయితే నంద్యాల ఫలితం తర్వాత బీజేపీ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చినట్టు భావిస్తున్నారు.

బంధం బలపడింది
రాయలసీమలో పట్టున్న వైసీపీని ఓడించి, నంద్యాలలో టీడీపీ గెలవడంతో... తెలుగుదేశం బీజేపీ మధ్య బంధం మరింత బలపడినట్టు భావిస్తున్నారు. నంద్యాలలో గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలపడంతోపాటు ఎన్డీయేలో టీడీపీ బలమైన భాగస్వామని ట్వీట్‌ చేయడం ద్వారా రెండు పార్టీల మధ్య సంబంధాలు మరింత మెరుగైనట్టు విశ్లేషిస్తున్నారు. నంద్యాలలో టీడీపీకి భారీ మెజార్టీ రావడంతో వైసీపీ కన్నా టీడీపీయే మేలన్న భావన బీజేపీలో పెరిగింది. పైగా ఈ ఫలితం తర్వాత చీటికి మాటికి టీడీపీని గుడ్డిగా వ్యతిరేకిస్తూ వస్తున్నబీజేపీలోని ఓ వర్గం ఇప్పుడు సైలెంట్‌ అయింది. మున్ముందు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమలనాథులు నోరు తెరిచే అవకాశం లేకుండా నంద్యాల ఫలితం కట్టడి చేసిందని భావిస్తున్నారు. 

07:23 - August 31, 2017

 

గుంటూరు : నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల వ్యూహాలు, ప్రచారంలో బిజీగా గడిపిన మంత్రులు మళ్లీ విధుల్లోకి వచ్చేశారు. దీంతో వెలగపూడిలోని సచివాలయ ప్రాంతం మళ్లీ సందడిగా మారింది. నువ్వానేనా అన్నట్టు సాగిన నంద్యాల ఉప ఎన్నిక సమరంలో ఏపీ మంత్రులు సొంతపార్టీ తరపున జోరుగా ప్రచారం చేశారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దాదాపు నెల రోజుల పాటు నంద్యాల ఎన్నికల పైన మంత్రులు అందరూ దృష్టిపెట్టారు. పరిపాలనకు తాత్కాల బ్రేక్‌ వేసి పార్టీ పనిలోనే పూర్తిగా నిమగ్నమయ్యారు.

అహర్నిశలు పనిచేశారు
సీఎం చంద్రబాబు , విపక్షనేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో బాబు మంత్రివర్గ సహచరులు...సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, భూమా అఖిలప్రియ, కె.ఇ. క్రిష్ణమూర్తి, కాలువ శ్రీనివాసులు, అమర్నాధరెడ్డి, ఆదినారాయణరెడ్డితోపాటు మంత్రినారాయణ, పరిటాల సునీత, నక్క ఆనంద్ బాబు, జవహర్, సిద్దా రాఘవరావు పార్టీవిజయం కోసం తీవ్రంగా కృషిచేశారు. వీరితోపాటు మంత్రిలోకేశ్‌ , కొల్లు రవీంద్ర, కిమిడి కళా వెంకట్రావ్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.పార్టీ అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు పనిచేశారు. మొత్తానికి నంద్యాల లో ఘనవిజయం సాధించడంతో మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు.

సంతోషం వ్యక్తం చేసిన సీఎం
అటు కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా పార్టీ విజయంకోసం చంద్రబాబు మంత్రి వర్గం రంగంలోకి దిగింది. క్షణం తీరక లేకుండా.. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపుతూ, ఓటర్లు, సామాజిక వర్గల నేతలను మోటివేట్‌ చేశారు. మంత్రులు చిన్నరాజప్ప, పత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ, జవహర్, గంటా శ్రీనివాసరావుతోపాటు ,మంత్రి మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, యనమల రామక్రిష్ణుడు, సిద్దా రాఘవరావు విస్తృతంగా ప్రచారం చేశారు. వీరితోపాటు మంత్రులు నక్క ఆనందబాబు, కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర కూడా టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. కాకినాడలో కూడా పార్టీకి విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారంతో ముఖ్యమంత్రితోపాటు, మంత్రివర్గం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పాలనను గాలికొదిలేశారని
మంత్రులందరూ ఎన్నికల ప్రచారం బడలిక తీర్చుకుని మరోసారి పరిపాలనపై దృష్టిపెట్టారు. కొందరు మంత్రులు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ఖుషీగా ఉండగా.. నెలరోజులపాటు పాలనను గాలికొదిలేశారని.. విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

Don't Miss