Activities calendar

01 September 2017

సత్వరం న్యాయం చేయాలి : సుప్రీంకోర్టు

విశాఖ : జిల్లాలోని వాకపల్లి ఆదివాసి మహిళలపై జరిగిన అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అపరిమిత జాప్యం జరిగినందుకు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు నిందితులైన 13 మంది గ్రేహౌండ్స్ పోలీసులపై విచారణ జరిపి తీరాలని ఆదేశించింది. పోలీసులు వేసిన క్వాష్ పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ శాంతానా గౌండర్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. సంబంధిత ట్రయల్ కోర్టు ఈ కేసు విచారణను 6 నెలలలోపు పూర్తి చేసి సత్వరం న్యాయం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

21:58 - September 1, 2017
21:56 - September 1, 2017

సంగారెడ్డి : జిల్లాలోని ఆందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు కోపం వచ్చింది. రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుపై పుల్కల్‌ మండలం చౌటుకూర్‌లో జరిగిన అవగాహన  సదస్సులో అన్నదాతలపై ఆగ్రహంతో ఊగిపోయారు.  బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధినన్న విషయం మర్చిపోయి బూతు పురాణం లంకించుకున్నారు. తాను వేషం వేసి నటిస్తే డబ్బులిస్తారని, మీరేమిస్తారంటూ రైతులను ప్రశ్నించారు.
 

21:53 - September 1, 2017

విశాఖ : జిల్లాలోని వాకపల్లి ఆదివాసి మహిళలపై జరిగిన అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అపరిమిత జాప్యం జరిగినందుకు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు నిందితులైన 13 మంది గ్రేహౌండ్స్ పోలీసులపై విచారణ జరిపి తీరాలని ఆదేశించింది.పోలీసులు వేసిన క్వాష్ పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ శాంతానా గౌండర్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. సంబంధిత ట్రయల్ కోర్టు ఈ కేసు విచారణను 6 నెలలలోపు పూర్తి చేసి సత్వరం న్యాయం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2007 ఆగస్టు 20న 21 మంది గ్రేహౌండ్స్ పోలీసులు వాకపల్లికి చెందిన 11మంది ఆదివాసీ స్త్రీలపై అత్యాచారానికి పాల్పడ్డారు. స్ధానిక ఎమ్మెల్యే సహకారంతో బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సబ్ కలెక్టర్ ఆదేశాలతో 21 మంది పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పటి నుంచి బాధిత మహిళలు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. 11 మందిలో ఇద్దరు చనిపోయారు. 

 

21:51 - September 1, 2017

సూర్యాపేట : ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, ప్రజా వ్యతిరేక విధానాలను పాట, మాట రూపంలో ఎండగట్టినందుకు కవి, గాయకుడికి చేతులకు సంకెళ్లు వేశారు. తెలంగాణ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడం వల్లే సోమన్నపై కంటగింపుకు పాల్పడారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా మారారు. ఎమ్మెల్యే సతీమణికీ పోలీసులు జీహుజూర్‌ అంటోన్నారు. తెలంగాణ కవి, గాయకుడు ఏపూరి సోమన్నకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీసులు సంకెళ్లు వేశారు. చేతులకు బేడీలు వేసి పోలీసు స్టేషన్ లోని లాకప్ కు కట్టేశారు. టెర్రరిస్టులను బంధించినట్లు స్టేషన్ లో బంధించారు. సోమన్న గత కొంతకాలంగా తెలంగాణ సర్కారు వైఫల్యాలను, కుటుంబ పాలనను తన పాట, మాట, రాతలతో ఎండగడుతున్నారు. ఆకాశమే హద్దుగా సర్కారుపై ఆయన పోరుబాట సాగిస్తున్నారు. తెలంగాణ సర్కారుకు ఆయన కంటగింపుగా మారారు. సోమన్న కుటుంబంలో కలహాలను ఆసరాగా తీసుకొని.. నకిరెకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భార్య పుష్ప... సోమన్న చేతులకు సంకెళ్లు వేయించి అరెస్ట్ చేయించారు. తీవ్రమైన నేరాలు చేసిన వారిని కూర్చోబెట్టినట్లు బేడీలతో కూర్చోబెట్టడంపై కవులు, కళాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబంలో వివాదాన్ని సాకుగా చూపి తనను వేధిస్తున్నారని సోమన్న ఆరోపించారు. ఎమ్మెల్యే భార్య పోలీసులపై ఒత్తిడి తెచ్చి తనకు సంకెళ్ళు వేయించారని అన్నారు. పీఎస్‌లో ఎమ్మెల్యే భార్య  పంచాయతీకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:33 - September 1, 2017

చెప్పుకోటానికి గొప్పలు చాలా ఉంటాయి.. ఒక్కోనగరం నెత్తిపై కీర్తికిరీటాలు చాలా ఉంటాయి. అవన్నీ మామూలు సందర్భాల్లోనే.. కాస్త తేడా వచ్చినా... అల్లకల్లోలం కావల్సిందే. నగర వాసి  ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమనాల్సిందే. ముంబయి, చెన్నై, హైదరాబాద్.. ఏ నగరం ఈ ఘనత నుంచి అతీతం కాదు.. అన్నిటికీ మాంచి ట్రాక్ రికార్డులున్నాయి. ఇప్పుడు ముంబయి వంతు నడుస్తోంది అంతే. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం...
స్తంభించిన జనజీవనం.. 
స్తంభించిన జనజీవనం.. అస్తవ్యవస్తమైన రవాణా వ్యవస్థ... కనీస సౌకర్యాలు కూడా కరువైన దృశ్యం.. ప్రజలంతా విలవిల్లాడుతున్న పరిస్థితి.. ఒక్కమాటలో చెప్పాలంటే,  భారీ వర్షాలకు ముంబయి చిత్తయింది. ఎందుకీ పరిస్థితి ఏర్పడింది? మన నగరాలకు భారీ వర్షాలను తట్టుకునే శక్తి లేదా? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:30 - September 1, 2017

కేంద్ర కేబినెట్ విస్తరణకు ఏర్పాట్లు సుర్వు, బడాయి మాటలు జెప్తున్న నారా బాబుగారు, బత్కమ్మ పండుగకు చీరెల పంపిణీ, ఆడోళ్లను గోకుతున్నసర్పంచ్ గారు, నడిరోడ్డు మీద బోర్ల వడ్డ బీరు సీసల లారీ...ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పలువురిని ఆయన కలవనున్నారు. 

21:23 - September 1, 2017

కాకినాడ ఎన్నికల ఫలితాలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యాక్రమంలో రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత సత్యానారాయణ మూర్తి, వైసీపీ నేత కొణిజేటి రమేష్ పాల్గొని, మాట్లాడారు. అలాగే కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

21:15 - September 1, 2017

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌3న ఆదివారం ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా నలుగురు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. దత్తాత్రేయను కూడా రాజీనామా చేయాలని బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా కోరగా ఆయన తిరస్కరించినట్లు సమాచారం. ఆయన స్థానంలో మురళిధర్‌రావును నియమించే అవకాశం ఉంది. పార్టీ ఆదేశాల మేరకే రాజీనామా చేసినట్లు మాజీ మంత్రులు చెబుతున్నారు. మంత్రివర్గంలో కొత్త ముఖాలకు చోటు దక్కే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి నరేంద్రమోది చైనా పర్యటనకు ముందు కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌ 3న ఆదివారం ఉదయం 10 గంటలకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

గురువారం రాత్రి ఆలస్యంగా నలుగురు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ, ఉమా భారతి, ఫగ్గన్‌సింగ్‌ కులస్తే, సంజీవ్‌ బలియాన్‌ తమ రాజీనామా పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదికి పంపారు. రాధా మోహన్‌సింగ్‌, కల్‌రాజ్‌ మిశ్రాలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. 75 ఏళ్లు దాటితే పదవులకు దూరంగా ఉండాలన్న బిజెపి నియమం మేరకు 76 ఏళ్ల మిశ్రా రాజీనామా చేయనున్నారు.

మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నది తన నిర్ణయం కాదని, పార్టీ నిర్ణయమని మాజీ కేంద్రమంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ తెలిపారు. పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.

రాజీనామా ఎందుకు తీసుకున్నారో తనకు తెలియదని మాజీ మంత్రి సంజీవ్ బలియాన్‌ అన్నారు. పార్టీ ఆదేశాలను పాటించడంలోనే తనకు సంతృప్తి ఉందన్నారు.

తాను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు వ‌స్తున్న వార్తల‌ను ఉమాభార‌తి ఖండించారు. అస‌లు ఆ అంశం త‌న దృష్టికే రాలేదని.. రాజీనామా అంశంపై తానేమీ మాట్లాడ‌లేన‌ని ఉమాభారతి ట్వీట్‌ చేశారు. దీనిపై సమాధానం పార్టీ చీఫ్‌ అమిత్‌ షానే చెబుతారని పేర్కొన్నారు.

మంత్రుల పనితీరు ఆధారంగా ప్రధాని మోది, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. పార్టీ రూపొందించిన కార్యక్రమాలను, ప్రభుత్వ పథకాలను మంత్రులు ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లారన్నది బేరీజు వేసుకుని కొందరు మంత్రులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. కనీసం 10 మంది మంత్రులపై వేటు పడే అవకాశముందని సమాచారం. మరికొద్ది నెలల్లో గుజరాత్‌, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు మంత్రివర్గంలో పెద్ద పీట వేయాలని బిజెపి భావిస్తోంది.

ఇప్పటికే మంత్రివర్గంలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, ఎన్డీయేలో కొత్తగా చేరిన మిత్రపక్షాలకు పదవులు ఇస్తారని తెలుస్తోంది. జెడియుకు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అన్నాడిఎంకెకు కాబినెట్‌ విస్తరణలో చోటు దక్కొచ్చు.  వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికవడం, అనిల్‌ దవే మరణం, మనోహర్‌ పరీకర్‌ గోవా సీఎంగా వెళ్లడంతో మూడు శాఖలు ఖాళీ అయ్యాయి.  రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు కూడా తన రాజీనామా అంశాన్ని ప్రధానికి ప్రస్తావించారు. అరుణ్‌జైట్లీ, నరేంద్రసింగ్‌ తోమర్, హర్షవర్ధన్‌, స్మృతీ ఇరానీల వద్ద రెండేసి శాఖలున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మంత్రుల శాఖలు మార్చడంతో పాటు కొత్త ముఖాలకు చోటు దక్కనుంది. 

ఎస్పీ త్యాగి సహా నలుగురిపై చార్జ్‌షీట్

ఢిల్లీ : అగస్టా హెలికాప్టర్ల స్కాంలో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మాజీ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్ ఎస్పీ త్యాగి సహా నలుగురిపై.. చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మొత్తం 30వేల చార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించింది. వీవీఐపీల కోసం 12 అగస్టా హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కాంట్రాక్ట్ కోసం.. యురోపియన్ మధ్యవర్తులు.. త్యాగీ సోదరుని ఖాతాలో పలుమార్లు నగదు జమ చేశారు. 

20:59 - September 1, 2017

ఢిల్లీ : అగస్టా హెలికాప్టర్ల స్కాంలో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మాజీ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్ ఎస్పీ త్యాగి సహా నలుగురిపై.. చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మొత్తం 30వేల చార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించింది. వీవీఐపీల కోసం 12 అగస్టా హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కాంట్రాక్ట్ కోసం.. యురోపియన్ మధ్యవర్తులు.. త్యాగీ సోదరుని ఖాతాలో పలుమార్లు నగదు జమ చేశారు. 

 

13 కిలోల బంగారం పట్టివేత

కృష్ణా : విజయవాడలో రైల్వే స్టేషన్ లో 13 కిలోల బంగారం పట్టుకున్నారు. హౌరా...తిరుచునాపల్లి ఎక్స్ ప్రెస్ లో రైల్లో బంగారం పట్టుకున్నారు. హౌరా నుంచి నెల్లూరుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

 

పోలవరం నిర్వాసితుడు ఆత్మహత్యాయత్నం

పశ్చిమగోదావరి : కుక్కనూర్ మండలం కొండపల్లిలో పోలవరం నిర్వాసితుడు వెంకటేశ్వరావు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పునరావాస ప్యాకేజీ జాబితాలో తనను స్థానికేతరుడిగా నమోదు చేయడంపై మనస్తాపం చెందిన వెంకటేశ్వరావు పరుగుల మందు తాగాడు. 

 

ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్నకు సంకెళ్లు

సూర్యపేట : ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్నకు పోలీసులు సంకెళ్లు వేశారు. తీవ్రవాదిలా గొలుసులతో లాకప్ కు కట్టేశారు. కుటుంబంలో నెలకొన్న వివాదాన్ని సాకుగా చూపి తనను వేధిస్తున్నారని సోమన్న ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలగిరి పీఎస్ లో మూడు రోజుల క్రితం ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే సతీమణి పోలీసులపై ఒత్తిడి తెచ్చి తనకు సంకెళ్లు వేయించిందని సోమన్న ఆరోపించారు. పోలీసుల తీరుపై కవులు, కళాకారులు మండిపడుతున్నారు. 

 

వినాయకుడి విగ్రహం ఊరేగింపును అడ్డుకున్న అగ్రవర్ణాలు

గుంటూరు : క్రోసూరు మండలం బయ్యవరంలో ఉద్రికత్త నెలకొంది. వినాయకుడి విగ్రహం ఊరేగింపును అగ్రవర్ణాలు అడ్డుకున్నారు. దళితులు, అగ్రవర్షాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

 

20:27 - September 1, 2017

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో భారీ హిట్ అందుకున్న బాలయ్య 101 వ సినిమాగా డాషింగ్ డైరెక్టర్ పూరి డైరెక్షన్ లో పైసా వసూల్ అనే మాస్ మసాలా సినిమా చేస్తున్నాడు అనగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక స్టంపర్ పూరి స్టైల్ లో సూపర్ గా ఉండడంతో,ట్రైలర్ చాలా కొత్తగా అనిపించడంతో ఈ సినిమా గురించి ఫాన్స్ తో సహా అంతా క్యూరియస్ గా వెయిట్ చేసారు.అలా అంతా ఏంహో ఆతృతగా ఎదురు చూసిన ఈ సినిమా ఈ రోజు విడుదలయింది. ఎలాంటి రిజల్ట్ సాధించిందో ఇప్పడు చూద్దాం.ఈ సినిమా కథ విషయానికి వస్తే క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తేడా సింగ్ తీహార్ జైలు నుండి రీలీజ్ అయ్యి హైదరాబాద్ వస్తాడు.అయితే అనుకోకుండా అతనికి వరల్డ్ నోటోరియస్ క్రిమినల్ అయిన బాబ్ మార్లీ గ్యాంగ్ తో గొడవ జరుగుతుంది.ఆ టైం లో తేడా సింగ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు అతని క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ని తెలుసుకుని అతన్ని వాడుకుని బాబ్ మార్లీ గ్యాంగ్ ని పట్టుకోవాలనుకుంటారు.అయితే తేడా సింగ్ అదే విషయాన్ని ఆ గ్యాంగ్ కి చెప్పి వాళ్ళతోనే ఫ్రెండ్ షిప్ చేస్తాడు.కానీ బాబ్ మార్లీ గ్యాంగ్ తన గర్ల్ ఫ్రెండ్ ఆయన హారిక ను కిడ్నాప్ చెయ్యడంతో వాళ్ళను కొట్టి ఆమెను కాపాడతాడు.కానీ అతన్ని కాపాడిన తేడా సింగ్ ని కాల్చేస్తుంది హారిక.హారిక తేడా సింగ్ ని ఎందుకు చంపాలనుకుంది?,తేడాసింగ్ కి హారిక కుటుంబానికి సంబంధం ఏమిటి?ఇంతకీ అసలు తేడా సింగ్ ఎవరు?,అతని గతం ఏమిటి అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.నటీ నటుల విషయానికి వస్తే ఈ సినిమా కి వచ్చిన వాళ్లకు పైసా వసూల్ అనే ఫీలింగ్ కలిగిస్తుంది బాలయ్య యాక్షన్.పూరి రాసిన టిపికల్ హీరో క్యారెక్టర్ ని చాలా నమ్మి,బాగా హార్డ్ వర్క్ చేసి స్క్రీన్ పై యాస్ ఇట్ ఈజ్ ప్రెజెంట్ చేసాడు బాలయ్య.పూరి మార్క్ డైలాగ్స్ ని,మ్యానరిజమ్స్ ని బాలయ్య చెప్పిన తీరు,చేసిన స్టైల్ ఆశ్చర్యం కలిగిస్తుంది.వంద సినిమాలు చేసిన బాలయ్య కూడా కొత్తగా కనిపిస్తాడు.ఇక హీరోయిన్స్ ముస్కాన్ సేథీ,ఐటెం సాంగ్ చేసిన కైరా దత్ లు కేవలం తెరపై గ్లామరస్ గా కనిపించడానికే పరిమితమయ్యారు.ఇక మెయిన్ లీడ్ అయిన శ్రేయ కి కూడా పెద్ద గా ప్యాదాన్యత ఉన్న క్యారెక్టర్ దక్కలేదు.బాలీవుడ్ యాక్టర్ కబీర్ బేడీ కి కూడా సాధారణ పాత్రా మాత్రమే దక్కింది.ఇక అలీ,పృథ్వి లాంటి కమెడియన్స్ ఉన్నా కూడా పెద్దగా యూజ్ చేసుకోలేదు.మిగతా నటీ నటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు.ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి స్టోరీ,స్క్రీన్ ప్లే,డైలాగ్స్ రాసుకుని డైరెక్ట్ చేసిన పూరి గురించి చెప్పుకోవాలి.ఈ మధ్య చాలా పేలవమయిన సినిమాలు చేస్తూ నిరుత్సాహ పరుస్తున్న పూరి ఈ సారి కొంచెం కష్టపడ్డాడు.స్టోరీ పరంగా పెద్దగా కసరత్తు చెయ్యకపోయినా తేడా సింగ్ క్యారెక్టర్ ని మలచడంలో,దానికి తగ్గ డైలాగ్స్ రాసి మెప్పించడంలో పూరి సక్సెస్ అయ్యాడు.కాకపోతే కొన్ని బాలయ్య ఏజ్ కి మ్యాచ్ అవ్వని సీన్స్,పూర్తిగా లాజిక్ లేకుండా నడిచి పోయే సీన్స్ మాత్రం ఇబ్బందికరంగా అనిపిస్తాయి.ఇప్పటివరకు మెలోడియస్ మ్యూజిక్ కి ఎంబ్లెమ్ లా ఉన్న మ్యూజిక్  డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా ఆర్.ఆర్ తో అలరించాడు.ఇక ముఖేష్ కెమెరా వర్క్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి.సినిమాకు రిచ్ లుక్ ని,బాలయ్యకి కొత్త లుక్ తీసుకురావడంలో అతని కృషి చాలా ఉంది.పోర్చుగల్ ఎపిసోడ్ లో అతని పనితనం కనిపిస్తుంది.ఇక హీరోయిజం ఎలివేట్ చేసే హై స్పీడ్ షాట్స్ లో ప్రత్యేకత కనిపిస్తుంది.ఇక భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు బావున్నాయి.ఓవర్ ఆల్ గా చెప్పాలంటే బాలయ్య కోసం ఒక టిపికల్ క్యారెక్టర్ రాసుకుని ఫాన్స్ అంతా  ఆమోదించేలా దానిని తీర్చి దిద్ది పైసా వసూల్ అనే సినిమా చేసాడు పూరి.మాస్ ఆడియెన్స్ కి కూడా కిక్ ఇచ్చే పూరి మార్క్ పంచ్ డైలాగ్స్,కొత్తగా అనిపించే తేడా సింగ్ క్యారెక్టరైజేషన్ కనెక్ట్ అయిన వారికి పైసా వసూల్ అయిన ఫీలింగ్ వస్తుంది.అలాగే మాస్ ఎలిమెంట్స్ దట్టించడంలో కూడా పూరి చాలా వరకు సక్సెస్ అయ్యాడు.అయితే కథ పరంగా కొంచెం కేర్ తీసుకుని పోకిరి ఛాయలు కనిపించకుండా సినిమా తీసుంటే రిజల్ట్ మరోలా ఉండేది.ప్రస్తుతానికయితే ఒక సగటు అభిమానిగా పూరి తీసిన ఈ సినిమా చూసి బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.మిగతా వర్గాలవారికి ఈ సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి.

ప్లస్ పాయింట్స్:
బాలయ్య నటన ,  క్యారెక్టర్
పూరి డైలాగ్స్ 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
కెమెరా వర్క్ 
నిర్మాణ విలువలు 

మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
లాజిక్స్ లేని స్క్రీన్ ప్లే  
పోకిరిని పోలిన ట్విస్ట్ 
ఎక్సైట్ చెయ్యని ఫ్లాష్ బ్యాక్
ఎక్కువయిన యాక్షన్ సీక్వెన్సెస్  
   
రేటింగ్ .. 2.25/5

20:22 - September 1, 2017

చిత్తూరు : తిరుమలలో సర్వదర్శనం భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లలో ఉండాల్సిన అవసరం లేకుండా వారి కోసం కొత్త టైం స్లాట్ విధానం అమలులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. డిసెంబర్ మొదటివారంలో ప్రయోగాత్మకంగా ఈ స్లాట్‌లు కేటాయించి పరిశీలిస్తామని ఆయన తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఇబ్బంది పడకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అనిల్ సింఘాల్ చెప్పారు. ఈరోజు తిరుమలలో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో సింఘాల్‌తో పాటు జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు. 

20:20 - September 1, 2017

హైదరాబాద్ : రెవెన్యూ వ్యవస్థను నీరుగార్చే జీవో నెంబర్ 39ని వ్యతిరేకిస్తున్నట్టు తెలంగాణ టీడీపీ ప్రకటించింది. రైతు సమన్వయ సమితుల పేరుతో రాజ్యాంగేతర శక్తులను సృష్టిస్తున్నారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంత్రివర్గం ఆమోదం లేకుండా విడుదల చేసిన జీవో 39కి వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటున్నారు. 

20:15 - September 1, 2017

కరీంనగర్ : అన్నదాతల సమస్యల పరిష్కారం కోసమే రైతు సమాఖ్యలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం కనుకులగిద్దలో రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై జరిగిన అవగాహన కార్యక్రమానికి ఈటెల  హాజరయ్యారు. ఈ సందర్భంగా  రైతు సమాఖ్యల ఆవశ్యకతను వివరించారు. 

 

20:12 - September 1, 2017
20:11 - September 1, 2017

కరీంనగర్ : సామాన్య ప్రజలకు జీవిత భీమా అందించే లక్ష్యంతో ఎల్‌ఐసీ పనిచేస్తోందని ఆ సంస్థ మార్కెటింగ్ మేనేజర్ వెంకటేశ్వర్లు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 61వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో కరీంనగర్‌లో జరిగిన వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. పాలసీదారుల సెటిల్‌మెంట్లలో ఎల్‌ఐసీ భారతదేశంలో మొదటిస్ధానంలో ఉందని వెంకటేశ్వర్లు చెప్పారు. 

 

20:09 - September 1, 2017

హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా కేసీఆర్ ముస్లింలకు బానిసగా మారిపోయారని విమర్శించారు బిజెపి సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి. కేసీఆర్ పాలనలో నిజాంను మించి తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అని కొత్త అర్ధం చెప్పారు. కేసీఆర్ ఖాసీం రజ్వీ పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు.

 

20:01 - September 1, 2017

గుంటూరు : అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లో మంచిపేరు తెచ్చుకుంటున్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ మైనింగ్ విషయంలో చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కున్న ప్లస్ పాయింట్సేమిటి? మైనస్ పాయింట్సేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్టు విశ్లేషణ చూద్దాం.

గురజాల పేరు చెప్పగానే కక్షలు, కార్పణ్యాలు గుర్తుకొస్తాయి. గుంటూరు జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పేరొందిన గురజాల అపార ఖనిజ సంపదకు నిలయం. సిమెంట్, సున్నపురాయి నిక్షేపాలను తన గర్భంలో దాచుకుంది గురజాల నియోజకవర్గం. వేల కుటుంబాలు ఈ పరిశ్రమలనే నమ్ముకుని జీవిస్తున్నాయి. 

1955లో ఏర్పడ్డ గురజాల నియోజకవర్గంలో ఆరు సార్లు కాంగ్రెస్, అయిదు సార్లు టిడిపి విజయం సాధించాయి. సిపిఐ, కృషిలోక్ పార్టీలు చెరోసారి గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి యరపతినేని శ్రీనివాస్ విజయం సాధించారు. ఇది ఆయనకు 5వ విజయం. 

గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల మండలాలు ఈ నియోజకవర్గంలో అంతర్భాగాలు.  2లక్షల 26వేల 376 మంది ఓటర్లున్న గురజాలలో మహిళా ఓటర్లు అధికం. నియోజకవర్గం ఓటర్లలో దాదాపు 44శాతం మంది బిసిలు. 

తాగునీటి సమస్యను పరిష్కరించడం, రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం, ఉపాధి కల్పనకు పరిశ్రమలు సాధించడం ఇలా అనేక హామీలిచ్చారు యరపతినేని శ్రీనివాస్. ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ఆయన మంచి మార్కులే సాధించారు. 

ఒకప్పుడు నడవడానికి వీలులేని గ్రామాల్లో ఇప్పుడు సీసీ రోడ్లు కనిపిస్తున్నాయి. తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు సాధించడం చాలావరకు సక్సెస్ అయ్యారు. తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కరించే బుగ్గవాగు రిజర్వాయర్ అభివృద్ధికి 450 కోట్ల రూపాయలు సాధించారు. అయితే, పనులు ఇంకా ప్రారంభం కాలేదు. 

పేద పిల్లల్ల పెళ్లిళ్లకు, చదువులకు సహాయం చేయడం, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి వైద్యం చేయించడం లాంటి సేవా కార్యక్రమాలతో ఆయన గురజాల ప్రజల్లో ఇమేజ్ పెంచుకుంటున్నారు. తన సహాయం కోరి వచ్చినవారికి పార్టీల కతీతంగా సాయం చేస్తారన్న మంచి టాక్ సంపాదించుకున్నారు యరపతినేని శ్రీనివాస్.

అభివృద్ధి, సేవా కార్యక్రమాల విషయంలో గుడ్ విల్ గెయిన్ చేసిన గురజాల ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన అనుచరుల చేత అక్రమ మైనింగ్ చేయిస్తూ, మూడేళ్లలోనే కోట్ల రూపాయలు సంపాదించారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రానికి హోంమంత్రి చినరాజప్ప అయితే, గుంటూరు జిల్లాకు హోం మంత్రి యరపతినేని శ్రీనివాస్ అంతా చెప్పుకుంటూ వుంటారు. ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు ఏ బదిలీ జరిగినా అది యరపతినేని శ్రీనివాస్  కనుసన్నల్లోనే జరుగుతోందన్నది పోలీస్ డిపార్ట్ మెంట్ లోనే వినిపించే టాక్. పరిశ్రమల ఏర్పాటుకు చొరవ ప్రదర్శించకపోవడం ఆయనకు మైనస్ పాయింట్ గా పరిణమిస్తోంది. 

గురజాల నియోజకవర్గంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం, వైసిపికి బలమైన నాయకుడు లేకపోవడం యరపతినేనికి కలిసొచ్చే అంశం. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి వైసిపి అభ్యర్థిగా రంగంలోకి దిగబోతున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. 

19:57 - September 1, 2017

శ్రీకాకుళం : సౌతాఫ్రికాలో ఉద్యోగాలిప్పిస్తానంటూ సుభాష్ అనే వ్యక్తిని తమను మోసం చేశాడంటూ శ్రీకాకుళం జిల్లా డొంకూరుకు చెందిన పలువురు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుభాష్ 19వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌గా ఉన్నాడని బాధితులు చెబుతున్నారు. తమ వద్ద లక్షల్లో డబ్బులు వసూలు చేసి రెండేళ్లైనా ఉద్యోగాలు ఇప్పించకుండా తిప్పుతున్నాడని యువకులు వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన చెందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

19:54 - September 1, 2017

నెల్లూరు : జిల్లాలోని అనంతసాగరం మండలం.. కామిరెడ్డిపాడులో విషాదం చోటుచేసుకుంది. నల్ల పెంచలయ్య అనే వ్యక్తి.. తన కుమార్తెలను బావిలోకి తోసేసి... తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు మృతి చెందారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. భార్య మరొకరికితో వెళ్లిపోయిందని... మనస్తాపానికి గురైన నల్ల పెంచలయ్య... తన ముగ్గురు కూతురులతో పురుగుల మందు తాగించి... ఊరి చివర ఉన్న బావిలోకి తోసేశాడు. అనంతరం పెంచలయ్య కూడా దూకేశాడు. అయితే ఈ ఘటనలో హరిత, కీర్తన ప్రాణాలు కోల్పోగా... పెంచలయ్య సురక్షితంగా బయటపడ్డాడు. మరో చిన్నారి ప్రేమ కుమారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

19:47 - September 1, 2017

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్వస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి ఉదయం పునర్వస్థీకరణ జరుగుతుంది.  మంత్రివర్గం నుంచి కొందరికి ఉద్వాసన పలుకుతారు. కొత్త కొందరికి స్థానం కల్పిస్తారు. పునర్వస్థీకరణకు వీలుగా ఇప్పటికే  ఐదుగురు మంత్రులు రాజీనామా చేశారు. ఉమాభారతి, రాజీవ్‌ప్రతాప్‌ రూడీ, కల్‌రాజ్‌ మిశ్రా, ఫగ్గన్‌సింగ్‌ కులస్తే, సంజీవ్‌ బలియాన్‌ మంత్రిపదవుల నుంచి తప్పుకున్నారు. మరికొందరు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.  పునర్వస్థీకరణలో ఏపీ నుంచి విశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు లేదా నరసాపురం ఎంపీ  గంగరాజుకు చోటు దక్కే అవకాశం ఉంది. టీడీపీ నుంచి ఒకరికి  సహాయ మంత్రి పదవి ఇచ్చే చాన్స్‌ ఉంది. తెలంగాణ నుంచి బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు శాఖ మారే అవకాశం ఉంది. సహాయ మంత్రులుగా ఉన్న పీయూష్‌గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌తోపాటు మరికొందరికి కేబినెట్‌ హోదా ఇచ్చే అవకాశం  ఉందని భావిస్తున్నారు. సురేశ్‌ ప్రభును రైల్వే శాఖ నుంచి తప్పించి, వేరే శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశంవుంది. రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి రైల్వే బాధ్యతలు కట్టబెట్టొచ్చని ప్రచారం జరుగుతోంది. జేడీయూ, అన్నా డీఎంకేలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయకు బీజేపీ అధిష్టానం షాక్‌ ఇచ్చింది. మంత్రిపదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. దత్తాత్రయే పనితీరుపై బీజేపీ అధినాయకత్వం అసంతృప్తితో ఉంది.

 

కేంద్రమంత్రి పదవికి దత్తాత్రేయ రాజీనామా

హైదరాబాబాద్ : బండారు దత్తాత్రేయ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. అమిత్ షా సూచనతో దత్తాత్రేయ రాజీనామా చేశారు. ఆదివారం కేంద్రకేబినెట్ విస్తరణ జరుగనుంది. 

19:37 - September 1, 2017

చిత్తూరు : దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపు ఇచ్చారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చనిన రాష్ట్రపతికి తిరుపతిలోని ఎస్వీ కాలేజీలో పౌర సన్మానం జరిగింది. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రపతికి సన్మానపత్రం అందజేశారు. ఇదే  వేదికపై నుంచి రామ్‌నాథ్‌ కోవింద్‌ రెండు కొత్త పథకాలు ప్రారంభించారు. స్టాండప్‌ ప్రోగ్రామ్‌ కింద మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూములు కొనిచ్చే ల్యాండ్‌ పర్చేజ్‌ పథకాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ రెండు కార్యక్రమాలను అమలు చేస్తున్న  ఏపీ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి అభినందించారు. 

 

పెరిగిన గ్యాస్ సలిండర్ ధర

ఢిల్లీ  : గ్యాస్ సలిండర్ ధరను పెంచారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పై రూ.7 పెంచారు. కేంద్రప్రభుత్వం ప్రతి సిలిండర్ పై నెలకు రూ.4 పెంచనుంది. 

19:30 - September 1, 2017

చిత్తూరు : రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. చదువుకున్న, ఉన్నతమైన వ్యక్తి రామ్ నాద్ కోవింద్ అని... ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కోవింద్ లో హంబుల్ నెస్, సింపుల్ సిటీ, సిన్సియారిటీ కనిపిస్తాయని చెప్పారు. కొంతమంది వ్యక్తులు ఆ పదవికి వన్నె తెస్తారని అలాంటి వ్యక్తుల్లో రామ్ నాథ్ కోవింద్ ముందుంటారని పేర్కొన్నారు. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండే దేశం భారత్ అని అన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో యంగ్ గా ఉండే దేశం భారత్ అని అన్నారు. ప్రపంచదేశాల్లోకెళ్ల భారతదేశంలోనే ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడే వారు ఉన్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తిరుపతిలో కాలేజీలున్నాయని తెలిపారు. దేశ అధ్యక్షునికి మనమతా అండగా ఉండాలని కోరారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రామ్ నాద్ కోవింద్ పై సీఎం చంద్రబాబు ప్రశంసలు

చిత్తూరు : రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. చదువుకున్న, ఉన్నతమైన వ్యక్తి రామ్ నాద్ కోవింద్ అని... ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కోవింద్ లో హంబుల్ నెస్, సింపుల్ సిటీ, సిన్సియారిటీ కనిపిస్తాయని చెప్పారు. కొంతమంది వ్యక్తులు ఆ పదవికి వన్నె తెస్తారు.. అలాంటి వ్యక్తుల్ల రామ్ నాథ్ కోవింద్ ముందుంటారని చెప్పారు.

19:18 - September 1, 2017
19:17 - September 1, 2017

హైదరాబాద్ : దత్తాత్రేయకు బీజేపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. కేంద్రమంత్రి పదవికి రాజీనామా‌ చేయమని... పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచించారు. అయితే దీనికి దత్తన్న విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కేబినెట్ పునర్ వ్యవస్తీకరణలో భాగంగా.. పని తీరు సరిగా లేని మంత్రులతో అమిత్ షా రాజీనామాలు చేయిస్తున్నారు. ఇప్పటివరకు ఐదుగురు కేంద్రమంత్రులు రాజీనామాలు సమర్పించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:11 - September 1, 2017

విశాఖ : ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు ఉద్యమిస్తామని సీఐటీయూ నేతలు అన్నారు. 'సేవ్ పబ్లిక్ సెక్టార్..సేవ్ విశాఖ' పేరుతో సీఐటీయూ ఆధ్వర్యంలో విశాఖలోని గాజువాక సెంటర్‌లో 10 లక్షల సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడమంటూ సీఐటీయూ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడమే లక్ష్యంగా..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని నేతలు మండిపడ్డారు. విశాఖలో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే లక్ష్యంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామంటున్నారు. స్టీల్ ప్లాంట్ మాజీ డైరెక్టర్ కె.కె.రావుతో పాటు సీఐటీయూ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

నెల్లూరు జిల్లాలో విషాదం

నెల్లూరు : జిల్లాలో విషాదం నెలకొంది. కుమార్తెలను హత్య చేసి.. తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరు బాలికలు మృతి చెందారు. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. తండ్రి చెంచలయ్య ప్రాణాలతో బయటపడ్డారు.
  

17:51 - September 1, 2017

కడప : ఎల్‌ఐసీ 61వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కడపలో వారోత్సవాలను జిల్లా కలెక్టర్ బాబురావునాయుడు ప్రారంభించారు. 60 సంవత్సరాలుగా ప్రజల డబ్బుకు సెక్యూరిటీ కల్పిస్తూ.. మంచి సేవలు అందిస్తున్న ఎల్‌ఐసీకి ఆయన అభినందనలు తెలిపారు. సంస్థ మారుమూల గ్రామాల ప్రజల్లోకి సైతం వెళ్లి.. అక్కడి ప్రజలకు కూడా భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ సూచించారు. 

 

17:50 - September 1, 2017

హైదరాబాద్ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 61 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని ఎల్‌ఐసీ కార్యాలయంలో వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, ఎల్‌ఐసీ డివిజనల్ మేనేజర్ జి.బాబురావు పాల్గొన్నారు. వ్యక్తి జీవిత భద్రతకు ఎల్‌ఐసీ ఎంతటి ప్రాముఖ్యతనిస్తుందన్న అంశంపై వక్తలు మాట్లాడారు. 

17:46 - September 1, 2017

హైదరాబాద్ : రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రైతు పోరాట సమన్వయ కమిటీ రాష్ట్ర నేత సాగర్ విమర్శించారు. రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సాగర్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చిన మోదీ వాటిని అమలు చేయలేమని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయడం దారుణమని ఆరోపించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16న కిసాన్ విముక్తి యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 

 

17:39 - September 1, 2017

హైదరాబాద్ : ఈ నెల ఐదో తేదీన జరగనున్న ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు 4న నిమజ్జనం ట్రయల్‌ రన్ రిహార్సల్స్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఎటువంటి అసౌకర్యంగా కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

ఆథార్ ఎపుడైర రద్దు కావచ్చు..!?

ఢిల్లీ:  వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కుల కిందకే వస్తుందని సుప్రీం కోర్టు ఆగస్టు 24, 2017న స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ స్కీమ్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని సుప్రీం కోర్టులో ఈ అంశంపై వాదిస్తున్న ప్రసన్న చెప్పారు. 2016లో ఆధార్‌కు ఏ చట్టబద్ధత లేదు. 2016కు ముందు సేకరించిన సమాచారం ఏ చట్టాన్ని అనుసరించి చేయలేదు. ఈ తీర్పు ప్రభావం చాలా పథకాలపై ఉండొచ్చని ప్రసన్న అన్నారు. భవిష్యత్తులోనూ దీని ప్రభావం ఉండొచ్చన్నారు.

17:37 - September 1, 2017

తూర్పుగోదావరి : కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో.. టీడీపీ కూటమి సత్తా చాటింది. 35 డివిజన్లలో చరిత్రాత్మక విజయంతో.. కాకినాడ పీఠంపై పసుపు జెండా రెపరెపలాడింది. రాష్ట్రంలో రాజకీయ వేడిపుట్టించిన ఈ ఎన్నికల్లో.. నగరపాలక సంస్థను తెలుగుదేశం కైవసం చేసుకోవడంతో.. పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. 
30 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఎన్నికలు 
కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రజలు పసుపు పార్టీకే పట్టం కట్టారు. 30 ఏళ్ల సుదీర్ఘ కాలం తరువాత కాకినాడ మేయర్‌ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. పుష్కర కాలం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో.. ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. మొత్తం 48 డివిజన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి ఎక్కువ స్థానాలను సంపాదించి.. విజయ ఢంకా మోగించింది. 
35 స్థానాల్లో టీడీపీ కూటమి గెలుపు 
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలో దూసుకుపోయిన టీడీపీ కూటమి అభ్యర్థులు.. 35 స్థానాల్లో గెలుపొందారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైసీపీ 10 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. 
బరిలో 241 మంది అభ్యర్ధులు 
ఓట్ల లెక్కింపు కోసం రంగరాయ వైద్య కళాశాలలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఆగస్టు 29న జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో మొత్తం 48 డివిజన్లకు సంబంధించి.. 241 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 1, 48, 598 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
టీడీపీ శ్రేణుల ఆనందోత్సవం  
కాకినాడ నగర పాలక ఎన్నికల్లో టీడీపీ చరిత్రాత్మక విజయంతో.. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కూడా ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. సచివాలయంలో సీఎం చంద్రబాబు.. ఈ గెలుపుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరినీ అభినందించారు. పలువురు నేతలకు మిఠాయిలు పంచుతూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కిమిడి కళా వెంకట్రావు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ, టీడీ జనార్ధన్‌ తదితరులు ఉన్నారు. 
మొత్తం 48 డివిజన్లు  
కాకినాడ పురపాలక సంస్థలో మొత్తం 48 డివిజన్లకు గాను.. టీడీపీ కూటమిలో టీడీపీ 32 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందింది. ప్రతిపక్ష వైసీపీ నేతలు 10 స్థానాల్లో విజయం సాధించారు. ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు. 30 ఏళ్ల తర్వాత టీడీపీ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది.   

'నూజివీడు ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ వాస్తవమే '

కృష్ణా : నూజివీడు ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ వాస్తవమే అని డైరెక్టర్ ఆచార్య వెంకటదాసు తెలిపారు. జూనియర్లను సీనియర్లు ర్యాగించేశారని, వారికి ట్రిపుల్ ఐటీ సిబ్బంది కూడా సహకరించారని చెప్పారు. ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలుంటయని కూడా బెదిరించారని తెలిపారు. ర్యాగింగ్ కు పాల్పడిన ఆరుగురు విద్యార్థులను గుర్తించామని, వారి పై చర్యలు తీసుకుంటామన్నారు.

17:32 - September 1, 2017

చిత్తూరు : రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుమల, తిరుపతికి విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఘనస్వాగతం లభించింది. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. సీఎంతో పాటు మంత్రులు, అచ్చెన్నాయుడు, దేవినేని, లోకేశ్‌, అమర్‌నాథ్‌రెడ్డి, కళా వెంకట్రావు, పితాని సత్యనారాయణ స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం తిరుచానూరు ఆలయాన్ని రాష్ట్రపతి దర్శించుకుంటున్నారు.

 

కేంద్ర మంత్రి పదవికి దత్తాత్రేయ రాజీనామా

ఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి దత్తాత్రేయ రాజీనామా చేశారు. దత్తాత్రేయను గవర్నర్ గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం...

గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది....

ఢిల్లీ: వంట గ్యాస్‌ వినియోగదారుడిపై మళ్లీ గ్యాస్‌ ‘బండ' భారం పడింది. క్రమంగా వంట గ్యాస్‌ సబ్సిడీ ఎత్తివేసే పథకాన్ని మరింత వేగవంతం చేసిన కంపెనీలు మరోసారి ధరలను సమీక్షించాయి. ప్రతి నెలా ధరల పెంపు నిర్ణయంలో భాగంగా ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను భారీగా పెంచేశాయి. శుక్రవారం ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం నాన్‌-సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.73.5 , సబ్సిడీ సిలిండర్‌ రూ. 7 ల మేర పెరగనుంది.

కేంద్ర మంత్రిసుజనా చౌదరికి పదవీ గండం!?

ఢిల్లీ: కేంద్ర మంత్రి పదవి నుండి సుజనా చౌదరిని తప్పించే యోచనలో ప్రధాని మోదీ ఉన్నట్లు తెలుస్తోంది. సుజనా చౌదరి పై ఆర్థిక నేరారోపణలు వున్న నేపథ్యంలో తొలగించి టిడిపిలో మరో నేతకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో బిజెపి పెద్దలు మంత్రాంగం చేస్తున్నట్లు సమాచారం.

సీఈసీ కమిషనర్ గా సునీల్ అరోరా నియామకం..

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ (సీఈసీ)గా మాజీ ఐఏఎస్ అధికారి సునీల్ ఆరోరా నియామకం అయ్యారు. అనంతయం సునీల్ ఎన్నికల సంఘం కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అచల్ కుమార్ జోతి, కమిషనర్లుగా ఓమ్ ప్రకావ్ రావత్, సునీల్ ఆరోరా కొనసాగుతున్నారు.

5వ తేదీన ప్రభుత్వ సెలవు...

హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 5వ తేదీన ప్రభుత్వ సెలవుగా ప్రకటించింది ప్రభుత్వం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఈ సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 5వ తేదీన సెలవు ప్రకటించినందున.. ఈ నెల 9న రెండో శనివారం పనిదినం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దత్తాత్రేయకు బిజెపి అధిష్టానం షాక్

ఢిల్లీ: దత్తాత్రేయకు బిజెపి అధిష్టానం షాక్ ఇచ్చింది. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయమని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దత్తాత్రేయ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. పని తీరు సరిగా లేని మంత్రులతో అమిత్ షా రాజీనామాలు చేయిస్తున్నారు.

16:34 - September 1, 2017

గుంటూరు : అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది.. ప్రభుత్వ శాఖలు అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. అధికారులు... అందినంత దోచుకుంటున్నారు. ఆ అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని... చేతులు దులుపుకుంటున్నారు. గుంటూరు జిల్లా ఉద్యానవన శాఖలో తాజాగా బయటపడిన అవినీతిపై 10టీవీ ప్రత్యేక కథనం.
జేబులు నింపుకుంటున్న అవినీతి అధికారులు
గుంటూరు జిల్లా.. ఉద్యానవన శాఖ అవినీతికి అడ్డాగా మారింది. సబ్సిడీ సొమ్ములో వాటాల కోసం కొందరు అధికారులు ఎగబడుతున్నారు. రైతులను బెదిరించి.. తమ జేబులు నింపుకుంటున్నారు. కడుపు మండిన అన్నదాతలు... జిల్లా అధికారుల అవినీతి బాగోతంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై దర్యాప్తు చేసిన ఉన్నతస్థాయి అధికారులు అవినీతి వాస్తవమేనని తేల్చి ... చర్యలకు ఉపక్రమించింది. 
లంచం డిమాండ్‌ చేసిన అధికారులు
జిల్లాలో... షెడ్‌ కల్టివేషన్ పద్ధతిలో నూతన వ్యవసాయ విధానాన్ని... ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు పలు రాయితీలను అందిస్తోంది. పరికరాలను, షెడ్‌ నిర్మాణాలకు రైతులకు కోట్ల రూపాయల్లో సబ్సిడీ అందిస్తోంది... అయితే రైతులకు ఆ రాయితీ సొమ్ము అందించేందుకు.. అందులో 20 నుంచి 30 శాతం వాటా ఇవ్వాలంటూ  అధికారులు డిమాండ్‌ చేశారు. దీంతో రైతులు ఉద్యానవన శాఖ ఉపసంచాలకుడు జయచంద్రారెడ్డిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. 
బయటపడ్డ భారీ అవినీతి
ఉప సంచాలకుడు జయచంద్రారెడ్డి  రూ.1.37 లక్షల రాయితీ సొమ్ము విడుదల చేయడానికి రూ.30వేలు డిమాండ్‌ చేశారని... ఆ సొమ్ము ఇవ్వనందున  రాయితీ సొమ్మును రూ.90వేలకు కుదించారని రైతులు ఆధారాలతో సహా అందించారు. దీంతో  రంగంలోకి దిగిన ఉద్యానవన శాఖ కమిషనర్‌ చిరంజీవి దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించారు. దర్యాప్తులో భారీ అవినీతి జరిగిందని తేలింది. ఈ మేరకు రాష్ట్ర కమిషనర్‌ చిరంజీవి ఉద్యానవన ఉప సంచాలకుడి పై సస్పెన్షన్‌ వేటు వేశారు. కాగా ఈ ఘటనలో ఉపసంచాలకుడు జయచంద్రారెడ్డిని మాత్రమే వేటు వేయడం... మిగిలిన అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

 

కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు.. చేర్పులు...!

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 10 నుంచి 12 మంది వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరికొందరు సీనియర్ల శాఖలు మారే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. పని తీరు బాగోలేని వారిని తొలగించే అవకాశం, 2019ఎన్నికలే లక్ష్యంగా కేబినెట్ పునర్వ్యస్థీకరణ జరుగుతుంది. పార్టీ బాధ్యతల్లోకి నిర్మలా సీతారామన్ వెళ్లనున్నారని, ఓం మాధూర్, సత్యపాల్ సింగ్, ప్రహ్లాద్ పటేల్, ప్రహ్లాద్ జోషి, వినయ్ సహస్రబుద్దేకు కేబినెట్ లో చోటు దక్కనున్నట్లు, ఏపీ నుంచి హరిబాబు లేదా గంగరాజుకు, తెలంగాణ నుంచి మురళీ ధర్ రావు పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

16:18 - September 1, 2017

శ్రీకాకుళం : 'మాకు గొడవలు వద్దు. పరిహారం ఇవ్వండి భూములు ఇచ్చేస్తాం'.. ఇదీ ప్రాజెక్టు నిర్వాసితుల మాట. పరిహారం సంగతి తర్వాత ముందు పంటపొలాలను మాత్రం నాశనం చేస్తాం.. అడ్డుకుంటే పోలీసులతో  చితకబాదిస్తాం.. ఇదీ ప్రభుత్వ తీరు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు ఇపుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం.. ప్రజల జీవితాలు ఛిద్రం 
శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జీవనాధరం అయిన భూములను నాశనం చేయకుండా ఆపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిల్‌ దాఖలు చేశారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తోంది. సహజంగా మా భూములు ఇవ్వం అని పలు రకనా పేచీలు పెట్టే గ్రామీణులు.. భూములిస్తాం మొర్రో అంటున్నా..ప్రభుత్వ తీరు మారడం లేదు. మాకు గొడవలు వద్దు.. పరిహారం ఇచ్చి భూములు తీసుకోండి అని మొరపొట్టుకున్నా.. పాలకులు పోలీసులతో బలప్రయోగం చేయస్తున్నారు. దీనిపై వంశధార నిర్వాసితులు భగ్గున మండిపడితున్నారు. అధికారపార్టీ నాయకుల కమీషన్లకోసం  పచ్చనిపల్లెల్లో చిచ్చుపెడుతున్నారని వాపోతున్నారు. గత ఇరవై రోజులుగా పోలీసు పహారా నడుమ వంశధార ప్రాజెక్ట్ పనులు జరిపించడంతో పాటు.. నిర్వాసిత గ్రామాల్లో బలగాల మోహరింపు స్థానికుల ఆగ్రహావేశాలకు కారణంగా మారింది. 
ప్రభుత్వ తీరుపై రైతులు ఆవేదన 
శ్రీకాకుళం జిల్లా హిరమండలం దుగ్గుపురం, పాడలి, చిన్నకొల్లివలస, ఇరపాడు, తులగాం గ్రామాలకు చెందిన నిర్వాసిత రైతులు ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగువందల ఎకరాలను పంటతో సహా  జేసిబి, ట్రాక్టర్లతో నాశనం చేశారని కన్నీరుపెట్టుకుంటున్నారు. పరిహారం ఇస్తే .. భూములు ఖాళీ చేస్తామని చెప్పినా వినిపించుకోవడంలేదని నిర్వాసిత గ్రామాల ప్రజలు అంటున్నారు. 
పంట పొలాలు ద్వంసం.. హైకోర్టులో పిల్‌  
మరోవైపు పచ్చని పంట పొలాలను ద్వంసం చేయడాన్ని వ్యతరేకిస్తూ హ్యూమన్ రైట్స్ ఫోరం తరపున కే.వీ.జగన్నాథరావు హైకోర్టులో పిల్‌ వేశారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిల్‌ లో కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం వారం రోజుల్లోగా  కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభభుత్వాన్ని, మరో 7గురు ప్రతివాదులను ఆదేశించిందని జగన్నాథరావు తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో అయినా.. రాష్ట్రప్రభుత్వం బలప్రయోగాన్ని మానుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు. కోర్టులో   తమకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. 

 

16:04 - September 1, 2017

హైదరాబాద్ : విధి నిర్వహణలో మృతి చెందిన జీహెచ్‌ఎంసీ హార్టీ కల్చర్‌ విభాగం కార్మికుడు సమ్మయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ  కార్మికులు ఆందోళనకు దిగారు. గణేశ్‌ నిమజ్జనం కోసం జామై ఉస్మానియా వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను నరికేందుకు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన సమ్మయ్య ప్రమాదవశాత్తు జారిపడిపోయి మృతి చెందాడు. ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా వాటర్‌ ట్యాంకు ఎక్కి చెట్లు నరకాలని అధికారులు ఆదేశించడంతో సమ్మయ్య చనిపోయాడని  కార్మికులు ఆరోపిస్తున్నారు. సమ్మయ్య మృతితో పెద్దదిక్కు కోల్పోయామని, అధికారులు తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 162 పాయింట్లు లాభపడి 31,892 వద్ద సెన్సెక్స్, 57 పాయింట్లు లాభడి 9,974 వద్ద నిఫ్టీ ముగిశాయి.

16:00 - September 1, 2017

హైదరాబాద్ : ఎవరు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా... నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఆపలేకపోయారని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఏ ఎన్నికల్లో  జరగనటువంటి అరాచకాలు ఈసారి జరిగాయని...టీడీపీ గెలుపును అడ్డుకోవడానికి... తీవ్ర ప్రయత్నాలు చేశారని... సీఎం అన్నారు. ఎన్ని దుర్మార్గమైన చర్యలకు పాల్పడినా... టీడీపీనే విజయం సాధించిందని అన్నారు.

 

ముగ్గురు కుమార్తెలతో బావిలో దూకిన తండ్రి: ఇద్దరు మృతి

నెల్లూరు: అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడులో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు కుమార్తెలతో కలిసి తండ్రి బావిలో దూకాడు. ఇద్దరు కుమార్తెలు కీర్తి(8), పరిమళ(7) మృతి చెందగా.. మరో కూతురి పరిస్థితి విషయంగా ఉండటంతో ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండ్రిని పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

15:52 - September 1, 2017

తీరుచానూరు కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

చిత్తూరు: తీరుచానూరు కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు ఆయన తిరుమలకు చేరుకోనున్నారు. రాష్ట్రపతికి వేదపండితులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు.

విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం...

విజయవాడ: పాత ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. తమ ఆస్పత్రిలో సౌకర్యాలు లేవని దళారీలను డాక్టర్లు ప్రోత్సహించారు. డెలివరీ కోసం వచ్చిన మహిళ చేయి చచ్చుబడిపోవడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు వైద్యులు అంబులెన్స్ రప్పించారు. మమత భర్తతో దళారీలు బేరసారాలకు దిగారు. రూ.20వేలు ఇస్తే తమ ఆస్పత్రిలో చికిత్స అందిస్తామంటూ బేరసారాలకు దిగారు. విషయం మీడియాకు లీకవడంతో సిబ్బంది వెనక్కి తగ్గారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చేయి చచ్చుబడిపోయిందని భర్త కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

15:41 - September 1, 2017
15:40 - September 1, 2017

మహిళా వార్తల సమాహారం మానవి న్యూస్ లో ప్రధానాంశాలు..దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు చేశామంటున్న ప్రజాప్రతినిధులు. మెన్స్ కంటే ఉమెన్సే ఎక్కువ బలవంతులంటున్న సైంటిస్టులు..భూమిపై మాకూ హక్కులు కావాలంటున్న మహిళా రైతులు..హింసాకాండలో పలువురి ప్రాణాలు కాపాడిన మహిళా ఐఏఎస్..రీ ఎంట్రీని గ్రాండ్ గా స్టార్ట్ చేసిన టెన్నిస్ బ్యూటీ..అరుదైన ఘతన సాధించిన భారత షట్లర్ స్టార్లు..

ప్రజా ప్రతినిథులంటే ప్రజలను రక్షించేవారు. కానీ మనదేశంలో మాత్రం మహిళలపై నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులు వున్నట్లుగా   అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. మరి వీరు ప్రజారక్షకులేనా? మహిళలపై నేరాలకు పాల్పడిన వీరు ప్రజాప్రతినిధులుగా కొనసాగే అర్హత వుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
 
స్త్రీలు శారీరకంగా బలహీనంగా వుంటారనే మాట మనం తరచు వింటునే వుంటాం. కానీ ఇది వాస్తవం కాదని పురుషుల కంటే స్త్రీలే ఎక్కేవ బలవంతులని కెనడా సైంటిస్టులు పేర్కొంటున్నారు. మరి ఆ వివరాలేంటో చూద్దాం..

వ్యవసాయం చేసే మహిళలను రైతులుగా గుర్తించి, భూమిపై చట్టపరమైన హక్కుల్ని కల్పించాలని  మహిళా రైతులు డిమాండ్‌ చేశాయి.

ఏ ప్రాంతంలోనైనా హింసాకాండ జరిగితే మనం ఏం చేస్తాం? భయంతో పారిపోతాం. ఆ సమయంలో ప్రమాదంలో వున్నవారిని కాపాడాలనే ఆలోచన కంటే మనల్ని మనం కాపాడుకోవాలనుకునేవారే ఎక్కువగా వుంటారు. కానీ ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా ఎంతోమంది ప్రాణాలను కాపాడి తన పెద్ద మనస్సును చాటారు ఐఎఎస్‌ అధికారి గౌరీ పరాశర్ జోషి. 

ఇటీవల అటు న్యాయస్థానాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం మహిళలకు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయి. దీంతో మహిళా లోకం నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితం  సెక్షన్‌ 498ఏ చట్టం దుర్వినియోగం అవుతోందని న్యాయస్థానం పేర్కొనగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం  మరో సంచనల నిర్ణయం తీసుకుంది. మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసే విషయం ఏమిటో తెలుసుకుందాం..

భారత బ్యాడ్మింటన్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు. వారు మరో ఘనతను సాధించారు. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలిసారి రెండు పతకాలు అందించి ఘనకీర్తిని అందుకున్నారు సైనా,సింధులు.

విలువిద్యలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ అర్జున అవార్డును అందుకుంది. కాగా విలువిద్యలో తెలుగు రాష్ట్రాల నుంచి అర్జున అవార్డు అందుకున్న తొలి క్రీడాకారిణి సురేఖ కావడం విశేషం.

టెన్నిస్ లో షరాపోవా ఓ సంచలనం. డోపింగ్ కారణంగా కొంతకాలం పాటు ఆటకు దూరమైనా..తిరిగి వచ్చిన తన సత్తా ఏమిటో మరోసారి చాటింది ఈ టెన్నిస్ స్టన్నింగ్ బ్యూటీ.  

15:37 - September 1, 2017

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో విధుల్లో మృతిచెందిన జీహెచ్ ఎంసీ కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ తోటి కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం ఓయూ పరిధిలో కార్మికుడు సమ్మయ్య చెట్లు నరుకుతూ చనిపోయాడు. దీంతో మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ కార్మికులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ అధికారులకు కనీసం మానవత్వం లేదని మండిపడ్డారు. సమ్మయ్య మృతదేహం వద్దకు జీహెచ్ ఎంసీ కమిషనర్, అదనపు కమిషనర్ రాలేదన్నారు. సమ్మయ్య కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు.
అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుడి మృతికి కారణమైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

కేసీఆర్‌ కనుసన్నల్లోనే రైతు సమాఖ్య కమిటీలు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్‌ కనుసన్నల్లోనే రైతు సమాఖ్య కమిటీల ఏర్పాటు అవుతున్నాయని, కేసీఆర్‌ కేబినెట్‌లో అంతా చేతగాని మంత్రులే ఉన్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. మన ఊరు-మన ప్రణాళిక తెచ్చి మూడేళ్లయినా దిక్కుమొక్కులేదు, తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘సమగ్ర భూ సర్వే వల్ల కేసీఆర్‌కు ప్రయోజనం ఉంది, జీవో 39ను వ్యతిరేకిస్తున్నాం, రద్దు చేసేవరకు పోరాడతాం’’మని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కాకినాడలో ధన్యవాద సభ నిర్వహిస్తాం: చంద్రబాబు

అమరావతి : ప్రజలను నన్ను నమ్మారు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...'ఐదేళ్లకోసారి ఎన్నికలు రావాలని రూ.2వేలు, రూ. 50 నోట్ల అవసరమే లేదు, అధికార యంత్రాంగం అవినీతిని మరిచిపోవాలి, అవినీతిని అంతానికి కృతనిశ్చయంలో ఉన్నాం, కాకినాడలో ధన్యవాద సభ నిర్వహిస్తాం, కాకినాడ ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. పార్టీ పై నమ్మం ఉంచారు. మంత్రులు సామాన్య కార్యకర్తల్లా పని చేశారు. కన్సల్టెంట్లతో ఉపయోగం లేదని ఎపుడో చెప్పా. కన్సల్ెంట్లు గెలిపించగలిగితే వాళ్లే సీఎం అయ్యేవారు' అని అన్నారు.

15:26 - September 1, 2017

హైదరాబాద్ : గణపతి బప్పా మొరియా..అదా లడ్డూఖాలియా అంటూ  హిందు, ముస్లీంలు, క్రిస్టియన్స్‌, సిక్కులు కలిసికట్టుగా వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నారు. గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో వెల్లివిరుస్తున్న మతసామరస్యంపై టెన్‌టీవీ స్టోరీ.. 
వినాయక ఉత్సవాలంటే వెరీ స్పెషల్..  
బాగ్యనగరంలో పండుగలంటేనే ఓ ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ వినాయక ఉత్సవాలంటే వెరీ స్పెషల్..  హైదరాబాద్‌లోని పలు బస్తీల్లో పండుగ సందర్భంగా మతసామరస్యం వెల్లివిరుస్తోంది.  ముషీరాబాద్‌లో  హిందూ, ముస్లీం, క్రిస్టియన్‌, సిక్కు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఒకే చోట దేవుణ్ని ప్రతిష్టించుకుని గణపతి నవవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. 
వినాయక ఉత్సవాల్లో ముస్లీంలు  
ముషీరాబాద్ నియోజకవర్గంలో ముస్లీంలు ప్రతిఏటా వినాయక ఉత్సవాలు జరుకుంటున్నారు.  గత 8ఏళ్ల నుంచి తాము గణేశ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తున్నామని ఇక్కడి ముస్లీం యువత చెబుతోంది. అన్ని మతాల వాళ్లం కలిసి పండుగ చేసుకుంటామని ముస్లీం యువకుడు సిద్ధికి చెబుతున్నాడు. 
మతాలకతీతంగా పండుగల నిర్వహణ 
మతాలకతీతంగా అన్ని పండుగలు జరుపుకుంటామని ముషీరాబాద్‌ యువకులు అంటున్నారు. రంజాన్‌, క్రిస్‌మస్‌ ఇలా అన్ని పండుగలను జరుపుకుంటామని ..చెబుతున్నారు. గంజా జమునా తెహెజీబ్‌ అంటే ఇదేనని ముషీరాబాద్‌ యువత నిరూపిస్తున్నారు. అందరూ అన్ని మతాల పండుగలను జరుపుకుంటూ.. సెక్యులర్‌ భారత్‌కు నిదర్శనంగా నిలుస్తున్నారు. 

 

15:16 - September 1, 2017

తూర్పుగోదావరి : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగరవేసింది. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. చిన్న రాజప్ప మాట్లాడుతూ.. కష్టపడి పని చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారని చంద్రబాబు ముందు నుంచి చెప్పినట్లు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కంటి ఆపరేషన్ కోసం ఢిల్లీకి సీఎం కేసీఆర్

హైదరాబాద్: ఈ రోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలదేరనున్నారు. ఢిల్లీలో కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు వెళ్తున్నట్లు సమాచారం.

అమిత్ షా ను కలిసిన దత్తాత్రేయ

హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కేంద్ర మంత్రి దత్తాత్రేయ కలిశారు. దత్తాత్రేయ భవిష్యత్ పై అనుమానాలు వస్తున్న సమయంలో అమిత్ షా ను కలవడంపై ఆసక్తి రేగుతోంది.

15:06 - September 1, 2017

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌3న ఆదివారం నాడు ముహూర్తం ఖరారైంది. కనీసం ఆరుగురు మంత్రులకు ప్రమోషన్‌ దక్కనుంది. తాజాగా ఐదుగురు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ, ఉమా భారతి, సంజీవ్‌ బలియాన్‌ తమ రాజీనామా పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదికి పంపారు. కల్‌రాజ్‌ మిశ్రా, మహేంద్ర పాండే కూడా రాజీనామాలు సమర్పించినట్లు తెలుస్తోంది. మొత్తం 10 మంది మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉంది. రాజీనామా చేసిన మంత్రులకు పార్టీ పదవులు దక్కనున్నాయి. జెడియు ఎన్డీయేలో చేరిపోయినందున నితీష్‌ సన్నిహితులు ఆర్‌పి సింగ్‌, సంతోష్‌ కుశవాహాకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. శివసేన నుంచి ఒకరికి, టిడిపి నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కనుందని సమాచారం. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికవడం, అనిల్‌ దవే మరణం, మనోహర్‌ పరీకర్‌ గోవా సీఎంగా వెళ్లడంతో మూడు శాఖలకు మంత్రులు లేరు. నితిన్‌ గడ్కరికి అదనంగా రైల్వేశాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఏసీబీ వలలో సబ్ ట్రెజరరీ జూనియర్ అసిస్టెంట్

విశాఖ : జి. మాడుగుల సబ్ ట్రెజరరీ కార్యాలయంపై ఏసీబీ దాడి చేసింది. రూ.20వేలు లంచం తీసుకుంటూ సబ్ ట్రెజరరీ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ జగన్నాథం ఏసీబీకి చిక్కాడు.

ఆదివారం కేంద్ర మంత్రివర్గ విస్తరణ..!

న్యూఢిల్లీ : ఎట్టకేలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయ్యింది. ఆదివారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్‌లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బృందావన్ పర్యటనను రద్దు చేసుకున్నారట. 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ కూర్పు కోసం మోదీ, అమిత్ షా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 

సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలి: కిషన్ రెడ్డి

హైదరాబాద్: రాజాకార్ల అరాచకాలకు నిలువెత్తు సాక్ష్యం అని బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. 70 ఏల్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు మజ్లిస్ కు కీలు బొమ్మలుగా పని చేస్తున్నాయని ఆరోపించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా చేస్తానన్న సీఎం కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. తెలంగాణ చరిత్రను కేసీఆర్ దాచిపెడుతున్నారని, ప్రజలు తిరగబడక ముందే కేసీఆర్ మేల్కొని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఏసీబీ వలలో ఫైర్ స్టేషన్ ఎస్సై

తూ.గో: రూ.50 వేలు లంచం తీసుకుంటూ కొత్తపేట ఫైర్ స్టేషన్ ఎస్సై నాగేశ్వరరావు ఏసీబీకి పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ విచారణ చేపట్టింది.

13:28 - September 1, 2017
13:22 - September 1, 2017

బెంగళూరు : తెలంగాణ కాంగ్రెస్‌ నేతల బృందం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసింది. తెలంగాణకు నారాయణపూర్‌ జలాశయంనుంచి 7 టీఎంసీల నీరు విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది.. ఈ నిర్ణయంపై కాంగ్రెస్‌ బృందం సంతోషం వ్యక్తం చేసింది... సిద్ధరామయ్యను కలిసి కృతజ్ఞతలు తెలిపింది.

13:20 - September 1, 2017

విజయవాడ : కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో టీడీపీ గెలుపొందడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులకు మిఠాయిలు పంచుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాకినాడలో అత్యధికంగా 32 స్థానాల్లో విజయంతో సైకిల్‌ దూసుకుపోయింది.

 

13:19 - September 1, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. బీజేపీతో కలిసి... 35 డివిజన్లలో టీడీపీ విజయం సాధించింది. వైసీపీ కేవలం 10 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌ అసలు ఖాతా తెరవకుండా బొక్కబోర్లా పడింది. మరో మూడు స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. టీడీపీ కాకినాడ కార్పొరేషన్‌ పీఠాన్ని దక్కించుకోవడంతో.... ఇప్పుడు మేయర్‌ పదవిపై ఉత్కంఠ నెలకొంది. అయితే... కాపు వర్గానికే మేయర్‌ పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పడంతో... ఇప్పుడు ఆ వర్గంలో పదవి ఎవరికి దక్కుతుందోనన్న చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా నలుగురు మహిళలు మేయర్‌ రేసులో ఉన్నారు. ఇక 30 ఏళ్ల తర్వాత కార్పొరేషన్‌పై టీడీపీ జెండా రెపరెపలాడుతుండడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకుంటున్నారు. 

ప్రజలు నాపై నమ్మకం ఉంచి గెలిపించారు :చంద్రబాబు

అమరావతి: కాకినాడ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొందరు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించారని, ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు.ప్రజలు నాపై నమ్మకం ఉంచి గెలిపించారు తెలిపారు. కాకినాడను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానన్నారు. పట్టిసీమ ఫలితాలు ఇపుడు కనపడుతున్నాయని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తానన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని సుస్థిరమైన అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నారు.

కాకినాడ మేయర్ రేసులో నలుగురు మహిళలు

తూ.గో : కాకినాడ మేయర్ రేసులో నలుగురు మహిళలు పోటీ పడుతుఆన్నరు. మేయర్ స్థానాన్ని కాపు వర్గానికి కేటాయిస్తానని ఇప్పటికే టిడిపి ప్రకటించడంతో రేసులో శేషకుమారి, అడ్డూరి సుంకర పావని, సుంకర శివప్రసన్న పోటీ పడుతున్నారు. మేయర్ ఎంపికపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు.

కర్ణాటక సీఎంతో టి.కాంగ్రెస్ నేతల భేటీ

బెంగళూరు : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో టి. కాంగ్రెస్ నేతల బృందం భేటీ అయ్యింది. నారాయణపూర్ జలాశయం నుంచి 7 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక సర్కార్ అంగీకరించింది. దీంతో కర్ణాటక సీఎంకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ ధన్యవాదాలు తెలిపారు.

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ 8కివాయిదా

హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా పడింది. ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపింది.

సీఎం చంద్రబాబు నివాసంలో సంబరాలు..

అమరావతి: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి గెలుపు పై సీఎం నివాసంలో సంబరాలు జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి కళా వెంకట్రావు, నారాయణ, పత్తిపాటి, రామ్మోహన్ రావు పాల్గొన్నారు.

 

ప్రజలు నాపై నమ్మకం ఉంచి గెలిపించారు :చంద్రబాబు

అమరావతి: కొందరు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించారని, ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రజలు నాపై నమ్మకం ఉంచి గెలిపించారు తెలిపారు. కాకినాడను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానన్నారు. పట్టిసీమ ఫలితాలు ఇపుడు కనపడుతున్నాయని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తానన్నారు.

శని, ఆదివారాల్లో మాంసం దుకాణాలు మూసివేత...

హైదరాబాద్‌: బక్రిద్‌ పండుగను పురస్కరించుకొని శని, ఆదివారాల్లో నగరంలోని కబేళాలతో పాటు మాంసం విక్రయ దుకాణాలను మూసి వేయాలని జీహెచ్‌ఎంసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

12:30 - September 1, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ లో సైకిల్ హావా కొనసాగింది. దాదాపు 30 ఏళ్ల తరువాత మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. 48 స్థానాలకు ఎన్నిక కౌంటింగ్ ముగిసింది. ఇందులో 35 స్థానాల్లో టిడిపి విజయకేతనం ఎగురవేయగా పది స్థానాలకు వైసీపీ పరిమితమైంది. మూడు డివిజన్లలో బీజేపీ, ఇతరులు మూడు డివిజన్లలో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ బోణి కొట్టక చతికిలపడిపోయింది.

డివిజన్

అభ్యర్థి పేరు పార్టీ పేరు విజయం
1. పేరాబత్తుల లోవబాబు టిడిపి విజయం
2. సత్తిబాబు టిడిపి విజయం
3. గుత్తుల అచ్చయమ్మ టిడిపి విజయం
4. సూర్యకుమారి వైసీపీ  విజయం
5. నల్లబిల్లి సుజాత బీజేపీ విజయం
6. బండి సత్యనారాయణ టిడిపి విజయం
7. అంబటి క్రాంతి  టిడిపి విజయం
8. వరలక్ష్మి టిడిపి విజయం
9. కె.రమేష్ వైసీపీ విజయం
10. దాసమ్మ  టిడిపి విజయం
11. జీ.దానమ్మ టిడిపి విజయం
12. కె. సునీత టిడిపి విజయం
13. వి.బాలాజీ టిడిపి విజయం
14. వనామాడి ఉమా శంకర్ టిడిపి విజయం
15. చినగోటి సత్యబాబు టిడిపి విజయం
16 మల్లారి గంగాధర్ టిడిపి విజయం
17 సత్యప్రసాద్ టిడిపి విజయం
18 సి.రాంబాబు టిడిపి విజయం
19. అనంతకుమార్ టిడిపి విజయం
20. సత్యనారాయణ టిడిపి విజయం
21. బుర్రా విజయకుమారి టిడిపి విజయం
22. జాన్ కిశోర్ వైసీపీ విజయం
23. శ్రీదేవి వైసీపీ విజయం
24. ఉదయ్ కుమార్ వైసీపీ విజయం
25. కె.సీత టిడిపి విజయం
26. సంగాని నందం టిడిపి విజయం
27. మంగారత్నం టిడిపి విజయం
28. ఎస్.పావని టిడిపి విజయం
29. వాసిరెడ్డి రాంబాబు ఇండిపెండెంట్ విజయం
30. చంద్రకళా దీప్తీ వైసీపీ విజయం
31. సూర్యవతి టిడిపి విజయం
32. రోకళ్ల సత్యనారాయణ వైసీపీ విజయం
33. గుజ్జు దుర్గ టిడిపి విజయం
34 తహేర్ ఖాన్ టిడిపి విజయం
35 రామకృష్ణ టిడిపి రెబల్ విజయం
36 లక్ష్మీ ప్రసన్న బీజేపీ విజయం
37 ఎల్.హేమలత టిడిపి విజయం
38 శేషకుమారి టిడిపి విజయం
39 మల్లిపూడి నాగదీపిక ఇండిపెండెంట్ విజయం
40 సుంకర శివప్రసన్న టిడిపి విజయం
41 సత్యవతి బీజేపీ విజయం
42.      
43. పవన్ కుమార్ టిడిపి విజయం
44.   టిడిపి విజయం
45.      
46. కోరిమిల్లి బాల ప్రసాద్ టిడిపి విజయం
47. వెంకటలక్ష్మీ వైసీపీ విజయం
48.    
12:28 - September 1, 2017

హైదరాబాద్ : భ్రమరాంబ థియేటర్ లో 'పైసా వసూల్ 'చిత్ర బృందం సందడి చేసింది. శుక్రవారం 'పైసా వసూల్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా భ్రమరాంబ థియేటర్ లో యాజమాన్యం ప్రీమియర్ షో ఏర్పాటు చేసింది. ఈ షోకు హీరో బాలకృష్ణ, దర్వకుడు పూరీ జగన్నాథ్, నటి, ఛార్మీ తదితరులు హాజరయ్యారు. నందమూరి తారకరత్న కూడా సినిమా చూశారు. థియేటర్ కు బాలయ్య చేరుకోగానే ఆయన అభిమానులు కేరింతలు కొట్టారు. పూల వర్షం కురిపించారు. 

12:14 - September 1, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పోరేషన్ ఎన్నిక తంతు ముగిసిపోయింది. 28వ తేదీన జరిగిన ఎన్నికల కౌంటింగ్ శనివారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టిడిపి - బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. మొత్తానికి 30 ఏళ్ల తరువాత టిడిపి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపించ లేక చతికిలపడింది. సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో డజను ఎమ్మెల్యేలు..మంత్రులు మోహరించడం..టిడిపి వ్యూహాలు ఫలించాయనే చెప్పవచ్చు. గత కౌన్సిల్ లో కాంగ్రెస్ 33 స్థానాలు కైవసం చేసుకోగా టిడిపి - బిజెపి కూటమిలో సొంతంగా టిడిపి 32 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు దక్కించుకున్నాయి. దీనితో టిడిపి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.

ఇక్కడ మేయర్ అంశం చర్చకు వస్తోంది. కాకినాడ కార్పొరేషన్ కు ఏడేళ్లుగా ఎన్నికలు నిర్వహించలేదు. గత ఏడాది నవంబరు లోపు ఎన్నికల నిర్వహణ జరుగుతుందని ఆశించినా ఆచరణకు నోచుకోలేదు. వివిధ సాంకేతిక సమస్యలతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. 2005లో ఎన్నికైన కౌన్సిల్‌ గడువు 2010తో ముగిసింది. ఆ తరువాత ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరుపుకోవచ్చన్న హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలను కోర్టుకు నివేదిస్తామని, కోర్టు ఎలా చెబుతుందో అలా వ్యవహరిస్తామని కార్పోరేషన్ అధికారులు పేర్కొంటున్నారు. పూర్తిస్థాయి కౌన్సిల్ సమావేశం ఏర్పాటవుతుందా ? లేదా ? అనేది తెలియరావడం లేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్‌ ఎంపిక ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. 

ఈ తీర్పు చంద్రబాబు సమర్థతకు సంకేతం: కళా

తూ.గో: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయ దుందుభి మోగించడంపై మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాకినాడ ప్రజలు ఇచ్చిన తీర్పు చంద్రబాబు సమర్థతకు సంకేతమని అన్నారు. గత మూడున్నరేళ్లుగా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చంద్రబాబు చేరువయ్యారని, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన పడుతున్న కష్టాన్నిచూసిన ప్రజలు ఓటు రూపంలో ఇచ్చిన తీర్పే ఈ విజయం అని అన్నారు.

12:00 - September 1, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పోరేషన్ ఎన్నిక ఫలితం ఏకపక్షంగా సాగిపోయింది. నంద్యాల ఫలితమే ఇక్కడా కొనసాగింది. హోరాహోరీ పోరు సాగుతుందని అనుకున్నా ఎన్నిక ఏకపక్షంగా సాగిపోయింది. ప్రస్తుతం 48 స్థానాలకు ఎన్నిక కౌంటింగ్ ముగిసింది. ఇందులో 35 స్థానాల్లో టిడిపి, మిత్రపక్షం బీజేపీ విజయకేతనం ఎగురవేయగా పది స్థానాలకు వైసీపీ పరిమితమైంది. మూడు డివిజన్లలో బీజేపీ, ఇతరులు మూడు డివిజన్లలో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ బోణి కొట్టక చతికిలపడిపోయింది. ఈ సందర్భంగా 47వ డివిజన్ నుండి వైసీపీ అభ్యర్థి వెంకటలక్ష్మీ, ఇతర కార్పొరేటర్లు టెన్ టివితో మాట్లాడారు. విజయం పట్ల సంతోషంగా ఉన్నానని, తన విజయానికి కారకులు ప్రజలేనని తెలిపారు. తనకు ఓటు వేసి వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. టిడిపి గెలుపు అనుకోవద్దని..ధన బలంతోనే వారు గెలిచారని వైసీపీ పేర్కొంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

బాబు మూడేళ్ల కృషిని ప్రజలు గుర్తించారు: మంత్రి పత్తిపాటి

అమరావతి: సీఎం చంద్రబాబు మూడేళ్ల కృషిని ప్రజలు గుర్తించారని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 2019 నాటికి 80శాతం ప్రజలు టిడిపి వైపు నిలబడేలా పని చేస్తామన్నారు. జగన్ ఇదే ధోరణి కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో పులివెందుల కూడా మాదే అని మంత్రి పుల్లారావు హెచ్చరించారు. ప్రతిపక్షం అభివృద్ధికి అడ్డుపడకుండా నిర్మాణాత్మక సూచనలు చేస్తే మంచిదని హితవు పలికారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసి గెలిచారని తెలిపారు.

11:55 - September 1, 2017

విజయవాడ :మూడేండ్లలో సీఎం చంద్రబాబు నాయుడు అందించిన అభివృద్ధి..కాకినాడ ఎన్నికల్లో గెలవడానికి కారణమని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. బాబు కష్టానికి నంద్యాల..కాకినాడ ఎన్నికలే నిదర్శనమని, 2019లో ఈ ఫలితాలు ప్రభావం చూపుతాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అందించిన అభివృద్ధి, సుపరిపాలన, శాంతిభద్రతలు విజయానికి కారణమన్నారు. ప్రతి పేదోడికి సహయం అందిందని, చరిత్రలో ఇలాంటిది లేదన్నారు. బాబు కష్టం ప్రజల్లో కనిపిస్తోందన్నారు. మూడేళ్ల సుపరిపాలనకు ప్రజలు ఓటేశారని, ప్రతిప్రక్షాల కుట్రలు..కుతంత్రాలను ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. 2019 నాటికి 175 స్థానాలకు 175 స్థానాల్లో విజయం సాధించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కాకినాడ విజయం సీఎంకు అంకితం: చినరాజప్ప

అమరావతి: కాకినాడ కార్పొరేషన్ విజయం సీఎంకు అంకితం అని హోం మంత్రి చినరాజప్ప అన్నారు. టిడిపికి కి విజాయాన్ని అందించిన ఓటర్లకు కృతజ్ఞతులుఅని, అభివృద్ధి, సంక్షేమానికి ఓటర్లు పట్టం కట్టారు అని పేర్కొన్నారు. త్వరలోనే వైసీపీ కనుమరుగు కావడం ఖాయం అని జోశ్యం చెప్పారు.

11:45 - September 1, 2017

హైదరాబాద్ : సీపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించాయి. కలెక్టరేట్లు, డీఈవో కార్యాలయాల వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ధర్నా నిర్వహిస్తోంది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వ్యతిరేక పోరాటం మరింత తీవ్రమైంది. శుక్రవారం సామూహిక సెలవులు పెట్టి, మహాధర్నాలు నిర్వహించేందుకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ సమాయత్తమయ్యారు. లక్ష మందికి పైగా సామూహిక సెలవులకు దరఖాస్తు చేసుకోవడం విశేషం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పెన్షన్ స్కీమ్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004లో అమలులోకి తెచ్చారు. అప్పటి నుంచి కొత్త పెన్షన్ స్కీమ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, అధికారుల సంఘాలు పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. గత 14 ఏళ్లలో రిటైనవారి జీవితాలు అత్యంత దుర్భరంగా మారడం కళ్లెదుటే కనిపిస్తున్న సాక్ష్యం. 

అక్రమాస్తుల కేసులో జగన్ చుక్కెదురు.

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ కు చుక్కెదురయింది. సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మొత్తం 11 కేసుల్లో ప్రతి శుక్రవారం ఆయన సీబీఐ కోర్టులో హాజరవుతున్నారు.

భవనం కూలిన ఘటనలో 33కి చేరిన మృతుల సంఖ్య...

ముంబై: భేండీబజార్‌లో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. గత అర్ధరాత్రి దాటిన తర్వాత మరో తొమ్మిది మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 33కు చేరింది.వీరిలో 9 మంది మహిళలు కూడా ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. మరో తొమ్మిది మందిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

సనత్ నగర్ ఈఎస్ఐ లో కార్మికుల ఆందోళన

హైదరాబాద్: సనత్ నగర్ ఈఎస్ ఐ ఆసుపత్రిలో కార్మికులు నిరసన చేపట్టారు. ఉద్యోగాల నుంచి కార్మికుల తొలగింపు పై వారు విధులు బహిష్కరించి సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

కాకినాడ కార్పొరేషన్ లో పూర్తయిన ఓట్ల లెక్కింపు

తూ.గో: కాకినాడ కార్పొరేషన్ లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. టిడిపి 32, వైసీపీ 10, బిజెపి 3, ఇండిపెండెంట్లు 3 డివిజన్లలో పొలుపొందాయి. 32 సీట్లతో కాకినాడ కార్పొరేషన్ ను టిడిపి కైవసం చేసుకుంది.

11:31 - September 1, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ లో సైకిల్ హావా కొనసాగింది. దాదాపు 30 ఏళ్ల తరువాత మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోబోతోంది. 48 డివిజన్లలో ఇప్పటి వరకు 30కి పైగా స్థానాల్లో టిడిపి గెలుపొందింది. వైసీపీ అభ్యర్థులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అక్కడక్కడ కొన్ని విశేషాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరాజయం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. 

డివిజన్

అభ్యర్థి పేరు పార్టీ పేరు విజయం
1. పేరాబత్తుల లోవబాబు టిడిపి విజయం
2. సత్తిబాబు టిడిపి విజయం
3. గుత్తుల అచ్చయమ్మ టిడిపి విజయం
4. సూర్యకుమారి వైసీపీ  విజయం
5. నల్లబిల్లి సుజాత బీజేపీ విజయం
6. బండి సత్యనారాయణ టిడిపి విజయం
7. అంబటి క్రాంతి  టిడిపి విజయం
8. వరలక్ష్మి టిడిపి విజయం
9. కె.రమేష్ వైసీపీ విజయం
10. దాసమ్మ  టిడిపి విజయం
11. జీ.దానమ్మ టిడిపి విజయం
12. కె. సునీత టిడిపి విజయం
13. వి.బాలాజీ టిడిపి విజయం
14. వనామాడి ఉమా శంకర్ టిడిపి విజయం
15. చినగోటి సత్యబాబు టిడిపి విజయం
16 మల్లారి గంగాధర్ టిడిపి విజయం
17 సత్యప్రసాద్ టిడిపి విజయం
18 సి.రాంబాబు టిడిపి విజయం
19. అనంతకుమార్ టిడిపి విజయం
20. సత్యనారాయణ టిడిపి విజయం
21. బుర్రా విజయకుమారి టిడిపి విజయం
22. జాన్ కిశోర్ వైసీపీ విజయం
23. శ్రీదేవి వైసీపీ విజయం
24. ఉదయ్ కుమార్ వైసీపీ విజయం
25. కె.సీత టిడిపి విజయం
26. సంగాని నందం టిడిపి విజయం
27. మంగారత్నం టిడిపి విజయం
28. ఎస్.పావని టిడిపి విజయం
29. వాసిరెడ్డి రాంబాబు ఇండిపెండెంట్ విజయం
30. చంద్రకళా దీప్తీ వైసీపీ విజయం
31. సూర్యవతి టిడిపి విజయం
32. రోకళ్ల సత్యనారాయణ వైసీపీ విజయం
33. గుజ్జు దుర్గ టిడిపి విజయం
34 తహేర్ ఖాన్ టిడిపి విజయం
35 రామకృష్ణ టిడిపి రెబల్ విజయం
36 లక్ష్మీ ప్రసన్న బీజేపీ విజయం
37 ఎల్.హేమలత టిడిపి విజయం
38 శేషకుమారి టిడిపి విజయం
39 మల్లిపూడి నాగదీపిక ఇండిపెండెంట్ విజయం
40 సుంకర శివప్రసన్న టిడిపి విజయం
41 సత్యవతి బీజేపీ విజయం
42.      
43. పవన్ కుమార్ టిడిపి విజయం
44.   టిడిపి విజయం
45.      
46. కోరిమిల్లి బాల ప్రసాద్ టిడిపి విజయం
47. వెంకటలక్ష్మీ వైసీపీ విజయం
48.  

ఈ సందర్భంగా కార్పొరేటర్లుగా గెలుపొందిన పలువురు టెన్ టివితో మాట్లాడారు. తమకు ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. తాము ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని..తమ తమ వార్డులను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళుతామన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కంటోన్మెంట్ మడ్ ఫోర్డ్ లో అగ్ని ప్రమాదం...

సికింద్రాబాద్: కంటోన్మెంట్‌ మడ్‌ఫోర్డ్‌లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న గుడిసెల్లో ప్రమాదవశాత్తు మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

11:05 - September 1, 2017
11:05 - September 1, 2017

కాకినాడ : కార్పొరేషన్ ను టిడిపి కైవసం చేసుకుంది. దాదాపు కొన్ని ఏళ్ల తరువాత ఇక్కడ పాగా వేసింది. మొత్తం 48 డివిజన్లలో ఇప్పటి వరకు 29కి పైగా స్థానాల్లో టిడిపి గెలుపొందింది. కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడంతో మేయర్ పీఠంపై చర్చ జరుగుతోంది. బీజేపీ రెండు స్థానాల్లో, వైసీపీ ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. ఈసందర్భంగా విజయం సాధించిన పలువురు కార్పొరేటర్లు టెన్ టివితో మాట్లాడారు. 

ప్రజలకు కృతజ్ఞతలు..
ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు వైసీపీ అభ్యర్థి రాగ దీప్తి విజయం పేర్కొన్నారు. ఆమె టెన్ టివితో మాట్లాడారు. తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు అధికారంలో ఉన్నా..లేకపోయినా ప్రజలో కోసం పనిచేస్తామన్నారు.

గుత్తుల అచ్చయమ్మ : మూడో వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, గెలుపొందినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. తాను ప్రజలందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు.

మేయర్ పదవిలో..
40వ డివిజన్ ప్రజలందరికీ తెలియచేస్తున్నట్లు గెలుపొందిన కార్పొరేటర్ పేర్కొన్నారు. మేయర్ పదవి ఇచ్చినా..ఇవ్వకపోయినా తాను పనిచేస్తానన్నారు. తనకు సీటు ఇచ్చిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.

బీజేపీ అభ్యర్థుల విజయం..
బీజేపీ అభ్యర్థి 9వ డివిజన్ నుండి కంపర రమేష్ గెలుపొందారు. 2వ డివిజన్ నుండి ఆయన సోదరి సూర్య కుమారిని గెలుపొందారు. ఈసందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. ఇది ప్రజా విజయమని, పార్టీ విజయమన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

బిజెపి అభ్యర్థి పై టిడిపి రెబల్స్ గెలుపు...

తూర్పుగోదావరి : కాకినాడలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలో బీజేపీకి కేటాయించిన డివిజన్‌లో టీడీపీ రెబల్ అభ్యర్థి గెలుపొందారు. కాకినాడలోని 39వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి పోటీలో నిలిచారు. అయితే బీజేపీకి టీడీపీ రెబల్ అభ్యర్థి గట్టిపోటీనిచ్చి గెలుపొందారు.

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి 29, వైసీపీ 8 కైవసం..

తూ.గో: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మూడు రౌండ్లలోనూ సైకిల్ హవా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 42 డివిజన్లలో కౌంటింగ్ పూర్తయ్యింది. టిడిపి 29, వైసీపీ 8, బిజెపి 3, ఇండిపెండెంట్లు 3 గెలుచుకున్నాయి.

 

3వ రౌండ్లో టిడిపి 4, వైసీపీ 4 డివిజన్లు కైవసం..

తూ.గో: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 3,6,12,18 డివిజన్లలో టిడిపి విజయం సాధించింది. 9,15,21,24 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. 9వ డివిజన్లో బిజెపి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య ఓటమి పాలయ్యాడు.

10:36 - September 1, 2017
10:32 - September 1, 2017
10:31 - September 1, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫలితాలు ఏకపక్షంగా కొనసాగుతున్నాయి. టిడిపి హావా కొనసాగుతోంది. వైసీపీ సింగిల్ డిజిట్ సంఖ్యకు మాత్రమే పరిమితమై పోయింది. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలే ఇక్కడ కొనసాగాయి. టిడిపి అభ్యర్థులు విజయం సాధిస్తుండడంతో వైసీపీలో తీవ్ర నిరాశ నెలకొంది. 21 వార్డుల్లో టిడిపి, 4 స్థానాల్లో వైసీపీ, ఇండిపెండెంట్లు 2 వార్డులు, బీజేపీ ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. టిడిపి అభ్యర్థులు విజయం సాధిస్తుండడంతో మేయర్ పదవిపై చర్చ కొనసాగుతోంది. పలువురు టిడిపి మహిళా అభ్యర్థులు మేయర్ రేసులో ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయమే శిరోధార్యమన్నారు. 

డివిజన్

అభ్యర్థి పేరు పార్టీ పేరు విజయం
1. పేరాబత్తుల లోవబాబు టిడిపి విజయం
4 సూర్యకుమారి వైసీపీ  విజయం
5. ఎన్.సుజాత బీజేపీ విజయం
7 అంబటి క్రాంతి  టిడిపి విజయం
10. దాసమ్మ  టిడిపి విజయం
13. వి.బాలాజీ టిడిపి విజయం
16 మల్లారి గంగాధర్ టిడిపి విజయం
19. అనంతకుమార్ టిడిపి విజయం
22 జాన్ కిశోర్ వైసీపీ విజయం
23 శ్రీదేవి వైసీపీ విజయం
25 కె.సీత టిడిపి విజయం
26. సంగాని నందం టిడిపి  విజయం
28. ఎస్.పావని టిడిపి విజయం
29 రామచంద్రరావు ఇండిపెండెంట్ విజయం
31 సూర్యవతి టిడిపి విజయం
34 తహేర్ ఖాన్ టిడిపి విజయం
35 రామకృష్ణ టిడిపి రెబల్ విజయం
37 ఎల్.హేమలత టిడిపి విజయం
38 శేషకుమారి టిడిపి విజయం
40 సుంకర శివప్రసన్న టిడిపి విజయం
41 సత్యవతి బీజేపీ విజయం

ఈ సందర్భంగా కార్పొరేటర్లుగా గెలుపొందిన పలువురు టెన్ టివితో మాట్లాడారు. తమకు ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. తాము ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని..తమ తమ వార్డులను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళుతామన్నారు. మేయర్ పదవికి రేసులో ఉన్న వారు కూడా మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కాకినాడ కార్పొరేషన్ టిడిపి కైవసం...

తూ.గో: కాకినాడ కార్పొరేషన్ ను టిడిపి కైవసం చేసుకుంది. మొదటి, రెండు రౌండ్లలో సైకిల్ అవా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 28 డివిజన్లలో కౌన్సిలింగ్ పూర్తి అయ్యింది. టిడిపి 21, వైసీపీ 4, బిజెపి 1, ఇండిపెండెంట్లు 2 స్థానాలు గెలుచుకున్నాయి. కాసేపట్లో మూడో రౌండ్ కౌంటింగ్ ప్రారంభం కానుంది.

10:11 - September 1, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టిడిపి హావా కొనసాగుతోంది. తొలి రౌండ్ లో 12 స్థానాల్లో టిడిపి, 2 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. రెండో రౌండ్ లెక్కింపులో టిడిపి, బీజేపీ హావా కొనసాగుతున్నాయి. 41 డివిజన్ లో బీజేపీ అభ్యర్థి సత్యవణి గెలుపొందింది. 

డివిజన్

అభ్యర్థి పేరు పార్టీ పేరు విజయం
1. పేరాబత్తుల లోవబాబు టిడిపి విజయం
4 సూర్యకుమారి వైసీపీ  విజయం
7 అంబటి క్రాంతి  టిడిపి విజయం
10. దాసమ్మ  టిడిపి విజయం
13. వి.బాలాజీ టిడిపి విజయం
16 మల్లారి గంగాధర్ టిడిపి విజయం
19. అనంతకుమార్ టిడిపి విజయం
22 జాన్ కిశోర్ వైసీపీ విజయం
23 శ్రీదేవి వైసీపీ విజయం
25 కె.సీత టిడిపి విజయం
28. ఎస్.పావని టిడిపి విజయం
29 రామచంద్రరావు ఇండిపెండెంట్ విజయం
31 సూర్యవతి టిడిపి విజయం
34 తహేర్ ఖాన్ టిడిపి విజయం
35 రామకృష్ణ టిడిపి రెబల్ విజయం
37 ఎల్.హేమలత టిడిపి విజయం
38 శేషకుమారి టిడిపి విజయం
40 సుంకర శివప్రసన్న టిడిపి విజయం
41   బీజేపీ విజయం

 

ఈ సందర్భంగా కార్పొరేటర్లుగా గెలుపొందిన పలువురు టెన్ టివితో మాట్లాడారు. తమకు ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. తాము ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని..తమ తమ వార్డులను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళుతామన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

పాదచారులపైకి దూసుకెళ్లిన మాజీ సీఎం కొడుకు వాహనం..

కర్నాటక : మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు ప్రయాణిస్తున్న వాహనం పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మాదపురాలోని ఎస్ యు వి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 

కాకినాడ కార్పొరేషన్..విజేతలు..

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమైంది. 14 డివిజన్లకు సంబంధించిన లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో 12 డివిజన్లలో టిడిపి, వైసీపీ 2 స్థానాల్లో విజయం సాధించారు. రెండో రౌండ్ లో టిడిపి, బీజేపీ హావా కొనసాగిస్తున్నాయి.

రెండో రౌండ్ లో..

తూర్పుగోదావరి : కాకినాడ కొర్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రెండు రౌండ్లలో టిడిపి, బీజేపీ హావా కొనసాగిస్తున్నాయి. 8,11,14,17,20,38 డివిజన్లలో టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. 

09:31 - September 1, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమైంది. 14 డివిజన్లకు సంబంధించిన లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో 12 డివిజన్లలో టిడిపి, వైసీపీ 2 స్థానాల్లో విజయం సాధించారు. 

డివిజన్

అభ్యర్థి పేరు పార్టీ పేరు విజయం
1. పేరాబత్తుల లోవబాబు టిడిపి విజయం
4 సూర్యకుమారి వైసీపీ  విజయం
7 అంబటి క్రాంతి  టిడిపి విజయం
10. దాసమ్మ  టిడిపి విజయం
13. వి.బాలాజీ టిడిపి విజయం
16 మల్లారి గంగాధర్ టిడిపి విజయం
19. అనంతకుమార్ టిడిపి విజయం
22 జాన్ కిశోర్ వైసీపీ విజయం
25 కె.సీత టిడిపి విజయం
28. ఎస్.పావని టిడిపి విజయం
31 సూర్యవరతి టిడిపి విజయం
34 తహేర్ ఖాన్ టిడిపి విజయం
37 ఎల్.హేమలత టిడిపి విజయం
40 సుంకర శివప్రసన్న టిడిపి విజయం

 

12 డివిజన్లలో టిడిపి విజయం..

తూర్పుగోదావరి : కాకినాడ కొర్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి హావా కొనసాగుతోంది. 12 డివిజన్లలో టిడిపి గెలుపొందింది. 2 డివిజన్లలో వైసీపీ గెలుపొందింది. 

09:10 - September 1, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమైంది. 14 డివిజన్లలో 10 డివిజన్లలో టిడిపి అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. 11 స్థానాల్లో వైసీపీ అధిక్యంలో కొనసాగుతోంది. ఫలితాల సరళిని బట్టి చూస్తే మేయర్ స్థానం టిడిపి ఎగురవేసుకపోతుందని తెలుస్తోంది. 

డివిజన్

అభ్యర్థి పేరు పార్టీ పేరు విజయం
1. పేరాబత్తుల లోవబాబు టిడిపి విజయం
4 సూర్యకుమారి వైసీపీ  విజయం
7 అంబటి క్రాంతి  టిడిపి విజయం
10. దాసమ్మ  టిడిపి విజయం
16 మల్లారి గంగాధర్ టిడిపి విజయం
19. అనంతకుమార్ టిడిపి విజయం
22 జాన్ కిశోర్ వైసీపీ విజయం
31 సూర్యవరతి టిడిపి విజయం
34 తహేర్ ఖాన్ టిడిపి విజయం
40 సుంకర శివప్రసన్న టిడిపి విజయం

 

అభ్యర్థుల గెలుపు..వివరాలు..

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 1 డివిజన్ లో పేరాబత్తుల లోవబాబు (టిడిపి), 4వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి సూర్యకుమారి (వైసీపీ), 7వ డివిజన్ లో అంబటి క్రాంతి (టిడిపి), 10వ డివిజన్ లో దాసమ్మ (టిడిపి), 16వ డివిజన్ లో మల్లారి గంగాధర్ (టిడిపి), 19వ డివిజన్ లో 300 ఓట్ల తేడాతో టిడిపి అభ్యర్థి గెలుపొందారు. 22 డివిజన్ లో వైసీపీ అభ్యర్థి 680 ఓట్లతో గెలుపొందారు. 31 డివిజన్ లో సూర్యతి (టిడిపి), 34 డివిజన్ లో తహేర్ ఖాతూన్ (టిడిపి) 700 ఓట్లతో విజయం సాధించారు. 40వ డివిజన్ లో సుంకర శివప్రసన్న (టిడిపి) గెలుపొందారు. 

టిడిపి అభ్యర్థుల విజయం..

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 1 డివిజన్ లో పేరాబత్తుల లోవబాబు (టిడిపి), 40వ డివిజన్ లో సుంకర శివప్రసన్న (టిడిపి) గెలుపొందారు. 16వ డివిజన్ లో మల్లారి గంగాధర్ (టిడిపి), 34 డివిజన్ లో టిడిపి అభ్యర్థి 700 ఓట్లతో విజయం సాధించారు. 

టిడిపి..వైసీపీ అభ్యర్థుల అధిక్యం..

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి రౌండ్ లో టిడిపి అధిక్యాన్ని కనబరుస్తోంది. 1,7,10,13,19, 28, 34 డివిజన్లలో టిడిపి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 4,13,16,22,25,31,37 డివిజన్లలో వైసీపీ ఆధిక్యం కనబరుస్తోంది. 

వైసీపీ అభ్యర్థుల అధిక్యం..

కాకినాడ : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 4వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి 200 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 22వ డివిజన్ లో 500 ఓట్ల ఆధిక్యం, 31 డివిజన్ లో 70 ఓట్లు ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థులు కొనసాగుతున్నారు. 

7 డివిజన్లలో టిడిపి..4 డివిజన్లలో వైసీపీ..

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి రౌండ్ లో టిడిపి అధిక్యాన్ని కనబరుస్తోంది. 1,7,10,13,19, 34 డివిజన్లలో టిడిపి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 4,46,22,37 డివిజన్లలో వైసీపీ ఆధిక్యం కనబరుస్తోంది. 

08:23 - September 1, 2017

ఢిల్లీ : 2019 ఎన్నికలు ఇంకా సమయం ఉండగానే ఇప్పటి నుండే పలు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ప్రధానంగా బీజేపీ పార్టీ ముందస్తు చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేయాలని ప్రధాన మంత్రి మోడీ యోచిస్తున్నారు. 8మందికి పదవీ గండం ఉండగా..8మందికి కొత్తగా పదవులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో 8 మంది శాఖలు మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఆదివారం ప్రధాన మంత్రి మోడీ చైనా వెళ్లనున్నారు. అక్కడ బ్రిక్స్ దేశాల శిఖరాగ్రా సమావేశంలో పాల్గొననున్నారు. ఈలోపు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. పలు కారణాలతో కేబినెట్‌లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంతోపాటు ఎన్డీయేలో కొత్తగాచేరిన మిత్రపక్షాలకు అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జేడీయూ, అన్నాడీఎంకే నుంచి కొందరికి మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఇప్పటికే కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సహాయ మంత్రి రాజీవ్‌ప్రతాప్‌రూడీ, జలవనరులశాఖా మంత్రి ఉమాభారతి తమ రాజీనామాలను సమర్పించారు. 

తొలి రౌండ్ లో టిడిపి ముందంజ..

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి రౌండ్ లో టిడిపి అధిక్యాన్ని కనబరుస్తోంది. 1,7,10,13,19 డివిజన్లలో టిడిపి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

టిడిపి 2 చోట్ల ఆధిక్యం..

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండు స్థానాల్లో టిడిపి ఆధిక్యం కనబరుస్తోంది. 

08:08 - September 1, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల విజేత ఎవరో కాసేపట్లో తేలనుంది. శనివారం కౌంటింగ్ ను అధికారులు ప్రారంభించారు. స్ట్రాంగ్ రూం నుండి తీసుకొచ్చిన బాక్స్ లను రంగరాయ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ కౌంటింగ్ కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌లో మూడు డివిజన్ల ఓట్లు లెక్కించే విధంగా ఏర్పాటు చేశారు. ఆగస్టు 29న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్‌ రూములను తెరించారు. అనంతరం కౌటింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లు..అనుమతి ఉన్న వారిని మాత్రమే అనుమతించారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఓట్ల లెక్కింపుకు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 48 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ 39 డివిజన్లకు అభ్యర్థులను నిలబెట్టింది. మిత్రపక్షమైన బీజేపీకి తొమ్మిది డివిజన్లు కేటాయించింది. ప్రతిపక్ష వైసీపీ 48 డివిజన్లకు అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 17 స్థానాల్లో బరిలో నిలిచింది. సీపీఎం, సీపీఐ చెరో రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. మొత్తం 2.36 లక్షల ఓట్లకు గాను 64.78 శాతం ఓట్లు పోలయ్యాయి. 

కాకినాడ కార్పొరేషన్..కౌంటింగ్ స్టార్ట్..

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. కౌంటింగ్ కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

 

కూలిన భవంతిలో 31 మంది మృతి..

ముంబై : దక్షిణ ముంబైలోని బేండీ బజార్ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొత్తంగా 31 మంది మృతి చెందినట్లు ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఓ జాతీయ ఛానెల్ కు వెల్లడించారు. 

మధురలో ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశాలు..

ఉత్తర్ ప్రదేశ్ : నేటి నుండి మధురలో ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశాలు జరుగనున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ షా, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు హాజరు కానున్నారు. 

07:25 - September 1, 2017

రద్దయిన పెద్దనోట్లలో దాదాపు 90 శాతం బ్యాంకింగ్‌ వ్యవస్థలో చేరాయని ఆర్బీఐ బుధవారం ఆర్బీఐ ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణమని ప్రతిపక్షాలు విమర్శించాయి. మోది సర్కార్‌ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి ఉపయోగపడిందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చలో బి.వెంకట్ (సీపీఎం), కుమార్ (బీజేపీ), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:21 - September 1, 2017

రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వ్యతిరేక పోరాటం మరింత తీవ్రమైంది. ఇవాళ సామూహిక సెలవులు పెట్టి, మహాధర్నాలు నిర్వహించేందుకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ సమాయత్తమవుతున్నారు. లక్ష మందికి పైగా సామూహిక సెలవులకు దరఖాస్తు చేసుకోవడం విశేషం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పెన్షన్ స్కీమ్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004లో అమలులోకి తెచ్చారు. అప్పటి నుంచి కొత్త పెన్షన్ స్కీమ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, అధికారుల సంఘాలు పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. గత 14 ఏళ్లలో రిటైనవారి జీవితాలు అత్యంత దుర్భరంగా మారడం కళ్లెదుటే కనిపిస్తున్న సాక్ష్యం. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లోని లోపాలపై టెన్ టివి జనపథంలో తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పుప్పాల కృష్ణకుమార్ గారు, మాధురి పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

సామూహిక సెలవులు..

హైదరాబాద్ : రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వ్యతిరేక పోరాటం మరింత తీవ్రమైంది. ఇవాళ సామూహిక సెలవులు పెట్టి, మహాధర్నాలు నిర్వహించేందుకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ సమాయత్తమవుతున్నారు.

06:56 - September 1, 2017

కోహ్లీసేన మరో భారీ విజయం సాధించింది. శ్రీలంక జట్టుకు మరో ఘోర పరాభవం ఎదురైంది. కొలంబో వేదికగా ఏకపక్షంగా సాగిన నాలుగో వన్డేలో భారత బ్యాటింగ్‌, బౌలింగ్‌కు లంక విలవిల్లాడింది. సొంతగడ్డపై తొలిసారి 168 పరుగులు భారీ తేడాతో ఓడిన లంకజట్టు చెత్త రికార్డు సొంతం చేసుకుంది. నాలుగో వన్డేలో టాస్‌ గెలిచిన భారత్‌..మొదట బ్యాటింగ్‌ చేసింది. కెప్టెన్‌ కోహ్లీ 96 బాల్స్‌లో 131 పరుగులు చేయగా.. రోహిత్‌ శర్మ 88 బంతుల్లో 104 పరుగులతో మ్యాచ్‌ను హోరెత్తించారు. ఇద్దరు బ్యాట్స్‌మన్‌ సెంచరీలు చేయడంతో ..

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక జట్టును టీమిండియా బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. బుమ్రా, పాండ్యా, కుల్దీప్‌ తలో రెండు వికెట్లతో చెలరేగడంతో 207 పరుగులకే లంకజట్టు కుప్పకూలింది. 70 పరుగులు చేసిన ఏంజెలో మాథ్యూస్‌ ఒంటరిపోరాటం చేశాడు. 39 రన్స్‌ చేసిన మరో బ్యాట్స్‌మన్‌ సిరివర్దనే కాస్త ఫర్వాలేదని పించాడు.

అయితే ..మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌ రూపంలో మొదటి ఝట్కా తగిలింది. 4 పరుగులు చేసిన శిఖర్‌ అనూహ్యంగా వికెట్ పారేసుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రోహిత్‌కు తోడైయ్యాడు. తన స్టైలీష్‌ బ్యాటింగ్‌తో కోహ్లీ మరోసారి పరుగులు వరద పారించాడు. వరుస బౌండరీలతో 38 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసిన కోహ్లీ అదే ఊపులో 76 బంతుల్లోనే శతకం బాదేశాడు. దీంతో వన్డేల్లో సచిన్‌ 49, రికీ పాంటింగ్‌ 30 సెంచరీల తర్వాత 29 సెంచరీలతో విరాట్‌ మూడో స్థానంలో నిలిచాడు. మరోవైపు రోహిత్‌ సిరీస్‌లో వరుసగా రెండో శతకం బాది టీమిండియా సత్తాను చాటాడు. ప్రమాదకరంగా మారిన విరాట్‌-రోహిత్‌జోడీని స్పీడ్‌స్టర్‌ మలింగ విడదీశాడు. 29వ ఓవర్‌ 3వ బంతికి కోహ్లీని ఔట్‌ చేసిన మలింగ తన కెరీర్‌లో 300వ వికెట్‌ సాధించాడు.

భారత్‌ 262 స్కోరు వద్ద పాండ్యా, రోహిత్‌.. మాథ్యూస్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్ట్రోక్‌ ప్లేయర్‌ లోకేశ్‌ రాహుల్‌ నిరుత్సాహ పరిచాడు.. 7 పరుగులు చేసిన వెనుదిరిగాడు. ఈ దశలో బ్యాటింక్‌కు వచ్చిన మనీశ్‌ పాండేకు ధనాధన్‌ ధోనీ తోడైయ్యాడు. పాండే 4ఫోర్లు, 1 సిక్స్‌తో 42 బంతుల్లోనే అర్థసెంచరీ కొట్టగా.. ధోనీ తన 300వ వన్డేలో మరోసారి విశ్వరూపం చూపించాడు.. 42 బాల్స్‌కు 49 పరుగులు పిండేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 101 పరుగులు ఆజేయ భాగస్వామ్యం అందించడంతో భారత్‌ 375/5తో లంకముందు భారీ టార్గెట్‌ను పెట్టింది. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను ఊడ్చేసిన కోహ్లీబ్యాచ్‌.. ఇపుడు వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ పై దృష్టిపెట్టింది. 5మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 4మ్యాచ్‌ల్లో విజయంసాధించిన టీమిండియా.. మరొక్క గెలుపుతో లంకకు సొంతగడ్డమీదే వైట్‌వాష్‌ వేయాలని ఉవ్విళ్లూరుతోంది. 

06:53 - September 1, 2017

ఢిల్లీ : మోది సర్కార్‌ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి ఉపయోగపడిందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. డిమోనిటైజేషన్‌ మనీలాండరింగ్‌ ఎక్సర్‌సైజ్‌ తప్ప మరోటి కాదన్నారు. అక్రమంగా ఆర్జించిన నోట్లను సక్రమంగా మార్చుకునేందుకు వీలు కల్పించిందని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దువల్ల క్యూలైన్లలో నిలబడి 100 మంది ప్రాణాలు కోల్పోయారని ఏచూరి గుర్తు చేశారు. కేవలం బహుళ జాతీయ కంపెనీలకు మాత్రమే లబ్ది చేకూరిందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం, అవినీతిని రూపుమాపడం, దొంగ నోట్లను అరికట్టడం, టెర్రరిస్టులకు నిధులు అందకుండా చేయాలన్న ప్రధాని లక్ష్యం ఏ ఒక్కటి నెరవేరలేదన్నారు. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు లక్షా 50 వేల కోట్ల నష్టం జరిగిందని దీన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో తలెత్తిన పరిణామాలకు ప్రధాని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. 

06:49 - September 1, 2017

ఢిల్లీ : భారత్‌ అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రోకు ఎదురుదెబ్బ తగిలింది. పీఎస్ ఎల్వీ సీ -39 విఫలమైంది. ఈ రాకెట్‌ ఐఆర్ఎన్ఎస్ఎస్ 1హెచ్ ఉప్రగహాన్ని మోసుకెళ్లింది. అయితే రాకెట్‌ ఉష్ణకవచం నుంచి ఉపగ్రహం వేరుకాకపోవడంతో ప్రయోగం విఫలమైంది. ఇటీవల కాలంలో ఇస్రోకు ఇది తొలి పరాజయం. పీఎస్ఎల్ వీ సీ 39 ప్రయోగం తొలి మూడు దశలు విజయవంతమైనా, చివరి దశలో రాకెట్‌ నుంచి ఉపగ్రహం వేరుకాకపోవడంతో ప్రయోగం ఫెయిలైంది. హీట్‌ షీల్డు తెరుచుకోపోవడంతో ఉపగ్రహాన్ని నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టలేకపోయారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్‌ సొంత దిక్సూటీ నావిక్.. మరింత మెరుగ్గా సేవలు అందించేంది. పీఎస్ఎల్ వీ సీ 39 ప్రయోగం వైఫల్యానికి కారణాలపై ఇస్రో సమీక్షిస్తోంది.  

06:44 - September 1, 2017

హైదరాబాద్‌ : హబ్సిగూడలోని ఐఐసిటీ క్లబ్‌లో ఏర్పాటు చేసిన డ్వాక్రా ఎగ్జిబిషన్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. మహిళలు స్వయంగా తయారు చేసిన వస్తువులు, వస్త్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దాదాపు 60 వరకు స్టాల్స్ ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను టీడీపీ నేత కూన వెంకటేష్ సందర్శించారు. మహిళలకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. 

06:42 - September 1, 2017

విజయవాడ : బెజవాడలో ఇవాళ్టి నుంచి హెల్మెట్‌ నిబంధనను తప్పనిసరిగా అమలు చేసేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. హెల్మెట్‌ లేకుండా బైకు నడిపినా.. సీటు బెల్ట్‌ పెట్టుకోకుండా కారు నడిపినా కఠినంగా వ్యవహరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు. హెల్మెటే కాదు.. వాహనపత్రాలు లేకున్నా ఫైన్‌ల మోత మోగించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి విజయవాడ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్‌ నిబంధనను అమల్లోకి తెచ్చేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్షలు విధించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపితే మినిమమ్ 100 రూపాయల ఫైన్‌ విధించనున్నారు. రహదారి భద్రతా నియమాలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు.

ద్విచక్ర వాహన ప్రమాదాల్లో అత్యధికంగా బ్రెయిన్‌ డ్యామేజ్‌తోనే మరణాల సంఖ్య ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. పోలీస్‌, రవాణా, ట్రాఫిక్‌ శాఖ ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం బుధవారం సమీక్ష నిర్వహించారు. హెల్మెట్‌ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సాధారణ ప్రజలే కాకుండా పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలంటున్నారు. దీంతోపాటు విద్యాసంస్థల యాజమాన్యాలు.. విద్యార్థులు విధిగా హెల్మెట్‌ వాడేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.

ఇక రోడ్‌సెప్టీ నిబంధనలు పాటించని వారిపై ఆర్టీఏ, ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు. ఆర్సీ, లైసెన్స్‌, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌, ఇన్సూరెన్స్‌ పత్రాలను పరిశీలిస్తారు. వీటిలో ఏ పత్రం లేకున్నా ఫైన్‌ విధిస్తారు. వాహన నెంబర్‌ సాయంతో డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఉన్నాయో లేదో తెలుసుకుంటారు. బైకిస్టులు హెల్మెట్‌, కార్లు, జీపులు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని..లేనిపక్షంలో జరిమానాలు తప్పవంటున్నారు.  

06:39 - September 1, 2017

ప్రకాశం : పెళ్లిచూపుల కోసం బయలు దేరింది. మరికొన్ని గంటల్లో సొంతూరుకు చేరుకుంటానని ఎదురు చూస్తున్న యువతి పట్ల కొందరు యువకులు యమదూతల్లా ప్రవర్తించారు. వెకిలి మాటలు, చేష్టలతో విసుగెత్తించారు. పోకిరీల వేధింపులను తప్పించుకోడానికి కదులు తున్న రైల్లోనుంచి దూకేసింది. తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జరిగన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

విజయవాడకు చెందిన యువతి షేక్‌ అజ్ములా చెన్నైల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తోంది. కాగా తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన పెళ్లిచూపుల కోసం సొంతూరుకు బయలు దేరింది. స్నేహితురాళ్లతో సంతోషంగా నిజమాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కిన అమ్మాయిలకు ఉత్తర భారత్‌కు చెందిన కొందరు యువకులు మాటలు, చేష్టలతో నరకం చూపెట్టారు. పోకిరీల వేధింపులకు తాళలేక అజ్ములా రైల్లోనుంచి దూకేసింది. అజ్ములా స్నేహితురాళ్లతోపాటు అదే ట్రైన్‌లో ఎక్కిన యువకులు ఫుల్‌గా మద్యం సేవించి ఉన్నారు. అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. దీంతో ప్రకాశం జిల్లా సింగరాయ కొండ రైల్వేస్టేషన్‌ దగ్గరకు రాగానే అజ్ముల్‌ ఒక్కసారిగా బయటికి దూకేసిందని ఆమే స్నేహితురాళ్లు తెలిపారు. వెంటనే స్పందించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన ఆజ్ముల్‌ను తిరుపతిలోని రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అజ్ముల్‌కు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ఆందోళన కరంగానే ఉందని డాక్టర్లు తెలిపారు. అటు పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన కూతురి కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు.. విషయం తెలుసుకుని షాక్‌కు గురైయ్యారు. అటు అజ్ముల్‌ ఆమె స్నేహితులతో అనుచితంగా ప్రవర్తించిన యువకులను విజయవాడ రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోకిరీలను కఠినంగా శిక్షించాలని అజ్ముల్‌ తల్లిదండ్రులు కోరుతున్నారు.

06:36 - September 1, 2017

విజయవాడ : ఎన్నో ఆశలు పెట్టుకున్న నంద్యాల పోరు అసంతృప్తిని మిగిల్చింది.. ఇపుడు వైసీపీ భవిష్యత్‌ కార్యాచరణ ఏంటి..? పార్టీశ్రేణుల్లో మనోధైర్యం నింపేందుకు వైసీపీ నేతలు ఏంచేయబోతున్నారు..? ఇప్పటికే ప్రకటించిన ఇంటింటికీ వైసీపీ ప్రోగ్రాం సంగతేంటి..? జగన్‌ ప్రకటించిన నవరత్నాల పైప్రచారానికి వైసీపీ సిద్ధం అవుతోందా..? నంద్యాల ఉప ఎన్నిక ఓటమి అసంతృప్తి నుంచి క్యాడ‌ర్ ను వీలైనంత తొంద‌ర‌గా బైట‌ప‌డేసేందుకు వైసిపి అధి నాయ‌క‌త్వం వ్యూహ ర‌చ‌న చేస్తోంది. గ‌తంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వైసిపి త‌రుపున అఖండ మెజార్టీతో గెలిచిన సంద‌ర్బాల‌ను గుర్తు చేసుకుంటూ నంద్యాల చేదు అనుభ‌వాన్ని మర్చిపోయే విధంగా కార్యక్రమాలకు వ్యూహాలు రూపొందిస్తోంది.

వైఎస్‌ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ర్ధంతిని సందర్భాన్ని ఉపయోగించుకుని పార్టీశ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి అధినాయకత్వం రెడీ అవుతోంది. సెప్టెంబ‌ర్ 2 నుంచి ప్రజాక్షేత్రంలో ప‌ర్యటించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా సెప్టెంబ‌ర్ 3 నుంచి 9 వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జిల‌కు శిక్షణ ఇచ్చేందుకు పార్టీ స‌మాయ‌త్తం అవుతోంది. ఆ త‌రువాత 'వైఎస్ఆర్ కుటుంబం' పేరుతో ప్రజ‌ల‌కు దగ్గరయ్యేలా వినూత్న కార్యక్రమానికి కూడా శ్రీ‌కారం చుడుతున్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనికోసం అధికార పార్టీ వైఫ‌ల్యాల‌తో కూడిన ప్రజా బ్యాలెట్ క‌ర‌ప‌త్రాన్ని ప్రజ‌ల‌కు పంపిణీ చేయ‌బోతున్నారు.

ప్లీనరీ సమావేశాల్లో పార్టీ అధినేత జగన్‌ ప్రకటించిన నవరత్నాల పథకాలపై కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని వైసీపీ నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్‌లో తలపెట్టిన విజయశంఖారావం కార్యక్రమంతోపాటు జగన్‌పాదయాత్ర మొదలు పెట్టడానికి కూడా యాక్షన్‌ప్లాన్‌ రెడీ చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక మిగిల్చిన చేదు అనుభ‌వాన్ని సాధ్యమైనంత త్వర‌గా పార్టీ కేడర్‌నుంచి తొలగించాలని వైసిపి నేత‌లు భావిస్తున్నారు. అందులో భాగంగా నూత‌న కార్యక్రమాల‌తో కార్యక‌ర్తల‌కు భ‌రోసా క‌ల్పిస్తామంటున్నారు. క్యాడ‌ర్‌లో మ‌నోస్థైర్యాన్ని నూరిపోస్తూనే ప్రభుత్వ విధానాల‌పై పోరాడేందుకు ప‌టిష్టమైన వ్యూహం ర‌చిస్తోంది వైసీపీ. పార్టీమారిన 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికల్లో దిగితే.. ఎవరి సత్తాఏంటో తెలుస్తుందన్న కోణంలో అధికారపార్టీపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటిదాకా మరుగున పెట్టిన ప్రత్యేక హోదా అంశాన్ని ఇక ఉధృతంగా వినిపించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నంద్యాల ఓట‌మి మిగిల్చిన అసంతృప్తి నుంచి నాయ‌కుల‌తో పాటు పార్టీ శ్రేణుల‌్లోనూ నూత‌న ఉత్సాహం నింపేందుకు సరికొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నామని వైసీపీ చెబుతోంది.  

06:33 - September 1, 2017

విజయవాడ : నంద్యాల ఓటమిని అంగీకరించకుండా జగన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ మంత్రి జవహర్ విమర్శించారు. ఉప ఎన్నికల ప్రచారంలో నోటికి వచ్చినట్లు మాట్లాడిన జగన్ ఇప్పుడు కొడాలి నానితో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే కొడాలి నాని తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నుంచి సామాన్య కార్యకర్తను నిలబెట్టి కొడాలి నానిపై గెలిచి చూపిస్తామని మంత్రి జవహర్ సవాల్ విసిరారు. 

06:31 - September 1, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. ఒకరోజు విధులకు సామూహిక సెలవు ప్రకటించారు. కాంట్రీబ్యూటరీ పింఛన్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 30జిల్లాల కేంద్రాలతోపాటు రాజధాని హైదరాబాద్‌లోనూ ధర్నాలు, ధీక్షలు చేపడుతున్నారు. సెలవుల్లో లేని ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు రానున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలపనున్నారు. 2004 సెప్టెంబర్‌ 9వ తేదీన నియమితులైన ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఈ నిరసనలో పాల్గొంటున్నారు. పాత పింఛను పథకాన్నే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగుల నిరసనలకు పలు ఉద్యోగ సంఘాలు, వామపక్షాలు మద్దతు తెలిపాయి. 

06:29 - September 1, 2017

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది. బ్రిక్స్‌ దేశాల సదస్సుకోసం ఆదివారం ప్రధాని మోదీ చైనా వెళ్లనున్నారు. ఈలోపుగానే మత్రి వర్గ విస్తరణ జరగవచ్చన ప్రచారం జరుగుతోంది.. శనివారం సాయంత్రానికల్లా కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉండొచ్చని తెలుస్తోంది. పలు కారణాలతో కేబినెట్‌లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంతోపాటు ఎన్డీయేలో కొత్తగాచేరిన మిత్రపక్షాలకు అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది.ముఖ్యంగా జేడీయూ, అన్నాడీఎంకే నుంచి కొందరికి మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఇప్పటికే కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సహాయ మంత్రి రాజీవ్‌ప్రతాప్‌రూడీ, జలవనరులశాఖా మంత్రి ఉమాభారతి తమ రాజీనామాలను సమర్పించారు. దీంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం అయిందని ఢిల్లీలో ప్రచారం జోరందుకుంది. ప్రధాని సూచనలతో మంత్రులు సంజీవ్‌బల్యాన్‌, కల్‌రాజ్‌మిశ్రా, ఫగ్గన్‌సింగ్‌కులస్థే, మంహేద్రపాండే కూడా రాజీనామాలకు సిద్దపడినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికలే టార్గెట్‌గా మిత్రపక్షాలకు అవకాశం కల్పించడంతోపాటు బీజేపీ నేతలకు పార్టీ పనులు అప్పగించాలని మోదీ-అమిత్‌షా భావిస్తున్నట్టు సమాచరం. దీన్లో భాగంగానే ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

తిరుమలకు రానున్న రాష్ట్రపతి..

@page { margin: 2cm }
p { margin-bottom: 0.25cm; line-height: 120% }

చిత్తూరు : నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చిత్తూరుకు రానున్నారు. తిరుమలలో శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నేడు కర్నాటక సీఎంతో టి.పిసిసి బృందం భేటీ..

హైదరాబాద్ : కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో శుక్రవారం బెంగళూరులో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం భేటీ కానుంది. పాలమూరు జిల్లా సాగునీటి అవసరాల కోసం నారాయణపూర్ జలాశయం నుండి జూరాల ప్రాజెక్టుకు నీరు విడుదల చేయాలని వారు కోరనున్నారు.

 

నేటి నుండి తెలంగాణ విమోచన యాత్ర..

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలంగాణ విమోచన యాత్రను శుక్రవారం నుండి మొదలు పెడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. వారం రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుందని తెలిపారు. 

24 మంది సజీవ సమాధి..

 

ముంబై : దక్షిణ ముంబైలోని బేండీ బజార్ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొత్తంగా 24 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతుల్లో పురుషులు 19 మంది, మహిళలు ఐదుగురున్నారు. 

 

అసెంబ్లీ నూతన కార్యదర్శిగా...

హైదారబాద్ : అసెంబ్లీ నూతన కార్యదర్శిగా డా.వీ నరసింహచార్యులను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కార్యదర్శి డాక్టర్ రాజా సదారాం గురువారం పదవీ విరమణ చేశారు. 

నేడు సంగీతం టీచర్ల పరీక్ష..

హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో సంగీతం టీచర్ల నియామకం కోసం అభ్యర్థులకు శుక్రవారం పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 10 నుండి 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. దిల్ సుఖ్ నగర్ న్యూ సిద్దార్థ మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహించనున్నారు. 

జూరాలకు పెరుగుతున్న వరద నీరు..

హైదరాబాద్ : ఎగువన కురిసిన భారీ వర్షాలతో జూరాలకు వరద భారీగా వస్తోంది. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 7.991 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గురువారం రాత్రి వరకు 15వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని తెలుస్తోంది. 

కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా...

న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీ వ్ గౌబా బాధ్యతలు స్వీకరించారు. 1982 జార్ఖండ్ క్యాడర్‌కు చెందిన రాజీవ్ గౌబా (58) రెండేండ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఏ క్షణమైనా విస్తరణ..?

ఢిల్లీ : కేంద్ర మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధమౌతున్నట్లు సమాచారం. ఆదివారం ప్రధాన మంత్రి మోడీ చైనా వెళ్లనున్నారు. అక్కడ బ్రిక్స్ దేశాల శిఖరాగ్రా సమావేశంలో పాల్గొననున్నారు. శనివారం సాయంత్రం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగవచ్చని ప్రచారం జరుగుతోంది.

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు..

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. 

Don't Miss