Activities calendar

02 September 2017

17:53 - September 2, 2017

మెదక్‌ : జిల్లాలో రూ. 100 కోట్ల విలువైన భారీ కుంభకోణం బయటపడింది..... కోట్ల రూపాయల విలువైన కొల్లూరు చెరువు కబ్జాకు కొందరు ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు.. 25 ఎకరాల్లో విస్తరించిఉన్న చెరువును ఆక్రమించిన యశోద ఆస్పత్రి ఎండీ సురేందర్‌ రావు, అతని బంధువు దేవేందర్‌ రావు... మట్టి నింపేందుకు ప్రయత్నించారు.. ఈ విషయం తెలుసుకున్న  ఎమ్మార్వో మహిపాల్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు ఐపీసీ 340, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కబ్జాకు యత్నించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ రూపొందించిన మ్యాప్‌లో కొల్లూరు చెరువుకు చెందిన 25 ఎకరాలు లేకుండా తయారు చేశారని.. దీని వెనక ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

 

17:48 - September 2, 2017

సూర్యపేట : ఏపూరి సోమన్న పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. సోమన్నను పోలీసులు గొలుసులతో బంధించడాన్ని టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, టీడీపీ నేత రేవంత్‌రెడ్డితో పాటు పలువురు నేతలు దారుణమని అభిప్రాయపడుతున్నారు. ఆయన కుటుంబ వ్యవహారంలో ఎమ్మెల్యే వీరేశం భార్య పుష్ప కలుగజేసుకుని... సోమన్నను దూషించడం సరికాదన్నారు. ఇదంతా పోలీస్‌స్టేషన్‌లోనే జరగడం దారుణమన్నారు. ఇక ఈ వ్యవహారంలో.... ఈరోజు సోమన్న... ఎమ్మెల్యే భార్య పుష్పపై తిరుమలగిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తనను దూషించిన పుష్పపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు పోలీసు రాజ్యం నడిపిస్తున్న పాలకులకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరపడ్డాయని.. ప్రతిపక్ష నేతలంటున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ విచారణ చేపట్టనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మీడియాపై దురుసుగా ప్రవర్తించిన నటుడు ఆర్.నారాయణ మూర్తి

తూ.గో: గండేపల్లి మండలం బొర్రం పాలెం వద్ద ఆర్ నారాయణమూర్తి నటిస్తున్న అన్నదాత సుఖీభవ సినిమా షూటింగ్ వివాదం రేగింది. పుష్పం ఎత్తిపోతల పంప్ హౌస్ వద్ద సినిమా షూటింగ్ కు అనుమతి లేదంటూ జడ్పీటీసీ యర్రం శెట్టి చంద్రారావు, గ్రామస్థులతో నారాయణ మూర్తి వాగ్వాదానికి దిగారు. వద్ద మీడియాపై ఆర్ నారాయణ మూర్తి దురుసుగా ప్రవరర్తించి.. మీడియా కెమెరామెన్ పై దాడి చేశాడు. అనంతరం షూటింగ్ నిలిపివేసిన చిత్ర బృందం వెళ్లిపోయింది.

మడికొండ సీఐ శ్రీధర్ దాష్టీకం...

వరంగల్ : మడికొండ సీఐ శ్రీధర్ దాష్టీకం...ఓ కేసు విషయంలో మైనర్ బాలుడు మహిళను మడికొండ సీఐ శ్రీధర్ తీవ్రంగా కొట్టాడు. బాలుడు మహిల నడవలేని స్థితిలో, అవమానం భరించలేక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు. రూ. 60 వేలు ఇవ్వాలంటూ బాధితులను సీఐ వేధిస్తున్నాడు.

బయ్యారంలో అగ్రవర్ణాల దాష్టీకం....

అమరావతి: కోసూరు మండలం బయ్యారంలో అగ్రవర్ణాల దాష్టీకానికి పాల్పడ్డారు. గణేష్ నిమజ్జనం చేసి తిరిగి వస్తున్న దాళితులపై దాడి చేశారు. గణేష్ విగ్రహంతో పాటు అంబేద్కర్ విగ్రహం తో పాటు అంబేద్కర్ విగ్రహాన్ని దళితులు పెట్టారు. అంబేద్కర్ పాటు పెట్టారని అగ్రకులస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి దాడి చేశారు. ఈ దాడిలో 10 మందికి తీవ్రగాయాలు కాగా... 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అమరావతి ఆసుపత్రికి తరలించారు.

16:45 - September 2, 2017

చంఢీగడ్ : చంఢీగడ్..సిమ్లా జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియల కింద వాహనాలు కూరుకుపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు లబ్ధి చేకూర్చేందుకే జీవో 39 : ఎల్ రమణ

హైదరాబాద్: భూసర్వే రాజ్యాంగ విరుద్ధం అని టిడిపి అధ్యక్షుడు నేత ఎల్ . రమణ అన్నారు. జీవో 39 పై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు లబ్ధి చేకూర్చేందుకే జీవో 39 అని ఆరోపించారు. ప్రతిపక్షాలను కేసీఆర్ శత్రువులుగా భావిస్తున్నారని మండిపడ్డారు.

16:12 - September 2, 2017

తమిళనాడు : నేషనల్‌ ఎలిజిబుల్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడిన తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల దళిత విద్యార్థిని ఎస్‌.అనిత ఆత్మహత్యకు పాల్పడడంపై ఎస్‌ఎఫ్‌ఐ తదితర విద్యార్థి సంఘాలు తమిళనాడులో ఆందోళన చేపట్టాయి. నీట్‌ను కేంద్రం వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. తన కూతురును కష్టపడి చదివించానని...నీట్‌ తన కూతురు ఉసురు తీసిందని అనిత తండ్రి ఆవేదన చెందారు.  నీట్‌ ఆధారంగానే మెడిసిన్‌ అడ్మిషన్లు తీసుకోవాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి స్పష్టం చేయడంతో... తనకిక మెడికల్‌ సీటు రాదనుకున్న అనిత శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  కుజుమూరు గ్రామానికి చెందిన అనితకు ఇంటర్‌లో 1200 మార్కులకు గాను 1176 మార్కులు వచ్చాయి.  నీట్‌ పరీక్షలో కేవలం 86 మార్కులే రావడంతో ఎంబిబిఎస్‌ సీటు పొందలేకపోయింది. నీట్‌ పరీక్షను ప్రామాణికంగా తీసుకోవద్దని, ఇంటర్‌ మార్కులను బేస్‌గా తీసుకుంటే తనకు మెడిసిన్‌లో సీటు వస్తుందని సుప్రీంకోర్టులో కేసు వేసింది. నీట్‌ను బిజెపి ప్రవేశపెట్టిందని ఈ ఘటనకు ఆ పార్టీనే బాధ్యత వహించాలని డిఎంకె డిమాండ్‌ చేసింది.

 

16:07 - September 2, 2017

పశ్చిమగోదావరి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో చిరు, పవన్ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మత్తు పదార్ధాలు వాడకండి.. వాడనీయకండి అనే నినాదంతో భారీ ర్యాలీ తీశారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మహిళలకు కుట్టుమిషన్లు.. పేదలకు దుప్పట్లు పంచారు. 

15:58 - September 2, 2017

ఢిల్లీ : హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటి అయ్యారు. ప్రధానంగా సికింద్రాబాద్‌లోని రక్షణ శాఖ భూముల బదాలయింపు, కంటోన్మెంట్ ఏరియాలో అభివృద్ధి పనులకు కావాల్సిన స్థలాలను.. తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. 

 

15:34 - September 2, 2017

నల్గొండ : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భార్య పుష్పపై కవి, గాయకుడు ఏపూరి సోమన్న తిరుమలగిరి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించి అవమానపరిచారని ఆరోపించారు. పుష్పపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం పీఎస్ లోనే పుష్ప సోమన్నను తిట్టారు. సోమన్నను గొలుసులతో బంధించడాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. కుటుంబ తగాదాలను అడ్డుపెట్టుకొని తీవ్రవాదులను, హంతకులను బంధించినట్లుగా సోమన్నను బంధించడం దారుణమన్నారు. సోమన్నపై కావాలని కక్ష సాధిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు రాజ్యం నడుపుతున్న పాలకులకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

రోజా ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే:మంత్రి అయ్యన్న

విశాఖ: వైసీపీ ఎమ్మెల్యే రోజా పై మంత్రి అయ్యన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లోనే... 'రోజా అంటేనే దరిద్రం, ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే, రోజా ఉన్న పదేళ్లు చంద్రబాబును దరిద్రం వెంటాడింది, ఆమె బయటికి వెళ్ళగానే టిడిపి అధికారంలోకి వచ్చింది. జబర్దస్త్ లో డాన్సులు చేసే రోజాకు మహిళల గురించి మాట్లాడే అర్హతలేదు. జగన్ త్వరలోనే వైసీపీ జెండా పీకేసి డ్రామా ట్రూప్ పెట్టుకోవడం ఖామం, ఆ డ్రామా ట్రూప్ లో రోజా రికార్డింగ్ డాన్సులు చేయడం తథ్యం' అని అన్నారు.

అరుణ్ జైట్లీని కలిసిన కేసీఆర్

ఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ర‌క్ష‌ణ శాఖ భూముల అప్ప‌గింత‌, జీఎస్టీ అంశాల‌పై ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగినట్లు సమాచారం. అనంతరం కేసీఆర్ మాట్లాడుత...స‌చివాల‌యం నిర్మాణం కోసం ర‌క్ష‌ణ శాఖ భూముల‌ను తెలంగాణ ప్ర‌భుత్వానికి అప్ప‌గించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం అంగీక‌రించిన‌ట్లు తెలిపారు.

15:20 - September 2, 2017

టాలీవుడ్ సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డి సినిమాను తమిళనాట రీమేక్ చేయనున్నారు. తెలుగులో వివాదాలతో మంచి హైప్ క్రియేట్ అవ్వటంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు పోటి పడ్డాయి. అయితే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు చెందిన వుండర్‌ బార్‌ ఫిల్మ్స్‌ ఈ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తారా..లేదా.. దర్శకుడు ఎవరు..? అన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు.

 

15:02 - September 2, 2017

మెదక్‌ : జిల్లాలో రూ. 100 కోట్ల విలువైన భారీ కుంభకోణం బయటపడింది. కోట్ల రూపాయల విలువైన కొల్లూరు చెరువు కబ్జాకు కొందరు ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. 25 ఎకరాల్లో విస్తరించిఉన్న చెరువును ఆక్రమించిన యశోద ఆస్పత్రి ఎండీ సురేందర్‌ రావు, అతని బంధువు దేవేందర్‌ రావు... మట్టి నింపేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మార్వో మహిపాల్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ 340, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

14:56 - September 2, 2017

హైదరాబాద్‌ : నగరంలోని కవాడిగూడలో ఏర్పాటు చేసిన అతిపెద్ద మట్టి వినాయక విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. 65 అడుగుల భారీ గ్రీన్‌ గణేష్‌ను మంగళవారం నిమజ్జనం చేయనున్నారు. వినాయకుని నిమజ్జనంలోనూ పర్యావరణాన్ని కాపాడేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం వీడియోలో చూడండి. 

14:55 - September 2, 2017

ఫిదా ఫేమ్ సాయి పల్లవి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు రెడీ అవుతోంది. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కబోయే ప్రయోగాత్మక చిత్రం 'కణం'లో లీడ్ రోల్ లో నటిస్తోంది. నాన్న లాంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన ఎ. ఎల్ విజయ్ దర్శకత్వంలో 2.ఓ నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సాయి పల్లవి ఓ పాపతో కలిసి ఉన్న ఈ పోస్టర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. టైటిల్ డిజైన్ లోనూ తల్లి గర్భంలోని బిడ్డను చూపించటంతో ఈ సినిమా లేడి ఓరియంటెడ్ మూవీ అయి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

14:54 - September 2, 2017

హైదరాబాద్‌ : నగర శివారు ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పల్ డిపో దగ్గర వరంగల్‌ జాతీయ రహదారిపై టిప్పర్‌ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు..

 

14:51 - September 2, 2017

ఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ విస్తరణ జాబితా ఇవాళ సాయంత్రం రాష్ట్రపతికి చేరే అవకాశముంది.. ప్రస్తుతం రామ్‌నాథ్ తిరుపతి పర్యటనలో ఉన్నారు.. ఆయన తిరుపతినుంచి ఢిల్లీ చేరుకోగానే కేబినెట్‌ సెక్రటరీ జాబితాను అందజేయనున్నారు.. సాయంత్రమే కొత్తగా ఎంపికైన మంత్రులకు సమాచారం ఇవ్వనున్నారు.. మరోవైపు పలువురు కొత్త నేతలకు మంత్రి పదవులు రానున్నాయని ప్రచారం జరుగుతోంది.. కర్ణాటక నుంచి ప్రహ్లాద్‌ జోషి, సురేశ్‌ అంగాడి, శోభా కరండాల్జీ.... మహారాష్ట్రనుంచి వినయ్‌ సహస్రబుద్దే, మాజీ పోలీస్‌ కమిషనర్‌ సత్యపాల్‌ సింగ్... ఉత్తరప్రదేశ్‌నుంచి హరీశ్ ద్వివేది...... మధ్య ప్రదేశ్‌నుంచి ప్రభాత్‌ ఝా, రాకేశ్‌ సింగ్... ప్రహ్లాద్‌ పటేల్ పేర్లు వినిపిస్తున్నాయి.. అలాగే బీహార్‌నుంచి అశ్విని చౌబే... ఢిల్లీనుంచి మహేశ్‌ గిరి... ఓం మాథుర్‌.... జెడీయూ నుంచి ఆర్ సీపీ సింగ్‌... సంతోశ్‌ కుమార్‌... శివసేన నుంచి ఆనంద్‌ రావ్‌ అడ్సూల్‌... అనిల్‌ దేశాయ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి... 

14:47 - September 2, 2017
14:26 - September 2, 2017

పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. సొసైటీ కోసం.. ప్రజల సంక్షేమం కోసం పవన్ నిజాయితీగా పాటుపడతారని అభివర్ణించింది. పవన్ ఆరోగ్యంగా ఉండాలని.. ఎన్నో బర్త్‌డేలు జరుపుకోవాలని ఆంకాక్షిస్తూ.. హ్యాపీ బర్త్‌డే పవన్ కల్యాణ్ అని రేణు ట్వీట్ చేసింది.

 

14:20 - September 2, 2017

అమెరికా టెన్నిస్ స్టార్ సెరీనా విలయమ్స్ కు బేబీ గర్ల్ పుట్టిందని ఆమె సోదరి వీనస్ విలియమ్స్ తెలిపింది. ఈ వార్త తెలుసుకున్న తాను ఎంతో సంతోషానికి గురైనట్లు వీనస్ పేర్కొంది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ఉన్న సెయింట్ మేరీస్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో సెరీనా త‌న బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. పాప బ‌రువు 3 కిలోలు ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. అమ్మాయికి జ‌న్మ‌నిచ్చిన సెరీనాకు కంగ్రాట్స్ వెల్లువెత్తాయి. సెరెనా గత కొన్నేళ్లుగా రిడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహనియన్‌తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, వీరిద్దరికి 2015లో రోమ్‌లో నిశ్చితార్థం జరిగింది.

13:54 - September 2, 2017

విజయనగరం : ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌లో తల్లిదండ్రుల సంతకం పెట్టించుకొని రాలేదంటూ ఓ టీచర్‌ అమానుషంగా ప్రవర్తించింది.. విద్యార్థి ముఖం కమిలిపోయేలా కొట్టింది.. విజయ నగరం జిల్లా సాలూరులోని దీప్తి హైస్కూల్‌లో ఈ ఘటన జరిగింది.. శుక్రవారం ప్రోగ్రెస్ రిపోర్ట్ లో పేరెంట్స్ సంతకం పెట్టించుకురాలేదని స్టూడెంట్‌కు టీచర్‌ పనిష్‌మెంట్ విధించింది..

13:52 - September 2, 2017

హైదరాబాద్: రిజర్వేషన్లు లేని సమాజమే అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అని పవన్‌ కళ్యాణ్ అన్నారు. అంబేడ్కర్‌ చెప్పినట్లు కొంతకాలం ఇచ్చి ఆపేయాలన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిందన్నారు. రిజర్వేషన్లు ఇస్తే ఇస్తామని, లేదంటే సాధ్యం కాదని చెప్పాలి.. కానీ సమస్యని నాన్చడం సరికాదన్నారు. దానివల్ల అశాంతి రేకెత్తుతుందన్నారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని చెప్పారు. అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి, పోలీసులకు లేదన్నారు. పోలీసులు ముద్రగడను అడ్డుకోవడం సరికాదన్నారు. నర్సరీ నుంచి 12 వరకు ఉచిత విద్య అందించాలని చెప్పాడు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు వేల కోట్లు దోచేస్తున్నాయన్నారు. తెలంగాణ కోసం ఆ ప్రాంత నేతలు గట్టిగా పోరాటం చేశారని.. ఏపీ నేతలు వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం మనం పోరాటం చేయకుండా కేంద్రాన్ని ఏం అడుగుతామని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నించే ముందు, రాష్ట్ర నేతలు ఏం చేశారని అడగాలన్నారు. తాను వ్యాపార వేత్తను కాదని.. తన మీద క్రిమినల్‌ కేసులు లేవని స్పష్టం చేశారు.

13:50 - September 2, 2017

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ విస్తరణలో పలువురు కొత్త నేతలకు మంత్రి పదవులు రానున్నాయని ప్రచారం జరుగుతోంది.. కర్ణాటక నుంచి ప్రహ్లాద్‌ జోషి, సురేశ్‌ అంగాడి, శోభా కరండాల్జీ.... మహారాష్ట్రనుంచి వినయ్‌ సహస్రబుద్దే, మాజీ పోలీస్‌ కమిషనర్‌ సత్యపాల్‌ సింగ్... ఉత్తరప్రదేశ్‌నుంచి హరీశ్ ద్వివేది...... మధ్య ప్రదేశ్‌నుంచి ప్రభాత్‌ ఝా, రాకేశ్‌ సింగ్... ప్రహ్లాద్‌ పటేల్ పేర్లు వినిపిస్తున్నాయి.. అలాగే బీహార్‌నుంచి అశ్విని చౌబే... ఢిల్లీనుంచి మహేశ్‌ గిరి... ఓం మాథుర్‌.... జేడీయూ నుంచి ఆర్ సీపీ సింగ్‌... సంతోశ్‌ కుమార్‌... శివసేన నుంచి ఆనంద్‌ రావ్‌ అడ్సూల్‌... అనిల్‌ దేశాయ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి...

13:47 - September 2, 2017

హైదరాబాద్:తెలుగు, త‌మిళ సినిమాల‌తో బిజీగా వున్న అందాల రాశి రాశీఖన్నా తొలిసారి మళయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హ‌ర్షిత చోప్రా అనే పాత్ర‌ను రాశి ఖ‌న్నా పోషిస్తుండ‌గా, తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో పాటు మూవీపై భారీ అంచనాలు పెంచింది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విలన్ చిత్రంలో మోహన్ లాల్.. మాథ్యూ మనోరంజన్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండ‌గా , ఆయన భార్యగా మంజూ వారియర్ నటిస్తుంది. విలన్ చిత్రాన్ని ఇటు తెలుగు అటు మలయాళంలో దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయ‌నున్నారు. ఇందులో శ‌క్తివేల్ ప‌ళ‌నిస్వామి అనే పాత్ర‌ను విశాల్‌, ఫెలిక్స్ డి విన్సెంట్ అనే పాత్ర‌ను శ్రీకాంత్‌, శ్రేయ అనే పాత్ర‌ను హ‌న్సిక చేస్తున్నారు రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ బేన‌ర్ పై రాక్ లైన్ వెంక‌టేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫ‌ర్స్ గా పీట‌ర్ హెయిన్, మ‌నోజ్ ప‌ర‌మ‌హంస పని చేస్తున్నారు. చిత్రానికి సుశీన్ శ్యామ్ సంగీతం అందించారు.

లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన హీరో నిఖిల్

గుంటూరు: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌కు గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన ఓ జిమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిఖిల్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. ఈ ఊహించని ఘటనతో అక్కడున్నవారంతా కొద్దిసేపు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

 

బైక్ ను ఢీకొట్టిన టిప్పర్ : ఇద్దరి మృతి

హైద‌రాబాద్: ఈ రోజు ఉద‌యం ఉప్ప‌ల్ బ‌స్ డిపో ద‌గ్గ‌ర జాతీయ ర‌హ‌దారిపై అతి వేగంగా వ‌స్తున్న టిప్ప‌ర్ బైక్ ను ఢీకొన్న‌ది. ఈ ఘ‌ట‌న లో బైక్ పై వెళ్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. సంఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకొని విచార‌ణ ప్రారంభించారు.

13:15 - September 2, 2017

రాజన్న సిరిసిల్ల : కొనరావుపేట మండలం నాగారంలో మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌ రావు పర్యటిస్తున్నారు.. హెలికాప్టర్‌ ద్వారా నాగారం చేరుకున్న గవర్నర్‌కు మంత్రులు ఈటెల రాజేందర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్‌ బాబు స్వాగతం పలికారు.. జీఎంఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగులకు వృత్తివిద్య శిక్షణ తరగతులను విద్యాసాగర్‌ రావు ప్రారంభించారు.. అలాగే గ్రామ పంచాయితీలో రైతులకు 85 పంపుసెట్లు పంపిణీ చేయనున్నారు.. మధ్యాహ్నం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.. ఈ కార్యక్రమం పూర్తయ్యాక గ్రామస్తులతోకలిసి భోజనం చేస్తారు.. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.. గవర్నర్‌ పర్యటనకు పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు..

13:14 - September 2, 2017

అనంతపురం: పుట్టపర్తిలో గ్యాస్‌ లీక్‌తో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి..... సాయిగంగా రెసెడెన్సీ రూంలో ఉంటున్న మహిళ వంట చేసేందుకు స్టౌ అంటించింది.. అయితే స్టౌ, సిలిండర్‌ మధ్య పైప్‌లోనుంచి గ్యాస్‌ లీక్ అయింది.. స్టౌ అంటించగానే మంటలు చెలరేగాయి... మంటలు ఆర్పడానికి విజయ లక్ష్మి కొడుకు ప్రయత్నించినా ఉపయోగంలేకుండాపోయింది.. మంటల్లో విజయలక్ష్మికి తీవ్రంగా గాయాలయ్యాయి... ఆమెను సత్యసాయి జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు... మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన రాంబాబుకు స్వల్ప గాయాలయ్యాయి..

 

13:12 - September 2, 2017

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ రోడ్‌నెం.78లో పోకిరీకి దేహశుద్ధి చేశారు స్థానికులు. వివాహితను వేధిస్తున్న వ్యక్తిని జనం పట్టుకుని చితక్కొట్టారు. నిందితుడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రసన్న కుమార్‌గా గుర్తించారు. నిందితుడు ఆరు నెలలుగా వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయింది.

 

12:54 - September 2, 2017

హైదరాబాద్ :మచిలీపట్నంలో పోర్టు పనులు ప్రారంభం కాకుండానే భూదందా మొదలైంది. బందరు పోర్టు కోసం రైతులపై ఒత్తిడి తెచ్చి భూములు తీసుకునేందుకు.. సర్కార్‌ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. తీరంలో అలజడి రేగింది. రైతుల భూములను ఎలాగైనా తీసుకునే ప్రయత్నాల్లో భాగంగా.. ప్రభుత్వం నోటిఫికేషన్ల గడువును పొడగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.

వ్యూహాత్మకంగా ముందుకెళ్తోన్న ప్రభుత్వం

మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభం కాకుండానే.. భూముల విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. అందులో భాగంగా భూ సేకరణ, భూ సమీకరణ నోటిఫికేషన్‌ గడువును మరో ఏడాది పొడగించింది. ఈ మేరకు కృష్ణాజిల్లా కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం 2017 ఆగస్టు 28న ఉత్తర్వులు జారీ చేశారు. పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణం పేరుతో.. మచిలీపట్నం నియోజకవర్గం 1.05 లక్షల ఎకరాలను సమీకరించనున్నట్లు సర్కార్‌ ప్రకటించింది. దీంతో ఎంతో విలువైన భూములను, నేలతల్లినే నమ్ముకొని జీవిస్తున్న రైతుల బతుకులు ఛిద్రం కాకుండా.. వామపక్షాలు రైతులతో కలిసి పోరాటం చేస్తున్నాయి.

పోర్టు నిర్మాణం కోసం 5, 324 ఎకరాలు

బందరుపోర్టు నిర్మాణం కోసం 5, 324 ఎకరాలు అవసరమని.. 2012లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి జీవో 11ను జారీ చేశారు. 2014లో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ 2015 ఆగస్టు 29న 33 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో రైతులకు సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, వైసీపీ, ఇతర ప్రజా సంఘాలు రైతులతో కలిసి ఉద్యమించాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

3, 014 ఎకరాలను సమీకరించామన్న పాలకులు

పోర్టు నిర్మాణానికి 3, 014 ఎకరాలను ప్రభుత్వం సమీకరించినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం.. చర్చనీయాంశంగా మారింది. 2017 మార్చి 28న పోర్టు నిర్మాణం నిర్వహించే ప్రాంతంలోని ఆరు గ్రామాల పరిధిలో.. 3, 014 ఎకరాలను సమీకరించామని పాలకులు చెప్పుకొస్తున్నారు. పారిశ్రామిక కారిడార్ కోసం 21 గ్రామాల్లో 12,144.86 ఎకరాలు అవసరమని నిర్ధారించారు. దీంతో అవసరానికి మించి కావాలని భూసేకరణ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

తిరుమల బూందీ పోటులో అగ్ని ప్రమాదం

తిరుమల: బూందీ పోటులో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

కాపు రిజర్వేషన్ల అంశాన్ని నాన్చొద్దు: పవన్ కల్యాన్

హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్ ఇస్తామనియ టిడిపి వాగ్ధానం చేసిందని పవన్ కల్యాన్ అన్నారు. ఓట్లేస్తే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామన్నారని, కాపు రిజర్వేషన్ హామీ ప్రత్యేహోదా హామీలాంటిదేనని పేర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్ ఇస్తే ఇవ్వండి... లేకపోతే ఇవ్వలేమని చెప్పండి.. నాన్చొద్దు అని పవన్ స్పష్టం చేశారు.

మోహన్ భగవత్ తో అమిత్ షా చర్చలు

ఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో అమిత్ షా చర్చలు జరుపుతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ 2019 ఎన్నికలే లక్ష్యం గా జరుగుతుంది. పలువురు సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. అంతే కాకుండా పలువురు సీనియర్ల శాఖల్లో మార్పులు, కొందరికి పదోన్నతలు కల్పించనున్నారు. బిజెపి 5, జేడీయూ నుంచి ఒకరికి కేబినెట్ లో స్థానం కల్పించనున్నట్లు సమాచారం.

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ర్యాగింగ్‌ పై మంత్రి గంటా ఆగ్రహం...

కృష్ణా :నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ర్యాగింగ్‌ ఘటనపై మంత్రి గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆర్జీయూకేటీ డైరెక్టర్‌తో మంత్రి మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గంటా ఆదేశించారు. ర్యాగింగ్‌ ఘటనపై ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక పంపాలని మంత్రి గంటా అధికారులకు ఆదేశమిచ్చారు. విద్యాలయాల్లో ర్యాగింగ్‌ను సహించేది లేదని ఆయన మండిపడ్డారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహారాష్ట్ర గవర్నర్ పర్యటన

రాజ‌న్న సిరిసిల్ల: జిల్లాలో ఇవాళ మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు ప‌ర్య‌టించారు. జిల్లాలోని కోన‌రావుపేట మండ‌లం నాగారంలో కోదండ‌రామ‌స్వామి ఆల‌య అభివృద్ధి ప‌నుల‌కు ఆయ‌న శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు ఈటెల రాజేంద‌ర్, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు.

11:57 - September 2, 2017

హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌3న ఆదివారం ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇప్పటికే ఏడుగురు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. పార్టీ ఆదేశాల మేరకే రాజీనామా చేసినట్లు మాజీ మంత్రులు చెబుతున్నారు. మంత్రివర్గంలో కొత్త ముఖాలకు చోటు దక్కే అవకాశం ఉంది. ఇదే అంశంపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ వినయ్ కుమార్, బెల్లయ్య నాయక్ టి.కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ప్రకాష్ రెడ్డి, టి. బిజెపి అధికార ప్రతినిధి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

11:52 - September 2, 2017

హైదరాబాద్: బల్దియా అధికారుల హడావుడి తీరు..ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. పనుల నిర్వహణలో నియమ... నిబంధనలు పాటించకపోవడంతో....సమ్మయ్య అనే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. వినాయక నిమజ్జనం శోభయాత్ర ఏర్పాట్లలో భాగంగా ... రోడ్డుపైకి వచ్చిన చెట్ల కొమ్మలను తొలగించాలని బల్దియా నిర్ణయించింది. ఈ మేరకు అర్బన్‌ బయో డైవర్సిటీ అధికారులు వాటర్‌ ట్యాంకర్‌పైకి ఎక్కి... చెట్ల కొమ్మలను తొలగించాలని కార్మికులను ఆదేశించారు. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో....కొమ్మలు కొడుతుండగా... సమ్మయ్య వాటర్‌ ట్యాంకర్‌పై నుంచి జారి కిందపడిపోయారు. తీవ్రగాయాలపాలపైన సమ్మయ్య మృతి చెందాడు.

మండిపడ్డ కార్మిక సంఘాలు...

ఈ ఘటనపై కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేతలు సమ్మయ్య మృత దేహంతో ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యపు వైఖరి వల్లే కార్మికుడు మృతి చెందాడని...వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని...కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనిపై విచారణ చేసి... బాధ్యులపై చర్యలు తీసుకుంటామని... మృతుని కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇస్తామని ...హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

బల్దియానే హత్య చేసింది...

ఏదిఏమైనా... ఇది బల్దియా చేసిన హత్యేనని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి కారణమైన అడిషనల్‌ డైరెక్టర్‌ అరుణ జ్యోతిని బల్దియా నుంచి మదర్‌ డిపార్ట్‌మెంట్‌కు సరెండర్‌ చేయాలని..ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

11:49 - September 2, 2017

శ్రీకాకుళం: ఏటా కోట్లలో ఆదాయాన్ని సమకూర్చి... లక్షలాది మందికి జీవనాధారమైన కొబ్బరి తోటలు నేడు కనుమరుగవుతున్నాయి. తుఫాన్‌లు..తెగుళ్లతో...చెట్లు నేలమట్టమై.. రైతులకు కంట నీరు నింపుతున్నాయి. మరో కోనసీమగా పేరొందిన ఉద్దానంలో కొబ్బరి సాగు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. శనివారం ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా 10TV ప్రత్యేక కథనం.

ప్రశ్నార్థకమైన లక్షలాదిమంది జీవనాధారం

సిక్కోలు జిల్లాలో... కొబ్బరి సాగు సంక్షోభంలో పడింది. ఏటా 60 కోట్ల రూపాయల టర్నోవర్‌... నేడు 30 కోట్లకు పడిపోయింది. దిగుబడులు గణనీయంగా తగ్గి...లక్షలాదిమంది జీవనాధారం ప్రశ్నార్థకంగా మారింది. తెగుళ్లు.. తుఫాన్‌లు.. దళారుల వల్ల.. కొబ్బరి రైతులు...దీన స్థితిలో పడిపోయారు.

కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, మందస, వజ్రపు కొత్తూరు...

ఉద్దాన ప్రాంతంగా పిలువబడే కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, మందస, వజ్రపు కొత్తూరు, పలాస మండలాలతో పాటు.. గార, ఎచ్చెర్ల, పొందూరు మండలాల్లో 35 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు ఇక్కడి నుంచి 25 లారీల కొబ్బరి కాయలు ఎగుమతి అవుతుంటాయి. అయితే దశాబ్ద కాలంగా కొబ్బరి సాగు సంక్షోభంలో కూరుకుపోయింది. తెగుళ్లు, తుఫానుల ప్రభావంతో సగానికి పైగా చెట్లు నేలమట్టం అయ్యాయి. దిగుబడి గణనీయంగా పడిపోయింది. కొబ్బరి కాయలు సైజు తగ్గిపోవడం... దళారుల ప్రాబల్యం పెరిగిపోవడంతో.. కొబ్బరి రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. మూడేళ్ల కిందట సంభవించిన పైలిన్ తుఫానుతో కొబ్బరి తోటలకు జరిగిన నష్టాన్ని 45 కోట్ల రూపాయలుగా అంచనా వేసిన అధికారులు...ఇప్పటికీ పూర్తి స్థాయి పరిహారం చెల్లించలేదు.

ప్రత్యేక ప్యాకేజి.. దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలి...

దీంతో ఉద్దాన ప్రాంత కొబ్బరి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం... ప్రత్యేక ప్యాకేజి.. దీర్ఘకాలిక రుణాలు.. అందించాలని రైతులు కోరుతున్నారు. స్థానికంగా కొబ్బరి పరిశోధన కేంద్రం అందుబాటులోకి తేవాలంటున్నారు. ఇప్పటికైనా పాలకులు... ఉద్దానంలోని కొబ్బరి సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

11:42 - September 2, 2017
11:38 - September 2, 2017

కరీంనగర్ : ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు.. మట్టి గణపతినే కొలుద్దాం.. అంటూ స్లోగన్స్ చాలామంది చెప్తారు. కానీ తక్కువమంది ఆచరిస్తారు. పర్యావరణానికి హానికరమని తెలిసీ రకరకాల రంగుల్లో ఆకర్షించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు జనం ఓటేస్తున్నారు. కానీ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెలిచాల గ్రామస్తులు పెద్దలు చెప్పింది వినడమే కాదు.. ఆచరణలో చూపించారు. ఊరు ఊరంతా మట్టిగణపయ్యలను ప్రతిష్టించి ఘనంగా పూజలు చేశారు.

గ్రామ పెద్దలంతా మట్టివినాయకులనే పూజిద్దామని తీర్మానం

వెలిచాలలో మూడేళ్ల క్రిందట గ్రామ పెద్దలంతా మట్టివినాయకులనే పూజిద్దామని తీర్మానం చేశారు. వారు చేసిన తీర్మానాన్ని గ్రామంలోని అన్ని వర్గాల వారు ఆమోదించారు. అప్పటి నుంచి ఏటా మట్టి విగ్రహాలనే వినియోగిస్తున్నారు. గ్రామంలోని యువకులంతా చందాలు వసూలు చేసి అన్ని కూడళ్లో కలిపి దాదాపు 30 మట్టి విగ్రహాలను ప్రతిష్టించారు. ఈసారి కరీంనగర్ జడ్పీ తుల ఉమ కూడా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.

గ్రామాన్ని కాలుష్య రహితంగా ఉంచడంతో పాటు..

గ్రామాన్ని కాలుష్య రహితంగా ఉంచడంతో పాటు.. అభివృద్ధి పథంలో పయనించేందుకు కృషి చేస్తున్నారు గ్రామ యువకులు. వెలిచాలను ఆదర్శంగా తీసుకుంటే చాలా గ్రామాలు కాలుష్య రహిత గ్రామాలుగా మారతాయనడంలో సందేహం లేదు.

11:36 - September 2, 2017

హైదరాబాద్: తెలంగాణాలో... కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానానికి వ్యతిరేకంగా ... ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఈరోజు పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ డీఈవో కార్యాలయాల వద్ద ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు.

పాత పెన్షన్ విధానం వల్లే... ఉద్యోగులకు మేలు

పాత పెన్షన్ విధానం వల్లే... ఉద్యోగులకు మేలు జరుగుతుందని... ఆక్యుపేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. హైదరాబాద్‌ డీఈఓ కార్యాలయం ముందు ర్యాలీ నిర్వహించింది.. నల్ల బ్యాడ్జీలు ధరించి టీచర్లు నిరసన తెలిపారు.

టీచర్లు ర్యాలీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో టీచర్లు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. అదే విధంగా... రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సీపీఎస్‌ విధానం వల్ల ఉద్యోగుల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోనూ...

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోనూ... ప్రభుత్వ ఉపాధ్యాయులు పోరాటబాట పట్టాయి. స్థానిక RDO కార్యాలయం ముందు ధర్నా చేశారు. స్థానిక టీఎన్జీఓ కేంద్రం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు . టీచర్ల ఆందోళనకు ప్రభుత్వ వైద్యులు సంఘీభావం ప్రకటించారు. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో.. ఉద్యోగులు... అమరవీరుల స్తూపం వద్ద అమలరులకి నివాళులు అర్పించి... అక్కడ నుంచి ర్యాలీ నిర్వహించి.. ధర్నా చౌక్‌ వద్ద నల్లజెండాలతో నిరసన తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించారు.

రాష్ట్రంలో లక్షా 20 వేల ఉపాధ్యాయలకు నష్టం....

కొత్త పెన్షన్ విధానం వల్ల రాష్ట్రంలో లక్షా 20 వేల ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని...ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోకపోతే... అక్టోబర్‌లో ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఉపాధ్యాయ నేతలు హెచ్చరించారు.

11:17 - September 2, 2017

విజయనగరం : సీతానగరం మండలం గాదెవలసలో దారుణం జరిగింది.. నలుగురు దుండగులు ఓ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు.. మృతదేహాన్ని చెరువులో పడేశారు.. మృతురాలు బొబ్బిలి మండలం రెడ్డియ్యవలస గ్రామానికి చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు..

11:15 - September 2, 2017

కృష్ణా : ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో బీ టెక్‌ విద్యార్థి రాజ్‌కుమార్‌ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.. రాత్రి రాజ్‌ కుమార్‌ తండ్రితో గొడవపడి ఇంటినుంచి బయటకు వెళ్లిపోయాడు.. ఉదయం జీ కొండూరు, చెవుటూరు బైపాస్‌ రోడ్డులో శవమై కనిపించాడు.. బైక్‌పైనుంచి కిందపడి ప్రమాదవశాత్తూ మరణించిఉంటాడని పోలీసులు భావిస్తున్నారు..

11:14 - September 2, 2017

నిర్మల్‌ : బైంసాలో భారీ భద్రత ఏర్పాటు చేశారు... గణేశ్ నిమజ్జనం, బక్రీద్‌ పండుగలు ఒకేసారి రావడంతో 400మంది పోలీసుల్ని మోహరించారు... 60 సీసీ కెమెరాలద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.. వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి, డీఐజీ రవి వర్మ భద్రతను పర్యవేక్షిస్తున్నారు.. రెండు మతాల పెద్దలతో సమీక్ష నిర్వహించిన అధికారులు... ప్రశాంతంగా కార్యక్రమం పూర్తయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు..

11:12 - September 2, 2017

హైదరాబాద్‌ : నగరాన్ని విశ్వనగరంగా మారుస్తామన్నది కేసీఆర్‌ మాట. చాలా సభల్లో హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చి తీరుతామని ప్రకటించారు. భాగ్యనగరం ప్రపంచస్థాయి నగరం కావాలంటే ప్రజా రవాణా కూడా అదేస్థాయిలో ఉండాలి. మరి మన రాజధాని నగరంలో రవాణా వ్యవస్థ ఎలా ఉంది? నగరవాసులకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు అందుబాటులోనే ఉందా? జాతీయ, అంతర్జాతీయ స్థాయి నగరాల స్థాయికి హైదరాబాద్‌ చేరాలంటే ఆర్టీసీ ఏం చేయాలి? విశ్వనగరిగా రూపుదిద్దుకోనున్న హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థపై 10టీవీ కథనం...

శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్‌

దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మన రాజధాని ఒకటన్నదాంట్లో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్ర జనాభాలోనే హైదరాబాద్‌ నగర జనాభా దాదాపు 30శాతం ఉంటుంది. ఇంత ప్రాధాన్యం ఉన్న నగరంలో ప్రజలకు నిత్యం ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడం లేదు. ట్రాఫిక్‌ తిప్పలు తప్పాలంటే నగరంలో ప్రజా రవాణాను పటిష్టం చేయడమే పరిష్కారమని అనే సర్వేలు, నిపుణులు తేల్చారు. అంటే ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడితేనే ప్రజలకు ట్రాఫిక్స్‌ కష్టాల నుంచి విముక్తి లభిస్తుందన్న మాట.

హైదరాబాద్‌లో రవాణాకు ఆర్టీసీ బస్సులే పెద్దదిక్కు

హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థకు ఆర్టీసీ బస్సులే పెద్దదిక్కు. ఎంఎంటీఎస్‌ రైళ్లు కూడా ఉన్నంతలో ప్రజలను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడంలో కృషి చేస్తున్నాయి. ఇక మెట్రోరైల్‌ పనులు నడుస్తున్నప్పటికీ అవి అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఒకవేళ మెట్రోరైల్‌ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినా రోజుకు ఐదు లక్షల మందినే గమ్యస్థానాలకు చేర్చగలదు. హైదరాబాద్‌లాంటి మహానగరంలో ప్రజారవాణా వ్యవస్థలో ఆర్టీసీదే అగ్రభాగం.

రోడ్లపై భారంగా కదులుతున్న ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌లు ఎన్ని ఉన్నప్పటికీ ప్రజలకు ఆర్టీసీ బస్సే పెద్ద దిక్కుగా మారింది. అలాంటి ఆర్టీసీ బస్సులు అనేక అవస్థలు పడుతూ నడుస్తున్నాయి. రోడ్లపై భారంగా కదులుతున్నాయి. కొద్దిగా వేగం పెరిగిందా... మరుక్షణమే భారీ శబ్దాలు వస్తుంటాయి. ఇప్పుడే ఊడిపోతాయా అన్నట్టు రేకుల చప్పుడు. రాజధానిలో ఉన్న బస్సుల్లో దాదాపు 55శాతం బస్సులు కాలం చెల్లినవే. 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సును స్క్రాప్‌ కింద పక్కన పెట్టాలి. కానీ ఆర్టీసీ అధికారులు వాటిని సామాన్య ప్రజలు ప్రయాణించే సిటీ బస్సులుగానో.... పల్లెవెలుగు బస్సులుగానో మార్చి రోడ్లపైకి వదులుతున్నారు. పోనీ ఈ బస్సులకేమైనా మరమ్మతులు చేస్తున్నారా అంటే అదీలేదు.

11:09 - September 2, 2017

హైదరాబాద్: తెలంగాణలోని డిగ్రీ కాలేజీలు ఖాళీ బెంచీలతో దర్శనమిచ్చే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో సగానికిపైగా సీట్లు మిగిలిపోయాయి. దీంతో ప్రైవేట్‌ యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాయి.

డిగ్రీ కోర్సులకు పడిపోతున్న క్రేజ్‌

విద్యావ్యవస్థలో ఎప్పుడు ఏ నిర్ణయాలు వస్తాయో ఊహించలేము. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చెప్పడం కష్టం. అలాగే... ఏ కోర్సుకు ఎప్పుడు క్రేజ్‌ ఉంటుందో.... ఏ కోర్సుకు బూమ్‌ పడిపోతుందో చెప్పలేని పరిస్థితి. తెలంగాణలో డిగ్రీ కోర్సులకు రోజురోజుకు క్రేజ్‌ పడిపోతుందనే చెప్పాలి. చదువులంటే ఇంజనీరింగ్‌, ఎంబీబీఎస్‌లనే ఊహాలోకంలో ఉన్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. ఫలితంగా డిగ్రీలో ఎన్నో మంచిమంచి కోర్సులు ఉన్నా... అందులో జాయిన్‌ అయ్యే విద్యార్థులే కరువయ్యారు. తెలంగాణలో దాదాపుగా సగానికిపైగా డిగ్రీ సీట్లు మిగిలిపోయాయి.

ఒకప్పుడు డిగ్రీలో సీటు సంపాదించడం కష్టతరమైన పని

ఒకప్పుడు డిగ్రీలో సీటు దొరకడమే మహా కష్టంగా ఉండేది. మంచి మార్కులు వస్తేగానీ సీటు దొరకకపోయేది. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులందరికీ సీట్లు దొరుకుతున్నాయి. ఈ సంవత్సరమైతే డిగ్రీ కాలేజీల్లో సగానికిపైగా సీట్లు

దోస్త్‌ పేరుతో డిగ్రీ అడ్మిషన్లు చేపట్టిన ఉన్నత విద్యామండలి

డిగ్రీలో అడ్మిషన్ల కోసం ఉన్నత విద్యామండలి దోస్త్‌ పేరుతో ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం తీసుకొచ్చింది. డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించిన కౌన్సెలింగ్‌ గత గురువారంతో ముగిసింది. నాలుగోదశ కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత మొత్తం 1,95,731 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఇంకా 2,14,536 సీట్లు మిగిలిపోయాయి. కొన్ని కాలేజీల్లో సింగిల్‌ డిజిట్‌ అడ్మిషన్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లాయి. తెలంగాణలో మొత్తం 1092 డిగ్రీలు కాలేజీలు ఉండగా... వివిధ కోర్సుల్లో మొత్తంగా 4,10,267 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 3 ,22,250 సీట్లు ప్రైవేట్‌ కాలేజీలకు చెందినవే. ఇందులో కేవలం 1,45,360 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో1,25,000 డిగ్రీ సీట్లు

యూనివర్శిటీల వారిగా చూస్తే కాకతీయ యూనివర్శిటీ పరిధిలో డిగ్రీ సీట్లు భారీగా మిగిలిపోయాయి. కాకతీయలో లక్షా 25వేల సీట్లకి గానూ 74 వేల సీట్లు మిగిలిపోయాయి. ఉస్మానియా లో లక్షా 43వేల సీట్లకుగానూ.. 68వేల సీట్లు మిగిలిపోయాయి. ఇక శాతవాహన యూనివర్శిటీలో మొత్తం 46వేల సీట్లకు.... 23వేల సీట్లు మిగిలిపోయాయి. మహాత్మాగాంధీ యూనివర్శిటీలో 36వేల సీట్లు ఉంగా.. 19వేల సీట్లు మిగిలిపోయాయి. పాలమూరు యూనివర్శిటీలో 31వేల సీట్లు వుండగా 16వేల సీట్లు మిగిలిపోయాయి. తెలంగాణా యూనివర్శిటీ పరిధిలో 26వేల సీట్లు ఉండగా 12వేల సీట్లు మిగిలిపోయాయి.

డిగ్రీ సీట్లు నిండకపోవడానికి అనేక కారణాలు

డిగ్రీ కాలేజీల్లో సీట్లు మిలగడానికి అనేక కారణాలు ఉన్నాయి. రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో 80శాతానికిపైగా విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ కోర్సులనే చదువుతున్నారు. కార్పొరేట్‌ కాలేజీలు విద్యార్థులను , వారి తల్లిదండ్రులను ఈ కోర్సులవైపే మొగ్గుచూపేలా చేస్తున్నాయి. దీంతో వారు ఇంటర్‌ పూర్తైన తర్వాత ఇంజనీరింగ్‌, మెడిసిన్‌వైపు వెళ్తున్నారు. ఇందులో సీట్లు రానివారు ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతున్నారు. దీంతో డిగ్రీ సీట్లు గణనీయంగా మిగిలిపోతున్నాయి.

11:06 - September 2, 2017

ఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల స్కాంలో సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది. మాజీ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగి సహా నలుగురిపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మొత్తం 3 వేల పేజీల చార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించింది. చార్జిషీట్‌ దాఖలైన వారిలో త్యాగితో పాటు రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్ జెఎస్‌ గుజ్రాల్‌, త్యాగి సోదరుడు సంజీవ్‌ త్యాగి, న్యాయవాది గౌతమ్‌ ఖైతాన్‌ ఉన్నారు. 2010లో యూపిఏ హయాంలో వివిఐపిల కోసం 3 వేల 6 వందల కోట్లతో 12 హెలిక్యాప్టర్లను కొనుగోలు చేసేందుకు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. నాటి ఒప్పందంలో అక్రమాలు జరిగినట్టు దర్యాప్తు సంస్థ గుర్తించింది. మొత్తం డీల్‌లో 10 శాతం ముడుపుల రూపంలోనే చెల్లించినట్లు తెరపైకి వచ్చింది. కాగా 2013లో ఈ ఒప్పందాన్ని యూపిఏ ప్రభుత్వం రద్దు చేసుకుంది. హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని అటు ఇటలీ కోర్టు కూడా స్పష్టం చేసింది. భారత అధికారులకు 90 నుంచి 225 కోట్ల వరకు ముడుపులు ముట్టినట్టు తెలిపింది. అగస్టా స్కాంకు సంబంధించి గత ఏడాది డిసెంబర్‌లో త్యాగిని అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయన బెయిలుపై విడుదలయ్యారు. ఎస్పీ త్యాగి 2004-2007 మధ్య ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌గా పనిచేశారు.

11:05 - September 2, 2017

పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు లాలు ప్రసాద్‌ యాదవ్‌కు కష్టాలు తీరేలా కనిపించడం లేదు. అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఇప్పటికే ప్రశ్నించిన ఆదాయపు పన్నుశాఖ తాజాగా మరో నోటీసు జారీ చేసింది. ఇటీవల పట్నాలో 'బిజెపిని వెళ్లగొట్టండి...దేశాన్ని రక్షించండి' పేరిట నిర్వహించిన సభకు సంబంధించి లెక్కలు చూపాలని ఐటిశాఖ లాలూను ఆదేశించింది. సభకు ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు లెక్క చూపాలని పేర్కొంది. ఈ సభకోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతల ఆతిథ్యంపై చేసిన ఖర్చు వివారలు కూడా తెలపాలని ఆదేశించింది. అయితే ఐటి తీరుపై ఆర్జేడినేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదాయపు పన్నుశాఖ అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు చెబుతామని పేర్కొన్నారు.

11:03 - September 2, 2017

చెన్నై: నేషనల్‌ ఎలిజిబుల్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌- తమిళనాడులో ఓ దళిత విద్యార్థిని ఉసురు తీసింది. నీట్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడిన 17 ఏళ్ల దళిత విద్యార్థిని ఎస్‌.అనిత తానిక మెడిసన్‌ చదవలేనని ఆత్మహత్యకు పాల్పడింది. నీట్‌ నుంచి మినహాయించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో... తనకిక మెడికల్‌ సీటు రాదనుకున్న అనిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుజుమూరు గ్రామానికి చెందిన అనితకు ఇంటర్‌లో 1200 మార్కులకు గాను 1176 మార్కులు వచ్చాయి. నీట్‌ పరీక్షలో కేవలం 86 మార్కులే రావడంతో ఎంబిబిఎస్‌ సీటు పొందలేకపోయింది. నీట్‌ పరీక్షను ప్రామాణికంగా తీసుకోవద్దని, ఇంటర్‌ మార్కులను బేస్‌గా తీసుకుంటే తనకు మెడిసిన్‌లో సీటు వస్తుందని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. నీట్‌ ఆధారంగానే మెడికల్ అడ్మిషన్స్‌ తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగస్టు 22న తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అనిత కలలు ఆవిరైపోయాయి.

బీఆర్డీ ఆస్పత్రి డాక్టర్ ఖపీల్ ఖాన్ అరెస్టు

యూపీ: గోరఖ్ పూర్ బీఆర్డీ ఆస్పత్రి డాక్టర్ ఖపీల్ ఖాన్ ను అరెస్టు చేశారు. బీఆర్డీ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 60మంది చిన్నారుల మృతికి డాక్టర్ ఖపీల్ నిర్లక్ష్యమే కారణ మని ఆరోపణలు వెల్లువెత్తాయి.

10:52 - September 2, 2017

విశాఖ: వాకపల్లి ఆదివాసీ మహిళలపై జరిగిన అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసులో అపరిమిత జాప్యం జరిగినందుకు సీరియస్‌ అయ్యింది. ఆదివాసీ మహిళలపై అత్యాచారానికి పాల్పడిన 13మంది గ్రేహౌండ్స్‌ పోలీసులపై విచారణ జరిపి తీరాలని ఆదేశించింది.

2007 ఆగస్టు 20 గిరిజన మహిళలపై అత్యాచారం

2007 ఆగస్టు 20న విశాఖపట్నం జిల్లా గిరిజన ప్రాంతంలోని జి. మాడుగుల మండలంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ పేరుతో 13మంది గ్రేహౌండ్స్‌ సిబ్బంది గ్రామంలో చొరబడ్డారు. 11 మంది గిరిజన మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టారు.ఈ ఘటన అప్పట్లలో సంచలనం సృష్టించింది. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సబ్‌ కలెక్టర్‌ ఆదేశాలతో 21మంది పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు మెజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించారు. అప్పటి నుంచి బాధిత మహిళలు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. 11మంది బాధితుల్లో ఇద్దరు చనిపోయారు కూడా.

పోలీసుల క్వాష్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

వాకపల్లి అత్యాచార ఘటనపై మెజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించడాన్ని సవాల్‌ చేస్తూ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 10 సంవత్సరాలుగా ఈ కేసు విచారణ కొనసాగుతుండడంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఈ కేసును ప్రతిరోజు విచారించాలని, ఆరు నెలల్లో విచారణ ముగించాలని జస్టిస్‌ అరుణ్‌మిశ్రా, జస్టిస్‌ శంతనా గౌదర్‌లతో కూడిన ధర్మాసనం ట్రయల్‌కోర్టును ఆదేశించింది. విచారణలో జాప్యం న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోందని న్యాయమూర్తులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

యశోద ఆస్పత్రి ఎండీ 25ఎకరాల చెరువు ఆక్రమణ

హైదరాబాద్: యశోద ఆస్పత్రి ఎండీ జీ. సురేంద్రరావు కొల్లూరు చెరువులో 25 ఎకరాలు ఆక్రమించినట్లు తహశీల్దార్ మహిపాల్ రెడ్డి నిర్ధారించారు.

3వరోజు కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగుల దీక్ష

హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల దీక్ష మూడో రోజుకు చేరింది. సీఎండీ చాంబర్ ముందే ఉద్యోగులు దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టిన వారిలో ఇద్దరి ఆరోగ్యం క్షీణించింది. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దీక్ష విరమించేది లేదని ఉద్యోగులు తేల్చి చెప్తున్నారు.

 

10:23 - September 2, 2017

డిల్లీ : లెఫ్ట్‌పార్టీల నేతల నాహీరోలని హీరో కమల్‌హాసన్‌ అన్నారు. శుక్రవారం కేరళ సీఎం పినరాయి విజయన్‌తో భేటీ తర్వాత కమల్ ఈవ్యాఖ్యలు చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలో చేరబోమని ఆయన స్పష్టంచేశారు. తన పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన కమల్... వామపక్షనేతలను కలుసుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇరువురి మధ్య భేటీ స్నేహపూర్వకమేనని కేరళ సీఎంవో వర్గాలు తెలిపాయి.

10:17 - September 2, 2017

హైదరాబాద్: డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ దత్త పుత్రిక హనీప్రీత్‌కు పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. రేప్‌ కేసులో పంచకుల కోర్టులో దోషిగా తేలిన తర్వాత గుర్మీత్‌ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు...ఇందుకు హనీప్రీత్‌ పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో హనీప్రీత్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. ఆమె విదేశాలకు పారిపోయే అవకాశం ఉండడంతో హనీప్రీత్‌తో పాటు మరో డేరా ప్రతినిధిపై కూడా లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఎయిర్‌పోర్టులు, ఇతర ఎగ్జిట్‌ పాయింట్లలో సిబ్బందిని అలర్ట్‌ చేశారు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ రామ్‌ రహీమ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గుర్మీత్‌కు ఎప్పుడూ నీడలా ఉండే హనీప్రీత్‌ అలియాస్ ప్రియాంకాతనేజా అజ్ఞాతంలోకి పోయారు.

10:08 - September 2, 2017

హైదరాబాద్: దత్తన్న రాజీనామా చేశారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బండారు దత్తాత్రేయ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా పలువురు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే ఏడుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయగా వారిలో బండారు దత్తాత్రేయ కూడా ఉన్నారు. బీజేపీ చీఫ్‌ అమిత్‌షా సూచనతోనే దత్తాత్రేయ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే అమిత్‌షా సూచనకు మొదట దత్తాత్రేయ ఒప్పుకోలేదన్నట్టు వార్తలు వచ్చాయి. కాని చివరికి రాజీనామా చేయడంతో ఆయన పార్టీ పెద్దల బలవంతం మీదనే పదవినుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

పార్టీ అవసరాల కోసం పనిచేస్తానన్న దత్తన్న....

అయితే తాను మంత్రి పదవికి రాజీనామా చేసినా.. పార్టీ అవసరాల కోసం పనిచేస్తానని దత్తాత్రేయ ప్రకటించారు. రాబోయే 2019ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ విస్తరణ జరుగుతోందని.. మిత్రపక్షాలు, సొంతపార్టీ అవసరాల మేరకే కొందరిని తప్పించి .. మరికొందరికి మంత్రులుగా అవకాశం ఇస్తున్నట్టు చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు తెలంగాణ నుంచి దత్తాత్రేయను తప్పించిన బీజేపీ అధిష్టానం ఆ ప్లేస్‌లో మరో సీనియర్‌ నేతకు అవకాశం ఇవ్వడానికి రెడీ అయింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావుకు కేంద్రమంత్రి పదవి ఇస్తారని బీజేనేతలు చెప్పుకుంటున్నారు. దీనికోసమే మురళీధరరావును తక్షణమే ఢిల్లీకి రావాలని అధిష్టానం పిలుపు ఇచ్చినట్టు సమాచారం.. మురళీధరరావు ప్రస్తుతం తమిళనాడు బీజేపీ వ్యవహారల ఇంచార్జ్‌గా ఉన్నారు.

కేంద్ర మంత్రిపదవికి బండారు దత్తాత్రేయ రాజీనామా

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో తెలంగాణనుంచి ఉన్న ఒకే ఒక మంత్రి రాజీనామా చేశారు. కేంద్ర కార్మికశాఖా మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయను తప్పుకోవాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు. అయితే తెలంగాణ నుంచి మరోనేతకు అవకాశం కల్పిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పార్టీ సీనియర్‌ నేత మురళీధర్‌రావుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.

09:55 - September 2, 2017

ఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యుల ఘననివాళి

కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద వైసీపీ అధినేత వైఎస్ జగన్‌, ఆయన తల్లి విజయమ్మ, సతీమణి భారతి, సోదరి షర్మిల, బ్రదర్‌ అనీల్‌ కుమార్‌, వైఎస్‌ వివేకానందరెడ్డితో పాటు పలువురు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వైఎస్‌ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. వైఎస్‌ఆర్‌ భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఈ సందర్భంగా జగన్‌ ట్విట్‌ చేశారు.

వేగంగా యాదాద్రి అభివృద్ధి పనులు

యాదాద్రి : యాదాద్రి అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి.. దక్షిణ భారత దేశంలో ఎక్కడాలేనివిధంగా ఆళ్లవరం మండపం తయారవుతోంది.. ఇందులో అద్భుతమైన శిల్పాలను శిల్పులు చెక్కుతున్నారు..

అన్నదాతలను పచ్చి బూతులు తిట్టిన బాబూమోహన్‌

సంగారెడ్డి : జిల్లా ఆందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు కోపం వచ్చింది. రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుపై పుల్కల్‌ మండలం చౌటుకూర్‌లో జరిగిన అవగాహన సదస్సులో అన్నదాతలపై ఆగ్రహంతో ఊగిపోయారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధినన్న విషయం మర్చిపోయి బూతు పురాణం లంకించుకున్నారు. తాను వేషం వేసి నటిస్తే డబ్బులిస్తారని, మీరేమిస్తారంటూ రైతులను ప్రశ్నించారు.

09:50 - September 2, 2017

తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ దంపతులు దర్శించుకున్నారు.. మహాద్వారం దగ్గర రాష్ట్రపతికి అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.. స్వామివారిని దర్శించుకున్నవారిలో గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు.. రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అమర్‌నాథ్‌రెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు.

ప్రజలకు సోషల్‌ మీడియాతో చేరువయ్యే యోచనలో పవన్‌

హైదరాబాద్: న్నికల్లో సీట్లు గెలవడమే తన లక్ష్యం కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. సమాజం, పార్టీ కోసం 25 ఏళ్లు కష్టపడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. 2019 ఎన్నికల్లో ఎన్నిసీట్లలో పోటీ చేస్తామన్నది 2018 చివర్లో తెలుస్తుందని తెలిపారు. పార్టీ పొత్తులపైనా అప్పుడే ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు.

09:48 - September 2, 2017

హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేస్తున్నారు. ఇందుకోసం డిజిటల్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. డిజిటల్‌ రెజిమెంట్‌ బృందానికి శతఘ్నిగా ఆయన నామకరణం చేశారు. వారితో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని శతఘ్ని కార్యకర్తలకు సూచించారు.

బైట్: పవన్‌ కల్యాణ్‌, జనసేన అధినేత

సమాజం, పార్టీకోసం 25 ఏళ్లు కష్టపడేందుకు సిద్ధమన్న పవన్‌

ప్రజారాజ్యం పార్టీ విఫలమైనందున ప్రతీదీ నిరూపించుకోవాల్సిన అవసరం తనముందు ఉందన్నారు. 25 ఏళ్లు సమాజం కోసం, పార్టీ కోసం కష్టపడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. 2018 చివర్లో ఈ విషయంలో స్పష్టత వస్తుందన్నారు. అప్పుడే తన బలమేంటో అందరికీ తెలుస్తుందని చెప్పారు. ఎన్నికల్లో కేవలం సీట్లు గెలవడమే తన లక్ష్యం కాదని, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని స్పష్టం చేశారు పవన్‌.

ఎన్నికల పొత్తులపై విధానం రూపొందించలేదన్న పవన్‌

పార్టీలతో పొత్తులపైనా పవన్‌ స్పందించారు. ఎన్నికల పొత్తులపై ఇంకా ఏ విధానం తీసుకోలేదన్నారు. అవన్నీ కాలమే నిర్ణయిస్తుందన్నారు. ప్రస్తుతం పార్టీ నిర్మాణంపైనే దృష్టిసారించానని... ఆ తర్వాతే పొత్తులపై ఆలోచిస్తానన్నారు.

ప్రత్యేక హోదాపై పోరాటం కొనసాగిస్తానన్న పవన్‌

ప్రత్యేక హోదాపై తన పోరాటం ఆగలేదని పవన్‌ స్పష్టం చేశారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంలో ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. ఏపీకి మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. లేదంటే అక్టోబర్‌ నుంచి దీనిపై పోరాటం చేయనున్నట్టు పవన్‌ తేల్చి చెప్పారు.

ఎన్నికల్లో ఓట్లను డబ్బుతో కొనడం తనకు నచ్చదని...

ఎన్నికల్లో ఓట్లను డబ్బుతో కొనడం తనకు నచ్చదని... ఓటు అమ్ముకోకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని పవన్‌ అన్నారు పవన్‌.రాయలసీమ కరువుకు నేతలే కారణమని ఆరోపించారు. అక్టోబర్‌ నుంచి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని జనసేనాని స్పష్టత ఇచ్చారు.

09:45 - September 2, 2017

సంగారెడ్డి : జిల్లా ఆందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు కోపం వచ్చింది. రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుపై పుల్కల్‌ మండలం చౌటుకూర్‌లో జరిగిన అవగాహన సదస్సులో అన్నదాతలపై ఆగ్రహంతో ఊగిపోయారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధినన్న విషయం మర్చిపోయి బూతు పురాణం లంకించుకున్నారు. తాను వేషం వేసి నటిస్తే డబ్బులిస్తారని, మీరేమిస్తారంటూ రైతులను ప్రశ్నించారు.

09:43 - September 2, 2017

యాదాద్రి : యాదాద్రి అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి.. దక్షిణ భారత దేశంలో ఎక్కడాలేనివిధంగా ఆళ్లవరం మండపం తయారవుతోంది.. ఇందులో అద్భుతమైన శిల్పాలను శిల్పులు చెక్కుతున్నారు.. మరిన్ని వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

09:41 - September 2, 2017

కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద వైసీపీ అధినేత వైఎస్ జగన్‌, ఆయన తల్లి విజయమ్మ, సతీమణి భారతి, సోదరి షర్మిల, బ్రదర్‌ అనీల్‌ కుమార్‌, వైఎస్‌ వివేకానందరెడ్డితో పాటు పలువురు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వైఎస్‌ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. వైఎస్‌ఆర్‌ భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఈ సందర్భంగా జగన్‌ ట్విట్‌ చేశారు.

ఉగ్రవాది హతం...

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా తంత్రీపోరాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. టెర్రరిస్టులకు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం విదితమే. ఉగ్రదాడిలో ఒక పోలీసు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పంథా చౌక్‌లో చోటు చేసుకుంది.

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి....

తిరుమల : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద ఇఫ్తికపాల్‌ ఆలయ మర్యాదలతో రాష్ట్రపతికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి వెంట గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అమర్‌నాథ్‌రెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు.

 

Don't Miss