Activities calendar

03 September 2017

21:47 - September 3, 2017
21:46 - September 3, 2017

వరంగల్ : జిల్లా వ్యాప్తంగా గ‌ణేష్ నిమ‌జ్జనం ఘనంగా జరుగుతోంది. చిన్నవడ్డెప‌ల్లి చెరువు వ‌ద్ద మేయ‌ర్ న‌రేంద‌ర్ పూజ చేసి నిమ‌జ్జన ప్రక్రియ‌ను ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు భ‌క్తి శ్రద్దల‌తో పూజ‌లందుకున్న బొజ్జగ‌ణ‌ప‌య్య గంగ‌మ్మ చెంత‌కి త‌ర‌లిస్తున్నారు. డ‌ప్పుచ‌ప్పులు కోల‌ట‌నృత్యాల‌తో యువ‌తి,యువ‌కులు ఉత్సాంహగా గ‌ణ‌ప‌తి శోభ‌యాత్రను నిర్వహిస్తు గంగ‌మ్మ చెంత‌కి చేరుస్తున్నార‌ు. ఉర్సు రంగ‌స‌ముద్రంతో పాటు బందం చెరువు, చిన్నవ‌డ్డెప‌ల్లి, ఖిలావ‌రంగ‌ల్, కోట‌ చెరువులో మొత్తం 3వేల వినాయక విగ్రహ‌లు నిమ‌జ్జనం కానున్నాయి. సాయంత్రం నుంచి రేపు తెల్లవారుజాము వ‌ర‌కు నిమ‌జ్జన ప్రక్రియ కొన‌సాగుతోంద‌ని అధికారులు తెలిపారు.  

21:45 - September 3, 2017

కడప : జిల్లా బద్వేల్ టీడీపీలో హైడ్రామా చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గానికి చెందిన బద్వేల్‌ జడ్పీటీసీ శిరీష రెడ్డి, గోపవరం జడ్పీటీసీ రమణయ్యలు రాజీనామా చేశారు. జెడ్పీటీసీల రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌లకు పంపారు. పార్టీ నాయకులు, అధికారులు అభివృద్ధికి సహకరించడం లేదని.. ఇరువురు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే విజయమ్మ, జయరాముల మధ్య వర్గపోరు రాజీనామాలకు కారణమని కార్యకర్తలు తెలిపారు. 

21:44 - September 3, 2017

కరీంనగర్/సిద్దిపేట : దళితులకు భూ పంపిణీ పథకంలో అవినీతి ఇద్దరు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. కరీంనగర్‌ జిల్లాలో ఈ స్కీం అమలు చేస్తున్నారు. బెజ్జంకి మండలం గూడెంకు చెందిన పరశురాములు, శ్రీనివాసులు నిరుపేదలు.. తమకూ భూమి ఇవ్వాలంటూ అధికారుల చుట్టూ తిరిగారు. టీఆర్ఎస్ జడ్పీటీసీ శరత్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస రెడ్డిలకు పదేపదే విజ్ఞప్తి చేశారు. అయితే భూమి కావాలంటే లంచం ఇవ్వాలంటూ... వీరిద్దరితో పాటు... వీఆర్‌వో డబ్బు డిమాండ్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది కొనసాగుతుండగానే భూపంపిణీ జాబితాను ప్రకటించారు.. ఇందులో అనర్హుల పేర్లు ఉన్నాయి.. ఈ లిస్ట్‌చూసి ఆవేదన చెందిన బాధితులు జాయింట్‌ కలెక్టర్‌ను కలిసి తమ బాధను చెప్పుకున్నారు.. అయితే బాధితులకు అండగా నిలవాల్సిందిపోయి.. సెలవురోజువచ్చి ఎందుకు తనను డిస్టర్బ్‌ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని బాధితులు చెబుతున్నారు.

ఎమ్మెల్యే రాలేదు..
ఎవ్వరిని కలిసినా ఉపయోగంలేకపోవడంతో బాధితులు మనస్తాపం చెందారు.. చివరకు ఎమ్మెల్యే రసమయికి ఫోన్‌ చేసి విషయం చెప్పారు.. ఎమ్మెల్యే సూచనతో ఆయన్ని కలిసేందుకు మానకొండూరులోని పార్టీ కార్యాలయానికి వచ్చారు.. ఉదయం నుంచి వేచి చూసినా ఎమ్మెల్యే రాలేదు.. దీంతో యువకులు మనస్తాపం చెందారు.. జరిగిన అన్యాయం తలచుకొని కుమిలిపోయారు.. అక్కడే ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నారు.. మంటలతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.. అంబులెన్స్‌కు ఫోన్‌ చేసినా వెంటనే రాకపోవడంతో... స్థానికులు, పోలీసులు తమ వాహనంలో బాధితుల్ని కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.

కుటుంబసభ్యులు కన్నీరు
యువకుల ఆత్మహత్యాయత్నంతో వారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.. బాధితుడు శ్రీనివాస్‌కు భార్య ఇద్దరు పిల్లలున్నారు.. తమ భర్తను కాపాడాలంటూ కుటుంబసభ్యులంతా కనిపించినవారందరినీ వేడుకోవడం అందరినీ కదలించింది. ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న మంత్రి ఈటెల.. ఎంపీ వినోద్... బాధితుల్ని పరామర్శించారు.. వారిని హైదరాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు.. వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.. మంత్రి ఆదేశాలతో బాధితులకు హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన వీఆర్‌వోను కలెక్టర్‌ సస్పెండ్ చేశారు. దళితుల ఆత్మహత్యాయత్నంలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపణలొస్తున్నా... సర్కారుమాత్రం వీఆర్‌వోను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకుంది.. అటు ప్రభుత్వ పథకాన్ని అధికార పార్టీ నేతలే బ్రష్టుపట్టించడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

21:43 - September 3, 2017

ఢిల్లీ : కేంద్రంలో కేబినెట్‌లోకి కొత్తనీరు వచ్చిచేరింది. కొందరిశాఖల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా కొందరికి కీలక శాఖలు దక్కాయి. నిన్నటివరకు కామర్స్‌ మినిష్టర్‌గా ఉన్న నిర్మలా సీతారామన్‌కు కీలకమైన రక్షణశాఖను అప్పగించారు. వాణిజ్య శాఖ మంత్రిగా సమర్థంగా పనిచేసిన నిర్మల పనితీరును మెచ్చి.. ప్రధాని మోదీ ఆమెకు అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఇటీవల సరిహద్దుల్లో పాకిస్థాన్‌, చైనాతో సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో నిర్మలాసీతారామన్‌కు ఈ పదవిని అప్పగించడం విశేషం. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రక్షణశాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్‌ ఈ ఘనతను సొంతం చేసుకున్నారు.

సురేశ్‌ ప్రభుకు శాఖమార్పిడి
అటు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీశాఖల్లో మార్పులు చేయలేదు. ఎప్పటిలాగే రాజ్‌నాథ్‌కు హోంశాఖ, సుష్మాస్వరాజ్‌కు విదేశాంగశాఖ,అరుణ్‌జైట్లీ ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖలు నిర్వహిస్తారు. ఇక రోడ్‌రవాణా, షిప్పింగ్‌ శాఖా మంత్రి నితిన్‌గడ్కరీకి కొత్తగా జలవనరులు, గంగా డెవలప్‌మెంట్‌ బాధ్యతలు అప్పగించారు. కాగా ఉమాభారతిని తాగునీరు,శానిటేషన్‌ శాఖలకు మార్చారు. మరోవైపు వరుస రైలుప్రమాదాల నేపథ్యంలో.. సురేశ్‌ ప్రభుకు శాఖమార్పిడి జరిగింది. ఆయనకు వాణిజ్యం పరిశ్రమలశాఖను కేటాయించగా.. కీలకమైన రైల్వేశాఖ పీయూష్‌ గోయల్‌కు దక్కింది. తాజా విస్తరణలో పీయూష్‌ కేబినెట్‌ మంత్రిగా ప్రమోషన్‌ పొందారు. పెట్రోలియం, స్కిల్‌ డెవలప్‌మెంట్ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్‌, సమాచారశాఖ మంత్రిగా స్మృతి ఇరానీ బాధ్యతలు చేపట్టారు.

ముగ్గురికి స్వతంత్ర హోదా
ఇక కొత్తమంత్రుల్లో ముగ్గురికి స్వతంత్ర హోదా దక్కగా..మిగతా ఆరుగురు సహాయమంత్రులుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. స్వతంత్రహోదాలో హర్‌దీప్‌సింగ్‌ పూరి : పట్టణ గృహ నిర్మాణ వ్యవహారాలు, ఆల్ఫోన్స్‌ కన్నన్‌థానం : టూరిజం, ఎలక్ట్రానిక్స్‌ ,ఐటి ..రాజ్‌కుమార్‌ సింగ్‌ : విద్యుత్‌, పునర్వినియోగ శక్తివనరుల శాఖలు నిర్వహిస్తారు. సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో గజేంద్రసింగ్‌ షెకావత్‌ : వ్యవసాయం-రైతు వ్యవహారాలు, సత్యపాల్‌ సింగ్‌ : మావనవ వనరులు, గంగా అభివృద్ధి పథకం.. వీరేంద్ర కుమార్‌ : మహిళా-శిశుసంక్షేమం, మైనార్టీ వ్యవహారాలు...అశ్విని కుమార్‌ చౌదరి: ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం ..శివ్‌ప్రతాప్‌ శుక్లా : ఆర్థిక మంత్రిత్వశాఖ ,అనంతకుమార్‌ హెగ్డే : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలు నిర్వహిస్తారు. 

21:41 - September 3, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల టీంను ఏర్పాటు చేసుకున్నారు. మంత్రివర్గ పునర్వస్థీకరణలో కొత్తగా తొమ్మిది మందికి స్థానం కల్పించారు. మరో నలుగురికి కేబినెట్‌ హోదా ఇచ్చారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొత్త మంత్రులతో ప్రమాణం చేశారు. ముందుగా సహాయ మంత్రుల నుంచి పదోతన్నతి పొందిన ధర్మేంద్ర ప్రధాన్‌, పియూష్‌ గోయల్‌, నిర్మాలా సీతారామన్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.ఆ తర్వాత తొమ్మిది మంది కొత్త మంత్రులతో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. బీహార్‌కు అశ్వినీకుమార్‌, రాజ్‌కుమార్‌సింగ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న శివప్రతాప్‌ శుక్లా, మధ్యప్రదేశ్‌కు చెందిన వీరేంద్రకుమార్‌ సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. కర్నాటక నుంచి అనంతకుమార్‌ హెగ్డే, రాజస్థాన్‌ కు చెందిన గజేంద్ర సింగ్‌ షెకావత్‌, యూపీ నుంచి సత్యపాల్‌ సింగ్‌, కేరళకు చెందిన అల్ఫోన్స్‌ కన్నన్‌థానన్‌లను మంత్రివర్గంలో స్థానం కల్పించారు. తొమ్మిది మంది కొత్త మంత్రులకు సహాయ మంత్రుల హోదా కల్పించారు. కొత్త మంత్రుల్లో నలుగురు అఖిల భారత సర్వీస్‌ అధికారులు ఉన్నారు. ఆర్కే సింగ్‌, అల్ఫోన్స్‌ కన్నన్‌థానన్‌ రిటైరైన ఐఏఎస్‌ అధికారులు. సత్యపాల్‌సింగ్‌ రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ కాగా, హర్దీప్‌సింగ్‌ పూరీ రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి.

2019లో లోక్‌సభకు ఎన్నికలు
మరో రెండు నెలల్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. 2019లో లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయి. ఈ అన్ని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వస్థీకరించారు. అయితే పునర్వవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపించారు. ఏపీ నుంచి విశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు, తెలంగాణ నుంచి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్‌కు మోదీ మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ప్రచారం జరిగింది. కుటుంబంతో సహా రావాలని ఆదేశించడంతో ఢిల్లీ చేరకున్న కంభంపాటి హరిబాబుకు తీవ్ర నిరాశే ఎదురైంది. తెలంగాణ నుంచి సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ స్థానంలో ఎవరికీ మంత్రివర్గంలో చోటు దక్కలేదు.

తెలుగు రాష్ట్రాలకు మెండిచేయి
బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూతోపాటు తమినాడు అధికార పార్టీ అన్నా డీఎంకే, మహారాష్ట్రలో బీజేపీతో కలిసి అధికారం పంచుకుంటున్న శివసేనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. నెల రోజుల్లో మరోసారి విస్తరణ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్పుడు జేడీయూ, అన్నా డీఎంకే, శివసేన పార్టీలతోపాటు తెలుగు రాష్ట్రాలకు చోటు కల్పించొచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. 

21:39 - September 3, 2017

కృష్ణా : జయవాడలో వైసీపీ వర్గాలు మధ్య విభేధాలు తారాస్థాయికి చేరాయి. వంగవీటి రంగాపై గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. దీనికి నిరసనగా రాధా అనుచరులు నిరసనకు దిగారు. రాధను అరెస్టు చేయడానికి పోలీసులు యత్నంచడంతో .. మాజీ ఎమ్మెల్యే రాధ తల్లి రత్నకుమారి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వంగవీటిఅభిమానుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వంగవీటి రత్నకుమారి కిందపడిపోయి గాయపడ్డారు. దీనిపై వంగవీటి రాధ ఆగ్రహం వ్యక్తంచేశారు. తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లతామన్నా వినిపించుకోకుండా పోలీసులు అతిగా ప్రవర్తించారని రాధ మండిపడ్డారు. ప్రస్తుతం రాధను అదుపులోకి తీసుకున్న పోలీసులు హౌస్‌ అరెస్ట్‌లో ఉంచారు. మరోవైపు వివాదంపై వైసీపీ అధినేత జగన్‌ సీరియస్‌ అయ్యారు. గౌతంరెడ్డిని పార్టీ నుంచి సస్పెన్షన్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. నిషేదం తక్షణం అమల్లోకి వస్తుందని జగన్‌ స్పష్టంచేశారు. వివాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని పార్టీ క్రమశిక్షణా సంఘాన్ని జగన్‌ ఆదేశించారు. 

21:18 - September 3, 2017
21:02 - September 3, 2017

యువకుల ఆత్మహత్యయత్నం సంఘటనలో వీఆర్వో సస్పెండ్

కరీంనగర్/సిద్దిపేట : భూపంపిణీ పథకంలో భాగంగా లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలడంతో బెజ్జంకి మండలం గూడెం వీఆర్వో ను సస్పెండ్ చేస్తున్నట్టు కలెక్టర్ ఉతర్వులు జారీ చేశారు. గూడెం గ్రామనికి చెందిన కొంత మంది అర్హులైన దళితులకు భూమి రాకపోవడంతో వారు ఎమ్మెల్యే రసమయితో ఫోన్ లో మాట్లాడారు ఆయన వారిని తిట్టడంతో వారు ఆత్మహత్యయత్నం చేసుకున్నట్టు వారి బంధువుల ఆరోపిస్తున్నారు.

20:21 - September 3, 2017
19:14 - September 3, 2017
19:14 - September 3, 2017

కడప : దశాబ్దాలుగా ఫ్యాక్షన్‌...రాజకీయాలు రెండూ కలగలిసి రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారిన జమ్మల మడుగులో మళ్లీ రాజకీయాలు మొదలయ్యాయి. వైసీపి నుండి ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి చేరడంతో అక్కడి రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఆదినారాయణ రెడ్డికి మంత్రి టీడీపి పదవి కట్టబెట్టింది. ఆదికి మంత్రి పదవి ఇవ్వడం పట్ల టీడీపీ నేత రామసుబ్బారెడ్డి బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి హామీ మేరకు వెనక్కు తగ్గారు. మంత్రిగా ఆదినారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తమకు పార్టీలో అవమానాలు మొదలయ్యాయని రామసుబ్బారెడ్డి వాపోతున్నారు.

ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు
రామసుబ్బారెడ్డి వర్గం కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా ఇటీవల గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కడంతో ఇప్పుడిప్పుడే పార్టీలో పుంజుకుంటున్నారు. గతంలో జమ్మలమడుగు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా రామసుబ్బారెడ్డి తన తమ్ముడు గిరిధర్‌ రెడ్డి పేరును ప్రతిపాదించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా తన కుమారుడు సుధీర్‌ రెడ్డిని చైర్మన్‌గా నియమించాలని పావులు కదిపారు. ఈ ప్రతిపాదనకు ఒప్పుకోని రామసుబ్బారెడ్డి తన తమ్ముడికే పదవి కట్టబెట్టాలని పట్టుబట్టారు. ఈ విషయంపై ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో అస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ ఎంపిక వాయిదా వేయాలని టీడీపీ అధిష్ఠానం సూచించింది. అధిష్ఠానం నిర్ణయంతో ఇరు వర్గాలు వెనక్కి తగ్గాయి.అయితే ఇటీవల జమ్మలమడుగులో జరిగిన సమావేశంలో ఆస్పత్రి కమిటీ చైర్మన్‌గా తన కుమారుడు సుధీర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. పట్టుబట్టి తన కుమారుడికి పదవి కట్టబెడతామని చెప్పారు. తాను అనుకున్నది జరగకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే ఆది మాటల వెనుక వ్యూహం దాగుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పదవి దక్కకపోతే రాజకీయాలను వదులుకుంటానన్న మాటలు చిన్నపాటి హెచ్చరికలా మంత్రి తెలియజేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామలతో జమ్మలమడుగులో సందిగ్ధత చోటుచేసుకుంది. ఇద్దరూ పార్టీకి మంచి నేతలవడంతో టీడీపీ అధిష్ఠానానికి ఇదో విషమ పరీక్షలా మారింది. ఈ సందిగ్ధంలో అధిష్ఠానం... పదవి ఎవరికి కట్టబెడుతుందో వేచి చూడాలి. 

19:12 - September 3, 2017

విజయవాడ : ప్రశాంత్‌ కిషోర్‌ను తమ పార్టీ తరపున ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు వైఎస్‌ జగన్‌. గతంలో కిషోర్‌ ట్రాక్‌ రికార్డును చూసి పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ప్లీనరీలో పార్టీ కార్యకర్తలకు ప్రశాంత్‌ కిషోర్‌ను పరిచయం చేశారు జగన్‌. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో మనకి దిశానిర్దేశం చేసి 2019లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తారని తెలిపారు. ప్లీనరీలో చెప్పినట్టుగానే పార్టీలో కీలకమైన అభ్యర్థుల ఎంపికను కిషోర్‌కు అప్పగించారు జగన్‌. ప్లీనరీ అనంతరం రంగంలోకి దిగిన కిషోర్‌ ఎమ్మెల్యేల దగ్గరి నుండి ఇంఛార్జ్‌ల పనితీరును నియోజక వర్గాల వారీగా సర్వేలు నిర్వహించారు. వాటి ఆధారంగా వచ్చే ఎన్నికల్లో చాలా మందికి టికెట్స్‌ రావనే ప్రచారం పార్టీలో జోరందుకుంది. అప్పటి నుండి కిషోర్‌పై పార్టీ నేతల్లో అసంతృప్తి మొదలైంది. పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉండి కూడా అనేక పోరాటాలు చేస్తున్నామని, ఇప్పుడు టికెట్‌ కూడా ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటి అని సందిగ్ధంలో ఉన్నారు కొందరు నేతలు. కిషోర్‌ వచ్చాక పార్టీలో సీనియర్‌ మాటలకు విలువ ఇవ్వడం లేదని సీనియర్‌ నేతలు వాదించారు. కీలక సమయాల్లోనూ జగన్‌ కిషోర్‌నే అనుసరిస్తున్నారని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఓటమికి కారణం కిషోరే
నంద్యాల ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం కిషోరే అన్న భావనలో ఉన్నారు పార్టీ నేతలు. నంద్యాల ప్రచారం, జగన్‌ ప్రసంగాలన్నీ కిషోర్‌ అధ్వర్యంలోనే జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎంపై జగన్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీ ఓటమికి కారణంగా చెబుతున్నారు. అయితే అలాంటి వ్యాఖ్యలు చేయించింది కిషోరే అంటున్నారు పార్టీ నేతలు. లోకల్‌ ఎలక్షన్‌లో కూడా పార్టీ సీనియర్‌ నేతల మాటలు వినకుండా కిషోర్‌ వ్యవహరించారని నేతలంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల మైండ్ సెట్‌, దక్షిణాది ప్రజల మైండ్‌ సెట్‌కి చాలా తేడా ఉంటుందని ఈశాన్య రాష్ట్రాల వ్యూహాలు దక్షిణాదిలో పని చేయవనే వాదనలు పార్టీ నేతల్లో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కిషోర్‌ టీంలో ఉన్న సభ్యుల పట్ల నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కనీస రాజకీయ అవగాహన లేని వ్యక్తులు ఈ టీంలో ఉన్నారని నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ లాంటి పటిష్ఠమైన పార్టీని ఎదుర్కోవాలంటే సీనియర్ల సలహాలు పాటించాలని నేతలు సూచిస్తున్నారు. మొత్తానికి 2019 ఎలక్షన్స్‌కి నంద్యాల ఎలక్షన్స్‌ సెమీ ఫైనల్‌ అంటూ చేసిన ప్రయత్నం విఫలమవడంతో నేతలు నిరుత్సాహంలో ఉన్నారు. నంద్యాల ఓటమికి కిషోరే కారణమంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో పార్టీ నేతలు, కార్యకర్తల్లో అధినేత జగన్‌ ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తారో చూడాలి. 

19:11 - September 3, 2017

కడప : జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్‌ జగన్‌ నిన్న పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ ప్రజా దర్బారులో పాల్గొని ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సుబ్బరాయుడు అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు. 

19:07 - September 3, 2017

ఢిల్లీ : రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టడం తనకు ఉద్వేగభరితంగా ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టన తాను ఇవాళ దేశానికి సంబంధించిన ఉన్నత పదవుల్లో ఉంటం.. మన ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనం అన్నారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందని ఇవాళ జరిగిన కేబినెట్‌ విస్తరణలో నిరూపణ అయిందన్నారు. ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని నిర్మలా సీతారామన్‌ అన్నారు. 

18:16 - September 3, 2017
18:14 - September 3, 2017

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కోట్ల రూపాయలు వెచ్చించి నిర్వహిస్తోన్న గురుకులాలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయి. ఖమ్మం జిల్లా ఇల్లందులోని 24 ఏరియాలో ఉన్న బాలుర మైనారిటీ గురుకుల పాఠశాలే ఇందుకు నిదర్శనం. అపరిశుభ్ర పరిసరాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లోనే తరగతులు నిర్వహించడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇదంతా ఒక ఎత్తైతే పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది నిర్వాకాలు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి.

ప్రిన్సిపల్‌ బెదిరింపులు
తమకు ఎదురైన సమస్యల గురించి ప్రిన్సిపల్‌కు విన్నవించుకున్న విద్యార్థులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. నోటికొచ్చిన బూతులు తిట్టడం, కాళ్లతో తన్నడం, ఎక్కువ మాట్లాడితే టీసీ ఇస్తానని ప్రిన్సిపల్‌ బెదిరిస్తున్నాడని విద్యార్థులు వాపోతున్నారు. తమ తల్లిదండ్రులు కూడా తమని ఏనాడు దండించలేదని ప్రిన్సిపల్‌ నిర్వాకం మాత్రం చాలా బాధాకరంగా ఉందని విద్యార్థులంటున్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రిన్సిపల్‌ ముదాఫిర్‌ హుస్సేన్‌ను 10 TV ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని బుకాయించాడు. చదువుకోవాలని చెప్పినందుకే విద్యార్థులు తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. విద్యార్థులకు ఆహారం కూడా సరైన రీతిలో అందిస్తున్నామని చెబుతున్నాడు.

తల్లిదండ్రులు మండిపటు
అయితే గతంలో కూడా ప్రిన్సిపల్‌పై పలు అవినీతి ఆరోపణలున్నాయి. పాఠశాలకు రావాల్సిన ఆహార పదార్థాలను పక్కదారి పట్టించి ప్రిన్సిపల్‌ జేబు నింపుకుంటున్నాడన్న ఆరోపణలున్నాయి. పాఠశాల సిబ్బందితో గొడవలు పడుతూ, సిబ్బందితో సమన్వయం లేక ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్న సందర్భాలున్నాయి. పిల్లలను హింసించారనే ఆరోపణలు రావడంతో వ్యవహారం బయటికి పొక్కకుండా అధికారులు ప్రిన్సిపల్‌ను సెలవుపై పంపించారన్న అభియోగాలున్నాయి. సెలవుపై వచ్చిన తర్వాత కూడా ప్రిన్సిపల్‌ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వేధించే ప్రిన్సిపల్‌ మాకొద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల సమస్యలు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

17:23 - September 3, 2017

ఆదిలాబాద్/నిర్మల్ : జిల్లా ఖానాపూర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు వివాహితపై అత్యాచారానికి పాల్పపడ్డారు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో వివాహితను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ప్రకారం కుంచపు గంగాధర్, ధర్మపురి చిన్నప్ప ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

17:22 - September 3, 2017

కరీంనగర్/సిద్దిపేట : అర్హులకు కాకుండా అనర్హులకు భూములు కేటాయించారని బెజ్జంకి మండలం గూడెం చెందిన కొంతమంది యువకులు ఎమ్మెల్యే రసమయికి విన్నవించిన పట్టించుకోకుండా తమను ఫోన్ లో తిట్టాడని యువకులు రసమయి కార్యాలయం ముందు ఆత్మహత్యయత్నం చేశారు. బాధితులు పరుశురాములు, శ్రీనివాసుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. మరంత సమాచారం కోసం వీడియో చూడండి.

వివాహితపై అత్యాచారం..

నిర్మల్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో వివాహితపై ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. కుటుంబసభ్యులు ఎవరూ లేని సమయంలో ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. కంచపు గంగాధర్, ధర్మపురి చిన్నప్పలు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు పేర్కొంది. 

రసమయి ఆఫీసు ఎదుట యువకుల ఆత్మహత్యాయత్నం..

కరీంనగర్ : ఎమ్మెల్యే రసమయి కార్యాలయం ఎదుట కలకలం రేగింది. బెజ్జంకి మండలం గూడెంలో అర్హులకు కాకుండా అనర్హులకు భూములు కేటాయించారని, ఎమ్మల్యే రసమకియి విన్నవించినా పట్టించుకోకుండా ఫోన్ లో తిట్టాడని యువకులు కలత చెందారు. దీనితో రసమయి కార్యాలయం ఎదుట పరుశురాములు, శ్రీనివాసరాములు నిప్పటించుకుని ఆత్మహత్యాప్రయత్నం చేశారు. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 

16:49 - September 3, 2017

నెల్లూరు : నిర్లక్ష్యానికి దర్పణం ఈ మృతదేహం. నెల్లూరులో ఏకె-47 మిస్‌ఫైర్‌ కలకలం రేపింది. ఏఎస్పీ గన్‌మెన్‌ దగ్గరి ఏకె 47 మిస్‌ఫైర్‌ అయ్యింది. ఈ ప్రమాదంలో ఏఎస్పీ కారు డ్రైవర్‌ రమేశ్‌ ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ రమేశ్‌ మృతి చెందాడు. నెల్లూరు జిల్లా, పోలీసు కార్యాలయం వద్ద రాత్రి 10 గంటలకు.. ఈ ఘటన జరిగింది. ఏఎస్పీ శరత్‌బాబు తన డ్రైవర్‌తో ఎస్పీని కలిసి వెళ్లేందుకు కార్యాలయానికి వెళ్లమని ఆదేశించారు. దీంతో డ్రైవర్‌ రమేశ్‌ ఏఎస్పీ వాహనాన్ని పోలీసు కార్యాలయంలోకి తీసుకొచ్చారు. వాహనం ఆగిన వెంటనే ఏఎస్పీ శరత్‌బాబు కిందికి దిగిన క్షణంలోనే.. గన్‌మ్యాన్‌ నాగేంద్ర వద్ద ఉన్న గన్‌ మిస్‌ ఫైర్‌ అయ్యింది.

పలు రకాల అనుమానాలు
రెండు రౌండ్‌లు డ్రైవర్‌ రమేశ్‌ ఒంట్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఒకటి ఛాతి మీదుగా వెళ్లి కార్యాలయం గోడకు తగలగా.. రెండో బుల్లెట్‌ ఛాతి కింది భాగంలో ఎడమవైపు నుంచి కుడివైపుకు దూసుకొచ్చింది. అనుకోని పరిణామంతో ఏఎస్పీ కూడా భయభ్రాంతులకు గురయ్యాడు. పెద్ద శబ్దం రావడంతో అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది.. డ్రైవర్‌ రమేశ్‌ను హుటాహుటిన బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ రామకృష్ణ, ఏఎస్పీ శరత్‌బాబు ఇతర పోలీసు అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకొని.. అండగా నిలిచినప్పటికీ రమేశ్ ప్రాణాలను కాపాడలేకపోయారు. రమేశ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని జిల్లా ఎస్పీ రామకృష్ణ తెలిపారు. నెల్లూరు జిల్లా, సీతారామపురానికి చెందిన రమేశ్ 2009లో పోలీసు ఉద్యోగంలో చేరాడు. ఈ ఘటనకు కారణమైన గన్‌మ్యాన్‌ నాగేంద్ర... 2011 బ్యాచ్‌కు చెందినవాడు. గత జనవరి నుంచి ఏఎస్పీ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ ఘటనలో గన్‌మ్యాన్‌ నిర్లక్ష్యమే కారణమని పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రమేశ్ మృతి పట్ల అతని బంధవులు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

16:47 - September 3, 2017

కరీంనగర్/సిరిసిల్ల : అవినీతి అధికారుల అత్యాశ సిరిసిల్లలోని వీర్నాపల్లి రైతులకు తీరని బాధను మిగిల్చింది. వీర్నాపల్లి మండల కేంద్రాన్ని ప్రధాన మంత్రి సంసద్‌ ఆదర్శ్‌ యోజన పథకం కింద కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ దత్తత తీసుకున్నారు. ఈ గ్రామంలో వెనుకబడిన తరగతుల వారికి జీనోపాధిని కల్పించాలనే సదుద్దేశ్యంతో ఎంపీ జనరల్‌ ఫండ్‌ నుండి సబ్సీడీ ద్వారా ఆవులను కొనివ్వాలని నిర్ణయించారు. అందుకోసం గ్రామంలో 18 మంది లబ్దిదారులను గుర్తించారు. ఒక్కొక్కరికి రెండు పాడి పశువుల చొప్పున ఇవ్వడానికి నిర్ణయించి బ్యాంక్‌ ద్వారా 80 వేల రుణం ఇప్పించారు. అందులో 50 శాతం సబ్సీడీ పోగా మిగిలిన 50 శాతం అంటే 40 వేలు రైతులు కట్టాల్సి ఉంటుంది.

40 వేల చొప్పున రైతులకు
వెనుకబడిన వారిని ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. అయితే దీనికి విరుద్ధంగా అవినీతి అధికారులు ప్రవర్తించడంతో ఆ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. స్థానికంగా, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల నుండి మేలు జాతి ఆవులను తీసుకురావాల్సిన అధికారులు....ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం మీదుగా రైతులను కోనసీమకు తీసుకువెళ్లారు. అక్కడ ఒక్కో పశువు విలువ సుమారు 15 నుండి 20 వేల మధ్య ఉంటే అవినీతికి అలవాటు పడ్డ అధికారులు ఒక్కో పశువును 40 వేల చొప్పున రైతులకు అంటగట్టారు.

తెచ్చిన పశువులు మూడు రోజులకే చనిపోయాయి
అంతేకాదు కొనుగోలు చేసిన పశువులను తమ ఖర్చులతోనే తీసుకెళ్లాలని రైతులకు సూచించారు. ఇలా తెచ్చిన పశువులు ఓ రైతు దగ్గర మూడు రోజులకే చనిపోయాయి. నష్టపరిహారం కోసం వెళ్తే ఇన్సూరెన్స్‌ లేదంటూ అధికారులు ఆ రైతును గెంటేశారు. గ్రామంలోని మరో ఇద్దరి లబ్దిదారుల పశువులు కూడా చనిపోతే వారికి కూడా అధికారులు మొండిచేయి చూపించారు. మరోపక్క బ్యాంకులో కట్టాల్సిన డబ్బు కోసం అధికారులు వేధించడంతో పోషణ కోసం పెంచుకున్న పశువులను అమ్ముకున్నాడు ఆ రైతు. 40 వేలు పెట్టి కొన్న పశువు 20 వేలకే అమ్ముడుపోవడంతో రైతు అప్పులపాలయ్యాడు. తమకు జరిగిన అన్యాయాన్ని ఉన్నతాధికారుల దగ్గర మొరపెట్టుకున్నా.. న్యాయం జరగలేదు. దీంతో మోసపోయిన రైతు ఉన్నదాంట్లో బతుకుతున్న తమను అనవసరంగా ఆశ చూపి దిక్కులేని వాళ్లని చేశారని వాపోతున్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. 

16:46 - September 3, 2017

తూర్పుగోదావరి : ఏలూరులో నిషేధిక ఆక్వా మందులను రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.. కొంతకాలంగా శనివారపుపేటకు చెందిన రామస్వామి హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీ నడుపుతున్నారు.. దేశవ్యాప్తంగా ఆక్వా కల్చర్‌లో నిషేధించిన మందుల్ని ఎటువంటి లైసెన్సులు లేకుండా అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న డ్రగ్ కంట్రోల్‌, విజిలెన్స్ అధికారులు రామస్వామి ఇంటిపై దాడి చేశారు.. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 1150 కిలోల నిషేధిత ద్రావణాన్ని గుర్తించారు.. రామస్వాని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

16:44 - September 3, 2017

నిజామాబాద్ : ఎన్నికలకుముందు కార్మికవర్గానికి ఇచ్చిన హామీలేవీ.... టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని... సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ఆరోపించారు. కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు పెంచలేదని మండిపడ్డారు. నిజామాబాద్‌లో  సీఐటీయూ ఎనిమిదవ జిల్లా మహాసభలకు భాస్కర్‌తోపాటు... జయలక్ష్మి హాజరయ్యారు.

16:43 - September 3, 2017

కరీంనగర్ : వ్యవసాయ రంగంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందన్నారు.. మంత్రి ఈటెల రాజేందర్‌. రైతు సమన్వయ సంఘాల ద్వారా అన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముందని చెప్పారు. ఏకకాలంలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు.

బాధ్యత పెరిగింది - నిర్మలా సీతారామన్..

ఢిల్లీ : తనపై మరింత బాధ్యత పెరిగిందని రక్షణ శాఖ మంత్రిగా నియమితులైన నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. తనకు ఈ శాఖ అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందని..మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతోందని ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 

గౌతమ్ రెడ్డికి షోకాజ్ నోటీసు..

విజయవాడ : వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వంగవీటి రంగాపై గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ ఖండించింది. జగన్ ఆదేశాలతో షోకాజ్ నోటీసు జారీ చేశారు. వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడిగా గౌతమ్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. 

16:35 - September 3, 2017
16:19 - September 3, 2017

కూరగాయాల్లో కందగడ్డ ఒక రకం. దీనితో పలు రకాల వంటలు చేస్తుంటారు. ఇది చాలా బలవ్ధకమైన ఆహారం. ఇందులో పలు పోషక విలువలు, ఔషధ గుణాలున్నాయి. బీటా కెరోటీన్ చాలా తక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల షుగర్..ఒబిసిటీలను అదుపులో ఉంచవచ్చు. కందగడ్డలో విటమిన్ ఎ చాలా ఎక్కువగా ఉంటుంది. లోగ్లిజమిక్ ఇండెక్స్, బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా క్రమబద్దం చేస్తుంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది. మహిళలో మోనోపాజ్ సమస్యకు చెక్ పెడుతుంది. ఇందులో క్యాల్షియం, ఐరన్, మినరల్స్, పోటాషియం, ఫాస్పరస్ అధికంగా ఉండడం వల్ల గుండెను పదిలంగా చూస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా పనిచేస్తుంది. 

16:15 - September 3, 2017

తాజా పండ్లు..కూరగాయలతో ఏం చేస్తారు ? పండ్లు జ్యూస్ గా లేదా అలాగే తినవచ్చు.. కూరగాయలతో వంటలు చేస్తాం అంటారు. కదా..కానీ వీటితో చర్మ సౌందర్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. కొన్ని కూరగాయలు..పండ్లతో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.

యాపిల్ పండులో ఏ, సీ విటమిన్లు, రాగి వంటి పోషకాలుంటాయి. ఒక చెంచా యాపిల్ తురుములో రెండు చెంచాల కొబ్బరి నీల్లు, మూడు చుక్కల నిమ్మ నూనె వేసుకోవాలి. ముద్దలా తయారు చేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల అనంతరం కడుక్కువాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ముతల ప్రభావాన్ని తగ్గిస్తుంది. మృతకణాలనూ నివారిస్తాయి. పైగా ఇది అన్నిరకాల చర్మతత్వాలవారికీ సరిపోతుంది.

టమాట సహజ సన్ స్ర్కీన్ లా ఉపయోగ పడుతుంది. టమాట రసాన్ని ముఖాకి పూతలా వేసి చేతి వెళ్లతో నెమ్మదిగా మర్దన చేయాలి. పదిహేను నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి. క్రమం తప్పకుండా చేసి ఫలితం తెలుసుకోండి. 

అహ్మదాబాద్ లో రాష్ట్రపతి..

గుజరాత్ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. గాంధీ ఆశ్రమంలో గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన వెంట సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 

నగరానికి రానున్న ఉప రాష్ట్రపతి..

హైదరాబాద్ : కాసేపట్లో హైదరాబాద్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి రానున్నారు. 

15:34 - September 3, 2017

కరీంనగర్/జగిత్యాల : శ్రమ... సృజనాత్మకత...వెరసి ప్రభాకర్‌..తక్కువ ఖర్చుతో... ఎక్కువ ఉపయోగపడే పరికరాల సృష్టికర్త..పట్టా లేకున్నా.. సత్తా ఉన్న గ్రామీణ ఇంజనీర్‌..జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన ఇతడి పేరు ప్రభాకర్...! అనేక ప్రయోగాలకు.. కొత్త పరికరాలకు కేరాఫ్‌ అడ్రస్‌! ... సమాజానికి అవసరమైన వస్తువులను తయారు చేయడంలో ప్రభాకర్ నేర్పరి. మధ్య తరగతి కుటుంబ నేపథ్యం కలిగిన ప్రభాకర్ వినూత్న వస్తువులను తయారు చేస్తూ... అందరినీ అబ్బురపరుస్తున్నాడు. చాలామంది యువకులకు శిక్షణ ఇచ్చి.. ఉపాధిని కల్పిస్తున్నాడు.

ఆటోమెటిక్ జనరేటర్ స్టార్టర్
1988లోనే ప్రభాకర్ తన తండ్రి వద్ద నేర్చుకున్న ఎలక్ట్రిక్‌ విద్యతో ఆటోమెటిక్ జనరేటర్ స్టార్టర్‌ను తయారు చేసి పేటెంట్ హక్కు పొందాడు. తన ఇంటి ఎదుటనే ప్రభాత్ ఇండస్ట్రీస్‌ అనే సంస్థను నెలకొల్పి చాలామంది నిరుద్యోగులకు పీసీ మెకానిజం, టిగ్ అండ్ ఆర్క్ వెల్డింగ్ వర్క్, శానిటేషన్ లాంటి పనులలో శిక్షణ ఇస్తూ.. వారికి జీవనోపాధిని అందిస్తున్నారు. అలాగే తక్కువ ఖర్చుతో... ఎక్కువ ఉపయోగపడే విధంగా అనేక వస్తువులను తయారు చేసి.... అన్ని రంగాల ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు. ప్రభాకర్‌ కనుగొన్న వాటిలో... అద్భుతమైనవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు, రోగులను దృష్టిలో పెట్టుకుని... తయారు చేసిన మంచం... అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సకల సౌకర్యాలను కల్పిస్తూ... బెడ్‌ను రూపొందించారు. కాలకృత్యాలు తీర్చుకోవడం మొదలు... స్నానం చేయడానికి కూడా ఈ బెడ్‌పై అవకాశం ఉంది. అన్నం తినడానికి... బోర్‌ కొట్టినప్పుడు చూడడానికి టీవీని కూడా అమర్చారు.

లక్ట్రికల్‌ పోల్ ఎక్కే చెప్పులు
ప్రభాకర్ తయారు చేసిన వాటిల్లో మరో ముఖ్యమైన పరికరం.. బోర్‌ వెల్‌ పుల్లింగ్‌ మిషన్‌ ఒకటి... మోటార్‌ అవసరం లేకుండా... ఈ మిషన్‌ పనిచేస్తోంది.చేతితో ఆపరేట్‌ చేసే విధంగా దీనిని తయారు చేశారు. అలాగే సౌర శక్తిని వృథా చేయకుండా పూర్తిగా వినియోగించుకునేలా ట్రాకింగ్ సోలార్ సిస్టం రూపొందించారు. అలాగే మురుగు కాల్వలో చెత్తను తీసి శుభ్రం చేసే యంత్రాన్ని తయారు చేశారు. రైతులు పొలాల్లో కలుపు మొక్కలను తీయడానికి సైతం చిన్న పరికరాన్ని రూపొందించారు. అలాగే పత్తి పంటలకు చెట్టు వద్దే ఎరువులు పడే విధంగా...ట్రిగ్గర్ పరికరాన్ని తయారు చేశారు. అలాగే విద్యుత్ లైన్ మెన్‌ల కోసం అతి సులభంగా ఎలక్ట్రికల్‌ పోల్ ఎక్కే చెప్పులను, 360 డిగ్రీల్లో తిరిగే జంబో కూలర్‌ను తయారు చేశారు. దొంగతనాలను నివారించేందుకు సేఫ్‌ గార్డ్‌ సైరన్‌ను... మురికి నీరు పైకి పోయి... చెత్త అంత పైన నిలిచిపోయే విధంగా మరో పరికరాన్ని ఆవిష్కరించారు. అయితే ప్రజలకు ఉపయోగపడే.. ఎన్నో పరికరాలను తయారుచేసే... ప్రభాకర్‌కు మాత్రం... ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లభించడం లేదని కుటంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా... కనీసం గ్రాడ్యుయేషన్‌ కూడా చేయని... ఈ గ్రామీణ ఇంజనీర్‌ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ప్రయోగాల ప్రభాకర్‌కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే.. మరిన్ని పరికరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

15:23 - September 3, 2017
15:02 - September 3, 2017

జుట్టు శుభ్రంగా ఉంచుకోవడం..ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే 'దువ్వెన' కీలకం. దీనిని శుభ్రం చేయకుండా అలాగే వాడితే జుట్టు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. దుమ్ము..ధూళఙ అన్ని కలిసి దువ్వెన చాలా మురికిగా కనిపిస్తుంది. దువ్వెన శుభ్రం కోసం కొన్ని చిట్కాలు..గోరు వెచ్చని నీటిలో కొద్దిగా షాంపూ వేసి దువ్వెనను నానబెట్టాలి. మెత్తని బ్రష్ తీసుకుని దువ్వెనను శ్రుభపరచండి. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేసేయండి. జెల్..క్రీములు అప్లై చేసిన సమయంలో దువ్వెనకు ధూళి త్వరగా పడుతుంది. అలాంటి సమయాల్లో వెంటనే దువ్వెనను వెంటనే కడిగి ఆరబెట్టాలి. దువ్వెనలో చిక్కుకపోయిన జుట్టు తీయడానికి పెన్ లేదా పెన్సిల్ ఉపయోగించండి. అందులో జుట్టును వదులు చేసిన అనంతరం కత్తెర సాయంతో కత్తిరించి బయటకు తీయాలి. దువ్వెన నానబెట్టే నీటిలో షాంపూ వేయకుండా బేకింగ్ సోడా, వెనిగర్ వేసి ఫలితం చూడండి. తల దువ్వుకున్న వెంటనే దానికి అంటుకున్న వెంట్రుకలు తీసేయాలి. వారానికి ఒకసారైనా దువ్వెనను శుభ్రం చేసుకోవాలి. రెండురోజులకొకసారి తలస్నానం చేస్తే ఇంత సమస్య ఉండదు.

15:00 - September 3, 2017

రెండు రోజులు మద్యం షాపులు బంద్..

హైదరాబాద్ : వినాయక నిమజ్జనం సందర్భంగా సందర్భంగా మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీలు మహేందర్‌రెడ్డి, సందీప్‌ శాండిల్య, మహేశ్‌ భగవత్‌లు వెల్లడించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్‌ షాపులు మూసి ఉంటాయని వెల్లడించారు. 

జగన్ ఒక శని - ఆనందబాబు..

గుంటూరు : ఏపీకి పట్టిన అతిపెద్ద శని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి ఆనందబాబు విమర్శించారు. నంద్యాల, కాకినాడ ఫలితాలతో జగన్‌లో మార్పురాలేదని, ఆయనకు సీఎం పదవిపై ఆశ తప్ప.. ప్రజా సమస్యలపై ధ్యాసలేదన్నారు. 

కొత్త మంత్రులకు బాబు అభినందనలు..

విజయవాడ : కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కొత్తగా చోటు దక్కించుకున్న వారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. 

14:42 - September 3, 2017

టాలీవుడ్ లో అగ్ర కథానాయకుల సినిమాలు రిలీజ్ అవుతుంటే వారి అభిమాను సందడి అంతా ఇంత ఉండదు. థియేటర్ లను అందంగా ముస్తాబు చేస్తారు..ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కటౌట్లకు పాలాభిషేకాలు..పూలదండలు వేస్తుంటారు. 'బాలకృష్ణ' నటించిన 'పైసా వసూల్' సినిమా ఇటీవలే విడుదలైంది.

విడుదలైన రోజున థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హడావుడి విపరీతంగా ఉంది. మంజు థియేటర్ వద్ద 'పైసా వసూల్' పోస్టర్ ని రూ. 500, రూ.2000 నోట్లతో ముస్తాబు చేశారు. ఈ విషయాన్ని ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై ఛార్మీ స్పందించారు. ఆ పోస్టర్‌ను రీట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

14:36 - September 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ‌లో రైతు స‌మితుల ఎర్పాటు విదానంపై విమ‌ర్శలోస్తున్నాయి. స‌మితుల‌కు స‌భ్యుల‌ను నామినేట్ చేయడ‌మంటే రాజ‌కీయ ద‌ళారీని ప్రోత్సహించ‌డమే అవుతుందంటున్నాయి రైతు సంఘాలు. గ్రామ స‌భ‌ల ద్వరా రైతు స‌మితిల‌ను ఎన్నిక చేయ్యాల‌ని డిమాండ్ చేస్తున్నాయి రైతు సంఘాలు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 9నాటికి అన్ని స్థాయిల్లో రైతు స‌మ‌న్వయ స‌మితుల‌ను ఎర్పాటు చేయాల‌ని ప్రభత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఉన్న స‌హ‌కార సంఘాల మాదిరిగా కాకుండా గ్రామ, మండ‌ల, జిల్లా స్థాయిలో రైతు స‌మ‌న్వయ స‌మితుల‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని క‌మిటీల్లోని స‌భ్యుల‌ను ప్రభుత్వమే నామినేట్ చేస్తుంది. అందుకోసం జిల్లాల వారిగా మంత్రుల‌కు బాధ్యత‌ల‌ను అప్పగించింది టీ సర్కార్‌.

వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి అందించనున్న పెట్టుబడి పథకాన్నికూడా రైతు సమితులకు అప్పగించనున్నారు. రెండు పంటసీజన్లలో ఒక్కో ఎరానికి ఇవ్వనున్న 8వేల రూపాయల రాయితీ డబ్బు పంపిణీలో ఈ కమిటీలు కీలకపాత్ర పోషించనున్నాయి. అయితే కమిటీలను ప్రభత్వమే నామినేట్‌ చేస్తుందన్న ప్రకటన రైతుల్లో ఆందోళన రేపుతోంది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న పంట పెట్టుబడి పథకం నిధులు అధికారపార్టీ నేతలకు ఫలహారంగా మారతాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైతు సమితులను నామినేట్‌ చేసే విధానాన్ని మానుకోవాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

రైతు క‌మీటిల‌ను నామినేట్ చేయాలన్న నిర్ణయం.. రాజ్యంగం క‌ల్పించిన గ్రామ పంచాయితీల హక్కులను కాలరాయడమే అంటున్నారు. ప్రజా స్వామికంగా జ‌రుగాల్సిన క‌మీటిల ఎర్పాటును ఇలా నామినేట్‌ చేయాలన్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం అవుంతోంది. అంతేకాదు.. పంటల ధరలు నిర్ణయించడంలో కూడా ఈ రైతు సమితులే కీలకంగా మారనున్నాయి. దీంతోపాటు రైతు సమితులకు తన పూచీకత్తుతో 10వేల కోట్ల రూపాయల రుణాలు కూడా ఇప్పస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అంటే.. నామినేట్‌ చేయబోయే కమిటీల్లో అధికారపార్టీ నేతలను తీసుకు వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా రైతుజీవితాలను రాజకీయ నాయకుల చేతిలో పెట్టినట్టేననే ఆందోళన వ్యక్తం అవుతోంది. పైగా ఇప్పటికే రైతులతో ఏర్పడిన కొన్న సహకార సంఘాలు ఉన్నతంగా పనిచేస్తున్నా కేసీఆర్‌ సర్కార్‌ వాటిని పట్టించుకోపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

దిగుబడి పెంచడం, పంటల అమ్మకాల కోసమే రైతు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా.. దాని వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి రైతుకమిటీల్లో గ్రామంలోని అన్ని సామాజిక తరగతుల నుండి ప్రతినిధులు ఉండాలని నిర్దేశించినప్పటికీ.. ఇవి టీఆర్‌ఎస్‌ అనుయాయుల కూటములుగా మారతాయనే విమర్శలు వస్తున్నాయి.ఇప్పటికై కేసీఆర్‌ సర్కార్‌ తమ నిర్ణయాన్ని మార్చుకోని కేవలం రైతుల భాగస్వామ్యంతోనే కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

14:32 - September 3, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మంత్రిర్గాన్ని పునర్వవస్థీకరించారు. కొత్తగా తొమ్మిది మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కొత్త మంత్రులతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు సహాయ మంత్రులుగా పనిచేసిన ధర్మేంద్ర ప్రధాన్‌, పియూష్‌ గోయల్‌, నిర్మలా సీతారామన్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ కేబినెట్‌ ర్యాంకు మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త మంత్రులుగా అశ్వినీకుమార్‌ చౌబే, గజేంద్రసింగ్‌ షెకావత్‌, వీరేంద్ర కుమార్‌, శివప్రతాప్‌ శుక్లా, అనంతకుమార్‌ హెగ్డే, సత్యపాల్‌సింగ్‌ ప్రమాణం చేశారు. అలాగే మాజీ బ్యారోక్రాట్స్‌ హర్దీప్‌సింగ్, ఆర్‌కేసింగ్‌, అల్ఫోన్స్‌ కన్నన్‌థానం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీరితో మంత్రులతో ప్రమాణం చేయించారు.

మోదీ మంత్రివర్గంలో చేని అశ్వినీకుమార్‌ చౌబే బీహర్‌లోని బక్సర్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీహార్‌ అసెంబ్లీకి వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు. 1974-75లో బీహార్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కేంద్ర జౌళి మండలిలో సభ్యుడుగా ఉన్నారు. బీహార్‌ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన అశ్వినీకుమార్‌ చౌబే, ఎమర్జెన్సీలో జైలు జీవితం గడిపారు. పాట్నా యూనివర్సిటీ సైన్స్‌ కాలేజీ నుంచి జంతుశాస్త్రంలో బీఎస్సీ పట్టా పొందారు. బీహార్‌ దళిత కుటుంబాలకు 11 వేల మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చారు.

గజేంద్రసింగ్‌ షెకావత్‌ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ లోక్‌సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. షెకావత్‌ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు. జోధ్‌పూర్‌లోని జై నారాయణ్‌ వ్యాస్‌ యూనివర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో ఎంఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అఖిల భారత క్రీడా సంఘం సభ్యుడుగా ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడుగా కొనసాగుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో యువతకు చేరువయ్యారు.

మోదీ మంత్రివర్గంలో చేరిన శివ్రపతాప్‌ శుక్లాఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోరఖ్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. న్యాయవాదిగా పనిచేసిన శివప్రతాప్‌ శుక్లాకు ఉత్తర్‌ప్రదేశ్‌ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. చేపట్టిన శాఖల్లో సంస్కరణలు తేవడం ద్వారా విశేష గుర్తింపు పొందారు. ఎమర్జెన్సీలో 19 నెలలపాటు జైలు జీవితం అనుభవించారు. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడుగా ఉన్నారు.

కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన హర్దీప్‌సింగ్‌ పూరీ 1974 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి. దౌత్యవేత్తగా నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం. 2009-13 మధ్య ఐక్యరాజ్య సమితిలో భారత్‌ శాశ్వత ప్రతినిధిగా పని చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ హిందూ కాలేజీ, సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీల్లో ఉన్నత విద్య చదివారు. విద్యార్థి సంఘం నేతగా పనిచేశారు. ప్రస్తుతం ఆర్ఐఎస్‌ అనే మేధో సంస్థకు అధ్యక్షుడుగా ఉన్నారు. గతంలో అంతర్జాతీయ శాంతి సంస్థకు ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు.

కేంద్ర మంత్రిగా పనిచేసిన సత్యపాల్‌సింగ్‌ రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన సత్యపాల్‌ సింగ్‌ ముంబై, పుణె మాజీ పోలీస్‌ కమిషనర్‌గా పని చేశారు. 2014లో యూపీలోని బాగ్‌పత్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ, ఎంఫిల్‌ ఆస్ట్రేలియాలో ఎంబీఏ పూర్తి చేశారు. నక్సల్స్‌ ఉద్యమంపై పీహెచ్‌డీ చేశారు. ఏపీ, మధ్యప్రదేశ్‌లలో నక్సల్స్‌ నియంత్రణలో కృషికి ప్రత్యేక సేవా పతకం అందుకున్నారు. హోం శాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడుగా ఉన్నారు.

రాజ్‌కుమార్‌సింగ్‌ 1975 బీహార్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా సేవలు అందిచారు. ప్రస్తుతం బీహార్‌లోని ఆరా లోక్‌సభ నుంచి ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి ఎంఏతోపాటు న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. నెదర్లాండ్స్‌లోని ఆర్‌వీబీ డెలెప్ట్‌ యూనివర్సిటీలోనూ ఉన్నత విద్య చదివారు. ప్రస్తుతం వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాలలో సభ్యుడుగా ఉన్నారు.

కేంద్ర మంత్రివర్గంలో చేరిన అల్ఫోన్స్‌ కన్నన్‌థానం కేరళ కేడర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి.కొట్టాయం జిల్లా కలెక్టర్‌గా విధుల నిర్వహించారు. సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలో పనిచేసిన అల్ఫోన్స్‌... 15వేల అక్రమ నిర్మాణాలను కూల్చివేయించడం ద్వారా ఖ్యాతి పొందారు. 1994లో జన్‌శక్తి ఎన్జీవో ఏర్పాటుచేసి, ప్రజలకు సేవ చేశారు. 2006-11 మధ్య కేరళలోని కంజీరపల్లి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 994లో టైమ్స్‌ మ్యాగజైన్‌ వంద మంది యువ నాయకుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

కేంద్ర మంత్రివర్గంలో చేరిన వీరేంద్రకుమార్‌ మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌ ఎస్సీ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్‌సభకు ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఏబీవీపీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆర్థికశాస్త్రంలో ఎంపీ, బాలకార్మిక వ్యవస్థపై పీహెచ్‌డీ చేశారు. ఎమర్జెన్సీలో 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. కార్మిక సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడుగా ఉన్నారు.

మోదీ మంత్రివర్గంలో చేరిన అనంత్‌కుమార్‌ హెగ్డే ఉత్తర కన్నడ (కర్నాటక) నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్‌సభకు వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు. సుగంధ ద్రవ్యాల బోర్డు చైర్మన్‌గా విధులు నిర్వహించారు. వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో పని చేసిన అనుభవం ఉంది. గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు. 

14:25 - September 3, 2017

బాలీవుడ్ నటుడు 'అక్షయ్ కుమార్' గర్భం దాల్చడం ఏంటీ ? అంటూ ఏవో ఊహించుకుంటున్నారా ? ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అక్షయ్ గర్భం దాల్చినట్లు...ఏకంగా కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు ఆ వీడియోలో చూపించారు. ఇదంతా ఓ టీవీ షో కార్యక్రమం కోసం నిర్వహించారు.

‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ -5’ అనే టీవీ షోకి 'అక్షయ్' న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా 'అక్షయ్' తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశాడు. రెండు రోజుల క్రితం ఈ వీడియోను పోస్ట్ చేసిన అక్షయ్, ‘దునియా సోచ్ రహీ హై యే అజూబా కైసే హువా?’ అని పేర్కొనడం గమనార్హం.

గన్ మిస్ ఫైర్ లో పలు అనుమానాలు..

నెల్లూరు : జిల్లా ఎస్పీ కార్యాలయంలో గన్ మిస్ ఫైర్ లో డ్రైవర్ రమేష్ మృతి ఘటనపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రమేష్ తో సహజీవనం చేస్తున్న మహిళ పలు ఆరోపణలు గుప్పించింది. ఏఎస్పీ గన్ మెన్ కుట్ర చేసి రమేష్ ను హత్య చేశారని ఆరోపిస్తోంది. 

14:14 - September 3, 2017

ఢిల్లీ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. కొత్తగా 9మంది ప్రమాణ స్వీకారం చేశారు. నలుగురికి పదోన్నతి కల్పించారు. మొత్తంగా 75 సంఖ్యకు చేరుకున్నట్లైంది. 2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. పనితీరు బాగాలేని మంత్రులను రాజీనామా చేయమని కోరడంతో ఏడుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

అశ్వినీ కుమార్ చౌబే, గజేంద్ర సింగ్ షెకావత్,. శితప్రతాప్ శుక్లా, హర్దీప్ సింగ్ పూరి, సత్యపాల్ సింగ్, రాజ్ కుమార్ సింగ్, అల్ఫోన్స్ కన్ననథనం, వీరేంద్ర కుమార్, అనంతకుమార్ హెగ్డే కొత్త మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రులుగా ఉన్న నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలకు కేబినెట్ హోదా కల్పించారు.

మోడీ కేబినెట్ లో పలువురు శాఖల్లో మార్పులు చేర్పులు చేశారు. రక్షణ శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ కు కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరూ ఊహించని విధంగా అత్యంత కీలక శాఖ అయిన రక్షణ శాఖ బాధ్యతలని మోడీ అప్పగించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తరువాత రక్షణ బాధ్యతలు చేపట్టనున్న రెండో మహిళ నిర్మలా సీతరామన్ కావడం విశేషం. ఇక పీయూష్ గోయల్ రైల్వే, బొగ్గు శాఖ...ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం శాఖ..ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనార్టీ సంక్షేమం..స్మృతి ఇరానీ - సమాచార జౌళీ శాఖ..సురేష్ ప్రభు - వాణిజ్య పన్నులు..శివ ప్రతాప్ శుక్లా -ఆర్థిక శాఖ సహాయ మంత్రి..అల్ఫోన్స్ కన్నన్ థానమ్ - పర్యాటక సహాయ మంత్రి...ఉమా భారతి - తాగునీరు, పారిశుధ్యం..స్మృతి ఇరానీకి సమాచార, ప్రసార శాఖ బాధ్యతలు అప్పగించారు. నితిన్‌గడ్కరీకి జలవనరులు, గంగా ప్రక్షాళన బాధ్యతలు కేటాయించారు. 

14:01 - September 3, 2017

జగన్నాథ ఆలయంలో ధర్మేంద్ర ప్రదాన్ పూజలు..

ఢిల్లీ : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ జగన్నాథ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపటి క్రితం ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 

నిర్మలా సీతారామన్ కు రక్షణ శాఖ ?

ఢిల్లీ : ధర్మేంద్ర ప్రదాన్ కు కేబినెట్ మంత్రి హోదాలో పెట్రోలియం శాఖ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి కేబినెట్ మంత్రి హోదాలో మైనార్టీ వ్యవహారాల శాఖ బాధ్యతలు..శివ ప్రతాప్ శుక్లాకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పదవి..పీయూష్ గోయల్ కు రైల్వే శాఖ..నిర్మలా సీతారామన్ కు రక్షణ శాఖ..సురేష్ ప్రభుకు వాణిజ్య శాఖ..వాణిజ్య సహాయ మంత్రిగా హర్ దీప్ సింగ్ లకు కేటాయించే అవకాశాలున్నాయి.

 

13:45 - September 3, 2017
13:42 - September 3, 2017

గుంటూరు : ఏపీ మంత్రివర్గం విషయంలో బాబు ప్రణాళిక పక్కాగా వర్కవుట్‌ అవుతోందా? సుదీర్ఘ కాలయాపన తరవాత ఏర్పడిన ఎన్నికల క్యాబినెట్‌.. చంద్రబాబు కలల్ని నిజం చేస్తోందా? ఎన్నికల్లో వరుస విజయాలలో మంత్రిమండలి పాత్రెంత? ముఖ్యమంత్రి లక్ష్యాలను మంత్రులు ఎంతమేరకు చేరుకుంటున్నారు.. వాచ్‌ దిస్‌ స్పెషల్‌ స్టోరీ. 

ఆంధ్రప్రదేశ్‌ మంత్రిమండలి లేట్‌గా వచ్చినా.. లేటెస్ట్‌ విజయాలను అందిస్తోంది. అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల తరవాత ఏర్పాటు చేసిన నూతన మంత్రివర్గం.. వరస విజయాలను అందిస్తూ సీఎం లక్ష్యాలను చేరుకుంటోంది. నంద్యాల ఉప ఎన్నికను కొత్త మంత్రులు గెలిపిస్తే.. కాకినాడలో టీడీపీని పాత మంత్రులు విజయతీరాలకు చేర్చారు. జూనియర్లు-సీనియర్లు కలిసి ముఖ్యమంత్రి అనుకున్న లక్ష్యానికి తగ్గట్లుగా పని చేస్తున్నారు. 

 

ఏప్రిల్‌ రెండున సీఎం చంద్రబాబు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. ఇందులో అప్పటికే మంత్రులుగా ఉన్న కొందరిని కొనసాగిస్తూనే.. 11 మంది కొత్తవారికి చోటు కల్పించారు. చంద్రబాబు కొత్త మంత్రివర్గం ఏర్పడ్డాక.. 2 కీలక ఎన్నికలను అధికార పార్టీ ఎదురుకుంది. ఈ ఎన్నికలను వైసీపీ తన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో.. టీడీపీని ఓ సవాలుగా తీసుకునేలా చేసింది. వరుస విజయాలకు మంత్రివర్గం కీలకంగా మారిందనే చర్చ జోరుగా సాగుతోంది. 

నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఆరుగురు మంత్రులతో సీఎం ఒక కమిటీని వేశారు. వీరిలో నారాయణ మినహా అంతా కొత్త మంత్రులే. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, అఖిలప్రియ, ఆది నారాయణ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు విస్తరణలో భాగంగా కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చినవారే. నంద్యాలలో విజయంతో వీళ్లు తమ సత్తా చాటారు. 

నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా కొత్త మంత్రులు.. చంద్రబాబు తమపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టారు. రెడ్డి సామాజిక ఓట్లను నంద్యాలలో తెలుగు దేశానికి అనుకూలంగా మలచటంలో ఈ మంత్రులు కీలక పాత్ర పోషిస్తే.. అక్కడ మరో కీలక సామాజిక వర్గంగా ఉన్న బోయ కమ్యూనిటీని పార్టీ వైపు తిప్పటంలో కాల్వ శ్రీనివాసులు కృషి చేశారు. 

ఇక కాకినాడ విషయానికి వస్తే.. ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించిన వారంతా పాత మంత్రులే. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, ఇంఛార్జ్‌ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్నపాత్రుడు, శిద్దా రాఘవరావు, కొల్లు రవీంద్ర వీళ్లంతా సీనియర్‌ మంత్రులు. వీరు కాకినాడలో పార్టీ ఘన విజయం సాధించడానికి తమ అనుభవాన్ని ఉపయోగించారు. వీరికి మద్దతుగా కొత్త మంత్రులు జవహర్‌, పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్‌బాబు తమ చేయూతనందించి.. పార్టీ విజయానికి సహకరించారు. 

ఇక చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల క్యాబినెట్‌లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి.. తెర వెనక ఈ రెండు ఎన్నికలను సమర్ధంగా నిర్వహించడంలో జూనియర్‌-సీనియర్‌ మంత్రుల పాత్ర ఎంతో కీలకంగా మారింది. ప్రతిపక్షం మాటల తూటాలతో ఎంత రెచ్చగొట్టినా టీడీపీ క్యాడర్‌ ఎక్కడా తొందరపాటు చర్యలకు పాల్పడకుండా ప్రతివ్యూహాలు రచించడంలో లోకేశ్‌ కృషి చేశారు. 

కొత్త మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో సుజయ్ కృష్ణ రంగారావు తనదైన శైలిలో జిల్లాలో అందరినీ కలుపుకుపోతున్నారు. సీనియర్‌ మంత్రి అశోక్‌ గజపతి రాజుతో ఎప్పటి నుంచో ఉన్న విబేధాలను చక్క దిద్దుకొని.. కలసి ముందుకు సాగుతున్నారు. ఉచిత ఇసుక సమర్థంగా అమలవ్వాలన్న సీఎం ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో రావెల కిశోర్‌బాబు, శ్రవణ్‌ల నుంచి ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ మంత్రిగా కుదురుకున్నారు. 2017లో విస్తరించిన మంత్రివర్గం మాత్రం చంద్రబాబు లక్ష్యాలను నెరవేరుస్తూ దూసుకుపోతోంది. 

13:37 - September 3, 2017

 


తూర్పుగోదావరి : కాకినాడ కుర్చీ వ్యవహారంలో క్లారిటీ కనిపించడం లేదు. ఎన్నికలు జరిగాయి. టీడీపీ కూటమి విజయం సాధించింది. మేయర్‌ పీఠం కోసం ఆశావాహుల పోటీ మొదలయ్యింది. కానీ న్యాయపరమైన చిక్కులతో మేయర్ ఎన్నిక వ్యవహారం సందిగ్ధంలోనే ఉంది. దాంతో కాకినాడ వ్యవహారం పూర్తిగా తేలాలంటే మరి కొన్ని రోజులు ఆగక తప్పదని అర్థమవుతోంది. 

కాకినాడ కార్పొరేషన్‌కి పుష్కరకాలం తర్వాత ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్‌గా మారిన తర్వాత 2005లో.. తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత కొన్ని సమస్యలతో నాన్చుతూ వస్తున్న ఎన్నికలు.. ఎట్టకేలకు కోర్టు తీర్పుతో గత నెల 29న పోలింగ్‌ జరిగింది. ఫలితాలు కూడా వచ్చాయి. కానీ కౌన్సిల్ ఏర్పాటుకి మరికొన్ని అడ్డంకులు కనిపిస్తున్నాయి. 

కార్పొరేషన్‌ చట్టం ప్రకారం కౌన్సిల్ ఏర్పాటు కోసం కనీసం 50 డివిజన్లు ఉండాలి. అయితే 50 డివిజన్లతో ఉన్న కాకినాడ కార్పొరేషన్‌లో 42, 48 డివిజన్లకు ఎన్నికలు జరగలేదు. దాంతో ఎన్నికలు జరిగిన 48 స్థానాలకు గానూ టీడీపీ 32, వైసీపీ 10, బీజేపీ, ఇండిపెండెంట్‌లు మూడేసి సీట్ల చొప్పున గెలుచుకున్నారు. ఆ రెండు సీట్ల ఫలితాలతో సంబంధం లేకుండానే టీడీపీ మ్యాజిక్‌ ఫిగర్‌ సునాయసంగా దాటేసింది. దాంతో పలువురు ఆశావాహులు మేయర్‌ పీఠం కోసం పోటీ పడుతున్నారు. 

కాపులకి మేయర్‌ పీఠం కేటాయిస్తామని టీడీపీ తొలుత ప్రకటించింది. జనరల్‌ మహిళకి రిజర్వ్‌ కావడంతో కాపు మహిళల్లో ఐదుగురు గెలిచినప్పటికీ.. నలుగురు మేయర్‌ రేసులో ఉన్నామని చెబుతున్నారు. టీడీపీ మహిళా ప్రచార కార్యదర్శి మాకినీడి శేషుకుమారి, నగర పార్టీ అధ్యక్షుడి భార్య సుంకర పావని, మరో సీనియర్‌ నేత అడ్డూరి లక్ష్మీ శ్రీనివాస్‌తో పాటు ఎంపీ తోట నరసింహం బంధువు సుంకర శివప్రసన్న కూడా సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. ఈ నలుగురిలో ఒకరికి మేయర్‌ పీఠం ఖాయం. అయితే మేయర్‌ ఎంపిక మాత్రం నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత చేస్తామని డిప్యూటీ సీఎం చినరాజప్ప చెబుతున్నారు. 

మేయర్‌ ఎంపిక నోటిఫికేషన్‌ రావడానికి.. న్యాయపరమైన చిక్కులు అడ్డు వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు జరపాలని కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలోనే .. కోర్టు అంతిమ తీర్పుకు కట్టుబడి ఉండాలని చెప్పారు. దాంతో ఇప్పుడు మేయర్‌ పీఠానికి ఎంపిక మిగిలిన రెండు డివిజన్లకు ఎన్నికలు జరిగిన తర్వాత ఉంటుందా.. లేక మరో మార్గం అనుసరిస్తారా అన్నది స్పష్టత లేదు. ఇప్పుడు గెలిచామన్న ఆనందంతో ఉన్న నూతన కార్పొరేటర్లకు.. కుర్చీ లేకపోవడంతో అది కాస్తా నిరుత్సాహంగా మారుతోంది. కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో.. ఎప్పటికి కుర్చీ దక్కేనో అని ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. 

13:34 - September 3, 2017

ఢిల్లీ : మోదీ కొత్త టీమ్‌ ప్రమాణ స్వీకారం చేసింది. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో కొత్తగా 9 మందికి అవకాశం లభించింది. కొత్త మంత్రుల చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌... ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త కేంద్రమంత్రులుగా వీరేంద్రకుమార్‌, శివప్రతావ్‌ శుక్లా, అనంతకుమార్‌ హెగ్డే, సత్యపాల్‌ సింగ్, అశ్వినీకుమార్‌ చౌబే, గజేంద్రసింగ్‌ షెకావత్, హర్దీప్‌సింగ్‌ పూరి, రాజ్‌కుమార్‌ సింగ్‌, అల్ఫోన్స్‌ కన్నన్‌థానం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే నిర్మలాసీతారామన్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, ముక్తార్‌ అబ్బాస్‌నఖ్వీ, పీయూష్‌గోయల్‌కు పదోన్నతి కల్పించి... కేబినెట్‌ హోదా ఇచ్చారు. ఇక కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు మొండి చేయే మిగిలింది. ఏపీ నుంచి కంభంపాటి హరిబాబుకు కేంద్రమంత్రి పదవి దక్కుతుందని చివరి వరకు ఊహాగానాలు సాగినా.... చివరకు మొండిచేయ్యే మిగిలింది. కేంద్ర కేబినెట్‌ విస్తరణపై తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు నిరాశతో ఉన్నారు. బండారు దత్తాత్రేయ రాజీనామాతో తెలంగాణకు ప్రాధాన్యత దక్కలేదు. చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది.

13:18 - September 3, 2017
13:17 - September 3, 2017
13:15 - September 3, 2017

చెన్నై : తమిళనాడు తిరుచ్చిలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు భవనం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

13:08 - September 3, 2017

ఢిల్లీ : ఉత్తరకొరియా మరోసారి అణ్వస్త్ర ప్రయోగం చేసింది. ఆరోసారి అణ్వస్త్ర ప్రయోగానికి పాల్పడింది. ఉత్తరకొరియా అణ్వస్త్ర ప్రయోగం చేసిన విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్ లు ధృవీకరించాయి. ఉ.కొరియాపై అమెరిరా, జపాన్ లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఐదో అణ్వస్త్ర ప్రయోగం కంటే ఈసారి చేపిన ప్రయోగం 9.8 రెట్లు ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా. 

 

12:59 - September 3, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటిస్తున్న 'స్పైడర్' చిత్ర విడుదలకు రంగం సిద్ధమౌతోంది. ప్రముఖ దర్శకుడు 'మురుగదాస్' దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కొద్ది రోజుల నుండి షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం కోసం అభిమానులు తెగ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘మహేష్' సినిమాలో 'రా' ఏజెంట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే టీజర్, పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది.

రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓ పాట చిత్రీకరణ కోసం చిత్ర బృందం రొమేనియాకు వెళ్లింది. తమిళం..తెలుగు భాషాల్లో ఒకేసారి రూపొందుతోంది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది. అందులో భాగంగా ఈనెల 10వ తేదీన చైన్నైలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. దాని ద్వారా మహేష్ బాబు కోలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు. అదే వేదికపై చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. దీనికి ముందు హైదరాబాద్‌లో ఈ నెల నాలుగో తేదీన ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను ఠాగూర్‌ మధు నిర్మిస్తున్నారు. 

12:55 - September 3, 2017

కుందనం మోపుజేస్తున్న పువ్వుగుర్తొళ్లు..సెప్టెంబర్ 15జంచాదికి అధికారిక పట్టం, బండారు దత్తన్న మంత్రి పదవి ఊస్టింగ్..అభివృద్ధి కూడా హానే అనుకున్న మంత్రి, బాగా బల్చి మాట్లాడుతున్న బాబుమోహన్..ప్రశ్నించిన రైతులను బూతులుదిట్టిండు, పాటకాని చేతులకు గొలుసులేసిన పోలీసోళ్లు....ఇంటిపంచాదీలకు జొర్రిన తెలంగాణ సర్కార్, పోలీసాయనను పొర్క పొర్క కొట్టిండు.. తాగినంక వానిదెట్లైతదల్లా తప్పు, అమెరికాను వొణికిస్తున్న పంచభూతాలు....అవే ట్రంప్ గారికి అసలైన శత్రువులు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

12:53 - September 3, 2017

టాలీవుడ్..బాలీవుడ్.. సినిమాల ప్రచారం వినూత్నంగా నిర్వహిస్తుంటారు. ఆయా దర్శకులు..హీరోలు..తమ చిత్రాలకు సంబంధించిన సమాచారాన్ని అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ చిత్రాలపై ఉత్కంఠను పెంచుతుంటారు. సినిమా షూటింగ్ నుండి మొదలు పూర్తయ్యే వరకు వివరాలు తెలియచేస్తుంటారు. సినిమా లుక్..టైటిల్ లోగో..ఫస్ట్ లుక్..సాంగ్స్..టీజర్..ట్రైలర్ ..ఇలా విడుదల చేస్తూ అభిమానులను సంతోష పెడుతుంటారు.

టాలీవుడ్ యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'జై లవ కుశ'. సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో ఏకంగా 'ఎన్టీఆర్' మూడు పాత్రలు పోషిస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది. ఆయా పాత్రలకు సంబంధించిన లుక్స్..టీజర్ లను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న 'జై' అనే పాత్ర‌కి సంబంధించిన లుక్ విడుద‌ల చేశారు. ఇందులో సంకెళ్ళ‌తో క‌ట్టివేయ‌బ‌డిన 'ఎన్టీఆర్' రౌద్రం రాజ‌సం క‌లిసిన లుక్ తో చాలా ప‌వర్ ఫుల్ గా క‌నిపించాడు. ఇక‌.. 'ల‌వ కుమార్' పాత్ర కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సింపుల్ అండ్ స్టైలిష్ గా యంగ్ టైగ‌ర్ ఇచ్చిన పోజు అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకొంటోంది. ఈ లుక్ చూసి 'ల‌వ కుమార్' పాత్ర పై 'ఎన్టీఆర్' అభిమానులు భారీగానే అంచ‌నాలు పెట్టుకుంటున్నారు. ఇక‌.. 'జై' టీజ‌ర్ ను రిలీజ్ చేసిన టీం వినాయక చ‌వితి సంద‌ర్భంగా 'ల‌వ' టీజ‌ర్ ని రిలీజ్ చేశారు.

సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్ ను చిత్ర బృందం రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. భారీ వ‌ర్షాలు, గ‌ణేశ్ నిమ‌జ్జ‌నాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడియో వేడుకను క్యాన్సిల్ చేసింది. సెప్టెంబ‌ర్ 3 న మూవీ ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నుంది. ఆడియో వేడుక లేనందున్న హైద‌రాబాద్ లో సెప్టెంబ‌ర్ 10 న ప‌బ్లిక్ ఈవెంట్ ను నిర్వహించనుంది. ఆ రోజు మూవీ ట్రైల‌ర్ ను రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సందర్భంగా ఆడియో కు సంబంధించి రెండు పోస్ట‌ర్ల‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

ఒక పోస్టర్‌లో తారక్‌తో పాటు రాశీ, నివేదా కనిపించారు. సినిమాలోని ఓ పాట స్టిల్‌ ఇదని చిత్ర బృందం తెలిపింది. మరో పోస్టర్‌లో 'జై', 'లవ', 'కుశ' కనిపించారు. వీరు ముగ్గురూ కలిసి ఉన్న తొలి ప్రచార చిత్రమిది. రాశీ ఖ‌న్నా, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో రోనిత్ రాయ్, బ్ర‌హ్మ‌జీ, పోసాని కృష్ణ ముర‌ళి, ప్ర‌దీప్ రావ‌త్, జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ్ స‌పోర్టింగ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

12:41 - September 3, 2017

టీఆర్ ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ తో 10 టివి వన్ టు వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీప్రభుత్వం పాలనపై మాట్లాడారు. కాంగ్రెస్ లో అన్యాయం, నిర్లక్ష్యం జరిగిందన్నారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ ఎస్  లోకి వచ్చానని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:39 - September 3, 2017

అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ రాహుల్ రామకృష్ణతో 10 టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రాహుల్ సినిమా విశేషాలు తెలిపారు. తన సినీ పరిశ్రమ ప్రవేశం, తనకు వచ్చిన అవకాశాలను వివరించారు. అర్జున్ రెడ్డి సినిమాలోని డైలాగ్ చెప్పి అలరించారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:34 - September 3, 2017

యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయ విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాకతీయుల నైపుణ్యం ఉట్టిపడేలా శిల్పకళతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మరో ఏడు నెలల్లో ప్రధాన ఆలయాన్ని పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో అధికారులున్నారు. 

దక్షిణ భారతదేశంలోనే యాదగిరి గుట్టను సుందర ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేదుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు యాదగిరి గుట్ట దేవస్థానం అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్ఠి సారించింది. అందులో భాగంగానే 1975 జీవో 47 ప్రకారం యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసి, చట్టపరమైన హోదా కల్పించింది. స్వయంగా ముఖ్యమంత్రే ఈ అథారిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆలయ అభివృద్ధి కోసం అథారిటీ 1800 కోట్లతో ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు 300 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిది. ముఖ్యమంత్రి, చిన్నజీయర్‌ స్వామితో కలిసి ఆలయ నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. అగమశాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం చేసేలా పేరొందిన శిల్పులను రప్పించి దేవాలయ అధునాతన డిజైన్‌ను తయారు చేశారు. చారిత్రక, ధార్మిక, సాంస్కృతిక ఔన్నత్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. 

దేవాలయం ప్రాంతంలో అభివృద్ధి కోసం కొండపై ఉన్న సుమారు 14 ఎకరాల స్థలంలో ఆలయ విస్తరణ చేయనున్నారు. కొండపై రిటెయినింగ్‌ వాల్‌ ఇతర సివిల్‌ పనులు చేసేందుకు ఇప్పటికే మెన్సర్‌ సన్‌ షైన్‌ సంస్థతో అథారిటీ ఒప్పందం కుదుర్చుకుంది. దేవాలయం పునర్‌నిర్మాణంలో ఆగమ శాస్త్రం, వాస్తు శాస్త్రం, పంచరాత్రాగమ శాస్త్రాలతో గుడి డిజైన్లకు రూపకల్పన చేశారు. శిల్ప, కళా ఖండాల చట్టం విధివిధానాలకు అనుగుణంగా ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ మెన్సర్స్‌ ఈవెంట్‌ ప్రతినిధి అనంత సాయి ప్రత్యేక డిజైన్‌ను రూపొందించారు. రీడిజైనింగ్‌ పనులు ప్రారంభించిన తర్వాత స్వామి వారికి నిత్యం పూజలు నిర్వహించేందుకు బాల ఆలయాన్ని ఏర్పాటు చేశారు. 

ఆలయ నిర్మాణంలో గోపురాలకు సంబంధించి బృహత్‌ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. గుంటూరు చరిజెపల్లి క్యారీకి చెందిన నల్ల రాయితీతో అల్వారీ మండప నిర్మాణం పనులు చేస్తున్నారు. మరో రెండు నెలల్లో మండపానికి సంబంధించిన కళా ఖండాల రూపకల్పన పూర్తికానుంది. దేవాలయ ప్రాంగణంలో 7 రాజగోపురాలు, ఆల్వార్‌ మండపంతో పాటు దేవాలయ ప్రాంగణంలో నరసింహుడి చరిత్ర తెలిపేలా ప్రధాన ఘట్టాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 500 మంది కళాకారులను నియమించారు. 8 నెలల కాలంలో 24 పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. 

ప్రముఖ శిల్పి సుందర్ రాజన్‌ నేతృత్వంలో కళాకారులు...ఆల్వారీ మండపాల నిర్మాణం దాదాపుగా పూర్తి చేశారు. ఆరు నెలల్లో దేవాలయ ప్రధాన కళాఖండాల నిర్మాణం పూర్తికానుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ఇందుకోసం 800 ఎకరాలను సేకరించారు. మొదటి దశలో భాగంగా 250 ఎకరాల్లో టెంపుల్‌ అథారిటీ కాటేజీల నిర్మాణం పూర్తి చేసింది. మరో 250 ఎకరాల్లో 200 విఐపీ కాటేజీలు నిర్మించబోతోంది. టెంపుల్‌ సిటీలో కాటేజీల నిర్మాణం కోసం దేవస్థానం డోనర్‌ పథకాన్ని ఆహ్వానించింది. కాటేజీ నిర్మాణంలో భాగస్వాములైన వారిని అథారిటీ నియమ నిబంధనల ప్రకారం కాటేజీ నిర్మాణ, నిర్వాహణా బాధ్యతలను అప్పగించనుంది. 

యాదాద్రిలో మొత్తం తొమ్మిది కొండలు ఉన్నాయి. ఇందులో 3 కొండలను పూర్తిగా దేవాలయం పునర్నిర్మాణం కోసం వినియోగిస్తున్నారు. గర్భగుడి ఉన్న కొండను ఏమాత్రం కదల్చకుండా మిగిలిన రెండు గుట్టలపై అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. కళ్యాణ మండపం, బస్టాండ్‌, కార్‌ పార్కింగ్‌, సెంట్రల్‌ రిజర్వేషన్‌ ఆఫీస్‌ ఫైర్‌ స్టేషన్‌, స్వామి వారి ఉద్యానవనం, అర్చక అగ్రహారం నిర్మాణాలను 250 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. 

గిరి ప్రదక్షిణుడిగా పేరున్న లక్ష్మీ నరసింహా స్వామి వారి భక్తుల కోసం కొండ చుట్టూ 100 అడుగులతో సర్క్యులర్‌ రోడ్డును ఏర్పాటు చేయనున్నారు. టెంపుల్‌ సిటీలో నీటి ఎద్దడి లేకుండా మిషన్‌ భగీరథ పథకం కింద భారీ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు. సుమారు 5 లక్షల లీటర్ల నీటి ఉత్పత్తికి ప్రాజెక్టును రూపకల్పన చేశారు. నూతన హంగులతో నిర్మిస్తున్న దేవాలయం పునర్‌ నిర్మాణం కావాలంటే మరో 500 కోట్ల బడ్జెట్‌ అవసరమంటున్నారు ఆలయ అధికారులు. వచ్చే ఏడాది యాదాద్రి బ్రహ్మోత్సవాలనాటికి ఆలయ పనులు పూర్తికావస్తాయని దేవాలయ అథారిటీ నిర్వాహకులు చెబుతున్నారు. 

12:26 - September 3, 2017

హైదరాబాద్ : మల్కాజ్‌గిరి శ్రీరాంనగర్ కాలనీవాసులు గణేశ్ నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. వేడుకలో ఉట్టి కొట్టే కార్యక్రమం సందడిగా సాగింది. ఉట్టికొట్టేందుకు అందరూ పోటీపడ్డారు. పిల్లలు, పెద్దలు, మహిళలు నృత్యాలతో గణనాథుడిని గంగ ఒడికి చేర్చారు.

12:26 - September 3, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' జోరు మీదున్నాడు. వరుసగా విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ తనదైన స్టైల్ ను చూపిస్తున్నాడు. ఇటీవలే 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' సినిమా ద్వారా ముందుకొచ్చిన 'అల్లు అర్జున్' ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.

వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉండగానే 'బన్నీ' మరో సినిమాకు సైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాబీ - ఎన్టీఆర్ కాంబినేషనలో 'జై లవ కుశ' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఏకంగా ఎన్టీఆర్ మూడు పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా అనంతరం బాబీ..'అల్లు అర్జున్' కోసం ఓ కథని సిద్ధం చేసినట్టు సమాచారం. 'జై లవకుశ' పూర్తయిన వెంటనే ఆ కథని బన్నీకి వినిపించనున్నట్టు తెలుస్తోంది. ‘అల్లు అర్జున్’ - ‘బాబీ’ కాంబినేషన్ లో సినిమా వస్తుందన్న ప్రచారం నిజమా ? కాదా ? అనేది రానున్న రోజుల్లో తేలనుంది. 

12:24 - September 3, 2017

నెల్లూరు : జిల్లాలో ఏకే 47 మిస్‌ఫైర్‌ కలకలం రేపింది. ఏఎస్పీ గన్‌మెన్‌ దగ్గరి ఏకె 47 మిస్‌ఫైర్‌ అయ్యింది. ఈ ప్రమాదంలో ఏఎస్పీ కారు డ్రైవర్‌ రమేష్‌ ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మళ్లా రమేశ్‌ మృతి చెందాడు. ఏఎస్పీ రామకృష్ణ హాస్పిటల్‌కు చేరుకున్నారు. డ్రైవర్‌ రమేశ్ రెండు వేల తొమ్మిది బ్యాచ్‌ అని ఆయన చెప్పారు. రమేశ్‌ వయస్సు 32 ఏళ్లని.. తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి శేషమ్మ అని తెలిపారు. 

కూలిన మూడంతస్తుల భవనం..

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొన్ననే ముంబైలో ఓ భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. 

12:18 - September 3, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' సినిమా కోసం అభిమానులు ఎంతగానే వెయిట్ చేస్తున్నారు. ఆయన నటించిన 'కాటమరాయుడు' డిజాస్టర్ అనంతరం వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' కాంబినేషన్ లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. 'పవన్' సరసన 'కీర్తి సురేష్‌’, 'అను ఇమ్మానుయేల్‌' హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి కథతో రూపొందుతోంది ? పవన్ పాత్ర ఎలా ఉండబోతోంది ? తదితర విషయాలకు బయటకు పొక్కడం లేదు. సినిమాకు సంబంధించిన ఫొటోలు కూడా రావడం లేదు. తాజాగా 'పవన్’ బర్త్ డే సందర్భంగా చిత్ర బృందం ఓ టీజర్ ను విడుదల చేశారు.

ఇక్కడ పూర్తిగా 'పవన్' ను టైటిల్ ను మాత్రం చూపించలేదు. కొద్ది కణాల పాటు 'పవన్' ను నీడలా చూపించారు. సినిమాలోని ఓ పాటను అనిరుధ్‌ హమ్‌ చేస్తుండగా పక్కనే దర్శకుడు త్రివిక్రమ్‌ ఎంజాయ్ చేసున్న దృశ్యాలు ఈ వీడియోలో చూపించారు. 'బయటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఒ క్లాక్‌... 'అంటూ ఈ పాట ట్రెండీగా ఉందనిపిస్తుంది. చివరిలో 'పవన్‌' కుర్చీ తిప్పి.. నిశ్శబ్ధంగా నిల్చొని ఉన్న సన్నివేశాన్ని చూపించారు. ఇక టీజర్ లో సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు. జనవరి 10, 2018న సినిమా రిలీజ్ ఉంటుందని ప్రకటించింది. మరి టైటిల్ ఏంటో త్వరలోనే తెలియనుంది. ‘ఇంజినీర్ బాబు' పేరు ఖరారు చేస్తారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. 

12:13 - September 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న భూసర్వే వ్యవహారం గులాబీ నేతలకు సవాల్‌ విసురుతోంది. స్థానికంగా ఉండే భూవివాదాలను ఎలా పరిష్కరించాలని నేతలు తలలు పట్టుకుంటున్నారు. భూపంచాయతీలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయోన్న ఆందోళన నేతల్లో నెలకొంది.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఇంతకుముందు ఏ ప్రభుత్వం తీసుకోని విధంగా భూ రికార్డులను ప్రక్షాళన చేసేందుకు రెడీ అయ్యింది.  గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూములపై సమగ్రంగా సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మూడు నెలల్లో ఈ సర్వేతంతు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం  చేశారు. దీంతో అధికారయంత్రాంగమంతా భూసర్వే ఏర్పాట్లలో తలమునకలైపోయింది.

రైతులకు వచ్చే ఏడాది నుంచి ఎకరాకు నాలుగువేల రూపాయల సాయం అందించనున్నట్టు కేసీఆర్‌  ప్రకటించారు. సంవత్సరానికి రెండు పంటలకు  కలిపి ఒక్కోఎకరాకు 8వేల రూపాయల సాయం అందుతుంది. ఈ పథకంలో అనర్హులు బెడద ఉండరాదని... అర్హులకే ప్రభుత్వ సాయం అందాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే భూమి లెక్కలు పక్కాగా ఉండాలని...  ఇందుకోసం భూ సర్వే నిర్వహించాలన్న నిర్ణయం తీసుకుంది. 

అధికారులు గ్రామాల వారీగా తిరిగి భూముల వివరాలను నమోదు చేయనున్నారు. గ్రామాల్లో వివాద రహిత భూములకు ముందుగా క్లియరెన్స్‌ ఇస్తారు. అయితే వివాదాల్లో ఉన్న భూముల సంగతి ఎవరు తేలుస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.  ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూవివాదాల్లో పేదల  భూముల కంటే పెద్దల భూములే ఎక్కువగా ఉన్నాయన్నది బహిరంగ సత్యమే. రాజకీయంగా గ్రామాల్లో ప్రభావితం చేయగల వ్యక్తుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడం ఎంత వరకు సాధ్యమన్న అభిప్రాయం గులాబీనేతల్లో వ్యక్తమవుతోంది. వీటిని పరిష్కరించే దారేదంటూ తలలు పట్టుకుంటున్నారు.  భూ సర్వే అంశం అంతా ఆశామాషీ వ్యవహారం కాదని గులాబీనేతలు భావిస్తున్నారు. పులిమీద స్వారీ లాంటిదని చెబుతున్నారు. మరోవైపు భూసర్వేకు స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించాలన్న సీఎం ఆదేశాలు గులాబీ నేతలకు చెమటలు పట్టిస్తున్నాయి. మరి ఈ భూసర్వేను గులాబీ నేతలు ఎలా పూర్తి చేస్తారో వేచి చూడాలి.

చైనాకు మోడీ..

ఢిల్లీ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనా దేశానికి బయలుదేరారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్య దేశాలుగా ఉన్న బ్రిక్స్‌ సదస్సు లో ఆయన పాల్గొననున్నారు. సెప్టెంబర్‌ 3 నుంచి 5 వరకూ చైనాలోని గ్జియామెన్‌ నగరంలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. 

12:12 - September 3, 2017

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు హైదరాబాద్‌కు చెందిన బచ్‌పన్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ పీవీ రావుగా గుర్తించారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:09 - September 3, 2017

టాలీవుడ్ మన్మథుడు 'అక్కినేని నాగార్జున' నటిస్తున్న 'రాజు గారి గది-2’ సినిమాకు సంబంధించిన ఓ లుక్ ఆయన అభిమానులను ఆకర్షిస్తోంది. గతంలో 'శివ' చిత్రంలో నాగ్..ఛైన్ పట్టుకుంటే..ఈ సినిమాలో రుద్రాక్ష మాలను పట్టుకోవడం విశేషం. గతంలో 'రాజు గారి గది' సినిమా ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. 2015లో విడుదలైన ఈ సినిమాను ఓంకార్ దర్శకత్వ వహించారు. పీవీపీ సినిమా పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

ఇక ఈ చిత్రంలో 'సమంత' కూడా నటిస్తోంది. 'సీరత్‌ కపూర్‌' ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు 'సమంత' సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ సందర్భంగా సినిమాలో తాను ఎలా ఉండనున్నానో ఓ ఫోటో పోస్టు చేశారు. చిత్రంలోని తన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని, సినిమా చాలా సరదాగా ఉంటుందని...అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నట్లు ఈ ముద్దుగుమ్మ ట్వీట్‌ చేసింది. ఈనెల 20న సినిమా ట్రైలర్ విడుదల కానుంది. 

12:05 - September 3, 2017

ఢిల్లీ : మోదీ కొత్త టీమ్‌ ప్రమాణ స్వీకారం చేసింది. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో కొత్తగా 9 మందికి అవకాశం కల్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌... కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే నిర్మలాసీతారామన్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, ముక్తార్‌ అబ్బాస్‌నఖ్వీ, పీయూష్‌గోయల్‌కు పదోన్నతి కల్పించి... కేబినెట్‌ హోదా ఇచ్చారు. ఇక కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి ఇచ్చారు. తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న దత్తాత్రేయను పదవి నుంచి తప్పించారు. ఏపీ నుంచి కంభంపాటి హరిబాబుకు కేంద్రమంత్రి పదవి దక్కుతుందని చివరి వరకు ఊహాగానాలు సాగినా.... చివరకు మొండిచేయ్యే మిగిలింది. 

 

12:04 - September 3, 2017

మెగా కుటుంబంపై సామాజిక మాధ్యమాల్లో ఏదో ఒక వార్తలు వస్తూనే ఉంటాయి. ఆయా ఫంక్షన్..ఇతర కార్యక్రమాల్లో 'పవన్ కళ్యాణ్' పాల్గొనకపోతుండడంపై వారి మధ్య విబేధాలు ఉన్నాయని పుకార్లు షికారు చేస్తుంటాయి. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఎన్నోమార్లు చెబుతున్నా అలాంటి వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పేరిట పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. దీనితో చిరంజీవి, పవన్ మధ్య అంతగా సఖ్యత లేదని ప్రచారం జరిగింది.

కానీ తాజాగా ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్..చిరంజీవి ఉన్న ఆ ఫొటో అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోతో విబేధాలు..ఇతర ఎన్నో ప్రశ్నలకు చెక్ పెట్టినట్లైంది. ‘పవన్ కళ్యాణ్' జన్మదిన సందర్భంగా 'రామ్ చరణ్ తేజ' ఓ ఫొటోను షేర్ చేశారు. 'మీరు బాబాయి కావడం నా అదృష్టం అని చెప్పడం కూడా తక్కువే అవుతుంది. మీ అబ్బాయిగా నేను చాలా సంతోషంగా ఉన్నా.. అదృష్టం, ఆశీర్వాదం పొందిన భావనతో ఉన్నా. మీ నుంచి నిజాయతీగా, సింపుల్‌గా ఉండటం నేర్చుకున్నా. మనసులో ఉన్న భావనలనే మాట్లాడటం నేర్చుకున్నా. లక్షల మందిలో మీరొక వినయపూర్వకమైన వ్యక్తని నిజంగా నమ్ముతున్నా. 'పవర్‌' పవర్‌.. సింప్లిసిటీ, హ్యుమానిటీలో ఉంది' అని రామ్‌ చరణ్‌ రాశారు. దీంతో పాటు హ్యాపీ బర్త్‌డే పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. దీని తర్వాత మరో రెండు ఫొటోలు కూడా జత చేశారు.

12:01 - September 3, 2017

విజయవాడ : మరో ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా? ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా? నిర్దేశిత సమయంలోగా పోలవరం పూర్తి చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయా? సీఎం చంద్రబాబు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పోలవరం సమీక్ష ఎంతవరకు ఫలితానిస్తోంది? కేంద్రం పోలవరానికి నిధులు విడుదల చేస్తోందా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై 10టీవీ కథనం..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆది నుంచి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా పోలవరం విషయంలో మాత్రం నాన్చుడు ధోరణిమాత్రం మారడం లేదు. అదిగో... ఇదిగో.. పోలవరం అంటూ ప్రజలను, రైతులను ప్రభుత్వాలు మభ్యపెడుతూనే ఉన్నాయి.  రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ పోలవరం ప్రాజెక్టును 2018 చివరికి పూర్తి చేస్తామని ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించింది. ఇందుకోసం నిర్మాణ పనుల్లో వేగం పెంచుతున్నామంటూ ఊదరగొట్టింది. కానీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యింది.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రధానంగా నిధుల సమస్య వెంటాడుతోంది. ఏపీ ప్రభుత్వం ఇందుకోసం అరకొర నిధులు కేటాయిస్తుండడంతో పనులు అనుకున్ స్థాయిలో జరగడం లేదు. ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అమలు, నష్టపరిహారం చెల్లింపులు తదితరాలన్నీ కలిపి తాజాగా ఈ ప్రాజెక్ట్‌ అంచనాలు 40వేల కోట్లకుపైగా చేరాయి. ఈ అంచనాలతో వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేయాలంటే 30వేల కోట్లకుపైగా ఖర్చు భరించాల్సి ఉంటుంది. ఇన్నివేల కోట్ల రూపాయలు వ్యయం చేసి 2018 నాటికి ఈ ప్రాజెక్ట్‌ను ఏపీ ప్రభుత్వం పూర్తి చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

2014 ఏప్రిల్ నాటికి ఉన్న లెక్కల ఆధారంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి 58,319 కోట్ల వ్యయం అవుతుందని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి అంచనాలు సమర్పించింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ లో ప్రధాన పనులకు తిరిగి టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమయ్యారు. స్పిల్ వే కాంక్రీట్ పనుల్లో కొంతభాగం తప్ప దాదాపు కీలకమైన పనులన్నీ మినహాయించి ప్రధాన పనులకు కలిపి టెండర్లు పిలవనున్నారు. అయితే పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం 979 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మరో 3వేల కోట్లు రావాల్సి ఉంది.  ఈ నిధులు ఇచ్చేందుకు కేంద్ర జలవనరులశాఖ సిఫార్సు చేస్తోంది. అయితే కేంద్ర ఆర్థికశాఖ దగ్గర ఫైల్‌ ఉండిపోవడంతో నిధులు విడుదలకు జాప్యం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం పోలవరానికి అరకొర నిధులు విడుదల చేస్తూ కాలయాపన చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరాన్ని అడ్డుపెట్టుకుని రైతుల జీవితాలతో ఆటలాడుతున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. నిర్దేశిత సమయంలో పోలవరాన్ని పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. పోలవరాన్ని పూర్తి చేసేందుకు నిధులకోసం రాష్ట్ర ప్రభుత్వం  కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలని ప్రజలు కోరుతున్నారు. అనుకున్న సమయంలో పోలవరాన్ని పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

11:58 - September 3, 2017


మహబూబ్ నగర్ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అధికారపార్టీ.. ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.. ఈ పథకం ద్వారా డిండికి నీటి తరలింపుతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని  ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మా నీళ్లు మా నియమకాలు మాకే దక్కాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనబాట పట్టారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేతల మాటలకు కౌంటర్లు ఇస్తున్నారు.. 

వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది.. 2015 జూన్ 11న ముఖ్యమంత్రి కేసీఆర్ భూత్పూర్ మండలం కరివెన దగ్గర ఈ పథకం పైలాన్ ఆవిష్కరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు 7లక్షల ఎకరాలకు, నల్గొండ జిల్లాకు  మరో 30వేల ఎకరాలకు సాగునీరు అం దించేలా ఈ పథకాన్ని రూపుదిద్దారు. మూడేళ్లలో ఈ పథకాన్ని పూర్తిచేసి పాలమూరు కరువును  కేసీఆర్‌ ఆర్భాటంగా ప్రకటించారు. 

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆందోళనబాట పట్టాయి. గత కొన్ని నెలల నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ధర్నాలు, రాస్తోరోకోలతో ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతున్నాయి.  డిండికి నీటిని తరలింపును విపక్షనేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
బైట్ః డీకే అరుణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే

పాలమూరు జిల్లాకి సాగునీరు ఇవ్వకుండా డిండికి తీసుకుపోతే ఉద్యమం తప్పదని మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. ఇక్కడి ప్రాంతానికి రావాల్సిన నీటి వాట ఇచ్చిన  తర్వాత మిగిలిన ప్రాంతాల వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు  ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్దిలేదని...అందుకే మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని ఆరోపించారు.

ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను  అధికారపార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. పాలమూరు జిల్లాకి అన్యాయం జరిగేలా ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టాడంలేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే విపక్షాలు ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. పాలమూరు జిల్లాకు రావాల్సిన 70టీఎంసీల నీరు కచ్చితంగా వస్తుందని... మిగిలిన నీటినే డిండీకి ఇస్తున్నామని ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. 

మొత్తానికి పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం ర‌గ‌డ ఇంక ర‌గులుతూనే ఉంది .పాల‌మూరుకి అన్యాయం జ‌రుగుతుంద‌ని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తోంటే.... జిల్లాకు రావాల్సిన నీటి వాట‌ను ఖ‌చ్చితంగా తీసుకువ‌స్తామ‌ని  అధికారపార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మ‌రి పాల‌మూరు రైతన్నకు ఈ ప్రాజెక్టు నుండి నీరు ఎప్పటికి అందుతుందో వేచి చూడాలి.

ఉత్తరకొరియా అణపరీక్ష..

ఢిల్లీ : ఉత్తర కొరియా మరోసారి అణుపరీక్ష నిర్వహించింది. అనుపరీక్ష నిర్వహించడం ఇది ఆరోసారి. పరీక్ష జరిపిన వెంటనే జపాన్ తీరంలో భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. మరోసారి అణుపరీక్ష నిర్వహించినట్లు జపాన్, దక్షిణ కొరియా దేశాలు నిర్ధారించాయి. 

11:53 - September 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ కవి, గాయకుడు ఏపూరి సోమన్న పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే వీరేశం భార్య పుష్ప సెటిల్‌మెంట్‌ చేసేందుకు యత్నించడమే కాకుండా... బెదిరింపులకు పాల్పడడంపై విపక్షాలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. ఈ వ్యవహారంలో 10టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో  పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.  జిల్లా ఎస్పీ తిరుమలగిరి పీఎస్‌ను సందర్శించి వివరాలు ఆరా తీశారు. 

అధికారపక్ష నేతల వ్యవహారం రోజురోజుకు శృతిమించుతోంది. ప్రభుత్వంపై గొంతెత్తి మాట్లాడే నేతలపై ఇప్పటివరకు పోలీసు కేసులు మాత్రమే పెట్టించే నేతలు.. ఇప్పుడు ఏకంగా పీఎస్‌లోనే పంచాయతీలు పెట్టించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తెలంగాణ కవి ఏపూరు సోమన్న కుటుంబ వివాదాన్ని సాకుగా చూపి.. తిరుమలగిరి పీఎస్‌లో గొలుసులతో బంధించారు. మరోవైపు రంగంలోకి దిగిన నకిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశం భార్య పుష్ప.. పీఎస్‌కు వచ్చిన సోమన్నను నోటికొచ్చినట్లు దుర్బాషలాడారు. ఈ విజువల్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండడంతో పుష్ప వ్యవహారం బయటపడింది. 

ఇక తిరుమలగిరి పీఎస్‌లో పుష్పపై.. సోమన్న ఫిర్యాదు చేశాడు. విచారణ నిమిత్తం పీఎస్‌కు పిలిపించి తనను దుర్భాషలాడారని ఫిర్యాదు చేశాడు. పుష్పపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశాడు. కుటుంబ వివాదాన్ని అడ్డుపెట్టుకొని తనపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని... తనను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ఇక సోమన్నను గొలుసులతో బంధించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమన్న పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును కాంగ్రెస్‌, టీడీపీ, వామపక్షాలు ఖండించాయి. తీవ్రవాదులను, బందిపోట్లను బంధించినట్లు సోమన్నను బంధించడం దారుణమని నేతలు ఆరోపించారు. ఇప్పటివరకు బయట మాత్రమే పంచాయతీలు నిర్వహించిన నేతలు... ఇప్పుడు పోలీస్‌స్టేషన్లలో కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు రాజ్యం నడిపిస్తున్న కేసీఆర్‌ సర్కార్‌కు ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారన్నారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. అదేవిధంగా పుష్ప, పోలీసులు వ్యవహరించిన తీరును రేవంత్‌రెడ్డి ఖండించారు. సోమన్నపై అనుచితంగా ప్రవర్తించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

ఇదిలావుంటే... 10టీవీలో సోమన్న వ్యవహారంపై వరుస కథనాలు ప్రసారం కావడంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. హుటాహుటిన తిరుమలగిరి పీఎస్‌కు చేరుకున్న ఎస్పీ... నిజానిజాలు తెలుసుకున్నారు. 

ఇక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పోలీసుల వ్యవహారాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కేవలం ఎస్‌ఐపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకునేందుకు పెద్దలు ప్లాన్‌ చేస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంలో పుష్పపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేసేందుకు ప్రజాసంఘాల నేతలు సిద్దమవుతున్నారు. ఏదిఏమైనా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ వ్యవహారంలో మరి పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి !

11:40 - September 3, 2017

ఢిల్లీ : కేంద్ర మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, శివ్ ప్రతాప్ శుక్లా, అశ్వినీ కుమార్ చౌబే, డా.వీరేంద్ర కుమార్, ఆనంద్ కుమార్ హెగ్డే, రాజ్ కుమార్ సింగ్, హర్దీప్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, డా.సత్యపాల్ సింగ్, అల్ఫోన్స్ కన్నన్ థానం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం స్వీకారం చేయించారు. కొత్తగా 9 మందికి కేబినెట్ లో చోటు దక్కింది. 
అల్ఫోన్స్ కన్నన్ థానం..
కేంద్ర మంత్రిగా అల్ఫోన్స్ కన్నన్ థానం ప్రమాణం చేశారు. సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1994లో జన్ శక్తి ఎన్జీవో ఏర్పాటు చేశారు. కేరళలోని కంజీరపల్లి నుండి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.
డా. సత్యపాల్ సింగ్ ప్రమాణం..
కేంద్ర మంత్రిగా సత్యపాల్ సింగ్ ప్రమాణం చేశారు. యూపీలోని బాగపత్ నుండి ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాలో ఎంబీఏ పూర్తి చేశారు. నక్సల్స్ ఉద్యమంపై పీహెచ్ డీ చేశారు.
గజేంద్ర సింగ్ షెకావత్..
కేంద్ర మంత్రితగా గజేంద్ర సింగ్ షెకావత్ ప్రమాణం చేశారు. సామాజిక మాధ్యమాల్లో యువతకు చేరువయ్యారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోక్ సభ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాస్కెట్ బాల్ క్రీడాకారుడు. 
హర్దీప్ సింగ్ పూరీ ప్రమాణం..
కేంద్ర మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరించారు. కేంద్ర మంత్రిగా హర్దీప్ సింగ్ పూరీ ప్రమాణం చేశారు. దౌత్యవేత్తగా నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. విద్యార్థి సంఘం నేతగా పనిచేశారు. 
రాజ్ కుమార్ సింగ్..
కేంద్ర మంత్రిగా రాజ్ కుమార్ సింగ్ ప్రమాణం స్వీకారం చేశారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా సేవలందించారు. బీహార్ ఆరా లోక్ సభ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆనంద్ కుమార్ హెగ్డే
కేంద్ర మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరించారు. కేంద్ర మంత్రిగా ఆనంద కుమార్ హెగ్డే ప్రమాణం చేశారు. ఉత్తర కన్నడ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్ సభకు వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు. 
డా.వీరేంద్ర కుమార్ 
కేంద్ర కేబినెట్ మంత్రిగా డా.వీరేంద్ర కుమార్ ప్రమాణం స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తికమ్ గడ్ ఎస్సీ లోక్ సభ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్ సభకు ఆరుసార్లు ఎంపికయ్యారు. 
అశ్వినీ కుమార్ చౌబే..
కేంద్ర మంత్రిగా అశ్వినీ కుమార్ చౌబే ప్రమాణం చేశారు. బీహార్ లోని బక్సర్ లోక్ సభ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు
శివ్ ప్రతాప్ శుక్లా 
కేంద్ర కేబినెట్ మంత్రిగా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణం స్వీకారం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. న్యాయవాదిగా పనిచేశారు. ఉత్తర్ ప్రదేశ్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 

11:30 - September 3, 2017

నెల్లూరు : ఇస్రో ప్రయోగించిన 8వ నేవిగేషన్‌ శాటిలైట్ ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ 1హెచ్ విఫలం కావడానికి అధిక బరువే కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. లాంచ్‌ వెహికల్‌ మోతాదుకు మించి ఒక టన్ను బరువు అధికంగా మోయడం వల్లే ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ 1హెచ్ ఉపగ్రహం విఫలమైందని భావిస్తున్నారు. గురువారం శ్రీహరికోట నుంచి  పీఎస్ ఎల్ వీ-సీ 39 ప్రయోగించిన కొద్దిసేపటికే విఫలమైంది.ఉష్ణకవచం నుంచి ఉపగ్రహం వేరుకాకపోవడంతో ప్రయోగం విఫలమైంది. బరువు అధికంగా ఉండడం వల్ల ఎత్తుకు ఎగరలేక పోవడమే కాకుండా.. ప్రతి సెకనుకు ఓ కిలోమీటర్‌  వేగం తగ్గడం కూడా  కారణమని ఇస్రో మాజీ డైరెక్టర్ ఎస్‌కె శివకుమార్‌ చెబుతున్నారు. పీఎస్ ఎల్ వీ సీ39 ప్రయోగం తొలి మూడు దశలు విజయవంతమైనా, చివరి దశలో రాకెట్‌ నుంచి ఉపగ్రహం వేరుకాకపోవడంతో ప్రయోగం ఫెయిలైంది. హీట్‌ షీల్డు తెరుచుకోపోవడంతో ఉపగ్రహాన్ని నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టలేకపోయినట్లు ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్‌ సొంత దిక్సూటీ నావిక్ సేవలు మరింత మెరగయ్యేవని ఇస్రోవర్గాలు అంటున్నాయి. 

కేంద్ర సహాయ మంత్రులు వీరే..

ఢిల్లీ : కేంద్ర సహాయ మంత్రులుగా శివప్రతాప్ శుక్లా, అశ్వినీ కుమార్ చౌబే, వీరేంద్ర కుమార్, అనంతకుమార్ హెగ్డే, రాజ్ కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పూరి, గజేంద్ర షేకావత్, సత్యపాల్ సింగ్, అల్ఫోన్స్ కన్నన్ థానమ్ లు ప్రమాణం చేశారు. 

11:26 - September 3, 2017

యూపీ : ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ దాస్‌ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 30 మంది చిన్నారుల ప్రాణాలు తీసిన ఉదంతంలో పోలీసులు ఓ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ను స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. సిలిండర్ల కొరతకు ప్రధాన కారణం కఫీలేనన్న ఆరోపణలు ఉన్నాయి. మెదడువాపు వ్యాధి విభాగానికి చీఫ్‌గా ఉన్న కఫీల్‌ ఖాన్‌, డెంటిస్ట్‌గా ఉన్న తన  భార్యతో కలిసి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. తన ఆస్పత్రి కోసం బీఆర్డీ ఆస్పత్రి నుంచే సిలిండర్లను తరలించాడని... దీంతో సిలిండర్ల కొరత ఏర్పడి పిల్లల మరణాలు సంభవించాయని ఆరోపణలున్నాయి. బిఆర్‌డి కాలేజీ ప్రిన్సిపాల్‌  డాక్టర్‌ ఆర్కే మిశ్రా కూడా కఫీల్‌ ఖాన్‌కు సహకరించినట్టు విచారణలో వెల్లడయింది. 

 

11:22 - September 3, 2017

హైదరాబాద్ : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు మరో అడ్డంకి ఎదురయింది. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదని సింగరేణి మాతృ సంస్థ కోలిండియా ప్రకటించింది. ఉద్యోగాలకు బదులు డబ్బులు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో పాటు మెడికల్ బోర్డు ద్వారా అన్ ఫిట్ అయిన కార్మికుల వారసుడికి కూడా ఇకేపై ఉద్యోగం ఇవ్వటం కుదరదని.. వారు కూడా డబ్బులు తీసుకొని వెళ్ళాలని సూచించింది. కోల్ ఇండియా నిర్ణయంపై.. కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యాజమాన్యం తీరుపై.. ఈ నెల 18, 19 తేదీల్లో కలకత్తాలో జరగనున్న సమావేశాల్లో నిర్ణయం చెప్పాలని నిర్ణయించాయి. 

11:20 - September 3, 2017

2019 సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేస్తున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇది ఒక ఎలక్షన్ కేబినెట్ గా చెప్పవచ్చని అభిర్ణించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలోరాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నేత కార్తీక్ రెడ్డి, బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:16 - September 3, 2017

నెలలో మరోసారి కేంద్ర మండలి పునర్ వ్యవస్థీకరణ ?

ఢిల్లీ : కేంద్ర మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ జరుగనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నేతలకు అప్పుడు ప్రాధాన్యత కల్పిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు చెందిన నేతలకు మాత్రమే ప్రాధాన్యత కల్పించారు. 

11:10 - September 3, 2017

గుంటూరు : జిల్లాలో అగ్రవర్ణాల దాష్టీకం వెలుగు చూసింది. అమరావతి సమీపంలోని బయ్యారం గ్రామంలో  దళితులపై దాడి చేశారు. గణేష్‌ నిమజ్జనం చేసి తిరిగి వస్తున్న దళితులపై అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది దాడికి పాల్పడ్డారు. గ్రామంలో  గణేష్‌ విగ్రహంతో పాటు దళితులు  అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టారు. నిమజ్జనోత్సవంలో అంబేద్కర్ పాటలు పెట్టారని అగ్ర కులస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... దళితులను చితకబాదారు. ఈ దాడిలో 25మందికి గాయాలయ్యాయి. వీరందరని అమరావతి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గాయపడిన దళితులను సీపీఎం నాయకుడు పాశం రామారావు పరామర్శించారు.  దళితులపై దాడి  చేసిన వారిని కఠినంగా శిక్షించాలని,  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని  ఆయన డిమాండ్‌చేశారు.  

 

కొత్తగా 9మందికి కేంద్ర మంత్రి పదవులు..

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది. కొత్త కేబినెట్ లో తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపారు. కేంద్రం పిలుపుతో నిన్ననే కంభంపాటి హరిబాబు ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. బండారు దత్తాత్రేయ రాజీనామాతో తెలంగాణకు ప్రాధాన్యత దక్కలేదు. 

11:04 - September 3, 2017

అనంతపురం : జిల్లాలోని.. రాయదుర్గం పట్టణంలో... ఓ విద్యార్థిని కొట్టాడనే కోపంతో..  తల్లిదండ్రులు ఓ టీచర్‌కు దేహశుద్ధి చేశారు. రాయదుర్గం పట్టణంలోని సెయింట్‌ థామస్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న లోకేశ్‌సాయిని.. టీచర్ వెంకటస్వామి చితకబాదాడు. గాయాలపాలైన లోకేశ్‌ను చూసిన తల్లిదండ్రులు... పాఠశాలకు వెళ్లి... టీచర్‌ను నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో చితకబాదారు. 

 

ముగిసిన ప్రమాణ స్వీకారోత్సవం..

ఢిల్లీ : కేంద్ర మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరించారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం స్వీకారం చేయించారు. 

కేంద్ర మంత్రిగా అల్ఫోన్స్ కన్నన్ థానం..

ఢిల్లీ : కేంద్ర మంత్రిగా అల్ఫోన్స్ కన్నన్ థానం ప్రమాణం చేశారు. సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1994లో జన్ శక్తి ఎన్జీవో ఏర్పాటు చేశారు. కేరళలోని కంజీరపల్లి నుండి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.

11:01 - September 3, 2017

నెల్లూరు : ఏకే 47 మిస్‌ఫైర్‌ కలకలం రేపింది. ఏఎస్పీ గన్‌మెన్‌ దగ్గరి ఏకె 47 మిస్‌ఫైర్‌ అయ్యింది. ఈ ప్రమాదంలో ఏఎస్పీ కారు డ్రైవర్‌ రమేష్‌ ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించిన కొద్ది సేపటికే ఆయన మృతి చెందారు. జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

 

 

డా. సత్యపాల్ సింగ్ ప్రమాణం..

ఢిల్లీ : కేంద్ర మంత్రిగా సత్యపాల్ సింగ్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనచే ప్రమాణం చేయించారు. యూపీలోని బాగపత్ నుండి ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాలో ఎంబీఏ పూర్తి చేశారు. నక్సల్స్ ఉద్యమంపై పీహెచ్ డీ చేశారు.

 

కేంద్ర మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్..

ఢిల్లీ : కేంద్ర మంత్రితగా గజేంద్ర సింగ్ షెకావత్ ప్రమాణం చేశారు. సామాజిక మాధ్యమాల్లో యువతకు చేరువయ్యారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోక్ సభ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాస్కెట్ బాల్ క్రీడాకారుడు. 

 

హర్దీప్ సింగ్ పూరీ ప్రమాణం..

ఢిల్లీ : కేంద్ర మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరించారు. రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం జరుగుతోంది. కేంద్ర మంత్రిగా హర్దీప్ సింగ్ పూరీ ప్రమాణం చేశారు. దౌత్యవేత్తగా నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. విద్యార్థి సంఘం నేతగా పనిచేశారు. 

10:55 - September 3, 2017

సంగారెడ్డి : జిల్లాలో రూ. 100 కోట్ల విలువైన భారీ కుంభకోణం వెలుగుచూసింది. కోట్ల రూపాయల విలువైన కొల్లూరు చెరువును అప్పనంగా నొక్కేసేందుకు హైదరాబాద్‌కు చెందిన కొందరు భూబకాసురులు రంగంలోకి దిగారు. కొల్లూరు గ్రామంలో కొన్ని భూములను కొనుగోలు చేసిన... ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి చెందిన యజమానులు సురేందర్‌రావు, దేవేందర్‌రావు రోడ్డు నిర్మాణం పేరుతో... చెరువును కబ్జా చేసేందుకు యత్నించారు. గతంలో గ్రామస్తులు ఎన్నిసార్లు అడ్డుకున్నా మళ్లీ అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు విచారణ కొనసాగుతుండగానే.. మరోసారి కబ్జాకు యత్నించారు. ఈ నేపథ్యంలో తహశీల్దారు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

కేంద్ర మంత్రిగా రాజ్ కుమార్ సింగ్..

ఢిల్లీ : కేంద్ర మంత్రిగా రాజ్ కుమార్ సింగ్ ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనచే ప్రమాణం చేయించారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా సేవలందించారు. బీహార్ ఆరా లోక్ సభ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కేంద్ర మంత్రిగా ఆనంద్ కుమార్ హెగ్డే

ఢిల్లీ : కేంద్ర మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరించారు. కాసేపటి క్రితం రాష్ట్రపతి భవన్ లో ప్రమాణం స్వీకారం జరుగుతోంది. కేంద్ర మంత్రిగా ఆనంద కుమార్ హెగ్డే ప్రమాణం చేశారు. ఉత్తర కన్నడ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్ సభకు వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు. 

డా.వీరేంద్ర కుమార్ ప్రమాణం..

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ మంత్రిగా డా.వీరేంద్ర కుమార్ ప్రమాణం స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తికమ్ గడ్ ఎస్సీ లోక్ సభ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్ సభకు ఆరుసార్లు ఎంపికయ్యారు. 

 

కేంద్ర మంత్రిగా అశ్వినీ కుమార్ చౌబే..

ఢిల్లీ : కేంద్ర మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరించారు. కాసేపటి క్రితం రాష్ట్రపతి భవన్ లో ప్రమాణం స్వీకారం జరుగుతోంది. కేంద్ర మంత్రిగా అశ్వినీ కుమార్ చౌబే ప్రమాణం చేశారు. బీహార్ లోని బక్సర్ లోక్ సభ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు

శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణం..

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ మంత్రిగా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణం స్వీకారం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. న్యాయవాదిగా పనిచేశారు. ఉత్తర్ ప్రదేశ్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 

10:46 - September 3, 2017

హైదరాబాద్ : మోదీ కేబినెట్‌ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపారా? లేక రెండో జాబితాలో చోటు లభిస్తుందా? అసలు రెండో జాబితా విడుదల చేస్తారా? తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి జాబితాలో ఎందుకు చోటు కల్పించలేదు. లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ...

కేంద్ర మంత్రివర్గ పునర్య్వస్థీకరణలో తెలుగు రాష్ట్రాల నుంచి చోటు ఎవరికి లభిస్తుందన్న దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇంత వరకు ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు. 9మందితో మొదటి జాబితా విడుదలైంది. అయితే అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి పేర్లు లేవు. దీంతో అధిష్టానంపై తెలుగు రాష్ట్రాల కాషాయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మోదీ అధికారం చేపట్టాక తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి తన కేబినెట్‌లో చోటు కల్పించారు. ఏపీ నుంచి వెంకయ్యనాయుడు, తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయకు మంత్రిపదవులు దక్కాయి. అయితే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కావడంతో ఆయన చోటు ఖాళీ అయ్యింది. ఇక మంత్రివర్గ పునర్య్వస్థీకరణలో భాగంగా బండారు దత్తాత్రేయను మోదీ రాజీనామా కోరడంతో రిజైన్‌ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరికి మోదీ కేబినెట్‌లో చోటు దక్కుతుందని జోరుగా ప్రచారం సాగింది. ఏపీ నుంచి కంభంపాటి హరిబాబు కేంద్రమంత్రి అవుతారని అంతా ఊహించారు. శనివారం సాయంత్రం ఆయనను ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి పిలుపురావడంతో మంత్రి పదవి దాదాపు ఖరారు అయ్యిందనుకున్నారు. అయితే మొదటి జాబితాలో ఆయన పేరుమాత్రం లేదు. ఇక తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ స్థానంలో మురళీధర్‌రావు, రాంమాధవ్‌, వెదిరే శ్రీరాంలో ఎవరో ఒకరికి చోటు దక్కుతుందన్న ప్రచారం సాగింది. అయితే మొదటి జాబితాలో వీరిలో కూడా ఎవరిపేరు లేదు. 

కేంద్రం గరిష్టంగా 81మంది మంత్రులను నియమించుకోవచ్చు. ప్రస్తుతం ప్రధానితో సహా కేంద్రమంత్రులు సంఖ్య 73. ఆరుగురు మంత్రులు రాజీనామా చేయడంతో ఈ సంఖ్య 67కు చేరింది. ఇవాళ 9మంది ప్రమాణస్వీకారం చేస్తే కేంద్ర కేబినెట్‌ సంఖ్య 76కు చేరుతుంది. అంటే కేంద్రం మరో ఐదుగురిని నియమించుకునే అవకాశం ఉంది.  మోదీ మరో ఐదుగురికి చోటు కల్పిస్తే అందులో తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం దక్కుతుందన్న ఆశలు రేకెత్తుతున్నాయి. మరి మోదీ మరో జాబితా విడుదల చేస్తారా. ఒకవేళ రెండో జాబితా విడుదల చేసినా అందులో తెలుగువారికి కచ్చితంగా చోటు దక్కుతుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మరి ఏం జరుగుతుందనేది పదిన్నరలోపు  తేలనుంది. 
 

ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి పదోన్నతి..

ఢిల్లీ : కేంద్ర మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరించారు. కాసేపటి క్రితం రాష్ట్రపతి భవన్ లో ప్రమాణం స్వీకారం జరుగుతోంది. కేంద్ర మంత్రిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రమాణం చేశారు. కేబినెట్ మంత్రిగా పదోన్నతి కల్పించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

నిర్మలా సీతారామన్ ప్రమాణం..

ఢిల్లీ : కేంద్ర మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరించారు. కాసేపటి క్రితం రాష్ట్రపతి భవన్ లో ప్రమాణం స్వీకారం జరుగుతోంది. కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనచే ప్రమాణం చేయించారు. ప్రస్తుతం వాణిజ్య, పరిశ్రమల శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

పీయూష్ గోయల్ ప్రమాణం..

ఢిల్లీ : పీయూష్ గోయల్ ప్రమాణం చేశారు. మోడీ కేబినెట్ లో పీయూష్ గోయల్ కు స్థానం దక్కింది. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనచే ప్రమాణం చేయించారు. 

10:40 - September 3, 2017

హైదరాబాద్  : మరికాసేపట్లో కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. కేబినెట్‌ విస్తరణలో కొత్తగా 9 మందికి అవకాశం కల్పించనున్నారు. వీరిలో మధ్యప్రదేశ్‌ తికమ్‌గడ్‌ ఎంపీ వీరేంద్రకుమార్‌,... ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శివప్రతాప్‌ శుక్లాకు అవకాశం కల్పించనున్నారు. అదేవిధంగా... ఉత్తర కర్నాటక నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతకుమార్‌ హెగ్డేకు అవకాశమివ్వనున్నారు. ఇక ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి.. సత్యపాల్‌సింగ్‌కు కూడా కేబినెట్‌లో అవకాశం దక్కనుంది. ఇక అశ్వినీకుమార్‌చౌబే, గజేంద్రసింగ్‌ షెకావత్‌, హర్దీప్‌సింగ్‌పూరీ, రాజ్‌కుమార్‌సింగ్‌, అల్ఫోన్స్‌ కన్నన్‌తనంలకు కూడా కేబినెట్‌లో అవకాశం దక్కనుంది. అయితే ఈ కెబినెట్‌ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి ఎదురైంది. కంభంపాటి హరిబాబు, వెదిరే శ్రీరామ్‌లకు అవకాశం ఇస్తారని వార్తలు వచ్చినా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కొత్త కేబినెట్‌లో జేడీయూ, శివసేనలకు కూడా అవకాశం దక్కలేదు. కేవలం పలు రాష్ట్రాల ఎన్నికలు, 2019 ఎన్నికలే లక్ష్యంగా కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

 

10:38 - September 3, 2017

ఢిల్లీ : ఉదయం పదిన్నర గంటలకు కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. కేబినెట్‌ విస్తరణలో కొత్తగా 9 మందికి అవకాశం కల్పించనున్నారు. వీరిలో మధ్యప్రదేశ్‌ తికమ్‌గడ్‌ ఎంపీ వీరేంద్రకుమార్‌,... ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శివప్రతాప్‌ శుక్లాకు అవకాశం కల్పించనున్నారు. అదేవిధంగా... ఉత్తర కర్నాటక నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతకుమార్‌ హెగ్డేకు అవకాశమివ్వనున్నారు. ఇక ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి.. సత్యపాల్‌సింగ్‌కు కూడా కేబినెట్‌లో అవకాశం దక్కనుంది. ఇక అశ్వినీకుమార్‌చౌబే, గజేంద్రసింగ్‌ షెకావత్‌, హర్దీప్‌సింగ్‌పూరీ, రాజ్‌కుమార్‌సింగ్‌, అల్ఫోన్స్‌ కన్నన్‌తనంలకు కూడా కేబినెట్‌లో అవకాశం దక్కనుంది. అయితే ఈ కెబినెట్‌ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి ఎదురైంది. కంభంపాటి హరిబాబు, వెదిరే శ్రీరామ్‌లకు అవకాశం ఇస్తారని వార్తలు వచ్చినా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కొత్త కేబినెట్‌లో జేడీయూ, శివసేనలకు కూడా అవకాశం దక్కలేదు. కేవలం పలు రాష్ట్రాల ఎన్నికలు, 2019 ఎన్నికలే లక్ష్యంగా కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

 

నేడు చైనాకు మోడీ..

ఢిల్లీ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనా దేశానికి వెళ్లనున్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్య దేశాలుగా ఉన్న బ్రిక్స్‌ సదస్సు లో ఆయన పాల్గొననున్నారు. సెప్టెంబర్‌ 3 నుంచి 5 వరకూ చైనాలోని గ్జియామెన్‌ నగరంలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. 

తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి ?

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. తాజా విస్తరణలో మొత్తం 9 మందికి అవకాశం కల్పించనున్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనూహ్య పరిణామాలు జరిగితే తప్పా తెలుగు రాష్ట్రాల నుండి ఒక్కరికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. 

కొత్త మంత్రులు వీరే !..

ఢిల్లీ : మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగనుంది. పునర్య్వవస్థీకరణలో తొమ్మిదిమంది కొత్త వారికి చోటు లభించింది. వీరితో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయించనున్నారు. అనంత్‌కుమార్‌ హెగ్డే, శివ ప్రతాప్‌ శుక్లా, సత్యపాల్ సింగ్, అశ్వినీ కుమార్ చౌబే, రాజ్ కుమార్ సింగ్, వీరేంద్ర కుమార్, హర్ దీప్ సింగ్ పూరి, గజేంద్ర సింగ్ షెకావత్, అల్ఫోన్స్ కణ్ణాంథనంలు ప్రమాణం చేయనున్నారు. 

కాసేపట్లో ప్రమాణ స్వీకారం..

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కాసేపట్లో జరగనుంది. మోడీ కేబినెట్ లోకి కొత్తగా 9 మంది మంత్రులను తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. మరోవైపు మంత్రుల శాఖల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. 

09:56 - September 3, 2017

హైదరాబాద్ : రిజర్వేషన్లు లేని సమాజమే అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అన్నారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన కాపుల రిజర్వేషన్ల అంశాన్ని త్వరగా తేల్చాలని పవన్ కోరారు. తన బలం తెలిసిన తరువాతే వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లకు పోటీ చేస్తామనేది నిర్ణయిస్తామని జనసేనాని స్పష్టం చేశారు. 

సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువయ్యే యోచనలో ఉన్నారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. శతఘ్ని పేరుతో డిజిటల్ టీంను సిద్ధం చేశారు. ప్రజల కోసం మమేకమై పనిచేయాల్సిందిగా టీంకోరిన పవన్ పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. రిజర్వేషన్లు లేని సమాజమే అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అని పవన్‌ కళ్యాణ్ అన్నారు. అంబేడ్కర్‌ చెప్పినట్లు కొంతకాలం ఇచ్చి ఆపేయాలన్నారు పవన్. 
కాపు రిజర్వేషన్ల అంశంపై పవన్ మరోసారి స్పందించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని టీడీపీ చెప్పిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమైతే ఇవ్వాలని.. లేదంటే సాధ్యం కాదని చెప్పాలని పవన్ అన్నారు. సమస్యను నాన్చడం వల్ల అశాంతి తలెత్తే అవకాశం ఉందని జనసేనాని హెచ్చరించారు. 

ముద్రగడ పాదయాత్ర అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి, పోలీసులకు లేదన్నారు. ఆయన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలన్నారు. కాపుల రిజర్వేషన్ ప్రత్యేక హోదాలాంటిదన్నారు పవన్. 

విద్యావ్యవస్థపై కూడా చర్చించిన పవన్.. నర్సరీ నుంచి 12 వరకు ఉచిత విద్య అందించాలన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు వేల కోట్లు దోచేస్తున్నాయన్నారు. 

తెలంగాణ కోసం ఆ ప్రాంత నేతలు గట్టిగా పోరాటం చేశారని.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ నేతలు వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చారని పవన్ విమర్శించారు. మనం పోరాటం చేయకుండా కేంద్రాన్ని ప్రత్యేక హోదా ఎలా అడుగుతామని పవన్ ప్రశ్నించారు. 

జనసేన భావాల్ని, భావజాలాల్ని డిజిటల్ విభాగం శతఘ్ని సమాజం ముందుకు తీసుకెళ్లాలని కోరారు పవన్.. అందుకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. జనం సమస్యలపై పోరాటమే పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు జనసేనాని. 

09:49 - September 3, 2017

విశాఖ : రోజాపై విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు. రోజా ఐరన్ లెగ్‌ అంటూ వ్యాఖ్యానించారు. రోజా వల్లే టీడీపీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టిందన్నారు.  ఆమె వెళ్లపోయాక అంతా  తమ పార్టీకి విజయమే నని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. 

 

09:45 - September 3, 2017

కడప : తమ పార్టీ  ప్రకటించిన నవరత్నాలపై ప్రచారం చేసేందుకు... వైఎస్సార్ కుటుంబం పేరుతో కార్యక్రమాన్ని  ప్రారంభిస్తున్నట్టు వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా... ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ... నివాళులు అర్పించారు.   నవరత్నాలతోనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందన్నారు. ఈ నెల 11 నుంచి అక్టోబర్‌ 2 వరకూ వైస్సార్‌ కుటుంబం కార్యక్రమం కొనసాగుతుందని ఆయన చెప్పారు.

 

09:41 - September 3, 2017

హైదరాబాద్ : టీ కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కోవర్ట్‌లు ఉన్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్న టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోనేందుకు.. మా వ్యూహాలు మాకున్నాయని భట్టి విక్రమార్క అన్నారు. కొందరు టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

 

09:38 - September 3, 2017

హైదరాబాద్ : నగరంలో రక్షణ శాఖ భూములను తెలంగాణ సర్కార్‌కు అప్పగించడానికి కేంద్రం అంగీకరించినట్లు రక్షణమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రజోపయోగ నిర్మాణాలపై విధించే జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్‌ను కేంద్రం పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. 
అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటి అయ్యారు. సికింద్రాబాద్‌లోని రక్షణ శాఖ భూముల బదలాయింపు, కంటోన్మెంట్ ఏరియాలో అభివృద్ధి పనులకు కావాల్సిన స్థలాలను.. తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించాలని జైట్లీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన కొత్త సెక్రటేరియెట్‌ కోసం బైసన్‌ పోలో గ్రౌండ్స్‌ను, మేడ్చల్‌ రహదారిని, కరీంనగర్‌ రహదారిని విస్తరించడానికి కావల్సిన స్థలాలను అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా వుందని జైట్లీ  సీఎం కేసీఆర్‌కి తెలిపారు. 
ప్రజోపయోగ నిర్మాణాలపై జీఎస్టీ తగ్గించాలని కోరిన టీ సర్కార్
ప్రజోపయోగ నిర్మాణాలపై జీఎస్టీని తగ్గించాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను కూడా పరిశీలించి తగు నిర్ణయాన్ని తీసుకుంటామని జైట్లీ చెప్పారు. మిషన్‌ భగీరథ, నీటి పారుదల, గృహనిర్మాణం, రహదారులు తదితర నిర్మాణాలపై జీఎస్టీని తగ్గించాలన్న అంశంపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని అరుణ్‌జైట్లీ తెలిపారు. 
అరుణ్‌ జైట్లీకి కేసీఆర్‌ కృతజ్ఞతలు 
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినందుకు అరుణ్‌ జైట్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్‌. నర్సింగ్‌రావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 

 

09:34 - September 3, 2017

హైదరాబాద్ : మోదీ కేబీనెట్‌ నుంచి దత్తన్నను తప్పించడం సరైందేనా?  బీసీ ఓటు బ్యాంక్‌పై ఈ నిర్ణయం ప్రభావం పడనుందా? దత్తాత్రేయను తొలగించడం పార్టీకి ప్లస్‌ అవుతుందా? మైనస్‌ అవుతుందా? ఇప్పుడు ఇదే  ఆలోచనలో పడ్డారు బీజేపీ నేతలు. మొత్తానికి ఈ అంశం.. తెలంగాణ బీజేపీలో హాట్ టాఫిక్‌గా మారింది. 
దత్తాత్రేయ తొలగింపు తెలంగాణ బీజేపీలో కలకలం 
కేంద్ర కేబీనెట్‌ నుంచి దత్తాత్రేయ తొలగింపు తెలంగాణ బీజేపీలో కలకలం సృష్టిస్తుంది. మోదీ బృందంలో తెలంగాణ నుంచి ఉన్న ఏకైక మంత్రి దత్తాత్రేయ. ఇప్పుడు దత్తన్నను మంత్రి వర్గం నుంచి తప్పించడంపై నేతల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. పార్టీలో దశాబ్దాలుగా కీలకంగా ఉన్న నేతను తొలగించడం పార్టీకి లాభమా? నష్టమా? అన్నదానిపై నేతలు తర్జన, భర్జన పడుతున్నారు.
దత్తన్న తొలగింపు నిర్ణయం...బీసీ ఓటు బ్యాంక్‌పై తీవ్ర ప్రభావం 
పార్టీలో ఉన్న ఏకైన బీసీ నేత అయిన దత్తన్న తొలగింపు నిర్ణయం వచ్చే ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంక్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. బీసీలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు.. దీనిని ప్రత్యర్థులు ఆయుధంగా చేసుకునే అవ‌కాశం ఉందని.. ఇది పార్టీకి  కొంత ఇబ్బందిక‌ర‌మే అన్న అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో వినిపిస్తోంది. 
దత్తాత్రేయ స్థానంలో ఎవరిని పెట్టాలనేదానికి చర్చ
ఇక దత్తాత్రేయ స్థానంలో ఎవరిని పెడితే ఎంత లాభం ఉంటుందనే అంశంపై కూడా చర్చ సాగుతోంది. దత్తన్న వారసుడిగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మురళీధర్‌రావును దించాలన్న యోచనలో పెద్దలు ఉన్నారు. అయితే గెలిచిన ఎంపీగా ఉన్న దత్తన్నను తప్పించి..వెలమ సామాజిక వర్గానికి చెందిన మురళీధర్‌రావును కేబినెట్‌లోకి తీసుకోవడం సరికాదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ లిస్ట్‌లో కిషన్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ మురళీధర్‌రావుకే మోదీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీపై... దత్తన్న నిర్ణయం ఎలాంటి ప్రభావం వేస్తుందో వేచి చూడాలి. 

 

09:26 - September 3, 2017

ఢిల్లీ : మార్పులు, చేర్పులులతో ఎలక్షన్ కలల కేబినెట్‌ను మోదీ ప్రభుత్వం ఆవిష్కరిస్తోంది. సామాజిక వర్గాలు, ప్రాంతాలను బేరీజు వేస్తూ.. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. పనితీరు ఆధారంగా ఏకంగా ఏడుగురు మంత్రులకు ఉధ్వాసన పలికారు. అయితే.. తమకు తెలియకుండానే తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకున్నారని .. పదవులు దూరమైన మంత్రులు గుర్రుగా ఉన్నారు. 
బెర్తులు ఖరారు..!
మాట మాత్రంగా కూడా చెప్పకుండా తమను తప్పించినట్టు ఫోన్‌ చేయడంపై మాజీమంత్రలు లోలోపల మధనపడుతున్నారు. అధిష్టానం ఆదేశాలను శిరసావహిస్తామంటూనే.. రాజీనామాలు తమ ఇష్టప్రకారం చేయలేదంటూ.. అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. 
మంత్రి పదవులకు పలువురు రాజీనామా 
మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా  బండారు దత్తాత్రేయ, కల్‌రాజ్‌ మిశ్రా, రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ,  ఫగ్గన్‌సింగ్‌ కులస్తే, సంజీవ్‌ బలియాన్‌, మహేంద్రనాథ్‌ పాండే  తమ పదవులకు రాజీనామా చేశారు. ఉమాభారతి, నిర్మలా సీతారామన్‌ రాజీనామా వార్తలు నిరాధారమని తేలింది. వీరిద్దరు మంత్రివర్గంలో కొనసాగనున్నారు. ఉమాభారతి విషయంలో రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ అధిష్టానం చెప్పినా.. ఆమె ససేమీరా అన్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి ఉమా భారతిని కొనసాగించాలనే మోదీ అండ్‌ టీం నిర్ణయానికి వచ్చినట్టు సమాచరం. అయితే ఆమె ప్రస్తుతం నిర్వహిస్తున్న శాఖను మార్పు ఖాయమని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. అటు  జెపి నడ్డా, రాధామోహన్‌సింగ్‌ మంత్రిత్వ శాఖలు మారిపోనున్నాయి. కాగా జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కర్‌ రైల్వేశాఖను నిర్వహించడంతో రైల్వేశాఖకు మరొకరికి కేటాయించే అవకాశం ఉంది. 
రాజీనామాలపై లోలోపల ఉడికిపోతున్న మాజీలు  
ఇక రాజీనామాలపై మాజీలు లోలోపల ఉడికి పోతున్నారు. మాటమాత్రంగా చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని వాపోతున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నది తన నిర్ణయం కాదని, పార్టీ నిర్ణయమని మాజీ కేంద్రమంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ తెలిపారు. పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.
కొత్త ముఖాలకు చోటు 
ఇక వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికవడం, అనిల్‌ దవే మరణం, మనోహర్‌ పరీకర్‌ గోవా సీఎంగా వెళ్లడంతో మూడు శాఖలు ఖాళీ అయ్యాయి.  రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు కూడా తన రాజీనామా అంశాన్ని ప్రధానికి ప్రస్తావించడంతో ఆయన శాఖ కూడా మారనుంది. అరుణ్‌జైట్లీ, నరేంద్రసింగ్‌ తోమర్, హర్షవర్ధన్‌, స్మృతీ ఇరానీల వద్ద రెండేసి శాఖలున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మంత్రుల శాఖలు మార్చడంతో పాటు కొత్త ముఖాలకు చోటు కల్పించారు. 
పనితీరు ఆధారంగా మార్పులు చేర్పులు..?
మంత్రుల పనితీరు ఆధారంగా ప్రధాని మోది, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. పార్టీ రూపొందించిన కార్యక్రమాలను, ప్రభుత్వ పథకాలను మంత్రులు ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లారన్నది బేరీజు వేసుకుని కొందరు మంత్రులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. 

 

09:15 - September 3, 2017

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10గంటల 30 నిముషాలకు  ముహూర్తం ఖరారైంది. మొత్తం 9 మంది కొత్తవారికి ఈసారి అవకాశం కల్పించారు.  మోది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో కేబినెట్‌లో మార్పులు చేయడం ఇది మూడోసారి. మరోవైపు కేంద్ర మంత్రి ఉమాభారతి పదవిలోనే కొనసాగనున్నారు.
ఉదయం 10 గంటలకు మూహూర్తం
కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ఇవాళ ఉదయం 10 గంటలకు ముహూర్తం ఖరారు అయింది.  2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు, రానున్న గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకుని బిజెపి మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. ఇప్పటికే మోది, అమిత్‌షాలు ఫైనల్‌ లిస్టును  తయారు చేశారు. మోది కాబినెట్‌లో కొత్తగా 9మందికి కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించారు.
కొత్త మంత్రులు 
కొత్తగా మంత్రులవుతున్న వారిలో ఢిల్లీకి చెందిన బీజేపీ నేత,రాజ్యసభా సభ్యుడు శివప్రతాప్‌ శుక్లా,  అశ్వనీకుమార్‌ చౌబే వీరిద్దూ బీజేఈపీకి చెందిన వారు. కాగా ఇటీవలే ఎన్డీయేతో జట్టుకట్టిన జేడీయూకు కేబినెట్‌లో బెర్త్‌ దక్కింది. ఆపార్టీకి చెందిన నేత వీరేంద్రకుమార్‌ను మంత్రిపది చాన్స్‌ ఇచ్చారు.  అటు  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కర్నాటకకు ఓ చాన్స్‌ ఇచ్చారు. ఆరాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డేకు ఛాన్స్‌ కల్పించారు. అటు మహరాష్ట్రకు చెందిన మాజీ పోలీస్‌ అధికారి, బీజేపీ ఎంపీ సత్యాపాల్‌ సింగ్‌కు మోదీకేబిన్‌లో చోటు లభించింది. కాగా కేరళకు కూడా ఈసారి ప్రాధాన్యత కల్పించారు. ఆ రాష్ట్రానికి చిందిన బీజీపీ ఎంపీ అల్ఫాన్స్‌ కన్నంతనమ్‌కు మంత్రిపదవి దక్కింది. అటు బీహార్‌ అర్రా లోక్‌సభా సభ్యుడు ..బీజేపీ ఎంపీ రాజ్‌కుమార్‌సింగ్‌కు  అవకాశం దక్కింది. ఇక ఇప్పటిదాకా సెంట్రల్‌ కేబినెట్లో ప్రాధాన్యత లభించని రాజస్థాన్‌కు కూడా ఈసారి అవకాశం కల్పించారు. జోద్‌పూర్‌ బీజేపీఎంపీ గజేంద్రసింగ్‌ షెకావత్‌కు మంత్రిపదవి దక్కగా.. అటు మధ్యప్రదేశ్‌కు చెందిన ఎంపీ హర్దీప్‌సింగ్‌కు కూడా మోదీ మంత్రివర్గంలో చోటు లభించింది. 
మోదీ కేబినెట్లో 9 మందికి ఛాన్స్‌ 
అయితే ప్రస్తుతం 9 మందికే  పిలుపు వచ్చినా.. ప్రమాణస్వీకారం సమయానికి మరికొందరు నేతలకు ఛాన్స్ లభించే అవకాశం ఉందని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి ఛాన్స్‌ దక్కనుందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అటు తమిళనాడు నుంచి అన్నాడీఎంకేకు ఛాన్స్‌పై కూడా ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. 

 

నేటి నుంచి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు

ఢిల్లీ : నేటి నుంచి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. శిఖరాగ్ర సదస్సుకు చైనా అతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోడీ సహా ఐదు దేశాల అధినేతలు, ఆర్థికవేత్తలు పాల్గొననున్నారు. 

 

జడ్చర్లలో రోడ్డు ప్రమాదం

మహబూబ్ నగర్ : జడ్చర్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అతివేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో హైదరాబాద్ బచ్ పన్ స్కూల్ డైరెక్టర్ పివి.రావు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో మహిళకు తీవ్ర గాయాలయయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.  

 

నేడు కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ

ఢిల్లీ : నేడు కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరుగనుంది. ఉదయం 10.30 గంటలకు కేంద్రమంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాబోయే ఎన్నికలు లక్ష్యంగా మార్పులు, చేర్పులు చేస్తోన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ లోకి 9 కొత్త ముఖాలకు చోటు ఖరారు అయింది. సత్యపాల్ (యూపీ లోక్ సభ ఎంపీ), శివప్రతాప్ శుక్లా (యూపీ రాజ్యసభ ఎంపీ), అనంతకుమార్ హెగ్డే (కర్టాటక), రాజ్ కుమార్ సింగ్, అశ్వినీ చౌబే (బీహార్), గజేంద్రసింగ్ షేకావత్ (రాజస్థాన్ ఎంపీ), వీరేంద్రకుమార్ (మధ్యప్రదేశ్ ఎంపీ), హర్దీప్ పూరీ (మాజీ ఐఎఫ్ ఎస్ అధికారి) కేంద్రకేబినెట్ లో చోటు దక్కింది.

ఏఎస్పీ గన్ మెన్ ఏకే 47 మిస్ ఫైర్

నెల్లూరు : ఏఎస్పీ గన్ మెన్ ఏకే 47 మిస్ ఫైర్ అయింది. ఏఎస్పీ కారు డ్రైవర్ రమేష్ ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందారు. ఏఎస్పీ కార్యాలయంలో ఘటన చోటుచేసుకుంది. 

ఏఎస్పీ గన్ మెన్ ఏకే 47 మిస్ ఫైర్

నెల్లూరు : ఏఎస్పీ గన్ మెన్ ఏకే 47 మిస్ ఫైర్ అయింది. ఏఎస్పీ కారు డ్రైవర్ రమేష్ ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందారు. ఏఎస్పీ కార్యాలయంలో ఘటన చోటుచేసుకుంది. 

Don't Miss