Activities calendar

04 September 2017

21:42 - September 4, 2017

ముంబై : ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ట్వంటీ ట్వంటీ లీగ్‌ ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ ప్రసార హక్కులను స్టార్‌ ఇండియా గ్రూప్‌ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. రికార్డ్‌లెవల్లో 16వేల 347 కోట్లకు బిడ్‌ వేసిన స్టార్‌ గ్రూప్‌కే బీసిసిఐ మొగ్గు చూపింది.ప్రత్యక్షప్రసారాలు,డిజిటల్‌ మీడియా హక్కులతో పాటు ఇతర దేశాల్లో ప్రసార హక్కులు సైతం స్టార్‌ గ్రూప్‌కే దక్కాయి.2018 నుంచి 2022 వరకూ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పోటీలు స్టార్‌ నెట్‌వర్క్‌లో ప్రసారమవుతాయి.

21:41 - September 4, 2017

హైదరాబాద్ : భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మళ్లీ గోపీచంద్‌ అకాడమీలో చేరింది. ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీల్లో వరుస పరాజయాలను చవిచూస్తున్న సైనా.. ప్రస్తుత కోచ్ విమల్‌ కుమార్‌ను వదిలి హైదరాబాద్‌కు తిరిగొచ్చేసింది. మనస్పర్థల కారణంగా సరిగ్గా మూడేళ్లక్రితం గోపీచంద్ అకాడమీకి గుడ్‌బై చెప్పిన సైనా.. బెంగళూరులో కోచ్ విమల్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ పొందింది. వీరిద్దరి కాంబినేషన్‌లోనూ మంచి విజయాలు నమోదుచేసినా .. ముఖ్యమైన టోర్నీల్లో ఎక్కువగా వైఫల్యాలే ఎదురయ్యాయి. తాజాగా జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన 16వ ర్యాంక్‌కు సైనా గ్రాఫ్ పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా తన సత్తా చాటాలని నిర్ణయించుకున్న సైనా.. మళ్లీ కోచ్ గోపీచంద్‌ వద్దకు చేరింది. ఇదే విషయాన్ని సైనా ట్విట్టర్ ద్వారా తెలిపింది. 

21:40 - September 4, 2017

హర్యానా : హర్యానా సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయంపై పోలీసులు దాడి చేసి... భారీ ఎత్తున మారణాయుధాలు లభ్యమయ్యాయి. 37 మిషన్‌గన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు డేరా భక్తులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇందులో వివిధ రకాల తుపాకులు, రైఫిల్స్‌ ఉన్నాయి. డేరా బాబా అనుచరుల వద్ద 60 తుపాకులు ఉన్నాయని వాటిని ఇవ్వకపోతే దాడులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. హర్యానా, పంజాబ్‌లోని డేరా సచ్చా సౌదాకు చెందిన పలుచోట్ల ఆయుధాలు లభ్యమయ్యాయి. 2010 నుంచే డేరా సచ్ఛ సౌధ ప్రధాన కార్యాలయంలో గుర్మిత్ సింగ్ తన అనుచరులకు ఆయుధ శిక్షణ ఇస్తున్నట్లుగా సమాచారం. ఆయుధాలు కలిగి ఉన్నవారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు.

21:39 - September 4, 2017

ఢిల్లీ : అరుణ్‌జైట్లీ పరువు నష్టం దావా కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు 5 వేల జరిమానా విధించింది. ఈ కేసులో సమాధానం ఇచ్చే విషయంలో జాప్యం చేసినందుకు కోర్టు కేజ్రీవాల్‌కు ఈ జరిమాన విధించింది. జైట్లీ డిడిసిఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అక్రమాలు జరిగాయంటూ ఆప్‌ ఆరోపించింది. తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ కేజ్రీవాల్‌తో పాటు ఆప్‌ నేతలపై అరుణ్‌జైట్లీ పది కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేశారు. జైట్లీ వేసిన మరో పరువు నష్టం కేసు విచారణ సమయంలో కోర్టులోనే కేజ్రీవాల్‌ తరపు లాయర్‌ రామ్‌జెఠ్మలాని జైట్లీని దూషించారు. దీంతో కేజ్రీవాల్‌పై జైట్లీ మరో పరువు నష్టం దావాను దాఖలు చేశారు. 

21:38 - September 4, 2017

అహ్మదబాద్: గుజరాత్‌ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మోది సర్కార్‌ను టార్గెట్‌ చేశారు. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల పేదలు, రైతులే నష్టపోయారని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ధ్వజమెత్తారు. గుజరాత్‌ మోడల్‌ తరహా అభివృద్ధి పనిచేయలేదని...దీనివల్ల యువత, రైతులు, చిన్న వ్యాపారులకు ఎలాంటి లబ్ది చేకూరలేదని చెప్పారు. మోది బడా వ్యాపారుల కోసమే పనిచేస్తున్నారని సామాన్య ప్రజలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ పార్టీని సమాయత్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికే టికెట్ కేటాయిస్తామని కార్యకర్తలకు తెలిపారు.

21:37 - September 4, 2017

బీజింగ్ : చైనాలోని షియమిన్‌లో జరుగుతున్న బ్రిక్స్‌ దేశాల సదస్సులో రెండోరోజు ఉగ్రవాదంపై చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులను ఖండిస్తూ బ్రిక్స్‌ దేశాలు తీర్మానం చేశాయి. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల పేర్లను తీర్మానంలో ప్రస్తావించాయి. తాలిబన్, ఐఎస్‌, లష్కరే తొయిబా, హక్కాని, అల్‌ ఖైదా, జైష్‌-ఎ-మహ్మద్, తహరిక్‌-ఎ-తాలిబన్, హిజ్బుత్‌ తహ్రీర్‌ లాంటి ఉగ్రవాద సంస్థలు చేసే హింస వల్ల ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని డిక్లరేషన్‌లో పేర్కొన్నాయి. ఉగ్రవాదంపై పోరుకు అంతర్జాతీయ సహకారం అవసరమని... ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారం నిలిపివేయాలని తీర్మానించాయి.

పరస్పర స‌హ‌కారం ఉంటేనే శాంతి
బ్రిక్స్‌ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. బ్రిక్స్‌ దేశాల మ‌ధ్య పరస్పర స‌హ‌కారం ఉంటేనే శాంతి, అభివృద్ధి సాధ్యమ‌వుతుంద‌న్నారు. పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, నైపుణ్యం తదితర అంశాలే ప్రాధాన్యంగా భారత్‌ పనిచేస్తోందని, యువతే తమకు అతిపెద్ద బలమని మోది చెప్పారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిలో భారత్‌ కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిక్స్‌ డిక్లరేషన్‌ ద్వారా ఉగ్రవాదంపై పోరు చేస్తున్న భారత్‌కు దౌత్యపరమైన మద్దతు లభించినట్లయింది.

మోడీని స్వాగతించిన చైనా అధ్యక్షుడు
బ్రిక్స్‌ దేశాల సదస్సులో భాగంగా ప్రధాని మోదిని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్వాగతించారు. మోదితో పాటు రష్యా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా దేశాల అధ్యక్షులకు జిన్‌పింగ్‌ స్వాగతం పలికారు. ప్రధాని మోది రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటి అయ్యారు. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. బ్రిక్స్‌ దేశాలు ఒకే నినాదంతో ముందుకు వెళ్తే ప్రపంచ శాంతికి, అభివృద్ధికి దోహద పడుతుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రస్తుత ప్రపంచంలో బ్రిక్స్ దేశాల బాధ్యత మరింత పెరిగిందన్నారు. బ్రెజిల్‌, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు కలిసి బ్రిక్స్‌గా ఏర్పడ్డాయి.

21:35 - September 4, 2017

పశ్చిమగోదావరి : పోలవరం నిర్వాసితుల నినాదాలతో ఏలూరు కలెక్టరేట్‌ దద్దరిల్లింది.. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఏలూరు కలెక్టరేట్‌ ముందు ఆందోళనకు దిగారు.. తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.. కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారు. కుక్కునూరు మండలంలో పోలవరం ప్రాజెక్టుకోసం అధికారులు గతంలో సర్వే నిర్వహించారు.. ఈ మండలంలోని పలు గ్రామాల ప్రజలనుంచి ఆధార్‌ కార్డులు తీసుకున్నారు.. సంతకాలు కూడా చేయించుకున్నారు.. తీరా పరిహారం ప్రకటించిన జాబితాలో వీరి పేర్లు లేవు. చుట్టూ ఉన్న గ్రామాలను ముంపు ప్రాంతాలుగా ప్రకటించారు.. అమెరికాలో ఉంటూ ఇక్కడ భూములున్నవారికి కూడా పరిహారం ఇచ్చారు.. ముంపు గ్రామాలకు మధ్యలోఉన్న కమ్మరి గూడెం వాసులకు మాత్రం మొండి చేయి చూపారు. చుట్టూ గ్రామాలు ప్రాజెక్టులో మునిగిపోతే తమ గ్రామం మాత్రం ఎలా ముంపు పరిధిలోకి రాదో చెప్పాలంటూ బాధితులు అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు.. భూములు లేనివారికి పరిహారం అందిందని.... తమకు మాత్రం అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు.గ్రామస్తుల ఆందోళనతో ఏలూరు కలెక్టరేట్‌ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.... అధికారులు ఎంతకీ స్పందించడంలేదంటూ ఓ నిర్వాసితుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు.. అతన్ని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ముంపు గ్రామాలకు పరిహారం చెల్లింపులో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.. న్యాయంగా రావాల్సినవారందరికీ పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.. లేకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

21:34 - September 4, 2017

కృష్ణా : బెజవాడ వైసీపీలో గ్రూపుల ఆధిపత్యపోరు రచ్చకెక్కింది. వంగవీటి రంగాపై సోషల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. వైసీపీ నేత గౌతంరెడ్డిపై వంగవీటి అభిమానులు భగ్గున మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి, వంగవీటిరాధ ఏర్పాటు చేయాలనుకున్న మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకోవడంతో.. పరిస్థితి పోలీస్‌ కేసుల వరకు వెళ్లింది. రచ్చకెక్కిన నేతల పోరుకు వైసీపీ చెక్‌ పెట్టే ప్రయత్నం చేసింది. వంగవీటి రాధను కూల్‌ చేసేపనిలో దాదాపు సక్సెస్‌ అయింది. గౌతంరెడ్డిని పార్టీ నుంచి సస్పెన్స్‌ చేస్తున్నట్టు వైసీపీ అధినేత జగన్‌ ప్రకటించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణా సంఘాన్ని ఆదేశించారు.

పోలీసు అధికారులు అతిగా ప్రవర్తించారు
మరోవైపు పోలీసుల అత్యుత్సాహమే వివాదాన్ని మరింత రెచ్చబెట్టిందని వంగవీటి రాధ అంటున్నారు. సోషల్‌మీడియాలో గౌతంరెడ్డి చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలను ఖండించడానికి తాము ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశామన్నారు. అయితే డీసీపీ, ఇతర పోలీసు అధికారులు అతిగా ప్రవర్తించారన్నది రాధ ఆరోపణ. తనను ప్రెస్‌మీట్‌ పెట్టనీయకుండా హౌస్‌ అరెస్టుకు ప్రయత్నించారని... అయితే ఈ వివాదంలో ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్టుగా తనకు అనిపించడం లేదన్నారు వంగవీటి రాధ.

ఇంతకీ .. ఇప్పటికిపుడే... గౌతంరెడ్డి రంగా ఇష్యూను ఎందుకు నెత్తికెత్తుకున్నారు అనే చర్చలు బెజవాడలో జోరుగా నడుస్తున్నాయి. దీని వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే కామెంట్లు వస్తున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్‌ రాదనే నిర్ధారణకు వచ్చాకనే గౌతమ్‌ రెడ్డి ఇలా రూటు మార్చారన్న ప్రచారం జరుగుతోది. ఇటీవల బీజేపీతో ఆయన టచ్‌లో ఉన్నట్టు కూడా ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో గౌతంరెడ్డి త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అని బెజవాడ వైసీపీ నేతల్లో చర్చ నడుస్తోంది. అందుకే ఏదో ఒక సంచలనం చేసి.. పొలిటికల్‌ మైలేజ్‌ పెంచుకోడానికే సోషల్‌ మీడియాను వేదికగా చేస్తుకున్నారనే వాదనలు వస్తున్నాయి. ఈ వ్యూహలో భాగంగానే రేపటి ప్రత్యర్థిగా మారనున్న వంగవీటి రాధను ఇప్పటి నుంచే టార్గెట్‌ చేయడం మొదలు పెట్టారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మండిపడుతున్న కాపు సంఘాలు
మరోవైపు వంగవీటి రంగాపై గౌతంరెడ్డి చేశారని చెబుతున్న వ్యాఖ్యలను ఏపీ కాపుసంఘాలు ఖండించాయి. రంగాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చిరిస్తున్నారు. మొత్తానికి 2019 ఎన్నికల వ్యూహాలు .. బెజవాడ వైసీపీలో చిచ్చుపెట్టాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. 

21:32 - September 4, 2017

గుంటూరు : మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్‌లో టీడీపీ కీలక వర్క్‌షాప్‌ జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పనిచేసిన మంత్రులను, ఎమ్మెల్యేలను సీఎం అభినందించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి..ఆనందం పంచుకున్నారు. నేతలెవరూ... గెలుపును తలకెక్కించుకోవద్దని ప్రజలు మెచ్చేలా పనిచే‌స్తే...వారి మద్దతు మనకే ఉంటుందని చంద్రబాబునాయుడు సూచించారు. ప్రజా ప్రతినిధులు పోల్ మేనేజ్‌మెంట్ ..పొలిటికల్‌ మేనేజ్ మెంట్, పబ్లిక్ మేనేజ్ మెంట్ నేర్చుకోవాలన్నారు. అలాగే టీడీపీ నూతన కార్యాలయాన్ని మంగళగిరిలోనే సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

పుస్తకాన్ని రూపొందించారు
నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలుపుపై ఒక పసుపు పుస్తకాన్ని రూపొందిస్తున్నామని, ఆ పుస్తకాన్ని 175 నియోజకవర్గ నేతలకు అందజేస్తామని బాబు చెప్పారు. అదే విధంగా 11 నుంచి జరగబోయే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొవాలని బాబు నేతలకు చెప్పారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్‌ను కౌన్సిల్‌ చైర్మన్‌గా నియమించారు. సదస్సులో చంద్రబాబునాయుడు మాటలను బట్టి... రాబోయే ఎన్నికల కోసం ఇప్పటికనుంచే కసరత్తు ప్రారంభించినట్టు

20:29 - September 4, 2017

ఉర్ముర్మి మంగళం మీద వడ్డట్టు.. మానకొండూరు కాడ దళితులు ఆత్మహత్యా యత్నం జేశ్న పంచాది ఆఖరికి రసమయిబాలకిషన్ సారు మెడకే జుట్టుకున్నది.. దళితుల భూముల పంపిణీలకు ఇద్దరు అగ్రవర్ణ లీడర్లు జొర్రి.. రాజేశిన మంట.. రసమయికి శెక సూపెడ్తున్నది.. మొత్తానికి రసమయి దళిత ద్రోహి అనే కుట్రకు సొంత పార్టీ నేతలే స్కెచ్ గీశినట్టనిపిస్తున్నది..

రాజన్న రాజ్యమొచ్చెదాక ఇడ్సిపెట్టేదే లేనట్టుండ్రుగదా..? జగనాలు బ్యాచు.. చంద్రన్న రాజ్యం గూలిపోవాలె.. రాజన్న రాజ్యం రావాలె అంటే.. పాదయాత్ర ఒక్కటే పక్కా పని అనుకుంటున్నట్టున్నరు.. వచ్చెనెల ఇర్వైఏడు తారీఖు సంది.. నడ్క సుర్వట.. నవరత్నాలను ఎంటేస్కోని.. ఒక్కటి గాదు రెండు గాదు ఆర్నెళ్లు తిర్గుతరట.. మళ్ల ఎంతమంది నుదుటి మీద ముద్దులో..? ఎన్నికథలో పోండ్రి..

ఎవ్వలన్నరమ్మా..? తెలంగాణ రాష్ట్రం పశిగుడ్డు.. అంబాడుతున్నది.. పాలు తాగుతున్నది.. కొత్త సంసారం అని.. అన్నోళ్లు మూతి మీద ఒక్కటి గుద్దుండ్రి.. ఓదిక్కు దేశంలనే ఏ రాష్ట్రానికి సాధ్యంగానిది.. ఒకనయ్యతోని గాని పనులన్ని తెలంగాణల అయితున్నయ్.. దేశంలనే నెంబర్ వన్ అయ్యిపోయింది.. దానికి పుట్టుమచ్చలసొంటి తీపి గుర్తుల కింద అవార్డులొస్తుంటె.. ఇకా పాకుతున్నదనకుండ్రి.. పరాష్కాలాడకుండ్రి..

నందమూరి బాలికాకయ్య జర్రంత బుద్ది మంతుడైనట్టుండుగదా..? ఎప్పుడు ఎనపోతు కశిరినట్టు కశిరిచ్చుకుంటుండే.. ఇప్పుడు మరి ఏ మూసిల మున్గినంక జ్ఞానోదయం అయ్యిందో ఏమో ప్రజలతోని గౌరవంగుంటున్నడు.. అభిమానులు దగ్గరికొస్తె ఆప్యాయంగ వల్కరిస్తున్నడు.. ఎంతైనా అప్పటంత చిల్లరగాని లెక్కమాత్రం జేస్తలేడమ్మా..?

నాకు ఎమ్మెల్యే, మంత్రి పదవి.. గవర్నర్ గిరి లేకుంటే.. ఎన్నడో ఆత్మహత్య జేస్కోని సచ్చిపోతుంటిని అన్నడు..? మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు.. నిజంగ విద్యాసాగర్ రావు సారుకు అంత కష్టముండేనా..? ఆ కష్టాలళ్లకెళ్లి బైటవడెతందుకు ఎమ్మెల్యే పదవి..? మంత్రిగిరే ఆదుకున్నయా..? గంత పెద్ద మాట ఎందుకన్నడు ఆ సారు పాండ్రి అర్సుకుందాం.. చిన్నముచ్చటగాదిది..

విద్యార్థుల ప్రతిభ ఎప్పుడు బైటికొస్తది..? మంచిగ సద్వులు సద్వి.. పరీక్షలు రాశి మంచి మార్కులు సాధించుకున్నప్పుడు గదా..? మరి అట్లనే దేవుండ్ల మహిమలు ఎప్పుడు బైటికొస్తయ్..? ఆయన శక్తి యుక్తులను ప్రదర్శించినప్పుడు వస్తయ్ గదా..? అగో గణపతి మారాజ్ కు రానే వచ్చింది ఆ గడియ.. ఆయన శక్తిని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది..? ఏందుకు ఏడా అనేది స్టోరీల జూడుండ్రి..

నీయక చెర్లళ్ల శాప పిల్లలు వోసుడు గూడ పెద్ద ప్రభుత్వ కార్యమే అయిపోయింది తెలంగాణల.. ఇద్వరకు ఎన్నడు శాప పిల్లలు వొయ్యలేదా చెర్లళ్ల..? మరి భూమి వుట్టిన సంది ఇప్పుడే ఫస్టు టైం ఇసొంటి బృహత్తర కార్యం జేస్తున్నట్టు ఏందో ముచ్చట అర్థమైతలేదు.. సరే చేస్తే చేయనిగని.. ఇద్వరకు వోశి చాపపిల్లలతోని ఎంత సంపద తయ్యారైందో చెప్పలేదు సారూ..? అది ఉత్తదే అయ్యిందని జాలర్లకు తెల్సుగని.. సర్కారు చెప్పుకుంటలేదు

 

మెరుగైన సమాజం నిర్మాణంలో.. ముఖాముఖీ దర్శకత్వంలో అంత్యంత ప్రమాదాత్మకంగ విడుదలైన కుల కథా చిత్రం.. విజయవాడ విధులళ్ల రణరంగంగ ప్రదర్శించబడ్తున్నది.. గౌతం రెడ్డి ప్రధాన పాత్రల.. వంగవీటి పాము ప్రత్యేక ఆకర్షణగ.. బెడవాడ విధులను గజగజ వన్కిస్తున్నది.. మెరుగైన సమాజం కోసం నౌనంబరోళ్లు ఇడ్దల జేశ్న కుల కథా చిత్రం హైలెట్స్ మీకోసం..

 

20:26 - September 4, 2017

కరీంనగర్ : దళితులకు భూపంపిణీలో అన్యాయం జరిగిందంటూ ఆత్మహత్యకు ప్రయత్నించిన బాధితులకు హైదరాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.. తీవ్ర గాయాలతో నరక యాతన అనుభవిస్తున్న యువకుల్ని టీ మాస్‌ ఫోరం సభ్యులతోపాటు... ప్రతిపక్ష పార్టీల నేతలు వేర్వేరుగా పరామర్శించారు.. బాధితులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ, టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డి... షబ్బీర్‌ అలీ... వీహెచ్‌... పొన్నం ప్రభాకర్‌... జీవన్‌ రెడ్డి...., టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి, మందకృష్ణ మాదిగ, విమలక్క, పీఎల్‌ విశ్వేశ్వరరావు... ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత ఓదార్చారు.. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.. ర్యాలీగా ఆస్పత్రికి వచ్చిన టీ మాస్‌ నేతలు... సర్కారు దిష్టిబొమ్మను దహనం చేశారు.

రైతులకు బేడీలు వేశారు
తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని తమ్మినేని అన్నారు.. దళితులకు అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇప్పటివరకూ దళితులకు భూ పంపిణీ చేపట్టలేదని.... ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.. మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేశారని వీహెచ్‌ ఫైర్ అయ్యారు.. దళితుల జీవితాలతో ఆడుకుంటున్న సీఎం కేసీఆర్‌పై 306 కేసు పెట్టాలని మండిపడ్డారు.యశోద ఆస్పత్రిలోకి కొందరినే పోలీసులు అనుమతించడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. బాధితులకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.. ఈ ఘటనకు నిరసనగా రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని.. టీ మాస్‌ నేతలు ప్రకటించారు. మరోవైపు దళితుల ఆత్మహత్యాయత్నంపై కరీంనగర్‌ జిల్లాలో నిరసనలు హోరెత్తాయి... ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నేతలు ఆందోళనకు దిగారు..... తిమ్మాపూర్‌ మండలం అల్గనూరు చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు.... సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే రసమయి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.. ఈ రాస్తారోకోతో దాదాపు ఐదు కిలోమీటర్లవరకూ ట్రాఫిక్ జాం అయింది.. నేతలను పోలీసులు అరెస్ట్‌చేసి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.మానకొండూరులోనూ దళితుల ఆందోళనలు కొనసాగాయి.. దళిత సంఘాల నేతలు ఎమ్మెల్యే రసమయి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.. రసమయికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

20:02 - September 4, 2017

తొమ్మిదినెలల క్రితం భారీ ప్రకటనలు చేశారు..దేశమంతటికీ క్యూలో నిలబెట్టారు..కారణాలు బహుభారీగా చూపెట్టారు..కానీ సీన్ రివర్సైంది. ఇప్పుడు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మాటలతో విషయం స్పష్టంగా అర్ధమౌతోంది. ఏ నిర్ణయాల వెనుక ఏ ఉద్దేశాలున్నాయో? ఇంతా చేసి ఎందుకు నోరు మెదపటం లేదో అర్ధమౌతుంది. డీ మానిటైజేషన్ తెరవెనుక అంశాలేంటి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టొరీ.. ఏం చెప్పారు? ఏం జరిగింది? నోట్లరద్దు దేశానికి ఏం మిగిల్చింది? సామాన్యుడికి ఏ అనుభవాలిచ్చింది? ఎంత నల్లధనం వెలికి తీశారు? ఆర్బీఐ గణాంకాలు ఏం చెప్తున్నాయి? జైట్లీ వాదనల్లో అసంబద్ధత ఎంత? మోడీ సర్కారు డీమానిటైజేషన్ తో తప్పులో కాలేసిందా? తగ్గిన జీడీపీ గణాంకాలేం చెప్తున్నాయి? ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఏం చెప్తున్నారు.. ?నల్లధనం ఎక్కడున్నా తీసుకొస్తాం..అందరి ఎకౌంట్లలో పంచేస్తాం.. మోడీ సర్కారు మూడేళ్ల క్రితం మీటింగుల్లో ఊదరగొట్టిన మాట. నల్లధనం అడ్రస్ ఆధారాలతో సహా వెల్లడైనా పట్టించుకోలేదు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

సీఎం కేసీఆర్ కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ బహిరంగలేఖ

హైదరాబాద్ : పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, దళితులు, గిరిజనుల, మైనార్టీలపై హత్యలు, అఘాయిత్యాలకు రాష్ట్రం అడ్డాగా మారిందని లేఖలో పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో చిరుత సంచారం

ఆదిలాబాద్ : జిల్లా ఉట్నూర్ మండలం రాజులమడుగులో చిరుత సంచారిస్తుంది. చిరుతపులి ఇళ్లలోకి వచ్చి ముగ్గురిపై దాడి చేసింది. ఒకరికి తీవ్రగాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్

హైదరాబాద్ : విజసాయిరెడ్డి సీబీఐ కోర్టులో డిశ్చార్జ పిటిషన్ దాఖలు చేశారు. రాంకీ, వన్పఇక్ పెట్టుబడుల వ్యవహారంలో చార్జిషీట్ నుండి తనను తొలగించాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.

 

చొరబాటు యత్నాన్ని అడ్డుకున్న బీఎస్ఎఫ్ సైన్యం

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ ఆర్నియా సెక్టార్ దగ్గర చొరబాటకు యత్నించిన ఉగ్రవాదుల కుట్రను బీఎస్ఎఫ్ సైన్యం భగ్నం చేసింది. పాకిస్థాన్ నుంచి ఆయుధాలతో ఉగ్రవాదులు చొరబాటకు యత్నించారు.

19:31 - September 4, 2017
19:29 - September 4, 2017

కృష్ణా : వంగవీటి రంగాను విమర్శిస్తే ఊరుకునేదిలేదని వైసీపీ నేత వంగవీటి రాధ హెచ్చరించారు. తన తండ్రిని తప్పుపట్టే స్థాయి గౌతంరెడ్డికి లేదన్నారు. గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రంగా అభిమానులు బాధపడ్డారని చెప్పారు. రంగాకు అన్ని పార్టీల్లో అభిమానులు ఉండారన్నారు. తన తల్లి రత్నకుమారిని అరెస్టు చేసే సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన పోసులు తీరును రాధ తప్పుపట్టారు. 

19:27 - September 4, 2017

రాష్ట్రంలో ఇద్దరు దళితులు ఆత్మహత్యాయత్నం చేశారని, వారి తరుపున పోరాడానికి ప్రతిపక్షాలకు ఉండాల వద్ద అని, కేలవం ఇద్దరు దళితులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం దాన్ని చిన్న సంఘటన అనడంత బాధకరమని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. కరీంనగర్ నేరేళ్ల ఘటన మరిచిపోక ముందే ఈ సంఘటన జరిగిందని ఆయన అన్నారు. దళితులకు రాజ్యంగం ఇచ్చిన హక్కులను మనం గుర్తించాలని, ఈ సంఘటన చిన్నదానిగా కొట్టిపారేయడం మంచిది కాదని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి చైర్మన్ గా సీఎం కేసీఆర్ ఉంటారని, మొదటి లిస్ట్ లో ఆత్మహత్యాయత్నం చేసిన వారి యువకుల పేరు వచ్చిందని, బెజ్జంకి మండల జడ్పీటీసీ శరత్ రావు భూములు కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులే చెబుతున్నారని సీపీఐ నేత వెంకట్ అన్నారు. అనవసంగా ప్రతిపక్షాలు ఆత్మహత్యా సంఘటనను పెద్దదిగా చేస్తున్నారని టీఆర్ఎస్ నేత వేణుగోపాల చారి అన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

19:19 - September 4, 2017

హైదరాబాద్ : ఖైరతాబాద్‌ గణనాథుడు శోభాయాత్రకి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ముందస్తు చర్యలో భాగంగా రూట్‌ అంతటిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రేపు నిమజ్జనం కావడంతో.. ఇవాళ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

19:16 - September 4, 2017

కడప : హాట్ హాట్ రాజకీయాలకు కడప కేరాఫ్ అడ్రస్. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గట్టి పట్టు వుండేది. ఆయన అనుచరులే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యే అంజద్ బాషా వైఎస్ కుటుంబ అండదండలతో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, 2014లో వైసిపి అభ్యర్థిగా విజయం సాధించారు అంజద్ బషా. గత ఎన్నికల్లో కడప ఓటర్లకు చాలా హామీలిచ్చారు అంజద్ బాషా. వీటిలో ముఖ్యమైనది కడప పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించడం, ట్రాఫిక్ సమస్యను తీర్చడం. అధ్వాన్నంగా వున్న డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం. కడప విమానాశ్రయం ఏర్పాటుకు కృషి, రిమ్స్ ను ఎయిమ్స్ గా మార్చడం, పరిశ్రమలు ఏర్పాటు చేయించి, యువతకు ఉపాధి చూపించడం, యోగి వేమన యూనివర్సిటీలోని పెండింగ్ భవనాల నిర్మాణాలను పూర్తి చేయించడం ఇలా అనేక హామీలిచ్చారు అంజద్ బాషా.

రిమ్స్ ఎయిమ్స్ గా మారలేదు...
తాగునీటి సమస్య, ట్రాఫిక్ సమస్య, డ్రైనేజీ సమస్య పరిష్కారం కాలేదు. రిమ్స్ ఎయిమ్స్ గా మారలేదు. కనీస సౌకర్యాలు లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన హామీలేవీ నెరవేర్చకపోవడంతో ఎమ్మెల్యే జనంలో అసంతృప్తి రాజుకుంటోంది. తెలుగుదేశం ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యహరిస్తూ, నిధులు విడుదల చేయడం లేదంటున్నా కడప ఎమ్మెల్యే అంజద్ బాషా. ఎమ్మెల్యేగా తన మాట పట్టించుకోకుండా, టిడిపి నియోజకవర్గ ఇన్ చార్జి చెప్పే పనులకే ప్రాధాన్యతనిస్తున్నారంటూ విమర్శిస్తున్నారాయన. తాను ఎమ్మెల్యేగా వున్నా లేనట్టేనన్న పరిస్థితి ప్రభుత్వం సృష్టించిందంటున్నారు అంజద్ బాషా.

ఎమ్మెల్యేకి అభివృద్ధి మీద కంటే అవినీతి మీదే ఎక్కువ ధ్యాస
ఎమ్మెల్యే మాటలను కొట్టిపారేస్తున్నారు టిడిపి నియోజకవర్గ ఇన్ చార్జి శ్రీనివాస్ రెడ్డి. ఎమ్మెల్యేకి అభివృద్ధి మీద కంటే అవినీతి మీదే ఎక్కువ ధ్యాస వుందన్నది టిడిపి విమర్శ. కార్పొరేషన్ కు నిధులు సాధించకపోగా, వచ్చే పనులను కూడా మేయర్, ఎమ్యెల్యే కలిసి కాజేస్తున్నారన్నది టిడిపి ఆరోపణ. ప్రభుత్వంతో మాట్లాడి కడపలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కోసం ఆరున్నర కోట్లు ఖర్చు చేసినట్టు టిడిపి చెబుతోంది. తాగునీటి సమస్య పరిష్కారం కోసం 75 కోట్లతో లింగంపల్లి చెక్ డ్యాం నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించామంటున్నారు టిడిపి నేతలు.రాజకీయ పార్టీల విమర్శల సంగతెలా వున్నా, కడప అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజికవర్గాలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. నియోజకవర్గంలో 30శాతం మంది ముస్లింలు, మరో 30శాతం మంది బిసిలున్నారు. క్రిస్టియన్, రెడ్డి, కాపు సామాజిక వర్గాలూ గెలుపు ఓటమిలను నిర్ణయిస్తుంటాయి. 

19:15 - September 4, 2017
19:14 - September 4, 2017

పశ్చిమగోదావరి : లవరం ముంపు మండలాల ప్రజలు ఏలూరులోని కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం చెల్లింపులో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని కుక్కునూరు మండలం కమ్మరగూడెం గ్రామస్తులు ఆరోపించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజీవ్ అందిస్తారు. 

19:13 - September 4, 2017

హైదరాబాద్ : ఏవీ కళాశాలలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏఐసీటీ నిబంధనలు పాటించకుండా ఫార్మసీ కాలేజీ నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయలు మింగేశారని విద్యార్థులు

19:12 - September 4, 2017

వరంగల్ : వరంగల్‌లోని ఇఎస్‌ఐ డిస్పెన్సరీల్లో వైద్యుల కొరత ఉన్న మాట వాస్తవమే అంటున్నారు జాయింట్‌ డైరెక్టర్‌ సుదర్శన్‌ ప్రసాద్‌. పీజీ కోర్సులు చదివేందుకు వైద్యులు వెళ్తుండటంతో ఈ సమస్య ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇఎస్‌ఐ పరిమితి 15 వేల నుంచి 21 వేలకు పెంచడంతో రోగుల సంఖ్య పెరిగిపోయిందంటున్నారు. కానీ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై కొరడా ఝుళిపిస్తామంటున్నారు. ఆకస్మిక తనిఖీలతో వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటామని ఆయన అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

19:11 - September 4, 2017

వరంగల్ : ఇఎస్‌ఐ..ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ పథకం...అనేక ప్రయోజనాలతో కూడిన సామాజిక భద్రతా పథకం. ఉద్యోగులకు, వారిపై ఆధారపడిన వారికి ఖర్చుల పరంగా ఎలాంటి గరిష్టపరిమితీ లేకుండా పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తుంది. ఆరోగ్యం బాగా లేనప్పుడు ఉద్యోగి నగదు ప్రయోజనాలు కూడా అందిస్తున్న ఆరోగ్య బీమా పథకం. కానీ వరంగల్‌ జిల్లాలో వైద్యుల నిర్వాకం.. ఇఎస్‌ఐ పథకాన్ని నీరుగార్చేలా చేస్తోంది. వరంగల్ జోన్‌లోని 4 ఇఎస్‌ఐ డిస్పెన్సరీల్లో జరుగుతున్న వైద్యుల భాగోతాన్ని 10 టీవీ బయటపెట్టింది. పేదరోగులకు వైద్యమందించే విషయంలో డాక్టర్లు ఏ స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారో బయటపెట్టింది. ఒక్కో డిస్పెన్సరీని ఒకటికి రెండు సార్లు విజిట్‌ చేసి అక్కడి వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టింది.

మధ్యవర్తులదే రాజ్యం...
ముందుగా గిర్మాజీపేట డిస్పెన్సరీని 10టీవీ బృందం సందర్శించింది. ఇక్కడ వైద్యులు, వైద్య సిబ్బంది కన్నా మధ్యవర్తులదే రాజ్యం. అంతా వారి కనుసన్నల్లోనే జరిగిపోతోంది. వైద్యులు ఆసుపత్రికి మొక్కుబడిగా వచ్చిపోతుండటంతో దళారీలు విజృంభించేస్తున్నారు. రహస్యంగా మందులు తీసుకెళ్లి బయట విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పెరకవాడ రైల్వే గేట్ సమీపంలోని డిస్పెన్సరీలో ఇద్దరికి గాను ఒకరే వైద్య సేవలందిస్తున్నారు. ఇక్కడి వైద్యులు విధులను షేరింగ్‌ చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అంటెడెన్స్‌ వేసి కనిపించకుండా పోతున్నారని రోగులు అంటున్నారు. ఇదే కాక.. గతంలో ఈ డిస్పెన్సరీ కరీమాబాద్‌లో ఉండేది. ఓ మెడికల్ ఏజెన్సీ కాంట్రాక్టర్ స్వలాభం కోసమే.. పెరకవాడలోని సొంత బిల్డింగ్‌కు మార్చాడాన్నది మరో ఆరోపణ. అయితే స్థలం సరిపోక పోవడంవల్లే ఆస్పత్రిని ఇక్కడకు మార్చామని.. ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఇండస్ట్రీయల్‌ కాలనీలోని డిస్పెన్సరీలో ఇద్దరు మహిళా డాక్టర్లు ఉన్నా..కాంట్రాక్టు వైద్యుడే దిక్కయ్యారు. తొలుత డాక్టర్లు విధులకు వచ్చారని బుకాయించిన..కాంట్రాక్టు వైద్యుడు..చూపించమని అడగడంతో నీళ్లు నమిలారు. సెలవుల్లో ఉన్నారన్న విషయాన్ని చెబుతూనే..జీతం తక్కువన్న కారణంతో శ్రద్ధ కనబరచడం లేదన్న విషయాన్ని ఆలస్యంగా సెలవిచ్చారు.

ఆఫీసర్ యాదగిరిదే హవా...
ఇక హన్మకొండ డిస్పెన్సరీ నిత్యం రోగులతో కిటకిటలాడుతుంది. అయినా ఒక్క డాక్టరే అందుబాటులో ఉంటారు. డిస్పెన్సరీ ఇన్‌చార్జ్ మీటింగ్‌ పేరుతో హైదరాబాద్ వెళ్లగా.. మరో డాక్టర్ సెలవుల్లో ఉన్నారు. ఇక జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో సీనియర్ ఆఫీసర్ యాదగిరిదే హవా. అన్నింటికీ ఆయన చెప్పిందే సమాధానం. జెడీ విధులకు రాకపోయినా.. అన్నీ తానై చూసుకుంటాడు. వరంగల్‌ జోన్‌లో ఇఎస్‌ఐ డిస్పెన్సరీలపై 10 టీవీ నిఘా పెట్టిందన్న సమాచారాన్ని.. అన్ని ఆస్పత్రులకు చేరవేసి అప్రమత్తం చేశారు. ఇక ఇఎస్‌ఐ ఆస్పత్రుల్లో 2003 నుంచి వైద్యుల కొరత తీవ్రంగా ఉందని జేడీ చెప్పుకొస్తున్నారు. వరంగల్‌లోని ఇఎస్‌ఐ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణం స్పందించాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.

19:10 - September 4, 2017

వరంగల్ : వరంగల్‌ జోన్‌లో ఇఎస్‌ఐ వైద్యుల తీరు.. రోగుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో వైద్యులు ఎప్పుడుంటారో, ఎవరుంటారో తెలియదు. ఒకవేళ ఆస్పత్రికి మొక్కుబడిగా వచ్చినా.. ఎంత సమయం ఉంటారో అంతకన్న తెలియదు. దీంతో డిస్పెన్సరీలకు వచ్చే రోగులు చికిత్స అందక నరకయాతన పడుతున్నారు. ఎంతో ఆశతో ఆస్పత్రికి వచ్చే రోగులు...వైద్యులు లేరన్న సమాధానంతో ఉస్సురంటూ వెనుతిరుగుతున్నారు. గత్యంతరం లేక ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ..వారి దోపిడీకి బలైపోతున్నారు.

రోజూ వందకు పైగా ఔట్‌పేషంట్లు
వరంగల్ పట్టణ ప్రాంతంలో నాలుగు ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు వున్నాయి. ఇండస్ట్రియల్ ఏరియా, గిర్మాజీపేట, హన్మకొండ రెడ్డి కాలనీ, అండర్ బ్రిడ్జ్ దగ్గర ఈ డిస్పెన్సరీలున్నాయి. ఒక్కో డిస్పెన్సరీకి రోజూ వందకు పైగా ఔట్‌పేషంట్లు వస్తుంటారు. ప్రతి డిస్పెన్సరీలోనూ ఇద్దరు లేదా ముగ్గురు వైద్యులు.. ఇంచార్జి మెడికల్ ఆఫీసర్ ఉంటారు. డిస్పెన్సరీల్లో పనిచేసే వైద్యులను సమస్వయం చేస్తూ ఇన్‌చార్జీ మెడికల్‌ ఆఫీసర్‌ వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ ఇఎస్ఐ డిస్పెన్సరీల్లో దుర్బిణి వేసి చూసినా వైద్యులు కనిపించరు. ఇన్‌చార్జీ మెడికల్‌ ఆఫీసర్లదీ.. అదే పరిస్థితి. దీంతో కిందిస్థాయి వైద్యులే అన్నితామై చూసుకుంటున్నారు. ఇక ప్రతి డిస్పెన్సరీకి ఒక యూడీసీ సీనియర్ అసిస్టెంట్, ఎల్డీసీ జూనియర్ అసిస్టెంట్ ఉంటారు. ఆస్పత్రిలో ఏం కావాలన్న వీరే పర్యవేక్షిస్తుంటారు. అయితే వీరి మాటను డాక్టర్లు బేఖాతర్‌ చేయడం షరా మాములుగా మారింది. వైద్యులు వస్తున్నారా అని ఎవరైనా అడిగితే నీళ్లు నములుతూ..సర్దిచెప్పుకోవడానికి వీరు నానా తంటాలు పడుతుంటారు. నాలుగు డిస్పెన్సరీల్లో పని చేసే వైద్యుల్లో ఎక్కువ మంది డిప్యూటేషన్ మీదా పని చేస్తున్నావారే కావడం గమనార్హం. 

19:09 - September 4, 2017

వరంగల్ : వరంగల్‌లో ఇఎస్‌ఐ వైద్యుల అంతులేని నిర్లక్ష్యం..చుట్టపుచూపుగా ఆస్పత్రులకు వస్తున్న వైద్యులు..అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేయగానే అదృశ్యం..సొంత క్లినిక్కుల్లో సేవలందించేందుకు తహతహ..10 టీవీ నిఘాలో బయటపడ్డ వైద్యుల బండారం. రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్లపై పరుగెత్తిందట. వరంగల్‌ జోన్‌లో ఈఎస్‌ఐ వైద్యుల తీరు ఇలాగే ఉంది. అధికారుల ఉదాసీనత కారణంగా.. ఈఎస్‌ఐ వైద్యులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. వేలకు వేలు జీతం తీసుకుంటూ.. పేదలకు వైద్యం అందించకుండా.. డిస్పెన్సరిలకు చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారు. సొంత క్లినిక్కుల్లో వైద్యమందించేందుకే తహతహలాడుతున్నారు. అటు ప్రభుత్వ జీతం.. ఇటు క్లినిక్‌ ఆదాయంతో రెండు చేతుల బాగానే సంపాదిస్తున్నారు. కార్మికులు, పేద రోగులు వైద్యం కోసం అల్లాడిపోతున్నా..అవేమీ తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గట్టిగా నిలదీస్తే సెలవుల్లో ఉన్నట్లుగానో.. ఉన్నతాధికారుల పర్మిషన్‌తో పనిమీద బయటికెళ్లినట్లుగానో చెప్పుకొస్తున్నారు. ఇఎస్‌ఐ వైద్యుల నిర్వాకాన్ని..10 టీవీ బృందం గుట్టురట్టు చేసింది.  

19:08 - September 4, 2017

నిజామాబాద్ : నిజాం సాగర్‌ ప్రాజెక్ట్‌ గేటును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తివేశారు. దీంతో నీరు వృధా అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం మూడున్నర సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు 12వ నెంబరు గేటును స్వల్పంగా ఎత్తి వేశారు. అసలే నీళ్లు లేకుండా ఉన్న డ్యాంలో దుండగులు గేట్ ఎత్తివేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలా పట్టపగలే అనామకులు గేట్లను ఎత్తి వేయడం నీటి పారుదల శాఖ అధికారుల అలసత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిజాంసాగర్‌ డ్యాంపై పటిష్టమైన భద్రత లేకపోవడం మూలంగానే ఇలా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

19:06 - September 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం విధానం వల్ల పేదకుటుంబాలు ఛిద్రం అవుతున్నాయని మహిళా సంఘాల నేతలు విమర్శించారు. హైదరాబాద్‌లోని కోఠీ ఉమెన్స్‌కాలేజీ దగ్గర మహిళలు ధర్నా నిర్వహించారు. వచ్చే నెలలో తీసుకు రానున్న కొత్త మద్యం పాలసీని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. లేకుంటే మద్యం పాలసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఎనిమిది మహిళా సంఘాలు పాల్గొన్నాయి. 

19:05 - September 4, 2017

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ మహాగణపతిని ఈరోజు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలో ఆకలి బాదలు లేకుండా.. అవినీతికి తావులేకుండా ఉండాలని అన్నారు. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంట కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. 

19:03 - September 4, 2017

హైదరాబాద్ : భాగ్య నగరంలో గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని... సిటీ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి తెలిపారు.. నిమజ్జనం భద్రతా విధుల్లో 24వేల మంది పోలీసులున్నారని చెప్పారు.. అత్యాధునిక టెక్నాలజీతో భద్రతను పర్యవేక్షిస్తామని సీపి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేశాం : తలసాని

హైదరాబాద్ : రేపు జరగబోయే వినాయకనిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తైయయాని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 2400 పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

17:50 - September 4, 2017

హైదరాబాద్ : కంచె చేనుమేసినట్లుగా..టీఎన్ జీవోస్ హౌసింగ్‌ సొసైటీ భూములను అధ్యక్ష, కార్యదర్శులే కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. ఒక్క సొసైటీ భూములే కాదు.. మరో 30 ఎకరాల భూమిని కూడా స్వాహా చేసేందుకు పెద్ద స్కెచే వేశారట. పెద్దల అండదండలతో ప్లాట్లను విక్రయించేందుకు విఫలయత్నం చేశారు. రెవెన్యూ అధికారులు అడ్డుకుని కోర్టులో కేసు వేసినా.. ప్లాట్ల అమ్మకాలు, ఇళ్ల నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు.  

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, పలు ఇండస్ట్రీలు హైదరాబాద్‌ శివారులో ఏర్పాటు కావడంతో..కాటేదాన్‌ భూములు కోట్లు పలికాయి. దీంతో టీఎన్‌జీఓఎస్‌ హౌసింగ్‌ సొసైటీకి ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల భూములపై కబ్జాసురుల కన్నుపడింది. పక్కనే ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేసి 130 ఎకరాల్లో ప్లాట్లు చేశారు. సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులే ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో రెవెన్యూ అధికారులు టీఎన్జీవో హౌసింగ్‌ సొసైటీపై కేసు వేశారు. ప్రస్తుతం హైకోర్టులో ఈ కేసు నడుస్తోంది. వాస్తవానికి కేసు కోర్టులో ఉన్నప్పుడు సదరు స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఇందులో ప్లాట్ల అమ్మకాలు, ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. 

కాటేదాన్‌ టీఎన్‌జీఓఎస్‌ హౌసింగ్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శిగా ఆర్‌. పెంటయ్య నియామకంతోనే అక్రమాలకు తెరలేచినట్లు ఆరోపణలున్నాయి. రెండేళ్లకోసారి హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నామమాత్రపు ఎన్నికలు నిర్వహించి ఆయనే ప్రధాన కార్యదర్శిగా 20 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అతని బంధువుల పేరు మీద 40 ప్లాట్లు ఈ సొసైటీలో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణ ఉద్యోగి అయిన పెంటయ్య సొసైటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టాక కోట్లకు పడగెత్తాడన్న అరోపణలు ఉన్నాయి.

30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి ప్లాట్లు చేసిన సొసైటీ కమిటీ నిర్వాకాన్ని 2007లో సీపీఎం సభ్యులు నిలదీశారు.  ఈస్థలంలో 15 రోజులపాటు భూ పోరాటం చేశారు. పేదలతో గుడిసెలు వేయించగా.. వాటిని రెవెన్యూ అధికారులు, పోలీసులు తొలగించారు. 37 మంది సీపీఎం నాయకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కబ్జాకోరులనుంచి తమ భూములను కాపాడాలని టీఎన్జీవో సొసైటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

17:01 - September 4, 2017
17:00 - September 4, 2017

కృష్ణా : జిల్లా, గూడూరులో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే భార్యను చంపేశాడు భర్త నాగరాజు. భార్య యార్లగడ్డ నాగమమత మృతదేహాన్ని గోనసంచిలో కట్టి ఇంటి వెనుక భాగంలో పాతిపెట్టాడు. నాగమమత కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు నాగరాజుపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు తనిఖీలు నిర్వహించి, గోనెసంచిని వెలికితీశారు. నాగరాజుపై కేసు నమోదు చేసుకొన్నట్లు తెలిపారు. 

16:58 - September 4, 2017

ఖమ్మం : జిల్లా కొత్తగూడెంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. సుజాత నగర్‌ వద్ద ఆగివున్న లారీని, ఆర్టీసీ బస్సు వెనక నుండి ఢీ కొంది. దీంతో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సు నడపడంవల్లే ప్రమాదం సంభవించిందని బాధితులు తెలిపారు. 

నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు - తలసాని..

హైదరాబాద్ : మంగళవారం నాడు జరిగే నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తలసాని వెల్లడించారు. ప్రభుత్వం తరపున అన్ని డిపార్ట్ మెంట్ లను అలర్ట్ చేయడం జరిగిందని, ఉదయం 6 నుండి నిమజ్జనం కార్యక్రమం మొదలవుతుందన్నారు. ఎవరైనా వదంతులు క్రియేట్ చేస్తే నమ్మవద్దని, భద్రత నిమిత్తం 800 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

16:57 - September 4, 2017

మెదక్ : ప్రభుత్వ కార్యక్రమాల్లో టి.ఆర్.ఎస్ నేతల వేదికలెక్కి కూర్చుంటున్నారు. నర్సాపూర్‌లో జరిగిన 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్ వేదికపై కూర్చున్నారు. సాక్షాత్తు మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలోనే జరగటం విశేషం. 

16:55 - September 4, 2017

తూర్పుగోదావరి : జిల్లా బిక్కవోలు గాయత్రి బయో ఆర్గానిక్‌ కంపెనీ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. ఐదు నెలలనుంచి జీతాలు ఇవ్వలేదని ఆరోపించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఫ్యాక్టరీ అధికారులను నిర్భంధించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:16 - September 4, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తాజా చిత్రం టైటిల్ పై ఉత్కంఠ నెలకొంటోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా కొనసాగుతున్న చిత్ర షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతోంది. ‘కాటమరాయుడు' డిజాస్టర్ అనంతరం 'పవన్' నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేమ..వినోదాత్మక అంశాలకు ఫ్యామిలీ అంశాలను మిళితం చేసి యాక్షన్ కు కూడా తగిన ప్రాధాన్యతనివ్వనున్నట్లు టాక్.

ఇటీవలే సినిమాకు సంబంధించిన ఓ టీజర్ ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరో ఫొటోను రిలీజ్ చేసింది. ఈ ఫొటోలో పవన్..కీర్తి సురేష్ లు ఆకట్టుకొనే విధంగా ఉన్నారు. షూటింగ్ కొనసాగుతున్నా చిత్ర టైటిల్ ను మాత్రం ప్రకటించలేదు. టైటిల్ విషయంలో చిత్ర బృందం తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంజినీర్ బాబు, దేవుడే దిగి వచ్చినా, ‘అజ్ఙాత వాసి' అనే టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో 'అజ్ఞాత వాసి'కి మొగ్గు చూపుతున్నట్లు టాక్. చిత్ర బృందం ఏ టైటిల్ ను పెడుతుందోనని అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నూతన సంవత్సరంలో సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. పవన్ సరసన కీర్తితో పాటు అనూ ఇమ్మాన్యుయేల్ కూడా నటిస్తోంది. ఇతర ముఖ్యపాత్రల్లో ఆది పినిశెట్టి, ఖుష్బూ తదితరులు నటించనున్నారు. 

16:08 - September 4, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహరెడ్డి' పై సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ‘ఖైదీ నెంబర్ 150' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన 'చిరు' 151వ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను సురేంద్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ తేజ నిర్మిస్తున్నారు.

ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న చిత్రం మోషన్ పిక్చర్ కూడా రిలీజ్ చేసింది. అనంతరం సినిమాలో ఎవరు నటించనున్నారనే దానిపై కూడా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో నయనతార, అమితాబ్ బచ్చన్ తదితర ప్రముఖ నటులు నటించనున్నారు. భారీ బడ్జెట్ తో చిత్రం రూపొందనుంది. చారిత్రక నేపథ్యం ఉన్న మూవీ కావడంతో చిత్ర బృందం అన్ని జాగ్రత్తలు తీసుకొంటోంది.

భారీ సెట్టింగ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ కృషి చేస్తున్నారు. అందులో భాగంగా 1840లో సామాజిక వాతావరణం ఎలా ఉందో అలాంటి సెట్టింగ్ ను రూపకల్పన చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్. ఇందుకు కొన్ని ఆధారాలను సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ కాలానికి చెందినటువంటివిగా అనిపించే భారీ సెట్టింగ్స్ ను వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సెట్టింగ్ ను హైదరాబాద్, రాజస్థాన్, పొల్లాచ్చిలలో వేస్తారని సమాచారం. 

పటిష్ట భాగస్వామ్యం కీలకం - మోడీ..

బీజింగ్ : సుస్థిర అభివృద్ధికి పటిష్ట భాగస్వామ్యం కీలకమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. బ్రిక్స్ దేశాల మధ్య మరింత పటిష్ట భాగస్వామ్యం అవసరమని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బ్రిక్స్ రేటింగ్ సంస్థ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ..ప్రైవేటు సంస్థల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు బ్రిక్స్ రేటింగ్ సంస్థ అని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ఈ దేశాలు కృషి చేస్తున్నాయని వెల్లడించారు. 

ఉగ్రవాదంపై బ్రిక్స్ దేశాల ఆందోళన..

బీజింగ్ : ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న ఉగ్రదాడులపై బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కఠినంగా వ్యవహరించాలని బ్రిక్స్ దేశాలు అభిప్రాయానికి వచ్చాయి. ఉత్తర కొరియా అణు పరీక్షను ఖండించాయి. బ్రిక్స్ ఆర్థిక, సాంకేతిక సహకార ప్రణాళికకు చైనా రూ. 487 కోట్లు సమకూర్చనున్నట్లు చైనా అధ్యక్షుడు ప్రకటించారు. బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకు ప్రాజెక్టులకు రూ. 26 కోట్లను చైనా ఇవ్వనుంది. 

'ఘాట్ రోడ్డు మీదుగానే దుర్గమ్మ దర్శనం'..

విజయవాడ : దుర్గగుడి పాలక మండలి సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. టికెట్ల విక్రయ పోస్టర్ ను దుర్గగుడి ఛైర్మన్ గౌరంగ బాబు, ఈవో సూర్యకుమారి విడుదల చేశారు. దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, ఢిల్లీలోని ఏపీ భవన్ లో అమ్మవారి పూజలకు ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. దసరా ఉత్సవాల్లో ఘాట్ రోడ్డు మీదుగానే దుర్గమ్మ దర్శనానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఉత్సవాల పూర్తి ఏర్పాట్లను వివరించడం జరుగుతుందన్నారు. 

15:44 - September 4, 2017

ఢిల్లీ : కోల్‌ స్కాంలో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్‌ జిందాల్‌ సహా మరో ముగ్గురికి సిబిఐ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 31కి వాయిదా వేసింది. మధ్యప్రదేశ్‌లోని ఉర్తన్‌ నార్త్‌ కోల్‌ బ్లాక్ కేటాయింపులో అవకవతవకలు జరిగినట్లు జిందాల్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన సిబిఐ జిందాల్ సహా పలువురి పాత్రను వెలుగులోకి తీసుకొచ్చింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ సహా 5 కంపెనీల పేర్లు కూడా ఛార్జిషీటులో చేర్చింది. జిందాల్‌స్టీల్‌ పవర్‌ లిమిటెడ్‌ మాజీ డైరక్టర్‌ సుశీల్‌ మర్రూ, మాజీ మేనేజింగ్‌ డైరక్టర్‌ ఆనంద్‌ గోయల్, సీఈవో విక్రాంత్‌ గుజ్రాల్‌లను సిబిఐ నిందితులుగా పేర్కొంది. జార్ఖండ్‌ అమరకొండ ముర్గదంగల్‌ కోల్‌ బ్లాక్ కేటాయింపుల్లో కూడా జిందాల్‌ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

15:43 - September 4, 2017

అనంతపురం : జిల్లా హిందూపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు.ఎమ్మెల్యే బాలకృష్ణ... హిందూపురంలో పర్యటించిన బాలయ్య... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.. కోటి ముప్పై లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఆర్ టీవో కార్యాలయాన్ని ప్రారంభించారు.. 23 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన కూరగాయల మార్కెట్‌కు భూమి పూజ చేశారు.. ఈ కార్యక్రమంలో ఎంపీ నిమ్మల కిష్టప్ప పాల్గొన్నారు.

15:42 - September 4, 2017

హైదరాబాద్ : న్నికల్లో డబ్బు పంచిన టీడీపీ నేతలు .. లెక్కపత్రాలు సరిచూసుకునేందుకే గుంటూరులో ప్రత్యేకంగా సమావేశమయ్యారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీస్‌, పొలిటికల్‌, మనీ మేనేజ్‌ మెంట్‌ చేసిన చంద్రబాబు నంద్యాల , కాకినాడలో ఓట్లను కొనుక్కోవడంలో సక్సెస్‌ అయ్యారని ఆయన విమర్శించారు. పోలీస్‌ యంత్రాంగాన్ని వాడుకుని నంద్యాల్లో గెలిచిన టీడీపీ వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటే అది భ్రమేనన్నారు అంబటి రాంబాబు. 

15:41 - September 4, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ బారాముల్లా జిల్లా సోపోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోపోర్‌లోని చెక్‌-ఎ-బ్రాత్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతాదళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమైనట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారన్నది గుర్తించాల్సి ఉంది. 

15:40 - September 4, 2017

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో చిన్నారులు మృత్యువాత పడిన మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫరూఖాబాద్‌లోని రామ్‌ మనోహర్‌ లోహియా జిల్లా ఆసుపత్రిలో గత ఆగస్టు నెలలో 49 మంది చిన్నారులు మృతిచెందారు. ఆక్సిజన్‌, మందుల కొరతతోనే పిల్లలు మృతిచెందినట్లు అధికారుల విచారణలో తేలింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వ యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ ఘటనలో ఉన్నతాధికారులు సహా వైద్యులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. డిఎం, సీఎంవో, సీఎంఎస్‌ అధికారులను సస్పెండ్‌ చేశారు. గోరఖ్‌పూర్‌ బిఆర్‌డి ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక 30 మంది పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే.

15:38 - September 4, 2017

కృష్ణా : తన తండ్రిని విమర్శిస్తే సహించబోమని వంగవీటి రంగా తనయుడు, వైసీపీ నేత రాధాకృష్ణ హెచ్చరించారు. చనిపోయిన తన తండ్రిపై గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలను రాధ తప్పుపట్టారు. రంగానే విమర్శించే స్థాయి గౌతంరెడ్డికి లేదని రాధ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

కేజ్రీకి జరిమాన విధించిన హైకోర్టు..

న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అక్కడి రాష్ట్ర హైకోర్టు జరిమాన విధించింది. అరుణ్‌ జైట్లీ దాఖలు చేసిన రూ. 10కోట్ల పరువు నష్టం దావాకు బదులివ్వనందుకు కేజ్రీవాల్‌కు మరోసారి ఢిల్లీ హైకోర్టు రూ. 5వేల జరిమానా విధించింది.

పోలవరం ముంపు బాధితుల ఆందోళన..

పశ్చిమగోదావరి : ఏలూరు కలెక్టరేట్ ఆఫీసు ఎదుట పోలవరం ముంపు బాధితులు ఆందోళన నిర్వహించారు. అన్ని అర్హతలున్నా పరిహారం జాబితా నుండి తమను తొలగించారంటూ కుక్కునూరు మండలంలోని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. వీరిన పోలీసులు అడ్డుకున్నారు.

 

 

ఎంపీ బీబీ పాటిల్ భూములు కాజేశారని...

సంగారెడ్డి : కంతి (మం) జోధిలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అక్రమంగా భూములు కాజేశారని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. మద్దతుగా నిలిచిన సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

వైసీపీని తక్కువ అంచనా వేయొద్దన్న అంబటి..

హైదరాబాద్ : ఒక్క ఉప ఎన్నికలో ఓటమితో వైసీపీని తక్కువ అంచనా వేయొద్దని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు సూచించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీదే విజయమని, నంద్యాల ఉప ఎన్నికల్లో సీఎం చంద్రబాబు మనీ మేనేజ్ మెంట్ చేశారని ఆరోపించారు.

14:56 - September 4, 2017

భార్య అనుమతి లేకుండా భర్త శృంగరానికి పాల్పడితే అది అత్యాచారం కాదని కేంద్రప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై మాట్లాడానికి సామాజికవేత దేవిగారు టెన్ టివి మానవికి వచ్చారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

14:21 - September 4, 2017

మొదలైన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లు..

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జన ఏర్పాట్లు మొదలయ్యాయి. అర్ధరాత్రి వరకే భక్తులకు దర్శనం కల్పించనున్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు శోభయాత్ర ప్రారంభం కానుంది. నాలుగో నెంబర్ క్రేన్ వద్ద నిమజ్జనం జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల్లోగా నిమజ్జనం జరిపించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మంగళవారం గణేష్ నిమజ్జనం...

హైదరాబాద్ : రేపు గణేష్ నిమజ్జనం జరుగనుంది. గణేష్ మహా శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 26వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. సీసీ కెమెరాలను డీజీపీ కార్యాలయానికి అనుసంధానం చేసి పర్యవేక్షణ చేయనున్నట్లు, ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. 

స్టార్ ఇండియా చేతికి ఐపీఎల్ మీడియా రైట్స్..

ఢిల్లీ : స్టార్ ఇండియా ఐపీఎల్ మీడియా రైట్స్ దక్కించుకుంది. వచ్చే ఐదు సంవత్సరాలకు రూ. 16347.50 కోట్లను చెల్లించనుంది. 

బాధ్యతలు చేపట్టిన అశ్వినీ కుమార్ చౌబే..

ఢిల్లీ : బీహార్‌కు చెందిన అశ్వినీ కుమార్‌ చౌబే ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే. 

ఘనంగా ఓనమ్ పండుగ..

కేరళ : ఓనమ్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. తిరువంతపురంలో కలర్ పుల్ ముగ్గులు, డ్యాన్స్ లు వేసుకుంటూ సందడిగా పండుగను జరుపుకుంటున్నారు. ఓనమ్ పండుగ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 

బ్లూ వేల్ గేమ్ పై మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..

చెన్నై : ఎంతో మందికి ఆత్మహత్యలకు కారణమౌతున్న బ్లూ వేల్ గేమ్ పై మద్రాస్ హైకోర్టు స్పందించింది. మధురై బెంచ్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో బ్లూ వేల్ గేమ్ లింక్స్ లన్నింటినీ తొలగించాలని, సెప్టెంబర్ 8వ తేదీన వివరణనివ్వాలని సూచించింది. 

టీఎంసీ ఎంపీ కన్నుమూత..

కోల్ కతా : టీఎంసీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగానే ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

నవీన్ కు బెయిల్ మంజూరు..

ఢిల్లీ : బొగ్గు కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్న పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ కు ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మధ్యప్రదేశ్ కోల్ బ్లాక్ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 

13:53 - September 4, 2017
13:51 - September 4, 2017

విశాఖ : జిల్లాలోని విశాలక్ష్మినగర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్‌ ప్రహరీగోడ కూలి బాలుడు మృతి చెందాడు. 

13:50 - September 4, 2017

హైదరాబాద్ : కంచె చేనుమేసినట్లుగా..టీఎన్ జీవోస్ హౌసింగ్‌ సొసైటీ భూములను అధ్యక్ష, కార్యదర్శులే కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. ఒక్క సొసైటీ భూములే కాదు.. మరో 30 ఎకరాల భూమిని కూడా స్వాహా చేసేందుకు పెద్ద స్కెచే వేశారట. పెద్దల అండదండలతో ప్లాట్లను విక్రయించేందుకు విఫలయత్నం చేశారు. రెవెన్యూ అధికారులు అడ్డుకుని కోర్టులో కేసు వేసినా.. ప్లాట్ల అమ్మకాలు, ఇళ్ల నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు.  

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, పలు ఇండస్ట్రీలు హైదరాబాద్‌ శివారులో ఏర్పాటు కావడంతో..కాటేదాన్‌ భూములు కోట్లు పలికాయి. దీంతో టీఎన్‌జీఓఎస్‌ హౌసింగ్‌ సొసైటీకి ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల భూములపై కబ్జాసురుల కన్నుపడింది. పక్కనే ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేసి 130 ఎకరాల్లో ప్లాట్లు చేశారు. సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులే ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో రెవెన్యూ అధికారులు టీఎన్జీవో హౌసింగ్‌ సొసైటీపై కేసు వేశారు. ప్రస్తుతం హైకోర్టులో ఈ కేసు నడుస్తోంది. వాస్తవానికి కేసు కోర్టులో ఉన్నప్పుడు సదరు స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఇందులో ప్లాట్ల అమ్మకాలు, ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. 

కాటేదాన్‌ టీఎన్‌జీఓఎస్‌ హౌసింగ్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శిగా ఆర్‌. పెంటయ్య నియామకంతోనే అక్రమాలకు తెరలేచినట్లు ఆరోపణలున్నాయి. రెండేళ్లకోసారి హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నామమాత్రపు ఎన్నికలు నిర్వహించి ఆయనే ప్రధాన కార్యదర్శిగా 20 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అతని బంధువుల పేరు మీద 40 ప్లాట్లు ఈ సొసైటీలో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణ ఉద్యోగి అయిన పెంటయ్య సొసైటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టాక కోట్లకు పడగెత్తాడన్న అరోపణలు ఉన్నాయి.

30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి ప్లాట్లు చేసిన సొసైటీ కమిటీ నిర్వాకాన్ని 2007లో సీపీఎం సభ్యులు నిలదీశారు.  ఈస్థలంలో 15 రోజులపాటు భూ పోరాటం చేశారు. పేదలతో గుడిసెలు వేయించగా.. వాటిని రెవెన్యూ అధికారులు, పోలీసులు తొలగించారు. 37 మంది సీపీఎం నాయకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కబ్జాకోరులనుంచి తమ భూములను కాపాడాలని టీఎన్జీవో సొసైటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

 

13:47 - September 4, 2017

హైదరాబాద్ : దుడ్డు ఎవడి చేతిలో ఉంటే..దున్న వాడిదే అన్నట్లు.. హైదరాబాద్‌ శివారులో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. కండ బలం.. అండ బలంతో అక్రమార్కులు ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు. ఎక్కడ సెంటు భూమి కనబడితే.. అక్కడ పాగా వేస్తున్నారు. 

ఇదీ.. హైదరాబాద్‌ శివారులోని కాటేదాన్‌లో కోట్ల విలువైన టిఎన్జీవో సంఘం భూములు స్వాహా అవుతున్నాయి. ఇప్పుడా భూములు కబ్జా కోరుల చేతుల్లో ఆక్రమణకు గురవుతున్నాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఏర్పడ్డాక ఈ భూములకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఎకరా కోట్లలో పలుకుతుండటంతో.. ఇక్కడ భూ కబ్జాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నా.. అక్కడ భూ అక్రమణలు సర్వసాధారణంగా మారాయి. 

1967లో రాజేంద్రనగర్ మండలం కాటేదాన్ ప్రాంతంలో 100 ఎకరాల భూమిని టిఎన్ జిఓ సంఘానికి అప్పటి ప్రభుత్వం కేటాయించింది. నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల కోసం కేటాయించిన భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి. స్థానిక నాయకులు దర్జాగా కబ్జాచేసి విక్రయిస్తున్నారు. సొసైటీ భూములతోపాటు సమీపంలోని ప్రభుత్వ భూమిని స్వాహా చేస్తున్నారు. కబ్జా చేసి ఏకంగా ఇళ్లే నిర్మిస్తున్నారంటే కబ్జాకోరుల బరితెగింపు ఏపాటిదో అర్థమవుతోంది. ఇంతజరుగుతున్నా అధికారులు కానీ, హౌసింగ్‌ సొసైటీ సభ్యులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. 

హైదరాబాద్‌లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు 1967లో తెలంగాణ టీఎన్‌జీవోఎస్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ బిల్డింగ్‌ సొసైటీ లిమిటెడ్‌ను స్థాపించారు. వీరంతా ఇళ్ల స్థలాల కోసం 1968లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా.. అప్పటి ప్రభుత్వం 12 జూన్‌ 1968న జీవో 644 విడుదల చేసింది. మైలార్‌దేవ్‌పల్లి కాటేదాన్‌లోని సర్వే నెం.156/1లో 50 ఎకరాల స్థలం హౌసింగ్‌ సొసైటీకి కేటాయించింది. స్థలం సరిపోదని తిరిగి దరఖాస్తు చేసుకోవడంతో అదే సర్వేనెంబర్‌లో మరో 50 ఎకరాలు సర్కార్ కేటాయించింది. అప్పటి మార్కెట్‌ విలువ కంటే తక్కువ ధరకు ఎకరానికి రెండు వేలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే భూమి నగరానికి చాలా దూరంలో ఉందని, కనీస సౌకర్యాలు లేవన్న తప్పుడు సమాచారంతో..ఎకరాకు 200 చొప్పున 20 వేలు చెల్లించారు.

13:44 - September 4, 2017

కర్నూల్‌ : జిల్లా ఎమ్మిగనూరు మండలం బసవాసిలో జంటహత్యలు కలకలం రేపాయి. వివాహేతర సంబంధం హత్యలకు కారణంగా తెలుస్తోంది. ఆదోని పట్టణానికి చెందిన బోయ నాగేంద్రకు అదే పట్టణానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.. విషయం తెలుసుకున్న మహిళ బంధువులు నాగేంద్రను కిడ్నాప్‌నకు ప్రయత్నిస్తుండగా తమ్ముడు నరేష్‌ అడ్డురావడంతో కత్తితో దాడి చేశారు. గాయపడ్డ తమ్ముడిని కర్నూల్‌ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగేంద్రను తీసుకెళ్లి చంపి బనవాసి గ్రామ పరిధిలో  పెట్రోల్‌ పోసి తగుల పెట్టారు. నాగేంద్ర శరీరం పూర్తిగా కాలి బూడిద అయ్యింది. చేతికి ఉన్న కడియం ఆధారంగా బంధువులు నాగేంద్రగా గుర్తుపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

13:42 - September 4, 2017

విజయవాడ : వంగవీటి రంగాను విమర్శిస్తే ఊరుకునేదిలేదని వైసీపీ నేత వంగవీటి రాధ  హెచ్చరించారు. తన తండ్రిని తప్పుపట్టే స్థాయి గౌతంరెడ్డికి లేదన్నారు. గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రంగా అభిమానులు బాధపడ్డారని చెప్పారు.  రంగాకు అన్ని పార్టీల్లో అభిమానులు ఉండారన్నారు. తన తల్లి రత్నకుమారిని అరెస్టు చేసే సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన పోసులు తీరును రాధ తప్పుపట్టారు. 

 

13:35 - September 4, 2017
13:34 - September 4, 2017

డేరా సచ్చా సౌదా ఆశ్రమంలో గన్నుల గుట్టలు ?

ఉత్తర్ ప్రదేశ్ : డేరా సచ్చా సౌద ఆశ్రమంలో గన్నుల గుట్టలు బయటపడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. సోమవారం పోలీసులు జరిపిన సోదాలో అత్యాధునిక ఆయుధాలు లభ్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏకే 47 నుండి స్పైపర్ గన్స్ వరకు డెన్ నిండా ఆయుధాలున్నట్లు సమాచారం. 

కుప్పకూలిన లిఫ్ట్..

లక్నో : జిల్లా కోర్టు వజ్రిగంజ్ లో లిఫ్ట్ కుప్పకూలింది. ఈఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

13:21 - September 4, 2017

విజయవాడ : నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వైసీపీ అధినేత జగన్‌లో మార్పురాలేదుని ఏపీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. అన్ని కార్యక్రమాలను  అభివృద్ధి నిరోధకుడుగా మారారని మండిపడ్డారు. ఈనెల రెండో వారం నుంచి చేపట్టే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమలో జగన్‌ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టు దేవినేని చెబుతున్నారు. 

 

13:18 - September 4, 2017

సన్నని చినుకులు పడుతుంటే ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది. ఎప్పుడూ మిరపకాయ బజ్జీలు..పకోడీ..సమోసాలేనా..? అనుకుంటుంటారు. మొక్కజొన్న పొత్తు తింటే ఆ రుచే వేరు. రుచితో పాటు ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు శరీరానికి అందిస్తుంది. ఎర్రని నిప్పుల మీద పొత్తు కాలుస్తుంటే వచ్చే ఆ కమ్మటి వాసనకు చాలా మంది ఫిదా అయిపోతుంటారు.

మొక్కజొన్న సూప్ తాగినా సలాడ్ గా తిన్నా..ఏ రూపంలో తీసుకున్నా దాని రుచే వేరు. తాజాగా ఉడికించి తింటే ఏ రకం మొక్కజొన్న అయినా మంచిదే. ఇందులో శక్తివంతమైన ఎ, బి, సి, ఇ విటమిన్లు కొన్ని ఖనిజాలు కూడా లభ్యమౌతాయి. ఓ కప్పు కార్న్ లు తింటే అవసరమైన పీచు అందుతుంది. గర్భిణీలకు అవసరమైన ఫోలేట్ శాతం కూడా మొక్కజొన్నల్లో ఎక్కువగా లభిస్తుంది. ఫాస్పరస్ మూత్ర పిండాల పనితీరుకి తోడ్పడితే మెగ్నీషియం ఎముక బలాన్ని పెంచుతుంది. మొక్కజొన్న తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు మలబద్దకాన్ని నివారిస్తాయి. నీళ్ల విరేచనాలు, ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌) వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ఆల్జీమర్స్, మధుమేహం, బీపీ, హృద్రోగాలను నివారిస్తాయి. కార్న్ లోని ఐరన్ రక్త హీనతనీ తగ్గిస్తుంది. మెగ్నీషియమ్‌ మంచి గుండె ఆరోగ్యంతో, ఎముకలకు బలాన్నిస్తుంది.

13:16 - September 4, 2017

జపాన్ : మహిళా వివక్ష మనదేశంలోనే కాదు.. జపాన్‌లోనూ ఉంది. జపాన్‌ రాజకుమారి మాకో ఓ సామాన్యుణ్ని ప్రేమించి, పెళ్లి చేసుకోబోతున్నారు. ఇందుకు రాజకుటుంబం ఒప్పుకున్నా.. ఇకపై ఆమె రాచరికపు హోదాను కోల్పోబోతున్నారు. అదే యువరాజు సామాన్య స్త్రీని వివాహం చేసుకుంటే అతని రాజరికపు హోదా కోల్పోయే అవకాశం ఉండదు. అక్కడి రాజరికపు చట్టాల్లోనూ మహిళపట్ల వివక్షను కల్పిస్తున్నాయి. 

రాజకుటుంబాల్లో కట్టుబాట్లు, సంప్రదాయాలు ఎక్కువ. దర్జా, దర్పం, హోదా  వ్యత్యాసాలు ఉంటాయి. ఇటువంటి కుటుంబంలో పుట్టిన జపాన్‌ రాజకుమారి మాకో కట్టుబాట్లు, సంప్రదాయాలు, హోదా.. అన్నింటిని పక్కన పెట్టి ప్రేమ  వివాహం చేసుకోబోతున్నారు. అదీ కూడా ఓ సామాన్యుణ్ని వలచి, వరించబోతున్నారు. టోక్యోలోని అంత్జాతీయ క్రిస్టియన్‌ యూనివర్సిటీలో చదివిన తన సహచర విద్యార్థి- కీ కుమురోను పెళ్లాడనున్నారు. 

జపాన్‌ రాజవంశంలో మహిళలు సింహాసనం అధిష్టించే అవకాశంలేదు. పురుషులే సింహాసనానికి అర్హులవుతారు. అయితే రాజకుటుంబంలోని మహిళలు  కట్టుబాట్లు, సంప్రదాయాలకు లోబడి పెళ్లిల్లు చేసుకుంటే రాయల్‌ హోదా పొందుతారు. లేకపోతే రాజకుమారి హోదా కోల్పోతారు. కీ కుమురోను ప్రేమించి, పెళ్లి చేసుకోబోతున్న మాకో కూడా రాయల్‌  స్టేటస్‌ను వదులుకునేందుకు సిద్ధమయ్యారు. రాజకుటుంబంలోని పురుషులకు ఈ నిబంధన వర్తించదు. రాయల్‌ ఫ్యామిలోని పురుషులు సామాన్య మహిళలను  పెళ్లి చేసుకున్నా  ఆ మహిళలకు  రాజకుటుంబీకులపైపోతారు.  

మాకో, కీ కుమురులో నిశ్చితార్థం తర్వలో జరుగనుంది. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. కీ కుమురో 2013లో రాజకుమారి మాకోతో తన ప్రేమ గురించి చెప్పారు. ప్రస్తుతం మాకో బ్రిటన్‌లో, కీ కుమురో అమెరికాలో చదువుతున్నారు. 

వికారాబాద్ లో కారులో మంటలు..

మెదక్ : వికారాబాద్ కారులో మంటలు చెలరేగాయి. బస్టాండులో నిలిపిన ఇండికా కారులో మంటలు అంటుకున్నాయి. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

13:08 - September 4, 2017

మెదక్ : మంత్రుల రాక రోగులకు ప్రాణ సంకటంగా మారింది. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించేందుకు మంత్రులు లక్ష్మారెడ్డి, హరీశ్‌రావు వస్తున్నారని డాక్టర్లు వైద్యం చేయడం  మానేశారు. దీంతో రోగులు చెట్లు కింది పడిగాపులు కాయాల్సి వచ్చింది. పురటి నొప్పులతో బాధపడుతున్న మహిళలను డాక్టర్లు పట్టించుకోలేదు. మంత్రులకు సాదర స్వాగతం పలకాలన్న ఉద్దేశంతో వైద్యం మానేసిన డాక్టర్ల తీరుపై రోగులు బంధువులు మండిపడ్డారు. 

13:05 - September 4, 2017

కరీంనగర్ : మానకొండూరు ఘటనపై కరీంనగర్‌ జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎమ్మెల్యే రసమయి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం, దళిత సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీని.. సీఎం నెరవేర్చడం లేదని ఆరోపించారు. తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి... రాస్తారోకో చేపట్టారు. కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో వరంగల్‌-హైదరాబాద్‌-కరీంనగర్‌ రహదారిపై ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. 

 

నిలకడగా ధావన్ తల్లి ఆరోగ్యం..

ఢిల్లీ : అనారోగ్యంతో బాధ పడుతున్న క్రికెటర్ ధావన్ తల్లి సునయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. తల్లి అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు సమాచారం అందుకున్న ధావన్ శ్రీలంక పర్యటన నుండి మధ్యలోనే భారత్ కు వెనుదిరిగిన సంగతి తెలిసిందే. 

12:59 - September 4, 2017

హైదరాబాద్ : దళితులకు ఇచ్చే మూడెకరాల భూపంపిణీ జాబితాలో తమ పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసి.. తీవ్రగాయాలై యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మానకొండూరుకు చెందిన ఇద్దరు యువకులను టీ-మాస్‌ ఫోరం నేతలు పరామర్శించారు. ప్రభుత్వ వైఖరి వల్లే దళితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పలువురు నేతలు ఆరోపించారు. మూడెకరాల భూమి ఇవ్వకపోవడంతో నిన్న కరీంనగర్‌లో పరశురాములు, శ్రీనివాసులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు. యువకులను టీ-మాస్‌ ఫోరం నేతలు తమ్మినేని వీరభద్రం, ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపాటు పలువురు నేతలు పరామర్శించారు. ఆస్పత్రి ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఏపీ శాసనమండలి ఛైర్మన్ గా..

విజయవాడ : ఏపీ శాసనమండలి ఛైర్మన్ గా ఎన్ఎండీ ఫరూఖ్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వ శిక్షణా శిబిరంలో పేరును ప్రకటించారు. 

12:50 - September 4, 2017

హైదరాబాద్‌ : నగరంలోని ఏవీ కాలేజీ అక్రమాలకు నిలయంగా మారిపోయింది. సొసైటీ పేరుతో నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేయని పనులు చేసినట్లుగా చూపించి కోట్లు దండుకున్న వైనం బయటపడింది. ఫార్మసీ కాలేజీ పేరుతో బిల్డింగ్‌ కట్టకపోయినా కట్టినట్లు చూపించి అక్రమాలకు పాల్పడినట్లు బయటపడింది. ఆర్టీఐ చట్టం ద్వారా రూ.5.5 కోట్లు అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇంకా లోతుగా దర్యాప్తు చేపడితే మరిన్ని అక్రమాలు బయటపడతాయని పలువురంటున్నారు. అయితే.. సొసైటీలో పేరున్న నేతలు ఉండడంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏవీ కాలేజీ అక్రమాలపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే... పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:39 - September 4, 2017

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లా పాండవులగుట్టలో రాక్‌ క్లైబింగ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా నిర్వహించిన ఈ ఫెస్టివల్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రాక్‌ క్లైంబింగ్‌ ఫెస్టల్‌వకు వచ్చిన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి నడుంకు తాడుకట్టుకుని కొండలు ఎక్కారు. 

 

12:37 - September 4, 2017

గుంటూరు : జిల్లాలోని తాడికొండ మండలం పొన్నేకల్లులో బాలిక దీప్తి అదృశ్యం కేసు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. గోపి అనే యువకుడు కిడ్నాప్‌ చేసినట్లు బాలిక తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15రోజులైనా బాలిక ఆచూకీ దొరకకపోవడంతో దీప్తి తల్లిదండ్రులు సీఎంను కలిసేందుకు అమవరావతికి వచ్చారు. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేదంటూ పోలీసులు నిలిపివేయడంతో వారు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని కోరుతున్నారు. 

 

12:33 - September 4, 2017

కర్నూలు : ఆదిత్యనగర్‌లో రజని అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. డాక్టర్‌ చిరంజీవి నివాసంలో పని చేస్తున్న రజని... ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే రజని మృతిపై అనుమానాలు కొనసాగుతున్నాయి. పదో తరగతి చదవలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. రజని ప్రకాశం జిల్లా గిద్దలూరు బురుజూరు వాసిగా తెలుస్తోంది. 

'రంగా అభిమానులే సమాధానం చెబుతారు'..

విజయవాడ : రంగాను విమర్శిస్తే అభిమానులే సమాధానం చెబుతారని వంగవీటి రాధా పేర్కొన్నారు. రంగాను అభిమానించే వాళ్లు అన్ని పార్టీలో ఉన్నారని, చనిపోయిన వారి గురించి మాట్లాడటం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

యశోద ఆసుపత్రిలో టీ మాస్ ఫోరం నేతలు..

హైదరాబాద్ : మూడెకరాల భూమి ఇవ్వకపోవడంతో నిన్న కరీంనగర్ లో ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు. సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరుశురాములు, శ్రీనివాసులను టీ మాస్ ఫోరం నేతలు పరామర్శించారు. ఆసుపత్రి ఎదుట ప్రభుత్వానికి టీ మాస్ ఫోరం నేతలు నినాదాలు చేశారు. 

12:18 - September 4, 2017

ఢిల్లీ : బ్రిక్స్‌ దేశాలు అన్ని విషయాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చైనాలోని  జియామెన్‌లో జరుగుతున్న బ్రిక్స్‌ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు.  విద్య, వైద్యం, వాణిజ్యం, ఐటీ రంగాల్లో బ్రిక్స్ దేశాలు మరింత పటిష్టమైన సహకారం అవసరమని సూచించారు. యువశక్తి బ్రిక్స్‌ దేశాలకు ప్రధానమని, యువ వనరులను ఉపయోగించుకుంటే వచ్చే దశాబ్ది మనదేని  మోదీ చెప్పారు. 

 

హిందూపురంలో బాలయ్య పర్యటన..

అనంతపురం : హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. రూ. 23 కోట్లతో నిర్మించనున్న కూరగాయల మార్కెట్ కు బాలకృష్ణ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా పాల్గొన్నారు. 

2019లో అధికారంలో బీజేపీ - లక్ష్మణ్..

జనగామ : వచ్చే ఏడాది సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నేత లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లేకుంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని నిమజ్జనం చేస్తామని, కేసీఆర్ ప్రభుత్వం అమరుల త్యాగాలను విస్మరించిందన్నారు. కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందని, తెలంగాణ పోరాట కేంద్రాలు సందర్శించి భావితరాల్లో స్పూర్తినింపేందుకు అమరుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని, 2019లో అధికారంలోకి తామే వస్తామని జోస్యం చెప్పారు. 

12:15 - September 4, 2017

ఒడిశా : ఏనుగుతో సెల్ఫీ దిగాలన్న సరదా ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. ఓ ఆడ ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మండియాకుడ్‌ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయని తెలుసుకున్న కటక్‌ వాసి అశోక్‌ భారతి అక్కడకు చేరుకున్నాడు. గ్రామస్థుల సహకారంతో అటవీశాఖ అధికారులు ఏనుగును తరుముతుండా అశోక్‌ భారతి ఫోటోలు తీశాడు. ఆ తర్వాత ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండా ఆగ్రహించిన ఏనుగు.. అశోక్‌ను అశోక్‌ భారతిని వెంటాడి కాళ్లతో, తొండంతో నలిపేసింది. ఏనుగుబారి నుంచి తప్పించుకునే పారిపోయేందుకు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఏనుగు తొక్కేడంతో తీవ్రంగా గాయపడ్డ అశోక్‌ భారతిని అస్పత్రికి తరలించిగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. 

12:14 - September 4, 2017

బాలీవుడ్ నటి 'కంగనా రనౌత్' ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేయడం ఈమె ప్రత్యేకత. ఎవరైనా అనుకుంటారేమోనన్న భయం ఆమెలో కనిపించదు. నటనలో కూడా ప్రత్యేకతను చాటుకుంటుంది. 'క్వీన్‌', 'తను వెడ్స్‌ మను' లాంటి చిత్రాలతో నాయిక ప్రాధాన్య చిత్రాల సత్తా ఏంటో బాక్సాఫీసుకు తెలియజెప్పింది కంగనా. తాజాగా ఆమెపై పలు వార్తలు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ హీరో 'హృతిక్ రోషన్'పై ఆమె చేసిన వార్తలు వివాదాస్పదమౌతున్న సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం 'సిమ్రన్' ప్రమోషన్స్ లో భాగంగా మరో బాంబ్ పేల్చింది. ఆదిత్య పంచోలి తనను తీవ్రంగా హింసించే వాడని..అపుడు తాను మైనర్ కావ‌డం వ‌ల‌న‌, ఏం చేయాలో అర్థం అయ్యేది కాదని తెలిపింది. సినిమా షూటింగ్‌లో పాల్గొన్న‌ప్పుడు ఆదిత్య త‌న‌ని ర‌క్తం వచ్చేలా కొట్టాడని, ఈ విష‌యాన్ని త‌న భార్య జ‌రీనా వాహ‌బ్‌కి చెబితే తాను ఏ స‌హాయం చేయ‌క సైలెంట్‌గా ఉండేద‌ని చెప్పింది. పోలీసులకు ఆనాడే ఫిర్యాదు చేద్దామని అనుకున్నా..తన తల్లిదండ్రుల గురించి ఆలోచించి అలా చేయలేదన్నారు. కానీ ఆ తరువాత ధైర్యం చేసి పోలీసులకు చెప్పగా జస్ట్ అతడిని పిలిచి వార్నింగ్ ఇచ్చినట్లు కంగనా వెల్లడించింది. మ‌రి అప్పటి వివాదాన్ని కంగనా ఇప్పుడు ఎందుకు తెరమీదకు తెచ్చిందో అర్థం కావడం లేదని ముచ్చటించుకుంటున్నారు. 

12:10 - September 4, 2017

మానకొండూరు బాధితులకు తమ్మినేని పరమార్శ..

హైదరాబాద్ : సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మానకొండురు బాధితులను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జాన్ వెస్లీ, విమలక్క, ప్రొ.పీఎల్.విశ్వేశ్వరరావు, సుజాత లు పరామర్శించారు. మూడెకరాల భూమి కోసం నిన్న మానకొండూరులో ఆత్మహత్యకు శ్రీనివాస్, పరుశురాములు యత్నించిన సంగతి తెలిసిందే. 

మా కూతురు ఆచూకీ చెప్పండి...

విజయవాడ : తమ కూతురు దీప్తి అదృశ్యంపై సీఎం చంద్రబాబును కలిసేందుకు హ్యాపీ రిసార్ట్స్ కు తల్లిదండ్రులు చేరుకున్నారు. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో బాధితులు ఆందోళన చేపట్టారు. కూతురు అదృశ్యమై 20 రోజులు అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు పేర్కొంటున్నారు. 

అలుగునూరు చౌరస్తాలో దళిత సంఘాల రాస్తారోకో..

కరీంనగర్ : అలుగునూరు చౌరస్తాలో దళిత సంఘాలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మానవ కొండురులో మూడెకరాల కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్, పరుశురాములకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. 

ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలన్న ముద్రగడ..

తూర్పుగోదావరి : కాపుల మద్దతు తమకే ఉందంటున్న సీఎం చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ముందస్తుకు సిద్ధ పడితే కాపు ఉద్యమాన్ని నిలిపివేస్తామని, కాపు రిజర్వేషన్ల అంశం నాన్చొద్దని, ప్రత్యేక హోదాతో సమానమన్న పవన్ వ్యాఖ్యలకు అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. పవన్ వ్యాఖ్యలకు బాబు సిగ్గు పడాలన్నారు. 

11:25 - September 4, 2017

టాలీవుడ్ యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' నటిస్తున్న తాజా చిత్రం 'జై లవ కుశ' పాటలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే నేరుగా మార్కెట్ లోకి విడుదలయ్యాయి. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాటలను చిత్ర బృందం విడుదల చేసింది. బిగ్ సిడీని హరికృష్ణ ఆవిష్కరించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరిచిన ఈ జ్యూక్‌ బాక్స్‌లో మొత్తం నాలుగు పాటలున్నాయి. రాక్‌స్టార్‌ ఎప్పటిలాగే ఆకట్టుకున్నారని, పాటలు బాగున్నాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బాబి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలను పోషించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ పాత్రలకు సంబంధించిన లుక్స్..టీజర్స్ విడుదలయ్యాయి. ఆడియో విడుదల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. బాబీ చెప్పిన కథ తనకు చాలా బాగా నచ్చిందని, ఈ సినిమాకు కథకు మా అన్నదమ్ములకు సంబంధం ఉందన్నారు. తన తమ్ముడు లోకం విడిచి వెళ్లాడని..ఇక్కడ ఉండి ఉంటే 'జై లవ కుశ' అనే వాడన్నారు. తామంతా కలిసి నాన్నకు ఏదైనా ఇవ్వాలని అనుకున్నామని, ఆ తరుణంలో ఈ కథ వినడం జరిగి ఒకే చెప్పడం జరిగిందన్నారు. 21వ తేదీ గురించి ఎదురు చూస్తున్నామని, ఆ రోజు మాట్లాడతానన్నారు. నాన్నకు గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్న తరుణంలో అన్నదమ్ముల ఔన్నత్యాన్ని చాటిచెప్పే ఈ చిత్రం చేయడం జరిగిందన్నారు.

'జై లవకుశ’లో రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు.. సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. సెప్టెంబరు 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

11:18 - September 4, 2017

టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించాలని హీరోయిన్స్ ఆశ పడుతుంటారు. అందులో కొంతమందికే అవకాశం దక్కుతుంది. అందులో మెగాస్టార్ 'చిరంజీవి' ఒకరు. ఆయన సినిమాలో కొద్ది నిమిషాలైనా కనిపించాలని..ఆయనతో ఓ స్టెప్ వేయాలని హీరోయిన్స్ అనుకుంటుంటారు. కొన్ని సంవత్సరాల వరకు చిత్రాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ 'ఖైదీ నెంబర్ 150’ తో ముందుకు వచ్చి తన సత్తా ఏంటో చూపించారు. అనంతరం ఆయన 151వ సినిమా కూడా మొదలై పోయింది. స్వాతంత్ర్య సమరయోధుడు 'ఉయ్యాల వాడ నరసింహారెడ్డి' జీవిత కథతో చిత్రం తెరకెక్కనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ తేజ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవి సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 'నయనతార'ను చిత్ర బృందం ఎంపిక చేసింది. తాజాగా 'ప్రగ్యా జైశ్వాల్' కూడా నటిస్తోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ‘కంచె', ‘ఓం నమో వెంకటేశాయ' చిత్రాల్లో 'ప్రగ్యా' నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'నక్షత్రం' సినిమాలో కూడా నటించింది. 'చిరంజీవి' 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో 'ప్రగ్యా' ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్‌ టాక్. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

అక్రమాలకు నిలయం ఏవీ కాలేజీ..

హైదరాబాద్ : నగరంలోని ఏవీ కాలేజీ అక్రమాలకు నిలయంగా మారింది. సొసైటీ పేరిట అక్రమాలు జరిగాయి. చేయని పనులకు చేసినట్లు, బిల్డింగ్ నిర్మించకపోయినా అడిట్ లో లెక్కలు చూపించారు. ఆర్టీఐ ద్వారా రూ. 5.5 కోట్లు పక్కదారి పట్టినట్లు వెల్లడైంది. సొసైటీలో పెద్ద నేతలు ఉండడంతో ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 

వైద్యశాల ప్రారంభోత్సవం..ప్రసవవేదనలో మహిళలు..

మెదక్ : తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాంతీయ వైద్య శాల ప్రారంభోత్సవానికి మంత్రులు లక్ష్మారెడ్డి, హరీష్ రావులు హాజరు కానున్నారు. ప్రారంభోత్సవ హడావుడిలో డాక్టర్లు రోగులను పట్టించుకోలేదు. ప్రసవవేదనతో మహిళలు బాధ పడుతున్నారు. 

10:52 - September 4, 2017

నెల రోజుల్లో 49 మంది చిన్నారుల మృతి..

ఉత్తర్ ప్రదేశ్ : గోరఖ్ పూర్ బీఆర్డీ ఆసుపత్రి తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఫరూఖాబాద్ లోని ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో నెల రోజుల్లో 49 మంది చిన్నారులు మృతి చెందారు. దర్యాప్తులో పలు వాస్తవాలు బయటపడ్డాయి. ఆక్సిజన్ కొరతతోనే చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సీఎంవో, సీఎండీపై సస్పెన్షన్ వేటు వేశారు. 

అఖండ హారతులు..

విజయవాడ : 6వ తేదీన విశాఖ యలమంచిలి వద్ద శారదా నదికి, 7వ తేదీన ప.గోలో గోదావరి నదికి అఖండ హారతి ఇస్తామని మంత్రి దేవినేని ఉమ వెల్లడించారు. 8వ తేదీన ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణా నదికి పవిత్ర హారతి, అదే తేదీన ఉరవకొండలో రూ. 830 కోట్ల పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. గోదావరి - పెన్నా, గోదావరి - సోమశిల పనులను పూర్తి చేస్తామని, నదుల అనుసంధానానికి కేంద్ర సహాయం ఉంటుందన్నారు. 

10:50 - September 4, 2017
10:49 - September 4, 2017

విజయవాడ : వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతంరెడ్డి ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో.. వంగవీటి రంగ హత్యపై చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. గౌతంరెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ వంగవీటి రాధా అనుచరులు మండిపడ్డారు. గౌతంరెడ్డి ఇంటి ముందు ఆందోళన చేసేందుకు రాధా అనుచరులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి విజయవాడలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. రంగా ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించిన గౌతంరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో.... గౌతంరెడ్డిని అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.... గౌతంరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన జగన్‌... వంగవీటి రంగపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను వైసీపీ నుంచి గౌతంరెడ్డిని సస్పెండ్‌ చేశారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని..క్రమశిక్షణా సంఘానికి జగన్‌ ఆదేశించారు. గౌతంరెడ్డి వ్యాఖ్యలతో రెండు సామాజివర్గాల మధ్య వివాదాలు  చెలరేగాయి. 
టీడీపీ యంత్రాంగం ఆచితూచి వ్యవహరిస్తోంది. గౌతంరెడ్డి, వంగవీటి రాధా ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

హ్యాపీ రిసార్ట్స్ లో అభినందన సభ..

గుంటూరు : మంగళగిరి హ్యాపీ రిసార్ట్ లో టిడిపి అభినందన సభ ఏర్పాటు చేశారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులను అభినందించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం బాబు విందు ఇవ్వనున్నారు. ఈ విందులో టిడిపి వర్క్ షాప్ పై బాబు చర్చించనున్నారు. 

అదనపు బాధ్యతలు స్వీకరించిన ధర్మేంద్ర ప్రదాన్...

ఢిల్లీ : కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్కిల్ డెవలప్ మెంట్ శాఖ బాధ్యతలను అదనంగా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలియచేశారు. 

10:44 - September 4, 2017

కేబినెట్ విస్తరణ గజిబిజిగా ఉందని వక్తలు అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ విస్తరణ జరిగిందని తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, బీజేపీ నేత బద్దం బాల్ రెడ్డి, టీడీపీ నేత దుర్గప్రసాద్, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్, టీఆర్ ఎస్ ఎంపీ సీతారాం నాయక్, వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పాలన, రాజకీయాలపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:32 - September 4, 2017

ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ ఆశ వర్కర్స్‌ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ఉన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

19న పారిశ్రామిక సమ్మె..

సంగారెడ్డి : 19న రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ పారిశ్రామిక సమ్మె జరగనుంది. అందులో భాగంగా సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. పెప్సీ కంపెనీ వద్ద సంతకాల సేకరణను సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ప్రారంభించారు. పారిశ్రామిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలని చుక్కా రాములు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని, కనీస వేతన చట్టం, కార్మిక వర్గం హక్కులను అమలు చేయని పరిస్థితి పరిశ్రమల్లో కన్పిస్తోందన్నారు. 

జమ్మూలో భద్రతా బలగాల కార్డన్ సెర్చ్..

జమ్మూ కాశ్మీర్ : సోపూర్ లో భారత బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇద్దరు ఉగ్రవాదులున్నట్లు సమాచారం రావడంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు..భారత బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

బ్రిక్స్ సదస్సులో మోడీ ప్రసంగం..

ఢిల్లీ : ప్రపంచ దేశాలకు ఉగ్రవాదమే ప్రధాన సమస్య అని, ఆర్థిక, వాణిజ్య సహకారం బ్రిక్స్ దేశాలకు పునాది అని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సులో ఆయన ప్రసంగిస్తున్నారు. పేదరిక నిర్మూలనకు పరస్పరం సహకారం ముఖ్యమని, వైద్యం, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఖైరతాబాద్ లో ఉప రాష్ట్రపతి..

హైదరాబాద్ : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. ఆయన వెంట కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, మంత్రి తలసాని తదితరులున్నారు.

 

10:22 - September 4, 2017

హైదరాబాద్ : భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందడి మొదలైంది. నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బలగాలను నియమించారు. పోలీసుల నిఘానీడన విజ్ఞేషుని నిమజ్జనం ఘనంగా జరగనుంది. 
పోలీసులు అప్రమత్తం
గ్రేటర్‌లో వినాయక నిమజ్జనం దగ్గరపడుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. బందోబస్తు విధుల కోసం నగర పోలీసులతో పాటు అర్మ్‌డ్‌ రిజర్వ్‌, తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ లను రంగంలోకి దింపారు. 24 వేల మంది సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. దీంతో పాటు సున్నిత ప్రాంతాల్లో ఉన్న గణేష్‌ మండపాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 
పోలీసులు ముందస్తు ప్రణాళికలు 
వినాయక నిమజ్జనంలో ఘర్షణలకు తావులేకుండా పోలీసులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న, దక్షిణ మండపాలతో పాటు పశ్చిమ, తూర్పు మండపాలపై ప్రత్యేక దృష్ఠి సారించారు. మండపాల వాలంటీర్ల శాంతి కమిటీ సభ్యులు, మత పెద్దలు, స్థానికులు, పోలీసులు సమన్వయంతో పని చేస్తున్నారు. కమిషనరేట్‌ పరిధిలోని పోలీసు స్టేషన్ల వారిగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో పికెటింగ్‌లను ఏర్పాటుచేశారు. పోలీసుల వద్ద రిజిస్టర్‌ చేసుకున్న 10వేల 642 మండపాలకు క్యూఆర్‌ కోడ్‌ను కేటాయించారు. ఈ కోడ్‌ ఉన్న మండపాల వద్ద సాంకేతిక పర్యవేక్షణ, కోడ్‌ లేని మండపాల వద్ద మాన్యువల్‌ పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. 
కమ్యునికేషన్‌కు ఇబ్బందులు లేకుండా చర్యలు
గస్తీ వాహనాలతో పాటు క్రమం తప్పకుండా పెట్రోలింగ్‌ నిర్వహించే ఏర్పాటు చేశారు. ప్రతి ఏరియాలోనూ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి కేటాయించి పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. కమ్యునికేషన్‌కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగంగా రౌడీషీటర్ల బైండోవర్‌, నిఘా తనిఖీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. సిటీ సెక్యూరిటీ వింగ్‌, సీఎస్ డబ్ల్యు అధికారులు ప్రతి రోజు మండపాలను తనిఖీ చేస్తున్నారు. నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో సిసి కెమెరాలు లేని చోట తాత్కాలికంగా కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తానికి నిమజ్జనాన్ని నిఘానీడలో ఉంచేందుకు సిటీ కాప్స్ సర్వం సిద్ధం చేశారు. పోలీసుల నిఘానీడన గణేషుని నిమజ్జనం ఘనంగా జరగనుంది. 

 

యువతి అనుమానాస్పద మృతి..

కర్నూలు : ఆదిత్యానగర్ లో యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. డాక్టర్ చిరంజీవి ఇంట్లో రజని అనే యువతి పనిచేస్తోంది. టెన్త్ చదవలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. 

10:18 - September 4, 2017

తూర్పుగోదావరి : జిల్లాలో గణేశ్‌నిమజ్జనంలో ఘర్షణ చోటు చేసుకుంది.  బిక్కవోలు మండలం రంగాపురంలో టీడీపీ -వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. టీడీపీకి చెందిన కన్నంటిబుజ్జి, చినదుర్గయ్య, దుర్గాజ్యోతి అనే యువకులు కత్తులతో హల్‌చల్‌ చేశారు. వైసీపీకి చెందిన దుర్గయ్య, వెంకన్న, వీరన్న, నక్కాబాబులపై దాడి చేశారు. ఈ ఘర్షణలో  నక్కాదుర్గయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పాతకక్షల తోనే ఇరువర్గాలు ఘర్షణకు దిగినట్టు స్థానికులు తెలిపారు. 

 

10:16 - September 4, 2017

సిరిసిల్ల : సిరిసిల్ల వాసులు మట్టి వినాయకుడే శ్రేష్టమంటున్నారు. పర్యావరణానికి చేటుచేసే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలు మాకొద్దంటున్నారు. ఇంతింతై వటువింతై అన్న చందంగా..ఏటీకేడు నగరంలో మట్టివినాయకుల సంఖ్య పెరగడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. విజ్ఞాలు తీర్చే గణపయ్యను..తమ సమస్యలు తీర్చాలంటూ వినూత్నంగా కొలుస్తున్నారు.     

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పర్యావరణ హిత వినాయకులను పూజిస్తూ తరిస్తున్నారు. మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడంలో ఇతరులకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. నగరంలో ఈ ఏడాది సుమారు 15 మట్టి గణపయ్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. 

సిరిసిల్ల అనంతనగర్‌లో హిందూ సేవక్‌ సమితి ఆధ్వర్యంలో ఐదేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తున్నారు. గతేడాది నేతన్న రూపంలో మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణపయ్యకు విశేష పూజలు నిర్వహించారు. నేతన్న రూపంలో పూజించడం వల్లనే తమకు చేతి నిండా పని దొరికిందని చేనేత కార్మికులు భావించారు. ఆ నమ్మకంతోనే ఈ ఏడాది తమకు మేలు జరగాలని రైతు రూపంలో లంబోదరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. 


ఎలాంటి హానికరమైన రంగులు వాడకుండా మట్టితో భారీ వినాయక విగ్రహాలను తయారు చేయొచ్చని హిందూ సేవక్‌ సమితి సభ్యులు చెబుతున్నారు. అనాదిగా మట్టి గణపయ్య విగ్రహాలను పూజించడం ఆచారంగా వస్తోందని చెప్పుకొస్తున్నారు. మట్టి వినాయకుడిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయంటున్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ కన్నా మట్టి గణపయ్యను ఇళ్లలో ప్రతిష్టించాలని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామంటున్నారు విద్యావేత్తలు.  

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఓవైపు పూజలు.. మరోవైపు ఆటపాటలతో సరదాగా గడుపుతున్నామని స్థానిక మహిళలు చెబుతున్నారు. మండపాల్లో ఐక్యంగా వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందంటున్నారు. 

సిరిసిల్ల వాసులు ఏటా మట్టి వినాయకులను వైవిద్యమైన రూపాల్లో తయారు చేస్తున్నారు. పర్యావరణ ప్రియ గణపయ్యే తమ కష్టాలు తీర్చే కల్పతరువుగా భావిస్తున్నారు.   

 

గౌతంరెడ్డి వర్సెస్ వంగవీటి..

విజయవాడ : గౌతం రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విజయవాడలో పెను దుమారం రేగుతోంది. నిన్న సాయంత్రం నుండి విజయవాడలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. గౌతంరెడ్డిపై సత్యనారాయణ పీఎస్ లో కేసు నమోదైంది. వైసీపీ నుండి గౌతం రెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణా సంఘానికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. గౌతంరెడ్డి, వంగవీటి రాధా ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

10:06 - September 4, 2017

నిర్మల్‌ : జిల్లాలోని ఖానాపూర్‌ మండలంలో దారుణం జరిగింది. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కుంచపు గంగాధర్‌, దుండగుల ధర్మపురి, దరంగుల చిన్నప్పలు కలిసి ఇంట్లో నుండి బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశారని బాధితురాలు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. 

 

10:01 - September 4, 2017

నల్గొండ : ప్రజాకళాకారుడు, గాయకుడు ఏపూరి సోమన్నను ఉక్కుసంకెళ్లతో బందించిన ఘటన పోలీస్‌శాఖ మెడకు చుట్టుకోనుందా? అధికారపార్టీ నేతల ఒత్తిడితో ఖాకీ బాస్‌లు ఏం చేయాలో తెలియక దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారా? సోమన్నకు సంకెళ్లువేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నా... ఉన్నతాధికారులు మౌనం వహించడం వెనుక దాగున్న మర్మమేంటి? ఈ కేసులో పోలీస్‌శాఖను శాసిస్తున్నదెవరు? ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కొత్త అర్థంచెప్పిన సోమన్న సంకెళ్ల ఘటనపై 10టీవీ కథనం...

ఏపూరి సోమన్న.. తెలంగాణ సమాజానికి పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రజాగొంతుకై ఊరూరా తిరిగారు. ఉద్యమానికి ఊపిరిలూదుతూ పాటలతో ప్రజలను ఏకం చేశారు. తెలంగాణ వచ్చాక కూడా ప్రజాకళాకారుడిగా గుర్తింపు నిలబెట్టుకోవడమే గొప్పగా భావించి... ప్రజాసమస్యలపై తన కలానికి, గళానికి పదునుపెడుతున్నారు.

ఓ ప్రజాకళాకారుడు, గాయకుడైన సోమన్నను పోలీసులు ఉక్కు సంకెళ్లతో బంధించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.  ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పేరుతో ఊదరగొట్టే పోలీసులు.. ఒక ప్రజాకళాకారుడిని తీవ్రవాదిగానో... కరడుగట్టిన నేరస్తుడినో బంధించినట్టు ఉక్కుసంకెళ్లు వేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  పోలీసుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. సోమన్నకు సంకెళ్లు వేసినట్టు ఆధారాలతో సహా వెలుగు చూడడం ఇప్పుడు పోలీస్‌ శాఖకు ఇరకాటంగా మారింది. అంతేకాదు.. పోలీస్‌స్టేషన్‌ లోపల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప  పంచాయతీ పెట్టడం వివాదాస్పదమైంది. అసలు పోలీసులు పుష్పను ఎందుకు అనుమతించారని ప్రజాసంఘాలు, కళాకారులు, విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.  ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు అధికారపార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపూరి సోమన్నకు సంకెళ్లు వేయడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి.  టీ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖరాశారు. సోమన్న విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తెలంగాణలో ప్రజాస్వామ్యం హత్యజరుగుతోందని తీవ్రంగా లేఖలో మండిపడ్డారు. పీఎస్‌లో పంచాయతీ నిర్వహించిన ఎమ్మెల్యే భార్య పుష్పపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

పుష్పారెడ్డి తనను కులం పేరుతో దూషించారంటూ ఏపూరి సోమన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంకింద కేసు నమోదు చేయాలని కోరారు.  ఈ మొత్తం వ్యవహారంపై 10టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో సమస్య మరింత పెద్దది కాకుండా పోలీసులు ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది.  జిల్లా ఎస్పీ పరిమళ హాన్‌ నూతన్‌, డీఎస్పీ సునితా మోహన్‌ తిరుమలగిరి పీఎస్‌లో జరిగిన ఘటనపై  ఆరా తీశారు. సోమన్నకు బేడీలు వేసిన ఘటనపై విచారణ జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఎస్పీ, డీఎస్పీలు మాత్రం దీనిపై పెదవి విప్పడం లేదు. దాటవేత ధోరణి కనబరుస్తున్నారు. దీనినిబట్టి చూస్తే అధికారపార్టీ పెద్దల ఒత్తిడి పోలీసులపై తీవ్రంగా ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఏకంగా టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ నుంచే పోలీసులపై ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తోంది. అందుకే ఏం సమాధానం చెప్పలేక పోలీసులు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సమస్య సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నా... పోలీసులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

09:56 - September 4, 2017

హైదరాబాద్ : మానవాళికి ప్రధాన శత్రువుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు పిలుపు ఇచ్చారు. ఇందుకోసం అన్ని దేశాలు ఏకంకావడంతోపాటు  కఠిన చట్టాలు రూపొందించాలని కోరారు. హైదరాబాద్‌ సమీపంలోని నల్సార్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్జాతీయ సంస్థ 78వ సమావేశాలకు వెంకయ్యనాయుడు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. అరవై దేశాలకు చెందిన న్యాయనిపుణులు పాల్గొన్న ఈ భేటీలో ఉగ్రవాదం ప్రపంచానికి ముప్పుగా పరిణమించింది ఆందోళన వ్యక్తం  చేశారు. 

09:53 - September 4, 2017

హైదరాబాద్ : కూకట్‌పల్లి వై-జంక్షన్‌ డీమార్ట్‌ ముందు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొట్టడంతో కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు వేణుగోపాలాచారిగా గుర్తించారు. కారులోని వారంతా మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు.    

 

09:51 - September 4, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని భువనగిరి మండలం రాయగిరిలో అర్ధరాత్రి ఓ ఇంట్లో పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో సోదరులైన వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు మృతి చెందగా... వారి తల్లి గాలమ్మ తీవ్రంగా గాయపడింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే... గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. సంఘటనాస్థలాన్ని డీసీపీ, ఏసీపీలు పరిశీలించారు. పేలుడుకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. 

 

09:49 - September 4, 2017

గుంటూరు : జిల్లాలోని తెనాలి పినపాడు సమీపంలో రైలు పట్టా విరిగిపోయింది. గ్యాంగ్‌మెన్‌ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టా విరిగిపోవడంతో పినాకిని ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌ మరమ్మతు పనులు చేపట్టారు. 

 

వైసీపీలో భగ్గుమన్న వర్గ విబేధాలు

కృష్ణా : వైసీపీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి, వైసీపీ నేత వంగవీటి రాధా మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో వంగవీటి రంగా హత్యపై గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. గౌతంరెడ్డి వ్యాఖ్యలపై వంగవీటి రాధా వర్గం తీవ్రంగా మండిపడింది. 

 

విరిగిన రైలు పట్టా

గుంటూరు : జిల్లాలో రైలు పట్టా విరిగింది. గ్యాంగ్ మెన్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. పినాకిని ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

09:24 - September 4, 2017

నెల్లూరు : గన్‌ మిస్‌ ఫైర్‌ అయింది... రెండు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయి ఏఎస్ పీ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న రమేశ్‌ చనిపోయాడు.. అంతా అయ్యో పాపం అన్నారు.. ఇంతలో కేసు మరో మలుపు తిరిగింది.. కేసులో కొత్త ట్విస్ట్‌ బయటకొచ్చింది.. మిస్‌ఫైర్‌ కాదు.. హత్య అంటూ ఆరోపణలొచ్చాయి.. దీనిని బలపరుస్తూ ఎన్నో సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.. ఇంతకీ అసలు ఏం జరిగింది? 

నెల్లూరు ఏఎస్ పీ శరత్‌ బాబు దగ్గర కార్‌ డ్రైవర్‌గా రమేశ్‌ రెండేళ్లనుంచి పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి ఏఎసీపీ గన్‌మ్యాన్‌ ఏకే 47 గన్‌ మిస్‌ఫైర్ అయిందని... రెండు బులెట్లు రమేశ్‌ శరీరంలోకి దూసుకెళ్లాయంటూ ఆస్పత్రికి తరలించారు.. రమేశ్‌తో సహజీవనం చేస్తున్న అనసూయకు ఈ సమాచారం పంపారు.. ఆమె ఆస్పత్రికి వచ్చేసరికే రమేశ్ చనిపోయాడు...  

రమేశ్ మృతదేహంచూసి కన్నీరుమున్నీరైన అనసూయ.... పోలీసుల సమాధానంపై అనుమానం వ్యక్తం చేసింది. రమేశ్‌ గన్‌ మిస్‌ఫైర్‌ వల్ల చనిపోలేదని.... అతన్ని హత్య చేశారని ఆరోపించింది.. రమేశ్‌ కుటుంబ సభ్యులు ఈ కేసులో పలు అనుమానాల్ని లేవనెత్తారు.... వైద్యులు చెప్పిన ప్రకారం రమేశ్‌ చాతిలోకి ఒక బులెట్‌... పొట్టలోనుంచి మరో బులెట్‌ దూసుకెళ్లాయి... సాధారణంగా ఒకసారి గన్‌ మిస్‌ఫైర్‌ అయి పేలితే ఒకే బులెట్‌ బయటకు వస్తుంది.. రమేశ్‌ కేసులో గన్‌ రెండు సార్లు మిస్‌ఫైర్‌ అయింది... ఇదెలా సాధ్యమని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.. ఇక రెండో డౌట్‌...  మామూలుగా గన్‌ వాడని సమయంలో అది లాక్‌ మోడ్‌లో ఉంటుంది. కాని ఎలా అన్‌ లాక్‌ అయిందన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గన్‌ను అన్‌లాక్‌ చేసి కావాలనే రెండు సార్లు ట్రిగ్గర్‌ నొక్కి రమేశ్‌ను చంపారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే చనిపోయిన తరువాత రమేష్ నోట్లోనుంచి నురుగులు రావడం... సంఘటన జరిగిన ప్రాంతంలో ఒక్క రక్తపు చుక్క లేకపోవడం.. జిల్లా పోలీసు కార్యాలయం దగ్గర సిసి కెమెరాలు పనిచేయకపోవడం ఈ కేసులో ఏదో జరిగిందన్న సందేహాలను కలిగిస్తున్నాయి..

ఇక రమేశ్‌ను ప్లాన్‌ చేసి చంపాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రశ్నకు కుటుంబ సభ్యులు తమ వాదన వినిపిస్తున్నారు. జిల్లా ఎస్‌పీ రామకృష్ణ రెండు నెలలనుంచి క్రికెట్‌ బెట్టింగ్‌పై సీరియస్‌గా దృష్టిపెట్టారు. పలువురు క్రికెట్‌ బుకీలు, కొందరు రాజకీయ నేతల్ని జైలుకు పంపారు.. ఇద్దరు డీఎస్‌పీలు, ఇద్దరు సీఐలను వీఆర్‌కు పంపారు.. ఈ కేసును లోతుగా విచారిస్తున్న ఎస్‌పీ... క్రికెట్‌ బుకీ కృష్ణ సింగ్‌ కాల్‌ డేటాను బయటకు తీశారు.. ఇందులో కృష్ణ సింగ్‌ చాలాసార్లు రమేశ్‌కు ఫోన్‌ చేసినట్లు తేలింది.. రమేశ్‌ను పిలిపించిన ఎస్‌పీ ఈ కేసుపై ప్రశ్నించారు.. మరోసారి విచారణకు రావాలని చెప్పి పంపారు.. 

ఈ కేసులో ఇక్కడే మరో ట్విస్ట్‌ను కుటుంబ సభ్యులు బయటపెట్టారు.... ఈ బెట్టింగ్‌తో ఏఎస్‌పీకి సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నారు.... ఈ టీంతో ఏఎస్‌పీ తరచూ మాట్లాడేవాడని... తన ఫోన్‌ అయితే ఇబ్బందని రమేశ్‌ ఫోన్‌ వాడేవాడని స్పష్టం చేస్తున్నారు.... తన ఫోన్‌ వాడుకోవడం వల్లే ఇలా ఇరుక్కుపోయానంటూ రమేశ్‌ టెన్షన్‌ పడేవాడని వారు చెబుతున్నారు.... ఏఎస్‌పీకి కృష్ణ సింగ్‌తో ఉన్న లింకులు బయటపెడతాడనే రమేశ్‌ను పథకం ప్రకారం చంపేశారని అనసూయ ఆరోపిస్తోంది. ముందునుంచి గన్‌ఫైర్‌గా అనుమానిస్తున్న ఈ కేసు అనసూయ డౌట్స్‌తో మరో మలుపు తిరిగింది.. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారిస్తే హత్యా? మిస్‌ఫైరా? అన్న మిస్టరీ తేలనుంది.. 

09:17 - September 4, 2017

విజయవాడ : వంగవీటి రంగాపై వైసీపీనేత గౌతమ్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు బెజవాడలో ఉద్రిక్తతకు దారితీశాయి. రంగా హత్యపై గౌతమ్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ ఆయన అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. రంగా కుమారుడు వంగవీటి రాధా.. గౌతమ్‌రెడ్డి ఇంటి దగ్గర నిరసన తెలిపేందుకు బయల్దేరడంతో వివాదం చినికిచినికి గాలివానలా మారింది.  మరోవైపు గౌతమ్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది. 

వైసీపీ నేత గౌతమ్‌రెడ్డి ... వంగవీటి  రంగాపై చేసిన వ్యాఖ్యలు బెజవాడలో పెను దుమారం రేపాయి. రంగాను హత్య చేయడానికి సంబంధించి గౌతమ్‌రెడ్డి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రంగా కుమారుడు రాధాకే  కాకుండా ఆయన అభిమానులకూ ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఆదివారం ఉదయం గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసన తెలపడానికి పెద్ద ఎత్తున రాధా అనుచరులు గౌతమ్‌రెడ్డి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

వంగవీటి రాధాకూడా గౌతమ్‌రెడ్డి ఇంటికి వెళ్లడానికి బయల్దేరగా పోలీసులు ఆయనను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మొగల్రాజపురంలో మీడియా సమావేశం పెడతానని చెప్పిన రాధా... తర్వాత రాఘవయ్య పార్కు దగ్గర ఇంట్లో మీడియా సమావేశం పెడతానని బయల్దేరడంతో వివాదం మొదలైంది. డీసీపీ గజరావు భూపాల్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. వారిని దాటుకుని వెళ్లేందుకు రాధా, అతడి తల్లి రత్నకుమారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, రాధా అనుచరుల మధ్య జరిగిన తోపులాటలో రాధా తల్లి రత్నకుమారి స్పృహతప్పి పడిపోయారు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై రాధా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తోపులాటలో వంగవీటి రాధా చొక్కా చిరిగిపోయింది.  ఆ తర్వాత  పోలీసులు రాధా అభిమానులను చెదరగొట్టి ఆయనను బలవంతంగా ఇబ్రహీంపట్నం పీఎస్‌కు తరలించారు. అయితే అక్కడ కూడా రాధా, రత్నకుమారి ఇద్దరూ నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. 

వంగవీటి రంగాపై గౌతమ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఖండించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.  గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని వైసీపీ నేత పార్థసారధి తెలిపారు. ఆ తర్వాత గౌతమ్‌రెడ్డిని పార్టీ నుంచి  సస్పెండ్‌ చేసినట్టు వైఎస్‌ జగన్‌ చెప్పారు.  అనవసర వ్యాఖ్యలు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని జగన్‌ స్పష్టం చేశారు.  

09:12 - September 4, 2017

హైదరాబాద్ : మోదీ కేబినెట్‌ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి ఎదురైంది. రెండు రాష్ట్రాల నుంచి ఒక్కరికి కూడా మంత్రిపదవి దక్కలేదు. ఏపీ నుంచి కంభంపాటి హరిబాబు, తెలంగాణ నుంచి వెదిరె శ్రీరాంలకు ఛాన్స్‌ ఉందంటూ చివరి క్షణం వరకు జరిగిన ప్రచారం వట్టిదే అని తేలిపోయింది. వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ స్థానాల్లో ఒక్కరికైనా అవకాశం ఇస్తారని భావించినా.. చివరికి  ఫలితం దక్కలేదని తెలుగు రాష్ట్రాల కాషాయపార్టీ నేతలు మధనపడుతున్నారు.
అధిష్టానంపై కాషాయ నేతల ఆగ్రహం 
కేంద్ర మంత్రివర్గ పునర్య్వస్థీకరణలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికి కూడా చోటు లభించలేదు. పైగా తెలంగాణ నుంచి ఉన్న దత్తాత్రేయను తప్పించి.. ఒక్కరికి కూడా స్థానం ఇవ్వకపోవడంపై కాషాయదళంలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 
వెంకయ్య, దత్తాత్రేయ స్థానంలో ఎవరికీ దక్కని చోటు
మోదీ అధికారం చేపట్టాక తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి తన కేబినెట్‌లో చోటు కల్పించారు. ఏపీ నుంచి వెంకయ్యనాయుడు, తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయకు అవకాశం ఇచ్చారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కాగా .. పునర్య్వస్థీకరణలో దత్తాత్రేయకు మోదీ టాటా చెప్పారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్‌లో స్థానమే లేకుండా పోయింది.  అయితే ఏపీ నుంచి కంభంపాటి హరిబాబు,  తెలంగాణ నుంచి మురళీధర్‌రావు, రాంమాధవ్‌, వెదిరే శ్రీరాంలో ఎవరో ఒకరికి చోటు దక్కుతుందన్న ప్రచారం సాగింది. కాని ఎవరికీ మంత్రిపదవి దక్కక పోవడంతో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని పరిస్థితి నెలకొంది. అదిగో, ఇదిగో  మంత్రిపదవులు అంటూ ..ఎంతో ఊరించి ఉసూరు మనిపించారంటూ అధిష్టానంపై తెలుగురాష్ట్రాల బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

 

08:46 - September 4, 2017

ఢిల్లీ : శ్రీలంకపై ఐదో వన్డేల్లోనూ భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్విప్‌ చేసింది. ఇప్పటికే టెస్ట్‌ సిరీస్‌ను 3-0తో గెలుచుకున్న విరాట్‌సేన.. వన్డేల్లోనూ అదే దూకుడు ప్రదర్శించింది. చివరి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. సిరీస్‌లో ఒక్కమ్యాచ్‌ అయినా గెలిచి పరువు నిలబెట్టుకుందామనుకున్న లంశ ఆశలు నెరవేరలేదు. 
 
శ్రీలంకతో జరిగిన 5 వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్విప్‌ చేసింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో శ్రీలంకపై కోహ్లీసేన ఘన విజయం సాధించింది. ఆరువికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ కొట్టింది. దీంతో 5-0తో వన్డే సిరీస్‌ను కోహ్లీ సేన దక్కించుకుంది.

శ్రీలంక ఉంచిన 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. 17 పరుగుల దగ్గర రహానే, 29 రన్స్‌ దగ్గర రోహిత్‌శర్మ పెవిలియన్‌ చేరారు.  అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడాడు. 116 బంతుల్లో 110పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. మనీశ్‌పాండేతో కలిసి మూడో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టుస్కోరు 128 పరుగుల దగ్గర పాండే ఔటైనా.. కోహ్లీ ఆగలేదు. తనదైన శైలిలో దూకుడు కొనసాగించాడు. కేదార్‌ జాదవ్‌తో కలిసి వీరవిహారం చేశాడు.  చక్కని కవర్‌డ్రైవ్‌లతో సొగసైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. నాలుగో వికెట్‌కు 109 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు.  ఈ క్రమంలోనే వన్డేల్లో 30వశతకం బాదాడు.  194 మ్యాచుల్లోనే కోహ్లీ ఈ ఘతన సాధించడం ఓ అరుదైన రికార్డు.  46.3 ఓవర్లలో  భారత్‌ 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 5వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన భువనేశ్వర్‌కుమార్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కగా... మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ బుమ్రాకు లభించింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన శ్రీలంక 238 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. భారత బౌలర్‌ భువనేశ్వర్‌కుమార్‌ వీర విజృంభణ చేసి కీలకమైన 5వికెట్లు తీశాడు.  బుమ్రా 2, కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌ చెరో వికెట్‌ నేలకూల్చారు. లంక బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్‌ ఉపుల్‌ తరంగ, లాహిరు తరిన్నె, మాథ్యూస్‌ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగతా వారెవ్వరూ పట్టుమని పదిపరుగులు కూడా చేయలేకపోయారు.

ఇదే వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ సైతం ఓ రికార్డను నమోదు చేశాడు.  100 మందిని స్టంపింగ్స్‌ చేసిన ఒకే ఒక వ్యక్తిగా ధోనీ అవతరించాడు.  గత మ్యాచ్‌లో గణతిలకను స్టంపౌట్‌ చేయడంతో 99 వద్ద నిలిచిన ధోనీ.. చివరి వన్డేలో అఖిల ధనంజయను పెవిలియన్‌కు పంపి 100 స్టంపింగ్స్‌ చేసిన వ్యక్తిగా నిలిచాడు. 301 మ్యాచుల్లోనే ధోనీ ఈ ఘనత సాధించాడు. 

 

నేడు, రేపు గుజరాత్ లో రాష్ట్రపతి కోవింద్ పర్యటన

గుజరాత్ : నేడు, రేపు గుజరాత్ లో రాష్ట్రపతి కోవింద్ పర్యటించనున్నారు. ఇరిగేషన్ యోజన పథకానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 

 

నేడు నర్సాపూర్ నిజయోజకవర్గంలో హరీష్ రావు, లక్ష్మారెడ్డి పర్యటన

మెదక్ : నేడు నర్సాపూర్ నిజయోజకవర్గంలో మంత్రులు హరీష్ రావు, లక్ష్మారెడ్డి పర్యటించనున్నారు. 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొననున్నారు. 

 

 

నేడు, రేపు హిందూపురంలో బాలకృష్ణ పర్యటన

అనంతపురం : నేడు, రేపు హిందూపురంలో బాలకృష్ణ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

 

నేడు ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి

హైదరాబాద్ : నేడు ఖైరతాబాద్ వినాయకుడిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకోనున్నారు. 

 

ఇంట్లో పేలుడు

యాదాద్రి : భువనగిరి మండలంలో రాయగిరిలో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డిగా గుర్తించారు. గ్యాస్ సిలిండర్ పేలుడుగా అనుమానిస్తున్నారు. 

 

ఇంట్లో పేలుడు

యాదాద్రి : భువనగిరి మండలంలో రాయగిరిలో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డిగా గుర్తించారు. గ్యాస్ సిలిండర్ పేలుడుగా అనుమానిస్తున్నారు. 

 

Don't Miss