Activities calendar

05 September 2017

22:09 - September 5, 2017

పుణె : నగరంలో వినాయకుల నిమజ్జనం అంగరంగవైభవంగా జరిగింది. పోలీసుల భారీ భద్రత ఏర్పాట్ల మధ్య భక్తుల సందోహంలో వినాయక శోభ యత్ర నిర్వహించిన అనంతరం నిమజ్జనం చేశారు. వినాయక శోభయాత్రలో అనేక మంది ప్రజలు పాల్గొని గణనాథునికి వీడ్కోలు పలికారు. 

22:05 - September 5, 2017

ముంబై : నగరంలో వినాయకుల నిమజ్జనం ఘనంగా అన్ని భద్రత ఏర్పాట్ల మధ్య భక్తులు శోభ యాత్ర నిర్వహించి వినాయకులను నిమజ్జనం  చేశారు. వినాయక నిమజ్జన కార్యక్రమాంలో బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. 

22:03 - September 5, 2017

హైదరాబాద్ : ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఘనంగా జరిగింది. అధికారులు అనుకున్న ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసి తెల్లవారజామునే వినాయక శోభయాత్ర మొదలు పెట్టారు. మధ్యాహ్నం 1.45కు ఖైరతాబాద్ వినాయకుడు గంగాలోకి ప్రవేశించాడు.

21:58 - September 5, 2017
21:56 - September 5, 2017

కర్ణాటక : రాష్ట్రం బెంగళూరులో జర్నలిస్టు దారుణ హత్యకు గురైయ్యారు. గౌరి లంకేష్ అనే జర్నలిస్టును గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. లంకేష్ హత్యను బెంగళూరు నగర్ కమిషనర్ ధృవికరించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

21:32 - September 5, 2017

లుంబినీ పార్క్ వద్ద మంటలు

హైదరాబాద్ : నగరంలోని లుంబినీ పార్క్ వద్ద జనరేటర్ లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో వినాయక నిమజ్జనానికి వచ్చి భక్తులు భయాందోళనకు గురౌతున్నారు. వెంటనే అక్కడికి చేరిన అగ్నిమాపక సబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

21:28 - September 5, 2017

హైదరాబాద్ : నగరంలోని లుంబినీ పార్క్ వద్ద జనరేటర్ లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో వినాయక నిమజ్జనానికి వచ్చి భక్తులు భయాందోళనకు గురౌతున్నారు. వెంటనే అక్కడికి చేరిన అగ్నిమాపక సబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

బెంగళూరులో జర్నలిస్టు హత్య

కర్ణాటక : రాష్ట్రం బెంగళూరులో జర్నలిస్టు దారుణ హత్యకు గురైయ్యారు. గౌరి లంకేష్ అనే జర్నలిస్టును గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. లంకేష్ హత్యను బెంగళూరు నగర్ కమిషనర్ ధృవికరించారు.

21:14 - September 5, 2017
21:04 - September 5, 2017

తమిళనాడు బలనిరూపణకు హైకోర్టులో పిటిషన్

చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష కోసం హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. బలపరీక్ష కోసం గవర్నర్ ను ఆదేవించాలని పిటిషన్ లో పిటిషనర్లు కోర్టును కోరారు. విచారించిన కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. 

టీఎస్ రహదారులకు జాతీయరహదారలుగా హోదా

ఢిల్లీ: తెలంగాణలోని రెండు రహదారలను జాతీయరహదారులుగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందులో ఒకటి కరీంనగర్ నుంచి భూపాలపల్లి రహదారి మరొకటి వరంగల్ ల్లో ఉంది.

20:47 - September 5, 2017

అయిదు దేశాలు..భవిష్యత్ ప్రపంచ ముఖచిత్రాలు..ఒక్కటైన స్నేహహస్తాలు..చైనా వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశం ఇప్పుడు అభివృద్ధి, సహకారం లాంటి అంశాలనే కాదు... తీవ్రవాదంలాంటి అంశాలకూ వ్యతిరేకంగా గళమెత్తింది. ప్రపంచంలోని పలుదేశాల కూటములలో అత్యంత ప్రభావం చూపుతున్న కూటమిగా బ్రిక్స్ దేశాల కూటమి నిలబడింది. బ్రిక్స్‌ కూటమి తొలిసారి పాకిస్థాన్‌ ఉగ్రమూకలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌, హక్కానీ నెట్‌వర్క్‌ తదితర ఉగ్రవాద గ్రూపుల పేర్లను తొలిసారి ప్రస్తావించింది. అంతర్జాతీయ వేదికపై నేరుగా పాక్‌లోని ఉగ్రమూకలను పేరు ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బ్రిక్స్ సదస్సు సందర్భంగా బ్రిక్స్‌ కూటమిలో భారత్‌ సహా అయిదు సభ్య దేశాలు.. నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక, వాణిజ్య సహకారంపై బ్రిక్స్‌ కార్యాచరణ ప్రణాళిక, నవకల్పనల ఆవిష్కరణలో పరస్పర సహకారం , బ్రిక్స్‌ కస్టమ్స్‌ కోఆపరేషన్‌పై వ్యూహాత్మక విధానంపై ఒప్పందాలు ఇందులో ఉన్నాయి. అలాగే, వ్యూహాత్మక సహకారంపై బ్రిక్స్‌ వ్యాపార మండలి, న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ కూడా అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. మరోపక్క పశ్చిమదేశాల ఆధిపత్యానికి గండికొట్టేలా ప్రత్యేక రేటింగ్ ఏజన్సీ ప్రతిపాదనలు కూడా వచ్చాయి. మొదలై తక్కువ కాలమే అయింది. కానీ, సాధించిన మార్పు చాలా ఎక్కువ. ఆధిపత్య దేశాలను సవాల్ చేస్తూ ఏటా పలు ఒప్పందాలతో బ్రిక్స్ దేశాలు ముందడుగు వేస్తున్నాయి. 2009లో తొలి సమాదేశం నాటినుంచి, 2017లో చైనా సమావేశం వరకు బ్రిక్స్ దేశాలు వడివడిగా ముందుకు అడుగులు వేస్తున్నాయి. పరస్పర సహకారంతో అభవృద్ధి బాటలో నడిచేందుకు, ప్రపంచ శాంతిని స్థాపించేందుకు కూడా గళమెత్తుతున్నాయి.

పక్క పక్కనున్న దేశాలు కాదు.. ఏ సారూప్యతలు లేవు.. సాంస్కృతకంగా పోలికలు లేదు..కానీ, కలసి పనిచేస్తూ.. పరస్పరం స్నేహహసర్తం అందించుకుంటూ పశ్చిమ దేశాల ఆధిపత్యానికి ఎదురొడ్డి.. ముందుకు సాగటమే లక్ష్యంగా బ్రిక్స్ అడుగులేస్తోంది. అడుగడుగునా ఆధిపత్యమే రాజ్యమేలుతున్న ప్రపంచంలో, ఆయుధ సంపత్తి, ధనబలమే పైచేసి సాధించగల కాలంలో... ప్రపంచ దేశాల మధ్య స్నేహ సంబంధాలు అత్యవసరం. వేదికలపై చేతులు కలపడమే కాదు.... విధానాల రూపకల్పన అమలులోనూ ఆ ఉత్సాహాన్ని చూపగలగాలి. ముఖ్యంగా పశ్చిమ దేశాల ఆధిప్యత రాజ్యమేలుతున్న సమయంలో వర్ధమాన దేశాలకు దన్నుగా నిలబడేందుకు బ్రిక్స్ లాంటి కూటమి మరింత బలపడాల్సిన అవసరం ఉంది.పూర్తి వివరాలకు వీడియో చూడండి

20:45 - September 5, 2017

హైదరాబాద్ : కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయదారుల రుణ ఉపశమనం చట్టాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ నేత సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం సీపీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మల్లారెడ్డితో పాటు పలువురు సీపీఎం నేతలు పాల్గొన్నారు. అన్ని పంటలకు ఉత్పత్తి ఖర్చులపై 50 శాతం గిట్టుబాటు ధర ఇవ్వాలన్న సారంపల్లి ఈనెల 16న తెలంగాణలో రైతు విముక్తి యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 

20:43 - September 5, 2017

అనంతపురం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న హెలీ ప్యాడ్ ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. సభకు విచ్చేసే నేతలు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు చేపడుతున్నట్ల కలెక్టర్ చెప్పారు. 

20:42 - September 5, 2017

విజయవాడ : ఎన్నికలప్పుడు అందరికీ ఇళ్లంటూ హామీలు గుప్పించిన టీడీపీ ప్రభుత్వం ఇప్పటికి ఆ హామీని అమలు చేయలేకపోయిందని మండిపడ్డారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్.బాబురావు. విజయవాడలో ఏ ఒక్కరికి ఇళ్లు కేటాయించలేదని ఆయన ఆరోపించారు. విజయవాడ సుందరయ్య భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు నిర్మించిందో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలన్న బాబురావు ఇళ్ల కోసం త్వరలో విజయవాడలో మొదలుకాబోతున్న ప్రజా ఉద్యమానికి సీపీఎం అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.

20:40 - September 5, 2017

విజయవాడ : సమాజాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు ఏపీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు. దేవుని కంటే ముందు స్థానంలో ఉపాధ్యాయున్ని ఈ సమాజం ఉంచిందని అన్నారు. విలువలతో కూడిన విద్యను అందించాలని, సమాజంలో అణగారిన వర్గాల పిల్లలను.. భావి భారత పౌరులుగా తీర్చి దిద్ధాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.

20:36 - September 5, 2017

విజయవాడ : ప్రపంచాన్ని శాసించే శక్తి భారత్‌కు ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించారు. గరువులందరికీ మార్గదర్శి సర్వేపల్లి రాధాకృష్ణను విద్యార్ధులు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. ఉపాధ్యాయుల ద్వారానే విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని.. రాష్ట్రాభివృద్ధి గురువుల ద్వారానే సాధ్యమన్నారు చంద్రబాబు. 

20:24 - September 5, 2017

ఏస్ ముమ్మాటికి తెలంగాణల దళితుల పరిస్థితి ఆగమున్నది.. ప్రభుత్వం దళితుల జీవితాలతోని ఆటాడుకుంటున్నది.. ఇది నేను గమనించి చెప్తున్న ముచ్చట.. మంథని మధుకర్ కాడికెళ్లి.. నిన్న మానకొండూరు ఆత్మహత్యాయత్నాల దాక.. దళితుని హక్కులను బొందవెట్టింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినంక.. దళితులను ఈ తరీఖల మోసం జేశిన ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమేగావొచ్చు..

అవునయ్యా తెలంగాణ రాష్ట్రం వచ్చి మూడేండ్లై.. నాల్గో యాడాది నడుస్తున్నది.. ఇన్నిరోజులళ్ల.. ఎన్నడన్న పువ్వుగుర్తోళ్లు సెప్టంబర్ 17 ను అధికారికంగ నిర్వహించాలే అని యాత్రలు జేశిండ్రా..? ఏదో పార్టీ ఆఫీసుల ప్రెస్ మీటింగు వెట్టి.. తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం సద్విపోయిండ్రు.. ఇగ ఏమంట తెలంగాణల ఎన్నికలు దగ్గరవడ్తున్నయో.. ఇగ సెప్టంబర్ 17 మీద చిన్నగావురం గారుస్తున్నరా..? సూడుండ్రి..

గాలొచ్చినప్పుడే తూర్పాల వట్టుకోవాలె.. అధికారం ఉన్నప్పుడే నాల్గు రాళ్లు ఎన్కేసు కోవాలె..? అంతేనా..? అధికార పార్టీ ఎంపీ అయి ఉండి గూడ.. ఏం సంపాయించుకోకపోతె.. ఏడ గుంటెడు భూమి కబ్జా వెట్టుకోకపోతె నల్గురు ఎక్కిరియ్యరా..? ఏహే తెల్వి తక్వ ఎంపీ తెల్వితక్వ ఎంపీ అంటే.. ఎంత నామూషుంటది..? అందుకే ఆ మాట నాకు రావొద్దని బీబీ పాటిల్ సారు ఎంత తాపత్రయపడ్డడో సూడుండ్రి..

మామూల్గ ప్రభుత్వ సభలు సమావేశాలకు.. అప్పట్ల మందిని తోల్కొస్తుండే.. ఇప్పుడు గొర్లను గొట్కొస్తున్నరు.. ఎందుకంటె గొర్ల మీదనే సభ గావట్టి అవ్వి తెస్తున్నట్టున్నరు.. అయితే కండియం శ్రీహరి సారు చిన్నప్పుడు ఈ జీవాలు గూడ గాశిండో ఏమో..? అవ్విటిని సూశి ముర్శిపోతున్నడు.. మందులేస్తున్నడు.? సూడుండ్రి సారు ముచ్చట ముర్పెం..

తెలంగాణ ప్రజలారా..? మీకు రోగమొచ్చినా నొప్పొచ్చినా..? ప్రైవేటు దావఖాండ్ల పొంట వోకుండ్రి.. సర్కారు దావఖాండ్లను వాడుకోండ్రి... పుణ్యానికే వైద్యం జేపిచ్చుకోండ్రి అని పిల్పునిస్తున్నడు మంత్రి.. మంత్రంటే వైద్యారోగ్యశాఖా మంత్రిగాదు.. నీటి పారుదల శాఖామంత్రి హరీష్ రావుగారూ.. శాఖలు వేరైతేంది.. సారం ఒక్కటేగదా..? ఏమంటరు..?

అమెరికా అధ్యక్షునితోని పంచాది వెట్టుకున్నా నడుస్తదిగని.. ఊర్లె సాప్ సపాయోళ్లతోని వెట్టుకుంటె ఎట్లుంటదో తెల్సా..? పోకిరి సీన్మల బ్రహ్మానందానికి ఏ గతి వడ్తది..? అగో అదే గతి వడ్తది ఎవ్వలికైనా..? కాకపోతె క్యారెక్టర్లు మాత్రమే మార్తయ్..? సాఫ్ సఫాయోళ్ల తెర్వువొయ్యిన ఒకాయిన ఇంటి మీద ఎసొంటి దండ యాత్ర జేశిండ్రో సూడుండ్రి..

ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారూ.. మా ఖమ్మం పట్నానికొచ్చినప్పుడు ఐదువేల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నమన్నడు.. ఇద్వర్ దాక ఒక్కటి గూడ ఇయ్యలేదంటే..? అప్పుడు కార్పొరేషన్ ఎన్నికలున్నయ్ గావట్టి అన్నడేమో.? ఇప్పుడేమున్నయ్.. అయినా ఏ నాయకుడైనా.. ఏ పార్టైనా..? మేము ఇస్తమనే అంటది గని.. ఇయ్యమంటదా..? న్యూ డెమోక్రసీ అన్నలు..?

అయ్యో పాడుగాను.. చివరి సూపు కన్న నోచుకోకపోతిమి.. ఎంతపనైపాయెనుల్లా.. శీన్మలు జూశెటోళ్లకు ఏ కష్టం రాకుంట కాపాడుతుండే.. నిన్న ఆత్మహత్య జేస్కోని సచ్చిపోయిందట.. పాపం మొగదిక్కు లేక ఆంధ్రా ఆడిబిడ్డెలు పాడె మోశిండ్రు తలగోరి వట్టిండ్రు.. డప్పుల సప్పుళ్లు లేక సైలెంటుగ పీన్గె వోతుంటే.. సూశినోళ్లంత నవ్విండ్రు.. అగో ఏడ్వాలేగని.. నవ్విండ్రేందంటరా..? సూడుండ్రి తెలుస్తది..

 

20:04 - September 5, 2017

సిద్దిపేట : జిల్లా తోగుట మండలం గూడికందుల గ్రామంలో సోని అనే యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. సోని కొంతకాలంగా బాబు అనే యువకున్ని ప్రేమిస్తోంది. ప్రియుడు బాబు పెళ్లి నిరాకరించడంతో మనస్తాపంతో స్కూల్బఇల్డింగ్ పై నుంచి దూకింది. తీవ్ర గాయలపలైన సోనిని సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

వినాయక నిమజ్జనంలో విషాదం

మహబూబ్ నగర్ : జిల్లా మక్తల్ మండలంలో వినాయక నిమజ్జనంలో విషాదం చొటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో మహేష్ అనే బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించారు.

నిజామాబాద్ లో దారుణం

నిజామాబాద్ : జిల్లాలో మరో అకృత్యం వెలుగు చూసింది. ఆర్మూర్ మండలం ఇసాపల్లిలో దళితుల గణేష్ ఉత్సవాలపై అగ్రకులాల వారు దాడి చేశారు. దళితుల వినాయక ప్రతిమ ఊరేగింపు అడ్డుకుని దళిత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకున్న ముగ్గురు దళిత యువకులను తరుముతూ దాడి చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

రమేష్ బాబు పౌరసత్వంపై కేంద్ర సంచలన ప్రకటన

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కు జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రమేష్ బాబు భారతీయ పౌరసత్వం చెల్లదని కేంద్ర తెల్చిచెప్పింది. గతంలో ఆయన జర్మనీలో ప్రొపెసర్ గా పనిచేశాడు. ఆయన 2009టీడీపీ నుంచి,2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెపొందారు.

19:36 - September 5, 2017

హైదరాబాద్ : నగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. అందరు చూసే విధంగా ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథుల నిమజ్జనం జరిగిందని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులు ఏర్పాట్లు బాగా చేశారని ఆయన అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

19:32 - September 5, 2017

మహబూబ్ నగర్ : జిల్లా మక్తల్ మండలంలో వినాయక నిమజ్జనంలో విషాదం చొటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో మహేష్ అనే బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించారు.

 

 

19:30 - September 5, 2017

నిజామాబాద్ : జిల్లాలో మరో అకృత్యం వెలుగు చూసింది. ఆర్మూర్ మండలం ఇసాపల్లిలో దళితుల గణేష్ ఉత్సవాలపై అగ్రకులాల వారు దాడి చేశారు. దళితుల వినాయక ప్రతిమ ఊరేగింపు అడ్డుకుని దళిత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకున్న ముగ్గురు దళిత యువకులను తరుముతూ దాడి చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:29 - September 5, 2017

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కు జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రమేష్ బాబు భారతీయ పౌరసత్వం చెల్లదని కేంద్ర తెల్చిచెప్పింది. గతంలో ఆయన జర్మనీలో ప్రొపెసర్ గా పనిచేశాడు. ఆయన 2009టీడీపీ నుంచి,2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెపొందారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

19:09 - September 5, 2017

హైదరాబాద్ : నగరంలో వినాయక నిమజ్జనం భారీ భద్రత మధ్య కొనసాగుతోంది. పోలీసులు సీసీ కెమెరాలతో వినాయక శోభ యాత్రను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే పరిశ్యుద్ధ సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి జీహెచ్ఎంసీ టీంలను పంపించి క్లియర్ చేస్తున్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పోలీస్ కంట్రోల్ రూం నుంచి సమీక్షిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.  

నాయిని ఏరియల్ సర్వే

హైదరాబాద్ : నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రామాన్ని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఏరియల్ సర్వే ద్వార్యా పర్యవేక్షించారు. ఏరియల్ సర్వేలో నాయినితో పాటు డీజీపీ, సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు.

బ్రిక్స్ తీర్మానాన్ని తిరస్కరించిన పాక్

బీజింగ్ : బ్రిక్స్ తీర్మానాన్ని పాకిస్థాన్ తిరస్కరించింది. ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని బ్రిక్స్ దేశాల సూచన స్పందించని పాక్ ను బ్రిక్స్ దేశాలు తప్పుబట్టాయి.

డేరా హెడ్ క్వార్టర్స్ వద్ద కర్ఫ్యూ

హర్యానా : రాష్ట్రంలోని సిర్పాలోని డేరా హెడ్ క్వార్టర్స్ వద్ద పోలీసులు కర్ఫ్యూ విధించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కర్ఫ్యూ విధించినట్టు పోలీసులు తెలిపారు. 

18:27 - September 5, 2017
18:07 - September 5, 2017
18:05 - September 5, 2017

గణేష్ నిమజ్జనం ఈ అర్థరాత్రికి పూర్తి చేయాలి: నాయిని

హైదరాబాద్: ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా గణేషుల నిమజ్జనం జరుగుతోందని హోం మంత్రి నాయిని అన్నారు. ఆయన ఏరియల్ సర్వే ద్వారా నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం త్వరగా అవడం మంచి పరిణామం అన్నారు. బాలాపూర్ గణేషుడి నిమజ్జనం కావాల్సి ఉందని, సహకరించిన ప్రజలు, గణేష్, ఉత్సవ కమిటీకి, పోలీసులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. గణేష్ నిమజ్జనం ఈ అర్థరాత్రికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, దానికి అనుగుణంగానే పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

17:48 - September 5, 2017

హైదరాబాద్ : నగరంలోని మోజంజాహి మార్కెట్ గుండా నిమజ్జనాలకు వినాయక విగ్రహాలు తరలివస్తున్నాయి. విగ్రహాలు చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో వినాయక నిమజ్జనం సాగుతోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

వైజాగ్ లో ఇంటర్నేషనల్ టెక్ టెలీ కాన్ఫరెన్స్ మంత్రి గంటా

అమరావతి: ఉన్నతాధికారులతో మంత్రి గంటా సమావేశం ఏర్పాటు చేశారు. డిసెంబర్ 16,17,18 తేదీల్లో సాంకేతిక సమావేశం ఏర్పాట్లు, 12 అంశాలపై చర్చించామని, టెక్ సదస్సు సంబంధించి 2,3 రోజుల్లో జీవో విడుదల చేయనున్నట్లు తెలిపారు. వైజాగ్ లో ఇంటర్నేషనల్ టెక్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నామని, యునెస్కో, రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యున్నత భేటీ కానున్నారు. సమావేశానికి 1,200 మంద్రి ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. విద్యావేత్తలు, నిపుణులతో జగరనున్న సదస్సు ఏర్పాట్లకు సంబంధించి జీవో విడుదల చేశామన్నారు.

17:37 - September 5, 2017

హైదరాబాద్ : నగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోందని హోమంత్రి నాయిని నర్సిహారెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడు తొందరగా నిమజ్జనం చేయడం వల్ల సగం భారం తగ్గిందని, డీజీపీ, సీపీ, పోలీసులు బాగా భద్రత ఏర్పాట్లు చేశారని ఆయన అన్నారు. పోలీసు, మున్సిపాల్ ఉన్నధికారులు కలిసి ఏరియల్ సర్వే చేశామని నాయిని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

నిమజ్జనం ప్రాంతాల్లో హోమంత్రి నాయిని ఏరియల్ సర్వే

హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనం ప్రాంతాల్లో హోమంత్రి నాయిని ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు.

17:30 - September 5, 2017
17:18 - September 5, 2017

నిమజ్జనంలో విద్యుత్ వైర్లు తగిలి ఒకరు మృతి

మహబూబ్ నగర్ : మక్తల్ లో గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు తగిలి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడు మహేష్(11) గా తెలుస్తోంది.

సిద్ధిపేటలో అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులకు మంత్రి హరీష్ శంకుస్థాపన

సిద్ధిపేట: రూ.315 కోట్లతో నిర్మించిన అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ...324 కి.మీటర్ల మేర అండర్ గ్రౌండ్ నిర్మాణం చేపట్టామని, 100ఏళ్ల అవసరాలు తీరేలా నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. 2,3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

మహబుబాబాద్‌ గణేష్ నిమజ్జనంలో అపశృతి

మహబుబాబాద్: జిల్లా కేంద్రమైన మహబుబాబాద్‌లో జరిగిన గణేష్ నిమజ్జనంలో అపశృతి దొర్లింది. వినాయక విగ్రహాలను క్రేన్ ద్వారా నీళ్లల్లో నిమజ్జనం చేస్తుండగా క్రేన్ రోప్ తెగిపడడంతో డీఎస్పీ రాజమహేంద్రనాయక్ తోపాటు ఆయా మీడియా సంస్ధల ఫొటోగ్రాఫర్లు నీళ్లల్లో పడిపోయారు. మున్నేరు వాగులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

టీచర్స్ డే వేడుకల్లో సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు..

విజయవాడ: టీచర్స్ డే వేడుకల్లో భాగంగా 131 మంది ఉపాధ్యాయులకు సీఎం చంద్రబాబు పురస్కారాల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాగా చదువుకున్న వారు పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదని అన్నారు. పిల్లలను కనడం, పెంచడం శ్రమగా భావిస్తున్నారని, ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు సూచించారు. ఒకపుడు కుటుంబ నియంత్రణను నేనే ప్రోత్సహించానని, కానీ ఇపుడు పిల్లలను కనాలని చెబుతున్నాని, లేకుంటే రోబోలతో పనులు చేయించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

మొజాంజాహీ మార్కెట్ దాటిన బాలాపూర్ గణనాథుడు

హైదరాబాద్: బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతుంది. మొజాంజాహీ మార్కెట్ దాటి బాలాపూర్ గణథుడు అబిడ్స్, బహీర్ బాగ్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ కు చేరుకోనున్నాడు.

ఏపీలో రానున్న 40 నిమిషాల్లో పిడుగులు పడే ప్రాంతాలు...

అమరావతి: రానున్న 40 నిమిషాల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులు హెచ్చరించారు.

గుంటూరు జిల్లా: తుళ్లూరు, తాడేపల్లి, నాదెండ్ల, బాపట్ల, తెనాలి, మంగళగిరి, దుగ్గిరాల, చిలకలూరిపేట.

కృష్ణా జిల్లా: విజయవాడ అర్బన్ : రూరల్, గన్నవరం.

శ్రీకాకుళం జిల్లా: ఆముదాలవలస, సరుబుజిలి, ఎల్.ఎన్ పేట, లక్ష్మీనరసింహపేట,

తూర్పుగోదావరి జిల్లా: రాజమండి అర్బన్ అండ్ రూరల్, రాజానగరం, కోరుకొండ.

మయన్మార్ చేరుకున్న ప్రధాని మోదీ

హైదరాబాద్: చైనా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ మయన్మార్ చేరుకున్నారు. 7వ తేదీ వరకు మయన్మార్ లో పర్యటించనున్నారు.

16:27 - September 5, 2017
16:24 - September 5, 2017
16:16 - September 5, 2017

సింగరేణిలో ఏఐటీయూసీ,ఐఎన్‌టీయూసీల మధ్య పొత్తు

భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే నెల 5వతేదీన జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిపీఐ అనుబంధ కార్మిక సంఘమైన ఏఐటీయూసీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్‌టీయూసీల మధ్య పొత్తు ఖరారైంది. నాలుగేళ్లకోసారి జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ కార్మికసంఘమైన టీజీబీకేఎస్‌ను దెబ్బతీసేందుకుగానూ ఈ రెండు యూనియన్ల మధ్య పొత్తు ఖరారు చేసుకున్నారు.

16:03 - September 5, 2017

50 శాతం వరకు గణేష్ విగ్రహాల నిమజ్జనం పూర్తి:డీజీపీ

హైదరాబాద్: ప్రశాంతంగా గణేష్ శోభాయాత్రలు కొనసాగుతున్నయాని డీజీపి తెలిపారు. చార్మినార్ వద్ద శోభాయాత్రను పరిశీలించిన డీజీపీ '10టివి'తో మాట్లాడుతూ...50 శాతం వరకు గణేష్ విగ్రహాల నిమజ్జనం పూర్తి అయ్యిందని తెలిపారు. సీసీ కెమెరాలతో నిమజ్జనం ప్రక్రియను పరిశీలిస్తున్నామని, అనుకున్న సమయానికే నిమజ్జనం పూర్తవుతుందని, పాతబస్తీ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని స్పష్టం చేశారు.

ఏపీలో 6 నుంచి 8 వరకు 'జలసిరికి హారతి'

అమరావతి: ఈనెల 6 నుంచి 8 వరకు 'జలసిరికి హారతి' ఏపీ సర్కార్ ఉత్తర్వుల జారీ చేసింది. జలవనరులు, ప్రాజెక్టుల వద్ద జలసిరికి హారి కార్యక్రమం చేపట్టనుంది.

విజయవాడలో వేతనాలు పెంచాలంటూ వీఆర్ఏల ఆందోళన

విజయవాడ: వీఆర్ ఏలు వేతనాల పెంచాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీఆర్ ఏల సమస్యలను సీఎం దృష్టి తీసుకెల్తా అని, సమస్యల పరిష్కారనికి ధర్నాలు వేదిక కాకూడదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి అన్నారు. వీఆర్ ఏలు ధర్నా ను విరమించాలని కేఈ విజ్ఞప్తి చేశారు.

పేదల ఇళ్ల కోసం దశలవారీ ఉద్యమం:సీపీఎం

విజయవాడ: సీఎం చంద్రబాబు పేదల సొంతింటి కలను కలగానే మారుస్తున్నారని సీపీఎం నేత సీహెచ్ బాబూరావు విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఒక్క ఇంటినీ నిర్మించలేదని, జేఎన్ ఎన్ ఆర్ ఎంయూ పథకంలో నిర్మించిన ఇళ్లు సగంలో నిలిచిపోయాయని మండి పడ్డారు. పేదల ఇళ్ల కోసం దశలవారీ ఉద్యమం చేపడుతున్నామని, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ని ఇల్లు నిర్మించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

15:30 - September 5, 2017
15:28 - September 5, 2017

యువతి గొంతుకోసి ...నగరలో పరారీ...

కర్నూలు: యువతి గొంతు కోసి ఆమె ఒంటిపై ఉన్న నగలతో ఓ యువకుడు పరారయ్యాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రాజు అనే వ్యక్తి, ఓ మహిళతో అక్రమ సంబంధం నెరపుతున్నాడు. అయితే... మంగళవారం ఆమె ఒంటిపై ఉన్న నగలపై కన్నేసిన అతను ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించి గొంతుకోశాడు. అనంతరం పది తులాల బంగారాన్ని తీసుకుని పరారయ్యాడు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం కర్నూలులోని ఓ ఆసుపత్రికి తరలించారు.

15:27 - September 5, 2017
15:25 - September 5, 2017
15:24 - September 5, 2017

ఆర్సీఎస్ పార్టీని మూసివేస్తున్నాం: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

కర్నూలు: మచ్చుమర్రిలో రాయలసీమ పరిరక్షణ సమితి కార్యకర్తల సమావేశం జరిగింది. ఆర్సీఎస్ పార్టీని మూసివేస్తున్నట్లు రాయసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్కొనాడు. ఇక్కడ రాయలసీమ వాదం లేదని.. అందుకే పార్టీ మూసివేస్తున్నట్లు తెలిపారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ద్రోణి

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, రానున్న 48 గంటల్లో కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొంది.

3100 ఎకరాలభూమిని కాజేసిన జహీరాబాద్ ఎంపి: బి.వెంకట్

సంగారెడ్డి : కంగ్డి మండలం బోర్గి లో సీపీఎం నేతలు పర్యటిస్తున్నారు. 15 గ్రామాల రైతుల నుంచి 3100 ఎకరాలను జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అక్రమంగా కాజేశారని సీపీఎం నేత బి.వెంకట్ విమర్శించారు. 3100 ఎకరాల్లో ఎంపీకి చెందిన వ్యక్తులు క్వారీ నడుపుతూ నిర్మాణాలు చేపుడుతున్నా రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అమాయకులైన రైతుల నుంచి కాజేసిన భూములను తిరిగి వారికి చెందేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలడి డిమాండ్ చేశారు. లేదండే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కొనసాగుతున్న బాలాపూర్ గణేష్ శోభాయాత్ర

హైదరాబాద్: బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతుంది. పాతబస్తీ కేశవగిరి, కందికల్ గేట్ నుంచి చార్మినార్, మొజంజాహీ మార్కెట్, అబిడ్స్, బషీర్ బాగ్, లిబర్టీ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ లేదా ట్యాంక్ బండ్ కు చేరుకోనున్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు 800 సీసీ కెమెరాలను అమర్చారు.

ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం పూర్తి

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులతో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఆ ప్రాంతం భక్తులతో కోలాహలంగా మారింది. ట్యాంక్ బండ్ పై సందడి వాతావరణం నెలకొంది.

14:22 - September 5, 2017

సీఎం సమావేశానికి దినకరన్ వర్గ ఎమ్మెల్యేల గైర్హాజరు..

చెన్నై:ఐఏఏడీఎంకే ఎమ్మెల్యేలలతో సీఎం పళని సమావేశం నిర్వహించారు. 19 మంది దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి గైర్జాహరు అయ్యారు.

 

13:10 - September 5, 2017

హైదరాబాద్ : గణేష్ నిమజ్జన ఊరేగింపులో వినూత్న వినాయకులు కనిపించాయి. వినాయక ఊరేగింపులో కొంతమంది పండ్లతో..పూలు..ఇలా ఎన్నో వైరైటీ గణనాథులు చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనం చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. పాతబస్తీలో రమేష్ అనే వ్యక్తి వినూత్నంగా ఆలోచించారు. మట్టి గణేష్ ను ఏర్పాటు చేశారు. గణేషుడి చేతి కింద కాయిన్స్ తో ఏర్పాటు చేశారు. శివలింగాన్ని పూర్తిగా కాయిన్స్ తో ఏర్పాటు చేయడం విశేషం. ఇందులో ఏకాణ..దోవానా..తీనానాలాంటి కాయిన్స్ ఉన్నాయి. నిజాం కాలం నాటి కాయిన్ కూడా ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా దీనిని ఏర్పాటు చేసిన రమేష్ తో టెన్ టివి ముచ్చటించింది. ఒక్క పైసా నుండి దోవానా..తీనానా...ఇలాంటి కాయిన్స్ ను తాను సేకరించడం జరిగిందన్నారు. ప్రతి వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా తాను ఇలాంటివి తయారు చేస్తానన్నారు. నీళ్లు చల్లి మళ్లీ ఇంటికి తీసుకొస్తామన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించిన కమల్...!

చెన్నై: నటుడు కమల్ హాసన్ కు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోంది. సీనియర్‌ నటి నగ్మాతో ఆయనకు రాయబారం పంపింది. కమల్‌ నివాసానికి వెళ్లి ఆయనతో అరగంటకు పైగా భేటీ అయ్యారు. తమ పార్టీలో చేరాలని కమల్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రాజకీయ ప్రవేశం గురించి తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని కమల్‌ తిరస్కరించినట్లు సమాచారం.

 

12:55 - September 5, 2017

బాలీవుడ్ అలనాటి హీరో 'దిలీప్ కుమార్' ను హీరోయిన్ 'ప్రియాంక చోప్రా' కలిసింది. తీవ్ర అనారోగ్యం కారణంగా దిలీప్ కుమార్ ఆసుపత్రిలో చేరి కొద్ది రోజుల క్రితం డిశ్చార్జ్ అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి ప్రియాంక చోప్రా ఆయన నివాసానికి వెళ్లింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను దిలీప్ సతీమణి సైరా బాను పోస్టు చేశారు. ప్ర‌స్తుతం దిలీప్ కుమార్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని ఆమె తెలిపారు. 'దిలీప్ కుమార్' దంపతులను కలవడం చాలా ఆనందంగా ఉందని ప్రియాంక ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా ఏ చిత్రాల్లో కూడా నటించడం లేదనే సంగతి తెలిసిందే. ఆమె కాల్షీట్లు స‌హక‌రించ‌డం లేద‌ని 'ప్రియాంక' త‌ల్లి మ‌ధు చోప్రా తెలిపిన సంగ‌తి తెలిసిందే. 

ఎమ్మెల్సీగా సీఎం యోగి ఆదిత్యనాథ్ నామినేషన్ దాఖలు

హైదరాబాద్:ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్సీ పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. యోగితో పాటు డిప్యూటీ సీఎంలు కేపీ మౌర్య, దినేశ్ శర్మ, మంత్రులు ఎస్డీ సింగ్, మోహసిన్ రజా నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ శాసనమండలికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.

 

మయన్మార్ కు బయలుదేరిన ప్రధాని మోదీ

ఢిల్లీ : చైనా నుండి ప్రధాని నరేంద్ర మోడీ మయన్మార్ కు బయలుదేరారు. ఈనెల 7 వరకు మయన్మార్ లో మోదీ పర్యటించనున్నారు.

మధ్యప్రదేశ్ లో పేలుడు ఇద్దరు చిన్నారుల మృతి

మధ్యప్రదేశ్ : దామో ప్రాంతంలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. టపాకాయలు తయారుచేసేందుకు ఉపయోగించే ముడిపదార్థాలు ప్రమాదశాత్తు పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

12:30 - September 5, 2017

హైదరాబాద్ : నగరంలో నిమజ్జన కోలాహాలం కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుండి తీసుకొచ్చిన విగ్రహాలు..నిమజ్జనం చూసేందుకు వచ్చే భక్తులతో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నగరంలోని వివిధ కూడళ్లలో ప్రతిష్టించిన విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు హుస్సేన్ సాగర్ వైపుఏ బయలుదేరుతున్నారు. వినాయకులను అందంగా అలకరించి నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా యువతీ యువకులు..డ్యాన్స్ లతో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా యువతులు..మహిళలు చేస్తున్న తీన్ మార్ డ్యాన్స్ ఆకట్టుకుంది. మీరు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

12:25 - September 5, 2017

మీసాభారతికి చెందినచెందిన ఫామ్ హౌస్ ఈడీ అటాచ్

ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె మీసాభారతికి చెందిన ఫామ్ హౌస్ ను ఈడీ అటాచ్ చేసింది.

12:23 - September 5, 2017

హైదరాబాద్ : గణేష్ పండుగ అంటేనే..రకరకాల భంగిమలతో విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారు. వినూత్నంగా అలంకరిస్తుంటారు. ఇక నిమజ్జనం అయితే సరే సరి..ఆకర్షణీయంగా అలంకరిస్తూ ఊరేగింపు నిర్వహిస్తుంటారు. పాతబస్తీలోని

చక్కర్ నగర్ పిట్టల బస్తీలో ఏర్పాటు చేసే వినాయకుడు అందర్నీ ఆకర్షిరిస్తుంటాడు. ఎందుకంటే మొత్తం పండ్లతో అలకరించి ఊరేగింపు నిర్వహిస్తుంటారు. పూర్తిగా పండ్లతో గణేష్ ను అలంకరిస్తుంటారు. యాపిల్..అంగూర్..పైనాపిల్..ఇతర పండ్లతో వెళుతున్న ఈ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాడు. ఈ సందర్భంగా టెన్ టివితో నిర్వాహక కమిటీ సభ్యులు మాట్లాడారు. తాము పండ్ల వ్యాపారం చేస్తుంటామని, నిమజ్జనం అనంతరం పండ్లను ప్రజలకు పంచుతామన్నారు. పూర్తి వివరాలకు..పండ్ల గణేష్ ను చూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

12:21 - September 5, 2017

హైదరాబాద్ : అన్ని విభాగాలు..సమన్వయం..సహకారం చేసుకొంటే ఏదేనా కార్యక్రమం విజయవంతమౌతుంది. అలాగే గణేష్ నిమజ్జనంలో ఇదే జరిగింది. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే ఒక ప్రహాసనంగా మారేది. నిమజ్జనం కంటే జరిగే ఊరేగింపులో ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యేవి. ఊరేగింపు జరిగి..ట్యాంక్ బండ్ కు చేరుకునే సరికి సాయంత్రం అయ్యేది.. నిమజ్జనం అర్ధరాత్రి..లేదా మరుసటి రోజు జరిగేది. నిమజ్జనం జరిగేంత వరకు అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉండేవి. దీనితో నిమజ్జనం వీక్షించడానికి వచ్చిన ప్రజలు..ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ ఈ సంవత్సరం మాత్రం అలాంటిది జరగలేదు. ప్రభుత్వం..ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు..ఇతర విభాగాల అధికారుల సహకారంతో అనుకున్న సమయానికే ట్యాంక్ బండ్ వద్దకు భారీ గణనాథుడు చేరుకున్నాడు. మంత్రి తలసాని..మేయర్ బొంతు రామ్మోహన్ స్వయంగా పర్యవేక్షించారు. మేయర్ బొంతు రామ్మోహన్ హుస్సేన్ సాగర్ లో బోటులో ప్రయాణిస్తూ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఇంగ్లడ్ లోరోడ్డు ప్రమాదం.. 8మంది భారతీయులు దుర్మరణం..

హైదరాబాద్: ఇంగ్లండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. రెండు ట్రక్కుల మధ్య ఓ మినీ బస్సు నలిగిపోయింది. ఈ ప్రమాదంలో 8మంది మృతి చెందగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదేళ్ల చిన్నారి ఉంది. మృతుల్లో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరిలో ముగ్గురు విప్రో ఉద్యోగులు ఉన్నారు. మృతదేహాలను స్వదేశానికి పంపేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

12:01 - September 5, 2017

హైదరాబాద్ : మట్టి గణేష్ విగ్రహాల ఏర్పాటులో ఈ సారి 50 శాతం సక్సెస్ అయ్యామని, వచ్చే సంవత్సరం పూర్తి స్థాయిలో మట్టి విగ్రహాల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని మంత్రి తలసాని వెల్లడించారు. నగరంలో వినాయక నిమజ్జనం కోలాహాలంగా కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పై నిమజ్జన ఏర్పాట్లను మంత్రి తలసాని పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్ కమిటీ మెంబర్ సభ్యుల సహకారంతో భారీ గణనాథుడి నిమజ్జన కార్యక్రమం జరుగుతోందని, తొందరగా తీయాలని అనే ఉద్ధేశ్యం లేదన్నారు. పండుగల విషయంలో ప్రభుత్వం ముందుకొచ్చి ఏర్పాట్లు చేస్తోందని, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేసేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు. నయాపూల్, గోషమహాల్ ప్రాంతాల్లో వాలంటీర్లు ముందుకొచ్చి సహాయం చేయడం గొప్ప విషయమన్నారు. 

'మోదీ~జన్ పింగ్ మధ్య చర్చలు ఫలప్రదం'

ఢిల్లీ: ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జన్ పింగ్ మధ్య చర్చలు ఫలప్రదంగా ముగిశాయని, వీరి మధ్య గంట పాటు చర్చలు జరిగాయని, ఈ చర్చలో ఉగ్రవాదం పై చర్చ జరగలేదని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. సరిమద్దుల్లో శాంతి నెలకొనడానికి ఇరుదేశాలు అంగీకరించాయన్నారు.

అనుకున్న సమయానికే నిమజ్జనం: సీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్: గణేశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతున్నదని సీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌ బండ్‌ వరకు శోభాయాత్ర కొనసాగుతుందన్నారు. అనుకున్న సమయానికే పూర్తవు ట్యాంక్‌బండ్‌పైకి ఖైరతాబాద్‌ మహాగణపతిని తీసుకువచ్చామని వెల్లడించారు. హైదరాబాద్‌లో 12వేల విగ్రహాలకు జియోట్యాగింగ్‌ చేశామని చెప్పారు. ఎప్పటికప్పుడు విగ్రహాలు ఎక్కడ ఉన్నది తెలిసిపోతుందని ఆయన అన్నారు.

11:53 - September 5, 2017

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమాల పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ నుండి ప్రారంభమైన శోభాయాత్ర కాసేపటి క్రితం ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంది. శోభయాత్ర..నిమజ్జనాన్ని వీక్షిచేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. గత సంవత్సరాల కంటే భిన్నంగా ఈ సంవత్సరం నిమజ్జనం కార్యక్రమం జరుగుతోంది. ఉదయాన్నే జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించాలని భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. నిమజ్జన ఏర్పాట్లను మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:48 - September 5, 2017
11:48 - September 5, 2017

కర్నూలు : జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అవుకు రిజర్వాయర్ లోకి దూసుకెళ్లింది. కానీ డ్రైవర్ చాకచాక్యంతో పెను ప్రమాదం తప్పింది. రాతి ఆనకట్టుని ఆనుకుని బస్సు ఆగిపోయింది. దీనితో 40 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. కొండమనాయునిపల్లె నుండి ఆవుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం తప్పడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్...

హైదరాబాద్: భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందించే లక్ష్యంతో.. నాణ్యతతో కూడిన మౌలిక వసతులు, సదుపాయాలను అందించడం తెలంగాణ ప్రభుత్వం టీచర్స్ డేకు అందించే గొప్ప బహుమతి అని కేటీఆర్ ట్వీట్ చేశారు. గజ్వేల్‌లో అత్యాధునిక సదుపాయాలతో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలల ఫొటోలను ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

ఉపాధ్యాయులను సన్మానించుకోవడం సంతోషంగా ఉంది: ఏపీ సీఎం

విజయవాడ: ఉపాధ్యాయులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజవాడ ఎ1 ప్లస్ కన్వెన్షన్ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ఉపాధ్యాయులు తమ స్వార్థం కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచించాలన్నారు. విద్యార్థుల గుండెల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నేను నిత్య విద్యార్థిని అని ప్రతి రోజూ నేర్చుకుంటుంటే భవిష్యత్ కు ఢోకా ఉండదన్నారు. ప్రపంచాన్ని శాసించే శక్తి భారత దేశానికి ఉందన్నారు.

ఎస్వీ యూనివర్శిటీలో ఉద్రిక్తత

తిరుపతి: ఎస్వీ యూనివర్శిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఇంజనీరింగ్ కాలేజీలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ప్రిన్సిపల్ కార్యాలయాన్ని విద్యార్థులు ధ్వంసం చేశారు. అప్రమత్తమైన పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్ట్ చేసి యూనివర్శిటీ పీఎస్ తరలించారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలని పీఎస్ ఎదుట విద్యార్థిసంఘాలు ఆందోళన చేపట్టాయి.

11:22 - September 5, 2017

హైదరాబాద్ : గణనాథుల నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. గతసారి కంటే ఈసారి నిమజ్జన కార్యక్రమం వేగంగా జరుగుతోంది. మలక్ పేట, చాంద్రాయణ గుట్ట, చార్మినార్ ప్రాంతం గుండా వచ్చే వాహనాలు ఎంజె మార్కెట్ మీదుగా ట్యాంక్ బండ్ కు చేరుకోనున్నాయి. ఇప్పటి వరకు వేయి విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్లినట్లు తెలుస్తోంది. ఇక బాలాపూర్ గణనాథుడు ఎంజె మార్కెట్ కు చేరుకోవడానికి ఎంజే మధ్యాహ్నం రెండు అవుతుందని తెలుస్తోంది. సొంత వాహనాలు..చిన్న ఆటోలు..ద్విచక్ర వాహనాల్లో వినాయకులను తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. 

రిజర్వాయర్ లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు...

కర్నూలు : అవుకు రిజర్వాయర్ లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. డ్రైవర్ చాక చక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. 40 మంది ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు. కొండమనాయునిపల్లె నుంచి అవుకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.

11:11 - September 5, 2017

టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకరైన 'బాలకృష్ణ' సినిమాల జోరు పెంచారు. వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఘన విజయం అనంతరం వరుసగా సినిమాలకు సైన్ చేసేస్తున్నారు. తాజాగా 101 సినిమాగా వచ్చిన 'పైసా వసూల్' మంచి టాక్ నే తెచ్చుకుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సరికొత్త బాలయ్యను చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం వెంటనే మరోసినిమా మొదలెట్టేశారు. ఇప్పటికే పూజలు చేసిన ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకొంటోంది.
కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో 'బాలయ్య' సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు టాక్. అందులో ఒకరు 'నయనతార' కాగా ఇక రెండో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోవాలని చిత్ర దర్శక..నిర్మాతలు యోచించినట్లు టాక్. అందులో భాగంగా 'నటాషా దోషి'ని తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయ. మలయాళంలో 'హైడ్ అండ్ సీక్', ‘నయన', 'కాల్' వంటి చిత్రాల్లో నటించింది. మూడో హీరోయిన్ ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నారంట. కె.ఎస్‌ రవికుమార్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. బాలయ్య నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

11:02 - September 5, 2017

'యే హాలీ..యే హాలీ..హాలీబీ అనే పాటతో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ముందుకొచ్చాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'స్పైడర్' పాటలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా రెండో పాటను విడుదల చేసింది. ఈ పాట మహేష్ అభిమానులను అలరిస్తోంది.

మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ బాషల్లో విడుదల కానుంది. తమిళ ఆడియో వేడుక ఈనెల 9వ తేదీన చెన్నైలో జరుగనుంది. త్వరలోనే తెలుగు ఆడియో వేడుకకు సంబంధించి టైంను ఫిక్స్ చేయనున్నారు. హ‌రీష్ జైరాజ్ సంగీతం అందించిన చిత్రంలో 'మహేష్' సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటించింది. విల‌న్ గా ఎస్‌జె సూర్య క‌నిపించ‌నున్నాడు. 

విజయవాడలో ఘనంగా ఉపాధాయ దినోత్సవం...

విజయవాడ: ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి గంటా పాల్గొన్నారు. ఈ ఏడాది 127 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేయనున్నారు. పాఠశాల విద్య నుంచి 58 మంది ఉపాధ్యాయులకు, ఇంటర్ విద్య నుంచి 13 మందికి, ఉన్నత విద్య నుంచి 15 మందికి, సాంకేతిక విద్య నుంచి ఐదుగురికి ఉత్తమ పురస్కారాలు అందజేయనున్నారు.

జిన్ పింగ్ తో ప్రధాని మోదీ భేటీ

ఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా భారత్ - చైనా ద్వైపాక్షి సంబంధాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

10:41 - September 5, 2017

హైదరాబాద్ : ఖైరతాబాద్ భారీ గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర మూడు గంటల్లోనే ట్యాంక్ బండ్ కు చేరుకుంది. గత సంవత్సరం కంటే భిన్నంగా ఈసారి ముందుగానే నిమజ్జనం జరుగనుంది. ఇందుకు ప్రభుత్వం..ఉత్సాహక నిర్వాకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రేన్ 4 వద్దకు విగ్రహం చేరుకుంది. ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లను మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మేయర్ టెన్ టివితో మాట్లాడారు. నాలుగు గంటల్లోనే శోభయాత్ర ట్యాంక్ బండ్ కు చేరుకుంది. సకాలంలో లక్షలాది మంది ప్రజలు వీక్షించేందుకు ఈ ఏర్పాట్లను చేయడం జరిగిందని, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకుల సహకారం..అన్ని విభాగాల సహకారంతో ఇది సాధ్యమైందన్నారు.

ఎంజే మార్కెట్..
వేలం పాట పూర్తి కావడంతో ట్యాంక్ బండ్ కు బాలాపూర్ గణేషుడు బయలుదేరాడు. ఎంజే మార్కెట్ గుండా ఒక్కో విగ్రహం హుస్సేన్ సాగర్ వైపుకు తరలి వెళుతున్నాయి. ఎప్పుడు మండపం నుండి బయలుదేరుతుంది ? తదితర వివరాలను జియో ట్యాగ్ ద్వారా తెలుసుకోనున్నారు. పూర్తిస్థాయిలో విగ్రహాలు రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ప్రారంభమైన బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర

హైదరాబాద్: బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమయ్యింది. పాతబస్తీ కేశవగిరి, కచంఇకల్ గేట్ నుంచి చార్మినార్, మొజాంజాహీ మార్కెట్, అబిడ్స్, బషీర్ బాగ్, లిబర్టీ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ లేదా ట్యాంక్ బండ్ కు బాలపూర్ గణేశుడు చేరుకోనున్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు 800 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ముగిసిన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ముగిసింది. ట్యాంక్ బండ్ వద్ద క్రేన్ నెం 4 వద్దకు గణపతి చేరుకున్నాడు. కాసేపట్లో నిజమజ్జన కార్యక్రమం జరగనుంది.

10:17 - September 5, 2017

హైదరాబాద్ : బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు సృష్టించింది. ఈసారి లడ్డూ ధర రూ. 15.60 లక్షలకు చేరుకుంది. గతంలో రూ. 14.65 లక్షలు పలికిన సంగతి తెలిసిందే. ఈసారి రూ. 95వేలు పెరిగినట్లైంది. బాలాపూర్ నిమజ్జనోత్సవంలో భాగంగా తొలుత లడ్డూ వేలం నిర్వహించారు. లడ్డూ వేలాన్ని ఉత్సవ కమిటీ రూ. 1,116 ప్రారంభించింది. కొలను మోహన్ రెడ్డి, నాగం తిరుపతిరెడ్డి (అయ్యప్ప సొసైటీ), మహేందర్ రెడ్డి (నాగార్జున స్టీల్) లు ప్రధానంగా వేలం పాటలో పోటీ పడ్డారు. 14 లక్షలకు పోటీ పడిన తరువాత కొలను మోహన్ రెడ్డి వెనక్కి తగ్గారు. అనంతరం నాగం తిరుపతి రెడ్డి..మహేందర్ రెడ్డిలు పోటా పోటీగా వేలం పాటలో పాల్గొన్నారు. చివరకు నాగం తిరుపతిరెడ్డి 15 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. స్థానికేతరుడు కావడంతో ఆ నగదును మొత్తం బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీకి అందచేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు నాగం తిరుపతి రెడ్డిని సన్మానించారు. 

1994 నుండి బాలాపూర్ లడ్డూను వేలం వేస్తూ వస్తున్నారు. ఆ ఏడాది గ్రామానికి చెందిన కొలను మోహన్ రెడ్డి రూ.450కి సొంతం చేసుకున్నారు. దానిని కొంత ఇంట్లో వారు తిని మరికొంత బంధువులకు పంచి మిగిలింది తన పొలంలో చల్లారు. అప్పటి నుండి తన పంటల దిగుబడి పెరిగిందని ఆయన నమ్మకం. ఆ తరువాత ఏడాది నుండి వరుసగా 17 ఏళ్లు స్థానికులే ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. బాలాపూర్‌ లడ్డూను 1994 నుంచి వేలం వేస్తూ వస్తున్నారు. ఆ ఏడాది గ్రామానికి చెందిన కొలను మోహన్‌రెడ్డి 4 వందల 50 రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి వరసగా 17 ఏళ్ల పాటు స్థానికులే ఈ లడ్డూను దక్కించుకున్నారు. 2012లో స్థానికేతరుడు పన్నాల గోవర్దన్‌రెడ్డి ఈ లడ్డూను 7 లక్షల 50 వేలకు తీసుకున్నారు. తన తండ్రి చివరి కోరిక మేరకు లడ్డూను సొంతం చేసుకున్నట్లు తెలిపారు. 2014లో మాజీ మేయర్, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూను దక్కించుకున్నందుకే తాను ఎమ్మెల్యేనయ్యానని ఆయన భావిస్తున్నారు. 2015 సంవత్సరం వేలం పాటలో 10 లక్షల 32 వేలకు కళ్లెం మదన్‌మోహన్‌ లడ్డూను దక్కించుకున్నారు. రికార్డు స్థాయిలో రూ.14.65 లక్షలకు స్కైలాబ్‌రెడ్డి బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూను కైవసం చేసుకున్నారు.

సంవత్సరం పేరు  ధర
1994 కొలను మోహన్ రెడ్డి  రూ. 450.00
1995 కొలను మోహన్ రెడ్డి రూ. 4,500.00
1996 కొలను కృష్ణా రెడ్డి రూ. 18,000.00
1997 కొలను కృష్ణా రెడ్డి రూ. 28,000.00
1998 కొలను మోహన్ రెడ్డి రూ. 51,000.00
1999 కల్లెం ప్రతాప్ రెడ్డి రూ. 65,000.00
2000 కల్లెం అంజిరెడ్డి రూ. 66,000.00
2001 జి.రఘునందన రెడ్డి రూ. 85,000.00
2002 కందాడ మాదవ్ రెడ్డి రూ.1,05,000.00
2003 చిగిరింత బాల్ రెడ్డి  రూ. 1,55,000.00
2004 కొలను మోహన్‌రెడ్డి రూ. 2,01,000.00
2005 ఇబ్రహిం శేఖర్ రూ. 2,08,000.00
2006 చిగురింత తిరుపతిరెడ్డి రూ. 3,00,000.00
2007 జి.రఘునందనాచారి రూ. 4,15,000.00
2008 కొలను మోహన్‌రెడ్డి  రూ. 5,07,000.00
2009 సరిత రూ. 5,10,000.00
2010 శ్రీధర్‌బాబు రూ. 5,35,000.00
2011 కొలను ఫ్యామిలీ రూ. 5,45,000.00
2012 పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ. 7,50,000.00
2013 తీగల కృష్ణారెడ్డి రూ. 9,26,000.00
2014 సింగిరెడ్డి జయేందర్ రెడ్డి  రూ. 9,50,000.00
2015 కళ్లెం మదన్‌మోహన్‌  రూ. 10,32,000.00
2016 స్కైలాబ్ రెడ్డి రూ. 14,65,000.00
2017 నాగం తిరుపతి రెడ్డి రూ. 15,60,000.00

ర‌న్‌వే ట్రాక్‌పై నుంచి ప‌క్క‌కు వరిగిన ఎయిరిండియా విమానం..

కేరళ: కొచ్చిన్ విమానాశ్ర‌యంలో ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో ర‌న్‌వే ట్రాక్‌పై నుంచి ప‌క్క‌కు జ‌రిగింది. ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు. అబు దాబి నుంచి కొచ్చికి వ‌స్తున్న ఎయిర్ ఇండియా విమానానికి ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఇవాళ ఉద‌యం 2.40 నిమిషాల‌కు ఈ సంఘట‌న జ‌రిగింది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో విమానంలో 102 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. వీరంతా క్షేమమని అధికారులు తెలిపారు.

బాలాపూర్ లడ్డూ ధర రూ.15 లక్షల 60 వేలు...

హైదరాబాద్: బాలాపూర్ గణనాథుని లడ్డూ వేలంలో 15 లక్షల 60 వేల రూపాయల ధరపలికింది. లడ్డూను నాగం తిరుపతి రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నాడు.

ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం పాట.

హైదరాబాద్: బాలాపూర్ గణనాథుని లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూను దక్కించుకునేందుకు 22 మంది పోటీపడుతున్నారు. బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ 1994 నుంచి ప్రారంభమైంది. 1994లో బాలాపూర్ లడ్డూ తొలిసారి రూ.450 పలికింది. గతేడాది స్కైలాబ్‌రెడ్డి బాలాపూర్ గణేశుడి లడ్డూను రూ.14.5 లక్షలకు సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సారి గణేశుని లడ్డూను ఎవరు దక్కించుకుంటారో, వేలంపాట ఎంత పాడుతారో అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మాజీ స్పీకర్ సూర్యనారాయణ రాజు ఇంట్లో చోరీ

తూ.గో: రాజోలు మండలం చింతలపల్లిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మాజీ స్పీకర్ సూర్యనారాయణ రాజు ఇంట్లో చోరీ జరిగింది. కత్తులతో బెదిరించి రూ.3లక్షల విలువైన బంగారాన్ని,రూ.75 వేలు దొంగలు అపరించుకుపోయారు.

09:48 - September 5, 2017

మాత శిశు వైద్య శాలలో బాలింత మృతి..

ఒంగోలు : మాత శిశు వైద్య శాలలో సిబ్బంది నిర్లక్ష్యానికి బాలింత మృతి చెందింది. నిన్న సాయంత్రం దివ్య అనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. దివ్యకు పెట్టిన సెలైన్లు అయిపోయినా సిబ్బంది మార్చలేదు. తీవ్ర రక్తస్రావంతో దివ్య (23) మృతి చెందింది. మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. 

కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం..

హైదరాబాద్ : బాలాపూర్ లడ్డూ వేలం కాసేపట్లో జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహక కమిటీ సభ్యులు పూర్తి చేశారు. మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. 

బాలాపూర్ లో మంత్రి మహేందర్ రెడ్డి..ఇతర నేతలు..

హైదరాబాద్ : బాలాపూర్ కు మంత్రి మహేందర్ రెడ్డి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఇతర పార్టీలకు చెందిన నేతలున్నారు. 

నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు - మేయర్..

హైదరాబాద్ : మధ్యాహ్నానికే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ పేర్కొన్నారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఆయన హుస్సేన్ సాగర్ వద్ద పర్యవేక్షిస్తున్నారు. 

09:24 - September 5, 2017

హైదరాబాద్ : మధ్యాహ్నానికే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ పేర్కొన్నారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఆయన హుస్సేన్ సాగర్ వద్ద పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. ప్రత్యేకంగా 35 భారీ క్రేన్ లు ఏర్పాటు చేసినట్లు, 5 వేల మంది పారిశుధ్య సిబ్బంది..ఇతరులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అన్ని డిపార్ట్ మెంట్ లు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు, హుస్సేన్ సాగర్ తో పాటు ఇతర కొలనులో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:22 - September 5, 2017

హైదరాబాద్ : నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరుగుతోంది. గతంతో పోలిస్తే నిమజ్జన కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. అందుకు ప్రభుత్వం..పోలీసులు..ఇతర అధికారుల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ మార్గంలో 9 క్రేన్ లు ఏర్పాటు చేయగా మిగతా క్రేన్ లను బుద్ధుడు ఎదురుగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది లాగే ఖైరతాబాద్ భారీ వినాయకుడు క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం జరుగనుంది.

క్రేన్ సామర్థ్యం ఇదే...
ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేసే క్రేన్ అత్యంత శక్తివంతమైంది. 12 ఏళ్లుగా రవి క్రేన్ సర్వీసుకు చెందిన భారీ క్రేన్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేన్ జర్మనీ నుంచి దిగుమతి అయ్యింది. 60 ఫీట్ల పొడువు, 11 అడుగుల వెడల్పు, 110 టన్నుల బరువు, 12 టైర్లతో రూపుదిద్దుకుంది. ఈ క్రేన్ 150 టన్నుల బరువును ఎత్తనుంది.

ఎంజే మార్కెట్..
ఎంజే మార్కెట్ లో నివాసాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రజలు వెళుతున్నారు. ద్విచక్ర వాహనాలు..కార్లలో తమ వినాయక విగ్రహాలను తీసుకెళుతున్నారు. డప్పు..వాయిద్యాల నడుమ డ్యాన్స్ లు చేస్తూ సందడిగా తరలివెళుతున్నారు.

ఖైరతాబాద్ గణనాథుడు..
ఖైరతాబాద్ గణనాథుడు శోభయాత్ర కొనసాగుతోంది. ఉదయమే ప్రారంభమైన ఈ యాత్ర కాసేపటి క్రితం టెలిఫోన్ భవనం వద్దకు చేరుకుంది. అనంతరం సెక్రటేరియట్ మార్గం గుండా ట్యాంక్ బండ్ కు చేరుకోనుంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

టెలిఫోన్ భవన్..టు సెక్రటేరియట్ భారీ గణనాథుడు..

హైదరాబాద్ : ఖైరతాబాద్ భారీ గణనాథుడు టెలిఫోన్ భవన్ కు చేరుకున్నాడు. ఉదయమే గణనాథుడిని ట్రాలీపైకి ఎక్కించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య నిమజ్జన కార్యక్రమం జరుగనుంది. 

మోడీ టీచర్స్ డే శుభాకాంక్షలు..

ఢిల్లీ : నేడు టీచర్స్ డే సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ కు నివాళులర్పిస్తున్నట్లు ఈమేరకు ఆయన ట్విటర్ లో ట్వీట్ చేశారు. 

అంబులెన్స్ లో ఫర్నీచర్..ఎల్పీజీ సిలిండర్ తరలింపు..

కర్నాటక : కోప్పాల్ ఆసుపత్రిలో ప్రభుత్వానికి చెందిన అంబులెన్స్ లో ఓ వైద్యుడు ఫర్నీచర్..ఎల్పీజీ సిలిండర్ లను తరలించారు. తన క్లినీక్ కోసం వీటిని తరలించినట్లు తెలుస్తోంది. ఓ జాతీయ ఛానెల్ లో తరలించిన ఫొటోలు దర్శనిమచ్చాయి. 

08:21 - September 5, 2017

బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరొందిన యాంకర్ 'అనసూయ' తరచూ వార్తల్లోకి ఎక్కుతుంది. తన నటన..అందంతో బుల్లితెర అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వెండితెరపై కూడా తళుక్కుమంటోంది. గతంలో ఆమె నటించిన సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పోస్టు చేసిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రామ్ చరణ్ తేజ', ‘సమంత' జంటగా ఓ సినిమా రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1985 లోని విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాలో 'చెర్రీ' రెండు పాత్రలను పోషించనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యాంకర్, నటి అనసూయ కూడా ఓ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇంట్రస్టింగ్ ఫొటో ఒకటి అనసూయ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. గజ్జెలు ధరించి ఉన్న పాదాలు..కాలి వేలికి మెట్టెలు..పక్కనే ఓ కుండ కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అంతేకాదు ‘నింద నిజమైతే తప్పక దిద్దుకో. అబద్ధమైతే నవ్వేసి వూరుకో.’ అని క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ స్టిల్ చూస్తుంటే 'రంగస్థలం' సినిమాలో తన పాత్రకు సంబంధించిన లుక్ ను 'అనసూయ' ముందుగానే అభిమానులతో పంచుకుందా ? అనేది తెలియరావడం లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

ఖైరతాబాద్ వద్ద జన సందోహం..

హైదరాబాద్ : ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో జన సందోహం నెలకొంది. భారీ గణనాథుడు ఊరేగింపు ప్రారంభమైంది. ఈ శోభాయాత్రను తిలకించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. 

కారు బీభత్సం..ఒకరికి గాయాలు..

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా మరో కారు ధ్వంసమైంది. 

08:11 - September 5, 2017

హైదరాబాద్ : నగరంలో శోభాయాత్ర ప్రారంభమైంది. నెమ్మది నెమ్మదిగా వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు వెళుతున్నాయి. ఎంజే మార్కెట్ లో ఉదయం 8 గంటలకు సందడి ప్రారంభమైంది. భారీ భారీ ఎత్తులో ఉండే విగ్రహాలను తిలకించేందుకు భక్తులు మార్కెట్ వైపుకు వస్తున్నారు. నిమజ్జనానికి సంబంధించి జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. గణేష్ యాక్షన్ టీం శానిటేషన్ క్లీన్ చేస్తున్నారు. 30 లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు హెచ్ఎండీఏ ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కమల్ తో నగ్మా..

చెన్నై : ప్రముఖ నటుడు కమల్ హాసన్ తో అలనాటి నటి, కాంగ్రెస్ నేత నగ్మా భేటీ అయ్యారు. సోమవారం ఈ భేటీ జరిగింది. తన రాజకీయ ప్రవేశం ఎప్పుడో ప్రారంభమైందని కమల్ పేర్కొన్న అనంతరం నగ్మా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

08:00 - September 5, 2017

హైదరాబాద్ : గణేష్ శోభాయాత్ర అంటే..పాతబస్తీలో హడావుడిగా ఉంటుంది. పాతబస్తీలో నార్త్ ఇండియన్స్ ఉంటారు కనుక ఎక్కువ సంఖ్యలో వినాయక మండపాలు ఏర్పాటు చేస్తారు. బాలాపూర్ గణేష్ శోభయాత్ర ప్రారంభం అయిన తరువాత ఇతర విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరుతాయి. బాలాపూర్ గణేష్ పాతబస్తీ రోడ్డు మీదుగా నిమజ్జనానికి వెళ్లనున్నాడు. 11వేల విగ్రహాలు నిమజ్జనానికి వెళ్లనున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. నిమజ్జనంలో ఎలాంటి సంఘటనలు జరుగకుండా ఉండేదుకు పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. 12వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

07:58 - September 5, 2017

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణనాథుడు..దేశంలోనే పేరొందిన వినాయకుడు. భారీ ఎత్తులో విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంటారనే సంగతి తెలిసిందే. గత సంవత్సరం 58 అడుగులు గా ఉన్న గణనాథుడు ఈ సంవత్సరం 57 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చాడు. శ్రీ చండీకుమార అనంత మహాగణపతిగా దర్శనమిచ్చాడు. గణేష్ కు కుడివైపున మహాకాల సదా శివుడు… ఎడమవైపు మహిషాసురమర్ధిని రూపాలు కన్పించేటట్లు విగ్రహాన్ని రూపొందించారు. ఈ భారీ గణనాథుడు మంగళవారం ఉదయమే నిమజ్జనానికి బయలుదేరాడు. గత సంవత్సరానికి కంటే భిన్నంగా నిమజ్జనానికి బయలుదేరడం విశేషం. మంగళవారం అనంత చతుర్ధశి ముగుస్తుండడంంతో ఆ లోపున నిమజ్జనం పూర్తి చేయాలని నిర్వాహకులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మూడు కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుంది. కొద్దిసేపటి క్రితం యాత్ర ప్రారంభమైంది. శోభాయాత్ర కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:42 - September 5, 2017

1994 వేలం ప్రారంభం..
1994 నుండి బాలాపూర్ లడ్డూను వేలం వేస్తూ వస్తున్నారు. ఆ ఏడాది గ్రామానికి చెందిన కొలను మోహన్ రెడ్డి రూ.450కి సొంతం చేసుకున్నారు. దానిని కొంత ఇంట్లో వారు తిని మరికొంత బంధువులకు పంచి మిగిలింది తన పొలంలో చల్లారు. అప్పటి నుండి తన పంటల దిగుబడి పెరిగిందని ఆయన నమ్మకం. ఆ తరువాత ఏడాది నుండి వరుసగా 17 ఏళ్లు స్థానికులే ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. బాలాపూర్‌ లడ్డూను 1994 నుంచి వేలం వేస్తూ వస్తున్నారు. ఆ ఏడాది గ్రామానికి చెందిన కొలను మోహన్‌రెడ్డి 4 వందల 50 రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి వరసగా 17 ఏళ్ల పాటు స్థానికులే ఈ లడ్డూను దక్కించుకున్నారు. 2012లో స్థానికేతరుడు పన్నాల గోవర్దన్‌రెడ్డి ఈ లడ్డూను 7 లక్షల 50 వేలకు తీసుకున్నారు. తన తండ్రి చివరి కోరిక మేరకు లడ్డూను సొంతం చేసుకున్నట్లు తెలిపారు. 2014లో మాజీ మేయర్, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూను దక్కించుకున్నందుకే తాను ఎమ్మెల్యేనయ్యానని ఆయన భావిస్తున్నారు. 2015 సంవత్సరం వేలం పాటలో 10 లక్షల 32 వేలకు కళ్లెం మదన్‌మోహన్‌ లడ్డూను దక్కించుకున్నారు. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో రూ.14.65 లక్షలకు స్కైలాబ్‌రెడ్డి బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూను కైవసం చేసుకున్నారు.

సంవత్సరం పేరు  ధర
1994 కొలను మోహన్ రెడ్డి  రూ. 450.00
1995 కొలను మోహన్ రెడ్డి రూ. 4,500.00
1996 కొలను కృష్ణా రెడ్డి రూ. 18,000.00
1997 కొలను కృష్ణా రెడ్డి రూ. 28,000.00
1998 కొలను మోహన్ రెడ్డి రూ. 51,000.00
1999 కల్లెం ప్రతాప్ రెడ్డి రూ. 65,000.00
2000 కల్లెం అంజిరెడ్డి రూ. 66,000.00
2001 జి.రఘునందన రెడ్డి రూ. 85,000.00
2002 కందాడ మాదవ్ రెడ్డి రూ.1,05,000.00
2003 చిగిరింత బాల్ రెడ్డి  రూ. 1,55,000.00
2004 కొలను మోహన్‌రెడ్డి రూ. 2,01,000.00
2005 ఇబ్రహిం శేఖర్ రూ. 2,08,000.00
2006 చిగురింత తిరుపతిరెడ్డి రూ. 3,00,000.00
2007 జి.రఘునందనాచారి రూ. 4,15,000.00
2008 కొలను మోహన్‌రెడ్డి  రూ. 5,07,000.00
2009 సరిత రూ. 5,10,000.00
2010 శ్రీధర్‌బాబు రూ. 5,35,000.00
2011 కొలను ఫ్యామిలీ రూ. 5,45,000.00
2012 పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ. 7,50,000.00
2013 తీగల కృష్ణారెడ్డి రూ. 9,26,000.00
2014 సింగిరెడ్డి జయేందర్ రెడ్డి  రూ. 9,50,000.00
2015 కళ్లెం మదన్‌మోహన్‌  రూ. 10,32,000.00
2016 స్కైలాబ్ రెడ్డి రూ. 14,65,000.00
2017 నాగం తిరుపతిరెడ్డి రూ. 15,60,000.00
07:38 - September 5, 2017

హైదరాబాద్ : ఖైరతాబాద్ భారీ గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరాడు. 6 గంటలకు ప్రారంభం కావాల్సిన ఊరేగింపు ఆలస్యంగా 7గంటలకు ప్రారంభమైంది. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు స్థానికులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ క్రేన్ పై గణనాథుడిని ఎక్కించిన అనంతరం నిర్వాహకులు ఊరేగింపు ప్రారంభించారు. నెమ్మదిగా నెమ్మదిగా ట్యాంక్ బండ్ వైపుకు భారీ గణనాథుడు పయనమవుతున్నాడు. మధ్యాహ్నం 2-3 గంటల్లోగా నిమజ్జనం జరుగుతుందని తెలుస్తోంది. శోభాయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని భారీ గణనాథుడిని వీక్షిస్తున్నారు. 165 గణేష్ యాక్షన్ టీం..వాలంటీర్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 

ఆలస్యంగా ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఊరేగింపు...

హైదరాబాద్ : ఖైరతాబాద్ భారీ గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరాడు. 6 గంటలకు ప్రారంభం కావాల్సిన ఊరేగింపు ఆలస్యంగా 7గంటలకు ప్రారంభమైంది. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు స్థానికులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 

హుస్సేన్ సాగర్ వద్ద సందడి..

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ వద్ద సందడి మొదలైంది. వివిధ ప్రాంతాల నుండి వస్తున్న వినాయక విగ్రహాలు సాగర్ లో నిమజ్జనం చేస్తున్నారు. ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. 

07:28 - September 5, 2017
07:25 - September 5, 2017

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనానికి వెళ్లడానికి సిద్ధమౌతున్నాడు. ఈ సందర్భంగా నిర్వాహక కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టెన్ టివితో నిర్వాహక కమిటీలోని ఓ సభ్యుడు మాట్లాడారు. ఉదయం 5గంటలకు తీయాల్సి ఉండేదని, కానీ భారీ గణనాథుడు కావడంతో ట్రాలీపై ఎక్కించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. ఏ సంవత్సరం రాని భక్తులు ఈ సంవత్సరం వచ్చారని, సుమారు 15 లక్షల మంది గణనాథుడిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. 

07:19 - September 5, 2017

హైదరాబాద్ : బాలాపూర్ గణేష్ శోభాయాత్ర మొదలైంది. కానీ షెడ్యూల్ ప్రకారం కంటే కొంత ఆలస్యంగా యాత్ర మొదలైంది. గ్రామాల పురవీధుల్లో తిరుగుతున్న గణనాథుడిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలాపూర్ రోడ్డు మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత ఏర్పాట్లు చేశారు. లడ్డూ వేలం కార్యక్రమం 9గంటలకు ప్రారంభించనున్నామని, 1994లో సామాన్యు రైతాంగ కుటుంబం బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారని నిర్వాహక కమిటీ సభ్యుడు పేర్కొన్నారు. ఈసారి లడ్డూ వేలం పాటలో 18 మంది పాల్గొంటున్నారని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ప్రారంభమైన ఖైరతాబాద్ శోభాయాత్ర..

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ శోభాయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు. గత సంవత్సరానికి కంటే భిన్నంగా ఈసారి నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. 

07:13 - September 5, 2017

హైదరాబాద్ : ఓయూ పరిధిలోని మాణికేశ్వరీనగర్‌లో వినాయక నవరాత్రి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో ఇవాళ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బస్తీవాసులు, ఓయూ విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 

07:10 - September 5, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌లో గణేశ్‌ ఉత్సవాలు ఎంత ప్రత్యేకమో... బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ అంతే ఫేమస్‌... పదకొండు రోజుల పాటు భక్తులతో పూజలు అందుకున్న బాలాపూర్‌ వినాయకుడు నిమజ్జన మహోత్సవానికి సిద్ధం అవుతున్నాడు. అయితే ఇక్కడ లడ్డూను ఈసారి ఎవరు కైవశం చేసుకుంటున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం 5 గంటలకు వినాయక విగ్రహం కదిలించారు. ఆ తర్వాత బాలాపూర్‌ లడ్డూ వేలంపాట కార్యక్రమం కొనసాగనుంది. సుమారు గంట పాటు ఈ వేలం జరగనుంది. ఈ మేరకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసందర్భంగా గతంలో లడ్డూ దక్కించుకున్న వ్యక్తి..నిర్వాహక కమిటీ సభ్యులు..పోలీసు అధికారితో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:05 - September 5, 2017

హైదరాబాద్ : ఖైరతాబాద్‌ గణనాథుడు సాగే నిమజ్జన శోభాయాత్రకి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యలో భాగంగా రూట్‌ అంతటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పక్కా ప్రణాళికతో ట్యాంక్‌బండ్‌, ఎన్‌టీఆర్‌ గార్డెన్‌, నెక్లెస్‌రోడ్‌ అంతటా నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:42 - September 5, 2017

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి లేఖాస్త్రం సంధించారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని ఆరోపించారు. ప్రభుత్వం వారికి రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమవుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా దళితులు, గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని, దళితులు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా దళితుల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఉత్తమ్‌ కుమార్‌ డిమాండ్ చేశారు.

కేసీఆర్ ప్రభుత్వ విధానాల‌పై హస్తం పార్టీ విరుచుకుపడుతోంది...అంశాల వారీగా ప్రభుత్వాన్ని ఎండ‌గ‌డుతోంది. క‌రీంన‌గర్‌లో ఇద్దరు ద‌లిత యువ‌కుల ఆత్మహ‌త్యాయత్నం చేయ‌డంపై ఆవేద‌న వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కార‌ణమని ఆరోపించింది. ఇక టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులపై కొనసాగుతున్న దాడులు, వేధింపులు, అక్రమాల గురించి లేఖలో వెల్లడించారు. ఖ‌మ్మంలో ద‌ళితుల‌, గిరిజ‌న రైతుల‌కు బేడీలు వేయడం..నేరేళ్లతో ద‌ళితుల‌పై థ‌ర్డ్‌ డిగ్రీ ప్రయోగం..క‌రీంన‌గ‌ర్‌లో దళితుల ఆత్మహత్యాయత్నం ఘటనలను లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే.. ఏపూరి సోమ‌న్నపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే దళితులపై జరుగుతున్న దాడుల‌ను అరిక‌ట్టి, వారిని ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుదని భావించామని..కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేశాక అణగారిన వర్గాలపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఎన్నికల ముందు దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి ఇవ్వకపోగా.. కనీసం వారికి ఎలాంటి రక్షణ కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు హైదరాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దళితులను ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, ష‌బ్బీర్ అలీ,విహెచ్‌ పరామర్శించారు. ద‌లితుల‌కు ఇస్తామన్న మూడెక‌రాల భూమి ఇవ్వనందుకే..ఆ యువ‌కులు ఆత్మహత్యాయత్నం చేశార‌ని.. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. దళిత, గిరిజనులపై కొన‌సాగుతున్న దాడుల‌ను ఆయుధంగా చేసుకుని ప్రభుత్వంపై పోరును మ‌రింత ఉద్ధృతం చేస్తోంది హస్తం పార్టీ. 

06:40 - September 5, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ముంబయి పర్యటనలో ఉన్న ఆయన ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందాకొచ్చర్‌తో సమావేశమయ్యారు. డిజిటల్‌ లావాదేవీలు, ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లీనిక్‌, టీఫండ్‌, మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన అంశాలపై ఆమెతో చర్చించారు. ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌తో పాటు JSWగ్రూప్‌ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌తో సమావేశమయ్యారు.

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు ముంబైలో బిజీ బిజీగా గడిపారు. ఒకరోజు ముంబై పర్యటనలో ఆయన కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఉదయం ఐసిఐసిఐ బ్యాంకు సీఈవో చందా కొచ్చర్ తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ఇండస్ర్టియల్ హెల్త్ క్లినిక్, వుమెన్ ఎంట్రప్రెన్యూర్ షిప్, డిజిటల్ ఇనిషియేటివ్స్ పైన కొచ్చర్‌తో మంత్రి చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టి-ఫండ్ లో భాగస్వాములు కావాలని కోరారు.

ఆ తర్వాత మంత్రి కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. జేఎస్ డబ్ల్యు గ్రూప్ చైర్మన్ మరియు ఎండి సజ్జన్ జిందాల్ తో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ సమావేశం తర్వాత మంత్రి కేటీఆర్ పై సజ్జన్ జిందాల్ ప్రసంశల వర్షం కురిపించారు. తెలంగాణ అభివృద్ధి పట్ల మంత్రికి ఉన్న విజన్ కు అభినందనలు తెలిపారు. తర్వాత లుపిన్ ఎండి నీలేష్ గుప్తతో సమావేశం అయిన మంత్రి కేటీఆర్ తెలంగాణ ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

సాయంత్రం జరిగిన వార్షిక గ్లోబల్ పెట్టుబడిదారుల సమావేశంలో "స్టార్టప్ స్టేట్‌గా మూడేళ్ల తెలంగాణ ప్రయాణం" అనే అంశంపైన మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తాము రూపొందించిన పారిశ్రామిక పాలసీ, ఇతర పాలసీలకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రసంశలు లభిస్తున్నాయని చెప్పారు. ఆ తర్వాత ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు సమస్యలపైన వాటి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సవివరమైన లేఖను అందజేశారు. చిన్నతరహా పరిశ్రమల బకాయిల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్న ఆయన.. ఆర్బీఐ మార్గదర్శకాలను చాలా బ్యాంకులు పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విధంగా స్టేట్ లెవల్ ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ కమీటీ పునర్వవ్యవస్ధీకరణ చేయాలన్నారు. 

06:38 - September 5, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌లో గణేశ్‌ ఉత్సవాలు ఎంత ప్రత్యేకమో... బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ అంతే ఫేమస్‌... పదకొండు రోజుల పాటు భక్తులతో పూజలు అందుకున్న బాలాపూర్‌ వినాయకుడు నిమజ్జన మహోత్సవానికి సిద్ధం అవుతున్నాడు. అయితే ఇక్కడ లడ్డూను ఈసారి ఎవరు కైవశం చేసుకుంటున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గణేశ్‌ ఉత్సవాలు ప్రారంభమయ్యాయంటే... అందరి దృష్టి భాగ్యనగరంపైనే ఉంటుంది. వినాయక చవితి సందర్భంగా... ఖైరతాబాద్‌, బాలాపూర్‌లలో పెట్టే గణేశ్‌ విగ్రహాలను చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నగరానికి వస్తుంటారు. అలాగే బాలాపూర్‌ వినాయకుడి లడ్డూకు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్సవాల ముగింపు దశలో ఈ లడ్డూ కోసం భక్తులు పోటీ పడుతుంటారు. ఒకప్పుడు వందల్లో పలికే ఈ లడ్డూ... ఇప్పుడు లక్షలకు చేరుకుంది.

బాలాపూర్‌ లడ్డూను 1994 నుంచి వేలం వేస్తూ వస్తున్నారు. ఆ ఏడాది గ్రామానికి చెందిన కొలను మోహన్‌రెడ్డి 4 వందల 50 రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి వరసగా 17 ఏళ్ల పాటు స్థానికులే ఈ లడ్డూను దక్కించుకున్నారు. 2012లో స్థానికేతరుడు పన్నాల గోవర్దన్‌రెడ్డి ఈ లడ్డూను 7 లక్షల 50 వేలకు తీసుకున్నారు. 2014లో మాజీ మేయర్‌, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, 2015లో కళ్లెం మదన్‌ మోహన్‌ 10 లక్షల 32 వేలకు, 2016లో 14 లక్షల 65 వేలకు స్కైలాబ్‌ రెడ్డి బాలాపూర్‌ గణేశ్‌ను లడ్డూను దక్కించుకున్నారు. ఈ లడ్డూను దక్కించుకున్నవారంతా...తమకు ఎంతో శుభం జరిగిందని..అన్నారు.

ఈ క్రమంలో ఈ ఏడాది బాలాపూర్‌ లడ్డూను ఎవరు కైవశం చేసుకుంటారోననే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. రేపు ఉదయం 5 గంటలకు వినాయక విగ్రహం కదిలిస్తారు. ఆ తర్వాత బాలాపూర్‌ లడ్డూ వేలంపాట కార్యక్రమం కొనసాగుతోంది. సుమారు గంట పాటు ఈ వేలం జరగనుంది. ఈ మేరకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.  

06:36 - September 5, 2017

హైదరాబాద్ : ఖైరతాబాద్‌ గణనాథుడు సాగే నిమజ్జన శోభాయాత్రకి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యలో భాగంగా రూట్‌ అంతటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పక్కా ప్రణాళికతో ట్యాంక్‌బండ్‌, ఎన్‌టీఆర్‌ గార్డెన్‌, నెక్లెస్‌రోడ్‌ అంతటా నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేశామని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డేవీస్‌ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:35 - September 5, 2017

హైదరాబాద్ : భాగ్యనగరంలో ప్రతిష్ఠాత్మకంగా కొనసాగుతున్న వినాయక విగ్రహాల నిమజ్జనాలు తుది దశకు చేరుకున్నాయి. నేడు కీలక ఘట్టమైన మహా శోభాయాత్ర ఉండటంతో పోలీసులు అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్యాంక్‌బండ్‌లో భారీగా విగ్రహాలను నిమజ్జనం చేయనుండటంతో ప్రధాన ఊరేగింపు మార్గాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మంగళవారం గణేశ్‌ నిమజ్జనంకు భాగ్యనగరం ముస్తాబైంది. వేడుకను సజావుగా నిర్వహించేందుకు.. పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. శోభయాత్రకు అడ్డంకులు లేకుండా..ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. ప్రధాన ఊరేగింపు మార్గాలను పోలీసులు నిర్ణయించారు. మొదటగా బాలాపూర్‌ నుంచి గణపతి ఊరేగింపు ఉదయం 6కు ప్రారంభమవుతుంది. అలియాబాద్‌-నాగుల్‌చింత-చార్మినార్‌-అఫ్జల్‌గంజ్‌- ఎం.జె.మార్కెట్‌-అబిడ్స్‌-బషీర్‌బాగ్‌-లిబర్టీ మీదుగా అప్పర్‌ ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు కొనసాగుతుంది. అలాగే సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే ఊరేగింపులు ఆర్‌పీరోడ్‌- ఎంజీరోడ్‌- కర్బలా మైదానం- కవాడిగూడ- ముషీరాబాద్‌ క్రాస్‌ రోడ్డు- ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు- నారాయణగూడ క్రాస్‌రోడ్డు- హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ మీదుగా లిబర్టీ వద్ద కలుస్తాయి. అలాగే ఉప్పల్‌ వైపు నుంచి వచ్చే ఊరేగింపులు - రామంతాపూర్‌- అంబర్‌పేట- ఓయూ ఎన్‌సీసీ - దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆసుపత్రి మీదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డుకు వచ్చి కలుస్తాయి. అలాగే అబిడ్స్‌ మీదుగా వచ్చేవి ఎంజే మార్కెట్‌తో పాటు సచివాలయం- తెలుగుతల్లి విగ్రహం వద్ద కలుస్తాయి.

గణేష్‌ విగ్రహాలను తరలించే వాహనాలు మినహా మిగిలినవి ప్రధాన వూరేగింపు సాగే మార్గాల్లో కాకుండా ఇతర చోట్లకు మళ్లిస్తారు. ప్రధాన ఊరేగింపు మార్గం మొత్తం బారికేడ్లతో ఉండటం వల్ల... సాధారణ ప్రయాణికులు ట్రాఫిక్‌ మళ్లింపులను తప్పించుకునేందుకు బేగంపేట, రింగ్‌రోడ్డు మార్గంలో వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే నిమజ్జన ఘట్టాన్ని చూసేందుకు వచ్చే వాహనదారులకు పలు చోట్ల పార్కింగ్‌ ప్రాంతాలను ఏర్పాటుచేశారు. ఖైరతాబాద్‌ కూడలి వద్ద ఉన్న ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఆనంద్‌నగర్‌ కాలనీలోని రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం, గోసేవా సదన్‌, కట్టమైసమ్మ గుడి, నిజాం కళాశాల, ఖైరతాబాద్‌ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌, బుద్ధభవన్‌ వెనుకభాగం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఎన్‌టీఆర్‌ స్టేడియం, పబ్లిక్‌ గార్డెన్స్‌ స్థలాల్లొ పార్కింగ్‌కు కేటాయించారు.

ఎన్‌టీఆర్‌ మార్గంలో నిమజ్జనం తర్వాత ఖాళీ ట్రక్కులు, లారీలు నెక్లెస్‌ రోడ్డు మీదుగా ఖైరతాబాద్‌ వంతెన, పీవీ విగ్రహం, కేసీపీ మీదుగా వెళ్లిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ట్యాంక్‌బండ్‌ మార్గంలో నిమజ్జనం తర్వాత ఖాళీ వాహనాలు చిల్డ్రన్స్‌ పార్కు, డీబీఆర్‌ మిల్స్‌, కవాడిగూడ, ఇందిరాపార్కు మీదుగా విద్యానగర్‌ మార్గంలో వెళ్లే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తినపుడు..అలానే వాహనదారుల సందేహాల నివృత్తికి ట్రాఫిక్‌ అధికారులు 040-27852482, 94905 98985, 9010203626 హెల్ప్‌లైన్‌ నంబర్లను కేటాయించారు.

నిమజ్జనం సందర్భంగా సిటీ బస్సుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. హుస్సేన్‌సాగర్‌కు దారితీసే.. మాసబ్‌ట్యాంక్‌, ఖైరతాబాద్‌, సీటీవో ప్లాజా, క్లాక్‌టవర్‌, చిలకలగూడ క్రాస్‌రోడ్‌, రామంతాపూర్‌ టీవీ స్టేషన్‌, గడ్డిఅన్నారం, చాదర్‌ఘాట్‌, మిధాని దగ్గరలోని ఐ.ఎస్‌.సదన్‌, వైఎంసీఏ నారాయణగూడ, జామై ఉస్మానియా వంతెన మార్గాల్లో ఆర్టీసీ బస్సులను అనుమతించరు.

రాజీవ్‌గాంధీ రహదారి, ముంబయి హైవే మీదుగా నగరానికి వచ్చిన బస్సులను జేబీఎస్‌, వైఎంసీఏ- సంగీత్‌, తార్నాక, జామై ఉస్మానియా వంతెన- నింబోలిఅడ్డ- చాదర్‌ఘాట్‌ మీదుగా ఎంజీబీఎస్‌కు అనుమతిస్తారు. బెంగళూరు నుంచి వచ్చే బస్సులు అరాంఘర్‌ చౌరస్తా- చాంద్రాయణగుట్ట, ఐఎస్‌ సదన్‌, నల్గొండ క్రాస్‌రోడ్సు, చాదర్‌ఘాట్‌ మీదుగా వెళ్లాలి. ప్రైవేటు బస్సులను నగరం వెలుపల నుంచి రాకపోకలకు అనుమతిస్తారు. విమానాశ్రయం నుంచి వచ్చేవారిని నెక్లెస్‌ రోడ్డు, ఎన్‌టీఆర్‌మార్గ్‌, అంబేడ్కర్‌ విగ్రహం, ఫలక్‌నుమా మెయిన్‌ రోడ్డు మీదుగా అనుమతించరు. అలాగే రైల్వే ప్రయాణికులు కూడా ఈ మార్గాల్లో వెళ్లడానికి వీలుండదు. జిల్లాలు, బయట రాష్ట్రాల నుంచి వచ్చే లారీలను ఈనెల 5, 6 తేదీల్లో రాత్రి పూట సైతం నగరంలోకి అనుమతించరు.

గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు..

హైదరాబాద్ : గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 6 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. బాలాపూర్ నుండి దారి పొడవునా 800 వీడియో కెమెరాలు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ తో పాటు మరో 24 చెరువుల్లో నిమజ్జనం జరుగనుంది. ఎన్టీఆర్ మార్గ్ లో 16 క్రేన్ లు, ట్యాంక్ బండ్ పై 22 క్రేన్ లు ఏర్పాటు చేశారు. 

గణేష్ నిమజ్జనం..

హైదరాబాద్ : నేడు గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 26 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. 

ప్రొ కబడ్డీలో నేటి మ్యాచ్ లు..

హైదరాబాద్ : ప్రొ కబడ్డీలో నేటి మ్యాచ్ లు...రాత్రి 8గంటలకు పాట్నాతో జైపూర్ జట్టు ఢీకొననుంది. రాత్రి 9గంటలకు బెంగాల్ జట్టుతో హర్యానా జట్టు ఢీకొననుంది.

ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొననున్న బాబు..

విజయవాడ : ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో ఉదయం 9 గంటలకు ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. 

ఏపీ వీఆర్ ఏల చలో విజయవాడ..

విజయవాడ : నేడు ఏపీ వీఆర్ఏ లు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వీఆర్ ఏ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో ప్రదర్శన నిర్వహించిన అనంతరం బహిరంగసభ జరుగనుంది. 

Don't Miss