Activities calendar

06 September 2017

21:47 - September 6, 2017

గుంటూరు : రైతు రథం కార్యక్రమం ద్వారా రైతులకు 11 వేల ట్రాక్టర్లు ఇస్తున్నామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు. ట్రాక్టర్ల పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదన్నారు. ఆన్‌లైన్‌లో ఎవరు ముందు నమోదు చేసుకుంటే..వారికే ట్రాక్టర్లు ఇస్తామన్నారు. మూడో విడత రైతు రుణమాఫీ కింద 3600 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

21:47 - September 6, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త సచివాలయం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంపై కాంగ్రెస్ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. తాజాగా సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్న కేసీఆర్ ప్రతిపాదనలతో కాంగ్రెస్ నేతలు మళ్లీ ఆందోళన బాట పట్టారు. బైసన్ పోలో గ్రౌండ్ ముందు ధర్నా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, ష‌బ్బీర్ ఆలీ, వీహెచ్‌ కార్యకర్తలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.

నిర్మాణాన్ని అడ్డుకుంటాము
బైసన్‌పోలో గ్రౌండ్‌లోకి సచివాలయాన్ని మార్చాలనుకోవడం కేసీఆర్ తుగ్లక్ చర్య అని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కొత్త సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. వీహెచ్ కొత్త సచివాలయంపై అటువైపు వెళ్తున్న వాహనదారుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ వాస్తు కోసం ప్రజాధనం వృథా చేస్తున్నారని వారికి వివరించారు. కేసీఆర్ రాజులా విలాసాలతో పాలన సాగిస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. బైసన్ పోలో గ్రౌండ్‌లో కొత్త సచివాలయ నిర్మాణం చేపడితే అడ్డుకుంటామంటున్నారు కాంగ్రెస్ నేతలు. అవసరమైతే అన్ని పార్టీలను కలుపుకుని ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

21:46 - September 6, 2017

హైదరాబాద్ : సీనియర్‌ జర్నలిస్టు గౌరీలంకేష్‌ హత్యపై నిరననలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప‍్తంగా ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. జర్నలిస్టులు గౌరీ హత్యకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక‍్తం చేస్తున్నారు. బెంగళూరులోని మీడియా హాల్‌లో పాత్రికేయులు ఆందోళనకు దిగారు. గూండాల తూటాలకు జర్నలిజం తలవంచదని నినదించారు. సీపీఎం, ప్రజాసంఘాలు హత్యను తీవ్రంగా ఖండిస్తూ నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఢిల్లీలో సీపీఎం నాయకులు గౌరీలంకేశ్‌ దారుణ హత్యను తీవ్రంగా ఖండించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, హిందుత్వవాదులకు ఎవరైనా ఎదురుతిరిగితే హత్యలకు పాల్పడుతున్నారని సీతారాం ఏచూరి అన్నారు. సంఘ్‌పరివార్‌ ఇలాంటి విషపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ అన్నారు. గౌరీపై దాడిని భారత సంస్కృతిపై దాడిగా చూడాలన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు. ఇది ఓ జర్నలిస్టును హత్య చేయడం కాదు.. ఏకంగా ఒక వ్యవస్థనే హత్య చేయడమన్నారు.

దోషులను తక్షణమే అరెస్ట్‌ చేయాలి
హైదరాబాద్‌లోనూ జర్నలిస్టుల ఆందోళనలు నిర్వహించారు. గౌరీలంకేశ్‌ హత్యను ఐజేయూ తీవ్రంగా ఖండించింది. గౌరీ హత్య ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించింది. ఇలాంటి దాడులను జర్నలిస్టులంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. దోషులను తక్షణమే అరెస్ట్‌ చేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు బషీర్‌బాగ్‌ చౌరస్తాలో నిరసన తెలిపారు. బంజారాహిల్స్‌లో జర్నలిస్ట్‌లు ఆందోళనకు దిగారు. హత్యలతో అక్షరాన్ని ఆపలేరని ప్లకార్డులు చేతపట్టి నినదించారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో నల్లరిబ్బన్స్‌తో నిరసన తెలిపారు. గౌరీలంకేష్‌ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ, హత్యలకు పాల్పడటం దారుణమని TWJF రాష్ట్రకార్యదర్శి బసవ పున్నయ్య అన్నారు.

విజయవాడ ప్రెస్‌క్లబ్ ఆధ్యర్యంలో
విజయవాడ ప్రెస్‌క్లబ్, ఐజేయూ, APUWJఆధ్వర్యంలో జర్నలిస్టులు.. గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో నిరసన వ్యక్తం చేశారు. దేశంలో అసహన, విద్వేష చీకటి కోణాన్ని బయటపెట్టడంలో గౌరీలంకేష్‌ కీలకపాత్ర పోషించారని చెప్పారు. హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్న శక్తులే ఆమె ప్రాణాలను బలిగొనడానికి కారణమన్నారు. నిజం గొంతు నొక్కలేరని.. వెంటనే గౌరీ లంకేశ్‌ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కడప బిల్డప్‌ సర్కిర్ వద్ద APUWJఆధ్వర్యంలో జర్నలిస్టులు రాస్తారోకోకు దిగారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక భద్రత కరువైందని.. జర్నలిస్టులపై దాడులు పెరిగపోయాయని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని లేనిపక్షంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అటు CPI నాయకులు, కార్యకర్తలు కడప నగరంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ హత్య మతోన్మాద శక్తులపనేనని ఆరోపిస్తూ, వీరికి బుద్ధి చెప్సే అనంతపురంలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాదుల హస్తం ఉందని ఘాటుగా విమర్శించారు. సమాజంలో జరిగే దౌర్జన్యాలను వేలెత్తిచూపినందుకే గౌరీలంకేష్‌ను పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. జైపూర్‌ ,గుజరాత్‌, ఢిల్లీ, ముంబై, చెన్నై, చండీగడ్‌, లక్నో,కోలకతా నగరాల్లో జర్నలిస్ట్ సంఘాలు, ప్రెస్‌ క్లబ్‌ల ఆధ్వర్యంలో గౌరి హత్యను ఖండిస్తూ ధర్నాలు, ర్యాలీ, కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమాలను చేపట్టారు. 

20:32 - September 6, 2017

ఏం ప్రశ్నిస్తే చంపేస్తారా? ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తోందా? లేక నియంతృత్వం ఉందా?మతాన్ని ఆధారంగా చేసుకున్న కుటిల రాజకీయాలను ఎండగడితే తప్పా? మూఢనమ్మకాలను, మూర్ఖ విశ్వాసాలను తప్పుపడితే పాపమా?హక్కుల కోసం నినదించటమే, లౌకిక సమాజంకోసం కలలుకనటమే నేరమా? ఆ తూటాలు పేల్చిన చేతులెవరివి? ఆ చేతలను పురికొల్పిన ఆలోచనలెవరివి? కల్బుర్గి, గోవింద్ పన్సారే, నరేంద్ర ధబోల్కర్, గౌరి లంకేశ్...ఈ వరుసలో ఎందరు? ఈ దేశంలో హేతువాదులకు, ఉద్యమకారులకు, పాత్రికేయులకు రక్షణ లేదా? నిజాల నిగ్గు తేల్చే జర్నలిస్టుల ప్రాణాలకు గ్యారంటీ లేదా? గౌరి హత్య ఏ సంకేతాలిస్తోంది..

గౌరీ లంకేశ్..ప్రఖ్యాత జర్నలిస్ట్ లంకేశ్ వారసురాలు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎంతో అనుభవం ఉన్న ధైర్యశాలి. నమ్మిన విలువల కోసం.. మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా, దళితులు, మహిళల హక్కుల కోసం నిరంతరం తపించిన గౌరి లంకేశ్ ని చంపిందెవరో ఊహించటం కష్టం కాదు.. ఎవరి తూటాలకు బలయ్యారో గ్రహించటం కష్టం కాదు.. కానీ, నిజం నిగ్గుతేలుతుందా అంటే.. గత అనుభవాల దృష్ట్యా అనుమానమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?ప్రభుత్వ విధానాల లోపాలను వేలెత్తితే వేధిస్తారా?రాజకీయ పార్టీల మతతత్వ కుట్రలను ప్రస్తావిస్తే జైల్లో పెడతారా?మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వంలో ఉన్నామా? ఈ దేశంలో ఏ శక్తులు రాజ్యమేలుతున్నాయి? ఆ తుపాకుల పట్టిన చేతులకు దన్నుగా నిలిచిందెవరు?


నిషేధాల కాలమంటూ పెన్నును వణికించే ప్రయత్నాలు చేస్తున్నారు. అసహనంతో రగిలిపోతూ మీడియాపై దాడులకు దిగుతున్నారు. పరువు ప్రతిష్ట అంటూ నిజాలకు ముసుగులు తొడుగుతున్నారు. ప్రశ్నంచే గొంతుకలను నులిమేస్తున్నారు. ఇదేనా దేశంలో జరుగుతోంది? జరుగుతున్న పరిణామాలే సంకేతాలిస్తున్నాయి? కాల్చి చంపేస్తున్నారు. మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా ఒకరిని చంపేశారు. ఇంట్లోకెళ్లి మరొకరిని హత్య చేశారు. ఎంఎం కల్బుర్తి, గోవింద్ పన్సారే, నరేంద్ర ధబోల్కర్.. ఈ వరుసలో ఇప్పుడు గౌరీ లంకేశ్.. ఓవరాల్ గా దేశంలో కవులు, రచయితలు, స్వేఛ్చావాదులపై దాడులు పెరిగాయి. తూటాలు దిగుతున్నాయి. ప్రశ్న ప్రజాస్వామ్యం ఉందనటానికి ఓ బలమైన ఉదాహరణ. అలాంటి ప్రశ్నబతికి ఉన్నప్పుడే హేతువాదంపై అడుగులు పడతాయి. లౌకిక వాదాన్ని విశ్వసిస్తారు. మతతత్వాన్ని విస్మరిస్తారు. అందుకే... ప్రశ్నను ఆయుధంగా చేసుకున్న పాత్రికేయులు, రచయితలపై ఈ దాడులు. ప్రశ్న బతికినపుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

 

20:30 - September 6, 2017

హురక చెన్నమనేని రమేష్ సారు ఉన్నడుగదా..? అదే వేములవాడ ఎమ్మెల్యే ఆయన దొంగకాయిదాలు వెట్టి ఎమ్మెల్యేగ గెల్చిండట.. సుప్రీంకోర్టుల తీర్పొచ్చింది నిన్న.. ఆయన ఇండియా మన్షేగాదు.. ఎప్పుడో జర్మనీకి వొయ్యి బత్కుతున్నడు.. ఆయన ఆదేశ పౌరుడే మనదేశంల ఎట్ల పోటీ జేశి గెలుస్తడు..? అని స్వయంగ కోర్టే తీర్పు జెప్పిందట.. అమ్మ చెన్నమనేని..?

రాయలసీమ కంకర రత్నం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సారు షెట్టర్ కిందికి గుంజిండుగదా..? చల్ నీయక ఈ ప్రత్యేక రాయలసీమ..? సీమహక్కులు.. బండమీద నక్కులు అంటె ఎవ్వడింటలేడు.. ఇగ ప్రత్యేక రాయలసీమ దుక్నంల ఉద్దెర గిరాకి ఎక్వైంది.. నగదు ఆసాములు తక్వైండ్రని.. రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ జెండా అవనతం జేశిండు..

రాజుల సొమ్ము రాళ్ల పాలైతె ఓకేగని.. జనం సొమ్ము దేవుండ్ల పాలైతెనే వస్తది పరేషాన్.. ఇద్వర్ దాక తెలంగాణ ముఖ్యమంత్రిగారు.. సమర్పించిన మొక్కులు సరిపోనట్టున్నయ్.. ఈనెల ఇర్వైఏడు తారీఖు నాడు బెజవాడకు వొయ్యి ముక్కు పుడక ముట్టజెప్పొస్తడట.. ఇప్పటికే కోట్ల రూపాల జనం సొమ్ము దేవుండ్ల మొక్కులకు వెట్టిండు.. మరి ఇది ఏ తరీఖ యవ్వారం ఏం కథ అనేది జనం గూడ ఆలోచన జేయాలే..

మామూల్గ భజన జేయాల్నంటే.. తబలా మద్దెల తాళాలుంటే సరిపోతుండే ఎన్కట.. కని ఇప్పుడు ఏ వాయిద్య పరికరం లేకున్నా భజన జేస్తున్నరు కొంతమంది.. అట్ల జేస్తున్నోళ్ల దాంట్లె టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు ఒకరు.. పుసుక్కున కేసీఆర్ సారు కుటుంబాన్ని ఎవ్వలన్న విమర్శిస్తె సాలు.. సారుకు శాతిమీద ఎంటికెలు వొడ్సుకొచ్చి.. మైకందుకుంటనే ఉంటడు.. మొన్నటి ఒక పంచాది మీద మైకందుకున్నడు..

అయ్యా గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గారి ధర్మపత్ని గారికి తెలంగాణ మహిళాలోకం చేసుకుంటున్న విన్నపం.. అమ్మా ఇంటాయినకు తాగుడు అల్వాటైతె ఆ సంసారం ఎట్లుంటదో మీకు తెల్సు.. మీ సారేమో ఒంటరి మహిళలకు పించిని అంటున్నడు.. మద్యం అమ్మి మమ్ములను ఒంటరి జేస్తున్నడు.. జర్ర మీరే ఆయన మన్సు మార్చాలే మేడం అంటున్నరు మహిళలు..

ఎమ్మెల్యేలు గానీ.. ఎంపీలుగానీ.. మంత్రులు గానీ..? ఒక్కనెల జీతం ఆల్చమైతె ఊకుంటరా..? లక్షలకు లక్షలు జీతగాళ్లే నెలగాదు.. ఒక్కరోజు లేటైనా పరేషాన్ అయితరు.. మరి అసొంటిది మున్సిపాల్టీలళ్ల పనిజేశే సఫాయోళ్లకు మూడు నెలల సంది జీతాలు ఇయ్యకపోతె..? వాళ్ల పెండ్లాం పిల్లలు ఎట్ల బత్కుతరు చెప్పుండ్రి..? వీళ్లది కడ్పుగాదా..?

గణపతిని ఓన్లీ పెద్దకులపోళ్లే వెట్టుకోవాల్నా..? దళితులు కింది వర్గాలోళ్లు వెట్టుకోవద్దా..? అట్ల వెట్టుకుంటె ఊరికేమన్న అరిష్టమైతదా..? లేకపోతె ఊరికి గత్తర దల్గుతదా..? అరే ఏం మన్షులురానాయన.. పాపం దళితులు గూడ గణపతి పండుగ జేస్కుంటె ఓరుస్తలేరంటే..? మరి దళితులు ఏం జేయాల్నో మీరే జెప్పుండ్రిగ అంబేద్కర్ విగ్రహం బెట్టుకుంటె ఓర్వరాయే.. ఆళ్ల కులవృత్తులు జేస్కుంటె ఓర్వరాయే.. ఏం కథ ఇది..?

అయ్యో పాడుగాను.. చివరి సూపు కన్న నోచుకోకపోతిమి.. ఎంతపనైపాయెనుల్లా.. శీన్మలు జూశెటోళ్లకు ఏ కష్టం రాకుంట కాపాడుతుండే.. నిన్న ఆత్మహత్య జేస్కోని సచ్చిపోయిందట.. పాపం మొగదిక్కు లేక ఆంధ్రా ఆడిబిడ్డెలు పాడె మోశిండ్రు తలగోరి వట్టిండ్రు.. డప్పుల సప్పుళ్లు లేక సైలెంటుగ పీన్గె వోతుంటే.. సూశినోళ్లంత నవ్విండ్రు.. అగో ఏడ్వాలేగని.. నవ్విండ్రేందంటరా..? సూడుండ్రి తెలుస్తది.. 

ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యుల జీతాలు భారీగా పెంపు

గుంటూరు : ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యుల జీతం భారీగా పెంచింది. చైర్మన్ వేతనం రూ.80వేల నుంచి 2.25లక్షలకు, సభ్యుల వేతనం రూ.79 వేల నుంచి రూ. 1,82లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

చెక్ బౌన్స్ కేసులో నందుమూరి జయకృష్ణకు జైలు శిక్ష

హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో నందుమూరి జయకృష్ణకు ఎరమంజిల్ కోర్టు 6నెలల జైలు శిక్ష విధించింది. శిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది. 2016 నాటి కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

ఏపీ మూడో విడత రుణమాఫీ

గుంటూరు : ఏపీ ప్రభుత్వం మూడో విడత రుణమాఫీ కింద రూ.3,600కోట్లు విడుదల చేస్తున్నామని మంత్రి సోమిరెడ్డి అన్నారు. ఈ నెల 10 నుంచి రైతు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ అవుతాయని ఆయన తెలిపారు. రైతు రథం ద్వారా 11వేల ట్రాక్టర్లు ఇస్తున్నామని మంత్రి ప్రకటించారు.

19:56 - September 6, 2017

హైదరాబాద్ : ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో హైదరాబాద్ మెట్రో రైలు పట్టాలెక్కనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో ట్రైన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మియాపూర్‌ నుంచి ఎస్ఆర్‌నగర్ వరకు 12 కి.మీ, నాగోల్‌ నుంచి మెట్టుగూడ వరకు 8 కి.మీల మేర మెట్రో మార్గాల పనులు పూర్తయ్యాయి. ఎస్‌ఆర్‌నగర్‌ నుంచి మెట్టుగూడ వరకు వెళ్లే మార్గాన్ని పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు అమీర్‌పేట్‌ ఇంటర్‌ జంక్షన్‌లో మెట్రో పనుల్లో వేగం పెంచారు అధికారులు.

 

19:54 - September 6, 2017

జర్నలిస్టుల హత్య పరంపర కొనసాగుతోందని, చాలా చోట్ల బెదిరంపులు కూడా జరుగుతున్నాయని, జర్నలిస్టుల భద్రతా విషయంలో భారత్ 136 ర్యాంక్ లో ఉందని, గౌరీ లంకేష్ పేదవారి కోసం పోరాడిన వ్యక్తి అని, ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఆమె పత్రిను నడిపించారని, ఇది కచ్చితంగా మతన్మోద చర్య అని ప్రాముఖ విశ్లేకులు వినయ్ గారు అన్నారు. ఏ సంఘటన జరిగిన దాని వెనుక రాజకీయాలు ఉంటాయని, ఇది భవప్రకటన స్వేచ్చపై దాడి అని, దక్షణ భారత్ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కల్బుర్గీని కూడా దారుణంగా హత్య చేశారని పీడబ్యూ నేత సంధ్య అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

19:53 - September 6, 2017

ఢిల్లీ : సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్యను జర్నలిస్ట్‌ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఢిల్లీ ప్రెస్‌ క్లబ్‌లో సమావేశమైన జర్నలిస్టులు దాడులతో పత్రికా స్వేచ్ఛను ఆపలేరన్నారు. మీడియా ఒకరి చేతిలో బంధీగా ఉండదని సీనియర్‌ జర్నలిస్ట్‌ బర్కాదత్ అన్నారు మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:52 - September 6, 2017

ఢిల్లీ : గౌరీ లంకేష్‌ హత్య హేయమైన చర్య అని సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ అన్నారు. ప్రశ్నించే వారు దేశద్రోహులు కారన్న ఆయన.. రుణాలు ఎగ్గొట్టి నల్లధనాన్ని దాచుకున్నవారే దేశద్రోహులన్నారు. జర్నలిస్టుల రక్షణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాల రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:50 - September 6, 2017

బెంగుళూరు : కర్నాటక సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీలంకేశ్‌ హత్య.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి ఇద్దరు దుండగులు.. పాయింట్‌బ్లాంక్‌ రేంజ్‌లో గౌరిపై కాల్పులు జరిపి చంపేశారు. ఈ హత్యోదంతంపై యావద్భారతావనీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యవాదులు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో.. కర్నాటక సీఎం సిద్దరామయ్య.. హోంమంత్రి, ఉన్నతస్థాయి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం, కేసు దర్యాప్తు కోసం.. ఐజీ స్థాయి అధికారితో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేసింది.

సీసీటీవీ ఫుటేజి ఆధారంగా..
గౌరీలంకేశ్‌ హత్యకు సంబంధించి.. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆమె ఇంటి వద్ద ఉన్న రెండు సీసీ టీవీ కెమెరాలతో పాటు, బసవనగుడి దగ్గరున్న గాంధీబజార్‌లోని గౌరి కార్యాలయం నుంచి ఆమె ఇంటివరకూ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీనీ పోలీసులు పరిశీలించారు. ఆమె నివాసం నుంచి పాస్‌వర్డ్‌ ప్రొటెక్షన్‌ కల్గిన రెండు డీవీఆర్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ నిపుణుల సాయంతో వాటిని తెరచి పరిశీలిస్తున్నారు. హతురాలితో పాటు నిందితులు కూడా ఒకే ఫ్రేమ్‌లో ఉండే ఫొటోలు కొన్ని లభ్యమైనట్టు తెలుస్తోంది. వీటన్నింటినీ ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీకి పంపారు. ఇప్పటివరకూ లభించిన ఆధారాల మేరకు ఆమెపై కాల్పులు జరిపిన వారు ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌ అయి ఉంటారని, పకడ్బందీ రెక్కీ అనంతరమే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన ఓ యువకుడు
ఇంకోవైపు, హంతకుల గాలింపు కోసం ఓ రెండు బృందాలు ఇప్పటికే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు వెళ్లాయి. అటు, గౌరీలంకేశ్‌ను హతమారుస్తానంటూ.. ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన ఓ యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు. కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో.. నిందితులను 24 గంటల్లోపు పట్టుకు తీరాలని కన్నడ పోలీసులు పట్టుదలగా ఉన్నారు. గౌరీలంకేశ్‌ హత్యతో బెంగళూరులో హైఅలర్ట్‌ ప్రకటించారు. అటు కేంద్రం కూడా గౌరీలంకేశ్‌ హత్యపై వివరాలు సేకరిస్తోంది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు గౌరీలంకేష్ హత్య ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆమె సోద‌రుడు ఇంద్రజిత్ లంకేష్ డిమాండ్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలనను గౌరీ కుటుంబసభ్యుల సమక్షంలో నిర్వహించాలన్నారు.

హత్య వెనుక హిందూత్వ శక్తుల హస్తం
ఇంకోవైపు.. పోస్టుమార్టం అనంతరం, గౌరీలంకేశ్‌ మృతదేహానికి బెంగళూరులో.. అభిమానుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కన్నడ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్యను సీపీఎం నేతలు ఖండించారు. లంకేశ్‌ను హత్య చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌ డిమాండ్‌ చేశారు. ఈ హత్య వెనుక హిందూత్వ శక్తుల హస్తం ఉందన్నారు. ఇలాంటి శక్తులను కఠినంగా అణచివేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

19:49 - September 6, 2017

సిద్దిపేట : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పేద ప్రజలు బాగుపడిందేమీ కనపడట్లేదన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. అధికారంలోకి రావాలనుకున్న వారికే తెలంగాణ వచ్చి ఉపయోగపడిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మెడలు వంచి ప్రజల దారికి తెచ్చేందుకే టీ మాస్ ఫోరమ్ ఏర్పడిందని తమ్మినేని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో జరిగిన టీ మాస్ ఫోరమ్ ఆవిర్భావ సభలో తమ్మినేని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలు సామాజిక, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. 

19:48 - September 6, 2017

అనంతపురం అనంతపురం జిల్లా శింగనమల మండలం గుమ్మేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులు తేజ, నాగిరెడ్డి, అరవింద్‌గా గుర్తించారు. 

19:47 - September 6, 2017

ఖమ్మం : అరకొర వసతులతో సచివాలయాన్ని నడపలేకనే.. కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. మంత్రులు, అధికారుల కార్యాలయాలు అన్నీ ఒకే చోట లేవని చెప్పారు. కలెక్టర్ల సమావేశాలు సైతం ప్రైవేటు హోటళ్లలో నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఉందని.. అందుకే బైసన్‌పోలో గ్రౌండ్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నట్లు తుమ్మల చెప్పారు. ప్రతిపక్షాలు ఎంత గోల చేసినా.. సెక్రటేరియట్‌ కట్టి తీరుతామన్నారు.

మెట్రోరైలు ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు

హైదరాబాద్ : మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం ముహుర్తం ఖరారు చేసింది. నవంబర్ చివరి వారంలో హైదరాబాద్ మెట్రో రైల్ ను ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే మెట్రో పనులు వేగం పెంచిన అధికారలు.

19:45 - September 6, 2017

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనం అంటే భక్తులకు ఎంతో ఇష్టం. ఆ తల్లి దర్శనం చేసుకుంటే.. అంతా మంచే జరుగుతుందని ఓ నమ్మకం. కానీ దేవస్థానంలో అంతరాలయ దర్శనం టికెట్‌ ధరలు ఎక్కువగా నిర్ణయించడం.. భక్తులను ఇబ్బందుల్లోకి నెట్టింది. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో నెలకొన్న వివాదాల విషయంలో.. ఇప్పుడిప్పుడే చిక్కుముడులు వీడుతున్నాయి. దుర్గమ్మ దర్శనం టికెట్‌ ధరలు కాస్ట్‌లీ అంటూ గతంలో 10టీవీ కథనాలు ప్రసారం చేసింది. దర్శనం టికెట్ల ధరలు పెరగడంతో గుడికి భక్తుల రాక తగ్గింది. దీంతో ఆలయ ఆదాయానికి గండి పడింది.

10 టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది
దుర్గమ్మ దేవాలయంలో ఉన్న సమస్యలను 10 టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే పాలక మండలి కూడా అమ్మ దర్శనం టికెట్లు తగ్గించేందుకు ప్రయత్నాలు చేసింది. దర్శనం టికెట్ల విషయంలో ఉన్న ఇబ్బందులను మంత్రికి తెలిపింది. మంత్రి దేవినేని ఉమ టికెట్ల ధరలను తగ్గించాలని ఈవో సూర్యకుమారిని కోరారు. అందుకు ఆమె వీలుపడదని చెప్పడం, మంత్రి ఆలోచిస్తాననడంతో వివాదం తార స్థాయికి చేరింది. ఈ విషయంపై ఆలయంలో పంచాయతీ జరగడం గురించి కూడా 10 టీవీ కథనాలు ప్రసారం చేసింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఆలయంలో జరుగుతున్న రాద్దాంతంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వెంటనే ఆలయ అధికారులు, ఈవో, పాలక మండలికి మధ్య నెలకొన్న విబేధాలపై సీరియస్‌ అయ్యారు. ప్రభుత్వం కూడా దర్శనం టికెట్ల గొడవపై.. ఆరుగురు సభ్యులతో తాత్కాలికంగా కమిటీని నియమించారు. ఈ కమిటీలో గౌరంగబాబు, ఈవో సూర్యకుమారి, ఇద్దరు సభ్యులతో పాటు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ను నియమించారు.

300 నుంచి 150 రూపాయలకు తగ్గించాలని తీర్మానం
సెప్టెంబర్‌ 4న దేవస్థానంలో ఆలయ చైర్మన్‌ గౌరంగబాబు, ఈవో సూర్యకుమారి ఆధ్వర్యంలో.. పాలకమండలి సమావేశం నిర్వహించారు. దర్శనం టికెట్‌ ధరను 300 నుంచి 150 రూపాయలకు తగ్గించాలని తీర్మానించారు. అలాగే 100 రూపాయలున్న ముఖ మండప దర్శనం టికెట్‌ ధరను కూడా.. 50 రూపాయలకు తగ్గించాలని తీర్మానం చేశారు. ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపారు. మొత్తానికి 10 టీవీ వరుస కథనాలతో అధికారుల్లో చలనం వచ్చింది. దీంతో భక్తులు ఎంతగానో సంతోషిస్తున్నారు. 

 

19:43 - September 6, 2017

అనంతపురం : తన తనయుడు త్వరలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేస్తున్నట్టు.. హీరో నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. అనంతపురం జిల్లా, హిందూపురంలో వందలాది మంది అభిమానుల మధ్య.. తన కుమారుడు మోక్షజ్ఙ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. కేక్‌ కట్‌ చేసి అభిమానులకు అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌ మొదటివారంలో మోక్షజ్ఞ మొదటి సినిమా షూటింగ్‌ మొదలవుతుందని ఆయన తెలిపారు. తన 101వ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా.. 101 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

19:42 - September 6, 2017

గుంటూరు : ప్రముఖ మహిళా జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ దారుణహత్యను ఏపీ సెక్రటేరియట్ జర్నలిస్ట్‌లు తీవ్రంగా ఖండించారు. సెక్రటేరియట్‌లోని పబ్లిసిటీ సెల్‌లో గౌరీ లంకేష్ ఆత్మకు శాంతి కలుగాలని రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన హంతకులను కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.

19:33 - September 6, 2017

హైదరాబాద్ : వ్యవసాయ విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్న జీవో 64ను ఏపీ సర్కార్ రద్దుచేసింది. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జీవో 64 రద్దు కోసం ఉద్యమించిన వ్యవసాయ విద్యార్థులు.. ఇటీవల పవన్‌ను ఆశ్రయించారు. 

19:32 - September 6, 2017

అనంతపురం : జిల్లా పామిడిలో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి పామిడిలోని రోడ్లు..లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. గుత్తి నుండి పామిడి వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. 

19:31 - September 6, 2017

గుంటూరు : రాష్ట్రాభివృద్ధిని వైసిపి అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు టీడీపీ మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్. వీలైతే వైసిపి నేతలు రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. 12 ఛార్జిషీట్లపై సమాధానం చెప్పాకే జగన్ ప్రజలకు ముందుకు వెళ్లాలన్నారు కంభంపాటి రామ్మోహన్. ప్రత్యేక హోదా కోసం పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని ప్రకటించిన జగన్.. ఆ పని త్వరగా చేస్తే తాము ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని కంభంపాటి సవాల్ విసిరారు. 

సీఎంకు ధన్యవాదాలు తెలిపిన పవన్

హైదరాబాద్ : జీవో నెంబర్ 64 రద్దు చేసినందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు జనసేన అధ్యక్షుడు పవన్ ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ విద్యార్థులకు నష్టం కలిగించే జీవో 64ను రద్దు చేయడం శుభాపరిణామం అని ఆయన అన్నారు.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ హెచ్చరిక

గుంటూరు : ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు హెచ్చరిక జారీ చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి డి.కొత్తకోట మండలాలు, నెల్లూరు జిల్లా డక్కిలి, వెంకటగిరి మండలాలు, కడప జిల్లా చిట్వేల్ మండల పరిధిలో గ్రామాల్లో పిడుగుపడే అవకాశం ఉందని హెచ్చరించింది.

అనంతపురంలో విషాదం

అనంతపురం : జిల్లా శింగనమల మండలం గుమ్మేపల్లిలో విషాదం నెలకొంది. ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందారు. మృతులు తేజ, నాగిరెడ్డి,అరవింద్ లుగా గుర్తించారు.

18:01 - September 6, 2017

హైదరాబాద్ : బెంగళూరులో సీనియర్ జర్నలిస్ట్ గౌరీలంకేశ్ హత్యను హైదరాబాద్ జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. బషీర్ బాగ్ చౌరస్తాలో జర్నలిస్ట్ నేతలు నిరసనకు దిగారు. హత్య వెనక ఎవరున్నా.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జర్నలిస్ట్ నాయకులు దేవుల పల్లి అమర్, రామచంద్ర మూర్తి, శ్రీనివాస రెడ్డి, పీఓడబ్య్లూ సంధ్య, సామాజిక కార్యకర్త దేవి పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

17:59 - September 6, 2017

నిజామాబాద్ : అర్బన్ నియోజకవర్గం 2009లో కొత్తగా ఏర్పడింది. 2 లక్షల 41వేల 562 మంది ఓటర్లున్నారు. బిసిలు, మైనార్టీలు అధికంగా వున్న నియోజకవర్గం. మున్నూరుకాపులు, మైనార్టీలు గెలుపు ఓటమిలను ప్రభావితం చేస్తుంటారు. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య చతుర్ముఖ పోటీ జరిగే నియోజకవర్గమిది. 2014 ఎన్నికల్లో చతుర్మఖ పోటీ జరగగా, టిఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా విజయం సాధించారు. అంతకు ముందు 2009లోనూ, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ అప్పటి కాంగ్రెస్ నాయకుడు డి. శ్రీనివాస్ పై సంచలన విజయాలు నమోదు చేయడం విశేషం.

నగర మేయర్ కీ, ఎమ్మెల్యే అనుచరవర్గానికి మధ్య గ్యాప్
టిఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వివాద రహితుడన్న పేరుంది. కానీ, ఆయన అనుచరవర్గం వ్యవహార శైలి ద్వితీయ శ్రేణి కేడర్ కి మింగుడుపడడం లేదు. పిఏ వ్యవహార శైలి, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ లు అడుగుతున్న తీరు ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు చెడ్డపేరు తెస్తోంది. నగర మేయర్ కీ, ఎమ్మెల్యే అనుచరవర్గానికి మధ్య గ్యాప్ బాగా పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చేయిస్తున్న సర్వేలలో గతంలో టాప్ ప్లేస్ లో వున్న గణేష్ గుప్తా లేటెస్ట్ సర్వేలో 15శాతం మార్కులు కోల్పోవడం విశేషం. నిజామాబాద్ జిల్లాలోని ఇతర నియోజకవర్గాల కంటే అర్బన్ లోనే పార్టీ బలహీనంగా వుందన్నది సిఎం సర్వేల సారాంశం.నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తానన్నది గణేష్ గుప్తా గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీ మార్చడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మరికొన్ని ముఖ్య వాగ్ధానాలు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నత్తనడకన సాగుతోంది. పనుల్లోనూ నాణ్యత లోపించిందన్న ఆరోపణలున్నాయి. గుంతలు తేలిన రోడ్లు నగర ప్రజలకు నిత్యం నరకం చూపిస్తున్నాయి. క్లీన్ అండ్ గ్రీన్ కనిపించడం లేదు.

మామూళ్లుగా పుచ్చుకుంటున్న అధికార పార్టీ నేతలు
నిజామాబాద్ టౌన్ లోని ప్రతి డివిజన్ లో ఒక పార్క్ ఏర్పాటు చేస్తామన్న వాగ్ధానమూ నెరవేరలేదు. రోడ్ల విస్తరణ పనులకు రాజకీయ ఒత్తిడిలు పెద్ద అడ్డంకిగా మారాయి. అధికార పార్టీ నాయకులు ప్రయివేట్ ఆస్పత్రుల నుంచి భారీగా మామూళ్లుగా పుచ్చుకుని, రోడ్ల విస్తరణకు మోకాలడ్డారన్న ఆరోపణలున్నాయి. నగర సుందరీకరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇంకా ప్రకటించలేదు. 1974 తర్వాత మాస్టర్ ప్లానే లేదు. రఘునాధ చెరవును మినీ ట్యాంక్ బండ్ గా మారుస్తామన్న వాగ్ధానమూ నెరవేరలేదు. శంకు:స్థాపనలు చేసి, ఆ తర్వాత పట్టించుకోవడం లేదన్నది పబ్లిక్ టాక్.అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి కలగానే మిగిలిపోతోంది. ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు అర్సపల్లి గేటు నుంచే నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహన కాలుష్యమూ పెరుగుతోంది. ఇవన్నీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు మైనస్ పాయింట్లుగా మారుతున్నాయి. మరోవైపు బిజెపి తన పట్టు నిలుపుకునేందుకు, పార్టీని విస్తరించేందుకు తీవ్రంగానే శ్రమిస్తోంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి గణేష్ గుప్తా రెండోసారి గెలవాలంటే, రాబోయే రెండేళ్లు చాలా తీవ్రంగానే శ్రమించాల్సి వుంటుంది. 

17:57 - September 6, 2017

హైదరాబాద్ : ప్రశాంత వాతావరణంలో అన్ని శాఖల సమన్వయంతో గణేశ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగామంటున్నారు జీహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి. మరోవైపు భాగ్యనగరంలో భారీ వర్షాలు కురిసినపుడు సహాయక చర్యల కోసం ఎప్పటికప్పుడు రెస్క్యూ టీంలను అందుబాటులో ఉంచుతున్నామ జీహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

17:56 - September 6, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హైదరాబాద్‌లో విపక్ష నేతలు, ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ మేరకు బషీరాబాగ్‌లోని బాబు జగ్జీవన్‌రావు విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని వారు ఆరోపించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

17:55 - September 6, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ బైసన్‌ పోలో గ్రౌండ్‌లో సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బైసన్‌ పోలో గ్రౌండ్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సచివాలయ భవనాల నుంచే పాలన సాగించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమించాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. 

జీహెచ్ ఎంసీకి మరో జాతీయ అవార్డు...

హైదరాబాద్: జీహెచ్ ఎంసీకి జాతీయ పర్యాటక పురస్కారం అందుకోనుంది. బెస్ట్ సివిక్ మేనేజ్ మెంట్ ఆఫ్ టూరిస్ట్ డెస్టినేషన్ అవార్డుకు జీహెచ్ ఎంసీని కేంద్ర పర్యాటక శాఖ ఎంపిక చేసింది. ఈ నెల 27న రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును జీహెచ్ ఎంసీ కమిషనర్ అందుకోనున్నారు.

చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి

మేడ్చల్: ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ లో ఇంజనీరింగ్ విద్యార్థి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి రేవంత్ నాయక్. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

గౌరి లంకేష్ హంతకులను కఠినంగా శిక్షించాలి: తమ్మినేని

హైదరాబాద్ : గౌరి లంకేష్ హంతకులను కఠినంగా శిక్షించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. . గౌరీ లంకేష్ హత్యకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గౌరీ లంకేష్ హత్య ను సీపీఎం తీవ్రంగా ఖండిస్తోందని, రేపు ప్రెస్ క్లబ్ వద్ద నిసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తమ్మినేని స్పష్టం చేశారు.

ప్రతికా స్వేచ్ఛను దాడుల ద్వారా అణచలేరు: బర్మాదత్

ఢిల్లీ: గౌరీ లంకేష్ హత్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ప్రెస్ కల్బ్ ఆఫ్ ఇండియాలో నిరసన సభ పెట్టారు. ప్రతికా స్వేచ్ఛను దాడుల ద్వారా అణచలేరని, గౌరీ లంకేష్ హత్య హేయమైన చర్య మీడియా ఏ ఒక్కరి చేతిలో బంధీగా ఉండదని ప్రముఖ జర్నలిస్టు బర్మాదత్ స్పష్టం చేశారు.

గౌరీ లంకేష్ హత్య హేయమైన చర్య :రాజ్ దీప్ సర్దేశాయ్

ఢిల్లీ : జర్నలిస్టుల రక్షణ పై ప్రభుత్వం చిత్త శుద్ధితో వ్యవహరించాలని రాజ్ దీప్ సర్దేశాయ్ సూచించారు. గౌరీ లంకేష్ హత్య హేయమైన చర్య అని, హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

16:49 - September 6, 2017

నిజామాబాద్ : నిజామాబాద్‌ జిల్లాలో అగ్రవర్ణాల దాష్టీకం వెలుగు చూసింది. దళితులు గణేశ్‌ ఉత్సవాలను నిర్వహిస్తుంటే సహించలేక పోయారు. గ్రామంలో గణేశ్‌ నిమజ్జన ఊరేగింపును పెత్తందారులు అడ్డుకున్నారు. మద్యం సేవించిన అగ్రవర్ణాల యువకులు దళిత మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నోటికి వచ్చినట్టు దూషిస్తూ.. దళితులను కించపరిచారు.

మహిళలపై కూడా దాడి
ఆర్మూర్‌మండలం ఇసాపల్లిలో ఉన్న ఎస్సీ సామాజికవర్గం యువకులు గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 9 రోజులు పూజలు చేసి.. అంగరంగ వైభవంగా భగవంతునికి జేజేలు పలుకుతూ నిమజ్జనానికి బయలుదేరారు. ఇదంతా అగ్రవర్ణాలకు కంటగింపుగా మారింది. దళితులు ఇంత గొప్పగా పండుగ చేసుకోవడంపై కస్సుబుస్సుమన్నారు. తాగుబోతుల్ని ఉసిగొల్పారు. గ్రామంలోగణేశుని ఊరేగింపు సందర్భంగా గొడవకు దిగారు. దళితులు ఊరిలో పండగ చేసుకునేడేంది..అంటూ బండబూతులు తిడుతూ.. దళిత యువకుల్ని చితకబాదారు. అడ్డుకున్న మహిళలపై కూడా దాడి డి చేశారు. ఒంటిమీద చీరలు లాగి అసభ్యంగా ప్రవర్తించారని బాధితుుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాపోతున్న దళితులు
అగ్రవర్ణాలా అహంకారపూరిత దాడితో చెదిరిపోయిన దళితులు కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఖాకీలు ఎప్పటిమాదిరిగానే ఆ చూద్దాంలే అనే ధోరణిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అట్రాసిటీ కేసుపెట్టి దౌర్జన్యానికి దిగిన అగ్రవర్ణ దురహంకారుల్ని అరెస్టు చేయాలని కోరితే.. పోలీసుల పట్టించుకోవడం లేదని దళితులు వాపోతున్నారు. ఇప్పటికైనా దాడులకు తెగబడిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. 

ఫేస్ బుక్, వాట్సాప్ లకు సుప్రీం కోర్టు నోటీసులు

ఢిల్లీ: ఫేస్ బుక్, వాట్సాప్ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల సమాచారాన్ని ఇతరులకు చేరవేయబోమని హామీ ఇవ్వాలని ఆదేశించింది. 4 వారాల్లో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది.

16:48 - September 6, 2017

విశాఖ : అన్ని పండుగలకంటే గొప్ప పండుగ..పవిత్రమైన పండుగ జలసిరికి హారతి అన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. విశాఖ జిల్లా కశింకోట మండలం నర్సాపురం గ్రామంలో జలసిరికి హారతి కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శారదా నదికి హారతి ఇచ్చిన చంద్రబాబు నర్సాపూర్ ఆనకట్టను ప్రారంభించారు. మన జీవన ప్రమాణాలు సక్రమంగా ఉండాలంటే ప్రకృతిని ఆరాధించాలని చంద్రబాబు అన్నారు. తిండినిచ్చే రైతన్నను గౌరవించడం మనందరి బాధ్యతని ఆయన సూచించారు. భవిష్యత్తులో 80శాతం ప్రజలు సంతోషంగా ఉండేలా పాలన అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. 

మయన్మార్ లో కొనసాగుతున్న ప్రధాని మోదీ పర్యటన...

ఢిల్లీ : మయన్మార్ లోని బగాన్ లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. బగాన్ లోని ఆనంద ఆలయంలో మోదీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

16:28 - September 6, 2017

ఓ కుక్క తో పోరాడిన కోడి గెలిచింది అంటే ఎవరైనా నమ్ముతారా.. నమ్మరండి.. కానీ ఇక్కడి జరిగింది ఏంటో చూస్తే మీరే ముక్కు వేలేసుకుసుని చూస్తారు. సహజంగా కోడిని కుక్క చూసిందంటే దాన్ని వేటాడి చంపి తింటుంది. కుక్కను చూస్తే కోళ్లు కూడా పారిపోతుంటాయి. కానీ ఇక్కడ ఓ కోడిపుంజు ఏకంగా కుక్కకు ఎదురుతిరిగింది.. తిరగబడింది. రెండూ హోరా హోరీగా పోరాడాయి. చివరికి కుక్క ఓడిపోయి పరుగులంకించుకుంది. కోడి పుంజు కుక్కను తరిమి తరిమి కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది...

16:25 - September 6, 2017

ఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులను అరికట్టేందుకు దేశంలో ప్రతి జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఉండాలని, టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

16:23 - September 6, 2017

గుంటూరు : ఏపీ పర్యటక శాఖ మంత్రి అఖిలప్రియ సంతకం ఫోర్జరీ జరిగింది. అలీ అనే వ్యక్తి ఓట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం మంత్రి సంతకం ఫోర్జరీ చేసినట్టు తెలుస్తోంది. ఫోర్జరీ చేసిన సంతకం అప్లికేషన్ తిరిగి అఖిలప్రియకే ఇవ్వడంతో ఆమె తన సంతకం ఫోర్జరీ అయిందని గుర్తించి ఎస్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అలీని అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

హత్య కేసులో రాకీయాదవ్ కు కోర్టు జీవితఖైదు

పాట్నా: ఆధిత్యసచ్ దేవ్ అనే యువకుడి హత్య కేసులో రాకీయాదవ్ కు కోర్టు జీవితఖైదు విధించింది. రాకీయాద జేడీయూ మాజీ ఎమ్మెల్సీ మనోరమాదేవి కుమారుడు. 2016 మే 7న కారును ఓవర్ టేక్ చేశాడని ఆధిత్యపచ్ దేవ్ అనే యువకుడిని రాకీయాదవ్ కాల్చి చంపేశాడు. ఈ కేసులో రాకీయాదవ్ తండ్రి బిందియాదవ్ కు 5ఏళ్ల జైలు శిక్ష విధించారు.

గోరక్షకులపై సుప్రీం కోర్టు ఆగ్రహం..

దేశంలో గోరక్షకుల ముసుగులో జరుగుతున్న ఆగడాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈహింసకు చెక్ పెట్టేందుకు ప్రతి జిల్లాలో ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. కనీసం డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో జిల్లాకు ఓ టాస్క్ ఫోర్స్ ను నియమించాలని సూచించింది. గోరక్షణ పేరుతో హింసాత్మక దాడులు జరుగుతున్నాయని, దీనికి కట్టడి చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త తెహసీన్‌ ఎస్‌ పూనావాలా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చీఫ్ జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం దీనిపై విచార‌ణ జ‌రుపుతున్న‌ది.

16:07 - September 6, 2017

దేశంలో గోరక్షకుల ముసుగులో జరుగుతున్న ఆగడాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈహింసకు చెక్ పెట్టేందుకు ప్రతి జిల్లాలో ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. కనీసం డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో జిల్లాకు ఓ టాస్క్ ఫోర్స్ ను నియమించాలని సూచించింది. గోరక్షణ పేరుతో హింసాత్మక దాడులు జరుగుతున్నాయని, దీనికి కట్టడి చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త తెహసీన్‌ ఎస్‌ పూనావాలా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చీఫ్ జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం దీనిపై విచార‌ణ జ‌రుపుతున్న‌ది. టాస్క్‌ఫోర్స్‌లో ఉండే సీనియ‌ర్ అధికారి ఇలాంటి ఘ‌ట‌న‌లు రిపీట్ కాకుండా చూడాల‌ని కోర్టు స్ప‌ష్టంచేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటుపై వారం రోజుల్లో త‌మ‌కు రిపోర్ట్ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది. రాష్ట్రాల చీఫ్ సెక్ర‌ట‌రీలు, డీజీపీలు వెంట‌నే ఈ దిశ‌గా చ‌ర్య‌లు మొద‌లుపెట్టాల‌ని కోర్టు నిర్దేశించింది.ఏప్రిల్‌ 27న ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, దీనిపై స్పందన తెలియజేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. జూలై 21న వాదనల నేపథ్యంలో హింసకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

16:03 - September 6, 2017

విజయవాడ : ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, మత సామరస్య వేదిక నాయకురాలు.. గౌరీ లంకేశ్‌ను హత్య చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ ప్రెస్‌క్లబ్, ఇండియన్‌ జర్నలిస్ట్ యూనియన్, ఏసీయూడబ్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు.. దీనిపై గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో నిరసన వ్యక్తం చేశారు. దేశంలో అసహన, విద్వేష చీకటి కోణాన్ని బయటపెట్టడంలో ఆమె కీలకపాత్ర పోషించారని అన్నారు. హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్న శక్తులే ఆమె ప్రాణాలను బలిగొనడానికి కారణమని జర్నలిస్టులు చెప్పారు. నిజం గొంతు నొక్కలేరని.. వెంటనే గౌరీ లంకేశ్‌ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. హంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. 

15:53 - September 6, 2017

సంగారెడ్డి : కంగ్టి మండలంలో భూ దందా వెలుగులోకి వచ్చింది. కొంతమంది పెద్దలు 3 వేల ఎకరాలకు పైగా పేదల భూములను కబ్జా చేశారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌కు చెందిన కొందరు వ్యక్తులు పేద రైతుల భూముల్లో... నిర్మాణాలకు పూనుకుంటున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలు కోసం వీడియో చూడండి.

ఉండవల్లిలో ఇసుక లారీలను మహిళలు

అమరావతి: తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఇసుక లారీలను మహిళలు అడ్డుకున్నారు. ఇసుక రీచ్ లను మూసేసినా మళ్లీ ఎందుకు అనుమతిచ్చారని అధికారులపై మహిలలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక లారీలను అడ్డుకోకపోతే ఆందోళనకు దిగుతామని మహిళలు హెచ్చరించారు.

15:52 - September 6, 2017

బెంగుళూరు : ప్రముఖ మహిళా జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ దారుణహత్యపై బెంగళూరులో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీపీఎం, ప్రజాసంఘాలు హత్యను తీవ్రంగా ఖండించాయి. భారీ ఆందోళన నిర్వహించాయి. మతోన్మాద శక్తుల అరాచకాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చాయి. 

15:51 - September 6, 2017

ఢిల్లీ : ప్రముఖ మహిళా జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ దారుణహత్యను సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. గౌరీపై దాడిని భారత సంస్కృతిపై దాడిగా చూడాలన్నారు. ఇది ఓ జర్నలిస్టును హత్య చేయడం కాదు.. ఏకంగా ఒక వ్యవస్థనే హత్య చేయడమన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఏర్పడుతున్న ముప్పుగా అభివర్ణించారు.  

15:50 - September 6, 2017

బెంగళూరు : సీనియర్‌ జ‌ర్నలిస్టు గౌరి లంకేష్ హత్య ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆమె సోద‌రుడు ఇంద్రజిత్ లంకేష్ డిమాండ్ చేశారు. గౌరి ఛాతిలో దుండుగులు కాల్చిన‌ట్లు ఆయన తెలిపారు. సీసీటీవీ ఫూటేజ్‌ ఆధారంగా దర్యాప్తు జరపాలని కోరారు. సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలనను గౌరి కుటుంబసభ్యుల సమక్షంలో నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గౌరి ఓ సామాజిక కార్యక‌ర్త అని, ఆమెకు ఎలాంటి బెదిరింపులు రాలేవని చెప్పారు. గౌరి కోరిక మేరకు ఆమె నేత్రాలను దానం చేసినట్లు ఇంద్రజిత్‌ తెలిపారు. పోస్టు మార్టం అనంతరం ఈరోజు సాయంత్రం గౌరి అంత్యక్రియలు నిర్వహించనున్నామని కుటుంబసభ్యులు తెలిపారు.

15:49 - September 6, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లా ఆలేరులో దారుణం జరిగింది. ఓ యువకుడు, అతని తల్లి బంధువులమని చెప్పి ఓ బాలికను గురుకుల కళాశాల నుంచి ఇంటికి తీసుకెళ్ళాడు. బాలిక తల్లి హాస్టల్‌కు ఫోన్‌చేయడంతో విషయం బయటపడింది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితుడు జేమ్స్‌, అతని తల్లి రూబీని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై కిడ్నాప్‌, అత్యాచారం, నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

15:47 - September 6, 2017

ఢిల్లీ : ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆధ్వర్యంలో 10వ గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ సమ్మిట్‌ 2017 ఢిల్లీలో ఘనంగా జరిగింది. వ్యవసాయ అనుబంధ రంగాలలో కృషి చేస్తున్న సంస్థలకు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులను అందించింది. ఇందులో భాగంగానే వ్యవసాయ అనుబంధ వ్యాపార విభాగంలో పసుర గ్రూప్‌...గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ 2017 అవార్డు సాధించింది. హర్యానా గవర్నర్‌ కెప్టన్‌ సింగ్‌ సోలంకి చేతుల మీదుగా పసుర గ్రూపు చైర్మన్‌ పి.వి. మోహనరావు ఈ అవార్డును అందుకున్నారు. సూక్ష్మ పోషకాలతో కూడిన సేంద్రీయ విధానంపై తాము దృష్టి సారించినట్లు మోహన్‌రావు తెలిపారు. జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

15:46 - September 6, 2017

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంటి ఆపరేషన్‌ ఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ సైట్‌ హాస్పిటల్‌లో జరిగింది. కుడి కన్నుకు సర్జరీ చేసిన వైద్యుడు సచ్‌ దేవాకు కేటీఆర్ ట్విట్టర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స అనంతరం కేసీఆర్‌ ఢిల్లీలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని టీఆర్‌ఎస్‌ నేతలు, ఎంపీలు ఆకాంక్షించారు. 

15:44 - September 6, 2017

కడప: బెంగళూరులో మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్యను నిరసిస్తూ కడపలోసీపీఐ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గౌరీ లంకేశ్‌ను హత్య చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ హత్య మతోన్మాద శక్తులపనేనని ఆరోపిస్తూ, వీరికి బుద్ధి చెప్సే రోజులు దగ్గర్నోనే ఉన్నాయని హెచ్చరించారు. 

15:42 - September 6, 2017

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లో జర్నలిస్ట్‌లు నిరసనకు దిగారు. ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ను హత్య చేయడంపై ఆందోళనకు దిగారు. మర్డర్లతో అక్షరాన్ని ఆపలేరని చేతిలో ప్లకార్డులు పట్టుకొని నినదించారు. 

15:41 - September 6, 2017

బెంగళూరు : జర్నలిస్ట్‌ గౌరి లంకేష్‌ హత్యను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఖండించారు. నిజాన్ని ఎప్పుడూ దాచి పెట్టలేరని... దోషులకు శిక్ష పడాలని అన్నారు. హిందుత్వ భావజాలమే ఈ హత్యకు కారణమని రాహుల్‌ పేర్కొన్నారు. ప్రధాని మోది దీనిపై నోరు మెదపడం లేదని తెలిపారు. అహింసాయుత దేశంలో హింసకు తావు లేదన్నారు. గౌరి అందరి హృదయాల్లో ఉన్నారని ఆమె కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని రాహుల్ చెప్పారు. 

15:39 - September 6, 2017

బెంగళూరు : మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్య కేసులో బెంగళూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ఐజీ స్థాయి పోలీసు అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. ఈ హత్యపై సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న కుటుంబ సభ్యుల డిమాండ్‌ను తోసిపుచ్చారు. సీసీ టీవీ కెమెరాల్లో నమోదైన హత్య దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. నిందితులను తర్వలోనే పట్టుకుంటామన్నారు. ఈ కేసులో ఇప్పటికే చిక్‌మగళూరుకు చెందిన సందీప్‌ను అరెస్టు చేసినట్టు చెప్పారు. మరోవైపు గౌరీ లంకేశ్‌ హత్యను నిరసిస్తూ కర్నాటక వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాల ఆందోళన చేస్తున్నాయి. 

ద్వారకా తిరుమల మండలం పులి సంచారం...

ప.గో: ద్వారకా తిరుమల మండలం తిరుమలపాలెంలో పులి సంచరిస్తోంది. అటవీ శాఖ అధికారులు పులి జాడలను గుర్తించారు. పులిని పట్టుకునేందుకు బోనులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

మంత్రి అఖిలప్రియ సంతకం ఫోర్జరీ

అమరావతి: మంత్రి అఖిలప్రియ సంతకం ఫోర్జరీ అయ్యింది. అలీ అనే వ్యక్తి మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం పోర్జరీ సంతకం చేసి ఏకంగా అఖిలప్రియకే అప్లికేషన్ ఇచ్చాడు. దాన్ని గుర్తించిన మంత్రి ఎస్పీఎఫ్ పోలీసుకలు ఫిర్యాదు చేశారు. అలీని అదుపులోకి తీసుకున్న పోలీసులు తుళ్లూరు పీఎస్ కు తరలించారు. అలీది పెదకూరపాడు అని తెలుస్తోంది.

15:25 - September 6, 2017

బీరకాయ.. ఈ పేరు అందరికీ సుపరిచతమే. అందునా తెలుగు ప్రజలు విరివిగా ఉపయోగిస్తారు. బీరకాయలో పందిర బీర, పొట్టి బీర, నేతిబీర, గుత్తిబీర అని వివిధ రకాలున్నాయి. అయితే ఈ బీరలో ఏఒక్కటి తిన్నా సరే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రస్తుత సీజన్ లో బీరకాయలు చాలా విరివిగా దొరకుతాయి. బీరకాయలో సి విటమిన్, ఐరన్ రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థయామిన్ తో పాటు అనేక రకాల ఖనిజలవణాలు ఉంటాయి. ఇందులో కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు చాలా తక్కువ. మన ఆరోగ్యానికి పీచు ఎంతో మేలు చేస్తుంది. అలాంటి పీచు బీరయకాయలో పుష్కలంగా లభిస్తుంది.

వైద్య పరిశోధనలన్నీ... ఇప్పుడు పీచు పరమావశ్యకతనే చాటిచెబుతున్నాయి. క్యాన్సర్లు రాకుండా.. గుండె జబ్బులు రాకుండా.. కొలెస్ట్రాల్‌ పెరక్కుండా.. మధుమేహం రాకుండా.. వూబకాయం రాకుండా... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పీచు ప్రయోజనాల జాబితా అంతాఇంతా కాదు. ఈ ఆధునిక కాలంలో పనిగట్టుకుని మరీ 'పీచు'ను ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.

రక్తం శుధ్ది చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది మరియు కాలేయ ఆరోగ్యంను మెరుగుపరుస్తుంది. మరియు మధ్యం మత్తు వైపు వెళ్ళకుండా తగ్గించడానికి సహాయపడుతుంది.

బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది. విరేచన కారి లక్షణాలను ఇందులో ఎక్కువగా కనుగొనడం జరిగింది. అందువల్లనే పథ్యంగా బీరకాయ చాలామంచిది. మలబద్దం నివారించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. పైల్స్ తో బాధపడే వారు దీన్ని తీసుకోవడం చాలా మంచిది. అంతే కాదు, పొట్ట యొక్క పనిసామర్థ్యం మీద అద్భుతంగా ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

కామెర్లను నివారించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కామెర్లతో బాధపడేవారు, జీరకాయలోని తెల్లటి గూడే, గింజలతో సహా తీసుకోవడం వల్ల కామెర్లను నివారించవచ్చు.

బీరకాయలోని కొన్ని ముఖ్యమైన లక్షణాలు మధుమేహాన్ని నిరోధించడంలో అద్భుతంగా సహాయపడుతుంది . బీరకాయలోని పెప్టైడ్స్ బ్లడ్ మరియు యూరిన్ లోని షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరియు బ్లడ్ ఇన్సులిన్ లెవల్స్ ను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గించుకోవాలనుకొనే వారు, బరువు తగ్గించే డైట్ లిస్ట్ లో దీన్ని చేర్చుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ, మరియు చాలా తక్కువ కొలెస్ట్రాల్ తీసుకొనేందుకు సహాయపడుతుంది. చాలా తక్కువ ఫ్యాట్ క్యాలరీలను కలిగి ఉండి, ఎక్కువ నీటిశాతం కలిగి ఉంటుంది. కాబట్టి, దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలిఅవ్వనివ్వదు మరియు ఇందులోని డైటరీ ఫైబర్ , విటమిన్స్ మరియు మినిరల్స్ బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

ఎటువంటి అనారోగ్యానికైనా గురైనప్పుడు చాలా త్వరగా కోలుకొనేలా చేస్తుంది. అంతటి శక్తికలిగిన బీరకాయను జ్యూస్ రూపంలో తీసుకవడం వల్ల శరీరంలో జీవక్రియలు చురుకు పనిచేసేలా, త్వరగా తేరుకొనేందుకు సహాయపడుతుంది. ఏ ఇన్ఫెక్షనస్ అయినా, ఏ వైరస్ లు శరీరానికి సోకుండా సహాయపడుతుంది. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు బీరకాయ రసం త్రాగితే రోగనిరోధక శక్తిని పెంపొంధించుకోవచ్చు.

బీరకాయను పేస్ట్ చేసి లేదా చక్రాల్లా నేరుగా అలాగే పొడి చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని చాలా కాంతివంతంగా మరియు మెటిమలు మచ్చలులేని చర్మంగా తయారుచేస్తుంది. మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను నివారించడంలో సహాయపడే అద్భుతమైన మూలకం ఇందులో ఉంది. అంతే కాదు ఇది శరీర నిర్వహణకు మరియు పాదాల దుర్వాసన నివారించడానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది.

బీరకాయలోని సెల్యులోజ్ కడుపు, ఉదర సంబంధిత సమస్యలు నివారించడంలో మరియు పైల్స్ నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

బీరకాయలో డైటరీ ఫైబర్ తో పాటు, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాల మేలు చేస్తుంది

బీరకాయలో యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర మొత్తం శుధ్ది చేసే, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగి, శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

సో మ రోజువారీ ఆహారంలో తప్పని సరిగా బీరకాయ ఉండేలా చూసుకుందా...

15:02 - September 6, 2017

టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ కొడుకు మహధాన్ వెండి తెరపై కనిపించనున్నాడు. మహధాన్ రాజాది గ్రేట్ సినిమాలో రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత దిల్‌రాజు ధ్రువీకరించారు. ‘‘మాస్ మహరాజ్ రవితేజ కుమారుడు మహధాన్‌ను మా సినిమాలో పరిచయం చేస్తున్నాం. అతడికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ రవితేజ కుమారుడితో కలసి సెట్స్‌లో దిగిన ఫొటోను దిల్‌రాజు పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో రవితేజ అంధుడి పాత్రలో నటిస్తున్నారు. తన సినీ జీవితంలో తొలిసారి అంధుడి పాత్ర పోషిస్తున్న రవితేజ తన కుమారుడిని కూడా అంధుడి పాత్రతోనే సినీరంగానికి పరిచయం చేయబోతున్నారు. దిల్‌రాజు పోస్ట్ చేసిన ఫొటోలో రవితేజ కుమారుడి చేతిలో ఉన్న స్టిక్‌ను గమనిస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది.

15:01 - September 6, 2017

జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం...

బెంగళూరు : జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. గౌరీ ఇంటి వద్ద ఉన్న 2 సీసీ టీవీ కెమెరాల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. ఆమె నివాసం నుంచి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ కలిగిన రెండు డీవీఆర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోటోల ఆధారంగా లంకేష్‌ను దగ్గర్నుంచే కాల్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరు నల్ల రంగు జాకెట్‌తో పూర్తిగా మాస్క్ ధరించినట్లు తెలుస్తుంది. ఒకరు బైక్‌పై వేచి ఉండగా మరో వ్యక్తి కాల్పులు జరిపినట్లు సమాచారం.

14:42 - September 6, 2017

తనను గాడ్ వుమన్ (దైవాంశ సంభూతురాలిగా) ప్రకటించుకున్న వివాదాస్పద మాత రాధేమా మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ పోలీసులను ఆదేశించింది. తనను ఆమె అదేపనిగా వేధిస్తూ బెదిరిస్తోందని విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు సురేందర్ మిట్టల్ దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని కోర్టు ఈ మేరకు పోలీసులను ఆదేశించింది. 2015 లో ఈ క్లిప్పింగ్స్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. కాగా రాధేమా గతంలోనూ ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. తనను ఆమె తీవ్రంగా వేధించిందని, వరకట్నం కేసులో తనను తన భర్త హింసించేలా ఆమె రెచ్చగొట్టిందని నటి డాలీ బింద్రా అప్పట్లో రాధేమా మీద క్రిమినల్ కేసు దాఖలు చేసింది.

14:38 - September 6, 2017

పెళ్లి అనగానే అబ్బాయి నచ్చగానే పెళ్లి చేస్తారు. కొంతమంది ఎన్ఆర్ఐ సంబంధం రాగనే పెళ్లి చేయడం జరుగుతుంది. పెళ్లి సంబంధలు చూసేటప్పుడు అబ్బాయి గురించి చాలా అబద్ధాలు చెబుతున్నారని, పెళ్లి తర్వాత మోసపోయామని ఫ్యామిలీ కోర్టుకు తల్లిదండ్రులు వస్తున్నారని ప్రాముఖ అడ్వకేట్ పార్వతీ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిలల్లో చాలావరకు కనీస సమాచారం లేకుంగా జరుగుతున్నాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:29 - September 6, 2017

విజయ్ దేవరకొండ మూవీ అర్జున్ రెడ్డి వసూళ్ళ సునామీ సృష్టిస్తోంది. అమెరికాలో 1.5 మిలియన్ మార్క్ ను దాటి 2 మిలియన్ల మార్క్ (20 లక్షల డాలర్ల) దిశగా పరుగులు తీస్తోంది. నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఈ మూవీ 15 వ స్థానంలో నిలిచిందని, ఈ ఏడాది విడుదలై భారీ వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రాల్లో 11 వ ప్లేస్ దక్కించుకుందని తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ విజయవాడ పర్యటన ఖరారు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ విజయవాడ పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 27న విజయవాడకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. కనకదుర్గమ్మకు ముక్కుపుడను కేసీఆర్ సమర్పించనున్నారు.

పరిగి బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి అదృశ్యం...

వికారాబాద్: పరిగి బాలుర రెసిడెన్షియల్ పాఠశాల నుంచి 7వ తరగతి విద్యార్థి మధు అదృశ్యం అయ్యాడు. గత నెల 28 నుంచి కనిపించకుండా పోయినా తల్లిదండ్రులకు, పోలీసులకు హెడ్మాస్టర్ సమాచారం ఇవ్వలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. గతంలో ఓ విద్యార్థి తప్పిపోయినా ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు.

గురుకుల కళాశాల బాలిక కిడ్నాప్.. నిర్భయ కేసు...

యాదాద్రి భువనగిరి: ఆలేరు లో యువకుడి తల్లి నిర్వాకం బయటపడింది. బంధువలమని చెప్పి బాలికను గురుకుల కళాశాల నుంచి యువకుడు, అతని తల్లి ఇంటికి తీసుకెళ్లారు. బాలిక తల్లి హాస్టల్ కు ఫోన్ చేయడంతో ఈ విషయం బయటపడింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు జేమ్స్, తల్లి రూబీని అరెస్ట్ చేసి కిడ్నాప్, అత్యాచారం, నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

11 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారయత్నం

తిరుపతి: రేణిగుంటలో దారుణం వెలుగుచూసింది. 11 ఏళ్ల బాలికపై పాస్టర్ పన్నీర్ సెల్వం అత్యాచారయత్నం చేశాడు. గమనించిన స్థానికులు నిందితుడ్ని విద్యుత్ స్తంభానికి కట్టి చికతబాదారు. బాలికను ఆసుపత్రికి తరలించారు.

13:38 - September 6, 2017

సంగారెడ్డి : పేదల భూములపై పెద్దలు పంజా విసురుతుండడం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం సంగారెడ్డిలో మూడు వేల ఎకరాల స్థలం వివాదాస్పదమౌతోంది. ఎంపీ బీబీ పాటిల్ అనుచరులపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంగ్టి మండలంలో రైతులకు చెందిన మూడు వేల ఎకరాలను ఢిల్లీకి చెందిన శర్మ కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు. ఎకరానికి రూ. 40 వేలు చొప్పున ఇస్తానని..అడ్వాన్స్ గా రూ. 10వేలు చెల్లిస్తానని..పూర్తి డబ్బు చెల్లించిన తరువాతే తాను భూమి తీసుకుంటానని..అప్పటి వరకు వినియోగించుకోవచ్చని శర్మ సూచించాడు. దీనితో గత కొన్ని సంవత్సరాలుగా రైతులు ఆ భూముల్లో సాగు చేసుకుంటున్నారు. కానీ ఇటీవలే ఎంపీ బీబీ పాటిల్ కు చెందిన కొంతమంది అనుచరులు ఆ భూముల్లోకి వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ చెందిన కంపెనీ పెడుతున్నామంటూ నిర్మాణాలు చేపట్టారు. భూములు తాము కొనడం జరిగిందని పేర్కొని రైతులను బలవంతంగా అక్కడి నుండి వెళ్లేవిధంగా చేశారని తెలుస్తోంది.

దీనిపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల్లో ప్రజా ప్రతినిధి అనుచరులు నిర్మాణ కార్యక్రమాలు ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నారు. భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు మొత్తం డబ్బులు ఇవ్వలేదని, తొలినుంచీ తామే ఈ స్థలంలో ఉన్నామని, వాటిని ఎలా కబ్జా చేస్తారని నిలదీస్తున్నారు.

ఈ భూములను తనఖా పెట్టి వందల కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సీబీఐ విచారణ కొనసాగిందని కానీ నివేదిక బయటకు రావడం లేదని తెలుస్తోంది. రైతులకు అండగా సీపీఎం నిలబడింది. రైతులకు న్యాయం చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేసి హై కోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. 

13:29 - September 6, 2017

పశ్చిమగోదావరి : నంద్యాల ఉప ఎన్నిక ఒకరి ప్రాణాలు తీసింది. ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారనే దానిపై ఇద్దరు వ్యక్తులు బెట్టింగ్ కాశారు. కానీ ఇక్కడ మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉండి మండలం మహదేవపట్నంలో చోటు చేసుకుంది. గోలి శ్రీను, శివ అనే ఇద్దరు వ్యక్తులు టిడిపి గెలుపుపై రూ. 16 వేలు కాశారు. ఈ ఎన్నికల్లో టిడిపి గెలిచిన సంగతి తెలిసిందే. దీనితో శివ రూ. 16వేలు చెల్లించాల్సి ఉంది. దశల వారీగా డబ్బులు చెల్లించాడు. చివరకు రూ. 3వేలు చెల్లించాల్సి ఉంది. వీరి మధ్య మధ్యవర్తిగా సూర్యారావు వ్యవహరించాడు.

దీనితో బకాయి పడిన డబ్బులు చెల్లించే విధంగా చూడాలంటూ గోలి శ్రీను..అతని కుమారుడు వెంకటేష్ లు మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో సూర్యారావుతో వాదనకు దిగారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగిపోయింది. తీవ్ర ఆవేశానికి లోనైన వెంకటేష్ పక్కనే ఉన్న ఇనుప రాడ్ తో దాడి చేశాడు. దీనితో సూర్యారావు తలకు తీవ్రగాయమై కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించిందని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. చికిత్స పొందుతు బుధవారం ఉదయం సూర్యారావు మృతి చెందాడు. దీనితో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చివరకు నంద్యాల ఉప ఎన్నిక బెట్టింగ్ ఒకరి ప్రాణాలు తీసింది. 

మానుకొండూరు ఘటన దురదృష్టకరం: ఎమ్మెల్సీ కర్నె

హైదరాబాద్:మానుకొండూరు ఘటన దురదృష్టకరం అన్ని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. అత్మహత్యా యత్నాలను రాజకీయం చేయడం తగదని, ఆత్మహత్యాయత్నాలకు సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలనడం హాస్యాస్పదం అని మండిపడ్డారు. ఇప్పటికైనా విపక్షాలు క్షుద్ర రాజకీయాలు మానాలని హితబోధ చేశారు.

13:09 - September 6, 2017

బెంగుళూరు : ప్రముఖ మహిళా జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి గౌరి లంకేశ్‌ హత్యపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు..నిరసనలు మిన్నంటాయి. జర్నలిస్టు సంఘాలు..పౌర సంఘాలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి బెంగళూరులో గౌరి లంకేశ్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆమెను కిరాతకంగా కాల్చి చంపారు. అతి సమీపం నుంచి కాల్పులు జరుపడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారు.

దీనిపై పోలీసుల దర్యాప్తు జరుగుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఐజీ స్థాయి పోలీసు అధికారి నేతృత్వంలో సిట్ బృందం ఏర్పాటు చేయడం జరిగిందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. మరోవైపు సీబీఐ చేత దర్యాప్తు చేయించాలనే డిమాండ్ ను ఆయన కొట్టిపారేశారు. సీసీ టీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు, ఇప్పటికే ఈ కేసులో చికమగళూరుకు చెందిన సందీప్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. 

అదృశ్యమైన ముగ్గురు విద్యార్థినుల కథ సుఖాతం

విజయవాడ:అదృశ్యం అయిన ముగ్గురు విద్యార్ధుల కథ సుఖాంతం అయింది. వీరు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. వీరిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని... వారంతట వారే.. హైదరాబాద్ వినాయక నిమజ్జనం వేడుక చూసేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. నిమజ్జనం అనంతరం బాలికలు హైదరాబాద్ నుంచి ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఉన్నతాధికారులు వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు.

తూ.గో జిల్లాలో ఓఎన్జీసీ పైప్ లైన్ లీక్..

తూ.గో: సఖినేటిపల్లి మండలం అంతర్వేది ఆదర్శ నగర్ లో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయ్యింది. లీకేజీ దగ్గర ఓఎన్జీసీ సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు. అయితే స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

సీఎం కేసీఆర్ కంటి ఆపరేషన్ సక్సెస్ : మంత్రి కేటీఆర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ కంటి ఆపరేషన్‌ విజయవంతమయిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆపరేషన్‌ చేసిన డాక్టర్ సచిదేవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ కుడి కంట్లో పొరను సచిదేవ్ తొలగించారని కేటీఆర్ తెలిపారు. 

గౌరి లంకేష్ హత్య కేసు పై సీబీఐ విచారణ లేదు: కర్ణాటక సీఎం

బెంగళూరు : జర్నలిస్టు గౌరి లంకేష్ హత్య కేసు పై సీబీఐ విచారణ అవసరం లేదని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల్ని మూసివేసి వాహనాల్ని తనిఖీ చేస్తున్నామని సిద్ధరామయ్య తెలిపారు. హత్య ఘటనలో ఎంత మంది పాల్గొన్నారనేది నిర్ధారించాల్సి ఉందని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు.

జలసిరికి -జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విశాఖ: నర్సాపురం ఆనకట్ట దగ్గర జలసిరికి -జలహారతి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని, గంటా, ఎంపి అవంతి పాల్గొన్నారు.

కమీషన్ల కోసమే కొత్త సచివాలయం నిర్మాణం :కాంగ్రెస్

హైదరాబాద్: కొత్త సచివాలయం ఏర్పాటును నిరసిస్తూ బైసన్ పోలో గ్రౌండ్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, వీహెచ్, జానా, షబ్బీర్ అలీ పాల్గొన్నారు. బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయం నిర్మించాలనుకోవడం తగ్లక్ చర్య అని, కొత్త సచివాలయం నిర్మించాల్సిన అవసరం లేదని, వాస్తు పేరుతో ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందన్నారు. దీని పై అన్ని పార్టీలతో కలిసి పోరాడుతామన్నారు. కమీషన్ల కోసమే కొత్త సచివాలయం నిర్మాణం అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.

'టీఎస్ విద్యుత్ రంగ అభివృద్ధికి సహకరించండి'

ఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ను మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపిలు జితేందర్ రెడ్డి, వినోద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా కలిశారు. విద్యుత్ రంగం అభివృద్ధికి టీఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను కేంద్ర మంత్రికి జగదీష్ రెడ్డి వివరించారు. విద్యుత్ రంగంలో టీఎస్ కు అన్ని విధాలుగా సహకరించాలని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ను మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీలు కోరారు.

12:34 - September 6, 2017
12:32 - September 6, 2017

హైదరాబాద్ : గణేశ్‌ నిమజ్జనోత్సవంతో ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌తోపాటు ఇతర రోడ్లపై పేరుకు పోయిన చెత్తను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.ఇందుకోసం గణేశ్‌ యాక్షన్‌ టీముల పేరుతు 166 ప్రత్యేక బృందాలను నియమించారు. చెత్త తొలగించేందుకు అదనపు వాహనాలను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

12:30 - September 6, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ బైసన్‌ పోలో మైదానంలో సచివాలయం, అసెంబ్లీ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఆందోళనకు దిగింది. ఇరుకు రోడ్లతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో సచివాలయం నిర్మించొద్దని డిమాండ్‌ చేసింది. వాస్తు దోషం పేరుతో కొత్త భవనాలు నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయం తప్పు అని కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ పేర్కొన్నారు. కేసీఆర్ ఒక నియంత..ఒక రాజుగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతితో నిర్మిస్తా అని పేర్కొంటున్నారని తెలిపారు. అనవసరమైన ఆలోచనలు చేస్తున్నారని..ప్రగతి భవన్ కట్టి సెక్రటేరియట్ కు సీఎం కేసీఆర్ రావడం లేదన్నారు. 

12:27 - September 6, 2017

ఢిల్లీ : కన్నడ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్యను సీపీఎం నేతలు ఖండించారు. లంకేశ్‌ను హత్య చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌ డిమాండ్‌ చేశారు. ఈ హత్య వెనుక హిందూత్వ శక్తుల హస్తం ఉందన్నారు. ఇలాంటి శక్తులను కఠినంగా అణచివేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

తమిళనాడులో భారీగా గంజాయి స్వాధీనం..

తమిళనాడు: రామనాథపురంలో పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మండపం బస్‌స్టేషన్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 20 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి విలువ రూ.లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై విచారణ వాయిదా..

ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి చెందిన స్పష్టమైన ఫోటోలు సమర్పించాలని పిటిషనర్, తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 20కి వాయిదా వేసింది.

పోలీసులతో కర్ణాటక సీఎం అత్యవసర భేటీ

కర్నాటక: పోలీసులతో సీఎం సిద్ధరామయ్య అత్యవసర భేటీ అయ్యారు. ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యపై చర్చిస్తున్నట్లు సమాచారం.

12:02 - September 6, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట నల్లపోచమ్మ వాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. భువనగిరి జిల్లా సెంట్ ఆన్ స్కూల్ కు చెందిన మినీ బస్సులో కొంతమంది విద్యార్థులు వెళుతున్నారు. స్కూల్ సమీపిస్తుందనగా టర్నింగ్ పాయింట్ వద్ద వెనుకనుండి వచ్చిన డీసీఎం బస్సును ఢీకొంది. దీనితో వర్షిత అనే(5) విద్యార్థిని మృతి చెందింది..నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి..వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

11:56 - September 6, 2017

గుంటూరు : జిల్లాలో ఓ ఫైర్ వర్క్స్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీనితో బాణాసంచా పేలుతూ భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటన మంగళగిరి మండలం చినకాకని వద్ద గల వినాయక ఫైర్ వర్క్స్ లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా ? ఇతర కారణాలున్నాయా ? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 

స్కూల్ వ్యాన్, డీజిల్ ట్యాంకర్ ఢీ: చిన్నారి మృతి

యాదగిరి గుట్ట : నల్లపోచమ్మ వాడలో రోడ్డుప్రమాదం జరిగింది. స్కూల్ వ్యాన్, డీజిల్ ట్యాంకర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో యూకేజీ విద్యార్థిని వర్షిత (5) మృతి చెందింది. మరో నలుగురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి.

11:44 - September 6, 2017

హైదరాబాద్ : వినాయక విగ్రహాల నిమజ్జన సరైన సమయంలో జరగడానికి అన్ని శాఖల సమన్వయం..సహకారం కారణమని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సంజీవయ్య పార్కు సమీపంలో కొన్ని విగ్రహాలున్నాయని..మిగతా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య లేదన్నారు. ఇప్పటి వరకు రెండు వేల టన్నుల చెత్తను తొలగించడం జరిగిందని..ఇంకా తొలగించే పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసు శాఖతో టచ్ లో ఉంటూ ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

11:43 - September 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..ముఖ్యమంత్రి కేసీఆర్ పై టి.కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ తీవ్ర విమర్శలు గుప్పించారు. బైసన్ పోలో గ్రౌండ్ లో తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం ఏర్పాటు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. దీనిని టి.కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం టి.కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. దళితులకు మూడెకరాల భూమి..రైతులకు రుణమాఫీ..డబుల్ బెడ్ రూం..ఇతర అంశాలను పట్టించుకోవాల్సింది పోయి..రోజుకో మాట కేసీఆర్ మాట్లాడుతున్నారని షబ్బీర్ ఆలీ ఘాటుగా విమర్శించారు. ఇదేమన్నా ఇంటి జాగీరా..నీవు రాజువా..తెలంగాణ బిడ్డల పైసలు..రూ. 73 వేల కోట్ల రూపాయలు అప్ర్పులు అయ్యాయని..ఇది ఎవరు తీరుస్తాని ప్రశ్నించారు. రూ. 150 వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారని, 11 ఎకరాల్లో సుమారు 300 కోట్ల రూపాయలతో ప్రగతి భవన్ కట్టి రాజకీయం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. విదేశాల నుండి వచ్చే వారు ఎక్కడ కూర్చొంటారు ? అంటూ ప్రగతి భవన్ చూపిస్తున్నారని..నీ నెత్తి మీద కూర్చొంటుర్రు..అంటూ విమర్శలు గుప్పించారు. అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. బైసన్ పోలో గ్రౌండ్ ను ప్రభుత్వం తీసుకోవద్దని చెప్పడం లేదని..ఈ భూమిని తీసుకుని ఇతర ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఉపయోగించాలని పేర్కొన్నారు. ఇందుకు తాము సహకరిస్తామని, సెక్రటేరియట్ కట్టడానికి తాము వ్యతిరేకమన్నారు. 

ప.గో జిల్లాలో ప్రాణం తీసిన బెట్టింగ్

ప.గో : ఉండి మండలం మహదేవపట్నంలో బెట్టింగ్ ప్రాణం తీసింది. నంద్యాల ఉప ఎన్నికలో శ్రీను,శివ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య బెట్టింగ్ జరిగింది. బెట్టింగ్ లో శ్రీను అనే వ్యక్తి కి శివ అనే వ్యక్తిరూ. 3వేలు బకాయిపడ్డాడు. డబ్బులు ఇవ్వాలంటూ మధ్యవర్తి గంటా సూర్యారావుతో శ్రీను ఘర్షణకు దిగాడు. శ్రీను కొడుకు వెంకటేష్ సూర్యారావు తలపై రాడ్ తో కొట్టాడు. తీవ్ర గాయాలతో భీమరవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సూర్యారావు మృతి చెందాడు. నిందితుడు పరారీలో ఉండగా... పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

బైసన్ పోలో గ్రౌండ్ వద్ద వీహెచ్ ఆందోళన

హైదరాబాద్: బైసన్ పోలో గ్రౌండ్ వద్ద కాంగ్రెస్ నేత వీహెచ్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సచివాలయం ఏర్పాటును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కొత్త సచివాలయం కట్టాల్సిన అవసరం లేదని, వాస్తు పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దని, బైసన్ పోటో గ్రఔండ్ ను ఫోర్స్ కే కేటాయించాలని విహెచ్ డిమాండ్ చేశారు.

11:28 - September 6, 2017

హైదరాబాద్ : నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగలే చీకట్లు అలుముకున్నాయి. దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. ఛత్తీస్ గడ్ నుండి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండడంతో ఈ ప్రభావంతో నగరంలో వాతావరణం మారిపోయిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, నాగోల్, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని..జీహెచ్ఎంసీ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

వినాయక నిమజ్జనం ఇంకా కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్..సెక్రటేరియట్, అసెంబ్లీ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

గౌరీ పై కాల్పులు..రెండు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు

బెంగళూరు: జర్నలిస్టు గౌరి లంకేష్ పై కాల్పుల ఘటనలో సీసీ టీవీల్లో రికార్డు అయినట్లు పోలీసులు గుర్తించారు. రెండు సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకుని వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సాంకేతిక లోపంతో నిలిచిన లక్నో మెట్రో రైలు

ఉత్తరప్రదేశ్ : ఈ రోజు ఉదయమే అందుబాటులోకి వచ్చిన లక్నో మెట్రో రైలు సర్వీసులో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు తాత్కాలికంగా మెట్రో రైలును నిలిపివేశారు. మెట్రో రైలు సాంకేతిక లోపం రావడంతో అలంబాగ్ స్టేషన్ వద్ద నిలిపేసినట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా ఏసీ, ఫ్యాన్లు బంద్ కావడంతో ప్రయాణికులు కొద్ది సేపు ఆందోళనకు గురయ్యారని అధికారులు పేర్కొన్నారు. సమాచారమందుకున్న సాంకేతిక సిబ్బంది అలంబాద్ స్టేషన్ వద్దకు చేరుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రజాస్వామ్య లౌకివాద శక్తులన్నీ ఏకంకావాలి: ప్రకాశ్ కరత్

ఢిల్లీ: ప్రజా సమస్యలపై పోరాడే వారిని హత్య చేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ విమర్శించారు. కల్బుర్గి హత్య కేసులో ఇప్పటి వరకు కర్ణాటక ప్రభుత్వం నిందితులను గుర్తించలేదని, గౌరి హత్య పై ప్రశ్నించేందుకు, ప్రజాస్వామ్య లౌకివాద శక్తులన్నీ ఏకంకావాలని కరత్ పిలుపునిచ్చారు.

11:18 - September 6, 2017

బెంగళూరు : ప్రశ్నిస్తే సంపేస్తారా ?..ఒక కలాన్ని చిదిమేస్తే నెత్తుటి సిరా ఇంకిపోతుందా ? అక్షరం పై కక్ష్యలు తూటాలై పేలాయి...కల్బుర్గి, పన్సారి, దబోల్కర్ ఇప్పుడు గౌరీ లంకేశ్‌.... తరువాత ఎవరూ....? అన్యాయాన్ని ఎదిరించిన వారి ప్రాణాలు తీస్తారా ? అంటూ గళమెత్తుతున్నారు. ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి గౌరీ లంకేశ్ హత్యపై నిరసనలు పెల్లుబికుతున్నాయి. మంగళవారం గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. కర్నాటక వ్యాప్తంగా పౌర సంఘాలు, జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిరసనకు దిగుతున్నాయి. వెంటనే ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బెంగలూరు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అక్కడి జర్నలిస్టు వరప్రసాద్ టెన్ టివికి తెలిపారు. ఈ కేసును చేధించేందుకు ముగ్గురు పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

గౌరీ లంకేశ్‌ కొన్నాళ్లుగా రాజరాజేశ్వరినగర్‌లోని తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. లంకేష్‌పత్రికే అనే కన్నడ వీక్లీ టాబ్లాయిడ్‌ ఆమె నడుపుతున్నారు. స్వతంత్రంగా, నిర్భయంగా వ్యాసాల ద్వారా తన అభిప్రాయాలను ఆమె వెలిబుచ్చేవారు. సైద్ధాంతిక సిద్ధాంతంతో విభేదించే వ్యక్తులే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తూటాలకు బలైన నరేంద్ర దబోల్కర్‌, ధార్వాడలో సాహితీవేత్త ఎం.ఎం. కలబురగి హత్యల తరహాలోనే గౌరీ లంకేశ్‌ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. దీనిపై టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

గౌరి లంకేష్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం: ఏచూరి

ఢిల్లీ : సీనియర్ జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి స్పష్టం చేశారు. గౌరి లంకేష్ మతతత్వ దుశ్చర్యలు, ప్రజా సమస్యలపై ధైర్యంగా పోరాడిన వ్యక్తి అని కొనయాడారు. కుల్బర్గి, దబోల్కర్, పన్నారే తరహాలోనే గౌరీ హత్య జరిగిందని, దేశంలో శాంతి భద్రతలను కాపడటం లేదని ఏచూరి ఆరోపించారు. గౌరి హత్య పై త్వరగా విచారణ చేసి బాధ్యులను శిక్షించాలని కర్ణటక ప్రభుత్వాన్ని కోరామని, ఇలాంటి హత్యను సహించేదని ఏచూరి హెచ్చరించారు.

ఇంజనీరింగ్‌ కళాశాలలో సందడి చేసిన నాగ చైతన్య, లావణ్య త్రిపాటి

తూర్పు గోదావరి: గోదావరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (గైట్‌) ఇంజనీరింగ్‌ కళాశాలలను ‘యుద్ధం శరణం, చిత్ర హీరో నాగచైతన్య, హీరోయిన్‌ లావణ్యా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ యువత మద్దతుతోనే ఏదైనా సాధించడం సాధ్యపడుతుందన్నారు. ఈ నెల 8న యుద్ధం శరణం చిత్రం విడుదల సందర్భంగా తమను ఆదరిస్తున్న అభిమానులను కలుసుకునేందుకు వచ్చామన్నారు. రాజమహేంద్రవరం రావడం సంతోషంగా ఉందన్నారు.

ఇంజనీరింగ్‌ కళాశాలలో సందడి చేసిన నాగ చైతన్య, లావణ్య త్రిపాటి

తూర్పు గోదావరి: గోదావరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (గైట్‌) ఇంజనీరింగ్‌ కళాశాలలను ‘యుద్ధం శరణం, చిత్ర హీరో నాగచైతన్య, హీరోయిన్‌ లావణ్యా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ యువత మద్దతుతోనే ఏదైనా సాధించడం సాధ్యపడుతుందన్నారు. ఈ నెల 8న యుద్ధం శరణం చిత్రం విడుదల సందర్భంగా తమను ఆదరిస్తున్న అభిమానులను కలుసుకునేందుకు వచ్చామన్నారు. రాజమహేంద్రవరం రావడం సంతోషంగా ఉందన్నారు.

ఇంజనీరింగ్‌ కళాశాలలో సందడి చేసిన నాగ చైతన్య, లావణ్య త్రిపాటి

తూర్పు గోదావరి: గోదావరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (గైట్‌) ఇంజనీరింగ్‌ కళాశాలలను ‘యుద్ధం శరణం, చిత్ర హీరో నాగచైతన్య, హీరోయిన్‌ లావణ్యా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ యువత మద్దతుతోనే ఏదైనా సాధించడం సాధ్యపడుతుందన్నారు. ఈ నెల 8న యుద్ధం శరణం చిత్రం విడుదల సందర్భంగా తమను ఆదరిస్తున్న అభిమానులను కలుసుకునేందుకు వచ్చామన్నారు. రాజమహేంద్రవరం రావడం సంతోషంగా ఉందన్నారు.

బాలికపై అత్యాచారం, హత్య కేసును చేధించిన పోలీసులు

విజయనగరం: సీతానగరం మండలం గాదెవలసలో బాలికపై అత్యాచారం, హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు శంకర్ రావు, లోకేష్ ను కాసేపట్లో పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియగ్ గా స్పందించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ వర్షం

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ వర్షం పడుతోంది. దీంతో పలు విమానాలు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. అంతే కాదు వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన విమానాలను వేరే విమానాశ్రయాలకు దారి మళ్లించినట్లు సమాచారం.

సచివాలయం వద్ద పోలీసులతో ఉద్యోగులు వాగ్వాదం

హైదరాబాద్: గణేష్ నిమజ్జనం సందర్భంగా లిబర్టీ వద్ద బారికేడ్లు నిర్మించి వాహన రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. సచివాలయ సిబ్బందిని మాత్రమే పోలీసులు అనుమతించారు. తమను కూడా అనుమతించాలని ఉద్యోగులు ఆందోళన చేపట్టి.. పోలీసులతో ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు.

చినకాకానిలో బాణాసంచా గోదాంలో అగ్ని ప్రమాదం

గుంటూరు: మంగళగిరి మండలం చినకాకానిలో బాణాసంచా గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపే చేసేందుకు యత్నిస్తున్నాయి.

నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం...

హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సాగర్ రింగ్ రోడ్డు, ఎల్బీనగర్, దిల్ షుక్ నగర్, కొత్తపేట, ఉప్పల్, రామాంతపూర్, నాగోల్ లో భారీ వర్షం పడుతోంది.

10:25 - September 6, 2017

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 170, నిఫ్టీ -60 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడ్ అవుతున్నాయి.

10:16 - September 6, 2017

హైదరాబాద్ : నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడం లేదనే సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై పోయింది. సాయంత్రం ఎలాంటి వాతావరణం ఉంటుందో..అలాంటి వాతావరణం ఉదయం కనిపిస్తుండడంతో నగర ప్రజలు అప్రమత్తమయ్యారు. భారీ వర్షం పడే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు గణేష్ నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండడంతో ఉద్యోగులు..ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సెక్రటేరియట్ ప్రాంతాల్లో పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగుతున్నారు. భారీ వర్షం పడితే మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. నిమజ్జనం సందర్భంగా రెండు వేల చెత్త వచ్చిందని..ఇంకా మూడు వేల టన్నుల చెత్త ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఈపీడీసీఎల్ ఈఏ రంగారావు ఇంటిపై ఏసీబీ దాడులు

విశాఖ: ఈపీడీసీఎల్ ఈఏ రంగారావు ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. ప.గో జిల్లాలో రంగారావు బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంతో తనిఖీలు చేస్తోన్నట్లు సమాచారం.

10:15 - September 6, 2017

పశ్చిమగోదావరి : టోర్నడోలు..దీనిని భారీ సుడిగాలి అంటారు. ఎక్కువగా విదేశాల్లో టోర్నడోల బీభత్సం వింటూనే ఉంటాం. కానీ పశ్చిమగోదావరి జిల్లాలో టోర్నడోల కలకలం సృష్టిస్తోంది. ఆకాశం నుండి వచ్చి భూమిని సుడిగాలులు చుట్టేశాయి. దీనిని చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రైతులు..స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఆకీవీడు మండలం కోళ్లపర్రు, గుమ్ములూరులో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. నల్లటి మబ్బులు కమ్ముకోగా ఆకాశం నుండి ఒక్క తెల్లటి పదార్థం భూమికి దూసుకరావడాన్ని కొంతమంది సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఈ పదార్థం క్రమ క్రమంగా పెద్దదిగా మారిపోయింది. చేపలు..రొయ్యల చెరువుల్లోని నీటిని పైకి లాగేసుకోవడం గమనార్హం. దీనిపై వాతావరణ అధికారులు దృష్టి సారించారు. 

స్కోచ్ అవార్డుకు ఎంపికైన సిద్ధిపేట మున్సిపాలిటీ...

సిద్దిపేట :పరిసరాల పరిరక్షణలో ఉత్తమ ఫలితాలు సాధించిన సిద్దిపేట మున్సిపాలిటీ స్కోచ్ అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 9న ఢిల్లీలో జరిగే స్కోచ్ సంస్థ 49వ సదస్సు సందర్భంగా సిద్దిపేట మున్సిపాలిటీకి అవార్డు ప్రదానం చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

నగరంలో కమ్ముకున్న కారుమొబ్బులు

హైదరాబాద్:నగరంలో కారుమొబ్బులు కమ్ముకోవడంతో ఒక్కసారిగా చీకటి వాతావరణం నెలకొంది. అంతే కాకుండా నగరంలో మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. ఉప్పల్, ఎల్బీనగర్, ఆల్వాల్, కాప్రా, లో వర్షం పడుతోంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలిన జీహెచ్ ఎంసీ అధికారులు హెచ్చరించారు.

ఢిల్లీలో ఎన్ ఐఏ సోదాలు

జమ్మూకశ్మీర్ : ఢిల్లీలో ఎన్ ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చి కేసులో ఎన్ ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. శ్రీనగర్, ఢిల్లీలో మొత్తం 16 చోట్ల తనిఖీలు చేపట్టింది.

ప.గో జిల్లాలో టోర్నడోల బీభత్సం..

ప.గో: ఆకివీడు మండలం, కోళ్లపర్రు, గుమ్మలూరులో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకాశం నుంచి భూమి చుట్టేసిన సుడిగాలులు, చేపలు, రొయ్యల చెరువుల్లోని నీటి టోర్నడోలు పైకిలాగేసుకుంటున్నాయి. స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

09:35 - September 6, 2017

సామాజిక తెలంగాణ అన్న నినాదానికి తుప్పు పట్టింది. దళితులపై పైశాచికత్వం పెచ్చుమీరింది. అగ్రకులాలు గీసిన గీత దాటినా.. కుల కట్టుబాటులు చెరిపేసినా ఇక మరణదండనే. ఇదేంటని ప్రశ్నిస్తే కేసులు..జైళ్లు...! భయభ్రాంతులను చేసేలా బేడీలతో లాక్కెళ్లడాలు..! కరీంనగర్‌ జిల్లాలో దళితులపై జరుగుతున్న వరుస దాడులు నేటి తెలంగాణాలో వివక్ష తీవ్రతకు అద్దం పడుతున్నాయి. సామాజిక తెలంగాణ అన్న నినాదానికి తుప్పు పట్టింది. దళితులపై పైశాచికత్వం పెచ్చుమీరింది. అగ్రకులాలు గీసిన గీత దాటినా.. కుల కట్టుబాటులు చెరిపేసినా ఇక మరణదండనే. ఇదేంటని ప్రశ్నిస్తే కేసులు..జైళ్లు...! భయభ్రాంతులను చేసేలా బేడీలతో లాక్కెళ్లడాలు..! కరీంనగర్‌ జిల్లాలో దళితులపై జరుగుతున్న వరుస దాడులు నేటి తెలంగాణాలో వివక్ష తీవ్రతకు అద్దం పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే, కరీంనగర్‌ జిల్లాలో.. దళితులపై.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా, ఆరు అకృత్యాలు జరిగాయి. అంటే దళితులపై సగటున ప్రతి ఆరు నెలలకూ ఓ దాడో.. ఓ అత్యాచారమో.. లేక హత్యో ఆనవాయితీగా మారిపోయింది. ఈ గణాంకాలు జిల్లాలోని దళితుల దుర్భర స్థితికి, సర్కారు వివక్షాధోరణికి అద్దం పడుతున్నాయి.

దళితులపై దాడుల్లో కరీంనగర్‌ జిల్లా కొత్త రికార్డును సృష్టించే దిశగా సాగుతోంది. నిరుడు ఫిబ్రవరిలో మొదలైన దళితులపై వివక్షాపర్వం.. నేటికీ కొనసాగుతూనే ఉంది. నిరుడు ఫిబ్రవరి 11న కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన దళిత యువతిపై అత్యాచారం ఘటన.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. పోలీస్‌ కావాలన్న ఆశతో.. వీణవంక పోలీసులు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి వెళ్లిన యువతిపై.. శ్రీనివాస్‌, అంజయ్యలు ఎల్బక గుట్టకు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాలను మైనర్‌ బాలుడు సెల్‌ఫోన్‌లో చిత్రించాడు.

తనపై దాడి గురించి బాధితురాలు 10టీవీని ఆశ్రయించడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు ఉదృతంగా కోనసాగడంతో ప్రభుత్వం స్పందించి కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. పదిహేను నెలల పాటు సాగిన విచారణలో నేరం రుజువు కావడంతో, కరీంనగర్ ప్రత్యేక అట్రాసిటి కోర్టు నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసు విచారణలో నిర్లక్ష్యం చేశాడనే కారణంతో అధికారులు వీణవంక ఎస్ఐ కిరణ్‌ను సస్పెండ్ చేశారు. వీణవంక యువతిపై అత్యాచారం గురించి మరచిపోక ముందే.. మార్చి 14న మంథనికి చెందిన దళిత యువకుడు మధుకర్‌ ఓ ప్రేమ వ్యవహారంలో దారుణ హత్యకు గురయ్యాడు. ఆ మర్నాడే బంధువుల ఆందోళనలతో పోలీస్ లు 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో మధుకర్‌కు సంబందించి ఫోటోలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ ఫోటోల్లో కనుగుడ్లు పీకినట్లు, మర్మాంగాలు కోసి చిత్రహింసలకు గురి చేసినట్లు జరిగిన ప్రచారంతో ఉవ్వెత్తున్న ఆందోళనలు మొదలయ్యాయి. ఇంత సంచలనం సృష్టించిన మధుకర్ హత్యకేసులో.. మృతదేహన్ని పరిశీలించిన మంథని సిఐ ప్రభాకర్ ఘటన స్థలంలోనే మధు ఆత్మహత్య చేసుకున్నాడని తేల్చడం.. వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. పైగా, ఈ కేసులో మంథని ఎమ్మెల్యే పుట్ట మధుపైనే ప్రధాన ఆరోపణలు వచ్చాయి. దీంతో దళిత, ప్రజాసంఘాలు ఆందోళనలతో విరుచుకుపడ్డాయి. అయితే ఈ కేసులోనూ ప్రభుత్వం సీఐపై సస్పెన్షన్‌ వేటు వేసి చేతులు దులుపుకుంది. అయితే, మృతుని కుటుంబ సభ్యులు న్యాయం కోసం హై కోర్టును ఆశ్రయించడంతో ఏప్రిల్ 9న రీపోస్ట్ మార్టం నిర్వహించారు. మృతుని కుటుంబం ఇంక న్యాయం కోసం పోరాటం కోనసాగిస్తునే ఉన్నారు.

మధుకర్‌ వ్యవహారం సమసిపోక ముందే.. పెద్దపల్లి జిల్లాలో మార్చి నెల్లోనే దళిత దంపతులు శ్యామల, దేవేందర్‌పై ఇద్దరు ఎస్‌ఐలు దుర్మార్గంగా విరుచుకుపడ్డారు. విచక్షణరహితంగా కొట్టి అక్రమ కేసులు పెట్టారు. చేనును కాపాడుకునేందుకు రాత్రి పొలానికి వెళ్లడమే వారు చేసిన నేరం. శ్యామల దంపతులపై దాడి ఘటనపై స్పందించిన దళిత సంఘాలు వారికి మద్దతుగా న్యాయ పోరాటానికి దిగాయి. దీంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఇద్దరు ఎస్ఐ లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో అప్పటి కలెక్టర్ వర్షిణి భాదితుల పక్షాన నిలవడంతో కేసు విచారణ కొంత ముందుకు సాగిందని చెప్పుకోవాలి.

నేరెళ్ల..! ఈ ఊరి పేరెత్తగానే, ఇసుక మాఫియా అకృత్యానికి బలైన దళితులు.. వారి ఆవేదనను గుర్తించకుండా కేసులతో వేధించిన ప్రభుత్వ తీరూ మదిలో మెదలక మానదు. అంతేకాదు.. రైతుల చేతులకు బేడీలు వేయడం.. ఇప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నానికి కారణమైన ఘనత తెరాస ఏలికలకే దక్కింది. జులై రెండో తేదీన.. రాజన్న సిరిసిల్లా జిల్లా నేరెళ్లలో.. ఇసుక లారీ ఢీకొని భూమయ్య అనే వ్యక్తి మరణించాడు. దీంతో, నేరెళ్ల, జిల్లెల, రామచంద్రాపురం గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఎవరో ఆకతాయిలు నిప్పు పెట్టడంతో, అక్కడున్న అయిదు లారీలు దగ్ధం అయ్యాయి. దీంతో పోలీపులు 12 మంది కేసులు నమోదు చేశారు. తరచూ ఇసుక లారీలు ఢీకోని ప్రాణాలు పోయిన పట్టించుకోని పోలీస్ లు... ఇసుక లారీలు దగ్ధం కావడాన్ని మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనలో 8 మంది పై థర్డ్ డిగ్రి ప్రయోగించడం వివాదాస్పదంగా మారింది. భాదితుల్లో దళితులు ఉండడం... మృతి చెందిన భూమయ్య దళితుడే కావడంతో అన్ని పార్టీలు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేశాయి. అయినా సంబందిత అధికారులపై మాత్రం ప్రభుత్వం... చర్యలు తీసుకోక పోవడం విమర్శలకు దారితీసింది. సాక్షాత్తు మంత్రి కేటీఆర్‌ నియోజక వర్గంలోనే ఈ ఘటన జరగడం విశేషం. నేరెళ్ల బాధితులు ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు.

గూడు కోసం పోరాటం చేసిన కూలీలకు సంకెళ్లు బిగించిన ఘటనా కరీంనగర్‌ జిల్లాలోనే జరిగింది. భూమి కోసం పోరాటం చేసిన వారిలో 33 మంది కూలీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో కొంత మంది మరణించగా... మరి కోంత మంది బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో చాలా రోజుల పాటు కోర్టుకు హజరు కాలేదు. ఈ కేసులోని 11 మందిని రిమాండ్‌కు తరలించాలంటూ న్యాయ మూర్తి ఆదేశించారు. ఈ సందర్భంగా, ఆ రైతులను సంఘ విద్రోహ శక్తులో...దేశ ద్రోహులో అన్నట్లుగా బేడీలు వేసి తీసుకు వెళ్లడం పెను కలకలాన్ని సృష్టించింది. గూడు కోసం పోరాడిన కూలీలకు బేడిలు వేయడంపై ప్రజా సంఘాలు తీవ్రంగా మండి పడ్డాయి.

వరుస ఘటనలపై ఆందోళనలు వ్యక్తమవుతుండగానే.. తాజాగా మానకొండూరులోనూ దళితులపై మరో వివక్షాఘటన వెలుగు చూసింది. మానకోండుర్ నియోజక వర్గం, బెజ్జంకి మండలం గూడెం గ్రామంలో దళితులకు మూడెకరాల భూ పంపిణీలో అవకతవకాలు జరిగాయని, అర్హులను గుర్తించడం లేదన్న మనస్తాపంతో శ్రీనివాస్, పరశురాములు ఆత్మహత్యకు యత్నించారు. సాక్షాత్తు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకోని నిప్పటించుకున్నారు అధికార పార్టీకి చెందిన జెడ్పీటీసీ, శరత్ రావు, మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, విఆర్ఒ రవి తమకు అన్యాయం చేశారంటు భాదితులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు యువకులు, ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గతంలో దళితులకు సంబందించిన ఘటనలన్నింటిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం మానకోండుర్ ఘటనలో కాస్త ముందుగానే స్పందించింది. ఉదంతం వెలుగులోకి రాగానే, మంత్రి ఈటెల రాజేందర్ హుటాహుటిన బాధితులను పరామర్శించారు. వారికి అయ్యే వైద్యం ఖర్చుప్రభుత్వం భరిస్తుందంటు హమీ ఇచ్చారు. ఈ ఘటనలోనూ.. ఆరోపణలు వచ్చిన అధికార పార్టీ నేతలను తప్పించి, విఆర్ఓ రవిని మాత్రమే సప్పెండ్ చేశారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో దళితులపై జరిగిన ఘటనలన్నీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడిన మూడేళ్లలో జరిగినవే కావడంతో.. దళితులు కేసీఆర్‌ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అత్యాచారాలు..హత్యలు..ఆత్మహత్యాయత్నాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు పాత కరీంనగర్‌ జిల్లాలో దళితులపై జరుగుతున్న వరుస దాడులు పాలకుల వివక్షకు నిలువెత్తు సాక్ష్యాలుగా ఉన్నాయి. నిందితులను వదిలేసి బాధితులను శిక్షిస్తున్న ఉదంతాలు.. అసలు దోషులను తప్పించే ప్రయత్నాలు.. దళితులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. సామాజిక తెలంగాణ అంటే ఇదేనా అన్న ప్రశ్న ప్రతీ దళితుడి గుండెను తొలిచేస్తోంది. ఈ దుర్నీతికి చరమగీతం పాడి.. దళితుడూ.. అందరిలా జీవించే పరిస్థితిని కల్పించి.. సమసమాజ స్పూర్తిని నిలపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఆ దిశగా కేసీఆర్‌ సర్కారు సాగుతుందని ఆశిద్దాం. 

ఎక్స్ ప్రెస్ రైళ్లో భారీ చోరీ..

కర్నూలు : చెన్నై - ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ రైల్లో చోరీ జరిగింది. భారీగా బంగారాన్ని దోచుకెళ్లారు. డోన్ - మాల్యాల స్టేషన్ల మధ్యలో ఘటన చోటు చేసుకుంది. 

ఎన్ఐఏ దాడులు..

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ లో ఎన్ఐఏ 11 చోట్ల దాడులు చేపట్టింది. ఢిల్లీలోని ఐదు ప్రాంతాల్లో కూడా ఎన్ఐఏ దాడులు చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో ఎన్ఐఏ దాడులు చేపడుతోంది. 

09:18 - September 6, 2017

హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం బుధవారం ఉదయం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. హుస్సేన్ సాగర్ లో సుమారు 11వేల విగ్రహాలు నిమజ్జనమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. బుధవారం ఉదయం కూడా ఎన్టీఆర్ మార్గంలో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళుతున్నాయి. సుమారు ఇంకా 300 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందని తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలను పలు ప్రాంతాల్లో సడలిస్తున్నారు. 

09:13 - September 6, 2017
09:12 - September 6, 2017

విజయవాడ : నున్నలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం కావడంపై కలకలం రేపుతోంది. పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్ లో ముగ్గురు విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగే వేడుకలకు విద్యార్థులు హాజరయ్యారు. వేడుకలు ముగిసిన అనంతరం వీరు ఇంటికి చేరుకోలేదు. దీనితో కుటుంబసభ్యులు పలు ప్రాంతాల్లో వెతికారు. చివరకు ఎలాంటి ఫలితం కానరాకపోవడంతో పీఎస్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఆచూకీ కనుక్కొనేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

రంగంపేటలో దారుణం..

వరంగల్ అర్బన్ : రంగంపేటలో దారుణం చోటు చేసుకుంది. బబ్లూ, అనీల్ కుమార్ అనే ఇద్దరిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. 

నేడు సిద్ధిపేటలో టీ మాస్ ఆవిర్భావ సభ..

మెదక్ : నేడు సిద్ధిపేటలో టీ మాస్ ఆవిర్భావ సభ జరుగనుంది. శివం గార్డెన్ లో జరిగే ఈ సభలో తమ్మినేని, గద్దర్, విమలక్క, జాన్ వెస్లీ తదితరులు పాల్గొననున్నారు.

 

08:11 - September 6, 2017

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఉదయం నుండి మొదలైన నిమజ్జనం బుధవారం ఉదయం కూడా కొనసాగుతోంది. ఖైరతాబాద్ భారీ గణనాథుడిని ఉదయమే నిమజ్జనం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయిలో నిమజ్జనం పూర్తి కావాలంటే ఇంకా మూడు..నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ లలో ఇంకా గణేష్ విగ్రహాలు బారులు తీరి నిల్చున్నాయి.

మరో వైపు నిమజ్జన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. వ్యర్థాలను..చెత్తను తొలగించే పనులు చేస్తున్నారు. రెండు వేల టన్నుల చెత్త వచ్చిందని అనుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

తుది దశకు గణేష్ నిమజ్జనం..

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ వద్ద గణేస్ నిమజ్జనం తుది దశకు చేరుకుంది. మరో మూడు గంటల్లో నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. దాదాపు 11వేల విగ్రహాలు నిమజ్జమయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

07:48 - September 6, 2017

తెలంగాణ రాష్ట్రంలతో దళితుల పరిస్థితి ఆగమ్యగోచర పరిస్థితి నెలకొంటోంది. మానకొండూరు ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరు దళిత యువకుల ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం దళితుల హక్కుల బొంద పెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రముఖ మహిళా జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి గౌరి లంకేశ్‌ బెంగళూరులో దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆమెను కిరాతకంగా కాల్చి చంపారు. ఈ అంశాలపై జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), రాకేష్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. హాట్ హాట్ గా సాగిన ఈ చర్చను చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

07:36 - September 6, 2017

ఒగ్గు కథ..తెలంగాణ ప్రత్యేకత. ఇది తెలంగాణ రాష్ట్రంలో కనిపించే విశిష్ట కళారూపం. ఐదారు మంది ప్రదర్శించే కళారూపం ఇది. ఇందులో ఒకరు ప్రధాన కథకుడిగా ఉంటారు. కథ..గానం..నృత్యం..నాటకాల మిశ్రమమే..ఒగ్గు కథ...ఒగ్గు కళాకారులకు శ్రావ్యమైన కంఠస్వరం ఉంటుంది. ఒగ్గు..డోలు..తాళం..కంజీరా అనే వాయిద్యాలతో ఒగ్గు కథను ప్రదర్శిస్తుంటారు. గొంతుతోనే అభినయించడం..ఈ కళాకారుల విశిష్ట లక్షణాలు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినా కూడా ఒగ్గు కళాకారుల జీవితాల్లో పెద్దగా మార్పులు రాలేదు. వాయిద్య పరికరాలు కొనుక్కోలేని దీనస్థితిలో చాలా మంది ఉండడం బాధాకరం. తెలంగాణ ఒగ్గు కళలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటీ ? ఒగ్గు కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు...ప్రభుత్వాన్ని నుండి ఆశిస్తున్నది ఏమిటీ ? తదితర అంశాలపై తెలంగాణ ఒగ్గు కళాకారుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

అంగన్ శాన్ సూచీతో భేటీ కానున్న మోడీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మయన్మార్ కు చేరుకున్నారు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నేత అంగ్ శాన్ సూచీతో మోడీ భేటీ కానున్నారు. 

నేడు తిరుమలలో పున్నమి గరుడ సేవ..

చిత్తూరు : నేడు తిరుమలలో పున్నమి గరుడ సేవ జరుగనుంది. రాత్రి 7 నుండి రాత్రి 9గంటల వరకు మాడవీధుల్లో గరుడ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు.

 

కశింకోటలో 'జలహారతి' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న బాబు..

విశాఖపట్టణం : కశింకోట (మం) నర్సాపురం బ్యారేజీ వద్ద నేడు జలహారతి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. 

విజయనగరంకు రానున్న బాబు..

విజయనగరం : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. చీపురుపల్లి దగ్గర తోటపల్లి జలాలకు హారతి కార్యక్రమంలో బాబు పాల్గొననున్నారు. 

06:42 - September 6, 2017

ఢిల్లీ : భారత సైనిక దళాల కుటుంబాల పట్ల తనకున్న నిబద్ధత, మానవత్వాన్ని తరచు చాటుకుంటూ వస్తున్న భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి చలించిపోయారు. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ రషీద్ కుమార్తె జోహ్రాను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తన తండ్రి మరణవార్త తెలిసి జోహ్రా కంటికిమింటికి ఏకధాటిగా ఏడుస్తున్న ఓ ఫోటో చూసి గౌతమ్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. జోర్హా చదువుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని ప్రకటించారు. 'జోహ్రా, నీ కన్నీళ్లు ఆపలేకపోవచ్చు కానీ నీ కలలు పండించేందుకు నేను వెన్నంటే ఉంటాను. నిన్ను జీవితాంతం చదివించే బాధ్యత నేను తీసుకుంటాను' అంటూ గంభీర్ ట్విటర్‌లో తన సందేశాన్నిచ్చారు. 

06:39 - September 6, 2017

ఢిల్లీ : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అవార్డులను అందజేశారు. ఉపరాష్ట్రపతి గా ఉపాధ్యాయు దినోత్సవంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఉపరాష్ట్రపతి చేతులమీదుగా అవార్డులను అందుకోవడం చాలా ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు అన్నారు. అవార్డులు అందుకోవడంతో మరింత భాద్యత పెరిగిందని కార్పోరేట్‌ విద్యాలయాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ఉపాధ్యాయులు తెలిపారు. అవార్డులకు తెలంగాణ నుంచి ఆరుగురు, ఏపీ నుంచి తొమ్మిది మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారు.

06:37 - September 6, 2017

హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు భారత పౌరసత్వం లేదని కేంద్ర హోశాఖ స్పష్టం చేసింది. చెన్నమనేని ప్రస్తుతం జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారని క్లారిటీ ఇచ్చింది. జర్మనీలో గతంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన చెన్నమనేని రమేశ్‌.. 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో విచారణ జరిపిన కేంద్ర హోంశాఖ.. పౌరసత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే తన పౌరసత్వంపై మళ్లీ అప్పీల్‌ చేసే యోచనలో ఎమ్మెల్యే చెన్నమనేని ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా నడుస్తున్న ఈ కేసు ఇటీవల సుప్రీం కోర్టులో విచారణకు రాగా.. ఆరు నెలల్లో నిర్ణయం ప్రకటించాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలిచ్చింది. మరోసారి విచారణ జరిపిన కేంద్ర హోంశాఖ.. పౌరసత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే తన పౌరసత్వంపై మళ్లీ అప్పీల్‌ చేసే యోచనలో ఎమ్మెల్యే చెన్నమనేని ఉన్నట్లు తెలుస్తోంది.

2009 సాధారణ ఎన్నికల్లో చెన్నమనేని రమేష్‌.. వేములవాడ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే.. రమేష్ అంతకుముందే జర్మనీలో స్థిరపడి, అక్కడి పౌరసత్వం పొందారు. అక్కడి నుంచి స్వదేశానికి వచ్చిన కొద్ది రోజులకే ఇక్కడి పౌరసత్వ ధ్రువీకరణ పొందారు. అనంతరం వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో రమేష్ చేతిలో ఓటమిపాలైన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్..చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. హోంశాఖ విచారణ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్ ఎన్నికను రద్దు చేయాలంటూ 2010లో ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని, ఆయన భారతీయపౌరుడు కాదని తేల్చిచెప్పింది. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును రమేశ్‌ ఆశ్రయించారు. 2014లో చెన్నమనని రమేష్‌ టీఆర్‌ఎస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల ఈ కేసు మళ్లీ సుప్రీంకోర్టులో విచారణకు రాగా.. నిర్ణయాన్ని హోంశాఖ తీసుకోవాలని కోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై విచారణ జరిపిన హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేసింది.

ఏపీలో 'జలసిరికి హారతి'..

విజయవాడ : నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో 'జలసిరికి హారతి' అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. ఆయా ప్రాంతాల్లోగల జలవనరులు, ప్రాజెక్టుల వద్ద జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

06:33 - September 6, 2017

కర్నాటక : ప్రముఖ మహిళా జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి గౌరి లంకేశ్‌ బెంగళూరులో దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆమెను కిరాతకంగా కాల్చి చంపారు. అతి సమీపం నుంచి కాల్పులు జరుపడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. గౌరీ లంకేశ్‌ను మర్డర్‌ నిందితులను వదిలిపెట్టబోమని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దించామన్నారు. గౌరీ లంకేశ్‌ మర్డర్‌ను సీపీఎం తీవ్రంగా ఖండించింది. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. గౌరీ మృతికి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీసహా పలువురు సీఎంలు, నేతలు సంతాపం తెలిపారు.

ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, మత సామరస్య వేదిక నాయకురాలు గౌరీ లంకేశ్‌ దారుణ హత్యగావించబడ్డారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్‌లోని తన తన ఇంటి దగ్గర ఆమె నిల్చుని ఉంది. ఇదే సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు బైక్‌లపై వచ్చారు. తాగడానికి నీరు కావాలని అడిగారు. అంతలోనే ఆమెపై కాల్పులు జరిపారు. 5అడుగుల దూరం నుంచి దుండగులు మొత్తం ఏడురౌండ్ల కాల్పులు గౌరీలంకేశ్‌పై జరిపారు. ఆమె నుదురు, ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో ఆమె అక్కడికక్కడే కూలిపోయారు. రక్తపుమడుగులో ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు.
గౌరీ లంకేశ్‌ మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గౌరీ హత్యపై విచారణ చేపట్టారు. గౌరీ లంకేష్‌ మృతి తనను కలచివేసిందని... నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి అని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. గౌరీని హత్య చేసిన నిందితులను వదలబోమన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్టు బెంగళూరు కమిషనర్‌ తెలిపారు.

గౌరీ లంకేశ్‌ కొన్నాళ్లుగా రాజరాజేశ్వరినగర్‌లోని తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. లంకేష్‌పత్రికే అనే కన్నడ వీక్లీ టాబ్లాయిడ్‌ ఆమె నడుపుతున్నారు. స్వతంత్రంగా, నిర్భయంగా వ్యాసాల ద్వారా తన అభిప్రాయాలను ఆమె వెలిబుచ్చేవారు. ఆమె సైద్ధాంతిక సిద్ధాంతంతో విభేదించే వ్యక్తులే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తూటాలకు బలైన నరేంద్ర దబోల్కర్‌, ధార్వాడలో సాహితీవేత్త ఎం.ఎం. కలబురగి హత్యల తరహాలోనే గౌరీ లంకేశ్‌ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె ముందే వూహించారు. ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులతో కూడా చెప్పారు. ఇంతలోనే ఆమె హత్యకు గురికావడం అంతటా విషాదాన్ని నింపింది.
 

గౌరీ లంకేశ్‌ హత్యను సీపీఎం తీవ్రంగా ఖండించింది. హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని..ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. గౌరీ హత్యకు గురికావడం తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గౌరీని హత్యచేసిన నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. గుర్తు తెలియని దుండగుల తుపాకీ తూటాలకు బలైన అభ్యుదయవాది గౌరీ లంకేశ్‌ శివమొగ్గలో జన్మించారు. తల్లి ఇందిర, తండ్రి లంకేష్‌. వీరికి మొదటి సంతానమే గౌరీ లంకేశ్‌. ఆమె తండ్రి లంకేష్‌ పేరిటే ఒక వారపత్రికను నడిపేవారు. సోదరి కవితా లంకేశ్‌, తమ్ముడు ఇంద్రజిత్‌ ఇద్దరూ దర్శకులే. గౌరీ విద్యాభ్యాసం అంతా బెంగళూరులోనే కొనసాగింది. సెంట్రల్‌ కళాశాలలో బీఏ పూర్తి చేసిన తరువాత దిల్లీలోని జేఎన్‌యులో మాస్‌ కమ్యూనికేషన్స్‌లో పట్టా అందుకున్నారు. దిల్లీతోపాటు, ఫ్రాన్స్‌, అమెరికాల్లో కొన్ని పత్రికల్లో సేవల్ని అందించిన తరువాత బెంగళూరుకు తిరిగి వచ్చారు. ఎటువంటి ప్రకటనలూ లేకుండా లంకేష్‌ అనే పత్రికను నడిపిన తండ్రి అడుగుజాడల్లోనే ఆమె పయనించారు. తన తండ్రి మృతి తర్వాత నిర్భయంగా, తాను నమ్మిన విశ్వాసాలకు అద్దం పట్టేలా గౌరీ లంకేష్‌ పత్రికను కొనసాగించారు.

మత సామరస్య వేదిక ప్రతినిధిగా దత్తపీఠం, బాబా బుడాన్‌గిరి, తీర ప్రాంత జిల్లాల్లో మత సామరస్యం కోసం వేర్వేరు కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థుల కోసం గైడ్‌ పేరిట మాస పత్రికను ఆమె ప్రచురిస్తూ వస్తున్నారు. పాకిస్థాన్‌ దివంగత నాయకురాలు బెనజీర్‌ భుట్టో జీవన చరిత్రపై ఒక పుస్తకాన్ని రాశారు. రాష్ట్ర పత్రికా అకాడమీ, ప్రెస్‌ క్లబ్‌, సందేశ్‌ పాత్రికేయ పురస్కారాలను ఆమె అందుకున్నారు. ఆదివాసీలు, గిరిజనుల హక్కుల కోసం ఆమె క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్నారు. 2016 నవంబరులో భాజపా నేతలు వేసిన పరువు నష్టం కేసులో ఆమెకు 6 నెలల జైలు శిక్ష పడింది. 

06:29 - September 6, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జన ఉత్సవం వైభవంగా జరిగింది. అంగరంగ వైభవంగా వినాయక శోభయాత్ర కొనసాగింది. ఢిల్లీ, పూణె, ముంబై, తదితర నగరాల్లో గణేష్ నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. 11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న... గణనాథులు గంగమ్మ తల్లి ఒడికి చేరుకున్నారు. జయజయద్వానాలతో భక్తులు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. డవాడలా వెలిసిన విఘ్నపతుల్ని భక్తులు మేళతాళాలతో ఉత్సాహంగా సాగనంపారు. జయజయ ధ్వానాల మధ్య విఘ్నేశ్వరులు నిమజ్జనానికి కదిలారు. కిలోమీటర్ల పొడవునా.. విగ్రహాలు క్యూ కట్టాయి. భక్తుల కోలాహలంతో ప్రధాన నగర పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. గణపతి బప్పా మోరియా అంటూ... చిన్నా పెద్దా నినదించారు. శోభాయాత్రకు భారీగా భక్తులు తరలివచ్చారు.

దేశ రాజధాని ఢిల్లీలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. డప్పులు..నృత్యాలు కేరింతలతో హస్తిన రోడ్లు హోరెత్తాయి. యుమునా నదీ తీరానికి భారీ సంఖ్యలో చేరుకున్న భక్తులు.. మేళతాళాలతో గణనాథుడిని సాగనంపారు. గణేష్ ఉత్సవాలకు ప్రఖ్యాతిగాంచిన వాణిజ్య రాజధాని ముంబైలో.. నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. చేతిలో పట్టే బొజ్జ గణపయ్య నుండి భారీ గణనాథుల వరకూ వివిధ రూపాల్లో ఉన్న వినాయకుడిని.. వాహనాల్లో నిమజ్జనానికి తరలించారు. లక్షలాది మంది భక్తుల కోలాహలంతో రోడ్లన్నీ నిండిపోయాయి. డప్పులు.. నృత్యాల మోతతో ముంబై రోడ్లు మారుమోగాయి. 119 చోట్ల ఏర్పాటు చేసిన గణేశ నిమజ్జన ఘాట్లలో దాదాపు 40 వేల గణేశ విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేశారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముంబై పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.

అటు పుణేలో కూడా గణేష్ నిమజ్జనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పల్లకిలో ఊరేగించి అనంతరం హారతులు ఇచ్చి గణపయ్యను గంగఒడికి సాగనంపారు. పూణెలో గణేశ నిమజ్జన కార్యక్రమం సందడిగా సాగింది. రోడ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. డప్పుల హోరుతో .. భక్తుల నృత్యాలతో పూణె మారుమోగింది. ఈ ఏడాది 4 వేల 5వందల మండపాల్లో గణేశ విగ్రహాలు ఏర్పాటు చేశారు. 8వేల మంది పోలీసులు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. జయజయద్వానాలతో భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలికారు. 

06:27 - September 6, 2017

హైదరాబాద్ : ఎంతో ప్రతిష్టాత్మకమైన బాలాపూర్‌ లడ్డూ.. ఈసారి 15 లక్షల 60 వేలు పలికింది. గతేడాది కంటే ఈసారి అధికంగా 95 వేలు పెరిగింది. చివరి వరకు ఎంతో పోటాపోటీగా సాగిన ఈ వేలం పాటలో... వనపర్తికి చెందిన నాగం తిరుపతిరెడ్డి బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నాడు. హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి... ఏటేటా భక్తుల్లో ఆసక్తిని రేకెత్తించే గణనాథుడు బాలాపూర్‌ గణేశుడు. ప్రతి ఏటా బాలాపూర్‌ లడ్డూ వేలం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే ఈ లడ్డూను దక్కించుకునేందుకు అందరూ ఆసక్తి కనబరుస్తుంటారు. ఈసారి లడ్డూ వేలం పాటలో 22 మంది పాల్గొన్నారు. ఈ వేలం పాటను తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు.

లడ్డూ వేలం పాట చివరి వరకు ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. ఈసారి నాగం తిరుపతిరెడ్డి అనే వ్యక్తి 15 లక్షల 60 వేల రూపాయలకు బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నాడు. గతేడాది కంటే ఈసారి బాలాపూర్‌ లడ్డూ 95 వేలు అధికంగా పలికింది. ఈ వేలంపాట నాగం తిరుపతిరెడ్డి, నాగార్జున మహేందర్‌రెడ్డి మధ్య కొనసాగింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన లడ్డూను దక్కించుకున్న నాగం తిరుపతిరెడ్డి ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ ఉంటుండగా.. ఆయన వనపర్తి జిల్లా గోపాలపేట మండలం నాగపూర్‌కు చెందినవాడు. వేలంపాటలో లడ్డూ దక్కించుకున్న తిరుపతిరెడ్డిని గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు సత్కరించారు.

బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు నాగం తిరుపతిరెడ్డి. లడ్డూ వేలం పాటకు సహకరించిన ప్రతి ఒక్కరికి తిరుపతిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బాలాపూర్‌ లడ్డూ దక్కించుకుంటే సిరిసంపదలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. దీంతో ప్రతి యేడాది ఈ లడ్డూ వేలానికి క్రేజ్‌ పెరిగింది. ప్రతి ఏడాది వినాయక నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరి చూపు బాలాపూర్‌ లడ్డూ వేలంపైనే ఉంటుంది. ఇందుకోసం స్థానికులతో పాటు... ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. అంతేకాకుండా... ఎన్‌ఆర్‌ఐలు కూడా ఈ వేలంలో పాల్గొంటారు. 23 ఏళ్లుగా లడ్డూ కొనసాగుతున్న లడ్డూ వేలం పాటలో... లంబోదరుడి చేతిలో ఉన్న లడ్డూను తాకితే చాలు సకల శుభాలు కలుగుతాయని పలువురు భావిస్తుంటారు. 1994లో ప్రారంభమైన ఈ వేలం ఇప్పటివరకు నిరాటంకంగా కొనసాగుతోంది. 94లో 450 రూపాయలు పలికిన లడ్డూ... ఇప్పుడు 15 లక్షల 60 వేలకు చేరింది.

ఇక వేలం పాట ద్వారా వచ్చిన డబ్బును గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తుంటారు. ఇప్పటివరకు వివిధ అభివృద్ధి పనులకు 39 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. ఇక ఈ వేలంపాటలో కులమతాలకు అతీతంగా.. రాజకీయ విభేదాలు వీడి వేలంపాటలో పాల్గొంటామని గ్రామస్తులంటున్నారు. గ్రామ శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండడంతో బాలాపూర్‌ గణేశుడి వేలంపాట... ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. 

06:25 - September 6, 2017

హైదరాబాద్ : భాగ్యనగరంలో పటిష్ట బందోబస్తు మధ్య వినాయక నిమజ్జనం కొనసాగింది. హైదరాబాద్‌ మొత్తం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నగరమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఇక హోంమంత్రి, డీజీపీ ఏరియల్‌ సర్వే నిర్వహించి నిమజ్జనోత్సవాన్ని పర్యవేక్షించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. నగరవ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. దాదాపు 30వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలు, హోంగార్డులు, శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

హైదరాబాద్‌ నగరంలో భద్రత కోసం వేల సంఖ్యలో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిమజ్జన కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు.. డేటా ఎనాలిటిక్స్‌ సైతం ఏర్పాటు చేశారు. పోలీస్‌ ఠాణాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. రౌడీషీటర్స్‌పై నిఘా పెంచారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించారు. రౌడీషీటర్స్‌ను బైండోవర్‌ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీని పెంచారు. నిమజ్జనానికి పెద్ద టీమ్‌వర్కే నిర్వహించారు. ఆకతాయిల కోసం షీటీమ్స్‌ను రంగంలోకి దించారు. సీసీఎస్‌, ఎస్‌వోటీ పోలీసులు మఫ్టీలో విధులు నిర్వహించారు. గణేష్‌ నిమజ్జనంపై హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి,సీపీ మహేందర్‌రెడ్డితో కలిసి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. పరిస్థితిని సమీక్షించారు.

చార్మినార్‌, ట్యాంక్‌బండ్‌లో నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారు. గణేష్‌ నిమజ్జనానికి పోలీసులు బాగా కష్టపడ్డారని హోంమంత్రి అన్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించారని చెప్పారు. నిమజ్జనానికి పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారని తెలిపారు. పాతబస్తీలో శోభాయాత్ర సందర్భంగా డీజీపీ అనురాగ్‌శర్మ పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనూ పటిష్ట నిఘామధ్య వినాయక నిమజ్జనం కొనసాగింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పోలీసులు సమీక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తానికి గణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

06:23 - September 6, 2017

మయన్మార్ లో ప్రధాని మోడీ..

న్యాపెట : చైనా పర్యటనను ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం మయన్మార్ కు చేరుకున్నారు. దేశ రాజధాని న్యాపిటాలో అడుగు పెట్టిన మోడీకి ఆ దేశాధ్యక్షుడు తిన్ చావ్ స్వాగతం పలికారు. 

నీట్ సూపర్ స్పెషాల్టీ కోర్సుల్లో నేడు..రేపు కౌన్సెలింగ్..

హైదరాబాద్ : జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ సూపర్ స్పెషాల్టీ కోర్సుల్లో ప్రవేశానికి రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేశారు. 2017-18 విద్యా సంవత్సరం జాతీయ సూపర్ స్పెషాల్టీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి కొత్తగా నమోదు చేసుకొనే వారు బుధ..గురువారాల్లో ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

ప్రొ.కబడ్డీ నేటి మ్యాచ్ లు..

హైదరాబాద్ : ప్రొ.కబడ్డీ నేటి మ్యాచ్ లు : రాత్రి 8గంటలకు ఢిల్లీ జట్టుతో బెంగళూరు జట్టు మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 9గంటలకు బెంగాల్ తో ముంబై జట్టు తలపడనుంది. 

ఆర్ఎంపీ వైద్యుడు నిర్వాకం..

కృష్ణా : పెనుగంచిప్రోలు (మం) సుబ్బాయగూడెంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకం వల్ల పదో తరగతి విద్యార్థి మహేష్ మృతి చెందాడు. అతని సోదరుడు మహేంద్ర (7) పరిస్థితి విషమంగా ఉంది. పెనుగంచి ప్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఆర్ఎంపీ వైద్యుడు నిర్వాకం..

కృష్ణా : పెనుగంచిప్రోలు (మం) సుబ్బాయగూడెంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకం వల్ల పదో తరగతి విద్యార్థి మహేష్ మృతి చెందాడు. అతని సోదరుడు మహేంద్ర (7) పరిస్థితి విషమంగా ఉంది. పెనుగంచి ప్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. 

తెగిన క్రేన్ డబ్బా..డీఎస్పీ..జర్నలిస్టులకు గాయాలు..

మహబూబాబాద్ : వినాయక నిమజ్జనంలో క్రేన్ డబ్బా తెగి పడింది. డీఎస్పీ, ముగ్గురు ఫొటో జర్నలిస్టులకు గాయాలయ్యాయి.

 

కొనసాగుతున్న గణేష్ నిమజ్జనోత్సవం..

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనోత్సవం ఇంకా కొనసాగుతోంది. బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తయ్యింది. మధ్యాహ్నానానికే ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేసిన సంగతి తెలిసిందే. 

Don't Miss