Activities calendar

07 September 2017

22:30 - September 7, 2017
22:28 - September 7, 2017
22:27 - September 7, 2017

జర్నలిస్టు హత్యను ఖండించిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : బెంగళూరులో జర్నలిస్టు హత్యను జన సేనాని, హీరో పవన్  కళ్యాణ్ ఖండించారు. ఒక జర్నలిస్టును చంపి వాస్తవాలను దాయగలం అనుకోవడం మూర్ఖత్వమన్నారు. చర్చించడానికి విషయం లేనప్పుడే భౌతికదాడులు, హత్యలకు తెగబడతారని పేర్కొన్నారు. కలం గొంతు నొక్కాలనుకుంటే మూల్యం చెల్లించక తప్పదన్నారు. నిజాన్ని తుపాకీతో నిర్మూలించామనుకునే వారు ఉనికి కోల్పోక తప్పదని చెప్పారు. 

22:13 - September 7, 2017

గోవా : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌కు గోవా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తరుణ్‌పై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. 2013 నవంబర్‌లో గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్‌లో తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ మహిళా జర్నలిస్టు ఆరోపణలు చేశారు. హోటల్‌లోని ఓ లిఫ్టులోకి లాగి తేజ్‌పాల్ తనను వేధించారంటూ బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి ఫిర్యాదు చేశారు. తేజ్‌పాల్‌పై ఐపిసి 341, 342, 376 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు ఫైనల్‌ ఛార్జ్‌షీటులో 376 సెక్షన్‌ తొలగించారని తేజ్‌పాల్‌ తరపు న్యాయవాది ప్రమోద్‌ దూబె అన్నారు. అదనంగా 354-బి సెక్షన్‌ పొందుపరచినట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ తవోరా తెలిపారు.  

 

22:11 - September 7, 2017

ఢిల్లీ : మోదీప్రభుత్వ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని సీపీఎం పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. ఢిల్లీలో రెండు జోజులగా జరుగుతున్న సమావేశాల్లో పలువురు సీపీఎం నేతలు పాల్గొన్నారు. దేశంలో మత అసహనం పెరిగిపోవడంపై పొలిట్‌బ్యూరో ఆందోళన వెలిబుచ్చింది. మోదీ అధికారంలోకి వచ్చాక.. దేశంలో దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.

22:07 - September 7, 2017

ఢిల్లీ : పాత్రికేయురాలు గౌరిలంకేశ్‌ హత్యను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. ఈ హత్యవెనుక ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ అజెండా ఉందన్నారు.  దబోల్కర్‌, గోవింద పన్సారే, కల్బుర్గి,  ఇపుడు గౌరీ లంకేశ్‌ల హత్యలతో .. తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని భౌతికంగా అడ్డు తొలగించుకుంటున్నారని ఏచూరి ఆరోపించారు.  దేశంలో లౌకిక వాతావరణానికి  హిందూత్వ శక్తులు గొడ్డలిపెట్టుగా మారాయన్నారు. ప్రజలు ,సమాజం ఇలాంటి హత్యలను ఖండించాలన్నారు.  

 

22:04 - September 7, 2017

ఢిల్లీ : చెన్నమనేని రమేష్‌ తప్పుడు పత్రాలతో భారతదేశ పౌరసత్వం పొందడం సిగ్గుచేటని బిజెపి నేత ఆది శ్రీనివాస్ విమర్శించారు. చట్టాన్ని మోసగిస్తూ ఆయన చట్టసభలో అడుగుపెట్టారని ఆరోపించారు. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ముఖేష్ మిట్టల్ ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చెన్నమనేని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

22:00 - September 7, 2017

మహారాష్ట్ర : 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో టాడా కోర్టు శిక్షను ఖరారు చేసింది. అండర్‌ వరల్డ్‌ డాన్‌ అబూసలేంకు జీవిత ఖైదు విధించింది. ఆయుధాలు సప్లయ్‌ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీముల్లాఖాన్‌కు జీవిత ఖైదుతో పాటు 2 లక్షల జరిమానా విధించింది. అబూ అనుచరులు మహ్మద్‌ తాహిర్‌ మర్చంట్, ఫిరోజ్‌ అబ్దుల్‌ రషీద్‌ ఖాన్‌లకు ఉరిశిక్ష శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

1993 నాటి ముంబయి వరుస పేలుళ్ల కేసులో ముంబయిలోని ప్రత్యేక టాడా కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది. అబూసలేంకు జీవిత ఖైదు, మరో కీలక నిందితుడు కరీముల్లాఖాన్‌కు జీవిత ఖైదుతో పాటు 2 లక్షల జరిమానా విధించింది. అబూ అనుచరుడు మహ్మద్‌ తాహిర్‌ మర్చంట్, ఫిరోజ్‌ అబ్దుల్‌ రషీద్‌ ఖాన్‌లకు ఉరిశిక్ష  విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రియాజ్‌ సిద్ధిఖీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

1993 మార్చి 12న ముంబైలో వరుస పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు రెండు గంటల వ్యవధిలో 12 చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు పేలుళ్లకు అత్యంత శక్తిమంతమైన ఆర్డీఎక్స్‌ను వినియోగించారు. 

వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మృతి చెందగా... 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్లలో కనీసం 27 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. పేలుళ్ల తర్వాత అబూసలేం పోర్చుగల్‌ పారిపోయాడు. 2005లో అబూసలేంను పోర్చుల్‌ పోలీసులు అరెస్టుచేసి, నేరస్థుల మార్పిడి ఒప్పిందం కింద మన దేశానికి అప్పంచారు. అబూసలేంను మన దేశానికి అప్పగించే ముందు ఇతగాడికి మరణశిక్ష విధించవద్దని పోర్చుగల్‌  షరతు పెట్టింది

ఈ కేసును సిబిఐ విచారణ చేపట్టింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా దావూద్‌ ఇబ్రహీం, టైగర్‌ మెమెన్, మహ్మద్‌ దోసా, ముస్తఫా దోసా తదితరులు కుట్ర పన్ని ఈ దాడికి పాల్పడినట్లు సిబిఐ విచారణలో తేల్చింది. 2007లో తొలివిడత కేసు విచారణ ముగిసింది. 100 మందిని దోషులుగా తేల్చగా... యాకుబ్‌ మెమెన్‌తో పాటు సంజయ్‌దత్‌ కూడా ఉన్నారు. యాకూబ్‌ మెమెన్‌ను 2013లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. 2015లో ఈ శిక్షను అమలు చేశారు.

ఈ కేసుకు సంబంధించి రెండో విడత విచారణ చేపట్టిన ప్రత్యేక టాడా కోర్టు 2017, జూన్‌ 16న తీర్పు వెలువరించింది...అబూసలేంతో పాటు ముస్తఫా దోసా, కరీముల్లాఖాన్‌, ఫిరోజ్‌ అబ్దుల్‌ రషీద్‌ఖాన్‌, రియాజ్‌ సిద్దిఖీ, తాహిర్‌ మర్చంట్‌లను దోషులుగా తేల్చింది. వీరిలో ముస్తఫా దోసా గుండెపోటుతో మరణించాడు. ఆధారాల్లేనందున మరో నిందితుడు అబ్దుల్‌ ఖయ్యూమ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. 

ముస్తఫా దోసా పేలుళ్లకు ప్రణాళికల కోసం సమావేశాలు నిర్వహించేవాడు. అబూ సలేం ఉగ్ర దాడుల కోసం ఎకె-56, గ్రెనేడ్లను భరూచ్‌ నుంచి ముంబైకి చేరవేయడంలో కీలక పాత్ర వహించాడు. ఫిరోజ్‌ అబ్దుల్‌ రషీద్‌ ఖాన్‌ ఆయుధాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడంలో మద్దతిచ్చాడు. రియాజ్‌ సిద్ధిఖి గుజరాత్‌ నుంచి ఆయుధాలను ముంబైకి తీసుకురావడానికి అబుసలేంకు సహకరించాడు. కరీముల్లాఖాన్‌ దోసా మద్దతుతో ఆయుధాలను టార్గెట్‌ చేసిన ప్రాంతానికి చేరవేశాడు. మహ్మద్‌ తాహిర్‌ మర్చంట్‌ ఆయుధ శిక్షణ కోసం అత‌ను భార‌తీయ యువ‌త‌ను పాకిస్థాన్‌కు పంపించాడు. ఈ కుట్రలకు పాల్పడినందునే టాడా కోర్టు వీరికి శిక్షలు విధించింది.

నేరెళ్ల బాధితులపై మరోసారి పోలీసుల దాష్టీకం

హైదరాబాద్ : నేరెళ్ల బాధితులపై మరోసారి పోలీసుల దాష్టీకం ప్రదర్శించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆస్పత్రి నుంచి పోలీసులు గెంటేశారు. ప్రభుత్వ ఒత్తిడి ఉందని... అందుకే తాము చికిత్స చేయలేమని... ఆర్ ఎంవో అన్నట్లు సమాచారం... అయితే తాము ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లేదిలేదని బాధితులు తేల్చిచెప్పారు.. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు... బాధితులను బెడ్‌పై నుంచి బయటకు లాక్కొచ్చారు.. పోలీసుల తీరుతో ఆగ్రహించిన బాధితులు.. ఎమర్జన్సీ వార్డు ముందు కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు.

21:56 - September 7, 2017

హైదరాబాద్ : నేరెళ్ల బాధితులపై మరోసారి పోలీసుల దాష్టీకం ప్రదర్శించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆస్పత్రి నుంచి పోలీసులు గెంటేశారు. ప్రభుత్వ ఒత్తిడి ఉందని... అందుకే తాము చికిత్స చేయలేమని... ఆర్ ఎంవో అన్నట్లు సమాచారం... అయితే తాము ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లేదిలేదని బాధితులు తేల్చిచెప్పారు.. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు... బాధితులను బెడ్‌పై నుంచి బయటకు లాక్కొచ్చారు.. పోలీసుల తీరుతో ఆగ్రహించిన బాధితులు.. ఎమర్జన్సీ వార్డు ముందు కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు...  

 

21:52 - September 7, 2017

తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. 'రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, భూ సర్వే, కమిటీలు, జీవో నెం.39 వంటి అంశాలపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీ.రైతు సంఘం నాయకులు హరిబండి ప్రసాద్, ఆరిబండ ప్రసాద్ రావు, కన్నెగంటి రవి, టీఆర్ ఎస్ నేత రాకేశ్, టీకాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఈటల సవాల్ ను స్వీకరించిన తమ్మినేని

హైదరాబాద్ : మంత్రి ఈటల రాజేందర్ కు సీపీఎం రాష్ట్ర కమిటీ లేఖ రాసింది. దళిత సంక్షేమంపై ప్రతిపక్ష పార్టీలతో బహిరంగ చర్చకు సిద్ధమన్న ఈటల సవాల్ ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వీకరించారు. వేదిక, తేదీని నిర్ణయించాలని తమ్మినేని లేఖ రాశారు. గతంలోనూ సవాల్ విసిరి వెనక్కి తగ్గారని తమ్మినేని పేర్కొన్నారు. ఈసారి తప్పకుండా బహిరంగ చర్చకు రావాలన్నారు. 

21:38 - September 7, 2017

దేశంలో జర్నలిస్టులు ప్రమాదర పరిస్థితిలో ఉన్నారా? నిజాలను వెలికి తీసినా, ఓ అభిప్రాయాన్ని వ్యక్తీకరించినా ప్రాణాలకే ముప్పుగా మారుతోందా? వరుస హత్యలు ఏ హెచ్చరికలిస్తున్నాయి? కొందరి అసహనం అంతిమంగా పాత్రికేయుల ప్రాణాలకు ప్రమాదంగా మారుతోందా? వరుస దాడులు ఏ సంకేతాలిస్తున్నాయి? గౌరీ లంకేశ్ వరకు జరిగిన అనేక ఘాతుకాలు ఏం చెప్తున్నాయి? ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలాంటి మీడియా ఇప్పుడు పెను ప్రమాదంలో ఉందా? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. 
జర్నలిస్టుల రక్తంతో తడిసిపోతున్న భారత్
జర్నలిస్టుల రక్తంతో భారత దేశం తడిసిపోతోంది. నిర్భీతిగా నిజాల్ని వెల్లడించే జర్నలిస్టులను ను అదుపులో పెట్టడానికి కొన్ని శక్తులు ఉవ్విళ్లూరుతున్నాయి.  మీడియా స్వేచ్ఛను అణగదొక్కాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వెంటాడి, వేటాడి, మాటువేసి పకడ్బందీగా అడ్డు తొలగించుకుంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:35 - September 7, 2017

నవంబర్ సంది మెట్రో రైలు కూతలు, మంత్రి అఖిల ప్రియ తెల్వికి పరీక్ష, అర్చకులకు శెఠగోపం బెట్టిన సర్కార్, మింగ మెత్కులేదు మీసాలకు నూనే, రూపాయికే నల్ల.. డిపాజిట్ ఇర్వైఐదువేలు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

21:13 - September 7, 2017
21:09 - September 7, 2017
21:07 - September 7, 2017
20:54 - September 7, 2017

గుంటూరు : జిల్లాలో తెలంగాణ ఉద్యోగులు హల్‌చల్ చేశారు. తాగిన మత్తులో ఎస్‌ఐపై దాడి చేశారు. నగరపాలెం పోలీసులు నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. నిన్న వ్యవసాయశాఖ ఉద్యోగుల సంఘం ఎన్నికల కోసం.. తెలంగాణ ఉద్యోగులు గుంటూరు వచ్చారు. మద్యం మత్తులో తిరిగి వెళ్తూ.. ఆర్టీసీ బస్సులో డ్రైవర్‌పై చిందులేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్‌ఐ అమీర్‌పై దాడికి దిగారు. దీంతో నలుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

20:49 - September 7, 2017

తూ.గో : జిల్లాలోని గోకవరం సమీపంలో బురదచెరువులో నలుగురు గల్లంతయ్యారు. చేపల వేట కోసం వెళ్లి యువకులు వరదలో చిక్కుకున్నారు. ఓ చెట్టును పట్టుకుని సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. దీన్ని గమనించిన స్థానికులు ముగ్గురిని కాపాడారు. మరో వ్యక్తి చెట్టుపై ఉండి.. సాయం కోసం ఎదురుచూశాడు. విషయం తెలుసుకుని పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని.. మరో యువకుడిని కాపాడారు. 

 

20:35 - September 7, 2017

విశాఖ : ఆసియా స్థాయిలో విశాఖ అపోలో ఆస్పత్రి మరో ఘనత సాధించింది... బెస్ట్ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కింద వివిధ కేటగిరీల్లో పలు అవార్డులను సొంతం చేసుకుంది.. కస్టమర్‌ సర్వీస్‌, క్లినికల్‌ సర్వీసుల్లో మెరుగుదల... హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్స్‌లో ఇన్నోవేషన్‌ ప్రాజెక్టులకు ఈ పురస్కారాలు దక్కాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులను అపోలో సొంతం చేసుకోవడంపట్ల సంస్థ సీఈవో సందీప్‌ సంతోషం వ్యక్తం చేశారు.

 

20:28 - September 7, 2017

విశాఖ : అత్యవసర క్రిటికల్‌  కేర్‌ కలిగిన నగరాల జాబితాలో విశాఖ చేరింది. ప్రపంచస్థాయి ట్రామా సేవల్ని అపోలో ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చింది. విశాఖ హెల్త్ సిటీలోని అపోలో ఆస్పత్రిలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు ప్రమాద బాధితుల కోసం ప్రత్యేక అంబులెన్స్ సేవల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.. గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌    లాంటి సమయాల్లో అంబులెన్స్ సేవల్ని వినియోగించుకోవచ్చని అపోలో సీఈవో సందీప్‌ తెలిపారు. 

పిడుగుపడి ఐదుగురికి గాయాలు

కడప : శివనాయక మండలం ఇటుకలపాడులో పిడుగుపాటుకు ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. 

 

20:17 - September 7, 2017

విజయవాడ : ప్రముఖ జర్నలిస్ట్‌, హేతువాది గౌరీ లంకేష్‌ హత్యను ఏపీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ తీవ్రంగా ఖండించింది. గౌరీ లంకేష్‌ హత్యను నిరసిస్తూ విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం నుండి జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై దాడులు జరగడంపై ప్రజాశక్తి సంఘాలు మండిపడ్డాయి. హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులు డిమాండ్‌ చేశారు. 

జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యను నిరసిస్తూ నిసనలు

ఢిల్లీ : జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 'నాట్ ఇన్ మై నేమ్' పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద 'భయం లేని గొంతుకలు మూగబోయాయి' పేరుతో నిరసన సభ నిర్వహించనున్నారు. గౌరీలంకేష్, కల్బుర్గి, పన్సారే, దబోల్కర్ హత్యలను జర్నలిస్టులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు, ప్రజా సంఘాల నేతలు ఖండించారు. దాడులతో ప్రశ్నించడాన్ని అణచలేరని వక్తలు అన్నారు. 

పెద్దపల్లి నగర పంచాయతీ ఛైర్మన్, కమిషనర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

పెద్దపల్లి : నగర పంచాయతీ ఛైర్మన్, కమిషనర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఇందిరానగర్ లో ముందస్తు సమాచారం ఇవ్వకుండా నగర పంచాయతీ సిబ్బంది మరుగుదొడ్డిని కూల్చివేసింది. న్యాయం కోసం బాధితుడు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో నగర పంచాయతీ ఛైర్మన్ రాజయ్య, కమిషనర్ శివయ్యపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 

 

19:49 - September 7, 2017
19:48 - September 7, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో కట్టుకున్న భర్తనే హత్య చేసింది భార్య... విషపూరిత ఇంజక్షన్‌ ఇచ్చి చంపేసింది. గతనెల 29న దేవరపల్లి మండలం నిర్మలగిరిలోగుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.... మృతుడు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన చేగొండి భీమశంకరంగా గుర్తించారు. ఆయనకు ఈ ఏడాది మేలో జయలక్ష్మితో వివాహమైంది. అతని భార్య ద్రాక్షారామంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. అదే ఆసుపత్రిలో పనిచేసే సహోద్యోగి వీరేష్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. భర్తను అడ్డు తొలగించుకునేందుకు జయలక్ష్మి ప్లాన్‌ వేసింది. చర్చికి వెళదామంటూ గత నెల 29న భర్తను గౌరీపట్నంలోని నిర్మలగిరికి తీసుకొచ్చింది. తనకు నీరసంగా ఉందని భీమశంకరం చెప్పడంతో..... ఇంజక్షన్‌ ఇస్తాను. తగ్గిపోతుందంటూ అతన్ని నమ్మించింది. కిటమిన్ అనే హైపవర్‌ డ్రగ్‌ను అతని శరీరంలోకి ఎక్కించింది. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న జయలక్ష్మి... తన ప్రియుడితో కలిసి అక్కడి నుంచి ఉడాయించింది. అయితే జయక్ష్మి అతని భర్త నిర్మలగిరిలో ఆటో దిగడం... చర్చి లోపలకి వెళ్లడం... జయక్ష్మి ఒక్కతే తిరిగి రావడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. పోలీసులు జయలక్ష్మిని, ఆమెకు సహకరించిన వీరేష్‌ను అరెస్టు చేశారు.

 

19:42 - September 7, 2017

కృష్ణా : పేదరికం లేని సమాజం కోసమే తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా చింతలపూడి ఎత్తిపోతల రెండోదశ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తిగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని.. ప్రభుత్వానికి ప్రజలంతా సహకారం అందించాలని చంద్రబాబు అన్నారు. 

https://youtu.be/JDu7RznhQ8s

 

19:37 - September 7, 2017

హైదరాబాద్ : పురానా హవేలీ చౌరస్తాలో ఉన్న స్నూకర్‌ పాయింట్‌ నిర్వాహకుడు షబ్బీర్ హుస్సేన్‌పై ప్రత్యర్థులు దాడి చేశారు. కత్తులతో, బేస్ బాల్ స్టిక్స్‌తో తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన షబ్బీర్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సౌత్ జోన్ పోలీసులు 24 గంటలు గడవక ముందే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి  సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

19:27 - September 7, 2017

హైదరాబాద్ : ఫ్లిప్‌కార్ట్‌ లో  కెమెరా బుక్‌ చేసిన ఓ వినియోగ దారుడికి పార్శిల్‌ రూపంలో షాక్‌ తగిలింది.. కెమెరాకు బదులు పార్శిల్‌లో రాయి, రెండు డమ్మీ కెమెరాలు దర్శనమిచ్చాయి.. కెమెరాకోసం దాదాపు 49వేలు ఆన్‌లైన్‌ల్‌లో   చెల్లించిన వినయ్‌...  రాయిని చూసి వెంటనే ఫ్లిప్‌ కార్ట్‌ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌   చేశాడు.. అయితే తాము కెమెరానే పంపామని.....  ఫ్లిప్‌కార్ట్‌ సిబ్బంది స్పష్టం చేశారు.. కొరియర్‌లో పొరపాటు జరిగి ఉంటుందని.....   ఇది వెరిఫై చేయడానికి నెల రోజుల సమయం పడుతుందని చెప్పారు..దీంతో బాధితుడు ఎల్‌ బీ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు..

 

మరో జర్నలిస్టుపై కాల్పులు

బీహార్ : మరో జర్నలిస్టుపై కాల్పులు జరిపారు. సహార జర్నలిస్టు పంకజ్ మిశ్రాపై కాల్పులు జరిపారు. ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి మిశ్రాపై కాల్పులు జరిపారు. పంకజ్ మిశ్రా పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులు జరిపిన ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. 

19:10 - September 7, 2017

వరంగల్ : ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం అంటే ఏమిటో స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాలను చూస్తే అర్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రి హోదా పొందారు. ఆయన రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరి అప్పట్లో ఎంపిగా వున్నారు. కానీ, కొద్ది నెలల్లోనే కథ తిరగబడింది. రాజయ్య పదవి పోయింది. కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. స్టేషన్ ఘన్ పూర్ లో తాటికొండ రాజయ్య పరిస్థితి ఏమిటి ? ఎమ్మెల్యేగా ఆయన గ్రాఫ్ ఎలా వుంది? ఇదే ఇవాళ్టి ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్. 

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం గతంలో వరంగల్ జిల్లాలో వుండేది. ఇప్పుడిది జనగామ జిల్లాలో అంతర్భాగమైంది. ఇదే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు ప్రతికూలాంశంగా మారే  అవకాశం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలోని జఫర్ గఢ్, స్టేషన్ ఘన్ పూర్; చిల్పూరు, మాల్కాపూర్ లను జనగామ జిల్లాలో కలపడం తో జనం కోపంగా వున్నారు. తమను వరంగల్ నుంచి వేరుచేయడం పై జఫర్ గడ్ మండల ప్రజలు రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే రాజయ్యపై జఫర్ గడ్ పర్యటనలో దాడులు కూడా జరగడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. 

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. అప్పట్లో ఇది జనరల్ నియోజకవర్గం. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో లింగాలఘనపురం రఘునాధపల్లి మండలాలు స్టేషన్ ఘన్ పూర్ లో చేరాయి. స్టేషన్ ఘన్ పూర్, ధర్మసాగర్, జాఫర్ గఢ్, లింగాల ఘనపురం, రఘునాధపల్లి మండలాలలోని 114 గ్రామాలు ఈ నియోజకవర్గంలో అంతర్భాగాలు. 

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 2,22,556 మంది ఓటర్లుండగా, 1,11,444 మంది మహిళా ఓటర్లు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య కాస్త ఎక్కువగా వున్న నియోజకవర్గమిది. 92819 కుటుంబాలున్న నియోజకవర్గమిది.

గతంలో కడియం శ్రీహరి, గుండె విజయరామారావు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహించారు. వీరిద్దరి చేతిలో రెండు సార్లు ఓడిపోయిన తాటికొండ రాజయ్య 2009, 2012, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించడం విశేషం. ఈ మూడు ఎన్నికల్లోనూ ఆయన మెజార్టీ పెరుగుతూ వచ్చింది. 2009 ఎన్నికల్లో కడియం శ్రీహరిపై 11,210 ఓట్ల మెజార్టీతో నెగ్గిన రాజయ్య 2014నాటికి మెజార్టీని 58వేలకు పెంచుకున్నారు. 

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం సమస్యల నిలయం. సాగు తాగు నీటి కష్టాలు షరామామూలు. దళిత కాలనీలు అధికం. విద్య, వైద్య సదుపాయాలకు దళితవాడలు చాలా దూరం. రోడ్ల పరిస్థితి మరీ ఘోరం. నియోజకవర్గ కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తి చేయడానికే పదేళ్లు పట్టింది. 
లెదర్ పార్క్ అతీగతీ లేకుండా పోయింది. ధర్మసాగర్ మండలం ముప్పారం దేవునూరు గ్రామాలలో అతిపెద్ద టెక్స్ టైల్ పార్క్ నిర్మిస్తామన్న వాగ్థానం అడ్రస్ లేకుండా పోయింది . ఎమ్మెల్యే రాజయ్య నిర్లక్ష్యం వల్లనే టెక్స్ టైల్ పార్కు రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయించడంలోనూ, అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంలోనూ విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. 

తాటికొండ రాజయ్యను అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆయన రేటింగ్ పడిపోయింది. ప్రభుత్వ సబ్సిడీ ట్రాక్టర్లు, సిడిఎఫ్ పనులు, అంగన్ వాడీ ఉద్యోగాలు, విద్యా వాలంటీర్ల నియామకాలు, మిషన్ కాకతీయ పనులు ఇలా అనేక వ్యవహారాల్లో నేరుగా సిఎం కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లడం ఆయనకు మైనస్ పాయింట్ గా పరిణమిస్తోంది. వరంగల్ వుండికూడా ప్రభుత్వ కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి.  మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తో పాటు దేవాదాల సొరంగం పనులు కూడా నత్తనడకనే సాగుతుండడంతో ఎమ్మెల్యే పనితీరుపై జనంలో అసంతృప్తి పెరుగుతోంది.

తన మీద ఎన్ని ఆరోపణలు, విమర్శలు వస్తున్నా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చాలా కూల్ గా కనిపిస్తున్నారు. రానున్న రెండేళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తానంటున్నారాయన. సిఎం కెసిఆర్ ఏదో ఒక రోజు పిలిచి, తనకు పదవి ఇస్తారన్న ఆశాభావంతో వున్నారు. మూడేళ్ల సమయం కరిగిపోయింది. ప్రజలను మెప్పించడానికి ఇక రెండేళ్లే సమయముంది

కట్టుకున్న భర్తను చంపిన భార్య

పశ్చిమగోదావరి : జిల్లాలోని దేవరపల్లి మండలం నిర్మలగిరిలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను భార్య హత్య చేసింది. గత నెల 29న ఈ ఘటన చోటుచేసుకుంది. 

18:36 - September 7, 2017

హైదరాబాద్ : ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ హత్యోదంతంపై నిరసనలు కొనసాగుతున్నాయి.... లంకేశ్‌ను హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వామపక్షాలు, ప్రజాసంఘాలు హైదరాబాద్‌లో నిరసన చేపట్టాయి. మతోన్మాదుల దిష్టిబొమ్మను దహనం చేశాయి. ఈ హత్య వెనక ఆర్ ఎస్ ఎస్ హస్తం ఉందని... ఆరోపించాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మంత్రి ఈటెల సవాల్ కు సంపత్ సై..

హైదరాబాద్ : తెలంగాణ దళిత సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధామా ? అని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లు టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాలనలో దళితులకు ఒరిగింది ఏమీ లేదన్నారు. 

16:46 - September 7, 2017

నిర్మల్ : జిల్లా కడెం మండలం పెర్కపల్లికి చెందిన సత్తవ్వ అనే మహిళా రైతు కరెంట్ షాక్‌తో చనిపోయింది. కలుపు తీసేందుకు పొలానికి వెళ్లిన సత్తవ్వకు ఫెన్సింగ్‌కి అమర్చిన కరెంట్లు వైర్లు తగిలి షాక్ తగలడంతో అక్కడికక్కడే మరణించింది. అడవి పందుల నుంచి పంటను రక్షించుకోవడం కోసం ఎటువంటి అనుమతులు లేకుండా నరేష్ అనే వ్యక్తి ఫెన్సింగ్‌కు విద్యుత్ వైర్లు అమర్చినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నరేష్‌ను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 

16:44 - September 7, 2017

రంగారెడ్డి : జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్ మండలం పసుమాల గ్రామ చెరువులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో చెరువులోని చేపలన్నీ మృత్యువాత పడ్డాయి. దీంతో కోటి రూపాయల మేర నష్టం వాటిల్లడంతో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. మూడేళ్లుగా చేతికందే సమయంలో చెరువులో చేపలు చనిపోతున్నాయని అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా వారు పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. 

 

 

16:42 - September 7, 2017

హైదరాబాద్ : జీఎస్టీ 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తూ నాచారంలోని పారిశ్రామిక వాడలో ఏపీ మరియు టీఎస్ ప్లాస్టిక్ ఫర్నిచర్ తయారీదారులు ఆమరణ దీక్ష చేపట్టారు. జీఎస్టీ భారంతో తాము కంపెనీలు నడపలేని స్థితికి చేరుకుంటున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. వీరి దీక్షకు టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్ మద్దతు పలికారు. సామాన్యులు వినియోగించే ప్లాస్లిక్ వస్తువులపై 28 శాతం జీఎస్టీ విధించడం వల్ల పెనుభారం పడుతుందని కోదండరామ్ అన్నారు. వారి న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోదండరామ్ కోరారు. 

16:40 - September 7, 2017

కృష్ణా : జిల్లా రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామంలో జరిగిన జలసిరికి హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. చింతలపూడి ఎత్తిపోతల రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు సీఎం హారతి ఇచ్చారు. పసుపు,కుంకుమ, పుష్పాలు చల్లి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎంపీ కేసీనేని నాని తోపాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం బాబు మాట్లాడారు. కృష్ణా, ప.గో.జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఓ పత్రిక పేజీల్లో వ్యతిరేకత తప్పించి..ఒక మంచి వార్త రాసే పరిస్థితి లేదన్నారు. ప్రజలను ఆనందంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కులాలు..మతాలు..ప్రాంతాలు..అందరం కలిపి 'జలసిరికి హారతి' పండుగలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. 

16:33 - September 7, 2017

సంగారెడ్డి : ఎంపీ బీబీ పాటిల్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని, బోర్గిలో రైతుల నుండి నేరుగా భూములు కొనుగోలు చేయలేదని పాటిల్ కన్ స్ట్రక్షన్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అధికారులు వెల్లడించారు. వీరు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ రసాభాస అయ్యింది. ప్రెస్ మీట్ లో బయటి వ్యక్తులు వచ్చి ఎలా ఫొటోలు..వీడియోలు తీస్తారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తాము ప్రెస్ మీట్ ను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ఆ భూములకు ఎంపీ బీబీ పాటిల్ కు సంబంధం లేదంటూ పాటిల్ కన్ స్ట్రక్షన్ కు చెందిన కొంతమంది పేర్కొన్నారు. భూములను రైతుల వద్ద కొనుగోలు చేయడం లేదని, శర్మ నుండి కొనుగోలు చేశామన్నారు. కానీ రైతులకు ఇంకా శర్మ డబ్బులివ్వలేదని..మీరు ఎలా కొనుగోలు చేస్తారని మీడియా ప్రశ్నకు వారు సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. 

సంక్షోభంలో రైతాంగం..

ఢిల్లీ : దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. కనీస మద్దతు ధర హామీని బీజేపీ తుంగలో తొక్కిందన్నారు. పండించిన పంటకు మూడు రెట్లు ధర ఇచ్చినప్పుడే రైతు ఆత్మహత్యలు నివారించగలమన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మతతత్వ దాడులకు వ్యతిరేకంగా 18న జాతీయ సదస్సు నిర్వహిస్తామన్నారు. మయన్మార్ శరణార్థుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. నీట్ వల్ల దళిత విద్యార్థిని ఆత్మహత్య బాధాకరమన్నారు. నీట్ పై తమ విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. మరోసారి రాష్ట్రాలతో చర్చించి నీట్ పై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 

16:21 - September 7, 2017

 

కర్నూలు : తమ కూతురు ప్రీతి మృతి కేసులో విచారణ సరిగ్గా జరగడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. తాజాగా ప్రీతి చిన్నాన్న రామచంద్ర నాయక్ కలెక్టరేట్ ఆఫీసులో ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ కేసును సరిగ్గా పట్టించుకోవడం లేదని, ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ రామచంద్ర నాయక్ మాత్రం వినిపించుకోలేదు. చివరకు విచారణ కమిటీ వేస్తామని హామీనిచ్చి తాడు సహాయంతో అతడిని కిందకు దించారు.

కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ హాస్టల్ ప్రీతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత నెల 19వ తేదీన ఈ ఘటన జరిగింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మృత దేహంతో కలెక్టరేట్‌ ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు. 

పెద్దపల్లిలో టీ మాస్ సభ..

పెద్దపల్లి : సింగరేణి వారసత్వ ఉద్యోగాలు కార్మికుల జన్మ హక్కు అని ప్రజా గాయకుడు గద్దర్ పేర్కొన్నారు. రద్దు చేయడం ఎవరితరం కాదన్నారు. తెలంగాణ వచ్చినా సామాజిక తెలంగాణ రాలేదని, సామాజిక తెలంగాణ సాధనే టీ మాస్ లక్ష్యమన్నారు. 

15:31 - September 7, 2017

వరంగల్ : తెలంగాణ అంటేనే నీళ్లు..నియామకాలు..నిధులు..చెప్పిన సర్కార్ తమ పట్ట నిర్లక్ష్యం చేస్తోందని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు పేర్కొంటున్నారు. వీరంతా ప్రస్తుతం రోడ్లెక్కారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినదిస్తున్నారు. పదేళ్లుగా పని చేస్తున్నా ఉద్యోగ భద్రత కల్పించరా అంటూ ప్రశ్నించారు. వీరంతా గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తాము ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, తమ డిమాండ్లు పరిష్కరించుకొనేంత వరకు పోరాటం చేస్తామని పేర్కొంటున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:26 - September 7, 2017

పశ్చిమగోదావరి : పోలరం నిర్వాసితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. జిల్లాలోని బుట్టాయిగూడెంలో ఆయన పర్యటించి నిర్వాసితులకు సంఘీభావం వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ...గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను తీసుకుంటే ఊరుకోమని, నిర్వాసితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని..అన్యాయం చేస్తే ఊరుకోమని మధు హెచ్చరించారు. నిర్వాసితుల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడిని నిలదీస్తామని పేర్కొన్నారు. 

15:21 - September 7, 2017

హైదరాబాద్ : నగరంలోని మెట్రో రైల్ మొదటి దశను నవంబర్ లో ప్రారంభించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. నవంబర్ 28 నుండి 30 వరకు నగరంలో జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రధాన మంత్రి మోడీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో మెట్రో రైల్ ను ప్రారంభించాలని లేఖలో కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాసిన లేఖను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. రూ. 15 వేల కోట్ల వ్యయంతో ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అని కేసీఆర్ అభివర్ణించారు. 

క్రికెటర్ మృతి..

కొలంబో : ఈత కొలనులో మునిగి భారత్ అండర్ -17 కు చెందిన క్రికెటర్ ఒకరు మృతి చెందారు. గుజరాత్ కు చెందిన 12 ఏళ్ల బాలుడు భారత్ తరపున అండర్ -17 క్రికెట్ ఆడేందుకు 19 మంది సభ్యులతో కలిసి శ్రీలంకకు ఇతను వెళ్లాడు. 

15:12 - September 7, 2017

ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, మత సామరస్య వేదిక నాయకురాలు గౌరీ లంకేశ్ ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. హత్య చేయడం పట్ల పలువురు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ ఘటనను ఖండించారు. 
జర్నలిజంలో ఈమె కొత్త వరవడి సృష్టించారు. ప్రముఖ జర్నలిస్టు, రచయిత, కవి పెద్ద కుమార్తె. ఎటువంటి ప్రకటనలు లేకుండా 'లంకేష్' పత్రికను ప్రచురించింది. విద్యార్థుల కోసం 'గైడ్' పేరిట మాస పత్రికను ప్రచురించారు. మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలిసేందుకు కృషి చేశారు. ఆదివాసీలు, గిరిజనుల హక్కుల కోసం పోరాడారు. మత సౌమరస్యం కోసం..అహర్నిశలు..కృషి చేసిన సామాజిక ఉద్యమ కారిణి..మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కథనాలు రచించి ప్రచురించారు. గౌరీ లంకేశ్ దారుణ హత్యను టెన్ టివి 'మానవి' ఖండిస్తోంది. దీనిపై టెన్ టివిలో జరిగిన చర్చా కార్యక్రమంలో డీఎం.రత్నమాల (సీనియర్ మహిళా జర్నలిస్టు), దేవి (సామాజిక ఉద్యమకారిణి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:10 - September 7, 2017

తమిళనాడు : కోయంబత్తూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోతున్నాయి. ఇందులో పలువురు మృతి చెందుతున్నారు. తాజాగా కోయంబత్తూరు బస్టాండు సమీపంలో ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. బస్టాండు పై కప్పు కూడా కూలిపోయింది. ఆ సమయంలో బస్సు కోసం ప్రయాణీకులు వేచి ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరి మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా 20 మంది శిథిలాల కింద ఉన్నట్లు గుర్తించారు. తమిళనాడు రాష్ట్రంలో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో పాత భవనాలు కూలిపోతున్నాయి. 

కూలిన మూడంతస్తుల భవనం..

తమిళనాడు : తిరుచ్చి మలైకోటై రోడ్డులో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. పక్కనే ఉన్న బస్టాండు పై కప్పు జనాల మీద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. శిథిలాల కింద మూడు కుటుంబాలు చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. శిథిలాల నుండి 10 మందిని రక్షించారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

ముగిసిన సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు..

ఢిల్లీ : సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. ఆర్థిక సామాజిక, రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ..నీతి అయోగ్ ప్రజా వ్యతిరేక సిఫార్సులపై పోరాటాలను బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది. 

15:00 - September 7, 2017

అమెరికా : టెక్సాస్‌లో హార్వే తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి తేరుకోక ముందే అమెరికాను మరో హరికేన్‌ వణికిస్తోంది. కరేబియన్‌ దీవుల్లో బర్బుడాలో భారీ నష్టాన్ని మిగిల్చిన ఇర్మా హరికేన్‌... ఫ్లోరిడా వైపు దూసుకొస్తోంది. ఇప్పటికే ఫ్లోరిడా సమీపంలోని ప్యూర్టారికో, యూఎస్‌ వర్జిన్‌ దీవుల్లో బీభత్సం సృష్టించిన ఇర్మా... శుక్ర, శనివారాల్లో ఫ్లోరిడాను తాకే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముందు జాగ్రత్య చర్యల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన ఈ భారీ హరికేన్‌ విలయం సృష్టిస్తోంది. బర్బుడా తీరాన్ని మొదటగా తాకిన ఇర్మా.... ఆ తర్వాత సెయింట్‌ మార్టిస్‌, సెయింట్‌ బార్తెల్మీ పట్టణాలపై తీవ్ర ప్రభావం చూపి, భారీ విధ్వంసం సృష్టించింది. దీంతో కరీబిన్‌ దీవుల్లో కర్ఫ్యూ ప్రకటించారు. ఇర్మా ప్రభావంతో అమెరికాలోని ఫ్లోరిడా పరిసర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తున్నాయి. గంటకు 360 కి.మీ. వేగంతో వీస్తున్న ప్రచండ గాలులకు ఫ్లోరిడా సమీప ప్రాంతాలు అతలాకుతులం అవుతున్నాయి.

పలు ప్రాంతాల్లో 20 నుంచి 40 సె. మీ. అతి భారీ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే పలువురు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. కొందరి ఆచూకీ లభించలేదు. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కరేబిన్‌ దీవులతోపాటు అమెరికాలోని ప్యూర్టారికో, వర్జిన్‌ ఐలాండ్స్‌లో వరదలు జలప్రళయాన్ని సృష్టించాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో గాఢాంధకారంలో ప్రజలు మగ్గిపోతున్నారు. మంచినీటి సరఫరా ఆగిపోవడంతో తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క జనం అల్లాడుతున్నారు. టెలికాం వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దీంతో సమాచార వ్యవస్థ స్తంభించింది. కరేబియన్‌ ఐలాండ్స్‌లోని ఆరు దీవుల్లో ఇర్మా హరికేన్‌ సృష్టించిన బీభత్సానికి ఇళ్లలోకి నీరు చేరడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

అమెరికాలోని టెక్సాస్‌లో సంభవించిన హార్వే హరికేన్‌ కంటే ఇర్మా భయంకరమైనదని యూఎస్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు రోజులో ఇర్మా ఫ్లోరిడాను తాకే అవకాశం ఉండటంతో మియామీ సహా పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. హార్వే హరికేన్‌తో టెక్సాక్‌లో మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని జర్మనీ సంస్థ అంచనా వేసింది. ఇర్మా నష్టం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని బార్క్‌లే సంస్థ అంచనా వేస్తోంది. ఇర్మాతో 8.32 లక్షల కోట్ల నష్టం సంభవించవచ్చని ప్రాథమిక నివేదిక తయారు చేసింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఫ్లోరిడాలో అప్రమత్తత ప్రకటించారు. ఫ్లోరిడాలో ఉన్న వేలాది మంది ప్రవాస భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఎన్‌ఆర్‌ఐ సంస్థలు సూచిస్తున్నాయి. హరికేన్‌ను అదునుగా భావించి దొంగలు విరుచుకుపడే అవకాశం ఉందని అనుమానిస్తున్న అమెరికా అధికారులు... సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లివారు తమ విలువైన పత్రాలు, వస్తువులు భద్రపరచుకోవాలని కోరుతున్నారు. 

14:42 - September 7, 2017

చిత్తూరు : త్రిదండి రామానుజ చిన్న జీయర్‌ స్వామివారు.. ఎట్టకేలకు టీటీడీపై అలక వీడారు. వెయ్యి కాళ్ల మండపం విషయంలో టీటీడీతో విబేధించిన ఆయన.. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం పునర్నిర్మించేంతవరకూ తిరుమలకు వచ్చేది లేదన్నారు. గత ఆరేళ్లుగా తిరుమల దర్శనానికి రాలేదు. అయితే రామానుజుల వారి సహస్రాబ్ధి ఉత్సవాలు త్రిదండి ఆధ్వర్యంలో ఘనంగా జరగుతుండటంతో రాక తప్పలేదు. హైదరాబాద్‌లో 216 అడుగుల రామానుజులవారి సమతామూర్తి పంచలోహ విగ్రహం.. ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 

14:40 - September 7, 2017
14:39 - September 7, 2017

విజయవాడ : అమరావతిలో అమరావతి అమెరికన్‌ ఆసుపత్రి భవన నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ప్రాబ్లమ్ వస్తోందని.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఒకప్పుడు సెల్‌ఫోన్లు కొనమని తానే చెప్పానని.. అలా అని ఎప్పుడూ ఫోన్‌ పట్టుకోవడం సరి కాదన్నారు. బ్లూవేల్‌ గేమ్‌తో మనుషులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికొచ్చారన్నారు. మనిషి మైండ్‌ ఏది ఆలోచిస్తే.. అటు వైపు వెళ్తామన్నారు. 

ఎస్సీ సబ్ ప్లాన్ పై సమీక్ష..

విజయవాడ : ఎస్సీ సబ్ ప్లాన్ పై మంత్రులు లోకేష్, నక్కా ఆనంద్ బాబు లు సమీక్ష నిర్వహించారు. పంచాయతీ రాజ్, సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. 745 ఎస్సీ నివాస ప్రాంతాలకు రూ. 483 కోట్లతో 5121 అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని..896 ఎస్సీ నివాస ప్రాంతాలకు రూ.242 కోట్లతో తాగునీటి సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. 

ఢిల్లీకి చేరుకున్న మోడీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ రాజధానికి చేరుకున్నారు. చైనా జరిగిన బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే మయన్మార్ లో కూడా మోడీ పర్యటించిన సంగతి తెలిసిందే. 

14:13 - September 7, 2017

గుంటూరు : పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉద్యోగులు హల్ చల్ చేశారు. ఏకంగా మద్యం సేవించి డ్రైవర్..ఎస్ఐ పై దాడి చేయడం కలకలం రేగింది. వ్యవసాయ శాఖ ఉద్యోగుల సంఘం ఎన్నికల కోసం కొంతమంది ఉద్యోగులు గుంటూరుకు వెళ్లారు. ఎన్నికలు ముగిసిన అనంతరం వీరంతా హైదరాబాద్ కు బస్సులో బయలుదేరారు. మద్యం మత్తులో డ్రైవర్ పై వాగ్వాదానికి దిగి దాడి చేశారు. దీనిని అడ్డుకోవడానికి యత్నించిన ఎస్ఐపై కూడా దాడి చేశారు. నలుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

14:10 - September 7, 2017

ఢిల్లీ : 1993 ముంబై పేలుళ్ల కేసులో టాడా కోర్టు సంచలనాత్మక తీర్పునువ వెలువరించింది. ఈ కేసులో కీలక నిందితుడు తాహర్ మర్చంట్, ఫిరోజ్ లకు ఉరిశిక్ష విధించింది. అబూసలెంతో పాటు కరీముల్లా ఖాన్ కు జీవిత ఖైదు విధించింది. అలాగే రూ. 2లక్షల రూపాయల చొప్పున జరిమాన విధించింది.

 • 1993 మార్చి 12: ముంబైలో వరుసగా 13 చోట్ల పేలుళ్లు జరిగాయి. 257 మంది మరణించగా, 700 మందికి పైగా గాయాలు.
 • 1993, ఏప్రిల్ 19 : సినీ నటుడు సంజయ్‌దత్ అరెస్ట్.
 • 1993, నవంబర్ 4: 189 మంది నిందితులపై పది వేల పేజీల తొలి చార్జిషీట్.
 • 1993, నవంబర్ 19: కేసు సీబీఐకి అప్పగింత.
 • 1995 ఏప్రిల్ 10 : 26 మంది నిందితులను విడుదల చేసిన టాడా కోర్టు.
 • 1995, ఏప్రిల్ 19: కేసుపై విచారణ ప్రారంభం.
 • 1995, అక్టోబర్ 14: సంజయ్‌దత్‌కు సుప్రీంకోర్టు బెయిల్.
 • 1996 మార్చి 23 : జడ్జి జేఎన్ పటేల్‌కు హైకోర్టు జడ్జిగా పదోన్నతి, బదిలీ.
 • 1996 మార్చి 29: టాడా ప్రత్యేక జడ్జిగా పీడీ కోడే నియామకం.
 • 2000 అక్టోబర్ : ప్రాసిక్యూషన్ తరఫు సాక్షులు 684 మంది విచారణ పూర్తి.
 • 2001 మార్చి 9 : నిందితుల వాంగ్మూలం నమోదు.
 • 2001, ఆగస్టు 9 : ప్రాసిక్యూషన్ వాదనలు ప్రారంభం.
 • 2003 సెప్టెంబర్ : ముగిసిన విచారణ. తీర్పును రిజర్వులో ఉంచిన కోర్టు.
 • 2006 జూన్ 13 : గ్యాంగ్‌స్టర్ అబూసలేంపై వేరుగా విచారణ.
 • 2006 సెప్టెంబర్ 12 : మెమన్ కుటుంబంలో నలుగురు దోషులని కోర్టు ప్రకటన. 12 మందికి మరణశిక్ష, 20 మందికి యావజ్జీవం. ముగ్గురి విడుదల.
 • 2013 మార్చి 21 : యాకుబ్ మెమన్‌కు మరణశిక్షను ధ్రువీకరించిన సుప్రీం, మిగిలిన 10 మందికి మరణశిక్ష.. యావజ్జీవ శిక్షగా మార్పు.
 • 2013 జూలై 30: యాకుబ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం.
 • 2014 ఏప్రిల్ 11: యాకుబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి.
 • 2014 జూన్ 2: మెమన్ మరణశిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్టు.
 • 2015 ఏప్రిల్ 9 : మెమన్ రెండో రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం.
 • 2015 జులై 21: మెమన్ క్యురేటివ్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం.
 • 2015 జులై 23: మరణశిక్షపై స్టే కోరుతూ సుప్రీంలో మెమన్ పిటిషన్.
 • 2015 జులై 27: క్యురేటివ్ పిటిషన్‌పై ఇద్దరు జడ్జీల భిన్నమైన తీర్పు.
 • 2015 జులై 29: మరణశిక్షపై స్టే విధించాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం.
 • 2015 జులై 30 : నాగ్ పూర్ జైల్లో మెమన్ కు ఉరి.

గవర్నర్ తో ముగిసిన దినకరన్ భేటీ..

చెన్నై : రాష్ట్ర గవర్నర్ తో టిటివి దినకరన్ జరిపిన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు కూడా ఆయనతో పాటు ఉన్నారు. భేటీ అనంతరం టిటివి దినకరన్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీని ప్రత్యేక పరచాలని, బలనిరూపణ చేసే విధంగా ఆదేశాలివ్వాలని తాము కోరినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

13:52 - September 7, 2017

వరంగల్ : జిల్లా వేలేరు మండల కేంద్రంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి... ధర్నాలు నిర్వహిస్తున్నారు. రాత్రి జరిగిన రైతు సమన్వయ సమితి సమావేశంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య జరిగిన వాగ్వాదం.. తారా స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే రాజయ్యను అవమానించారనే ఆగ్రహంతో... టీఆర్‌ఎస్‌ నేతలు ధర్నా చేపట్టగా.. కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేశారని.. వారిని వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో వారిని అదుపు చేయడం పోలీసులకుతలనొప్పిగా మారింది.కాగా ఈ గందరగోళంలో రైతు సమన్వయ సమితి సమావేశం అర్ధాంతరంగా నిలిచిపోయింది. 

13:51 - September 7, 2017

ముంబై : 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషులకు టాడా కోర్టు శిక్ష ఖరారు చేసింది. ముంబై పేలుళ్లలో ప్రధాన సూత్రధారి అబూసలేంకు టాడా కోర్టు జీవిత ఖైదుతోపాటు రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది. కరీముల్లా ఖాన్‌కు కూడా జీవిత ఖైదుతోపోటు రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ కేసులో అబూసలేం, తాహెర్‌ మర్చెంట్‌, రియాజ్‌ సిద్ధికి, ఫిరోజ్‌ అబ్దుల్‌ రషీద్‌ ఖాన్‌, ముస్తాఫా దోసాలను దోషులుగా కోర్టు తేల్చింది. వీరిలో ముస్తాఫా దోసా ఈ ఏడాది జూన్‌ 28న మరణించడంతో కేసు మూసివేశారు. ఈ ఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోగా... 713మందికి గాయాలయ్యాయి. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

'ఎంపీ పాటిల్ తో సంబంధం లేదు'..

సంగారెడ్డి : ఎంపీ బీబీ పాటిల్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని, బోర్గిలో రైతుల నుండి నేరుగా భూములు కొనుగోలు చేయలేదని పాటిల్ కన్ స్ట్రక్షన్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అధికారులు వెల్లడించారు. సీబీఐ విచారణలో ఉన్న భూముల జోలికి తాము వెళ్లలేదని తెలిపారు. 

బాబుకు ఉపరాష్ట్రపతి లేఖ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం చేసిన పౌరసన్మానం ఎప్పటికీ మరువలేనని, రాజ్యాంగ పదవిలో ఉన్నా..రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉన్నా తెలుగు నేలను..తెలుగు ప్రజలను ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. 

మోడీకి కేసీఆర్ లేఖ..

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. నవంబర్ 28వ తేదీన హైదరాబాద్ మెట్రో రైల్ ను ప్రారంభించాలని లేఖలో కేసీఆర్ కోరారు.

 

రూ. 7,200 కోట్లు కేటాయించాలన్న జోగు రామన్న..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి రూ. 7,200 కోట్లు కేటాయించాలని, ఇలా చేస్తే అన్ని తరగతులు ప్రజలు అభివృద్ధి చెందుతారని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. కళ్యాణ లక్ష్మీ పథకానికి కేంద్రం రూ. 100 కోట్ల సహాయం చేసిందన్నారు. 

సిట్ కు సహకరిస్తామన్న గౌరీ లంకేష్ సోదరుడు..

బెంగళూరు : తాము సిట్ కు సహకరిస్తామని గౌరీ లంకేష్ సోదరుడు వెల్లడించారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమకారిణి గౌరీ లంకేష్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

పోటీ పోటీ ధర్నాలు..

వరంగల్ : జిల్లాలో వేలేరులో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోటా పోటీగా ధర్నాలు చేపట్టారు. ఎమ్మెల్యేను అవమానించారంటూ టీఆర్ఎస్..కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారంటూ ఆయా పార్టీ నేతలు పోటీగా ధర్నా చేపట్టారు.

ముంబై పేలుళ్ల కేసులో తీర్పు..

ముంబై : 1993 ముంబై పేలుళ్లలో కేసులో దోషులకు టాడా కోర్టు శిక్ష ఖరారు చేసింది. అబుసలెం, కరీముల్లాకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. దీనితో పాటు వీరిద్దరికీ రూ. 2 లక్షల జరిమాన విధించింది. రియాజ్ సిద్ధిఖీకి పదేళ్లు, తాహిర్ మర్చంట్, ఫిరోజ్ ఖాన్ కు మరణ శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. 

అబూ సలీంకు జీవిత ఖైదు..

ముంబై : 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో టాడా కోర్టు తీర్పును వెలువరిస్తోంది. కరీంముల్లాకు జీవిత ఖైదును విధించగా రూ. 2 లక్షల జరిమాన విధించింది. అబూ సలెంకు కూడా జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 

ముంబై పేలుళ్ల కేసులో తీర్పు..

ముంబై : 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో టాడా కోర్టు తీర్పును వెలువరిస్తోంది. కరీంముల్లాకు జీవిత ఖైదును విధించింది. అంతేగాకుండా రూ. 2 లక్షల జరిమాన విధించింది. 

మెడికల్ ఇనిస్టిట్యూట్ కు బాబు శంకుస్థాపన..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మెడికల్ ఇనిస్టిట్యూట్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

12:40 - September 7, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూ రికార్డుల ప్రక్షాళన అంశం.. అధికార పార్టీలో కలకలం రేపుతోంది. నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ శాసన సభ్యులకే పూర్తి అధికారాలు కట్టబెట్టారు. దీంతో భూ సర్వేతో గ్రామాల్లో కొత్త పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కీలకంగా మారే రైతు సమన్వయ సమితిలపై ఆధిపత్యం ఉండాలని.. అన్ని వర్గాలు పోటీ పడుతున్నాయి. కమిటీల నియామకం జరిగేలా శాసనసభ్యులు చూడాలని ఆదేశాలున్నా.. అవి అమలులో మాత్రం నేతలకు చుక్కలు చూపిస్తున్నాయి. గ్రామస్థాయి కమిటీలో సభ్యుడిగా కొనసాగితేనే.. మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పదవులకు అర్హత దక్కుతుందన్న నిబంధన నేతల్లో మరింత పట్టు పెంచేలా చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన కమిటీల్లో పార్టీ పదవులు దక్కించుకునే విధంగానే నేతలు పోటీ పడుతున్నారు.

నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు
రాష్ట్రస్థాయిలో 10 వేలకు పైగా గ్రామాల్లో కమిటీలు.. ఈ నెల 15 నాటికి ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 3 వేల కమిటీల నియామకం పూర్తి కాలేదని తెలుస్తోంది. నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు కారణంగానే కమిటీల నియామకంలో జాప్యం జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాష్ట్రస్థాయిలో 1.50 లక్షలకు పైగా పదవులు రైతు సమితిల నుంచి దక్కనున్నాయి. రైతు సంక్షేమ పథకాలన్నీ భవిష్యత్తులో రైతు కమిటీల ద్వారానే అమలు చేసే అవకాశం ఉండటంతో.. కమిటీలో పట్టు దక్కించుకునేందుకు పార్టీలోని నేతలు పావులు కదుపుతున్నారు.

లాలూ..తేజశ్వీలకు సీబీఐ నోటీసులు..

బీహార్ : లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తేజశ్వి యాదవ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఐఆర్‌సీటీసీ హోటల్‌ టెండర్లలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. 11న లాలూ, 12న తేజశ్వి హాజరు కావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. 

12:39 - September 7, 2017

హైదరాబాద్ : తెలంగాణలోని పాఠశాలల్లో కాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం అవుతోంది. ఖాళీల వివరాలను టీఎస్‌పీఎస్‌కీ అందాయి. దీంతో డీఎస్పీ నోటఫికేషన్‌ జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ముందుగా 8,792 టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వివరాలను ఆర్థిక శాఖకు పంపింది. కానీ ఆర్థిక శాఖ 340 పోస్టులకు కోత పెట్టింది. మొత్తం 8,452 పోస్టులకు అనుమతి ఇవ్వడంతో ఈ మేరకు వివరాలను అధికారులు టీఎస్‌పీఎస్సీకి అందజేశారు. దీంతో పాత జిల్లాల వారీగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చర్యలు చేపట్టింది. ముందుగా కొత్త జిల్లాల వారీగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రతిపాదించింది. అయితే జోనల్‌ వ్యవస్థను రద్దు చేయకుండా కొత్త జిల్లా వారీగా టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయశాఖ అధికారులు ప్రభుత్వ దృష్టికి తేవడంతో పాత జిల్లాలను పరిగణలోకి తీసుకుంటున్నారు.

ఒక్కో పోస్టుకు 15 మందిని ఎంపిక
గురుకుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుసరించిన పరీక్షా విధానాన్నే డీఎస్సీలో కూడా అమలు చేయాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ప్రిలిమినరీ, మెయిన్స్‌ నిర్వహస్తారు. ప్రిలిమ్స్‌లో ఒక్కో పోస్టుకు 15 మందిని ఎంపిక చేస్తారు. మెయిన్స్‌ను 80 శాతంగా, టెట్‌ మార్కులను 20 శాతంగా పరిగణించి జాబితాలు సిద్ధం చేస్తారు. జాతీయ ఉపాధ్యాయ శిక్షణా మండలి నిబంధనల ప్రకారం జనరల్‌ అభ్యర్థులు విద్యార్హత పరీక్షలో 50 శాతం మార్కులు సాధించి ఉంటేనే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌లోనే ఈ నిబంధనను చేర్చనున్నారు. మొత్తంమీద టీచర్‌ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో అభ్యర్థులు తుది విడత కోచింగ్‌కు సిద్ధమవుతున్నారు.

 

రాజ్ భవన్ కు టిటివి దినకరన్..

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. కాసేపటి క్రితం టిటివి దినకరన్ తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ గవర్నర్ తో ఆయన భేటీ కానున్నారు.

నవంబర్ 28న మెట్రో రైలు ప్రారంభం..

హైదరాబాద్ : నవంబర్ 28న మెట్రో రైలు ప్రారంభం కానుందని మంత్రి కేటీఆర్ కాసేపటి క్రితం ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. నాగోల్ - మియాపూర్ వరకు మెట్రో రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని ఆయన ట్వీట్ చేశారు. 

12:30 - September 7, 2017

గుంటూరు : అమరావతి అమెరికన్‌ ఆసుపత్రి భవన నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ప్రాబ్లమ్ వస్తోందని.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఒకప్పుడు సెల్‌ఫోన్లు కొనమని తానే చెప్పానని.. అలా అని ఎప్పుడూ ఫోన్‌ పట్టుకోవడం సరి కాదన్నారు. బ్లూవేల్‌ గేమ్‌తో మనుషులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికొచ్చారన్నారు. మనిషి మైండ్‌ ఏది ఆలోచిస్తే.. అటు వైపు వెళ్తామన్నారు. 

12:12 - September 7, 2017

టాలీవుడ్ సూపర్ స్టార్ 'మహేష్ బాబు' తాజా చిత్రం 'స్పైడర్' రిలీజ్ కు సిద్ధమౌతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా చిత్ర షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన విషయాలు గతంలో తెలియకపోతుండడంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అనంతరం మహేష్ కు సంబంధించిన పోస్టర్స్..టీజర్స్ విడుదల చేయడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. యూ ట్యూబ్ ద్వారా రెండు సాంగ్స్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా సినిమాకు సంబంధించి ఆడియోను రిలీజ్ చేసేందుక చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో 'స్పైడర్' రిలీజ్ కానుంది. చిత్ర ఆడియోను సెప్టెంబర్ 9న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. మహేష్ బాబు నటించిన తెలుగు సినిమాలను తమిళంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసే వారు తొలిసారిగా తమిళంలో 'స్పైడర్' ను రూపొందించి విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మహేష్ ను కోలీవుడ్ వాసులు పరిచయం చేసేందుకు ఆడియో వేదికను ఉపయోగించుకోనున్నారని తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా దర్శ‌క‌ ధీరుడు రాజ‌మౌళి, సూప‌ర్ హిట్ మూవీల ద‌ర్శ‌కుడు శంక‌ర్ లు హాజ‌రుకానున్నారు. తమిళ, తెలుగు వెర్షన్స్ కి సంబంధించిన ఆడియోను ఇదే వేదిక‌పై దిగ్గ‌జ ద‌ర్శ‌కులు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య, భరత్ నెగెటివ్ పాత్రలలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెప్టెంబర్ 27న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

12:11 - September 7, 2017

తూర్పుగోదావరి : జిల్లా గోవకరం సమీపంలో బురదచెరువులో నలుగురు యువకులు వరదలో ఇరుక్కున్నారు. చేపల వేట కోసం వెళ్లిన యువకులు వరదలో చెట్టు పట్టుకుని సాయం కోసం అరుస్తున్న వారిలో ముగ్గురిని స్థానికులు కాపాడారు. మరో వ్యక్తి కాపాడేందుకు ప్రయత్నించిన సాధ్యకాకపోడంతో ఫైర్ సబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది వ్యక్తి కాపాడారు. పైర్ కానిస్టేబుల్ రెడ్డి సహసంతో వరదలోకి వెళ్లి చెట్టుకు తాడు కట్టి యువకున్ని రక్షించాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

బురద చెరువులో యువకుల గల్లంతు..

తూర్పుగోదావరి : గోకవరం బురద చెరువులో చేపల వేట కోసం వెళ్లిన నలుగురు యువకులు వరదలో చిక్కుకున్నారు. వీరు చెట్టును పట్టుకుని సాయం కోసం ఎదురు చూపులు చూశారు. స్థానికులు గమనించి ముగ్గురిని రక్షించారు. చెట్టుపై ఉన్న మరొకరిని పోలీసులు, ఫైర్ సిబ్బంది రక్షించారు. 

పసుమామల చెరువులో మృతి చెందిన చేపలు..

రంగారెడ్డి : అబ్దుల్లాపూర్ మెట్ (మం) పసుమాముల చెరువులో రసాయన పదార్థాలను దండుగులు కలుపడంతో భారీగా చేపలు మృతి చెందాయి. రూ. కోటి వరకు మత్స్యకారులు నష్టపోయినట్లు తెలుస్తోంది.

 

గాల్లో చక్కర్లు కొట్టిన విమానం..

హైదరాబాద్ : ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం రావడంతో విమానం 20 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. హైదరాబాద్ నుండి అహ్మదాబాద్ వెళుతున్న ఈ విమానంలో 168 మంది ప్రయాణీకులున్నారు.

 

11:31 - September 7, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ వ్యవహారంలతో సిట్‌ బృందం సైలెంట్‌గా పనిచేసుకుపోతోంది. మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న మరో ముగ్గురు టాలీవుడ్ తారలకు నోటీసులు రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి సినీవర్గాల్లో కలకలం బయలు దేరింది. డగ్స్ కేసులో విచారణ చేపట్టి దాదాపు రెండు నెలలు కావస్తున్నా.. విచారణ ఎదుర్కొంటున్న సినీతారల్లో ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. ఈనేపథ్యంలో మరోసారి డ్రగ్స్‌ వ్యవహారంలో సినీప్రముఖలు ప్రమేయం ఉన్నట్టు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా సినీ పరిశ్రమకు చెందిన మరో ముగ్గురికి కూడా డ్రగ్స్ తో సంబందాలు ఉన్నట్లు సిట్ బృందం ధర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. వారి దగ్గర నుంచి కీలక సమాచరం సేకరించే పనిలో ప్రస్తుతం సిట్‌ అధికారులు బిజీగా ఉన్నారు.

పెద్దల పేర్లే ఉన్నట్టు జోరుగా ప్రచారం
ఈసారి సిట్‌ బృందం రెడీ చేసిన లిస్టులో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దల పేర్లే ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ముగ్గురు సినీనటుల్లో ఒకరు ప్రముఖ హీరోయిన్ కూడా ఉన్నట్టు సమాచారం. టాప్‌ హీరోయిన్ లలో ఒకరుగా చలామణీ అవుతున్న ఓనటీ.. కోకైన్ వాడుతున్నట్టు సిట్‌ అధికారులు గుర్తించారనే సమాచారం ప్రస్తుతం సినీవర్గాల్లో కలకలం రేపుతోంది. సదరు హీరోయిన్‌ మత్తుమందులు వాడుతుండగా తీసిన వీడియోలను సిట్ బ్రందం సేకరించినట్లు తెలుస్తుంది. అయితే కోద్ది రోజుల క్రితం నిర్వహించిన ఒక సినీ వేడుకలో బహిరంగంగానే మత్తుమందులు తీసుకుని అదుపు తప్పి పడిపోతుంటే మరో నటుడు తన కారులో ఆమెను తమ ఇంటి దగ్గర దింపినట్లు కూడా సిట్‌ బృందం ఆధారాలు సేకరించింది. అలాగే మరో ఇద్దరు సినీపెద్దలపై కూడా దర్యాప్తు బృందం నిశింతంగా దృష్టిపెట్టింది. ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న నటులు ఈ ప్రముఖుల పేర్లు వెల్లడించినట్టు సమాచరం.

బాధితులుగా మాత్రమే
ఈ ఆధారాలతోనే సిట్‌ కీలక సమాచారం ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సీఎం కేసీఆర్‌ డ్రగ్స్‌ వాడుతున్న వారిని బాధితులుగా మాత్రమే చూస్తామని ప్రకటించడంతో.. దర్యాప్తు అధికారులపై ఒత్తిడి పెరిగినట్టైంది. దీంతో తాజాగా వెలుగు చూసిన సినీపెద్దల వ్యహారంపై ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. వారు డ్రగ్స్‌ వాడేవారేనా...లేదా అమ్మకాలు కూడా సాగించారా.. అనేదానిపై పూర్తి ఆధారాలు సేకరించే పనిలో సిట్‌ బీజీగా ఉంది. అయితే డ్రగ్స్‌ దందాలపై ఉక్కుపాదం మోపుతామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ చెపుతున్నా ... ఇంతవరకు సాగిన దర్యాప్తులో సినీ నటుల్లో ఒక్కరిపైకూడా చర్యలు తీసుకోలేదు. దీంతో తాజాగా బయటికి వస్తున్న ముగ్గురు సినీ ప్రముఖులను కూడా కేవలం ప్రశ్నించి వదిలేస్తారా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ఇంతకు ముదలా కాకుండా పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే వివరాలు బయటపెట్టాలని సిట్‌ బృంద భావిస్తున్నట్టు సమాచారం. 

11:28 - September 7, 2017
11:23 - September 7, 2017

జమ్మూలో పర్యటించనున్న రాజ్ నాథ్ సింగ్..

ఢిల్లీ : కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. అక్కడి రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్. వ్రోహా, సీఎం మహబూబా ముఫ్తీతో ఆయన భేటీ కానున్నారు. 

11:19 - September 7, 2017

బాలీవుడ్ నటి 'పరిణీతి చోప్రా'కు అరుదైన గౌరవం దక్కింది. బాలీవుడ్ లో అందాల భామగా పేరొందిన ఈ నటి ఎన్నో జాతీయ ఫిలిం అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. చాలా బ్రాండ్లకు..ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆస్ట్రేలియా టూరిజం రాయబారిగా నియమితులయ్యారు. ఆస్ట్రేలియా పర్యటక శాఖ రాయబారిగా వ్యవహరించనున్న తొలి భారతీయ మహిళ కూడా పరిణీతే. ఫ్రెండ్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా (ఎఫ్‌ఓఏ) అడ్వొకసీ ప్యానెల్‌లో పరిణీతితో పాటు ప్రముఖ చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌, క్రికెట్‌ వ్యాఖ్యాత హర్ష భోగ్లే కూడా ఉన్నారు. ఈసందర్భంగా 'పరిణీతి' మీడియాతో మాట్లాడారు. ' ఫ్రెండ్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియాగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆస్ట్రేలియా ఇష్టమైన పర్యాటక దేశాల్లో ఒకటి. గత ఏడాదే నేను ఆ దేశం వెళ్లాను. ఒక ట్రిప్పు అయితే చాలదు'' అని పేర్కొంది. పర్యటక శాఖ అంబాసిడర్‌గా పరిణీతి క్వీన్స్‌ల్యాండ్‌తో పాటు వివిధ ప్రసిద్ధ ప్రాంతాల్లో పర్యటించనుంది. 

11:13 - September 7, 2017

హైదరాబద్ : పాతబస్తీ స్నూకర్ సెంటర్ లో క్యాషియర్ పై దాడి కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారిస్తున్నారు. దాడి కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి నిందితుల కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:12 - September 7, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' దుస్తుల కోసం చ్రిత బృందం అన్వేషణ సాగిస్తోంది. ఆయన తాజా చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాల వరకు వెండి తెరకు దూరంగా ఉన్న 'చిరు' ఇటీవలే 'ఖైదీ నెంబర్ 150’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అనంతరం కొంత గ్యాప్ తీసుకుని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

స్వాతంత్ర్య సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత కథతో చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల టైటిల్‌ను, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. వీటికి మంచి స్పందనే వచ్చింది. చిరంజీవిని ప్రత్యేకంగా చూపించడం కోసం 'అంజు' డిజైనర్ గా పనిచేస్తున్నారు. బాలీవుడ్ లో 'బాజీరవు మస్తాని', ‘రామ్ లీలా' చిత్రాలకు డిజైనర్ గా పనిచేశారు. 'అంజు' తో పాటు మరో పది మంది దుస్తుల డిజైన్‌ కోసం పరిశోధన చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్వాతంత్య్రానికి ముందు ఉన్న సంస్కృతి, అప్పటి వస్త్రధారణకు అనుగుణంగా డిజైన్ చేయాలని భావిస్తున్నట్లు టాక్. ఇక ఈ వారంలోనే సినిమా షూటింగ్ మొదలు కానున్నట్లు, ఇందుకు తమిళనాడులోని పొల్లాచిలో భారీ సెట్‌ వేస్తున్నట్లు సమాచారం. ఇక 'సైరా' తెలుగు, హిందీ..తమిళం..కన్నడ భాషల్లో రూపొందనుందని తెలుస్తోంది. అందుకోసమే హిందీ నుండి అమితాబ్ బచ్చన్, తమిళ్‌ నుంచి విజయ్ సేతుపతి, కన్నడ నుంచి సుదీప్‌ కీలక పాత్రలు ఎంపిక చేశారని తెలుస్తోంది. 'నయన తార’ కూడా నటించనుందని చిత్ర బృందం వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ నయన్ ‘చిరు’ పక్కన హీరోయిన్ గా నటించనుందా ? అనేది తెలియరాలేదు. 

11:06 - September 7, 2017

ముంబై : 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషులకు టాడా కోర్టు కాసేపట్లో శిక్ష ఖరారు చేయనుంది. అబూసలేంతో పాటు మిగతా దోషులకు టాడా కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఈ పేలుళ్లలో ప్రధాన నింధితుడిగా అబూసలేం ఉన్నాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కాసేపట్లో దోషులకు శిక్ష ఖరారు..

ముంబై : 1993 ముంబై పేలుళ్లలో కేసులో దోషులకు టాడా కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ముంబై పేలుళ్లలో అబూసలెం ప్రధాన నిందితుడని ఆరోపణలున్నాయి. అబూసలెంతో పాటు మిగతా దోషులకు శిక్ష ఖరారు చేయనుంది. 

10:55 - September 7, 2017

టాలీవుడ్ లో వివాదస్పదంగా మారిన 'అర్జున్ రెడ్డి' సినిమాపై ఇతర నటులు స్పందిస్తున్నారు. పలువురు విమర్శలు చేస్తుండగా మరికొందరు కితాబునిస్తున్నారు. తాజాగా దీనిపై టాలీవుడ్ స్వీటీ 'అనుష్క' కూడా స్పందించారు. విజయ్ దేవరకొండ- షాలినీ పాండే హీరో హీరోయిన్లుగా 'అర్జున్ రెడ్డి' సినిమా తెరకెక్కింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. టీజర్‌ లో బూతు డైలాగ్స్ ఉండడం సంచలనం సృష్టించింది. సినిమా రిలీజైన తర్వాత సినిమాలో ఎన్నో అభ్యంతరకరమైన దృశ్యాలు వున్నాయనే ఫిర్యాదులు అందాయి.

పలువురు నటులు మాత్రం 'అర్జున్ రెడ్డి' సినిమాను ప్రశంసించారు. ‘అర్జున్ రెడ్డి' సినిమాను కచ్చితంగా చూడండి..నిజాయితీగా తీసిన చిత్రమిందని 'అనుష్క' ఫేస్ బుక్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. చిత్ర బృందంలోని ప్రతొక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని పోస్టు చేశారు. ప్రస్తుతం అనుష్క 'భాగమతి' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. 

బాబుతో ఎయిర్ ఏవియేషన్ ఛైర్మన్ భేటీ..

విజయవాడ : సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, ఎయిర్ ఏవియేషన్ ఛైర్మన్ సమావేశమయ్యారు. ఏపీలో ఎయిర్ పోర్టుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. 

మళ్లీ ఎన్ఐఏ తనిఖీలు..

జమ్మూ కాశ్మీర్ : అనంతనాగ్, బుద్గాంలో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. శ్రీనగర్ 10 ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు కొనసాగిస్తోంది. హురియత్ నేత ఆగా హసం నివాసంలోనూ సోదాలు చేసింది. నకిలీ చలానాలతో డ్రై ఫ్రూట్స్ రవాణా సమాచారంపై తనిఖీలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

క్యాషియర్ పై దుండగుల దాడి..

హైదరాబాద్ : పాతబస్తీలో దుండగులు హల్ చల్ చేశారు. స్నూకర్ సెంటర్ క్యాషియర్ షబ్బీర్ పై దుండగులు దాడి చేశారు. కత్తులు..కర్రలతో ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దుండగులను పట్టుకోవడం కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు.

10:26 - September 7, 2017

 

కోలంబో : శ్రీలంక పర్యటనలో టీమ్‌ ఇండియా విజయపరంపర కొనసాగింది. బుధవారం శ్రీలంకతో జరిగిన ఏకైక టీ20లో విరాట్‌సేన ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. టాస్‌ గెలిచిన టీమ్‌ ఇండియా కెప్టెన్‌ కోహ్లీ శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 170 పరుగులు చేసింది.171 రన్స్‌ టార్గెట్‌తో బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ రోహిత్‌శర్మ 22 పరుగుల దగ్గర, 42 రన్స్‌ దగ్గర లోకేశ్‌ రాహుల్‌ పెవిలియన్‌ బాటపట్టారు. ఈ దశలో క్రీజులో ఉన్న విరాట్‌ కోహ్లీ, మనీశ్‌పాండే మరో వికెట్‌ పడకుండా కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. లంక బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా విరాట్‌ తనదైన శైలిలో దూకుడును ప్రదర్శించి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. బౌండరీలతో చెలరేగుతూ వేగంగా హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పాండే సైతం టీ20 కెరీర్‌లో తొలి అర్థశతకం సాధించాడు. అయితే ఆఖర్లో 10 బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా భారీ షాట్‌కు ప్రయత్నించి విరాట్‌ వెనుదిరిగాడు. క్రీజుల్లోకి వచ్చిన ధోనీ సాయంతో పాండే లక్ష్యాన్ని పూర్తి చేశాడు.

పోటీనిచ్చిన శ్రీలంక
అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. శ్రీలంక ఆటగాళ్లలో దిల్షాన్‌ మునవీర 53 పరుగులు చేయగా... అషాన్‌ ప్రియంజన్‌ 40 రన్స్‌ చేశాడు. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోర్లకే ఔటైనా శ్రీలంక పరుగుల వరద పారంచింది. బ్యాట్స్‌మెన్‌ దిల్షాన్‌ మునవీర 29 బాల్స్‌లో 53 రన్స్‌ చేశాడు. 99 పరుగుల దగ్గర మునవీరను కుల్దీప్‌ యాదవ్‌ బోల్తా కొట్టించడంతో లంక రన్‌రేట్‌ పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన వారంతా తక్కువ స్కోర్‌కే అవుటయ్యారు. చివర్లో అషాన్‌ ప్రియంజన్‌ రెండు సిక్సర్లు బాది మెరవడంతో శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 170 పరుగుల చేసింది. భారత బౌలర్లు చాహాల్‌కు 3వికెట్లు దక్కగా కులదీప్‌ యాదవ్‌కు 2, భువనేశ్వర్‌, బుమ్రాలకు చెరో వికెట్‌ పడింది.

10:25 - September 7, 2017

హైదరాబాద్ : వివిధ కార‌ణాల‌తో ఆల‌స్యమయిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేన్ పాల‌క‌మండ‌లి ఎట్టకేలకు ఇవాళ సమావేశం అవుతోంది. సాధార‌ణంగా మూడు నెల‌ల‌కోసారి స‌ర్వస‌భ్యస‌మావేశం నిర్వహించాల్సి ఉంది. కాని ప్రధాన ప్రతి ప‌క్షం ఎంఐఎం, అధికార టిఆర్ ఎస్ స‌భ్యులు పెద్దగా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో సాధారణంగా స‌మావేశాలు ఆల‌స్యమౌతున్నాయని అధికారులు అంటున్నారు.

బ‌డ్జెట్ విడుద‌ల‌పై చ‌ర్చించే అవ‌కాశం
దాదాపు 5 నెలల తర్వాత జరుగుతున్న బల్దియా కౌన్సిల్ మీటింగ్‌లో త‌మ డివిజ‌న్ల‌లోని స‌మ‌స్యల‌ను చ‌ర్చించేందుకు కార్పొరేటర్లు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా కార్పొరేట‌ర్ బ‌డ్జెట్ విడుద‌ల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉంది. మరోవైపు కొద్ది నెల‌లుగా జరుగుతున్న ఎల్ ఈ డి లైట్ల ఫిట్టింగ్ ప‌నులు మందకొడిగా సాగుతున్నాయి. దీంతోపాటు వర్షల‌కార‌ణంగా సిటిలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. వాటికి తోడు నాలాల విస్తర‌ణ ప‌నులు ఇప్పటి వ‌ర‌కు మొద‌లు కానేలేదు.ఈ అంశాలపై వాడివేడి చ‌ర్చజరిగే అవకాశం ఉంది. అయితే బ‌ల్దియా కౌన్సిల్ ను రెగ్యుల‌ర్ గా స‌మావేశ ప‌రుచ‌డంలో అధికారులు త‌గిన శ్రద్ధ క‌నబ‌ర‌చ‌డం లేదన్న ఆరోప‌న‌ణలు వన్నాయి. ఒకవేళ స‌మావేశం అయినా ఒక్కరోజుపాటు నిర్వహించి మ‌మ అనిపిస్తున్నారని.. సమస్యలపై సమగ్రంగా చ‌ర్చించి వాటిపై స‌రైన నిర్ణయాలు చేయడం లేదని విపక్ష కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. ఈసారి సమావేశంలో అయినా.. ప్రజాసమస్యలకు పరిష్కారం చూపించేలా చర్చలు నడవాలని కోరుతున్నారు.  

10:23 - September 7, 2017

హైదరాబాద్ : పాతబస్తీ సంతోష్‌నగర్‌లో ఓ నిత్యపెళ్లికొడుకు నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రబుద్ధుడు మొదటి భార్యకు విడాకులివ్వకుండానే మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలియగానే మొదటి భార్య.. సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిఖా జరుగుతున్న సమయంలో మొదటిభార్య తన బంధువులతో కలిసి భర్తపై దాడికి దిగింది. ఫంక్షన్‌లో ఏర్పడ్డ గందరగోళంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఆ తర్వాత ఫంక్షన్‌హాల్‌ నుంచి పెళ్లికొడుకు బంధువులు పారిపోయారు. పోలీసులు పెళ్లికొడుకుపై కేసు నమోదు చేశారు. 

10:21 - September 7, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో.. గణేశ్‌ నిమజ్జనం కోలాహలంగా జరిగింది. సచివాలయం సమీపంలోని మందడం గ్రామంలో వినాయకుడి శోభాయాత్ర ఘనంగా జరిగింది. నిమజ్జనానికి ముందు గణనాథుడి లడ్డు ప్రసాదం వేలం పాట.. ఎంతో ఉత్కంఠగా జరిగింది. 50 వేలకు ప్రారంభమైన లడ్డు వేలం పాట 5 లక్షలకు చేరింది. చివరకు మందడం గ్రామానికి చెందిన ఆలూరి సాయి వివేక్‌ లడ్డు ప్రసాదాన్ని వేలం పాటలో సొంతం చేసుకున్నాడు. దేవతల విగ్రహాల నమూనాల సెట్టింగ్‌తో నిమజ్జన కార్యక్రమం జరిగింది. నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా.. పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 

10:20 - September 7, 2017
10:18 - September 7, 2017

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు రేపు పండుగ. ఎందుకంటే ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన మరో టీజర్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రెండు టీజర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. దీనిని చూసిన అభిమానులు టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' చిత్ర షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. సినిమాలో 'ఎన్టీఆర్' ఏకంగా మూడు పాత్రలను పోషిస్తున్నారు. 'జై', 'లవ', 'కుశ' పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ ను చిత్ర బృందం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 'జై', 'లవ' పాత్రలకు సంబంధించి టీజర్స్ విడుదలయ్యాయి. ఈ టీజర్స్ అభిమానులను విశేషంగా అలరించాయి. 'కుశ' పాత్రకి సంబందించిన టీజర్ ఇంకా విడుదల కాలేదు.

శుక్రవారం ఉదయం 10 గంటలకు టీజర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ట్వీట్ చేసింది. రఫ్ అండ్ టఫ్ గా కనిపించే 'కుశ' టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

10:14 - September 7, 2017
10:12 - September 7, 2017

విజయనగరం : జిల్లా పూసపాటి మండలం కొవ్వాడలో ఉద్రిక్తత నెలకొంది. దళితులకు కేటాయించిన భూమిని నెల్లిమర్ల ఎమ్మెల్యేకు కట్టబ్టెటడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకు చెందిన ఎస్ వీఎస్ కెమికల్ కంపెనీకి భూమి కేటాయించారు. బాధితులు భూమల చుట్టూ ఉన్న కంచెను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బాధితులకు మధ్య తోపులాట జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:07 - September 7, 2017

అనంతపురం : జిల్లా హిందూపురం మార్కెట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వర్షం వల్ల బురదమయమైన మార్కెట్ లో ఇబ్బదులు ఎదుర్కొంటున్నామని అధికారుల సరైన వసతులు కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. కూరగాయలు కిందపారబోసి వారు నిరసన తెలుపుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

బురదలో కూరగాయలు...

అనంతపురం: జిల్లా హిందూపురం కూరగాయల మార్కెట్ లో రైతులు నిరసన వ్యక్తం చేశారు. వర్షంతో బురదమయమైనా అధికారులు సరైన వసతులు కల్పించ లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలను కిందపారబోసి తమ నిరసన వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యే రాజయ్యను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు..

వరంగల్ : బుధవారం రాత్రి రైతు సమన్వయ సమితీ సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రాజయ్యను కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపులోకి తీసుకొచ్చారు. సభలో రాజయ్యను అడ్డుకున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. 

దళితులను అడ్డుకున్న కాప్స్..

విజయనగరం : పూసాటిరేగ మండలొ కొవ్వాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు కేటాయించిన భూములను నెల్లిమర్ల ఎమ్మెల్యే నారాయణ స్వామికి చెందిన ఎస్వీఎస్ కెమికల్స్ కంపెనీకి కేటాయించడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను తొలగించారు. దళితులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

ఫెదరర్ నిష్క్రమణ..

ఢిల్లీ : యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ నుండి ఫెదరర్ నిష్క్రమించాడు. క్వార్టర్స్ మ్యాచ్ లో డెల్ పాట్రో చేతిలో 7-5, 3-6, 6-4 తేడాతో ఫెదరర్ పరాజయం చెందాడు. 

పాతబస్తీలో దారుణం

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. అందరు చూస్తుండగానే స్నూకర్ సెంటర్ లో క్యాషియర్ షబ్బీర్ పై గుర్తుతెలియాని దుండగులు కత్తులు, కర్రలు, రాడ్లతో దాడి చేశారు. దాడిలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్టు ప్రత్యేక్ష సాక్షులు చెబుతున్నారు. తీవ్రగాయాలపాలైన షబ్బీర్ ను ఆసుపత్రికి తరలించారు. దాడికి పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

హిందూపురం మార్కెట్ లో రైతుల ధర్నా

అనంతపురం : జిల్లాల హిందూపురం కూరగాయల మార్కెట్ లో రైతులు ధర్నా దిగారు. వర్షం కురవడంతో మార్కెట్ బురదతో నిండిపోయింది. అధికారులు సరైన వసతి కల్పించలేదని కూరగాయాలు కిందపారబోసి రైతులు నిరసన తెలుపుతున్నారు.

09:21 - September 7, 2017

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. అందరు చూస్తుండగానే స్నూకర్ సెంటర్ లో క్యాషియర్ షబ్బీర్ పై గుర్తుతెలియాని దుండగులు కత్తులు, కర్రలు, రాడ్లతో దాడి చేశారు. దాడిలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్టు ప్రత్యేక్ష సాక్షులు చెబుతున్నారు. తీవ్రగాయాలపాలైన షబ్బీర్ ను ఆసుపత్రికి తరలించారు. దాడికి పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నింధితులు గాలింపు కోసం పోలీసులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:14 - September 7, 2017

లక్నో : యూపీలో మరో రైలు ప్రమాదం జరిగింది. సాంభద్ర జిల్లాలో శక్తిపుంజ్ ఎక్స్ ప్రెస్ 7 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనం ఉదయం 6గంటలకు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. యూపీలో వరుస ప్రమాదాలతో ప్రజలు రైలు ఎక్కాలంటే భయపడుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

అమెరికాపై ఇర్మా తుఫాన్ పంజా

వాషింగ్టన్ : అమెరికాలోని ఫ్లోరిడాపై ఇర్మా పంజా విసురుతోంది. హార్వే తుఫాన్ నుంచి తేరుకొకముందే ఇర్మా తుఫాను తో అమెరికి ఉక్కిరిబిక్కిరౌతుంది. తొలుత ఆంటిగ్వా, బార్బుడాపై ప్రతాపం చూపిన ఇర్మా ప్రస్తుతం ఫ్లోరిడాపై కొనసాగుతోంది.

 

కరీబియన్ దీవుల్లో ఇర్మా తుఫాన్ బీభత్సం

వెస్టీండిస్ : కరీబియన్ దీవుల్లో ఇర్మా తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. పెనుగాలులు, భారీ వర్షాలతో ఇర్మా విరుచుకుపడుతోంది. 

ఉత్తర్ ప్రదేశ్ లో మరో రైలు ప్రమాదం

లక్నో : ఉత్తర ప్రదేశ్ లో మరో రైలు ప్రమాదం జరిగింది. సాంభద్ర జిల్లాలో శక్తికుంజ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. 7బోగీలు పక్కకు ఒరిగాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

08:09 - September 7, 2017

అటవీ హక్కుల చట్టం అమలులోకి వచ్చి 11 ఏళ్లయ్యింది. కానీ, ఈ చట్టం ఇప్పటికీ సంపూర్ణంగా అమలుకావడం లేదు. అడవినే ప్రేమిస్తూ, అడవిలోనూ జీవిస్తూ, అడవిని సంరక్షిస్తూ తమ జీవితాలను అడవితోనే పెనవేసుకున్న గిరిజనుల జీవితాల్లో ఇంకా చీకట్లు తొలగడం లేదు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పట్టాలు ఇవ్వకపోగా, హరితహారం పేరుతో, అడవుల సంరక్షణ పేరుతో గిరిజనుల వెళ్లగొడుతున్న దృశ్యాలు గత రెండు మూడేళ్లలో పెరిగాయి. అనేకమంది గిరిజనుల మీద కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా గిరిజనులు పోరాటాలు సాగిస్తున్నారు. మరోవైపు అటవీ భూముల్లోని విలువైన ఖనిజాల మీద కన్నేసిన బడా కార్పొరేట్ సంస్థలు మైనింగ్ పేరుతో తిష్ట వేస్తున్నాయి. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం ఎలా అమలవుతోంది? గిరిజనులు ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? అటవీహక్కుల చట్టం వచ్చి 11ఏళ్లు వచ్చిందని, తరతరాలుగా గిరిజనలు అటవీని నమ్మూకుని జీవిస్తున్నారని, సీపీఎం ఎంపీలు అందురు 2005లో అటవీ హక్కులు తీసుకోచ్చారని, అటవీహక్కుల చట్టం రాకముందు గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడేవారని, అటవీ హక్కు చట్టం వచ్చిన తర్వాత కూడా గిరిజనులక న్యాయం జరగడంలేదని తెలంగాణ గిరిజన నాయకుడు శోభన్ నాయక్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

 

08:08 - September 7, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కేసులో శ్రీనగర్‌, ఢిల్లీలో NIA దాడులు జరిపింది. శ్రీనగర్‌లో 11 చోట్ల, ఢిల్లీలో 5 చోట్ల ఈ సోదాలు నిర్వహించింది. క‌శ్మీర్ వ్యాలీలో అల్లర్లు సృష్టించేందుకు ఉగ్ర సంస్థలు ఫండింగ్ చేస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఐఏ ఏడుగురు వేర్పాటువాద నేత‌ల‌ను అరెస్టు చేసి విచారణ జరిపింది. ఇంతకు ముందు హంద్వాడా, బారాముల్లాల్లో ఎన్‌ఐఏ 12 చోట్ల దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. హవాలా వ్యాపారుల ఇళ్లల్లోనూ ఎన్‌ఐఏ సోదాలు చేసింది. మరోవైపు కశ్మీర్‌ వేర్పాటువాద నేత షబ్బీర్‌షాకు ఢిల్లీ కోర్టు బెయిలు తిరస్కరించింది. పాకిస్థాన్‌తో పాటు కొన్ని మిలిటెంట్ సంస్థలు క‌శ్మీర్ అల్లర్లకు ఆర్థిక స‌హ‌కారం అందిస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వేర్పాటువాద నేత‌ల‌కు, ఉగ్ర మూక‌ల‌కు డ‌బ్బు చేరుతున్నట్లు ఎన్ఐఏ ద‌ర్యాప్తులో తేలింది.

08:07 - September 7, 2017

పాట్నా : బిహార్‌లో కారును ఓవర్‌ టేక్‌ చేయబోయిన ఓ యువకుడిని కాల్చి చంపిన కేసులో జెడియు బహిష్కృత నేత మనోరమాదేవి కుమారుడు రాకీ యాదావ్‌కు కోర్టు జీవితఖైధు శిక్ష విధించింది. రాకీ యాదవ్‌తో పాటు మరో ఇద్దరికి గయా జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించిన రాకీ యాదవ్‌ తండ్రి బిందీ యాదవ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 2016, మే 7న తన కారును ఓవర్‌ టేక్‌ చేశాడన్న కారణంతో రాకీ యాదవ్ ఇంటర్‌ విద్యార్తి ఆదిత్య సచ్‌దేవ్‌ను కాల్చి చంపాడు. ఆ సమయంలో రాకీ కారులో నలుగురు స్నేహితులు కూడా ఉన్నారు. 16 నెలల తర్వాత తమకు న్యాయం జరిగిందని కోర్టు తీర్పుపై ఆదిత్య సచ్‌దేవ్‌ పేరెంట్స్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో రాకీ యాదవ్‌ పట్నా హైకోర్టు బెయిలు మంజూరు చేయగా...సుప్రీంకోర్టు రద్దు చేసింది.

 

08:05 - September 7, 2017

ముంబై : చార్జీల బాదుడులో... ఎస్బీఐ ప్రైవేట్ బ్యాంకులను మించిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 235కోట్ల రూపాయలు పెనాల్టీ కింద వసూలు చేసింది. ఏప్రిల్ నుంచి జులై మధ్య కాలంలో మినిమమ్ బ్యాలెన్స్ లేని 3కోట్ల 88లక్షల 74వేల అకౌంట్ల ఖాతాల నుంచి ఈ మొత్తం వసూలు చేసింది. ముంబైలోని చంద్రశేఖర్ అనే ఆర్టీఐ కార్యకర్త వేసిన అర్జీపై ఎస్బీఐ ఈ సమాచారం వెల్లడించింది. 

08:04 - September 7, 2017

నేమిథా : భారత్‌-మయన్మార్‌ల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోది మయన్మార్‌ ప్రభుత్వ కౌన్సిలర్‌ ఆంగ్‌ సాన్‌ సూకీతో భేటి అయ్యారు. దైపాక్షిక అంశాలపై చర్చించిన అనంతరం ఇరుదేశాలు 11 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో సముద్ర తీర భద్రతకు సంబంధించిన ఒప్పందం అత్యంత ప్రాధాన్యమైనది. మయన్మార్‌లో ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం, ఆరోగ్యం, ఐటి రంగాల్లో భారత్‌ సహకరించనుంది. తమ భూభాగంపై టెర్రరిజాన్ని అంగీకరించేది లేదని ఆంగ్‌ సాన్‌ సూకి స్పష్టం చేశారు. భద్రత, ఉగ్రవాద నిరోధం, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన, ఇంధన రంగాల్లో ఇరుదేశాల పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భావిస్తున్నట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్‌ను సందర్శించాలనుకునే మయన్మార్‌ వాసులకు ఉచితంగా వీసాలు ఇస్తామని తెలిపారు. భారత్‌లోని జైళ్లలో మగ్గుతున్న 40 మంది మయన్మార్‌ పౌరులను విడుదల చేస్తామని మోది ప్రకటించారు. ఈసందర్భంగా రోహింగ్యాల వలసలపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

08:03 - September 7, 2017

చెన్నై : నీట్ ద్వారా మెడిసిన్‌లో సీటు రాక ఆత్మహత్యకు పాల్పడ్డ అనితకు సంఘీభావంగా తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మెరీనా బీచ్‌లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద విద్యార్థులు ధర్నాకి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు నివ్వాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఆందోళనకు దిగిన స్టూడెంట్స్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మెరీనాబీచ్‌లో నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

08:02 - September 7, 2017

ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారంగా 5.19 లక్షల మంది రైతులుంటే, ఇందులో 50 శాతం మంది రైతులకు మాత్రమే బ్యాంకు రుణాలు అందుతున్నాయి. అవి కూడా అరకొరగా అందుతుండటంతో పెట్టుబడి కోసం దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇక బ్యాంకు గడప తొక్కని ఇతర రైతులు పూర్తిగా వ్యాపారులపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

వర్షాధార పంటలపైనే ఆధారపడాలి
ఆదిలాబాద్ జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం ఏడు లక్షల హెక్టార్ల వ్యవసాయభూమి ఉంది. అయితే ఏటా సాగయ్యే భూమి ఆరు లక్షల హెక్టార్లకు మించడం లేదు. సాగు నీటి సౌకర్యం 2.50 లక్షల హెక్టార్లకే ఉండటంతో.. ఎక్కువ మంది రైతులు వర్షాధార పంటలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అధికారుల నివేదిక ప్రకారం జిల్లాలో కాలువల ద్వారా 60 వేల హెక్టార్లు, రిజర్వాయర్ల ద్వారా 72 వేలు, బావులు, బోర్లు తదితర వాటితో 50 వేలు, ఇతర సౌకర్యాల ద్వారా 28 వేల హెక్టార్ల భూమికి సాగు నీరందుతోంది. జిల్లాలో ఉన్న సాగు భూమిలో 32 శాతం భూమికి మాత్రమే సాగు నీరందుతుంది. దీంతో కాలం కలిసి రాక రైతులు ఏటా నష్టపోవాల్సి వస్తోంది. దీంతో తిరిగి పంట వేయటానికి దళారుల వద్ద మళ్లీ అప్పులు చేస్తున్నారు. ఇలా ఏటా అప్పులు పెరుగుతున్నాయే తప్ప లాభపడింది లేదని రైతన్నలు వాపోతున్నారు. అయితే జిల్లాలో ఈ ఏడాది పంట రుణాలు రూ.1323 కోట్లు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. గతంతో పోలిస్తే రెండేళ్లలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం పెరిగినా రైతులను ఆదుకోవడంలో బ్యాంకులు వెనుకబడి ఉన్నాయి. అప్పులు తీసుకునే వారిలో సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. పంటల సాగుకు పెట్టుబడి లేకపోవడంతో రైతులు వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోంది.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
అయితే జిల్లాలో అటవీ భూమిని హక్కుగా పొంది సాగు చేసుకుంటున్న రైతులు 50 వేలకు పైగా ఉన్నారు. వారికి ప్రభుత్వం భూమి సాగు చేసేందుకు హక్కు కల్పించినా ఆ భూమిపై పంట రుణం పొందని పరిస్థితి ఉంది. ఎన్నోఏళ్లుగా ఏజెన్సీ ఏరియాలో భూములు సాగు చేసుకుంటున్న రైతులు ఉన్నారు. వారికి ఆ భూములపై పట్టాలు లేకపోవడంతో ఆయా రైతులు రుణాలు పొందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... తమకు రుణాలు బ్యాంకుల నుంచే లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. ఏజెన్సీ ఏరియాలో భూములు సాగుచేసుకునే రైతులకు కూడా రుణాలు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  

08:00 - September 7, 2017

విశాఖ: పోర్టులో ఒక నౌక లోడింగ్ సమయంలో పక్కకు ఒరిగిపోవడంతో భారీగా ఆస్తినష్టం సంభవించింది. సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం తప్పింది. సోమవారం ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టుకు ఈ నౌక వచ్చింది. ఈక్యూ ఐదో నంబర్ బెర్త్ వద్ద ఉన్న నౌకలో సరుకు లోడింగ్ జరుగుతోంది. లోడింగ్ అనంతరం నౌక హాంకాంగ్‌కు వెళ్లాల్సి ఉంది. ఐతే ఈలోపుగానే ఈ ఘటన చోటు చేసుకుంది. 

07:59 - September 7, 2017

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఇస్సాపల్లి గ్రామంలో దాడి ఘటనలో.. దళితులు పోలీసులను ఆశ్రయించారు. అగ్రవర్ణాలు తమపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న సమయంలో కులంపేరుతో దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామన్నారు. 

07:58 - September 7, 2017

హైదరాబాద్ : 10 టీవీ ఎస్టేట్‌ మేనేజర్‌ మధుసూదన్‌ రెడ్డి సంతాపసభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. నియోకర్సర్‌ ఆధ్వర్యంలో మధుసూదన్‌ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మధుసూదన్‌ రెడ్డి మృతి ప్రజానాట్యమండలి, 10టీవీకి తీరని లోటు అని ప్రముఖ గాయకుడు జయరాజ్‌ అన్నారు. ప్రజా సమస్యలపై ఆయన ఎప్పుడూ స్పందించే వారని.. కళలను ప్రోత్సహించేవారని సినీనటుడు మాదాల రవి తెలిపారు.  

07:57 - September 7, 2017

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా... కంగ్టి మండలంలో భూ దందా వెలుగులోకి వచ్చింది. కొంతమంది పెద్దలు మూడు వేల ఎకరాలకుపైగా పేదల భూములను కబ్జా చేశారు. బడుగు పేద రైతుల నుంచి...భూములు లాక్కున్నారు. ఇందులో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీబీ పాటిల్‌ అండతోనే కొంతమంది తమ భూములను సొంతం చేసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీకి చెందిన శర్మ అనే వ్యక్తి 2006లో మండలంలోని... బీంరా, బోరీ, చాప్టా, కంగ్టి, మోర్గీ లాంటి 15 గ్రామాల రైతుల భూములను ఎకరాకు 40 వేల రూపాయలు చొప్పున కొంటానని,... అడ్వాన్స్‌గా పది వేల రూపాయలు ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత శర్మ రైతులను కలవలేదు. దీంతో ఆ రైతులే భూముల్లో సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల ఎంపీ బీబీ పాటిల్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఈ భూముల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదేంటని అడిగితే ఈ భూములు తమవేనని సమాధానం చెబుతున్నారు.

వాపోతున్న రైతులు...
కొనుగోలు చేసిన వ్యక్తి రాకుండా... ఇప్పుడు ఎవరో వచ్చి... తమ భూములు సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రైతులు వాపోతున్నారు. అక్రమంగా తమ భూములను లాక్కొంటున్నారని ... ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములను కొనుగోలు చేసిన శర్మ ఈ భూములను తనఖా పెట్టి వందల కోట్ల రుణాలు పొందడం ఈ ఎపిసోడ్‌లో మరో కోణం... దీనిపై సీబీసీఐడీ విచారణ కూడా సాగుతోంది. విచారణలో ఉండగా ఈ భూముల్లో అసలు నిర్మాణాలు ఎలా చేపడతారని.. సీపీఎం నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ అండతో ఈ కబ్జా జరిగిందని విమర్శిస్తున్నారు. ఈ భూ దందాపై ఇప్పటికైనా అధికారులు పూర్తి విచారణ జరిపించి... రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే .. న్యాయం కోసం పోరాటం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. 

07:56 - September 7, 2017

విజయవాడ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం 2016 సెప్టెంబర్‌ 7న రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించింది. 2014 ఏప్రిల్‌ 1 నుంచి చేసిన పనుల ఖర్చులను రీయింబర్స్‌ చేస్తామంటూ కేంద్రం ప్రకటించింది. అంతేకాదు... విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్‌, తాగునీటి పథకానికి అయ్యే ఖర్చు మినహా నీటిపారుదల విభాగానికి అయ్యే ఖర్చులను భరిస్తామని హామీనిచ్చింది. 2014 నుంచి వరుసగా మూడు సంవత్సరాల్లో 3,364.70 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కూడా చూపించింది. మరో 3,793 కోట్ల రూపాయల నిధులను రీయింబర్స్‌ చేయాలని ఏపీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. డీల్‌ గడువులోగా 2018 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలంటే నిధుల కొరత లేకుండా చూడాలని కోరింది.

వివరణ కోరిన కేంద్రం
ఏపీ పంపిన ప్రతిపాదనలపై పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాను కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి అమర్జీత్‌సింగ్‌ వివరణ కోరారు. దీంతో ఆర్కే గుప్తా... పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని, 2018 నాటికి పాక్షికంగా పూర్తిచేసి ఆయకట్టుకు గ్రావిటీ ద్వారా నీళ్లు అందించగలుగుతామని నివేదిక పంపారు. నివేదిక మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అమర్జీత్‌ సింగ్‌... మూడేళ్లలో విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు, యూసీలు కేంద్రానికి పంపాలని ఆదేశించారు. అయితే వాటిని ఆర్కే గుప్తా సకాలంలో సమర్పించలేదు. దీంతో ఆర్కే గుప్తా జాప్యం చేయడంపై అమర్జీత్‌సింగ్‌ సీరియస్‌ అయ్యారు. అంతేకాదు.. గుప్తా పంపిన నివేదికలో క్లారిటీ లేకపోవడంతో అమర్జిత్‌సింగ్‌కు అనుమానం కలిగింది. దీంతో గుప్తాపై బదిలివేటు వేసినట్టు తెలుస్తోంది.

శ్రీవాత్సవ నివేదిక...
2016-17 ఆర్థిక సంవత్సరంలో నాబార్డు దగ్గర దీర్ఘకాలిక నీటిపారుదల నిధి కింద ఏర్పాటు చేసి నిధుల్లో నుంచి 9,086.02 కోట్ల రూపాయాలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులకు విడుదల చేశారు. ఇందులో 2,414.16 కోట్ల రూపాయలను పోలవరం ప్రాజెక్టుకు మంజూరు చేశారు. ఈ ఏడాది ఎల్టీఐఎఫ్‌ నుంచి 9.020 కోట్ల నిధులను దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులకు విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో పోలవరం ప్రాజెక్టుకు కేవలం 779.36 కోట్ల రూపాలను నాబార్డు కేటాయించింది. బాండ్ల రూపంలో నాబార్డు నిధులను సేకరించాక... శ్రీవాత్సవ ఇచ్చే నివేదిక ఆధారంగా 979.36 కోట్లను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్టు జలవనరులశాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్టుగా 2018 చివరి నాటికి పోలవరం పూర్తిచేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

07:54 - September 7, 2017

విశాఖ : ఏపీ ప్రభుత్వం జలసిరికి హారతి అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విశాఖ జిల్లాలో చంద్రబాబు జలసిరికి హారతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విశాఖ జిల్లాలోని గొబ్బురుకు చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా నర్సపురంలోని శారదా నదికి చేరుకున్నారు. శారద నదిపై 16.17 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆనకట్టను ప్రారంభించారు. అనంతరం జలసిరికి హారతి ఇచ్చి పట్టువస్త్రాలు, పూలు సమర్పించారు.

నీటిని జాగ్రత్తగా వినియోగించాలి
గొబ్బూరులో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ప్రతి ఒక్కరు నీటిని జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. నదులను అనుసంధానం వల్ల లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తుంపాల ప్రాజెక్ట్‌ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. జీవన ప్రమాణాలు సక్రమంగా ఉండాలంటే ప్రకృతిని ఆరాధించాలని పిలుపునిచ్చారు. అందరికీ తిండిపెట్టే రైతన్నలను గౌరవించడం మనందరి బాధ్యత అని ముఖ్యమత్రి అన్నారు. శారదానదికి హారతినివ్వడం తన జీవితంలో మర్చిపోలేని సంఘటనగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సిన నిధులతో పాటు.. రైతులకు ఇవ్వాల్సిన మూడో విడత రుణమాఫీ నిధులను త్వరలోనే విడుదల చేస్తామని హామీనిచ్చారు.

తోటపల్లి కాలువకు జలసిరికి హారతి
విశాఖ జిల్లా నుంచి చంద్రబాబు నేరుగా విజయనగరం జిల్లాలోని చీపురుపల్లికి చేరుకున్నారు. తోటపల్లి కాలువ దగ్గర జలసిరికి హారతి ఇచ్చారు. జిల్లాలోని నాలుగు నదులను అనుసంధానిచ్చి రైతులకు కరువు లేకుండా సాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. విజయనగరం జిల్లాకు 25వేల బోర్లు, 25వేల పంపుసెట్లు అందిస్తామని హామీనిచ్చారు. చివరిగా సభలో పాల్గొన్న వారందరిచేత కరువు రహిత రాష్ట్ర నిర్మాణం కోసం కృషి చేస్తామని చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. 

పెద్దపల్లిలో టీ మాస్ ఫోరం అవిర్భావ సభ

కరీంనగర్/పెద్దపల్లి : జిల్లా గోదావరిఖనిలో నేడు టీ మాస్ అవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీపీఎం కార్యదర్శి తమ్మినేని, ప్రజాగాయకుడు గద్దర్, విమలక్క హాజరుకానున్నారు.

07:21 - September 7, 2017

గౌరీ లంకేష్ హత్య భవన ప్రటన స్వేచ్ఛపై దాడి అని, రాజ్యంగ మీద దాడి అని ముంబై హైకోర్టు మొన్న తీర్పు ఇచ్చిందని, హత్య కేవలం వ్యక్తి చేసింది కాదని దీని వెనుక వ్యవస్థ ఉందని, గాంధీ చంపిన గాడ్ సేను దండలేసిన వారు ఇప్పుడు పాలకులైయ్యారని, ప్రశ్నకు మరణం లేదని, నిజం ఎప్పుడు భూమిలో నాటిన బీజం వంటిదని, రాజకీయంగా మతున్మాద శక్తులు అధికారంలోకి రావడమే దీనికి కారంణమని ప్రజసంఘాల నాయకులు జేవీవీ రమేష్ అన్నారు. గౌరీ లంకేష్ హత్య పట్ల బీజేపీ సంతపం వ్యక్తం చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా జర్నలిస్టుల హత్యలు జరిగాయని, బీజేపీ పై అనవసరంగా మాట్లాడుతున్నారని బీజేపీ నేత కుమార్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

​తూర్పుగోదావరిలో చంద్రబాబు పర్యటన

తూర్పుగోదావరి : ఏపీ సీఎం చంద్రబాబు నేడు రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఆయన అర్బన్ ఎస్పీ, సీఐడీ ఆఫీసులను ప్రారంభించనున్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనానికి శంకుస్థాపన చేయనున్నారు.

ముంబై పేలుళ్ల కేసులో నేడు టాడా కోర్టు తీర్పు

ముంబై : 1993 ముంబై పేలుళ్ల కేసులో టాడా కోర్టు నేడు తుది తీర్పు ఇవ్వనుంది. అబూసలేంతో పాటు నింధితులకు టాడా కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

నేటితో ముగియనున్న నీట్ కౌన్సిలింగ్

ఢిల్లీ : నేటితో నీట్ కౌన్సిలింగ్ ముగుస్తోంది. ఈ సంవత్సరం నుంచి దేశవ్యాప్త మెడికల్ ఎట్రెన్స్ పరీక్ష నిర్వహించి నీట్ ద్వారా సీట్లు భర్తీ చేస్తున్నారు.

నేడు జీహెచ్ఎంసీ సమావేశం

హైదరాబాద్ : నగరంలో ఏరియా సభల ఏర్పాటు కోసం నేడు జీహెచ్ఎంసీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి కమిషనర్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. 150 వార్డులను, 146 వార్డులుగా ఏర్పాటు చేసి వార్డులకు ప్రతినిధులను నియమించనున్నారు.

Don't Miss