Activities calendar

08 September 2017

21:31 - September 8, 2017

చండిఘర్  : హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్ఛా సౌధా ప్రధాన కార్యాలయంలో భారీ భద్రత నడుమ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. డేరా ఆశ్రమం పరిసరాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా కర్ఫ్యూ విధించారు. 41 కంపెనీల ఆర్మీ జవాన్లు, నాలుగు జిల్లాల పోలీసులు, ఒక ప్రత్యేక పోలీస్ టీం, బాంబ్ స్క్వాడ్ సోదాల్లో పాల్గొన్నాయి. భద్రత అధికారుల తనిఖీల్లో ఐదుగురు అనుమానస్పద యువకులు పట్టుబడ్డారు. ఇందులో ఇద్దరు మైనర్‌ బాలురు. వీరిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

భారీ ఎత్తున పాత కరెన్సీ..
సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా డేరా ఆశ్రమంలో భారీ ఎత్తున పాత కరెన్సీ లభించింది. డేరా సమీప మార్కెట్‌లో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ ప్లాస్టిక్‌ కరెన్సీ దొరికింది. వీటితో పాటు కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డేరాలోని కంట్రోల్‌ రూమ్‌తో పాటు మరో మూడు గదులను పోలీసులు సీల్‌ చేశారు. అనుమానిత ప్రదేశాల్లో తవ్వకాలు జరిపేందుకు జెసిబి సహాయాన్ని కూడా తీసుకున్నారు. మెటల్‌ డిటెక్టర్‌ సహకారంలో గోడలను తనిఖీ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఫోరెన్సిక్ టీమ్‌ను కూడా ఆశ్రమానికి రప్పించారు. డేరా ఫార్మసీలో అన్‌ బ్రాండెడ్‌, లేబుళ్లు లేని మందులు పెద్దఎత్తున లభించాయి. ఓబీ వ్యాన్‌, నంబరు ప్లేట్‌లేని ఓ కారును అధికారులు గుర్తించారు. డేరా ప్రధాన కార్యాలయంలో విస్తృత తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను అధికారులు నిలిపివేశారు. ఈ నిషేధం సెప్టెంబర్‌ 10 వరకు ఉంటుంది.

అస్తిపంజరాలు...
డేరా క్యాంపస్‌లో అస్తిపంజరాలు ఉన్నాయని డేరా అనుకూల పత్రిక సచ్‌ కహూ పేర్కొంది. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష పడ్డ విషయం తెలిసిందే. బాబా జైలుకు వెళ్లినప్పటినుంచి విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. హరియాణా, పంజాబ్‌లలోని డేరా ఆశ్రమాల నుంచి ఇప్పటికే ఆయుధాలు లభ్యమయ్యాయి.

21:26 - September 8, 2017

హైదరాబాద్ : నిమ్స్‌ ఆస్పత్రిలో నేరెళ్ల బాధితులకు చికిత్స చేయకుండా బయటకు గెంటివేయడంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ ఒత్తిడితోనే వైద్యులు వారిని బయటకు పంపారన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. కేటీఆర్‌ డైరెక్షన్‌తో బాధితులను పోలీసులు వేధిస్తున్నారన్నారు. బాధితుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై... మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. బాధితులకు న్యాయం కోసం ఈనెల 15 నుంచి నేరేళ్లలో రిలే నిరాహార దీక్షలు చేపడతామరి జానారెడ్డి అన్నారు. 

21:24 - September 8, 2017

హైదరాబాద్ : స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ అబద్ధాలను ప్రచారం చేస్తుందన్నారు మంత్రి హరీష్‌రావు. ప్రభుత్వ పథకాలతో రైతులు సంతోషంగా ఉంటే ఓర్వలేని కాంగ్రెస్‌ నేతలు... లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని హరీష్‌రావు అన్నారు. 

21:23 - September 8, 2017

అనంతపురం/కర్నూలు : ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించారు.. ముందు కర్నూలు జిల్లా చేరుకున్న సీఎం.... ముచ్చుమర్రి ఎత్తి పోతల పథకాన్ని ప్రారంభించారు... నదికి జలహారతి ఇచ్చారు.. హంద్రినీవా సుజల స్రవంతి మొదటి దశ రెండో ప్యాకేజీలో భాగంగా నిర్మించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా.. కర్నూలు, కడప, చిత్తూర్‌, అనంతపూర్‌ జిల్లాల్లోని 6లక్షల ఎకరాలకు సాగునీరు. 33 లక్షలమందికి తాగునీరు అందనుంది. శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ ద్వారా 40 టీఎంసీల నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా తరలిస్తారు.

పోలవరం పూర్తి చేసి తీరతా
పేదవాడికి అండగా ఉండడమే తన జీవితాశయమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం పూర్తి చేసి తీరతామని తేల్చిచెప్పారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ పూర్తి చేసింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్నీ అనుకున్న సమయానికంటే ముందే పూర్తిచేసి లిమ్కా బుక్‌లో చోటు దక్కించుకున్న ఈ సంస్థ, ముచ్చుమర్రి ఎత్తిపోతలను కూడా రెండేళ్ల వ్యవధిలోనే పూర్తి చేసింది. మేఘా సంస్థ పనితీరును ప్రశంసించిన చంద్రబాబు... సంస్థ ఎండీ కృష్ణారావును ముచ్చుమర్రి సభలో సన్మానించారు.. ఈ సందర్భంగా, ప్రాజెక్టు పూర్తికి కృషి చేసిన మిగతా అధికారులనూ సత్కరించారు.

ఇంద్రావతి దగ్గర జలహారతి
ముచ్చుమర్రి నుంచి చంద్రబాబు అనంతపురం జిల్లాకు వెళ్లారు. ఉరవకొండ ఇంద్రావతి దగ్గర జలహారతి ఇచ్చారు.. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లాను పండ్ల తోటల హబ్‌గా మారుస్తామని సీఎం ప్రకటించారు.. అవినీతి లేని పాలనే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.. ప్రజలు తమకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా 1100 నెంబర్‌ ఫోన్‌ చేయాలని... వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండు జిల్లాల పర్యటనల్లో బిజీ బిజీగా గడిపిన చంద్రబాబు.. సీమ వాసులపై వరాలు కురిపించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా.. ఆయా సభల్లో ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

రాజమౌళికి అక్కినేని పురస్కారం

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం లభించింది. ఈనెల 17న ఉపరాష్ట్రపతి చేతుల మీదగా అవార్డు ప్రధానోత్సవం జరగనుంది.

కాకినాడ కార్పొరేషన్ మేయర్ ఎన్నికు నోటిఫికేషన్

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ కార్పొరేషన్ మేయర్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 16న మేయర్, డీప్యూటీ మేయర్ ఎన్నిక చేయనున్నారు.

రేపు 21వ జీఎస్టీ సమావేశం

హైదరాబాద్ : రేపు 21వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. తెలంగాణ తరుపున ఈటెల, కడియం హాజరుకానున్నారు.

20:42 - September 8, 2017

సరదాగా మొదలౌతుంది. రక్తం చిందటంతో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా ఆటలాడిస్తుంది. అంతా గేమ్ లో భాగం అనుకుంటారు. కానీ, అది వాడి స్క్రీన్ ప్లేలో భాగమని గుర్తించలేరు. ఆడిస్తూ, పాడిస్తూ, బెదిరిస్తూ చివరకు చావుముంగిట్లోకి పిల్లలను లాక్కెళుతోందా గేమ్. అదే బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్.. చావుతో ఛాలెంజ్ చేసే పరిస్థితి లేతబుగ్గల చిన్నారులకు ఎందుకు వస్తోంది? ఎవరా పరిస్థితి కారణమౌతున్నారు? ఈ డెత్ గేమ్ లబారినుండి పిల్లలను కాపాడేదెలా? క్యాండీ క్రష్, జెల్లీ సాగా, కలర్ స్విచ్, పియానో టైల్స్, పొకెమాన్, టెంపుల్ రన్, ఈ పేర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇంకా చెప్తే ఇవన్నీ అవుట్ డేటెడ్. కానీ, ఈ గేమ్ ల సరసన ఓ డెత్ గేమ్ ఎంటరయింది. వచ్చీ రాగానే చావుమేళం మోగిస్తోంది. సరిగ్గా 50 రోజుల్లో చిన్నారుల ఉసురు తీస్తోంది. తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగులుస్తోంది.

ఫైనల్ స్టేజ్ ఆత్మహత్య
తీరానికి వచ్చి బ్లూవేల్స్ అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకుంటాయి. అదే పేరును ఈ గేమ్ కి పెట్టారు. పేరుకి తగ్గట్టుగానే దీని ఫైనల్ స్టేజ్ ఆత్మహత్యతో ముగుస్తుంది. పద్మవ్యూహంలో ఇరుక్కున్నట్టుగా చిన్నారులు, బలహీన మనస్తుల.. ఇది ఆడించినట్టల్లా ఆడి చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్ ఓ హిప్నాటిక్ గేమ్.. రష్యాలో వందలమంది టీనేజర్లు బలయ్యారు. చూడటానికి జస్ట్.. ఓ మొబైల్ గేమ్ అనిపిస్తుంది .. కానీ, 10 నుంచి 14 ఏళ్ల పిల్లలే లక్ష్యంగా రూపొందించిన ఈ ఆట లేత మనసులను దారుణంగా వేటాడేస్తుంది. భావోద్వేగాలతో ఆడుకుంటూ, పసి హృదయాలను మృత్యుముఖంలోకి తోసేస్తుంది. ఈ ప్రాణాంతక క్రీడను రూపొందించిన సైకో డెవలపర్ ఫిలిప్ బుడేకిన్‌ను రష్యా పోలీసులు అరెస్టుచేసినా, ఆ ఆట అనేక కాపీ ప్రోగ్రామ్ ల రూపంలో ఇంటర్నెట్ లో వివిధ దేశాలకు విస్తరిస్తూనే ఉంది.

నిన్నటిదాకా పోకెమాన్
ఇప్పుడు బ్లూ వేల్ ఛాలెంజ్.. సవాల్ విసురుతోంది. నిన్నటిదాకా పోకెమాన్ సంచలనం కలిగించింది. అంతకుముందు ఛోకింగ్ గేమ్ ఊపిరి తీసింది. అన్నిటికీ కారణం స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్.. అరచేతిలో ప్రపంచాన్ని చూపే ఫోన్.. ఇప్పుడు సమాచారం కోసం కంటే... వినోదానికి, అంతకంటే వికృత చేష్టలకు ఎక్కువగా ఉపయోగపడుతోంది. సాంకేతిక ప్రగతి ఎంటర్ టైన్ మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అదే సమయంలో వినోదాన్ని హై ఎండ్ కి తీసుకెళ్లే అప్లికేషన్లు కొన్ని, ప్రమాదాల అంచుకు లాక్కెల్లే గేమ్ లు మరికొన్ని అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే మనుషులు బయటి ప్రపంచాన్ని వదిలేసి వర్చువల్ వాల్డ్ కి పరిమితం అవుతూ సామాజిక జీవనాన్ని మరచిపోతున్నారు. ఇప్పుడు బ్లూవేల్ లాంటి గేమ్ లు ఆ ప్రమాదాన్ని మరింత పెంచే అవకాశముంది. రెండంచుల కత్తిలాంటి టెక్నాలజీని వాడుకోవటంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్నిసార్లు జీవితమే చేజారుతుంది. కీప్ వాచింగ్ టెన్ టీవీ. న్యూస్ ఈజ్ పీపుల్.

 

20:40 - September 8, 2017

అయ్యా కల్వకుంట్ల చంద్రాశేఖరా తమరి ప్రభుత్వం ఎట్లైనా దళితులను బత్కనియ్యది గని.. ఊకె సప్పుడు జేక ఒక ఎంట్రిన్ డబ్బ గొన్కొచ్చి తెలంగాణ దళిత వాడల పొంట నీళ్ల ట్యాంకులుంటయ్ గదా.. అగో అండ్ల గల్పిపోయ్యి..అందరు ఒక్కటే పారి సచ్చివొతరు.. అప్పుడు నిమ్మలమైతది మీ ప్రభుత్వనికి.. ఇంత దుర్మార్గమా సారూ..దళితులకు వైద్యం గూడ అందకుండ జేస్తున్నవంటే..చీ..చీ..

ఈ సారి గూడ బత్కమ్మ పండుగా భారీగా జేయాలనుకుంటున్నదట తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల ఇర్వై తారీకు సంధి ఇర్వై ఎన్మిది తారీకు దాక.. పండుగా డేట్ ఫిక్సు జేశిండ్రు.. అన్ని జిల్లాలళ్ల జోరుగా జేస్తరట.. ఏర్పాట్లు ఇద్వర్ సందే మొదలు వెట్టుమని అధికార్లకు నోటిమాట జెప్పిండ్రట..

భారతీయ రైల్వే శాఖ మీద శనిగ్రహాం గూసున్నదా ఎట్ల..? దేశంలున్న చిన్నజీయర్లు పెద్ద జీయర్లు జర్ర మీరు పూనుకోవాలె.. రైల్వేలకు వట్టిన గాచారం ఏందో కనివెట్టాలే.. రెమెడీలు గూడ సూచించుండ్రి.. ఏ యాగం జేయాల్నో చెప్పుండ్రి ఇన్నోద్దులు మీరు జెప్పకనే రైళ్లు అవ్వంతల అవ్వే పట్టాలు తప్పుతున్నయి..

తెలంగాణ రాష్ట్రం భారతదేశంలనే నెంబర్ వన్ అని తబ్లాలు గొట్టుకుంట తిర్గే నేతలారా..? ఐటిల మనమే నంబర్ వన్..ఎవుసంల మనమే నంబర్ వన్..ఎండ్లైనా మనమే నెంబర్ వన్ అని చెప్పుకుంటురు గని.. మరి అసలైన దాంట్లే మనమే నంబర్ వన్ అన్న సంగతి ఎందుకు చెప్పుకుంటలేరో...?

మన తెలంగాణ చేనేత కార్మికుల తల్కాయ రాతలు మార్చెదాక ఇడ్శపెట్టెతట్టు లేదుగదా.. హీరోయిన్ సమంత నిన్న సిద్దిపేట దుబ్బాక దిక్కు బాగతిర్గింది.. చేనేతను అది జేస్త ఇది జేస్తా అంటున్నది.. ఏది జేశ్న అగాం మాత్రం జేయకు తల్లీ.. ఇప్పటికే వాళ్ల ఆలతు బాగలేదు.. ఏమంటవే మల్లనా..?

అయ్యో.. ఎంత పనైపోయ్యిందమ్మా.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలున్న సముద్రలింగాపూర్ ఊర్లె ఏనంగానో ఊశిపడ్డది పిడ్గు ముప్పై నాల్పై మ్యాకలు ఆడిదాడనే జీవిడ్శినయి.. ఇద్వరకు ఓ పారి ఇట్లనే అయ్యిందట అప్పుడు యాబై గోర్లు సచ్చిపోయ్యినయట అవ్విట్కంటే ఇన్సురెన్పు ఉండి అవ్విటిమందం వచ్చినయి..కానీ మ్యాకలకు అట్ల లేదాయే..? చో..చో..

దొంగొడు ఒగానాడు గాకున్న ఒగాన్నాడన్న బైటవడ్తడు అంటరు సూడు అగో అట్లనే బైటవడ్డది అన్ లైన్ షాపింగ్ కంపెని ఫ్లిప్ కార్డోంది.. ఈ ఆఫర్ ఆ ఆపర్ అని కష్టమర్లని కంటికి రెప్పల సూస్తుంటమని కాకమ్మా ముచ్చట్లు కథలు కథలు చెప్తుంటరు.. చివరాకర్కి కష్టమర్ల మన్సు శిన్నవుచ్చి చేతులు దుల్పుకుంటరు అగో నిన్న గట్లనే అయ్యింది హైద్రావాద్ పట్నంల..

20:27 - September 8, 2017

ముంబై : బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా... దేశీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు తీస్తోంది. ఉత్తర కొరియా, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్‌ ఇర్మా ప్రభావంతో శుక్రవారం పసిడి ధర పది నెలల గరిష్ఠానికి చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే 990 రూపాయలు పెరిగింది. ఈ ఏడాదిలో ఇంతగా బంగారం ధర పెరగడం ఈరోజే. దీంతో పది గ్రాముల పసిడి ధర 31 వేల 3 వందల 50 రూపాయలకు చేరుకుంది. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు కూడా ఊపందుకోవడంతో బంగారం ధర పెరిగినట్టు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి రూ.42వేలకు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో వెండి ధర పెరిగినట్టు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

డాలర్‌ విలువ పడిపోవడం
2015 కనిష్ఠానికి డాలర్‌ విలువ పడిపోవడం అంతర్జాతీయ మార్కెట్‌కు కలిసొచ్చిందని బులియన్‌ ట్రేడర్లు చెబుతున్నారు. హరికేన్‌ ఇర్మా అమెరికాపై భారీగా ప్రభావం చూపడం.. అంచనా వేసిన దానికంటే బలహీనంగా ఉద్యోగ డేటా విడుదల కావడం...డాలర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని బులియన్‌ ట్రేడర్లు తెలిపారు. ఈ ప్రభావాలతో అంతర్జాతీయంగా బంగారం ఔన్సు ధర 0.31శాతం పెరిగి...1,352 డాలర్ల 80 సెంట్లు పలికింది.

 

20:26 - September 8, 2017

వాషింగ్టన్ : కరేబియన్‌ దీవుల్లో ఇర్మా తుఫాను పెను బీభత్సం సృష్టించింది. అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఏర్పడ్డ హరికేన్లలో కెల్లా అత్యంత శక్తిమంతమైన ఈ తుపాను గత రెండు రోజులుగా కరేబియన్‌ దీవులను అతలాకుతలం చేసింది. కరేబియన్‌ దీవుల్లో విధ్వంసం సృష్టించిన ఇర్మా- క్రమంగా అమెరికాలోని ఫ్లోరిడా తీరం వైపు దూసుకెళ్తోంది. డొమినికన్‌ రిపబ్లిక్, హైతీలపై ప్రభావం చూపిన హరికేన్‌...క్యూబా, బహమాస్‌ మీదుగా ఆదివారం తెల్లవారుజామున ఫ్లోరిడా తీరాన్ని తాకవచ్చని అమెరికా వాతావరణ శాఖ పేర్కొంది. ఆంటిగ్వా, బార్బుడా, సెయింట్‌ మార్టిన్‌, సెయింట్‌ బార్టెలెమి, వర్జిన్‌ ఐలాండ్స్, ప్యూర్టోరికా దీవుల్లో ఇర్మా కోలుకోలేని దెబ్బ తీసింది. గంటకు 285 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో విద్యుత్‌, సమాచార, రవాణా వ్యవస్థలు కుప్ప కూలాయి.

ఇప్పటివరకు 14 మంది చనిపోయారు
హరికేన్‌ ఇర్మా ధాటికి కరేబియన్‌ దీవుల్లో ఇప్పటివరకు 14 మంది చనిపోయారు. సెయింట్‌ మార్టిన్‌ ద్వీపంలో 95 శాతం ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్యూర్టోరికాలో 10 లక్షల మంది ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. 50 వేల మందికి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. బార్బుడా దీవుల్లో దాదాపు 60 శాతం మంది నిరాశ్రయులయ్యారు.ఇర్మా అట్లాంటిక్‌ తీర ప్రాంతాన్ని ప్రభావితం చేయనుందని అమెరికా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇర్మా ధాటికి ఫ్లోరిడా తీర ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లవచ్చని, ఫ్లోరిడాతో పాటు జార్జియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ విధ్వంసం జరగవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్లోరిడాలో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అధికారులు స్థానికులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత నష్టాన్ని మిగిల్చే తుపానుగా మిగిలిపోవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ మియామికి చెందిన హరికేన్‌ పరిశోధకుడు బ్రియాన్‌ మెక్‌ నోల్డీ చెప్పారు. 

20:25 - September 8, 2017

చీలి : మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేలుపై భూకంప తీవ్రత 8.1 నమోదైంది. గురువారం రాత్రి సంభవించిన భూ ప్రకంపనలకు భయభ్రాంతులకు గురైన జనం వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంపం ధాటికి దక్షిణ మెక్సికోలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఐదుగురు మృతి చెంది ఉంటారని సమాచారం. 90 సెకన్ల పాటు భవనాలు కంపించాయని స్థానికులు చెబుతున్నారు. భూకంపానికి మెక్సికో నగరంలో పెద్దగా నష్టం వాటిల్లలేదు. పిజిజియాపన్‌కు 87 కిలోమీటర్ల దూరంలో సముద్రగర్భంలో 43 మైళ్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించిన అధికారులు సునామి హెచ్చరికలను జారీ చేశారు. మెక్సికో, గ్వాటెమాలా, ఎల్‌ సాల్వడార్‌, కోస్టారికా, నిఖరాగ్వా, పనామా, హోండూరస్‌, ఈక్వెడార్‌ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అమెరికా వాతావరణ శాఖ వెల్లడించింది. 2.3 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడ్డాయి.

20:24 - September 8, 2017

ముంబై : కర్ణాటకలో సీనియర్‌ జ‌ర్నలిస్ట్ గౌరీ లంకేష్ హ‌త్యపై మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహ‌మాన్ స్పందించాడు. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటే... ఇది నా ఇండియా కాదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గౌరీ హత్య ఘ‌ట‌న తనను ఎంత‌గానో బాధించిందని... ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇండియాలో జ‌ర‌గ‌కూడ‌దని పేర్కొన్నారు. ఇలాంటివి ఇండియాలో జ‌రుగుతుంటే.. ఇది నా ఇండియా కాదు.... నా ఇండియా ఎంతో ద‌య‌తో ఉండాలని రెహ‌మాన్ అన్నాడు. వందేమాతరం, మా తుఝే సలాం లాంటి దేశభక్తి గీతాలకు రెహమాన్‌ సంగీతంతో పాటు గాత్రాన్ని అందించారు. గురువారం ముంబైలో జ‌రిగిన 'వ‌న్ హార్ట్‌: ద ఏఆర్ రెహ‌మాన్ కాన్సర్ట్ ఫిల్మ్ ప్రీమియ‌ర్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

20:23 - September 8, 2017

హైదరాబాద్ : ప్రముఖ జర్నలిస్టు, రచయిత గౌరీ లంకేశ్ హత్యను ఖండిస్తూ హైకోర్టు వద్ద న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. హిందూ మతోన్మాద శక్తుల ఆగడాలను అరికట్టాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. దారుణానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. 

20:22 - September 8, 2017

అసిఫాబాద్ : నమస్తే..! మంచిగుండ్రా.. నా పేరు ఉడత దేవక్క... కొమ్రంభీం జిల్లా... బోరంపల్లి మా ఊరు. మేం గరీబోళ్లం... నాకు లగ్గం జేసేటందుకు ... మా అమ్మ, బాపు దగ్గర పైసల్‌ లేకుండె. ఏం చేయాలో తెలియక పరేషాన్‌ అయ్యేటోళ్లు. అట్లాటప్పుడు మీరు కల్యాణ లక్ష్మి స్కీం తెచ్చిండ్రు. దోస్త్‌లు జెబితే వోయి..దరఖాస్తు పెట్టినం.. లగ్గం టైమ్‌కి పైసలొస్తాయని మాబాపు.. నా పెళ్లి పని షురూ చేసిండ్రు... కానీ గోర్నమెంటాఫీసులో సారోళ్లు.. మమ్మల్ని మస్తు దిప్పుకున్నరు.. గానీ, పైసలు ఇయ్యలే. కడాకు... మా బాపూ మావూరి పటేల్‌ తాన మిత్తికి పైసల్‌ దెచ్చి నాకు లగ్గం చేసిండ్రు. నాకిప్పుడు ఓ పిలగాడూ పుట్టె. ఏడాది సంది తిరిగితే.. ఇప్పటికి గోర్నమెంటు సారోళ్లు కర్నించిండ్రు.. నా లగ్గం కోసమని, పైసల చెక్కు పంపిండ్రు. సీఎం సారూ.. పైసల్‌ ఇచ్చినందుకు మస్తు ఖుష్‌ అయితాంది. గయితే.. ఇది నా లగ్గం నాటికొచ్చుంటే ఎంత మంచిగుండె.. మా అమ్మ, బాపులు నా లగ్గం పైస్‌ల కోసం... తెచ్చిన పైసలకి మిత్తి కట్టే తిప్పలు తప్పుతాండె. ఇన్ని నెలలు మిత్తి కట్టి..కట్టి... మస్తు అవస్థలు పడ్డరు. గిది నా ఒక్కదాని బాధే కాదు.. మా ఇలాఖల.. శానామందిది గిదే లొల్లి. లగ్గం నాటికి రాని పైసలేం పైసలంటుండ్రు. గసుందేకే.. ఈ కల్యాణలక్ష్మి పైసల్‌.. లగ్గం నాటికే అందేటట్ల సూడుండ్రి సారూ.. గప్పుడు, నా అసుంటోళ్ల బాపులకు మిత్తీ తిప్పలు తప్పుతాయి. మా గోస తీరుస్తారు కదా సారూ.. ఉంటామరి.. నమస్తే.. మీ ఓటరు.. ఉడత దేవక్క. 

20:20 - September 8, 2017

కృష్ణా : వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బుడవాడలో అల్ట్రా టెక్ సిమెంట్ కంపెనీ కార్మికులు ఆందోళన చేపట్టారు. జూలై నెలలో అధికారులు ఇచ్చిన హామీలను సైతం వెంటనే అమలు చేయాలని కోరుతూ కంపెనీ గేటు ముందు బైఠాయించారు. కార్మికులు చేపట్టిన ఆందోళనకు సీపీఎం, సీఐటీయూ నేతలు మద్దతు పలికారు. మరోవైపు కంపెనీ ముందు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. 

20:19 - September 8, 2017

సూర్యపేట : జిల్లా కోదాడ మార్కెట్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో వెంటనే మార్కెట్‌, ఫైర్‌ సిబ్బంది మంటలార్పివేశారు. మార్కెట్‌ గోడౌన్‌లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరగడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. 

20:18 - September 8, 2017

కొత్తగూడెం : తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో బిజెపి నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ర్యాలీగా బయలుదేరిన బిజెపి కార్యకర్తలు కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించారు. బారికేడ్లు దాటి దూసుకు వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కలెక్టరేట్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకరరెడ్డి సహా వందమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

20:17 - September 8, 2017

కొత్తగూడెం : భద్రాద్రి ఆలయంలో ఓ భక్తుడిని అవమానం జరిగింది. కొండపల్లి నవీన్ అనే భక్తుడిని ఎస్పీఎఫ్ సిబ్బంది దర్శనం చేసుకోనీయకుండా అడ్డుకున్నారు. క్యూలో ఉన్నవారిని కాకుండా పక్కనుంచి భక్తులను ఎందుకు పంపుతున్నారని నవీన్ ప్రశ్నించడంతో సెక్యూరిటీ సిబ్బంది నవీన్‌తో గొడవకు దిగారు. నవీన్‌ను దర్శనం చేసుకోనీయకుండా ఆలయం బయటకు పంపించి వేశారు. సెక్యూరిటీ సిబ్బంది తీరుపట్ల నవీన్‌తో పాటు తోటి భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

20:16 - September 8, 2017

హైదరాబాద్ : ఉన్న సచివాలయాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే.. కొత్తగా ఎలాంటి బిల్డింగ్‌లు అవసరం లేదన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఖాళీచేసిన సచివాలయం గదులు పిచ్చుక గూళ్లుగా మారుతున్నాయని.. వాటికి కొద్దిపాటి మరమ్మతులు చేస్తే సరిపోతుందని తెలిపారు. ఉన్న బిల్డింగ్‌లను వాడుకోకుండా..కొత్తవాటిని నిర్మించి ప్రజాధనాన్ని వృధా చేయొద్దని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి హితవు పలికారు లక్ష్మణ్. 

20:15 - September 8, 2017

హైదరాబాద్ : సీఆర్‌ సర్కార్‌ తెచ్చిన జీవో-39కి వ్యతిరేకంగా ఈనెల 11న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని టీకాంగ్రెస్‌ నిర్ణయించింది. గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. సెక్రెటేరియట్‌ అంశంతోపాటు రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు నిరసనగా అఖిలపక్షాలతో కలిసి పోరాటం చేయాలని టీ కాంగ్రెస్‌నేతలు నిర్ణయించారు.

20:14 - September 8, 2017

హైదరాబాద్ : ఉపాధ్యాయులు... మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో గురుపూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను బెస్ట్‌ టీచర్స్‌ అవార్డులతో... సత్కరించారు. అవార్డు గ్రహీతలు మరింత బాధ్యతగా పనిచేయాలని... విద్యాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. అలాగే ఎవరి బాధ్యతను వారు... సరిగ్గా నిర్వర్తిస్తే.. విద్యా వ్యవస్థ పటిష్టం అవుతుందని అన్నారు. అలాగే.. మార్కుల కోసం కాకుండా... విద్యార్థుల్లో విలువలు... ఆత్మస్థైర్యాన్ని నింపే.. విధంగా ఉపాధ్యాయులు కృషిచేయాలని మంత్రి ఈటెల రాజేందర్‌ సూచించారు.

20:13 - September 8, 2017

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ తుది దశకు చేరుకుందన్నారు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌. ఢిల్లీలో జవదేకర్‌ను.. కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. ముఖ్యంగా ఏపీలో ఐఐటీ, ఐఐఎం, నీట్, ట్రిపుల్‌ ఐటీ, ఇతర కేంద్రీయ విద్యాసంస్థల శాశ్వత భవనాల నిర్మాణంపై చర్చించారు. ఏపీలో గిరిజన, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని... రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు జవదేకర్‌. 

20:11 - September 8, 2017

హైదరాబాద్ : సీబీఐ కోర్టులో జగన్‌ డిశ్చార్జ్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 22కు వాయిదా పడింది. చార్జ్‌షీట్‌ నుంచి తన పేరు తొలగించాలని జగన్‌ డిశ్చార్జ్‌ పిటిషన్‌ వేయగా... దానిని కొట్టివేయాలంఊ సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. పెట్టుబడుల వ్యవహారంలో క్విడ్‌ ప్రో గానీ...ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవని జగన్‌ తరపు న్యాయవాది వాదించారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసిందన్నారు. తదుపరి విచారణ ఈనెల 22కు వాయిదా వేశారు. మరోవైపు తన లండన్‌ పర్యటన కోసం జగన్‌ పిటిషన్‌ వేయగా... కోర్టు అనుమతిచ్చింది. ఇవాళ విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చిన జగన్‌.. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం వరకు కోర్టులోనే ఉన్నారు. 

20:10 - September 8, 2017

అనంతపురం : రాయలసీమను రతనాల సీమగా చేస్తామని ప్రకటించారు... సీఎం చంద్రబాబు... అనంతపురం జిల్లాను పండ్ల తోటల హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు.. అవినీతి లేని పాలనే తమ లక్ష్యమన్నారు.. పేదల అభివృద్ధికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.. అనంతపురం జిల్లా ఉరవకొండ ఇంద్రావతి దగ్గర నీటి కుంటలో సీఎం జలహారతి ఇచ్చారు.. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు.

20:09 - September 8, 2017

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యను ఖండిస్తూ.. జర్నలిస్ట్ సంఘాలు, ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

20:08 - September 8, 2017

బెంగళూరు : జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ను దుండగులు కాల్చిచంపిన సీసీ టీవీ ఫుటేజ్‌ లభ్యమైంది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన గౌరీ.. గేటు తీసేందుకు కారులో నుంచి కిందకు దిగింది. అప్పటికే ఇంటి ముందు కాపు కాసిన దుండగులు ఆమెను కిందకు తోసేసి కాల్పులు జరిపి పరారయ్యారు. నుదురు, ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో గౌరీ అక్కడికక్కడే మృతి చెందారు. 

20:07 - September 8, 2017

ఢిల్లీ : విమాన ప్రయాణాలలో భద్రతా ప్రమాణాల నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్రం నేటి నుంచి నో ఫ్లై లిస్ట్ అమలు చేస్తోంది. విమాన ప్రయాణాల్లో దురుసుగా ప్రయాణించే వారిపై మూడు పరిధిల్లో చర్యలు చేపట్టనున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు స్పష్టం చేశారు. చర్యలు చేపట్టేముందు వారిని అంతర్గత కమిటీ విచారిస్తుందని ఆయన తెలిపారు. ప్రయాణికులు, విమాన సిబ్బందితోపాటు.. ప్రజానీకం అభిప్రాయాలు సేకరించి నిబంధనలు రూపొందినట్లు అశోక్‌ గజపతిరాజు చెప్పారు. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారాయన. 

20:06 - September 8, 2017

విశాఖ : గంజాయి నిర్మూలించేందుకు ప్రజలు, అధికారులు కలిసిరావాలన్నారు మంత్రి అయ్యన్న పాత్రుడు. గంజాయి అక్రమ రవాణాలో పట్టుబడితే ఎలాంటి వారినైనా పీడీ యాక్ట్‌ కింద నమోదు చేయాలని సూచించారు. గంజాయి రవాణా వలన యువత జీవితాలు నాశనమైపోతాయన్నారు. జీవీఎంపీ ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. డిసెంబర్‌లో ఎన్నికలు పెట్టాలని ఇప్పటికే సీఎంను కోరామని త్వరలో దీనిపై ఓ నిర్ణయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

20:05 - September 8, 2017

అసిఫాబాద్ : కొమురం భీమ్‌ జిల్లాలోని దహేగాం ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి అజయ్‌ని ఉపాధ్యాయుడు చితకబాదాడు. దీంతో అజయ్‌ వీపుపై వాతలు తేలాయి. ఉపాధ్యాయుడు రవిపై.. అజయ్‌ తల్లిదండ్రులు తహశీల్దార్‌, ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. 

మహబూబ్ నగర్ ఉట్కూరులో ఉద్రిక్తత

మహబూబ్ నగర్ : జిల్లా ఉట్కూరులో గణేష్ నిమజ్జనం రోజున ఇరువర్గాల మధ్య వివాదం ఇప్పటి వరకు కొనసాగుతోంది. దీంతో పోలీసులు అక్కడ 144సెక్షన్ విధించారు. ఉట్కూరుకు వచ్చిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

19:05 - September 8, 2017

ఈ మధ్య డిఫరెంట్ సినిమాలు చేస్తూ యుత్ లో తన ఫాలోయింగ్ పెంచుకుట్టున్న నాగచైతన్య యుద్ధం శరణమంటూ ఒక ఇంటెన్సీటి ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యంగ్ టీం అంత కలిసి చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.....

ఈ సినిమా కథ విషయానికి వస్తే అమ్మ, నాన్న, అక్క, చెల్లితో కలిసి ఎలాంటి చింత లేని లైఫ్ గడుపుతుంటాడు అర్జున్. అప్పుడే అర్జున్ జీవితంలోకి అంజలి వస్తుంది. అప్పుడే అర్జున్ జీవితంలో చిన్న కుదుపు వస్తోంది..అదేంటో తెరపై చూడాల్సిందే...ఈ సినిమాకి టెన్ టివి 1.5 ఇచ్చింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

18:38 - September 8, 2017
17:44 - September 8, 2017
17:34 - September 8, 2017

హైదరాబాద్ : తెలంగాణ పౌరసరఫరాల శాఖ మరో ముందడుగు వేసింది. రేషన్‌ షాపుల సమస్త సమాచారాన్ని ఫోన్‌లో తెలుసుకునేలా సరికొత్త యాప్‌ను లాంచ్‌ చేసింది. నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ సౌజన్యంతో తయారు చేసిన ఈ యాప్‌ను మంత్రి ఈటెల రిలీజ్‌ చేశారు. ఈ యాప్‌ ద్వారా సరుకుల నిల్వ... రాకపోకలు..... రేషన్‌ షాప్‌ ఎక్కడుంది? తెరచి ఉందా? మూసి ఉందా?లాంటి సమాచారం ప్రజలు తెలుసుకోవచ్చు.. పౌరసరఫరాలో ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ.. ప్రజలను మరింత చేరువ చేసేందుకు ఈ యాప్‌ రూపొందించామని ఈటెల తెలిపారు.

17:32 - September 8, 2017
17:11 - September 8, 2017

ముంబై : బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే బంగారం ధర రూ.990 పెరిగి రూ.31,350 గా ఉంది. అమెరికాలో హార్వి తుఫాన్, ఉత్తర కోరియా అనుసరిస్తున్న విధానాలతో బంగారం ధర పెరిగినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

'కేటీఆర్ చెప్పినందుకే వారిని గెంటేశారు'..

హైదరాబాద్ : నేరెళ్ల బాధితులకు మానవీయ కోణంలో చికిత్స అందించామని, మంత్రి కేటీఆర్ చెప్పినందుకే నేరెళ్ల బాధితులను నిమ్స్ నుండి గెంటివేశారని టి.కాంగ్రెస్ నేత వీహెచ్ పేర్కొన్నారు. 

16:55 - September 8, 2017

సెల్ ఫోన్..ఇప్పుడిది చిన్నపిల్లల చేతుల్లో కూడా చేరిపోతున్నాయి. చిన్నపిల్లలు మారం చేయకుండా ఉండాలని..సెల్ ఫోన్ లో ఏవో బొమ్మలు..కార్టున్లు..ఇతరత్రా పెట్టి ఇచ్చేస్తున్నారు పెద్దలు. కొన్ని యాప్ లు ఆహ్లాదంగా ఉంటుంటే మరికొన్ని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. అందులో ప్రధానమైంది 'బ్లూ వేల్'. దీని బారిన పడి ఎంతో మంది ఆత్మహత్యకు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు కూడా పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఆత్మహత్యకు పురిగొల్పే ఈ ప్రమాదకర గేమ్ పై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన రెండు నెలలుగా భారతదేశంలో 'బ్లూ వేల్' పేరు మారుమోగుతోంది. అసలు దీనిని సృష్టించింది ఎవరు ? అతని పేరు ఎంటీ ? అనే దానిపై చర్చ జరిగింది. దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రష్యన్ విద్యార్థి ఫిలిప్ బొడికిన్ అనే స్టూడెంట్ దీనిని తయారు చేసినట్లు కథనం. రష్యాలోని అతిపెద్ద సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో డెత్ గ్రూప్ ఆఫ్ కోల్ ఫేక్ట్ అనే గ్రూప్ ప్రవేశ పెట్టాడని..దీనితో అతడిని వర్సిటీ నుండి బహిష్కరించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదకరగేమ్ వల్ల రష్యాలో మొత్తం 16 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది.

'బ్లూ వేల్' మృత్యుక్రీడను సృష్టించిన ఇతడిని రష్యా పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు టాక్. న్యాయస్థానం మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించినట్లు సమాచారం. మరి ఈ వార్త నిజమా ? కాదా ? అనేది రానున్న రోజుల్లో తెలియనుంది. 

గోరఖ్ పూర్ వర్సిటీలో ఎన్నికలు వాయిదా..

ఉత్తర్ ప్రదేశ్ : గోరఖ్ పూర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాసేపటి క్రితం పోలీసులు లాఠీఛార్జీ జరిపారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. 

బ్లాస్టింగ్ స్థావరాలపై ఎస్ వోటీ పోలీసుల దాడులు..

మేడ్చల్ : శామిర్ పేట (మం) తురకపల్లి, లాల్ గాడి మలక్ పేట్ లో బ్లాస్టింగ్ స్థావరాలపై ఎస్ వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. 54 జిలెటిన్ స్టిక్స్, 51 డిటోనేటర్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. 

హెచ్చార్సీకి వెళుతామన్న జానా..

హైదరాబాద్ : నేరెళ్ల బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశించినా నిమ్స్, కేర్ ఆసుపత్రి నుండి గెంటివేయడం బాధాకరమని ఈ విషయంపై హెచ్చార్సీకి వెళుతామని జానారెడ్డి వెల్లడించారు. బాధితులకు బయటి రాష్ట్రంలో చికిత్స చేయిస్తామని పేర్కొన్నారు. 

గంజాయి స్మగ్లింగ్ పై మంత్రి అయ్యన్న వ్యాఖ్యలు..

విశాఖపట్టణం : గంజాయి స్మగ్లింగ్ పై మంత్రి అయ్యన్న పలు వ్యాఖ్యలు చేశారు. గంజాయి స్మగ్లింగ్ విషయంలో ఎక్సైజ్ సిబ్బంది.. పోలీసులు విఫలం చెందారని, ఏజెన్సీలో గంజాయి స్థావరాలు..స్మగ్లింగ్ అందరికీ తెలిసిందేనని, దీనిపై చర్చ ఎందుకని ప్రశ్నించారు. 

16:35 - September 8, 2017

సంగారెడ్డి : బీబీ పాటిల్‌... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజా సేవ చేస్తానని ఎంతో వినమ్రంగా చెబితే.. ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని నమ్మపలికారు. కరవు నివారించి, వలసలను అరికడతానని ఊదరగొట్టారు. మూడేళ్లు గడిచిపోయినా ఒక్కటీ నెరవేరలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. సాగునీరు లేకపోవడంతో కరవు తాండవిస్తోంది. తాగునీరు లేక జనం అల్లాడుతున్నారు. బీబీ పాటిల్‌ హామీలను నమ్మి నట్టేట మునిగామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరిశ్రమ ఎంపీ పాటిల్‌ది కాదట
అయితే ఎంపీ అనుచరులు మాత్రం తమ నేత ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని చెబుతున్నారు. కంగ్టి మండలం బోర్గిలో భారీ ఆహారశుద్ధి కర్మాగారం ఏర్పాటును విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. బోర్గిలో పెడుతున్న మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఎంపీ పాటిల్‌ది కాదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రజల ఉపాధి కోసం పెడుతున్నదని అంటున్నారు. అయితే ఇది స్వయాన ఎంపీకి చెందినదేనని విపక్షాలు చెబుతున్నాయి. బీబీ పాటిల్‌ పెడుతున్న మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ భూముల వ్యవహారంపై ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రైతులను మభ్యపెట్టి తక్కువ రేటుకు కొనుగోలు చేశారన్నఫిర్యాదులున్నాయి. ఈ పరిశ్రమతో 15 గ్రామాల రైతులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.

పరిశ్రమ వ్యవహారంపై సీబీఐ విచారణ
జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోంది. మరోవైపు రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కోనుగోలు చేయటాన్ని ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి. భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. అయితే ఎంపీ అనుచరులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు. భూములను చట్టబద్ధంగా కొనుగోలు చేశామన్న వాదాన్ని వినిపిస్తున్నారు. బీబీ పాటిల్‌ నిర్మాణ సంస్థ అనుబంధ విభాగం ఏర్పాటు చేస్తున్న ఆహారశుద్ధి పరిశ్రమ భూ కబ్జా వ్యవహారాలపై ఎన్నో ఆరోపణలు వస్తున్నా... జహీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ ఇంతవరకు నోరు మెదపలేదు. అనుచరులతో వివరణ ఇప్పించి తప్పించుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ కోసం సేకరించిన భూముల వివాదంపై ఎంపీ బీబీ పాటిల్‌ వివరణ ఇవ్వాలని విపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

16:33 - September 8, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అక్రమంగా తరలిస్తున్న 4 కేజీల బంగారాన్ని జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. గురువారం రాత్రి సికింద్రాబాద్‌కు చేరుకున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా బంగారం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన జీఆర్పీ పోలీసులు రాజేష్‌ఖన్నా, జగన్‌మోహన్‌ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న కోటి 35లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారానికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో బంగారాన్ని కోర్టుకు అప్పగిస్తామని రైల్వే ఇంచార్జ్ ఎస్పీ రాజేంద్రప్రసాద్ చెప్పారు. 

నో ఫ్లై లిస్ట్.

ఢిల్లీ : విమాన ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాల నిబంధనలను పౌర విమానయాన శాఖ కఠినతరం చేసింది. నేటి నుండి నో ఫ్లై లిస్ట్ అమల్లోకి రానుంది. విమాన ప్రయాణాల్లో దురుసుగా ప్రవర్తించే వారిపై మూడు పరిధిల్లో చర్యలు ఉండనున్నాయి. దురుసుగా మాట్లాడితే మూడు నెలల వరకు విమాన ప్రయాణం రద్దు..భౌతిక దాడులు చేస్తే ఆరు నెలల వరకు ప్రయాణం నిషేధం విధించనున్నారు. విమానానికి నష్టం కలిగిస్తే కనిష్టంగా రెండేండ్లు..గరిష్టంగా అపరిమిత విమాన ప్రయాణం నిషేధించనున్నారు. అంతర్గత కమిటీ విచారించనుంది. 30 రోజుల్లోగా కమిటీ చర్యలు తీసుకోకపోతే చర్యలు లేనట్టే.

16:32 - September 8, 2017

కర్నూలు : ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం కట్టి తీరతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరికీ నీటి భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జనం కోసమే తాను పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో జల హారతి కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.

మంత్రి ఈటెలను కలిసిన సీపీఎం నేతలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ ను సీపీఎం నేతలు సున్నం రాజయ్య, బి.వెంకట్, నర్సింహారావు, బాబురావులు కలిశారు. సాధారణ ప్రజలపై జీఎస్టీ భారాన్ని తగ్గించేలా రేపటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని కోరారు. 

16:10 - September 8, 2017

హైదరాబాద్ : జగన్ డిశ్చార్జ్ పిటిషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తైయ్యాయి. రాంకీ, వాన్ పిక్, జగతి పబ్లికేషన్ పెట్టుబడుల వ్యవహారంలో చార్జ్ షీట్ నుంచి తనను తొలగించాలని కోరతూ జగన్ పిటిషన్ వేశారు. జగన్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

జగన్ లండన్ పర్యటనకు కోర్టు ఒకే..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ లండన్ పర్యటనకు సీబీఐ ప్రత్యేక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాంకీ, వాన్ పిక్, జగతి పబ్లికేషన్ పెట్టుబడుల వ్యవహారంలో ఛార్జీషీట్ నుండి తనను తొలగించాలని కోరుతూ జగన్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఛార్జీషీట్ నుండి జగన్ తప్పించవద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కాసేపటి క్రితం సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలను కోర్టు విన్నది. 

నేరేళ్ల నుండి టిపిసిసి పాదయాత్ర..

హైదరాబాద్ : దళితుల, బడుగు, బలహీన వర్గాలపై దాడులకు నిరసనగా నేరేళ్ల నుండి పాదయాత్ర చేపట్టాలని టిపిసిసి నిర్ణయం తీసుకుంది. భట్టి నేతృత్వంటో పాదయాత్ర చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈనెల 15 నుండి నేరెళ్లలో టిపిసిసి రిలీ నిరహార దీక్షలు, రైతు సంరక్షణ సమితుల ఏర్పాటు బాధ్యతలు ఉత్తమ్ తీసుకోనున్నారు. 

రైతులు బాగు పడుతున్నారంట..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలిట శాపంగా మారాయని మంత్రి హరీష్ విమర్శించారు. రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని, కాంగ్రెస్ హాయంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తోందన్నారు. మిషన్ కాకతీయను ప్రపంచమంతా మెచ్చుకొంటోందని, మంచి సూచనలు ఇవ్వాలి కానీ రైతులను ఆత్మనూన్యత భావనలోకి నెట్టవద్దన్నారు. 

ఆరోగ్యం బాగలేకనే రాలేదు - కేఈ..

విజయవాడ : ఆరోగ్యం బాగా లేకనే సీఎం కార్యక్రమానికి హాజరు కాలేదని డిప్యూటి సీఎం కేఈ పేర్కొన్నారు. టిడిపి సిద్ధాంతాలు నచ్చి ఎవరైనా వస్తే ఆహ్వనిస్తామని బాబు పేర్కొంటున్నారని తెలిపారు. బైరెడ్డి రాజశేఖరరరెడ్డి విషయంలో బాబు ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తామన్నారు. 

ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభం..

కర్నూలు : ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి ఇంటికి పెద్ద బిడ్డగా ఉంటానని హామీ నెరవేర్చుతానని, రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ప్రతొక్కరికీ నీటి భద్రత కల్పించనున్నట్లు, పోలవరం పూర్తి జాతికి అంకితమిస్తామన్నారు. రోబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచడం జరగడని, ప్రాజెక్టుల భగీరథ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పేదవాడికి అండగా ఉండడమే తన ప్రయత్నమన్నారు. 

15:26 - September 8, 2017

ఆదిలాబాద్/నిర్మల్ : జిల్లా కలెక్టరెట్ ఫర్నిచర్ ను జిల్లా కోర్టు సిబ్బంది సీజ్ చేశారు. రైతులకు భూపరిహారం చెల్లించడంలో జాప్యం చేయడంతో ఆస్తులు సీజ్ చేయాలని నిర్మల్ సీనియర్ సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. 1992లో నర్సాపూర్ మండలం బామ్నిలో చెరువు నిర్మాణం ముంపు గురైన 28మంది రైతులు భూములకు నష్టపరిహారం చెల్లించపోవడంతో వారు కోర్టును ఆశ్రియించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:19 - September 8, 2017

హర్యానా : సిర్సాలోని డేరా సచ్ఛా సౌధా కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. డేరాలో భారీగా నగదు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు అధికారలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదులో ప్లాస్టిక్ కరెన్సీ ఉన్నుట్లు అధికారులు తెలిపారు. మరోవైపు డేరాలో అస్థిపంజరాలు దోరికినట్టు సమాచారం. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:17 - September 8, 2017
15:13 - September 8, 2017

తేనే...పెద్దలతో పాటు పిల్లలు కూడా తీసుకుంటుంటారు. ప్రతి రోజు తేనే స్వీకరిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తుంటారు. తేనే గుండెకు..మెదడుకు చాలా బాగా పనిచేస్తుంది. గోరు వెచ్చని నీటితో తేనేను ప్రతి రోజు కలిపి తీసుకోవడం వల్ల రక్త ప్రసార వ్యవస్థలోని ఎర్రకణాలు, రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుందంట. కానీ ఒక సంవత్సరంలోపు పిల్లలకు ఇవ్వకూడదని వైద్యులు సూచిస్తున్నారు. సంవత్సరం దాటిన పిల్లలకు రోజుకు ఒక స్పూన్ చొప్పున ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. 

డేరా సచ్చా సౌదాలో సోదాలు..

హర్యానా : సిర్సాలోని డేరా సచ్చా సౌదా కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. భారీగా నగదు, కంప్యూటర్ హార్డ్ డిస్క్, ప్లాస్టిక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 

అనంతనాగ్ లో పోలీసు వ్యాన్ దగ్ధం..

జమ్మూ కాశ్మీర్ : అనంతనాగ్ లో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు వ్యాన్ ను దగ్ధం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. 

సమర్థవంతంగా పౌరసరఫరాల శాఖ - ఈటెల..

హైదరాబాద్ : పౌర సరఫరాల శాఖలో అక్రమాలకు తావు లేకుండా ఈ పాస్, టీ రేషన్ యాప్ ల ద్వారా అడ్డుకట్ట వేస్తున్నట్లు మంత్రి ఈటెల పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని, తెలంగాణలో ఎక్కువ టెక్నాలజీని వాడుతున్న సంస్థ పౌరసరఫరాల శాఖ అని తెలిపారు.

 

14:49 - September 8, 2017

మహాత్ముల పుట్టిన రోజులు..వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రముఖులు సైతం వారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ..నివాళులర్పిస్తుంటారు. పలు పాఠశాలల్లో కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ సీఎం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమౌతోంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వివాదస్పద నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 17న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినం. ఈ సందర్భంగా అక్కడి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ రోజు ఆదివారం వస్తోంది. ఆదివారం నాడు అన్ని పాఠశాలలు కూడా తెరిచి ఉంచాలని, విద్యార్థులు విధిగా హాజరయ్యే విధంగా చూడాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రతొక్కరూ తప్పకుండా స్కూల్ కు వచ్చి వేడుకల్లో పాలు పంచుకోవాలని రాష్ట్ర విద్యా మంత్రి అనుపమా జైస్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దేశాభివృద్ధిపై మోడీ విజన్..పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కలిగించేలా ప్రసంగాలుండాలని విద్యా మంత్రి పేర్కొన్నారు. ఈ తాజా ఉత్తర్వులపై విపక్షాలు మండిపడుతున్నాయి. విమర్శలు వస్తున్న ఈ ఆదేశాలపై అక్కడి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

14:29 - September 8, 2017

నూతన చరిత్రకు శ్రీకారం : చంద్రబాబు

కర్నూలు : ప్రతి ఒక్కరికి నీటి భద్రత ఉండాలని, నీటి కోసం రాష్ట్రా మధ్య పోరాటలు జరుగుతున్నాయని, పైరాష్ట్రాలు స్వర్థంతో ముందుకు పోతున్నాయని, ఇది చాల దుర్మార్గం, బాధకరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం పూర్తి చేసి జాతి అంకితం చేసి మా హామీలు తీరుస్తామని ఆయన అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో నీటి సమస్యలను పరిష్కలించాలని కంకణం కట్టుకున్నానని చంద్రబాబు అన్నారు. తెలుగు గంగా కోసం నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఒప్పించారు. రాజధాని, ప్రాజెక్టులో నిర్మాణంలో భూములిచ్చిన ప్రతిఒక్కరికి పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మనం ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నామని, ప్రతి నీటి బోట్టును కాపాడుకోవాలని, ఎస్సీ, ఎస్టీ లకు 90శాతం, మిగతావారికి 70శాతం సబ్సిడీ ఇస్తున్నామని సీఎం తెలిపారు. బుడగ జంగాలను ఎస్సీలలో చేరుస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిలో అందరు పాలుపంచుకోవాలని సూచించారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనను కాపాడుతుందని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

గాంధీభవన్ లో టిపిసిసి ఆఫీస్ బేరర్ల సమావేశం..

హైదరాబాద్ : గాంధీభవన్ లో టిపిసిసి ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్కలు హాజరయ్యారు. తాజా రాజకీయాలు, సంస్థాగత వ్యవహారాలు, జీవో 39పై చర్చ జరిగింది. 

కలెక్టర్ ఆస్తులను జప్తు చేసుకున్న కోర్టు..

నిర్మల్ : నర్సాపూర్ (మం) బామినిలో భూ సేకరణ అంశంపై జిల్లా కోర్టులో విచారణ జరిగింది. రూ. 12.84 లక్షల విలువైన కలెక్టర్ కార్యాలయం ఆస్తులను కోర్టుకు అటాట్ చేస్తూ నిర్మల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కల్టెకర్ కార్యాలయంలోని ఫర్నీచర్, కంప్యూటర్లను స్వాధీనం చేసుకుంది. 

13:54 - September 8, 2017

ఖమ్మం : ఆగస్టు 28.. ఆవేశం కట్టలు తెంచుకున్న రోజు. ప్రజలకు భారమైన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని ప్రజలు గొంతెత్తిన రోజు. అప్పటి తెలుగు దేశం ప్రభుత్వాన్ని వామపక్షాలన్నీ కలిసి నిలదీసిన రోజు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు పాశవికంగా కాల్పులు జరిపిన రోజు. ఆ దారుణ మారణ కాండకు ముగ్గురు వీరులు బలయ్యారు. ఇందులో ఖమ్మం జిల్లా ముద్దు బిడ్డ కామ్రెడ్ సత్తెనపల్లి రామకృష్ణ ఒకరు. పోలీసు కాల్పుల్లో గాయపడి 12 రోజుల పాటు మృతువుతో పోరాడి.. సెప్టెంబర్‌ 8న తుది శ్వాస విడిచాడు. రామకృష్ణ వర్ధంతి సందర్భంగా 10టీవీ ప్రత్యేక కథనం. 
రామకృష్ణది సీపీఎంలో చురుకైన పాత్ర 
ప్రజా ఉద్యమంలో సత్తెనపల్లి రామకృష్ణ పాత్ర అమోఘం. రామకృష్ణ ఖమ్మం నగరంలో డివైఎఫ్‌ఐలో పని చేస్తూ.. సీపీఎంలో చురుకైన పాత్ర పోషించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించటంలో.. ప్రజా సమస్యలపై పోరాడటంలో రామకృష్ణ ముందుండేవారు. పార్టీ అవసరాల కోసం చేతివృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తూ హైదరాబాద్‌కు వచ్చారు.
12 రోజులు మృత్యువుతో పోరాటం 
విద్యుత్‌ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా 2000 సంవత్సరం ఆగస్టు 28న పెద్ద ఉద్యమమే జరిగింది. వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ఆ పోరాటంలో.. రామకృష్ణ బషీర్‌బాగ్ చౌరస్తాలో ముందు వరసలో ఉన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు పాశవికంగా జరిపిన కాల్పుల్లో.. తీవ్రంగా గాయపడ్డాడు. రామకృష్ణ దాదాపు 12 రోజులు మృత్యువుతో పోరాడి.. చివరికి సెప్టెంబర్‌ 8న తుదిశ్వాస విడిచాడు. రామకృష్ణ చనిపోయి ఇవాళ్టికి 16 ఏళ్లు. 
రామకృష్ణ ఆశయ సాధనలో ఆయన కుటుంబం 
సత్తెనపల్లి రామకృష్ణ కుటుంబం ముందు నుంచి వామపక్ష భావాలున్న కుటుంబం. వీళ్లు రామకృష్ణ ఆశయ సాధన కోసం ఎర్రజెండా నీడలోనే ముందుకు సాగుతున్నారు. రామకృష్ణ భార్య మంగ, కూతురు రమ్య, తండ్రి వెంకటయ్య, తల్లి యశోద, సోదరులు శ్రీనివాసరావు, రాము, ప్రజా ఉద్యమాల్లో పాలు పంచుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 
కరెంట్ చార్జీల పెంపు నిలిపివేత 
అప్పుడు నిర్వహించిన విద్యుత్‌ ఉద్యమం ఫలితంగా.. తరువాత వచ్చిన ప్రభుత్వాలు తాత్కాలికంగా కరెంట్ చార్జీల పెంపును నిలిపేశాయి. ప్రజల కోసం ప్రాణాలర్పించిన సత్తెనపల్లి రామకృష్ణను స్ఫూర్తిగా తీసుకొని విప్లవ జోహార్లు అర్పిస్తున్నారు కామ్రెడ్లు. 

 

13:50 - September 8, 2017

హైదరాబాద్ : ఉపాధ్యాయులు... మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో గురుపూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా  ఉపాధ్యాయులను బెస్ట్‌ టీచర్స్‌ అవార్డులతో... సత్కరించారు.  బెస్ట్‌ టీచర్స్‌గా అవార్డులను పొందిన ఉపాధ్యాయులకు కడియం శ్రీహరి శుభకాంక్షలు తెలిపారు. అవార్డు గ్రహీతలు మరింత బాధ్యతగా పనిచేయాలని... విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఆయన చెప్పారు. అలాగే ఎవరి బాధ్యతను వారు... సరిగ్గా నిర్వర్తిస్తే.. విద్యా వ్యవస్థ పటిష్టం అవుతుందని అన్నారు. అలాగే.. మార్కుల కోసం కాకుండా... విద్యార్థుల్లో విలువలు... ఆత్మస్థైర్యాన్ని నింపే.. విధంగా ఉపాధ్యాయులు కృషిచేయాలని మంత్రి ఈటెల రాజేందర్‌ పిలుపునిచ్చారు.

 

13:48 - September 8, 2017

హైదరాబాద్ : సీబీఐ కోర్టులో జగన్‌ డిశ్చార్జ్‌ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. రాంకి, వాన్‌పిక్‌, జగతి పబ్లికేషన్‌ పెట్టుబడుల వ్యవహారంలోచార్జ్‌షీట్‌ నుంచి తనను తొలగించాలని కోరుతూ జగన్‌ డిశ్చార్జ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే జగతి పబ్లికేషన్‌ పెట్టుబడల వ్యవహారంలో చార్జ్‌షీట్ నుంచి జగన్‌ను తొలగించొద్దంటూ సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి.  అన్ని చార్జ్‌షీట్లపై విడతలవారిగా విచారిస్తామన్న సీబీఐ కోర్ట్‌ తెలిపింది. మరో వైపు లండన్‌ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ జగన్‌ సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:47 - September 8, 2017

విజయవాడ : 2019 ఎన్నికల్లో ప్రతిపక్షం అడ్రస్‌ గల్లంతు అవుతుందని, రాష్ర్టంలోని 175 స్థానాలను టీడీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. విజయవాడ భవానీపురంలోని వాటర్‌ వర్క్స్ దగ్గర జలసిరికి జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌ 2019లోగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. నంద్యాల ఉప ఎన్నిక విజయంతో టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయిందంటున్న మంత్రి లోకేశ్‌తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఆ విషయాలను వీడియోలో చూద్దాం...

13:45 - September 8, 2017

మెదక్‌ : జిల్లాలోని నర్సాపూర్‌ మండలం కొండాపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లను ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనాలపై ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరిని నర్సాపూర్‌ వాసులు మీర్జాసల్మాన్‌బేగ్‌, ఎండీ అజ్మత్‌గా గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:42 - September 8, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. విద్యావ్యవస్థ నిర్వీర్య స్థితిలో ఉందన్నారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు, ప్రజలు సమన్వయంతో పని చేస్తేనే ప్రభుత్వ విద్యను కాపాడుకోగలమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకుల పాఠశాలలో సన్నం బియ్యంతో అన్నం పెడుతున్నామని తెలిపారు. 525 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. 

 

13:37 - September 8, 2017

హైదరాబాద్ : ఉపాధ్యాయుడు చాలా గొప్ప వ్యక్తి అని మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మొదటి గురువు తల్లి అని.. ఆ తర్వాత ఉపాధ్యాయుడు చాలా గొప్ప వ్యక్తి అని తెలిపారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు క్లాస్ లో అల్లరి చేసేవాడినని గుర్తు చేశారు. తనకు పాఠాలు నేర్పిన గురువు ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో కలిస్తే 
ఆయన పాదాలకు నమస్కరించానని చెప్పారు. తాను కేంద్రమంత్రి అయినా మీరు నాకు గురువే అని చెప్పినట్లు పేర్కొన్నారు. 

కొట్టుకున్న టిడిపి కార్పొరేటర్లు..

అనంతపురం : మున్సిపల్ స్టాండింగ్స్ కమిటీ భేటీ రసాభాస చోటు చేసుకుంది. టిడిపి కార్పొరేటర్లు కొట్టుకున్నారు. పనుల విషయంలో కార్పొరేటర్ల మధ్య వివాదం చెలరేగింది. 

ప్రకాష్ జవదేకర్ తో సుజన..గంటా భేటీ..

ఢిల్లీ : కేంద్ర మానవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ను ఏపీ ఎంపీ సుజనా చౌదరి, మంత్రి శ్రీనివాసరావు కలిశారు.  

లండన్ పర్యటన కోసం జగన్ పిటిషన్..

హైదరాబాద్ : లండన్ పర్యటనకు అనుమతినివ్వాలంటూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్ పై విచారణ జరిగింది. రాంకీ, వాన్ పిక్, జగతి పబ్లికేషన్ పెట్టుబడుల వ్యవహారంలో ఛార్జీషీట్ నుండి తనను తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. జగతి పబ్లికేషన్ పెట్టుబడుల వ్యవహారంలో జగన్ ను తొలగించద్దంటూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. పెట్టుబడి దారులను జగన్ మోసం చేసిందని వాదించింది. చివరకు ఈ కేసు విచారణ అక్టోబర్ 6వ తేదీకి వాయిదా పడింది. 

13:13 - September 8, 2017

కృష్ణా : ఇది విజయవాడలోని పాత ప్రభుత్వ ఆస్పత్రి. కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణిలు ఈ ఆస్పత్రికే వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. 
అవసరాలకు అనుగుణంగాలేని పడకలు
బెజవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు బ్లాక్‌లు ఉన్నాయి. మచిలీపట్నంలోని జిల్లా ప్రధాన కేంద్రం ఆస్పత్రికి రక్తహీతన గర్భిణిల తాకిడి పెరగడంతో కొంతమందిని విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రికి పంపిస్తున్నారు. దీంతో ఈ దవాఖానకు వస్తున్న గర్భిణుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.  ఇక్కడకు వస్తున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా పడకలు లేవు. ఉన్న రెండు బ్లాకుల్లో ఒక్కోచోట 30 వంతున మాత్రమే పడకలు అందుబాటులో ఉన్నాయి.  దీంతో  ఒక్కో మంచంపై ఇద్దరు  గర్భిణిలు పడుకోవాల్సిన దయనీయ పరిస్థితులు ఉన్నాయి. రోగుల తాకిడి పెరగడంతో అదనంగా మరికొన్ని పడకలు  ఏర్పాటు చేసినా...  అవసరాలకు చాలడంలేదు. రోగులవెంట వచ్చే సహాయకులు తలదాచుకునేందుకు ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. 
అవరసరాలకు సరిపోని బ్లడ్‌ బ్యాంక్‌ 
విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో మరో రెండు బ్లాక్‌లు నిర్మించాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. కొత్త భవనాలు నిర్మిస్తే అదనంగా డాక్టర్లతోపాటు పారా మెడికల్‌ సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలు ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో ఉన్న సిబ్బందికి పనిభారం పెరుగుతోంది. దీంతో రోగులపై కోపతాపాలు ప్రదర్శిస్తున్నారు. కొన్ని అత్యవసర కేసులను కూడా మచిలీపట్నం నుంచి విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఒక్క బ్లడ్‌ బ్యాంకు రోగుల అవసరాలకు సరిపోవడంలేదు. మరో రెండు రక్తనిధి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉన్నా... కార్యరూపం దాల్చలేదు. ఏపీ రాజకీయ రాజధాని విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై పాలకులు దృష్టి పెట్టాలని రోగులు, వీరి బంధువులు కోరుతున్నారు. సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. 

 

జేఎన్ యుఎస్ యు ఎన్నికలు..

ఢిల్లీ : జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. యూనివర్సిటీ క్యాంపస్ లో జరుగుతున్న ఎన్నికల్లో విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 

రెండో తరగతి విద్యార్థి దారుణ హత్య..

ఢిల్లీ : గుర్గావ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బాత్ రూంలో రెండో తరగతి విద్యార్థి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. మృతదేహం పక్కనే కత్తి పడి ఉంది. 

12:54 - September 8, 2017

తూర్పుగోదావరి : రాజమండ్రి... శతాబ్దాల చరిత గల సుందర నగరం. ఒక వైపు వేదంగా ఘోషించే గోదావరి. మరోవైపు ప్రకృతి సోగయాలు. వీటితో రాజమహేంద్రి అమరధామంలా శోభిల్లేది. ఇదంతా గత చరిత్ర. ఇప్పుడు రాజమహేంద్రవరం మురికికూపంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.  రాజమండ్రి రూపులేఖలే మార్చేస్తామని 2014 ఎన్నికల్లోహామీ ఇచ్చి, అధికారలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ ప్రజా ప్రనిధులు మాటలు నీటి మూటలుగా మారాయని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అధ్వానంగా మారిన రాజమండ్రిపై 10 టీవీ ప్రత్యేక కథనం... 
గోదావరి నది ఒడ్డున రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం... గోదావరి నది ఒడ్డున విలసిల్లుతున్ననగరం. వితంతు వివాహాలను ప్రోత్సహించిన కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తలకు నెలవు. ప్రాచీన రాతప్రతులతోపాటు ఎన్నో విలువైన గ్రంథాలకు నెలవైన గౌతమీ గ్రంథాలయం.  నగరానికి వన్నె తెచ్చే రైల్‌ కమ్‌ రోడ్డు బ్రిడ్జి. వలసపాలనకు ప్రతీకగా నిలిచే బంగ్లాలు.. ఇలా రాజమండ్రికి ఎన్నో ఘనతలు ఉన్నాయి. అయితే ఇదంతా గతం. ఇప్పుడు రాజమహేంద్రవరం మురికికూపాన్ని తలపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.  పేరు గొప్ప... ఊరు దిబ్బ.. అన్న చందంగా తయారైంది.  
అభివృద్ధిని గాలికొదిలేసిన పాలకులు
కాంగ్రెస్‌ పాలకులు రాజమండ్రి అభివృద్ధిని గాలికొదిలేశారని, చారిత్రక రాజమహేంద్రవరాన్ని సుందర నగరంగా తీర్చి దిద్దుతామని మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పాలకులు కూడా ఇప్పటి వరకు చేసిందేమీలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. వర్షం వస్తే పొంగిపొర్లే ఓపెన్‌ డ్రెయిన్లు,  ఎండకు దుమ్మురేగే రోడ్లు, గోదావరినది చెంతనే ఉన్నా తాగేందుకు సరిగా మంచినీరు లేక నోరెండుతున్న జనాలు... ఇలా ఎన్నో సమస్యలు ఈ నగరాన్ని పట్టిపీడిస్తున్నాయి. 
డ్రైనేజీ వ్యవస్థతో తీవ్ర ఇబ్బందులు
కొద్దిపాటి వర్షం కురిసినా పొంగిపొర్లే  డ్రైనేజీ వ్యవస్థతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రెయినేజీ వ్యవస్థ ఆధునీకరణ పేరుతో పెద్ద మురుగు కాల్వలను చిన్నవి చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్లు అధ్వానంగా మారాయని మండిపతున్నారు. రాజమండ్రి పరిసరాల్లో ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొల్యూషన్‌తో నగరం మొత్తం కాలుష్య కాసారంగా మారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
నగరాభివృద్ధి శూన్యం : విపక్షాలు
రాజమండ్రి నగరాభివృద్ధికి స్థానిక టీడీపీ ఎంపీ మురళీమోహన్‌, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారారాయణ చేసింది శూన్యమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు నగరంలోని చాలా సమస్యలు పరిష్కరించామని, మిగిలివున్న కాలంలో మరింత అభివృద్ధి చేస్తామని రాజమండ్రి నగర బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ  అమలు చేసేందుకు ఇకపైనా ప్రజా ప్రతినిధులు చర్యలు  తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

12:53 - September 8, 2017

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతుల ఫొటోలు తీస్తే నేరమా ? వారి ఫొటోలు తీయవద్దా ? తీస్తే చావబాదుతారా ? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వారి ఫొటోలు తీసిన ఫిల్మ్ జర్నలిస్టులపై బౌన్సర్లు విరుచకపడుతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

గురువారం రాత్రి శిల్పా భర్త రాజ్ కుంద్రాతో కలిసి ముంబైలోని బాస్టియన్ రెస్టారెంట్ కు వెళ్లింది. ఈ విషయం తెలిసిన స్థానిక ఫొటోగ్రాఫర్లు రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. బయటకు వెళ్లే సమయంలో జర్నలిస్టులు, అక్కడున్న ఇతరులు తమ వద్ద ఉన్న కెమెరాలు, సెల్ ఫోన్లలో వారిని బంధించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా శిల్పా, రాజ్ లు సైతం ఫొజోలిచ్చి వెళ్లిపోయారు. వాళ్లు అలా వెళ్లిపోయారో లేదో హోటల్ బౌన్సర్లు దాడికి దిగారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. సోను, హిమాన్షు అనే ఫొటోగ్రాఫర్లపై పిడుగుద్దుల వర్షం కురిపించారు. వారు కూడా ప్రతిఘటించారు. తీవ్రంగా గాయపడిన సోను, హిమన్షులను ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి ఘటనను కొంతమంది సెల్ ఫోన్ లో వీడియో తీశారు. బౌన్సర్ల దాడిపై జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. 

ప్రజల నుండి భారీ స్పందన - లక్ష్మణ్..

హైదరాబాద్ : తెలంగాణ విమోచన యాత్రకు ప్రజల నుండి భారీ స్పందన వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ తెలిపారు. టీఆర్ఎస్ పట్ల ప్రజా వ్యతిరేకత బయటపడుతోందని, 11, 12, 13 తేదీల్లో కలెక్టరేట్ల ఎదుట నిరసనలు చేస్తామన్నారు. సెప్టెంబర్ 17న నిజామాబాద్ లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు, విమోచన దినోత్సవంపై అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 

కొండాపూర్ లో ఆక్సిడెంట్..

నర్సాపూర్ (మం) కొండాపూర్ లో బైక్ - ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అద్మత్, సల్బాన్ బేగ్, యూసుఫ్ లు మృతి చెందారు. 

పాట బాగుందన్న బాబు..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు చేరుకున్నారు. విమానంలో జలసిరికి హారతి పాటను కంపోజ్ చేసి బాబుకు వందేమాతరం శ్రీనివాస్, అనంత శ్రీరామ్ వినిపించారు. పాట బాగుందని సీఎం బాబు కితాబిచ్చారు. కడప నుండి బాబు కర్నూలుకు వెళ్లనున్నారు. 

12:40 - September 8, 2017

ఖమ్మం : పట్టణంలోని ఎంబి గార్డెన్‌లో.. జనసేన సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీని పటిష్టపరిచడంలో భాగంగా.. ఈ శిబిరాలను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు జనసేన రాష్ట్ర ఇంఛార్జ్‌ శంకర్ గౌడ్‌, రాష్ట్ర మీడియా ఇంఛార్జ్‌ హరిప్రసాద్‌ తెలిపారు. జనసేన పార్టీలోకి వచ్చేవారు కుల, మత, ప్రాంత, వైషమ్యాలను పక్కన పెట్టి రావాలని హరిప్రసాద్‌ అన్నారు. అలాంటి వారికే తమ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సూచించారన్నారు. 

 

12:38 - September 8, 2017

కామారెడ్డి : ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో.. తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కామారెడ్డి జిల్లాలో పనులు ప్రారంభమైనా.. గడువులోగా పథకాన్ని పూర్తి చేయడంలో అధికారులు విఫలమయ్యారు. అటు నేతలు.. ఇటు అధికారుల తీరుతో పథకంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు నీరుగారుతున్నాయి. 
పనులు పూర్తి చేయటంలో అధికారులు విఫలం 
మిషన్‌ భగీరథ పనులు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో ప్రజలు అనుకున్న సమయానికి ఈ పథకం పూర్తవుతుందా లేదా అని అయోమయంలో పడ్డారు. ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని అందించే లక్ష్యంతో.. రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టింది. కామారెడ్డి జిల్లాలో గతేడాది పనులు ప్రారంభమయ్యాయి. కానీ గడువులోగా పనులు పూర్తి చేయటంలో అధికారులు రెండుసార్లు విఫలమయ్యారు. 
పనులలో జాప్యం
పనులలో జాప్యంతో మూడోసారి కూడా మిషన్‌ భగీరథ పనులు.. గడువులోగా పూర్తయ్యేలా కనిపించటం లేదు. సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలని ఆదేశాలున్నా .. 70 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులు ఈ నెలాఖరులోగా ఎలా పూర్తి చేస్తారోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్‌ చివరి నాటికి అన్ని గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. 309 గ్రామాలకు తాగునీరు అందించేందుకు పనులు ప్రారంభమయ్యాయి. బాన్సువాడ డివిజన్‌ పరిధిలో 12 మండలాల్లో, 525 గ్రామాలకు తాగునీరు అందించేందుకు పనులు చేపట్టారు. ఇలా అనేక చోట్ల పథకం ప్రారంభమైంది కానీ పనులు ముందుకు సాగడం లేదు. 
మొదటి విడతలో 131 ప్రాంతాలకు నీరు 
మొదటి విడత కింద కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని.. 131 నివాస ప్రాంతాలలో నీరందించాల్సి ఉంది. ఇప్పటికే ప్రధాన పైపులైన్‌ వేయటం పూర్తి కాగానే గ్రామాలలో అంతర్గత పైపులైన్‌ 244 కిలోమీటర్లకు గాను.. 230 కిలోమీటర్ల పైపులైన్‌ వేశారు. 50 వాటర్‌ ట్యాంకుల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. 22, 310 కుళాయిలకు 15, 202 కుళాయిలను బిగించారు. మోటార్ల బిగింపు ఇతరేతర పనులు చేపట్టాల్సి ఉంది. ఇలా పనులన్నీ సగంలో ఉండటంతో ప్రజలు ఈ సారైనా ఈ పథకం పూర్తవుతుందా లేదా అని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. 

 

12:32 - September 8, 2017

పశ్చిమగోదావరి : తమ కులం ఏంటో నిర్ధారించి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు నాయకపోడు కులస్తులు. పశ్చిమగోదావరి జిల్లా గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న నాయకపోడు కులస్తులకు ప్రభుత్వం కుల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఎందరో విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. కొందరు జిల్లా కలెక్టర్‌ చొరవతో స్కూళ్లల్లో చేరినా కాలేజీ చదువులకు మాత్రం దూరం అవుతున్నారు. తాము ఏ కులమో చెప్పాలంటున్న నాయకపోడు కులస్తుల సమస్యలపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

రవీంద్ర భారతిలో గురుపూజోత్సవం..

హైదరాబాద్ : రవీంద్ర భారతిలో గురుపూజోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం జరిగింది. 

12:27 - September 8, 2017

ప్రస్తుతం ట్విట్టర్ లో '# బ్లాక్ నరేంద్ర మోడీ’ ట్రెండ్ వైరల్ అవుతోంది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ట్విట్టర్ లో అకౌంట్ ఉన్న విషయం తెలిసిందే. ఈయనకు ట్విట్టర్ లో 33.7 మిలియన్ల మంది ఉన్నారు. ప్రస్తుతం ఆయన్ను ఫాలో అవుతున్న వారు అన్ ఫాలో లేదా బ్లాక్ చేయడం స్టార్ట్ చేశారు. దీని వెనుక ఓ విషయం ఉంది.

బెంగళూరులో ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమ కారిణి గౌరీ లంకేశ్ ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత మార్చిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాపితంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. పలువురు ప్రముఖులు ఖండిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ విషయంపై ట్విట్టర్ లో కూడా తమ తమ స్పందనలు తెలియచేస్తున్నారు.

కానీ ఓ వ్యక్తి మాత్రం గౌరీ లంకేశ్ హత్య విషయంలో ట్విటర్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరుష పదజాలం ఉపయోగించి ట్వీట్స్ చేయడంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతని ట్విటర్ ను పరిశీలించగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆయన ఫాలో అవుతున్నారని గ్రహించారు. జర్నలిస్టుల హత్యలను ప్రోత్సాహించే వ్యక్తిని మోడీ ఫాలో అవుతున్నారని..పరోక్షంగా అతడికి మోడీ మద్దతిస్తున్నట్లే అని ఓ వ్యక్తి పేర్కొన్నట్లు, అతడిని అన్ ఫాలో చేసే వరకు పీఎం నరేంద్ర మోడీని ఖాతాని అంతా బ్లాక్ చేయాలని పిలుపునిచ్చినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. అందుకే '# బ్లాక్ నరేంద్ర మోడీ' టాగ్ ని వాడుతున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ మారింది. ఒక్కసారిగా పీఎంకు ఫాలోవర్స్ తగ్గుతున్నారు. మరి ప్రధాని మోడీ ఎలాంటి స్పందన వ్యక్తపరుస్తారో చూడాలి. 

12:24 - September 8, 2017

నిర్మల్‌ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వస్తోంది. బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. మార్గంమధ్యలో నిర్మల్ జిల్లాలోని గంగాపూర్ దగ్గర ఓ బైకిస్టు ఎదురుగా వచ్చి బస్సును ఢీకొట్టి.. దాని కిందకు దూసుకెళ్లాడు. అతను మృతి చెందాడు. బైక్ ను తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సును రోడ్డు కిందికి నడిపాడు. ఈ నేపథ్యంలో బస్సు రెండు పల్టీలు కొట్టింది. దీంతో బస్సులోని 30 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 20 మందికి స్వల్పగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

12:11 - September 8, 2017

మెక్సికో సిటీ : మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 8గా నమోదైంది. మరోవైపు మెక్సికన్ తీరంలో సునామి హెచ్చరికలను జారీ చేశారు.

 

12:02 - September 8, 2017

అక్కినేని నాగ‌చైత‌న్య, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా తెర‌కెక్కిన చిత్రం 'యుద్ధం శ‌ర‌ణం'. వారాహి చల‌న‌చిత్రం బ్యాన‌ర్‌పై సాయి కొర్ర‌పాటి నిర్మాత‌గా కృష్ణ మ‌రిముత్తు ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం తెర‌కెక్కింది. యుద్ధం శరణం మూవీ టీమ్ తో 10 టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నాగచైతన్య, లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ సినిమా విశేషాలను తెలిపారు. తమ అనుభవాలను వివరించారు. వారు తెలిపిన పలు ఆసక్తరమైన అంశాలను వీడియోలో చూద్దాం...

 

గౌరీ లంకేశ్ కేసులో సమాచారం ఇస్తే రివార్డు..

ఢిల్లీ : ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి గౌరీ లంకేష్ దారుణ హత్య కేసులో రాష్ట్ర హోం మంత్రి రామలింగారెడ్డి రివార్డు ప్రకటించారు. హత్య కేసులో సమాచారం ఇచ్చిన వారికి రూ. 10 లక్షలు రివార్డు ఇస్తామని వెల్లడించారు. 

తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు..

చెన్నై : టిటివి దినకరన్ కు మద్దతిస్తున్న 19 మంది ఎమ్మెల్యేలకు తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 14వ తేదీ వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. 

సీబీఐ కార్యాలయం ఎదుట మేయర్..

కోల్ కతా : మేయర్ సోవాన్ ఛటర్జీ సీబీఐ కార్యాలయం ఎదుట హాజరయ్యారు. వరుసుగా రెండో రోజు విచారణ కొనసాగుతోంది. నారద స్కాంలో ఆయన పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

జేబీఐటీ కాలేజీ విద్యార్థుల ధర్నా..

రంగారెడ్డి : నిన్న మొయినాబాద్ జేబీఐటీ కాలేజీ ఎదుట రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. కాలేజీ దగ్గర తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారిపై విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పోలీసులు - విద్యార్థుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. 

11:51 - September 8, 2017

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ. ఈ ఏడాది బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సీఎస్ ఎస్పీ సింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

తెలంగాణ ఆడపడుచులకు సంబరాలను మోసుకొచ్చే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగను రాష్ట్రంలో మహిళంతా సంఘటితంగా జరుపుకుంటారు. ఈనెల 20 నుంచి 28 వరకు జరిగే బతుకమ్మ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతోంది. 

బతుకమ్మ పండుగ‌ను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు సిఎస్ ఎస్సీ సింగ్  బతుకమ్మ పండుగ నిర్వహణపై వివిధ  శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. పండుగ నిర్వహణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. 

సెప్టెంబర్  26 న దాదాపు 35వేల  మంది మహిళలతో  పెద్ద ఎత్తున ఎల్.బి. స్టేడియంలో బతుకమ్మ పండుగ ఉత్సవం నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టనున్నారు. 28న సద్దుల బతుకమ్మ సందర్భంగా పీపుల్స్ ప్లాజా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఇదే రోజు వివిధ ప్రాంతాల నుండి వచ్చే మహిళలు బతుకమ్మలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర స్ధాయిలో నిర్వహిస్తున్న విధంగా జిల్లాల్లో కూడా బతుకమ్మ పండుగను నిర్వహించాలని సీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఇక దేశ, విదేశాలలో కూడా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడానికి అధికారులు సన్నద్దమవుతున్నారు. గతేడాది కంటే ఈసారి బతుకమ్మ ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. 

ఎక్కడికెళ్లినా గోదావరి నీరే - లోకేష్..

విజయవాడ : నీరు లేకుంటే అభివృద్ది, వ్యవసాయం కష్టమని సీఎం గ్రహించి గోదావరి - కృష్ణా నదుల అనుసంధానం చేశారని, రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా గోదావరి నీరే కనబడుతోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాయలసీమలో 23 ప్రాజెక్టులు కట్టి రతనాల సీమ చేస్తామని, 2019 వరకు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తామని తెలిపారు. 20 శాతం వర్షపాతం తక్కువగా ఉన్నా 30 శాతం ఎక్కువ దిగుబడి సాధించామన్నారు. 

జగన్ అక్రమాస్తుల కేసు వాయిదా..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆస్తుల కేసులో ఆయన పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ అక్టోబర్ 6వ తేదీకి వాయిదా పడింది. 

సంగం బ్యారేజీ వద్ద...

నెల్లూరు : సంగం బ్యారేజీ దగ్గర జలసిరికి హారతి కార్యక్రమం జరిగింది. మంత్రులు సోమిరెడ్డి, నారాయణలు హాజరయ్యారు. రుణమాఫీ జరగలేదని ఆరోపించడం హాస్యాస్పదమని, ప్రతి నీటిబొట్టు వృదా కాకుండా చేస్తామని మంత్రులు పేర్కొన్నా

ఏపీ కేబినెట్ మీటింగ్ లో స్వల్ప మార్పులు..

విజయవాడ : ఏపీ కేబినెట్ మీటింగ్ సమయంలో మార్పు చోటు చేసుకుంది. ఉదయం 10గంటలకు జరగాల్సిన సమావేశం మూడు గంటలకు జరగనుంది.

11:43 - September 8, 2017

ఢిల్లీ : కరీబియన్ దీవులను ఇర్మా తుపాన్ వణికిస్తోంది. ఇర్మా వల్ల భారీ స్థాయిలో కరీబియిన్ దీవులు దెబ్బతిన్నాయి. సమారు 10 మంది మృతి చెందినట్లు సమాచారం. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గంటకు 285 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో బిల్డింగులు, భారీ వృక్షాలు , విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. బార్బడా దీవి నివాసానికి పనికి రాకుండా పోయింది. సెయింట్ మాటినా కూడా దాదాపు కొట్టుకుపోయింది. ఇర్మా తుపాను మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముంది. ఇర్మాను ఐదో కేటగిరి తుపాన్ గా అధికారులు ప్రకటించారు. ఈ దశాబ్ధంలోనే ఇది అత్యంత శక్తివంతమైన తుపాన్ గా అభిర్ణించారు. 

రాజ్ నాథ్ తో సిద్ధరామయ్య భేటీ..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కర్నాటక సీఎం సిద్ధ రామయ్య భేటీ అయ్యారు. ప్రముఖ జర్నలిస్టు గౌరీ శంకర్ దారుణ హత్య కేసు దర్యాప్తు విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. 

11:16 - September 8, 2017

మేడ్చల్‌ : జిల్లాలోని ఘట్‌కేసర్‌లో విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. ఐదోతరగతి చదువుతున్న నితిన్‌ నిన్న స్కూల్‌కు వెళ్లి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

రసమయికి ఆరేపల్లి సవాల్..

కరీంనగర్ : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి సవాల్ విసిరారు. దళితుల భూ పంపిణీకై 9100 ఎకరాల కొనుగోలు చేసి 140 ఎకరాల కంటే ఎక్కువ పంపిణీ జరగలేదని, ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాస్ కుటుంబానికి భూమి ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. లేదంటే రసమయి గుంజీలు తీసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

 

జలసిరికి హారతి..

విజయవాడ : విద్యాధరపురం హెడ్ వాటర్ వర్క్స్ వద్ద జలసరికి హారతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, గద్దె రామోహన్ తదితరులు పాల్గొన్నారు. 

11:13 - September 8, 2017

గుంటూరు : అమరావతిలోని ఉండవల్లి సీఎం చంద్రబాబు నివాసం దగ్గర ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ప్రొద్దుటూరు నివాసి గంగుల శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెక్యూరిటీ గార్డులు ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. కేశవరెడ్డి విద్యాసంస్థలో డిపాజిట్ చేసిన 5 లక్షల రూపాయాలను తిరిగి ఇవ్వడం లేదని బాధితుడు అంటున్నాడు. డిపాజిట్ డబ్బులు అడిగితే మంత్రి ఆదినారాయణ అనుచరులు చంపేస్తామని బెదిరిస్తున్నారని అంటున్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నిర్మల్ లో ఆర్టీసీ బస్సు బోల్తా..

నిర్మల్ : జిల్లాలోని గంగాపూర్ దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి.

11:00 - September 8, 2017

తూర్పుగోదావరి : దళితుల అభివృద్ధికి తోడ్పడాల్సిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారిపడుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రాతినిథ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఈ భాగోతం బయటపడింది. పెద్దాపురం మునిసిపాలిటీ పరిధిలో కార్పొరేట్‌ విద్యాసంస్థకు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు వెళ్లే రోడ్డును ఆధునీకరించేందుకు ఏకంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను వాడేశారు. సుమారు కోటి 50 లక్షల రూపాయల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను మళ్లించి 12వ వార్డులో రోడ్లను బాగుచేస్తున్నారు. దళితుల నివాస ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడాల్సిన ఈ నిధులను బడాబాబుల ప్రయోజనాల కోసం వెచ్చించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే సదరు మున్సిపల్ కమిషనర్‌ సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

బాధితుడికి ఏపీ సీఎస్ హామీ..

విజయవాడ : సీఎం నివాసం ఎదుట ఆత్మహత్యయత్నం చేసిన గంగుల శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని భద్రతా సిబ్బంది సీఎస్ వద్దకు తీసుకెళ్లారు. జిల్లా మంత్రి, అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని సీఎస్ హామీనిచ్చారు. 

10:49 - September 8, 2017

‘కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా' అంటూ 'కుశ' పాత్రలో 'ఎన్టీఆర్' పలికిన డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. ఆయన తాజా చిత్రం 'జై లవ కుశ' టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో 'ఎన్టీఆర్'..’జై', ‘లవ', ‘కుశ' పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈపాత్రలకు సంబంధించిన పోస్టర్స్..టీజర్స్ లను చిత్ర బృందం విడుదల చేస్తోంది.

ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఎన్టీఆర్ ఏకంగా మూడు పాత్రలు పోషిస్తుండడం..ఆ పాత్రలకు దేనికవే భిన్నంగా ఉండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. సంకెళ్ళ‌తో క‌ట్టివేయ‌బ‌డిన 'ఎన్టీఆర్' రౌద్రం రాజ‌సం క‌లిసిన 'జై' లుక్ ఉండగా...సింపుల్ అండ్ స్టైలిష్ గా 'లవ'.. ఇక 'కుశ' పాత్రలో 'ఎన్టీఆర్' డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ట్రెండీగా కనిపిస్తున్నాడు.

‘కుశ' కు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ‘కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా...ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డేదో నాకు ఇప్పించేయండి బాబు' అని ఎన్టీఆర్ పలికితే 'దాన్ని ఆధార్ కార్డు అనరమ్మ..గ్రీన్ కార్డు అంటారు' అనే డైలాగ్స్ ఉంది. ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా..నివేదా థామస్ లు నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

10:48 - September 8, 2017

వరంగల్ : ఎమ్మెల్యే రాజయ్యను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. వేలేరులో రైతు సమన్వయ సమితి కమిటీల ఏర్పాటు సభలో రాజయ్యను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. తనను, ఎమ్మెల్యే రాజయ్యను దూషించారని కర్ణాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు కత్తి సంపత్, జర్రు సంపత్, సద్దాం హుస్సేన్ పై ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. మరో ఐదుగురు నేతలపై 506, 209, 323, 341, 147, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. వారిని పోలీసులు కాసేపట్లో రిమాండ్ కు తరలించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఇర్మా బీభత్సం..14కు చేరిన మృతులు..

అమెరికా : హరికేన్ ఇర్మా అమెరికాను వణికిస్తోంది. కరేబియన్ దీవుల్లో పెను బీభత్సం సృష్టించిన ఇర్మా 14 మందిని పొట్టన పెట్టుకుంది. 

10:30 - September 8, 2017

హర్యానా : డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాలతో తనిఖీలు చేపట్టారు. ఆర్మీ జవాన్లు, పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్ సోదాలు నిర్వహిస్తున్నారు. డేరా పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ భద్రతా దళాలు అనుమతించడం లేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆశ్రమం పరిసరాల్లో కర్ఫ్యూ విధించారు. 41 ఆర్మీ కంపెనీలతో పహారా కాస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:27 - September 8, 2017

అవును మీరు వింటున్నది..చదువుతున్నది నిజమే. బీర్ల అమ్మకాల్లో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ముందున్నది. దక్షిణాది రాష్ట్రాలన్నింటితో పోల్చుకుంటే రాష్ట్రంలో ఏ ఏడాది ఏప్రిల్ - జులై లో ఏకంగా రూ. 19.75 కోట్ల బీరు తాగేశారు. అంటే బీరు తాగేయడంలో దూకుడు కనిపిస్తోందన్నమాట. అమ్మకాలు పెరగడంతో అబ్కారీ శాఖ గల్లా గల గలా అంటోందంట.

రాష్ట్రంలో మొదటి నాలుగు నెలల్లో 1.20 శాతం అమ్మకాలు పెరిగాయని, రెండో స్థానంలో ఉన్న ఏపీ 2.92 శాతమే అమ్మకాలు పెరిగాయి. కేరళలో 5.31 శాతం, తమిళనాడులో 7.5 శాతం మేర మద్యం అమ్మకాలు జరిగాయి. తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు జోరు మీదున్నాయి. తెలంగాణ రాష్ట్రానితో పోల్చుకుంటే 2016-17 సంవత్సరం మధ్య ఆదాయం ముందటి ఏడాదితో పోల్చుకుంటే 11.65 శాతం పెరగడం గమనార్హం. పక్కనున్న ఏపీ రాష్ట్రంలో ఈ వృద్ధి 8.02 శాతం మాత్రమే. గత ఏడాది ఇదే సమయంతో పోల్చుకుంటే 24.80 శాతం పెరిగాయన్నమాట. ఇక్కడ కేరళలో బీర్ల అమ్మకాలు 38.05, తమిళనాడులో 15.03 శాతం క్షీణించడం విశేషం. మొత్తంగా చెప్పుకొంటే తెలంగాణ రాష్ట్రంలో బీరు ఏరులై పారుతోందన్నమాట. 

10:21 - September 8, 2017
10:19 - September 8, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిమ్స్ ఆస్పత్రి సాక్షిగా..నేరెళ్ల బాధితులపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. చికిత్సపొందుతున్న వారి పట్ల కిరాతకంగా ప్రవర్తించారు. మానవత్వాన్ని మరిచిపోయి బయటకి ఈడ్చిపారేశారు. చికిత్స అందించలేమని చేతులెత్తిసిన వైద్యులు..బాధితులపైకి పోలీసులను ఉసిగొల్పారు. బాధితుల ఆందోళనకు విపక్షాలు భాసటగా నిలిచాయి. కేసీఆర్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగాయి.    
నేరెళ్ల బాధితుల పట్ల అమానవీయ ప్రవర్తన
మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన నేరెళ్ల బాధితుల పట్ల వైద్యులు, పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. మాననిగాయాలతో తల్లడిల్లుతున్న వారిపట్ల కనికరం చూపలేదు. కనీసం సాటి మనుషులన్నా మానవత్వం కూడా  ప్రదర్శించలేదు. చికిత్స అందించలేమని చెప్పిన వైద్యులు..పోలీసులను పిలిపించి బలవంతంగా వారిని గెంటిచేశారు. మానవత్వాన్ని మంటగలిపిన ఈ ఘటన హైదరాబాద్‌ నిమ్స్‌లో చోటుచేసుకుంది. 
చికిత్స ఆపేసిన వైద్యులు 
నేరెళ్లలో పోలీసుల దాడికి గురైన హరీష్, ఈశ్వర్‌కుమార్‌, బాల్‌రాజ్‌, మహేష్‌, గోపాల్‌, పెంట బాణయ్యలు బుధవారం సాయంత్రం నిమ్స్‌కు వచ్చారు. వైద్యులు పరీక్షించి ఆస్పత్రిలో చేర్చుకున్నారు. కొన్ని గంటల్లోనే ఎలాంటి సమాచారం  ఇవ్వకుండా వైద్యులు చికిత్స ఆపేశారు. చికిత్స అందించలేమంటూ చెప్పి వెళ్లిపోయారు. వైద్యుల ఆదేశాలతో సిబ్బంది చికిత్స నిలిపేశారు. గాయాలు మానలేదని బాధితులు డాక్టర్లను బతిమాలినా కనికరించలేదు. పైగా అనారోగ్యంతో ఉన్నవారిని పోలీసుల సాయంతో ఆస్పత్రి బెడ్లపై నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశారు. 
బాధితులు ఆందోళన
ఆ తర్వాత బాధితులు ఎమర్జెన్సీ వార్డు ముందు ఆందోళనకు దిగారు. కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం అందకపోవడం వల్లే మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ఆరోగ్య శ్రీ కార్డులతో నిమ్స్‌కు వచ్చామన్నారు. సీఎం కేసీఆర్‌ ఒత్తిడితోనే తమకు చికిత్స నిలిపేశారని వారు ఆరోపించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్, బీజేపీ, ప్రజా సంఘాల నేతలు బాధితులకు మద్దతుగా నిమ్స్‌ ఆస్పత్రి ముందు నిరసనకు దిగారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ కుట్రే అని నిప్పులు చెరిగారు. నేరెళ్ల బాధితుల పట్ల నిమ్స్ వైద్యులు, పోలీసుల నిర్వాకంపై విపక్షాలు మండిపడుతున్నాయి. కేసీఆర్‌ సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్నాయి.

 

కాంగ్రెస్ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..

వరంగల్ : ముగ్గురు కాంగ్రెస్ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదైంది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను అడ్డుకున్న ఘటనలో కత్తి సంపత్, జర్రు సంపత్, సద్దాం హుస్సేన్ లపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. మరో ఐదుగురు కాంగ్రెస్ నేతలపై 506, 209, 323 341, 147,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

10:15 - September 8, 2017

నేరళ్ల బాధితులపై టీప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వక్తలు అన్నారు. నిమ్స్ ఆప్పత్రిని నుంచి నేరెళ్ల బాధితుల గెంటివేత దారుణమన్నారు. ప్రభుత్వానికి మానవత్వం ఉందా..? అని ప్రశ్నించారు. నిమ్స్ కు వైద్యం కోసం వెళ్లిన నేరెళ్ల బాధితులను సిబ్బంది గెంటివేశారు. బెడ్ మీద ఉన్న రోగులను పోలీసులు బయటికి లాక్కొచ్చారు. ఈ ఘటనపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీఆర్ ఎస్ ఎంపీ సీతారాం నాయక్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. నేరళ్ల బాధితులపై ప్రభుత్వం హేయమైన చర్యకు పాల్పడుతుందని అన్నారు. ప్రశ్నించే వారి గొంతునొక్కాలని చూస్తోందని చెప్పారు. పోలీస్ వ్యవస్థ టీసర్కార్ చెప్పుచేతుల్లో నడుస్తోందని ఆరోపించారు. దళితులపై దాడులు పెరిగిపోయాయని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 4.5 కిలోల బంగారం..

విజయవాడ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఓ ప్రయాణీకుడి వద్ద నుండి 4.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకన్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు.

ఘట్ కేసర్ లో ఐదో తరగతి విద్యార్థి మిస్సింగ్..

మేడ్చల్ : ఐదో తరగతి చదువుతున్న నితిన్ నిన్న స్కూల్ కు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనితో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

నగరంలో జీఎస్టీ మండలి సమావేశం..

విజయవాడ : జీఎస్టీ మండలి సమావేశానికి ఏపీ వ్యూహ రచన జరుగనుంది. శనివారం హైదరాబాద్ లో జీఎస్టీ మండలి సమావేశం జరుగనుంది. 12 ప్రధాన అంశాలను లేవనెత్తాలని నివేదిక సిద్ధం చేయనున్నారు. బయో డీజిల్, చింతపండు, ఎండు చేపలు, చేనేత కార్మికులు, వ్యవసాయ ట్రాక్టర్లు, పప్పు దినుసులు, టైల్స్ వంటి అంశాలపై పన్ను తగ్గించాలని ఏపీ ప్రభుత్వం కోరనుంది. 

అమరావతి ఎక్స్ ప్రెస్ మార్గ భూ సేకరణకు లైన్ క్లియర్..

విజయవాడ : అమరావతి ఎక్స్ ప్రెస్ మార్గ భూ సేకరణకు లైన్ క్లియర్ అయ్యింది. వ్యయాన్ని భరించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. భూ సేకరణకు రూ. 2,200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఐదు జిల్లాల మీదుగా వచ్చే రహదారుల కోసం 21 వేల ఎకరాలు సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

బాబు నివాసం వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం..

విజయవాడ : ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసం దగ్గర భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెక్యూర్టీ గార్డులు అడ్డుకున్నారు. కేశవరెడ్డి విద్యా సంస్థలో డిపాజిట్ చేసిన రూ. 5 లక్షలు తిరిగి ఇవ్వడం లేదని శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారులు, మంత్రులను కలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు అడిగితే చంపేస్తామని మంత్రి ఆదినారాయణ అనుచరులు బెదిరిస్తున్నారని ఆరోపించాడు. బాధితుడు ప్రొద్దుటూరు వాసి గంగుల శ్రీనివాస్ రెడ్డిగా తెలుస్తోంది. 

09:36 - September 8, 2017

తెలంగాణలో ఆర్టీసీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని ఎస్ డబ్ల్యుఎఫ్ తెలంగాణ కార్యదర్శి విఎస్ రావు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'తెలంగాణలో ఆర్టీసీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచకపోగా, వున్న సర్వీసులనే రద్దు చేస్తున్న దుస్థితి. తెలంగాణకు 15వేలకు పైగా బస్సులు అవసరం కాగా, 10,400 మాత్రమే నడుపుతున్నారు. ఇందులో 2230 అద్దె బస్సులే వున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అద్దె బస్సుల సంఖ్య విపరీతంగా పెరగడం, వందలాది రూట్లలో బస్సు సర్వీసులు రద్దు చేయడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మోటారు వాహన చట్ట సవరణ బిల్లు వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ పరిరక్షణ పేరుతో ఎస్ డబ్ల్యుఎఫ్ సంతకాల సేకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:30 - September 8, 2017

చెన్నై : తమిళనాడులోని కొయంబత్తూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగర శివారులోని సోమనూర్‌ ప్రాంతంలో బస్టాండ్‌ పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో  తొమ్మిది మంది మృతిచెందారు. మరో పదిమందివరకు గాయాల పాలయ్యారు.  ప్రయాణికులంతా స్టేషన్‌లో వేచిఉండగా .. ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది.  దీంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని  అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

09:28 - September 8, 2017

కడప : జిల్లాలోని బద్వేల్‌ టీడీపీలో విభేదాలు తార స్థాయికి చేరాయి. పార్టీ నాయకుల మధ్య ఉన్న గొడవలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే జయరాములు, టీడీపీ నాయకురాలు విజయమ్మ మధ్య వర్గపోరు తీవ్రమైంది. ఇద్దరు జడ్పీటీసీలు రాజీనామా చేసే స్థాయికి పోరు ముదిరింది.

కడప జిల్లా తెలుగు దేశం పార్టీలో ఇద్దరు జడ్పీటీసీ సభ్యుల రాజీనామాలు..  కలకలం రేపాయి. నేతల మధ్య విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.  ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన తమకు పార్టీలో అన్యాయం జరుగుతుందని.. చిన్నచూపు చూస్తున్నారని జడ్పీటీసీలు వాపోతున్నారు. పార్టీ నేతలు, అధికారులు తమకు సహకరించడం లేదంటూ జడ్పీటీసీ సభ్యులు శిరీష, రమణయ్య రాజీనామా లేఖల ద్వారా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని...సమస్య తీర్చాలని కోరారు. 

కొంతకాలంగా బద్వేలు టీడీపీలో ఎమ్మెల్యే జయరాములు, పార్టీ నాయకురాలు విజయమ్మ మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఇరువురు నేతలు పార్టీని రెండు వర్గాలుగా చీల్చారు. తమ వర్గం వారికే పనులు, కాంట్రాక్టు దక్కేలా అటు ఎమ్మెల్యే జయరాములు, ఇటు పార్టీ నాయకురాలు విజయమ్మ గట్టిగా పట్టుబడుతున్నారు. 

పనులను కేటాయించుకోవడంలో.. తలెత్తిన విభేదాలు ఇప్పుడు పార్టీలో రచ్చగా మారాయి. ఎమ్మెల్యే జయరాములు.. తమ వర్గం వారికి పనులు ఇవ్వడం లేదంటూ.. విజయమ్మ ఆరోపిస్తున్నారు. ఇటీవల పార్టీ ద్వితీయ శ్రేణి పదవుల భర్తీ విషయంలో కూడా ఎమ్మెల్యే జయరాములు.. తమ వర్గానికి అవకాశం కల్పించలేదని విజయమ్మ ఆరోపిస్తున్నారు. విజయమ్మకు పార్టీలో జరుగుతున్న అవమానాన్ని తాళలేమంటూ ఆమె వర్గానికి చెందిన బద్వేలు జడ్పీటీసీ శిరీష, గోపవరం జడ్పీటీసీ రమణయ్య పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫ్యాక్స్‌ ద్వారా రాజీనామా లేఖను పంపించారు. 

జయరాములు.. గడచిన ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచారు. అయితే ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా, ఆయన టీడీపీలోకి వలసొచ్చారు. అప్పటినుంచే విజయమ్మకు, ఆయనకు పొసగడం లేదు. ప్రారంభ స్థాయిలోనే వీరిద్దరి మధ్య విభేదాలను పరిష్కరించడంలో అధినేత చంద్రబాబు.. శ్రద్ధ చూపలేదు. దీంతో.. బద్వేలు టీడీపీలో విర్గ వైరుధ్యాలు ముదురుపాకాన పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లా నుంచి అత్యధిక సీట్లు గెలుచుకోవాలనుకుంటున్న టీడీపీ అధినాయకత్వానికి, బద్వేలు లాంటి చోట్ల తలెత్తుతున్న పరిస్థితులు ఇబ్బందిగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఈ తరహా ఇబ్బందులను ఎప్పుడు.. ఎలా.. పరిష్కరిస్తారోనని కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

09:25 - September 8, 2017

హైదరాబాద్ : రుణ మాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతుల ఆశ తీరనుంది. మూడవ విడత రుణమాఫీని రైతులకు అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు  కోసం మూడు వేల 600 కోట్లను కేటాయించింది. 
రైతులకు కొంత ఊరట 
రుణ మాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు కొంత ఊరట లభింనుంది. ఇప్పటికే రుణ మాఫీ విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం రైతులకు మూడో విడతగా రుణ మాఫీ చేయాలని నిర్ణయించింది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో మూడో విడతగా రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది.
వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.50 వేలు మాఫీ
మొదటి రుణ మాఫీలో భాగంగా వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద 50 వేల వరకు మాఫీ చేశారు. లక్షన్నర వరకు ఉన్న రైతులకు మాత్రం రుణమాఫీ కోసం ప్రత్యేకంగా బాండ్లు జారీ చేసింది. ఈ బాండ్లను తాకట్టు పెట్టుకొని రుణాలు పొందొచ్చని ప్రభుత్వం అంటోంది.  అయితే బాండ్లను పెట్టుకొని రుణాల ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరించకపోవడంతో కొన్ని రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం తాజాగా మూడవ విడత రుణ మాఫీ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. మొత్తం 3600 కోట్ల రూపాయలు మూడవ విడతలో రైతులకు రుణ మాఫీ చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే వెయ్యి కోట్లు రైతు సాధికార సంస్థలో ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన 2600 కోట్లను సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ప్రభుత్వం నిర్ణయం పట్ల రైతులు హర్షం 
రెండవ విడత రుణ మాఫీలో రైతులకు అందించిన ఉపశమన పత్రాల వివరాలను బ్యాంకులు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల తమకు తొమ్మిది లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు మంత్రి చెప్పారు.  అందులో అర్హులైన 5.47 లక్షల మంది రైతులకు 528 కోట్లను కేటాయించామన్నారు. ప్రభుత్వం నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో భద్రతా దళాలు సోదాలు

హర్యానా : డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాలతో తనిఖీలు చేపట్టారు. ఎవ్వరినీ ప్రధాన కార్యాలయంలోకి అనుమతించడం లేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆశ్రమం పరిసరాల్లో కర్ఫ్యూ విధించారు. 
 

నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీలో కేసీఆర్ కంటికి శస్త్ర చికిత్స చేయించున్నారు. 

టీఎస్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నిక వాయిదా

హైదరాబాద్ : నేడు జరగాల్సిన టీఎస్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నిక వాయిదా పడింది. 

ప్రోకబడ్డీలో నేటి మ్యాచ్ లు

ఢిల్లీ : ప్రోకబడ్డీలో భాగంగా ఇవాళ రాత్రి 8 గంటలకు హర్యానా, పాట్నా పైరేట్స్ తలపడనున్నాయి. రాత్రి 9 గంటలకు గుజరాత్ ఫార్చున్ జెయింట్స్, యూపీ మోధ ఢీకొననున్నాయి. 

విశాఖలో నేటి నుంచి జాతీయ ఆరోగ్యమేళా

విశాఖ : నగరంలో నేటి నుంచి జాతీయ ఆరోగ్యమేళా ప్రారంభం కానుంది. మేళాను కేంద్రమంత్రి యశోనాయక్ ప్రారంభించనున్నారు. 

08:13 - September 8, 2017

విశాఖ : పట్ణణంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నెమ్మదిగా పుంజుకుంటోంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, రేరా చట్టాలతో గాడి తప్పిన రియల్‌ ఎస్టేట్‌... వెంచర్‌ పేరెత్తడానికే హడలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు తిరిగి వెంచర్లను ప్రారంభించడంతో తిరిగి విశాఖలో రియల్‌ ఎస్టేట్‌ పుంజుకుంటుందని నగరవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

విశాఖ పట్టణంలో రియల్‌ ఎస్టేట్‌ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో పారిశ్రామిక నగరంగా పేరుగాంచిన విశాఖ.. రాష్ట్ర విభజన తర్వాత ప్రాధాన్యతను సంతరించుకుంది. రియల్‌ ఎస్టేట్‌లో రాజధాని అమరావతికి అందనంత ఎత్తుకు ఎదిగింది. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రకటనతో విశాఖ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇలా రియల్‌ ఎస్టేట్‌ దూసుకుపోతుండగా ఒక్కసారిగా వచ్చిన నోట్ల రద్దుతో భారీగా ధరలు పడిపోయాయి. రేరా చట్టం అమలు, జీఎస్టీ పోటు అన్నీ ఒక్కసారిగా దాడి చేయడంతో రియల్‌ ఎస్టేట్‌ భారీగా నష్టాల్లోకి కూరుకుపోయింది. దీంతో ఈ సంస్థలో ఉన్న వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. 

దీనికి తోడు నూతన వెంచర్లు లేకపోవడం, ఉన్న వెంచర్లలో ప్లాట్లు కొనేవారు లేకపోవడంతో మనీ లేక రియల్‌ రంగం కుదేలైంది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఫైళ్లన్నీ నిలిచిపోవడంతో ఇక రియల్‌ ఎస్టేట్‌ పరిస్థితి మరింత  దయనీయంగా మారింది. రియల్‌ ఎస్టేట్‌లో బాగా అనుభవమున్న సంస్థలు సైతం ఆరు నెలలుగా తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో భూమాత రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నూతన వెంచర్‌ను ప్రారంభించింది. విశాఖ పూర్తిగా ఎంప్లాయ్‌ సెక్టార్‌ జోన్‌ కావడంతో తాము రియల్‌ ఎస్టేట్‌లో ముందుకు వెళ్తామని చెబుతున్నారు.  

వెంచర్లను ప్రారంభిస్తున్నప్పటికీ రియల్‌ వ్యాపారుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. రేరా చట్టంపై ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు హడలిపోతున్నాయి. ఇలాంటి సమయంలో రియల్‌ ఎస్టేట్‌ నెమ్మదిగా పుంజుకోవడంపై నగర వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. 

08:11 - September 8, 2017

పశ్చిమగోదావరి : పెళ్లయింది...మూడు నెలలు గడిచింది...ఆమెకు భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేదేమో...అందుకే ప్రియుడితో కలిసి చెట్టాపట్టాలేస్తుంది.. ప్రతీసారి భర్త అడ్డుగా ఉన్నాడనుకుంటున్న ఆ నవవధువు అతన్ని చంపాలనుకుంది..ఆమెనే నర్సు కావడంతో భర్తకు విషపు మందు కలిపి ఇంజక్షన్ ఇచ్చి చంపేసింది...తన జీవితాన్ని తాను నాశనం చేసుకున్న ఓ నవవధువు దుర్మార్గమిది...

జిల్లా దేవరపల్లి గౌరీపట్నంలోని నిర్మలగిరి పుణ్యక్షేత్రంకు నిత్యం భక్తుల తాకిడి ఉంటుంది...ఈ క్రమంలోనే ఆ కొండపై ఓ మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు..వెంటనే వెళ్లి చూస్తే ఎలాంటి ఆధారాలు దొరకలేదు.. డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు...
మృతుడు భీమశంకర్‌గా గుర్తింపు..

ఇక పోలీసులు డెడ్‌బాడీని పోస్టుమార్టం పంపించడంతో అనుమానాలు పెరిగాయి..దీంతో కేసును సవాలుగా తీసుకుని ఆరా తీస్తే ద్రాక్షారామం చెందిన చేగొండి భీమశంకర్‌గా తేలింది...అతను ఎందుకు వచ్చాడు..ఎవరితో వచ్చాడు...అన్న విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు...ముందుగా పుణ్యక్షేత్రం లోపల..బయట ఉన్న సీసీ ఫుటేజీ ఫీడ్ తీసుకుని పరిశీలించారు...

మృతుడు భీమాశంకర్ కు ఈ ఏడాది మే నెలలో జయలక్ష్మి తో వివాహం అయింది...అయితే జయలక్ష్మి ద్రాక్షారామం  ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్స్ గా పనిచేస్తుంది. ఇదే ఆసుపత్రి లో పని చేసే సహోద్యోగి గిరీష్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది.. ఇదే క్రమంలో వారిద్దరూ కలుసుకునేందుకు భర్త భీమశంకర్ అడ్డుగా ఉన్నాడని నిర్ధారించుకుంది...
29న గుడికి వెళ్దామన్న జయలక్ష్మి..

ఇక అప్పటికే భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్న జయలక్ష్మి గుడికి వెళ్దామంటూ తీసుకువెళ్లింది...అక్కడే కొండపై తిరిగడంతో అలసిపోయిన భర్త నీరసంగా ఉందని కూర్చున్నాడు..అయితే అప్పటికే ప్లాన్ చేసుకున్న జయలక్ష్మి స్వయానా నర్సు కావడంతో వెంట ఇంజక్షన్ తోపాటు కిటామిక్ అనే హైపవర్ డ్రగ్ ని తెచ్చింది..భర్తకు తెలియకండా ఆ మందును ఇంజెక్షన్ ద్వారా అతని శరీరం లోకి  ఎక్కించింది. అనంతరం కొద్దిసేపటికే భర్త మృతి చెందాడు...భర్త మృతి చెందాడని నిర్ధారించుకుని తిరిగి గ్రామానికి చేరింది..

జయలక్ష్మి తన ప్రియుడు గిరీష్ తో కలసి ఏమీ ఎరగనట్టు స్వగ్రామం వెళ్లి పోయింది...అప్పటికే అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి చివరకు వారిద్దరినీ అదుపులోకి తీసుకుంటే విషయం చెప్పారు. మూడు ముళ్లు వేయించుకున్న మూడు నెలలకే భర్తను చంపేసింది జయలక్ష్మి...హాయిగా జీవితాన్ని వెళ్లదీయాల్సిన ఆమె క్షణికానందాల కోసం తన జీవితాన్ని నాశనం చేసుకుంది...

08:06 - September 8, 2017

హైదరాబాద్ : భాగ్యనగరంలో మెట్రో రైలు కూత పెట్టనుంది. తొలి దశ మెట్రో సర్వీసుకు ముహుర్తం ఖరారైంది. నవంబర్ 28న నాగోల్‌ నుంచి మియాపూర్‌ మధ్య మెట్రో రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మెట్రో ప్రారంభోత్సవానికి రావాలంటూ సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 
మెట్రో రైలు పరుగులు 
హైదరాబాద్‌లో మెట్రో రైలు పరుగులు తీయనుంది. నాగోల్ నుంచి మియాపూర్‌  వరకు 30 కిలోమీటర్ల మెట్రోరైల్‌ తొలి దశ పూర్తయింది. దీన్ని నవంబర్ 28న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మెట్రోరైల్‌ ప్రారంభోత్సవానికి రావాలంటూ ప్రధాని నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. ఆ లేఖను మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 
రూ.15 వేల కోట్లతో మెట్రో రైలు నిర్మాణం
దేశంలోనే అతి పెద్ద పబ్లిక్  ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ ప్రాజెక్టుగా 15 వేల కోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలు నిర్మాణం జరుగుతోంది. మూడు కారిడార్లలో మొత్తం 72 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణమౌతోంది.  మొదటి దశలో మియాపూర్- అమీర్ పేట మార్గం 13 కిలోమీటర్లు, అమీర్ పేట- నాగోల్ మార్గం 17 కిలోమీటర్లు పూర్తయింది. స్టేషన్ల నిర్మాణంతో పాటు ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. మరోవైపు భద్రతాపరమైన అనుమతులు కూడా రావడంతో మొదటి దశ మెట్రో ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 
మెట్రోరైల్‌ ప్రారంభోత్సవానికి మోదీకి ఆహ్వానం 
ఈ ఏడాది నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్ లో జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.ఇదే సమయంలో మెట్రోరైల్‌ను ప్రారంభించాలని కేసీఆర్ మోదీని ఆహ్వానించారు. మొదటి దశ మెట్రో ప్రారంభంతో భాగ్యనగర వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి కాస్త ఉపశమనం 
దొరుకుతుంది. 

 

కరీబియన్ దీవుల్లో ఇర్మా విధ్వంసం

కరీబియన్ : కరీబియన్ దీవుల్లో ఇర్మా విధ్వంసం సృష్టించింది. సెయింట్ మార్టిన్, బార్చుడా, ప్యూర్టోరికాలో ఇర్మా బీభత్సం సృష్టించింది. పెనుగాలుతో భారీగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. అమెరికా వైపు ఇర్మా దూసుకొస్తోంది. రేపు ఫ్లోరిడాను తాకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గంటకు 250 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఫ్లోరిడా, జార్జియా, సౌత్ కరోలినా ఎమర్జెన్సీ విధించారు.
 

07:42 - September 8, 2017

అనంతపురం : ఏపీలో పండుగలా మొదలైన జలసిరికి హారతి కార్యక్రమం నేటితో ముగియనుంది. జలసిరికి హారతి ముగింపు కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాళ అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇంద్రావతి నదికి సీఎం జల హారతి ఇవ్వనున్నారు. హంద్రినీవా కాలువ విస్తరణ పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. 
ఇవాళ అనంతలో పర్యటించనున్న సీఎం 
జలసిరికి హారతి ముగింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు అనంతపురం జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఉరవకొండలో ఇంద్రావతి నదికి సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారు. దీంతో సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 9.20 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో ఉదయం 11 గంటలకు ఉరవకొండ చేరుకుంటారు. అక్కడి నుంచి ఇంద్రావతి నది వద్దకు వెళ్లి ఉదయం 11.15 నిమిషాలకు జలసిరికి హారతి ఇస్తారు. అనంతరం హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకుని..పైలాన్‌ ఆవిష్కరిస్తారు. దాంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం ఉరవకొండ నుంచి హెలికాప్టర్‌లో పుట్టపర్తి విమానాశ్రయానికి 3.15 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమవుతారు. 
28 ప్రాజెక్టులు పూర్తిచేయాలని ప్రణాళిక 
వచ్చే ఏడాది మార్చిలోపు 13 వేల కోట్లతో 28 ప్రాజెక్టులు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. జలసిరికి హారతి కార్యక్రమం ద్వారా వివిధ సాగునీటి పథకాల కింద ఆయకట్టును గరిష్ఠ స్థాయికి పెంచి పంటసిరుల సౌభాగ్యం కల్పించాలని ఆకాంక్షిస్తోంది. ఇందులోభాగంగానే సాగునీటి ప్రాజెక్టులు, నదులు, వాగులు, రిజర్వాయర్లు, చెక్ డ్యాములు, చెరువులు వరకు ప్రతి సాగునీటి పథకాన్ని పూజించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

 

07:38 - September 8, 2017

హైదరాబాద్ : నేరెళ్ల బాధితుల పట్ల నిమ్స్ వైద్యులు, పోలీసులు అమానుషంగా ప్రవర్తించినా... ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మానవత్వాన్ని చాటుకున్నాయి. గాయాలతో బాధపడుతున్న బాధితులను బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:34 - September 8, 2017

హైదరాబాద్ : నేరెళ్ల బాధితులపై మరోసారి పోలీసుల దాష్టీకం ప్రదర్శించారు.. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆస్పత్రినుంచి పోలీసులు గెంటేశారు.. ప్రభుత్వ ఒత్తిడి ఉందని... అందుకే తాము చికిత్స చేయలేమని... ఆర్ ఎంవో అన్నట్లు సమాచారం... అయితే తాము ఆస్పత్రినుంచి బయటకు వెళ్లేదిలేదని బాధితులు తేల్చిచెప్పారు.. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు... బాధితులను బెడ్‌పై నుంచి బయటకు లాక్కొచ్చారు.. పోలీసుల తీరుతో ఆగ్రహించిన బాధితులు.. ఎమర్జన్సీ వార్డు ముందు కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు... వీరి నిరసనకు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు అండగా నిలిచాయి. 

 

నేడు, రేపు హైదరాబాద్ లో ఢిల్లీ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్ పర్యటన

హైదరాబాద్ : నేడు, రేపు హైదరాబాద్ లో ఢిల్లీ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్ పర్యటించనున్నారు. మావనరహిత పారిశుద్ధ్య నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే అంశంపై గౌతమ్ అధ్యయనం చేయనున్నారు.  జలమండలి విధానాలను అధ్యయనం చేయనున్నారు. 

నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

కడప : నేడు సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద జలసిరికి హారతి కార్యాక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. కేసీ కాల్వకు సీఎం నీరు విడుదల చేయనున్నారు.

 

Don't Miss