Activities calendar

09 September 2017

21:31 - September 9, 2017

హైదరాబాద్ : సుచిత్ర సెంటర్‌లో... కొత్తగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. వేద మంత్రాల నడుమ హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఈ మాల్‌ను ప్రారంభించారు. తొలుత రిబ్బన్‌ కటింగ్‌ చేసి..అనంతరం జ్యోతి ప్రజ్వలనతో షాప్‌ ఆరంభించారు. ఈ సందర్భంగా... షాపింగ్‌ మాల్‌ ఎండీ జమునా రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగచైతన్య, కాజల్‌... మాల్‌ను సందర్శించి... వస్త్రాలను పరిశీలించారు. నెంబర్‌ వన్‌గా నిలిచిన షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని హీరో నాగచైతన్య అన్నారు. చెన్నై షాపింగ్‌ మాల్‌ వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలను అందించడంలో ముందు ఉంటుందని ఆయన అన్నారు.

చెన్నై షాపింగ్‌ మాల్‌ నిర్వాహకులకు హీరోయిన్‌ కాజల్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మాల్‌కు తాను పెద్ద అభిమానినని అన్నారు. ప్రతి తెలుగింటి ఆడపడుచు చెన్నై షాపింగ్‌ మాల్‌ను సందర్శించాలని కాజల్‌ అన్నారు. తక్కువ ధరకే.. నాణ్యతగల వస్త్రాలను అందించడం వల్లే... వ్యాపారం రంగంలో విజయం సాధిస్తున్నామని, హైదరాబాద్‌లో ఇది తొమ్మిదో షోరూమ్‌ అని ఎండీ జమునారెడ్డి చెప్పారు. వినియోగదారులకు వస్త్రాలను, నగలను సరసమైన ధరలకు అందిస్తామన్నారు. సినీ నటుల రాకతో.. మాల్‌ ప్రాంగణమంతా.. అభిమానులతో నిండిపోయి... సందడి వాతావరణం నెలకొంది. 

21:26 - September 9, 2017

మహబూబబాద్ : కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాలు ప్రజాపోరాటాలను అణచివేయాలని చూస్తున్నాయని ఆరోపించారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. అన్ని సంఘాలు కలిసి పని చేస్తేనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడగలమని ఆయన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన టీ మాస్ ఫోరం సభలో తమ్మినేని పాల్గొన్నారు. అంతకు ముందు కొమురం భీం సెంటర్‌ నుంచి యశోద గార్డెన్ వరకు టీ మాస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. 

21:25 - September 9, 2017

హుబ్లీ : కర్ణాటక రాష్ట్రంలోని.. హుబ్లీలో బ్యాంకింగ్‌ పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి కన్నడ సంఘాల నేతలు అడ్డుకున్నారు. అభ్యర్థులను పరీక్షా హాల్‌ వద్ద అడ్డుకుని.. హాల్‌ టికెట్లను చించేశారు. వారిపై దాడులకు పాల్పడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి కన్నడ సంఘాల నేతలను అడ్డుకున్నారు. ఈ పరిణామంతో.. భయాందోళనకు గురైన చాలామంది అభ్యర్థులు పరీక్షలు రాయకుండానే వెనుదిరిగారు. హుబ్లీలోనే కాకుండా గుల్బర్గా, దావణగెరే, బెంగళూరులో కన్నడిగులు ఆందోళన నిర్వహించారు. ఈ నెల 9,10, 16,17, 24 తేదీల్లో బ్యాంకు పోస్టుల భర్తీకి కర్ణాటకలో జరగనున్న పరీక్షలకు.. తెలుగు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా 9తేదీన జరిగే పరీక్షకు తెలుగు విద్యార్థులు హాజరయ్యారు. అయితే తమ రాష్ట్రంలో.. వేరే రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి ఐబీపీఎస్‌ పరీక్షలు రాయడానికి వీల్లేదనే డిమాండ్‌తో కన్నడ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పరీక్షలకు హాజరుకావద్దంటూ... అపరిచితుల నుంచి తెలుగు అభ్యర్థులకు ఫోన్లు కూడా చేశారు.

చంద్రబాబు నాయుడు ఆగ్రహం
ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు విద్యార్థులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వెంటనే కర్ణాటక సీఎస్‌తో మాట్లాడాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర కర్ణాటక సీఎస్‌తో మాట్లాడారు. రేపు, ఎల్లుండి జరిగే పరీక్షల్లో తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలో తెలుగు విద్యార్థులను అడ్డుకోవడం సరికాదని రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. దీనిగురించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. దీంతో ఆదివారం, సోమవారం కూడా పరీక్షలు ఉన్నప్పటికీ తెలుగు అభ్యర్థులు వెనక్కి వచ్చేశారు. మరోవైపు శనివారం పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు ఏపీ సీఎస్ దినేశ్ కుమార్ తెలిపారు. 

21:24 - September 9, 2017

 

గుంటూరు : ఇసుక విధానం అమలవుతున్న తీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. అమరావతిలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో... ఉచితంగా ఇసుక అందిస్తూ... అవినీతి, ఆక్రమాలను ఆపలేకపోతున్నామని మండిపడ్డారు. వెంటనే సరిదిద్దుకోవాలని మంత్రి సుజయ కృష్ణ రంగారావుకు సూచించారు. సమావేశంలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పారిశ్రామిక వాడలకు భూములను కేటాయించినట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని 14 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏపీఐఐసికి కేటాయించినట్లు తెలిపారు. ఇదే జిల్లాలోని ఎర్రమంచి గ్రామంలో 91 ఎకరాలు ఏపీఐఐసికి ఉచితంగా ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి 123.13 ఎకరాలను కేటాయించే ప్రతిపాదనకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. సచివాలయంలో 60కి పైగా అంశాలపై చర్చించారు. 

21:23 - September 9, 2017

హైదరాబాద్ : జీఎస్టీలో అధిక పన్నులపై వామపక్షాలు, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. బీడీలు, వస్త్ర పరిశ్రమ, చేనేత, గ్రానైట్‌ తదితర రంగాలపై పన్ను తగ్గించాలని డిమాండ్ చేశాయి. జీఎస్‌టీ సమావేశం జరుగుతున్న హైదరాబాద్‌లోని హైటెక్స్‌ కు సమీపంలో ఆందోళనకు దిగాయి. జీఎస్‌టీ వల్ల కలిగే నష్టాలను వివరించేందుకు అఖిలపక్షాన్ని కేంద్రం దగ్గరకు తీసుకువెళ్లాలని డిమాండ్ చేశాయి. చేనేత రంగం సంక్షోభంలో ఉందని.. రాయితీలు ఇవ్వాల్సింది పోయి ఇలా 28శాతం పన్ను ఎలా వేస్తారని వామపక్ష నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీఎస్‌టీ విధింపు అంతా అగమ్యగోచరంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మండిపడ్డారు.

వ్యతిరేకంగా నేతలు నినాదాలు
జీఎస్‌టీవల్ల లక్షలాది మంది కార్మికులు ఉపాది కోల్పోతున్నారని... వామపక్షాలు ఆరోపించాయి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు.. జీఎస్‌టీ సమావేశం జరుగుతున్న HICC వద్ద ఆందోళనకు దిగిన వామపక్షాలు, ప్రజాసంఘాల నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ సహా పలువురు నేతలున్నారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని వామపక్ష నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. జీఎస్‌టీకి వెంటనే సవరణలు చేపట్టకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

21:22 - September 9, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ హైటెక్స్‌లో 21వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి జైట్లీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శులు పాల్గొన్నారు... జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక రెండోసారి నిర్వహించిన ఈ భేటీలో 30 వస్తువులపై చర్చించారు.. ఈ మూడు నెలల కాలంలో అర్హులైనవారు దాదాపు 70శాతం మంది జీఎస్‌టీలోకి మారారని జైట్లీ తెలిపారు.. జీఎస్‌టీ అమలులో సాంకేతిక సమస్యలున్నాయని... త్వరలో వాటిని అధికమిస్తామని చెప్పారు.

స్పోర్ట్స్‌ కార్లపై సెస్‌ 7శాతానికి
ఇవాళ్టి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని జైట్లీ స్పష్టం చేశారు. కొన్ని వస్తువులపై శ్లాబుల్లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు.. ఖాదీ వస్తువులకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు చేనేత రవాణా, విక్రయాలపై 20 లక్షలవరకూ పన్ను మినహాయింపు ఇచ్చారు. కొన్ని హస్తకళల వస్తువులపై కూడా పన్ను తగ్గించారు. మధ్యరకం కార్ల విడిభాగాలపై పన్నును 48 నుంచి 43శాతానికి తగ్గించామని జైట్లీ ప్రకటించారు. అటు స్పోర్ట్స్‌ కార్లపై సెస్‌ 7శాతానికి పెరిగింది. జీఎస్‌టీ రిటన్స్‌కు అక్టోబర్‌ 10వరకూ గడువు పొడిగించినట్లు జైట్లీ ప్రకటించారు.

20:49 - September 9, 2017

కాళోజీ తాతా..? ఏ స్వర్గానున్నవోగని.. మమ్ములను క్షమించే.. తెలంగాణ ప్రభుత్వం తర్పున ప్రజలము క్షమాపణ గోరుతున్నం.. నీకు తెల్వందిగాదు.. మీదికెళ్లి గూడ మా ప్రభుత్వం పర్పామెన్సు జూస్తనే ఉన్నయ్ కావట్టి.. నీ కళాక్షేత్రం..? కళ క్షేత్రమే అయ్యినందుకు ముక్కునాలకు రాశి క్షమాపణ గోరుతున్నం.. మా ముఖ్యమంత్రి గారి మాటలిని మీరు సంబురపడ్డట్టే మేముగూడ వడ్డం తాతా..

అరే పిచ్చోడా ఏమెర్క నీకు.. పీసీసీ చీఫ్ పదవి మనకే వస్తున్నదిరా..? వచ్చెనెలల అని కోమటిరెడ్డి బ్రదర్సు కల్సిన కార్యకర్తకళ్ల చెప్పుకుంటొచ్చిండ్రు.. ఆఖరికి పీసీసీ గాదుగదా..? ఎమ్మెల్యే టికెట్ వచ్చుడే కష్టమన్న కథ అర్థమైనట్టుంది బ్రదర్సుకు..? ఇగ లాభం లేదు చేతిగుర్తు చెరలకెళ్లి బైటవడకుంటే.. ఉత్తం రెడ్డి ఉన్న పోస్టులు గూడ ఊడగొడ్తడన్న భయంలున్నరట పాపం..

అబ్బా ఈ కాంగ్రెస్ పార్టోళ్లు ఎప్పుడు కండ్లళ్ల నిప్పులే వోస్కునెతట్టున్నరు.. తెలంగాణల రైతులు రాజుల లెక్క బత్కాలే.. అని కేసీఆర్ సర్కారు కూడు దినకుంట కష్టపడ్తుంటే.. గడ్కోపారి కాలడ్డం బెడ్తున్నరట.. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగ మారిందని ఉత్తంకుమార్ రెడ్డి గారు విమర్శించుడు మంచిదేనా..? ఏం పద్దది ఇది..? ఆయ్..

తెలంగాణ ప్రభుత్వం ఈ ముచ్చటను జూస్తె గన్క తల్కాయ యాడవెట్టుకుంటదో ఏమో..? ఎందుకంటె పన్నెండు లక్షల రూపాలు రైతులకు ఇయ్యలేకపోయిండ్రు.. ఏకంగ కలెక్టర్ ఆఫీసులున్న కుర్చీలు కంప్యూటర్లు అన్ని కోర్టు జప్తు జేస్కున్నదంటే..? సర్ ప్లస్ బడ్జెట్ అని సంకలు గుద్దుకునె వాసనలేని గులాబీ పెద్దయ్య సర్కారుకు శిగ్గుశేటుగాదా..?

పేదింటోళ్లు పెండ్లి పత్రిక ఇస్తె సాలు.. ఎంటనే కళ్యాణ లచ్చిమి చెక్కు తాళి గట్టకముందుకే తల్పుకాడికొచ్చి ఉంటదని ముచ్చట్లు జెప్తరు మన ప్రభుత్వ పెద్దలు.. ఇవ్విగూడ ఉత్తమాటలే అనెతందుకు సరిగ్గ సరిపోయే కథొక్కటొచ్చింది.. పెండ్లినాటికే కళ్యాణ లచ్చమి కానుక కింద పైకమిస్తదని సర్కారు చెప్కతిర్గుతున్నది గదా..? సూడుండ్రి ఆ యవ్వారం..

తెల్గురాష్ట్రాలళ్ల ఈసారి సంది..? తాగి ఎవ్వడన్న తప్పు జేస్తె.. తాగినోన్ని ఏ టూ ముద్దాయిగ వెట్టి.. తాగుడు సప్లయ్ జేస్తున్న సర్కారు మీద అంటె ముఖ్యమంత్రిని ఏవన్గ వట్టాలే.. అట్లైతెనే సర్కారుకు బుద్దొస్తది..? వాస్తవానికి గూడ.. తాగినోడు తప్పుజేస్తె వాంది తప్పెట్లైతది... తాగిపిచ్చినోంది గదా తప్పు..? మరి ఆదిలాబాద్ జిల్లాల ఒకడు తాగి తన్నిండు నల్గురిని.. తాగకపోతె తంతుండెనా..? ఏమంటరు..?

యాప చెట్టుకు తెల్లటి నుర్గలసొంటిది కారంగ సూశిండ్రనుల్లా మీరు..? మస్తుగ జూశే ఉంటరు.. మీ ఊర్లపొంటి.. తాటి చెట్టు.. ఈత చెట్లు కల్లు లెక్కనే.. యాపకల్లు గూడ వారుతాఉంటది అప్పుడప్పుడు.. అయితే ఇసొంటిది యాప చెట్టుకు తెల్ల నుర్గు గారుతున్నది.. కొబ్బరికాయలు ఊదు బత్తీలు.. దీపంతలు.. అగో అది కామన్గ అయ్యేదేగదా మల్లన్నా అంటే.. నాకు తెల్సుగని.. వీళ్లకు జెప్పుండ్రి మీరే..

పాండ్రి పాండ్రిగ మనమంత సావుకు వొయ్యేదున్నది.. మన అందరి సుట్టంపేగు సచ్చిపోయింది.. అంత్యక్రియలు జేయాలే.. ఖమ్మం ఎవుసం మార్కెట్ల కాలు జారి కిందవడి సచ్చిపోయిందట.. సుట్టాలు పక్కాలంతొచ్చేశిండ్రట.. మన రాకకోసమే ఎదురు సూస్తున్నరు.. మనం బోతెగని.. పీన్గెను లేపమంటున్నరట.. పాండ్రి మరి.. 

20:32 - September 9, 2017
19:19 - September 9, 2017
18:53 - September 9, 2017

విశాఖ : విశాఖ జిల్లా ఏపీలో గిరిజనులు అత్యధికంగా కలిగిన జిల్లాల్లో ఒకటి. గిరిజనులకు కూడా అభివృద్ధి ఫలాలు అందించాలన్న లక్ష్యంతో ఏపీ సీఎం చంద్రబాబు అరకు నియోజకవర్గంలోని పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకున్నారు. ఇక్కడ ఇటీవలే అంతర్జాతీయ గిరిజన ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించారు. అయితే పెదలబుడు పంచాయతీ పరిధిలోని 20 గ్రామాల్లో స్వచ్ఛ భారత్‌ కింద ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు 20 గ్రామాల్లో దాదాపు 1151 మరుగుదొడ్లను గిరిజనులు తమ సొంత డబ్బుతో నిర్మించుకున్నారు. దాదాపు కోటి 75 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ప్రభుత్వానికి బిల్లులు కూడా పెట్టుకున్నారు. డబ్బులు కూడా అధికారులు మంజూరు చేశారు. కానీ ఆ డబ్బులు గిరిజనుల అకౌంట్లలోకి రాలేదు. ఇక్కడే కథ కొత్త మలుపు తిరిగింది. ఒక్కొక్క మరుగుదొడ్డికి ప్రభుత్వం 15వేల చొప్పున మొత్తం 1151 మరుగుదొడ్ల కోసం కోటి 75 లక్షలు రూపాయలు మంజూరు చేసింది.

కాంట్రాక్టర్ల ఖాతాలోకి లబ్ది డబ్బులు
ఆ డబ్బులు లబ్ది దారుల ఖాతాల్లోకి వెళ్లకుండా కాంట్రాక్టర్లు స్కెచ్‌ వేశారు. ఆ డబ్బునంతా తమ బంధువుల అకౌంట్లలోకి వెళ్లిపోయాయి. పెదలబుడు మాజీ ఎంపీటీసీ శెట్టి వెంకటరావు, గుమ్య సన్యాసిరావు, గుమ్మ శివకృష్ణ, ఎస్‌. కనకరాజు ఖాతాల్లోకి వెళ్లాయి. శెట్టి వెంకటరావు ఖాతాలోకి 28 లక్షల 70వేల రూపాయలు, కే. రవిరాజు కుమార్‌ ఖాతాలోకి 13 లక్షల 30వేలు, పెదలబుడు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ దీనబందు అకౌంట్‌లోకి లక్ష 83వేలు, వంతాల గంగులు ఖాతాలోకి మరో 5లక్షల 60వేల రూపాయలు పడ్డాయి. వరకోటి కొండమ్మ అనే మహిళ ఖాతాలోకి 2 లక్షల 63వేల రూపాయలు, సన్యాసిరావు అకౌంట్లో 6లక్షల 34వేలు, శివకృష్ణ ఖాతాలో 6లక్షల 26వేలు, వంపూరు గంగాధర్‌ ఖాతాలో 11లక్షల 13వేలు, సుంకరమెట్ట అభిరాం ఖాతాలోకి మరో ఏడున్నర లక్షలు జమ అయ్యాయి.

సీపీఎం నేతలు కూపీ లాగగా
గిరిజనులు కట్టుకున్న మరుగుదొడ్ల బిల్లులన్నీ 2016 మార్చినాటికే అక్రమార్కుల ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. 2017 మార్చిలో జరిగిన సామాజిక తనిఖీలోనూ ఈ అవినీతి బాగోతం బయటపడకుండా అక్రమార్కులు జాగ్రత్తపడ్డారు. ఎక్కడా ఎలాంటి సర్వే నిర్వహించని అధికారులు..పైగా అన్ని సక్రమంగా ఉన్నట్టు నివేదికలు పంపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీపీఎం నేతలు కూపీ లాగగా అవినీతి బండారం బయటపడింది. గిరిజనులకు చెందిన డబ్బులు కాంట్రాక్టర్లు కాజేయడంపై సీపీఎం నేతలు మండిపడుతున్నారు. అధికారులను నిలదీశారు. ఫలితంగా కొంతమంది కాంట్రాక్టర్లు గిరిజనులకు తమ ఎకౌంట్లలో పడ్డ డబ్బులను ఇచ్చివేశారు. దీంతో మేల్కొన్న అధికారులు గిరిజనుల డబ్బులు కాజేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మొత్తానికి సీఎం దత్తత గ్రామంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా గ్రామాల్లో అవినీతి ఎలా జరుగుతుందో ఊహించవచ్చు. పారదర్శక పాలన అని ఊదరగొడుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

18:52 - September 9, 2017

గుంటూరు : మాస్టర్ మైండ్స్ యాజమాన్యం ఫండ్ రైజింగ్ స్కీమ్ ద్వారా వచ్చిన ఫండ్‌ని కొంత మంది విద్యార్ధులకు ఆర్ధిక సహాయంగా అందజేసింది. మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల్లో ప్రతి ఆరునెలలకు ఒకసారి ఇతర కాలేజీలు, స్కూల్స్ వారు మాస్టర్ మైండ్స్ కు ఇచ్చిన మెమెంటోలను వేలం వేస్తామని తెలిపారు.. వీటిని మాస్టర్ మైండ్స్ విద్యార్ధులు వేలం ద్వారా కొంటారాని.. మాస్టర్‌ మైండ్‌ డైరెక్టర్‌ తెలిపారు. వీటి ద్వారా వచ్చిన ఫండ్‌ని మాస్టర్‌ మైండ్స్‌లో చదువుకుంటున్న పేద విద్యార్ధులకు.. అలాగే మెరిట్‌ విద్యార్ధులకు స్కాలర్‌ షిప్‌ రూపంలో అందజేస్తున్నామని తెలిపారు. ఈ సారి ఫండ్‌ రైజింగ్‌ చేయగా 90వేల రూపాయలు రాగా వాటిని స్కాలర్‌షిప్‌లుగా విద్యార్ధులకు గుంటూరు అడిషనల్ SP వైటి నాయుడు ద్వారా అందజేశారు. 

18:51 - September 9, 2017

శ్రీకాకుళం : జిల్లా సీతంపేట ఐటీడీఏ పాలక వర్గ సమావేశం తూతూ మంత్రంగా సాగింది.. ఏడాదిన్నర తర్వాత సమావేశం ఏర్పాటు చేసినా అధికారులు ఎవ్వరూ పెద్దగా చర్చపై ఆసక్తి చూపలేదు.. ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సిందిపోయి... సెల్‌ ఫోన్‌లో వీడియోలు చూస్తూ... నిద్రపోతూ సమావేశాన్ని సరిపెట్టేశారు.. ప్రజా సమస్యలను పక్కనబెట్టి సెల్‌ ఫోన్‌లో సరదా వీడియోలను చూస్తూ కెమెరాకు చిక్కారు.

18:45 - September 9, 2017

గుంటూరు : కర్ణాటకలో తెలుగు విద్యార్థులను పరీక్షలు రాయకుండా కన్నడ సంఘాల ప్రతినిధులు అడ్డుకుంటున్న ఘటనను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా తీసుకున్నారు. తెలుగు విద్యార్థులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై కేంద్రంతో మాట్లాడతానని మంత్రులకు చెప్పారు. అవసరమైతే కర్ణాటక ముఖ్యమంత్రితోనూ చర్చిస్తానని తెలిపారు. ఈ ఘటనపై వెంటనే కర్ణాటక సీఎస్‌తో మాట్లాడాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర కర్ణాటక సీఎస్‌తో మాట్లాడారు. రేపు, ఎల్లుండి జరిగే పరీక్షల్లో తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు. సీఎం అధ్యక్షతన కొనసాగుతున్న TDP సమన్వయ కమిటీ సమావేశంలో కర్ణాటక ఘటనను మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. 

18:33 - September 9, 2017

గుంటూరు : అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీ రెంట్ కంట్రోల్ ముసాయిదా బిల్లు అర్డినెన్స్ కు ఆమోదం తెలిపారు. 2016 కృష్ణా పుష్కరాల సమయంలో కాలువ గట్లు, రోడ్డుపక్కన ఇళ్లు తొలగించిన 2602 మందికి పునరావాసం కింద ఒక్కో కుటుంబానికి రూ.68 వేల పరిహారం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం. వివాస్పధమైన 64 జీవో రద్దుపై కేబినెట్ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కొత్తగా అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు అంశంపై చర్చించినట్టు సమాచారం మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

18:27 - September 9, 2017
18:16 - September 9, 2017

హైదరాబాద్ : నక్సల్బరీ ఉద్యమానికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు రోజుల పాటు అఖిల భారత సదస్సులు నిర్వహించారు. నక్సల్బరీ ఉద్యమ స్పూర్తితో మతోన్మాద శక్తులపై పోరాటం చేయాలని విప్లవ నేతలు సూచించారు. భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావాలు, విజయాలపై మేధావులతో సుధీర్ఘంగా చర్చించినట్లు విరసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి వరలక్ష్మి తెలిపారు. అఖిల భారత సదస్సులో వివిధ అంశాలపై చర్చించి భవిష్యత్‌ కార్యచరణ సిద్ధం చేస్తామన్నారు. 

18:13 - September 9, 2017

హైదరాబాద్ : విక్టోరియా మహాల్‌ భూముల పరిరక్షణ కోసం అఖిలపక్షం నేతలు ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. విక్టోరియా మహాల్‌ భూముల పరిరక్షణ కమిటి సభ్యులు అఖిలపక్షం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భేటీ అయ్యారు. భూములపై ప్రభుత్వం విడుదల చేసిన జీ.వో.ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. ఈ నెల 13వ తేదీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 

18:12 - September 9, 2017

యాదాద్రి : వైద్యంకోసం వచ్చిన మహిళలపై అత్యాచారం చేసిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం తహసిల్దార్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. స్థానికంగా నర్సింగ్‌ హోం నిర్వహిస్తున్న అజీజ్‌ పాషా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. వైద్యం కోసం వచ్చిన రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడని... ఆపరేషన్‌ అవసరం లేకపోయినా డబ్బుకోసం చేస్తున్నాడని మండిపడ్డారు. మహిళా రోగులపై అత్యాచారం చేస్తున్న డాక్టర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని తహశిల్దార్‌ను కోరారు. 

18:11 - September 9, 2017

మహబూబబాద్ : బిజెపి అధికారంలోకి వచ్చాక మతోన్మాద శక్తులు చెలరేగిపోతున్నాయని ఆరోపించారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ప్రజాస్వామ్య వాదులు దారుణ హత్యకు గురవుతున్నారని తమ్మినేని అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రజాస్వామ్య పునాదులు దెబ్బతినే ప్రమాదం ఉందన్నతమ్మినేని... కేంద్రం అవలంభిస్తున్న అనేక విధానాలపై టీ మాస్ ఫోరం పోరాటం చేస్తుందని తెలిపారు. 

18:09 - September 9, 2017

నిజమాబాద్ : జిల్లా కోటగిరిలో నాగేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కిడ్నాప్ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైయ్యాయి. కుటుంబ సభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆందోళన దిగారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

18:04 - September 9, 2017

రంగారెడ్డి : టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీలేదని టీపీపీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.. ప్రతి కార్యకర్త సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ వేధింపులకు భయపడొద్దని చెప్పారు.. కేసీఆర్‌ మాయ మాటలవల్లే 2014 ఎన్నికల్లో ఓడిపోయామని స్పష్టం చేశారు.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో కాంగ్రెస్‌ శిక్షణా తరగతులకు ఉత్తమ్‌ హాజరయ్యారు.. మండల, బ్లాక్‌ స్థాయి ప్రతినిధులు, కార్యకర్తలకు పలు సూచనలు చెప్పారు.. అయితే కార్యక్రమం ప్రారంభంలో వేదికపైకి కోమటిరెడ్డి బ్రదర్స్‌ను పిలవకపోవడం వివాదాస్పదైంది.. తమను వేదికపైకి ఆహ్వనించలేదంటూ అలిగిన కోమటిరెడ్డి బ్రదర్స్‌... కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.

18:04 - September 9, 2017

హైదరాబాద్ : మియాపూర్‌లో నటుడు అక్కినేని నాగార్జున, హీరోయిన్లు రాశి ఖన్నా, ప్రజ్ఞా జైస్వాల్‌లు సందడి చేశారు. మదీనాగూడలో నూతనంగా ఏర్పాడు చేసిన సౌతిండియా షాపింగ్‌ మాల్‌ ప్రారంభించారు. నాణ్యతతో కూడిన వస్త్రాలను వినియోగదారులకు అందిస్తున్న సౌతిండియా షాపింగ్ మాల్‌ యాజమాన్యాన్ని నాగార్జున అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని బ్రాంచీలు ప్రారంభించే దిశగా షాపింగ్ మాల్ అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. 

18:03 - September 9, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుర్తుతెలియని ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సోపోర్‌ సమీపంలోని రేబన్‌ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కొన్నారనే సమచారం మేరకు భద్రతాదళాలు తెల్లవారుజామున సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఉగ్రవాదులు లొంగిపోవాలని అధికారులు హెచ్చరించారు. కానీ వీటిని లెక్కచేయని ఉగ్రవాదులు భద్రతాదళాలపైకి కాల్పులకు తెగ్గబడ్డారు. భద్రతాదళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌ జరిగే ప్రాంతంలో మొబైల్‌, ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేశారు.

18:01 - September 9, 2017

చండీఘర్ : హరియాణా సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయంలో రెండోరోజు కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 25న పంచకులలో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ డేరా అనుచరులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో హింసాత్మక ఘటనల ప్రధాన సూత్రధారి డేరా పంచకుల శాఖ హెడ్‌ చమ్‌కౌర్‌సింగ్‌ ఉన్నారు. 5 కోట్లు ఖర్చు పెట్టి హింసను ప్రేరేపించారని వీరిపై ఆరోపణలున్నాయి. డేరా ప్రాంగణంలో తాళాలను పగలగొట్టారు. అక్రమ బాణసంచా తయారీ ఫ్యాక్టరీని గుర్తించి సీజ్‌ చేశారు. బాణసంచా, భారీగా నిల్వ ఉన్న పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫ్యాక్టరీలో అక్రమంగా ఆయుధాలను తయారు చేసినట్లు సమాచారం.

18:00 - September 9, 2017

బెంగుళూరు : జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. నిఘా వర్గాల సమాచారం మేరకు 18 మంది ప్రముఖ రచయితలు, అభ్యుదయవాదులు, తదితరులకు భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సినీ నటుడు, రచయిత గిరీష్‌ కర్నార్డ్‌తో పాటు బరగూరు రామచంద్రప్ప, పాటిల్‌ పుట్టప్ప, చెన్నవీర కనవి తదితరులకు ప్రభుత్వం రక్షణ కల్పించనుంది. లింగాయత్‌లను ప్రత్యేకంగా గుర్తించాలని పోరాడుతున్న ఎస్‌ఎమ్‌ జమ్‌దర్‌కు కూడా భద్రత కల్పించనున్నట్లు ఇంటిలిజెన్స్‌ అధికారులు తెలిపారు. 

17:58 - September 9, 2017

హైదరాబాద్ : కర్ణాటకలో తెలుగు విద్యార్థులను పరీక్ష రాయకుండా అడ్డుకోవడం సరికాదన్నారు.. AP మంత్రి చినరాజప్ప... ఈ విషయంపై కేంద్రంతోపాటు.. కర్ణాటక అధికారులతోనూ మాట్లాడతామని స్పష్టం చేశారు.. IBPS పరీక్ష జాతీయ స్థాయిలో నిర్వహిస్తారని గుర్తు చేశారు.. తెలుగు విద్యార్థులకు తాము అండగా నిలబడతామని చెప్పారు.. కర్ణాటక హుబ్లీలో ఐబీపీఎస్‌ పరీక్ష రాస్తున్న తెలుగు విద్యార్థులను కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి.. ఎక్కువ పోస్టులు ఆంధ్ర అభ్యర్థులకే వస్తున్నాయని ఆరోపించాయి. 

17:57 - September 9, 2017

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రతిష్టాత్మక స్కోచ్‌ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన 49వ స్కోచ్‌ సమ్మిట్‌లో పాల్గొన్న కేటీఆర్‌ను ఐటీ మినిస్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపిక చేశారు. దేశంలోనే మొదటి సారిగా బ్రాండ్‌ బ్యాండ్‌ సేవలను అందిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు కేటీఆర్‌. తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా తెలంగాణలో ప్రతి ఇంటికీ మంచి నీటి వసతి కల్పిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 

17:56 - September 9, 2017

విశాఖ : అంతర్జాతీయ ఆవిష్కరణల ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. ఐఎఫ్‌ఐఏ అధ్యక్షుడు అలిరేజా రస్టెగర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 150 స్టాల్స్‌ను ఏర్పాటు చేసి.. కొత్త పరికరాలను.. కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగకరంగా ఉండే ఆవిష్కరణలు ప్రదర్శించి... వాటి గురించి వివరించారు. 30 దేశాల ప్రతినిధులు, 50 మంది దేశీయ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనకు... ఆదివారం మంత్రి నారా లోకేశ్, సోమవారం సీఎం చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు.

17:55 - September 9, 2017

హైదరాబాద్ : చేనేతలపై జీఎస్టీ ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సంక్షోభంలో ఉన్న చేనేతకు రాయితీ అందించాల్సింది పోయి.. 28శాతం పన్ను వేయడం సరికాదని విమర్శించారు.. చేనేతపై పన్ను తగ్గించకుంటే ఉద్యమం తప్పదని చెరుపల్లి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:11 - September 9, 2017

గుంటూరు : ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో జలసిరి హారతి జరిగిన తీరుపై ప్రధానంగా చర్చ జగుతున్నట్టు తెలుస్తోంది. దోమల నియంత్రణ చట్టం పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు సహా పలు సంస్థలకు భూ కేటాయింపులపై, నీటి పారుదల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా రూ.3వేల కోట్ల సమీకరణపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

టిడిపి సమన్వయ భేటీ ప్రస్తావించిన అంశాలు...

అమరావతి: టిడిపి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎం చంద్రబాబు వివరించారు. అంతే కాకుండా అతి విశ్వాసంతో వ్యవహరించొద్దని సూచించారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చర్చ జరిగింది. ఈనెల 28 వరకు చంద్రన్న బీమా ఎన్ రోల్ మెంట్ గడువు పెంచాలని నిర్ణయించారు. పులివెందులలో హార్టీకల్చర్ కు మంచి అవకాశం ఉందని, అక్కడి రైతులను ఆదిశగా ప్రోత్సహించాలని చంద్రబాబు తెలిపారు. నంద్యాల, కాకినాడలో మంచి ప్రతిభ కనబరిచారంటూ నేతలను ప్రశంసించారు. పార్లమెంట్ ఇంఛార్జలుగా ఉన్న మంత్రులు మరింత దూకుడుగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. త్వరలోనే జాతీయ రాష్ట్ర పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ పై నేరం రుజువు

యాదాద్రి: ఫోర్జరీ సంతకాలతో 250 ఎకరాలు ఆక్రమించిన కేసులో మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ పై నేరం రుజువు అయ్యింది. భిక్షమయ్యగౌడ్ సహా మరో ఐదుగురిపై నేరం రుజువు అయ్యింది. అయితే ఇప్పటికే భిక్షమ్య, భార్య, కుమారుడు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ముందస్తు బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు.

15:43 - September 9, 2017

వరంగల్ : తెలంగాణాలో ముదిరాజుల అభివృద్ధి కోసం చెరువులు, ప్రాజెక్టులలో చేపపిల్లలు పంపిణీ చేస్తున్నామన్నారు శాసన సభాపతి సిరికొండ మధుసూధనాచారి. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి చలివాగు ప్రాజెక్ట్‌లో చేపపిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చేపపిల్లలను జాగ్రత్తగా పెంచుకుంటే సుమారు మూడు కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ముదిరాజులకు అడ్డువచ్చే కాంట్రాక్టర్లు, మద్యవర్తులపై చట్టసవరణలు చేసైనా చర్యలు తీసుకుంటామన్నారు. 

15:42 - September 9, 2017

కడప : జిల్లా పులివెందులలో ఇంజక్షన్‌ వికటించి ఓ విద్యార్థి మృతి చెందాడు.. లక్ష్మీదేవి, సుబ్బయ్య దంపతుల కుమారుడు శివశంకర్‌ పదో తరగతి చదువుతున్నాడు.. అతనికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు RMP డాక్టర్‌ కులయప్పకు చూపించారు... శివశంకర్‌కు డాక్టర్‌ ఇంజక్షన్‌ వేశాడు.. మర్నాటికి బాలుడి కాలులో వాపు వచ్చింది.. అతన్ని వేరే ఆసుపత్రికి తరలించినా బాలుడు కోలుకోలేదు.. కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కొడుకు మరణంతో అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

15:41 - September 9, 2017

హైదరాబాద్ : నగరంలో మళ్లీ ఐసిస్ కలకలం రేగింది. టోలిచౌకీలో ముగ్గురు ఐసిస్ అనుమానితులను ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ పోలీసుల సహాకరంతో అరెస్ట్ చేశారు. వారిని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. అరెస్టైన వారిలో ఖయ్యూం, నఫీక్, మాలిక్ లు ఉన్నారు. మరింత సమాచారం వీడియోలో చూద్దాం.

15:36 - September 9, 2017

ప్రకాశం : జిల్లా బల్లికురవ మండలంలో విషాదం చోటుచేసుకుంది. నక్కబొక్కలపాడు గ్రామంలో వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఇద్దరు చిన్నారులు నీటి కాలువలో పడి మృతి చెందారు. నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తూ చిన్నారులు కాలువలో జాపిపడ్డట్టు తెలుస్తోంది. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయాలు నెలకొన్నాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:34 - September 9, 2017

పశ్చిగోదావరి : జిల్లా వేలేపాడు మండలం ఎర్రబోరులో కలకలం రేగింది. చేతబడి చేశారన్న అనుమానంతో ఓ గిరిజనుడు ఏకంగా తన కడుపును అడ్డంగా కోసుకున్నాడు. వెంకటేశ్వర్లు ఈ నెల 6న కత్తిపీటతో కడుపును కోసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే వేలేరుపాడు ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వర్లు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ప్రారంభమైన ఏపీ కేబినెట్

అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయ్యింది. రైతులకు మూడో విడత రైతు రుణమాఫీ విడుదల, నిరుద్యోగ భృతి, జలసిరి నిర్వహించిన తీరు పై చర్చించనున్నట్లు సమాచారం.

15:00 - September 9, 2017

విజయవాడ : శాసనమండలిలో కీలక పదవుల భర్తీపై టీడీపీ అధినాయకత్వం దృష్టిసారించింది. ఇప్పటికే మండలి చైర్మన్‌పదవికి నంద్యాలకు చెందిన ఎన్‌ఎండీ ఫరూక్‌ పేరును ఖరారు చేయగా.. ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్‌గా తూర్పుగోదావరికి చెందిన రెడ్డిసుబ్రహ్మణ్యం ఉన్నారు. ఇక మిగిలిన చీఫ్‌విప్‌ పదవితో పాటు విప్‌లను ఖరారు చేయడానికి చంద్రబాబు భారీ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కేబినెట్‌ ర్యాంకు పదవి అయిన చీఫ్‌విప్‌తో పాటు విప్‌ పదవులకు నేతల నుంచి పోటీ ఎక్కువగా ఉంది. చీఫ్‌విప్‌ ఛాన్స్‌కోసం యలమంచిలి రాజేంద్రప్రసాద్‌, టీడీ జనార్దన్‌, బీద రవిచంద్రయాదవ్, పయ్యావుల కేశవ్‌లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. కడపజిల్లాకు చెందిన రామసుబ్బారెడ్డికి గతంలో ఇచ్చిన హామీ మేరకు చీఫ్‌విప్‌ పదవి దక్కే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

బుద్ధావెంకన్నకే బాబు ప్రాధాన్యత
ఇక మిగిలిన నాలుగు విప్‌ పదవులపై కూడా పార్టీ నేతలు ఎవరిస్థాయిలో వారు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఆయా సామాజిక వర్గాలను పరిగణలోనికి తీసుకుని.. ఉన్న నాలుగు బెర్తులను నాలుగు సామాజిక వర్గాలకు కేటాయించే అవకాశం ఉంది. అయినా ఆయా సామాజిక వర్గాల నుంచి కూడా పదవి ఆశిస్తున్న నేతల సంఖ్య భారీగానే ఉంది. కాపుల నుంచి పప్పుల చలపతిరావు, చిక్కాల రామచంద్రరావు, అన్నం సతీష్‌ల పేర్లు పరిశీలిస్తున్నా.. వీరిలో అన్నం సతీశ్‌కే ఛాన్స్‌ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అటు బీసీల నుంచి బుద్దావెంకన్న, అంగర రామ్మోహన్‌, పోతుల సునీత, బచ్చుల అర్జునుడుతోపాటు తిప్పేస్వామిలాంటి నేతలు పోటీపడుతున్నారు. అయితే.. పార్టీకార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటున్న బుద్ధావెంకన్నకే బాబు ప్రాధాన్యత ఇస్తారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

ఎస్సీ ,ఎస్టీ వర్గాలకు ఒక విప్‌పదవి
ఇక ఎస్సీ ,ఎస్టీ సామాజిక వర్గాలకు ఒక విప్‌పదవి దక్కే అవకాశం ఉంది. ఈ రెండు వర్గాల నుంచి పదవి ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి డొక్కామాణిక్య వరప్రసాద్‌, శమంతకమణి ఉండగా ..ఎస్టీల నుంచి గుమ్మడి సంధ్యారాణి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మండలి పదవుల ఎంపిక టీడీపీలో హాట్‌హాట్‌ చర్చకు దారితీసింది. పోటీ ఎక్కువగా ఉంటడంతో ఇప్పటిదాకా ఊరిస్తున్న పదవి ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. 

నేరెళ్ల బాధితుల విషయంలో కాంగ్రెస్ నేతల డ్రామాలు: మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్: నేరెళ్ల బాధితుల విషయంలో కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని, బాధితులు కోరుకున్న ఆస్పత్రిలో చికిత్స చేయిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఇన్ పేషెంట్స్ గా అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదని, నిమ్స్, కేర్ ఆస్పత్రుల డాక్టర్లు చెప్పారని మంత్రి పేర్కొన్నారు.

14:54 - September 9, 2017

తూర్పు గోదావరి : రాజమహేంద్రరం మహిళలు రోడ్డెక్కారు. హెల్మెట్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించడం కోసం.. భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మహిళలంతా హెల్మెట్‌లు ధరించి.. నగరంలోని ప్రధాన వీధుల్లో ప్రదర్శన చేశారు. నగర మేయర్ పంతం రజనీశేషసాయి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఎస్పీ రాజకుమారి సహా పలువురు మహిళా ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్మెట్ అవసరాన్ని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ అన్నారు. ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ ప్రాణ రక్షణగా నిలుస్తుందని తెలిపారు. 

14:53 - September 9, 2017

విశాఖపట్నం : పీజీ విద్యార్థులు తమకు 3 వేల స్కాలర్‌షిప్‌ పెంచాలని.. కలెక్టర్‌ బంగ్లా వద్ద ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు అక్కడున్న విద్యార్థి నాయకులను అరెస్ట్‌ చేశారు. దీంతో ఏయూ విద్యార్థులు అరెస్ట్ చేసిన విద్యార్ధులను వెంటనే విడుదల చేయాలని.. త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. మహిళా విద్యార్ధులను రాత్రంతా స్టేషన్‌లోనే ఉంచడంతో.. ఎయు రిజిస్ట్రార్‌ స్పందించాలంటూ వీసీ బంగ్లాను ముట్టడించారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పీజీ విద్యార్ధులకు ఇప్పుడు 6 వందలు చెల్లిస్తున్నారని.. కానీ మెస్‌ చార్జీలు 3 వేలు వస్తోందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్‌ అయిన విద్యార్ధులకు బెయిల్‌ మంజూరయ్యింది.

14:52 - September 9, 2017

హైదరాబాద్ : స్కూల్‌ టీచర్ల పోస్ట్‌లను భర్తీ చేయకపోతే....తెలంగాణాలో ఏ మంత్రిని గ్రామాల్లో తిరగనియ్యమంటూ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ అభ్యర్థులు ఇవాళ డైరెక్టర్ ఆఫ్‌ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్రంలో దాదాపుగా 40వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా కేవలం 8వేల పోస్టులకు మాత్రమే ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిందని ఆర్‌.కృష్ణయ్య మండిపడ్డారు. అంతేకాదు మూడున్నరేళ్లుగా వాయిదాలు వేస్తూ వస్తున్నారని వెంటనే డీఎస్సీ విడుదల చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవంటూ హెచ్చరించారు. 

కవి సీతారాంకు కళోజీ సాహిత్య పురస్కారం..

హైదరాబాద్ : ఖమ్మం జిల్లాకు చెందిన కవి రావులపాటి సీతారాంకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. కాళోజీ 103వ జయంతి వేడుకలో రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా సీతారాంకు అవార్డును ప్రదానం చేసి సన్మానించారు. పురస్కారంతో పాటు రూ. 1,01,116ల నగదును సీతారాంకు అందజేశారు

కేసీఆర్ పాలనలో నలుగురికే బంగారు తెలంగాణ:ఉత్తమ్

రంగారెడ్డి: కేసీఆర్ పాలనలో నలుగురికే బంగారు తెలంగాణ అని టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన శంషాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో మాట్లాడుతూ... కేసీఆర్ మాయమాటల వల్ల 2014 లో ఓడామని, ఖాళీ పోస్టులను భర్తీ చేయలేని అసమర్థుడు కేసీఆర్ అని మండిపడ్డారు.

14:01 - September 9, 2017
14:00 - September 9, 2017
13:59 - September 9, 2017

శిక్షణా శిబిరం నుండి బయటకు వెళ్లిన కోమటిరెడ్డి సోదరులు..

హైదరాబాద్: శంషాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో మాజీ మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనుచరులు పలు నినాదాలు చేశారు. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో కోమటిరెడ్డి అనుచరులు పెద్దపెట్టున నినాదాలు ఇచ్చారు. అనంతరం తన అనుచరులతో కలిసి కోమటిరెడ్డి బ్రదర్స్ బయటకు వెళ్లిపోయారు.

నోట్ల రద్దుతో దేశానికి నష్టమే : పృధ్వీరాజ్ చౌహాన్

రంగారెడ్డి: నోట్ల రద్దు పై కాంగ్రెస్ చెప్పిందే నిజమైందని మహారాష్ట్ర మాజీ సీఎం పృధ్వీరాజ్ చౌహాన్ అన్నారు. నోట్ల రద్దుతో దేశానికి మేలు కంటే నష్టమే ఎక్కువ జరిగిందని, ప్రజల జీవితాలతో మోదీ ఆటలాడుతున్నారని మండిపడ్డారు.

13:57 - September 9, 2017

హైదరాబాద్ : నగరంలోని నెహ్రూ పిల్లల పాఠశాలలో దారుణం జరిగింది. రెండో తరగతి విద్యార్థిని ప్రిన్సిపల్ చితకబాదారు. కార్యాన్ లోని నెహ్రూ పాఠశాలలో ఆదిత్య (7) అనే విద్యార్థి రెండో తరగతి చదువుతున్నాడు. ఆదిత్యకు నత్తి ఉండడంతో కొన్ని పదాలు సరిగ్గా పలక లేదు. ప్రిన్సిపల్ చిన్నారిని చితకబాదారు. విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తల్లిదంద్రులు ఆందోళనలో ఉన్నారు. టప్పచెబుత్ర పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ ను అరెస్టు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థి తల్లి అదే పాఠశాలలో టీచర్ గా పని చేయడం గమనార్హం.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఎన్నికల తర్వాత కేసీఆర్ బిజెపితో కలవడం ఖాయం: జైపాల్ రెడ్డి

రంగారెడ్డి: అబద్ధాలు చెప్పడంలో మోడీతో కేసీఆర్ పోటీపడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ బిజెపితో కలవడం ఖాయమని, 2019లో కాంగ్రెస్ దే విజయం అని స్పష్టం చేశారు.

తెలుగు విద్యార్థులు ఆందోళన చెందొద్దు:సీఎం చంద్రబాబు..

అమరావతి: కర్ణాటకలో జాతీయ పోటీ పరీక్షలు రాసే తెలుగు విద్యార్ధులు ఆందోళన చెందవద్దని సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. కర్ణాటకలో తెలుగు విద్యార్ధులపై దాడి అంశంపై కర్ణాటక సీఎస్‌, డీజీపీ, కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడాలని సీఎం స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్రను చంద్రబాబు ఆదేశించారు. అంతేగాక అవసరమైతే ఆరాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రప్రభుత్వంతో మాట్లాడతానని చంద్రబాబు పేర్కొన్నారు. రేపు ఎల్లుండి జరిగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

13:26 - September 9, 2017

సినిమా వాళ్ళు వ్యాపారం లోకి దిగటం కొత్తేమి కాదు. రియల్ ఎస్టేట్, హోటల్స్ పబ్స్, ఇలా ప్రతి బిసినెస్ లో రాణిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా హిట్ ట్రాక్ లో దూసుకెళ్తున్న హీరో కొత్తగా బిజినెస్ మీద ఫోకస్ పెట్టాడు. మరి ఆ హీరో ఎవరు ? 'ప్రభాస్' అంటే ఒకప్పుడు లోకల్ యాక్టర్ ఇప్పుడు ఇంటెర్నేషన్స్ స్టార్ లో ఒకడయ్యాడు. ఒకప్పుడు తెలుగు స్క్రీన్ కి మాత్రమే పరిమితమయిన నటుడు. తెలుగు సినిమా రుచిని గ్రాండ్ గా ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా 'బాహుబలి'. ఈ సినిమాతో అందరికి ఒక్క సరిగా ఇంటర్నేషనల్ లెవెల్ రికగ్నైజేషన్ వచ్చింది. మరి ఆ గుర్తింపును క్యాష్ చేసుకుంటున్నాడు మన అమరేంద్ర బాహుబలి. కలక్షన్స్ పరంగానే కాకుండా టెక్నీకల్ గా కూడా సూపర్బ్ అనిపించుకుంది ఈ బాహుబలి సినిమా.

'బాహుబలి' తర్వాత ప్రభాస్ కెరీర్లోనే అత్యంత బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'సాహో' సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'సాహో' సినిమా గ్రాఫిక్స్ లో కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు ఫిలిం యూనిట్. ఇదిలా ఉంటె 'ప్రభాస్' బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. తాజాగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ ఎత్తున థియేటర్లను నిర్మిస్తున్నారు. ఈ థియేటర్ల క్యాంపస్ ను 'బాహుబలి' థియేటర్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న బాహుబలి థియేటర్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం శరవేగంగా నిర్మిస్తున్న ఈ థియేటర్ ను 2018లో ప్రారంభించనున్నారు

13:18 - September 9, 2017
13:16 - September 9, 2017

హైదరాబాద్ : నగరంలో మళ్లీ ఐసిస్ కలకలం రేపింది. టోలిచౌకీలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ఎన్ ఐఏ విచారిస్తున్నారు. ఖయ్యూం, నఫీక్, అబ్దుల్ మాలిక్ గా గుర్తించారు. రాజేంద్రనగర్ సన్ సిటీలో ముగ్గురు ఉంటున్నారు. వీరిని నుంచి అనేక సమాచారం లాగుతున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులతో వీరికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో రాష్ట్ర పోలీసులు, యూపీ ఎన్ ఐఏ పోలీసులు కలిసి విచారిస్తున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:15 - September 9, 2017

సినిమాల్లో రాణించాలని చాలామంది కళలుకంటారు. సినిమా ఇండస్ట్రీ లో కొత్తవాళ్లకు ప్లేస్ రావడం చాల కష్టం ..వారసత్వం ఉన్న ఈ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే కొంచం కష్టమైన పనే. బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడ ఒక హిట్ సినిమా కోసం తెగ తాపత్రేయ పడుతున్నాడు ఈ యంగ్ హీరో. 'నాగార్జున' వారసుడు 'అఖిల్' .అక్కినేని వారి ఫామిలీ లో ఫస్ట్ సినిమా ఘోరంగా ప్లాప్ చేసుకున్నాడు అని అఖిల్ గురించి అనుకుంటున్నారట. ఎన్నో ఎక్సపెక్టషన్స్ తో వచ్చిన 'అఖిల్' సినిమా ఆశించిన విజయం సాధించలేదు అని ఫిలిం నగర్ టాక్. ఎంత స్టార్ హీరో కొడుకు అయితే మాత్రం ఎలా తీసిన సినిమాలు చూస్తారా అనేది ప్రేక్షకుల ప్రశ్న. సినిమాలో కంటెంట్ ఉండాలి హీరోలో దమ్ము ఉండాలి అని ఫిక్స్ ఐన ఆడియన్స్ కి నిరాశ మిగిల్చిన సినిమా అఖిల్ అని అనుకుంటున్నరు.

'24' సినిమా తో మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్ విక్రమ్ కుమార్. అక్కినేని అఖిల్ ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు నాగార్జున. ఇక తాజాగా అఖిల్ రెండో సినిమాకు సంబంధించి మరో స్టిల్ బయటికి వచ్చింది. అందులో వెనుక విలన్లు తరుముతుంటే అఖిల్ గోడమీదుగా గాల్లోకి ఎగురుతూ కనిపిస్తున్నాడు. వరుసగా ఈ పోస్టర్లు చూసిన జనాలు.. అఖిల్ బాబు అసలు నేల మీద నడవడా.. అతనేమైనా స్పైడర్ మ్యానా.. సూపర్ మ్యానా.. అని చర్చించుకుంటున్నారంట. మరి ప్రేక్షకులందరూ సెన్సిబుల్ సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడుతున్న ఈ రోజుల్లో అఖిల్-విక్రమ్ పక్కా యాక్షన్ సినిమా చేయడంలో ఆంతర్యమేంటో.. ఇందులో అంత విశేషం ఏముందో చూడాలి

హైదరాబాద్ లో మళ్లీ ఐసిస్ కలకలం

హైదరాబాద్: నగరంలో మళ్లీ ఐసిస్ కలకలం రేగింది. రాజేంద్ర నగర్ లోని సన్ సిటీలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించాడని ఖయ్యూంను, అనుమానితులు నఫీక్, మాలిక్ గా గుర్తించారు. ఆ ముగ్గురిని ఎన్ ఐఏ విచారిస్తోంది.

జీఎస్టీ బిల్లుకు సవరణ చేయాలి: సీపీఐ నారాయణ

హైదరాబాద్: జీఎస్టీతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోందని, కేంద్రం, ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పునరాలోచించాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. జీఎస్టీ బిల్లుకు సవరణ చేయాలని, జీఎస్టీలో సవరణలకు కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే దేశ వ్యాప్త ఆందోళనలకు పిలుపు ఇస్తామని నారాయణ హెచ్చరించారు.

13:01 - September 9, 2017

హైదరాబాద్ : నగరంలోని సుచిత్రలో చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ కాజల్ అగర్వాల్ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. 9 వ చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభం అయింది.  
మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం...

రేయాన్ స్కూల్ ప్రిన్సిపల్ సస్పెండ్..

న్యూఢిల్లీ : గుర్గావ్‌లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ తాత్కాలిక ప్రిన్సిపాల్ నీర్జా భట్రా సస్పెండ్ అయ్యారు. రెండో తరగతి చదువుతున్న ప్రద్యుమన్(7)ను బస్సు కండక్టర్ హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. విద్యార్థి హత్యపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. విద్యార్థి హత్యకు గల కారణాలపై నివేదిక ఇవ్వాలని కమిటీని కలెక్టర్ ఆదేశించారు. ఈ కేసులో విద్యార్థి తల్లిదండ్రుల డిమాండ్ మేరకు స్కూల్ ప్రిన్సిపాల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యం...

జమ్మూకశ్మీర్: ఫూంచ్ సెక్టార్ లో పార్టీ రేజంర్లు కాల్పులకు తెగబడ్డారు. మోర్టార్లను భారత సైనిక శిబిరాలపైకి విసిరారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది.

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు...

హైదరాబాద్ : రవీంద్ర భారతిలో ప్రజా కవి కాళోజీ నారాయణరావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, నందిని సిధారెడ్డి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో పాటు పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు.

12:53 - September 9, 2017


మంచిర్యాల : జిల్లాలోని లక్సెట్టిపేట గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థినుల ర్యాగింగ్‌ను తట్టుకోలేక.. ఇద్దరు 8వ తరగతి విద్యార్థినులు యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌ ఆసుపత్రికి తరలించారు. గత వారం రోజులుగా సీనియర్లు వేధిస్తున్నారని శిరీష, సాయినిధి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో ఇంటికి ఫోన్‌ చేసి తనను తీసుకొని వెళ్లమని   సాయినిధి తల్లిదండ్రులను కోరింది. అంతలోనే ల్యాబ్‌కు వెళ్లి ఇద్దరు విద్యార్ధినులు కెమికల్ తాగారు. 

 

12:46 - September 9, 2017

హైదరాబాద్‌ : నగరంలోని హైటెక్స్‌ ఎదుట పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జీఎస్టీ సమావేశం జరుగుతుండడంతో సీపీఎం, సీఐటీయూ, తెలంగాణ, ఏపీ చేనేత కార్మికులు ధర్నాకు దిగారు. జీఎస్టీతో చేనేత, బీడీ, టెక్స్‌టైల్‌, ప్లాస్టిక్‌ పరిశ్రమలు నష్టపోతున్నాయని ఆందోళన చేపట్టారు. జీఎస్టీ నుంచి మినహాయించాలని,.. పన్ను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

 

ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారుల గల్లంతు

ప్రకాశం: బల్లికురవ మండలం నక్కబొక్కలపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక నీటికుంటలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. సమాచారమందుకున్న స్థానికులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టి రెండు మృతదేహాలను వెలికితీశారు. మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉత్తమ్

రంగారెడ్డి : శంషాబాద్ మల్లి కన్వెన్షన్ లో కాంగ్రెస్ మండల బ్లాక్ స్థాయి ప్రతినిధులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని పతాకావిష్కరణ తో టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ స్పోక్స్ పర్సన్ రన్ దీప్ సింగ్ సూర్జేవారి హాజరయ్యారు. మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చౌహాజన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా, జైపాల్ రెడ్డి, భట్టివిక్రమార్క హాజరయ్యారు.

12:34 - September 9, 2017

ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ మరోసారి వివాదాస్పదమయ్యారు. ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మోదీని ఉద్దేశించి.. 'నేను సాధించిన విజయాలు రెండు... ఒకటి మూర్ఖులను భక్తులను చేయడం, రెండు.. భక్తులను మూర్ఖులను చేయడం' అని మోదీ బొమ్మతో ఉన్న చిత్రాన్ని డిగ్గీ పోస్ట్‌ చేశారు. దిగ్విజయ్‌ వాడిన పదాలు అత్యంత అశ్లీలమైనవి కావడంతో... బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డిగ్గీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే... దిగ్విజయ్‌ మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదని తెలిపారు. నాపై మోదీ భక్తులు చేస్తున్న విమర్శలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.. ఎందుకంటే వారిని మోదీ వెర్రివాళ్లను చేస్తున్నాడని మరో ట్వీట్‌ చేయడం గమనార్హం. 

 

40 వేల పోస్టులతో డీఎస్సీని ప్రకటించాలి: ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని బీసీ నేతలు ముట్టడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. 40 వేల పోస్టులతో డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

12:31 - September 9, 2017

మంచిర్యాల : జిల్లాలోని లక్సెట్టిపేట గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. మరోసారి ర్యాగింగ్‌ భూతం బుసుకొట్టింది. పదో తరగతి విద్యార్థినుల ర్యాగింగ్‌ను తట్టుకోలేక ఇద్దరు 8వ తరగతి విద్యార్థినులు యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

క్యూబాను తాకిన ఇర్మా...

హైదరాబాద్:  అమెరికా ఖండాన్ని వణికిస్తున్న ఇర్మా హరికేను ఇప్పుడు క్యూబాను తాకింది. ఇర్మా ప్రభావంతో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే దీనిని ఐదో కేటగిరికి చెందిన హరికేనుగా నిర్ణయించారు. శుక్రవారం రాత్రి నుంచి ఇర్మా విపరీతంగా బలపడింది. కొన్ని దశాబ్దాల అనంతరం ఐదో కేటగిరికి చెందిన హరికేను క్యూబాను తాకింది. దీంతో తీరప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాలు విపరీతంగా ప్రభావితం అవుతున్నాయి.

12:27 - September 9, 2017
12:26 - September 9, 2017

రాజస్థాన్‌ : జైపూర్‌లో అల్లర్లు కొనసాగుతున్నాయి. వాహనాల తనిఖీలతో అల్లర్లు మొదలయ్యాయి. నిన్న ఓ వ్యక్తిని పోలీసులు కొట్టడంతో స్థానికులు రెచ్చిపోయారు. పోలీసులపై స్థానికులు రాళ్ల దాడి చేశారు. పలు వాహనాలను దగ్ధం చేశారు. ఈ దాడులో ఓ పోలీస్‌ అధికారి మృతి చెందాడు. అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. లాఠీచార్జ్‌లో పలువురికి గాయాలయ్యాయి. శాంతిభద్రతల దృష్ట్యా మనక్‌చౌక్‌, సుభాష్‌చౌక్‌, రాంగంజ్‌, గల్టా గేట్‌ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

స్కోచ్ అవార్డు అందుకున్న మంత్రి కేటీఆర్

ఢిల్లీ : 49వ స్కోచ్ సమ్మిట్ సందర్భంగా శనివారం ఢిల్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్కోచ్ అవార్డుకు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను తెలంగాణ ఐటీ స్టాల్స్ మంత్రి సందర్శించారు.

12:17 - September 9, 2017

విశాఖ : ఆంధ్రా యూనివర్శిటీలో పలు సమస్యల పరిష్కారం కోసం.. రిజిస్ట్రార్ ఆఫీసు ముందు ఎస్ ఎఫ్ ఐ నాయకులు, విద్యార్ధులు ధర్నాకు దిగారు. పోలీసులు వారిపై అక్రమ కేసులు పెట్టి.. రాత్రంతా అమ్మాయిలను త్రీ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు. పీజీ విద్యార్ధులకు 3 వేల రూపాయల స్కాలర్‌షిప్‌ చెల్లించాలని.. రెండు రోజుల కిందట ఏయూ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. దీంతో స్టూడెంట్స్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

 

12:13 - September 9, 2017

హైదరాబాద్ : ఇవాళ టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం 5వ విడత తెలంగాణ అమరవీరుల స్ఫూర్తియాత్ర ప్రారంభంకానుంది. ఈ యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొనసాగుతుంది. ఇందుకోసం టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. నేరుగా ఆయన ఆదిలాబాద్‌ జిల్లాలోని బాసర వెళ్తారు. అక్కడ నుంచి స్ఫూర్తి యాత్రను ప్రారంభించనున్నారు.  మంచిర్యాలలో ఈ యాత్ర ముగియనుంది. 

 

కొనసాగుతున్న జీఎస్టీ కౌన్సిల్...

హైదరాబాద్: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి 29 రాష్ట్రాల నుండి ఆర్థిక మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

'10టివి' కథనానికి పాలకవర్గం స్పందన...

తూ.గో: పెద్దాపురంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగంపై '10టివి' కథనానికి పాలకవర్గం స్పందించింది. రోడ్డు నిర్మానానికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించడం లేదని వివరణ ఇచ్చింది.

హైటెక్స్ వద్ద ఉద్రిక్తత.. కొనసాగుతున్న అరెస్టులు

హైదరాబాద్:నగరంలో హైటెక్స్ లో జీఎస్టీ కౌన్సిల్‌ 21వ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా సీపీఎం, సీఐటీయూ, తెలంగాణ, ఏపీ చేనేత కార్మికులు ధర్నా చేపట్టారు. జీఎస్టీ నుంచి చేనేత, బీడీ, టెక్స్ టైల్, ప్లాస్టిక్ పరిశ్రమలను మినహాయింపు ఇవ్వాలని, పన్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

11:42 - September 9, 2017

బెంగళూరు: కర్ణాటక హుబ్లీలో బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేందుకు వచ్చిన తెలుగు విద్యార్థులను కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. తమ ఉద్యోగాలను ఇతర రాష్ట్రాల వాళ్లు కొల్లగొడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

11:30 - September 9, 2017

హైదరాబాద్: కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. తొలిసారి భాగ్యనగరంలో జీఎస్టీ కౌన్సిల్‌ మీట్‌ జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న అరుణ్‌జైట్లీని.. ఈటల రాజేందర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్థికమంత్రులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. జీఎస్టీతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టాలను కేంద్రానికి వివరిస్తామని ఈటల రాజేందర్‌ తెలిపారు. మరోవైపు సమావేశం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రారంభమైన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం...

హైదరాబాద్: కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. తొలిసారి భాగ్యనగరంలో జీఎస్టీ కౌన్సిల్‌ మీట్‌ జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న అరుణ్‌జైట్లీని.. ఈటల రాజేందర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్థికమంత్రులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. జీఎస్టీతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టాలను కేంద్రానికి వివరిస్తామని ఈటల రాజేందర్‌ తెలిపారు. మరోవైపు సమావేశం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

11:28 - September 9, 2017

రంగారెడ్డి : చేవెళ్ల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల నుంచి వేగంగా వస్తున్న ఇండికా వాహనం పంచర్ కావడంతో.. అదుపుతప్పి హైదరాబాద్ నుంచి వస్తున్న మిలిటరీ వ్యాన్‌ను ఢీ కొట్టింది. దీంతో కార్లో ఉన్న ఏడాది బాబు .. అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

'డేరా' ప్రధాన కార్యాలయంలో భద్రతా దళాలు సోదాలు

హర్యానా: సిర్సాలోని డేరా సచ్చా సౌధా ప్రధాన కార్యాలయంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో హార్డ్ డిస్క్ లు, నగదు, ప్లాస్టిక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. డేరాలో పేలుడు పదార్థాల ఫ్యాక్టరీ గుర్తించారు, 82 కార్టన్ల పేలుడు పదార్థాలు లభ్యం అయ్యాయి.

అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

అమరావతి: కాసేపట్లో టీడీపీ సమన్వయ కమిటీ ప్రారంభం కానుంది. 11వ తేదీ నుంచి జరగబోయే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంపై చర్చించనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఏమీ కేబినెట్‌ భేటీ కానుంది. జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు, దోమల నియంత్రణ చట్టంపై చర్చించనున్నట్లు సమాచారం.

హైటెక్స్ లో 21వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం...

హైదరాబాద్: జీఎస్టీ కౌన్సిల్‌ 21వ సమావేశం హైదరాబాద్‌లో జరుగనుంది. సమావేశంలో పాల్గొనేందుకు జమ్ముకశ్మీర్‌, కేరళ, మహారాష్ర్ట ఆర్థిక మంత్రులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. నీటి పారుదల ప్రాజెక్టులపై జీఎస్టీ ని వ్యతిరేకిస్తున్న టీఎస్‌ సర్కారు..నష్టాలను కేంద్రానికి వివరించనుంది.

11:13 - September 9, 2017

హైదరాబాద్: బీడీ కార్మికులకు సంబంధించి 29 ట్యాక్స్, గ్రానైట్ అంశాలు లాంటి 32 అంశాలపై జీఎస్టీ ఎఫ్టెక్ట్ పడుతుందని, దానిపై తమకు అబ్యంతరాలు వున్నాయని తెలంగాణ ఆర్థిక మంత్రి మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆయన కేంద్ర హోం మంత్రి అరుణ్ జైటీ ఈటెల భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జీఎస్టీ కౌన్సిల్‌ 21వ సమావేశం హైదరాబాద్‌ లో జరగడం సంతోకరం అని, ఈ సమావేశానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆన్ గోయింగ్ పనులకు ఇబ్బంది ఏర్పడుతుందని, గతంలో కొంత తగ్గినా మరింత తగ్గించాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ అంశాల పరిష్కారం కోసం ఈ సమావేశంలో అన్ని విషయాల మీద చర్చిస్తాం. ఈ సమావేశంలో పాల్గొనేందుకు జమ్ముకశ్మీర్‌, కేరళ, మహారాష్ర్ట ఆర్థిక మంత్రులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. నీటి పారుదల ప్రాజెక్టులపై జీఎస్టీ ని వ్యతిరేకిస్తున్న టీఎస్‌ సర్కారు..నష్టాలను కేంద్రానికి వివరించన్నుట్లు కూడా సమాచారం.

ఇంటింటికి టిడిపి కార్యక్రమం షెడ్యూల్ విడుదల

అమరావతి: ఇంటింటికి టిడిపి కార్యక్రమం షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ నెల 11 నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభం కానుందని, 3 రోజుల ముందుగా అన్ని ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు, సభలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

10:35 - September 9, 2017

మంచిర్యాల : లక్సెట్టిపేట గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థినుల ర్యాగింగ్‌ను తట్టుకోలేక ఇద్దరు 8వ తరగతి విద్యార్థినులు యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

10:33 - September 9, 2017

హైదరాబాద్: జీఎస్టీ కౌన్సిల్‌ 21వ సమావేశం హైదరాబాద్‌లో జరుగనుంది. సమావేశంలో పాల్గొనేందుకు జమ్ముకశ్మీర్‌, కేరళ, మహారాష్ర్ట ఆర్థిక మంత్రులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. నీటి పారుదల ప్రాజెక్టులపై జీఎస్టీ ని వ్యతిరేకిస్తున్న టీఎస్‌ సర్కారు..నష్టాలను కేంద్రానికి వివరించనుంది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

10:30 - September 9, 2017

అమరావతి: కాసేపట్లో టీడీపీ సమన్వయ కమిటీ ప్రారంభం కానుంది. 11వ తేదీ నుంచి జరగబోయే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంపై చర్చించనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఏమీ కేబినెట్‌ భేటీ కానుంది. జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు, దోమల నియంత్రణ చట్టంపై చర్చించనున్నట్లు సమాచారం.

 

గుర్గావ్ లోని రేయన్ పాఠశాల వద్ద ఉద్రిక్తత

ఢిల్లీ : గుర్గావ్ లోని రేయన్ పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. రేయన్ పాఠశాలలో నిన్న ఏడేళ్ల బాలుడి దారుణ హత్యగురయిన విషయంపై స్కూల్లో తమ పిల్లల భద్రత లేదని వారు ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజామన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

09:29 - September 9, 2017

జీఎస్టీ వల్ల ప్రజలపై మరింత భారం పడిందని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో విశ్లేషకుడు వినయ్ కుమార్, టీఆర్ ఎస్ నేత రాజమోహన్, టీడీపీ నేత దుర్గప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. సామాన్యులపై పన్నుల భారం పడుతుందన్నారు. జీఎస్టీ వల్ల నిత్యవసరాల ధరలు పెరిగాయన్నారు. అనాలోచితంగా జీఎస్టీ తీసుకొచ్చారని పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల గందరగోళం పరిస్థితి ఏర్పడిందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ కు రఫెల్ నాదల్

హైదరాబాద్ : యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ కు రఫెల్ నాదల్ చేరుకున్నాడు. సెమీస్ లో డెల్ పోట్రోపై 4..6, 6..0, 6...3, 6...2 తేడాతో రఫెల్ నాదల్ విజయం సాధించారు.

 

గురుకుల పాఠశాలలో యాసిడ్ తాగిన ఇద్దరు విద్యార్థినులు

మంచిర్యాల : లక్సెట్టిపేటలో గురుకుల పాఠశాలలో ఇద్దరు యాసిడ్ తాగారు. పదో తరగతి విద్యార్థినులు వేధిస్తున్నారనే మనస్తాపంతో 8 వ తరగతి విద్యార్థినులు యాసిడ్ తాగారు. విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. 

 

08:40 - September 9, 2017

మెక్సికో : అత్యంత శక్తిమంతమైన భూకంపం మెక్సికోను కుదిపేసింది. దక్షిణ తీరప్రాంతాలను అతలాకుతలం చేసింది. 34మంది దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు చెప్తున్నారు. రిక్టర్‌ స్కేలుపై 8.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 3.3 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడినట్లు పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. 50 మీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. భూకంపంతో దక్షిణ మెక్సికోలో వందల భవనాలు నేలకూలాయి. మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒయాక్సాకా రాష్ట్రం జుచిటన్‌లో నష్టం తీవ్రత అధికంగా ఉంది. ఇక్కడే 17మంది పౌరులు చనిపోయారు. భూకంపం సంభవించినప్పుడు మెక్సికో నగరంలో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. చిన్నారుల ఆక్రందనలు వినిపించాయి. గృహాలు, బడులు, ఆస్పత్రులు దెబ్బతిన్నాయి. కొన్ని తీరప్రాంతాల్లో అధికారులు ప్రజల్ని ఖాళీ చేయించారు. శుక్రవారం పలు విద్యాసంస్థల్లో తరగతుల్ని రద్దు చేశారు. ప్రకంపనలు పొరుగునే ఉండే గ్వాటెమాలా వరకు పాకాయి. తీవ్రంగా నష్టం సంభవించిన ప్రాంతాల్లో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. 

 

08:35 - September 9, 2017

సంగారెడ్డి : ప్రముఖ జర్నలిస్టు, రచయిత గౌరీ లంకేశ్ దారుణ హత్యకు నిరసనగా సంగారెడ్డిలో జర్నలిస్టులు, పలు ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. గౌరీ లంకేశ్ హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు. 

 

08:33 - September 9, 2017

హైదరాబాద్ : ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ... పలు జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాల నేతలు, పౌర సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు.. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకూ ప్రదర్శన నిర్వహించారు.

 

నేడు తిరుచ్చిలో ప్రతిపక్షాలు ర్యాలీ

ఢిల్లీ : నేడు తిరుచ్చిలో ప్రతిపక్షాలు ర్యాలీ నిర్వహించనున్నారు. నీట్ కు వ్యతిరేకంగా డీఎంకే నేతృత్వంలో ఆందోళనలు చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పుతో ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. 

నేటి నుంచి పీఈసెట్ ఆప్షన్ల నమోదు

హైదరాబాద్ : నేటి నుంచి పీఈసెట్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 11 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. 

08:16 - September 9, 2017

చిత్తూరు : తిరుమలేశుని సన్నిధిలో.. ఎల్‌1 బ్రేక్‌ దర్శనాల నిలిపివేత.. సత్ఫలితాలనే ఇస్తోంది. అక్రమార్కులకు ముకుతాడు వేయడమే లక్ష్యంగా.. టీటీడీ ఎల్‌1 బ్రేక్‌ దర్శనాలను నిలిపివేసింది. ప్రభుత్వం కూడా అనుమతించడంతో.. బుధవారం నుంచి.. ఎల్‌1 దర్శనాలకు బ్రేక్‌ పడింది.  
3 రోజులుగా నిలిచిన ఎల్‌1 బ్రేక్‌ దర్శనాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఎల్‌1 బ్రేక్‌ దర్శనాలు.. మూడు రోజులుగా నిలిచిపోయాయి. శ్రీనివాసుని అతి సమీపం నుంచి చూసే అవకాశంతో పాటు.. స్వామి వారి హారతిని, తీర్థం, శఠారిలను దర్శించి, స్పర్శించే వీలు ఈ ఎల్‌1 బ్రేక్‌ దర్శనాల వల్ల కలుగుతుంది. దర్శనానికి వచ్చే వీఐపీల ప్రాముఖ్యతను బట్టి ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 బ్రేక్‌ దర్శనం టికెట్లను కేటాయించేవారు. ఎల్‌1 లో దర్శనం చేసుకునే వారికి అధికారులు రాచమర్యాదలు చేస్తారు. ఈ టికెట్లు పొందిన వారు కనీసం 5 నిముషాలపాటు స్వామివారి ముందు నిలబడి సంతృప్తికరంగా దర్శనం చేసుకునే వీలుండేది. అందుకే ఈ టికెట్లకు ఇంత డిమాండ్‌ ఉంది. 
రూ.500 టికెట్‌ను రూ.10వేలకు బ్లాక్‌లో విక్రయం
దేవస్థానంలో ఎల్‌1 టికెట్లకు ఉన్న డిమాండ్‌ను కొందరు అక్రమార్కులు ధనార్జన మార్గంగా మలచుకున్నారు. అయిదు వందల రూపాయలున్న ఒక్కో టికెట్‌ను దాదాపు 10 వేల రూపాయలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకునేవారు. ఎల్‌1 టికెట్లను బ్లాక్‌లో విక్రయించే వ్యవహారాలు నిర్వహిస్తూ.. ఈ ప్రాంతంలో కొందరు దళారులు కోట్లకు పడగలెత్తారంటే.. ఇదెంతటి లాభసాటి వ్యవహారమో ఇట్టే అర్థమవుతుంది. టీటీడీ అందించే ఎల్‌1 బ్రేక్‌ దర్శనం టికెట్లను బ్లాక్‌లో అమ్మడంతో పాటు.. ఇతరత్రా మార్గాల ద్వారా కూడా దొంగ టికెట్లను సృష్టించి.. భక్తులకు విక్రయించేవారని టీటీడీ గుర్తించింది. ఒరిజినల్‌ ఎల్‌1 బ్రేక్‌ దర్శనం టికెట్ల కొనుగోలుదారులతో పాటు.. ఇలా నకిలీ టికెట్లు కొన్నవారూ.. హారతి, తీర్థ సేవలకు తరలి వస్తుండడంతో.. టీటీడీపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. 
ఎల్‌1 బ్రేక్ దర్శనం టికెట్లు రద్దు చేయాలని అధికారుల నిర్ణయం
పరిస్థితిని సమీక్షించిన టీటీడీ అధికారులు.. ఎల్‌1 బ్రేక్‌ దర్శనం టికెట్ల జారీని రద్దు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికీ నివేదించారు. దీనిపై ప్రభుత్వం నుంచీ సానుకూల స్పందన రావడంతో.. టీటీడీ గత బుధవారం నుంచి ఎల్‌1 బ్రేక్‌ దర్శనం టికెట్ల జారీని నిలిపివేసింది. ప్రోటోకాల్‌ వీఐపీలకు మినహా సిఫార్సు ఉత్తరాలకు ఇచ్చే బ్రేక్‌ దర్శనం టికెట్ల జారీని దేవస్థానం నిలిపివేసింది. 
భక్తులకు మరింత వెసులుబాటు 
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, ఎల్‌1 బ్రేక్‌ దర్శనం టికెట్ల జారీ నిలిపివేయడంతో సిఫార్సు ఉత్తరాలతో తిరుమల వచ్చే వీఐపీలకు ఇబ్బందులు మొదలయ్యాయి. అయితే, అదే సమయంలో, శ్రీవారిని దర్శించుకునే సాధారణ భక్తులకు మరింత వెసులుబాటు కలిగింది. గతపాలక మండలి ఉన్న రోజుల్లోనే ఎల్‌3 దర్శనాన్ని రద్దు చేశారు. ఇప్పటివరకు ఎల్‌1, ఎల్‌2 బ్రేక్‌ దర్శనం మాత్రమే ఉండేది. ఇక ఎల్‌1 బ్రేక్‌ టికెట్లను కేవలం ప్రోటోకాల్‌ వారికి మాత్రమే కేటాయిస్తుండడంతో..  ఇప్పుడు ఎల్‌ 2 టికెట్ల కోసం సిఫార్సు ఉత్తరాలు పెరుగుతున్నాయి. దళారులు ఈ లేఖలతో ఎలాంటి సరికొత్త అక్రమాలకు తెరతీస్తారోనని టీటీడీ అధికారులు ఇప్పటినుంచే నిఘా పెట్టారు. మొత్తానికి, ఎల్‌1 బ్రేక్‌ దర్శనం నిలపివేతతో.. తమలాంటి మరికొందరికి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కలగడం పట్ల  సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

08:10 - September 9, 2017

హైదరాబాద్ : దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికి ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డును ప్రదానం చేయనున్నట్టు సినీ హీరో, నిర్మాత అక్కినేని నాగార్జున తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో రాజమౌళికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. సెప్టెంబర్‌ 17న సాయంత్రం 4.30కు శిల్ప కళావేదికగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. శుక్రవారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో అక్కినేని నాగేశ్వరరావు అంతర్జాతీయ అవార్డుల ప్రకటన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సినీ రంగానికి చేసిన అద్భుతమైన సేవలకుగానూ జక్కన్నకు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్టు నాగార్జున ప్రకటించారు. తెలుగువారు గర్వపడే సినిమా బాహుబలి అని... ఎవరూ ఊహించని రీతిలో ఈ సినిమాను రాజమౌళి తీశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బరామిరెడ్డి తెలుగువారు గర్వించే దర్శకుడు రాజమౌళి అన్నారు. 

 

08:07 - September 9, 2017

హైదరాబాద్ : తన కళల ద్వారా ప్రజలను కదిలించిన కళాకారుడు గరికపాటి రాజారావు అని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. నాటక రంగాన్ని గరికపాటి బతికించారని కొనియాడారు. గరికపాటి రాజారావు వర్దంతి సభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సభలో పాల్గొన్న గద్దర్‌.. మాట కంటే పాట, కళ గొప్పదని అన్నారు. కళాకారులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ఐక్యంగా ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ఇదే సభలో పాల్గొన్న నటుడు మాదాల రవి...ప్రజాకళలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్ధంతి సభలో  పీఎన్‌ఎం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. 

08:04 - September 9, 2017

హైదరాబాద్ : మెట్రో రైల్ ప్రాజెక్టును అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామని మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. నవంబర్ 28న 30 కిలో మీటర్ల మెట్రో రైలు మార్గాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ప్రయాణికుల భద్రత, మెరుగైన రవాణా, అత్యాధునిక సదుపాయాలతో మెట్రో రైల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 2018 నవంబర్‌ కల్లా 75 కిలోమీటర్ల మెట్రో రైలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. 

 

07:59 - September 9, 2017

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి ఈటెలను సీపీఎం నేతలు సున్నం రాజయ్య, వెంకట్‌ కలిశారు. జీఎస్టీతో రాష్ట్ర ప్రజలపై తీరని భారం పడుతోందని... మంత్రి దృష్టికి తెచ్చారు. గ్రానైట్‌, ప్లాస్టిక్‌, బీడీ పరిశ్రమలు, నీటి పారుదల రంగంపై ఈ పన్ను తొలగించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించబోయే జీఎస్టీ నేషనల్‌ కౌన్సిల్‌లో ఈ విషయం ప్రస్తావించాలని విజ్ఞప్తి చేశారు.

 

07:57 - September 9, 2017

హైదరాబాద్ : ఇవాళ  జీఎస్టీ కౌన్సిల్‌ 21వ సమావేశం జరుగనుంది.  ఇందుకు హైదరాబాద్‌ ఆతిథ్యమిస్తోంది. నీటి పారుదల ప్రాజెక్టులపై జీఎస్టీని వ్యతిరేకిస్తున్న టీఎస్‌ సర్కారు.. శనివారం జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఏం చెప్పబోతోంది? కేంద్రానికి తన నిరసన గళం వినిపించనుందా? కౌన్సిల్‌ ఒప్పుకోకపోతే ఏం చేయబోతోంది? వాచ్‌ దిస్‌ స్టోరీ..
హైదరాబాద్‌లో జిఎస్టీ కౌన్సిల్ స‌మావేశాలు 
హైదరాబాద్‌లో తొలిసారి జిఎస్టీ జాతీయ కౌన్సిల్ స‌మావేశాలు జరగబోతున్నాయి.. హెచ్‌ఐసీసీలో నిర్వహించే  ఈ స‌మావేశంలో కేంద్ర మంత్రి ఆరుణ్ జైట్లీ, వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొనబోతున్నారు.. జీఎస్‌టీ రాష్ట్రాల ఆర్థికాభివృద్ధిపై ఎలాంటి చూపిందన్న అంశంపై ఇందులో చర్చిస్తారు.. 
జీఎస్‌టీ వచ్చాక 18శాతానికి పెరిగిన పన్ను
అయితే నీటి పారుదల ప్రాజెక్టులపై జీఎస్‌టీని తెలంగాణ ప్రభుత్వం మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది. ఏడాదికి 25 వేల కోట్ల వరకూ నీటి పారుదల ప్రాజెక్టులపై సర్కారు ఖర్చు చేస్తోంది. గతంలో ఈ ప్రాజెక్టు అవసరాలు, మౌళిక సదుపాయల కల్పన, టెండర్లు, మిషనరీ ఖర్చులపై 5శాతం వ్యాట్‌ ఉండేది.. జీఎస్‌టీ వచ్చాక ఈ పన్నుకాస్తా 18శాతం అయింది.. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించడంతో జీఎస్‌టీ కౌన్సిల్‌ పన్నును 12శాతానికి తగ్గించింది. అయినా తెలంగాణ సర్కారు ఈ పన్ను భరించే స్థితిలో లేదు..
జీఎస్‌టీవల్ల మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయపై అదనపు భారం
మిషన్ భగీరథ కోసం 2017-18 బడ్జెట్‌లో ప్రభుత్వం 3వేల కోట్లను కేటాయించింది.. 42 వేల 853 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మిషన్ భగీరథ కింద 26 మెయిన్ సెగ్మెంట్లు, లక్షా 44 వేల కిలో మీటర్ల పైపు లైన్లు నిర్మించాల్సి ఉంది.. జీఎస్‌టీవల్ల మిషన్‌ భగీరథపై 6వేల కోట్లు... మిషన్‌ కాకతీయపై 4వేల  వేల కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు.. ఈ స్థాయిలో పెరిగిన ఖర్చు భరించడం కష్టమని కేంద్రానికి టీఎస్‌ ప్రభుత్వం పలుసార్లు విజ్ఞప్తి చేసింది.. మౌళికసదుపాయ రంగంలో జీఎస్‌టీని మినహాయించాలని... పన్ను తప్పదంటే పాత విధానం ప్రకారం 5శాతానికి పరిమితం చేయాలని జీఎస్‌టీ కౌన్సిల్‌లోనూ కోరింది.. అయినా సానుకూల స్పందన రాలేదు.. 
ప్రధానికి లేఖ రాయాలని చూస్తున్న సీఎం కేసీఆర్‌
కేంద్రంతో ముందు నుంచి సయోధ్యగా ఉన్న కేసీఆర్‌.. జీఎస్‌టీ తర్వాత స్వరం పెంచారు.. పన్ను పోటుపై నిరసన తెలియజేశారు.. చివరి ప్రయత్నంగా జీఎస్టీ ప్రభావం ఏఏ శాఖలపై పడుతుందో పూర్తి వివరాలతో ప్రధానికి లేఖ రాసే పనిలో ఉన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత జీఎస్‌టీని అమలు చేశారని.. ఇప్పుడు పెరిగిన ప్రాజెక్టుల వ్యయాన్ని బడ్జెట్‌లో పొందుపరచడం సాధ్యం కాదని పీఎంకు వివరించాలని చూస్తున్నారు.. అప్పటికీ కేంద్రం దిగి రాకపోతే న్యాయ పోరాటం చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారు. నీటి పారుదల రంగంపై జీఎస్‌టీని తగ్గించాలంటున్న టీఎస్‌ ప్రభుత్వం.. శనివారం నిర్వహించబోయే సమావేశంలోనూ ఇదే వాదన వినిపించే అవకాశముంది.. మరి దీనికి కౌన్సిల్‌ ఎలా స్పందిస్తుందో... ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.. 

నేడు మహబూబాబాద్ లో టీమాస్ ఫోరం ఆవిర్భావ సభ

మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో నేడు టీమాస్ ఫోరం ఆవిర్భావ సభ జరుగనుంది. గద్దర్, తమ్మినేని వీరభద్రం, విమలక్క, కంచె ఐలయ్య హాజరుకానున్నారు. 

 

నేటి నుంచి ఆదిలాబాద్ జిల్లాలో టీజేఏసీ అమరుల స్ఫూర్తి యాత్ర

ఆదిలాబాద్ : జిల్లాలో నేటి నుంచి టీజేఏసీ ఐదో విడత అమరుల స్ఫూర్తి యాత్ర నిర్వహించనున్నారు. 

నేడు హైదరాబాద్ లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

హైదరాబాద్ : నగరంలో నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. రాష్ట్రాల ఆర్థికమంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. తెలంగాణ తరపున మంత్రులు ఈటల రాజేందర్, కడియం శ్రీహరి హాజరవ్వనున్నారు. 

 

ప్రైవేట్ స్కూల్ టీచర్ దారుణ హత్య

వరంగల్ : హన్మకొండ మండలం ఇందిరానగర్ లో వ్యక్తి దారుణ హత్య గావించబడ్డాడు. ప్రైవేట్ స్కూల్ టీచర్ ను కత్తులతో దుండగులు నరికి చంపారు. మృతుడు శ్రీనివాస్ గా గుర్తించారు.

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ తనిఖీలు

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దుబాయ్ నుంచి వస్తున్నప్రయాణికుడి నుంచి రూ.29 లక్షల విలువైన 932 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 

నేడు ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ ర్యాలీ

కృష్ణా : విజయవాడలో నేడు ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. 17 నుంచి 21 ఏళ్ల వయసువారు అర్హులు. విజయవాడతోపాటు విశాఖ, విజయనగరం, యానాం, నెల్లూరులో ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. 

నేడు ఏపీ కేబినెట్ సమావేశం

అమరావతి : నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. రైతు రుణబమాఫీ, నిరుద్యోగ భృతిపై చర్చించనున్నారు. 

నేడు ఏపీ కేబినెట్ సమావేశం

అమరావతి : నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. రైతు రుణబమాఫీ, నిరుద్యోగ భృతిపై చర్చించనున్నారు. 

Don't Miss