Activities calendar

10 September 2017

21:42 - September 10, 2017

మేడ్చల్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు ఇల్లు దాటడం లేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభద్రం. మేడ్చల్‌జిల్లా టీమాస్‌ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక రంగాల్లో మార్పుకోసమే టీమాస్‌ ఆవిర్భవించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రొఫెసర్‌ కంచె ఐలయ్య, కాకిమాధవరావు, అద్దంకి దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

21:40 - September 10, 2017

కడప : రాయలసీమ ఉక్కుపరిశ్రమ పోరాట కమిటీ ఆధ్వర్యంలో వామపక్షాలు సోమవారం కడపజిల్లాలో తలపెట్టిన సభకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని కాంగ్రెస్‌పార్టీ నేత తులసిరెడ్డి స్పష్టం చేశారు. ఈ సభలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు 6నెలల లోపున కడపజిల్లాల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే 39 నెలలు గడిచినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాల్లో ఉలుకూ పలుకూ లేదని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో స్టీల్‌ పరిశ్రమ స్థాపనకు ఆనాడు పార్లమెంటులో ఎటువంటి చట్టం చేయలేదన్న ఆయన.. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి నానా రకాల కొర్రీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే.. 6నెలల లోపు కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపిస్తామని తులసిరెడ్డి స్పష్టం చేశారు.

ఇంటింటికీ మోసం..
ఇంటింటికీ తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కుటుంబం అంటూ అధికార, ప్రధాన ప్రతిపక్షపార్టీలు మళ్లీ జనాన్ని మోసం చేయడానికి సిద్ధం అవుతున్నాయని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. ఇంటింటికీ మోసం అని పేరుపెట్టుకోవడమే ఆ రెండు పార్టీలకు కరెక్ట్‌ పదం అని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. వాస్తవానికి వైఎస్‌ రాజశేఖరెడ్డి పేరు చెప్పుకునే అర్హత జగన్‌పార్టీకి లేదని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ నాయకుడని.. జగన్‌ తన పార్టీలో వైఎస్‌ఆర్‌ పేరును తీసేస్తే బాగుంటుందని తులసిరెడ్డి సలహా ఇచ్చారు. రాష్ట్రవిభజన తర్వాత కోలుకోలేని రీతిలో చతికిలపడిన ఏపీ కాంగ్రెస్‌.. ఇపుడు తన పోరాట పంథాను మార్చుకుంది. ప్రజా సమస్యలే ప్రాధాన్యంగా ఉద్యమిస్తున్న వామపక్షాలతో కలిసి వస్తామని కాంగ్రెస్‌నేతలు చెబుతున్నారు. అందుకే టీడీపీ, వైసీపీలను టార్గెట్‌ చేస్తూ విమర్శల దాడిని పెంచారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

21:39 - September 10, 2017

కరీంనగర్/జగిత్యాల : నాడు కాంగ్రెస్‌ పాలనలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని..నేడు కేసీఆర్‌ పాలనలో రైతుల కోసం 24 గంటల నిరంతర విద్యుత్‌, ప్రాజెక్టుల కోసం లక్షా 50 వేల కోట్ల నిధులు మంజూరు చేశారని చెప్పారు. జగిత్యాల్‌ జిల్లా కథలాపూర్‌లో జరిగిన రైతు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రైతు సమన్వయ సంఘాలు రానున్న రోజుల్లో సమర్థవంతంగా పనిచేసి అన్నదాతలకు అండగా నిలవాలని పోచారం పిలుపునిచ్చారు. 

21:38 - September 10, 2017

వాషింగ్టన్ : ఇర్మా తుఫాన్‌ ధాటికి అమెరికా చివురుటాకులా వణికిపోతోంది. ఇప్పటికే కరేబియన్‌ దీవులను ముంచెత్తిన ఇర్మా.. ఇపుడు ప్లోరిడాను అతలాకుతలం చేస్తోంది. ప్రచండగాలులకు విద్యుత్‌ సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మియామి, ఫ్లోరిడా రాష్ట్రాల తీరప్రాంతాల్లో అంధకారం నెలకొంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7గంటల ప్రాంతంలో ఇర్మా తుపాను తీరాన్ని తాకింది. టంప్‌పట్టణ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని యూఎస్ నేష‌న‌ల్ హ‌రికేన్ సెంట‌ర్ ప్రకటించింది. తుఫాన్‌ ప్రభావం వల్ల గంటకు 209 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రచండగాలులకు లక్షలాది ఇళ్లు నేలమట్టమయ్యియి. రోడ్లపై నిలిపిన వాహనాలు సైతం కాగితాల్లా ఎగిరిపడుతున్నాయి. తుఫాను ధాటికి ఒక్క ద‌క్షిణ ఫ్లొరిడాప్రాంతంలోనే నాలుగున్నర ల‌క్షల ఇళ్లకు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది.

4 కేటగిరీలుగా..
మరోవైపు ఇర్మా హరికేన్‌ ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 60లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను తుఫాను 4 కేటగిరీలుగా మారిందన్న యూఎస్ నేష‌న‌ల్ హ‌రికేన్ సెంట‌ర్ ప్రకటన ఫ్లోరిడా ప్రాంత ప్రజలను మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. తుపాను ధాటికి ఫ్లొరిడాలోని అనేక ప్రాంతాల్లో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం గంట‌కు 12 కిలోమీట‌ర్ల వేగంతో ఫ్లోరిడా పశ్చిమ తీరంవైపు ఇర్మాతుఫాన్‌ కదులుతోంది. నేపెల్స్, పోర్ట్ మేయ‌ర్స్, తంపా ప్రాంతాల వైపు ఈ తుపాను దూసుకెళ్తుతున్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు.

20 వేల మంది భార‌తీయులు
మరోవైపు ఫ్లోరిడాలోని ల‌క్షా 20 వేల మంది భార‌తీయుల‌ను ర‌క్షించే చ‌ర్యల‌ను భార‌త రాయ‌బార కార్యాల‌యం చేప‌ట్టింది. తుపాను ప‌రిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 65 ల‌క్షల ఫ్లొరిడా ప్రజ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అమెరికాలోనే మూడవ అతిపెద్ద జనాభా కలిగిన ఫ్లోరిడా తీర ప్రాంతంలో తీవ్రగాలులతో ఇళ్ల పైకప్పులు, రోడ్లుపై పార్కింగ్ చేసిన వాహనాలు కదలిపోతున్నాయి. దీనికితోడు బ్రోవర్డ్ కౌంటీలో టోర్నడో చెలరేగి 15 అడుగుల ఎత్తులో గాలి సుడులు తిరుగుతూ విరుచుకుపడింది. తీరప్రాంత కెరటాలు 12 అడుగుల ఎత్తుకు విరుచుకుపడినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే ఫ్లోరిడాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

21:36 - September 10, 2017

విజయవాడ : రూపాయి రూపాయి కూడబెట్టి.. అప్పులు చేసి మరీ అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేసిన బాధితుల కష్టాలు తీరబోతున్నాయి. కోర్టు కేసులతో అగ్రిగోల్డ్‌లో ఉపాధి కోల్పోయిన వారికి మళ్లీ ఉద్యోగాలు రాబోతున్నాయి. సత్యం తరహాలో అగ్రిగోల్డ్‌ సంస్థను ఎస్సెల్‌ గ్రూప్‌ టేకోవర్‌ చేయబోతోంది.. ఇందుకు సంబంధించి రెండు సంస్థల మధ్య అవగాహన కూడా కుదిరింది. అగ్రిగోల్డ్‌ సంస్థ 1995లో ప్రారంభమైంది.. వ్యవసాయం, అనుబంధ రంగాలపై ప్రధానంగా దృష్టిపెట్టిన సంస్థ కొద్దికాలంలోనే వేగంగా విస్తరించింది. రియల్‌ ఎస్టేట్‌లోకూడా అగ్రిగోల్డ్‌ పెట్టుబడులు పెట్టింది. టూరిజంవైపూ అడుగులు వేసింది. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల ఇబ్బందుల్లో పడింది. యాజమాన్యంపై కోర్టులో కేసులు నమోదయ్యాయి. కోర్టు కేసుల తర్వాత అగ్రిగోల్డ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇలాంటి విపత్కర సమయంలో అగ్రిగోల్డ్‌ సంస్థను టేకోవర్‌ చేసేందుకు ఎస్సెల్‌ గ్రూప్‌ ముందుకొచ్చింది. MMR గ్రూప్‌ చైర్మన్‌ నవీన్‌ కుమార్‌ ఈ అగ్రిమెంట్‌ కుదర్చడంలో కీలకపాత్ర పోషించారు.

సమాజంపట్ల బాధ్యతగా..
నష్టాల దిశలో ఉన్న వ్యాపారాలను పెద్ద సంస్థలు కొనుగోలు చేసి లాభాలబాట పట్టేలా చేయడంలో నవీన్‌ కుమార్‌కు చాలా అనుభవముంది. అగ్రిగోల్డ్‌ విషయం తెలుసుకున్న నవీన్‌... సంస్థ గురించిన సమస్త సమాచారం సేకరించారు. అగ్రిగోల్డ్‌ సంస్థను ఒక ఆస్తి, అప్పుల పట్టీగా చూడకుండా సమాజంపట్ల బాధ్యతగా... 40 లక్షల కుటుంబాల సమస్యకు పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ముందడుగు వేశారు. ఇందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయం చేసేలా ఎస్సెల్‌ గ్రూప్‌ను ఒప్పించారు. అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేస్తున్న ఎస్సెల్‌ గ్రూప్‌.. ప్యాకేజింగ్.. ఎస్సెల్‌ ఎక్స్‌పోర్ట్స్, ఎస్సెల్‌ వరల్డ్ పేరుతో అతి పెద్ద ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌... జీ గ్రూప్‌ పేరుతో దేశ విదేశాల్లో టీవీ చానల్స్‌... టీవీ పంపిణీ రంగంలో డిష్ టీవీ, సిటీ కేబుల్‌ లాంటి అనేక సంస్థలతో ఉత్తర భారత దేశంలో పెద్ద సంస్థగా అవతరించింది... రాజ్యసభ సభ్యుడైన సుభాశ్‌ చంద్ర... ఈ సంస్థకు చైర్మన్‌గా ఉన్నారు. ఒక్క వ్యాపారమే కాదు.. ట్రస్ట్‌ ద్వారా సేవా కార్యక్రమాల్లోనూ ఈ సంస్థ చురుగ్గా వ్యవహరిస్తోంది.. అగ్రిగోల్డ్‌ విషయం తెలుసుకున్న గ్రూప్‌ చైర్మన్‌.. ఈ సంస్థను టేకోవర్‌ చేసి ఉద్యోగులు, కస్టమర్ల సమస్య తీర్చాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆలస్యమైన ప్రక్రియ
ఈ ప్రక్రియ మూడు నెలలక్రితమే జరగాల్సి ఉన్నప్పటికీ... అగ్రిగోల్డ్‌ యాజమాన్యం రిమాండ్‌లో ఉండటంతో ఆలస్యమైంది.. త్వరలో ఈ రెండు సంస్థలమధ్య చట్టబద్దమైన ఒప్పందం కుదరబోతోంది. ఎస్సెల్‌ సంస్థ ఒప్పందం ద్వారా దాదాపు 40 లక్షలమందికి మేలు జరుగుతుంది.. అగ్రిగోల్డ్‌ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ఆర్థిక ప్రగతిలో ఎస్సెల్‌ గ్రూప్‌ తనవంతు పాత్ర పోషించబోతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిసిన ఎస్సెల్‌ గ్రూప్‌ యాజమాన్యం... సహకారం కోరింది. సీఎంకూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. కోర్టు కేసు ఉన్నా ఎస్సెల్‌ గ్రూప్‌ ఒప్పందం సజావుగా సాగే అవకాశం కనిపిస్తోంది.. కోర్టులో ఇప్పటికే అఫిడవిట్‌ దాఖలు చేసిన సంస్థ టేకోవర్‌ దిశగా అడుగులు వేస్తోంది.

అసిఫాబాద్ జిల్లాలో విషాదం

అసిఫాబాద్ : జిల్లా లింగాపూర్ మండలంలో విషాదం నెలకొంది. సప్తగుండం జలపాతంలో ఈతకెళ్లి 13 ఏళ్ల బాలుడు జాదవ్ సురేష్ గల్లంతయ్యాడు. బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

20:22 - September 10, 2017

అసిఫాబాద్ : జిల్లా లింగాపూర్ మండలంలో విషాదం నెలకొంది. సప్తగుండం జలపాతంలో ఈతకెళ్లి 13 ఏళ్ల బాలుడు జాదవ్ సురేష్ గల్లంతయ్యాడు. బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కానీ ఇంతవరకు బాలుడు దొరకలేదు. మరింత సమాచారం కోసం వీడయో చూడండి.

 

మంథని ఎంపీపీ కుమారుడు అరెస్ట్

హైదరాబాద్ : మంథని టీఆర్ఎస్ ఎంపీపీ కుమారుడు శ్రీధర్ గౌడ్ ను పోలీసులు అరెస్ట చేశారు. శ్రీధర్ గౌడ్ హైదరాబాద్ నకిలీ పోలీస్ అధికారిగా చలామణి అవుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసుతు అతన్ని అరెస్ట్ చేశారు. 

20:17 - September 10, 2017

కరీంనగర్/పెద్దపల్లి : జిల్లా కేంద్రంలో ఆర్ఎంపీ డాక్టర్ కీచక పర్వం వెలగులోకి వచ్చింది. వైద్యం కోసం వస్తున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారిని లైగింకంగా వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ఎంపికి మహిళలు చెప్పులతోమ దేహశుద్ది చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

20:15 - September 10, 2017

హైదరాబాద్ : మంథని టీఆర్ఎస్ ఎంపీపీ కుమారుడు శ్రీధర్ గౌడ్ ను పోలీసులు అరెస్ట చేశారు. శ్రీధర్ గౌడ్ హైదరాబాద్ నకిలీ పోలీస్ అధికారిగా చలామణి అవుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసుతు అతన్ని అరెస్ట్ చేశారు. శ్రీధర్ గౌడ్ పై గతంలో ఇదే తరహ కేసులు నమోదైయ్యాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

20:04 - September 10, 2017

రేపు శ్రీకాకుళంలో సీఎం పర్యటన

శ్రీకాకుళం : రేపు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.  వీరఘట్టం మండలం టట్టంగిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఆయన పాల్గొననున్నారు.

19:24 - September 10, 2017

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడ నగరంలో.. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కానీ పనులు వేగవంతం చేసే విషయంలో టెండర్ల ప్రక్రియ ఆటంకంగా కనిపిస్తోంది. ఓవైపు కాంట్రాక్ట్ సంస్థ పనులు చేస్తుండగా, వంతెన పొడవు మారడంతో.. అసలు సమస్య మొదలైంది. బందరు-విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చేపట్టిన ఈ వంతెనను 740కోట్ల అంచనావ్యయంతో చేపట్టారు. దిలీప్ కాన్ సంస్థ ఈ పనులు చేపట్టింది. అయితే కొత్తగా పెంచిన వంతెన పొడవు పనులను ప్రధాన గుత్తేదారుగా ఉన్న దిలీప్‌ కాన్‌ సంస్థకు అప్పగించకుండా.. ఎన్‌హెచ్‌ఎఐ మరో ఈపీసీ టెండర్‌ పిలవడం చర్చనీయాంశంగా మారింది.మారిన పొడవుకు ఈపీసీ కింద టెండర్ పిలవాలని నిర్ణయించారు. పార్టు-1 బీఓటీ కింద, పార్టు-2 ఈపీసీ కింద ఎలా నిర్మాణం చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. అయితే ప్రజా ప్రతినిధులు మాత్రం 18 నెలల్లో ఫ్లై ఓవర్‌ను పూర్తి చేసి 2018 కల్లా అందుబాటులోకి తెస్తామని హామీ ఇస్తున్నారు. అయితే ఇప్పటికీ టెండర్లు పిలవకపోవడంతో 18 నెలల్లో ఈ పనులు పూర్తవ్వడం సాధ్యం కాదనే భావన అధికారులలో వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ విషయమై నగరవాసులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

19:23 - September 10, 2017

పశ్చిమగోదావరి : జిల్లా మొగల్తూరు మండలం సేరేపాలెంలో ఆక్వా ఫుడ్‌ పార్క్‌కు చెందిన మట్టి లారీలను రైతులు అడ్డుకుని ధర్నా నిర్వహించారు. వ్యర్ధాలను నేరుగా సముద్రంలోకి పంపేందుకు పైప్‌లైన్‌ వేస్తామని చెప్పిన కంపెనీ యాజమాన్యం... పైపులైన్లు వేయకుండానే నిర్మాణం చేపట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్ధాలతో తమ పంటలు నాశనమవుతాయని... కంపెనీకి వెళ్తున్న లారీలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపు పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విషయాన్ని సబ్‌కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. 

19:22 - September 10, 2017

తూర్పుగోదావరి : ఇన్సూరెన్స్‌ పాలసీ మీద జీఎస్టీ విధించడం పట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజమండ్రిలోని ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో లక్ష సంతకాలు సేకరించనున్నట్లు యూనియన్‌ నేతలు తెలిపారు. కోటి సంతకాల సేకరణ పూర్తైన తర్వాత ఈ వివరాలను ఆర్థిక మంత్రికి పంపడానికి నిర్ణయించామన్నారు. 

19:21 - September 10, 2017

గుంటూరు : వ్యవసాయ శాఖలో వివాదాస్పదమైన జీవో నెంబర్ 64 ను.. ఏపీ ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల నుండి వ్యతిరేకత రావడం, గత రెండు నెలలుగా వ్యవసాయ విద్యార్థులు ఆందోళన చేస్తుండడంతో.. ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా నవ్యాంధ్రలో వ్యవసాయ విద్యార్థులు చేస్తున్న.. ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చింది. కొంతమంది పొరుగు రాష్ట్రాల్లో అనుమతి లేని కాలేజ్ నుండి పట్టాలు పొంది.. వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు పొందారు. వారికి అనుకూలంగా ప్రభుత్వం జీవో నెంబర్‌ 64ను తీసుకొచ్చిందని ఆరోపిస్తూ.. గత రెండు నెలలుగా రాష్ట్రంలోని 11 వ్యవసాయ కళాశాలల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. జీవో నెంబర్ 64 కారణంగా రాష్ట్రంలో గుర్తింపున్న కాలేజ్‌లో చదివిన విద్యార్థులకు నష్టం జరుగుతుందని.. దానిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేశారు. విద్యార్థుల ఆందోళనతో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. 64 జీవోను రద్దు చేస్తామని ప్రకటించారు. 

17:58 - September 10, 2017

నల్లగొండ : జిల్లాలోపూర్తయిన భూ సర్వే గ్రామాలను వామపక్షాల నేతలు సందర్శించారు. మిర్యాలగూడ మండలం ముల్కలకాల్వ గ్రామంలో రైతులతో మాట్లాడారు. భూ సర్వే, రికార్డుల ప్రక్షాళన ద్వారా రైతులకు చేకూరిన ప్రయోజనాన్ని లెఫ్ట్‌నేతలు ఆరాతీశారు. అయితే భూ సర్వేపేరుతో కేవలం రెవిన్యూ రికార్డులు మాత్రమే సరిచేస్తున్నారని.. క్షేత్రస్థాయిలో భూమి కొలతలు పూర్తిచేస్తేనే తమకు ప్రయోజనం ఉంటుందని ఈసందర్భంగా రైతులు స్పష్టంచేశారు. 

17:57 - September 10, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ పనులపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తారనే వార్తలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జీఎస్టీ భారం తగ్గించేది లేదని హైదరాబాద్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ మీట్‌ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ తేల్చి చెప్పారు. పన్ను రేట్లను తగ్గించడం సరికాదని,.. ఇప్పటికే 18 శాతం ఉన్న పన్నును 12 శాతానికి తగ్గించామన్నారు. పన్ను తగ్గిస్తే... రాష్ట్ర ప్రభుత్వానికే నష్టమని సూచించారు.

9వేల కోట్ల మేర భారం
మోదీ, అరుణ్‌జైట్లీకి కేసీఆర్‌ లేఖలు రాశారు. ఆర్థికమంత్రి ఈటల కూడా పలు జీఎస్టీ సమావేశాల్లో అభ్యంతరాలను లేవనెత్తారు. 12 శాతం జీఎస్టీతో రాష్ట్రంపై 9వేల కోట్ల మేర భారం పడుతుందని... జీఎస్టీ మొత్తం ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. కనీసం ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులకు మినహాయించాలని కోరారు. హైదరాబాద్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ... అరుణ్‌జైట్లీ పన్ను తగ్గించేది లేదని తేల్చిచెప్పారు. పన్ను తగ్గించడం వల్ల కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకే మేలు జరుగుతుందే తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. అలాగే.. మీ లెక్కలు సరి చూసుకోండని సలహా ఇచ్చారు. దీంతో జీఎస్టీ తగ్గుతుందనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఆశలన్నీ అడియాశలయ్యాయి.

ఎలాంటి వ్యూహాలు
ఇదిలావుంటే... ప్రభుత్వం నిర్మించే పాఠశాలలు, ఇతర భవనాల విషయంలో పన్ను తగ్గించేలా పబ్లిక్‌ వర్క్స్‌ నిర్వచనాన్ని మారుస్తామన్నారు అరుణ్‌జైట్లీ. వచ్చే సమావేశం నాటికి దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులపై కూడా సానుకూల నిర్ణయం వస్తుందంటున్నారు ఈటల. మొత్తానికి ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులపై జీఎస్టీ తగ్గించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనే ఆలోచనలో పడింది. మరి దీనిపై కేసీఆర్‌ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి. 

17:56 - September 10, 2017

హైదరాబాద్ : దేశంలో 80 శాతం ఉన్న సామాన్య ప్రజలపై జీఎస్టీ భారం పడుతోందని సీపీఐ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నారాయణ అన్నారు. హైదరాబాద్‌ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జీఎస్టీ పై వామపక్షాలు సమావేశం నిర్వహించారు. కేవలం కార్పొరేట్‌ సంస్థలకు మాత్రమే జీఎస్టీ భారం లేదని నారాయణ అన్నారు. బీడీ, వస్త్ర పరిశ్రమ, చేనేత రంగాలపై జీఎస్టీ భారం సరైంది కాదన్నారు. జీఎస్టీ వలన కలిగే ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకురావడానికి అఖిలపక్షాన్ని పిలవాలని కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. 

17:55 - September 10, 2017

సంగారెడ్డి : జిల్లా పటాన్‌చెరులో ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 60 ప్రైవేట్‌ పాఠశాలలు పాల్గొన్నాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. గురుపూజోత్సవంలో ఎంఈవోలు, స్కూల్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ విలియమ్‌ జెమ్స్‌ వారి టీమ్‌తో పాటు సభ్యులు, టీచర్లు పాల్గొన్నారు.

17:54 - September 10, 2017

ఖమ్మం : ప్రభుత్వాస్పత్రిలో శిశువు మృతి కేసునుంచి తప్పించుకునేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు.. శిశువు బల్లపైనుంచి పడిపోలేదని కడుపులోనే మృతి చెందాడంటూ తప్పుడు నివేదిక తయారు చేశారు.. మరోవైపు శిశువు మృతిపై డ్యూటీ డాక్టర్‌, ఆర్ఎంవో శోభాదేవి విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు.

17:53 - September 10, 2017

ఖమ్మం : ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ శిశువు మృతి చెందింది. పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్బిణికి నెలలు నిండలేదని సిబ్బంది పట్టించుకోలేదు. తీవ్రమైన పురిటి నొప్పులతో ఇబ్బందిపడ్డ గర్బిణి... బల్లపైనే శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం శిశువు బల్ల పైనుంచి కిందపడి మృతి చెందింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. 

17:52 - September 10, 2017

సంగారెడ్డి : జిల్లా కొల్లూరులో చెరువు ఆక్రమణ కేసును అధికారులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. యశోద ఆస్పత్రికి చెందిన కొందరు వ్యక్తులు చెరువుశిఖం భూములను ఆక్రమించి రోడ్లు వేస్తున్నా.. అధికారుల పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే స్థానిక తహశీల్దార్‌, ఇతర అధికారులు కబ్జాదారులపై చర్యలు తీసుకోవడం లేదని కొల్లూరు గ్రామస్తులుతో ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

17:51 - September 10, 2017

ఆదిలాబాద్/నిర్మల్ : రైతుల వికాసం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారన్నారు వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి. ఈ మేరకు నిర్మల్‌ జిల్లా, బైంసా డివిజన్‌లోని కుబీర్‌ మండల కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన రైతు సమన్వయ కమిటీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతును తలెత్తుకొని తరిగేవిధంగా చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని దాన్ని కొందరు అవగాహన లేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 

17:36 - September 10, 2017

కొత్తగూడెం : గోదావరి తీర ప్రాంతాన్ని పరిశీలించేందుకు స్పెషల్ ప్రొటెక్షన్‌ ఫోర్స్ డీజీ వినూత్న యాత్ర చేపట్టారు.. తీర ప్రాంతాన్ని బోటు ద్వారా ప్రయాణిస్తూ పరిశీలించారు. భద్రాచలం నుంచి అంతర్వేది వరకు చేపట్టిన ఈ యాత్ర రాజమహేంద్రవరం చేరుకుంది.. గోదావరికి వరద ఉధృతి పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై బోట్‌ జర్నీ ద్వారా ప్లాన్‌ చేస్తున్నారు.

17:33 - September 10, 2017

కృష్ణా : వాట్సప్‌ కాల్‌... కేసుల పరిష్కారంలోనూ ఉపయోగపడుతోంది.. విజయవాడ లోక్‌అదాలత్‌ తొలిసారి వాట్సప్‌ ద్వారా ఇద్దరు క్లయింట్ల మధ్య రాజీ కుదిర్చింది.. సింగపూర్‌లో ఉండే వెంకట శివ ప్రసాద్‌... కృష్ణా జిల్లాకుచెందిన రవి నంద కుమార్‌ మధ్య భూ వివాదం ఏర్పడింది.. తన న్యాయం చేయాలంటూ శివ ప్రసాద్‌ లోక్‌ అదాలత్‌ను ఆశ్రయించాడు.. అవనిగడ్డలోని లోక్‌ అదాలత్‌కు రవి నంద కుమార్ హాజరుకాగా..... సింగపూర్‌లోఉన్న శివ ప్రసాద్‌ వాట్సప్‌ వీడియో కాల్‌ ద్వారా తన వాదన వినిపించాడు.... లోక్‌ అదాలత్‌ జోక్యంతో రాజీకి ఇద్దరూ అంగీకరించారు.

17:32 - September 10, 2017

శ్రీకాకుళం : శ్రీకాకుళం ఎంపీ స్థానం పోటీకీ అభ్యర్థులు కరువవుతున్నారు. ఒకప్పుడు ఈ స్థానం నుండి గెలుపొందిన దివంగత నేతలు బొడ్డేపల్లి రాజగోపాలరావు, కింజారపు ఎర్రంనాయుడులు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. ఎర్రం నాయుడుతో పాటు.. మాజీ ఎంపీ కిల్లీ కృపారాణి కేంద్రమంత్రులుగా కూడా పని చేశారు. అయితే 2019కి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుండి ఇక్కడ ఎంపీ అభ్యర్థులు కరువయ్యారు.

2014లో ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్‌ నాయుడు.. ఎందుకో తన రూట్ మార్చుకున్నారు. రాబోయే 2019 ఎన్నికల్లో నరసన్న పేట నుండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న టీడీపీ నేతల్లో ఎవ్వరూ ఎంపీగా పోటీ చేయాలన్న ఉత్సాహం చూపడం లేదు. అందుకు కొత్తగా అభ్యర్థిని రంగంలోకి దింపాలని చూస్తున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే పోటీకి రెడ్డి శాంతి
ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వైసీపీలో ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న రెడ్డి శాంతి.. 2014లో ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. వైసీపీ పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ.. టీడీపీలోకి వెళ్లడంతో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడ్డి శాంతి సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే 2019లో వైసీపీ నుంచి కొత్త అభ్యర్థిని పోటీలో నిలపాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్‌ నుండి ఎంపీ స్థానానికి పోటీ చేసిన మాజీ కేంద్రమంత్రి కిల్లీ కృపారాణి.. త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకొని టెక్కలి ఎమ్మెల్యేగా అచ్చెంనాయుడిపై పోటీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. దీంతో కాంగ్రెస్‌ తరపున అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్థకం.

చర్చనీయాంశంగా
ఇక మిగిలిన పార్టీలకు గట్టి అభ్యర్థులే లేని పరిస్థితుల్లో ఎంపీ స్థానంపై పోటీకి.. ప్రధాన పార్టీల నేతలు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులే కాదు. వివిధ పార్టీలకు చెందిన సీనియర్లు కూడా పార్లమెంట్ వైపు చూడటం లేదు. టీడీపీలో గౌతుశ్యామ సుందర శివాజీ, గుండ అప్పల సూర్యనారాయణ లాంటి వారితో పాటు.. వైసీపీలో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలాంటి వారు ఎంపీ అభ్యర్థిత్వంపై వెనక్కి తగ్గుతున్నారు. మరి ఎన్నికల సమయానికైనా నేతల్లో ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి.  

చేయి విరగ్గొట్టిన నారాయణ కాలేజీ లెక్చరర్..

కడప : జిల్లాలో నారాయణ కాలేజీ లెక్చరర్ ఇద్దరు విద్యార్థులను చితకబాదాడు. ఓ విద్యార్థికి చెయ్యి విరిగిపోయింది. వీరిని ఆసుపత్రికి తరలించారు. పీఎస్ లో విద్యార్థి బంధువులు ఫిర్యాదు చేశారు. 

16:18 - September 10, 2017

హైదరాబాద్ : చాకలి ఐలమ్మ స్పూర్తితో కేసీఆర్‌ సర్కార్‌పై తిరగబడాలని టీ-మాస్‌ ఫోరం నేతలు సూచించారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 32వ వర్ధంతి సభను టీ-మాస్‌ ఫోరం ఎస్వీకేలో ఘనంగా నిర్వహించింది. ప్రభుత్వం చాకలి ఐలమ్మ త్యాగాలని విస్మరిస్తోందని.. వెంటనే ట్యాంక్‌బండ్‌ పై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే పాలకుర్తిలో ఐలమ్మ స్మారక మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలన్నారు. 

16:14 - September 10, 2017

పశ్చిమగోదావరి : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ జైల్ నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. జైలు గోడ దూకి సిరపు గణేష్, బుగత శివ పారిపోయారు. ఉదయం ఖైదీలకు కటింగ్ చేయించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అదే అదునుగా చేసుకుని మధ్యాహ్నం 12గంటల సమయంలో గోడ దూకి వెళ్లినట్లు తెలుస్తోంది.

16:07 - September 10, 2017

ఒడిశా: రాజధాని భువనేశ్వర్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. శిథిలాలకింద మరికొంతమంది ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

15:55 - September 10, 2017
15:52 - September 10, 2017

చిత్తూరు : తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 1 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు పటిష్టభద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలి ఒకరు మృతి..

భువనేశ్వర్ : బొమికాల్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైవర్ లో కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారని, నలుగురికి గాయాలయ్యాయని భువనేశ్వర్ పోలీసు కమిషనర్ పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

15:50 - September 10, 2017

విజయవాడ : ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు ఇస్తామని టీడీపీ అధికారంలోకి రాకముందు మాట ఇచ్చిందని ఇప్పుడు మాట నిలబెట్టుకోవడం లేదని విజయవాడ సీఐటీయూ నగర కార్యదర్శి ఎమ్‌.డేవిడ్‌ మండిపడ్డారు. ఎక్స్‌ ఎల్‌ ప్లాంట్‌, జక్కంపూడిలో కడుతున్న వాటిలో పేదలకు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ సింగినగర్‌లో సీపీఎం నేతలు నిరాహారదీక్షకు దిగారు. ఇళ్ల కోసం ఈ నెల 20వ తేదీన మహాధర్నా చేపడుతున్నట్లు తెలిపారు.

15:49 - September 10, 2017

ఖమ్మం : ప్రభుత్వాస్పత్రిలో శిశువు మృతి కేసును తప్పుదారి పట్టించేందుకు వైద్యులు యత్నిస్తున్నారు. డ్యూటీ డాక్టర్‌, ఆర్‌ఎంవో ప్రకటనలు విరుద్దంగా ఉన్నాయి. శిశువు బల్ల పైనుంచి పడి మృతి చెందగా... అలా కాలేదని నివేదికలో పేర్కొన్నారు. టెన్ టివి చేతిలో నివేదిక సంబంధించిన పత్రాలు ఉన్నాయి. 10టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో మంత్రి తుమ్మల స్పందించడంతో వైద్యులు నివేదక తయారుచేశారు. కానీ... తప్పుడు నివేదిక తయారు చేయడంతో ఐద్వాతో పలువురు ఆందోళనకు దిగారు. 

15:47 - September 10, 2017

ఖమ్మం : ప్రభుత్వాస్పత్రిలో శిశువు మృతి కేసును తప్పుదారి పట్టించేందుకు వైద్యులు యత్నిస్తున్నారు. డ్యూటీ డాక్టర్‌, ఆర్‌ఎంవో ప్రకటనలు విరుద్దంగా ఉన్నాయి. శిశువు బల్ల పైనుంచి పడి మృతి చెందగా... అలా కాలేదని నివేదికలో పేర్కొన్నారు. 10టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో మంత్రి తుమ్మల స్పందించడంతో వైద్యులు నివేదక తయారుచేశారు. కానీ... తప్పుడు నివేదిక తయారు చేయడంతో ఐద్వాతో పలువురు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:46 - September 10, 2017

ముంబై : ఆస్ట్రేలియాతో తొలి మూడు వన్డేలకు భారత జట్టును ఎంపిక చేశారు. అశ్విన్‌, జడేజాలకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఉమేష్‌ యాదవ్‌, షమీలు జట్టులో తిరిగి స్థానం సంపాదించారు. టీమ్‌లో కోహ్లీ, ధోనీ, రోహిత్‌, రాహుల్‌, జాదవ్‌, పాండే, రహానే, హార్ధిక్‌పాండ్యా, శిఖర్‌ ధావన్‌, చౌహాల్‌, భువనేశ్వర్‌, షమీ, కుల్దీప్‌, అక్షర్‌లకు చోటు కల్పించారు.

 

సబ్ జైలు నుండి ఇద్దరు ఖైదీల పరారీ..

పశ్చిమగోదావరి : తాడేపల్లిగూడెం జిల్లాలోని సబ్ జైల్ నుండి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. వీరు గోడ దూకి పరారైనట్లు తెలుస్తోంది. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ముంబై నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి నుండి రూ. 75 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

భారతీయులంతా క్షేమంం - సుష్మా..

వెనిజులా : కారకాస్, హవానా, జార్జ్ టౌన్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో ఉన్న భారతీయులంతా క్షేమంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. నివసించే భారతీయుల క్షేమ సమాచారాన్ని దౌత్య అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. 

కూలిన ఫ్లైఓవర్...

భువనేశ్వర్ : బొమికాల్ ప్రాంతంలో ఫ్లైవర్ లో ఒక భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

మీడియాపై జరిగిన దాడిని ఖండించిన హుడా..

కర్నాటక : మీడియాపై జరిగిన దాడి పట్ల బీఎస్ హుడా ఖండించారు. గుర్ గావ్ లో జరిగిన ఘటనలో ఓ మీడియా వ్యక్తిపై పోలీసులు లాఠీఛార్జీ జరిపారని వార్తలు వస్తున్నాయి. 

14:37 - September 10, 2017

విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్‌ సంస్థలతో కుమ్మక్కై కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ మండిపడ్డారు. కార్మిక, ఉద్యోగులకు వ్యతిరేక విధానాలపై నిరసనగా విజయవాడ మాంటిస్సోరి కాలేజ్‌ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్‌ ఐక్య కార్మిక సంఘాల సదస్సు నిర్వహించారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్టమెంట్‌లో, ఇటు అసెంబ్లీలోనూ కార్మికులపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలు మార్చాలని కోరుతూ ఛలో పార్లమెంట్‌, ఛలో అసెంబ్లీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎంఏ గఫూర్‌ తెలిపారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం..

చిత్తూరు : తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు టెన్ టివితో టిటిడి ముఖ్య భద్రతా అధికారి రవికృష్ణ పే ర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భధ్రత కోసం 2400 మంది విజిలెన్స్, 400 మంది హోం గార్డులకు ప్రత్యేక శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. నాలుగు వేల మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు పేర్కొన్నారు. 

14:35 - September 10, 2017

ఆదిలాబాద్ : తెలంగాణలో రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు టీజాక్ చైర్మన్ కోదండరామ్. రైతాంగానికి భరోసా ఇస్తూ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సిన అవరం ఉందన్నారు. అమరవీరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో జరిగిన రోడ్‌ షో కోదండరామ్ పాల్గొన్నారు. అనంతరం భారీ సభ నిర్వహించారు. 

అంతర్ రాష్ట్ర సర్వీస్ ను ప్రారంభించిన మంత్రి మహేందర్..

వికారాబాద్ : తాండూరు నుండి ఛత్తీస్ గడ్ లోని దంతెవాడకు అంతర్ రాష్ట్ర సర్వీస్ ను మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. టీఎస్ ఆర్టీసీ ఆరు రాష్ట్రాలకు అంతర్ రాష్ట్ర సర్వీసులను నడుపుతోందన్నారు. కొత్తగా రాయ్ పూర్, దంతెవాడ, సిరోంచ గోవాలకు సర్వీసులను ప్రారంభించనున్నట్లు మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. 

ఉత్తమ్ పై మాజీ ఎమ్మెల్యే నిప్పులు..

హైదరాబాద్ : జనంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఉన్న క్రేజ్ ను చూసి ఉత్తమ్ ఓర్వలేకపోతున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుముర్తి పేర్కొన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను ఉత్తమ్ ప్రోత్సాహిస్తున్నారంటూ మండిపడ్డారు. బలమైన నేతలను పార్టీకి దూరం చేస్తున్నారని పేర్కొన్నారు. 

14:03 - September 10, 2017
14:00 - September 10, 2017

ఢిల్లీ : భర్త చనిపోయాడన్న బాధతో ఆమె కృంగిపోలేదు.. గుండె ధైర్యంతో అడుగులు ముందుకు వేసింది. భర్త యూనిఫాంను తాను ధరించడం కోసం కఠోర దీక్ష పూనింది. ఉగ్రదాడిలో నేలకొరిగిన వీర సైనికుడు సంతోష్ మహదిక్ ఆశయ సాధన కోసం ..ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న లెఫ్టెనెంట్ స్వాతి మహదిక్‌పై ప్రత్యేక కథనం. 
 

స్వాతి మహదిక్.. ఏడాదిన్న క్రితం దేశం కోసం పోరాడుతూ ఉగ్రదాడిలో నేలకొరిగిన వీర జవాన్ సంతోష్ మహదిక్ భార్య. భర్త మరణం తరువాత ఆ బాధ నుండి తేరుకోవడమే కాదు.. అమరుడైన భర్త యూనిఫాంను ఆమె ధరించారు.  పట్టుదలతో సైనిక పరీక్షలు రాసి ఎంపికై.. 11 నెలలపాటు కఠోర శిక్షణ తరువాత లెఫ్టెనెంట్‌గా పట్టా అందుకున్నారు. 

స్వాతికి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఎంతో ఆసక్తి. అందులోనూ ఆటిజం ఉన్న పిల్లలకు చదువు నేర్పడం అంటే ఇంకా ఆసక్తి. అదే సబ్జెక్ట్‌ తీసుకుని పుణెలోని సావిత్రీబాయ్ పూలే విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు స్వాతి. దేశ వ్యాప్తంగా ఉన్న పలు పాఠశాలల్లో పనిచేశారు. పిల్లలు పుట్టాక ఇంట్లోనే ఉండాల్సి రావడంతో తన ఇష్టాన్ని వదులుకున్నారు. పూర్తిగా పిల్లల బాధ్యతలో మునిగి ఉన్న సమయంలో అనుకోని కష్టం తలుపుతట్టింది. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో స్వాతి భర్త సంతోష్ మహదిక్ కన్నుమూశారు. భర్త మరణంతో తిరిగి తన కెరియర్‌ను మొదలుపెట్టారు స్వాతి. అయితే ఈసారి తనకిష్టమైన సబ్జెక్ట్‌లో కాకుండా తన భర్త పనిచేసిన సైన్యంలో తాను పనిచేయాలని నిర్ణయించుకున్నారు. 

ఆర్మీలో చేరాలంటే ఆషామాషీ కాదు. అందుకు తగ్గ శారీరక..మానసిక ఆరోగ్యం తప్పనిసరి. భర్త మరణించేనాటికి స్వాతి వయసు 37 ఏళ్లు. భర్త మరణంతో సైన్యంలో పనిచేసేందుకు వయసు మినహాయింపు లభించింది స్వాతికి. దాంతో భర్త కన్నుమూసిన రెండు నెలల తరువాత పుణెలోని అపెక్స్ కెరియర్స్‌లో జాయిన్ అయ్యారు స్వాతి. సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు. వయసు మినహాయింపు లభించినా శారీరక దారుఢ్యంతో పాటు రాత పరీక్ష..ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. వాటన్నిట్లో అర్హత సాధించిన స్వాతి శిక్షణకు ఎంపికయ్యారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో  11 నెలల కఠోర శిక్షణ అనంతరం లెఫ్టెనెంట్ పట్టా అందుకున్నారు. 

సైనికాధికారిగా పనిచేయడమంతే తనకు ఇష్టమని.. తాను కూడా సైన్యంలో చేరతానని స్వాతి చెప్పారు. తన ఇద్దరు పిల్లల్ని తన భర్త ఎలా పెంచాలనుకున్నారో అలా తీర్చిదిద్దడమే తన ముందున్న లక్ష్యం అంటారామె.  భర్త చనిపోతే అక్కడితో తమ జీవితం అయిపోయిందని .. తాము ముందుకు సాగలేమని ఎందరో మహిళలు కృంగిపోతారు. అలాంటి వారికి స్వాతి మహదిక్ కథ ఇన్సిపిరేషన్. ఓవైపు దేశం కోసం.. మరోవైపు భర్త ఆశయ సాధన కోసం స్వాతి మహదిక్ ఎంచుకున్న మార్గం అభినందనీయం. 

13:57 - September 10, 2017

ఆదిలాబాద్ : పంట పొలాలకు వాడే పురుగుల మందులు రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. క్రిమి సంహారకాలను మితిమీరి పిచికారి చేస్తుండటంతో.. రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే ముగ్గురు రైతులు మరణించడం.. సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. 

వ్యవసాయం అంటే ప్రకృతితో మమేకమై పంటను తీసి.. పది మందికి అన్నం పెట్టడం. ఇలాంటి రంగంలో సహజ సేద్యం పోయి ఎరువుల పంటలొచ్చాయి. వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా పొందేందుకు క్రిమి సంహారక మందులు, కలుపు మందులతో.. రైతులు పంటలను రక్షించుకున్నారు. కానీ ఆ మందులే వారి పాలిట యమపాశాలవుతున్నాయి. 

పెస్టిసైడ్ పిచికారి చేస్తున్న సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. చాలా మంది రైతులకు మందు పిచికారీ చేసే సమయంలో.. చేతులు కడుక్కోకుండానే తంబాకు, గుట్కా తినే అలవాటు ఉంటుంది. దీంతో అస్వస్థతకు గురై.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇలా పెస్టిసైడ్‌ కడుపులోకి వెళ్లడం వల్ల ముగ్గురు చనిపోయారు. పత్తి చేలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పెస్టిసైడ్‌ని చల్లడంతో.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట మండలం, మిట్టపల్లిలో లింగయ్య అనే రైతు పత్తి మందు చల్లే క్రమంలో.. జాగ్రత్తలు పాటించకపోవడంతో అదే రోజు రాత్రి ఇంటి దగ్గరే చనిపోయాడు. మరో రైతు పల్సి గ్రామానికి చెందిన రాములు.. పత్తి మందు కడుపులోకి వెళ్లి అన్యారోగ్యం పాలయ్యాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. బజర్ హత్నూరు మండలం, గిర్నూర్‌కి చెందిన గంగయ్య పత్తి చేనుకు మందు కొట్టి.. ఇంటికి తిరిగి వస్తూ అస్వస్థతకు గురయ్యాడు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

స్లో పాయిజన్‌లా పని చేసే పురుగుల మందు ప్రభావంతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నా ఇదీ కారణమని తెలుసుకోలేకపోతున్నారు. వీటివల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, శిశు మరణాలు సంభవిస్తున్నాయి. క్రిమి సంహారక మందులు రైతుల పిల్లల జీవితాల మీద కూడా ప్రభావం పడుతోంది. 

పంటకు ఏదైనా రోగం వచ్చినప్పుడు రైతులు ముందుగా సమీప వ్యవసాయాధికారులనో, వ్యవసాయ శాస్త్రవేత్తలనో సంప్రదించాలి. వాళ్లు పంటను పరిశీలించి రోగమేంటో తేల్చి మందు రాసివ్వాలి. ఏ మందు ఎంత మోతాదులో పిచికారీ చేయాలో చెప్పాలి. రైతులు మందులు పిచికారీ చేసే సమయంలో శరీరాన్నంతా ఆప్రాన్‌ లేదా కవర్‌తో కప్పేసుకోవాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అవగాహనా లోపంతో చేసే చిన్న చిన్న తప్పులతో రైతుల ప్రాణాలు పోతున్నాయి. ఇకనైనా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. 

13:54 - September 10, 2017

కరీంనగర్‌ : జిల్లాలో టీఆర్ఎస్ నేతల విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వైఖరిని నిరసిస్తూ 30వ డివిజన్ కార్పొరేటర్ జయశ్రీ.. పార్టీకి, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా సీఎం కార్యాలయం, మంత్రి ఈటల, ఎంపీ వినోద్‌కు పంపించినట్లు జయశ్రీ తెలిపారు. తనపై ఓడిన అభ్యర్థికి కమలాకర్‌ ప్రాధాన్యత ఇస్తూ... వార్డు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బలహీనవర్గానికి చెందిన తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఓవైపు ప్రభుత్వం కరీంనగర్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించగా... పనుల్లో అధికార పార్టీ నేతల జోక్యం ఎక్కువ కావడంతో... ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు గుప్పుమన్నాయి. 

 

తొలి వన్డేలకు భారత జట్టు ఎంపిక..

ముంబై : ఆస్ట్రేలియాతో తొలి మూడు వన్డేలకు భారత జట్టు ఎంపిక చేశారు. కోహ్లీ (కెప్టెన్), రోహిత్, శిఖర్ ధావన్, రాహుల్, పాండే, జాదవ్, రహానే, అక్సర్, కుల్ దీప్, చాహల్, బుమ్రా, భువి, ఉమేష్, షమీలున్నారు. 

13:52 - September 10, 2017

ఢిల్లీ : గురుగ్రామ్‌లో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాయన్‌ ఇంటర్నేషనల్ స్కూల్‌ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులను స్కూల్‌ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ సమీపంలోని మద్యం దుకాణానికి నిప్పుపెట్టారు. 

 

13:50 - September 10, 2017

హైదరాబాద్ : నేరెళ్ల బాధితుల్ని రాత్రి వేళ ఆసుపత్రి నుంచి గెంటేయడం దారుణమన్నారు రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్‌ను ఆసుపత్రి అధికారులు ఉల్లంఘించారని ఆరోపించారు.  కేసీఆర్ ఏది చెప్తే అది చేసేస్తారా? అంటూ నిమ్స్‌  అధికారుల్ని వీహెచ్ ప్రశ్నించారు. నిమ్స్ సూపరింటెండెంట్‌పై ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని విహెచ్ డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాలపై జరుగుతున్న దౌర్జన్యంపై సిరిసిల్లలో ఈనెల 15 నుంచి రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. 

 

13:48 - September 10, 2017
13:46 - September 10, 2017

విశాఖ : ఎన్నికలన్నీ ఒకేసారి జరగాలనేది చంద్రబాబు ఆలోచన అని... దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు మంత్రి లోకేశ్‌. రాష్ట్రాభివృద్ధి కోసం తాము ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరిగిన టీడీపీకి.. 80 శాతం ఓట్లు పడతాయన్నారు లోకేశ్‌. విశాఖలో ఇంటర్నేషనల్‌ ఇన్నోవేషన్‌ సదస్సుకు హాజరైన లోకేశ్‌... కొత్త ఆవిష్కరణలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. ఏపీలో తయారైన వస్తువులను ఇంటర్నేషనల్‌ మార్కెట్‌కు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నామన్నారు లోకేశ్‌. 

 

13:41 - September 10, 2017

ఖమ్మం : ఆసుపత్రిలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో... ముగ్గురు చిన్నారులు చనిపోయిన ఘటనపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఆసుపత్రి ఎదుట ఐద్వా, పీవైఎల్ సంఘాలు ఆందోళనకు దిగాయి. చిన్నారుల మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

13:28 - September 10, 2017

ఖమ్మం : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని పాలకులు చెప్పుకుంటున్నా... సరైన వైద్యం అందక రోగులు మృత్యువాత పడుతున్నారు. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్బిణికి సరైన సమయంలో వైద్యం అందించకపోవడంతో... ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో శిశువులు మృత్యువాత పడుతున్నారు. ఒకేరాత్రి ముగ్గురు శిశువులు మృతి చెందడం కలకలం రేగుతోంది. దీనిపై 10టీవీలో వరుస కథనాలు ప్రసారం కావడంతో... మంత్రి తుమ్మల స్పందించారు. వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

గుర్ గావ్ లో ఉద్రిక్తత..

గుర్ గావ్ : రెండు రోజుల క్రితం రేయాన్ స్కూల్ వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేశారు. విద్యార్థులను స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్కూల్ సమీపంలోని మద్యం దుకాణానికి నిప్పు పెట్టారు. 

13:17 - September 10, 2017

వరంగల్‌ : నగరంలో స్వైన్‌ఫ్లూ కలకలం నెలకొంది. వర్దన్నపేట ఏసీపీ దుర్గయ్య స్వైన్‌ఫ్లూ మృతి చెందాడు. స్వైన్‌ఫ్లూతో లంగ్స్‌ ఫెయిల్‌ కావడంతో... హైదరాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దుర్గయ్య మృతి చెందాడు. మరిన్ని 
వివరాలను వీడియోలో చూద్దాం...

13:07 - September 10, 2017

హైదరాబాద్ : అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయని.. తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. టెన్ టీవీలో సాయంత్రం ప్రసారమయ్యే చర్చా కార్యక్రమం హెడ్ లైన్ షోకు.. ఆరాధన - శ్రీకరి సంస్థలు.. బెస్ట్‌ టాక్‌షో అవార్డు అందించింది. హైదరాబాద్‌ త్యాగరాయ గానసభలో జరిగిన 22వ టీవీ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో 10టీవీ అసిస్టెంట్‌ ఎడిటర్‌ సతీష్‌ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సతీష్‌ను.. రోశయ్య, మాజీ జస్టిస్ శేషశయనారెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు సన్మానించారు. 

 

12:58 - September 10, 2017

చిత్తూరు : కాణిపాక వరసిద్ధ వినాయక బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. పుష్పపల్లకి వాహనం నేలకొరిగింది. ఉత్సవం ముగిశాక పల్లకిలోని పూలను తీసుకోవడానికి.. భక్తులు ఎగబడ్డారు. దీంతో వాహనం పక్కకు వాలిపోయింది. 

12:57 - September 10, 2017

చిత్తూరు : కాణిపాకంలో స్వయంభు వరసిద్ది వినాయకస్వామి ప్రత్యేకోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 21 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో... పుష్పపల్లకి సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. సిద్ది వినాయకుడిని కర్ణాటక నుంచి తెచ్చిన పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. పుష్పపల్లకిపై స్వామివారు కాణిపాకం తిరుమాడ వీధుల్లో విహరించారు. ఈ సేవను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. 

 

12:55 - September 10, 2017

బెంగళూరు : కర్ణాటకలో బ్యాంక్‌ పరీక్ష ప్రశాంతంగా జరుగుతోంది. నిన్న తెలుగు విద్యార్థులపై కన్నడిగులు దాడి చేయడంతో... పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు పహారాలో పరీక్ష కొనసాగుతోంది. కన్నడిగుల దాడి నేపథ్యంలో నిన్న జరగాల్సిన పరీక్షను అధికారులు వాయిదా వేశారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:43 - September 10, 2017
12:41 - September 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులపై జీఎస్టీ తగ్గిస్తారనుకుంటున్న సమయంలో... కేంద్రం భారీ షాక్‌ ఇచ్చింది. 12 శాతం ఉన్న పన్ను 5 శాతానికి తగ్గించేది లేదని అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. పన్ను తగ్గింపుతో ప్రభుత్వాని కంటే కాంట్రాక్ట్‌లకే మేలు జరుగుతుందని... రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు సరిచూసుకోవాలని హితవు పలికారు కేంద్ర ఆర్ధికమంత్రి. 
జీఎస్టీ భారం తగ్గించేది లేదన్న జైట్లీ
ప్రభుత్వ పనులపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తారనే వార్తలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జీఎస్టీ భారం తగ్గించేది లేదని హైదరాబాద్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ మీట్‌ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ తేల్చి చెప్పారు. పన్ను రేట్లను తగ్గించడం సరికాదని,.. ఇప్పటికే 18 శాతం ఉన్న పన్నును 12 శాతానికి తగ్గించామన్నారు. పన్ను తగ్గిస్తే... రాష్ట్ర ప్రభుత్వానికే నష్టమని సూచించారు. 
ప్రభుత్వ ఆశలు అడియాశలు 
గత కొంతకాలంగా వర్క్స్‌ కాంట్రాక్ట్‌లపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించాలని తెలంగాణ సర్కార్‌ డిమాండ్‌ చేస్తోంది. దీనిపై ప్రధాని మోదీ, అరుణ్‌జైట్లీకి కేసీఆర్‌ లేఖలు రాశారు. ఆర్థికమంత్రి ఈటల కూడా పలు జీఎస్టీ సమావేశాల్లో అభ్యంతరాలను లేవనెత్తారు. 12 శాతం జీఎస్టీతో రాష్ట్రంపై 9వేల కోట్ల మేర భారం పడుతుందని... జీఎస్టీ మొత్తం ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. కనీసం ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులకు మినహాయించాలని కోరారు. హైదరాబాద్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ... అరుణ్‌జైట్లీ పన్ను తగ్గించేది లేదని తేల్చిచెప్పారు. పన్ను తగ్గించడం వల్ల కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకే మేలు జరుగుతుందే తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. అలాగే.. మీ లెక్కలు సరి చూసుకోండని సలహా ఇచ్చారు. దీంతో జీఎస్టీ తగ్గుతుందనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇదిలావుంటే... ప్రభుత్వం నిర్మించే పాఠశాలలు, ఇతర భవనాల విషయంలో పన్ను తగ్గించేలా పబ్లిక్‌ వర్క్స్‌ నిర్వచనాన్ని మారుస్తామన్నారు అరుణ్‌జైట్లీ. వచ్చే సమావేశం నాటికి దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులపై కూడా సానుకూల నిర్ణయం వస్తుందంటున్నారు ఈటల. మొత్తానికి ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులపై జీఎస్టీ తగ్గించకపోవడంతో... రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనే ఆలోచనలో పడింది. మరి దీనిపై కేసీఆర్‌ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి. 

 

ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ముగ్గురు శిశువుల మృతి..

ఖమ్మం : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం ముగ్గురు శిశువులు మృతి చెందారు. నెలలు నిండలేదని వైద్యులు డెలివరీ చేయలేదు. దీనితో ఆసుపత్రిలోని బల్లపైనే మగశిశువుకు మహిళ జన్మనిచ్చింది. బల్లపై నుండి కిందపడడంతో ఆ శిశువు మృతి చెందింది. కడుపులో అడ్డం తిరగడంతో మరో పసికందు, ఉమ్మనీరు తాగడంతో పుట్టిన కాసేపటికే మరో శిశువు మృతి చెందింది. 

12:33 - September 10, 2017

చిత్తూరు : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గోకులం వీధిలో పురాతన భవనం కూలి.. వృద్ధురాలి మృతిచెందింది. ఇటీవల వర్షాలకు.. గోడలు బాగా దెబ్బతిన్నాయి. పురాతన భవనం కావడంతో... ఒక్కసారిగా కూలిపోయింది. ఇంట్లో నివాసముంటున్న వృద్ధురాలు అక్కడికక్కడే చనిపోయింది.

 

12:31 - September 10, 2017

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆల్విన్ కాలనీ ఆదిత్యనగర్‌లో దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతోనే ఇరువురు చనిపోయినట్టు తెలిపారు. మృతులను అనిత, ప్రవీణ్‌లుగా గుర్తించారు. 

 

ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎదుట ఆందోళన..

గుర్ గావ్ : ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేండ్ల చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరుగుతుందని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వెల్లడించిన సంగతి తెలిసిందే. 

ఆ స్కూల్ ను మూసేయాలన్న తల్లి...

ఢిల్లీ : గాంధీనగర్ లోని ఠాగూర్ పబ్లిక్ స్కూల్ లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో విచారణ సరిగ్గా జరగడం లేదని చిన్నారి తల్లి ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొంది. ఈ రోజు తన పిల్లపై జరిగిందని, మరో రోజు మరొక పిల్లపై జరిగే అవకాశం ఉందని, వెంటనే స్కూల్ ను మూసివేయాలని విజ్ఞప్తి చేసింది. 

12:00 - September 10, 2017

నందమూరి 'బాలకృష్ణ' ఫిలిం మేకింగ్ లో స్పీడ్ పెంచాడు. తన ఎనర్జీ లెవెల్స్ తో డైలాగ్స్ అదరగొడుతూ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. 'పైసా వసూల్' సినిమా రిలీజ్ అయింది రిజల్ట్స్ ఎలా ఉనా 'బాలయ్య' మరో సినిమా చేయబోతున్నాడు. 'పైసా వసూల్’ రిజల్ట్ చూశాక అందరూ నందమూరి బాలకృష్ణ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఈ సినిమా ఓ మాదిరిగా ఆడుతోందని టాక్. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' హిస్టీరికల్ సినిమాగా నిలిచింది. వరల్డ్ వైడ్ హిట్ టాక్ తో నడిచింది. ఆ తరువాత పూరి తో 'పైసా వసూల్' లో నటించాడు బాలయ్య.

‘పైసా వసూల్’ విషయంలోనే బాలయ్య తప్పటడుగు వేశాడనుకుంటుంటే.. ఈ సినిమా ఫలితం చూశాక కూడా బాలయ్య పూరితో ఇంకో సినిమా చేయడానికి రెడీ అవడం చూసి మరింత ఆశ్చర్యపోతున్నారు. ‘పైసా వసూల్’ విడుదలకు ముందు బాలయ్య-పూరి కాంబినేషన్లో ఇంకో సినిమా ఉంటుందని.. అదో పొలిటికల్ డ్రామా అని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. స్వయంగా పూరినే బాలయ్యతో తాను మరో సినిమా చేయబోతున్నట్లు కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. 

11:56 - September 10, 2017

అమెరికా : ఇర్మా తుఫాను ఉత్తర అమెరికా ఖండాన్ని వణికిస్తోంది. ప్రచండమైన గాలులు, కుండపోత వర్షాలతో దడ పుట్టిస్తోంది. కరేబియన్ దీవుల్లో బీభత్సం సృష్టించిన హరికేన్.. ఫ్లోరిడా దిశగా దూసుకొస్తోంది. తీరాన్ని తాకే సమయంలో 25 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడతాయని .. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అమెరికా జాతీయ హరికేన్ విభాగం హెచ్చరించింది. దీంతో సుమారు 63 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. 
ఫ్లోరిడావైపు దూసుకొస్తున్న ఇర్మా 
కుండపోత వర్షం.. భీకరమైన గాలులతో కరేబియన్ దీవుల్లో బీభత్సం సృష్టించిన హరికేన్‌ ఇర్మా అమెరికాలో పెను విధ్వంసం సృష్టించేందుకు తీరం వైపునకు వేగంగా దూసుకొస్తుంది. ఆదివారం ఉదయం ఫ్లోరిడా రాష్ట్ర తీరాన్ని తాకనున్న హరికేన్‌ అమెరికాలో కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించవచ్చని ఆ దేశ జాతీయ హరికేన్‌ కేంద్రం హెచ్చరించింది. ఫ్లోరిడా కీస్‌ వద్ద అమెరికా తీరాన్ని తాకి, అనంతరం ప్రధాన భూభూగమైన మయామి-డేడ్‌ కౌంటీపై విరుచుకుపడనుంది. ఆ సమయంలో గంటకు 250 కి.మీ వేగంతో పెనుగాలులతో పాటు కుండపోత వర్షం ముంచెత్తవచ్చని అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో 25 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడవచ్చని హెచ్చరించింది. ముందు జాగ్రత్త చర్యగా లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఫ్లోరిడాలో కుండపోతగా వర్షాలు
ఫ్లోరిడాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఇర్మా ప్రభావం మొదలైంది. పలుచోట్ల కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 63 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఫ్లోరిడా రాష్ట్ర అధికారులు విజ్ఞప్తి చేశారు. వేలాది మంది భారతీయులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. జార్జియా రాష్ట్రంలోని అతిపెద్ద నగరం అట్లాంటా హోటళ్లన్నీ ఫ్లోరిడా ప్రజలతో నిండిపోయాయి.  జార్జియా తీర ప్రాంతాల నుంచి 5.4 లక్షల మంది సహాయక శిబిరాలకు వెళ్లాలని ఆ రాష్ట్ర అధికారులు కోరారు. ఫ్లోరిడా, జార్జియాతో పాటు, ఉత్తర కరొలినా, దక్షిణ కరొలినా, అలబామా రాష్ట్రాల్లో కూడా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అత్యవసర సహాయం కోసం హోం ల్యాండ్, ఎమర్జెన్సీ, ఇతర విభాగాలకు చెందిన వేలాది మందితో పాటు ఆర్మీ సిబ్బందిని ఫ్లోరిడా తీర ప్రాంతాల్లో మోహరించారు.  
25 మంది మృతి
గురువారం నుంచి ఇప్పటి వరకూ ఇర్మా ధాటికి కరీబియన్ దీవుల్లో 25 మంది మరణించారు. 112 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు ఆసుపత్రులు, కర్మాగారాలు, భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ఉత్తర తీర ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 10 లక్షల మందిని ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే బహమాస్‌ దక్షిణ ప్రాంతంలో కూడా శనివారం హరికేన్‌ విధ్వంసం కొనసాగింది. గాలుల తీవ్రతకు భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో పాటు, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. బ్రిటన్‌ అధీనంలోని టర్క్స్‌ అండ్‌ కైకోస్, వర్జిన్‌ ఐలాండ్స్‌లో నష్టం తీవ్రతను అంచనా వేస్తున్నామని స్ధానిక అధికారులు చెబుతున్నారు. 
పరిస్థితి సమీక్షిస్తున్న భారత విదేశాంగ శాఖ
హరికేన్‌ ఇర్మా నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో వేలాది మంది భారతీయులు ఉన్న నేపథ్యంలో ఆ శాఖ అప్రమత్తమైంది. అమెరికా, వెనెజులా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌లోని భారత రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. ఇర్మా ధాటికి 60 శాతం చిన్న దీవులు దెబ్బతిన్నాయి. ఇప్పటికే ఇర్మా దెబ్బకు సెయింట్‌ మార్టిన్‌ దీవి విధ్వంసం కాగా.. జోస్‌ ముప్పు నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెలికాప్టర్ల ద్వారా హెచ్చరికలు వినిపిస్తున్నారు.  
ఫ్లోరిడాలో 260 పునరావాస కేంద్రాలు
ఫ్లోరిడాలో ఇంతవరకూ 260 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. యుద్ధ ప్రాతిపదికన మరో 70 షెల్టర్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.  అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత విధ్వంసకర తుపాను కావచ్చంటూ అధ్యక్షుడు ట్రంప్ వీడియో సందేశం పంపారు. అధికారులు, పోలీసుల సూచనల ప్రకారం నడుచుకోవాలంటూ వీడియో సందేశంలో తెలిపారు. 

 

11:46 - September 10, 2017

సిద్దిపేట : నంగనూరు మండలంలోని ఆదర్శగ్రామం తమ్మాయిపల్లిలో విదేశీయులు సందడి చేశారు. 7 దేశాల నుంచి వచ్చిన విదేశీ ప్రతినిధులకు గ్రామస్తులు డప్పు చప్పుళ్లతో  తెలంగాణ సంప్రదాయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, సేంద్రీయ వ్యవసాయ పద్ధతి, హరితహారం, ప్లాస్టిక్ నివారణకు సంబంధించిన అంశాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతో కలిసి విదేశీయులు బతుకమ్మ ఆడారు. 

11:42 - September 10, 2017

హైదరాబాద్ : నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి జగన్‌ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇప్పటికే ఎన్నిక‌ల‌కు స‌న్నద్ధమవుతున్న త‌రుణంలో.. ముందుగా ప్రకటించిన ప్రకారం వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్రకు కూడా సిద్ధమ‌వుతున్నారు.  అయితే ఈలోగా తానేంటో నిరూపించుకునేందుకు పీకే కొత్త టార్గెట్‌ను వైసీపీకి ఫిక్స్ చేశార‌ని స‌మాచారం! మరోవైపు 60 రోజుల కార్యాచరణ సమక్రమంగా అమలు కావడం లేదని ప్రశాంత్‌ కిషోర్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. 
ఓటమిపై జగన్‌ పోస్టుమార్టం
నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై..ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి పోస్టుమార్టం నిర్వహించారు. ఎన్నికల వ్యూహకర్తగా రంగంలోకి దిగిన ప్రశాంత్‌ కిషోర్‌..జగన్‌తో సుదీర్ఘంగా సమావేశమై నంద్యాల, కాకినాడ ఓటమికి గల కారణాలపై విశ్లేషించారు. ఎన్నికలకు ముందు ప్రశాంత్‌ కిషోర్‌ చేసిన సర్వేలో నంద్యాలలో వైసీపీ విజయం సాధిస్తుందని నివేదికలు వచ్చాయి. కానీ ఎన్నికల ఫలితాలు రివర్స్‌ కావడంతో.. పీకే జగన్‌కు వివరణ ఇచ్చుకున్నారట. ప్రధానంగా పార్టీకి నంద్యాల ప్రజల్లో మంచి ఇమేజ్‌ ఉన్నా..వాటిని ఓట్లుగా మలుచుకోవడంలో విఫలమైనట్లు చెప్పారు. 
జగన్‌కు ప్రశాంత్ కిషోర్ రిపోర్టు
నంద్యాల, కాకినాడ ఫలితాలు విశ్లేషించి తన బృందాలతో నివేదికలు తెప్పించిన ప్రశాంత్ కిషోర్.. ఏపీలో వైసీపీ పరిస్థితిపై ఓ రిపోర్టును జగన్‌కు అందించార‌ట‌. పార్టీకి అంతర్గత నిర్మాణం లేకపోవడమే పెద్ద మైనస్‌గా చెప్పారట. పార్టీ బలోపేతానికి కొన్ని సూచనలు, సలహాలు చేసినట్లు తెలుస్తోంది. మ‌రికొద్ది రోజుల్లో వైఎస్సార్ కుటుంబం పేరుతో స‌భ్యత్వ న‌మోదు కార్యక్రమాన్ని చేప‌ట్టబోతున్నారు. దీనికోసం మిస్డ్ కాల్ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దాని ప్రకారం ఓ ప్రత్యేకమైన ఫోన్‌నెంబర్ కేటాయించి మిస్డ్ కాల్స్ ఉద్యమాన్ని ప్రారభిస్తున్నట్లు సమాచారం. గతంలో బీజేపీ మిస్డ్ కాల్ ద్వారా పార్టీ సభ్యత్వాలనిచ్చింది. అదే మార్గాన్ని అనుసరించి మొత్తం కోటి మిస్డ్ కాల్స్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా నిర్ణయించుకున్నార‌ట‌. మ‌రోవైపు అక్టోబర్ చివర్లో పాదయాత్ర ప్రారంభించాలనుకుంటున్న జగన్.. ఈలోపే వైఎస్పార్ కుటుంబంలో కోటిమందిని భాగస్వామ్యం చేయాలనుకుంటున్నారు. 

 

11:33 - September 10, 2017

యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జై లవ కుశ' చిత్ర ట్రైలర్ ఆదివారం విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ విడుదలయ్యాయి కూడా. ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో మూడు పాత్రలను పోషిస్తుండడంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. అంతేగాకుండా ఆయా పాత్రలు దేనికవే భిన్నంగా ఉన్నాయి.

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' హీరోగా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై 'జై లవ కుశ' రూపొందుతోంది. ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్ 3 న డైరెక్ట్ గా మార్కెట్ లో విడుదల చేశారు. అభిమానులను సంతృప్తి పరిచేందుకు సాయంత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. బాబీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా, నివేదిత థామస్ లు హీరోయిన్స్ నటించారు. 

11:28 - September 10, 2017

గుంటూరు : ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.  మద్యం ధరలను స్వల్పంగా పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. జలసిరికి హారతి, వనం -మనం, ఏరువాక కార్యక్రమాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించింది.  ఇసుక విధానం అమలు తీరు, వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై చంద్రబాబు కేబినెట్‌లో సీరియస్‌ అయ్యారు. ఏపీఐఐసీ వ్యవహారశైలిపైనా ఆయన మండిపడ్డారు.
మద్యం ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్‌
సుమారు 5 గంటలపాటు జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మధ్యం ధరల పెంపుపై రామానుజన్‌ కమిటీ సిఫార్సులను పరిశీలించిన మంత్రివర్గం పరిమితంగా  మద్యం ధరలను పెంచేందుకు ఆమోదం తెలిపింది. మద్యం కేసు ధర 400 రూపాయల లోపు ఉంటే ఎటువంటి పెంపు ఉండకూడదని నిర్ణయించింది.  400 నుండి 450 రూపాయల ధరలపై 3 శాతం, 450 పైన ఉంటే  9 శాతం ధరను పెంచాలని నిర్ణయించింది.  అగ్రికల్చర్ కాలేజీల్లో అక్రమాలు, బోగస్ సంస్థలపై చర్చించిన మంత్రివర్గం ఆకస్మిక తనిఖీల ద్వారా వాటిని అరికట్టాలని నిర్ణయించింది. ఇందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. .ఈ ఏడాది జలసిరికి హారతి కార్యక్రమం విజయవంతం కావడంతో ఇక నుంచి ప్రతి ఏడాది  ఏరువాక, వనం -మనం, జలసిరికి హారతి నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 
చక్కెర కర్మాగారాలకు ఆర్థిక చేయూత
రాష్ట్ర వ్యాప్తంగా మూడు సహకార చక్కెర కర్మాగారాలకు ఆర్ధికంగా చేయూత అందించాలని కేబినెట్ నిర్ణయించింది.  ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ యాక్ట్ బిల్, 2017ను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. మరోవైపు రాజధాని ప్రాంతంలో భారీగా అద్దెలు పెంచేయడంతో  ... రెంట్ కంట్రోల్ ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.. ఇక కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణానది  తీరంలో గుడిసెలు తొలగించడంతో..బాధితులకు సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటల సేవలు, ఇసుక, అగ్రిగోల్డ్‌, అటవీ భూముల డీనోటిఫై మీద కేబినెట్‌లో చర్చించారు. ఎస్‌ఈఎల్‌ టర్బో కన్సార్టియానికి దగదర్తి ఎయిర్‌పోర్టు అభివృద్ధి బాధ్యతలు అప్పగించేందుకు  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  మహిళా, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల సిబ్బంది నియామకానికి ఆమోదముద్ర వేసింది. 
పలు శాఖల పనితీరుపై సీఎం అసంతృప్తి
మంత్రివర్గ సమావేశంలో పలు శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు..ఏపీఐఐసీ అధికారులపై  సీఎం మండిపడ్డారు..పారిశ్రామికవేత్తలకు భూముల కేటాయింపులో అలసత్వం వహిస్తున్నారనీ, భూముల ధరలను సైతం అధికంగా పెంచటం సరికాదని చంద్రబాబు  సూచించారు. ఇక ఇసుక విధానాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నా ఇంకా లోపాలు కనిపిస్తూనే ఉన్నాయని ఆ శాఖ మంత్రి సుజయ్ కృష్ణా రంగారావు పై  చంద్రబాబు మండిపడ్డారు... ఇసుక రీచుల్లో ఆకస్మిక తనిఖీల ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని ఉన్నతాధికారులను  ఆదేశించారు..అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ పై కూడా  ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. మొత్తంగా ఐదు గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశం వాడీవేడిగా సాగింది.

 

ట్రిపుల్ తలాక్ పై ముస్లిం లా బోర్డు సమావేశం..

మధ్యప్రదేశ్ : ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించేందుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కాసేపటి క్రితం సమావేశమైంది. 

11:23 - September 10, 2017

ఖమ్మం : పట్టణంలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ శిశువు మృతి చెందింది. పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్బిణికి నెలలు నిండలేదని సిబ్బంది పట్టించుకోలేదు. తీవ్రమైన పురిటి నొప్పులతో ఇబ్బందిపడ్డ గర్బిణి... బల్లపైనే శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం శిశువు బల్ల పైనుంచి కిందపడి మృతి చెందింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మరిన్ని వీడియోలో చూద్దాం...

 

పీఎస్ లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు - రాజ్ నాథ్...

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించనున్నట్లు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. అనంతనాగ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కర్నాటకలో పోలీసు పహారా మధ్య ఎగ్జామ్..

బెంగళూరు : కర్నాటకలో ప్రశాంతంగా బ్యాంక్ ఎగ్జామ్ పరీక్ష జరుగుతోంది. నిన్న తెలుగు విద్యార్థులపై కన్నడిగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడి ఘటనతో పరీక్షా కేంద్రాల వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

10:47 - September 10, 2017

సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో వైసీపీ నేత హన్మంతరావు, సీపీఎం నేత ఎం.ఎ గపూర్,  టీడీపీ నేత సుబ్బారావు పాల్గొని, మాట్లాడారు. కేబినెట్ నిర్ణయాలు అమలు కావడం లేదని విమర్శించారు. నిర్ణయాలను ప్రచారం కోసమే ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:35 - September 10, 2017
10:34 - September 10, 2017

ఢిల్లీ : కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్‌ నివాసంలో సీబీఐ తనిఖీలు చేసింది. పర్యావరణ మంత్రి హోదాలో నేరపూరిత కుట్ర, అక్రమాలకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణల నేపథ్యంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. యూపీఏ హయాంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్‌లకు జార్ఖండ్‌లోని అటవీ భూములను  అక్రమంగా కేటాయించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి పర్యావరణ శాఖకు చెందిన ఇద్దరు ఉన్నత అధికారులపై సీబీఐ వేర్వేరుగా కేసులు నమోదు చేసింది. తమిళనాడుకు చెందిన జయంతి నటరాజన్‌ జులై 2011 నుంచి డిసెంబరు 2013 వరకు పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తన నిర్ణయాల్లో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అతి చొరవ చూపిస్తున్నారనే కారణంతో జనవరి 2015లో పార్టీకి రాజీనామా చేశారు..

 

10:31 - September 10, 2017

ఢిల్లీ : గురుగ్రామ్‌లోని రాయన్‌ ఇంటర్నేషనల్‌ స్కూళ్లో ఏడేళ్ల బాలుడి హత్య కేసులో దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేస్తామని గుర్గావ్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ ఖిర్వార్‌ హామీ ఇచ్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బస్సు కండక్టర్‌ అశోక్‌ను మూడు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ముగ్గురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీ వేసింది. విచారణలో స్కూలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినట్లు తేలితే స్కూలు గుర్తింపును రద్దు చేస్తామని జిల్లా అధికారి వినయ్‌ ప్రతాప్‌సింగ్‌ హెచ్చరించారు. స్కూలు ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తింపును రద్దు చేసినట్లు వినయ్‌ తెలిపారు. రెండో తరగతి చదువుతున్న ప్రద్యుమ్న్‌ శుక్రవారం పాఠశాల బాత్రూంలో శవమై కనిపించాడు. బస్సు కండక్టర్‌ అశోక్‌ బాలుడిని హత్య చేసినట్లు  స్పష్టమైంది.

 

రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం..

కర్నాటక : రెండున్నరేళ్ల వయస్సు గల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటనలో ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారిని సజీవంగా పాతిపెట్టాడని తెలుస్తోంది. 

10:24 - September 10, 2017

‘ఐయామ్ వెయిటింగ్' అనే డైలాగ్ తనకెంతో ఇష్టమని టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' వ్యాఖ్యానించారు. తమిళంలో 'కత్తి' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇందులో 'హీరో' ఈ డైలాగ్ పలుకుతాడు. తెలుగులో మెగాస్టార్ 'చిరంజీవి' ‘ఖైదీ నెంబర్150’ గా రీమెక్ అయ్యింది. విజయ్ ‘కత్తి' సినిమాను రీమెక్ చేయాలని అనుకున్నట్లు..కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదన్నారు.

ప్రిన్స్ 'మహేష్ బాబు' నటించిన 'స్పైడర్' చిత్రం వేడుకలు శనివారం రాత్రి చెన్నైలో ఘనంగా జరిగాయి. కలైలవానర్ ఆరంగం ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో 'మహేష్' అభిమానులు సందడి చేశారు. మురుగదాస్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలయ్యే ఈ ఆడియో వేడుకకు అతిరథ మహారథులు వస్తారని ప్రచారం జరిగినా ఎవరూ రాలేదు. హీరో విశాల్ స్పెషల్ గెస్ట్ గా వచ్చి మహేష్ ని సాదరంగా తమిళ పరిశ్రమకి ఆహ్వానించడం ఆకట్టుకుంది.

మురుగదాస్, హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్, మహేష్ బాబు..చిత్ర బృందం వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు వేడుక హైదరాబాద్ లో ఈనెల 15 గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. మరో 17 రోజుల్లో ప్రిన్స్ దండయాత్ర స్టార్ట్ కాబోతోంది.  

10:18 - September 10, 2017

కర్ణాటక : కన్నడిగుల ప్రాంతీయాభిమానం తెలుగు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఎంతో కష్టపడి బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమైన విద్యార్థులను పరీక్ష రాయనీయకుండా అడ్డుకొని కన్నడ సంఘాలు వీరంగం సృష్టించాయి. పరీక్షా కేంద్రాలను రణరంగంగా మార్చాయి. ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ పరీక్షలు రాసేందుకు  వెళ్లిన ఏపీ అభ్యర్థులపై దాడులకు దిగారు. ఘటనపై ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించింది. 
తెలుగువారిపై కన్నడీయులు దాడులు
కర్ణాటక రాష్ట్రంలోని.. హుబ్లీలో బ్యాంకింగ్‌ పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి కన్నడ సంఘాల నేతలు అడ్డుకున్నారు. అభ్యర్థులను పరీక్షా హాల్‌ వద్ద అడ్డుకుని.. హాల్‌ టికెట్లను చించేశారు. వారిపై దాడులకు పాల్పడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి కన్నడ సంఘాల నేతలను అడ్డుకున్నారు. ఈ పరిణామంతో.. భయాందోళనకు గురైన చాలామంది అభ్యర్థులు పరీక్షలు రాయకుండానే వెనుదిరిగారు. హుబ్లీలోనే కాకుండా గుల్బర్గా, దావణగెరే, బెంగళూరులో కన్నడిగులు ఆందోళన నిర్వహించారు. 
తమ రాష్ట్రంలో పరీక్షలు రాయడానికి వీల్లేదంటూ కన్నడ సంఘాల ఆందోళన
పరీక్షలకు హాజరుకావద్దంటూ.. ముందుగానే ఫోన్లు
ఈ నెల 9,10, 16,17, 24 తేదీల్లో బ్యాంకు పోస్టుల భర్తీకి కర్ణాటకలో జరగనున్న పరీక్షలకు.. తెలుగు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా 9తేదీన జరిగే పరీక్షకు తెలుగు విద్యార్థులు హాజరయ్యారు. అయితే తమ రాష్ట్రంలో.. వేరే రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి ఐబీపీఎస్‌ పరీక్షలు రాయడానికి వీల్లేదనే డిమాండ్‌తో  కన్నడ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పరీక్షలకు హాజరుకావద్దంటూ... అపరిచితుల నుంచి తెలుగు అభ్యర్థులకు ఫోన్లు కూడా చేశారు. 
ఘటనపై ఏపీ సీఎం సీరియస్‌
ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు విద్యార్థులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వెంటనే కర్ణాటక సీఎస్‌తో మాట్లాడాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర కర్ణాటక సీఎస్‌తో మాట్లాడారు. రేపు, ఎల్లుండి జరిగే పరీక్షల్లో తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలో తెలుగు విద్యార్థులను అడ్డుకోవడం సరికాదని రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. దీనిగురించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. దీంతో ఆదివారం, సోమవారం కూడా పరీక్షలు ఉన్నప్పటికీ  తెలుగు అభ్యర్థులు వెనక్కి వచ్చేశారు. మరోవైపు శనివారం పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు ఏపీ సీఎస్ దినేశ్ కుమార్ తెలిపారు. 

తిరుమల బ్రహ్మోత్సవాలు..వివరాలు..

 

చిత్తూరు : ఈ నెల 22న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. 23న రా.7గంటలకు ధ్వజారోహంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రా.8గంటలకు సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
23న రాత్రి 9గంటలకు పెదశేషవాహనం, 24న ఉదయం 9గంటలకు చినశేషవాహనం, రాత్రి 9గంటలకు హంసవాహనసేవ.

10:12 - September 10, 2017

ఇర్మా ప్రభావితంతో..

అమెరికా : ఇర్మా ప్రభావితంతో భారీగా వరద నీరు పోటెత్తె ప్రమాదం ఉంది. ఇప్పటికే లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ తుఫాన్ కారణంగా చాలా మంది మృతి చెందారు. 

ఖమ్మంలో వైద్యుల నిర్వాకం..శిశువు మృతి..

ఖమ్మం : పల్లెగూడెంకు చెందిన గర్బిణీకి పురిటినొప్పులు రావడంతో ఖమ్మం జిల్లా ప్రధాన వైద్యశాలకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. కానీ ఇంకా నెలలు నిండలేదని వైద్యులు డెలివరీ చేయలేదు. దీనితో ఆసుపత్రిలోని బల్లపైనే మగశిశువుకు మహిళ జన్మనిచ్చింది. బల్లపై నుండి కిందపడడంతో ఆ శిశువు మృతి చెందింది. 

నేడు నిర్మల్ జిల్లాలో మంత్రులు పోచారం, ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ : నేడు జిల్లాలో మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొననున్నారు. 

 

 

నేడు తెలంగాణలో ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

హైదరాబాద్ : నేడు తెలంగాణలో ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. జీవో 39కి వ్యతిరేకంగా టీకాంగ్రెస్ నిరసనలు తెలపనుంది. 

నిజామాబాద్ లో నేడు టీమాస్ ఫోరం ఆవిర్భావ సభ

నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో నేడు టీమాస్ ఫోరం ఆవిర్భావ సభ జరుగనుంది. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, విమలక్క, గద్దర్ హాజరుకానున్నారు. 

 

ప్రొకబడ్డీలో నేటి మ్యాచ్ లు

ఢిల్లీ : ప్రొకబడ్డీలో భాగంగా నేటి రాత్రి 8 గంటలకు బెంగళూరుతో పుణె తలపడనుంది. 9 గంటలకు హర్యానా, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది. 

అనంతనాగ్ జిల్లాలో నేడు రాజ్ నాథ్ సింగ్ పర్యటన

జమ్మూ : అనంతనాగ్ జిల్లాలో నేడు రాజ్ నాథ్ సింగ్ పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

అమెరికా వైపు ముంచుకొస్తోన్న ఇర్మా తుఫాన్

అమెరికా : ఇర్మా తుఫాన్ అమెరికా వైపు ముంచుకొస్తోంది. కొద్ది గంటల్లో ఫ్లోరిడా వైపు దూసుకురానుంది. ఇర్మా వల్ల గంటకు 260కిమీ వేగతంతో గాలులు వీస్తున్నాయి.
 

09:36 - September 10, 2017

విశాఖ : అనాథ ఆశ్రమాల నిధుల కోసం కాసా అనే స్వచ్ఛంద సంస్థ... జాతీయ అంతర్జాతీయ మోడల్స్‌తో విశాఖపట్నంలో ఫ్యాషన్‌ షో నిర్వహించింది. మొత్తం 8 సీక్వెన్స్‌లో 8 మంది జాతీయ స్థాయి మోడల్స్‌ ఈ షోలో పాల్గొన్నారు. షో స్టాపర్‌గా అంతర్జాతీయ మోడల్‌ షారోన్‌ పెర్నాండెజ్ నిలిచారు. ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ తోషిరైనా తన పాటలతో ప్రేక్షకులను అలరించారు. మిస్‌ ఇండియా రన్నర్ నటాషా ఈ షోలో యాంకరింగ్‌ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షో ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనాథ పిల్లల అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

 

09:31 - September 10, 2017

విశాఖ : అంతర్జాతీయ ఆవిష్కరణల ప్రదర్శనకు విశాఖపట్నం వేదికైంది. నగరంలో ఇంటర్నేషనల్‌ ఇన్నోవేషన్ ఫెయిర్‌ ఘనంగా ప్రారంభమైంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు... తమ నూతన ఆవిష్కరణలను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. 

విశాఖపట్నంలో మూడు రోజుల పాటు జరగనున్న... అంతర్జాతీయ ఆవిష్కరణ ప్రదర్శన శనివారం ప్రారంభమైంది. ఐఎఫ్ ఐఏ అధ్యక్షుడు అలిరేజా రస్టెగర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 150 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వారు రూపొందించిన కొత్త పరికరాలను... కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగకరంగా ఉండే ఆవిష్కరణలను ప్రదర్శించి... వాటి గురించి వివరించారు. 

ఈ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు... అందరినీ అబ్బురపరిచాయి. ప్రధానంగా  తక్కువ ఖర్చుతో లిఫ్ట్‌ను అమర్చగలిగే కొత్త విధానం... రెండు గంటల్లో రెండు ఎకరాలకు నాట్లు పెట్టే వ్యవసాయ మిషన్‌ ప్రదర్శనలో హైలెట్‌గా నిలిచాయి. 

అలాగే మట్టి లేకుండా వాటర్‌ ద్వారానే మొక్కలు పెంచే విధానం అందరినీ ఆకర్షించింది. కొత్త టెక్నాలజీతో... తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగకరంగా ఉండే.. నూతన పరికరాలను ఆకట్టుకున్నాయి. నగరవాసులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ప్రదర్శనను తిలకించారు. ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని... విద్యార్థులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

ఈ ప్రదర్శనలో 30 మంది వివిధ దేశాల ప్రతినిధులు, 50 దేశీయ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆదివారం మంత్రి నారా లోకేశ్‌  హాజరుకానున్నారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరై ప్రదర్శననుద్దేశించి ప్రసంగించనున్నారు. 

08:36 - September 10, 2017

ఆదిలాబాద్ : ప్ర్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులపై ఒత్తిడి రోజు రోజుకీ పెరిగిపోతుంది. ట్యూషన్‌లు, అదనపు క్లాసులు అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు తల్లిదండ్రులు. అంతేకాదు మెదడు చురుగ్గా పని చేస్తుందంటూ వివిధ రకాల లేహ్యాలను పిల్లలతో తినిపిస్తున్నారు. అయితే అవి ఎంత వరకు సురక్షితమో కూడా ఆలోచించడం లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.  
పిల్లల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న తల్లిదండ్రులు  
ఇరుగుపొరుగు వారి పిల్లలు బాగా చదువుతున్నారు నువ్వెందుకు చదవడంలేదు? పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకొని మా పరువు నిలబెట్టు.. లేకపోతే బంధువుల్లో మేం తలెత్తుకొని తిరగలేం... ఇలా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. మార్కుల కోసం, ర్యాంకుల కోసం పిల్లలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే చదువులో పిల్లలు పరుగులు తీయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. కనీసం పిల్లలకు ఆడుకునే సమయం కూడా ఇవ్వడంలేదు. 
మూఢనమ్మకాలను వదలని తల్లిదండ్రులు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే పిల్లలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో తల్లిదండ్రులు మూఢ నమ్మకాలనూ వదలడం లేదు. కొందరు పూజలు, హోమాలు నిర్వహిస్తుంటే.... మరికొందరు సరస్వతీ లేహ్యం, సరస్వతి ఆకు తినడం వల్ల చదువు బాగా వస్తుందని నమ్ముతున్నారు. పిల్లలు చదువులో రాణించాలని బాసర గుడిలో అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ఇక తల్లిదండ్రుల నమ్మకాన్ని క్యాష్‌ చేసుకునేందుకు.. బాసరలో వ్యాపారులు మోసపూరిత వ్యాపారానికి తెరతీస్తున్నారు. నకిలీ సరస్వతీ లేహ్యం, బుద్ధి పెరుగుదల కోసం చూర్ణం, సరస్వతీ బీజాక్షర ఆకు అంటూ దేవుడి పేరుమీద వ్యాపారం చేస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ సంస్థల నుండి గుర్తింపు పొందని లేహ్యాలను, ఇతర రకాల మందులను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. 
ఇష్టారీతిగా లేహ్యాలు అమ్మకాలు
అసలు ఈ లేహ్యలు ఎవరు తయారు చేస్తారో, మార్కెట్‌లోకి ఎలా వస్తాయో కూడా తెలియని షాపుల యజమానులు వీటిని ఇష్టారీతిగా అమ్మేస్తున్నారు. వీటిని గురించి ఏ మాత్రం ఆరా తీయకుండానే తల్లిదండ్రులు కొనేస్తున్నారు. అది ఎంత వరకు మంచిదనే విషయం కూడా పట్టించుకోవడం లేదు. 
మందుల పట్ల జాగ్రత్తగా ఉండాలి : డాక్టర్లు 
ఇలాంటి మందుల పట్ల జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. పిల్లల మెదడు చురుగ్గా పని చేయడానికి ఎన్నో పద్దతులున్నాయని ఇలాంటి మందులతో పిల్లల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉందంటున్నారు. 
నకిలీ వ్యాపారులను పట్టించుకోని అధికారులు
మరోవైపు ఇలాంటి నకిలీ వ్యాపారాల పట్ల ఆలయ అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నకిలీ మందులను అంటగడుతూ పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

08:21 - September 10, 2017

గుంటూరు : ఇంటింటికి టిడిపి కార్యక్రమానికి సమాయత్తమవుతోంది తెలుగుదేశం పార్టీ.. పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా పార్టీ అధినేత చంద్రబాబు శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ఈరోజు జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నేతలకు దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు. 
టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
అటు నంద్యాల ఉప ఎన్నిక.. ఇటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల విజయంతో  పచ్చ పార్టీలో ఉత్సాహం ఊపందుకుంది. ఇదే సమయంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. అందులో భాగంగా సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో తెలుగుదేశంపార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. పార్టీకి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు.. పలు అంశాల్లో నేతలకు దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు. 
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
ఈనెల 11 నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించాలని చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంటి నుంచి పార్టీ సభ్యత్వం ఉండాలని... ప్రతి ఇంటిపై తెలుగు దేశం జెండా ఎగరాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయో .. లేదో విచారించడంతోపాటు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా.. మూడేళ్లలో అమలు చేసిన పథకాలను ప్రజలకు  గుర్తు చేయాలని చంద్రబాబు సూచించారు. మితి మీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదని.. పార్టీపై వ్యతిరేకత ఉన్నవారి మనసులు కూడా గెలుచుకోవాలని శ్రేణులకు సూచించారు. పార్లమెంటు ఇంచార్జ్‌లుగా వ్యవహరిస్తున్న మంత్రులు మరింత దూకుడుగా పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. 
మంత్రులకు చంద్రబాబు కితాబు
మరోవైపు నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో మంచి ప్రతిభ కనబర్చారంటూ మంత్రులు, అధికారులకు కితాబిచ్చారు చంద్రబాబు. ఎమ్మెల్యే పదవికి ఆశపడి ఎమ్మెల్సీ పదవితో పాటు వచ్చే చైర్మన్ పదవిని కోల్పోయారంటూ శిల్పా బ్రదర్స్‌ని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు మరోవైపు ముద్రగడ పద్మనాభం ద్వారా కాపులను దూరం చేయాలని ప్రతిపక్షం ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు తిప్పి కొట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
త్వరలో టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీలు
ఇక త్వరలోనే జాతీయ, రాష్ట్ర పార్టీ కమిటీలు వేయనున్నట్టు పార్టీ నేతలకు చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక యాప్‌లో సభ్యత్వ నమోదు వివరాలు నమోదుచేయాలని ఆదేశించారు. గ్రామ కమిటీలు, మండల, నియోజకవర్గ,జిల్లా కమిటీల సమావేశాలు అర్థవంతంగా నిర్వహించాలని నేతలకు సూచించారు. అవసరమైన చోట అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మారుస్తానని చంద్రబాబు సంకేతాలిచ్చారు. 

 

08:16 - September 10, 2017

అమెరికా : ఇర్మా తుఫాన్‌ అమెరికా ఖండాన్ని వణికిస్తోంది. ప్రచండమైన గాలులు, కుండపోత వర్షాలతో దడ పుట్టిస్తోంది. కరీబియన్‌ దీవుల్లో బీభత్సం సృష్టించిన హరికేన్‌ ఇర్మా అమెరికాలో పెను విధ్వంసం సృష్టించేందుకు తీరం వైపునకు వేగంగా దూసుకొస్తుంది. ఈ ఉదయం ఫ్లోరిడా రాష్ట్ర తీరాన్ని తాకనున్న హరికేన్‌ అమెరికాలో కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించవచ్చని ఆ దేశ జాతీయ హరికేన్‌ కేంద్రం హెచ్చరించింది. ఫ్లోరిడా కీస్‌ వద్ద అమెరికా తీరాన్ని తాకి, అనంతరం ప్రధాన భూభూగమైన మయామి-డేడ్‌ కౌంటీపై విరుచుకుపడనుంది. ఆ సమయంలో గంటకు 205 కి.మీ వేగంతో పెనుగాలులతో పాటు కుండపోత వర్షం ముంచెత్తవచ్చని అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.  ముందు జాగ్రత్త చర్యగా లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 
ఫ్లోరిడాలో మొదలైన ఇర్మా ప్రభావం 
ఫ్లోరిడాలోని పలు ప్రాంతాల్లో ఇర్మా ప్రభావం మొదలైంది. పలుచోట్ల కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 63 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఫ్లోరిడా రాష్ట్ర అధికారులు విజ్ఞప్తి చేశారు. వేలాది మంది భారతీయులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. జార్జియా రాష్ట్రంలోని అతిపెద్ద నగరం అట్లాంటా హోటళ్లన్నీ ఫ్లోరిడా ప్రజలతో నిండిపోయాయి.  జార్జియా తీర ప్రాంతాల నుంచి 5.4 లక్షల మంది సహాయక శిబిరాలకు వెళ్లాలని ఆ రాష్ట్ర అధికారులు కోరారు. ఫ్లోరిడా, జార్జియాతో పాటు, ఉత్తర కరొలినా, దక్షిణ కరొలినా, అలబామా రాష్ట్రాల్లో కూడా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అత్యవసర సహాయం కోసం హోం ల్యాండ్, ఎమర్జెన్సీ, ఇతర విభాగాలకు చెందిన వేలాది మందితో పాటు ఆర్మీ సిబ్బందిని ఫ్లోరిడా తీర ప్రాంతాల్లో మోహరించారు.  
వణికిపోతున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు 
ఇర్మా తుపాన్‌ ప్రకోపానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కొన్ని రోజులుగా విధ్వంసం సృష్టిస్తున్న తుపాన్‌..అమెరికన్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. హరికేన్‌ ఇర్మా ఇంకా అత్యంత ప్రమాదకరంగానే ఉందని...ఈ ఉదయం తీరాన్ని తాకే సమయంలో గరిష్టంగా 205 కి.మీ. వేగంతో గాలులు వీయనున్నాయి. నైరుతి ఫ్లోరిడా, టాంపాను మధ్యాహ్నం తాకవచ్చని హరికేన్‌ కేంద్రం తెలిపింది. రోజంతా మొత్తం ఫ్లోరిడా తీర ప్రాంతం మీదుగానే హరికేన్‌ ముందుకు కదులుతుందని, ఈ సమయంలో భారీ నష్టం జరగవచ్చని హెచ్చరించింది. శనివారం మధ్యాహ్నానికి హరికేన్‌ కేంద్రం మయామికి 395 కి.మీ దూరంలో ఉండగా.. తీరంవైపునకు వేగంగా దూసుకెళ్తోంది. ఫ్లోరిడా కీస్‌లోని పల్లపు ప్రాంతాల్లో పెనుగాలులతో పాటు భారీ ఎత్తున అలలు ఎగసిపడవచ్చని హెచ్చరికలు జారీచేశారు. గత 82 ఏళ్లలో అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఏర్పడ్డ అతి తీవ్రమైన ఐదు హరికేన్లలో ఇర్మా ఒకటి.  

 

ఢిల్లీలో ఇన్వెస్టు ఇండియా కార్యక్రమం

ఢిల్లీ : విజ్ఞాన్ భవన్ లో ఇన్వెస్టు ఇండియా కార్యక్రమం జరుగనుంది. మేకిన్ ఇండియాలో భగంగా కార్యక్రమం నిర్వహించనున్నారు. దేశంలో పరిశ్రమల స్థాపనకు రాయితీలు, మౌలిక వసతులపై దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు మంత్రులు వివరించనున్నారు. తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ పాల్గొనున్నారు. టీఎస్ ఐపాస్, టీహబ్ లపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 

నేడు లండన్ వెళ్లనున్న జగన్

హైదరాబాద్ : వైసీసీ అధినేత జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నేడు లండన్ వెళ్లనున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో తన కుమార్తె హర్షను చేర్పించేందుకు వెళ్తున్నారు. 19న తిరిగి జగన్ హైదరాబాద్ రానున్నారు.

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ లో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది లొంగిపోయాడు. 

 

నేడు ప్రొ.కోదండరాం అమరవీరుల స్ఫూర్తి యాత్ర

ఆదిలాబాద్  : నేడు జిల్లాలో ప్రొ.కోదండరాం అమరవీరుల స్ఫూర్తి యాత్ర జరుగనుంది. నేరడుగొండ నుంచి ఆదిలాబాద్ వరకు యాత్ర కొనసాగనుంది. 

 

నేడు ప్రొ.కోదండరాం అమరవీరుల స్ఫూర్తి యాత్ర

ఆదిలాబాద్  : నేడు జిల్లాలో ప్రొ.కోదండరాం అమరవీరుల స్ఫూర్తి యాత్ర జరుగనుంది. నేరడుగొండ నుంచి ఆదిలాబాద్ వరకు యాత్ర కొనసాగనుంది. 

 

Don't Miss