Activities calendar

11 September 2017

21:34 - September 11, 2017

సంగారెడ్డి : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు చిన్నారుల పాలిట విలన్లుగా మారుతున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం- భారతినగర్‌లోని రావూస్‌ స్కూల్‌లో చిన్న తప్పుకు విద్యార్థినికి దారుణమైన పనిష్‌మెంట్ ఇచ్చారు. శనివారం యూనిఫాం వేసుకొని రాలేదంటూ పదకొండేళ్ల బాలికను అబ్బాయిల టాయ్‌లెట్‌ముందు నిలబెట్టారు.. గంటసేపు అక్కడే ఉన్న బాలిక... తీవ్ర మనో వేదనకు గురైంది. సాయంత్రం ఇంటికి వచ్చాక తాను ఇకనుంచి ఆ స్కూల్‌కు వెళ్లనంటూ తల్లిదండ్రులకు విషయం చెప్పింది.. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు సోమవారం స్కూల్‌ యాజమాన్యాన్ని ఈ విషయంపై ప్రశ్నించారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో స్కూల్‌ముందు ఆందోళనకు దిగారు.

మంత్రి కేటీఆర్‌ కూడా సీరియస్‌
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు ధర్నా చేపట్టాయి... పాఠశాలకు వచ్చిన బాలల హక్కుల సంఘం సభ్యులు... స్కూల్‌ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ కూడా సీరియస్‌ అయ్యారు.. బాలికను అబ్బాయిల టాయిలెట్‌లో నిలబెట్టడం అమానవీయమని ట్వీట్‌ చేశారు. స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ట్విట్టర్‌లో కోరారు. కేటీఆర్‌ ట్వీట్‌తో మంత్రి క‌డియం శ్రీహ‌రి స్పందించారు. రావూస్ పాఠ‌శాల ఘ‌ట‌న‌పై నివేదిక ఇవ్వాల‌ని డీఈవోను ఆదేశించారు.. మంత్రి ఆదేశాలతో డీఈవోలు సత్యనారాయణ రెడ్డి, విజయకుమారి స్కూల్‌కు వెళ్లారు. బాలికను టాయ్‌లెట్‌ముందు నిలబెట్టింది వాస్తవమేనని ధృవీకరించారు.. ఈ విషయంపై యాజమాన్యంతో చర్చించారు. ఈ ఘటనపై అధికారుల ఆగ్రహంతో ... స్కూల్‌ యాజమాన్యం దిగివచ్చింది... బాలికకు పనిష్‌మెంట్‌ ఇచ్చిన పీఈటీని సస్పెండ్‌ చేసింది... పనిష్‌మెంట్‌ విషయం, స్కూల్‌ యాజమాన్యం తీసుకున్న చర్యలను వివరిస్తూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

 

21:32 - September 11, 2017

హైదరాబాద్ : టీ-మాస్‌ ఫోరం ప్రొఫెసర్‌ కంచె ఐలయ్యకు బాసటగా నిలిచింది. కంచె ఐలయ్య వైశ్యులపై పుస్తకం రాస్తే.. ఆయనపై దాడులు చేస్తామనడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఐలయ్యపై దాడులు చేస్తామన్న వైశ్యుల వ్యాఖ్యలను టీమాస్‌ ఫోరం ఖండిస్తూ తీర్మానం చేసింది. తాను ఎవరి మనోభావాలనూ కించపరచలేదని ప్రొఫెసర్‌ ఐలయ్య అన్నారు.

21:31 - September 11, 2017

హైదరాబాద్ : సామాజిక న్యాయం-సమగ్రాభివృద్ధి కోసమే టీ-మాస్‌ ఫోరం పోరాడుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన టీమాస్‌ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశించారని.. అయితే చాలా నోటిఫికేషన్లను కోర్టులు కొట్టేస్తున్నాయన్నారు. కోర్టులు కొట్టేసే విధంగానే జీవోలు తయారు చేస్తున్నారని తమ్మినేని విమర్శించారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి పథకాలు ఎక్కడా అమలు కావడం లేదని తమ్మినేని అన్నారు. 

21:30 - September 11, 2017

ఢిల్లీ : డీఎస్సీపై వరుస ప్రకటనలు ఇస్తూ వాయిదాలు వేస్తున్న తెలంగాణ సర్కార్‌పై సుప్రీం కోర్టు సీరియస్‌ అయింది. సెప్టెంబర్‌లో డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి మళ్లీ గడువు అడగడంపై సుప్రీం మండిపడింది. విద్యాశాఖ కార్యదర్శి వెంటనే సుప్రీం కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 28కి వాయిదా వేసింది. ఇటీవలే 8 వేల 792 ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అయితే నోటిఫికేషన్‌ ఇవ్వడానికి ప్రభుత్వం వాయిదాలు వేస్తూవస్తోంది. ఏ పోస్టుకైనా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం జీవో విడుదల చేయాలి. కాని ఇప్పటి వరకు డీఎస్సీకి సంబంధించి ఎలాంటి జీవో విడుదల చేయలేదు. ప్రభుత్వం కావాలనే డీఎస్సీపై జాప్యం చేస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టెట్‌ ఫలితాలు వచ్చిన రోజునే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని డిప్యూటి సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. కాని ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు వల్లే
కొత్త జిల్లాల ఏర్పాటు వల్లే నియామక ప్రక్రియ ఆలస్యమైందని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. కాని ప్రస్తుతం పాత జిల్లాల ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఒకసారి పాత జిల్లాలని, మరోసారి కొత్త జిల్లాలని చెప్పడంతో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవోలో తప్పని సరిగా పోస్టులు ఏ ప్రకారం భర్తీ చేస్తారనే అంశం ఉంటుంది. ఈ విషయం బయటికి వస్తే నిరుద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని ప్రభుత్వం డీఎస్సీ పై అలసత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో దాదాపు 20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు నిరుద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయితే కేవలం 8 వేల 792 పోస్టులకు మాత్రమే ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంపై నిరుద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేక విద్యార్థుల నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో 12వేల మంది విద్యావాలంటీర్లు ఉన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి తరగతికి ఒక్కో టీచర్‌ ఉండాలన్న నిబంధన పాటించినట్లయితే దాదాపు 40వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. కాని ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వలేదు.

సుప్రీంకోర్టు ఆగ్రహం
ఐదు సంవత్సరాలుగా ఊరిస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌పై తెలంగాణ సర్కార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుప్రీంకోర్టు ఆగ్రహంతోనైనా తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. 

21:28 - September 11, 2017

హైదరాబాద్ : కేసీఆర్‌ప్రగతి భవన్‌లో మిషన్ భగీరథపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.. ఈ పథకం అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నదీ జలాల వినియోగంలో మంచినీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో కనీస నీటి మట్టాలను పాటించాలన్నారు. ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరాకోసం నదీజలాల్ని ఏడాది పొడవునా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.మిషన్ భగీరథ కోసం 30 పాయింట్లను రిసోర్సులుగా పెట్టుకున్నామని సీఎం అధికారులకు గుర్తుచేశారు.

ఆపరేషనల్ రూల్స్...
ఏ రిసోర్స్ దగ్గర ఏడాదికి ఎన్ని నీళ్లు అవసరమో అంచనా వేయాలని సూచించారు. ఆ అంచనాకు 25 శాతం అదనంగా నీరు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఇందుకు అనుగుణంగా ప్రాజెక్టుల వారీగా ఆపరేషనల్ రూల్స్ రూపొందించాలని ఆదేశించారు. నీటిపారుదల, మిషన్ భగీరథ అధికారులు సంయుక్త సమావేశం నిర్వహించుకుంటూ పనులు పూర్తిచేయాలన్నారు.ప్రాజెక్టుల నీటిని మంచినీటిగా వాడుకోవడం తెలంగాణలో ఒక హక్కు అని సీఎం స్పష్టం చేశారు. కాళేశ్వరంతో పాటు కొత్త ప్రాజెక్టులు పూర్తయితే చాలా నీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కొత్త ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు ప్రస్తుత సోర్సులను మిషన్‌ భగీరథకు వాడాలని సీఎం చెప్పారు. వాటి నుంచే నీటి సరఫరా జరగాలన్న సీఎం.. ఇందుకోసం మొదటిదశ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయ్యాక శాశ్వత ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది చివరికే నదీ జలాలను గ్రామాలకు అందించాలని సీఎం చెప్పారు. నీటిపారుదల శాఖతో సమన్వయం కోసం మిషన్ భగీరథ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని కేసీఆర్ ఆదేశించారు.మూడో విడత హరితహారంపై సీఎంవో అధికారులతో కేసీఆర్‌ సమీక్షించారు.. ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే వికారాబాద్‌ ప్రాంతాన్ని మరో ఊటిగా తీర్చిదిద్దే అవకాశాలున్నాని చెప్పారు.. మూడో విడత హరితహారంలో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.. ఇప్పటివరకూ 29 కోట్ల మొక్కలు నాటామని... మరో పది కోట్ల మొక్కల్ని ఈ నెలాఖరులోగా నాటాలని సూచించారు.

సంచార పశు వైద్య శాలలు
రాష్ట్రవ్యాప్తంగా సంచార పశు వైద్య శాలలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.. పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చిన గొర్రెలు, ఇతర పశువులకు వైద్యం అందించడానికి ఈ వైద్య శాలలు ఉపయోగించాలన్నారు.. అలాగే బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని పేద మహిళలకు చీరలు పంపిణీ చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు.. ఇప్పటికే సగానికి పైగా చీరలు జిల్లా కేంద్రాలకు చేరాయని స్పష్టం చేశారు. ఈ చీరల్ని గ్రామాలకు చేర్చాలని... ఈ నెల 18నుంచి మూడు రోజులపాటు వీటిని పంపిణీ చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.

21:26 - September 11, 2017

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తెట్టంగిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి...ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలుతీరుపై వాకబు చేశారు. పలువురు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో రాజకీయాలకు చోటులేదని సీఎం చంద్రబాబు అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాల్సిందేనని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలకు కొంతమంది అడ్డుపడుతున్నారని.. అలాంటి వారిని అడ్రస్‌ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడకూడదన్నదే తమ అభిమతమన్నారు.

175 అసెంబ్లీ సీట్లు టీడీపీ లక్ష్యం
2019లో 175 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడమే టీడీపీ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాల్సి వుంటుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు, కార్యకర్తలు ముందడుగు వేయాలని కోరారు. ఎటువంటి సమస్య ఉన్నా, తనతో చెప్పుకోవచ్చని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తాను కృతనిశ్చయంతో ఉన్నానని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని చెప్పారు. 2014 ఎన్నికల్లో 1.5 శాతం ఓట్లను అధికంగా తెచ్చుకుని టీడీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో 16 శాతం ఓట్లను తెచ్చుకున్నామని, కాకినాడలోనూ ఘన విజయం సాధించామని అన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో డ్వాక్రా సంఘాలు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 25 కుటుంబాలకు ఒక మెంబర్‌ను నియమిస్తామని చెప్పారు. వారే ఆ 25 కుటుంబాల బాగోగులు చూసుకోవాలన్నారు. గ్రామకమిటీ, బూత్‌ కమిటీలను త్వరలోనే నియమిస్తామని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. 

20:12 - September 11, 2017

తెలంగాణ రైతన్నలు జర్ర మీరు పైలమే..? మీకు సర్కారు గాలం గట్టిగనే ఏస్తున్నది.. పుసుక్కున ఆ ఎర్రను జూశి నోరు తెరిస్తిరాంటే.. వాళ్ల వలల వడ్డట్టే సుమా..? ఇప్పుడు అర్థంగాకున్నా.. ఇంకో నాల్గొద్దులకన్న మల్లన్న గాయాళ జెప్పిండు ఇనకపోతిమి అని బాధపడొద్దంటే.. ముందుగాళ్లనే మేల్కోండ్రి.. ప్రశ్నించకపోతె భవిష్యత్ ప్రశ్నార్థకమైతదే..?

సామాజిక స్మగ్లర్లు.. కోమటోళ్లు.. కోమటోళ్లు ఎన్కటి సంది జేశ్న ఉద్దార్కాలన్ని ఒక్కతానేశి బుక్కురాశిండట కంచె ఐలయ్య సారూ..? అగో మేము స్మగ్లర్లమా..? అని కోమటోళ్లు కయ్యానికి దిగిండ్రు.. దిష్టిబొమ్మలు..? ర్యాలీలు.. రాస్తారొకోలు..? ఆందోళనలు.. ఒక్కటిగాదు..? ఎక్కడ్నో పారేశినట్టు ఆడొకలు ఆడొకలుండే.. కోమటోళ్లందర్ని ఒక్కతాన గల్పిన ఆ గ్రంథం..? దానికి దొర్కిన ప్రచారం.. సూడుండ్రి..

తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సారు మళ్ల స్పూర్తి యాత్రని తిర్గుతున్నట్టుండుగదా... మొన్ననే గాతీర్గ పరేషాన్ జేశిరి..? అరెస్టులు జేశిరి అడ్డం బడిరి..? మళ్లెందుకు వోయిండో..? వచ్చిన పించిని పైసలతోని తిని నిమ్మలంగ ఉండక..? జయశంకర్ సారు కోరుకున్న తెలంగాణ తెచ్చెదాక ఇడ్సిపెట్టాంటే.. ఏమన్నట్టు.. ఇట్లనే జేస్తె మన సర్కారు ఇడ్సిపెడ్తదా..? అరెస్టులు జేశి ఆగం జేయది..? ఏమో సారూ..?

ఓ అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరయ్యా..? ఏడున్నవో నీకో సవాలొచ్చింది.. మీరు ఏలిన ఈ మూడున్నరేండ్ల పరిపాలన ఓదిక్కు.. నేను ఎమ్మెల్యేగ పనిజేశ్న ఐదేండ్ల పనితీరు ఓదిక్కు.. నా భూములు.. నీ భూములు.. నా ఆస్తులు నీ ఆస్తులు.. అన్ని దీస్కొచ్చి యాదగిరి గుట్ట లచ్చిమి నర్సింహస్వామి మెట్ల కాడ వెడ్దాం.. ఇద్దరం గల్సి సీబీఐ ఎంకువైరీ జేపిచ్చుకుందాం నువ్వు తయ్యారేనా అంటున్నడు నల్లగొండ డీసీసీ ప్రెసిడెంట్.. బూడిద భిక్షమయ్య గౌడు..

ఈ మూడేండ్ల కాలంల త్వరలో డీఎస్సీ అని అత్యధిక సార్లు ప్రకటించిన రాష్ట్రం ఏది..? ఏ రాజస్తాన్.. బీ మహారాష్ట్ర , సీ తెలంగాణ, డీ ఢిల్లీ..? సోషల్ మీడియాల ఇంత కామెడీ జేస్తున్నరు నిరుద్యోగులు మన బంగారు తెలంగాణ సర్కారు మీద.. కడియం శ్రీహరి సారు త్వరలో డీఎస్సీ అనెంగనే నవ్వుకుంటున్నరు నిరుద్యోగులు.. అంత కామెడీ అయిపోయింది తెలంగాణల డీఎస్సీ అంటే..?

న్యాయం జేయవల్సిన న్యాయమూర్తే దొంగతనం జేశిండంటే ఎవ్వలన్న నమ్ముతరా..? కండ్లార జూస్తె గూడ ఎవ్వలు నమ్మరు.. కని ఒకతాన జేశిండు.. మరి ఆయన న్యాయమూర్తి హోదాను ఎట్ల సంపాయించిండు..? ఏం దొంగతనం జేశిండు..? అస్సలు ఎవ్వడు వాడు అనేది మొత్తం బట్కొచ్చిన.. విత్ దొంగతనం వీడ్యోగూడ సూస్తరా..? తల్గనీ..

వీడు మన్షా దున్నపోతా..? జర్ర ఇది జూశ్నంక మీరే జెప్పాలుల్లా..? అగో దున్నపోతంటే..? మేము అంత అల్కగ గనిపిస్తున్నమా..? అడ్డమైనోళ్లందర్ని దెచ్చి మా జాతిల గల్పుతున్నవని దున్నపోతులు కోపానికి రాగాళ్ల.. ఎందుకంటె వీడు జేశ్న పని దున్నపోతులు గూడ జేయయ్.. అంత లత్కోర్ పనిజేశిండు..? చెప్తె శిగ్గువోతది.. సూడుండ్రి మీరే..

19:34 - September 11, 2017

కొత్త రాష్ట్రం ఏర్పాటు జరిగిందని, విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికపై భర్తీ చేస్తామని అందుకే కొంత సమయం పట్టిందని, ఎన్సీటీ గైడ్ లైన్స్ ప్రకారం టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని, కొంత మంది అభ్యర్థులు టెట్ కోసం అభ్యర్థన చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ పోతూరి సుధాకర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అధికారంలో వచ్చన తర్వాత ముఖ్యమంత్రి 27వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారని, ఇదిగో డీఎస్సీ అదిగో డీఎస్సీ ప్రకటనలు చేస్తోందని, తెలంగాణ వచ్చిందే ఉపాధ్యాయులు, విద్యార్థులతో అని, వీరికి పోలీసులపై ఉన్న ప్రేమ బీఈడీ అభ్యర్థులపై లేదని నిరుద్యోగ సంఘల నేత మానవతరాయ్ అన్నారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఉపాధ్యాయుల అవసరం ఉందని. ప్రభుత్వం డీఎస్సీ వేయడంలో తప్పించుకుంటుందని, 20వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీలు ఉన్నాయని టీఎస్ యూటీఎఫ్ కార్యదర్శి చామ రవి అన్నారు. సుధాకర్ గారు చెప్పిదాంట్లో వాస్తవం లేదని, గత మూడున్నర సంవత్సరాలుగా అభ్యర్థులు చూసి చూసి కళ్లు కాయలు కాసాయని తెలంగాన బీఈడీ, డీఎస్సీ సంఘం అధ్యక్షుడు మధుసుధన్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:15 - September 11, 2017

టెక్సాస్ : టెక్సాస్‌లో కాల్పులు మరోసారి కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో మొత్తం 8 మంది మృతి చెందారు. డల్లాస్‌కు 20 మైళ్ల దూరంలోని ప్లానోలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సాయుధుడైన దుండగుడు ఓ ఇంట్లో ఏడుగురిని కాల్చి చంపాడు. కాల్పుల సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై కూడా ఆ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే హతమయ్యాడు. కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.

19:15 - September 11, 2017

ఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. కార్తీకి లుక్‌అవుట్‌ నోటీసు కొనసాగించాలా...వద్దా అన్నది సెప్టెంబర్‌ 18కి కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు లుక్‌అవుట్‌ నోటీసు అమలులో ఉంటుంది. కార్తీపై కీలక విచారణ జరుగుతోందని...విదేశాల్లో 25 చోట్ల ఆస్తులున్నాయని సిబిఐ కోర్టుకు తెలిపింది. సిబిఐ ఆరోపణలు నిరాధారమైనవని, విచారణ పేరిట కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తోందని కార్తీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కార్తీ కుటుంబానికి చెందిన ఆస్తుల వివరాలు ఐటి వద్ద ఉన్నాయని... విదేశాల్లో ఆస్తులుంటే కేంద్రం జప్తు చేసుకోవచ్చని సూచించారు. లుక్‌అవుట్‌ నోటీసుకు వీటికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో అక్రమాలకు సంబంధించి కార్తీ విదేశాలకు వెళ్లకుండా సిబిఐ లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

19:10 - September 11, 2017

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌ ఆస్తులను టేకోవర్‌ పై హైకోర్టు ఇవాళ విచారణ జరిగింది. ఈ సంస్థను టేకోవర్‌ చేసేందుకు ఎస్సెల్ గ్రూప్‌ ముందుకొచ్చింది. కోర్టు అనుమతిస్తే నాలుగు నెలల్లో అగ్రిగోల్డ్‌ సంస్థను స్వాధీనం చేసుకుంటామని తెలిపింది. అయితే ఆస్తుల కొనుగోలుకు ఎంత మొత్తం డిపాజిట్‌ చేస్తారని కోర్టు ఎస్సెల్ సంస్థను ప్రశ్నించింది.. ఆస్తుల విలువ తెలియకుండా ఎంత డిపాజిట్‌ చేస్తామో చెప్పలేమని లాయర్‌ సమాధానమిచ్చారు. మరోవైపు 5, 10 వేల రూపాయలు డిపాజిట్‌ చేసినవారి వివరాలు తమ ముందుంచాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణ గురువారానికి వాయిదాపడింది.

19:09 - September 11, 2017

సిరిసిల్ల : ఇల్లంతకుంటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడు కిందకు దూకుతానంటూ హల్‌చల్‌ చేశాడు. గాలిపల్లి గ్రామానికి చెందిన దళిత కళాకారుడు రవి ప్రభుత్వ తీరుకు ఇలా నిరసనకు దిగాడు. బతుకుదెరువు కోసం ఉద్యోగం లేదా, కొంత భూమి అయినా ఇవ్వాలని ప్రభుత్వానికి పలుమార్లు అర్జీలు పెట్టుకున్నాడు. కాని.. అధికారులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్‌టవర్‌ ఎక్కాడు. యువకుణ్ని కిందకు దించేందుకు పోలీసులు, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. 

19:08 - September 11, 2017

సంగారెడ్డి : రావూస్‌ స్కూల్‌ ఘటనలో ప్రిన్సిపల్, పీఈటీపై ఆర్సీపురం పీఎస్‌లో కేసు నమోదైంది. ఐపీసీ 342, 324, 506, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉదయం రావూస్ స్కూల్ సిబ్బంది యూనిఫామ్ వేసుకురాలేదని విద్యార్థినిని.. టాయ్‌లెట్‌ వద్ద నిల్చోబెట్టారు. ఆ తరువాత నుంచి స్కూల్‌కు వెళ్లేందుకు చిన్నారి భయపడుతోంది. ఇంట్లోనే ఒంటరిగా ఉంటోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. 

19:06 - September 11, 2017

వరంగల్ : జిల్లా హన్మకొండలో దారుణం జరిగింది.. పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసుముందు సంచిలో పసికందు శవం కలకలం సృష్టించింది.. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పసికందును చంపి సంచిలో పెట్టారని అనుమానిస్తున్నారు.. నిందితులకోసం గాలిస్తున్నారు.

19:05 - September 11, 2017

కరీంనగర్ : రైతు సమన్వయ కమిటీల పేరుతో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ కమిటీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హుజురాబాద్‌ ఆర్‌డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. వెంటనే జీవో 39 ని రద్దు చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. రైతుల మద్య విభేదాలే వచ్చే విధంగా గ్రామాల్లో కలుషిత వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారని పొన్నం మండి పడ్డారు.

19:04 - September 11, 2017

నల్లగొండ : రాజకీయ దురుద్దేశంతోనే టీఆర్‌ఎస్‌ రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సమన్వయ కమిటీల్లో అన్ని పార్టీల రైతులు ఉండేలా చూడాలని ఆయన డిమాండ్‌ చేశారు. పంటవేసిన ప్రతి రైతుకు ఎకరానికి 4 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జీవో 39ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ ఆందోళన నిర్వహించింది. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు.

 

19:03 - September 11, 2017

హైదరాబాద్ : సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విలీనదినోత్సంగా జరపాలని కేసీఆర్‌ సర్కార్‌ను సీపీఐ డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న ముగ్దూమ్‌ మోయినుద్దీన్‌ విగ్రహం నుంచి తెలంగాణ పోరాట స్ఫూర్తియాత్రను సీపీఐ నేతలు ప్రారంభించారు. భూమికోసం, భుక్తికోసం నైజాం సర్కార్‌పై సాయుధపోరాటం చేసిన ఘనత కమ్యూనిస్టులదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ తెలంగాణ విమోచన అంటూ బీజేపీ కొత్తగా ప్రచారం చేస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. 

19:02 - September 11, 2017

ప్రకాశం : జిల్లా కనిగిరి మండలం దేవాంగనగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. కనిగిరి నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ఆటోని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏసుదాస్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మిగిలిన క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.

19:01 - September 11, 2017

సిద్దిపేట : అప్పులబాధ తాళలేక సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు.. ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడు. చెప్పాల్‌ గ్రామానికి చెందిన అక్కరాజు నర్సయ్య అనే రైతు తన రెండెకరాల భూమిలో నాలుగు బోర్లు వేసినా.. చుక్కనీరు పడలేదు. చేసిన అప్పులు తీర్చారని ముంబైకి వలసవెళ్లాడు. మూడు నెలలు గడవకముందే మనస్తాపానికి గురైన నర్సయ్య..ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

19:00 - September 11, 2017

ఢిల్లీ : ఆదాయానికి మించి అధిక సంపత్తి కలిగి ఉన్న ఏడుగురు లోక్‌సభ సభ్యులు, వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 98 మంది శాసనసభ్యులపై విచారణకు రంగం సిద్ధమైంది. వీరి ఆదాయం లెక్కకు మించి ఉందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గణనీయంగా ఆస్తులు పెంచుకున్న ఏడుగురు ఎంపీలు, 98 మంది ఎమ్మెల్యేలపై దర్యాప్తు జరపాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ని ఆదేశించింది. ఈ ఎంపీలు ఎమ్మెల్యేలకు సంబంధించిన జాబితాను సీల్డ్‌కవర్‌లో మంగళవారం నాటికి సిబిడిటికి అందుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఐటి విభాగం అధికారులు ఎంపీలు... ఎమ్మెల్యేలపై జరిపిన ప్రాథమిక విచారణలో గణనీయంగా ఆస్తులు పెంచుకున్నట్లు సిబిడిటికి సుప్రీంకోర్టు తెలిపింది. లక్నోలోని ప్రముఖ ఎన్‌జీఓ సంస్థ 'లోక్‌ ప్రహరి' ప్రజాప్రతినిధుల ఆస్తుల పెరుగుదలపై సుప్రీంకోర్టును ఆశ్రయింయించింది. ఈ ఆస్తులపై విచారణ జరపాలని కోరింది. 26 మంది లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 257 మంది ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టుకు అందించింది. 

18:58 - September 11, 2017

ఢిల్లీ : గురుగ్రామ్‌లోని రేయాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఏడేళ్ల బాలుడి హత్య కేసులో సుప్రీంకోర్టు కేంద్రం, హర్యానా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై 3 వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ప్రద్యుమన్‌ తండ్రి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సిబిఐతో విచారణ జరిపించేందుకు సిద్ధమేనని హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ ప్రద్యుమన్‌ తండ్రి వరుణ్‌ ఠాకూర్‌కు హామీ ఇచ్చారు. మరోవైపు బాలుడి హత్య కేసులో స్కూలు మేనేజ్‌మెంట్‌కు చెందిన ఇద్దరు అధికారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్కూల్‌ నార్త్‌ ఇండియా హెడ్‌ ఫ్రాన్సిస్‌ థామస్‌, కోఆర్డినేటర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ హెడ్‌ జీయూస్‌ థామస్‌ను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదర్‌ పిఎస్‌కు చెందిన ఎస్‌ఎచ్‌ఓ అరుణ్‌సింగ్‌ను సస్పెండ్‌ చేశారు. రాయన్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ యజమాని విచారించేందుకు ఓ టీమ్‌ను ముంబైకి పంపినట్లు గురుగ్రామ్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. 

అగ్రిగోల్డ్ ఆస్తులపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తులపై హైకోర్టులో విచారణ జరిగింది.  ఆస్తుల కొనుగోలుకు జీఎస్సెల్ సంస్థ ముందుకొచ్చింది. 

18:22 - September 11, 2017
17:24 - September 11, 2017

తెలుగు సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల వార్తల్లో ప్రముఖం గా వినిపించిన ఢిల్లీ బ్యూటీ తాప్పీ హాకీ ప్లేయర్ నటించనుందట. బాలీవుడ్ లో ప్రస్తుతం వరుణ్ దావన్ సరసన హీరోయిన్ గా నటించిన జుడ్వా 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న తాప్సీ, మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పింది. ఇప్పటికే పింక్, బేబి లాంటి సినిమాలతో బాలీవుడ్ లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న తాప్సీ, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లో హాకీ ప్లేయర్ గా నటించనుందట. అందుకోసం ప్రత్యేకంగా హాకీ శిక్షణ తీసుకునేందుకు రెడీ అవుతోంది. షాద్ అలీ దర్శకత్వంలో తెరకెక్కనున్ ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. టాలీవుడ్ లో ఆనందో బ్రహ్మా సినిమాతో సౌత్ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఇక తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చేస్తానని చెప్పిన ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవటంతో తిరిగి బాలీవుడ్ లో బిజీ అయ్యే పనిలో ఉందని తెలుస్తోంది.

17:16 - September 11, 2017

హైదరాబాద్ : ఏజెంట్ల మోసాలతో మరో యువకుడు గల్ఫ్‌ దేశంలో అవస్థలు పడుతున్నాడు. ఉపాధి లేక మరోవైపు అక్కడినుండి హైదరాబాద్‌కు వచ్చేందుకు డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాడు. తన కుమారుడిని ఎలాగైనా స్వస్థలానికి చేర్చాలని... గల్ఫ్‌ తెలంగాణ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కల్చరల్‌ అధ్యక్షుడు పోతుకూరి బసంత్‌ రెడ్డిని కలిసి వృద్ధ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడు శ్రావణ్‌ను నిజామాబాద్‌కు చెందిన ఏజెంట్లు లక్ష్మణ్‌, ప్రతాప్‌గౌడ్‌లు మోసం చేశారని తెలిపింది. తనకు ఎవరూ లేకపోవడంతో మేడ్చల్‌ జిల్లా కుషాయిగూడలోని తమ బందువుల దగ్గర ఉన్నానని వాపోయింది.

17:15 - September 11, 2017

తూర్పుగోదావరి : చంద్రబాబు లాంటి అబద్దాల ముఖ్యమంత్రిని తాను ఎక్కడా చూడలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై రోజుకోమాట మాట్లాడుతున్నారని.. ఇప్పటికైనా ప్రాజెక్టు స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోనూ విద్యుత్‌ బిల్లులు అధికంగా చెల్లించారని ఉండవల్లి ఆరోపించారు. నోట్ల రద్దు ద్వారా ప్రధాని మోదీ సాధించిందేమీ లేదని ఉండవల్లి విమర్శించారు.

 

17:14 - September 11, 2017
17:13 - September 11, 2017

హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా కోర్టు నిలిపివేసింది. పౌరసత్వం రద్దుపై పునఃసమీక్షించాలని కేంద్రహోంశాఖను రమేశ్‌ కోరారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:11 - September 11, 2017

ఆదిలాబాద్ : జిల్లాలో కొనసాగుతున్న తెలంగాణ అమరవీరుల స్ఫూర్తి యాత్రలో టీజాక్‌ ఛైర్మన్‌ కోదండరామ్‌ టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఉట్నూర్‌లో అంబేద్కర్‌, తెలంగాణ అమరవీరుల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆయన.. రైతు సమన్వయ కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయడం తప్ప.. ఆ కమిటీలతో ఒరిగేదేమీ లేదన్నారు. ఉట్నూర్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. 

17:10 - September 11, 2017

పశ్చిమగోదావరి : జిల్లా తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా పుడ్ పార్కును తరలించాలంటూ కంసాల భేతపూడి గ్రామస్తులు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. గత మూడు సంత్సరాలుగా ఫ్యాక్టరీని నిర్మిచొద్దంటూ ఆందోళనలు చేస్తున్న చంద్రబాబు మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని అన్నారు. పోలీసు కేసులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు ఆక్వా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫ్యాక్టరిని వేరే చోటికి తరలించకుంటే తామే తరలిస్తామని కంసాల బేతపూడి వాసులు అంటున్నారు.

హన్మకొండలో దారుణం

వరంగల్ రూరల్: హన్మకొండలో దారుణం జరిగింది. పసికందు మృదేహాన్ని సంచిలో పెట్టి పబ్లిక్ హెల్త్ ఆఫీస్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అగ్రిగోల్డ్ ఆస్తుల కేసు విచారణ వాయిదా

హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆస్తుల కొనుగోలుకు మందుకొచ్చిన జీఎస్సెల్ సంస్థ. ఎంత నగదు డిపాజిట్ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల పూర్వాపరాలు తెలియకుండా ఏరకంగా డిపాజిట్ చేస్తామన్న జీఎస్సెల్ సంస్థ పేర్కొంది. డిపాజిట్ల వివరాలను తమ ముందు ఉంచాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. తుదపరి విచారణను గురువారానికి వాయి వేశారు.

వైశ్యులు తమ బెదిరింపులు మానుకోవాలి: తమ్మినేని

హైదరాబాద్: ప్రొ. కంచె ఐలయ్యను చంపుతామంటూ వైశ్యులు తమ బెదిరింపులు మానుకోవాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే టీమాస్ తో చర్చించాలని ఏదైనా అభ్యంతరాలు ఉంటే టీమాస్ చర్చించాలని సూచించారు. వైశ్యుల్లో పేదలు, ఉద్యమకాలున్నారు అని, కమ్మకులంలో పుట్టి ఆ కుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నా కుల అసమానతలు సృష్టించి తరతరాలుగా అణిచివేతకు పాల్పడుతున్నారని తెలిపారు. రాజ్యాధికారంతోనే అసమానతలు తొలిగిపోతాయన్నారు. సామాజిక న్యాయం కోసం టీ-మాస్ పోరాటం చేస్తుందన్నారు.

కోట్ల నుంచి నాకు ప్రాణహాని ఉంది: ప్రొ.కంచె

హైదరాబాద్: వైశ్యుల పై నేను ప్రత్యేకంగా పుస్తకం రాయలేదని ప్రొ. కంచె ఐలయ్య అన్నారు. 209లో రాసిన పరిశోధనాత్మక పుస్తకంలో కోమట్ల చరిత్ర ఒక చాప్టర్ మాత్రమే అని, ఈ చాప్టర్ ను ప్రత్యేక బుక్ లెట్ గా ముద్రించారని, పుస్తకంలో ఎవరి మనోభావాలను కించపరచలేదన్నారు. అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, కోమట్ల పేరుతో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, చంపుతామని బూతులు తాడుతున్నారని కంచె తెలిపారు. కోట్ల నుంచి నాకు ప్రాణహాని ఉందని, దేశంలో మేధావులకు రోణ కరువైందని మండిపడ్డారు.

డీజీపీ సాంబశివరావుకు తప్పిన ప్రమాదం

ప.గో : తణుకు వద్ద ఎన్ హెచ్ పై లారీని డీజీపీ సాంబశివరావు కారు ఢీ కొట్టింది. డీజీపీ సాంబశివరావు క్షేమంగా ఉన్నారు. కారు స్వల్పంగా ధ్వంసం అయ్యింది. రాజమండ్రి నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వేరే కారులో విజయవాడకు డీజీపీ బయలుదేరారు.

ఆశా వర్కర్ల ముందస్తు అరెస్టులు..

అమరావతి: మంగళగిరి నుంచి విజయవాడ ధర్నాకు వెళ్తున్న 60 మంది ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేసి పీఎస్ లకు తరలించారు.

మిషన్ భగీరధ పురోగతి పై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: ప్రగతి భవన్ లో మిషన్ భగీరధ పురోగతి పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో అధికారులు, మంత్రులు పాల్గొన్నారు.

ముంబైలో ఆత్మహత్య చేసుకున్న చెత్యాల రైతు..

సిద్దిపేట: మిర్దొడ్డి మండలం చెత్యాలకు చెందిన రైతు ఎ.నర్సయ్య ముంబైలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 4 బోర్లు వేసి నీరు పడక అప్పుల పాలైన నర్సయ్య ముంబైకి వలస వెళ్లి అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

466 గ్రాముల బంగారం పట్టివేత

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 466 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 14 లక్షలు చేస్తుందని అధికారులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న ప్రయాణికుడిని అధికారులు విచారిస్తున్నారు.

దాడులతో ప్రజాపోరాటాలను అడ్డుకోలేరు: ఉత్తమ్

హైదరాబాద్: ఎమ్మెల్యే చిన్నారెడ్డి పై జరిగిన దాడిన టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి టిఆర్ ఎస్ దాడి చేయడం ఇది రెండో సారి అని, దాడులతో ప్రజాపోరాటాలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక 39 జివో పై ఉద్యమం చేయడం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అని పేర్కొన్నారు.

మంత్రి లక్ష్మారెడ్డికి సీపీఎం రాష్ట్ర కమిటీ లేఖ

హైదరాబాద్: మంత్రి లక్ష్మారెడ్డికి సీపీఎం రాష్ట్ర కమిటీ లేఖ రాసింది. ఖమ్మం ఆస్పత్రిలో శశువుల మృతి ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ విజృంభిస్తోందని, తక్షణమే విచారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

పోలీసుల ముసుగులో దాందాలు:వ్యక్తి అరెస్ట్...

హైదరాబాద్: పోలీసుల ముసుగులో దాందాలు చేస్తున్న ఓ వ్యక్తిని నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డమ్మీ రివాల్వర్, కారు, రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

15:52 - September 11, 2017

విశాఖ : జగన్‌ను ఒక అసమర్థ ప్రతిపక్షనేత అంటూ మండిపడ్డారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను అడ్డుకోవడమే ఆయన పనిగా పెట్టుకున్నాడని గంటా ఆరోపించారు. నంద్యాల ఎన్నికల్లో సీఎం చంద్రబాబుపై జగన్ వాడిన భాష జనం అందరూ చూశారని గంటా గుర్తు చేశారు. విజయనగరంలో టీడీపీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న టీడీపీకే భవిష్యత్‌లో జనం పట్టం కడతారని మంత్రి గంటా చెప్పారు. 

15:48 - September 11, 2017

మహబూబ్ నగర్ : వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. అగ్రికల్చర్ ఆఫీసర్ ను చిన్నారెడ్డి ప్రశ్నిస్తుండగా ఆయన పై టీఆర్ఎస్ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉప అధ్యక్షుడు సమక్షంలో ఘటన జరగడం గమన్హారం. 

15:47 - September 11, 2017

హైదరాబాద్ : ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య రాసిన పుస్తకం ఆర్య, వైశ్యులను కించ పరిచేలా ఉందంటూ ఆర్యవైశ్య జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు హైదరాబాద్‌ పంజగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అంటూ కంచె ఐలయ్య పుస్తకం రాశారని మండిపడ్డారు.. ఐలయ్యపై చర్య తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

 

15:46 - September 11, 2017

హైదరాబాద్ : తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయంటూ ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. తాను రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకం వివాదాస్పదమైన అనంతరం ఆయన స్పందించారు. జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌ను హతమార్చినట్లు తనను కూడా చంపేస్తారేమోనని కంచె ఐలయ్య అనుమానం వ్యక్తం చేశారు. తాను రాసిన పుస్తకం కాపీని పోలీసులకు ఇచ్చానని ఆయన తెలిపారు.

15:45 - September 11, 2017

సంగారెడ్డి : జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌ భూ కబ్జాలకు వ్యతిరేకంగా 15 గ్రామాల ప్రజలు పోరుబాట పట్టారు. తమకు న్యాయం చేయాలని బాధితులు సంగారెడ్డి కలెక్టరేట్‌ ముందు ధర్నాకు దిగారు. బాధిత రైతులకు సీపీఎంపార్టీతోపాటు, రైతు, వ్యవసాయ కార్మికసంఘం, కేవీపీఎస్‌ సంఘాలు మద్దతు తెలిపాయి. బీబీపాటిల్‌ భూ బాగోతాలపై సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించాలని కోరుతున్న ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

15:44 - September 11, 2017

దేవదాసు తెలుగు సినిమాతో ఎంట్రీ అయి పోకిరీతో దూసుకెళ్లిన ఇలియానా ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరం అయి బాలీవుడ్ సినిమాలతో సరిపెడుతోంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కొంతకాలంగా 'డేటింగ్‌'లో బిజీ బిజీగా వుంది. ఫొటోలూ, ముద్దులూ, హాలిడే లూ ఇలా అభిమానులందరికీ పండగచేసింది.. బాద్‌షాహో సినిమా బాక్స్‌ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈమెపై తాజాగా జరుగుతున్న పరిణామాలపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహించింది ఇలియానా. 'ఈ మధ్యకాలంలో ఈమె ఎక్కడికి వెళ్లినా తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూనీబోస్ గురించే అడుగుతుండటం తనకు బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. పబ్లిక్‌లో ఉన్న ప్రతీ సందర్భంలోనూ నవ్వుతూ కనిపించడం సాధ్యపడకపోవచ్చు. నేను పబ్లిక్ ఫిగర్‌ని మాత్రమే. పబ్లిక్ ప్రాపర్టీని కాదు. మీరు నా బాయ్‌ఫ్రెండ్ గురించి అడగటంలో తప్పులేదు. కానీ అతడి జాతి గురించి అడగటం బాధకలిస్తోంది. అతను తెల్లగా ఉండటం కారణంగానే నేను డేటింగ్ చేస్తున్నానని చెప్పుకుంటున్నారు. అది నాకు నచ్చడం లేదు. నేనుచేస్తున్నది తప్పు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. మీ తల్లులు, చెల్లెల పట్ల అలాగే ప్రవర్తిస్తున్నారా..? మీ వాళ్ళకిచ్చే గౌరవం నాకెందుకు ఇవ్వరు' అంటూ తీవ్ర ఆగ్రహం చేసింది.

15:43 - September 11, 2017

నల్లగొండ : కోమటిరెడ్డి బ్రదర్స్‌, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలకు అతీతంగా ఈ పేర్లు తెలియనివారుండరు. అంతటి చర్చనీయాంశ రాజకీయనాయకులుగా వీరి పేర్లు నల్గొండ ప్రజల్లో నానుతుంటాయి. కీర్తి శేషులు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి చాలా విశ్వాసమైన వ్యక్తిగా కోమటిరెడ్డికి గుర్తింపు ఉంది. ఆ సమయంలోనే తమ్ముడు రాజగోపాల రెడ్డిని భువనగిరి ఎంపీగా పార్లమెంటుకు పంపించారు. అయితే వైఎస్‌ మరణాంతరం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చెక్‌ పడిందనే చెప్పుకోవచ్చు. అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో ఉత్తమ్‌కు మంత్రి పదవి లభించింది.

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పెద్ద దెబ్బ..
మొదటి నుండి ఎడమొహం పెడమొహంగా ఉన్న కోమటిరెడ్డి, ఉత్తమ్‌ల నడుమ కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో మంత్రి పదవులు మారాయి. దీంతో వీరిద్దరి మధ్య మరింత దూరం పెరిగింది. పరస్పర విమర్శలు చేసుకుంటూ, ఎన్నికల్లో సైతం ఒకరినొకరు ఓడించుకునేందుకు ప్రయత్నించారనే విమర్శలు సొంత పార్టీ నేతల నుండి వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంలో టీపీసీసీ పగ్గాలు ఉత్తమ్‌కు దక్కడం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. నాటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా ఉత్తమ్‌ను విమర్శిస్తూ టీపీసీసీని తాము పరిగణలోకి తీసుకోవడంలేదని బహిరంగంగానే ప్రకటించారీ ఇద్దరు సోదరులు.

సాధారణ ఎన్నికల్లో టీపీసీసీ బాధ్యతల్లో ఉన్న ఉత్తమ్‌ వైఖరి వల్లే కాంగ్రెస్‌ ప్రజల్లోకి వెళ్లలేకపోయిందని కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రచారం చేశారు. తమకు వీలున్న మార్గాల ద్వారా అధిష్ఠానం వద్దకు పదే పదే ఈ విషయాన్ని తీసుకెళ్లారు. గతంలో పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌ వైఎస్‌ వర్గానికి సన్నిహితంగా ఉండటం వల్లే టీపీసీసీపై విమర్శలు చేసినా కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఉత్తమ్‌ వైఖరితో 2019 ఎన్నికలకు వెళ్తే తెలంగాణలో పార్టీ మరింత దిగజారిపోతుందని కోమటిరెడ్డి వర్గం ప్రచారం చేస్తూ వస్తోంది. తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం రావాలంటే కోమటిరెడ్డి లాంటి మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న నాయకులు పార్టీ పగ్గాలు చేపట్టాలని సామాజిక వెబ్‌సైట్‌ల ద్వారా, తన క్యాడర్‌ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించారు కోమటిరెడ్డి బ్రదర్స్‌. దీంతో టీపీసీసీ నాయకత్వం మార్పు జరుగుతుందని, బ్రదర్స్‌లో ఒకరికి పదవి వరిస్తుందని ప్రచారం జరిగింది.

అదే సమయంలో టీఆర్‌ఎస్‌లోకి కోమటిరెడ్డి వెళ్తున్నారన్న ప్రచారం జరగడం, అనూహ్యంగా ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి గులాబీ పార్టీకి చేరడంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ వెనక్కి తగ్గారన్న ఆరోపణలున్నాయి. అప్పటివరకు కేసీఆర్‌పై పెద్దగా విమర్శలు చేయని కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఆ తర్వాత తీవ్రమైన విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుండి ఈ బ్రదర్స్‌ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్గొండలో నాలుగు రోజుల పాటు మకాం వేయడంతో ప్రచారం నిజమవుతుందని భావించారు. అయితే సెప్టెంబర్‌లో టీపీసీసీ పగ్గాలు మారే అవకాశం ఉండటంతో తమకు కొంత సమయం కావాలని, తర్వాత నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి బ్రదర్స్‌ బీజేపీ నేతలకు చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొంత కాలం పాటు ఈ ప్రచారాలు సద్దుమనిగినా ఇటీవల మళ్లీ ఈ చర్చ తెరపైకి వచ్చింది. ఇటీవల కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా దిగ్విజయ్‌ స్థానంలో కుంతియా బాధ్యతలు చేపట్టడం కోమటిరెడ్డి బ్రదర్స్‌ను మరింత ఇరకాటంలో పెట్టినట్టయింది. కుంతియా ఉత్తమ్‌ వర్గంతో సన్నిహితంగా ఉన్నారనే అభిప్రాయాలున్నాయి. ఉత్తమ్‌ తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పార్టీ సభలకు కుంతియా హాజరుకావడంతో టీపీసీసీలో మార్పులు జరగవనే ప్రచారం జరిగింది. దీంతో టీపీసీసీ కోసం ఎదురు చూస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అవకాశాలు సన్నగిల్లిపోయాయని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తమ్‌ సారధ్యంలోనే వచ్చే శాసనసభ ఎన్నికలను ఎదుర్కుంటామని కుంతియా ప్రకటించడం సొంత పార్టీలోనే తీవ్ర చర్చకు దారితీసింది.

బీజేపీలోకి...
కుంతియా ప్రకటనతో కోమటిరెడ్డి డోలాయమానంలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నల్గొండ నియోజకవర్గం లక్ష్యంగా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కుంతియా వ్యాఖ్యలు తమ క్యాడర్‌ను నైరాశ్యంలోకి నెట్టాయని బ్రదర్స్‌ భావిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని రాహుల్‌ దగ్గరే తేల్చుకుంటామనుకున్నా కుంతియా వ్యాఖ్యలలోని అంతరార్థం గురించి బ్రదర్స్‌ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పరిణామాలతో మొదటి నుండి వ్యాపార ప్రయోజనాల కోసం బీజేపీకి వెళ్లడం శ్రేయస్కరమని సోదరులు భావిస్తున్నారు. కాని రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు బీజేపీ ప్రభావిత శక్తిగా ఎదిగే అవకాశం లేకపోవడంతో కేవలం ఎమ్మెల్యేగా సరిపెట్టుకోవాలా అన్న ఆలోచనలో వెంకటరెడ్డి ఉన్నట్లు సమాచారం. వెంకటరెడ్డి బీజేపీలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్టోబర్‌లో ఇందుకు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. టీపీసీసీ పగ్గాలు రాకపోతే కమలం గూటికి చేరడం ఖాయమని కోమటిరెడ్డి అనుచరులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఏదేమయినప్పటికీ కోమటిరెడ్డి బ్రదర్స్‌ పార్టీ మార్పు ప్రచారం వారి రాజకీయ స్థిరత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి నుండి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలంగా ఉన్న బ్రదర్స్‌ ప్రస్తుతం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది అక్టోబర్‌ మాసంలో తెలియనుంది.

15:37 - September 11, 2017

ఢిల్లీ : భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన మహానుభావుడు వివేకానంద అని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో 'యువ భారత్‌-నవభారత్‌' కార్యక్రమంలో పాల్గొన్న మోదీ... వివేకానంద చికాగో సదస్సు పాల్గొని 125 ఏళ్లు పూర్తయిందన్నారు. నేడు వినోభాబావే పుట్టిన రోజు అని గుర్తు చేశారు. 

15:36 - September 11, 2017

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తామంటూ అమాయకుల నుంచి లక్షలు దోచేస్తున్న నైజీరియన్ ముఠాను ఢిల్లీలో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పది మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీ మొత్తంలో ల్యాప్‌టాప్‌లు, ఐఫోన్లు, 50 వేల యూఎస్ డాలర్లు, గోల్డ్, ముత్యాల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఆగస్టియన్ విలియమ్స్‌పై కేసు నమోదు చేశారు.

జగన్ మానసిక స్థితి సరిగా లేదు: సీఎం చంద్రబాబు

శ్రీకాకుళం : జగన్ మానసిక స్థితి సరిగా లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.తెట్టంగిలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలవుతున్న విధానంపై ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలు టిడిపీ వైపు ఉంటే వైసీపీలో రౌడీలున్నారన్నారు. రాజకీయాలకు జగన్ అనర్హుడు అని, ప్రభుత్వ పనితీరుపై 60 శాతం మంది సంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 90 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యం అని స్పష్టం చేశారు.

14:41 - September 11, 2017
14:39 - September 11, 2017

మొత్తం ప్రపంచంలో జర్నలిస్టులకు అతీప్రమాదకర దేశంగా ఇండియా 3వ స్థానంలో ఉందని. గతంలో అరుణాచల్ ప్రదేశ్ లో ఓ మహిళ జర్నలిస్టుపై హత్యాయత్నం చేశారని. భారతదేశం జర్నలిజంలో విలువలు దెబ్బతింటున్నాయని. పురుషుల్లో కన్నా మహిళల్లో జర్నలిజం వైపు వస్తున్నారని. గౌరీ లంకేష్ హత్య యువత్ భారతదేశానికి ఓ మాయని మచ్చ అని సీనియర్ జర్నలిస్టు వనజ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

పెబ్బేరులో ఎమ్మెల్యే చిన్నారెడ్డి పై దాడి

వనపర్తి: పెబ్బేరులో ఎమ్మెల్యే చిన్నారెడ్డి పై దాడి టిఆర్ ఎస్ నేతలు దాడి చేశారు. రైతు సమన్వయ సమితి ఏర్పాటు పై వ్యవసాయ అధికారిని ప్రశ్నించినందుకు చిన్నారెడ్డి పై టిఆర్ ఎస్ నేతలు దాడి చేశారు.

13:49 - September 11, 2017
13:45 - September 11, 2017
13:42 - September 11, 2017

సిరిసిల్ల : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు కోర్టు విచారణ చేపట్టింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఎమ్మెల్యే చెన్నమనేనికి హైకోర్టులో ఊరట

సిరిసిల్ల : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు హైకోర్టు లో ఊరట లభించింది. భారత పౌరసత్వం రద్దు పై ఆరు వారాల పాటు హైకోర్టు స్టే ఇచ్చింది. 6 వారాల్లో నిర్ణయం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.

కపిలతీర్థం వద్ద అటవీ ప్రాంతంలో ముగ్గురు విద్యార్థుల అదృశ్యం..

తిరుపతి: కపిలతీర్థం వద్ద అటవీ ప్రాంతంలో ముగ్గురు పాలిటెక్నిక్ విద్యార్థులు అదృశ్యం అయ్యారు. నిన్న అడవిలోకి వెళ్లినట్లు ఆనవాలు లభ్యం అయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కపిల తీర్థం, శేషాచలం అడవుల్లో పోలీసులు గాలిస్తున్నారు.

13:35 - September 11, 2017

నెల్లూరు : గూడూరు మండలం మేఘనూరులో బాయిలర్ పేలుడు సంభవించింది. స్థానిక రసాయిన పరిశ్రమలో బాయిలర్ పేలడంతో అవినాష్ అనే వ్యక్తి మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:29 - September 11, 2017

హైదరాబాద్‌: అలనాటి మేటి తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం మహానటి. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ ఒదిగిపోయారు. సమంత, దుల్కర్‌ సల్మాన్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే సావిత్రిగా కీర్తి ఎలా కనిపించనున్నారనే విషయంపై ఆసక్తినెలకొంది. కాగా మహానటి సెట్‌లో తీసిన కొన్ని ఫొటోలు బయటికి వచ్చాయి. వీటిలో కీర్తి సావిత్రి గెటప్‌లో చాలా చక్కగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైజయంతి మూవీస్‌ పతాకంపై ప్రియాంకా దత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్‌, మలయాళ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే, ప్రగ్యా జైశ్వాల్‌ కూడా ఇందులో నటిస్తున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం రద్దు పై విచారణ

కరీంనగర్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించాడు.

13:10 - September 11, 2017

ఢిల్లీ : భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన మహానుభావుడు వివేకానంద అని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో 'యువ భారత్‌-నవభారత్‌' కార్యక్రమంలో పాల్గొన్న మోదీ... వివేకానంద చికాగో సదస్సు పాల్గొని 125 ఏళ్లు పూర్తయిందన్నారు. నేడు వినోభాబావే పుట్టిన రోజు అని గుర్తు చేశారు. 

 

మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో అగ్నిప్రమాదం

నల్గొండ: మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్యూట్ తో మంటలు చెలరేగినట్లు సమాచారం.

13:07 - September 11, 2017

రావూస్ స్కూలు మూసివేస్తాం.. డీఈఓ

సంగారెడ్డి : రామ‌చంద్రాపురం ఓల్డ్ఎంఐజీ రావూస్ స్కూల్ కు అనుమ‌తులు లేవ‌ని.. గ‌తంలోనూ రెండు సార్లు స్కూల్ కు నోటీసులు ఇచ్చి మూసివేశామ‌ని డీఈఓ తెలిపారు. పాఠ‌శాల‌కు అనుమ‌తులు లేనందున మూసివేస్తామ‌ని డీఈవోలు వెల్ల‌డించారు. బాల‌ల హ‌క్కుల చ‌ట్టం ప్ర‌కారం నిర్వాహ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు డీఈవోలు తెలిపారు. యూనిఫాం వేసుకురాలేదని 11 ఏళ్ల బాలిక‌ను బాయ్స్ టాయిలెట్ లో నిల‌బెట్టిన ఘ‌ట‌న‌పై నివేదిక కోసం సంగారెడ్డి డీఈవో విజ‌య‌కుమారి, రంగారెడ్డి డీఈవో స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి స్కూల్ కు వెళ్లి విచారణలో ఈ విషయాలు వెలుగుచూశాయి.

13:02 - September 11, 2017

సంగారెడ్డి : యూనిఫాం వేసుకురాలేదని స్కూల్ సిబ్బంది 5వ తరగతి విద్యార్ధినిని బాయిస్ టాయిలెట్‌లో గంట సేపు  నిలబెట్టిన ఘటనపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. స్కూలుకు నోటీసులు ఇవ్వమంటూ డిప్యూటీ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బీహెచ్ ఈఎల్ లోని రావూస్‌ హైస్కూల్‌లో ఓ విద్యార్ధిని యూనిఫాం వేసుకుని రాకుండా స్కూలుకు వచ్చింది. స్కూలు సిబ్బంది ఆమెను బాయిస్ టాయిలెట్‌లో గంటసేపు నిలబెట్టారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్ధిని స్కూలుకు వెళ్లనని ఆవేదన చెందడంతో విద్యార్ధిని తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడంతో విద్యార్ధిని కుటుంబ సభ్యులు స్కూలు వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు బాలల హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. 

 

12:58 - September 11, 2017

హైదరాబాద్ : తెలంగాణలో టీచర్ల నియామకం చేపట్టకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. గతంలో సెప్టెంబర్‌లోపు నియామకాలు పూర్తి చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తాజాగా తిరిగి వాయిదా కోరడంతో సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యా శాఖ కార్యదర్శి తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:57 - September 11, 2017

పవన్ స్టార్ పవన్ కల్యాన్ మాజీ భార్య రేణూ దేశాయ్ తెలుగు ప్రేక్షలకుల ముందు ప్రత్యక్షం కానుంది. అందులో హిందీలో హిట్టయిన నాచ్ బలియే టీవీ షో తెలుగు వెర్షన్‌కి రేణు హోస్ట్‌గా వ్యవహరించనుంది. ఈ స్లాట్‌కి రీప్లేస్‌మెంట్‌గా నాచ్ బలియే తెలుగు వెర్షన్‌ని టెలికాస్ట్ చేయాలని ఆ ఛానెల్ ప్లాన్ చేసింది. హిందీలో మాధురిదీక్షిత్ చేస్తున్న జడ్జి రోల్‌ని తెలుగులో రేణుదేశాయ్ టేకప్ చేసింది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయినట్టు కూడా తెలుస్తోంది. పవన్‌కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ అతిత్వరలో షురూ కాబోతుందన్నమాట.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సోమవరం వీఆర్వో

ఖమ్మం: వైరా తహశీల్దారు కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ.27 వేలు లంచం తీసుకుంటూ సోమవరం వీఆర్వో రవికుమార్ పట్టుబడ్డాడు.

జీహెచ్ ఎంసీ అభివృద్ధి పై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ అభివృద్ధి పై క్యాంప్ ఆఫీసులో అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు.

నెల్లూరు జిల్లాలో పేలిన బాయిలర్: ఒకరి మృతి

నెల్లూరు: గూడూరు మండలం మేఘనూరు రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.

12:29 - September 11, 2017

రంగారెడ్డి : జిల్లాలోని చేవేళ్ల మండలం ఆలూర్‌ గేట్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్‌ చెందిన ఓ కుటుంబం... వికారాబాద్‌ వెళ్లి వస్తుండగా ఆలూరు స్టేజి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆటోలోని బిపాషా బేగం, అబేదా బేగం మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.  

 

12:26 - September 11, 2017

హైదరాబాద్‌ : నగరంలోని ఐమాక్స్‌ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎగ్జిబిషన్ కోసం నిర్మిస్తున్న షెడ్డు కూలడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు సలీం, ప్రసాద్‌లుగా గుర్తించారు. 

 

ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం

శ్రీకాకుళం: వారఘట్టం మండలం తెట్టంగిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికెళ్లి ప్రజల సమస్యలను సీఎం అడిగి తెలుగసుకుంటున్నారు.

12:19 - September 11, 2017

సంగారెడ్డి : యూనిఫాం వేసుకురాలేదని స్కూల్ సిబ్బంది ఓ విద్యార్ధినిని బాయిస్ టాయిలెట్‌లో గంట సేపు నిలబెట్టిన ఘటనపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. స్కూలుకు నోటీసులు ఇవ్వమంటూ డిప్యూటీ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బీహెచ్ ఈఎల్ లోని రావూస్‌ హైస్కూల్‌లో ఓ విద్యార్ధిని యూనిఫాం వేసుకుని రాకుండా స్కూలుకు వచ్చింది. స్కూలు సిబ్బంది ఆమెను బాయిస్ టాయిలెట్‌లో గంటసేపు నిలబెట్టారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్ధిని స్కూలుకు వెళ్లనని ఆవేదన చెందడంతో విద్యార్ధిని తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడంతో విద్యార్ధిని కుటుంబ సభ్యులు స్కూలు వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు బాలల హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. 

 

12:18 - September 11, 2017

ఆంధ్ర మాత గా పిలువబడే గోంగూర. తెలంగాణ లో కుంటి కూర అని కూడా పిలుస్తున్నారు. ఇది రెండు రకాలుగా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఎర్ర లేదా కొండ గోంగూర, తెల్ల గోంగూర. అందరూ ఎంతగానో ఇష్టపడే గోంగూర, రుచిలోనేగాక ఆరోగ్యపరంగా కూడా ఎంతో శ్రేష్టమైనది. గోంగూరలో ఉండే పీచు పదార్ధం మన గుండెకు ఎంతో మేలుచేస్తుంది.

గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి9, సి పుష్కలంగా ఉంది. పొటాషియమ్‌, కాల్షియమ్‌, ఫోస్పర్స్, సోడియం, ఐరన్ సమృద్థిగా ఉన్నాయి. దీనిలో ప్రోటీన్స్, కార్బోహైడ్రైట్స్ అధికంగా ఉండి క్రొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఆకులో పొటాషియం ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండటం వలన రక్త ప్రసరణ సక్రమంగా ఉండటమే కాకుండా మన శరీరంలోని రక్తపోటును కూడా అదుపులో ఉంచడానికి ఇది సహకరిస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ గోంగూరలో అనేక దీర్ఘకాలిక రోగాలను నయం చేసే సత్తా ఉంది.

రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, షుగర్ లెవెల్స్ ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు గోంగూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు.

ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను నివారించడానికి గోంగూర సహాయపడుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది.

గోంగూర ఆకుల పేస్ట్ తలకు పట్టించి ఉదయం స్నానం చేస్తే వెంట్రుకలు ఊడడం తగ్గి బట్టతల రాకుండా కాపాడుతుంది.

12:13 - September 11, 2017

విశాఖ : ఏజెన్సీలో మళ్లీ ఆంత్రాక్స్ విజృంభిస్తోంది. డుంబ్రిగూడ మండలం, కండ్రూం, సరాయి గ్రామాల్లో పదిహేనుకు పైగా ఆంత్రాక్స్‌ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ఆంత్రాక్స్ వ్యాధి గ్రస్తులను అరకు లోయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

12:09 - September 11, 2017

ఆదిలాబాద్ : మూడేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను జేఏసితో చెప్పుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. అమరవీరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. బాసర ఆలయ నిర్వహణ సక్రమంగా లేదని ఫిటీ ఆర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. భైంసాలో గిట్టుబాటు ధరలు లేక.. రుణమాఫీ అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాలో పారిశ్రామీకరణ ద్వారా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రైతు సమన్వయ కమిటీలు సక్రమంగా పనిచేయడం లేదని విమర్శించారు.

 

12:05 - September 11, 2017

నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన 102వ చిత్రం లో బాలయ్య సరసన నయనతార, మలయాళ నటి నటాషా దోషి నటిస్తున్నారు. కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో బ్రహ్మానందం, మురళీ మోహన్, సంద్య జనక్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కుంభకోణంలో షూటింగ్ జరుపుకుంటోంది.

12:00 - September 11, 2017

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జై లవ కుశ' చిత్ర ట్రైలర్ ఆదివారం విడుదల అయ్యింది. ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో మూడు పాత్రలను పోషిస్తుండడంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై 'జై లవ కుశ' రూపొందుతోంది. బాబీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా, నివేదిత థామస్ లు హీరోయిన్స్ నటించారు.

ఐసీయూలో శశికళ భర్త

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ జనరల్‌ సెక్రటరీ వీకే శశికళ భర్త ఎం నటరాజన్‌ తీవ్ర అస్వస్థతో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రిలో చేరారు. మల్టిపుల్‌ ఆర్గాన్ ఫెయిల్యూర్స్‌ కారణంగా ఆయన్ను పెరుంబక్కంలోని గ్లోబల్‌ హెల్త్‌ సిటీ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గత ఆర్నెల్లుగా నటరాజన్‌ లివర్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పాయి. వ్యాధి తీవ్ర రూపం దాల్చడంతో లివర్‌, కిడ్నీ ఫెయిలైనట్లు తెలిపాయి. ఊపిరితిత్తులపై కూడా వ్యాధి ప్రభావం ఉండటంతో ఆయన శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బందిపడుతున్నట్లు తెలిసింది.

11:52 - September 11, 2017

సంగారెడ్డి : బీహెచ్ ఈఎల్ రావూస్ హైస్కూల్ యాజమాన్యం నిర్వాకం బయటపడింది. యూనిఫాం వేసుకురాలేదని విద్యార్థినిని గంటసేపు బాయిస్ టాయిలెట్ లో నిలబెట్టారు. తీవ్ర మనస్తాపానికి లోనై విద్యార్థిని స్కూలుకు వెళ్లనని చెప్పింది. స్కూలులో విద్యార్థిని తల్లి బోధనేతర సిబ్బందిగా పని చేస్తోంది. తన కూతురికి జరిగిన అవమానంపై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడంతో స్కూలు వద్ద కటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఘటనపై విద్యా శాఖ అధికారులు స్పందించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. 

 

రావూస్ పాఠశాలకు డీఈఓ..

సంగారెడ్డి:  రావూస్ పాఠ‌శాల వ‌ద్ద ఆందోళ‌న కొన‌సాగుతున్న‌ది. విద్యార్థిని త‌ల్లిదండ్రులు, బంధువులు, చైల్డ్ రైట్స్ యాక్టివిస్టులు పాఠ‌శాల వ‌ద్ద ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. విద్యార్థిని బంధువులు స్కూల్ లో ఫ‌ర్నీచ‌ర్ ను ధ్వంసం చేశారు. రామ‌చంద్రాపురం ఓల్డ్ఎంఐజీ రావూస్ స్కూల్ లో 11 ఏళ్ల బాలిక‌ను బాయ్స్ టాయిలెట్ లో నిల‌బెట్టిన ఘ‌ట‌న‌పై ఉప‌ముఖ్య‌మంత్రి, విద్యా శాఖ మంత్రి క‌డియం శ్రీహ‌రి స్పందించారు. రావూస్ పాఠ‌శాల ఘ‌ట‌న‌పై నివేదిక ఇవ్వాల‌ని డీఈవోకు ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంగారెడ్డి డీఈవో రావుస్ పాఠ‌శాల‌కు వెళ్లారు.

తెలంగాణ సర్కార్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం...

ఢిల్లీ: తెలంగాణ లో టీచర్ల నియామకం చేపట్టకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ లోగా నియామకాలు పూర్తి చేస్తానని తెలిపిన టీ సర్కార్ తిరిగి మళ్లీ వాయిదా కోరడం పై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతే కాకుండా విద్యాశాఖ కార్యదర్శి తమ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేసింది.

11:24 - September 11, 2017

అమెరికా : ఇర్మా తుపాను అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని బీభత్సం సష్టించింది. ఇర్మా ధాటికి ఫ్లోరిడా చివురుటాకుల వణికిపోయింది. కరీబియన్‌ దీవులను కకావికలం చేసిన హరికేన్‌ ఇర్మా... ఫ్లోరిడా కీస్‌ వద్ద తీరం దాటినా.. ఫ్లోరిడా తూర్పు తీరం మీదుగా ఇంకా బీభత్సం కొనసాగిస్తోంది. ఇర్మా ప్రభావంతో ఫ్లోరిడాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు తుపాను ధాటికి కరీబియన్ దీవుల్లో 25 మంది మృతి చెందారు. ఇర్మా తుపానును కేటగిరి 4 నుంచి కేటగిరి 2గా అధికారులు ప్రకటించారు. ఇర్మా ప్రభావంతో మయామీలో ఎమర్జెన్సీ విధించారు. క్యూబాలోనూ ఇర్మా విధ్వంసం సృష్టించింది. తూర్పు , ఉత్తర క్యూబాలో వేలాది ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. 20 లక్షల మంది చిమ్మచీకట్లో మగ్గిపోతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. వరద ముప్పు పొంచి ఉండటంతో ఎవరూ బయటకు రావొద్దంటూ అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ఫ్లోరిడాలోని భారతీయ అమెరికన్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపానులో చిక్కుకున్న భారతీయులకు పలు సంఘాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. 

 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 10వేల బెంచ్‌ మార్క్‌కు దగ్గర్లోనే ట్రేడ్‌ అవుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 157 పాయింట్లు ఎగబాకి 31,844 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 9,982 వద్ద కొనసాగుతున్నాయి.

రావూస్ స్కూల్ ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్...

సంగారెడ్డి: రామ‌చంద్రాపురం ఓల్డ్ఎంఐజీ రావూస్ స్కూల్ లో 11 ఏళ్ల బాలిక‌ను బాయ్స్ టాయిలెట్ లో నిల‌బెట్టిన ఘ‌ట‌న‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది అమాన‌వీయ ఘ‌ట‌న అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌ను రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి క‌డియం శ్రీహ‌రి దృష్టికి తీసుకెళ్లి.. ఎలాగైనా స్కూల్ పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతామ‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.

విశాఖ ఏజెన్సీలో మళ్లీ అంత్రాక్స్

విశాఖ : ఏజెన్సీల్లో మళ్లీ ఆంత్రాక్స్ విజృంభిస్తోంది. డుంబ్రిగూడ మండలం కండ్రూం, సరాయి గ్రామాల్లో 15కు పైగా ఆంత్రాక్స్ కేసులు నమోదు అయ్యాయి.

10:50 - September 11, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. గత కొన్ని రోజులుగా మెట్రో పనుల నిమిత్తం రాకపోకలను నిలిపివేయగా... స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో రాకపోకలను పనః ప్రారంభించారు. మరోవైపు ఎన్నో ఏళ్ల నుంచి అద్వానంగా ఉన్న రోడ్ల మరమ్మతులను సైతం చేపట్టారు. బ్రిడ్జి కింది రోడ్డుకు ఇరువైపులా సీసీ రోడ్లు వేశారు. ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద మెట్రో పనులు పూర్తి కావడంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు కొనసాగుతున్నాయి. 

 

10:43 - September 11, 2017

గుంటూరు : జిల్లాలోని క్రోసూరు మండలం నాగవరంలో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ వర్గం వారు మరో వర్గంపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. 

 

10:40 - September 11, 2017

అమెరికా : ఇర్మా తుపాను అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని బీభత్సం సష్టించింది. ఇర్మా ధాటికి ఫ్లోరిడా చివురుటాకుల వణికిపోయింది. కరీబియన్‌ దీవులను కకావికలం చేసిన హరికేన్‌ ఇర్మా... ఫ్లోరిడా కీస్‌ వద్ద తీరం దాటినా.. ఫ్లోరిడా తూర్పు తీరం మీదుగా ఇంకా బీభత్సం కొనసాగిస్తోంది. ఇర్మా ప్రభావంతో ఫ్లోరిడాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు తుపాను ధాటికి కరీబియన్ దీవుల్లో 25 మంది మృతి చెందారు. ఇర్మా తుపానును కేటగిరి 4 నుంచి కేటగిరి 2గా అధికారులు ప్రకటించారు. ఇర్మా ప్రభావంతో మయామీలో ఎమర్జెన్సీ విధించారు. క్యూబాలోనూ ఇర్మా విధ్వంసం సృష్టించింది. తూర్పు , ఉత్తర క్యూబాలో వేలాది ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. 20 లక్షల మంది చిమ్మచీకట్లో మగ్గిపోతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. వరద ముప్పు పొంచి ఉండటంతో ఎవరూ బయటకు రావొద్దంటూ అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ఫ్లోరిడాలోని భారతీయ అమెరికన్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపానులో చిక్కుకున్న భారతీయులకు పలు సంఘాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. 

 

10:35 - September 11, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ ఒలిఫెంటా బ్రిడ్జి నుంచి రాకపోకలను పునః ప్రారంభించారు మంత్రి పద్మారావు. మెట్రో రైలు పనుల్లో భాగంగా గత కొన్ని రోజులుగా రాకపోకలు నిలిపివేశారు. అయితే ఈ సమయంలో బ్రిడ్జి కింద ఇరువైపులా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు పద్మారావు తెలిపారు. 

 

10:32 - September 11, 2017

చంఢీఘర్ : హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్ఛా సౌధా ప్రధాన కార్యాలయంలో మూడు రోజులు పాటు నిర్వహించిన సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ పాల్పడ్డ పలు అరాచకాలు, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పలు హత్యలు జరిగినట్టు గుర్తించారు. హార్డ్‌ డిస్క్‌లు, లాప్‌టాప్‌లు, కంప్యూటర్లుతో పాటు ప్లాస్టిక్‌ నాణేలు స్వాధీనం చేసుకున్నారు. ఆశ్రమంలో స్వాధీనం చేసుకున్న వస్తువులతోపాటు సోదాలపై కోర్టుకు నివేదిక సమర్పించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. 
అక్రమాలు వెలికితీత
హర్యానా సిర్సాలోని డేరా సచ్ఛా సౌధా ఆశ్రమంలో సోదాలను భద్రతా బలగాలు పూర్తి చేశాయి. ఆశ్రమం మొత్తాన్ని జల్లెడపట్టి పలు అక్రమాలను వెలికి తీశారు. సోదాల్లో వెలుగుచూసిన వాస్తవాలు, స్వాధీనం చేసుకున్న వస్తువులతో కోర్టుకు నివేదిక ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోదాలు పూర్తవడంతో సిర్సాలో  శుక్రవారం నుంచి  నిలిపివేసిన ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌ సర్వీసులను ఇవాళ్టి నుంచి పునరుద్ధరించారు. 
డేరా ఆశ్రమంలో రెండు సొరంగ మార్గాలు 
మొత్తం 42 కంపెనీల పారా మిలటరీ బలగాలు, నాలుగు ఆర్మీ బెటాలియన్లు, పోలీసులు, స్వాట్‌ టీములు, డాగ్‌ స్క్వాడ్‌లు సోదాల్లో పాల్గొన్నాయి. డేరా ప్రాంగణంలో రెండు సొరంగ మార్గాలను గుర్తించారు. గుర్మీత్‌ వ్యక్తిగత నివాసం నుంచి సాధ్వీ నివాస్‌కు ఫైబర్‌ సొరంగం ఉన్నట్టు సోదాల్లో వెలుగు చూసింది. పోలీసులు పేలుడు పదార్ధాల తయారీ కర్మాగారాన్ని కూడా గుర్తించారు. గుర్మీత్‌ ఆశ్రమం నుంచి స్వాధీనం  చేసుకున్న కంప్యూటర్లు, లాట్‌టాప్‌లు, హార్డ్‌ డిస్క్‌లల్లోని సామాచారాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. 
14 మృత దేహాల తరలించినట్టు ఆరోపణలు 
డేరా తరుపున ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు  మధ్య వరకు 14 మృత దేహాలను లక్నోలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు వచ్చిన ఆరోపణలపై హర్యానా పోలీసులు స్పందించారు. డేరా ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో మృతదేహాల తరలింపుపై ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు. ఆశ్రమంలోని ఫార్మసీ నుంచి స్వాధీనం చేసుకున్న మందులును పరిశీలిస్తున్నారు. వీటిలో లేబుళ్లులేని మందులు ఎక్కువగా ఉండటంతో, ఇవి ఎక్కడ నుంచి వచ్చాయన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంమీద సోదాల్లో డేరాలో జరిగిన పలు అక్రమాలు వెలుగులోకి రావడంతో వీటన్నింటిని కోర్టుకు నివేదించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.  

 

ఇద్దరు ఉగ్రవాదులు హతం....

జమ్ముకశ్మీర్‌ : కుల్గామ్‌ జిల్లాలో నేడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. బలగాల కదలికలతో అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీనికి స్పందనగా భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు నేలకొరిగారు. వీరిని హిజ్బుల్‌కు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఏకే47, ఇన్సాస్‌ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

10:23 - September 11, 2017

అమెరికా : కరేబియన్‌ దీవులను కకావికలం చేసిన హరికేన్‌ ఇర్మా... ఫ్లోరిడా కీస్‌ దగ్గర తీరం దాటించింది. న్యాపెల్స్‌, పోర్ట్‌ మేయర్స్, టంపావైపు ఈ తుపాను దూసుకెళ్తోంది. మరోవైపు హరికేన్‌ ఇర్మా తుపాను ధాటికి ఫ్లోరిడా ప్రజలు చివురుటాకుల్లా వణికిపోయారు. ప్రచండగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడుతున్నాయి. ఇళ్లపైకప్పులు, రోడ్డుపై నిలిపిన వాహనాలు సైతం గాలికి కొట్టుకుపోతున్నాయి. లక్షలాది మంది అంధకారంలో మగ్గుతున్నారు. 
చిగురుటాకులా వణుకుతోన్న ఫ్లోరిడా
హరికేన్‌ ఇర్మా తుపాను అమెరికాను వణికిస్తోంది. ఇర్మా విలయం ధాటికి ప్లోరిడా చిగురుటాకులా వణుకుతోంది. ఆదివారం రాత్రి టంపా ప్రాంతం మీదుగా ఇర్మా తీరాన్ని దాటింది.  ఫ్లోరిడా కీస్‌ వద్ద తుపాను తీరం దాటింది.  ఇర్మా తీరం దాటే సమయానికి గంటకు 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇర్మా తుపాను ధాటికి ప్లోరిడాలోని అనేక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 
దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థ
ఇప్పటికే కరేబియన్‌ దీవులను ముంచెత్తిన ఇర్మా.. ఇపుడు ప్లోరిడాను అతలాకుతలం చేస్తోంది.  ప్రచండగాలులకు  విద్యుత్‌ సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మియామి, ఫ్లోరిడా రాష్ట్రాల తీరప్రాంతాల్లో అంధకారం నెలకొంది. తుఫాన్‌ ప్రభావంతో వీస్తున్న ప్రచండగాలులకు లక్షలాది ఇళ్లు నేలమట్టమయ్యియి. రోడ్లపై నిలిపిన వాహనాలు సైతం కాగితాల్లా ఎగిరిపడుతున్నాయి.  తుఫాను ధాటికి ఒక్క ద‌క్షిణ ఫ్లొరిడాప్రాంతంలోనే నాలుగున్నర  ల‌క్షల ఇళ్లకు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. 
సురక్షిత ప్రాంతాలకు 60లక్షల మంది తరలింపు
మరోవైపు ఇర్మా హరికేన్‌ ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 60లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను తుఫాను  4 కేటగిరీలుగా మారిందన్న యూఎస్ నేష‌న‌ల్ హ‌రికేన్ సెంట‌ర్  ప్రకటన ఫ్లోరిడా ప్రాంత ప్రజలను  మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. తుపాను ధాటికి ఫ్లొరిడాలోని అనేక ప్రాంతాల్లో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. నేపెల్స్, పోర్ట్ మేయ‌ర్స్, టంపా ప్రాంతాల వైపు ఈ తుపాను దూసుకెళ్తుతున్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు.
భార‌తీయుల‌ను ర‌క్షించే చ‌ర్యలు
మరోవైపు ఫ్లోరిడాలోని ల‌క్షా 20 వేల మంది భార‌తీయుల‌ను ర‌క్షించే చ‌ర్యల‌ను భార‌త రాయ‌బార కార్యాల‌యం చేప‌ట్టింది. తుపాను ప‌రిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.  అమెరికాలోనే మూడవ అతిపెద్ద జనాభా కలిగిన ఫ్లోరిడా తీర ప్రాంతంలో తీవ్రగాలులతో ఇళ్ల పైకప్పులు, రోడ్లుపై పార్కింగ్ చేసిన వాహనాలు కదలిపోతున్నాయి. దీనికితోడు బ్రోవర్డ్ కౌంటీలో టోర్నడో చెలరేగి 15 అడుగుల ఎత్తులో గాలి సుడులు తిరుగుతూ విరుచుకుపడింది.  తీరప్రాంత కెరటాలు 12 అడుగుల ఎత్తుకు విరుచుకుపడినట్టు అధికారులు తెలిపారు.  దీంతో ఇప్పటికే ఫ్లోరిడాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.  

10:16 - September 11, 2017

టీసర్కార్ చేపట్టిన రైతు సమితులపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత దుర్గాస్రసాద్, టీఆర్ ఎస్ నేత, ఎంబిసి చైర్మన్ తాడూరి శ్రీనివాస్ రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నేత సుభాష్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఐమాక్స్ సమీపంలో ప్రమాదం :ఇద్దరి మృతి

హైదరాబాద్: ఐమాక్స్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఎగ్జిబిషన్ కోసం నిర్మిస్తున్న షెడ్డు కూలి ఇద్దరు మృతి చెందారు. మృతులు సలీం, ప్రసాద్ లు గా గుర్తించారు.

అమెరికాలో ఇర్మా తుపాన్ విధ్వంసం

హైదరాబాద్ : అమెరికాలో ఇర్మా తుపాన్ విధ్వంసం సృష్టిస్తోంది. ఫ్లోరిడాలో పెను బీభత్సం సృష్టించిన ఇర్మా తుపాను రెండు తీరాలను తాకింది. కేటగిరి -4 నుంచి కేటగిరి -2గా మారింది. గంటలకు 210 కి.మీ వేగంతో గాలులు విరుచుకుపడ్డాయి. తుపాన్ దెబ్బకు నలుగురు మృతి చెందగా భారీ ఆస్థి నష్టం సంభవించినట్లు సమాచారం. 65 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 15 లక్షల ఇళ్లు, ఆఫీసులకు విద్యుత్ సఫరా నిలిచిపోయింది. మయామిలో ఎమర్జెన్సీ విధించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకి రావద్దని హెచ్చరించారు. ఇప్పటికే మయామి సహా అనేక నగరాలు జలమయం అయ్యాయి.

తూనికలు, కొలతల శాఖ ఇన్ స్పెక్టర్ నాగోతు స్వామి ఇంటిపై ఏసీబీ దాడులు

కర్నూలు : తూనికలు, కొలతల శాఖ ఇన్ స్పెక్టర్ నాగోతు స్వామి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మంచి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై సోదాలు చేపట్టింది. హైదరాబాద్ లోని ఎర్రగడ్డలోని స్వామి బావమరిది ఇంట్లో తనిఖీలు చేస్తోంది.

యూనిఫాం లేదని బాలికను బాలికల వాష్ లో ఉంచిన టీచర్..

సంగారెడ్డి: బీహెచ్ ఈఎల్ రావూస్ హైస్కూల్ లో దారుణం జరిగింది. యూనిఫాం వేసుకురాలేదని బాలికను బాలుర వాష్ రూమ్ లో టీచర్ నిలబెట్టింది. సమాచారం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. అంతే కాక బాలల హక్కుల కమిషన్ కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

భారీగా కల్తీ పాలు పట్టివేత...

యాదాద్రి భువ‌న‌గ‌రి: బొమ్మ‌ల రామారం మండ‌లం ఫ‌కీర్ గూడెంలో ఆయిల్ తో పాటు పాల‌ను క‌ల్తీ చేస్తున్న వ్య‌క్తిని అరెస్ట్ చేశారు. అత‌డి నుంచి 240 లీట‌ర్ల కల్తీ పాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

భార్య పుట్టింటికి వెళ్లిందని కుమారుడిని హత్య చేసిన తండ్రి

నల్గొండ : తిరుమలగిరి మండలం కొంపల్లిలో దారుణం జరిగింది. భార్య పుట్టింటికి వెళ్లి రావడం లేదన్న మనస్థాపంతో మద్యం మత్తులో ఐదేళ్ల కుమారుడిని తండ్రి రవి హత్య చేశాడు. గొంతు నులిమి చంపి మృతదేహాన్ని బావిలో పేడేశాడు.

09:45 - September 11, 2017

వాస్తవ సాగుదారులను గుర్తించాలని రైతు సంఘం నాయకులు అరిబండి ప్రసాదరావు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన  జనపథం కార్యకమ్రంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 39న ప్రకంకపనలు సృష్టిస్తోంది. భూ సర్వేలు, భూ రికార్డుల ప్రక్షాళన, రైతు సమితుల ఏర్పాటు అంటూ ప్రభుత్వం చేస్తున్న హడావిడి అనేక ప్రశ్నలు సంధిస్తోంది. అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయతలపెట్టిన రైతు సమితులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి'. మరిన్ని వివరాలనువీడియోలో చూద్దాం...

 

09:36 - September 11, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయలు రసకందాయంలో పడ్డాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే ప్రభుత్వం విశ్వాస పరీక్షకు మొగ్గు చూపకపోడతంతో, ఈ అంశంపై కోర్టును ఆశ్రయించాలని ప్రతిపక్ష డీఎంకే నిర్ణయించింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలన్న విపక్షాల విజ్ఞప్తిపై  ఆ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు సానుకూలంగా స్పందించకపోవడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు స్టాలిన్‌...  ఇన్‌చార్జ్‌ గవర్నర్‌  విద్యాసాగర్‌రావును రెండు సార్లు కలిసి... పళనిస్వామి ప్రభుత్వ  బలనిరూపణకు ఆదేశించాలని కోరారు. దీనికి విద్యాసాగర్‌రావు సానుకూలంగా స్పందించకపోవడంతో ఇకపై హైకోర్టును ఆశ్రయించాలని డీఎంకే నిర్ణయించింది. 
మైనారిటీ ప్రభుత్వం నడుపుతున్న సీఎం పళనిస్వామి   
ముఖ్యమంత్రి పళనిస్వామి మైనారిటీ ప్రభుత్వం నడుపుతున్నారు. అన్నా డీఎంకేకి అసెంబ్లీలో తనిగన సంఖ్యాబలం లేకపోవడంతోనే బలనిరూపణకు పళనిస్వామి భయపడుతున్నారన్నది విపక్ష డీఎంకే వాదన. తమిళనాడు అసెంబ్లీలో 238 మంది సభ్యులు ఉన్నారు. పళనిస్వామి ప్రభుత్వానికి 114 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. డీఎంకేకి 89 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలు, ఐయూఎంఎల్‌కు ఒక సభ్యుడు ఉన్నారు.  అన్నా డీఎంకే చీలికవర్గం దినకరన్‌కు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నారు. దినకరన్‌ వర్గం కూడా పళనిస్వామి మంత్రివర్గం బలపరీక్ష కోరుతోంది. గవర్నర్‌ను రెండుసార్లు కలిసి తన వాదాన్ని వినిపించారు. బలపరీక్ష కోరుతున్న డీఎంకే, అన్నా డీఎంకే చీలికవర్గం ఎమ్మెల్యేల సంఖ్య 119 ఉందని చెబుతున్నారు. పళనిస్వామి మంత్రివర్గాన్ని పడగొట్టే ఉద్దేశం తమకులేదని దినకరన్‌ చెబుతున్నా... ప్రభుత్వ బలపరీక్షకు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అంగీకరించకపోవడంతో... దినకరన్‌ కూడా ఇప్పుడు ప్రత్యామ్నాయాలు గురించి ఆలోచిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పళనిస్వామి తకు 124 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని చెబుతున్నారు. దినకరన్‌ వర్గం నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తమవైపు తిరిగిరావడంతో తమ బలం 124కు పెరిగిందని, ఈ పరిస్థితుల్లో మెజారిటీ తమకే ఉందని పళనిస్వామి  వర్గం వాదిస్తోంది. తమిళనాడు రాజకీయాలు ఏ  మలుపు తిరుగుతా చూడాలి. 

09:30 - September 11, 2017

భద్రాద్రికొత్తగూడెం : సహజీవనం.. ఈ మాట ఉన్నత వర్గాలకు, సినీ హీరో, హీరోయిన్లకు, సెలబ్రిటీల జీవితాల్లో వినిపించే మాట. ఇప్పుడు ఈ విష సంస్కృతి  మారు మూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఉన్నత వర్గాల్లో బంధాలు చెడిపోతే ఎవరిదారి వారు చూసుకుంటారు.. కానీ గ్రామీణ వాతావరణంలో అలా కుదరదు.. ప్రేమ ఆప్యాయతలు చంపుకొలేరు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇలా జరిగిన సంఘటన ఒకసారి చూడండి..
కారు డ్రైవర్‌ శేషు ప్రేమాయణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకి చెందిన నాగమణి ఓ ప్రయివేటు స్కూల్‌లో టీచర్‌. ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న శేషు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. గత పన్నెండు సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేస్తూ...శారీరకంగా వాడుకొని, కోర్కెలు తీర్చుకుని ఆమెను గర్భవతిని చేశాడు. తనకు ఇప్పుడే పిల్లలు వద్దంటూ ఆమెని నమ్మించి..అబార్షన్‌ చేయించాడు.. 
ప్రశ్నించిన నాగమణికి బెదిరింపులు
నాగమణి పెళ్లి చేసుకుందామని శేషును అడిగిన ప్రతిసారీ దాటవేసేవాడు. పెళ్లిమాట ఎత్తేసరికి ఇదిగో అదిగో అంటూ.. రేషన్‌ కార్డ్‌లో తన భార్యగా పేరు నమోదు చేయిచాడు. పెళ్లి చేసుకుంటాడని నమ్మిన నాగమణి శేషుని అనుమానించలేదు. ఇంతలో శేషుకి మరో మహిళతో పరిచయం ఏర్పడటంతో నాగమణిని దూరం పెట్టసాగాడు. విషయం తెలుసుకున్న నాగమణి అతన్ని నిలదీసింది. అధికారపార్టీ అండదండలు చూసుకున్న శేషు నీకు, నాకు ఏ సంబంధం లేదని తెగేసి చెప్పాడు. కావాలంటే రేషన్‌ కార్డులో కూడా నీ పేరు తొలగించానని నువ్వు దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. అడ్డం వస్తే మీ వాళ్లని చంపుతానని బెదిరిస్తున్నాడని నాగమణి వాపోయింది..
ప్రియుడి ఇంటిముందు మౌన పోరాటం
తాను మోసపోయానని గ్రహించిన నాగమణి శేషు ఇంటికి వెళ్లి అతని తల్లిని అడగ్గా పది రోజుల నుంచి ఇంటికి రాలేదని చెబుతూ.. నువ్వు ఎవ్వరు అంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. శేషు తనని పెళ్లి చేసుకొనే వరకు తన ఇంటి ముందు నుండి కదలనని.. మౌన పోరాటం చేస్తోంది. బాధితురాలికి అండగా కుటుంబ సభ్యులు, స్థానికుల సహకారంతో టెంట్‌ వేసుకుని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. నాగమణి దీక్షకు స్థానికులతో పాటు మహిళాసంఘాలూ మద్దతు తెలుపుతున్నాయి. నాగమణికి న్యాయం జరగాలని మనమూ కోరుకుందాం. 

09:25 - September 11, 2017

కృష్ణా : విజయవాడ రైల్వే స్టేషన్‌లో దోపిడీ పర్వం కొనసాగుతోంది. రైల్వేస్టేషన్‌లో తినుబండారాల ధరలు చూసి ప్రయాణికులు కంగుతింటున్నారు. ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లుకు విక్రయిస్తూ వ్యాపారులు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. . రైల్వే అధికారుల నిఘా లోపంతో వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.   
ఏడాదికి 175 కోట్లకు పైగా ఆదాయం
ఏడాదికి 175 కోట్లకు పైగా ఆదాయం.70 ప్యాసింజర్ రైళ్లు, 250 ఎక్స్‌ప్రెస్ రైళ్లు. బెజవాడ రైల్వేజంక్షన్ మీదుగా నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణికుల రాకపోకలు. రైల్వేకు అత్యధిక ఆదాయమార్గంగా ఉన్న బెజవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు కనీసం ఆహారపదార్థాలు కూడా కొనలేని దుస్థితి నెలకొంది. స్టేషన్‌లో దోపిడీ పెచ్చుమీరిపోతోంది. రోజు రోజుకు ధరలు పెంచుతూ వ్యాపారులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మార్పీ ధరల కన్నా అధికంగా వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. రైల్వే జీఎం, డీఆర్ఎం తనిఖీ సమయాల్లో మాత్రమే ఎమ్మార్పీ ధరలకు విక్రయిస్తూ.. మిగతా సమయాల్లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. 
బాదం మిల్క్ ధర రూ.25 కు బదులుగా రూ.35  
200 ఎంఎల్ బాదం మిల్క్ ధర 25 రూపాయలుగా ఉంటే.. దాన్ని 30 నుంచి 35కు విక్రయిస్తున్నారు. లీటర్ వాటర్ బాటిల్ 15 అయితే 20 నుంచి 25లకు అమ్ముతున్నారు. ఇక కూల్‌డ్రింక్స్‌పై అదనంగా 5 వడ్డిస్తున్నారు. 60 రూపాయల ఉన్న బిర్యానీని 70కి, 40 రూపాయలున్న కర్డ్ రైస్‌ని 50కి విక్రయిస్తున్నారు. తినుబండారాలు రుచి, సుచి లేకపోయినా..ఇష్టారాజ్యంగా దండుకుంటున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని మండపడుతున్నారు.  
వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి : ప్రయాణికులు 
ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. అలాగే తినుబండారాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించారో లేదో తెలుసుకునేందుకు నిత్యం తనిఖీలు చేయాలని చెబుతున్నారు. 

 

09:18 - September 11, 2017

ఖమ్మం : ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది.. వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో... ప్రసవ వేదనతో వచ్చిన గర్భిణీ బల్లపైనే ప్రసవించింది.. బల్లపైనుంచి కిందపడిన శిశువు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణకు ఆదేశించారు.
వైద్యుల నిర్లక్ష్యం..శిశువు మృతి 
ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ గర్భిణీకి అంతులేని శోకం మిగిల్చింది... ఖమ్మం జిల్లా పల్లెగూడెంకు చెందిన నాగమణి నిండు గర్భిణి... ప్రసవ వేదనతో ఉన్న ఆమె... భర్త రాజయ్యతో కలిసి శనివారం రాత్రి ఆస్పత్రికి వచ్చింది.. నెలలు నిండలేదని చెప్పిన వైద్యులు... ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. వరండాలో విశ్రాంతి తీసుకోమని చెప్పారు.. నొప్పులు తీవ్రమై ఆమె బల్లపైనే ప్రసవించింది... బల్లపైనుంచి జారిపడి శిశువు మృత్యువాత పడ్డాడు.. 
బిడ్డ మృతితో దంపతులు కన్నీరుమున్నీరు
బిడ్డ మృతితో రాజయ్య దంపతులు కన్నీరుమున్నీరయ్యారు.. వైద్యుల నిర్లక్ష్యంవల్లే పసికందు మృతి చెందాడంటూ ఆందోళనకు దిగారు.. వీరికి మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి.. శిశువు మృతికి బాధ్యులైన డాక్టర్లపై చర్య తీసుకోవాలంటూ ఐద్వా ఆధ్వర్యంలో ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు.. అటు శిశువు మృతి విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఘటనపై పూర్తి వివరాలతో తనకు నివేదిక అందించాలని ఆదేశించారు.. మంత్రి ఆదేశాలతో కదిలిన వైద్యులు... ఈ ఘటనలో డాక్టర్ల తప్పేమీ లేదన్నట్లుగా నివేదిక మార్చారంటూ ఆరోపణలొస్తున్నాయి.. గర్భంలోనే శిశువు మృతి చెందిందంటూ డాక్టర్లు చెబుతున్నారు. శిశువు మృతి ఘటన సర్కారు ఆస్పత్రుల్లో వైద్యం పరిస్థితిని మరోసారి కళ్లకు కట్టింది.. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది.. 

09:14 - September 11, 2017

మెదక్‌ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం నాగసానిపల్లి దగ్గర పర్యాటక బస్సు బోల్తాపడింది. ఏడు పాయల నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సు.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని  తప్పించబోయి అదుపుతప్పింది. పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారంతా హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. పింకి ఆనంద్‌ కుమారుడు రుత్విక్‌ పుట్టు వెంట్రుకలు ఏడుపాయల దగ్గర తీసి తిరుగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

 

09:12 - September 11, 2017

కడప : ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను కోరారు... మంత్రి ఆది నారాయణ రెడ్డి.. కడప వైఎస్ ఆర్ ఆడిటోరియంలో టీడీపీ జిల్లా స్థాయి సమావేశానికి మంత్రితోపాటు... ఎమ్మెల్సీ దొరబాబు హాజరయ్యారు.. నేతలు, కార్యకర్తలకు పార్టీ కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చామని స్పష్టం చేశారు.

 

08:48 - September 11, 2017

కడప : జిల్లాలో జ్వరాలతో జనాలు ఇబ్బంది పడుతున్నా... పట్టించుకునేవారే కరువయ్యారని... వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆకెపాటి అమర్‌నాథ్ రెడ్డి విమర్శించారు. వైసీపీ ప్రకటించిన నవరత్నాల గురించి ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. అక్టోబర్‌ 2 వరకూ ప్రతి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లోకి వెళ్లి వీటి గురించి ప్రజలకు చెబుతామని స్పష్టం చేశారు.

 

08:41 - September 11, 2017

నిజామాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధిత గ్రామాల ప్రజలు ఆందోళనకు సిద్ధ మవుతున్నారు. పాత డిజైన్‌ ప్రకారమే ప్రాజెక్టు నిర్మించాలన్న డిమాండ్‌తో ఉద్యమానికి రెడీ అవుతున్నారు. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకంకాదని... అయితే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌ చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువని వాదిస్తున్నారు. అందుకే డిజైన్‌ మార్చకుండా  ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
మారిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రూపురేఖలు
ప్రాణహిత - చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు 21వ ప్యాకేజీలో భాగంగా  నిజామాబాద్‌ జిల్లాలోని మంచిప్ప, కొండెం చెరువులను  వేర్వేరు రిజర్వాయర్లుగా వాడుకోవాలని నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది.  అయితే టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు రూపురేఖలే మారిపోయాయి. ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్‌ చేసిన ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. మంచిప్ప, కొండెం చెరువులు వేర్వేరుకాకుండా  రెండు చెరువుల మధ్యలో ఉన్న ప్రాంతానంతా కలిపి ఓ భారీ జలాశయంగా మార్చాలని డిజైన్‌ చేసింది. 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని భావించింది. కానీ 3.5 టీఎంసీలకు మాత్రమే అనుమతులు ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా... అసలు సమస్య ఇక్కడే మొదలైంది.
నిరాశ్రయులువుతోన్న 10 గ్రామాల ప్రజలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన మంచిప్ప రిజర్వాయర్‌తో మూడు గ్రామాలు , ఏడు గిరిజన గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఈ గ్రామాల్లోని ప్రజలంతా నిరాశ్రయులవుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టింది. ప్రజలంతా ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైనింగ్‌ చేయడం వల్ల ఏ ఉపయోగం లేదని ముంపు వాసులు చెబుతున్నారు. అప్పుడు మూడు గ్రామాలే ముంపు బారిన ఉంటే... ఇప్పుడు 10 గ్రామాల వరకు ముంపుకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1200 ఎకరాల ఆయకట్టుకు నష్టం కలుగమేకాకుండా... 800 ఎకరాల్లోని అటవీ సంపద మునిగిపోతుందని.. తద్వారా ఇది పర్యావరణాన్ని దెబ్బతింటుందన్నారు.  పాత డిజైన్‌ ప్రకారమే ప్రాజెక్టు నిర్మించాలని కోరుతున్నారు.
భయబ్రాంతులకు గురిచేస్తోన్న ప్రభుత్వం : ముంపు బాధితులు  
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం తమను భయబ్రాంతులకు గురిచేస్తోందని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు  బలవంతంగా లాక్కుంటున్నారని వాపోయారు. తమ భూములకు సరైన పరిహారం కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పరిహారం కోసం మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నామన్నారు.  తమకు డబ్బులు వద్దని.. భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు ఇప్పించాలని వేడుకుంటున్నారు.
ఆందోళనకు సిద్ధమవుతున్న బాధితులు
పాత డిజైన్‌ ప్రకారమే ప్రాజెక్టు నిర్మించాలని బాధితులంతా ఆందోళబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.  ముంపు గ్రామాల ప్రజలు ఓ కమిటీని ఏర్పాటు చేసుకుని ఆందోళనలు చేసేందుకు రెడీ అవుతున్నారు.  తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు నిర్వహిస్తూనే ఉంటామని ముంపు బాధితులు స్పష్టం చేస్తున్నారు.   

 

08:29 - September 11, 2017

హైదరాబాద్ : టీఆర్ ఎస్ బలోపేతం పై గులాబి పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. రాబోయే ఎన్నికల కోసం బలమైన అభ్యర్థులను కారెక్కించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా ఇతర నేతల చేరికపై ఇప్పటికే పార్టీలో చర్చలు ప్రారంభమైనట్టు ప్రచారం జరుగుతోంది. 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొనేందుకు  అధికార టీఆర్‌ఎస్‌ కసరత్తు ప్రారంభించింది. దాదాపు  రెండేళ్లు ముందు నుంచే ఎన్నికలకు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా మళ్లీ ఆపరేషణ్‌ ఆకర్ష్‌కు తెరతీయాలని టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆలోచిస్తోంది. 
బలమైన నేతలను వెతికే పనిలో టీఆర్‌ఎస్‌ 
ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కి 90 మంది శాసనసభ్యులున్నా.....వీరిలో బలమైన నేతలు చాలా తక్కువని టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం భావిస్తోంది.  ఇదే టీంతో వచ్చే ఎన్నికలకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయో అన్న అనుమానాలు  గులాబీ నాయకత్వాన్ని వేధిస్తున్నాయి. దీంతో బలమైన నేతలను వెతికే పనిలో పార్టీ నాయకత్వం నిమగ్నమైంది.   ప్రభుత్వ తీరుపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదని ప్రభుత్వ నిర్వహించిన సర్వేల్లో తేలింది. అయితే  కొందరు శాసనసభ్యులపై తీవ్రంగా వ్యతిరేకత ఉన్నట్టు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది.  దీన్ని బేరీజు వేసుకుంటున్న ముఖ్యమంత్రి రాజకీయంగా మార్పులు చేర్పులు చేయాలనే అంశంపై దృష్టి పెట్టారని సమాచారం.
ప్రతిపక్షంలోని బలమైన నేతలతో చర్చలు 
ఆపరేషణ్‌ ఆకర్ష్‌లో భాగంగానే  ప్రతిపక్షంలో ఉన్న బలమైన నేతలపై ఆరా తీసి, వారితో  చర్చలు కూడా  టీఆర్‌ఎస్‌ నేతలు  మొదలుపెట్టినట్టు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ పై ఆశలు పెంచుకున్నారు.  అదే విధంగా మెదక్ జిల్లాలో మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహాతో కూడా చర్చలు జరుపుతున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.  అయితే   మెదక్ జిల్లాలో తాను  సూచించిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని రాజనర్సింహ  డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. వికారాబాద్ లో కాంగ్రెస్‌ మాజీ మంత్రి ప్రసాద్  కుమార్ కు గులాబి నేతలు వలవేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ వంటి నేతలను  పార్టీ బలోపేతం చేసేందుకే కారెక్కించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.  
రంగంలోకి బలమైన నేతలు
2019 ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో బలమైన నేతలను రంగంలోకి దించితే తిరుగులేని మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రావొచ్చని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు. నియోజకవర్గంలో బలమైన నేతలు ఏ పార్టీలో ఉన్నా....కారెక్కించుకోవడం లక్ష్యంగానే అధికార పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ను అమలు చేస్తున్నట్లు సమాచారం.

 

ఎదురుకాల్పుల్లో జవానుకు గాయాలు

శ్రీనగర్ : కుల్గామ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి.  మరో ఉగ్రవాదిని పట్టుకున్నాయి. ఎదురుకాల్పుల్లో ఓ జవానుకు గాయాలయ్యాయి. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. 

 

అమెరికాలో ఇర్మా తుఫాన్ బీభత్సం

వాషింగ్టన్ : అమెరికాలో ఇర్మా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఫ్లోరిడాలో పెను బీభత్సం సృష్టించింది. ఇర్మా హరికేన్ రెండు తీరాలను తాకింది. కేటగిరి 4 నుంచి కేటగిరి 2 గా ఇర్మా హరికేన్ మారింది. నలుగురు మృతి చెందారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. 65 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంటకు 210 కిమీ వేగంతో గాలులు విరుచుకుపడ్డారు. పెను గాలుల ధాటికి భారీగా ఆస్తి నష్టం కలిగింది. 

నేడు ఏపీలో బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ పర్యటన

హైదరాబాద్ : నేడు ఏపీలో బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ పర్యటించనున్నారు. 

 

నేటి నుంచి సిర్సాలో రైళ్లు, ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరణ

హర్యానా : నేటి నుంచి సిర్సాలో రైళ్లు, ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరణ కానున్నాయి. 

నేడు బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

హైదరాబాద్ : నేడు బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరుగనుంది. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

జీవో నెం.39 వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన

హైదరాబాద్ : జీవో నెం.39 వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. నేడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చారు. 

 

నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

శ్రీకాకుళం : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. వీరఘట్టం మండలం టట్టంగిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. 

 

Don't Miss