Activities calendar

12 September 2017

22:01 - September 12, 2017
22:00 - September 12, 2017

గుజరాత్‌ : గుజరాత్ 2002లో  జ‌రిగిన అల్లర్ల కేసుకు సంబంధించి బిజెపి చీఫ్‌ అమిత్ షాకు సిట్‌ కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. సెప్టెంబర్‌ 18న కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని అమిత్‌షాను ఆదేశించింది. అమిత్‌షా సాక్షిగా కోర్టు ముందు హాజ‌రు కావాల‌ని ఈ కేసులో హ‌త్యానేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న గుజరాత్‌ మాజీ మంత్రి మాయా కొద్నానీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కొద్నాని విజ్ఞప్తిని ఏప్రిల్‌లో కోర్టు అంగీకరించింది. నరోద గ్రామంలో జరిగిన అల్లర్లలో 11 మంది ముస్లింలు ఊచకోతకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచారణ 4 వారాల్లోగా పూర్తి చేయాలని సిట్‌ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. 2002 అల్లర్లకు సంబంధించి మాయా కొద్నానీ దోషిగా తేలింది. ఆ హ‌త్యలు జ‌రిగిన స‌మ‌యంలో తాను అమిత్ షాతో క‌లిసి త‌న ఆసుప‌త్రిలో ఉన్నట్లు మాయా కొద్నాని  చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి 2009లో మాయా కొద్నానిని అరెస్ట్‌ చేశారు. 

21:58 - September 12, 2017

ఢిల్లీ : కాలిఫోర్నియాలోని బర్క్‌లీ యూనివర్సిటీలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రసంగంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు.  భారత్‌లో వారసత్వ రాజకీయాలు సర్వసాధారణమేనని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నవారికి ఎలాంటి వారసత్వ రాజకీయాలు లేవన్నారు. గుజరాత్‌కు చెందిన ప్రధాని మోది పేద కుటుంబం నుంచి ప్రధాని స్థాయికి ఎదిగారని, రాష్ట్రపతి కోవింద్‌ దళిత కుటుంబం నుంచి వచ్చారని గుర్తు చేశారు. ఉపరాష్ట్రపతి కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినవారేనని మంత్రి తెలిపారు. వీరంతా జీవితంలో ఎన్నో పోరాటాలు చేసిన ఈ స్థాయికి ఎదిగారని స్మృతీ అన్నారు. ప్రజాస్వామ్యంలో వారసత్వానికి తావులేదని ప్రతిభే కొలమానమని చెప్పుకొచ్చారు. 

21:56 - September 12, 2017

వాషింగ్టన్ : అమెరికాలో రెండు వారాల పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మోది ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. భారత్‌లో ప్రస్తుతం అసహన పరిస్థితులు నెలకొన్నాయని... గోరక్షణ, బీఫ్‌ పేరిట మైనారిటీలు, దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. మోది ప్రభుత్వం తీసుకున్న  పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి నిర్ణయం వల్ల భారత ఆర్థిక వృద్ధిరేటు తగ్గిపోతోందని రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని పదవికి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రాహుల్‌ స్పష్టం చేశారు. కాలిఫోర్నియాలోని బర్క్‌లీ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్‌ మాట్లాడారు. మాది సంస్థాగత పార్టీ...దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. తాను వారసత్వంగా రాజకీయాల్లో వచ్చానని అనుకోవద్దన్నారు. అఖిలేష్‌ యాదవ్‌, స్టాలిన్‌ కూడా వారసత్వంగా వచ్చినవారేనని రాహుల్‌ గుర్తు చేశారు. 

 

21:54 - September 12, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోది నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1శాతం అదనపు డీఏకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రస్తుతం అమలులో ఉన్న 4 శాతం డిఏకు ఇది అదనం. జులై 1, 2017 నుండి అదనపు డీఏ వర్తిస్తుంది. అలాగే గ్రాట్యుటీ చెల్లింపు గరిష్ట పరిమితిని పెంచే చట్ట సవరణకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7వ వేతన సంఘం సిఫారసు మేరకు గ్రాట్యుటీ గరిష్ట పరిమితి... 10 లక్షల నుండి 20 లక్షల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డియర్‌నెస్‌ అలవెన్స్‌ను, డియర్‌నెస్‌ రిలీఫ్‌ను 1 శాతం పెంచి 5 శాతానికి పెంచింది. దీంతో కేంద్ర ఖజానాపై 3 వేల 68 కోట్ల భారం పడనుంది. కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంతో 49.26 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. వీటితో పాటు... ఆంధ్రప్రదేశ్‌లో 16వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో నరసన్నపేట నుండి రణస్థలం వరకు 54 కిలోమీటర్ల వరకు 6లేన్లతో రహదారిని విస్తరించనున్నారు. ఇందుకోసం 14వందల 63కోట్లు ఖర్చు చేయనున్నారు. కలకత్తా - చెన్నై కారిడార్‌ విస్తరణలో భాగంగా ఈ పనులు చేపట్టనున్నారు. 

 

21:52 - September 12, 2017

చెన్నై : అన్నాడిఎంకేలో చిన్నమ్మ శశికళ శకం ముగిసినట్లేనా? తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తూ అన్నాడిఎంకె నిర్ణయం తీసుకుంది. మరోవైపు పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకే మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్ వేసింది.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత పార్టీలో ప్రభుత్వంలో చక్రం తిప్పాలని భావించిన చిన్నమ్మ
శశికళ ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. ఇప్పటికే అక్రమ ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు. పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం నేతృత్వంలో చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పటికీ జయలలితదేనని జనరల్‌ కౌన్సిల్‌ తీర్మానించింది. ఆ బాధ్యతలను తాత్కాలికంగా చేపట్టిన శశికళను పదవి నుంచి తొలగిస్తూ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. పార్టీ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పన్నీర్‌ సెల్వం, అసిస్టెంట్‌ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పళనిస్వామి ఉంటారని కార్యవర్గం పేర్కొంది. శశికళ మేనల్లుడు దినకరన్‌ చేపట్టిన నియామకాలు, ప్రకటనలను ఆమోదించమని స్పష్టం చేసింది. పార్టీ రెండాకుల గుర్తును తిరిగి కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాలని సమావేశం నిర్ణయించింది.

మరోవైపు త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి ప‌ళ‌ని ప్రభుత్వం బ‌ల‌నిరూప‌ణ నిర్వహించాల‌ని డీఎంకే నేత స్టాలిన్ మద్రాస్‌ కోర్టుకు వెళ్లారు. స్టాలిన్‌తో పాటు పీఎంకే పార్టీకి చెందిన బాలు కూడా పిటిష‌న్ వేశారు. ఈ పిటిషన్‌పై అక్టోబ‌ర్ 10వ తేదీన  మద్రాస్ హై కోర్టు విచారణ చేపట్టనుంది. 

తమిళనాడు ప్రజలను, పార్టీ కార్యకర్తలను పన్నీర్‌సెల్వం, పళనిస్వామి మోసం చేశారని దినకరన్‌ మండిపడ్డారు. పళనిస్వామి ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తానని హెచ్చరించారు. అన్నాడిఎంకెకు చెందిన 19 మంది ఎమ్మెల్యేలు దినకరన్‌ వెంట ఉండడంతో పళనిస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. 

శశికళకు  కాలం కలిసి రాలేదు. జయలలిత మరణానంతరం శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టడం....పన్నీర్‌ సెల్వంను సిఎంను పదవి నుంచి తొలగించడం జరిగిపోయాయి. తదనంతరం జరిగిన పరిణామాల్లో పార్టీ రెండుగా చీలిపోయింది. సిఎంగా బాధ్యతలు చేపడతారు అనుకునే సందర్భంలో అక్రమ ఆస్తుల కేసులో శశికళ జైలుపాలయ్యారు. దీంతో ఆమె మేనల్లుడు దినకరన్‌కు ఉప ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం పార్టీలో కొందరికి నచ్చలేదు. ఈ నేపథ్యంలో పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం వర్గాలు ఏకమయ్యాయి. శశికళ, దినకరన్‌కు  అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు  తాజాగా తీర్మానం చేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో శశికళ ఎలాంటి వ్యూహం పన్నుతారో  వేచి చూడాల్సిందే.

21:49 - September 12, 2017
21:48 - September 12, 2017

హైదరాబాద్ : లోధా బిల్డర్స్‌ పై మెరిడియమ్ అపార్టుమెంట్ వాసుల ధర్నా ఉద్రిక్తంగా మారింది. తమకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బాధితులు నిరసనకు దిగారు. లోధాబిల్డర్‌, నాయకులు కుమ్మక్కై.. అన్యాయం చేస్తున్నారని 7వంద ఫ్యామిలీలు ఆవేదన వ్యక్తం చేశాయి. అయితే కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బాధితులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.

 

21:47 - September 12, 2017

హైదరాబాద్ : ఐలయ్య రాసిన పుస్తకంపై భేదాభిప్రాయాలుంటే విమర్శలు చేయొచ్చుకానీ, చంపుతామని బెదిరించడం సబబు కాదన్నారు తెలంగాణ సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఐలయ్య చాలాకాలంగా పోరాడుతున్నారని..ఆర్యవైశ్యులను రెచ్చగొట్టడం వెనక వారి హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.  

 

21:44 - September 12, 2017

హైదరాబాద్ : తెలుగు భాషకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో తెలుగును తప్పనిసరి చేసింది. తెలుగును తప్పనిసరిగా బోధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంచేశారు. తెలుగు మహాసభల నిర్వహణపై సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 12వ తరగతి వరకు పాఠ్యాంశంగా తెలుగు కచ్చితంగా బోధించే పాఠశాలలు, కళాశాలలకు మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు అన్ని పాఠశాలల నామ ఫలకాలు కూడా తెలుగులోనే ఉండాలన్నారు. దీంతో పాటు తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహాసభల సన్నాహక కార్యక్రమాలు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణకు రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 

 

21:41 - September 12, 2017

విశాఖ : నగరంలో ఇండియన్‌ ఓపెన్‌ ప్రపంచ ర్యాంకింగ్‌ స్కూకర్‌ టోర్నమెంట్‌ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ పోటీలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. నగరంలోని బీచ్ రోడ్డులో ఉన్న నోవాటెల్ హోటల్లో ఐదు రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయి. స్నూకర్‌ టోర్నీలో వరల్డ్ నెంబర్ వన్‌ షాన్‌మర్ఫీ, భారత స్నూకర్‌ ఆదిత్య మెహతా సహా 64 మంది అగ్ర క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనున్నారు. ప్రపంచ ఛాంపియన్‌ జాన్‌ హిగిన్స్‌ ఈ టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.  విశాఖ నగరంలో ఇలాంటి స్నూకర్‌ టోర్నమెంట్‌ను నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని.. క్రీడల హబ్‌గా ఏపీని నిలుపుతామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. 

 

21:39 - September 12, 2017

విజయవాడ : రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, తానూ ఏ పార్టీ లో చేరడం లేదని, చేరబోనని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును.. లగడపాటి కలిశారు. వ్యక్తిగతంగానే సీఎంను కలిశానని.. రాజకీయాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని లగడపాటి చెప్పారు. సీఎంతో ఏ రాజకీయ అంశం గురించి మాట్లాడలేదని చెప్పారు. అలాగే తాను రాజకీయ సర్వేలను కొనసాగిస్తూనే ఉంటానని లగడపాటి చెప్పారు.

 

21:36 - September 12, 2017

హైదరాబాద్ : గుత్తా సుఖేందర్‌రెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో సలహాదారుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను... ఉపసంహరించుకున్నట్లు చెప్పడంతో సీరియస్‌ అయ్యింది. మీ రాజకీయాలకు కోర్టును వేదికగా మార్చుకుంటున్నారా ? అని ప్రశ్నించింది. కేసు ఉపసంహరణకు హైకోర్టు నిరాకరించింది. విచారణను కొనసాగిస్తామని హైకోర్టు వెల్లడించింది. 

 

21:25 - September 12, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ఖరారు చేసింది. రేపటి నుంచి మద్యం షాపులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో 6 శ్లాబ్‌ల నుంచి 4 శ్లాబ్‌లకు తగ్గించారు. అప్లికేషన్ ఫీజును 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పెంచారు. హైదరాబాద్‌లో వైన్‌ షాపులను రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచేలా అనుమతించారు.  
రేపటి నుంచి మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ 
తెలంగాణ ప్రభుత్వం నూతన ఎక్సైజ్‌ పాలసీని ఖరారు చేసింది. మద్యం షాపులకు దరఖాస్తులను బుధవారం నుంచి ఈ నెల 19 వరకు స్వీకరిస్తారు. అలాగే.. గతంలో ఉన్న 6 స్లాబులను 4కు తగ్గించారు. మద్యం దుకాణానికి దరఖాస్తు ఫీజును 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పెంచారు. ఒక వ్యక్తి ఒకే మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేసుకునే విధంగా అనుమతిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాన్ని మరో గంట పొడిగించారు. రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. షాపింగ్ మాల్స్‌లో కూడా మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 50 వేల జనాభా ఉన్న చోట మద్యం దుకాణానికి వార్షిక ఫీజు రూ. 45 లక్షలు. ఐదు లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాలకు వార్షిక ఫీజు రూ. 55 లక్షలుగా... ఇరవై లక్షల వరకు జనాభా ఉన్నచోట వార్షిక ఫీజు రూ. 85 లక్షలుగా.... 20 లక్షలు పైబడి జనాభా ఉన్న చోట దుకాణానికి వార్షిక ఫీజు 1 కోటీ 10 లక్షలుగా నిర్ణయించారు.  ఏడాదికి లైసెన్స్ రుసుం కింద 1360 కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.
కొత్త మద్యం విధానం రెండేళ్లపాటు అమలు
దుకాణాల సంఖ్యలో ఎలాంటి మార్పులేదన్న సోమేశ్‌ కుమార్‌... హైదరాబాద్‌లో గతంలో మిగిలిన 72 దుకాణాలను డిమాండ్ ఉన్న చోట ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ప్రతి మద్యం దుకాణం వద్ద రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని అబ్కారీ శాఖ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు కానుందని చెప్పారు. కొత్త మద్యం విధానం రెండేళ్లపాటు అమల్లో ఉండనుంది.

 

21:19 - September 12, 2017

అగ్రిగోల్డు ఆస్తుల వేలంపై వక్తలు భిన్నవాదనలు  వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సిద్ధార్థ లా కాలేజీ ప్రిన్సిపల్ దివాకర్ బాబు, సీపీఎం నేత సీహెచ్ బాబూరావు, టీడీపీ నేత వర్ల రామయ్య పాల్గొని, మాట్లాడారు. అగ్రిగోల్డు బాధితులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

21:09 - September 12, 2017

తొమ్మిదినెలల క్రితం భారీ ప్రకటనలు చేశారు..దేశమంతటికీ క్యూలో నిలబెట్టారు..కారణాలు బహుభారీగా చూపెట్టారు.. కానీ సీన్ రివర్సైంది. ఇప్పుడు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మాటలతో విషయం స్పష్టంగా అర్ధమౌతోంది. ఏ నిర్ణయాల వెనుక ఏ ఉద్దేశాలున్నాయో? ఇంతా చేసి ఎందుకు నోరు మెదపటం లేదో అర్ధమౌతుంది. డీ మానిటైజేషన్ తెరవెనుక అంశాలేంటి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టొరీ.. 
ఏం చెప్పారు? ఏం జరిగింది? 
ఏం చెప్పారు? ఏం జరిగింది? నోట్లరద్దు దేశానికి ఏం మిగిల్చింది? సామాన్యుడికి ఏ అనుభవాలిచ్చింది? ఎంత నల్లధనం వెలికి తీశారు? ఆర్బీఐ గణాంకాలు ఏం చెప్తున్నాయి? జైట్లీ వాదనల్లో అసంబద్ధత ఎంత? మోడీ సర్కారు డీమానిటైజేషన్ తో తప్పులో కాలేసిందా?   తగ్గిన జీడీపీ గణాంకాలేం చెప్తున్నాయి? ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఏం చెప్తున్నారు ? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:41 - September 12, 2017

సోషల్ నెట్ వర్క్... ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్లపై ఇవాళ్టి మల్లన్నముచ్చట్లు. ఆవు నిరసన, రైలు పట్టాలపై పడుకున్న కుక్క, పిల్లగాని ఆలనాపాలన చూస్తున్న రామచిలుక, బీరు తాగిన కోతి, ఈతగొట్టిన ఏనుగు, ప్రత్యేక మిషన్ తో నీటిలోకెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్, కల్లు తాగిన విదేశీ మహిళ, సౌదీలో తెలుగు బిడ్డల గోస.. వంటి సంఘటనలు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేశాయి. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

 

20:29 - September 12, 2017

 విశాఖ : కట్టుకున్నవాళ్లు వదిలేశారు...! అయినవాళ్లు.. తరిమికొట్టారు...! గ్రామ పెద్దలు శిక్షించారు..! న్యాయం కోసం అడిగితే... పరీక్షలు చేశారు... ప్రశ్నలతో వేధించారు..! పోలీసుల దాష్టీకానికి బలై... ఎన్నో అవమానాలకు గురయ్యారు వాకపల్లి ఆదివాసీ మహిళలు.. అందులో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు... ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత సుప్రీం కోర్టు స్పందించింది.. జరిగిన జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ ఇన్నేళ్లు వాళ్లు పడ్డ అవస్థలపై... సమాధానం చెప్పాల్సిందెవరూ... ప్రభుత్వమా..? దాన్ని ఎన్నుకున్న సమాజమా..? న్యాయం కోసం సమాజంతో... ప్రభుత్వంతో పోరాడుతున్న వాకపల్లి మహిళల ఆవేదనపై ప్రత్యేక కథనం.. 
వాకపల్లి అత్యాచార ఘటనపై స్పందించిన సుప్రీం 
సుప్రీం తీర్పుతో తెరపైకి వచ్చిన వాకపల్లి మహిళల ఘటన... సమాజం ముందు ఎన్నో ప్రశ్నలు ఉంచింది. చట్టాల్లోని లోపాలను.. సమాజంలో ఉన్న రుగ్మతలను ఎత్తి చూపింది. 2007లో ఆదివాసీ పీటీజీ తెగకు చెందిన గిరిజన యువతులపై గ్రేహౌండ్స్ పోలీసులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. విశాఖ ఏజెన్సీలోని.. జి. మాడుగులలోని నుర్మతి పంచాయతీలోని వాకపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులను గాలిస్తూ...ఆ గ్రామానికి చేరుకున్న 21 మంది గ్రేహౌండ్స్‌ పోలీసులు 11 మంది ఆదివాసీ మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు.
సామాజికంగా అవమానాలు
జరిగింది అత్యాచారం.. బాధితులు అమాయక గిరిజనులు..! వారిని బలాత్కరించిన వారికి శిక్ష పడాలి. కానీ.. విచిత్రంగా సమాజం, బాధిత మహిళలనే.. దండించింది. దుర్మార్గులపై దండెత్తాల్సిన భర్తలు.. తమ భార్యలనే వదిలేశారు. అయితే కాలక్రమంలో.. కొందరు భర్తలు మారి.. తమ భార్యలను చేరదీశారు. మరికొందరేమో అదే మూర్ఖత్వంతో.. భార్యలను చేరనీయలేదు.
కృంగిపోయేలా చేసిన కుల కట్టుబాట్లు 
ఇక కుల కట్టుబాట్లయితే.. మహిళల నవనాడులూ కృంగిపోయేలా చేశాయి. అత్యాచారం చేయించుకు వచ్చినందుకు గాను.. పరిహారం చెల్లించాకే గ్రామంలో అడుగు పెట్టాలంటూ కుల పెద్దలు.. పంచాయతీ పెద్దలు ఆంక్షలు విధించారు. ఇలా అడుగడుగునా.. అత్యాచార బాధితులకు న్యాయం జరగకపోగా... సామాజికంగా కూడా వారు చిత్రవధకు గురయ్యారు. వారి జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి.
అన్యాయంపై ఎమ్మెల్యేకు తెలిపిన బాధితులు
కులం కట్టుబాట్లు.. సమాజం వంకర చూపులు.. గ్రామస్థుల అవహేళనలు.. ఇలా బాధితులు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు మొరపెట్టుకోని వారు లేరు. చివరికి వీరి గోడు ఫలించి, పోలీసులు, ఐపీసీ సెక్షన్ 372(2), సెక్షన్ 3 (2), ఎస్.సి., ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం కింద గ్రేహౌండ్స్‌ పోలీసులపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. అప్పటి ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. అయితే సీఐడీ తన విచారణలో వాకపల్లి ఆదివాసీ మహిళలపై అత్యాచారం జరిగినట్టు ఆనవాళ్లు లేవని తెలిపింది. ఆనాటి నుంచి వాకపల్లి మహిళలు తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఈ పది సంవత్సరాల్లో న్యాయం అందకుండానే.. దోషులకు పడే దండన చూడకుండానే.. ఇద్దరు బాధిత మహిళలు చనిపోయారు.
కేసు నుంచి బయటపడేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు 
మరోపక్క ఈ కేసు నుంచి బయటపడడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులు 2008 హైకోర్టులో తమపై జరుగుతున్న విచారణను ఎత్తివేయాలంటూ క్వాష్‌ పిటీషన్ దాఖలు చేశారు. ఈ మేరకు 2012లో కోర్టు 21 మంది గ్రేహౌండ్స్ పోలీసులలో 13 మందిని విచారణ నుంచి మినహాయింపు ఇచ్చింది. మిగిలిన ఎనిమిది మంది మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా... వారు వేసిన పిటిషన్‌ 2017 సెప్టెంబర్ ఒకటో తేదీన విచారణకు వచ్చింది. ఈ మేరకు  జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ శాంతానా గౌండర్‌లతో కూడిన ధర్మాసనం పోలీసుల పిటిషన్‌ను కొట్టి వేసింది. ఈ కేసులో అపరిమిత  జాప్యం జరిగినందుకు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.. నిందితులైన 13 మంది గ్రేహౌండ్స్ పోలీసులపై కేసు విచారణ జరిపి తీరాలని ఆదేశించింది. ఆరునెలలలోపు విచారణను పూర్తి చేసి సత్వరం న్యాయం చేకూర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఈ సంచలన తీర్పుప గిరిజన , ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
బాధితులకు న్యాయం జరిగినట్టేనా? 
అయితే...ఒకవేళ విచారణ ముగిసి...నిందితులకు శిక్ష పడినా... బాధితులకు న్యాయం జరిగినట్టేనా? ఈ పదేళ్ల కాలంలో వారు ఎదుర్కొన్న మానసిక, శారీరక చిత్రవధకు ఉపశమనం లభిస్తుందా..? ఇన్నేళ్లలో వీరు పడ్డ వెతలకు పరిష్కారం.. సాంత్వన.. ఎలా?? ఇదీ ఇప్పుడు సమాజం ఆలోచించాల్సిన కోణం. ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాల్సిన అంశం.  

 

20:12 - September 12, 2017

ఢిల్లీ : హస్తినలో కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో 16వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో నరసన్నపేట నుండి రణస్థలం వరకు 54 కిలోమీటర్ల వరకు 6లేన్లతో రహదారిని విస్తరించనున్నారు. ఇందుకోసం 14వందల 63కోట్లు ఖర్చు చేయనున్నారు. కలకత్తా ..చెన్నై కారిడార్‌ విస్తరణలో భాగంగా ఈ పనులు చేపట్టనున్నారు. దీని ద్వారా ఏపీలో మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం కానున్నాయి. వీటితో పాటు... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1శాతం అదనపు డీఏకు గ్రీన్ సిగ్నల్ లభించింది. జులై 1, 2017 నుండి అదనపు డీఏ వర్తిస్తుంది. అలాగే గ్రాట్యుటీ చెల్లింపు గరిష్ట పరిమితిని పెంచే చట్ట సవరణకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
7వ వేతన సంఘం సిఫారసు మేరకు గ్రాట్యుటీ గరిష్ట పరిమితి. ప్రస్తుతం అమలులో ఉన్న 4శాతం డీఏకి ఒక శాతం అదనంగా చెల్లించనుంది. 61 లక్షల పెన్షనర్లు, 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. రూ.10 లక్షల నుండి 20 లక్షల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో 16న నెంబర్ జాతీయ రహదారి విస్తరణకు ఆమోదం తెలిపారు. నరసన్నపేట నుండి రణస్థలం వరకు 54 కిమీ వరకు 6 లేన్ల రహదారి విస్తరణ 
చేయనున్నారు.

నూతన ఎక్సైజ్ పాలసీ ఖరారు

హైదరాబాద్ : రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. అప్లికేషన్ ఫీజు రూ.50 వేల నుంచి లక్షకు పెంచారు. రేపటి నుంచి మద్యం షాపులకు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. దరఖాస్తుల ద్వారా రూ.250 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా ఉంది. శ్లాబ్ లు 6 నుంచి 4 కు తగ్గించారు. హైదరాబాద్ లో మద్యం షాపులకు రాత్రి 11 గంటల వరకు అనుమతి ఇచ్చారు. షాపింగ్ మాల్స్ లో మద్యం అమ్మకాలకు అనుమతి లభించింది.

19:20 - September 12, 2017
19:19 - September 12, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. అప్లికేషన్ ఫీజు రూ.50 వేల నుంచి లక్షకు పెంచారు. రేపటి నుంచి మద్యం షాపులకు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. దరఖాస్తుల ద్వారా రూ.250 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా ఉంది. శ్లాబ్ లు 6 నుంచి 4 కు తగ్గించారు. హైదరాబాద్ లో మద్యం షాపులకు రాత్రి 11 గంటల వరకు అనుమతి ఇచ్చారు. షాపింగ్ మాల్స్ లో మద్యం అమ్మకాలకు అనుమతి లభించింది. 50 లక్షల జనాభా వరకు ఉన్న ప్రాంతాల్లో వార్షిక ఫీజు రూ.45 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకు వార్షిక ఫీజు రూ.55లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకు వార్షిక ఫీజు రూ.85 లక్షలు. 20 లక్షల పైన జనాభా ఉన్న ప్రాంతాలకు కోటీ 10 లక్షల వార్షిక ఫీజు. వైన్ షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆబ్కారీశాఖ కంట్రోల్ రూమ్ కు సీసీ కెమెరాలను అనుసంధానం చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

19:17 - September 12, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. అప్లికేషన్ ఫీజు రూ.50 వేల నుంచి లక్షకు పెంచారు. రేపటి నుంచి మద్యం షాపులకు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. దరఖాస్తుల ద్వారా రూ.250 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా ఉంది. శ్లాబ్ లు 6 నుంచి 4 కు తగ్గించారు. హైదరాబాద్ లో మద్యం షాపులకు రాత్రి 11 గంటల వరకు అనుమతి ఇచ్చారు. షాపింగ్ మాల్స్ లో మద్యం అమ్మకాలకు అనుమతి లభించింది. 50 లక్షల జనాభా వరకు ఉన్న ప్రాంతాల్లో వార్షిక ఫీజు రూ.45 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకు వార్షిక ఫీజు రూ.55లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకు వార్షిక ఫీజు రూ.85 లక్షలు. 20 లక్షల పైన జనాభా ఉన్న ప్రాంతాలకు కోటీ 10 లక్షల వార్షిక ఫీజు. వైన్ షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆబ్కారీశాఖ కంట్రోల్ రూమ్ కు సీసీ కెమెరాలను అనుసంధానం చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

తెలంగాణలో నలుగురు డీఎస్పీలు బదిలీ

హైదరాబాద్ : తెలంగాణలో నలుగురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. సూర్యపేట డీఎస్పీగా ఎం.నాగేశ్వరరావును నియమించారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూర్యపేట డీఎస్పీవి.సునీతకు ఆదేశాలు జారీ అయ్యాయి. 

18:58 - September 12, 2017

హైదరాబాద్ : బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ సెల్‌ సర్వీసెస్‌, ల్యాండ్‌ లైన్‌, ఇంటర్‌నెట్‌ సర్వీసుల్లో సరికొత్త ఆఫర్లు ప్రవేశపెడుతున్నట్లు తెలంగాణ సర్కిల్‌ మేనేజర్‌ ఎల్‌ అనంతరామ్‌ తెలిపారు. వినియోగదారులను ఆకట్టుకునేలా సెల్‌ సర్వీస్‌లో ప్లాన్‌429 రూపాయలకే  90రోజుల వరకు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు రోజు  1జీబీ డాటాని అందిస్తున్నట్లు.. అలాగే ప్లాన్‌666 తో 90రోజుల పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ మరియు 2జీబీ డాటా అందిస్తున్నట్లు తెలిపారు. 1500 రూపాయలకే వైఫై మోడమ్‌ అందిస్తున్నామని.. అదేవిధంగా వోడాఫోన్‌ నెట్‌ వర్కతో అనుసంధానం చేసి రోమింగ్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 62 పట్టణ, 50 గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తున్నామని తెలంగాణ సర్కిల్‌ మేనేజర్‌ అనంతరామ్‌ తెలిపారు.

 

18:56 - September 12, 2017

గుంటూరు : అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్‌ భేటీ అయ్యారు. లగడపాటి టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

జీహెచ్‌ఎంసీ కార్యాలయం దగ్గర లోధా వాసులు ధర్నాకు యత్నం

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర లోధా మెరిడియన్‌ వాసులు ధర్నాకు యత్నించారు. నిబంధనల ప్రకారం తమకు కల్పించాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయకుండా నిర్మాణాలు చేపట్టడంపై నిరసన తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా.. సమస్య పరిష్కారం కాకపోవడంతో ధర్నాకు యత్నించారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు లోధా వాసులపై జులుం ప్రదర్శించారు. 

ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ప్లస్‌ గ్రేడ్‌

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీకి న్యాక్‌.. ఏ ప్లస్‌ గ్రేడ్‌ ఇచ్చింది. గత నెలలో ఉస్మానియా యూనివర్సిటీని న్యాక్‌ బృందం సందర్శించింది. ఓయూ అధికారుల ప్రజంటేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన న్యాక్.. ఏ ప్లస్ గ్లేడ్ ఇచ్చింది. 

18:52 - September 12, 2017

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర లోధా మెరిడియన్‌ వాసులు ధర్నాకు యత్నించారు. నిబంధనల ప్రకారం తమకు కల్పించాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయకుండా నిర్మాణాలు చేపట్టడంపై నిరసన తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా.. సమస్య పరిష్కారం కాకపోవడంతో ధర్నాకు యత్నించారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు లోధా వాసులపై జులుం ప్రదర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:51 - September 12, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీకి న్యాక్‌.. ఏ ప్లస్‌ గ్రేడ్‌ ఇచ్చింది. గత నెలలో ఉస్మానియా యూనివర్సిటీని న్యాక్‌ బృందం సందర్శించింది. ఓయూ అధికారుల ప్రజంటేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన న్యాక్.. ఏ ప్లస్ గ్లేడ్ ఇచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

18:48 - September 12, 2017

హైదరాబాద్ : విద్యార్థిని చాందినిది హత్యేనని పోలీసులు తేల్చారు. ఫోన్‌లో మై హార్ట్ అనే పేరుతో సేవ్ చేసుకున్న నంబర్‌కు చాందిని తరచూ కాల్ చేసేదని, చివరి కాల్ కూడా మై హార్ట్ నంబర్‌కు వెళ్లిందని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చాందిని చివరిసారి ఓ యువకుడితో ఆటోలో వెళ్తున్న సీసీ ఫుటేజి లభ్యమైంది. అయితే... చాందిని ఎవరితో వెళ్లిందనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. విద్యార్థిని చాందిని హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.
మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
అంతకుముందు... అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన చాందిని జైన్‌ మృతదేహానికి గాంధీ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. చాందిని మొహం, మెడ, కాలిపై గాయాలున్నట్లు తెలిపారు. ఈ నెల 9న స్నేహితులతో పార్టీకి వెళ్లిన చాందిని.. ఈ ఉదయం అమీన్‌పూర్‌లోని కొండల్లో శవమై కనిపించింది. పథకం ప్రకారం చాందినిని హత్య చేసి ఉంటారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 

18:43 - September 12, 2017

హైదరాబాద్ : ఆర్యవైశ్యుల వెనుక బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ శక్తులున్నాయని అనుమానం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వారి కుట్రలో ఆర్యవైశ్యులు పడొద్దని హితవుపలికారు. దాడులు చేయడం ఆర్యవైశ్యుల సంస్కృతి కాదన్నారు. ఆర్యవైశ్యులను తప్పుదోవపటిస్తున్నారని చెప్పారు. ప్రొ.కంచె ఐలయ్యపై బెదిరింపులను టీమాస్, సీపీఎం తరపున పూర్తిగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై చర్చల ద్వారా అభిప్రాయాలు తెలపాలని సూచించారు. బెదిరింపులు, దాడులకు పాల్పడడం సరికాదని హితవుపలికారు. 'మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా... ఆటవిక రాజ్యంలో ఉన్నామా'... అని ప్రశ్నించారు. అభిప్రాయాలపై చర్చ జరగవచ్చు...కానీ చట్ట విరుద్ధంగా చంపేస్తామని బెదిరింపులు చేయడం సరికాదన్నారు. బెదిరింపుల వెనుక బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ శక్తులు, ఆగ్రకుల శక్తులు ఉన్నాయనే అనుమానం కల్గుతుందన్నారు. భావజాలానికి వ్యతిరేకంగా దాడులు, హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్, హిందు భావజాలాన్ని పెంపొందించాలని చూస్తున్నారని చెప్పారు. గౌరీ లంకేశ్ ది యాధృచ్ఛికంగా జరిగిన హత్య కాదన్నారు. సెప్టెంబర్ 17ను విమోచనదినంగా భావించడం లేదన్నారు. నైజాం సర్కార్ నుంచి తెలంగాణ.. ఇండియన్ యూనియన్ లో విలీనం అయిందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

18:13 - September 12, 2017

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర లోధా మెరిడియన్‌ వాసులు ధర్నాకు సిద్ధమవుతున్నారు.  నిబంధనల ప్రకారం తమకు కల్పించాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయకుండా నిర్మాణాలు చేపట్టడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 

కంచె ఐలయ్య పుస్తకంపై గద్దర్ స్పందన

హైదరాబాద్ : కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై ప్రజా గాయకుడు గద్దర్ స్పందించారు. కంచె ఐలయ్యపై బెదిరింపులను ఆయన ఖండించారు. భావ ప్రకటన స్వేచ్ఛతోనే రచయితగా ఐలయ్య ఆయన పని చేశారని చెప్పారు. 

శ్రమశక్తిని దోచుకున్నవారిని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు : కంచె ఐలయ్య

హైదరాబాద్ : ఆర్యవైశ్యులు ప్రజాస్వామ్యాన్ని రోడ్లపై దహనం చేస్తున్నారని అన్నారు. శ్రమశక్తిని దోచుకున్నవారిని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. 'సామాజిక స్మగ్లర్లు అంటే కింది కులాలు తయారు చేసిన ఉత్పత్తులను తిరిగి వారికే ఎక్కువ ధరకు విక్రయించే వారు' అని తెలిపారు. గౌరీ లంకేశ్ ను చంపి ఆమె ఆలోచన శక్తిని పూడ్చేశారు.. రేపు తనను కూడా చంపి తన ఆలోచన శక్తిని పూడ్చాలనుకుంటున్నారని పేర్కొన్నారు. 

 

18:00 - September 12, 2017
17:58 - September 12, 2017

హైదరాబాద్ : కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై ప్రజా గాయకుడు గద్దర్ స్పందించారు. కంచె ఐలయ్యపై బెదిరింపులను ఆయన ఖండించారు. భావ ప్రకటన స్వేచ్ఛతోనే రచయితగా ఐలయ్య ఆయన పని చేశారని చెప్పారు. తాను ఆర్యను కాదు...ద్రవిడ్ నని అన్నారు. తెలంగాణలో కోమటోళ్లను ఆర్యవైశ్యలు అనరని... కోమటోళ్లే అంటారని తెలిపారు. మాదిగోడా, మాలోడా, గొల్లోడా అని అగ్రకులాలు వారు దుర్బాషలాడేవారని.. అసభ్య పదజాలంతో తిట్టేవారు...
అవమానకర మాటలతో పిలిచే వారని.. వాటికి తాము ఎలా బాధపడాలని ప్రశ్నించారు. కంచె ఐలయ్యను చంపేప్తామని వేలాది ఫోన్ కాల్స్ రావడం దేనికి సంకేతం అన్నారు. ఇది కుట్ర పూరితంగానే చేస్తున్నారని అన్నారు. చంపేస్తం, నరికేస్తం అనడం భావ్యం కాదని... వీలైతే పుస్తకంపై చర్చ పెట్టాలని, అభిప్రాయాలు తెలపాలని అన్నారు. దేశంలో భావ ప్రకటన స్వేచ్చ ఉందో లేదో ప్రధాని మోడీని అడుగుతున్నానని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

17:48 - September 12, 2017

హైదరాబాద్ : ఆర్యవైశ్యులు ప్రజాస్వామ్యాన్ని రోడ్లపై దహనం చేస్తున్నారని అన్నారు. శ్రమశక్తిని దోచుకున్నవారిని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. 'సామాజిక స్మగ్లర్లు అంటే కింది కులాలు తయారు చేసిన ఉత్పత్తులను తిరిగి వారికే ఎక్కువ ధరకు విక్రయించే వారు' అని తెలిపారు. గౌరీ లంకేశ్ ను చంపి ఆమె ఆలోచన శక్తిని పూడ్చేశారు.. రేపు తనను కూడా చంపి తన ఆలోచన శక్తిని పూడ్చాలనుకుంటున్నారని పేర్కొన్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు బయటిరూపం పుస్తకమన్నారు. ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యంగ విలువలను, జ్యూడిషియల్ విలువలను కాలుస్తున్నారని మండిపడ్డారు. దోపిడీ లేని వ్యవస్థ రావాలని, డొనేషన్ ల రంగం పోవాలన్నారు. గాంధీ, నెహ్రూ ఫౌండేషన్ ను నాశనం చేస్తున్నారని చెప్పారు. ఆలోంచించే బ్రెయిన్ లను చంపాలని చూస్తున్నారు. గద్దర్, టీమాస్ ఫోరం నిరసన తెలపాలంటే అనుమతి తీసుకోవాలి కాని.. ఆర్య వైశ్యులు పుస్తకాలను కాల్చేందుకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. కంచె ఐలయ్య దగ్గర డబ్బులు లేవని, మేధావి అని, నిమ్న కులస్తుడని వార్తలు రాయడం లేదా అని ప్రశ్నించారు. 'నా ప్రాణానికి హాని ఉందంటే ఇంగ్లీష్ పత్రికలు బాగా రాస్తే... తెలుగు మీడియా అదే వార్తను ఏదో ఒక మూలన వేస్తారు'.. ఇది భావ్యమా అన్నారు. తెలుగు మీడియాకు జీవించే హక్కు ప్రధానం కాదా...అని ప్రశ్నించారు. మంటలకు ప్రాధాన్యత ఇవ్వడం మానేయాలని హితవు పలికారు. తాను గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ లను గౌరవిస్తానని అన్నారు. 'నా ప్రాణం బలి అయినా...రచనలు చేస్తూనే ఉంటాను. నా కలం నా బొందలో కూడా రాస్తుంటది'..అని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

సీఎం చంద్రబాబుతో లగడపాటి భేటీ

గుంటూరు : అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. లగడపాటి టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 

 

17:04 - September 12, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఆకివీడులో దారుణం జరిగింది. రవీంద్రభారతి స్కూల్‌లో ఒకటవ తరగతి, రెండవ తరగతి, మూడవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు స్కూల్‌ ఫీజు కట్టలేదన్న కారణంతో బాత్‌రూం వద్ద కూర్చోబెట్టాడు టీచర్‌. విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు చెప్పడంతో.. స్కూల్‌ యాజమాన్యాన్ని నిలదీశారు. యాజమాన్యం స్పందించకపోవడంతో స్కూల్‌ ముందు పేరెంట్స్‌ ఆందోళనకు దిగారు. మరోవైపు విషయం తెలుసుకున్న ఎంఈవో రవీంద్ర ఘటనపై విచారణ చేపట్టారు. 

 

16:58 - September 12, 2017

నల్లగొండ : జిల్లాలోని జలాల్‌పురం కస్తూర్భా గాంధీ .. హాస్టల్‌ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. విద్యార్థినులు అఖిల, షేక్‌ షమీనా... నిన్నటి నుంచి కనిపించకుండాపోయారు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు... పోలీసులను ఆశ్రయించారు. పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:57 - September 12, 2017

బ్లూవేల్ చాలెంజ్ గేమ్..ఆత్మహత్యలు అనే అంశంపై నిర్వహించని మావని వేదిక చర్చా కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు సజయ్, క్లీనికల్ సైకాలజిస్టు డా.లక్ష్మీనారాయణ పాల్గొని, మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:49 - September 12, 2017

పోలాండ్‌ : పోలాండ్‌లో రెడ్‌బుల్‌ మెగావాట్‌  చాలెంజ్‌ పోటీలు ప్రారంభమయ్యాయి.ఈ డేర్‌ డెవిల్‌ కాంపిటీషన్‌లో  ప్రపంచంలోనే 500 మంది టాప్‌ క్లాస్‌ స్టంట్‌ రైడర్లు పోటీకి దిగారు. క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో కొండరాళ్లు, గుట్టలపై రిస్క్‌ను సైతం లెక్కచేయకుండా రేస్‌లో దూసుకుపోయారు. రెడ్‌బుల్‌ మెగావాట్‌ చాలెంజ్‌  క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ పోటీల్లోని థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ మీ కోసం...

 

16:47 - September 12, 2017

హైదరాబాద్ : వివాదాస్పదమైన కంచె ఐలయ్య ఆర్యవైశ్య పుస్తకంపై.. మాజీ ఎంపీ హనుమంతరావు స్పందించారు. దేశంలో ఎవరికైనా స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించే హక్కు ఉందని ఆయన అన్నారు. ఎవరైనా ఆయన పుస్తకంలోని వ్యాఖ్యల ద్వారా ఇబ్బందులు పడితే.. కోర్టును ఆశ్రయించే హక్కు, ఆరోపణలు చేసే హక్కు ఉందన్నారు. 

 

16:45 - September 12, 2017

విశాఖ : విశాఖపట్టణం, పెందుర్తిలో మంత్రి నారా లోకేశ్‌ పర్యటించారు. పర్యటనలో భాగంగా సమాఖ్య భవనం, షాపింగ్‌ కాంప్లెక్స్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. అప్పులు ఒక రాష్ట్రానికి, ఆస్తులు ఒక రాష్ట్రానికి ఇచ్చారని మంత్రి లోకేశ్‌ అన్నారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా.. సీఎం ప్రజలకు లోటు లేకుండా పరిపాలన చేస్తున్నారన్నారు. డ్వాక్రా సంఘాలను మరింత మలోపేతం చేసి మహిళల కాలికి మట్టి అంటకుండా.. అన్ని గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు నిర్మిస్తున్నామని లోకేశ్ తెలిపారు. 

 

16:42 - September 12, 2017

విజయనగరం : జిల్లాలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ పర్యటించారు. ఇవాళ్టి నుంచి రెండు రోజులు ఆయన పర్యటించనున్నారు. పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌కు.. జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

16:38 - September 12, 2017

యాదాద్రి : జిల్లాలోని మోత్కూరు మండలం కేంద్రంలో ఓ విద్యార్థి ఆత్మహత్యయత్నం చేశాడు. జెడ్ పీహెచ్ ఎస్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కొంపెల్లి నవీన్‌ ప్రాణాలు తీసుకోబోయాడు. ఇది గమనించిన స్థానికులు నవీన్‌ను భువనగిరి ఆస్పత్రికి తరలించారు. కాగా ఇంగ్లీషు టీచర్‌ సత్యనారాయణ వేధింపులే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:35 - September 12, 2017

మేడ్చల్‌ : డబిల్‌ పూర్‌ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మల్కాచెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికులు గాలించి..రెండు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:30 - September 12, 2017

హైదరాబాద్ : విద్యార్థిని చాందినిది హత్యేనని పోలీసులు తేల్చారు. ఫోన్‌లో మై హార్ట్ అనే పేరుతో సేవ్ చేసుకున్న నంబర్‌కు చాందిని తరచూ కాల్ చేసేదని, చివరి కాల్ కూడా మై హార్ట్ నంబర్‌కు వెళ్లిందని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనాస్థలిలో చిందరవందరగా వస్తువులు, మద్య బాటిళ్లు ఉన్నాయి. చాందిని చివరిసారి ఓ యువకుడితో ఆటోలో వెళ్తున్న సీసీ ఫుటేజి లభ్యమైంది. అయితే... చాందిని ఎవరితో వెళ్లిందనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 
చాందినిజైన్‌ మృతదేహంపై గాయాలు : సీఐ
చాందిని జైన్‌ మృతదేహంపై గాయాలున్నాయని సీఐ చెప్పారు. కాళ్లపైన..మెడపైన గాయాలున్నాయన్నారు. మృతదేహాన్ని వైద్యులు పోస్ట్‌మార్టం చేశారని.. ఢీ కంపోజ్‌ అవ్వడంతో... మిగిలిన వివరాలు రెండు రోజుల్లో చెబుతామని వైద్యులు చెప్పారని సీఐ చెప్పారు.  
చాందినీది హత్యేనంటున్న బంధువులు 
చాందినీది హత్యేనని ఆమె తరపు బంధువుల అంటున్నారు. స్నేహితులను కలిసి వస్తానని బయటకు వెళ్లిన చాందిని మళ్లీ తిరిగిరాలేదని చెప్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ప‌ళ‌ని ప్ర‌భుత్వం బ‌ల‌నిరూప‌ణ కోరుతూ కోర్టుకెళ్లిన స్టాలిన్

చెన్నై: త‌మిళ‌నాడు అసెంబ్లీలో ప‌ళ‌ని ప్ర‌భుత్వం బ‌ల‌నిరూప‌ణ నిర్వ‌హించాల‌ని ఇవాళ డీఎంకే నేత స్టాలిన్ కోర్టుకు వెళ్లారు. స్టాలిన్‌తో పాటు పీఎంకే పార్టీకి చెందిన బాలు కూడా పిటీష‌న్ వేశారు. అయితే అక్టోబ‌ర్ 10వ తేదీన ఆ పిటీష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టేందుకు మద్రాస్ హై కోర్టు అంగీక‌రించింది. మ‌రోవైపు త‌మిళ‌నాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకే ఇవాళ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో భాగంగా శ‌శిక‌ళను ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు ఏక‌గ్రీవ తీర్మానం చేసింది. అటు ఆమె మేన‌ల్లుడు దిన‌క‌ర‌న్ ఉప ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ ప‌ద‌వి కూడా ఊడింది.

హైకోర్టులో టీ. సర్కార్ కు ఎదురు దెబ్బ

హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రైతు సమన్వయ సమితుల కోసం జీవో 39ని తీసుకురావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ నేడు విచారణ జరిగింది. టీఆర్ ఎస్ నాయకుల కమిషన్ కోసమే జీవో 39 తీసుకొచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. రైతు సమన్వయ సమితులకు విడుదల చేసిన రూ. 500 కోట్లు ఏ విధంగా ఖర్చు చేస్తారో తెలపాలని కోర్టు సూచించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రూ.500 కోట్ల పై ఎలాంటి చెల్లింపులు జరపొద్దని హైకోర్టు ఆదేశించింది. దీనిపై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీ. సర్కార్ ను ఆదేశించింది.

సీఎం చంద్రబాబుతో డీజీపీ సాంబశివరావు భేటీ

అమరావతి: సీఎం చంద్రబాబుతో డీజీపీ సాంబశివరావు భేటీ అయ్యారు. వీరి భేటీలో ప్రొ.కంచె ఐలయ్య పుస్తుకం-ఆర్యవైశ్య వర్గాల ఆందోళనల పై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆర్యవైశ్యుల నిరసనలు, అభ్యంతరాలపై చంద్రబాబుకు డీజీపి నివేదించినట్లు తెలుస్తోంది. పుస్తకాన్ని నిషేధించాలాని ఆర్యవైశ్యుల డిమాండ్ చేశారు. ఎవరి చర్యలైనా కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉంటే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం.

30 నుండి సమ్మెకు పిలుపు నిచ్చిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు...

కృష్ణా: ఈనెల 30 నుండి విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. తమను పర్మినెంట్ చేయాలని తిరువూరు అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ కు వినపతి పత్రం సమర్పించారు.

కస్తూర్భా గాంధీ హాస్టల్ విద్యార్థినుల అదృశ్యం...

నల్గొండ: జలాల్ పురం కస్తూర్భా గాంధీ హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం అయ్యారు. నిన్నటి నుంచి అఖిల, షేక్ షమీనా విద్యార్థినులు కనిపించకుండా పోయారు. ఆందోళనలో ఉన్న వారి తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

కశ్మీర్ లో వలస దారులకు భారీ ప్యాకేజీ...

జ‌మ్మూ : క‌శ్మీర్ వ్యాలీలో ఉన్న సుమారు మూడు వేల మంది వ‌ల‌స‌దారుల‌కు ఉద్యోగాలు ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ స్కీమ్ కింద రాష్ట్ర ప్ర‌భుత్వానికి సుమారు రూ.1080 కోట్లు రిలీజ్ చేసిన‌ట్లు రాజ్‌నాథ్ చెప్పారు. జ‌మ్మూక‌శ్మీర్ హింస‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల పెద్ద‌గా రియాక్ట్ కావాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

 

13:25 - September 12, 2017

హైదరాబాద్ : గతంలో నేరెళ్ల ఘటనపై జస్టీస్‌ చంద్రకుమార్‌ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. ఘటనపై మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది.గాయపడిన దానయ్య, హరీశ్‌లకు నిమ్స్‌ డాక్టర్లతో... వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:22 - September 12, 2017

చిత్తూరు : రెండు రోజుల క్రితం తిరుపతిలోని కపిలతీర్థం అటవీప్రాంతంలో గల్లంతైన యువకుడి మృతిదేహం లభ్యమైంది. పాలిటెక్నిక్‌ చదువుతున్న బాలాజీ రెండ్రోజుల క్రితం కపిలతీర్థం అటవీప్రాంతంలో గల్లంతయ్యాడు. అతని మృతదేహాన్ని కొండపై నీటి మడుగులో గుర్తించారు.

ఫీజు కట్టలేదని టాయిలెట్స్ వద్ద నిలబెట్టారు....

ప.గో: ఆకీవీడు రవీంధ్ర భారతి స్కూల్లో దారుణం వెలుగుచూసింది. ఫీజు కట్టలేదని ముగ్గురు చిన్నారులను టాయిలెట్ వద్ద టీచర్లు నిలబెట్టారు. 1వ తరగతి చదువుతున్న నాగప్రసన్న, రెండో తరగతి చదువుతున్న సంధ్య, 3వ తరగతి చదువుతున్న యషితను టాయిలెట్స్ వద్ద టీచర్లు నిలబెట్టారు.

చాందిని ని గొంతు నులిమి చంపినట్లు వైద్యులు నిర్ధారణ!

హైదరాబాద్: మియాపూర్ మదీనాగూడలో దారుణం జరిగింది. 9న అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కు గురయ్యింది. అమీన్ పూర్ సమీప కొండల్లో చాందిన మృతదేహ లభ్యం అయ్యింది. ఘటనాస్థలిలో చిందరవందరగా వస్తువులు, మద్యం బాటిళ్లు పడి ఉన్నాయి. చాందిని గొంతు నులిమి చంపినట్లు వైద్యులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. చాందినికి సంబంధించిన వెంట్రుకలు, గోళ్లు, రక్తనమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పోలీసులు పంపించారు. 2 రోజుల్లో పోస్టు మార్టం ఎఫ్ ఎస్ ఎల్ నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. చాందిని హత్యోదంతాన్ని హోమిసైడ్ హత్యగా పోలీసులు నిర్ధారించారు.

13:14 - September 12, 2017

హైదరాబాద్ : దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థి చాందినిది హత్యే అని పోలీసులు నిర్థారించారు. చాందిని ఫోన్ నుంచి ఓ నెంబర్ కు తరుచు కాల్స్ వెళ్తునట్టు పోలీసులు గుర్తించారు. చాందిని గొంతునులిమి చప్పినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:13 - September 12, 2017

ఢిల్లీ : సదావర్తి భూముల కేసులో సుప్రీం కోర్టు విచారణ ముగిసింది. సెప్టెంబర్ 14న భూముల వేలం కొనసాగించాలని ఆదేశించింది. పటిషనర్ సంజీవ రెడ్డిపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మాసనం తప్పు జరుగుతూ ఉంటే కళ్లు మూసుకుని కూర్చోలేమని వ్యాఖ్య చేసింది. వేలంలో ఖచ్చితంగా పాల్గొనాలని ప్రతివాది, హైకోర్టులో పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడిని సుప్రీం ఆదేశించింది. ఒకవేళ వేళంలో పాల్గొనకపోతే ఇప్పటికే కట్టిన 10కోట్లు జప్తు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

సదావర్తి భూములపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు...

ఢిల్లీ: సదావర్తి భూములపై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. 14న భూముల వేలం కొనసాగించాలని ఆదేశించింది. పిటిషనర్ సంజీవరెడ్డి పై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పు జరుగుతుంటే కళ్లు మూసుకుని కూర్చోలేమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. వేలంలో పాల్గొనాల్సిందేనని ప్రతివాది పిటిషనర్ ఆళ్ల రామకృష్ణా రెడ్డికి కోర్టు ఆదేశించింది. ఒక వేళ వేలంలో పాల్గొనకపోతే ఇప్పటికే కట్టిన రూ. 10 కోట్లు జప్తు చేస్తామని సుప్రీం హెచ్చరించింది. వేలంలో పాల్గొని హైకోర్టు కంటే తక్కువ ధర కోడ్ చేస్తే రూ.15కోట్లు జప్తు చేస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా వేసింది.

నేరెళ్ల ఘటనపై హైకోర్టు లో విచారణ

హైదరాబాద్: నేరెళ్ల ఘటనపై హైకోర్టు లో విచారణ జరిపింది. నేరెళ్ల ఘటనలో గాయపడ్డ దానయ్య, హరీష్ లకు రేపు ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించి నేరెళ్ల ఘటనలపై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీ.సర్కార్ కు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్:ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సలహాదారుల నియామాకాన్ని సవాల్ చేస్తూ గతంలో గుత్తా సుఖేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు గుత్తా తరపు న్యాయవాది తెలిపారు. కోర్టు రాజకీయాలకు వేదికనా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. పిటిషన్ ఉపసంహరణకు హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్ వెనక్కి తగ్గినా తాము మాత్రం విచారణ ఆపబోమని హైకోర్టు తేల్చి చెప్పింది.

సీఎం చంద్రబాబుకు ముద్రగడ అల్టిమేటం

తూ.గో : సీఎం చంద్రబాబుకు ముద్రగడ అల్టిమేటం జారీ చేశాడు. డిసెంబర్ 6 కల్లా కాపు రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని హెచ్చరించారు.

మోత్కూరు జెడ్సీ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం...

యాదాద్రి: మోత్కూరు జెడ్పీ స్కూల్లో టెన్త్ విద్యార్థి నవీన్ ఆత్మహత్యాయత్నం ఇంగ్లీష్ టీచర్ సత్యనారాయణ వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నాడు.

12:27 - September 12, 2017

హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థిని చాందినిది హత్యగా పోలీసులు నిర్థారించారు. ఆమె ఫోన్ లో మై హార్ట్ పేరుతో సేవ్ చేసుకున్న నంబర్ ఉంది, ఆమె తరచు ఆ నంబర్ కాల్ చేయడాన్ని పోలీసులు గుర్తించారు. చివరి కాల్ కూడా మై హార్ట్ నంబర్ వెళ్లినట్లు నిర్ధారణ జరిగింది. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

12:17 - September 12, 2017

చెన్నై : అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శిగా జయలిలత అంటూ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. రెండాకుల గుర్తు తమదేనంటూ కూడా తీర్మానం చేశారు. సమావేశం శశికళ, దినకరన్ పై వేటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించారు. దినకరన్ ను పార్టీ పదవుల నుంచి దినకరన్ తప్పించారు. మొత్తం 2 తీర్మానాలకు సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

16న కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక

తూ.గో : 16వ తేదీన కాకినా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మేయర్ పదవి రేసులో నలుగురు మహిళలు పోటీపడుతుండగా, డిప్యూటీ మేయర్ రేసులో ముగ్గు కార్పొరేటర్లు పోటీ పడుతున్నారు.

 

చాందిని హత్యోదంతాన్ని హోమి సైడ్ హత్యగా తేల్చిన పోలీసులు

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థిని చాందిని హత్యోదంతాన్ని హోమి సైడ్ హత్యగా పోలీసులు తేల్చారు. ఫోన్ లో మై హార్ట్ అనే పేరుతో సేవ్ చేసుకున్న నంబర్ కు తరచూ చాందిని కాల్ చేసేదని తెలిపారు. చివరి కాల్ కూడా మై హార్ట్ నంబర్ కు వెళ్లినట్లు నిర్ధారించారు. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలిలో చిందరవందరగా వస్తువులు, మద్యం బాటిళ్లు పడి వున్నాయి.

 

12:10 - September 12, 2017

నిజమాబాద్ : జిల్లా కోటగిరిలో బాలుడి కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడింది. అరుణ్ అనే బాలుడు ఈ నెల 9న కిడ్నాప్ కు గురైయ్యాడు. ప్రస్తుతం బాలుడు బోధన్ పోలీస్ స్టేషన్ ఉన్నాడు. బాలున్ని తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాలకు వీడియో చూద్దాం...

పార్టీ నుండి దినకరన్, శశికల పై వేటు

చెన్నై: ఏఐఏడీఎం సర్వసభ్య సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం పొందాయి. ఏఐఏడీఎం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళ, దినకరన్ లను తొలగించారు. శాశ్వత పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలితను ఎన్నుకున్నారు. జయలలిత ఎన్నుకున్నవారంతా పదవుల్లో వుంటారని తెలిపారు.

ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళ తొలగింపు..

చెన్నై: ఏఐఏడీఎం సర్వసభ్య సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం పొందాయి. ఏఐఏడీఎం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించారు.

11:32 - September 12, 2017

చెన్నై : అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. శశికళ, దినకరన్ లపై పార్టీ సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. మరోవైపు సమావేశం నిలిపివేయాలంటూ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. దినకరన్ పిటిషన్ పై కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అనవసరంగా తమ టైమ్ వృథా చేస్తున్నరని పిటిషన్ కొట్టివేసింది. పళనిస్వామి రాజీనామాకు దినకరన్ డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కసం వీడియో చూడండి.

 

పంజాయతీరాజ్ డీఈఈ సుదర్శన్ ఇంటిపై ఏసీబీ దాడులు

రంగారెడ్డి : మొయినాబాద్ పంజాయతీరాజ్ డీఈఈ సుదర్శన్ ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మొత్తం 6 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని సుదర్శన్ పై ఆరోపణలు రావడంతో దాడులు చేస్తున్నట్లు సమాచారం.

11:18 - September 12, 2017

హైదరాబాద్ : మియాపూర్ లోని అమీన్‌పూర్‌ కొండల్లో హత్య గురైన చాందిని జైన్ మృతదేహానికి పొస్ట్ మార్టం పూర్తైయింది. ఆమె చేయిపై గాయాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. పొస్ట్ మార్టం పూర్తి నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

చాందిని మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి...

హైదరాబాద్: చాందిని మృతదేహానికి గాంధీలో పోస్టుమార్టం జరిగింది. అనంతరం మృతదేహాన్ని బంధువులకు పోలీసులు అప్పగించారు. కాల్ డేటా, వాట్సప్ మెస్సేజీల ఆధారంగా ప్రేమ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. హత్యకోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. చాందిని శరీరంపై కాలిన గాయాలను పోలీసులు గుర్తించారు.

11:12 - September 12, 2017
11:08 - September 12, 2017

హైదరాబాద్ : పాతబస్తీ మంగళహాట్ లో పరువు హత్య జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని యువతియ సోదరుడు లక్ష్మణ్ హత్య చేశాడు. అమర్ యువతిని బెంగళూరుకు తీసుకెళ్లి పెళ్లి చేకున్నాడు. లక్ష్మణ్ నవదంపతులను నమ్మబలికి తీసుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ద్రౌపతి గార్డెన్స్ వద్ద అమర్ ను బండరాయితో లక్ష్మణ్ కొట్టి చంపాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కాసేపట్లో అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం...

చెన్నై: నేడు అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం కానుంది. ఈ సమావేశానికి దూరంగా దినకరన్ వర్గ ఎమ్మెల్యే ఉన్నారు. శశికళ, దినకరన్ లను పార్టీ నుంచి బహిష్కరిస్తూ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పాతబస్తీ మంగళహాట్ లో పురువు హత్య

హైదరాబాద్: పాతబస్తీ మంగళహాట్ లో పురువు హత్య జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న యుకుడ్ని యువతి సోదరుడు చంపేశాడు. యువతిని బెంగుళూరుకు తీసుకెళ్లి అమర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. నవ దంపతులను నమ్మబలికి పాతబస్తీకి తీసుకొచ్చిన యువతి సోదరుడు లక్ష్మణ్ ద్రౌపతి గార్డెన్స్ వద్దకు తీసుకెళ్లి అమర్ ను బండరాయితో లక్ష్మణ్ కొట్టి చంపేశాడు.

10:23 - September 12, 2017

హైదరాబాద్ : నగరంలో మరో చిట్ ఫండ్ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చింది. చిట్ ఫండ్ కంపెనీ సభ్యులను స్నేహబంధ: చిట్ ఫండ్ మోసం చేసి బోర్డు తిప్పేసింది. 3నెలల క్రితం చిట్ ఫండ్ కంపెనీని రాజేష్, ప్రదీప్ లు ప్రారంభించారు. 3నెలలలో డబ్బులు చెల్లిస్తామని దారణండా మోసం చేయడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఉప్పల్ పోలీస్ స్టేష్ బాధితులు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

రూ. 14లక్షల విలువైన బంగారం పట్టివేత...

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 14 లక్షలు విలువైన 466 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

తిరుమల అటవీ ప్రాంతంలో తప్పిపోయిన విద్యార్థి మృతదేహం లభ్యం..

తిరుపతి: రెండు రోజుల క్రితం కపిల తీర్థం వద్ద అటవీ ప్రాంతంలో అదృశ్యమైనర విద్యార్థి బాలాజీ మృతి చెందాడు. జలపాతంలో విద్యార్థి బాలాజీ మృతదేహాన్ని గుర్తించారు.

10:08 - September 12, 2017

హైదరాబాద్ : మదీనాగూడలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్‌ విద్యార్థిని చాందిని జైన్‌ను దుండగులు దారుణంగా హత్య చేశారు. అమీన్‌పూర్‌ సమీపంలోని కొండల్లో చాందిని మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. చాందిని బాచుపల్లిలోని ఓ ప్రైవేట్‌ కాలేజిలో ఇంటర్‌చదువుతోంది. మూడు రోజుల క్రితం కాలేజికి వెళ్లి చాందిని అదృశ్యమైంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

సాధారణ తుపానుగా మారిన హరికేన్ ఇర్మా

అమెరికా : ఫ్లోరిడాలో విధ్వంసం సృష్టించిన హరికేన్ ఇర్మా సాధారణ తుపానుగా మారింది. తుపాను బలహీనపడినా బలంగా గాలులు వీస్తున్నాయి. 3.6 కోట్ల మందిపై ప్రభావం చూపిన ఇర్మా తుపాను వల్ల 72 లక్షల ఇళ్లు, కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను తీవ్రత సాధారణ స్థాయికి వచ్చినా వరద ముప్పు పొంచి ఉందని, రానున్న 2 రోజుల్లో కుండపోత వానలు కరుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలతో వరదలు, అలలు పోటెత్తే అవకాశం కూడా ఉందని, ఉత్తర ఫ్లోరిడా, జార్జియాలో కుండ పోత వర్షాలు కురుస్తాయనిహెచ్చరించింది.

10:04 - September 12, 2017
10:02 - September 12, 2017

ఫ్లోరిడా : కరీబియన్‌ దీవుల్లో విధ్వంసం సృష్టించిన హరికేన్‌ ఇర్మా.. ఫ్లోరిడా తీరాన్ని తాకింది. ఆదివారం ఫ్లోరిడాలోని కీస్‌ వద్ద దక్షిణ తీరాన్ని తాకిన ఇర్మా.. సోమవారం పశ్చిమ తీరానికి చేరుకోవడంతో తగ్గుముఖం పట్టి కేటగిరి 1గా మారింది. ప్రతి గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ తీరంలోని మార్కో ద్వీపంలో హరికేను ప్రతాపాన్ని చూపించింది. ఈ తుపాను కారణంగా గంటకు 177 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. క్రమంగా ఇర్మా స్థాయి తగ్గుతున్నట్లు కన్పిస్తోందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఫ్లోరిడాలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇర్మా భయంతో ఫ్లోరిడాలో దాదాపు 60 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయం తెలిసిందే. ఇర్మా తుపాను ధాటికి విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. లక్షాలాది మంది ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

భారీగా ఆస్తినష్టం...
హరికేన్‌ ఇర్మాతో ఫ్లోరిడాకు భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఫ్లోరిడా వంద బిలియన్‌ డాలర్లు నష్టపోయిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్యాటక రంగంపై ఇర్మా తీవ్ర ప్రభావాన్ని చూపనుందని చెబుతున్నారు. శీతాకాలంలో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పర్యాటక ప్రాంతాలు చాలావరకు దెబ్బతినడంతో ఈసారి పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిస్నీ వరల్డ్‌కు చెందిన మ్యాజిక్‌ కింగ్డమ్‌, యునివర్శల్‌ స్టూడియోస్‌, లెగో ల్యాండ్‌, సీ వరల్డ్‌లాంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. గత ఏడాది 113 మిలియన్ల మంది ఇక్కడ పర్యటించారు. ఇటీవల వచ్చిన హార్వే హరికేను అమెరికా చరిత్రలోనే అత్యంత నష్టదాయకమైంది. ఈ హరికేను కారణంగా అమెరికాకు 190 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. ఇర్మా ధాటికి కరేబియన్‌ తీరంలో ఇప్పటికే 25 మంది ప్రాణాలు కోల్పోగా.. ఫ్లోరిడాలో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. ఇర్మా పశ్చిమ దిశగా కదులుతుండటంతో చాలా వరకు ముప్పు తప్పిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు.

ఎం కేసీఆర్ నిజాంలా వ్యవహరిస్తున్నారు: వీహెచ్

హైదరాబాద్: బైసన్ పోలో గ్రౌండ్ లో కొత్త సచివాలయం నిర్మించొద్దని మాజీ ఎంపి వీహెచ్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. బైసన్ పోటో గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సీఎం కేసీఆర్ నిజాంలా వ్యవహరిస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను సద్వినియోగం చేసుకోకుండా కొత్త భవనాలు కట్టాలని ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, కేసీఆర్ తన నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

నిజామాబాద్ బాలుడి కిడ్నాప్ సుఖాంతం

నిజమాబాద్ : జిల్లా కోటగిరిలో బాలుడి కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడింది. అరుణ్ అనే బాలుడు ఈ నెల 9న కిడ్నాప్ కు గురైయ్యాడు. ప్రస్తుతం బాలుడు బోధన్ పోలీస్ స్టేషన్ ఉన్నాడు. బాలున్ని తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మియాపూర్ లో దారుణం

హైదరాబాద్ : మియాపూర్ మదీనాగూడలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థిని చాందిన్ జైన్ దారుణహత్య గురైంది. అమీన్ పూర్ కొండల్లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. చాందిని ఈ నెల 9న కాలేజీ వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. చాందిని బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ చదువుతుంది.

09:16 - September 12, 2017

గుంటూరు : సోవియట్‌ యూనియన్‌ అక్టోబర్‌ విప్లవ ప్రభావం నేటి పోరాటాలపై ఎంతో ఉందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. దోపిఈ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.కార్మికులు,కర్షకులు, కూలీలను సమన్వయం చేసుకుంటేనే విప్లవ పోరాటాలు విజయవంతం అవుతాయని స్పష్టం చేశారు. కారల్‌మార్క్స్‌ ద్విశతజయంతి సందర్భంగా గుంటూరులో నిర్వహించిన అక్టోబర్‌ మహావిప్లవ శత వార్షికోత్స సభకు ఆయన హాజరయ్యారు. మతోన్మాద దౌర్జన్యాలు, ఆర్దిక అసమానతలు ఎదుర్కొనే దిశగా దేశంలో విప్లవోద్యమాల అవసరం ఎంతో ఉందన్నారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అక్టోబర్‌ మహావిప్లవ శత వార్షికోత్సవం సభ జరిగింది. పెట్టుబడి గ్రంథం ప్రాముఖ్యతపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దేశంలో పాలకులు, పెట్టుబడిదార్ల గుప్పిట్లో
మానవ చరిత్రను మార్చిన అక్టోబరు మహా విప్లవం ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ఏచూరీ అన్నారు. దేశంలో పాలకులు, పెట్టుబడిదార్ల గుప్పిట్లో చిక్కుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులను సమీకరించి... వారితో ప్రజాతంత్ర విప్లవ పంథాను రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని దేశాల్లో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతోనే ఉద్యమాలు నడుస్తున్నాయని చెప్పారు. సోషలిజం కోసం పోరాడాల్సిన అవసరాన్ని అక్టోబర్‌ మహా విప్లవం తర్వాత లెనిన్‌ ప్రత్యేకంగా చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం సోవియట్‌ యూనియన్‌ లేకున్నా అక్టోబరు మహా విప్లవ ప్రాధాన్యం ఎంతో ఉందన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా పెట్టుబడిదారీ వర్గాలకే కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు విద్య, వైద్యం, నివాసం కల్పించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్దితో వ్యవహరించాలని సూచించారు. దేశంలో మతోన్మాద రాజకీయాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసిన ఏచూరీ.. కుల వ్యవస్థ, సామాజిక దౌర్జన్యాలను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సభలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ... శ్రమను, సంపదను సృష్టిస్తున్న కార్మికవర్గం చేతిలోనే పెట్టుబడిదారీ వర్గం అంతమవుతుందని కారల్‌ మార్క్స్‌ తన పెట్టుబడి గ్రంథంలో వివరించారని చెప్పారు. మార్క్స్‌ రాసిన పెట్టుబడి గ్రంథాన్ని నేటికీ సిద్దాంతపరంగా తప్పు అని రుజువు చేయలేకపోయారన్నారు. ప్రధాని మోదీ పెట్టుబడిదారీ దారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ పేదలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ఏదో ఒక దశలో పతనం తప్పదని హెచ్చరించారు. కమ్యూనిస్టుల పనైపోయిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారని.. కానీ కమ్యూనిస్టుల పనంతా భవిష్యత్‌లోనే ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి. కృష్ణయ్య, వైవీ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కేయస్‌ లక్ష్మణరావుతోపాటు పలువురు నేతలు, సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు.

08:06 - September 12, 2017
07:49 - September 12, 2017

తెలంగాణలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు ఆలస్యమవుతోందంటూ ప్రశ్నించింది. ఈ కేసును అక్టోబర్ 28కి వాయిదా వేసింది. దీంతో తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. తెలంగాణలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా వుండాలంటే మరో నలభై వేల మంది ఉపాధ్యాయులను రిక్రూట్ చేయాలన్న అంచనాలున్నాయి. 8792 పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. అయిన్నప్పటికీ జీవో జారీ కాలేదు. నోటిఫికేషన్ రాలేదు. ప్రభుత్వం నిరుద్యోగులతో అడుకుంటుందని, బాద్యత లేకుండా ప్రభుత్వం ప్రవర్తిస్తుందని, చరిత్ర తొలిసారి విద్యాశాఖ కార్యదర్శి సుప్రీం కోర్టు ముందు హాజరుకావాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా ప్రభుత్వ టీచర్ రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసి రెగ్యూలర్ గా పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ సంఘం నాయకులు మధుసూదన్ గారు అన్నారు మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:46 - September 12, 2017

కృష్ణా : కృష్ణా, గుంటూరు జిల్లాలో మద్యం వెల్లువలా ప్రవహిస్తోంది. రెండు జిల్లాలో మొత్తం 695 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్క కృష్ణా జిల్లాలోనే 162 బార్లు, రెండు పబ్‌లు ఉన్నాయి. ఈ మేరకు 2017 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఐదు నెలల వ్యవధిలో కృష్ణా జిల్లాలోనే 681.68 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోనే దాదాపు రూ.300 కోట్లకు పైబడి అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇష్టానుసారంగా మద్యం షాపులు పెట్టడంతో... మహిళలు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లాలో యువత పెడదోవ పడుతుందని ఆవేదన చెందుతున్నారు. మద్యం మైకంలో అనేక మంది తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అంటున్నారు. మద్యం విక్రయాలను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం.. మద్యంపై వచ్చే ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు చౌక మద్యం ధరలు మినహా మిగతా ప్రీమియం బ్రాండ్ల ధరలు స్వల్పంగా పెంచేశారు. ఈ మేరకు క్వార్టర్‌పై రెండు రూపాయలు నుంచి ఐదు రూపాయలు వరకూ పెరిగింది. తాజా ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం చేరనుంది. 

07:45 - September 12, 2017

హైదరాబాద్ : గ్రేటర్‌ వాసులకు మెట్రో ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. గత కొంత కాలంగా మెట్రో రైల్‌ నిర్మాణ పనులతో ట్రాఫిక్‌ను మళ్లించడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇందులో భాగంగా అమీర్‌పేట, సికింద్రాబాద్‌, చిలకలగూడ చౌరస్తా ఏరియాలో ట్రాఫిక్‌ను మళ్లించారు. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే వాహనదారులు 5 కిలో మీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఒలిఫెంటా వద్ద రైల్వే ట్రాక్‌పై మెట్రో సిబ్బంది స్టీల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ బ్రిడ్జ్‌ నిర్మాణం కోసం అధికారులు సుమారు 90 లక్షల రూపాయలు వెచ్చించారు. స్టీల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణమే కాకుండా బ్రిడ్జ్‌కి ఇరువైపులా సిసి రోడ్డు నిర్మాణం చేపట్టారు. గతంలో ఈ బ్రిడ్జి కింద నుండి ప్రయాణం చేయాలంటే బురద నీటిలోనే వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం స్టీల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణంతో ఆ బ్రిడ్జ్‌ కింద రోడ్డు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అధికారులు శరవేగంగా పనులు పూర్తి చేయడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మెట్రో పనులు కూడా శరవేగంగా పూర్తి కావస్తుండడంతో నగర వాసులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.

 

07:43 - September 12, 2017

హైదరాబాద్ : పదిన్నర దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన విక్టోరియా మెమోరియల్‌ ట్రస్ట్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది.. నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచి... ఆశ్రయం కల్పించిన ఆ విద్యానిలయం మనుగడ ప్రమాదంలో పడింది. పాలకులే వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఆ చరిత్రను సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని 1903లో దిల్‌సుఖ్ నగర్‌లో విక్టోరియా మహల్‌ను స్థాపించారు. ఆరో నిజాం నవాబు ఎతీమ్ ఖాన్ పేరుతో విక్టోరియా రాజులు సుమారు 74 ఎకరాల భూమిలో లక్షల చదరపు అడుగుల సువిశాలమైన సుందర భవనాలను నిర్మించారు.

ఎస్సీ అభివృద్ధి శాఖ...
విక్టోరియా నిలయం విద్యాభివృద్ధి కోసం పనిచేస్తూ ఎందరో విద్యార్థులను ఉన్నతస్థాయికి చేర్చింది. విక్టోరియా మహల్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ హాయాంలో 1994లో జీవో నెంబర్‌ 124 ద్వారా ఎస్సీ అభివృద్ధి శాఖ పర్యవేక్షణలో ట్రస్ట్‌ ఏర్పాటు చేసి డేస్కాలర్ పాఠశాలగా మార్చారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కార్యనిర్వాహాక చైర్మన్‌గా ఉన్న ఈ ట్రస్ట్‌లో సంబంధింత శాఖ కార్యదర్శితో పాటు విద్యా కమిషనర్‌ సాంకేతిక విద్యా, కార్మిక దేవాదాయ శాఖలను ట్రస్టులో సభ్యులుగా చేసింది. ఇంత పటిష్టంగా ఏర్పడిన ట్రస్టు కొన్నేళ్లగా నిరాధరణకు గురవుతుంది. వెయ్యిమంది విద్యార్థులతో పాటు 34 మంది టీచర్లు కలిగిన ఈ పాఠశాల భూములు నేడు అన్యాక్రాంతమవుతున్నాయి. నిబంధన ప్రకారం ట్రస్ట్‌ భూములను ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించకూడదు. కానీ ప్రభుత్వాలు రూల్స్‌కు విరుద్ధంగా భూముల బదలాయింపులకు పాల్పడుతున్నాయి. 1997లో టీడీపీ ప్రభుత్వం ట్రస్టుకు చెందిన 20 ఎకరాలకు కూరగాయలు... పండ్లు మార్కెట్‌ కోసం లీజుకు కేటాయించారు. అలాగే రిలయన్స్‌ పెట్రోల్ బంక్, బాబు జగ్జీవన్‌రావ్‌ ఆడిటోరియం నిర్మాణాలకు కేటాయించారు. అలాగే రోడ్డు విస్తీర్ణంలో నాలుగు ఎకరాల భూమిని కోల్పోయింది. మరో రెండు ఎకరాల భూమి కబ్జాకు గురైంది.

రాచకొండ పోలీస్ కమిషనర్‌ రేట్ నిర్మాణానికి
తాజాగా తెలంగాణ ప్రభుత్వం కన్ను.. ట్రస్టు భూములపై పడింది.. జీ.వో నెంబర్ 48 ద్వారా 10 ఎకరాల భూమిని రాచకొండ పోలీస్ కమిషనర్‌ రేట్ నిర్మాణానికి లీజుకిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది... మరో 26 ఎకరాల భూమిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు వైద్య ఆరోగ్య శాఖకు లీజుకివ్వడానికి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పాలకుల నిర్ణయంపై ప్రజా పక్షాలు, విద్యార్థులు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ప్రభుత్వ చర్యపై మండిపడుతున్నాయి. విక్టోరియా మహల్‌ను కాపాడుకోవడానికి పోరాటానికి దిగాయి. ఏదిఏమైన... ప్రభుత్వం...ఈ కట్టడం విశిష్టతను కాపాడి... దాని అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

07:41 - September 12, 2017

విజయవాడ : విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయ అధికారులు ఈసారి కూడా దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తులపై భారం మోపేందుకు సిద్ధమయ్యారు. అమ్మవారిని దర్శించుకుని వివిధ పూజలు నిర్వహించేందుకు వచ్చే భక్తులపై టిక్కెట్ల భారం వేయడానికి రంగం సిద్ధమైంది. గతేడాది భారీగా పెంచిన సేవా టిక్కెట్ల ధరలను యధావిధిగా కొనసాగించాలని దుర్గగుడి అధికారులు, పాలకమండలి నిర్ణయించింది. దుర్గమాతకు నిత్యం నిర్వహించే కుంకుమ పూజలకు దసరా నవరాత్రి ఉత్సవాల్లో విశేషమైన ఆదరణ ఉంటుంది. భక్తులు నవరాత్రుల్లో కుంకుమ పూజల్లో పాల్గొనేందుకు భక్తులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. సాధారణ రోజుల్లో కుంకుమ పూజకు వెయ్యి రూపాయలుగా టిక్కెట్‌ ధర ఉంటుంది. అయితే దసరా ఉత్సవాల సందర్భంగా ఈ టిక్కెట్‌ ధరను ఏకంగా మూడు వేల రూపాయలకు పెంచారు. అంతేకాదు.. సరస్వతీదేవి రూపంలో అమ్మవారు కనిపించే మూలానక్షత్రం రోజున ఇదే పూజకు ఏకంగా 5వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.

చండీయాగానికి 4వేల రూపాయలు
అమ్మవారికి నిత్యం నిర్వహించే చండీయాగానికి మామూలు రోజుల్లో వెయ్యి రూపాయలు టిక్కెట్‌ ధర ఉండగా.. దసరా ఉత్సవాల సమయంలో దానిని 4వేల రూపాయలకు పెంచారు. దసరా ఉత్సవాల్లో సేవా టిక్కెట్లను భారీగా పెంచడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామూలు భక్తులు దుర్గగుడివైపు చూడకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. దుర్గగుడిలో సేవా టిక్కెట్ల పెంపుపై ఎన్ని విమర్శలు వస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దాదాపు 15 కోట్ల రూపాయలతో అమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నందున ఆదాయం కోసం టిక్కెట్ల ధరలను తగ్గించడం కుదరదని తేల్చి చెబుతున్నారు. సేవా టిక్కెట్ల ధరలను తగ్గించేందుకు అధికారులు ససేమిరా అనడంపై పాలకమండలి కూడా నిస్సహాయంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు దర్శనం టిక్కెట్ల రేట్లను తగ్గిస్తామని అధికారులు చెబుతున్నారు. సేవా టిక్కెట్ల ధరల పెంపుపై మాత్రం నోరు మెదపడం లేదు. వందల్లో ఉండే దర్శనం టిక్కెట్ల ధర కొద్దిగా తగ్గించి... వేలల్లో సేవాటిక్కెట్ల ధరలు పెంచడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా దసరా పండుగను నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులపై భారం పడేలా ఎందుకు సేవా టిక్కెట్ల ధరలను పెంచుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పెంచిన సేవా టిక్కెట్ల ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

07:39 - September 12, 2017

హైదరాబాద్ : త్వరలోనే తెలంగాణలోనూ నంద్యాల లాంటి పోరు తప్పేలా లేదు. ఉప ఎన్నికల స్పెషలిస్ట్‌ పార్టీగా గుర్తింపు పొందిన గులాబీ పార్టీ... మరోసారి అదే దారిని ఎంచుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తికావడంతో.. ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు ఉప ఎన్నికలు అనివార్యం అని గులాబీ బాస్‌ బావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికారపార్టీ ఇప్పటికే తన సత్తా చాటింది. ఇప్పుడు మరోసారి ప్రయోగానికి టీఆర్‌ఎస్‌ రెడీ అవుతోంది.

సమన్వయ సమితి చైర్మన్‌ ఎవరికి
తెలంగాణ సర్కార్‌ రైతు సమన్వయ సమితుల ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే రాష్ట్రస్థాయిలో రైతు సమన్వయ సమితి చైర్మన్‌ ఎవరికి ఇవ్వాలనే దానిపై కేసీఆర్‌ కసరత్తు చేశారు. నల్లగొండ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించేందుకు సీఎం కేసీఆర్‌ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రైతు సమన్వయ సమితి చైర్మన్‌ కేబినెట్‌ హోదా కలిగిన పదవి. దీంతో కేబినెట్‌ హోదాకు.. గుత్తా ఎంపీ పదవి హోదా అడ్డువస్తోంది. దీంతో గుత్తా కూడా ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్దమయినట్టు సమాచారం. మరో పది లేదా నెల రోజుల్లో రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎన్నిక ఇక లాంఛనమే కానుంది. దీంతో నల్లగొండ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక రానుంది. కేసీఆర్‌ కూడా జనరల్‌ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికను ప్రీపోల్‌గా భావిస్తున్నట్టు తెలుస్తోంది. నల్లగొండ ఎంపీతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థానానికి కూడా ఉప ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో కేసీఆర్‌ ఉనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్‌ను నైతికంగా దెబ్బతీయాలని వ్యూహం
గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజీనామా, ఎంపీ స్థానానికి ఉప ఎన్నికతో కాంగ్రెస్‌కు కూడా కేసీఆర్‌ షాక్‌ ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలో ఉత్తమ్‌, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలాంటి హేమాహేమీలు ఉండడంతో వీరిని దెబ్బకొట్టవచ్చని కేసీఆర్‌ భావిస్తున్నారు. జనరల్‌ ఎన్నికలకు ముందు నల్లగొండ ఎంపీ స్థానంలో టీఆర్‌ఎస్‌ను గెలిపించి కాంగ్రెస్‌ను నైతికంగా దెబ్బకొట్టాలన్న వ్యూహంతో కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు.

 

07:37 - September 12, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో ఆక్వాఫుడ్‌ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమం మళ్లీ ఉధృతమవుతోంది. భీమవరం మండలం తుందుర్రులో బాధిత గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఆక్వా పరిశ్రమని పూర్తిగా ఎత్తేవేసేంతవరకు ఉద్యమం ఆగదని తేల్చి చెబుతున్నారు. పోలీసులతో ఉద్యమాన్ని ఆపాలనుకుంటే.. చంద్రబాబు ప్రభత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆందోళన కారులు హెచ్చరించారు. 

07:36 - September 12, 2017

వరంగల్ : వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ధర్నాకు దిగారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

07:35 - September 12, 2017

హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ ద్వంద్వ వైఖరిని విడనాడాలని టీ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ నేత బీహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోడీ కేసీఆర్‌ పాలనను అభినందిస్తున్నారని.. రాష్ట్ర బీజేపీ నేతలేమో కేసీఆర్‌ పాలనను విమర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర పెద్దలు కేసీఆర్‌ పొగుడుతుంటే.. రాష్ట్ర నాయకులు విమర్శలు గుప్పిస్తూ ద్వంద్వ వైఖరి అవలంభించడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ డబుల్‌స్టాండ్‌ను విడనాడితే బాగుంటుందని రేవంత్‌ సూచించారు. 

07:34 - September 12, 2017

విశాఖ : కాపులుప్పాడ ఐటీ లేఔట్‌ను మంత్రి నారా లోకేష్‌ పరిశీలించారు. వచ్చే 2 నెలల్లో ఐటీ అభివృద్ధిపై కీలకమైన ప్రకటన చేస్తామన్నారు. 2018 మార్చి నాటికి 30 వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అక్టోబర్‌ నాటికి కాపులుప్పాడ ఐటీ లేఔట్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.  

07:33 - September 12, 2017

హైదరాబాద్ : కేసీఆర్‌ సర్కారు తీసుకొచ్చిన రైతు సమన్వయ సమితులు రాష్ట్ర రాజకీయాల్లో నిప్పు రాజేశాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్‌ పోరుబాట పట్టింది. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల తహసీల్దార్‌ కార్యాలయాల ముందు కాంగ్రెస్‌ నాయకులు ధర్నాలు చేశారు. సమితుల ఏర్పాటు కోసం ప్రభుత్వం విడుద‌ల చేసిన జీవో 39ను తక్షణం ర‌ద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన భట్టీ విక్రమార్క, సబితాఇంద్రారెడ్డి, షబ్బీర్‌ ఆలీ, డీకే అరుణ తదితర నాయకులు ధర్నాల్లో భాగమయ్యారు. హూజూర్‌నగర్‌ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఆందోళ‌న‌లో పాల్గొన్న ఉత్తం కుమార్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. కేసీఆర్‌ తన వివాదాస్పద నిర్ణయాలతో రైతుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నార‌ని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే జీవో 39ని విరమించుకోకుంటే... ఆందోళన మరింత ఉధృతం చేస్తామనికాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.

07:32 - September 12, 2017

హైదరాబాద్ : విద్యార్థులపై కార్పొరేట్‌ కాలేజీల వేధింపులు మాత్రం ఆగడం లేదు. ముగ్గురు లెక్చరర్స్‌ ఓ స్టూడెంట్‌ను వేధింపులకు గురిచేయడంతో అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. బాలాపూర్‌కు చెందిన మాణిక్‌ప్రభు, విజయశ్రీల కుమారుడు సంజయ్‌ చంపాపేట్‌లోని ఓ కార్పొరేట్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం ముగ్గురు కాలేజీ లెక్చరర్స్‌ సంజయ్‌ను వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన సంజయ్‌ కాలేజీ నుంచి ఇంటికి వెళ్లాడు. 5వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతడి తల్లిదండ్రులు బాలాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంజయ్‌ పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. 48 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమంటున్నారు. తమ కుమారుడిని వేధించిన లెక్చరర్స్‌పై చర్యలు తీసుకోవాలని సంజయ్‌ తల్లిదండ్రులు కోరుతున్నారు. 

07:19 - September 12, 2017

రాజకీయంగా చూస్తే 63 మంది ఎమ్మెల్యేల అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ 93 ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చాయో మనకు తెలుసని సీపీఎం నేత మల్లరెడ్డి అన్నారు. అందరి ఎమ్మెల్యేలో రాజీనామా చేయించండి ఎన్నికల వెళ్లి ఎవరి సత్తా ఎంటో తెల్చుకుందామని టీడీపీ నేత విద్యాసాగర్ అన్నారు. మేము తెలంగాణ వ్యతిరేకంగా టీడీపీ నేతలు ప్రవర్తించి తెలంగాణ ద్రోహులుగా మారారని టీఆర్ఎస్ నేత రాకేష్ అన్నారు. మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూంలో ప్రభుత్వం విఫలం చెందిందని, దళితులకు ఇచ్చిన భూమిలో 75 శాతం ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలేదని బీజేపీ నేత నరేష్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

నేడు అవరావతికి నార్మన్ పోస్టర్ టీం

గుంటూరు :నేడు అమరావతికి నార్మనన్ పోస్టర్ టీం రానుంది. ప్రభుత్వ భవనాల డిజన్లపై సీఆర్డీయోతో సమావేశం జరపనున్నారు.

నేటి నుంచి ఓపెన్ సూర్ సరీస్ బ్యాడ్మింన్ టోర్ని

దక్షణ కొరియా : నేటి నుంచి దక్షణ కొరియాలో కొరియా ఓపెన్ సరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో సింధు ఐదో సీడ్ గా బరిలోకి దిగనుంది. సింధు తొలిరౌండ్ లో చుంవాంగ్ తలపడనుంది.

 

నేడు పాకిస్థాన్ తో ప్రపంచ ఎలెవన్ మ్యాచ్

ఇస్లామాబాద్ : నేడు పాకిస్థాన్ తో ప్రపంచ ఎలెవన్ జట్టు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ప్రపంచఎలెవన్ జట్టు పాక్ తో మూడు మ్యాచ్ లు ఆడనుంది.

 

నేడు నదుల అనుసంధానంపై సమావేశం

ఢిల్లీ : నేడు నదుల అనుసంధానంపై సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల జలవనరుల మంత్రులు హాజరుకానున్నారు. ఏపీ నుంచి మంత్రి దేవినేని, అధికారులు హాజరుకాన్నున్నారు.

నేడు అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం

చెన్నై : నేడు అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశించింది.

నేటి నుంచి విశాఖలో స్నూకర్ టోర్నిమెంట్

విశాఖ : నేటి నుంచి ఐదు రోజుల పాటు స్నూకర్ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నిలో 64 మంది వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ పాల్గొననున్నారు. 

Don't Miss