Activities calendar

13 September 2017

పేకాట స్థావరంపై పోలీసులు దాడి

పశ్చిమగోదావరి : జిల్లాలోని చింతలపూడిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు. అనంతరం.. వారిని చింతలపూడి వీధుల్లో అర్ధనగ్నంగా ఊరేగించారు. వీరిని ఇలా అర్థనగ్నంగా ఊరేగించడం బాగాలేదనివాదనలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో వీరిని పేకాట ఆడొద్దని పలుమార్లు హెచ్చరించినా... వినలేదని అందుకే ఇలా చేశామని పోలీసులు చెబుతున్నారు. 

 

22:03 - September 13, 2017

రాజధాని భవనాల డిజైన్లపై బాబు సమీక్ష

గుంటూరు : రాజధాని పరిపాలన, నగర నిర్మాణ ప్రణాళిక, ఆకృతులపై సీఎం చంద్రబాబు నాయుడుకు నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.. కోహినూరు వజ్రాకృతిలో రూపొందించిన శాసన సభ భవంతి, హైకోర్టు భవంతి ఆకృతులను కూడా వివరించారు.. 

22:01 - September 13, 2017
22:00 - September 13, 2017

ఆప్ఘనిస్తాన్‌ : కాబూల్‌లో క్రికెట్‌ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు, ఓ పౌరుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాబూల్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్ స్టేడియం చెక్‌ పాయింట్‌ వద్ద సుసైడ్‌ బాంబర్‌ తనని తాను పేల్చుకున్నాడు. స్టేడియంలో టి-20 మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రికెట్‌ ఆటగాళ్లంతా క్షేమంగా ఉన్నట్లు ఆఫ్గన్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది.

 

21:59 - September 13, 2017

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు ప్రయోగాలకు నిలయాలుగా మారుతున్నాయి. తరగతి గదిలో విద్యార్థులు హాజరు పలికేటపుడు 'యస్‌ సార్‌, ప్రజెంట్‌ సార్‌' అని చెప్పడం సాధారణం. ఇక మీదట దీనికి బదులు 'జై హింద్‌ సర్‌' అని పలకాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ్‌ షా ఆదేశాలు జారీ చేశారు. ప్రయోగాత్మకంగా సత్నా జిల్లాలోని అన్ని పాఠాశాలలో ఈ విధానం అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి రానుంది. దీనివల్ల విద్యార్థుల్లో దేశభక్తి పెరుగుతుందని మంత్రి సెలవిచ్చారు. త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. అంతకు ముందు ప్రభుత్వ స్కూళ్లకు పెద్దమొత్తంలో విరాళాలిచ్చే కంపెనీలు, వ్యక్తుల పేర్లు పెడతామని విద్యామంత్రి చెప్పారు. 

21:56 - September 13, 2017

ఢిల్లీ : ఢిల్లీ యూనివ‌ర్సిటీ విద్యార్థుల సంఘం ఎన్నిక‌ల్లో బిజెపి అనుబంధ విద్యార్థి సంస్థ ఎబివిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్ష పదవిని గెలుచుకుంది. ఎన్‌ఎస్‌యుఐకి చెందిన రాకీ తూశీద్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఉపాధ్యక్ష పదవిని కూడా ఎన్‌ఎస్‌యుఐ కైవసం చేసుకుంది. ఏబివిపి సెక్రెటరీ, జాయింట్‌ సెక్రెటరి పదవులు దక్కాయి. నాలుగేళ్ల తర్వాత ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్ష పదవిని గెలుచుకుంది. అధ్యక్ష పదవి కోసం ఎబివిపి నుంచి రజత్‌ చౌదరి, ఎన్‌ఎస్‌యుఐ నుంచి రాకీ తుశీద్, ఐసా నుంచి పారల్‌ చౌహాన్, స్వతంత్ర అభ్యర్థి రాజా చౌదరి పోటీ పడ్డారు.  సెప్టెంబ‌ర్ 12న జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తం 43 శాతం విద్యార్థులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. గత ఏడాది ఏబివిపి మూడు పదవులు గెలుచుకోగా ఎన్‌ఎస్‌యుఐ కేవలం జాయింట్‌ సెక్రెటరి పదవితో సంతృప్తి పడింది.

 

21:52 - September 13, 2017

గుజరాత్ : రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే దంపతులకు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రధాని నరేంద్రమోది ఘనస్వాగతం పలికారు. షింజో అబేను మోది ఆలింగనం చేసుకుని స్వాగతించారు. అబే పర్యటన కోసం ప్రత్యేక స్వాగతం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి అహ్మదాబాద్‌లో రోడ్‌ షో నిర్వహించారు. రోడ్ షో అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి సబర్మతీ ఆశ్రమం వరకు 8 కిలోమీటర్ల మేర సాగింది. సబర్మతీ నదీ తీరాన ఏర్పాటు చేసిన వేదికపై పలువురు కళాకారులు నృత్యాలను ప్రదర్శించారు. విదేశి ప్రధానమంత్రితో కలిసి భారత ప్రధాని రోడ్‌ షో నిర్వహించడం ఇదే తొలిసారి. రోడ్‌ షో సందర్భంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.  5 వందల ఏళ్ల కాలం నాటి సిద్ధి సయీద్‌ మసీదును షింజో అబే సందర్శించనున్నారు.  గురువారం అహ్మదాబాద్ - ముంబై మ‌ధ్య తొలి హైస్పీడ్ రైలు ప‌నుల ప్రారంభ కార్యక్రమంలో షింజో అబే పాల్గొంటారు. షింజో అబేకు గుజరాతీ వంటకాలతో ఈ సాయంత్రం మోది ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

21:49 - September 13, 2017

గుంటూరు : రాజధాని పరిపాలన, నగర నిర్మాణ ప్రణాళిక, ఆకృతులపై సీఎం చంద్రబాబు నాయుడుకు నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.. కోహినూరు వజ్రాకృతిలో రూపొందించిన శాసన సభ భవంతి, హైకోర్టు భవంతి ఆకృతులను కూడా వివరించారు.. హైకోర్టు బాహ్య ఆకృతి అద్భుతంగా... ప్రపంచానికి తలమానికంగా ఉండాలని సీఎం నార్మన్‌ ప్రతినిధులకు సూచించారు.. లోపల ఎలాంటి సౌకర్యాలు ఉండాలో... అంతర్గత భవంతి నిర్మాణ శైలి ఎలా ఉండాలో న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.. 

 

21:47 - September 13, 2017

హైదరాబాద్ : టీడీపీ.. కాంగ్రెస్‌..! ఈ రెండు పార్టీలూ మొన్నటి వరకూ వైరిపక్షాలు. కానీ ఇప్పుడు ఈ రెండు పార్టీలూ తెలంగాణలో ఐక్యతారాగాన్ని ఆలపిస్తున్నాయి. సమస్య ఏదైనా.. విడివిడిగానో... ఐక్యంగానో ప్రభుత్వ తీరును ఎండగుడుతోన్న టీడీపీ, కాంగ్రెస్‌లు, ఇప్పుడు ఎన్నికల్లోనూ ఐక్యంగా బరిలోకి దిగాలని నిర్ణయించాయి. రానున్న సింగరేణి ఎన్నికల్లో దీనికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించాయి. 

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలు ఐక్యతారాగం అందుకున్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు, అదే కాంగ్రెస్‌తో జతకలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు.. ఈ రెండు పక్షాలూ తమ సిద్ధాంతాలను సైతం పక్కనబెట్టి ఏకమవుతున్న పరిస్థితి తెలంగాణలో ఆవిష్కృతమవుతోంది. 

తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో అవ‌క‌త‌వ‌కల్ని ఎండగట్టేందుకు.. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు ఐక్యంగా ముందుకు సాగుతున్నాయి. కొంతకాలంగా వివిధ సమస్యలపై ఈ రెండు పక్షాలూ ఉమ్మడి ఆందోళనల్లో పాల్గొన్నాయి. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ, మియాపూర్ భూస్కాం ఆరోప‌ణ‌లు, నేరెళ్ళలో ద‌ళితుల‌పై దాడి పైనా ఒకే వాణిని వినిపించిన విపక్షాలు.. కొన్ని సందర్భాల్లో ఒకే ఉద్యమ వేదికనూ పంచుకున్నాయి. తాజాగా, రైతు సమన్వయ సమితులపైనా కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఐక్యగళాన్ని వినిపిస్తున్నాయి.  

సమగ్ర భూ సర్వే కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 39కి వ్యతిరేకంగా.. ఈ రెండు పక్షాలు ఐక్యంగా ఉద్యమిస్తున్నాయి. సీపీఐ, టీజేఏసీ నేతలను కూడా కలుపుకుని.. బుధవారం, జీవో 39 రద్దు కోసం గవర్నర్‌ నరసింహన్‌ను కలిశాయి. జీవో నెంబర్‌ 39ను రద్దు చేసేలా చొరవ తీసుకోవాలంటూ ఈ పార్టీల నేతలు గవర్నర్‌కు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు.  

సమస్యలపై ఐక్య పోరాటమే కాదు.. కలిసికట్టుగా ఎన్నికలను ఎదుర్కొనే దిశగానూ టీడీపీ, కాంగ్రెస్‌లు సాగుతున్నాయి. సింగరేణి ఎన్నికల్లో.. టిఆర్ఎస్ అనుబంధ యూనియ‌న్‌ను ఓడించడమే లక్ష్యంగా ఉమ్మడి అభ్యర్థులను నిలపాలని నిర్ణయించాయి. సింగ‌రేణిలో వార‌స‌త్వ ఉద్యోగాలు ఇస్తామన్న సర్కారు.... మాట తప్పిందన్న ఆరోపణలతో.. సింగరేణి కార్మికుల మనసు చూరగొనే ప్రయత్నం చేస్తున్నాయి. వారసత్వ ఉద్యోగాల క్రమబద్దీకరణకు జీవో ఇచ్చిన ప్రభుత్వం... మళ్లీ జాగృతి నాయకుడితో దానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్‌ వేయించిందని ఆరోపిస్తున్నాయి. మొత్తానికి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటినుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.. గులాబీ బాస్‌ను ఢీకొట్టాలన్న  వీరి ఐక్యతారాగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో వేచిచూడాలి.. 

21:44 - September 13, 2017

వరంగల్‌ : జిల్లాలో టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య రైతు సమన్వయ సమితి చిచ్చు పెట్టింది. హన్మకొండలో సర్క్యూట్‌ హౌస్‌ వద్ద టీఆర్ ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ను అడ్డుకున్నారు. తన అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూ నిజమైన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే తీరుపై మంత్రి కడియంకు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. రైతు సమన్వయ సమితుల్లో తమకు అవకాశం ఇవ్వడంలేదని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

 

వరంగల్‌ జిల్లాలో రైతు సమన్వయ సమితి రగడ

వరంగల్‌ : జిల్లాలో టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య రైతు సమన్వయ సమితి చిచ్చు పెట్టింది. హన్మకొండలో సర్క్యూట్‌ హౌస్‌ వద్ద టీఆర్ ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ను అడ్డుకున్నారు. తన అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూ నిజమైన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే తీరుపై మంత్రి కడియంకు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. రైతు సమన్వయ సమితుల్లో తమకు అవకాశం ఇవ్వడంలేదని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

 

21:40 - September 13, 2017

సామాజిక వేత్త, ప్రొ.కంచె ఐలయ్య 'సోషల్ స్మగ్లర్లు' కోమటోళ్లు...అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకంపై వక్తలు భిన్న వాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పుస్తక రయియిత, సామాజికవేత్త ప్రొ.కంచె ఐలయ్య, తెలంగాణ సాహితీ కన్వీనర్ భూపతి వెంకటేశ్వర్లు, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, వైశ్య వికాస వేదిక రాష్ట్ర కన్వీనర్ కాచం సత్యనారాయణగుప్తా పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

21:20 - September 13, 2017

గవర్నర్ నరసింహన్ మీద వీహెచ్ గరం... గల్లీలల్లతిరుగుకుంట జనానికిజెప్తున్నడు, చంద్రబాబు జీవితం మీద సీన్మొస్తుంది....ఓటుకు నోటు సీన్లు మాత్రం పెట్టకుండ్రి, రాత్రి 11 దాకా వైన్సులు ఓపెన్.. తాగుబోతులకు టీర్కార్ బంపర్ హాపర్, సైకిండ్లకు కూడా గులాలద్దిన ప్రభుత్వం... వైన్స్ లకు, బార్లకు కూడా అద్దితే బాగుంటది కదా, సబ్బిడీ గొర్లు అమ్ముకున్న ఇద్దరు అరెస్టు.... అపతొచ్చిన అవిట్నికాసుకోవల్సిందే ... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:59 - September 13, 2017

కాళ్లకింద భూమి కదిలిపోతోంది. తలపైన ఆకాశం నిప్పుల వర్షం కురిపిస్తోంది. సంద్రం వైపు ఆశగా చూసే కళ్లను తీరం తిరస్కరిస్తోంది. వెరసి ఎవరికీ చెందని అభాగ్యులయ్యారు. మాతృభూమికి, పరాయిదేశానికి మధ్య బతుకు ప్రశ్నార్ధకంగా మారుతోంది. భూమిపై గీతలు గీసుకున్న సరిహద్దులు, నిబంధనలు పేరుతో నిరాకరించి అపహసిస్తున్న పౌరసత్వాలు.. అణచివేతకు పరాకాష్టగా మారిన పరిస్థితులు.. వెరసి రోహింగ్యాలు ఇప్పుడు లెక్కల్లో లేని మనుషులు.. దేశం లేని పౌరులు.. ఉనికి నిరాకరించబడిన దీనులు..ఆధునిక ప్రపంచంలో అణచివేతకు నిజమైన ఉదాహరణగా కనిపిస్తున్న రోహింగ్యాల పరిస్థితిపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..
సొతగడ్డకు బరువయ్యారు.. 
సొతగడ్డకు బరువయ్యారు.. చదువుకునే అర్హతలేదు.. ఉద్యోగాలకు అవకాశం లేదు.. అసలు బతికే పరిస్థితే లేదు.. ఏం చేయాలి? ఎటు పారిపోవాలి..? ఎక్కడ తలదాచుకోవాలి? ఇప్పుడది భూమీ ఆకాశాలు ఏకమైన సుదీర్ఘ విలాపం.  చావుకీ బతుక్కీ మధ్య తేడా తెలియని లక్షలాది ప్రజల దీనత్వం.. జాతులపేరుతో, మతాల పేరుతో విద్వేషాలు పెంచుకునే మానవజాతి హీనత్వం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

దేవాదాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : దేవాదాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ధార్మిక పరిషత్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలపై వివక్ష చూపారని పేర్కొన్నారు. యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తరహాలోనే బాసర ఆలయ అభివృద్ధికి కార్యచరణ చేయనున్నట్లు తెలిపారు.

 

సమచారం శాఖ కమిషన్ సభ్యుల నియామకానికి కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ : సమచారం శాఖ కమిషన్ సభ్యుల నియామకానికి కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సభ్యులుగా ఉన్నారు. 

పోలీసుల కళ్లుగప్పి నిందితుడు పరారీ

చిత్తూరు : రేణిగుంటలో పోలీసుల కళ్లుగప్పి నిందితుడు పరారీ అయ్యాడు. బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న శశి చేతికి బేడీలతోనే పరారయ్యాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యంపై తిరుపతి అర్బన్ ఏస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

20:14 - September 13, 2017

హీరో సునీల్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడారు. ఉంగరాల రాంబాబు సినిమా విశేషాలను వివరించారు. తన సినీ కెరీర్ పై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:10 - September 13, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు త్వరలో భక్తులకు కనువిందు చేయనున్నాయి. చాలా కాలం తరువాత ధర్మకర్తల మండలి లేకుండానే.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధమవుతోంది. జిల్లా యంత్రాంగంతో కలుపుకొని నలుగురు ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
సెప్టెంబర్‌ 22న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుండి అక్టోబర్‌ 1 వరకూ జరగనున్నాయి. అయితే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సెప్టెంబర్‌ 22న  జరగనుంది. 23న ధ్వజారోహణంతో ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. అదే రోజు సీఎం చంద్రబాబునాయుడు.. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. చాలా కాలం తరువాత ధర్మకర్తల మండలి లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధమవుతోంది. 
వివిధ వాహనాలపై స్వామివారు ఊరేగింపు 
ఉత్సవాలు జరిగే 9 రోజులు స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ.. భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవాల ప్రత్యేకత. ఆ రోజుల్లో తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకొని.. వాహన సేవల్లో పాల్గొనాలని భక్తులు కోరుకుంటుంటారు. గరుడ సేవ రోజున 4 నుండి 5 లక్షల మంది వరకు భక్తులు తిరుమలకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు
ప్రభుత్వం బ్రహ్మోత్సవాలకు ముందు టీటీడీ ధర్మకర్తల మండలి నియామకం పట్ల మొగ్గు చూపడం లేదు. ఉత్సవాల తరువాతే కొత్త పాలకమండలిని నియమిస్తారని చర్చించుకుంటున్నారు. ఇక టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు నేతృత్వంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
బ్రహ్మోత్సవం ఏర్పాట్లకు రూ. 8 కోట్ల కేటాయింపు 
బ్రహ్మోత్సవం ఏర్పాట్లకు మొత్తం 8 కోట్లు కేటాయించారు. కొత్తగా తయారు చేసిన ఏడు అడుగుల సర్వభూపాల వాహనంలో.. ఈ ఏడాది స్వామివారిని ఊరేగించనున్నారు. దసరా సెలవులకు తోడు తమిళ భక్తులు పరమ పవిత్రంగా భావించే పెరటాశి నెల కూడా బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉండడంతో.. భక్తులు ఎక్కువగా వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. 

20:01 - September 13, 2017

విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రూటు మార్చారు. మొన్నటి వరకూ పాలనపైనే ఎక్కువ ఫోకస్ చేసిన చంద్రబాబు తాజాగా ఎమ్మెల్యేల పనితీరును  సీరియస్‌గా మానిటర్ చేస్తున్నారు. పని తీరు బాగుంటేనే  వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తానంటూ చంద్రబాబు స్పష్టం చేయడంతో తెలుగు తమ్ముళ్ల గుండెల్లో  రైళ్లు పరుగెడుతున్నాయి.  .

టిడిపి అధినేత.. సీఎం చంద్రబాబు నాయుడు పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు పాలనా కార్యక్రమాలు చూసుకుంటూనే  మరోవైపు పార్టీకి వీలైనంత సమయం కేటాయిస్తున్నారు. ఇక నుండి రియల్ టైమ్ పాలిటిక్స్ చేస్తానంటూ తాజాగా  ఆయన చేసిన కామెంట్స్ తెలుగు తమ్ముళ్లలో గుబులు పుట్టిస్తున్నాయి.  ఎమ్మెల్యేలపై చంద్రబాబు చేయిస్తున్న వరుస సర్వేలతో వచ్చే ఎన్నికల్లో తమ బెర్త్ ఉంటుందా? లేక ఊడుతుందా అన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది.

ఇటీవ‌ల చంద్రబాబు చేయించిన స‌ర్వేలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వారిలో మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదని తేలడంతోపాటు.. కొందరిపై అవినీతి ఆరోపణలు తీవ్రస్ధాయిలో ఉన్నట్లు తేలింది. అలాగే కొందరు ఇంచార్జ్‌లు కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని తేలింది. దీంతో ఇంచార్జ్‌లను మార్చాలనే యోచనలో ఉన్నారు చంద్రబాబు. ఇక ఎమ్మెల్యేల పని తీరును కూడా సర్వేల ద్వారా తెలుసుకుంటున్న చంద్రబాబు పార్టీ అంతర్గత సమావేశాలు జరిగినప్పుడల్లా సూచనలు చేస్తూనే ఉన్నారు. పని తీరు సరిచేసుకోకపోతే వచ్చే ఎన్నికలకు టికెట్ ఉండదనే హెచ్చరికలు పంపిస్తున్నారు. అటు యువనేత లోకేశ్ సైతం ఇదే అంశాన్ని నేతల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. 

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు 175 టార్గెట్ గా పెట్టుకున్న చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.  ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ని పక్కన పెట్టి పనిచేయాలని నేతలకు హితబోధ చేస్తున్నారు. మ‌రి బాబు మాటలు నేత‌లు సీరియ‌స్ గా తీసుకుంటారా? లేక లైట్ తీసుకుంటారా? అనేది వేచి చూడాలి. 

19:57 - September 13, 2017

ఖమ్మం : జిల్లాలోని గోళ్లపాడు నుంచి తీర్ధాల మధ్యలో ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న విద్యార్తుల్లో ఒకరు చనిపోగా... 15 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

 

19:55 - September 13, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని చింతలపూడిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు. అనంతరం.. వారిని చింతలపూడి వీధుల్లో అర్ధనగ్నంగా ఊరేగించారు. వీరిని ఇలా అర్థనగ్నంగా ఊరేగించడం బాగాలేదనివాదనలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో వీరిని పేకాట ఆడొద్దని పలుమార్లు హెచ్చరించినా... వినలేదని అందుకే ఇలా చేశామని పోలీసులు చెబుతున్నారు. 

 

19:53 - September 13, 2017

కర్నూల్‌ : నగరంలో గత నెలలో జరిగిన విద్యార్ధిని ఆత్మహత్య వివాదాస్పదంగా మారింది. కర్నూల్‌ శివారులోని కట్టమంచి రామలింగా రెడ్డి ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ప్రీతి అనే విద్యార్ధిని ఆగస్ట్‌ 19న ఆత్మహత్య చేసుకుంది.  అయితే ఇది హత్యేనంటూ కుటుంబ సభ్యులు, విద్యార్ధి సంఘాలు ఆందోళన చేపడుతూ.. పాఠశాల వద్ద రాస్తారోకోని నిర్వహించారు. హత్యకు భాద్యులైన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని... అప్పటివరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.

 

19:44 - September 13, 2017

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరంలో రద్దైన పాత నోట్లను పోలీసులు పట్టుకున్నారు. పాత నోట్లను మార్చేందుకు నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తులు రెండు కార్లలో తిలక్‌ రోడ్డులో తిరుగుతుండగా అనుమానించిన పోలీసులు వారిని ప్రశ్నించగా... ఆ మూఠా తప్పించుకునే ప్రయత్నం చేసింది. మూఠాలో ఒకరు పారిపోగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తాడేపల్లి గూడానికి చెందిన వంగా దుర్గ, కొడవటి ఈశ్వర్రావులు రాజమహేంద్రవరంలో కోటి రూపాయల పాత నోట్లకు 25 లక్షల కొత్త కరెన్సీ చెల్లించే విధంగా ఒప్పందంతో నోట్లు మార్చుకునేందుకు వచ్చినట్టు నిందుతులు తెలిపారు. అయితే ఈ నోట్లను కోర్టులో ప్రవేశపెట్టామని, కోర్టు అనుమతితో తదుపరి విచారణను కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

 

19:41 - September 13, 2017

ఢిల్లీ : వంశధార నదీ జలాల వివాదంపై వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పు వెల్లడించింది. నేరడి బ్యారేజీ, సైడ్ వీర్ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు పర్యవేక్షణకు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సి.డబ్ల్యు.సి ఛీఫ్ ఇంజనీర్‌ నేత్రృత్వంలో ఏపీ, ఒడిషా రాష్ట్రాలకు చెందిన ఛీఫ్ ఇంజనీర్లు, సి.డబ్ల్యు.సి డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఒప్పందంలో భాగంగా ఏడాదిలోగా నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం 106 ఎకరాలు సేకరించి ఒడిషా ప్రభుత్వం... ఏపీకి ఇవ్వాల్సి ఉంటుంది. నేరడి బ్యారేజీ ఎడమ కాలువ ద్వారా  5 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలనుకుంటే.. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే ఖర్చును కొంత మేర కూడా భరించాల్సి ఉంటుంది. సైడ్ వీర్ నిర్మాణాల ద్వారా వంశధార నదీ జలాలను పెద్ద మొత్తంలో ఏపీ వినియోగించుకొనే అవకాశం ఉందన్న ఒడిషా వాదనలను ట్రిబ్యునల్ కొట్టివేసింది. 

19:39 - September 13, 2017

హైదరాబాద్‌ : నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.. కీసర, నాగారం, దమ్మాయిగూడ, కాప్రా, చర్లపల్లి, కుషాయిగూడ, ఈసీఐఎల్, ఏఎస్ రావు నగర్‌, నాచారం, లాలపేట్‌, ఓయూలో వర్షం హోరెత్తిపోయింది.. ఉదయంనుంచి ఎండతో ఉష్ణోగ్రతలు పెరిగినా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. భారీ వర్షంతో రోడ్లన్నీ చెరువుల్లా మారాయి.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

 

సాయికిరణ్‌ ను హంతకునిగా గుర్తించాం : సీపీ సందీప్ శాండిల్య

హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో సాయికిరణ్‌ను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. శనివారం చాందిని అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందిందని.. వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కాల్‌డేటా, స్నేహితుల వివరాలు, సీసీ ఫుటేజీలను పరిశీలించి సాయికిరణ్‌ ను హంతకునిగా గుర్తించామన్నారు. సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. చాందినిపై లైంగిక దాడి జరగలేదని... పోస్టుమార్టమ్ నివేదిక ఇంకా రావాల్సి ఉందన్నారు. చాందిని, సాయి కిరణ్ ఇద్దరు మైనర్లేనని సీపీ తెలిపారు. పిల్లలు సోషల్ మీడియా వాడే సమయంలో...

నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల గోస

మెదక్‌ : జిల్లాలోని నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల గోస పడుతున్నారు. మౌలికసదుపాయాల లేమితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీసం గ్లూకోజ్‌ పెట్టాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. స్టాండ్లు లేకపోవడంతో  గ్లూకోజ్‌ బాటిళ్లను రోగుల బంధువులే పట్టుకోవాల్సి వస్తోంది. గోడలకు చెక్కముక్కలు కొట్టి బాటిళ్లను  వేలాడదీస్తున్నారు. మరోవైపు రోగులు, వారి బంధువులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా సిబ్బంది తీరు మారడం లేదు. 

19:30 - September 13, 2017

మెదక్‌ : జిల్లాలోని నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల గోస పడుతున్నారు. మౌలికసదుపాయాల లేమితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీసం గ్లూకోజ్‌ పెట్టాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. స్టాండ్లు లేకపోవడంతో  గ్లూకోజ్‌ బాటిళ్లను రోగుల బంధువులే పట్టుకోవాల్సి వస్తోంది. గోడలకు చెక్కముక్కలు కొట్టి బాటిళ్లను  వేలాడదీస్తున్నారు. మరోవైపు రోగులు, వారి బంధువులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా సిబ్బంది తీరు మారడం లేదు. 

19:28 - September 13, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని జిల్లెల గ్రామంలో విషాదం చోటుచేసుకొంది. ఈత కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్ధులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. జిల్లెల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్ధులు.. మద్యాహ్న భోజనం చేసిన అనంతరం ఈత కోసమని చెరువు దగ్గరికి వెళ్లారు. చెరువులోకి దిగిన ఇద్దరు స్నేహితులు మునిగి పోవడంతో వెంటనే ఇంకో విద్యార్ధి విషయాన్ని పాఠశాల ఉపాద్యాయులకు తెలిపాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఉపాద్యాయులు.. గ్రామస్థుల సహాయంతో చెరువుని గాలించి ఇద్దరి విద్యార్ధుల శవాలు వెలికితీసారు. 

 

19:26 - September 13, 2017

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్లలో టీమాస్‌ ఫోరం ఆవిర్భావ సభలో తెలంగాణ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నియంతృత్వం వైపు పోతుందా లేక ప్రజాస్వామ్యం వైపు పోతుందా తెలియడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే టీమాస్‌ ఫోరం ఆవిర్భవించిందని..ఈ పేరు వింటేనే పాలకులకు వణుకుపుడుతోందన్నారు.

 

19:23 - September 13, 2017

హైదరాబాద్ : రైతుల భూముల్ని బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌పై చర్యలు తీసుకోవాలని... రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇలాంటి అక్రమాలు చేయడమే కాకుండా... రైతులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కంటి మండలంలోని 23 గ్రామాల్లో భూములు కొన్నట్లు పాటిల్‌ మోసపూరిత అగ్రిమెంట్లు రాయించుకున్నారని చెప్పారు. 2006లో 40 వేల రూపాయలకు ధర మాట్లాడుకొని కేవలం పది వేలే చెల్లించారని మండిపడ్డారు. పాటిల్ కంపెనీ పేరుతో అక్రమంగా రిజిస్టర్ చేసుకున్న భూముల రిజిస్ర్టేషన్‌లను వెంటనే రద్దు చేయాలంటూ... సీసీఎల్ ఏ జాయింట్ కమిషనర్‌కు బాధితులతో కలిసి వినతి పత్రం ఇచ్చారు.. రైతులను మోసం చేసి తీసుకున్న భూములను తిరిగి వారికి అప్పగించాలని కోరారు....  

 

19:19 - September 13, 2017

ఖమ్మం : జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పర్యటించారు. కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లో 13 లక్షల చేపపిల్లలను మంత్రులు వదిలారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం 18 లక్షల గొర్రెలను యాదవులకు పంపిణీ చేసిందని మంత్రి తలసాని అన్నారు. ఈనెల 15న సీఎం చేతులమీదుగా సంచార పశువైద్యశాలలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. అభివృద్ధికి అడ్డుపడుతూ విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మంత్రి తుమ్మల విమర్శించారు.

 

19:17 - September 13, 2017

హైదరాబాద్ : పాలిహౌస్‌ల పేరుతో ఉద్యానవన రైతులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ సీనియర్‌ నేత వి. హన్మంతరావు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఆందోళన చేస్తున్న రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్‌ జిల్లాల పూలతోటల రైతులకు వీహెచ్‌ బాసటగా నిలిచారు. 75 శాతం సబ్సిడీ ఇస్తామని ఊరించిన ప్రభుత్వం.. పూలతోటలు పెట్టిన తర్వాత అన్యాయం చేసిందన్నారు. రూ.180 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

 

19:12 - September 13, 2017

సూర్యాపేట : జిల్లాలోని నెరేడుచర్ల మండలం పెంచికలదిన్నె గ్రామంలో కృష్ణయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కృష్ణయ్య కుటుంబ సభ్యులు అతని శవంతో రోడ్డుపై ధర్నా చేశారు. తనఖాలో ఉన్న తన భూమిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించడంతో.. మనస్తాపానికి గురైన కృష్ణయ్య ... పురుగులు మందు తాగి...తన పంట పొలం దగ్గరే ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన కృష్ణయ్య బంధువులు ఆందోళన చేశారు. కృష్ణయ్య ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

 

18:59 - September 13, 2017
18:52 - September 13, 2017
18:39 - September 13, 2017

ఛత్తీస్‌గడ్‌ : అత్యాచారం కేసులో గుర్మీత్‌ రామ్‌ రహీం, ఆసారాం బాపు  జైలుశిక్ష అనుభవిస్తున్నప్పటికీ... బాబాల పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లడం లేదు. సాధారణ ప్రజలే కాదు... మంత్రులు సైతం బాబాలను గుడ్డిగా నమ్ముతున్నారు. ఛత్తీస్‌గడ్‌కు చెందిన హోంమంత్రి రామ్‌ సేవక్ పైక్‌రా షుగర్‌ వ్యాధిని నయం చేసుకోవడానికి కంబల్‌ బాబాను ఆశ్రయించాడు. ప్రజాయాత్రలో భాగంగా మంత్రి బలరామ్‌పూర్‌ జిల్లాలో ఉన్న కంబల్‌ బాబాను కలుసుకున్నారు. కంబల్‌ ఓఢాకర్‌ బాబా చెవిలో మంత్రం ఊదితే చాలు...ఎలాంటి రోగమైనా తగ్గిపోతుందట. దీనికో షరతు ఉంది. బాబా దర్బార్‌కు 5 సార్లు తప్పకుండా రావలసి ఉంటుంది. తన పర్యటనలో భాగంగానే బాబాను కలిశానని...ఆ చమత్కారమేంటో చూడ్డానికే వచ్చినట్లు మంత్రి చెప్పారు. ఓ టీస్పూన్‌ చక్కెర ఇచ్చాడని...ఇందుకోసం బాబా నయాపైసా తీసుకోరని మంత్రి చెప్పారు. కంబల్‌ బాబా అసలు పేరు గణేష్. భుజాన గొంగడి వేసుకోవడంతో కంబల్‌ బాబాగా మారారు. 28 ఏళ్లుగా ఇలా చికిత్స చేస్తున్నాడు. 

 

18:34 - September 13, 2017

ఢిల్లీ : గురుగ్రామ్‌లోని రాయన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏడేళ్ల బాలుడు ప్రద్యుమ్న్ హత్యకేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా సాక్షాలు సేకరించడానికి ఫోరోన్సిక్‌ సైన్స్ లేబరేటరీ టీమ్‌ రాయన్‌ స్కూలుకు చేరుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బస్‌ కండక్టర్ అశోక్‌ డిఎన్‌ఏ శాంపిల్‌ను పోలీసులు లాబ్‌కు పంపించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో బాలుడి హత్యకు గల కారణాలను పోలీసులు ఇంతవరకు గుర్తించలేదు. ప్రద్యుమన్‌పై అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం రిపోర్టులో తేలడంతో బాలుడి హత్య మిస్టరీగా మారింది.

18:32 - September 13, 2017

ఢిల్లీ : భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్...అండరవరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్‌లో దావూద్‌కు చెందిన 43 వేల కోట్ల ఆస్తులను జప్తు చేశారు.  దావూద్‌కు చెందిన బ్రిటన్‌లో పలు భవనాలతో పాటు ఓ హోటల్‌ను కూడా జప్తు చేసినట్లు యూకే ప్రభుత్వం పేర్కొంది. దౌత్యపరంగా విదేశాల్లో  భారత్‌కు ఇది పెద్ద విజయం. దావూద్‌ పేరిట వార్విక్‌షైర్‌లో ఓ హోటల్‌తో పాటు మిడ్‌ల్యాండ్స్‌లో నివాస స్థలాలున్నాయి. దావూద్‌కు లండన్‌లో ఆస్తులున్నట్లు 2015లో ఈడీ గుర్తించింది. 1993 ముంబై వరుసు పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. పేలుళ్ల అనంతరం దేశం విడిచి వెళ్లిపోయిన దావూద్‌ పాకిస్తాన్‌లో దాక్కున్నట్లు సమాచారం. దావూద్‌కు 21 మారుపేర్లు ఉన్నాయి.

 

పరుగులమందు తాగి రైతు ఆత్మహత్య

సూర్యపేట : నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నెలో విషాదం నెలకొంది. పరుగులమందు తాగి రైతు కృష్ణయ్య (50) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2003సం.లో ఎరువుల వ్యాపారి వద్ద కృష్ణయ్య తన పొలాన్ని తనఖా రిజిస్ట్రేషన్ చేయించారు. డబ్బులు తీసుకుని తన పొలం తనకు ఇవ్వాలని కృష్ణయ్య అన్నారు. అందుకు ఎరువుల వ్యాపారి అంగీకరించలేదు. పోలీసులు, అధికారుల అండతో ఇతరులకు పొలాన్ని విక్రయించేందుకు యత్నించారు. మనస్తాపంతో రైతు కృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహంతో బంధవులు ఆందోళన చేపట్టారు. 

 

ఒక్కమంత్రి కూడా అందుబాటులో లేరు : విష్ణుకుమార్ రాజు

అమరావతి : ఆర్జీలు ఇచ్చేందుకు సచివాలయానికి వెళ్తే ఒక్కమంత్రి కూడా అందుబాటులో లేరని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఎమ్మెల్యేలకే ఈ పరిస్థితి ఉందంటే ఇక సామాన్యులు ఇంకెంత ఇబ్బందులు పడుతున్నారో అని అన్నారు. 

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ : నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలో పలు చోట్ల వర్షం పడింది. తార్నాక, మౌలాలి, మాల్కాజ్ గిరి, విద్యానగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి. 

 

16:50 - September 13, 2017

విజయవాడ : ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల నిర్వహణపై... అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం  పనులైతే ప్రారంభమయ్యాయి కానీ.. నిధులు జాడ మాత్రం కానరావడం లేదు.  పాలక మండలి ప్రతిపాదనలు పంపినా... నేటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో ఉత్సవాల నిర్వహణపై అయోమయం నెలకొంది.  
నిధులు విడుదల చేయని ప్రభుత్వం
విజయవాడ... ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏటా వైభవంగా జరిగే దసరా ఉత్సవాలు ఈ ఏడాది ఏ విధంగా జరగుతాయోననే... సందేహం వ్యక్తమవుతుంది. దసరాను పురస్కరించుకుని... శ్రీ కనకదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకూ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పనులు కూడా చేపట్టారు.  కానీ ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకూ నిధులు విడుదల చేయలేదు.  
దసరా ఉత్సాలకు రూ.15 కోట్ల ఖర్చవుతుందని అంచనా
ఈ ఏడాది దసరా ఉత్సవాలకు సుమారు రూ.15 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన ఆలయ అధికారులు... కనీసం 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని దేవస్థానం అధికారులు.. ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు పాలక మండలి తీర్మానం  చేసి ప్రభుత్వానికి పంపించారు. 
దర్శనం టికెట్‌ ధరలను తగ్గించాలని ప్రతిపాదనలు
అలాగే... పాలకమండలి ఆలయంలో దర్శనం టికెట్‌ ధరలను తగ్గించాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ఆలయ చైర్మన్‌ గౌరంగబాబు, ఈవో సూర్యకుమారి ఆధ్వర్యంలో దర్శనం టికెట్‌ ధరను రూ.300ల నుంచి రూ.150లకు... ముఖమండప దర్శనం టికెట్ ధరను వంద రూపాయల నుంచి 50 రూపాయలకు తగ్గించాలని సభ్యులు తీర్మానం చేశారు. ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇప్పటికైనా త్వరితగతిన ప్రభుత్వం స్పందించి ఆలయ అంతరాలయ టికెట్ల ధరలను తగ్గించాలని... ఉత్సవాలకు నిధులు విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. అలాగే ఉత్సవాల నిధులతో పాటు...ఈ పదిరోజుల పాటు పని చేసే వివిధ శాఖల అధికారులకు అయ్యే మూడు కోట్ల రూపాయలను ప్రభుత్వమే అందిస్తే... ఆలయంపై భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. వీటిపై ప్రభుత్వం నుంచి స్పష్టత ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

 

16:45 - September 13, 2017
16:39 - September 13, 2017

హైదరాబాద్ : చాందిని హత్యకేసు నిందితుడు సాయికిరణ్‌ను మియాపూర్‌ పీఎస్‌కు తరలించారు. సాయంత్రం నాలుగు గంటలకు మీడియా ముందుకు సాయికిరణ్‌ను ప్రవేశపెట్టనున్నారు. చాందిని హత్యకేసు వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు. మరోవైపు సాయికిరణ్‌ను కఠినంగా శిక్షించాలని చాందిని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 
సాయికిరణ్ హత్య చేశాడని తెలిసి షాక్ అయ్యాం : చాందిని పేరెంట్స్ 
చాందినిని హత్య చేసి అనంతరం నిందితుడు సాయికిరణ్ తమ ఇంటికి వచ్చినట్లు చాందిని పేరెంట్స్ చెబుతున్నారు. సాయికిరణ్ హత్య చేశాడని తెలిసి షాకయ్యామని చాందిని తల్లి అన్నారు. హత్యలో అతనికి మరికొందరు సాయం చేసినట్లు భావిస్తున్నామని ఆమె ఆరోపించారు. సాయికిరణ్‌ను కఠినంగా శిక్షించాలని చాందిని తల్లి డిమాండ్ చేస్తున్నారు. ఇక సాయి కిరణ్‌ తానే నేరం చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. 2015 నుంచి చాందిని తను ప్రేమించుకుంటున్నామని .. ఆమె ప్రవర్తన నచ్చక 6 నెలల నుంచి దూరం పెట్టానని సాయికిరణ్‌ పోలీసులకు తెలిపాడు. అయితే చాందిని హత్య వెనుక సాయికిరణ్‌కు ఎవరెవరు సహకరించారనే వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు చాందిని అక్క తాను కూడా చాందిని చదివిన స్కూల్‌లోనే చదివానని తెలిపింది. సాయికిరణ్‌, చాందిని క్లాస్‌మేట్ అని తెలుసని, ఇలా చంపేస్తాడని అనుకోలేదని చెప్పింది. ఏ ప్రాబ్లమైనా షేర్‌ చేసుకునేదని, లోలోపల ఇంత ఒత్తిడికి గురవుతోందని తెలీదని ఆవేదనకు గురైంది. 

 

16:33 - September 13, 2017

కన్సెంట్ డైవోర్స్ యాక్టు..అనే అంశంపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. కన్సెంట్ డైవోర్స్ యాక్టు గురించి వివరించారు. పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:29 - September 13, 2017

నెల్లూరు : అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌ షాలినీ పాండే స్వల్ప అస్వస్థతకు గురైంది. నెల్లూరులో ప్రైవేటు ఫంక్షన్‌కు హాజరైన షాలిని అస్వస్థతకు గురవడంతో బోలినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.

 

16:23 - September 13, 2017

హైదరాబాద్ : అఖిల పక్షం నేతలు గవర్నర్ నరసింహన్ కలిశారు. జీవో నంబర్ 39 రద్దు చేయాలని  విజ్ఞప్తి చేశారు. జీవో నంబర్ 39 టీఆర్‌ఎస్ పార్టీ రాజకీయ అవసరాలకు తప్ప రైతులకు ఏ మాత్రం ఉపయోగపడదని అఖిల పక్షం నేతలు ఆరోపించారు. రైతులను తీవ్ర నష్టపరిచే జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకునే దిశగా చర్యలు చేపట్టాలని గవర్నర్‌ను కోరారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు నేతలు చెప్పారు. 

 

మహిళలు, స్కూలు విద్యార్థుల రక్షణకు కొత్త రవాణా చట్టం

శ్రీకాకుళం : మహిళలు, స్కూలు విద్యార్థుల రక్షణకు కొత్త రవాణా చట్టాన్ని అమలు చేస్తున్నామని నిబంధనలు అతిక్రమించే వారిపై చట్ట ప్రకారం చర్యలు 10 టీవీతో డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషన్ శ్రీదేవి త్వరలో రాష్ట్రంలోనే తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో కాల్ అంబులెన్స్ యాప్ ను ప్రారంభిచబోతున్నామని తెలిపారు. 

సామాజిక న్యాయం పాటించాం : ఎంపీ బాల్కసుమన్

హైదరాబాద్ : రైతు సమన్వయ సమితులపై పిటిషనర్లకు కోర్టు చీవాట్లు పెట్టినా గవర్నర్ ను కలవడం సిగ్గుచేటని టీఆర్ ఎస్ ఎంపీ బాల్కసుమన్ అన్నారు. రైతు సమన్వయ సమితుల్లో సామాజిక న్యాయం పాటించామని తెలిపారు. రైతులు తమ వెంట రారనే భయంతో సమితులను అడ్డుకోవాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. సింగరేణిలో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్, టీడీపీ, లెఫ్ట్ అనుబంధ సంఘాలు ప్రకటించడం రాజకీయ వ్యభిచారమే అని అన్నారు. 

 

పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాలి : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : థర్మల్ విద్యుత్ ఉత్పత్తి...కొనుగోలును క్రమంగా తగ్గించుకుని పునరుత్పాదక విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేలా కార్యాచరణ ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ నిల్వ సామర్థ్య వ్యవస్థ నెలకొల్పే లోపు విద్యుత్, కొనుగోలు వ్యయాన్ని తగ్గించడంపై దృష్టిపెట్టాలని సూచించారు. 

విద్యుత్ రంగంలో ఏపీకి 26 అవార్డులు

హైదరాబాద్ : విద్యుత్ రంగంలో రాష్ట్రానికి 2015...16 నుంచి 2016..17 వరకు 26 అవార్డులు వచ్చాయి. విద్యుత్ శాఖలో సేవలను ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. డిమాండ్ ...సప్లయ్ ఆధారంగానే సబ్ స్టేషన్ల, ఇతర మౌలిక వసతుల కల్పన జరగాలని కోరారు. ఆక్వా రంగంతో సహా అన్నింటా విద్యుత్ వినియోగంలో ఆదాకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

 

15:51 - September 13, 2017

హైదరాబాద్ : గవర్నర్‌ను తన కుమారుడి పెళ్లికి.. మంత్రి పరిటాల సునీత ఆహ్వానించారు. అక్టోబర్‌ 1న తన కుమారుడి పెళ్లి జరగనున్నట్లు ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్‌ను, మంత్రులు, ఎమ్మెల్యేలు, తమ పార్టీకి చెందినవాళ్లను.. అందరినీ ఆహ్వానించనున్నట్లు సునీత చెప్పారు. ప్రజలందరూ తన కుమారుడు శ్రీరామ్‌కు ఆశీస్సులు అందించాలని కోరారు. 

 

15:47 - September 13, 2017

గుంటూరు : అమరావతిలో వరల్డ్ బ్యాంక్ పరిశీలన బృందం పర్యటిస్తోంది. నేలపాడు  రైతులతో భారీ ఎత్తున సభ నిర్వహించిన బృంద సభ్యులు  రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు అంశంపై  రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. వరల్డ్ బ్యాంకు నుంచి రుణం విషయంలో కొందరు రైతులు లేఖలు రాసిన నేపథ్యంలో  ప్రతినిధుల బృందం క్షేత్రస్ధాయిలో పరిశీలన ప్రారంభించింది. మరోవైపు రాజధాని నిర్మాణానికి స్వచ్చందంగా భూములు ఇచ్చామని.. తమను ఎవరూ బలవంత పెట్టలేదని రైతులు చెప్పారు. 

15:45 - September 13, 2017

హైదరాబాద్ : చాందిని హత్యకేసు నిందితుడు సాయికిరణ్‌ను మియాపూర్‌ పీఎస్‌కు తరలించారు. సాయంత్రం నాలుగు గంటలకు మీడియా ముందుకు సాయికిరణ్‌ను ప్రవేశపెట్టనున్నారు. చాందిని హత్యకేసు వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు. మరోవైపు సాయికిరణ్‌ను కఠినంగా శిక్షించాలని చాందిని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చాందిని హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. చాందినీని తానే చంపినట్లు సాయికిరణ్‌ అంగీకరించారు. 2015 నుంచి తాను, చాందిని ప్రేమించుకుంటున్నామని తెలిపారు. చాందిని ప్రవర్తన నచ్చక ఆరు నెలలుగా దూరం పెట్టా నని తెలిపారు. తన వెంట పడొద్దని చాందినీకి చాలాసార్లు చెప్పానని చెప్పారు. పదేపదే తన వెంట పడటంతో వదిలించుకోవాలనుకున్నానని తెలిపారు. హత్య జరిగిన స్థలానికి సాయికిరణ్‌ను పోలీసులు తీసుకెళ్లారు. హత్య జరిగిన సీన్‌ను పోలీసులు రీ కన్‌స్ర్టక్షన్‌ చేశారు.
సాయికిరణ్‌ను కఠినంగా శిక్షించాలి: చాందిని తల్లి
చాందినిని హత్య చేసి అనంతరం నిందితుడు సాయికిరణ్ తమ ఇంటికి వచ్చినట్లు చాందిని పేరెంట్స్ చెబుతున్నారు. సాయికిరణ్ హత్య చేశాడని తెలిసి షాకయ్యామని చాందిని తల్లి అన్నారు. హత్యలో అతనికి మరికొందరు సాయం చేసినట్లు భావిస్తున్నామని ఆమె ఆరోపించారు. సాయికిరణ్‌ను కఠినంగా శిక్షించాలని చాందిని తల్లి డిమాండ్ చేస్తున్నారు. ఇక సాయి కిరణ్‌ తానే నేరం చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. 2015 నుంచి చాందిని తను ప్రేమించుకుంటున్నామని .. ఆమె ప్రవర్తన నచ్చక 6 నెలల నుంచి దూరం పెట్టానని సాయికిరణ్‌ పోలీసులకు తెలిపాడు. అయితే చాందిని హత్య వెనుక సాయికిరణ్‌కు ఎవరెవరు సహకరించారనే వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు చాందిని అక్క తాను కూడా చాందిని చదివిన స్కూల్‌లోనే చదివానని తెలిపింది. సాయికిరణ్‌, చాందిని క్లాస్‌మేట్ అని తెలుసని, ఇలా చంపేస్తాడని అనుకోలేదని చెప్పింది. ఏ ప్రాబ్లమైనా షేర్‌ చేసుకునేదని, లోలోపల ఇంత ఒత్తిడికి గురవుతోందని తెలీదని ఆవేదనకు గురైంది.
నా కూతురిని చంపడానికి అతనికేం హక్కు ఉంది : చాందిని తల్లి 
సాయికిరణ్‌ చిన్నప్పటి నుంచి చాందినితో కలిసి చదువుకున్న అబ్బాయి కావడంతో.. తమకెలాంటి అనుమానం రాలేదని చాందిని తల్లి తెలిపారు. తమ కూతురిని చంపడానికి అతనికేం హక్కుందని ఆమె ఆవేదనకు గురయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం...

 

ఏపీలో పెరిగిన 7.3 శాతం విద్యుత్ ఉత్పత్తి

గుంటూరు : ఈ ఏడాది ఏప్రిల్...ఆగస్ట్ తో పోల్చుకుంటే 7.3 శాతం విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. ఇదే సమయంలో 0.4 శాతం మేర విద్యుత్ కు డిమాండ్  పెరిగింది. సీఎం చంద్రబాబుకు విద్యుత్ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2.16 కోట్ల ఎల్ ఈడీ బల్బుల పంపిణీ, విద్యుత్ ఆదా చేసే 2.55 లక్షల ఫ్యాన్లు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. 17,779 విద్యుత్ ఆదా ట్యూబ్ లైట్ల పంపిణీ చేశామని వివరణ ఇచ్చారు. దేశంలోనే అత్యధికంగా 15 వేల సోలార్ పంపు సెట్లు, 110 పట్టణాల్లో 5.9 లక్షల ఎల్ ఈడీ వీధి దీపాల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

మధ్యాహ్నం మీడియా ముందుకు సాయికిరణ్

హైదరాబాద్ : చాందిని హత్యకేసు నిందితుడు సాయికిరణ్‌ను మియాపూర్‌ పీఎస్‌కు తరలించారు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు సాయికిరణ్‌ను ప్రవేశపెట్టనున్నారు. చాందిని హత్యకేసు వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు. మరోవైపు సాయికిరణ్‌ను కఠినంగా శిక్షించాలని చాందిని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

నష్టాల్లో ఏపీ డిస్కంలు

గుంటూరు : ఏపీ డిస్కంకు ఆదాయం కన్నా, వ్యయం పెరిగింది. 2016-2017 సంవత్సరానికి ఆదాయం 25 వేల 290 కోట్లు కాగా, ఖర్చు 27 వేల 621 కోట్లకు చేరింది. 2016-2017లో ఏపీ డిస్కంకు 2 వేల 331 కోట్ల నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అధికారులు ఈ విషయాల్ని వివరించారు. 

13:19 - September 13, 2017

గుంటూరు : ఏపీ డిస్కంకు ఆదాయం కన్నా, వ్యయం పెరిగింది. 2016-2017 సంవత్సరానికి ఆదాయం 25 వేల 290 కోట్లు కాగా, ఖర్చు 27 వేల 621 కోట్లకు చేరింది. 2016-2017లో ఏపీ డిస్కంకు 2 వేల 331 కోట్ల నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అధికారులు ఈ విషయాల్ని వివరించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:18 - September 13, 2017

హైదరాబాద్ : చాందిని హత్యకేసు నిందితుడు సాయికిరణ్‌ను మియాపూర్‌ పీఎస్‌కు తరలించారు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు సాయికిరణ్‌ను ప్రవేశపెట్టనున్నారు. చాందిని హత్యకేసు వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు. మరోవైపు సాయికిరణ్‌ను కఠినంగా శిక్షించాలని చాందిని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:13 - September 13, 2017

హైదరాబాద్ : ప్రీమియర్‌ ఫుట్‌సాల్‌ లీగ్‌ రెండో సీజన్‌తో తెలుగు టైగర్స్‌ జట్టు ఎంట్రీ ఇవ్వనుంది.హైదరాబాద్‌ ఫ్రాంచైజ్‌ తెలుగు టైగర్స్‌ జట్టుకు టాలీవుడ్‌ స్టార్‌ రానా కో-ఓనర్‌గానే కాకుండా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఫుట్‌సాల్‌ ఆటకు భారత్‌లో ఆదరణ రోజు రోజుకు పెరుగుతోందని.....80 దేశాల్లో ప్రీమియర్‌ ఫుట్‌సాల్‌ లీగ్‌ రెండో సీజన్‌ పోటీలు ప్రసారం కానున్నాయి. బ్రెజిట్‌ సాకర్‌ దిగ్గజం రొనాల్డిన్హో, ర్యాన్‌ గిగ్స్‌, ఫాల్కో వంటి మాజీ ఫుట్‌బాల్‌ దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నీతో మరోసారి భారత అభిమానులను అలరించనున్నాడు. భారత్‌లో ఫుల్‌సాల్‌ ఆటకు పాపులారిటీ ప్రీమియర్‌ ఫుట్‌సాల్‌ లీగ్‌తో మరింత పెరుగుతుందని...తెలుగు టైగర్స్‌ కో ఓనర్‌ దగ్గుబాటి రానా ధీమాగా చెబుతున్నాడు.

13:11 - September 13, 2017

హైదరాబాద్ : లోధా బాధితులు రెండు వర్గాలతో మాట్లాడినట్లు.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌ రెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని తెలిపారు. అలాగే బిల్డర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మేటప్పుడు ఎలాంటి వసతులు కల్పిస్తామని బిల్డర్‌ హామీ ఇచ్చారో, వాటిని అమలు చేయమని బిల్డర్‌కి ఆదేశాలిస్తామన్నారు. లోధా బిల్డర్‌ యజమాని హాజరు కాలేదు. 

13:09 - September 13, 2017

హైదరాబాద్ : సాయికిరణ్‌ చిన్నప్పటి నుంచి చాందినితో కలిసి చదువుకున్న అబ్బాయి కావడంతో.. తమకెలాంటి అనుమానం రాలేదని చాందిని తల్లి తెలిపారు. తమ కూతురిని చంపడానికి అతనికేం హక్కుందని ఆమె ఆవేదనకు గురయ్యారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:08 - September 13, 2017

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన మియాపూర్‌ మదీనాగూడకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని చాందిని హత్యకేసులో మిస్టరీ వీడింది. ఆమె స్నేహితుడు సాయికిరణ్‌ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. తనను పెళ్లి చేసుకోమని చాందిని ఒత్తిడి చేస్తుండడంతో పథకం ప్రకారమే ఆమెను అమీన్‌పూర్‌ గుట్టలోకి తీసుకెళ్లి హత్య చేశాడని తేల్చారు. ఘటన సమయంలో ఆమెపై అత్యాచారం జరగలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మదీనాగూడలోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సాయికిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

13:07 - September 13, 2017

గుంటూరు : జరుగుతున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల తీరుపై అధికారపక్ష నేతలు పెదవి విరుస్తున్నారు. యూజీడీ పనుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా.. నాసిరకంగా పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి యుజిడి ప్రాజెక్టులో అక్రమాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అడ్డగోలుగా చేపట్టిన పనులపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే ఫిర్యాదు....
సాక్షత్‌ యూజీడీ పనుల్లో అక్రమాలపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో.. జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ రంగంలోకి దిగారు. నగరపాలక సంస్థ అధికారులతో కలిసి నగరంలో ఆకస్మిక పర్యటన చేశారు. పనులు జరిగిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారులపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి..మధ్యలోనే వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులు గుంతలమయంగా, మట్టిదిబ్బలుగా మారితే జనం ఎలా రాకపోకలు సాగిస్తారని ప్రశ్నించారు. కలెక్టర్‌ వరుసగా ప్రశ్నలు సంధించడంతో.. సంబంధిత అధికారులు నీళ్లు నమిలారు. అమరావతి రాజధానిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. క్షేత్రస్తాయిలో పర్యటించిన కలెక్టర్‌.. యూజీడీ పనుల్లో లోసుగులు వున్నట్లు గుర్తించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా.. 100 కీలోమీటర్ల మేర ఉన్న మట్టిరోడ్లలో.. గ్రావెల్ రోడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. గుంటూరులో వెయ్యి కిలోమీటర్లకు గాను..140 కిలోమీటర్లలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తయినట్లు సమాచారం. 140 కిలోమీటర్ల పనులకే అక్రమాలు బయటపడితే.. పనులు మొత్తం పూర్తయ్యేవరకు మరెన్ని కుంభకోణాలు బయటపడతాయో చూడాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నవ్యాంధ్ర రాజధానిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు అక్రమాలకు తావులేకుండా..పటిష్టంగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు.   

13:06 - September 13, 2017

గుంటూరు : అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు చేపడుతున్న షాపూర్జీ పల్లోంజి కంపెనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యుజిడి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వెయ్యి కిలోమీటర్ల మేర అండర్‌ గ్రౌండ్‌ పైపు లైన్లు వేస్తుండటంతో.. దీర్ఘకాలం మన్నేలా పనులు చేపట్టాల్సి ఉంది. ముఖ్యమైన కూడళ్ల వద్ద ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పైపులైన్ల సైజుల్లోనూ నిబంధనలు పాటించడం లేదన్నది మరో ఆరోపణ. పనులు తొందరగా పూర్తి చేయాలన్న ధ్యాస తప్ప.. నాణ్యత గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్వారీ డస్ట్‌తో పనులు పూర్తి
పైపులైన్‌ వేసే ముందు 4 అంగుళాల మేర ఇసుక వేయాలి. పైపు లైన్‌ వేసిన తర్వాత కూడా 6 అగుంళాల మేర ఇసుక వేయడం తప్పనిసరి. అయితే ఇసుక వేయకుండా క్వారీ డస్ట్‌తో పనులు పూర్తి చేస్తున్నారు. గుంటూరు నగరంలో నల్లరేగడి భూములు ఉండటంతో..పైపులైను గుంతలను సరిగా పూడ్చకపోతే భూమిలో పగుళ్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. దాంతో పైపులైన్లు పగిలే పోయే అవకాశం ఉందంటున్నారు. వెయ్యి కోట్లతో చేపట్టిన పనులను ప్రజారోగ్య శాఖ పర్యవేక్షిస్తోంది. ఈ శాఖలో సిబ్బంది తగినంతగా లేరు. దీంతో పనుల నాణ్యతపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జేఎన్ఎన్ యూఆర్ఎంపథకం
నాసిరకంగా చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల్లో అక్రమాలు కలకలం రేపుతున్నాయి. జేఎన్ఎన్ యూఆర్ఎంపథకం మార్గదర్శకాలను అనుసరించి ఏపీ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌...డీపీఆర్‌ తయారీకి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థను ఆదేశించింది. దీంతో జూన్‌ 28, 2012న తీర్మానం చేసి ఎలాంటి టెండర్లు ఆహ్వానించకుండా హైదరాబాద్‌కు చెందిన ఓ సలహా సంస్థకు డీపీఆర్‌ బాధ్యతలు కట్టబెట్టింది. అసలు ఇక్కడే అక్రమాలకు బీజం పడింది. డిపిఆర్ తయారీకి రెండు సంత్సరాలు గడువు తీసుకుంది. కమిషనర్‌ స్థాయిలో ఎస్‌ఈతో చర్చించి అందులో ఏం నిర్ణయాలు తీసుకున్నారో నమోదు చేయకుండా సలహా సంస్థ కోరిన విధంగా బిల్లులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ప్రాజెక్టు విలువ 903.81 కోట్లపై 0.75 శాతం చొప్పున కన్సల్టెన్సీ రుసుములు చెల్లించటానికి సెప్టెంబర్‌ 27, 2016న ప్రభుత్వం జీవో నంబరు 233 జారీ చేసింది. డీపీఆర్‌ తయారీకి 50 లక్షల నుంచి కోటి రూపాయలు చెల్లించాల్సింది పోయి ఏకంగా.. 7.69 కోట్లు చెల్లించారు. ఈ ఏడాది మార్చిలో నగరపాలక సంస్థ ఈ చెల్లింపులు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

13:05 - September 13, 2017

గుంటూరు : ఇదీ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పరిస్థితి...ఓవైపు ప్రజా ప్రతినిధులు, అధికారుల ఆర్భాట ప్రకటనలు. మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం అమరావతి రాజధాని అభివృద్ధిని వెక్కిరిస్తున్నాయి. కాంట్రాక్టర్లపై నిఘాలేమి, అధికారుల సమన్వయ లోపం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గుంటూరు నగరంలో చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల తీరు..ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. గుంటూరు నగరానికి భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవటంతో పారిశుధ్య సమస్య తీవ్రమైంది. పీకల వాగు ద్వారా ప్రవహించే మురుగు నీరు నగరంలో పోటెత్తుతోంది. ఓపెన్ డ్రెయిన్స్ ఉండటంతో రహదారులపై మురుగునీరు పొంగిపోర్లుతోంది. దీంతో కంపుకొట్టే పరిసరాల మధ్య జనం జీవించాల్సిన దుస్థితి. ఇక అపరిశుభ్ర వాతావరణంతో దోమలు విజృంభించి విషజ్వరాలు ప్రబలుతున్నాయి.

2012లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు మంజూరు
అండర్ గ్రౌండ్ డ్రెయినేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ప్రజల నుంచి పెరిగిపోయింది. గుంటూరు నగరానికి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2012లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టును మంజూరు చేసింది. పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు ఉన్న సమయంలో గుంటూరు కార్పొరేషన్‌లో యుజిడి పనుల కోసం వెయ్యి కోట్లు కేటాయించారు. గత ఏడాదే షాపూర్జీ పల్లోంజి కంపెనీ టెండర్లు దక్కించుకొని పనులు మొదలు పెట్టింది. స్థానిక ఎమ్మెల్యేలు గుంటూరులో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు ఘనంగా జనవరిలో శంకుస్థాపన చేశారు. ఏడాది క్రితమే పనులు ప్రారంభించాల్సి ఉండగా.. పలు కారణాలతో జాప్యం జరిగింది. 18 నెలల్లోనే ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని షాపూర్జీ, పల్లోంజీ ప్రకటించడంతో అధికారులు అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించారు. సుమారు వెయ్యి కిలో మీటర్ల మేర నగరమంతా భూగర్భ పైపు లైన్లు వేయాలని నిర్ణయించారు. లక్షా నలభై వేల గృహాలను పైప్ లైన్ల ద్వారా అనుసంధానించాలని నిశ్చయించారు.

గుంతలమయంగా గుంటూరు నగరం
తాగునీటి పైపు లైన్‌ పనులు ఓవైపు యుజిడి పనులు మరోవైపు జరగుతుండటంతో..గుంటూరు నగరం గుంతలమయంగా మారిపోయింది. అసలే వర్షాకాలం కావడంతో చినుకు పడిందంటే నగరం బురదమయంగా మారిపోతోంది. పలు ప్రాంతాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం గుంతలు తవ్వి అలాగే వదిలేశారు. దీంతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు..కాలినడకన వెళ్లాలన్నా ఎక్కడ జారిపడిపోతామోనన్న భయంతో వణికిపోతున్నారు. ఏ పనిమీద బయటికెళ్లాలన్నా వారికి పాట్లు తప్పడం లేదు. యుజిడి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లను, నగరపాలక సంస్థ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇష్టారాజ్యంగా రహదారులు తవ్వేసి వెళ్తే రాకపోకలు ఎలా సాగించాలని ప్రశ్నిస్తున్నారు.

13:02 - September 13, 2017

విజయవాడ : తల్లి జీవితాన్ని ఇస్తే.. నదులు సర్వస్వాన్ని ఇస్తాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అలాంటి నదుల్ని వారసత్వ సంపదగా పూజించి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. జగ్గీ వాసుదేవ్ చేపట్టిన మహత్తర కార్యక్రమానికి తాను సంపూర్ణ సహకారాలు అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ర్యాలీ ఫర్‌ రివర్స్‌ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జగ్గీ వాసుదేవ్ కోరారు. నదులు అంతరించిపోతే విపత్తులు సంభవిస్తాయని ఆయన హెచ్చరించారు. ర్యాలీ ఫర్‌ రివర్స్‌లో అందరూ భాగస్వాములు కావాలని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ పిలుపునిచ్చారు. విజయవాడలో ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. నదులు అంతరించిపోతే విపత్తులు సంభవిస్తాయని జగ్గీ వాసుదేవ్ హెచ్చరించారు. 25 ఏళ్లుగా నదులు స్వరూపం కోల్పోతున్నాయని.. నదుల పరిరక్షణకు అందరూ నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. 

12:59 - September 13, 2017
12:58 - September 13, 2017

కోమరంభీమ్ అసిఫాబాద్ : జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. కాగజ్‌నగర్‌, కౌటాల, చింతలమానేపల్లి, పెంచికల్ పేట్‌, దహేగాం, బెజ్జూరు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుండే కొన్ని గ్రామాలలో.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గత 10 రోజులుగా వర్షాలు లేకపోవడంతో.. ఆందోళనకు గురైన రైతన్నకు ఈ వర్షంతో కాస్త ఊరట లభించింది. 

12:55 - September 13, 2017

హైదరాబాద్ : చాందినిని హత్య చేసి అనంతరం నిందితుడు సాయికిరణ్ తమ ఇంటికి వచ్చినట్లు చాందిని పేరెంట్స్ చెబుతున్నారు. సాయికిరణ్ హత్య చేశాడని తెలిసి షాకయ్యామని చాందిని తల్లి అన్నారు. హత్యలో అతనికి మరికొందరు సాయం చేసినట్లు భావిస్తున్నామని ఆమె ఆరోపించారు. సాయికిరణ్‌ను కఠినంగా శిక్షించాలని చాందిని తల్లి డిమాండ్ చేస్తున్నారు. ఇక సాయి కిరణ్‌ తానే నేరం చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. 2015 నుంచి చాందిని తను ప్రేమించుకుంటున్నామని .. ఆమె ప్రవర్తన నచ్చక 6 నెలల నుంచి దూరం పెట్టానని సాయికిరణ్‌ పోలీసులకు తెలిపాడు. అయితే చాందిని హత్య వెనుక సాయికిరణ్‌కు ఎవరెవరు సహకరించారనే వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు చాందిని అక్క తాను కూడా చాందిని చదివిన స్కూల్‌లోనే చదివానని తెలిపింది. సాయికిరణ్‌, చాందిని క్లాస్‌మేట్ అని తెలుసని, ఇలా చంపేస్తాడని అనుకోలేదని చెప్పింది. ఏ ప్రాబ్లమైనా షేర్‌ చేసుకునేదని, లోలోపల ఇంత ఒత్తిడికి గురవుతోందని తెలీదని ఆవేదనకు గురైంది. 

11:44 - September 13, 2017

హైదరాబాద్ : చైతన్యపురిలోని శ్రీచైతన్య కాలేజ్ లెక్చరర్ల ఆందోళన దిగారు. అకారణంగా ఆరుగురు లెక్చరర్స్ తొలగించాలని వారు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ ఫర్ పేరుతో డీన్ రవికాంత్ వేధిస్తున్నాడంటున్నారు. వారు యాజమాన్యానికి, డీన్ రవికాంత్ వ్యతిరేకంగా నినాదాలు తొలగించిన లెక్చరర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:29 - September 13, 2017

హైదరాబాద్ : నగరంలో సంచలనం సృష్టించిన చాందిన హత్య కేసు మిస్టరీ వీడింది. చాందిని ఆమె ప్రియుడు సాయికిరణ్ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తెలింది. మదీనాగూడకు చెందిన సాయికిరణ్ చాందినిని తానే చంపినట్లు అంగీకరించాడు. 2015 నుంచి తను చాందినిన ప్రేమించుకుంటున్నామని, చాందిని ప్రవర్తన నచ్చక ఆరు నెలలుగా దూరం పెట్టా అని కిరణ్ విచారణలో తెలిపాడు. సాయికిరణ్ కు మరికొందరు సాయం చేశారని ఆమె తల్లి ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య

హైదరాబాద్ : నగరంలో కలకలంరేపిన చాందిని హత్య కేసు మిస్టరీ వీడింది. చాందినిని హత్య చేసింది ఆమె చిన్ననాటి క్లాస్ మెంట్ సాయికిరణ్ రెడ్డి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తెలింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకే అమీన్ పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లి హతమార్చినట్టు తెలిసింది.

10:08 - September 13, 2017

హైదరాబాద్ : నగరంలో కలకలంరేపిన చాందిని హత్య కేసు మిస్టరీ వీడింది. చాందినిని హత్య చేసింది ఆమె చిన్ననాటి క్లాస్ మెంట్ సాయికిరణ్ రెడ్డి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తెలింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకే అమీన్ పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లి హతమార్చినట్టు తెలిసింది. ఈ హత్య సాయికిరణ్ ఒక్కడే చేశాడా లేక అతని స్నేహితుల ఉన్నరా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

09:32 - September 13, 2017

చిత్తూరు : జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్ట సమీపంలో స్మగర్ల కలకలం సృష్టించారు. గుర్రాలబావి అటవీ ప్రాతంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు తారసపడ్డ స్మగర్లు దీంతో పోలీసులు వారిని లొంగిపోవాలంటూ హెచ్చరించారు. స్మగ్లర్లు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

09:17 - September 13, 2017
09:13 - September 13, 2017

హైరదాబాద్ : ఇంటర్ విద్యార్థి చాందనిని చిన్ననాటి స్కూల్ మెట్ సాయికిరణ్ రెడ్డి హత్య చేశాడని దర్యాప్తులో తెలింది. సాయికిరణ్ విషయంలో చాందిని సోదరి నివేదిత చాందినితో గొడవ పడినట్టు పోలీసుల విచారణలో తెలింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

మైలార్ దేవపల్లిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : రాజేంద్రనగర్ మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్ రెడ్డినగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ రా మెటీరియల్ గోదాంలో మంటలు ఎగసిపడుతున్నాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

నెల్లూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయగిరి ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

వీడిన చాందిని హత్య మిస్టరీ

హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థి చాందిని హత్య కేసులో సాయికిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాయికిరణే చాందినిని హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాయికిరణ్ చాందినికి 10 రోజుల క్రితం దాండియా కార్యక్రమంలో పరిచమైయ్యాడు.

08:25 - September 13, 2017

హైదరాబాద్ : రాజేంద్రనగర్ మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్ రెడ్డినగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ రా మెటీరియల్ గోదాంలో మంటలు ఎగసిపడుతున్నాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

08:24 - September 13, 2017

నెల్లూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయగిరి ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

08:23 - September 13, 2017

హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థి చాందిని హత్య కేసులో సాయికిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాయికిరణే చాందినిని హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాయికిరణ్ చాందినికి 10 రోజుల క్రితం దాండియా కార్యక్రమంలో పరిచమైయ్యాడు. హత్యకు కారణం ప్రేమ వ్యవహారమా లేక ఇతర కారణలున్నాయా అని పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

నేడు సిరిసిల్లలో కేటీఆర్, పోచారం పర్యటన

సిరిసిల్ల : నేడు జిల్లాలో మంత్రి కేటీఆర్, పోచారం పర్యటించనున్నారు. రైతు సమన్వయ సమావేశాలతో పాటు పలు కార్యక్రమాల్లో వారు పాల్గొననున్నారు.

నేడు కృష్ణా ట్రైబ్యునల్ సమావేశం

హైదరాబాద్ : నేటి నుంచి కృష్ణా ట్రైబ్యునల్ సమావేశం ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించనున్నాయి. 

నేడు తిరుమలలో వయోవృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేకదర్శనం

చిత్తూరు : నేడు వయోవృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకదర్శనం సౌకర్యం కల్పించనున్నారు. నేడు 4వేల మంది వయోవృద్ధులకు, వికలాంగులకు దర్శనం కల్పించనున్నారు. రేపు ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం

నేడు కుల్ భూషణ్ కేసు విచారించనున్న ఇంటర్నేషనల్ కోర్టు

ఢిల్లీ : భారత నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో ఇంటర్నేషనల్ కోర్టు వాదనలు విననుంది.

నేడు టీఎస్ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: నేడు తెలంగాణ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నేటి నుంచి 19 వరకు దరఖాస్తుల స్వీరణ, 22న డ్రా తీయనున్నారు. 

07:25 - September 13, 2017

తెలంగాణ రాష్ట్రంలో మద్యం నియంత్రించిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని, హైదరాబాద్ విశ్వనగరమని అందుకోసమే టైమ్ పెంచామని, దశల వారిగా మద్యం నియంత్రిస్తున్నామని, రాత్రి 11గంటలు అనేది హైదరాబాద్ లో 450 షాపులకు మాత్రమే అని టీఆర్ఎస్ నేత శివశంకర్ అన్నారు. ఇవాళ ప్రభుత్వంలో మద్యం షాపు ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోందని, మల్కాజ్ గిరిలో రెసిడెన్సి ఏరియాలో మద్యం షాపులు తీసేయాలని వారు ధర్నా చేస్తున్నారని, టెండర్ల సమయంలో 50వేల నుంచి లక్షలకు పెంచిందని కాంగ్రెస్ నేత ఇందిరాశోభన్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గానీ ఇతర టీఆర్ఎస్ నేతలు గానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పి ఇప్పుడు వారు తెలంగాణను మద్యం తెలంగాణగా మారుస్తున్నారని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

07:24 - September 13, 2017

తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్న డిమాండ్ ను వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలోని హమాలీలు. నిర్మాణరంగ కార్మికులకు ఏర్పాటు చేసినట్టు హమాలీలకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నది హమాలీల మరో ముఖ్యమైన డిమాండ్. ఖమ్మంలో జరిగిన ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభల్లో తెలంగాణలో హమాలీలు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై చర్చించారు. ప్రధానంగా హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలేటంటి వారికి ఎటువంటి గుర్తింపు కార్డు లేదని, వారికి ఈఎస్ఐ, ఫీఎఫ్ సౌకర్యంలేదని, సంక్షేమంలేని హమాలీలు సంఘమని, తెలంగాణ రాష్ట్రంలో అంత మంది కలుపుకుని హమాలీ మహసభలు ఖమ్మం జరుపుకున్నామని హమాలీలసంఘం అధ్యక్షుడు పాలడుగు సుధాకర్ అన్నానరు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:22 - September 13, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్ధులపై వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. విద్యార్థులను కేవలం ర్యాంకుల యంత్రాలుగా చూస్తున్నాయి. అందుకే వారిని క్రమశిక్షణ పేరుతో హింసిస్తున్నాయి. చిత్రహింసలకు గురిచేస్తున్నాయి. బట్టీ చదువుల కోసం మానసిక ఒత్తిడికి గురిచేస్తుననాయి. బట్టీ చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను శిక్షల పేరుతో హింసించడం ఈ మధ్యకాలంలో మరింత పెరిగింది. దీంతో విద్యార్థులు ఆత్మహత్యలవైపు మొగ్గుచూపుతున్నారు.

యూనిఫాం వేసుకురాలేదని బాలుర బాత్‌రూం దగ్గర
బీహెచ్‌ఈఎల్‌లోని రావూస్‌ స్కూల్‌లో 7వ తరగతి విద్యార్థిని యూనిఫాం వేసుకురాలేదని బాలుర బాత్‌రూం దగ్గర నిల్చోబెట్టారు. దీంతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని చదువుకే స్వస్తి పలకాలని భావించింది. మొన్నటికి మొన్న మెహదీపట్నంలో నెహ్రూ చిల్డ్రన్‌ స్కూల్‌లో సెకెండ్‌ క్లాస్‌ చదువుతున్న బాలుడు నత్తితో బాధపడుతున్నాడు. నత్తితో సరిగ్గా చదవడం లేదని ఏకంగా ప్రిన్సిపాలే తీవ్రంగా ఆ బాలుడిని దండించాడు. దీంతో ఆ బాలుడి వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. ఇక గాయత్రి కాలేజీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థిని ముగ్గురు లెక్చరర్స్‌ సరిగ్గా చదవడంలేదంటూ క్లాస్‌రూమ్‌లో, స్టాఫ్‌ రూమ్‌లో చితకబాదారు. మనస్తాపం చెందిన ఆ విద్యార్థి ఐదు అంతస్తుల బిల్డింగ్‌ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇలా కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థులను మాసనిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. బంగారు భవిష్యత్‌ కోసం కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థులను చేర్చడమే తల్లిదండ్రుల పాపమైపోయింది.ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు శిక్షలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే అక్కడ ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో శిక్షణ పొంది ఉంటారు. అంతేకాదు.. వారంతా బీఈడీ, డీఎడ్‌ చదవి ఉంటారు.

విద్యాసంస్థల్లో కార్పొరల్‌ పనిష్మెంట్స్‌ కనిపించవు
అంటే విద్యార్థుల మానసిక స్థితి ఎలా ఉంటుందో వారికి తెలుసు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఏవిధంగా పాఠాలు బోధించాలో వారితో ఏవిధంగా మెలగాలనే విషయాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరల్‌ పనిష్మెంట్స్‌ కనిపించవు. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ప్రతీది బిజినెస్‌ కిందే చూస్తారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ర్యాంకుల కోసం పరుగులు పెట్టిస్తారని... క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను శిక్షిస్తుంటారని ఆరోపిస్తున్నారు. దీనికంతటికీ ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకపోవడమే కారణమని చెబుతున్నారు. కార్పొరేట్‌ కళాశాలలు, పాఠశాలలు విద్యావ్యాపారాన్ని విడనాడితేనే విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంత వాతావరణంలోనే విద్యార్థులు చదువగలరు. అప్పుడే వారి భవిష్యత్‌కు బాటలు వేసుకోగలరు. 

07:21 - September 13, 2017

హైదరాబాద్ : ఎక్సైజ్‌ పాలసీ అంటే మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం కాదని..మద్యం వ్యాపారాన్ని అదుపు చేయడమే అని ఎక్సైజ్శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు. ఆదాయం కోసమే మద్యం రేట్లు పెంచారన్న ఆరోపణలను కొట్టివేశారు. గతంలో కన్న కొత్తగా వైన్‌ షాపుల సంఖ్య పెంచలేదని సోమేష్‌ కుమార్‌ అన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

07:19 - September 13, 2017

కరీంనగర్ : తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉత్తర తెలంగాణ మొదటి నుంచి అండగా నిలిచింది. ఇందులోనూ కరీంనగర్‌జిల్లా అయితే టీఆర్‌ఎస్‌కు పెట్టని కోట. ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్‌ కూడా ఇదే జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కరీంనగర్‌ కేంద్రంగా ఇటీవల జరిగిన పరిణామాలు ప్రభుత్వ పాలనకు మాయని మచ్చలా మిగిలాయి. నేరెళ్లలో దళితులపై పోలీసుల దాష్టీకం మొదలుకొని నిన్నటి మానకొండూరు ఘటన వరకు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను తీసుకొచ్చాయి. నేరెళ్లలో ఇసుక లారీలను దగ్దం చేశారన్న కారణంతో దళితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిని చిత్రహింసలకు గురిచేశారు. ఒక్కొక్కరు సరిగా నడవలేని స్థితికి తీసుకొచ్చారు. దీంతో పోలీసులు, ప్రభుత్వ తీరుపై నిరసనలు వెల్లువెత్తాయి. నెరెళ్లలో ఇసుక మాఫియా దళితులపై దాడి చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తే... వారి ముఖాన దళితులు అని రాసిఉందా ఉంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో రోజురోజుకు నేరెళ్ల దళితుల ఘటన ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకొచ్చింది.

ఇద్దరు దళిత యువకుల ఆత్మహత్యాయత్నం
మూడెకరాల భూమి పంపిణీ పథకంలో తమకు అన్యాయం జరిగిందని ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు దళిత యువకుల ఘటన కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచింది. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం వాసి మహంకాళి శ్రీనివాస్ , యాలాల పరశురాములు అనే యువకులు పంద్రాగస్టు రోజున ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయాలు కావడంతో వారిని కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రికి... ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. దీంతో గ్రామస్తులు, యువకుల బంధువుల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవి చూడాల్సి వచ్చింది.

ప్రశ్నార్దకంగా చెన్నమనేని రమేష్‌ పౌరసత్వం
ఈ వివాదాల నుంచి ఎలా గట్టెక్కాలని ప్రభుత్వం ఆలోచిస్తోంటే... వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ రూపంలో మరో సమస్య తెరపైకి వచ్చింది. చెన్నమనేని రమేష్‌ పౌరసత్వమే ప్రశ్నార్దకంగా మారింది. వరుస ఘటనలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతుండడంతో అధికార టీఆర్‌ఎస్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో సీఎం అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలోపడ్డారు. జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులతో సమావేశం జరిపారు. పార్టీ నేతలపై కేసీఆర్‌ సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి టీఆర్‌ఎస్‌కు పెట్టని కోటగా ఉన్న కరీంనగర్‌లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. మరి దీన్ని తగ్గించుకునేందుకు గులాబీబాస్‌ ఏ వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి.

07:06 - September 13, 2017

విజయవాడ : నంద్యాల, కాకినాడ ఓటములు వైసీపీని నిరాశపర్చాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారు. వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయంపై వైసీపీ చాలా ఆశలు పెట్టుకుంది. నంద్యాలలో గెలిచి అధికారపార్టీకి దిమ్మతిరిగే షాక్‌ ఇవ్వాలని భావించింది. అందుకే నంద్యాల ఉప ఎన్నికను ప్రభుత్వ వ్యతిరేకతకు రిఫరెండం అంటూ వైసీపీ ఎన్నికల్లో ప్రచారం చేసింది. కానీ ఫలితాలు మాత్రం టీడీపీకే అనుకూలంగా వచ్చాయి. వైసీపీకి ఊహించని షాక్‌ తగిలింది. దీంతో నేతల్లో ఉత్సాహం తగ్గింది. కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్లారు.

వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమానికి రూపకల్నన
పార్టీ నేతలను ఆవహించిన నైరాశాన్ని పారదోలేందుకు, ఎన్నికల ఫలితాల నుంచి క్యాడర్‌ను బయటపడేసేందుకు వైసీపీ అధినేత జగన్‌... వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమానికి రూపకల్న చేశారు. అంతేకాదు... ప్లీనరీలో ప్రకటించినట్టుగా నవరత్నాలపై కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. సమావేశాలు, సభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అయితే పార్టీ ఓటమితో నిరాశలో ఉన్న కొంతమంది కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అధినేత ఆదేశించినా వాటిని పాటించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. కొందరు నామమాత్రంగా పనిచేస్తోంటే.... మరికొందరు కనీసం వాటి గురించి ఆలోచించడం లేదు. అధినేత జగన్‌ కూడా లండన్‌ పర్యటనలో ఉండడంతో పార్టీలో ఎవరికివారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

విజయవంతంగా ఇంటింటికీ టీడీపీ
ఏపీలో అధికార టీడీపీ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీనేతలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం తీసుకున్న కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టలేక పోతోంది. మొత్తానికి రెండు ఓటములతో గాడి తప్పింది ప్రతిపక్ష వైసీపీ. గాడితప్పిన నేతలను అధినేత జగన్‌ ఎలా దారిలోకి తెచ్చుకుంటారో వేచి చూడాలి.

07:05 - September 13, 2017

నల్లగొండ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ టీపీసీసీలో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. పీసీసీ చీఫ్‌ పేరు ఎత్తితే చాలు.. తోక తొక్కిన తాసుపాములా కస్సుమంటూ లేస్తారు. కోపంతో ఊగిపోతారు. శంషాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల శిక్షణా తరగతుల తర్వాత మరింత రగలిపోతున్నారు. ఈ సమావేశాల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమను అవమానించారన్న భావంతో ఉన్న కోమటిరెడ్డి సోదరులు... టీపీసీసీ చీఫ్‌ను టార్గెట్‌ చేశారు. ఇరువర్గాల మధ్య ఎప్పటి నుంచే కొనసాగుతున్న అంతర్యుద్ధం ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది.

గాంధీభవన్‌ గడప తొక్కనని శపథం
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నంత కాలం గాంధీభవన్‌ గడప తొక్కనని శపథం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవకాశం దొరికనప్పుడట్టా పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ని టార్గెట్‌ చేస్తున్నారు. చాన్స్‌ వచ్చినప్పుడల్లా తన ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు. పీసీసీ చీఫ్‌ పదవి కోసం పైరవీలు చేసుకుంటున్న కోమటిరెడ్డి సోదరులు... శంషాబాద్‌ సమావేశం అనుభవంతో ఇక కాంగ్రెస్‌లో ఉండలేమన్న భావనుకు వచ్చారని సమాచారం. పార్టీ శిక్షణా తరగతుల్లో అవమానించారన్న కోపంతో రగలిపోతున్న కోమటిరెడ్డి సోదరులు.. ఆ రోజు వేదికపై ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డితోపాటు ఐఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియాకు ఇంగిత జ్ఞానంలేదంటూ వ్యాఖ్యానించడం రాజకీయం పెద్ద రచ్చతోపాటు చర్చకు దారితీసింది.

టీపీసీసీ చీఫ్‌ పదవి తమకు
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమకు కాంగ్రెస్‌లో పొగబెట్టారని బహిరంగంగా విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి సోదరులు.. టీపీసీసీ చీఫ్‌ పదవి తమకు ఇవ్వకపోతే పార్టీలో ఉండలేమని ప్రకటించారు. సెప్టెంబర్‌లో పీసీసీలో మార్పులు ఉంటాయని అనుకున్న నల్గొండ బద్రర్స్‌ ఆశలపై కుంతియా నీళ్లు చల్లారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డే కెప్టెనంటూ కుంతియా స్పష్టం చేయడంతో.... కాంగ్రెస్‌లో ఇమడలేకపోతున్నారు. శంషాబాద్‌ షాక్‌తో కోమటిరెడ్డి సోదరులకు పార్టీలో కొనసాగలేని పరిస్థితి వచ్చిందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ విషయాలపై స్పష్టంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌.. తమ రాజకీయ భవిష్యత్‌పై అయోమయంలో ఉన్నారని వినిపిస్తోంది.కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి భవిష్యత్‌ పయనం టీఆర్‌ఎస్‌, బీజేపీ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వీరికి టీఆర్‌ఎస్‌ తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి. ఇక బ్రదర్స్‌ బీజేపీ గూటికి చేరతారని చర్చ జరుగుతోంది. ఈ విషయంలో కూడా కోమటిరెడ్డి సోదరుల్లో స్పష్టతలేదని వినిపిస్తోంది. కమలం పార్టీపై ప్రజల్లో ఊపు కనిపించడంలేదని భావిస్తున్నారు. నల్గొండ జిల్లాలో బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో వీరు కలవరపడుతున్నారు. కమలదళంలో చేరితే భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందేమోన్న భయం వెంటాడుతోంది. అన్ని విషయాల్లో స్వేచ్ఛగా వ్యవహరించే తాము బీజేపీలో ఇమడలేమన్న భావంతో కోమటిరెడ్డి సోదరులతోపాటు వీరి అనుచరులు ఉన్నారు. దీంతో బీజేపీలోకి వెళ్లే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తారా
మొత్తానికి పార్టీలో పట్టు పెంచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధాటిని తట్టుకోలేక... కోటమిరెడ్డి సోదరులు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికిప్పుడు వేరు పార్టీలోకి వెళ్లలేని పరిస్థితి. మరోవైపు వీరిపై వేటు పడకుండా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎటూతేల్చుకోలేని పరిస్థితితుల్లో చివరి అవకాశంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. వీరికి రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తారా ? ఇవ్వకపోతే కోమటిరెడ్డి సోదరుల దారెటు ? అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Don't Miss