Activities calendar

14 September 2017

22:55 - September 14, 2017
22:54 - September 14, 2017
22:53 - September 14, 2017
22:52 - September 14, 2017
22:51 - September 14, 2017

జోగులాంబ గద్వాల : సామాజిక తెలంగాణ సాధించడం కోసమే టీమాస్ ఫోరం ఏర్పడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా టీమాస్ ఫోరం ఆవిర్భావ సభలో పాల్గొని, ఆయన మాట్లాడారు. అగ్రకులాకు పేదలు ఓటు బ్యాంకుగా మారారని తెలిపారు. రాష్ట్రంలో 93 శాతం పేదులన్నారని పేర్కొన్నారు. 

 

22:45 - September 14, 2017

పదిహేడేళ్ల అమ్మాయి.. ఇంట్లో సందడిగా తిరిగే వయస్సు.. ఆటపాటల్లో, చదువు సంధ్యల్లో మునిగి రేపేంటో ఆలోచనకే రాని వయస్సు..కానీ, ఆమె గుట్టల్లో రాళ్ల మధ్య విగతజీవిగా మారింది. ఆమె అమితంగా ఇష్టపడిన స్నేహితుడు నేరస్తుడయ్యాడు? ప్రేమ ఆకర్షణ తిరస్కారం అనుమానం ఇవే కారణాలా? మరేవైనా ఉన్నాయా? ఈ ఇద్దరినే కాదు.. ఇలాంటి టీనేజ్ పిల్లల పక్కనే పొంచి ఉన్న అనేకానేక ప్రమాదాలేమిటి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..

ఆధునికతలో సౌకర్యం ఉంది.. అది అనుసరించటం తెలిస్తే..ఆధునికతలో ప్రమాదం ఉంది.. అది జాగ్రత్తపడటం తెలియకపోతే.. కాలికి ముల్లుగుచ్చుకుంటేనే విలవిల్లాడతాం.. మరి ఇంట్లో పిల్లల ప్రాణాలకే ముప్పొస్తే... ఎంత జాగ్రత్తపడాలి.. ఇంటర్నెట్, పబ్బులు, డ్రగ్స్ లాంటి అనేక భూతాలు టీనేజ్ పిల్లలను కబళించటానికి పొంచి ఉంటే ఎంత జాగ్రత్తపడాలి మరి? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

22:42 - September 14, 2017

జపాన్ తుక్కును గొన్కొస్తున్న మోడీ, ఏ పార్టీలకు వోనంటున్న కోమటిరెడ్డి, సింగరేణి ఎన్నికలళ్ల టీఆర్ఎస్ డీలా, తాటికొండ రాజయ్యకు తల్కాయనొప్పి, జీహెచ్ఎంసీల సుర్వైన మూసీ పుష్కరాలు....మల్లన్న ముచ్చట్లలో చూద్దాం...

22:17 - September 14, 2017

అమెరికాలో దారుణం

హైదరాబాద్ : అమెరికాలోని కాన్సాస్‌లో దారుణం జరిగింది. తెలంగాణకు చెందిన డాక్టర్ అచ్యుత్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అచ్యుత్ రెడ్డి.. కాన్సాస్‌లో సైక్రియాటిస్ట్‌గా పని చేస్తున్నారు. దుండగులు అచ్యుత్‌ రెడ్డిని కత్తితో పొడిచి చంపారు. హత్యకు సంబందించి ఓ అనుమానితున్ని.. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

 

22:11 - September 14, 2017

హైదరాబాద్ : అమెరికాలోని కాన్సాస్‌లో దారుణం జరిగింది. తెలంగాణకు చెందిన డాక్టర్ అచ్యుత్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అచ్యుత్ రెడ్డి.. కాన్సాస్‌లో సైక్రియాటిస్ట్‌గా పని చేస్తున్నారు. దుండగులు అచ్యుత్‌ రెడ్డిని కత్తితో పొడిచి చంపారు. హత్యకు సంబందించి ఓ అనుమానితున్ని.. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

22:08 - September 14, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాదళాలకు భారీ విజయం లభించింది.  అమర్‌నాథ్‌ యాత్రీకులపై దాడి చేసిన మాస్టర్‌ మైండ్‌ లష్కర్‌ కమాండర్‌ అబూ ఇస్మాయిల్‌ను భద్రతాదళాలు కాల్చి చంపాయి. ఎన్‌కౌంటర్‌లో అబుతో పాటు మరో గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. జులై 10న బస్సులో వెళ్లుతున్న అమర్‌నాథ్‌ యాత్రీకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు మృతి చెందారు. ఉగ్రదాడి కీలక సూత్రధారి అబు ఇస్మాయిల్‌ కోసం భద్రతా బలగాలు గత కొన్నిరోజులుగా వేటాడుతున్నాయి.  అబూ ఇస్మాయిల్‌ బట్‌మాలు ప్రాంతంలో సంచరిస్తున్నాడన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు దాడులు నిర్వహించింది. పాకిస్తాన్‌కు చెందిన 24 ఏళ్ల అబు ఇస్మాయిల్‌పై 10 లక్షల బహుమతి ప్రకటించారు. రెండేళ్ల క్రితం కశ్మీర్‌లోకి చొరబడ్డ అబు ఇస్మాయిల్‌కు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ నేతలతో సంబంధం ఉంది.

22:06 - September 14, 2017

చిత్తూరు : తిరుపతిలోని రుయా ఆస్పత్రి దారుణం చోటు చేసుకుంది. ఇంజెక్షన్లు వికటించి  15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని అత్యవసర చికిత్స విభాగానికి తరలించారు. బాధిత చిన్నారులకు వాంతులు, విరేచనాలతో పాటు శరీర ఉష్ణోగ్రతలు పెరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సుమారు 300 మంది చిన్నారులు వివిధ రోగాలతో ఇక్కడ చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒక ఏడాది లోపు ఉన్న చిన్నారులకు దగ్గు, జలుబు వంటి వాటికి యాంటీబయోటిక్‌ ఇంజెక్షన్‌ను వైద్యులు చేశారు. ఆస్పత్రిలో ఉన్న 300 మందికీ ఇవే ఇంజెక్షన్లు ఇచ్చినప్పటికీ 15 మందికి మాత్రమే ఎందుకు వికటించదనే కోణంలో ఆస్పత్రి అధికారులు విచారణ చేస్తున్నారు. వైద్య సిబ్బందిని ఆరా తీశారు. 

22:03 - September 14, 2017

విజయవాడ : అర్హులైన పేదలందరికీ ఇళ్లను కేటాయించాలని  విజవాడ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు సీపీఎం నిరసనకు దిగింది. జక్కంపూడిలో ప్రారంభం కానున్న ఇళ్లను పేదలకే ఇవ్వాలని సీపీఎం నేతలు  డిమాండ్‌ చేశారు. ఇళ్లను టీడీపీ నేతలు అమ్ముకోడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  పేదలకు దక్కాల్సిన ఇళ్లు టీడీపీ అనుచరులకు కేటాయిస్తే ఊరుకోమని లెఫ్ట్‌ నేతలు  హెచ్చరించారు. ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరగకుంటే ఈనెల 20న ఎమ్మార్వో కార్యాలయం ముందు పేదలతో మహాధర్నాకు దిగుతామని హెచ్చరించారు. 


 

జనంలోకి దూసుకుపోతోన్న జనసేనపార్టీ

హైదరాబాద్ : జనసేనపార్టీ జనంలోకి దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా నిర్వహిస్తున్న ఔత్సాహిక వేదకలు చివరి అంకానికి చేరుకున్నాయి. పార్టీ పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారికి సభ్యత్వం ఇవ్వడంతోపాటు.. వివిధ కేటగిరీలుగా కార్యకర్తలను విభజించిన పార్టీ కార్యక్రమాల్లో వినియోగించనున్నారు. త్వరలో గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఔత్సాహికల వేదకలు నిర్వహించడానికి జనసేనపార్టీ సిద్ధం అవుతోంది. 

విభజన నిబంధనలే ఆర్టీసీ విభజనకూ వర్తిస్తాయి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ఆర్టీసీ ఆస్తుల పంపకంపై కీలక అడుగు పడుతోంది. రేపు విజయవాడలో ఇరు రాష్ట్రాల ప్రతినిధులు భేటీ కానున్నారు. భేటీ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. విభజన నిబంధనలే ఆర్టీసీ విభజనకూ వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు చట్టానికి లోబడే పంపకాలు ఉంటాయన్నారు. పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామని కేసీఆర్‌ అన్నారు. విభజన సమస్యలను విజ్ఞతతో పరిష్కరించాలని అన్నారు. ఎవరి సంస్థలు వారే నడుపుకోవాలన్న కేసీఆర్‌ ఎవరి పాలన వారు చేసుకోవాలన్నారు.

బాలిక అదృశ్యం

హైదరాబాద్ : శంషాబాద్‌ విమానాశ్రయానికి బయలుదేరిన బాలిక అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ విజయ్‌నగర్‌ కాలనీలో ఉంటున్న షణ్ముఖప్రియ ఇంటర్‌ చదువుతూ సినిమాల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. కాగా గత నెల 17న యాడ్‌ఫిల్మ్‌ తీయడానికి డార్జిలింగ్‌కు వెళుతున్నట్టు తమకు చెప్పిందని తల్లిదండ్రులు అంటున్నారు. కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో ఎయిర్‌పోర్టు పీఎస్‌లో షణ్ముఖప్రియ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

మూసీ నదిలో చిక్కుకున్న తొమ్మిది మంది

యాదాద్రి భువనగిరి : హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వలిగొండ మండలం సంగెం భీమిలింగం దగ్గర దర్శనానికి వెళ్లి ముగ్గురు భక్తులు మూసీలో చిక్కుకున్నారు. కాపాడేందుకు వెళ్లి మరో ఆరుగురు వరదలో చిక్కుకున్నారు. సహాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

 

సీబీఎస్ ఈ స్కూళ్లలో భద్రతకు మార్గదర్శకాలు

ఢిల్లీ : సీబీఎస్ ఈ స్కూళ్లలో భద్రతకు మార్గదర్శకాలు వెలువడ్డాయి. సీబీఎస్ ఈ పాఠశాలల్లో సీసీ టీవీలు, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు తప్పనిసరి చేసింది. 

ఎల్‌ఈడీ లైట్ల సెట్టింగులో ప్రమాదం

హైదరాబాద్‌ : నగరంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న.. ఎల్‌ఈడీ లైట్ల సెట్టింగులో విద్యుత్ షాక్‌ తగిలి ఎలక్ట్రిషియన్‌ మృతి చెందాడు. కాంట్రాక్టర్లు తమ లాభాపేక్ష కోసం ఎలక్ట్రికల్ పరిజ్ఞానం లేని కార్మికులతో పని చేయించారు. ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు ప్రత్యేక శిక్షణ పొందిన కార్మికులను ఉపయోగించాలి. విద్యుత్‌ సరఫరా నిలిపేయకుండా పనులు చేయించడంతో ప్రమాదం జరిగింది. దీంతో మిరాజ్‌ అనే కార్మికుడు మృతి చెందాడు.

అనంతపురం జిల్లాలో దారుణం

అనంతపురం : జిల్లాలోని కొవ్యూరులో దారుణం జరిగింది. భార్య తరపు బంధువులు భర్తపై కత్తితో దాడి చేశారు. కత్తి మెడలోనే ఉండి పోయింది. అతని పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

పశ్చిమగోదావరి : దెందులూరు మండలం కొవ్వలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతులు కృష్ణా జిల్లా వాసులుగా గుర్తించారు.

చిన్నారుల మిస్సింగ్ వ్యవహారం విషాదాంతం

కర్నూలు : జిల్లాలో చిన్నారుల మిస్సింగ్ వ్యవహారం విషాదాంతంగా ముగిసింది. ఇద్దరు చిన్నారుల్లో ఒకరి మృతదేహం లభ్యమయింది. అల్లూరు వద్ద కేసీ కెనాల్ లో ఒకరి మృతదేహం లభ్యమయింది. మరొక చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదవశాత్తు కాల్వలో పడినట్లు అనుమానిస్తున్నారు. 

 

సీఎం చంద్రబాబుతో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధుల సమావేశం

గుంటూరు : సీఎం చంద్రబాబుతో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఫోస్టర్ బృందం అందించిన ఆకృతులను మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాస్, నారాయణతో కలిసి సీఎం పున:పరిశీలన చేశారు. పరిపాలన నగరంలోని ముఖ్య భవంతుల తుది ఆకృతులు నిర్మాణ వ్యూహ ప్రణాళికలను సిద్ధం చేయడానికి మరికొంత సమయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

ముంపు ప్రాంతాల్లో రంగంలోకి ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు

హైదరాబాద్ : ముంపు ప్రాంతాల్లో ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ముంపు కాలనీలు, బస్తీల్లో తాగునీరు, పాలు ఇతర ఆహార పదార్థాలను అధికారులు అందిస్తున్నారు. పలు కాలనీల్లో విద్యుత్ కోతలు ఇంకా కొనసాగుతున్నాయి. 

వరంగల్ లో స్వైన్ ప్లూ కలకలం

వరంగల్ : జిల్లా హసన్ పర్తి మండలం కేశపురానికి చెందిని రవికి స్వైన్ ప్లూ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రవి అనే ఓ వ్యక్తి ఎన్1హెచ్1 వైరస్ లక్షణాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్లూ లక్షనాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రోగికి చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

గ్రూప్ 2కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష వివాదంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. హైకోర్టు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది.

10:40 - September 14, 2017

హైదరాబాద్ : నరంలోని కూకట్ పిల్ల వెంకటేశ్వరనగర్ లో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. గత రాత్రి నరేష్ అనే బాలుడు డెంగ్యూతో మృతి చెందాడు. బాలుడు మృతదేహాన్ని ఇంట్లోకి ఇంటి ఓనర్ అనుమతించకపోవడంతో కొడుకు మృతదేహంతో రాత్రంతా వర్షంలోనే తల్ల ఉంది. ఈ సంఘటన చూసి స్థానికులు చలించిపోయి చందాలు వేసుకుని బాలుని అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మానవత్వం లేకుండా ఇంటి ఓనర్ ప్రవర్తిండం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

నాగరాజ్ మృతిపై వీడని మిస్టరీ

కరీంనగర్ : జిల్లా జమ్మికుంట మండలం నాగంపేటలో మృతిచెందిన నాగరాజు కేసు మిస్టరీ వీడలేదు. ఔషధ ప్రయోగాలతో నాగరాజు మృతిచెందాడన్న ఆరోపణలపై జూన్ లో కేఎంసీ వైద్యలు రీపోస్టుమార్టం చేశారు. 3నెలలు గడిచిన పోస్టుమార్టం నివేదిక రాలేదు.

కూకట్ పల్లిలో దారుణం

హైదరాబాద్: కూకట్ పల్లి వెంకటేశ్వరనగర్ లో దారుణం జరిగింది. రాత్రి డెంగ్యూతో బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి ఇంటి ఓనర్ అనుమతించకపోడంతో రాత్రంతా కుమారుడి మృతదేహంతో తల్లి వర్షంలోనే ఉంది.

10:14 - September 14, 2017

హైదరాబాద్ : జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి కుండపోత వాన కురిసింది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యయాయి. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, ఖైరతాబాద్‌, ఎర్రగడ్డ, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, బేగంపేట, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మల్కాజ్‌గిరిలో బండ్ల చెరువు పొంగిపొర్లుతోంది. దీంతో పటేల్‌ నగర్‌, దుర్గానగర్‌లోని ఇళ్లలోకి చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాలు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో అంధకారంలో మగ్గిపోయాయి. నగరంలోని పలు అపార్ట్‌మెంట్స్‌లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో కిందకు దిగేందుకు అవకాశం లేని పరిస్థితి నెలకొంది. కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలతో పాటు పలు కాలనీలను వరద నీరు ముంచెత్తడంతో లాలాపేటలోని ఫంక్షన్‌హాల్‌లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మోకాళ్లలోతు నీళ్లలోనూ రాష్ట్ర మంత్రి పద్మారావు పునరావాస కేంద్రాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. వెంటనే సహాయకచర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులను పద్మారావు ఆదేశించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:10 - September 14, 2017

హైదరాబాద్ : జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి కుండపోత వాన కురిసింది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యయాయి. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, ఖైరతాబాద్‌, ఎర్రగడ్డ, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, బేగంపేట, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మల్కాజ్‌గిరిలో బండ్ల చెరువు పొంగిపొర్లుతోంది. దీంతో పటేల్‌ నగర్‌, దుర్గానగర్‌లోని ఇళ్లలోకి చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాలు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో అంధకారంలో మగ్గిపోయాయి. నగరంలోని పలు అపార్ట్‌మెంట్స్‌లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో కిందకు దిగేందుకు అవకాశం లేని పరిస్థితి నెలకొంది. కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలతో పాటు పలు కాలనీలను వరద నీరు ముంచెత్తడంతో లాలాపేటలోని ఫంక్షన్‌హాల్‌లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మోకాళ్లలోతు నీళ్లలోనూ రాష్ట్ర మంత్రి పద్మారావు పునరావాస కేంద్రాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. వెంటనే సహాయకచర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులను పద్మారావు ఆదేశించారు. 

10:05 - September 14, 2017

మలేషియాలో ఘోర ప్రమాదం

మలేషియా : రాజధాని కౌలాలంపూర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జలాన్ దాతుక్ కెర్మాట్ లోని మత పాఠశాలలో మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు

09:37 - September 14, 2017

మలేషియా : రాజధాని కౌలాలంపూర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జలాన్ దాతుక్ కెర్మాట్ లోని మత పాఠశాలలో మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులంతా 15ఏళ్లలోపు చిన్నారులే. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

09:21 - September 14, 2017

మల్కాజ్ గిరిలో పొంగిపోర్లుతున్న నాలాలు

హైదరాబాద్: గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు జంట నగరల ప్రజల తీవ్ర ఇబ్బందులు గురైయ్యారు. మల్కాజ్ గిరిలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అధికారులు ఎవరు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

09:09 - September 14, 2017

హైదరాబాద్: గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు జంట నగరల ప్రజల తీవ్ర ఇబ్బందులు గురైయ్యారు. మల్కాజ్ గిరిలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అధికారులు ఎవరు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం వీడియో క్లిక్ చేయండి.

నేడు ఏపీ సచివాలయంలో ఫుడ్ ఫెస్టివెల్

హైదరాబాద్ : నేడు ఏపీ సచివాలయంలో ఫుడ్ ఫెస్టివెల్ జరగనుంది. ఫుడ్ ఫెస్టివెల్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.

నేడు ఐదేళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం

చిత్తూరు : తిరుమలలో ఐదేళ్లఓపు చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.

 

08:27 - September 14, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని పరిపాలన నగరంలో నిర్మించబోయే అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్స్‌పై నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. వజ్రాకారపు అసెంబ్లీ, బుద్ద స్థూపాకారపు హై కోర్ట్ డిజైన్స్ పై నార్మన్ ప్రతినిధులు ప్రజంటేషన్ ఇచ్చారు.. ప్రభుత్వం సూచించిన అన్ని మార్పులతో అసెంబ్లీ, హై కోర్ట్ ఆకృతులను ముఖ్యమంత్రికి చూపించారు.. అసెంబ్లీ భవనం లోపల ఎలా ఉంటుంది, ప్రభుత్వం చెప్పిన కోహినూర్ డైమండ్ షేపు ఎక్కడ మొదలై , ఎక్కడ ముగుస్తుంది అనే అంశాలను నార్మన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి క్షుణ్ణంగా వివరించగా, చంద్రబాబు డిజైన్స్ నిశితంగా పరిశీలించారు.హైకోర్టు బాహ్య ఆకృతి అత్యద్భుతంగా ఉండాలని ఫోస్టర్ బృందానికి చంద్రబాబు సూచించారు. శాసనసభ, హైకోర్టు నిర్మాణాలు ప్రపంచానికే తలమానికంగా ఉండాలనేది తమ అభిమతమని.... ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

హైకోర్టు భవంతి....
హైకోర్టు భవంతి లోపల తమకు ఎటువంటి సౌకర్యాలు వుండాలో, అందులో అంతర్గత నిర్మాణ శైలి ఎలా ఉండాలో న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చునని సూచించారు. ఇక బాహ్య ఆకృతి మాత్రం తనతో పాటు రాష్ట్ర ప్రజలందరూ మెచ్చేలా ఉండాలన్నారు. ఇక అసెంబ్లీ భవంతిపై ఫోస్టర్‌ బృందం సమర్పించిన ఆకృతులు, అంతర్గత నిర్మాణశైలి, ప్రణాళికలను చంద్రబాబు పరిశీలించారు. అసెంబ్లీ భవనాన్ని 35 ఎకరాల్లో , 7.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్థులుగా నిర్మాణం చేయనున్నారు. మొదటి అంతస్థును నాలుగు భాగాలుగా రూపొందించారు. మధ్యలో పబ్లిక్ ప్లేస్‌గా ఉంచారు. బేస్‌మెంట్ లెవల్‌లో వాహన పార్కింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. మొదటి అంతస్థును మంత్రులకు, ముఖ్యమంత్రికి, సభాపతికి, పబ్లిక్, ప్రెస్ కార్యస్థానాల కోసం కేటాయించనున్నారు. నాలుగు వైపుల నుంచి ద్వారాలు ఉండగా.... ముఖ్యమంత్రి, సభాపతి, మంత్రులు రాకపోకలకు ప్రత్యేకమార్గం ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ, శాసనమండలి కోసం రెండు వేర్వేరు భవంతులు ఈ సముదాయంలోనే అంతర్గతంగా నిర్మాణంకానున్నాయి. అసెంబ్లీ లోపలి భాగంలో 250 సీట్లతో శాసనసభ మందిరం ఉంటుంది. 231 సీట్లతో పబ్లిక్, ప్రెస్ గ్యాలరీలు ఉంటాయి. 125 సీట్లతో శాసనమండలి మందిరం ఉంటుంది. త్రిభుజాకారంలో నిర్మించే బాల్కనీలు శాసనసభ నిర్మాణానికే అతి ముఖ్య అలంకారంగా ఉంటాయని ఫోస్టర్ బృందం ముఖ్యమంత్రికి వివరించింది.

బుద్ద స్థూపాకారపు హై కోర్ట్ భవనం
ఇక హై కోర్ట్ భవనానికి సంబంధించి మరో రెండు డిజైన్లు సిద్దం చేయాలని నార్మన్ పోస్టర్ ప్రతినిధులకు సియం సూచించారు. మొత్తం 50 ఎకరాల్లో 14.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్థులుగా బుద్ద స్థూపాకారపు హై కోర్ట్ భవనం నిర్మాణం చేయాలని నిర్ణయించారు.. హై కోర్ట్ లో 48 కోర్టులు ఉండేలా , భవిష్యత్ లో అవసరం అనుకుంటే మరో 18 కోర్టులు పెంచుకునే వెసులుబాటుతో హై కోర్ట్ నిర్మాణం చేయనున్నారు. మొత్తం 5వేల మంది పట్టేలా హై కోర్ట్ నిర్మాణం ఉండబోతుంది..హై కోర్ట్ లోపలి నిర్మాణాలుకు ఎలాంటి మార్పులు ఉండేలి అనే దాని పై న్యాయమూర్తుల సలహాలు తీసుకోవాలని సియం సూచించారని మంత్రి నారయణ చెప్పారు. శాశ్వత అసెంబ్లీ భవనానికి సంబంధించిన వజ్రాకారపు డిజైన్ ను నేడ అధికారికంగా ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు.. దీని కోసం ఉదయం మరోసారి నార్మన్ ప్రతినిధులతో సమావేశం కావాలని ,ఈ సమావేశానికి స్పీకర్ తో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారుల హాజరుకావాలని సియం అదేశించారు.  

08:24 - September 14, 2017

నేడు ఏపీ సీఎంతో నార్మన్ పోస్టర్ ప్రతినిధుల భేటీ

గుంటూరు : నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో నార్మన్ పోస్టర్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. శాశ్వత అసెంబ్లీ డిజైన్ నేడు అధికారంగా ఖరారు చేయనున్నారు. డిజైన్లు సీఎం చంద్రబాబు పబ్లిక్ డొమైన్ లో విడుదల చేస్తారు.

నేడు కరీంనగర్ లో మంత్రులు పర్యటన

కరీంనగర్ : నేడు జిల్లాలో మంత్రి ఈటెల, తలసాని పర్యటించనున్నారు. లోయర్ మానేర్ డ్యాములో 18 లక్షల చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో వారు పాల్గొంటారు.

08:19 - September 14, 2017

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అంతరాలయ దర్శనం టికెట్ల విషయం ఇంకా తేలలేదు. టికెట్ల ధరలను భక్తులపై వేయడంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2015-16 సంవత్సరంలో ఇంద్రకీలాద్రిపై తొమ్మిది లక్షల మంది భక్తులు అంతరాలయం దర్శనం చేసుకున్నారు. అయితే 2016-17 సంవత్సరంలో మూడున్నర లక్షల మంది భక్తులు మాత్రమే అంతరాలయాన్ని దర్శించుకున్నారు. దేవాలయంలో అంతరాలయం టిక్కెట్ ధరను పెంచి.. భక్తులపై భారం వేయడం వల్లే దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. భక్తులకు ఇబ్బంది కలుగుతుండడంతో సెప్టెంబర్ 4న దేవస్థానంలో ఆలయ చైర్మన్ గౌరంగబాబు, ఈవో సూర్యకుమారి ఆధ్వర్యంలో పాలక మండలి సమావేశం నిర్వహించారు. దర్శనం టికెట్ ధరను 300ల నుంచి 150లకు తగ్గించాలని నిర్ణయించారు. అలాగే 100 రూపాయల టికెట్‌ ధరను 50కి తగ్గించాలని తీర్మానం చేశారు. దీనికి ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు కూడా పంపారు. ప్రభుత్వం ఆమోదం తరువాత అమ్మదర్శనం టికెట్ల ధరలు భక్తులకు అందుబాటులోకి వస్తాయని ఆలయ అధికారులు తెలిపారు.

ఏటా కోటి మందికి పైగా
ఆంధప్రదేశ్‌లోనే రెండో అతిపెద్ద దేవాలయమైన ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి ఏటా కోటి మందికి పైగా భక్తులు దర్శనానికి వస్తుంటారు. 2016 జులై వరకూ భక్తులు 9 లక్షల మందికిపైగా అమ్మవారిని అంతరాలయం దర్శనం చేసుకునేవారు. అంతరాలయ దర్శనం టికెట్ ధర 100 ఉండటంతో ఏటా దుర్గమ్మ గుడికి వచ్చే భక్తుల్లో 10 శాతం మంది మాత్రమే వీటిని కొనుగోలు చేసేవారు. వంద రూపాయల టిక్కెట్ల ద్వారా నెలకు 75 లక్షల వరకు ఆదాయం వచ్చేది. ఏటా 9 కోట్లకుపైగా ఆదాయం ఆలయానికి చేరేది.2016 ఆగష్టులో జరిగిన కృష్ణా పుష్కరాల నుంచి 2017 జులై వరకు 300 రూపాయల టిక్కెట్ల పెంపుతో ఆలయానికి 11.20 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ టిక్కెట్ల ద్వారా కేవలం 3లక్షల 73వేల మంది భక్తులు మాత్రమే అమ్మవారిని అంతరాలయ దర్శనం చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఐదున్నర లక్షల మంది భక్తులు తగ్గిపోయారు. కొంతమంది భక్తులు మాత్రమే ఉచిత దర్శనం క్యూలైన్లో నిలబడి దుర్గమ్మను దూరం నుండే దర్శించుకుంటున్నారు.

టికెట్‌ ధరపై 9 కోట్ల 33 లక్షల 47వేల 200 రూపాయలు
2014-15 సంవత్సరంలో వంద రూపాయల టికెట్‌ ధరపై 9 కోట్ల 33 లక్షల 47వేల 200 రూపాయల ఆదాయం వచ్చింది. అయితే ఈ సంవత్సరంలో 9 లక్షల 33 వేల భక్తులు అంతరాలయం దర్శించుకున్నారు. 2015-16 సంవత్సరంలో 100రూపాయల టికెట్‌ ధరపై 9కోట్ల 6లక్షల 32వేల 200 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరంలో 9 లక్షల 6వేల మంది భక్తులు అంతరాలయాన్ని దర్శించుకున్నారు. దర్శనం టికెట్ల ధర పెరగడం వల్ల భక్తుల సంఖ్య అమాంతం తగ్గిపోయింది. దసరా సమయం దగ్గరపడుతుండడంతో పాలకమండలి ప్రతిపాదనలపై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ ప్రతిపాదనలపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనొ పాత టికెట్ల ధరనే కొనసాగించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

08:17 - September 14, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ మహానగరం శివార్లలోని అమీన్‌పూర్ గుట్టల్లో దారుణహత్యకు గురయిన ఇంటర్ స్టూడెంట్‌ చాందినీ జైన్‌ కేసులో మిస్టరీ వీడింది....ఆమె చిన్ననాటి స్నేహితుడు సాయికిరణ్‌ హత్య చేసినట్లు తేలింది... అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ఆధారాలతో సహా సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు... చాందిని,సాయికిరణ్‌లు క్లాస్‌మేట్స్‌ కావడంతో పాటు చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు...వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగానే ఉన్నా ఈ మధ్యకాలంలో చాందిని మరో ఇద్దరు అబ్బాయిలతో క్లోజ్‌గా ఉండడం సహించలేకపోయాడు సాయికిరణ్..ఇదే విషయంలో ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి.

ఆవేశంతో చంపేశాడు...
మాట్లాడుకుందామంటూ గుట్ట ప్రాంతాల్లోకి తీసుకువెళ్లిన సాయికిరణ్ ఆవేశంతో అక్కడే ఆమెను చంపేశాడు.మియాపూర్‌ మదీనాగూడలోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సాయికిరణ్‌, అదే ప్రాంతంలోని సత్యనారాయణ ఎన్‌క్లేవ్‌కు చెందిన హోల్‌సేల్‌ వస్త్ర వ్యాపారి కిషోర్‌జైన్‌ కుమార్తె చాందిని జైన్‌లు ఇద్దరూ చిన్ననాటి మిత్రులే...కలిసి చదువుకునే వీరిద్దరి మధ్య ఎంతో స్నేహం ఉంది...అయితే ఇంటర్ చదువుతున్న చాందిని సోషల్‌ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది..దీంతోనే ఆమెకు ఎందరో అపరిచిత యువకులతో స్నేహం ఉంది...ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సాయికిరణ్, చాందినీల మధ్య చిన్న చిన్న గొడవలు పెరిగాయి...దీంతోనే ఈ నెల 9న సాయంత్రం 5 గంటల సమయంలో బయటకు తీసుకువెళ్లిన సాయి కిరణ్ గుట్టల్లో చంపేశాడు.. అయితే ఈ హత్యానంతరం సాయికిరణ్‌ ఏమాత్రం జంకలేదు...నేరుగా చాందినీ ఇంటికి వచ్చాడు...ఆ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో మాట్లాడి వెళ్లాడు.

సీసీ ఫుటేజీ బయటకు తీసుకురావడంతో
ఇదిలా ఉండగా చాందిని మిస్సింగ్ ఫిర్యాదు చేశారు ఆమె కుటుంబీకులు..ఆ తర్వాత గాలించారు...తనకు మాత్రం ఏమీ తెలియనట్లుగా ఉన్న సాయికిరణ్‌ ఏ మాత్రం జంకలేదు...ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాడు...ఈ లోగా చాందిని డెడ్‌బాడి మూడు రోజుల తర్వాత బయటపడ్డప్పుడు కూడా బెదరని సాయికిరణ్ తనకేం తెలియనట్లేఉన్నాడు...ఇక పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేసి సీసీ ఫుటేజీ బయటకు తీసుకురావడంతో పాటు..అందులో సాయికిరణ్‌ను గుర్తించినా తనకు సంబంధం లేదని బుకాయించాడు...ఆ తర్వాత బయటపడింది.ఇక పోలీసులు సేకరించిన సీసీ ఫుటేజీలో సాయికిరణ్‌గా గుర్తించారు...ఈ విషయాన్ని సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే తాను ఆ సమయంలో క్రికెట్ ఆడుతున్నట్లు చెప్పాడు..పోలీసు బృందం ఆ గ్రౌండ్ ప్రాంతానికి వెళ్లి ఆరా తీస్తే సాయికిరణ్ అబద్దం చెప్పాడని తేలింది...దీంతో కిరణ్ తండ్రికి చూపించడంతో సీసీ కెమెరా ఫుటేజీలోఉన్నది తన కొడుకేనని తేల్చాడు..దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే విషయం చెప్పాడు..తానే చాందినీని చంపేశానని చెప్పడంతో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

08:16 - September 14, 2017

గుంటూరు : రాజధాని నిర్మాణం, వివిధ సంస్థల ఏర్పాటుకై 12,444.89 హెక్టార్ల అటవీ భూమిని డీనోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. అయితే రాజధానికి అవసరమయ్యే అటవీ భూమిని డీనోటిఫై చేసేందుకు కేంద్రం ఎఫ్‌ఎసీ ఆధ్వర్యంలో డెహ్రడూన్‌ ఎపిసిసిఎఫ్‌ ఎస్‌.హెచ్‌ అజయ్‌ కుమార్‌ చైర్మన్‌ కమిటీని వేసింది. విజయవాడ, అమరావతి, గుంటూరు ప్రాంతాల్లో జూన్‌ నెలలో ఈ కమిటీ పర్యటించింది. రాజధాని నిర్మాణం కోసం అవసరమైతే డీగ్రేడెడ్‌ అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేయాలని విభజన చట్టంలో పేర్కొన్నారు.. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధాని అభివృద్ధి పనులు, పలు సంస్థల ఏర్పాటుకు గాను పలు షరతులపై రెండు గ్రామాల్లో 2087.09 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేసేందుకు సూత్ర ప్రాయంగా అంగీకరించింది. తాడేపల్లిలో 251.77 హెక్టార్లు, వెంకటాయపాలెంలోని 1835.32 హెక్టార్ల రిజర్వ్‌ ఫారెస్ట్‌లో రాజధాని నిర్మాణంలో భాగమైన సంస్థలను ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించడంతో ఆ మేరకు అంగీకారం తెలిపింది. మిగిలిన 10,355.08 హెక్టార్ల డీనోటిఫికేషన్‌ కోసం సవివరంగా ప్రాజెక్ట్‌ నివేదిక పంపాలని స్పష్టం చేసింది.

షరతులతో అంగీకారం
రాజధాని నిర్మాణ ప్రాంత పరిధిలోకి తాడేపల్లి వస్తున్నందున అక్కడి అటవీ ేప్రాంతాన్ని డీనోటిఫై చేసేందుకు ఒప్పుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు, భద్రతా దళాల శిక్షణ కోసం ఏర్పాటు చేసే స్టేట్‌ పోలీస్‌, గ్రేహౌండ్స్‌, మిలటరీ స్టేషన్‌, వాటర్‌ సర్వైవల్‌ ట్రైనింగ్‌ ఫెసిలిటీ, కేంద్ర కారాగారం, రైల్వే అకాడమీ, సీఆర్పీఎఫ్‌ వంటి సంస్థల ఏర్పాటుకు వెంకటాయపాలెం అటవీ భూమిని డీనోటిఫై చేసేందుకు షరతులను విధిస్తూ అంగీకరించింది. డీనోటిఫై చేసేందుకు అంగీకరించిన భూమిలో 60 శాతం పచ్చదనం ఉండేలా చూడాలి. ప్రాజెక్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేసి నివేదికను కేంద్రానికి పంపాలని తెలిపింది. వాణిజ్య, నివాసిత ప్రాంతాలకు, అపార్ట్‌మెంట్‌, షాపింగ్‌ మాల్స్‌, స్టార్‌ హోటళ్లు డీనోటిఫై చేసిన అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయకూడదని .. కేవలం ప్రభుత్వ భవనాలకు సబంధించిన నిర్మాణాలను మాత్రమే చేపట్టాలని కేంద్రం తెలిపింది.మొత్తం మీద రాజధాని అభివృద్ధి కోసం 2087.09 హెక్టార్ల అటవీ భూమిని కేంద్రం డీనోటిఫై చేయడంతో మార్గం సుగమం అయ్యింది.అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రొవిజన్‌ వెట్‌ ల్యాండ్‌ 2010, 2016 నది పరిరక్షణ నిబందనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. 

08:15 - September 14, 2017

కృష్ణా : మావన నాగరికతకు మూలాధారమైన నదులు అంతరించి పోతున్నాయని.. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఇపుడు మానవాళిపై ఉందన్నారు ఈశాఫౌండేషన్‌ వ్యవస్థాపకులు జగ్గీవాసుదేవ్‌. దేశవ్యాప్తంగా చేపట్టిన ర్యాలీఫర్‌ రివర్స్‌ కార్యక్రమం విజయవాడలో ఉత్సాహంగా జరిగింది. నదులు అంతరించి పోతుండటం.. ప్రపంచానికి పెనువిపత్తును తెచ్చిపెడుతుందని జగ్గీవాసుదేవ్‌ అన్నారు. గత 25 ఏళ్లుగా దేశంలో నదులు స్వరూపం కోల్పోతున్నాయని.. ఫలితంగా భవిష్యత్తులో తాగునీరు కూడా కరువయ్యే పరిస్థితులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా అందరూ మేల్కొని.. నదులను కాపాడుకోడానికి నడుం బిగించాలన్నారు. తల్లి జీవితాన్ని ఇస్తే.. నదులు సర్వస్వాన్ని ఇస్తాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నదుల్ని వారసత్వ సంపదగా గుర్తించి కాపాడుకోవాలన్నారు. ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి తాను సంపూర్ణ సహకారాలు అందిస్తానని చంద్రబాబు తెలిపారు. ర్యాలీఫర్‌ రివర్స్‌ కార్యక్రమంలో జగ్గీవాసుదేవ్‌, సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. సభలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

08:13 - September 14, 2017

మహబూబ్ నగర్ : ల్లాలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హోరాహోరీగా జరుగుతుంటాయి. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా జరుగుతున్న రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ పదవికి పోటీ నెలకొంది. భవిష్యత్ ఎన్నికల సందర్భంగా ఈ పదవి నియామకంపై పలు రకాల సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. తమ అనుచరులకు పదవి దక్కించుకోవడం ద్వారా నియోజకవర్గాల్లో పట్టు బిగించాలని ఎమ్మెల్యేలు ఆశిస్తుంటే ..ఈ సారైనా తమకు ఛాన్స్ ఇవ్వకపోతారా..అన్న ధీమాలో అని సీనియర్లు ఉన్నారు. నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పదవి దక్కితే ఆయా వర్గాలకు దగ్గరవ్వాలనే వ్యూహంతో ఎమ్మెల్యేలు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ విధేయత, సామాజిక వర్గాల ప్రాధాన్యం ప్రభుత్వ విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడమనే అంశాల ఆధారంగా కోఆర్డినేటర్‌ నియామకం ఉంటుందని టీఆర్‌ఎస్‌ వర్గాల నుండి సంకేతాలు వస్తున్నాయి.

అధ్యక్ష పదవి రేసులో
అధ్యక్ష పదవి రేసులో జిల్లా మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస గౌడ్‌, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎస్‌ రాజేందర్‌ రెడ్డి, సి రామ్మోహన్‌ రెడ్డిలు ఉన్నారు. ఇక కోఆర్డినేటర్ పదవి కోసం.. గతంలో నియోజకవర్గ ఇంచార్జ్‌గా పని చేసిన వారు మొదలుకొని రెండో స్థాయి నేతలు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మఖ్తల్ నియోజకవర్గం నుండి గతంలో నియోజకవర్గ ఇంచార్జ్‌గా పనిచేసిన దేవర మల్లప్ప, మహబూబ్‌ నగర్‌ నియోజకవర్గం నుండి బోయిన్‌ పల్లి శ్యాంసుందర్‌ రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గం నుండి బస్వరాజ్‌, మఖ్తల్‌ నుండి మాజీ ఎంపీపీ వెంకట్రామి రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

బలమైన అభ్యర్ధులకు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాలను కంచుకోటలుగా తీర్చిదిద్దుకునేందుకు తమ పరిధిలో బలమైన అభ్యర్ధులకు పదవిని ఇప్పించుకోవాలనే ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల వ్యూహాలు ఇలా ఉంటే గతంలో పార్టీ కోసం ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన వారికి ఈ సారైనా అవకాశం ఇస్తారనే నమ్మకంతో సీనియర్లు ఉన్నారు. మొత్తంగా జిల్లాలో రైతు సమన్వయ సమితి పదవికి పోటీ నెలకొన్నందున అభ్యర్ధి ఎంపికపై ఆలోచించాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది. ఓవైపు జోగుళాంబ గద్వాల్ జిల్లా...గ్రామాల్లో సమన్వయ కమిటీల గొడవ నడుస్తోంది. గద్వాల నియోజకవర్గంలో ఎంపిక ప్రక్రియ ముగిసినా అలంపూర్‌లో మాత్రం అడుగు ముందుకు పడలేదు. నాయకుల మధ్య వున్న విభేదాల వల్ల ఒక్క కమిటీ కూడా పూర్తి కాలేదు. తమ వారికే అవకాశం ఇవ్వాలని నేతలు పోటీ పడుతుండడంతో కమిటీల ఎంపిక నాయకులకు తలనొప్పిగా మారింది. ఏదేమైనా రెండు రోజుల్లో కమిటీ ఎంపిక పూర్తి చేస్తామని మాజీ ఎంపి జగన్నాథం చెబుతున్నారు. అధ్యక్ష పదవికి సీతారాం రెడ్డి, గట్టు తిమ్మప్ప, టీఆర్‌ఎస్‌ పార్టీ గద్వాల్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ కృష్ణ మోహన్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండారి భాస్కర్‌ తల్లి బండారి దేవమ్మ పోటీలో నిలిచే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జోగులాంబ గద్వాలలో కోఆర్డినేటర్‌ పదవి ఎవరిని వరిస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

సెల్‌ టవర్‌ ఎక్కిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త
నాగర్‌ కర్నూల్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు తన నియోజక వర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా రైతు సమన్వయ కమిటీలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే మఖ్తల్‌ నియోజక వర్గంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఏకంగా సెల్‌ టవర్‌ ఎక్కి కమిటీలో తనను ఎంపిక చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఎన్నో సంవత్సరాల నుండి టీఆర్‌ఎస్‌ పార్టీలో పని చేసినా స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి తనకు సరైన గుర్తింపు ఇవ్వడంలేదని అసంతృప్తితో ఉన్నారు. ఇలా రైతు సమన్వయ సమితి కమిటీ ఎంపిక ప్రభావం పార్టీపై తీవ్రంగా వుంది. సొంత పార్టీ నేతల ఒత్తిళ్లు ఓవైపు... ప్రతిపక్షాల నుండి వస్తున్న విమర్శలు మరోవైపు... దీంతో అధికార పార్టీ నేతలకు ఇదో పెద్ద సమస్యగా మారిందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కమిటీకి అభ్యర్థులను ఎవరిని ఎంపిక చేస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

08:11 - September 14, 2017

గుంటూరు : ఏపీ ప్రభుత్వం విద్యుత్‌ చార్జీల వడ్డణ నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించింది. పరిశ్రమల నుంచి గృహ విద్యుత్ అవసరాల వరకు విద్యుత్‌ చార్జీల భారం ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో విద్యుత్‌శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. చార్జీల పెంపు గురించి ఆలోచించకుండా మరింత చవకైన విద్యుత్‌ సరఫరా చేసే అంశంపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. వ్యయ భారం తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు క్రమంగా నిలిపివేయాలని ఆదేశించారు.

ఏపీడిస్కంకు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా
2016-17 ఆర్ధిక సంవత్సరంలో ఏపీడిస్కంకు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా వుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఆదాయం 25,290 కోట్లు రాగా, రూ. 27,621 కోట్ల వ్యయమైందని.. 2,331 కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పారు. విద్యుత్ శాఖలో సేవలను ఇకపై ఔట్‌సోర్సింగ్ విధానంలో తీసుకోవాలని, డిమాండ్-సప్లయ్ ఆధారంగానే సబ్ స్టేషన్లు, ఇతర మౌలిక వసతుల కల్పన జరగాలన్నారు సీఎం. ఆక్వారంగంతో సహా అన్నింటా విద్యుత్ వినియోగంలో పొదుపు చర్యలు తీసుకోవాలని సూచించారు. వినియోగదారులను వివిధ వర్గాలుగా విభజించి సేవలు సమర్థవంతంగా అందించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు బకాయిపడ్డ విద్యుత్ బిల్లులను తక్షణమే చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సోలార్ పంపుసెట్లు అమర్చడం
రాష్ట్రంలో వ్యవసాయానికి సోలార్ పంపుసెట్లు అమర్చడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయొచ్చని ఏపీ సీఎం తెలిపారు. 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో 400 మెగావాట్ల వరకు సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. వ్యవసాయ అవసరాలకు పోగా మిగిలిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడం ద్వారా రైతులు ఆర్థికంగా లబ్ది పొందవచ్చన్నారు. రాష్ట్రంలో 2.16 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను, విద్యుత్ ఆదా చేసే 2.55 లక్షల ఫ్యాన్లను, 17,779 ట్యూబ్‌లైట్లను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా 15 వేల సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేశామన్నారు. సౌర-పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఉత్పత్తి పెద్దఎత్తున జరిగేలా చూడాలని, రాష్ట్రంలో విద్యుత్ నిల్వ సామర్ధ్య వ్యవస్థ నెలకొల్పడం ద్వారా వ్యయభారం గణనీయంగా తగ్గించుకోవచ్చని సీఎం తెలిపారు. మొత్తంగా విద్యుత్‌ చార్జీలు పెంచబోమని సీఎం ప్రకటించడంపై ఏపీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  

08:09 - September 14, 2017

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలును సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. కారాగార స్థలమే కాకుండా చుట్టూరా మరో 20 ఎకరాల స్థలంలో వివిధ తోటలు కూడా ఉన్నాయి. అయితే ఆ స్థలాలన్నీ ప్రజావసరాలకు వినియోగించడంలో భాగంగా.. ఒక స్టేడియాన్ని నిర్మించాలంటూ గతంలో ఎంపీగా పనిచేసిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రతిపాదించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఉండవల్లి ప్రతిపాదనలు ఆచరణరూపం దాల్చడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆతర్వాత అనూహ్యంగా ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ స్టేడియం నిర్మాణం చేయాలన్న ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. నగరం మధ్యలో అలాంటి ప్రయత్నాలు చేయకూడదంటూ ఆందోళన నిర్వహించింది.

నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఇప్పుడు
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఇప్పుడు అధికారపక్షంలో కూర్చొంది. నేతల తీరులోనూ మార్పు వచ్చింది. నాడు స్టేడియం నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారే ఇప్పుడు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్టేడియం నిర్మాణం ప్రతిపాదనలు ముందుకు తీసుకురావడంతో మరోసారి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు భూములపై మరోసారి చర్చ మొదలైంది. స్టేడియం నిర్మాణంతోపాటూ కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా జైలు స్థలంలోనే నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. వాస్తవానికి జైలు స్థలాన్ని ఇతర అవసరాలకు వినియోగించాలన్న ప్రతిపాదనలపై గతంలోనే జైళ్లశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పెద్దల ప్రయత్నాలకు సహకరించకపోవడంతో అప్పట్లో ప్రతిపాదనలకు ఆటంకాలు ఏర్పడ్డాయి.

నాటి ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు...
అయితే ఇప్పుడు మరోసారి అదే అంశం ముందుకురావడంతో నాటి ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. తాము పేదల ప్రయోజనాల కోసం ప్రతిపాదన చేస్తే కాదని... ఇప్పుడు కన్వెన్షన్‌ సెంటర్ల పేరుతో కార్పొరేట్‌ ప్రయోజనాలు నెరవేర్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కుడి ఎడమైనట్టు ఒకప్పుడు వ్యతిరేకించిన వారే ఇప్పుడు దాన్ని సమర్ధిస్తున్నారు. అప్పుడు సమర్ధించిన వారు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, ప్రతిపక్షంలో మరోమాట మాట చెబుతూ విస్తుగొలుపుతున్నారు. మరి జైలు స్థలాల కథ ఏ మలుపు తీసుకుంటుందో వేచిచూడాలి.

08:08 - September 14, 2017

కరీంనగర్/మంచిర్యాల/భూపాలపల్లి : గులాబీ పార్టీని ఉద్యమ సమయం నుంచి ఆదరించిన ఉత్తర తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంటోంది. వాయిదా పడుతూ వచ్చిన సింగరేణి కాలరీస్‌ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దీంతో రాజకీయ పార్టీల్లో బొగ్గు గనుల రాజకీయ వేడి రగులుతోంది. గులాబీ పార్టీని సింగరేణి ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలు అన్ని దాదాపు ఇప్పటికే ఏకమయ్యాయి. బొగ్గు గనుల ప్రాంతంలో ప్రచారం నిర్వహించేందుకు కార్యాచరణ ప్రకటించాయి.కానీ అధికార పార్టీ నేతలు మాత్రం....అంతర్గత సమావేశాలతోనే ఎన్నికల ప్రణాళికలపై చర్చలు జరుపుతున్నారు.ఉద్యమ సమయంలో కార్మికుల పూర్తి మద్దతును కూడగట్టిన టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఆ స్థాయిలో మద్దతు లభించే అవకాశం లేదన్న అనుమానాలు పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. బొగ్గుగని కార్మిక సంఘంగా కార్మికుల్లో పట్టు సాధించినా.... అధికార పార్టీగా అవతరించిన తర్వాత కార్మికులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ పెద్దగా అమలైన దాఖలు లేవన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు.

వ్యూహాలపై గులాబీ నేతలు మల్లగుల్లాలు
కీలక హామీలు అమలుకు నోచుకోకపోవడంతో సింగరేణి కార్మికులను ఆకట్టుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నాయి. వారసత్వ ఉద్యోగాల కల్పన విషయంలో అధికార పార్టీ నేతలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న ఆందోళన టీఆర్‌ఎస్‌ నేతల్లో కనిపిస్తోంది. దీనికి తోడు ఉద్యమ సమయంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌, అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చినా.....ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోపోవడం వంటి అంశాలు గులాబి నేతలకు కొత్త సమస్యలు సృష్టించే అవకాశాలు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా....ఈ ఎన్నికల్లో తమకే విజయం దక్కుతుందన్న ధీమాను అధికార పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.ప్రతిపక్ష పార్టీలన్నీ మరో కార్మిక సంఘానికి మద్దతు తెలపడంతో ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఉత్కంఠ రేపుతున్నాయి.

08:06 - September 14, 2017

హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన మూడేళ్ల తర్వాత రాష్ట్ర సమాచార కమిషన్‌లో పదవుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ప్రతిపక్ష నేత జానారెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగబద్ధమైన ప్రధాన సమాచార కమిషనర్‌తోపాటు సమాచార కమిషనర్ల ఎంపికకు ప్రతిపక్ష నేత సమ్మతి తప్పనిసారి కావడంతో కమిటీలో జానారెడ్డికి స్థానం కల్పించారు. రాష్ట్ర సమాచార కమిషనర్ల పదవులకు కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్‌ నేతలతోపాటు ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసి రిటైరైన అధికారులు ఈ పదవులు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేసి రిటైరైన రాజా సదారామ్‌ను సమాచార కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రిటైరైన న్యాయమూర్తులతోపాటు ఇద్దరు జర్నలిస్టులు కూడా పదవుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌తోపాటు సభ్యుల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారే. కానీ టీఎస్‌పీఎస్‌సీతో ప్రభుత్వానికి ఆశించిన పేరు రాకపోగా, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందన్న అసంతృప్తితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని సమాచారం. దీంతో సమాచార కమిషనర్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. 

08:05 - September 14, 2017

 

హైదరాబాద్ : భద్రాచలం రామాలయం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. చినజీయర్‌ స్వామి సూచనలకు అనుగుణంగా ఆలయ శిల్పి ఆనందసాయి బృందం రూపొందించిన దివ్యక్షేత్రం నమూనాలను పరిశీలించారు. మార్పులు, చేర్పులపై కేసీఆర్‌ కొన్ని సూచనలు చేశారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రామాలయాన్ని అభివృద్ధి చేస్తారు. దేవాలయ ప్రాంగణంలోనే కల్యాణ మండపం, దుకాణాల సముదాయ, భక్తులు సేదతీరేందుకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తారు. భద్రాద్రి సీతారాములు కల్యాణానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న విషయాన్ని కేసీఆర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలాంటి సమయంలో భక్తులందరికీ సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు.

రైలు మార్గాన్ని భద్రాచలం వరకు
భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తులు గోదావరిలో స్నానం చేసేందుకు అనువైన సౌకర్యలు కల్పించేందుకు చర్యలు చేపడతారు. యాదాద్రి, వేములవాడ తరహాలోనే భద్రాచలం రామాలయానికి కూడా భూములు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాచలం నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలతోపాటు ఏపీలోని అమరావతి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రకు రోడ్డు సౌకర్యం మెరుగుపరచాలని సమీక్షలో నిర్ణయించారు. కొత్తగూడెం వరకు ఉన్న రైలు మార్గాన్ని భద్రాచలం వరకు పొడించాలని కోరుతూ రైల్వే శాఖకు పంపిన ప్రతిపాదన కార్యరూపం దాల్చే విధంగా చర్యలు చేపడతారు. భద్రాచలం-కొత్తగూడెం మధ్య విమానాశ్రయం నిర్మిస్తారు. గోదావరి నదిపై మరో రోడ్డు వంతెన నిర్మించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. గోదావరిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండే విధంగా చూడటంతోపాటు, యాత్రికులు పడవ ప్రయాణం చేసే విధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తలపెట్టింది.

బాసరకు కూడా...
యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తరహాలోనే బాసరకు కూడా స్తపతులన పంపించి జ్ఞానసరస్వతి ఆలయం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కేసీఆర్‌ ఆదేశించారు. మరోవైపు అర్చకుల సమస్యలపై చర్చించేందుకు ఈనెల 15న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అర్చకుల జీతాల పెంపు, చెల్లింపు విధానం, ధూప దీప నైవేధ్యం నిర్వహణ ఎలా ఉండాలన్న అంశాలపై ఆ రోజు అర్చకులతో చర్చిస్తారు. 

07:37 - September 14, 2017

హైదరాబాద్ : జంటనగరాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు డ్నైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రాంతాల్లో మంత్రి పద్మారావుగౌడ్ పర్యటించారు. బాధితులతో మంత్రి మూడు గంటలు ఉండి వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. అధికారులు బాధితులకునివాస, ఆహర ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

జంటనగరాల్లో భారీ వర్షం

హైదరాబాద్ : జంటనగరాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు డ్నైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రాంతాల్లో మంత్రి పద్మారావుగౌడ్ పర్యటించారు. బాధితులతో మంత్రి మూడు గంటలు ఉండి వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. 

07:28 - September 14, 2017

ప్రభుత్వం వేసే కమిటిలు రైతు సమన్వయ కమిటిలు కాదని అవి టీఆర్ఎస్ కమిటిలు అని, ప్రభుత్వం చర్యలతో గ్రామపంచాయతీ అస్థిత్వం కోల్పోయే అవకాశం ఉందని, గతంలో నీటి కమిటిలు, సబ్ స్టేషన్ కమిటిలు ఏర్పాటు అప్పుడు పార్టీలు జోక్యం లేదని, దీనివల్ల రైతులకు లాభం లేదని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. జీవో 39తో టీఆర్ఎస్ ఓ కుటిల యత్నం చేస్తుందని, కమిటిలు వేసి వారికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్ చార్జులుగా నియమించారని, జీవో నెం.39తో పంచాయతీలను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తోందని, 39 జీవో లోపం ఎక్కడ కనిపించిందో చూపించాలని, టీఆర్ఎస్ నేత గోవర్థన్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

Don't Miss