Activities calendar

15 September 2017

22:18 - September 15, 2017
22:17 - September 15, 2017

రాష్ట్ర సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ భేటీ

హైదరాబాద్ : రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా డాక్టర్‌ ఎస్. రాజా సదారాం, కమిషనర్‌గా బుద్దా మురళిని రాష్ట్రప్రభుత్వం నియమించింది. సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ ప్రగతి భవన్‌లో భేటీ అయింది. సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రతిపక్షనేత జానారెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సమాచార ప్రధాన కమిషనర్‌, కమిషనర్‌ ఎంపికపై వీరు చర్చించారు. రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా డాక్టర్‌ ఎస్ రాజా సదారాం, కమిషనర్‌గా బుద్దా మురళిని ఎంపిక చేశారు.. వీరిద్దరి పేర్లను గవర్నర్‌కు పంపగా ఆయన ఆమోద ముద్ర వేశారు. 

 

22:13 - September 15, 2017

హైదరాబాద్ : రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా డాక్టర్‌ ఎస్. రాజా సదారాం, కమిషనర్‌గా బుద్దా మురళిని రాష్ట్రప్రభుత్వం నియమించింది. సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ ప్రగతి భవన్‌లో భేటీ అయింది. సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రతిపక్షనేత జానారెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సమాచార ప్రధాన కమిషనర్‌, కమిషనర్‌ ఎంపికపై వీరు చర్చించారు. రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా డాక్టర్‌ ఎస్ రాజా సదారాం, కమిషనర్‌గా బుద్దా మురళిని ఎంపిక చేశారు.. వీరిద్దరి పేర్లను గవర్నర్‌కు పంపగా ఆయన ఆమోద ముద్ర వేశారు. 

 

22:11 - September 15, 2017

సూర్యపేట : తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రాష్ట్రంలో ప్రజా హక్కులు అణచివేయబడుతున్నాయని విమర్శించారు. ప్రశ్నించిన గొంతులను నొక్కేస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేటలో టీ మాస్ ఫోరం జిల్లా ఆవిర్భావ సభకు తమ్మినేని హాజరయ్యారు. సీఎం కేసీఆర్ పాలనపై గద్దర్‌ రూపొందించిన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి.. 

 

మహిళ హత్యకు కుట్ర

గుంటూరు : ఒక మహిళ హత్యకు కుట్ర పన్నిన వ్యవహారం గుంటూరులో కలకలం రేపింది. చలసాని ఝాన్సీ అనే మహిళను హత్య చేయడానికి శంకర్‌రెడ్డి అనే వ్యక్తి కుట్రపన్నాడు. ఇందుకోసం మొదుగుల విజయ్‌భాస్కర్‌రెడ్డిని పురమాయించాడు. ఒక పిస్టల్‌, బైక్‌ను సమకూర్చి ఝాన్సీని చంపాలంటూ సూచించాడు. 

22:08 - September 15, 2017

గుంటూరు : ఒక మహిళ హత్యకు కుట్ర పన్నిన వ్యవహారం గుంటూరులో కలకలం రేపింది. చలసాని ఝాన్సీ అనే మహిళను హత్య చేయడానికి శంకర్‌రెడ్డి అనే వ్యక్తి కుట్రపన్నాడు. ఇందుకోసం మొదుగుల విజయ్‌భాస్కర్‌రెడ్డిని పురమాయించాడు. ఒక పిస్టల్‌, బైక్‌ను సమకూర్చి ఝాన్సీని చంపాలంటూ సూచించాడు. ఆమెను చంపకపోతే.. నిన్ను హతమారుస్తానని మొదుగుల విజయ్‌భాస్కర్‌రెడ్డిని శంకర్‌రెడ్డి బెదిరించినట్టు సమాచారం. ఈ వ్యవహారంతో భయపడిన విజయ్‌భాస్కర్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. ఝాన్సీ హత్యకు కుట్ర చేశారన్న అభియోగాలతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. 

 

22:06 - September 15, 2017

బిగ్ బాస్ ప్రిన్స్ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిగ్ బాస్ షో గురించి మాట్లాడారు. షోలో జరిగిన పలు ఆసక్తిరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:51 - September 15, 2017

ముస్తాబైన టెన్ టీవీ బత్కమ్మ పాట, మళ్ల నెంబర్ వన్ అయిన తెలంగాణ, తిరుమల ఎంకన్న పాదాల కాడ పాపం
ట్విట్లర్ల గప్పాలు గొట్టుకుంటున్నమంత్రి... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం..

21:47 - September 15, 2017

కమెడియన్ నుండి హీరోగా మారి రెండు హిట్స్ కొట్టిన సునిల్ ఆ తరువాత మాత్రం వరుస డిసాస్టర్స్ తో ఆడియన్స్ ను నిరాశ పరిచాడు అందుకే ఈ సారి తన మూసా కామెడీకి బిన్నంగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసే క్రాంతి మాధవ్ తో కలిసి ఉంగరాల రాంబాబు సినిమా చేశాడు. ట్రైలర్ తో కాస్తా ఆసక్తిని రేకెత్తించిన ఉంగరాల రాంబాబు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా హీరోగా సునిల్ కి మరో సక్సెస్ ను అందించిందా లేదా.. క్రాంతి మాధవ్ చేసిన ఈ డిఫ్రెంట్ మూవీ ప్రేక్షకులను నవ్వించిందా.. లేదా అనేది చూద్దాం..
కథ...      
కథ విషయానికి వస్తే వందల కోట్ల జంమిందారు మనవడు అయిన రాంబాబు చిన్న తనం నుండి తాత పెంపకంలో గారాబంగా పెరుగుతాడు.. ఆ తరువాత తాత చనిపోవడంతో ఆయన చేసిన అప్పులకు ఆస్తంతా కోల్పోయి రోడ్డున పడతాడు ఆ స్టేజ్ లో బాదం బాబ ఇచ్చిన సలహాతో అనుకోకుండా కోటీశ్వరుడు అవుతాడు.. అదే టైంలో సావిత్రితో ప్రేమలో పడతాడు.. కాని ఆమె కేరళాకు చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు నాయర్ కూతురు కావడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్ళి చేసుకోమంటుంది.. దాంతో కేరళా వెళ్ళిన రాంబాబు నాయర్ ను ఎలా కన్విన్స్ చేశాడు. నాయర్ పెట్టిన ట్విస్ట్ లు ఎలా పాస్ అయ్యాడు.. చివరికి తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే.. 
నటీనటులు
నటీనటుల విషయానికి వస్తే తన డైలాగ్ డెలివరీతో బాడీ లాంగ్వేజ్ తో కితకితలు పెటే సత్తా ఉన్న సునిల్ ఈ సారి కొంచెం డిఫెరంట్ గా ట్రై చేశాడు.. సెంటి మెంట్ వాల్యూస్ ఉన్న కథను ఎంచుకుని తనలోని మరో కోణాని ఆవిష్కరించాలని చూశాడు.. తనకు అలవాటు అయిన కామెడీని పర్వాలేదు అనిపించేలా చేసిన సునిల్ మిగతా విషయాల్లో మాత్రం బాగా తడబడ్డాడు.. మళ్లీ కమెడియన్ గా టర్న్ తీసుకోవాలి అని డిసైడ్ అవ్వడంతో ఫిట్ నెస్ ను కూడా పక్కన పెట్టాడు..  డాన్స్ లుతో మాత్రం ఎప్పటి లాగానే మెప్పించగలిగాడు. ఇక హీరోయిన్ మీరా  జార్జ్ డీసెంట్ లుక్స్ తో చూడటానికి బాగుంది ఆమె పాత్రకి సరైన వెయిట్ లేకపోవడంతో ఆమె నటించడానికి కూడా పెద్దగా స్కోప్ దక్కలేదు.. సినిమా మెత్తాన్ని డామినేట్ చేసి కాస్తో కూస్తో పర్వాలేదు అనిపించాడు టాలెంటెడ్ యాక్టర్ ప్రకాశ్ రాజ్.. కమ్యూనిస్ట్ గా ఆయన క్యారక్టరైజేషన్, ఆయన పలికిన డైలాగ్స్ బాగానే కుదిరాయి.. ఇక వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి నవ్వించడానికి బాగా కష్టపడ్డారు కాని అది కొంత వరకు మాత్రమే వర్కౌట్ అయింది. మిగతా నటీనటులు అంతా తమ పాత్ర పరిది మేరకు నటించారు.. 
ఇక టెక్నీషియన్స్ 
ఇక టెక్నీషియన్స్ విషయానకి వస్తే స్టోరీ స్క్రీన్ ప్లే డైరక్ష అని క్రాంతి మాధవ్ పేరు పడగానే ఒక మంచి ఎంటర్ టైనర్, మెసేజ్ ఓరియంటడ్  మూవీని ఆశిస్తారు అంతా.. కాని కథ దగ్గర నుండి   స్క్రీన్ ప్లే దగ్గర నుండి డైరక్షన్ వరకు ఏ ఒక్క విభాగంలో తన ముద్ర చూపించుకోలేక పోయాడు క్రాంతి మాధవ్. పది నిమిషాలకొక కొత్త ఎలిమెంట్ సినిమాలోకి వచ్చినప్పటికి ఏది కూడా కథతో కలిసి నడవలేదు.. పైగా అనుకున్నంత రేంజ్ లో కామెడీ వర్కౌట్ అవ్వకపోవడంతో భారంగా నడిచింది సినిమా. ఇటు సునిల్  సినిమా లాగా, అటు క్రాంతి మాధవ్ సినిమా లాగా కాకుండా అస్త వ్యస్తంగా తయారు అయ్యింది.. సెకండ్ ఆఫ్ లో కూడా.. ప్రకాశ్ రాజ్ క్యారక్టర్ లో సరైన బ్యాలస్స్ కుదరకపోవడంతో కథ పూర్తిగా సైడ్ ట్రాక్ అయ్యి.. పాత చింతకాయ పచ్చడిలా మారింది ఈ ఉంగరాల రాంబాబు.. సర్వేశ్ మురారి సినిమాటోగ్రాఫీ పర్వాలేదు అనిపించింది. ఎప్పుడూ ట్రెండీ మ్యూజిక్ అందించే జిబ్రాన్ మనసు పెట్టి సినిమాను చేయలేదు అనే రేంజ్ లో ఉంది మ్యూజిక్ .ఆర్ ఆర్ పెద్ద మైనస్. ప్రొడక్షన్ వాల్యూస్ చెత్తగా ఉన్నాయి. 
 
ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే, రొటీన్ కథతో, అసలు ఆకట్టుకోలేని స్క్రీన్ ప్లే తో ఏ మాత్రం ఇంప్రస్ చేయని డైలాగ్స్ తో అదో రకం సినిమాలా తయారయ్యింది ఉంగరాల రాంబాబు.. అయితే కమ్యూనిజం, హ్యూమనిజం అనే పదాలకు క్రాంతి మాధవ్ ఇచ్చిన డెఫెనిషన్స్ , మరికొన్ని ఫీల్ గుడ్ సీన్స్ మినహాయిస్తే.. ఈ రాంబాబును భరించడం కష్టం.. 
ప్లస్ పాయింట్స్
సునిల్, ప్రకాశ్ రాజ్  నటన
సినిమాటోగ్రాఫీ
మైనస్ పాయింట్స్
నిర్మాణ విలువలు 
ఓల్డ్ ఫార్మెట్ కథ
స్క్రీన్ ప్లే
డెప్త్ లేని డైలాగ్స్ 
వర్కౌట్ అవ్వని కామెడీ..

రేటింగ్ 1/5

మద్యం మత్తులో పోలీసులతో యువకుడి వాగ్వాదం

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లోని కృష్ణానగర్ లో పోలీసులు డ్రండ్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం మత్తులో యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

సీఎం చంద్రబాబుతో సచివాలయ హెచ్ వోడీల భేటీ

గుంటూరు : సీఎం చంద్రబాబుతో సచివాలయ హెచ్ వోడీలు భేటీ అయ్యారు. రేపటి నుంచే బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేయనున్నారు. 

19:35 - September 15, 2017

హైదరాబాద్ : రుణమాఫీ వల్ల రైతులకు బాధలే మిగిలాయన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. ప్రభుత్వ నిర్వాకంతో రైతులకు  బ్యాంకుల్లో రుణం దొరకని పరిస్థితి తలెత్తిందన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతుసమితుల పేరుతో  అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా దేశ వ్యాప్తంగా చేపట్టిన  కిసాన్‌ ముక్తి యాత్ర ఈనెల 16న హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుందన్నారు. కర్షకులను రుణ విముక్తులను చేయడం, గిట్టు బాటు ధర కల్పించాలనే డిమాండ్‌తో  ఈ యాత్ర చేపట్టినట్టు కోదండరాం తెలిపారు. 

19:33 - September 15, 2017

మంచిర్యాల : జిల్లాలోని లక్షెట్టిపేట గురుకుల విద్యార్థిని సాయినిధి ఆత్మహత్యకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి. లక్షెట్టిపేట ఊత్కూర్‌ చౌరస్తా వద్ద విద్యార్థి నాయకులు ధర్నా చేశారు.  ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి.. ప్రాణాలు తీసుకుందని.. విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రిన్సిపాల్‌ కవితను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా.. ఆర్ డీవో శ్యామలాదేవి గురుకుల పాఠశాలను పరిశీలించి... ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

19:30 - September 15, 2017

మేడ్చల్ : జిల్లాలోని కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో కేంద్ర మంత్రి మేనకా గాంధీ పర్యటించారు. జ్యోతిరావు పూలె బీసీ గురుకుల పాఠశాలను సందర్శించారు.. స్కూల్‌లో మొక్కను   నాటారు.. చిన్నారులకు ఆప్యాయంగా పలకరించి పాఠశాలలో వసతులు, విద్యాబోధన, భోజనం వివరాలను అడిగి తెలుసుకున్నారు.. టీచర్లతో కూడా కొద్దిసేపు ముచ్చటించారు..  పాఠశాలను పరిశీలించిన కేంద్ర మంత్రి... స్కూల్‌ అద్భుతంగా పని చేస్తుందని     ప్రశంసించారు.. 

 

19:27 - September 15, 2017

హైదరాబాద్ : దట్టమైన క్యుములోనింబస్‌ మేఘాలు కమ్మేయడంతో జంటనగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్‌లలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. రెండోరోజు భారీగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు మరోసారి జలమయం అయ్యాయి. సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్, కుకట్‌పల్లి, మెహిదీపట్నం, మణికొండ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. నగరంలోని కొన్ని ప్రాంతాలు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో అంధకారంలో మగ్గిపోయాయి. ఆదివారం వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

19:25 - September 15, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ బైసాన్‌ పోలో గ్రౌండ్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బైసాన్‌ పోలో గ్రౌండ్‌లో నిరసన తెలిపేందుకు చేరుకున్న యూత్‌ కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. యూత్‌ కాంగ్రెస్‌ నేతలు  సికింద్రాబాద్ టీవోలి థియేటర్ వద్ద నుంచి బైసాన్‌ పోలో గ్రౌండ్ చేరుకునేందుకు ప్రయత్నించారు. అయితే ర్యాలీగా బయలు దేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురు మధ్య తోపులాట జరిగింది. 

 

19:12 - September 15, 2017

యాదాద్రి : మదర్‌ డైరీకి సరఫరా చేస్తున్న పాలకు లీటర్‌కు నాలుగు రూపాయల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలంటూ యాదాద్రి జిల్లా భువనగిరిలో రైతులు చలో ప్రగతి భవన్‌ చేపట్టారు. ఈ నిరసనకు సీపీఎం, ఆ పార్టీ అనుబంధ సంఘాలు, రైతు సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, యువ తెలంగాణ అధినేత జిట్టా బాలకృష్ణా రెడ్డి మద్దతు పలికారు. విజయ డైరీలో చెల్లిస్తున్నట్లుగా పాడి రైతులకు ప్రోత్సాహకం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. నిరసనలో భాగంగా వినాయక నగర్‌ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరిన సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌తో పాటు పాడి రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.. 

19:09 - September 15, 2017

హైదరాబాద్ : వంద రోజుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ను డల్లాస్‌, ఇస్తాంబుల్‌ చేస్తామన్న మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఎక్కడకు పోయారని ప్రశ్నించారు... మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ. కేటీఆర్ ను ఫేక్‌ రావ్‌ అంటూ విమర్శించిన షబ్బీర్‌ అలీ....   ఆయనకు అవార్డులు తీసుకోవడం మీదున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని మండిపడ్డారు.

 

19:06 - September 15, 2017

హైదరాబాద్ : రైతులు, దళితులు, గిరిజనుల సమస్యల పరిష్కారమే అజెండాగా 100 రోజుల ఇందిరమ్మ రైతుబాట కార్యక్రమం చేపడుతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈనెల 18 నుంచి అవగాహన సదస్సుల ద్వారా.. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై రైతులు, ప్రజలకు సహకారం అందిస్తామని చెప్పారు. దళితులు, గిరిజనులకు కేసీఆర్‌ సర్కార్ ఇస్తామన్న 3 ఎకరాల భూమి.. ఇప్పటివరకు ఒకశాతం కూడా ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ రైతుబాట కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించి.. అర్హులైన వారికి భూములు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. 

 

19:02 - September 15, 2017

కరీంనగర్ : తెలంగాణ అంతటా భూమి రికార్డుల ప్రక్షాళన ప్రారంభమైంది. కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామంలో.. మంత్రి ఈటెల రాజేందర్‌ పాల్గొన్నారు. తెలంగాణలో తాతలకు భూములుంటే వాళ్ల వారసులకు వచ్చేవని.. భూ రికార్డులు ఉండేవి కాదని మంత్రి చెప్పారు. అప్పట్లో సమస్యలను గ్రామాల్లోనే పరిష్కరించుకునేవారని.. ఇప్పుడు భూ తగాదాలు వస్తే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. అందుకే భూమి ప్రక్షాళన కార్యక్రమంతో ప్రతీ గ్రామంలో సర్వే చేసి పరిశీలించి.. వివరాలు రికార్డుల్లో భద్రపరచాలని మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. 

 

18:59 - September 15, 2017

హైదరాబాద్ : దేవాలయాల్లో అధికారులు, అర్చకులకు వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేలు అమలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్‌.  హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో అర్చకులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ప్రస్తుతం 1805 ఆలయాల్లో అమలవుతున్న ధూపదీప నైవేద్య పథకాన్ని మరో 3వేల దేవాలయాలకు విస్తరిస్తామన్నారు. ఆలయాల నిర్వహణ అంశాలను పర్యవేక్షించడానికి కొత్తగా ధార్మికపరిషత్‌ను ఏర్పాటు చేస్తామన్ని కేసీఆర్‌ ప్రకటించారు. 

 

18:53 - September 15, 2017

తమిళనాడు : రాజకీయాలపై కమల్‌హాసల్‌ మళ్లీ స్పందించారు. త్వరలోనే రాజకీయాల్లోకి రావడమే కాకుండా.. ఏకంగా సొంత పార్టీనే పెడతానని ట్వీటారు. రోజుకో వార్తను ట్వీట్ చేస్తూ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఓటు వేసే అధికారంతో పాటు.. తిరస్కరించే హక్కు మీకే అంటోన్న లోకనాయకుడి రాజకీయ అరంగేట్రంపై ఓ స్టోరీ. 
తమిళ రాజకీయాల్లో సినీ గ్లామర్ 
తమిళ రాజకీయాల్లో సినీ గ్లామర్ ఏళ్ల తరబడి నడుస్తున్న చరిత్రే. అయితే ఎంజీఆర్‌, కరుణానిధి, జయలలితల తర్వాత.. సినీ గ్లామర్ ద్రవిడ పార్టీల్లో పెద్దగా పని చేయలేదు. ద్రవిడ సిద్ధాంతాలు, తమిళ భాష, స్థానికతపైనే గత 40 ఏళ్లుగా తమిళ రాజకీయాలు ముందుకు సాగుతున్నాయి. అయితే జయలలిత మరణం, కరుణానిధి వయోభారం ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో అస్థిరత ఏర్పడేలా చేసింది. 
రాజకీయ రంగ ప్రవేశానికి సినీ గ్లామర్ కారణం 
సినీ గ్లామర్ రాజకీయ రంగ ప్రవేశానికి కారణమవుతోంది. నిశ్శబ్ధంగా మారిన తమిళ రాజకీయాల్లో సినీ గ్లామర్‌ రాజకీయ రంగ ప్రవేశానికి కారణమవుతోంది.  ప్రస్తుత పరిస్థితుల్లో సినీ గ్లామర్ ఎంతవరకు పని చేస్తుందో తెలుసుకునేందుకు.. బడా తారలు దారులు వెతుకుతున్నారు. నిన్న రజనీకాంత్, నేడు కమల్ హాసన్.. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. 
ఈ తారలకు అది సాధ్యమేనా? 
ఒకరు మాస్‌, మరొకరు క్లాస్‌. ఇద్దరూ ఏసీ గదుల్లో జీవించేవాళ్లే. మరి రాజకీయాల్లోకి వస్తే.. గ్రామీణ ప్రాతాలకు తిరగాలి. మట్టివాసన తెలియాలి. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకోవాలి. అట్టడుగు వర్గాలతో మమేకం కావాలనే వాస్తవికత తెలియాలి. మరి ఈ తారలకు అది సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
పార్టీ పెట్టబోతున్నానని ట్వీట్  
జయలలిత మృతి చెందినప్పటి నుంచి కమల్‌హాసన్‌ అధికార పార్టీ, ప్రతిపక్షాలపై సెటైర్లు వేస్తూ.. చివరకు రాజకీయాల్లోకి తాను వస్తున్నానేమో అనేశాడు. ఇక డిఎంకెనా, కమ్యూనిస్టు పార్టీలోకా అని వస్తున్న వార్తలకు కమల్‌ ఫుల్‌ స్టాప్ పెట్టారు. ఏకంగా పార్టీనే పెట్టబోతున్నానని ట్వీట్టర్‌లో తెలిపారు. రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ హడావిడి చేసి సైలెంట్ అయిన రజనీకాంత్‌ని పక్కన పెడితే.. సొంత పార్టీ పెడతా.. మార్పునకు సిద్ధంగా ఉండండంటూ ట్వీట్లు చేస్తున్న కమల్‌హాసన్.. నిజంగానే రాజకీయాల్లోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. 

 

18:48 - September 15, 2017

కరీంనగర్‌ : పాలక సంస్థ చుట్టూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయాలు తిరుగుతున్నాయి. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ జాబితాలో చోటు దక్కించుకున్న తరువాత నేతల మధ్య ప్రచ్చన్న యుద్ధం మొదలైంది. అభివృద్ధి మాటేమో గానీ.. వచ్చిన 100 కోట్ల నిధుల కోసం పంచాయితీ జరుగుతోంది. ఈ క్రమంలో మహిళా కార్పొరేటర్‌ తమ వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే అడ్డు పడుతున్నాడంటూ.. పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. ప్రస్తుత కార్పొరేటర్ల పంచాయితీ ఎంపీ వినోద్‌కుమార్‌ టేబుల్ వద్దకు చేరింది. 
ఎమ్మెల్యే, మేయర్‌ల మధ్య విబేధాలు 
కరీంగనర్ మున్సిపల్ కార్పొరేషన్ పదవీకాలం పూర్తయ్యి మూడేళ్లు గడిచింది. కరీంనగర్‌ స్మార్ట్ సిటీ హోదాకు సెలెక్ట్‌ అయ్యింది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మేయర్ రవీందర్‌ సింగ్‌ల మధ్య విబేధాలు భగ్గుమన్నాయని వార్తలొచ్చాయి. ఆ సమయంలో ఎవరికి వారు అదేమీ లేదని దాటవేశారు. అయితే నగర కార్పొరేటర్‌గా 30వ డివిజన్ నుంచి ఎన్నికైన మహిళ జయశ్రీ.. ఆమె ఆవేదనను మీడియా సమావేశంలో చెప్పారు. 
కార్పొరేటర్‌ రాజీనామా
తమను ఎమ్మెల్యే చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించి.. జయ శ్రీ కార్పొరేటర్‌ పదవికి రాజీనామాను ఇచ్చారు. నిధులు కేటాయించడంలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఎమ్మెల్యే వైఖరి వల్లే తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. కార్పొరేటర్ రాజీనామా చేయడం ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం.. తమకు బాధగా ఉందని డిప్యూటీ మేయర్‌ గుగ్గిల్లపు రమేశ్ చెప్పారు. జయ శ్రీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పనులు అంచనాల దశలో ఉండగానే ఇలా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
నేను ఎవ్వరినీ చిన్నచూపు చూడలేదన్న గంగుల
తాను ఎవ్వరినీ చిన్నచూపు చూడలేదని.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వివరణ ఇచ్చారు. పూర్తి విచారణ జరిపి అధిష్టానం ఏ చర్యనైనా తీసుకోవచ్చని.. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. 
జరుగుతున్న పరిణామాలపై స్పందించని మేయర్ రవీందర్ 
అయితే జరుగుతున్న పరిణామాలపై స్పందించడానికి మేయర్ రవీందర్‌ సుముఖంగా లేరు. సీఎం కేసీఆర్‌ ప్రకటించినట్టు కరీంనగర్‌ను లండన్‌, ప్యారిస్, డల్లాస్‌లాగా మార్చాల్సిన సమయంలో.. ఇంటిపోరుతో గులాబీ పార్టీ పరేషాన్ అవుతోంది. 

 

ప్రముఖ కార్టూనిస్టు మోహన్ మృతి

హైదరాబాద్ : ప్రముఖ కార్టూనిస్టు మోహన్ మృతి చెందారు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

17:55 - September 15, 2017

విజయవాడ : సొంతగూడు కట్టుకోవడం పేద, మధ్యతరగతి వారికి ఇక కలేనా? జీఎస్టీ ప్రభావంతో రోజు రోజుకు పెరుగుతున్న సిమెంట్, ఐరన్ ధరలు అందుకు కారణమా? వ్యవసాయ రంగాన్ని వదులుకుని భవన నిర్మాణ రంగానికి వచ్చిన కార్మికుల పరిస్థితి ఏంటి?  ప్రశ్నార్థకంగా మారిన భవన నిర్మాణ రంగంపై టెన్ టీవీ ప్రత్యేక కథనం. 
అమాంతంగా పెరిగిన ఉత్పత్తుల ధరలు
కేంద్రం తెచ్చిన వస్తు సేవల పన్ను ప్రభావం భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. జీఎస్టీ ప్రవేశపెట్టిన వెంటనే సిమెంట్, ఐరన్ ఉత్పత్తి కంపెనీలు ఒక్కసారిగా వాటి ఉత్పత్తుల ధరలను అమాంతంగా పెంచేశాయి. దీంతో భవన నిర్మాణ రంగం కోలుకోలేకుండా ఉంది.  మరోవైపు వ్యవసాయరంగాన్ని కాదనుకుని భవన నిర్మాణ రంగంలోకి వచ్చిన లక్షలాది కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.  
సిమెంట్‌పై 28 శాతం..ఇనుపై 18 శాతం జీఎస్టీ
2017 జులై 1వ తేదీ నుంచి సిమెంట్‌ పై 28 శాతం, ఇనుముపై 18 శాతం జీఎస్టీని తెచ్చారు. అప్పటి నుంచి నెల నెలా సిమెంట్ ధరల పెరుగుతూ పోవడంతో కొనుగోలుదారులపై భారం పడుతోంది. 2017 ఆగస్టు నుంచి కేసీపీ సిమెంట్ బస్తా ధర రూ.336 నుంచి ఒక్కసారిగా రూ.376కు పెరిగింది. దీంతో రూ.40 మేర అదనపు భారం పడింది. జీఎస్టీ దెబ్బకు టన్ను ఐరన్ ధర రూ.42 వేలకు చేరింది. దీంతో భవన నిర్మాణ దారులకు ఇల్లు కట్టుకోవాలంటే పెను భారంగా మారింది. 
జీఎస్టీ ఎఫెక్ట్‌...చాలామంది కోల్పోయిన ఉపాధి
విజయవాడ నగరంలో సుమారు లక్ష మంది వరకూ నిర్మాణరంగంలో ఉపాధి పొందుతున్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గడంతో పట్టణానికి వలస వచ్చిన వీరంతా నిర్మాణరంగ కార్మికులుగా మారి జీవనోపాధి సాగిస్తున్నారు. అయితే జీఎస్టీ ఎఫెక్ట్‌తో ఇప్పుడు వీరిలో చాలామందికి పని లేకుండా పోయింది. దీంతో వీరందరికి దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. ఇక గతం కంటే నిర్మాణ పరమైన ఖర్చులు పెరగడంతో నిర్మాణాలు మొదలుపెట్టేందుకు యజమానులు వెనకడుగు వేస్తున్నారు. కొందరు మధ్యలోనే  నిర్మాణాలను నిలిపివేస్తున్నారు. దీంతో కార్మికులు పనుల్లేక ఆర్ధికంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. వ్యాపారులు సైతం వచ్చిన లాభంలో 28 శాతం ప్రభుత్వానికే జీఎస్టీ చెల్లిస్తుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు. మరోవైపు కార్మికుల పొట్టకొట్టేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ కార్మికుల జీవనోపాధిని దెబ్బ తీస్తోంది. ఇప్పుడు ఎటువైపు వెళ్లాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలోకి కార్మికులు అల్లాడుతున్నారు. 

17:50 - September 15, 2017

హైదరాబాద్ : దేశ సంపదలో 46శాతం ఆర్య వైశ్యుల చేతుల్లోనే ఉందని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య అన్నారు. ఆర్య వైశ్య సత్రాలు బ్లాక్‌ మనీ కేంద్రాలని ఆరోపించారు. ఆర్య వైశ్యుల పరిశ్రమలు, వ్యాపారాల్లో 5శాతం ఉద్యోగాలు.... వెనక బడిన కులాలవారికివ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడు తన పుస్తకం పేరును సామాజిక సర్వర్లు వైశ్యులుగా మార్చుతానని సవాల్‌ విసిరారు. బీజేపీకి ఆర్యవైశ్యులు ఇస్తున్న విరాళంలో ఐదు శాతం రైతులకిస్తే అన్నదాతల ఆత్మహత్యలు ఉండవని ఐలయ్య చెప్పుకొచ్చారు.

 

ముగిసిన సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ భేటీ

హైదరాబాద్ : సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ భేటీ ముగిసింది. ప్రధాన సమాచార కమిషనర్ తోపాటు ఇతర కమిషనర్ల ఎంపికపై సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మహమూద్ అలీ చర్చించారు. 

 

16:27 - September 15, 2017

అమరావతి భవనాల నిర్మాణంపై ప్రభుత్వం జాప్యం చేస్తోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత సీహెచ్ బాబూరావు, టీడీపీ నాయకులు పట్టాభిరామ్, పాండు రంగారావు పాల్గొని, మాట్లాడారు. భవనాల రీ డిజైన్లతో ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆశలకు తగినట్లుగా రాజధాని అమరావతి నిర్మాణం లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

లండన్‌లో భారీ పేలుడు..పలువురికి గాయాలు

ఇంగ్లండ్ : లండన్‌లోని భూగర్భ రైల్వే మెట్రో స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వెస్ట్‌ లండన్‌లోని పర్సన్స్‌ గ్రీన్‌ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు వెనక ఐసిస్ హస్తమున్నట్లు అనుమానిస్తున్నారు.

 

16:11 - September 15, 2017

ఇంగ్లండ్ : లండన్‌లోని భూగర్భ రైల్వే మెట్రో స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వెస్ట్‌ లండన్‌లోని పర్సన్స్‌ గ్రీన్‌ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టడంతో స్వల్పంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో తాత్కాలికంగా మెట్రో సర్వీసులు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పేలుడు వెనక ఐసిస్ హస్తమున్నట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:08 - September 15, 2017

హైదరాబాద్ : రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల చర్చలు విఫలం దిశగా ముగిశాయి. ఆస్తుల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఉమ్మడిగా ఉన్న 14 ఆస్తుల్లో వాటా ఇవ్వాలని ఏపీ అడుగుతుండగా.. ఒక్క బస్‌భవన్‌లో మాత్రమే వాటా ఇస్తామని తెలంగాణ తేల్చి చెప్పింది. రెండు రాష్ట్రాల అభిప్రాయాలను ఎక్స్‌పోర్ట్‌ కమిటీకి ఉమ్మడి పాలక మండలి నివేదించనుంది. దీనిపై కేంద్రం వేసిన ఎక్స్‌పోర్ట్‌ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:05 - September 15, 2017

కడప : జిల్లాలోని మైలవరం జలాశయంలో కలకలం రేగింది. జలాశయంలో ఒకే కుటుంబానికి చెందిన మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. జలాశయంలో మరో ఇద్దరి మృతదేహాలు ఉన్నట్టు సమాచారం. మృతులు జమ్మలమడుగు మండలం గూడెంకు చెందిన ఆసియా, షమీనాబీ, వాహీదాలుగా గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే హత్యా, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:58 - September 15, 2017

మహిళా వార్తల సమాహారంతో ఇవాళ మీ ముందుకు వచ్చింది. మానవి న్యూస్. ఆడపిల్ల ఈల వేస్తే ఏమౌతుంది..? ఐదేళ్ల వయస్సులో బాణాలు వేస్తున్న చిన్నారి, ఢిల్లీలో వేశ్య గృహాలపై మహిళా కమిషనర్ ఆగ్రహం, సీఎం కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే భార్య ఆత్మహత్యాయత్నం, హీరోయిన్ జ్యోతిక సంచలన వ్యాఖ్యలు, మహిళకు దక్కిన సింగపూర్ అధ్యక్ష పీఠం.. వంటి పలు మహిళ వార్తలపై పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...
 

15:55 - September 15, 2017

హైదరాబాద్ : ఆరోగ్యకరమైన సమాజం కోసం చైతన్యవంతంగా కృషిచేయాలన్నారు స్వచ్ఛ భారత్‌ తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ అక్కినేని అమల. ఈ మేరకు జీహెచ్ ఎంసీ చందానగర్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో మియాపూర్‌ డివిజన్‌ జనప్రియ వెస్ట్‌ సిటీ నందు స్వచ్ఛ బస్తీ పేరుతో ఏర్పాటు చేసిన నూతన కార్యక్రమానికి అమల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులకు గ్లౌజ్‌లు అందజేశారు. కాలనీవాసులతో కలిసి రోడ్లు ఊడ్చారు. గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. అనంతరం వీధి శునకాలను కాలనీ వాసులకు దత్తత ఇచ్చారు. 

 

15:52 - September 15, 2017

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో.. కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌ నీటిమట్టం ఏడు వందల అడుగులైతే.. ప్రస్తుత నీటి మట్టం 699 అడుగులలో ఉంది. జిల్లాలో బోథ్‌, నేరేడిగొండ, కుంటల, ఇంద్రవెళ్లి మండలాల్లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కడెం జలాశయంలోకి ఇన్‌ ఫ్లో 52 వేల క్యూసెక్కులుగా ఉంది. ఇరిగేషన్‌ అధికారులు 5 గేట్లు.. 12 ఫీట్లు ఎత్తి.. 60 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కడెం ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

15:49 - September 15, 2017

హైదరాబాద్ : హయత్‌నగర్‌లో డెకాయిట్‌ ఆపరేషన్‌ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత నెలలో 4 కోట్ల రూపాయల విలువైన సిగరెట్ల కంటైనర్‌ను దొంగిలించిన ముఠాను పట్టుకున్నారు. ముఠా సభ్యులు మధ్యప్రదేశ్‌కు చెందిన కంజర్‌ గ్యాంగ్‌ సభ్యులుగా గుర్తించారు. దేవాస్‌ జిల్లాకు చెందిన రాజన్, మనోజ్ శిశోదియా ప్రధాన సూత్రధారులుగా గ్యాంగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు సీపీ మహేష్‌ భగవత్ తెలిపారు. 

 

15:47 - September 15, 2017

కృష్ణా : విజయవాడలో మద్యం పాలసీకి వ్యతిరేకంగా మహిళలు ఆందోళనకు దిగారు. మద్యం వ్యతిరేక ఐక్య మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జనావాసాల్లో ఉన్న మద్యం షాపులను తొలగించాలని మహిళలు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రధాన ఎజెండాగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తామన్నారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:46 - September 15, 2017

గుంటూరు : నిధులు వెచ్చిస్తే వృద్ధి జరుగుతుందనుకోవడం సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖాధిపతుల సమావేశంలో అన్నారు. సరైన విధానాలను సమర్ధవంతంగా అమలు చేస్తే ఫలితాలు కనిపిస్తాయన్నారు. ప్రభుత్వశాఖలు అమలు చస్తున్న పద్దతులను విశ్లేషించుకోవాలని సూచించారు. జాతీయ స్థాయిలో ఆర్థిక వృద్ధిలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకొని నిలబడగలుగుతున్నామంటే సంపూర్ణంగా దృష్ఠి పెట్టడం, విధివిధానాలను మెరుగుపరుచుకోవడం వల్లే సాధ్యమయిందన్నారు. ఎక్కడా అలసత్వానికి తావేలేకుండా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యలను చేరుకోగలుగుతామని సీఎం అన్నారు. రెండంకెల వృద్ధి సాధించడంలో భాగమైన అందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. 

 

భూముల వేలంపై స్టే ఇవ్వాలని కోరిన తమిళనాడు ప్రభుత్వం

ఢిల్లీ : సదావర్తి భూములపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టులో సదావర్తి భూములపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం పిటిషన్‌లో ప్రస్తావించింది. భూముల వేలంపై స్టే ఇవ్వాలని కోరింది. సదావర్తి భూముల విషయంలో ఏపీకి సంబంధం లేదని.. తమిళనాడు పిటిషన్‌లో వెల్లడించింది. 

 

15:39 - September 15, 2017

ఢిల్లీ : సదావర్తి భూములపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టులో సదావర్తి భూములపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం పిటిషన్‌లో ప్రస్తావించింది. భూముల వేలంపై స్టే ఇవ్వాలని కోరింది. సదావర్తి భూముల విషయంలో ఏపీకి సంబంధం లేదని.. తమిళనాడు పిటిషన్‌లో వెల్లడించింది. 

 

15:33 - September 15, 2017

ఇంగ్లండ్ : లండన్‌ అండర్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. అండర్‌ గ్రౌండ్‌ పార్సన్స్‌ గ్రీన్‌ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

అర్చకులతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో అర్చకులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే అర్చకుకు కూడా పే స్కేల్ ఉంటుందని తెలిపారు. 1805 దేవాలయాల్లో అమలవుతున్న దూప దీప నైవేద్యం, ఆలయాల నిర్వహణకై ధార్మిక పరిషత్ ఏర్పాటు చేశామని చెప్పారు. 

 

ఆర్టీసీ ఆస్తుల పంపకాలపై అసంపూర్తిగా ముగిసిన చర్చలు

విజయవాడ : ఆర్టీసీ ఆస్తుల పంపకాలపై జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఆస్తుల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. 

లండన్ లో భూగర్భ మెట్రో రైల్వేస్టేషన్ లో పేలుడు

ఇంగ్లాండ్ : లండన్ లో భూగర్భ మెట్రో రైల్వేస్టేషన్ లో పేలుడు సంభవించింది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. 

13:43 - September 15, 2017

మెదక్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో మాత్రమే రూపొందించే జర్నల్స్‌ను ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కళాశాల రూపొందించింది. విశ్వవిద్యాలయాలకు మాత్రమే సాధ్యమయ్యే పనిని తామూ చేయగలమంటూ చేసి చూపింది. అంతేకాదు కార్పొరేట్‌ స్కూలు యాజమాన్యాల చేత ఔరా అనిపించింది. ఇంతకీ అది ఏకాలేజీ..? వాచ్‌ దిస్‌ ఇది జహీరాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల. విశ్వవిద్యాలయాలకు తక్కువ కాదంటూ 2014 నుండి జర్నల్స్‌ను రూపొందించి ప్రచురిస్తోంది. ఈ ఏడాది జనవరి 10న కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలోని అధ్యాపకులు పదోన్నతులు పొందడం కోసం, పీహెచ్ డీ పూర్తి చేయడానికి, యూజీసీ గుర్తింపు పొందిన జర్నల్స్‌ను కనీసం రెండు పరిశోధనా పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసమే డిగ్రీ కళాశాల అద్యాపక బృందం నాలుగేళ్ల క్రితం మంజీర జర్నల్స్‌ పేరుతో జర్నల్స్‌ను ప్రారంభించింది.

ఈ జర్నల్స్‌ ప్రతి ఆరు నెలలకు
కళాశాల ప్రారంభించిన ఈ జర్నల్స్‌ ప్రతి ఆరు నెలలకు ఒక సారి ప్రచురితం అవుతాయి. ఇందులో దేశ, విదేశాల్లోని మేధావుల, శాస్త్రవేత్తల, ఆచార్యుల, సామాజిక శాస్త్రవేత్తల పరిశోధన పత్రాలను ప్రచురితం చేస్తున్నారు. దీనికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు రావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాసరాజు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా మంజీరా జర్నల్స్‌ను రూపొందిస్తున్న వీరికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని యూజీసీ గుర్తించి ఒక ప్రత్యేక నంబర్‌ను ఇచ్చింది. అంతేకాదు ఇంటర్నేషనల్‌ స్టాండెడ్‌ సీరియల్‌నంబర్‌ అనే సంస్థ కూడా ఈ జర్నల్‌ను గుర్తించింది. ఇంతటి అరుదైన గౌరవం తమ కళాశాలకు అభించడం ఆనందంగా ఉందని అధ్యాపకులు డాక్టర్‌ మల్లిఖార్జున రావు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ విశ్వవిద్యాలయాలతో సమానంగా
ఇక ఈ కళాశాలలోని విద్యార్థులు కూడా తమ కళాశాల అధ్యాపక బృందం చేస్తున్న కృషిని కొనియాడుతున్నారు. పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు చేసే పనిని మారుమూల ప్రాంత కళాశాల చేస్తున్నందుకు గర్వకారణంగా ఉందని చెబుతున్నారు.జాతీయ విశ్వవిద్యాలయాలతో సమానంగా తమ కళాశాల కూడా ముందుకు సాగుతుందని కళాశాల అధ్యపకులు గర్వపడుతున్నారు. 

13:32 - September 15, 2017

హైదరాబాద్: పసి ప్రాయం నుంచి యవ్వనంలోకి అడుగు పెట్టిన యువత.. తెలిసీ తెలియని వయస్సులో సరి దిద్దుకోలేని తప్పులు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో పబ్‌ కల్చర్‌, డ్రగ్స్‌, గంజాయి వంటి దురలవాట్లు వేళ్లూనుకుపోయాయి. ఇప్పుడు చాందిని కేసులో వెలుగు చూసిన నిజాలు.. పిల్లల తల్లిదండ్రులను ఆలోచనలో పడేస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచకపోతే.. వాళ్లు పతనం అంచుకు ఎలా చేరుతారో చాందిని కేసు ఓ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోందంటున్నారు పోలీసులు. చాందిని మిత్రులు సుమారు 52 మంది.. ఫేస్‌బుక్‌ స్నేహంతో నేషనల్ డిప్లమాటిక్‌ సమ్మిట్ పేరిట ప్రత్యేక పేజీని ప్రారంభించారు. హైదరాబాద్‌, బెంగళూరులోని ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులందరినీ ఇందులో సభ్యులుగా చేర్చుకున్నారు.

52 మంది విద్యార్థినీ, విద్యార్థులు 23 గదులు
ఈ గ్రూప్‌ అంతా కలిసి ఈ నెల 1 నుంచి 3 వరకు లకిడీకపూల్‌లోని.. సెంట్రల్ కోర్టు హోటల్‌లో కలిసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.. మొత్తం 52 మంది విద్యార్థినీ, విద్యార్థులు 23 గదులను బుక్ చేసుకున్నారని, ఇక్కడ చేసిన ఖర్చంతా ఈ 52 మందీ.. తలా కొంత భరించారని పోలీసులు గుర్తించారు. ఈ మూడు రోజులు పిల్లలు ఆడమగా భేదం లేకుండా అంతా కలిసి తోచిన గదుల్లో ఎంజాయ్‌ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మైనర్లని తెలిసినా.. 52 మందీ బస చేసిన హోటల్ యాజమాన్యం వారికి యధేచ్చగా మద్యం కూడా సరఫరా చేసింది. ఇక్కడ బస చేసినప్పుడు, సోహెల్ అనే విద్యార్థితో చాందిని క్లోజ్‌గా మూవ్‌ అవడాన్ని గమనించిన సాయికిరణ్, ఆమెపై అనుమానం పెంచుకున్నాడని.. అదే చాందినిని చంపేలా సాయికిరణ్‌ను పురికొల్పిందని పోలీసులు తేల్చారు. ఇద్దరు ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల మధ్య చిగురించిన ప్రేమకథ చివరకిలా విషాదాంతమైంది. చాందినిని చంపిన సాయికిరణ్‌ జైలు గోడల మధ్య బతకాల్సిన పరిస్థితి వచ్చింది. మరి సాయికిరణ్‌ తల్లిదండ్రులు పరిస్థితేంటి? చెట్టంత ఎదిగిన కొడుకు తమకు భవిష్యత్తులో ఆసరా అవుతాడనుకుంటే.. కళ్ల ముందే హంతకుడిగా ముద్ర వేసుకున్నాడు. అటు చాందిని కూడా తన తల్లిదండ్రుల చెంతకు ఎప్పటికీ తిరిగిరాదు. ఆమె తల్లిదండ్రుల కడుపుకోత ఎన్నటికీ తీరదు.

విద్యార్థుల మనస్సులపై తీవ్ర ప్రభావం
ఫేస్‌బుక్‌, సోషల్ మీడియా మాధ్యమాలు విద్యార్థుల మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చాందిని, సోహెల్‌తో క్లోజ్‌గా ఉండటం, ఫోటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేయడం.. వీటన్నింటినీ గమనించిన సాయికిరణ్ చాందినిని మందలించాడు. అదే క్రమంలో ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. అయితే చాందిని తరచూ పెళ్లి చేసుకోమని వేధించడంతో.. పక్కా ప్లాన్‌తో చంపేశాడని పోలీసుల విచారణలో తేలింది. చాందిని హత్యోదంతం.. విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లలతో ఉండాల్సిన అనుబంధాన్నీ.. వారి నడవడికపై శ్రద్ధ చూపాల్సిన అవసరాన్నీ సుస్పష్టం చేస్తోంది. టీనేజ్‌లో పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. సెల్‌ఫోన్‌, నెట్‌లను పరిమితికి మించి వాడుతున్నా.. డబ్బు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నా వారి ప్రవర్తన మీద ఓ కన్నేసి ఉంచాలి. అప్పుడప్పుడే ప్రపంచం గురించి తెలుసుకునే వయస్సులో.. పిల్లలకు అన్నీ కొత్తగానే కనిపిస్తాయి. ప్రతీది అందంగానే కనిపిస్తుంది. కానీ పక్కనే ప్రమాదం పొంచి ఉంటుందని వాళ్ల చిన్న బుర్రలకు తట్టదు. టీనేజ్‌లో పిల్లలు మంచికైనా, చెడుకైనా త్వరగా ఆకర్షితులవుతారు. మంచి దారిని ఎంచుకుంటే పర్లేదు కానీ చెడు వైపు ఆకర్షితులైతే పిల్లల భవిష్యత్తు ఇలా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే మీ పిల్లలను ఓ కంట కనిపెట్టండి. 

13:14 - September 15, 2017

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. వసతి గృహంలో సరైన నీటి సౌకర్యం లేదని, ఉడకని ఆహారాన్ని అందిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వీసీ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

ఎమ్మెల్యేల తీరుపై కమల్ హసన్ ఆగ్రహం

చెన్నై : తమిళ ఎమ్మెల్యేల తీరుపై కమల్ హస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు రిసార్టుల్లో ఉండడంపై కమల్ పెదవి విరిచారు. ఎమ్మెల్యేలు అమ్ముడుపోయి రిసార్టుల్లో కూర్చుంటే పాలన ఎలా అని ట్వీట్ చేశారు.

13:10 - September 15, 2017

చెన్నై : తమిళ ఎమ్మెల్యేల తీరుపై కమల్ హస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు రిసార్టుల్లో ఉండడంపై కమల్ పెదవి విరిచారు. ఎమ్మెల్యేలు అమ్ముడుపోయి రిసార్టుల్లో కూర్చుంటే పాలన ఎలా అని ట్వీట్ చేశారు. పని చేయకపోతే జీతం లేదనే సూత్రం ఉద్యోగులకేనా..? అని కమల్ ప్రశ్నించారు. మరి బేరసారాలు సాగిస్తూ రిసార్టుల్లో కూర్చనే రాజకీయా నేతల సంగతేంటి, సమ్మె చేస్తున్న ఉపాధ్యాయులను హెచ్చరించిన కోర్టు ఎమ్మెల్యేలను కూడా హెచ్చరించాలని కమల్ అభప్రాయపడ్డారు. కమల్ హసన్ ట్వీట్ తమిళ రాజకీయంలో సంచలనం రేపుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:33 - September 15, 2017

కరీంనగర్ : జిల్లా పోలీసులకు ఆట విడుపు దొరికింది. రోజు వారి విధులకు కాస్తంత విరామం ఇచ్చి.. డీజే సౌండ్ల మధ్య డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇటీవల వరుసగా వచ్చిన పండుగలకు బందోబస్తు నిర్వహించడం ద్వారా.. జిల్లా పోలీసు సిబ్బంది కొంత మానసిక ఒత్తిడికి గురయ్యారు. అందుకే.. వృత్తిపరమైన ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కోసం జిల్లా పోలీస్‌ బాస్‌.. ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి కరీంనగర్‌లోని వి-కన్వెన్షన్ సెంటర్లో కేవలం పోలీసుల కోసమే ఓ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న పోలీసు సిబ్బంది.. ఉత్సాహంతో ఊగిపోయారు.

సినీ నటుడు శివారెడ్డి...
సినీ నటుడు శివారెడ్డితో పాటు, పలువురు ఆర్టిస్టులు, సింగర్లు ప్రదర్శించిన వినోద కార్యక్రమాలు పోలీసులను అలరించగా.. ఆ తర్వాత హోంగార్డుల నుంచి పోలీసు ఉన్నతాధికారుల దాకా స్టేజ్‌ మీదకు వచ్చి డ్యాన్సులు చేస్తూ సందడి చేసారు. తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టారు. అలాగే కొందరు మహిళా పోలీసులు దాండియా ఆడుతూ సందడి చేయగా ఇంకొందరు మహిళా పోలీసులు.. ఓ అడుగు ముందుకేసి డ్యాన్సులు ఇరగదీసారు. ఇటీవల జరిగిన గణేష్ నిమజ్జన వేడుకలు, బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు ఎంతో శ్రమించారని అందుకే.. వారికి ఎంకరేజ్ మెంట్ ఇచ్చేందుకు ఈ ఆటవిడుపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

మానసిక ఆహ్లాదం కోసం..
అన్ని శాఖల సమన్వయ సహకారంతో పండుగలను ప్రశాంతంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని.. అందుకోసమే మానసిక ఆహ్లాదం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. మొత్తమ్మీద ఈ మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమంతో కరీంనగర్‌ పోలీసులు కొత్త జోష్‌ నింపుకున్నారు. తద్వారా.. రాబోయే దేవీ నవరాత్రులు, దసరా పండుగ బందోబస్తుకు సిద్ధమయ్యారు. 

12:31 - September 15, 2017

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సామాన్యునిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు, గ్యాస్‌ ధరలు పెరిగి సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తాజాగా వీటి జాబితాలోకి పెట్రోల్‌, డీజిల్‌లు వచ్చి చేరాయి. రెండు రోజుల్లోనే కేంద్రం పెట్రోలు లీటరుకు 5 పైసలు, డీజిల్‌ లీటరుకు 3 పైసలు పెంచింది. అంటే వారం రోజుల్లోనే 82 పైసల వరకూ పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. పైసల రూపంలో ధరలను పెంచుతూ వాహనదారులకు అనుమానం రాకుండా ధరలను వడ్డిస్తోంది.

ఐదురోజుల్లో 5 సార్లు పావలా చొప్పున
కేంద్రం పెట్రోల్‌పై ఐదురోజుల్లో 5 సార్లు పావలా చొప్పున ధరలను పెంచుతూ వచ్చింది. దీంతో 72 రూపాయల 40 పైసలు ఉన్న పెట్రోల్‌ ధర 74 రూపాయల 54 పైసలకు పెరిగింది. ఇక డీజిల్‌పై 82 పైసలు పెరగ్గా గురువారానికి డీజిల్‌ ధర 63 రూపాయల 82 పైసలకు చేరింది. బాదుతున్నట్లు తెలియకుండానే... పెరుగుతూ పోతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కేంద్రం ఓ ప్రణాళిక లేకుండా పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెంచుతూ పోతుంటే తమపై తీవ్ర ప్రభావం ఉంటుందంటున్నారు. ఒక్కసారిగా రూపాయల్లో ధరలు పెంచితే ప్రజలు వ్యతిరేకిస్తారని భావించిన కేంద్రం ఈ రకంగా దొంగదెబ్బ తీస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.

వాహనదారుల ఆవేదన...
ఇక పెరిగిన స్పీడ్‌ పెట్రోల్‌ వాల్యూమ్‌ ధరలు వాహనదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. స్పీడ్‌ పెట్రోల్ ధర పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దాటేసింది. వాస్తవంగా స్పీడ్‌ పెట్రోల్‌ ధర 74 రూపాయల 30 పైసలుగా ఉంది. అయితే పెరిగిన ధరలతో 77 రూపాయల 30 పైసలైంది. దీంతో వాహనదారుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల రోజువారీ హెచ్చుతగ్గుల పట్ల అటు, పెట్రోలు బంకుల యజమానులూ అసంతృప్తినే వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కూడా తాము ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నామన్న భావన ఉందని.. ఫిక్స్‌డ్‌ రేట్లే మెరుగని అంటున్నారు. మెల్లిగా పెరుగుతోన్న పెట్రోల్‌ ధరలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇదే పరిస్థితి గనక కొనసాగితే ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే ప్రమాదం ఉంది. 

12:24 - September 15, 2017

కరీంనగర్ : జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో మంత్రి ఈటల జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగరేశారు. జాతీయ గీతం ఆలాపన కార్యక్రమానికి హాజరైన ఈటల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే జెండా తలక్రిందులు కావడాన్ని గమనించిన సీపీ కమలాన్ రెడ్డి జెండాను క్రిందకు దించి సరిచేసి తిరిగి ఆవిష్కరించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే జాతీయ జెండాకు అవమానం జరిగిందని స్ధానికులు మండిపడుతున్నారు. 

12:23 - September 15, 2017

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కిషన్‌ గూడ వద్ద ఆర్డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నిబంధనలు విరుద్ధంగా నడుపుతున్న 5 ప్రైవేటు వాహనాలపై కేసులు నమోదు చేశారు. 

12:22 - September 15, 2017

కర్నూలు : జిల్లా పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామం వద్ద హంద్రీవాగు పొంగిపొర్లడంతో అర్ధరాత్రి నుండి వాహనాలు భారీగా నిలిచిపోయాయి. బెంగుళూరు నుండి మంత్రాలయం వెళ్లే వాహనాల్లోని ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వాగు ఉధృతికి లారీ నీటిలో నిలిచిపోవడంతో లారీలో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌లు రాత్రంతా లారీలోనే ఉండిపోయారు. చిన్నహుల్తి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు డ్రైవర్‌, క్లీనర్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. ప్రజలు ఇంత అవస్థలు పడుతున్నా ఇంతవరకు అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని బాధితులు వాపోతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:09 - September 15, 2017

కడప : జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని విద్యార్థుల నిరసన చేస్తున్నారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించి మెస్ ల వద్ద బైఠాయించారు. మెస్ కాంట్రాక్ట్ దసరా తర్వాత వెరె వారికి ఇచ్చి నాణ్యమైన ఆహారం అందేల చూస్తామని అధికారులు తెలపడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

ఛలో ప్రగతి భవన్ మదర్ డైరీ రైతుల పిలుపు

యాదాద్రి : నేడు ఛలో ప్రగతి భవన్ కు మదర్ డైరీ రైతులు పిలుపునిచ్చారు. లీటర్ రూ.4 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ వారు ఛలో ప్రగతి భవన్ కు పిలుపునిచ్చారు. వీరికి యువ తెలంగాణ అధ్యక్షుడు జిట్టా మద్దతు తెలిపారు. 

హెచ్ఓడీలతో సీఎం చంద్రబాబు సమావేశం

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖధిపతులతో సమావేశం కానున్నారు. మార్నింగ్ సెషన్ లో తొలి త్రైమాసిక ప్రగతి లక్ష్యాలపై చర్చ జరపనున్నారు. కేంద్ర కేటాయింపలపై సీఎస్, ప్రణాళిక కార్యదర్శి, ఆర్ధిక కార్యదర్శి ప్రసంగాలు చేస్తారు. సమాజ వికాసం, కుటుంబ వికాసం తదితర అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేయనున్నారు.

మరోసారి క్షిపణి పరీక్ష జరిపిన ఉత్తరకొరియా

ఉత్తరకొరియా : దేశం మరోసారి క్షిపణి ప్రయోగం చేసింది. జపాన్ మీదుగా మరో మిస్సైల్ ప్రయోగం చేసినట్టు తెలుస్తోంది. కొరియా నెల రోజుల్లో రెండోసారి క్షిపణి ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం ప్యాంగ్యాంగ్ నుంచి ప్రయోగించారు. 770కి.మీ ఎత్తులో 3,700 కి.మీ దూరం లో ఈ ప్రయోగం జరిపారు.

11:24 - September 15, 2017

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖధిపతులతో సమావేశం కానున్నారు. మార్నింగ్ సెషన్ లో తొలి త్రైమాసిక ప్రగతి లక్ష్యాలపై చర్చ జరపనున్నారు. కేంద్ర కేటాయింపలపై సీఎస్, ప్రణాళిక కార్యదర్శి, ఆర్ధిక కార్యదర్శి ప్రసంగాలు చేస్తారు. సమాజ వికాసం, కుటుంబ వికాసం తదితర అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేయనున్నారు. 80 శాతం సంతృప్త ఫలితాల సాధనకు అనుసరించాల్సిన కార్య ప్రణాళికపై ఆర్టీజీ ప్రెజంటేషన్ ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

11:19 - September 15, 2017
11:16 - September 15, 2017

ఉత్తరకొరియా : దేశం మరోసారి క్షిపణి ప్రయోగం చేసింది. జపాన్ మీదుగా మరో మిస్సైల్ ప్రయోగం చేసినట్టు తెలుస్తోంది. కొరియా నెల రోజుల్లో రెండోసారి క్షిపణి ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం ప్యాంగ్యాంగ్ నుంచి ప్రయోగించారు. 770కి.మీ ఎత్తులో 3,700 కి.మీ దూరం లో ఈ ప్రయోగం జరిపారు. మిస్సైల్ జపాన్ ఉత్తర భాగంలోని హోకైడో మీదుగా ఫసిఫిక్ సముద్రంలో పడింది. జపాన్, దక్షణ కొరియాలు ప్రయోగం జరిగిందని ధృవిరించాయి. ఉత్తరకొరియా చర్యలను జపాన్ ప్రధాని ఫింజో అబె ఖండించారు. ఉత్తరకొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుంటు ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడయో క్లిక్ చేయండి.

 

రామగుండంలో రోడ్డు ప్రమాదం

కరీంనగర్/పెద్దపల్లి : జిల్లా రామగుండంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీపవర్ హౌస్ వద్ద ఓ కారు స్కూల్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు. 

పశ్చిమగోదావరిలో గంజాయి పట్టివేత

పశ్చిమగోదావరి : జిల్లాలో గంజాయి పడ్డుబడింది. దేవరపల్లి లో కంటైనర్ గంజాయిని తరలిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ గంజాయి విశాఖ నుంచి హర్యానాకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. 

10:26 - September 15, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో గంజాయి పడ్డుబడింది. దేవరపల్లి లో కంటైనర్ గంజాయిని తరలిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ గంజాయి విశాఖ నుంచి హర్యానాకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కంటైనర్ డ్రైవర్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

10:11 - September 15, 2017
10:09 - September 15, 2017

హైదరాబాద్ : నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం వరకు వర్షాటు కురిసే అవకాశలు ఉన్నాయిని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:14 - September 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద సర్వేకు సిద్ధమైంది. నేటి నుంచి తెలంగాణలో సమగ్ర భూ సర్వే ప్రారంభం కానుంది. ఇప్పటికే 1346 సర్వే బృందాలు గ్రామాలకు వెళ్లాయి. వారు ఇంటింటికి తిరిగి భూవివరాలు సేకరించరున్నారు. ఒక్క ఊర్లో 10 రోజులు, మొత్తం 100 రోజులు సర్వే నిర్వహించనున్నారు. రికార్డుల అప్ డేట్ తర్వాత అత్యంత భద్రతతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సర్వేకు రైతుల సమన్వయ సమితులు సహకారం అందించనున్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు గ్రామాల్లో పర్యటించి భూ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

నేటి నుంచి తెలంగాణలో భూసర్వే

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద సర్వేకు సిద్ధమైంది. నేటి నుంచి తెలంగాణలో సమగ్ర భూ సర్వే ప్రారంభం కానుంది. ఇప్పటికే 1346 సర్వే బృందాలు గ్రామాలకు వెళ్లాయి. వారు ఇంటింటికి తిరిగి భూవివరాలు సేకరించరున్నారు. ఒక్క ఊర్లో 10 రోజులు, మొత్తం 100 రోజులు సర్వే నిర్వహించనున్నారు. రికార్డుల అప్ డేట్ తర్వాత అత్యంత భద్రతతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది.

09:06 - September 15, 2017

భద్రాది కొత్తగూడెం : జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురైయ్యాడు. అన్నపురెడ్డి మండలం ఎర్రగుంటలో దారుణంగా కాంగ్రెస్ నేత శ్రీనివాసరావును దారుణంగా నరికి చంపారు. ఈ హత్య చేసింది ప్రత్యర్థులు అని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

కాంగ్రెస్ నేత దారుణ హత్య

భద్రాది కొత్తగూడెం : జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురైయ్యాడు. అన్నపురెడ్డి మండలం ఎర్రగుంటలో దారుణంగా కాంగ్రెస్ నేత శ్రీనివాసరావును దారుణంగా నరికి చంపారు. ఈ హత్య చేసింది ప్రత్యర్థులు అని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

08:42 - September 15, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా పినపాక పట్టినగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక ఎమ్మెల్యే సాయం వెంకటేశ్వర్లు కారు, ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో సాయం వెంట్వేర్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఎమ్మెల్యే సాయంవెంకటేశ్వర్లకు తప్పిన ప్రమాదం

 

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా పినపాక పట్టినగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక ఎమ్మెల్యే సాయం వెంకటేశ్వర్లు కారు, ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో సాయం వెంట్వేర్లకు స్వల్ప గాయాలయ్యాయి. 

08:28 - September 15, 2017

హైదరాబాద్ : నగరంలో భారీ వర్షం కురిసింది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం వరకు వర్షాలు కురిసే అవకాశలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

కాల్పుల విరమణ ఉల్లఘించిన పాక్

శ్రీనగర్ : పాక్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లఘించింది. జమ్మూలోని ఆర్నియాలో పాక్ సైన్యం భారత సైన్యంపై కాల్పులు జరిపింది. కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందాడు.

నేడు తెలంగాణ మేనకాగాంధీ పర్యటన

హైదరాబాద్ : నేడు తెలంగాణలో కేంద్రమంత్రి మేనకాగాంధీ పర్యటించనున్నారు. కీసరలోని జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియ్ స్కూల్ ను ఆమె సందర్శించనున్నారు.

08:12 - September 15, 2017

నల్లగొండ : అమెరికాలో జాత్యహంకారానికి బలైన కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్య మరచిపోక ముందే కాన్సాస్‌లో మరో దారుణం జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని సీతారాంపురంకు చెందిన వైద్యుడు అచ్యుత్‌రెడ్డి హత్యకు గురయ్యాడు. కాన్సాస్‌ రాష్ట్రంలోని విచితలో డాక్టర్‌ అచ్యుత్‌రెడ్డి నిర్వహిస్తున్న హోలిస్టిక్‌ క్లినిక్‌లోనే ఈ దారుణం జరిగింది. చికత్సి కోసం వచ్చిన రోగే అచ్యుత్‌రెడ్డిని కత్తితో పొడిచి సంపాడు. అచ్యుత్‌రెడ్డి ప్రాథమిక విద్య నుంచి ఇంటర్‌ వరకు మిర్యాలగూడలోనే చదివాడు. హైదరాబాద్‌ ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో 1986లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి, అక్కడ సైకియాట్రీ చేశారు. 1989 నుంచి కాన్సాస్‌లోని విచితలో హోలిస్టిక్‌ క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న క్లినిక్‌కు వచ్చిన ఒక వ్యక్తి డాక్టర్‌ అచ్చుత్‌రెడ్డితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో కోద్రిక్తుడైన ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తినీ తీసుకుని అచ్యుత్‌రెడ్డిని పొడిచాడు. దీంతో అచ్యుత్‌రెడ్డి రక్తమడుగులోపడి విలవిలాకొట్టుకుని అక్కడికక్కడే ప్రాణాలు విడిశాడు. నిందితుణ్ని కాన్సాస్‌ పోలీసులు అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విషాదంలో కుటుంబ సభ్యులు
అచ్యుత్‌రెడ్డిక భార్య బీనారెడ్డి, పిల్లలు రాధ, లక్ష్మి, విష్ణు ఉన్నారు. తల్లిదండ్రలు, భద్రారెడ్డి పారిజాత మిర్యాలగూడలో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న అచ్యుత్‌రెడ్డి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అచ్యుత్‌రెడ్డి హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

08:11 - September 15, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో వైరల్‌ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. జ్వరం.. జలుబు.. దగ్గు.. గొంతునొప్పి.. వంటి లక్షణాలతో రోగులు ఆస్పత్రుల దగ్గర క్యూలు కడుతున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో జ్వర పీడితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మూడు, నాలుగు నెలల నుంచి లక్ష మందికి పైగా జ్వరంతో ఆస్పత్రికి వచ్చారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ప్రజలు రోగాలతో కునారిల్లుతున్నా.. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. విపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఈ అంశంపై పాలక పక్షంపై దుమ్మెత్తి పోస్తోంది.

ఒకేరోజు నాలుగు వేల మంది రోగులు
గాంధీ ఆస్పత్రికి ఈ నెలలో.. ఒకేరోజు నాలుగు వేల మంది రోగులు వచ్చారని వైద్యులు చెబుతున్నారు. వీరిలో దాదాపు సగం మంది జ్వర లక్షణాలతో బాధపడుతున్నవారేనని వైద్య వర్గాలు చెబుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం మూడు నెలల్లో ఆదిలాబాద్‌ జిల్లాలో 9 వేల 758 మంది వైరల్‌ ఫీవర్ బారినపడ్డారు. ఆసిఫాబాద్‌ కొమురం భీం జిల్లాలో ఏడు వేల 701 మంది, జయశంకర్‌ భూపాలపల్లి లో ఐదు వేల 728మంది, కొత్తగూడెం భద్రాద్రిలో ఆరు వేల 914 మంది, ఖమ్మంలో ఐదు వేల 126 మంది, మంచిర్యాల జిల్లాలో ఆరు వేల 319 మంది, మహబూబాబాద్‌ లో ఎనిమిది వేల 164, నల్గొండలో 9వేల 694 మంది, నిర్మల్‌లో ఐదు వేల 265 మంది, సంగారెడ్డిలో ఏడు వేల 81మంది, సిద్దిపేట్‌ లో ఏడువేల 83మంది, సూర్యాపేట్ లో 6వేల 742 మంది, యాద్రాద్రి జిల్లాలో ఐదు వేల 396 మంది రోగులు ఆస్పత్రులకు వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షా 25వేల 393 మంది జ్వరంతో ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందారు.

వైరల్‌ ఫీవర్స్‌..
వాతావరణంలో చోటుచేసుకుంటున్న విభిన్న మార్పుల కారణంగా వైరల్‌ ఫీవర్స్‌ విజృభిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందడంతో...చాలామంది జలుబు, గొంతునొప్పి, సైనస్, నిమోనియా, ఆస్తమా వంటి వ్యాధులకు గురవుతున్నారని అంటున్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు. రాష్ట్రంలో జ్వర పీడితుల సంఖ్య పెరిగినప్పటికీ ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రం సరైన సదుపాయాలు కనిపించడం లేదు. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.

 

08:09 - September 15, 2017

హైదరాబాద్ : సమీపిస్తోన్న దసరా పండుగ..సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసుల సన్నాహాలు..దోపిడికి తెరలేపిన ప్రైవేటు ట్రావెల్స్‌ ఆపరేటర్లు..దసరా పండుగ సమీపిస్తుండటంతో.. నగరజీవులు.. సొంతూళ్లకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే చాలామంది ఆర్టీసీ, రైల్వే సర్వీసులపై ఆధారపడి టికెట్లు బుక్‌ చేసుకున్నారు. దసరా స్పెషల్‌ సర్వీసుల పేరిట.. ప్రభుత్వరంగ సంస్థలు కూడా సుమారు 50 శాతం అదనంగా చార్జీలు గుంజేస్తున్నాయి. అయినా.. సరే ఎలాగోలా ఊరెళదామనుకున్న వారికి.. చాలా చోట్ల టికెట్లు దొరకని పరిస్థితి ఎదురైంది.

జేబులకు చిల్లులు పడేలా..
ప్రయాణికుల అవసరాలే అదనుగా ప్రయివేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులు దోపిడికి తెరలేపారు. విజయవాడ, గుంటూరు నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్‌ నుంచి విజయవాడ, గుంటూరు అలాగే బెంగుళూరుకి ప్రయాణించే ప్రయాణికుల జేబులకు చిల్లులు పడేలా.. టికెట్‌ ధరలు నిర్ణయిస్తున్నారు. దసరా పండగ సందర్భంగా సాధారణ రోజుల కంటే మూడింతల అధిక ధరకు టికెట్లను అమ్ముతూ ప్రయాణికులను నిలువుదోపిడి చేస్తున్నారు. దసరా సరదాను ప్రజలకు దూరం చేస్తూ.. ప్రైవేటు బస్‌ ఆపరేటర్లు టికెట్ల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేశారు. సాధారణంగా విజయవాడ నుంచి బెంగళూరుకు ఏసీ టిక్కెట్ రూ.1300 ఉండగా, దసరా కావడంతో ఈ నెల 22 నుంచి రూ.3 వేలకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్ కు సాధారణ రోజుల్లో ఏసీ సర్వీసుకు రూ.600లు ఉంగా, రూ.వెయ్యి నుంచి రూ.1500ల వరకు విక్రయిస్తున్నారు. ప్రైవేటు ఆపరేటర్లపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఒక్కో ట్రావెల్స్ సంస్థ ఒక్కో ధరను ప్రకటిస్తోంది. దసరా నవరాత్రులు సెప్టెంబర్ 21 నుంచి 30వ తేదీ వరకూ జరగనున్నాయి. పాఠశాలలకు సెప్టెంబర్ 19 నుంచే సెలవులు ప్రకటించేశారు. దీంతో ప్రజలు ఆ తేదీల్లో టికెట్లు బుక్‌ చేసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని, ప్రత్యేక సర్వీసుల పేరిట ప్రైవేటు టూర్‌ ఆపరేటర్లు టికెట్‌ల పేరిట ప్రరయాణికుల నుంచి వేలాది రూపాయలను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే దసరా పండగ సెలవులు సెప్టెంబర్ 30తో ముగుస్తున్నాయి. అక్టోబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజున ప్రయాణించే వారి నుంచి భారీగా టికెట్‌ ధరలు వసూలు చేసేందుకు ప్రైవేటు ఆపరేటర్లు సన్నాహాలు చేస్తున్నారు.

ఆర్టీసీకి దీటుగా ప్రైవేట్ ట్రావెల్స్
ఆర్టీసీ బస్సులను సైతం తేదీల ప్రాధాన్యాన్నిబట్టి ఏర్పాటు చేస్తున్నా ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ డిమాండ్ తో ఆర్టీసీ బస్ లు సరిపోయే పరిస్థితిలేదు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఆర్టీసీకి దీటుగా కొత్త కొత్త బస్సులను దింపుతున్నాయి. ప్రయాణికులు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. ధరలు ఎక్కువగా చెబుతున్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లను ఆశ్రయిస్తున్నారు. దసరా రోజుల్లో ప్రైవేటు ఆపరేటర్ల దోపిడి నుంచి రక్షించేందుకు.. ఆర్టీసీ, తగినన్ని సర్వీసులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

 

08:08 - September 15, 2017

గుంటూరు : అమరావతిలో నిర్మించతలపెట్టిన ముఖ్య భవనాలకు డిజైన్లను రూపొందిస్తోన్న నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో గురువారం భేటీ అయ్యారు. వారు ప్రదర్శించిన డిజైన్ల తుది రూపును.. సహచర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి మరోసారి పరిశీలించారు. ఈ డిజైన్లపై సీఎం చంద్రబాబు.. సంతృప్తిని వ్యక్తం చేయలేదు. డిజైన్లపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోందని.. నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులకు తెలిపిన సీఎం.. మరికొంత సమయం తీసుకొని అత్యుత్తమమైన డిజైన్లను రూపొందించాలని సూచించారు. నార్మన్‌ సంస్థ ప్రతినిధులు.. ప్రస్తుతం అందించిన డిజైన్లలో కొన్ని అంశాలు బాగున్నా.. బాహ్యరూపం ఆకర్షణీయంగా రాలేదని చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. డిజైన్ల రూపకల్పనకు మరికొంత సమయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులకు సూచించారు.

డైరెక్టర్‌ ఎస్ఎస్‌రాజమౌళితో సంప్రదింపులు
ప్రపంచంలోనే తొలి పది అత్యుత్తమ నిర్మాణాలను స్పూర్తిగా తీసుకొని వాటిని తలదన్నేలా అమరావతి డిజైన్లను రూపొందించాలన్నారు. సీఆర్‌డీఏలో పనిచేస్తున్న ఆర్కిటెక్చర్లు, రాష్ట్రంలో పేరొందిన ఆర్కిటెక్చర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి డిజైన్ల రూపకల్పనలో ఫోస్టర్ బృందానికి సహకరించాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. అమరావతి భవనాల డిజైన్లకు సంబంధించి, తెలుగు మెగా డైరెక్టర్‌ ఎస్ఎస్‌రాజమౌళితో సంప్రదింపులు జరపాలని సిఆర్డీఏ కమిషనర్‌ను సీఎం ఆదేశించారు. అవసరమైతే.. రాజమౌళిని లండన్‌కు పంపి.. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులతో భేటీ ఏర్పాటు చేయాలని సూచించారు. అక్టోబర్‌ 25న లండన్‌ వెళ్లనున్న చంద్రబాబు.. అక్కడే నార్మన్‌ ప్రతినిధుల సరికొత్త ఆకృతులను పరిశీలిస్తానని చెప్పారు. మెరుగైన డిజైన్లను వచ్చే నెలాఖరుకల్లా ఆమోదిస్తామని చంద్రబాబు చెప్పారు. 

08:07 - September 15, 2017

కృష్ణా : విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశానికి అంతా సిద్ధమైంది. ఇవాళ జరిగే కౌల్సిల్‌ భేటీలో ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసి, ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాల అస్త్రశస్త్రాలలో రెడీ అయ్యాయి. గత సమావేశంలో చర్చించి ఆమోదించిన అజెండా అమలుకు నోచుకోని వైనంపై అధికార పక్షాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. నగరంలో అధ్వానంగా మారిన రోడ్లు, అస్తవ్యస్తంగా తయారైన డ్రెయినేజీ వ్యవస్థ, బెజవాడలో ప్రబలుతున్న విషజ్వరాలు, కార్పొరేషన్‌ స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం, టీడీపీ కార్పొరేటర్లపై వస్తున్న అవినీతి ఆరోపణలు వంటి అంశాలపై వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉంది.

26 ఎకరాల భూమిని విదేశీ కంపెనీలకు ధారాదత్తం
వర్షంనీరు సాఫీగా పోయేందుకు మార్గం సుగం చేయాలని నిర్ణయించారు. స్ట్రామ్‌వాటర్‌ డ్రెయిన్ల నిర్మాణానికి 461 కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నా... ఇప్పటి వరకు ఉపయోగించలేదు. ప్రారంభించిన పనులు ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. ప్రతిపక్షంలో ఉండగా కుళాయిలకు నీటి మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ, ఇప్పుడు వీటి ఏర్పాటుకు మొగ్గు చూపడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. విజయవాడలోని 20 ఎకరాల చారిత్రక స్వరాజ్‌ మైదానంతోటు దీని చుట్టూ ఉన్న స్టేట్‌ గెస్ట్‌హౌస్‌, డీజీపీ కార్యాలయం, విద్యుత్‌ ఆఫీసు స్థలాలు కలిపి మొత్తం 26 ఎకరాల భూమిని విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేసే ప్రతిపాదనలను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దాదాపు 1500 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని చైనా కంపెనీకి కట్టపెట్టేందుకు కౌల్సిన్‌కు తెలియకుండా సమగ్ర నివేదిక ఎలా తయారు చేశారన్న అంశంపై అధికార పక్షాన్ని నిలదీయాలని ప్రతిపక్ష కార్పొరేటర్లు నిర్ణయించారు. మరోవైపు అజెండాలోని అంశాలపై చర్చతోపాటు విపక్షాలు లేవనెత్తే అంశాకు దీటుగా జవాబు చెప్పేందుకు అధికార టీడీపీ కూడా సిద్ధమైంది. 

08:00 - September 15, 2017

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ విడిపోయి మూడేళ్లు గడచిపోయింది. ఆర్టీసీ సిబ్బంది విభజన జరిగినా.. ఇంకా సంస్థ ఆస్తుల విభజన కొలిక్కిరాలేదు. దీనిపై ఢిల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు భేటీలు జరిగినా సమస్యల పరిష్కారం కాలేదు. ఎక్కడ ఆస్తులు అక్కడే అన్న విషయంలో సూత్రపాయ అంగీకారానికి వచ్చినా, ఆర్టీసీలోని కొన్ని ఆస్తులను ఉమ్మడి జాబితాలో చేర్చారు. దీంతో బస్‌ భవన్‌తో పాటు మరికొన్ని ఆస్తుల విభజనకు ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఏపీ, తెలంగాణ నిర్ణయించాయి. ఆర్టీసీ ఆస్తుల పంపకాలపై ఇవాళ విజయవాడంలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భేటీలో చర్చించాల్సిన అంశాలపై అధికారులకు దిశా, నిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన విధంగానే ఆర్టీసీ ఆస్తుల పంపకాలు చేసుకోవాల్సి ఉందని సూచించారు. రాష్ట్ర విభజన నిబంధనలే ఆర్టీసీ ఆస్తుల పంపకానికి కూడా వర్తిస్తాయన్న విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చారు. విజయవాడలో జరిగే సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు.

పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు
ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలన్నది తెలంగాణ మౌలిక విధానమని కేసీఆర్‌ గుర్తు చేశారు. దీనికి అనుగుణంగానే విభజన సమస్యలను విజ్ఞతతో పరిష్కరించుకోవాలని సూచించారు. దేశంలో ఇతర రాష్ట్రాలు విడిపోయిన సమయంలో అమలు చేసిన నిబంధనలే ఏపీ విభజనకు కూడా పాటించిన అంశాన్ని సమీక్షలో కేసీఆర్‌ ప్రస్తావించారు. సమస్యలు తలెత్తితే రెండు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు. అలా సాధ్యంకాని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాన్ని తోసిపుచ్చలేమన్న అధికారుల దృష్టికి తెచ్చారు. కేంద్ర స్థాయిలో కూడా పరిష్కారం కాకపోతే ఏంచేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుందన్న అంశాన్ని ప్రస్తావించారు. ఉన్నత విద్యా మండలి ఆస్తుల పంపిణీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్న విషయాన్ని కేసీఆర్‌ ప్రస్తావించారు. పార్లమెంటు చట్టానికి లోబడి పంపకాలు చేసుకోవాలని, ఇందులో ఆర్టీసీ బోర్డులకు ఎలాంటి అధికారం ఉండదని అధికారుల దృష్టికి తెచ్చారు. విజయవాడలో జరిగే సమావేశంలో ఇదే వైఖరి అనుసరించాలని సూచించారు. 

07:59 - September 15, 2017

హైదరాబాద్ : చర్లపల్లిలోని హెచ్‌పీసీఎల్‌ గ్యాస్‌ ఫిల్లింగ్‌ ప్లాంటులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్లలో గ్యాస్‌ నింపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు అంటుకుని సిలిండర్లు వరుసగా పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా భారీ శబ్దాలు మిన్నుముట్టాయి. ఆ సమయంలో ఎక్కువ మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. పేలుడు ధాటికి మంటలు భారీగా ఎగిసిపడటంతో సమీపంలోని కాలనీల ప్రజలు భయపడి భయటకు పరుగులు తీశారు. చిన్నారులు, మహిళలు భయాందోళనతో వణికిపోయారు. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆహాకారాలు, ఆర్తనాదాలు, రోదనలు ఆకాశాన్ని అంటాయి. సిలిండర్లు పేలడంతో హెచ్‌పీసీఎల్‌ గోదాములకు వచ్చే అన్ని రహదారులపై ఐదు కిలో మీటర్ల దూరంలో ట్రాఫిక్‌ను నిలపివేశారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో పక్కనే ఉన్న ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌తోపాటు ఇతర గ్యాస్‌ కంపెనీల కార్మికలను ముందుజాగ్రత్తగా బయటకు పంపారు. మల్లాపూర్‌, అశోక్‌నగర్‌, చెంగిచర్ల, మేడిపల్లి, ఈసీఐఎల్‌, నాచారం ప్రాంతాలపై పేలుడు ప్రభావం అధికంగా ఉండటంతో ప్రజలను ఇళ్ల నుంచి దూరంగా పంపించారు. గ్యాస్‌ వాసనతో శ్వాస పీల్చుకోడానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముందు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

విమానాలు చర్లపల్లి వైపు రాకుండా
సమీపంలోని కంపెనీలను మూసివేశారు. విమానాలు చర్లపల్లి వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని శంషాబాద్‌ విమానాశ్రయ అధికారులను పోలీసులు ఆదేశించారు. రైళ్ల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ ప్రాంతంలో ఐదు వేల అయిల్‌ ట్యాంకర్లు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆరు శకటాలను మంటలను అదుపు చేశారు. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. మంటలను ఆర్పివేసిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. భయంతో దూరంగా వెళ్లి ప్రజలు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌లో లీకేజీని అరికట్టేందుకు వెల్డింగ్‌ చేస్తున్నసమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించిందని హెచ్‌పీసీఎల్‌ కార్మికులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

07:52 - September 15, 2017

తెలంగాణలో కార్మికవర్గం సమ్మెకు సై అంటోంది. ఈ నెల 19న ఒక్కరోజు సమ్మెకు సిఐటియు పిలుపునిచ్చింది. సమానపనికి సమాన వేతనం చెల్లించాలన్నది యూనియన్ డిమాండ్. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చ.తెలంగాణ రాష్ట్రంలో 73 ఎంప్లాయిస్ మెంట్స్ ఉన్నాయని, వాటి జీవోలను ప్రతి ఐదు సంవత్సరాలకు సవరించాలని, ప్రభుత్వం ఇంతరకు దాని గురించి పట్టించుకోవడంలేదని, 2014 డిసెంబర్ వేతన కమిటి వేసిందని, ఆ కమిటి నివేదిక కూడి ఇచ్చిందని కానీ దీనిపై సీఎం కేసీఆర్ సంతకం చేయలేదని సిఐటియు నాయకులు పాలడుగు భాస్కర్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:40 - September 15, 2017

ఇది ప్రభుత్వాల వైఫల్యమని కేంద్రం దీంట్లో జోక్యం చేసుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయించుకోలేకపోయిందని,అటు టీడీపీ బీజేపీతో పొత్తులో ఉంది, ఇటు టీఆర్ఎస్ కూడా బీజేపీకి దగ్గరగా ఉందని, రేపు స్వర్ధ రాజకీయాలు చేయడానికి ఇవి ఇరురాష్ట్రాలకు ఉపయోగపడతాయని, ఎన్నికలప్పడు ప్రజల్లో భవోద్వేగాలు పెంచి లబ్ధిపొందడానికి వారు యత్నిస్తున్నారని నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య అన్నారు. ఎంతో పోరాటం చేసి రాష్ట్రం తెచ్చుకున్నామని, అటువైపు చంద్రబాబు నుంచి సానుకూల నిర్ణయం రావడంలేదని, వారు హైకోర్టు విభజన ఒప్పుకోకపోవడం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు సమరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పిన, వారు రాష్ట్ర విభజనను ఇంక మానసికంగా ఒప్పుకోవడంలేదని టీఆర్ఎస్ నేత రాజమోహన్ అన్నారు. ఈ రోజు అందరు అంగీరించేది విభజన అశాస్త్రీయంగా జరిగిందని, దీనిపై కేంద్రాన్ని కూడా అడగడం జరిగిందని, కేంద్రం రాష్ట్రలు సమరస్యంగా పరిష్కరించుకోవాలని, అవసరమైతే గవర్నర్ సహాయం తీసుకోవాలని అంటున్నారని టీడీపీ నేత రామకృష్ణ ప్రసాద్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.  

07:08 - September 15, 2017
07:07 - September 15, 2017
07:05 - September 15, 2017

నల్లగొండ : జిల్లా ప్రకాశం బజార్ టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ మటన్ మార్కెట్ శంకుస్థాపన చేశారు. ఎంపీ గుత్తాకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

07:04 - September 15, 2017

విజయవాడ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీలను భర్తీ చేస్తామని... ఉద్యోగం రాని యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు.. మూడున్నరేళ్లు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఖాళీలను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా... ఉన్న ఉద్యోగాలను ఎత్తివేసే ప్రయత్నం చేస్తుందన్నారు. వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. 

07:03 - September 15, 2017

విశాఖ : ప్రముఖ జర్నలిస్టు, రచయిత గౌరీ లంకేశ్ హత్యను ఖండిస్తూ విశాఖలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రెస్ క్లబ్‌ నుంచి జీవీఎంపి గాంధీ విగ్రహం వరకూ జరిగిన ర్యాలీలో సీపీఐ, సీపీఎం, వైసిపి, లోక్‌సత్తా నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తూ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. 

07:02 - September 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష వివాదంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. హైకోర్టు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

07:00 - September 15, 2017

వరంగల్ : జిల్లా హసన్ పర్తి మండలం కేశపురానికి చెందిని రవికి స్వైన్ ప్లూ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రవి అనే ఓ వ్యక్తి ఎన్1హెచ్1 వైరస్ లక్షణాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్లూ లక్షనాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రోగికి చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రవికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

06:58 - September 15, 2017

లక్నో : యూపీలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బాగ్ పత్ ప్రాంతంల్నోఇ యమునా నదిలో పడవ బోల్తా పడి 19 మంది జలసమాధి అయ్యారు. మరో 12 మందిని పోలీసులు రక్షించారు. ప్రమాదసమయంలో పడవలో 60 మంది ప్రయాణికులు ప్రయణిస్తున్నారు. ప్రస్తుతం ఇంక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

06:57 - September 15, 2017

కర్నూలు : జిల్లా ఆదోని మండలం దొడ్డినాకెరిలో దారుణం జరిగింది. నాగప్ప అనే వ్యక్తి భార్యను గొడ్డలితో నరికి చంపాడు. తర్వాత ఏడాది వయసున్న కూతురిని గొంతు నులిమి చంపాడు. భార్య కూతురిని చంపిన నాగప్ప తన పొలంలో ఉరి వేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని స్థానికులు అంటున్నారు. మరింత సమాచారం వీడియో క్లిక్ చేయండి.

06:54 - September 15, 2017

అహ్మదాబాద్ : ముంబయి-అహ్మదాబాద్‌ మార్గంలో బుల్లెట్‌ రైలు పనులకు ప్రధాని మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబేలు శంకుస్థాపన చేశారు. 508 కిలోమీటర్ల మేర ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. గతేడాది నవంబర్‌లో మోదీ జపాన్‌ పర్యటనలో భాగంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. భారత్‌లో బుల్లెట్‌ రైలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్న షింబో అబే... భారత్‌ సంబంధాలపై జపాన్‌ ఆధారపడి ఉందన్నారు.

Don't Miss