Activities calendar

16 September 2017

22:23 - September 16, 2017

ఇది ఎందరో జీవితాల వ్యధ... ఎందరో కన్నీళ్ల కథ...తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న మానవ అక్రమరవాణాకు అడ్డులేకుండా పోతోంది. అదే సమయంలో గడప దాటితే చాలు... పంజా విసిరేందుకు ఎదురుచూస్తున్న కళ్లు ఎన్నోఉన్నాయి..మానవ మృగాల బారిన పడిన ఎందరో పడతుల జీవితాలు అగమ్య గోచరంగా మారుతుంది.. ఇదీ కథకాదు..ఏ రియల్ స్టోరీ... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:04 - September 16, 2017

ఢిల్లీ : పెట్రోల్‌, డీజిల ధరల పెంపుపై కేంద్ర పర్యాటక మంత్రి కె.జె అల్ఫోన్స్‌ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయి. ధరల పెరుగుదలను మంత్రి సమర్థించారు. కారు, బైక్‌ ఉన్నవాళ్లే పెట్రోలు కొంటారని...పెట్రోల్‌ కొనేవాళ్లు ఆకలితో మరణించడం లేదని వ్యాఖ్యానించారు. పెట్రోల్‌, డీజిల్‌పై విధించే పన్నుల రాబడిని ప్రభుత్వం అణగారిన వర్గాల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. యూపీఏ పాలనలో ప్రజా ధనాన్ని మంత్రులు, అధికార పార్టీ నేతలు దోచుకున్నారని విమర్శించారు. మోది ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందని అల్ఫోన్స్‌ చెప్పారు. 

 

22:00 - September 16, 2017

హైదరాబాద్ : పరాయి రాష్ట్రం నుంచి పార్టీని నడుపుతున్న జగన్‌కు రాష్ట్రం గురించి ఆలోచించే అర్హత లేదన్నారు ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. సభ్య సమాజం అసహ్యించుకునేలా మాట్లడటం జగన్‌కు, అతని పార్టీ నేతలకు తగదన్నారు. ప్రజా సమస్యలపై జగన్‌కు చిత్తశుద్ధి లేదని ప్రజలు ఇప్పటికే గుర్తించారని.. త్వరలో వైసీపీ బంగాళాఖాతంలో కలవడం ఖాయమన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ భాష మార్చుకోవాలని కాల్వ హెచ్చరించారు. 

21:58 - September 16, 2017

భూపాలపల్లి : జిల్లాలో గుత్తికోయలపై జరిగిన దాడిని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. గిరిజనులకు భూములపై హక్కులను కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదివాసీలపై పాశవికంగా దాడి చేసిన ఫారెస్ట్‌ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:53 - September 16, 2017

భూపాలపల్లి : గుత్తికోయ గూడెంలపై ఫారెస్ట్‌ అధికారులు జులుం ప్రదర్శించారు. పోడు వ్యవసాయం చేస్తున్నారనే నెపంతో వారిపై దాడి చేశారు. గిరిజనుల ఆవాసాలను కూల్చి వేశారు. పంటపొలాలను నాశనం చేశారు. ఆడవాళ్లని కూడా చూడకుండా లాగి పడేసి.. చెట్లకు కట్టేశారు. భూపాలపల్లి జిల్లాలో ఫారెస్ట్‌ అధికారుల దౌర్జన్యంపై టెన్‌ టీవీ స్పెషల్‌ స్టోరీ. 
గిరిజనులపై ఫారెస్ట్‌ అధికారులు దౌర్జన్యం
పోడు వ్యవసాయంతో అడవిని నాశనం చేస్తున్నారనే నెపంతో ఫారెస్ట్‌ అధికారులు, సిబ్బంది గిరిజనులపై దౌర్జన్యం చేశారు. పిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా దాడి చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలం పసర రేంజ్‌ పరిధిలోని జలగలంచ అటవీ ప్రాంతంలో కొంత కాలంగా గుత్తికోయలు ఆవాసాలు ఏర్పరుచుకుని బతుకుతున్నారు. అయితే వీరు పోడు వ్యవసాయం చేసి అడవిలోని చెట్లను నరికివేస్తున్నారనే నెపంతో.. ఫారెస్ట్‌ సిబ్బంది దాడులు నిర్వహించారు. గుత్తికోయల గుడిసెలను కూల్చివేశారు. పంట పొలాలను ధ్వంసం చేశారు. అడ్డుకున్న వారిపై లాఠీచార్జ్‌ చేశారు. మహిళలందరినీ చెట్టుకు కట్టేసి తమ ప్రతాపం చూపించారు. గిరిజనులు కష్టపడి తెచ్చుకున్న వంట పాత్రలను, సరుకులను ట్రాక్టర్‌లో వేసి ఇతర ప్రాంతానికి తరలించారు. అడ్డుకున్న మహిళలను లాగి పడేశారు.
ఎన్నో ఏళ్లుగా గిరిజనులు ఆవాసాలు
గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఆవాసాలు ఏర్పరుచుకుని బతుకుతుంటే వారికి కనీస వసతులైన వసతి, మంచినీరు, విద్య, వైద్యం, విద్యుత్‌ వంటి సదుపాయాలు కల్పించకుండా.. వారిపై దౌర్జన్యానికి దిగారు. బంగారు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే ఇలా ఆదివాసీలపై దాడులు జరగడం అన్ని వర్గాల ప్రజలను కలచివేస్తోంది.  

 

21:46 - September 16, 2017

టీ.కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో టెన్ టివి వన్ టు వన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి.. టీకాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వివాదాస్పద వాఖ్యలు చేశారు. ఉత్తమ్ పై తీవ్ర విమర్శలు చేశారు. పీసీసీ చీఫ్ ప్రెసిడెంట్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్హుడు కాదన్నారు. ఉత్తమ్ కో హఠావో..కాంగ్రెస్ కో బచావో పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లో ఉత్తమ్ ఉంటడనే నమ్మకం లేదని చెప్పారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కు బెదిరి బీఫామ్ లు  క్యాన్సల్ చేసుకున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:40 - September 16, 2017

సింగరేణిల డీలావడ్డ అధికార పార్టీ సంఘం..కవితమ్మ మాటలమీద కార్మికుల కండ్లెర్ర, రైతు సమన్వయ సంఘాలకు కాంగ్రెస్ చెక్..తెరమీదికొచ్చిన రైతు పరిరక్షణ సంఘాలు, వరంగల్ అడవులల గుత్తికోయల గోస...ఒసేయ్ రాములమ్మను తలపిచ్చిన సీన్లు, న్యాయం కోసం రోడ్డెక్కిన న్యాయవాది...నీకే దొరకకపోతే ఇక సమాన్యులకేది, లెక్కలు జెప్పి పరువు తీస్కున్న మంత్రి...చదువురాని సన్నాసి విద్యాశాఖ మంత్రి, రెండు తల్కాయలతో పుట్టిన మేక....బ్రహ్మంగారినే తలచుకుంటున్నరు జనం...ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:22 - September 16, 2017

ఢిల్లీ : ఇన్‌స్టంట్‌ వన్డే, టీ20 ఫార్మాట్లలో తిరుగులేని టీమిండియా సొంతగడ్డపై మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. ఆస్ట్రేలియాతో  5 వన్డేలు, 3 మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌కు కొహ్లీ అండ్‌ కో సై అంటే సై అంటోంది. ఓటమంటూ లేకుండా శ్రీలంక టూర్‌ ముగించిన టీమిండియా... సొంతగడ్డపై ఆస్ట్రేలియాను బ్రౌన్‌ వాష్‌ చేయడమే  లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది.

భారత జట్టు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో అసలు సిసలు సమరానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఇండియాలో ఆస్ట్రేలియా టూర్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఓ వైపు ఇన్‌స్టంట్‌ ఫార్మాట్లలో ఎదురులేని ఇండియా...మరో వైపు పటిష్టమైన ఆస్ట్రేలియా...భారత క్రికెట్‌ అభిమానులకు ఇంతకు మించి కావాల్సిందేముంటుంది.

విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు  స్టీవ్‌స్మిత్‌ సారధ్యంలోని ఆస్ట్రేలియా సవాల్‌ విసురుతోంది. 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో పాటు 3 మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో తలపడేందుకు ఇరు జట్లు ఇప్పటికే పక్కా గేమ్‌ ప్లాన్‌తో సిద్ధమయ్యాయి. సెప్టెంబర్‌ 17న చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా తొలి వన్డేతో ఇండియా-ఆస్ట్రేలియా 5వన్డేల సిరీస్‌ ఆరంభం కానుంది.21న కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌లో 2వ వన్డే జరుగనుంది. 

24న ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం వేదికగా  3వ వన్డే...బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా 4వ వన్డే జరుగనున్నాయి. నాగ్‌పూర్‌లోని విదర్భ స్టేడియంలో  5వ వన్డేకు ఆతిధ్యమివ్వనుంది. అక్టోబర్‌ 7నుండి 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌కు రాంచీలోని జార్ఖండ్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా ఆతిధ్యమివ్వబోతుండగా...10న గువహటీ బర్సాపరా స్టేడియం వేదికగా రెండో టీ20 జరుగనుంది.

ఆఖరి 13న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరుగనున్న 3వ టీ20 మ్యాచ్‌తో ఆస్ట్రేలియా టూర్‌ ముగుస్తుంది. శ్రీలంక టూర్‌లో టెస్ట్‌,వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్‌ స్వీప్‌ చేసిన కొహ్లీ అండ్‌ కో....ఆస్ట్రేలియాపై సైతం ఆధిపత్యం ప్రదర్శించాలని పట్టుదలతో ఉంది. మరి సొంత గడ్డపై తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన టీమిండియా....పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుకు చెక్ పెట్టగలుగుతుందో లేదో చూడాలి.

 

21:14 - September 16, 2017

హైదరాబాద్ : ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో చివరి దశకు చేరుకుంది. షో ముగింపు దగ్గర పడుతున్న కొద్దీ మరింత రసవత్తరంగా సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా మొత్తం 14 మంది పార్టిసిపెంట్స్‌తో మొదలైన షోలో మరో ఇద్దరు పార్టిసిపెంట్స్  వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 10 మంది ఎలిమినేట్ కాగా ప్రస్తుతం ఆరుగురు షోలో ఉన్నారు. అయితే వీరిలో  బిగ్‌ బాస్‌ విన్నర్ ఎవరు? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ..

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 1 క్లైమాక్స్‌కి చేరుకుంది. ఇప్పటికి 60 ఎపిసోడ్‌లను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా 14 మంది కంటెస్టెంట్స్‌తో జూలై 16న ప్రారంభమైన బిగ్ బాస్ జర్నీ 60 ఎపిసోడ్‌కి వచ్చేసరికి కేవలం ఆరుగురు మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వీరిలో నవదీప్, దీక్షలు షో మధ్యలో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటరైనప్పటికీ  మిగిలిన వారికి గట్టి పోటీ ఇస్తున్నారు. 

బిగ్‌బాస్‌ హౌస్‌లో మొదట అర్చన, సమీర్, ముమైత్, ప్రిన్స్, మధుప్రియ, సంపూర్ణేష్‌ బాబు, జ్యోతి, కల్పన, మహేష్ కత్తి, కత్తి కార్తీక, శివబాలాజీ, హరితేజ, ఆదర్శ్‌, ధనరాజ్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో జ్యోతి, సంపూర్ణేష్‌ బాబు, మధు ప్రియ, సమీర్, మహేష్ కత్తి, కల్పన, ధనరాజ్, కత్తి కార్తీక, ముమైత్ ఖాన్, ప్రిన్స్ ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నవదీప్, దీక్ష మిగిలిన కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీ ఇస్తూ గేమ్‌ ఆడుతున్నారు. వారం వారం కెప్టెన్ ని ఎంచుకునే ప్రక్రియ, ఎలిమినేషన్ ప్రక్రియలతో పాటు బిగ్ బాస్ ఇచ్చే రకరకాల టాస్క్‌లతో బిగ్‌ బాస్‌ హౌస్‌ ఉత్కంఠ రేపుతోంది. ఇక వారానికో సెలబ్రిటీ గెస్ట్‌గా వచ్చి బిగ్‌ బాస్ హౌస్‌లో సందడి చేస్తున్నారు. 

చివరి దశలో బిగ్ బాస్ షోను మరింత రక్తి కట్టించేందుకు గేమ్ నిర్వాహకులు కంటెస్టెంట్స్  ఫ్యామిలీలను రంగంలోకి దించారు. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఒక్కొక్క కంటెస్టెంట్స్  ఫ్యామిలీ మెంబర్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ కావడంతో కంటెస్టెంట్స్ అందరూ  తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం బిగ్ బాస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఆదర్శ్ , హరితేజ, శివబాలాజీ, దీక్ష, అర్చన, నవదీప్ టైటిల్ పోరు కోసం హోరా హోరీగా తలపడుతున్నారు. వీరిలో ఈ వారం ఆదర్శ్, హరితేజ, దీక్ష, అర్చన ఎలిమినేషన్‌ ప్రక్రియకి ఎంపికయ్యారు. షో చివరి దశకు చేరేవేళకి.. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌ రూల్స్‌ అతిక్రమించకుండా అందరూ విధిగా పాటిస్తున్నారు. 

బిగ్ బాస్ హౌస్‌లో ఓటింగ్ ప్రక్రియ సైతం రంజుగా సాగుతోంది. ప్రేక్షకులు ఇచ్చే ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతోందని ఎన్టీఆర్ ఇంతకు ముందు చాలా సార్లు చెప్పారు. ప్రతి ఓటును పీడబ్ల్యుసి అనే సంస్థ ద్వారా ఆడిటింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నవదీప్, శివబాలాజీ ఫైనల్‌కి తమ పేరును ఖరారు చేసుకోగా.. ఈ శనివారం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియలో ఆదర్శ్, అర్చన, హరితేజ, దీక్ష ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో? ఎవరు ఫైనల్‌కి చేరతారో? సస్పెన్స్..

ఇప్పటికే ప్రేక్షకుల్లో ఫైనల్ విన్నర్ ఎవరు అనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. హరితేజ, శివబాలాజీల్లో ఒకరని.. నవదీప్, ఆదర్శ్ కావచ్చని.. ఇలా రకరకాల పేర్లు వినబడుతున్నాయి. ఒకరికొకరు గట్టి పోటీ ఇస్తూ.. గేమ్‌ను ఆడుతున్న వీరిలో బిగ్ బాస్ ఫైనల్ విజేత ఎవరన్నది తెలియాలంటే  వచ్చే ఆదివారం వరకూ వెయిట్ చేయాల్సిందే.  

21:09 - September 16, 2017

హైదరాబాద్ : బీసీ కులాల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ భేటీకి మంత్రులు జోగు రామన్న, హరీశ్ రావు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. వెనుకబడిన కులాల వారి జీవితాల్లో వెలుగు రావడం కోసం ప్రభుత్వ కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలని కేసీఆర్ సూచించారు. కుల వృత్తులు లేని వారు, ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్న వారికి తగిన ప్రోత్సాహం అందించాలన్నారు. వారి ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా.. ఏంబీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి లక్ష రూపాయల నుంచి 2 లక్షల ఆర్థిక సాయం అందించాలని కేసీఆర్ సూచించారు. ఏటా 60 నుంచి 70వేల చేతివృత్తి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఏంబీసీ కార్పొరేషన్‌కు ఇకనుంచి ప్రతి ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని కేసీఆర్ తెలిపారు. 

 

21:06 - September 16, 2017

కోల్ కతా : పశ్చిమబెంగాల్‌ లో మమత సర్కార్‌కు చెందిన మంత్రి రవీంద్రనాథ్‌ ఘోష్‌ ఓ ఉద్యోగిపై ప్రతాపం చూపారు.  కూచ్‌ బిహార్‌ జిల్లాలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచి ఉద్యోగిపై ఆగ్రహంతో విరుచుకు పడ్డారు. ఎక్కువ మాట్లాడితే లాగిపెట్టి కొట్టి ఈడ్చి బయటకు గెంటేస్తానంటూ చేయి లేపారు. ఇంతకి ఏం జరిగిందంటే... మంత్రిగారు తన కారులో వెళుతూ గుగుమారి ప్రాంతంలో యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద భారీగా బారులు తీరిన జనాల్ని చూశారు. కారు ఆపి సమస్య ఏంటని వారిని ప్రశ్నించారు. గత 10 రోజులుగా బ్యాంకు కార్యకలాపాలు స్తంభించాయని చెప్పారు. అంతే ఆగ్రహంతో లోనికెళ్లిన ఆయన... దీనికెవరు బాధ్యులని సిబ్బందిని ప్రశ్నించారు. హెడ్‌ ఆఫీస్ అని ఓ ఉద్యోగి సమాధానమిచ్చారు. దీంతో ఆయన నోటికొచ్చినట్లు తిట్టారు. 

ఆర్టీసీ బస్సు బోల్తా

కర్నూలు : జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. భారీవర్షాలకు సంజామల వద్ద పాలేరువాగు వంతెనపై నుండి వరదనీరు ప్రవహిస్తోంది. వంతెనపై నుండి వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. వరదనీటితో చిక్కుకుపోయి బోల్తాపడింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది... ప్రయాణికులను రక్షించారు. 

20:56 - September 16, 2017

ముంబై : ముంబైలోని ఆర్‌కె స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టూడియోలోని రెండో ఫ్లోర్‌లో మంటలు అంటుకున్నాయి. ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో డెకరేషన్‌ సామగ్రికి అంటుకొని భారీగా మంటలు వ్యాపించాయి. 4 ట్యాంకర్లు, 6 ఫైర్‌ ఇంజన్లు మంటలను ఆర్పాయి. 'సూపర్‌ డ్యాన్సర్‌' టీవీ షో సెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం కావడంతో సిబ్బందితో పాటూ షోకు సంబంధించిన సభ్యులు ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రాజ్‌కపూర్‌ పేరిట ఈ స్టూడియోను ఏర్పాటు చేశారు. ప్రముఖ నటుడు రిషికపూర్‌ ప్రస్తుతం దీని నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు.

 

20:52 - September 16, 2017

కర్నూలు : జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. భారీవర్షాలకు సంజామల వద్ద పాలేరువాగు వంతెనపై నుండి వరదనీరు ప్రవహిస్తోంది. వంతెనపై నుండి వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. వరదనీటితో చిక్కుకుపోయి బోల్తాపడింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది... ప్రయాణికులను రక్షించారు. 

 

20:42 - September 16, 2017
20:41 - September 16, 2017
20:40 - September 16, 2017
20:37 - September 16, 2017

ప్రకాశం : కార్పొరేట్‌ ఆస్పత్రి నిర్లక్ష్యానికి నిండు గర్భిణి మృతి చెందింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన లక్ష్మి అనే గర్భిణి శుక్రవారం అర్ధరాత్రి పురిటి నొప్పులతో సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరింది. శనివారం ఉదయం వరకు డాక్టర్‌ రాకపోవడంతో ఆ మహిళ ఆస్పత్రిలోనే మృతి చెందింది. నిండు గర్భిణి మృతి చెందడంతో మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సర్కారు వైద్యంపై నమ్మకం లేక కార్పొరేట్‌ ఆస్పత్రికి వస్తే డబ్బు తీసుకునేవారే కాని వైద్యం చేసేవారు లేరని ఆవేదన చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని లక్ష్మి మృతిపై విచారణ చేపట్టారు. 

 

20:35 - September 16, 2017

కడప : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు, అధ్యాపకుల ఆందోళనలతో అట్టుడికిపోతోంది. నాసిరకం భోజనం పెడుతున్నారంటూ విద్యార్ధులు మెస్‌ల ముందు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఆత్మహత్య చేసుకున్న లెక్చరర్ నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలంటూ అధ్యాపకులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. 

ఈ కుర్రాడి చేతిలో ఉన్నది బాల్ .. లేక కోడిగుడ్డా...? సందేహం లేదు కోడిగుడ్డే..మరి పగలగొట్టేందుకు అంతగా ట్రై చేసినా పగలదే.. ఆ సీక్రెట్ ఏంటో కడప ట్రిపుల్ ఐటీలో మెస్‌ నిర్వాహకులకే తెలియాలి. 

ఇది కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ .. ఇక్కడ ఉన్న మూడు మెస్‌లలో 6 వేల మంది విద్యార్ధులు భోజనం చేస్తారు. కొంతకాలంగా మెస్‌లలో నాసిరకం భోజనం పెడుతున్నారని.. తరచూ అనారోగ్యాల పాలవుతున్నామని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి ఫుడ్ బాగా లేదంటూ భోజనం చేయకుండా మెస్‌ల ముందు విద్యార్ధులు బైఠాయించారు. ఈ విషయాన్ని ట్రిపుల్ ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

విద్యార్ధుల ఆందోళనపై ట్రిపుల్ ఐటీ పరిపాలన అధికారి అమరేంద్ర స్పందించారు. మెస్‌ను నిర్వాహకులు కొద్దిరోజులపాటు సరిగానే నిర్వహించినా... తర్వాత నాసిరకంగా భోజనం పెడుతున్నారన్నారు. నెలరోజుల్లో కొత్త క్యాటరింగ్‌కు టెండర్స్ పిలుస్తామని తెలిపారు. ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. 

మరోవైపు జాబ్ పర్మినెంట్ కాలేదనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకన్న లెక్చరర్ నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలంటూ 4 రోజులుగా ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు ఆందోళన చేస్తున్నారు. మొత్తానికి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఆందోళనల పర్వం కొనసాగుతోంది. వీటిపై వీసీ స్పందించి తగు చర్యలు తీసుకుంటేనే కానీ పరిస్థితి చక్కబడేలా లేదు. 

20:26 - September 16, 2017
20:23 - September 16, 2017

శ్రీకాకుళం : జిల్లాలో దాదాపు 80 మంది రైస్‌ మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు.  మరికొన్ని రైస్‌ మిల్లులు ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన పిడిఎస్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి ..మిల్లులో పాలిష్‌ చేసిన అనంతరం సన్నబియ్యంగా మార్కెట్‌లోకి అమ్ముతున్న వైనం కూడా వెలుగులోకి వచ్చింది.  ప్రభుత్వం నుండి సేకరించిన ధాన్యం  నిల్వలు మిల్లుల్లో లేవు. కాని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన బకాయిలు మాత్రం పేరుకుపోయి ఉన్నాయి.  

రైస్‌ మిల్లుల నుండి సుమారు కోటి రూపాయల విలువైన బియ్యాన్ని అక్రమంగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తుండగా పట్టుబడ్డాయి. జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయల మేర దోపిడీ జరుగుతున్నా విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదులు మాత్రం అందడంలేదు. తమకు ఈ అక్రమ రవాణా గురించి సమాచారం అందిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచి ఆకస్మిక తనిఖీలు జరుపుతామని విజిలెన్స్‌ ఎస్పీ చెబుతున్నారు. 

అయితే బడా రాజకీయ నాయకుల అండతోనే రైస్‌ మిల్లర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే జిల్లా నుండి గిడ్డంగులకు బకాయిలు పేరుకుపోయినా వాటిని రాబట్టడంలో పౌర సరఫరాల శాఖ అధికారులు విఫలమవుతున్నారని సమాచారం. 

20:21 - September 16, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయని టిటిడి జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఇవాళ టిటిడి ముఖ్యభద్రతాదికారి రవిక్రిష్ణ, అర్బన్ యస్పీ అభిషేక్ మహంతీ, ఇంజినీరింగ్ అధికారులతో కలసి ఏర్పాట్లను పరిశీలించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 23 నుండి ప్రారంభం కానున్నాయిని, అదేరోజున పెరటాసి నెల మొదటి శనివారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్నారు. గరుడసేవ రోజున తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాలు నిషేదించినట్లు చెప్పారు. ఆరోజున తిరుమలకు ఏడువేల కార్లను మాత్రమే అనుమతించి ఆ తరువాత వచ్చే కార్లకోసం తిరుపతి దేవలోక్, భారతీయ విధ్యాభవన్ ల వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 

 

20:17 - September 16, 2017

చెన్నై : తమిళనాడు తిరునల్వేలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన గుంటూరు జిల్లా వాసుల్ని వారి స్వస్థలానికి చేర్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగి ఉన్న బస్సును సిమెంట్ లారీ ఢీకొన్న ఘటనలో గుంటూరు జిల్లాకు చెందిన ఐదుగురు చనిపోయారు. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

 

20:14 - September 16, 2017

చిత్తూరు : నగరి ఎమ్మెల్యే రోజా కాసేపు లెక్చరర్‌గా మారారు. నగరిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు శాశ్వత భవనాన్ని నిర్మించారు. ఈ భవనాలను ఎమ్మెల్యే రోజా ఇవాళ ప్రారంభించారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్ధినీలతో ముచ్చటించారు. చాక్‌పీస్ తీసుకుని బ్లాక్ బోర్డుపై 'ఓం... కలలు కనండి... సాకారం చేసుకోండి' అంటూ రాశారు. ఆమె రాసిన సూక్తులు, సామెతలు విద్యార్థులను ఆకర్షించాయి.

 

20:12 - September 16, 2017

కడప : జిల్లాలోని జమ్మలమడుగు పరిధిలోని గూడెంచెరువు మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో దారుణం జరిగింది. చదువు చెప్పాల్సిన గురువు విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. హెడ్‌మాస్టర్‌ జాన్సన్‌ విద్యార్థినులను తరగతి గదిలో నగ్నంగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఆందోళన చెందిన విద్యార్థినులు పారిపోయి ఇంట్లో తల్లిదండ్రులకు విషయం చెప్పారు. పాఠశాలకు వచ్చిన పేరెంట్స్‌ ఉపాధ్యాయున్ని నిలదీశారు. ఘటనపై విచారణకు వచ్చిన ఎంఈవో ముందే కీచక టీచర్‌పై మండిపడ్డారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎంఈవో తెలిపారు.

 

20:08 - September 16, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రులో ఉద్రిక్తత నెలకొంది. చలో గరగపర్రుకు మాలమహానాడు పిలువునివ్వగా.. రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు నల్లి రాజేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజేష్‌ అరెస్టుకు నిరసనగా దళితులు ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు అరెస్ట్‌ చేయగా... పోలీసులు, దళితులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరుతో మనస్థాపం చెందిన ముగ్గురు యువకులు యనుమదుర్రు డ్రైన్‌లో దూకారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

గిరిజనులపై కేసీఆర్ కక్ష సాధింపు చర్య : తమ్మినేని

జయశంకర్ భూపాలపల్లి : జలగలంచ అడువుల్లో గుత్తికోయలపై ఫారెస్టు సిబ్బంది దాడిని సీపీఎం ఖండించింది. ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గిరిజన మహిళలను చెట్టుకు కట్టేసిన ఫారెస్టు అధికారులపై కేసు పెట్టి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. గిరిజనులపై కేసీఆర్ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు.  

 

సినీ నిర్మాత దిల్ రాజ్ పై కేసు నమోదు

హైదరాబాద్ : సినీ నిర్మాత దిల్ రాజ్ పై కేసు నమోదు అయింది. దిల్ రాజ్ పై నవల రచయిత శ్యామల రాణి ఫిర్యాదు చేసింది. నా మనుసు నిన్ను కోరే నవలను కాఫీ కొట్టి మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా తీశారని ఆరోపించారు.

 

19:41 - September 16, 2017

హైదరాబాద్ : జర్నలిజం లో 14 ఏళ్ల సేవలకు గాను 10టీవీ అసిస్టెంట్ ఎడిటర్ సతీష్‌కు శృతిలయ ఆర్ట్స్ అక్కినేని ఫౌండేషన్ సంయుక్త మీడియా పురస్కారం దక్కింది. అక్కినేని నాగేశ్వరరావు 94వ జయంతి సందర్బంగా.. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, ప్రముఖ సామాజిక వేత్త జెబి రాజు, శృతిలయ ఆర్ట్స్ ఛైర్మన్ విఎన్ సింగ్‌లు సతీష్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని పాటలతో నిర్వహించిన కార్యక్రమం ఆహుతులను అలరించింది.
 

19:38 - September 16, 2017

హైదరాబాద్ : చంచల్ గూడ జైల్లో వార్డర్ భరత్‌పై ఐసిస్ ఉగ్రవాద ఖైదీలు దాడి చేశారు. దీనిపై దబీర్ పురా పీఎస్‌లో కేసు నమోదైంది. ఉన్నతాధికారులు ఘటనపై విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:35 - September 16, 2017
19:33 - September 16, 2017

హైదరాబాద్ : తెలంగాణలోని దళితులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేస్తుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు. దళితుల నిధులను పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ మంత్రుల సవాల్‌ను స్వీకరించి ముందుకు వస్తే.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నేతలు పారిపోయారని అన్నారు. దొరల గడీల్లో బంధీలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు బయటకు రావాలని సంపత్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. 

 

19:30 - September 16, 2017

హైదరాబాద్ : ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్షల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం.. అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. తనిఖీ చేసి పరీక్ష హాలులోకి పంపించడంలో సిబ్బంది జాప్యం వల్ల... అభ్యర్థులు ఎగ్జామ్ టైమ్‌కు హాలులోకి వెళ్లలేకపోయారు. సిబ్బంది తీరును నిరసిస్తూ...పరీక్ష హాలు వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

19:28 - September 16, 2017

భూపాలపల్లి : జిల్లాలో గుత్తికోయలపై అటవీ అధికారులు దాడులు చేశారు. గోవిందరావు పేట మండలం పసర రేంజ్ పరిధిలో పోడు వ్యవసాయం చేస్తున్నారనే నెపంతో... దాడి చేశారు. గిరిజనుల ఆవాసాలు కూల్చివేసి పంటపొలాలు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన గిరిజనులపై లాఠీఛార్జ్ చేశారు. మహిళలను కూడా చూడకుండా... తీవ్రంగా కొట్టారు.  గిరిజనులను చెట్లకు కట్టేసి వారి సామాన్లను వేరే చోటుకు తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మెట్రో రైల్లో పేలుడు ఘటనలో ఒకరు అరెస్టు

లండన్ : మెట్రో రైల్లో పేలుడు ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. లండన్ మెట్రో రైల్లే పేలుడుకు ఐసిస్ బాధ్యత వహించారు. 

 

వార్డర్ ఐసిస్ ఉగ్రవాద ఖైదీల దాడి

హైదరాబాద్ : చంచల్ గూడ జైలులో వార్డర్ పై ఐసిస్ ఉగ్రవాద ఖైదీలు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన ఖైదీలపై దబీర్ పురా పీఎస్ లో కేసు నమోదు చేశారు. 

16:47 - September 16, 2017
16:46 - September 16, 2017

హైదరాబాద్ : ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్షల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం.. అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. తనిఖీ చేసి పరీక్ష హాలులోకి పంపించడంలో సిబ్బంది జాప్యం వల్ల... అభ్యర్థులు ఎగ్జామ్ టైమ్‌కు హాలులోకి వెళ్లలేకపోయారు. సిబ్బంది తీరును నిరసిస్తూ...పరీక్ష హాలు వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:43 - September 16, 2017

మహారాష్ట్ర : ముంబైలోని ఆర్‌కె స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టూడియోలోని రెండో ఫ్లోర్‌లో మంటలు అంటుకున్నాయి. 4 ట్యాంకర్లు, 6 ఫైర్‌ ఇంజన్లతో అగ్నిమాపకసిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రాజ్‌కపూర్‌ ఆర్‌కె పేరిట ఈ స్టూడియోను ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగింది. స్టూడియో 75 శాతం కాలిపోయినట్లు తెలుస్తోంది. ఘటన జరిగినప్పుడు మొదటి అంతస్తులో సినిమా షూటింగ్ జరుగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

16:39 - September 16, 2017

హైదరాబాద్‌ : నగరంలో మసాజ్ సెంటర్లలో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడ్డ ఆదిత్యను మాదాపూర్ పోలీసులు చెన్నైలో అరెస్టు చేశారు. ఆదిత్యకు హైదరాబాద్‌లో 6, బెంగళూరులో ఒక స్పా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. థాయిలాండ్, ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలతో.. ఆదిత్య అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...


 

సిబ్బంది నిర్లక్ష్యం.. అభ్యర్థుల పాలిట శాపం

హైదరాబాద్ : ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్షల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం.. అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. తనిఖీ చేసి పరీక్ష హాలులోకి పంపించడంలో సిబ్బంది జాప్యం వల్ల... అభ్యర్థులు ఎగ్జామ్ టైమ్‌కు హాలులోకి వెళ్లలేకపోయారు. సిబ్బంది తీరును నిరసిస్తూ...పరీక్ష హాలు వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 

16:36 - September 16, 2017

హైదరాబాద్ : ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్షల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం.. అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. తనిఖీ చేసి పరీక్ష హాలులోకి పంపించడంలో సిబ్బంది జాప్యం వల్ల... అభ్యర్థులు ఎగ్జామ్ టైమ్‌కు హాలులోకి వెళ్లలేకపోయారు. సిబ్బంది తీరును నిరసిస్తూ...పరీక్ష హాలు వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

మసాజ్ సెంటర్లలో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడ్డ వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌ : నగరంలో మసాజ్ సెంటర్లలో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడ్డ ఆదిత్యను మాదాపూర్ పోలీసులు చెన్నైలో అరెస్టు చేశారు. ఆదిత్యకు హైదరాబాద్‌లో 6, బెంగళూరులో ఒక స్పా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 

16:31 - September 16, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో హోంగార్డు సమస్యలపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయాలు కల్పించాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌ చివరినాటికి హోంగార్డుల సమస్యలు పరిష్కారం కాకపోత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. పాదయాత్రగా బయలుదేరిన ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితో పాటు హోంగార్డులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 

16:17 - September 16, 2017

భూపాలపల్లి : జిల్లాలోని గుత్తికోయలపై అటవీఅధికారులు దాష్టీకానికి పాల్పడ్డారు. గిరిజనులపై పోలీసులు కండకావరం ప్రదర్శించారు. గిరిజనులు కూడా మనుషులు అనే విషయాన్ని మర్చి అమానవీయంగా ప్రవర్తించారు. గుత్తికోయలపై అటవీ అధికారులు దాడులు చేశారు. గోవిందరావు పేట మండలం పసర రేంజ్ పరిధిలో పోడు వ్యవసాయం చేస్తున్నారనే నెపంతో... దాడి చేశారు. పోడు వ్యవసాయం చేస్తున్నారనే నెపంతో వారిపై విచక్షణారహితంగా దాడులు చేశారు. మహిళలని చూడకుండా జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ లాక్కెళ్లి చెట్టుకు కట్టేశారు. మహిళలపై మగపోలీసులు దాడికి పాల్పడ్డారు. గిరిజనుల ఆవాసాలు కూల్చివేసి పంటపొలాలు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన గిరిజనులపై లాఠీఛార్జ్ చేశారు. మహిళలను కూడా చూడకుండా... తీవ్రంగా కొట్టారు.  గిరిజనులను చెట్లకు కట్టేసి వారి సామాన్లను వేరే చోటుకు తరలించారు. మహిళలపై తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడారు. వస్తు సామాగ్రిని తరలిస్తుండగా అడ్డుకున్న మహిళలను చెట్టుకు కట్టేశారు. రేషన్ బియ్యాన్ని వెదజల్లారు. వస్తు సామాగ్రిని ధ్వసం చేశారు. 

సీపీఎం జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి
'గుత్తికోయలపై పోలీసుల దాడులు అమానుషం, దుర్మార్గం. అటవికదాడి, దుర్మార్గమైన చర్య. చట్ట విరుద్ధంగా గిరిజనుల ఇళ్లను కూలగొట్టారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించారు. దాడికి పాల్పడిన అధికారులు, పోలీసులుపై చర్యలు తీసుకోవాలి. గిరిజనులను వారి ఆవాసాల్లో ఉంచాలి. లేకపోతే యావత్తు మంది గిరిజనులను సమీకరించి, పోరాటం చేస్తామని' హెచ్చరించారు. 
గిరిజన సంఘం నేత..బండారి రవికుమార్ 
ఆదివాసీలపై దాడులు జరిగాయి. అటవీప్రాంతానికి సరిహద్దులు లేవు. కేసీఆర్ ప్రభుత్వం భరితెగించింది. ఆదివాసీ వ్యతిరేక ప్రభుత్వం ముద్రవేసుకుంటుంది. సీఎం ఆదేశాలతోనే పోలీసులు ఇలాంటి దాడులు చేస్తున్నారు. పోరాటాలు, ఉద్యమాలను ఉధృతం చేస్తాం. ప్రభుత్వం, పోలీసులు తగిన మూల్యం చెల్లించక తప్పదు అని అన్నారు. 
గిరిజన సంఘం నేత... ధర్మనాయక్ 
'తెలంగాణ వచ్చిన తర్వాత గిరిజనులపై దాడులు పెరిగాయి. ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా..అన్న అనుమానం కలుగుతుంది. ఈ దాడిని టీఆర్ ఎస్ ప్రభుత్వ దాడిగా చూడాలి. ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా గతంతో గిరిజనులపై దాడలు జరిగాయి. హరితహారం పేరుతో ప్రభుత్వం బూటకం చేస్తోంది. అటవీసంపదను దోచుకోవాలని చూస్తున్నారు. పెట్టుబడిదారులకు దారాధత్తం చేయాలని చూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని
అమలు చేయడం లేదు. గిరిజనులపై దాడులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని' హెచ్చరించారు.

 

ఆర్కే స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం

ముంబై : నగరంలోని ఆర్కే స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టూడియో రెండో ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. 

 

16:02 - September 16, 2017

విజయనగరం : ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా అక్టోబర్‌ 3వ తేదీన సిరిమాను ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో భానురాజు తెలిపారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. సిరిమాను చెట్టు తరలింపు కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగిందన్నారు. చెట్టును కొట్టే కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన పూజారి ప్రారంభించారని తెలిపారు. సిరిమాను చెట్టును హుకుంపేటకు తరలించినట్లు చెప్పారు. వడ్రంగులు చెట్టును సిరిమానుగా మలచి ఉత్సవానికి సిద్ధం చేస్తారని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:56 - September 16, 2017

హైదరాబాద్‌ : నగరంలో హోంగార్డుల సదస్సు ఉద్రిక్తతకు దారితీసింది. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో సదస్సు జరుగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. హోంగార్డులకు న్యాయం చేస్తానని కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని కిషన్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. అక్టోబర్‌లోగా హోంగార్డులకు న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న కిషన్‌రెడ్డితో సహా పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం...

 

విద్యార్థులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ఆందోళన

సంగారెడ్డి : జిల్లాలోని తున్కల్‌ మండలం సుల్తాన్‌పూర్‌లోని జేఎన్ టీయూ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు తరగతులు బహిష్కరించి క్యాంపస్‌ ముందు నిరసన ర్యాలీ చేపట్టారు. 15 మంది విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్‌ ఈశ్వర ప్రసాద్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

15:42 - September 16, 2017

సంగారెడ్డి : జిల్లాలోని తున్కల్‌ మండలం సుల్తాన్‌పూర్‌లోని జేఎన్ టీయూ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు తరగతులు బహిష్కరించి క్యాంపస్‌ ముందు నిరసన ర్యాలీ చేపట్టారు. 15 మంది విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్‌ ఈశ్వర ప్రసాద్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

 

15:39 - September 16, 2017

కరీంనగర్‌ : జిల్లాలో ముఖ్యమంత్రి నాటిన మొక్క వివాదం ఠాణాకెక్కింది. సీఎం నాటిన మొక్క వాడిపోయింది. అయితే ఇది కావాలనే ఎవరో చేశారని అధికారులంటున్నారు. విచారణ కోసం కార్పోరేషన్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

15:06 - September 16, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని గరగపర్రులో దళిత సంఘాలు చేపట్టిన చలో గరగపర్రు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 15 లోపు గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు.. దళితులకు నష్టపరిహారం చెల్లించాలని దళిత సంఘాల నేతలు గతంలో డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో గరగపర్రుకు చేరుకున్న దళిత సంఘాల నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. 

 

గరగపర్రులో ఉద్రిక్తత

తూర్పుగోదావరి : జిల్లాలోని గరగపర్రులో దళిత సంఘాలు చేపట్టిన చలో గరగపర్రు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 15 లోపు గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు.. దళితులకు నష్టపరిహారం చెల్లించాలని దళిత సంఘాల నేతలు గతంలో డిమాండ్ చేశారు. 

14:06 - September 16, 2017

హైదరాబాద్ : హోంగార్డుల సమావేశం ఉద్రిక్తతలకు దారి తీసింది. హోంగార్డులను రెగ్యూలైజ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు హామీని మరించిందని బీజేపీ ఎమ్మెల్యే హోంగార్డులతో కలిసి ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

13:42 - September 16, 2017

విజయనగరం : విజయనగరం ఇలవేల్పు దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు మొదలయ్యాయి. అక్టోబర్‌ 3వ తేదీన జరిగే ఈ సిరిమాను ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన సిరిమాను ఊరేగింపుకు అవసరమైన సిరిమాను చెట్టు తరలింపు కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగుతోంది. ఈ సంబరాలపై మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:39 - September 16, 2017

సంగారెడ్డి : అన్నా.. సోలో ఆంధ్రాకి అందగాడిని అంటూ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన నటుడు బాబుమోహన్‌ని ఇప్పటికి తెలుగు ప్రేక్షకులు మర్చిపోరు.. సినీ రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చాలాకాలం టీడీపీలో పనిచేశారు. ఎమ్మెల్యేగా.. మంత్రిగా పదవులు నిర్వహించారు. గత ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా ఆందోల్ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఉన్నారు సరే.. నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేసారని ప్రశ్నించారో.. అంతే.. ఆయన విప్పే బూతుపురాణం వినాలంటే చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి. అభివృద్ధి పనుల సంగతి అటుంచితే ఓటేసి గెలిపించిన ప్రజలను అవమానిస్తూ మాట్లాడతారని స్ధానికులు అంటున్నారు.

పంచాయతీ మరింత అధ్వాన్నం
నియోజకవర్గ పరిస్థితి ఇలా ఉంటే జోగిపేట-ఆందోల్ నగర పంచాయతీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. చైర్మన్‌గా ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో బాబు మోహన్‌ అసలు నగర పంచాయతీ వైపు కన్నెత్తి చూడటం లేదని స్ధానికులు మండిపడుతున్నారు. గడిచిన మూడేళ్లలో ఎనిమిది కోట్ల రూపాయల నిధులు ఉన్నా.. కనీస అభివృద్ధి కార్యక్రమాలు జరగనీయకుండా బాబు మోహన్ అడ్డుపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక నియోజకవర్గానికి వచ్చిన బాబు మోహన్‌ జనం చెప్పింది వినరు.. ఆయన చెప్పిందే.. జనం వినాలి. ఆందోల్‌లో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నాయి. వాటి పరిష్కారం కోసం జనం ఆందోళన చెందుతున్నారు. బాబు మోహన్ నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారి తమ సమస్యలు చెప్పుకోవాలని ప్రయత్నించి విఫలమవుతున్నారు నియోజకవర్గ ప్రజలు. ప్రజల్ని, అధికారుల్ని తిట్టి వెళ్లడమే బాబు మోహన్ పనిగా పెట్టుకున్నారని కౌన్సిలర్ శరత్‌ బాబు అంటున్నారు.

మస్యల్ని ఆలకించే స్థితిలో లేని రాజనర్సింహ
ఇక ఎమ్మెల్యే బాబు మోహన్‌ దూకుడు ఇలా ఉంటే మాజీ ఎమ్మెల్యే..మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా ప్రజల సమస్యల్ని ఆలకించే స్థితిలో లేరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గానికి వచ్చే ఎమ్మెల్యేలు స్ధానికులు కాకపోవడం వల్లే తమకు ఇన్ని ఇబ్బందులు అని స్ధానికులు అంటున్నారు. ఇది ఆందోల్ నియోజకవర్గ పరిస్థితి. ఇక్కడికి వచ్చే ఎమ్మెల్యేలు అతిథులుగా వస్తున్నారు తప్ప.. తమ బాగోగులు పట్టించుకోవడం లేదని ఆందోల్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరి వీరి పరిస్థితి ఎప్పటి మారుతుందో వేచి చూడాలి. 

13:37 - September 16, 2017

హైదరాబాద్ : కురిసిన వర్షానికి నాచారం లోతట్టు ప్రాంతాలు.. రాఘవేంద్ర నగర్‌, ఇందిరా నగర్‌లలో ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తెప్ప సహాయంతో బయటికి వెళ్లి రోజువారీ సామాగ్రి తెచ్చుకుంటున్నారు. మూడు రోజులైనా నీళ్లు అలాగే నిలిచిపోవడంతో వస్తున్న దుర్గంధంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. నీళ్లు తొలగించడంలో అలసత్వం వహిస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు. కొన్ని ఇళ్లకు విద్యుత్‌ నిలిపేశారు. కనీసం తమకు ఆహారం కూడా అందడం లేదని కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల ఇళ్లు నీటిలో ఉన్నాయి. 

13:36 - September 16, 2017

చెన్నై : తమిళనాడు తిరునల్వేలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును సిమెంట్‌ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఐదుగురు మృతి చెందగా, 14మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు పొన్నూరు మండలం కొల్లూరువాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలపై మంత్రి నక్కా ఆనంద్ బాబు తిరునల్వేలి జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు.

13:34 - September 16, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్‌లో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. మేయర్‌ పదవి పావనికి ఇవ్వడంపై 38వ డివిజన్‌ కార్పొరేషన్‌ శేషకుమారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా పార్టీ కోసం ఎంతో సేవ చేస్తుంటే.... నమ్మించి మోసం చేశారపి శేషకుమారి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:33 - September 16, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైన సుంకర పావని ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం పావని తొలి పాలకవర్గ సమావేశం నిర్వహించారు. మేయర్‌గా సుంకర పావనిని, డిప్యూటీ మేయర్‌గా కాలా సత్తిబాబును పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

13:30 - September 16, 2017

కరీంనగర్/పెద్దపల్లి : సింగరేణిలో ఆరవ దఫా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సింగరేణి వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికులు ప్రశ్నిస్తుండటంతో.. నేతలు ఎలా ప్రచారం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:27 - September 16, 2017

హైదరాబాద్ : నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ పార్కింగ్ ప్లేస్‌లో.. ఉస్మానియా మెడికల్ కాలేజ్‌ విద్యార్థుల ఆధ్వర్యంలో ఇంపల్స్‌ 2017 కార్యక్రమం జరిగింది. హెల్త్‌ వాక్‌ అండ్‌ రన్‌ని.. జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. కౌమారదశ, మానసిక, శారీరక సమస్యలపై అవగాహన, నివారణ, చైతన్యం, ఆరోగ్యవంతమైన సమాజం.. ఈ అంశాల్ని విస్తృతంగా ప్రచారం చేశారు. కౌమార దశలో వచ్చే మానసిక, శారీరక ఒత్తిడిల అవగాహన-నివారణ, చైతన్యం ఆ దశలో ఉన్నవారికే కాకుండా తల్లిదండ్రులకు కూడా అవసరమే అని రామ్మోహన్ అన్నారు. కౌమార దశ సమస్యలపై ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం అందరి మీదా ఉందన్నారు.

13:10 - September 16, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ వారు టీడీపీ సహారించరంటూ టీడీపీ కార్యకర్తలు అనడంతో దానికి దీటుగా బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తలు దారి తీశాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:41 - September 16, 2017

ఆనమక వచ్చి ఎవడే సబ్రమణ్యంతో ఫర్వలేదనిపంచి, పెళ్లిచూపులతో అదరగొట్టి, ద్వారకా తో బుజ్జగించి, అర్జున్ రెడ్డితో చరిత్ర సృష్టించిన వర్తమాన నటుడు విజయ్ దేవరకొండ. యూత్ భారీ ఫాలోయింగ్ తో పాటు అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం విజయ్ ఈ సినిమా క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డట్టు టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి చిత్రంతో సౌత్ లో ఇతర ఇండస్ట్రీల దృష్టిలో పడ్డాడు విజయ్. ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరో త్వరలో కన్నడలో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడని సినీవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పైగా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ కన్నడ భాషను మాట్లాడిన తీరు అక్కడి డైక్టర్లను, నిర్మాతలను అకర్షించినట్టు తెలుస్తోంది.

పుట్టపర్తిలో చదువుకున్న విజయ్ కి కన్నడ భాష మీద పట్టు ఉండటంతో త్వరలో అక్కడ హీరోగా పరిచయమయ్యందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే తన సినిమాలతో కాకుండా దక్షణాదిలో సంచలనం సృష్టించిన ఓ తమిళ చిత్రంను కన్నడలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు కనబడుతోంది. ఇప్పుడు అధికారింగా ప్రకటించకపోయినా త్వరలో ఈ ప్రాజెక్టుపై క్లారిటి వచ్చే అవకాశం ఉంది.

12:14 - September 16, 2017

ఏకగ్రీవంగా సుంకర పావని ఎంపిక

తూర్పు గోదావరి : కాకినాడ మేయర్ గా సుంకర పావనిని కార్పొరేషన్ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా కాలా సత్తిబాబు ఎన్నికయ్యారు. 

12:12 - September 16, 2017

తూర్పు గోదావరి : కాకినాడ మేయర్ గా సుంకర పావనిని కార్పొరేషన్ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా కాలా సత్తిబాబు ఎన్నికయ్యారు. చంద్రబాబు నిర్ణయం మేరకే వీరి ఎన్నిక జరిగినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:53 - September 16, 2017

హైదరాబాద్ : రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో.. కిసాన్‌ ముక్తి యాత్ర జరుగుతోంది. చుక్కా రామయ్య గన్‌పార్క్‌ వద్ద యాత్రను ప్రారంభించారు. ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర పర్యటించనుంది. ఇవాళ సూర్యాపేట, ఖమ్మంలో బహిరంగ సభ, రైతు ప్రదర్శనలు జరగనున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం యాత్ర జరగనుంది. యాత్రలో ప్రజా సంఘాల నేతలు పాల్గొంటున్నారు. రుణవిముక్తి చేయాలని, పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని.. రైతులవి రెండు డిమాండ్‌లేనని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. అందరికీ అన్నం పెట్టే వ్యవసాయాన్ని ఆదుకోవాల్సి అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం సరిగా రైతు సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఇన్ని ఆత్మహత్యలు జరగవని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 

11:49 - September 16, 2017

చెన్నై : తమిళ రాజకీయాల్లో సినీ గ్లామర్ ఏళ్ల తరబడి నడుస్తున్న చరిత్రే. అయితే ఎంజీఆర్‌, కరుణానిధి, జయలలితల తర్వాత.. సినీ గ్లామర్ ద్రవిడ పార్టీల్లో పెద్దగా పని చేయలేదు. ద్రవిడ సిద్ధాంతాలు, తమిళ భాష, స్థానికతపైనే గత 40 ఏళ్లుగా తమిళ రాజకీయాలు ముందుకు సాగుతున్నాయి. అయితే జయలలిత మరణం, కరుణానిధి వయోభారం ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో అస్థిరత ఏర్పడేలా చేసింది. సినీ గ్లామర్ రాజకీయ రంగ ప్రవేశానికి కారణమవుతోంది. నిశ్శబ్ధంగా మారిన తమిళ రాజకీయాల్లో సినీ గ్లామర్‌ రాజకీయ రంగ ప్రవేశానికి కారణమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సినీ గ్లామర్ ఎంతవరకు పని చేస్తుందో తెలుసుకునేందుకు.. బడా తారలు దారులు వెతుకుతున్నారు. నిన్న రజనీకాంత్, నేడు కమల్ హాసన్.. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

మట్టివాసన తెలియాలి....
ఒకరు మాస్‌, మరొకరు క్లాస్‌. ఇద్దరూ ఏసీ గదుల్లో జీవించేవాళ్లే. మరి రాజకీయాల్లోకి వస్తే.. గ్రామీణ ప్రాతాలకు తిరగాలి. మట్టివాసన తెలియాలి. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకోవాలి. అట్టడుగు వర్గాలతో మమేకం కావాలనే వాస్తవికత తెలియాలి. మరి ఈ తారలకు అది సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జయలలిత మృతి చెందినప్పటి నుంచి కమల్‌హాసన్‌ అధికార పార్టీ, ప్రతిపక్షాలపై సెటైర్లు వేస్తూ.. చివరకు రాజకీయాల్లోకి తాను వస్తున్నానేమో అనేశాడు. ఇక డిఎంకెనా, కమ్యూనిస్టు పార్టీలోకా అని వస్తున్న వార్తలకు కమల్‌ ఫుల్‌ స్టాప్ పెట్టారు. ఏకంగా పార్టీనే పెట్టబోతున్నానని ట్వీట్టర్‌లో తెలిపారు.

సిద్ధంగా ఉండండంటూ ట్వీట్లు
రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ హడావిడి చేసి సైలెంట్ అయిన రజనీకాంత్‌ని పక్కన పెడితే.. సొంత పార్టీ పెడతా.. మార్పునకు సిద్ధంగా ఉండండంటూ ట్వీట్లు చేస్తున్న కమల్‌హాసన్.. నిజంగానే రాజకీయాల్లోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. 

11:47 - September 16, 2017

ముంబై : ఆస్ట్రేలియాతో 5 వన్డేల సిరీస్‌ ఆరంభానికి ముందే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌...తొలి 3 వన్డేలు ఆడనున్న జట్టు నుంచి తప్పుకున్నాడు. భార్య ఆయేషాకు అస్వస్థత కారణంగా ధావన్‌ 3 వన్డేలకు దూరమయ్యాడు. ఆఖరి రెండు వన్డేలకు ధావన్‌ తిరిగి భారత్‌ జట్టుకు అందుబాటులో ఉంటాడు. ధావన్‌ స్థానంలో అజింక్యా రహానే లేదా కేఎల్‌ రాహుల్‌లలో ఒకరు ఓపెనర్‌గా భారత జట్టు ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

11:44 - September 16, 2017

హైదరాబాద్ : పాతబస్తీలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. సౌత్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. బహదూర్‌పురా పీఎస్‌ పరిధిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు 350మంది పోలీసులు పాల్గొన్నారు. ఆకతాయిల ఆగడాలు పెరిగిపోయాయనే సమాచారంతో తనిఖీలు నిర్వహించామని.. ఈ తనిఖీలతో ప్రజల్లో ధైర్యం పెరుగుతుందన్నారు డీసీపీ సత్యనారాయణ.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

చెన్నై : తిమిళనాడులోని తిరునల్వేలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఓ ట్రావేల్స్ బస్సును సిమెంట్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఐదుగురు మృతి చెందారు. 14 మందికి గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించారు. 

11:38 - September 16, 2017

చెన్నై : తిమిళనాడులోని తిరునల్వేలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఓ ట్రావేల్స్ బస్సును సిమెంట్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఐదుగురు మృతి చెందారు. 14 మందికి గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు పొన్నూరు మండలం కొల్లూరువాసలుగా అక్కడి పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

కాకినాడ మేయర్ గా సుంకర పావని

 

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ మేయర్ పీఠం ఉత్కంఠ తెర పడింది. మేయర్ గా సుంకర పావనిని టీడీపీ అదిష్టానం ప్రకటించింది. డిప్యూటీ మేయర్ గా కాలా సత్తిబాబును ప్రకటించారు. మరి కాసేట్లో వీరిని కార్పొరేటర్లు అందురు కలసి ఎన్నుకొనున్నారు. 

కాసేపట్లో డేరా బాబా విచారణ

హర్యానా : కాసేపట్లో గుర్మీత్ బాబా రెండు హత్య కేసులపై పంచకుల కోర్టులో విచారణ జరగనుంది. జర్నలిస్టు రామ్ చందర్ చత్రపతి, మేనేజర్ రంజిత్ సింగ్ లను డేరా బాబా హత్య చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. విచారణ నేపథ్యంలో కోర్టు పరిసరా ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు

11:26 - September 16, 2017

హర్యానా : కాసేపట్లో గుర్మీత్ బాబా రెండు హత్య కేసులపై పంచకుల కోర్టులో విచారణ జరగనుంది. జర్నలిస్టు రామ్ చందర్ చత్రపతి, మేనేజర్ రంజిత్ సింగ్ లను డేరా బాబా హత్య చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. విచారణ నేపథ్యంలో కోర్టు పరిసరా ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. డేరా బాబా ఇప్పటికే సాధ్వీలపై అత్యాచారం కేసులో 29ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

11:24 - September 16, 2017

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ మేయర్ పీఠం ఉత్కంఠ తెర పడింది. మేయర్ గా సుంకర పావనిని టీడీపీ అదిష్టానం ప్రకటించింది. డిప్యూటీ మేయర్ గా కాలా సత్తిబాబును ప్రకటించారు. మరి కాసేట్లో వీరిని కార్పొరేటర్లు అందురు కలసి ఎన్నుకొనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:23 - September 16, 2017
10:20 - September 16, 2017
10:09 - September 16, 2017

తూర్పు గోదావరి : కాకినాడ మేయర్ పీఠంపై ఇంక ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటి వరకు టీడీపీ మేయర్ పేరు ప్రకటించలేదు. స్థానిక కార్యకర్తలు, కార్పొరేటర్లు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

09:23 - September 16, 2017

చాలా మంది సీనియర్ హీరోలు ఇతర చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేస్తూ బాగానే అకట్టుకుంటున్నారు. అందులో సీనియర్ బహుభాషా నటుడు అర్జున్. ఆయన ఇప్పుడు టాలీవుడ్ పై కన్నేశాడు. టాలీవుడ్ సినిమాల్లో విలన్ గా, ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ మద్య ఆయన నటించిన లై చిత్రం కాస్త నిరాశపరిచిన అందులో అర్జున్ చేసిన పాత్ర బాగా ఉందని ప్రేక్షలు మెచ్చుకున్నారు. అర్జున్ తాజాగా మరో తెలుగు సినిమాలో ముఖ్యపాత్రలో నటించడానికి అంగీరించారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న చ్రితం నా పేరు సూర్య వక్కతం వంశీ దర్శకత్వంలో వస్తున్న వస్తున్న ఈ చిత్రంలో అర్జున్ ఓ కీలక పాత్ర చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో ఇదివరకే శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తుండగా మరొక పాత్రలో యాక్షన్ కింగ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ కొన్ని భారీ సెట్స్ లలో షూటింగ్ ను జరుపుకుంటుంది. అందుకోసం స్టైలిష్ స్టార్ చాలా కష్టపడుతున్నడటా. పాత్రకు అనుగుణంగా ఇప్పటికే తన బాడీని పెంచేశాడట బన్నీ. ఇక చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ నెగిటివ్ పాత్రలో కనిపంచే అవకాశం ఉంది. ఒక వేళ అదే నిజమైతే అర్జున్ వర్సెస్ అర్జున్ యుద్ధం జరుగుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

09:21 - September 16, 2017
09:03 - September 16, 2017
09:00 - September 16, 2017
08:58 - September 16, 2017

విజయవాడ : నగర పాలక సంస్థ సమావేశంలో తలా తోక లేని అంశాలపై చర్చకు అధికార, విపక్షాలు మొగ్గు చూపాయి. నగరంలో నెలకొన్న పారిశుధ్యలోపంతో వ్యాపిస్తున్న విషజ్వరాలు, పిల్లలు, వృద్ధుల మరణాలు వంటి కీలక అంశాలపై చర్చ జరగలేదు. కార్పొరేషన్‌ స్థలాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయడంపై చర్చ జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో కొన్ని స్థలాలను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టుందుకు కౌన్సిల్‌ ముందుకు వచ్చిన అజెండాలను మాత్రం వైపీసీ, సీపీఎం అడ్డుకోవడంతో, ఈ ప్రతిపాదనను వాయిదా వేయకతప్పలేదు. వచ్చే ఏడాది నుంచి నగరంలో ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్నినిషేధించాలని నగరపాలక సంస్థ సమావేశంలో తీర్మానించారు. పేదల గృహ నిర్మాణ పథకంలో టీడీపీ కార్పొరేటర్ల అవినీతి అంశం చర్చకు వచ్చింది. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. అవినీతి ఆరోపణలపు మేయర్‌ కోనేరు తోసిపుచ్చారు. కార్పొరేషన్‌ స్థలాల ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్న వైనంపై కౌన్సిల్‌లో చర్చ జరిగింది. దీనిపై కమిషన్‌ నివాస్‌ వివరణ ఇచ్చారు. మరోవైపు ప్రతిపక్షంగా తాము ప్రజా సమస్యలు లేవనెత్తుతుంటే సమాధానం చెప్పలేక అధికార పక్షం చర్చకు పక్కదారి పట్టిస్తోందన్న వాదాన్ని వైసీపీ వినిపిస్తోంది.మొత్తంమీద నాగులు గంటలపాటు జరిగిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో అజెండాలోని 54 అంశాలకుగాను 30 అంశాలు కౌన్సిల్‌ ఆమోదం పొందాయి. 

08:56 - September 16, 2017

విజయనగరం : పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌ విజయనగరం జిల్లా రెండు రోజుల పర్యటన విజయవంతమైంది. లోకేశ్‌ టూర్‌ టీడీపీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది. నేతలు, కార్యకర్తలందరూ పాల్గొని లోకేశ్‌ పర్యటనను విజయవంతం చేశారు. విజయనగరం జిల్లా తెలుగుదేశం నేతల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, అన్నింటినీ పక్కనపెట్టి నేతలందరూ కలిసికట్టుగా లొకేశ్‌ టూర్‌లో పాల్గొన్నారు. నేతల ఐక్యతా రాగం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఇదే స్ఫూర్తి మున్ముందు కూడా కొనసాగిస్తే పార్టీకి మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోకేశ్‌ పర్యటనతో తెలుగుదేశం నేతలు విభేదాలను విస్మరించడం మంచిపరిణామంగా భావిస్తున్నారు.

ప్రజల నుంచి మంచి స్పందన
విజయనగరంతోపాటు ఎస్‌ కోట, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో లోకేశ్‌ పర్యటించారు. చినబాబు టూర్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. లోకేశ్‌ ప్రజలతో మమేకమైన తీరు టీడీపీ శ్రేణులకు బాగా నచ్చింది. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. చేయబోయే కార్యక్రమాలను చెప్పి ప్రజల మన్నలు పొందారు. విజయనగరం జెడ్పీ అతిథి గృహంలో మంత్రి లోకేశ్‌ నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమానికి జనంతోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజలు లేవనెత్తిన సమస్యలకు అధికారలతో పరిష్కార మార్గాలను సూచించిన లోకేశ్‌ తీరు అందర్నీ ఆకట్టుకుంది. జిల్లా అభివృద్ధికి లోకేశ్‌ వరాల జల్లు కురిపించారు.

పార్టీ నేతల్లో నూతనోత్సాహం
విజయనగరం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో లోకేశ్‌ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ, పరిణతిచెందిన నేతగా ప్రజల మన్ననలు అందుకున్నారు. ఎస్‌ కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, గజపతినగరం శాసనసభ్యుడు ఏకే నాయుడు పనితీరుపై ప్రజలు పెదవి విరుస్తున్న తరుణంలో ఈ రెండు నియోజకవర్గాల్లో లోకేశ్‌ పర్యటన వీరిద్దరికీ బాగా కలిసొచ్చింది విశ్లేషిస్తున్నారు. మొత్తానికి లోకేశ్‌ పర్యటన తర్వాత విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లో కనిపిస్తున్న నూతనోత్సాహం ఎప్పటి వరకు కొనసాగుతుందో చూడాలి. 

08:55 - September 16, 2017

హైదరాబాద్ : తెలంగాణలో బ్లూవేల్‌ గేమ్‌ను కట్టడి చేసేందుకు విద్యాశాఖ, ఐటీశాఖ నడుంబిగించాయి. ఇందుకోసం డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సంఘాలు, ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. బ్లూవేల్‌ గేమ్‌ను కంట్రోల్‌ చేసేందుకు నిశింత్‌ పేరుతో మొబైల్‌ యాప్‌ను తీసుకొస్తున్నారు. ఈ యాప్‌ను తల్లిదండ్రులు తమ మొబైల్స్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. తద్వారా తమ పిల్లు ఏది చేస్తున్నారో తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందని ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌రంజన్‌ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షలకుపైగా ఈగేమ్‌ను ఆడుతున్నారని... ఈ ప్రాణాంతక గేమ్‌ను నియంత్రించేందుకే ఈ యాప్‌ను తీసుకొచ్చినట్టు యాప్‌ సృష్టికర్త రాఘవ మిమాని అన్నారు.

బ్లూవేల్‌ గేమ్‌తోపాటు విద్యారంగానికి చెందిన
సమావేశంలో బ్లూవేల్‌ గేమ్‌తోపాటు విద్యారంగానికి చెందిన అనేక అంశాలపై చర్చిస్తామని చెప్పిన విద్యాశాఖ అధికారులు వాటి గురించి ప్రస్తావనే చేయలేదని కొంతమంది పేరెంట్స్‌ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం నిశింత్‌ యాప్‌ ప్రమోషన్‌ తప్పా... పిల్లల భద్రతకు సంబంధించిన అంశాలపై ఏమాత్రం చర్చించలేదన్నారు. అయితే రోజురోజుకు పెరుగుతున్న కార్పోరల్‌ పనిష్మెంట్స్‌పైనా చర్చిస్తున్నట్టు డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కిషన్‌ అన్నారు. బ్లూవేల్‌ గేమ్‌ నియంత్రణకు తీసుకొచ్చిన నిశింత్‌ యాప్‌ ఏమేరకు ఉపయోగపడుతుందన్నది కాలమే నిర్ణయించాలి. ఇక ఇలాంటి యాప్‌ను ప్రభుత్వం చేయాల్సిందిపోయి... ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

08:54 - September 16, 2017

హైదరాబాద్ : గులాబీ స‌ర్కార్‌ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. ఇందిరమ్మ రైతుబాట పేరుతో 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. ఇప్పటికే అంశాల వారీగా ప్రభుత్వంపై విమ‌ర్శలు గుప్పిస్తున్న హ‌స్తం పార్టీ .. రైతు స‌మ‌న్వయ స‌మితుల‌ తీరుపై పోరు బాట ప‌ట్టింది. ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్న టీ కాంగ్‌ నేతలు.. క్షేత్రస్థాయి ఉద్యమానికి శ్రీ‌కారం చుట్టారు. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన గాంధీభ‌వ‌న్‌లో స‌మావేశ‌మైన పిసిసి కార్యవర్గం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు స‌మ‌న్వయ స‌మితుల‌ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ నెల 18 నుంచి 22 వ‌ర‌కు పార్టీ కార్యకర్తల శిక్షణా త‌ర‌గ‌తుల‌ను నిర్వహించనుంది.

టీ కాంగ్‌నేతలు టార్గెట్ చేయ‌నున్నారు.
వంద రోజుల పాటు సాగ‌నున్న ఇందిర‌మ్మ రైతు బాట‌లో కేసిఆర్ ఇచ్చిన హామీల‌ను టీ కాంగ్‌నేతలు టార్గెట్ చేయ‌నున్నారు. జీఓ 39పై రైతులతో క‌లిసి పోరాటం చేయనున్నారు. అంతేకాదు ద‌ళితులకు మూడెక‌రాల భూపంపిణీ, డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ హామీల‌పై అర్హులైన ల‌బ్దిదారుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీకరించనున్నారు. ఒకవేళ ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చని పక్షంలో..అధికారంలోకి వ‌చ్చాక తామే అమ‌లు చేస్తామ‌ని చెప్పనున్నారు. ల‌బ్దిదారుల డేటాను పూర్తిస్థాయిలో భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందిర‌మ్మ రైతు బాట ద్వారా ఓ వైపు కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూనే...మ‌రోవైపు పార్టీ ప్రచారాన్ని ఇంటింటికి చేర్చేందుకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ వ్యూహరచన చేస్తోంది. 

08:52 - September 16, 2017

హైదరాబాద్ : మిషన్‌ భగీరథకు ప్రభుత్వం సాంకేతిక హంగులు అద్దుతోంది. టెక్నాలజీ అనుసంధానంతో పనులను మరింత మెరుగుపర్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే మిషన్‌భగీరథ పనుల పరిశీలనతోపాటు ... అధికారుల మధ్య సమన్వయం కోసం ఉపయోగపడేలా ఓ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. అధికారుల పనితీరును కేటీఆర్‌ అభినందించారు. రియల్‌టైమ్‌ మానిటరింగ్‌తోపాటు యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ బాగున్నాయని ప్రశంసించారు. కోటి రూపాయల ప్రపంచ బ్యాంకు నిధులతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కాన్ఫరెన్స్‌ హాల్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన ఆయన.. డిసెంబర్‌ నాటికి ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటిని అందించబోతున్నామని ప్రకటించారు. నీళ్ల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని.. దాన్ని సరిదిద్దడానికే కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

ద్భుతంగా అమలుచేసిన ఘనత ఆర్‌డబ్ల్యూఎస్‌
సాగునీటి రంగంలో తెలంగాణను స్వయం సమృద్ధిగా మార్చడానికే మిషన్‌ భగీరథకు ముఖ్యమంత్రి రూపకల్పన చేశారని కేటీఆర్‌ చెప్పారు. సీఎం ఆలోచనను క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలుచేసిన ఘనత ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగానికే దక్కుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా భగీరథ ప్రాజెక్టును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారన్నారు. ఇందుకు అధికారులు, ఇంజనీర్ల పనితీరే కారణమని తెలిపారు. మిషన్‌ భగీరథ దేశానికే రోల్‌ మోడల్‌గా మారిందని.. ఇప్పటిఆకే 9 రాష్ట్రాల ప్రతినిథులు మిషన్‌ భగీరథ గురించి తెలుసుకోవడానికి, పనులను పర్యవేక్షించడానికి వచ్చారన్నారు. మిషన్‌ భగీరథ ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అయినా.. మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలోనే ప్రాజెక్టు గొప్పగా రూపుదిద్దుకుంటోందని మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా భగీరథ ఇంజనీర్లు, ఉద్యోగులతో కేటీఆర్‌ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు.

08:51 - September 16, 2017

హైదరాబాద్ : తెలంగాణ మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు జలసౌధలో కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి అనంతకుమార్‌సింగ్‌తో సమావేశమయ్యారు. పత్తికొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు. పత్తి మద్దతు ధర 4320 రూపాయలకన్నా తగ్గిన వెంటనే సీసీఐ రంగంలోకి దిగి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు కోరారు. పత్తిని తీయడానికి రైతులకు కాటన్‌ ప్లకింగ్‌ యంత్రాలు సబ్సిడీపై సరఫరా చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. రాష్ట్రం లో పత్తి సాగు పెరుగుతున్న నేపథ్యంలో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ లు తెలంగాణలోని ఈ-నామ్ మార్కెట్లలో ఏర్పాటు చేయాలని కోరారు. అక్టోబర్‌ 20లోపు 143 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు.

జీన్నింగ్‌ మిల్లులపై నోటిఫై
పత్తి కొనుగోలులో ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన సీసీఐ సిబ్బందిని నియమించాలని హరీశ్‌రావు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది కొరత ఉంటే మార్కెటింగ్‌ శాఖ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన కొంతమందిని సీసీఐ ఎంగేజ్‌ చేసుకోవచ్చని సూచించారు. పత్తి క్రయ విక్రయాలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలన్నారు. రైతులు పత్తి ఎక్కువ దూరం తీసుకెళ్లకుండా వారికి దగ్గరలోని జిన్నింగ్‌ మిల్లులపై నోటిఫై చేయాలని కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి అనంతకుమార్‌సింగ్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. నోటిఫై చేసిన కేంద్రాల పరిధిలోనే ఆయా గ్రామాల రైతులు పత్తిని అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది పత్తి రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో పూర్తి సహాయ సహకారాలను కేంద్రం అందిస్తుందని హరీశ్‌రావుకు హామీనిచ్చారు. 

08:50 - September 16, 2017

హైదరాబాద్ : సింగరేణి గుర్తింపు యూనియన్‌ ఎన్నికలను టీఆర్‌ఎస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రభావం చూపే ఈ ఎన్నికల్లో విజయం కోసం గులాబీ పార్టీ పక్కా ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా కోల్ బెల్ట్ ఏరియా ప్రజాప్రతినిధులతో పాటు.... కార్మిక సంఘం నేతలతో ఎంపీ కవిత ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణా ఉద్యమానికి అండగా నిలిచిన సింగరేణి కార్మికుల మద్దతు కూడగట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు.ప్రధానంగా ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలతో పాటు.... అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకోసం అమలు చేసిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. కార్మికులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్న సంకేతాలను ఎన్నికల్లో ఇవ్వాలన్న అభిప్రాయానికి వచ్చారు. వివాదాస్పదంగా మారిన వారసత్వ ఉద్యోగాల అంశంలో ప్రతిపక్ష పార్టీలు కోర్టు గడప దొక్కడంతోనే సమస్య ఎదురైందన్న విషయాన్ని కార్మికుల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ప్రకటించే మ్యానిఫెస్టోను నేతలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి ఆమోదంతో దీనిని విడుదల చేయనున్నారు. విపక్ష పార్టీలు అన్నీ ఏకమై ఎన్నికల్లో పోరాడుతున్న నేపథ్యంలో అందుకు దీటుగానే వ్యవహరించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. 

08:40 - September 16, 2017

హైదరాబాద్ : అధికారంలో ఉన్నప్పుడు రైతుల బాగోగులు పట్టించుకోని కాంగ్రెస్‌, టీడీపీలు ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలపై విషం చిముతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌ హయాంలో ఇందిరమ్మకమిటీలు వేసిన కాంగ్రెస్‌పార్టీకి తాము రైతుసమితులను ఏర్పాటు చేస్తుంటే అభ్యంతరం ఎందుకని ఆయన ప్రశ్నించారు. రైతు సమన్వయ సమితులకు ఎలాంటి అధికారాలు లేవన్న ఆయన.. రైతులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా మాత్రమే ఉంటారన్నారు. దీన్ని విపక్షాలు రాద్ధాంతం చేయడం తగదన్నారు.

రిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా
రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని కేసీఆర్‌ అన్నారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ఎత్తిపోతల పథకాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇరిగేషన్‌కు 45 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని కేసీఆర్ వెల్లడించారు.ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకానికి ఊహించని విధంగా సానుకూల స్పందన వచ్చిందని.. ప్రభుత్వం నాలుగు లక్షల యూనిట్లకు అంచనా వేస్తే..దాదాపు ఏడు లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తు చేసిన ప్రతిఒక్కరికీ గొర్రెల పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు పంపిణీ చేసిన జీవాల ఆరోగ్యంపైకూడా ప్రభుత్వం దృష్టిపెట్టిందని కేసీఆర్‌ అన్నారు. దీనికోసం సంచారవైద్యశాలలను ఆయన జెండాఊపీ ప్రారంభించారు. రాష్ట్రంలో వంద నియోజవర్గాలకు వంద అబులెన్స్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు.. పశువుల పెంపకందారుల ఉపయోగం కోసం 1962 సంఖ్యతో టోల్‌ఫ్రీనంబర్‌ను కూడా సీఎం ప్రారంభించారు.

మత్స్య, పాడిపరిశ్రమ రంగాలకు కూడా అత్యధిక ప్రాధాన్యత
రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంకోసం మత్స్య, పాడిపరిశ్రమ రంగాలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలతో ప్రతిపక్షాల గుండెల్లో గుబులు రేగుతుందన్నారు. విపక్షాలు ఎంతగోల చేసినా తమ దారిలో తాము సాగుతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

08:39 - September 16, 2017

గుంటూరు : అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు శాఖాధిపతులతో సమావేశమయ్యారు. శాఖ‌ల వారీగా అభివృద్ది, త్రైమాసికంలో సాధించిన వృద్ధి రేటుపై ప్రత్యేకంగా చర్చించారు... సేవా రంగంలో ఆశించిన వృద్ధి రాక‌పోవ‌డంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు...సేవా రంగం ద్వారానే ఎక్కువ ఉద్యోగాలు క‌ల్పించ‌గ‌ల‌మ‌ని...వెనుక‌బ‌డటానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. ప్రతి కుటుంబానికి నెల‌కు 10వేల ఆదాయం క‌ల్పించేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు.. 2017-18 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సాధించిన ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు.

వినీతిని సహించేది లేదు
ప్రభుత్వ శాఖల్లో అవినీతిని సహించేది లేదని..సమూలంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తప్పవన్నారు. 80 శాతం ప్రజల్లో సంతృప్తి తీసుకురావాలంటే అవినీతి ఏ రూపంలో ఉన్నా అరికట్టాల్సిందేనన్నారు. ప్రభుత్వశాఖలన్నీ తమ సేవలను ఆన్‌లైన్‌ చేస్తే ఫిర్యాదులు తగ్గడంతో పాటు అవినీతి అంతమవుతుందని చెప్పారు. ఇక శనివారం నుంచి బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. తనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కిందిస్థాయి వరకు బయోమెట్రిక్‌ పద్ధతిని పాటించాలన్నారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం
ప్రతిశాఖను కచ్చితంగా ఈ-ప్రగతి పరిధిలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి మంగళవారం సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. మీసేవతో పాటు అన్ని రకాల ప్రభుత్వ శాఖల సేవలకు ఒకే విధమైన సేవా ప్రమాణాలను తీసుకురావాలన్నారు. పలుశాఖలపై మీడియాలో వచ్చే వ్యతిరేక కథనాలను పరిశీలించి.. స్పందించడం అధికారులు నిరంతర బాధ్యతగా గుర్తించాలని సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు పనులు సకాలంలో పూర్తి చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎఎస్‌పీ కిందవున్న 150 పథకాలకు సంబంధించి..రాష్ట్ర వాటాగా కనీసం 4.39% నిధులు రాబట్టేందుకు గట్టిగా ప్రయత్నించాలన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసేందుకు ఎవరు ముందుకొచ్చినా సహకరిస్తామని సీఎం ప్రకటించారు. ఈ వ్యవహారంలో మొదటి నుంచి కఠినంగానే వ్యవహరించామని.. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వ శాఖలు చొరవ చూపాలన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా..ఆయన సేవలను చంద్రబాబు కొనియాడారు. మోక్షగుండం స్ఫూర్తితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నదుల అనుసంధానం చేపట్టామన్నారు.

పాతబస్తీలో కార్డన్ సర్చ్

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేశారు. బహదూర్ పూరా పీఎస్ పరిధిలో పలువురు పాత నేరాస్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ సోదాల్లో 250 పోలీసులు పాల్గొన్నారు.

08:21 - September 16, 2017

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేశారు. బహదూర్ పూరా పీఎస్ పరిధిలో పలువురు పాత నేరాస్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ సోదాల్లో 250 పోలీసులు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

నేడు కాకినాడ మేయర్ ఎన్నిక

తూర్పుగోదావరి : కాకినాడ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేట్లో మంత్రులు కళా వెంకట్రావ్, ప్రతిపాటి, పితాని త్రిసభ్య కమిటీ భేటీ నిర్వహించనున్నారు. సమావేశం తర్వాత మేయర్ ప్రకటన రానుంది. మేయర్ పదవికి అడ్డూరు లక్ష్మి శ్రీనివాస్, శుంకర శివప్రసన్న మధ్య పోటీ డిప్యూటీ మేయర్ కోసం కూడ గట్టి పోటీ ఉంది.

అనంతపురంలో దారుణం

అనంతపురం : జిల్లాలో దారుణం జరిగింది. గుత్తిలోని కుమ్మరవీధిలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలను యజమాని అడ్డుకొవడంతో యజమానిని దొంగలు కొట్టిచంపారు. 25తులాల బంగారం, రూ.5లక్షల చోరీ జరిగినట్టు తెలుస్తోంది.

08:15 - September 16, 2017

తూర్పుగోదావరి : కాకినాడ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేట్లో మంత్రులు కళా వెంకట్రావ్, ప్రతిపాటి, పితాని త్రిసభ్య కమిటీ భేటీ నిర్వహించనున్నారు. సమావేశం తర్వాత మేయర్ ప్రకటన రానుంది. మేయర్ పదవికి అడ్డూరు లక్ష్మి శ్రీనివాస్, శుంకర శివప్రసన్న మధ్య పోటీ డిప్యూటీ మేయర్ కోసం కూడ గట్టి పోటీ ఉంది. డిప్యూటీ మేయర్ రేసులో కాలా సత్తిబాబు, బాల కామేష్, త్రిమూర్తులు ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

08:14 - September 16, 2017

అనంతపురం : జిల్లాలో దారుణం జరిగింది. గుత్తిలోని కుమ్మరవీధిలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలను యజమాని అడ్డుకొవడంతో యజమానిని దొంగలు కొట్టిచంపారు. 25తులాల బంగారం, రూ.5లక్షల చోరీ జరిగినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం వీడియో క్లిక్ చేయండి.

 

శ్రీవారిని దర్శించుకున్న కామినేని

చిత్తూరు : ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వాస్పత్రిలో మోకాలు ఆపరేషన్ చేయించుకుని ఎలాంటి ఇబ్బందిలేకుండా తిరుమలకు కాలినడకన వచ్చానని ఆయన తెలిపారు.

 

నేడు ఛలో గరగపర్రుకు పిలుపునిచ్చిన దళిత సంఘాలు

పశ్చిమగోదావరి : నేడు గరగపర్రుకు దళిత సంఘాలు పిలునిచ్చాయి. గరగపర్రులో భారీగా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. రహదారుల వెంట చెక్ పోస్టుల ఏర్పాటు చేశారు.

నేటి నుంచి స్వచ్ఛతే సేవ కార్యక్రమం

గుంటూరు : ఏపీలో నేటి నుంచి అక్టోబర్ 2వరకు స్వచ్ఛతే సేవ కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్రంలో గ్రామస్థాయి వరకు స్వచ్చతే సేవ కార్యక్రమాలు జరుగుతాయని, ఇందులో గ్రామ సర్పంచ్, అధికారులు భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

నేడు హైదరాబాద్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

హైదరాబాద్ : నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ కు రానున్నారు. ఆయన శివం రోడ్డులోని వృత్తి విద్యా శిక్షణా సంస్తకు శంకుస్థాపన చేయనున్నారు.

నేడు పంచకుల కోర్టులో డేరా బాబా విచారణ

హర్యానా : నేడు పంచకుల కోర్టులో రెండు వేర్వేరు హత్య కేసుల్లో గుర్మిత్ ను పంచకుల కోర్టు విచారించనుంది. విచారణ సందర్బంగా కోర్టు వద్ద భారీగా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. 

07:05 - September 16, 2017

జీవుల పెంపకం లాభసాటిగా ఉండాలంటే మొదటగా మంచి రకాల జీవులను మనం కొనుగోళు చేయాలని, తర్వాత పిల్లలను కాపాడుకోవాలని, షెడ్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు షెడ్ లోకి నీరు రాకుండా చేసుకోవాలని, జీవుల పెరుగుదలకు ముఖ్యమైంది ఆహారమని, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోంటే మంచి లాభలుంటాయని, జీవుల పెంపకం గురించి మేము క్లాస్ లు కూడా నిర్వహిస్తున్నామని వెల్దండి కిరణ్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

Don't Miss