Activities calendar

17 September 2017

22:31 - September 17, 2017

సీపీఎం కేంద్రకార్యదర్శివర్గ సభ్యులు, దళిత్ శోషణ్ మంచ్ కన్వీనర్ వి.శ్రీనివాస్ రావు తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణం అని అన్నారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకే నోట్ల రద్దును తీసుకొచ్చారని ఆరోపించారు. అవినీతిని నిర్మూళించలేదని.. ఉగ్రవాదాన్ని అరికట్టలేదని చెప్పారు. బ్లాకుమనీ దారులతో కేంద్రం కుమ్మక్కైందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుందని విమర్శించారు. నోట్ల రద్దు వల్ల జీడీపీ ఒడిదుడుకులకు గురవుతోందన్నారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. గౌరీ లంకేష్ తోపాటు దబోల్కర్, పన్సారే, కల్బుర్గి.. ఈ నలుగురి హత్యలు ఒక ప్లాన్ ప్రకారం జరిగాయన్నారు. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లు హింసా రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు మోడీకి దాసోహమంటున్నారని పేర్కొన్నారు. 
మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...
'నోట్ల రద్దు దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణం. నోట్ల రద్దు వల్ల 3 నుంచి 4 లక్షల కోట్లు దేశానికి లాభామా...మోడీ ఎవరి చెవిలో పువ్వులు పెడతావు. నోట్ల రద్దు వల్ల జీడీపీ ఒడిదుడుకులకు గురవుతోంది. నిర్మాణ రంగంతోపాటు పలు రంగాలకు నేలచూపులు. జీఎస్టీతో రాష్ట్రాలకు తీరని నష్టం. కార్పొరేట్లకు సబ్సిడీలకు, రుణాల రద్దుపై మోడీకి ఉన్న శ్రద్ధ దళితులు స్కాలర్ షిప్ ల మొత్తానికి కేటాయించడంపై లేదు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో పరిస్థితి చేయి దాటుతోంది. నేరళ్ల, కరీంనగర్, దేవరాపల్లి, గరగపర్రు ఘటనలే నిదర్శనం. బిజెపి వాళ్ల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడుతున్నట్లుంది. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు మోడీకి దాసోహమంటున్నారు. మోడీ, బాబు, కేసీఆర్ ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో ఉన్నారు. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు... ఇద్దరు సీఎంలు ఇప్పుడు జీఎస్టీపై సన్నాయి నొక్కులు. గౌరీ లంకేష్ తోపాటు దబోల్కర్, పన్సారే, కల్బుర్గి ఈ నలుగురి హత్యకు ఒకే ప్లాన్, ఒకే ఆయుధం వాడారంటేనే తెలిసిపోతోంది పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న హత్యలివి. మావోయిస్టుల ప్రమేయం ఉందని బీజేపీతోపాటు కొందరు అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే హిందుత్వ శక్తులు మావోయిస్టుల చర్యను ఖండించాలి.. కానీ గౌరి హత్యను కొందరు స్వాగతిస్తున్నారు. అంతటితో ఆగకుండా సాగిరికా ఘోష్ తో పాటు పలువురు పేర్లు బయటికి చెబుతున్నారు. గతంలో ఇంత అతిగా ప్రదర్శించినవారికి సరైన గుణపాఠం నేర్పారు. ఆర్ ఎస్ ఎస్, బీజేపీ పుట్టుకే గాంధీ హత్యతో ప్రారంభమైంది. గాంధీని గాడ్సే హత్య చేసి ఒక సంస్కృతిని సృష్టించారు. ఇప్పటికీ వారు అదే సంస్కృతిని కొనసాగిస్తున్నారు. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లవి హింసా రాజకీయాలు. గాడ్సే సంస్కృతిని నిర్మూలిస్తే తప్ప..భారతదేశంలో శాంతియుత పరిస్థితులు పునరుద్ధరించబడవు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విధానాలతో కూటమికి ప్రయత్నిస్తాం. ప్రజా ఉద్యమాల నుంచి ప్రత్యామ్నాయ కూటమి రావాలి. అవకాశవాద పార్టీలతో కూటమి కడితే లాభం లేదు. బెంగాల్లో గతంలో కంటే వెనుకబడిన మాట వాస్తవం. దళిత్ శోషణ్ మంచ్ ద్వారా మరింతగా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇప్పటికే చేపట్టిన ఉద్యమాలు ఫలితాలిస్తున్నాయి'. అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:49 - September 17, 2017

ఢిల్లీ : కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్‌లో తెలుగు తేజం మెరిసింది. వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఓటమికి బదులు తీర్చుకుంది. రసవత్తరంగా సాగిన ఫైనల్‌ పోరులో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై 22-20, 11-21, 21-18తో విజయం సాధించి...కొరియా ఓపెన్‌ టైటిల్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డ్ సృష్టించింది. 

కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్లో తెలుగు తేజం పీవీ సింధు విజృంభించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తనను ఓడించిన ప్రత్యర్థి ఒకుహరపై ప్రతీకారం తీర్చుకుంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో భారత స్టార్‌ షట్లర్‌ సింధు జయకేతనం ఎగురవేసింది. 

ఇరువురి క్రీడాకారిణుల మధ్య హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌లో ఒకుహారా 12-9 తో ఆధిక్యంలో నిలిచిన సమయంలో సింధు వరుసగా పాయింట్లు సాధించి స్కోరును సమం చేశారు. చివరకు తొలి గేమ్ ను 22-20తేడాతో సొంతం చేసుకుంది. 

రెండో గేమ్‌లో ఒకుహారా ఆది నుంచి పైచేయి సాధిస్తూ సింధును వెనక్కునెట్టింది. ఏ దశలోనూ సింధుకు అవకాశం ఇవ్వని ఒకుహారా అదే జోరును కొనసాగించి 11-21 పాయింట్లతో రెండో గేమ్‌ సాధించింది. దీంతో మూడో గేమ్‌ ఉత్కంఠగా మారింది. సింధు 19-16 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న దశలో ఒకుహోరా మరోసారి పుంజుకునే యత్నం చేసింది. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య 56 సెకన్ల సుదీర్ఘమైన ర్యాలీ జరిగింది. ఇక్కడ ఒకుహారా పాయింట్ సాధించనప్పటికీ, సింధు మాత్రం ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా 3 పాయింట్ల తేడాతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సాధించింది. దాంతో కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను సింధు తన ఖాతాలో వేసుకుంది. 

కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన భారత స్టార్‌ షట్లర్‌ సింధుపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యతో పాటు అమితాబచ్చన్, వీరేంద్ర సెహ్వాగ్‌, కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో కొనియాడారు. 

 

21:45 - September 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఆడ బిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణికీ సర్వం సిద్ధమైంది.రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం మొదలై బుధవారం వరకు కొనసాగనుంది.  ఉపాధి లేక అవస్థలు పడుతున్న నేతన్నకు పని కల్పించడమే లక్ష్యంగా బతుకమ్మ చీరల కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. సోమవారం నుంచి  మొదలై బుధవారం వరకు పంపిణీ కొనసాగుతుంది. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు కేసీఆర్ బతుకమ్మ చీరలను కానుకగా ఇస్తున్నారు. నేతన్నలను కష్టాల నుంచి ఆదుకునేందుకు ..వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి సంకల్పించింది. 

బతుకమ్మ చీరల పంపిణీ  కార్యక్రమ బాధ్యతను కేసీఆర్ మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ జౌళి మరియు చేనేత శాఖ ప్రణాళిక బద్ధంగా పనిచేసింది. బతుకమ్మ చీరలను 18ఏళ్లు నిండి.... తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సుమారు కోటీ నాలుగు లక్షల చీరలు సిద్ధం చేశారు. ఇందుకోసం సుమారు 222 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మొత్తం చీరల్లో సగానికిపైగా రాష్ట్రం నుంచే సేకరించింది. ఒక్క సిరిసిల్లలోనే 52 లక్షల చీరలు ఉత్పత్తి అయ్యాయి. దీంతోపాటు జాతీయ స్థాయి టెండరింగ్ ప్రక్రియ ద్వారా మిగిలిన చీరలను సేకరించారు. వచ్చే ఏడాది నుండి పూర్తిగా ఇక్కడి నేతన్నల నుంచే  సేకరించేలా నిర్ణయించారు. 

ఇక మహిళల అభిరుచి మేరకు బతుకమ్మ చీరలు డిజైన్ చేశారు. సుమారు 500 డిజైన్లు.. పలు రకాల రంగుల్లో ఈ చీరలు తయారు అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చీరల తయారీ తాలుకు వస్ర్తాల నాణ్యత, తయారీ, ప్రింటింగ్, కొంగు, బార్డర్లు, ప్యాకేజీంగ్ వంటి అంశాలపైనా శ్రద్ధ వహించారు. చీరల పంపీణీ కోసం ప్రత్యేకంగా ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో  పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టారు.  

21:30 - September 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ రైతులపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై గేదెలు పంపిణీ చేస్తామన్నారు. విజయ డైరీ తరహాలో మిగతా డైరీలకు 4 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో క్షీర విప్లవం దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర రైతు సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో పాల ఉత్పత్తిదారులతో సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2 లక్షల మంది పాడి రైతులున్నారని తెలిపారు. రాష్ట్రానికి కోటి లీటర్ల పాల అవసరం ఉండగా.. డైరీల ద్వారా మొత్తం 7 లక్షల లీటర్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. రెండు లక్షల మంది పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై గేదెలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు 75 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. గేదెలను రైతులే నేరుగా కొనుగోలు చేయాలని సూచించారు. నెల రోజుల్లో డబ్బులు సమకూర్చుతామని.. రెండు నెలల్లో గేదెలను కొనాలన్నారు. 7లక్షల లీటర్ల నుంచి 10 లక్షల లీటర్ల దాకా పాల ఉత్పత్తి పెరగాలన్నారు సీఎం. త్వరలోనే క్షీర విప్లవం కొనసాగించడానికి ఒక పథకం తెస్తామన్నారు. విజయ డైరీ తరహాలోనే మిగతా రైతులకు 4 రూపాయల ప్రోత్సాహకం అందిస్తామన్నారుదసరాకు ముందే ఇది అమలవుతుందని సీఎం హామీ ఇచ్చారు. 

దళారీలతో రైతులు దోపిడీ కాకుండా ఉండేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఏ రైతు తన పంట ధాన్యం అమ్ముడుపోదని భయపడాల్సిన అవసరం లేదన్నారు. రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర రైతు సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పంట కొనుగోలు కోసం వారికి 5 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ కూడా ఉంటుందన్నారు. మండలానికో రైతు సంఘాన్ని నియమించుకోవాలన్నారు. 

దేవుడు కరుణిస్తే రెండేళ్లలో గోదావరి నీళ్లు తీసుకువచ్చి తెలంగాణ ప్రజల కాళ్లు కడుగుతానన్నారు. గోదావరి నీళ్లు వస్తే చెరువులు ఎండిపోయే పరిస్థితి ఉండదన్నారు. రాష్ట్రంలో 60 ఏళ్లగా అస్తవ్యస్థపాలన సాగిందని, వేరుపడ్డ సంసారం బాగుపడడానికి సమయం పడుతుందన్నారు. భూముల సర్వే పూర్తైతే రైతులకు ఎకరానికి 4 వేలు ఇస్తామన్నారు. మరోవైపు పాడి రైతు కుటుంబాలకు ఒక్కో ఇంటికి ఆరు చెట్లు పంపిణి చేస్తామని..వాటిని పెంచాల్సిన బాధ్యత ఆ కుటుంబాలదే అన్నారు. 

గుడివాడ ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం

కృష్ణా : గుడివాడ ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బార్లు, రెస్టారెంట్ల వద్ద ట్రాఫిక్ ను పట్టించుకోకుండా నడిరోడ్డుపై వాహనదారులను ఎస్సై రామకృష్ణ నిలిపివేశారు. వాహనదారుల పట్ల అసభ్యంగా మాట్లాడిన ట్రాఫిక్ ఎస్సై రామకృష్ణ, వన్ టౌన్ ఏఎస్సై దాసు ఎస్పీకి వాహనదారులు ఫిర్యాదు చేశారు. 

దేశంలో 46 శాతం ఆస్తులు ఆర్యవైశ్యులవే : కంచె ఐలయ్య

హైదరాబాద్ : దేశంలో 46 శాతం ఆస్తులు ఆర్యవైశ్యులవేనని ప్రొ.కంచె ఐలయ్య అన్నారు. బడా పారిశ్రామికవేత్తలంతా వైశ్యులేనని చెప్పారు. మోడీ బీసీ వైశ్యుడు, అమిత్ షా ఆర్యవైశ్యుడని పేర్కొన్నారు. వారి సంపాదనలో ఒక శాతం పేదలకు ఇస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. బీజేపీకి ఇచ్చే విరాళాల్లో 5 శాతం ఇస్తే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఉండవు అని అన్నారు. బీసీలకు ప్రైవేట్ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్కెట్లలో రైతు కమిటీలు వేయాలన్నారు. 
 

రేపు ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్ అంత్యక్రియలు

ఢిల్లీ : రేపు ఉదయం ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్ అంత్యక్రియలు జరుగనున్నాయి. జాతీయ జెండాలను అవనతం చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. 

 

ఒంగోలు రిమ్స్ లో దారుణం

ప్రకాశం : ఒంగోలు రిమ్స్ లో దారుణం జరిగింది. ప్రసవం కోసం మహిళ ఆస్పత్రికి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, బిడ్డ మృతి చెందారు. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన చెందారు. 

20:51 - September 17, 2017
20:42 - September 17, 2017

హైదరాబాద్ : దర్శకుడు రాజమౌళికి అక్కినేని జాతీయ అవార్డు ఇవ్వడం సముచితమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శిల్పాకళా వేదికలో దర్శకుడు రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై, వెంకయ్యనాయుడు మాట్లాడారు. శ్రద్ధ, ఆసక్తిని పెంచడానికే పురస్కారాలు ఇస్తారని చెప్పారు. తెలుగు విలక్షణ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు అని కొనియాడారు. రెండు లక్షల మందికి సిని పరిశ్రమ ఉపాధి 
కల్పిస్తుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:17 - September 17, 2017

హైదరాబాద్ : దర్శకుడు రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. శిల్పాకళా వేదికలో పురస్కారాల కార్యక్రమం నిర్వహించిచారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ తనకు అక్కినేని జాతీయ పురస్కారం రావడం సంతోషకరమన్నారు. అక్కినేని నాగేశ్వర్ గొప్పవ్యక్తి అన్నారు. డాక్టర్లు, మందులతో నాగేశ్వర్ 14 సం.లు బతికితే.... విల్ పవర్ తో ఇంకో 14 సం.లు బతికారని తెలిపారు. చావుకే ఆయన వార్నింగ్ ఇచ్చి బతికారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, హీరో నాగార్జున పాల్గొన్నారు. 
 

20:10 - September 17, 2017

అనంతపురం : బర్మాలో సైన్యం దాడులతో దేశంలోకి వచ్చిన రోహింగ్యాలను గుర్తించి వెళ్ళగొడతామని కేంద్రం చెప్పడం దారుణమని సీఐటీయూ నాయకులు గఫూర్‌ అన్నారు. రోహింగ్యాలపై అక్కడి సైన్యం అఘాయిత్యాలకు పాల్పడుతున్నా ఏమిచేయలేని పరిస్థితి నెలకొందని అనంతపురంలో అన్నారు. వారిని కాందిశీకులుగా గుర్తించి వారికి కేంద్రప్రభుత్వం ఆశ్రయం ఇవ్వాలని గఫూర్ డిమాండ్‌ చేశారు.

 

20:05 - September 17, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని వేమగిరి పవర్‌ ప్లాంట్‌లో కార్మికుల తొలగింపుపై ఉద్యమం ఉధృతమవుతోంది. పలు రూపాల్లో నిరసనలు తెలుపుతున్న కార్మికులకు మద్దతుగా వైసీపీ నేత కందుల దుర్గేశ్‌ దీక్షకు దిగారు. వేమగిరి సెంటర్‌ లో ఆయన దీక్ష చేపట్టడంతో మాజీ మంత్రి పిల్లి సుభాష్‌తో పాటు పలువురు నేతలు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఇక దీక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

19:55 - September 17, 2017

హైదరాబాద్ : జనసేన పార్టీ సభ్యత్వ నమోదుపై ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ రివ్యూ నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఆన్‌లైన్‌లో జరిగిన ఈ సమీక్షలో సాఫ్ట్‌వేర్, సాంకేతిక వివరాలను ఐటీ విభాగం నిపుణులు పవన్ కల్యాణ్‌కు వివరించారు. సాఫ్ట్‌వేర్, యాప్‌ను పరిశీలించిన అనంతరం... కొన్ని మార్పులు, చేర్పులను సూచించారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదును కూడా  ప్రారంభించనున్నట్లు పవన్‌కల్యాణ్ తెలిపారు. 

రూ.222 కోట్లతో 1.4 కోట్ల చీరలు పంపిణీ : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : రూ.222 కోట్లతో 1.4 కోట్ల చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలోనే 52 లక్షల చీరల తయారీ అవుతుందని అన్నారు. చీరల పంపిణీ కోసం గ్రామాలు, పట్టణాల్లో పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 18 ఏళ్లు నిండి తెల్లరేషన్ కార్డులో పేరున్న ప్రతి ఆడపడచు అర్హురాలని అన్నారు. 

 

19:29 - September 17, 2017
19:26 - September 17, 2017

రాజ్‌నాథ్ ప్రసంగంపై కార్యకర్తల పెదవి విరుపు

నిజామాబాద్‌ : జిల్లాలో బీజేపీ నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ప్రసంగంపై కార్యకర్తల అసహనం వ్యక్తం చేశారు. తన ప్రసంగంలో... రాజ్‌నాథ్ కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. తెలంగాణ స్వాతంత్ర పోరాటాన్ని పక్కన పెట్టి దేశస్వాతంత్ర పోరాటంపై ప్రసంగం చేశారు. మోడీ పాలన గురించి గొప్పలు చెప్పడానికి ఆయన పరిమితమయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తూ పార్టీ నిర్వహించిన ఈ సభలో రాజ్‌నాథ్ ప్రసంగం విని కార్యకర్తలు పెదవి విరిచారు.

 

19:22 - September 17, 2017

నిజామాబాద్‌ : జిల్లాలో బీజేపీ నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ప్రసంగంపై కార్యకర్తల అసహనం వ్యక్తం చేశారు. తన ప్రసంగంలో... రాజ్‌నాథ్ కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. తెలంగాణ స్వాతంత్ర పోరాటాన్ని పక్కన పెట్టి దేశస్వాతంత్ర పోరాటంపై ప్రసంగం చేశారు. మోడీ పాలన గురించి గొప్పలు చెప్పడానికి ఆయన పరిమితమయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తూ పార్టీ నిర్వహించిన ఈ సభలో రాజ్‌నాథ్ ప్రసంగం విని కార్యకర్తలు పెదవి విరిచారు.

 

19:19 - September 17, 2017

సంగారెడ్డి : కాలుష్య భూతం వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పచ్చని పల్లెల మధ్య పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో.. అక్కడి జనం ఊర్లను ఖాళీ చేసే పరిస్థితి నెలకొంది. ప్రశాంతమైన జీవనం కాస్తా.. పొగ కాలుష్యంతో పొగచూరిపోయింది. సంగారెడ్డి జిల్లా, కొండాపూర్‌ మండలంలోని కాలుష్య కారక పరిశ్రమలపై స్పెషల్ ఫోకస్. 

జనావాసాల మధ్య కాలుష్య కారక పరిశ్రమల్ని ఉంచబోమని.. మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన హామీ వాస్తవ రూపం దాల్చలేదు. దీంతో పచ్చని పల్లెలు కాలుష్యంతో అల్లాడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో పరిశ్రమలతో ప్రజలు సతమతమైపోతున్నారు. కొండాపూర్‌ మండలంలో పన్నెండు టైర్ల కంపెనీలు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. రాష్ట్రం నలు మూలల నుండి పాత టైర్లను సేకరించి, వాటిని అత్యధిక ఉష్ణోగ్రతతో కరిగించి తిరిగి తయారు చేస్తున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా వీటిని కలిగించడంతో వచ్చే దుర్వాసనతో.. ఇక్కడి ప్రజలకు ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతోంది. పంటలు నాశనమవుతున్నాయి. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. 

ఇక్కడికి పరిశ్రమలు రానప్పుడు హాయిగా జీవించామని గ్రామస్తులంటున్నారు. ఇప్పుడు భూ గర్భ జలాలు పూర్తిగా కాలుష్యమయ్యాయంటున్నారు.  ఐదారు గ్రామాల ప్రజలు బయట నుండి తాగునీటిని తెప్పించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు వేసిన పంటలు నాశనమవుతున్నాయి. చాలా మంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఇక్కడి కాలుష్యకారక పరిశ్రమలను మూసివేయాలని కోరుతూ.. రైతుసంఘం ఆధ్వర్యంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. 

పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుందని ఇక్కడి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇక్కడి పరిశ్రమల్లో స్థానికులకు ఎలాంటి ఉపాధి దొరకలేదు. మొత్తం యూపీ, బీహార్, ఒడిషాల నుంచి కార్మికుల్ని పిలిపించి పనులు చేయిస్తున్నారు. 

ఇంతటి దయనీయ స్థితిలో ప్రజలు బతకాల్సిన పరిస్థితులు ఉంటే.. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడట్లేదు. ప్రజలు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోవట్లేదు. హాయిగా బతికే తమ జీవితాల్లోకి కాలుష్య పరిశ్రమలు వచ్చి.. చిచ్చు పెట్టాయని రైతులు వాపోతున్నారు. 

పాత టైర్ల కంపెనీల యజమానులు ఎవరూ కంపెనీల దరిదాపుల్లోకి రారు. కానీ లాభాలు మాత్రం తీసుకుంటున్నారు. కనీస తనిఖీలు నిర్వహించని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు.. ప్రజలిచ్చిన ఫిర్యాదుల్ని బుట్టదాఖలు చేస్తున్నారు. 

19:15 - September 17, 2017

హైదరాబాద్ : మంత్రి హరీష్‌రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా నిలచి ప్రాణాపాయం నుంచి కాపాడారు. మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన చంద్రం దంపతుల కుమార్తె ఏడేళ్ల అక్షయ పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసినా.. వ్యాధి నయం కాలేదు. మరోసారి ఆపరేషన్ చేస్తే కాని అక్షయ ప్రాణాలతో బయటపడదని వైద్యులు నిర్ధారించారు. ఇప్పటికే చిన్నారి కోసం ఉన్నదంతా ఖర్చు చేసిన అక్షయ తండ్రి మరోసారి ఆపరేషన్ చేయించే స్థోమత లేక సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తమ పాపను కాపాడాలంటూ వేడుకున్నారు. ఈ విషయం మంత్రి హరీష్‌రావు దృష్టికి వెళ్లడంతో చంద్రంను తన వద్దకు పిలిపించుకుని అక్షయ చికిత్స కోసం అయ్యే ఖర్చును సీఎం ఫండ్‌ నుంచి మంజూరు చేయించారు. ప్రస్తుతం శస్త్ర చికిత్స జరిగిన అక్షయ కోలుకుంటోంది. తమకు చేసిన సాయానికి అక్షయ కుటుంబసభ్యులు.. హరీష్‌రావును కలిసి కృతజ్ఞతలు చెప్పారు. 

 

జ‌ల‌క‌ళ సంత‌రించుకున్న జూరాల ప్రాజెక్టు

మహబూబ్‌ నగర్‌ : జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు జ‌ల‌క‌ళ సంత‌రించుకుంది. ఎగువన కుర‌స్తున్న వ‌ర్షాల‌తో జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో 16 గేట్ల ద్వారా లక్షా 44 వేల 842 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుద‌ల చేసారు. 

19:08 - September 17, 2017

మహబూబ్‌ నగర్‌ : జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు జ‌ల‌క‌ళ సంత‌రించుకుంది. ఎగువన కుర‌స్తున్న వ‌ర్షాల‌తో జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో 16 గేట్ల ద్వారా లక్షా 44 వేల 842 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుద‌ల చేసారు. అటు నెట్టంపాడు ఎత్తిపోత‌ల ద్వారా 2250 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భీమా ఎత్తిపోత‌ల ద్వారా 1300 క్యూసెక్కులు,కోయిల‌సాగ‌ర్ ద్వారా 1300 క్యూసెక్కులు, ఎడ‌మ కాలువకు 1250 క్యూసెక్కులు, కుడి కాలువకు 872 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఆదివారం కావడంతో..జూరాల ప్రాజెక్టులో నీటిపరవళ్లను చూసేందుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. 

 

19:06 - September 17, 2017
19:04 - September 17, 2017

నిజామాబాద్ : టీఆర్‌ఎస్ నేత డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి అరవింద్.. కమలం తీర్థం పుచ్చుకున్నారు. నిజామాబాద్‌లో కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సమక్షంలో అరవింద్ బీజేపీలో చేరారు. నిజామాబాద్‌లో బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తోంది. 

 

19:00 - September 17, 2017

విజయవాడ : అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో విజయవాడ మధురానగర్‌లో సీపీఎం నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావు ఈ దీక్షలను ప్రారంభించారు. ఇదే డిమాండ్‌తో ఈనెల 20న ఎమ్మార్వో కార్యాలయం వద్ద  మహాధర్నా నిర్వహించాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. ఇంటింటికి తెలుగుదేశం పేరుతో టీడీపీ నేతలు మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని బాబూరావు ఆరోపించారు. 

 

18:55 - September 17, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో క్షీర విప్లవం దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పాడి రైతులకు సబ్సిడీపై గేదెల పంపిణీ, విజయ డైరీకి ఇచ్చినట్లే మిగతా డైరీలకు 4 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తామని సీఎం ప్రకటించారు. ప్రగతి భవన్‌లో పాడి రైతులతో సమావేశమైన ఆయన.. రాష్ర్టానికి కోటి లీటర్ల పాలు అవసరం ఉందన్నారు. 2 లక్షల మంది పాడి రైతులకు సబ్సిడీపై గేదెలను పంపిణీ చేస్తామన్న సీఎం.. ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు 75 శాతం సబ్సిడీ, మిగతా వారికి 50 శాతం సబ్సిడీ వర్తిస్తుందన్నారు. 

దర్శకుడు రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కారం ప్రదానం

హైదరాబాద్ : దర్శకుడు రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. శిల్పాకళా వేదికలో జరిగిన పురస్కారోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్ హాజరయ్యారు. 

17:58 - September 17, 2017

కేరళ : జిమిక్కి కమల్‌ సాంగ్‌ దుమ్ము రేపుతోంది.. కేరళలోని కొచ్చిలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్ కామర్స్‌ కాలేజ్‌ స్టుడెంట్స్‌ చేసిన డ్యాన్స్‌కు వ్యూయర్స్‌ ఫిదా అయిపోయారు.. యూ ట్యూబ్‌లో ఆగస్టు 30న రిలీజైన ఈ డ్యాన్స్‌ను దాదాపు కోటిన్నర మంది ఈ పాటను చూశారు.. ప్రముఖ మ‌ల‌యాళీ న‌టుడు మోహ‌న్ లాల్ న‌టించిన‌ వెలిప‌డింతె పుస్తకం అనే సినిమాలోని సాంగే ఈ జిమిక్కి క‌మల్‌.. ఓనం పండుగ రోజు సంప్రదాయ దుస్తులు వేసుకున్న కాలేజీ విద్యార్థినులు, కాలేజీ స్టాఫ్ క‌లిసి జిమిక్కి క‌మల్‌కు స్టెప్పులేశారు.. 
నటి సుమా అదిరిపోయే డ్యాన్స్‌
జిమిక్కి పాటకు యాంకర్‌ సుమ కూడా స్టెప్పులేశారు.. ఈ పాటకు వేసిన డ్యాన్స్‌ను వీడియో తీసి నెట్‌లో పెట్టారు.. సుమ పాటకు కూడా వీక్షకులు లైకుల మీద లైకులు కొట్టేస్తున్నారు..

 

17:54 - September 17, 2017

గుజరాత్ : దేశంలో మరో బృహత్తర ప్రాజెక్టును గుజరాత్‌ కెవాడియాలో ప్రధాని మోదీ ప్రారంభించారు.. 56 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు.. 1961లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి దశలవారీగా ప్రాజెక్టు నిర్మాణం సాగింది. నర్మద నదిపై 30 భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు రచించగా వాటిలో సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ అతిపెద్దది. ఈ ఏడాది జూన్‌ 17న డ్యామ్‌ గేట్లు మూసివేసి.. ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138.68 మీటర్లకు పెంచారు. దీంతో నీటి నిల్వ సామర్ధ్యం 4.73 మిలియన్‌ ఎకరపు అడుగులకు పెరిగింది. ఎత్తు పెంచిన డ్యామ్‌నే ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు. జలాశయం లోతు 163 మీటర్లుగా ఉంది.. దాదాపు 30 గేట్లున్న సాగర్‌ సరోవర్‌ డ్యామ్‌లో ఒక్కో గేటు బరువు 450 టన్నులకు పైగా ఉంటుంది. ఒక గేటు మూయాలంటే గంట పడుతుంది. డ్యామ్‌ ఎత్తు పెంచడంతో నీటినిల్వ సామర్ధ్యం పెరిగి గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలు అత్యంత ప్రయోజనం పొందనున్నాయి. తాగునీరు అందడం ద్వారా 4 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. దాదాపు 18 లక్షల హెక్టార్లు సాగులోకి వస్తాయి. ఇంతటి ప్రాముఖ్యమైన ప్రాజెక్టును మోదీ తన పుట్టినరోజున ప్రారంభించబోతున్నారు..

 

17:47 - September 17, 2017

విశాఖ : విశాఖపట్నం పోర్టు భూములను ఐటీ కంపెనీలకు దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం వ్యతిరేకించింది. సాలిగ్రామపురంతో పాటు ఎయిర్‌ పోర్టు దగ్గర ఉన్న 200 ఎకరాలను ఐటీ కంపెనీలకు 60 ఏళ్ల లీజుకు ఇచ్చే ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండ్‌ చేసింది. లేకపోతే ఉద్యమం తప్పదని సీపీఎం నేత నర్సింగరావు హెచ్చరించారు. 

 

17:40 - September 17, 2017

హైదరాబాద్ : దళారీలతో రైతులు దోపిడీ కాకుండా ఉండేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఏ రైతు తన పంట ధాన్యం అమ్ముడుపోదన్న భయపడాల్సిన అవసరం లేదన్నారు. రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర రైతు సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పంట కొనుగోలు కోసం వారికి 5 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ కూడా ఉంటుందన్నారు. 

 

భారత్ స్కోర్ 281/7

చెన్నై : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేయాల్సివుంది. ఆస్ట్రేలియా విజయలక్ష్యం 282 పరుగులుగా ఉంది. 

 

17:28 - September 17, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని రాజమండ్రిలో.. ఇవాళ తెల్లవారుజాము నుండి భారీగా వర్షం కురుస్తోంది. నగరంలోని పలుప్రాంతాలు జలమయమయ్యాయి. రాజమండ్రి రైల్వేస్టేషన్ నుండి కోటిపల్లి బస్టాండ్‌ వెళ్లే రహదారి పూర్తిగా నీట మునగడంతో..  వాహనదారుల రాకపోకలకు అంతరాయం కలిగింది. నీరు నిలిచిపోవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. 

 

17:22 - September 17, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో సేవ్‌ బైసన్‌ పోలో గ్రౌండ్‌ అంటూ సిటిజన్‌ వాక్‌ జరిగింది. ఈ వాక్‌లో పార్టీ నేతలు, యువత తరలిరాగా.. పరేడ్‌ గ్రౌండ్ నుంచి బైసన్‌ పోలో గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సంతకాల సేకరణ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ పాల్గొన్నారు. పరేడ్‌ గ్రౌండ్ ప్రాంతాన్ని కనుమరుగు చేయవద్దని, నూతన సెక్రటరియేట్ నిర్మాణాన్ని మానుకోవాలని ప్రొఫెసర్‌ కోదండరాం చెప్పారు. సెక్రటరియేట్‌ నిర్మాణం జరిగితే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయన అన్నారు. 

 

హార్థిక్ పాండ్యా హాఫ్ సెంచరీ

ఢిల్లీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ హార్థిక్ పాంద్యా హాఫ్ సెంచరీ చేశాడు. వరుసగా మూడు సిక్స్ లు బాదాడు. 

 

16:39 - September 17, 2017

భద్రాద్రి కొత్తగూడెం : అధికార పార్టీకి చెందిన కార్మిక సంఘం టీజీబీకేఎస్ ప్రలోభానికి కార్మికులు లొంగొద్దని... సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు సూచించారు. స్థానిక టీఆర్ ఎస్ నేతలు డబ్బు మూటలు, మద్యంతో ఎర చూపుతారన్నారు. ఒక్కో కార్మికుడికి 5వేల రూపాయలు ఇస్తామని మాయ చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో సీఐటీయూ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సీఐటీయూ, జేకేఓసీ కార్మిక సంఘాలు సమావేశమయ్యాయి.. ఈ భేటీకి సాయిబాబు హాజరయ్యారు.

 

బీజేపీలో చేరిన డిఎస్ కుమారుడు అరవింద్

నిజామాబాద్ : టీఆర్ ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో అరవింద్ బీజేపీలో చేరారు. 

16:26 - September 17, 2017
16:24 - September 17, 2017

హైదరాబాద్ : సెప్టెంబర్‌ 17ను విలీన దినంగా గుర్తించాలని టీజాక్ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ రోజును గుర్తు చేసుకుంటే విలీన ప్రయాణం ఎలా జరిగిందో తెలుస్తుందని అన్నారు. హైదరాబాద్‌లోని టీజాక్ కార్యాలయంలో కోదండరాం జాతీయ జెండా ఎగురవేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారికి నివాళులు అర్పించారు.

 

16:04 - September 17, 2017

హైదరాబాద్ : ఉద్యోగానికి రాజీనామా చేసి.. అణగారిన ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్నానని కంచె ఐలయ్య అన్నారు. మాకు పురుగన్నం మీకు పెరుగన్నమా అని.. రెండే నినాదాలు ఉంటాయని ఆయన తెలిపారు. బీజేపీకి ఆర్యవైశ్యులు ఇచ్చే డొనేషన్‌లో.. 5 శాతం తనకిస్తే ఒక్క ఆత్మహత్య లేకుండా చేసే బాధ్యత తనదని చెప్పారు. 

 

15:57 - September 17, 2017

హైదరాబాద్ : రెండేళ్లలో గోదావరి నీళ్లతో మీ కాళ్లు కడుగుతానని సీఎం కేసీఆర్ చెప్పారు. గోదావరి నీళ్లు వస్తే మన చెరువులు ఎండిపోవని తెలిపారు. ప్రగతిభవన్ లో నిర్వహించిన పాల ఉత్పత్తిదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మనమందరం ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ కు రోజుకు 40 లారీల చేపలు వస్తున్నాయని తెలిపారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి లీటర్ల పాలు అవసరమన్నారు. ఏడు లక్షల లీటర్ల పాలు మాత్రమే లభిస్తున్నాయని చెప్పారు. ప్రజలకు అవసరమైన పాలు లభించడం లేదన్నారు. రైతులకు మద్దతు ధర లభించాలంటే గ్రామానికో రైతు సంఘం ఉండాలన్నారు. 80 ఏళ్ల తర్వాత రికార్డుల సర్వే చేస్తున్నామని తెలిపారు. ఫుల్ వీడియో కోసం 

 

రెండేళ్లలో గోదావరి నీళ్లు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : గోదావరి నీళ్లు వస్తే మన చెరువులు ఎండిపోవని సీఎం కేసీఆర్ తెలిపారు. రెండేళ్లలో గోదావరి నీళ్లతో మీ కాళ్లు కడుగుతానని చెప్పారు. రైతులకు మద్దతు ధర లభించాలంటే గ్రామానికో రైతు సంఘం ఉండాలన్నారు. తెలంగాణలో ప్రజలకు అవసరమైన పాలు లభించడం లేదన్నారు. ఏడు లక్షల లీటర్ల పాలు మాత్రమే లభిస్తున్నాయని చెప్పారు. 80 ఏళ్ల తర్వాత రికార్డుల సర్వే చేస్తున్నామని తెలిపారు. 

 

ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : మనమందరం ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రగతిభవన్ లో పాల ఉత్పత్తిదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ కు రోజుకు 40 లారీల చేపలు వస్తున్నాయని తెలిపారు. రైతులకు ఎరువులు కొరత లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి లీటర్ల పాలు అవసరమన్నారు. గోదావరి నీళ్లు వస్తే మన చెరువులు ఎండిపోవని తెలిపారు. 

15:19 - September 17, 2017

విశాఖ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.. పర్యావరణహిత ఇంధనానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించారు.. పర్యావరణ పరిరక్షణపై విశాఖలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ సదస్సుకు చంద్రబాబు హాజరయ్యారు.. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమేశ్‌ రంగనాథన్‌ హాజరయ్యారు.

 

సీఎం కేసీఆర్ తో పాల ఉత్పత్రిదారుల సమావేశం

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో పాలఉత్పత్రిదారులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం పాల ఉత్పత్తిదారులను ఉద్దేశించి మాట్లాడారు. వారికి పలు హామీలు ఇచ్చారు. 

 

13:58 - September 17, 2017
13:57 - September 17, 2017

ఖమ్మం : నిజాం సైన్యాలు, రజాకార్లు జరిపిన అకృత్యాలు, అన్యాయాలపై అది వెల్లువెత్తిన తిరుగుబావుటా. బాంచెన్‌ నీ కాల్మొక్త అని బతిమాలిన బానిస బతుకులు బందూకులెత్తిన చైతన్య జ్వాల. నిజాం సైన్యాలకు ఎదురొడ్డి నిలిచిన విప్లవ ధీరత్వం. ప్రాణాలు పోతున్నా పేదల కోసం పరితపించిన త్యాగాల చరిత్ర. వేలమంది అమరులు బలిదానం సాక్షిగా వెట్టిచాకిరీ నుంచి ప్రజలకు విముక్తి కల్పించిన మహోజ్వల పోరాటం. భూమి, భుక్తి, విముక్తి కోసం ఊరూవాడా అరుణపతాకం కింద ఏకమై పోరుసల్పిన చరిత. అదే తెలంగాణ సాయుధ సాయుధ రైతాంగ పోరాటం.  తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాలో సాగిన సాయుధ పోరుపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ.. 

మహత్తర తెలంగాణ సాయుధ రైతంగా పోరాటం
భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలోనే తెలంగాణ సాయుధ రైతాంగ గెరిల్లా పోరాటం  ఒక మహత్తరమైన అధ్యాయం.  భారత విప్లవ పోరాటానికి అనేక పాఠాలు నేర్పిన పోరాటమది. అనేక విప్లవోద్యమాలకు స్ఫూర్తినిచ్చిన మహోజ్వల ఉద్యమమది.1946 నుంచి 1951 మధ్య ఐదేళ్లపాటు సాగిన ఈ పోరాటానికి ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీలు నాయకత్వం వహించాయి. బాంచన్‌ నీ కాల్మొక్త దొరా అన్న బడుగుజీవులకు బందూకునిచ్చి ప్రజారాజ్య స్థాపన గావించింది. తెలంగాణ సాయుధ పోరాటానికి ఖమ్మం గుమ్మంసైతం పోరాట ఊపిరులూదింది.

ఖమ్మం జిల్లాలకు ప్రత్యేక చరిత్ర
ఖమ్మం జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని..  మంచికంటి రాంకిషన్‌రావు, చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, పర్సా సత్యనారాయణ, కెల్‌ నర్సింహ్మారావు, బోడేపూడి వెంకటేశ్వరరావు, సర్వదేవభట్ట రామనాథం, తమ్మినేని సుబ్బయ్యతోపాటు పలువురు నాయకులు ముందుండి నడిపించారు. ఇందులో చాలా మంది పుట్టింది జమీందారు కుటుంబంలోనైనా.. ప్రజలకు అండగా నిలిచి పోరాటాలు నిర్వహించారు.  పేదల కోసం ఎన్నో నిర్భందాలు ఎదుర్కొన్నారు. జైలు జీవితం గడిపారు. కుటుంబాలను వదిలి ఏళ్లకు ఏళ్లు అజ్ఞాతవాసం చేశారు.  దొరల గడీలను కూల్చి, రజాకార్లను తరిమికొట్టి, వెట్టిచాకిరీ నుంచి ప్రజలకు విముక్తి కల్పించారు. 

నైజాంకు వెన్నులో వణుకు పుట్టించిన జానకి రామయ్య
తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటిగడ్డగా బోనకల్‌కు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. పగలు, రాత్రి కట్టుబాసిసలుగా పని చేయించుకుని పట్టెడు అన్నంపెట్టడానికి కూడా చేతులు రాని నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి ఎందరో మంది అమరులయ్యారు.  చిరునోములకు చెందిన రావెళ్ల జానకిరామయ్య ఆంధ్రమహాసభ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ తెలంగాణ ఉద్యమానికి ఇంచార్జీగా పనిచేశారు. గోవిందాపురం, లక్ష్మీపురం, తూటికుంట్ల, ముష్టికుంట్ల, పెద్దబీరవల్లి, సీతానగరం, బ్రాహ్మణపల్లికి చెందిన యువకులను ఉద్యమకారులుగా తీర్చిదిద్దారు.  వీరికి మరికొంత మంది ఉద్యమవీరులు జతకలికి అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ నైజాంకు వెన్నులో వణుకు పుట్టించారు.

తూటాలకు వెరవని ధీరత్వం
నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఎంతోమంది పోరాట యోధులను నిజాం సైన్యం మట్టుబెట్టింది. బోనకల్‌ మండలంలోని ఆళ్లపాడుకు చెందిన యలమందల చంద్రయ్య, మందా అచ్చయ్య, వల్లాపురానికి చెందిన గొర్రెముచ్చుల అజరయ్య, సామినేని గోపయ్య, మడుపల్లి వీరస్వామి, రేపల్లెవాడకు చెందిన తమ్మినేని బుచ్చయ్యను చిత్రహింసలకు గురిచేశారు.  చివరికి రేపల్లెవాడ చివరి వీధుల్లో తుపాకితో కాల్చిచంపారు. వీరి మృతదేహాలను గోవిందాపురం గ్రామంలో అందరూ చూస్తుండగా ఒకే చితిపై వేసి దహనం చేశారు. వీరి పోరాటాలకు గుర్తుగా గోవిందాపురంలో అమరవీరుల స్థూపాన్ని ఎదిరించారు. ఒక్కొక్క వీరున్ని నైజాం మూకలు మట్టుబెడుతున్నా... ఉద్యమంలో ఒక్కరూ వెనకుడుగు వేయలేదు.  ఉద్యమం మరింతగా ఉప్పెనలా ఎగసిపడిందేతప్ప ఆగిపోలేదు.  

ఉరకలెత్తించిన కుర్నవల్లి నాయకులు
వీర తెలంగాణ సాయుధ పోరాట యోధులను కన్న గ్రామంగా కుర్నవల్లి ప్రసిద్ధికెక్కింది. తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన ఏడుగురు యోధులు వీరోచితంగా నైజాం నవాబుకు ఎదురొడ్డి పోరాడారు.  కొలికొండ రాఘవయ్య, బోడేపూడి పుల్లయ్య, బసవయ్య, శేషయ్య, సూరయ్య, బత్తుల సుబ్బయ్య, కట్టా గోపయ్య ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. 

స్ఫూర్తిని కొనసాగిస్తూ.. 
తెలంగాణ సాయుధ పోరాటంలో  మధిక తాలూకా ప్రాంత ప్రజల పోరాటం వీరోచితమైనది. నైజాం పాలకులకు మచ్చెమటలు పట్టించి, మూడు చెర్వుల నీళ్లు తాగించి గడగడలాడించిన చిత్ర మధిర ప్రాంత పోరాట యోధులకే దక్కుతుంది. ఈ పోరాటంలో కొంతమంది మహిళలు ప్రత్యక్షంగా పాల్గొనగా... మరికొంతమంది పరోక్షంగా ఉద్యమ వీరులకు సహాయ సహకారాలు అందించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఖమ్మం జిల్లాలోని ఒక్కోపల్లెకు ఒక్కో చరిత్ర ఉంది. ఎందరో పోరాట యోధులను అందించిన ఖిల్లా ఖమ్మం జిల్లా. ఆ వీరులిచ్చిన స్ఫూర్తితో నేటికి ఖమ్మం జిల్లాలో వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఇదే స్ఫూర్తి భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని ఆశిద్దాం...

13:50 - September 17, 2017

కరీంనగర్ : హరితహారం మూడవ విడత కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో సీఎం కేసీఆర్‌ నాటిన మొక్క ఎండిపోయింది. దీంతో అధికారులు రాత్రికి రాత్రి అదే ప్రదేశంలో మరో మొక్క నాటారు. ఇప్పటికే నగర పాలక కమిషనర్ మొక్క ఎండిపోవడానికి ఆకతాయిలు కారణమని.. సీపీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సీఎం నాటిన మొక్క ఎండిపోవడం.. అధికార పార్టీతో పాటు అధికారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మొక్క వివాదంతో జిల్లాలో ఆసక్తికర చర్చ మొదలైంది. మొక్కను దక్కించుకోవడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అదే స్థలంలో మహాఘని మొక్కను అధికారులు నాటి, పోలీసులను కాపలా ఉంచారు.

13:46 - September 17, 2017

నాగర్‌కర్నూల్ : విద్యానగర్‌ కాలనీలో దారుణం జరిగింది. మూడేళ్ల కొడుకుకు ఉరివేసిన ఓతల్లి తానుకూడా ఆత్మహత్య చేసుకుంది.  విద్యానగర్‌లో శ్వేత తన భర్త కొడుకుతో కలిసి ఉండేది. భర్త హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో శ్వేత తన కొడుకుకు ఉరివేసింది. ఆ తర్వాత తానుకూడా ఉరివేసుకొని చనిపోయింది. కుటుంబ కలహాలవల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.

13:43 - September 17, 2017

హైదరాబాద్ :  ప్రపంచ బాడ్మింటన్‌ చాంపియన్‌ ఒకహరపై పీవీ సింధు ప్రతీకారం తీర్చుకుంది. తనను ఓడించిన ప్రత్యర్థిని కొరియా సూపర్‌ సిరీస్‌లో చిత్తు చేసింది. కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై 22-20, 11-21, 21-18 తేడాతో సింధు విజయం సాధించింది. గతంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఒకుహర చేతిలో సింధు ఓటమి చవిచూసింది. కొరియా సూపర్‌ సిరీస్‌లో సింధూ.. ఒకుహరకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. ఆరంభం నుంచే ఒకుహరపై దూకుడు ప్రదర్శించి విజయం సాధించింది.   మొదటి రౌండ్ హోరా హోరీగా జరిగినప్పటికీ కీలక సమయంలో పుంజుకున్న సింధూ సెట్ దక్కించుకుంది. రెండో రౌండ్ లో కొంత తడబడి సెట్ కోల్పోయింది. కాగా కీలకమైన మూడో రౌండ్ లోమాత్రం ఒత్తిడి అధిగమించి విజృంభించింది. మూడో రౌండ్ లో సత్తా చాటి కొరియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. 

 

విషాదం..

నాగర్ కర్నూల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యా నగర్ కు చెందిన ఓ మహిళ కొడుకుతో పాటు బలవన్మరనానికి పాల్పడింది. స్వేత (25) తన మూడేళ్ల కొడుకు కు ఉరి వేసి, తాను తనువు చాలించింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

కంచె ఐలయ్య టీమాస్

వరంగల్ : నగరంలో జరుగుతున్న టీమాస్ ఆవిర్భావ సభకు కంచె ఐలయ్య హాజరు కానున్నారు. కాగా ఆర్య వైశ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు కల్పించారు. 

13:18 - September 17, 2017

సిరిసిల్ల : ఏరియా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఓ శిశువు ప్రాణాలు తీసింది. డెలివరీకోసం వచ్చిన సంధ్యకు వైద్యులు ఆలస్యంగా డెలివరీ చేశారు. అప్పటికే ఆలస్యం కావడంతో బిడ్డ పుట్టగానే కన్ను మూశాడు. వైద్యుల నిర్లక్ష్యంవల్లే పసికందు మృతి చెందాడంటూ బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.

బ్యాంటింగ్ ఎంచుకున్న టీమిండియా..

హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఐదు వన్డేల సిరీలో భాగంగా నేడు తొలి వన్డే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. 

12:47 - September 17, 2017

హైదరాబాద్ : నిజాం పాలనను వ్యతిరేకించిన ప్రజలు వాళ్లు. రజాకార్లకు వ్యతిరేకంగా ఎదురుతిరిగి.. తుపాకీకి గుండెను చూపించిన ధైర్యవంతులు. తమ గ్రామంలోకి వచ్చిన నిజాం సైన్యాన్ని ఎదురించారు. అంతా ఒక్కటై రజాకార్లను తరిమికొట్టారు. కానీ రజాకార్లు నిరాయుధులైన ప్రజలపై విరుచుకుపడ్డారు. ఆ మారణ కాండలో 11 మంది అసువులు బాసి చరిత్రలో అమరులుగా నిలిచారు. అంతటి త్యాగమూర్తుల కుటుంబాలు.. ఇవాళ అత్యంత దీనావస్థలో ఉన్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. 1947 ఆగస్టు 15న.. భారత దేశమంతా పండగ జరుపుకుంది. దేశమంతా స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంటే తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం నిరంకుశ పాలనలో మగ్గారు. ఏడో నిజాం నవాబు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి కాశీం రజ్వీకి సైన్యం బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో రజాకార్లు రణరంగం సృష్టించారు. ప్రజల్ని చిత్రహింసలకు గురి చేశారు.  

గుండ్రాంపల్లి, పరకాల, భైరాన్‌పల్లి 
ప్రజలపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, పన్నుల వసూలు.. ఇలా అడ్డూ అదుపూ లేకుండా రజాకార్లు విరుచుకుపడేవారు. నల్లగొండ జిల్లా, గుండ్రాంపల్లిలో, వరంగల్‌ జిల్లా, పరకాల, భైరాన్‌పల్లిలలో ప్రజలు ఎదురు తిరిగారు. ఆ ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటంగా మారింది. 

చరిత్రలో అప్పంపల్లి ఘటన 
తెలంగాణ విమోచనోద్యమంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో అప్పంపల్లి ఘటన చరిత్రలో నిలిచిపోయింది. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ విమోచన కోసం మేధావులు, యువకులు, వృద్ధులు సమరశంఖం పూరించారు. 1947 అక్టోబర్‌ 7న జిల్లాలోని చిన్నచింతకుంట మండలం, అప్పంపల్లి, నెల్లికొండి, వడ్డెమాన్, దాసన్‌ పల్లి, రాంపూర్‌, లంకాల, అమరచింత తదితర గ్రామాలకు చెందిన.. దాదాపు 2 వేల మంది ఆత్మకూరు సంస్థానంలో స్వాతంత్ర్య ఉద్యమ ప్రదర్శనలు చేస్తూ పట్టణంలో సత్యాగ్రహం చేశారు. అక్కడున్న నిజాం సైనికులు ఉద్యమాన్ని అదుపు చేయలేకపోయారు. 

సైన్యం  విచక్షణ రహిత కాల్పులు 
నాటి ఉద్యమానికి అప్పంపల్లికి చెందిన బెల్లం నాగన్న, దాసరిపల్లి బుచ్చారెడ్డి నేతృత్వం వహించారు. వారిని అరెస్ట్‌ చేసేందుకు రజాకార్లు ప్రయత్నించగా.. గ్రామస్తులు ఎదురుతిరిగారు. తోక ముడిచిన సైన్యం ఓ భవనంలో తల దాచుకొని.. తిరిగి సాయంత్రం వేళల్లో బయటికి వచ్చిన ఉద్యమకారులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది. ఈ దాడిలో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఇప్పటికీ గ్రామస్తులను కలిచివేస్తోంది. 
చేయూత ఏదీ?
చరిత్రలో నిలిచిపోయిన ఈ ఘటనలో వీరులు అసువులు బాశారు. కానీ గ్రామానికి, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఏ సాయం అందించలేదు. గత పదేళ్లుగా ఇక్కడ సెప్టెంబర్‌ 17న తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా.. అమరులకు నివాళులర్పిస్తారు. కానీ అప్పుడు పోరాటం చేసిన వారి కుటుంబ సభ్యుల దీన స్థితిని మాత్రం పట్టించుకున్న పాలకులే లేరు. అప్పంపల్లి ఘటన పాలమూరు జలియన్‌ వాలా బాగ్‌గా కీర్తికెక్కింది. పాలకులు చిత్తశుద్ధితో అప్పటి పోరాటంలో అమరులైన కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

12:45 - September 17, 2017

హైదరాబాద్ : నిజాం నరమేధానికి ఎర్రజెండా ఎదురొడ్డి నిలిచింది. గడ్డి కోసిన చేతులే కొడవళ్లు పట్టాయి. బువ్వొండిన చేతులే తుపాకీలు పట్టాయి. దొరను చూసి గజగజ వణికే జనం, గడీ తలుపులను బద్దలుకొట్టి దొరలను తరిమికొట్టారు. పొలం దున్నే రైతులు, కత్తులు పట్టి రాక్షస రజాకార్లపై విరుచుకుపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరులయ్యారు. 

అక్షర జ్ఞానం వెలిగించిన కమ్యూనిస్టులు
చదువు లేని జనంతో అక్షరాలు రాయించారు కమ్యూనిస్టులు. బానిస బతుకుల నుంచి బయటపడాలంటే దొరల బతుకును అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. సంఘం పెట్టారు. దేశ్‌ముఖ్‌ గూండాలను తరిమికొట్టారు. దొరల అహంకారానికి సమాధానం చెప్పారు. ఎర్రజెండా అండతో ప్రజలు దొరలకు ఎదురు నిలిచారు. దీంతో  దున్నేవాడిదే భూమి అనే నినాదం మార్మోగిపోయింది. 1947 సెప్టెంబర్‌ 11న తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైంది. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఆయుధాలు సేకరించాలని నిర్ణయించింది. దీంతో భూస్వాముల నుంచి ఇతర ప్రాంతాల నుండి ఆయుధాలు సేకరించడంతో.. రజాకార్లు ఒక్కో అడుగు వెనక్కి వేశారు. రజాకార్లతో దళాలను అణిచి వేయడం సాధ్యం కాదని నిజాం గుర్రాల ఫౌజ్‌ మిలటరీ రంగంలోకి దిగింది. ఈ గుర్రాల ఫౌజ్‌ రావడంతో దళాలు కొన్ని నష్టపోయాయి. చెరువు అన్నారంలో, కలిమెరలో మెరికల్లాంటి నాయకులు హతమయ్యారు. 

గెరిల్లా పోరాటం.. 
ఖాసింరజ్వీ నిరంకుశ విధానాలకు ఎదురొడ్డి పోరాడారు మల్లారెడ్డి గూడెం వీరులు. 1946 డిసెంబరు 1న నిజాం మిలిటరీ ఆకస్మాత్తుగా గ్రామంపై దాడిచేసింది. రజాకార్లను ఉద్యమనాయకులు గట్టిగానే ప్రతిఘటించారు. ఈ ఘటనలో అప్పిరెడ్డి, ముంగి వీరయ్య, నందిరెడ్డి నర్సిరెడ్డి, అలుగుల వీరమ్మ నిజాం మిలటరీ తూటాలకు బలైపోయారు. వీరి మరణానంతరం నిజాం ప్రభుత్వం 400 మందిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసింది. ఈ సంఘటన జిల్లా పోరాట చరిత్రలోనే ప్రధాన భూమిక వహించింది. రావి నారాయణరెడ్డి.. నైజాం పాలనపై తిరుగుబాటుకు గెరిల్లా పోరాటానికి నాయకత్వం వహించారు. 4 వేల గ్రామాల్లో ప్రజారాజ్య స్థాపనకు పునాదులు వేశారు. భువనగిరి మండలం బొల్లెపల్లికి చెందిన రావి నారాయణరెడ్డి భూస్వామ్య కుటుంబంలో పుట్టినా.. దున్నేవాడికే భూమి అంటూ తనకు ఉన్న వంద ఎకరాల భూమిని పేదలకు పంపిణి చేశారు. 

సాయుధ పోరాటయోధులకు ఉరిశిక్ష..
నిజాం ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక కోర్టు.. సాయుధ పోరాట యోధులు 8 మందికి ఉరిశిక్ష విధించింది. శిక్షపడ్డ వారిలో నంద్యాల శ్రీనివాసరెడ్డి, యువకుడైన ఎర్రబోతు రాంరెడ్డి కూడా ఉన్నారు. నల్లగొండ జైలులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఓ జాతీయ పత్రిక విలేకరి..రాంరెడ్డికి విధించిన ఉరిశిక్షపై వార్తలు ప్రచురించాడు. విద్యార్థి నాయకుడికి ఉరిశిక్ష ఏంటని అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. దీంతో ప్రధాని నెహ్రూ అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించాడు. ఆ తర్వాత కేసు వీగిపోవడంతో 8 మంది సాయుధ పోరాట వీరులకు ఉరిశిక్ష తప్పింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో మసీదు కేంద్రంగా చేసుకొని ఖాసీం రజ్వీ దురాగతాలు కొనసాగించాడు. రజాకార్లకు వ్యతిరేకంగా ఏర్పడిన కమ్యూనిస్టు దళాలను, ఇతరులను 200 మంది వరకు ఊచకోత కోశాడు. మసీదు సమీపంలో ఉన్న బావిలో మృతదేహాలు పడవేశాడు. 
తుపాకీ పట్టిన మల్లు స్వరాజ్యం 
బాంచెన్‌ దొరా ... నీ కాల్మొక్తా ! అన్న బానిసలే...కొడకా నీకు గోరీ కడతామన్న దాకా తీసుకెళ్లింది వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఆరుట్ల కమలాదేవి తెగువ.. భీంరెడ్డి నరసింహారెడ్డి సింహనాదం.. మల్లు స్వరాజ్యం తుపాకీ పోరుతో.. కమ్యూనిస్టు వీరులు జూలు విదిల్చారు. కత్తులు, కర్రలు, తుపాకులు ఆఖరికి కారం పొట్లాలు కూడా ఆయుధాలుగా మార్చుకున్నారు. ప్రజలు కూడా సాయుధపోరాటానికి దిగారు. ఒకవైపు ఉద్యమకారులు కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతున్నా ఏ మాత్రం భయపడలేదు. వేలాది గ్రామాల్లో 12 లక్షల ఎకరాలను కమ్యూనిస్టులు పంచిపెట్టారు.

బైరాన్ పల్లి నరమేధం
1948 ఆగస్టు 27న నరమేధం జరిగింది. వరంగల్ జిల్లా బైరాన్ పల్లిలో మహిళలను నగ్నంగా చేసి, బతుకమ్మ ఆడించిన రజాకార్ల పైశాచిక ఆనందం నేటికీ వారి మనసుల్లో మానని గాయంగానే మిగిలిపోయింది. రజాకార్లపై పోరుకు దిగిన తెలంగాణ రైతాంగంపై సైనికులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీంతో 118 మంది వీరమరణం పొందారు. నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలోనూ రజాకార్లు చేసిన విధ్వంసం తాలూకూ చేదు జ్ఞాపకాలు నేటికీ అక్కడి ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.

కమ్యూనిస్టులపై భారత సైన్యం తూటాలు
1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం రంగప్రవేశం చేసింది. హైదరాబాద్‌ సంస్ధానాన్ని స్వాధీనం చేసుకుంది. సైన్యం తుపాకులు రజాకార్ల మీద ఎక్కుపెట్టలేదు. మొట్టమొదట కమ్యూనిస్టులపై తూటాలు పేలాయి. సాయుధ పోరాటం చేసినవారిపై దాడులు మొదలయ్యాయి. కమ్యూనిస్టులను ఏరిపారేయటమే లక్ష్యంగా భారత సైన్యం తెలంగాణ ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. బుల్లెట్ల వర్షంతో ఎర్రజెండాకు తూట్లు పొడవాలని చూసింది. నిజాం పాలకుల మారణకాండకు ఎదురొడ్డి... ఎర్రజెండా అండగా పోరాడి అసువులు బాసిన వేలాది అమరవీరులను స్మరించుకుని.... పాలకుల కుట్రలను చేధించుకుని... ప్రజలకు నిజమైన అభివృద్ధిని అందించిననాడే ... చారిత్రక వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటానికి అసలైన నివాళులు అర్పించినవాళ్లమవుతామని కమ్యూనిస్టులు స్పష్టం చేస్తున్నారు.

కొరియన్ ఓపెన్ సింధూదే..

హైదరాబాద్ :  తెలుగుతేజం పీవీ సింధూ బ్యాడ్మింటన్ లో మరో టైటిల్ సాధించింది. కొరియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను ఎగరేసుకొచ్చింది. ఫైనల్ లో ప్రపంచ ఛాంపియన్ జపాన్ షట్లర్ ఒకుహరి పై విజయ ఢంఖా మోగించింది. 

12:28 - September 17, 2017

హైదరాబాద్ : ఒకవైపు నిజాం నిరంకుశత్వం... మరోవైపు భూస్వాముల ఆగడాలు... ఈ సమయంలోనే ప్రజలకు ఓ అండ దొరికింది. రగులుతున్న గుండెలకు ఓ చుక్కాని కనపడింది. తమకోసం పోరాడే ఓ జెండా కనిపించింది. అందుకే జనం జేజేలు పలికారు. అరుణపతాకానికి అండగా నిలిచారు. 

పల్లెల్లో ఎగిరిన తిరుగుబాటు జెండాలు 
స్వాతంత్య్రోద్యమ నీడ తన సంస్థానంపై పడకుండా నిజాం నిషేధాజ్ఞలు విధించిన సందర్భం. జాగీరు పేరిట పోలీసు, న్యాయ, పాలనా అధికారులు దక్కించుకున్న జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు చెప్పిందే వేదం. గ్రంథాలయం, పాఠశాల, వ్యాయామశాల, సంఘం, సమావేశం ఏది పెట్టాలన్నా డేగ కళ్ల గస్తీ నిషాన్ -53 చట్టం చెప్పినట్లు వినాల్సిందే. దీనిని నిరసిస్తూ... పల్లెలు తిరుగుబాటు జెండా ఎగురవేశాయి.

తెలంగాణలో రహస్యంగా కమ్యూనిస్టు పార్టీ 
1940లో తెలంగాణలో రహస్యంగా కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడింది. భూస్వామ్య, వెట్టిచాకిరి విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ అండగా నిలిచింది. దగాపడ్డ ప్రాంతం ఆంధ్ర మహాసభల రూపంలో రాజకీయ చైతన్యాన్ని సంతరించుకుంది. ప్రజలు ఆంధ్రమహాసభను సంఘంగా పిలిచేవారు. ఆ సంఘమే సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపింది. 
బందగి రక్తార్పణం 
1940 జులై 27న దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా బందగి రక్తతర్పణం చేశాడు. కామారెడ్డి గూడెం ఘటన తెలంగాణ రైతాంగ పోరాటానికి తొలి రక్త ప్రేరణగా నిలిచింది. బందగి సాహసం బడుగు వర్గాలకు ధైర్యం నూరిపోసింది. దీంతో తెలంగాణ విప్లవ జ్వాల ఎగిసిపడింది. నల్లగొండ జిల్లా జనగాం తాలుకా పాలపర్తి సంఘటన చరిత్రలో నిలిచిపోయింది. రామచంద్రారెడ్డి అనే దేశ్‌ముఖ్‌ నుంచి కమ్యూనిస్టులు పోలమ్మను కాపాడారు. ఈ పాలపర్తి తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికింది. 

బలిదానాలు..
ఆగస్టు 8న ఓరుగల్లులో బత్తిని మొగిలయ్య గౌడ్‌ బలిదానం చేశాడు. డిసెంబర్‌ 1న హుజూర్‌నగర్‌ తాలుకా మల్లారెడ్డిగూడెంలో ముగ్గురు మహిళలు ప్రాణాలర్పించారు. చింద్రాల గురువమ్మ, తొండమ్మ, అంకాళమ్మలు వీరవనితలుగా చరిత్రలో నిలిచిపోయారు. తెలంగాణ రైతాంగ పోరాటం... ప్రజల పోరాటతత్వానికి నిదర్శనం. నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా... జనమంతా గళమెత్తి ధ్వజమెత్తిన ఉద్యమం. ఈ పోరాటానికి కులం లేదు.. మతం లేదు.. ప్రాంతం లేదు. వేలమంది త్యాగాలతో... ప్రాణాలను పణంగా పెట్టి... నిజాం నవాబును తరిమికొట్టిన అసలు సిసలైన పోరాటం. 

12:24 - September 17, 2017

హైదరాబాద్ : హలం పట్టే రైతన్నలు తుపాకులు పట్టారు. కలం పట్టే విద్యార్థులు రణం చేశారు. ప్రజల విముక్తి కోసం పోరుబాటపట్టారు. స్వేచ్ఛా వాయువులు పీల్చాల్సిన జనం యుద్ధం చేశారు. అసలు హైదరాబాద్‌ సంస్థానంలో ఈ ఘటనలు ఎందుకు జరిగాయి..? నిజాంపై సామాన్యుడికి ఎందుకు కోపమొచ్చింది..? భూ స్వాముల ఆగడాలకు ఎలా చెక్‌ పడింది..? దక్కన్‌లో ఏం జరిగింది..?

వెట్టి చాకిరి వ్యవస్థ
నిజాం పాలనలో అరాచకత్వం రాజ్యమేలింది. "జగేలా "వెట్టి చాకిరి వ్యవస్థ కొనసాగింది. దీనికి తోడు "నాగు వడ్డీ" వ్యాపారం ప్రజల్ని కష్టాల్లోకి నెట్టింది. ఒక బస్తా అప్పు తీసుకుంటే... ఆరు నెలల తర్వాత ఒకటిన్నర బస్తా చెల్లించాల్సి ఉండేది. దీంతో అప్పు తీర్చడం సామాన్యుడికి కష్టంగా మారింది. అప్పులు తీర్చలేక రైతన్నలు వెట్టిచాకిరి చేస్తుండేవారు. బాంచణ్‌ నీ కాళ్లు మొక్కుతా దొరా..! అంటూ హీనాతి హీనంగా జీవించేవారు. 

పల్లెలపై నిజాం దళాల దాడులు
ఇక హైదరాబాద్ సంస్థానంలో మధ్యయుగం నాటి భూ స్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేది. అప్పటి భూమిలో 60 శాతం దివానీ, 30 శాతం జాగీర్దారు విధానం, 10 శాతం నిజాం కమతంగా ఉండేది. దేశ్‌ముఖ్‌, దేశ్‌పాండే, పటేల్‌, పట్వారీ, మాల్‌పటేల్‌ వంటి గ్రామాధికారులు ఉండేవాళ్లు. రైతులు కష్టపడి పండిస్తే ఆ పంటలను కూడా దౌర్జన్యంగా దోచుకునేవారు. ప్రశ్నిస్తే గుండెల మీద తన్నేవారు. నిజాం దళాలు పల్లెల మీద విరుచుకుపడి మాన, ప్రాణాలను హరించాయి. అందమైన ఆడపిల్ల కనపడితే శీలం దోచుకునేవారు. భర్తల ఎదుటే భార్యలను చెరిచేవారు. తండ్రుల ఎదుటే కూతుళ్లను నాశనం చేశారు. అడ్డు తిరిగిన వారి ఆస్తులను బుగ్గి చేశారు. 
ఐలమ్మ తెగింపు.. 
జనగామ ప్రాంతంలో పేరు మోసిన దేశ్‌ముఖ్ విసునూరు రామచంద్రారెడ్డి 40 వేల  ఎకరాలకు భూస్వామి. ఆయన కౌలుదార్లు, రైతుల నుంచి నిర్బంధంగా భూములు కబళించేవాడు. చాకలి ఐలమ్మ వెట్టి చేయనందుకు..బాకీ చెల్లించనందుకు ఆమెపై రామచంద్రారెడ్డి కక్షగట్టాడు. ఆమె పంట పొలాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్రపన్నాడు. పంట కోసుకురావాలని 200 మంది గుండాలను పంపాడు. సంఘం నాయకులు 28 మంది వాలంటీర్లతో వెళ్ళి.. గుండాలపై దాడి చేయడంతో.. అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత సంఘం నాయకులు.. పంట కోసి ధాన్యాన్ని అయిలమ్మ ఇంటికి పంపారు. ఆ రాత్రే విసునూరు నుంచి పోలీసులు దిగారు. అయినా, ఐలమ్మ ఇంట్లో వున్న ఆ ధాన్యాని, ముట్టుకోవడానికి ఎవరూ సాహసించలేదు. ఈ ఘటనే స్థానికులను ఉత్తేజ పరిచింది. 

ఐలమ్మ చేతిలో ఘోర పరాభవానికి గురైన దేశ్‌ముఖ్ బాగా రెచ్చిపోయాడు. పోలీసుల సాయంతో కడవెండి గ్రామానికి చెందిన ఉద్యమ నాయకుల హత్యకు పథకం వేసాడు. 1946 జూలై 4న దొర గుండాలు సంఘం నాయకుల ఇళ్లపై రాళ్ళు విసిరారు. లాఠీలు, వడిసెలు, చేతబూని ప్రజలు ప్రదర్శన నిర్వహించారు. మార్గమధ్యంలో దొర అనుచరులు ప్రజలపైకి కాల్పులు జరపడంతో.. గ్రామసంఘ నాయకుడు దొడ్డి కొమురయ్య ప్రాణాలు విడిచారు. కొమరయ్య అన్న మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రజలు..వేలాదిగా వచ్చి జమీందారు భవనాన్ని చుట్టుముట్టారు. నిప్పు పెట్టేందుకు ఎండుగడ్డి మోపులను సిద్ధం చేశారు. సమాచారం అందుకున్న రామచంద్రారెడ్డి తనయుడు జగన్ మోహన్...రెండువందల మంది గూండాలతో బయల్దేరాడు. గ్రామం వెలుపల కాపలాకాస్తున్న ప్రజలు..వడిసెలు రువ్వుతూ గూండాలపై దాడిచేయడంతో వారు వెనుదిరిగారు. అంతాఅయిపోయాక 60 మంది రిజర్వుపోలీసులు గ్రామానికి చేరుకున్నారు. 
దొరల పెత్తనం..
మరోవైపు భూస్వామ్య దొరల పెత్తనం నడుస్తోంది. గ్రామాలన్నీ భూస్వామ్య దొరల పాలనలో ఉన్నాయి. నిజాం నవాబు దొరలు చేతులు కలిపారు. నిజాంకు సంస్ధానంపై అధికారం కావాలి. దొరలకు వారి పెత్తనం సాగాలి. ఎటు తిరిగి వారి చేతుల్లోని భూమి ఎటూ పోకూడదు. బానిసలుగా బతుకుతున్న జనం అలాగే మగ్గిపోవాలి, తమ దొరతనం సాగిపోవాలన్న ధోరణి పెరిగిపోవడంతో జనం యుద్ధానికి సిద్ధమయ్యారు. వాళ్ల కడుపులు ఆకలి గురించి ఆలోచించటం మర్చిపోయాయి. అవి దొరలపై కసిని పెంచుకున్నాయి. వారి కళ్లు ప్రకృతిని చూడలేదు. నేలతల్లి సాక్షిగా దొరల అంతాన్ని చూడాలనుకున్నాయి. భూస్వాముల అరాచకత్వం... నిజాం నిరంకుశత్వం నుంచి... తమ ప్రాణాలను పణంగా పెట్టి... మడమ తిప్పకుండా... తూటాలకు ఎదురొడ్డి రైతన్నలు పోరుబాటపట్టారు. 1936లో ఆరుట్ల రామచంద్రారెడ్డి, లక్ష్మీ నరసింహరెడ్డి... కొలనుపాకలోని జాగీర్దార్లకు వ్యతిరేకంగా విజృంభించారు. 1944లో నాగు వడ్డీ వ్యాపారానికి వ్యతిరేకంగా భువనగిరిలో ఆందోళన చేశారు. 

12:18 - September 17, 2017
12:17 - September 17, 2017
12:01 - September 17, 2017

హైదరాబాద్ : నిజాం ప్రభువులపై మంత్రి నాయిని ప్రశంసలు కురిపించారు. తెలంగాణ మేలుకోసమే నిజాం ప్రభువు హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేశారని మంత్రి నాయిని అన్నారు. రజాకార్లు పొరపాటు చేసిన మాట వాస్తవమేనని చెప్పారు. కొందరు కావాలనే విలీన దినాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని టీఆరెస్ భవన్‌లో విలీన దినోత్సవానికి నాయిని హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు.

10:58 - September 17, 2017
10:48 - September 17, 2017
10:47 - September 17, 2017

జాతికి అంకితం..

గుజరాత్: సర్థార్ సరోవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. నర్మద జిల్లా కెవాడియాలో సర్దార్ సరోవర్ డ్యామ్ ను ప్రధాని ప్రారంభించారు. 

హేయం..

హైదరాబాద్ : భూపాల పల్లి జిల్లాలో గుత్తికోయలపై ఫారెస్టు అధికారులు ప్రవర్తించిన తీరు హేయకరమైన చర్య అని ప్రొ. కోదండరాం అన్నారు. తెలంగాణ విలీన దినం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అధికారికంగా విలీన దినం జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఐఎంతో సంధి కోసమే విలీన దినం చేయడానికి కేసీఆర్ వెనుకాడుతున్నాడని కోదండరాం ఆరోపించారు. 

కేసీఆర్ కు నిజాంకు పట్టిన గతే..

హైదరాబాద్ : నిజాం రాజుకు పట్టిన గతే ముఖ్యమంత్రి కేసీఆర్ కు పడుతుందని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ విలీన దినం సందర్భంగా గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. 

సీఐ ఓవర్ యాక్షన్..

 

సూర్యపేట: తెలంగాణ విలీన దినం సందర్భంగా సూర్యపేటలో స్థానిక సీఐ దురుసుగా ప్రవర్తించాడు. టీజీవీపీ విద్యార్థులు విలీన దినం సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై జెండా ఎగురవేడయడానికి ప్రయత్నించగా సీఐ అడ్డుకున్నాడు. సీఐ మొగులయ్య ఒక విద్యార్థిని కాలితో తన్నుకుంటూ లాక్కెళ్లి  అరెస్టు చేశాడు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ఆందోళనకు దిగాయి. 

ఎయిర్ పోర్టులో బంగారు బిస్కెట్లు..

హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుడిని నుండి 12 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

10:00 - September 17, 2017

మంచిర్యాల : జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. భారీగా చేరుతున్న వరద నీటితో ప్రాజెక్టు నీటిమట్టం 146 అడుగులకు చేరింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతోంది. మరింత సమాచారం వీడియోలో చూడండి.. 

జెండా ఆవిష్కరించిన కోదండరాం..

హైదరాబాద్ : తెలంగాణ విలీన దినం వేడుకలు జేఏసీ కార్యాలయం వద్ద జరిగాయి. ఈ సందర్భంగా టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. నూతన తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదని ఆయన విమర్శించారు. 

నిండుకుండలా ఎల్లంపల్లి..

మంచిర్యాల : జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. భారీగా చేరుతున్న వరద నీటితో ప్రాజెక్టు నీటిమట్టం 146 అడుగులకు చేరింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతోంది.

09:42 - September 17, 2017

ప్రకాశం : జిల్లాలో వేటపాలెంలో ప్రేమోన్మాదానికి యువతి బలైంది. రామానగంకుచెందిన గోపీచంద్‌... పాత చీరాలకు చెందిన తేజా అనే యువతిని ప్రేమించుకున్నారు.. కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య గోడవలు జరుగుతున్నాయి. తనను కలిసేందుకు ప్రియురాలు ఇష్టపడటంలేదని గోపీచంద్‌ రగిలిపోయాడు. రాత్రి అమెను తన మేన మామ ఇంటికి వెనక డోర్ నుంచి గోపీ చంద్ తీసుకెళ్లాడు. అక్కడ అమ్మాయి చేతులు కట్టేసి, పీక, మణికట్టు కోసి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం ఘటనా స్థలి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

09:38 - September 17, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో రోడ్డు ప్రమాదం నలుగురి ప్రాణాలు తీసింది. అన్నపురెడ్డిపల్లి మండలం మద్దుకూరు వెంకటేస్వరస్వామి ఆలయం దగ్గర ఆర్టీసీ బస్సు- బొగ్గు టిప్పర్‌ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా 20 మంది గాయపడ్డారు. ప్రమాదం ధాటికి టిప్పర్‌ రెండు ముక్కలైంది. మృతదేహాలు కూడా ఛిద్రమయ్యాయి. క్షతగాత్రులను చికిత్సకోసం చుండ్రుగొండ ఆస్పత్రికి తరలించారు.

09:36 - September 17, 2017

హైదరాబాద్ : తమ పరిసరాల్లో దోమలు విజృంభించకుండా ప్రతి పౌరుడు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ లయన్స్‌ భవన్‌లో మస్కిటో యాప్‌ డ్రాను తీశారు. మస్కిటో యాప్‌ను జీహెచ్ఎంసీ ఆగస్టు 17న విడుదల చేసింది.. దోమల ద్వారా వచ్చే వ్యాధులు, వాటి నివారణకు సంబంధించిన వివరాల్ని ఈ యాప్‌లో తెలియజేశారు. ఈ యాప్‌ను నెల రోజుల్లో దాదాపు 52 వేలమంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.. ఇందులోనుంచి వంద మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన కమిషనర్‌... ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల బహుమతి అందజేయనున్నారు. వచ్చే నెలలో పది మందిని డ్రా తీసి... పదివేల రూపాయలను ఇస్తామని జనార్ధన్‌ రెడ్డి తెలిపారు.. 

09:32 - September 17, 2017
09:31 - September 17, 2017

ప్రేక్షకుల పల్స్ పట్టుకొని సినిమాలు చేస్తూ హిట్ కొట్టేస్తున్నాడు ఈ సూపర్ స్టార్ .సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో వస్తున్న చేంజెస్ ని అబ్సర్వ్ చేస్తూ కొత్త సబ్జెక్టు తో రాబోతున్న సూపర్ స్టార్ తన సినిమా గురించి చాల కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు .ఆ అప్ డేట్స్ ఇప్పుడు చదవండి..
 మహేష్ బాబు సినిమాల సెలక్షన్ ఈ మధ్య కొత్తగా ఉంటుంది .తన రోల్ ని పర్టికులర్ గ చూసుకుంటూ హిట్ కొట్టేస్తున్నాడు మహేష్ . కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లింది. మహేష్ బాబు ని తన యాక్టింగ్ ని కంప్లీట్ గ వాడుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. శృతి హాసన్ హీరోయిన్ గా జగపతిబాబు ,రాజేంద్ర ప్రసాద్ లాంటి బడా నటులు స్క్రీన్ ని పంచుకున్న ఈ సినిమా శ్రీ మంతుడు మ్యూజికల్ గ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది .ఆ తరువాత కొరటాల శివతో మరో మూవీ కూడా మహేష్ అనౌన్స్ చేసాడు.
రీసెంట్ గ మహేష్ కొత్త సినిమా స్పైడర్ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసిన మహేష్ బాబు ఫాన్స్ తో సోషల్ మీడియా లో ముచ్చటించాడు .‘‘ఒక ఎక్స్ ట్రార్డినరీ థ్రిల్లర్... ఎక్స్ ట్రార్డినరీ ఫొటోగ్రఫీ.. ఎక్స్ ట్రార్డినరీ  ఫైట్స్... ఎక్స్ ట్రార్డినరీ సెట్ డిజైన్స్ తో రెండు గంటల ఇరవై అయిదు నిమిషాల పాటు సినిమా చూసిన ప్రేక్షకులు స్టన్ అయిపోయేలా సినిమా తీద్దాం. సినిమా స్టోరీ సిట్టింగ్ టైంలో మురుగ దాస్ చెప్పిన మాటిది. ఆడియన్స్ కాదు.. డబ్బింగ్ చెప్పేటప్పుడు నేనే స్టన్ అయిపోయా’’ స్పైడర్ సినిమా ఎలా ఉండబోతోందో మహేష్ బాబు మూడు మాటల్లో సూపర్ కాన్ఫిడెంట్ గా చెప్పిన మాటిది..స్పైడర్ సినిమా ట్రైలర్ బాగుంది అని మంచి టాక్ కూడా వచ్చేసింది .

09:28 - September 17, 2017

ఒక చిన్న సినిమా అతి పెద్ద విజయం సాధించింది .ఒక సినిమా ఆడటానికి పెద్ద స్టార్స్ అవసరం లేదని నిరూపించింది .ప్రతి భాషలో కథ గెలిచింది .కధలో ఉన్న బలం సినిమాని ప్రతి ఆడియన్ కి దగ్గర చేసాయి .మరి ఆ సినిమా ఏంటి ఆ కథ ఏంటో చదవండి.. 

వినూత్న కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని `దృశ్యం` సినిమా నిరూపించింది. మోహన్ లాల్ హీరోగా 2013లో వచ్చిన ఈ చిత్రం మాలీవుడ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మలయాళంలో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రూ.50 కోట్లు కొల్లగొట్టిన మొదటి సినిమాగా చరిత్ర పుటలకెక్కింది.  అంతే కాకుండా చాలా స్క్రీన్లలో 150 కన్నా ఎక్కువ రోజులు ఆడిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను  తెలుగు - తమిళ - కన్నడ - హిందీ భాషల్లోకి కూడా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. 

వెంకటేష్ హీరోగా ఈ దృశ్యం సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది ఆడియన్స్ ని కట్టిపడేసింది .ఈ చిత్రం మరో ఘనత దక్కించుకుంది. ఈ సినిమా  చైనీస్ లో రీమేక్ కాబోతోంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమా `దృశ్యం` కావడం విశేషం.ఈ చిత్ర రీమేక్ హక్కులను ఓ చైనా నిర్మాణ సంస్థ కొనుగోలు చేసినట్లు దర్శకుడు జీతూ జోసెఫ్ తెలిపారు. ఈ విధంగా చైనా కంపెనీ రీమేక్ రైట్స్ కొనుక్కున్న మొట్ట మొదటి భారతీయ సినిమా ఇదేనని జోసెఫ్ చెప్పారు.ఏది ఏమైనా కథ ఉంటేనే సినిమా అని నిరూపించింది ఈ దృశ్యం సినిమా.

ఘోర ప్రమాదం.. రెండు ముక్కలైన టిప్పర్..

భద్రాద్రి కొత్త గూడం : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటలో టిప్పర్ వాహనం రెండు ముక్కలయ్యింది. 

చంద్రబాబు విశాఖ పర్యటన..

విశాఖ : నేడు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. 

08:58 - September 17, 2017

ప్రకాశం : జిల్లాలో ప్రేమో ఉన్మాధానికి చేతిలో మరో అమ్మాయి బలయ్యింది. ప్రేమను అంగీకరించడంలేదనే నెపంతో ఓ ఉన్మాధి పీక కోసి అమ్మాయిని హత్య చేశాడు. ప్రకాశం జిల్లా వేట పాలెంలో తేజ అనే అమ్మాయిని గోపిచంద్ అనే ప్రేమోన్మాది గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

08:45 - September 17, 2017
08:43 - September 17, 2017

ఆంధ్ర ప్రదేశ్ ఎదుర్కొంటున్న నీటి కొరత.. రాష్ట్ర కజానాపై ఆంక్షలు విధించడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు..  అగ్రీ గోల్డు అంశంపై నేటి న్యూస్ మార్నింగ్ డిబేట్ లో చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత సునీత, బీజేపీ నేత విష్ణు, వైసీపీ నేత కొనిజేటి రమేష్ లు పాల్గొన్నారు. పూర్తి డిబేట్ కోసం వీడియో క్లిక్ చేసి చూడండి.. 

08:38 - September 17, 2017

కరీంనగర్ : శాత వాహన యూనివర్సిటీలో అర్థ రాత్రి ఉదృక్తిత చోటుచేసుకుకుంది. యూనివర్సిటీలోకి ప్రవేశించిన పోలీసులు విద్యార్థి లీడర్లను అరెస్టులు చేశారు. తెలంగాణ విలీన దినాన్ని జరపకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ అక్రమ అరెస్టులు చేయించిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. మరో వైపు యూనివర్సిటీలోని  విద్యార్థులంతా ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా అర్థరాత్రి యూనివర్సిటీలో బైఠాయించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడవచ్చు..

08:30 - September 17, 2017

హైదరాబాద్ : రెండు సార్లు వరల్డ్‌ చాంపియన్‌ ఇండియా.. ఐదు సార్లు వన్డే చాంపియన్‌ ఆస్ట్రేలియాతో  అసలు సిసలు వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని తొలి వన్డేలో విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు  స్టీవ్‌స్మిత్‌ సారధ్యంలోని ఆస్ట్రేలియా సవాల్‌ విసురుతోంది.సొంతగడ్డపై  తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన టీమిండియా....ఆస్ట్రేలియా జట్టుపై మరోసారి ఆధిపత్యం ప్రదర్శించాలని తహతహలాడుతోంది. 
తహ..తహ.. 
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉండగా...ఇండియా మూడవ స్థానంలో కొనసాగుతోంది. సొంతగడ్డపై  తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన టీమిండియా....ఆస్ట్రేలియా జట్టుపై మరోసారి ఆధిపత్యం ప్రదర్శించాలని తహతహలాడుతోంది.  రాహుల్‌,రోహిత్‌ శర్మ, విరాట్‌ కొహ్లీ, ధోనీ, మనీష్‌ పాండే,కేదార్‌ జాదవ్‌లతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ ఎప్పటిలానే పటిష్టంగా ఉంది. హార్దిక్‌ పాండ్య,అక్షర్‌ పటేల్‌ వంటి హార్డ్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్లతో లోయర్‌ ఆర్డర్‌లోనూ బలంగా ఉంది.
కుల్దీప్‌ యాదవ్‌,యజ్వేంద్రచహాల్‌ వంటి మ్యాజిక్‌  స్పిన్నర్లతో పాటు  మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌,ఉమేష్‌ యాదవ్‌ వంటి  పేస్‌ బౌలర్లతో బౌలింగ్‌ ఎటాక్‌ పదునుగా ఉంది. అన్ని విభాగాల్లోనూ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోన్న భారత్‌...శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాపై తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన రోహిత్‌ శర్మ,విరాట్‌ కొహ్లీ మరోసారి స్థాయికి తగ్గట్టుగా చెలరేగితే భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు.

అశ్విన్, జడేజా లేకుండా..
అశ్విన్‌,జడేజా లేకుండానే బరిలోకి దిగబోతున్న భారత జట్టు కంగారూ బ్యాట్స్‌మెన్‌ కట్టడి చేయగలదో లేదో చూడాలి.  మరోవైపు స్టీవ్‌ స్మిత్‌ సారధ్యంలోని ఆస్ట్రేలియా జట్టు సీనియర్ల మీదే భారం వేసింది. బ్యాటింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ , స్టీవ్‌ స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌...బౌలింగ్‌లో జేమ్స్‌ ఫాక్నర్‌, కౌల్టర్‌నైల్‌ వంటి అనుభవజ్ఞులు రాణిస్తేనే భారత్‌కు గట్టి పోటీనివ్వగలుగుతుంది.  సొంతగడ్డపై తిరుగులేని ట్రాక్ రికార్డ్‌తో పాటు...పవర్‌ఫుల్‌ టీమ్‌ కాంబినేషన్‌తో పటిష్టంగా ఉన్న భారత జట్టు తొలి వన్డేలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో సందేహమే లేదు. కానీ 5 సార్లు వరల్డ్ చాంపియన్‌ ఆస్ట్రేలియాను మాత్రం అసలే మాత్రం తక్కువ అంచనా వేయలేం. మాజీ వన్డే చాంపియన్‌ జట్ల మధ్య జరుగనున్న ఈ కీలక సిరీస్‌లోని తొలి వన్డేలో నెగ్గి శుభారంభం చేసే జట్టేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్‌ చేయాల్సిందే.

08:24 - September 17, 2017

న్యూ ఢిల్లీ : భారత వైమానిక దళ మార్షల్‌ అర్జన్‌సింగ్‌ రాత్రి చనిపోయారు. గుండెపోటుతో ఆయన శనివారం ఉదయం ఆర్మీకి చెందిన రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1964 నుంచి 69 మధ్య భారత వైమానిక దళ అధిపతిగా ఉన్న ఆయన.. ఐదు నక్షత్రాల ర్యాంకు కలిగిన ఏకైన మార్షల్‌. 1965లో జరిగిన భారత్‌ -పాక్‌ యుద్ధంలో అర్జన్‌ వీరోచితంగా పోరాడారు. యువ వైమానిక దళానికి ఆయన నాయకత్వం వహించారు. గతేడాది ఆయన అరుదైన గౌరవం అందుకున్నారు.  పశ్చిమ్‌ బంగాలోని పనాగడ్‌ వైమానిక స్థావరానికి ఆయన పేరు పెట్టారు. అర్జన్‌సింగ్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, రక్షణమంత్రి నిర్మలాసీతారామన్‌తోపాటు త్రివిధ దళాధిపతులు ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

08:22 - September 17, 2017

హైదరాబాద్ : తెలంగాణలో మద్యాన్ని సమూలంగా నిషేధించాలని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం డిమాండ్‌ చేశారు. మద్యం మహమ్మారితో మహిళల బతుకులు ఛిద్రం అవుతున్నాయన్నారు. తెలంగాణ సర్కార్‌ బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు చీరలు పంచడం సంతోషకరమే అన్న ఆమె.. అదే మహిళలు మద్యంతో ఇబ్బంది పడుతోంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట మత్స్యకార్మికుల సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆమె... కాసేపు బతుకమ్మ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. 

 

08:19 - September 17, 2017

కర్నూల్ : నీట్‌ , జేఈఈ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలులో విద్యార్థులు ఆందోళనకు దిగారు.  నీట్‌, జేఈఈ పరీక్ష కేంద్రాల సాధన సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.  నీట్‌, జేఈఈ పరీక్ష కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలంటోన్న విద్యార్థులడి మాండ్స్ ఏమిటీ? వారు దేనికోసం ఫైట్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే వీడియో చూడండి..

08:16 - September 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ డిమాండ్‌ చేశారు.  తెలంగాణ పోరాట యోధులను గుర్తించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రజాకార్లకు వ్యతిరేకంగా చేపట్టిన సాయుధ పోరాటం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవం సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర రాత్రి మంచిర్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన..  కేసీఆర్‌ నియంత పాలనకు ప్రజలు చరమగీతంపాడే రోజు ఆసన్నమైందని హెచ్చరించారు.

08:14 - September 17, 2017

వికారాబాద్ : తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి సమగ్ర అభివృద్ధి జరగాలని టీమాస్‌ నేత , ప్రజాయుద్ధనౌక గద్దర్‌ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల మాదిరిగానే...  స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కూడా పెన్షన్‌ విధానాన్ని వర్తింపచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీమాస్‌ తెలంగాణ సామాజిక సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వంపై రాజీలేని పోరుచేస్తుందని హెచ్చరించారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని కొండా బాలకిష్టారెడ్డి గార్డెన్‌లో టీమాస్‌ జిల్లా ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న గద్దర్‌... హక్కుల సాధన కోసం ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఇదే సభలో పాల్గొన్న విమలక్క... కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. మనుధర్మ శాస్త్రం అమలు చేస్తూ దళితులపై దాడులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. అనంతరం బహుజన బతుకమ్మ గోడ పత్రికను నేతలు ఆవిష్కరించారు. 

కారు అదుపుతప్పి..

అనంతపురం : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుత్తి మండలం కరటికొండ వద్ద అదుపు తప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ప్రేమోన్మాదం..

ప్రకాశం : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమను అంగీకరించలేదని ఒక ప్రేమోన్మాధి అమ్మాయి గొంతుకోసి చంపాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

అర్థ రాత్రి అరెస్టులు..

కరీం నగర్ : శాతవాహన యూనివర్సిటీలో శనివారం అర్థరాత్రి విద్యార్థి లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు. విలీన దినం జరపకుండా ఉండేందుకే పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కొనసాగుతున్న అక్రమ నిర్భందాలకు వ్యతిరేకంగా విద్యార్థులు యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేశారు. 

తొలిసమరం నేడే..

హైదరాబాద్ : భారత్, ఆస్ట్రేలియాల మధ్య వన్డే సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. చెన్నై చిదంబరం స్టేడియంలో నేడు ఇరు జట్లు తలపడనున్నాయి. స్టీవ్ స్మిత్ ఆద్వర్యంలోని ఆసీస్ తో భారత్ ఐదు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్ ల సిరీస్ ను బ్రౌన్ వాష్ చేయాలని కోహ్లీ సేన ఉవ్విల్లూరుతోంది. 

Don't Miss