Activities calendar

18 September 2017

దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. 

20 లక్షల చీరల పంపిణీ..

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం చీరల పంపిణీ కార్యక్రమం మొదలైందని తెలంగాణ జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ వెల్లడించారు. కోటి 4 లక్షల 47 వేల మంది మహిళలున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, తొలి రోజు దాదాపు 20 లక్షల చీరల పంపిణీ పూర్తయ్యిందని వెల్లడించారు. 

చీరల దగ్ధంలో 18 మందిపై కేసులు - డీసీపీ..

హైదరాబాద్ : భువనగిరిలో బతుకమ్మ చీరలు దగ్ధం చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చీరలు దగ్ధం చేసిన వారిపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో కాంగ్రెస్ నేత వెంకటేశ్వర్లు సహా 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీసీపీ యాదగిరి చెప్పారు. 

పరారీలో హనీ ప్రీత్ ఇన్ సా..

ఢిల్లీ : డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ దత్త పుత్రిక హనీప్రీత్‌ ఇన్‌సా సహా మరో 43 మంది పేర్లను హర్యానా పోలీసులు మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చారు. డేరా సచ్చా సౌదా అధికార ప్రతినిధి ఆదిత్య ఇన్‌సా పేరు కూడా ఇందులో ఉంది. హనీప్రీత్‌, ఆదిత్య వీరిద్దరు కూడా పరారీలో ఉన్నారు. 

21:26 - September 18, 2017

గుంటూరు : సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో టీడీపీ సర్కార్‌కు షాక్‌ తగిలింది. చౌకగా భూములను తన అనుయాయులకు కట్టబెట్టాలనుకున్న సీఎం చంద్రబాబు కుట్రలకు బ్రేక్‌ పడింది. సుమారు గంటపాటు పోటాపోటీగా సాగిన బహిరంగ వేలంలో సదావర్తి సత్రం భూములకు మూడింతల ఎక్కువ ధర పలికింది. 83 ఎకరాల భూమిని 60 కోట్ల 30 లక్షల రూపాయలకు కడప జిల్లాకు చెందిన బిల్డర్‌ సత్యనారాయణ రెడ్డి సొంతం చేసుకున్నారు. 

సదావర్తి భూములకు న్యాయం జరిగింది. కారు చౌకగా భూములను సొంతం చేసుకుందామనుకున్న అధికార పార్టీ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో చెన్నైలో సదావర్తి భూములకు వేలం నిర్వహించారు. 83.11 ఎకరాల భూమిని 60 కోట్ల 30 లక్షలకు కడప జిల్లాకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్‌ కంపెనీకి చెందిన సత్యనారాయరెడ్డి వేలంలో దక్కించుకున్నారు. సత్యనారాయణ రెడ్డి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వరదరాజులరెడ్డి కుమారుడు.

చెన్నైలోని టీ-నగర్‌లో నిర్వహించిన వేలంలో 27కోట్ల 45 లక్షల రూపాయల నుంచి పాట మొదలైంది. తర్వాత పోటాపోటీగా సాగింది. ఈ-టెండర్లలో 54 కోట్లకు బ్రహ్మనంద కోట్ చేశారు. అయితే బహిరంగ వేలంలో మాత్రం 60 కోట్ల 30 లక్షలకు సత్యనారాయరెడ్డి దక్కించుకున్నారు. గతంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అంటే...37 కోట్ల 90 లక్షల అధిక ధర పలికింది. బహిరంగ వేలానికి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కూడా హాజరయ్యారు.

కాగా సదావర్తి సత్రం పేరిట ఉన్న 83.11 ఎకరాల భూముల అమ్మకానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత ఏడాది మార్చి 28న చెన్నైలో బహిరంగ వేలం నిర్వహించింది. అప్పుడు జరిగిన వేలం ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని, సర్కారు పెద్దలు ఆ భూములు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు వెళ్లారు. 10టీవీ సైతం సదావర్తి భూముల వేలంలో లోపాలున్నాయని కథనాలను ప్రసారం చేసింది. అయితే సదావర్తి సత్రం భూములుగా పేర్కొంటున్నవి తమ ఆస్తులని, ఏపీ ప్రభుత్వం నిర్వహించే వేలం ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఏడాదిన్నరగా దీనిపై వివాదం కొనసాగింది. గతంలో 83.11 ఎకరాలను రూ.22.40 కోట్లకే సీఎం తన అనుయాయులకు కట్టబెట్టారు. అయితే తిరిగి మళ్లీ నిర్వహించిన వేలం పాటలో సదావర్తి భూముల ధరలు మూడు రెట్లు అధికంగా పలికాయి. వేలం పాట ప్రక్రియ మొత్తాన్ని సుప్రీం కోర్టుకు నివేదిస్తామని దేవదాయ శాఖ కమిషనర్ అనురాధ ప్రకటించారు.

21:21 - September 18, 2017

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం తడిచిపోమెడవుతోంది. ప్రాజెక్టుతో పాటు పునరావాసం, భూసేకరణకు ఇప్పటికే దాదాపు 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కాల్వలు, ప్రాజెక్టు, పునరావాసం, భూసేకరణ మొత్తం పనులు పూర్తవ్వాలంటే మరో 40 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నట్టు పోలవరం పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల ఫోటోలు, మ్యాప్‌లను దగ్గర పెట్టుకుని విహంగ వీక్షణం చేశారు.
 

పోలవరం ఏరియల్‌ సర్వే తర్వాత ప్రాజెక్టు నిర్మాణ స్థలానికి చేరుకుని జరుగుతున్న పనులను పరిశీలించారు. స్విల్‌వేతో పాటు గేట్ల నిర్మాణం జరుగుతున్న తీరును చూశారు. స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మ్యాప్‌లను చూశారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు గురించి అధికారులు చంద్రబాబుకు వివరించారు. 1055 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిపని చేయాల్సి ఉండగా ఇంతవరకు 70 శాతం పూర్తైనట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. 31 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులకు కేవలం 2.70 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు మాత్రమే జరగడం పట్ల ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు... వేగం పెంచాలని ఆదేశించారు.

పన్నెండు వందల మీటర్ల డయాఫ్రం వాల్‌లో 55 మీటర్లు పూర్తైంది. ఏడు లక్షల క్యూబిక్‌ మీటర్ల స్పిల్‌ వే కాంక్రీటు పనులు పూర్తైతే ప్రాజెక్టుకు ఒక రూపం వస్తుందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 960 మెగావాట్ల సామర్థం కలిగిన పోలవరం జల విద్యుత్‌ కేంద్రానికి త్వరలో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఇంతవరకు చేసిన ఖర్చుల వివరాలు, కేంద్రానికి పంపిన సవరించిన అంచనాల నివేదిక, భూసేకరణ, పునరావాసం కోసం కావాల్సిన నిధుల తదితర అంశాలపై సమీక్షించారు. ప్రాజెక్టు వ్యయం 50వేల కోట్లకు చేరుతుందని అంచనావేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్ణీత సమయానికి పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 

21:18 - September 18, 2017

హైదరాబాద్ : అమరావతి డిజైన్లపై సీఎం చంద్రబాబు సూచన మేరకు సినీ దర్శకుడు రాజమౌళిని మంత్రి నారాయణ, కమిషనర్‌ శ్రీధర్‌ బృందం కలిసింది. ఇప్పటి వరకు నార్మన్‌ ఫోస్టర్‌ బృందం ఇచ్చిన డిజైన్లను, వాటి ఉద్దేశాలను రాజమౌళికి వివరించారు. రాజధాని నిర్మాణంలో మన ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేందుకు తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని రాజమౌళిని మంత్రి నారాయణ కోరారు.  

21:17 - September 18, 2017

నల్గొండ : భువనగిరిలో బతుకమ్మ చీరలు దగ్ధం చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చీరలు దగ్ధం చేసిన వారిపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో కాంగ్రెస్ నేత వెంకటేశ్వర్లు సహా 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీసీపీ యాదగిరి చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తనపై కావాలనే తప్పుడు కేసులు నమోదు చేసినట్లు వెంకటేశ్వర్లు చెబుతున్నారు.

హైకోర్టు న్యాయమూర్తులుగా...

హైదరాబాద్ : హైకోర్టు న్యాయమూర్తులుగా ఆరుగురిని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కొంగర విజయలక్ష్మీ, పి.కేశవరావు, ఎం.గంగారావు, డీవీఎస్ సోమయాజులు, అభినంద్ కుమార్, టి.అమర్ నాథ్ గౌడ్ లను నియమించారు.  

బతుకమ్మ చీరల్లో అవినీతి - రేవంత్..

హైదరాబాద్ : నాసిరకం బతుకమ్మ చీరలతో మహిళలను అవమానించారని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. సూరత్, మాలేగావల్ తూకం ద్వారా చీరలు కొన్నారని, చీర ఖరీదు రూ. 50 నుండి రూ. 60 మాత్రమే ఉంటుందన్నారు. బతుకమ్మ చీరల్లో రూ. 150 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 

మంథని మార్కెట్ కమిటీ ఛైర్మన్ పై చీటింగ్ కేసు..

పెద్దపల్లి : మంథని మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకుల కిరణ్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు. శివశంకర ఎంటర్ ప్రైజెస్ ను ఆకుల కిరణ్ నడుపుతున్నారు. తన వద్ద పనిచేసే కార్మికులకు పీఎఫ్ చెల్లించకపోవడంతో పోలీసులను 132 మంది బాధితులు ఆశ్రయించారు. 

20:48 - September 18, 2017

భూములు సర్వే చేస్తాం...అంటున్నారు..మంచి విషయమే. ఎవరి పేరును ఉందో తెలుసుకోవడానికి..అన్ని లెక్కలు తేలుస్తామంటున్నారు..ఆహ్వానించాల్సిందే..కానీ ఆ దిశగా సర్కార్ వేస్తున్న అడుగులు ఎలా ఉన్నాయి ? జీవోల మతలబు ఏంటీ ? రైతు సమన్వయ సమితులు ఏ లక్ష్యం కోసం ఏర్పాటు చేస్తున్నారు ? సమితలు పరోక్షంగా అధికార పార్టీ ప్రయోజనాలు సాధించడానికేనా ? దీనిపై ప్రత్యేక కథనం..మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:42 - September 18, 2017

బతుకమ్మ పండుగ అంటే ఆడోళ్ల పండుగ అనుకుంటరు..కానీ ఒక్క ఆడోళ్ల పండుగ కాదు..దానికి రకరకాల పూలు తెంపేకాడ..తాత అక్కరొస్తడు..బతుకమ్మ మోసే కాడ తమ్ముడు అక్కరొస్తడు..అన్ని బంధాలు కలిస్తే బతుకమ్మ పండుగ అయితది...తెలంగాణలోనే పూలను కొల్చుకునే బతుకమ్మ ఉంటది కాబట్టి..ఆ బతుకమ్మ కోసం..అమ్మలు..ఆడపడుచుల కోసం టెన్ టివి బతుకమ్మ పాటను ముందుకు తీసుకొస్తోంది..టెన్ టివి ఒక్కటే తీసుకొస్తలేదు..బొమ్మకు క్రియేషన్...'శరణం గచ్చామి' చిత్రాన్ని అందించిన ప్రొడ్యూసర్ బొమ్మకు మురళి, డాక్టర్ ప్రసునూరి రవీందర్ (కేంద్ర సాహిత్య అకాడమీ పురాస్కార గ్రహీత) అక్షరాలు..పూలగా పేరిస్తే పాట తయారైంది. మురళన్న సహకారంతో పాట ముందుకొచ్చింది. మరి ఆ పాట ఎలా ఉందో చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:54 - September 18, 2017

తెలంగాణ సర్కార్ పై సీఐటీయూ సమ్మె సైరన్ మోగించింది. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా సీఐటీయూ ధర్నాలు నిర్వహించనుంది. కనీస వేతనాల జీవోను సవరించాలని, కనీస వేతనం రూ. 18 వేలుగా నిర్ణయించాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని..సుప్రీం తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని.. ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో ప్రత్యేక చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో భిక్షపతి (ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి), భూపాల్ (సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్) పాల్గొని అభిప్రాయాలు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:44 - September 18, 2017

హైదరాబాద్ : బతుకమ్మ చీరల నాణ్యతపై వస్తున్న విమర్శలను మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. ప్రతిపక్షాలు కావాలనే ఇలాంటివి చౌకబారు, దుష్ర్పచారాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. బతుకమ్మ సందర్భంగా ద్విముఖ మైన వ్యూహం..నేతన్నలకు సహాయం పడాలని..ఆడపడుచుల సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో 'బతుకమ్మ చీరలు' పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి 4 లక్షల చీరలను పంపిణీ చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలో 8వేల పైచిలుకు పైగా సెంటర్లలో 25వేల లక్షలకు పైగా చీరలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తాను స్వయంగా పాల్గొని చీరలను పంపిణీ చేసినట్లు చెప్పారు.

కృత్రిమ నిరసనలకు దిగాలని ప్లాన్ చేసినట్లు, డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు చేస్తుంటే వారం రోజుల కిందటే 'బతుకమ్మ చీరలు' నాసిరకంగా ఉన్నాయని వార్తలు వచ్చాయని, తాము ఈ వార్త విని ఆశ్చర్యపోయామన్నారు. 4, 5 చోట్ల ఘటనలు జరిగాయని, అందులో ప్రధానంగా జగిత్యాల, సత్తుపల్లి నియోజవకర్గాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఆలోచించాలన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పని విపక్షాలు ఒర్చుకోవడం లేదని, చీరలు ఎవరూ కాల్చరని, జగిత్యాల నియోజకవర్గంలో కొంతమంది మహిళలు చీరలు తీసుకెళుతుంటే ఆ చీరలను గుంజుకుని కాల్చారంటూ ఓ పోస్టర్ ను చూపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి నాయకులు ఇందులో ఉన్నారని తెలిపారు. ఈ విషయంలో కేసులు నమోదు చేయడం జరిగిందని, ఇంత నీచమైన రాజకీయం ఎక్కడా చూడలేదన్నారు. 

19:39 - September 18, 2017

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదమైంది. పండక్కి.. చేనేత చీరలు అందిస్తామంటూ ప్రకటనలతో ఊదరగొట్టిన ప్రభుత్వం.. సూరత్‌, షోలాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన పాలియెస్టర్‌ చీరలను మహిళలకు పంపిణీ చేసింది. దీంతో ఎక్కడికక్కడ మహిళాలోకం భగ్గుమంది. ఉదయం నుంచీ క్యూలైన్లలో నిలుచుని చీరలు తీసుకున్న మహిళలు.. వాటి నాణ్యతను చూడగానే ప్రభుత్వంపై శాపనార్థాలు మొదలు పెట్టారు.

పద్దెనిమిది సంవత్సరాల పైబడ్డ ప్రతి మహిళకూ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం.. కోటీ నాలుగు లక్షల చీరలను సిద్ధం చేసింది. సుమారు 222 కోట్ల రూపాయలను దీనికోసం ఖర్చు చేసింది. సిరిసిల్ల నేతన్నల నుంచి 52 లక్షల చీరలు.. మిగిలిన చీరలు టెండరింగ్ ప్రక్రియ ద్వారా సేకరించామని ప్రభుత్వం వెల్లడించింది. తీరా పంపిణీ సమయంలో.. చేనేత చీరలు కాకుండా పాలియెస్టర్‌ చీరలు అందించడంతో.. కొందరు మహిళలు వాటిని అక్కడికక్కడే తగులబెట్టేశారు.

హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని శ్రీశంకర్ కాలనీలో బతుకమ్మ చీరలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకో ప్రాంతంలో ఒకో రకం చీరలు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్బీనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉదయం నుంచి పడిగాపులు కాసినా అధికారులు చీరల పంపిణీ చేయకపోవడంపై మహిళలు భగ్గుమన్నారు.

బతుకమ్మ చీరలపై నల్లగొండ జిల్లా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతలేని చీరలను పంచుతున్నారంటూ.. కేసీఆర్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. రోడ్డుపై చీరలను కుప్పగా పారేసి నిరసన తెలిపారు.

బతుకమ్మ చీరలపై ఖమ్మం జిల్లా మహిళలు మండిపడ్డారు. సిరిసిల్ల చేనేత చీరలిస్తామన్న ప్రభుత్వం చివరికి నాసిరకం పాలిస్టర్ చీరలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ చర్యను విపక్షాలూ తప్పుబట్టాయి. కేసీఆర్ ప్రభుత్వం మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆక్షేపించాయి.

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బతుకమ్మ చీరల బాగోతం బయటపడింది. నాసిరకం చీరలు అంటగడుతున్నారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా చల్‌గల్‌లో బతుకమ్మ చీరలపై మహిళలు ధ్వజమెత్తారు. తమకి ఇచ్చిన చీరలను విసిరికొట్టారు.

వనపర్తిలో ఇదే సీన్ కనిపించింది. చేనేత చీరలు ఇస్తామని చెప్పి.. పాలిస్టర్ చీరలు ఇస్తారా అంటూ మహిళలు మండిపడ్డారు. పనులు మానుకుని వచ్చిన తమ కూలీ డబ్బులు అధికారులు ఇస్తారా అని నిలదీశారు.

మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం బొద్దుగుంటలో తమకిచ్చిన చీరలు వెనక్కు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. బొంతలు కుట్టుకునేందుకు కూడా ఈ చీరలు పనికి రావని మహిళలు విమర్శించారు.

మరోవైపు చీరల పంపిణీలో ఎటువంటి గోల్ మాల్ జరగలేదన్నారు టెక్స్ టైల్ కమిషనర్ శైలజా రామయ్యర్. సూరత్‌లో తయారు చేసిన చీరలు ఇతర చీరల కన్నా కాస్త భిన్నంగా ఉంటాయని చెప్పారు. ఈ చీరల క్వాలిటీపై పూర్తి పర్యవేక్షణ జరిగిందని స్పష్టం చేశారు.

ఎంతో అట్టహాసంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అభాసుపాలయ్యే పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలపై దృష్టి సారించింది. చీరలు కాల్చిన వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసుల నమోదుకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో భువనగిరి, జగిత్యాల జిల్లాలో అరెస్టులు జరిగాయి. చీరలు తగలపెట్టారని... భువనగిరిలో పోలీసులు 18 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జగిత్యాల జిల్లా జల్గల్ సర్పంచ్ కవిత భర్త రాజేందర్‌ను కూడా ఇదే నెపంతో.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు.. పీఎస్‌ ముందు ధర్నాకు దిగారు.

19:36 - September 18, 2017

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బతుకమ్మ చీరలు నాణ్యంగా లేవంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. మంత్రి ఈటెల రాజేందర్‌ నియోజకవర్గమైన జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామపంచాయితీ ఎదుట నిరసన చేపట్టారు.. చీరలకు నిప్పంటించి చుట్టూ బతుకమ్మ ఆడారు.. డోర్‌ కర్టెన్లకు కూడా పనిచేయని చీరలు తమకిచ్చి మోసం చేశారని ఆరోపించారు.. మరిన్ని వివరాలు..ఆడపడుచుల ఆగ్రహం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:35 - September 18, 2017

విశాఖపట్టణం : నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ...అదే రెట్టింపు ఉత్సాహంతో మరో ఎన్నికకు సిద్ధం అవుతుంది. మరోవైపు ఓటమి నైరాశ్యం నుండి బయటపడి రానున్న ఎన్నికలకు ప్రజలను కార్యకర్తలను సిద్ధం చేసేపనిలో పడింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. అయితే త్వరలో విశాఖలో రానున్న జీవీఎంసీ ఎన్నికలకు ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్దం అవుతున్నాయి.

నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలిచి రెట్టింపు ఉత్సాహంతో ఉన్న టీడీపీ మరో ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహాన్ని ప్రదర్శించేందుకు సిద్ధం అవుతుంది. ఏ క్షణంలో అయినా జీవీఎంసీ ఎన్నికల ప్రకటన వస్తుందన్న ఊహాగానాలతో ఇటు టీడీపీ, అటు వైసీపీ పార్టీలు పోరుకు సిద్ధం అవుతున్నాయి. ఇందుకోసం ఇరు పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల తర్వాత అందరి దృష్టి విశాఖ కార్పొరేషన్‌పై పడింది. 5 సంవత్సరాలుగా విశాఖ కార్పొరేషన్‌ ప్రత్యేక అధికారుల పాలనలోనే నడుస్తుంది. దీంతో కాకినాడ ఎన్నికల తర్వాత విశాఖలో ఎన్నికలు నిర్వహిస్తారన్న ఆలోచనలో ఉన్నాయి ఇరుపార్టీ వర్గాలు.

ఇందులో భాగంగానే ఈ నెల 11వ తేదీన ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని అధికార పార్టీ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రజలకు నెరవేర్చని హామీలను ప్రజల నుండి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అంతే కాకుండా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని అధిష్ఠానం దృష్ఠికి తీసుకెళ్తుంది. టీడీపీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలతో ఇప్పటికే విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఆ పార్టీ నేతలు పనులు ప్రారంభించారు.

నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమితో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఒక్కసారిగా డీలా పడిందని చెప్పవచ్చు. అయితే నంద్యాల ఉప ఎన్నికల సమయంలో జగన్‌ ఇచ్చిన హామీలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉంది వైసీపీ. ఓటమి నైరాశ్యం నుండి బయటపడి పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని నింపడంలో నవరత్నాల సభలతో పాటుగా వైఎస్‌ఆర్‌ కుటుంబం పేరుతో కార్యకర్తలు ప్రతి గ్రామస్తులను కలిసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికే సంస్థాగతంగా బూత్‌ కమిటీలను ఏర్పాటు చేసుకున్న వైసీపీ...వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని పూర్తిగా బూత్‌ కమిటీలకు అప్పగించింది. ప్రత్యేక హోదా విశాఖకు రైల్వే జోన్‌ వంటి అంశాలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను కూడా తీసుకువచ్చి ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 20 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే డిసెంబర్‌, జనవరి నాటికి కార్పొరేషన్‌ ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ, టీడీపీ పార్టీలు ఇప్పటికే తమ తమ కార్యకర్తలను విశాఖలో పర్యటించేలా ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

19:33 - September 18, 2017

అనంతపురం : బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కలిసి ముందుకు రావాలని నోబెల్‌ అవార్డ్‌ గ్రహీత కైలాష్‌ సత్యర్ధి పిలుపునిచ్చారు. బాలల హక్కుల కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఇరవై రెండు రాష్ట్రల్లో యాత్ర చేపడుతున్నారు. యాత్రలో భాగంగా కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కి చేరిన యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు, అధికారులు పెద్ద ఎత్తున కైలాష్‌ సత్యర్థికి స్వాగతం పలికారు. అనంతపురం చిలమత్తూరు మండల సమీపంలో నిర్వహించిన సభలో... కైలాష్ సత్యర్థి వచ్చిన వారితో చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రతిజ్ఞ చేయించారు. 

19:32 - September 18, 2017

రాజమండ్రి : పోలవరం ప్రాజెక్టు నిర్ణీత సమయానికి పూర్తయే అవకాశాలు తక్కువనేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడాన్ని ఉండవల్లి తప్పుపట్టారు. టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివరావు సంస్థకు అప్పగించిన పనులు మూడేళ్ల నుంచి చేపట్టకపోయినా చంద్రబాబు మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు. 2018 నాటికి పోలవరం పూర్తైతే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి మినహా... మిగిలిన ఏపార్టీలకు ఓట్లు రావన్నారు ఉండవల్లి. 

19:30 - September 18, 2017

కర్నూలు : శివారులోని సీర్‌ రెడ్డి స్కూల్లో పదో తరగతి విద్యార్థిని ప్రీతి కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది ఆత్మహత్య కాదని, హత్యని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్‌ వద్ద ధర్నా జరిగింది. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:20 - September 18, 2017

సర్పంచ్ భర్త అరెస్టు..

జగిత్యాల : జిల్లా జల్గల్ సర్పంచ్ కవిత భర్త రాజేందర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బతుకమ్మ చీరలను దగ్ధం చేశారని రాజేందర్ ను అరెస్టు చేసి రూరల్ పీఎస్ కు తరలించారు. పీఎస్ ఎదుట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ వరకు గ్రామస్తులు భారీ ర్యాలీ చేపట్టారు. 

బతుకమ్మ చీరల విమర్శలపై కేటీఆర్ స్పందన..

హైదరాబాద్ : బతుకమ్మ చీరల నాణ్యత విషయంలో చెలరేగిన విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వం ఏ మంచి పనిచేయాలని అనుకున్నా..చౌకబారు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. 

18:40 - September 18, 2017

గుంటూరు : జిల్లా పెనుమాక గ్రామ అధ్యక్షుడి నియామకం తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చు పెట్టింది. రాజధాని ప్రాంతమైన పెనుమాక అధ్యక్ష పదవిని అనర్హులకు కేటాయిస్తున్నారంటూ టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు.. ఐవీఆర్ఎస్ పద్ధతిలో నియామకాలు జరుగుతాయని చెప్పి... ఇప్పుడు మాట మార్చారని ఆ పార్టీ నేత కొల్లి శేషు వర్గీయులు ఆరోపించారు.. పది లక్షల రూపాయల కోసం పార్టీ పరువును దిగజార్చారంటూ... టీడీపీ నేతలు మన్నవ సుబ్బారావు, గంజి చిరంజీవిని నిర్భందించారు.

18:39 - September 18, 2017
18:38 - September 18, 2017

శ్రీకాకుళం : ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని ఏపీ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌ చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న లోకేశ్... పలాసలో నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించారు. జిల్లాలో ఏర్పాటు చేసే ఏడు మెగా ఆర్వో ప్లాంటుల్లో ఇది మొదటి. ఒక్కో వాటర్‌ ప్లాంటు కోసం 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఏడు ఆర్వో ప్లాంట్‌ల ద్వారా రోజు లక్ష లీటర్ల శుద్ధి చేసిన జలాలు అందుతాయని చెప్పారు. 

18:37 - September 18, 2017

గుంటూరు : రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని... ఆ పార్టీ ప్రతినిధులు హరిప్రసాద్‌, మహేందర్‌ రెడ్డి తెలిపారు.. నీతివంతమైన రాజకీయాలకోసం మేధావులు, చదువుకున్నవారు పవన్‌ కల్యాణ్‌తో పనిచేసేందుకు అసక్తి చూపుతున్నారని చెప్పారు.. గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:35 - September 18, 2017

పశ్చిమగోదావరి : సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ తర్వాత పోలవరం దేశానికి అతిపెద్ద ఆస్తిగా మలచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే ఈ ప్రాజెక్టును నిర్దిష్టకాలపరిమితి ప్రకారం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలవరం పనులను చంద్రబాబు ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. ఆ తర్వాత ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను స్వయంగా తనిఖీ చేశారు. అధికారులను సమీక్ష నిర్వమించారు. జరుగుతున్న పనులను అధికారులు చంద్రబాబుకు వివరించారు. రానున్న కొద్ది రోజుల్లో పోలవరం విద్యుత్‌ కేంద్రానికి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 71 శాతం పనులు పూర్తి చేసిన విషయాన్ని అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. సర్దార్‌ సరోవర్‌ తర్వాత జాతికి అంకితం చేసే ప్రాజెక్టు పోలవరం అవుతుందని చంద్రబాబు చెప్పారు.

 

 

కాక్ పిట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం..

తూర్పుగోదావరి : జెట్ విమానంలో నార్వే జాతీయుడు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కాక్ పిట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఎయిర్ పోర్టు అథార్టీకి పైలట్ ఫిర్యాదు చేశాడు. రాజమండ్రి ఎయిర్ పోర్టులో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ నుండి రాజమండ్రికి విమానం వెళుతోంది. 

చీరల దగ్ధంపై సర్కార్ సీరియస్..

యాదాద్రి : బతుకమ్మ చీరలు దగ్ధం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దగ్ధం చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ అయ్యాయి. భువనగిరిలో దగ్ధం చేసిన మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొంటున్నారు.

 

పోలీసుల అదుపులో చీరల దగ్ధం చేసిన మహిళలు..

యాదాద్రి : బతుకమ్మ చీరలు దగ్ధం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దగ్ధం చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ అయ్యాయి. భువనగిరిలో దగ్ధం చేసిన మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. 

తెలుగు సినీ ప్రముఖులకు మోడీ లేఖ..

హైదరాబాద్ : తెలుగు సినీ ప్రముఖులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లేఖ రాశారు. రాజమౌళి, మోహన్ బాబు, మహేష్ బాబు, ప్రభాస్ కు లేఖలు అందాయి. స్వచ్చతే సేవలో భాగస్వాములు కావాలని లేఖలో కోరారు. 

యాజమాన్యాలు చేస్తున్న హత్యలు - వైసీపీ..

విజయవాడ : కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యలు కావని ర్యాంకుల కోసం యాజమాన్యాలు చేస్తున్న హత్యలని, విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం కళ్లగప్పించి చూస్తోందని వైసీపీ నేత పార్థసారధి పేర్కొన్నారు. కార్పొరేట్ దోపిడీకి ప్రబుత్వం ఊతం ఇస్తోందన్నారు. 

18:09 - September 18, 2017

విజయవాడ : ఎన్టీపీసీలో బొగ్గు సంక్షోభం ఏర్పడింది. బొగ్గు లేక మూడు యూనిట్లు నిలిచిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు యూనిట్లలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని తెలుస్తోంది. బొగ్గు సరిపడా రాకపోతే రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు ఉంటాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు సమీక్ష నిర్వహించారు. ముందస్తు చూపు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. 

18:07 - September 18, 2017

గుంటూరు : తండ్రి, కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన నవభారత్ నగర్ లో చోటు చేసుకుంది. తండ్రి సత్యనారాయణ, కూతురు శిరీష లు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలిలో సూసైడ్ లెటర్ లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించడంతో అసలు విషయం బయటపడింది.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో పట్టుబడిన 9 మంది తెలుగు వారికి శిరీష, భర్త ఉమా మహేశ్వరరావు నకిలీ వీసాలు ఇప్పించారు. నకిలీ వీసాలతో వారంతా ఇటలీకి వెళ్లేందుకు ప్రయత్నించడం..అక్కడి అధికారులు వారిని నిలువరించారు. పట్టుబడిన విషయాన్ని భార్య శిరీషకు భర్త ఫోన్ లో చెప్పారు. భయంతో శిరీష, తండ్రి మహేశ్వరరావులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విదేశాల్లో ఎమ్మెస్సీ కెమెస్ట్రీ చేసిన శిరీషకు అక్కడున్న కన్సల్టెన్సీలతో పరిచయాలున్నాయి.

భయంతో కూతురు..తండ్రి ఆత్మహత్య..

గుంటూరు : నవభారత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. తండ్రి సత్యనారాయణ, కూతురు శిరీష లు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలిలో సూసైడ్ లెటర్ లభ్యమైంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో పట్టుబడిన 9 మంది తెలుగు వారికి శిరీష, భర్త ఉమా మహేశ్వరరావు నకిలీ వీసాలు ఇప్పించారు. విదేశాల్లో ఎమ్మెస్సీ కెమెస్ట్రీ చేసిన శిరీషకు అక్కడున్న కన్సల్టెన్సీలతో పరిచయాలున్నాయి. పట్టుబడిన విషయాన్ని భార్య శిరీషకు భర్త ఫోన్ లో చెప్పారు. భయంతో శిరీష, తండ్రి మహేశ్వరరావులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

17:44 - September 18, 2017

హైదరాబాద్ : ఈ నెల ఇరవై నుంచి అక్టోబర్‌ రెండో తేదీ వరకు బహుజన బతుకమ్మ నిర్వహించనున్నట్లు టీ మాస్‌ నేత విమలక్క తెలిపారు. ఎస్వీకేలో బహుజన బతుకమ్మ పోస్టర్‌ను ఆవిష్కరించిన విమలక్క మాట్లాడుతూ... బతుకమ్మ అనేది ప్రకృతి పండుగ అని.. తరతరాలుగా మన తెలంగాణ సంస్కృతిలో భాగమైందని అన్నారు. కానీ నేడు బతుకమ్మ కొందరి పండుగలా మారింపోతుందని వాపోయారు. బహుజనులందరిని కలుపుకొని మొదటి రోజు హైదరాబాద్‌ ఎల్లమ బండలో బతుకమ్మ సంబరాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ రెండున రుద్రంగి గ్రామం సిరిసిల్ల జిల్లాలో ఉత్సవాలు ముగియనున్నాయి.

17:43 - September 18, 2017

హైదరాబాద్‌ : లోధా టవర్స్‌పై యాక్షన్‌ సిద్ధమైంది జీహెచ్ఎంసీ. లోధా టవర్స్‌ను నిర్మించిన హెల్తీ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలపర్స్‌ను బల్దియా తప్పుపట్టింది. దీంతో బిల్డర్‌ మోసం చేశారంటూ లోధా టవర్స్‌లోని మెరిడియన్‌ వాసులు చేస్తున్న వాదనలు నిజమయ్యాయి. లోధా టవర్స్‌ పేరుతో ఒకే ప్రాజెక్టు నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకున్న హెల్తీ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ బిల్డర్స్ రెండు వెంచర్లు వేసింది. బెలిజా, మెరిడియన్‌ పేర్లతో అపార్ట్‌మెంట్లు నిర్మించారు. ఒకే ప్రాజెక్టుకు అనుమతి తీసుకుని బెలిజా, మెరిడియన్‌ టవర్స్‌కు మధ్యలో గోడ కట్టడం వివాదాస్పదమైంది. దీంతో మెరిడియన్‌ వాసులు దఫదఫాలుగా ఆందోళనలు చేశారు. దీంతో ఈ వివాదంపై బల్దియా దృష్టిపెట్టింది. బెలిజా, మెరిడియన్‌ అపార్ట్‌మెంట్ల మధ్యలో నిర్మాణ సంస్థ కట్టిన గోడ అక్రమమని తేల్చింది. దీంతో ఈ గోడను తొలగించాలని మెరిడియన్‌ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

నిర్మాణ సమయంలో తమకు ఇస్తామన్న సౌకర్యాలను కూడా హెల్తీ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ బిల్డర్స్‌ కల్పించలేదని, వీటిపై కూడా దృష్టి పెట్టాలని మెరిడియన్‌ వాసులు కోరుతున్నారు. ఫ్లాట్ల కొనుగోలు ఒప్పుందాలు చేసుకున్నప్పుడు అందరికీ పార్కింగ్‌ ఇస్తామన్న నిర్మాణ సంస్థ... ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మెరిడియన్‌ వాసులు చెబుతున్నారు. అంతేకాకుండా కొనుగోలు సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం పార్కులు, క్రీడా స్థలం ఇవ్వకపోవడాన్ని మెరిడియన్‌ ఫ్లాట్ల నివాసితులు తప్పుపడుతున్నారు. బెలిజా, మెరిడియన్‌ ఫ్లాట్ల మధ్య అక్రమంగా నిర్మించిన తొలగించడంతో పాటు ఒప్పందం ప్రకారం తమకు ఇస్తామన్న సౌకర్యాలు నిర్మాణ సంస్థ కల్పించే విధంగా జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

17:41 - September 18, 2017

జగిత్యాల : సర్కార్‌ దవాఖాన అంటేనే భయపడే రోగులు నేడు నిర్భయంగా వస్తున్నారు. ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు అందించడమే కాకుండా... రోగుల పట్ల వైద్యులు నమ్మకం కలిగించడంతో అందరూ ప్రభుత్వాస్పత్రులలో వైద్యం చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కేసీఆర్‌ కిట్‌, అమ్మ ఒడి కార్యక్రమాలతో ఆస్పత్రులలో డెలివరీల సంఖ్య పెరుగుతోంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు అందుతాయన్న నమ్మకాన్ని వైద్యులు కలిగిస్తుండడంతో రోజురోజుకు ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు కేసీఆర్‌ కిట్లు, అమ్మ ఒడి కార్యక్రమంలో ఆస్పత్రిలో డెలివరీల సంఖ్య పెరిగింది. అంతేకాకుండా వైద్య సిబ్బంది రోగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు మంచిగా ఉండడంతో... రోజురోజుకు ఈ ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది.

ఈ ప్రభుత్వ ఆస్పత్రికి మెట్‌పల్లితోపాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, కథలాపూర్‌ తదితర మండలాల నుంచి నిత్యం అనేకమంది గర్బిణీలు ప్రసవాల కోసం వస్తుంటారు. ఆస్పత్రి సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల కంటే మంచి వైద్యం అందిస్తుండడంతో.. ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పిల్లలకు ఈ ఆస్పత్రిలో డెలివరీలు చేయిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించడం వల్ల రోగుల సంఖ్య పెరుగుతుందని వైద్య సిబ్బంది అంటున్నారు. ఆస్పత్రి సిబ్బంది మెరుగైన వైద్యం చేస్తున్నా... ఆస్పత్రి భవనం నిర్మించి ఏళ్లు గడుస్తుండడంతో శిధిలావస్థకు చేరుకుంది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ రోగులను వెంటాడుతోంది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ఆస్పత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంచి పక్కా భవనం నిర్మించాలని పలువురు కోరుతున్నారు. 

17:20 - September 18, 2017

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఖజానా ఖాళీ అయ్యింది. బల్దియాను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ముందువేసుకున్న ప్రాజెక్టులు వెక్కిరిస్తున్నాయి. పూర్తయిన పనులకు చెల్లింపులు కష్టంగా మారాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే జీతాలు చెల్లించడానికి ఇబ్బందులు తప్పవు. బల్దియాలో నిధుల కొరతపై 10టీవీ కథనం.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ .. ఒకప్పుడు భారీగా ఆదాయం కలిగిన లోకల్‌ బాడీ. ఇదంతా ఒకప్పటి చరిత్ర. ఇప్పుడు బల్దియాలో నిధులకు కటకట ఏర్పడింది. బల్దియాకు ఆదాయం భారీగా ఉందని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కానీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పైన పటారం.. లోన లోటారం అన్నచందంగా తయారయ్యింది జీహెచ్‌ఎంసీ పరిస్థితి.

నిత్యం కాసులతో కళకళలాడే బల్దియా గల్లాపెట్టే ఇప్పుడు వెలవెలబోతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరం వరకు జీహెచ్‌ఎంసీకి 600 కోట్ల ఎఫ్‌డీలు ఉండేవి. దీనిపై వడ్డీ రూపంలోనే దాదాపు 100 కోట్ల ఆదాయం వచ్చేది. అయితే జీహెచ్‌ఎంసీ ఆదాయాన్ని ఆర్టీసీ, వాటర్‌ బోర్డుతో పాటు ప్రభుత్వం నిర్వహించే ఇతర పండుగలకు ప్రభుత్వం మళ్లించింది. దీంతో ఉన్న నిధులు కాస్తా కరిగిపోయాయి. ఒక ప్రభుత్వం ప్రకటించిన స్ట్రాటర్జిక్‌ రోడ్డు డెవలప్‌మెంట్‌ ప్లాన్‌, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి కూడా జీహెచ్‌ఎంసీ పెద్ద ఎత్తున నిధులను ఖర్చుచేస్తోంది. దీంతో బల్దియా ఖజానా ఖాళీ అయ్యింది.

గత రెండేళ్లలో ఆర్టీసికి 330 కోట్ల వరకు చెల్లింపులు చేశారు. ఆస్తిపన్నులో 15శాతం నిధులను జలమండలికి బదలాయిస్తున్నారు. దీంతో బల్దియా ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడింది. మరోవైపు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి జీహెచ్‌ఎంసీకి రావాల్సిన నిధులను మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అంతేకాదు.... రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వృత్తిపన్ను, ఆస్తిపన్ను, మోటార్‌ వాహనాల పన్ను, స్టాంప్‌ డ్యూటీ కూడా విడుదల కాలేదు. 2016-17లో ప్రభుత్వం బల్దియాకు 632 కోట్లు చెల్లిస్తామని ప్రకటించి... కేవలం 52 కోట్లు మాత్రమే విడుదల చేసింది. స్టాంప్‌ డ్యూటీ 240 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా... కేవలం 40 కోట్లు మాత్రమే విడుదల చేశారు.
బల్దియాలో పరిస్థితి ఇలానే కొనసాగితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చివరికి ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని ప‌రిస్థితి దాపురిస్తోంది.వరల్డ్‌ క్లాస్‌ సిటీ అంటూ ప్రచారం చేస్తున్న ప్రభుత్వం నిధుల విడుదలలో మాత్రం బల్దియాకు మొండి చెయ్యిచూపుతుంది. దీంతో బల్దియా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన నిధులను మంజూరు చేసి ఆదుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి.

కోల్ కతాకు ఇండియా..ఆస్ట్రేలియా టీమ్స్...

వెస్ట్ బెంగాల్ : ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్స్ కోల్ కతాకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 21వ తేదీన ఇరు జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది. 

17:09 - September 18, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ సందర్భంగా పేదలకు 'బతుకమ్మ' పేరిట 'చీరలను' ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. కానీ బతుకమ్మ చీరల క్వాలిటీపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం చీరలను పంపిణీ చేస్తున్నారని, ఇలాంటి చీరలు తమకొద్దూ అంటూ తగులబెడుతున్నారు. చేనేత చీరలను పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని మండి పడుతున్నారు. ఈ సందర్భంగా అధికారులు మీడియాతో మాట్లాడారు. ఎలాంటి అవినీతి జరగలేదని, నాసిరకం చీరలను పంపిణీ చేయలేదని చెప్పుకొచ్చారు. 31 మంది కలెక్టర్లతో తాము మాట్లాడడం జరుగుతోందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఎర్రబెల్లికి తప్పిన ప్రమాదం..

జనగామ : టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణీస్తున్న కారుతో పాటు మరో కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఎర్రబెల్లి సురక్షితంగా బయటపడ్డారు. గిరిజన సహకార సంస్థ ఛైర్మన్ గాంధీనాయక్ తో పాటు గన్ మెన్ లకు గాయాలయ్యాయి. 

తమిళనాడులో ప్రజాస్వామ్యం ఖూనీ - స్టాలిన్..

చెన్నై : శశికళ, దినకరన్ వర్గానికి ఎదురు దెబ్బ తగిలింది. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యేల అనర్హతతపై స్టాలిన్ స్పందించారు. తమిళనాడులో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, సీఎం పళనీస్వామి రాజీనామా చేయాల్సిందేనన్నారు. 

నాసిరకం బతుకమ్మ చీరలు - టీమాస్...

హైదరాబాద్ : నాసిరకం బతుకమ్మ చీరలతో అడపడుచులను ప్రభుత్వం అవమానించిందని ఆ చీరలు కట్టుకుని మంత్రులు..ఎమ్మెల్యేలు కుటుంబీకులు బతుకమ్మ ఆడగలరా ? అని టీమాస్ ఫోరం నేత సీఎల్ యాదగిరి పేర్కొన్నారు. బతుకమ్మ చీరల్లో అవినీతికి పాల్పడ్డ నాయకులను అరెస్టు చేసి ప్రజల ముందు నిలబెట్టాలన్నారు. 

16:03 - September 18, 2017

ఇన్ఫోసిస్ కు మరో సీనియర్ గుడ్ బై..

ఢిల్లీ : ఇన్ఫోసిస్‌కు మరో సీనియర్‌ గుడ్‌బై చెప్పారు. ఇన్ఫీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, డిజైన్‌ అండ్‌ రిసెర్చ్‌ హెడ్‌ సంజయ్‌ రాజగోపాలన్‌ పదవి నుంచి వైదొలిగారు. 

పాలనపై శ్వేతపత్రం - యోగి ఆదిత్యనాథ్..

ఉత్తర్ ప్రదేశ్ : అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్న సందర్భంగా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. 

బతుకమ్మ చీరలను తగులబెట్టిన మహిళలు..

వనపర్తి : అమరచింత తహశీల్దార్ కార్యాలయం వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం బతుకమ్మ చీరలు పంచారని మహిళలు ఆందోళన చేపట్టారు. చీరలను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. సీపీఎం, కాంగ్రెస్, టిడిపి, బీజేపీ మద్దతు తెలిపాయి. 

మన్నవ సుబ్బారావుపై టిడిపి నేతల ఆగ్రహం..

గుంటూరు : మంగళగిరి టీడీపీ ఆఫీసు వద్ద వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెనుమాక గ్రామాధ్యక్షుడి నియామకం విషయంలో మన్నవ సుబ్బారావుపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్నవ పదవులకు బేరం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. మన్నవ సుబ్బారావును కొల్లి శేషు వర్గం నిర్భందించింది. తనకు తెలియకుండానే నియామకం జరిగిందని నియోజకవర్గ ఇన్ ఛార్జీ గంజి చిరంజీవి పేర్కొన్నారు. 

రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త సమ్మె...

హైదరాబాద్ : రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త సమ్మెకు సీఐటీయూ పిలుపునిచ్చింది. కనీస వేతనాల జీవోను సవరించాలని, కనీస వేతనం రూ. 18 వేలుగా నిర్ణయించాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని..సుప్రీం తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని.. ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

15:35 - September 18, 2017

విజయవాడ : నగర ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పడం లేదు. విద్యార్థులు, ఉద్యోగస్తులు నిత్యం ట్రాఫిక్‌తో ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. టైమంతా ట్రాఫిక్‌లోనే సగం గడిచిపోతోంది. విజయవాడ ప్రజల ట్రాఫిక్‌ కష్టాలపై 10టీవీ కథనం.. నవ్యాంధ్రకు బెజవాడ నగరం కీలకంగా మారడంతో పాలనాపరంగానూ బిజీబిజీగా మారిపోయింది. విజయవాడ రాజధానిగా అవతరించడంతో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీఐపీల తాకిడీ ఎక్కువైంది. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు అధికారులు, ఉద్యోగుల మకాం విజయవాడకు మారింది. దీనికి తోడు ఏడాది కాలంలో సుమారు లక్ష మందికిపైగా ఉద్యోగ, వ్యాపార, ఉపాధికోసం విజయవాడకు వచ్చారు. దీంతో వాహనాల రద్దీ కూడా అంతకంతకు పెరుగుతోంది.

విజయవాడలో అసలే ఇరుకురోడ్లు. దీంతో ప్రజలను ట్రాఫిక్‌ కష్టాలు మొదటి నుంచి వెంటాడుతున్నాయి. ఇప్పుడు రాజధానిగా మారడంతో ఈ కష్టాలు మరింత అధికమయ్యాయి. విజయవాడలో ఫ్లైఓవర్లు లేకపోవడం కూడా ట్రాఫిక్‌ కష్టాలకు కారణమైంది. బెజవాడలోని రెండు జాతీయ రహదార్లపై 90శాతానికిపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బందరు రోడ్‌లో ట్రాఫిక్‌ జామ్‌ షరా మామూలుగా మారిపోయింది. పగలు, రాత్రి అని తేడా లేకుండా గంటల తరబడి బెంజ్‌ సర్కిల్‌ దగ్గర ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో వాహనదారులు చిక్కుకుంటున్నారు. దీంతో వాహనదారులు నిత్యం ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.

బెజవాడలో ట్రాఫిక్‌ కష్టాలు తొలగించేందుకు ప్రభుత్వం బెంజ్‌ సర్కిల్‌ దగ్గర ఫ్లైఓవర్‌ను నిర్మిస్తోంది. ఈ ఫ్లైఓవర్‌ ఎప్పటికి పూర్తవుతుందనేది చెప్పలేని పరిస్థితి. ఇక దుర్గగుడి దగ్గర ఫ్లైఓవర్‌ అదిగో ఇదిగో అంటూ డెడ్‌లైన్లతో పాలకులు ఊదరగొడుతున్నారు. నిర్మాణ పనుల్లో మాత్రం జాప్యం జరుగుతోంది. మరోవైపు వాహనాల సంఖ్య మాత్రం అంతకంతకు పెరుగుతుండడం మూలంగా ప్రజలు ట్రాఫిక్‌ వలయంలో చిక్కుకుంటున్నారు.

దుర్గగుడి ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్లను త్వరితగతిన పూర్తిచేస్తే తప్ప విజయవాడలో ట్రాఫిక్‌ కష్టాలు తీరేలా కనిపించడం లేదు. మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బెజవాడ నగర ప్రజలు అనుభవిస్తున్న ట్రాఫిక్‌ కష్టాల నుంచి వారికి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉంది.

15:30 - September 18, 2017

వరంగల్ : జిల్లా కేయూలో కాంట్రాక్ట్‌ లెక్చరర్లు మళ్లీ నిరసనబాట పట్టారు.. కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. తిరుపతిరావు ఇచ్చిన రిపోర్ట్‌పై యూనివర్శిటీ అధికారులు స్పష్టత ఇవ్వడంలేదని ఆరోపించారు.. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వీడియో క్లిక్ చేయండి. 

15:27 - September 18, 2017

హైదరాబాద్ : బతుకమ్మ చీరలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతలేని చీరలను పంచుతున్నారంటూ.. కేసీఆర్‌ ప్రభుత్వంపై నల్లగొండ జిల్లా మహిళలు మండిపడుతున్నారు. రోడ్డుపై చీరలను కుప్పగా పోసి నిరససనకు దిగారు.

ఖమ్మంలో...
బతుకమ్మ చీరలపై ఖమ్మం జిల్లా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల చేనేత చీరలని చెప్పిన ప్రభుత్వం..చివరికి నాసిరకం సిల్కు చీరలు ఇస్తున్నారని మండిపడ్డారు. దీనిపై టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్య కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నాణ్యమైన చేనేత చీరలు పంపిణీ చేయాలని సండ్ర డిమాండ్‌ చేశారు.

జగిత్యాల..
జగిత్యాల జిల్లా చల్‌గల్‌లో చీరల పంపిణీ వివాదాస్పదమైంది. 100,200 రూపాయల చీరలు ఇస్తున్నారని మహిళల ధ్వజమెత్తారు. తమకు చేనేత చీరలు కావాలని డిమాండ్ చేశారు. రోడ్డు మీద చీరలు దహనం చేసి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్‌ సర్కార్‌ మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు.

ఖమ్మంలో...
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో బతుకమ్మ చీరల బాగోతం బయటపడింది. అధికారులు..సిరిసిల్ల నేత చీరలకు బదులు సూరత్ సిల్క్‌ చీరల పంపిణీ చేస్తున్నారు. దీంతో మహిళలు చీరలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. 

15:20 - September 18, 2017

పశ్చిమగోదావరి : దేశానికి పెద్ద ఆస్తి పోలవరం అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఆయన పోలవరం పనులను ఏరియల్ సర్వే ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ తర్వాత పోలవరం దేశానికి అతిపెద్ద ఆస్తిగా మలచాలన్నారు. రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే ఈ ప్రాజెక్టును నిర్దిష్టకాలపరిమితి ప్రకారం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను స్వయంగా తనిఖీ చేశారు. అధికారులను సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న పనులను అధికారులు చంద్రబాబుకు వివరించారు. రానున్న కొద్ది రోజుల్లో పోలవరం విద్యుత్‌ కేంద్రానికి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 71 శాతం పనులు పూర్తి చేసిన విషయాన్ని అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. సర్దార్‌ సరోవర్‌ తర్వాత జాతికి అంకితం చేసే ప్రాజెక్టు పోలవరం అవుతుందని చంద్రబాబు చెప్పారు. 

14:59 - September 18, 2017
14:56 - September 18, 2017

స్పూర్తి అనే మాటకు అసలైన అర్థం ఆమె. ధైర్యం అనే పదానికి నిర్వచనం ఆమె. దేశ భక్తికి అంకితమైన ఆమె ధీశాలి ఆమె. భర్తను కొల్పోయినా పచ్చదనం ఇంకిపోకముందే భర్త ఆశయం కోసం..దేశ రక్షణ కోసం ముక్కుపచ్చలారని పసి బిడ్డలను కూడా వీడి దేశ రక్షణలో భాగస్వామ్యం అయిన నారిశిరోమణి ఆమె. శత్రుసేనల ఆకృత్యాలకు భర్త బలైపోయినా అదరక..బెదరక మొక్కువోని దీక్షతో దేశ సేవ ముఖ్యంగా భావించిన ధీశాలి కథనం..’మానవి' స్పూర్తిలో..పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:33 - September 18, 2017

హైదరాబాద్ : ఆబిడ్స్ లోని జాన్సన్ డిగ్రీ కాలేజీలో గురుకుల పరీక్షలో గందరగోళం నెలకొంది. సీల్ ఓపెన్ చేసిన ప్రశ్నాపత్రాల బండిల్స్ ను ఇన్విజిలేటర్ పరీక్ష హాల్లోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆయన చేతిలో మొబైల్ ఫోన్ కూడా ఉండడంతో అభ్యర్థులు నిలదీశారు. ఈ సందర్భంగా టెన్ టివితో సత్యపాల్ అభ్యర్థి మాట్లాడారు. 9.55 నిమిషాలకు పేపర్ లు సీల్ ఓపెన్ చేసి తీసుకొచ్చారని, దీనిపై ప్రశ్నిస్తే సిల్లీగా సమాధానం చెప్పారని పేర్కొన్నారు. బలవంతంగా బెదిరించి ఎగ్జామ్ రాయించారని, ప్రతి ఇన్విజిలేటర్ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయన్నారు.

14:16 - September 18, 2017

కృష్ణా : నూజివీడు ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ ఘటనను పాలక మండలి సీరియస్ గా తీసుకుంది. గత రోజులుగా తీవ్ర కలకలం రేపిన ర్యాగింగ్ వ్యవహారంపై ట్రిపుల్ ఐటీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. ర్యాగింగ్ కు 54 మంది విద్యార్థులను బాధ్యులుగా గుర్తిస్తూ క్రమశిక్షణా చర్యలను ట్రిపుల్ ఐటీ యాజమాన్యం తీసుకుంది. ఏడాది పాటు 15 మంది విద్యార్థులను సస్పెన్షన్ చేయగా మిగిలిన విద్యార్థులను క్లాసులకు హాజరు కాకుండా పరీక్షలకు మాత్రమే అనుమతినిచ్చింది. గత నెల 29వ తేదీన జూనియర్లను సీనియర్లు ర్యాంగింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై 11 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. 

పోలవరం పనులపై బాబు సమీక్ష..

పశ్చిమగోదావరి : వంద రోజుల్లో 28 ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుందని, అంతేగాకుండా కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

14:11 - September 18, 2017

పశ్చిమగోదావరి : వంద రోజుల్లో 28 ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుందని, అంతేగాకుండా కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం జీవనాడి అని, ప్రగతికి చిహ్నంగా ఉండే ఈ ప్రాజెక్టు కింద 7లక్షల 20వేల కొత్త ఆయుకట్టు వస్తుందన్నారు. 1200 మీటర్ల మేర పనులు పూర్తి చేయాలని, 53 స్పిల్ వే లున్నాయని, 7లక్షల క్యూబిక్ మేర కాంక్రీట్ వేయాల్సి ఉందన్నారు.

ఈ పనులన్నీ నవంబర్ నెలలోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు, అందులో భాగంగా ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష నిర్వహించడం జరుగుతోందన్నారు. నీరు - ప్రగతి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం జరిగిందని, 118 టీఎంసీల నీళ్లు గోదావరి నది నుండి కృష్ణా నదికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. గోదావరి - డెల్టా కింద జూన్ మొదటి వారంలో నీళ్లు ఇవ్వడం జరిగిందని, కృష్ణా డెల్టా కింద కూడా నీళ్లు విడుదల చేయడం జరిగిందన్నారు. 17 టీంఎసీల నీళ్లు శ్రీశైలంకు రావడం జరిగిందని, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుండి నీళ్లు రావాల్సి ఉందన్నారు. ఏలేరు రిజర్వాయర్ కు నీళ్లు తీసుకెళితే విశాఖపట్టణానికి సమస్య ఉండదన్నారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 

ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ ఘటనపై కీలక నిర్ణయం..

కృష్ణా : నూజివీడు ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ ఘటనను పాలక మండలి సీరియస్ గా తీసుకుంది. ర్యాగింగ్ కు 54 మంది విద్యార్థులను బాధ్యులుగా గుర్తిస్తూ క్రమశిక్షణా చర్యలను ట్రిపుల్ ఐటీ యాజమాన్యం తీసుకుంది. ఏడాది పాటు 15 మంది విద్యార్థులను సస్పెన్షన్ చేయగా మిగిలిన విద్యార్థులను క్లాసులకు హాజరు కాకుండా పరీక్షలకు మాత్రమే అనుమతినిచ్చింది. గత నెల 29వ తేదీన జూనియర్లను సీనియర్లు ర్యాంగింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై 11 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. 

గురుకుల పరీక్షలో గందరగోళం...

హైదరాబాద్ : ఆబిడ్స్ లోని జాన్సన్ డిగ్రీ కాలేజీలో గురుకుల పరీక్షలో గందరగోళం నెలకొంది. సీల్ ఓపెన్ చేసిన ప్రశ్నాపత్రాల బండిల్స్ ను ఇన్విజిలేటర్ పరీక్ష హాల్లోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆయన చేతిలో మొబైల్ ఫోన్ కూడా ఉండడంతో అభ్యర్థులు నిలదీశారు. 

కేసీఆర్ ఊసరవెల్లి అన్న షబ్బీర్...

హైదరాబాద్ : కేసీఆర్ ఊసరవెల్లిలా రంగు మారుస్తున్నారని టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎంబీసీల సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కంచె ఐలయ్య తన బుక్ టైటిల్ మార్చుకోవాలని, వైశ్యులు సంయమనం పాటించాలని సూచించారు. 

రోహింగ్యాలు దేశ భద్రతకు ముప్పన్న కేంద్రం..

ఢిల్లీ : రోహింగ్యా ముస్లిం కేసులో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలైంది. ఈ అఫిడవిట్ ను కేంద్రం దాఖలు చేసింది. రోహింగ్యాలు దేశ భద్రతకు ముప్పు అని, దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో రోహింగ్యాలు ఉన్నారని పేర్కొంది. టెర్రరిస్టులతో రోహొంగ్యాలకు సంబంధాలున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయని తెలిపింది. 

సుప్రీంకోర్టుకు డ్రగ్స్ కేసు

ఢిల్లీ : తెలంగాణతో సహా ఏపీలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. న్యాయవాది శ్రవణ్ డ్రగ్స్ కేసును సీబీఐకి అప్పగించలని సుప్రీంను ఆశ్రయించారు. డ్రగ్స్ నియంత్రణ చర్యలు వెల్లడించాలని కేంద్రానికి సుప్రీం నోటీసులు పంపింది. గతంంలో సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరయ్యాయని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. హుక్కా సెంటర్ లు, ననైట్ క్లబ్ లను నిషేంధించాలని పిటిషనర్ సుప్రీంను కోరారు.

13:41 - September 18, 2017

ఖమ్మం : జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో బతుకమ్మ చీరల బాగోతం బయటపడింది. అధికారులు..సిరిసిల్ల నేత చీరలకు బదులు సూరత్ సిల్క్‌ చీరల పంపిణీ చేస్తున్నారు. దీంతో మహిళలు చీరలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:40 - September 18, 2017

హైదరాబాద్ : తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ వివాదాస్పదమైంది. నాసిరకం చీరలు అంటగడుతున్నారని..మహిళా లోకం భగ్గుమంటోంది. పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో బతుకమ్మ చీరల బాగోతం బయటపడింది. సిరిసిల్ల నేత చీరలకు బదులు అధికారులు సూరత్ సిల్క్‌ చీరల పంపిణీ చేస్తున్నారు. దీంతో మహిళలు చీరలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. అటు జగిత్యాల జిల్లా చల్‌గల్‌లో 100,200 రూపాయల చీరలు ఇస్తున్నారని మహిళలు ధ్వజమెత్తారు. చేనేత చీరలు కావాలని డిమాండ్ చేశారు. చీరలు దహనం చేసి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. నల్లగొండజిల్లాలోనూ ఆడపడుచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతలేని చీరలను పంచుతున్నారంటూ.. కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రహదారిపై చీరలను కుప్పగా పోసి నిరససన తెలిపారు. 

13:38 - September 18, 2017

కృష్ణా : విజయవాడ గూడవల్లిలోని నారాయణ క్యాంపస్‌లో విద్యార్థి ఈశ్వర్‌రెడ్డి మృతికి నిరసనగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నారాయణ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంతోపాటు .. మంత్రి నారాయణ రాజీనామా చేయాలని విద్యార్థినేతలు డిమాండ్‌ చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:35 - September 18, 2017

ఢిల్లీ : తెలంగాణతో సహా ఏపీలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. న్యాయవాది శ్రవణ్ డ్రగ్స్ కేసును సీబీఐకి అప్పగించలని సుప్రీంను ఆశ్రయించారు. డ్రగ్స్ నియంత్రణ చర్యలు వెల్లడించాలని కేంద్రానికి సుప్రీం నోటీసులు పంపింది. గతంంలో సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరయ్యాయని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. హుక్కా సెంటర్ లు, ననైట్ క్లబ్ లను నిషేంధించాలని పిటిషనర్ సుప్రీంను కోరారు. సినీ, టివి కార్యక్రమాల్లో డ్రగ్స్ వినియోగం దృశ్యాలు ప్రదర్శించరాదని ఆయన కోర్టుకు విన్నవించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

సదావర్తి భూములకు భారీ ధర

చెన్నై : సదావర్తి భూములకు భారీ ధర పలికింది. గతంలో రూ.37 కోట్లు పలికిన ధర తాజా వేలంతో రూ.60.3కోట్ల పలికింది. కడప జిల్లాకు చెందిన సత్యనారాయణ రెడ్డి సదావర్తి భూములను స్వంతం చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతలంలో సదావర్తి భూములను తక్కువ ధరకు కట్టబెట్టింది. 

13:09 - September 18, 2017

చెన్నై : సదావర్తి భూములకు భారీ ధర పలికింది. గతంలో రూ.37 కోట్లు పలికిన ధర తాజా వేలంతో రూ.60.3కోట్ల పలికింది. కడప జిల్లాకు చెందిన సత్యనారాయణ రెడ్డి సదావర్తి భూములను స్వంతం చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతలంలో సదావర్తి భూములను తక్కువ ధరకు కట్టబెట్టింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

సదావర్తి భూముల వేలానికి అనూహ్య స్పందన

చెన్నై : టీనగర్ లో సదావర్తి భూమలు వేలం కొనసాగుతోంది. భూముల వేలం ప్రక్రియ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ నేతృత్వంలో జరుగుతోంది. సదావర్తి భూముల వేలానకి అనూహ్య స్పందన వస్తోంది.

12:04 - September 18, 2017

హైదరాబాద్ : తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ వివాదాస్పదంగా మారింది. కొన్ని చోట్ల మహిళలకు చేనేత చీరలకు బదులు సిల్క్ చీరలు పంపిణీ చేస్తున్నారు. కొన్ని చోట్ల రేషన్ షాపు మూసివేసి వెళ్లిపోవడంతో మహిళలు అందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా చల్ గల్ లో సిల్క్ చీరలు పంపిణీ చేస్తున్నారని మహిళలు ఆ చీరలను దహనం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:58 - September 18, 2017
11:52 - September 18, 2017
11:45 - September 18, 2017
11:42 - September 18, 2017

చెన్నై : తమిళ రాజకీయంలో కీలక మలుపు చోటుచేసుకుంది. శశికళ, దినకరన్ వర్గానికి పళనిస్వామి వర్గం షాక్ ఇచ్చింది. శాసనసభ శాభ స్పీకర్ దన్ పాల్ దినకరన్ మద్దతు ఇస్తున్న 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. బలపరీక్షకు వెళ్లేందుకు దినకరన్ వర్గంపై వేటు వేసినట్టు తెలుస్తోంది. పార్టీ విప్ ను ధిక్కరించారన్న కారణంతో స్పీకర్ ఆ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. మరో వైపూ ఈ రోజు తమిళనాడు ఇనా చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ చెన్నైకి రానున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

దినకరన్ వర్గానికి షాక్

చెన్నై : తమిళ శాసన సభ స్పీకర్ ధన్ పాల్ శశికళ, దినకరన్ వర్గానికి షాక్ ఇచ్చాడు. దినకరన్ మద్దతు తెలిపిన 18 మంది ఎమ్మెల్యేలపై ఆయన అనర్హత వేటు వేశారు.  

విజృభిస్తున్న విషజ్వరాలు

హైదరాబాద్ : నగరంలో విషజ్వరాలు విజృభిస్తున్నాయి. ప్రలజలకు మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. విషజ్వరాలు ప్రబలడానికి వాతావరణంంలో మార్పూలు కారణమని వైద్యులు అంటున్నారు.

11:27 - September 18, 2017

హైదరాబాద్ : నగరంలో విషజ్వరాలు విజృభిస్తున్నాయి. ప్రలజలకు మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. విషజ్వరాలు ప్రబలడానికి వాతావరణంంలో మార్పూలు కారణమని వైద్యులు అంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

బతుకమ్మ చీరల పంపిణీలో వివాదాస్పదం

కరీంనగర్/జగిత్యాల : జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ వివాదాస్పదంగా మారింది. రూ.100, రూ200 రూపాయల చీరలు ఇస్తున్నారని మహిళలు ఆందోళనకు దిగారు. చేనేత చీరలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు మీద చీరలు దహనం చేసి మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మహిళల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు.

సత్తుపల్లిలో బయటపడ్డ బతుకమ్మ చీరల బాగోతం

ఖమ్మం : జిల్లా సత్తుపల్లి నియోజవర్గంలో బతుకమ్మ చీరలబాగోతం బయటపడింది. సిరిసిల్ల నేత చీరలకు బదులు సూరత్ సిల్క్ చీరలు పింపిణీ చేస్తున్నారు. దీంతో మహిళలు చీరలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.

11:19 - September 18, 2017

చిత్తూరు : ఏపీలో బలిజ, కాపుల సంక్షేమానికి కృషిచేస్తామని రాష్ట్ర కాపు,బలిజ సమాఖ్య అధ్యక్షుడు ఊకా విజయ్‌కుమార్‌ తెలిపారు. తిరుపతిలోని అర్బన్‌హాట్‌లో జరిగిన కార్యక్రమంలో కాపు,బలిజ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. కాపు విద్యార్థులకు చేయూత ఇవ్వడం, కాపులను బీసీల్లో చేర్చడం తదితర అంశాలపై ప్రభుత్వంతో చర్చిస్తామని విజయ్‌కుమార్‌ అన్నారు. కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామాంజనేయులు ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లా నుంచి కాపు,బలిజ సంఘం నేతలు తరలి వచ్చారు. 

11:16 - September 18, 2017
11:14 - September 18, 2017

కరీంనగర్/జగిత్యాల : జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ వివాదాస్పదంగా మారింది. రూ.100, రూ200 రూపాయల చీరలు ఇస్తున్నారని మహిళలు ఆందోళనకు దిగారు. చేనేత చీరలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు మీద చీరలు దహనం చేసి మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మహిళల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు.

11:08 - September 18, 2017

ఖమ్మం : జిల్లా సత్తుపల్లి నియోజవర్గంలో బతుకమ్మ చీరలబాగోతం బయటపడింది. సిరిసిల్ల నేత చీరలకు బదులు సూరత్ సిల్క్ చీరలు పింపిణీ చేస్తున్నారు. దీంతో మహిళలు చీరలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

బతుకమ్మ చీరల పంపిణీలో గందరగోళం

భద్రాద్రి : జిల్లా బూర్గంపహాడ్లో బతుకమ్మ చీరల పంపిణీలో గందరగోళం నెలకొంది. బతుకమ్మ చీరల కూపన్లు అందకపోవడంతో మహిళలు రేషన్ షాపుకు వెళ్లి ఆందోళనకు దిగారు.

10:30 - September 18, 2017

హైదరాబాద్ : తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. హైదరాబాద్ వ్యాప్తంగా 16 సర్కిళ్లలో చీరల పంపిణీ జరుగుతోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

నాగర్ కర్నూలులో విషాదం

మహబూబ్ నగర్/నాగర్ కర్నూలు : జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో విషాదం చోటుచేసుకుంది. పాతాళగంగలో దూకి ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే కామరణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

10:23 - September 18, 2017

మహబూబ్ నగర్/నాగర్ కర్నూలు : జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో విషాదం చోటుచేసుకుంది. పాతాళగంగలో దూకి ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే కామరణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

 

 

 

సూర్యాపేట కుటుంబ ఆత్మహత్య కేసులో కొత్త కోణం

సూర్యాపేట : జిల్లా కుటుంబం ఆత్మహత్యల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పెద్దకుమారుడు చేసిన అప్పులతో పాటు చిన్న కుమారిడికి రంగారెడ్డి జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఇప్పిస్తామని ఇద్దరు వ్యక్తులు సత్యనారాయణ, ఉపేందర్ రూ.14లక్షలు వసూల్ చేశారని. 6 నెలలు గడిచినా అపాయింట్ మెంట్ రాకపోవడంతో మోసపోయామని కుటంబం ఆత్మహత్య చేసుకుంటున్నమని వారు సుసైడ్ నోట్ లో పేర్కొన్నారు.

మరికాసేపట్లో సదావర్తి భూముల వేలం

 

చెన్నై : మరికాసేపట్లో చెన్నై టీనగర్ లో సదావర్తి భూమల వేలం ప్రారంభం కానుంది. దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ నేతృత్వంలో వేలం ప్రక్రియ జరగునుంది. అధికారులు 83.11ఎకరాల భూమిని రూ. 27.45కోట్ల కనీస ధరతో వేలం వేయనున్నారు. ఇప్పటికే దేవాదాయశాఖకు 6 సీల్డ్ కవర్ టెండరల్లు, 2 ఈ ప్రొక్యూర్ మెంట్ టెండర్లు చేరాయి. వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి టెండర్ దాఖలు చేశారు. 

10:17 - September 18, 2017

సూర్యాపేట : జిల్లా కుటుంబం ఆత్మహత్యల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పెద్దకుమారుడు చేసిన అప్పులతో పాటు చిన్న కుమారిడికి రంగారెడ్డి జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఇప్పిస్తామని ఇద్దరు వ్యక్తులు సత్యనారాయణ, ఉపేందర్ రూ.14లక్షలు వసూల్ చేశారని. 6 నెలలు గడిచినా అపాయింట్ మెంట్ రాకపోవడంతో మోసపోయామని కుటంబం ఆత్మహత్య చేసుకుంటున్నమని వారు సుసైడ్ నోట్ లో పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చడూండి.

 

10:10 - September 18, 2017

చెన్నై : మరికాసేపట్లో చెన్నై టీనగర్ లో సదావర్తి భూమల వేలం ప్రారంభం కానుంది. దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ నేతృత్వంలో వేలం ప్రక్రియ జరగునుంది. అధికారులు 83.11ఎకరాల భూమిని రూ. 27.45కోట్ల కనీస ధరతో వేలం వేయనున్నారు. ఇప్పటికే దేవాదాయశాఖకు 6 సీల్డ్ కవర్ టెండరల్లు, 2 ఈ ప్రొక్యూర్ మెంట్ టెండర్లు చేరాయి. వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి టెండర్ దాఖలు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:03 - September 18, 2017

తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మికల్యాణం సినిమాతో తెలుగ తెరకు పరిచయమైన కాజల్ అగార్వల్ మగధీరతో పాపులార్ హీరోయిన్ గా పేరు సంపధించింది. ఆ తర్వాత సినిమాలు బాగానే చేసింది. కానీ ఆ మధ్య కొచ్చెం ఆమెకు ఆవకాశలు తక్కువైయ్యాయి. ఆమె ఈ ఏడాది చాలా జోరు మీద వున్నారు. ఖైదీ నంబర్ 150, వివేకం, చిత్ర నేనే రాజు..నేనే మంత్రి..సినిమాతో మరోసారి రేసులోకి వచ్చారు. ఆమె తమిళ నటుడు అజయ్ తో నటించిన అదిరింది సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ప్రస్తుతం కాజల్ యం.ఎల్.ఎ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కల్యాణ్ రామ్ కథానాయకుడిగా, ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రాబోతోంది. ఇకి కాకుండా కాజల్ క్వీన్ తమిళ్ రీమేక్ లోనూ నటిస్తున్నారు.

ఇది ఇలాఉంటే ఆమెకు మరో చిత్రంలో నటించే అవకాశం వరించినట్లు చిత్ర వర్గాల సమాచారం. రవితేజ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కథానాయక పాత్ర కోసం కాజన్ అగార్వల్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాకి కాజల్ ఒప్పుకున్నారో లేదో తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రకటన రావాల్సి ఉంది....!

09:45 - September 18, 2017

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన షారుఖ్ ఖాన్ ప్రస్తుత పోటీ లో కొంత వెనుక పడ్డడాడు. షారఖ్ మళ్లీ ఫామ్ లోకి రావడానికి మంచి సబ్జెక్టు కోసం చూస్తున్నట్టు సమాచారం. ఆయన తాజాగా ధూమ్ 4 చేయనున్నట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సినిమా ధూమ్. ధూమ్ సీరిస్ లో వరుసగా మూడు సినిమాలు వచ్చాయి. ధూమ్ 1 కి రూ.100 కోట్ల వసూళోస్తే, ధూమ్ 2కి రూ.150కోట్లొచ్చాయి. ఆమిర్ ఖాన్ హీరోగా వచ్చిన ధూమ్ 3 ఏకంగా 550 కోట్ల వసూలు చేసింది.

ఇప్పుడు ధూమ్ 4 చిత్రం రాబొతున్నంటూ తెలుస్తోంది. అందులో హీరోగా షారుఖ్ నటించనున్నట్టు సినీ వర్గాలు అంటున్నాయి. ఆల్రెడీ యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత, క్లోజ్ ఫ్రెండ్ ఆదిత్యా చోప్రా కూడా షారుఖ్ ధూమ్ 4 చేస్తే బాగుంటుందని, హీరోతో డిస్కస్ చేశారని బీటౌన్ టాక్...? ధూమ్ అంటేనే హైఎండ్ బైకులు, రేసీ చేజింగ్ లు, ఫైట్స్ కి ఫెమస్. చూడాలి మరి ధూమ్ 4 లో షారుఖ నట్టిస్తాడో లేదో...! 

09:22 - September 18, 2017

విజయనగరంలో ఉద్రిక్తత

విజయనగరం : జిల్లా పార్వతీపురలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ అధికారులు పేదల గుడిసెలు తొలగిస్తున్నారు. రైల్వే గూడ్స్ షెడ్ రోడ్డులో 30 ఏళ్లుగా నివాసుముంటున్న 20 కుటుంబాలను అధికారులు ఉన్నఫలంగా వెళ్లిపోమ్మనడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

09:15 - September 18, 2017

విజయనగరం : జిల్లా పార్వతీపురలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ అధికారులు పేదల గుడిసెలు తొలగిస్తున్నారు. రైల్వే గూడ్స్ షెడ్ రోడ్డులో 30 ఏళ్లుగా నివాసుముంటున్న 20 కుటుంబాలను అధికారులు ఉన్నఫలంగా వెళ్లిపోమ్మనడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:05 - September 18, 2017

ఎల్బీనగర్ లో వివాహిత అనుమానాస్పద మృతి

హైదరాబాద్ : నగరంలోని ఎల్బీనగర్ లో దారుణం జరిగింది. రాక్ టౌన్ కాలనీలో హారిక అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన హారికను 2ఏళ్ల క్రితం రిషికుమార్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. హారిక ఇటీవలే కామినేని మెడికల్ కాలేజీలో బీడీఎస్ లో చేరింది. ఆమె భర్త రిషికుమార్ ఎంబీబీఎస్ సీటు రాలేదని కొంతకాలంగా హారికను వేధిస్తున్నట్టు బంధువులు తెలిపారు. రిషికుమారే హారిక ను హత్య చేశాడని హారిక తల్లిదండ్రులు అరోపిస్తున్నారు.

08:42 - September 18, 2017

హైదరాబాద్ : నగరంలోని ఎల్బీనగర్ లో దారుణం జరిగింది. రాక్ టౌన్ కాలనీలో హారిక అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన హారికను 2ఏళ్ల క్రితం రిషికుమార్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. హారిక ఇటీవలే కామినేని మెడికల్ కాలేజీలో బీడీఎస్ లో చేరింది. ఆమె భర్త రిషికుమార్ ఎంబీబీఎస్ సీటు రాలేదని కొంతకాలంగా హారికను వేధిస్తున్నట్టు బంధువులు తెలిపారు. రిషికుమారే హారిక ను హత్య చేశాడని హారిక తల్లిదండ్రులు అరోపిస్తున్నారు. పోలీసులు కేసు అనుమానాస్పదంగా నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

08:34 - September 18, 2017

తెలంగాణలో కార్మికవర్గం సమ్మెకు సై అంటోంది. ఈ నెల 19న ఒక్కరోజు సమ్మెకు సిఐటియు పిలుపునిచ్చింది. సమానపనికి సమాన వేతనం చెల్లించాలన్నది యూనియన్ డిమాండ్. పోరాటలతోనే వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం బీడి కార్మికుల అన్యాయం చేస్తోందని, కనీసవేతన జీవో ఇచ్చిన దాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయడం లేదని, బీడి కార్మికులకు కేవలం రూ.1000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని సీఐటీయూ నాయకురాలు రమా అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:32 - September 18, 2017

కొరియా : కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్లో తెలుగు తేజం పీవీ సింధు విజృంభించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తనను ఓడించిన ప్రత్యర్థి ఒకుహరపై ప్రతీకారం తీర్చుకుంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో భారత స్టార్‌ షట్లర్‌ సింధు జయకేతనం ఎగురవేసింది. ఇరువురి క్రీడాకారిణుల మధ్య హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌లో ఒకుహారా 12-9 తో ఆధిక్యంలో నిలిచిన సమయంలో సింధు వరుసగా పాయింట్లు సాధించి స్కోరును సమం చేశారు. చివరకు తొలి గేమ్ ను 22-20తేడాతో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో ఒకుహారా ఆది నుంచి పైచేయి సాధిస్తూ సింధును వెనక్కునెట్టింది. ఏ దశలోనూ సింధుకు అవకాశం ఇవ్వని ఒకుహారా అదే జోరును కొనసాగించి 11-21 పాయింట్లతో రెండో గేమ్‌ సాధించింది. దీంతో మూడో గేమ్‌ ఉత్కంఠగా మారింది. సింధు 19-16 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న దశలో ఒకుహోరా మరోసారి పుంజుకునే యత్నం చేసింది. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య 56 సెకన్ల సుదీర్ఘమైన ర్యాలీ జరిగింది. ఇక్కడ ఒకుహారా పాయింట్ సాధించనప్పటికీ, సింధు మాత్రం ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా 3 పాయింట్ల తేడాతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సాధించింది. దాంతో కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను సింధు తన ఖాతాలో వేసుకుంది.

ప్రముఖుల అభినందన...
కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన భారత స్టార్‌ షట్లర్‌ సింధుపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యతో పాటు అమితాబచ్చన్, వీరేంద్ర సెహ్వాగ్‌, కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో కొనియాడారు. 

08:23 - September 18, 2017

చెన్నై : టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ తొలి వన్డేలో ఘన విజయం సాధించి ఆధిక్యంలో నిలిచింది. చెన్నైలో జరిగిన వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. హార్దిక్‌ పాండ్యా, ధోనీ హాఫ్‌ సెంచరీలు చేయడంతో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. అనంతరం జోరుగా వర్షం కురవడంతో ఆట రెండు గంటల పాటు నిలిచింది. దీంతో ఆసీస్‌ టార్గెట్‌ను 21 ఓవర్లకు 164 పరుగులకు కుదించారు. అయితే విజయలక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు గుడ్‌ ఓపెనింగ్‌ లభించలేదు. చాహల్‌, కుల్దీప్‌, పాండ్యా దెబ్బకు 35 పరుగులకే నాలుకు కీలక వికెట్లు చేజార్చుకుంది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌, జేమ్స్‌ ఫాల్క్‌నర్‌, డేవిడ్‌ వార్నర్‌ మినహా మరేవరూ రాణించకపోవడంతో 21 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

రాణించిన పాండ్యా, ధోని
తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రహానె, కోహ్లీ, మనీశ్‌పాండేలు వెంటవెంటనే ఔటయ్యారు. అనంతరం వచ్చిన బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్‌ శర్మ, కేదార్‌ జాదవ్‌లు గట్టిక్కెంచే ప్రయత్నం చేశారు. అయితే.. స్టొయినిస్‌ వారిద్దరిని పెవిలియన్‌కు పంపించడంతో భారత్‌.. 22 ఓవర్లలో 87 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్‌పాండ్యా, ధోనీలు నిలకడగా ఆడారు. సింగిల్స్‌ తీయడమే కష్టమైన మైదానంలో బౌండరీల మోత మోగించారు. మంచి ఫామ్‌లో ఉన్న పాండ్యా.... హ్యాట్రిక్‌ సిక్సర్లు బాది హాఫ్‌ సెంచరీ చేశాడు. 66 బంతుల్లో 83 పరుగులు చేసి పాండ్యా కెరీర్‌లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌ నమోదు చేశారు. ఇక ధోనీ కూడా సింగిల్స్‌ తీస్తూ హాఫ్‌ సెంచరీ చేశారు. సచిన్‌, ద్రవిడ్‌, గంగూలీ తర్వాత.. అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన ఆటగాడిగా ధోనీ నిలిచాడు. పాండ్యా, ధోనీ మెరుపుదాడితో పాటు.. చివర్లో భువనేశ్వర్‌ కూడా చెలరేగి ఆడడంతో భారత్‌ మంచి స్కోర్‌ సాధించింది.

చివరి ఐదు ఓవర్లలో 53 పరుగులు
ఇక భారత్‌ చివరి ఐదు ఓవర్లలో 53 పరుగులు చేయడంతో... స్కోర్‌ 281 పరుగులకు చేరింది. మొత్తానికి ఐదు వన్డే సిరీస్‌లో భారత్‌కు శుభారంభం దక్కింది. తొలి వన్డే గెలిచి ఆధిక్యంలో నిలిచింది. ఇక 83 పరుగులు చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించిన హార్దిక్‌ పాండ్యాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

08:21 - September 18, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామన్నారు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రత పరంగా పటిష్ట చర్యలు చేపట్టామని జేఈఓ శ్రీనివాసరాజు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:20 - September 18, 2017

వరంగల్ : నర్సంపేటలోనూ వివిధ సంఘాల కార్యకర్తల ర్యాలీ వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల్లో టీ మాస్‌ఫోరం ఆవిర్భావ సభలు జరిగాయి. ఈ సభలకు ముందు నగరంలో వివిధ సంఘాలకు చెందిన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో అమరవీరుల స్థూపం నుంచి మొదలైన ర్యాలీ... విష్ణుప్రియ గార్డెన్‌ వరకు సాగింది. ఈ ర్యాలీలో కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. అటు వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేటలోనూ టీమాస్‌ ఫోరం ఆవిర్భావ సభను పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జరిగిన టీమాస్‌ ఆవిర్భావ సభకు ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య పాల్గొన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి... అణగారిన ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్నట్టు ఐలయ్య అన్నారు. పంటను పండించే రైతులు పురుగన్నం తినేపరిస్థితి దాపురించిందన్నారు. ఏకష్టం చేయనివారు సంపదనంతా దోచుకుంటున్న వారు దర్జాగా పెరుగన్నం తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బీజేపీకి ఆర్యవైశ్యులు ఇచ్చే డొనేషన్‌లో తనకు 5శాతం ఇస్తే.. ఒక్క రైతు ఆత్మహత్య జరుగకుండా చూసే బాధ్యత తనదన్నారు.

రానున్న రోజుల్లో మండల స్థాయి కమిటీలు
ఇదే సమావేశంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేసీఆర్‌ సర్కార్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పరిపాలన నడుస్తోందని విమర్శించారు.అప్రజాస్వామిక పరిపాలన ఎదుర్కోవాలంటే అందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు జిల్లాల్లో జరిగిన ఆవిర్భావ సభల్లో రెండు జిల్లాలకు వేర్వేరుగా టీమాస్‌ ఫోరం నూతన కమిటీలను ఎన్నుకున్నారు. రానున్న రోజుల్లో మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.

08:17 - September 18, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొంత మందికి శాపంగా మారింది. బతుకమ్మ సందర్బంగా ఈరోజు నుంచి ఆడపడుచులకు ప్రభుత్వం చీరలను రేషన్‌షాపుల ద్వారా అందజేస్తోంది. అయితే ఈ చీర పొందే మహిళలకు ముందే టోకెన్లు మంజూరు చేస్తున్నారు. ఈ టోకెన్ల ద్వారా మహిళలకు చీరలు అందజేస్తారు. కానీ... ఇప్పుడు ఆ టోకెన్ల వ్యవహారమే మహిళలకు ఇబ్బందిగా మారింది.

అశ్వారావుపేటలో బతుకమ్మ చీరలను
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు అర్హుల జాబితాను సిద్దం చేశారు. 18 ఏళ్లు పైబడిన పేద మహిళలందరినీ అర్హులుగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 లక్షల 7 వేల 852 మందికి చీరలు అందించాలని నిర్ణయించారు. పౌరసరఫరాల అధికారులు తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇక ఇప్పటికే అందించాల్సిన చీరలను గోడౌన్లకు చేర్చారు. ఇక జాబితా ప్రకారం మహిళలకు గ్రామస్థాయి బృందాలు టోకెన్లు అందజేయాలి. అయితే.. అశ్వారావుపేటలో మాత్రం అందుకు విరుద్దంగా రేషన్‌షాపులో టోకెన్లు తీసుకోవాలని అధికారులు సూచించారు. టోకెన్‌ ఉంటేనే చీర ఇస్తామని ప్రకటించారు. దీంతో మహిళలంతా టోకెన్‌ కోసం రేషన్‌షాపులకు క్యూ కట్టారు. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. టోకెన్ల కోసం మహిళలంతా.. కూలీ పనులు మానేసుకుని రేషన్‌షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో గంటల తరబడి లైన్లలో నిలబడి మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.

టోకెన్‌ తీసుకుని చీర తీసుకుంటేనే చ్చే నెల నుంచి రేషన్‌
ఓవైపు ప్రభుత్వం చీర ఇస్తుందని సంతోషపడుతున్న మహిళలకు... అధికారుల తీరుతో అనేక అవస్థలు ఎదురవుతున్నాయి. టోకెన్‌ తీసుకుని చీర తీసుకుంటేనే వచ్చే నెల నుంచి రేషన్‌ ఇస్తామని పుకార్లు షికార్లు చేస్తుండడంతో మహిళలంతా పనులు మానేసుకుని రేషన్‌షాపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. బతుకమ్మ చీర ఏమో గానీ... టోకెన్‌ దొరక్కపోతే రేషన్‌ కట్‌ అవుతుందేమోనన్న ఆందోళన మహిళలను వెంటాడుతోంది. ఏది ఏమైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి అర్హులైన అందరికీ బతుకమ్మ చీరలు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

08:15 - September 18, 2017

 

విశాఖ : జిల్లా కేంద్రంలో జరిగిన ప్రాంతీయ పర్యావరణ సదస్సు ముగిసింది. ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిక్షణ, కాలుష్య నియంత్రణ, పారిశ్రామిక వ్యర్థాలు నదుల్లో కలవకుండా చూడ్డానికి తీసుకోవాల్సిన చర్యలు.. వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. చర్చల వివరాలతో నివేదిక రూపొందించి అమలు కోసం కేంద్ర, రాష్ట్రాలకు పంపాలని నిర్ణయించారు. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నామని ముగింపు కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని సదస్సు దృష్టికి తెచ్చారు.

జాతీయ హరిత న్యాయస్థానం
పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ హరిత న్యాయస్థానం చైర్మన్‌ జస్టిస్‌ స్వతంత్ర కుమార్‌ కోరారు. మానవ జీవితం పర్యావరణతో ముడివడి ఉందని, దీని పరిరక్షణ ఆవశ్యకతను ప్రతి ఒక్కరు బాధ్యతగా గుర్తించాలని కార్యక్రమానికి హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్కే అగర్వాల్‌ కోరారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

08:13 - September 18, 2017
08:11 - September 18, 2017

సూర్యాపేట : జిల్లా మామిళ్లగడ్డలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటూ బంధువులు చెబుతున్నారు. మృతులు పర్చూరి జనార్ధన్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి జనార్ధన్ భార్య చంద్రకళ, చిన్న కుమారుడు అశోక్, కోడలు ప్రభాత, మనవరాళ్లు సిరి(5), రిత్విక(2) మృతి చెందారు. వారంలో రోజులుగా పెద్ద కొడుకు సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:42 - September 18, 2017

ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడితే ఎవరు అడ్డుచెప్పరని, కానీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లకు గొర్రెలు, బర్రెలతో కులలవారిగా ఇచ్చి ఓట్ల కోసం నాటకమడుతున్నారని, రీ డజైన్ ప్రభుత్వం కేవలం 37వేల ఎకరాలకు మాత్రమే నీరు అందిస్తున్నారని, ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఉంటే రాష్ట్రం రాగానే మొదటి సంవత్సరం ఎందుకు చేయలేదని టీడీపీ నేత దుర్గాప్రసాద్ అన్నారు. రోజుకో వరం ఇవ్వడమనేది సీఎం ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్లుతున్నారని, ప్రభత్వాలు వివిధ దశల్లో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, చాప కింద నీరు లాగా పెద్దలకు మాత్రం బాగా లబ్ధి పొందుతున్నారని, రైతంగా సంక్షోభాన్ని నిర్మిలించడం మంచిదని ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ప్రభుత్వం అన్నాక ఎదో ఒకటి చేయాలని, ఏది చేయకుండా ప్రభుత్వం ఉండలేదని, ప్రభుత్వం కులవృత్తులపై దృష్టి పెట్టిందని ఎంపీ సీతారామ్ నాయక్ అన్నారు. 25సంవత్సరాలుగా గుత్తికోయలు ఉన్నారని, మహిళలను వివస్త్రలను చేసి కొడుతున్నారని బీజేపీ నేత అచార్య అన్నారు. సెప్టెంబర్ 17 దినోత్సవం జరపడంల అనవసరమని టీఆర్ఎస్ నేత మన్నే గోర్దన్ రెడ్డి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

సూర్యపేట మామిళ్లగడ్డలో విషాదం

సూర్యాపేట : జిల్లా మామిళ్లగడ్డలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటూ బంధువులు చెబుతున్నారు. 

నేడు ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్ అంత్యక్రియలు

ఢిల్లీ : నేడు ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్బంగా జాతీయ జెండా అవతనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. జెండా అవతనం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు : జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మట్టికుప్పను కారు ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగి కారు దగ్ధం అయింది. కారులో ఉన్న ముగ్గురు సజీవదహనమయ్యారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. 

07:23 - September 18, 2017

కర్నూలు : జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మట్టికుప్పను కారు ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగి కారు దగ్ధం అయింది. కారులో ఉన్న ముగ్గురు సజీవదహనమయ్యారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు వనితాబాయి, ప్రేమ్కకుమార్, ఉమేష్ గా గుర్తింపు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Don't Miss