Activities calendar

19 September 2017

21:47 - September 19, 2017

వనపర్తి : జిల్లా జూరాల ప్రాజెక్టు మొసళ్లు కలకలం సృష్టిస్తున్నాయి.ఇవాళ ప్రాజెక్ట్ సమీపంలో ఈతకెళ్లిన బాలుడిపై మొసలి దాడిచేసింది. నీటిలోకి లాక్కెళ్లేందుకు యత్నించగా.. బాలుడు తృటిలో తప్పించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని హుటాహుటిన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. 

21:45 - September 19, 2017

కటక్ : ఒడిశాలో జరిగిన సీషోర్‌ చిట్‌ఫండ్‌ కుంభకోణానికి సంబంధించి అధికార బీజూ జనదళ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రవత్ రంజన్ బిస్వాల్‌ను సిబిఐ అరెస్ట్‌ చేసింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత బిస్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీషోర్‌ గ్రూప్‌ చీఫ్‌ ప్రశాంత్‌ దాస్‌తో కలిసి భూకొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై బిస్వాస్‌ను నాలుగుసార్లు పోలీసులు విచారణ జరిపారు. అంతకుముందు జయపూర్‌ బేనాపూర్‌ భూకుంభకోణంలో ఎమ్మెల్యే భార్య లక్ష్మి బిలాస్నీ బిస్వాల్‌ను కూడా సిబిఐ విచారణ జరిపింది. బిస్వాల్ కటక్-చౌదార్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

21:44 - September 19, 2017

 

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన రుణమాఫీ ఓ జోక్‌లా తయారైంది. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు వస్తున్న ప్రమాణ పత్రాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మధురలో ఓ రైతుకు నయాపైసా మాఫీ అయినట్లు ఓ లెటర్‌ వచ్చింది. గోవర్ధన్‌ తహసిల్ పరిధిలోని ఛిద్దీలాల్‌ తండ్రి డాల్‌చంద్‌ 2011లో లక్షా 55 వేల రుణం తీసుకున్నాడు. ఆ బకాయి ఇంతవరకు తీర్చలేదు. లక్షా 55 వేలకు బదులు ఒక పైసా మాఫీ అయినట్లు ఆ పత్రంలో ఉంది. అధికారులను మూడు సార్లు కలిసినా నయాపైసా రుణమాఫీపై నోరు మెదడపం లేదని ఆ రైతు తెలిపాడు. అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నారు. రైతులకు లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని యుపి ఎన్నికల సమయంలో బిజెపి ప్రకటించింది. ఇంతకు ముందు కూడా 90 పైసలు, రూపాయిన్నర, రెండు రూపాయలు రుణమాఫీ అయినట్లు రైతులకు సర్టిఫికెట్లు వచ్చినట్లు వార్తలొచ్చాయి.  

21:43 - September 19, 2017

వాషింగ్టన్ : ఐదు నెలల తర్వాత అమెరికాలో హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియ మళ్లీ మొదలైందిది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్- ఆదివారం నుంచి హెచ్-1బీ వీసా పిటిషన్లను ప్రాసెస్ చేయడం ప్రారంభించింది. ఈ వీసాలను ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్‌ ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఇది నాన్ ఇమ్మింగ్రెంట్ వీసా. విదేశీ సాంకేతిక నిపుణుల కోసం హెచ్-1బీ వీసాలు జారీ చేస్తారు. వీరిని అమెరికా కంపెనీలు ప్రతియేటా వేల సంఖ్యలో హైర్ చేసుకుంటాయి. 2018 ఆర్థిక సంవత్సరానికిగాను 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేయనున్నారు. హైయర్ డిగ్రీ ఉన్నవారికి అదనంగా జారీ చేసే 20 వేల వీసాల కోసం కూడా వచ్చిన పిటిషన్లను పరిశీలిస్తున్నారు. 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే.. వీసా కోసం కట్టిన ఫీజు తిరిగిచ్చి ఆ ప్రక్రియను కొనసాగిస్తామని యూఎస్‌సీఐఎస్ తెలిపింది.

21:42 - September 19, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా కార్మికులు సమ్మె బాట పట్టారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో సిఐటియు ఆధ్వర్యంలో రాష్ర్ట వ్యాప్తంగా ఒక్క రోజు సమ్మెకు దిగారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు విధులను బహిష్కరించారు. హైదరాబాద్‌లో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు నేతృత్వంలో లేబర్‌కమిషన్‌ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. అధికారులు స్పందించకపోవడంతో కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు సీఐటీయూ కార్మికులను అరెస్టు చేశారు. అంతేకాదు మహిళా కార్మికులను దురుసుగా నెట్టివేశారు. ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్లలో ఎక్కించారు.

పలువురు కార్మికులకు గాయాలు
ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడ్డారు. ప్రభుత్వ తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసవేతనం కోసం అడిగితే పోలీసులతో నిర్బంధిస్తారా అని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి సాయిబాబు ధ్వజమెత్తారు. అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలన్న డిమాండ్‌తో..కరీంనగర్ జిల్లాలో సిఐటియు నాయకుల ధర్నాలు, నిరసనలు హోరెత్తాయి. కళాభారతి నుంచి కలెక్టరేట్ వరకు కార్మికులతో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై సీఐటీయూ నాయకులు మండిపడ్డారు. స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలోని ఒప్పంద కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ.. ఎంజీఎం ఆస్పత్రి నుంచి పోచ‌మ్మమైదాన్ వ‌ర‌కు సాగింది. దారి పొడ‌వునా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్మికులు నిర‌స‌న వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ మండలం జోగిపేటలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల బాగోగులు ఏనాడు పట్టించుకోలేదని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ..సచివాలయం నుంచి కాకుండా ప్రగతిభవన్‌ నుంచి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అటు సీఐటీయూ ఆధ్వర్యంలో పటాన్‌చెరులో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.

21:40 - September 19, 2017

 

గుంటూరు : రాష్ట్రంలో ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాల టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని.. కొందరు కావాలనే వీటిపై రాజకీయం చేస్తున్నారని మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో వ్యాధుల వల్ల ఒక్కరు కూడా చనిపోకూడదనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో కొన్ని చోట్ల కొరతగా ఉన్న సిటీ స్కాన్‌, MRI స్కాన్‌, పరికరాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

21:39 - September 19, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో... బతుకమ్మ చీరల రగడ కొనసాగుతూనే ఉంది. చీరల నాణ్యతపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రెండోరోజు సాగింది. పాలకులు నాసిరకం చీరలు ఇచ్చి.. మహిళలను మోసం చే‌స్తున్నారని ప్రతిపక్ష నాయకులు మండిపడుతుంటే.. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అంటూ ..టీఆర్‌ఎస్‌ పాలకులు అంటున్నారు. తెలంగాణలో బతుకమ్మ చీరల ... చిచ్చు..రగులుతూనే ఉంది. నాసిరకం చీరలపై మహిళలను తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రభుత్వ చర్యపై ప్రతిపక్షాలు.. మండిపడ్డాయి. మరోవైపు టీఆర్‌ఎస్‌ పాలకులు ఇదంతా ప్రతిపక్షాల అసత్య ప్రచారమంటూ... ఎదురుదాడికి దిగారు. దీంతో ప్రతిపక్ష, అధికార నాయకుల మధ్య మాటల యుద్ధం వాడివేడీగా సాగుతోంది.

ముప్పై రూపాయల విలువ చీరలు
కనీసం ముప్పై రూపాయల విలువ కూడా చేయని చీరలను పంచుతున్నారని పాలకులపై ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసి.. చివరకు మహిళలకు నాణ్యత లేని చీరలను అంటగట్టారని విమర్శించారు. అసలు చీరల పంపిణీ పథకంలో భారీ కుంభకోణం జరిగిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. అసలు ఈ చీరలకు ఎంత ఖర్చు చేశారు.. ఎన్ని పంపిణీ చేశారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా ప్రతిపక్షాల మాటలను అధికార పార్టీ నాయకులు ఖండించారు. అసలు రాష్ట్రంలో చీరలపై మహిళలు ఆందోళనలు చేయడం లేదని.. ఇదంతా ప్రతిపక్షాలు చేసిన కుట్ర అని ఆరోపించారు. కాగా తెలంగాణాలోని మంగళవారం కూడా బతుకమ్మ చీరలను పంపిణీ పంపిణీలో అక్కడక్కడా ఆందోళనలు చెలరేగాయి. యాదాద్రి జిల్లా మోత్కూరులో గందరగోళం ఏర్పడింది. చీరల నాణ్యత బాగాలేదంటూ మహిళలు అక్కడ నాయకులను నిలదీశారు.

21:37 - September 19, 2017

గుమ్లాపూర్ సర్పంచ్ ఆత్మహత్యయత్నం

కరీంనగర్ : జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో ఓవర్ లోడ్ తో వెళ్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందించకపోవడంతో మనస్తాపంతో సర్పంచ్ వెంకటరెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు ఊదు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు.

ఐక్యరాజ్యసమితిలో జనరల్ అసెంబ్లీలో ట్రంప్ తొలి ప్రసంగం

న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ తొలి ప్రసంగం చేశారు. అన్ని దేశాలతో అమెరికా స్నేహాన్ని కోరుకుంటుందని, ఏకపక్ష ఒప్పందాలకు అమెరికా దూరమని ఆయన ప్రకటించారు.

 

అనంతపురంలో ప్రబులుతున్న విష జ్వరాలు

అనంతపురం : జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. డెంగ్యూ జర్వంతో ముగ్గురు చిన్నారులు ఇప్పటికే మృతి చెందారు.

 

19:59 - September 19, 2017

దేశంలో పులుల లెక్కల తెలుసు కానీ, ఆదివాసీల లెక్కలు తెలియవు..ఇదీ మన ప్రభుత్వాల చిత్తశుద్ధి.. అడవి పుట్టినప్పటి నుంచి గిరిజనుడిదే భూమి. అక్కడి సాగుభూమిపై, గూడేలపై ఆదివాసీలకే హక్కు. ఒక్కమాటలో చెప్పాలంటే అడవికి గిరిజనుడే రాజు. కానీ జరుగుతున్నదేమిటి? కారణాలు అనేకం చెప్తూ ఆదివాసులను అడవులనుండి తరిమే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ దారుణాలకు తెలంగాణ వలస వచ్చిన గొత్తికోయలు బలవుతున్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘర్‌, జార్ఖండ్, తమిళనాడు, ఆంద్ర, తెలంగాణ ఇలా దేశంలో ఏ ఒక్క రాష్ట్రమూ దీనికి అతీతం కాదు.. అధికారంలో ఉన్న ఏ పార్టీలకి తేడాలేదు. అడవి బిడ్డలకు అన్యాయం చేయటంలో ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఇప్పుడు సొంత రాష్ట్రాన్ని వదిలి తెలంగాణ అడవులకు వలస వచ్చిన గొత్తికోయల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. గత పదేళ్ల నుండి వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలోని అడవుల్లో పలు చోట్ల గుత్తికోయల ఆవాసాలు కనిపిస్తున్నాయి. చత్తీస్ ఘడ్ రాష్ట్రం దాడుల నుంచి తట్టుకోలేక గోదావరి దాటి జీవనోపాధి కోసం వలస వచ్చిన గుత్తికోయలకు ఇక్కడా అభద్రతే ఎదురవుతోంది. తలదాచుకోవాలని తెలంగాణకు వచ్చిన గుత్తికోయల పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారైంది..

అడవుల్లో ఎంతకాలం ఉన్నా స్థానికులు కాలేని పరిస్థితి..ఓ పక్క పోడు వ్యవసాయం పట్ల ప్రభుత్వ విధానాన్ని ఆసరాగా చేసుకుని అటవీ సిబ్బంది సాగించే దుర్మార్గాలు.. మరోపక్క స్థానిక గిరిజనుల వ్యతిరేకత.. వెరసి గొత్తికోయలకు నిలువల నీడలేని పరిస్థితి ఏర్పడుతోంది.. స్వతంత్ర భారతంలో ఎవరైనా ఎక్కడైనా బతికే అవకాశం ఉంది. కానీ, ఆదివాసీల బడుగు బతుకులను ఆసరాగా తీసుకుని అధికార యంత్రాంగం దారుణంగా ప్రవర్తిస్తోంది.అసలీ అడవి ఎవరిది? ఆ అడవిని నిజంగా కాపాడుతున్నదెవరు? ఆ అటవీ సంపదను నాశనం చేస్తున్నదెవరు? కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టే న్యాయాన్ని అనుసరిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. చారెడు నేల అడిగితే లాఠీ ఝుళిపిస్తున్నారు.. పోడు వద్దంటూ తరిమే ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు అడవికి, ఇటు మైదానానికి కాకుండా ఆదివాసీల ఉనికినే ప్రమాదంలో పడేస్తున్నారు.. మరి ఆదివాసుల్ని తరిమేస్తే అడవి కళకళలాడుతుందా? కానీ వీరిలో 40 శాతం మంది నివాసాలని కోల్పోయి వివిధ ప్రాంతాలకు చెదిరిపోయారన్నది విషాదకరమైన వాస్తవం.. ముఖ్యంగా 1990ల నుంచి ప్రపంచీకరణలో భాగంగా ఆధిపత్య దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలపై కన్ను వేశాయి. ఎక్కడ ఖనిజాలు కనిపిస్తే అక్కడ స్థానిక ప్రభుత్వాలను గుప్పిట్లో పెట్టుకుని కార్పొరేట్‌ శక్తుల ద్వారా తమ పంజా విసురుతున్నాయి. ఈ వేటలో ప్రధాన బలిపశువులు ఆదివాసీలే.

గత 30 ఏళ్లలో మొత్తం 35 లక్షల ఎకరాల అటవీ భూమి చట్టబద్ధంగా నాశనమైంది. దానిపై ఎలాంటి చర్యలు, పరిశీలనలు లేవు. కానీ, పొట్టకూటికోసం మాత్రం తనసొంతమైన అడవితల్లి ఇచ్చిన సంపదను ఉపయోగించుకుంటే, పండించుకుంటే, ప్రభుత్వాలకు నొప్పి కలుగుతోంది. ఈ దేశమూలవాసులను నిర్లక్ష్యం చేస్తూ ఇప్పటికీ వారికోసం ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టకపోగా, ఉన్న కాస్త ఆధారాన్ని పోగొట్టే ప్రయత్నాలను ప్రజాస్వామికవాదులు తీవ్రంగా నిరసిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

ఏపీకి రూ.2,074కోట్లు విడుదల చేసిన కేంద్రం

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ. 2,074కోట్లు విడుదల చేసింది. కేంద్ర పన్నుల వాటా కింద నిధులు విడుదల చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 42 శాతం నిధులు విడుదల చేసింది.

 

రాబ్రీదేవికి ఈడీ సమన్లు

పాట్నా: లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రాబ్రీదేవికి ఈడీ సమన్లు జారీ చేశారు. బినామీ ఆస్తుల కేసులో రాబ్రీదేవికి సమన్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.

పాల్వంచ కేటీపీఎస్ లో తప్పిన భారీ ప్రమాదం

భద్రాద్రి : జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో భారీ ప్రమాదం తప్పింది. యూనిట్ ట్రాన్స్ ఫార్మర్ లో మంటలు చెలరేగడంతో ఇంజినీర్ల అప్రమత్తతతో పెను ప్రమాదం తిప్పింది.

19:35 - September 19, 2017

బతుకమ్మ చీరలపై ప్రతిపక్షాలు రాద్ధంతం చేయడంలేదని, చీరల పంపిణీ మంచి నిర్ణయమని దీంతో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం ఉపయోగపడతాయని అందరు అనుకున్నారని, చివరికి రూ.70 సిల్క్ చీరుల ఇచ్చారని, దీంతో మహిళలే కేసీఆర్ మడ్డిపడుతున్నారని, చీరకు రూ.200 కేటాయించిన ప్రభుత్వం కేవలం రూ.70 ఇవ్వడం బాధకరమని, తెలంగాణ చేనేత కార్మికులకు ఉపాధి కోసమని చెప్పి ఇప్పుడు సూరత్ నుంచి తెచ్చి ఇవ్వడం చాలా దారుణమని టీడీపీ నేత శోభ రాణి అన్నారు. కేసీఆర్ మహిళలకు చీరలు మంచి ఉద్దేశంతో ఇచ్చారని టీఆర్ఎస్ నేత కవిత అన్నారు. అధికార పార్టీ ప్రతిపక్షాలను అనడం రివాజ్ గా మారిందని, మహిళలు ఎరైనా కూలీపోయి రూపాయి రూపాయి పొగేసి కనీసం రూ.500 చీర కొనుకుంటారని కాంగ్రెస్ నాయకురాలు రమ్యరావు అన్నారు. చీరలను రాజకీయాలకు వాడడమే తప్పని ఐద్వా నాయకురాలు ఐమవతి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

19:34 - September 19, 2017

కృష్ణా : కే.ఎల్‌. యూనివర్సిటీ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 6,7వ తేదీల్లో జాతీయ స్థాయి సాంకేతిక నిర్వహణ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్ధులు విజయవాడ ఎంవీఆర్‌ మాల్‌లో ఫ్లాష్‌ మాబ్‌ నిర్వహించారు. విద్యార్ధులు సినిమా పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. విద్యార్ధుల్లోని వినూత్న ఆలోచనలకు, నాయకత్వ లక్షణాలతో పాటు సృజనాత్మకత ప్రతిభను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు విద్యార్ధి విభాగం సమన్వయకర్త తెలిపారు.

19:32 - September 19, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 23న తిరుమలలో ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గతంలో చంద్రబాబునాయుడుపై జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకుని.. అధికారులు ఘాట్‌ రోడ్ల వద్ద బాంబు స్క్వాడ్, ప్రత్యేక టాస్క్ ఫోర్సు పోలీసులతో జల్లెడ పడుతున్నారు.

19:31 - September 19, 2017

గుంటూరు : జివో నెంబర్ 64 రద్దను వ్యతిరేకిస్తూ వ్యవసాయ విద్యార్దులు గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా 11వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో 48 గంటల పాటు నిరవదిక నిరహార దీక్ష చేపట్టారు. దేశంలో ఎక్కడా లేని జీవోలను ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తోందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. 48 గంటల లోపు ప్రభుత్వం స్పందించక పోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని విద్యార్ధులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

19:30 - September 19, 2017

ప్రకాశం : జిల్లాలో విషజ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి శిద్దా రాఘవరావు అధికారులను ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ప్రబలిన విషజ్వరాలపై మంత్రి రాఘవరావు ఒంగోలులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో డెంగీ వ్యాధితో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, విషజ్వరాలతో ఆరుగురు మరణించిన విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటి వరకు 96,500 విషజ్వరాల కేసులు నమోదైన అంశాన్ని ప్రస్తావించారు. పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని శిద్దా రాఘవరావు అధికారులను ఆదేశించారు. 

19:29 - September 19, 2017

 

కర్నూలు : రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ ని ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని కర్నూలు జిల్లా నంద్యాలలో పొదుపు సంఘాల మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారు. రాజకీయ అస్థిరత ఉంటే పెట్టుబుడులు రావన్నారు. వచ్చే ఎన్నికలు టీడీపీ కి నల్లేరుపై నడక అవుతుందని నంద్యాల ఉప ఎన్నిక ఫలితంతో దీనిపై స్పష్టత వచ్చిందన్నారు. 

గౌరవెల్లి రిజర్వాయర్ లైన్ క్లియర్

హైదరాబాద్ : గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. హైకోర్టు రిజర్వాయర్ నిర్మాణ పనులు కొనసాగించవచ్చని తీర్పునిచ్చింది.

 

19:05 - September 19, 2017

యాభై రూపాల చీర ఉయ్యాలో మాకు ఇచ్చిండమ్మ ఉయ్యాలో.. మీరిచ్చె ఈ శీరె ఉయ్యాలో.. మీ బిడ్డ గడ్తదా ఉయ్యాలో.. మీ భార్యగడ్తదా ఉయ్యాలో.. మీ కోడల్ గడ్తదా ఉయ్యాలో.. తెలంగాణల నిన్నటి సంది ఇదే మోతమోగుతున్నది.. ఆడోళ్లైతె కేసీఆర్ మీద ఆయన కొడ్కు మీద ఏడేడు దోశల మన్నెత్తి పోస్తున్నరు.. మేము గింత అగ్వగనిపిచ్చినాం అని.. సూడుండ్రి..

తెలంగాణల బట్టలు నేశెటోళ్లే కర్వైండ్రా..? గద్వాల కాడికెళ్లి మొదలు వెడ్తె శిరిశిల్ల దాక ఎన్ని మగ్గాలు లేవు ఎంత గొప్ప పనోళ్లు లేరు..? ఆరు గజాల శీరెను అగ్గిపెట్టెల వెట్టిన ఘనకీర్తి గళ్ల నేతన్నలు వున్న గడ్డ ఈ తెలంగాణ.. ఈడ నేసుడు సరిపోదనుకుంటే.. ధర్మవరం అసొంటి జాగలకు వంపి చేపిస్తె ఏమైతుండే..? రెండువందల ఇర్వై కోట్ల దాక ఖర్చువెట్టినమంటిరి.. నేత కార్మికులకు దక్కింది లేదు.. నడ్మెవ్వడో బ్రోకర్లు మింగిరి ఒడ్సిపాయే..

ఆ అయ్యా కల్వకుంట్ల తారక రామారావుగారూ..? రాండ్రి మీరు వంచిన చీరెలు ఓ నాల్గు వట్కోని మీరు రాండ్రి.. వద్దని తిట్టి ఆవేదన ఎల్లగక్కిన అమ్మలక్కను నేను తీస్కొస్త.. ఆబిడ్స్ చౌరస్తకాడ గూసుందాం.. ఎవ్వలు ఎవ్వలిని మోసం జేశింది ఏం కథ..? సూపెడ్త రాండ్రి.. అమ్మలక్కలు చీరెలు గాలవెడ్తె కేసులు వెట్టిస్తావ్..? కాలవెడ్తె కేసులు వెట్టిచ్చనవ్ గదా... మరి నేత చీరెలిస్తాని.. పాలిస్టర్ శీరెలిచ్చిన మీ మీద ఏం బెట్టాల్నయ్యా..?

ట్రాఫిక్ పోలీసోళ్లకే సుక్కలు జూపెట్టిండు ఒక తాగువోతు.. కడ్పునిండ దాగి బండిమీదొస్తుంటే.. ఆపిండ్రట.. పోలీసోళ్లు ఆపంగనే గుండె నొప్పి గుండె నొప్పని కిందవడిపోయిండట.. వానికి ఎర్కేగదా..? ఇగ ఎట్లైనా నోట్లె పైపు వెట్టి ఊదిపిస్తరని.. ఇగ ఈ ఏశం గట్టిండు.. పోలీసోళ్లు పరేషాన్ అరే వీన్ని ఊకెనన్న ఆపితిమిరా అని... తర్వాత ఏమైందో సూడుండ్రిగ..

ఎవ్వడన్న పోలీసోడుగానీ.. ప్రభుత్వ అధికారి గానీ.. లంచం అడ్గితె.. ఆడనే కాలి చెప్పుదీశి రెండు సప్పరియ్యుండ్రి ఏంగాదు..? అసలు పోలీసోనికి లంచం ఎందుకియ్యాలే... ? వానికి జీతం రాదా..? కోర్టుల కేసు తశ్వ అయ్యింది.?. ఇరువర్గాలు రాజీపడ్డయ్ ఒడ్సిపాయే.. రెండు లక్షల రూపాల లంచంగావాలె అని ఒకతాన ఎస్ఐ గాడు ఎంత పెద్ద పనిజేశిండో సూడుండ్రి..

బంగారు తెలంగాణల నేను గూడ భాగమైత.. రాష్ట్రప్రభుత్వానికి నా వంతు పన్నుగట్టి అభివృద్ధిల పాలువంచుకుంట అనుకున్నట్టున్నడు ఒక సర్కారు బడి పంతులు.. ఎక్వ పన్ను చెల్లించాలే అని.. ఎక్వ తాగిండు.. అదే తాగిన సంతోషంతోని తన బడికొచ్చి ఎంత హ్యాపీగ నిద్రవోతున్నడంటే..? ఈ లోకాన్ని మర్శిపోయి మరీ తన్మయం బొందుతున్నడు.. నాతోని గాలేదు జర్ర మీరన్న నిద్రలేపితె ఇంటికన్నతోలిద్దాం..

17:54 - September 19, 2017

సంగారెడ్డి : జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం మన్నెగూడలోని శ్లోకా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు బతుకమ్మ పాటలకు చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగర్‌ మధు ప్రియ హాజరై చిన్నారులను ఆట పాటలతో అలరించారు. తెలంగాణ సంప్రదాయ పండగైన బతుకమ్మ గురించి పిల్లలకు తెలియజేయడానికే ఈ కార్యక్రమం చేపట్టామని స్కూల్‌ యాజమాన్యం తెలిపింది.

17:53 - September 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసి కార్మికులకు వెంటనే పీఆర్సీ విడుదల చేసి, పనిభారం తగ్గించాలని, సంస్థ విస్తరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్ డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో చైతన్య యాత్రలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఈ నెల 26 వరకు తెలంగాణలోని అన్ని డిపోలను కలుపుతూ సాగే జాతాలు రాష్ట్రంలోని వివిధ రీజియన్లలో ప్రారంభమయ్యాయి. కేంద్రం తీసుకువస్తున్న ఎంవి యాక్టు వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసి సంక్షోభంలో పడబోతుందని.. వెంటనే వేతన సవరణ చేయాలని ఏఐఆర్ టీడబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య డిమాండ్ చేశారు.

17:51 - September 19, 2017

ఆదిలాబాద్ : తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం.. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో అత్యంత ప్రధానమైనది. పేదల సొంతింటి కలను నెరవేర్చుతామని, డబ్బా ఇళ్ల నుంచి విముక్తి కల్పిస్తామని కేసీఆర్‌ హామీనిచ్చారు. ప్రతి పేదవాడూ ఆత్మగౌరవంగా బతికేందుకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించి ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అయితే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా... రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ జిల్లాలోనూ ఈ ఇళ్లు పూర్తి కాలేదు. ఇక అదిలాబాద్‌ జిల్లాలో చేపట్టిన రెండు పడక గదుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. పలుచోట్ల మంత్రులు అట్టహాసంగా ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసినా అవి అక్కడితోనే ఆగిపోయాయి.

168 ఇళ్లకు మాత్రమే కాంట్రాక్టర్లతో ఒప్పందం
ఆదిలాబాద్‌, బోధ్‌ నియోజకవర్గంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం కోసం 23 గ్రామాల్లో అధికారులు స్థలాలను ఎంపిక చేశారు. లబ్దిదారుల ఎంపిక కూడా పూర్తయ్యింది. మొత్తం 1300 మందికి ఇళ్లను కట్టించే బాధ్యతను పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ అధికారులు తీసుకున్నారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 318 ఇళ్లకు టెండర్లు పిలవగా.. 168 ఇళ్లకు మాత్రమే కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదిరింది. మిగిలిన 52 ఇళ్ల నిర్మాణానికి పనులు ప్రారంభమైనా అవి పునాదుల దశను దాటలేదు. ఇక బోథ్‌ నియోజకవర్గంలో 400 ఇళ్లకుగాను కేవలం 41 ఇళ్లకు మాత్రమే ఒప్పందం పూర్తయ్యింది. అయితే పనులు మాత్రం ఎక్కడా ఇంతవరకు ప్రారంభమే కాలేదు. ఆదిలాబాద్‌ పట్టణం పరిధిలో 582 ఇళ్లకు ఇంత వరకు స్థల ఎంపికనే జరుగలేదు. దీంతో టెండర్ల విషయంలో స్పష్టత రావడం లేదు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియ టెండరు దశను దాటడానికి ఆపసోపాలు పడుతోంది. దీంతో ఇళ్లకోసం ఎదురు చూస్తోన్న పేదల ఆశలు అడియాసలు అవుతున్నాయి. ఎప్పటి మాదిరిగానే అద్దె ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. మావల మండలం బట్టిసావర్గాంలో 100 ఇళ్లను మంజూరు చేస్తే... స్థల వివాదం కారణంగా పనులు ప్రారంభం కాలేదు. మంత్రి జోగురామన్న సొంత మండలమైన జైనథ్‌ మండల కేంద్రంలో 131 ఇళ్లు, గిమ్మలో మరో 29 ఇళ్లను మంజూరు చేసినా నిర్మాణ పనులు మాత్రం నేటికీ ప్రారంభంకాలేదు.

కాంట్రాక్టర్‌లు ఆసక్తి చూపడం లేదు...
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్‌లు ఆసక్తి చూపడం లేదు. అందుకే ఎవరూ టెండర్లు వేయడం లేదు. ప్రభుత్వం ఇచ్చే నిధులతో తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు తేల్చి చెబుతున్నారు. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రక్రియకే అడ్డంకులు ఎదురవుతున్నాయి. మరి ఈ బాలారిష్టాలు దాటుకుని ప్రభుత్వం పేదలకు ఎలా రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తుందో వేచి చూడాలి.

17:48 - September 19, 2017

హైదరాబాద్ : ప్రొఫెసర్‌ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చిలో... తెలంగాణ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఏర్పాటై నెలలు గడుస్తున్నా ఏమాత్రం పురోగతి లేకుండా పోయింది. పైగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిన తిరుపతిరావు కమిటీ వాయిదాలతోనే సరిపెడుతోంది. దీంతో తిరుపతిరావు కమిటీ అసలు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిరావు కమిటీ వాస్తవానికి ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల ఫీజుల దోపిడీపై అధ్యయనం చేసింది. విచ్చల విడిగా ప్రతిఏటా వేలకువేలు ఫీజులు పెంచడంపై సమాచారాన్ని సేకరించింది. ఫీజులు ఎందుకు పెంచాల్సి వస్తుందో స్పష్టం చేయాలని ప్రైవేట్‌ స్కూల్స్‌ను తిరుపతిరావు కమిటీ కోరింది. ఇందుకు ఆదాయ, వ్యయాల నివేదికలను సమర్పించాలని ప్రైవేట్‌ స్కూల్స్‌ను ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు చాలా స్కూల్స్‌ వాటిని సమర్పించనేలేదు. ఇప్పటికే ఇందుకోసం పలుమార్లు గడువు పొడిగించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరోసారి నెలరోజులు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది ఫీజుల నియంత్రణ అనేది కలగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. 

17:47 - September 19, 2017

హైదరాబాద్ : న్యాక్ అక్రిడేషన్‌లో ఉస్మానియాకి ఏ ప్లస్ గ్రేడ్‌ రావడం ఎంతో సంతోషకరమై విషయమని ఓయూ ప్రొఫెసర్ వీసి రాంచంద్రం అన్నారు. న్యాక్‌ గుర్తింపుతో యూనివర్సిటీ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. ఈ గుర్తింపు రావడానికి యూనివర్సిటీ వర్గాలు ఎంతో శ్రమించాయన్నారు. ఓయూలో కొత్త నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే వర్సిటీలో మరింత అభివృద్ధి జరగాలంటే నాన్‌ బోర్డర్స్‌ ఖాళీ చేయక తప్పదన్నారు. నాన్‌బోర్డర్స్‌కి ఖాళీ చేయకపోతే రైడ్‌ చేసి బయటికి పంపాల్సి వస్తుందని వీసీ హెచ్చరించారు. 

17:45 - September 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా నేడు కార్మికులు సమ్మె బాట పట్టారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రాష్ర్ట వ్యాప్తంగా సమ్మెకు దిగారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు విధులకు హాజరుకాలేదు. మరి కొన్ని చోట్ల కార్మికులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలోని ఒప్పంద కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.

17:44 - September 19, 2017

కరీంనగర్ : అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలన్న డిమాండ్‌తో..కరీంనగర్ జిల్లాలో సిఐటియు నాయకులు ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు. కళాభారతి నుంచి కలెక్టరేట్ వరకు కార్మికులతో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. కాలపరిమితి ముగిసినా కనీస వేతన చట్టాలను అమలు చేయకపోవడం పట్ల సిపిఎం జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ప్రభుత్వం వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. 

17:42 - September 19, 2017

సంగారెడ్డి : జిల్లాలో సీఐటీయూ రాష్ట్రవ్యాప్త సమ్మె ఉద్ధృతంగా కొనసాగింది. ఆందోల్‌ మండలం జోగిపేటలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల బాగోగులు ఏనాడు పట్టించుకోలేదని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ..సచివాలయం నుంచి కాకుండా ప్రగతిభవన్‌ నుంచి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అటు పటాన్‌చెరులో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనం 18 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం సభ నిర్వహించిన సీఐటీయూ నాయకులు.. కేసీఆర్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. శ్రమదోపిడీ చేస్తున్న పరిశ్రమల యాజమాన్యాలకు ప్రభుత్వం కొమ్ముకాస్తుందని ఆరోపించారు. రాబోయే కాలంలో కంపెనీ యాజమాన్యాలకు, ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధిచెపుతారన్నారు. 

17:40 - September 19, 2017

హైదరాబాద్ : బతుకమ్మ పండుగ కానుకగా నాసిరకం చీరల పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మహిళలను అవమానిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోపించారు. ముప్పై రూపాయల విలువ కూడా చేయని చీరలను పంచుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఎనిమిదో నిజాంలా పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలను ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ముందుగా కట్టుకోవాలని కోమటిరెడ్డి డిమాండు చేశారు.

జూరాల ప్రాజెక్టు వద్ద బాలుడి పై మొసలి దాడి

వనపర్తి: జూరాల ప్రాజెక్టు వద్ద బాలుడి పై మొసలి దాడి చేసింది. తృటిలో ఆ బాలుడు తప్పించుకున్నాడు. 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొసలి దాడితో జూరాల పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్పై కెమెరాలపై హైకోర్టులో పిల్

హైదరాబాద్: స్పై కెమెరాల అమ్మకాలను నియంత్రించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా స్పై కెమెరాలను వినియోగిస్తున్నారని పిల్ ధాఖలయ్యింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ హోంశాఖలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

టెలీ మెడిసిన్ టెండర్లలో అక్రమాలు లేవు: మంత్రి కామినేని

అమరావతి : టెలీ మెడిసిన్ టెండర్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. జిల్లా ఆస్పత్రిల్లో సిటీ ఎంఆర్ ఐ స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులపై కేంద్రం నివేదిక ఇచ్చిందని, ఏపీలో జనవరి నుంచి ఇప్పటి వరకు 12,298 మలేరియా, 1,454 డెంగ్యూ కేసులు నమోదైతే ఒక్క మరణం కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. స్వైన్ ఫ్లూతో 13 మంది మృతి చెందారని తెలిపారు.

గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

హైదరాబాద్: గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. గౌరవెల్లి రిజార్వాయర్ నిర్మాణంపై హైకోర్టు స్టే ఎత్తివేసింది. నిర్మాణం కొనసాగించుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

16:33 - September 19, 2017
16:31 - September 19, 2017

హైదరాబాద్: కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు చావు ప్రభుత్వం కారణమని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అన్నారు. బతుకమ్మ చీరల పేరిట మహిళలకు రూ.50 పంచుతున్నట్టు మహిళలు చెబుతున్నారని ఆయన అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

16:27 - September 19, 2017

కృష్ణా : దేశంలోనే అత్యధిక ఆదాయమార్గంగా ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్‌ను భద్రతా వైఫల్యం వెంటాడుతోంది. రైల్వే ప్రయాణికుల భద్రతపై అధికారుల చర్యలు ఎవరికీ అంతుపట్టడంలేదు. అత్యధిక ఆదాయం, రద్దీ సమయాల్లో వందల సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడపడంలో బెజవాడ రైల్వే స్టేషన్‌ కీర్తి గాంచింది. కాని లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు పనిచేయకపోవడం, భద్రతా చర్యలు చేపట్టడంలో మాత్రం రైల్వే అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

పనిచేయని సీసీ కెమెరాలు
ఇటీవల వచ్చిన రైల్వే ఎస్పీ మోహనరావు రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించి సిసి కెమెరాలు పని చేయడంలేదని గుర్తించారు. ఒకటో నెంబర్‌ ఫ్లాట్‌ ఫారం నుండి పదో నెంబర్‌ ఫ్లాట్‌ఫారం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ విషయాన్ని డీఆర్ఎం ధనుంజయుల దృష్టికి తీసుకెళ్లారు. స్టేషన్‌లో మూడంచెల భద్రతపై సమీకృత భద్రత వ్యవస్థ ఏర్పాటులో భాగంగా పదేళ్ల క్రితం విజయవాడ డివిజన్‌ అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలు ఇంకా ఆమోదం పొందలేదు. ప్రజాప్రతినిధులైనా ఈ విషయంపై చొరవ తీసుకోవాలని ప్రయాణికులు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

గేట్ల వద్ద భద్రతా సిబ్బంది కరువు
రైల్వేస్టేషన్‌లో తూర్పు, పశ్చిమ బుకింగ్‌ సెషన్‌, తారాపేట ప్రాంతాల్లో భద్రత అంతంతమాత్రంగానే ఉంటోంది. ఈ మార్గాల్లో వచ్చే వారిని పరీక్షించేందుకు గేట్ల వద్ద భద్రతా సిబ్బంది ఉండటంలేదు. డోర్‌ ఫ్రేమ్‌లు పని చేయడంలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పార్శిల్‌ కార్యాలయంలో సరుకును తనిఖీ చేయకుండానే లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేస్తున్నారు. స్టేషన్‌లో ఆహార పదార్థాలు విక్రయించే అనధికార హాకర్ల నియంత్రణపై కూడా అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. రైళ్లలో అనుమానాస్పద వ్యక్తులను కనుగొనే నిఘా వ్యవస్థ కూడా లేకపోవడం అపరిచిత వ్యక్తుల సంచారం ఎక్కువైపోవడంతో కనిపెట్టే నాథుడే లేడు. అక్కడక్కడ ఏర్పాటు చేసిన సిసి కెమెరాల పనితీరు అంతంత మాత్రంగానే ఉండటంతో స్టేషన్‌లో భద్రత గాల్లో దీపంలానే మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కెమెరాలను అమర్చి, స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రయాణికులు. అలాగే రాత్రి సమయాల్లో నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

16:25 - September 19, 2017

కృష్ణా : బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రతి ఏటా దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. సెప్టెంబర్‌ 21 నుంచి 30వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. దీంతో ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉన్నతాధికారులు దృష్టిసారించారు. 27వ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు...
ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 15కోట్ల రూపాయలు ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. భక్తుల కోసం 2కోట్ల రూపాయల వ్యయంతో క్యూలైన్లు, వాటర్‌ ప్రూఫ్‌ టెంట్లు, ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు వంటి ఇంజనీరింగ్‌ పనులు చేపట్టారు. రాజగోపురం, దుర్గమ్మ కోవెల, మల్లేశ్వరాలయం, ఉపాలయాల అలంకరణ నిమిత్తం 17.28 లక్షలు ఖర్చు చేస్తున్నారు. భక్తులకు సమాచారం, దేవతామూర్తుల అలంకారాల కోసం 3.25 లక్షలు కేటాయించారు. వినాయకుడి గుడి నుంచి దుర్గగుడి వరకు మూడు వరుసల్లో 900మీటర్ల మేర క్యూలైన్లు వేయడానికి రూ.17లక్షలు కేటాయించారు. ఇందులో మెష్‌ ఏర్పాటు కోసం అదనంగా ఇప్పటికే 12.50 లక్షలు వెచ్చించారు. వినాయకుడి గుడి వద్ద క్యూలైన్ల పనులు ప్రారంభమయ్యాయి. దుర్గగుడి టోల్‌ గేట్‌ నుంచి ఓంకార మలుపు వరకు మూడు వరుసలు, అక్కడ నుంచి కూల్చివేసిన భవానీ దీక్షా మండప ప్రాంతం వరకు ఐదు క్యూలైన్లు నిర్మిస్తున్నారు.

వాహన మరమ్మతుల కోసం రూ.7.10 లక్షలు
అలాగే దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించే హంస వాహన మరమ్మతుల కోసం రూ.7.10 లక్షలు ఖర్చు చేయనున్నారు. వీటితో పాటు ఆర్చిగేట్ల నిర్మాణానికి ఒకటిన్నర లక్షలు, సీసీ కెమెరాలు, ఎల్‌ఈడీ తెరలకు ఆరున్నర లక్షల రూపాయలు కేటాయించారు. ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు అధికారులు ప్రత్యేకంగా సీసీ కెమెరాలతో నిఘాని ఏర్పట్లు చేస్తున్నారు.ఇంద్రకీలాద్రిపై జరిగే నవరాత్రులకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. భక్తులకు సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు.

16:18 - September 19, 2017

మోత్కూరులో బతుకమ్మ చీరల పంపిణీ రసాభాస

యాదాద్రి: మోత్కూరులో బతుకమ్మ చీరల పంపిణీ వద్ద రూ.100 చీరలు పంచుతారా అని ఎమ్మెల్యే కిషోర్ ని మహిళ నిలదీసింది. మహిళ అరెస్టు చేశారు.

టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం స్పందించాలి:ఐలయ్య

హైదరాబాద్: టిడిపి నేత టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించాల ప్రో. కంచె ఐలయ్య డిమాండ్ చేశారు. మేదావివైన నన్ను కల్చి చంపుతానని పక్క రాష్ట్ర ఎంపి అంటుంటే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎంపీ టీజీ వెంకటేష్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. టీజీ వెంకటేష్ ఇంట్లో సోదాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వెనక టీజీ వెంకటేష్ హస్తముందన్నారు. నన్ను చంపుతామని బెదిరిస్తున్న వారిపై రేపు ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేస్తానని ప్రొ.ఐలయ్య హెచ్చరించారు.

16:04 - September 19, 2017
16:03 - September 19, 2017

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా వేములవాడలో దారుణం జరిగింది. రవి అనే వ్యక్తి ఆటోలో భార్య అంజలి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరుం రవి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రవిని హసుపత్రికి తరలించారు. రవి నెల క్రితమే దుబాయ్ నుంచి వచ్చాడు. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

16:00 - September 19, 2017

విజయనగరం : జిల్లా పార్వతీపురం గూడ్స్ షెడ్ వద్ద ఇళ్ల తొలగింపుతో ఇద్దరు అనాథ వృద్దులు నిలువనీడలేక నిరాశ్రయులై విలవిల్లాడుతున్నారు. మున్సిపల్ అధికారులు అనాథ వృద్ధులను వృద్ధాశ్రమానికి తరలిస్తామని చెప్పి పని పూర్తైన తర్వాత పట్టించుకోవడం లేదు. ఆ అనాథ వృద్ధులు రోడ్డు పక్కన ఆకలితో నకనకలాడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:59 - September 19, 2017

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్ ఆర్బీనగర్ లో ఐదేళ్ల చిన్నారి అనుమానాస్పదంగా మృతి చెందింది. చిన్నారి అనారోగ్యంతో చనిపోయినుట్టు ఆమె తండ్రి చెబుతున్నారు. రెండో భార్యతో కలిసి కూతురిని తండ్రే చంపాడని పాప తరుపు బంధువులు ఆరోపిస్తున్నారు. పాప తల్లి ఏడాది క్రితం చనిపోవడంతో తండ్రి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

పాలకొల్లులో శ్రీచైన్య స్కూల్ లో దారుణం...

ప.గో: పాలకొల్లు శ్రీచైతన్య స్కూలులో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుడు రామకృష్ణ చితకబాదాడు. స్కూలు ఎదుట విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.

15:43 - September 19, 2017

చెన్నై : తమిళ తాజా రాకీయాలు వేడెక్కాయి. నేడు సాయంత్రం డీఎంకే శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఈ భేటీలో ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఢిల్లీలో బిజీబీజీగా ఉన్నారు. ఆయన కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. వారి మధ్య తమిళనాడు తాజా రాజకీయ పరిణామలపై, దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. విద్యాసాగర్ రావు రాష్ట్రపతి కోవింద్ కూడా భేటీ అయ్యారు. తాజా పరిణామాలను అన్నాడీఎంకే నిశితంగా పరిశీలిస్తుంది. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ ముఠా వీరంగం

విజయవాడ: పటమటలో బ్లేడ్ బ్యాచ్ ముఠా వీరంగం సృష్టించింది. బైక్ ఎక్కమని విద్యార్థినిని ఐదుగురు పోకిరీలు బ్లేడ్లతో బెదిరించారు. విద్యార్థిని పై దాడికి యత్నించగా మరో మహిళ అడ్డుకుంది. బందర్ రోడ్డు వరకు ఆకతాయిలు విద్యార్థిని వెంబడించారు.

15:30 - September 19, 2017

దేశాన్ని పాలిస్తున్న నేతలు చాలవరకు మహిళలపై దాడి చేసిన వారే....మహిళలపై దాడి చేసే వారిని ఎన్నికల్లో పోటీచేయడం, వారు గెలుపొందడం అనేది విచారదగ్గ విషయం..దీని పై మానవి వేదికలో చర్చించడానికి గీతామూర్తి, ఇందిరా శోభన్ వచ్చారు. అఫిడవిట్ ఇచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందని, నేర చరిత ఉన్న వారిని అభ్యర్థిగా నిలబెట్టి ప్రజలకు ఎటువంటి మేసెజ్ ఇవ్వదలచుకున్నారని, ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు ప్రజలకు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి పూర్తి తెలుసుకోవాలని గీతా మూర్తి అన్నారు.ప్రజస్వామ్యాన్ని కాపాడేవారు ప్రజాప్రతినిధులు అని అనుకుంటామని, పార్టీలు స్వర్థం నేరా చరిత ఉన్న వ్యక్తిని పోటీచేయిస్తే ఓటర్లు వారిని తిరస్కరించాలని కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:28 - September 19, 2017

ముంబై : భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్‌ కాస్కర్‌ను సోమవారం రాత్రి థానె క్రైంబ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బిల్డర్లను బెదిరించడం, హఫ్తా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఇక్బాల్‌పై ఆరోపణలున్నాయి. ఓ బిల్డర్‌ ఫిర్యాదు మేరకు భేండి బజార్‌లోని ఆయన నివాసం నుంచి పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత కొంత కాలంగా డబ్బుల కోసం ఇక్బాల్‌ వేధిస్తున్నట్లు బిల్డర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి విచారణ జరిపిన తర్వాతే ఇక్బాల్‌ను అదుపులోకి తీసుకున్నామని, ఈ కేసులో మరికొంతమంది నిందితులను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు. భారత్‌లో ఉంటున్న దావూద్‌ తమ్ముడు ఇక్బాల్‌కు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు లేవు. దావూద్‌ గ్యాంగ్‌కు రాజీకీయ పార్టీల నేతలతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు.

15:26 - September 19, 2017

హర్యానా : డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ దత్త పుత్రిక హనీప్రీత్‌ ఇన్‌సా నేపాల్‌లో కనిపించింది. ఆమెతో పాటు మూడు ఎస్కార్ట్‌ వాహనాలున్నట్లు హర్యానా పోలీసులు గుర్తించారు. పోలీసుల టీమ్‌ను చూసి హనీప్రీత్‌ పోఖ్‌రా వైపు పారిపోయారు. హనీప్రీత్‌ కొండల్లో నివసించే కుటుంబాల సహాయంతో దాక్కునేందుకు యత్నిస్తున్నట్లు నేపాల్‌ పోలీసులు తెలిపారు. ఇందుకోసం ఆమె వారికి భారీగా డబ్బు ఆశ చూపుతున్నారు. తనని ఎవరు గుర్తు పట్టకుండా ఉండేందుకు నేపాలి అమ్మాయిలా వేషం మార్చినట్లు తెలుస్తోంది. హనీప్రీత్‌తో పాటు మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. నేపాల్‌లోని పోఖ్‌రాలో డేరా పేరిట ఓ ఆశ్రమం కూడా ఉంది. ఇద్దరు సాధ్విలపై అత్యాచారం జరిపిన కేసులో కోర్టు గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో బాబాను పోలీస్‌ కస్టడీ నుంచి తప్పించేందుకు పథకం పన్నినట్లు హనీప్రీత్‌పై ఆరోపణలున్నాయి. 

15:25 - September 19, 2017

చిత్తూరు : తిరుమలలో కోయల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 6గంటలకు ప్రారంభమైన ఆలయశుద్ధి 11 గంటలవరకు కొనసాగింది. దీంతో నేడు జరగాల్సిన అష్టదళ పాదప్మారాధన సేవను రద్దుచేశారు. ఉదయం 11 గంటల తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభమైంది. 

15:23 - September 19, 2017

నిమ్మ..ఆరోగ్యానికి..వంటలకే కాదు..ఇల్లు క్లీనింగ్ కు కూడా ఉపయోగపడుతుంది. ఎన్నో వంటకాల్లో నిమ్మను ఉపయోగిస్తుంటారు. ఆరోగ్యానికి కూడా నిమ్మరసం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇంటిని ఎలా క్లీన్ గా ఉంచుకోవచ్చు ?

కొన్ని ప్రాంతాల్లో మరకలు ఎంతగాను వదలవు. అలాంటి సమయంలో నిమ్మ చక్కగా ఉపయోగపడుతుంది. నివాసంలో తలుపులు..కిటీకిలు..సింక్ లలో దుమ్ము పేరుకపోతుంది. దీనిని తొలగించాలంటే ఓ మగ్గు నీళ్లలో నిమ్మరసం వేసి ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేయాలి. కాటన్ బట్టను నీళ్లలో ముంచి కిటీకి..తలుపులు..సింక్ లను తుడిచి చూడండి. నాన్ వెజ్ వంటకాలు వండిన తరువాత పాత్రలను కడుగలేక అవస్థలు పడుతుంటారు. పాత్రలకు ఉండే జిడ్డు..వాసన ఒక పట్టాన పోదు. అందుకు నిమ్మరసం..వెనిగర్ కలిపిన నీటితో పాత్రలను ముందుగా రుద్దాలి. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేయాలి. అంతే జిడ్డుతో పాటు వాసన మటుమాయం. వంటగదిలోని సింక్ అపరిశుభ్రంగా ఉంటే రెండు నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఈ రసాన్ని..దొడ్డుప్పును సింక్ లో మొత్తం చల్లి ఏదైనా బ్రష్ తో రుద్దాలి. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేయాలి. 

15:23 - September 19, 2017

వరంగల్ : వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో వరంగల్‌ రూరల్‌ జిల్లాలో చెరువులు, వాగులు జలకళతో కళకళలాడుతున్నాయి. వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతన్నలు ఆనందంలో మునిగితేలుతున్నారు. వాగులోని చెక్‌ డ్యాంలు నిండి ఉధృతంగా దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తున్నాయి. చెక్‌ డ్యాంల వద్ద వరదల్ని చూడటానికి గ్రామస్థులు తరలివస్తున్నారు. 

72 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం

హైదరాబాద్: పహాడి షరీఫ్ పీఎస్ పరిధిలో 72 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు చోరీకి గురైన యజమానులు మహాడీ షరీఫ్ పీఎస్ లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.

15:18 - September 19, 2017

జనగామ : జిల్లా కేంద్రంలోని ఓ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. అధ్యాపకులు కలగజేసుకుని ఇరు వర్గాలకు బయటకు వెళ్లవలసిందిగా సూచించారు. అయితే బయటకొచ్చిన తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న కర్ణాకర్‌పై పలువురు విద్యార్థులు దాడి చేశారు. ఎస్‌ఐ పరమేశ్వర్ అక్కడికి చేరుకుని దాడి చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

పోతిరెడ్డి పాడు గేట్లను ఏపీ ఏకపక్షంగా తెరిచింది:టీ.సర్కార్

హైదరాబాద్: తెలంగాణ కృష్ణా బోర్డుకు నీటిపారుదల శాఖ ఈఎస్ సీ లేఖ రాసింది. పోతిరెడ్డి పాడు గేట్లను ఏపీ ఏకపక్షంగా తెరిచిందని ఫిర్యాదు చేసింది. ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలు నీటి పంపిణీకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ పై చర్చించడానికి వెంటనే బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది.

15:16 - September 19, 2017
15:16 - September 19, 2017

హైదరాబాద్ : కనీస వేతనాల కోసం కార్మికులు కదం తొక్కారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. హైదరాబాద్‌లో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు నేతృత్వంలో లేబర్‌కమిషన్‌ కార్యాలయం ముట్టడించారు. 18వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని సీఐటీయూ నేతలు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో లేబర్‌ ఆఫీస్‌ దగ్గర ధర్నాకు దిగిన పలువురు సీఐటీయూ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా పలువురు మహిళా కార్మికులను పోలీసులు దురుసుగా నెట్టివేశారు. ప్రభుత్వ తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసవేతనం కోసం అడిగితే పోలీసులతో నిర్బంధిస్తారా అంటూ ప్రశ్నించారు. 

15:14 - September 19, 2017

కృష్ణా : విజయవాడలో ఇంటర్ విద్యార్థినిపై ఐదుగురు గుర్తుతెలియని దుండగులు దాడికి యత్నించారు. వారు రద్దీ ప్రాంతంలో విద్యార్థిని ఆపి బైక్ ఎక్కమని వేధింపులకు పాల్పపడ్డారు. విద్యార్థిని బైక్ ఎక్కకపోవడంతో బ్లేడ్ తో దాడికి యత్నించారు. ఓ మహిళ అడ్డుకుని దుండగులను కొడుతూ గట్టిగా అరవడంతో వారు అక్కడ నుంచి పారిపోయారు. విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కాలేజీ వెళ్లి ఫిర్యాదు చేయడంతోపాటు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:13 - September 19, 2017

హైదరాబాద్ : కృష్ణానది పై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నరట్టు వైసీపీ ఎమ్మెల్యేల ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ విచారించిన కోర్టు ఏపీ 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కృష్ణానది కరకట్టపై సీఎం నివాసంతో పాటు 57 నిర్మాణాలపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

నల్గొండ నుంచి పోటీకి సిద్ధం:కోమటిరెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్, టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధుల కుటుంబీకులు ఈ చీరలు కట్టుకుని బతుకమ్మ ఆడాలని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. నల్గొండ నుంచి పోటీకి సిద్ధం అని, టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ పోటీ చేసినా పని చేస్తానని కోమటి రెడ్డి అన్నారు.

పిల్లల సంరక్షణ కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలి: సీఎం చంద్రబాబు

కర్నూలు: ఒక సిద్ధాంతం కోసం 40 ఏళ్లుగా పోరాడుతున్న వ్యక్తి కైలాష్ సత్యార్థి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశంలో ఐదుగురికి నోబెల్ బహుమతి వచ్చిందని, అందులో కైలాష్ సత్యార్థి ఉండటం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో పిల్లలకు స్వేచ్ఛ వచ్చేంత వరకు పని చేస్తానని చంద్రబాబు అన్నారు. సమాజంలో పిల్లల సంరక్షణ కోసం స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీఎం సూచించారు.

14:29 - September 19, 2017

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరొందిన నటుడు 'అమీర్ ఖాన్' వైవిధ్య పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అంతేగాకుండా ఆయా పాత్రలకు జీవం పోసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆయన ఏ సినిమా చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇటీవలే వచ్చిన సినిమాలే అందుకు నిదర్శనం. తాజాగా 'సీక్రెట్‌ ఆఫ్‌ సక్సెస్‌', 'థగ్స్ ఆఫ్‌ హిందుస్థాన్‌' సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిల్లో 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రానికి సంబంధించిన ఓ లుక్ బయటకు వచ్చింది.

ఈ లుక్ చూసిన వారందరూ అసలు అమీర్ ఖాన్ యేనా అంటూ ఆశ్చర్యపోయారు. చింపిరి జుట్టు... చినిగిపోయిన బట్టలు... మాసిపోయిన శరీరంతో కనిపించాడు. ఈ సినిమా చిత్రీకరణ శనివారం ముంబయిలోని ఓ స్టూడియోలో ప్రారంభమైంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. యస్‌రాజ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ కూడా నటిస్తున్నట్లు టాక్. అమీర్ ఖాన్ గెటపే ఇలా ఉంటే బిగ్ బి గెటప్ ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. కత్రినా కైఫ్‌, 'దంగల్‌' ఫేమ్‌ ఫాతిమ సన్‌ షైక్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

బతుకమ్మ చీరల పంపిణీలో రూ. 150 కోట్ల స్కాం:డీకే

హైదరాబాద్: బతుకమ్మ చీరల పంపిణీలో రూ. 150 కోట్ల స్కాం జరిగిందని కాంగ్రెస్ నేత డీకే అరుణ ఆరోపించారు. చేనేత చీరలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేసిందని, కానీ చేనేత చీరలు కాకుండా సిల్క్ చీరలు పంపిణీ చేసిందని తెలిపారు. కాంగ్రెస్సే నిరసనలు చేయించదని మంత్రి కేటీఆర్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

పంచాయతీరాజ్ శాఖ పై మంత్రి లోకేష్ సమీక్ష

శ్రీకాకుళం : పంచాయతీరాజ్ శాఖ పై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. దేశంలో పంచాయతీరాజ్ శాఖల్లో నాదే చిన్న వయసు అని, ప్రతి అధికారి నాకు సహకరించాలని మంత్రి సూచించారు. వచ్చే మార్చి వరకు రెండో విడతగా గ్రామ పంచాయతీల్లో 100 శాతం ఎల్ ఈడీ వీధి దీపాలు అమరుస్తామన్నారు. ఉత్తరాంధ్రలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందించేందుకు రూ, 4,500 కోట్లతో ప్రణాళిక, ప్రతిపక్ష నేతల తప్పుడు ఫిర్యాదుతో ఉపాధి హామీ నిధులు రూ. 60ఏ కోట్లు పెండింగ్ లో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ సీఎం అక్రమ నివాసంతో పాటు 67 కట్టడాలకు నోటీసులు...

విజయవాడ: కృష్ణా నది కరకట్టపై సీఎం అక్రమ నివాసంతో పాటు 67 అక్రమ నిర్మాణాలపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఎస్ ఎఫ్ ఐ విద్యార్థిని చితకబాదిన ఏబీవీపీ

వరంగల్: జనగాంలో విద్యార్థి సంఘం నేతల మధ్య గొడవ జరిగింది. ఎస్ ఎఫ్ ఐ విద్యార్థిని ఏబీవీపీ విద్యార్థులు చితకబాదారు. ఓ ప్రైవేటు కాలేజీలో ఫ్లెక్సీ కడుతుండగా దాడి జరిగింది. దాడి చేసిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

నిర్వాసితులకు న్యాయం చేసి ప్రాజెక్టులు నిర్మించాలి: పి.మధు

విజయవాడ: ఎంబీ భవన్ లో నిర్వాసితుల రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం నేత మధు మాట్లాడుతూ.. నిర్వాసితులకు న్యాయం చేసి ప్రాజెక్టులు నిర్మించాలని డిమాండ్ చేశారు. వంశధార నిర్వాసితులు 19 మంది పీఎస్ లోనే ఉన్నారని, పునరావాసం ఇవ్వకుండా ప్రాజెక్టు నిర్మానం చేపట్టకూడదని, నిర్వాసితులు ఆందోలనకు దిగితే అరెస్టులు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు.

14:13 - September 19, 2017

పిల్లలు జుట్టు ఎలా సంరక్షించాలో తెలియక కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. పిల్లలు పెరిగే కొద్ది జుట్టు సంరక్షణ చాలా అవసరమనే సంగతి అందరికీ తెలిసిందే. చిన్న వయస్సులోనే సరిగ్గా చూడకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి పిల్లల జుట్టును ఎలా సంరక్షించాలి ?

పిల్లలు ఎక్కువ సమయంలో బయట ఆడడం వల్ల జుట్టు దుమ్ము..ధూళి చేరుతుంది. ఈ సమయంలో పిల్లలు ఎక్కువగా చిరాకు పడుతుంటారు. ముందుగానే తలస్నానం చేయించకుండా శుభ్రంగా దువ్వెనతో జుట్టును దువ్వాలి. దీనితో జుట్టులో ఉన్న దుమ్ము..ధూళి పోయే అవకాశం ఉంది. అనంతరం అంతగా గాఢత లేని షాంపూతో స్నానం చేయించండి. కళ్లకు ఎలాంటి హానీ తలపెట్టకుండా స్నానం చేయించాలి. షాంపు, కండిషనర్‌ వాడిన తర్వాత హెయిర్‌ను బాగా ఆరనివ్వాలి. జుట్టు బాగా ఆరిందని నిర్ధారించుకున్న తరువాతే దువ్వెన వాడాలి. జుట్టు కట్టడానికి క్లిప్‌ కానీ, టైకానీ ఉపయోగించొచ్చు.

కేటీఆర్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు: డీకే అరుణ

హైదరాబాద్:మంత్రి కేటీఆర్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ నేత డీకే అరుణ విమర్శించారు. ప్రజాధనం దుర్వినియోగమవుతుంటే మాట్లాడకుండదా అని ప్రశ్నించారు. చీరలకు బదులు మహిళల అకౌంట్ లో డబ్బులు వేయాలని, ఎంపి కవిత బతుకమ్మ చీ కట్టుకుందా అని డీకే సూటిగా ప్రశ్నించారు.

14:04 - September 19, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం నీచ రాజీయాలు చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్..మరమగ్గాలు అంటే తెలుసా..అని ప్రశ్నించారు. బతుకమ్మ చీరల పంపిణీపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆడబిడ్డలపై చిత్త ఉంటే సూరత్ నుంచి చీరలు ఇస్తారా అని ప్రశ్నించారు. ప్రతి పండగ రోజు ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చీరల పంపిణీపై రాష్ట్రంలో నిరసన తెలపని ప్రాంతం ఉందా అని ప్రశ్నించారు. నాసిరకం చీరలు ఇచ్చారని విమర్శించారు. 

 

14:00 - September 19, 2017

కర్నూలు : బాలకార్మిక వ్యవస్థ పూర్తిగా పోవాలని  సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలులో నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి భారత్ యాత్రలో ఆయన మాట్లాడారు. పిల్లలపై పెద్దలే అఘాయిత్యం చేసే పరిస్థితికి వచ్చారని అన్నారు. బాలల చేత పని చేయించేవారిపై పీడీ చట్టం కింద కేసు పెట్టి జైలులో పెడతామని హెచ్చరించారు. పిల్లల జీవితాలను నాశనం చేసే హక్కు ఎవరీకీ లేదన్నారు. తల్లిదండ్రులు బాధ్యతగా ముందుగా పోవాలని తెలిపారు. ప్రపంచంలోకెళ్ల చిన్నపిల్లలు అత్యధికంగా ఉన్న దేశం భారత్ అని అన్నారు. ప్రపంచాన్ని జయించే శక్తి పిల్లలకు ఉందన్నారు. పిల్లలే నిజమైన సంపద అన్నారు. కొంతమంది కైలాష్ పై హత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. 

 

13:55 - September 19, 2017

హైదరాబాద్ : కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్‌లో లేబర్‌ ఆఫీసు ముందు ధర్నా చేస్తున్న సీఐటీయూ నేతలు సాయిబాబాతోపాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి వ్యాన్ లో పడేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపరిపాలన, దుర్మార్గపాలన సాగుతుందని అన్నారు. కార్మికులు ప్రభుత్వానికి ఘోరి కడుతారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా నేడు కార్మికులు సమ్మె బాట పట్టారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రాష్ర్ట వ్యాప్తంగా సమ్మెకు దిగారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు విధులకు హాజరుకాలేదు. మరి కొన్ని చోట్ల కార్మికులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 
కార్మికులు...
జీతాలు ఇస్తలేరు.. మాకు అన్యాయం జరుగుతుంది. కడుపుమండి ఆందోళన చేస్తే మమ్మల్ని పోలీసులు కొడుతున్నారు. జీతాలు కరెక్టుగా లేవు. పెంచిన జీతాలు ఇవ్వడం లేదు. పోలీసులు...మమ్మల్ని లంజలు అంటున్నారు.

 

భూములను లాక్కొంటున్న సర్కార్ - కోదండరాం..

హైదరాబాద్ : చట్టాల మార్పు చేయకుండా భూ సర్వే చేయడం సరికాదని, ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం పేరిట భూ యాజమానులను భయపెట్టి భూములను లాక్కొంటోందని ప్రో.కోదండరాం పేర్కొన్నారు. ఆదివాసీలకు అటవీ భూములు సాగు చేసుకొనే ప్రభుత్వమే కల్పించిందన్నారు. భూమి సాగుచేసే వారికి పట్టా ఇచ్చారన్నారు. 

13:48 - September 19, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి లైసెన్స్‌ వచ్చింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈ లైసెన్స్‌ను అందించింది. అయితే గతంలో లడ్డూ ప్రసాదాల నాణ్యతను ప్రశ్నిస్తూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి ఓ భక్తుడు ఫిర్యాదు చేశారు. దీంతో లడ్డూ తయారీ ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన అధికారులనను టీటీడీ అనుమతించలేదు. అయితే ప్రస్తుతం తాజాగా ఫుడ్‌సేఫ్టీ నుంచి టీటీడీ లైసెన్స్‌ పొందింది. 

 

13:46 - September 19, 2017

హైదరాబాద్ : అధికార మదంతో, అరకొర జ్ఞానంతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె.అరుణ మండిపడ్డారు. సంస్కారం ఉన్న వ్యక్తిగా మాట్లాడడం లేదన్నారు. కేటీఆర్ భాష అభ్యంతకరంగా ఉందన్నారు. చేనేత చీరలు ఎలా ఉంటాయో తమకు తెలుసునని..నీకు తెలుసా అని కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు. సూరత్ లో చేనేత చీరలు ఉన్నాయా.. అని ప్రశ్నించారు. రూ.50..60 చీరలు ఇచ్చి పట్టుచీర అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిరాశకు గురై నిరసనలు వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ చేస్తోందనడం సరికాదన్నారు. టీఆర్ ఎస్ ఆఫీస్ నుంచి చీరలు పంచడం లేదని...ప్రభుత్వం నుంచి పంపిణీ చేస్తున్న చీరలని... అందుకే ప్రశ్నిస్తున్నామని చెప్పారు. నాణ్యత లేని చీరలపై మాట్లాడుతున్నామని చెప్పారు. చేనేత చీరలు, పవల్ లూమ్ చీరలు అంటే ఎంటో తమకు తెలుసునని చెప్పారు. చీరల గురించి మాట్లాడే హక్కు తమకు కూడా ఉందన్నారు.

 

వల్లభనేని మనస్థాపం...

విజయవాడ : టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మనస్థాపానికి గురయ్యారు. వ్యక్తిగత రివాల్వర్ లైసెన్స్ రెన్యువల్ చేయకపోవడం ఉన్న ఒక్క గన్ మెన్ కు పిస్టల్ ఇచ్చిన పోలీసులు కార్బన్ ఇవ్వలేదు. మనస్థాపంతో వల్లభనేని తన గన్ మెన్ ను సరెండర్ చేశారు. 

13:33 - September 19, 2017

అమెరికా : ఇర్మా హరికేన్‌ నుంచి ఇంకా కోలుకోని కరీబియన్‌ దీవులకు మరో ప్రమాదం ముంచుకొస్తోంది. సాధారణ తుపానుగా ప్రారంభమైన మారియా హరికేన్‌-గ్రేడ్‌ ఫైవ్‌ స్థాయికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో కరీబియన్‌ దీవులపై హరికేన్‌ విరుచుకుపడే అవకాశం ఉంది.  డొమినికా వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. మారియా హరికేన్‌ తీరం దాటే సమయంలో గంటకు 209 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతోపాటు భారీ వర్షాలు, వరద ముప్పుకూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా లీవార్డ్‌, మార్టినిక్‌, పోర్టారికో, యూఎస్‌, బ్రిటిష్‌వర్జిన్‌ ఐల్యాండ్స్‌పై మారియా హరికేన్‌ ప్రభావం చూపనుంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

 

13:23 - September 19, 2017

కాకినాడ : 10టీవీ కథనానికి ప్రభుత్వం కదిలింది. తూర్పుగోదావరి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థులు.. గత కొంత కాలంగా కాళ్ల వాపు వ్యాధితో బాధ పడుతున్నారు. ఏజెన్సీ ఆసుపత్రిలో చికిత్స పొందినా.. తగ్గకపోవటంతో వారిని కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు. ఈ వార్తను 10 టీవీ ప్రసారం చేసింది. దీంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను.. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 

 

పంచాయతీ రాజ్ శాఖపై నారా లోకేష్ సమీక్ష..

శ్రీకాకుళం : పంచాయతీ రాజ్ శాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. దేశంలో పంచాయతీ రాజ్ శాఖల్లో తనదే చిన్నవయస్సు గల వాడినని, ప్రతి అధికారి తనకు సహకరించాలని కోరారు. వచ్చే వారం వరకు రెండో విడతగా గ్రామ పంచాయతీల్లో 100 శాతం ఎల్ ఈడీ వీధి దీపాలు అమరుస్తామన్నారు. ఉత్తరాంధ్రలో ప్రతి ఇంటికి కొలాయి ద్వారా తాగునీరందించేందుకు రూ. 4500 కోట్లతో ప్రణాళిక రచించినట్లు పేర్కొన్నారు. 

మాలేగావ్ పేలుళ్ల నిందితులకు బెయిల్..

ముంబై : మాలేగావ్ 2008 పేలుళ్ల కేసుల్లో నిందితులు సుధాకర్ చతుర్వేది, సుధాకర్ ద్వివేదీలకు ముంబై ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

లేబర్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : లేబర్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. కనీస వేతనాలు అమలు చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. సిఐటియూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సమ్మె తలపెట్టారు. లేబర్ ఆఫీసు వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. 

దావూద్ సోదరుడు అరెస్టు...

ముంబై : దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతనితో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్టు చేశారు. దోపిడి కేసులో కస్కర్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇతడిని థానేలోని తన సోదరి నివాసంలో అరెస్టు చేశారు. 

మంత్రి కామినేని సమీక్ష..

విజయవాడ : వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కామినేని శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నమోదవుతున్న జ్వరాల తీవ్రత..గిరిజన ప్రాంతాల్లో అందుతున్న వైద్య సేవలు..108 సేవలు..చంద్రన్న సంచార వైద్య సేవలు..సురక్షిత మాతృత్వం..నవజాత శిశు సంరక్షణ..మదర్ కిట్స్..స్వాస్త్య విద్యా వాహిని..బ్లడ్ కలెక్షన్ వాహనాలు..ఆసుపత్రుల్లో బెడ్ షీట్స్ మార్పు..సీఎం ఆరోగ్య కేంద్రాల పనితీరుపై చర్చ జరిగింది.

13:12 - September 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా నేడు కార్మికులు సమ్మె బాట పట్టారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రాష్ర్ట వ్యాప్తంగా సమ్మెకు దిగారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు విధులకు హాజరుకాలేదు. మరి కొన్ని చోట్ల కార్మికులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో లేబర్‌ ఆఫీసు ముందు కార్మికులు ధర్నాకు దిగారు. వివిధ రంగాల కార్మికులు పెద్ద ఎత్తున కదలివచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 18 వేల రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని కోరారు. పెట్టుబడిదారులకు ఊడిగం చేసే పద్ధతి సీఎం కేసీఆర్ మానుకోవాలని హితవుపలికారు. జీతం సరిపోవడం లేదని లేఖ రాసి కామారెడ్డిలో ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారని.. ఇది ప్రభుత్వ హత్యేనని అన్నారు. టీసర్కార్ గుడ్డి పరిపాలన చేయదల్చిందా...గుడ్డిగుర్రం పళ్లు తోముతుందా అని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులు సీఎంను పాతిపెడతారని హెచ్చరించారు. సీఎంకు గులాం గురి చేస్తున్నావా అని నాయిని నర్సింహ్మారెడ్డిని ప్రశ్నించారు. కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోలన, పోరాటాలు నిర్వహిస్తామన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సీఎంను గద్దె దించుతామని హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

అంబేద్కర్ స్మృతి వనం డిజైన్..

గుంటూరు : రాజధానిలో అంబేద్కర్ స్మృతి వనం డిజైన్ ను సిద్ధం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకై మంత్రి ఆనందబాబు ఆధ్వర్యంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో దళిత సంఘాలు, మేధావుల అభిప్రాయాలను సేకరించారు. 20 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు కానుంది. 125 అడుగుల్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కానుంది. 

శ్రీవారి లడ్డూ ప్రసాదానికి లైసెన్స్...

చిత్తూరు : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథార్టీ ఆఫ్ ఇండియా లైసెన్స్ అందించింది. గతంలో లడ్డూ ప్రసాదాల నాణ్యతను ప్రశ్నిస్తూ ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఓ భక్తుడు ఫిర్యాదు చేశారు. లడ్డూ తయారీ ప్రక్రియను పరిశీలించేందుకు టిటిడి అధికారులు అనుమతించలేదు. తాజాగా ఫుడ్ సేఫ్టీ నుండి టిటిడి లైసెన్స్ పొందింది. 

కైలాష్ సత్యార్థి భారత్ యాత్ర లో సీఎం చంద్రబాబు

కర్నూలు: నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి భారత్ యాత్ర లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాజ్ విహార్ కూడలి నుంచి ఏపీ ఎస్ పీ బెటాలియన్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. సురక్షిత బాల్యం, సురక్షిత భారత్ పేరుతో కైలాష్ సత్యార్థి యాత్ర నిర్వహిస్తున్నారు.

ఇక్బాల్ కస్కర్ ను కోర్టులో ప్రవేశ పెట్టనున్న పోలీసులు...

ముంబై: దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కస్కర్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. థానేలోని తన సోదరి నివాసంలో కస్కర్ ను అరెస్టు చేశారు. దోపిడీ కేసులో కస్కర్ ను అరెస్టు చేసిన పోలీసులు నేడు కోర్టులో హాజరు పర్చనున్నారు.

12:38 - September 19, 2017

ఢిల్లీ : కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు భేటీ అయ్యారు. తమిళనాడు తాజా రాజకీయాలపై చర్చిస్తున్నారు. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

12:32 - September 19, 2017

నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడ కోర్టు దగ్గర ఓ పోలీస్ అధికారి లంచం డిమాండ్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్ కట్టడానికి వచ్చిన వారి నుంచి డబ్బు డిమాండ్ చేశారు. రూ.300 ఇస్తేనే ఫైల్ జడ్జి ముందుకు పంపస్తామన్నారు. అయితే కోర్టు డ్యూటీ చేసే ప్రతీ పోలీస్ ఇలా లంచం తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

బెంగళూరు కు ఉగ్ర ముప్పు: ఐబీ హెచ్చరిక

కర్నాటక: బెంగళూరు ఉగ్ర ముప్పు ఉందని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. బంగ్లాదేశ్ ఉగ్రవాదులు బెంగళూరులో దాడులకు వ్యూహం పన్నుతున్నట్లు ఐబీ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన కర్ణాటక ప్రభుత్వం భద్రత కట్టుదిట్టం చేసింది.

వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతోమంత్రి కామినేని సమీక్ష

అమరావతి: వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతోమంత్రి కామినేని సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నమోదవుతున్న జ్వరాల తీవ్రత, గిరిజన ప్రాంతాల్లో అందుతున్న వైద్యసేవలు, 108 సేవలు, చంద్రన్న సంచార వైద్య సేవలు, సురక్షిత మాతృత్వం, నవజాత శిశు సంరక్షణ, మదర్ కిట్స్, స్వాస్ద్య విద్యావాహిని, బ్లడ్ కలెక్షన్ వాహనాలు, ఆస్పత్రుల్లో బెడ్ షీట్స్ మార్పు, సీఎం ఆరోగ్య కేంద్రాల పనితీరుపై చర్చించనున్నట్లు సమాచారం.

12:12 - September 19, 2017

కడప : జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి దారుణ హత్య గావించబడ్డారు. కొండాపూర్‌ మండలంలోని టి.కోడూరు గ్రామంలో ఆది నారాయణ నాయుడు(55) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పొలం తగాదా విషయంలో వేట కొడవళ్లతో ప్రత్యర్థులు హత్య చేశారు.  ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు

అమరావతి: రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ లో రెండు రోజుల పాటు సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు కలెక్టర్లు, హెచ్ వోడీలు, ప్రధాన కార్యదర్శులు, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్ఆరట్, అర్బన్ డెవలప్ మెంట్ పై తొలి రోజు, ఎంపౌర్ మెంట్, ఇంఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జి అండ్ స్కిల్ డెవలప్ మెంట్ మిషన్ పై రెండో రోజు చర్చ జరగనున్నట్లు సమాచారం. ఆదాయ ఆర్జిత శాఖపైనా సదస్సులో చర్చిస్తారని తెలుస్తోంది.

11:58 - September 19, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో బ్రిడ్జి కూలింది. బన్సీలాల్‌పేట, సిటీలైట్‌ హోటల్‌ సమీపంలో ఆర్మీ వాహనం దూసుకెళ్లడంతో.. ప్రొటెక్షన్ గ్రిల్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ఇద్దరికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

క్రికెటర్ శ్రీశాంత్ పై నిషేధం కొనసాగించాల్సిందే: బీసీసీఐ!

ఢిల్లీ: కేరళ హైకోర్టు తీర్పుతో క్రికెటర్ శ్రీశాంత్‌పై నిషేధం తొలగిపోయినట్టేనని భావిస్తున్న తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలన్న తీర్పును వ్యతిరేకిస్తూ కేరళ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలకు విరుద్దంగా హైకోర్టు నిర్ణయం ఉందంటూ బీసీసీఐ పేర్కొంది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అన్ని ఆధారాలు ఉన్నందునే శ్రీశాంత్‌పై నిషేధం విధించామని... దాన్ని కొనసాగించాలని కోర్టుకు నివేదించింది.

11:56 - September 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా నేడు కార్మికులు సమ్మె బాట పట్టారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రాష్ర్ట వ్యాప్తంగా సమ్మెకు దిగారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు విధులకు హాజరుకాలేదు. మరి కొన్ని చోట్ల కార్మికులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో లేబర్‌ ఆఫీసు ముందు కార్మికులు ధర్నాకు దిగారు.

 

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ తో గవర్నర్ విద్యాసాగర్ రావు భేటీ

ఢిల్లీ: హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో గవర్నర్ విద్యాసాగర్ రావు భేటీ అయ్యారు. ఈ భేటీ తమిళనాడులోని రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

11:53 - September 19, 2017

నల్లగొండ : జిల్లాలోని చింతపల్లి మండలం టీదేడులో దారుణం జరిగింది. పలువురు యువకులతో సన్నిహితంగా ఉంటుందని కూతురు రాధికను తల్లిదండ్రులు హత్య చేశారు. నర్సింహ, లింగమ్మ అనే దంపుతులు టీదేడులో నివాసముంటున్నారు. వీరి కూతురు రాధిక (13) ఏడో తరగతి చదువుతోంది. రాధిక పలువురు యువకులతో సన్నిహితంగా ఉంటోందని ఆరోపణ ఉంది. పరువు పోతోందని కుమార్తెపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా అమె అలాగే యువకులతో సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. కుమార్తె రాధికను తండ్రి నర్సింహ మందలించారు. రాధిక తంద్రికి ఎదురుదిరిగింది. దీంతో ఎదురు తిరిగిన కుమార్తెను తండ్రి గొంతు నులిమి చంపాడు. అయితే విషయం బయటకు పొక్కకుండా ఇంట్లోనే శవాన్ని తగులబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ నెల 15న పోలీసుల విచారణలో ఈఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులు నర్సింహ, లింగమ్మలను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:53 - September 19, 2017

టాలీవుడ్ పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పక్కన పెట్టేసినట్లేనా ? మోడీ వద్ద పవన్ ఇమేజ్ ఏంటీ ? అనే చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. ఎందుకంటే ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్ ప్రమోషన్ నేపథ్యంలో టాలీవుడ్ లోని కొంతమంది నటులకు లేఖలు రాశారంట. కానీ పవన్ కు మాత్రం లేఖ రాయకపోవడంతో దీనిపై తెగ వార్తలు వెలువడుతున్నాయి.

టాలీవుడ్ లో పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కు ఉన్న మేనియా అందరికీ తెలిసిందే. ఆయన మద్దతు తీసుకోవడం ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమిలు ప్రయత్నించాయి. అందులో భాగంగా 2014 ఎన్నికల్లో 'పవన్ కళ్యాణ్' టిడిపి - బిజెపి కూటమికి మద్దతినిచ్చారు. అంతేగాకుండా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ప్రతిపక్షాలపై పవన్ ఘాటు విమర్శలు చేశారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఎక్కడ పాల్గొన్నా భారీ స్పందన వచ్చేది. ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమి ఘన విజయం సాధించింది.

అనంతరం కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మోడీ..చంద్రబాబు ప్రభుత్వంపై 'పవన్' పలు విమర్శలు గుప్పించడం అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేగాకుండా 'జనసేన' పేరిట పార్టీ స్థాపించి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతామని కూడా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం..కార్యకర్తల నియామకం విస్తృతంగా జరుగుతోంది.

పలు సందర్భాల్లో ఆయన పాలకులపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మోడీ ఆయన్ను పట్టించుకోవడం మానేసినట్లు తెలుస్తోంది. తాజాగా మోడీ తెలుగు సినీ ప్రముఖులైన రాజమౌళి, ప్రభాస్, మోహన్ బాబు, మహేష్ బాబులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లేఖలు రాశారు. స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని లేఖలు రాశారు. కానీ తనకు గతంలో మద్దతు తెలిపిన పవన్ కు మాత్రం లేఖ రాయకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరి లేఖపై పవన్ స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

మిర్యాలగూడ కోర్టులో కానిస్టేబుల్ లంచావతారం

నల్గొండ: మిర్యాలగూడ కోర్టులో కానిస్టేబుల్ లంచావతారం బయటపడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన టౌన్ పీఎస్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్ రూ. 300 ఇస్తేనే ఫైల్ జడ్జి ముందుకు పంపిస్తానని కానిస్టేబుల్ బెదిరిస్తున్నాడు. ఈ వ్యవహారం అంతా '10టివి' కెమెరాకు చిక్కింది.

11:29 - September 19, 2017

తూర్పుగోదావరి : కాళ్లవాపు వ్యాధి మరోసారి కలకలం రేపింది. తూర్పు ఏజెన్సీ, పోలవరం ముంపు మండలాల్లో.. ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంది. గతేడాది కూడా విజృంభించిన ఆ అంతు చిక్కని వ్యాధి మూలాలేంటో.. అధికారులు ఇప్పటికీ కనిపెట్టలేదు. చింతూరు ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో 11 మంది విద్యార్థులకు అస్వస్థత కలగింది. కాళ్లవాపు వ్యాధితో విద్యార్థులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికీ కాళ్లవాపు వ్యాధికి మూలాలేంటో అధికారులు కనిపెట్టలేదు. పోలవరం ముంపు మండలాల్లో వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంది. గతేడాది కాళ్లవాపు వ్యాధితో 11 మంది మృతి చెందారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన ఆ18మంది ఎమ్మెల్యేలు

తమిళనాడు: అనర్హత వేటు పడిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పార్టీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ధన్ పాల్ నిన్న అనర్హత వేటు వేశారు.

కర్నూలుకు చేరుకున్న సీఎం చంద్రబాబు

కర్నూలు: సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలుకు చేరుకున్నారు. కాసేపట్లో సీఎం పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొననున్నారు.

11:14 - September 19, 2017
11:08 - September 19, 2017

టాలీవుడ్ లో పండుగలకు విశేష స్థానం ఉంటుంది. తమ తమ చిత్రాలను ఆయా పండుగల్లో రిలీజ్ చేయాలని హీరోలు అనుకుంటుంటారు. దసరా..సంక్రాంతి పండుగల సందర్భంగా ప్రముఖ హీరోల సినిమాలు విడుదలవుతుంటాయి. దీనితో ఆ సినిమాలపై తెగ చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక 2017 దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరోస్ 'మహేష్ బాబు', 'ఎన్టీఆర్' చిత్రాలు కొద్ది రోజుల తేడాతో రిలీజ్ అవుతున్నాయి. సెప్టెంబర్ 21న 'ఎన్టీఆర్' నటించిన 'జై లవ కుశ' వస్తుంటే 'మహేష్ బాబు' నటించిన 'స్పైడర్' సెప్టెంబర్ 27న విడుదలవుతోంది. దీనితో వీరి సినిమాల్లో ఎవరిది పై చేయి అవుతుందనే చర్చ జరుగుతోంది.

వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్న యంగ్ టైగర్ బాబీ దర్శకత్వంలో 'జై లవ కుశ' లో నటించాడు. సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో 'ఎన్టీఆర్' ఏకంగా మూడు పాత్రలను పోషించడంతో చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. టీజర్స్..ట్రైలర్స్..పోస్టర్ చూస్తుంటే పక్కా మాస్ మసాలా చిత్రమని అర్థమౌతోంది. 'జై లవ కుశ' రొటీన్‌ ఎలిమెంట్స్ తో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంతో మాస్‌ని నమ్ముకున్నారని తెలుస్తోంది.

ఇక 'స్పైడర్' విషయానికి వస్తే ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. సామాజిక అంశాన్ని ఆయన చిత్రాల్లో సృషిస్తుంటారనే సంగతి తెలిసిందే. స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. రెగ్యులర్ అంశాలకు భిన్నంగా పూర్తిగా భిన్నమైన సెటప్ తో చిత్రం ఉందని టాక్ వినిపిస్తోంది. జేమ్స్ బాండ్ తరహాలో మహేష్ నటించాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా అభిమానులను ఆకట్టుకొంటోంది.

ఈ చిత్రాలపై విపరీతమైన నమ్మకంతో బయ్యర్లు కోట్లు ధారపోసేశారంట. రెండింటి మధ్య క్లాష్ ఉన్నా ఆరు రోజుల వ్యవధి అంటే చాలా వరకు ఎఫెక్ట్ తగిస్తుందని తెలుస్తోంది. తొలి వారం కలెక్షన్లు చాలా కీలకమని..ముందుగా వస్తున్న జై లవ కుశపై కానీ..తరువాత వచ్చే 'స్పైడర్' పై కానీ మొదటి వారం వసూళ్ల పరంగా ప్రభావం ఉండకపోవచ్చని టాక్. మరి ఈ బరిలో విజేతగా నిలిచేదెవరు? దసరా బాక్సాఫీస్‌ని గెలిచేదెవరు ? 

11:07 - September 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు కార్మికులు సమ్మె చేపట్టారు. కనీస వేతనాలు అమలు చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. సిఐటియూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సమ్మె తలపెట్టారు. కార్మికులు విధులకు హాజరుకాలేదు. పలు చోట్ల కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

శ్రీవారి లడ్డూ ప్రసాదానికి లైసెన్స్

తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదానికి లైసెన్స్ లభించింది. ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదానికి లైసెన్స్ లభించింది. గతంలో లడ్డూ ప్రసాదాల నాణ్యతను ప్రశ్నిస్తూ ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐకి ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. లడ్డూ తయారీ ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన అధికారులను టిటిడి అనుమతించలేదు. తాజాగా ఫుడ్ సేప్టీ నుంచి టిటిడి లైసెన్స్ పొందింది.

10:56 - September 19, 2017

నెల్లూరు : ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కాడు. నాయుడుపేట నగరపాలక పంచాయతీ కమిషనర్ అవినేని ప్రసాద్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని అవినేని ప్రసాద్ పై ఆరోపణలున్నాయి. చిత్తూరు, నెల్లూరు, రాజంపేటలతోపాటు 6 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:51 - September 19, 2017

హైదరాబాద్ : సామాజికవేత్త కంచె ఐలయ్యపై కేసు నమోదుకు ఏపీ డీజీపీ ఆదేశించారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకం రాశారంటూ ఆర్యవైశ్యు సంఘాలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఐలయ్యపై కేసు నమోదు చేయాలని సీఐడీ అధికారులను డీజీపీ ఆదేశించారు. సీఎం చంద్రబాబుతో చర్చించిన తరువాత డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

10:50 - September 19, 2017

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా నర్సింహరెడ్డి' లో టాలీవుడ్ కమెడియన్ 'సునీల్' నటించనున్నారని సోషల్ మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే కొన్ని సంవత్సరాల తరువాత చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఆయన సినిమాల్లో నటించాలని పలువురు నటులు, నటీమణులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

చిరు 151వ సినిమా స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను రాంచరణ్ తేజ్ స్వయంగా నిర్మస్తుండడం విశేషం. ఇటీవలే సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసి అభిమానులను సంతృప్తిపరిచారు. సినిమాలో నటించే వారి విషయాలను తెలియచేశారు.

కానీ విలన్, కామెడీ పాత్రలు ఎవరు పోషిస్తారనే దానిపై క్లారిటీ రాలేదు. తాజాగా చిత్రంలో కామెడీ నటుడు 'సునీల్' నటించనున్నారనే వార్తలు సోషల్ మాధధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. హీరోగానే కాకుండా ఇతర పాత్రలు చేస్తానని 'సునీల్ ఇటీవలే 'ప్రకటించేసినట్లు తెలుస్తోంది. 'సైరా నరసింహా రెడ్డి'లో తనకి చోటు దొరకడం అదృష్టమని చెప్పాడు. ఈ సినిమాలో తాను ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నానని వెల్లడించాడు.

తెలంగాణ లో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల సమ్మె

హైదరాబాద్: తెలంగాణ లో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె బాట పట్టారు. హైదరాబాద్: లేబర్ ఆఫీస్ వద్దకు కార్మికులు భారీగా చేరుకున్నారు. దీంతో లేబర్ ఆఫీసు గేటుకు అధికారులు తాళాలు వేశారు. లేబర్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కనీస వేతనం రూ. 18 వేలుగా నిర్ణయించాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సుప్రీం తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఈ ఎస్ ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాల అమలుకు వారు డిమాండ్ చేస్తున్నారు.

10:41 - September 19, 2017

టాలీవుడ్ పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' సినిమా మొదలైదంటే చాలు సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు ఆయన అభిమానులు చిత్ర విశేషాల కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. కానీ తన సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని లీక్ కాకుండా జాగ్రత్త పడుతారని టాక్. టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కొనసాగుతున్న ఈ సినిమాలో 'పవన్' సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కానీ షూటింగ్ ప్రారంభమైనా ఇంతవరకు టైటిల్ నిర్ణయించకపోవడం గమనార్హం.

పవన్ కిది 25వ చిత్రం కావడంతో చిత్ర టైటిల్ వైవిధ్యంగా ఉండాలని 'త్రివిక్రమ్' భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు పలు సినిమా టైటిల్స్ పరిశీలించినట్లు తెలుస్తోంది. 'ఇంజనీర్‌ బాబు', గోపాల, గోపాలుడు వంటి టైటిల్స్ వినిపించినా తాజాగా 'గోపాలుడు' టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలిసింది. ఇక ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ 'ఖుష్బూ' ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.

కాళ్ల వాపు వ్యాధి బాధితులను పరామర్శించిన యనమల

తూ.గో: కాకినాడ జీజీహెచ్ లో కాళ్ల వాపు వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి యనమల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. కాల్ల వాపు సమస్యకు మూలాలు కనుగొని నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

10:35 - September 19, 2017

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం 'స్పైడర్' కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేసుకుంది. ఆడియో ఫంక్షన్ కూడా జరిపేశారు. ఈనెల 27న చిత్రం విడుదలవుతోందని చిత్ర బృందం ప్రకటించేసింది. ఆడియో వేడుకలో 'స్పైడర్' ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది. రన్ టైమ్ రెండు గంటల 25 నిముషాలుగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందించారు. స్వయంగా మహేష్ తమిళ డైలాగ్స్ చెప్పినట్లు తెలుస్తోంది. 'మహేష్ బాబు' సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు 'ఎస్.జె.సూర్య', 'భరత్' లు ప్రతి నాయకులుగా నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉండనుందో తెలుసుకోవాలంటే 27వరకు వెయిట్ చేయాల్సిందే. 

కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రులు

నల్గొండ : జిల్లాలో ఘోరం జరిగింది. కూతురిని తల్లిదండ్రులు హత్య చేశారు. 13 ఏళ్ల కూతురు పలువురు యువకులతో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతో తండ్రి నరసింహ కూతురి గొంతు నులిమి చంపేశాడు. అంతరం ఇంట్లోనే తగలబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పోలీసు విచారణ లో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు నర్శింహ, లింగమ్మను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన చింతపల్లి మండలం టేదెడు లో చోటు చేసుకుంది.

10:27 - September 19, 2017

ప్రముఖ రాజకీయ, సినీ, ఇతర ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానులను అలరిస్తుంటారు. పోస్టుల ద్వారా వారి వారి అనుభవాలను..విషయాలను..విశేషాలను పంచుకుంటుంటారు. సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్ కూడా ప్రముఖ స్థానం సంపాదించిందనే సంగతి తెలిసిందే. ఒక నటుడు..నటి ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేయగానే లక్షలాది మంది అభిమానులు వారిని ఫాలో అవుతుంటారు. సినీ ప్రముఖులు తమ తమ చిత్రాలకు సంబంధించిన విశేషాలను..ఇతరత్రా వాటిని పోస్టు చేస్తుంటారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా ట్విట్టర్ లో అకౌంట్ ఉంది. ఇందులో అత్యధికంగా ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా అతడి ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 4మిలియన్లకు చేరుకోవడం విశేషం. ఇక్కడ మహేష్ బాబు అందరిలా కాకుండా అరుదుగా ట్వీట్లు చేస్తుంటాడు. ఇటీవ‌ల 'స్పైడర్ మూవీలోని ర‌య్ ర‌య్ ర‌య్ అనే పాట‌కు త‌న కూతురు సితార పెద‌వులు క‌దిలించిన వీడియోను షేర్ చేశాడు. దానికి అత్యధిక ట్విట్స్ అభిమానుల నుంచి వచ్చాయి. ప్రస్తుతం ఆయన మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కొద్ది రోజుల్లో విడుదల కానుంది. 

10:26 - September 19, 2017

నాగర్ కర్నూలు : మద్యం మత్తులో కన్న తల్లిపైనే దాడి చేశాడు ఓ కసాయి కొడుకు. నాగర్‌కర్నూలు జిల్లా మద్దిమడుగు గ్రామ పరిధిలోని చెంచుగూడెంలో తల్లి పోతమ్మపై కన్న కొడుకు బాణాలతో దాడి చేశాడు. పోతమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో భార్యపై సైతం దాడికి యత్నించాడు. తల్లి, భార్య పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని మందలించి వదిలేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ తల్లిపై దాడికి దిగాడు. 

 

ప్రభుత్వాసుపత్రిలో హెచ్ ఐవీ బాధిత మహిళకు అవమానం

విజయవాడ: పాత ప్రభుత్వ ఆస్పత్రిలో హెచ్ ఐవీ బాధిత మహిళకు అవమానం జరిగింది. చికిత్సకు సిబ్బంది రోజూ లంచం డిమాండ్ చేస్తున్నారు. బాలింతను వైద్య సిబ్బంది మానసికంగా వేధిస్తున్నారు. ఈ అంశం కలెక్టర్ దృష్టికి రావడంతో కలెక్టర్ లక్ష్మీ కాంతం విచారణకు ఆదేశించారు.

10:21 - September 19, 2017

టాలీవుడ్ మన్మథుడు 'అక్కినేని నాగార్జున' ప్రధాన పాత్రలో నటిస్తున్న 'రాజు గారి గది 2' సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. సినిమా సినిమాకు వైవిధ్యంగా కనిపించే 'నాగార్జున' ఈ సినిమాలో ఎలా కనిపిస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్‌, ఓక్‌ ఎంటర్‌టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రెండేళ్ల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన 'రాజు గారి గది' చిత్రానికి కొనసాగింపనే విషయం తెలిసిందే.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పలు పోస్టర్స్..వీడియోలు విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా రాజు గారి గది ఎలా ఉండనుంది ? దీనికి సంబంధించిన ట్రైలర్ ను ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. ఇదే రోజున అక్కినేని నాగేశ్వరరావు జయంతి అనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో నాగ్ మైండ్ రీడింగ్ చేసే వ్యక్తిగా కనిపిస్తారని తెలుస్తోంది. తనకు ఎదురుగా ఉన్నవాళ్లు మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేగలిగే వ్యక్తిగా కనిపించనున్నట్లు టాక్. ఈ సినిమాలో సమంత, కాజల్‌ అగర్వాల్‌, సీరత్‌ కపూర్‌, అశ్విన్‌ బాబు, వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌ తదితరులు నటిస్తున్నారు.

కూలిన రైల్వే బ్రిడ్జి సేప్టీ రాడ్డు...

సికింద్రాబాద్: బన్సీలాల్ పేట సిటీలైట్ హోటల్ సమీపంలో రైల్వే బ్రిడ్జి సేప్టీ రాడ్డు కూలింది. ఆర్మీ వాహనం ఢీకొనడంతో సేప్టీ రాడ్డు కూలింది. ఈ ఘటనలో ఇద్దరికి గాలయ్యాయి.

కేబీఆర్ పార్క్ లో చైన్ స్నాచర్ నర్శింహ అరెస్ట్

హైదరాబాద్: కేబీఆర్ పార్క్ లో చైన్ స్నాచర్ నర్శింహ ను పోలీసులు అరెస్టు చేశారు. 9 ఏళ్లుగా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న నర్శంహ పై ఏడు చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయి. 250 గ్రాముల బంగారం, కారు ను పోలీసులు సీజ్ చేశారు.

రుయా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మె

తిరుపతి : రుయా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్, కార్యాలయ ఉద్యోగిని మధ్య వివాదం రేగింది. తమను దూషించిన మహిళా ఉద్యోగినిపై చర్యలు తీసుకోవాలని వైద్యుడు వెంకట రమణ ఫిర్యాదు చేశారు. నిరసనగా వైద్యులు ఈ రోజు విధులు బహిష్కరించారు. రేపు కూడా విధులు బహిష్కరిస్తామని వైద్యులు ప్రకటించారు. ఉద్యోగి పై చర్యలు తీసుకోకుంటే ఎల్లుడి అత్యవసర సేవలకూ దూరంగా ఉంటామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు.

ఏసీబీ వలలో పంచాయితీ కమిషనర్ అవినేని ప్రసాద్

నెల్లూరు: నాయుడు పేట నగరపాలక పంచాయితీ కమిషనర్ అవినేని ప్రసాద్ ఇళ్ల పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మంచిన ఆస్తులున్నాయని ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.చిత్తూరు, నెల్లూరు, రాజంపేటతో పాటు 6 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

09:43 - September 19, 2017

తూర్పుగోదావరి : చింతూరు ట్రైబల్ వెల్ఫేర్ జూ.కాలేజీలో 11 మంది విద్యార్థులకు అస్వస్థత కలగింది. కాళ్లవాపు వ్యాధితో విద్యార్థులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికీ కాళ్లవాపు వ్యాధికి వైద్యుతు కారణాలు కనిపెట్టలేదు. గతేడాది కాళ్లవాపు వ్యాధితో 11 మంది మృతి చెందారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

చిత్తూరు : తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరుగుతోంది. ఆలయాన్ని సుగంధ పరిమళ ద్రవ్యాలతో టీటీడీ శుద్ధి చేసింది.

 

తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల: తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరుగుతోంది. ఆలయాన్ని సుగంధ పరిమళ ద్రవ్యాలతో టిటిడి శుద్ధి చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజు పాల్గొన్నారు.

09:39 - September 19, 2017

టీ.సర్కార్ నాణ్యత లేని బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు రాణి, టీఆర్ ఎస్ నాయకురాలు సింగిరెడ్డి స్వర్ణలత, బీజేపీ అధికారి కొల్లి మాధవి పాల్గొని, మాట్లాడారు. చేనేత చీరలకు బదులు నాణ్యతలేని చీరలు ఇచ్చారని ఆరోపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

గవర్నర్ పేట ఆర్టీసీ డిపోలో కుంభకోణం

విజయవాడ : గవర్నర్ పేట ఆర్టీసీ డిపోలో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ అధికారులు అద్దె బస్సులకు ఉచితంగా డీజిల్ కొట్టారు. ఈ భాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.

కంచె ఐలయ్యపై కేసు నమోదుకు డీజీపీ ఆదేశాలు జారీ

గుంటూరు : కంచె ఐలయ్యపై కేసు నమోదుకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచారంటూ ఆర్యవైశ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. 

 

08:53 - September 19, 2017

తెలంగాణలో కార్మికవర్గం సమ్మెకు సై అంటోంది. ఈరోజు సమ్మెకు సిఐటియు పిలుపునిచ్చింది. సమానపనికి సమాన వేతనం చెల్లించాలన్నది యూనియన్ డిమాండ్. ఇదే అంశంపై నిర్వహించిన ఇవాళ్టి జనపథంలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా పాల్గొని, మాట్లాడారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:49 - September 19, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో సీజనల్‌ ఫీవర్స్‌ విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు డెంగ్యూ జ్వరాలు ఇంటికి ఒకరిని పట్టి పీడిస్తున్నాయి. ప్రభుత్వం, ప్రైవేటు అనే తేడా లేకుండా ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. మరోవైపు సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి రోగులకు మరింత ఇబ్బందికరంగా మారింది.

రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్‌తో పాటు చికెన్‌గున్యా, డెంగ్యు లాంటి విష జ్వరాలు సోకడంతో ఇప్పటికే అనేక మంది రోగులు ఆస్పత్రి పాలయ్యారు. పట్టణ ప్రాంతాల్లో కూడా రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మహిళలు, చిన్నారులు, విద్యార్థులు అంతా విషజ్వరాల బారినపడి అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ లోని ఫీవర్ ఆస్పత్రి ఔట్ పేషెంట్లతో నిండిపోయింది. ఒక్కరోజులోనే దాదాపుగా 3వేల మంది రోగులు ఆస్పత్రిలో చేరారంటే విష జ్వరాలు ఏ స్థాయిలో విజృంభిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. 

సీజనల్‌ వ్యాధులు వ్యాపించడంతో జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో బెడ్స్‌ ఖాళీ లేక రోగులను తిప్పిపంపేస్తున్నారు. ఫీవర్ హాస్పిటల్‌లో క్యూ లైన్లో నిలబడ లేక రోగులు చాలా అవస్థలు పడుతున్నారు. 

వ్యాధులు ప్రబలకుండా ఫాగింగ్‌ చేయట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విష జ్వరాల వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ...మున్సిపల్‌ శాఖ మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే నిర్లక్ష్యం గనక కొనసాగితే స్వైన్‌ఫ్లూ కూడా విస్తరించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్త వహించాలని ఏ మాత్రం నలతగా ఉన్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. 

వర్షాకాలం కాబట్టి సీజనల్‌ వ్యాధులు విస్తరించే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఏరియా హాస్పటల్స్ లో మరింత మెరుగైన వైద్యం అందించి, పారిశుధ్య విభాగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. ఫీవర్ హాస్పిటల్‌లో మరిన్ని కౌంటర్లు పెంచి క్యూలైన్లో ఇబ్బందులు పడుతున్న రోగులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

08:45 - September 19, 2017

కృష్ణా : నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సంచలన నిర్ణయం తీసుకుంది. వారం రోజులుగా తీవ్ర కలకలం రేపిన ర్యాగింగ్‌ వ్యవహారంపై ట్రిపుల్‌ ఐటీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. ట్రిపుల్ ఐటీ ప్రతిష్ట, విద్యార్థులకు హెచ్చరికగా మొత్తం 54 మందిపై చర్యలు తీసుకుంది.
జూనియర్లను కొట్టి ర్యాగింగ్‌ చేసిన సీనియర్లు
కృష్ణా జిల్లా, నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సంచలన నిర్ణయం తీసుకుంది. జూనియర్లపై 54 మంది సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడినట్టు గుర్తించారు. వినాయకచవితి వేడుకల సందర్భంగా సీనియర్లంతా లౌడ్‌ స్పీకర్ ఏర్పాటు చేశారు. దీంతో సౌండ్ ఎక్కువగా ఉందని.. పరీక్షలు వస్తున్న సమయంలో ఇదేంటని జూనియర్ విద్యార్థులు వారిని ప్రశ్నించారు. డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 
ర్యాగింగ్ కింద కేసు నమోదు 
తమపై ఫిర్యాదు చేయడంతో సీనియర్లు జూనియర్ విద్యార్థులను తమ రూముకు పిలిపించుకొని.. కొట్టడంతో పాటు, తీవ్రంగా హింసించారు. దీంతో జూనియర్లు ఆందోళన చేయడంతో.. పోలీసులు రంగప్రవేశం చేశారు. ర్యాగింగ్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో అధికారులు కూడా ఘటనపై విచారణ జరిపారు.
ఆరుగురు విద్యార్థులపై శాశ్వత సస్పెన్షన్ 
జూనియర్‌లను ర్యాగింగ్‌ చేసిన 54 మంది విద్యార్థులను ఇప్పటికే కళాశాల నుంచి బయటకు పంపిం చేశారు. ర్యాగింగ్‌కు రూపకల్పన చేసిన ఆరుగురు విద్యార్థులను శాశ్వతంగా సస్పెండ్‌ చేశారు. మరో 9 మందిని మిడ్‌ టర్మ్‌ పరీక్షలకు హాజరయ్యే విధంగా వేటు వేశారు. 39 మంది విద్యార్థులపైన సస్పెన్షన్‌ కొనసాగిస్తూనే.. మిడ్‌టర్మ్‌ పరీక్షలకు అనుమతిస్తామన్నారు. ఘటనపై 13 మందితో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ పూర్తి విచారణ అనంతరం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య వీరంకి వెంకట దాసు మీడియాకు తెలిపారు. 
యాజమాన్యం చర్యలపై జూ.విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం 
యాజమాన్యం తీసుకున్న చర్యలపై జూనియర్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుకునేందుకు కళాశాలలకు రావాలి కానీ, రౌడీయిజానికి, గూండాయిజం నేర్చుకునేందుకు కాదని వారు తెలిపారు. ఈ చర్యలతో కళాశాల ప్రతిష్ఠ మరింత పెరిగిందని వారు అభిప్రాయపడ్డారు.

 

08:27 - September 19, 2017

వరంగల్ : తెలంగాణ అంతా బతుకమ్మ సందడి నెలకొంది. కాలేజీలకు సెలవులు ఇస్తుండడంతో కేయూలో విద్యార్థినులంతా ముందే బతుకమ్మ పండుగ చేసుకున్నారు. అందమైన బతుకమ్మలను పేర్చి... కోలాటాలతో ఆడిపాడారు. వందలాది విద్యార్థుల ఆటపాటలతో కేయూ పీజీ ఆర్ట్స్‌ కాలేజీ కొత్త సందడిని సంతరించుకుంది. 

రోజు పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులంతా కాస్తా రిలీఫ్‌ పొందారు. తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మ సంబరాలను వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ ఉమెన్‌ ఆర్ట్స్‌ పీజీ కాలేజీ విద్యార్థినులు ఘనంగా నిర్వహించారు. 

యువతులంతా తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా ముస్తాబై వచ్చారు. అందంగా పూలతో బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మలను ఒకచోట పేర్చి ఆటపాటలాడారు. వందలాది మంది విద్యార్థులతో కోలాటాలతో ఆడిపాడారు. 

ఇక ప్రొఫెసర్లు సైతం విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ కాలేజీలో ఆడడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు విద్యార్థినులు. స్నేహితులతో సంబరాలు చాలా ఆనందాన్ని ఇచ్చాయంటున్నారు. 

ఈ బతుకమ్మ సంబరాలకు కేయూ వీసీ ముఖ్య అతిధిలో పాల్గొన్నారు. విద్యార్థినులతో కలిసి సంబరాల్లో పాలు పంచుకున్నారు. 

ఇక బాగా ఆడిపాడిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కాలేజీల్లో జరుగుతున్న బతుకమ్మ ఆటలను చూస్తుంటే తన బాల్యం గుర్తుకు వస్తుందన్నారు వీసీ సాయన్న. మొత్తానికి కాకతీయ యూనివర్సిటీలో ముందే వచ్చిన బతుకమ్మ విద్యార్థులలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. 

08:17 - September 19, 2017

హైదరాబాద్ : జ‌న‌సేన పార్టీని పటిష్టం చేసేందుకు పవన్‌ కల్యాణ్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌కు ధీటుగా పార్టీ సభ్యత్వ నమోదుకు త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు.. ప్రతి అడుగులోనూ వినూత్నంగా సాగుతున్న గబ్బర్‌ సింగ్‌.. యువతే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సభ్యత్వ నమోదుకు ఆన్‌లైన్‌ను వాడుకుంటున్నారు.
పార్టీ సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రాబోతున్నారు. అక్టోబర్‌ నుంచి రాజకీయాలకే పరిమితమవుతానన్న ఆయన.. ఆలోపు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. పార్టీ సభ్యత్వ నమోదు... అనుబంధ కమిటీలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో యూత్‌ను సభ్యులుగా చేర్చుకోవడంపై దృష్టిపెట్టారు. ఇప్పటికే జనసేన పార్టీ సభ్యత్వ నమోదుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ కూడా రూపొందించింది. 
యువతను తిప్పుకోవాలని ప్లాన్‌ 
మొదటి నుంచీ ఇతర పార్టీలకు భిన్నంగా సాగుతున్న పవన్‌..పార్టీ స‌భ్యత్వ నమోదును పూర్తిగా ఆన్‌లైన్‌లో చేపట్టాలని నిర్ణయించారు. దీని ద్వారా యువతను ఎక్కువగా తనవైపు తిప్పుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు. ప్రత్యేక యాప్‌ ద్వారా సభ్యత్వాలను నమోదు చేయబోతున్నారు.. ఇందుకు సంబంధించిన యాప్‌ కూడా సిద్ధమైంది.. పవన్‌ సూచనతో ఈ యాప్‌లో జనసేన ఐటి విభాగం కొన్ని మార్పులు చేయబోతోంది. సభ్యత్వ నమోదుతోపాటు అనుబంధ సంఘాల ద్వారాకూడా పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లాలని పవన్‌ స్కెచ్‌ వేస్తున్నారు. ఒక్కో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ అమలు దిశగా ముందుకు సాగుతున్నారు.
 

 

08:11 - September 19, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఉప ఎన్నిక వేడి రగిలించాలనుకున్న గులాబీ దళపతి పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు కూడా లేకపోవడంతో నేతలంతా పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. మరోవైపు యువనేత సైతం గుత్తా రాజీనామా వ్యవహారంపై తొందరపాటు వద్దనడంతో ఉప ఎన్నికపై పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే... ఫైనల్‌ డెసిషన్‌ కేసీఆర్‌దే కావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న టెన్షన్‌ నేతలను వెంటాడుతోంది. 

కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖ నేతలున్న జిల్లాలో ఉప ఎన్నికల ద్వారా సత్తా చాటాలనుకున్న సీఎం కేసీఆర్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన రెండేళ్ల తర్వాత టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కారెక్కిన నాటి నుంచి తాను రాజీనామాకు సిద్దమేనన్న సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. దీంతో ఆయనకు కేబినెట్‌లో బెర్త్‌ దొరుకుతుందనే ఊహాగానాలు కొనసాగాయి. కానీ... ఇప్పటివరకు ఆ దిశగా గులాబీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే... నంద్యాల ఉప ఎన్నికల అనంతరం కేసీఆర్‌ గుత్తాకు రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పదవి కట్టబెట్టాలన్న నిర్ణయం తీసుకోవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని పావులు కదిపారు. 

అయితే... ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు కూడా బైపోరుకు సై అనే సంకేతాలిచ్చారు. అలాగే ఇతర రాజకీయ పక్షాలు సైతం రెడీ అని చెప్పకనే చెప్పాయి. ఈ పరిస్థితుల్లో ఎంపీ పదవికి రాజీనామా చేసి విజయం సాధించినా... మారిన రాజకీయ సమీకరణల ప్రకారం పార్టీకి ఎంతవరకు లాభమనే చర్చ అధికార పార్టీలో మొదలైనట్లు సమాచారం. స్వల్ప మెజారిటీతో విజయం సాధించినా... ఆ ప్రభావం మరో ఏడాది తర్వాత జరిగే సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. గతంలో జరిగిన వరంగల్‌ పార్లమెంట్‌ స్థానంతో పాటు... పాలేరు, నారాయణఖేడ్‌ ఉప ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యత... నల్గొండ పార్లమెంట్‌ స్థానంలో వచ్చే పరిస్థితి లేదని నేతలు కేసీఆర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. 

యువనేత కేటీఆర్‌ సైతం ఉప ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే... గుత్తాతో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్తారా లేదా... అనేది పూర్తిగా కేసీఆర్‌ నిర్ణయంపై ఆధారపడి ఉండడంతో ఏం జరుగుతుందో నేతలు అంచనాకు రాలేకపోతున్నారు. 

చింతూరు ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో 11 మంది విద్యార్థులకు అస్వస్థత

తూర్పుగోదావరి : చింతూరు ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో 11 మంది విద్యార్థులకు అస్వస్థత కలిగింది. కాళ్ల వాపు వ్యాధితో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. గతేడాది కాళ్లవ్యాపుతో 11 మంది మృతి చెందారు. ఇప్పటికీ కాళ్లవాపు వ్యాధికి కారణాలు కనుగొనలేదు.

 

07:59 - September 19, 2017

హైదరాబాద్ : బతుకమ్మ చీరల దగ్ధాన్ని తెలగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలను దగ్ధం చేసిన మహిళలపై చర్యలకు ఉపక్రమించింది. భువనగిరి, జగిత్యాల జిల్లాలకు చెందిన మహిళలపై కేసు నమోదు చేసింది.  ప్రభుత్వ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిరసన తెలిపే హక్కునూ ప్రభుత్వం హరిస్తోందంటూ మహిళలు మండిపడుతున్నారు.
చీరలు దగ్ధం చేయడంపై ప్రభుత్వం సీరియస్‌ 
సోమవారం తెలంగాణలో ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టింది. బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదంటూ పలుచోట్ల మహిళలు నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన చీరలను దగ్దం చేశారు. మహిళలు బతుకమ్మ చీరలు దగ్ధం చేయడంపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. చీరలు దగ్ధం చేసిన వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. సర్కార్‌ ఆదేశాలతో భువనగిరి పోలీసులు రంగంలోకి దిగారు. బతుకమ్మ చీరలను దగ్ధం చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసిన 18 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఫిర్యాదుతో  మహిళలను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. 
మహిళలపై చర్యలకు ఉపక్రమించిన పోలీసులు
జగిత్యాల జిల్లాలోనూ పోలీసులు మహిళలపై చర్యలకు ఉపక్రమించారు. బతుకమ్మ చీరలను దగ్ధం చేశారంటూ జల్గల్‌ సర్పంచ్‌ కవిత భర్త రాజేందర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం అతడిని రూరల్‌ పీఎస్‌కు తరలించారు. రాజేందర్‌ అరెస్ట్‌ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వంపై నిరసన తెలిపితే అరెస్ట్‌లు చేయిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులనూ కేసీఆర్‌ సర్కార్‌ కాలరాస్తోందంటూ మండిపడ్డారు. 
బతుకమ్మ చీరల దగ్ధంపై మంత్రి కేటీఆర్‌ మండిపాటు 
బతుకమ్మ చీరల దగ్ధంపై మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. బతుకమ్మ చీరలపై ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. తమకు నచ్చకపోతే మహిళలు పక్కన పెడతారే తప్ప... ఇలా తగలబెట్టరని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నచోటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.
ప్రభుత్వంపై సర్వత్రా ఆగ్రహం 
బతుకమ్మ చీరలు తగలబెట్టడం వెనుక ప్రతిపక్షాల కుట్ర దాగుందని మరోమంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. మహిళలకు ప్రభుత్వం చీరలు పంచడాన్ని ప్రతిపక్ష నేతలు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. మొత్తానికి బతుకమ్మ చీరల దగ్ధం రాజకీయ రంగు పులుముకుంది. అయితే నిరసన తెలిపిన మహిళలపై కేసులు నమోదు చేయడంపై ప్రభుత్వంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నేడు ఉట్నూర్ లో ఇందిరమ్మ రైతు బాట

ఆదిలాబాద్ : నేడు ఉట్నూర్ లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రైతు బాట నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఇంచార్జ్ కుంతియా, ఉత్తమ్, జానారెడ్డి, మల్లుభట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ పాల్గొననున్నారు. 

 

నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

చిత్తూరు : నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఆలయ శుద్ధి నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనం రద్దు చేయనున్నారు. 

 

ఆర్థిక పరిస్థితిపై నేడు ప్రధాని మోడీ సమీక్ష

ఢిల్లీ : ఆర్థిక పరిస్థితిపై నేడు ప్రధాని మోడీ సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. 

 

నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

కర్నూలు : జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్ విహార్ సెంటర్ నుంచి ఎస్ ఏసీ క్యాంప్ వరకు పాదయాత్ర చేయనున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం చంద్రబాబు నంద్యాల వెళ్లనున్నారు. 

 

Don't Miss