Activities calendar

20 September 2017

21:54 - September 20, 2017

ప్రిన్స్ టన్ : యుపిఏ వైఫల్యాలను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అంగీకరించారు. రోజుకు 30 వేల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయామని రాహుల్‌ అన్నారు. ప్రస్తుత అవసరాలకు తగినవిధంగా ఉద్యోగాల సృష్టిలో ఎన్డీయే ప్రభుత్వం కూడా విఫలమవుతోందని తెలిపారు. తమ మీద ఆగ్రహం వ్యక్తం చేసినవారు ప్రస్తుత మోదీ ప్రభుత్వంపై కూడా ఆగ్రహంతో ఉన్నారని రాహుల్‌ చెప్పారు. నిరుద్యోగం భారత ఆర్థికవ్యవస్థకు పెను సవాల్‌గా మారిందన్నారు. అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ మోది సర్కార్‌ను టార్గెట్‌ చేశారు. విద్య, ఆరోగ్యంపై కేంద్రం నిధులు వెచ్చించడం లేదని విమర్శించారు. మేక్‌ ఇన్‌ ఇండియాను పెద్ద పారిశ్రామికవేత్తలకే పరిమితం చేశారని... చిన్న వ్యాపారులను ప్రోత్సహించేలా చూడాలని అభిప్రాయపడ్డారు.

21:53 - September 20, 2017

ముంబై : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మరోసారి వణికింది. మంగళవారం సాయంత్రం నుంచి ముంబై నగరంలో భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు నీట మునగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయానికి ముంబయి నగరంలో 304 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆగస్టు 29న కురిసిన భారీ వర్షాలకు 316 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మళ్లీ రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. బుధవారం ఒక్కరోజే 12 గంటల వ్యవధిలో 9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

పాఠశాలలు, కళాశాలలకు గురువారం కూడా సెలవు
వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు గురువారం కూడా సెలవు ప్రకటించింది. వర్షాలకు ముంబై డబ్బావాలాలు టిఫిన్ బాక్స్‌ డెలివరి సేవలను నిలిపివేశారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాన రన్‌వేను నిలిపివేశారు. ఇక్కడ కేవలం రెండో రన్‌వే మాత్రం పనిచేస్తోంది. మంగళవారం రాత్రి స్పైస్‌జెట్‌ ల్యాండ్‌ అయ్యే క్రమంలో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి రన్‌వే నుంచి పక్కకు మళ్లి మట్టిలో కూరుకుపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 50 విమాన సర్వీసులను రద్దు చేశారు. స్పైస్‌ జెట్‌, ఇండిగో సంస్థలు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించాయి.

సబర్బన్‌ రైళ్లు ఆలస్యంగా
విద్యుత్తు సమస్య కారణంగా సబర్బన్‌ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. మరికొన్న రైళ్లను దారి మళ్లించారు. ఇండియా గేట్‌ వద్ద సముద్రంలో భారీగా అలలు ఎగసిపడుతుండడంతో పర్యాటకులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. ఆగస్టు 29 న భారీ వర్షాలు ముంబైని ముంచెత్తిన విషయం తెలిసిందే. ఆ ఘటనను ఇంకా మరవకముందే మరోసారి వర్షాలు ముంబై వాసులను వణికించాయి. 

21:51 - September 20, 2017

గుంటూరు : సదావర్తి భూముల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సోమవారం జరిగిన వేలం పాటలో భూములను దక్కించుకున్న పాటదారులు ఇప్పుడు వెనకడుగు వేశారు. తమపై వైసీపీ నేతలు ఆరోపణల చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంత్రులు ఆదినారాయణరెడ్డి, లోకేష్‌తో తమకు సంబంధం ఉందంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారని వేలం పాటలో భూములను దక్కించుకున్న శ్రీనివాసుల రెడ్డి పేర్కొన్నారు. అందుకే భూములను తీసుకోరాదని నిర్ణయించామని తెలిపారు. తమిళనాడులోని 83.11 ఎకరాల సదావర్తి సత్రం భూముల వేలంను సోమవారం నిర్వహించగా.. 60కోట్ల 30 లక్షలకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్‌ సంస్థకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి, పద్మనాభయ్య దక్కించుకున్నారు. 

21:50 - September 20, 2017

హైదరాబాద్ : ఇంటర్మీడియట్‌ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. వందల సంఖ్యలో ఇంటర్‌ కాలేజీలకు అఫ్లియేషన్లు నిరాకరించింది. ఈ నిర్ణయంతో.. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో 17 వందల కాలేజీలు అఫ్లియేషన్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. అందులో 332 కాలేజీలకు ఇంటర్‌ బోర్డు అనుమతులు ఇవ్వలేదు. 104 ఒకేషనల్‌ కాలేజీలు... 228 జనరల్‌ ఇంటర్‌ కాలేజీలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. వీటిలో వివిధ బ్రాంచ్‌లకు చెందిన కార్పొరేట్‌, బడా కాలేజీలు కూడా ఉన్నాయి. ఈ కాలేజీల్లో సెకండియర్‌లో 50 వేల మంది విద్యార్థులు ఫస్టియర్‌లో 50వేలకుపైగా విద్యార్థులు చదువుతున్నట్టు సమచారం.

లక్ష మంది విద్యార్థులు
కాగా గురువారానికి అఫ్లియేషన్ల గడువు ముగుస్తుండడంతో... మరిన్ని కాలేజీలకు కూడా అఫ్లియేషన్లు నిరాకరించే అవకాశం ఉంది. అలాగే విద్యా ప్రమాణాలు పాటించకపోవడంతో.. కొన్ని కాలేజీలకు ఇంటర్‌ బోర్డు జరిమానా విధించింది. ఈ మేరకు శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు రెండు కోట్ల 17 లక్షల రూపాయల జరిమానాను ఇంటర్‌ బోర్డుకు చెల్లించడం జరిగింది. అయితే అంత పెద్ద ఎత్తున జరిమానా చెల్లించుకోలేని కాలేజీలు స్వచ్ఛందగా తప్పుకున్నాయి. అయితే ఇంటర్‌ బోర్డ్‌ నిర్ణయంతో దాదాపుగా లక్ష మంది విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ ఏడాది పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారోనని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఏ కాలేజీ తరపు నుంచైనా రాయిస్తారా? ప్రైవేట్‌గా రాయిస్తారో తెలియక విద్యార్థులు గందరగోళ పడుతున్నారు.

21:49 - September 20, 2017

గుంటూరు : బాహుబలి డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి.. అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడుసార్లు సమావేశమై.. అమరావతిలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లపై చర్చించారు. లండన్‌కు చెందిన నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధి బృందం రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు... బాహుబలి డైరెక్టర్‌ రాజమౌళికి చూపించారు. లోపలి ఆకృతులపై సంతృప్తి వ్యక్తంచేసిన చంద్రబాబు, బాహ్య డిజైన్లు తాను అనుకున్నట్టుగా లేవని రాజమౌళి దృష్టికి తెచ్చారు. అమరావతి చరిత్ర, సంస్కృతి ఉట్టిపడేలా బాహ్య డిజైన్లు ఉండాలాన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇందకు సహకారం అందించాలని చంద్రబాబు కోరగా, రాజమౌళి సుముఖత వ్యక్తం చేశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం రాజమౌళి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రాజమౌళి వెంట సీఆర్‌డీఏ కమిషన్‌ చెరుకూరి శ్రీధర్‌, ఇతర అధికారులు ఉన్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను పరిశీలించారు. శాసనసభ అద్భుతంగా ఉందని, అసెంబ్లీ హాలు డిజైన్‌ చాలా బాగుందని ప్రశంసించారు. కృష్ణానది అభిముఖంగా అమరావతి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఈ నది పరీవాహక ప్రాంతాన్ని కూడా రాజమౌళి పరిశీలించారు. 

21:48 - September 20, 2017

కరీంనగర్/సిరిసిల్ల : రోజులాగే కార్మికులు పనిలోకి వెళ్లారు.. భోజన విరామం కోసం ముందు ఇంజనీర్లు బయటకు వచ్చారు.. వారి వెనకే వస్తున్న కార్మికులపై సొరంగ మార్గం కూలిపోయింది.. కాళేశ్వరం పనుల్లో జరిగిన ఈ ప్రమాదం ఏడుగురు కార్మికుల ప్రాణాలను బలిగొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో కాళేశ్వరం ఎత్తిపోతల పదో ప్యాకేజీ పనులు కొనసాగుతున్నాయి. తిమ్మపూర్‌లో సొరంగ మార్గంలోకి ఇంజనీర్లతో పాటు.. కార్మికులు వెళ్లారు.. పనులు ముగించుకొని ఇంజనీర్లు బయటకు వచ్చారు.. వారి వెనకే వస్తున్న కార్మికులపై సొరంగ మార్గం కుప్పకూలింది.. ఈ ఘటనలో సందీప్‌, జితేందర్‌, హరిచరణ్‌, హరిరాం, గీత్మా, హరి మృత్యువాత పడ్డారు.. సొరంగం కప్పు పది అడుగుల వరకూ కూలిపోవడంతో వీరి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి.. అధికారులు, కార్మికులు కలిసి డెడ్‌బాడీలను మూటలుగా కట్టి బయటకు తెచ్చారు.

కాంగ్రెస్ నేతలు ధర్నా..
గాయపడ్డ ముగ్గురు కార్మికులను కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ పురంసింగ్‌ అనే కార్మికుడు ఆస్పత్రిలో చనిపోయాడు.. మృతుల్లో సందీప్‌ అనే కార్మికుడు వరంగల్‌ జిల్లా ములుగు ప్రాంతానికి చెందినవాడు.. మిగతావారంతా ఒడిషా, చత్తీస్‌గఢ్‌, బీహార్‌నుంచి పనికోసం ఇక్కడికి వచ్చారు. ప్రమాద ఘటనపై మంత్రి హరీశ్‌ రావు విచారం వ్యక్తం చేశారు.. మృతుల కుటుంబాలకు 5లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ప్రకటించిందని చెప్పారు.... ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.. డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ పైకప్పులోని ఎయిర్‌ ప్యాకెట్స్‌ పేలడంతో దాదాపు నాలుగు టన్నుల బరువున్న గ్రానైట్‌ రాయి కూలిందని ఇంజనీర్లు హరీశ్‌ రావుకు వివరించారు. మృతదేహాలకు పోస్టుమార్టమ్ నిర్వహించేందుకు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ నేతలు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత

పశ్చిమగోదావరి : జిల్లా తుందుర్రులో మళ్లీ ఉద్రక్తత చోటుచేసుకుంది. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా కంసాల బేతపూడి నుంచి గ్రామస్థులు క్యాండిల్ ర్యాలీ చేయడం ప్రారంభించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొని గ్రామస్థుల, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు.

21:12 - September 20, 2017

పశ్చిమగోదావరి : జిల్లా తుందుర్రులో మళ్లీ ఉద్రక్తత చోటుచేసుకుంది. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా కంసాల బేతపూడి నుంచి గ్రామస్థులు క్యాండిల్ ర్యాలీ చేయడం ప్రారంభించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొని గ్రామస్థుల, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం వీడియో చూడండి.

సొరంగం దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హరీష్ రావు

హైదరాబాద్ : ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంపై మంత్రి హరీష్ రావు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అదుకుంటామని ఆయన ప్రకటించారు.

20:08 - September 20, 2017

అమరావతీ ఊపిరి పీల్చుకో...రాజమౌళి వస్తున్నాడు.. మాహిష్మతి కాదు.. దాని తలదన్నే డిజైన్లతో భవనాలు సెలక్ట్ చేయబోతున్నాడట.. అమరావతిలో ముఖ్యమైన భవనాల డిజైన్ల విషయంలో జక్కన్న క్రియేటివిటీ వాడబోతున్నారు. దేశ విదేశాల ఆర్కిటెక్కులు, ఎన్నో ఏజన్సీలు చేయలేని పనిని రాజమౌళి చేస్తారని చంద్రబాబు నమ్ముతున్నారు. ఈగ ఎగిరినట్టే, ఉదయఘర్ సామ్రాజ్యం వెలిగినట్టే, మాహిష్మతి అబ్బురపరిచినట్టే, అమరావతి డిజైన్లు కూడా వస్తాయని ఏపీ సర్కారు భావిస్తోందా? ఇది కావాలని చేస్తున్న కాలయాపనా? లేక మహిష్మతి పట్ల చంద్రబాబుకున్న ఇష్టమా?

అమరావతి..భ్రమరావతి..మాహిష్మతమరావతి ..డిజైన్లు, సంస్థలు, ఆర్కిటెక్కులు మారుతున్నట్టే... అమరావతికి మారుపేర్లూ పెరుగుతున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో ఏపీ సర్కారు చేస్తున్న స్టంట్లు అనేక ప్రశ్నలను రేరెత్తిస్తున్నాయి. అనేక విమర్శలకు కారణమౌతున్నాయి. గుళ్లూ గోపురాలను డిజైన్ చేయించుకున్నారంటే ఓ అర్ధముంది..ఫ్యాట్ వెడ్డింగ్ డిజైనర్లుగా సలహా అడిగారంటే అర్ధం చేసుకోవచ్చు..కానీ, ఓ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భవనాల డిజైన్ల గురించి ఓ డైరెక్టర్ ని సంప్రదించటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. మరి సర్కారీ యంత్రాగంలోని ఆర్కిటెక్కులు.. కోట్లు ఛార్జ్ చేసి డిజైన్లు ఇచ్చిన కన్సల్టెంట్ లు వీరికంటే ఓ సినిమా నిపుణుడికి ఎక్కువ తెలుస్తుందా?

దేశ విదేశాల ఆర్కిటెక్కుల ప్రతిభ సరిపోలేదు..మూడేళ్ల కాలం, పర్యటనల మీద పర్యటనలు నడిచాయి.. డిజైన్లు రావటం... పక్కకు పోవటం జరిగిపోతూనే ఉన్నాయి.. కానీ, బాబుగారి కన్ను మాహిష్మతి మీద పడింది. ఆ రేంజ్ డిజైన్లు కావాలంటున్నారు. గ్రీన్ మ్యాట్ అద్భుతాలను రియల్ లైఫ్ లో సాకారం చేయాలని భావిస్తున్నారు. మరి ఇది కాలయాపన వ్యవహారమా? లేక పనిజరిగేదేమైనా ఉందా? రాజధాని అంటే నాలుగు రోడ్లు, పది భవనాలు, ఓ పార్కు మాత్రమే కాదు.. అక్కడి ప్రజలు, వారి బాగోగులు , ఇతర ప్రాంతాలకు కూడా పాలనా పరంగా అందుబాటులో ఉండటం, పారదర్శక విధానాలు అని గుర్తిస్తే ఆధునిక అమరావతి కల సాకారమయినట్లే.. ఈ దిశగా సాగకుండా జై మాహిష్మతీ అంటూ కలలు కంటే ప్రయోజనం ఉంటుందా? గ్రాఫిక్స్ డిజైన్లను వాస్తవంలో కావాలనటంలో అర్ధం ఉందా? పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:06 - September 20, 2017

చీరెల పంచాది ఒడ్సిపోయిందేమో అనుకున్న.. అమ్మో ఎట్లొడుస్తది..? అయిపాయే మొగోళ్లకు జాంగలిచ్చినా బనీన్లిచ్చినా ఏం పంచాదిలేకుంటుండే... పొయ్యిపొయ్యి ముఖ్యమంత్రిగారి ఆడోళ్లతోని వెట్టుకున్నడు.. ఆ మంట సల్లారెతట్టు అనిపిస్తలేదు ఇప్పట్ల.. ఆ శీరెను జూశినప్పుడల్ల మంట మండుతున్నరు అమ్మలక్కలు.. ఇగ ఆడోళ్ల కోపం ఇట్లుంటే ఈటెల రాజేంద్ర సారు ఏమంటున్నడో ఇనుండ్రి..

అయ్యో ఈ రాజమౌళేంది..? ఆ అమరావతి నిర్మాణమేంది.?. ఇదేమన్న శీన్మనా..? లేకపోతె నాటికనా..? చంద్రాలు..? నీయక పెద్దపెద్ద సద్వులు సద్వినోళ్లతోని గాని డిజైన్ల గీత రాజమౌళి జేస్తాడు..? ఈ లెక్కన రాజమౌళి అనె మన్షి ఈ భూమ్మీద వుట్టకపోయినుంటే.. మరి ఏం జేస్తుంటివో ఏమోగని.. బాహుబలి సీన్మ సీన్లతోని బాగనే డ్రామా జేస్తున్నవ్ గదా..?

ఇచ్చిన శీరెలు తీస్కుంటె తీస్కొండ్రి లేకపోతె ఊకోండ్రి అంతెగని.. ఈ పిచ్చకుంట్ల రాజకీయం జేయకుండ్రి అని.. అంటున్నడు గౌరవనీయులు శ్రీ గాదరి కిషోర్.. తుంగతుర్తి ఎమ్మెల్యేగారూ.. ఆడోళ్లు కుఠిల రాజకీయం జేస్తరనంగ ఇన్నం.. కుల్లు రాజకీయాలు జేస్తరనంగ ఇన్నంగని.. మరి ఈ పిచ్చకుంట్ల రాజకీయం ఏడగనిపెట్టిండో ఏమో సారూ..?

ఇగురం మల్లారెడ్డి పెండ్లాం ఇల్లలుకుతుంటే.. పక్కింటి పెంటయ్య పరాష్కమాడిండట.. అగో అట్లనే ఉన్నది ఈ ముచ్చట.. మధ్యప్రదేశ్ రాష్ట్రంల ఒకతాన బీజేపీ మహిళామని స్వచ్చతా కార్యం బెట్టింది.. రోడ్లు సాపు జేసుడు అన్నట్టు.. అంతలనే ఆడికొచ్చిన ఒక మన్షి ఆమెను ఒక మాటన్నడు.. ఇగ గొట్టిందంటే ఆయనను.. మరి ఆయన ఏమన్నడు.. ఈమె ఎందుకు గొట్టిందో సూడుండ్రి..

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి గారు మీకేమన్న శిగ్గున్నదా సారూ..? ఏమెల్గవెడ్తున్నరు సారూ తమరు..? పాపం పాతింట్ల బత్కుతున్న ఇద్దరు ముసలోళ్లను ఇంట్లకెళ్లి బైటికి ఎల్లగొట్టి.. వాళ్లను రోడ్డు మీద వడేశి మీ సావు మీరు సావుండ్రి అంటె.? మీ శాఖల పనిజేస్తున్న అధికారులకు గానీ..? మీకు గాని..? ఏమన్న బుర్ర పనిజేస్తున్నదా..?

అయ్యయ్యయ్యయ్యో.. ఎంత పనైపాయెనుల్లా..? సూస్తుంగనే మందిని మింగేశింది భూ కంపం.. ఇప్పటికి తెల్సిన లెక్క మూడు వందల మంది సచ్చిపోయిండ్రట భూకంపం జేయంగ.. మెక్సికో దేశం మొత్తం గజ్జున వన్కింది దెబ్బకు.. సరిగ్గ ముప్పై రెండేండ్ల కింద ఏ తేది నాడైతె వచ్చిందో భూకంపం సేయ్ ఇయ్యాళ గూడ అదే యాళ్లకొచ్చింది.. అప్పుడు పదివేల మంది సచ్చిపోయిండ్రట.. ఇప్పుడు లెక్క తెల్వలే ఇంక..

నీయక ఇప్పటి మన్సులు నిండ యాభై ఏండ్లు బత్కితెనే అబ్బో బాగనే బత్కిండు అంటున్నరు.. ఆ ఏన్కటి మన్సులు ఏంతిన్నరో ఏం కథనోగని.. ఎన్బై ఏండ్ల దాక గూడ ఎవ్వలి పని వాళ్లు జేస్కోని నూరేండ్లు దాటి బత్కిండ్రు.. ఒక ముసలామెనట నూట పదేండ్లున్నదట.. ఇప్పటికి నడుస్తున్నది.. ఆమె బల్గమంతొచ్చి బర్త్ డే జేస్తున్నరు పాండ్రి మనం పాలువంచుకుందాం..

కంచె ఐలయ్య పుస్తకాన్ని నిషేధించాలని సుప్రీంలో పిటిషన్

ఢిల్లీ : కంచె ఐలయ్ రచించిన కోముటోళ్లు సామాజిక స్మగ్లర్లు పుస్తకాన్ని నిషేదించాలని ఆర్యవైశ్యుల సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.

ప్లాట్ ఫాం టికెట్ ధరలు పెంచిన రైల్వే

ఢిల్లీ : దసరా రద్ధీ దృష్ట్యా రైల్వే శాఖ ప్రయాణికుల వద్ద బాదుడుకు సిద్ధమైంది. ప్లాట్ ఫాం టికెట్ ధరను ఏకంగా రూ.10 నుంచి రూ.20కి పెంచింది. పెంచిన చార్జీలు నేటి నుంచి అక్టోబర్ 10 వరకు అమలులో ఉంటాయి.

విజయవాడలో ఎస్ బీఐ బ్యాంక్ క్లర్క్ చేతివాటం

కృష్ణా : విజయవాడ గాయత్రినగర్ లోని ఎస్ బీఐ బ్యాంకు క్లర్క్ కృష్ణచైతన్య చేతివాటానికి పాల్పపడ్డాడు. బ్యాంకులో ఖాతాదారలు తాకట్టు పెట్టిన 10.5 కిలోల బంగారాన్ని చోరీ చేసి మణప్పురంలో తనఖా పెట్టాడు. వచ్చిన డబ్బుతో షేర్లను కొన్నాడు. ఎస్ బీఐ ఉన్నధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

19:53 - September 20, 2017
19:52 - September 20, 2017
19:51 - September 20, 2017

మహబూబ్ నగర్ : ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ జలకలను సంతరించుకుంది. కర్ణాటక, మహారాష్ట్రలలో భారీగా వర్షాలు కురవడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలకు వచ్చి చేరుతోంది. ఈ నీటిని దిగువకు వదలడంతో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరద ఉధృతి పెరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులు కాగా ప్రస్తుతం 318.320 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 83వేల క్యూసెక్కులుగా ఉండగా. 48,430 క్యూసెక్కులు బయటికి వదులుతున్నారు.

110 టీఎమ్‌సీల వరద నీరు
ఈ ప్రవాహంతో... శ్రీశైలంలో నీటిమట్టం పెరుగుతోంది. సెప్టెంబర్‌ మొదటి వారం నుండి ఇప్పడివరకు శ్రీశైలం జలాశయానికి సుమారు 110 టీఎమ్‌సీల వరద నీరు వచ్చిచేరింది. అయితే కృష్ణా రివర్‌ బోర్డ్‌ ఆదేశాలతో త్రాగునీటి కోసం దిగువకు 2 టీఎంసీల నీటిని విడుదల చేశారు. దీంతోపాటు మహాత్మగాంధీ కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు, హంద్రీనీవా జల స్రవంతికి మొత్తం 0.48 టీఎంసీల నీటిని విడుదల చేసినట్టు శ్రీశైలం జలాశయం సూపరిండెంట్‌ ఇంజనీరు మల్లికార్జునరెడ్డి తెలిపారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 861 అడుగులు కాగా గరిష్ఠ స్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటినిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 110 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుతం జూరాల నుండి శ్రీశైలం జలాశయానికి 69 వేల 81 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఇదే విధంగా జలాశయానికి మరో 5 రోజులపాటు వరదనీరు పోటెత్తెతే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. 

19:46 - September 20, 2017

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాసు హైకోర్టు ఊరటనిచ్చింది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీలో బలనిరూపణ చేయాల్సిన అవసరం లేదని న్యాయస్థానం వెల్లడించింది. తన వర్గం ఎమ్మెల్యేలపై బహిష్కరణను రద్దు చేయాలని, పళనిస్వామిని బలపరీక్షకు ఆదేశించాలని కోరుతూ అన్నాడిఎంకే బహిష్కృత నేత దినకరన్‌ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం విచారించింది. దినకరన్‌, పళనిస్వామి వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం... తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు విశ్వాస పరీక్ష నిర్వహించవద్దంటూ స్పీకర్‌కు సూచించింది.

హైకోర్టు తోసిపుచ్చింది
దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్‌ ధన్‌పాల్‌ వేసిన అనర్హత వేటుపైనా న్యాయస్థానం సుదీర్ఘ వాదనలు వింది. స్పీకర్‌ నిర్ణయంపై స్టే ఇవ్వాలన్న దినకరన్‌ వర్గం వాదాన్ని మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. అయితే కేసు విచారణ పూర్తయ్యేంత వరకు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించరాదని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 4 కు వాయిదా వేసింది. జయలలిత మరణం తర్వాత రెండుగా విడిపోయిన ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాలు ఒకటయ్యాయి.దీనిని వ్యతిరేకిస్తూ దినకరన్‌ వర్గం తిరుగుబాటు చేసింది. తదనంతర పరిణామాల్లో దినకరన్‌తోపాటు, శశికళను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అన్నా డీఎంకే నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ధన్‌పాల్‌ అనర్హత వేటు వేశారు. దీనిని సవాల్‌ చేస్తూ దినకరన్‌ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. 

19:45 - September 20, 2017

చిలీ: మెక్సికోను భారీ భూకంపం కుదిపేసింది. భూకంపం ధాటికి అనేక భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. మరికొన్ని భవనాలు భూ ప్రకంపనలకు చెట్లలా ఊగాయి. భూకంపానికి బోట్లు ఊగిపోయాయి. బోటింగ్‌ షికారు చేస్తున్న టూరిస్టులు బెంబేలెత్తిపోయారు. ప్రకంపనలతో భయాందోళనకు గురైన వేలాదిమంది ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. చాలామంది గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోయారు. మంగళవారం మధ్యాహ్నం 1-14 నిముషాలకు భూకంపం సంభవించినట్లు యుఎస్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. భూకంప తీవ్రత రెక్టార్‌ స్కేలుపై 7.1గా నమోదు అయింది. మెక్సికో సిటీకి 123 కిలోమీటర్ల దూరంలో ప్యూబెలా రాష్ట్రంలోని రబొసొ వద్ద భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కుప్పకూలిన ఐదంత‌స్థుల భ‌వ‌నం
మెక్సికో న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న కాండెసా ప్రాంతంలోని ఓ ఐదంత‌స్థుల భ‌వ‌నం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న కొందరిని సహాయక సిబ్బంది రక్షించింది. భూకంపానికి మెక్సికో సిటీలోని ఎన్రిక్‌ రెబ్‌సామెన్‌ పాఠశాల స్కూలు పైకప్పు కూలిపోయి 20 మంది విద్యార్థులు మృత్యువాత పడడం కలచివేసింది. మృతుల్లో ఇద్దరు టీచర్లు కూడా ఉన్నారు. శిథిలాల కింద మరో 30 మంది, 8 మంది సిబ్బంది ఉంటారని అంచనా వేస్తున్నారు. 44 చోట్ల భవనాలు కూలిపోయాయని మెక్సికో మేయర్ మిగేల్ తెలిపారు. 60 మందిని శిథిలాల నుంచి సురక్షితంగా వెలికి తీశామని, 70 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్యూబ్లా, మొర్లస్‌, మెక్సికో సిటీలో భూకంప తీవ్రత ఎక్కువ ఉందని... శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారని, సహాయక కార్యక్రమాలు పూర్తయితే కానీ పూర్తి వివరాలు అందుబాటులోకి రావని అధికారులు తెలిపారు.

ఇదే రోజు మెక్సికోలో భూకంపం
మెక్సికోలో వారం రోజుల క్రితమే భారీ భూకంపం సంభవించింది విద్యుత్‌ లైన్లు, ఫోను లైన్లు అనేకచోట్ల ధ్వంసమయ్యాయి. స‌రిగ్గా 32ఏళ్లక్రితం 1985 సెప్టంబ‌రు 19న‌ ఇదే రోజు మెక్సికోలో భూకంపం సంభవించి 10 వేల మంది చనిపోయారు. ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం నగరంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు మాక్‌డ్రిల్స్‌ నిర్వహించారు. అది పూర్తయిన కొన్ని గంటలకే భూకంపం సంభవించడం గమనార్హం. భూకంపం ఎంత తీవ్రంగా ఉందంటే ఆ భయం నుంచి 2 కోట్ల మంది ప్రజలు తేరుకోలేక పోతున్నారు. మెక్సికోకు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

19:42 - September 20, 2017

గుంటూరు : గుంటూరు జిల్లా గురజాలలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని 40 మంది గర్భిణీలకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల నగదు.. మూడు వేల రూపాయల విలువైన వస్తువులు అందజేశారు. తమ కుమారుడు నిఖిల్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు.

19:40 - September 20, 2017

విజయనగరం : విజయనగరం జిల్లా ఏజెన్సీలోని గిరిజన ప్రాంతమిది. ఇక్కడి భూములపై గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వచ్చే పెత్తందార్ల కన్ను పడింది. ఇక్కడి భూములను యథేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు. అడ్డు వచ్చిన గిరిజనులపై దాడులకు తెగబడుతున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల పార్వతీపురం మండలం చందలంగి గిరిజన గ్రామంలో బలరాం అనే గిరిజనుడు తన పొలంలో ఐటిడిఏ అధికారులు ఇచ్చిన జీడి మొక్కలను పెంచుకుంటున్నాడు. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే తూర్పుగోదావరి జిల్లాకి చెందిన రంగరాజు అనే మోతుబరి రైతు బలరాం జీడితోటను కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. రాత్రి వేళ కిరాయి మనుష్యుల్ని పంపించి యంత్రాలతో జీడి మొక్కలను నరికించాడు.

గిరిజనులకు అండగా సిపిఎం నాయకులు
అయితే విషయం తెలుసుకున్న బలరాంతోపాటు గిరిజనులంతా కిరాయి మనుష్యుల్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయినా పోలీసులు కేసు నమోదు చేయలేదు.. రెవెన్యూ అధికారులు కూడా స్పందించలేదు. పెద్దల అండతో గిరిజనుడైన బలరాం భూముల్ని కబ్జా చేసేందుకు రంగరాజు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ వ్యవహారం పెద్దది కావడంతో స్థానిక సిపిఎం నాయకులు గిరిజనులకు అండగా వచ్చారు. వారికి న్యాయం చేసేవరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదొక్కటే కాదు.. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఎక్కడి నుంచో వచ్చిన పెత్తందార్లు అమాయక గిరిజనుల భూముల్ని లాక్కుంటున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

19:39 - September 20, 2017

శ్రీకాకుళం : పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీకి ఉత్తరాంధ్ర కంచుకోట. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆదుకుంది సిక్కోలు జిల్లాలే. అయితే ఈ జిల్లాలో ఐదుగురు మంత్రులున్నప్పటికీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం కొరవడింది. ఇప్పుడిదే తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని అంశంగా మారింది. ఈ సందర్భంలోనే మంత్రి నారాలోకేష్‌ ఉత్తరాంధ్ర పర్యటన ఆసక్తిగా మారింది. ఈ నెల 18, 19 తేదీలలో శ్రీకాకుళం జిల్లాలో లోకేష్‌ పర్యటించారు. పర్యటించింది పలాస, నరసన్న పేట, శ్రీకాకుళం నియోజకవర్గ ప్రాంతాలే అయినప్పటికీ పది నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులతో చర్చించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బలం పుంజుకుంటున్న వైసీపీ..
ఉత్తరాంధ్రలో వైసీపీ బలం పుంజుకుంటుందన్న వాదనలపై లోకేష్‌ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై వైకాపా నేత విజయసాయి రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. దీంతో పాటుగా ప్రశాంత్‌ కిషోర్‌ టీం పది నియోజక వర్గాల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేయడంతో పాటు అధికార పార్టీ బలహీనతలు సైతం బేరీజు వేసింది. ఈ కారణాలతోనే లోకేష్‌ సిక్కోలుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సిక్కోలులో టీడీపీకి బలమైన నాయకులు ఉన్నప్పటికీ పార్టీలో సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఓ వైపు మంత్రి అచ్చెన్నాయుడుకు, మరో మంత్రి కిమిడి కళా వెంకటరావుకు మధ్య సఖ్యత లేదు. సీనియర్‌నేతలు గౌతు శివాజి, ప్రతిభా భారతి, గుండ అప్పలసూర్యనారాయణ లాంటి వారు తమ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే 2019 ఎన్నికల్లో గెలవడం తమ పార్టీకి కష్టమవుతుందని టీడీపీ అధినాయకత్వం అంచనా వేస్తోంది.

చేరికలకోసం లోకేష్‌ ప్లాన్స్‌...
ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా పార్టీలో కొత్తగా చేరికలకోసం లోకేష్‌ ప్లాన్స్‌ వేస్తున్నారు. అటు వైసీపీ నుండి విజయసాయిరెడ్డి లాంటి వారు ఇతర పార్టీ వ్యక్తులను ఫ్యాన్‌ కిందకు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో లోకేష్‌ శ్రీకాకుళంతో పాటు, విశాఖ, విజయనగరం జిల్లాలలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా టీడీపీ హవాను అడ్డుకోలేరని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లోకేష్‌ పర్యటనలో మొదటి రోజు అంతా బాగానే ఉన్నా ..రెండవ రోజు పర్యటనలో మాత్రం నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనబడింది. మంత్రి అచ్చెంనాయుడు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ పర్యటనకు దూరంగా ఉండటం, మరో మంత్రి కళా వెంకట్రావు అన్నీ తానై చక్రం తిప్పడం గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసింది. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్‌ ఉత్తరాంధ్రపై ప్రత్యేక కార్యచరణ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి. 

19:36 - September 20, 2017

విశాఖ : పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్న విషయం గమనించి దోపిడికి ప్రయత్నించారు. అక్కయ్య పాలెం లలితా నగర్‌లో ఇంట్లో ఉన్న మహిళను అడ్రస్ కోసమని ఇద్దరు అగంతకులు బయటకు పిలిచారు. మహిళతో మాట్లాడుతున్నట్లుగా నటించి అకస్మాత్తుగా ఆమెపై దాడి చేశారు.. వెంటనే ఆమె కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు... అగంతకులలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ పెనుగులాటలోమహిళ చేతికి స్వల్పగాయాలయ్యాయి. 

19:35 - September 20, 2017

కర్నూలు : ప్రొఫెసర్‌ కంచె ఐలయ్యపై రాజ్యసభ సభ్యుడు TG వెంకటేశ్ మరోసారి ఫైర్ అయ్యారు. మరోసారి పూర్వికులను కించపరిచేలా మాట్లాడితే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. కంచె ఐలయ్య తనపై కేసులు పెట్టడాన్ని TG స్వాగతించారు. కంచె ఐలయ్య తన భాషతోపాటు.... పుస్తకంలోని పదాలు, చరిత్రను కించపరిచిన ఘటను సవరించుకోవాలని కర్నూలులో సూచించారు.

19:34 - September 20, 2017

గుంటూరు : ఎపీ సీఎం చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి ఇవాళ రెండుసార్లు భేటి అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన భేటీలో రాజమౌళితో పాటు మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో రాజధానిలో నిర్మిస్తున్న శాశ్వత అసెంబ్లీ, హై కోర్ట్ భవనాల డిజైన్స్‌పై చర్చ జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనుకుంటున్న అసెంబ్లీ, హైకోర్ట్ భవనాలకు సంబంధించి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా డిజైన్లను సూచించాలని చంద్రబాబు రాజమౌళిని కోరారు. అమరావతి డిజైన్స్‌ను తానింకా పూర్తి స్ధాయిలో చూడలేదని సీఎంతో మరోసారి భేటీ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తానని రాజమౌళి చెప్పారు. చంద్రబాబుతో భేటీ అనంతరం సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌తో కలిసి రాజమౌళి వెలగపూడి సచివాలయం, అసెంబ్లీ భవనాలను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం మరోసారి భేటీ అయ్యారు. 

19:33 - September 20, 2017

కృష్ణా: రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించడానికి కృషిచేస్తున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. టెక్నాలజీని వాడుకుని గ్రామ, మండలస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేస్తామన్నారు.

19:20 - September 20, 2017

యాజమన్యంతో తప్పిదంతోనే సొరంగ కూలింది

కరీంనగర్/సిరిసిల్ల : కాళేశ్వరం పనుల్లో ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య చేరింది. యాజమాన్యం నిర్లాక్ష్యం కారణంగా సొరంగం కూలిందని తెలుస్తోంది. సొరంగంలో మరికొందురు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 

19:10 - September 20, 2017

కరీంనగర్/సిరిసిల్ల : కాళేశ్వరం పనుల్లో ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య చేరింది. యాజమాన్యం నిర్లాక్ష్యం కారణంగా సొరంగం కూలిందని తెలుస్తోంది. సొరంగంలో మరికొందురు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏఈ వెంకటకిష్టయ్య

కర్నూలు : విద్యుత్ ఏఈ వెంకటకిష్టయ్య, రుద్రవరం మండలం పెద్దకంబలూరు చెందిన రైతు వద్ద రూ.68 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. 

కాళేశ్వరంపై ఎన్జీటీలో వాదనలు

ఢిల్లీ : కాళేశ్వరం పై దాఖలైన పిటిషిన్ పై ఎన్జీటీలో సుదీర్ఘ వాదనలు సాగాయి. టీఎస్ ప్రభుత్వ తరుపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కాళేశ్వరం తాగునీటి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు అవసరం లేదని, ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకే కాళేశ్వరం ప్రాజక్టు నిర్మిస్తున్నామని, ఇది బహుళ ప్రయోజనాల ప్రాజెక్టు అని ఆయన వాదించారు.

18:36 - September 20, 2017
18:13 - September 20, 2017

కరీంనగర్ : కుటుంబసభ్యులతో నడిచి వస్తున్న ఈ బామ్మ పేరు అనుమవ్వ. కరీంనగర్ జిల్లా వెలిచాలకి చెందిన అనుమవ్వ ఇటీవల 110వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కుటుంబసభ్యులంతా కలిసి ఆమె పుట్టినరోజును వేడుకగా జరిపారు. 60 ఏళ్లు బతకడమే అరుదుగా మారిన ఈరోజుల్లో 110 ఏట అడుగుపెట్టిన అనుమవ్వ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గ్రామీణ వాతావరణంలో జీవనం, అంబలితో పాటు కూరగాయలతో భోజనం అనుమవ్వ ఆరోగ్యంగా ఉండటానికి కారణమంటారు కుటుంబసభ్యులు. అనుమవ్వ ఇప్పటికి తన వంట తాను చేసుకోవడమే కాదు.. బంధువుల ఇళ్లల్లో శుభకార్యాలైనా.. ఫించను తెచ్చుకోవాలన్నా ఒంటరిగా వెళ్లి వస్తుందని చెబుతున్నారు.

వీరి సంతానం అంతా కలిపి 120 మంది
అనుమవ్వకు ఐదుగురు కొడుకులు.. ఇద్దరు కూతుళ్లు . వీరి సంతానం అంతా కలిపి 120 మంది. అనుమవ్వ పెద్ద కొడుకు వయసు 94ఏళ్లు కాగా.. కూతురి వయసు 93 ఏళ్లు. వీరంతా కూడా పూర్తి ఆరోగ్య వంతులుగా జీవనం సాగిస్తున్నారు. వీరంతా అనుమవ్వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని సంతోషంగా గడిపారు. మంచి ఆహారపు అలవాట్లుతో జీవన ప్రమాణాన్ని పెంచుకోవచ్చనడానికి అనుమవ్వ జీవితం చక్కని ఉదాహరణ. 

18:11 - September 20, 2017

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఈ నెల 23న గాంధీ భవన్‌లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తొందని, రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. ఈ విధానాలను నిరసిస్తూ నవంబర్‌ నెల 9,10,11 తేదీల్లో పార్లమెంట్‌ ముందు ఆందోళన చేపడతామని సాయిబాబా తెలిపారు.

18:10 - September 20, 2017

గద్వాల : జిల్లాలో నోబుల్‌ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి పర్యటించారు. జిల్లాకు వచ్చిన కైలాశ్‌... అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి స్థానిక MLA డీకే అరుణ, కలెక్టర్‌ రజత్‌ కుమార్‌, SP విజయ్‌ కుమార్‌, పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులతో కలిసి పాత బస్టాండ్‌ వరకూ ర్యాలీ చేశారు. ర్యాలీ తర్వాత ప్యారడైజ్‌ ఫంక్షన్‌ హాల్‌లో సమావేశానికి హాజరయ్యారు. బాలికలు, బాల కార్మికులపై జరుగుతున్న దాడులను సమావేశంలో అందరికీ వివరించారు. బాలికలపై కుటుంబ సభ్యులు, తెలిసినవారే ఎక్కువగా లైంగిక దాడులు చేస్తున్నారని తెలిపారు.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించేందుకు అందరం కృషి చేయాలని సూచించారు.

దసరా రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ బాదుడు

హైదరాబాద్: దసరా రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ బాదుడు ప్రారంభించింది. ఫ్లాట్ పాం టికెట్ ధర రూ. 10 నుందిచ రూ.20కి పెంచింది. పెంచిన ఫ్లాట్ ఫాం టికెట్ ధర అక్టోబర్ 10 వరకు అమలలో ఉండనుంది. దసరా రద్దీ ని రైల్వే శాఖ క్యాష్ చేసుకుంటుంది.

ఎస్ బీఐ బ్రాంచ్ లో హెడ్ క్లర్క్ కృష్ణ చైతన్య చేతివాటం

విజయవాడ: గాయత్రినగర్ ఎస్ బీఐ బ్రాంచ్ లో హెడ్ క్లర్క్ కృష్ణ చైతన్య చేతివాటం ప్రదర్శించాడు. తాకట్టు పెట్టిన 10.5 కిలోల బంగారాన్ని చోరీ చేసి మణప్పురం బ్రాంచ్ లో తనఖా పెట్టాడు. వచ్చిన డబ్బులను షేర్లలో పెట్టిన కృష్ణ చైతన్య. ఎస్ బీఐ ఫిర్యాదు కేసు నమోదు చేసిన సీఐడీ ఎస్బీఐ హెడ్ క్లర్క్ కృష్ణ చైతన్యతో పాటు మణప్పురం సిబ్బంది ఫణికుమార్, దిలీప్ పై కేసు నమోదు చేశారు.

17:08 - September 20, 2017

17 ప్రింటింగ్ ప్రెస్ లను 5కు కుదించనున్న కేంద్రం....

ఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీ 2 ఐటిడిసి హోటళ్ల ఆస్తుల వ్యవహారంపై కేబినెట్ లో చర్చ జరిగినట్లు సమాచారం. మూడు ప్రభుత్వ రంగ హోటళ్లలో వాటా ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 17 ప్రింటింగ్ ప్రెస్ లను ఐదుకు కుదించాలని, ఏ ఒక్కరికీ ఉద్యోగం పోకుండా ప్రింటింగ్ ప్రెస్ ల కుదింపుకు నిర్ణయం తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు దసరాకు ముందే బోసన్, ఖేలో ఇండియా పూర్తి స్థాయి పునరుద్ధరణకు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో క్రీడలను తప్పనిసరి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు సమాచారం.

16:31 - September 20, 2017

హైదరాబాద్ : తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీజీ వెంకటేష్ పై ఓయూ పీఎస్ లో కంచె ఐలయ్య ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఎస్ వీకే నుంచి ఓయూ పీఎస్ కు ర్యాలీగా కంచె ఐలయ్య బయల్దేరారు. వారిని అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:30 - September 20, 2017

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద కాళేశ్వరం సొరంగ మార్గం కూలి ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. మృతులు యూపీకి చెందిన వారిగా గుర్తించారు. సొరంగంలో మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

'కాళేశ్వరం' పనుల్లో ఘోర ప్రమాదం: 6గురి మృతి

రాజన్న సిరిసిల్ల: కాళేశ్వరం పనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. సొరంగం పై కప్పు కూలి ఆరుగురు కార్మికుల మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇల్లంతకుంట మండలం తిప్పా పూర్ వద్ద కాళేశ్వరం పదో ప్యాకేజీ పనుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సొరంగంలో మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. బ్లాస్టింగ్ దాటికి సొరంగం పై కప్పు కూలి ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

16:16 - September 20, 2017
16:13 - September 20, 2017

జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్‌లో గ్యాస్ సిలిండర్ పేలి, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆంజనేయులు, రాఘవేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బెలూన్‌లు నింపే గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. 

16:11 - September 20, 2017

వరంగల్ : నగరంలో బతుకమ్మ సందడి మొదలైంది. స్థానిక పాఠశాలల్లో ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. త్రినగరిలోని పాఠశాలలు తీరొక్కపూలతో కనువిందు చేస్తున్నాయి. ఆటపాటలతో విద్యార్థులు, టీచర్లు సందడి చేశారు. 

16:09 - September 20, 2017

హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ... దీనిపై సీబీఐ తో విచాణర జరిపించాలని వైసీపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కాంట్రాక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు లాలూచీ పడ్డారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. 

16:07 - September 20, 2017

ఖమ్మం : జిల్లా కేంద్రంలో కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై రగడ చోటుచేసుకుంది. పుస్తకానికి వ్యతిరేకంగా.. ఆర్యవైశ్యులు ఆందోళన చేయగా.. ఐలయ్యకు మద్దతుగా బహుజనుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దీంతో జడ్పీ సెంటర్‌లో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. స్వల్పంగా తోపులాట కూడా చోటు చేసుకుంది. కాగా బహుజనుల జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

16:06 - September 20, 2017

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లు సమ్మె విరమించడానికి సమ్మతించారు. డాక్టర్లపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు చెప్పడంతో నిరసన విరమిస్తున్నట్టు వారు తెలిపారు. ఇప్పటికే 4గురుని అరెస్టు చేసిన పోలీసులు..మరో ముగ్గురిని అరెస్టు చేస్తామని హామి ఇచ్చారని డాక్టర్ల ప్రతినిధులు తెలిపారు. 

ఓయూ పీఎస్ లో టీజీ వెంకటేష్ పై ఐలయ్య ఫిర్యాదు

హైదరాబాద్: తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీజీ వెంకటేష్ పై ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేసేందుకు కంచ ఐలయ్య ఎస్ వికె నుంచి ఓయూ పీఎస్ వరకూ ర్యాలీగా ఐలయ్య, టీమాస్ నేతలు బయలు దేరారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కారులో ఓయూ పీఎస్ బయలుదేరారు.

 

ప్రొ.కంచె ఐలయ్యపై పరిపూర్ణానంద స్వామి ఫైర్

తూ.గో: ప్రొ.కంచె ఐలయ్యపై పరిపూర్ణానంద స్వామి ఫైర్ అయ్యారు. వైశ్యులు తమ సంపాదనలో 10 శాతం సమాజం కోసం, ధర్మకార్యాల కోసం ఉపయోగిస్తారని తెలిపారు. మతం మారాక ఐలయ్యకు మతిపోయిందన్నారు. హిందూత్వ జోలికి వస్తే ఐలయ్య కథ కంచికి చేరుతుందన్నారు. ఐలయ్య పుస్తకం పై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేశారు. ఐలయ్య వెనుకన్న వారిపై కూడా దృష్టి పెట్టాలని, లేదంటే మా గళం, దళం, బలం ఏమిటో చూపిస్తామన్నారు.

ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ జీవోలు విడుదల

అమరావతి: ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ జీవోలు విడుదల అయ్యాయి. జీవోలు, 72,73,74 లను మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేశారు. సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు కృషి వల్లే ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధ్యమైందని తెలిపారు. పాఠశాల హెడ్ మాస్టర్లకు జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్లు కల్పిస్తామన్నారు.

మరోసారి సీఎం తో భేటీ కానున్న రాజమౌళి

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో రాజమౌళి భేటీ ముగిసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో సాయంత్రం మరోసారి భేటీకానున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... రాజధాని ప్రాంతంలో ఉదయం నుంచి పర్యటించారని, ఐకానిక్ భవనాలు నిర్మించే ప్రాంతం, తాత్కాలిక సచివాలయం, కృష్ణా పరివాహక ప్రాంతాలను రాజమౌళి పరిశీలించారని తెలిపారు. సాయంత్రం 6.30 గంటలకు మరోసారి సీఎంతో రజమౌళి భేటీ అవుతారని తెలిపారు. రాజమౌళి లండన్ పర్యటన ఇంకా ఖరారు కాలేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

15:10 - September 20, 2017

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి రెండోసారి భేటీ ముగిసింది. సాయంత్ర మళ్లీ విజయవాడలో క్యాంప్ కార్యాలయంలో మరోసారి వీరు భేటీ కానున్నారు. రాజమౌళి ఉదయం నుంచి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఆయన ఐకానిక్ భవనాలు నిర్మించే ప్రాంతాలను పరిశీలించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

పాకిస్థాన్ క్రికెటర్ ఖలీద్ లతీఫ్ పై ఐదేళ్ల నిషేధం

హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెటర్ ఖలీద్ లతీఫ్ పై ఐదేళ్ల నిషేధం విధించారు. మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో పీకేబీ నిషేధం విధించింది.

'పోలవరం' విచారణలో తెలంగాణను తప్పించాలని కోరిన ఏపీ

ఢిల్లీ: పోలవరం పై ఎన్ జీటీలో జరుగుతున్న విచారణ నుంచి తెలంగాణను తప్పించాలని ఏపీ కోరింది. సుప్రీంలో పలు పిటిషన్ లపై విచారణ పూర్తయ్యే వరకూ ఎన్జీటీలో విచారణను నిలిపి వేయాలని ఏపీ కోరింది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతివాదిగా తొలగించే అంశంపై వారంలోగా అభ్యంతరాలు తెలియజేయాలని స్వచ్ఛంద సంస్థ రేలాకు ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది.

14:35 - September 20, 2017

వీడకులపై సహాలు, సందేహలపై మానవి మై రైట్. భార్యభర్తల మధ్య కుటుంబ కలహాలు సాధారణమని ప్రముఖ అడ్వకేట్ పార్వతీ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:22 - September 20, 2017

ముంబై : టీం ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోని అరుదైన గౌరవం దక్కింది. బీసీసీఐ పద్మభూషణ్ అవార్డుకు ధోని పేరు సిఫారసు చేసింది. ధోని పేరును బీసీసీఐ బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ప్రతిపాందించారు. ధోని నేతృత్వంలో భారత్ కు రెండు ప్రపంచకప్ లు వచ్చాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

జూడాలపై దాడి చేసిన ఇద్దరిని అరెస్ట్ చేశాం: ఏసీపీ

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో జూడాలపై దాడి చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. రోగి బంధువులు విచక్షణ కోల్పోయి వైద్యుల పై దాడి చేశారని పేర్కొన్నారు. మృతదేహాన్ని రోగి బంధువులకు అప్పగించామని, సమ్మె విరమణపై జూడాలతో పోలీసులు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

పద్మభూషణ్ కు ధోని పేరును సిఫార్సు చేసిన బీసీసీఐ

ముంబై: భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌కు ధోనీ పేరును బీసీసీఐ నామినేట్ చేసింది. కెప్టెన్ కూల్‌గా పేరున్న ధోనీకి 2007లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు వచ్చింది. అనంతరం 2009లో పద్మ శ్రీ పురస్కారంతో ధోనీని కేంద్ర ప్రభుత్వం సత్కరించిన విషయం తెలిసిందే.

అవిశ్వాస తీర్మానంపై మద్రాస్ హైకోర్టు స్టే

చెన్నై : అవిశ్వాస తీర్మానంపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అవిశ్వాస తీర్మానం నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశించింది. అనర్హత వేటు పడ్డ 18 మంది ఎమ్మెల్యేల స్థానాలకు ఎన్నికలు నిర్వహించొద్దని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 4కు వాయిదా వేసింది.

14:08 - September 20, 2017

చెన్నై : తమిళ రాజకీయాలు మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీలో బలపరీక్షపై చెనన్నై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశౄలు ఇచ్చేవరకు బలపరీక్ష నిర్వహించొద్దని హై కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది. దినకరన్ వర్గం చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడంపై హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

సీఎం చంద్రబాబుతో చంద్రమౌళి మరోసారి భేటీ

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడితో డైరెక్టర్ రాజమౌళి మరోసారి భేటీ అయ్యారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఆకృతులపై చర్చించినట్లు సమాచారం.

13:43 - September 20, 2017
13:32 - September 20, 2017

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా సంబరాలు మొదలయ్యాయి. నేటినుంచి ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే పండుగ.. ఈనెల 28న సద్దులతో ముగియనుంది. ఈ పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ సర్కార్‌... మొత్తం తొమ్మిదిరోజుల పాటు గతంలో కంటే భారీగా ఉత్సవాలు జరిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. వరంగల్ నగరంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో మతసౌమరస్యం వెల్లివిరిసింది. హిందూ - ముస్లిం మహిళలు పాల్గొని ఆడిపాడారు. 

13:23 - September 20, 2017

హైదరాబాద్ : మళ్లీ పాతబస్తీలో అరబ్ షేక్ లు అరెస్టు కావడం కలకలం రేపుతోంది. పేద ముస్లిం కుటుంబాలను పలువురు అరబ్ షేక్ లు టార్గెట్ చేయడం..బాలికలు పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లి చిత్రహింసలకు గురి చేయడం లాంటి సంగతులు చూస్తూనే ఉంటాం. డబ్బులకు ఆశ పడి పలువురు తల్లిదండ్రులు షేక్ లకు ఇచ్చి వివాహం చేస్తుంటారు. ఇందులో కాజీలు కీలక పాత్ర పోషిస్తుంటారు. తాజాగా పాతబస్తీలో అరబ్ షేక్ ల కుట్రలకు సౌత్ జోన్ పోలీసులు చెక్ పెట్టారు. 

ఫలక్ నుమా, చాంద్రాయణగుట్టలో రహస్యంగా బాలికలను వివాహం చేసుకుంటున్నారన్న సమచారం మేరకు సౌత్ జోన్ పోలీసులు దాడులు జరిపారు. 8మంది అరబ్ షేక్ లను వీరితో పాటు 8 మంది మధ్యవర్తులను సౌత్ జోన్ అరెస్టు చేశారు. పాతబస్తీలో ముగ్గురు కాజీలు, ముంబై నుండి వచ్చిన మరొక కాజీని అదుపులోకి తీసుకుని విచారించారు. అంతేగాకుండా నలుగురు లాడ్జ్ ఓనర్లను కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. ఇందులో 20 మంది రాకెట్ లో పట్టుబడడం సంచలనం సృష్టిస్తోంది. 

13:18 - September 20, 2017

హైదరాబాద్ : ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమౌతోంది. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కాలేజీల అప్లికేషన్స్ లను నిరాకరిస్తూ తీసుకున్న నిర్ణయంతో లక్ష మంది విద్యార్థుల భవిష్యత్ ఆగమ్యగోచరంగా తయారైంది. 1700 కాలేజీలు అప్లికేషన్స్ దాఖలు చేసుకున్నాయి. కానీ 302 కాలేజీల గుర్తింపు రద్దు చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. సెకండియర్ లో 50 వేలు, ఫస్ట్ ఇయర్ లో 50 వేలు..మొత్తంగా చూస్తే లక్ష మంది విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. రద్దయిన కాలేజీల విషయాల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ పై ఇంటర్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇంటర్ బోర్డు చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

ఏపీ గ్రూప్ -2 నియామకాలపై అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ స్టే

అమరావతి: ఏపీ గ్రూప్ -2 నియామకాలపై అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. అక్టోబర్ 9 వరకు ఎలాంటి నియామక ప్రక్రియ చేపట్టొద్దని ఏపీ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఆన్ లైన్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరిగిందని బాధితులు పిటిషన్ దాఖలు చేశారు.

12:54 - September 20, 2017
12:53 - September 20, 2017
12:52 - September 20, 2017

నల్గొండ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తోంది. నాసిరకం చీరలు పంపిణీ చేస్తున్నారంటూ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు బయటపడింది. బతుకమ్మ చీరల పంపిణీలో టీఆర్ఎస్ వర్గాలు గొడవకు దిగాయి. పేనీ పల్లి మండల కేంద్రంలో చీరల పంపిణీకి ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ హాజరయ్యారు. తమకు సమాచారం ఇవ్వకుండా చీరల పంపిణీ ఎలా చేపడుతారంటూ జడ్పీ ఛైర్మన్ బాలు నాయక్ వర్గం గొడవకు దిగి ఎమ్మెల్యే వర్గాన్ని అడ్డుకొంది. దీనితో చీరల పంపిణీ రసాభాసగా సాగింది. ఇరువర్గాలు పోటా పోటీగా నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. 

12:45 - September 20, 2017
12:34 - September 20, 2017

తమిళనాడు : రాష్ట్రంలో రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. అందరి చూపు మద్రాసు హైకోర్టుపైనే నెలకొంది. తీవ్ర ప్రభావితం చేయగల ఈ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని రోజులుగా తమిళనాడులో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. అమ్మ మరణం అనంతరం అనేక రాజకీయ కోణాల నేపథ్యంలో ముక్కలైన అన్నాడీఎంకే పార్టీ బీజేపీ చొరవతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రస్తుత సీఎం పళనీ స్వామీ, పన్నీర్ వర్గాలు కలిసిపోయాయి. పన్నీర్ వర్గానికి పలు పదవులు కూడా దక్కాయి.

టిటివి దినకరన్ మాత్రం తనకు కొంతమంది ఎమ్మెల్యేల సపోర్టు ఉందని పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఆయనకు మద్దతు పలుకుతున్న 18 మందిపై అనర్హత వేటు వేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. ఈ నెల 20 వరకు అసెంబ్లీలో సీఎం పళని స్వామి బలపరీక్షకు ఆదేశించవద్దన్న హైకోర్టు గడువు ఇవాల్టితో ముగియబోతోంది. దీంతో ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారనే ఉత్కంఠ పెరిగింది.

ఎమ్మెల్యేల అనర్హత వేటుపై దినకరన్ వర్గం దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు విచారణకు స్వీకరించింది. అత్యవసర అంశం కింద విచారణ జరపాలన్న పిటిషనర్ల విజ్ఞప్తి మేరకు బుధవారం విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. అంతేగాకుండా పళనీ స్వామి సర్కార్ బలం నిరూపించుకోవాలని డీఎంకే వేసిన పిటిషన్ పై విచారణ జరుగనుంది. దీనిపై ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి. 

12:22 - September 20, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 50వేల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. రాష్ట్రంలోని 1700 కాలేజీల్లో 235 కాలేజీలు ఇంటర్ బోర్డుకు అప్లికేషన్ డిటైయిల్స్ సమర్పించలేదు. దీనితో కాలేజీల గుర్తింపును బోర్డు రద్దు చేసింది. అందులో ఉన్న విద్యార్థులు లబోదిబోమంటున్నారు. రేపటితో గడువు ముగుస్తుండడంతో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందోనని విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ విద్యార్థుల ద్వారా ప్రైవేటు కాలేజీల ద్వారా పరీక్షలు రాయిస్తారా ? ఇతరత్రా విషయాలు తెలియరావడం లేదు.

మార్చి నెలలో పరీక్షలు ఉండనున్న నేపథ్యంలో అక్టోబర్ నెల నుండి ఫీజు వసూలు చేస్తుంటారు. సరియైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గుర్తింపు పలు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నారాయణ, చైతన్య కాలేజీలు భారీగా జరిమాన కట్టిన సంగతి తెలిసిందే. 

235 ఇంటర్ కాలేజీల గుర్తింపు రద్దు

హైదరాబాద్: తెలంగాణ లో రాష్ట్రవ్యాప్తంగా 235 కాలేజీల గుర్తింపును ఇంటర్ బోర్డు రద్దు చేసింది. దీంతో 50 వేల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

ఖమ్మంలో బహుజనల జేఏసీ నేతల అరెస్ట్...

ఖమ్మం: ప్రొ.కంచె ఐలయ్య పుస్తకంపై ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగారు. ఐలయ్యకు మద్దతుగా బహుజనుల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ సెంటర్ లో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. బహుజనుల జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

12:14 - September 20, 2017

ఖమ్మం : సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో వివాదానికి దారి తీస్తోంది. ఆర్య వైశ్య సామాజిక వర్గం నుంచి పుస్తకంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమౌతోంది. అందులో భాగంగా ఖమ్మం లో కంచె ఐలయ్య రాసిన ఈ పుస్తకంపై చర్చ జరుగుతోంది. ఐలయ్యకు మద్దతుగా బహుజనుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తోంది. స్థానిక జడ్పీటీసీ సెంటర్ వద్ద జేఏసీ నేతలు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలోనే ఆర్య వైశ్యులు కూడా ఆందోళన నిర్వహిస్తూ జడ్పీటీసీ సెంటర్ వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాలు ఎదురుపడడంతో వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. బహుజనుల నేతలను నోటికొచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి బహుజనుల నేతలను అరెస్టు చేసి తీసుకెళుతుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్యవైశ్యులను మాత్రం అరెస్టు చేయలేదని వార్తలు వెలువడుతున్నాయి. 

బతుకమ్మ చీరల పంపిణీలో తన్నుకున్న నేతలు..

నల్లగొండ: పీఏపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బతుకమ్మ చీరల పంపిణీలో అధికార పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ చీరలు పంపినీ చేస్తుండగా జెడ్పీ ఛైర్మన్ బాలూ నాయక్ వర్గం అడ్డుకుంది. సమాచారం లేకుండా చీరలు ఎలా పంపిణీ చేస్తారని ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొడంతో అప్రమత్తమైన పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేసి పలువురిని అరెస్ట్ చేశారు.

8మంది అరబ్ షేక్ ల అరెస్ట్...

హైదరాబాద్ : ఓల్డ్ సిటీలో ముస్లిం బాలికలకు ఒప్పంద వివాహాలు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలోని పోలీసుల బృందం తనిఖీలు చేసి 20 మందిని అరెస్టు చేశారు. ముగ్గురు ఖాజీలు, 8 మంది అరబ్‌షేక్‌లు, ఐదుగురు మధ్యవర్తులు, నలుగురు హోటల్ యజమానులను అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. వీరందరిని విచారిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఏడాది చిన్నారిని చంపి తల్లి ఆత్మహత్య...

కుమ్రంభీం: కాగజన్ నగర్ మండలం సీతానగర్ లో విషాధం నెలకొంది. ఏడాది కూతురిని చంపిన తల్లి జయ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

అర్హులకు ఇళ్లు కేటాయించాలంటూ విజయవాడలో మహా ధర్నా

విజయవాడ: ఇళ్ళు, ఇళ్ల పట్టాలు అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటియూ, ఐద్వా, పౌరసంక్షేమ సంఘం, కేవీపీఎస్, డీవైఎఫ్ ఐ ఆధ్వర్యంలో మహా ధర్నా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పేదలు, కార్మికులు తరలి వచ్చారు.

11:27 - September 20, 2017

విజయవాడ : అర్హులైన వారికి ఇళ్లు..ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వద్ద భారీ ఆందోళన చేపట్టారు. సీఐటీయూ, ఐద్వా, పౌర సంక్షేమ సంఘం, కేవీపీఎస్, ఆవాజ్, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ మహాధర్నా జరుగుతోంది. ధర్నాకు పేదలు..కార్మికులు భారీగా తరలివచ్చారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలివ్వాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా సీపీఎం నేత బాబురావు, ఇతర నేతలు టెన్ టివితో మాట్లాడారు. మూడున్నరేండ్ల పాలనలో పేదలకు ఒక్క ఇళ్లు కేటాయించలేదని, విజయవాడ శాసనసభ్యులు, టిడిపి నాయకులు అమ్ముకుంటున్నారని..పేదలకు వట్టి చేతులు చూపిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఉన్న వారికి ప్రభుత్వం వందలాది ఎకరాలు కేటాయిస్తోందని, మాట తప్పిందని ధ్వజమెత్తారు. ఓట్లు గుంజుదామనే ఆశ తప్ప ఇళ్లు కేటాయించాలనే సోయి ప్రభుత్వానికి లేదన్నారు. విజయవాడ కార్పొరేషన్ ఆఫీసును..ఇతరత్రా వాటిని అమ్మేయ్యడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

ఏసీబీకి చిక్కిన టెక్కలి వీఆర్ వో

విజయనగరం: నెల్లిమర్ల మండలం టెక్కలిలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. రూ.14వేలు లంచం తీసుకుంటూ వీఆర్ వో కృష్ణ పట్టుబడ్డాడు.

11:26 - September 20, 2017

హైదరాబాద్ : రోగుల బంధువుల నుండి తమను రక్షించాలని జూ.వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. రక్షణ కల్పించేంత వరకు విధులకు హాజరు కాబోమని తేగెసి చెబుతున్నారు. దీనితో గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. రోగి బంధువులు దాడి చేయడంతో ఈ వివాదం చెలరేగింది. ఈ ఘటనలో రెండు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

తాము చికిత్స అందించడం జరిగిందని, ఒక చెకప్ చేయించాలని చెప్పడం జరిగిందని..అనంతరం రోగి బంధువులు కనబడలేదన్నారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి తిరిగి ఇక్కడకు రావడం..కొంతసేపటికి రోగి మృతి చెందాడని వైద్యులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే బయట ఓ పరీక్ష చేయించుకొని రావాలని వైద్యులు చెప్పడంతో తాము బయటకు వెళ్లడం జరిగిందని మృతి చెందిన రోగి బంధువులు పేర్కొంటున్నారు. రోగుల పట్ల వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

మహ్మద్ మున్నీర్ అనే రోగి ఆసుపత్రిలో మృతి చెందాడు. ఇందుకు వైద్యులే కారణమని పేర్కొంటూ రోగి బంధులు వైద్యులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళా డాక్టర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఆర్ఎంఓ చిలకలగూడ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

తెలుగు ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు: గవర్నర్

హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భగా తెలుగు ప్రజలకు గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పండగ జరుపుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

 

11:18 - September 20, 2017

నువ్వుల ఆరోగ్యం పదిలాంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ నువ్వులు శరీరానికి అవసరమైన, ఆరోగ్యాన్ని పెంపొంచే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి కావున వీటిని 'పవర్ హౌసెస్' అంటారు. ఇవి మినరల్స్, కాల్షియం, జింక్, ఐరన్, థయామిన్ మరియు విటమిన్ 'E'లను కలిగి ఉంటాయి, అంతేకాకుండా ఆరోగ్యానికి మంచిని కలిగించే చాలా రకాల మూలాకాలు వీటిలో ఉంటాయి.

గ్యాస్ ట్రబుల్స్ కు చెక్ పెట్టే నువ్వుల నూనె...

ఎంతోమంది గ్యాస్‌ ట్రబుల్‌తో బాధపడుతుంటారు. గ్యాస్‌ ట్రబుల్‌ తగ్గడానికి నువ్వు బాగా ఉపయోగపడతాయంట. అదెలా అంటే ఒక అరకప్పు పాలలో రెండు స్పూన్ల నువ్వులనూనె కలిపి ప్రతిరోజు కొంతకాలం తాగినట్లయితే పొట్టలో కురుపులు, గ్యాస్‌కు సంబంధించి మలబద్దకం వంటివి తగ్గిపోతుంది. అలాగే గ్యాస్‌ ట్రబుల్‌ అనేదే ఉండదు. ఇకపోతే.. నువ్వులను నానబెట్టి రుబ్బి తయారుచేసిన అరకప్పు పాలలో కొద్దిగా బెల్లం కలిపి సేవిస్తుంటే జీర్ణశక్తి వృద్ధి కావటమే కాక కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులపై కూడా పనిచేస్తాయి.

11:17 - September 20, 2017

ఢిల్లీ : ఉక్రెయిన్ లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. జపోరోజియా రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ కు చెందిన శివకాంత్ రెడ్డి, బీఎన్ రెడ్డినగర్ కు చెందిన అశోక్ లు జపోరోజియాలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇక్కడ వేయి మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 600 మంది విద్యార్థులు తెలుగు వారు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే పక్కనే ఉన్న సరస్సుకు శివకాంత్ రెడ్డి, అశోక్ తో పాటు మరో ముగ్గురు వెళ్లారు. ఇక్కడ ఈత రాని అశోక్ ప్రమాదవశాత్తు సరస్సులో మునిగిపోయాడు. ఇతడిని కాపాడే క్రమంలో శివకాంత్ రెడ్డి కూడా గల్లంతయి మృతి చెందాడు.
ఆగస్టు 28 సెలవులు ముగించుకుని ఇక్కడకు రావడం..ఈ మధ్యలోనే విషాదం చోటు చేసుకోవడంతో స్నేహితులు..కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

బీహార్ లో ప్రారంభానికి ముందే కుప్పకూలిన డ్యామ్

బీహార్ : నీటిపారుదల స్కీమ్‌ కింద చేపట్టిన కెనాల్‌ ప్రాజెక్టు డ్యామ్‌ ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలింది. మరో 24 గంటల్లో సీఎం ఈ డ్యామ్‌ను ప్రారంభం చేస్తారనగా ఈ ఘటన చోటుచేసుకుంది. బిహార్‌లోని భాగల్పూర్‌లో కహల్‌గావ్‌ వద్ద ఇరిగేషన్‌ స్కీమ్‌ కింద బతేశ్వర్‌ పంత్‌ కెనాల్ ప్రాజెక్ట్ ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్ట నిర్మించడానికి ప్రభుత్వం రూ.389.31 కోట్లను ఖర్చుచేసింది. మరో 24 గంటల్లో ఆ ఆనకట్టను ఆ రాష్ట్ర సీఎం నితీష్‌ కుమార్‌ ప్రారంభించనున్నారు. 

11:05 - September 20, 2017

ఓంకార్ డైరెక్షన్ లో వచ్చిన రాజుగారి గది మూవీ సీక్వెల్ రాజుగారి గది-2 ట్రైలర్ రిలీజ్ అయింది. రాజుగారి గది 2 మాత్రం హార్రర్.. ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. కళ్లల్లో చూస్తూ.. గుండెలో ఏముందో చెప్పగలిగే మెంటలిస్ట్‌గా నాగార్జున యాక్ట్ చేశారు. సమంత, కాజల్ అగర్వాల్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్, శకలక శంకర్, రాజేష్ ఈ మూవీలో మంచి కామెడీని పంచారు. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.

10:59 - September 20, 2017

సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుండి వరల్డ్ వైడ్ కి ఎదిగిన నటుడు రజినీకాంత్..తలైవా సినిమా అంటే తమిళనాడులోనే కాకా వరల్డ్ వైడ్ కూడా ఫాన్స్ వెయిట్ చేస్తుంటారు. ఫాన్స్ కోసం ఈ ఏజ్ లో కూడా స్టెప్స్ వేస్తూ ఫైట్స్ చేస్తున్న తలైవా రజనీకాంత్ ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ లో పార్ట్ అయ్యాడు.

సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ పెరుగుతోంది..రీజనల్ ఏరియాస్ కి పరిమితమైన సినిమాలు ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ కి సిద్ధం అవుతున్నయి. శంకర్ డైరెక్షన్ లో ప్రస్తుతం రజినీకాంత్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ 'రోబో 2 .0’. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న శంకర్ 'రోబో' ఫస్ట్ పార్ట్ లో చూపించిన గ్రాఫిక్స్ కంటే ఎక్కువ వర్క్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. శంకర్-రజినీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘2.0’. ఈ రోబో ‘2.0’ ఆడియో వేడుక కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఈ వేడుకను దుబాయిలో నిర్వహించబోతున్నట్లు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. దట్ ఈజ్ రజనీకాంత్..

రజనీకాంత్ నుండి వచ్చిన వన్ అఫ్ థీ బెస్ట్ ఫిలిం 'బాషా'. పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ అద్భుత చిత్రంలో.. ఆటో డ్రైవర్ గా.. ముంబై అండర్ వరల్డ్ డాన్ గా విభిన్న గెటప్ లలో రజినీ కనిపిస్తారు. 'భాషా' సినిమా డిజిటల్ లో వచ్చిన విషయం తెలిసిందే. ఈ డిజిటల్ 'భాషా'ను యూఎస్ లో జరగనున్న ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబోతున్నారు. సెప్టెంబర్ 21 నుంచి 28 వరకూ యూఎస్ లో 12వ ఫెంటాస్టిక్ ఫెస్ట్ జరగనుంది. వరల్డ్ వైడ్ సెలెక్టెడ్ సినిమాలను ప్రదర్శించే ఈ ఫెస్ట్ లో మన 'భాషా' ఉండటం గర్వకారణం.

90 శాతం ప్రజల్లో సంతృప్తి ఉండాలి: సీఎం చంద్రబాబు

విజయవాడ: సంక్షేమం లేకుండా ఎంత అభివృద్ధి చేసినా ప్రజలు సంతృప్తి చెందరని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ.. 90 శాతం ప్రజల్లో సంతృప్తి ఉండాలని, జాతీయ వృద్ధి కంటే రాష్ట్ర వృద్ధి రేటు బాగుందన్నారు. కలెక్టర్లు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని, నా తర్వాత కలెక్టర్లకే ఎక్కువ అధికారులున్నాయన్నారు. మూడో విడత రుణమాఫీ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.

చొరబాటుకు యత్నించిన ఇద్దరు హతం

ఢిల్లీ: దేశ సరిహద్దు లో అజ్నాల సెక్టార్‌లో ఇద్దరు పాకిస్థానీయులు భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించారు. పాకిస్థాన్ దేశస్తుల చొరబాటును పసిగట్టిన బీఎస్‌ఎఫ్ బలగాలు.. వారిద్దరిని మట్టుబెట్టాయి. ఘటనాస్థలి నుంచి 4 కేజీల గంజాయి, ఏకే 47, తుపాకులు, బుల్లెట్లు, పాక్‌కు చెందిన సెల్‌ఫోన్లతో పాటు సిమ్‌కార్డులు, పాక్ కరెన్సీని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

10:31 - September 20, 2017

విజయవాడ : 'ఏమీ అవలేదు...ఏమీ జరగలేదు' అని ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు. విజయవాడలోని ఉండవల్లికి చేరుకున్న అనంతరం ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం వచ్చిన ఆయన్ను మీడియా ప్రశ్నించింది. భేటీకి సంబంధించిన వివరాలపై స్పందించలేదు. తనకు ఇక్కడకు రావడానికి ఆలస్యం అయ్యిందని..మాట్లాడే అవకాశం దొరకలేదని..మధ్యాహ్నం కలిసిన అనంతరం వివరాలను మీడియాకు చెబుతానని పేర్కొన్నారు.

అమరావతి రాజధాని, ఏపీ హైకోర్టుకు సంబంధించిన డిజైన్ల విషయంలో రాజమౌళి సలహాలు..సూచనలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు రాజమౌళితో భేటీ అయ్యి చర్చించారు. అందులో భాగంగా సీఎం చంద్రబాబుతో రాజమౌళి భేటీ అయ్యారు. రాజమౌళిని లండన్ కు కూడ పంపాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం. 

మీ భూమి పోర్టల్ ను తెలుగులోనే: కేఈ

అమరావతి: రాష్ట్రంలో రెండు ముఖ్యమైన పరిణామాలు జరిగాయాని, అవి నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్ ఎన్నికలు ఈ రెండు ఎన్నికల్లో టిడిపికి ఘన విజయం అదించారని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఇది ప్రభుత్వం పై ప్రజలకు గల విశ్వాసానికి నిదర్శనం అని, సాంకేతికతను వినియోగించుకోవడంలో ప్రభుత్వం ఉందుందని, మీ భూమి పోర్టల్ ను తెలుగులోనే నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. రెవెన్యూ శాఖ ప్రజల కోసం నిర్వహిస్తున్న పోర్టల్స్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు.

జీఎస్ డీపీలో పురోగతి సాధించాం:మంత్రి యనమల

విజయవాడ: మూడేళ్లలో సీఎం దార్శనికత, శ్రమ వల్ల జీఎస్ డీపీలో పురోగతి సాధించామని మంత్రి యనమల రాకృష్ణుడు అన్నారు. ఇంకా ఎంతో సాధించాలని, ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలని, వృద్ధి రేటులో దేశంలో హెచ్చుతగ్గులు ఉన్నాయన్నారు. వృద్ధిపరంగా మంచి ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలని, వ్యవసాయ రంగంలో మంచి పురోగతి సాధించినట్లు తెలిపారు. పారిశ్రామికంగా ఇంకా మెరుగుపడాల్సి వుందన్నారు.

10:26 - September 20, 2017

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. తమకు రక్షణ కల్పించాలంటూ నినదిస్తున్నారు. తమ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కనబరుస్తోందని పేర్కొంటున్నారు. రోగి బంధువులు దాడి చేయడంతో వివాదం చెలరేగింది.

మంగళవారం తెల్లవారుజామున ఓ రోగి గాంధీ ఆసుపత్రికి వచ్చాడు. కొద్దిసేపటి అనంతరం ఆ రోగి మృతి చెందాడు. ఒక్కసారిగా ఆగ్రహం చెందిన రోగి బంధువులు వైద్యులపై దాడి చేశారు. రోగిని బతికించేందుకు తమ ప్రయత్నం చేయడం జరిగిందని, కానీ అతను చనిపోయాడని వైద్యులు పేర్కొంటున్నారు.

మంగళవారం తెల్లవారుజామున ఓ రోగి కిడ్నీ ఫెయిల్ అయి ఆసుపత్రికి వచ్చాడని..అతనికి తాము చికిత్స ఇచ్చామని ఓ వైద్యుడు పేర్కొన్నారు. అనంతరం పేషెంట్ కనిపించకుండా పోయాడని, అతని కోసం వెతకినట్లు తెలిపారు. సుమారు చాలా ఆలస్యంగా మళ్లీ ఆ రోగి వచ్చాడని, కొద్దిసేపటికే అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందాడని పేర్కొన్నారు. కానీ రోగి బంధువులు తమపై ఒక్కసారిగా దాడి చేశారని, ముగ్గురు వైద్యులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. వైద్యులపై ఎలా దాడి చేస్తారని, వెంటనే దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

రాంగోపాల్ వర్మ, దాసరి కిరణ్ అరెస్ట్ కు ఆదేశాలు..

విజయవాడ: వంగవీటి సినిమా తెరకెక్కించిన వర్మపై వంగవీటి రాధ పిటీషన్ పై విచారణ జరిపించిన విజయ వాడ కోర్టు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

 

ఉక్రెయిన్ లో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు మృతి

హైదరాబాద్: ఉక్రెయిన్ లో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు మృతి చెందారు. వాలీబాల్ ఆడుతూ సముద్రంలో కొట్టుకుపోయిన ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థులు శివకాంత్ రెడ్డి, అశోక్. శివకాంత్ రెడ్డి హయత్ నగర్ వాసి కాగా, అశోక్ బీఎన్ రెడ్డి నగర్ వాసి అని తెలుస్తోంది.

10:04 - September 20, 2017

అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ప్రసాద్ ఇంట్లో ఏసీబీ సోదాలు

తూ.గో: కాకినాడలో జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ప్రసాద్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రూ.50 వేలు లంచం తీసుకుంటూ ప్రసాద్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో ఏసీబీ అధికారులు సోదాల ప్రారంభించారు.

గాంధీలో కొనసాగుతున్న జూడాల ఆందోళన

సికింద్రాబాద్: గాంధీలో జూడాల ఆందోళన కొనసాగుతుంది. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సమ్మె చేపడతామంటూ జూడాలు హెచ్చరిస్తున్నారు.

కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సు

అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం 13వ కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. రాష్ట్రంలో ఉత్పాదకత పెంపు, పారదర్శక పాలనకు ఉత్తమ అభ్యాసాలను అనుసరిస్తున్నాం అని సీఎస్ దినేష్ కుమార్ తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్, ఈ-ప్రగతి, ప్రజలే ముందు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. కలెక్టర్లు ర్రాతి వేళల్లో గ్రామాల్లో నిదురించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని తెలిపారు.

 

ముంబైని ముంచెత్తిన వర్షం

 హైదరాబాద్ : ముంబై నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పురాతన భవనాల్లో ఉండే వారు ఖాళీ చేయాలని ఆదేశించింది. ఎయిర్ పోర్ట్ లో రన్ వే పైకి వరద నీరు చేరడంతో రన్ వే పై స్పైస్ జెట్ విమానం నిలిచిపోయింది. దీంతో ముంబై ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలు నిలిపివేశారు. ముంబైలో దిగాల్సిన విమానాలు హైదరాబాద్ కు మళ్లించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు కు 16 విమానాలు చేరుకున్నాయి. హైదరాబాద్ - ముంబై విమానాలు 24 గంటల పాటు రద్దు చేశారు. ప్రయాణీకులను ఎయిర్ పోర్టు సిబ్బంది పట్టించుకోకపోవడంతో వారు ఆందోళనకు దిగారు.

09:39 - September 20, 2017

పెద్దపల్లి : సింగరేణిలో ఎన్నికల వేడి రాజుకొంటోంది. ఆరో విడత ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. దీనితో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరపున ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ఆర్జీ1 గని గేట్ వద్ద వారు మీటింగ్ నిర్వహించారు. కొప్పుల ఈశ్వర్ ను ఇతర కార్మిక సంఘానికి చెందిన సింగరేణి కార్మికులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొప్పుల ఈశ్వర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వీఆర్ఎస్ ఉద్యోగాల రద్దుకి టీఆర్ఎస్ నేతలే కారణమంటూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా టిబిజీకేఎస్ కార్యకర్తలు..ఏఐటీయూసీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

ఏపీ కలెక్టర్ల సదస్సు ప్రారంభం..

విజయవాడ : మూడు నెలలకొకసారి నిర్వహించే కలెక్టర్ల సమావేశం బుధవారం ఉదయం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు  నిర్వహించే ఈ సదస్సులో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.

138 మంది మృతి..

మెక్సికో : మంగళవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.1గా నమోదైంది. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. ఇప్పటి వరకు 138 మంది మృతి చెందారు. 

09:28 - September 20, 2017

మెక్సికో : మంగళవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.1గా నమోదైంది. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. ఇప్పటి వరకు 138 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అనేక మంది ఆచూకీ తెలియ రావడం లేదు. వందలాది మంది శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం. ప్రాణ..ఆస్తి నష్టం భారీగానే ఉండే అవకాశం ఉంది.

మెక్సికో నగరం నడిబొడ్డున ఉన్న కాండెసా ప్రాంతంలోని ఐదంతస్తుల భవనం నేలకూలింది. భూకంపం వల్ల గ్యాస్ పైపులైన్లు దెబ్బతిన్నాయి. క్యూయెర్ నవాకా ప్రాంతంలోని పాఠశాల భవనం కుప్పకూలడంతో విద్యార్థులు..ఉపాధ్యాయులు మృతి చెందారని తెలుస్తోంది. ప్రకంపనాలు రావడంతో భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. దీనితో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని తెలుస్తోంది.

వారం రోజుల క్రితమే ఇక్కడ భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. విద్యుత్ లైన్లు..ఫోను లైన్లు అనేక చోట్ల దెబ్బతిన్నాయి. సరిగ్గా 32 ఏళ్ల క్రితం 1985 సెప్టెంబర్ 19వ తేదీన ఇదే రోజు నగరంలో భూకంపం సంభవించి 10 వేల మంది చనిపోయారు. ఈ సందర్భంగా మంగళవారం నగరంలోని ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు కవాతులు నిర్వహించారు. ఈ కవాతు పూర్తయిన కొద్ది సేపటి అనంతరం తాజా భూకంపం సంభవించింది. పెను విపత్తుకు గురైన మెక్సికోకు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. 

09:14 - September 20, 2017

విజయవాడ : రెండంకెల వృద్ధి రేటు ఎలా సాధించాలని అనే దానిపై ఏపీ సర్కార్ వ్యూహ రచనలు చేస్తోంది. అందులో భాగంగా మూడు నెలలకొకసారి కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం రెండు రోజుల పాటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ప్రైమరీ సెక్టార్..మౌళిక వసతులపై చర్చ జరగనుంది. జిల్లాలకు సంబంధించి నివేదికను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. దీనికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. అర్బన్ డెవలప్ మెంట్ ఎలా మెరుగు పరచాలి..? భవిష్యత్ తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేయనున్నారు. అంతేగాకుండా ఏడు మిషన్లపై హెచ్ వోడీలందరూ ప్రాథమిక ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఐటీ, పెట్టుబడుల శాఖ, రాజధాని డిజైన్లు, సీఆర్డీఏ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు..సంక్షేమ పథకాలపై కూడా చర్చ జరుగనుంది. 

09:12 - September 20, 2017

విజయవాడ : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఉండవల్లికి చేరుకున్నారు. కాసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. అమరావతి డిజైన్లపై ఆయన సలహాలు..సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న అనంతరం నేరుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి ఆయన చేరుకున్నారు.

హైకోర్టుకు సంబంధించిన డిజైన్స్ లను నార్మన్ పోస్టర్స్ చూస్తున్న సంగతి తెలిసిందే. 8 నెలలుగా దీనిపై వర్కవుట్ చేస్తున్నారు. ఈ డిజైన్లను సీఎం బాబు ఖరారు చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఎలివేషన్ తదితర డిజైన్ లపై బాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళిని సంప్రదించి సలహాలు..సూచనలు తీసుకోవాలని మంత్రి నారాయణ..సీఆర్డీఏ అధికారులకు బాబు సూచించారు. దీనితో వారందరూ రాజమౌళితో ఇటీవలే భేటీ జరిపారు. అనంతరం రాజమౌళి స్వయంగా విజయవాడకు వెళ్లి బాబుతో చర్చలు జరిపారు. రాజమౌళిని లండన్ పంపాలని ఏపీ సర్కార్ పంపించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గ్రాఫిక్స్..డిజైన్స్ చేసే వారు రాజధాని డిజైన్లను ఎలా ఖరారు చేస్తారని విమర్శలు వస్తున్నాయి.

కాసేపట్లో ఏపీ కలెక్టర్ల సదస్సు ప్రారంభం..

విజయవాడ : కాసేపట్లో ఏపీ కలెక్టర్ల సదస్సు ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. 

బాబుతో రాజమౌళి భేటీ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రముఖ దర్శకుడు రాజమౌళి కలుసుకున్నారు. రాజధాని డిజైన్లపై రాజమౌళి తన అభిప్రాయాలను బాబుకు తెలియచేసినట్లు తెలుస్తోంది. 

08:29 - September 20, 2017
08:28 - September 20, 2017

శ్రీకాకుళం : జిల్లాలో భారీ అవినీతి చేప ఏసీబీ చేతికి చిక్కింది. ఓ కాంట్రాక్టర్ వద్ద నుండి డబ్బులు తీసుకుంటున్న అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భూగర్భ జనుల శాఖ అసిస్టెంట్ జియాలజిస్ట్ గా హనుమంతరావు విధులు నిర్వహిస్తున్నారు. ఇసుక రీచ్ కాంట్రాక్టర్ వద్ద నుండి రూ. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ సీఐయూ డీఎస్పీ ప్రసాదరావు పట్టుకున్నారు. ఓ స్టార్ హోటల్ లో ఈ డీల్ చేస్తుండగా దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

08:20 - September 20, 2017
08:18 - September 20, 2017

హైదరాబాద్ : టీఆర్ఎస్ నేతల పుతరత్నాలు తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. వివాదాస్పదంగా వ్యవహరిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇటీవలే పలు ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మల్కాజ్ గిరి కార్పోరేటర్ జగదీష్ కుమారుడు అభిషేక్ గౌడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అమ్మాయిలను వేధిస్తున్నారని షీ బృందాలకు ఫిర్యాదులు అందాయి. అభిషేక్ గౌడ్ తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఫేక్ ఐడీ ప్రొఫెల్ క్రియేట్ చేసి అమ్మాయిలను తరచూ వేధిస్తుండే వాడని తెలుస్తోంది. చార్మినార్, హయత్ నగర్, గొల్కోండ ప్రాంతాల ద్వారా ఇంటర్ నెట్ వీడియో ద్వారా ఫోన్ చేసి వేధించే వాడని సమాచారం. 

08:09 - September 20, 2017

విశాఖపట్టణం : ఓ వైద్యుడిపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ తో దాడి చేయడం కలకలం రేగింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో డాక్టర్ బాలాజీ భూషణ్ పట్నాయక్ చిన్నపిల్లల వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్నాడు. పందిమెట్ట విద్యుత్ కార్యాలయం వద్ద బాలాజీ కారును ఇద్దరు దుండగులు అటకాయించారు. రాళ్లతో కారుపై దాడి చేయంతో ఎందుకు ఇలా చేస్తున్నారని బాలాజీ ప్రశ్నించారు. వెంటనే వెంట తెచ్చుకున్న యాసిడ్ అతడిపై పోయడంతో ముఖానికి చేతులు అడ్డం పెట్టుకున్న బాలాజీ కేకలు వేశాడు. వెంటనే దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయాలైన బాలాజీని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

07:56 - September 20, 2017

ఆ అయ్యా కల్వకుంట్ల తారక రామారావుగారూ..? రాండ్రి మీరు వంచిన చీరెలు ఓ నాల్గు వట్కోని మీరు రాండ్రి.. వద్దని తిట్టి ఆవేదన ఎల్లగక్కిన అమ్మలక్కను నేను తీస్కొస్త.. ఆబిడ్స్ చౌరస్తకాడ గూసుందాం.. ఎవ్వలు ఎవ్వలిని మోసం జేశింది ఏం కథ..? సూపెడ్త రాండ్రి.. అమ్మలక్కలు చీరెలు గాలవెడ్తె కేసులు వెట్టిస్తావ్..? కాలవెడ్తె కేసులు వెట్టిచ్చనవ్ గదా... మరి నేత చీరెలిస్తాని.. పాలిస్టర్ శీరెలిచ్చిన మీ మీద ఏం బెట్టాల్నయ్యా..? పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

07:51 - September 20, 2017

వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీనిపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక్క విజయాన్ని అడ్డు పెట్టుకుని ఎలా బేరీజు వేస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. మరో వైపు కృష్ణా అక్రమ నిర్మాణాలపై హైకోర్టు 8 మంది అధికారులతో పాటు 49 మంది అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న అతిథి గృహ యజమానికి కూడా నోటీసులు వెళ్లాయి. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. నదీ పరివాహక ప్రాంతాలను పూర్తిగా ఆక్రమించేస్తున్నారని వైసీపీ పేర్కొంటోంది. దీనిపై టెన్ టివి చర్చా కార్యక్రమంలో పద్మజారెడ్డి (వైసీపీ), చందు సాంబశివరావు (టిడిపి), ఆళ్ల రామకృష్ణారెడ్డి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

గాంధీ వైద్యులపై రోగి బంధువుల దాడి..

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రోగి మృతి చెందాడు. ఆగ్రహంతో రోగి బంధువులు వైద్యులపై దాడి చేశారు. 

వైద్యుడిపై యాసిడ్ దాడి...

విశాఖపట్టణం : ఓ వైద్యుడిపై యాసిడ్ దాడి జరిగింది. పందిమెట్ట విద్యుత్ కార్యాలయం వద్ద వైద్యుడిపై యాసిడ్ పోసి ఇద్దరు దుండగులు పరారయ్యారు. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో డాక్టర్ బాలాజీ భూషణ్ పట్నాయక్ కు చికిత్స జరిపిస్తున్నారు.

రైల్వే స్టేషన్ లో తుపాకి మిస్ ఫైర్...

అనంతపురం : రైల్వే స్టేషన్ లో తుపాకీ మిస్ ఫైర్ జరిగింది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తుపాకీకి ప్రయాణీకుడి చేతి తగిలడంతో పేలింది. ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. 

07:13 - September 20, 2017

ఒంటిమీద ఖాకీ చొక్క.. చేసేది పోలీసు పని కానీ ఆ జీవితంలో అంత వెలుగు కనపడదు. ప్రస్తుతం హోంగార్డుల పరిస్థితి ఇది. హోంగార్డులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై టెన్ టివి జనపథంలో హోంగార్డుల సంఘం రాష్ట్ర నాయకులు జంగోజి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:09 - September 20, 2017

విజయవాడ : సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి హెల్మెట్‌ ధరించాల్సిందేనంటూ అధికారులు చేసిన హెచ్చరికలను వాహనదారులు బేఖాతరు చేస్తున్నారు. తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని, హెల్మెట్‌తో పాటు సీటు బెల్టులు ధరించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు, రవాణాశాఖ అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా వాహనదారుల్లో చైతన్యం రాకపోడంతో హెల్మెట్‌ నిబంధన పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు.

ప్రజల ప్రాణాలను సంరక్షించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు పెద్దగా సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన వాహనాలు నడుపుతున్న వారి దూకుడుకు చెక్‌ పెట్టేందుకు ఏపీలో సెప్టెంబర్‌ 1నుంచి హెల్మెట్‌ నిబంధన తప్పనిసరి చేశారు. వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని, సీటు బెల్ట్‌ పెట్టుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

వాహనదారుల అతివేగం, ట్రాఫిక్‌ నియమ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడపడం వల్ల ఇతరుల ప్రాణాలను హరిస్తున్నారని... దీని నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని, వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు... అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కోర్టు తీర్పును పక్కాగా అమలు చేసేందుకు కృష్ణాజిల్లా అధికారులు కార్యాచరణలోకి దిగారు. విజయవాడ నగరంలో హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానాతో పాటు జైలుకు పంపాలని భావించారు. వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు రవాణాశాఖ, పోలీసులు రంగంలోకి దిగారు. ద్విచక్రవాహన దారుడు హెల్మెట్‌ లేకుండా మొదటిసారి పట్టుబడితే వంద రూపాయలు పెనాల్టీ విధించాలని.. మరోసారి పట్టుబడితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయాలని నిర్ణయించారు.

ఈ నిబంధనను వాహనదారులు మూడు, నాలుగు రోజులు సరిగానే పాటించారు. పోలీసులు సైతం హెల్మెట్‌ ధరించని వారి నుంచి ఫైన్‌ వసూలు చేశారు. అయితే.. ఆ తర్వాత అధికారులు ఈ నిబంధనను పెద్దగా పట్టించుకోవడంతో.. వాహనదారులు హెల్మెట్‌ లేకుండానే వాహనాలు నడుతుపుతున్నారు. దీంతో మళ్లీ యాక్సిడెంట్‌ల కేసులు జరిగి వాహనదారులు మృత్యువాత పడుతున్నారు. అధికారులు అప్పుడప్పుడు హడావుడి చేయడం.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై పెద్దస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించాలంటున్నారు. ఏది ఏమైనా హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తూ... వాహనదారుల ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా పక్కాగా ట్రాఫిక్‌ నియమ నిబంధనలు అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. 

06:45 - September 20, 2017

విజయవాడ : తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రక్షాళనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమిటీల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. టీడీపీ నూతన కమిటీల కసరత్తుపై 10టీవీ కథనం..తెలుగుదేశం పార్టీలో నూతన కమిటీల ఏర్పాటుపై ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టి సారించారు. 2019 ఎన్నికల్లో విజయమే టార్గెట్‌గా కమిటీల ప్రక్షాళనకు రెడీ అయ్యారు. ఎన్నికల నియమావళి ప్రకరాం ప్రతి రెండేళ్లకొకసారి పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలి. అందులో భాగంగానే ఇటీవల విశాఖలో జరిగిన మహానాడులో మరోసారి చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే మహానాడులో రెండు రాష్ట్రాలకు కొత్త కమిటీలు నియమించాల్సి ఉండగా అనివార్య కారణాలవల్ల వాటిని ఏర్పాటు చేయలేదు.

దీంతో గత పది రోజులుగా కమిటీల ఏర్పాటుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పార్టీ సీనియర్స్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కమిటీ ఏర్పాటు ఓ కొలిక్కి తీసుకొచ్చారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కమిటీల కూర్పు చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు ఏర్పాటయ్యే కమిటీలు ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉండడంతో అందుకు తగ్గట్టుగా కసరత్తు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే సమర్థులకు కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అధ్యక్షుడి తర్వాత పార్టీలో ప్రధాన కార్యదర్శి కీలకం. ఈ పదవిని బలమైన నేతలకు అప్పగించాలనే యోచనలో ఉన్నారు.

రెండేళ్లుగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న కిలారి రాజేష్‌కు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శులుగా ఉన్న నిమ్మల రామానాయుడు, జయనాగేశ్వర్‌రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వర్ల రామయ్యకు మరోసారి ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యే అవకాశముంది. జాతీయ కమిటీలో కూడా కీలక మార్పులు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి లోకేష్‌, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, సిద్ధా రాఘవరావులాంటి వారికి జాతీయ కమిటీలో మరోసారి చోటు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పార్టీ పొలిట్‌బ్యూరోలోనూ కొన్ని మార్పులు చేసే అవకాశముంది. అంతేకాదు.. చాలా కాలంగా రెండు రాష్ట్రాల్లోనూ ఖాళీగా ఉన్న పార్టీ అనుబంధ విభాగాలను సైతం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా కొత్త కమిటీలను నియమించే అవకాశముంది.

06:35 - September 20, 2017

హైదరాబాద్ : 2014 ఎన్నికల ముందు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ఆయన అయితేనే దేశానికి మేలు జరుగుతుందని ఒకరు అంటే... అతనిలాంటి గొప్ప వ్యక్తితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు మరొకరు. ఇది అప్పటి మాట. కానీ... తాజాగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది. గత సాధారణ ఎన్నిక సమయలో మోదీ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టినా... ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీయే కూటమికి మద్దతిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మోదీ, పవన్‌కల్యాణ్‌ కలిసి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. అది గతం. కానీ... ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ, పవన్‌కల్యాణ్‌ల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఎన్డీయే అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు ఆస్తామని అప్పట్లో మోదీ హామీ ఇచ్చారు. అయితే.. మోదీ గెలిస్తే విడిపోయి నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని పవన్‌ ఆయనకు మద్దతుగా నిలిచారు. కానీ... బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత... ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని పక్కనపెట్టి... ప్రత్యేక సాయం ప్రకటించింది.

దీంతో బీజేపీ తీరుపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేసి పోరాటం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంలోని బీజేపీతో పాటు,.. కొంతమంది కేంద్రమంత్రులను సైతం టార్గెట్‌ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ, పవన్‌ మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే.. పవన్‌ కేంద్రమంత్రులను టార్గెట్‌ చేసినా ఎక్కడా మోదీని ఒక్క మాట కూడా అనలేదు. దీంతో పవన్‌, మోదీ సన్నిహితంగానే ఉన్నారనే ప్రచారం జరిగింది. కానీ... మోదీ మాత్రం పవన్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదనే వార్తలకు మరింత బలం పెరిగింది.

తాజాగా మోదీ స్వచ్చ భారత్‌లో తమ వంతు సహకారం అందించాలని కోరుతూ పలువురు ప్రముఖులకు లేఖలు రాశారు. టాలీవుడ్‌ సినీ ప్రముఖులు మహేష్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, మోహన్‌బాబులకు లేఖలు రాసిన మోదీ... పవన్‌ను మాత్రం అందులో భాగస్వామ్యం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పవన్‌ సహకారం కోరిన మోదీ... ఇప్పుడు ఎందుకు దూరం పెట్టారనేది ఆసక్తిగా మారింది. అయితే... ప్రత్యేక హోదా విషయంలో పవన్‌ కేంద్రం తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కారణమని జనసేన వర్గాలు అంటున్నాయి. ఇదేకాకుండా... చిరంజీవిని బీజేపీలోకి తీసుకువచ్చి... 2018లో రాజ్యసభ సీటు ఇచ్చేందుకు ఆ పార్టీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇక పవన్‌కల్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని బీజేపీ నేతలు తమ ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ కలిసి వచ్చినా...రాకపోయినా చిరంజీవిని ముందు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని కాషాయి నేతలు ప్లాన్‌ వేస్తున్నారు. మొత్తానికి పవన్‌కల్యాణ్‌, మోదీల మధ్య దూరం వచ్చే ఎన్నికల నాటికి ఇలాగే కొనసాగుతుందా ? లేదంటే వచ్చే ఎన్నికల ముందు మళ్లీ ఒక్కటి అవుతారా ? అంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. 

06:33 - September 20, 2017

హైదరాబాద్ : గులాబీ సర్కార్‌ నిర్ణయాలే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు అందివచ్చిన ఆయుధాలుగా మారుతున్నాయి. సర్కారు వరుస వైఫల్యాలనే ప్రధాన ఎజెండాగా ఉద్యమ కార్యాచరణకు నడుంబిగిస్తున్నారు హస్తం నేతలు. వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ ప్రకటించి జనంలోకి వెళ్తోన్న కాంగ్రెస్‌ నేతలు... క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అధికారపార్టీ నేతలపై పదునైన విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల వేడిని రాజేస్తున్నారు.

కేసీఆర్‌ అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. వాటిపై కాంగ్రెస్‌ వాయిస్‌ పెంచడం, తద్వారా జనంలోకి వెళ్లేందుకు అవకాశం కల్పించాయి. చెస్ట్‌ ఆస్పత్రి తరలింపు, ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేత, కొత్త సచివాలయంలాంటి నిర్ణయాలు కాంగ్రెస్‌ ఉద్యమానికి ఆజ్యం పోశాయి. కాంగ్రెస్‌ నేతలు జనంలోకి వెళ్లేందుకు కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలే దోహదం చేశాయి. రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌ ఏకంగా రైతులను సమీకరించి వరుస ఉద్యమాలను చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది.

ఇక సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్‌ అంశం కూడా కాంగ్రెస్‌కు కలివచ్చింది. ప్రాజెక్టులపై కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రజెంటేషన్‌ ఇచ్చినా... అసెంబ్లీ బయట కాంగ్రెస్‌ అందులో జరుగుతున్న అవినీతిపై ప్రజెంటేషన్‌ ఇచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఆ తర్వాత ప్రాజెక్టుల భూసేకరణపై వరుస ఉద్యమాలతో సర్కార్‌ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు కాంగ్రెస్‌ పోరాటాలు నిర్వహించింది. స్థానిక రైతులతో కలిసి కాంగ్రెస్‌ నాయకులు చేసిన ఆందోళనలు ఆపార్టీకి మైలేజ్‌ను పెంచిందనే భావనలో నేతలు ఉన్నారు.

ఖమ్మంలో రైతుల ఆందోళన, నేరెళ్ల దళితుల ఘటనపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఇక భూపాలపల్లిలో గిరిజనులపై పోలీసుల దాడి... సర్కార్‌ను మరోసారి ఇరుకున పెట్టిందనే చెప్పాలి. ఇక బతుకమ్మ చీరల పంపిణీపై జనంలో వస్తున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీన్ని కలిసి వచ్చిన ఆయుధంగా కాంగ్రెస్‌ మలచుకుంటోంది. ఈ ఇష్యూకు పొలిటికల్‌ మసాలా జోడించి గులాబీ సర్కార్‌పై మాటల దాడిని పెంచింది. మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీకి టీఆర్‌ఎస్‌ వైఫల్యాలే ఆయుధాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైనే పోరాటం చేస్తూ పార్టీ మైలేజ్‌ పెంచేందుకు కృషి చేస్తున్నారు.

06:30 - September 20, 2017

హైదరాబాద్ : మళ్లీ పూల పండుగ వచ్చింది. తంగేడు, గునుగు, బంతి, చామంతి పూల సందడి మొదలు కానుంది. నేటినుంచి ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే పండుగ.. ఈనెల 28న సద్దులతో ముగియనుంది. ఈ పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ సర్కార్‌... మొత్తం తొమ్మిదిరోజుల పాటు గతంలో కంటే భారీగా ఉత్సవాలు జరిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.

తెలంగాణలో పాటు ఈసారి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని తెలంగాణ మహిళలు, ప్రజలు పండుగ చేసుకునేందుకు సన్నారు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, యాస, భాషలను ప్రతిబింబిస్తూ ప్రతి ఇంటా పండుగ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలకు తెలంగాణ జాగృతి సహకరించనుంది. ఉత్సవాలలో భాగంగా ఈనెల 26న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో, 28న ట్యాంక్‌ బండ్‌పై సద్దుల బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సౌకర్యాలు కల్పించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 

నేడు ఎంగిలిపూల బతుకమ్మ...

హైదరాబాద్ : మళ్లీ పూల పండుగ వచ్చింది. తంగేడు, గునుగు, బంతి, చామంతి పూల సందడి మొదలు కానుంది. నేటినుంచి ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే పండుగ.. ఈనెల 28న సద్దులతో ముగియనుంది. 

06:28 - September 20, 2017

విజయవాడ : శ్రీచైతన్య కాలేజీలో దారుణం జరిగింది. తోటి విద్యార్థులతో గొడవ పడ్డాడని చింత కల్యాణ్‌ అనే విద్యార్థిని లెక్చరర్స్‌ చితకబాదారు. కొట్టవద్దని ప్రాధేయపడినా లెక్చరర్స్‌ ఏమాత్రం వినిపించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన చింతా కల్యాణ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతడిని స్తానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్యాణ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. 

06:27 - September 20, 2017

ఢిల్లీ : మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 7.1గా నమోదయ్యింది. ప్రకంపనాల ధాటికి అనేక భవనాలు కూలిపోయాయి. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. భూప్రకంపనలతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. విద్యుత్‌ లైన్లు, ఫోన్లు లైన్లు తెగిపోయాయి. 10 రోజుల్లోనే రెండు సార్లు భూకంపాలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో 1985లో ఇదే రోజున మెక్సికోలో భూకంపం సంభవించింది. ఆ ప్రమాదంలో 10వేల మంది మృత్యువాతపడ్డారు. ఈ సందర్భంగా నగరంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. అది పూర్తయిన కొద్ది గంటలకే భూకంపం సంభవించింది. ఇప్పటివరకు 100 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సైన్యం రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపడుతోంది. 

మల్కాజ్ గిరి కార్పొరేటర్ తనయుడు అరెస్టు...

మేడ్చల్ : మల్కాజ్ గిరి కార్పొరేటర్ కుమారుడు అభిషేక్ గౌడ్ ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అమ్మాయిలను వేధిస్తున్నారని షీ బృందాలకు ఫిర్యాదులు అందాయి. అభిషేక్ గౌడ్ తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 

మెక్సికోలో భారీ భూకంపం..

ఢిల్లీ : మెక్సికోలో భూకంపం సంభవించింది. 119 మంది మృతి చెందారు. రిక్టర్ స్కేల్ పై 7.4గా తీవ్రత నమోదైంది. భూకంప ధాటికి భవనాలు కుప్పకూలిపోయాయి.

 

రూ. 300 కోట్లకు పైగా ఆదాయం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపుల దరఖాస్తు గడువు ముగిసింది. 2,216 మద్యం షాపులకు గాను 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా రూ. 300 కోట్లకు పైగా ఆదాయం లభించింది. 

ఏఎస్ఐ అదృశ్యం..

హైదరాబాద్ : అంబర్ పేట ఏఎస్ఐ హనుమంత రాయప్ప కనిపించడం లేదు. మంగళవారం డ్యూటికి వెళ్లిన ఏఎస్ఐ ఇంటికి రాకపోవడంతో ఉప్పల్ పీఎస్ లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.

 

రాగన్నగూడలో భారీ చోరీ..

రంగారెడ్డి : ఆదిభట్ట రాగన్నగూడలోని లక్ష్మారెడ్డి కాలనీలో చోరీ జరిగింది. భీంరెడ్డి నివాసంలో 70 తులాల బంగారం, రూ. 15 లక్షల నగదును దొంగలు అపహరించారు. 

రాగన్నగూడలో భారీ చోరీ..

రంగారెడ్డి : ఆదిభట్ట రాగన్నగూడలోని లక్ష్మారెడ్డి కాలనీలో చోరీ జరిగింది. భీంరెడ్డి నివాసంలో 70 తులాల బంగారం, రూ. 15 లక్షల నగదును దొంగలు అపహరించారు. 

జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాల పెంపు...

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాలను పెంచుతూ టి.సర్కార్ నిర్ణయం తీసుకుంది. రూ. 1500 వేతనం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు ఊడ్చే కార్మికులతో పాటు దోమల నివారణ విభాగంలో పనిచేసే కార్మికులకు వేతనం రూ. 12,500 నుండి రూ. 14వేలకు పెంచారు. జీహెచ్ఎంసీలో 22,400 మంది కార్మికులకు లబ్ది చేకూరనుంది. శానిటేషన్, మలేరియా సూపర్ వైజర్ల వేతనం రూ. 13వేల నుండి రూ. 14,500కు పెంచారు. 

రూ. 5లక్షలు లంచం తీసుకుంటుండగా...

శ్రీకాకుళం : భూగర్భ జనుల శాఖ అసిస్టెంట్ జియాలజిస్ట్ హనుమంతరావు ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ సీఐయూ డీఎస్పీ ప్రసాదరావు పట్టుకున్నారు. 

Don't Miss