Activities calendar

21 September 2017

21:49 - September 21, 2017

చెన్నై : తమిళనాడులో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అధికార అన్నాడీఎంకేలో దినకరన్‌, పళని-పన్నీర్‌ వర్గాల మధ్య పోరు కొనసాగుతుండగా...మరోవైపు సినీతారలు రాజకీయ సందడి చేస్తున్నారు. తాజాగా కొత్త రాజకీయ సమీకరణ కోసం కసరత్తు చేస్తున్న లోక నాయకుడు కమల్‌హసన్‌తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ భేటి అయ్యారు. ఢిల్లీ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న కేజ్రీవాల్‌ను కమల్‌ చిన్న కుమార్తె అక్షర స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతించారు.సుమారు గంటకు పైగా చర్చలు జరిపిన అనంతరం ఇద్దరు కలిసి భోజనం చేశారు. తరువాత కమల్‌ మీడియాతో మాట్లాడుతూ... తనని కలవడం కోసం ఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌ చెన్నైకి రావడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.

అవినీతి రహిత సమాజం కోసం
కేజ్రీవాల్‌ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని...అవినీతి రహిత సమాజం కోసం ఆయన ఆరాటపడడం తనకెంతో నచ్చిందని కమల్‌ హసన్‌ అన్నారు. మా ఇద్దరి ఆలోచనలు, లక్ష్యాలు ఒక్కటేనని...కేజ్రీవాల్‌ సలహాలు, సూచనలు తనకు అవసరమని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, తమతో కలిసి వచ్చే వారందరిని కలుపుకుపోతామని కేజ్రీవాల్‌ అన్నారు. తమిళనాడులోని రాజకీయ పరిస్థితులు, తమ భావాలను ఒకరినొకరం పంచుకున్నామని సిఎం అన్నారు. ఇక ముందు కూడా తామ మధ్య చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కమల్‌ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారన్నా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వీవో3ఇంతకుముందు 2015లో కమల్‌హసన్‌ సినిమా షూటింగ్‌ పర్మిషన్‌ కోసం కేజ్రీవాల్‌ను ఢిల్లీలో కలిశారు. త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నట్లు కమల్ ప్రకటించిన కొద్ది రోజులకే కేజ్రీవాల్‌తో కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దక్షిణాది రాజకీయాల్లో ఆప్‌ను విస్తరించేందుకు కేజ్రీవాల్‌ ఈ భేటిని అవకాశంగా మలచుకోనున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

21:47 - September 21, 2017

హైదరాబాద్ : మెట్రోరైలు ప్రారంభానికి ముహూర్తం దాదాపు ఖరారైంది. నవంబర్‌లో ఎలాగైనా ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తోంది. మెట్రో రైలు పనుల పురోగతిని సికింద్రాబాద్‌లో మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఒలిఫెంటా బ్రిడ్జిని ఆయన సందర్శించారు. ఆ తర్వాత సమీపంలోని పలు మెట్రో రైలు స్టేషన్లను పరిశీలించారు. పనుల పర్యవేక్షణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో మెట్రో ప్రాజెక్టు చాలా సంక్లిష్టమైందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తొలి దశ మెట్రో రైల్‌ను నాగోల్ - మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల మేర ప్రారంభిస్తామన్నారు. మెట్రోరైల్‌ను ప్రారంభించాలని ఇప్పటికే ప్రధానిని ఆహ్వానించినట్లు చెప్పారు. ప్రధాని వీలునుబట్టి నవంబర్‌ 28న లేదా మరో తేదిన మెట్రో రైలును ప్రారంభిస్తారని తెలిపారు. నవంబర్‌ 15 వరకు అన్ని పనులు పూర్తి చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. మెట్రో రైలు ప్రారంభోత్సవానికి మియాపూర్‌ స్టేషన్‌ వేదిక కానుందని వెల్లడించారు.

మెట్రో స్టేషన్‌లోకి వెళ్లేందుకు నాలుగు మార్గాలు
మెట్రో స్టేషన్‌లోకి వెళ్లేందుకు నాలుగు మార్గాలు ఉంటాయని.. మెట్రో స్టేషన్ దగ్గర ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. రోడ్డు దాటేందుకు మైట్రో రైల్‌ స్టేషన్లు ఉపయోగించుకోవచ్చన్నారు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు, స్కైవేలు నిర్మిస్తామని తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ఈస్ట్‌, వెస్ట్‌ స్టేషన్లను అనుసంధానిస్తూ స్కైవాక్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మెట్రోరైలు, ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌ ప్రయాణాలకు ఒకే కార్డును అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. మెట్రోరైలుకు సంబంధించిన వివరాల కోసం స్మార్ట్‌యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 

21:46 - September 21, 2017

కృష్ణా : జిల్లా చల్లపల్లిలో పదో తరగతి విద్యార్థిని చైతన్యశ్రీ మిస్సింగ్‌..మిస్టరీగా మారింది. మే 20న స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన చైతన్యశ్రీ అదృశ్యమైంది. 4 నెలలు గడిచినా చైతన్య శ్రీ ఆచూకీ తెలియలేదు. దీంతో మే 21న చల్లపల్లి పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మరో వ్యక్తితో చైతన్య వెళ్లినట్లు తెనాలి రైల్వే స్టేషన్‌ సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్‌ అయ్యింది. మిస్సింగ్‌ కేసులో ఎస్పీకి ఫిర్యాదు చేసినా పురోగతి కనిపించలేదు. అవనిగడ్డ డీఎస్పీ, చల్లపల్లి సీఐల చుట్టూ చైతన్యశ్రీ తండ్రి తిరుగుతున్నాడు. ప్రేమ వ్యవహారమా లేక మరేదైనా జరిగిందా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.  

కోల్ కత్తా వన్డేలో భారత్ గెలుపు

కోల్ కత్తా : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ తరుపున కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. 

21:10 - September 21, 2017

కోల్ కత్తా : రెండవ వన్డేలో ఆస్ట్రేలియా ఎదురీతుంది. భారత్ బౌలర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. వరుస బంతుల్లో వేడ్, ఎగర్, కమిన్స్ అవుట్ చేసిన కల్దీప్ భారత్ తరపున హ్యాట్రిక్ సాధించిన మూడవ అటగాడిగా రికార్డ్ సృష్టించారు. 

ఏపీలో డ్రగ్స్ వినియోగం పెరిగింది : డీజీపీ

గుంటూరు : ఏపీలో డ్రగ్స్ వినియోగం పెరిగిందని కలెక్టర్ల సదస్సులో ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు.

 

ఇల్లంతకుంట ఘటన విచారణ కమిటీ

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లాలో కాళేశ్వరం పదో ప్యాకేజీ పనుల్లో సొరంగం పై కప్పు కూలిన ఘటనపై విచారణకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.

చిన్నారి రిషిత ఆచూకీ లభ్యం

అనంతపురం : జిల్లా ధర్మవరంలో ఉదయం కిడ్నాప్ కు గురైన రిషిత ఆచూకీ లభ్యమైంది. రిషితను కిడ్నాపర్లు కునుతూరు వద్ద వదిలివెళ్లారు. పోలీసులు రిషితను తల్లిదండ్రులకు అప్పగించారు. 

20:14 - September 21, 2017

బతుకుకు స్ఫూర్తినిచ్చిన సంబురం. తీరొక్క పూలు, కోటొక్క పాటల కోలాహలం. తెలంగాణ అస్తిత్వ వైభవం. ఆడపడుచుల ఆరాధ్య వైభోగం. ప్రకృతి రమణీయత. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక. తెలంగాణలో బతుకమ్మ సంబరం మొదలైంది. ఎంగిలి పూల వేడుకతో ఆరంభమైంది. అసలు బతుకమ్మ తెలంగాణకు ఎలాఅస్తిత్వమైంది...ఆడపడుచులతో ఎలా మమేకమైంది...బతుకమ్మ ఇచ్చే బతుకు సందేశమేంటి. బతుకమ్మ పూలతో చేసే జాతర. అందాల హరివిల్లును నేలమీద పరిచే వేడుక . కంచెలు కంచెలుగా, బీళ్లు బీళ్లుగా విస్తరించుకున్న తెలంగాణలో కన్నీటి చెలిమె బతుకమ్మ. ఉయ్యాలలూపే పాటల పల్లవుల్లో ఆడపడుచుల ఆర్భాటపు పండగ బతుకమ్మ. తెలంగాణ ఊరూవాడా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

బతుకమ్మపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ పక్కనపెడితే బతుకమ్మ అంటే ప్రకృతితో పెనవేసుకున్న మానవీయ బంధం. సమతా మమతల సారం. ఒక నవ్యనూతన సామాజిక చైతన్యం. ప్రకృతితో బతుకమ్మ ఎలా మమేకమైంది...దేనికీ పనికి రాని పూలకు బతుకమ్మ ఉత్సవం ఎలా విలువనిచ్చింది...బతుకమ్మ అంటే మూర్తీభవించిన మహిళ. చెరువుల రక్షణ కోసం ప్రాణార్పణకు వెరవని మగువ. సామాజిక చైతన్య తెగువ. దశాబ్దాల బతుకమ్మ ఉత్సవం స్త్రీలతో ఎలా పెనవేసుకుంది..?బతుకమ్మ చుట్టూ రాజకీయం ఎందుకు ముసురుకుంటోంది...బతుకమ్మ ఉత్సవం కొందరికే సొంతమైనట్టు ప్రచారమెందుకు...బతుకమ్మ అస్తిత్వమైన తెలంగాణలో బతుకుమ్మలను ఎందుకు చిదిమేస్తున్నారు...మహిళా సంఘాలు సంధిస్తున్న ప్రశ్నలివి. బతుకు కోసం, బతుకు భద్రత కోసం బతుకమ్మ కావాలి. గడీల బతుకమ్మ కాదు బడుగుల బతుకమ్మ ఆడుదాం. మహిళలపై హింసలేని తెలంగాణ కోసం పోరాడుదాం.

బతుకమ్మ పండుగలో మూడు ప్రధానమైన అంశాలు. ఒకటి ఆడబిడ్డలు, రెండు చెరువు, మూడు పూలు. చెరువులో పూలను వదలడం అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకున్నా అన్నింటికీ మించి చెరువు కోసం ప్రాణత్యాగాలు చేసిన వారికి పూలనివాళి బతుకమ్మ. చారిత్రక కథనాలు ఎలా ఉన్నా తెలంగాణకు సజీవ అస్తిత్వం బతుకమ్మ. కోటి రతనాల తెలంగాణాకు ఒక పూల తోరణం. తొమ్మిదిరోజుల పాటు ఈ పూలవనం ప్రతి ముంగిటా అందంగా కనిపిస్తుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:11 - September 21, 2017

ఆ యవ్వారం జూస్తుంటె సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలళ్ల.. టీఆర్ఎస్ పార్టీ సంఘం ఇజ్జత్ కచ్రా అయ్యెతట్టే గొడ్తున్నది.. ఎన్నికల ప్రచారం కోసం మంది మార్బలంతోని గనుల పొంట దిగిన టీఆర్ఎస్ పార్టోళ్లకు సుక్కలు జూపెడ్తున్నరు కార్మికులు.. అయ్యా ఏం బొడ్సిండ్రని మళ్లొచ్చి మమ్ములను ఓట్లడ్గుతున్నరని.. ఏడికాడ అడ్డంబడ్తున్నరు..

కాషాయం బట్టలు పెయ్యిమీద గప్పుకోని ముచ్చట్లు జెప్పినోళ్లంత మేధావులు అయితున్నరు.. చరిత్రలు తెల్సుకోని..? ఉన్నత సద్వులు సద్వి లోపాలను బైటవెట్టినోళ్లు బైరూపులోళ్లు అయితున్నరు.. గాయన ఎవ్వలాయిన.. ఆ పరిపూర్ణానంద గారట.. ఆయనకు ఏమన్న దమకున్నదా..? అరే ఇప్పటికే బహుజన కులాలోళ్లకు.. కోమటోళ్లకు కొట్లాటైతుంటే.. దాన్ని సల్లవడేశె ముచ్చట శాతనైతె జెప్పాలే లేకపోతె రామక్రిష్ణ అనుకుంట గూసోవాలె..? ఏందిది ఇంకా రెచ్చగొట్టుడు..?

తుందుర్రు కాడ మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ కట్టి తీర్తం అని గట్టిగ జెప్తున్న చంద్రాలు..? మరి బాబొస్తె జాబొస్తడంటివిగదా... గదిగూడ గంతే గట్టిగ ఎందుకు జెస్తాంటలేవు సారూ...? అన్ని లత్కోర్ మాటలు..? ఇనెటోడుంటే ఇమానం సందుల దూరిస్తాని గూడ జెప్తడు..? అరే తుందుర్రు కాడ ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ వద్దువా సారూ అంటే..? కట్టితీర్తాంటడు.. మళ్ల పంచాది లేశింది నిన్న..

తెలంగాణ రాష్ట్రంల బీసీలంత ఒక్కటై ముంగటికొస్తె.. బీసీ రాజ్యమొస్తది..? బీసోళ్లే ముఖ్యమంత్రి అయితరు.. మంత్రులు అయితరు.. ఎమ్మెల్యేలు అయితరు.? గందుకోసం బీసీలంత ఒక్కటై నడ్వాలే.. చర్చలు వెట్టుకోవాలె సభలు వెట్టుకోవాలె.. అట్ల ఏడవెట్టినా నా వంతు మద్దతు మీకుంటదంటున్నడు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖామంత్రి జోగురామన్న సారూ..

ఓదిక్కు మన తెలంగాణ సీఎం సారూ.. ఎర్కలోళ్లకు పందులు పంపిణీ జేస్తం వాళ్లకు ఉపాధి గల్పిస్తమని ఆలోచన జేస్తుంటే.. ఊరవందులకు మందు వెట్టి ఉన్నపందులను సంపేస్తున్నరు ఊర్లపొంటి గ్రామపంచాదులోళ్లు.. మంచిర్యాల జిల్లా చెన్నూరు కాడ పందులకు మందు వెట్టి సంపితే ఆ పందులను దెచ్చి గ్రామ పంచాది ముంగటేశిండ్రు ఎర్కల బిడ్డలు..

గాలొచ్చినప్పుడే తూర్పాల వట్కోవాలె అనుకుంటున్నట్టున్నడు దక్షిణ మధ్య రైల్వేవోడుగూడ.. ఎట్లైనా దస్ర పండుగొస్తున్నది.. జనం ఊర్లపొంటి వోతరు పట్నాలు ఇడ్సిపెట్టి ఇదే మంచి మోకా.. వాళ్లతాన వీలైనంత పైకం గుంజాలే అని బడే ఎత్తేశిండు సూడుండ్రి.. ఫ్లాట్ ఫాం టికెట్ మూడు రూపాలుండే అప్పట్ల నడ్మిట్ల పది జేశిండ్రు.. ఇప్పుడు ఇర్వైయట..

20:10 - September 21, 2017
20:08 - September 21, 2017

గుంటూరు : చంద్రబాబు, జక్కన్న.. ఇప్పుడీ కాంబినేషనే హాట్‌ టాపిక్‌గా మారింది. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళిని, అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనుకుంటున్న రాజధానిలో భాగం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఎందరో ప్రముఖ ఆర్కిటెక్‌లను కాదని చంద్రబాబు, రాజమౌళిని ఎంచుకోవడంలో ఉన్న అంతరార్ధమేంటి? కేవలం గ్రాఫిక్‌ డిజైన్స్‌తో తీసిన సినిమాలకు, వాస్తవ కట్టడాలకు చాలా తేడా ఉంటుంది. అయితే చంద్రబాబు ఎందుకు రాజమౌళిని ఎంచుకున్నట్టు? ఇప్పుడిలాంటి ప్రశ్నలే సామాన్య ప్రజానికంతో పాటు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమరావతిని ఆంధ్రుల అద్భుత కలల రాజధానిగా, ప్రపంచం మెచ్చే సుందరనగరంగా తీర్చిదిద్దాలన్నదే చంద్రబాబు కోరిక. అందుకోసమే రాజధాని నిర్మాణం కోసం ప్రపంచంలోని అన్ని టెక్నాలజీలను వాడుకోవాలని భావిస్తున్నారు. ఏ రాష్ట్రానికైనా కీలకంగా ఉండేవి అసెంబ్లీ, హై కోర్ట్‌, సచివాలయం భవనాలే కాబట్టి ఈ నిర్మాణాల విషయంలో నో కాంప్రమైజ్‌ అంటూ ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు.

పది నెలల నుండి నార్మన్‌ సంస్థలు
మాకీ సంస్థలు ఇచ్చిన డిజైన్స్‌ నచ్చలేదని, నార్మన్‌ పోస్టర్‌ సంస్థలను ఎంపిక చేశారు. పది నెలల నుండి నార్మన్‌ సంస్థలు ఎన్ని డిజైన్‌లు సిద్ధం చేసినా, ఎన్ని మార్పులు చేసినా చంద్రబాబుని సంతృప్తి పరచడంలేదు. అప్పుడే చంద్రబాబు మదిలో బాహుబలి మాహిష్మతి రాజ్యాన్ని, కుంతల రాజ్యాలను సృష్టించిన రాజమౌళి గుర్తుకువచ్చాడు. అంతే వెంటనే రాజమౌళిని పిలిపించి, ఆయన సూచనలు, సలహాలతో హైకోర్ట్‌, అసెంబ్లీ భవనాలను రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో సీఆర్డీఏ అధికారులు రాజమౌళితో సమావేశం అవడం, తర్వాత చంద్రబాబుతో భేటీ అవడం వరుసగా జరిగిపోయాయి. బాహుబలి సినిమాలో రాజమౌళి చెప్పకుండా, రాజమౌళి విజన్‌ చూపించకుండా గ్రాఫిక్‌ డిజైనర్‌ గాని, ఆర్ట్‌ డైరెక్టర్‌ గాని అలాంటి కోటలు, రాజ్యాలు సృష్టించలేడు. ఈ సినిమాలో మనం చూసిన అద్భుత దృష్యాలకు అసలు రూపకర్త రాజమౌళినే. ఈ అంశమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాజమౌళి సేవలు ఉపయోగించుకోవాలనే ఆలోచన పుట్టింది. రాజమౌళి నిర్మించిన కోటలు, రాజ్యాలు చూసి కాకుండా వాటి వెనక ఆయనకున్న విజన్‌, పరిశోధన వంటి అంశాలు ఆయనను రాజధాని నిర్మాణానికి సలహా అడిగాలన్న ఆలోచన చంద్రబాబుకి కలిగేలా చేశాయి.

అమరావతి సంస్కృతి, సంప్రదాయాలు
వందల సంవత్సరాల క్రితం రాజ్యాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టు చూపించిన రాజమౌళి... అమరావతిలోని భవనాల విషయంలో తెలుగు సంప్రదాయ ముద్ర వేస్తారనే నమ్మకంతో చంద్రబాబు ఆయనను సంప్రదించారు. డిజైన్‌లో అమరావతి సంస్కృతి, సంప్రదాయాలు మిళితం చేయాలన్నదే చంద్రబాబు కోరిక. అదే విషయాన్ని రాజమౌళికి స్పష్టం చేశారు. మొదట్లో హైకోర్టును కోహినూర్‌ డైమండ్ ఆకారంలో నిర్మించాలనుకున్నప్పటికీ, అసెంబ్లీ కొహినూర్‌ ఆకారంలో ఉంటే అద్భుతంగా ఉంటుందని చంద్రబాబు నిర్ణయించారు. కోహినూర్‌ డైమండ్‌ ఆకారంలోనే అసెంబ్లీని సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కోహినూర్‌ ఆకారంలో అసెంబ్లీ భవన నిర్మాణ డిజైన్‌ను నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులు రెండు నెలల పాటు శ్రమించి చంద్రబాబుకు చూపించారు. అద్భుతంగా ఉందని ఇలాంటి డిజైన్‌ కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పిన చెంద్రబాబు దానిని ఖరారు చేస్తామని ప్రకటించారు. కాని రాత్రికి రాత్రే సీన్‌ మారిపోయింది. అప్పటివరకు అసెంబ్లీ డిజైన్‌ అద్భుతంగా ఉందన్న చంద్రబాబు మరుసటి రోజు కోహినూర్‌ ఆకారం అంటే అచ్చెం అలానే దించమని కాదని, దాని స్ఫూర్తిని మాత్రమే తీసుకోమన్నానని చెప్పారు.

కోహినూర్‌ ఆకారంలోని డిజైన్‌ను తిరస్కరించడం
అయితే కోహినూర్‌ ఆకారంలోని డిజైన్‌ను తిరస్కరించడంలో కొత్త కోణం దాగి ఉందనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది. చంద్రబాబుకు మొదటి నుండి వాస్తు, సిద్ధాంతాలపై నమ్మకం ఎక్కువ. అందులో భాగంగానే కోహినూర్‌ వజ్రం ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యాలు సర్వనాశనం అవుతాయని, రాజులు అధికారాలు కోల్పోతారని చంద్రబాబు ఆస్థాన సిద్ధాంతులు కొంత ఆలస్యంగా చెప్పడంతో రాత్రికిరాత్రి చంద్రబాబు ఈ డిజైన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారని చర్చించుకుంటున్నారు. డిజైన్‌ బాగున్నప్పటికీ సంస్కృతీ, సంప్రదాయం డిజైన్‌లో కనబడడంలేదనే మెలిక పెట్టారని ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ఇదే అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించడంలో ప్రచారం నిజమనే భావన కల్గిస్తుంది. అమరావతి డిజైన్స్‌లోకి ఇప్పుడు రాజమౌళి రావడంతో రాజధాని రూపకల్పన ఆగిన చోట నుండి తిరిగి ప్రారంభమవుతుందా లేక మొదటికి వస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతుంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు కలగలిపి ఆకృతులను ఖరారు చేస్తారా లేక రాజమౌళి స్టైల్‌ ఆఫ్‌ డిజైన్స్‌ సిద్ధం చేయిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇక చంద్రబాబు ఎంచుకున్న కోహినూర్‌ కథ ముగిసిందా లేదా అనేది కూడా కొద్ది రోజుల్లో తేలాల్సి ఉంది. 

20:02 - September 21, 2017

ప్రభుత్వం అగ్రిగోల్డ్ అనే సంస్థ ప్రజల నుంచి రూ.8వేల కోట్లు సమీకరించిందని, దీనికి ప్రభుత్వమే కారణమని, రాజకీయా నాయకులు అగ్రిగోల్డ్ కార్యాలయాలు ప్రాంభంచడంతో ప్రజలు అగ్రిగోల్డ్ ను నమ్మరని, సంస్థలో ఎవరైతే డిపాజిట్ చేశారో వారి డబ్బులు తీరిగివస్తాయని నమ్మకంలేదని, ఎందుకంటే అగ్రిగోల్డ్ తన ఆస్తులను తాఖట్టు పెట్టి అప్పు తీసుకుందని దీని ప్రకారం మొదటగా బాధితుల కంటే చట్టం బ్యాంకులే ప్రాధాన్యం ఇస్తుందని సిద్దార్థ లా కాలేజీ ప్రిన్సిపల్ దివాకర్ బాబు అన్నారు. ఆరు హామీలు ఇచ్చి 120 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి బాధితులు చాలా కష్టలు అనుభవిస్తున్నారని అగ్రిగోల్డ్ ఎజెంట్లు, బాధితుల సంఘం అధ్యక్షుడు ఉప్పాడ నాగేశ్వర్ రావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:01 - September 21, 2017

విశాఖ : పోలవరం కాఫర్ డ్యాం డిజైన్ ఫైనల్ కాకుండానే 2018 కల్లా డ్యాం పూర్తవుతుందని సీఎం చంద్రబాబు ఎలా చెబుతారని సీపీఎం నేత నరసింగరావు ప్రశ్నించారు. విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో నరసింగరావుతో పాటు రిటైర్డ్ చీఫ్‌ ఇంజినీర్ సత్యనారాయణ, బ్రహ్మయ్య పాల్గొన్నారు. డ్యాంను 41 మీటర్ల ఎత్తుకు పెంచి ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు నీరు ఇవ్వాలనే ప్రభుత్వ ప్రతిపాదన మంచిది కాదన్నారు రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ. ముందుగా మెయిన్ రాక్‌ ఫిల్‌ డ్యాం నిర్మించిన తరువాత కాపర్ డ్యాం నిర్మాణం గురించి ఆలోచించడం మంచిదని సత్యానారాయణ సూచించారు. 

19:59 - September 21, 2017

కృష్ణా : విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు చెప్పారు. ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమంలో భాగంగా ఆయన రాణిగారి తోటలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా డిప్యూటి ఇన్ పుట్ ఎడిటర్ జయరాజ్ అందిస్తారు. 

19:57 - September 21, 2017

కృష్ణా : విజయవాడలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ పనితీరు బాగాలేదంటూ మండిపడ్డారు. స్కూళ్లు, హాస్టళ్లలో బయోమెట్రిక్‌ యంత్రాలు పనిచేయడంలేదంటూ సంధ్యారాణి ఇచ్చిన వివరణపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. మూడేళ్లయినా ఇవే సమస్యలు చెబుతున్నారంటూ కన్నెర్ర చేశారు. ఇదే అంశంపై జోక్యం చేస్తున్న విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు చురకలు అంటించారు. విద్యాశాఖ కొనుగోలు చేసిన బయోమెట్రిక్‌ యంత్రాలు బాగా పనిచేస్తున్నాయని, APTS సరఫరా చేసిన మెషీన్లు సరిగాలేవంటూ గంటా చెప్పారు. దీనికి చంద్రబాబు బదులిస్తూ... మన నాయకత్వం సరిగా ఉంటే ఈ తరహా ఇబ్బందులు ఎందుకు వస్తాయంటూ ప్రశ్నించారు. బడ్జెట్‌లో ఏడాదికి ఐదువేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నా... విద్యా శాఖ సరిగా పనిచేయడంలేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మధ్యలో జోక్యం చేసుకోబోయిన సంధ్యారాణిని వారించి కూర్చోబెట్టారు. శంకుస్థాపన చేసిన రెండేళ్ల తర్వాత కూడా స్కూళ్లు, హాస్టళ్లకు ప్రహరీగోడల నిర్మాణాలు పూర్తి చేయకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టుటుకోరిన్ ఓడరేవులో అధికారుల తనిఖీలు

చెన్నై : టుటుకోరిన్ ఓడరేవులో కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. దాడుల్లో మలేషియాకు తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 3కోట్లుగా అధికారులు తెల్చారు. ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు.

కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సు

 

కృష్ణా : విజయవాడలో ఏపీ కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ సదస్సులో రోడ్డు ప్రమాదాలపై చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది, రోడ్డు ప్రమాదాలను నివారణకు మరింత కృషి చేయాలన అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.

తిప్పపూర్ లో కాళ్వేశ్వరం సొరంగాన్ని పరిశీలించిన హరీష్ రావు

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ లో నిన్న జరిగిన సొరంగ ప్రమాద స్థలాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఘటన జరిగిన 24 తర్వాత మంత్రి పర్యటించడం పట్ల బాధితులు ఆగ్రహంతో ఉన్నారు.

18:40 - September 21, 2017

బాబి డైరెక్షన్ లో కొంత గ్యాప్ తర్వాత వచ్చిన యాక్షన్ ఎంటటైనర్ ఈ ''జై లవ కుశ'' సినిమా. ఎలాంటి పాత్రైన అలవోకగా చేసే ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది. ఈ సినిమాకి ఎన్టీఆర్ నటనే మేజర్ ఎస్సెట్ అని డైరెక్టర్ బాబి చాలా సందర్భల్లో చెప్పారు.

ఒక తల్లికి పుట్టిన ముగ్గురు కొడుకులు మూడు దారులు ఎంచుకుంటే ఎలా ఉంటుందని అనే కథ అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. కథ మొత్తం ఒక హీరో చూట్టో ఒక పాత్ర చూట్టో తిరుగకుండా మూడు పాత్రలతో ముగ్గురిని హీరోలుగా చూపించే ప్రయత్నం చేశాడు బాబీ. ప్రతి పాత్రకి ఒక క్యారెక్టరైజషన్ తో ఇంటరెస్టింగ్ వేలో స్టోరి ప్లాన్ చేశాడు డైరెక్టర్. ఈ సినిమా గురించి పూర్తి రివ్యూ కోసం వీడియో చూడండి.

కుక్కల దాడిలో బాలుడు మృతి

గుంటూరు : జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. అడవితక్కెళపాడులో కుక్కలు ఐదేళ్ల బాలుడిపై దాడి చేశాయి. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. 

18:06 - September 21, 2017

గుంటూరు : జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. అడవితక్కెళపాడులో కుక్కలు ఐదేళ్ల బాలుడిపై దాడి చేశాయి. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

భారత్ 255పరుగలకు అలౌట్

కోల్కత్తా : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండవ వన్డేలో భారత్ 252 పరుగులకు అలౌట్ అయింది. కోహ్లీ 92, రహానే 55, జాదవ్ 24 పరుగులు చేశారు. మిగతావారు తక్కువ సోర్లకే ఔటయ్యారు.

17:33 - September 21, 2017
17:32 - September 21, 2017
17:31 - September 21, 2017

సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని మూకుమ్మడి కుటుంబ ఆత్మహత్య కేసుకి సంబంధించి.. జిల్లా పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినవారిని.. సెక్షన్‌ 306 ప్రకారం రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జనార్ధన్‌ పెద్ద కుమారుడు సురేశ్ చేసిన అప్పులకు.. అప్పిచ్చినవారు డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేశారు. చిన్న కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని 14 లక్షలు తీసుకొని.. ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశారు. తీసుకున్న డబ్బు తిరిగివ్వకుండా వెంపటి సత్యనారాయణ, బెంజారపు ఉపేందర్‌లు మోసం చేశారు. అప్పు ఇచ్చినవారు చేసిన అవమానాన్ని భరించలేక.. ఈ నెల 17న జనార్ధన్‌, అతని భార్య చంద్రకళ, చిన్న కుమారుడు అశోక్, పెద్ద కోడలు ప్రభాత, వారి పిల్లలు శాన్వి, రుత్విక సహా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోవడంతో సూర్యాపేట పట్టణంలో తీవ్ర కలకలం రేగింది. పెద్ద కొడుకు సురేశ్‌ పూణే వెళ్తున్నానని చెప్పి తిరిగి రాకపోవడం, మూడున్నర కోట్లు అప్పిచ్చినవారు జనార్ధన్‌ను అడగడంతో కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకుంది. అయినా సురేశ్‌ రాకపోవడం, అతని ఆచూకీ తెలియకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

17:30 - September 21, 2017

వరంగల్ : భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో గొత్తికోయ మహిళలపై ఫారెస్ట్ అధికారుల పాశవిక దాడిపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాలు ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

17:29 - September 21, 2017

హైదరాబద్ : సికింద్రాబాద్‌లో మెట్రో పనులను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. సికింద్రాబాద్‌ నుంచి ఒలిఫెంటా స్టీల్‌ బ్రిడ్జిపై ఆయన నడిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్‌..నవంబర్‌ 28న ప్రధాని చేతుల మీదుగా మెట్రోను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ నవంబర్‌ 28న ప్రధానికి వీలుకాని పక్షంలో మరో తేదీన ప్రారంభిస్తామన్నారు. తొలిదశలో నాగోల్‌ టూ మియాపూర్‌ మార్గంలో రైళ్లను ప్రారంభిస్తామన్నారు. నవంబర్‌ 20 కల్లా ఈ 30 కిలోమీటర్ల మార్గంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. 

17:13 - September 21, 2017

ఒకప్పుడు సౌత్ సిని పరిశ్రమలో సంచలనం సృష్టించిన శృంగారతార 'షకీల' అనుకొనేరు..ఆమె కాదు..బాలీవుడ్ లో సీనియర్ నటిగా పేరొందిన 'షకీలా' తుది శ్వాస విడిచారు. ఆమె వయస్సు 82 సంవత్సరాలు. బుధవారం కన్నుమూయగా ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు గురువారం ప్రకటించారు. రాజ్ కపూర్, షమ్మీ కపూర్, గురుదత్ లాంటి హేమాహేమీలతో కలసి 'షకీలా' నటించిన సంగతి తెలిసిందే. 'బాపూజీ దీరే సే చల్ నా'..పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అంతేగాకుండా ఆలీ బాబా ఔర్ చాలీస్ చోర్, పోస్ట్ బాక్స్ 999, చైనా టైన్, సీఐడీ, ఆర్ పార్ తదితర ఎన్నో హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. షకీలా మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  

17:09 - September 21, 2017

మెట్రోకు ఓలా, ఉబెర్ సర్వీసుల అనుసంధానం: కేటీఆర్

హైదరాబాద్: మెట్రో కు ఓలా, ఉబెర్ సర్వీసులను అనుసంధానం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మియాపూర్ నుంచి మెట్రో రైలును ప్రధాని మోదీ ప్రారంభిస్తారని, ఢిల్లీ మెట్రోకు ధీటుగా హైదరాబాద్ మెట్రో సేవలుంటాయన్నారు. పాతబస్తీ మెట్రో రైలు మార్గంపై ఎంపీ ఓవైసీతో మాట్లాడతామన్నారు. పాతబస్తీలో కూడా మెట్రో రైలు స్టేషన్ ల నిర్మాణం చేపడతామన్నారు.

92 పరుగుల వద్ద కోహ్లీ ఔట్...

కోల్ కత: మరో ఎనిమిది పరుగుల్లో సెంచరీ పూర్తి చేయాల్సి ఉన్న కెప్టెన్ కోహ్లీ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కల్టర్ నైల్ బంతికి బౌల్డ్ అయి 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. మొత్తం 107 బంతులాడిన కోహ్లీ 8 బంతుల్ని బౌండరీకి తరలించి 85.98 స్ట్రయిక్ రేటును సాధించాడు. అంతకుముందు కేదార్ జాదవ్ (24) వికెట్ కూడా నైల్‌కే దక్కింది. ప్రస్తుతం 39 ఓవర్లకు భారత జట్టు 5 వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసింది.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఒకానొక దశలో 80 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌.. చివరకు కాస్త కోలుకుని 30 పాయింట్ల నష్టంతో 32,370 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 19 పాయింట్లు నష్టపోయి 10,122 వద్ద స్థిరపడింది.

రిషిత ఆచూకీ లభ్యం

అనంతపురం: ధర్మవరంలో ఈ రోజు ఉదయం కిడ్నాపుకు గురయిన రిషిత ఆచూకీ లభ్యం అయ్యింది. కునుతూరు వద్ద రిషతను కిడ్నాపర్లు వదిలి వెళ్లారు. రిషితను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కు అటవీ అనుమతులు: మంత్రి హరీష్

హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీశాఖ స్టేజ్ -2 అనుమతులు మంజూరు పై మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. 600ల ఎకరాల అటవీ భూమిని కాళేశ్వరం ప్రాజెక్టుకు వినియోగించుకోవడానికి మార్గం సుగమం అయ్యిందని, వచ్చే జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

'కాంగ్రెస్ అవినీతి పాలనను టిఆర్ ఎస్ కొనసాగిస్తోంది'

సిద్ధిపేట: కాంగ్రెస్ అవినీతి పాలనను టిఆర్ ఎస్ కొనసాగిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఆయన సిద్ధిపేటలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో టీఆర్ ఎస్ దోపిడీ చేస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ లోపాలే ఉన్నాయి తెలిపారు. కేంద్ర పథకాల పేర్లను మార్చి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్నారని లక్ష్మణ్ విమర్శించారు.

'టేకులపల్లి ఎదురు కాల్పుల్లో ఎవరూ చనిపోలేదు'

భద్రాద్రి: టేకులపల్లి ఎదురు కాల్పుల్లో ఎవరూ చనిపోలేదని, 8 ఎంఎం పిస్తోల్, తపంచా, రివాల్వర్ స్వాధీనం చేసుకున్నామని కొత్తగూడెం ఎస్పీ కార్యాలయం వివరణ ఇచ్చింది.

16:06 - September 21, 2017
16:05 - September 21, 2017

చెన్నై : ఆప్ అధినేత కేజ్రీవాల్, సినీనటుడు కమల్ హాసన్ భేటీ ప్రారంభమైంది. నలుగురు ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ కమల్ హాసన్ ను కలిశారు. వారి మధ్య తాజా రాజకీయాలు చర్చకు వచ్చినుట్టు తెలుస్తోంది. కమల్ రాజకీయాల్లోకి రావాలని కేజ్రీ ఆకాక్షించినట్లు తెలుస్తోంది. అవినీతికి వ్యతికేకంగా పోరాడుతున్న కేజ్రీవాల్ కు నా మద్దతు ఎప్పుడు ఉంటుందని కమల్ ప్రకటించారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

16:02 - September 21, 2017

వర్షాకాలం ముగుస్తోంది..చలికాలం ప్రవేశించబోతోంది..ఈ సమయంలోనే రోగాలు కూడా ప్రవేశిస్తాయి..జలుబు..జ్వరం..దగ్గు..ఇతర వ్యాధులు ప్రబలుతుంటాయి. వైరస్..బ్యాక్టీరియాలు సోకితే శరీరంలోని రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. అందువల్ల బొంగురు గొంతు, తరచూ తుమ్ముల్లు, దగ్గు, కండరాలు పట్టుకోవడం తదితర సమస్యలు ఏర్పడుతాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, హెపటైటిస్ ఎ ఇతరత్రా వ్యాధులు వస్తాయి.

దొమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా, దోమలను నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలి. శరీరం పొడిబారకుండా చూడాలి. ఇమ్యూన్ వ్యాక్సిన్ ఇవ్వాలి. కాచి వడబోసిన నీరు తాగడం బెటర్. శుభ్రమైన..తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. వాటర్ ట్యాంక్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం మరిచిపోకండి. అపరిశుభ్రమైన నీటిని సేవించడం వల్ల పలు అంటు వ్యాధులు వ్యాపిస్తాయి. డీహైడ్రేషన్, డయేరియా, వాంతులు, శరీరం పొడిబారడం, విరోచనాలు ఉంటే అది కలరా లక్షణాలని గుర్తించాలి. శుభ్రత కొరవడిన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. శుభ్రమైన ఆహారం..నూనె, కారం ఎక్కువగా లేని ఆహారం తీసుకోవాలి. తేలికగా అరిగే ఇడ్లీ..బ్రెడ్..ఆపిల్..కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవడం ఉత్తమం.

మా ఇద్దరి లక్ష్యం ఒక్కటే :కమల్ హాసన్

చెన్నై:కమల్ హాజన్ తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ అయ్యారు. కేజ్రీవాల్ నన్ను కలవడాన్నిగౌరవంగా భావిస్తున్నాని కమల్ పేర్కొన్నారు. అవినీతి, కులతత్వానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ పోరాటం చేస్తున్నారని తెలిపారు. మా ఇద్దరి లక్ష్యం ఒక్కటే అని కమల్ స్పష్టం చేశారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కమల్ హాసన్ ధైర్యం, చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి పేర్కొన్నారు. కమల్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ కి నారాయణ రాణే రాజీనామా

హైదరాబాద్: ముంబై కాంగ్రెస్ పార్టీ కి మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణే రాజీనామా చేశారు. ఈ మేరకు సోనియాకు రాజీనామా లేఖ పంపించారు.

నాగోల్- మియాపూర్ మెట్రో రైలు ప్రారంభిస్తాం: కేటీఆర్

సికింద్రాబాద్: మెట్రో రైలు పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తొలిదశలో నాగోల్- మియాపూర్ మధ్య 29 కి.మీ మేర మెట్రో రైలును ప్రారంభిస్తామని తెలిపారు. మెట్రో రైలును ప్రారంభించాలని ప్రధానిని కోరామని, నవంబర్ 15 లేదా 20న మెట్రో రైలు ప్రారంభం అవుతుందని తెలిపారు. మెట్రో స్టేషన్ లోకి వెల్లేందుకు నాలుగు మార్గాలు ఏర్పాటు చేశామని, మెట్రో స్టేషన్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. అలాగే స్కైవాక్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

దళితులకు మొండి చేయి చూపించేందుకు భూసర్వే: వీహెచ్

హైదరాబాద్: దళితులకు మూడెకరాల హామీ నుంచి తప్పించుకునేందుకు సీఎం కేసీఆర్ భూసర్వే నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపి వీహెచ్ విమర్శించారు. దళితులకు మొండి చేయి చూపించేందుకు కేసీఆర్ భూసర్వే పేరుతో కొత్త నాటకానికి తెరలేపాడని, గొర్రెరల పంపిణీ గ్యాంబ్లింగ్ అని, గొర్రెలు, బర్రెలు అయిపోయాయని.. ఇక గాడిదల పంపిణీ మిగిలిందని ఎద్దేవా చేశారు. నాసిరకపు చీరలు పంచి మహిళలను అవమానించారని మండిపడ్డారు. కొత్త సచివాలయం అవసరం లేదని, రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు.

15:40 - September 21, 2017

మురుగదాస్..సామాజిక అంశాలను సృశిస్తూ సినిమాలు తీస్తుంటారు. ఆయన తీసిన పలు సినిమాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈయన దర్శకత్వంలో ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' హీరోగా 'స్పైడర్' చిత్రం రూపొందింది. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తో మురుగదాస్ ఓ సినిమా చేయనున్నారని సోషల్ మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. అక్టోబర్ నుండి తాను రాజకీయాల్లో ఉంటానని ఇటీవలే పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఒప్పుకున్న సినిమానలు త్వరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. అనంతరం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో కూడ పవన్ నటిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

పవన్‌కి 'కత్తి' లాంటి సామాజిక నేపథ్యం ఉన్న కథలు బాగా సరిపోతాయని మురుగదాస్ పేర్కొన్నట్లు వార్తల కథనం. 'కత్తి' చిత్రానికి సీక్వెల్‌గా వీరి కాంబినేషన్‌లో సినిమా వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద 'ఖైదీ నెంబర్ 150' సినిమాకి సీక్వెల్ రూపొందబోతోందని, అందులో పవన్ నటిస్తారన్న వార్తలతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారంట. మరి పవన్ - మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా ఉంటుందా ? లేదా ? అనేది చూడాలి. 

15:38 - September 21, 2017

హైదరాబాద్ : హైకోర్టులో సదావర్తి భూముల కేసు విచారణ కొనసాగింది.. వేలంలో ఎక్కువపాడిన వ్యక్తి డబ్బు చెల్లించేందుకు ముందుకు రాలేదని పిటిషనర్‌ తరపు లాయర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు.. అయితే ఇదే కేసుపై రేపు సుప్రీం కోర్టులో విచారణ ఉందని ఏపీ ప్రభుత్వం న్యాయమూర్తికి నివేదించారు.. వాదనలు విన్న కోర్టు విచారణను అక్టోబర్‌ 3కు వాయిదా వేసింది.

15:37 - September 21, 2017

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నాయని సిఐటియూ జాతీయ కార్యదర్శి గఫూర్ ఆరోపించారు. దీనిపై పోరుకు సిద్ధమవుతున్నట్లు గఫూర్ స్పష్టం చేశారు. నవంబర్ 9,10, 11 తేదీల్లో అన్ని కార్మిక సంఘాలతో కలిసి సిఐటియూ ఆధ్వర్యంలో చలో పార్లమెంట్ నిర్వహించబోతున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పుడున్న కార్మిక చట్టాలను మారిస్తే కార్మికులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని గఫూర్ అన్నారు. 

జపాన్ సూపర్ సిరీస్ లో సైనా ఓటమి

హైదరాబాద్: జపాన్ సూపర్ సిరీస్ లో సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. రెండో రౌండులో 16-21,13-21 తేడాతో సైనా నెహ్వాల్ పై కరోలినా మారిన్ గెలుపొందింది.

15:36 - September 21, 2017

బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ అల్లుడు...కాఫీ డే కంపెనీ యజమాని వీజీ సిద్ధార్థ ఇళ్లపై ఐటి దాడులు నిర్వహించింది. బెంగళూరు విఠల్‌ మాల్యా రోడ్డులోని కేఫ్‌ చైన్‌ కేఫ్‌ కాఫీ డే ప్రధాన కార్యాలయంలో కూడా ఐటి సోదాలు చేస్తోంది. బెంగళూరుతో పాటు ముంబై, చెన్నై, చిక్‌మంగళూరులోని సిద్ధార్థకు సంబంధించిన 20 చోట్ల ఏకకాలంలో ఐటి తనిఖీలు చేపట్టింది. చెన్నైలో కృష్ణ కుటుంబానికి సంబంధించిన కంపెనీ సికల్‌ లాజిస్టిక్ ప్రయివేట్‌ లిమిటెడ్‌లో కూడా సోదాలు నిర్వహించింది. 46 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఎస్‌ఎమ్‌ కృష్ణ ఇటీవలే బిజెపిలో చేరారు. ఆయన గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు

15:35 - September 21, 2017

నల్లగొండ : జిల్లాలో ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తమ్ముడి భార్య శ్రీలత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమండ్లలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని శ్రీలత ఆత్మహత్య చేసుకుంది.. శ్రీలత భర్త ఓ ప్రైవేటు స్కూల్‌కు వ్యవస్థాపకుడిగా ఉన్నాడు.

నవంబర్ 9,10,11 తేదీల్లో చలో పార్లమెంట్ : గఫూర్

విజయవాడ: నవంబర్ 9,10,11 తేదీల్లో చలో పార్లమెంట్ నిర్వహస్తున్నామని సీఐటియు ఏపీ కమిటి ప్రధాన కార్యదర్శి గఫూర్ తెలిపారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాసే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. చట్టాలను మార్చు చేస్తే కార్మికులు తీవ్ర ఇబ్బందులో పడతారని తెలిపారు. కార్మిక చట్టాలను కాలరాస్తున్న ప్రభుత్వాలపై పోరుకు సిద్ధమవుతున్నామని తెలిపారు.

15:21 - September 21, 2017
15:18 - September 21, 2017

హైదరాబాద్ : శంషాబాద్ లో యువతి మిస్సింగ్ కేసులో విస్టరీ ఇంక వీడలేదు. గత జూలై 20న ఆఫీస్ వెళ్లిన జాబిలీ వర్మ అనే యువతి ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు 2నెలలు గడిచిన యువతి ఆచూకీ కనుగొనలేదు. డీజీపీకి ఫిర్యాదు చేసిన పురోగతి కనిపించకపోవడంతో యువతి పేరెంట్స్ చివరికి హై కోర్టును ఆశ్రయించారు. దీని పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆక్టోబర్ 3లోపు కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశాలరు జారీ చేసింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:17 - September 21, 2017

అనంతపురం : ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. ఎంపీగా అనంతపురంలో లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయలేకపోయా, జిల్లాకు సాగునీరు అందించడంలో విఫలమయ్యా అని జేసీ అన్నారు. అనంతపురంలో రోడ్లు వస్తరించలేకపోయా, ప్రజలకు ఏమీ చేయలేకపోయినప్పుడు పదవిలో ఉండలేనని ఆయన ప్రకటించారు. తనకు తెలుగుదేశం అధినాయకత్వం నుంచి ఎలాంటి సహకారం అందడంలేదని, ఎంపీ పదవికి రాజీనామా చేసినా టీడీపీలోనే ఉంటానని జేసీ తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:17 - September 21, 2017

టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' మీసం తీసేయడం పట్ల టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. కొత్త గెటప్ ఏదైనా సినిమా కోసమా ? లేకుంటే టీవీ షో ప్లాన్ చేస్తున్నారా ? యాడ్ కోసమా ? అనేది తెలియరావడం లేదు. ఈయన మీసం తీసేయడం హాట్ టాపిక్ అయిపోయింది.

వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ఆ పాత్రల్లో లీనమై నటించడం 'నాగార్జున'కు అలవాటు. సినిమా షూటింగ్ ప్రారంభం నుండి మొదలు కొంటే షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు స్ట్రిక్ గా పనిచేస్తారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'రాజు గారి గది 2' సినిమా టీజర్ విడుదల కార్యక్రమానికి 'నాగార్జున' వచ్చారు. ఆయన స్టైల్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతటి అందగాడు మీసం ఎందుకు తీసేసినట్లు అని చెవులు కొరుక్కున్నారంట.

సినిమా కోసమేనని పుకార్లు షికారు చేస్తున్నాయి. మలయాలంలో రూ. వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'మహాభారత' లో 'నాగార్జున' కర్ణుడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం మేకప్ టెస్టుల్లో భాగంగా మీసం తీసేశారని టాక్. దీనిపై పూర్తి క్లారిటీ రావలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. 

15:13 - September 21, 2017

అభివృద్ధి నినాదంతో ముందుకెళుతామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన కలెక్టర్ల సదస్సులో ప్రసంగించారు. గత కలెక్టర్ల సదస్సు కంటే ఈ సదస్సు భిన్నంగా సాగిందని ప్రభుత్వం పేర్కొంటోంది. రెండంకెల వృద్ధి రేటు సాధించామని..కలెక్టర్లు..దశ..దిశా..నిర్దేశం చేయాలని..పనిలేని శాఖలు రద్దు చేయాలని..అవసరం లేని చట్టాలను రద్దు చేయాలని తదిరత నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు ఏపీ అసెంబ్లీ..హైకోర్టు డిజైన్లపై దర్శకుడు రాజమౌళి సలహాలు..సూచనలను ఏపీ ప్రభుత్వం తీసుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో రాజశేఖర్ (వైసీపీ), మన్నె సుబ్బారావు (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

తెలంగాణ అసెంబ్లీ కి కైలాస్ సత్యార్థి...

హైదరాబాద్: నోబెల్ బహుమతి గ్రహీత భారతయాత్రలో భాగంగా కైలాస్ సత్యార్థి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న కైలాస్ సత్యార్థికి శాసనసభాపతి మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్, జగదీష్‌రెడ్డి, ఎంపీలు వినోద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

15:00 - September 21, 2017

తల్లిదండ్రుల అడుగజాడలో నడిచిన ఓ తనయ ప్రజా సమస్యలను తన గొంతుతో ఎలుగెత్తి చాటింది. ప్రజా ఉద్యమాపంథాలో సాగిన అరుణోదయ పయాణం ఆమెది. బహుజనుల కోసం తన గాత్రన్ని ఆయుద్ధంగా చేసి గర్జించిన గనం ఆమెది. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో కాళ్లకు గజ్జెకట్టి, భూజన గొంగడేసుకుని తన సంస్కృతిక దళంతో తెలంగాణ ప్రజల గొంతులను తన పాటలో మెలవించిన జానపద కళాకరణి ఆమె. తెలంగాణ ఉద్యమంలో ఆమె పాట అత్యంత ప్రత్యేకమైంది. ఆమె తెలంగాణ పాటకు నిలువెత్తు రూపం విమలక్క...విమలక్క గురించి మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

14:51 - September 21, 2017

హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెయిన్ రిజల్ట్స్ ఇవ్వాలన్న అభ్యుర్థుల వాదనను పరిగణలోకి తీసుకున్న గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్ కమిషనర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో 128 గ్రూప్ 1 పోస్టులకు లైన్ క్లియర్ అయింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

14:45 - September 21, 2017

చెన్నై : కాసేపట్లో కమల్ హాసన్ తో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సమావేశం కానున్నారు. కేజ్రీ నలుగురు ఆప్ నేతలతో కలిసి కమల్ ను కలవనున్నారు. వారు తమిళనాడులో నెలకొన్న తాజా రాజకీయా పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

మోడీకి సోనియా లేఖ...

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకోవాలని, లోక్ సభలో బీజేపీకి తగినంత బలం ఉన్నందున బిల్లు ఆమోదించాలని సోనియా పేర్కొన్నారు. 

13:58 - September 21, 2017

హైదరాబాద్ : నెలరోజులుగా మాటువేశారు...మైనర్లే కావాలంటూ మొండికేశారు...తమకు దొరికిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు..అందుకు ఖర్చుకు వెనకాడొద్దని చెప్పారు...అంతటితో ఆగకుండా లాడ్జిల్లో మకాం వేసి నచ్చిన బాలికల కోసం వెయిటింగ్ చేస్తున్నారు.. బాధిత బాలిక ఇచ్చిన సమాచారం పోలీసులు రైడ్ చేయడంతో పాతబస్తీలో కలకలం రేపింది...ఏకంగా ఎనిమిది మంది అరబ్‌షేక్‌లు దొరికిపోయారు.. మైనర్లను నిఖా చేసుకునేందుకు వచ్చిన షేక్‌ల అరాచకాలు కొనసాగుతున్నాయని తాజా ఘటనతో రుజువయింది..
అరబ్‌షేక్‌ల అరాచకాలు 
హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీలో మైనర్ బాలికలను టార్గెట్ చేసుకున్న అరబ్‌షేక్‌ల అరాచకాలు కొనసాగుతున్నాయి.. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి రాగా...రహస్యంగా తలదాచుకున్న అరబ్‌షేక్‌లను పోలీసులు గుర్తించారు.. ఏడుపదులు దాటిన వయస్సున్న అరబ్‌షేక్‌లంతా పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని బాలికలను పెళ్లిళ్లు చేసుకుంటున్నారు..వారితో కొన్ని రోజులు ఇక్కడే కాపురం చేసి వదిలేయడం..లేదంటే...తమతో వారి దేశాలకు తీసుకువెళ్లి అక్కడ అరాచకాలకు పాల్పడడం నిత్యం జరుగుతున్నదే...ఈ క్రమంలోనే పాతబస్తీలో ఎన్నో పెళ్లిళ్లను ఆపేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతున్నా... మధ్యవర్తుల కిరాతకాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి...
అరబ్‌షేక్‌లపై పోలీసులు దాడులు 
పాతబస్తిలో కొనసాగుతున్న తతంగంపై పోలీసులకు సమాచారం అందింది..దీనిపై ఆరా తీయగా పోలీసులకు తెలిసిన విషయాలతో ఖంగుతిన్నారు..రాత్రికి రాత్రి వివిధ ప్రాంతాల్లో రహస్యంగా తలదాచుకున్న అరబ్‌షేక్‌లపై దాడులు కొనసాగించారు..పెళ్లిళ్ల రాకెట్‌ను ఛేదించిన పోలీసులు 12మంది మైనర్ బాలికలను సురక్షితంగా వారి కన్నవారికి అప్పగించారు...అరబ్ షేక్ పెళ్లిళ్ల రాకేట్ లో మొత్తం 20మందిని అరెస్ట్ చేశారు. 8మంది అరబ్‌షేక్‌లతో పాటు ముగ్గురు గాజీలను, నలుగురు లాడ్జి యజమానులను, ఐదుగురు పాతబస్తి బ్రోకర్లను అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. అరెస్టైన వారిలో ముంబయికి చెందిన ప్రదాన గాజి ఉండగా మరో 15మంది బ్రోకర్లు పరారిలో ఉన్నారు. 
నెల రోజులుగా రహస్య స్థావరాల్లో...
గత నెలరోజులుగా పహాడిషరీఫ్ లో అరబ్ షేక్ లు తలదాచుకుంటున్నారన్న సమాచారం మేరకు పోలిసులు దాడులు జరిపారు. గత నెల 17న మైనర్ బాలికలను అరబ్ షేక్ లు వివాహం చేసుకునేందుకు నగరానికి చేరుకున్నారు...అయితే ఇందులో ఓ బాధిత బాలిక ఇచ్చిన సమాచారంతో రాకెట్‌ గుట్టురట్టయింది... 8మంది అరబ్ షేక్ లలో ముగ్గురు కతర్ కు చెందిన వారు కాగా, ఐదుగురు ఒమన్ దేశానికి చెందిన కురువృద్దులు...పట్టుబడిన వారిలో అరబ్ షేక్ లు 65ఏల్ల నుంచి 85ఏళ్ల వయస్సున్నవారే... వీరికి  నలుగురు లాడ్జి ఓనర్లు సహకరించి ఆశ్రయం కల్పించారు..భారీ మొత్తంలో డబ్బు లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది...అయితే ఇందులో మహిళా బ్రోకర్లు కూడా ఉన్నారు...

 

రోహింగ్యాలు..అక్రమ వలసదారులు - రాజ్ నాథ్..

ఢిల్లీ : రోహింగ్యాలు భారత్ లో ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్న శరణార్థులు కారని..వారు అక్రమ వలసదారులని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ పేర్కొన్నారు. 

13:50 - September 21, 2017

 గుంటూరు : హైటెక్‌ రాజధానిగా నిర్మాణం అవుతున్న  అమరావతిలో శ్మశానవాటికలు సమస్యగా మారాయి. ఊరికి దూరంగా ఉండాల్సిన శ్మశానవాటికలు ఇళ్లమధ్యనే నిర్మిస్తున్నారు. సీఆర్‌డీఏ అధికారుల తీరుపై రాజధాని గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. 
కొత్తగా శ్మశాన వాటికలపై గ్రామస్తుల అభ్యంతరం 
ఏపీ రాజధానిలో శ్మశానవాటికలు వివాదాస్పదమ వుతున్నాయి. భూములు ఇచ్చేసమయంలో ఒక సమస్య ..ఇచ్చిన తర్వాత మరో సమస్య అన్నట్టు పరిస్థితి తయారైంది. నిర్వాసిత గ్రామాలకు స్థలాలను కేటాయించిన సీఆర్‌డీఏ అధికారులు.. శ్మశానవాటికల ఏర్పాటుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.   రాజధాని పరిధిలో మొత్తం 29 గ్రామాలు ఉండగా  వివిధ మతాలకు సంబంధించి గతంలో  విడివిడిగా శ్మశానాలు ఉన్నాయి. కాని సీఆర్‌డీఏ అధికారులు కొత్తగా కేటాయిస్తున్న బరేలీ గ్రౌండ్స్‌తో  సమస్యలు వచ్చిపడ్డాయి. 
పాత శ్మశాన వాటికలను తొలగించిన సీఆర్‌డీఏ 
భూముల తీసుకున్న తర్వాత సీఆర్‌డీఏ అధికారులు చాలా గ్రామాల్లో శ్మశానాలను తవ్వేశారు. దాంతో  ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో  శ్మశానాలను కదిలించబోమని అప్పట్లోనే అధికారులు హామీఇచ్చారు. ఒకవేళ తప్పని సరి పరిస్థితుల్లో తొలగించాల్సి వస్తే .. అందరి ఆమోదంతో కొత్త శ్మశానవాటికలు నిర్మిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం  ఇళ్లకు సమీపంలోనే   శ్మశా స్థలాలు కేటాయిస్తుండటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
ఇళ్లకు సమీపంలో కొత్తగా బరేలీ గ్రౌండ్స్‌ 
అమరావతి గ్రామాలను కలిపే విధంగా కృష్ణానది కరకట్టకు సమాంతరంగా  సీడ్‌యాక్సిస్‌ రహదారి నిర్మాణం చేస్తున్నారు.  దీనికోసం కృష్ణానదికి ఆనుకుని ఉన్న శ్మశానవాటికలు తొలగించారు. వాటిస్థానంలో సీడ్‌యాక్సిస్‌రోడ్‌ పక్కనే  గ్రామాలను ఆనుకుని కొత్తగా బరేలీ గ్రౌండ్స్‌ నిర్మిస్తున్నారు. జనావాసాలకు కనీసం 100 మీటర్ల దూరంకూడా పాటించకుండా శ్మశానాలు నిర్మించడంతో తాము  ఇళ్లలో ఎలా ఉండలని వెంకటాపాలెం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. 
గ్రామానికి దూరంగా శ్మశానాలు ఏర్పాటు చేయాలి : ప్రజలు 
భూములు తీసుకునే సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం గ్రామానికి దూరంగా శ్మశానాలు ఏర్పాటు చేయాలని రాజధాని ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకుని.. జనావాసాలకు  దూరంగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాసేలా సీఆర్‌డీఏను ఆదేశించాల్సిన అవసరం ఉంది. 

 

13:48 - September 21, 2017

కృష్ణా : బెజవాడ దుర్గమ్మను మంత్రి దేవినేని కాలినడకన వెళ్లి దర్శించుకున్నారు.. క్యూలైన్లలో భక్తులను అడిగి సౌకర్యాల విషయం తెలుసుకున్నారు.. ఆ తర్వాత అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రితో ఫేస్‌ టు ఫేస్ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

గ్రూప్ 1పై హైకోర్టు ఉత్తర్వులు..

హైదరాబాద్ : గ్రూప్ 1 ఫలితాలను ఆపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన అభ్యర్థులను పక్కన పెట్టడంపై హైకోర్టులో కార్తీక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆగస్టు 10వ తేదీన జరిగే గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఇప్పటి వరకు మెయిన్ రిజల్ట్ ఇవ్వాలనే అభ్యర్థుల వాదనలను హైకోర్టు పరిగణలో తీసుకుంది. గ్రూప్ 1 రిజల్ట్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 128 గ్రూప్ 1 పోస్టులకు లైన్ క్లియర్ అయ్యినట్లైంది. 

'రూ. 500 కోట్లిలివ్వండి..భూమిలిచ్చేస్తాం'

విజయవాడ : సదావర్తి భూముల విషయంలో ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. బహిరంగ వేలం పెట్టినా విమర్శలు చేయడం సరికాదని, రూ. 1000 కోట్ల ఆస్తి అంటున్న వైసీపీ, రూ. 500 కోట్లు కడితే భూములిచ్చేస్తామని సోమిరెడ్డి సవాల్ విసిరారు. 

పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి: ఇద్దరి మృతి

జమ్ము కశ్మీర్ : పుల్వామా జిల్లాలో ట్రాల్ లో ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ దాడి నుండి మంత్రి నయీమ్ అక్తర్ తృటిలో తప్పించుకున్నారు.

 

మెడ్ టెక్ జోన్ ఎండీ బాధ్యతల నుండి పూనం మాలకొండయ్య తొలగింపు

అమరావతి: మెడ్ టెక్ జోన్ ఎండీ బాధ్యతల నుంచి పూనం మాలకొండయ్యను ప్రభుత్వం తప్పించింది. విశాఖ మెడ్ టెక్ జోన్ వివాదం నేపథ్యంలో చర్యలు చేపట్టింది. గతంలో టెండర్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జితేంద్ర శర్మకు సీఈవోతో పాటు ఎండి బాధ్యతలను అప్పగించింది. మెడ్ టెక్ జోన్ చైర్ పర్సనగా మాలకొండయ్య కొనసాగనున్నారు.

జపాన్ ఓపెన్ క్వార్టర్స్ లో యమగూచి

హైదరాబాద్: జపాన్ ఓపెన్ క్వార్టర్స్ లోకి జపాన్ క్రీడాకారిణి యమగూచి చేరింది. ఫ్రీ క్వార్టర్స్ లో దక్షిణ కొరియా షట్లరర్ కిమ్ హ్యోమిన్ పై విజయం సాధించింది. 21-12,18-21, 21-8 తేడాతో యమగూచి విజయం సాధించింది.

సదావర్తి భూములపై విచారణ వాయిదా

హైదరాబాద్: సదావర్తి భూములపై దాఖలైన కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ వేలంలో అత్యధిక ధరకు కోట్‌ చేసిన వ్యక్తి ముందుకు రావట్లేదని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ భూములపై రేపు సుప్రీం కోర్టులో విచారణ ఉందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో హైకోర్టు ఈ కేసు విచారణను వచ్చేనెల 3వ తేదీకి వాయిదా వేసింది.

 

తిప్పాపూర్ లో ఉద్రిక్తత

రాజన్న సిరిసిల్ల: ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. నిన్న ప్రమాదం జరిగిన కళేశ్వరం పదో ప్యాకేజీ టన్నెల్లోకి వెళ్లేందుకు బిజెపి నేత లక్ష్మణ్, సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా బైఠాయించి ఆందోళన చేపట్టారు.

12:21 - September 21, 2017

చాలా మంది ముఖం మీద కనపరిచే శ్రద్ధ మెడమీద చూపించరు. మెడ నల్లగా ఉన్నా, ఆపరిశుభ్రంగా ఉన్నా పట్టించుకోరు. ముఖం అందంగా ఉంటే చాలు అని అనుకుంటారు. మెడ శుభ్రం విషయంలో నిర్లక్ష్యంగా ఉండడంతో సమస్య తీవ్రతరమౌతుంది. దీనితో ఇతర మందులు..బ్యూటీషియన్స్ ను సంప్రదిస్తుంటారు. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు..

మెడ మడతలలో మురికి చేరి ఉంటుంది కదా. ఈ మురికి వదిలించుకోవడానికి చాలా సార్లు సబ్బు పెడుతుంటారు. కొద్దిగా పెరుగు తీసుకుని అందులో బియ్యం పిండి వేసి ఆ మిశ్రమాన్ని మెడకు అప్లై చేయండి. అనంతరం గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.

బేకింగ్ సోడాను నీటిలో మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను మీ మెడ మీద అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత దీన్ని శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ తో మెడను శుభ్రం చేసుకుంటే మెడ సౌందర్యం అద్భుతంగా మెరుగుపడుతుంది.

మెడ మీద నలుపును నివారించుకోవడం కోసం నిమ్మరసానికి కొద్దిగా పంచదార మిక్స్ చేసి,దీన్ని మెడచుట్టు అప్లై చేసి 15నిముషాల తర్వాత స్ర్కబ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆర్టీసి కండక్టర్ పై ఇరాక్ విద్యార్థుల దాడి

అమరావతి: ఆర్టీసి కండక్టర్ పై ఇరాక్ విద్యార్థులు దాడి చేశారు. ఫుట్ బోర్డింగ్ చేస్తున్న విద్యార్థుళను లోనికి రమ్మన్నందుకు కండక్టర్ వెంకటేశ్వరరావు పై నిన్న రాత్రి విద్యార్థులు దాడి చేశారు. ఆచార్య నాగార్జున వర్శిటీలో విద్యార్థులు చదువుతున్నారని పెదకాకాని పీఎస్ లో కండక్టర్ ఫిర్యాదు చేశారు.

దక్షిణాదిలో బిజెపిది కీలకపాత్రధారిగా మార్చటమే లక్ష్యం: మరళీధర్ రావు

విశాఖ: దక్షిణాదిలో బిజెపిది కీలకపాత్రధారిగా మార్చటమే తమ లక్ష్యం అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మరళీధర్ రావు అన్నారు. దేశంలో బిజెపికి పట్టులేని 130 నియోజకవర్గాలపై దృష్టి పెట్టామని, ఇందులో అత్యధికం దక్షిణాదివే అని, 30 మంది పార్టీ ప్రముఖలకు 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ప్రతీ ఇంటికి కేంద్ర పథకాలు అందేలా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. మోదీ, కేంద్ర నాయకత్వాన్ని బలోపేత చేయటమే లక్ష్యంగా ఏపీలో ఎన్డీఏ కూటమి పటిష్టంగా ఉందన్నారు.

ఆపదలో ఉన్న మహిళల కోసం 181 కాల్ సెంటర్ :ఏపీ సీఎం

విజయవాడ: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఆపదలో ఉన్న మహిళల కోసం 181 కాల్ సెంటర్ ఏర్పాటుకు బ్రోచర్ ను విడుదల చేయాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డెంగీ విషయంలో అనుకున్నంత ఫలితాలు రావడం లేదు. గిరిజన ప్రాంతాల్లో ఎంత ఖర్చు పెట్టిన ఫలితాలు రావట్లేదని, ఎక్కడ విఫలమవుతున్నామో అధికారులు గుర్తించాలన్నారు. సామాన్య ప్రజలకు ఇంకా సేవల చేయాలి, గిరిజనుల్లో మూఢ నమ్మకాలున్నాయని, గిరిజన, విద్య, వైద్యారోగ్యా శాఖలు కలిపి పని చేస్తే ఫలితాలు వస్తాయన్నారు. కలెక్టర్లు ప్రజా వైద్యంపై సమయం కేటాయించాలన్నారు.

12:03 - September 21, 2017

భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో భారత రైల్వే అతి పెద్దది... దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణీస్తుంటారు...దూర ప్రాంతాలకు ఎక్కువగా రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. ప్రయాణంలో సౌకర్యంగా ఉండడం కోసం రిజర్వేషన్ చేయించుకుని వెళుతుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైళ్లలోనే రెండు..మూడు రోజులు గడపాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే..ప్రస్తుతం రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై పలు విమర్శళు వెల్లువెత్తుతున్నాయి.

రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణీకులు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నిద్రపోవాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి ఓ కారణం కూడా చెబుతోంది. రిజర్వ్డ్ బోగీల్లో కింది..మధ్య బెర్త్ ల ప్రయాణీకులు త్వరగా పడుకోవడం..వల్ల తోటి ప్రయాణీకులకు ఇబ్బందికరంగా ఉంటుందని..ఈ విధంగా ఎక్కువ సేపు నిద్రపోవడాన్ని నిరోధించాలని పేర్కొంటోంది. అయితే గర్భిణీలు..వృద్ధులు..దివ్యాంగులు..అనారోగ్య వంతులు ఉంటే ? ఎలా అని అంటారా ? వారికి ఇతర ప్రయాణీకులు సహకరించాలని సూచిస్తోంది రైల్వే శాఖ. మరి వారు సహకరించకపోతే ?

ఇలా చేయడం వల్ల ఘర్షణలు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రైల్వే శాఖ నిర్ణయం మార్చుకుంటుందా ? లేదా ? అనేది రానున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది..

నగరంలో 'భారత యాత్ర'

హైదరాబాద్: బాలికలపై లైంగిక వేధింపులు, మహిళల అక్రమరవాణాకు వ్యతిరేకంగా నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాస్‌ సత్యార్థి ఆధ్వర్యంలో ‘భారత యాత్ర’ జరిగింది. నగరంలోని ఎంజే మార్కెట్‌ నుంచి ఎగ్జిబిషన్‌ మైదానం వరకు ఈ ర్యాలీని నిర్వహించారు.

సుక్మా జిల్లాలో ఎదురు కాల్పులు: మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గడ్‌ : సుక్మా జిల్లా పిడ్మెల్‌ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మృతుడి వద్ద నుంచి ఒక ఎయిర్‌గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

11:51 - September 21, 2017

విద్యా కుసుమాలు నేల రాలుతున్నాయి..చదువు కోసం ఊరు కాని ఊరు వచ్చి చదువుకుంటున్న వారు విగతజీవులగా మారుతుండడం కలకలం రేపుతోంది...కన్న బిడ్డ క్షేమంగా ఉంటుందని భావించిన ఆ తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖం మిగులుతోంది...మరి వారు బలవన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నారు. గూడవల్లిలోని నారాయణ క్యాంపస్‌లో విద్యార్థి ఈశ్వర్‌రెడ్డి మృతిపై చర్యలు తీసుకోవాని డిమాండ్ చేస్తున్నా స్పందన ఎక్కడ ? శ్రీ చైతన్య కాలేజీలో తోటి విద్యార్థులతో గొడవపడ్డాడనే కారణంతో చింత కళ్యాణ్ అనే విద్యార్థిని లెక్చరర్స్ చితకబాదడంతో ఆ విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఎన్నో ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.


కానీ వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలు ఏంటీ ? మానసిక వత్తిడిని భరించలేక వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా ? లేక ఇతరత్రా కారణాలున్నాయా ? ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుండడం గమనార్హం. గత రెండేళ్ల కాలంలో ఏపీలో 692 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారంట. ఇంత జరుగుతున్న ప్రభుత్వం ఏం చేస్తోంది ? ఏపీలోని నారాయణ విద్యా సంస్థల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నట్లు ?

ఇక విద్యార్థుల బలవన్మరణాల నివారణకు ఏర్పాటైన చక్రపాణి కమిటీ రిపోర్టును ఇంతవరకు అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదనే విమర్శలున్నాయి. కాలేజీలలో జరుగుతున్న ఆత్మహత్యల నివారణకు మంత్రి నారాయణ చర్యలు తీసుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో కంటి తుడుపు చర్యగా విచారణ కమిటీ వేశామంటూ చేతులు దులుపుకుంటున్నారని విద్యార్థుల సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

నారాయణ కాలేజీల్లో విద్యార్థులను రాచిరంపాన పెడుతుంటారని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఉదయం నుండి మొదలు కొంటే రాత్రి వరకు చదివిపిస్తుండడంతో విద్యార్థులు తీవ్ర వత్తిడికి లోనవుతుంటారని నిపుణులు పేర్కొంటున్నారు. దీనిపై నియమించబడిన కమిటీ పలు విషయాలను..సూచనలు..సలహాలు నొక్కి చెప్పింది. కానీ కమిటీ చెప్పిన వాటిని ఎక్కడా అమలు కావడం లేదని విద్యార్థుల బలవన్మరణాలను బట్టి చూస్తుంటే తెలుస్తోంది. ఇప్పటికైనా ఏపీ సర్కార్ మేల్కొని విద్యార్థుల బలవన్మరణాలకు చెక్ పెడుతుందా ? ఇందుకు కారణమౌతున్న కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటారా వేచి చూడాలి. 

11:46 - September 21, 2017
11:44 - September 21, 2017

కృష్ణా : విజయవాడలో కలెక్టర్లతో సమావేశం రెండో రోజు కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు కలెక్టర్లతో పలు అంశాలపై చర్చిస్తున్నారు. కలెక్టర్ల సదస్సులో ఈ..ప్రగతిపై చంద్రబాబు సమీక్ష చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:41 - September 21, 2017

కర్నూలు : జిల్లాలోని ఎమ్మిగనూరులోని సిండికేట్‌ బ్యాంక్‌ ఏటీఎంలో చోరీ జరిగింది.. అర్ధరాత్రి ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు.. గ్యాస్‌ కట్టర్‌తో మిషన్‌ను ఓపెన్‌ చేసి 17 లక్షల రూపాయలు దోచుకెళ్లారు.. ఉదయం క్లీనింగ్‌కోసం వచ్చిన స్వీపర్‌ చోరీ విషయం గమనించి బ్యాంక్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు.. దోపిడీ సమయంలో సైరన్‌ మోగకపోవడంతో దొంగలు ప్రశాంతంగా ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. 

 

రూ.30 లక్షల విలువైన గంజాయి స్వాధీనం...

తూ.గో: రాజమహేంద్రవరం లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. దాదాపు రూ.30 లక్షల విలువైన 400 కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుండి కారు, వ్యాన్ సీజ్ చేసి 8 మందిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నర్సీపట్నం నుంచి షోలాపూర్ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

11:33 - September 21, 2017

కర్నూలు : జిల్లాలోని ఎమ్మిగనూరులోని సిండికేట్‌ బ్యాంక్‌ ఏటీఎంలో చోరీ జరిగింది.. అర్ధరాత్రి ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు.. గ్యాస్‌ కట్టర్‌తో మిషన్‌ను ఓపెన్‌ చేసి 17 లక్షల రూపాయలు దోచుకెళ్లారు.. ఉదయం క్లీనింగ్‌కోసం వచ్చిన స్వీపర్‌ చోరీ విషయం గమనించి బ్యాంక్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు.. దోపిడీ సమయంలో సైరన్‌ మోగకపోవడంతో దొంగలు ప్రశాంతంగా ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. 

 

11:26 - September 21, 2017

కర్నూల్ : మెడికల్ కాలేజీలో మళ్ళీ ర్యాగింగ్ కలకలం సృష్టించింది. రాత్రి జూనియర్లను తమ హాస్టల్‌ గదులకు పిలిపించుకుంటున్న సీనియర్స్‌.. బట్టలు ఉతికిస్తున్నట్లు ఢిల్లీలోని యాంటి ర్యాగింగ్‌ సెల్‌కు ఓ విద్యార్థి మెయిల్‌ చేశాడు. దీనిపై కాలేజీ ప్రిన్సిపాల్‌ డా. రామ్ ప్రసాద్‌ విచారణకు ఆదేశించారు. వైస్ ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ తో విచారణకు ఆదేశించామని ప్రిన్సిపాల్‌ తెలిపారు. ర్యాగింగ్ జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు..

 

కార్టూనిస్ట్ మోహన్ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్: ప్రముఖ కార్టునిస్ట్ మోహన్ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు మోహన్ భౌతికకాయం తరలించారు. సామాజికంగా, పొలిటికల్ కార్టునిస్టుగా ఆయన పెట్టింది పేరు. 1951 డిసెంబర్ 24న ఏలూరు లో జన్మించారు.

11:19 - September 21, 2017

టాలీవుడ్ దర్శకుడు 'రాజమౌళి' తన రెండు చిత్రాలతో అంతర్జాతీయస్తాయిలో పేరు సంపాదించుకున్నాడు. సంవత్సరాల తరబడి చేసిన 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాలు ఏ స్థాయిలో విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమా అనంతరం 'రాజమౌళి' ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. దీనితో ఆయన దర్శకత్వంలో ఏ హీరో నటిస్తారనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై సోషల్ మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఇటీవలే 'రామ్ చరణ్' నటిస్తున్న 'రంగస్థలం 1985' సినిమా షూటింగ్ లో మెగాస్టార్ 'చిరంజీవి'తో కలిసి 'రాజమౌళి' హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 'మగధీర' తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల 'రామ్‌ చరణ్‌'తో గ్యాప్‌ వచ్చిందని అప్పట్లో ఇండస్టీ కోడై కూసింది. కానీ ఇవన్నీ వట్టి పుకార్లేనని పరిణామాలను బట్టి తెలుస్తోంది. 'రాజమౌళి' ఈ మధ్య 'రామ్‌ చరణ్‌'తో సన్నిహితంగా కనిపిస్తున్నారు. 'చిరంజీవి' నటించబోయే 'సైరా' టైటిల్ లాంచింగ్ వేడుకలో 'రాజమౌళి' పాల్గొనడం తెలిసిందే. అంతేగాకుండా విజయేంద్ర ప్రసాద్ 'శ్రీవల్లి' ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా వెళ్లారు. చిరు, రామ్‌ చరణ్‌ కోసం ఒక కథ రాయాలని ఉందని రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈమధ్య ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారివురితో రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నట్లు, మెగాధీరులకోసం తండ్రితో కథ సిద్ధం చేస్తున్నట్లే అనిపిస్తోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. 

11:16 - September 21, 2017


హైదరాబాద్ : ప్రముఖ కార్టూనిస్టు మోహన్ (63) ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. గతకొంతకాలంగా యాన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఈనెల 7న కేర్ ఆస్పత్రిలో చేరారు. ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని కాసేపట్లో ప్రెస్ క్లబ్ కు తీసుకురానున్నారు. 1952 డిసెంబర్ 21 న ఏలూరులో మోహన్ జన్మించారు. పలు దిన, వార పత్రికలలో మోహన్ పని చేశారు. పొలిటికల్ కార్టూనిస్టుగా పలు పత్రికల్లో పని చేశారు. పొలిటికల్ లో ప్రత్యేక శైలిని పరిచయం చేశారు. సిద్ధాంత నిబద్ధత కలిగినవాడిగా 
గుర్తింపు పొందారు. మోహన్ మృతిపై పలువురు సంతాపం తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
మోహన్ చాలా గొప్ప వ్యక్తి అని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి కొనియాడారు. 

 

రుయా ఆస్పత్రిలో వైద్యులు, ఉద్యోగులు మధ్య ముదిరిన వివాదం

తిరుపతి: రుయా ఆస్పత్రిలో వైద్యులు, ఉద్యోగులు మధ్య వివాదం ముదురుతోంది. వీరు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తనను దూషించిన సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమారిపై కేసు నమోదు చేయాలంటూ జూడాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా కేసు నమోదు చేయకుంటే అత్యవసర సేవలనూ బహిష్కరిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమారికి ఎన్జీవో సంఘం అండగా ఉంది.

11:08 - September 21, 2017

తమిళ్ ఇండస్ట్రీ లో ప్రయోగాత్మక సినిమాలు రావడం కామన్. అలాంటి సినిమాలకి అక్కడి ప్రేక్షకులతో పాటు ఇక్కడ తెలుగు ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవుతారు. డిఫెరెంట్ వేలో సినిమాలు చేస్తూ తమిళ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సినిమా అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఇదో సోషల్ రెస్పాన్సిబిలిటీ అని నిరూపిస్తున్నాడు ఈ హీరో 'విశాల్' హీరోగా తమిళ్ లో వచ్చిన సినిమాలు చాల వరకు హిట్ టాక్ తెచ్చుకున్నవే. వాస్తవానికి దగ్గరగా ఉండే కధలను సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేసే 'విశాల్' తమిళ్ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు. కోలీవుడ్లో ఇప్పుడందరి దృష్టి 'విశాల్' మీదే ఉంది. ఓవైపు ఇండస్ట్రీని పీల్చి పిప్పి చేసేస్తున్న పైరసీ మీద యద్ధాన్ని కొనసాగిస్తూనే సినిమాలు కూడా చేస్తున్నాడు విశాల్.

విశాల్ కొత్త సినిమా ‘తుప్పారివాలన్’ ఈ గురువారమే విడుదలైంది. ఈ సినిమాకు అమ్ముడయ్యే ప్రతి టికెట్ లోంచి ఒక రూపాయి రైతు సంక్షేమ నిధికి వెళ్తుందని ప్రకటించి అందరి మనసులూ గెలిచాడు విశాల్. ‘తుప్పారివాలన్’ సూపర్ హిట్ టాక్‌తో మొదలైంది. విలక్షణమైన సినిమాలు తీసే సీనియర్ డైరెక్టర్ మిస్కిన్ రూపొందించిన చిత్రమిది. ఇందులో విశాల్ డిటెక్టివ్ పాత్ర చేశాడు. ఆద్యంతం ఉత్కంఠ రేపేలా ఈ థ్రిల్లర్ మూవీ సాగుతూ.. ఉర్రూతలూగిస్తుందని క్రిటిక్స్ అంటున్నారు.

11:03 - September 21, 2017

ఖమ్మం : జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. టేకులపల్లి అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. న్యూడెమోక్రసీ రామన్నమదళం, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. రామన్నదళ సభ్యులు ముగ్గురు మహిళలు మృతి చెందినట్లు సమాచారం. ఆయుధాలు, మావోయిస్టు సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఎన్ కౌంటర్ లో దళ సభ్యులు ముగ్గురు మహిళలు మృతి చెందినట్లు సీపీఐఎం న్యూడెమ్రోసీ అండర్ గ్రౌండ్ నేతలు అంటున్నారు. ఎన్ కౌంటర్ జరిగిందని..అందులో ఎవరూ చనిపోలేదని భద్రాద్రి కొత్తగూడెం ఎస్ పి అంబర్ కోషోర్ జా చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:00 - September 21, 2017

యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' తన తాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. వరుస విజయాలతో దూసుకెళుతున్న ఈ యంగ్ టైగర్ మరో హిట్ కొట్టాడా ? లేదా ? అనే దానిపై సోషల్ మాధ్యమాల్లో రివ్యూలు చక్కర్లు కొడుతున్నాయి. బాబీ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' సోదరుడు 'కళ్యాణ్ రామ్' నిర్మాణంలో 'జై లవ కుశ' చిత్రం తెరకెక్కింది. ఎన్టీఆర్ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున ఈ సినిమా 2400 థియేటర్స్ లో ప్రదర్శితమవుతోంది. 'బాహుబలి 2' తరువాత అత్యధిక థియేటర్స్ లో విడుదలవుతోన్న సినిమా ఇదేనని టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలను పోషిస్తుండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా..నివేదా థామస్ లు హీరోయిన్స్ నటించారు. 

ఇక చిత్ర కథ విషయానికి వస్తే జై..లవ..కుశ అనే కవలలుంటారు. జైకి నత్తి..సరిగ్గా మాట్లాడలేకపోతాడు. ఈ కారణంతో మిగిలిన ఇద్దరు సోదరులతో సరిగ్గా కలువలేకపోతాడు. లవ..కుశ కూడా జైని చిన్న చూపు చూస్తారంట. ఈ కారణంగా చిన్నప్పుడే తన సోదరులపై కోపం..కసి పెంచుకుంటాడు. ఎలాగో చిన్నప్పుడే ముగ్గురూ తప్పిపోతారు. లవ పెద్దవాడై బ్యాంకు ఉద్యోగిగా..కుశ ఏదోలా మాయ చేసి అమెరికా వెళ్లి గ్రీన్ కార్డు సంపాదించి అక్కడే సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. వీరిద్దరి జీవితాల్లోకి 'జై' ప్రవేశిస్తాడు. చిన్పప్పటి పగ..ప్రతికారాన్ని తీర్చుకున్నాడా ? ముగ్గురు కలిశారా ? కలిసి ఉంటూనే మరొకరిపై పోరాటం చేశారా ? అనేది తెరపై చూడాల్సిందే.

సినిమాలో మాత్రం 'ఎన్టీఆర్' అన్ని తానై నడిపించారని టాక్ వినిపిస్తోంది. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ చక్కగా ఇమిడిపోయాడని, ఇంటర్ వెల్ అనంతరం 'జై' విశ్వరూపం మొదలవుతుందని తెలుస్తోంది. స్పష్టమైన రివ్యూ తెలుసుకోవాలంటే మాత్రం టెన్ టివిలో సాయంత్రం ప్రసారమయ్యే 'నేడే విడుదల' కార్యక్రమాన్ని చూడండి..

చిత్తూరు జిల్లాలో మరో ఎకనామిక్ సిటీ

విజయవాడ: జక్కంపూడి జెట్ సిటీ తరహాలో చిత్తూరు జిల్లాలో మరో ఎకనామిక్ సిటీని సిద్ధం చేయాలని, పట్టణ ప్రాంతాల్లో మురికి వాడలు ఇక కనిపించరాదని సీఎం తెలిపారు.

హైకోర్టులో ఆరుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

హైదరాబాద్:హైకోర్టులో ఆరుగురు కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తులు పి. కేశవరావు, కె.విజయలక్ష్మి, గంగరావు, అభినంద్ కుమార్, అమర్ నాథ్ గౌడ్, డీవీ సోమయాజులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరి చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బులెట్ కలకలం

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బులెట్ కలకలం రేగింది. లక్నో వెళ్తున్న ప్రయాణికుడి నుంచి పోలీసులు బులెట్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుతు సతీష్ ఎల్బా నగర్ వాసిగా గుర్తించారు.

కలెక్టర్ల సదస్సులో ఈ ప్రగతి పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: కలెక్టర్ల సదస్సులో ఈ ప్రగతి పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇది ఇ-ప్రగతి సంవత్సరంగా ప్రకటించాం అని, అన్ని జిల్లాలూ రిటైల్ టైమ్ గవర్నెన్స్ పరిధిలోకి రావాలన్నారు. ల్యాండ్ హబ్, క్లౌడ్ హబ్, ఏపీసీఎం కనెక్ట్ కింద అవినీతిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పూర్తి స్థాయిలో సాంకేతికతను వినియోగించుకుంటే అవినీతిని అంతం చేయడం పెద్ద విషయం కాదని సీఎం పేర్కొన్నారు. పరిష్కార వేదిక పెట్టి ప్రజల ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేస్తే ఉపేక్షించవద్దన్నారు.

ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు..

విజయవాడ:బెజవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గా దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రోజుకు 50వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు రానున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

జపాన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ లో ప్రణయ్

హైదరాబాద్: జపాన్ క్వార్టర్ ఫైనల్ కు ప్రణయ్ చేరుకున్నాడు. ఫ్రీ క్వార్టర్స్ లో చైనా క్రీడాకారుడు జెన్ హో పై 21-18,23-21 తేడాతో ప్రణయ్ విజయం సాధించాడు.

 

టేకులపల్లి అడవుల్లో ఎదురు కాల్పులు..

భద్రాద్రి కొత్తగూడెం: టేకులపల్లి మండలం లోని సిద్దారం అడవుల్లో తెల్లవారు జామున పోలీసులకు న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం రామన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. కేవ‌లం ఎదురుకాల్పులు మాత్ర‌మే జ‌రిగాయి, ఎవ‌రూ మ‌ృతి చెంద‌లేద‌ని కొత్త‌గూడెం ఎస్‌పీ కార్యాల‌యం వివ‌ర‌ణ ఇచ్చింది. పోలీసులు గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నారు.

కర్నూలు మెడికల్ కాలేజీలో మళ్లీ ర్యాగింగ్

కర్నూలు : మెడికల్ కాలేజీలో మళ్లీ ర్యాగింగ్ కలకలం రేగింది. కొన్ని రోజులుగా జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారు. జూనియర్ విద్యార్థులను రాత్రి సమయంలో హాస్టల్ రూమ్ లకు పిలిపించుకుని సీనియర్ విద్యార్థులు బట్టలు ఉతికిస్తున్నారు. ర్యాగింగ్ సెల్ కి ఫోన్ చేసి జూనియర్లు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ రామ్ ప్రసాద్ విచారణకు ఆదేశించారు.

26మంది ఎర్రచదనం కూలీలు అరెస్ట్

కడప: రైల్వే కోడూరు మండలం శేషాచలం అటవీప్రాంతంలో 26 మంది ఎర్రచందనం తమిళ కూలీలు అరెస్టు అయ్యారు. వారి వద్ద నుండి 52 ఎర్రచందనం దుంగలు, లారీ స్వాధీనం చేసుకున్నారు.

ఎస్ఎం కృష్ణ అల్లుడు ఇంట్లో ఐటీ దాడులు

బెంగళూరు: బిజెపి నేత ఎస్ఎం కృష్ణ అల్లుడు ఇంట్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చిక్ మంగళూరు, ముంబై, చెన్నై సహా 24 ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి.

ఏపీలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు

విజయవాడ : సీఎం చంద్రబాబు అధ్యక్షతన 2వ రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ..ప్రగతిపై సమీక్ష ప్రాంరభించారు. రాష్ట్ర క్రీడా విధానాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 

 

09:49 - September 21, 2017

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలకు టీసర్కార్ నాసిరకం చీరలు పంపిణీ చేసిందని చేనేత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించని జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఇప్పుడు తెలంగాణ అంతటా బతుకమ్మ చీరలమీదనే చర్చ నడుస్తోంది. తెలంగాణ ఆడబిడ్డలకు చేనేత చీరలు ఇస్తానని చెప్పి... ఇతర చీరలు పంపిణీ చేయడంతో  కేసీఆర్‌ సర్కార్‌పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకీ చేనేత చీరల పంపిణీ ఎందుకు జరుగలేదు'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

09:43 - September 21, 2017

విజయవాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి సకల హంగులతో ముస్తాబైంది. పది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. గురువారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాలకు బెజవాడ కాంతులతో మిరుమిట్లు గొలుపుతోంది. 
ఇంద్రకీలాద్రిపై ఉత్సవ శోభ
బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రతి ఏటా దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. గురువారం నుంచి ఈనెల 30వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉన్నతాధికారులు దృష్టిసారించారు. 27వ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 
విద్యుత్‌ కాంతులతో ధగధగలాడుతున్న ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రికి విద్యుత్ ధగధగలు విరాజిల్లుతోంది. ప్రధాన ఆలయం సహా దారి పొడవునా విద్యుత్‌ దీపాలాతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని సులువుగా దర్శించేందుకు బారికేడ్ల నిర్మాణం పూర్తిచేశారు. తొలిరోజు అమ్మవారికి స్నపన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం సుమారు గంట నుంచి రెండున్నర గంటలపాటు జరుపుతారు. తర్వాత 6.30 గంటలకు అమ్మవారికి అర్చన అనంతరం బాలభోగంను నివేదించి, హారతులు ఇస్తారు. తదుపరి స్వర్ణకవచగా దుర్గమ్మను అలంకరించి, భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. 
ప్రతిరోజు శతచండీయాగం
దసరా మహోత్సవాల్లో ప్రతిరోజూ నిర్వహించే శతచండీయాగానికి ముగింపుగా మహాపూర్ణాహుతిని నిర్వహిస్తారు. మహాపూర్ణాహుతితో మొత్తం హోమాలు, ఇతర పూజా కార్యక్రమాలకు ముగింపు పలుకుతారు. తొలిరోజున పదిరోజుల పూజలకు నాందిగా ప్రతిష్టాపనచేసి కలశానికి ఉద్వాసన పలుకుతారు. అమ్మవారికి పున:పూజలు నిర్వహించి, తర్పణ చేస్తారు. దసరాలో నిర్వహించిన సాధారణ పూజా కార్యక్రమాలు, ఇటు శతచండీ హోమాల ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. అలాగే సకల జనుల సంక్షేమం కోసం చండీహోమం నిర్వహిస్తారు. స్వయంభు దుర్గమ్మ సన్నిధిలో చండీహోమం చేయించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. 
భారీ పోలీస్ పహారా
పదిరోజుల దుర్గమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 5,500 మంది సిబ్బందితో పోలీస్ అధికారులు ప్రణాళిక రూపొందించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ నుంచి 1800 మందిని, ఇతర జిల్లాల నుంచి 3,700 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. ఎస్సై స్థాయి నుంచి పైస్థాయి అధికారులు రెండు షిప్టుల్లో, మిగిలినవారు మూడు షిప్టుల్లో ఉత్సవ విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామునుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు... దసరారోజు తెప్పోత్సవంలో ముగుస్తాయి.

 

09:38 - September 21, 2017

హర్యానా : డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్ రామ్‌ రహీమ్‌ చేసిన ఘోరాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. సిర్సాలోని డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో 600 పైగా అస్థిపంజరాలను పూడ్చిపెట్టినట్టు గుర్మీత్‌ మద్దతుదారుడు తెలిపారు. దీనికి సంబంధించి డేరా సచ్చా సౌదా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ పిఆర్‌ నైన్‌ మాత్రం 3 వందల మంది వ్యక్తులకు చెందిన లిస్టును సిట్‌కు సమర్పించారు. డేరా పొలాల్లో అస్తికలు వేస్తే మోక్షం వస్తుందన్న భక్తుల కోరిక మేరకు అస్తికలు పాతి పెట్టారని నైన్‌ సిట్‌కు చెప్పారు. డేరా క్యాంపస్‌లో 6 వందల అస్థిపంజరాలు పాతిపెట్టారనీ.. వాటిపై మొక్కలు నాటి కవర్ చేశారని డాక్టర్‌ నైన్‌ సిట్ బృందానికి తెలియజేశారు. నైనా సమర్పించిన లిస్టుపై విచారణ జరపనున్నట్లు సిట్‌ బృందానికి నాయకత్వం వహిస్తున్న కుల్‌దీప్‌ బెనీవాల్‌ తెలిపారు. గుర్మీత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని దారుణంగా హతమార్చి డేరా క్యాంపస్‌లో రహస్యంగా పాతిపెట్టేవారని ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.  

 

09:35 - September 21, 2017

ఖమ్మం : జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. టేకులపల్లి అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. న్యూడెమోక్రసీ రామన్నమదళం, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. రామన్నదళ సభ్యులు ముగ్గురు మహిళలు మృతి చెందినట్లు సమాచారం. ఎన్ కౌంటర్ లో దళ సభ్యులు ముగ్గురు మహిళలు మృతి చెందినట్లు సీపీఐఎం న్యూడెమ్రోసీ అండర్ గ్రౌండ్ నేతలు అంటున్నారు. ఎన్ కౌంటర్ జరిగిందని..అందులో ఎవరూ చనిపోలేదని భద్రాద్రి కొత్తగూడెం ఎస్ పి అంబర్ కోషోర్ జా చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

జపాన్ ఓపెన్ ప్రీక్వార్టర్స్ సూపర్ ఫైట్స్

జపాన్ ఓపెన్ : ప్రీక్వార్టర్స్ సూపర్ ఫైట్స్ లో నేడు పీవీ సిందు మధ్య నోజోమీ ఒకుహరా మ్యాచ్ జరుగనుంది. కరోలినాతో సైనా నెహ్వాల్ తలపడనుంది. 

 

08:50 - September 21, 2017

హైదరాబాద్ : ప్రముఖ కార్టూనిస్టు మోహన్ (63) ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన మృతి చెందారు. గతకొంతకాలంగా మోహన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఈనెల 7న కేర్ ఆస్పత్రిలో చేరారు. ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని కాసేపట్లో ప్రెస్ క్లబ్ కు తీసుకురానున్నారు. 1952 డిసెంబర్ 21 న ఏలూరులో మోహన్ జన్మించారు. పలు దిన, వార పత్రికలలో మోహన్ పని చేశారు. పొలిటికల్ కార్టూనిస్టుగా పలు పత్రికల్లో పని చేశారు. పొలిటికల్ లో ప్రత్యేక శైలిని పరిచయం చేశారు. సిద్ధాంత నిబద్ధత కలిగినవాడిగా గుర్తింపుపొందారు. మోహన్ మృతిపై పలువురు సంతాపం తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:44 - September 21, 2017

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండగ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. మంత్రుల సతీమణులు మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొన్నారు. వాడవాడలా ఆటపాటలతో వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో తొలిరోజు పండగ  ఎంగిలిపూల బతుకమ్మను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈనెల 28న సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి.

తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా బతుకమ్మల కోలాహలం కనిపించింది. మహిళలంతా భారీ బతుకమ్మలను తయారు చేసి  తీసుకొచ్చారు. వాటి చుట్టూరా తిరుగుతూ పాటలుపాడుతూ బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఎంగిలిపూవు బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా వైభవోపేతంగా మొదలయ్యాయి.

హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. అసెంబ్ల డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం మంత్రుల సతీమణులతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ అని వారంతా కొనియాడారు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌, ఓయూసహా పలుచోట్లు బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. మహిళలు, యువతులు బతుకమ్మలు పేర్చి వాటి చుట్టూరా చేరి ఆడిపాడారు. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి.  కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంతోపాటు ఆకారపు ఆలయంలో మహిళలు బతుకమ్మ ఆడారు. మహిళలు వివిధ పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో వచ్చారు. భారీగా మహిళలు తరలిరావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. బతుకమ్మ పాటలకు లయబద్దంగా ఆడుతూ సందడి చేశారు. ఆ తర్వాత ఎంగిలిపూల బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఓ స్టాండ్‌ హైస్కూల్‌ విద్యార్థులు భారీ బతుకమ్మతో ప్రదర్శన చేపట్టారు. చిన్నారులు చేసిన కోలాట నృత్యాలు బతుకమ్మ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ బతుకమ్మ సంబరాలు ఘనంగా షురూ అయ్యాయి. తొలిరోజు ఎంగిలిపువ్వు బతుకమ్మతో ఉత్సవాలు అట్టహాసంగా మొదలయ్యాయి. విద్యాసంస్థలు, స్వచ్చంద సంస్థలు, కాలనీ సంఘాలు, అపార్ట్‌మెంట్‌ వాసులు బతుకమ్మ వేడులను నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటలుపాడుతూ ఆడలు ఆడుతూ సరదాగా గడిపారు. దీంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది.

 సంగారెడ్డి  జిల్లా కలెక్టరేట్‌లో బతుకమ్మ  ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సమీకృత కలెక్టరేట్‌లోని మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. బతుకమ్మలు చుట్టూ లయబద్దంగా గొంతు కలుపుతూ ఆడిపాడారు. దీంతో సంగారెడ్డి 

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోనూ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి.  వేలాదిగా తరలివచ్చిన తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మలను అందంగా పేర్చి..  కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల మైదానంలో ఆడిపాడారు. దాదాపు ఐదువేల మంది మహిళలలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

తొలిరోజు ఎంగిలిపువ్వు బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు... 28వ తేదీ సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తెలంగాణలో అతిపెద్ద పండుగైన బతుకమ్మ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
 

08:30 - September 21, 2017

హైదరాబాద్ : ఈనెల 27న ఢిల్లీలో జరిగే ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌కు తెలంగాణ  ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  హాజరుకానున్నారు. ప్రగతిమైదాన్‌లో జరిగే ఈ సదస్సులో  పాల్గొనాల్సిందిగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా... కేటీఆర్ ను ఆహ్వానించారు. విద్యావేత్తలు, ఐటీ సంస్థల సీఈవోలు పల్గొనే ఈ సమావేశంలో సస్టెయినబుల్‌ వైఫై.. అన్న అంశంపై ప్రసంగించాలని మనోజ్‌ సిన్హా    కేటీఆర్ ను కోరారు.  తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ వివరిస్తారు. 

08:22 - September 21, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో మకుటాయమానంగా నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లలో మార్పులు, చేర్పులకు తన వంతు సహకారం అందించేందుకు బాహుబలి డైరెక్టర్‌ రాజమౌళి సుముఖత వ్యక్తం చేశారు. డిజైన్లు రూపొందిస్తున్న బ్రిటన్‌కు చెందిన నార్మన్‌ పోస్టర్‌ బృందాన్ని కలిసేందుకు లండన్‌ వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బుధవారం మూడుసార్లు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన జక్కన్న... పోస్టర్‌ ప్రతినిధులను కలిసి ఇప్పటికే రూపొందించిన డిజైన్లలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు సూచిస్తానని చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించనున్న సెక్రటేరియట్‌, అసెంబ్లీ, శాసన మండలి, హైకోర్టుసహా ఇతర భవనాలకు తనవంతు సహకారం అందించేందుకు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సిద్ధమయ్యారు.  బుధవారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిజైన్లపై చర్చించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడుసార్లు సమావేశమై.. అమరావతిలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లపై చర్చించారు. 

లండన్‌కు చెందిన నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధి బృందం రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు... బాహుబలి డైరెక్టర్‌ రాజమౌళికి చూపించారు. లోపలి  ఆకృతులపై సంతృప్తి వ్యక్తంచేసిన చంద్రబాబు, బాహ్య డిజైన్లు తాను అనుకున్నట్టుగా లేవని రాజమౌళి దృష్టికి తెచ్చారు. అమరావతి చరిత్ర, సంస్కృతి ఉట్టిపడేలా బాహ్య డిజైన్లు ఉండాలాన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇందుకు సహకారం అందించాలని చంద్రబాబు కోరగా, రాజమౌళి  సుముఖత వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి రాజమౌళి వచ్చే నెల 11,12 తేదీల్లో  లండన్‌లో  నార్మన్‌ పోస్టర్‌ సంస్థ ప్రతినిధులతో భేటీ కావాలని నిర్ణయించారు.   రాజధాని డిజైన్స్‌ విషయంలో ఏపీ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తానని రాజమౌళి తెలిపారు. నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతోనూ మాట్లాడతానని చెప్పారు. డిజైన్లు, రాజధాని అంశాలపై అధ్యయనం చేయనున్నట్టు రాజమౌళి వివరించారు.

ఏ అంశం ప్రాతిపదికగా ఆకృతులు రూపొందించారో రాజమౌళి ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకున్నారని మంత్రి నారాయణ తెలిపారు. అక్టోబర్‌ 12లోగా లండన్‌ ప్రతినిధులతో రాజమౌళి మాట్లాడనున్నట్టు చెప్పారు. సేవా భావంతోనే డిజైన్స్ విషయంలో రాజమౌళి సాయం ఉంటుందన్నారు. 

మొదటిసారి చంద్రబాబుతో భేటీ అనంతరం రాజమౌళి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రాజమౌళి వెంట మున్సిపల్‌ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషన్‌ చెరుకూరి శ్రీధర్‌ ఉన్నారు.  తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను పరిశీలించారు. అసెంబ్లీ అద్బుతంగా ఉందని, శాసనసభ సమావేశ మందిరం డిజైన్‌ చాలా బాగుందని ప్రశంసించారు. కృష్ణానది అభిముఖంగా అమరావతి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఈ నది పరీవాహక ప్రాంతాన్ని కూడా రాజమౌళి పరిశీలించారు. అమరావతిలో నిర్మిస్తున్న పార్కులు, అంబేడ్కర్‌ విగ్రహంతోపాటు సచివాలయం భవనాలు గురించిన సీఆర్‌డీఏ అధికారులు రాజమౌళి దృష్టికి తెచ్చారు.

అమరావతిలో పర్యటించిన బాహుబలి డైరెక్టర్‌ రాజమౌళి 

నేడు హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

హైదరాబాద్ : నేడు హైకోర్టు నూతన న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం జరుగనుంది. ఉదయం 9.55 గంటలకు నూతన న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

టేకులపల్లి అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు

భద్రాద్రి : టేకులపల్లి అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. న్యూడెమోక్రసీ రామన్నమదళం, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. రామన్నదళం సభ్యులు ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. 

 

ప్రముఖ కార్టూనిస్టు మోహన్ మృతి

హైదరాబాద్ : ప్రముఖ కార్టూనిస్టు మోహన్ (63) మృతి  చెందారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాన్ని కాసేపట్లో ప్రెస్ క్లబ్ కు తీసుకురానున్నారు. 

 

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

విజయవాడ : నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కొనసాగుతుందని ఈవో తెలిపారు. మూలనక్షత్రం రోజు తెల్లవాజుజామున 1.30 నుంచి దర్శనానికి అనుమతిస్తారు.

 

Don't Miss