Activities calendar

22 September 2017

21:39 - September 22, 2017

ఉత్తరకొరియా : అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కిమ్‌....ఆయన మానసిక స్థితి సరిగా లేదన్నారు. ఉత్తర కొరియాను నాశనం చేస్తామని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అమెరికా బెదిరింపుల నుంి తమ దేశాన్ని రక్షించుకుంటామని ఇందుకు అణు సంపత్తి అవసరమని కిమ్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలతో తాము ఎంచుకున్న మార్గం సరైనదేనని...వీటిని కొనసాగిస్తామని కిమ్‌ స్పష్టం చేశారు. ఉత్తర కొరియా ఇటీవల అతిశక్తిమంతమైన హైడ్రోజన్‌ బాంబును పరీక్షించిన విషయం తెలిసిందే. అణు, క్షిపణి పరీక్షలు ఇలాగే కొనసాగితే ఉత్తర కొరియాను నాశనం చేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు.

21:37 - September 22, 2017

శ్రీనగర్ : సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌ సైన్యానికి భారత్ తీవ్ర హెచ్చరికలు చేసింది. భారత సైనికులపై మరోసారి కాల్పులకు తెగబడితే తగిన రీతిలో సమాధానం చెబుతామని పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. భారత, పాకిస్తాన్‌లకు చెందిన డిజిఎంవోల మధ్య ఫోన్‌లో చర్చలు జరిగాయి. భారత ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాకిస్తాన్‌ పౌరులు మృతి చెందారని, 26 మంది గాయపడ్డారని పాకిస్తాన్‌ ఆరోపించింది. పౌరులపై కాల్పులు జరపలేదని భారత్‌ స్పష్టం చేసింది. జమ్ము సెక్టార్‌లో పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడినందునే భారత్‌ దీటుగా స్పందించిందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏకే భట్‌ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారని భారత్‌ పేర్కొంది. పాకిస్తాన్‌ సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, దీనివల్ల జమ్మూ కశ్మీర్‌లో భద్రతాపరమైన సమస్యలు వస్తున్నాయని భట్‌.. పాక్‌ డీజీఎంవో దృష్టికి తీసుకెళ్లారు.

21:35 - September 22, 2017

బీజింగ్ :  కశ్మీర్‌ అంశంలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని చైనా స్పష్టం చేసింది. కశ్మీర్‌ సమస్య భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య అంతర్గత వివాదమని, ద్వైపాక్షిక చర్చల ద్వారా కశ్మీర్‌ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఇరుదేశాలు కలిసి శాంతి, సుస్థిరతలను కాపాడుకోవాలని పేర్కొంది. కశ్మీరు సమస్యపై తమ వైఖరి సుస్పష్టంగా ఉన్నట్లు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ పేర్కొన్నారు. కశ్మీరుపై ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అమలు చేయాలని ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.

21:31 - September 22, 2017

న్యూయార్క్

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్‌ చేసిన ఆరోపణలను భారత్‌ దీటుగా తిప్పికొట్టింది. జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగించిన ఐక్యరాజ్యసమితిలో భారత కార్యదర్శి ఈనమ్‌ గంబీర్‌ పాకిస్తాన్‌ తీరును ఎండగట్టారు.పాకిస్తాన్‌ ఇపుడు టెర్రరిస్తాన్‌గా మారిపోయిందని భారత్‌ పేర్కొంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తోందని దుయ్యబట్టింది. ఒసామాబిన్‌ లాడెన్, ముల్లా ఒమర్‌ లాంటి ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి కాపాడిన దేశం పాకిస్తాన్‌ కాదా? అని ప్రశ్నించింది. అలాంటిది తానే బాధిత దేశంగా పాకిస్తాన్‌ చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందని ఈనమ్‌ గంభీర్‌ అన్నారు.

లష్కరే తోయిబా ప్రధాన నేత హఫీజ్ సయీద్ 
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రధాన నేత హఫీజ్ సయీద్ ను ఐరాస గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించినప్పటికీ... పాకిస్తాన్‌ అతనిపై చర్యలు తీసుకోవడం లేదని భారత్‌ ధ్వజమెత్తింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు తుపాకులతో ప్రజల మధ్యే స్వేచ్ఛగా తిరుగుతారని ఉద్ఘాటించింది. సొంతగడ్డపై విఫలమైన ఓ దేశం నుంచి ప్రజాస్వామ్యం, మానవ హక్కులపై పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం భారత్‌కు లేదని పాకిస్తాన్‌కు చురకలంటించింది. జమ్ముకశ్మీర్‌ ఇప్పటికి...ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటుందని...దీన్ని పాకిస్తాన్‌ అర్థం చేసుకోవాలని ఈనమ్‌ స్పష్టం చేశారు.ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షాహిద్‌ ఖాకాని అబ్బాసీ మరోసారి కశ్మీర్‌ రాగాన్ని ఆలపించారు. భారత్‌ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందని... కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. అబ్బాసీ చేసిన ఆరోపణలపై ఈనమ్ గంబీర్‌ గట్టి సమాధానమిచ్చారు. ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్‌పై భారత్ ఈ స్థాయిలో స్పందించడం ఇదే తొలిసారి.

 

21:26 - September 22, 2017

గుంటూరు : సదావర్తి భూముల వ్యవహారంలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సదావర్తి భూములపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఆ భూముల ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావాలన్నదే తమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. 

21:25 - September 22, 2017

 

గుంటూరు : ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి 200వ బ్యాంకర్ల సమావేశాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు బ్యాంకర్లపై ఫైర్‌ అయ్యారు. రుణ మంజూరు పత్రాలు ఇచ్చినా చెల్లించడానికి ఇబ్బంది ఏమిటని బ్యాంకర్లను ప్రశ్నించారు. ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు సమన్వయానికి ఓ కమిటీ అవసరమని సూచించగా.. సీఎం వెంటనే అందుకు అంగీకరంచారు. ఈ కమిటీలో ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు, ఆర్థిక శాఖ, వ్యవసాయశాఖ, పరిశ్రమలు, సంక్షేమశాఖల నుంచి ఒక్కొక్కరు, ఆంధ్రాబ్యాంక్‌, ఎస్‌బిఐ, కెనరాబ్యాంక్‌, సిండికేట్ బ్యాంక్‌, ఆర్‌బిఐ నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 10 మంది కమిటీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. వ్యవసాయ రుణాలలో 10శాతం కౌలు రైతులకు చెల్లించాలని బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. భూ యజమానుల ప్రయోజనాలు దెబ్బతినకూడదని.. వారికి మేలుజరిగేలా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిచాల్సి ఉందన్నారు. స్వయం సహాయక బృందాలను స్వయం వ్యాపార మహిళలుగా తీర్చిదిద్దాలని నిశ్చయించినట్లు చంద్రబాబు తెలిపారు. ఎంపిక చేసిన మహిళలకు తగిన శిక్షణ ఇచ్చి, సహకారం అందించి పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తామన్నారు.

ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఒక పోర్టల్
ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఒక పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కావడం లేదన్న అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం నుంచి లబ్దిపొందుతూ, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనకపోవడం సరికాదన్నారు. ఏఏ రంగాలకు ఆయా బ్యాంకులు ప్రాధాన్యతనిస్తాయో..వాటి సేవాస్థాయి ఒప్పందాలను వాణిజ్య ప్రకటనల ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుతామన్నారు. ఆ తర్వాత ఆయా బ్యాంకుల దగ్గరకు వెళ్లొద్దని..అక్కౌంట్లు కూడా తెరవొద్దని ప్రజలకు సూచిస్తామన్నారు. అదనపు చార్జీల విధింపు పద్ధతులను మానుకోవాలని బ్యాంకులకు సూచించారు. రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక 2017-18 లక్ష్యం 1,66,806 కోట్లు కాగా,.. ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు 50,090 కోట్ల మేర లక్ష్యాన్ని సాధించినట్లు బ్యాంకర్లు సీఎంకు వివరించారు. 

21:24 - September 22, 2017

హైదరాబాద్ : భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమ పురోగతిపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని భూవివాదాలు కూడా భూ రికార్డుల ప్రక్షాళన వల్ల కొలిక్కి వస్తున్నాయని కేసీఆర్ అన్నారు. భూమి యాజమాన్యంపై స్పష్టత రావడం రైతులకు గొప్ప వూరటనిచ్చే అంశమని సీఎం అన్నారు. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో పురోగతిపై ప్రగతి భవన్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

కొత్త పాసు పుస్తకాలు తొలివిడత పూర్తికాగానే స్పష్టత వచ్చిన భూములకు కొత్త పాసు పుస్తకాలు ఇస్తామన్నారు కేసీఆర్. 2018, మే15వ తేదీ లోపు తొలి విడత సాయం, అక్టోబర్ 15లోపు రెండో విడత సాయం అందించనున్నట్లు తెలిపారు. ఎకరానికి రూ. 4 వేల చొప్పున రెండు పంటలకు పెట్టుబడి సాయం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అధికారులు 11.55 లక్షల ఎకరాల భూరికార్డులు పరిశీలించారని తెలిపిన సీఎం 9.48 లక్షల ఎకరాల భూములకు యాజమాన్య హక్కులు కల్పించినట్లు చెప్పారు. విదేశాల్లోని యజమానులు కూడా భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని వినియోగించుకోవచన్న కేసీఆర్ దీనికి సంబంధించి నాలుగైదు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని తెలిపారు. మరోవైపు గొర్రెల పంపిణీపై కేసీఆర్ అధికారులను ఆరా తీశారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తక్కువ సమయంలో లక్ష యూనిట్ల పంపిణీ పూర్తైన సందర్భంగా అధికారులను కేసీఆర్ అభినందించారు. 

తాగితే బాగా మాట్లాడతా ఏలూరు ఎంపీ

పశ్చిమగోదావరి : ఏలూరు ఏంపీ మాగంటి బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందరు పేకాట అడుకోండి అని, పేకాటరాయుళ్లను ఎవరు పట్టుకోవద్దు అంటూ వ్యాఖ్యలు చేశారు.

21:02 - September 22, 2017

హైదరాబాద్ : భారత దేశ ఆర్థిక వ్యవస్థ మున్నెన్నడూ లేని రీతిలో పతన స్థాయిలో దూసుకు పోతూ ఆందోళనను కలిగిస్తోంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు గద్దెనెక్కింది మొదలు.. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవడం మొదలైంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు నిర్ణయాలతో.. దేశ ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది. 2017-18 జూన్ త్రైమాసికంలో.. ఆర్థిక వృద్ధి రేటు.. మూడేళ్ల కనిష్ఠ స్థాయిలో 5.7 శాతంగా నమోదైంది. ఇక ఇదే త్రైమాసికంలో.. కరెంట్ అకౌంట్ డెఫిసిట్-కాడ్ కూడా జీడీపీలో 2.4 శాతంగా నమోదైంది. గడచిన నాలుగేళ్లలో ఇదే అత్యధిక స్థాయి. దేశ ఆర్థిక రంగం కుదేలవుతోందనడానికి.. నిరంతరంగా పతనం అవుతోన్న రూపాయి విలువనూ ఉదహరించవచ్చు. ఎగుమతులు కాస్తంత పెరిగినట్లు కనిపించినా.. దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేలా ఏమీ లేవు. ఇక వర్కింగ్ కేపిటల్ రుణాలు.. 2002లో 76 శాతం ఉంటే, ప్రస్తుతం 48 శాతానికి పడిపోయాయి. బ్యాంకుల్లో మొండిబకాయిలు ఈఏడాది మార్చి నాటికి 6.41 ట్రిలియన్ కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. 2013లో ఈ బకాయిలు 1.56 ట్రిలియన్ కోట్లు మాత్రమే ఉండేవి.

పశు క్రయవిక్రయ నియంత్రణ చట్టం కూడా..
మరోవైపు, గోరక్షణే పరమావధిగా తీసుకొచ్చిన పశు క్రయవిక్రయ నియంత్రణ చట్టం కూడా.. దేశ ఆర్థిక వృద్ధిని మందగించేలా చేసింది. పశువులను విక్రయించి, తమ అత్యవసరాలను తీర్చుకోవడం గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఉంది. అయితే, పశువుల క్రయవిక్రయాలపై నిషేధంతో.. గ్రామీణ ప్రాంతాల్లో 2017-18 జూన్ త్రైమాసికంలో పశుగణాభివృద్ధిపై గణనీయ ప్రభావం చూపింది. నిజానికి 2014లో ఎన్డీయే అధికారంలోకి రాకముందు కూడా.. దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగానే ఉండేది. దాన్ని స్థిరపరుస్తామని.. పురోగమంలో పరుగులెత్తిస్తామని హామీలు గుప్పించి.. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు గద్దెనెక్కింది. ఇక అప్పటి నుంచీ.. ప్రధాని మోదీ.. నిర్ణయాలు.. దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేయడం మాటేమోగానీ, నానాటికీ దిగజారేలా చేస్తున్నాయి. ఉద్యోగాలను భారీగా కల్పిస్తామన్న హామీతో.. 2014 ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఎన్డీయే కూటమి.. ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తెచ్చే ప్రయత్నాలు పెద్దగా చేసింది లేదు. పైపెచ్చు.. ప్రజల సంక్షేమం.. అవినీతి అంతం.. అంటూ పెద్ద పెద్ద నిర్ణయాలను, రాత్రికి రాత్రే ఏకపక్షంగా తీసేసుకుంటూ.. గెలిపించిన ప్రజలను బిత్తరపోయేలా చేస్తోంది. మోదీ నిర్ణయాలకు మొదట్లో మద్దతుగా నిలిచిన ప్రజలు.. ఇప్పుడిప్పుడే, వాస్తవాలు గుర్తిస్తూ.. మోదీ అసమంజస నిర్ణయాలపై మండిపడుతున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలపై ప్రభుత్వం వాస్తవిక ధృక్కోణంతో చూడకపోవడమే ప్రస్తుత ఆర్థిక అస్తవ్యస్తానికి కారణమన్నది నిపుణుల మాట. పైగా దీని ప్రభావం గ్రామీణాభివృద్ధిపై స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండిపోయిందన్నది మోదీ సర్కారుపై ప్రధాన ఆరోపణ. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు గ్రామీణాభివృద్ధి తిరోగమనం బాట పట్టడమే కారణమన్నది నిపుణుల భావన. వాస్తవానికి

కనీస మద్దతు ధరలో వృద్ధి
2013-14 ఆర్థిక సంవ్సతరం నుంచే సమస్య మొదలైంది. ఆర్.బి.ఐ. నియంత్రిత ద్రవ్య విధానాన్ని అవలంబిస్తున్న తరుణంలో ప్రపంచ ఆహార ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కనీస మద్దతు ధరలో వృద్ధి కూడా బాగా మందగించింది. అంతకుముందు 8 శాతంగా ఉన్న కనీస మద్దతు ధర వృద్ధి.. 2013 తర్వాత 3.5 శాతానికి పడిపోయింది. గ్రామాల్లోని ప్రతి ఇంటా ఒకరికి కనీసం వంద రోజుల ఉపాధిని కల్పించాలన్న ఉద్దేశంతో ప్రవేశ పెట్టిన ఉపాధి హామీ పథకం 2014 తర్వాత, వనరుల ఆధారంగా కాకుండా, డిమాండ్ ఆధారితంగా మారిపోయింది. 2014-15, 2015-16 సంవత్సరాల్లో సంభవించిన కరవు పరిస్థితుల్లోనూ కేంద్రం.. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై పెద్దగా ధృష్టి సారించలేదు. ఫలితంగా గ్రామీణాభివృద్ధి మందగించింది. ఇదే తరుణంలో, కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటి రెండు కీలక నిర్ణయాలు పరిస్థితిని మరింతగా దిగజార్చాయి. సంఘటిత, అసంఘటిత రంగాలను ఈ రెండు నిర్ణయాలూ అతి దారుణంగా దెబ్బతీశాయి. నిరుడు నవంబర్ 8న రాత్రికి రాత్రే, చలామణిలో ఉన్న నోట్లలో 86 శాతం ఉపసంహరిస్తూ తీసుకున్న నిర్ణయం, నగదు ఆధారిత, జీడీపీలో 40 శాతం ఉన్న అసంఘటిత రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ రంగాలపై ఆధారపడ్డ వారు ఉపాధిని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.

పెద్దనోట్ల రద్దే విఫల ప్రయోగం...
పెద్దనోట్ల రద్దే విఫల ప్రయోగం అని భావిస్తున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తెరపైకి తెచ్చింది. ఇది పంపిణీ వ్యవస్థను ఇది బాగా దెబ్బతీసింది. ఉత్పాదకతనూ గణనీయంగా తగ్గించేసింది. ఫలితంగా, జీడీపీ 5.7 శాతంతో మూడేళ్ల కనిష్టాన్ని నమోదు చేసింది. జీఎస్టీ వల్ల పన్ను చెల్లింపు విధానం సంక్లిష్టమైపోయింది. జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్ లో విపరీతమైన జాప్యం, బిజినెస్ సెంటిమెంట్ ని బాగా కుదిపేసింది. పరిస్థితి ఇదే తీరుగా కొనసాగితే.. వచ్చే రెండు మూడు త్రైమాసికాల్లో జీడీపీ మరింతగా తిరోగమిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో ద్రవ్య విధానాలు పెద్దగా ప్రభావం చూపవని, నిర్దిష్టమైన కాలావధితో, చిత్తశుద్ధితో కూడిన ద్రవ్య మద్దతే సమస్యకు పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. బుల్లెట్ ట్రైన్ లు, ఎనిమిది లైన్ల మార్గాలు కాకుండా.. గ్రామీణ గృహనిర్మాణం, గ్రామీణ రహదారులు, చిన్నతరహా సేద్యపు నీటి ప్రాజెక్టులపై తక్షణమే ప్రభుత్వం దృష్టి సారిస్తేనే.. దేశ ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతుందన్నది నిపుణుల సూచన. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు అద్భుతమైన ప్యాకేజీ ప్రకటిస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. నిపుణుల సూచనలను గమనంలోకి తీసుకుని.. కఠిన నిర్ణయాలు తీసుకుంటే.. ఆర్థిక రంగం కొంతైనా పుంజుకుంటుంది. మరి మోదీ సర్కారు ఈ దిశగా చర్యలు తీసుకుంటుందా..? లేక ఎప్పట్లాగానే పైపూత చర్యలతో సరిపుచ్చుతుందా..? వేచి చూడాలి. 

21:00 - September 22, 2017

విశాఖ : విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల ఉనికి లేదని ఓ వైపు పోలీసులు చెబుతున్నా మావోయిస్టులు మాత్రం తమ కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నారు. ఇటీవలే జీ మడుగుల మండలంలో 10 రోజుల కిందట మావోయిస్టులు ప్రొక్రెయిన్లను ధ్వంసం చేశారు. కొయ్యూరు ప్రాంతంలో పోస్టర్లు కూడా విడుదల చేశారు. అయితే ఎవోబీలో యాక్షన్‌ టీమ్‌లు తిరుగుతున్నాయన్న సమాచారం పోలీసులకు ఉంది. ఇప్పటికే మావోయిస్టులు మారుమూల జీ మడుగుల పరిధిలో సభను కూడా నిర్వహించారు. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే తనిఖీలను ముమ్మరం చేసింది. అనుమానం ఉన్న ప్రాంతాల్లో తనిఖీలతో పాటుగా భద్రతను కూడా పెంచారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మావోయిస్టుల వారోత్సవాలు పూర్తయ్యేవరకు ఎక్కడికి వెళ్లినా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. మావోయిస్టుల మూలంగా అమాయకులైన గిరిజన ప్రాంతీయులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

విధ్వంసం జరుపుతారని పోలీసులు అనుమానం
గతంతో పోలిస్తే విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల రాకపోకలు పెరిగిపోయాయి. ఆంధ్ర-ఒరిశా బార్డర్‌ను ఆనుకొని ఉండటంతో తరచుగా ఒడిశా, చత్తీస్‌ఘర్ లాంటి ప్రాంతాల నుండి మావోయిస్టులు రాకపోకలు సాగిస్తున్నారు. బయట ప్రాంతాల నుండి వచ్చి ఏదైనా విధ్వంసం జరుపుతారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విశాఖ ఏజెన్సీలో పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. 

21:00 - September 22, 2017

విజయనగరం : విజయనగరంజిల్లా రాజకీయాల్లో కోలగట్ల వీరభద్రస్వామికి ప్రత్యేక స్థానముంది. దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన కోలగట్ల.. ఇప్పటికీ విజయనగరం నియోజకవర్గంలో ప్రత్యర్థులకు గట్టిసవాల్‌ విసిరే స్థాయిలోనే ఉన్నారు. విజయనగరం పురపాలక సంఘం, కోపరేటివ్ అర్బన్ బాంక్ చైర్మన్‌గా స్థానిక రాజకీయాల్లో కోలగట్ల వీరభద్రస్వామి తనదైన ముంద్ర వేసారు. రాజకీయ నాయకునిగా అంచలంచలుగా ఎదిగిన కోలగట్ల విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎన్నికల బరిలో నిలిచారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుపై పలుమార్లు పోటీపడ్డారు. అయితే కాంగ్రెస్‌పార్టీలో అంతర్గత పోరుతో పలుమార్లు ఓటమి చవిచూడాల్సి వచ్చిందని భావించిన కోలగట్ల 2004 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజుపై విజయం సాధించారు. కాని .. 2009 ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు వీరభద్రస్వామి. దీనికి అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న బొత్స సత్యనారాయణతో ఉన్న విభేదాలే కారణమని కోలగట్ల భావించారు.

2014 ఎన్నికల ముందు వైసిపి తీర్థం
ఇక సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడిన కోలగట్ల వీరభద్రస్వామి 2014 ఎన్నికల ముందు వైసిపి తీర్థం పుచ్చుకుని విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీపడ్డారు . కాని మరోసారి ఓటమే ఎదురైంది. అయితే ..పార్టీలో కీలక నేతగా ఉన్న కోలగట్లకు వైసీపీ అధినేత జిల్లాపార్టీ బాధ్యతలు అప్పగించారు. దాంతోపాటు పార్టీ నుంచి ఎం ఎల్ సి గా కూడా అవకాశం కల్పించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ వైసిపిలో చేరడంతో జిల్లాలో మరోసారి.. కోలగట్ల వర్సెస్‌ బొత్స ఆదిపత్యపోరు మొదలైంది. వీటికి తోడు బొత్స వర్గాన్ని ఎదుర్కోవడంలో అప్పటిదాగా తోడుగా ఉన్న సుజయకృష్ణరంగారావు టీడీపీలోకి వెళ్లిపోయారు. దీంతో బొత్స వర్గాన్ని ఎదుర్కోవడంలో కోలగట్ల వీరభద్ర స్వామి మరోసారి ఒన్‌మ్యాన్‌ ఆర్మీగా మారారు.

బొత్సతో విభేదాల....
బొత్స సత్యనారాయణ పార్టీలో చేరిన తర్వాత కొంతకాలం కోలగట్ల కూడా సైలెంట్‌గానే ఉన్నారు. రెండు వర్గాలు వేరువేరుగానే పార్టీకార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. అంతా సామర్యసంగానే సాగుతోంది. కాని.. ఇటీవల జిల్లాపార్టీ అధ్యక్షునిగా బొత్స అనుచరుడైన బెల్లాన చంద్రశేఖర్‌కు అవకాశం దక్కింది. దీంతో కోలగట్ల వీరభద్ర స్వామి అలిగారు. నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే పార్టీకి మాత్రం తన సేవలు అందిస్తానని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో తాను మరోసారి అసెంబ్లీకి పోటీపడనని వీరభద్రస్వామి ప్రకటించారు. దీంతో.. జిల్లావైసీపీలో కలకలం మొదలైంది. అయితే 2019 ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి వీరభద్రస్వామేనని వైసీపీనేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో బొత్సవర్గంతో కోలగట్లకు ఉన్న కస్సుబుస్సుల పంచాయతీని పార్టీ ఎలా పరిష్కరిస్తుందన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.

20:57 - September 22, 2017

ఖమ్మం : ఇతను రాజులు... ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం దురదపాడు చెందిన కొరస రాజులుకు దామరచర్లలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది....రాజులు మొదటి భార్య,కుమార్తెతో కలిసి ఉంటుండగా...రెండో భార్య వీరమ్మ అతని పేదరికాన్ని అసహ్యించుకుని వెళ్లిపోయింది...మరో పెళ్లి చేసుకున్నా వీరి దాంపత్యానికి గుర్తుగా ఓ కూతురు అనిత ఉంది...కొన్ని రోజుల తర్వాత ఆ కూతురిని కూడా వీరమ్మ తీసుకువెళ్లింది.. ఇక రాజులుకు వయస్సు మీదపడింది..ఇదే సమయంలో తనకున్న రెండు ఎకరాల భూమి కాస్త పోలవరం ముంపులో పోయింది..దీనికి గాను ఎనిమిదిన్నర లక్షల రూపాయల పరిహారం అందింది...వయస్సు మీదపడ్డంతో ఉన్న డబ్బు బ్యాంకులో వేసుకుని శేషజీవితాన్ని గడుపుతున్నాడు. ఇక రాజులు ఊహించనిది ఓ రోజు జరిగింది.. సరిగ్గా 20 ఏళ్లు దాటిన ఓ అమ్మాయి వచ్చి నాన్నా అంటూ పిలిచింది... తన రెండో భార్య కూతురు అనిత అని తెలుసుకున్న రాజులులో ఆనందం అంతా ఇంతా కాదు...కూతురు వచ్చి తనను విడిచిపోనని...ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది.

20 ఏళ్ల తర్వాత వచ్చిన అనిత
ఇక అసలు కథ మొదలయింది...తండ్రిపై ప్రేమతో 20 ఏళ్ల తర్వాత వచ్చిన అనిత అసలు స్కెచ్ వేరే... తండ్రికి ముంపు పరిహారం అందిందని తెలుసుకుని వచ్చిన అనిత ప్రేమను నటిస్తూ ఇంట్లో ఉంటూ అన్నీ చూసుకుంది.. మధ్యలో ఇద్దరు కుర్రాళ్లు కూడా వచ్చి వెళ్లేవారు..వారు స్నేహితులని చెప్పే అనిత ఓ రోజు తండ్రి జ్వరంతో మంచం పట్టడంతో సందట్లో సడేమియా అంటూ ఏటీఎం కార్డు తస్కరించింది. అవసరం నిమిత్తం రాజులు బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో డబ్బు లేదని తేలింది..మోసం జరిగిందని పోలీసులను ఆశ్రయిస్తే చూస్తామన్నారు...ఆ తర్వాత తానే వేరొకరి ద్వారా వెళ్లి సీసీ ఫుటేజీలు చూస్తే కూతురు అనిత, మరో ఇద్దరు కుర్రాళ్లతో డబ్బు డ్రా చేయడం గుర్తించాడు.. న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించాడు.

సీసీ కెమెరాలో కన్పించిన వ్యక్తులు
రాజులుకు న్యాయం చేయాలని పోలీసులు సీసీ కెమెరాలో కన్పించిన వ్యక్తులను పిలిపించారు..అదే సమయంలో రాజకీయ అండ ఉన్న వ్యక్తులు రావడంతో ఆ కేసును పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి...పరిహారం డబ్బు పోయి...పట్టెడన్నం పెట్టే పొలం పోయి రాజులు పరిస్థితి ఘోరంగా మారింది.

20:55 - September 22, 2017

హైదరాబాద్ : సవరించిన రికార్డుల ఆధారంగానే సాగుకు పెట్టుబడి ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులతో ప్రగతిభవన్‌లో కేసీఆర్ భేటీ అయ్యారు. భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాలపై సమీక్షించారు. భూ యాజమాన్య హక్కులపై స్పష్టత వస్తున్నందున రైతులకు ఊరట కలుగుతోందన్నారు కేసీఆర్. భూరికార్డుల ప్రక్షాళనలో పాల్గొంటున్న సిబ్బందికి నగదు ప్రోత్సాహం ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకు అధికారులు 11.55 లక్షల ఎకరాల భూరికార్డులు పరిశీలించారన్న కేసీఆర్ 9.48 లక్షల ఎకరాల భూములకు యాజమాన్య హక్కులు కల్పించినట్లు తెలిపారు. 

20:54 - September 22, 2017

అనంతపురం : అనంతపురం జిల్లాలో రైతులు సోయా పంటలపై దృష్టి పెట్టారు. పుట్టపర్తి మండలం వీరజిన్నయ్య పల్లికి చెందిన రైతు రవిబాబు తనకున్న రెండు ఎకరాల్లో ఏ పంట వేసినా తగిన గిట్టుబాటు ధర కూడా రాలేదు. అందుకే ఇతర కూరగాయల పంటలను సాగు చేయాలనే ఆలోచనతో వంకాయ, సోయా చిక్కుడు పంటలను సాగుచేశాడు. జూన్‌లో మొదటి సారిగా సాగు చేసిన పంటకు 50 వేల రూపాయలు ఖర్చు చేశాడు. పంటలకు చీడపీడలు పట్టకుండా పురుగుల మందులను వాడాడు. ఆగష్టు నెలలో పంటతో పాటు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా చేతికి వచ్చింది. మూడు నెలల పాటు వచ్చే ఈ పంటను నెలకు నాలుగు సార్లు కోత కోస్తూ మార్కెట్‌కు తరలిస్తున్నారు. తక్కువ నీటితో డ్రిప్పు పద్దతిలో పంటను సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడీ రైతు రవిబాబు. తన భూమిలో ఇంతవరకు ఆరు పంటలను వేసినా ఏమాత్రం లాభం రాలేదని, అందుకే సోయా పంటపై దృష్టి పెట్టానని చెబుతున్నాడు. తక్కువ నీటితో సాగు చేసినా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. పంటకు సరిపడా రేటు బాగా ఉంటే సుమారు నాలుగు నుండి ఐదు లక్షల వరకు లాభాలను పొందవచ్చని రైతు అంటున్నాడు. అయితే దీనికి ప్రభుత్వ సహకారం కూడా ఉండాలంటున్నాడు. రైతులను ప్రోత్సహించి ఉద్యానవన అధికారుల సలహాలు సూచనలు ఇస్తే రైతులు మరిన్ని పంటలను వేసి లాభాలు గడిస్తారని అంటున్నాడు. అదే విధంగా ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా మార్కెట్‌ సదుపాయం, సబ్సిడీ లోన్లు కల్పించాలని రైతు కోరుతున్నాడు. సీజనల్‌ పంటలు పండించే రైతులను ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

20:53 - September 22, 2017

గుంటూరు : ఈ నామ్ పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సిస్టమ్‌ ద్వారా.. దేశంలోని మార్కెట్ యార్డులను అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డును మోడల్‌గా తీసుకొని.. 20 రోజుల క్రితం నుంచి ఈ నామ్‌ను అమలు చేస్తున్నారు. ఈ నామ్ ప్రక్రియ అంతా ఆన్ లైన్ పద్ధతిలో జరుగుతుంది. దేశంలో ఎక్కడి నుండైనా కొనుగోళ్లు చేసుకోవచ్చు. వ్యాపారులు కుమ్మక్కు కాకుండా మిర్చికి ధర నిర్ణయించాల్సి ఉంటుంది. దీని వల్ల దళారుల పాత్రను పూర్తిగా తగ్గించవచ్చు.ఈ పద్ధతిలో కొనుగోలు చేసిన మిర్చికి వెంటనే నగదు బ్యాంక్‌లో జమ చేయాల్సి ఉంటుంది. దీంతో రైతుకు మంచి ధర రావటమే కాకుండా.. మధ్యవర్తుల పాత్ర లేకుండా ఉంటుంది.

కమీషన్ ఏజెంట్లు సమ్మె...
ఈ ఉద్దేశంతోనే ఈ నామ్‌ను కేంద్రం తీసుకొచ్చింది. అయితే ఈ నామ్ వద్దంటూ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు సమ్మె చేస్తున్నారు. సంస్థ ద్వారా రైతులు తమ మిర్చిని కమీషన్ ఏజెంట్ వద్దకు చేరుస్తారు. కమీషన్ ఏజెంట్ ఆ మిర్చిని ఎగుమతి వ్యాపారులకు చూపించి ధర నిర్ణయిస్తాడు. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికే కమీషన్ ఏజెంట్ రైతు అనుమతితో అమ్ముతాడు. ఈ విధానంలో వ్యాపారులు కుమ్మక్కై ధర రాకుండా చేయడం, కమీషన్ చెల్లించాల్సి రావడం, కొలతల్లో రైతులకు నష్టం చేయడం వంటి అంశాలున్నాయి. అయితే ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన ఈ నామ్‌ను అమలు చేస్తున్నారు. రైతులకు వ్యాపారులకు కమీషన్ ఏజెంట్లకు అవగాహన కల్పించి అందరి అనుమతితో ఈ నామ్ అమలు చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా అహంకార ధోరణితో అధికారులు వ్యవహరిస్తే రైతులకు నష్టమే కాని లాభం ఉండదంటున్నారు.

హై స్పీడ్ ఇంటర్నెట్..
వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు ఈ నామ్‌కు మేము ఏ రోజు వ్యతిరేకం కాదని చెబుతున్నారు. గతంలో ఈ ట్రేడింగ్ విధానం వలన కూడా అనేక ఇబ్బందులు తలెత్తాయని గుర్తు చేశారు. ఈనామ్ అమలు చేయాలంటే కేంద్రం కొన్ని నిబంధనలు విధించిందని ఆ నిబంధలను పాటించకుండా ఈనామ్ ఏవిధంగా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను నిర్దేశించటానికి ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలి. దీనికి 5 నుండి 10 ఎంబిపిఎస్ హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండాలి. మౌళిక సదుపాయాలు లేకుండా ఈనామ్ అమలు చేయడం ద్వారా అందరూ నష్టపోతారంటున్నారు. అసలు ఇంత వరకు ఈనామ్ గురించి రైతులకు, సిబ్బందికి, వ్యాపారులకు శిక్షణలు ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందే తప్ప రైతుల ప్రయోజనాల గురించి పట్టించుకొవడంలేదంటున్నారు. దీని వల్ల రైతులు, కార్మికులు కూడా నష్టపోతారంటున్నారు.  

20:51 - September 22, 2017

కృష్ణా : ప్రముఖ భారతీయ బహుళజాతి సంస్థ ఇండోఫిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.... కొత్త తెగుళ్ళ మందును విడుదల చేసింది.. ఇంప్రెషన్‌ పేరుతో తయారుచేసిన ఈ మందును సంస్థ రీజినల్‌ సేల్స్‌ మేనేజర్‌ ఏ అంజిరెడ్డి విజయవాడలో ఆవిష్కరించారు.. ఈ మందు వరి పైరుకు మూడంచెల రక్షణ ఇస్తుందని అంజిరెడ్డి తెలిపారు. పొడ తెగులు, అగ్గి తెగుళ్లను ఒకేసారి అరికడుతుందని చెప్పారు.. ఈ కార్యక్రమంలో రీజనల్ సేల్స్ మేనేజర్ ఎ. అంజిరెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ వి. శేషారెడ్డి, అసిస్టెంట్ రీజనల్ సేల్స్ మేనేజర్ కె. సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. 

20:50 - September 22, 2017

పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లాలో దసరా ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు బొమ్మల కొలువుతో సందడి చేస్తున్నారు. నల్లజర్లలోని ఎకేఆర్ జే పాఠశాలలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందర్నీ ఆకట్టుకుంటోంది. విద్యార్ధినులు నవదుర్గల వేషధారణలో అలరించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:49 - September 22, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను కేటాయించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. హైదరాబాద్‌ జలసౌధలో జరిగిన సమావేశంలో బోర్డు కార్యదర్శి సమీర్‌ చటర్జీతో పాటు తెలంగాణ నీటి పారుదుల శాఖ ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది తమకు 40.1 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ, తమకు తక్షణమే 17 టీఎంసీలు విడుదల చేయాలన్న ఏపీ విజ్ఞప్తులపై సమావేశంలో చర్చించారు. అనంతరం ఏపీకి 16, తెలంగాణకు 6 టీఎంసీల నీటిని కేటాయిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, తెలంగాణ తరపున పాల్గొన్న ప్రతినిధులు పలు అభ్యంతరాలను బోర్డు ముందు ఉంచారు.. వాటి పై అక్టోబర్‌లో జరిగే సమావేశంలో చర్చ ఉంటుందని సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జి తెలిపారు. ఏపీకి కేటాయించిన నీటిలో హంద్రీనీవా సుజల స్రవంతికి 5, పోతిరెడ్డి పాడు 5, సాగర్ రైట్ కెనాల్‌కు 6 టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేస్తారు. తెలంగాణ కేటాయింపుల్లో కల్వకుర్తికి 4, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి కోసం రెండు టీఎంసీలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

20:30 - September 22, 2017

అరవై కెమేరాలు..అనుక్షణం పరిశీలించే కళ్లు.. కోట్లాది ప్రేక్షకులు.. చివరకు మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లు.. వెరసి ఇప్పుడు సీజన్ వన్ టైటిల్ ఎవరిదా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. బిగ్ బాస్ షో మొదలయ్యేపుడు..ఈ గందరగోళం తెలుగులోకి కూడా వచ్చిందా అనే వాదనలు వినిపించాయి. ప్రేక్షకుల్లోని వాయరిస్టిక్ ఇంట్రస్ట్ ని రేటింగ్ మార్చుకునే ఈ ప్రోగ్రామ్ ఇతర భాషల కంటే తెలుగులో కాస్త క్లీన్ గానే సాగిందనే ఇంప్రెషన్ తెచ్చుకుంది. 

బతకటానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి. కానీ నో సెల్‌ఫోన్, నో టీవీ, నో న్యూస్ పేపర్. వర్చువల్ లివింట్ ఎన్వైర్ మెంట్. బయటి ప్రపంచంతో అసలు ఎలాంటి సంబంధాలు లేని పరిస్థితి. కానీ, తలుపుసందులోంచి చూసే వాడికి కలిగే ఆనందాన్ని నిద్రలేపి క్యాష్ చేసుకునే ఈ ప్రోగ్రామ్ ఫార్మాట్ తెలుగులోనూ మంచి ఫాలోయింగే సాధించింది. ఇప్పుడు టెలివిజన్ చరిత్రలో మొదటి సారి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన షో బిగ్ బాస్. హిందీలో సల్మాన్ తో నడిచిన ఈ షో కోసం తెలుగులో యంగ్ అండ్ ఎనర్జిటిక్ తారక్ కు అప్పజెప్పారు. అయితే అప్పటి వరకు బుల్లి తెర మీద ఎలాంటి షోలు చెయ్యని తారక్ బిగ్ బాస్ షోని ఎంతవరకు లాగగలడు అని అందరు అనుకున్నారు. మరి జూనియర్ తన ప్రతిభతో బుల్లి తెరపై కూడా విశ్వరూపాన్ని చూపించాడనిపించుకున్నాడు. బిగ్ బాస్ షోమొదటి సీజన్ లో తారక్ రోల్ కు మంచి మార్కులే పడ్డాయి


బిగ్ బాస్ షో..దేశ విదేశాల్లో ఈ షోకున్నంత ఆదరణ.. మరే టీవీ రియాల్టీషో కి రాలేదంటే అతిశయోక్తి కాదు.. అదే సమయంలో దీనిపై విమర్శలూ అదే రేంజ్ లో వచ్చాయి.. తెలుగులో కాస్త ప్రశాంతంగానే నడిచిన బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ వన్ గెలుపెవరిదా అనే ఉత్కంఠను ప్రేక్షకుల్లో రేకెత్తిస్తోందివినోదానికి అర్ధాలు, రూపాలు మారుతున్న కాలం. కొన్ని టీవీ షోలు బూతు డైలాగులను, డబుల్ మీనింగ్ పంచ్ లనే ఎంటర్ టెయిన్ మెంట్ గా భావిస్తున్న పరిస్థితి ఇప్పుడుంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. పక్కింటి కబుర్లు తెలుసుకోవాలనుకునే సాధారణ మనిషిలోని ఉత్సాహాన్ని నిద్రలేపటంలో కొంత వరకు సక్సెస్ అయింది. ఇప్పుడీ గేమ్ లో టైటిల్ విజేత ఎవరో త్వరలో తేలనుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

గ్రామీణ వికాస్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ చేతివాటం

సంగారెడ్డి : జిల్లా ఇస్నాపూర్ ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ దుర్గాప్రరసాద్ చేతివాటం చూపాడు. ఖాతాదారులకు చెందిన రూ.5కోట్లను దుర్గాప్రసాద్ తన ఖాతాలోకి మార్చుకున్నాడు. విచారణ చేపట్టిన బ్యాంకు అధికారలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

లాలూ ప్రసాద్ ను ప్రశ్నించనున్న సీబీఐ

పాట్నా : మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ ను రైల్వే హోటళ్ల కేటాయింపు కేసులో సీబీఐ ప్రశ్నించనుంది. లాలూతో పాటు తేజస్వియాద్ ను ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. 25న లాలూ, 26న తేజస్వియాదవ్ ను ప్రశ్నించున్నారు. 

17:36 - September 22, 2017
17:34 - September 22, 2017

కరీంనగర్/జగిత్యాల : కోతుల బెడద నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి ఓ యువరైతు వినూత్న ప్రయత్నం చేశాడు. కోతులను పారదోలేందుకు కుక్కను పంటపొలంలో కట్టేశాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన మహిపాల్ రెడ్డి...తనకు ఉన్న3 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేసాడు. అయితే రోజూ కోతుల గుంపు కంకులు తినడంతో పంటను నాశనం చేసేవి. నెలకు వెయ్యి రూపాయల కిరాయికి కుక్కును తెచ్చుకొని..పంటచెనులో కట్టేసి ఉంచాడు. దీంతో కోతులు కుక్కను చూసి పరుగులు పెడుతున్నాయి.

17:34 - September 22, 2017

హైదరాబాద్ : ఉదయం చలి.. మధ్యాహ్నం భరించలేనంత ఎండ, ఉక్కపోత. సాయంత్రం జోరువాన. రాత్రి అయిందంటే మళ్లీ ఉక్కపోత. వాతావరణం మారుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పరిస్థితులను శరీరం తట్టుకోలేకపోతోంది. ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. వైరల్‌ ఫీవర్లు, ఒంటినొప్పులు, దగ్గు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తోంది. వైరస్ శక్తి పుంజుకొని దాడి చేస్తోంది. దీనికి వాతావరణంలో మార్పులే కారణమని డాక్టర్లు చెబుతున్నారు.

విజృభిస్తున్న స్వైన్‌ఫ్లూ...
స్వైన్‌ఫ్లూతో వర్ధన్న పేట ఏసీపీ.. సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో మృతి చెందారు. ఇలా ఈ ఏడాది పది మంది స్వైన్‌ ఫ్లూతో చనిపోయారు. వ్యాధికారక వైరస్ కొత్త రూపంలో జనంపై దాడి చేస్తోంది. ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాపిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం గడిచిన పది రోజుల్లోనే 32 మందికి స్వైన్‌ ఫ్లూ సోకింది. హైదరాబాద్‌లో గత నెలలో 75 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో ఈ ఏడాది 193 మంది చికిత్స పొందారు. స్వైన్‌ ఫ్లూ బాధితుల్లో పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. ఈ వైరస్‌ను మిషిగాన్ స్టెయిన్ అని పిలుస్తున్నారు. 2009లో మొదటిసారి దాడి చేసినప్పుడు హెచ్‌1ఎన్‌1 ఇన్‌ఫ్లూయోంజా ఏ వైరస్‌గా వెలుగులోకి వచ్చింది. కొత్తలో దీనికి మందులు లేకపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. అప్పట్లో వ్యాధి నిర్ధారణకు పుణెలోని ల్యాబ్‌కు నమూనాలు పంపించాల్సి వచ్చేది. కాలక్రమేణా ఈ వైరస్‌ సాధారణ ఫ్లూగా మారిపోయింది. అయితే ఈ వైరస్ ప్రతీ ఏడాది తన రూపాన్ని మార్చుకొని దాడి చేస్తోంది.

జ్వరం, దగ్గు, జలుబు
జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు నుంచి ఆగకుండా నీరు కారుతుండడం, గొంతు గరగర, ఒంటినొప్పులు, అలసట, నీరసం, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం తదితర సమస్యలుంటే స్వైన్‌ ఫ్లూగా అనుమానించాలి. కొద్ది రోజులుగా ఫీవర్‌ ఆసుపత్రిలో రోగుల తాకిడి పెరిగింది. ఇంతకు ముందు ఔట్ పేషంట్‌ల సంఖ్య 800 లోపు ఉంటే ఇప్పుడు 1200లు దాటుతోంది. రోజూ 30 నుంచి 40 మంది ఇన్‌ పేషంట్‌లుగా చేరుతున్నారు. ఈ విషయంలో జనం కూడా అప్రమత్తంగా ఉండాల్సి అవసరం ఎంతైనా ఉంది. 

17:32 - September 22, 2017

హైదరాబాద్ : కంచె ఐలయ్యకు హానీ జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని ప్రొఫెసర్‌ పి.ఎల్‌. విశ్వేశ్వరరావు, కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కె. భాస్కర్‌ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడిన వక్తలు.. కంచె ఐలయ్యపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐలయ్య పుస్తకంపై అభ్యంతరాలు ఉంటే.. సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలన్నారు. 

17:31 - September 22, 2017

హైదరాబాద్: పాటలతో కదం తొక్కే ప్రజా యుద్ధ నౌక గద్దర్‌..బతుకమ్మ ఆడి సందడి చేశారు. టీమాస్‌ ఫోరం ఆధ్వర్యంలో చదువుల బతుకమ్మ సంబరాలు...హైదరాబాద్‌ సుందరయ్యపార్కులో ఘనంగా జరిగాయి. విద్యార్థినులు, మహిళలు బతుకమ్మ ఆడారు. ఆడపిల్లలను ఎదగనిద్దాం, బతుకనిద్దాం, చదువనిద్దాం అన్న నినాదంతో చదువుల బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు గద్దర్‌ తెలిపారు. 

17:30 - September 22, 2017

హైదరాబాద్ : సుందరయ్యపార్కులో జాహ్నవి ఉమెన్స్‌ డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్ని బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు బతుకమ్మ ఆడి సందడి చేశారు. విద్యార్థినుల ఆటపాటలు, కోలాటాలు, డ్యాన్సులతో హోరెత్తించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

17:30 - September 22, 2017

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు లేఖ రాశారు. రాష్ట్రంలో తొలిసారి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం పట్ల రామోజీరావు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు భాషకు మహర్దశ పట్టించే దిశగా తీసుకున్న బలమైన నిర్ణయంగా పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఉద్యోగ నియామకాల్లో తెలుగు ప్రజ్ఞను అనివార్యం చేయాలని విన్నవించారు. తెలుగు భాష విస్తృతం కావాలంటే పరిపాలనా వ్యవహారాల్లోనూ తెలుగు తప్పనిసరి కావాలన్నారు. 

సాకేత్ మైనేనికి సీఎం బాబు రివార్డు..

విజయవాడ : అర్జున అవార్డు సాధించిన టెన్నిస్ స్టార్, తెలుగు తేజం సాకేత్ మైనేనికి సీఎం చంద్రబాబు నాయుడు నగదు రివార్డును ప్రకటించారు. సాకేత్ కు రూ. 75 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 

ఉబెర్ లెసెన్స్ పునరుద్ధరణకు నో..?

ఢిల్లీ : ఉబెర్‌ లైసెన్స్ ను పునరుద్ధలించలేమని లండన్‌ ట్రాన్స్ పోర్టు అధారిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. భద్రత, సెక్యూరిటీ తదితర కారణాలను చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

వారణాసిలో మోడీ పర్యటన..

ఉత్తర్ ప్రదేశ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో పర్యటిస్తున్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గవర్నర్ రామ్ నాయక్, సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. 

17:07 - September 22, 2017

కరీంనగర్ : జిల్లాలో జరుగుతున్న కాళేశ్వరం ఆరో ప్యాకేజీ సొరంగం పనుల్లో మళ్లీ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా నందిమేడారం వద్ద సొరంగం పనులు చేపడుతుండగా బండరాళ్లు విరిగిపడడంతో ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వరుస ప్రమాదాలకు కారణం యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోకపోబడమే అని నిపుణులు అంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

శ్రీశైలం దేవస్థానంలో లడ్డూ ప్రసాదం ధరలు పెంపు...

కర్నూలు : శ్రీశైలం దేవస్థానంలో లడ్డూ ప్రసాదం ధరలు పెంచారు. 100 గ్రాముల లడ్డూ ధర రూ.15కు పెంచారు. 250 గ్రాముల లడ్డూ ధర రూ. 75లు అయ్యింది. పెరిగిన లడ్డూ ధరలు ఈ నెల 25 నుంచి అమలు అవుతుందని ఆలయఈవో తెలిపారు.

నానక్ రాంగూడలోని ఐటీ కంపెనీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: నానక్ రాంగూడలోని ఐటీ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

16:06 - September 22, 2017
16:05 - September 22, 2017

ముంబై : చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డైన అస్కార్‌కు భారత దేశం నుంచి బాలీవుడ్‌ చిత్రం న్యూటన్‌ ఎంపికైంది. ఈ మూవీలో రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్ర పోషించారు.. దేశంలోని ఎన్నికల ప్రక్రియపట్ల ఓ ఉద్యోగి తీసుకువచ్చిన మార్పేంటి? అన్న అంశంపై ఈ చిత్రం సాగుతుంది. అమిత్‌ వీ మసుర్కర్‌ దర్శకుడు.. ఈ చిత్రం ఇవాళే థియేటర్లలో విడుదలైంది.. మొత్తం 26 చిత్రాలను చూసిన ఆస్కార్‌ ఇండియా జ్యూరీ బృందం న్యూటన్‌ను ఎంపిక చేసింది.. ఈ బృందం చూసిన సినిమాల్లో తెలుగు నుంచి 'బాహుబలి 2', 'గౌతమిపుత్ర శాతకర్ణి' . ఉన్నాయి.

కాళేశ్వరం పనుల్లో మరో ప్రమాదం

పెద్దపల్లి: కాళేశ్వరం పనుల్లో మరో ప్రమాదం జరిగింది. సొరంగంలో బండరాళ్లు పడి ఐదుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ధర్మారం మండలం సాయిపేట వద్ద కాళేశ్వరం ఆరో ప్యాకేజీ పనుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

16:04 - September 22, 2017

న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షాహిద్‌ ఖకాన్‌ అబ్బాసీ చేసిన వ్యాఖ్యలను భారత్‌ దీటుగా తిప్పికొట్టింది. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి ఈనమ్‌ గంబీర్‌ పాకిస్తాన్‌ను టెర్రరిస్తాన్‌గా పేర్కొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను తయారుచేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని దుయ్యబట్టారు. పాక్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని, ఉగ్రవాద నేతలకు రాజకీయంగా రక్షణ కల్పిస్తున్నారని గంబీర్‌ విమర్శించారు. హఫీజ్‌ సయీద్‌ లాంటి వారు అక్కడే ఉండి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుంటారని తెలిపారు. లాడెన్, ముల్లా ఉమర్‌ లాంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ ఆశ్రయం కల్పించిందని గుర్తు చేశారు. జమ్ముకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని ఈనమ్‌ స్పష్టం చేశారు. భారత్‌ కశ్మీర్‌ ప్రజలను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఐక్యరాజ్యసమితిలో పాక్‌ ఆరోపించింది. 

16:03 - September 22, 2017

చెన్నై : తాను రాజకీయాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని...ఒకవేళ తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సి వస్తే అందుకు సిద్ధమేనని ప్రముఖ నటుడు కమల్ హాసన్ చెప్పారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ నిజాయతీ కలిగిన వ్యక్తి అత్యుత్తమ స్థానంలో ఉండాలని ప్రజలు కోరుకుంటే అందుకు తాను సిద్ధమేనని తెలిపారు. ముందు ఓటర్లు నిజాయతీగా ఉండాలని కమల్ అభిప్రాయపడ్డారు. తాను పార్టీ ఎప్పుడు ప్రారంభించబోతున్నది మాత్రం ఆయన చెప్పలేదు. మా పార్టీ ఎలా ఉంటుందో చెప్పలేను. కానీ కచ్చితంగా పార్టీని లాంచ్ చేస్తానని పేర్కొన్నారు. ముందు తాను ప్రజలను కలుసుకుని...ఆ తర్వాత రోడ్‌ మ్యాప్‌ తయారు చేస్తానని కమల్ తెలిపారు. 

16:01 - September 22, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రపంచానికే మార్గదర్శకంగా ఉండేలా నిర్వహిస్తామన్నారు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. అన్నివిభాగాల సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఉత్సవాల్లో రద్దీ అధికంగా ఉండే రెండు శనివారాలతో పాటు గరుడసేవరోజున దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేశామన్నారు. అడ్వాన్స్‌ రిజర్వేషన్ కోటాను తగ్గించి భక్తులకు నిత్యం 4 వేల గదులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. విఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జితసేవలు రద్దు చేసినట్లు తెలిపారు. 

16:00 - September 22, 2017

అనంతపురం : విధి నిర్వహణలో ఎంతో మానసిక ఒత్తిడికి లోనవుతున్న పాత్రికేయుల్లో క్రీడలు ఉల్లాసం నింపుతాయన్నారు.. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌... అనంతపురంలో ఫాదర్‌ విన్సెంట్‌ జర్నలిస్టుల క్రికెట్‌ రాష్ట్ర స్థాయి పోటీలను కేశవ్‌ ప్రారంభించారు.. ఆంధ్ర ప్రదేశ్‌ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుంచి జర్నలిస్టులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.. ఈ పోటీలకు ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి... అనంతపురం నగర డీఎస్పీ మల్లికార్జున వర్మ, క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి షాబుద్దిన్‌ హాజరయ్యారు.

15:59 - September 22, 2017

వనపర్తి : ముఖ్యమంత్రి ఆప్త మిత్రుడు నిరంజన్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిన్నారెడ్డి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. వనపర్తిజిల్లాలో కాంగ్రెస్‌- టీఆర్‌ఎస్‌ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఇటీవల పెబ్బేరులో నిర్వహించిన రైతు సమన్వయ సంఘాల సమావేశం సందర్భంగా కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ నేతల మధ్య వివాదం రగిలింది. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు సమాచారం ఇవ్వకుండా రైతు కమిటీల సమావేశం జరపడంపై ఎమ్మెల్యే చిన్నారెడ్డి భగ్గున మండిపడుతున్నారు. ఇదే విషయంపై అధికారులను నిలదీశారు. పనిలో పనిగా సీఎం కేసీఆర్‌పై చిన్నారెడ్డి తీవ్రవిమర్శలు గుప్పించారు.

ఘాటుగా కౌంటర్‌...
చిన్నారెడ్డి విమర్శలకు టీఆర్‌ఎస్‌ నేత నిరంజన్‌రెడ్డి ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తుంటే .. చిన్నారెడ్డి లాంటి నేతలు తట్టుకోలే పోతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరికలు చేశారు. అధికార, విపక్షపార్టీలనేతల తీరుపై వనపర్తి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా.. రాజకీయ విమర్శలతో కాలం గడిపేస్తున్నారని సీపీఎం జిల్లానేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. 

టీ ఎస్ ఉద్యోగులకు డీఏ పెంపు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 22.008 శాతం నుంచి 24.10 శాతానికి పెంచింది. సెప్టెంబర్ నెల వేతనంతో పెరిగిన డీఏ అమలు అవుతుందని తెలిపింది.

సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల భర్తీకి సుప్రీం గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ: సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల భర్తీపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సూపర్ స్పెషాలిటీ సీట్ల భర్తీపై తెలంగాణ, ఏపీ విద్యార్థులు, కాలేజీలు సుప్రీంను ఆశ్రయించాయి. తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల భర్తీకి సుప్రీం కోర్టు అంగీకరించింది. దేశ వ్యాప్తంగా 600 సీట్ల భర్తీకి అంగీకరించింది. సీట్లు ఎలా భర్తీ చేయాలనే విషయాన్ని తీర్పులో స్ఫష్టం చేస్తామని సుప్రీం పేర్కొంది.

 

'నష్టపరిహారం అందించాకే మిడ్ మానేరులోకి నీరు వదలాలి'

రాజన్న సిరిసిల్ల: కలెక్టరేట్ ఎదుట తంగళ్లపల్లి మండలం బీర్లవంచ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. నష్టపరిహారం అందించాకే మిడ్ మానేరులోకి నీరు వదలాలని డిమాండ్ చేస్తున్నారు.

15:20 - September 22, 2017

గుంటూరు : అమరావతిలో బ్యాంకర్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. సంక్షేమ శాఖ కార్యదర్శి రావత్ బ్యాంకులు సకాలంలో లోన్లు ఇవ్వటం లేదని సమావేశంలో ప్రస్తవించారు. రుణాలు ఇవ్వక లబ్దిదారులు నష్టపోతున్నారని రావత్ తెలిపారు. రుణాల ఇవ్వడంపై సమన్వయ కమిటీ వేయాలని ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ కుటుంబరావు సూచించారు. సీఎం చంద్రబాబు కుటుంబరావు సూచనకు అంగీరించి 11 మందితో సమన్వయ కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కమిటీలో సభ్యులుగా శ్రీ కుటుంబరావు, ఆంధ్ర బ్యాంకు, కెనరా బ్యాంక్, స్టేక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, ఆర్ఆర్ బి నుంచి ప్రతినిధులు, ముగ్గురు ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు.

15:19 - September 22, 2017

పశ్చిమగోదావరి : జిల్లా ఏలూరులో జరుగుతున్న టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశం రసాభాసగా మారింది. జడ్పీ హాలులో సమావేశం జరుగుతుండగా ఈ సమావేశానికి మంత్రులు ప్రతిపాటి, పితాని, కొల్లు రవీంద్ర హాజరైయ్యారు. మాజీ మంత్రి పీతల సుజాత, ఎంపీ మాగంటి వర్గీయులు రెండుగా విడిపోయి ఒకరితో మరొకరు వాగ్వాదానికి దిగారు. పార్టీలోమ కష్టపడి పనిచేసేవారికి పీతల సుజాత పట్టించుకోవడంలేదంటూ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

నంద్యాల తాలూకా పీఎస్ లో కలకలం

కర్నూలు: నంద్యాల తాలూకా పీఎస్ లో కలకలం రేగింది. దొంగనోట్ల తయారీ కేసులో ఆరుగురు అరెస్టు అయ్యారు. అరెస్టైయిన వారిలో సుధాకర్ అనేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్లేడ్ తో చేయి కోసుకున్న ముద్దాయి సుధాకర్ దొంగనోట్ల వ్యవహారంలో తనకు సంబందం లేదని కేసు నుంచి తన పేరు తొలించాలని.. లేకపోతే గొంతు కోసుకుని చనిపోతానని హల్ చల్ చేశాడు. పోలీసులు అడ్డుకుని నంద్యాల ఆస్పతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆస్కార్ రేసులో బాలీవుడ్ సినిమా 'న్యూటన్'

ఢిల్లీ: ఆస్కార్ రేసులో బాలీవుడ్ సినిమా 'న్యూటన్ ' ఎంపికయ్యింది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఎంపికయ్యింది. అమిత్ వి.మసుకర్ దర్శకత్వంలో రాజ్ కుమార్ రావు ప్రధాన ప్రాతలో తెరకెక్కిన న్యూటన్ బాహుబడి-2, దంగల్, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి 26 సినిమాలను వెనక్కి నెట్టి ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. ఈ రోజే విడుదలైన న్యూటన్ మూవీ.. విడుదలైన రోజే ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.

మోదీ విధానాలతో దేశానికి మేలే లేదు: జేపీ

తూ.గో: మోదీ విధానాలతో దేశానికి మేలు జరిగే అవకాశం కనిపించడం లేదని లోక్ సత్తా నేత జేపీ అన్నారు. చంద్రబాబు పాలన రొటీన్ గా ఉందని, ప్రజలకు విద్య, వైద్యం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

14:59 - September 22, 2017

తెలంగాణ సంస్కృతి చాటే బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. టీ మాస్ నేత విమలక్ ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ ఘనంగా ప్రారంభమైంది.

బతుకమ్మ సంబరాల్లో మంత్రులు సతీమణులు మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. వాడవాడల ఆటపాటలతో వేడుకులు కన్నుల పండుగగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ఎంగిలపూల బతుకమ్మతో ప్రారంభమౌతుంది.

బాలిక విద్య కోసం పడుపడుతున్ ఇద్దరు సెలబ్రెటీలు ఒకే చోట మొదటిసారి కలిస్తే ఎలా ఉంటుంది. ఆసమయంలో వారిద్దరి భావోద్వేగాలు ఎలా ఉంటాయి. మరి ఆ ఇద్దరు సెలబ్రెటీలు ఎవరు..?వారిద్దరు వారివారిఅనుభుతులను ఎలా పంచుకున్నారు. తెలుసుకుద్దాం..

కర్ణాటక సంగీతం అంటే ఠక్కున గుర్తోచ్చేది ఎవరంటే పసివారు కూడా ఆమె పేరు చెబుతారు. దేవాదసి కుటుంబంలో పుట్టి భారతదేశం గర్వించే స్థాయికి చేరుకున్నారమే. అంతేకాదు భారతరత్నంగా ఎదిగరామే..ఆమె ఎంఎస్.సబ్బలక్ష్మి . ఈమె శత జయంతి సందర్బాంగా కేంద్రప్రభుత్వం ఓ అరుదైనా గౌరవాన్ని ఆమె ఇచ్చింది.

కామన్వేల్త్ క్రీడాలో తెలుగమ్మాయిలు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. దక్షణ ఆప్రికాలో జరుగుతున్న ఈ టోర్నీలో సాయి రేవతి, చంద్రిక మూడు స్వర్ణలు గెలుచుకుని తెలుగమ్మాయిల సత్తా చాటారు. వీరిద్దరు ఏపీ చెందిన గుంటూరు వాసులు కావడం విశేషం.

యూనెటెడ్ కింగ్ గడ్డపై తొలి సారి తెలంగాణ గజ్జె ఘల్లుమంది. మరి ఏ సందర్బంగా బ్రిటన్ లో తెలంగాణ కళలు ప్రదర్శించపబడ్డాయో వీడియోలో చూద్దాం..

14:57 - September 22, 2017

కృష్ణా : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు వేడుకల్లో దుర్గమ్మ బాలత్రిపురసుందరిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

14:56 - September 22, 2017

మద్యం లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది:డీసీపీ

హైదరాబాద్: జిల్లాల్లో మద్యం లాటరీల ప్రక్రియ ముగిసింది. హైదరాబాద్ వ్యాప్తంగా 183 వైన్ షాపులకు లాటరీ తీశారు. 84 మద్యం దుకాణాలకు సింగిల్ అప్లికేషన్ రాగా లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని డీసీపీ వివేకానందరెడ్డి తెలిపారు.

బ్యాంకర్ల సమావేశంలో డ్వాక్రా సంఘాల ఇబ్బందులపై చర్చ

అమరావతి: బ్యాంకర్ల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో డ్వాక్రా సంఘాల ఇబ్బందులపై చర్చించారు. సంఘాల పొదుపు నిధులు వాడుకునేందుకు బ్యాంకర్లు సహకరించకపోవడంపై సీఎం అంసతృప్తి వ్యక్తం చేశారు. ఇన్సూరెన్సులు, అదనపు ఛార్జీలంటూ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని సీఎం ప్రశ్నించారు. రుణాల విషయంలో కౌలు రైతులను ఇబ్బంది పెట్టొదన్నారు. రైతు రునాలు, సంక్షేమ పథకాల రుణాల మంజూరులో సమస్యలు లేకుండా చూసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తానన్నారు.

నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ మహిళల ఆందోళన

వరంగల్: అర్బన్ నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ సీఎంఎస్, ఐఎఫ్ డబ్ల్యూ, ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు. హన్మకొండ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మద్యం లాటరీలను అడ్డుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు మహిళలను చెదరగొట్టి సీఎంఎస్ నేత అనిత, ఐఎఫ్ డబ్ల్యూ నేత జ్యోతి, సదాలక్ష్మి ని అరెస్టు చేశారు.

కుక్కలదాడిలో బాలుడి మృతి.. స్పందించిన మంత్రి

అమరావతి: గుంటూరు జిల్లాలో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై మంత్రి స్పందించారు. కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం మున్సిపల్ శాఖకు సిగ్గు చేటని, సీఎంకి వివరణ ఇవ్వాలని కన్నబాబు, గుంటూరు కమిషనర్ ను మంత్రి నారాయణ ఆదేశించారు. డాగ్స్ స్టెరిలైజేషన్ పూర్తి స్థాయిలో చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెలీ కాన్ఫరెన్స్లో కమిషనర్లను ఆదేశించినా అధికారుల తీరు మారలేదు అని మంత్రి నారాయణ మండిపడ్డారు.

ఏలూరులో జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశం రసాభాస

ప.గో: ఏలూరులో జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశం రసాభాస అయ్యింది. ఏపీ మాగుంట, ఎమ్మెల్యే పీతల వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే పీతల సీనియర్ నేతలను పట్టించుకోవడం లేదని మంత్రుల ముందు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఆందోళన వ్యక్తం చేశారు. పదవులకు రాజీనామా చేస్తామని వారు హెచ్చరించారు.

బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తి అరెస్ట్..

రంగారెడ్డి: అత్తాపూర్ పాండురంగానగర్ లో ఈనెల 8న కిడ్నాపైన నాలుగేళ్ల బాలుడు నాగరాజు క్షేమంగా ఉన్నాడు. అనంతపురంలో బాలుడి ఆచూకీ లభ్యం. కిడ్నాపర్ ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గతంలో ఓ కేసులో జైలు శిక్ష అనుభవించాడు.

14:30 - September 22, 2017

ఢిల్లీ : సదావర్తి భూముల వేలంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం వేలం జరిగిన ప్రక్రియను కోర్టుకు వివరించింది. వేలం దక్కించుకున్న వ్యక్తి డబ్బులు కట్టేందుకు ముందుకు రావట్లేదని కోర్టుకు ఏపీ వివరణ ఇచ్చింది. మొదటి వేలానికి, రెండో వేలానికి రూ.40కోట్లు అధికంగా రావడం చిన్నవిషయంకాదని కోర్టు అభిప్రాయపడింది. ఏపీ న్యాయవాది రెండో బిల్డర్ గడువు రేపటితో ముగుస్తోందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంను మరింత గడువు కోరింది. 

తాగు అవసరాల కోసం నీటిని విడుదల

హైదరాబాద్: కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కమిటీ భేటీ ముగిసింది. తాగు అవసరాల కోసం నీటిని విడుదల చేసుకునేందుకు ఏపీ, తెలంగాణకు అనుమతి ఇచ్చింది. ఆంధ్రాకు రైట్ కెనాల్ నుంచి 6 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 4 టీఎంసీలు సాగర్ లెఫ్ట్ కెనాల్ కు 2 టీఎంసీలు విడుదలకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ రెండో వారంలో ఫుల్ బోర్డు సమావేశం కావాలని, ఫుల్ బోర్డు మీటింగ్ లో అభ్యంతరాలు, వివాదాలపై చర్చించనున్నారు.

14:25 - September 22, 2017

హైదరాబాద్ : కృష్ణా నది బోర్డు సమావేశం ముగిసింది. తాగునీటి అవసరాలకోసం నీటి విడుదలకు బోర్డు అంగీకారించింది. ఏపీకి 16 టీఎంసీలు, తెలంగాణకు 6 టీఎంసీలు వాడుకునేందుకు బోర్డు అనుమతిచ్చింది. వచ్చే నెల రెండో వారంలో పూర్తిస్థాయి రివర్ బోర్డు మీటింగ్ జరుగుతుందని బోర్డు ప్రకటించింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

ఎస్వీ వర్శి నియామకాల్లో అక్రమాలపై విచారణకు ఆదేశం..

అమరావతి: తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో నియామకాల్లో అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణాధికారిగా ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వల్లీ కుమారి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

నోయిడాలో అగ్నిప్రమాదం..

ఉత్తర్ ప్రదేశ్ : నోయిడా సెక్టార్ 63లోని ఐడీయా కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీ గోదాం వద్ద ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పుతున్నారు. 

గురుదాస్ పూర్ లోక్ సభ స్థానానికి నామినేషన్లు..

పంజాబ్ : గురుదాస్ పూర్ లోక్ సభ ఉప స్థానానికి కాంగ్రెస్ నేత సునీల్ జక్కర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట సీఎం అమరీందర్ సింగ్ కూడా ఉన్నారు. 

సూపరింటెండెంట్ కారు ఢీకొని వృద్ధురాలు మృతి..

నిజామాబాద్ : ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. సూపరింటెండెంట్ రాములు కారు ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. 

మంత్రుల ఎదుట ఎంపీటీసీలు..జడ్పీటీసీల ఆందోళన..

పశ్చిమగోదావరి : ఏలూరులో జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశం రసాభాసగా సాగింది. ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే సుజాత వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే పీతల సీనియర్ నేతలను పట్టించుకోవడం లేదని మంత్రుల ముందు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఆందోళన నిర్వహించారు. 

13:43 - September 22, 2017

హర్యానా : డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్ బ్యాంక్‌ ఖాతాల గుట్టు రట్టయింది. ఒకటి కాదు...రెండు కాదు...డేరా సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో 75 కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డేరా పేరిట ఉన్న 504 బ్యాంకు ఖాతాలను హర్యానా ప్రభుత్వం స్తంభింపజేసింది
504 బ్యాంకు ఖాతాల్లో రూ.75కోట్లు 
ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి పాల్పడిన కేసుల్లో డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్ జైలు కెళ్లాక రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తాజాగా డేరా దాని అనుబంధ సంస్థలకు చెందిన 504  బ్యాంకు ఖాతాల్లో 75కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 
గుర్మీత్‌...12 ఖాతాల్లో రూ. 7.72 కోట్లు
గుర్మీత్‌ పేరిట ఉన్న 12 ఖాతాల్లో  7.72 కోట్ల రూపాయలు లభించాయి. ఆయన దత్తపుత్రిక హన్‌ప్రీత్‌కు చెందిన 6 ఖాతాల్లో కోటి రూపాయలు జమ ఉన్నాయి. అందరికన్నా అధికంగా రామ్‌ రహీమ్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌కు చెందిన హకీకత్‌ ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ పేరిట 20 బ్యాంకు ఖాతాల్లో 50కోట్ల బ్యాంక్‌ బాలెన్స్‌ ఉంది. డేరా, దాని అనుబంధ సంస్థల పేరిట మొత్తం 504 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు హరియాణా ప్రభుత్వం నిర్ధారించింది. వీటిలో 473 పొదుపు ఖాతాలు కాగా.. మిగిలినవి రుణ ఖాతాలు.
గుర్మీత్‌ కు 20 ఏళ్ల జైలుశిక్ష 
ఆగస్టు 25న ఇద్దరు సాధ్విలపై అత్యాచారం జరిపిన కేసులో గుర్మీత్‌ రామ్‌రహీమ్‌కు పంచకుల సిబిఐ కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఈ సందర్భంగా గుర్మీత్‌ అనుచరులు హింసాత్మక ఘటనలకు పాల్పడి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో 31 మంది మృతి చెందగా...ప్రభుత్వ ప్రయివేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు అల్లర్ల కారణంగా జరిగిన నష్టాన్ని డేరా సంస్థల నుంచి సేకరించాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
డేరా సంస్థకు 1,435 కోట్ల ఆస్తులు 
కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన హర్యానా సర్కార్ డేరా సంస్థకు 1,435 కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించింది. 504 బ్యాంకు ఖాతాలకు గాను ఒక్క సిర్సా జిల్లాలోనే 495 ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాలన్నీ గుర్మీత్‌, ఆయన భార్య, కుమార్తెలు, కుమారుడు, దత్తపుత్రిక హనీప్రీత్‌, డేరా సచ్చా సౌధ ట్రస్ట్‌, దాని అనుబంధ సంస్థల పేరుతో ఉన్నట్లు తేలింది. ఈ ఖాతాలన్నింటినీ హరియాణా ప్రభుత్వం సీజ్‌ చేసింది. గుర్మీత్‌ దత్తపుత్రిక హనీప్రీత్‌ కనిపించకుండా పోవడంతో పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. హనీప్రీత్‌ నేపాల్‌లో ఉన్నట్లు గుర్తించారు. హనీప్రీత్‌ను పట్టుకుంటే గుర్మీత్‌కు చెందిన మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

 

ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో..వరంగల్ భద్రకాళీ ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనం ఇస్తున్నారు. శుక్రవారం కావడంతో అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

13:37 - September 22, 2017

కరీంనగర్ : సింగరేణి సంస్థలో ఆరవ విడత జరగనున్న ఎన్నికలకు నల్లబంగారు నేల సిద్ధమవుతోంది. విజయమే లక్ష్యంగా కార్మిక సంఘాలు వ్యూహ, ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాలే కార్మిక సంఘాల భవిష్యత్‌ను తేల్చనున్నాయి. నల్ల సూరీల నేలపై మోగిన ఎన్నికల సైరన్‌పై 10టీవీ ప్రత్యేక కథనం. 
ర‌స‌వ‌త్తరంగా బొగ్గు రాజ‌కీయం 
కరీంనగర్‌ జిల్లాల్లో బొగ్గు రాజ‌కీయం ర‌స‌వ‌త్తరంగా మారుతోంది.  విప‌క్ష, అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య బొగ్గు గ‌నులు వేడి పుట్టిస్తున్నాయి. ముందు అధికార పార్టీ నేత‌ల్లో ఆందోళ‌న క‌నిపించినా.. ప్రచార ప‌ర్వం మొద‌లు కావ‌డంతో గులాబి నేత‌లు ప్రభుత్వ హామీల‌తో కార్మికులను ప్రసన్నం చేసుకుంటున్నామ‌న్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.  
అక్టోబర్‌ 5న ఎన్నికలు 
సింగరేణి సంస్థలో ఏడాది తరువాత ఎన్నికలను నిర్వహించేందుకు.. కార్మిక శాఖ నిర్ణయించి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్‌ 5న ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 14 నుంచి 16 వరకు నామినేషన్లు.. 19 వరకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ నిర్వహించారు. సింగరేణిలో ఇప్పటికే 5 విడతలు ఎన్నికలు జరగగా.. ప్రస్తుతం ఆరవ విడత జరగనున్న ఎన్నికలపై కార్మిక సంఘాలు ప్రత్యేక దృష్టి సారించాయి. 
17 సంఘాలు పోటీ 
ప్రస్తుతం జరగనున్న ఎన్నికలకు 17 సంఘాలు పోటీలో నిలవడానికి అర్హత సాధించాయి. 53, 146 కార్మికులు, ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ దఫా ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఓడించేందుకు పలు సంఘాలు పొత్తులు పెట్టుకొని రంగంలోకి దిగుతున్నాయి. ఏఐటియుసి, ఐఎన్టియుసి సంఘాలు కలిసి ఐక్యంగా పోటీ చేసేందుకు నిర్ణయమైంది. టీడీపీ అనుబంధ టీఎన్టియుసి కూడా ఈ పొత్తుకు మద్దతునిచ్చింది. ఇక విప్లవ కార్మిక సంఘాలు కూడా కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. 
జోష్‌లో ఉన్న సీఐటీయూ 
సీపీఎం నాయకత్వం ఇప్పటికే కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో సమావేశాలను నిర్వహించి.. ప్రచార కార్యక్రమాలను రూపొందించుకుంది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం యూనియన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గతంలో కంటే ఈ సారి సీఐటీయూ అనూహ్యంగా కార్మికుల ఆదరణ పొందుతుండటంతో.. ఆ యూనియన్ నేతలు జోష్‌లో ఉన్నారు. వేజ్ బోర్డు సంబంధించిన చర్చల్లో సీఐటీయూ కార్మిక ప్రయోజనాలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారం కోసం డిమాండ్ చేస్తున్నారు. 
ఎంపీ కవిత చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు 
ఉత్తర తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్న బొగ్గు గనుల ఎన్నికలు అధికార పార్టీలో ఎంపీ కవిత చుట్టూ తిరుగుతున్నాయి. ఆమె తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతగా ఎన్నికలను ముందుండి నడిపిస్తున్నారు. అయితే కార్మికులు వారసత్వ ఉద్యోగాల గురించి అడగటం నేతలకు తలనొప్పిగా మారింది.  
న్యాయస్థానం పరిధిలో వారసత్వ ఉద్యోగాల అంశం 
సింగరేణిలో ప్రధాన సమస్య అయిన వారసత్వ ఉద్యోగాల కల్పన అంశం న్యాయస్థానం పరిధిలో ఉంది. పరిధి దాటి హామీలిచ్చే ధైర్యం కార్మిక సంఘాలు చేయడం లేదు. దీంతో ఏ యూనియన్ విజయం సాధిస్తుందో అంచనా వేయలేని గందరగోళ పరిస్థితి నెలకొంది. 

 

కృష్ణా రివర్ బోర్డు నిర్ణయాలు..

హైదరాబాద్ : కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కమిటీ భేటీ కాసేపటి క్రితం ముగిసింది. తక్షణ అవసరాల కోసం నీటిని విడుదల చేసేందుకు ఏపీ తెలంగాణకు అనుమతి ఆంధ్రాకు రైట్ కెనాల్ నుండి 6 టీఎంలు..హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 4 టీఎంసీలు..సాగర్ లెఫ్ట్ కెనాల్ కు 2 టీఎంసీల విడుదలకు అనుమతినిచ్చింది. 

13:22 - September 22, 2017
13:21 - September 22, 2017

ఢిల్లీ : సదావర్తి భూముల వేలంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. భూముల వేలంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వేలం జరిగిన ప్రక్రియను ఏపీ ప్రభుత్వం కోర్టుకు వివరించింది. వేలం దక్కించుకున్న వ్యక్తి డబ్బులు కట్టేందుకు ముందుకు రావట్లేదని కోర్టుకు వివరణ ఇచ్చారు. మొదటి వేలానికి, రెండో వేలానికి రూ.40 కోట్లు అధికంగా రావడం చిన్న విషయం కాదని ఏపీ లాయర్ అన్నారు. తాజా వేలంలో బిల్డర్ రూ.60.3 కోట్లకు చెల్లించలేకపోయారు. రెండో బిల్డర్ గడువు రేపటితో ముగుస్తుందని ఏపీ న్యాయవాది తెలిపారు. ఏపీ ప్రభుత్వం గడువు కోరింది. సదావర్తి భూములను కారుచౌకగా విక్రయిస్తే ఊరుకునేది లేదని కోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:11 - September 22, 2017

అవసరం ఉందని వెళితే చాలు..అడిగినంత డబ్బు ఇస్తాడు..అర్ధరాత్రి అయినా సొమ్ములిస్తాడు..కానీ తెల్లకాగితాలపై సంతకం చేయాలి...వేలి ముద్రలు వేయాలి..ఇదేంటీ అనే అవకాశం ఉండదు...ఆపదలో ఉన్న వారే అతని టార్గెట్..వడ్డీ అంటరా..పది రూపాయలు వసూలు చేస్తాడు. పచ్చని పల్లెల్లో కాల్ మనీ కేసుల్లో చిక్కుకుని పోతున్నరు..ఇది ఎక్కడో కాదు..నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం యల్లారెడ్డి గూడెంకు చెందిన సుర రాములు అరాచకం బాహ్య ప్రపంచానికి తెలిసింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

12:53 - September 22, 2017

విజయవాడ : బాలాత్రిపుర సుందరి దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అమ్మవారి అంతరాలయ దర్శనాన్ని దేవస్థాన అధికారులు నిలిపివేశారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. మరింత సమాచారం వీడియోలో చూద్దాం...

 

జమ్మలమడుగు కోఆపరేటివ్ బ్యాంక్ లో డిపాజిట్లు గల్లంతు..

కడప: జమ్మలమడుగు టౌన్ కోఆపరేటివ్ బ్యాంక్ లో బ్యాంకులో డిపాజిట్ దారుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. దీంతో డిపాజిట్ దారులు ఆందోళనకు దిగారు. రూ. 4 కోట్ల మేర అవినీతి జరిగిందని అనుమానం వ్యక్తం అవుతోంది. గత పది రోజులుగా బ్యాంక్ లావాదేవీలు బంద్ అయినా ఇంత వరకు డైరెక్టర్లు బ్యాంకుకు రాలేదు.

12:50 - September 22, 2017

విజయవాడ : మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మిడ్ డే మీల్స్ వర్కర్లు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వేస్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకూ ఈ ర్యాలీ సాగింది. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి 13 జిల్లాల మిడ్ డే మీల్ వర్కర్లు భారీగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడానికి వీల్లేదని, వర్కర్లను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మిడ్‌ డే వర్కర్లు మండిపడ్డారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గపూర్, సీఐటీయూ మహిళా నాయకురాలు స్వరూపరాణి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరూణరాణి మాట్లాడుతూ చంద్రబాబు నమ్మకం ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. గపూర్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తోందన్నారు. పేదలకు, కష్టజీవులకు వ్యతిరేకంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఉన్న ఉద్యోగాలు తీసివేయాలని ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఏపీ వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.1,66,806

అమరావతి:ఏపీ వార్షిక రుణ ప్రణాళిక 2017-18లక్ష్యం రూ.1,66,806లు, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు చెల్లించిన రుణాలు రూ. 50,090 కోట్లు. స్వల్ప కాలిక ఖరీఫ్ పంట రుణాలు రూ.38,736 కోట్లు. స్వల్పకాలిక రబీ పంట రుణాలు రూ. 24,370 కోట్లు.

రేపటి నుండి తిరుమల బ్రహ్మోత్సవాలు: టిటిడి ఈవో

తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని టీటిడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రేపటి నుండి అక్టోబర్ 1 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో మొదటి, రెండో శనివారం గరుడ సేవ రోజు నడకదారి భక్తులకు జారీ చేసే దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు అందుబాటులో 4 వేల వసతి గదులు ఉన్నాయని, ప్రోటోకాల్ వీఐపీలకు మినహా సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు చెప్పారు.

12:41 - September 22, 2017

ఢిల్లీ : సదావర్తి భూముల వేలంపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ భూములకు సంబంధించి వీడియో, అఫిడవిట్లు, డాక్యుమెంట్లను ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు కోర్టుకు సమర్పించారు. అయితే వేలం పాట పాడిన శ్రీనివాసురెడ్డి డబ్బు చెల్లించకపోవడంతో రెండో బిల్డర్‌కు అవకాశం ఉందో లేదో అనే అంశంపై సుప్రీం నేడు తేల్చనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:38 - September 22, 2017

ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు పెద్దలు...అసలు టైం దొరకడం లేదు..ఇంకా ఆరోగ్యంపై శ్రద్ధా అని కొందరు పెదవివిరుస్తుంటారు. కానీ ఎన్ని పనులున్నా కొద్దిసేపైనా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తుంటారు. కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడిన సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ సమస్యలు తీరే అవకాశం ఉంది.

వాంతులు అదే పనిగా అవుతుంటే దానిమ్మ గింజలను చప్పరించి చూడండి. స్థూలకాయం ఎంతకు తక్కువ కాకపోతే..పది గ్రాముల మిరియాలు..అంతే చొప్పున శొంఠి..నాలుగు కట్టల పుదీనా తీసుకుని వీటన్నింటినీ మెత్తగా నూరుకోవాలి. చిన్న సైజు ట్యాబెట్ల ఆకారంలో చేసుకని ఎండలో ఆరబెట్టాలి. ఎండిన తరువాత రోజుకు ట్యాబెట్లు తీసుకుని చూడండి. రక్తహీనతో బాధ పడుతున్న వారు మూడు నెలల పాటు క్రమం తప్పకుండా మెంతికూర తినాలి. కీళ్ల నొప్పులున్న వారు ఉసిరికాయ రసంలో కొద్దిగా చక్కెర వేసి కొద్ది కొద్దిగా రెండు పూజటలు తీసుకుని చూడండి. ఇలాంటి కొన్ని చిట్కాలు పాటిస్తే మేలు. 

12:35 - September 22, 2017

చెన్నై : టుటుకొరిన్ ఓడరేవుపై కస్టమ్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. మలేషియాకు తరలించడానికి సిద్ధంగా ఉన్న 9.5 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:26 - September 22, 2017
12:25 - September 22, 2017

శరీరంలో అన్ని భాగాలు ముఖ్యమే. అందులో వెన్ను కూడా ఒకటి. శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం అని పేర్కొన్నవచ్చు.ఇది 33 వెన్నుపూసలతో ఉంటుంది. మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ లు సహాయపడతాయి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూ బిజి బిజీగా గడిపేస్తుంటారు. దీనితో శరీరంలోని పలు అవయావాలపై ప్రభావం చూపిస్తాయి. అందులో వెన్ను ముక ఒకటి. పలు సందర్భాల్లో వెన్ను నొప్పి బాధిస్తుంటుంది. గంటల కొద్ది కంప్యూటర్స్..ఇతర పనులు చేయడం దీనికి కారణమౌతున్నాయి.

వెన్నునొప్పి వస్తే ఆముదాన్ని వేడి చేసి రాసి చూడండి. అలాగే వెల్లుల్లి పాయలను కొన్నింటిని తీసుకుని కొద్దిగా నువ్వుల నూనెల వేసి బాగా కాచాలి. అనంతరం గోరువెచ్చగా ఉన్న సమయంలో వెన్ను నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి చూడండి. కారు..బైక్ నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కారు నడిపేటప్పుడు చిన్నపాటి దిండ్లను వాడడం బెటర్. వేడిగా ఉన్న నువ్వుల నూనెతో మసాజ్ చేయించకుంటే నొప్పి తగ్గే అవకాశం ఉంది. మునగాకు రసం..పాలు..సమపాళ్లుగా తీసుకుని సేవించాలి. వెన్ను నొప్పి అధికంగా ఉన్న సమయంలో అధిక బరువులు ఎత్తడం, ఒకేసారి హఠాత్తుగా వంగటం వంటివి చేయకూడదు. పిల్లల స్కూలు బ్యాగుల విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. బ్యాగులకు పట్టీలు..బరువు రెండు భుజాల మీద సమానంగా పడేలా చూసుకోవాలి. ఒకే పొజిషన్‌లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి. శరీర బరువు అధికంగా ఉంటే వెంటనే తగ్గించుకొనే విధంగా చూసుకోండి. 

12:24 - September 22, 2017

హైదరాబాద్ : ఐఆర్ ఎస్ అధికారిణి, వైసీపీ ఎమ్మెల్యే సురేశ్ భార్య విజయలక్ష్మీ పై కేసు నమోదు చేశారు. సురేశ్ పైనా సీబీఐ కేసు నమోదు చేసింది. ఏ1 గా విజయక్ష్మీ, ఏ2గా సరేశ్ ఉన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ప్రారంభమైన రాష్ట్రస్థాయి 200వ బ్యాంకర్ల సదస్సు

అమరావతి: రాష్ట్రస్థాయి 200వ బ్యాంకర్ల సదస్సును సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రాబ్యాంకు ఎగ్జిక్యూటివ్ి డైరెక్టర్ ఎస్ ఎల్ బీసీ కన్వీనర్, ఆంధ్రాబ్యాంక్ సర్కిర్ మేనేజర్, విశాఖ సర్కిల్ జనరల్ మేనేజర్, హైదరాబాద్ ఆంధ్రా బ్యాంక్ జనరల్ మేనేజర్ హాజరయ్యారు.

'సదావర్తి భూముల' పై సుప్రీం కోర్టులో విచారణ

ఢిల్లీ: సదావర్తి భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. వేలం జరిగిన ప్రక్రియను ఏపీ సర్కార్ కోర్టుకు వివరించింది. వేలం దక్కించుకున్న వ్యక్తి డబ్బులు కట్టేందుకు ముందుకు రావట్లేదని కోర్టుకు వివరణ ఇచ్చింది. ఏపీ సర్కార్ మరింత గడువు కోరింది. తదుపరి విచారణ అక్టోబర్ 6కు వాయిదా పడింది.

యలమంచిలి కోర్టుకు మంత్రి అయ్యన్న

విశాఖ: యలమంచిలి కోర్టుకు మంత్రి అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. 2012 పాయకరావుపేట ఉప ఎన్కిల్లో కోడ్ ఉల్లంఘన కేసులో మంత్రి అయ్యన్న, చెంగల వెంకట్రావు కోర్టుకు హాజరయ్యారు.

గాలి జనార్థన్ రెడ్డి పీఏ పై నాన్ బెయిలబుల్ వారెంట్

హైదరాబాద్: ఓబుళాపురం గనుల కేసులో సీబీఐ కోర్టుకు గాలి జనార్థన్ రెడ్డి హాజరయ్యారు. అయితే గాలి పీఏ అలీఖాన్ హాజరు కాక పోవడంతో అతని సీబీఐ కోర్టు నాన్ బెయిల బుల్ వారెంట్ జారీ చేసింది

తెలంగాణ సెట్ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్

హైదరాబాద్: తెలంగాణ సెట్ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. టీఎస్ సెట్ ఫలితాల విడుదల పై హైకోర్టు స్టే ఎత్తివేసింది.

11:57 - September 22, 2017

విజయవాడ : అవినీతి అధికారుల భరతం పట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రతి పనికీ కరెన్సీ నోట్లతో చేతులు తడపాలనే అధికారులపై కొరడా ఝుళిపించేందుకు అవినీతి నిరోధక శాఖ సిద్ధమవుతోంది. వచ్చే నెల 2 నుంచి అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసింది.
అవినీతి అధికారులు 
ప్రభుత్వ శాఖల్లోని కొందరు అధికారుల అవినీతి సర్కారుకు చెడ్డ పేరు తెప్పిపెడుతోంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అందినకాడికి బొక్కడం,  దొరికినంత దోచుకోవడం పనిగా పెట్టుకున్నారు. ఇకపై ఇలాంటి వారి పప్పులు ఉడకవు. అవినీతి అధికారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 
అవినీతిని అంతం చేయాలని చంద్రబాబు పంతం 
రాష్ట్రంలో అవినీతిని అంతం చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు పంతం పట్టారు. ఇందుకు అనుగుణంగా  అధికారులకు సింహస్వప్నంగా మారేందుకు ఏసీబీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. కొంతమంది అధికారులు ఆదాయాన్ని మించి వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెడుతున్నారు. ఈ జాడ్యాన్ని సమూలంగా రూపుమాపితే 80 శాతం మంది ప్రజలు ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేస్తారన్న నమ్మకంతో ముఖ్యమంత్రి ఉన్నారు. శాఖల వారీగా అవినీతి అధికారుల చిట్టా తయారుచేసి, పట్టుకుని చర్యలు తీసుకునేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. 
అవినీతి అధికారులపై ఏసీబీ కన్ను 
అవినీతి అధికారులపై ఏసీబీ ఓ కన్నేసి ఉంచింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జులై వరకు 60 మంది అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. వీరిలో 39 మంది లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మరో 21 మంది ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో పట్టుబడ్డారు. ఆరోగ్యశాఖలో పనిచేస్తూ  ఏసీబీకి పట్టపడ్డ పాండురంగారావు  ఇటు ఏపీ, అటు తెలంగాణలో వందల కోట్ల భారీ ఆస్తులు కూడబెట్టినట్టు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌కు తిరుపతిలో పది కోట్ల రూపాయలకుపైగా ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. కర్నూలు, విశాఖ జిల్లాల్లో పనిచేసిన  డీఎం అండ్‌ హెచ్‌వో కూడా భారీగా ఆస్తులు కూడబెట్టిన వైనం ఏసీబీ సోదాల్లో తేలింది. తహశీల్దార్లు, ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్లు.. ఇలా  60 మంది ఏసీబీ వలకు చిక్కారంటే అవినీతి ఎంత భారీ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.  దొరికితేనే దొంగ అన్నట్టు... ఏసీబీకి చిక్కకుండా అవినీతి వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్న అధికారులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాని ఆటకట్టించేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. 
అవినీతి కేసుల్లో దర్యాప్తు వేగవంతం 
లంచాల కోసం ప్రజలను పీడిస్తున్నప్రభుత్వ అధికారులు, సిబ్బంది సంఖ్య తక్కువేమీలేదు. శ్రీకాకుళం జిల్లాలో మైన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బత్తు హనుమంతరావు ఇసుక రీచ్‌ల అనుమతి కోసం ఐదు లక్షల రూపాయలు డిమాండ్‌ చేసిన అంశం వెలుగులోకి వచ్చింది. ఏపీ సచివాలయం సిబ్బంది హైదరాబాద్‌ నుంచి అమరావతికి తలివచ్చిన కొత్తలోనే హోం శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌... ఒక కాంట్రాక్టర్‌ నుంచి 50 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డారు. గత నాలుగు నెలల్లో 44 కేసులకు గాను... 27 కేసుల్లో ఏసీబీ అధికారులు కోర్టుల్లో చార్జ్‌షీట్లు దాఖలు చేశారు. 64 కేసుల్లో ప్రాసిక్యూషన్‌కు సకాలంలో అనుమతి లభించింది. శిక్ష ఖరారైన పది మంది అధికారులను సర్వీసు నుంచి తొలగించడంతోపాటు పెన్షన్‌ చెల్లింపును నిలుపుదల చేశారు. అవినీతి కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, మరింత మందికి శిక్షలు పడేవిధంగా చేయాలని ఏసీబీ నిర్ణయించింది. 
అవినీతిలో ఏపీ 19 వ స్థానం 
నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లైడ్‌ ఎకనమిక్‌ రీసర్చ్‌ ఇచ్చిన నివేదిక ప్రకారంలో అవినీతిలో గత ఏడాది ఏపీ మొదటి స్థానంలో నిలవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అవినీతి అధికారులపై ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది 19 వ స్థానంలో ఉంది. వచ్చే ఏడాదికి  25 స్థానానికి చేరుకోవాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అవినీతి అధికారులపై చర్యలతోనే ఇది సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. 

 

11:48 - September 22, 2017

హైదరాబాద్ : ఇవాళ తెలంగాణాలో మద్యం షాపులు కేటాయింపు జరుగనుంది. కలెక్టర్ల సమక్షంలో ఎక్సైజ్‌ అధికారులు లాటరీ తీయనున్నారు. ఘట్‌కేసర్‌లో ఒక షాపుకు మినహా మిగిలిన 2,215 దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. 2015సం.లో మద్యం టెండర్ల ద్వారా ప్రభుత్వానికి 155 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గతంతో పోలిస్తే ఈసారి 256 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరింది. ఈసారి 411 కోట్ల రూపాయలకు పైగా ఖజానాకు జమ కానుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఐఆర్ ఎస్ అధికారి విజయలక్ష్మి పై సీబీఐ కేసు

చెన్నై: ఐఆర్ ఎస్ అధికారి విజయలక్ష్మి పై సీబీఐ కేసు చేసింది. విజయలక్ష్మికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. విజయలక్ష్మి సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే సురేష్ భార్య. ఎమ్మెల్యే సురేష్ పై కేసు సీబీఐ కేసు నమోదు చేసింది. ఏ1గా విజయలక్ష్మి, ఎ2గా ఆదిమూలపు సురేష్ పై సీబీఐ కేసు నమోదు చేసింది.

కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కమిటీ భేటీ

హైదరాబాద్: కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీకి బోర్డు ఛైర్మన్ సాహు, కార్యదర్శి సమీర్ చటర్జీ, ఇరు రాష్ట్రాల ఈఎన్ సీలు హాజరయ్యారు.

స్వైన్ ఫ్లూతో టిఆర్ ఎస్ ఎంపీటీసీ లింగప్ప మృతి

మహబూబ్ నగర్ : మక్తల్ మండలం ఉప్పరపల్లి, లింగంపల్లి టిఆర్ ఎస్ ఎంపీటీసీ లింగప్ప స్వైన్ ఫ్లూ తో మృతి చెందాడు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

'కాళేశ్వర' మృతుల కుటుంబాలను ఆదుకుంటా: మంత్రి హరీష్

రాజన్న సిరిసిల్ల :కాళేశ్వరం పదో ప్యాకేజీలో ప్రమాదం చాలా దురదృష్టకరమని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం చెల్లించేందుకు ఏజెన్సీ ముందుకొచ్చిందని, ప్రభుత్వపరంగా వారిని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ లోని ప్రమాద స్థలాన్ని కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ విశ్వజిత్, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు.

11:27 - September 22, 2017

గుంటూరు : జిల్లాలో కేంద్రంలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే వీధి కుక్కలకు ఆపరేషన్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న కుక్కలను ఇతర ప్రాంతాల్లో విడిచిపెట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 స్థానిక సంస్థల పరిధిలో 8 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదికను అందించారు. గుంటూరు జిల్లాలో 18 వేలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ప్రతీ యేటా 70 వేల మందికి వీధి కుక్కల దాడిలో గాయాలవుతున్నాయని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:23 - September 22, 2017

దసరా పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయనే సంగతి తెలిసిందే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పూజలు చేస్తుంటారు. ఆయా సంస్కృతి..ఆచారాలకు అనుగుణంగా పండుగను నిర్వహిస్తుంటారు. గుర్ గావ్ ప్రాంతంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా టన్..చికెన్ షాపులు తెరిచి ఉంచకూడదని శివసేన ఆర్డర్స్ ఇచ్చేసింది.

ఉత్తర్ భారతదేశంలోని న్యూ ఢిల్లీకి నైరుతి దిశగా గుర్ గావ్ ఉంటుంది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు చికెన్..మటన్ షాపులు బంద్ చేయాలని ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. బలవంతంగా షాపులను కూడా బంద్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అంతర్జాతీయంగా పేరొందిన కేఎఫ్ సీ ని కూడా మూసివేసినట్లు సమాచారం. తమ సూచనలు పాటించకపోతే పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని గుర్ గావ్ లోని శివసేన గ్రూపుకు చెందిన ఓ నేత జాతీయ ఛానెల్ తో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

శాఖాహారం కాని వారికి వీరు నోటీసులు జారీ చేశారు. తొమ్మిది రోజుల వరకు దుకాణాలను మూసివేయించే విధంగా చూడాలని పేర్కొన్నారు. సూరత్ నగర్, పాలెం విహార్, అశోక్ న గర్, సెక్టార్ 5, 9, పటౌడ్ చౌక్, సదర్ బజార్, డీఎల్ఎఫ్ ఏరియా తదితర ప్రాంతాల్లో ఉన్న మటన్..చికెన్ షాపులను మూసివేయించారు. దీనిపై సీనియర్ పోలీసు అధికారి స్పందించారు. దీనిపై దృష్టి సారిస్తున్నట్లు, చట్టం చేతుల్లోకి తీసుకొనే అధికారి ఏ ఒక్కరికి లేదని ఆయన ఓ జాతీయ ఛానల్ తో పేర్కొన్నారు. బలవంతంగా మూసివేయించినట్లైతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

11:16 - September 22, 2017
11:15 - September 22, 2017
11:03 - September 22, 2017

భారతదేశం అభివృద్ధిలో దూసుకపోతోంది...ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశం పయనిస్తోంది..ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా ఉన్నారు..స్మార్ట్ సిటీలు..మురికివాడలు లేని ప్రాంతంగా తయారు చేస్తున్నాం..అని చెబుతున్న పాలకుల మాటలు కార్యరూపం దాలుస్తున్నాయా ? లేదని ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే తెలుస్తోంది. కానీ 20 ఏళ్లుగా నీళ్ల కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. నిత్యం నీటి కోసం వారు భగీరథ ప్రయత్నం చేయాల్సి వస్తోంది...

ఛత్తీస్ గడ్.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ కొనసాగుతున్నారు. ఇటీవలే ఆయన 5000 రోజుల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. కానీ బలరాంపూర్ జిల్లాకు చెందిన ప్రజలు మాత్రం 20 ఏళ్లుగా కష్టాలు పడుతూనే ఉన్నారు. బలరాంపూర్ జిల్లాలోని కేంద్ర హెడ్ క్వార్టర్స్ కు కేవలం 8 కిలోల మీటర్ల దూరంలో డుమర్ పురా ఉంది. వీరంతా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా స్థానిక నదీ జలాలపై మనుగడ పడాల్సి వస్తోంది. గత 20 ఏళ్లుగా స్థానికంగా ఉన్న నదీ జలాలపైనే ఆధార పడాల్సి వస్తోందని అక్కడి గ్రామస్తులు ఓ జాతీయ ఛానెల్ కు తెలిపారు. కానీ ఎండకాలంలో నది నీరు అడుగంటిపోతుండడంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోందని పేర్కొన్నారు. నదీ జలాల నుండి నీరు తాగుతుండడం వల్ల చాలా మంది ప్రజలు అనారోగ్యంతో బాధ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

కానీ 20 ఏళ్లు పడుతున్న నీటి కష్టాలపై కలెక్టర్ స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే అన్ని నివాస గృహాలకు స్వచ్ఛమైన తాగునీరందిస్తామని హామీనిచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా వారి కష్టాలు తీరుతాయా ? లేదా ? అనేది చూడాలి. 

జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ ల ప్రదర్శన

విజయవాడ: మధ్యాహ్నం 2.30గంటలకు ఎంబీ విజ్ఞాన కేంద్రంలో 50 షార్ట్ ఫిల్మ్ లను జాషువా సాంస్కృతిక వేదిక ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ స్పీకర్ బుద్ధ ప్రసాద్ ప్రారంభించనున్నారు.

ఉద్యోగం లేకుండా పెన్షన్ పొందుతున్న వ్యక్తి అరెస్ట్

కృష్ణా: ఉద్యోగం లేకుండా పెన్షన్ తీసుకుంటున్న సాయిబాబు అనే వ్యక్తిని విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. 2001 నుంచి అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్న సాయిబాబు ప్రతి నెల రూ. 35 వేల పెన్షన్ డ్రా చేస్తున్నాడు. ఇప్పటి వరకు పెన్షన్ కింద రూ.38 లక్షలు తీసుకున్నాడు. ఆగిరిపల్లి మండలం ఈదరలో స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నట్లు తప్పుడు రికార్డులతో పెన్షన్ పొందుతున్న సాయిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. సాయిబాబాను పామర్రులో విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. జిల్లాలో ఐదుగురు నకిలీ రిటైర్డ్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నామని విజిలెన్స్ అధికారులు తెలిపారు.

 

10:41 - September 22, 2017

జమ్మూకాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందవాఇన్ని ఉల్లఘించింది. జమ్మూకాశ్మీర్ లో ఆర్నియా సెక్టార్ లో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు పౌరులు మృతి చెందారు. దీంతో అక్కడి ఉద్రిక్తల నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

అమెరికాలో ఉద్యోగాల పేరుతో మోసం

విజయవాడ : అమెరికాలో ఉద్యోగాల పేరుతో మోసం వెలుగు చూసింది. 150 మంది నిరుద్యోగుల నుంచి రూ. 3 కోట్లు వసూలు చేసిన పటమటకు చెందిన ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి రహస్య ప్రాంతంలో పెనమలూరు పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. మరో ముగ్గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

10:40 - September 22, 2017

లావణ్య త్రిపాఠి...'అందాల రాక్షసి' ఫేం అయిన ఈ అందాల భామ టాప్ లిస్టులో చేరిపోయింది. సొగ్గాడే చిన్ని నాయనా..భలే భలే మగాడివోయ్ వంటి చిత్రాల్లో నటించిన ఇక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. వెంట వెంటనే సినిమా చేస్తూ బిజీగా మారిపోయింది. కానీ ఈ అమ్ముడు ప్రస్తుతం ముద్దుగుమ్మ చిక్కుల్లో పడిపోయింది.

టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన నటీమణుల్లో 'లావణ్య త్రిపాఠి' ఒకరు. ప్రస్తుతం ఈమె '100% లవ్' తమిళ్ రీమెక్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. జీవీ ప్రకాష్ హీరోగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ లండన్ లో కొనసాగించేందుకు చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. లావణ్య మాత్రం అదే సమయంలో రాకుండా డుమ్మా కొట్టిందట. దీంతో చిర్రెత్తుకొచ్చిన మూవీ డైరెక్టర్ చంద్రమౌళి ఏకంగా దక్షిణ భారత సినీ వాణిజ్య మండలిలో ఫిర్యాదు చేశారు. ఆమె బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వల్ల తాము చాలా నష్టపోయామని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. మరి ఈ చిక్కుల్లో నుండి 'లావణ్య' ఎలా బయటపడుతుందో వేచి చూడాలి. 

10:37 - September 22, 2017

హైదరాబాద్ : ఇవాళ ఉదయం 11గం.లకు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో మూడో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల... సంక్షేమ పథకాలకు రుణాల మంజూరుపై చర్చించనున్నారు. 

10:34 - September 22, 2017

రంగారెడ్డి : జిల్లాలోని తాండూరులో ఆత్మహత్యాయత్నం చేసిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త అయూబ్‌ ఖాన్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెల 30న తాండూరులో మంత్రి మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశానికి అయూబ్‌ హాజరయ్యాడు. ఉద్యమ కారులకు పార్టీలో గుర్తింపు ఇవ్వడంలేదంటూ మనస్తాపం చెందిన అతను... సమావేశంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అయూబ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. అయూబ్‌ మృతితో తాండూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి నివాసం దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:25 - September 22, 2017

చిత్తూరు : తిరుపతి రుయా ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. జూనియర్‌ డాక్టర్‌ వెంకటరమణ ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో.. అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. మూడు రోజుల క్రితం వెంకటరమణపై క్లర్క్‌ కృష్ణకుమారి దాడికి యత్నించారు. దీంతో మనస్థాపం చెందిన వెంకటరమణ ఆత్మహత్యాయత్నం చేశాడు. మరోవైపు రుయా ఆస్పత్రి ఘటనపై కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. వెంకటరమణ ఆత్మహత్యాయత్నంపై విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆస్పత్రి సూపరిండెంట్‌ సిద్ధనాయక్‌కు ఆదేశాలు జారీ చేశారు. జూనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణ కుమారిని సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. అటు సస్పెన్షన్‌తో మనస్తాపం చెందిన కృష్ణ కుమారి.. ఆమె కూడా ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆమెను చికిత్సకోసం స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఉద్దరు ఉగ్రవాదుల అరెస్ట్...

బనిహల్ : ఎస్‌ఎస్‌బీ జవాన్లపై దాడి ఘటనకు సంబంధించి బనిహల్ ప్రాంతంలో ఉగ్రవాదులు అరిఫ్, ఘజన్‌ఫర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల దగ్గర ఉన్న రెండు సర్వీస్ రివాల్వర్లు, దాడిలో ఉపయోగించిన ఇన్సాస్ రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

10:19 - September 22, 2017

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా నర్సింహారెడ్డి' చిత్ర షూటింగ్ ఎప్పుడు ప్రారంభమౌతుంది ? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ షూటింగ్ ప్రారంభం కాకపోవడం వల్ల అభిమానులు నిరుత్సాహం ఉన్నారంట. తాజాగా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి...టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకరు. రాజకీయాల్లోకి వెళ్లిన అనంతరం చాలాకాలం పాటు ఆయన సినిమాలు చేయలేదు. అడపదడపా స్పెషల్ రోల్స్ లో నటించినా పూర్తిస్థాయి సినిమాలో నటించలేదు. ఇటీవలే ఆయన 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో తదుపరి చిత్రం కోసం 'చిరు' చాలా రోజుల పాటు వెయిట్ చేశాడు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర్య సమరయోధుడు 'ఉయ్యాల వాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో 'చిరంజీవి' నటిస్తుండడంతో భారీ అంచనాలు ఇప్పటి నుండే నెలకొన్నాయి. ఇటీవలే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు..చిత్ర పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. దీపావళి తరువాతే 'సైరా' షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్ టాక్. అక్టోబర్ 20 నుండి చిత్రీకరణ మొదలుకానుందని, నగర శివారులో ఓ భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను రామ్ చరణ్ తేజ నిర్మిస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. అమిత్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, సైనికాధికారుల సంయుక్త ఆధ్వర్యంలో విపత్తులు ఏర్పడినప్పుడు సాయం అందించే విధానంపై ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 6గంటల నుంచి 12గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నెక్లెస్‌ రోటరీ ట్రాఫిక్‌ను పీపుల్స్‌ ప్లాజా వైపునకు వెళ్లేందుకు అనుమతించారు. ఈ వాహనాలు తెలుగుతల్లి, మింట్‌ కాంపౌండ్‌ నుంచి వివి విగ్రహం వైపు వెళ్లాల్సి ఉంటుంది. ట్యాంక్‌బండ్‌ నుంచి బుద్ద భవన్‌ వెళ్లే వాహనాలను కర్బాల మైదాన్‌ వద్ద మళ్లిస్తారు.

గుంటూరు జిల్లాలో 18వేలకు పైగా వీధికుక్కలు

గుంటూరు : జిల్లా వ్యాప్తంగా 18వేలకు పైగా వీధికుక్కలు ఉన్నాయని, ఏటా 70 వేల మంది కుక్కల దాడి గాయపడుతున్నారని సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదిక అందజేశారు. కుక్కల సంతతి తగ్గించేందుకు వాటికి ఆపరేషన్ చేయాలని, జనావాసాల్లోని కుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 స్థానిక సంస్థల పరిధిలో 8 లక్షలకు పైగా కుక్కలున్నట్లు సీఎంకు అధికారులు నివేదించారు.

 

10:11 - September 22, 2017

చిత్తూరు : నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. రేపు స్వామివారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేశారు. 

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అకురార్పణ చేయనున్నారు. సాయం సంధ్యవేళ శ్రీవారి సేనాధిపతి శ్రీవిష్వక్సేనుల వారు ఆలయానికి నైరుతివైపున ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు. భూమి పూజాది కార్యక్రమాల తర్వాత ఆలయం ప్రవేశం చేస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 

ఇక శనివారం సాయంత్రం 5 గంటల 48 నిమిషాల నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఘట్టంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 8 గంటలకు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 9 గంటల నుంచి పెద్దశేష వాహనసేవ ప్రారంభమవుతుంది. దీంతో ఉత్సవాలకు పూర్తిస్థాయిలో శ్రీకారం చుట్టినట్లు అవుతుంది. రెండో రోజు ఉదయం చిన్న శేష వాహనం, సాయంత్రం హంస వాహన సేవ ఉంటుంది. 9 రోజులపాటు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 1న చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగుస్తాయి. 

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేటినుంచి శ్రీవారి ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లులకు ప్రత్యేక దర్శనాలను అక్టోబర్‌ 1 వరకు పూర్తిస్థాయిలో రద్దు చేశారు. ప్రోటోకాల్‌ పరిధిలో ప్రముఖులకు పరిమిత సంఖ్యలో వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు కేటాయిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సిఫార్సుల లేఖలను స్వీకరించరు. 

బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు లక్షలాది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యంగా కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు బ్రహ్మోత్సాలను పురష్కరించుకుని ఆలయాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. 

10:09 - September 22, 2017

రంగారెడ్డి : జిల్లాలోని తాండూరులో ఆత్మహత్యాయత్నం చేసిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త అయూబ్‌ ఖాన్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు.. గత నెల 30న తాండూరులో మంత్రి మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశానికి అయూబ్‌ హాజరయ్యాడు.. ఉద్యమ కారులకు పార్టీలో గుర్తింపు ఇవ్వడంలేదంటూ మనస్తాపం చెందిన అతను... సమావేశంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు.. తీవ్ర గాయాలపాలైన అయూబ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు... చికిత్స పొందుతూ అతను చనిపోయాడు.. అయూబ్‌ మృతితో తాండూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. మంత్రి నివాసం దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:05 - September 22, 2017

చిత్తూరు : తిరుపతి రుయా ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. జూనియర్‌ డాక్టర్‌ వెంకటరమణ ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో.. అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. మూడు రోజుల క్రితం వెంకటరమణపై క్లర్క్‌ కృష్ణకుమారి దాడికి యత్నించారు. దీంతో మనస్థాపం చెందిన వెంకటరమణ ఆత్మహత్యాయత్నం చేశాడు. మరోవైపు రుయా ఆస్పత్రి ఘటనపై కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు.. వెంకటరమణ ఆత్మహత్యాయత్నంపై విచారణకు ఆదేశించారు.. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆస్పత్రి సూపరిండెంట్‌ సిద్ధనాయక్‌కు ఆదేశాలు జారీ చేశారు. జూనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణ కుమారిని సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. సస్పెన్షన్‌తో మనస్తాపం చెందిన కృష్ణకుమారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

కుక్కల దాడి..బాలుడి మృతి.. సీఎం సీరియస్

గుంటూరు: అడవితక్కెళ్ల పాడులో నిన్న వీధిక్కుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ నాలుగేళ్ల బాలుడి మృతి ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.

10:00 - September 22, 2017

టీ.ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోందని వక్తలు అన్నారు. ఉమ్మడి ఏపీ పాలనకు టీసర్కార్ పాలనకు తేడా లేదని తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీఆర్ ఎస్ నాయకులు రాకేష్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కశ్మీర్ సమస్య కు రాయబారిని నియమించండి: పాక్ ప్రధాని

ఢిల్లీ: జమ్మూకశ్మీర్‌తో పాటు భారత్‌తో ఉన్న సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసి మాట్లాడారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక రాయబారిని నియమించాలని ఐక్యరాజ్యసమితిని పాకిస్థాన్ కోరింది. కశ్మీర్‌లో జరుగుతున్న నేరాలు, అల్లర్లపై అంతర్జాతీయ విచారణ చేపట్టాలని పాకిస్థాన్ ప్రధాని యూఎన్‌ను డిమాండ్ చేసింది.

09:54 - September 22, 2017

రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రైతు పంట అమ్మేటప్పుడు ధర తక్యువగా ఉంటుందని... తీసుకునేపటప్పుడు అధిక ధరలు ఉంటాయన్నారు. మార్కెట్లలో దళారీలదే రాజ్యం అయిందన్నారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:50 - September 22, 2017

ప.బెంగాల్ : కోల్‌కతా వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి  ఆస్ట్రేలియా 202 పరుగలకే ఆలౌట్‌ అయ్యింది. ఆసీస్‌ను తొలుత భువనేశ్వర్‌ దెబ్బతీయగా.. తర్వాత కుల్దీప్‌ యాదవ్‌ దెబ్బకొట్టాడు. కుల్దీప్‌ వన్డేల్లో హ్యాట్రిక్‌ సాధించాడు. వరుస బంతుల్లో వేడ్‌, అగర్‌, కమిన్స్‌ అవుట్‌ చేశాడు. భారత్‌ తరపున మూడో హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో స్మిత్‌, స్టోయినిస్‌ ఆఫ్‌ సెంచరీలతో రాణించారు. భారత ఆటగాళ్లలో కోహ్లి 92 పరుగులు చేయగా.. రహానే 56 పరుగులు సాదించాడు. 5 వన్డేల సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యంలోకి వచ్చింది.

 

09:47 - September 22, 2017

కృష్ణా : బెజవాడలోని విలువైన ప్రభుత్వ స్థలాలు  ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. స్వయంగా ప్రభుత్వమే ఈ చర్యకు సిద్ధమైంది.  దాదాపు 49 ఎకరాల స్థలాన్ని పలు కార్పొరేట్‌ సంస్థలకు ఇవ్వాలని తీర్మానం కూడా చేసింది.  ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడే స్థలాలను బడా కంపెనీలకు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించడం విమర్శలకు తావిస్తోంది. 

నవ్యాంధ్ర రాజధానిగా బెజవాడ అయిన తర్వాత అక్కడి స్థలాల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఖాళీ జాగా కనబడితే చాలు కార్పొరేట్‌ శక్తులు దాన్ని కబ్జా చేసేందుకు గద్దల్లా వాలిపోతున్నాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ప్రభుత్వానికి చెందిన ఖాళీస్థలాలను ప్రభుత్వమే  కబ్జా చేసేస్తోంది. వాటిని రక్షించాల్సిన ప్రభుత్వమే కోట్లాది రూపాయల విలువైన స్థలాలను, ఖాళీ ప్రదేశాలను ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులకు ధారాదత్తానికి స్కెచ్‌ వేసింది.  

విజయవాడ బందరు రోడ్డులోని స్వరాజ్య మైదానం స్థలాన్ని గతంలో పీపీపీ పద్ధతిలో చైనా కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడేమో గుణదల విద్యుత్ సౌధ ప్రాంగణంలోని ఖాళీ భూములపై  ప్రభుత్వ కన్నుపడింది. సుమారు 4.80 ఎకరాల స్థలాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టేందుకు  తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే అధికారులు ఇటీవల సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.

200 కోట్ల రూపాయలకుపైగా విలువచేసే  గుణదల విద్యుత్‌ సౌధ ప్రాంగణంలోని స్థలాన్ని 99 ఏళ్లపాటు లీజు పేరుతో కారుచౌకగా కాజేసేందుకు బడాబాబులు స్కెచ్‌ వేశారు. ఇంకేముందు ఇందుకోసం చర్యలు ముమ్మరమ్యాయి. దీన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.  ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.  అతి విలువైన ప్రభుత్వ స్థలాలను టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని సీపీఎం నేత బాబురావు ఫైర్‌ అయ్యారు.

ఒక్క గుణదల విద్యుత్‌ సౌధ ప్రాంగణంలోని స్థలమేకాదు... నగరపాలక సంస్థ కార్యాలయం,  రాజీవ్ గాంధీ పార్కు, పూల మార్కెట్  ప్రాంతాలలోని 26 ఎకరాల భూమిని బడా బాబులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ స్థలాల్లో  కమర్షియల్ కాంప్లెక్సులు, చిల్డ్రన్స్ పార్కులు, గ్రీన్ కారిడార్లు, ఎగ్జిబిషన్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టేందుకు కొన్ని డిజైన్లు రూపొందించారు. దీంతో ప్రభుత్వ భూములను కారుచౌకగా కట్టబెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే వ్యవహరిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా మానుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. లేదంటే ప్రభుత్వంపై ఆందోళనకు సిద్ధమని హెచ్చరిస్తున్నాయి.
 

25ఎర్రచందనం దుంగలు పట్టివేత..

 చిత్తూరు: తిరుపతి నగరానికి సమీపంలోని ఎర్రదారి అటవీప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తరలించడానికి సిద్ధం చేస్తున్న స్మగ్లర్లపై టాస్క్ ఫోర్సు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్మగ్లర్లు పారిపోగా సుమారు టన్ను బరువున్న 25 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వాహనంతో సహా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డీఎస్పీ హరినాథ్‌బాబు, ఆర్‌ఐ మురళి, ఎఫ్‌ఆర్‌వో లక్ష్మీపతి, ఆర్‌ఎస్‌ఐ విజయనర్సింహులు, డీఆర్‌వో శ్రీనివాసరావు, ఎఫ్‌హెచ్‌వో నాగరాజు పాల్గొన్నారు.

 

09:44 - September 22, 2017

విజయనగరం : అవన్నీ మూరుమూలలో ఉన్న గిరిజన తండాలు. అక్కడికి వెళ్లాలంటే రోడ్లు ఉండవు. రాళ్లు, రప్పలతో కూడిన పిల్లల బాటవెంటనే కాలినడకన వెళ్లాలి. ఇక వారికి విద్య, వైద్యం సంగతేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ గ్రామాలకు కేవలం రోడ్లు వేస్తే వారికి అన్ని సౌకర్యాలు అందుతాయి. అదే విషయాన్ని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నో ఏళ్లుగా ఆదివాసీలు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. అయినా వారంత నిరాశపడలేదు. చివరికి వారు ఏంచేశారో తెలుసుకోవాలంటే వాచ్‌ దిస్‌ స్టోరీ...

గిరిజన గ్రామాలంటే అందరికీ అలుసే. ప్రభుత్వం దండిగా నిధులు విడుదల చేస్తుంది. పద్దుల్లో ఖర్చుల జమా కూడా కనిపిస్తుంది. కాని ఆచరణలో పనులే కనిపించవు. అంటే అదంతా కాగితాల మీదలెక్కలేనన్నమాట. అందుకే మూరుమూలనున్న గిరిజన తండాలు నేటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. 70ఏళ్ల స్వతంత్రంలోనూ వారి కష్టాలు ఏమాత్రం తీరలేదు.

ఇది విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతం. కురుపాం మండలంలోని వలసబల్లేరు పంచాయతీ పరిధిలోని ఆగంగూడెం, వెలగమానుగూడేలకు నేటికీ సరైన రోడ్లులేవు. ఆ గ్రామాలకు వెళ్లాలంటే కొండలు, గుట్టలు దాటుకుంటూ వ్యయప్రయాసలకు ఓర్చుకుంటూ వెళ్లాలి.  ఇలా ఏళ్లతరబడి ఆదివాసీలు కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వారికి ప్రాథమిక సౌకర్యాలు కూడా అందడంలేదు. దీంతో తమ గ్రామాలకు రోడ్డు వేయించాలని ఎన్నికల ప్రచారానికి వచ్చే ప్రతి నాయకుడిని అర్థిస్తుంటారు. పొలిటికల్‌ లీడర్లు కూడా చేయిస్తామంటూ హామీలు గుప్పించడం, ఆతర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడం సర్వసాధారణమైంది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అటు ప్రజాప్రతినిధులుగానీ... ఇటు అధికారులుగానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఏళ్లతరబడి పడుతున్న వారి కష్టాలు తొలగిపోలేదు.

ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఇన్నాళ్లూ ఎదురు చూసిన ఆదివాసీలు చివరికి వారే ఏకమయ్యారు. రెండు గ్రామాల ప్రజలు సమావేశమై రోడ్డును తామే వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు అవసరమైన నిధులు సమకూర్చుకున్నారు. ప్రజలంతా కలిసి శ్రమదానం చేసి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.  నాలుగున్నర కిలోమీటర్ల రోడ్డును కొన్ని రోజుల్లోనే పూర్తి చేసి ఏళ్లుగా పడుతున్న కష్టాలకు పుల్‌స్టాప్‌ పెట్టారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం పొందకుండానే తమ గ్రామాలకు ఆదివాసీలు రోడ్డు వేసుకున్నారు.  ఎవరి మీదనో ఆధారపడకుండా స్వయంగా రోడ్డువేసుకున్న ఆదివాసీ ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలిచారు.

09:41 - September 22, 2017

హైదరాబాద్ : మద్యం దుకాణాల టెండర్ల ద్వారా ఈసారి తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. మొత్తం 2,215 షాపులకు గాను ఖజానాకు 411 కోట్ల ఆదాయం సమకూరింది. గతంతో పోలిస్తే ఇది 256 కోట్ల రూపాయలు అదనం. శుక్రవారం మద్యం టెండర్లను తెరిచి, లాటరీ పద్ధతిలో షాపులు కేటాయించనున్నారు. 

మద్యం దుకాణాల టెండర్ల ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. సగటున ఒక్కో పాపుకు 19కి పైగా దరఖాస్తులు రావడంతో ప్రభుత్వానికి 411 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము వచ్చింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఎక్సైజ్‌  విధానంలో భాగంగా మద్యం దుకాణాలు కేటాయించేందుకు పిలిచిన టెండర్లకు వైన్‌షాపు వ్యాపారుల నుంచి మంచి స్పందన వచ్చింది. మొత్తం 2,215 షాపులకు గాను 41,119 దరఖాస్తులు అందాయి. 2015లో 31 వేల దరఖాస్తులు వస్తే, ఈసారి మరో పదివేలకు పైగా ఎక్కువ  దరఖాస్తులు వచ్చాయి. మద్యం టెండర్ల ద్వారా అప్పట్లో 155 కోట్ల రూపాయల ఆదాయం వస్తే... ఈసారి 411 కోట్లు వచ్చింది. గతంతో పోలిస్తే ఈసారి 256 కోట్ల రూపాయల అదనంగా సొమ్ము సమకూరింది. 2015లో పలుసార్లు టెండర్లు పిలించినా 72 వైన్‌ షాపులకు దరఖాస్తులు రాలేదు. అయితే ఈసారి మేడ్చల్‌ జిల్లాలోని ఘట్‌కేసర్‌ పరిసరాల్లో ఒక షాపుకు మాత్రమే ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. ఏపీ సరిహద్దు జిల్లాల్లో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు ఎక్కువ మంది పోటీ పట్డారు. దరఖాస్తుల్లో ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో  ఉండగా, మెదక్‌ జిల్లాల్లో అతి తక్కువగా 37 షాపులకు 301 దరఖాస్తులు మాత్రమే వచ్చాయ. గతంలో టెండర్‌ వేసి వైన్‌ షాపు దక్కకపోతే డిపాజిట్‌ సొమ్మును ప్రభుత్వం  తిరిగి ఇచ్చేది. కానీ ఇప్పుడు ఈ నిబంధన తొలగించడంతో డిపాజిట్‌ సొమ్ము మొత్తం ఖజానాకు చేరింది.  

వచ్చేది ఎన్నికల సీజన్‌ కావడంతో మద్యం షాపులు దక్కించుకునేందుకు ఎక్కువ మంది పోటీ పడ్డారు. వచ్చే ఏడాది పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ ఎన్నికలున్నాయి.  2019లో అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతాయి. దీంతో రాజకీయ నాయకులు తమ అనుచరులతో దరఖాస్తులు చేయించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ల సమక్షంలో టెండర్లు తెరిచి... లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయిస్తారు. 

ఆర్నియా సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులు: 4గురి మృతి

జమ్మూ కశ్మీర్ : ఆర్నియా సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందారు.

మా తమ్ముడికి మంత్రి మహేందర్ రెడ్డి అన్యాయం చేశారు : అయూబ్ ఖాన్ సోదరుడు

వికారాబాద్ : తమ తమ్ముడికి మంత్రి మహేందర్ రెడ్డి అన్యాయం చేశారని అయుబ్ ఖాన్ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. అయుబ్ ఖాన్ మరణించిన విషయం కూడా తనకు చెప్పలేదన్నారు.

నేడు తెలంగాణలో మద్యం షాపుల కేటాయింపు

హైదరాబాద్ : తెలంగాణలో నేడు మద్యం షాపుల కేటాయింపు జరుగనుంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. 2216 మద్యం షాపులకు 41, 119 దరఖాస్తులు వచ్చాయి. 

 

ఉదయం 11 గం.లకు బ్యాంకర్ల సమావేశం

విజయవాడ : నేడు ఏపీ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టీఆర్ ఎస్ కార్యకర్త మృతి

రంగారెడ్డి : ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టీఆర్ ఎస్ కార్యకర్త మృతి చెందారు. గత నెల30న టీఆర్ ఎస్ సమావేశంలో మంత్రి మహేందర్ రెడ్డి ముందు ఆ పార్టీ కార్యకర్త అయూబ్ ఖాన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. 

 

తిరుపతి రుయా ఆస్పత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత

చిత్తూరు : తిరుపతి రుయా ఆస్పత్రిలో ఉద్రిక్తత కొనసాగుతుంది. జానియర్ డాక్టర్ వెంకటరమణ ఆత్మహత్యాయత్నం చేశారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. అత్యవసర విభాగంలో అతనికి చికిత్స అందిస్తున్నారు. మూడు రోజుల క్రితం వెంకటరమణపై జూనియర్ అసిస్టెంట్ కృష్ణకుమారి దాడికి పాల్పడింది. మనస్తాపంతో వెంకటరమణ ఆత్మహత్యాయత్నం చేశారు. 

 

07:04 - September 22, 2017

గుంటూరు : శివారుప్రాంతమైన అడవితక్కెళ్లపాడులో విషాదం నెలకొంది. ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిపై స్వైర విహారం చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు ప్రేమ్‌కుమార్‌ను ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయాడు. 

మనిషన్న వాడు రోజురోజుకు మాయమవుతున్నాడు. మనుషుల్లోని మానవత్వం కనుమరుగవుతోంది.  తోటివారికి ఆపద వచ్చినా  పట్టించుకునేవారే కరువయ్యారు. ఇందుకు గుంటూరులో జరిగిన బాలుడిపై కుక్కల దాడి ఘటనే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.

చూడండి. బాలుడు ఎలా గింజుకుంటున్నాడో. కుక్కల దాడిలో గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని ఆస్పత్రికి తరలించేవారే కరువయ్యారు. అందరు చుట్టూ చేరి దాన్నో వింతలా చూస్తున్నారనే తప్ప బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలనే ధ్యాస ఎవరికీ లేకుండా పోయింది. 

గుంటూరు శివారు ప్రాంతం అడవి తక్కెళ్లపాడులోని రాజీవ్‌ గృహసముదాయానికి చెందిన మేరి కుమారుడు ప్రేమ్‌కుమార్‌ దసరా సెలవులు కావడంతో ఇంటివద్దే ఉన్నాడు. బయట ఆడుకుంటున్న ప్రేమ్‌పై వీధికుక్కలు విరుచుకుపడ్డాయి. ఉదరం, మెడ, తొడల భాగాల్లో కరిచాయి. దీంతో బాలుడు లేవలేని స్థితిలో రక్తపుమడుగులో పడిపోయాడు. గాయాలకు తాళలేక గింజుకుంటున్న బాలుడిని గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. ఏం జరిగిందంటూ అందరూ ఆరా తీశారేతప్ప... సాహసించి ఒక్కరూ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లలేదు.  ఆ తర్వాత చాలా సేపటికి తల్లిదండ్రులు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. బాలుడిని సరైన సమయంలో తీసుకొస్తే బతికేవాడని వైద్యులు చెప్పారని ప్రేమ్‌ తల్లి బోరున విలపించింది. ఈ ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసింది.

గుంటూరు నగర శివారులో గత కొన్ని నెలలుగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల దాడిలో ఎంతో మందికి గాయాలు అయ్యాయి. అధికారులతో మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్తున్నారు. పైగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పట్టుకొచ్చిన కుక్కలనూ అధికారులు ఇక్కడే వదిలి వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా అధికారుల నిర్లక్ష్యం, మనుషుల్లో మంటగలుస్తోన్న మానవత్వం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. బాలుడి బంగారు భవిష్యత్‌ను చిదిమేశాయి.

07:01 - September 22, 2017

ఖమ్మం : కేసీఆర్‌ ప్రభుత్వం గిరిజన భూములను బలవంతంగా లాక్కుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా.. ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ రైతు బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీక్వెల్ ఫంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ రైతుబాట పేరుతో ఒకరోజు భూ రికార్డులపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా, కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆలిండియా అధ్యక్షులు  కొప్పుల రాజు, తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ సభ్యురాలు రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు,కార్యకర్తలు హాజరయ్యారు.

దళితులకు, గిరిజనులకు భూములపై చట్టపరమైన హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి. ఈ మూడేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం గిరిజనుల పట్టాలు లాక్కుందని విమర్శించారు. రైతులకోసం కాంగ్రెస్ అనేక చట్టాలు తీసుకొచ్చి గర్వంగా బతికేలా చేస్తే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని కాలరాస్తోందని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

రైతుల చేతులకు  బేడీలు వేసిన ఘనత  టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు ఏఐసీసీ సభ్యురాలు రేణుకా చౌదరి.. ఇదేనా బంగారు తెలంగాణ అని ఆమె మండిపడ్డారు. 

రైతుల కోసమే పుట్టిన ప్రభుత్వంగా చెప్పుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే కళ్లుండి చూడలేని కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించేందుకు అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

గ్రామ స్ధాయిలో భూ సమస్యలు, రైతుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు కార్యకర్తలకు సూచించారు. గ్రామ గ్రామాన పర్యటించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

06:58 - September 22, 2017

హైదరాబాద్ : వైశ్యులపై అనుచిత వ్యాఖ్యలతో పుస్తకం రాసిన కంచె ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. వైశ్యులను కులం పేరుతో దూషించడం దుర్మార్గమన్నారు.

06:52 - September 22, 2017

గుంటూరు : అక్టోబర్‌ నుంచి పూర్తిస్థాయిలో సంక్షేమబాట పట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో చిన్నపాటి అలసత్వాన్ని కూడా సహించబోననన్నారు. ప్రతి నెలా ప్రజల సంతృప్తిపైన సర్వేలు నిర్వహించి నివేదికలు తెప్పించుకుంటానన్నారు. సంక్షేమ బాటలో భాగంగా అక్టోబర్‌ 2న మూడో విడత రుణమాఫీ కింద నిధులు బ్యాంకుల్లో జమ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. 

రాష్ట్రంలో విద్య, వైద్య, ఆరోగ్య రంగాలకు నిధులు కేటాయిస్తున్నా ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అహాలు వీడి సమన్వయంతో పని చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాయకత్వం సరిగ్గా ఉంటే.. ఇబ్బందులు ఉండవని ఆయా శాఖల మంత్రులను విజయవాడ ఏ-కన్వెన్షన్‌ సెంటర్‌లో రెండోరోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో పరోక్షంగా హెచ్చరించారు. 

వైద్య, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, పట్టణాభివృద్ది, పురపాలక, వృత్తినైపుణ్యం తదితర శాఖలపై సీఎం అధ్యక్షతన కీలకచర్చ జరిగింది. విద్యాశాఖ అధికారుల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయో మెట్రిక్‌ విధానం అమలులో తాత్సారంపై మండిపడ్డారు. మంత్రి గంటా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా... వ్యవస్థ సరిగ్గా పని చేయడం లేదని... ఎన్నిసార్లు చెప్పిన ఆ శాఖ పట్టించుకోకపోవడం సరికాదన్నారు. కలెక్టర్లు తమ ఇగోలు పక్కనపెట్టి ప్రజా సంక్షేమం కోసం పని చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 

ఇక రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ 2న రెండు లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఆయా జిల్లాల ప్రతినిధులు హాజరుకావాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షించిన సీఎం... మెరుగైన వైద్యం అందించే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఇక ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు సరికొత్త టోల్‌ఫ్రీ నెంబర్‌ 181ను చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో లాంఛనంగా ప్రారంభించారు. గృహహింస, ఈవ్‌టీజింగ్‌లాంటి ఫిర్యాదులు ఉంటే ఈ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే బాధితులను ఆదుకుంటారని చంద్రబాబు తెలిపారు. 

ఇక రాష్ట్రంలో డ్రగ్స్‌ వినియోగంపై పోలీస్‌ ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. గంజాయి తరలింపుపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని విశాఖ రూరల్‌ ఎస్పీని చంద్రబాబు ప్రశ్నించగా.. ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు వివరించారు. గంజాయి సాగు నివారణకు స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి గంటా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. గంజాయి విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహించాలన్నారు. అదేవిధంగా బెట్టింగ్‌, కోడిపందాలపై కూడా ఉక్కుపాదం మోపాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 

ఇక నగరాల ఆర్థిక అభ్యున్నతి కోసం కొత్త శాఖను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు చంద్రబాబు. త్వరలోనే అన్ని ప్రభుత్వ శాఖల సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మొత్తానికి రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అనే దానిపై కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 

నేడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

చిత్తూరు : నేడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. రాత్రి 7 గంటలకు మాడవీధుల్లో విష్వక్సేనుడు ఊరేగనున్నారు. 

నేడు కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కమిటీ భేటీ

హైదరాబాద్ : నేడు కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కమిటీ భేటీ జరుగనుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. 

 

నేడు బాలత్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ దర్శనం

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నేడు బాలత్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. 
 

నేడు చింతలపూడిలో టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం

ప.గో : చింతలపూడిలో ఎమ్మెల్యే పీతల సుజాత ఆధ్వర్యంలో టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 

 

నేడు చింతలపూడిలో టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం

ప.గో : చింతలపూడిలో ఎమ్మెల్యే పీతల సుజాత ఆధ్వర్యంలో టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 

 

Don't Miss