Activities calendar

23 September 2017

21:46 - September 23, 2017

ఒకటి కాదు రెండు కాదు ఏడేళ్లుగా వణుకుతున్నారు. వారిలో భయనకి కారణం ఒక్కడే ఆ ఒక్కడి పేరు వింటేనే నిద్రకూడా పట్టడం లేదు ఆ జ్ఞాకలు వారిని వేధిస్తున్నాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రాణ భయంతో బిక్కచంచ్చిపోతున్నారు. ఎప్పుడు ఏ వైపు మృత్యువు రూపంలో వచ్చి ప్రాణాలు తీస్తుడో అని భయపడుతున్నారు. ఏడేళ్లు క్షణం క్షణం భయంతో గడిపిన ప్రజలు ఇప్పుడు ప్రశాతంగా ఉన్నారు. ఇది కథ కాదు ఏ రియల్ స్టోరీ పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

21:32 - September 23, 2017
21:30 - September 23, 2017

జైపూర్ : డెరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌... ఆసారాం బాపుల సరసన ఇపుడు రాజస్థాన్‌కు చెందిన ఫలహారీ బాబా కూడా చేరిపోయాడు. ఈ బాబాలు సామాన్యులు కాదు...ఓవైపు భక్తి ప్రవచనాలు వల్లిస్తూనే మరోవైపు మహిళలను లోబరచుకుని లైంగిక దాడికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతిపై అత్యాచారం కేసులో అల్వర్‌కు చెందిన ఫలహారీ బాబాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అసలు పేరు కౌశలేంద్ర్‌ ప్రపన్నాచార్య ఫలాహారి

77 ఏళ్ల ఫలహారీ బాబా అసలు పేరు కౌశలేంద్ర్‌ ప్రపన్నాచార్య ఫలాహారి. ఈ బాబాకు సామాన్యులే కాదు...బడా నేతలు కూడా భక్తులే...ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపికి చెందిన పెద్ద నేతలు ఫలహారీ బాబా భక్తులు కావడం గమనార్హం. అలాంటి బాబా అత్యాచారం కేసులో అడ్డంగా దొరికిపోయాడు. బాబా తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఛత్తీస్‌గఢ్‌ బిలాస్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును బిలాస్‌పూర్‌ నుంచి రాజస్థాన్‌లోని అల్వర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.

బాధితురాలు న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి
బాధితురాలు న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి ఇంటర్న్‌షిప్‌ చేస్తోంది. ఈ యువతి తల్లిదండ్రులు ఫలహారీ బాబాకు శిష్యులు. ఈ నేపథ్యంలో ఆగస్టు 7న బాబా ఆశ్రమానికి వెళ్లినట్లు బిలాస్‌పూర్‌ డిఎస్‌పి అర్చనా సింగ్‌ తెలిపారు. బాబాను కలవాలని చెప్పగా కొద్దిసేపు వెయిట్‌ చేయాలని ఆయన అనుచరులు చెప్పారు. అనంతరం ఆశ్రమంలో ఈ యువతిపై ఫలహారీ బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెప్పొద్దంటూ యువతిని బెదిరించాడు. ఈ విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించడంతో ఫలహారీ బాబాపై కేసు నమోదైంది. ఈ ఘటన అనంతరం బాబాతో తన ప్రాణానికి ముప్పు ఉందని బాధితురాలు భయపడుతోంది.

21:18 - September 23, 2017

కృష్ణా : పదవి పిచ్చితో .. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్‌ చరిత్రలో రైతు ద్రోహిగా మిగిలిపోతారని విమర్శించారు. ఎప్పటికీ జగన్ సీఎం కాలేడని.. దేవినేని జోస్యం చెప్పారు.

21:16 - September 23, 2017

హైదరాబాద్ : మిషన్ భగీరథ తొలి దశ పనులు డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. ఇవాళ క్యాంప్ కార్యాలయంలో ఆయన భగీరథ పనులపై రివ్యూ నిర్వహించారు. 2018లో రెండో దశను పూర్తి చేయాలని ఆయన సూచించారు. 24వేల 225 ఆవాస ప్రాంతాలకు మంచినీటిని అందించే పథకం దేశంలో మరెక్కడా లేదని కేసీఆర్ అన్నారు. గిరిజన తండాలు, దళిత వాడలు, గోండు గూడేలకు కూడా.. నూటికి నూరు శాతం మంచినీరు అందించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. 

హీరో శ్రీకాంత్ ఇంట్లో దుండగుడు చోరబాటు

హైదరాబాద్ : హీరో శ్రీకాంత్ ఇంట్లో దుండగుడు చోరబడి రెండు కార్లు ధ్వంసం చేశాడు. దీని పై శ్రీకాంత్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

20:34 - September 23, 2017

శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

చిత్తూరు : తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారి దర్శించుకున్నారు. వేదపండితులు సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. సీఎం దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

పాలమూరు రంగారెడ్డికి పర్యావరణ అనుమతి

హైదరాబాద్ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మొదటి దశ పథకానికి పర్యావరణ అనుమతి లభించింది. వారంలోగా విధివిధానాలు ఖరారు చేసి 6 నెలల్లో పర్యావరణ ప్రభావ అంచనాల సమగ్ర నివేదిక సర్పించాలని కేంద్రఆ ఆదేశం.

20:24 - September 23, 2017
20:22 - September 23, 2017

ఇండోర్ : 5 వన్డేల సిరీస్‌లో వరల్డ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాపై విరాట్‌ ఆర్మీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. టీమిండియా డామినేషన్‌తో హోరాహోరీగా జరుగుతుందనుకున్న వన్డే సిరీస్‌ కాస్తా... ఏకపక్షంగా సాగుతోంది. ఇండియన్‌ టీమ్‌ ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో చెలరేగలేకపోయినా....బలహీనమైన జట్టుతో ఆస్ట్రేలియా జట్టు ఢీలా పడింది. బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోర్లు సాధించలేకపోతున్నా....బౌలింగ్‌లో మాత్రం భారత్‌ అంచనాలకు మించి రాణిస్తోంది. స్వింగ్‌ సెన్సేషన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఆరంభ ఓవర్లలోనే కంగారూ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తూ భారత్‌కు శుభారంభాన్నిస్తున్నాడు. ఇక లెగ్‌ స్పిన్‌ గన్స్‌ యజ్వేంద్ర చహాల్‌, కుల్దీప్‌ యాదవ్‌లను ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ పడుతోన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.రెండు వన్డేల్లో చహాల్‌, కుల్దీప్‌ కలిసి 10 వికెట్లు పడగొట్టి భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.చెన్నై వన్డేలో 2 వికెట్లు తీసిన కుల్దీప్‌ యాదవ్‌ ....కోల్‌కతా వన్డేలో పెద్ద సంచలనమే సృష్టించాడు.వన్డేల్లో హ్యాట్రిక్ వికెట్స్‌ తీసిన భారత బౌలర్‌గా కుల్దీప్‌ యాదవ్‌ చరిత్ర సృష్టించాడు. మణికట్టుతో మ్యాజిక్‌ చేసి ఏకంగా హ్యాట్రిక్‌ వికెట్స్ తీసి అందరినీ ఆశ్చర్యపరచాడు. రెండు వన్డేల్లో వరల్డ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను ఓడించడంతో టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. స్పిన్‌ మ్యాజిక్‌తోనే 2 మ్యాచ్‌లు నెగ్గిన భారత్‌....బ్యాటింగ్‌లోనూ చెలరేగితే 5 వన్డేల సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయం.

రేపే మూడో వన్డే
ఇండోర్‌లో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డేకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో 2 సార్లు చాంపియన్‌ ఇండియా....5 సార్లు వన్డే చాంపియన్‌ ఆస్ట్రేలియా మధ్య కీలక వన్డేకు హోల్కర్ స్టేడియంలో రంగం సిద్ధమైంది. తొలి రెండు వన్డేల్లో తిరుగులేని టీమిండియా....మూడో వన్డే సైతం నెగ్గి సిరీస్‌ దక్కించుకోవాలని తహతహలాడుతోంది. మూడో వన్డేలో అయినా భారత జట్టు స్పీడ్‌కు బ్రేక్‌ వేయాలని ఆస్ట్రేలియా జట్టు పట్టుదలతో ఉంది. రహానే, రోహిత్‌ శర్మ, విరాట్‌ కొహ్లీ,మనీష్‌ పాండే, ధోనీ, హార్దిక్‌ పాండ్య,కేదార్‌ జాదవ్‌ వంటి బ్యాట్స్‌మెన్‌తో పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన భారత జట్టు రెండు వన్డేల్లోనూ స్థాయికి తగ్గట్టుగా రాణించలేదు. రోహిత్‌ శర్మ, మనీష్‌ పాండే వరుసగా విఫలమవ్వుతుండటంతో భారత భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతోంది. కోల్‌కతా వన్డేతో విరాట్‌ కొహ్లీ,రహానే ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనడంలో అనుమానమే లేదు. జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌లతో భారత్‌ పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ పదునుగా ఉంది. ఇక యంగ్‌ స్పిన్‌ గన్స్‌ కుల్దీప్‌ యాదవ్‌,యజ్వేంద్రచహాల్‌ ఎంతలా మ్యాజిక్‌ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

డైలమాలో ఆస్ట్రేలియా జట్టు
మరోవైపు స్టీవ్‌ స్మిత్‌ సారధ్యంలోని ఆస్ట్రేలియా జట్టు డైలమాలో ఉంది.బౌలర్లు సమిష్టిగా రాణిస్తున్నా...బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమవ్వడంతో కంగారూ టీమ్‌ తేలిపోతోంది. ఇండోర్‌ వన్డేలో అయినా కంగారూ బ్యాట్స్‌మెన్‌...భారత స్పిన్నర్లకు చెక్ పెట్టలేకపోతే ఆస్ట్రేలియా జట్టు సిరీస్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. రెండు వన్డేల్లోనూ స్పిన్‌ మ్యాజిక్‌తోనే నెగ్గిన భారత్‌ .... బ్యాటింగ్‌లోనూ రాణిస్తే మూడో వన్డేతోనే 5 మ్యాచ్‌ల సిరీస్‌ నెగ్గడం ఖాయం. వరుస విజయాలతో జోరు మీదున్న విరాట్‌ ఆర్మీకే ఇండోర్‌వన్డేలో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మరి మూడో వన్డేలో అయినా ఆస్ట్రేలియా జట్టు ఇండియాకు కనీస పోటీ అయినా ఇస్తుందో లేదో చూడాలి. 

20:19 - September 23, 2017

హర్యానా : గురుగ్రామ్‌లో ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఏడేళ్ల బాలుడు ప్రద్యుమ్న్‌ ఠాకూర్‌ హత్యకు సంబంధించి సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. సాక్ష్యాల సేకరణకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందం స్కూలును సందర్శించినట్లు సిబిఐ వర్గాలు వెల్లడించాయి. సీబీఐ బృందానికి దర్యాప్తులో సహకరిస్తున్నట్టు స్థానిక పోలీసులు చెప్పారు. మరోవైపు బస్‌ కండక్టర్‌ అశోక్‌ కుమార్‌, మరో ఇద్దరిని ఒకరోజు రిమాండ్‌లోకి తీసుకున్నారు. హత్య, అక్రమంగా ఆయుధాలు కలిగిఉండటంతో పాటు పోక్సో చట్టం, జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ కింద సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసింది. ప్రద్యుమ్న్‌ మృతిపై ఈనెల 15న హర్యానా ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

20:18 - September 23, 2017

నోయిడా : నిర్భయ చట్టం వచ్చినా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్‌లో ఓ యువతిపై గ్యాంగ్‌రేప్‌ జరిగింది. నోయిడా సెక్టార్‌-37 వద్ద కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు యువతిని కిడ్నాప్‌ చేసి నడుస్తున్న కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌ మందిర్‌ వద్ద యువతిని వదిలేసి ఆ దుర్మార్గులు పారిపోయారు. బిపిఓలో పనిచేస్తున్న బాధితురాలు నోయిడా సెక్టార్‌-36 లో నివాసముంటోంది. సాయంత్రం 7 గంటల సమయంలో గోల్ఫ్‌ కోర్స్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో క్యాబ్‌ కోసం వెయిట్‌ చేస్తోంది. అదే సమయంలో కారులో వచ్చిన ఇద్దరు యువకులు ఈ మార్గం ఎటు వెళ్తుందని మాటల్లో మభ్యపెట్టి ఆ యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని పారిపోయారని పోలీసులు చెప్పారు. యమునా ఎక్స్‌ప్రెస్‌ వే వైపు వెళ్తూ కారులోనే లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొట్టారు. బాధితురాలు సెక్టార్‌-39 పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

20:16 - September 23, 2017

పంజాబ్ : పంజాబ్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టు కేజె సింగ్‌, ఆయన తల్లి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. 60 ఏళ్ల కెజె సింగ్‌, ఆయన తల్లి 92 ఏళ్ల గురుచరణ్‌ కౌర్‌ మొహాలీలోని ఆయన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు అధికారులు కేజె సింగ్‌ నివాసానికి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. ఆయన మెడపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో కెజె సింగ్‌ హత‍్యకు గురై ఉంటారనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కెజె సింగ్‌ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు న్యూస్‌ ఎడిటర్‌గా, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ది ట్రిబ్యూన్‌ లాంటి పత్రికల్లో ఉన్నత స్థానాల్లో పనిచేశారు. 

20:15 - September 23, 2017

నిజామాబాద్ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు, బాల్కొండ, మోర్తాడ్‌, భీంగల్‌ మండలాల్లో పెత్తందార్ల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. తాము చెప్పిందే వేదంగా అనుసరించాలని దళితులకు హుకుం జారీ చేస్తున్నారు. ఇలా వారి ఆదేశాలు ధిక్కరించినందుకు భీంగల్‌ మండలం 110 దళిత కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ విధించడంతో దళితులు నానా ఇబ్బందులు పడ్డారు. దీనిపై సీపీఎం, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఈ మేరకు గ్రామంలో సీపీఎం నాయకులు గ్రామంలో పర్యటించారు.

గత ఏడాది కూలీ డబ్బులు పెంచాలని
బెజ్జొర గ్రామంలో దళితులు మొదటి నుంచి డప్పులు కొట్టి కూలీ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గత ఏడాది కూలీ డబ్బులు పెంచాలని దళితులు గ్రామాభివృద్ధి కమిటీలో విన్నవించారు. ఎన్నిసార్లు చెప్పినా పెద్దలు పట్టించుకోక పోవడంతో.. కూలీ డబ్బులు పెంచాల్సిందేనని మరో సమావేశంలో పట్టుబట్టారు. దీనిపై కోపగించుకున్న పెత్తందారులు గ్రామంలో దళితులు డప్పు కొట్టరాదని తీర్మానించారు. ఈ నేపథ్యంలో ఇటీవల గ్రామ మాజీ సర్పంచ్‌ పోసాని మృతి చెందారు. ఆమె దహన సంస్కారాల సందర్భంగా డప్పులు కొట్టారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు డప్పుకొట్టినందుకు 5వేల రూపాయల జరిమానా చెల్లించాలని హుకుం జారీ చేశారు. అంతేకాదు కృష్ణాష్టమి పండుగ సందర్భంలోనూ దళితులపై పెత్తందారులు వివక్ష ప్రదర్శించారు. దళితులు ఉట్లు కొట్టవద్దంటూ అడ్డుకున్నారు. మరో సందర్భంలో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసుకున్నందుకు కూడా పెత్తందారులు పలు ఆంక్షలు పెట్టారు. రాజరాజేశ్వర ఆలయంలోకి దళితులకు ప్రవేశంలేదంటూ నిషేదం విధించారు. ఈ నేపథ్యంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీని దళితులు కోరారు. ఈ విన్నపాన్ని కూడా పెత్తందార్లు ఒప్పుకోలేదు. పైగా గత 15 రోజుల నుంచి గ్రామంలో ఎవరూ తమతో మాట్లాడకుండా ఆంక్షలు విధించారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్యాయం ఏంటని ప్రశ్నించారు
ఇంత అన్యాయం ఏంటని ప్రశ్నించారు దళితులు. దీంతో మరింత ఊగిపోయారు పెత్తందారులు. తమమాటే ధిక్కరిస్తారా అంటూ 25వేల జరిమానా చెల్లించాలని హుకుం జారీ చేశారు. అంతేకాదు ఇక నుంచి గ్రామంలో చావులకు, పెళ్లిళ్లకు డప్పులు కొడితే 50వేల రూపాయల ఫైన్‌ కట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి ఒప్పుకోని దళితుకుటుంబాలన్నీ కదిలాయి. ఆర్మూరు ఆర్డీవో ఆఫీసు ముందు నిరసనకు దిగాయి. ఘటనపై ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామానికి వెళ్లి.. విచారణ నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలు, దళితులతో అధికారులు చర్చించారు. గ్రామం నుంచి దళితులను బహిష్కరించి... వారి పట్ల ఎటువంటి వివక్షతను చూపినా.. కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. దీంతో అగ్రకుల పెద్దలు దారికొచ్చారు. ఇకపై సామరస్యంగా మెలగుతామని వీడీసీ సభ్యులు హామీ ఇచ్చారు. 

20:13 - September 23, 2017

యాదాద్రి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద మరోసారి రైతులు ఆందోళనకు దిగారు. అర్హులకు నష్టపరిహారం చెల్లించకుండా కొంతమంది అధికార పార్టీ నేతల పేర్లను జాబితాలో చేర్చారని విమర్శిస్తూ.. రైతులు దామరచర్ల మండలం వీర్లపాలెంలోని పవర్ ప్లాంట్ పైలాన్ వద్ద ధర్నా చేపట్టారు. నష్టపరిహారం చెల్లించేందుకు మొదట విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు ఉన్నాయని.. కానీ రెండో జాబితాలో తమ పేర్లకు బదులు... వేరే వారి పేర్లు వచ్చాయని అర్హులైన రైతులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అక్కడికి చేరుకొని రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. అర్హులైన రైతులందరికి పరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని.. లేదంటే ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామని హెచ్చరించారు.

20:13 - September 23, 2017

 

తూర్పుగోదావరి : గంజాయి సాగు నిరోధించేందుకు 500 మందితో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ తెలిపారు. కల్లు గీత నూతన విధానంపై ప్రత్యేక మార్పులు తెస్తామని అన్నారు. కల్లు గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో 13 జిల్లాల సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రజల అభ్యంతరాల మేరకు ఇప్పటి వరకు 600 షాపులను మార్పించామని మంత్రి జవహర్ అన్నారు.

తిరుమల చేరుకున్న చంద్రబాబు

చిత్తూరు : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుమల చేరుకున్నారు. ఆయనకు టీటీడీ ఈవో,జేఈవో ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో ప్రభుత్వం తరుపున శ్రీవారికి సీఎం దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

 

 

పరకాలలో ఉద్రిక్తత

వరంగల్ : జిల్లా పరకాల కంచె ఐలయ్యను ఆర్యవైశ్యులు అడ్డుకున్నారు. ఆర్యవైశ్యల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు ఐలయ్య ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఆర్యవైశ్యుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరకాల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

19:05 - September 23, 2017

వరంగల్ : జిల్లా పరకాల కంచె ఐలయ్యను ఆర్యవైశ్యులు అడ్డుకున్నారు. ఆర్యవైశ్యల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు ఐలయ్య ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఆర్యవైశ్యుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరకాల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

18:55 - September 23, 2017
18:54 - September 23, 2017

విశాఖ : నగరంలోని బిర్లా జంక్షన్ సమీపంలో యమహా స్కూటర్‌ బొటిక్ ప్రారంభమైంది. యమహా మోటార్‌ ఇండియా సేల్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మసాకీ అసానోతో పాటు.. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాయ్‌ కురియన్ బొటిక్‌ను ప్రారంభించారు. నూతన ఆవిష్కరణలు చేయిస్తున్నామని మసాకీ చెప్పారు. ఇది ప్రపంచంలోనే రెండవది. యమహా షోరూమ్‌లో మిస్‌ సుప్రా నేషనల్ 2014 ఆశాభట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్కూటర్ వినియోగం పెరుగుతుండటంతో స్కూటర్‌ బొటిక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

18:53 - September 23, 2017

కర్నూలు : కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న జీఎస్టీ విధానం వల్ల ప్రజలపై పెనుభారం మోపుతున్నారని మాజీ ఎమ్మెల్సీ వి.శర్మ ఆరోపించారు. కర్నూల్‌ నగరంలోని లలితకళా క్షేత్రంలో జీఎస్టీ లాభ నష్టాలపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే దేశంలో పేదరికం పెరిగిందని ఆయన ఆరోపించారు.

18:52 - September 23, 2017

అనంతపురం : జిల్లా పెనుకొండ మండలంలోని తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. లంచం తీసుకుంటున్న వీఆర్వోను పట్టుకున్నారు. కొత్త పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్న గుట్టూరు గ్రామానికి చెందిన ఓ రైతు నుంచి వీఆర్వో రంగనాథ్‌ ఎనిమిది వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు చేసి వీఆర్‌వోను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

18:50 - September 23, 2017

గుంటూరు : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పని రాక్షసుడు. అధికారుల పాలిట చండ శాసనుడు అని టీడీపీ నేతలు చెప్పుకునేవారు. చంద్రబాబు తాను పరిగెత్తడంతో పాటు అధికారులను పరుగులు పెట్టిస్తారు. 30 ఏళ్ల వయస్సువారు కూడా చంద్రబాబుకి అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనకు అలసట రాదా? అని అశ్చర్యపోతుంటారు. నిజమే.. ఏపీ సీఎం చంద్రబాబుకు అంత ఎనర్జీ ఎక్కడ నుంచి వస్తుందో చాలా మందికి తెలియదు. అందుకే ఆయన తన ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో స్వయంగా మీడియాతో చెప్పారు.

గతాన్ని ప్రస్తుతం వరకు విజువలైజేషన్
ఉదయం లేవగానే తాను చేసే మొదటి పని.. గతాన్ని ప్రస్తుతం వరకు విజువలైజేషన్ చేసుకోవడమేనని చంద్రబాబు చెప్పారు. 30 నుంచి 40 నిమిషాలు వ్యాయామం చేస్తానని తెలిపారు. 25 నుండి 30 నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తానన్నారు. ప్రతీ రోజు కనీసం ఐదున్నర గంటల నుంచి 6 గంటలు నిద్రపోతానన్నారు. రోజుకి 18 గంటల పాటు పని చేస్తారని, అంత ఎనర్జీ ఎలా వస్తుందంటూ చాలా మంది తనను అడుగుతారని.. మనం చేసే పనిని ఇష్టంగా చేస్తే.. ఎనర్జీ అదే వస్తుందని చంద్రబాబు తెలిపారు. ఇక ఆహారం విషయంలో కొందరు తినడానికే బతుకుతున్నారని.. తాను మాత్రం బతకడానికి తింటానన్నారు. ప్రతీ రోజు ఉదయం ఇడ్లీ లేదంటే ఓట్స్‌ తర్వాత ఏదైనా ఫ్రూట్ తింటానన్నారు. మధ్యాహ్నం రాగి, సజ్జ సంకటి, పెరుగు, సాయంత్రం డ్రై ఫ్రూట్స్‌ తీసుకుంటానని చెప్పారు. గతంలో రాత్రి 11 గంటల వరకు ఏమీ తినేవాడిని కాదని, అయితే ఈ మధ్య రాత్రి 7 గంటలలోపే సూప్‌తో పాటు గుడ్డును ఆహారంగా తీసుకుంటున్నానన్నారు. మొత్తానికి చంద్రబాబు తన దైనందిన జీవిత విశేషాలు, ఆహారపు ఆలవాట్లు ఇలా అందరితో పంచుకున్నారు. ఈ అలవాట్లను చాలా మంది ఫాలో అవుతారని ఛలోక్తులు వినబడుతున్నాయి. 

18:49 - September 23, 2017

గుంటూరు : టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీలను చంద్రబాబు ప్రకటించారు. రెండు మార్పులు మినహా ఈసారి కమిటీల్లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. 17 మంది సభ్యులు పొలిట్ బ్యూరోలో కొనసాగనున్నారు. జాతీయ కమిటీలో ఐదుగురు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, ఒక ట్రెజరర్‌ను ఏర్పాటు చేశారు. పొలిట్ బ్యూరోలోకి తెలంగాణ నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి, సీతక్కలకు చోటు కల్పించారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ కొనసాగనున్నారు. 114 మందితో తెలంగాణ టీడీపీ కమిటీ ఏర్పాటు చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావును కొనసాగనున్నారు. 104 మంది సభ్యులతో ఏపీ టీడీపీ కమిటీ ఏర్పాటు చేశారు. త్వరలో టీడీపీ అనుబంధ సంస్థలను ప్రకటిస్తామన్న చంద్రబాబు.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అందరూ పనిచేయాలని సూచించారు. 

18:33 - September 23, 2017
18:32 - September 23, 2017

పశ్చిమగోదావరి : జిల్లా చింతల్ పూడి మండలం ఎర్రగుంటపల్లిలో దారుణం జరిగింది. కట్నం డబ్బులు రూ.7.60లక్షలతో వరుడు రాజేష్ పరారైయ్యాడు. ఈ రోజు జరగాల్సిన ఉన్న పెళ్లి కార్యక్రమం వరుడి పరారుతో అగిపోయింది. వరుడి రాజేష్ ఇంటి ముందు వధువు తరుపు బంధువులు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

18:28 - September 23, 2017

కృష్ణా : జిల్లా నందిగామ మణప్పురం ఫైనాన్స్ కార్యాలయంలో గోల్ మాల్ జరిగింది. తాకట్టు పెట్టిన బంగారు నగలను మాయం చేసిని కార్యాలయ సిబ్బంది. పాత మేనేజన్ అవకతవకలకు పాల్పడ్డారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. నగలు ఇవ్వకుండా సాగకులు చెప్పిన సిబ్బందిపై ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిని కార్యాలయంలో ఖాతాదారులు నిర్భంధించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

18:27 - September 23, 2017

వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా.. పరిధిలోని భూపాలపల్లి జయశంకర్ జిల్లా, మహబూబాబాద్, వరంగల్‌ అర్బన్‌, వరంగల్ రూరల్‌, జనగాం జిల్లాల పరిధిలో వివిధ రంగాలలో.. విశిష్ట సేవలందించిన వారికి లయన్స్‌ క్లబ్ అవార్డులను అందజేసింది. హన్మకొండలోని నయీంనగర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివిధ సామాజికాంశాలపై ఉత్తమ కథనాలను రాసిన 10టీవీ వరంగల్ సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ కెంచ కుమారస్వామి లయన్స్‌ క్లబ్ అవార్డు ప్రకటించింది. మీడియా గొంతు లేని వారి గొంతుక కావాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా చురుకైన పాత్ర పోషించాలని మాజీ వీసీ గోపాల్ రెడ్డి అన్నారు. 

18:25 - September 23, 2017

హైదరాబాద్ : అరోరా పీజీ కాలేజ్‌లోని.. ఎంబీఏ, ఎంసీఏ విభాగాలకు ర్యాంకుల పంట పండింది. యూనివర్సిటీ మొదటి, రెండు ర్యాంకులతో కలిపి 12 ర్యాంకులను కైవసం చేసుకుంది. ఎంబీఏలో ఒకటి, నాలుగు, పదిహేను ర్యాంకులను.. ఎంసీఏలో రెండు, ఆరు, పదిహేను, పదిహేడు, పంతొమ్మిది ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా రామాంతపూర్ అరోరా పీజీ కాలేజీలో విద్యాసంస్థల చైర్మన్ రమేశ్‌బాబు విద్యార్థులను సన్మానించారు. క్రమశిక్షణ, అధ్యాపకుల కృషి వల్లే తాము ఈ ర్యాంకులు సాధించగలిగామని ఆయన అన్నారు.

18:24 - September 23, 2017

హైదరాబాద్ : సెక్రటేరియట్‌లో ఉద్యోగినులంతా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి.. బంగారు బతుకీయమంటూ ఆడిపాడారు. బతుకమ్మ సంబరాల్లో చిన్నారులు సందడి చేశారు. 

18:21 - September 23, 2017

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం కడియం, మంత్రి హరీష్‌రావు సతీమణులతో పాటు..డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌ రెడ్డి, కవిత, గుండు సుధారాణి, అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్‌లు బతుకమ్మలను పేర్చి కోలాటమాడారు. బతుకమ్మ కోలాటంతో ప్రగతి భవన్ ప్రాంగణం సందడిగా మారిపోయింది. 

18:20 - September 23, 2017

హైదరాబాద్ : దసరా పండుగ వచ్చిందంటే చాలు బస్సులన్నీ ఫుల్‌ అవుతాయి. ప్రతి ఏడాది కూడా ఆర్టీసీ... ప్రయాణికులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా నగరం నుండి ఊర్లకు వెళ్లే రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్త్తోంది. పండుగ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 3,600 ప్రత్యేక బస్సులను నడిపేలా ప్రణాళికలు సిద్దం చేశారు. ఈ బస్సుల రద్దీని, ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక బస్సు బస్టాప్‌లు ఏర్పాటు చేసి అక్కడినుండే బస్సులను నడపనున్నారు. విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఎల్బీనగర్‌ నుండి,.. వరంగల్‌ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్‌ నుండి,... కరీంనగర్‌, నిజామాబాద్‌ వైపు వెళ్లే బస్సులు జేబీఎస్‌ నుండి... ఇలా నగరంలో ఆరాంఘర్‌, సాగర్‌ రింగ్‌రోడ్డు, తదితర చోట్ల నుండి ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పాయింట్లలో 300 మంది ప్రత్యేక సిబ్బందిని ఆర్టీసీ కేటాయించింది. అయితే... షెడ్యూల్‌ బస్సులు మినహా స్పెషల్‌ బస్సులలో ఒకటిన్నర రెట్లు చార్జీ వసూలు చేయనున్నారు. తిరుగు ప్రయాణంలో వచ్చే నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ చార్జీలు తప్పడం లేదని యాజమాన్యం అంటుండగా... పండుగ పేరుతో ఈ దోపిడీ ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. 

18:18 - September 23, 2017

హైదరాబాద్ : అత్యాచారం కేసులో బాలీవుడ్‌ ప్రొడ్యూసర్ కరీమ్ మొరానీ ఎట్టకేలకు హైదరాబాద్‌ రాచకొండ పోలీసులకు లొంగిపోయాడు. 2015లో ఢిల్లీకి చెందిన యువతిపై ముంబై, హైదరాబాద్‌లో పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో కరీమ్ నిందితుడిగా ఉన్నాడు. ముంబైకి చెందిన యువతి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో నిర్మాత కరీం పరిచయం అయ్యాడు. కరీం మొరానీ సినిమాలో అవకాశం ఉందంటూ పిలవడంతో 2015లో ఆమె ఢిల్లీ నుంచి ముంబై వచ్చింది. సదరు నిర్మాత తన స్నేహితురాలి తండ్రి కావడంతో సినిమాలో అవకాశం నిజంగానే ఇస్తాడని భావించింది. ఆ తర్వాత యువతి ఉంటున్న హోటల్‌కి వెళ్లిన కరీం మొరాని..ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ సమయంలోనే న్యూడ్‌ ఫొటోలుతీసి, బ్లాక్‌మెయిల్‌చేస్తూ పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.

హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో
జనవరి10న హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు నిర్మాత కరీమ్‌ మురానీపై ఫిర్యాదుచేసింది. 'దిల్‌వాలే' షూటింగ్‌ సమయంలో హయత్‌నగర్‌ సమీపంలో కరీం పలుమార్లు తనపై అత్యాచారం జరిపాడని పేర్కొంది. ముంబైలోనూ తనపై పలుమార్లు లైంగికదాడి చేసినట్లు చెప్పింది. తనకు మాఫీయాతో సంబంధాలున్నాయని, విషయం బయటికి చెబితే చంపేస్తానని కరీం మొరానీ బెదిరించాడని తెలిపింది. చివరికి వేధింపులు భరించలేని స్థితిలో పోలీసులకు ఫిర్యాదుచేశానంది. దీంతో కరీం మొరానీపై నిర్భయ చట్టం, మరో నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. సంచలనాత్మక 2జీ కుంభకుణంలోనూ కరీం మొరానీ నిందితుడిగా ఉన్నాడు.

నాన్ బెయిల‌బుల్ వారెంట్‌
ట్రయల్‌ కోర్టునుంచి ముందస్తు బెయిల్‌ తీసుకున్న కరీం మొరానీ.. ముంబైకి వెళ్లిపోయాడు. బాధితురాలు హైకోర్టును ఆశ్రయించడంతో.. సెప్టెంబర్ 5న అతడికి నాన్ బెయిల‌బుల్ వారెంట్‌ను ఇష్యూ చేసింది. దీంతో.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. అయితే.. ఆయన అప్పీల్‌ను సుప్రీం కూడా తిరస్కరించి హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈనెల 22న హైదరాబాద్‌ పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో నిందితుడు కరీం.. రాచకొండ పోలీసులకు లొంగిపోయాడు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని...పోలీసులు రంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు. షారూఖ్‌ఖాన్‌ హీరోగా నటించిన దిల్‌వాలే, చెన్నై ఎక్స్‌ప్రెస్‌, రా.వన్‌ సినిమాలకు కరీమ్‌ ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్న ఇతడు..క్షణికసుఖాల కోసం చేసిన తప్పు కటకటాల పాలు చేసింది. 

18:17 - September 23, 2017

భద్రాద్రి : శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం రాజగోపరంకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇవాళ ఉదయం రాజగోపురం నుంచి చిన్న శకలం ఊడిపడింది. ఆ సమయంలో భక్తులు ఎవరు లేకపోవడంతో.. ప్రమాదం తప్పింది. ఆలయ ఈవో ప్రభాకర్ శ్రీనివాస్ శిల పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం.. భక్తులను పడమర గోపురం నుంచి కాకుండా ఉత్తర ద్వారం నుంచి దర్శనానికి పంపిస్తున్నారు. రాజగోపురంను పురావస్తు అధికారులతో పరీక్షించిన అనంతరం.. మరమ్మత్తులు చేపట్టనున్నట్టు ఆలయ ఈవో తెలిపారు.

పరకాలలో ప్రొ.కంచె ఐలయ్యను అడ్డుకున్న వైశ్యులు..

వరంగల్: పరకాలలో ఉద్రిక్తత నెలకొంది. ప్రొ.కంచె ఐలయ్యను వైశ్యులు అడ్డుకున్నారు. భూపాలపల్లి టీమాస్ సభకు హాజరై తిరిగి వస్తుండగా నిరసన తెలియజేస్తూ అడ్డుకున్నారు. దీంతో ఐలయ్యను పీఎస్ కు తరలించారు.

'సిట్' కు సీనియర్ జర్నలిస్టు హత్య కేసు

చంఢీగఢ్: సీనియర్ జర్నలిస్టు కేజే సింగ్, ఆయన తల్లి గురుచరణ్ కౌర్ హత్యకు గురికావడంపై పంజాబ్ ప్రభుత్వం తక్షణం స్పందించింది. కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగించింది.

ఎల్బీనగర్ లో మాజీ మావోయిస్టు నేత అరెస్ట్...

హైదరాబాద్: ఎల్బీనగర్ లో మాజీ మావోయిస్టు నేత శ్రీనివాస్ ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనే పోలీసుల ఎదుట లొంగిపోయిన శ్రీరంగం శ్రీనివాస్ ను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని టీమాస్ ఫోరం కన్వీనర్ జాన్ వెస్లీ, గద్దర్ డిమాండ్ చేశారు.

మిషన్ భగీరథపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: మిషన్ భగీరథ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మిషన్ భగీరథ పనులను రెండు భాగాలుగా విభజించుకోవాలని, పార్ట్ -1 ను డిసెంబర్ 31 కల్లా పూర్తి చేయాలని తెలిపారు. మరో 6 నెలల్లో పార్ట్ -2 ను పూర్తి చేయాలని సూచించారు. పైపు లైన్ల ద్వారా నీరు సరఫరా చేయడం ప్రారంభించిన తర్వాత కొన్ని నెలల పాటు పైపు లైన్లు లీకవడం జరుగుతుందని, ఒత్తిడి తట్టుకోలేక అక్కడక్కడ పైపు లైన్లు పగిలిపోవడం, వాల్వ్ ల వద్ద సమస్యలు తలెత్తుతాయని వాటిని ఎప్పటికపుడు సరిచేసుకుంటూ పోవాలని కేసీఆర్ తెలిపారు.

తిరుమలకు బయలుదేరిన ఏపీ సీఎం

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలకు బయలుదేరారు. రాత్రి 8 గంటలకు స్వామి వారికి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

16:41 - September 23, 2017

 

హైదరాబాద్ : సీఎం క్యాంప్ ఆఫీస్‌లో బతుకమ్మ సంబరాలు వేడుకగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌ రెడ్డిలతో పాటు పలువురు మహిళలు ఈ వేడుకలకు హాజరై బతుకమ్మ కోలాటమాడారు. బతుకమ్మ కోలాటంతో క్యాంప్ ఆఫీస్ ప్రాంగణం సందడిగా మారిపోయింది. 

16:39 - September 23, 2017

 

వరంగల్ : ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు మూడో రోజుకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గాయత్రి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు అమ్మవారికి వేదమంత్రోచ్ఛరణ నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయ ప్రాంగణలో బారులు తీరారు. అమ్మవారిని ఇవాళ సింహ వాహనంపై ఊరేగించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు శేషు తెలిపారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్

అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఎన్నికయ్యారు. పార్టీ జాతీయ కమిటీకి ఐదుగురు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు అధికార ప్రతినిధులు ఎపికయ్యారు. ఏపీ టిడిపి అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావు, ఉపాధ్యక్షులుగా ఏడుగురు, ఏపీ కమిటీలో 104 మందికి చోటు కల్పించారు. తెలంగాణ టిడిపి ఉపాధ్యక్షుడిగా ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. కమిటిలో 114 మంది సభ్యులకు చోటు కల్పించారు. త్వరలో అనుబంధ సంఘాలను కూడా ప్రకటించనున్నారు.

16:37 - September 23, 2017
16:36 - September 23, 2017

యూపీ : ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం కొందరి స్వభావమని...తమకు మాత్రం పార్టీ కన్నా దేశమే గొప్పదని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మోది ఇవాళ షహన్‌షాపూర్‌లో పర్యటించారు. అక్కడ పశు ఆరోగ్యమేళాను ప్రారంభించారు. రైతులకు రుణమాఫీ సర్టిఫేకేట్లను అందజేశారు. ఇప్పటివరకు పశుపాలనపై ఏ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదని...2022 నాటికి రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయడమే తమ ధ్యేయమని ప్రధాని స్పష్టం చేశారు. నేను రిస్క్‌ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. 2022 నాటికి ప్రతి పేదవారికి ఇళ్లు, ఉపాధి చూపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు పేదలను ఆదుకోవడంలో విఫలమయ్యాయని మోది విమర్శించారు. దేశం స్వచ్ఛంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లేనని పేర్కొన్నారు. ప్రధానితో పాటు యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్‌ రామ్‌నాయక్‌ ఉన్నారు.

16:35 - September 23, 2017

ఆదిలాబాద్‌ : జిల్లా గుడిహత్నూర్‌ మండలం కొలామ్‌లో దారుణం జరిగింది.. గ్రామ శివారులో మడావి సునీత అనే వివాహితను టేకం గోవింద్‌ రావ్ అనే యువకుడు హత్య చేశాడు.. హత్య తర్వాత తానుకూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. వివాహేతర సంబంధమే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

పండుగకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్: దసరా సెలవుల సందర్భంగా వివిధ ప్రాంతాలకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు జూబ్లీ బస్ స్టేషన్, ఎంజీబీఎస్ నుంచి 3,600 బస్సుల సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రధాన బస్టాండ్ ప్రయాణీకులతో కిక్కిరిశాయి. అదనపు బస్సులు నడిపినా ప్రయాణీకుల రద్దీ తగ్గలేదు.

పోలవరాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తాం: చంద్రబాబు

అమరావతి: పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వర్షపు నీటిని గ్రౌండ్ వాటర్ గా మార్చే కార్యక్రమాన్ని చేపట్టామని, జలాశాయాలు, గ్రౌండ్ వాటర్ ని సరిగ్గా వాడుకుంటే నీటి సమస్యను అధిగమించవచ్చని చంద్రబాబు సూచించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని, అనంతపురంలో భూగర్భ జలాలు పెంచేందుకు యత్నిస్తున్నామన్నారు.

16:27 - September 23, 2017
16:16 - September 23, 2017
16:15 - September 23, 2017

హైదరాబాద్ : తెలంగాన రాష్ట్రంలో స్వైన్ ప్లూ విజృభిస్తోంది. ఈ రోజు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ప్లూతో ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే స్వైన్ ప్లూతో 39 మంది మరణించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:14 - September 23, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని సీతారామస్వామి ఆలయ రాజగోపరానికి బీటలు ఏర్పడ్డాయి. గోపురం గోడ నుంచి శకలం విరిగిపడింది. భక్తులు లేని సమయంలో కూలడంతోమ ప్రమాదం తప్పింది. భక్తులను ప్రస్తుతం ఉత్తర ద్వారం నుంచి మళ్లిస్తున్నారు. ఆలయ సబ్బంది పురావస్తు శాఖ అధికారులకు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

జేసీ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం

అమరావతి: ఎంపి జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. టిడిపి క్రమశిక్షణ కలిగిన పార్టీ.. అందరూ పాటించాలన్నారు. అనంతపురానికే కాదు.. అన్ని జిల్లాలకు నీరు ఇస్తున్నామన్నారు. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడాలని, ప్రజా సమస్యలను అందరూ కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు.

17 మంది సభ్యులతో టిడిపి పొలిట్ బ్యూరో

అమరావతి: 17 మంది సభ్యులతో టిడిపి పొలిట్బ్యూరో ప్రకటించింది. టిడిపి జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులుగా అశోక్ గజపతి రాజు, యనమల, చినరాజప్ప, కేఈ, కాల్వ, దేవేందర్ గౌడ్, హరికృష్ణ, ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి, రావుల, సోమిరెడ్డి,ప్రతిభా భారతి, అయ్యన్న పాత్రుడు ఉన్నారు.

మొహాలీలో జంట హత్యలు

పంజాబ్:మొహాలీలో జంట హత్యలు జరిగాయి. సీనియర్ జర్నలిస్టులు కేజే సింగ్ సహా ఆయన తల్లిని దుండగులు హత్య చేశారు. కేజే సింగ్ నివాసంలో దుండగులు హత్య చేశారు.

గాంధీలో స్వైన్ ఫ్లూతో ముగ్గురి మృతి

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో ముగ్గురు మృతి చెందారు. మృతులు యాదాద్రి జిల్లా వాసి స్వరూప(46), భద్రాద్రి జిల్లా వాసి బాబూరావు(50), వరంగల్ అర్బన్ హన్మకొండ వాసి సాజిదా సుల్తానా(48) చెందిన వారు. స్వైన్ ఫ్లూతో మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. గాంధీలో ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూతో మృతి చెందిన వారి సంఖ్య 39కి చేరింది.

కూలిన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ రాజగోపురం

భద్రాద్రి: శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ రాజగోపురం కూలింది. భక్తులేని సమయంలో రాజగోపురం కూలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉత్తర ద్వారా దర్శనం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం చేయిస్తున్నారు.

గాంధీలో స్వైన్ ఫ్లూతో ముగ్గురి మృతి

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన వారు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలియాల్సి వుంది.

15:27 - September 23, 2017

విజయవాడలో కల్తీ కేంద్రం గుట్టు రట్టు

విజయవాడ:కేదారేశ్వరిపేటలోని పండ్ల మార్కెట్‌ వద్ద కల్తీ నెయ్యి, నిత్యావసరాలు, ఆహార పదార్థాల కల్తీ విక్రయ కేంద్రంపై దాడులు చేశారు. ఈ కేంద్రంలో కల్తీ నెయ్యి, షాంపూలు, మౌత్‌ ఫ్రెష్‌నర్‌ తదితర నిత్యావసరాలు, ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నెయ్యిలో డాల్డాను కలిపి విక్రయిస్తున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ కేంద్రాలు నడిపిస్తున్నారని టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ప్రసాద్‌ తెలిపారు.

భారత ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ పదవీ కాలం పొడిగింపు

ఢిల్లీ:భారత ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్ పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. సీఈఏగా ఆయన మూడేళ్ల పదవీకాలం అక్టోబర్ 16తో ముగియనుండగా, మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

 

15:11 - September 23, 2017

తన మొదటి సినిమా నుండి కష్టపడుతూ యాక్టింగ్ ని లుక్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు ఈ మెగా హీరో. సినిమాల్లో వైవిధ్యం చూపిస్తూ డిఫెరెంట్ కథలతో వస్తున్న ఈ హీరో అటు ప్రొడ్యూసర్ గా కూడా హిట్ కొట్టేసాడు. తాను చేస్తున్న రీసెంట్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ప్లాన్ లో ఉన్నాడు. మెగా హీరోల్లో సినిమా హిట్ ట్రాక్ లో పెట్టి మెగా టైటిల్ కి న్యాయం చేస్తున్న ఈ మెగా యంగ్ హీరో 'రాంచరణ్'. 'ధ్రువ' సినిమా 'రామ్ చరణ్' ని మార్చేసింది అని చెప్పాలి. 'రామ్ చరణ్' లుక్ తో పాటు యాక్టింగ్ లో కూడా డిఫెరెంట్ చూపిస్తూ తన కెరీర్ ని పక్క ప్లానింగ్ లో పెట్టుకున్నాడు. తనలో యాక్టింగ్ స్కిల్స్ ని చూపించే మంచి అవకాశాన్ని 'ధ్రువ' సినిమా ద్వారా యూస్ చేసుకున్నాడు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'తనీ ఒరువన్' సినిమాని తెలుగు లో 'ధ్రువ' పేరుతో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

'ధ్రువ' సినిమాలో 'రామ్ చరణ్' పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యారు ఆ తరువాత ఆయన చెయ్యబోయే సినిమాలమీద ఇంటరెస్ట్ కూడా చూపిస్తున్నారు. రామ్ చరణ్ - సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'రంగస్థలం 1985'. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లి ఏడెనిమిది నెలలవుతోంది. ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. దసరా కానుకగా 'రంగస్థలం' తొలి చూపును పరిచయం చేస్తారట. ఇందులో సుకుమార్ మార్కు ఉంటుందని.. కచ్చితంగా మెగా అభిమానుల్ని ఈ లుక్ అలరిస్తుందని అంటున్నారు.

15:10 - September 23, 2017

నిజామాబాద్ : జిల్లాలోని బీంగల్ మండలం బెజ్జొరలో అగ్రకులవారు 110 దళిత కుటుంబాలపై సాంఘిక బహిష్కరించారు. దీని పై టెన్ టివి ప్రసారం చేసిన కథనాలకు ఎట్టకేలకు అధికారులు స్పందించారు. బెజ్జొర గ్రామాన్ని పోలీసు, రెవిన్యూ అధికారులు సందర్శించి గ్రామీణాభివృద్ది కమిటీ, గ్రామ పెద్దల, దళితులతో వారు చర్చలు జరిపారు. దళితులను బహిష్కరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు గ్రామ పెద్దలను హెచ్చరించారు. అధికారుల హెచ్చరికలతో అగ్రకుల పెద్దలు దారికొచ్చి సామరస్యంగా మెలగుతామని హామీ ఇచ్చారు. మరింత సమాచారం కోసంవ వీడియో చూడండి.

15:06 - September 23, 2017

ఒక చిన్న సినిమా అతి పెద్ద విజయం సాధించింది. ఒక సినిమా ఆడటానికి పెద్ద స్టార్స్ అవసరం లేదని నిరూపించింది. ప్రతి భాషలో కథ గెలిచింది. కథలో ఉన్న బలం సినిమాని ప్రతి ఆడియన్ కి దగ్గర చేసాయి. వినూత్న కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని 'దృశ్యం' సినిమా నిరూపించింది. మోహన్ లాల్ హీరోగా 2013లో వచ్చిన ఈ చిత్రం మాలీవుడ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మలయాళంలో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రూ.50 కోట్లు కొల్లగొట్టిన మొదటి సినిమాగా చరిత్ర పుటలకెక్కింది. అంతే కాకుండా చాలా స్క్రీన్లలో 150 కన్నా ఎక్కువ రోజులు ఆడిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తెలుగు - తమిళ - కన్నడ - హిందీ భాషల్లోకి కూడా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

వెంకటేష్ హీరోగా ఈ 'దృశ్యం' సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఈ చిత్రం మరో ఘనత దక్కించుకుంది. ఈ సినిమా చైనీస్ లో రీమేక్ కాబోతోంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమా 'దృశ్యం' కావడం విశేషం. ఈ చిత్ర రీమేక్ హక్కులను ఓ చైనా నిర్మాణ సంస్థ కొనుగోలు చేసినట్లు దర్శకుడు జీతూ జోసెఫ్ తెలిపారు. ఈ విధంగా చైనా కంపెనీ రీమేక్ రైట్స్ కొనుక్కున్న మొట్ట మొదటి భారతీయ సినిమా ఇదేనని జోసెఫ్ చెప్పారు. ఏది ఏమైనా కథ ఉంటేనే సినిమా అని నిరూపించింది ఈ 'దృశ్యం' సినిమా.

ప్రగతిభవన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్: ప్రగతిభవన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. బతుకమ్మ వేడుకలో గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, కడియం, హరీష్ సతీమణులు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, కవిత, గుండు సుధారాణి, అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ పాల్గొన్నారు.

భూపాలపల్లి జిల్లాలో టీమాస్ ఫోరం ఆవిర్భావ సభ

జయశంకర్ భూపాలపల్లి : టీమాస్ ఫోరం జిల్లా ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొ.కంచ ఐలయ్య పాల్గొన్నారు.

దళితులపై సాంఘిక బహిష్కరణ ఎత్తివేత...

నిజామాబాద్: భీంగల్ మండలం బెజ్జోర గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ సద్దుమణిగింది. దళితులపై సాంఘిక బహిష్కరణను గ్రామ అభివృద్ధి కమిటీ ఎత్తివేసింది. దళిత సంఘాలు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులతో రెవెన్యూ, పోలీస్ అధికారులు చర్చలు జరిపారు. దళితుల బహిష్కరణకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ పోలీసు అధికారులు హెచ్చరించారు.

గాంధీభవన్ లో సదస్సు..

హైదరాబాద్ : గాంధీభవన్ లో కార్మిక, ఉద్యోగ సంఘాల రాష్ట్ర సదస్సు జరుగుతోంది. సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత, ఏఐటీయూసీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మహదేవన్ లు హాజరయ్యారు

టిడిపి ముఖ్యనేతలతో బాబు భేటీ..

విజయవాడ : టిడిపి ముఖ్యనేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు బాబు భేటీ అయ్యారు. పొలిట్ బ్యూరో, జాతీయ, తెలుగు రాష్ట్రాల కమిటీల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ నేతల వలసలతో పొలిట్ బ్యూరోలో ఖాళీ అయిన స్థానాల భర్తీపై చర్చిస్తున్నారు. ఒకటి..రెండు రోజుల్లో కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ నుండి పొలిట్ బ్యూరో రేసులో రేవూరి పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, విజయ రమణరావులున్నారు

జయ శంకర్ భూపాలపల్లిలో టీ మాస్ సభ..

జయ శంకర్ భూపాలపల్లి : టీ మాస్ ఫోరం జిల్లా ఆవిర్భావ సభ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీమాస్ ఫోరం సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు

అన్నదాన ప్రసాద వితరణ కేంద్రంలో కలెక్టర్ భోజనం..

విజయవాడ : దుర్గగుడిలో కలెక్టర్ లక్ష్మీకాంతం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రసాదాల పంపిణీ..అన్నదాన వితరణ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి అన్నదాన ప్రసాద వితరణ కేంద్రంలో కలెక్టర్ భోజనం చేశారు

13:46 - September 23, 2017

హైదరాబాద్‌ : హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్శిటీ(హెచ్ సీయూ) విద్యార్థి సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఏ, డీఎస్‌యూ కూటమి ఘన విజయం సాధించింది. గురువారం ఎన్నికలు నిర్వహించగా... శుక్రవారం కౌంటింగ్‌ నిర్వహించారు. హెచ్ సీయూ స్టుడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా ఏఎస్ జే అభ్యర్థి శ్రీరాగ్... ఏబీవీపీ, ఓబీసీఎఫ్ కూటమి అభ్యర్థి పల్సానియాపై 160 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శ్రీరాగ్‌కు 1509 ఓట్లు... పల్సానియాకు 1349 ఓట్లు, ఎన్ ఎస్ యూఐ అభ్యర్థి అంజురావ్‌కు 872 ఓట్లు వచ్చాయి. 71మంది నోటాకు ఓటేశారు. ఉపాధ్యక్షులుగా ఏఎస్ జే అభ్యర్థి నరేశ్‌... ఏబీవీపీ అభ్యర్థిపై 260 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 52 కౌన్సిలర్‌ పోస్టులకుగాను... 49 పోస్టుల్లో ఏఎస్ జే అభ్యర్థులు దక్కించుకున్నారు. ఫలితాల తర్వాత విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

 

అంతర్ రాష్ట్ర దొంగల అరెస్టు..

పశ్చిమగోదావరి : నలుగురు అంతర్ రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 15 లక్షల విలువలైన బంగారం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లాల రవాణా అవుతున్న గంజాయిపై ప్రత్యేక నిఘా పెట్టింది. క్రికెట్ బెట్టింగ్ లను నిరోధించడానికి ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందని జిల్సా ఎస్పీ రవి ప్రకాష్ పేర్కొన్నారు

13:44 - September 23, 2017

హైదరాబాద్‌ : నగరంలో 2017 ప్రళయ సహాయ పేరుతో ప్రత్యేకంగా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృంద సభ్యులు.. ఆపదలో ఎలా కాపాడతారనే విషయాలు సందర్శకులకు చెప్పారు. ఇండియన్ నేవీ, మిలిటరీ అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులంతా.. ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:34 - September 23, 2017

కృష్ణా : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కుంకుమ పూజ నిర్వహించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. కుంకుమ పూజకు 3 వేల టికెట్‌ పలికినప్పటికీ భక్తులు లెక్కచేయలేదు. రద్దీ దృష్ట్యా అధికారులు రెండు షిఫ్ట్‌లకు పెంచారు. కుంకుమ పూజ అనంతరం అమ్మవారి దర్శనం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

13:21 - September 23, 2017
13:20 - September 23, 2017

గుంటూరు : జిల్లాలో అగ్నిప్రమాదం సంభవించింది. నాదెండ్ల మండలంలోని గణపవరంలోని జాతీయ రహదారి పక్కనున్న టోబాకో కంపెనీలో మంటలు అంటుకున్నాయి. 510 కాటన్ బేళ్లు, 350 పసుపు కొమ్ములు దగ్ధం అయ్యాయి. కోటి పది లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయి. పోలీసులు, అధికార యంత్రాంగం ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. అగ్నిప్రమాదానికి విద్యుత్ షాక్ కారణమా లేదా మరే ఇతర కారణాలేమైన ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

'ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు పై సమీక్ష'

హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు పై అన్ని శాఖల అధికారులతో సీఎప్ ఎస్పీ సింగ్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

జపాన్ ఓపెన్ సిరీస్‌లో ఓడిన ప్రణవ్, సిక్కి జంట

టోక్యో: జపాన్ ఓపెన్ సిరీస్‌ మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా, సిక్కి రెడ్డి జంట  ఓటమి పాలైంది. టోక్యోలో జరుగుతున్న టోర్నమెంట్‌లో ప్రణవ్-సిక్కి జంట 21-14, 15-21, 19-21 స్కోర్‌తో జపాన్‌కు చెందిన తాకురో హోకి, సయక హిరోటా చేతిలో ఓడిపోయారు.

గణపరరంలోని టొబాకో కంపెనీలో అగ్ని ప్రమాదం

గుంటూరు: జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాదెండ్ల మండలం గణపరరంలోని టొబాకో కంపెనీలో మంటలు అంటుకున్నాయి. 510 కాటన్ బేళ్లు, 350 పసుపు కొమ్ములు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

12:58 - September 23, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని సఖినేటిపల్లి మండలంలో ఓఎన్‌జీసీ గ్యాస్‌పైప్‌ లీక్‌ స్థానికులను టెన్షన్‌ పెడుతోంది.. కేశవదాసుపాలెంలో గ్యాస్‌ పైప్‌ లీకవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.. రాత్రి నుంచి లీక్‌ అవుతున్నా... అధికారులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సఖినేటిపల్లి మండలంలో తరచూ గ్యాస్‌ లీక్‌ అవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు.. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవడం లేదని, తమ ప్రాణాలకు రక్షణ కరువైందని గ్రామస్తులు వాపోతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:55 - September 23, 2017

నిజామాబాద్ : కుల దురంహకారం మరోసారి పడగ విప్పింది. తెలంగాణ రాష్ట్రంలో దళితులు సాంఘీక బహిష్కరణకు గురవుతున్నారు. ఇటీవలే పలు ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బెజ్జొరలో అగ్రకులాలు 110 దళిత కుటుంబాలను సాంఘీక బహిష్కరణ చేశారు. డప్పులు కొట్టవద్దంటూ, ఆలయ ప్రవేశం లేదంటూ.. కుల పెద్దలు, పెత్తందారులు హుకుం జారీ చేశారు. నవతరాత్రి ఉత్సవాలను జరుపవద్దంటూ ఆంక్షలు విధించారు. గతంలో కృష్ణాష్టమి, వినాయక చవితి పండుగుల సందర్భంగా కూడా దళితులపై అగ్రకులాలు ఆంక్షలు విధించారు. దీంతో ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా నిర్వహించారు. ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. తమను వెలివేసినవారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:39 - September 23, 2017

శ్రీకాకుళం : జిల్లాలో సీపీఎం, సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వంశధార నిర్వాసితులను కలిసేందుకు వెళ్తుండగా సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణతోపాటు 30 మందిని అరెస్టు చేశారు. కొత్తూరు మండలం నవతల జంక్షన్ లో నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కార్యర్తలను నడిరోడ్డుపై విచక్షణారహితంగా ఈడ్చుకెళ్తూ తీసుకెళ్లి వ్యాన్ లో పడేశారు. అయితే పోలీసుల తీరును నేతలు ఖండిస్తున్నారు. పోలీసులు అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

 

దేశాన్ని అభివృద్ధిపరచడమే లక్ష్యం: మోదీ

లక్నో : దేశాన్ని అభివృద్ధిపరచడమే తమ పార్టీ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాని మోదీ తన నియోజకవర్గం వారణాసిలోని షహెన్‌షాపూర్‌లో ఆయన ఇవాళ పర్యటించారు. అక్కడ పశు ఆరోగ్య మేళాను ప్రారంభించారు.

శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం

హైదరాబాద్ : శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. జలాశయానికి లక్షా 38వేల 814 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కుడి, ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌కు 58 వేల 900 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 10 వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,525 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

నూతన క్షిపణిని పరీక్షించిన ఇరాన్

హైదరాబాద్: ఇరాన్ నూతన క్షిపణిని పరీక్షించింది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ క్షిపణిని ఇరాన్ పరీక్షించింది.

11:59 - September 23, 2017

భారీ సినిమాలను నిర్మించడంలో బాలీవుడ్ ఎప్పుడు ముందే ఉంటుంది. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఫిలిం మేకింగ్ చేసే సంజయ్ లీలా భన్సాలి ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు. చరిత్రలో జరిగిన సంఘటనలకు తన మార్కు ప్రెజెంటేషన్ ఇచ్చే సంజయ్ చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో చూద్దాం. దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా, రణ్ వీర్ సింగ్ లతో చేసిన స్క్రీన్ మేజిక్ బాజీరావు మస్తానీ. ఒక మంచి ప్రేమకథని చరిత్రతో కనెక్ట్ చేసి స్క్రీన్ మీద అద్భుత ప్రేమ కావ్యాన్ని చూపించాడు సంజయ్ లీల భన్సాలీ. భారీ సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్ లో రాయల్టీ నటీ నటుల అభినయం ఇవన్నీ బాజీరావు మస్తానీ సినిమాని మరో రేంజ్ కి తీస్కెల్లినవే. అలా తన మార్కు డైరెక్షన్ ప్రెజెంటేషన్ ని తన సినిమాల్లో ప్రెసెంట్ చేసే ఈ డైరెక్టర్ ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పద్మావతి'. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. దీపిక రియల్ లైఫ్ లవర్ రణవీర్ సింగ్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషిస్తుండడం. చారిత్రాత్మక కథ ఆధారంగా రూపొందుతున్న మూవీ కావడంతో ఆడియన్స్ లో కూడా ఆసక్తి నెలకొంది. దీపిక భర్తగా షాహిద్ కపూర్.. అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ ఈ చిత్రంలో నటిస్తుండగా డిసెంబర్ 1న పద్మావతి మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించాడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. మరి చిత్రం ఎలా ఉంటుందో వేచి చూడాలి

 

11:55 - September 23, 2017

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర సమితి బీసీ జపం అందుకుంది. ఎన్నికలకు ఇంకా  రెండేళ్ల సమయం ఉన్నా.... బీసిలను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రభుత్వ ప్రకటనలతో  వెనుకబడిన వర్గాలకు నేరుగా లబ్ది చేకూర్చే యత్నాలు మొదలు కాగా..... రాజకీయంగా కూడా బీసిలకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ ను తెరపైకి తెస్తోంది.
మెజార్టీ ప్రజలను ఆకర్షించేందుకు ప్లాన్   
పార్టీ పరంగా పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణం లేని గులాబి పార్టీ వచ్చే ఎన్నికల నాటికి మెజార్టీ ప్రజలను ఆకర్షించేందుకు పావులు కదుపుతోంది. దాదాపు ఆరు నెలలుగా ప్రభుత్వం ఎంబీసిలు, బీసిల జపం చేయడం మొదలు పెట్టింది. ఎంబీసీల కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసి అట్టడుగు వర్గాల వెనుకబడిన తరగతులను ఆదుకుంటామన్న సంకేతాలు ఇస్తోంది. దీనికి తోడు ఇతర వర్గాలను కూడా ఆకట్టుకునేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు మొదలవుతున్నాయి. ఓ వైపు రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేస్తూనే.... బిసిలను కూడా తమ పార్టీ వైపునకు తిప్పుకునేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రణాళికలను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు : టీఆర్‌ఎస్‌ 
అందులో భాగంగానే వెనకబడిన వర్గాలకు ఇంటికో బర్రె పథకాన్ని ఇటీవలే సీఎం ప్రకటించారు. ఇప్పటికే అమలు చేస్తున్న గొర్రెల సంపిణీ, చేపల పంపిణీ లాంటి పథకాలు మెజార్టీ బీసి కులాలకు ప్రభుత్వానికి చేరువ చేస్తాయన్న అంచనాతో ముఖ్యమంత్రి పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇక రాజకీయంగా కూడా బీసిలకు ప్రాతినిథ్యం దక్కాలన్న అభిప్రాయంతో మర్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లను అమలు చేసింది. చట్ట సభల్లో కూడా  ఓబీసిల రిజర్వేషన్లు  ఉండాలనే డిమాండ్‌ను పార్టీ తెరపైకి తెస్తోంది. మహిళా బిల్లును కేంద్రం పార్లమెంట్ ముందుకు తెస్తే తాము సంపూర్ణంగా మద్దతునిస్తామనే ఎంపీ బూర నర్సయ్య ప్రకటించారు. మరోవైపు చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని.. టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. 

 

11:49 - September 23, 2017

చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకట్లేదు అనుకునే వారు పెద్ద సినిమాలు లేని టైం లో జాగర్తగా చిన్న సినిమాలని రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు హిట్ ట్రాక్ లోనే ఉన్నాయ్ కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన కొన్ని సినిమాలు మాత్రం ఆడియన్స్ కి రీచ్ అవ్వలేకపోయాయి.

రీసెంట్ టైం లో తెలుగు లో 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ‘ఉంగరాల రాంబాబు’ పరిస్థితి మేలు. 'సునీల్' ట్రాక్ రికార్డు ఎలా ఉన్నప్పటికీ దీనికి తొలి రోజు ఉదయం ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఈ చిత్రానికి దారుణమైన టాక్ రావడంతో సాయంత్రానికే పరిస్థితి మారిపోయింది. కలెక్షన్లు పడిపోయాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యంత పేలవమైన సినిమాల్లో ఇది ఒకటనిపించుకుంది అని ఇండస్ట్రీ టాక్. ఇక ఏమాత్రం హైప్ లేకుండా రిలీజైన ‘కథలో రాజకుమారి’ పరిస్థితి దయనీయం. ఈ సినిమాపై ముందే ఆశలు పోయాయో ఏమో.. ప్రమోషన్ కూడా పెద్దగా చేయలేదు. నామమాత్రంగా సినిమాను రిలీజ్ చేశారు. టాక్ కూడా నెగెటివ్ గానే ఉండటంతో కలెక్షన్ల గురించి చెప్పాల్సిన పని లేకుండా పోయింది. ఇక ‘బాహుబలి’ రైటర్ ‘శ్రీవల్లీ’ గురించి మాట్లాడేవాళ్లే లేరు. దీనికి కూడా ఏమాత్రం హైప్ లేదు. సినిమా చూసిన వాళ్లు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అట.

ఇక పరభాషా నటుడు సచిన్ జోషి సినిమా ‘వీడెవడు' రిలీజ్ అయిన పెద్దగా టాక్ లేని పరిస్థితి. పబ్లిసిటీ బాగానే ఉన్నా కానీ సినిమా ఓపెనింగ్స్ లేవు అని తెలుస్తుంది. అలానే తమిళ్ హీరో 'శింబు' మూవీ ‘సరసుడు’ గురించి అసలు డిస్కషనే లేదు. మొత్తంగా ఈ వీకెండ్లో బాక్సాఫీస్ మరీ డల్లయిపోయింది. ఇలా అన్ని సినిమాలు ఆడియన్స్ ని రీచ్ అయ్యకుండానే పోయాయి. కొత్తదనం లేక ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు అని అనుకుంటున్నారు ఫిలిం నగర్ వాసులు.

11:38 - September 23, 2017

హైదరాబాద్ : దసరా పండుగ రద్దీ సందర్భంగా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు టీఎస్ఆర్టీసి ఉన్నతాధికారులు. నగరం నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. ప్రయాణికుల తిరగు ప్రయాణానికి కూడా... ఏర్పాట్లు చేశామన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి అన్ని రకాల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. 
దసరా వచ్చిందంటే బస్సులన్నీ ఫుల్‌ 
దసరా పండుగ వచ్చిందంటే చాలు బస్సులన్నీ ఫుల్‌ అవుతాయి. ప్రతి ఏడాది కూడా ఆర్టీసీ... ప్రయాణికులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా నగరం నుండి ఊర్లకు వెళ్లే రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 
3,600 ప్రత్యేక బస్సులు 
పండుగ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 3,600 ప్రత్యేక బస్సులను నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ బస్సుల రద్దీని, ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక బస్సు బస్టాప్‌లు ఏర్పాటు చేసి అక్కడినుండే బస్సులను నడపనున్నారు. విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఎల్బీనగర్‌ నుండి,.. వరంగల్‌ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్‌ నుండి,... కరీంనగర్‌, నిజామాబాద్‌ వైపు వెళ్లే బస్సులు జేబీఎస్‌ నుండి... ఇలా నగరంలో ఆరాంఘర్‌, సాగర్‌ రింగ్‌రోడ్డు, తదితర చోట్ల నుండి ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పాయింట్లలో 300 మంది ప్రత్యేక సిబ్బందిని ఆర్టీసీ కేటాయించింది.
స్పెషల్‌ బస్సులలో ఒకటిన్నర రెట్లు చార్జీ వసూలు  
అయితే... షెడ్యూల్‌ బస్సులు మినహా స్పెషల్‌ బస్సులలో ఒకటిన్నర రెట్లు చార్జీ వసూలు చేయనున్నారు. తిరుగు ప్రయాణంలో వచ్చే నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ చార్జీలు తప్పడం లేదని యాజమాన్యం అంటుండగా... పండుగ పేరుతో ఈ దోపిడీ ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. 

 

టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ

అమరావతి: టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. తెలంగాణ నేతల వలసలతో పొలిట్ బ్యూరోలో ఖాళీ స్థానాల భర్తీపై చర్చిస్తున్నట్లు సమాచారం. పొలిట్ బ్యూరో, జాతీయ, తెలుగు రాష్ట్రాల కమిటీల ఏర్పాటు పై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో కమిటీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి పొలిట్ బ్యూరో రేసులో పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, విజయరమణరావు ఉన్నట్లు సమాచారం.

కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడికి గాయాలు

అనంతపురం : ఉరవకొండ మండలం రాయంపల్లిలో కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడికి గాయాలయ్యాయి. గాయాలతో బాధపడుతున్న బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దుర్గగుడిలో కలెక్టర్ లక్ష్మీకాంతం ఆకస్మిక తనిఖీలు

విజయవాడ: దుర్గగుడిలో కలెక్టర్ లక్ష్మీకాంతం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రసాదాల పంపిణీ, అన్నదాన వితరణ కేంద్రాలను తనిఖీ చేశారు. అన్నదాన ప్రసాద వితరణ కేంద్రంలో కలెక్టర్ భోజనం చేశారు.

11:14 - September 23, 2017

మెగాస్టార్ కాంపౌండ్ నుండి వచ్చి తనదైన స్టైల్లో సినిమాలు చేస్తున్న 'సాయి ధరమ్ తేజ్'...మరో చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఇతను బీవీఎస్ రవి దర్శకత్వంలో 'దిల్' రాజు సమర్పణలో తెరకెక్కుతున్న 'జవాన్' సినిమాలో నటిస్తున్నాడు. 'మెహ్రీన్ ఫిర్జాదా' హీరోయిన్ గా నటిస్తోంది. ఆయన నటించిన 'నక్షత్రం' సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీనితో హిట్ కొట్టాలని 'సాయి ధరమ్ తేజ' భావిస్తున్నాడు.

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నెంబర్ 150' సినిమాకు వినాయక్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఘన విజయం సాధిచడంతో మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోలతో సినిమా చేయాలని 'వినాయక్' యోచించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా 'సాయి ధరమ్ తేజ'తో సినిమా తీయాలని..అందుకు 'ఖైదీ నెంబర్ 150' ముందుగానే కథ సిద్ధం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కథ నచ్చడంతో సాయి ధరమ్ తేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై పోయింది. వినాయక్ తో దిగిన ఫొటోను సాయి ధరమ్ తేజ ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నాడు. 'వినాయ‌క్ గారితో తొలి రోజు ప‌ని చేస్తున్నాను.. క‌ల నిజ‌మైంది.. గొప్ప అవ‌కాశం ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు' అని ట్వీట్ చేశాడు. తేజ స‌ర‌స‌న 'లావ‌ణ్య త్రిపాఠి' నటించనుందని తెలుస్తోంది. ఈ మూవికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

11:01 - September 23, 2017

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన వారిలో 'శ్రద్ధా కపూర్' ఒకరు. పలు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. టాలీవుడ్ లో 'ప్రభాస్' హీరోగా రూపొందుతున్న 'సాహో' సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. హీరోయిన్ గా రాకముందు విద్యకు సంబంధించిన విషయాలపై పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తాను చదువులో అత్యుత్తమ ప్రతిభను కనబర్చలేదని కుండబద్దలు కొట్టేసింది. తాను కరిక్యూలమ్ ఉండే ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివినట్లు..అందులో 12వ గ్రేడ్ వచ్చిందన్నారు. జస్ట్ పాస్ కావడం జరిగిందని, కానీ 12వ తరగతిలో మాత్రం కొద్దిగా కష్టపడి చదివితే 95 శాతం మార్కులొచ్చాయని ముద్దుగుమ్మ పేర్కొంది. వార్‌విక్‌ యూనివర్శిటీలో సీటొచ్చిందని, అంతేగాకుండా రెండు మూడు యూనివర్శిటీల నుంచి స్కాలర్‌షిప్‌లు కూడా వచ్చాయన్నారు. ఎక్కువ మార్కులు వచ్చాయే గాని ఏమీ చదువుతున్నానో అర్థం కాలేదని తెలిపింది. ప్రస్తుతం 'శ్రద్ధా కపూర్' టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'హసీనా పార్కర్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో దావూద్ ఇబ్రహీం సోదరి హసినా పార్కర్ గా పాత్ర చేస్తోంది. 'సైనా నెహ్వాల్‌' బయోపిక్‌ కూడా చేయబోతుంది.

10:57 - September 23, 2017
10:48 - September 23, 2017

మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన నాగాబు కూతురు 'నిహారిక' చిత్రసీమలో నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తోంది. 'ఒక మనస్సు' చిత్రంతో ఆరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా 'నిహారిక' మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా అనంతరం 'నిహారిక' ఏ సినిమాలను ఒప్పుకోలేదు. మంచి కథల కోసం వెయిట్ చేస్తున్న ఈ అమ్ముడు తమిళంలో ఓ సినిమా చేస్తోంది. తాజాగా తెలుగులో మంచి కథ దొరకడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంట.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో 'సమంత్ అశ్విన్' హీరోగా..'నిహారిక' హీరోయిన్ గా నటించనున్నారు. చిత్రానికి 'హ్యాపీ వెడ్డింగ్' అని నామకరణం కూడా చేసేశారు. రొమాంటింగ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర 4 నుండి ప్రారంభం కానుంది. అందరికీ వినోదాన్ని పంచే చిత్రమవుతుందని చిత్ర బృందం పేర్కొంటోంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. 

10:48 - September 23, 2017

రంగారెడ్డి : జిల్లాలోని షాద్ నగర్ లో బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రజా గాయకురాలు విమలక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మను కార్పొరేట్ బతుకమ్మగా మారుస్తున్నారని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు హక్కులను కాపాడుకోవాలని విమలక్క అన్నారు. తెలంగాణ వనరులను కబ్జాదారుల నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 

 

పోలీసుల అదుపులో సీపీఎం నేత మధు

శ్రీకాకుళం: కొత్తూరు మండలం నవతల జంక్షన్ లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ మూర్తి సహా 30 మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

10:12 - September 23, 2017

హైదరాబాద్‌ : సంజీవయ్య పార్క్ సమీపంలో వరద సహాయక చర్యలపై మాక్‌ డ్రిల్‌ కొనసాగుతోంది. ఎమర్జెన్సీ సహాయక సేవలు, పునరావాసంపై ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్‌, నేవీ, ఎన్డీఆర్ఎఫ్,రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నివారణ విభాగాల ఆధ్వర్యంలో ఈ డ్రిల్‌ నడుస్తోంది. పునరావాస చర్యల్లో భాగంగా మెడికల్‌ క్యాంపులు... వరద బాధితులకు వైద్య సహాయ శిబిరాలను కూడా ప్రదర్శిస్తున్నారు. జాతీయ రక్షక దళం దక్షిణ కమాండ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

10:07 - September 23, 2017

హైదరాబాద్ నగరంలో ప్రముఖమైన ప్రాంతం ఏదీ అంటే అది వెస్ట్ ప్రాంతమని చెప్పవచ్చు...ప్రాపర్టీ అమ్మకాలు..కొనుగోలు విషయంలో రిజిస్ట్రేషన్ లో మెళుకవులు అవసరం...ఆర్క్ ఇన్ గ్రా గ్రూప్ విశేషాలు..ఇంటి ఇంటీరియర్స్ కోసం ఎంతైనా ఖర్కు పెడుతున్నారు గృహ యజమానులు..ఇలాంటి పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:00 - September 23, 2017

శ్రీకాకుళం : చంద్రబాబు ప్రభుత్వానికి పోలీసులు ప్రైవేట్‌ సైన్యంలా వ్యవహరిస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రైల్వేస్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వంశధార నిర్వాసితులపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని, నిర్వాసితులకు తగిన పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టు చేపట్టడం తగదన్నారు. వంశధార నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు సీపీఎం పోరాడుతుందని మధు స్పష్టం చేశారు. 

09:57 - September 23, 2017

హైదరాబాద్‌ : హయత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాలీవుడ్‌ నిర్మాత కరీం మొరాని లొంగిపోయారు. గత జనవరిలో తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడంటూ హయత్‌ నగర్‌ పీఎస్‌లో యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కరీం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీం కోర్టు బెయిల్‌ తిరస్కరించి తెలంగాణ పోలీసుల ఎదుట 22వ తేదీ లోపునలొంగిపోవాలని ఆదేశించింది. దీనితో గత్యంతరం లేక ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

110దళిత కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ

నిజమాబాద్: భీంగల్ మండలం బెజ్జోరలో దళితులను బహిష్కరించారు. 110 మంది దళిత కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ బహిష్కరించింది.

09:49 - September 23, 2017

నిజామాబాద్ : కుల దురంహకారం మరోసారి పడగలు విప్పింది. తెలంగాణ రాష్ట్రంలో దళితులను సాంఘీకంగా బహిష్కరించేస్తున్నారు. ఇటీవలే పలు ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బెజ్జొరలో 110 దళిత కుటుంబాలను దళితులను అగ్రకులాలు సాంఘీకంగా బహిష్కరణ చేసిన ఘటన కలకలం రేపుతోంది. డప్పులు కొట్టవద్దంటూ..ఆలయ ప్రవేశం లేదంటూ కుల పెద్దలు..పెత్తందారులు హుకుం జారీ చేశారు. నవతరాత్రి ఉత్సవాలను జరుపవద్దంటూ ఆంక్షలు విధించారు. గతంలో కృష్ణాష్టమి, వినాయక చవితి పండుగుల సందర్భంగా కూడా వీరు ఆంక్షలు విధించారు. దీనితో ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా నిర్వహించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

బద్వేల్ లో విషాదం

కడప: బద్వేల్ లో విషాదం నెలకొంది. ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణారెడ్డి గుండెపోటుతో మరిణించారు. సోదరుడి మృతిని తట్టుకోలేక సోదరి సుబ్బలక్ష్మమ్మ మృతి చెందింది.

హుస్సేన్ సాగర్ లో మాక్ డ్రిల్

హైదరాబాద్: హుస్సేన్ సాగర్ లో మాక్ డ్రిల్ జరుగుతోంది. ప్రళయ్ సహాయ్ పేరుతో ఆర్మీ, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. వరదలు సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

హయత్ నగర్ పీఎస్ లో లొంగిపోయిన బాలీవుడ్ నిర్మాత

హైదరాబాద్: యువతిపై అత్యాచారం కేసులో హయత్ నగర్ పీఎస్ లో బాలీవుడ్ నిర్మాత కరీం మొరాని లొంగిపోయాడు.

నేడు తిరుమలకు సీఎంచంద్రబాబు

చిత్తూరు: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు విచ్చేయనున్నారు.

08:32 - September 23, 2017

చిత్తూరు : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శనివారం ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా భద్రతా చర్యలు చేపట్టామంటున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో టెన్ టివి ఫేస్ టూ ఫేస్  
నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:25 - September 23, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని జూలూరుపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. బారసాల కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా మార్గంమధ్యలో సాయిరాం తండా సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లావత్ శాంతి అక్కడికక్కడే మృతి చెందింది. 20 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిని కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:17 - September 23, 2017

సింగరేణిలో ఎన్నికలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వినయ్ కుమార్, టీఆర్ ఎస్ సీనియర్ నాయకులు రాజమోహన్, కాంగ్రెస్ ఎంపీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొని, మాట్లాడారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

నేడు సింగరేణిలో 750 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ : నేడు సింగరేణిలో 750 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. కార్మిక హోదా పోస్టులు 643, ఎగ్జిక్యూటివ్ పోస్టులు 107. 

 

జమ్మూకాశ్మీర్ లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు

జమ్మూకాశ్మీర్ : ఆర్ ఎస్ పురా సెక్టార్ లో పాకిస్తాన్  సైన్యం కాల్పులు తెగబడింది. పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో ఇద్దరు జవాన్లు, ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి. 

 

రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

భద్రాద్రి కొత్తగూడెం : జూలూరుపాడు మండలం సాయిరాంతండలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

07:49 - September 23, 2017

చిత్తూరు : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఇవాళ ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని టిటిడి అధికారులు తెలిపారు. సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఇవాళ సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

 

07:46 - September 23, 2017

హైదరాబాద్ : దేశంలో విద్యా వ్యాపారాన్ని అరికట్టిన రోజునే ... విద్యావ్యవస్థ గాడినపడుతుందని ఎస్‌ఎఫ్ఐ ప్రొఫెషనల్ విద్యార్థుల జాతీయ మహాసభలో వక్తలు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా విద్యావ్యాపారం పెచ్చుమీరిపోతుందని కానీ.. ఉపాధి అవకాశాలు మాత్రం శూన్యంగా మారాయని వారు అన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ ప్రొఫెషనల్ విద్యార్థుల జాతీయ మహాసభ 
హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో.. ఎస్‌ఎఫ్‌ఐ ప్రొఫెషనల్ విద్యార్థుల ప్రతినిధుల ఆధ్వర్యంలో జాతీయ మహాసభ ప్రారంభమైంది. ఐటీ నిపుణులు ప్రొఫెసర్ ప్రబీర్ పుర్కాయస్తా , ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఈ సభను ప్రారంభించారు. 
డిగ్రీలను అమ్మే షాప్‌లుగా విద్యా సంస్థలు : ప్రొ.ప్రబీర్ 
ప్రస్తుతం డిగ్రీలను అమ్మే షాప్‌లుగా విద్యా సంస్థలు మారాయని... ఐటీ నిపుణులు ప్రొఫెసర్‌ ప్రబీర్‌ పుర్కాయస్తా అన్నారు. సరైన విజ్ఞానాన్ని అందించకపోవడం వల్ల...డిగ్రీలు పొందిన విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వృత్తి విద్య ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించాలి : ప్రొ.నాగేశ్వర్ 
ప్రభుత్వం విద్య అందించడాన్ని ఖర్చుగా చూసినంత కాలం విద్యావ్యవస్థ కుంటుపడుతుందని.. వృత్తి విద్య ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించాల్సిన తరుణం ఆసన్నమైంది ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. 
ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలం : చుక్కా రామయ్య 
ఇంజనీరింగ్‌లో ఏడాదికి రెండు లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారని అయితే వారికి ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య విమర్శించారు. దాదాపుగా 90 శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని అన్నారు.
ప్రభుత్వాల నిర్ణయాలతో విద్యార్థులకు ఇబ్బందులు : విక్రమ్ సింగ్ 
మరోవైపు దేశంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎస్‌ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌ మండిపడ్డారు. మతతత్త్వ విధానాలను అన్ని యూనివర్శిటీల్లో తీసుకెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అయినా విద్యార్థులు మాత్రం ఈ విధానాలను తిప్పికొడుతున్నారని ఆయన అన్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభకు దేశంలోని అన్నీ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

 

07:38 - September 23, 2017

కృష్ణా : ఆక్వా సాగు పచ్చని పంట పొలాలను నాశనం చేస్తోంది, డెల్టా భూములను పనికి రాని భూములుగా మారుస్తోంది. ఆక్వా చెరువులు భూగర్భ జలాలను కలుషితం చేసి.. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
తీవ్ర నష్టాలను కలిగిస్తున్న అక్రమ ఆక్వాసాగు
ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ ఆక్వాసాగు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 7లక్షల ఎకరాలకు పైగా ఆక్వా సాగులో ఉంది. కోస్తాలోని 9 జిల్లాల సాధారణ సాగు విస్తీర్ణం 97 లక్షల ఎకరాలతో పోల్చితే ఆక్వా సాగు 7.5 శాతంగా ఉంది. ఉభయగోదావరి, కృష్ణాజిల్లాలలోనే దాదాపు 5.5 లక్షల ఎకరాల్లో ఆక్వాసాగు ఉంది. కృష్ణాజిల్లాలో ఆక్వా రంగం ఆర్థిక వనరుగా మారింది. ఆక్వా పరిశ్రమ లాభాలు తెస్తుంటే ప్రభుత్వం దీన్ని మరింత విస్తరించే పనిలో ఉంది. 
పంట భూములకు అందని సాగునీరు
కృష్ణా జిల్లాలో సాధారణ సాగు 3.3 లక్షల హెక్టార్లు. డెల్టా భూముల్లో దాదాపు 2.4 లక్షల హెక్టార్లలో వరిని సాగుచేస్తారు. అయితే ఏటా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గతేడాది 3.01 లక్షల హెక్టార్లలోనే పంటలు వేశారు. కొన్నేళ్లుగా పంట భూములకు సాగునీరు అందని పరిస్థితి తలెత్తింది. దీనివల్ల వేసిన పంట దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో చేసేదేమి లేక పొలాలను ఆక్వా చెరువులుగా మారుస్తున్నారు. ఏటా సుమారు 10 వేల ఎకరాల వరకు ఆక్వా చెరువులుగా మారిపోతున్నాయి. మండవల్లి, ముదినేపల్లి, కలిదిండి, కృత్తివెన్ను, కోడూరు, నాగాయలంక, బంటుమిల్లి, మచిలీపట్నం, ఇతర ఏరియాల్లో డెల్టా మండలాల్లో ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 
ఆక్వా చెరువులుగా మారుతున్న 30వేల ఎకరాలు
మూడెళ్లలో 30 వేల ఎకరాలకు పైగా మాగాణి పొలాలు ఆక్వా చెరువులుగా మారిపోయాయి. అయితే ఈ మార్పు చేయాలంటే అధికారుల అనుమతి తీసుకోవాలి. మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో ఇందు కోసం కమిటీలు ఉంటాయి. వీటిలో వ్యవసాయ, జలవనరుల, డ్రైనేజీ, భూగర్భ జల శాఖ, మత్స్య, రెవెన్యూ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరు దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే అనుమతులు జారీ చేస్తారు. అయితే ఈ కమిటీలతో పని లేకుండానే విచ్చలవిడిగా మారుస్తున్నారనే ఆరోపణలున్నాయి. 
రొయ్యల చెరువులుగా మారిన ఆయకట్టు భూములు
ముదినేపల్లి మండలంలో మొత్తం 28 వేల ఎకరాల పొలాలు ఉన్నాయి. ఇందులో 20 వేల ఎకరాల వరకు ఆక్వా సాగుకు మారిపోగా మిగిలింది 8 వేల ఎకరాలు మాత్రమే. కలిదిండి, కైకలూరు మండలాల్లో 3 వేల ఎకరాలు మాత్రమే ఉన్న వ్యవసాయ భూములు ఇప్పుడిప్పుడే ఆక్వా సాగుకు మారుతున్నాయి. ముదినేపల్లి మండలం నుంచి 3 కాలువలు వెళ్తాయి. గతంలో సమృద్ధిగా చివరి భూములకు అందేది. ప్రస్తుతం తగినంత నీరందక ఈ ఏడాది దాదాపు 2,500 ఎకరాలలో కొత్తగా చెరువులు తవ్వారు. రావిగుంట గ్రామంలో అన్ని ఆక్వా చెరువులుగానే ఉన్నాయి. గురజ, పేరూరు, వైవాక వంటి ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మల్లంపూడి, రామవరపుమోడి, పెదతుమ్మిడి, చినతుమ్మిడి ప్రదేశాల్లో ఆయకట్టు భూములు రొయ్యల చెరువుగా మారాయి. 
రొయ్యల చెరువులకు అనుమతి లేని వ్యవసాయ భూములు
సముద్రతీరంలో చేపలు, రొయ్యలు పెంపకానికి కేంద్ర ప్రభుత్వం 2005లో కోస్టల్ ఆక్వా కల్చరల్ అథారిటీ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ఆక్వాసాగు సముద్రం, నదులు అత్యధిక పోటు వచ్చే ప్రాంతాలకు 2 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. వ్యవసాయ భూములను ప్రభుత్వం రొయ్యల చెరువులుగా మార్చకూడదు. వ్యవసాయానికి పనికిరాని భూములను మాత్రమే రొయ్యల చెరువులకు అనుమతించాలి. మడ అడవులు, చిత్తడి, తంపర భూముల్లో రొయ్యల చెరువులకు అనుమతించకూడదు. 500లోపల జనాభాగల ఆవాసానికి 100 మీటర్ల దూరంలో, 500 కంటే ఎక్కువ జనాభా ఉంటే 300 మీటర్ల దూరంలో మాత్రమే ఆక్వాసాగుకు అనుమతించాలి. పట్టణాలకైతే ఈ నిబంధన 2 కిలోమీటర్ల వరకు వర్తిస్తుంది. మంచినీటి వనరులకు 100 మీటర్ల పరిధిలో రొయ్యల చెరువులు ఉండకూడదు. రెండు చిన్న రొయ్య చెరువుల మధ్య కనీసం 20 మీటర్లు దూరం ఉండాలి. పెద్దవైతే కనీసం 50 నుంచి 100 మీటర్ల దూరం ఉండాలి. మొత్తం రొయ్యల చెరువు భూమిలో 60 శాతం విస్తీర్ణం దాటి ఉండకూడదు. మిగిలిన 40 శాతం భూమిని గట్టు, మొక్కలు పెంపకం వంటి వాటికి వినియోగించాలి. రొయ్యల పెంపకం కోసం భూగర్భ జలాలను వినియోగించకూడదు. ప్రతి హెక్టారుకు 4 పీజోమీటర్లు గానీ, మానిటరింగ్ బోర్ వెల్స్ గానీ ఏర్పాటు చేసి భూమి లోపలి ఉప్పదనం ఎప్పటికప్పడు పర్యవేక్షించాల్సి ఉంటుంది.  
నిబంధనలకు విరుద్ధంగా ఆక్వాసాగు 
అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆక్వాసాగుకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్షనేతలు మండిపడుతున్నారు. తక్షణమే ఆక్వాసాగును తొలగించి పర్యావరణాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఆక్వాసాగుతో భూగర్భ జలాలలకూ ప్రమాదం పొంచి ఉంది. పర్యవారణానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆక్వాసాగును నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 

07:30 - September 23, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని చింతలపూడి టీడీపీ సమావేశంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నియోజకవర్గ ప్రజలను పేకాట ఆడుకొమ్మని సలహా ఇచ్చారు. పేకాట ఆడుతున్న టీడీపీ కార్యకర్తలను అరెస్టులు చేస్తే ఊరుకోనన్నారు. చాలా మాట్లాడాలని ఉందని.. క్వార్టర్‌ వేస్తే ఇంకా బాగా మాట్లాడుతానని వ్యాఖ్యానించారు. మాగంటి బాబు వ్యాఖ్యలతో అందరూ విస్తుపోయారు. ఒక ఎంపీ ఇలా మాట్లాడడం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. 

 

జమ్మూ, శ్రీనగర్ లలో భూ ప్రకంపనలు

జమ్మూకాశ్మీర్ : జమ్మూ, శ్రీనగర్ లలో భూ ప్రకంపనలు సంభవించాయి. జమ్మూకాశ్మీర్ లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గామ నమోదు అయింది. 

07:25 - September 23, 2017

హైదరాబాద్ : కృష్ణా నీటిని విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చింది. తాగునీటి అవసరాల కోసం ఇరు రాష్ట్రాలకు 22 టీఎంసీల నీటిని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు 16 టీఎంసీలు, తెలంగాణకు 6 టీఎంసీల నీటిని కేటాయిస్తూ త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
ఏపీకి 16, తెలంగాణకు 6 టీఎంసీలు
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను కేటాయించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. హైదరాబాద్‌ జలసౌధలో జరిగిన సమావేశంలో బోర్డు కార్యదర్శి సమీర్‌ చటర్జీతో పాటు తెలంగాణ నీటి పారుదుల శాఖ ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది తమకు 40.1 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ, తమకు తక్షణమే 17 టీఎంసీలు విడుదల చేయాలన్న ఏపీ విజ్ఞప్తులపై సమావేశంలో చర్చించారు. అనంతరం ఏపీకి 16, తెలంగాణకు 6 టీఎంసీల నీటిని కేటాయిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
పలు అభ్యంతరాలను బోర్డు ముందుంచిన ఏపీ, తెలంగాణ ప్రతినిధులు
ఏపీ, తెలంగాణ తరపున పాల్గొన్న ప్రతినిధులు పలు అభ్యంతరాలను బోర్డు ముందు ఉంచారు.. వాటి పై అక్టోబర్‌లో జరిగే సమావేశంలో చర్చ ఉంటుందని సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జి తెలిపారు. ఏపీకి కేటాయించిన నీటిలో హంద్రీనీవా సుజల స్రవంతికి 5, పోతిరెడ్డి పాడు 5, సాగర్ రైట్ కెనాల్‌కు 6 టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేస్తారు. తెలంగాణ కేటాయింపుల్లో కల్వకుర్తికి 4, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి కోసం రెండు టీఎంసీలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 
అనుమతి లేకుండా నీటి విడుదల తగదు : బోర్డు
మరోవైపు బోర్డు అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉమ్మడి జలాశయాల నుంచి నీరు విడుదల చేస్తున్నారంటూ రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన పరస్పర ఫిర్యాదులపైనా సమావేశంలో చర్చ జరిగింది. బోర్డు అనుమతి లేకుండా నీరు విడుదల చేయడాన్ని కూడా సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ ప్రస్తావించారు. స్థానికంగా ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచకుని చేసిన కేటాయింపుల నుంచే నీరు తీసుకున్నామని రెండు రాష్ట్రాలు చెప్పాయి. ఇక నుంచి అనుమతి లేకుండా నీరు విడుదల తగదని బోర్డు స్పష్టం చేసింది. ప్రాజెక్టుల వద్ద కనీస నీటి వినియోగ మట్టాలు ఉండేలా చూడాలని, బోర్డు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. అన్ని అంశాలను వచ్చే నెలలో జరిగే పూర్తి స్థాయి సమావేశంలో చర్చించనున్నట్లు కృష్ణా బోర్డు నిర్ణయించింది. 

 

నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుమల : ఈరోజు సాయంత్రం ధ్వజరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. నేటి నుంచి అక్టోబర్ 1 వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. 

 

నేడు వంశధార నిర్వాసిత ప్రాంతాల్లో సీపీఎం, సీపీఐ నేతలు పర్యటన

శ్రీకాకుళం : నేడు వంశధార నిర్వాసిత ప్రాంతాల్లో సీపీఎం, సీపీఐ నేతలు పి.మధు, సత్యనారాయణ పర్యటించనున్నారు. 

 

Don't Miss