Activities calendar

24 September 2017

22:03 - September 24, 2017

చిత్తూరు : జిల్లా మిట్టిండ్లు గ్రామంలో విషాదం జరిగింది. ఈతకోసం చెరువుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానికులు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. 

22:01 - September 24, 2017

హైదరాబాద్ : సింగరేణి ఎన్నికలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టిబిజికేఎస్‌ గౌరవాధ్యక్షురాలు టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత హెచ్‌ఎంఎస్‌ నేతలను మరియ ఇతర సంఘాల నాయకులను కండువా కప్పి చేర్చుకున్నారు. సీఎం కేసీఆర్‌ వల్లే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో టిబిజికేఎస్‌లో చేరుతున్నట్లు ఇతర సంఘ నేతలు తెలుపుతున్నారు.

21:58 - September 24, 2017

సిద్దిపేట : రైతు సమన్వయ సమితుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులకు మేలు జరుగుతుందన్నారు మంత్రి హరీష్‌ రావు. ఈ మేరకు ఆయన సిద్దపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయ ఆవరణలో నియోజకవర్గంలోని లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. 10 కోట్ల 27 లక్షలతో సిద్దిపేట నియోజకవర్గం ప్రజలకు సహాయం చేశామని తెలిపారు. 

21:56 - September 24, 2017

హైదరాబాద్: పర్యావరణ, పబ్లక్‌ హియరింగ్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలు, ప్రజల నిరసనలపై తాము రివ్యూ నిర్వహించామన్నారు. కొద్ది రోజుల్లో తర్వాతి నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. 

21:53 - September 24, 2017

కరీంనగర్ : జిల్లా మానకొండూరులో మూడెకరాల భూమి కోసం ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు దళిత యువకుల్లో శ్రీనివాస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న మూడెకరాల భూపంపిణీలో తమ పేర్లు లేవనే మనస్థాపంతో శ్రీనివాస్, పరశురాములు అనే యువకులు ఈనెల 3వ తేదీన ఆత్మహత్యాయత్నం చేశారు. తమ సమస్యను చెప్పుకునేందుకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కార్యాలయానికి వచ్చి... ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూసినా.. ప్రయోజనం లేకపోవడంతో మనస్తాపానికి గురై ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ మృతి చెందాడు. అయితే శ్రీనివాస్‌ ఉదయమే మరణించినా విషయం బయటకు వెల్లడించలేదు. శ్రీనివాస్‌ మృతదేహాన్ని రహస్యంగా స్వస్థలానికి తరలించారు. ఇక శ్రీనివాస్‌ మృతితో కరీంనగర్‌ జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీనివాస్‌ స్వస్థలంతో పాటు.. ఎమ్మెల్యే రసమయి కార్యాలయం ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

అంత్యక్రియలు హడావుడిగా నిర్వహించేందుకు యత్నించారు
గూడెం గ్రామానికి చేరిన శ్రీనివాస్‌ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మూడెకరాల భూమి కోసం తన భర్త మృతి చెందాడని శ్రీనివాస్‌ భార్య శ్రావణి రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. మరోవైపు ఇద్దరు చిన్నారులు నాన్న కావాలంటూ దీనంగా చూడడం అందరినీ కలిచివేసింది. మరోవైపు శ్రీనివాస్‌ అంత్యక్రియలను పోలీసులు హడావుడిగా నిర్వహించేందుకు యత్నించారు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు... కడసారైనా చూసుకోనియండి అంటూ పోలీసులు, టీఆర్‌ఎస్‌ నేతలను నిలదీశారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకుంటుండగా అడ్డుకుని సాంపద్రాయబద్దంగా అంతిమయాత్ర చేపట్టి... అంత్యక్రియలు నిర్వహించారు.

కేసీఆర్‌, రసమయి దిష్టిబొమ్మ దహనం
శ్రీనివాస్‌కు మెరుగైన చికిత్స అందించినా దక్కించుకోలేకపోయామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఇదిలావుంటే ప్రభుత్వ తీరుతోనే శ్రీనివాస్‌ మృతి చెందాడని కాంగ్రెస్‌, టీడీపీ, వామపక్షాలు ఆందోళనకు దిగాయి. మానకొండూరు, అలుగునూర్‌లో సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే రసమయి దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించింది. శ్రీనివాస్‌ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దళితులు ఆత్మహత్యాయత్నం చేసినప్పటి నుంచి అండగా నిలిచిన పార్టీలన్నీ.. శ్రీనివాస్‌ మృతితో ఆందోళనలకు సిద్దమవుతున్నాయి.

21:40 - September 24, 2017
21:26 - September 24, 2017

ఇండోర్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు వికెట్లు కోల్పోపోయి 294పరుగుల లక్ష్యాన్ని చేధిచింది. 5 వన్డేల సిరీస్ ను భారత్ 3_1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో పాండ్యా, రోహిత్, రహానే హాఫ్ సెంచరీలతో రాణించారు.

మూడో వన్డేలో భారత్ ఘన విజయం

ఇండోర్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు వికెట్లు కోల్పోపోయి 294పరుగుల లక్ష్యాన్ని చేధిచింది.

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

ఇండోర్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 206 పరుగుల వద్ద కేదార్ జాదవ్ (2) ఔట్ అయ్యాడు.

చీరాలలో చిట్టీల వ్యాపారి కుచ్చుటోపీ

ప్రకాశం : జిల్లా చీరాల కొత్తపేటలో చిట్టీల వ్యాపారి చిటీలు వేసేవారికి కుచ్చుటోపీ పెట్టాడు. రూ.70లక్షలు మోసం చేశారు. వెంటనే మోసన్ని గ్రహించిన బాధితులు పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

20:05 - September 24, 2017

గైతమి ఎక్స్ ఫ్లోజివ్ పరిశ్రమలో పేలుడు

యాదాద్రి : జిల్లా ఆలేరు మండలం టంగుటూరులో ప్రమాదం జరిగింది. గౌతమి ఎక్స్ ఫ్లోజివ్ పరిశ్రమలో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందారు, మరో ముగ్గురికి గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించారు.

శాతవాహన ఎక్స్ ప్రెస్ లో సెల్ ఫోన్ పేలుడు

 

వరంగల్: శాతవాహన ఎక్స్ ప్రెస్ లో సెల్ ఫోన్ పేలింది. ప్రయాణికులు భయందోళనతో రైలును అపారు. ప్రమాదం లేదని తెలిసి ఊరిపిపిల్చుకున్నారు.

శ్రీనివాస్ అంత్యక్రియల్లో పోలీసుల అత్యుత్సాహం

కరీంనగర్ : జిల్లా బెజ్జంకి మండలం గూడెంలో శ్రీనివాస్ అత్యక్రియల్లో పోలీసులు, టీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం చూపారు. బంధువులు రాకుండానే అత్యక్రియలు ముగించారు.

19:38 - September 24, 2017

చిత్తూరు : తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం.... తిరుమల శ్రీవారు చిన శేషవాహనంపై విహరించారు. రాత్రికి వీణాపాణియైు హంస వాహనంపై దర్శనమిస్తారు. మరోవైపు బ్రహ్మోత్సవాలు, సెలవులతో తిరుమలపై రద్దీ పెరిగింది. స్వామి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 

19:37 - September 24, 2017

విశాఖ : గంజాయి మత్తులో యువత వెర్రెత్తిపోతోంది. అందుకే దీనికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి ఎక్సైజ్‌ అధికారులు ముందడుగు వేశారు. విశాఖ ఏజెన్సీలోని గంజాయి సాగు గురించి తెలుసుకోవడానికి.. 10 టీవీ ఎక్సైజ్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సహకారంతో.. గంజాయి సాగు జరుగుతున్న ప్రాంతాలకు బయలుదేరింది.

డ్రగ్‌ మాఫియాపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం
దేశంలో ఈ మధ్య మత్తు మందుల వినియోగం పెరిగిపోయింది. ప్రధానంగా గంజాయి మత్తుకు కాలేజ్‌ విద్యార్థులు బానిసలవుతున్నారు. ఈ మధ్య హైదరాబాద్‌ డ్రగ్‌ మాఫియాపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో.. ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది. అయితే దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా.. దాని ఆనవాళ్లు మాత్రం విశాఖ మన్యంలోనే కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. దానిలో భాగంగా ఎక్సైజ్, పోలీసు విభాగంతో సంయుక్త టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. విశాఖ ఏజెన్సీలో సాగైన గంజాయిని తూర్పుగోదావరి జిల్లా మీదగా విదేశాలకు రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం ఏజెన్సీలోని 150 నుంచి 200 గ్రామాల్లో.. వేలాది ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. ప్రతీ యేటా 5 వేల టన్నుల గంజాయి ఉత్పత్తవుతోంది. వరి, ఇతర పంటలలో అంతర పంటగా దాన్ని సాగు చేస్తున్నారు.

మావోయిస్టుల భయం...
మారు మూల ప్రాంతం.. కమ్యునికేషన్స్ అసలే ఉండవు. పైగా మావోయిస్టుల భయం. దీంతో గంజాయి సాగు, రవాణాను అరికట్టడానికి పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వడం లేదు. పైగా పోలీసు అధికారులలోనూ, ఇటు ఎక్సైజ్‌ విభాగంలోనూ కొందరు గంజాయి రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నల్లమందు, లిక్విడ్ గంజాయి వినియోగం విశాఖపట్టణం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు వంటి పట్టణాల్లో అధికమవుతోంది. విశాఖ ఏజెన్సీలో 6 రోజుల పాటు టాస్క్‌ ఫోర్స్‌ టీం దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో దాదాపు 200 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి పంటను ధ్వంసం చేశారు. ఈ దాడులకు ప్రత్యేకంగా అధికారులు డ్రోన్లను కూడా ఉపయోగించారు. దళారులు గంజాయి పంటను గిరిజనుల ద్వారా పండిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఎక్కువ ధర పలికే శీలావతి గంజాయిని సాగు చేయిస్తున్నని అధికారులు తెలిపారు. 

19:35 - September 24, 2017

ప్రకాశం : ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ సీబీఐ కేసులో చిక్కుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన భార్య విజయలక్ష్మితోపాటు... సురేష్‌ పేరునూ సీబీఐ నమోదు చేసింది. 2010 ఏప్రిల్‌ 1 నుంచి 2016 ఫిబ్రవరి 29 మధ్యలో వీరు ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోళ్లు చేయడంతో చెన్నైలోని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సురేష్‌ భార్య విజయలక్ష్మి చెన్నైలోని పాండిచ్చేరి ఆదాయపన్నుశాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. సురేష్‌ కూడా గతంలో కర్నాటక, తమిళనాడు, హైదరాబాద్‌, వెస్ట్‌ బెంగాల్‌తోపాటు పంచాయతీరాజ్‌శాఖలో జేఈవోగా విధులు నిర్వర్తించారు. ఇలా రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో నిర్వహించి స్వచ్చంద పదవీ విరమణ చేశారు. ఎమ్మెల్యే సురేష్‌....కొనుగోలు చేసిన వాహనాలు, ఇళ్లు , స్థలాలు అన్ని వివరాలతో సమగ్రంగా సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ సిద్ధం చేశారు. ఏ సమయంలోనైనా సురేష్‌ను, ఆయన భార్య విజయలక్ష్మిని అరెస్ట్‌ చేసే అవకాశమున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఏడాది నుంచే నిఘా పెట్టినట్టు
సురేష్‌ ఆస్తులు, వ్యాపార వ్యవహారాలపై సీబీఐ ఏడాది నుంచే నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్‌లో మర్కాపురంలోని ఆయనకు చెందిన విద్యాసంస్థల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అంతేకాదు.. వారికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో తెలుసుకుని అన్నిచోట్ల తనిఖీలు నిర్వహించారు. సురేష్‌కు మార్కాపురం, యర్రగొండపాలెంలో స్థిరాస్తులు ఉన్నాయి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం, మర్కాపురంలోనూ కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆయన భార్య విజయలక్ష్మి పేరిటి పశ్చిమ గోదావరి, నల్లగొండ జిల్లాల్లో వ్యవసాయభూమి ఉంది. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో ఎమ్మెల్యే తనకు 11.54 కోట్ల స్థిరాస్తులు, 2.27 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్టు చూపారు. కేవలం 2010 ఏప్రిల్‌ నుంచి 2016 ఫిబ్రవరి మధ్య ఇరువరి సంపాదన, వ్యయం, ఆస్తుల కొనుగోళ్లపైనే సీబీఐ దృష్టి పెట్టింది. దీంతో అదనపు ఆస్తులను గుర్తించి కేసు నమోదు చేసింది. తనపై సీబీఐ కేసు నమోదు చేయడం పెద్ద విషయమేమీ కాదని ఎమ్మెల్యే సురేష్‌ తెలిపారు. తమకు వారసత్వంగా ఆస్తులు వచ్చాయని.. వ్యాపారం ద్వారా సంక్రమించినట్లు చెప్పారు. సీబీఐ తనపై కేసు నమోదు చేయడాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.

19:34 - September 24, 2017

గుంటూరు : 2019 ఎన్నికలకు టీడీపీ ఇప్పటినుంచే సమాయత్తమవుతోంది. రాబోయే ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా ఏ పార్టీ నిర్వహించని విధంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. మంగళగిరి సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో హెచ్‌ఆర్డీ మెంబర్‌ పెద్ది రామారావు ఆధ్వర్యంలో.. ముగ్గురు ప్రొఫెసర్లతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తొలుత టీఎన్‌ఎస్‌ఎఫ్‌ సభ్యులైన 100 మందికిపైగా శిక్షణ ఇస్తున్నారు. మూడు రోజుల పాటు.. సాధారణ శిక్షణలా కాకుండా... కార్పొరేట్‌ కళాశాల మాదిరిగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ క్లాసులు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల పాటు కొనసాగుతున్నాయి. మూడు రోజులపాటు ఎవరూ బయటకు వెళ్లకుండా అక్కడే వసతి కల్పించారు.

చంద్రబాబు విజన్‌, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై
ఇక ఈ శిక్షణ తరగతుల్లో ముఖ్యంగా... చంద్రబాబు విజన్‌, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై బోధిస్తున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి... భవిష్యత్‌లో చంద్రబాబు ఏ విధంగా ముందుకెళ్తారన్న అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. నాయకులు దురుసుగా వ్యవహరించకుండా.. కుల, ప్రాంత, ప్రాంతాలకు అతీతంగా ఎలా వ్యవహరించాలనే దానిపై శిక్షణ ఇస్తున్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇతర సోషల్‌ మీడియా విభాగాలను వాడుకునే విధానం.. తమ అభిప్రాయాలను ఎలా పంచుకోవాలో తర్ఫీదు ఇస్తున్నారు. మీడియాతో సత్సంబంధాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించుకోవడం లాంటి అంశాలపై శిక్షణ కల్పిస్తున్నారు. మంత్రి నారా లోకేష్‌ ఆలోచనల నుంచి వచ్చిన ఈ విధానం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సైతం తరగతులు
ఇదిలావుంటే... టీఎన్‌ఎస్‌ఎఫ్‌కు శిక్షణ తరగతులు పూర్తయ్యాక పార్టీ అనుబంధ విభాగాలన్నింటికీ ఇదే విధంగా శిక్షణ ఇవ్వనున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సైతం తరగతులు నిర్వహించేందుకు ప్లాన్‌ గీస్తున్నారు. కేవలం శిక్షణ ఇవ్వడమే మాత్రమే కాకుండా... వారి అభిప్రాయాలను సేకరించి పార్టీ విధానాల్లో మార్పులు తీసుకురావడం దీని ప్రత్యేకత. ఇక శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో ప్రతి మండలానికి 10 మందిని ఎంపిక చేసి.. మిగతా వారికి శిక్షణ ఇప్పించనున్నారు. 2019 నాటికి లక్ష మందికి శిక్షణ ఇప్పించాలనేది పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తానికి 2019లో 175 టార్గెట్‌ను సాధించాలంటే.. ముందు నాయకులకు సరైన శిక్షణ అవసరమని టీడీపీ భావిస్తోంది. అందకనుగుణంగా రాష్ట్రంలో లక్ష మంది సుశిక్షితులైన కార్యకర్తలను తయారు చేసేందుకు శిక్షణ ఇస్తోంది. మరి టీడీపీ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. 

19:31 - September 24, 2017

కృష్ణా : జీఎస్టీ విధానం వల్ల పెద్ద పరిశ్రమలకు ఎలాంటి నష్టం లేదని, చిన్న పరిశ్రమలు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. లైఫ్ ఇన్సురెన్స్‌ కంపెనీలకు జీఎస్టీ విధించడం దారుణమని, వెంటనే ఈ ప్రక్రియను విరమించుకోవాలన్నారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని రాఘవులు అన్నారు. ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ 49వ మహాసభలు విజయవాడలోని ఎంబీకే భవన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సభను ప్రారంభించిన రాఘవులు బీజేపీ పాలకుల విధానాలపై మండిపడ్డారు. 

19:15 - September 24, 2017
19:12 - September 24, 2017

యూపీ : వారణసిలోని బెనారస్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. యూనివర్శీటీలో లైగింక వేధింపులను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కొంత మంది విద్యార్థులు వీసీని కలిసేందుకు ప్రయత్నించారు. విద్యార్థులనుల ఆందోళనకు పలు విద్యార్ధిసంఘాలు మద్దుతు తెలిపాయి. విద్యార్థుల ఆందోళనకు పోలీసులు అడ్డుపడడంతో విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. విద్యార్థులు ప్రతిగా పోలీసులపై రాళ్లు రువ్వారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

19:02 - September 24, 2017
17:34 - September 24, 2017

వరంగల్ : ఓరుగ‌ల్లు ఇల‌వేల్పు శ్రీ భ‌ద్రకాళీ అమ్మవారి ఆల‌యంలో దేవి న‌వ‌రాత్రి ఉత్సవాలు నాలుగో రోజుకు చేరాయి. మ‌హాల‌క్ష్మీ అవతారంలో అమ్మవారు భక్తుల‌కు ద‌ర్శనం ఇచ్చింది. అర్చకులు అమ్మవారికి ఉదయం సూర్యప్రభ వాహ‌న సేవతో పాటుగా ప్రత్యేక పూజ‌లు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి ద‌ర్శనం కోసం భ‌క్తులు ఆల‌య ప్రాంగ‌ణంలో బారులు తీరారు. సాయంత్రం హంస‌వాహ‌న సేవ‌ నిర్వహించ‌నున్నట్లు ఆల‌య ప్రధాన అర్చకులు తెలిపారు.

17:26 - September 24, 2017

సంగారెడ్డి : ఆర్టీసీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎస్ డబ్ల్యూ  అధ్వర్యంలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల చైతన్య యాత్ర సంగారెడ్డి డిపోకు చేరుకుంది. ఆరు రోజుల క్రితం మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ప్రారంభమైన జీపు జాత ఇప్పటివరకు ఇరవై ఆరు డిపోలను సందర్శించి అక్కడి సమస్యలను తెలుసుకున్నామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

ఆసీస్ 293/6..

ఢిల్లీ : భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. భారత్ విజయం సాధించాలింటే 294 పరుగులు చేయాల్సి ఉంటుంది. 

17:10 - September 24, 2017

కరీంనగర్ : జిల్లా మానకొండూరులో ఉద్రిక్తత నెలకొంది. మూడెకరాల భూమి కోసం ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాస్ మృతి చెందాడు. శ్రీనివాస్ మృతితో మానకొండూరులో కాంగ్రెస్, టీడీపీ నాయకులుఆందోళనకు దిగారు. అలుగునూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే రసమయి దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం రాస్తారోకో చేపట్టారు. శ్రీనివాస్ మృతదేహం మరి కాసేపట్లో ఆయన స్వగ్రామం గూడెంకు రానుంది. దీంతో ఆ గ్రామాన్ని మొత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

రసమయి దిష్టిబొమ్మ దగ్ధం..

కరీంనగర్ : మానకొండురూలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 3న మానకొండూరు టీఆర్ఎస్ కార్యాలయం వద్ద మూడెకరాల భూమి కోసం ఆత్మహత్యాయత్నం చేసి శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై తీవ్ర ఆందోళనలు..నిరసనలు వ్యక్తమౌతున్నాయి. బెజ్జంకి బంద్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఆలుగునూరులో కాంగ్రెస్, టిడిపి నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే రసమయి దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళన చేపట్టారు. మానకొండురూలో ఎన్ఎస్ యూ ఐ నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 

16:48 - September 24, 2017

హైదరాబాద్ : దుర్గాభాయి దేశ్‌ముఖ్‌ మహిళాసభ- పి ఓబుల్‌ రెడ్డి పాఠశాలలో బాస్కెట్‌ బాల్‌ క్లస్టర్‌ 7 బాలికల బాస్కెట్‌ బాల్‌ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవానికి అపోలో హాస్పిటల్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి, ఓబుల్‌ రెడ్డి స్కూల్‌ చైర్మన్‌ ఎస్‌వి రావ్‌, సెక్రటరీ నరసింహారావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఓబుల్‌ రెడ్డి పాఠశాలలో నూతనంగా నిర్మించిన ఇండోర్‌ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభం చేశారు. 3 రోజుల పాటు బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్స్‌ జరుగుతాయని సంగీతా రెడ్డి తెలిపారు. జాతీయ స్థాయి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని క్రీడలలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. విద్యార్థులకు అత్యుత్తమ స్థాయిలో విద్యాభ్యాసాన్ని అందిస్తున్న ఓబుల్‌ రెడ్డి పాఠశాలలో ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రధానమైనవిగా భావిస్తున్నామని ఓబుల్‌రెడ్డి పాఠశాల చైర్మన్‌ విఎస్‌ రావు అన్నారు. బాస్కెట్‌ బాల్‌ క్లస్టర్‌ 7 బాలికల బాస్కెట్‌ బాల్‌ పోటీలు నిర్వహించే అవకాశం దక్కడం గర్వకారణమని స్కూల్‌ ప్రిన్సిపల్‌ అంజలి రజ్దాన్‌ అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో చాంపియన్‌ షిప్‌ కోసం 42 జట్లు పోటీపడనున్నాయి. 

16:42 - September 24, 2017

ఆసీస్ మూడో వికెట్..

ఢిల్లీ : భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా టీం మూడో వికెట్ కోల్పోయింది. 243 పరుగుల వద్ద స్మిత్ (63) ఔటయ్యాడు. 

అంబుల్ ఆసుపత్రిలో చిన్నారి మృతి..

రంగారెడ్డి : షాద్ నగర్ లోని అంబుల్ చిన్న పిల్లల ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు ఆసుపత్రిపై దాడి చేశారు. 

ఉగ్రవాద శిబిరం ధ్వంసం..

జమ్మూ కాశ్మీర్ : హంద్వారాలో ఉగ్రవాద శిబిరాన్ని భారత బలగాలు ధ్వంసం చేశాయి. ఈ దాడిలో ఉగ్రవాదుల శిబిరం నుండి భారీ ఎత్తున మందుగుండు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఫించ్ సెంచరీ..

ఢిల్లీ : భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మ్యాచ్ కొనసాగుతోంది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆరంభించింది. ఈ మ్యాచ్ లో ఫించ్ సెంచరీ సాధించాడు. 

వారసత్వ ఉద్యోగాలకై కృషి - ఎంపీ కవిత..

హైదరాబాద్ : వారసత్వ ఉద్యోగాల విషయంలో తాను ఇచ్చిన హామీని అమలు చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీ కవిత పేర్కొన్నారు. ప్రతిపక్షాలు వారసత్వ ఉద్యోగాలపై కేసులు వేయించారని విమర్శించారు.

15:42 - September 24, 2017

విశాఖ : జాతీయ, అంతర్జాతీయ వేదికలకు కేంద్రంగా ఉన్న విశాఖ నగరం మరో ఫెస్ట్‌కి వేదిక కానుంది. డిసెంబర్‌ 1 నుంచి 10వ తేదీ వరకు ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో వైజాగ్‌ ఫెస్ట్‌-2017 నిర్వహిస్తున్నట్లు నిర్వాహాకులు అజా శర్మ తెలిపారు. దీనికి సంబంధించిన లోగోను విశాఖ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆవిష్కరించారు. 2017 ఫెస్ట్‌ను ప్రజలు విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

15:41 - September 24, 2017

హైదరాబద్ : విద్యుత్‌ బిల్లులను ఆదా చేసే ఉద్దేశంతో జంట నగరాల్లోని వీధి దీపాలను ఎల్‌ఈడీ లైట్లుగా మార్చాలని జీహెచ్‌ఎంసీ చాలా కాలం క్రితమే నిర్ణయించింది. నిధులు, నిపుణుల కొరతతో ప్రాజెక్టు అమల్లో జాప్యానికి కారణమైంది. అవరోధాలను అధిగమించి ఈ ఏడాది మేలో పట్టాలెక్కిన ఎల్‌ఈడీ వీధి దీపాల ప్రాజెక్టు అమల్లో ఆశించిన పురోగతి కనిపించపోవడం విమర్శలకు తావిస్తోంది. జంట నగరాల్లో ఉన్న సోడియం వేపర్‌ వీధి దీపాలను ఎల్‌ఈడీ లైట్లుగా మార్చేందుకు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వేసెస్‌తో జీహెచ్‌ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది మే 29న కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం 4.36 లక్షల వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లు అమర్చాల్సి ఉంది. వీటిలో 70 వాట్ల ఎస్వీ ల్యాంపులు 86,934 ఉన్నాయి. అలాగే 150 వాట్ల సామర్థ్యం కలిగిన 2,34,045 ఎస్వీ ల్యాంప్‌ల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లు అమర్చాలి. ఒప్పందం కుద్చుకున్న మూడు నెలల్లో ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. నిర్ణీత గడువు ప్రకారం గత నెల 29 నాటికే ఎస్‌వీ ల్యాంప్స్‌ను ఎల్‌ఈడీ లైట్లుగా మార్చాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 25 శాతం బల్బులను మాత్రమే మార్చారు. దీంతో ప్రాజెక్టు అమలు గడవును వచ్చే నెల 19 వరకు పొడిగించారు. దీపావళిలోగా వంద శాతం వీధి దీపాలను ఎల్‌ఈడీ లైట్లుగా మార్చాలని నిర్ణయించినా.. ఈ లక్ష్యం కూడా నెరవేరే అవకాశం కనిపించంలేదు. ఈ ఏడాది చివరి పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మెటీరియల్స్‌ అందుబాటులో లేకపోవడం
ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చడంతో జాప్యానికి కారణాలు లేకపోలేదు. వీటిని అమర్చేందుకు నిపుణలైన సిబ్బంది లేరు. లైటింగ్‌ మెటీరియల్స్‌ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రాజెక్టు అమల్లో జాప్యం జరుగుతోంది. నేషనల్‌ లైటింగ్‌ కోడ్‌ ప్రకారం రోడ్డు వెడల్పును బట్టి 70 వాట్ల ఎస్వీ ల్యాంప్స్‌ ఉన్న చోట్ల 35 వాట్ల ఎల్‌ఈడీ లైట్లు అమర్చుతున్నారు. 150 వాట్ల ఎస్వీ లైట్లు ఉన్న ప్రాంతాల్లో 70 వాట్ల ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. 250 వాట్ల బల్బుల స్థానంలో 110, 190 వాట్ల లైట్లు అమర్చుతున్నారు. దీని వలన యాభై శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది. జీహెచ్‌ఎంసీకి ఏటా 250 కోట్ల రూపాయల విద్యుత్‌ బిల్లుల భారం తగ్గుంది. సరైన సర్వే చేపట్టకుండానే ప్రాజెక్టు అమలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. చేస్తున్న పనులకు, అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతనలేకుండా పోతోంది. ఇప్పటి వరకు 1.60 లక్షల ఎస్వీ ల్యాంప్‌ల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నా...సర్వేలో మాత్రం 50 వేల వీధి దీపాలనే మార్పు చేసినట్టు తేలింది. అధికారులు చెబుతున్న లెక్కలకు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన లేకుండా పోయింది.

కార్మికులకు సరైన శిక్షణ ఇవ్వలేదన్న ఆరోపణలు
ఎల్‌ఈడీ ప్రాజెక్టు అమల్లో భద్రతా చర్యలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీతో ఒప్పందం చేసుకున్న ఈఈఎస్‌ఎల్‌ కార్మికులకు సరైన శిక్షణ ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాతబస్తీలో ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లకు గాను 17 మంది కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పగించారు. కార్మికుల భద్రతను కాంట్రాక్టర్లు పట్టించుకోవడంలేదు. ఒక్కో లైటు బిగించేందుకు జీహెచ్‌ఎంసీ 260 రూపాయలు చెల్లిస్తున్నా.... కాంట్రాక్టర్లు మాత్రం 90 నుంచి 120 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని కార్మికుల నుంచి ఫిర్యాదు అందుతున్నాయి. జీహెచ్‌ఎంపీ పర్యవేక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు కార్మికులకు ప్రాణసంకంటంగా మారింది. మరోవైపు ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే పాడైపోతున్నాయన్న ఫిర్యాదులు అందుతున్నాయి. ఈఈఎస్‌ఎల్‌తో జీహెచ్‌ఎంసీ కుదుర్చుకున్న ఒప్పందంలో ఎల్‌ఈడీ బల్బుల నిర్వహణ అంశం లేదు. దీంతో పాడైపోతున్న బల్బుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడంతో వీధుల్లో అంధకారం నెలకొంటోందని కాలనీ సంక్షేమ సంఘాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. 

బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం..

ఢిల్లీ : బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా..ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. 

15:40 - September 24, 2017

విశాఖ : 2015-16 విద్యా సంత్సరంలో SSC పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ట్యాబ్‌లను పంపిణీ చేసింది. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజయల చేతులు మీదుగా విద్యార్థులు ట్యాబ్‌లు అందుకున్నారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విద్యాశాఖకు బడ్జెట్‌లో 23వేల 209 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. వీటితో అన్ని స్కూళ్లలో మౌలికవసతులు కల్పిస్తున్నామని గంటా తెలిపారు. 

హాస్టల్ భవనంపై నుండి పడిన విద్యార్థి..

ఆదిలాబాద్ : జైపూర్ లో 9వ తరగతి విద్యార్థి వెంకటేష్ మృతి చెందాడు. స్కూల్ హాస్టల్ భవనం పై నుండి కిందపడి మృతి చెందినట్లు సమాచారం. వెంకటేష్ ది కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వాసి. 

15:39 - September 24, 2017

హైదరాబాద్ : తెలంగాణలోని ప్రస్తుత సెక్రటేరియట్‌నే కొనసాగించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు వీ.హనుమంతరావు డిమాండ్‌ చేశారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం అవసరమా? లేదా? అనే అంశంపై ప్రజల నుంచి ఓట్ల ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. అందుకోసం కొన్ని సెంటర్లలో ఎన్నికల తరహాలో బ్యాలెట్ బాక్స్‌లను ఉంచుతామన్నారు. ఈనెల 27న సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో బ్యాలెట్ బాక్స్‌లను తెరుస్తామని వీహెచ్‌ చెప్పారు. 

15:38 - September 24, 2017

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలో బైక్‌ యాక్సిడెంట్‌లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బండ్లగూడలోని ఓ టైలర్‌ షాపులో పని చేస్తున్న ఉపేందర్‌, జాకీర్‌, మోహిన్‌లు కాటేదాన్‌ నుండి బండ్లగూడ వైపు బైక్‌పై వెళ్తూ.. మైలార్‌దేవ్‌పల్లి సమీపంలో డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

టెంపో బోల్తా..

జమ్మూ కాశ్మీర్ : జమ్మూలోని ఓ ప్రాంతంలో టెంపో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈఘటనలో ముగ్గురు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

15:37 - September 24, 2017

కరీంనగర్ : చనిపోయిన శ్రీనివాస్ చాలా పేదవాడు. ప్రభుత్వం అందించే దళితులకు భూ పంపిణీ స్కీమ్‌లో తనకు స్థలం వస్తుందని ఆశపడ్డాడు. అయితే స్థానిక నేతలు శ్రీనివాసరెడ్డి, ZPTC శరద్ రావు.. తమవాళ్లకే.. భూములు కేటాయించుకున్నారని... ఆత్మహత్యాయత్నం చేసిన రోజు.. 10టీవీతో వాపోయాడు. తాను చనిపోతే వాళ్లే బాధ్యత వహించాలని ఆరోజు డిమాండ్ చేశాడు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న రోజు శ్రీనివాస్ ఆవేదనను ఓసారి చూద్దాం..

శ్రీనివాస్ మృతిపై నిరసనలు..

కరీంనగర్ : శ్రీనివాస్ మృతిపై నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ఆలునూరు చౌరస్తాలో కాంగ్రెస్, టిడిపి ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే రసమయి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. బెజ్జంకిలో సీఎం దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. 

ఆదిలాబాద్ లో టీ మాస్ ఫోరం ఆవిర్భావ సభ..

ఆదిలాబాద్ : టీ మాస్ ఫోరం ఆవిర్భావ సభ జరిగింది. దేశంలో కుల అసమానతలు పెరిగిపోయాయని, హిందూ మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారని, అగ్రకుల పేదలకూ టీ మాస్ ఫోరం అండగా ఉంటుందని తమ్మినేని పేర్కొన్నారు. తెలంగాణలో పోలీసు, దొరల రాజ్యం నడుస్తోందని, టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం సాగిస్తున్నాయని పేర్కొన్నారు. 

మోడీతో మాట్లాడిన సిక్కోలు విద్యార్థులు..

శ్రీకాకుళం : మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రధాని మోడీతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలను నివారించి రైతు సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని ప్రధాని మోడీని విద్యార్థులు కోరారు. 

టీఎస్ ఆర్టీసీ సర్వర్ డౌన్..

హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ టికెట్ రిజర్వేషన్ సిస్టమ్ సర్వర్ డౌన్ అయ్యింది. దీనితో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగ సీజన్ లో ప్రతిసారి సర్వర్ డౌన్ కావడం వల్ల కార్మిక సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

14:38 - September 24, 2017
14:37 - September 24, 2017

కరీంనగర్ : దళితులకు మూడేకరాల భూమి ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ నాయకులు కొందరు దళితుల వద్ద డబ్బులు వసూల్ చేసి వారి మరణానికి కారణమయ్యారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన శ్రీనివాస్, పరుశరాము అనే దళిత యుకులు మూడేకరాల భూమి కోసం దరాఖస్తు చేసుకున్నారు. కానీ బెజ్జంకి స్థానిక జడ్పీటీసీ శరత్ రావు వారి నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో వారు ఆత్మహత్యాయత్ననికి పాల్పడ్డారు. వారిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ అనే యువకుడు మరణించాడు. టీఆర్ఎస్ నేతల స్వర్థానిక ఓ దళిత యువకుడు బలి కావడం దారణమని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

14:36 - September 24, 2017

కరీంనగర్ : జిల్లాలో మానకొండూరులో 3ఎకరాల భూమి ఇవ్వలేదన్న మరస్థాపంతో ఆత్మహ్యకు యత్నించిన ఇద్దరు యువకుల్లో శ్రీనివాస్ మృతి చెందారు. హైదరాబాద్ లోని యశోదాలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు గూడెం గ్రామంలో భూపంపిణీలో అన్యాయం జరిగిందని ఈనెల 3న ఎమ్మెల్యే రసమయి కార్యాలయం ముందు శ్రీనివాస్, పరశురాములు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. శ్రీనివాస్ మృఇ నేపథ్యంలో మానకొండూరు టీఆర్ఎస్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:54 - September 24, 2017

హైదరాబాద్ : టీసర్కార్ చేపట్టిన దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ ఒక నిండు ప్రాణం తీసింది. అర్హులకు కాకుండా అనర్హులుకు మూడు ఎకరాల భూ పంపిణి చేశారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసుకున్న అర్హుడైన వ్యక్తి మృతి చెందారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో 3 ఎకరాల భూమి ఇవ్వలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు యువకుల్లో శ్రీనివాస్ మృతి చెందారు. గూడెం గ్రామంలో దళితులకు భూపంపిణీలో అన్యాయం జరిగిందని ఈనెల 3న మానకొండూరు టీఆర్ ఎస్ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకుని శ్రీనివాస్, పరశురాములు నిప్పంటించుకున్నారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఇవాళ శ్రీనివాస్ మృతి చెందారు. ఈనేపథ్యంలో మానకొండూరు టీఆర్ ఎస్ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే శ్రీనివాస్ మృతిని వైద్యులు, పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. శ్రీనివాస్ మృతితో స్వగ్రామం బెజ్జంకి మండలం గూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆస్పత్రి వద్ద శ్రీనివాస్ గుండెలవిసేలా రోధిస్తుంది. 
మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ 
'శ్రీనివాస్ మృతి చాలా బాధాకరం. శ్రీనివాస్ ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత. సీఎం కేసీఆర్ పై 306కింద కేసు నమోదు చేయాలి. ప్రభుత్వం అనర్హులకు భూమి పంపిణీ చేసింది' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:33 - September 24, 2017
13:21 - September 24, 2017

ఏపీ రాజధాని డిజైన్లపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి కొణిజేటి రమేష్, టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, రాజేశ్వర్ రావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:02 - September 24, 2017

భూమి కోసం ఆత్మహత్యయత్నం చేసిన శ్రీనివాస్ మృతి..

కరీంనగర్ : యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. ఈనెల 3న మానకొండూరు టీఆర్ఎస్ కార్యాలయం వద్ద మూడెకరాల భూమి కోసం పెట్రోల్ పోసుకుని శ్రీనివాస్, పరుశురాములు ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. 

మన్ కీ బాత్ కి మూడేళ్లు..

ఢిల్లీ : మన్ కీ బాత్ కార్యక్రమం మూడేళ్లు పూర్తి చేసుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఎంతో మంది సూచనలు..సలహాలు..విజ్ఞప్తులు చేశారని, దేశ వ్యాప్తంగా ప్రజలతో అనుసంధానం కోసం మన్ కీ బాత్ బాగా ఉపయోగపడిందన్నారు. ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సాహించాలని..పండుగలు..ఉత్సవాల్లో ప్రజలు ఖాదీ బహుమతులివ్వాలని పిలుపునిచ్చారు. ఖాదీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నట్లు, వచ్చే గాంధీ జయంతి రోజున ఖాదీ ఉత్పత్తులను కొనాలన్నారు. స్వచ్చతే సేవ కార్యక్రమం విజయం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. 

12:59 - September 24, 2017

రంగారెడ్డి : జిల్లాలోని షాబాద్‌ మండలం సంకేపల్లిగూడలో ఉన్న లక్ష్మీనివాస్‌ భారత్‌ గ్యాస్‌ గోదాములో దొంగతనం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు 221 సిలిండర్లను ఎత్తుకెళ్లారు. దొంగతనాన్ని గుర్తించిన గ్యాస్‌ ఏజెన్సీ సిబ్బంది పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. 

12:58 - September 24, 2017

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం భగవాన్‌ కాలనీలోని హెబ్రోను చర్చిలో నిధుల వినియోగంపై రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం  గొడవకు దారితీసింది.  హైదరాబాద్‌ నుంచి బౌన్సర్లను రప్పించిన ఒకవర్గం మరో వర్గంపై దాడికి యత్నించింది. పోలీసులు వచ్చి రెండు వర్గాలను శాంతింపచేశారు.

 

ప్రతి జర్నలిస్టుకు సొంతిల్లు ఇవ్వడమే లక్ష్యం - కాల్వ..

విజయవాడ : జర్నలిస్టు వృత్తి అత్యంత విశిష్టమైనదని, జర్నలిజమనేది ఉద్యోగం కాదని..సమాజం పట్ల ఓ బాధ్యత అని మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టుకు సొంతిల్లు ఇవ్వడమే తన లక్ష్యమన్నారు. సీఎం చంద్రబాబు కూడా ఈ విషయంలో చిత్తశుద్ధితో ఉన్నారని, రిటైర్డ్ జర్నలిస్టులకు రూ. 3వేల పెన్షన్ అంశం పరిశీలనలో ఉందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు చాలా వరకు అరికట్టడం జరిగిందని, 26న జర్నలిస్టు సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. 

12:56 - September 24, 2017

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీ అన్నపూర్ణా దేవి దర్శనార్ధం క్యూలైన్లలో.. భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. దీంతో అమ్మవారి దర్శనానికి చాలా సమయం పడుతోంది. కుంకుమ పూజ అనంతరం గంట నుంచి క్యూలైన్‌లు కదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఐపీ భక్తుల సేవలో దుర్గ గుడి అధికారులు, పాలకమండలి సభ్యులు తరిస్తున్నారని మండిపడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం....

12:55 - September 24, 2017

మంచిర్యాల : సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు యూనియన్‌కు వచ్చే నెల 5న ఎన్నికలు జరుగనున్నాయి. పోటీలో ఉన్న అన్ని సంఘాలు  కార్మికులను ఆకట్టుకునేందుకు గేటు మీటింగులు నిర్వహిస్తున్నాయి. కార్మికులను కలుసుకుని తమకు ఓట్లేయాలని కోరుతున్నాయి. గతంలో గుర్తింపు పొందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారం విఫలమైందని సీఐటీయూ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

12:54 - September 24, 2017

చిత్తూరు : జిల్లాలో ఏసీబీ వలలో పూతలపట్టు తహశీల్దార్‌ సుధాకరయ్య చిక్కారు. క్వారీకి ఎన్‌వోసీ మంజూరు చేసేందుకు ఓ వ్యక్తి నుంచి.. 2 లక్షల రూపాయలు తీసుకుంటుండగా... ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 

12:44 - September 24, 2017

కృష్ణా : జిల్లా బందరు పోర్టు పనులను ఈ ఏడాది చివరికి ప్రారంభిస్తామని.. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు చెప్పారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. పోర్టుకు సంబంధించి కొన్ని ఆటంకాలున్నాయని, సమస్యలను అధిగమించి పనులను ప్రారంభిస్తామన్నారు. విజయవాడ, మచిలీపట్నం, నాలుగు లైన్ల రహదారి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. ఏడాది లోపు నిర్మాణం పనులు పూర్తవుతాయన్నారు. జిల్లాలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. 

 

12:33 - September 24, 2017

యాదాద్రి : జిల్లాలోని చౌటుప్పల్‌లో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉంటున్న రమాదేవి అనే మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రమాదేవికి.... నాలుగు నెలల క్రితమే గుంటూరు జిల్లాకు చెందిన ప్రదీప్‌తో వివాహం జరిగింది. తన మరణానికి ప్రదీప్ కారణమని ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కొనసాగుతున్న ఎన్ కౌంటర్..

జమ్మూ కాశ్మీర్ : యూరీ సెక్టార్ లో ఉగ్రవాదులకు..భారత బలాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతమైనట్లు తెలుస్తోంది. 

12:15 - September 24, 2017

రాజన్న సిరిసిల్ల : మిడ్‌ మానేరు ముంచేసింది. ప్రాజెక్టు పూర్తి కాకముందే నీరు విడుదల చేయడంతో నాలుగు ముంపు గ్రామాల ప్రజలకు ముప్పు వాటిల్లుతోంది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలంలోని మల్క్‌పేట, కొదురుపాక, నీలోజీపల్లి  గ్రామాల ప్రజలు పెట్టే బేడ, తట్టా బుట్టా సద్దుకుని, పిల్లాపాపలతో తలదాచుసుకునేందుకు వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరోవైపు తమకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించకుండా నీరు విడుదల చేయడాన్ని నిరిస్తూ  చీర్లవంచ నిర్వాసితులు కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు చేశారు.
డ్యామ్‌ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు 
రాజన్నసిరిసిల్ల జిల్లాలో నిర్మిస్తున్న మిడ్‌ మానేరు డ్యామ్‌ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం, పునర్నిర్మాణం కల్పించలేదు. పరిహారం కూడా ఇవ్వలేదు. అయినా మిషన్‌ భగీరథ కోసం ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి ప్రభుత్వం ప్రాజెక్టులోని నీరు విడుదల చేయడంతో ముంపు గ్రామాల ప్రజలు లబోదిబో మంటున్నారు. 
మిడ్‌ మానేరు డ్యాముకు నీరు విడుదల
మిడ్‌ మానేరు డ్యాముకు ప్రభుత్వం నీరు విడుదల చేసింది. ఒకటి... రెండు టీఎంసీలు కాదు.. ఏకంగా ఒకేసారి నాలుగు టీఎంసీల నీరు నిల్వ చేస్తుండటంతో ముంపు గ్రామాల ప్రజలకు ప్రమాదం ముంచుకొస్తోంది. నిర్వాసిత గ్రామాల ప్రజలకు పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించలేదు. పునరావాసం, పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టలేదు. ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా నీరు విడుదల చేయడంతో ప్రజలు ఊర్లను ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారు. 
ఎక్కడికి పోవాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బాధితులు  
మిడ్‌ మానేరు డ్యామ్‌కు ఇప్పుడు  విడుదల చేస్తున్న నీటితో బోయిన్‌పల్లి మండలంలోని మల్కపేట్‌, కొదురుపాక, నీలోజీపల్లి నీటిమునిగిపోయే ప్రమాదం పొంచివుంది. నీరు విడుదల అంశం నెల రోజులు ముందు చెప్పినా... ముందుగానే ఏదో ఒక్కచోటుకు తరలిపోందుకు ఆస్కారం ఉండేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా ఒక్కసారిగా నీరు విడుదల చేయడంతో ఎక్కడికి పోవాలని బాధితులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 
పరిహారం కింద ప్రభుత్వం ఇచ్చింది అంతంత మాత్రమే
పరిహారం కింద ప్రభుత్వం ఇచ్చింది అంతంత మాత్రమే. డబుల్‌ బెడ్‌ రూము ఇళ్లు కట్టిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరలేదు.  ఈ పరిస్థితుల్లో  మిడ్‌ మానేరుకు నీరు విడుదల చేయడంతో తామెక్కడ తలదాచుకోవాలని నిర్వాసితులు ప్రభుత్వాన్ని పశ్నిస్తున్నారు. 
నిర్వాసితులు రాస్తారోకో  
మరోవైపు మిడ్‌ మానేరుకు నీరు విడుదల నిలుపుదల చేయాలంటూ తంగళ్లపల్లి మండలం చీర్లవంచ నిర్వాసితులు రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ వద్ద రాస్తారోకో  చేశారు.  ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించకుండా, పునరావాసం, పునర్నిర్మాణం కల్పించకుండా నీరు విదడల చేయడాన్ని తప్పుపడుతున్నారు. జిల్లా కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌... ఆందోళనకారులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. పరిహారం విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన కలెక్టర్‌... నీరు విడుదల ఆపడం తన పరిధిలోని లేని అంశమని తేల్చి చెప్పారు. దీంతో ఆందోళనకారులు తమకు పూర్తి పరిహారం చెల్లించిన తర్వాతే  వీర్లవంచ నుంచి తరలిపోతామని స్పష్టం చేస్తున్నారు. మిడ్‌ మానేరు నిర్వాసితుల ఆందోళనకు వివిధ పార్టీల నాయకులు అండగా నిలుస్తున్నారు. ఎప్పుడో ప్రారంభించే  మిషన్‌ భగీరథకు ఇప్పుడే నీరు విడుదల చేయడం ఎందుకని పశ్నిస్తున్నారు. నీరు విడదల చేసే ముందే పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించి ఉండాల్సిందంటున్నారు. అలాంటిదేమీ లేకుండా ఒక్కసారిగా నీరు విడుదల చేయడం సరికాదంటున్నారు. 

 

12:08 - September 24, 2017

విజయవాడ : బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలను మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

12:06 - September 24, 2017
12:02 - September 24, 2017

నివేదా థామస్..టాలీవుడ్ లో ఈమె నటించిన పలు చిత్రాలు వరుసగా విజయవంతమౌతున్నాయి. దీనితో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఆమె నటించిన వరుస మూడు చిత్రాలు విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేసింది. ఆమె నటించిన తాజా చిత్రం 'జై లవ కుశ' మంచి విజయంతో ముందుకు దూసుకెళుతోంది. ‘జెంటిల్ మెన్' చిత్రంతో ఈ మలయాళి భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ‘జెంటిల్ మెన్' లో 'నాని' సరసన 'నివేదా' నటించింది. అనంతరం మరోసారి ఇదే జంటగా 'నిన్ను కోరి' సినిమా వచ్చింది. ఈ చిత్రం కూడా హిట్ టాక్ ను అందుకుంది. అనంతరం 'ఎన్టీఆర్' హీరోగా 'బాబీ' దర్శకత్వంలో 'నందమూరి కళ్యాణ్ రామ్' నిర్మాణంలో వచ్చిన 'జై లవ కుశ' సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం కూడా మంచి విజయానే నమోదు చేయడమే కాకుండా అద్బుతమైన వసూళ్లను సాధిస్తోంది.

ఈ సందర్భంగా ఆమె అభిమానులకు ధన్యవాదాలు తెలియచేస్తూ ట్విట్టర్ లో ఓ లెటర్ ను పోస్టు చేశారు. ఒక సినిమా హిట్ అవడం ప్రత్యేకమని, మొదటి మూడు సినిమాలను అభిమానులు బాగా ఆదరించారని పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ సొంత మనిషిలా చూసిందని..ఇంతకన్నా పెద్ద ప్రశంస ఏమీ ఉండదన్నారు. దీనిన తాను ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు..అభిమానులకు, కుటుంబసభ్యులకు ఎలా ధన్యవాదాలు చెప్పినా తక్కువేనన్నారు. ‘జై లవ కుశ' కు ఇంత పెద్ద విజయం అందించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, మరో అందమైన చిత్రం..మరో పాత్రతో కలుస్తానని 'నివేదా థామస్' లేఖలో పేర్కొన్నారు. 

12:00 - September 24, 2017

కేరళ : అక్టోబర్‌ విప్లవ శత వార్షికోత్సవాలను పురస్కరించుకుని కేరళలోని కొచ్చిలో దక్షిణాసియా దేశాల వామపక్షాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీపీఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశాలను ప్రారంభించిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం  ఏచూరి అక్టోబర్‌ విప్లవ ప్రాముఖ్యతను వివరించారు. సామ్యవాద సమాజం స్థాపనకు ఈ విప్లవం ఎంతగానో దోహదం చేసిందన్నారు. సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు దక్షిణాసియా దేశాలు సామాజ్ర్యవాదం, మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. కార్మికులు, కర్షకులను ఏకం చేసిన గొప్ప చరిత్ర అక్టోబర్‌ విప్లవానికి ఉందని సీతారాం ఏచూరి చెప్పారు. సీపీఎం పాలిత కేరళ, త్రిపురల్లో ఉద్రిక్తతలను సృష్టించేందుకు మతోన్మాద శక్తులు చేసిన ప్రయత్వాలు ఫలించలేదని సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్న కేరళ ముఖ్యమంత్రి పనిరయి విజయన్‌ చెప్పారు.  ప్రజల్లో లౌకిక భావాలను పెంపొందించేందుకు ప్రగతిశీల వామపక్ష శక్తులు చేసిన కృషే ఇందుకు కారణమన్నారు. 
-------

11:57 - September 24, 2017

బ్రాండ్ అంబాసిడర్ గా 18 ఏళ్ల యువకుడు..

ఢిల్లీ : శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన 18ఏళ్ల బిలాల్ దార్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. దాల్ సరస్సులో సుమారు 12వేల కిలోల వ్యర్థాలను బిలాల్ దార్ తొలగించాడు. 

టిప్పర్ కు విద్యుత్ షాక్..

నల్గొండ : మర్రిగూడ మండలం మాల్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణలో భాగంగా మట్టిని ఆన్ లోడ్ చేస్తుండగా టిప్పర్ వైర్లు తగిలి విద్యుత్ సరఫరా తగిలింది. టిప్పర్ డ్రైవర్ శ్రీనివాస్ కు విద్యుత్ షాక్ తగిలింది. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఏసీబీకి చిక్కిన తహశీల్దార్..

తిరుపతి : పూతలపట్టు తహశీల్దార్ సుధార్ అయ్య ఏసీబీకి చిక్కాడు. క్వారీకి ఏన్ వోసీ మంజూరు చేసేందుకు ఓ వ్యక్తి నుండి రూ. 2 లక్షలు తీసుకుంటుండగా అయ్యను పట్టుకున్నారు.

 

విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ కు గుండెపోటు..

సూర్యాపేట : మోతె పీఎస్ హెడ్ కానిస్టేబుల్ రాజు మృతి చెందాడు. విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రాజుకు గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. 

11:38 - September 24, 2017

గుర్మీత్ సింగ్ ను తాను ఎక్కడ వివాహం చేసుకుంటానోనని హనీప్రీత్ తనను దూరంగా పెట్టేందని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వెల్లడించారు. డేరా స్వచ్చ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. అత్యాచారం కేసులో ఆయన్ను సీబీఐ దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఆయన దత్తపుత్రిక పేర్కొంటున్న హనీప్రీత్ సింగ్ ఆచూకీ ఇంకా తెలియరావడం లేదు. హనీ పీర్త్ సింగ్...గుర్మీత్ సంబంధాలపై పలు వార్తలు..ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం గుర్మీత్ సింగ్..హనీప్రీత్ జీవిత ఆధారంగా బాలీవుడ్ లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఇందులో బాలీవుడ్ హాట్ నటి 'రాఖీ సావంత్' నటిస్తోంది. ఈ సందర్భంగా 'ఎ డైలాగ్ విత్ జేసీ' అనే ఛాట్ షోలో రాఖీ పాల్గొని సంచలన విషయాలు వెల్లడించిందంట. గుర్మీత్ ను తాను కలుస్తానంటే హనీ ప్రీత్ ఒప్పుకొనేది కాదని..ఎందుకు తెలియదని పేర్కొన్నారు. ఎక్కడ గుర్మీత్ ను పెళ్లి చేసుకుంటానోనని తనని దూరంగా పెట్టేదని, తనకు మూడేళ్లుగా గుర్మీత్..హనీప్రీత్ తో పరిచయం ఉందని వెల్లడించారు. గుర్మీత్ తన పుట్టిన రోజు సందర్భంగా తనను డేరా ఆశ్రమానికి ఆహ్వానించారని, కానీ అది హనీ ప్రీత్ కు నచ్చేది కాదని, కానీ ఇలా ఆడవారి జీవితాలతో ఆడుకుంటాడని...మగవారిని నపుంసుకల్ని చేస్తాడని ఊహించలేదని 'రాఖీ సావంత్' పేర్కొన్నారు. ఆమె గుర్మీత్..హనీ ప్రీత్ జీవిత ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో 'రాఖీ' ఎలా నటించనుందో..ఎలాంటి సంచలన విషయాలు వెల్లడిస్తారో వేచిచూడాలి. 

శేషాచలం అడవుల్లో...

చిత్తూరు : శేషాచలం అడవుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వారిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. దీనితో వారు పోలీసులపైకి రాళ్ల దాడి చేసి పారిపోయారు. ఈ ఘటనలో ఒకరిని టాస్క్ ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

10:55 - September 24, 2017

ఢిల్లీ : ఉత్తర అండమాన్‌కు ఆనుకుని గల్ఫ్‌ ఆఫ్‌ మార్టబన్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. లక్షదీవుల నుంచి కేరళ, దక్షిణ బంగాళాఖాతం మీదుగా రాయలసీమ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంలో ఆదివారం నుంచి రాయలసీమలో, సోమవారం నుంచి కోస్తా, తెలంగాణలో భారీవర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం మార్టబన్‌లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి పశ్చిమంగా పయనిస్తే అల్పపీడనంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తాల్లో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ
తెలిపింది. అలాగే రెండు రోజులపాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. 

 

10:53 - September 24, 2017

అమెరికా : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్‌ను ఉతికి ఆరేశారు. పాక్ ఉగ్రవాదానికి ఊతమిస్తూ ఉగ్రవాదులను తయారు చేసే కేంద్రంగా తయారైందని ఆరోపించారు. పాకిస్థాన్ టెర్రరిస్థాన్‌గా మారిందన్నారు. పాక్ ఉగ్రవాదులను తయారు చేస్తే భారత్ డాక్టర్లు, సైంటిస్టులను తయారు చేసిందన్నారు. భారత్ ఐఐటీలు, ఐఐఎంలు ఏర్పాటు చేస్తే పాకిస్థాన్ లష్కర్ ఎ తొయిబా, జైష్ ఎ మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలను ఏర్పాటు చేసిందని సుష్మ ఎద్దేవా చేశారు. 

 

10:51 - September 24, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారికి 30 కిలోల బరువున్న బంగారు ఆభరణాన్ని ప్రవాస భారతీయుడు కానుకగా అందజేశాడు. ఎం.రామలింగరాజు అనే ఎన్‌ఆర్‌ఐ 11 కోట్ల రూపాయలతో శ్రీవారికి సహస్రనామ కాసులహారం చేయించాడు. ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా... శనివారం బ్రహ్మోత్సవ వేడుకల్లో కాసులహారం అందజేశారు.

 

10:45 - September 24, 2017

విశాఖ : ధనుంజయ ట్రావెల్స్‌ బస్సు యాజమాన్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నుండి హైదరాబాద్‌ వెళ్లేందుకు 50 మంది ప్రయాణికులు.. ఆన్‌లైన్‌లో టికెట్‌లు బుక్‌ చేసుకున్నారు. తీరా బస్సు ఎక్కే సరికి చిరిగిన సీట్లు, పని చేయని టీవీ, ఏసీ, పుష్‌ బ్యాక్‌లతో ప్రయాణికులు షాకయ్యారు. నేరుగా బస్సును తీసుకొని విశాఖ పోర్త్‌ టౌన్ స్టేషన్ తీసుకువచ్చి ఆందోళన చేశారు. కంప్లైంట్‌ ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకు బస్సు కదిలేది లేదన్నారు. బస్సు తరపున వచ్చినవారు తాగి ప్రయాణికులతో అతిగా మాట్లాడటంతో గొడవ పెద్దగా మారింది. దీంతో సీఐ రాంబాబు రంగంలోకి దిగారు. బస్సుపై కంప్లైంట్ తీసుకొని ప్రయాణికులకు నచ్చజెప్పారు. కొంతమంది ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే కానీ బస్సు ఎక్కమన్నారు. దీంతో కంప్లైంట్‌ తీసుకొని రిసిప్ట్‌ అందజేశారు. 

హెబ్రో చర్చీలో వివాదం..

భద్రాద్రి : భద్రాచలం భగవాన్ కాలనీలో హెబ్రోను చర్చిలో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. హైదరాబాద్ నుండి బౌన్సర్లను ఓ వర్గం తెప్పించడంతో వివాదం మరింత ముదిరింది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు.  

ప్రభుత్వాసుపత్రిలో మగశిశువు మృతి..

కృష్ణా : నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన మగశిశువు మృతి చెందాడు. శిశువు మృతికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని నూజివీడు పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మైలవరం ఆసుపత్రిలో శిశువు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 

10:29 - September 24, 2017

మహబూబ్ నగర్ : జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరుగుతోంది. శనివారం లక్షా 75వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. లక్షా64 వేల 68 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో... శ్రీశైలానికి కూడా వరద ప్రవాహం పెరిగింది. తెలంగాణలోని కల్వకుర్తి ఎత్తిపోతలకు శ్రీశైలం నుంచి 16 వందల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం సాగర్‌ ప్రాజెక్టు కుడి కాలువ రెండు గేట్ల ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రెండు రోజులపాటు తర్వాత 7 వేల క్యూసెక్కులు చొప్పున 6 టీఎంసీల వరకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

10:28 - September 24, 2017

హైదరాబాద్ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పర్యావరణ ప్రభావ నివేదిక తయారీకి.. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అంగీకరించింది. వారం రోజుల్లో విధివిధానాలు ఖరారవనున్నాయి. ఢిల్లీలో జరిగిన కేంద్ర పర్యావరణ సలహా సంఘం సమావేశంలో..  పీఆర్ ఎల్ ఐఎస్ ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలు పరిశీలించారు. విధి విధానాలను జారీ చేయడానికి అంగీకరించినట్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చీఫ్‌ ఇంజనీర్‌ తెలిపారు. సలహా సంఘం సమావేశానికి చెందిన మినిట్స్‌.. వారంలో అందుతాయని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.

 

అక్రమ భూ విక్రయానికి పాల్పడిన వారికి జైలు శిక్ష..

మేడ్చల్ : అక్రమ భూ అమ్మకానికి పాల్పడిన వ్యక్తులకు జైలు శిక్ష పడింది. తప్పుడు రికార్డులతో భూ విక్రయానికి పాల్పడిన ఆవుషాపూర్ వాసులు కొట్టి రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డిలకు నెల జైలు శిక్ష, రూ. 1000 చొప్పున జరిమాన విధించింది. 2012 అదే గ్రామానికి చెందిన కొట్టి అంజిరెడ్డికి రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డిలు భూమి అమ్మారు. 

నవ వధువు సూసైడ్..

యాదాద్రి : చౌటుప్పల్ హనుమాన్ నగర్ లో నవ వధువు రమాదేవి (20) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులే కారణమని సూసైడ్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

 

జగ్గయ్యపేట తహశీల్దార్ చంద్రశేఖర్ పై సస్పెన్షన్ వేటు

కృష్ణా : జగ్గయ్యపేట తహశీల్దార్ చంద్రశేఖర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇసుక పాలసీ అమలులో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై చంద్రశేఖర్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. 

 

హోమ్ గార్డ్ పై దాడికి యత్నం

అమరావతి : మంగళగిరి మండలం చిన్నకాకానిలో విధి నిర్వహణలో ఉన్న హోమ్ గార్డ్ పై దాడికి యత్నం చేశారు. రూరల్ పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఏపీ రాజధాని డిజైన్లపై భిన్నవాదనలు

ఏపీ రాజధాని డిజైన్లపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి కొణిజేటి రమేష్, టీడీపీ ఎమ్మెల్సీ బొచ్చుల అర్జునుడు, రాజేశ్వర్ రావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

చిత్తూరు : తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. చినశేషవాహనంపై శ్రీవారు ఊరేగుతున్నారు. 

జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్..ఉగ్రవాది హతం

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ లోని యూరి ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. 
 

07:58 - September 24, 2017
07:55 - September 24, 2017
07:51 - September 24, 2017
07:36 - September 24, 2017

ప్రకాశం : వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ దంపతుల ఆస్తులపై సీబీఐ గురిపెట్టింది. మొత్తం 18 ప్రాంతాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించింది. అక్రమాస్తుల రికార్డులనూ సిద్దం చేసింది. వాటి ఆధారంగానే ఎఫ్‌ఐఆర్‌ నకూడా నమోదైంది. ఎమ్మెల్యే సురేష్‌, అతని భార్య విజయలక్ష్మిని సీబీఐ ఏక్షణమైనా అరెస్ట్‌చేసే అవకాశముంది.

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ సీబీఐ కేసులో చిక్కుకున్నారు.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన భార్య విజయలక్ష్మితోపాటు... సురేష్‌ పేరునూ సీబీఐ నమోదు చేసింది. 2010 ఏప్రిల్‌ 1 నుంచి 2016 ఫిబ్రవరి 29 మధ్యలో వీరు ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోళ్లు చేయడంతో చెన్నైలోని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సురేష్‌ భార్య విజయలక్ష్మి చెన్నైలోని పాండిచ్చేరి ఆదాయపన్నుశాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.  సురేష్‌ కూడా గతంలో కర్నాటక, తమిళనాడు, హైదరాబాద్‌, వెస్ట్‌ బెంగాల్‌తోపాటు పంచాయతీరాజ్‌శాఖలో జేఈవోగా విధులు నిర్వర్తించారు. ఇలా రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో నిర్వహించి స్వచ్చంద పదవీ విరమణ చేశారు.  ఎమ్మెల్యే సురేష్‌....కొనుగోలు చేసిన వాహనాలు, ఇళ్లు , స్థలాలు అన్ని వివరాలతో సమగ్రంగా సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ సిద్ధం చేశారు. ఏ సమయంలోనైనా సురేష్‌ను, ఆయన భార్య విజయలక్ష్మిని అరెస్ట్‌ చేసే అవకాశమున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. 
 
సురేష్‌ ఆస్తులు, వ్యాపార వ్యవహారాలపై సీబీఐ ఏడాది నుంచే నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్‌లో మర్కాపురంలోని ఆయనకు చెందిన విద్యాసంస్థల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.  అంతేకాదు.. వారికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో తెలుసుకుని అన్నిచోట్ల తనిఖీలు నిర్వహించారు. సురేష్‌కు మార్కాపురం, యర్రగొండపాలెంలో స్థిరాస్తులు ఉన్నాయి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం, మర్కాపురంలోనూ కొంత వ్యవసాయ భూమి ఉంది.  ఆయన భార్య విజయలక్ష్మి పేరిటి పశ్చిమ గోదావరి, నల్లగొండ జిల్లాల్లో వ్యవసాయభూమి ఉంది. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో ఎమ్మెల్యే తనకు 11.54 కోట్ల స్థిరాస్తులు, 2.27 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్టు చూపారు. కేవలం 2010 ఏప్రిల్‌ నుంచి 2016 ఫిబ్రవరి  మధ్య ఇరువరి సంపాదన, వ్యయం, ఆస్తుల కొనుగోళ్లపైనే సీబీఐ దృష్టి పెట్టింది. దీంతో అదనపు ఆస్తులను గుర్తించి కేసు నమోదు చేసింది. 

తనపై సీబీఐ కేసు నమోదు చేయడం పెద్ద విషయమేమీ కాదని ఎమ్మెల్యే సురేష్‌ తెలిపారు. తమకు వారసత్వంగా ఆస్తులు వచ్చాయని.. వ్యాపారం ద్వారా సంక్రమించినట్లు చెప్పారు. సీబీఐ తనపై కేసు నమోదు చేయడాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.
 

07:34 - September 24, 2017

హైదరాబాద్ : ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖలపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందా అంటే... ఇటీవల ఎక్సైజ్‌శాఖ టెండర్ల ప్రక్రియ చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. సంక్షేమ పథకాల అమలుకు నిధులు సేకరించాలనే దానిపై దృష్టి సారించిన అధికారులు.... సర్కార్‌ ఖజానాకు గండికొడుతున్న అంశాలపై పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్ర ఖజానాకు రావాల్సిన భారీ మొత్తం రాకుండాపోయింది. 

తెలంగాణ సర్కార్‌ ఖజానాకు వచ్చే ఆదాయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో మద్యం షాపుల టెండర్ల దరఖాస్తులపై దృష్టి సారించిన అధికారులు... ప్రధాన ఆదాయాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. 

హైదరాబాద్‌ నగరంలో ఇటీవల జరిగిన మద్యం షాపుల టెండర్లలో దరఖాస్తుల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం గడించినా... షాపులు కొత్తవారికి కేటాయించడంలో ఎక్సైజ్‌ శాఖ విఫలమైంది. దీంతో మద్యం వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. గ్రేటర్‌ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలోని 412 దుకాణాలకు 5,778 దరఖాస్తులు రాగా... హైదరాబాద్‌లో 183 దుకాణాలకు కేవలం 660 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక వీటిలో సుమారు 84 షాపులకు ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే వచ్చిందంటే ... మద్యం వ్యాపారులు ఏ విధంగా సిండికేట్‌ అయ్యారో అర్ధమవుతోంది. 

మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్‌ ధర లక్ష రూపాయలుగా నిర్ణయించారు. గతంలో 50 వేలు ఉండగా... దానిని లక్షకు పెంచారు. షాపు దక్కినా.. దక్కకపోయినా దరఖాస్తుకు చెల్లించిన లక్ష రూపాయలు తిరిగి చెల్లించరు. దీంతో హైదరాబాద్‌లోని మద్యం వ్యాపారులంతా కుమ్మక్కై దుకాణాలను పంచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు వస్తే... హైదరాబాద్‌లో తక్కువ మొత్తం మాత్రమే రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

ఇతర జిల్లాల్లో మద్యం షాపుల కోసం ఒక్కొక్కరు ఐదు నుంచి 10 దరఖాస్తులు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. అయితే... భాగ్యనగరంలో వ్యాపారులంతా సిండికేట్‌ కావడంతో కేవలం లక్ష రూపాయలతోనే షాపు దక్కించుకోవడం విశేషం. మరోవైపు ఒక వ్యక్తికి ఒక్క షాపు మాత్రమే కేటాయించాల్సి ఉండగా.. రాజకీయ నాయకుల అండదండలతో ఒక్కొక్కరు అనేక షాపులు పొందారు. మొత్తానికి ఎక్సైజ్‌శాఖ అధికారుల ఉదాసీనత వైఖరి వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. మద్యం దరఖాస్తులపై దృష్టిపెట్టిన అధికారులు.... మద్యం వ్యాపారంపై వచ్చే ఆదాయాన్ని పట్టించుకోకపోవడంతో సర్కార్‌ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని పలువురు ఆరోపిస్తున్నారు. 

తిరుమలలో ఘనంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

చిత్తూరు : తిరుమలలో ఘనంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకు చినశేషవాహనం, రాత్రి 9 గంటలకు హంసవాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. 

 

నేడు సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు పర్యటన

సిద్ధిపేట : నేడు సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో వన్డే

కోల్ కతా : నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే జరుగనుంది. కోల్ కతాలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

 

07:18 - September 24, 2017

భూపాలపల్లి జయశంకర్‌ : జిల్లాలో టీ మాస్‌ ఆవిర్భావ సభ విజయవంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం నుంచి భారత్‌ ఫంక్షన్ హాల్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కోయ కళాకారులు నృత్యాన్ని ప్రదర్శించారు. జూన్‌ రెండున వచ్చిన అసలు తెలంగాణ కాదని... తెలంగాణలో సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉందని   సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక అంతరాలను తగ్గించేందుకు టీ మాస్‌ కృషి చేస్తుందన్నారు. 

 

07:15 - September 24, 2017

యాదాద్రి : పోరాటం ద్వారా ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందన్నారు అరుణోదయ సమాఖ్య చైర్మన్‌ విమలక్క. యాద్రాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గందమల గ్రామంలో బహుజన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొని బతుకమ్మ ఆడారు. ఊర్లలో ప్రజల మధ్య చక్కని అనుబంధం ఉంటుందన్నారు. అలాంటి గ్రామాలను ప్రాజెక్టులు కట్టి ముంచొద్దన్నారు విమలక్క. వేలాదిమందిని నిర్వాసితులు చేసే ప్రాజెక్టులు అవసరమా ? అని ఆమె ప్రశ్నించారు. గంధమలలో ప్రాజెక్టులు అవసరం లేదని... దీని కోసం ప్రజలంతా పోరాటం చేయాల్సిన అవసరముందని విమలక్క అన్నారు. 

07:12 - September 24, 2017

హైదరాబాద్ : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియాను ప్రైవేటీకరణ చేస్తారన్న వార్తల నేపథ్యంలో.. ఆ సంస్థ ఉద్యోగులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ప్రయివేటీకరణ బారి నుంచి డిసిఐని రక్షించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ డిసిఐ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హైదరాబాద్‌ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ను కలిశారు. లాభాల్లో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టడం దారుణమైన విషయమని పవన్‌ అన్నారు. 

 

07:09 - September 24, 2017

విజయవాడ : ఏపీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలను టీడీపీ అధిష్టానం ఎన్నుకుంది. రాష్ట్ర కమిటీలతో పాటు జాతీయ, పొలిట్‌బ్యూరో సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పొలిట్‌బ్యూరోలో స్వల్ప మార్పులు చేశారు. తెలంగాణ నుంచి రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్కకు చోటుకల్పించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నందమూరి హరికృష్ణను కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

టీడీపీ పొలిట్‌బ్యూరో, జాతీయ, తెలుగు రాష్ట్రాల కమిటీల ఏర్పాటుపై కసరత్తు పూర్తయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పార్టీ సీనియర్లతో సమావేశమైన చంద్రబాబు.. పొలిట్‌బ్యూరోలో 17 మంది సభ్యులు ఉంటారని స్పష్టం చేశారు. కొత్తగా తెలంగాణ నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి,  సీతక్కకు పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించినట్టు చెప్పారు. ఇటీవల పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి, రమేశ్‌ రాఠోడ్‌ స్థానంలో వీరిద్దరికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటికే పొలిట్‌బ్యూరోలో అంతా సీనియర్లే ఉన్నందునా.. పెద్దగా మార్పులు చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కమిటీలో 105  మంది, తెలంగాణ కమిటీలో 114 మంది ఉంటారని ప్రకటించారు. తెలంగాణ కమిటీకి ఎల్‌.రమణ అధ్యక్షుడిగా, రేవంత్‌రెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ కమిటీకి అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉంటారని తెలిపారు. త్వరలోనే పార్టీ అనుబంధ సంఘాలు,  కమిటీలు ప్రకటించనున్నట్టు సీఎం వెల్లడించారు. ఇక టీడీపీ జాతీయకమిటీలో ఐదుగురు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు అధికార ప్రతినిధులు ఉంటారని తెలిపారు.  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ కొనసాగుతారని వెల్లడించారు. 

టీడీపీ పొలిట్‌బ్యూరో అధ్యక్షులుగా చంద్రబాబు ఎన్నికయ్యారు. సభ్యులుగా అశోకగజపతిరాజు, యనమల, చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, దేవేందర్‌గౌడ్‌, ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి, రావుల, సోమిరెడ్డి, ప్రతిభాభారతి, అయ్యన్నపాత్రుడు, నామా నాగేశ్వరరావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్క ఉంటారు. నటుడు నందమూరి హరికృష్ణ స్థానం టీడీపీలో పదిలంగా ఉంది. ఆయన ప్రస్తుతం టీడీపీ పొలిట్‌బ్యూరోలో కొనసాగుతున్నారు. హరికృష్ణ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదనే విమర్శలు ఉన్నా...కొత్తగా ఏర్పడిన పొటిట్‌బ్యూరోలో హరికృష్ణను టీడీపీ అధిష్టానం కొనసాగించింది.  

07:06 - September 24, 2017

హైదరాబాద్ : నిర్దేశించిన సమయానికే మిషన్‌ భగీరథను  పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఇంటింటికి మంచినీరు ఇచ్చే ఈ పథకం పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.  దేశ వ్యాప్తంగా ఈ పథకానికి వస్తున్న పేరు ప్రతిష్టల పట్ల కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథపై కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికే మిషన్‌ భగీరథను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  ఇంటింటికి మంచినీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనని చెప్పానని... అందుకే అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.  మిషన్‌ భగీరథ పనులను రెండు భాగాలుగా విభజించుకోవాలన్నారు. పార్ట్‌-1ను ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా పూర్తి చేయాలని, మరో ఆరు నెలల్లో పార్ట్‌-2ను పూర్తి చేయాలని ఆదేశించారు.  దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేయడం అందరికీ గర్వకారణమన్నారు. 

జిల్లాలు, సెగ్మెంట్ల వారీగా ఇన్‌టేక్‌వెల్స్‌, వాటర్‌ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓహెచ్‌బిఆర్‌ నిర్మాణం, పైపులైన్ల నిర్మాణం, ఎలక్ట్రో మోటార్‌ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు.  మొత్తం 24,225 ఆవాస ప్రాంతాలకు మంచినీరు అందించాలనే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 3,431 గ్రామాలకు మంచినీరు అందిస్తున్నామన్నారు. అక్టోబర్‌ చివరినాటికి మరో 5,443 గ్రామాలకు, నవంబర్‌ చివరి నాటికి మరో 6,606 గ్రామాలకు, డిసెంబర్‌ చివరి నాటికి మిగిలిన 9,345 గ్రామాలకు మంచినీరు అందిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 

మిషన్‌ భగీరథ పూర్తికావడంలో విద్యుత్‌శాఖది కీలకపాత్రని కేసీఆర్‌ అన్నారు.  2017 డిసెంబర్‌ 31 లక్ష్యంగా మిషన్‌ భగీరథ పనులు చేపట్టగా... విద్యుత్‌శాఖ మాత్రం రెండు నెలల ముందే తమకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చిందని కేసీఆర్‌ ప్రశంసించారు.  ఇక ఫ్లోరైడ్‌ పీడిత మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి మొదట మంచినీరు అందించాలని సీఎం ఆదేశించారు.  ఈ రెండు నియోజకవర్గాల్లో అక్టోబర్‌ చివరినాటికే పనులు పూర్తి చేసి, అంతర్గత పనులు కూడా చేపట్టాలని ఆదేశించారు.  రాష్ట్రంలోని అన్ని గిరిజన తండాలు, దళిత వాడలు, గోండు గూడేలకు మంచినీరు అందించాలని సూచించారు.

పాలేరు సెగ్మెంట్‌ పరిధిలోని పాత వరంగల్‌ జిల్లా మండలాలకు నీరందించే పనులు నత్తనడకన సాగడంపై కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.  పాలేరు ద్వారా 1706 ఆవాస ప్రాంతాలకు నీరు అందించాలన్నారు.  మరో రెండు నెలల్లో పనులన్నీ పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  మిషన్‌ భగీరథతో పరిశ్రమలకు కూడా శుద్ది చేసిన మంచినీటిని అందించాలని  సీఎం అధికారులకు సూచించారు.  నగర పంచాయతీలకు కూడా మిషన్‌ భగీరథతోనే బల్క్‌ సప్లై చేయాలని స్పష్టం చేశారు.
 

నేడు ఆదిలాబాద్ జిల్లాలో టీమాస్ ఫోరం జిల్లా ఆవిర్భావ సభ

ఆదిలాబాద్ : నేడు జిల్లాలో టీమాస్ ఫోరం జిల్లా ఆవిర్భావ సభ జరుగనుంది. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కంచ ఐలయ్య, ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొనున్నారు. 

 

నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

ఢిల్లీ : నేటి నుంచి ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. రెండు రోజులపాటు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

Don't Miss