Activities calendar

25 September 2017

21:38 - September 25, 2017

రోమ్ : ఇటలీ ఎయిర్‌ షోలో విషాదం చోటుచేసుకుంది. విన్యాసాలు చేస్తున్న ఓ విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఫైలెట్‌ మృతి చెందాడు. రోమ్‌కు 110 కిలోమీటర్ల దూరంలో టెరాసినా సముద్రతీరంలో ఎయిర్‌ షో నిర్వహించారు. ఇటలీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పలు విమానాలు ఈ ప్రదర్శనలో పాల్గొని విన్యాసాలు చేశాయి. ఎయిర్‌షోను తిలకించేందుకు వేల మంది పర్యాటకులు సముద్రతీరానికి చేరుకున్నారు. ఇంతలో మిలిటరీ విభాగానికి చెందిన యూరోఫైటర్‌ జెట్‌ ఒకటి సముద్రంలో కూలిపోయింది. విమానం తుదిదశ విన్యాసం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్‌ మృతిచెందాడు. ఘటన జరిగిన వెంటనే అధికారులు గాలింపు చర్యలు చేపట్టి పైలట్‌ మృతదేహాన్ని వెలికితీశారు. అయితే విమానం కూలడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

21:37 - September 25, 2017

రాంచి : జార్ఖండ్‌లోని కుమార్డూబి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తోంది. 

21:35 - September 25, 2017

ఢిల్లీ : దేశరాజధాని నిరసనలతో హోరెత్తిపోయింది. జంతర్‌ మంతర్‌ దగ్గర విద్యార్థి సంఘాలు, ఐద్వా ర్యాలీ చేపట్టాయి. బెనారస్‌ యూనివర్శిటీ విద్యార్థినిలపై లాఠీచార్జ్‌కు నిరసనగా ఆందోళనకు దిగాయి. ఆదివారం యూనివర్శిటీలోని విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన వారితో పాటు... లాఠీచార్జ్‌కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

21:34 - September 25, 2017

కరీంనగర్/ జగిత్యాల : జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌ టి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు 16 ఫీట్ల బతుకమ్మను తయారు చేశారు. యాభై మంది మహిళలు కలిసి ఏడు క్వింటాల పూలతో బతుకమ్మను తయారు చేశారు. స్థానిక పొన్నాల గార్డెన్‌ నుండి న్యూబస్టాండ్‌ మీదుగా తహశీల్‌ చౌరస్తా టవర్‌ సర్కిల్‌ నుండి మినీ ట్యాంక్‌బండ్‌ వరకు బతుకమ్మను ఊరేగిస్తూ మహిళలు ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. గత సంవత్సరం 14 ఫీట్ల బతుకమ్మ తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో నమోదైందని... ఆసారి 16 ఫీట్లతో ఆ రికార్డ్‌ అధిగమించినట్లు తెలిపారు. 

21:33 - September 25, 2017

యాదాద్రి :జిల్లా భువనగిరిలోని గ్యాంగ్‌స్టర్‌ నయిం ఇంటికి IT అధికారులు నోటీసులు అంటించారు. బినామీ ఆస్తుల లావాదేవీలపై ఐదుగురు కుటుంబ సభ్యుల పేర్లతో నోటీసులు ఇచ్చారు. అక్టోబర్‌ 3లోగా సమధానం ఇవ్వాలని ఆదేశించారు.. తల్లి తహెర బేగం, సోదరి సలీమా బేగం, హుస్సేన బేగం.. సహైలబేగం... హీనాకౌసర్‌ పేర్లతో నోటీసులు పంపారు.

21:30 - September 25, 2017

కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఏసీబీ తడాఖా చూపించింది...ఈ మధ్యకాలంలో ఎన్నో సంచలనాలకు కేంద్రమైన ఏసీబీ తన పంథాను కొనసాగిస్తుంది..మధ్యలో షార్ట్‌బ్రేక్ ఇచ్చినట్లే ఇచ్చిన ఏసీబీ మరో భారీ అవినీతి తిమింగలాన్ని పట్టుకుంది..ఈ సారి పట్టుబడ్డ ఆఫీసర్‌ ఆస్తుల విలువ ఎంతో తెలుసా...? అక్షరాలా ఐదువందల కోట్లకు పైనే ఉంది...అతను ఎవరో కాదు...ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి డైరెక్టర్...గొల్ల వెంకటరఘు.

ఏపీ టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్‌ గా
ఏపీ టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్‌ గొల్ల వెంకట రఘు ఆస్తులు వెలికి తీసినకొద్దీ బయటపడుతుండడంతో ఏసీబీ అధికారులే విస్తుపోతున్నారు...గుంటూరు జిల్లా మంగళగిరిలో నివాసం ఉంటున్న రఘు ఇంట్లో 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.రఘు నివాసంతో పాటు విజయవాడ, చిత్తూరు, నెల్లూరు, షిర్డీ, విశాఖ ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖ టౌన్‌ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్‌ ఎన్‌వి రఘు, అతని స్నేహితుడు బాలగంగాధర్‌ రెడ్డి ఇంట్లో.. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గొల్ల వెంకటరఘు ఆస్తుల చిట్టా బయటపడుతుంది...భార్య,కూతురు, అత్తగారిపేరుతో వివిధ ప్రాంతాల్లో ఆస్తులను గుర్తించారు.. దాదాపు స్థలాలు...భూములే ఉన్నట్లు అధికారులకు డాక్యుమెంట్లు దొరికాయి.

21:28 - September 25, 2017

ఢిల్లీ : ఇంటింటికీ 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా కలను సాకారం చేసే 'సౌభాగ్య పవర్ స్కీమ్'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి ఉత్సవం, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా.. మోదీ ఈ ప్రకటన చేశారు. ఈ పథకానికి 16,320 కోట్లను ప్రకటిస్తున్నట్లు మోదీ తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని చిట్టచివరి ఇంటికి కూడా నిరంతర విద్యుత్‌ సరఫరా అందజేయడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. సౌభాగ్య పవర్‌ స్కీమ్‌ కింద బీపీఎల్‌ కార్డుదారులు ఉచితంగా విద్యుత్‌ను పొందవచ్చని తెలిపారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 18 వేల గ్రామాల్లోని 3 కోట్ల ఇళ్లు లబ్ది పొందనున్నాయి. కేంద్రం భరించే 16,320 కోట్ల వ్యయంతో కొంత భాగం రాష్ట్రాలు వెచ్చించాల్సి ఉంటుంది. 

జమ్మలమడుగు టౌన్ బ్యాంక్ లో డీఆర్ వో తనిఖీలు

కడప : జిల్లా జమ్మలమడుగులో టౌన్ బ్యాంక్ డీఆర్ వో తనిఖీలు నిర్వహించారు. రూ.2కోట్ల మేర అవినీతి జరగినట్లు నిర్ధారించి కేసు నమోదు చేశారు. 

బోర్డు తిప్పేసిన బోగస్ ఐటీ కంపెనీ

హైదరాబాద్ : మాదాపూర్ లో ఓ బోగస్ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. మార్వెట్ ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 50 మంది నిరుద్యోగుల నుంచి రూ.కోటి వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో బాధితులు స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐటీ కంపెనీ ఎండీ మహ్మద్ అన్వర్, యూకుబ్ జానీని అరెస్ట్ చేశారు. 

జయలలిత మృతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ

చెన్నై : దివంగత జయలలిత మృతిపై విచారణకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి అర్ముగస్వామి తమిళనాడు ప్రభుత్వం నియమించింది.

20:15 - September 25, 2017

నోరు జారుతున్నారు. సై అంటే సై అంటున్నారు. తెరవెనుక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నీకంత సీన్ లేదంటే నీకంత సీన్ లేదంటున్నారు. నువ్వెంతంటే నువ్వెంతని సవాల్ విసురుతున్నారు.. ఏం జరుగుతోంది? నార్త్ కొరియా మొండితనం, పెద్దన్న మూర్ఖత్వానికి ఫలితం ఏం కాబోతోంది? ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అసలీ ఉద్రిక్తతలకు కారణం ఎవరు? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం..

ఓ పక్క బెదిరింపులు...మరోపక్క ఆంక్షలు..ఆకాశం నుంచి మిస్సైళ్లు.. సముద్రతలం నుంచి యుద్ధ నౌకలు.. ఉత్తరకొరియాను పిప్పి చేస్తాం అని ట్రంప్ పళ్లు నూరుతుంటే.., పోవోయ్.. నీకంత సీన్ లేదు.. నీ తాట తీస్తా అంటున్నాడు ఉత్తరకొరియా కిమ్. ఈ ఇద్దరి వ్యవహారం శృతిమించి యుద్ధంగా పేలితే అది ప్రపంచానికి తీరని ముప్పు కావటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.ఉత్తరకొరియా..అన్ని విషయాల్లోనూ అమెరికా కంటే చిన్నదే. నో డౌట్. కానీ మొండితనంలో మాత్రం తక్కువది కాదు. నా జోలికొస్తే నేను నష్టపోయినా నిన్ను వదలను అనే తరహాలో కనిపిస్తోంది. అసలు ఉత్తర కొరియా ధైర్యమేంటి. ఆంక్షల వలయం చుట్టుముడుతున్నా అణుపరీక్షలు కొనసాగించటంలో ఆంతర్యమేంటి.

ఉత్తర కొరియాతో అమెరికా తలపడుతుందా? చిన్నదేశం కొరియాకు అంత శక్తి ఉందా? అసలు కొరియా అమెరికాకు ప్రత్యర్థిగా ఎందుకు మారింది? అమెరికాను సవాల్ చేసే పరిస్థితికి ఎందుకొచ్చింది? ఆయుధాలు ఎందుకు సమకూర్చుకుంటోంది? ఈ పరిస్థితులకు ప్రపంచ పెద్దన్న ఎంత వరకు కారణం.. తినటానికి తిండి లేకపోయినా చేతిలో ఆయుధం కావాలి. అభివృద్ధి అంతంత మాత్రమే అయినా, ఆయుధాగారం నిండుగా ఉండాలి.. విద్య, సామాజిక అబివృద్ధి మాట తర్వాత.., బడ్జెట్ లో మెజారిటీ కేటాయింపులు అణ్వాయుధాలకే కేటాయిస్తున్న పరిస్థితి అనేక ప్రపంచ దేశాల్లో ఇప్పుడు కనిపిస్తున్నదృశ్యం .. దీనికి కారణం ఎవరు? పేదరికం, అవిద్య, వెనుకబాటుతనం వర్ధమానదేశాలను వేధిస్తున్నాయి. అభివృద్ధి క్రమంలో ఈ రంగాలపై ఆ దేశాలు దృష్టి పెట్టాల్సిన సందర్భం ఇది. కానీ, అమెరికా ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని పరిహసిస్తూ, తన ప్రయోజనాల కోసం, ప్రపంచంపై తన పట్టుకోసం సామంత రాజ్యాల తరహాలో మెలగమంటే సాధ్యమయ్యే పని కాదు. ఆ క్రమంలో ఆంక్షలు, బెదిరింపులు ఎన్ని చుట్టుముట్టినా పోరాటానికి దిగే వాళ్లూ ఉంటారు. ఇప్పుడు ఉత్తరకొరియా మొండితనం వెనుక ఇలాంటి కారణాలే కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:11 - September 25, 2017
20:10 - September 25, 2017

14 మందికి జీవిత ఖైదు

నిజామాబాద్ : జిల్లాలోని ఫారెస్ట్ అధికారి గంగయ్య హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ సెషన్ కోర్టు 14 మందికి జీవిత ఖైదు విధించింది. 2013 సెప్టెంబర్ 14న నల్లవెల్లి అటవీ ప్రాంతంలో అటవీఝభూముల అక్రమణను అడ్డుకున్న ఘటనలో హత్య జరిగిన విషయం తెలిసిందే.

19:54 - September 25, 2017

క్రూడయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయని దానివల్ల పెట్రోల్ ధరలు పెరిగాయని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చమురు కంపెనీలు నష్టల్లో ఉన్నాయని, వాటిని గట్టిఎక్కించేందుకు ప్రస్తుత తమ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్రలకు పెట్రోల్ పై పన్నుల రూపంలో ఆదాయం పొందుతున్నాయని బిజెపి నేత రాకేష్ రెడ్డి అన్నారు. ఈ రోజు క్రూడయిల్ ధర 50 డాలర్లకు పడియిందని కానీ బిజెపి ప్రభుత్వం రెట్లు పెంచుకుంటుపోతున్నాయని, వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఇప్పుడు సామాన్యుడిపై ఉక్కుపాదం మోపుతోందని, రాష్ట్రప్రభుత్వాలు కూడా వంట గ్యాస్ పై హామీలిచ్చారని, ఏపీ ప్రభుత్వం డీజిల్ పై 4 శాతం ఎక్కువగా వసూల్ చేస్తోందని, పెట్రోల్ , డీజిల్ ను ఎందుకు జీఎస్టీని తీసుకురాలేదని, చిన్న పిల్లలకు వాడే నాప్ కిన్స్ కు జీఎస్టీలోకి తీసుకొచ్చిందని సీపీఎం నేత బాబురావు అన్నారు. బిజెపి అధికారంలోకి రావడానకి వంద రోజులు ధరలు తగ్గిస్తామని చెప్పి గ్యాస్ పై రూ. పెంచ్చి గ్యాస్ సబ్సీడి ఎత్తివేయాలని ప్రభుత్వం చూస్తోందని, గతంలో కాంగ్రెస్ హయంలో ఏ పథకాలు ఉన్నాయో అవే కొనసాగిస్తున్నారు. ఇతర ఆసియా దేశాల్లో చాలా తక్కువ ఉన్న ప్రెటోల్ ధర మన దేశంలో మాత్రం రూ.75ఉందని, బిజెపి ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారన్ని మోపుతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ అన్నారు.

19:52 - September 25, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో విద్యశాఖ ఉద్యోగులు వివాదాస్పదంగా ప్రవర్తించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో పై వేస్ట్ మెటీరియల్ పడెశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

సౌభాగ్య యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని

ఢిల్లీ : ప్రధాని మోడీ సౌభాగ్య యోజన పథకాన్ని ప్రారంభించారు. ఇంటింటికి విద్య, విద్యుత్, మౌలిక సౌకర్యాలు కల్పన కోసం ఈ పథకంలో ఉంటాయి. 

నయీం ఇంటికి ఐటీ నోటీసులు

యాదాద్రి : భువనగిలో గ్యాంగ్ స్టర్ నయీం ఇంటికి ఐటీ అధికారులు నోటీసులు అంటించారు. ఐదుగురు కుటుంంబ సభ్యుల పేర్లతో నోటీసులు ఉన్నాయి. నోటీసులో సహైలబేగం,హీనాకౌసర్ పేర్లతో ఉన్నాయి. అక్టోబర్ 3లోగా సమాధానం ఇవ్వలని ఐటీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. 

18:51 - September 25, 2017

కృష్ణా : విజయవాడలో దసరా ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. సెప్టెంబర్ 27, 28, 29 తేదీల్లో బందరు రోడ్‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో దాండియా దసరా ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు నేహా జైన్, సుమన్ మీనా తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేశ సంప్రదాయాలతో కూడిన వస్త్రాలు ధరించి గుజరాతీయులు ఆడిపాడారు. దాండియా టికెట్లు.. కఫుల్‌కు వెయ్యిరూపాయలు.. ఫ్యామిలీకి 2 వేల రూపాయలుగా నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. 

18:50 - September 25, 2017

పశ్చిమగోదావరి : గత ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామిలను చంద్రబాబు మరిచిపోయారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చాక ఆరునెలల వ్యవధిలో రిజర్వేషన్‌లు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామిలను నెరవేర్చాలని ముద్రగడ డిమాండ్‌ చేశారు. 

18:49 - September 25, 2017

విశాఖ : ప్రపంచ టూరిజం డే సందర్భంగా ఈ నెల 27న విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అక్టోబర్‌ 2 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అమరావతి, తిరుపతి, రాజమండ్రికి చందిన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. విశాఖ ఉత్సవ్‌, అరకు, భీమిలి ఫెస్టివల్స్‌తో పాటుగా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, కుకింగ్‌ ఒలంపియాడ్‌ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 

18:48 - September 25, 2017

ప్రకాశం : గ్రామీణ వైద్యుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఒంగోలులో జరిగిన జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 7వ మహాసభలో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ, గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలోని పేదలకు ప్రథమ చికిత్స అందిస్తున్న గ్రామీణ వైద్యులను ప్రశంసించారు.

18:47 - September 25, 2017

గుంటూరు : అమరావతిలో తాడికొండ అడ్డరోడ్డు వద్ద.. సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తాటికొండ అడ్డరోడ్డునుంచి బస్టాండ్‌ వరకూ పాదయాత్ర చేపట్టారు.. గుంటూరు నుంచి వెలగపూడి సచివాలయాలయానికి నాన్‌స్టాప్‌ బస్సులు ఏర్పాటు చేసినా... అన్ని స్టాపుల్లో ఆపుతున్నారని మండిపడ్డారు.. నాన్‌స్టాప్‌ బస్సును ఆర్డినరీ బస్సుగా మార్చి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.. బయోమెట్రిక్‌ విధానం అమలులోకి రావడంతో ఆఫీసుకు ఆలస్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

18:46 - September 25, 2017

గుంటూరు : శంకర్‌ విలాస్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి పునర్‌నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు రోడ్డు భవనాల శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి, నక్కా ఆనందబాబు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌తో కలిసి నగరంలో పర్యటించిన ఆయన శంకర్‌ విలాస్‌ బ్రిడ్జిని పరిశీలించారు. 150 కోట్లతో బ్రిడ్జ్‌ నిర్మాణం చేసేందుకు ప్లాన్‌ రూపొందిస్తున్నామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. 

18:45 - September 25, 2017

పశ్చిమగోదావరి : జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య మళ్లీ వర్గ విభేదాలు తలెత్తాయి. మాజీ మంత్రి పీతల సుజాత... టీడీపీ నేత ముత్తారెడ్డి వర్గాల మధ్య అంతర్గత పోరు మరోసారి బయటపడింది.. పార్టీ సీనియర్‌ నేతలను పీతల సుజాత పట్టించుకోవడంలేదంటూ జడ్పీటీసీ, ఎంపీటీసీ లు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 22న జరిగిన సమావేశంలో మంత్రుల సమక్షంలోనే రెండు వర్గాల నేతలు వాగ్వాదానికి దిగారు. వారి సమస్యను పరిష్కరిస్తామని మంత్రులు హామీ కూడా ఇచ్చారు.. ఈ హామీని నెరవేర్చలేదంటూ 20 మంది ఎంపీటీసీ లు, ఇద్దరు జడ్పీటీసీ లు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. 

18:44 - September 25, 2017

హైదరాబాబ్ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మరో గౌరవం దక్కింది.. ప్రతిష్టాత్మకమైన ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరమ్‌.... పవన్‌ను ఎక్సలెన్స్‌ అవార్డుతో సత్కరించనుంది.. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి పీడితులను ఆదుకున్న తీరు, సామాజిక సమస్యల పరిష్కారంలో పవన్‌ చూస్తున్న చొరవ, సుసంపన్నమైన సమాజ స్థాపనకు ఆయన చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును అందజేయాలని నిర్ణయించింది.... నవంబర్‌ 17న లండన్‌లోని హౌస్‌ ఆఫ్ లార్డ్స్‌లో జరగనున్న ఇన్వెస్ట్‌ న్యూ ఇండియా సభలో ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు.

18:42 - September 25, 2017

ముస్సోరి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్సోరిలోని అఖిల భారత సర్వీసు అధికారుల శిక్షణ కేంద్రంలో ప్రసంగించారు. ఇక్కడ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు మూడు వారాల మిడ్‌ కెరీర్‌ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీనియర్‌ అధికారులు, ఫౌండేషన్‌ కోర్సులో ఉన్న ట్రైనీ అధికారుల సంయుక్త సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న సవాళ్లు, సాధిస్తున్న విజయాలు, కొత్త రాజధాని నిర్మాణం తదితర అంశాలను వివరించారు. అభివృద్ధిలో సాంకేతికతకు పెద్దపీట వేశామని తెలిపారు.

18:41 - September 25, 2017

కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ అధికారులు పంజా విసిరారు. స్టేట్‌ టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ గొల్ల వెంకటరఘుతో పాటు ఆయన బినామీ.. విజయవాడ నగరపాలక సంస్థలో జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ నల్లూరి వెంకట శివప్రసాద్‌ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రఘు 500 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించారని అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో ఏకకాలంలో 23 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. దాడుల్లో పెద్ద మొత్తంలో బంగారం, నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. రఘు ఆస్తులు చూసి ఏసీబీ అధికారులకే కళ్లు బైర్లు కమ్మాయి. మంగళగిరి నివాసంలో 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రఘుకు బొమ్మలూరు 1033 గజాల ఇంటి స్థలం, కండపేని లేఔట్‌లో 220 గజాల ఇంటి స్థలం, చిత్తూరు జిల్లా పులివెల్లంలో కుమార్తె పేరున 428 గజాల ఇంటి స్థలం, అత్త పేరున విశాఖలో 167 గజాల స్థలం, షిర్డీలో సాయి సురాజ్‌కుంజ్‌ పేరిట డూప్లెక్స్‌ ఇల్లు, లాడ్జీ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక శివప్రసాద్‌ సతీమణి గాయత్రి గతంలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో టెక్నికల్‌ ఇంజనీర్‌గా పని చేసి ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేశారు. గాయత్రి పేరు మీద భారీ మొత్తంలో డాక్యుమెంట్లు, బంగారు నగలు లభించాయి. శివప్రసాద్‌ ఇంట్లో 8 కిలోల బంగార ఆభరణాలు, 10 కిలోల వెండి, 43 లక్షల నగదు పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 

18:39 - September 25, 2017

హైదరాబాద్ : కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనివర్సిటీల్లో విద్యార్థులపై దాడులు పెరిగిపోయాయని యూత్‌ కాంగ్రెస్‌ నేత అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రోహిత్‌ వేముల ఘటన నుంచి నేటి బనారస్‌ యూనివర్సిటీ గొడవ వరకు కేంద్ర ప్రభుత్వ తీరే కారణమన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం ముందు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గుండు గీయించుకుని నిరసన తెలిపారు. 

18:37 - September 25, 2017

మహబూబ్ నగర్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనకు రైతులందరూ సహకరించాలని గవర్నర్ నరసింహన్ కోరారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా నాగసాలలో నిర్వహించిన భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. భూరికార్డుల ప్రక్షాళనను గవర్నర్ ప్రత్యక్షంగా పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అధికారులు రైతుల ఇంటికి వచ్చి భూ ప్రక్షాళన చేపడతారని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. రైతుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టకొని ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. 

18:36 - September 25, 2017

హైదరాబాద్ : నవంబర్‌ 2 నుంచి 5 వరకు ప్రపంచ ఇస్‌టాప్‌- సెపక్‌తక్ర పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు క్రీడాశాఖ మంత్రి పద్మారావు తెలిపారు. తెలిసారిగా మనదేశంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు 200 దేశాలనుంచి 300 మంది క్రీడాకారులు రానున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు పద్మారావు తెలిపారు.  

18:35 - September 25, 2017

హైదరాబాద్ : జర్నలిస్టు హత్యలకు నిరసనగా బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో మీడియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ఇండియా ఆధ్వర్యంలో సెమినార్‌ నిర్వహించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు జరగడం బాధాకరమని సుప్రీంకోర్ట్‌ మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్టులు దేవులపల్లి అమర్‌, కె.శ్రీనివాస్‌ రెడ్డి, కె.అమర్‌నాథ్‌, రచయిత్రి వసంత కన్నాభిరాన్‌ పాల్గొన్నారు.

18:25 - September 25, 2017

కరీంనగర్/పెద్దపల్లి : మారుమూల గ్రామాలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని పాలకులు చెబుతున్నా అవి వాస్తవరూపం దాల్చడం లేదు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో కూనారం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్మించి మూడేళ్లైనా.. వైద్య సేవలు అందించేందుకు అన్ని పరికరాలు ఉన్నప్పటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. వైద్యం కోసం.. వైద్యుల రాకకోసం కూనారం గ్రామస్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వెంటనే ఆస్పత్రి ప్రారంభించాలని గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు మరిన్ని వివరాలు కూనారం నుంచి మా ప్రతినిధి సతీష్‌ అందిస్తారు. 

18:24 - September 25, 2017

వరంగల్ : తెలంగాణ వచ్చాక గిరిజన గూడాలపై దాడులు ఎక్కువయ్యాయని టీడీపీ నేతలంటున్నారు. జలగలంచలో గుత్తికోయలపై జరిగిన దాడి అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని టీ-టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అంటున్నారు. తాండూరులో అయూబ్‌ఖాన్‌,.. మానకొండూరులో శ్రీనివాస్‌ ఆత్మహత్యలకు.. డిప్యూటీ సీఎంలిద్దరూ బాధ్యత వహించి రాజీనామా చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. గుత్తికోయల దాడిపై అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు సీతక్క. ప్రభుత్వ వైఖరిపై అవసరమైన అన్ని పార్టీలను కలుపుకొని ముందుకెళ్తామని రేవంత్‌రెడ్డి, సీతక్క అన్నారు, మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:22 - September 25, 2017

నల్లగొండ : జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లం వద్ద ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులను మంత్రులు హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డిలు ఆకస్మికంగా పరిశీలించారు. సమాచారం తెలుసుకుని ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ప్రాజెక్ట్‌ వద్దకు పరుగులు తీశారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమన్నారు హరీష్‌రావు. వచ్చే మూడు నెలల్లో టన్నెల్‌ పన్నులు పూర్తవుతాయని... డిసెంబర్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామన్నారు హరీష్‌రావు. ప్రతి 15 రోజులకోసారి పనులను పర్యవేక్షించాలని కలెక్టర్‌ను కోరామని... పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్ట్‌ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హరీష్‌రావు హెచ్చరించారు. 

గ్యాంగ్ స్టర్ నయీం ఇంటికి ఐటీ అధికారులు నోటీసులు

యాదాద్రి: భుఏవనగిరిలో గ్యాంగ్ స్టర్ నయీం ఇంటికి ఐటీ అధికారులు నోటీసులు అంటించారు. బినామీ ఆస్తుల లావాదేవీలపై ఐదుగురు కుటుం సభ్యుల పేర్లతో పోలీసులు నోటీసులు అంటించారు. అక్టోబర్ 30 లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. తల్లి తహెర బేగం, సోదరి సలీమా బేగం, హుస్సేన బేగం, నహైల బేగం, హనాకౌసర్ పేర్లతో నోటీసులు అంటించారు.

17:11 - September 25, 2017

హైదరాబాద్: నగరంలో ఓ ప్రబుద్ధుడు కట్టుకున్న భార్య నగ్న ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. విజయనరం చెందిని చిలకపాటి సునిల్ కు ఓ యువతితో 2007లో పెళ్లైంది. సునిల్ పెళ్లైన నాటినుంచి భార్యను వేధించసాగాడు. దీంతో అతని భార్య పీఎస్ లో వేధింపుల కేసు పెట్టింది. తనపై పెట్టిన కేసులు విత్ డ్రా చేసుకోవాలని బాధితురాలి సోదురుడికి ఈ వీడియోలు, ఫోటోలు ఫేక్ ఐడీతో మెయిల్స్ పెట్టాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో సైబరాబాద్ క్రైమ్ బ్రాంచి పోలీసులు ఒడిశా లో సునిల్ అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

జయ మృతి పై విచారణకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలిత మృతి పై విచారణకు హైకోర్టు రిటైర్డ్ జడ్జిని పళని సర్కార్ ఆదేశించింది.

మున్సిపల్ ఏఓ వెంకటశివప్రసాద్ ఇంటిపై ఏసీబీ సోదాలు..

విజయవాడ: మున్సిపల్ ఏఓ వెంకటశివప్రసాద్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణ నేపథ్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. శివప్రసాద్ మున్సిపల్ ఆఫీసు టౌన్ ప్లానింగ్ ఉద్యోగి. గన్నవరం లోని శివప్రసాద్ ఇంటితో సహా, విజయవాడలోని బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

16:47 - September 25, 2017

హైదరాబాద్: నగరంలో ఓ ప్రబుద్ధుడు కట్టుకున్న భార్య నగ్న ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సునిల్ అనే వ్యక్తిపై తన భార్య వరకట్నకేసు నమోదు చేసింది. తనపై పెట్టిన కేసులు విత్ డ్రా చేసుకోవాలని బాధితురాలి సోదురుడికి ఈ మెయిల్స్ పెట్టాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో సైబరాబాద్ క్రైమ్ బ్రాంచి పోలీసులు ఒడిశా లో సునిల్ అరెస్ట్ చేశారు. 

'మున్సిపల్ కమిషనర్ పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి'

హైదరాబాద్ : ఇల్లందు మున్సిపల్ కమిషనర్ రవిబాబుపై దాడి చేసిన టీఆర్ ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలపి కాంగ్రెస్ నేత పొంగులేసుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని, ఫ్లెక్సీలు తొలగించినందుకు కమిషనర్ ఇంటికెళ్లి భార్య, పిల్లల ముందు కొట్టడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు తొలగించాలని కేటీఆర్ గతంలో ఉత్తర్వులు ఇచ్చారని, మంత్రి ఉత్తర్వులు అమలు చేస్తున్న అధికారులపై టిఆర్ ఎస్ నాయకులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

16:35 - September 25, 2017

ఢిల్లీ : బెనారస్‌ యూనివర్శిటీ విద్యార్థినిలపై లాఠీచార్జ్‌కు నిరసనగా విద్యార్థి సంఘాలు, ఐద్వా ఢిల్లీలో ఆందోళనకు దిగాయి.. బాధితులకు అండగా నిలవాల్సిందిపోయి వారిపైనే చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డాయి.... మహిళలను అణగదొక్కే చర్యలను సహించేదిలేదని హెచ్చరించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

16:33 - September 25, 2017

నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్‌ స్థానం ఉప ఎన్నికల గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. తొందరపడుతున్నామా.. అనే అలోచనతో గులాబీదళపతి సతమతం అవుతున్నట్టు తెలుస్తోంది. నల్లగొండ పార్లమెంట్‌ స్థానంలో హస్తంపార్టీని తక్కువ అంచనా వేస్తున్నామా.. అనే ఆందోళన కారుగుర్తుపార్టీలో వస్తున్నట్టు చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోటలో పాగావేయడం అంత ఈజీ కాదనే విశ్లేషణలు వస్తున్నాయి.

 

టీడీపీ అనూహ్య విజయాన్ని సాధించడం..
గత ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచి గుత్తాసుఖేందర్‌రెడ్డి రెండు లక్షలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత గుత్తా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అయితే మారురు కాని కార్యకర్తలు మాత్రం ఇంకా కాంగ్రెస్‌ వెంటే ఉన్నట్టు గుత్తాకూడా గ్రహించారు. అందుకే కారుగుర్తుపార్టీలో చేరినా గులాబీకండువా కప్పుకోకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో నంద్యాల ఉప ఎన్నికలో అధికార టీడీపీ అనూహ్య విజయాన్ని సాధించడం..ఇక్కడ గులాబీబాస్‌ కు ప్రేరణ అయిందనే అభిప్రాయాలు వస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌దెబ్బతీయాలంటే.. ఆపార్టీ బలంగా ఉన్నచోటే దెబ్బకొట్టాలనేది ప్లాన్‌. అందుకే కేసీఆర్‌ ఆదేశాలతో ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. దాంతోపాటు ప్రజల్లోకి విస్తృతంగా దూసుకెళ్లుతున్న టీమాస్‌ఫోరం కూడా గులాబీబాస్‌ను ముందస్తు టెస్ట్‌కు పరుగులు పెట్టేలా చేస్తుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. పనిలో పనిగా ఇటీవల కాస్త హడావిడి చేస్తున్న బీజేపీ ఉత్సాహాన్ని కూడా దెబ్బకొట్టవచ్చనేది కేసీఆర్‌ వ్యూహాంగా తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌ అంచనాలు తల్లకిందు
అయితే నల్లగొండలో టీఆర్‌ఎస్‌ అంచనాలు తల్లకిందులు కావడం ఖాయం అని విపక్షాలు తేల్చి చెబుతున్నాయి. గతంలో పలు ఉప ఎన్నికల్లో గెలిచామని చెబుతున్న గులాబీనేతలు.. అసలు విషయాన్ని మర్చిపోయారని అంటున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజలను ప్రభావితం చేసి.. ఓట్లు పొందిన గులాబీపార్టీకి ప్రస్తుతం సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యే పరిస్థితి లేదంటున్నాయి. పైగా ఉమ్మడి నల్లగొండజిల్లాలో హస్తంపార్టీ ఇప్పటికీ బలంగానే ఉంది. టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ లాంటీ ఉద్దండులను తట్టుకుని గెలవడం అంత సులభం కాదనే విశ్లషణలు వస్తున్నాయి.  

16:31 - September 25, 2017

అనంతపురం : అనంతపురంలో రోడ్డు విస్తరణ పనులు ఉద్రిక్తంగా మారాయి.. రహదారుల విస్తరణ రాజకీయ విస్తరణగా మారిందంటూ సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

16:30 - September 25, 2017

ఖమ్మం : ఐద్వా ఖమ్మం జిల్లా 10వ మహాసభలు ప్రారంభమయ్యాయి. మంచికంటి భవన్‌లో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి బత్తుల హైమావతి సభలను ప్రారంభించారు. ఈ సంద్భంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. చప్పట్లు వేల ముచ్చట్లయ్యాయి. మహిళలు ఎంతో సంతోషంగా బతుకమ్మ ఆడారు. 

16:28 - September 25, 2017

హైదరాబాద్ : రోడ్డెక్కి.. రాస్తారోకో చేయకుండా... ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదుకు ఓ ఫోరం ఆవిర్భవించింది. సీనియర్‌ సిటిజన్స్‌ థింకర్స్‌ ఫోరంగా ఏర్పడి... ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ.. సమస్యల పరిష్కారం కోసం .. సెమినార్లు, సమావేశాలు, చర్చలు నిర్వహిస్తామని..చైర్మన్‌ గోపాలకృష్ణ చెప్పారు. వివిధ శాఖల్లో పనిచేసిన సీనియర్‌ సిటిజన్స్‌ ఈ ఫోరంలో ఉంటారని చెప్పారు. అక్టోబర్‌ మొదటి వారంలో ఫోరం కార్యాచరణ ప్రకటించబోతున్నట్టు ఆయన చెప్పారు.ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, సీనియర్‌ పాత్రికేయుడు పొత్తూరు వెంకటేశ్వర్లు ఈ ఫోరంలో సభ్యులుగా ఉన్నారు. 

పవన్ కల్యాన్ కు అంతర్జాతీయ పురస్కారం

హైదరాబాద్:జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాన్ కు అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఇండో -యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్సలెన్స్ అవార్డుకు పవన్ కల్యాన్ ను ఎంపిక చేశారు. నవంబర్ 17న బ్రిటన్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ లో జరిగే ఇన్వెస్ట్ ఈస్ న్యూ ఇండియా సభలో పురస్కారం ప్రదానం చేయనున్నారు.

16:26 - September 25, 2017

పశ్చిమగోదావరి : జిల్లా కాళ్ళ మండలం జువ్వలపాలెం గ్రామస్తులు రోడ్డెక్కారు. జనావాసాల మధ్య ఉన్న మద్యం షాపును వెంటనే తొలగించాలని గోకరాజు నాగరాజు ఆధ్వర్యంలో.. మద్యం షాపు ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దారిని U ఆకారంలో చూపించి.. ఇళ్ల మధ్యలో షాపును నిర్వహిస్తున్నారన్నారు. మద్యం షాపు వల్ల కాలేజ్‌కు వెళ్లే విద్యార్థులకు, మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో.. ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. 

సేవ చేయాలన్న దృక్పథం ప్రతి ఒక్కరిలో ఉండాలి:చంద్రబాబు

ఉత్తరాఖండ్ : ముస్సోరి బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ శిక్షణా కేంద్రంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మించుకునే పనిలో ఉన్నామన్నారు. రాజధాని నిర్మాణంలో పలు ఆకృతులను నిశితంగా పరిశీలిస్తున్నామని, త్వరితగతిన ప్రాజెక్టుల పూర్తిచేయడానికి అధిక ప్రాధాన్యనిస్తున్నామన్నారు. కరెంట్ కొరత లేకుండా చేస్తున్నామని, సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని, అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ఉండాలన్నదే మాలక్ష్యం అని చెప్పారు.

16:25 - September 25, 2017

విశాఖ : టౌన్‌ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్‌ ఎన్‌వి రఘు, అతని స్నేహితుడు బాలగంగాధర్‌ రెడ్డి ఇంట్లో.. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు చేశారు. మొత్తం 15 బృందాలు ఏకకాలంలో సోదాలు చేశాయి. మంగళగిరి, విజయవాడ, షిర్డీ, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్టణంతో పాటు.. తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం, చిత్తూరు జిల్లాలోని సదుం, సోమల ప్రాంతాల్లో.. రఘు బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆస్తులను కలిగి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో కూడా రఘు ఇంటిపై ఏసీబీ రైడ్స్‌ జరిగాయి. 2 లక్షల 68 వేల డబ్బు, హార్డ్‌ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మంగళగిరి, విజయవాడలో నాలుగుచోట్ల,.. నెల్లూరు, చిత్తూరులో మూడు చోట్ల, ,.. షిర్టీలో 2 చోట్ల, విశాఖ, తిరుపతి, తూర్పుగోదావరి జిల్లాలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. రఘు పేరుపై భారీగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. 

భార్య నగ్న ఫోటోలు, వీడియోలతో బెదిరిస్తున్న వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: కట్టుకున్న భార్య నగ్న ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు దిగిన భర్త ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన పై పెట్టిన కేసులు విత్ డ్రా చేసుకోవాలని బాధితురాలి సోదరుడికి ఈ మొయిల్స్ పంపించారు. చేసేదేమి లేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. భర్త సునిల్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

16:01 - September 25, 2017

జువైనల్‌ హోం నుంచి 34 మంది బాలనేరస్థుల పరారీ....

ఢిల్లీ : ముంగేర్‌ జువైనల్‌ హోంలో 86మంది బాలనేరస్థులున్నారు. వీరిలో 34 మంది తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో గేట్‌ను బద్దలుకొట్టి వీరంతా పారిపోయినట్లు చెప్పారు. అయితే కొద్దిగంటల తర్వాత వీరిలో 12 మంది తిరిగొచ్చారన్నారు. కాగా.. పారిపోయిన బాలనేరస్థుల్లో చాలా మందిపై హత్య, అత్యాచారం, దొంగతనం వంటి తీవ్ర అభియోగాలున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై విచారణ చేపట్టామని.. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చేపట్టామన్నారు.

త్వరలోనే తేదీ ప్రకటిస్తా: కమల్ హాసన్

చెన్నై: కొత్త పార్టీతోనే నూతన సంవత్సరంలో అడుగుపెడతానని సహజ నటుడు కమల్‌హాసన్ స్పష్టం చేశారు. త్వరలోనే తేదీ ప్రకటిస్తానని, బీజేపీకి సూపర్ స్టార్ రజనీకాంత్ అనుకూలంగా ఉంటున్నారని, తాను మాత్రం హేతువాదినని చెప్పారు. రజనీ హిందూ ఆధ్యాత్మిక భావాలు ఉన్న వ్యక్తి అని కమల్ పేర్కొన్నారు. తన పార్టీతో తమిళనాడుకు మంచి రోజులు వస్తాయని అన్నారు. పళని పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని, తన పార్టీ డీఎంకే, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగానే ఉంటుందని, అవినీతిపై పోరాటం కొనసాగుతుందని కమల్ స్పష్టం చేశారు.

డిసెంబర్ లో విశాఖకు బిల్ గేట్స్ : సీఎంచంద్రబాబు

అమరావతి: డిసెంబర్ లో విశాఖకు బిల్ గేట్స్ వస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అగ్నికల్చర్ లో సాంకేతిక వినియోగంపై చర్చిస్తామని చెప్పారు.

చింతలపూడి నియోజకవర్గం టీడిపిలో విభేదాలు

ప.గో: చింతలపూడి నియోజకవర్గం టీడిపిలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పీతల సుజాత సీనియర్లను పట్టించుకోవట్లేదని ముత్తారెడ్డి వర్గానికి చెందిన 20 మంది ఎంపీటీసీలు, ఇద్దరు జడ్పీటీసీలు రాజీనామాకు సిద్ధపడ్డారు. ఏలూరు జెడ్పీ కార్యాలయానికి నేతలు బయలుదేరారు. కాసేపట్లో రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఏసీబీ వలలో ఫుడ్ కంట్రోల్ అసిస్టెంట్ ఆఫీసర్

కర్నూలు: రూ.10వేలు లంచం తీసుకుంటూ ఫుడ్ కంట్రోల్ అసిస్టెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డాడు.

 

టిఆర్ ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆత్మహత్యలు:రేవంత్ రెడ్డి

వరంగల్: టిఆర్ ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టిడిపి నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం పై పోరాడి అలసిపోయిన టిఆర్ ఎస్ కార్యకర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మైనారిటీలకు ప్రతినిధినని మహమూద్ అలీ, దళితులకు ప్రతినిధినని కడియం గొప్పలు చెప్పుకుంటున్నారని, మైనారిటీ బలిదానానికి మహమూద్ అలీ, దళితుడి ప్రాణత్యాగానికి కడియందే బాధ్యత అని రేవంత్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే జలగలంచ గిరిజనులపై అటవీ అధికారులు దాడులు చేశారని, మహిలలను కట్టేసి కొట్టడం నిజాం సర్కార్ చర్యలను తలిపిస్తోందని రేవంత్ మండిపడ్డారు.

15:16 - September 25, 2017

యావత్ తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసిన సాయిపల్లవి అపుడే తల్లి అయి అందరినీ షాక్ కి గురిచేసింది. మలయాళ చిత్రం ప్రేమమ్‌తో చిత్రసీమలోకి అరంగేట్రం చేసింది సాయిపల్లవి. తెలుగులో ఫిదా చిత్రంతో పరిచయమైంది. అయితే తన మాతృభష తమిళంలో ఇప్పటి వరకు సినిమా చేయలేదు. తాజాగా తమిళంలో ఏ.ఎల్.విజయ్ దర్శత్వంలో మహిళా ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న 'కరు' సినిమాలో సాయిపల్లవి నాలుగేళ్ల వయసున్న పాపకు తల్లిగా నటిస్తున్నది. మలయాళ, తెలుగు భాషల్లో చక్కటి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న సాయిపల్లవి తన ఇమేజ్‌ను పక్కనబెట్టి తల్లిపాత్రలో నటించడం ప్రశంసనీయమని తమిళ సినీవర్గాలు అభినందిస్తున్నాయి. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నది.

నగరంలో బాలీవుడ్ నటి సుస్మిత సందడి...

హైదరాబాద్: మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి సుష్మితా సేన్ హైదరాబాద్ లో సందడి చేసింది ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి లేబిల్ ని లాంచ్ చేసింది. తాను హైదరాబాద్ లోని సెయింట్ థెరిసా హాస్పిటల్ లో జన్మించానని సుష్మిత గుర్తు చేసుకుంది. దసరా ఉత్సవాల సందర్భంగా ట్రెడిషనల్ వేర్ లో హైదరాబాద్ కి రావడం సంతోషంగా ఉందని చెప్పింది.

14:59 - September 25, 2017

స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ నటిస్తున్న కొత్త సినిమా రంగస్థలం 1985. చరణ్ ఇందులో పల్లెటూరి కుర్రాడుగా కనిపించబోతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే దసరా కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది రంగస్థలం టీమ్. ఈ లుక్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదగా రిలీజ్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అబ్బాయ్ చరణ్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత బాబాయ్ అబ్బాయ్ లను ఒకే వేదికపై మెగా అభిమానులు చూడబోతున్నారు.

14:42 - September 25, 2017

అబుదాబి: ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా పేరుగాంచిన ఇమాన్ అహ్మద్ సోమవారం కన్నుమూసింది. అబుదాబిలోని బుర్జీల్ ఆసుపత్రి వైద్యులు ఇమాన్ మృతిని ధృవీకరించారు. 37 ఏళ్ల ఇమాన్.. పలు గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీలు పనిచేయకపోవడంతో మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఆమె బరువు తగ్గించుకునేందుకు ఈజిప్ట్‌కు చెందిన ఎమాన్‌ చికిత్స నిమిత్తం 2016 ఫిబ్రవరిలో ముంబయికి తీసుకువచ్చారు. ఇక్కడి సైఫీ ఆస్పత్రిలో కొంతకాలం ఆమెకు చికిత్సను అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెని అబుదాబిలోని బుర్జీల్‌ ఆస్పత్రికి తరలించారు. మే నెల నుంచి అబుదాబిలోనే చికిత్స తీసుకుంటున్నది. 500 కిలోలకుపైగా బరువుతో గత మార్చి నెలలో ముంబై వచ్చిన ఇమాన్‌కు సైఫీ హాస్పిటల్‌లో సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత ఆమె 324 కిలోల బరువు తగ్గినట్లు డాక్టర్లు చెప్పారు. ఆమె ముంబై వదిలి వెళ్లే సమయంలో 176 కేజీల బరువుంది. అయితే ఆమెకు చేసిన చికిత్స తమకు సంతృప్తి కలిగించలేదని ఇమాన్ సోదరి ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఆమెను డాక్టర్లు కేవలం పబ్లిసిటీ కోసమే వాడుకుంటున్నారని ఆరోపించింది. అయితే ఆమె ఆరోపణలను ఖండించిన సైఫీ హాస్పిటల్.. తదుపరి చికిత్స కోసం ఇమాన్‌ను అబుదాబి పంపించింది. ఆమె చికిత్స కోసం ఆసుపత్రి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఇమాన్‌కు సర్జరీ చేసిన డాక్టర్ ముఫజల్ లక్డావాలా చెప్పారు. ఆమె చికిత్సకు సుమారు రూ.3 కోట్లు ఖర్చు కాగా.. రూ.65 లక్షలు విరాళాలుగా వచ్చినట్లు ఆసుపత్రి వెల్లడించింది.

14:41 - September 25, 2017

అట్టడుగు వర్గాల సాహిత్యానికి అక్షర రూపమిచ్చిన అరుదైనా వ్యక్తి ఆయన..పరిశోధకులు, సృజనశిలి, ప్రముఖ కవి, విమర్శకులు ఇలా బహుముఖ ప్రజ్ఞశాలి ఆయన... ఆయన పేరు చెప్పగానే గిరిజన సంస్కృతి, జానపదకళారూపలు, తెలంగాణ పోరాట పాటలు వాటి పరిశోధనలు గుర్తుకు వస్తాయి. ఆయనే ప్రొ జైధీర్ తిరుమల్ గారు మనం చూడని పట్టించుకొని చరిత్రలో కనిపించకుండా పోయిన గతవైభవపు శిథిలా చరిత్రలను వెలికి తీసెందుకు కృషి చేస్తున్న చరిత్రకారులు ప్రొ జైధీర్ తిరుమల్ రావు గారు. తెలుగు నేల మరుగునపడిని ప్రజాకళారూపాలకు జీవం పోసిన ప్రముఖ కళాకరులు జైధీర్ తిరుమల్ రావు గారు మరి బతుకమ్మ చరిత్ర ఆయన మాటాల్లోనే తెలుసుకుద్దాం....పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:31 - September 25, 2017

ముల్లంగిలో మేలు చేసే ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మన సొంతమవుతుంది. ముల్లంగిలో శరీరాన్ని డిటాక్సిఫైచేయడానికి, విటమిన్ సి, ఫోలిక్ యాసిడి మరియు యాంతోసినిన్ వల్ల యాంటిక్యాన్సర్ ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి.

ఉపయోగాలు..

ముల్లంగిని తినడం వల్ల లివర్ మరియు కడుపును మంచి కండీషన్ లో పెడుతుంది. అంతే కాదు, శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఇంకా ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్ ను సప్లై చేస్తుంది. ముల్లంగి ఆకులను మరియు బ్లాక్ రాడిష్ ను జాండిస్ నివారణకు ఉపయోగిస్తారు.

పైల్స్ నివారణకు బాగా సహాయపడుతుంది. పైల్స్ అధికంగా కాకుండా అడ్డుకుంటుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి మరియు యూరినేటింగ్ సమయంలో ఏర్పడే బర్నింగ్ సెన్షేషన్ వంటి వాటికి నివారిణిగా పనిచేస్తుంది.

ముల్లంగిన మన డైలీ డయట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ (కోలన్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్, కిడ్నీ కాన్సర్, మరియు ఓరల్ క్యాన్సర్ )లను రాకుండా కాపాడుతుంది.

ముల్లంగిలో ఉండే విటమిన్ సి, ఫాస్పరస్, జింక్ మరియు విటమిన్ బి కాప్లెక్స్ వంటివి పుష్కలంగా ఉండటం వల్ల చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

తేనెటీగలు, కందిరీగలు మొదలగునవి కుట్టినప్పుడు నొప్పి మరియు వాపు ఉన్న ప్రదేశంలో ముల్లంగి రసాన్ని అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

ముల్లంగి బాడీ టెంపరేచర్ ను తగ్గిస్తుంది. అందుకు కారణం అయ్యే వాటిని నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముల్లంగి రసంలో కొద్దిగా బ్లాక్ సాల్ట్ కలిపి త్రాగడం వల్ల జ్వరానికి కారణం అయ్యే లక్షణాలతో పోరాడి, జ్వరాన్ని తగ్గిస్తుంది.

ముఖ్యంగా ముక్కు, గొంతు, శ్వాసనాళం మరియు ఊపిరితిత్తు సంబంధించిన సమస్యలు, దగ్గు, అలెర్జీ మరియు కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను నివారిస్తుంది. శ్వాసనాలం బాగా పనిచేసేలా చేస్తుంది.

భూ ప్రక్షాళన పై రైతులతో గవర్నర్ ముఖాముఖి

మహబూబ్ నగర్: జడ్చర్ల మండలం నాగశాలలో భూ ప్రక్షాళన పై రైతులతో గవర్నర్ నరసింహన్ ముఖాముఖి నిర్వహించారు. భూ సమస్యలపై రైతులను అడిగి గవర్నర్ తెలుసుకుంటున్నారు.

ప్రపంచంలో అత్యంత బరువైన మహిళ మృతి

అబుదాబి: ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా పేరుగాంచిన ఇమాన్ అహ్మద్ ఇవాళ చనిపోయింది. అబుదాబిలోని బుర్జీల్ ఆసుపత్రి వైద్యులు ఇమాన్ మృతిని ధృవీకరించారు. 37 ఏళ్ల ఇమాన్.. పలు గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీలు పనిచేయకపోవడంతో మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.

13:32 - September 25, 2017

హైదరాబాద్ : పువ్వులంటనే ఆడవాళ్లు అని...సున్నితంగా ఉండడం..కలర్ ఫుల్ గా ఉండడం..అవసరమైనప్పుడు శక్తిరూపాన్ని సంతరించుకోవడం మహిళలకు ఉన్నటు వంటి విషయమని టీఆర్ఎస్ ఎంపీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ కవిత టెన్ టివితో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం మహిళలు..యువతులపై దాడులు జరుగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

13:24 - September 25, 2017

యాదాద్రి : జిల్లాలోని టంగటూరు గ్రామ శివారులోని గౌతమి ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన రాకెల సిద్ధులు బంధువులు కంపెనీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటే వారు వేడుకున్నారు. వారు చేపడుతున్న ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. మృతుడికి ఇద్దరు కుమార్తెలున్నారు. 

13:14 - September 25, 2017

విజయవాడ/విశాఖపట్టణం : టౌన్ ప్లానింగ్ లో పదవి కోసం ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తుంటారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో కీలక స్థానం కోసం పైరవీలు సాధించుకుని మరీ దక్కించుకుంటుంటారు. ప్రజలకు జవాబుదారిగా ఉంటారని అనుకొనేరు..కాదు..ఈ విభాగంలో పనిచేస్తే అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలని పలువురు అనుకుంటుంటారు. అలా అనుకుని అక్రమంగా సంపాదించిన వారి భరతం ఏసీబీ పడుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా విశాఖపట్టణం టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రఘు ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. సోమవారం ఉదయం ఏపీ రాష్ట్రం, ఇతర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మూడు ప్రత్యేక బృందాలు 14 చోట్ల దాడులు చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. రఘు అక్రమంగా ఆస్తులు సంపాదించారనే సమాచారంతో ఏసీబీ సోదాలు చేస్తోంది. మంగళగిరి, విజయవాడ, షిర్డీ, నెల్లూరు, తిరుపతి, తూర్పుగోదావరి ఇతర జిల్లాల్లోని రఘు బంధువుల నివాసాలపై సోదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆస్తులు కలిగి ఉన్నాడని ఏసీబీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. సుమారు వంద కోట్ల మేర అవినీతికి పాల్పడి ఉంటారని అంచనా. పూర్తి వివరాలు కొద్దిసేపట్లో తెలియనున్నాయి.

తిరువూరులో ఇద్దరు కారుడ్రైవర్ల పై కత్తులతో దాడి

కృష్ణా : తిరువూరు పట్టణం మజీద్ సెంటర్ లో ఇద్దరు కారు డ్రైవర్ల పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అదుపుతప్పి బోల్తా పడ్డ జీపు: 11మందికి గాయాలు..

నిర్మల్ : కుబీర్ మండలం గోడితర వద్ద వేగంగా వచ్చిన జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కుబీర్ నుంచి భైంసా సంతకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు.. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు మృతి

తూ.గో: దేవీపట్నం మండలం పోచమ్మ గల్లి వద్ద విహార యాత్రలో విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ వాసులని తెలుస్తోంది.

ట్యాంక్ బండ్ పై యూత్ కాంగ్రెస్ నిరసన

హైదరాబాద్: ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులపై దాడులకు వ్యతిరేకంగా గుండు చేయించుకొని యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

12:41 - September 25, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావు పేర్కొన్నారు. సికింద్రాబాద్ లోని బౌద్ధనగర్ లో బతుకమ్మ సంబరాల్లో మంత్రి, ఆయన కుటుంబం పాల్గొన్నారు. మహిళలు..యువతులు..చిన్నారులతో కలిసి మంత్రి ఆడారు. అయితే ఈ బతుకమ్మ సంబరాల్లో కొంత కలకలం రేగింది. ఓ ఆవు దూసుకొచ్చింది. ఎవరికీ ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

12:38 - September 25, 2017

హైదరాబాద్ : బతుకమ్మ పండుగ ఉత్సవాలు నగరంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు మైలార్ దేవులపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. రాజేంద్రనగర్ ఉప సర్కిల్ కమిషనర్ విజయలక్ష్మి హాజరై ఆడి..పాడారు. మహిళలు..యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి చూడముచ్చటగా కనిపించారు. తెలంగాణ పాటలకు చిందేశారు. మహిళలు జరుపుకొనే బతుకమ్మ పండుగ ఏడాది అంతా ఉత్సాహం ఇస్తుందని తోకల శ్రీనివాస్ పేర్కొన్నారు. 

12:34 - September 25, 2017
12:33 - September 25, 2017

విజయవాడ : చిన్న అనుమానం పెనుభూతమై కూర్చొంటోంది. చివరకు హత్యలకు దారి తీస్తోంది. ముఖ్యమంగా ఈ అనుమానాలు భార్య...భర్తల మధ్య చోటు చేసుకుంటున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్తలు ఏకంగా వారిన అంతమొందిస్తున్నారు. రాజీవ్ నగర్ లో ఓ భర్త ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టాడు. సుధాకర్..రమాదేవిలు దంపతులు రాజీవ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా సుధాకర్ కు భార్యపై అనుమానం ఉంది. దీనితో ఇరువురి మధ్య తగాదాలు చోటు చేసుకుండేవి. అనుమానంతో ఆమెను చిత్ర హింసలకు గురి చేసేవాడు. గతంలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించిన పరిస్థితిలో మార్పు రాలేదు. చివరకు ఆదివారం రాత్రి రమాదేవి గొంతు నులిమి హత్య చేసిన అనంతరం పీఎస్ లోకి వెళ్లి సుధాకర్ లొంగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు రమాదేవి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న వారు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

స్కూల్ రేషనలైజేషన్ అంటే వివరించిన మంత్రి గంటా...

విశాఖ: స్కూల్ రేషనలైజేషన్ అంటే స్కూల్స్ మూసేయడం కాదని మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిని సరి చేయడం అని, స్కూల్స్ రేషనలైజేషన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సంవత్సరం 10 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలకే రేషనలైజేషన్ అమలు చేస్తామన్నారు. నవంబర్ 7 నుంచి 9 వరకూ విశాఖ లో ఏపీ సైన్స్ కాంగ్రెస్ జరుగుతుందని, యూనివర్శిటీల్లో పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లాలో హడలెత్తిస్తున్న డెంగ్యూ

ప్రకాశం: దర్శి మండలంలో డెంగ్యూతో ఇద్దరు మృతి చెందారు. వీరయ్యపాలెంలో ఆరేళ్ల బాలుడు విష్ణువర్ధన్ మృతి చెందాడు. నాగులుప్పలపాడులో మోహన్ (32) అనే వ్యక్తి మృతి చెందాడు.

శ్రీనగర్ లో కొనసాగుతున్న వ్యాపారులు బంద్

జమ్మూకాశ్మీర్: శ్రీనగర్ లో వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. వ్యాపారులంతా ఎన్‌ఐఏ ముందు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేయడంపై నిరసనగా….బంద్ నిర్వహిస్తున్నారు. దీంతో జమ్మూకాశ్మీర్ వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

12:18 - September 25, 2017

విజయవాడ : రైతాంగ సమస్యలు పరిష్కరించకుండా రైతులను అరెస్టు చేయడం దారుణమని వామపక్ష నేతలు పేర్కొన్నారు. సుబాబు రైతులకు ఉన్న దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని, పెండింగ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన నిర్వహించారు. విజయవాడలోని చందర్లపాడు ఎమ్మార్వో కార్యాలయం వద్ద రైతులు, సీపీఎం నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 143, 493లను రద్దు చేయాలని, టన్ను కర్ర రూ. 4, 400కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పేరుకపోయిన బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవడం వల్ల రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు రైతులను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. 

చందర్లపాడు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

కృష్ణా: విజయవాడ, చందర్లపాడు తహశీల్దార్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. సుబాబు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆఖిలపోం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. జీవో నెంబర్ 143, 493లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టన్ను కర్ర రూ. 4,400లకు కొనుగోలు చేయాలన రైతులు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. పీఎస్ వద్దకు చేరుకున్న రైతులు ఆందోళనకు దిగారు.

12:11 - September 25, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం సింహవాహనంపై శ్రీనివాసుడిని ఊరేగించారు. సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి ముత్యపు పందిరి వాహన సేవ జరుగనుంది. ఇదిలా ఉంటే మూడో రోజైన సోమవారం తిరుమలలో భారీ వర్షం కురిసింది. దీనితో భక్తులు పలు ఇబ్బందులకు గురయ్యారు. తిరుమల నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చూడటానికి భక్తులు సందడి అంతగా కనిపించలేదు. గ్యాలరీలన్నీ వెలవెలబోయ్యాయి. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

రైల్లో పేలిన సెల్ ఫోన్..

హైదరాబాద్: శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీలో సెల్‌ఫోన్ పేలింది. క్షణాల్లో పొగలు వ్యాపించాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను శాంతంగా ఉండాలని కోరారు.

 

తెలంగాణ థింకర్స్ ఫోరమ్ ఏర్పాటు

హైదరాబాద్: తెలంగాణ థింకర్స్ ఫోరమ్ ఏర్పాటు అయ్యింది. థింకర్స్ ఫోరమ్ ఛైర్మన్ గోపాల కృష్ణ ఎన్నికయ్యారు. సభ్యులుగా చుక్కా రామయ్య, హరగోపాల్, పొత్తూరి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఈ ఫోరం పనిచేయనుంది. ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలపై అన్ని జిల్లాల్లో అవగాహన సద్సులు, సెమినార్ లు పెట్టాలని నిర్ణయించారు.

బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ మెహరిషి

న్యూఢిల్లీ: నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా రాజీవ్ మెహరిషి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో ఇవాళ మెహరిషితో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోల హతం..

జార్ఖండ్: సింమ్డేగ అటవీ ప్రాంతంలో పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టుల వద్ద నుండి ఏకే 47, ఎల్ ఎంజీ కార్బన్ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు...

నెల్లూరు: జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కొండాపురం, జలదంకి, కావలిలో ఉదయం నుంచి వర్షం పడుతోంది. దీంతో రహదారులు జలమయం అవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

11:38 - September 25, 2017

గుంటూరు : ఏపీ సచివాలయ ఉద్యోగులు బస్సు కోసం ఆందోళన..నిరసన చేపడుతున్నారు. బస్సును ఎక్కడపడితే అక్కడ ఆపుకుంటూ రావడం వల్ల తాము పలు సమస్యలు ఎదుర్కొన్నామని పేర్కొంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్సును ఆపిన ఉద్యోగులు కాలినడకన బయలుదేరారు.

ఏపీ రాజధాని అనంతరం వెలగపూడిలో సచివాలయం నిర్మాణం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తెలంగాణ రాష్ట్రం నుండి ఉద్యోగులు ఇక్కడకు తరలివచ్చారు. వీరు నివాసం ఉంటున్న ప్రాంతాల నుండి సచివాలయం చేరుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విజయవాడ, మంగళగిరి, తెనాలి ఇతర ప్రాంతాల మీదుగా నాన్ స్టాప్ బస్సులను నడుపుతున్నారు.

రోజులాగే సోమవారం కూడా గుంటూరు -వెలగపూడికి ఓ బస్సు బయలుదేరింది. కానీ ఈ బస్సును డ్రైవర్ ఎక్కడ పడితే అక్కడ ఆపడం..ప్రయాణీకులను ఎక్కించుకోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్సులో ఉన్న ఓ ఆర్టీసీ అధికారిని ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. బయో మెట్రిక్ విధానం ఉండడం వల్ల తాము సమస్యను ఎదుర్కొవాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోయారు. చివరకు తాడికొండ అడ్డా రోడ్డు వద్ద బస్సును ఆపివేసిన సచివాలయ ఉద్యోగులు కాలినడకన సచివాలయానికి బయలుదేరారు. సుమారు 30 కిలో మీటర్ల మేర వీరు నడువనున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

తృణమూల్ పార్టీకి ఎంపి ముఖుల్ రాయ్ రాజీనామా

ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎంపి ముఖుల్ రాయ్ రాజీనామా చేశారు. గత వారం బిజెపి నాయకులతో సమావేశం అయ్యారు. ముఖుల్ రాయ్ బిజెపిలో చేరుతారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది.

11:26 - September 25, 2017

ఢిల్లీ : పి.వి.సింధు..మరో అరుదైన గౌరవం దక్కింది. బ్యాడ్మింటెన్ లో రాణిస్తున్న ఈమె పేరును పద్మభూషణ్ అవార్డుకు కేంద్ర హోం శాఖ సిఫార్సు చేసింది. పూసర్ల వెంకట సింధు ఒక అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అనే సంగతి తెలిసిందే. 2016 లో జరిగిన 'రియో' ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. సిల్వర్ మెడల్ ను సాధించి భారత క్రీడాలోకానికి మరో కీర్తిని సాధించింది. దేశం మొత్తం ఆమెను అభినందనల్లో ముంచెత్తింది. అంతేగాకుండా తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా పలు అవార్డులను ప్రకటించింది. ఏపీ రాష్ట్రం ఆమెకు డిప్యూటి కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది.

 

11:13 - September 25, 2017

రాజకీయ, సినీ, ఇతర రంగాల్లోని ప్రముఖులు వారి కుమార్తెలు..కుమారులు వెండితెరపై తమ ప్రతిభను చూపించుకోవాలని అనుకుంటుంటారు. అందులో భాగంగా వారు చిత్ర సీమకు పరిచయమవుతుంటారు. అందులో కొందరిని ప్రేక్షకులు అభిమానిస్తుంటారు. తమ అభిమాన హీరో కుమార్తె..కుమారుడు ఎలా నటించాడోనని తెలుసుకొనేందుకు అభిమానులు ఉత్సుహత చూపుతారు. తాజాగా క్రికెట్ గాడ్ గా పేరొందిన 'సచిన్ టెండూల్కర్' కుమార్తెపై సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

సచిన్ టెండూల్కర్...క్రికెట్ గాడ్..మాస్టర్ బ్లాస్టర్ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఆయన క్రికెట్ లో ఎలాంటి రికార్డులు..విజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె సారా టెండూల్కర్ ప్రస్తుతం వెండితెరకు పరిచయమౌతుందని టాక్. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమిర్‌ ఖాన్‌ 'సారా'ను బాలీవుడ్‌కు పరిచయం చేస్తారని ప్రచారం జరుగుతోంది. సినిమాల్లోకి రావాలని 'సారా' కు కూడా కోరిక ఉందని, అందుకే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పుకార్లు షికారు చేస్తున్నాయి. ధీరూబాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 'సారా' విద్యనభ్యసించిన సంగతి తెలిసిందే. ‘సారా' బాలీవుడ్ ఎంట్రీపై వస్తున్న కథనాలపై 'సచిన్' ఎలా స్పందిస్తారో చూడాలి. 

గుంటూరు టిడిపి జిల్లా సమన్వయ కమిటీ భేటీ

గుంటూరు: టిడిపి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి మంత్రులు అయ్యన్న పాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపి గల్లా జయదేవ్, జిల్లా నాయకులు హాజరయ్యారు. ఇంటింటికి తెలుగుదేశం నిర్వహణ తీరు, ప్రజాస్పందన తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

11:09 - September 25, 2017

గుంటూరు : ఏపీ రాష్ట్రంలో అవినీతి తిమింగాలు పెరిగిపోతున్నారు. ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా అవినీతి చేస్తున్న వారిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఏసీబీ నిర్వహిస్తున్న దాడుల్లో కల్లుబైర్లు కమ్మే ఆస్తులు బయటపడుతున్నాయి. తాజాగా విశాఖపట్టణం టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రఘు ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.

ఏపీ రాష్ట్రం, ఇతర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మూడు ప్రత్యేక బృందాలు 14 చోట్ల దాడులు చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. రఘు అక్రమంగా ఆస్తులు సంపాదించారనే సమాచారంతో ఏసీబీ సోదాలు చేస్తోంది. మంగళగిరి, విజయవాడ, షిర్డీ, నెల్లూరు, తిరుపతి, తూర్పుగోదావరి ఇతర జిల్లాల్లోని రఘు బంధువుల నివాసాలపై సోదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆస్తులు కలిగి ఉన్నాడని ఏసీబీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. గతంలో కూడా రఘుపై ఏసీబీ దాడులు నిర్వహించినా పలుకుబడిని ఉపయోగించి పలు కీలక పోస్టుల్లో పనిచేశారని సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ఈ దాడుల్లో రఘు వంద కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ప్రారంభమైన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు

ఢిల్లీ: బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రలు, ఆ పార్టీ సినియర్ నేతలు పాల్గొన్నారు.

ఉదయసముద్రం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి హరీష్

నల్గొండ: నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణ పల్లెలో ఉదయసముద్రం ప్రాజెక్టు పనులను మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. అనంతరం అటవీ అభివృద్ధి కమిషనర్ ఛైర్మన్, అధికారులతో భేటీ అయ్యారు.

10:42 - September 25, 2017
10:40 - September 25, 2017

జార్ఖండ్ : దీపావళి పండుగ సమీపిస్తోంది. దీనితో బాణాసంచా పరిశ్రమల్లో కార్మికులు పనుల్లో నిమగ్నమౌతున్నారు. దీనితో పాటు ప్రమాదాలు కూడా సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలోని కుమార్జుబి ప్రాంతంలో ఉన్న ఓ బాణాసంచా పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది సజీవదహనం కావడం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 25 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచనలు చేస్తున్నారు.

తిరుమలలో పెరిగిన భక్తు రద్దీ...

తిరుప‌తి: తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది. శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగుతుండ‌టంతో తిరుమ‌ల‌కు భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది. మొత్తం 31 కంపార్టుమెంట్లు నిండి క్యూలైన్ బ‌య‌టికి వ‌చ్చింది. శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నానికి 8 గంట‌ల స‌మ‌యం ప‌డుతున్న‌ది. ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నానికి 4 గంట‌ల స‌మ‌యం ప‌డుతున్న‌ది. మరో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది...

చింతగింజ మింగి చిన్నారి మృతి

జనగామ :బచ్చన్నపేట మండలం కొడవటూర్‌ లో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ చింతగింజ మింగిన ఓ ఐదేళ్ల చిన్నారి శ్వాస ఆడక మృతి చెందింది. రాసూరి లక్ష్మి, లింగం దంపతుల కుమార్తె పవిత్ర(5). ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై: ఈ రోజు స్టాక్‌మార్కెట్లు ష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 9868 వద్ద ట్రేడవుతోంది. మరోపక్క బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కూడా 243 పాయింట్లు కుంగి 31,678 వద్ద ట్రేడవుతోంది.

10:20 - September 25, 2017

కరీంనగర్ : సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. కార్మిక సంఘాలు గెలుపు గుర్రాన్ని ఎక్కేందుకు చిత్రమైన పొత్తులు, అసాధారణ ఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. అక్టోబర్‌ 5వ తేదీన జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ ఉనికిని కాపాడుకునేందుకు ఆయా సంఘాలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. సింగరేణి మణుగూరు ఏరియా ఎన్నికలు జాతీయ కార్మిక సంఘమైన ఏఐటీయూసి, ప్రాంతీయ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మధ్య నువ్వా..నేనా అన్నట్లు ఎన్నికల ప్రచారం సాగుతుంది.

ఈ నేపథ్యంలో సింగరేణి ప్రాంతంలో టీఆర్ఎస్ నేతలు విస్తృంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. సింగరేణిలో 9వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే ఒదేలు టెన్ టివికి తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

బాణా సంచా పరిశ్రమలో అగ్న్రిపమాదం: 8 మంది మృతి

జార్ఖండ్ : జంషెడ్ పూర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణా సంచా పరిశ్రమలో మంటలు చెలరేగి 8 మంది మృతి చెందగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐదు ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఇంటి పై టిఆర్ ఎస్ నేతల దాడి

భద్రాద్రి: ఇల్లందు టీఆర్ ఎస్ కార్యకర్తలు దౌర్జాన్యానికి దిగారు. రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఇంటి పై కార్యకర్తలు దాడి చేశారు. గ్రంథాలయ ఛైర్మన్ రాజేందర్ ప్రమాణస్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఎస్ లో మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఫిర్యాదు చేశారు.

టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు..

గుంటూరు : టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘు ఇళ్లపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. మంగళగిరి, వైజాగ్ తో పాటు 14 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించింది. అక్రమాస్తులున్నాయన్న సమాచారంతో ఈ సోదాలు చేస్తోంది. 

సచివాలయం ఉద్యోగుల అసంతృప్తి..

గుంటూరు : గుంటూరు - వెలగపూడి సచివాలయానికి ఏర్పాటు చేసిన నాన్ స్టాప్ బస్సును ఆర్డినరీగా మార్చడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ప్రతిస్టాపులో బస్సును ఆపుతుండడంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ విధానం అమల్లోకి రావడంతో ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు పేర్కొంటున్నారు. 

09:58 - September 25, 2017

స్టార్ మా టీవీ ఆధ్వర్యంలో టెలికాస్ట్ అయిన 'బిగ్ బాస్ 1’ విజేత ఎవరో తేలిపోయింది. సుమారు 71 రోజుల పాటు జరిగిన ఈ షో ఆదివారం క్లైమాక్స్ కు చేరుకుంది. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షో కు ప్రజల నుండి భారీగానే స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. క్లైమాక్స్ లో ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ పాటలు..ఆటలతో సందడి చేశారు.

ఈ షోలో మొత్తం 16 మంది పాల్గొన్న సంగతి తెలిసిందే. చివరి వరకు ఐదుగురు మాత్రమే మిగిలారు. వారిలో అర్చన..నవదీప్..లు వెనుకబడ్డారు. ఆదివారం తుదిపోటీకంటే ముందుగానే వైదొలిగారు. ఫైనల్లో శివబాలాజీ..ఆదర్శ్..హరితేజ మాత్రమే మిగిలారు. దీనితో ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. చివరకు అత్యధికంగా ఓట్లు సాధించిన 'శివ బాలాజీ' విజేత అని జూ.ఎన్టీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రోఫితో పాటు రూ. 50 లక్షల నగదును అందచేశారు. ఈ షోలో మొత్తం దాదాపు 11 కోట్ల మంది ప్రేక్షకులు ఓటింగ్ లో పాల్గొన్నట్లు ఎన్టీఆర్ వెల్లడించారు. అత్యధికంగా మూడు కోట్లకు పైగా 'శివ బాలాజీ' ఓట్లు సాధించినట్లు తెలిపారు. 

09:35 - September 25, 2017

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొనేందుకు తెల్లవారుజామునుండే భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ అధికారులు, అర్చకులు ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కాటేదాన్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : కాటేదాన్ ఎస్ఎస్ చాక్లెట్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాయిలర్ పేలడంతో కిరణ్ అనే కార్మికుడు మృతి చెందాడు. 

09:29 - September 25, 2017

అనంతపురం : జిల్లాలోని తిలక్ నగర్ లో అధికారులు ఇళ్లను కూల్చివేస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా నివాసాలను కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కానీ అధికారుల ప్రయత్నాలను సీపీఐ నాయకులు, స్థానికులు అడ్డుకున్నారు. దీనితో కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. తిలక్ నగర్ కు ఉదయం 5గంటలకు మున్సిపల్, ఆర్ అండ్ బి అధికారులు చేరుకుని ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నించారు. నోటీసు ఇవ్వకుండా..పరిహారం ఇవ్వకుండానే ఎలా కూలుస్తారని అధికారులను స్థానికులు నిలదీశారు. కానీ తాము గతంలోనే నోటీసులు ఇవ్వడం జరిగిందని అందుకే కూల్చివేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే తన నియోజకవర్గంలో అభివృద్ది చేయలేదని అందుకే రాజీనామా చేస్తానని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనితో ఆయన రాజీనామా చేస్తే పార్టీకి నష్టం వస్తుందని భావించి ఇలాంటివి చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తిలక్ నగర్ లో ఉద్రిక్తత..

అనంతపురం : తిలక్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లను కూల్చేందుకు మున్సిపల్ అధికారుల యత్నించారు. సీపీఐ నాయకులు, స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

 

మున్సిపల్ కమిషనర్ పై టీఆర్ఎస్ నేతల దాడి..

భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లందు మున్సిపల్ కమిషనర్ రవిబాబుపై టీఆర్ఎస్ నేతలు దాడికి దిగారు. గ్రంథాలయ ఛైర్మన్ రాజేందర్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ నేతలు ఇల్లందు పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ నుండి అనుమతులు తీసుకోకపోవడంతో ఆ శాఖ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు ఆగ్రహోదగ్రులయ్యారు. మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఇంటికి వెళ్లి ఆయనపై దాడి చేశారు.

09:17 - September 25, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో టీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయారు. ఏకంగా మున్సిపల్ కమిషనర్ పైనే దాడికి దిగడం కలకలం రేపుతోంది. కేవలం ఫ్లెక్సీలను తొలగించారనే కారణంతో గులాబీ నేతలు ఈ దాడికి పాల్పడడం గమనార్హం.

ఏ అధికార..అనధికార కార్యక్రమమైనా నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని స్వయంగా మంత్రి కేటీఆర్ కిందిస్థాయి నేతలకు సూచనలు..ఆదేశాలు జారీ చేశారు. కానీ పలు ప్రాంతాల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో భారీగా ఫ్లెక్సీలు వెలుస్తూనే ఉన్నాయి. గ్రంథాలయ ఛైర్మన్ రాజేందర్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ నేతలు ఇల్లందు పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ నుండి అనుమతులు తీసుకోకపోవడంతో ఆ శాఖ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు ఆగ్రహోదగ్రులయ్యారు.

మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఇంటికి వెళ్లి ఆయనపై దాడి చేశారు. దీనితో ఆయన తీవ్రమనస్థాపానికి గురయ్యారు. టీఆర్ఎస్ కార్యకర్తల ఆగడాలను ఆపాలని ఆయన ఇల్లందు పీఎస్ కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు..ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

09:12 - September 25, 2017

ప్రకాశం : జిల్లాలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా ఎస్ఐపైనే కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన మార్టూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. గత కొంతకాలంగా మార్టూరు జాతీయ రహదారిపై దోపిడి దొంగలు హల్ చల్ చేస్తున్నారని, లారీలు..ఇతర వాహనాల డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనితో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై మార్టూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు బృందం తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆరుగురు వ్యక్తులు అనుమానంగా సంచరిస్తుండడం వారి కంట పడింది. వెంటనే అప్రమత్తమైన ఎస్ఐ, ఇతర కానిస్టేబుళ్లు వారిని ప్రశ్నించడం జరిగింది. వెంటనే దొంగలు దాడి చేశారు. ఎస్ఐని పట్టుకుని కత్తులతో పొడిచే ప్రయత్నం చేశారు. చాకచక్యంగా ఈ దాడి నుండి ఆయన తప్పించుకన్నారు. అనంతరం దొంగలు అక్కడి నుండి పరారయ్యారు. భుజంపై కత్తిపోట్లకు గురయిన ఎస్ఐని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అనంతరం ఇంటికి పంపించారు.

 

8మంది సజీవదహనం..

ఝార్ఖండ్ : రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కుమార్ డూబి ప్రాంతంలో ఓ బాణసంచా పరిశ్రమలో మంటలు అంటుకుని భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 8మంది కార్మికులు సజీవదహనమయ్యారు. 

మార్టూర్ ఎస్ఐపై దొంగల దాడి...

ప్రకాశం : మార్టూరు హైవేపై దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మార్టూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావుపై కత్తులతో దొంగలు దాడి చేశారు. పట్టుకొనేందుకు ప్రయత్నించగా దొంగలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎస్ఐకి స్వల్ప గాయాలయ్యాయి. 

08:06 - September 25, 2017

పెద్దనోట్ల రద్దు...జీఎస్టీ..వీటిపై పడుతున్న ప్రభావంపై కథనాలు వెలువడుతున్నాయి. పెద్దనోట్లు రద్దు నిర్ణయం లాగే.. జీఎస్టీ ప్రణాళికలోనూ ఎలాంటి దూరదృష్టి, సంసిద్ధత లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో దళితులకు పంచాల్సిన మూడెకరాల భూమి విషయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆత్మహత్యాయత్నం చేసిన మహంకాళీ శ్రీనివాస్ కన్నుమూశాడు. దీనిపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), దుర్గా ప్రసాద్ (టిడిపి), సుభాష్ (బీజేపీ), కర్నె ప్రభాకర్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

https://youtu.be/SU7F6VBTknc

https://youtu.be/xGKi_pkvbsc

 
07:32 - September 25, 2017

అతనో కష్టజీవి.. శ్రమటోడ్చి పంటలు పండిస్తాడు.. కాని అతనికి ఏ హక్కులు ఉండవు. ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉండదు, బ్యాంకు నుంచి రుణం ఉండదు. ఇదీ కౌలు రైతు పరిస్థితి. దీనికి కారకులెవరు.. కారణాలేంటి..ఈ అంశంపై టెన్ టివి జనపథంలో కౌలు రైతుసంఘం ఏపీ రాష్ట్ర కార్యదర్శి జమలయ్య విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:30 - September 25, 2017

ఢిల్లీ : మూడోవన్డేలో టీమ్‌ ఇండియా సత్తా చాటింది. కంగారుల జట్టును ఓ ఆట ఆడుకుంది. కీలకమైన మూడో వన్డేలో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన టీమ్‌ ఇండియా ఐదువన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో ధోనీ రికార్డును కెప్టెన్‌ కోహ్లీ సమం చేశాడు. వరుసగా ఆరో సిరీస్‌ను కైవసం చేసుకొని రాహుల్‌ ద్రవిడ్‌, ధోనీ సరసన నిలిచాడు విరాట్‌. ఇండోర్‌ వన్డేలో కోహ్లీసేన ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 294 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది. యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య 72 బంతుల్లో 5ఫోర్లు, 4 సిక్స్‌లతో 78 పరుగులు , రహానె 76 బంతుల్లో 9 ఫోర్లతో 70 పరుగులు , రోహిత్‌ శర్మ 62 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 71పరుగులతో కదం తొక్కారు.

అంతకు ముందు ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ ఆరోన్‌ ఫించ్‌ 125 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సలతో 124 పరుగులతో వీరవిహారం చేశాడు. పింఛ్‌కు తోడుగా స్మిత్‌ (63 , వార్నర్‌ 42 పరుగులు చేయడంతో ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లతో 6వికెట్లకు 293 పరుగులు చేసింది. ఇండోర్‌వన్డే గెలుపుతో టీం ఇండియాకు వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయం సాధించినట్టైంది. మరోవైపు వరుసగా ఆరో సిరీస్‌ను కైవసం చేసుకొని భారత్‌ను అగ్రస్థానంలో నిలిపిన కెప్టెన్‌ కోహ్లీ.. భారత్‌ను వన్డేల్లోనూ అగ్రస్థానంలో నిలిపాడు.

07:27 - September 25, 2017
07:25 - September 25, 2017

హైదరాబాద్ : సమాచార హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలన్న బాధ్యత అందరిపై ఉందని పలువురు నేతలు అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ కమిషనర్ల నియామకంపై పీపుల్స్‌ ఫోరం ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమాచార హక్కు చట్టంలో నియమించిన కమిషనర్లపై ప్రజాసంఘాలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉందని నేషనల్‌ కాంపెయిన్‌ ఫర్‌ పీపుల్స్‌ రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ కన్వీనర్‌ రాకేష్‌ రెడ్డి అన్నారు. ఆర్‌టీఐ సేవలు కూడా ఆన్‌లైన్‌లో పొందేలా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2015 డిసెంబర్‌ 31 వరకు ప్రభుత్వ ఉత్తర్వులన్నీ వెబ్‌సైట్‌లో వచ్చాయని తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వెబ్‌సైట్‌లో జీవోలు పెట్టడంలేదని సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీనివాస్ అన్నారు. సమాచార హక్కు చట్టం 4-1 సీ ప్రకారం ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

07:23 - September 25, 2017

హైదరాబాద్ : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో పదవుల భర్తీపై అనుమానాల నీడ వీడటం లేదు. మూడున్నరేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేతలకు నిరాశే ఎదురవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నరే సమయమున్నా..పదవుల భర్తీ.. పార్టీ నిర్మాణంపై అధినేత కేసీఆర్‌ సస్పెన్స్‌ కొనసాగిస్తున్నారు. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులపై కసరత్తు పూర్తయిందన్న ప్రచారం నేతల్లో ఆశలు కల్పించినా..తాజా పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. దీంతో టీఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఓ వైపు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్‌ సర్కార్‌ ప్రజలపై వరాల వాన కురిపిస్తోంది. అన్ని సామాజిక వర్గాలను దగ్గర చేసుకునేందుకు..కొత్త పథకాలు ప్రకటిస్తోంది. వినూత్న పథకాలు, నిధుల కేటాయింపుతో దూకుడు పెంచుతున్నా.. నేతల్లో ఉత్తేజం నింపేందుకు సీఎం కేసీఆర్ పెద్దగా దృష్టి సారించడం లేదన్న అభిప్రాయం గులాబి నేతల్లో వ్యక్తమవుతోంది. నామినేటేడ్‌ పోస్టుల భర్తీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. దసరా పండుగ నాటికే పదవులు ప్రకటిస్తారని ప్రచారం జరిగినా..ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదన్న వాదన తెరపైకి వస్తోంది.

మంత్రి కెటిఆర్ విదేశీ పర్యటనలో ఉండటం కూడా.. పదవుల భర్తీ వాయిదాకు ఓ కారణంగా తెలుస్తోంది. దాంతోపాటు సింగరేణి ఎన్నికలపై ప్రముఖ నేతలు నిమగ్నం కావడం మరో కారణంగా కనిపిస్తోంది. రైతు సమన్వయ సమితుల వ్యవహారాన్ని సీఎం సీరియస్‌గా పరిశీలిస్తుండటంతో పార్టీ పదవుల నియామకంపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం లేదన్న అభిప్రాయాన్ని సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారట. మరి ఆశావహుల ఎదురుచూపులు ఎప్పటికి ఫలిస్తాయనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. 

07:21 - September 25, 2017

హైదరాబాద్ : సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. కార్మిక సంఘాలు గెలుపు గుర్రాన్ని ఎక్కేందుకు చిత్రమైన పొత్తులు, అసాధారణ ఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. అక్టోబర్‌ 5వ తేదీన జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ ఉనికిని కాపాడుకునేందుకు ఆయా సంఘాలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. సింగరేణి కార్మికసంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికల్లా మారిపోయాయి. గతంలో కార్మిక సంఘాలు కార్మికులకు చేసిన అభివృద్ధి సంక్షేమం, వేతన ఒప్పందం, పని దినాల వంటి తదితర అంశాలపై ఆధారపడి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగేవి. కార్మిక సంక్షేమమే ధ్యేయంగా పని చేసిన జాతీయ కార్మిక సంఘాలు సైతం తమ గెలుపు ఓటములపై స్పష్టత రాని పరిస్థితి ఈసారి నెలకొంది. ప్రాంతీయ కార్మిక సంఘమైన టీబీజీకేఎస్‌ ఈ సారి జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలపై ప్రభావం చూపనుంది. 2017 అక్టోబర్‌ 5వ తేదీన జరిగే యావత్‌ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ సారి ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

సింగరేణి మణుగూరు ఏరియా ఎన్నికలు జాతీయ కార్మిక సంఘమైన ఏఐటీయూసి, ప్రాంతీయ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మధ్య నువ్వా..నేనా అన్నట్లు ఎన్నికల ప్రచారం సాగుతుంది. ఈసారి ఏఐటీయూసి.. ఐఎన్‌టీయూసితో పొత్తు పెట్టుకుంది. గతంలో మణుగూరు ఏరియాను కైవసం చేసుకున్న ఐఎన్‌టీయూసికి బలమైన నాయకత్వం కలిగిన చీలికవర్గమైన ఎస్‌సిఎమ్‌ఎల్‌యూ గుర్తింపు సంఘమైన టిబిజికెఎస్‌తో జతకట్టడంతో తమ గెలుపు నల్లేరుపై నడకలాగ ప్రచారం సాగుతోంది.

మరోపక్క తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ సంఘం కావటంతో ఎన్నడూ లేని విధంగా ఆయా ప్రాంతాల్లో సాధారణ ఎన్నికలను తలపించే విధంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం కుమార్తె నిజామాబాద్‌ ఎంపీ కవిత టీబీజీకేఎస్‌ కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా ఉండటంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బలమైన క్యాడర్‌ కలిగిన ఎఐటియూసి పై చేయి సాధించేందుకు ముందుకు సాగుతున్నాయి. జాతీయ సంఘాలైన సీఐటీయూ, బిఎమ్‌ఎస్‌, హెచ్‌ఎమ్‌యస్‌, ఐఎఫ్‌టియూ ఇతర కార్మిక సంఘాలు తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ఎన్నికల బరిలోకి దిగాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, కార్పొరేట్‌ కొత్తగూడెం, సత్తుపల్లి మణుగూరు ఏరియాలో కార్మికుల వారసత్వ ఉద్యోగాలు గుర్తింపు సంఘానికి తలనొప్పిగా మారనున్నాయి. ప్రాంతీయ కార్మిక సంఘాలైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి వేజ్‌బోర్డ్‌ జాతీయ కమిటీలో మెంబర్‌షిప్‌ లేకపోవడంతో కార్మిక సోదరులు గెలుపెవరికి ఇవ్వాలో అనే ఆలోచనలో పడ్డారు. ఓ పక్క టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వం కావటం, మరోపక్క సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ కావటం, మెడికల్‌ అన్‌ఫిట్‌, ఇన్‌సెంటివ్‌ స్కీం, కార్మికుల సంక్షేమం, పక్కా గృహానికి పది లక్షల వడ్డిలేని రుణం వంటి పేరుతో కార్మికుల ముందుకు వెళ్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ చిత్రవిచిత్ర పొత్తులు.. అసాధారణ ఎత్తులు గెలుపు గుర్రాన్ని ఎవరు అదిరోహిస్తారో నల్లసూర్యులు త్వరలో తేల్చనున్నారు.

07:17 - September 25, 2017

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి. కాలదోషంపట్టిన చట్టాలను సవరించకుండా సర్వే చేపట్టడంపై రైతుల్లోఆందోళన వ్యక్తం అవుతోంది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల జేబులు నింపడానికే భూ సర్వే తలపెట్టారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కుట్రలో భాగంగానే తాజాగా ఏర్పాటు చేస్తున్న రైతుసమితుల్లో గులాబీ పార్టీ అనుయాయులను నింపేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

పేదల భూముల రక్షణకోసం 1977లోనే తీసుకొచ్చిన చట్టాన్ని అమలును గతపాలకులు, ప్రస్తుత పాలకులు అటకెక్కించారు. సీలింగ్‌ భూములు ఆక్రమణకు గురవుతున్నా ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహిరిస్తూ వస్తున్నాయి. కోనేరు రంగారావు కమిటీ తెలంగాణలో 25లక్షల ఎకరాల భూదాన, అసైండ్‌ల్యాండ్స్‌ ఉన్నట్టు లెక్కలు తేల్చింది. తాజాగా భూ సర్వే అంటూ..గతంలో దళితులు, పేదలకు పంచిన భూములను లాక్కునేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో వేలాది ఎకరాలను రాజకీయనాయకులు, అవినీతి అధికారులు కబ్జాచేస్తుంటే... పేదప్రజలు నిలువ నీడలేక రోడ్లవెంబడి, ఇరుకు బస్తీల్లోనూ కాలం వెళ్లదీస్తున్న దీనావస్థల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కనిపించడంలేదా అని లెఫ్ట్‌ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

మరోవైపు తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 38 వేల 055 దళిత , 5లక్షల 54వేల 384 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. వీరిలో మొత్తం 3లక్షల 95వేల 363 కుటుంబాలకు కుంటభూమి కూడా లేదని ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ఇక ఒక ఎకరం లోపు ఉన్న కుటుంబాలు మరో 2లక్షల 94వేల వరకు ఉన్నాయి. ఈలెక్కన తెలంగాణలో ఉన్న పేద దళితులకు 3ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి ఇస్తే.. మొత్తం దాదాపు 18లక్షల ఎకరాలకు పైగా పంచాల్సి వస్తుంది.

సమగ్ర భూ సర్వే పేరుతో రైతుల భూముల లెక్కలు తీస్తామంటున్న కేసీఆర్‌ సర్కార్‌.. ముందుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్యాక్రాంతం భూముల సంగతి తేల్చాలని వామపక్షాలు, రైతుసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. హైదరాబాద్‌ చుట్టుముట్టు ప్రాంతాల్లోనే వేల ఎకరాలను బడాబాబాలు కబ్జా పెట్టిన సంగతి ముఖ్యమంత్రికి తెలియాదా అని లెఫ్ట్‌పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. వికారాబాద్‌జిల్లా కోదండల్‌దొరల సీలింగ్‌ భూమి 1156ఎకరాలు, నల్లగొండ జిల్లాలో డేరాబాబా ఆశ్రమం భూములు, రాంకి, నార్నెఎస్టేట్‌లాంటి బడా సంస్థలు ఆక్రమించిన భూముల సంగతి తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్స్‌లు, సీలింగ్‌, అసైండ్‌ చట్టాలను గాలికి వదిలి.. రైతుల వద్ద ఉన్న భూలను కొలిచేస్తాం అంటూ కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తున్న హడావిడితో ఏం ఒరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి.

ఇదిలావుంటే.. గతంలో సాదా బైనామాలతో భూ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం తెగ హడావిడి చేసింది. రైతుల నుంచి దాదాపు 11లక్షల 20వేల దరఖాస్తులు స్వీకరించింది. కాని వాటిలో ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. కాగా తాజాగా నిర్వహిస్తున్న భూ సర్వే వల్ల ప్రభుత్వం ఏం సాధిస్తుందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా సీఎం ఇచ్చిన హామీ ప్రకారం దళితులు మూడు ఎకరాల భూమిని పంచాల్సిన అవసరం ఉంది. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నేతలు, రియల్‌ఎస్టేట్ సంస్థలు, అవినీతి అధికారుల కబ్జాకోరల్లో ఉన్న భూమిపై లెక్కలు తేల్చి పేదలకు పంచాలని వామపక్షాలు, రైతుసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

07:10 - September 25, 2017

నల్గొండ : నంద్యాల్లో టీడీపీ గెలుపు టీఆర్‌ఎస్‌ను తొందరపెడుతోందా..? సార్వత్రిక ఎన్నికలకు ముందే విపక్షాలను దెబ్బకొట్టాలన్న వ్యూహం ఫలిస్తుందా..? టీఆర్‌స్‌ అధినేత వ్యూహాలు వికటించనున్నాయా..? నల్లగొండ పార్లమెంట్‌ స్థానంలో ఉప ఎన్నికపై గులాబీపార్టీ తొందరపడుతోందా..? జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ ఎదుర్కోవడం అంత ఈజీనా..? ఇపుడు గులాబీపార్టీలో ఇదే చర్చ సాగుతోంది. నల్లగొండ పార్లమెంట్‌ స్థానం ఉప ఎన్నికల గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. తొందరపడుతున్నామా.. అనే అలోచనతో గులాబీదళపతి సతమతం అవుతున్నట్టు తెలుస్తోంది. నల్లగొండ పార్లమెంట్‌ స్థానంలో హస్తంపార్టీని తక్కువ అంచనా వేస్తున్నామా.. అనే ఆందోళన కారు గుర్తు పార్టీలో వస్తున్నట్టు చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోటలో పాగావేయడం అంత ఈజీ కాదనే విశ్లేషణలు వస్తున్నాయి.

గత ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండు లక్షలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత గుత్తా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అయితే మారారు కాని కార్యకర్తలు మాత్రం ఇంకా కాంగ్రెస్‌ వెంటే ఉన్నట్టు గుత్తాకూడా గ్రహించారు. అందుకే కారు గుర్తు పార్టీలో చేరినా గులాబీ కండువా కప్పుకోకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో నంద్యాల ఉప ఎన్నికలో అధికార టీడీపీ అనూహ్య విజయాన్ని సాధించడం..ఇక్కడ గులాబీ బాస్‌ కు ప్రేరణ అయిందనే అభిప్రాయాలు వస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ ని దెబ్బతీయాలంటే.. ఆ పార్టీ బలంగా ఉన్నచోటే దెబ్బకొట్టాలనేది ప్లాన్‌. అందుకే కేసీఆర్‌ ఆదేశాలతో ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. దాంతోపాటు ప్రజల్లోకి విస్తృతంగా దూసుకెళ్లుతున్న టీమాస్‌ఫోరం కూడా గులాబీబాస్‌ను ముందస్తు టెస్ట్‌కు పరుగులు పెట్టేలా చేస్తుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. పనిలో పనిగా ఇటీవల కాస్త హడావిడి చేస్తున్న బీజేపీ ఉత్సాహాన్ని కూడా దెబ్బకొట్టవచ్చనేది కేసీఆర్‌ వ్యూహాంగా తెలుస్తోంది.

అయితే నల్లగొండలో టీఆర్‌ఎస్‌ అంచనాలు తల్లకిందులు కావడం ఖాయం అని విపక్షాలు తేల్చి చెబుతున్నాయి. గతంలో పలు ఉప ఎన్నికల్లో గెలిచామని చెబుతున్న గులాబీనేతలు.. అసలు విషయాన్ని మర్చిపోయారని అంటున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజలను ప్రభావితం చేసి.. ఓట్లు పొందిన గులాబీపార్టీకి ప్రస్తుతం సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యే పరిస్థితి లేదంటున్నాయి. పైగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హస్తం పార్టీ ఇప్పటికీ బలంగానే ఉంది. టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ లాంటీ ఉద్దండులను తట్టుకుని గెలవడం అంత సులభం కాదనే విశ్లషణలు వస్తున్నాయి.  

07:07 - September 25, 2017

విజయవాడ : సొంత పార్టీపై విమర్శలు చేసిన కొందరు సీనియర్‌ నాయకులకు టీడీపీ చీఫ్ చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. తాజాగా ప్రకటించిన పార్టీ కమిటీల్లో చోటివ్వకుండా అంతా కొత్తవారితో భర్తీ చేశారు. ఇంతకీ కొత్త కమిటీలో చోటు దక్కించుకోలేకపోయిన ఆ నేతలెవరు? 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే ఫుల్ టీంను సిద్ధం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. శనివారం జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. ఏపీలో 104 మంది సభ్యులతో చంద్రబాబు టీడీపీ కమిటీని ఏర్పాటు చేశారు. టీడీపీ కమిటీల్లో కొందరు సీనియర్స్‌కు చంద్రబాబు గట్టి షాక్ ఇచ్చారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో సీనియర్ నేత కరణం బలరాం, విజయవాడకు చెందిన బోండా ఉమ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విశాఖ జిల్లాకు చెందిన బండారు సత్యనారాయణ మూర్తి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నిమ్మల రామానాయుడుకు కమిటీలో చోటు దక్కలేదు. పాత కమిటీలో ప్రధాన పదవుల్లో పనిచేసిన వీరికి కొత్త కమిటీలో మాత్రం చంద్రబాబు చోటు ఇవ్వలేదు. వీరంతా పలు సందర్భాల్లో అధినేతపై, పార్టీపై విమర్శలు చేయడమే కారణమని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వీరిలో నిమ్మలనాయుడు మినహా మిగిలిన నలుగురు నేతలు ఇటీవల చేసిన కామెంట్స్‌తో పార్టీ ఇరకాటంలో పడినట్లు సమాచారం.

కరణం బలరాం నిన్నటి వరకు పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవి పొందిన బలరాం అధినేత ఆదేశాలను బేఖాతరు చేయడమే కమిటీలో పదవి కోల్పోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. స్ధానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవితో బలరాంకి ఉన్న విభేదాలపై చంద్రబాబు అనేకసార్లు బలరాంను పిలిచి సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. అయినా మాట వినకపోవడం వల్లే పార్టీ కమిటీలో పదవి ఇవ్వలేదని సమాచారం. ఎమ్మెల్యే బోండా ఉమ నిన్నటి వరకు టీడీపీ జాతీయ కమిటీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు. కానీ ఈసారి ఆయనకు పార్టీ పదవి ఇవ్వలేదు. తాజాగా జరిగిన మంత్రి వర్గ విస్తరణలో అధినేతపై విమర్శలు చేయడం.. పార్టీని విమర్శించడం వంటి కారణాల వల్ల బోండా ఉమకు కొత్త కమిటీలో ప్లేస్ దక్కలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి వర్గ విస్తరణ సమయంలో చంద్రబాబుపై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. దీనిపై చంద్రబాబు పిలిచినా కలవలేదు. దీంతో చంద్రబాబు గోరంట్లపై తీవ్ర ఆగ్రహంలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకూ పార్టీ జనరల్ సెక్రటరీగా కొన్ని జిల్లాల బాధ్యతలు నిర్వహించిన గోరంట్లకు అందువల్లే కొత్త కమిటీ పదవి ఇవ్వనట్లు తెలుస్తోంది. ఇక పాత కమిటీలో పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన విశాఖ జిల్లా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తికూడా కొత్త కమిటీలో చోటు దక్కలేదు. మంత్రి పదవి దక్కలేదని పార్టీ పదవులకు రాజీనామా చేసి అధినేతపై విమర్శలు చేశారు. దాంతో కొత్త కమిటీలో మొండిచేయి ఎదురైంది. ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు ఎమ్మ్యల్యే నిమ్మల నాయుడు పాత కమిటీలో జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన పార్టీ ఆదేశాలను ధిక్కరించకపోయినా పార్టీ కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించనందున బాబు ఆయనను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపై పార్టీ ఆదేశాలను ధిక్కరించే వారు ఎంతటి వారైనా చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి అధినేత ఆదేశాలను నేతలు పట్టించుకుంటారా? లేక లైట్ తీసుకుంటారా ? అనేది వేచి చూడాలి. 

జనగామ..భూపాలపల్లికి రేవంత్..

హైదరాబాద్ : నేడు జనగామ, భూపాలపల్లిలో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఫారెస్ట్ అధికారుల దాడికి గురైన బాధితులను ఆయన పరామర్శించనున్నారు. 

పోలీసుల అదుపులో చిట్టీల వ్యాపారులు..

ప్రకాశం : చీరాల కొత్తపేటలో చిట్టీల వ్యాపారుల కుచ్చుటోపి బహిర్గతమైంది. రూ. 70 లక్షల మేర మోసం చేసినట్లు తెలిసింది. పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు చిట్టీల వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించగా పది సవర్ల బంగారం, రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. 

కాగ్ అడిటర్ జనరల్ గా..

ఢిల్లీ : నేడు నూతన కంప్రోల్టర్ అండ్ అడిటర్ జనరల్ గా రాజీవ్ మెహర్షి బాధ్యతలను స్వీకరించనున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 

సెకండ్ డే..బీజేపీ పదాధికారుల సమావేశం..

ఢిల్లీ : నేడు రెండో రోజు బీజేపీ పదాధికారుల సమావేశం జరుగనుంది. ప్రధాన మంత్రి మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా పాల్గొననున్నారు. 

భూ రికార్డుల ప్రక్షాళనపై గవర్నర్ పరిశీలన..

హైదరాబాద్ : నేడు భూ రికార్డుల ప్రక్షాళన..ప్రక్రియను ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పరిశీలించనున్నారు. మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో ఆయన పరిశీలించనున్నారు. 

తిరుమల..మూడో రోజు బ్రహ్మోత్సవాలు..

చిత్తూరు : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమలేషుని బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం సింహవాహనంపై శ్రీనివాసుడిని ఊరేగించారు. సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి ముత్యపు పందిరి వాహన సేవ జరుగనుంది. 

ముస్సోరికి బాబు..

 

విజయవాడ : నేడు సీఎం చంద్రబాబు నాయుడు ముస్సోరికి వెళ్లనున్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సదస్సులో పాల్గొననున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారుల మిడ్ కెరీర్ శిక్షణలో బాబు పాల్గొననున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ అమలు, ఫలితాలు, పథకాల అమలు..రెండంకెల వృద్ధి రేటు పై బాబు ప్రసంగించనున్నారు. 

 

Don't Miss