Activities calendar

26 September 2017

21:37 - September 26, 2017

ఢిల్లీ : డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ దత్తపుత్రిక హనీప్రీత్‌ ఆచూకీ లభించింది. దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బురఖా వేసుకుని రోడ్డుపై వెళ్తున్న దృశ్యాలు సిసిటివి కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. హనీప్రీత్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిలు కోసం పెట్టుకున్న పిటిషన్‌ను  హైకోర్టు కొట్టివేసింది. హనీప్రీత్‌ పోలీసుల ముందు లొంగిపోవాలని కోర్టు స్పష్టం చేసింది. 

రేప్‌ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ దత్తపుత్రిక హనీప్రీత్‌ ఢిల్లీలోని ఉన్నట్లు ఆధారం లభించింది. హనీప్రీత్‌ బురఖా కప్పుకుని రాజధానిలో ఓ రోడ్డుపై వెళ్తున్న దృశ్యాలు సిసిటివిలో రికార్డ్‌ అయ్యాయి.

ముందస్తు బెయిలు కోసం ప్రయత్నిస్తున్న హనీప్రీత్ సోమవారంనాడు ఎవరికి అనుమానం రాకుండా తన న్యాయవాది ఇంటికి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లాయర్‌ ఇంటికి వెళ్తుండగా సిసిటివి కెమెరాలో నమోదైన దృశ్యాలు పోలీసులకు అందాయి. ఈ వీడియో దృశ్యాల్లో ఉన్నది హనీయేనని అనుమానిస్తున్నారు. హనీప్రీత్‌ తన కార్యాలయానికి వచ్చినట్లు లాయర్‌ ప్రదీప్‌ ఆర్య ధృవీకరించారు. ముందస్తు  బెయిల్‌ కోసం ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 

విచారణ సందర్భంగా బెయిల్‌ పిటిషన్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టులో ఎందుకు దాఖలు చేయలేదని.... కోర్టులో ఆమెను ఎందుకు హాజరు పరచలేదని ఢిల్లీ హైకోర్టు హనీప్రీత్‌ న్యాయవాదిని ప్రశ్నించింది. హనీప్రీత్ దర్యాప్తుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని... ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని లాయర్‌ కోర్టుకు తెలిపారు. హనీప్రీత్‌కు పారిపోయే ఉద్దేశం లేకుంటే పోలీసులకు లొంగిపోవాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది.

హనీప్రీత్‌ కోసం హర్యానా పోలీసులు ఢిల్లీలో ఆమెకోసం గాలించారు. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో దక్షిణ ఢిల్లీలోని కైలాశ్‌ పార్ట్‌-2 లోని ఓ ఇంటిపై దాడి చేశారు. అయితే అక్కడ హనీప్రీత్‌ దొరకలేదు. ఈ ఇల్లు రామ్‌రహీమ్‌కు చెందినదని భావిస్తున్నారు. 

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో ఆగస్టు 25 పంచకుల కోర్టు గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో భారీ విధ్వంసం చెలరేగి ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. గుర్మీత్‌ను పోలీస్‌ కస్టడీ నుంచి తప్పించేందుకు విధ్వంసానికి కుట్ర పన్నినట్లు హనీప్రీత్‌పై ఆరోపణలున్నాయి. హర్యానా పోలీసులు ఆమెతో పాటు మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో 43 మంది పేర్లను చేర్చారు. ఆగస్టు 25 నుంచి పరారీలో ఉన్న హనీప్రీత్‌ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

21:36 - September 26, 2017

హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో మహాబతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 35 వేల మంది మహిళలు బతుకమ్మ సంబరాల్లో ఆడి పాడారు. 19 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఎల్బీ స్టేడియం పూలవనాన్ని తలపించింది. మహా బతుకమ్మ వేడుకలతో సందడిగా మారిపోయింది. 31 జిల్లాల నుంచి తరలివచ్చిన మహిళలు బతుకమ్మ కోలాటాలతో సందడి చేశారు. 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది మహాబతుకమ్మ. ఉయ్యాల పాటలతో ఎల్బీ స్టేడియం మార్మోగిపోయింది. జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ కోలాటమాడారు. 

మహా బతుకమ్మ వేడుకలో  19 రాష్ర్టాలకు చెందిన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 15 రాష్ర్టాల నుంచి బ్రహ్మకుమారీలు తరలివచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎంపీ కవితతో పాటు, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పలువురు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.  

21:24 - September 26, 2017
21:11 - September 26, 2017

చెత్తకుండి అయిన చంద్రాలు పోట్వ, గెల్పుకోసం శెమ్ట ఓడుస్తున్ననేతలు, లేకలేక పనిల మున్గిన గవర్నర్ సార్, కబ్జా కోర్ అయిన జనగామా ఎమ్మెల్యే, లలితా జ్యూవెల్లర్స్ ను మించిన నగలు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియలో చూద్దాం...

తిమ్మినాయుడుపాలెం వద్ద ఘోర రోడ్డుప్రమాదం

చిత్తూరు : తిమ్మినాయుడుపాలెం వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జాయింట్ కలెక్టర్ గిరీష్ షా కారు ఢీకొని యువకుడు మృతి చెందారు. 2 నెలల క్రితం కూడా జేసీ కారు ఢీకొని బాలుడు మృతి చెందారు. 

జమ్మలమడుగు టౌన్ బ్యాంక్ అవినీతిపై అధికారుల చర్యలు

కడప : జమ్మలమడుగు టౌన్ బ్యాంక్ అవినీతిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. చైర్మన్ తాతిరెడ్డి హృషికేశవరెడ్డి ఆస్తులతో పాటు మేనేజర్ బాలాజీ ఆస్తులు అటాచ్ చేశారు. 

నిజామాబాద్ ఎక్పైజ్ సూపరింటెండెంట్ జ్యోతికిరణ్ అరెస్టు

నిజామాబాద్ : జిల్లా ఎక్పైజ్ సూపరింటెండెంట్ జ్యోతికిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతికిరణ్ ఇంట్లో ఏసీబీ పోదాలు ముగిశాయి. 

20:57 - September 26, 2017

హైదరాబాద్ : రామ్‌గోపాల్‌ వర్మ నూతన చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పోస్టర్‌ను ఆయన తన ఫేస్‌బుక్‌ అకౌంట్లో విడుదల చేశారు. దివంగత సీఎం ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా లక్ష్మీపార్వతికి అనుకూలంగా ఉంటుందేమోనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీ కూడా కాంట్రవర్సీ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

20:55 - September 26, 2017

ఢిల్లీ : అట్లాంటాలో ఫ్రీ ఫాల్‌ డైవింగ్‌ స్పెషలిస్ట్‌లు ప్రదర్శించిన స్టంట్‌ ప్రస్తుతం ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌ వరల్డ్‌లోనే హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రొఫెషనల్‌ డైవర్లు కెవిన్‌ మెన్షన్‌,రొమెయిన్‌ యాంగ్లెట్‌, మ్యాగ్జిమ్‌ మెటాయర్‌, సోఫీ డేవిడ్‌, టోనీ కొయెస్లర్‌, నికోలస్‌ మార్గారోన్‌...ఆకాశంలో పెద్ద సాహసమే చేశారు. సముద్ర మట్టానికి 6 వేల మీటర్ల ఎత్తులో ఫ్రీ ఫాలింగ్‌ చేయడం మాత్రమే కాకుండా.....స్లాక్‌ లైన్స్‌పై జంప్స్‌ చేసి ఔరా అనిపించారు. గాల్లో....6 వేల మీటర్ల ఎత్తులో స్లాక్‌ లైన్‌ జంప్స్‌ చేసిన అథ్లెట్లుగా ఈ ఆరుగురు ప్రపంచరికార్డ్‌ సృష్టించారు. ఈ డేర్‌డెవిల్‌ స్టంట్‌కు ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌ అభిమానులు ఫిదా అయిపోయారు.  

20:52 - September 26, 2017

గుజరాత్ : గుజరాత్‌లో పరిపాలన రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా కొనసాగుతోందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఐదారుగురు పారిశ్రామిక వేత్తల కోసం మోది రిమోట్‌ కంట్రోల్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్నారని ఆరోపించారు. గుజరాత్‌ ప్రభుత్వం గుజరాత్‌ నుంచే సాగాలని...ఢిల్లీ నుంచి కాదని అన్నారు. గుజరాత్‌లో మార్పు రావాలంటే కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవాలని రాహుల్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మోది ప్రభుత్వం రైతులు, పేదల కోసం పనిచేయడం లేదని...బడా పారిశ్రామిక వేత్తల కొమ్ము కాస్తున్నారని ఆయన మండిపడ్డారు. పటేల్‌ సామాజికవర్గానికి కంచుకోట సౌరాష్ట్రలో రాహుల్‌ పర్యటించారు. బిజెపి ప్రభుత్వం పటేల్‌ సామాజిక ఉద్యమాన్ని లాఠీలు, తూటాలతో అణచివేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అన్నివర్గాల వారిని కలుపుకుపోతుందని చెప్పారు.

 

బతుకమ్మ వేడుకల్లో టీఆర్ ఎస్ నేతల మధ్య ఘర్షణ

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి.  కాటారం బతుకమ్మ వేడుకల్లో నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పుట్టా మధు,.. టీఆర్‌ఎస్‌ యూత్‌ లీడర్‌ సునిల్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సునిల్‌రెడ్డి వాహనంపై ఎమ్మెల్యే వర్గీయుల దాడి చేశారు. దీంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.

20:48 - September 26, 2017

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కాటారం బతుకమ్మ వేడుకల్లో నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే పుట్టా మధు,.. టీఆర్‌ఎస్‌ యూత్‌ లీడర్‌ సునిల్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సునిల్‌రెడ్డి వాహనంపై ఎమ్మెల్యే వర్గీయుల దాడి చేశారు. దీంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:46 - September 26, 2017

జగిత్యాల : వరుణుడు వర్షాలు కురిపించక పోయేసరికి అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వేసిన పంటలు ఎండిపోతుండటంతో కర్షకుడు కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు. జగిత్యాల జిల్లాలో ఆందోళన చెందుతున్న అన్నదాతలపై 10టీవీ ప్రత్యేక కథనం. 

జగిత్యాల జిల్లా జగ్గాసాగర్‌ గ్రామంలో ప్రతి ఏటా మూడు వేల ఏకరాల్లో సాగు చేసేవారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు బాగానే కురవడంతో అన్నదాతలు వెయ్యి ఎకరాల్లో వరిని సాగు చేశారు. 500 ఏకరాల్లో సాగు భూమిని పంటలు వేయక బీడు భూములుగా ఉంచారు. మరో పదిహేను వందల ఎకరాల్లో మొక్కజొన్న, పసుపు, పెసర్లు తదితర పంటలను సాగు చేస్తున్నారు. 

అయితే అనంతరం వరుణుడు కరుణించక పోవడంతో పాటు.. నిత్యం ఎండలు మండుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో వరికి సరియైన రీతిలో నీరందకుండా భూమికి పగుల్లు వచ్చి నీటి కోసం నోరు తెరిచినట్టు ఉంది. గ్రామంలో ఎండుతున్న పంటలను చూస్తూ అన్నదాతలు ఆవేదనకు లోనవుతున్నారు. మరోవైపు పెరిగిన మొక్కజొన్న కంకులు సరిగా రాక ..వచ్చినా కంకి పెరగక పోయే సరికి రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి పంటలు సాగు చేశామని పంటలు బతికే పరిస్థితుల్లో కనబడపోయేసరికి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వం తమపై దృష్టి సారించి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. 

20:43 - September 26, 2017

హైదరాబాద్ : అందరు ఖాజీల్లా అల్లాటప్పా కాదు...ఖాజీలకు చీఫ్‌...ఇతని కాంటాక్ట్స్‌ కూడా ఇంటర్నేషల్‌ లెవల్లోనే ఉంటాయి...ఇక ఆ కాంటాక్ట్స్‌తోనే కాంట్రాక్ట్‌ మ్యారేజీలు చేస్తుంటాడు...ఒక్క ఇంటర్నేషనల్‌ కాల్‌తోనే నిఖా పక్కా చేస్తాడు...రఫీ భాయ్ అంటే పాతబస్తీలో సుపరిచితుడే.. వీడి దుర్మార్గాలకు చెక్‌పెట్టారు పోలీసులు..

హైదరాబాద్‌ పాతబస్తీ...చారిత్రాత్మక ప్రాంతంలో చీకటి కోణాలెన్నో ఉన్నాయి...అందులో ప్రధానమైనది కాంట్రాక్ట్‌ పెళ్ల
ళ్లు.. ఈ మధ్యనే పోలీసులు భారీ ఎత్తున అరబ్‌ షేక్‌లను పట్టుకున్నారు...బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు...పేదరికంలో ఉన్న మైనర్ల బతుకులతో ఆడుకునే ఖాజీలున్నారు..అందులో ప్రధానమైనవాడు ఈ అబ్దుల్‌ రఫీ... రఫీకి అంతర్జాతీయ స్థాయిలో లింకులున్నాయి.. గల్ఫ్‌ దేశాల్లోని అరబ్‌ షేక్‌లు పెళ్లి చేసుకోవాలంటే చాలు రఫీ కుదుర్చుతాడు..అంతా ఫోన్లపైనే...ఒక్క ఇంటర్నేషనల్‌ కాల్‌తోనే మైనర్ బాలిక జీవితాన్ని నాశనం చేయగల దుర్మార్గుడు...

ఈ మధ్యకాలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ముఠాలను విచారించగా వారు చెప్పిన సమాచారంతో నగరంలో ఇంకా పెళ్లిళ్లు చేసుకునేందుకు అరబ్‌షేక్‌లున్నారని తేలింది..అమాయక ముస్లీం యువతులను డబ్బుల ఆశ చూపించి వారికి నఖీలి ధ్రువ పత్రాలను స్రష్టించి అరబ్ షేకులతో వివాహం జరిపిస్తున్నారని సమాచారం...దీంతోనే పోలీసులు చంద్రాయణగుట్ట,పాత బస్తి తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా ముగ్గురు ఓమన్ అరబ్ షేకులను ఇద్దరు ఖాజీలను అదుపులోకి తీసుకున్నారు...

కాంట్రాక్ట్ పెళ్లిళ్లు నిర్వహిస్తున్న ముఠా సభ్యుల వద్ద నుండి నకిలీ స్టాంపు ప్యాడ్ లు నఖీలీ పాస్ పోర్టులు స్వాధీనం చేసుకున్నారు...ఇప్పటికే అరెస్ట్ అయిన వారందరిపై పిడి యాక్ట్ పెట్టడానిక నగర కమీషనర్ కు ప్రతిపాదనలు పంపారు..ఇక నగరంలో ఇప్పటి వరకు 75 మంది ఖాజీలు ఉన్నట్లు గుర్తించగా..అందులో 38 మంది బోగస్‌ ఖాజీలు ఉన్నారు...

నగరంలోని పాతబస్తీలో జరిగిన దారుణాలు ఎన్నో..చీకట్లో జరిగిన ఎన్నో అరాచకాలు బయటపడుతున్నాయి..దీనిలో ప్రధానమైనది నిఖాలు...పోలీసులకు తెలిసిన సమాచారంలో దాదాపు 35 మందికి నిఖా జరిపించగా అందులో పాతిక మంది మైనర్లు ఉన్నట్లు తేలింది...గల్ఫ్‌ దేశాల్లోని అరబ్‌షేక్‌ల చెరలో ఉన్న వారికి విముక్తి కల్పించేందుకు కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు..

పట్టుబడిన అరబ్‌ షేక్‌ల వద్ద అనేక రకాల స్టెరాయిడ్స్, లైంగిక సామర్థ్యాన్ని పెంచే మాత్రలు లభించినట్లు తెలుస్తోంది...ఒమన్ దేశానికి రాయాబార కార్యాలయం ద్వారా లేఖ రాసి ఇలాంటి వారిని వివధ రకాల వీసాలపై రాకుండా చూడాలని కోరినట్లు పోలీసులు చెబుతున్నారు...

 

20:42 - September 26, 2017

ప్రకాశం : అందరూ కాలేజీ స్టూడెంట్సే...పరిచయం ప్రేమగా మారింది..జంటలుగా కలిసి చెట్టాపట్టాలు కొట్టారు..అంతే అందులో ఒకడికి వచ్చిన అనుమానంతో తన ప్రియురాలిని  విహారయాత్రకంటూ తీసుకువెళ్లి దారుణానికి తెగబడ్డాడు..ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు...అమానవీయఘటనపై ప్రకాశం జిల్లా పోలీసులు వెంటనే స్పందించారు..ప్రకాశం జిల్లాలో ఓ అమానవీయఘటన సభ్యసమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఇక్కడ ఓ యువకుడు యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడుతున్నాడు..దాన్ని వీడియోలో బంధిస్తున్నాడు మరో యువకుడు...అదే సమయంలో వారితో పాటు ఉన్న మరో యువతి నిలువరించే ప్రయత్నం చేస్తుంది...ఇక విషయానికి వస్తే ఆ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నది సాయి...అతను స్నేహితుడే...ఇక వీడియో తీస్తున్నది కార్తీక్..  ఆ బాధిత యువతి ప్రేమికుడు...మరో యువతి మరో యువకుడి ప్రియురాలు..వీరంతా ఫ్రెండ్స్...
 

ప్రకాశం జిల్లా కనిగిరి చెందిన యువతి డిగ్రీ స్టూడెంట్...ఇక మిగతా వారంతా బీటెక్‌,డిగ్రీ చదువుతున్నవారే..వీరంతా స్నేహితులు..ప్రేమికులు కూడా...ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు విద్యార్థినులు కలిసి విహారానికి అంటూ శివానగర్‌ ప్రాంతంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు...అక్కడికి వెళ్లాక ఆ యువకులు ముందుగా అనుకున్న ప్రకారం ముగ్గురు విద్యార్థులు కలిసి అందులోని ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు. యువతిని వివస్త్రను చేసేందుకు ప్రయత్నించిన దృశ్యాల్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీసి ఆ దృశ్యాలను వాట్సాప్‌లో వారి స్నేహితులతో పంచుకున్నారు...బాధిత యువతి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనలో పోలీసులు వెంటనే స్పందించి ప్రధాన నిందితుడు కార్తీక్‌ సహా అతని స్నేహితులైన పవన్‌, సాయిలను అదుపులోకి తీసుకున్నారు.

విశాఖ టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్‌ ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

విశాఖ : నిన్న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విశాఖ టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్‌ రఘును ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రఘుకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఇక ఇదే కేసులో రఘు బినామీలు శివప్రసాద్‌, గాయత్రిలను అరెస్ట్‌ చేశారు. 

20:36 - September 26, 2017

విశాఖ : నిన్న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విశాఖ టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్‌ రఘును ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రఘుకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఇక ఇదే కేసులో రఘు బినామీలు శివప్రసాద్‌, గాయత్రిలను అరెస్ట్‌ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:30 - September 26, 2017
20:28 - September 26, 2017

హైదరాబాద్‌ : బిగ్ బాస్‌ తెలుగు రియాల్టీ షోలో విజేతగా నిలిచిన నటుడు శివబాలాజీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో శివబాలాజీకి అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. శివబాలాజీకి అభినందనలు తెలిపి సెల్ఫీలు దిగారు. 

 

20:26 - September 26, 2017

నకిలీ భూ దస్తావేజులతో మోసం...8 మంది అరెస్టు

కృష్ణా : నకిలీ భూ దస్తావేజులు సృష్టించి మోసం చేస్తున్న 8 మంది నిందితులను విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆన్‌లైన్లో రెవెన్యూ భూముల డేటా తారుమారు చేసి విక్రయించేందుకు వీరు ప్రయత్నించారు. రెవెన్యూ అధికారుల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తెలుసుకుని రికార్డులను మార్పిడి చేశారు. విజయవాడ నగరశివారు రామవరప్పాడు, గొల్లపూడి, కొత్తూరు తాడేపల్లిలో భూ రికార్డులు మార్చి మోసానికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా గత కలెక్టర్ బాబు,  తహశీల్దారు సంతకాలు ఫోర్జరీచేసి భూదస్త్రాల సృష్టించారు. ఈ నెల 6న విజయవాడ రూరల్ తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..

20:23 - September 26, 2017

కృష్ణా : నకిలీ భూ దస్తావేజులు సృష్టించి మోసం చేస్తున్న 8 మంది నిందితులను విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆన్‌లైన్లో రెవెన్యూ భూముల డేటా తారుమారు చేసి విక్రయించేందుకు వీరు ప్రయత్నించారు. రెవెన్యూ అధికారుల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తెలుసుకుని రికార్డులను మార్పిడి చేశారు. విజయవాడ నగరశివారు రామవరప్పాడు, గొల్లపూడి, కొత్తూరు తాడేపల్లిలో భూ రికార్డులు మార్చి మోసానికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా గత కలెక్టర్ బాబు,  తహశీల్దారు సంతకాలు ఫోర్జరీచేసి భూదస్త్రాల సృష్టించారు. ఈ నెల 6న విజయవాడ రూరల్ తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ప్రధాన నిందితుడు ఉప్పుతల్ల నరసింహారావు అలియాస్ నర్రా రమేష్ సహా 8మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఆర్‌డీఏ పరిధిలోని వివాదాస్పద భూములనూ సెటిల్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటి వరకు 15 నుంచి 20 ఎకరాల భూముల రికార్డులు ట్యాంపరింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

 

20:20 - September 26, 2017

తూర్పుగోదావరి : దసరా వేడుకలకు ఏపీ పర్యాటక శాఖ ముస్తాబవుతోంది. గోదావరి తీరాన.. వీక్షకులను ఆకట్టుకునేలా... భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజమహేంద్రవరంలో గోదావరి డాన్స్‌ అండ్‌ లాంటర్న్‌ ఫెస్టివల్‌  పేరిట ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తొంది. 

దసరా శరన్నవరాత్రుల్లో గోదావరి తీరాన వేడుకలు ఏర్పాట్లు చేస్తోంది ఏపీ టూరిజం విభాగం. ఈ నెల 27, 28వ తేదీల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. ఓ వైపు ఆధ్యాత్మికత, సంప్రదాయ నృత్యాల ప్రదర్శనతో పాటుగా.. మరోవైపు యువతను ఆకర్శించేలా కార్యక్రమాలను రూపొందిస్తోంది. 

దసరా పండుగను పురస్కరించుకొని 51మంది వేదపండితులచే గోదావరి తల్లికి మహాహారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే కథక్‌, మణిపురి నృత్య ప్రదర్శనలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క యువతను ఉర్రూతలూగించే విధంగా మ్యూజికల్‌ నైట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ వాయిద్యకారుడు శివమణి డ్రమ్స్‌తో  అలరించనున్నారు. ఇవి కాకుండా ఫైర్‌ వర్క్స్‌ ప్రదర్శన స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉండనుంది.
ఈ కార్యక్రమాల కోసం మూడు ప్రత్యేక స్టేజ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 

సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు... తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని రకాల వంటకాలతో ఫుడ్‌ ఫెస్టివల్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇవే కాకుండా జిల్లాకు చెందిన వివిధ రకాల వస్తువులు, చేతివృత్తుల ప్రదర్శనలు ఉత్సవాల్లో దర్శనమివ్వనున్నాయి. మొత్తానికి ప్రభుత్వం ఉత్సవాల రూపంలో జిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తొంది. దసరా సందర్భంగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పర్యాటకుల దృష్టి రాజమహేంద్రవరంపై పడేలా ప్రయత్నిస్తొంది. 

20:19 - September 26, 2017

ఢిల్లీ : ఆప్గనిస్తాన్‌కు భారత సైనికులను పంపే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. అభివృద్ధి, వైద్య సేవలకు తదితర రంగాల్లో ఆఫ్గనిస్తాన్‌కు భారత్‌ సహాయం చేస్తుందని తెలిపారు. మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్‌ మ్యాటీస్-  రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటి అయ్యారు. ఉగ్రవాదం తదితర అంశాలపై చర్చించారు. అనంతం సంయుక్త మీడియా సమావేశంలో ఇరువురు నేతలు మాట్లాడారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్వర్గధామాలు సహించరాదని ఇరుదేశాలు అంగీకారానికి వచ్చినట్లు సీతారామన్‌ తెలిపారు. ఒకవేళ జేమ్స్‌ మటిస్‌ పాకిస్థాన్‌లో పర్యటిస్తే, ఆ దేశంలో ఉగ్రవాద సురక్షిత స్థావరాలు, సరిహద్దుల ఆవలి నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద సమస్యలను లేవనెత్తాలని కోరినట్లు ఆమె తెలిపారు. ఉగ్రవాదంతో భారత్‌, అమెరికాలు నష్టపోయాయని, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని జేమ్స్‌ చెప్పారు. ఉగ్రవాదం ప్రపంచానికి ముప్పుగా పరిణమించిందని జేమ్స్‌ అన్నారు.

 

20:15 - September 26, 2017

ఢిల్లీ : రేప్‌ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ దత్తపుత్రిక హనీప్రీత్‌ ఢిల్లీలోని ఉన్నట్లు ఆధారం లభించింది. హనీప్రీత్‌ బురఖా కప్పుకుని రాజధానిలో ఓ రోడ్డుపై వెళ్తున్న దృశ్యాలు సిసిటివిలో రికార్డ్‌ అయ్యాయి. బెయిలు కోసం ప్రయత్నిస్తున్న హనీప్రీత్ సోమవారం లాయర్‌ ఇంటికి వెళ్లినపుడు సిసిటివిలో ఈ దృశ్యాలు చోటుచేసుకున్నాయి. హనీప్రీత్‌ తన కార్యాలయానికి వచ్చినట్లు లాయర్‌ ప్రదీప్‌ ఆర్య ధృవీకరించారు. హనీప్రీత్‌కు బెయిల్‌ కోసం ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అత్యవసర విచారణ కింద పిటిషన్‌ దాఖలు చేసినట్లు హనీప్రీత్‌ లాయర్ ప్రదీప్ ఆర్య తెలిపారు. మరికొద్దిసేపట్లో బెయిలుపై కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఉదయం 7 గంటల ప్రాంతంలో కైలాశ్‌ పార్ట్‌-2 లోని ఓ ఇంటిపై దాడి చేశారు. అయితే అక్కడ హనీప్రీత్‌ దొరకలేదు. ఈ ఇల్లు రామ్‌రహీమ్‌కు చెందినదని భావిస్తున్నారు. హనీప్రీత్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

 

20:13 - September 26, 2017

రంగారెడ్డి : జిల్లాలోని షాద్‌నగర్‌లో.. వైద్యం వికటించి పసికందు మృతి చెందిన సంఘటనలో డాక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ప్రేమ్‌కుమార్‌ను శిక్షించడంచో పాటు ఆసుపత్రిని సీజ్‌ చేయాలన్నారు. షాద్‌నగర్‌ ముఖ్య కూడలిలో పాప తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ధర్నాకు దిగారు. పాప తల్లిదండ్రులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు. వర్షం పడుతున్నా కూడా పాప మృతదేహంతో ధర్నా చేస్తుండటం పలువురిని కలచివేసింది.

 

20:11 - September 26, 2017

భద్రాద్రికొత్తగూండెం : ప్రభుత్వం వెంటనే జీవో.39 ని రద్దుచేయాలని జేఎసీ చైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. భద్రాద్రి జిల్లా పర్ణశాలలో ఆదివాసుల భూమి సమస్యలు తెలుసుకునేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలో ఖాలీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చెయ్యాలని డిమాండ్‌ చేశారు. అక్టోబర్ 31న జరిగే  కొలువు కై కొట్లాట సభకు అందరు హాజరు కావాలని కోదండరామ్‌   కోరారు.

 

20:09 - September 26, 2017

గుంటూరు : తుళ్లూరు మండలం... మందడం హైస్కూల్‌ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పాఠశాల వివరాలను తెలుసుకున్నారు. మందడం హైస్కూల్‌ను మోడల్‌ స్కూల్‌గా తయారు చేస్తామని గంటా చెప్పారు. ఇక్కడే వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌ కాలేజ్‌ని ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల కోసం ఐదు వేల కోట్లు కేటాయించామని... 18 నెలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.

 

20:06 - September 26, 2017

నెల్లూరు : రూరల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి పనితీరుపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఆయన తడబడుతున్నారన్నది ప్రజల మాట. ప్రచార ఆర్భాటం తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిందేమీ లేదంటున్నారు. మూడేళ్లుగా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి పనితీరుపై స్పెషల్‌ ఫోకస్‌.. 

నెల్లూరు.. అలియాస్‌ సింహపురి..! రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడి ప్రజల్లో రాజకీయం చైతన్యం వెల్లివిరుస్తూ ఉంటుంది. అట్లాంటి జిల్లాలో రూరల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఆయన ఎన్నికై.. మూడేళ్ల కాలం గడిచిపోయింది. ఈ వ్యవధిలో శ్రీధర్‌రెడ్డి పనితీరు ఎలా ఉంది..? ఇచ్చిన హామీలను ఆయన ఏమేరకు నెరవేర్చారు..? ఈ ప్రశ్నలకు ప్రజల నుంచి పెదవి విరుపే సమాధానంగా వస్తోంది. 

2014 ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు కోటం రెడ్డి శ్రీధరరెడ్డి. ఎన్నికలకు ముందు ప్రజలకు హామీల వర్షం కురిపించారు. వాటిల్లో ప్రధానమైనది.. తాగునీటి ఎద్దడి నివారణ. ప్రజల దాహార్తిని తీర్చే విషయంలో కోటంరెడ్డి విఫలమయ్యారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గం పరిధిలోని అనేక ప్రాంతాల్లో గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. గతంలో 150 కోట్లతో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు ఏర్పాటు చేసినా పైపులైను వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజల దాహార్తి తీరడంలేదు. 

ఇక రూరల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇప్పటికీ రోడ్లు సక్రమంగా లేవు. అనేక గ్రామాలకు చాలా దశాబ్దాల క్రితం వేసిన మట్టిరోడ్లే ఉన్నాయి. సమీపంలోనే జిల్లా కేంద్రం ఉన్నా కొన్ని గ్రామాలకు కనీసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా లేదు. దీంతో ఆ ప్రజలకు ఆటోలే దిక్కుగా ఉన్నాయి. ఫలితంగా గ్రామీణులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. నెల్లూరుకి సర్వీసు రోడ్డుతో పాటు పలు ప్రాంతాలకు తాత్కాలిక రోడ్లు వేయించారేతప్ప శాశ్వత పరిష్కారం చూపలేదన్న ఆవేదన ప్రజల్లో ఉంది.   

నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ మరింత దయనీయంగా ఉంది. కాలువలు సక్రమంగా లేవు. మురికి నీరు, చెత్తాచెదారం, కాలువల్లో  పేరుకుపోవడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పేరుతో ఇష్టారాజ్యంగా రోడ్లను తవ్వేయడంతో గుంతలు ఎక్కడున్నాయో తెలీక ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. పన్నులను మాత్రం నగర స్థాయిలో వసూలు చేస్తున్నారు కాని ఆ స్థాయిలో వసతులు కాని, సౌకర్యాలు గాని ప్రజలకు అందించడంలేదని ప్రజలు వాపోతున్నారు. 

విజయవాడ, గుంటూరు తర్వాత ఏపీలో నెల్లూరు నియోజకవర్గంలోని ఆటోనగర్‌కు ప్రాధాన్యముంది. సుమారు 40 ఏళ్లకు పైగా ఉన్న ఈ ఆటోనగర్‌లో ఇప్పటికీ తారురోడ్లు లేవు. దీంతో మట్టిరోడ్లే దిక్కయ్యాయి. ఈ ప్రాంతం సిటీలోనే ఉన్నా కనీస సౌకర్యాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ఇదే ప్రాంతంలో అనేక కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే వర్షం పడితే ఈ ప్రాంతానికి వెళ్లాలంటే అష్టకష్టాలు పడాల్సివస్తుంది.  

ఇంతాచేసి కోటంరెడ్డి శ్రీధరరెడ్డి గడచిన మూడేళ్లలో అస్సలు పనిచేయలేదని చెప్పలేం. కొన్ని ప్రజోపయోగ్యమైన కార్యక్రమాలనూ ఆయన చేపట్టారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే కోటి రూపాయల గౌరవ వేతనాన్ని పేద విద్యార్థుల ఆర్థిక సహాయం, వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం వినియోగిస్తున్నారు. పెద్దలు విశ్రాంతి తీసుకోవడం కోసం పెద్దల కొలువును ఏర్పాటు చేయడం, శ్మశానవాటికలను, పార్కులను అభివృద్ధి పరచడం వంటి పనులు చేశారు. వామపక్షాలతో కలిసి రూరల్‌ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయాలన్న టోల్‌ గేట్‌ని అడ్డుకున్నారు. టోల్‌ గేట్‌ లేకుండా చేసి ప్రజలను పన్నుల భారం నుండి తప్పించారు. అన్నింటికన్నా ముఖ్యంగా.. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. కాని నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించడంలేదన్నదే ప్రజల అసంతృప్తి. 

ఎమ్మెల్యే కోటంరెడ్డి పనితీరుపై ప్రత్యర్థులు తరచూ విరుచుకుపడుతూనే ఉన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయడం లేదని, ప్రచార ఆర్భాటం తప్ప మరేదీ ఎమ్మెల్యేకి పట్టదని విమర్శిస్తున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తారే తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేయరన్నది వారి వాదన. మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనూ కోటం రెడ్డి ఎలాంటి నిధులు రాబట్టలేకపోయారని అటు నియోజక వర్గ ప్రజలూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

వచ్చే ఎన్నికల్లో పోటీకి మళ్లీ బరిలోకి దిగే ప్రయత్నం చేస్తున్న కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి.. హామీల అమలులో తన వైఫల్యాలను ఎలా సమర్థించుకుంటారు..? తన పనితీరుపై ప్రజలను ఎలా మెప్పిస్తారు..? అన్న చర్చ సాగుతోంది. మరి కోటంరెడ్డి శ్రీధరరెడ్డి.. ప్రజలను మరోసారి మెస్మరైజ్‌ చేస్తారా..? ప్రజాగ్రహానికి గురవుతారా..? వేచి చూడాలి. 

కీచక వీఆర్వో

కర్నూలు : జిల్లాలోని మంత్రాలయం మండలం కోసిగిలో చోటుచేసుకుంది. కుల ధృవీకరణ పత్రం కోసం వచ్చిన ఇంటర్‌ విద్యార్థినిపై కోసిగి వీఆర్వో బ్రహ్మానందం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తాను చెప్పినట్లు చేస్తేనే కులధృవీకరణ పత్రం ఇస్తానంటూ షరతు పెట్టాడు. ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడుతూ ఆఫీస్‌ చుట్టూ తిప్పుకున్నాడు. అయితే... వీఆర్వీ లైంగిక వేధింపుల విషయం బంధువులకు తెలియడంతో... బ్రహ్మానందంకు దేహశుద్ది చేశారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

19:59 - September 26, 2017

కర్నూలు : కామంతో కళ్లు మూసుకుపోయిన కొంతమంది దుర్మార్గులు... అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అవసరం కోసం తమ వద్దకు వచ్చే మహిళలను లోబర్చుకునేందుకు యత్నిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కోసిగిలో చోటు చేసుకుంది. కుల ధృవీకరణ పత్రం కోసం వచ్చిన ఇంటర్‌ విద్యార్థినిపై కోసిగి వీఆర్వో బ్రహ్మానందం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తాను చెప్పినట్లు చేస్తేనే కులధృవీకరణ పత్రం ఇస్తానంటూ షరతు పెట్టాడు. ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడుతూ ఆఫీస్‌ చుట్టూ తిప్పుకున్నాడు. అయితే... వీఆర్వీ లైంగిక వేధింపుల విషయం బంధువులకు తెలియడంతో... బ్రహ్మానందంకు దేహశుద్ది చేశారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే... బ్రహ్మానందం విషయం తమ దృష్టికి వచ్చిందని.... పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కోసిగి తహశీల్దార్‌ అన్నారు.

 

 

19:43 - September 26, 2017
19:41 - September 26, 2017

రాజన్నసిరిసిల్ల : అనంతారం ప్రాజెక్టు పనులను సోమారంపేట రైతులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కన్ స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రైతులను అరెస్టు చేశారు. పీఎస్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ అర్ధరాత్రి 1.30 నుంచి సర్వతిదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రేపు ఉదయం ఉదయం 9 గంటలకు అమ్మవారిని సీఎం చంద్రబాబు దర్శించుకోనున్నారు. 

అనంతారం ప్రాజెక్టు పనులను అడ్డుకున్న సోమారంపేట రైతులు

రాజన్నసిరిసిల్ల : అనంతారం ప్రాజెక్టు పనులను సోమారంపేట రైతులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కన్ స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రైతులను అరెస్టు చేశారు. పీఎస్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.

ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ వేడుక

హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ వేడుక జరుగుతోంది. ఈ సంబరాల్లో 28 వేల మంది మహిళలు పాల్గొన్నారు. 25 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేశారు. 15 రాష్ట్రాల నుంచి కళాకారులు తరలివచ్చారు.

 

18:41 - September 26, 2017

విజయవాడ : 2029 నాటికి ఏపీని 50 శాతం పచ్చదనంగా మార్చేస్తామన్నారు ఏపీ అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు. విజయవాడ భవానీపురం బరంపార్క్‌లో జరిగిన అటవీ శాఖ అధికారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న మనం-వనం కార్యక్రమంపై సమీక్షించామని, రాబోయే కాలంలో నగరాల్లో కూడా వనాలు పెంచటంపై కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండేళ్లుగా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ను అదుపులోకి తెచ్చామన్న శిద్దా రాఘవరావు ఎర్రచందనం దుంగలు అడ్డదారుల్లో తరలించేవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. 

 

18:33 - September 26, 2017

నిజామాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్ వర్ని మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు 91 చెక్కులను  మంత్రి పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డ పెళ్లికి ఏ తండ్రికి భారం కాకూడదని సీఎం పథకం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పెళ్లికి 15 రోజుల ముందు కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని పోచారం సూచించారు. 

 

18:31 - September 26, 2017

హైదరాబాద్ : ఎంపీ నిధుల వినియోగంపై సచివాలయంలో ప్రభుత్వ సీఎస్‌- ఎస్పీసింగ్‌ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎంపీ నిధుల ఖర్చు ప్రపోజల్స్‌ను అప్‌లోడ్‌ చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని.. దీనివల్లే పనులు జరగడం లేదన్నారు. ఎంపీ నిధుల కింద ఏడాదికి 5 కోట్ల రూపాయలు వస్తున్నాయని అందులో 70 శాతం నిధులు కూడా ఖర్చు కావడం లేదన్నారు. అధికారులు సహకరించాలని ఎంపీలు కోరారు. అలాగే.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపీలకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని.. పోటోకాల్‌ పాటించడం లేదని సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. 

 

17:51 - September 26, 2017

హైదరాబాద్ : సచివాలయాన్ని బైసన్ పోలో గ్రౌండ్స్‌కు మార్చాలన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో టీకాంగ్రెస్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ సందర్భంగా నగరంలోని 20 చోట్ల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. కొడుకు సీఎం కావాలనే వాస్తుపేరిట కేసీఆర్ కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణం చేపడుతున్నారని పార్టీ సీనియర్లు షబ్బీర్ అలీ, వీ.హనుమంతరావు విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

17:48 - September 26, 2017

ప్రకాశం : జిల్లాలోని కనిగిరిలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై సాయి అనే యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన సాయి స్నేహితులు కోటేశ్వరరావు, కార్తీక్ సోషల్‌ మీడియాలో పెట్టారు. దీనిపై యువతి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్‌ చేశారు. కనిగిరినగర పంచాయతీలోని శివానగర్‌ కాలనీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు విద్యార్థినులు కలిసి విహారానికి వెళ్లారు. అక్కడ ముగ్గురు విద్యార్థులు కలిసి అందులోని ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు. యువతిని వివస్త్రను చేసేందుకు ప్రయత్నించిన దృశ్యాల్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీసి ఆ దృశ్యాలను వాట్సాప్‌లో వారి స్నేహితులతో పంచుకున్నారు. ఈ ఘటనపై కనిగిరి పోలీస్‌ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. ఎస్సై శ్రీనివాసరావు ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విద్యార్థుల్లో ఒకరు బీటెక్‌ చదువుతుండగా.. మరో ఇద్దరు డిగ్రీ చదువుతున్నారు.

 

17:46 - September 26, 2017

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో రెండో రోజు... కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని కలిశారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన పెండింగ్‌ బిల్లులపై చర్చించారు. నాలుగైదు రోజుల్లో రాష్ట్రానికి రావాల్సిన బిల్లులను చెల్లిస్తామని జైట్లీ హామీ ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. అదేవిధంగా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని... వచ్చే నెల ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు రావాల్సిందిగా గడ్కరీని ఆహ్వానించగా... అందుకు అంగీకరించారని చంద్రబాబు తెలిపారు.

 

17:42 - September 26, 2017
17:39 - September 26, 2017

కోస్ట్ గార్డ్ అడిషనల్ డీజీ వీఎస్ ఆర్ మూర్తితో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోస్ట్ గార్డ్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. తీరం రక్షణ బాధ్యత కూడా తమకు అప్పగించారని తెలిపారు. ట్రైనింగ్ చాలా టఫ్ గా ఉంటుందన్నారు. సముద్రంలో ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారిని రక్షించినప్పుడు చాలా అనందం కల్గుతుందని చెప్పారు. కోస్ట్ గార్డ్ లో ఏం జరుగుతుంది ? అనే అంశాలను వీడియోలో చూద్దాం..

 

17:33 - September 26, 2017
17:32 - September 26, 2017

తార్నాకలో పాత నోట్ల మార్పిడి చేస్తున్న ముఠా అరెస్ట్...

హైదరాబాద్: తార్నాకలో పాత నోట్ల మార్పిడి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 2 కోట్ల పాత కరెన్సీని వెస్ట్ జోన్ పోలీసులు సీజ్ చేశారు.

కోసిగిలో వీఆర్వోకు దేహశుద్ధి

కర్నూలు: కోసిగిలో వీఆర్వోకు దేహశుద్ధి చేశారు. కుల ధృవీకరణ సర్టిఫికేట్ కోసం వచ్చిన విద్యార్థిని వీఆర్వో బ్రహ్మానందం కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీఆర్వోపై ఫిర్యాదు చేసినా తహశీల్దారు పట్టించుకోలేదని బాధితురాలు విమర్శిస్తున్నారు.

17:12 - September 26, 2017

వందేళ్ల చరిత్ర కల్గిన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలకు మహిళ ప్రొఫెసర్, అలాగే మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్ ఆవిడ. మహిళా ఉపాధ్యాయులు వృత్తి పట్ల నిబద్ధత ఉంటూనే హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చిన చైతన్య మహిళ ఆమె. నేటి ఆధునిక కాలంలో కూడా సంస్కృతి సంప్రదాయాల పేరుతో మహిళలు వెనుకబాటుకు గురవుతున్నారనే ఆవేదన ఆమెది. ఉపాధ్యాయులు కేవలం పాఠ్య పుస్తకానికే పరిమితం కాకుండా నిత్యం సమాజాన్ని అధ్యయనం చేస్తూ విద్యార్థులను చైతన్యం చేయాల్సిన బాధ్యత గలవారిగా ఉండాలంటారమే. ఆమె ప్రతిష్మాత్మక ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల మహిళా ప్రొఫెసర్ గా పని చేసిన కస్తూరి లక్ష్మీ. బతుకమ్మ పండుగకు అసలైన నిర్వచనం ఏమిటో తను రాసే వ్యాసాల ద్వారా తెలిపేవారు. బతుకమ్మ అంటే కేవలం ఆడవారి ఆటల పండుగేనా ? బతుకమ్మ సంస్కృతి పండుగ ఎలా అయిందో ? ఈ బతుకమ్మ, ప్రకృతి, స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటీ ? ఈ అంశాలను లక్ష్మీ మాటల్లోనే తెలుసుకుందాం. పూర్తి వివరాలను వీడియోలో వీడియోలో చూద్దాం...

 

ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ వేడుకలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన 35 వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటు రాష్ట్ర సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపిలు, అధికారులు కూడా పాల్గొన్నారు.

5కిలోల టిఫిన్ బాంబు నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు

ఛత్తీస్ గఢ్: భద్రతా బలగాలు తృటిలో తప్పించుకున్నాయి. రోడ్డు మధ్యలో 5 కిలోల టిఫిన్ బాంబును గుర్తించి వెంటనే ఆ బాంబును భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. కాంకేర్ జిల్లాలోని కోయలిబెడ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా టిఫిన్ బాంబు ను గుర్తించారు.

16:48 - September 26, 2017


హైదరాబాద్ : రైతు సమన్వయ సమితులు వివాదానికి దారితీస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది.  వివిధ స్థాయిల్లో కమిటీల పదవులపై ఆచితూచి వ్యవహరిస్తోంది.  గ్రామం  నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు కట్టబెట్టడంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఎక్కడా వివాదాలకు ఆస్కారం ఇవ్వొద్దంటూ పార్టీ నేతలకు గులాబీబాస్‌ ఆదేశాలు జారిచేసినట్టు తెలుస్తోంది.

గ్రామస్థాయిలో   ఏర్పాటు చేస్తున్న  రైతు సమన్వయ సమితులపై విపక్షాలు విమర్శలు సంధిస్తుండటంతో సీఎం కేసీఆర్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జిల్లా,రాష్ట్రస్థాయి కమిటీల ఏర్పాటులో వివాదాలకు తావులేకుండా చూడాలని పార్టీనేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది.  మరోవైపు విపక్షాలు న్యాయపోరాటానికి కూడా సిద్ధం కావడంతో  ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుకమిటీల నియామకాన్ని పూర్తి చేసేందుకు  ప్రణాళికలను రచిస్తోంది. 

రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవికి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందన్న ప్రచారం గులాబీపార్టీలో జోరుగా సాగుతోంది. ఇక జిల్లా కమిటీలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. జిల్లా కమిటీల్లో  24 మంది సభ్యులు, రాష్ట్ర కమిటీల్లో 42 మంది సభ్యుల నియమాకం జరుగాల్సి ఉంది.  పూర్తి స్థాయి వివరాలు  సేకరించిన తర్వాతే జిల్లా రైతుసమితుల నియామకం చేయాలన్న అభిప్రాయంతో  ముఖ్యమంత్రి ఉన్నట్టు సమాచారం. ఈ కారణంగానే   రైతు సమితుల ఏర్పాటు విషయంలో జాప్యం జరుగుతోందని పార్టీవర్గాలు  అంటున్నాయి.  

న్యాయపరమైన చిక్కులు ఎదురు కారాదన్న అభిప్రాయంతో సిఎం ఉన్నట్టు సమాచారం. దీనికి అనుగుణంగానే  కమిటీల నియామకంలో మార్పులు చేసే అవకాశం ఉందని గులాబీపార్టీనేతలు చెప్పుకుంటున్నారు. అవసరమైతే  ఇప్పటికే కమిటీల్లో ఉన్న కొన్ని పేర్లను మార్చే చాన్స్ ఉందని టీఆర్‌ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ ఏడాది చివరి నాటికి రైతుసమన్వయ కమిటీల ఏర్పాటు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

విశాఖ లో కల్తీ ఆయిల్ మఫియా గుట్టు రట్టు

విశాఖ : నగరంలో కల్తీ ఆయిల్ మాఫియా గుట్టు రట్టు అయ్యింది. నకిలీ ఆయిల్ కేంద్రాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. కృష్ణా కాలేజీ సమీపంలో గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 2 వేల లీటర్ల నకిలీ ఆయిల్ ను సీజ్ చేశారు. హోటల్స్ లో వాడిన నూనెను సేకరించి హెదరాబాద్ లో కెమికల్ ట్రీట్ మెంట్ చేసిన అమ్ముతున్నారు. విజిలెన్స్ దాడుల్లో ముఠా పరారైంది.

సచివాలయానికి బదులు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలి: వీహెచ్

హైదరాబాద్: సచివాలయానికి బదులు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని వి. హన్మంతరావు డిమాండ్ చేశారు. ఆటస్థలం లేకపోతే యువత పెడదారి పట్టి నక్సలైట్లుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

16:44 - September 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ మహిళలకు ఆరాధ్యమైన బతుకమ్మ పండుగ రాష్ట్ర స్థాయి ఉత్సవాలు ఇవాళ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగనున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే వేలాది మంది మహిళలతో మహా బతుకమ్మ వేడుక నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 31 జిల్లాల్లోని 427 మండలాల నుంచి మహిళలను తీసుకొచ్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. గిన్నిస్‌ బుక్‌లో రికార్డు కోసం మూడువేల మంది మహిళలు తంగేడుపూల ఆకారంలో నిలుచొని బతుకమ్మ ఆడతారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కవిత, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రుల సతీమణలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, మహిళానేతలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:36 - September 26, 2017

విశాఖ : ఏజెన్సీలో రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతగా వర్షం కురవడంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. నాలుగుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షపునీరు ప్రవాహానికి ఘాట్‌రోడ్‌ కోతకుగురైంది. దీంతో విశాఖ పాడేరు మధ్య రాకపోకలు స్తంభించాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలు అరెస్ట్...

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో ప్రయాణికుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 9.6 లక్షల విలువైన 36 తులాల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానిత వ్యక్తుల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

అవసరం అయితే బిజెపితో కలుస్తా: కమల్

చెన్నై: రాజకీయాల్లో అంటరానితనం ఉండకూడదని.. ప్రజా ప్రయోజనాలకోసం బిజెపితో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు. మంగళవారం ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.

చీరాల ఆర్డీవో కార్యాలయంలో ఉద్రిక్తత

ప్రకాశం: చీరాల ఆర్డీవో కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. లైసెన్స్ కోసం వచ్చిన టీచర్ ను సిబ్బంది చితకబాదారు. ఫోన్ దొంగిలించాడని ఆగ్రహంతో దాడి చేశాడు. ఆర్డీవో కార్యాలయ సిబ్బంది దాడికి నిరసనగా ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి.

15:46 - September 26, 2017

ఉత్తరప్రదేశ్‌: బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో శనివారం రాత్రి విద్యార్థులపై జరిపిన లాఠీచార్జిపై నివేదిక సిద్ధమైంది. యూనివర్సీటీ పాలకవర్గాన్ని దోషిగా ఖరారు చేస్తూ బనారస్‌ కమిషనర్ నితిన్‌ గోకర్ణ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ ఘటనపై యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌తో పాటు 12 మందిని విచారణ జరిపి సాక్ష్యాలు సేకరించారు. విద్యార్థుల వివాదాన్ని పరిష్కరించడంతో యునివర్సీటీ పాలక విభాగం విఫలమైందని నివేదిక పేర్కొంది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి ఎంతో సమయం ఉన్నప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అడ్మినిస్ట్రేషన్‌ విఫలమైందని తెలిపింది. క్యాంపస్‌లో యువతులపై జరుగుతున్న వేధింపులను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థినులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి వెయ్యి మంది విద్యార్థులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే.

15:44 - September 26, 2017

హైదరాబాద్: తెలంగాణ సర్కార్‌కు ఎప్పుడూ లేని విధంగా.. మద్యం షాపుల వల్ల కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల డిపోల ఆధునీకరణకు.. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ సిద్ధమవుతోంది. మరి ఆధునిక మద్యం డిపోల సంగతేంటో ఇప్పుడో లుక్కేద్దాం.

ఎక్సైజ్‌ శాఖకు కోట్లల్లో ఆదాయం

తెలంగాణ ఎక్సైజ్‌ శాఖకు ఈ సారి కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అందుకే మద్యం డిపోలను ఆధునిక హంగులతో ఏర్పాటు చేసేందుకు టీఎస్‌బీసీఎల్‌ కసరత్తు చేస్తోంది. అద్దె భవనాల్లో నడుస్తున్న డిపోలను సొంత భవనాల్లోకి మార్చాలని చూస్తున్నారు. అలాగే డిపోల నుంచి మద్యం లోడుతో వెళ్లిన వాహనం ఎటువైపు వెళ్తుందో, ఎక్కడ సరుకు దించుతుందో తెలుసుకోవడానికి.. అత్యాధునిక టెక్నాలజీతో డిపోలు నిర్మించాలని ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది.

రూ. 411 కోట్ల ఆదాయం

ఈ సారి తెలంగాణ రాష్ట్రానికి మద్యం దుకాణాల వల్ల 411 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 2, 216 షాపులకు దరఖాస్తులు రాగా.. ప్రభుత్వం వాటన్నింటినీ కలిపి లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులను కేటాయించింది. ప్రతీసారి టెండర్లు డిపాజిట్ చేసినవారికి టెండర్‌ రాకపోతే.. డిపాజిట్‌ను తిరిగి చెల్లించేవారు. కానీ ఈ సారి తెలంగాణ ప్రభుత్వం డిపాజిట్ చేసిన ఆదాయాన్ని తిరిగి చెల్లించకుండా తన ఖాతాలో జమ చేసుకుంది. దీంతో ఈ సారి 256 కోట్లు అదనంగా వచ్చాయి.

మెదక్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌

తొలి విడతలో మెదక్‌, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల్లోని డిపోల ఆధునీకరణకు ప్రతిపాదనలు పంపగా.. ఖమ్మం, కరీంనగర్‌ మద్యం డిపోలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారించడానికి.. ముందు నుంచే ప్రణాళికలను సిద్ధం చేసింది. రాష్ట్రంలో నెలకు సగటున 30 లక్షల కేసుల మద్యం వినియోగమవుతోంది. ఈ ఏడాది సాధారణ, మీడియం, ప్రీమియం, విదేశీ మద్యం, బీరు కలిపి.. 633 లక్షల విలువ చేసే మద్యాన్ని అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ, ఇంత మద్యాన్ని ఒకేసారి నిల్వ చేసుకునే సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 18 గోదాంలకు లేవు. అందుకే కొత్తగా గోదాంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

5 ఎకరాల స్థలం అవసరం

ఎక్సైజ్‌ కార్పొరేషన్‌కు ఇప్పటివరకు ఆధునిక టెక్నాలజీతో నడుస్తున్న గోదాంలు లేవు. వాటికి కనీసం 5 ఎకరాల స్థలం అవసరం. కాబట్టి ప్రభుత్వ భూములు ఉన్న చోటే గోదాంలు నిర్మించాలని.. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

15:42 - September 26, 2017

విజవాయడ: వంశధార ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయంపై విజయవాడ ఎంబీ భవన్‌లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వంశధార నిర్వాసితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. టీడీపీ పాలన ప్రజా వ్యతిరేకంగా కొనసాగుతుందన్నారు రామకృష్ణ. కావాల్సిన దాని కంటే ఎక్కువగా భూములు సేకరించేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారన్నారు. భవిష్యత్‌లో టీడీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు రామకృష్ణ. నిర్వాసితులకు అండగా నిలిచేందుకు అక్టోబర్‌ 10న హిర మండలంలో ప్రతిపక్షాలన్నీ పర్యటించాలని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో నిర్ణయించారు. అలాగే వంశధార నిర్వాసితులకు న్యాయం చేయకపోతే అక్టోబర్‌ 16, 17 తేదీల్లో అమరావతిలో 30 గంటలపాటు ఆందోళన కార్యక్రమం చేపడతామని నేతలు హెచ్చరించారు.

15:40 - September 26, 2017

ఢిల్లీ: రేప్‌ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ దత్తపుత్రిక హనీప్రీత్‌ ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిలు కోసం హనీప్రీత్ తరపు న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. హనీప్రీత్‌ పిటిషన్‌పై కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. అత్యవసర విచారణ కింద పిటిషన్‌ దాఖలు చేసినట్లు హనీప్రీత్‌ లాయర్ ప్రదీప్ ఆర్య తెలిపారు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో ఆగస్టు 25 పంచకుల కోర్టు గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో భారీ విధ్వంసం చెలరేగింది. గుర్మీత్‌ను పోలీస్‌ కస్టడీ నుంచి తప్పించేందుకు విధ్వంసానికి కుట్ర పన్నినట్లు హనీప్రీత్‌పై ఆరోపణలున్నాయి. హర్యానా పోలీసులు ఆమెతో పాటు మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో 43 మంది పేర్లను చేర్చారు. ఆగస్టు 25 నుంచి పరారీలో ఉన్న హనీప్రీత్‌ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

15:38 - September 26, 2017

హైదరాబాద్: బాంబు దాడుల్లో తల్లిదండ్రులతో పాటు సర్వం కోల్పోయి వీధిబాలలుగా మారిన పిల్లలను ....ఓ స్వచ్చంధ సంస్థ ప్రోత్సహించి ఫ్రీ రన్నర్లుగా మార్చింది. మొన్నటివరకూ అనాధలుగా, వీధిబాలలుగా ఉన్న యువకులు ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ ఫ్రీ రన్నింగ్‌ అథ్లెట్లుగా మారారు. గాజా వీధుల్లో కళ్లు చెదిరే ఫీట్స్‌తో స్థానికులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు.

అలీగఢ్ వర్శిటీ విద్యార్థి నేతపై కాల్పులు..

ఉత్తరప్రదేశ్‌: అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ మాజీ వైస్ ప్రెసిడెంట్‌పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి, కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి నేతను ఆసుపత్రిలో చేర్చారు. ఏఎంయూ క్యాంపన్ సివిల్ లైన్స్ ఏరియాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు యూనివర్శిటీ ప్రొఫెసర్ మొహిసిన్ ఖాన్ మంగళవారం తెలిపారు. తీవ్రంగా గాయపడిన నదీం అన్సారీని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో చేర్చగా పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

హనీప్రీత్ బెయిల్ పిటిషన్ విచారణ.. రిజర్వులో తీర్పు

ఢిల్లీ: హనీప్రీత్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు లో విచారణ ముగిసింది. తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వులో ఉంచింది. ముందస్తు బెయిలు కోసం ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్‌ను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఎందుకు దాఖలు చేయలేదని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. తమ సమక్షంలో ఆమె ఎందుకు హాజరుకాలేదని ఆమె తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. హనీప్రీత్ దర్యాప్తుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తరపు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. అయినప్పటికీ హైకోర్టు ఆమెకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేయలేదు.

'పాలమూరు' భూ నిర్ధారణకు కమిటీ ఏర్పాటు...

హైదరాబాద్ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు అటవీ భూముల వ్యవహారంపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. రికార్డులు పరిశీలించి భూములు నిర్ధారించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో సభ్యులుగా నాగర్‌కర్నూల్ జిల్లా సంయుక్త కలెక్టర్, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎస్‌ఈ, నాగర్‌కర్నూల్ డివిజన్ అటవీ అధికారి కొనసాగనున్నారు. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ప్రకాశం జిల్లా కనిగిరిలో దారుణం...

ప్రకాశం: కనిగిరిలో దారుణం వెలుగు చూసింది. యువతిపై సాయి అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించి సాయి, అతని స్నేహితులు కోటేశ్వరరావు, కార్తీక్ సోషల్ మీడియాలో పెట్టారు. పీఎస్ లో బాధితురాలి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాయి, కోటేశ్వరరావు, కార్తీక్ లను అదుపులోకి తీసుకున్నారు.

ముగ్గురు ఒమన్ దేశస్తులు, ఇద్దరు ఖాజీలను అరెస్టు చేశాం: డీసీపీ

హైదరాబాద్: అరబ్ షేక్ లకు పెళ్లిళ్లు నిర్వహిస్తున్న ముగ్గురు ఒమన్ దేశస్తులు, ఇద్దరు ఖాజీలను అరెస్టు చేసినట్లు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. అరెస్టు అయిన 8 మంది ఖాజీలను ఇచ్చిన సమాచారంతో నిన్న రాత్రి పాతబస్తీలో ఖాజీలను అరెస్టు చేశామని డీసీపీ పేర్కొన్నారు. నిన్న అరెస్టు చేసిన వారిలో హైదరాబాద్ ఖాజీ చీఫ్ అబ్దుల్ రఫీ, అతని అనుచరుడు అబ్రహంను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 38 మంది ఖాజీల బ్రోకర్లను గుర్తించామని, కీలక పత్రాలు, ఫేక్ స్టాంప్ స్వ్కాడ్ లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఒక్కో అమ్మాయికి రూ.5 లక్షల నుండి రూ.

కేటీఆర్ మిస్టర్ ఫెయిల్యూర్ :షబ్బీర్ అలీ

హైదరాబాద్: కేటీఆర్ మిస్టర్ ఫెయిల్యూర్ అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులను రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు. గల్ప్ ఎన్ ఆర్ ఐలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని, అసెంబ్లీలో ఎన్ ఆర్ ఐ బిల్లును పెట్టాలని షబ్బీర్ డిమాండ్ చేశారు.

'అఖిలపక్షం ప్రతినిధులను గల్ఫ్ తీసుకెళ్లాలి'..

హైదరాబాద్ : గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులను రాష్ట్రానికి తీసుకరావడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, గల్ఫ్ ఎన్ఆర్ఐలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని, అసెంబ్లీలో ఎన్ఆర్ఐ బిల్లును పెట్టాలన్నారు. గల్ఫ్ బాధితులను కలిసేందుకు అఖిలపక్షం ప్రతినిధులను గల్ఫ్ తీసుకోళ్లాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రజాభిప్రాయ సేకరణ...

సికింద్రాబాద్ : బైసన్ పోలోకు సచివాలయ తరలింపుపై కాంగ్రెస్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. హైదరాబాద్ లో 20 చోట్ల బ్యాలెట్ బాక్స్ లను వీహెచ్ ఏర్పాటు చేశారు. సచివాలయం తరలింపునకు వ్యతిరేకంగా షబ్బీర్ ఆలీ ఓటేశారు. 

13:35 - September 26, 2017

హైదరాబాద్ : ఐఎఫ్‌ఎస్‌ అధికారి బాబూరావు తనను మోసం చేశారని ప్రకాశం జిల్లాలకు చెందిన మనోహరమ్మ అనే మహిళ ఆరోపించారు. తనకు తాళికట్టి రెండో భార్యగా స్వీకరించి.. ఇప్పుడు గెంటివేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మనోహరమ్మకు .. కన్నయ్య అనే వ్యక్తితో 1986లో పెళ్లైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో ఇద్దరూ విడిపోయారు. అదే సమయంలో కన్నయ్య సోదరుడు ఐఎఫ్‌ఎస్‌ అధికారి బాబూరావు ఆమెపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి.. అన్నివిధాలా ఆదుకుంటానంటూ ఓ లాడ్జిలో తనను రెండోపెళ్లి చేసుకున్నాడని మనోహరమ్మ ఆరోపించారు. పిల్లల పెళ్లికి ఆర్థికసాయం కోరితే తనను దూరం పెట్టాడని వాపోయారు. బాబూరావు కుటుంబ సభ్యుల నుంచి తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయని...చంపేస్తామని హెచ్చరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.

13:33 - September 26, 2017

హైదరాబాద్ : నాచారంలో పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్న దొంగ బాబా బండారం బయటపడింది. కుషాయిగూడకు చెందిన శ్రీరాం శర్మ దత్తపీఠమ్‌ అధిపతిగా చెప్పుకుంటూ పూజలు నిర్వహిస్తున్నాడు. తన వద్దకు వచ్చే భక్తురాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తనపై అత్యాచారయత్నం చేశాడని ఓ భక్తురాలు నాచారం పోలీసులను ఆశ్రయించిండంతో..దొంగబాబా నిర్వాకం బయటపడింది. శ్రీరాంశర్మ తన వద్ద 50 లక్షల రూపాయల వరకు డబ్బులు తీసుకోవడమేగాకుండా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది...బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు శ్రీరామ్‌ శర్మపై ఐపీసీ 354, 420 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

శివప్రసాద్ ఇంట్లో ముగిసిన ఏసీబీ సోదాలు..

విజయవాడ : నగర పాలక సంస్థలో జూనియర్ టెక్నికల్ అధికారిగా పనిచేస్తున్న నల్లూరి వెంకట శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు జరిపిన సోదాలు కాసేపటి క్రితం ముగిశాయి. ఆస్తుల మదింపు ప్రక్రియ కొనసాగింది. అనంతరం ఏసీబీ కార్యాలయానికి శివప్రసాద్ ను తరలించారు. అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు. 

ఎస్సీ కుమారుడి అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ : ఏపీ క్యాడర్ కు చెందిన ఎస్పీ రత్నకుమారి కుమారుడు రోషనల్ అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. పంజాగుట్ట ఐఏఎస్, ఐపీఎల్ కాలనీలో ఈఘటన చోటు చేసుకుంది. 

13:25 - September 26, 2017

యాదాద్రి : జిల్లా యాదగిరి గుట్టలో విషాదం జరిగింది. వెంకటేష్, మహేశ్వరి అనే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మూడు రోజుల క్రితమే చనిపోయినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్య కారణమని అనుమానిస్తున్నారు. వెంకటేష్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా మహేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వీరి ఇద్దరు పిల్లలున్నారు. వీరి మరణంతో పిల్లలు ఆనాథలుగా మారారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

'ఎంపి నిధులు కేంద్రం ప్రవేశపెట్టే కార్యక్రమాలకు వినియోగించాలి'

హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంపీలు అందరితో సీఎస్ ఎస్పీ సింగ్ సమావేశం ఏర్పాటు చేశారని ఎంపి దత్తాత్రేయ అన్నారు. వేల కోట్ల ఎంపి నిధులు వస్తున్నాయని, వాటిని మళ్లించకుండా కేంద్రం ప్రవేశపెట్టే కార్యక్రమాలకు వినియోగించాలని దత్తాత్రేయ సూచించారు.

13:13 - September 26, 2017

కృష్ణా : టౌన్ ప్లానింగ్ అధికారి రఘ అవినీతి కేసులో గంట గంటకు మలుపు తిరుగుతోంది. తాజగా ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రఘు గన్నవరంలోని భార్గవీనగర్ లో సప్తరుషివనం ఏర్పాటు చేశాడు. ఈ సప్తరుషివనంలో భారీగా పిరమిట్లు ఉన్నాయి. వీటికి లాక్ సిస్టం ఏర్పాటు చేశారు. పిరమిడ్ల కింద విలువైన వస్తువులు ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:06 - September 26, 2017

'జ్యోతిష్కుడు శ్రీరామ శర్మ నాపై అత్యాచారం చేశాడు'

హైదరాబాద్: తాంత్రిక పూజలతో జ్యోతిష్కుడు శ్రీరామ శర్మ నన్ను మోసం చేశాడు అని బాధితురాలు మధురి తెలిపింది. ఆమె ' 10టివి'తో మాట్లాడుతూ.. 'బార్ అండ్ రెస్టారెంట్లలో నష్టం రావడంతో పూజలు చేస్తే లాభాలు వస్తాయని నమ్మించాడని, తాంత్రిక పూజల పేరుతో ఆయిల్ మసాజ్ లు చేశాడు. పూజల పేరుతో నన్ను లోబరుచుకుని అత్యాచారం చేశాడు. నా నుంచి రూ. 40 లక్షలు తీసుకున్నాడని వాపోయింది. గతంలో ఓ చీటింగ్ కేసులో నన్నుజేలుకు పంపాడు. శ్రీరామశర్మ చాలా మంది అమ్మాయిలను మోసం చేశాడు' అని తెలిపింది.

యాదగిరి గుట్టలో దంపతులు ఆత్మహత్య

యాదాద్రి: భువనగిరి యాదగిరి గుట్టలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉరేసుకుని భర్త, పురుగు మందు తాగి భార్య ఆత్మహత్య చేసుకుంది. 3 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలే కారణమని బంధువులు అంటున్నారు.

12:44 - September 26, 2017

చిత్తూరు : తిరుమల కొండపై దేవదేవుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారు కల్పవృక్ష వాహనంపై ఊరేగారు. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక రాత్రి శ్రీవారు సర్వభూపాల వాహనంపై విహరించనున్నారు.

12:43 - September 26, 2017

కృష్ణా : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.. అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమిస్తోంది. వేకువజాము నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివస్తున్నారు. మహాలక్ష్మీ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:42 - September 26, 2017

కరీంనగర్ /పెద్దపల్లి : జిల్లా, రామగుండం 3 పరిధిలోని 10A గని గేట్‌ మీటింగ్‌లో.. జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి పాల్గొన్నారు. సింగరేణి ఎన్నికల్లో గతంలో గెలిచిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.. కార్మికుల సంక్షేమాన్ని మరచిందని జీవన్‌ రెడ్డి అన్నారు. కార్మికుల సంక్షేమ నిధి కాజేయడానికి కొట్టుకొని జైలుకెళ్లిన నీచ చరిత్ర టీబీజీకేఎస్ కే ఉన్నదని ఆయన అన్నారు. వారసత్వ ఉద్యోగాల కల్పనను వివాదాస్పదం చేసింది కేసీఆర్‌ అని మండిపడ్డారు. సింగరేణి కార్మికుల భిక్షతోనే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాడు. గోదావరి ఖనిలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఊసే మరచిపోయాడన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 80 వేల కోట్ల అప్పులు చేసి.. రాష్ట్రాన్ని కేసీఆర్‌ తాకట్టు పెడుతున్నాడన్నారు.

12:40 - September 26, 2017

మహబూబ్ నగర్ : జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరదనీటితో కళకళలాడుతోంది. జలాశయంలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. దీంతో 14 గేట్లు ఎత్తి 77.674 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పవర్‌హౌస్‌ ద్వారా 36 వేల క్యూసెక్కులు, సమాంతర కాల్వలు, లిఫ్ట్‌ల ద్వారా 3.210 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో లక్షా 19 వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో లక్షా 19వేల క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

12:37 - September 26, 2017

హైదరాబాద్ : నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ జ్యోతికిరణ్‌ ఇళ్లు, ఆస్తులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలతో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌లో నాలుగు చోట్ల, నిజామాబాద్‌లో ఒక చోట సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ శివారులో 30 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, 14 ప్లాట్లు, కిలో బంగారు నగలు, 3 కిలోల వెండి, 2 కార్లు, 6 ద్విచక్ర వాహనాలు, విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:34 - September 26, 2017

కృష్ణా : అవినీతి అనకొండ...ఏపీ టౌన్‌ప్లానింగ్‌ డెరెక్టర్‌ రఘు కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పదవీ విరమణ వేడుకను ఘనంగా విదేశాల్లో నిర్వహించేందుకు రఘు ప్లాన్‌ చేశాడు. సింగపూర్‌, మలేషియా, హాంకాంగ్‌లకు ఫ్లైట్‌ టికెట్లు బుక్కింగ్ చేశాడు. ఈనెలాఖరున రఘు రిటైర్ కానున్నారు. ఇప్పటికే సుమారు 500 కోట్ల ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు..తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కార్మిక శాఖలో 248 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: కార్మిక శాఖలో 248 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ కి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్ తో ఎంపీలు భేటీ

హైదరాబాద్: తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్ తో ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీల ఫండ్ వినియోగం పై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

12:26 - September 26, 2017

వరంగల్ : సోమవారం రాత్రి కురిసిన వర్షంతో వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మొక్కజోన్న ధాన్యం తడిసిపోయింది. అమ్మడం కోసం మార్కెట్ తీసుకోస్తే ధాన్యం తడవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు వివిధ ప్రాంతాల నుంచుఇ భారీగా మొక్కజోన్న ధాన్యం తీసురావడంతో అధికారలు రెండు రోజులుగా కోనుగోలు నిలిపివేశారు. అధికారుల తీరు పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ వద్ద ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

ఉత్తర కొరియాపై అమెరికా సీరియస్

హైదరాబాద్: ఉత్తర కొరియాల మధ్య మాటల యుద్ధం అసలు యుద్ధం రంగు పులుముకుంటోంది. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలతో కవ్విస్తుండడంతో అమెరిగా కూడా సీరియస్సైంది. ఏ క్షణాన్నైనా డైరెక్ట్ అటాక్‌కు రంగం సిద్ధం చేస్తోంది. అమెరికా ఫైటర్ విమామానాలు ఉత్తర కొరియా తూర్పు తీరాన తమ బలాన్ని కూడా ప్రదర్శిస్తున్నాయి.B 1B, F 16C ఈగల్ ఫైటర్ లాంటి యుద్ధ విమానాలు కొరియా జలాల మీదుగా అంతర్జాతీయ గగనతలంలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ దేశాధ్యక్షుడిని భయపెట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి.

12:25 - September 26, 2017

హైదరాబాద్ : నగరంలోని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ చెందిన కృష్ణ మూర్తి హార్ట్ సర్జరీ కోసం కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే హార్ట్ సర్జరీ ఫెయిలై కృష్ణ మూర్తి మృతి చెందాడు. డాక్టర్లు సర్జరీ చేసిన తరువాత బాగానే ఉన్నారని మృతిని బంధులు తెలిపారు. స్టంట్స్ ఫెయిల్ అవ్వడంతోనే చనిపోయడాని వారు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ప్రధాన గేట్ వద్ద మృతదేహంతో ఆందోళన చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:17 - September 26, 2017

బాలీవుడ్ క్రికెట్ పోటీలు ఏమన్నా జరుగుతున్నాయా ? అందులో రణవీర్ ఆడనున్నాడా? అని అనుకుంటున్నారా ? క్రికెట్ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి మాత్రం దిగబోతున్నాడు కానీ పోటీల్లో కాదు..రీల్ లైఫ్ లో...అవును త్వరలోనే గ్రౌండ్ లో దిగి ఫోర్లు..సిక్స్ లు కొట్టబోతున్నాడంట..అంతేకాదు ప్రపంచ కప్ ను తీసుకొస్తాడంట...

బాలీవుడ్ లో బయో పిక్ ల హావా కొనసాగుతున్న సంగతి తెలిసిందే కదా. క్రికెటర్లు..ప్రముఖల జీవిత కథల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఎం.ఎస్. ధోని స్టోరీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అలనాటి టీమిండియా బౌలర్ 'కపిల్ దేవ్' జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 1983లో ప్రపంచ కప్ ను 'కపిల్' దేశానికి అందించిన సంగతి తెలిసిందే. ఫైనల్ లో వెస్టిండీస్ తో భారత్ తలపడింది. ఈ మ్యాచ్ లో కపిల్ విశ్వరూపం ప్రదర్శించాడు. కపిల్ పాత్రలో 'రణవీర్' కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందంట. ప్రస్తుతం 'రణ్ వీర్' 'పద్మావతి' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

హైదరాబాద్ కు ఎక్సైజ్ సూపరింటెండ్ జ్యోతికిరణ్‌

నిజామాబాద్: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండ్ జ్యోతికిరణ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని నిజామాబాద్ నుంచి హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. జ్యోతికిరణ్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు నిజామాబాద్‌లోని కార్యాలయంతో పాటు నగరంలోని కొండాపూర్ , చైతన్యపురి, బంజారాహిల్స్‌లో అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని ఐదు చోట్ల ఏకకాలంలో అధికారుల సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో 14 ఇళ్ల స్థలాలు, హైదరాబాద్ బాగ్‌అంబర్‌పేటలో 2 ఇళ్లు, జహీరాబాద్‌లో 30 ఎకరాల భూమి, ఇంట్లో కిలో బంగారంను అధికారులు గుర్తించారు.

11:55 - September 26, 2017

నందమూరి బాలకృష్ణ యమ జోరుమీదున్నాడు. వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఘన విజయం అనంతరం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 101వ చిత్రం 'పైసా వసూల్' ద్వారా మరో విజయాన్ని 'బాలకృష్ణ' తన ఖాతాలో వేసుకున్నారు. 'బాలకృష్ణ'ను ఈ సినిమాలో పూరీ కొత్తగా చూపించాడు. అనంతరం కె.ఎస్.రవికుమార్ దర్వకత్వంలో..సి.కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో 'బాలయ్య' నటిస్తున్నాడు.

ఇటీవలే చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కుంభకోణంలో ఓ భారీ షెడ్యూల్ ను చిత్రీకరించారు. ఓ ఆలయ నేపథ్యంలో యాక్షన్ ఎపిసోడ్ ను షూటింగ్ చేశారు. ఈ ఎపిసోడ్‌లో నయనతార, నటాషా, ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, మురళీ మోహన్‌, జేపీ, ఎల్బీ శ్రీరామ్‌లతో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొంది. దాదాపు రెండు వేల మంది పురోహితులు..ఫైటర్లు..జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్న ఈ భారీ ఫైట్ ను చిత్రీకరించారు. ఫైట్‌ మాస్టర్లు రామ్‌ లక్ష్మణ్‌, అరివి మణి ఈ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. కుంభకోణంలో 30 రోజుల పాటు జరిగిన షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగిందని, భారీ పోరాట ఘట్టాన్ని షూటింగ్ చేయడం జరిగిందన్నారు.

నేడు హనీప్రీత్ ముందస్తు బెయిల్ పై విచారణ

ఢిల్లీ: డేరాబాబా గుర్మీత్ కేసులో హనీప్రీత్ ముందస్తు బెయిల్ పై నేడు కోర్టు లో విచారణ జరగనుంది. ఢిల్లీ కోర్టులో మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభం కానుంది.

బాల, కౌమార కార్మికుల నిరోధంపై సదస్సు ప్రారంభం

ఢిల్లీ : బాల, కౌమార కార్మికుల నిరోధంపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జాతీయ సదస్సు ప్రారంబం అయ్యింది. ఈ సదస్సుకు పలు రాష్ట్రాల కార్మిక, హోంశాఖ మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ నుండి హోంమంత్రి నాయిని, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను సదస్సులో నాయిని వివరించనున్నారు.

11:28 - September 26, 2017

గుండె ఆపరేషన్ ఫెయిల్ అయివ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన

హైదరాబాద్: కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ ఫెయిల్ అయి కృష్ణమూర్తి అనే వ్యక్తి మృతి చెందాడు. ఆపరేషన్ చేసిన రెండు గంటలకే కృష్ణమూర్తి మృతి చెందాడు. దీంతో బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

11:20 - September 26, 2017

ఎమాన్ అహ్మద్..పేరు వినగానే...ఆమె భారీ శరీరం ముందుగా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఈమె భారీకాయురాలిగా నమోదైంది. పాపం ఈమె తీరని లోకాలకు వెళ్లిపోయింది. ఈమె మృతి చెందడం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవలే ముంబైలో చికిత్స చేయించుకున్న ఎమన్ పూర్తిగా కొలుకొంటుందన్న ఆనందంలో ఆమె కుటుంబం ఉండగానే ఆమె తీరని లోకాలకు వెళ్లిపోయింది. దీనితో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈజిప్టుకు చెందిన ఎమాన్ భారీ కాయురాలు. చికిత్స నిమిత్తం 2016లో ముంబైకి తీసుకొచ్చారు. సైఫీ ఆసుపత్రిలో కొంతకాలం పాటు ఆమెకు చికిత్స అందించారు. ముంబైకి తరలించే సమయంలో ప్రత్యేక ప్లేన్..ఇతర ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. చికిత్స అనంతరం ఆమె తనంతట తానే తినగలిగే స్థితికి చేరుకుందని గతంలో వైద్యులు ప్రకటించినట్లు వార్తలు వెల్లువడ్డాయి.

దుబాయ్ లోని మరో అధునాతన ఆసుపత్రిలో మరింత మెరుగైన చికిత్స కోసం అంటూ ఆమె బంధువులు జూన్‌లో అబుదాబికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఆమె చనిపోయినట్లు అక్కడి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 

11:17 - September 26, 2017

కృష్ణా : ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘు కేసులో కోణాలు వెలుగులోకి వచ్చాయి. రఘు పదవీ విరమణ వేడుకను విదేశాల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్టు దాని కోసం సింగపూర్, మలేషియా, హాంకాంగ్ లకు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసినట్టు తెలుస్తోంది. రఘు ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు. కానీ అధికారి ఇంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడడం మన వ్యవస్థకు అద్దం పడుతుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

అటవీ సిబ్బంది పై స్మగ్లర్ల దాడి...

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని భూపాలపల్లి మండలం గుర్రంపేట శివారులో అటవీ అధికారులపై కలప స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. చెల్పూరు అటవీ రేంజ్ అధికారి విక్రముద్దీన్ మరో నలుగురు సిబ్బందిపై స్మగ్లర్లు రాళ్లు, గొడ్డళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో అటవీ సిబ్బందికి గాయాలయ్యాయి. దాడి ఘటనపై అటవీ సిబ్బంది వెంకటాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

11:09 - September 26, 2017

హైదరాబాద్ : నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతికిరణ్ ఆస్తులపై ఏసీబీ దాడులు చేస్తోంది. నిజమాబాద్, హైదరాబాద్ తో పాటు 5 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ శివారులో 30 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, హైదరాబాద్, రంగారెడ్డి 14 ప్లాట్లు, కేజీ గోల్డ్, 3కేజీల వెండి, 2 కార్లు, 6 ద్విచక్ర వాహనాలు, విదేశీ మద్యం బాటిళ్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

11:08 - September 26, 2017

మాస్టర్ బ్లాస్టర్ 'సచిన్ టెండూల్కర్' చీపురు పట్టుకుని రోడ్డు మీదకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మంగళవారం ఉదయం ముంబై పశ్చిమ బాంద్రాలో సచిన్ రోడ్లను ఊడ్చారు. ఆయనతో పాటు పలువురు పాల్గొన్నారు. భారత ప్రధాన మంత్రి పిలుపు మేరకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్చ భారత్ మిషన్ కు మోడీ నాంది పలికిన సంగతి తెలిసిందే. 2019లో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ సాధనతో ఉత్తమ నివాళి అందించాలని మోడీ సూచించారు. ఈ నేపథ్యంలో సచిన్ 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమంలో పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రంగా ఉంటేనే మనం బాగుంటామని ఈ సందర్భంగా సచిన్‌ పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 

ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపడ్డాయి మంత్రి కామినేని

విశాఖ: అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రిలో రోగుల సహాయకుల విశ్రాంతి భవన నిర్మాణానికి మంత్రి కామినేని, ఎంపి ముత్తం శెట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం అంటువ్యాధుల విభాగాన్ని మంత్రి కామినేని ప్రారంభించారు. ఆసుపత్రిలో వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో గతంలో కన్న ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపడ్డాయని మంత్రి చెప్పుకొచ్చారు.

10:51 - September 26, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటించిన తాజా చిత్రం 'స్పైడర్' చిత్రం దసరా పండుగ పురుస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా బుధవారం రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అటువైపు చిత్ర యూనిట్ కూడా భారీ అంచనాలు పెట్టేసుకుంది. ఈ సినిమాలో 'మహేష్' 'రా' అధికారిగా పనిచేశాడు. ప్రముఖ దర్శకుడు 'మురుగదాస్' తెరకెక్కించిన ఈ సినిమాలో 'మహేష్' సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' నటించింది.

'మహేష్ బాబు' 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ అనంతరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. చాలా రోజుల పాటు షూటింగ్ జరుపుకొంది. షూటింగ్ మొదలై రోజులు గడుస్తున్నా చిత్ర పోస్టర్..టీజర్ విడుదలకాకపోయేసరికి అప్పట్లో అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు. అనంతరం అడపదడపా పోస్టర్స్..టీజర్స్ విడుదలను చేశారు. 'మహేష్ బాబు' సీరియస్ గా తన పని చేసుకుంటూ వెళుతుంటే, ఓ రోబో స్పైడర్ మెల్లగా ఆయన కాలు పట్టుకుని పైకి ఎక్కి, భుజంపై చేరి డిస్ట్రబ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మహేష్ దాన్ని 'ష్...' అని హెచ్చరిస్తే, తోక ముడుచుకుని కూర్చునే టీజర్ అభిమానులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో డబుల్ యాక్షన్ ఉంటుందనే వార్తలను 'మహేష్ బాబు' కొట్టిపారేశారు. అంతేగాకుండా టీజర్ లో చూపిన 'స్పైడర్' సినిమాలో కనిపించదని స్పష్టం చేశారు. 'స్పైడర్'లో నటించడం తనకెంతో కొత్త అనుభవాన్ని ఇచ్చిందన్నారు.
ప్రస్తుతం 'మహేష్' 'భరత్ అను నేను' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

10:45 - September 26, 2017

గుంటూరు : ఎన్నికలకు ముందే ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్‌ చేసిన వైసీపీ అధినేత జగన్‌.. అక్టోబర్‌ 27నుంచి పాదయాత్ర చేస్తానని గతంలో ప్రకటించారు.. ఈ యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూనే... టీడీపీ ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని ప్రణాళిక వేసుకున్నారు. నవరత్నాలు, వైఎస్సార్‌ కుటుంబంలాంటి కార్యక్రమాలనూ ప్రకటించారు. అయితే నంద్యాల ఉప ఎన్నికలో పరాజయం తర్వాత పార్టీ నిరాశలో కూరుకుపోయింది.. ఓటమి తర్వాత

నవరత్నాలను పార్టీ కేడర్‌ పట్టించుకోలేదు. ఇలాంటి సమయంలో పాదయాత్ర వాయిదా వేసుకోవడమే మంచిదన్న అభిప్రాయాలు పార్టీనుంచి వ్యక్తమవుతున్నాయి.

జగన్‌పై ఉన్న కేసులు
మరోవైపు పాదయాత్రకు జగన్‌పై ఉన్న కేసులు ఇబ్బందికరంగా మారాయి.... ప్రస్తుతం ప్రతి శుక్రవారం జగన్‌ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.. ఇక పాదయాత్ర చేయాలంటే కోర్టునుంచి అనుమతి తప్పనిసరి.. అందుకే కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాక పాదయాత్రపై ఆలోచించాలని చూస్తున్న జగన్‌.. ప్రస్తుతం యాత్ర విషయం పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.. అటు ఇడుపులపాయనుంచి పాదయాత్ర చేస్తానని ప్లీనరీ సమావేశంలో జగన్‌ ప్రకటించారు.. దీనిపైనా పార్టీనుంచి కొన్ని సూచనలు వస్తున్నాయి.. ఇడుపులపాయనుంచి కాకుండా తిరుమ‌ల నుంచి పాద‌యాత్ర చేస్తే బావుంటుంద‌ని ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు జ‌గ‌న్‌కు సూచించినట్లు సమాచారం.. మొత్తానికి జగన్‌ పాదయాత్రపై ఇంకా స్పష్టత రాలేదు.. పాదయాత్ర వాయిదా వేశారా? ఎప్పటివరకూ వాయిదా వేశారన్న అంశంపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది.. కొద్దిరోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది.

10:35 - September 26, 2017

హైదరాబాద్ : నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతికిరణ్ ఆస్తులపై ఏసీబీ దాడులు చేస్తోంది. నిజమాబాద్, హైదరాబాద్ తో పాటు 5 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

10:34 - September 26, 2017

కృష్ణా : అక్రమాస్తుల కేసులో విశాఖ టౌన్ ప్లానింగ్ అధికారి రఘు, ట్యాక్స్ ఆఫీసర్ శివప్రసాద్ ను ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. వారి వద్ద నుంచి కీలక డాక్యుమెంట్లు, నగదు, బంగారు, వెండి ఆభరణాలు ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.500కోట్ల విలువైన అక్రమాస్తుల ఏసీబీ గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

10:33 - September 26, 2017

హైదరాబాద్ : పాతబస్తీలో కాంట్రాక్టు పెళ్లిళ్లను పోలీసులు అడ్డుకున్నారు. కాంట్రాక్ట్ మ్యారేజీ చేయిస్తున్న ఖాజీ అలీ అబ్దుల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాజీతో పాటు ఇద్దరు అరబ్ షేకులు, ఒమన్ దేశస్తులు, బ్రోకర్లు అరెస్ట్ చేశారు. ఖాజీ అలీ అమ్మాయిలను దుబాయి షేక్ లకు ఇచ్చి పెళ్లి చేయిస్తునరన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

బాసర, భద్రాద్రి పుణ్యక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు...

నిర్మల్: బాసర, భద్రాద్రి పుణ్యక్షేత్రాలకు భక్తులు భారీగా పోటెత్తారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజైన నేడు సరస్వతి అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేద పండితులు వేకువజాము నుంచి వేద పారాయణం నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు చండీయాగం. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవార్లకు మహానివేదన. రాత్రి 8 గంటలకు అమ్మవార్లకు మహాహారతి కార్యక్రమాల నిర్వహణ జరగనుంది

గాంధీ లో స్వైన్ ఫ్లూ తో మరొకరి మృతి

హైదరాబాద్: నగంలోని గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ తో మరొకరు మృతిచెందారు. గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ నగరానికి చెందిన దయామణి(60) మృతి చెందింది.

కారుబోల్తా: నల్గురి మృతి

యూపీ: ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా మహావన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన కారు బోల్తా పడటంతో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్...

హైదరాబాద్: నగరంలోని బోరబండలో గంజాయి విక్రయిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి విక్రయిస్తున్న మహిళతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా మరో వ్యక్తి పరారయ్యాడు. నిందితుల వద్ద నుంచి 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

కల్పవృక్ష వాహనంపై మలయప్పస్వామి

తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం కల్పవృక్ష వాహనంపై మలయప్పస్వామి ఊరేగనున్నారు. రాత్రి సర్వభూపాల వాహనంపై ఉరేగి భక్తులను కటాక్షించనున్నారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ...

తిరుమల: తిరుమలలో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి భక్తులు 26 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 9 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.

నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు...

హైదరాబాద్: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతికిరణ్ ఆస్తులపై ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నిజామాబాద్, హైదరాబాద్ సహా ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది.

పాతబస్తీలో కాంట్రాక్టు పెళ్లిలను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్ : పాతబస్తీలో కాంట్రాక్టు పెళ్లిళ్లను పోలీసులు అడ్డుకున్నారు. కాంట్రాక్ట్ మ్యారేజీ చేయిస్తున్న ఖాజీ అలీ అబ్దుల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాజీ అలీ అమ్మాయిలను దుబాయి షేక్ లకు ఇచ్చి పెళ్లి చేయిస్తునరన్న సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు.

09:28 - September 26, 2017

హైదరాబాద్ : పాతబస్తీలో కాంట్రాక్టు పెళ్లిళ్లను పోలీసులు అడ్డుకున్నారు. కాంట్రాక్ట్ మ్యారేజీ చేయిస్తున్న ఖాజీ అలీ అబ్దుల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాజీ అలీ అమ్మాయిలను దుబాయి షేక్ లకు ఇచ్చి పెళ్లి చేయిస్తునరన్న సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

ప్రత్యేక కోర్టుకు రఘు, శివప్రసాద్

విజయవాడ : అక్రమాస్తుల కేసులో విశాఖ టౌన్ ప్లానింగ్ అధికారి రఘు, ట్యాక్స్ ఆఫీసర్ శివప్రసాద్ ను ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. వారి వద్ద నుంచి కీలక డాక్యుమెంట్లు, నగదు, బంగారు, వెండి ఆభరణాలు ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.500కోట్ల విలువైన అక్రమాస్తుల ఏసీబీ గుర్తించారు.

09:13 - September 26, 2017

విజయవాడ : అక్రమాస్తుల కేసులో విశాఖ టౌన్ ప్లానింగ్ అధికారి రఘు, ట్యాక్స్ ఆఫీసర్ శివప్రసాద్ ను ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. వారి వద్ద నుంచి కీలక డాక్యుమెంట్లు, నగదు, బంగారు, వెండి ఆభరణాలు ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.500కోట్ల విలువైన అక్రమాస్తుల ఏసీబీ గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

భారత్ లో అమెరికా రక్షణశాఖ కార్యదర్శి పర్యటన

ఢిల్లీ : నేడు భారత్ లో అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జిమ్ మ్యాటిస్ పర్యటించనున్నారు. ఆయన ప్రధాని మోడీ రక్షణశాఖ మంత్రి నిర్మలసీతారామన్ తో భేటీ కానున్నారు. 

పోర్టు కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ రావుపై దాడి

 

విశాఖ : జిల్లా గంగవరం పోర్టు కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ రావు పై దాడి జరిగింది. ఇద్దరు దుండగులు వెంకటేశ్వర్ పై గాజువాకలో కత్తులతో దాడి చేశారు. దుండగుల దాడిలో వెంకటేశ్వర్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం దుండుగుల్లో ఒకరు ఆత్మహత్యాయత్నాం చేశారు.

08:12 - September 26, 2017

విశాఖ : జిల్లా గంగవరం పోర్టు కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ రావు పై దాడి జరిగింది. ఇద్దరు దుండగులు వెంకటేశ్వర్ పై గాజువాకలో కత్తులతో దాడి చేశారు. దుండగుల దాడిలో వెంకటేశ్వర్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం దుండుగుల్లో ఒకరు ఆత్మహత్యాయత్నాం చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:47 - September 26, 2017

నోట్ల రద్దు తో జీడీపీ వృద్ధి రేటు తగ్గుతుందని, కేవలం జీడీపీ కాదు జాతీయ ఆదాయం కూడా తగ్గిందని, మనం ఖర్చు పెడుతున్న విదేశి మారకద్రవ్యం మూడోంతులు చమురు పెట్టాలని కానీ చమురు ధర భారీగా తగ్గినా విదేశి మారకద్రవ్యం ఖర్చు ఇప్పటికి కూడా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని, దేశా ఎకానమిక్ పరిస్థితి బాగాలేదని, దేశ ఆర్థిక పరిస్థితి నోట్ల రద్దు వల్ల దిగజారిందని, జీఎస్టీతో ప్రజలపై భారం తప్ప ఒరిగింది ఏమి లేదని దీ హన్స్ ఇండియా ఎడిటర్ నాగేశ్వర్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

07:37 - September 26, 2017

ఎన్నికలు వచ్చే సరికి ప్రభుత్వ పెద్దలంతా సింగరేణి కార్మికుల ముందు వాలిపోయి వారి సమస్యలు పరిష్కరిస్తామని హామిలు ఇస్తున్నారు. అధికారంలో ఉన్న మాకు సింగరేణిలో అధికారం ఇస్తే ప్రతి సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నారు. నిజానికి సింగరేణి కార్మికుల సమస్యలు ఏంటి? వారి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటివరకు ఉన్న చిత్తశుద్ధి ఎంత..? సింగరేణి కార్మికుల ఎన్నికలు కేవలం కార్మికులకు సంబంధంచిన ఎన్నికలు, కానీ కొన్ని పార్టీలు ఇందులో వచ్చి మిని ఎలక్షాన్స్ అని అంటున్నారని, ముఖ్యంగా గత ఎన్నికల్లో గెలిచిన టీజీబీకేఎస్ వారసత్వ ఉద్యోగాల హామీ గాలిక వదిలేసింది. సింగరేణిలో ఉండే 56 మంది కార్మికులకు ఆదాయ పన్ను నుంచి తొలగించాలని సీఐటీయూ కార్యదర్శి రావు అన్నారు.

 

 

07:36 - September 26, 2017

తూర్పుగోదావరి : ప్రిన్స్‌ మహేష్‌ బాబు నటించిన స్పైడర్‌ మూవీ ఈ నెల 27న విడుదలవుతున్న సందర్భంగా రాజమండ్రిలో మహేష్‌ యూత్‌ సంబరాలు జరుపుకున్నారు. మహేష్‌ హిట్‌ సాంగ్స్‌కు ఫ్లాష్‌ మాబ్‌ నృత్యాలు చేశారు. రాజమండ్రిలోని వివిధ కళాశాలలకు చెందిన యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

07:35 - September 26, 2017

అనంతపురం : అనంతపురం పట్టణ కేంద్రంలోని తిలక్ రోడ్డు విస్తరణ పనుల వ్యవహారం ఉద్రిక్తంగా మారింది. రోడ్డు విస్తరణలో భాగంగా నగర పాలకశాఖ అధికారులు ... తిలక్‌ రోడ్డులో ఉన్న భవనాల తొలగింపు పనులు చేపట్టారు. దీంతో ఇళ్ల యజమానులు, వ్యాపారులు ఆందోళనకు దిగారు. పనులు అడ్డుకుని... పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. విస్తరణకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించారు. బాధితుల ఆందోళనకు సీపీఐ నేతలు మద్దతుగా నిలిచారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఎంతో శ్రమించి కట్టుకున్న ఇళ్లను తొలగించడం సరికాదంటూ.. బాధితులు వాపోతున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా.. పరిహారం చెల్లించకుండా రోడ్డు విస్తరణ పనులు చేపడితే తాము రోడ్డున పడతామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డులో ఏళ్ల నాటి చరిత్ర ఉన్న మసీదు, ఆలయాలున్నాయని వాటిని రోడ్డు విస్తరణలో తొలగించవద్దన్నారు. రోడ్డు విస్తరణ పనుల విషయంలో రాజకీయ లబ్ది ఉందని... అందుకే ప్రజలను రోడ్డు పాలు చేసి.. ఈ పనులు చేపడుతున్నారని సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు.

చాలా కాలంగా వివాదం సాగుతోంది...
ఈ పనుల వ్యవహారంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, అనంతపురం నగర ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి మధ్య చాలా కాలంగా వివాదం సాగుతోంది. ఇందులో భాగంగా తాను పనులు చేయలేనప్పుడు ఎంపీగా కొనసాగడం ఇష్టం లేదని, రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం చాగళ్లు రిజర్వాయర్‌కు నీరు ఇవ్వడంతో పాటు రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేసింది. దీంతో అధికారులు భవనాల తొలగింపునకు పూనుకున్నారు. అయితే భవనాల తొలగింపునకు సంబంధించి ఇదివరకే నోటీసులు ఇచ్చామని .. అధికారులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రహదారుల విస్తరణ పనులు ఆపేది లేదని నగర పాలక అధికారులు స్పష్టం చేశారు.  

07:34 - September 26, 2017

ప్రకాశం : ఇది ప్రకాశం జిల్లా కొండెపి మండలం కామేపల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల. ఈ పాఠశాల పేరు వివాదంగా మారుతోంది. స్కూల్‌ అభివృద్ధికి 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తే... వారి దివంగతుల పేర్లు పాఠశాలకు పెట్టుకోవచ్చన్న నిబంధనపై వివాదం చెలరేగుతోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు కామేపల్లిలో జన్మించడంతో... స్కూల్‌కు గంటా నారాయణమ్మ, రోశయ్య మెమోరియల్‌ పేరు పెట్టాలనుకోవడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు.

మూడెకరాల 65 సెంట్ల భూమిని పాఠశాలకు దానం
1961లో కామేపల్లి గ్రామస్తులు కొంతమంది కలిసి మూడెకరాల 65 సెంట్ల భూమిని పాఠశాలకు దానం చేశారు. అలాగే పశువుల ఆస్పత్రి, పాల డెయిరీ, దేవస్థానాలకు కోట్లాది రూపాయల విలువైన భూమిని అందజేశారు. కానీ... తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు స్కూల్‌ అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చి... స్కూల్‌కు ఆయన తల్లిదండ్రుల పేరు పెట్టాలనుకోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ స్కూల్‌కు పేరు పెట్టాల్సి వస్తే అప్పట్లో భూమి ఇచ్చి.. పాఠశాలను నిర్మించిన వారి పేర్లు పెట్టాలంటున్నారు గ్రామస్తులు. ఎట్టి పరిస్థితిలోనూ గంటా తల్లిదండ్రుల పేర్లు పెడితే ఒప్పుకునేది లేదంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఇక్కడ పుట్టినా... ఆయన వల్ల గ్రామానికి ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు మాజీ శాసనసభ్యులు దివంగత చాగంటి రోశయ్య కుటుంబీకులు. అప్పట్లో కొంతమంది గ్రామస్తులు కలిసి భూమి దానంగా ఇస్తే.. ఇప్పుడు గంటా కుటుంబీకుల పేర్లు పెట్టాలనుకోవడం సరికాదంటున్నారు.

గ్రామస్తులు మండిపడుతున్నారు....
మంత్రి హోదాలో ఉన్న గంటా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉన్నా... ఎప్పుడో నిర్మించిన స్కూల్‌కు ఆయన తల్లిదండ్రులు పెట్టుకోవాలనుకోవడం సరికాదని గ్రామస్తులు మండిపడుతున్నారు.. మొత్తానికి స్కూల్‌ పేరు మార్పు అంశంపై కామేపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఉదార స్వభావంతో ఆనాడు గ్రామస్తులు భూమి దానంగా ఇస్తే... ఇప్పుడు గంటా కుటుంబీకుల పేర్లు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పేరు మార్పు అంశంపై గ్రామస్తులు కోర్టును ఆశ్రయించడంతో.. న్యాయస్థానం స్టే విధించింది. ఒకవేళ పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గంటా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి ! 

07:33 - September 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఆత్మ బలిదానాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో సక్సెస్‌ అయిన గులాబీపార్టీ.. అధికారం చేపట్టాక ఆత్మహత్యలపై ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వ పరంగా చేపడుతున్న పథకాలు పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు భరోసా కలిగించడంలేదన్న సంకేతాలు ఇస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ జెండా మోసిన వికారాబాద్ జిల్లా తాండూరు మైనార్టీ నేత ఆయ్యూబ్ ఖాన్ ఆత్మహత్యకు పాల్పడటం గులాబీపార్టీలో కలకలం రేపింది. పార్టీలో గుర్తింపు దక్కలేదని....మంత్రి మహేందర్ రెడ్డి ముందే నిరసన తెలిపి ఆత్మహత్యా యత్నం చేసుకున్న అయూబ్‌ఖాన్‌.. 20 రోజుల చికిత్స అనంతరం మృతి చెందాడు. ఈఘటన టీఆర్‌ఎస్‌ నేతల తీరుపై ప్రజల్లో ఆగ్రహం తెప్పించింది. అటు కరీంనగర్‌ జిల్లా మానకోండూరు నియోజకవర్గంలో దళితుడు శ్రీనివాస్‌ ఆత్మహత్య సంఘటనకూడా టీఆర్‌ఎస్‌పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసింది. భూపంపిణీ పథకంలో తమకు న్యాయం జరుగడం లేదన్న మనస్తాపంతో దళిత యువకుడు శ్రీనివాస్ ఆత్మహ్యత కేసీఆర్‌ సర్కార్‌ను విమర్శలపాలు చేసింది.

అధికార పార్టీకి ఇబ్బందికరంగా
ఈ రెండు ఘటనలు అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఇలాంటి ఘటనలను స్థానిక శాసనసభ్యులు డీల్ చేయలేకపోవడంతో ప్రభుత్వం విమర్శల పాలవుతోందనే అభిప్రాయాలు పార్టీనేతల్లో వస్తున్నాయి. పైస్థాయినేతలకు పార్టీపరంగా అన్ని రకాలుగా న్యాయం జరుగుతుండగా కిందిస్థాయి, సాధారణ కార్యకర్తలను మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. అధికార మత్తులో టీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలను మర్చిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

07:32 - September 26, 2017

హైదరాబాద్: తెలంగాణలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టింది. అనేక కార్యక్రమాలతో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిదూసుకుపోతున్నా పార్టీకి మరింత అదనపు బలం జోడించాలని చూస్తోంది. ఉత్తమ్‌ ప్లాన్‌లతో పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని భావిస్తున్నా... స్పీడ్‌ మరింత పెంచాలని చూస్తోంది. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతోనే తెలంగాణలో ఉద్యమ కార్యాచరణ కొనసాగుతోంది. ఈ యాక్షన్‌ ప్లాన్‌కు మరింత మెరుగులు దిద్దేందుకు ఢిల్లీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని తెలుస్తోంది. ప్రియాంక రాక పార్టీలో మరింత ఉత్సాహం నింపుతుందని సీనియర్‌ నేతలు అంచనా వేస్తున్నారు.

ప్రియాంక తోడైతే...
ఇప్పటికే రాహుల్‌ గాంధీ చురుగ్గా రాజకీయాల్లో ఉన్నారు. త్వరలో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. రాహుల్‌కు ప్రియాంక తోడైతే 2019 ఎన్నికల్లో పార్టీకి లాభం జరుగుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. 2019 ఎన్నికల కోసం ముందు నుంచే ప్లాన్‌లు సిద్ధం చేస్తున్న పార్టీ పెద్దలు.. గెలుపు కోసం సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. దక్షిణాదిలో తెలంగాణను కీలకంగా భావిస్తున్న ఢిల్లీ పెద్దలు.... వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎలాగైనా కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని పట్టుదలగా ఉన్నారు.. ఇందులో భాగంగానే ప్రియాంక అస్త్రాన్ని తెలంగాణపై సంధించబోతున్నారని సమాచారం.. ప్రియాంక ప్రధాన కార్యదర్శి అయ్యాక ఆమె చేతికి తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని పార్టీలో చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ఎన్నో ఆశలతో ఉన్న కాంగ్రెస్‌... ఇందుకోసం పక్కా స్కెచ్‌లు రెడీ చేస్తోంది. రాష్ట్ర వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఏకంగా ప్రియాంక గాంధీనే రంగంలోకి దించడం ద్వారా గెలుపు సులభం అవుతుందని అంచనా వేస్తోంది. 

07:30 - September 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ మహిళలకు ఆరాధ్యమైన బతుకమ్మ పండుగ రాష్ట్ర స్థాయి ఉత్సవాలు ఇవాళ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగనున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే వేలాది మంది మహిళలతో మహా బతుకమ్మ వేడుక నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 31 జిల్లాల్లోని 427 మండలాల నుంచి మహిళలను తీసుకొచ్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. గిన్నిస్‌ బుక్‌లో రికార్డు కోసం మూడువేల మంది మహిళలు తంగేడుపూల ఆకారంలో నిలుచొని బతుకమ్మ ఆడతారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కవిత, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రుల సతీమణలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, మహిళానేతలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు.

 

07:29 - September 26, 2017

ఢిల్లీ : ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలు, ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో జరిపిన భేటీలో ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అంశంపై ప్రధానంగా చర్చించారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని గడ్కరీకి వివరించిన చంద్రబాబు... డయాఫ్రం వాల్‌ నిర్మాణం, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పురోగతి, కాపర్‌ డ్యామ్‌ నిర్మాణాలు గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలిచేందుకు తీసుకుంటున్న చర్యలపై గడ్కరీతో చర్చించారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. పోలవరం పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతోపాటు తరచు పనులను పర్యవేక్షిస్తున్న విషయాన్ని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధులను వివరించిన చంద్రబాబు... చేసిన పనులకు రావాల్సిన మిగిలిన నిధులను విడుదల చేయాలని కోరారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చారు.

ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి..
అంతకు ముందు ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఉన్న లాల్‌ బహదూర్‌ శాస్త్రి అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, శిక్షణా ఐఏఎస్‌ల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఐఏఎస్‌లకు పాఠాలు బోధించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రం ముందున్న సవాళ్లు, సాధిస్తున్న విజయాలు, కొత్త రాజధాని అమరావతి నిర్మాణం వంటి అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అభివృద్ధికి సాకేతికతను జోడించడం వలన సత్ఫలితాలు వస్తున్నాయన్నాయని ఐఏఎస్‌ అధికారుల దృష్టికి తెచ్చారు. అమరావతిలో మకుటాయమానంగా నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం భవన నిర్మాణాల ఆకృతుల పరిశీలన, త్వరితగతిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కొరత లేకుండా విద్యుత్‌ సరఫరా వంటి అంశాలు గురించి వివరించారు. ప్రపంచలో ఎక్కడాలేని విధంగా రాజధాని అమరావతి నిర్మాణంలో కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూ సమీకరణ పద్ధతిలో 33 వేల ఎకరాలు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే చాలా కాలం తర్వాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం అధికారంలోకి రావడం వలన కీలక సంస్కరణలు, సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కలుగుతున్న అంశాన్ని ప్రస్తావించారు. పలు అంశాపై ఐఏఎస్‌ అధికారులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పారు. 

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
ఆ తర్వాత చంద్రబాబు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమయ్యారు. కృష్ణా బేసిన్‌లో గ్యాస్‌ నిక్షేపాల వెలికితీ, సహజవాయువుకు కేటాయింపులు, విశాఖలో పెట్రోలియం యూనివర్సిటీ భవన నిర్మాణాలకు నిధుల మంజూరు వంటి అంశాలపై చర్చించారు. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ రిఫైనరీ ఏర్పాటుపై మాట్లాడారు. కాకినాడ సెజ్‌లో రిఫైనరీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన హెచ్‌పీసీఎల్‌... ఆ తర్వాత వెనక్కి తగ్గిన అంశం ప్రస్తావనకు వచ్చింది. చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరగా, పరిశీలిస్తానని ధర్మేంద్ర ప్రధాన్‌ హామీ ఇచ్చారు. 

నేడు కల్పవృక్ష వాహనంపై శ్రీవారు

 

చిత్తూరు : తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారు కల్పవృక్ష వహనంపై ఊరేగనున్నారు. సాయంత్రం సర్వభూపాల వాహనంపై ఊరేగనున్నారు.

మహాలక్ష్మి అవతారంలో దుర్గమ్మ దర్శనం

కృష్ణా : నేడు మహాలక్ష్మి అవతారంలో దుర్గమాత దర్శనం ఇవ్వనున్నారు. నేడు భక్తులు ఎక్కువగా రావచ్చనే అంచనాతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

మహాలక్ష్మి అవతారంలో దుర్గమ్మ దర్శనం

కృష్ణా : నేడు మహాలక్ష్మి అవతారంలో దుర్గమాత దర్శనం ఇవ్వనున్నారు. నేడు భక్తులు ఎక్కువగా రావచ్చనే అంచనాతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

మహాలక్ష్మి అవతారంలో దుర్గమ్మ దర్శనం

కృష్ణా : నేడు మహాలక్ష్మి అవతారంలో దుర్గమాత దర్శనం ఇవ్వనున్నారు. నేడు భక్తులు ఎక్కువగా రావచ్చనే అంచనాతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

Don't Miss