Activities calendar

27 September 2017

21:50 - September 27, 2017

ఢిల్లీ : నిన్న మొన్నటిదాకా ఉత్తరకొరియా దిగులు.. నేడేమో మయన్మార్‌ సరిహద్దుల్లో సర్జికల దాడుల నేపథ్యంలో... దేశీయ సూచీలు భారీగా పతనమయ్యాయి. సెప్టెంబర్‌ డెరివేటివ్‌ల గడువు ముగింపుకు తోడు... మయన్మార్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 440 పాయింట్ల నష్టంతో 31వేల 160 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 9,800 కిందకు దిగజారింది. ఈసూచీ 136 పాయింట్లు కోల్పోయింది. ఉదయం సెన్సెక్స్‌ స్వల్ప లాభంతో ప్రారంభమైనప్పటికీ.. మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో నష్టాల్లోకి జారుకుంది. దీనికి తోడు సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా సూచీ మరింత డీలాపడింది. ఎక్కువగా మిడ్‌ క్యాప్, బ్యాంకింగ్, ఫార్మా షేర్లు కుదేలయ్యాయి. నిఫ్టీలో భారతీ ఇన్‌ ఫ్రా, టీసీఎస్, టెక్ మహీంద్ర, గెయిల్ టాప్ గెయినర్లు కాగా... అదానీ పోర్ట్స్, ఎస్ బీఐ, అల్ట్రా టెక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాక్టర్ రెడ్డీస్ నష్టపోయాయి. 

 

21:47 - September 27, 2017

కర్నూలు : వైశ్యుల పట్ల కంచ ఐలయ్య వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లుగా ఉందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ అన్నారు. కులాలను రెచ్చగొడితే పదేళ్ల జైలు శిక్ష వేయాలని అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంలోనే ఉందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ మాల్స్‌, స్టోర్స్‌ వల్ల వైశ్యులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని టీజీ వెంకటేష్‌ అన్నారు. ఇతర కులాలను కించపరచడం ఐలయ్యకు తగదని టీజీ వెంకటేష్‌ అన్నారు. 

21:40 - September 27, 2017

గుంటూరు : చంద్రబాబు లండన్‌ పర్యటన ఖరారైంది. అక్టోబర్‌ 24, 25 తేదీల్లో పర్యటించనున్న సీఎం... అమరావతి భవన నిర్మాణాల డిజైన్లను ఫైనల్‌ చేయనున్నారు. ఇప్పటికే భవన ఆకృతుల్లో అనేక మార్పులు సూచించిన సీఎం... ప్రత్యేకంగా సీఆర్డీఏ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఇవాళ సీఆర్డీఏ ఆధ్వర్యంలో అమరావతి అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం
అమరావతి రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది. అమరావతిలో నిర్మించాల్సిన భవనాలు, సంస్థలు,.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కాలనీల ఏర్పాటుతో పాటు అనేక అంశాలపై చర్చించారు. 
భవన నిర్మాణాలపై ప్రధాన చర్చ
అమరావతిలో నిర్మించనున్న భవన నిర్మాణాలపై ప్రధానంగా చర్చించారు. గతంలో నార్మన్‌ పోస్టర్‌ రూపొందించిన డిజైన్లపై చంద్రబాబు మార్పులు సూచించడం,... సీఆర్డీఏ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే.. తాను లండన్‌ వచ్చినప్పుడు మరోసారి భవన నమూనాలను పరిశీలిస్తానని చంద్రబాబు చెప్పడంతో... అక్టోబర్‌ 24, 25 తేదీల్లో లండన్‌లో పర్యటించి... ఆ నమూనాలను పరిశీలించాలని సీఆర్డీఏ సమావేశంలో ఖరారు చేశారు. అయితే... చంద్రబాబు పర్యటనకు ముందే అక్టోబర్‌ 11, 12, 13 తేదీల్లో మంత్రి నారాయణతో పాటు సినీ దర్శకులు రాజమౌళి, సీఆర్డీఏ అధికారులు లండన్‌లో పర్యటించనున్నారు. ఇక అమరావతిలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు 25 అత్యుత్తమ సంస్థలు ముందుకు వచ్చాయని.. అందులో 11 జాతీయ, అంతర్జాతీయ సంస్థలున్నాయని చంద్రబాబు తెలిపారు. 

 

21:36 - September 27, 2017

అనంతపురం : ప్రభుత్వ ఆసుపత్రిలో మరణ మృదంగం కొనసాగుతోంది. ఒకేవార్డులో కొన్ని గంటల వ్యవధిలో  10 మంది మరణించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వైద్యుల తీరుపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీరియస్ కేసులన్నీ ఒకేసారి వచ్చాయని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. 
10 మంది రోగులు మృతి
అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో మరణ మృదంగం మోగింది. తెల్లవారు ఝామున 2 గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వ్యవధిలో 10 మంది రోగులు ఒకరి తరువాత ఒకరు పిట్టల్లా రాలిపోయారు. ఏమి జరిగిందో తెలియక రోగుల బంధువులు భయాందోళనలో మునిగిపోయారు. 
వివిధ వార్డుల్లో 1200 మంది రోగులు
అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో 12 వందల మంది రోగులు వైద్య చికిత్సలు పొందుతున్నారు. ప్రతిరోజు మరో 2 వేల మందిదాక వివిధ రోగాలతో వైద్య పరీక్షలు చేయించుకుని వెళ్తూ ఉంటారు. ఇటీవల కాలంలో జ్వరాలు తీవ్రం కావడంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య మరింత పెరిగింది. ఈ క్రమంలో కొన్ని గంటల వ్యవధిలో 10 మంది చనిపోవడం ఆందోళనకరంగా మారింది. తగినంత మంది వైద్యులు, సిబ్బంది లేకపోవడమే మరణాలకు కారణమని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. 
జ్వరాలతో ఎవరూ చనిపోలేదు : సూపరింటెండెంట్ 
అత్యవసర చికిత్సలు పొందుతున్న రోగులు వివిధ రోగాలతో మృతి చెందారని, జ్వరాలతో ఎవరూ చనిపోలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ తెలిపారు. రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రోజుకు నాలుగైదు మరణాలు సహజమని తేలిగ్గా తీసిపడేసారు. 
ఆస్పత్రిలో ఎమ్మెల్యే ప్రభాకర్‌ ఆకస్మిక తనిఖీలు 
అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి. ప్రైవేటు ఆసుపత్రి నుంచి సీరియస్ కేసులు రిఫర్ చేయడం వల్లే 10 మంది రోగులు చనిపోయినట్లు ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి స్పష్టం చేశారు. తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికైనా ఆస్పత్రిలో సరిపడా వైద్య సిబ్బందిని నియమించడంతో పాటు.. తగిన వసతి సౌకర్యాలు కల్పించాలని స్ధానికులు కోరుతున్నారు. మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. 

 

21:25 - September 27, 2017

ఢిల్లీ : ఇండియన్ ఆర్మీ మయన్మార్‌ సరిహద్దులో మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో నాగా ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని ఆర్మీ ప్రకటించింది. ఆర్మీ దాడుల్లో నాగా ఉగ్రవాదులు చాలా మంది  చనిపోయినట్లు భావిస్తున్నారు. తొలుత సర్జికల్‌ స్ట్రయిక్స్‌గా భావించినప్పటికీ...తాము సరిహద్దు దాటలేదని ఆర్మీ పేర్కొంది.

మయన్మార్‌ సరిహద్దులో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భీకరపోరు జరిగింది. మయన్మార్‌ సరిహద్దు వద్ద లెంఖు గ్రామంలో ఉదయం 4.45 గంటల సమయంలో నాగా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం దాడులు జరిపినట్లు ఈస్ట్‌ కమాండ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

సరిహద్దులో భారత జవాన్లపై అజ్ఞాత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులను భారత దళాలు దీటుగా తిప్పికొట్టాయి.ఈ దాడుల్లో నేషనల్‌ సోషలిస్టు కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ (కె)కు చెందిన ఉగ్రవాదులకు భారీ నష్టం జరిగింది. ఆర్మీ జరిపిన కాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు పారిపోగా... చాలామంది ఉగ్రవాదులు హతమైనట్లు సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో సైన్యానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. దాదాపు 70 మంది భారత పారా కమాండోలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. 

భారత ఆర్మీ జరిపిన దాడులను సర్జికల్‌ స్ట్రయిక్స్‌గా భావించారు. ఈసారి సరిహద్దు దాటకుండానే దాడులు జరిపినట్లు ఆర్మీ ఈస్టర్న్‌ కమాండ్‌ స్పష్టం చేసింది. ఇంతకుముందు 2015లో భారత ఆర్మీ మయన్మార్‌ సరిహద్దు దాటి 15 మంది ఉగ్రవాదులను హతమార్చింది. మణిపూర్‌లోని చందేల్‌లో ఉగ్రవాదులు 18 మంది సైనికులను చంపడంతో ఆర్మీ ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఎన్ ఎస్ సీఎన్ (కె) కెవైకెఎల్) ఉగ్రవాద సంస్థలకు భారీ నష్టం సంభవించింది.

2016లో భారత సైన్యం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. పివోకేలోని 4 ఉగ్ర స్థావరాలను ఆర్మీ ధ్వంసం చేసింది. కేవలం గంట వ్యవధిలో నిర్వహించిన ఈ దాడుల్లో దాదాపు 40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

ట్యాంపర్ చేసిన రీడింగ్ ను అంగీకరించేదిలేదు : మంత్రి హరీష్

హైదరాబాద్ : ట్యాంపర్ చేసిన రీడింగ్ ను అంగీకరించేదిలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. 

 

అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటుకు కేంద్రకేబినెట్ అమోదం

గుంటూరు : అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అమోదం తెలిపారు. పోలీసు వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటుకు అమోదం తెలిపింది. టెలిమెట్రి పరికరాలు ఏర్పాటు చేసిన ఏజెన్సీపై ఫిర్యాదు చేశారు. టెటిమెట్రి ఏజెన్సీలో ఎల్లుండి సమావేశం జరుగనుంది. పోతిరెడ్డిపాడు టెలిమెట్రి ట్యాంపరింగ్ పై చర్చ చేయనున్నారు. 

 

20:56 - September 27, 2017

చీరెల పంపిణీల 28 కోట్లు గోల్మాల్, వాన నీళ్లళ్ల కొట్కపోయిన మక్కజొన్న, పరిహారం అడ్గితె కేసులు వెడ్తున్నరు, కన్నీరు వెడ్తున్న మిడ్ మానేరు జనం, ఎంపీ నగేష్ ఇంటి మీద దొంగల పగ.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

20:52 - September 27, 2017
20:50 - September 27, 2017

పాకిస్తాన్ : 26/11 ముంబై దాడుల మాస్టర్‌ మైండ్‌....లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ తమకు భారంగా మారారని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ అన్నారు. ఏషియా సొసైటీ ఫోరమ్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సయీద్‌లాంటి వాళ్లు తమకు తలనొప్పేనని, త్వరలోనే అతని పని పడతామని చెప్పారు. హక్కానీ, లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌లాంటి సంస్థలతో తమకు ఇబ్బందేనని చెప్పారు. కొన్నాళ్ల కిందటి వరకు హఫీజ్ సయీద్‌లాంటి ఉగ్రవాదులను  పెంచి పోషించింది మీరేనంటూ అమెరికాను దుయ్యబట్టారు. లష్కరే ఏర్పడడానికి పాకిస్తాన్‌దే బాధ్యత కాదని... 20 ఏళ్ల క్రితం అమెరికా మద్దతు తెలిపిందని ఆసిఫ్‌ గుర్తు చేశారు. మరోవైపు హఫీజ్‌ సయీద్‌ నిర్బంధాన్ని పాకిస్తాన్‌ మరో నెలరోజుల పాటు పొడిగించింది.

 

20:45 - September 27, 2017
20:43 - September 27, 2017

ఢిల్లీ : భారత్‌, ఆస్ట్రేలియా మధ్య 4వ వన్డేకు బెంగళూర్‌ చిన్నస్వామి స్టేడియంలో రంగం సిద్ధమైంది. 5 వన్డేల సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడమే లక్ష్యంగా కొహ్లీ అండ్‌ కో పక్కా గేమ్ ప్లాన్‌తో బరిలోకి దిగనుంది. బెంగళూర్‌లోని చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియం వేదికగా జరుగనున్న 4వ వన్డేలోనూ నెగ్గి విరాట్‌ ఆర్మీ అరుదైన రికార్డ్‌ సృష్టించాలని పట్టుదలతో ఉంది. 

బెంగళూర్‌లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య 4వ వన్డేకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో 2 సార్లు చాంపియన్‌ ఇండియా....5 సార్లు వన్డే చాంపియన్‌ ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న ఈ కీలక వన్డేకు చిన్నస్వామి స్టేడియంలో రంగం సిద్ధమైంది. 

మూడు వన్డేల్లోనూ తిరుగులేని టీమిండియా....కంగారూ జట్టుపై క్లీన్‌ స్వీప్‌ సాధించాలని పట్టుదలతో ఉంది. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌, పవర్‌ఫుల్‌ బౌలింగ్‌ ఎటాక్‌తో భారత్‌  అన్ని విభాగాల్లోనూ  బలంగా ఉంది.  హార్దిక్ పాండ్య ఆల్‌రౌండర్‌గా అదరగొడుతుండటంతో భారత్‌ మునుపెన్నడూ లేనంతలా  దుర్భేధ్యంగా కనిపిస్తోంది.

కోల్‌కతా వన్డేతో విరాట్‌ కొహ్లీ, ఇండోర్ వన్డేతో రోహిత్‌ శర్మ ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనడంలో అనుమానమే లేదు. యంగ్‌ స్పిన్‌ గన్స్‌ కుల్దీప్‌ యాదవ్‌,యజ్వేంద్రచహాల్‌ను ఎదుర్కోవడానికి కంగారూ బ్యాట్స్‌మెన్‌ ఎన్న కష్టాలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

5 వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 3-0తో నెగ్గిన భారత్‌....ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది.దీంతో 4వ వన్డేలో టీమ్‌ కాంబినేషన్‌తో  భారత్‌ ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి. మరోవైపు స్టీవ్‌ స్మిత్‌ సారధ్యంలోని ఆస్ట్రేలియా జట్టు అయోమయంలో ఉంది.మూడు వన్డేల్లో కొహ్లీ సేనకు గట్టి  పోటీ కూడా ఇవ్వలేక కంగారూ టీమ్‌ చేతులెత్తేసింది. ఇప్పటికే సిరీస్‌ కోల్పోయినా  ఆస్ట్రేలియా ...ఆఖరి 2 వన్డేల్లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. 

వరుస విజయాలతో జోరు మీదున్న విరాట్‌ ఆర్మీకే  బెంగళూర్‌ వన్డేలోనూ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి   నాలుగో వన్డేలో అయినా వరల్డ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా, ఇండియాకు కనీస పోటీ అయినా ఇస్తుందో లేదో చూడాలి. 

20:39 - September 27, 2017

అమెరికా : ఉత్తర కొరియాపై సైనిక చర్యకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. యుద్ధమే సమస్యకు పరిష్కారం కాదని...తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోందని ట్రంప్‌ అన్నారు. ఒకవేళ సైనిక చర్య తీసుకోవాల్సి వస్తే ఉత్తర కొరియా భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. సెప్టెంబర్‌3న ఉత్తర కొరియా అణు పరీక్ష చేపట్టిన తర్వాత్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తమ దేశ సరిహద్దుల సమీపంలో ఎగిరే అమెరికా బాంబర్లను కూల్చేస్తామని ఉత్తరకొరియా విదేశాంగశాఖ మంత్రి రియాంగ్‌ ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్‌ ఈ విధంగా స్పందించారు. బాధ్యతగల దేశాలన్నీ చేతులు కలిపి ఉత్తరకొరియాను అణురహితంగా మార్చాలని ట్రంప్‌ అన్నారు.

 

20:36 - September 27, 2017

పాకిస్తాన్ : టమాట కేజీ వంద రూపాయలంటేనే మనం అల్లాడిపోతాం....అలాంటిది పాకిస్తాన్‌లో కేజీ టమాటా 300 రూపాయలు పలుకుతోంది. లాహోర్‌, పంజాబ్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో కిలో టమోటో ౩ వందలు, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో 2 వందలు రూపాయలు ఉంది. భారత్‌ నుంచి సరఫరా తగ్గిపోవడంతో పాకిస్తాన్‌కు ఈ సమస్య వచ్చింది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా భారత్‌ నుంచి మాత్రం టమోటోను దిగుమతి చేసుకునేది లేదని పాక్‌ ఆహార భద్రత మంత్రి సికందర్‌ హయత్‌ బోసన్‌ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాక్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. బలుచిస్తాన్‌లో టమాట కోతకు వచ్చిందని మరి కొద్ది రోజుల్లో ధరలు తగ్గనున్నాయని చెబుతున్నారు.

 

20:30 - September 27, 2017

హైదరాబాద్ : పదో తరగతి పాసయ్యాడు..పై చదువులకు వెళ్లలేకపోయాడు...డబ్బు సంపాదించాలంటే పెట్టుబడిలేని వ్యాపారం కావాలి..చదివిన చదువుకు ఉద్యోగం రాదు..సంపాదనా ఉండదు..దీంతోనే మాస్టర్ ప్లాన్ చేసి జ్యోతిష్యం నేర్చుకున్నాడు..ఆ తర్వాత నగరానికి వచ్చేశాడు..కొన్నేళ్లుగా భవిష్యవాణి పేరుతో సంస్థను ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నాడు.. ప్రయివేటు చానల్స్‌లో ప్రచారం చేసుకుంటూ తనకు తాను స్వామిగా ప్రాచుర్యం పొందాడు....అతనే నర్సింహ..అలియాస్‌ విష్ణు...

ఎలాంటి సమస్యకైనా చిటికెలో పరిష్కారం చేస్తానంటాడు.. మీ జాతక రీత్యా...పుట్టిన తేదీ దృష్ట్యా ఉన్న లోపాలను సరిచేసి గాడిన పెడతానంటాడు ఈ స్వామి...పేరు గుడిమల్ల వెంకట లక్ష్మీనర్సింహ అలియాస్ విష్ణు అలియాస్ చింటూ... హోమం చేస్తే మూడు లక్షలు... ప్రత్యేక పూజలు చేస్తే రెండు లక్షలు..పేరు పేరునా స్పెషల్‌ కార్యక్రమాలు.. నర్సింహ అలియాస్ విష్ణు హైదరాబాద్‌ నగరంలోని మీర్‌పేట ప్రాంతం గాయత్రీనగర్‌లో ఏకంగా భవిష్యవాణి పేరుతో ఓ సంస్థను నెలకొల్పాడు...

ఇక తను గాయత్రీనగర్‌లో కొందరికి మాత్రమే తెలుసు..కాని తన గురించి ప్రచారం కావాలంటే మీడియాను వాడుకున్నాడు...ప్రయివేటు చానల్స్‌లో ప్రచారం మొదలుపెట్టాడు.. 

ఖమ్మం జిల్లాలో పదో తరగతి వరకు చదివి ఆ తర్వాత జ్యోతిష్యం నేర్చుకున్నాడు..పుస్తకాలు తిరిగేశాడు...ఇక ఏడేళ్ల క్రితం నగరానికి వచ్చి ఏకంగా సంస్థను ఏర్పాటు చేశాడు నర్సింహ. తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ప్రాచుర్యం..కష్టాల్లో ఉన్న మహిళలతో లైంగిక సంబంధాలు.. శాడిస్టుగా మారి రకరకాల వేధింపులు..హోమాలు..పూజల పేరుతో అరాచకాలు.. ఎందరో ఆడాళ్లను తన వాక్చాతుర్యంతో లోబర్చుకున్న నర్సింహచార్యులు వారిని బెదిరింపులకు దిగేవాడు..లక్షలు లక్షలు తీసుకుని పూజలు..హోమాల పేరుతో దోపిడీ చేసేవాడు.. ఐదు పోలీసు స్టేషన్లలో కేసులు..50 నుంచి 60 మంది బాధితులు.. డమ్మి పిస్టోల్‌తో సీబీఐ ఆఫీసర్‌నని..

ఇలా ఎన్నో రకాల అవతారాలు ఎత్తే నర్సింహ దోపిడీనే ఎంచుకున్నాడు...అవసరాలు..కష్టాల్లో ఉన్నవారిని గుర్తించి వారి నుంచి దొరికినంత దోచేశాడు...ఇలా ఎందరో బాధితులు ఉండగా అందులో ఐదుగురు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు కలిసి దాడులు చేసి నకిలీ స్వామిని అదుపులోకి తీసుకున్నారు...

నమ్మకం..విశ్వాసాన్ని క్యాష్‌ చేసుకుంటున్న ఇలాంటి బాబాలు..స్వాములు ఎందరో నకిలీలు నగరంలో సంచరిస్తూనే ఉన్నారు..రకరకాల పేర్లతో మాయలు చేస్తున్నారు... మీ అవసరాన్ని క్యాష్ చేసుకునేవారెందరో ఉన్నారని గుర్తించండి..కష్టపడకుండా ఏదీ రాదు...కష్టంతో వచ్చింది ఎక్కడికి పోదు...ఇది సత్యం...

 

20:23 - September 27, 2017

ప్రకాశం : సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది...కనిగిరిలో యువతిపై ప్రేమికుడు చేసిన ఘోరం ప్రతీ ఒక్కరినీ కదిలించింది..ఈ ఘటనపై ప్రభుత్వం, అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు..యువతికి అండగా ఉండడమేగాకుండా ఆ ముగ్గురు నిందితులపై రౌడీషీట్‌ తెరిచేందుకు రెడీ అయ్యారు...
దుశ్శాసన పర్వంపై సర్వత్రా నిరసనలు 
ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన దుశ్శాసన పర్వంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి...ఇప్పటికే ఈ విషయంపై ఏపీ సర్కార్‌ సీరియస్‌గా తీసుకుంది..నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు... అయితే జరిగిన ఘటన మామూలుది కాదని..ఇలా ఎందరో అమ్మాయిల బతుకులతో ఆడుకుంటున్న మృగాళ్లకు హెచ్చరికలా ఉండాలని ప్రభుత్వం మహిళా కమిషన్‌ను రంగంలోకి దించింది..దుర్మార్గంపై స్పందించిన మహిళా కమిషన్‌ వెంటనే బాదిత కుటుంబాన్ని కలుసుకుంది..వారికి అండగా ఉంటామని...న్యాయం చేస్తామంటూ హామీ చేసింది....
నిందితులకు త్వరలోనే శిక్ష : పోలీసులు.. 
ఇప్పటికే నిందితులు ముగ్గురు సాయి, కార్తీక్, కోటేశ్వర్‌రావులపై నిర్భయతో పాటు ఐటీ యాక్ట్‌కింద..మరికొన్ని సెక్షన్లు నమోదు చేసి అరెస్టు చేశామని...ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించడమేగాకుండా నిందితులకు త్వరలోనే శిక్ష పడేలా చూస్తామన్నారు పోలీసులు.. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎందరో వారికి అండగా ఉండడమేగాకుండా న్యాయం చేయాలని...యువతికి ఉద్యోగం ఇప్పించాలని కోరారు...అయితే వెంటనే స్పందించిన తీరుపై బాధిత యువతి తల్లి సంతోషం వ్యక్తం చేస్తుంది...
నిందితులపై రౌడీషీట్‌లు తెరిచేందుకు సన్నద్ధం
నిందితులపై రౌడీషీట్‌లు తెరిచేందుకు పోలీసులు సన్నద్ధం చేస్తున్నారు..మరో ఘటన జరుగకుండా ముగ్గురిపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా పోలీసులు ఆదేశించారు....

 

20:20 - September 27, 2017

అనంతపురం : ప్రైవేటు ఆసుపత్రి నుంచి సీరియస్ కేసులు రిఫర్ చేయడం వల్లే 9 మంది రోగులు చనిపోయినట్లు ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి స్పష్టం చేశారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆయన మరణాలకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని.. తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామని చెబుతున్న ఎమ్మెల్యే ప్రభాకర చౌదరితో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:16 - September 27, 2017
20:15 - September 27, 2017

ఢిల్లీ : ఇండియన్ ఆర్మీ మయన్మార్‌ సరిహద్దులో మెరుపు దాడులు చేసింది. ఈ తెల్లవారుజామున 5 గంటల సమయంలో నాగా తీవ్రవాదుల శిబిరాలపై ఇండియన్‌ పారా కమాండోలు దాడులు జరిపారు. లాంగ్‌ఖూ గ్రామంలోని నాగా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు ఆర్మీ తెలిపింది. ఈసారి సరిహద్దు దాటకుండానే దాడులు జరిపినట్లు ఆర్మీ ఈస్టర్న్‌ కమాండ్‌ స్పష్టం చేసింది. ఈ దాడుల్లో నాగా తీవ్రవాదుల శిబిరానికి భారీ నష్టం వాటిల్లినట్లు  వెల్లడించింది. ఆర్మీ వైపు ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. ఇంతకుముందు 2015లో భారత ఆర్మీ మయన్మార్‌ సరిహద్దు దాటి 15 మంది ఉగ్రవాదులను హతమార్చింది.

 

20:10 - September 27, 2017

నేషనల్ లెవల్ లో గ్రేట్ హిట్స్ అందుకున్న మురుగదాస్ డైరక్షన్ లో మహేష్ బాబు సినిమా అని ఎనౌన్స్ అవ్వగానే మహేష్ కి మరో బ్లాక్ బాస్టర్ గ్యారంటీ అని మెంటల్ గా ఫిక్స్అయ్యారు ఫ్యాన్స్.. ఇల బైలాంగ్వల్ మూవీ అనగానే సినిమా ఓ రేంజ్ లో  స్టఫ్  ఉంటుందని అంచనా వేశారు.. అందుకు తగ్గట్టుగానే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మచ్ ఎవైటెడ్ మూవీ స్పైడర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ, ఆ అంచనాలను ఎంతవరకు రీచ్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం.. 
కథ విషయానికి వస్తే.. 
కథ విషయానికి వస్తే.. ఐబి ఆఫీస్ లో కాల్ టాంపరింగ్ ఏజంట్ గా పనిచేస్తున్న శివ, ఎక్కడైన.. ఎవరైన సఫర్ అయితే తట్టుకోలేని మనస్థత్వం అతనిది. అందుకే సొంతంగా ఓ సాప్ట్ వేర్ క్రియేట్ చేసుకుని... ఎవరైన బాధపడినా.. హెల్ప్ అని అడిగినా.. భయపడినా.. ఏడ్చినా.. తనకు ఎలర్ట్ వచ్చేలా ఓ ఫ్రోగ్రామ్ ను రూపొందిస్తాడు... అలా సాఫ్ట్ వేర్ ద్వారా ఓ అమ్మాయి భయపడుతుంది అని తెలిసి ఆమెకు తోడుగా ఓ లేడీ కానిస్టేబుల్ ని పంపుతాడు.. ఆ మరుసటి రోజు ఆ ఇద్దరిని ఓ సీరియల్ కిల్లర్ మర్డర్ చేశాడు అని తెలుసుకుని స్టన్ అవుతాడు.. అలానే వాడిని వదిలేస్తే చాలా మందిని చంపుతాడు అని అర్ధం అయ్యి.. వాడిని వెతుకుంటూ బయలుదేరుతాడు.. ఆ ప్రోసెస్ లో శివకి ఎదురైన ఛాలెంజస్ ఏమిటి. శివ ఆ సైకో కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడు. అతని ద్వారా ఎదురైయ్యే ప్రమాధాలనుండి ప్రజలను ఎలా కాపాడాడు.. చివరికి అతన్ని శివా ఎలా మట్టుపెట్టాడు.. ఇలాంటి విషయాలన్ని సినిమా చూసి తెలుసుకోవల్సిందే.. 
నటీ నటుల విషయానికి వస్తే.. 
నటీ నటుల విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తానికి వన్ అండ్ ఓన్లీ హైలట్ మహేష్.. ఫైట్స్ డాన్స్ ల్లో నెవర్ బిఫోర్ అనిపించేలా మెచ్యూరిటీ చూపించాడు.. అతను ఈ సినిమాకు పడిన కష్టం ప్రతీ సీన్లో కనిపిస్తుంది.. డైరక్టర్ నమ్మి ఒక సినిమా కోసం హీరో ఎంత చేయాలో అంతకు పదింతలు చేశాడు.. ఎమోషన్స్ పండించడంలో మహేష్ కు తిరుగులేదు అని మరోసారి ప్రూ చేసుకున్నాడు,.. ఈ సినిమా కోసం మహేష్ పెట్టిన ఎఫర్ట్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తుంది. ఇక హీరోయిన్ రకుల్ విషయానికి వస్తే ఒక నార్మల్ క్యారక్టర్ లొ హైపర్ ఎనర్జీతో యాక్ట్ చేసి ఆకట్టుకుంది.. మహేష్ పెయిర్ గా బాగా సెట్ అయ్యింది.  కాకపోతే ఆ క్యారక్టర్ కి పెద్దగా ఎలివేషన్ ఇంపార్టెన్స్ లేకపోవడంతో  గుర్తుపెట్టుకునే రేంజ్ లో పండలేదు. ఇక ఈ సినిమాకు మహేష్ తరువాత.. మరో మెయిన్ ఎసెట్ గా నిలిచాడు ఎస్ జే సూర్య.. సైకోగా శాడిజాన్ని చూపిస్తూ,... విలనీని బాగా హైలెట్ చేశాడు.. అతని ఫర్ఫామెన్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.. ఇక వరుసగా సీరియస్ క్యారక్టర్స్ చేస్తున్న కమెడియన్ ప్రియదర్శి..  ఈ సినిమాలో కూడా మరో సీరియస్ క్యారక్టర్ చేశాడు.. ప్రేమిస్తే ఫేం భరత్ జస్ట్ గెస్ట్ అపీరియన్స్ గా కనిపించాడు.. ఇక మిగతా నటీనటులు అందరూ.. తమ పాత్రల పరిదిమేర నటించారు.. 
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. 
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఈ సినమాకు స్టోరీ స్ర్కీన్ ప్లే.. డైలాగ్స్, డైరక్షన్ వంటి కీలక విభాగాలను హ్యాండిల్ చేసిన మురగదాస్.. రైటర్ గా చాలా డిసప్పాయింట్ చేశాడు.. అతడు రాసిన స్క్రీప్ట్ లో విలన్ కి సరైన స్పాన్ లేదు..  విలన్ పాత్రలో ఇంటెన్సిటీ లేదు.. ఓవర్ ఆల్ గా స్క్రీన్ ప్లేకి ఒక ప్లో లేదు అనే చెప్పాలి.. మంచి కధను ఎంచుకున్న మురుగదాస్ దాన్ని యాక్షన్ ఎంటర్ టైనర్ గా.. ద్విభాషా చిత్రంగా మార్చడంలో.. తడబడ్డాడు..  అందుకే మురుగదాస్ కి మేయిన్ బలం అయిన ఎమోషన్స్ కూడా ఎవరికీ కనెక్ట్ కాలేదు.. హీరో పడుతున్న శ్రమ.. మనుషులను కాపాడాలి అన్న తాపత్రయం కూడా చాలా మామూలు విషయాలుగా మనకు కనిపిస్తాయి..  మహేష్ స్టార్ డమ్ ను ఎలివేట్ చేసే  సీన్స్ అస్సలు రాసుకోలేదు అని చెప్పాలి.. సినిమా మొత్తంలో రెండే రెండు సన్నివేశాలలో  మురుగదాస్ ముద్ర కనిపిస్తుంది.. ఇక పాటలతో జస్ట్ యావరేజ్ అనిపించుకున్న హేరీష్ జయరాజ్  ఆర్ ఆర్ వరకు ఇంప్రెస్ చేయగలిగాడు.. సంతోష్ శివన్ సినిమాటో గ్రాఫీ బాగుంది.. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో అతని కెమెరా పనితనం కనిపిస్తుంది.. గ్రాఫిక్స్ వర్క్స్ ఓకే.. నిర్మాణ విలువలు బాగున్నాయి.. 

ఓవర్ ఆల్ గా భారీ ఎక్స్ పర్టేషన్స్ తో థియేటర్స్ లోకి వచ్చిన స్పైడర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం అనేది కొంచెం కష్టమే అనిపిస్తుంది.. సినిమాలో కామెడీ లేకపోవడం.. విలనీ ఎపిసోడ్ అంతా మరీ తమిళ్ టచ్ లో బాగా రా గా ఉండటం... హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ వల్గర్ గా ప్రొజక్ట్ అవ్వడంతో స్పైడర్ ఏ రేంజ్ విజయం సాధిస్తుంది అనేది చెప్పడానికి  మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.. కాకపోతే మహేష్ బాబు స్టార్ డమ్ తో ఈ సినిమా గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి..   
ప్లస్ పాయింట్స్
మహేష్ బాబు యాక్టింగ్
సినిమాటోగ్రాఫీ.. 
బ్యాగ్రౌండ్ మ్యూజిక్... 
ఫైట్ సీన్స్..
మైనస్ పాయింట్స్
పాటలు
కామెడీ అస్సలు లేకపోవడం
కనెక్ట్ కాని ఎమోషన్స్
హీరో హీరోయిన్ లవ్ ట్రాక్.. 
స్క్రీన్ ప్లే లో లోపాలు

రేటింగ్ 2/5 

20:06 - September 27, 2017
20:05 - September 27, 2017
20:04 - September 27, 2017

శ్రీకాకుళం : పురపాలక ఉన్నతపాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. పాఠశాలకు దసరా సెలవులు ఇవ్వడంతో కొంతమంది ఆకతాయిలు రాత్రి సమయాల్లో ఇక్కడ మద్యం సేవించి వరండాలలో బాటిళ్లు, తినుబండారాలు వదిలివెళ్తున్నారు. దీంతో పాఠశాల పరిసరాలన్నీ బార్‌లను తలపిస్తున్నాయి. రాత్రి సమయాల్లో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నా... పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు యువత తప్పుదారి పట్టకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. 

19:59 - September 27, 2017

కృష్ణా : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ.. సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తోంది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. సరస్వతీ దేవి శరణు శరణు అని ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలన్నీ మార్మోగుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై కుంకుమ పూజకు అనూహ్య స్పందన వస్తోంది. మూలా నక్షత్రం మరియు అమ్మవారి జన్మనక్షత్రమైన ఈరోజు కుంకుమ పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయన్న నమ్మకంతో భక్తులు ఈ పూజలో పాల్గొంటున్నారు.

 

19:57 - September 27, 2017

చిత్తూరు : తిరుమలలో శ్రీవారి గరుడసేవకు భక్తులు పోటెత్తారు. రాత్రి 7.30 గంటలకు గరుడవాహనంపై శ్రీవారు ఊరేగనుండటంతో.. తిరుమాడవీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. మాడవీధుల్లోని గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. గ్యాలరీల్లోకి వెళ్లలేక మాడవీధుల్లో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అన్న ప్రసాదాల పంపిణీల్లో జాప్యం నెలకొనడంతో.. భక్తులకు పాట్లు తప్పడం లేదు. 

19:55 - September 27, 2017

కృష్ణా : జిల్లాలోని నందిగామ టీడీపీ నేత శాఖమూరి వంశీధర్‌పై హైవే మొబైల్‌ ఎస్సై సత్యానందం దాడి చేశాడు. నందిగామ రైతుపేట నుంచి ట్రాక్టర్‌ ద్వారా కరెంట్‌ స్తంభాలను తరలిస్తుండగా ఎస్సై అడ్డుకున్నాడు. ప్రజా అవసరాల కోసం కరెంట్‌ స్తంభాలను తరలిస్తున్నామని చెప్పినా వినిపించుకోకుండా బూతులు తిడుతూ దాడి చేశాడని వంశీధర్‌ భార్య కౌన్సిలర్‌ సుమలత తెలిపారు. ఈ మేరకు ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా.. ఎస్సైపై చర్యలకు ఆదేశించారు. పూర్తి నివేదిక పంపాలని డీఎస్పీని కోరారు. 

 

19:53 - September 27, 2017

గుంటూరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన ఖరారైంది. వచ్చేనెల 24,25 తేదీల్లో ఆయన లండన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అమరావతి నగరం ఆకృతులపై చంద్రబాబు నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు ఈనెలలో తుది డిజైన్స్ సమర్పించనున్నారు. సీఎం పర్యటన కంటే ముందే వచ్చేనెల 11, 12,13 తేదీల్లో మంత్రి నారాయణ నేతృత్వంలో ప్రతినిధి బృందం లండన్‌ వెళ్లి నార్మన్ సంస్థ ప్రతినిధులతో భేటీ కానుంది. ఈ వర్క్‌షాప్‌లో దర్శకుడు రాజమౌళి కూడా పాల్గోనున్నారు. ఇవాళ జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో చంద్రబాబు లండన్‌ పర్యటనపై తుది నిర్ణయం తీసుకున్నారు.

 

19:51 - September 27, 2017

ప్రకాశం : కనిగిరిలో యువతిపై ముగ్గురు యువకులు అత్యాచార యత్నానికి ప్రయత్నించి ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన సంచలనం కలిగించింది. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపునేని రాజకుమారి కనిగిరిలోని బాధిత యువతి కుటుంబసభ్యులను పరామర్శించారు. చంద్రబాబుతో మాట్లాడి ఉద్యోగం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని నన్నపునేని హామీ ఇచ్చారు. 

 

 

పోలీస్ వాహనం ఢీకొని ఒకరు మృతి

మంచిర్యాల : తాండూరు మండలం నిలయ్యపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీస్ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

విజయవాడ : ఇంద్రకీలాద్రి భక్తులు పోటెత్తారు. సరస్వతిదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. క్యూలైన్ లో భక్తులు బారులు తీరారు. 

బ్యాంకుల కన్సార్టియంతో కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్ ఒప్పందం

హైదరాబాద్ : బ్యాంకుల కన్సార్టియంతో కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.11,400 కోట్ల రుణం ఇవ్వనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని 12 బ్యాంకుల కన్సార్టియం రుణం ఇవ్వనుంది. సీఎస్ ఎస్పీ సింగ్ ఆధ్వర్యంలో ఒప్పందం కుదిరింది. 

 

ఏసీబీకి చిక్కిన ఏఈ కుపా నాయక్

హైదరాబాద్ : ఉప్పుగూడ జీహెచ్ ఎంసీ ఏఈ కుపా నాయక్ ఏసీబీకి చిక్కాడు. సివిల్ కాంట్రాక్టర్ వద్ద రూ.30 వేలు లంచం తీసుకుంటూ కుపా నాయక్ ఏసీబీకి పట్టుబడ్డాడు. 

 

గరుడ సేవలో టీటీడీ అధికారుల అత్యుత్సాహం

తిరుమల : గరుడ సేవలో టీటీడీ అధికారుల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫిల్టర్ హౌస్ సర్కిల్ నుంచి రాంబగీచ వరకు ఒక రోడ్డు మొత్తం వీఐపీలకు కేటాయించారు. సామాన్య భక్తులకు యంత్రాంగం చుక్కలు చూపిస్తున్నారు. 

 

18:54 - September 27, 2017

కొమురంభీం అసిఫాబాద్‌ : గ్రామీణ ప్రాంతాలలో కులమతాలకు అతీతంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. కొమురంభీం అసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ గ్రామపంచాయితీ సర్పంచ్‌ సయ్యద్‌ కీజర్‌ హుస్సేన్ తన సొంత ఖర్చుతో బతుకమ్మ జాతరను నిర్వహించారు. సిర్పూర్‌ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో గ్రామంలోని వెయ్యి మందికి పైగా మహిళలు ఒకేసారి బతుకమ్మ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి కోనేరు రమాదేవితో పాటు పలువురు మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా ఈ బతుకమ్మ జాతరను నిర్వహించారు. 

18:52 - September 27, 2017

భద్రాద్రికొత్తగూడెం : ఐదేళ్లుగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు విమర్శించారు. కొత్తగూడెంలో ఉన్న సింగరేణి హెడ్ ఆఫీస్‌లో ఆయన విస్తృతంగా పర్యటించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పోగొట్టి ఐక్యతా రాగాలు ఆలపిస్తున్న కొన్ని సంఘాలను తిప్పి కొట్టి సీఐటీయూని గెలిపించాలని సాయిబాబు కోరారు. 


 

18:50 - September 27, 2017

భూపాలపల్లి జయశంకర్ : ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. ఏజెన్సీలో వైద్యాన్ని మెరుగుపరిచే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటే దసరాకు ఏడాది పూర్తవుతున్న సందర్భంలో జిల్లాను అభివృద్ధిపథంలో తీసుకెళ్తున్నామని చెప్పారు. మార్చికల్లా ఇంటింటికి నల్లా నీరు ఇవ్వడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మార్చి కల్లా 6వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు.

 

18:44 - September 27, 2017

ఖమ్మం : బతుకమ్మ చీరలతో రాష్ట్ర ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరతీశారని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో టీమాస్ ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ సంబరాలను ఆయన ప్రారంభించారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటకు తమ్మినేని, పోతినేని సుదర్శన్‌ రావు ఆడిపాడారు. నాసిరకం చీరలు పంపిణీ చేసి తెలంగాణ ఆడపడుచులను అవమానిస్తున్నారన్నారు. తెలంగాణ ఆడపడుచులపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుందన్నారు జ్వలిత. బహుజనులంతా ఏకమై సామాజిక తెలంగాణలో బహుజన బతుకమ్మను చేసుకోవాలని కోరుకుంటున్నామన్నారు. 

 

18:40 - September 27, 2017

హైదరాబాద్‌ : నగరంలో మధ్యాహ్నం కుంభవృష్టి వాన కురిసింది. అరగంటపాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, సోమాజీగూడ, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, నాంపల్లి, మెహదీపట్నం, సికింద్రాబాద్‌, ఈసీఐఎల్‌లలో వర్షం కురిసింది. 

 

18:39 - September 27, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్.... ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఇంటికో ఉద్యోగం, మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు వంటి హామీలు అమలు కాలేదన్నారు. కొత్త హామీలు ఇవ్వడం మానుకొని పాత హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త హామీలను ఇస్తున్నారని విమర్శించారు. కొత్త సెక్రటేరియట్ ఆలోచనను మానుకోవాలని హితవుపలికారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

18:24 - September 27, 2017

హైదరాబాద్ : మరికొద్ది రోజుల్లో గ్రేటర్‌ వాసులకు మెట్రో అందుబాటులోకి రానుంది. కాని ఓల్డ్‌ సిటీ వాసులకు మాత్రం మెట్రో ఎక్కే అవకాశం లేకుండా పోయింది. దీంతో తమకు మెట్రో రైల్‌ కావాలంటూ టీ మాస్‌ ఫోరం ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం విరమించుకున్న ఎంజీబిఎస్‌ నుండి ఫలక్‌నుమా వరకు మెట్రో రైళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరుతూ ఓల్డ్‌ సిటీ వాసులు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ ఆందోళనపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

 

17:50 - September 27, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అలసత్వం వల్ల మెట్రో ప్రాజెక్ట్‌ ఆలస్యమవుతుందని టీ.పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్‌ ఆలస్యం కావడంతో తెలంగాణ ప్రజలపై ఆర్థిక భారం కూడా పెరుగుతుందన్నారు. మెట్రో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. మెట్రో ప్రాజెక్ట్‌ కాంగ్రెస్‌దే అని తెలిపారు.
 

17:47 - September 27, 2017

జనగాం : తన పేరుపైన ప్రభుత్వానికి సంబంధించిన గజం భూమి రిజిస్ట్రేషన్‌ అయినట్లు నిరూపించినా.. ఏ శిక్షకైనా సిద్ధమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. కలెక్టర్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కలెక్టర్‌ నిరాధార ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఎంతో పాటు సీఎస్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీని కోరతానని చెప్పారు. తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఎందుకు ఆరోపణలు చేశారో ఆమెనే వివరణ ఇవ్వాలని యాదగిరిరెడ్డి అన్నారు. గుడికి ట్రస్ట్ చైర్మన్‌గా ఎమ్మెల్యే ఉండాలని అఖిలపక్షం నిర్ణయించిందని.. గుడికి ట్రస్టీని మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారని.. భూమిని రిజిస్ట్రేషన్‌ చేయలేదని యాదగిరిరెడ్డి వివరణ ఇచ్చారు. 

 

17:44 - September 27, 2017

గజల్ శ్రీనివాస్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1986 సం.లో గజల్ ప్రారంభించానని చెప్పారు. మూడు గిన్నిస్ బుక్ రికార్డులు వచ్చాయని తెలిపారు. 'గజల్ శ్రీనివాస్ నా మానస పుత్రుడు అని సినారే అన్నారని' గుర్తు చేశారు. సమైక్య ఆంధ్ర ఉండాలని కోరుకున్నా... తెలంగాణ వద్దని ఎప్పుడూ చెప్పలేదన్నారు. 'నాకు నేనే ఉద్యమాల్లోకి వచ్చానని..ఎవరి ప్రోద్బలం లేదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో చాలా వెనుకబడిన ప్రాంతాలున్నాయిని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల కంటే గజల్ తోనే ఎక్కువ సంపాదిస్తున్నానని తెలిపారు. సుఖంగా నిద్రపోయి చాలా ఏళ్లైందన్నారు. సర్వకుల హిత సమాజాన్ని కోరుకుంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తుందనుకోలేదు...అందుకే కాంగ్రెస్ కు రాజీనామా చేశానని తెలిపారు. పల్లెలు ఓల్డేజ్ హోంలా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేకిన్ ఇండియా కాదు.. పస్తులుండే వ్యక్తులను మహోన్నత శక్తులుగా చేయాలని కోరారు. ఆయన తెలిపిన పలు ఆసక్తికరమైన అంశాలను వీడియోలో చూద్దాం..

 

17:32 - September 27, 2017
17:30 - September 27, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని పోలవరం తహశీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పోలవరం ఏడు ముంపు గ్రామాల ప్రజల తరలింపునకు వాహనాలు వాడకుండా 80 లక్షల రూపాయలకు పైగా అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై తహశీల్దార్‌ ముక్కంటిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

17:28 - September 27, 2017

హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో భవిష్యవాణి పేరుతో భారీ మోసం బట్టబయలైంది. జ్యోతిష్యం చెబుతానంటూ అమాయక మహిళలను మోసం చేస్తున్న నకిలీ జ్యోతిష్యుడు నర్సింహాచార్యులును రాచకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నకిలీ పిస్టల్, కారుతో పాటు 5 కేజీల వెండి..ఒక ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు. పలువురి నుంచి నర్సింహాచార్యులు లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:10 - September 27, 2017

వరంగల్ రూరల్ : జిల్లాలో విషాదం నెలకొంది. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడ్డారు. మృతులు సాయి (8), అఖిల (10), అజయ్(10)గా గుర్తించారు. చిన్నారులతో మృతితో రోధనలు మిన్నంటాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

17:05 - September 27, 2017

ఉచిత న్యాయం సహాయం అంటే ఏమిటి ? అనే అంశంపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఆర్టికల్ 39 (ఏ).. ఉచిత న్యాయం సహాయక అధికారిక చట్టం. మహిళలు, పిల్లలు, బిలో పావర్టీ, పీహెచ్ సీ, మెంటల్లీ హ్యాండ్ క్యాప్డ్, విపత్తు బాధితులు ఉచిత న్యాయ సహాయానికి అర్హులు అని అన్నారు. వీరు ఉచిత న్యాయ సహాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

చెరువు కబ్జా ఆరోపణలకు జనగామ ఎమ్మెల్యే వివరణ

హైదరాబాద్: చెరువు కబ్జా ఆరోపణలకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వివరణ ఇచ్చారు. నాపై వచ్చిన చెరువు కబ్జా ఆరోపణలు అవాస్తవం అని, ఎందుకు కలెక్టరే ఆపోణలు చేశారో వివరణ ఇవ్వాలన్నారు. ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ గా ఎమ్మెల్యే ఉండాలని ప్రజల కోరిక అని, ఎమ్మెల్యే పేరు మీద ట్రస్ట్ రిజిస్టర్ అయిందని, భూమి రిజిస్ట్రేషన్ కాలేదని తెలిపారు. ప్రభుత్వ భూమి ఒక గజం అయినా కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అని చెప్పారు. కలెక్టర్ చేసిన ఆరోపణలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సీఎంతో పాటు సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీని కోరతానని తెలిపారు.

16:52 - September 27, 2017

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై  రాకెట్ల దాడి జరిగింది. ఉదయం 11.15 నిమిషాలకు విమానాశ్రయానికి సమీపంలో దాడి జరిగినట్లు ఆఫ్గన్‌ హోంశాఖ పేర్కొంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సుమారు 20 నుంచి 30 రాకెట్లతో దాడి జరిగినట్లు స్థానిక మీడియావర్గాలు పేర్కొన్నాయి. అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ ఎయిర్‌పోర్టులో దిగిన గంట సేపటికే ఈ దాడులు జరగడం గమనార్హం.  నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ కూడా ప్రస్తుతం కాబూల్‌లోనే ఉన్నారు. జేమ్స్‌ మాటిన్, జెన్స్‌ స్టోలెన్‌ బర్గ్‌లను  టార్గెట్ చేస్తూ రాకెట్ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. రాకెట్‌ దాడి నేపథ్యంలో అధికారులు ఎయిర్‌పోర్ట్‌ను ఖాళీ చేయించారు. పలు విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇంతవరకూ ఏ సంస్థ ప్రకటించుకోలేదు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

 

16:46 - September 27, 2017

ఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ దిగజారుతుండడంతో మోది ప్రభుత్వంపై సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిజెపికి చెందిన మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్‌ సిన్హా  ప్రస్తుత ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని టార్గెట్‌ చేశారు. ఆంగ్ల దినపత్రిక 'ద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' రాసిన కథనంలో జైట్లీ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దిగజార్చారని మండిపడ్డారు. మోది ప్రభుత్వం కీలకంగా భావించిన నోట్ల రద్దు కారణంగా అగ్నిలో ఆజ్యం పోసినట్లు.... ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందని యశ్వంత్‌ సిన్హా  ధ్వజమెత్తారు. జైట్లీ చేసిన తప్పులపై ఇప్పటికి కూడా తాను స్పందించకపోతే భారతీయుడిగా తన ప్రాథమిక విధిని విస్మరించినట్లేనని ఆయన తెలిపారు. బిజెపి నేతల్లో చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని...వారు చెప్పడానికి భయపడుతున్నారని యశ్వంత్‌సిన్హా అన్నారు. ప్రస్తుతం ఎవరికీ ఉపాధి లభించడం లేదని, అభివృద్ధి మందగించిందని...దీని ప్రభావం పెట్టుబడులు, జిడిపిపై చూపుతోందని ఆయన పేర్కొన్నారు.

 

16:45 - September 27, 2017

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కుంకుమ పూజకు అనూహ్య స్పందన వస్తోంది. మూలా నక్షత్రం మరియు అమ్మవారి జన్మనక్షత్రమైన ఈరోజు కుంకుమ పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయన్న నమ్మకంతో భక్తులు ఈ పూజలో పాల్గొంటున్నారు. అసలు కుంకుమ పూజ విశిష్టత ఏంటి.. భక్తుల కోసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే దానిపై ఇంద్రకీలాద్రి నుంచి మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:44 - September 27, 2017

అనంతపురం : ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం నెలకొంది. ఒకేవార్డులో రాత్రి 9మంది మృతి చెందారు. వైద్యుల తీరుపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి విషమించి వస్తే.. శవంతో వెళ్లాల్సి వస్తోందని మండిపడ్డారు. మరోవైపు సీరియస్ కేసులన్నీ ఒకే రాత్రి వచ్చాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. తగినంత మంది వైద్యులు, సిబ్బంది లేకపోవడమే మరణాలకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

16:43 - September 27, 2017

ఢిల్లీ : ఇండియన్ ఆర్మీ మరోసారి సర్జికల్ దాడులు నిర్వహించింది. మయన్మార్ సరిహద్దుల్లో ప్రత్యేక దళాలు ఈ దాడులు నిర్వహించాయి. నాగా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు ఆర్మీ తెలిపింది. భారత కమాండోలు సరిహద్దులు దాటలేదని.. అలాగే దాడుల్లో ఎవరూ గాయపడలేదని ప్రకటించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

16:42 - September 27, 2017

వనపర్తి : జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. ఘనపూర్‌ మండలం మానాజిపేటలోని దర్గా సమీపంలో పిడుగుపాటుకు పెద్దమందడి మండలం జంగమాయపల్లికి చెందిన రాములు, మానాజీపేటకు చెందిన కృష్ణయ్య, సొహైల్ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరి మృతితో తోటి భక్తులు కంటతడిపెట్టారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

16:38 - September 27, 2017

అనంతపురం : ఆర్ టీడీ క్రీడా మైదానంలో వారం పాటు నిర్వహించిన.. ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ రాష్ట్రస్థాయి జర్నలిస్ట్‌ క్రికెట్ టోర్నమెంట్‌ ముగిసింది. ఫైనల్‌ పోటీల్లో చిత్తూరు, కడప జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కడప జట్టు 20 ఓవర్లలో 74 పరుగులు తీసి ఆలౌట్‌ అయ్యారు. తిరిగి బ్యాటింగ్ చేపట్టిన చిత్తూరు జట్టు 10 ఓవర్లలో మూడు వికెట్‌లు కోల్పోయి.. 74 పరుగుల లక్ష్యాన్ని అందుకొని టోర్నీ విజేతగా నిలిచింది. టోర్నీ విజేతలకు జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ కప్‌తో పాటు నగదు బహుమతులను అందజేశారు. విధి నిర్వహణలో మానసిక వత్తిడితో ఉంటే జర్నలిస్ట్‌లకు.. క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయని జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ చెప్పారు. పోటీల్లో పాల్గొన్న 12 జిల్లాల జట్లకు అభినందనలు తెలిపారు. 

అక్టోబర్ 24,25 తేదీల్లో చంద్రబాబు లండన్ టూర్

అమరావతి: అక్టోబర్ 24,25 తేదీల్లో సీఎం చంద్రబాబు లండన్ టూర్ కన్ఫామ్ అయ్యింది. నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కానున్నారు. అక్టోబర్ 25న రాజధాని తుది ఆకృతులను పోస్టర్ అండ్ పార్టనర్స్ సమర్పించనున్నారు. అక్టోబర్ 11,12,13 తేదీల్లో లండన్ లోని నార్మన్ పోస్టర్ కార్యాలయంలో అమరావతి పరిపాలన నగర ఆకృతులపై వర్క్ షాప్ జరగనుంది. ఈ వర్క్ షాప్ లో డైరెక్టర్ రాజమౌళి కూడా పాల్గొనన్నుట్లు తెలుస్తోంది.

16:14 - September 27, 2017

కామారెడ్డి : జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, సంతాయి పేట గ్రామంలో చోటు చేసుకుంది. రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరూ ఒకేసారి మృతి చెందడంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నలుగురు స్నేహితులు కలిసి చెరువులో దూకారు. స్నానం చేస్తున్న సమయంలో షేక్‌ బషీర్‌, సయ్యద్‌ సలీం నీటిలో మునిగిపోతున్నట్లు కేకలు వేశారు. వారి మాటలు విన్న మరో ఇద్దరు చిన్నారులు.. స్థానికులకు విషయం చెప్పారు. దీంతో స్థానికులు వచ్చి మునిగిపోయిన చిన్నారుల కోసం గాలించారు. అప్పటికే  ఇద్దరూ చనిపోయినట్లు గ్రామస్తులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

పోలవరం తహశీల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడి

ప.గో: పోలవరం తహశీల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడి చేసింది. తహశీల్దార్ ముక్కంటిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజల తరలింపులో రూ. 80 లక్షల అవినీతికి పాల్పడినట్లు ముక్కంటిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ముంపు గ్రామాల ప్రజలను వాహనాల్లో తరలించినట్లు నకిలీ బిల్లులు సృష్టించి అవినీతికిపాల్పడినట్లు ఏసీబీ వద్ద ఆధారాలు ఉన్నాయి.

15:54 - September 27, 2017

సినీ ఇండస్ట్రీలో బయో పిక్స్ హావా నడుస్తోంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బయోపిక్స్ మీద ఫోకస్ పెడుతున్నారు ఫిలిం మేకర్స్. ఇప్పుడు ఒక బయోపిక్ డిస్కస్ నడుస్తుంది. క్రికెట్ అంటే ఉన్న ఆసక్తిని స్క్రీన్ మీద చూపించడానికి ఒక బయో పిక్ రెడీ అవుతుంది. హీరోయిన్ గా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ని క్రియేట్ చేసుకుంది 'కీర్తి సురేష్'. 'నాని' 'కీర్తి' నటించిన 'నేను లోకల్' సినిమా హిట్ తెలుగు రాష్టాల్లోనే కాకుండా తెల్ల దేశాల్లో కూడా కాసులు కురిపించింది. 'నాని' నాచురల్ యాక్టింగ్, 'కీర్తి' సురేష్ అందం, అభినయం కామెడీ డైలాగ్స్ అన్ని కలిపి ఆడియన్స్ కి ఆనందాన్ని, ప్రొడ్యూసర్ కి డబ్బుల్ని అందించాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అందం అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఆ తరం హీరోయిన్ మహానటి సావిత్రి. 'మహానటి' సావిత్రి జీవిత కథని మహానటి పేరుతో బయోపిక్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ లో కూడా బయోపిక్స్ శకం కొనసాగుతోందనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో బయోపిక్స్ తెరపైకొచ్చాయి. తాజాగా లేడి క్రికెటర్ బయోపిక్ కూడా తెరపైకి రానుంది. మహిళల టీం ఇండియా కెప్టెన్‌ 'మిథాలీ రాజ్‌'పై బాలీవుడ్‌లో బయోపిక్‌ రాబోతోంది. వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి హక్కులు సొంతం చేసుకున్నట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. రీసెంట్ గా వచ్చిన సచిన్ బయో పిక్ హిట్ టాక్ తో ఆడియన్స్ ని రీచ్ అయిన విషయం తెలిసిందే. 

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 440 పాయింట్ల నష్టంతో 31.59 వద్ద సెన్సెక్స్, 136 పాయింట్ల నష్టంతో 9,735 వద్ద నిఫ్టీ ముగిసింది.

15:45 - September 27, 2017

డిఫెరెంట్ స్టోరీ లతో తెలుగు స్క్రీన్ నుండి బాలీవుడ్ కి వెళ్లిన క్రియేటివ్ డైరెక్టర్ మరో ఇంటరెస్టింగ్ స్టోరీ కి రంగం సిద్ధం చేస్తున్నాడు. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా ఉండే ఈ డైరెక్టర్ ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేసాడో అర్ధం అవుతుంది అంటున్నారు ఫిలిం వర్గాలు. సినిమాలు అనేవి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అలానే ప్రజల్లోకి ఎంతో కొంత ఆలోచించే అంశాలని తీసుకువెళ్లాలి. 'సర్కార్' సీరియస్ తో బాలీవుడ్ ని కుదిపేసిన డైరెక్టర్ 'రామ్ గోపాల్ వర్మ'. 'అమితాబచ్చన్' తో 'సర్కార్ త్రీ' తీసి థియేటర్స్ లో తన మార్క్ ఫిలిం ని ప్రాజెక్ట్ చేసాడు. 'అమితాబ్' తో వచ్చిన 'సర్కార్' పార్ట్ వన్ సినిమా మంచి టాక్ తో ఆడియన్స్ ని రీచ్ అయింది అదే తరహాలో వచ్చిన 'సర్కార్ టు' 'సర్కార్ త్రీ' మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని ఫిలిం పీపుల్ టాక్. ఇలా బాలీవుడ్ సూపర్ స్టార్ తో వర్క్ చేసిన 'రామ్ గోపాల్' ఎప్పుడు ఏదో వివాదంలో ఉంటూనే ఉంటాడు.

'జె డి చక్రవర్తి'కి 'రామ్ గోపాల్ వర్మ'కి మంచి సన్నిహితం ఉంది. 'మనీ' సినిమా కామెడీ వే లో ఉంటే 'దెయ్యం' సినిమా హారర్ టచ్ లో ఉంటుంది. ఇంతకు ముందు చాల సినిమాలు అనౌన్స్ చేసిన 'వర్మ' ఇప్పుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అంటూ.. సీనియర్ ఎన్టీఆర్ జీవితంపై సినిమా చేస్తానని చెప్పడం సెన్సేషన్ అయింది. లక్ష్మీపార్వతి కోణంలోంచి ఈ చిత్రం ఉంటుందని చెప్పకనే చెప్పాడు వర్మ. ఇప్పుడీ చిత్రాన్ని నిర్మించేందుకు.. వర్మ శిష్యులలో ఒకరైన.. హీరో 'జేడీ చక్రవర్తి' ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 'లక్ష్మి పార్వతి' 'ఎన్ టి ఆర్' కి సంబంధించి సినిమా కచ్చితంగా వివాదాలకు దారి తీస్తుంది అనుకుంటున్నారు ఇండస్ట్రీ పీపుల్.

వరంగల్ ఎంజీఎంలో నలుగురికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ

వరంగల్: ఎంజీఎంలో నలుగురికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది. రవి, సునీత, కృష్ణా రెడ్డి, సాక్షిక(6) కు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రత్యేక వార్డులో స్వైన్ ఫ్లూ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఎంజీఎం ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణా రెడ్డి స్వైన్ ఫ్లూ బాధితుల్లో ఒకరు.

సైబర్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ ముఠాఅరెస్ట్..

హైదరాబాద్: షాదీకామ్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ ముఠాను సైబరాబాద్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.

హీరో రాజశేఖర్ కు మాతృవియోగం...

హైదరాబాద్: ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ మాతృమూర్తి ఆండాళ్ వరదరాజ్ (82) తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న ఆమె బుధవారం ఉదయం కన్నుమూశారు. మృతదేహాన్ని చైన్నైకి తరలించి, గురువారం ఉదయం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రాజశేఖర్ రెండో సంతానం.

 

మరోసారి ఆర్మీ సర్జికల్ దాడులు

జమ్మూకశ్మీర్ : మరోసారి ఆర్మీ సర్జికల్ దాడులు చేస్తోంది. మయన్మార్ సరిహద్దు ల్లో ప్రత్యేక దళాలులు దాడులు చేపట్టింది. నాగా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా సర్జికల్ స్ట్రైక్ కొనసాగిస్తోంది. భారత కమాండోలు సరిహద్దులు దాటలేదని ఆర్మీ స్పష్టం చేసింది. దాడుల్లో ఎవరూ గాయపడలేదని తెలిపింది.

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో మరణ మృదంగం:9మంది మృతి

అనంతపురం : ప్రభుత్వ ఆస్పతిలో దారుణం జరిగింది. గత అర్థరాత్రి 12 గంటల నుంచి ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. జ్వరంతో ఆరుగురు, కడుపు నొప్పితో ఇద్దరు, గుండె నొప్పితో మరొకరు మృతి చెందారు. ఆసుపత్రికి వచ్చిన రోజులను వైద్యులు పట్టించుకోవడం లేదు.

ఇసుక ట్రాక్టర్ ఢీ కొని బాలుడి మృతి

ఖమ్మం: మామిళ్ల గూడెంలో విషాదం నెలకొంది. ఇసుక ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి చెందాడు. ఇసుక ట్రాక్టర్ ను పోలీసులు వెంబడిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మెట్రో పనులను పరిశీలించిన టి.కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్: లక్డీకపూల్ మెట్రో రైల్ స్టేషన్ వద్ద ఉత్తమ్, జానా, షబ్బీర్, దానంలను పోలీసులు అడ్డుకున్నారు. మెట్రో పనులు పరిశీలించేందుకు కాంగ్రెస్ నేతలకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులతో కాంగ్రెస్ నేతల వాగ్వాదానికి దిగారు. సీపీ అనుమతితో మెట్రో పనులను నేతలు పరిశీలించారు.

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

వనపర్తి: ఖిల్లాఘన్ పూర్ మండలం మానాజీపేటలో విషాదం నెలకొంది. పిడుగుపాటకు ముగ్గురి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

నకిలీ స్వామిజీ అరెస్టు..

హైదరాబాద్ : నకిలీ స్వామిజీని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పిస్తోల్, రూ. 5 లక్షలు, 2 తులాల బంగారం, 5 కిలోల వెండి సామాగ్రీ, నకిలీ సీబీఐ ఐడీ కార్డు, కారులను రాచకొండ ఎస్ వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

చెరకు రైతు సంఘం నాయకుల అరెస్టు...

విశాఖపట్టణం : చోడవరం గోవాడ షుగర్స్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. చెరకు మద్దతు ధర పెంచాలని నష్టాలపై వివరణ ఇవ్వాలని రైతుల డిమాండ్ చేశారు. చైరకు రైతు సంఘం నాయకులను అరెస్టు చేసి చోడవరం పీఎస్ కు తరలించారు.  

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు విడుదల..

విజయవాడ : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు విడుదలయ్యాయి. రేపటి నుండి వరుస సెలవుల నేపథ్యంలో ముందుగానే జీతాలను విడుదల చేశారు. 

13:58 - September 27, 2017

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసులు చిరువ్యాపారులపై దౌర్జన్యం ప్రదర్శించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్నారన్న నెపంతో తోపుడు బళ్లను బలవంతంగా లాక్కెళ్లారు. చిరువ్యాపారులు వద్దని బతిమాలిన వినకుండా తోపుడు బళ్లను వాహనంలో తీసుకెళ్లారు. 

ఆసుపత్రికి దావూద్ సోదరుడు..

ముంబై : ఇటీవలే పట్టుబడిన దావూద్ సోదరుడు దావూద్ ఇబ్రహీం కస్కర్ ను సివిల్ ఆసుపత్రికి తరలించారు. మెడికల్ చెకప్ అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. 

13:46 - September 27, 2017

కృష్ణా : మచిలీపట్నం పోర్టు నిర్మాణం నేతల ఆర్భాటపు ప్రకటనకే పరిమితం అవుతోంది. రెండు దశాబ్దాలుగా ఈ ఓడరేవు నిర్మాణానికి మోక్షం లభించడంలేదు. శంకుస్థాపన శిలాఫకాలు ఎక్కిరిస్తున్నాయి. రెండు దశాబ్దాల నుంచి బందరు పోర్టు నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. కార్యాచరణకు నోచుకోని పథకంగా తయారైంది. చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రైన తర్వాత 1999-2004 మధ్య ఒకసారి దీని నిర్మాణానికి చర్యలు చేపట్టినా, స్థల వివాదంతో అప్పట్లో ఈ ప్రాజెక్టు కొలిక్కిరాలేదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2008 ఏప్రిల్‌ 23న పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడచిపోయిన తర్వాత కూడా పోర్టు ఆధారిత పారిశ్రాక నడవా అభివృద్ధి ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.

నిధులే పెద్ద సమస్యగా మారాయి...
మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి నిధులే పెద్ద సమస్యగా మారాయి. భూసేకరణే అవరోధంగా తయారైంది. వెయ్యి ఎకరాలు కాదు.. రెండు వేల ఎకరాలు కాదు... ఏకంగా లక్షా ఐదు వేల ఎకరాలు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో దిగొచ్చిన చంద్రబాబు సర్కారు ముందుగా 14,620 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే రెండసార్లు పెంచిన భూసేరకణ నోటిఫికేషన్‌ గడువును ఇప్పుడు తాజా మరో ఏడాది పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మరో 15 వేల ఎకరాల ప్రభుత్వ, ఎసైన్డ్‌ భూమి సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. భూసేకరణ నోటిఫికేషన్‌కు రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో సమీకరణను తెరపైకి తెచ్చారు. ఇప్పటి వరకు ఐదు వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూమిని స్వాధీనం చేసుకుని కాకినాడలో ఉన్న రాష్ట్ర ఓడరేవుల శాఖ డైరెక్టర్‌కు అప్పగించారు. మరో రెండువేల ఎకరాల పట్టా భూములు సమీకరణలో మాత్రం ఆశించిన పురోగతిలేదు.

పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వలేదు...
భూ సమీకణకు రైతులు ముందుకు రావడంలేదని గ్రహించిన ప్రభుత్వం... చట్టం ద్వారా సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే ఇందుకు 700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. నిధుల కొరత ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఈ మొత్తాన్ని భరించే శక్తిలేదు. దీంతో మళ్లీ భూ సమీకరణ ప్రక్రియను తెరపైకి తెస్తున్నారు. అయితే ఇప్పటికే రైతుల నుంచి సేకరించిన భూమికి పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ సమీకణరణకు పూనుకుంటే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో సేకరణ నోటిఫికేషన్‌ గడువును పెంచుకుంటూ పోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు చూసుకుని మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభిస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. పోర్టు కోసం భూమి సేకరించాలా.. లేక అమరావతి తరహాలో సమీకరించాలా.. అన్న అంశంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న ప్రభుత్వ వైఖరితోనే నిర్మాణంలో జాప్యానికి కారణమన్న విమర్శలు వినవస్తున్నాయి. 

నకిలీ విద్యార్హలతో..ఉద్యోగం..

విజయవాడ : నకిలీ విద్యార్హతలతో ఉద్యోగం చేస్తున్న ఆరుగురు వ్యవసాయ శాఖ అధికారులను ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేశారు. గత 15 ఏళ్లుగా వీరు విధులు నిర్వహిస్తున్నారు. ఈ కుంభకోణంలో మరింత మంది ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

13:34 - September 27, 2017

హైదరాబాద్: మెట్రో రైల్‌ పనులను తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌, జానా, షబ్బీర్‌, దానం‌, సర్వే సత్యనారాయణ పరిశీలించారు. సుల్తాన్‌ బజార్‌, మలక్‌పేట, అఫ్జల్‌గంజ్‌, లక్డీకపూల్‌,అమీర్‌పేటలో మెట్రో పనులను పరిశీలించారు.

 

13:05 - September 27, 2017

శ్రీవారి గరుడ సేవకు పోటెత్తిన భక్తులు...

తిరుమల: శ్రీవారి గరుడ సేవకు భక్తులు పోటెత్తారు. మాడవీధుల్లోని గ్యాలరీలు నిండిపోయాయి. గ్యాలరీల్లోకి వెళ్లలేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

పాపాయపేటలో చెరువులో పడి ముగ్గురి మృతి

వరంగల్ రూరల్ : చెన్నారావు పేట మండలం పాపాయపేటలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు బాలుర మృతదేహాలు లభ్యం కాగా, బాలిక కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.

అక్టోబర్ 3వ రైతు సత్యాగ్రహ దీక్ష :ప్రొ.కోదండరాం

హైదరాబాద్: అక్టోబర్ 3వ రైతు సత్యాగ్రహ దీక్ష చేపడతామని ప్రొ. కోదండరాం తెలిపారు. రైతు సమన్వయ సమితులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయితీలు బలపడాలన్నారు.

12:51 - September 27, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' తన తాజా చిత్రం 'స్పైడర్' తో ప్రేక్షకులు ముందుకొచ్చాడు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో 'మహేష్' సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' నటించింది. ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక అంశాన్ని మేళవించే మురుగదాస్ ఈ సినిమాలో ఎలాంటి అంశాన్ని స్ర్పశించరానేది కీలకంగా మారింది. 'బ్రహ్మోత్సోవం' డిజాస్టర్ అనంతరం 'మహేష్' నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం రెండు భాషల్లో తెరకెక్కడం విశేషం. చిత్ర విడుదలపై సోషల్ మాధ్యమాల్లో రివ్యూలు వచ్చేస్తున్నాయి.

మహేష్ ఈ సినిమాలో ఇంటిలిజెన్స్ ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగిగా నటించాడు. ఎవరు ఏడ్చినా..ఎవరు హెల్ప్ అని అరిచినా స్పందించేలా సొంతంగాఓ సాఫ్ట్ వేర్ ను కనిపెడుతాడు. ఈ నేపథ్యంలో ఓ కాల్ రావడం..ఆ కాల్ వచ్చిన అనంతరం కానిస్టేబుల్..యువతి హత్యకు గురి కావడం జరుగుతుంది. ఈ హత్యకు కారకులెవరు ? అనే దానిపై మహేష్ స్టడీ చేయడం..సైకో కిల్లర్ భైరవ (సూర్య) అని తేలుతుందని కథనాలు పేర్కొంటున్నాయి.

హీరో..విలన్స్ మధ్య వచ్చే సిన్నివేశాలు కట్టిపడేస్తాయని..ద్వితియార్థం కీలకమని తెలుస్తోంది. అయితే దర్శకుడు మురుగదాస్ తన గత చిత్రాల స్థాయిలో ప్రేక్షకులను కథలో లీనం చేయలేకపోయారని టాక్. కొన్ని సన్నివేశాలు..పతాక సన్నివేశాలు..హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దారు. విలన్ చేసే పనులు..అతను తలపెట్టిన ముప్పులనుండి కాపాడేందుకు హీరో చేసే పనులు ప్రేక్షకులకు కొంత విసుగుపాటు తెప్పిస్తాయని సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. చివరకు మురుగదాస్ చెప్పిన సందేశం కథకు ఏమాత్రం అతకలేదని టాక్.

మరి పర్ ఫెక్ట్ రివ్యూ చూడాలంటే టెన్ టివిలో ప్రసారమయ్యే 'నేడే విడుదల' కార్యక్రమంలో చూడండి...

కొత్త సచివాలయ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రజాభిప్రాయ సేకరణ

హైదరాబాద్: కొత్త సచివాలయ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రజాభిప్రాయ సేకరణ బ్యాలెట్ పత్రాల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. సచివాలయాన్ని మార్చాలనేది ప్రజావ్యతిరేక నిర్ణయం అని ఇపుడున్న సచివాలయాన్నే కొనసాగించాలని టి.పిసీసీ చీఫ్ ఉత్తమ్ డిమాండ్ చేశారు.

12:41 - September 27, 2017

అనంతపురం : తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వైసీపీ నేతల్లో మరికొందరు క్యూ కడుతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి కూడా అదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది. గుర్నాథరెడ్డి... చేరికకు పరిటాల సునీత కీలకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఈయన రాకపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వైపు నుంచి కూడా అభ్యంతరం లేదంటున్నారు. గుర్నాథ రెడ్డి సోదరుడు నారాయణ రెడ్డి గతంలో అనంతపురం ఎమ్మెల్యేగా పనిచేశారు.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్న రోజుల్లో అత్యంత ఆత్మీయ మిత్రునిగా ఉండేవారాయన., దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో కొనసాగిన బంధాన్ని.. వైఎస్‌ మరణంతో తెంచుకుని.. వైసీపీలో చేరారు నారాయణరెడ్డి, గుర్నాథరెడ్డి సోదరులు.

మిస్సమ్మ బంగ్లా కోసమే...
తెలుగుదేశం పార్టీపై మోజు, వైసీపీలో భవితవ్యంపై అనుమానం కంటే.. మిస్సమ్మ బంగ్లా కోసమే గుర్నాథరెడ్డి పసుపు కండువా కప్పుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది... కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో.. గుర్నాథరెడ్డి కుటుంబం బీఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ పేరుతో అనంతపురంలో 200 కోట్ల విలువైన మిస్సమ్మ బంగళా స్థలాన్ని కొనుగోలు పేరుతో ఆక్రమించుకుందనే ఆరోపణలున్నాయి. ప్రతిపక్షాలు దీనిపై గతంలో తీవ్రస్థాయిలో మండిపడ్డాయి కూడా.. చివరికి సీన్ కోర్టుకు చేరింది.. గుర్నాథరెడ్డి భూముల ఆక్రమణ వ్యవహారాన్ని ప్రస్తుత అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. దీంతో సీఎం చంద్రబాబు ఆ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించారు. దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు ఇది అక్రమమని తేల్చారు... దీనిపై న్యాయస్థానం గుర్నాథరెడ్డితోపాటు మరికొందరికి అరెస్టు వారెంట్లు కూడా జారీ చేసింది.

కేసు నుంచి తప్పించుకునేందుకే
ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే గుర్నాథరెడ్డి పార్టీ మారుతున్నారనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. దోషి అని తేలిన వ్యక్తిని పార్టీ మారుతున్నారని వెనుకేసుకోస్తే... ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని అనంతపురం టీడీపీ నేతల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అరెస్టు వారెంట్లు కూడా జారీ చేసిన గుర్నాథరెడ్డి టీడీపీలో చేరితే... టీడీపీ నైతికత కూడా కచ్చితంగా ప్రశ్నించాల్సిన అంశమే. మరోవైపు మొన్నటి నంద్యాల ఉప ఎన్నికల వేళ టీడీపీ విజయంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కీలక పాత్ర పోషించారు. అలాంటి ప్రభాకర్‌ చౌదరిని పరిగణలోకి తీసుకోకుండా.. గుర్నాథరెడ్డిని పార్టీలో ఎలా చేర్చుకుంటారనే దానిపై కూడా చర్చ సాగుతోంది. 

ఏపీలో డీఎస్సీ నిర్వహణపై విద్యాశాఖ కసరత్తు

అమరావతి: డీఎస్సీ నిర్వహణపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది ఉపాధ్యాయుల భర్తీకి చర్చలు, జిల్లాల వారీ ఖాళీల వివరాలను పంపాలని డీఈవోలకు విద్యాశాఖ ఆదేశించింది. ఈ ఏడాది జూన్ 1 వరకు ఉన్న ఖాళీలతో పాటు రాబోయే మూడేళ్లలో పదవీ విరమణ చేయనున్న వారి అదజేయాలని ఆదేశించారు.

12:36 - September 27, 2017

విశాఖ : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని.. విశాఖ ఆర్‌కే బీచ్‌లో భారీ ర్యాలీ జరిగింది. జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్ కుమార్‌, ఉడా వీసీ ఉన్నతాధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్కే బీచ్‌ నుంచి వైఎస్సార్‌ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఇవాళ్టి నుంచి బీచ్‌ రోడ్డులో విశాఖ ఉత్సవ్‌ పేరుతో టూరిజం డేను వారం రోజుల పాటు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. టూరిజం పరంగా విశాఖ అంతర్జాతీయంగా ఖ్యాతిని ఆర్జించిందని.. మరిన్ని టూరిజం ప్రాజెక్ట్‌లను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. 

12:35 - September 27, 2017

చిత్తూరు : తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ రాత్రి శ్రీవారు తిరుమాడవీధుల్లో గరుడవాహనంపై ఊరేగనున్నారు. గరుడవాహన సేవను తిలకించేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకున్నారు. దీంతో టీటీడీ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గరుడవాహన సేవ భద్రతకు సంబంధించి డీఐజీ ప్రభాకర్‌ రావు టెన్ టివితో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ

అమరావతి: కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ఏపీకి మరో 5 టీఎంసీల నీరు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ఆరుగురు వ్యవసాయ శాఖ అధికారులు సస్పెండ్

విజయవాడ: నకిలీ విద్యార్హతలతో ఉద్యోగం చేస్తున్న ఆరుగురు వ్యవసాయ శాఖ అధికారులు సస్పెండ్ అయ్యారు. నకిలీ సర్టిఫికేట్లతో 15 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ జీతాలు తీసుకుంటున్నట్లు నిర్ధారణకొచ్చారు. ఈ కుంభకోణంలో మరికొంత మంది ఉన్నట్లు అనుమానం. సమగ్ర విచారణకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.

12:24 - September 27, 2017

గుంటూరు : ప్రకాశం జిల్లా కనిగిరి అత్యాచారయత్నం ఘటనపై సీఎం చంద్రబాబ సీరియస్ గా స్పందించారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిని ఆయన ఆదేశించారు. సీఎం ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. పోలీసులు ఇప్పటికే నిందితులపై నిర్భయ చట్టం, అత్యాచారయత్నం కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

సీఆర్డీఏ వారాంతపు సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి: సచివాయలంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ వారాంతపు సమీక్ష సమావేశం నిర్వహించారు.

12:14 - September 27, 2017

టాలీవుడ్ లో సినిమాల జోరు మొదలయింది. కొత్తగా వస్తున్న పోటీ ని తట్టుకోడానికి హీరోలు సిద్ధం అవుతున్నారు .ఎవరు ఎన్ని చేసిన కొత్త టాలెంట్ ని ఎవరు ఆపలేరు. అలానే సినిమాల విషయంలో చాల జాగర్తగా మెగా హీరో జాగ్రతత్తగా ఉంటున్నాడు. సినిమాలు వరసగా చేస్తూ హిట్, ఫ్లాప్ లను పట్టించుకోవడం లేదు అల్లు అర్జున్. డి జె సినిమా తో అయోమయంలో పడిపోయాడు మెగా హీరో అల్లు అర్జున్. సినిమాల విషయం లో పక్కాగా ఉండే అల్లు అర్జున్ డి జె సినిమా విషయం లో డైరెక్టర్ ని పూర్తి గ నమ్మెడు . పాత చింతకాయ కధలను కొత్త కధల్లా చూపించే డైరెక్టర్స్ ఉన్న ఈ రోజుల్లో అల్లు అర్జున్ నమ్మకం వమ్ము అయింది అని ఫిలిం నగర్ వాసులు అనుకుంటున్నారు .హీరోయిన్ అందాలు , అల్లు అర్జున్ ఎనేర్జి యాక్టింగ్ కలిసి డి జె సినిమా ని మాస్ కి దగ్గర చేసాయి .

అల్లు అర్జున్ ప్రెసెంట్ షూటింగ్ జరుపుకుంటున్న సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా .వక్కంతం వంశి డైరెక్టర్ గా వస్తున్న ఈ సినిమా చాల స్పీడ్ గ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెగా అభిమానుల్ని అలరించేందుకు బన్నీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎంటెర్టైనేమేంట్ హారర్ ఫీల్ లో వచ్చిన సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా ఈ సినిమాలతో డీసెంట్ హిట్స్ కొట్టిన విఐ ఆనంద్ డైరెక్షన్ లో నటించేందుకు బన్నీ తాజాగా అంగీకరించాడు .బన్నీ స్పీడ్ తో సినిమా పండగ రాబోతుంది అని ఆడియన్స్ అనుకుంటున్నారు 

జపాన్ లో భారీ భూకంపం...

టోక్యో: జపాన్‌లో ఈ రోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. పెసిఫిక్‌ తీర ప్రాంతంలోని అమోరీ లో రిక్టర్‌ స్కేల్‌పై 6 తీవ్రతతో భూమి కంపించింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 23న జపాన్‌ రాజధాని టోక్యోలో భూప్రకంపనలు సంభవించాయి. 2011లో అమోరీలోనే భారీ భూకంపం సంభవించి సునామీ వచ్చింది.

11:31 - September 27, 2017
11:24 - September 27, 2017

ఆదిలాబాద్ : ఎంపీ నాగేష్ ఇంట్లో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు రూ.15లక్షల విలువ చేసే నగలు, నగదును చోరీ చేశారు. చోరీపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

ఢిల్లీ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ఢిల్లీ: తెలంగాణ భవన్ లో ఘనంగా స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ 102వ జయంతి వేడులు జరిగాయి. బాపూజీ చిత్ర పటానికి తెలంగాణ భవన్ సహాయ కమిషనర్ రామ్మోహన్, అధికారులు పూలమాలు వేసి నివాళులర్పించారు.

11:19 - September 27, 2017

విశాఖ : జిల్లాకేంద్రంలోని భీమిలీ ఎమ్మార్వో ఆఫీసు దగ్గర ఓ ఆటోను తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు, మరో ఆరుగురికి గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరు చిన్నారు పరిస్థితి వషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. తుఫాన్ వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

11:18 - September 27, 2017

గల్ఫ్ పంపిస్తానంటూ భారీ డబ్బులు వసూలు చేసిన మహిళ

సిరిసిల్ల : ప్రమీల అనే మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. గల్ఫ్ పంపిస్తానంటూ వీసా, పాస్ పోర్టుల కోసం నిరుద్యోగుల నుంచి ప్రమీల రూ. లక్ష వసూలు చేసింది. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. జననీ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ పేరుతో సిరిసిల్ల జగిత్యాల, వేములవాడల్లో పెద్ద ఎత్తున ప్రమీల మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

నవరాత్రి ఉత్సవాలు జరపడం ఆనందంగా ఉంది:చంద్రబాబు

అమరావతి: నవరాత్రి ఉత్సవాలు జరపడం ఆనందంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రం కోసం స్వచ్ఛతే సేవ అని సంకల్పించానని, స్మార్ట్ వాటర్ గ్రిడ్ రావాలని సంకల్పం చేశానన్నారు. స్మార్ట్ పవర్ గ్రిడ్ ద్వారా కరెంట్ ఛార్జీలు తగ్గవచ్చు అని ఏపీని నాలెడ్జ్ స్టేట్ గా తయారు చేయమని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. పోలవరంకు డబ్బులు రాకుండా ఢిల్లీలో అడ్డుపడుతున్నారని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి రూ. 42వేల కోట్లు కావాలన్నారు. దుష్ట శక్తులు పోలవరంను అడ్డుకోకుండా చూడాలని అమ్మవారిని కోరినట్లు పేర్కొన్నారు.

10:41 - September 27, 2017

తెలుగు చలన చిత్ర సత్తా ఏంటో పలు చిత్రాలు చూపిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన 'బాహుబలి', 'బాహుబలి 2' చిత్రాలు అంతర్జాతీయ ఖ్యాతీని సంపాదించి పెట్టాయి. మరికొన్ని చిత్రాలు అత్యధికంగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ లో ప్రముఖుల చిత్రాలు రిలీజ్ కావడం..అత్యధికంగా కలెక్షన్లు సృష్టించడం..వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం పరిపాటైంది. ఇప్పుడు టాలీవుడ్ చిత్రాలు కూడా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోతున్నాయి.

యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' నటించిన 'జై లవ కుశ' కూడా రికార్డులు సృష్టిస్తోంది. బాబీ దర్శకత్వంలో 'కళ్యాణ్ రామ్' నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఏకంగా ఎన్టీఆర్ మూడు పాత్రలను పోషించడంతో ఉత్కంఠ పెరిగింది. సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఉండడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. గత గురువారం విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 75 కోట్లు రాబట్టడం విశేషం. ఇక వారం రోజుల్లోనే ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఎన్టీఆర్ కెరీర్ లో రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరడం మూడో చిత్రంగా పేర్కొనవచ్చు. ఆయన నటించిన 'జనతా గ్యారేజ్', 'నాన్నకు ప్రేమతో' సినిమాలు ఆ క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే.

వంద కోట్ల క్లబ్ లోకి చేరడం పట్ల నిర్మాత 'కళ్యాణ్ రామ్' సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులందరికీ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియచేశారు. 'ప్రపంచంలోని తెలుగు చిత్ర అభిమానులు అందరికీ ధన్యవాదాలు' అంటూ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి. 

బాసర దేవాలయానికి పోటెత్తిన భక్తజనం

బాసర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర చదువుల తల్లి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు అమ్మవారి మూలా నక్షత్రం కావడంతో భక్తులు బాసరకు పోటెత్తారు. ఒక్క రోజు ముందుగానే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. సరస్వతి అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రాత్రి 2 గంటల నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి ఆలయంలో బారులు తీరారు. వేదపండితులు వేకువజాము నుంచి అమ్మవారికి సరస్వతి వేదపారాయణం నిర్వహించి మహా హారతి ఇస్తున్నారు. చిన్నారుల అక్షరాభ్యాసం ఉదయం 5 గంటల నుంచే ప్రారంభమైంది.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత...

సూర్యాపేట: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో చోటుచేసుకుంది. మేళ్లచెరువు నుంచి గుంటూరుకు లారీలో 150 క్వింటాళ్ల రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నారు. సోదాల సందర్భంగా అక్రమ రవాణాను గుర్తించిన పోలీసులు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

10:35 - September 27, 2017

దసరా...తెలంగాణలో అతి పెద్ద పండుగ. దీనితో సొంతూళ్లకు వెళ్లేందుకు జనాలు బయలుదేరుతున్నారు. రైల్వే స్టేషన్ లు..బస్ స్టేషన్ లన్నీ జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ, రైల్వే స్టేషన్ లు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. స్కూళకు ముందుగానే దసరా సెలవులు ఇచ్చేయడం...ప్రభుత్వ ఉద్యోగులు..ఇతరులకు కూడా సెలవులు రావడంతో కుటుంబసభ్యులతో గడిపేందుకు మక్కువ చూపుతున్నారు. మొత్తంగా ఐదు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. దసరాతో పాటు కలిసొచ్చిన ఆదివారం..ఆపై గాంధీ జయంతి..దీనితో పెట్టాపేడా సర్దుకుని ఛలో సొంతూరికి అంటూ వెళ్లిపోతున్నారు.

కొంతమంది ముందుగానే ప్లాన్స్ వేసుకుని మరీ బయలుదేరుతున్నారు. ఏకంగా లక్షల మంది హైదరాబాద్ నగరం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. దీనితో సిటీ సగం బోసిపోయినట్లైంది. ఇక ఆర్టీసీ..రైల్వే ఛార్జీలు కూడా అదనపు ఛార్జీల పేరిట ప్రజల జేబులు చిల్లు చేసే పనిలో పడిపోయాయి. ఎంతమంది నగరం నుండి వెళ్లారో..అంతమంది బుధవారం తిరుగు ప్రయాణమౌతారు. అప్పుడు జాతీయ రహదారులన్నీ కిక్కిరిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోలు హతం..

ఒడిశా: బారాఘర్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు హతం కాగా, వారి వద్ద నుండి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

ఆగివున్న ఆటోను ఢీ కొట్టిన టాటాఫోర్స్ వాహనం:ఇద్దరి మృతి

విశాఖ: భీమిలి తహశీల్దార్ ఆఫీస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్ లు ఫెయిల్ అయి ఆగివున్న ఆటోను టాటాఫోర్స్ వాహనం ఢీ కొట్టింది. ఇద్దరు ప్రయాణీకులు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.

గంగవరం పోర్టులో ప్రమాదం: ఇద్దరి మృతి

విశాఖ: గంగవరం పోర్టులో ప్రమాదం జరిగింది. షిప్ లోకి ఐరన్ రాడ్లు లోడ్ చేస్తుండగా క్రేన్ గొలుసులు తెగి కార్మికులపై ఇనుపరాడ్లు పడటంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పింన సీఎం దంపతులు

విజయవాడ: ఇంద్రకీలాద్రి పై సర్వస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను సీఎం చంద్రబాబు దంపతులు దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం కు పూర్ణ కుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. చంద్రబాబుతో పాటు మంత్రులు మాణిక్యాలరావు, దేవినేని ఉమ, ఎంపి కేశనేని నాని అమ్మవారిని దర్శించుకున్నారు.

భూత్పూర్ ఆర్డీవో, తహశీల్దార్ లపై కేసు నమోదు

మహబూబ్ నగర్ : భూత్పూర్ ఆర్డీవో లక్ష్మీనారాయణ తహశీల్దార్ జ్యోతిలపై పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. సాదాబైనామాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.

ఎంపి నగేష్ ఇంట్లో చోరీ

ఆదిలాబాద్: ఎంపి నగేష్ ఇంట్లో చోరీ జరిగింది. రూ.15 లక్షల విలువైన బంగారం, రూ.10 లక్షల విలువైన సామాగ్రిని దొంగలు ఎత్తికెళినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు. పీఎస్ లో కేసు నమోదు అయ్యింది.

 

10:05 - September 27, 2017

16 ప్రైవేటు బస్సులకు జరిమాన..

రంగారెడ్డి : శంషాబాద్ కిషన్ గూడ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 16 ప్రైవేటు బస్సులకు జరిమాన విధించారు. ఆరు బస్సులను అధికారులు సీజ్ చేశారు. 

గంగవరం పోర్టులో కార్మికుల మృతి..

విశాఖపట్టణం : గంగవరం పోర్టులో ప్రమాదం ఏర్పడింది. షిప్ లోకి ఇనుప రాడ్లు లోడ్ చేస్తుండగా క్రేన్ గొలులు ఒక్కసారిగా తెగిపడ్డాయి. దీనితో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

ఇంద్రకీలాద్రిపై బాబు దంపతులు..

విజయవాడ : ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు చేరుకున్నారు. సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి బాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు బాబు దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

09:18 - September 27, 2017

గంగవరం పోర్టులో ప్రమాదం

విశాఖ : గంగవరం పోర్టులో ప్రమాదం జరిగింది. షిప్ లోకి ఐరన్ రాడ్లు లోడ్ చేస్తుండగా క్రేన్ గొలుసులు తెగడంతో ఇనుప రాడ్లు కార్మికులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించారు. 

ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

భువనేశ్వర్ : ఒడిశాలోని నెర్ గుండి స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 16 బోగీలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. 

08:51 - September 27, 2017

నల్లగొండ : జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు అంబరాన్నంటాయి. వాడవాడలా బతుకమ్మ ఆటపాటలతో పల్లెల్లో సందడి నెలకొంది. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ప్రతీ రోజు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో జిల్లా పరిషత్ సీఈవో హనుమా నాయక్‌, స్త్రీ శిశు సంక్షేమ ఆర్గనైజర్ శరణ్యా రెడ్డి, ఎంపీపీ రజిత, డిప్యూటీ డైరెక్టర్‌ సంగీత లక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు. 

08:50 - September 27, 2017

రంగారెడ్డి : సరదాకి ఆడిన కబడ్డీ ఆట ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. చిన్న గొడవ పెద్దదిగా మారి ఒకరు మృతి చెందిన సంఘటన.. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం, ముచింతల్‌లో చోటు చేసుకుంది. ముచింతల్ గ్రామంలో నివాసముండే మీసాల నరసింహకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు మల్లేశ్‌ ఉన్నారు. మల్లేశ్ దసరా సెలవులు కావడంతో అరుణ్‌ అనే అబ్బాయితో.. కబడ్డీ ఆడాడు. అయితే గొడవ జరిగి అరుణ్‌ మల్లేశ్‌ మెడపై కొటట్డంతో స్పృహ కోల్పోయాడు. దీంతో మల్లేశ్‌ను ఆసుపత్రికి తరలించారు. మల్లేశ్‌ చనిపోయాడని తెలుసుకున్న అరుణ్‌ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మల్లేశ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

08:48 - September 27, 2017

ఢిల్లీ : ఆప్గనిస్తాన్‌కు భారత సైనికులను పంపే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. అభివృద్ధి, వైద్య సేవలకు తదితర రంగాల్లో ఆఫ్గనిస్తాన్‌కు భారత్‌ సహాయం చేస్తుందని తెలిపారు. మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్‌ మ్యాటీస్- రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటి అయ్యారు. ఉగ్రవాదం తదితర అంశాలపై చర్చించారు. అనంతం సంయుక్త మీడియా సమావేశంలో ఇరువురు నేతలు మాట్లాడారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్వర్గధామాలు సహించరాదని ఇరుదేశాలు అంగీకారానికి వచ్చినట్లు సీతారామన్‌ తెలిపారు. ఒకవేళ జేమ్స్‌ మటిస్‌ పాకిస్థాన్‌లో పర్యటిస్తే, ఆ దేశంలో ఉగ్రవాద సురక్షిత స్థావరాలు, సరిహద్దుల ఆవలి నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద సమస్యలను లేవనెత్తాలని కోరినట్లు ఆమె తెలిపారు. ఉగ్రవాదంతో భారత్‌, అమెరికాలు నష్టపోయాయని, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని జేమ్స్‌ చెప్పారు. ఉగ్రవాదం ప్రపంచానికి ముప్పుగా పరిణమించిందని జేమ్స్‌ అన్నారు.

08:47 - September 27, 2017

హైదరాబాద్ : మాట‌లు కోట‌లు దాటుతున్నాయి.చేత‌లు మాత్రం గ‌డ‌ప‌దాటడం లేదు. మరో ఏడాదిలో నగరంలోపూర్తిస్థాయిలో మెట్రో పరుగులు మొదలవుతాయని.. ఊరిస్తున్న ప్రభుత్వం. అసలు విషయాన్ని మరిచింది. వచ్చే నవంబర్‌ చివరి నాటికి మెట్రో పరుగులు మొదలవుతాయని చెబుతున్నా.. ఆయా స్టేషన్ల దగ్గర పార్కింగ్‌ సమస్య వెక్కిరిస్తోంది. ఇంతవరకు వాహనాలు నిలిపేస్థలాలను మెట్రోఅధికారులు గుర్తించనేలేదు. న‌గ‌రంలోని మూడు కారిడార్‌లలో 72కిలో మీట‌ర్ల మేరా మొత్తం 66 మెట్రో స్టేషన్ల నిర్మాణం జరుగుతోంది. వీటిలో 50 ప్రాంతాల్లో పార్కింగ్‌ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఇక వచ్చే న‌వంబ‌ర్లో 29 కిలోమీట‌ర్ల మేర మెట్రో ప్రారంభించనున్న మార్గంలో కూడా 24 మెట్రో స్టేషన్‌లు ఉన్నాయి. వీటిలో చాలా స్టేష‌న్లు ఇప్పటికే పూర్తయినా పార్కింగ్‌కు ఎర్పాటుట్లు మాత్రం కనిపించడంలేదు. రెండేళ్ల క్రితమే పూర్తయిన నాగోల్ మెట్టుగుడా ... ఎడాది క్రితం పూర్తైన ఎస్ ఆర్ న‌గ‌ర్ - మియాపూర్ మార్గంలో కూడా పార్కింగ్ ఏర్పాట్లు జరగలేదు.

అమీర్‌పేట నుంచి మియాపూర్‌ వరకు 11మెట్రో స్టేషన్లు
అమీర్‌పేట నుంచి మియాపూర్‌ వరకు 11మెట్రో స్టేష న్లు ఉండగా మియాపూర్‌, జేఎన్‌టీయూ, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, బాలానగర్‌, మూసాపేట, భరత్‌నగర్‌, ఎర్రగడ్డ, ఇఎస్‌ఐ ఆస్పత్రి, ఎస్సార్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. కాని మియాపూర్‌, భరత్‌నగర్‌ స్టేషన్‌లు మినహా మిగతా చోట్ల పార్కింగ్‌ సౌకర్యం సరిగా లేదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అమీర్‌పేటలో ఇంటర్‌చేంజ్‌ స్టేషన్‌ వద్ద పార్కింగ్‌ స్థలం అందుబాటులో ఉన్నా కూడా ఇప్పటికీ దీనిని డెవ‌ల‌ప్‌మెంట్ జరగలేదు. ఇక కారిడార్ త్రీ లో నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు మెట్రో త‌న స‌ర్వీసుల‌ను నడపాలని నిర్ణయించింది. అయితే ఈ మార్గంలో 2015 ఉగాది నాటికి నాగోల్‌, ఉప్పల్‌, సర్వే ఆఫ్‌ ఇండియా, ఎన్‌జీఆర్‌ఐ, హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడ స్టేష‌న్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం సికిందాబ్రాద్‌ రైల్వే స్టేషన్‌, ప్యాట్నీ స్టేషన్‌, ప్యారడైజ్‌, రసూల్‌పుర చౌరస్తా, బేగంపేట షాపర్స్‌ స్టాప్‌, బేగంపేట రైల్వే స్టేషన్‌, అమీర్‌పేట ఇంటర్‌ చేంజ్ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. కాని ఇక్కడ పార్కింగ్ సౌక‌ర్యాలు మాత్రం సరిగా లేవు.

సైకిళ్లను అందుబాటులోకి
ప‌ర్యావ‌ర‌ణ హితంగా ఉండేలా సైకిళ్లను అందుబాటులోకి తెస్తామ‌ని ప్రభుత్వం చెబుతున్నా... వాటికి కూడా పార్కింగ్‌ స్థలం అవ‌స‌రం అవుతుంది. ఆయా స్టేషన్ల ద‌గ్గర ప్రాంతాల నుంచి వేలాది మంది మెట్రో రైలును వినియోగించే అవకాశం ఉంది. ఇలా రద్దీగా ఉండే ఏరియాల్లోనే పార్కింగ్‌ స్థలాల సమస్యతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకాలు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం, మెట్రో అధికారులు పార్కింగ్‌స్థలాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని హైదరాబాద్‌ పబ్లిక్‌ అంటున్నారు. 

08:45 - September 27, 2017

కృష్ణా : బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రోజుకో రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు.. ఆరోరోజు మహాలక్ష్మీరూపంలో భక్తులను కరుణించింది. భారీగా సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కనకదుర్గమ్మకు కుంకుమార్చనలు చేశారు. ఇవాళ అమ్మవారు సరస్వతీదేవిగా కనిపించనున్నారు. మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

08:44 - September 27, 2017

విజయవాడ : ఐదువందల కోట్ల రూపాయలకు పైగా అక్రమార్జన చేసి అవినీతి సామ్రాజ్యాన్ని నెలకొల్పి సంచలనం రేపిన గొల్ల వెంకట రఘు కేసు విచారణలో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి...రఘు సాదా సీదాగా కన్పించినా అతనిలో మాత్రం అనేక కోర్కెలు దాగున్నాయని తెలుస్తోంది....త్వరలోనే పదవీ విరమణ చేయబోతున్న రఘు తన రిటైర్మెంట్‌ వేడుకలు మర్చిపోలేని విధంగా ఏర్పాట్లు చేయాలనుకున్నాడు...అందుకు తన దగ్గరి బంధుమిత్ర సపరివారంగా విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది...ఇందు కోసం సింగపూర్‌, మలేషియా, హాంకాంగ్‌లకు ఫ్లైట్‌ టికెట్లు బుక్కింగ్ చేశాడు.ఏపీ టౌన్,కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్‌ రఘు అక్రమాలపై ఇప్పటికే సుమారు 500 కోట్ల ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు.. ఇంకా శోధిస్తూనే ఉన్నారు...ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో ఆరా తీస్తున్నారు.

రఘు పేరుతో సప్తరుషివనం
మరో వైపు గన్నవరంలోని భార్గవీనగర్‌లో రఘు పేరుతో సప్తరుషివనంను ఏర్పాటు చేసుకున్నాడు. సప్తరుషివనంలో భారీగా పిరమిడ్లు కూడా ఉన్నాయి. ఈ పిరమిడ్ల కింద విలువైన వస్తువులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.అక్రమంగా డబ్బు సంపాదించి దొరికిపోయిన రఘ, శివప్రసాద్‌లను ఏసీబీ అధికారులు విశాఖ,విజయవాడ కోర్టుల్లో హాజరుపర్చారు...మరోవైపు శివప్రసాద్‌ నివాసంలో రెండో రోజు కూడా సోదాలు జరిగాయి...పలు డాక్యుమెంట్లు, నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. శివప్రసాద్ సతీమణి గాయత్రిని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రఘు బినామీలు, వారి ఆస్తుల వివరాలపై తమకు ఇంకా సమాచారం అందుతోందని, వాటిపై కూడా దాడులు చేయనున్నట్లు తెలుస్తోంది.

08:42 - September 27, 2017

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన లీడర్లు ఎందరో ఉన్నారు.. కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా.. ఆయాపార్టీల్లో కీలక వ్యక్తులుగా పనిచేసిన అనుభం వీరి సొంతం. అయినా.. ప్రస్తుత పాలిటిక్స్‌లో తమ రాజకీయ భవిష్యత్తుపై చాలా మంది సీనియర్‌నేతలు సందిగ్ధంలో పడిపోయారు. కొండ్రు మురళి... కాంగ్రెస్ పార్టిలో ఎచ్చెర్ల, రాజాం ఎస్సి రిజర్వు స్థానం నుండి రెండు సార్లు గెలిచిన కొండ్రు ..కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పార్టీ కష్టాల్లో ఉన్నా.. అందరినేతల్లా పూటకో పార్టీకండువా మార్చలేదు. అయినా ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గాలేరు.

ఎమ్మెల్యేగా పోటిపడి ఓటమి
గతంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణి, వైఎఎస్‌ఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఓవెలుగు వెలిగిన ధర్మాన ప్రసాదరావు, ఇక గతఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా పోటిపడి ఓటమి చెందిన గుండా లక్ష్మీదేవి..వీరంతా ప్రస్తుతం తమ రాజకీయ భవిష్యత్తుపై సందిగ్ధంలో ఉన్నారు. టిడిపి నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన మాజీ మంత్రి గుండా అప్పలసూర్య నారాయణ.. సిన్సియర్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్నారు. కాని ప్రస్తుతం పార్టీలో అంతగా ప్రాధాన్యత దక్కడంలేదన్న అసంతృప్తిలో ఉన్నారు. ఇక నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిభా భారతి ప్రస్తుతం పాలిటక్ట్స్‌లోయాక్టివ్‌గా లేరు. అలాగే మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, రెండు సార్లు పార్టీలు మారి ప్రస్తుతం టీడీపీలో ఉన్న బగ్గు లక్ష్మణరావు రాజకీయంగా సైలెంట్‌ ఆయ్యారు.

రాజకీయ ప్రతికూలత
ఇక నాలగులుసార్లు ఎమ్మెల్యేలగా గెలిచి.. టీడీపీ నుంచి ప్రజారాజ్యంపార్టీలోకి వెళ్లి, ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న తమ్మినేని సీతారాం ప్రజెంట్‌ పాలిటిక్స్‌లో ప్రతికూలత ఎదుర్కొంటున్నారు. అటు పలాసలో మంచి పట్టున్న నాయకునిగా పరపతిని సంపాదించిన కణితి విశ్వనాధం కాంగ్రెస్, వైకాపా, జై సమైక్యాంధ్ర పార్టీలు మార్చి ప్రస్తుతం బిజెపి లోకి వెళ్ళారు. దీంతో ఈయన ప్రజల విశ్వసనీయత కోల్పోయారనే అభిప్రాయాలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నపుడు ప్రజలను విస్మరించడం.. అవకాశాన్ని బట్టి పార్టీలు మార్చడం..వల్లే శ్రీకాకుళం జిల్లాలో పలువురు సీనియర్లు ప్రస్తుతం రాజకీయ ప్రతికూలత ఎదుర్కొంటున్నారనే అభిప్రాయాలు స్తున్నాయి. ప్రజల బాగోగులు పట్టని ఏ నేత అయినా .. రాజకీయాల్లో ప్రాభవం కోల్పోక తప్పదని సిక్కోలు ప్రజలు అంటున్నారు. 

08:41 - September 27, 2017

హైదరాబాద్ : జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్న రేంజ్‌లో కనిపిస్తోంది ఇక్కడ హడావిడి చూస్తే.. కానీ ఇక్కడ జరుగుతున్నది ప్రజా బ్యాలెట్. బైసన్ పోలో గ్రౌండ్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్న సీఎం కేసీఆర్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. ఇలా ప్రజలతో ఓటింగ్ నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనం ఓటేసి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ బైసన్‌ పోలో గ్రౌండ్‌లో కొత్తగా సచివాలయాన్ని నిర్మించాలన్న కేసీఆర్ ప్రతిపాదనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటివరకు నిరసనలు, ఆందోళనలు, ప్రెస్ మీట్లతో పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. ఇక ఈ విషయంలో పూర్తి స్ధాయి యుద్ధానికి సిద్ధమయ్యారు. కొత్త సచివాలయంపై ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రజా బ్యాలెట్‌ను నిర్వహించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు వీహెచ్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. చార్మినార్‌ నుండి పటాన్ చెరువు వరకు.. బైసన్ పోలో గ్రౌండ్‌ నుంచి టోలీ చౌకీ వరకు 20 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా
సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు ఓటు వేయగా.. టోలిచౌకీ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా బ్యాలెట్‌లో మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఓటేసారు. తన కొడుకును సీఎం చేసేందుకు వాస్తు అడ్డు వస్తుందనే కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకుంటున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. కొత్త సచివాలయ నిర్మాణం వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని వీహెచ్ విమర్శించారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇలా సచివాలయంపై నిర్వహించిన ప్రజా బ్యాలెట్ ఓట్లను బుధవారం ఉదయం 10 గంటలకు సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో లెక్కించనున్నారు. కాంగ్రెస్ నిర్వహించిన ప్రజా బ్యాలెట్‌లో తీర్పు ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది. 

08:40 - September 27, 2017

హైదరాబాద్ : అధికారపార్టీనేతలు, ప్రజాప్రతినిధుల అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. మీడియా సాక్షిగా నేతల అసలు రూపం జనం ముందుకు వస్తోంది. లీడర్లు ఆదర్శవంతంగా ఉండాలన్న ముఖ్యమంత్రి హితవులును బూడిదలోపోసిన పన్నీరు చందంగా మారుతున్నాయి. శాసనసభా పక్ష సమావేశాలు జరిగిన ప్రతిసారి సిఎం కెసిఆర్ నైతికపాఠాలతో దిశా నిర్దేశం చేస్తున్నా .. నేతల అవినీతి బాగోతాలు బయటపడుతూనే ఉన్నాయి. అధికారులు- అధికారపార్టీ ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం ఎప్పటికప్పుడు బయటపడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యవహారం మరువక ముందే ..తాజాగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ కబ్జాల బాగోతం బయటపడింది.

ఎమ్మెల్యే భూ కబ్జా
ఎమ్మెల్యే భూ కబ్జా బాగోతాన్ని మీడియాసాక్షిగా కలెక్టర్‌ దేవసేన బయటపెట్టారు. పైగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కబ్జాల వ్యవహారం ఉప ముఖ్యమంత్రికి కూడా తెలుసని కలెక్టర్‌ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ప్రజాప్రతినిధుల బండారాన్ని అధికారులే బయటపెడితే.... పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఘటనే అద్దం పడుతోంది. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం దూమారం రేపే అవకాశం కనిపిస్తోంది. కాగా దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలా స్పందిస్తారో అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. 

08:38 - September 27, 2017

ఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు నిధులు, తిరుమల శ్రీవారి టికెట్లపై జీఎస్టీ ఎత్తివేత, రాష్ట్రం ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటు భర్తీ, ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు జీఎస్టీ నుంచి మినహాయింపు వంటి అంశాలపై చర్చించారు. అరుణ్‌ జైట్లీతో చంద్రబాబు భేటీలో పోలవరం ప్రాజెక్టు నిధుల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. మూడువేల కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభించిన ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు 58 వేల 100 కోట్లకు చేరుకున్న విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్రానికి పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణం కల్పించాల్సి రావడంతో అంచనా వ్యయం పెరిగిన విషయాన్ని వివరించారు. సవరించిన అంచనాల ప్రకారం నిధులు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

జైట్లీ సుముఖత
పోలవరం కోసం ఇప్పటి వరకు చేసిన వ్యయం వివరాలు, కేంద్ర ఇచ్చిన నిధులు, ఇంకా విడుదల చేయాల్సి ఉన్న బకాయిలపై కూడా చంద్రబాబు, అరుణ్‌ జైట్లీ చర్చించారు. ఇప్పటి 12,294.40 కోట్ల రూపాయల ఖర్చు చేస్తే కేంద్రం 4,329 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మిగిలిన నిధులను కూడా విడుదల చేయాలని కోరారు. ఏపీ ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటును భర్తీ చేయాలని చంద్రబాబు కోరగా, అరుణ్‌ జైట్లీ సానుకూలంగా స్పందించారు. అలాగే తిరుమల శ్రీవారి టికెట్లపై జీఎస్టీ ఎత్తివేతకు జైట్లీ సుముఖత వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరగా, వస్తు సేవల పన్ను కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జైట్లీ హామీ ఇచ్చారు. మరోవైపు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వచ్చే నెల 3న పోలవరం ప్రాజెక్టును సందర్శించి, జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించనున్నారు. 

07:44 - September 27, 2017

పోలవరం అనేది మనకు తీరని కోరికల మిగిలిందని ప్రాజెక్టును హడవిడిగా కాకుండా జాగ్రత్తగా నిర్మించాలని, పోలవరం ఎస్టీమెట్ చాలా పెరిందని, రాజకీయా లబ్ది కోసం ప్రభుత్వం తొందరపడుతోందని కాంగ్రెస్ నేత జివి రెడ్డి అన్నారు. పోలవరం అనేది మేజర్ ప్రాజెక్టు అని, డ్యామ్ కట్టడానికి చాలా అడ్డంకులు వస్తాయని, ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతి వారం సమీక్షిస్తున్నారని, పోలవరాన్ని ఎలక్షన్ కోసం నిర్మిస్తున్నది కాదని టీడీపీ నేత చందు సాంబశివరావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:43 - September 27, 2017

మన అచరిస్తున్న పండగాలు మానవుడు సాధించిన విజయాలకు జరుపుకుంటున్నామని, ధర్మంగుడనే రాజు ఓ పాప ను పెంచుకున్నారని, ఆ పాప పేరు బతుకమ్మగా పేరు పెట్టారని, రకరకాల కథలు బతుకమ్మ ఉన్నాయని, బతుకమ్మ కొద్ది ప్రాంతానికే ఎందుకు పరితమైంది అంటే అది రాజులు తమ రాజ్యం పరిధిలో మాత్రమే చేసేవారు. సైన్స్ పరంగా కూడా బతుకమ్మ మంచిదని, ఆడపిల్లలు అందరు కలసి అడ్డుకుంటారని, కానీ సర్కార్ ఉన్న కేసీఆర్ తన బిడ్డ కోసం వందల కోట్లు ఖర్చుపెడుతున్నారని ఐద్వా ప్రధాన కార్యదర్శి బత్తుల ఐమవతి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

జీహెచ్ఎంసీకి నేషనల్ టూరిజం అవార్డు

హైదరాబాద్ : జీహెచ్ఎంసీకి నేషనల్ అవార్డు దక్కింది. నేడు ఢిల్లీలో ఈ అవార్డును మేయర్ బొంతు, కమిషనర్ జనార్ధన్ రెడ్డి అందుకోనున్నారు.

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల ఉన్న క్యూలైన్లులో భక్తులు ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారు నేడు గరుడోత్సవం జరగనుంది. గరుడ సేవ సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. నడకదారి భక్తులకు టోకెన్ల నిలిపివేసిన టీటీడీ అధికారులు.

నేడు సరస్వతిదేవిగా అమ్మవారు

కృష్ణా : ఇంద్రకీలాంద్రిలో అమ్మవారు నేడు సరస్వతిదేవిగా దర్శనమివ్వనున్నారు. సీఎం చంద్రబాబు ఉదయం 9గంటలకు అమ్మవారిని దర్శించుకోనున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

Don't Miss