Activities calendar

28 September 2017

మారీసుపేటలో వివాహిత అనుమానాస్పద మృతి

గుంటూరు : జిల్లాలోని తెనాలి మారీసుపేటలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఏడేళ్ల క్రితం మహ్మద్‌ మాబు ఘోరిని లక్ష్మిసౌమ్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే లక్ష్మి సౌమ్య తన తల్లిదండ్రులు ఇంటికి రావడం లేదని కలత చెంది ఉరి వేసుకుని చనిపోయిందని ఆమె భర్త మహ్మద్‌ మాబు ఘోరి తెలిపాడు. ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు లక్ష్మి సౌమ్య మృతిపై అనుమానాలున్నాయని ఆమె పేరెంట్‌ అన్నారు. 

నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా విజయం

బెంగళూరు : నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించారు. 21 పరుగులతో తేడాతో భారత్ పై గెలుపొందింది. ఆస్ట్రేలియా : 334/5, భారత్ : 313/8. 5 వన్డేల సిరీస్ లో భారత్ 3..1 ఆధిక్యంలో ఉంది. 

 

21:47 - September 28, 2017
21:44 - September 28, 2017
21:39 - September 28, 2017

ఉ.కొరియా : వరుస క్షిపణి ప్రయోగాలు, అణు పరీక్షలతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఉత్తర కొరియా- ఆయుధ సంపత్తిని, సైనికశక్తిని పెంచుకునే పనిలో పడింది. కొత్తగా 47 లక్షల మంది సైన్యంలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకటించింది. సైన్యంలో చేరాలనుకునే వారిలో ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలిపింది. 12 లక్షల మంది మహిళలు కూడా సైన్యం చేరేందుకు ముందుకు వచ్చారని పేర్కొంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరకొరియా తన దుందుడుకు చర్యలను ఆపకపోతే ఆ దేశం పూర్తిగా నాశనమవుతుందని ట్రంప్‌ హెచ్చరించారు. మరోవైపు ఉత్తర కొరియాకు వెళ్లరాదని మలేషియా తమ దేశ ప్రజలపై ఆంక్షలు విధించింది.

 

21:36 - September 28, 2017

గోవా : అత్యాచారం కేసులో తెహల్కా మ్యాగజిన్‌ మాజీ చీఫ్‌ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌పై అభియోగాలు నమోదయ్యాయి. నాలుగేళ్ల క్రితం తోటి మహిళా జర్నలిస్ట్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న తేజ్‌పాల్‌పై గోవా కోర్టు అభియోగాలను ఖరారు చేసింది. దీనిపై నవంబర్‌ 21న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు వెల్లడించింది. 2013లో గోవాలోని ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తేజ్‌పాల్‌ తన జూనియర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తేజ్‌పాల్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. గోవా న్యాయస్థానం ఆయనపై అభియోగాలు నమోదు చేయడంతో తేజ్‌పాల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

 

హనుమాన్‌ జంక్షన్‌ ఎస్సైపై మహిళ ఫిర్యాదు

కృష్ణా : జిల్లాలోని హనుమాన్‌ జంక్షన్‌ ఎస్సై విజయ్‌కుమార్‌ను అధికారులు వీఆర్‌కు పంపారు. నూజివీడుకు చెందిన ఓ బ్యూటీషియన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన విజయ్‌కుమార్‌.. ఆమెతో క్లోజ్‌గా దిగిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టాడు. తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడంటూ ఎస్సైపై ఆ మహిళ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు ఎస్సైని వీఆర్‌కు పంపి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

21:32 - September 28, 2017

కృష్ణా : జిల్లాలోని హనుమాన్‌ జంక్షన్‌ ఎస్సై విజయ్‌కుమార్‌ను అధికారులు వీఆర్‌కు పంపారు. నూజివీడుకు చెందిన ఓ బ్యూటీషియన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన విజయ్‌కుమార్‌.. ఆమెతో క్లోజ్‌గా దిగిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టాడు. తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడంటూ ఎస్సైపై ఆ మహిళ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు ఎస్సైని వీఆర్‌కు పంపి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:29 - September 28, 2017

కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం భగీరథపల్లిలో అగ్రవర్ణాల దురహంకారం వెలుగుచూసింది. దళితుల ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించిన అనంతరం... చెరువులో వేయడానికి వెళ్తుండగా.. అగ్రవర్ణాలు అడ్డుకున్నారు. దీనిపై దళిత సంఘాలు కలెక్టర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:25 - September 28, 2017

నల్లగొండ : పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి శని వదులుతుందని ఆయన అన్నారు. సుఖేందర్‌రెడ్డి పోటీ చేస్తే ఆయనపై పోటీ చేసి ఓడిస్తానని కోమటిరెడ్డి అన్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఉప ఎన్నిక వస్తే మున్సిపాలిటీ సహా ఏడు నియోజకవర్గాలకు నిధులు వస్తాయని.. తద్వారా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. 

 

21:22 - September 28, 2017

కడప : అతను ఓ గన్‌మెన్...చేతిలో తుపాకీ...అది బాగా పనిచేయాలని శుభ్రం చేయడం అలవాటే..రొటీన్‌గా తుపాకీని క్లీన్ చేస్తుండగా మిస్‌ఫైర్ అయింది...నిర్లక్ష్యమో..ఏమరుపాటో...ఓ నిండు ప్రాణం బలయింది.
తుపాకీ శుభ్రం చేస్తుండగా పేలుడు..
నిర్జీవమైన ఇతను చంద్రశేఖర్‌రెడ్డి....ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఆదినారాయణరెడ్డి గన్‌మెన్...పోలీసు డిపార్ట్‌మెంట్లో పనిచేస్తున్న చంద్రశేఖర్‌రెడ్డి కడప నగరంలో ఉంటున్నాడు... రొటీన్‌గానే తన గన్‌ శుభ్రం చేస్తుండగా మిస్‌ఫైర్ అయింది...దీంతో తూటా అతని పొత్తి కడుపు లో నుంచి దూసుకెళ్ళి వీపు వెనకకు చీల్చుకు వచ్చింది...చంద్రశేఖర్ రెడ్డి అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు.ఇది గమనించిన కుటుంభ సభ్యులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. 
కుటుంభ సభ్యులను ఆదుకుంటాం : ఎస్పి 
విషయం తెలుసుకున్న కడప జిల్లా పోలీస్ యంత్రాంగం అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు...ఎస్పీ బాపుజి అట్టాడ అక్కడికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు...పోలీస్ శాఖ నుండి వారి కుటుంభ సభ్యులను అన్ని విదాల ఆదుకుంటామని ఎస్పి మామీ ఇచ్చారు. చంద్రశేఖర్‌రెడ్డి చేతిలో గన్‌ మిస్‌ఫైర్ అయినప్పుడు రకరకాల అనుమానాలు వచ్చాయి..అయితే అది మిస్‌ఫైర్‌ మాత్రమేనని పోలీసులు తేల్చారు.

 

21:17 - September 28, 2017

గుంటూరు : జిల్లాలోని తెనాలి మారీసుపేటలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఏడేళ్ల క్రితం మహ్మద్‌ మాబు ఘోరిని లక్ష్మిసౌమ్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే లక్ష్మి సౌమ్య తన తల్లిదండ్రులు ఇంటికి రావడం లేదని కలత చెంది ఉరి వేసుకుని చనిపోయిందని ఆమె భర్త మహ్మద్‌ మాబు ఘోరి తెలిపాడు. ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు లక్ష్మి సౌమ్య మృతిపై అనుమానాలున్నాయని ఆమె పేరెంట్‌ అన్నారు. 

 

21:14 - September 28, 2017
21:12 - September 28, 2017

హైదరాబాద్ : ఎంటిబి ఆర్ ఏడబ్ల్యు రైడ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో పోటీకి దిగిన కంటెస్టంట్స్‌....జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు.20 ఫైనల్‌ రౌండ్‌ బెర్త్‌ల కోసం... 150 మంది రైడర్లు క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టోరంటో వేదికగా ఫైనల్‌ రౌండ్‌ పోటీలు జరుగనున్నాయి. 

 

21:09 - September 28, 2017

కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం అబద్దాలతో పాలన చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. రామగుండంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రజలకు నాసిరకం చీరలు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆడపడుచును కాకుండా ఇతరులను పవర్‌లూం బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

21:04 - September 28, 2017

ప్రకాశం : జిల్లాలోని కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. ఒంగోలు ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన మోసే అనే వ్యక్తి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాల్‌మని ఆగడాలు తాళలేక కలెక్టర్‌కు చెప్పుకుందామని వచ్చిన మోసేకు  అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడంతో మనస్థాపం చెందాడు. అప్పులవాళ్ల బాధ బరించలేక తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందును తాగాడు. మోసేను రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం మోసే పరిస్థితి విషమంగా ఉంది. 

 

21:02 - September 28, 2017

అనంతపురం : ప్రభుత్వాసుపత్రిలో వరుస మరణాలను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రోగుల మరణాలపై ఇప్పటికే నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం తదుపరి చర్యలకు సన్నద్ధమవుతోంది. మరోవైపు ఆసుపత్రిలో మరణాలు ఆగడం లేదు. ఇవాళ మరో నలుగురు మృత్యువాతపడ్డారు.
అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో మరణ మృదంగం
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణ మృదంగం కొనసాగుతోంది. బుధవారం ఒకేవార్డులో కొన్ని గంటల వ్యవధిలో  10 మంది చనిపోయారు. గురువారం మరో నలుగురు చనిపోవడంతో ఆ సంఖ్య 14కు చేరింది. దీంతో రోగులు భయాందోళనలకు గురవుతున్నారు. 
చికిత్స పొందుతున్న 1200 మంది రోగులు
అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో 12 వందల మంది రోగులు వైద్య చికిత్సలు పొందుతున్నారు. ప్రతిరోజు మరో 2 వేల మందిదాక వివిధ రోగాలతో వైద్య పరీక్షలు చేయించుకుని వెళ్తూ ఉంటారు. ఇటీవల కాలంలో జ్వరాలు తీవ్రం కావడంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య మరింత పెరిగింది. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజే పది మంది చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది మరవక ముందే మరో నలుగురు మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా... రోగుల పట్ల  వైద్యులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. 
వైద్యులను అప్రమత్తం చేసిన కలెక్టర్ వీరపాండ్యన్
మరోవైపు ఆసుపత్రిలో వరుస మరణాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ నివేదిక తెప్పించుకోవడంతో పాటు వైద్యులను అప్రమత్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నగర ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆసుపత్రిలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇతర ప్రాంతాల నుంచి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి పంపుతున్నారు.

20:57 - September 28, 2017
20:56 - September 28, 2017

ఢిల్లీ : బిజెపి సీనియర్‌ నేత, మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్‌ సిన్హా  మోది ప్రభుత్వంపై దాడిని కొనసాగిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వాన్ని దోషిని చేయడం కాదు...40 నెలలుగా మీరేం చేశారంటూ క్షీణిస్తున్న ఆర్థికవ్యవస్థపై మోది సర్కార్‌ను నిలదీశారు. నోట్లరద్దు, జిఎస్‌టి నిర్ణయాలతో ప్రజలకు షాక్ మీద షాకిచ్చారని దుయ్యబట్టారు. మరోవైపు నవభారత నిర్మాణానికి వ్యవస్థీకృత సంస్కరణలు అవసరమేనని ఆయన కుమారుడు జయంత్‌ సిన్హా  తండ్రిని విభేదించారు.

క్షీణిస్తున్న ఆర్థికవ్యవస్థకు సంబంధించి మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్‌ సిన్హా  మోది ప్రభుత్వంపై దాడిని కొనసాగిస్తున్నారు. యూపీఏ-2 ప్రభుత్వ పాలసీలను విమర్శించడం చాలని...అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి తేడా లేదని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్న విషయం తమకు కూడా తెలుసని...40 నెలలుగా అధికారంలో ఉండి కూడా మీరేం చేశారంటూ మోది సర్కార్‌ను ఆయన నిలదీశారు. నోట్ల రద్దు, జిఎస్‌టి రూపంలో ప్రజలకు వరుసగా రెండుసార్లు షాకిచ్చారని సిన్హా  సీరియస్‌ అయ్యారు. జిఎస్‌టిని తాను కూడా సమర్థిస్తానని... దీన్ని ఆదర బాదరాగా అమలు చేయడం వల్లే సమస్య ఉత్పన్నమైందని తెలిపారు.

పడిపోతున్న ఆర్థికవ్యవస్థ ఉపాధిని సృష్టించదని యశ్వంత్‌ సిన్హా  చెప్పారు. ప్రజలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆర్థిక వ్యవస్థ సరిగా లేని సమయంలో మోది నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు.  ఒకే దెబ్బతో దేశమంతటా క్యాష్‌లెస్‌ కావడం దుర్లభమన్నారు. 

8 లక్షల కోట్లు బ్యాంకుల్లో స్తంభించిపోవడం విచారకరమని యశ్వంత్‌ సిన్హా   అన్నారు. ఎన్‌పిఏ కారణంగా బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని... దీంతో ప్రయివేట్‌ పెట్టుబడులు నిలిచిపోయాయని తెలిపారు. 40 పెద్ద కంపెనీలు దివాళా తీసే దిశగా కొనసాగుతున్నాయన్నారు. బ్యాంకుల పరిస్థితిని మెరుగు పరచేందుకు చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం వెయిట్‌ చేసే ధోరణి అవలంబిస్తోందన్నారు.

మోది ప్రభుత్వానికి మిత్రపక్షాల నుంచి కూడా విమర్శలు తప్పడం లేదు. గుజరాత్‌ అభివృద్ధి ఏమైందని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో ప్రశ్నించింది. గుజరాత్ అభివృద్ధి అనేది ఓ పిచ్చి భ్రమ అంటూ... అక్కడి ప్రజలే చెబుతున్నారని...దేశ అభివృద్ధి కూడా కుంటుపడిందని శివసేన విమర్శించింది. మన్మోహన్‌, చిదంబరం లాంటి ఆర్థికవేత్తలు ఆర్థికవ్యవస్థపై మాట్లాడితే వారిని పిచ్చోళ్ల కింద జమకట్టారని...ఇపుడు బిజెపికి చెందిన మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్‌ సిన్హా నే మోది అభివృద్ధి గాలి తీశారని శివసేన వ్యాఖ్యానించింది. 

కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశ ఆర్థికవ్యవస్థ నాశనం అవుతోందని బిజెపి సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా  చేసిన విమర్శలను ఆయన కుమారుడు జయంత్‌ సిన్హా  విభేదించారు. నవభారతాన్ని నిర్మించేందుకు ఇలాంటి వ్యవస్థీకృత సంస్కరణలు అవసరమేనని కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా  ఓ ఆంగ్ల పత్రికకు రాసిన ఆర్టికల్‌లో మోది ప్రభుత్వాన్ని సమర్థించారు. మోదీ ప్రభుత్వం కొత్త ఆర్థిక విధానాన్ని సృష్టించిందని, ఇది దీర్ఘకాల వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు, న్యూ ఇండియా సృష్టికి దారి తీస్తుందని జయంత్ అన్నారు. 

జయంత్‌ సిన్హా  ఆర్టికల్‌పై మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ఫైర్‌ అయ్యారు. మీరు రాసిందే నిజమైతే...గత 5 నెలల్లో జిడిపి ఎందుకు దిగజారిందని ప్రశ్నించారు.

20:53 - September 28, 2017

సిద్ధిపేట : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం వచ్చిందన్నారు మంత్రి హరీష్‌రావు. సిద్దిపేట జిల్లా సిద్దిపేటలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. పలు వీధుల్లో బతుకమ్మ కోలాటాలను తిలకించిన హరీష్‌రావు ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు ప్రదానం చేశారు. వేడుకల్లో హరీష్ రావు సతీమణి శ్రీనిత, కుమార్తె వైష్ణవి పాల్గొని బతుకమ్మ ఆడారు. 

 

నాల్గో వికెట్ కోల్పోయిన భారత్

బెంగళూరు వన్డే : నాల్గో వన్డేలో భారత్ నాల్గో వికెట్ కోల్పోయింది. 225 పరుగుల వద్ద నాల్గో వికెట్ కోల్పోయింది. భారత్ విజయలక్ష్యం 335 పరుగులుగా ఉంది.

20:46 - September 28, 2017
20:44 - September 28, 2017
20:42 - September 28, 2017

హైదరాబాద్‌ : నగర శివారు ప్రాంతంలోని కీసర మండలం అంకిరెడ్డి పల్లి క్రషర్‌ పరిశ్రమ వద్ద ట్రైనింగ్‌ విమానం కుప్పకూలింది. ఒక్కసారిగా విమానం కూలడంతో పెద్దగా మంటలు వ్యాపించాయి. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం...

 

20:41 - September 28, 2017

విజయవాడ : నోట్లరద్దు తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బ్లాక్‌ మనీ వైట్‌ మనీగా మారిందని.. సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యక్రమాలు మరింతగా పెరిగాయని చెప్పారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయని.. వాటిపై ఎలాంటి విచారణ ముందుకు సాగడం లేదన్నారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన కార్పొరేట్లు యథేశ్చగా తిరుగుతుంటే.. రైతులకు మాత్రం సకాలంలో రుణాలు ఇవ్వడం లేదన్నారు. మోదీ ప్రభుత్వలోని లోపాలను తాము చెప్పిన అంశాలనే బీజేపీ మాజీ మంత్రి యశ్వంత్‌సిన్హా  కూడా స్పష్టం చేశారని ఏచూరీ చెప్పారు. 

 

20:37 - September 28, 2017
20:36 - September 28, 2017
20:34 - September 28, 2017

హైదరాబాద్ : మెట్రో ప్రాజెక్టును పరిశీలించి విమర్శలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ నేతల వ్యాఖ్యలపై మంత్రి తలసాని స్పందించారు. పబ్లిసిటీ కోసమే కాంగ్రెస్‌ విమర్శలు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను, ఈ మూడేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి కార్యక్రమాలపై... చర్చించేందుకు సిద్ధమా అని తలసాని సవాల్ విసిరారు. 

20:29 - September 28, 2017

హైదరాబాద్ : వనపర్తిలో తడిసిన మొక్కజొన్నలకు మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. వనపర్తి మార్కెట్‌ ఏర్పడ్డ ఈ సమస్యను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. వనపర్తిలో 2 రోజుగా కురిసిన వర్షాలకు తడిసిన పంటలకు మొక్కజొన్న బాగా తడిచిపోయింది. దీంతో రైతులు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో సమస్యను సానుభూతితో పరిష్కరించాలని.. జేసీని మంత్రి ఆదేశించారు. 

బతుకమ్మను చెరువులో వేయడాన్ని అడ్డుకున్న అగ్రవర్ణాలు

కామారెడ్డి : జిల్లాలో బిక్నూరు మండలం భగీరథపల్లిలో అగ్రకుల దురహంకారం బయటపడింది. దళితుల ఆద్వర్యంలో తయారు చేసిన బతుకమ్మను చెరువులో వేయడాన్ని అగ్రవర్ణాలు అడ్డుకున్నారు. దళిత సంఘాలు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 

20:13 - September 28, 2017

వనపర్తి : తడిసిన మొక్కజొన్నకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి తమను ఆదుకోవాలని వనపర్తిలో రైతులు మార్కెట్‌ యార్డు ముందు ఆందోళనకు దిగారు. అధికారులు ఎంతకీ స్పందించకపోవడంతో పురుగుల మందు తాగి చనిపోతామని ఆందోళన చేశారు. పోలీసులు రైతుల వద్ద నుండి పురుగుల మందును లాక్కొని సంబంధిత అధికారులను పిలిపించారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని వాగ్దానం చేయడంతో ఆందోళన విరమించుకున్నారు. 

20:05 - September 28, 2017

హైదరాబాద్‌ : నగరంలో భారీవర్షం ముంచెత్తింది. ఎల్బీ నగర్, దిల్‌సుఖ్ నగర్, ట్యాంక్‌ బండ్,  ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్, హబ్సిగూడ, జూబ్లీహిల్స్, అమీర్‌ పేటలో భారీవర్షం కురిసింది. సుమారు గంట పాటు కురిసిన వర్షంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్‌లతో ఇబ్బందులు పడ్డారు. 

 

20:03 - September 28, 2017
20:01 - September 28, 2017

హైదరాబాద్‌ : నగరంలో భారీ వర్షం సద్దుల బతుకమ్మ వేడుకలకు తీవ్ర ఆటంకంగా మారింది. ఎల్బీ స్టేడియంలో 2 వేల 600 మందితో తలపెట్టిన బతుకమ్మ వరల్డ్‌ రికార్డ్‌ వర్షం కారణంగా తృటిలో మిస్సైంది. వర్షం కారణంగా చాలామంది మహిళలు రాలేకపోయారని పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. నెల తర్వాత మరోసారి బతుకమ్మ వేడుకను నిర్వహించి రికార్డ్‌ సాధిస్తామని ఆయన అన్నారు. 

 

18:59 - September 28, 2017

నెల్లూరు : జిల్లాలో అక్యుపంక్చర్ నాడీ వైద్యం పేరుతో వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. జ్యోతినగర్ లో నకిలీ డాక్డర్ ఏంగల్స్ రాజా అక్యుపంక్చర్ నాడీ వైద్యం పేరుతో నకిలీ వైద్యం చేస్తున్నాడు. నకిలీ వైద్యం అందిస్తున్న స్థావరంపై ప్రజారోగ్య వేదిక, జనవిజ్ఞాన వేదిక సభ్యులు, పోలీసులు దాడికి పాల్పడ్డారు. నకిలీ డాక్డర్ ఏంగల్స్ రాజాను పోలీసులు అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

18:58 - September 28, 2017

బతుకమ్మ ఆడబిడ్డల పండుగ. బతుకమ్మ పూల పండుగ. బతుకమ్మ పండుగపై మానవి స్పెషల్ ఫోకస్ నిర్వహించింది. బతుకమ్మ విశిష్టతకు సంబంధించిన మరిన్ని  వివరాలను వీడియోలో చూద్దాం...

 

రోహిత్ శర్మ అర్థశతకం

కర్నాటక : బెంగళూరు వన్డేలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. 42 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో వన్డే మ్యాచ్ జరుగుతోంది. 

 

తిరుమలలో ఘనంగా స్వర్ణరథోత్సవం

చిత్తూరు : తిరుమలలో స్వర్ణరథోత్సవం ఘనంగా జరుగుతోంది. స్వర్ణరథంపై తిరుమలేశుడు ఊరేగుతున్నాడు. గోవిందనామస్మరణతో మాడవీధులు మార్మోగుతున్నాయి.

 

నగరంలో భారీ వర్షం...

హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో భారీవర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, నేరేడ్ మెట్ , కుషాయిగూడ, ఈసీఐఎల్, నాగారం, కీసర, లాలాపేట్, తార్నాక, ఓయూ క్యాంపస్, విద్యానగర్, వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ లో వర్షం కురుస్తోంది.

భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ ఎంసీ కమిషనర్

హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అత్యవసర బృందాలు, ఇంజనీరింగ్ విభాగం అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి హెచ్చరించారు.

17:55 - September 28, 2017
17:49 - September 28, 2017

ప్రకాశం : జిల్లాలోని కలెక్టరేట్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాల్ మనీ ఆగడాలు తాళలేక ఒంగోలు ఎన్టీఆర్ కాలనీకి చెందిన మోసే.. కలెక్టర్ కు చెప్పుకుందామని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో మనస్తాపం చెందిన మోసే పరుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అతన్ని చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. మోసే పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

17:37 - September 28, 2017
17:33 - September 28, 2017
17:24 - September 28, 2017

'మహానుభావుడు' మూవీ టీమ్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతీ, హీరో శర్వానంద్, హీరోయిన్ మెహరీన్ మాట్లాడారు. సినిమా షూటింగ్ విశేషాలను వివరించారు. తమ సినీ అనుభవాలను తెలిపారు. వారు తెలిపిన పలు ఆసక్తిరమైన విషయాలను వీడియోలో చూద్దాం....

 

తిరుమలలో వైభవంగా స్వర్ణరథోత్సవం

తిరుమల : తిరుమలలో వైభవంగా స్వర్ణరథోత్సవం జరుగుతోంది. స్వర్ణ రథంపై తిరుమలేశుడు ఊరేగుతున్నాడు. గోవిందనామస్మరణతో మాడవీధులు మార్మోగుతున్నాయి.

నెల్లూరులో నకిలీ వైద్యుడు అరెస్ట్...

నెల్లూరు: జ్యోతి నగరలో ప్రజారోగ్య, జనవిజ్ఞానవేదిక, పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నకిలీ వైద్యుడు ఏంగల్స్ రాజును అరెస్టు చేశారు. ఆక్యుపంచర్, నాడీ వైద్యం పేరుతో డాక్టర్ అవతారం ఎత్తిన ఏంగల్స్ రాజు నాడి పట్టుకుని వాధ్యులు నయం చేస్తానని కొన్నేళ్లుగా మోసాలకు పాల్పడుతున్నాడు.

17:05 - September 28, 2017

ఢిల్లీ : రెడ్‌బుల్‌ షాంఘైలో నిర్వహించిన బౌల్‌ స్కేట్‌ బోర్డింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో టాప్‌ క్లాస్ స్కేట్‌బోర్డర్లు అదరగొట్టారు. సిటీలోని హాట్‌ స్పాట్‌ స్కేట్‌ ఎరీనా  వేదికగా జరిగిన ఈ కాంపిటీషన్‌లో... పోటీకి దిగిన కంటెస్టంట్స్‌ కళ్లు చెదిరే స్కేటింగ్‌ ఫీట్స్‌తో  ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు. స్టెప్‌ అప్‌, స్టెప్‌ డౌన్‌, వర్చువల్‌ స్పిన్‌, టోటల్‌ స్పిన్‌ వంటి ఫీట్స్‌తో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు.ఈ డేర్ డెవిల్‌ కాంపిటీషన్‌లో అరుదైన ఫీట్స్‌ ప్రదర్శించిన బ్రెజిల్‌ టాప్‌ కంటెస్టంట్‌ ఆస్కార్‌ హాల్బెర్గ్‌ టాప్‌ ప్లేస్‌లో నిలిచి టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. యుటో హోరిగేమ్‌, డానీ లియోన్‌ వరుసగా రెండు,మూడు స్థానాలతో సరిపెట్టుకున్నారు.

 

తడిసిన మొక్క జొన్నకు మద్ధతు ధర: మంత్రి హరీష్

వనపర్తి: తడిసిన మొక్క జొన్న పంటకు మద్ధతు ధర కల్పించాలని రైతుల విజ్ఞప్తికి మంత్రి హరీష్ రావు స్పందించారు. తడిసిన మొక్కజన్నకు మద్ధతు కల్పించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైతులు కోరిన ధరకే మొక్కజొన్న కొనేలా అధికారులు చర్యలు చేపట్టారు.

17:00 - September 28, 2017

ఢిల్లీ : మోది ప్రభుత్వ పనితీరుపై సొంత పార్టీ నేతలే కాదు...ఎన్డీయే మిత్ర పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అభివృద్ధిపై శివసేన మళ్లీ కేంద్రాన్ని టార్గెట్‌ చేసింది. గుజరాత్‌ అభివృద్ధి ఏమైందని తన అధికార పత్రిక సామ్నాలో ప్రశ్నించింది. గుజరాత్ అభివృద్ధి అనేది ఓ పిచ్చి భ్రమ అంటూ... అక్కడి ప్రజలే చెబుతున్నారని...దేశ అభివృద్ధి కూడా గాడి తప్పిందని శివసేన పేర్కొంది. మన్మోహన్‌, చిదంబరం లాంటి ఆర్థికవేత్తలు ఆర్థికవ్యవస్థపై మాట్లాడితే వారిని పిచ్చోళ్ల కింద జమకట్టారని...ఇపుడు బిజెపికి చెందిన మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్‌ సిన్హా నే మోది అభివృద్ధి గాలి తీశారని శివసేన వ్యాఖ్యానించింది. జిడిపి రేటు 5.7 శాతం ఉందని కేంద్రం చెబుతున్నా వాస్తవానికి 3.7 శాతమే ఉందని యశ్వంత్‌ అన్నారు. యశ్వంత్‌ సిన్హా  నిజం చెప్పినందుకు ఆయనకు ఏం శిక్ష విధిస్తారో చూడాలని తెలిపింది. 

 

టిటిడి ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్

తిరుమల:టిటిడి పాలకమండలి కొత్త చైర్మన్‌గా కడప జిల్లా మైదుకూరుకు చెందిన టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ పేరును ప్రభుత్వం ఖారారు చేసింది. అందరి సహకారంతో భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని సుధాకర్ చెప్పారు. టీటీడీ చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సుధాకర్ యాదవ్‌కు పలువురు టీడీపీ నేతలు అభినందించారు. సుధాకర్‌యాదవ్ గతంలో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు.

' కోస్తాంధ్రకు 3 తుపాన్లు వచ్చే అవకాశం'

హైదరాబాద్: వచ్చేమూడు నెలల్లో 3 తుపాన్లు వచ్చే అవకాశం ఉందని, దాని వలన తీవ్ర భూకంపం సంభవించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా జిల్లాలపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వల్ల అక్టోబర్ నుంచి డిసెంబర్ లోగా 3 తీవ్రమైన తుపాన్లు ఏర్పడవచ్చని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశాన్ని కేరళకు చెందిన బీకే రిసెర్చ్ అసోసియేషన్ ఫర్ ఈఎస్సీ డైరెక్టర్ బాబు కలియల్ ప్రధానికి లేఖ ద్వారా తెలిపింది. డిసెంబర్ 31 లోగా తీవ్రమైన భూకంపం వస్తుందని, భారత్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని లేఖ ల్లో వెల్లడించారు. ప్రభుత్వం ప్రజలను చైతన్యం చేయాలని లేఖలో ప్రధానిని బాబు కలియల్ కోరారు.

16:55 - September 28, 2017

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశ ఆర్థికవ్యవస్థ నాశనం అవుతోందని బిజెపి సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా  చేసిన విమర్శలను ఆయన కుమారుడు జయంత్‌ సిన్హా  విభేదించారు. నవభారతాన్ని నిర్మించేందుకు ఇలాంటి వ్యవస్థీకృత సంస్కరణలు అవసరమేనని కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా  ఓ ఆంగ్ల పత్రికకు రాసిన ఆర్టికల్‌లో తెలిపారు. మోదీ ప్రభుత్వం కొత్త ఆర్థిక విధానాన్ని సృష్టించిందని, ఇది దీర్ఘకాల వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు, న్యూ ఇండియా సృష్టికి దారి తీస్తుందని జయంత్ అన్నారు. నోట్ల రద్దు, జిఎస్‌టి, డిజిటల్‌ పేమెంట్‌ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని... కేంద్ర సంస్కరణ వల్ల అన్ని వర్గాల వారు టాక్స్‌ పరిధిలోకి వచ్చారని జయంత్‌ సిన్హా  తెలిపారు. రానున్న కాలంలో టాక్స్‌ కలెక్షన్లు పెరిగి రాష్ట్రాలకు లాభం చేకూరుతుందన్నారు. 

 

16:48 - September 28, 2017

ఢిల్లీ : చిన్నపిల్లలు పొగాకు బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇందుకోసం కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పొగాకు, పొగాకేతర ఉత్పత్తులు ఒకే దగ్గర అమ్మడంతో పిల్లలు వీటికి అలవాటు పడే అవకాశాలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మైనర్లు పొగాకు బారిన పడకుండా కేంద్రం ప్రయత్నాలు 
మైనర్లు పొగాకు బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. సిగరెట్లు, బీడీలు, గుట్కాలు అమ్మే దుకాణాదారులు ఇతర ఉత్పత్తులు కూడా అమ్ముతుండడంతో పిల్లలు వాటి పట్ల ఆకర్షితులు అవుతున్నారు. ఆల్కహాల్‌తో పాటు సిగరెట్లను మైనర్లకు అమ్మకూడదన్న నిబంధన ఉన్నా ఎవరూ పాటించడంలేదు. ఇలాంటి వారు 56 శాతం మంది వరకు పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయగలుగుతున్నారని 2009-10 సంవత్సరంలో గ్లోబల్‌ యూత్‌ టొబాకో సర్వే తేల్చి చెప్పింది. ఇందులో 13 నుండి 15 ఏళ్ల వయసు వారు 15 శాతంగా ఉండటంతో  కేంద్ర ప్రభుత్వం కలవరపడుతోంది. 
ఎక్కడపడితే అక్కడ పొగాకు అమ్మకాలు జరగకుండా కేంద్రం చర్యలు 
ఎక్కడపడితే అక్కడ పొగాకు అమ్మకాలు జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోబోతుంది. ఇందుకోసమే కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ర్టాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం లైసెన్స్‌ ఉన్న రిటెయిలర్లు పొగాకు అమ్మాలని సూచించింది. ఈ లైసెన్స్‌లను మున్సిపల్‌ అధికారులు జారీ చేసేలా ఓ ప్రణాళిక రూపొందించాలని తెలిపింది. ముఖ్యంగా పిల్లలు తినే బిస్కెట్లు, చాక్లెట్లు ఇతర తినుబండారాల వద్ద పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదన్న కొత్త నిబంధనను కేంద్రం తీసుకురాబోతుంది. ఇలాంటి చర్యల వల్ల పిల్లలు పొగాకు అలావాటు లేని వాళ్లు వాటికి ఆకర్షితులు కాకుండా ఆపవచ్చని ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో తెలిపింది. అయితే ఇకమీదట కేవలం లైసెన్స్‌ ఉన్నవారే పొగాకు ఉత్పత్తులను అమ్మాల్సి ఉంటుంది.    

 

తంగేడు పువ్వు ఆకారంలో నిలబడి..

హైదరాబాద్: ఎల్బీస్టేడియంలో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రయత్నం చేస్తోంది. తంగేడు పువ్వు అకారంలో నిలబడిన 3వేల మహిళలు పసుపు, ఆకుపచ్చ చీరలు ధరించారు. తంగేడు ఆకారంలో నిలబడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు యత్నిస్తున్నారు.

కారెం శివాజీ ఆధ్వర్యంలో ఎస్టీ విద్యార్థులపై విరిగిన లాఠీ

కర్నూలు: స్టేట్ గెస్ట్ హౌస్ లో అధికారులతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ సమావేశంఅయ్యారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దంటూ ఎస్టీ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

 

16:33 - September 28, 2017

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన బస్‌ టెర్మినల్‌ అది. రాష్ట్రం నలుమూలలకు వెళ్లే వేలకొద్ది ప్రయాణీకులకు ఆశ్రయం కల్పించిన ప్రాంతమది. బస్సు ఎక్కేవరకు ప్రయాణికుడికి నీడ కల్పించిన అడ్డా అది. ఒకటి కాదు రెండుకాదు..  8దశాబ్ధాల చరిత్ర కలిగిన బస్‌ టెర్మినల్‌ అది. ఇప్పుడు ఈ అద్భుత కట్టడం కనమరుగు కానుంది. రోడ్డు విస్తరణలో తన ఉనికిని కోల్పోబోతోంది. 8 దశాబ్ధాలకుపైగా ప్రజలకు సేవలందించి కాలగర్భంలో కలిసిపోతున్న ఉమ్మడి రాష్ట్రాల తొలి బస్‌స్టేషన్‌.. సీబీఎస్‌ బస్‌ టెర్మినల్‌పై 10టీవీ కథనం...
నిజాంకాలంలో రూపుదిద్దుకున్న తొలి బస్టాండ్‌
అర్ధ చంద్రాకారం. ఆకట్టుకునే రూపం.  రేకులతో నిర్మించిన విశాల ప్రాంగణం.  అదే హైదరాబాద్‌లోని సిటీ బస్‌ టెర్మినల్‌.  ఒకప్పుడు పట్నం బస్టాండ్‌గా ఓ వెలుగు వెలిగిన గౌలిగూడలోని ఆర్టీసీ పాత బస్టాండ్‌. నిజాం కాలంలో నిర్మితమై ఇప్పటికే సేవలందిస్తోంది. 8 దశాబ్దాల నాటి ఈ అపురూప నిర్మాణం మరికొద్ది రోజుల్లో అదృశ్యం కాబోతోంది. పెరిగిన ట్రాఫిక్‌ అవసరాలకు అనుగుణంగా అఫ్జల్‌గంజ్‌ గౌలిగూడ రోడ్డు వెడల్పు చేయాల్సి రావడంతో ఈ టెర్మినల్‌ను కూల్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  నాటి జమానాకు గుర్తుగా, చిరస్మరణీయంగా మార్చాలనుకున్న ఆర్టీసీ ప్రయత్నాలు విఫలమే అయ్యాయి.
గౌలిగూడలో రోడ్డు విస్తరణ చేపట్టిన అధికారులు
సిటీ బస్‌ టెర్మినల్‌కు ఒకవైపు స్థలం ఉంది. మరోవైపు మూసీ ఉంది. దీంతో రోడ్డు విస్తరణ చేయాలంటే ఈ నిర్మాణాన్ని కూల్చితేనే సాధ్యమవుతుంది. 25 అడుగుల కంటే ఎక్కువ స్థలం సేకరించాల్సి ఉండడంతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయాల్సి వస్తోంది.  రేకులతో నిర్మితమైన కట్టడం కావడంతో కొంత తొలగించినా మిగిలిన నిర్మాణాన్ని వాడుకునే వెసులుబాటు లేదు. దీంతో మొత్తం కట్టడాన్నే తొలగించాల్సి వస్తోంది.
1994లో మహాత్మాగాంధీ బస్టాండ్ నిర్మాణం
1994లో మూసీ మధ్యలో మహాత్మాగాంధీ బస్టాండ్‌ను నిర్మించారు. జిల్లాల బస్సులకు ఇమ్లిబన్‌ బస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో పాత బస్టాండ్‌ను సిటీ బస్‌ టెర్మినల్‌గా మార్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సిటీ బస్‌ టెర్మినల్‌ను మ్యూజియంగా మార్చుతారని ఆర్‌టీసీ అధికారులు భావించారు. కానీ ప్రభుత్వం దాన్ని కూల్చివేతకే మొగ్గు చూపింది. గౌలిగూడ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటోంది. ప్రాంతం గుండా ప్రయాణం చేయాలంటే వాహన దారులు గంటలతరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు. దీంతో రోడ్డు విస్తరణకు ప్రభుత్వం పూనుకుంది. 
సీఎన్‌జీ బస్సులకు కేటాయించాలన్న ఆర్టీసీ
విశాలమైన ప్రాంగణం కావడంతో బస్టాండ్ స్థలాన్ని భవిష్యత్‌ అవసరాలకు వాడుకోవడానికి ఆర్టీసీ అనేక ప్రణాళికలు రూపొందించింది. రేకుల బస్టాండ్‌ను కూల్చి భారీ నిర్మాణం చేపట్టాలని యోచించింది. సీఎన్‌జీ బస్సులకు కేటాయించాలని, వాణిజ్య  సముదాయానికి ఇవ్వాలని అనేక రకాలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.  నిజాం హయాంలో నిర్మితమైన హైదరాబాద్‌ తొలిబస్టాండ్‌ కావడంతో నాటి గుర్తులకు చిహ్నంగా మ్యూజియం తరహాలో అభివృద్ధి చేయాలని కోరింది. కానీ రోడ్డు వెడల్పు చేసేందుకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో పట్నం బస్టాండ్‌ను కూల్చేయాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో చారిత్రక కట్టడాలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్‌ చెబుతోంటే.. మరోవైపు ఉన్నతాధికారులు పాత బస్టాండ్‌ను కూల్చివేయడానికి సిద్ధపడుతున్నారు. దీంతో 8దశాబ్దాల చరిత కలిగిన పట్నం బస్టాండ్‌ కాలగర్భంలో కలిసిపోనుంది.

పవన్ కల్యాణ్ కలిసొస్తే స్వాగతిస్తాం:

విజయవాడ : బిజెపి విధానాలతో వ్యతిరేకించే వారితో జత కట్టేందుకు సిద్ధంఅని జనసేన అధినేత పవన్ కల్యాన్ కలిసొస్తే స్వాగతిస్తామని సీపీఎం నేత సీతారం ఏచూరి స్పష్టం చేశారు. పవన్ తో పొత్తు అంశంపై రాష్ట్ర కమిటీదే నిర్ణయం అని స్పష్టం చేశారు.

16:17 - September 28, 2017

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సిద్ధమైంది. వేడుకలలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. మరోవైపు మరోసారి గిన్నిస్ రికార్డును బ్రేక్ చేసేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ వేడుకలకు సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దిగాజారిపోయింది:ఏచూరి

విజయవాడ: దేశ ఆర్థిక పరిస్థితి దిగాజారిపోయిందని.. దీనికి నోట్ల రద్దే ప్రధాన కారణమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ...దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోందని, కార్పొరేట్లకు రూ.2లక్షల కోట్ల రుణ మాఫీ చేసి.. రైతు రుణ మాఫీ ని మాత్రం గాలికొదిలేశారని మండిపడ్డారు. మోదీ ప్రధానిగా కంటే ఈవెంట్ మేనేజర్ గా బాగా పనికి వస్తారని ఎద్దేవా చేశారు. రైతాంగ సమస్యలపై అక్టోబర్ లో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టామని, ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు మేధావుల ఫోరం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

15:58 - September 28, 2017

బాలీవుడ్ మెగా స్టార్ 'అమితాబ్ బచ్చన్' వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కోన్ బనేగా కరోడ్ పతి' షోల ఎంత పాపులార్టీ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ షో మళ్లీ టెలికాస్ట్ అవుతోంది. ఈ షోలో ప్రముఖులు..ఇతరులు పాల్గొని ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. తాజాగా ఈ షోలో ప్రముఖ బ్యాడ్మెంటెన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు హాజరయ్యారు. ఈ విషయాన్ని 'అమితాబ్ బచ్చన్' సామాజిక మాధ్యమాల ద్వారా తెలియచేశారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఫొటోను 'అమితాబ్' త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన ప్ర‌పంచ ఛాంపియ‌న్ పీవీ సింధును త‌న షోకి రావ‌డం గ‌ర్వంగా ఉంద‌ని తెలియచేశారు.

రియో సెంట్రో ఎరీనా వేదికగా ముగిసిన..సస్పెన్స్ థ్రిల్లర్ గోల్డ్ మెడల్ ఫైట్ లో ప్రపంచ నెంబర్ వన్ కారోలిన్ మారిన్ తో సింధూ తుదివరకూ పోరాడి రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సింధూపై ప్రశంసల జల్లు కురిశాయి. ఒలింపిక్స్ ఫైనల్స్ చేరిన భారత తొలి మహిళ మాత్రమే కాదు..రజత పతకం సాధించిన ప్లేయర్ గా రికార్డుల్లో చేరింది. మరి హాట్ సీట్ లో అమితాబ్ అడిగిన ప్రశ్నలకు పీవీ సింధు ఎలాంటి సమాధానాలు చెప్పారో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

15:55 - September 28, 2017

శ్రీకాకుళం : పట్టణ జనాభా పెరిగిపోతోంది. ఇరుకురోడ్లు, వాహనాల రద్దీతో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్‌ నియంత్రణ పోలీసులకు సవాల్‌గా మారింది. దీన్ని అదిగమించేందుకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.  ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు పరికరాలు పెద్ద  ఎత్తున కొనుగోలు చేస్తోంది. 

ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం జిల్లా అధికారులు యాక్షన్‌ప్లాన్‌ను మొదలు పెట్టారు. ట్రాఫిక్‌ నియంత్రణకోసం ప్రత్యేక పరికరాలను సమకూర్చుకుంటున్నారు. 

శ్రీకాకుళం నగరంలో వాహనాల రద్దీ రోజురోజుకు పెరిగిపోతోంది. పట్టణ స్థాయి నుంచి నగరంగా విస్తరిస్తున్న సిక్కోలు లో మూడు ప్రధాన రోడ్లు తప్పించి..మిగత అన్నిచోట్ల ఇరుకు రోడ్లే దర్శనం ఇస్తున్నాయి. డేఅండ్‌ నైట్‌ జంక్షన్‌, ఏడురోడ్ల కూడలి, రామలక్షణ జంక్షన్‌, పాతబస్టాండు ఏరియాల్లో మాత్రమే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ అందుబాటులో ఉన్నాయి. మిగత రోడ్లన్నీ వాహనాల రాకపోకలతో నిత్యం బిజీగా ఉంటున్నాయి. ట్రాఫిక్‌నియంత్రణ వ్యవస్థలు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు, ట్రాఫిక్‌జామ్‌లు జరుగుతున్నాయి. దీనిపై దృష్టిపెట్టిన జిల్లా అధికారులు.. ట్రాఫిక్‌ నియంత్రణ పరికరాలను పెద్ద ఎత్తున సమకూర్చుకుంటున్నారు. జిల్లాకేంద్రంతోపాటు  ఇతర ముఖ్య పట్టణాలు, జాతీయరహదారుల వద్ద  ప్రమాదాల జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. 

మరోవైపు సెప్టెంబర్‌ 28నుంచి  జిల్లా వ్యాప్తంగా హెల్మెట్‌వాడకం తప్పని సరి చేసినట్టు శ్రీకాకుళం జిల్లా అధికారులు ప్రకటించారు. హెల్మెట్‌ ధరించి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని వాహనదారులకు చెబుతున్నారు. దాన్లో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవస్థలను పటిష్టం చేస్తున్నట్టు అధికారులు అంటున్నారు. దీనిపై సిక్కోలు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల నివారణకు మరిన్ని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌పెట్టేందుకు శ్రీకాకుళం జిల్లా అధికారుల చర్యలు 

రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

బెంగళూరు: నాల్గొ వన్డే ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ఆరోన్ ఫించ్(94) ఔటయ్యాడు. వెంట వెంటనే ఆస్ట్రేలియా వర్నార్, పించ్ వికెట్లు కోల్పోయింది.

15:52 - September 28, 2017

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు దుర్గాదేవి  అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.  దుర్గాదేవి అలంకారంలో ఉన్న కనదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో క్యూలైన్‌లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 123 పాయింట్ల లాభంతో 31,282 వద్ద సెన్సెక్స్, 33 పాయింట్ల లాభంతో 9,768 వద్ద నిప్టీ ముగిసింది.

15:49 - September 28, 2017

హైదరాబాద్ : పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని ఇండియన్‌ మహిళా క్రికెట్‌టీమ్‌ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ అన్నారు. తెలంగాణ పోలీస్‌లు ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరవీరుల స్ఫూర్తిని తెలియజేస్తూ పోలీస్‌శాఖ 3 ప్రచార రథాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రచార రథాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను డీజీపీ కార్యాలయంలో మిథాలీరాజ్‌ ఆవిష్కరించారు. 15 రోజులపాటు 27 జిల్లాలను ప్రచార రథాలు చుట్టిరానున్నాయి. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్‌ సీపీ మహేందర్‌రెడ్డితోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

 

విద్యుత్ చార్జీలు పెంచబోం:సీఎం చంద్రబాబు

అమరావతి: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబునాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచబోమంటూ ఓ లేఖలో విడుదల చేశారు. రెండో దశ సంస్కరణలతో ప్రజలకు లాభం చేకూరుతుందని లేఖలో వివరించారు. నిరంతర విద్యుత్‌తో మూతబడిన పరిశ్రమలు మళ్లీ ప్రారంభమవుతున్నాయని ఆయన అన్నారు. స్మార్ట్ గ్రిడ్ విధానం ప్రపంచానికి ఆదర్శమని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నిర్మిస్తామని తెలిపారు.

 

15:44 - September 28, 2017

మేడ్చల్ : ప్రొఫెసర్‌ కంచె ఐలయ్యపై జరిగిన దాడిపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లో కంచె ఐలయ్యకు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ప్రజాసంఘాల కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఐలయ్యపై దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో తమ భావాలను వ్యక్తపరిచే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని.... నేడు ఆ హక్కుకే ముప్పువాటిల్లే ప్రమాదమేర్పడిందని అన్నారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే వారిపై దాడులు చేయడం దారుణమన్నారు. ఐలయ్యపై దాడులు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

 

ఒంగోలు కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ప్రకాశం: ఒంగోలు కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాల్ మనీ వ్యాపారం ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్ బాధితుడు వచ్చాడు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.

15:39 - September 28, 2017

కరీంనగర్ : బొమ్మకల్ ప్లైఓవర్ వద్ద పోలీసులు లారీలను అడ్డుకుంటున్నారు. కరీంనగర్, ధర్మారం లక్సెట్టిపేట మార్గాల్లో లారీలను దారి మళ్లిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా బసంత నగర్ టోల్‌ప్లాజా మీదుగా వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. లారీలను అడ్డగిస్తున్న ఏఎస్సై 10 టీవీ కెమెరాకు చిక్కారు. ఘటనపై వివరణ కోరగా..ట్రాఫిక్ పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:36 - September 28, 2017

ప్రకాశం : జిల్లాలోని కొత్తపట్నం బీచ్‌లో ఇద్దరు విద్యార్థుల..  షేక్‌ అహ్మద్‌ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.  ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్‌లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. దసరా సెలవులు కావడంతో 10 మంది స్నేహితులు కలిసి సముద్రస్నానానికి వెళ్లారు. అయితే వీరిలో ఇద్దరు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతుండగా.. షేక్‌ అహ్మద్‌ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. మరో విద్యార్థి నాగ పవన్‌ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నాగ పవన్‌ ఒంగోలు ప్రైవేట్ కాలేజీలో సీనియర్ ఇంటర్ చదువుతుండగా..  షేక్‌ అహ్మద్‌ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

తరుణ్ తేజ్ పాల్ కేసు..

ఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 'తెహల్కా' మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించడంతో తేజ్ పాల్ మీద కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా తరుణ్ తేజ్ పాల్ పై ఛార్జీ షీట్ నమోదైనట్లు తెలుస్తోంది. తదుపరి విచారణ నవంబర్ 21కి కోర్టు వాయిదా వేసింది. 

కాసేపట్లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు..

హైదరాబాద్ : కాసేపట్లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ జరుగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఎల్బీస్టేడియం, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. 

15:05 - September 28, 2017

బతుకమ్మ...ఏదో పూలు తెచ్చి ఆడి..నిమజ్జనం చేయడం కాదు. ఇందులో ఆరోగ్య రహస్యం కూడ ఉందంట. తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి… తదితర పూలతో బతుకమ్మను పేరుస్తారు. పేర్చిన ఈ పూలల్లో ఔషద గుణాలున్నాయి. బతుకమ్మకు అందంతో పాటు..ఆడిన వారికి..ఇతరులకు ఆరోగ్యానిస్తాయి. అడవిలో పుట్టిన పూలను తెచ్చి ఓపికగా బతుకమ్మను పేర్చి..ఆడి పాడి చెరువుల్లో..బావుల్లో నిమజ్జనం చేస్తుంటారు. బతుకమ్మలను నిమజ్జనం చేయడం వల్ల పూలల్లో ఉండే ఔషధ గుణాలు నీటిలో కరిగి క్రిములను నశింపచేస్తాయి.

బంతి : బంతిపూలలో యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయ.ఇ కాస్మటెక్స్ తయారీలో బంతి పూలు ఉపయోగిస్తుంటారు.

తామరపూలు : రక్తస్రావ నివారణకు ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్యాల తయారీ, మలబద్ధకంతో బాధపడేవారికి దీని నుండది తీసిన నూనె ఔషధంగా పనిచేస్తుంది.

గునుగు : గాయం అయిన చోట ఈ ఆకులను కడుతుంటారు. అతిసార, కలరా లాంటి వాటికి ముందుగా ఈ పూలను వాడుతారంట. పాము విషానికి విరుగుడుగా ఈ మొక్క ఉపయోగపడుతుంది. వీటి గింజల నుండి నూనె కూడా తీస్తారు. రుతుస్రావ సమస్యలు ఉన్న మహిళలు పూలతైలన్ని వాడతారు. గునుగు రక్త విరోచనాను అరికడుతుంది.

గులాబీ : గులాబీ పూలను ఆయుర్వేద మందుల్లో విరివిగా ఉపయోగిస్తారనే సంగతి తెలిసిందే.

మందార పూలు : మందార పూలను ఎండబెట్టి నూనెలో మరిగించి తలకు రాస్తే తల నొప్పి తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు తెల్లగా మారకుండా నల్లగా ఉంటాయి.

చామంతి పూలు : ఇందులో ఆరోగ్యకర లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి నియంత్రణకు వాడతారు. ఈ పూల తైలం తో పైరటమ్‌ అనే కీటకనాశిని మందులను తయారు చేస్తారు. 

14:55 - September 28, 2017

యాంకర్ 'ఉదయ భాను' అనగానే మనకి గుర్తొచ్చేది తెలుగింటి అమ్మాయి. ఈమె బుల్లితెరపై పలు షోలు నిర్వహించి పాపులర్ అయ్యింది. బుల్లితెరపైనే కాకుండా కొన్ని తెలుగు సినిమాలు మరికొన్ని కన్నడ సినిమాలు లో హీరోయిన్ పాత్రలు చేసింది. ఆ తరువాత ఐటెం సాంగ్స్ లలో కూడా అలరించింది. ఇటీవల యాంకర్ కు...సిన్మాలకు దూరంగా ఉన్న 'ఉదయ భాను'పై ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్' కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా కొనసాగుతున్నా ఇంకా ఇంతవరకు సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు. పవన్ కు జోడీగా 'కీర్తి సురేష్', 'అనూ ఇమ్మాన్యుయేల్' లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే 'ఉదయ భాను'తో త్రివిక్రమ్ సంప్రదింపులు జరిపినట్లు, ఓ ప్రత్యేక గీతంలో నటించేందుకు చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో 'రానా దగ్గుపాటి' నటించిన 'లీడర్', త్రివిక్రమ్ తెరకెక్కించిన 'జులాయి' సినిమాలో 'ఉదయ భాను' ప్రత్యేక సాంగ్ లో నర్తించింది. ఇప్పుడు పవన్ సినిమాలో ఓ పాటకు ఆడిపాడబోతున్నట్లు టాక్. మరి ఈ వార్త నిజమా ? కాదా ? అనేది రానున్న రోజుల్లో తెలియనుంది. 

నగరంలో పలు చోట్ల వర్షం..

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఓయూ క్యాంపస్, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్, అంబర్ పేట, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, తార్నాక, వారాసిగూడ తదితర ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం వర్షం పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 

పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా..

వనపర్తి : మార్కెట్ యార్డులో రైతులు ధర్నా నిర్వహించారు. పురుగుల మందు డబ్బాలతో రైతులు ధర్నా చేపట్టారు. తడిచిన మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. 

లారీలను అడ్డుకున్న ఏఎస్ఐ..

కరీంనగర్ : జిల్లాలోని బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్దం లారీలను పోలీసులు అడ్డుకుంటున్నారు. లారీలను అడ్డగిస్తూ టెన్ టివి కెమెరాకు ఏఎస్ఐ చిక్కారు. పెద్దపల్లి జిల్లా బసంత నగర్ టోల్ ప్లాజా మీదుగా వెళ్లాలని హుకుం జారీ చేశారు. ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. కరీంనగర్, ధర్మారం, లక్సెట్టిపేట మార్గాల్లో లారీలను మళ్లిస్తున్నారు. 

మరోసారి యశ్వంత్ సిన్హా వ్యాఖ్యలు..

ఢిల్లీ : ఆర్థిక పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని మరోసారి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆయన విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్న సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక పరిస్థితిపై తాను చేసిన వ్యాఖ్యలు సరైనవేనని, దీనిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 

'టీఆర్ఎస్ ను సింగరేణి కార్మికులు ఓడిస్తారు'...

పెద్దపల్లి : 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించిన సింగరేణి కార్మికులే రాబోయే ఎన్నికల్లో ఓడిస్తారని టి.కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ వ్యాఖ్యానించారు. నడిచే ఫ్యాక్టరీలను మూసేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, సింగరేణి సీఎండీ శ్రీధర్ టీఆర్ఎస్ తొత్తుగా వ్యవహరించడం సరికాదన్నారు. 

జవహార్ నగర్ లో ప్రజా సంఘాల ర్యాలీ...

మేడ్చల్ : జిల్లాలో జవహార్ నగర్ లో ప్రొ. కంచె ఐలయ్యకు మద్దతు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించారు. ఐలయ్యపై దాడులు చేస్తే సహించబోమని హెచ్చరించారు. 

తండ్రి అప్పు తీర్చలేదని..

విజయవాడ : అజిత్ సింగ్ నగర్ లోని ఆంధ్రప్రభ కాలనీలో ఇద్దరు యువకుల కిడ్నాప్ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తండ్రి అప్పు తీర్చలేదని ఇద్దరు కుమారులను ఫైనాన్షియర్లు పోలీసులు అరెస్టు చేషశారు. కాసేపట్లో నిందితులను మీడియా ఎదుట హాజరు పర్చనున్నారు. 

కానిస్టేబుల్ పై ఎస్ఐ దాడి..

చిత్తూరు : రాంభగీచ గెస్ట్ హౌస్ 2 వద్ద కానిస్టేబుల్ పై ఎస్ఐ రాజశేఖరరెడ్డి దాడికి పాల్పడ్డాడు. దీనితో కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. మహిళా భక్తుల పట్ల కూడా ఎస్ఐ దురుసుగా ప్రవర్తించాడని కానిస్టేబుల్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఏఐటీయూసీని గెలిపించండి: మాజీ శ్రీధర్ బాబు

పెద్దపల్లి : సింగరేణి సంస్థ ఉనికిని కాపాడుకోవడానికి ఐఎన్ టీయూసీ బలపరిచిన ఏఐటీయూసీని గెలిపించాలని మాజీ శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపిస్తే వారసత్వ ఉద్యోగాలు ఇప్పించడంతో పాటు, ఆదాయపన్ను రద్దు, ప్రైవేటీకరనను అడ్డుకుంటామని తెలిపారు.

నడిచే ఫ్యాక్టరీలను మూసేసిన ఘనత టీఆర్ ఎస్ దే: షబ్బీర్ అలీ...

పెద్దపల్లి: 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్ ను గెలిపించిన సింగరేణి కార్మికులే రాబోయే ఎన్నికల్లో ఓడిస్తారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. నడిచే ఫ్యాక్టరీలను మూసేసిన ఘనత టీఆర్ ఎస్ ప్రభుత్వానిదే అని, సింగరేణి సీ అండ్ ఎండీ శ్రీధర్ టిఆర్ ఎస్ తొత్తుగా వ్యవహరించడం సరికాదన్నారు. సింగరేణి గనులను టీబీజీటీకే రెస్టారెంట్లు మారుస్తోందని ఆరోపించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

బెంగళూరు: భారత్‌-ఆసీస్‌ మధ్య నాలుగో వన్డేలో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. తుది జట్టులో ఆసీస్‌ రెండు మార్పులు చేసింది. వేడ్‌, అడమ్‌ జంపాను తిరిగి జట్టులోకి తీసుకుంది. ఆసీస్‌ వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు ఇది 100వ వన్డే కావడం విశేషం. మరోపక్క మూడు మార్పులతో కోహ్లీసేన బరిలో దిగుతోంది. కుల్‌దీప్‌, భువనేశ్వర్‌, బుమ్రాలకు విశ్రాంతి కల్పించి వారి స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమి, అక్షర్‌ పటేల్‌లను తీసుకున్నారు. కోహ్లీ సేన కనుక ఈ మ్యాచ్‌ నెగ్గితే వన్డేల్లో నెంబర్‌వన్‌ ర్యాంకు పదిలంగా ఉంటుంది.

13:37 - September 28, 2017

గుంటూరు : సోనోవిజన్‌ 48వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన దసరా డిస్కౌంట్‌ సేల్‌కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. సోనోవిజన్‌ స్క్రాచ్‌ కార్డ్‌లపై 7 కార్లను బహుమతులుగా అందజేశారు. ఈనెల 25,26,27 తేదీల్లో ఈ బహుమతులు ప్రదానం చేశారు. గుంటూరు సోనోవిజన్‌ షోరూంలో.. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు లక్కీడ్రా తీసి కారు, ఎల్‌ఈడీటీవీ, రిఫ్రిజిరేటర్‌ అందించారు. అదేవిధంగా విజయనగరం, ఒంగోలు, రేపల్లే, గాజువాక, కాకినాడ, నర్సాపురంలో ప్రజాప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు. 

13:36 - September 28, 2017

హైదరాబాద్ : విద్యానగర్‌ ఆంధ్రాబ్యాంక్‌ బ్రాంచ్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బ్యాంక్‌ ఉద్యోగులు, తమ కస్టమర్లతో కలిసి బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం తమ బ్యాంక్‌లో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటామని ఈ సంవత్సరం కూడా కస్టమర్లతో కలిసి వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని బ్యాంక్‌ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.

13:35 - September 28, 2017

కడప : జిల్లా పెద్దముడియం మండలం ఉలవపల్లెలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో..ఉలవపల్లె సమీపంలోని కాశివారివంక ఉద్ధృతంగా ప్రవహస్తోంది. వంకను దాటేందుకు యత్నించిన వీఆర్‌ఏ బిల్లా సుబ్బరాయుడు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. మరునాడు ఉదయం ముళ్లపొదల్లో సుబ్బరాయుడు మృతదేహం చిక్కుకుని కనిపించింది. 

మొక్కజన్న కు గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల ధర్నా

వనపర్తి: మార్కెట్ యార్డులో రైతులు ధర్నాకు దిగారు. పురుగు మందు డబ్బాలతో రైతులు ధర్నా చేపట్టారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

నగరంలో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్ : నగరంలో పలు చోట్ల వర్షం పడుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లిలో వర్షం పడుతోంది. దీంతో వాహన దారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

13:26 - September 28, 2017

రోడ్డు పక్కన ఉండే బండ్లు..ఇతరత్రా ప్రాంతాల్లో విక్రయించే ఆహార పదార్థాలను అసలు భుజించవద్దని పెద్దలు చెబుతుంటారు. ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని హెచ్చరిస్తుంటారు. కొంతమందికి ఫుడ్ పాయిజనింగ్ వల్ల పలు సమస్యలు ఎదుర్కొంటుంటారు. వాంతులు..వికారంతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

వికారంగా అనిపించే సమయంలో మూడు పూటలా ఒక స్పూన్ మోతాదులో తేనే తీసుకోవాలి. రెండు అరటిపళ్లు పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును పాలలో కలిపి తీసుకుంటే బెటర్. ఒక కప్పు నీళ్లలో ఒక స్పూను జీలకర్ర వేసి మరిగించాలి. ఇందులోనే చిటికెడు ఉప్పు వేసి కలిసి తీసుకోవాలి. నీరసంగా ఉన్న సమయంలో ఒక అరటిపండు తింటె బాగుంటుంది. ప్రతి నిత్యం పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ చిట్కాలు పాటిస్తే ఫుడ్ పాయిజనింగ్ ప్రభావం తగ్గుతుంది. ఒకవేళ ఇంకా తగ్గలేనిపక్షంలో వైద్యుడిని సంప్రదించడం బెటర్. 

13:23 - September 28, 2017
13:22 - September 28, 2017

హైదరాబాద్ : రాజేంద్రనగర్ అత్తాపూర్ లో పూజిత అనే యువతి ఆత్మహత్య పాల్పడింది. తల్లిదండ్రులు షాపింగ్ వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరివేసుకుని పూజిత ఆత్మహత్య చేసుకుంది. నాలుగు రోజుల్లో నిశ్చితార్థం ఉండగా అఘాయిత్యం చేయడంతో పలు అనుమానాలకు దారి తీస్తోంది. ప్రస్తుతం పూజిత ఎంటెక్ చేస్తున్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:21 - September 28, 2017

ప్రకాశం : జిల్లా కొత్తపట్నం బీచ్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. దసరా సెలవులు కావడంతో 10 మంది స్నేహితులు సముద్ర స్నానానికి వెళ్లారు. 10 మందిలో ఇద్దరు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని షేక్ అహ్మద్ గా గుర్తించారు. మరో విద్యార్థి నాగ పవన్ కోసం ముమ్మర గాలింపు చెపట్టారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:19 - September 28, 2017

కడప : జిల్లాలో సెల్ఫీ సరదా ప్రాణాలు తీసింది. సెల్పీ తీసుకునే క్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి గన్ మెన్ చంద్రశేఖర్ రెడ్డి గన్ మిస్ ఫైర్ అయింది. చంద్రశేఖర్ రెడ్డి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

మెట్రో స్టేషన్ పరిశీలన పేరుతో కాంగ్రెస్ డ్రామా: మంత్రి తలసాని

హైదరాబాద్: మెట్రో స్టేషన్ పరిశీలన పేరుతో కాంగ్రెస్ డ్రామా కంపెనీ డ్రామా చేసిందని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రపంచానికి తలమానికం కాబోతోంది అని తెలిపారు. అంతర్జాతయ ప్రమాణాలతో మెట్రో నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. భూసేకరణలో అనేక అవాంతరాలు, ఇబ్బందులు అధిగమించి మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. మెట్రోకు పైసా కూడా ఎక్కువ ఖర్చు చేయలేదన్నారు.

12:47 - September 28, 2017

హైదరాబాద్ : మాదాపూర్‌ బిగ్‌ సీ హెడ్ ఆఫీస్‌లో దసరావళి లక్కీ డ్రా విజేతల్ని ప్రకటించారు. 36 రోజులు 36 కార్ల ధమాకా ఆఫర్‌లో భాగంగా మొదటివారం లక్కీ డ్రా విజేతల్ని ప్రకటించారు. మొత్తం ఏడుమంది విజేతలు కార్లను గెలుచుకున్నారు. ఈ దసరాకు లక్కీ డ్రాతో పాటు మొబైల్ కొనుగోలుపై మరిన్ని ఆఫర్లు ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని బిగ్ సి వ్యవస్థాపకులు బాలు చౌదరి తెలిపారు. 

12:46 - September 28, 2017

తూర్పుగోదావరి : చల్లని సాయంత్రం..ఓ వైపు గోదారి పరవళ్లు..మరోవైపు సాంప్రదాయ నృత్యాలు..ఇంకోవైపు నదీమతల్లికి హారతులు..ఇలా నేత్రపర్వంగా సాగింది గోదావరి ఉత్సతం. దసరా సందర్భంగా ఏపీ పర్యాటక శాఖ రెండు రోజుల పాటు గోదావరి ఉత్సవాన్ని రాజమండ్రిలో అంగరంగవైభవంగా నిర్వహిస్తోంది. తొలిరోజు అమరావతి వైభవంపై పద్మశ్రీ ఆనంద్‌ శంకర్‌ బృందం చేసిన భరతనాట్యం, మ్యూజిక్‌డైరెక్టర్‌ శివమణి సంగీత ప్రదర్శన, సినీ గాయకుడు సింహా బృందం ఆలపించిన సినీ విభావరి ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. 

12:45 - September 28, 2017

మేడ్చల్ : బోడుప్పల్‌లో బోడుప్పల్ మున్సిపాలిటీ కాలనీల సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మహా బతుకమ్మ సంబరాలు అంబరన్నంటాయి. టీజేఏసీ చైర్మన్ కోదండరాం దంపతులు, ఐద్వా తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ బి హైమావతి పాల్గొన్నారు. కోదండరాం దంపతులు , హైమావతి బతుకమ్మ ఆడి సందడి చేశారు. సద్దులబతుకమ్మను మహిళలు ఘనంగా నిర్వహించాలన్న కోదండరామ్‌.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. 

12:44 - September 28, 2017

అనంతపురం : జిల్లా పుట్టపర్తిలో భారీ వర్షం పడింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.రహదారులన్నీ జలమయంగా మారాయి. చిన్న చిన్న డ్యాములు, చెరువుల్లోకి భారీగా నీరు చేరింది. అమగొండ్యాపాళ్యం అడవి పెద్ద ఎత్తున నీరు రావడంతో సాహెబ్‌ చెరువు నిండుతోంది. బోర్లలో నీరు లేక ఎండిపోయిన సమయంలో రాత్రి వర్షం కురవడంతో... రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

12:43 - September 28, 2017

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతల ఠాణా గ్రామాలు మిడ్‌ మానేరు కింద ముంపునకు గురవుతున్నాయి. భూ నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం చేయడంతో ఇక్కడి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మిషన్‌ భగీరథలో భాగంగా మిడ్‌ మానేరును 4.4 టీఎంసీల నీరు నింపడానికి ప్రభుత్వం నిశ్చయించింది. గ్రామాలను ఖాళీ చేయాలంటూ గతంలో డప్పుచాటింపులు కూడా వేయించింది. ప్రభుత్వం నష్టపరిహారంతో పాటు పునరావాసం కల్పిస్తామనడంతో.. అరవై ఏళ్ల నుంచి ఉన్న ఊరిని వదులుకోవడానికి గ్రామస్తులు సిద్దమయ్యారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రాక, పునరావాసం చూపించక పోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

అసైన్డ్‌ భూములకు కూడా నష్టపరిహారంగ్రామంలోని కొన్ని అసైన్డ్‌ భూములకు కూడా నష్టపరిహారం చెల్లించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామం మునిగిపోతున్నప్పటికీ తమ ఇళ్లను భూములను అధికారులు నోటిఫై చేయకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలోని కొంత మంది నిర్వాసితులకు నష్టపరిహారం రావడంతో వారు వారి ఇళ్లకు తాళం వేసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లగా నష్టపరిహారం రాని వారు బిక్కు బిక్కుమంటూ అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. నష్టపరిహారం చెల్లించాలంటూ ముంపు బాధితులు అనేక మార్లు జిల్లా అధికారులకు మొర పెట్టుకున్నప్పటికీ పట్టించుకోకపోవడం లేదని వాపోతున్నారు. నష్టపరిహారం ఇవ్వకపోతే.. మిడ్‌ మానేరులో నీరు వచ్చినా గ్రామాన్ని ఖాళీ చేసేది లేదని గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు. ప్పటికైనా ప్రభుత్వం తమకు నష్ట పరిహారం చెల్లించాలని బాధిత కుటుంబాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

12:42 - September 28, 2017

హైదరాబాద్ : నగరంలో ట్రాఫిక్‌ సమస్య నిత్యకృత్యం అయ్యేటట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకూ మెట్రో నిర్మాణ పనులతో నగర ప్రజల జీవితం ట్రాఫిక్‌లోనే గడిచిపోయింది. అది ఓ కొలిక్కి వచ్చిందని అనుకునేలోపే ... మళ్లీ ఫ్లై ఓవర్ల నిర్మాణం తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లో నూతన ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ మల్టీ లెవెల్‌ ఫ్లై ఓవర్ల పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి.

జీహెచ్‌ఎంసీ ఫ్లైఓవర్ల పనులకు అనుమతులు
జీహెచ్‌ఎంసీ ఫ్లైఓవర్ల పనులకు అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అనుమతులు రాగానే దసరా తర్వాత మొదటి దశగా మూడు జంక్షన్‌ల వద్ద పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే వీటి నిర్మాణం వల్ల ఎటువంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. కానీ అది సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పినట్టు సమాచారం.

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వైపు నుంచి క్యాన్సర్‌ ఆస్పత్రివైపు
తొలుత జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వైపు నుంచి క్యాన్సర్‌ ఆస్పత్రివైపు రెండు లైన్లతో మొదటి వరుస ఫ్లై ఓవర్‌, పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వైపు మూడు లైన్లతో రెండోవరుస ఫ్లై ఓవర్‌ నిర్మించనున్నారు. మొదట రెండోవరస ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని మొదలుపెట్టనున్నారు. ఈ మేరకు ఏ ఆటంకాలు రాకుండా అయితే మెట్రోతో ఏళ్ల తరబడి... నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలతో విస్తుపోయిన ప్రజలకు... మళ్లీ అవే కష్టాలు కొనసాగనున్నట్టు తెలుస్తోంది. మూడు జంక్షన్‌లలో ఒకేసారి ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపడితే... ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కోకతప్పదు. 

కారు అద్దాలు పగులగొట్టి దోచేశారు...

రంగారెడ్డి : శంషాబాద్‌ సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఎదుట నిలిపి ఉన్న కారు అద్దా లను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి అందులోని లక్షన్నర నగదు, డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారు. ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుల ఆచూకీ కోసం క్లూస్‌టీంను రప్పించారు. రాజేంద్రనగర్‌లో కొన్ని మాసాల క్రితం కారు అద్దాలు పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఇది కూడా వారి పనేనా అని అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నిన్న (బుధవారం) జరిగింది.

12:31 - September 28, 2017

మేడ్చల్ : జిల్లా కీసరలో ట్రైనింగ్ విమానం కుప్పకూలింది. కీసర సమీపంలోని స్లీమీ క్రషర్ మిషన్ దగ్గర విమాన కూలడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:30 - September 28, 2017

హైదరాబాద్ : సినిమా రివ్యూలపై నిర్మాత శోభు యార్లగడ్డ ఫైర్ అయ్యారు. ఓ వెబ్ సైట్ పై ఆయన మండిపడ్డాడు. సినిమా పూర్తి గా చూడకుండా రివ్యూ రాశారని ధ్వజమెత్తారు. సగం సినిమా చూస్తూ మొబైల్ లో రివ్యూలు రాసేవారు తమ పనికి న్యాయం చేయలేరని శోభు అన్నారు. ప్రతి సినిమాను జాగ్రత్తగా గమనించి రాయాలని ఆయన సూచించారు. ఇష్టం వచ్చినట్టు రాసే ముందు ఎంతో మంది శ్రమను గుర్తించాలని శోభు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

కూలిన శిక్షణ విమానం:క్షేమంగా ఫైలెట్లు

మేడ్చల్ : కీసర మండలం అంకిరెడ్డి పల్లిలో శిక్షణ విమానం కూలింది. ఈ ప్రమాదం నుండి ముగ్గురు ఫైలెట్లు క్షేమంగా బయటపడ్డారు.

కడపలో గన్ మిస్ ఫైర్ :గన్ మెన్ మృతి

కడప: మంత్రి ఆదినారాయణ రెడ్డి గన్ మెన్ చంద్రశేఖర్ రెడ్డి గన్ మిస్ ఫైర్ అయ్యింది. చంద్రశేకర్ రెడ్డి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అప్రమత్తమై ఆసుపత్రికి తరలిస్తుండగా గన్ మెన్ మృతి చెందాడు.

సినిమా రివ్యూలపై నిర్మాత శోభు ఫైర్

హైదరాబాద్: సినిమా రివ్యూలపై నిర్మాత శోభు యార్లగడ్డ ఫైర్ అయ్యారు. ఓ వెబ్ సైట్ పై శోభు మండిపడ్డారు. సినిమాను పూర్తిగా చూడకుండా రివ్యూ రాశారని ధ్వజమెత్తారు. సగం సినిమా చూస్తూ మొబైల్ లో రివ్యూవు రాసేవారు తమ పనికి న్యాయం చేయలేరని శోభు స్పష్టం చేశారు. ప్రతి సినిమాకు జాగ్రత్తగా గమనించి రివ్యూ రాయాలని శోభు సూచించారు.

12:05 - September 28, 2017

అనంతపురం : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష కొనసాగుతోంది. ఈ రోజు నలుగురు రోగులు మృతి చెందడంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 14 మందికి చేరింది. మృతుల్లో కుల్లాయప్ప, ఉమాదేవి, హనుమక్క, కొండమ్మ ఉన్నారు.మరో 11మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆసుపత్రికి వస్తున్న రోగులు చనిపోతుండడంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

11:40 - September 28, 2017

కృష్ణా : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గామాత దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 8వ రోజైన ఇవాళ కనకదుర్గ... దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని చూడడానికి భారీగా తరలివస్తుండడంతో... క్యూలైన్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. దుర్గాదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని... కష్టాలన్నీ తొలగిపోతాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు. 

కొత్తపట్నం బీచ్ లో గల్లంతైన ఇద్దరు విద్యార్థులు

ప్రకాశం: కొత్తపట్నం బీచ్ లో  ఇద్దరు విద్యార్థులు  గల్లంతయ్యారు. ఒంగోలు ఎన్ ఆర్ఐ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నాగపవన్ గల్లంయ్యాడు. 10 మంది విద్యార్థులు విహార యాత్రకు వెళ్లారు. మరో విద్యార్థి పాలిటెక్నిక్ రెండో సంవత్సర చదువుతున్న మహ్మద్ అక్బర్ అల్ఫాగా గుర్తించారు. వీరిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీయగా.. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

11:35 - September 28, 2017

మేడ్చల్ : జిల్లా కీసర మండలంలో యద్గర్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చేపపిల్లల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు నుంచి సర్వీస్‌ రోడ్డుపైకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లా నుంచి మెదక్‌ జిల్లాకు చేపపిల్లలు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

11:31 - September 28, 2017

కేరళలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

తిరువనంతపురం: కేరళలో ఏడేళ బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారు. రబ్బర్ ఎస్టేట్ వద్ద బాలిక మృదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అఘాయిత్యానికి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

11:23 - September 28, 2017

తిరుమలలో కానిస్టేబుల్ పై ఎస్సై దాడి...

తిరుమల : రాంభగీచ గెస్ట్ హౌస్ 2 వద్ద కానిస్టేబుల్ పై ఎస్సై రాజశేఖర్ రెడ్డి దాడి చేశాడు. ఎస్సై పైఔ ఉన్నతాధికారులకు కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. మహిళా భక్తుల పట్ల కూడా ఎస్సై రాజశేఖర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించడాని ఆరోపణలు వచ్చాయి.

11:17 - September 28, 2017

 

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తన తాజా చిత్రానికి సంబంధించిన ఓ లుక్ బయటకొచ్చింది. ఏ చిత్రాల్లో నటించినా స్టైల్ వైవిధ్యంగా కనబడాలని 'బన్నీ' కోరుకుంటుంటాడు. డ్యాన్స్..ఫైట్స్..స్టైల్..ఇలా ప్రతి సినిమా సినిమాకు భిన్నంగా కనబడే ప్రయత్నం చేస్తుంటాడనే సంగతి తెలిసిందే. 'డీజే దువ్వాడ జగన్నాథం' చిత్రం అనంతరం ఆయన 'వక్కంతం వంశీ' దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.

ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది కూడా. 'నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'అల్లు అర్జున్‌' ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం 'బన్నీ' కొన్నింటిలో శిక్షణ తీసుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఊటీలో చిత్రీకరణ జరుగుతోంది. లైట్ గా ఫేస్ కట్ ఛేంజ్ కావడం..ఆర్మీ హెయిర్ స్టైల్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. 'అల్లు అర్జున్‌' న్యూ లుక్‌ అదిరిందని అభిమానులు సంతోష పడుతున్నారంట. ఇక ఈ సినిమాలో 'బన్నీ' సరసన 'అనూ ఇమ్మాన్యుయేల్‌' హీరోయిన్ గా నటిస్తోంది. 

11:11 - September 28, 2017

టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుల్లో 'పూరీ జగన్నాథ్' ఒకరు. తన చిత్రాల్లో హీరో..హీరోయిన్ల గెటప్..ఇతర విషయాల్లో వెరైటీగా చూపిస్తుంటాడు. తన మార్కును తన చిత్రాల్లో చూపించి ఆయా హీరోలు..హీరోయిన్ల అభిమానాన్ని చూరగొనడంలో 'పూరీ' దిట్ట. గత చిత్రాలు ఆయనకు మంచి విజయాలే అందించాయి కానీ కొన్ని చిత్రాలు డిజాస్టర్ గా మిగులుతున్నాయి. ఆయన దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన 'పైసా వసూల్' చిత్రం కూడా మరోసారి నిరాశపరిచింది. ఈ చిత్రంలో 'బాలకృష్ణ' హీరోగా నటించారు.

ఇదిలా ఉంటే పూరీ తనయుడు 'ఆకాష్' ను హీరోగా లాంచ్ చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. నేడు పూరీ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ కొత్త సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు 'మెహబూబా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 1971 భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో సినిమా ఉండనుంది. మంగళూరు మోడల్ 'నేహా శెట్టి' హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాకు సందీప్ చౌతా సంగీతమందించనున్నారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ లలో షూటింగ్ జరుపుకోనుంది. అక్టోబ్ నుండి ప్రారంభమయ్యే ఈ సినిమా విశేషాలు త్వరలో తెలియనున్నాయి. 

11:05 - September 28, 2017

అనంతపురం : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష కొనసాగుతోంది. ఈ రోజు నలుగురు రోగులు మృతి చెందడంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 14 మందికి చేరింది. మరో 11మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆసుపత్రికి వస్తున్న రోగులు చనిపోతుండడంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

10:51 - September 28, 2017

ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టగలరా ? కష్టంగానే ఉంది కదా...కానీ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాగా వేషం మాత్రం వేసుకున్నాడు..కానీ ఎవరనేది తెలియడం లేదు అంటున్నారా ? కానీ నిజంగా మాత్రం అమితాబ్ మాత్రం కాదు.

పలువురు హీరోలు..హీరోయిన్స్ లు ఇతర నటీ నటులను అనుకరిస్తుండడం చూస్తూనే ఉంటాం. వారిల్లాగా డైలాగ్ లు పలుకుతూ..అచ్చం వారిలాగే తయారయ్యి తమ అభిమానులను అలరిస్తుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి 'శిల్పా శెట్టి' చేరిపోయారు. దర్శకురాలు..కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ ఓ కామెడీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో భాగంగా 'శిల్పాశెట్టి' బిగ్ బి 'అమితాబ్' లా తయారయ్యారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ గా మారిపోయింది. అమితాబ్ పై ప్రేమ, గౌరవంతో ఇలా చేయడం జరిగిందని, తాను చేసిన అతి కష్టమైన టాస్క్ ఇదేనని 'శిల్పా శెట్టి' పేర్కొన్నారు.  ఆమె వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. శిల్పాశెట్టి బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. 'సాహస వీరుడు సాగర కన్య', 'ఆజాద్', 'భలేవాడివి బాసూ' చిత్రాల్లో నటించారు. 

బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్: బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ రమీజ్ అహ్మద్ పార్రేను బందిపోరలోని హజిన్‌లో ఉగ్రవాదులు అతి దారుణంగా కాల్చి చంపారు. లీవ్‌లో ఉన్న రమీజ్.. తన సొంత ఊరుకు వెళ్లాడు. తన ఊరు వద్ద కాపు కాసిన ఉగ్రవాదులు అతడి ఇంటి వద్ద కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రమీజ్ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా... రమీజ్ ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు గాయపడ్డారు.

కిడ్నాప్ కు గురైన యువకులను రక్షించిన పోలీసులు..

విజయవాడ: అజిత్‌సింగ్‌నగర్‌లో నిన్న కిడ్నాప్‌కు గురైన ఇద్దరు యువకులను పోలీసులు క్షేమంగా రక్షించారు. యువకులను కిడ్నాప్‌ చేసి తీసుకెళుతున్న నలుగురిని పోలీసులు వెంబడించారు. చిలకలూరిపేట వద్ద వీరిని అరెస్టు చేశారు. నిందితులను అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. డబ్బు వివాదమే కిడ్నాప్‌నకు కారణమని పోలీసులు గుర్తించారు.

తిరుమలలో ప్రారంభమైన హనుమంత వాహనసేవ

తిరుమల: తిరుమలలో శ్రీవారి హనుమంత వాహన సేవ వైభవంగా ప్రారంభమైంది. ఈ సేవ ఉదయం 11గంటల వరకు జరుగుతుంది. హనుమంతుడు శ్రీరామునికి సేవలందించిన తీరును ప్రస్ఫుటించేలా ఈ సేవ జరుగుతోంది. గోవింద నామస్మరణలతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. తిరువీధులు భక్తజనసంద్రాన్ని తలపిస్తున్నాయి. నేటి సాయంత్రం స్వర్ణ రథోత్సవం, ఆ తర్వాత గజవాహన సేవలు జరగనున్నాయి.

14కు చేరిన 'అనంత' ప్రభుత్వాసుపత్రి మృతుల సంఖ్య

అనంతపురం: ప్రభుత్వాసుపత్రిలో మృత్యుఘోష కొనసాగుతుంది. మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ రోజు నలుగురు రోగులు మృతి చెందారు. నిన్న పది మంది రోగులు మృతి చెందారు. రోగుల మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుల పేర్లు కుళ్లాయప్ప, ఉమాదేవి, హనమక్క, కొండమ్మ.

10:17 - September 28, 2017

తిరుమల ఘాట్ రోడ్డులో సుమో బోల్తా:7గురి మృతి

తిరుమల: తిరుమలలో బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. 12-13 మలుపు వద్ద చెట్టును ఢీకొని సుమో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. గరుడసేవ అనంతరం తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తెల్లవారు జామును 2.40 గంటలకు ఈ ఘటన జరిగింది.

10:10 - September 28, 2017

ఆదిలాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్ మండలం బోరజ్ దగ్గర కారు డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని రిమ్స్ కు తరలించారు. మృతులు జైనథ్ మండలం గిమ్మకు చెందిన వారిగా గుర్తించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:06 - September 28, 2017

అనంతపురం : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష కొనసాగుతోంది. ఈ రోజు నలుగురు రోగులు మృతి చెందడంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 14 మందికి చేరింది. ఆసుపత్రికి వస్తున్న రోగులు చనిపోతుండడంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

అనంతలో కొనసాగుతున్న మృత్యుఘోష

అనంతపురం : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష కొనసాగుతోంది. ఈ రోజు నలుగురు రోగులు మృతి చెందడంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 14 మందికి చేరింది. 

09:37 - September 28, 2017

కుషాయిగూడలో దారుణం

హైదరాబాద్ : నగరంలోని కుషాయిగూడలో దారుణం చోటుచేసుకుంది. అడ్వకేట్ గోపాల్ రెడ్డిపై అంజిరెడ్డి అనే వ్యక్తి దాడికి తెగపడ్డాడు. క్లైంట్ రూమ్ లోకి వచ్చి గోపాల్ రెడ్డిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. అంజిరెడ్డి గోపాల్ రెడ్డి మెడపై కత్తిపెట్టి బంగారు గొలుసు, ఉంగరాలు తీసుకున్నాడు. తిరిగివెళ్తూ మెడపై కత్తితో కొయడంతో గోపాల్ రెడ్డికి మెడపై తీవ్ర గాయం ఏర్పడింది. ఆయనను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.

08:10 - September 28, 2017

హైదరాబాద్ : నగరంలోని కుషాయిగూడలో దారుణం చోటుచేసుకుంది. అడ్వకేట్ గోపాల్ రెడ్డిపై అంజిరెడ్డి అనే వ్యక్తి దాడికి తెగపడ్డాడు. క్లైంట్ రూమ్ లోకి వచ్చి గోపాల్ రెడ్డిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. అంజిరెడ్డి గోపాల్ రెడ్డి మెడపై కత్తిపెట్టి బంగారు గొలుసు, ఉంగరాలు తీసుకున్నాడు. తిరిగివెళ్తూ మెడపై కత్తితో కొయడంతో గోపాల్ రెడ్డికి మెడపై తీవ్ర గాయం ఏర్పడింది. ఆయనను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. గోపాల్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:42 - September 28, 2017

సామాన్య ప్రజలపట్ల ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేదని, సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణల శాతం కేవలం 4శాతం మాత్రమేనని, గతంలో ఏజెన్సీలో మరణలపై మంత్రి పట్టించుకోలేదని వైసీపీ నేత పద్మజా రెడ్డి అన్నారు. జరిగింది దురదృష్టకర సంఘటన అని, బడ్జెట్ లో 5 శాతం నిధులను ఆరోగ్యంపై ఖర్చు పెడుతుందని, దీనిపై ప్రభుత్వం భవిష్యత్ అన్ని చర్యలు తీసుకుంటుందని, గతంలో ఆరోగ్య శ్రీ అక్రమాలు జరిగాయని, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ను తీసుకొచ్చమని, గతంలో 23 జిల్లాలకు 11వందల కోట్లు ఖర్చు పెట్టారని కానీ ఇవాళ 13 జిల్లాలకు అంతే ఖర్చు పెడుతుందని టీడీపీ నేత సుబ్బరావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ అంక్షలు

హైదరాబాద్ : నేడు సద్దుల బతుకమ్మ సందర్బంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ అంక్షలు విధించనున్నారు. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ అంక్షలు అమలులో ఉంటాయి.

నేడు సద్దుల బతుకమ్మ

హైదరాబాద్ : నేడు తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండగ సందర్బంగా ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు బతుకమ్మలను ఊరేగించనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఉదయం 9గంటల నుంచి మహిళలు బతుకమ్మలు పేర్చనున్నారు.

పశ్చిమగోదావరిలో కళా వెంకట్రావు పర్యటన

పశ్చిమగోదావరి : నేడు జిల్లాలో మంత్రి కళా వెంకట్రావు పర్యటించనున్నారు. ఆయన పాలకొల్లు మండలం అడవిపాలెంలో విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయాన్ని ప్రారభించనున్నారు.

నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో వన్డే

బెంగళూర్ : నేడు భారత్ ఆస్ట్రేలియా నాలుగో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కి వాన ముప్పు ఉంది.

నేటి నుంచి ఏపీలో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం

గుంటూరు : నేటి నుంచి ఏపీలో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేయనున్నారు. సీట్ బెల్డ్, హెల్మెట్ లేకుంటే నో పెట్రోల్ నిబంధన విధించారు. దినికనుగుణంగా అన్ని పెట్రోలు బంకులకు ఆదేశాలు జారీ చేశారు.

దుర్గాదేవి రూపంలో అమ్మవారి దర్శనం

కృష్ణా : విజయవాడ ఇందకీలాద్రిపై దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు దుర్గాదేవి రూపంలోప అమ్మవారి దర్శనం ఇవ్వనున్నారు.

07:38 - September 28, 2017

ఆర్టీసీ అత్యంత ప్రజోపయోగ రవాణ సంస్థ. ఈ సంస్థకు ఆయువుపట్టు సంస్థ కార్మికులే. మరి ఆ కార్మికుల సంక్షేమం పట్ల యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంత ? అసలు ఆర్టీసీ పట్ల ప్రభుత్వానికి ఉన్న విధానం ఏంటి ? తెలంగాణ సాధనకై ఎన్నో ఉద్యమాలు చేశామని, మూడున్నర ఎళ్లలో ఒక్క ఆర్టీసీ ఉద్యోగం ఇవ్వడంలేదని, సకలజనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులకు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారని, కానీ ఆర్టీసీ కార్మికులను సీఎం విస్మరించడం జరిగిందని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రాజిరెడ్డి అన్నారు. ఆర్టీసీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పని భారమని, ప్రభుత్వ విధానంలో భాగంగా 2017 కార్మికులకు రావాల్సింది ఒక నెల ముందుగానే ఇస్తామని సీఎం అన్నారని ఎస్ డబ్ల్యూఎఫ్ నేత విఎస్ రావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:37 - September 28, 2017

బెంగళూరు : బెంగళూర్‌లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య 4వ వన్డేకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో 2 సార్లు చాంపియన్‌ ఇండియా....5 సార్లు వన్డే చాంపియన్‌ ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న ఈ కీలక వన్డేకు చిన్నస్వామి స్టేడియంలో రంగం సిద్ధమైంది. మూడు వన్డేల్లోనూ తిరుగులేని టీమిండియా....కంగారూ జట్టుపై క్లీన్‌ స్వీప్‌ సాధించాలని పట్టుదలతో ఉంది. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌, పవర్‌ఫుల్‌ బౌలింగ్‌ ఎటాక్‌తో భారత్‌ అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. హార్దిక్ పాండ్య ఆల్‌రౌండర్‌గా అదరగొడుతుండటంతో భారత్‌ మునుపెన్నడూ లేనంతలా దుర్భేధ్యంగా కనిపిస్తోంది.

కొహ్లీ, రోహిత్‌ ఫామ్‌లోకి
కోల్‌కతా వన్డేతో విరాట్‌ కొహ్లీ, ఇండోర్ వన్డేతో రోహిత్‌ శర్మ ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనడంలో అనుమానమే లేదు. యంగ్‌ స్పిన్‌ గన్స్‌ కుల్దీప్‌ యాదవ్‌,యజ్వేంద్రచహాల్‌ను ఎదుర్కోవడానికి కంగారూ బ్యాట్స్‌మెన్‌ ఎన్న కష్టాలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 5 వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 3-0తో నెగ్గిన భారత్‌....ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది.దీంతో 4వ వన్డేలో టీమ్‌ కాంబినేషన్‌తో భారత్‌ ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి. మరోవైపు స్టీవ్‌ స్మిత్‌ సారధ్యంలోని ఆస్ట్రేలియా జట్టు అయోమయంలో ఉంది.మూడు వన్డేల్లో కొహ్లీ సేనకు గట్టి పోటీ కూడా ఇవ్వలేక కంగారూ టీమ్‌ చేతులెత్తేసింది.

పరువు దక్కించుకోవాలని
ఇప్పటికే సిరీస్‌ కోల్పోయినా ఆస్ట్రేలియా ...ఆఖరి 2 వన్డేల్లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. వరుస విజయాలతో జోరు మీదున్న విరాట్‌ ఆర్మీకే బెంగళూర్‌ వన్డేలోనూ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి నాలుగో వన్డేలో అయినా వరల్డ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా, ఇండియాకు కనీస పోటీ అయినా ఇస్తుందో లేదో చూడాలి.

 

07:36 - September 28, 2017

ఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ దిగజారుతుండడంతో మోది ప్రభుత్వంపై సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిజెపికి చెందిన మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్‌ సిన్హా ప్రస్తుత ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని టార్గెట్‌ చేశారు. ఆంగ్ల దినపత్రిక 'ద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' కు రాసిన కథనంలో జైట్లీ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దిగజార్చారని మండిపడ్డారు. మోది ప్రభుత్వం కీలకంగా భావించిన నోట్ల రద్దు కారణంగా అగ్నిలో ఆజ్యం పోసినట్లు.... ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందని యశ్వంత్‌ సిన్హా ధ్వజమెత్తారు. జైట్లీ చేసిన తప్పులపై ఇప్పటికి కూడా తాను స్పందించకపోతే భారతీయుడిగా తన ప్రాథమిక విధిని విస్మరించినట్లేనని ఆయన తెలిపారు. బిజెపి నేతల్లో చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని...వారు చెప్పడానికి భయపడుతున్నారని యశ్వంత్‌సిన్హా అన్నారు. ప్రస్తుతం ఎవరికీ ఉపాధి లభించడం లేదని, అభివృద్ధి మందగించిందని...దీని ప్రభావం పెట్టుబడులు, జిడిపిపై చూపుతోందని ఆయన పేర్కొన్నారు.

07:35 - September 28, 2017

గుంటూరు : రహదారి భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హెల్మెట్‌, సీటు బెల్టు నిబంధనలను తప్పనిససి అమలు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు ఎన్నో విలువైన ప్రాణాలు బలితీసుకుంటున్న నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. హెల్మెట్‌, సీటు బెల్టు పెట్టుకోకుండా వచ్చే వాహనచోదకులకు పెట్రోలు, డీజిల్‌ అమ్మకుండా ఆంక్షలు విధించారు.

ఎవరు కూడా అలసత్వం ప్రదర్శించవద్దని
రోడ్డు ప్రమాదాల నివారణలో ఎవరు కూడా అలసత్వం ప్రదర్శించవద్దని చంద్రబాబు ఆదేశించారు. రహదారి భద్రత కోసం వినియోగించే పరికరాల కొనుగోలుకు రూ.10 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. రవాణ వాహనాల యజమానులు తమ డ్రైవర్లకు భద్రత ప్రాధాన్యత తెలిచెప్పడంతోపాటు, వీరిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు గురించి తెలియజేయాలని కోరారు. ప్రమాదల నివారణకు పోలీసు, రవాణా శాఖల్లో జవాబుదారితనం మరింత పెరగాలని చంద్రబాబు సూచించారు. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న రోడ్లను గుర్తించి నివరాణ చర్యలకు సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంలో పని చేయాలని కోరారు.

ఆటోలను నియంత్రించాలని
ప్రమాదాలకు కారణం అవుతున్న ఓవర్ లోడ్ ఆటోలను నియంత్రించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. హదారి భద్రత పట్ల ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. నెలవారీ సమీక్షలో అధికారుల అలసత్వం తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కువ శాతం ప్రమాదాలు కాపలా లేని కూడళ్లలో జరుగుతున్నాయని , ఇలాంటి చోట్ల తక్షణమే కాపలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని రోడ్లతోపాటు జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణలు తొలగించాల్సిన అవసరాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అవసరమైతే కమ్యూనిటీ పోలీసింగ్ వినియోగించుకోవాలని సూచించారు.

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. అన్ని స్కూల్ బస్సులు, ప్రయాణికుల వాహనాలకు స్పీడ్ గవర్నెన్స్ తప్పనిసరి చేశారు. రాష్ట్రంలోని అన్ని వాహనాలకు జిపీయస్ అమర్చే అంశం పరిశీలించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులు, ట్రామాకేర్ సెంటర్ల వివరాలతో ప్రత్యేక యాప్ తయారు చేయాలని ఆదేశించారు.ప్రమాదాల్లో శాశ్వత వైకల్యం పొందిన వారికోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చంద్రబాబు ఆధికారుల దృష్టికి తెచ్చారు. రహదారుల భద్రతకు వినియోగిస్తున్న వాహనాలు, 108 వాహనాలన్నింటికీ జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. ప్రమాద సమాచారం దగ్గరలో ఉన్న అన్ని వాహనాలకు అందేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.

07:34 - September 28, 2017

మహబూబ్ నగర్ : జిల్లాలో ఇద్దరు మహిళా ఉద్యోగుల మధ్య ఘర్షణ జరిగింది. బస్సులో ఎక్కిన మహిళా కానిస్టేబుల్‌ టికెట్‌ తీసుకోలేదు... దీంతో ఐడీ కార్డు చూపించాలని కండక్టర్‌ అడిగింది. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి... పరస్పరం దాడికి దిగారు. ఈ దృశ్యాలన్నీ బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో విషయం బయటకొచ్చింది. 

07:32 - September 28, 2017

చిత్తూరు : తిరుమలలో శ్రీవారి గరుడవాహన సేవల కన్నుల పండువగా సాగింది. శ్రీదేవి,భూదేవీ సమేతంగా శ్రీనివాసుడు మాడవీధుల్లో విహరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వరోజు బుధవారం ఉదయం మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీనివాసుడు.. సాయంత్రం గరుడవాహనంలో ఊరేగారు. గరుడ వాహనంపై వూరేగుతున్న స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

నిరంతరాయంగా అన్నపానీయాలు
మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలను సరఫరా చేస్తున్నారు. కాగా ఉత్సవాల్లో ఆరవరోజు గురువారం ఉదయం హన్మంతవాహనం, సాయంత్రం స్వర్ణరథంపై విహరించనున్నారు. ఏడుకొండలవాడి వైభవాన్ని తిలకించడానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. 

07:31 - September 28, 2017

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ సంబురానికి హైదరాబాద్‌ సిద్ధమైంది. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ వేడుకును రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు, కళకారులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయి. సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే వారు నేరుగా ఎల్బీ స్టేడియంకు చేరుకునే ఏర్పాటు చేశారు.

నగరంలో ట్రాఫిక్ అంక్షలు
ఏఆర్‌ పెట్రోలు బంక్‌ జంక్షన్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు ట్రాఫిక్‌ అనుమతించరు. ఇటు నుంచి వచ్చే వాహనాలను నాంపల్లి, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. ఆబిడ్స్‌, గన్‌ఫౌండ్రీ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను బీజేఆర్‌ విగ్రహం వైపు అనుమతించరు. గన్‌ఫౌండ్రీ, చాపెల్‌ రోడ్డు మీదుగా ట్రాఫిక్‌ మళ్లిస్తారు. బషీర్‌బాగ్‌ నుంచి జీపీవో వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్‌ జంక్షన్‌ నుంచి హైదర్‌గూడ, కింగ్‌కోఠి వైపు మళ్లిస్తారు. ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి హిమాయత్‌నగర్‌ వైపు మళ్లిస్తారు. కింగ్‌కోఠి నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను తాజ్‌మహల్‌ హోటల్‌ వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్‌ వైపు మళ్లిస్తారు. పోలీసు కంట్రోల్‌ రూము వైపు నుంచి బషీర్‌బాగ్‌ చౌరాస్తాకు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లిస్తారు.

భారీ భద్రత ఏర్పాట్లు
సద్దుల బతుకమ్మ వేడుకలను ఎల్బీ స్టేడియంకు వచ్చే వాహనాలకు పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. వెస్ట్‌ జోన్‌, సెంట్రల్‌ జోన్‌ నుంచి వచ్చే బస్సులు ఆయకార్‌ భవన్‌ వద్ద ఆగి, నిజాం కాలేజీలో పార్కు చేయాల్సి ఉంటుంది. నార్త్‌, ఈస్ట్‌ జోన్ల నుంచి వచ్చే బస్సులు బీజేఆర్‌ విగ్రహం వద్ద ఆగి, ఎన్టీఆర్‌ స్టేడియంకు వెళ్లి పార్కింగ్‌ చేయాలి. సౌత్‌ జోన్‌ నుంచి వచ్చే బస్సులకు పబ్లిక్‌ గార్డెన్‌లో పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. వీఐపీలు, ఇతర ఆహ్వానితుల వాహనాలకు ఆలియా కాలేజీలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. మంత్రుల వాహనాలు డీ గేటులో నుంచి ప్రవేశించి, ఆలియా మోడల్‌ స్కూల్‌ ఆవరణలో పార్కు చేయాల్సి ఉంటుంది. సద్దుల బతుకమ్మ వేడుకలను పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మఫ్టీలో షీ టీములను రంగంలోకి దింపుతున్నారు. 

Don't Miss