Activities calendar

29 September 2017

దుర్గాభాయ్ దేశ్ ముఖ్ ఆస్పత్రిపై కేసు నమోదు

హైదరాబాద్ : దుర్గాభాయ్ దేశ్ ముఖ్ ఆస్పత్రిపై కేసు నమోదు అయింది. మూర్చ వ్యాధితో విద్యార్థి వంశీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు వంశీకి ఫంగస్ ఉన్న సెలైన్ బాటిల్ ఎక్కించాడు. గమనించిన వంశీ తల్లిదండ్రులు  పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

 

అంకిరెడ్డిపల్లిలో అంధకారం

మేడ్చల్ : కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో అంధకారం నెలకొంది. విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపంతో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

 

21:50 - September 29, 2017

ఢాకా : బంగ్లాదేశ్‌ సముద్ర తీర ప్రాంతంలో రోహింగ్యాలను తీసుకెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. బోటు మునిగిపోయిన ఘటనలో 60 మంది రోహింగ్యాలు మృతి చెందారు. 23 మంది మృతదేహాలను వెలికితీసినట్లు యునైటెడ్‌ నేషన్స్‌ మైగ్రేషన్‌ ఏజెన్సీ ధృవీకరించింది. మరో 40 మంది మునిగిపోయి ఉంటారని భావిస్తున్నారు. పడవలో మొత్తం 80 మంది రోహింగ్యాలు ఉండగా...ఇందులో 50 మంది పిల్లలు. భారీ వర్షం, బలమైన ఈదురు గాలుల కారణంగా ఈ దుర్ఘటన జరిగింది. రాత్రంతా సముద్రంలో ప్రయాణించామని తినడానికి తిండి కూడా లేదని బాధితులు చెప్పారు. గత కొన్ని వారాలుగా మయన్మార్‌లోని రఖైన్‌ రాష్ట్రంలో రోహింగ్యాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడి నుంచి తప్పించుకుని భద్రత కోసం పొరుగున ఉన్న  బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.  5 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌లో శరణార్థులుగా ఉన్నారు. రోహింగ్యాల సమస్యను పరిష్కరించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఎంతోనియో గుతారెస్‌ మయన్మార్‌ నేతలకు విజ్ఞప్తి చేశారు.


 

21:49 - September 29, 2017

రాజస్థాన్‌ : బికనేర్‌లో ఓ యువతిపై తనపై 23 మంది అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితురాలు ఢిల్లీ నుంచి గాజులు తదితర వస్తువులు తీసుకువచ్చి బికనేర్‌లో అమ్ముతూ జీవనం సాగిస్తోంది. జైపూర్‌ రోడ్డులోని ఓ గుడివద్ద వాహనాల కోసం వేచి చూస్తుండగా...ఇద్దరు యువకులు ఎస్‌యువీ వాహనంలో యువతిని కిడ్నాప్‌ చేసి బలవంతంగా తీసుకెళ్లారు. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపారు. వారిద్దరే కాకుండా మరో ఆరుగురిని పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డారు. పలన గ్రామంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద కూడా కొందరు లైంగిక దాడి చేశారని... 26 తేదీ తెల్లవారుజామున ఎత్తుకెళ్లిన చోటే వదిలి వెళ్లారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిగతా యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 8 మంది అత్యాచారం జరిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

 

21:45 - September 29, 2017

హైదరాబాద్ : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టిబిజికెఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్. కార్మికులపై వరాల జల్లు కురిపించారు. డిపెండెంట్ ఉద్యోగాల పునరుద్ధరణతో పాటు గృహ నిర్మాణానికి వడ్డీ లేని రుణాలను అందిస్తామని ప్రకటించారు. ఇన్నాళ్లు కార్మికులకు ఏమీ చేయలేకపోయాయని జాతీయ కార్మిక సంఘాలపై కేసీఆర్ విరుచుకుపడ్డారు.

సింగరేణిలో ఎక్కువ కాలం ఏఎన్‌టీయూసీ, ఐఎన్‌టీయూసీలే గుర్తింపు సంఘాలుగా ఉన్నాయని, ఉద్యమ సమయంలో టిబిజికెఎస్ ఆవిర్భవించిందని సీఎం కేసీఆర్  అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాల హక్కును తీసేయించింది జాతీయ సంఘాలేనని మండిపడ్డారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కార్మికులనుద్దేశించి ప్రగతి భవన్‌లో మాట్లాడారు. 

వారసత్వ ఉద్యోగాలపై న్యాయసలహా తీసుకున్నామని కూడా కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ పనులను అడ్డుకునేందుకు ముఠా ఉందని, ముఠాలో ప్రత్యేకంగా లాయర్లు కూడా ఉన్నారని  కేసీఆర్ ఆరోపించారు. కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం అవసరం లేని వారికి ఇస్తున్న రూ. 12.50 లక్షలను రూ. 25 లక్షలకు పెంచుతామని కేసీఆర్ చెప్పారు. 

సింగరేణి కార్మికుల రూ.175 కోట్ల వృత్తిపన్నును రద్దు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.6లక్షల వరకు వడ్డీలేని రుణం ఇస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల ఆరోగ్యం గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, 15 వేల మందికి ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సింగరేణి పరిధిలో ఉన్న 11 డివిజన్లలోనూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధిస్తుందని  కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. 

21:33 - September 29, 2017
21:25 - September 29, 2017

ఖమ్మం :  అభయ ఆస్పత్రిలో టీఆర్‌ఎస్‌ నేతలు హల్‌చల్‌ చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న టీఆర్‌ఎస్‌ నేతను చూసేందుకు అనుమతివ్వలేదని వైద్యులపై దాడికి దిగారు. ఆపరేషన్ చేస్తుండగా ఆపరేషన్ థియేటర్ లోకి దూసుకెళ్లారు. డాక్టర్లను దుర్భాషలాడారు. అంతేకాకుండా ఆస్పత్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైద్యులు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆస్పత్రి సిబ్బంది ఆందోళన చేపట్టింది. వైద్యులు కేసు పెట్టేందుకు పీఎస్‌కు బయల్దేరుతుండగా.... టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకున్నారు. మరోవైపు నిరసన తెలుపుతున్న వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

ఖమ్మంలో వైద్యులపై టీఆర్ ఎస్ నేతల దాడి

ఖమ్మం : జిల్లాలోని అభయ ఆస్పత్రిలో టీఆర్ ఎస్ నేతల హచ్ చల్ చేశారు. ఐసీయూలోకి అనుమతించలేదని నేతలు వైద్యులపై దాడి చేశారు. ఆపరేషన్ చేస్తుండగా ఆపరేషన్ థియేటర్ లోకి దూసుకెళ్లారు. డాక్టర్లను దుర్భాషలాడారు. ఆస్పత్రి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైద్యులు ర్యాలీ నిర్వహించారు. 

21:18 - September 29, 2017

సింగరేణిలోని బొగ్గు గని కార్మికులతో మల్లన్న ముచ్చటించారు. కార్మికులతోపాటు బొగ్గుబావిలోకి వెళ్లి వారితో ముచ్చటించారు. బొగ్గు ఉత్పత్తి, కార్మికులు పడుతున్న శ్రమను తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:10 - September 29, 2017

'జబర్దస్త్' టీమ్ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కార్తీక్, మాస్ అవినాష్, పంచ్ ప్రకాశ్ మాట్లాడారు. జబర్దస్త్ షో అనుభవాలు, సినిమా అనుభవాలను తెలిపారు. పలు డైలాగ్స్ తో అలరించారు. పలు హీరోలను ఇమిటేట్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:57 - September 29, 2017

చిన్న సినిమాలతో పెద్ద డైరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న మారుతి.. బాబు బంగారం అంటూ పెద్ద సినిమా చేసి పరాజయం పాలు అయ్యాడు... అందుకే కాస్త గ్యాప్ తీసుకుని తన బలమైన కథను నమ్ముకుని దానికి ఓసిడీ అనే కొత్త కాన్సెప్ట్ ను యాడు చేసి.. ప్రెష్ స్క్రీన్ ప్లేతో, మహానుభావుడు అనే స్క్రిప్ట్ ను తయారుచేసుకున్నాడు.దానికి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న శర్వానంద్ హీరో కావడంతో, ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. పైగా పెద్ద స్టార్స్ మధ్య వచ్చి, భారీ విజయాలు అందుకోవడం శర్వానంద్ కు సెంటిమెంట్ గా మారడంతో.. ఈ సినిమా గురించి అందరూ.. ఆసక్తిగా ఎదురు చూశారు..  అలా రిలీజ్ కు ముందే మంచి క్రేజ్ ను పెంచుకున్న మహానభావుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. 
కథ..
కథ విషయానకి వస్తే. ఓ సాప్ట్ వేర్ కంపెనీలో ప్రొగ్రాం మేనేజర్ గా పనిచేస్తున్న ఆనంద్.. ఓసిడీ అనే ఓవర్ క్లీన్ లీ నెస్ ప్రొబ్లమ్ తో బాధపడుతుంటాడు. అయితే అతనికి అనుకోకుండా పరిచయం అయిన మేఘన బిహేవియర్, క్లీన్  లీ నెస్ నచ్చి ఆమెతో లవ్ లో పడతాడు.. ఆమె కూడా అతని  బిహేవియర్ నచ్చి ఇష్టపడుతుంది. తమ పెళ్ళికి తన తండ్రిని కూడా ఒప్పిస్తుంది కాని తరువాత అతని డిజార్డర్ చూసి అసహ్యించుకుని దూరం పెడుతుంది. అలా లవ్ లో ఫేయిల్ అయిన ఓసిడీ బాధితుడు ఆనంద్ మేఘనాని ఎలా కన్వింన్స్ చేశాడు.. చివరికి ఆనంద్ ప్రేమని మేఘన ఆక్సెప్ట్ చేసిందా లేదా.. ఆనంద్ తన ఓసిడీ డిజార్డర్ ను ఎలా దూరం చేసుకున్నాడు అనేది సినిమాచూసి తెలుసుకోవాలసిందే..
నటీనటులు..
నటీనటుల విషయానికి వస్తే డిఫరెంట్ అండ్ ఫన్ ఫీల్డ్ సినిమాలతో అందరి ఆడియన్స్ కి చేరువైన శర్వానంద్ మరోసారి మహానుభావుడు సినిమాతో అందరిని అలరించాడు అనే చెప్పాలి..  ఓసిడీ అనే ప్రబ్లమ్ ఉన్న ఆనంద్ క్యారక్టర్ లో ఇమిడిపోయాడు.. తన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో నాచ్యూరల్ యాక్టింగ్ ను చాలా ట్రై చేశాడు,... అతని కామెడీ టైమింగ్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలించింది.. శర్వానంద్ స్టైలింగ్ చాలాబావుంది.. ఇక మెహరిన్ మొదటి సినిమాలాగా మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారక్టర్  దక్కించుకుంది.. అపీరియన్స్ పరంగా 100% మార్కులు దక్కించుకుంది.. స్కిన్ షో చేయకుండానే మెస్మరైజ్ చేసింది,... యాక్టింగ్ పరంగా అక్కడక్కడా తడబడినప్పటికీ... ఓవర్ ఆల్ గా మేఘన పాత్రలో మెప్పించింది.. వెన్నెల కిషోర్ మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి. సినిమాకు ప్లస్ గా మారాడు. నాజర్, బద్రం, వేణు తదితరులంతా.. తమ పాత్రల పరిధిమేర బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు.. 
టెక్నీషియన్స్...
టెక్నీషియన్స్ విషయానికి వస్తే డైరక్టర్ మారుతి.. మరోసారి ఓసిడీ అనే కొత్త కాన్సెప్ట్ ని తన స్టైల్ ఆఫ్ రైటింగ్ తో మంచి వినోదాత్మక సినిమాగా మలిచాడు శర్వానంద్ కూడా పూర్తిగా కోఆప్ రేట్ చేయడంతో కుటుబం సమేతంగా ఎంజాయి చేయదగ్గ సినిమాగా మారింది మహానుభావుడు.. డైలాగ్ రైటర్ గా కూడా మారుతి తన మార్కును నిలబెట్టుకున్నాడు. ఇక కెమేరామెన్ నిజర్ షఫీ డీసెంట్ విజ్యూవల్స్ తో ఇంప్రస్ చేశాడు. ఒకే సీన్ లో ఎమోషన్, కామెడీ పండించాల్సిన టైంలో అతని కెమేరా పనితనం వలన ఆయా సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి.. సినిమాటోగ్రాఫర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మ్యూజిక్ డైరక్టర్ తమన్ ఓకే అనిపించే ఆల్బమ్ అందించాడు.. పాటలు స్క్రీన్ పై బాగున్నాయి.. ఆర్ ఆర్ పరంగా స్పెషల్ ఎఫర్ట్ పెట్టి సినిమా కలర్ ను కాపాడాడు.. ప్రతి సీన్ లో ని సెన్స్ బులిటీని ఎలివేట్ చేశాడు తమన్ ఇక ఎడిటింగ్ కూడ క్రిస్బ్ గా ఉంది.. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలకు తిరుగులేదు.. సినిమాను చాలా రిచ్ గా తెరకెక్కించారు.. 
ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే.. దసరా బరిలో చివరిగా చిన్న సినిమాగా రిలీజ్ అయిన మహానుభావుడు గ్రాండ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.. ఎక్కడా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన మహానుభావుడు సరదాగా నవ్వించి.. బాగుంది అనిపిస్తాడు.
ప్లస్ పాయింట్స్
శర్వానంద్ నటన
ఫ్రెష్ స్క్రీన్ ప్లే..
కొత్త కాన్సెప్ట్
డైలాగ్స్ ..
కామెడీ..
బ్యాగ్రౌండ్ స్కోర్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
కొన్నిరిపీటెడ్ సీన్స్
లైటర్ క్లైమాక్స్.. 

 

20:37 - September 29, 2017
20:36 - September 29, 2017
20:30 - September 29, 2017

ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో కుంభకోణాలు

ప్రకాశం : జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో మరో కుంభకోణం వెలుగుచూసింది. గత కొంతకాలంగా నిత్యం ఏదో ఒక కుంభకోణం వెలుగుచూస్తూనే ఉంది. బ్యాంక్‌లో ఏం జరుగుతుందో తెలియక ప్రస్తుతం డైరెక్టర్లు.. చైర్మన్‌ ఈదర మోహన్‌కు ఎదురుతిరిగారు.  చైర్మన్‌పై అనేక అభియోగాల నేపథ్యంలో... డైరెక్టర్లు అంతా సీఎం చంద్రబాబును కలిశారు. మరో వైపు బ్యాంక్‌ చైర్మన్‌ మూడు రోజులుగా పత్తాలేకుండా పోయాడు. ఇదిలావుంటే అవకతవకలకు పాల్పడిన రికార్డులను అర్ధరాత్రే తరలించాడని డైరెక్టర్లు అంటున్నారు. 

20:23 - September 29, 2017

ప్రకాశం : జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో మరో కుంభకోణం వెలుగుచూసింది. గత కొంతకాలంగా నిత్యం ఏదో ఒక కుంభకోణం వెలుగుచూస్తూనే ఉంది. బ్యాంక్‌లో ఏం జరుగుతుందో తెలియక ప్రస్తుతం డైరెక్టర్లు.. చైర్మన్‌ ఈదర మోహన్‌కు ఎదురుతిరిగారు.  చైర్మన్‌పై అనేక అభియోగాల నేపథ్యంలో... డైరెక్టర్లు అంతా సీఎం చంద్రబాబును కలిశారు. మరో వైపు బ్యాంక్‌ చైర్మన్‌ మూడు రోజులుగా పత్తాలేకుండా పోయాడు. ఇదిలావుంటే అవకతవకలకు పాల్పడిన రికార్డులను అర్ధరాత్రే తరలించాడని డైరెక్టర్లు అంటున్నారు. 

 

20:21 - September 29, 2017

కృష్ణా : విజయవాడ ఇంద్రకీలాద్రపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. విజయదశమి సందర్భంగా అమ్మవారిని కృష్ణానదిలో విహరింప చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం నుండి డిసిపి కాంతి రానా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్వవేక్షిస్తున్నారు. సిసి కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

20:17 - September 29, 2017

హైదరాబాద్ : సింగరేణి ఎలక్షన్లలో కార్మికులు కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలన్నారు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. కార్మికులు సాధించిన హక్కులను నిలబెట్టుకోవాలని సూచించారు. సింగరేణి ఎన్నికలు కార్మికుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికులను మోసం చేసిన కేసీఆర్‌ను కార్మికులు శిక్షించాలన్నారు. కేసీఆర్‌ మాటలను కార్మికులు నమ్మవద్దని రేవంత్‌ రెడ్డి సూచించారు. కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకే కేసీఆర్‌ వారిని కలిసే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. 

 

20:11 - September 29, 2017

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఐడీఏలోని నిఫ్టీ ల్యాబ్స్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలకు గోడౌన్‌లో నిల్వ ఉంచిన కెమికల్స్‌ తగలబజుతున్నాయి. దీంతో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... మంటలు విస్తరించకుండా ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:09 - September 29, 2017

మహారాష్ట్ర : దసరా పండగ వేళ మహారాష్ట్రలో విషాదం నెలకొంది. ముంబైలోని ఎలిఫిన్స్‌టన్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 22 మంది మృతి చెందారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. వర్షం ఆగిపోయిన తర్వాత  ప్రయాణికులంతా ఒక్కసారిగా నడిచే వంతెనపైకి దూసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది.

ఉదయం పదిన్నర ప్రాంతంలో ప్రయాణికులతో ఎలిఫిన్స్‌టన్‌ రైల్వే స్టేషన్‌ కిక్కిరిసి పోయింది. వర్షం కురుస్తుండడంతో ప్రయాణికులంతా స్టేషన్‌లోనే ఉండిపోయారు. కొద్ది సేపటి తర్వాత వర్షం వెలిసింది. అదే సమయంలో స్టేషన్‌కు 4 రైళ్లు ఒకేసారి రావడంతో ప్రయాణికులు హడావిడిగా వెళ్లే క్రమంలో ఒక్కసారిగా నడిచే బ్రిడ్జిపైకి దూసుకొచ్చారు. ఒకరినొకరు తోసుకోవడంతో కొందరు కిందపడిపోయారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఘటనాస్థలంలో ప్రయాణికుల పాద రక్షలు చిందరవందరగా పడిపోయాయి. 

తొక్కిసలాట నుంచి తప్పించుకునేందుకు కొందరు బ్రిడ్జి కడ్డీలు పట్టుకుని కిందకు దూకేశారు. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఘటనా స్థలానికి పోలీసులు, వైద్య సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు వైద్య సహాయం అందించారు.

భారీ వర్షం కారణంగా పెద్దసంఖ్యలో ప్రయాణికులు వంతెనపైకి చేరుకున్నారని.... వర్షం ఆగిపోగానే వారంతా దిగేందుకు ప్రయత్నించగా.. తొక్కిసలాట జరిగిందని రైల్వై పిఆర్వో అనిల్ సక్సేనా తెలిపారు. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఘటనస్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

మరోవైపు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పేలుడు సంభవించి భారీ శబ్దం రావడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసి ఉండే ఎల్‌ఫిన్స్‌టన్‌ స్టేషన్‌ అభివృద్ధిని అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఎప్పుడో పాతకాలంనాటి బ్రిడ్జి ఒక్కటే ఉందని మరికొన్ని వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. బుల్లెట్‌ ట్రెయిన్‌పై కలలు కంటున్న మోది సర్కార్‌కు ప్రస్తుత రైల్వే సేవలపై శ్రద్ధ చూపడం లేదని శివసేన ధ్వజమెత్తింది. తొక్కిసలాటపై ప్రధాని నరేంద్రమోది, రాష్ట్రపతి కోవింద్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

20:06 - September 29, 2017
20:04 - September 29, 2017

హైదరాబాద్ : దసరా పండగను పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని తన చాంబర్‌లో మేయర్‌ బొంతు రామ్మోహన్‌.. సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల వచ్చిన వరుస పండుగలను జీహెచ్‌ఎంసీ విజయవంతంగా నిర్వహించిందని... రాబోయే రోజుల్లో కూడా అలాగే నిర్వహిస్తామన్నారు మేయర్‌. నగరవాసులందరికీ రామ్మోహన్‌ దసరా శుభాకాంక్షలు తెలిపారు. 

 

19:54 - September 29, 2017
19:53 - September 29, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌కి బీసీలకు న్యాయం చేయాలనుకుంటే యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు డిమాండ్‌ చేశారు. బీసీ రిజర్వేషన్లకు గుది బండగా మారిన క్రిమిలేయర్‌ విధానాన్ని ఎత్తివేయాలన్నారు. కేసీఆర్‌ కి చిత్తశుద్ధి ఉంటే బీసీ సబ్‌ ప్లాన్‌ని అమలు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. 

 

19:48 - September 29, 2017

గుంటూరు : రైతులకు ప్రపంచ స్ధాయిలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చేందుకు  బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఏపీ సెక్రటేరియట్‌లో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి నవంబర్ 15, 16,17  తేదీల్లో విశాఖలో జరిగే సమ్మిట్‌లో ఏపీ ప్రభుత్వం బిల్ అండ్ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. చివరి రోజు జరిగే సమ్మిట్‌లో బిల్‌ గేట్స్ స్వయంగా పాల్గొంటున్నారు. ఏపీ రైతాంగానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ముందుకు రావడం పట్ల ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 

19:46 - September 29, 2017

హైదరాబాద్‌ : భాగ్యనగరాన్ని భారీవర్షం ముంచెత్తింది. జూబ్లీ హిల్స్, మాదాపూర్, ఎల్బీ నగర్, దిల్‌సుఖ్ నగర్, ట్యాంక్‌ బండ్,  ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్, హబ్సిగూడ, అమీర్‌ పేటలో భారీవర్షం కురుస్తోంది. దాదాపు గంట నుంచి కురుస్తున్న  వర్షంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. వాహనదారులు, పండగకు ఊళ్లకు వెళ్లేవారు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ జామ్‌లతో ఇబ్బందులు పడుతున్నారు. 

19:42 - September 29, 2017

సీఎం కేసీఆర్ పై రేవంత్ విమర్శలు

హైదరాబాద్ : సింగరేణి ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారని చెప్పారు. ఓట్లు వేసుకోవడానికి నాటకాలు ఆడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలు అంటే కార్మికుల కుటుంబ సభ్యులకు ఇచ్చేవని తెలిపారు. ఉద్యోగం చేస్తు అనుకోకుండా చనిపోతే వారి స్థానంలో కుటుంబంలోని వ్యక్తికి ఇచ్చేది కారుణ్య నియామకం అన్నారు. కారుణ్య నియామాకాలు అన్ని డిపార్టుమెంట్లలో ఉంటాయని తెలిపారు. 

19:40 - September 29, 2017

హైదరాబాద్ : సింగరేణి ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారని చెప్పారు. ఓట్లు వేసుకోవడానికి నాటకాలు ఆడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలు అంటే కార్మికుల కుటుంబ సభ్యులకు ఇచ్చేవని తెలిపారు. ఉద్యోగం చేస్తు అనుకోకుండా చనిపోతే వారి స్థానంలో కుటుంబంలోని వ్యక్తికి ఇచ్చేది కారుణ్య నియామకం అన్నారు. కారుణ్య నియామాకాలు అన్ని డిపార్టుమెంట్లలో ఉంటాయని తెలిపారు. కారుణ్య నియామకం మసుగులో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని సీఎం చెబుతున్నారని విమర్శించారు. చట్టంలో లేనిదాన్ని సీఎం కేసీఆర్ చెబుతుంటే కొప్పుల ఈశ్వర్, తుమ్మల నాగేశ్వరరావు గంగిరెద్దుల లాగా తల ఊపుతున్నారని ఎద్దేవా చేశారు. వారసత్వ ఉద్యోగాలకు, కారుణ్య నియామాకాలకు తేడా ఉందన్నారు. సింగరేణిలో మూడు రకాల నియామకాలు ఉంటాయన్నారు. కారుణ్య నియామకాలు, వారసత్వ నియామకాలు, మెడికల్ అన్ ఫిట్ నియామకాలు ఉంటాయని తెలిపారు. 

 

సీఎం కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అమలుకు నోచుకోని హామీలు ఇస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోలేదని విమర్శించారు. సింగరేణి ఎన్నికల కోసం కేసీఆర్ దిగజారడం సిగ్గు చేటు అన్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమేరకు అమలు చేశారో అడగాలన్నారు. కేసీఆర్ సీఎం సీటులో కూర్చుకోవడానికి సింగరేణి కార్మికులే కారణమని చెప్పారు. 

19:30 - September 29, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అమలుకు నోచుకోని హామీలు ఇస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోలేదని విమర్శించారు. సింగరేణి ఎన్నికల కోసం కేసీఆర్ దిగజారడం సిగ్గు చేటు అన్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమేరకు అమలు చేశారో అడగాలన్నారు. కేసీఆర్ సీఎం సీటులో కూర్చుకోవడానికి సింగరేణి కార్మికులే కారణమని చెప్పారు. వారసత్వ ఉద్యోగాలు ఇస్తావా లేదా 
అడగాలన్నారు. వారసత్వ ఉద్యోగాలపై కాంగ్రెస్ కేసు వేయలేదని తెలిపారు. కేసులు వేసింది తెలంగాణ జాగృతి అని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

19:20 - September 29, 2017

నల్లగొండ : సూర్యాపేట జిల్లాల నుంచి సబ్సిడీ గొర్రెలను దళారులు తరలిస్తుండగా... వాడపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 210 గొర్రెలు, 4 డీసీఎంలు, 2 బొలెరో వాహనాలు సీజ్‌ చేశారు. సబ్సిడీ గొర్రెలను విక్రయించిన వారితో పాటు.. కొన్న వారిపైనా చీటింగ్‌ కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

టీసర్కార్ పై చాడా వెంకట్ రెడ్డి మండిపాటు

హైదరాబాద్ : టీసర్కార్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అబద్ధాల పునాదుల మీద పరిపాలన చేయాలనుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ 7 వేల ఉద్యోగాలు ఇచ్చామనడం పచ్చి అబద్ధమన్నారు. కేసీఆర్ దిగజారుడు పద్ధతిలో మాట్లాడుతున్నారని చెప్పారు.

19:14 - September 29, 2017

హైదరాబాద్ : టీసర్కార్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అబద్ధాల పునాదుల మీద పరిపాలన చేయాలనుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ 7 వేల ఉద్యోగాలు ఇచ్చామనడం పచ్చి అబద్ధమన్నారు. కేసీఆర్ దిగజారుడు పద్ధతిలో మాట్లాడుతున్నారని చెప్పారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సొంత ఇంటి కళ ఏమైందని ప్రశ్నించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఎడ్లబండిపై ప్రసవించిన మహిళ...

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో ఎడ్లబండిపై మహిళ ప్రసవించింది. గుండాల మండలం ఎలగలగడ్డ వద్ద ఘటన చేటుచేసుకుంది. గుండాల పీహెచ్ సీకి రావాలంటే రెండు వాగులు దాటాల్సిన పరిస్థితి ఉంది. 108 కి ఫోన్ చేసినా రోడ్డు బాగాలేక వాహనం ఆలస్యమైంది. ఎడ్లబండిలోనే గర్భిణి ఆస్పత్రికి పయనమైంది. నొప్పులు రావడంతో మహిళ ఎడ్లబండిలోనే ప్రసవించింది. 

18:48 - September 29, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో ఎడ్లబండిపై మహిళ ప్రసవించింది. గుండాల మండలం ఎలగలగడ్డ వద్ద ఘటన చేటుచేసుకుంది. గుండాల పీహెచ్ సీకి రావాలంటే రెండు వాగులు దాటాల్సిన పరిస్థితి ఉంది. 108కి ఫోన్ చేసినా రోడ్డు బాగాలేక వాహనం ఆలస్యమైంది. ఎడ్లబండిలోనే గర్భిణి ఆస్పత్రికి పయనమైంది. నొప్పులు రావడంతో మహిళ ఎడ్లబండిలోనే ప్రసవించింది. తరువాత 108 వాహనంలో ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

18:42 - September 29, 2017

వరంగల్ : జిల్లాలోని వర్దన్నపేట మండల ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో రవళి అనే బాలింత మృతి చెందారు. మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. 

 

18:28 - September 29, 2017
18:09 - September 29, 2017

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోతపేతంగా జరుగుతున్నాయి. తొమ్మిదవరోజు దుర్గమ్మ మహిషాసురమర్ధనీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం భక్తులు పోటేత్తారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:05 - September 29, 2017

హైదరాబాద్ : ఉప్పుగూడ అరుంధతి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వైద్యం వికటించి 11 ఏళ్ల బాలుడు తరుణ్ మృతి చెందాడు. బాలుడికి చికిత్స అందించిన వైద్యురాలు భవానీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


 

17:58 - September 29, 2017

అనంతపురం : జిల్లాలో చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేస్తోన్న ముఠా పోలీసులకు చిక్కింది. పోలీసులు మూడు నెలలుగా వీరిని మాటువేసి పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి ముగ్గురు చిన్నారులను సురక్షితంగా కాపాడారు. ఈ ముఠాలో మొత్తం 12 మంది సభ్యులుగా అందులో 5గురు పోలీసులకు చిక్కారు. మిగతా వారిని త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ అంటున్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:54 - September 29, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలోని ఉదరాళ్లపాలెంలో రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఘటనపై కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్‌ తెలిపారు. ఈ ఘటనపై కొవ్వూరు డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. దళితులు, కాపుల మధ్య ఘర్షణకు కారణమైన స్థలం పూర్తిగా ఆర్‌ అండ్‌ బీకి చెందినదని.. ఆ స్థలంపై ఇరువర్గాలకు హక్కులు లేవన్నారు. ఇక్కడ ఏ వర్గం రావడానికి అనుమతులు లేవని తెలిపారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా మూడు పోలీస్‌ పికెట్స్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. 

కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు: చాడ వెంకటరెడ్డి

హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు సంబంధించి సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు తొలగించాలని మా సంఘాలు ఎక్కడా సంతకం చేయలేదని స్పష్టం చేశారు. ఎన్నికలొచ్చాయి కాబట్టే సింగరేణి కార్మికులు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. మూడేళ్లలో సింగరేణి కార్మికులకు కేసీఆర్ ఏం చేశారని చాడ ప్రశ్నించారు.

తొలిసారి విదేశీ పర్యటనకు రాష్ట్రపతి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తొలిసారిగా అంతర్జాతీయ పర్యటన ఖరారైంది. తూర్పు ఆఫ్రికాలోని జైబూటీ, ఇథియోపియా దేశాల్లో అక్టోబర్ మొదటివారంలో రాష్ట్రపతి పర్యటిస్తారు. ఇరుదేశాల్లోని భారత రాయబారి అనురాగ్ శ్రీవాత్సవ ఆగస్టు నెలలో రాష్ట్రపతిని ఇప్పటికే కలిసి ఈ విషయమై చర్చించారు. గత రెండేళ్లుగా ఆఫ్రికాతో సత్‌సంబంధాల విస్తరణకు ప్రధాని మోదీ చర్యలను ఉదృతం చేశారు.

16:27 - September 29, 2017

చిత్తూరు : జిల్లాలో ఇద్దరు రౌడీషీటర్ల దారుణహత్య సంచలనం రేపింది. సీటీఎం మండలం పెద్దపల్లిలో అమర్‌నాథ్‌, జగదీశ్వర్‌రెడ్డిపై దుండగులు కత్తులతో విరుచుకుపడ్డారు. అత్యంత క్రూరంగా నరికి చంపారు. అయితే ఐదుగురి హత్య కేసులో మృతులు అమర్‌నాథ్‌, జగదీశ్వర్‌రెడ్డి నిందితులుగా ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:23 - September 29, 2017

మహారాష్ట్ర : ముంబయిలో విషాదం చోటుచేసుకుంది. ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయపడ్డారు. స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లే మార్గంలో పాదచారుల వంతెన ఉంటుంది. ఉదయం వర్షం రావడంతో ప్రయాణికులు స్టేషన్‌లో ఆగిపోయారు. వర్షం నిలిచిపోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా వంతెనపైకి దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తొక్కిసలాట నుంచి తప్పించుకునేందుకు కొందరు వంతెన కడ్డీలు పట్టుకుని కిందకు పరుగులు తీశారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది రైల్వేస్టేషన్‌కు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు వైద్యసాయం అందించారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

జయశంకర్ భూపాలపల్లి యువతి దారుణ హత్య...

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో ఓ యువతి హత్యకు గురైంది. గంటా సుగుణకుమారి(25) అనే యువతి నిన్న రాత్రి హత్యకు గురైంది. పరిచయస్థుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా సమాచారం. హత్య అనంతరం మృతదేహాన్ని కాటారం శివారులో గల నీలగిరి వనంలో పాతిపెట్టాడు. ఘటనపై సమాచారం అందంటంతో మృతదేహం వెలికితీత కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సబ్సిడీ గొర్రెలను తరలిస్తున్న దళారుల..పట్టివేత

హైదరాబాద్: నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి సబ్సిడీ గొర్రెలను దళారులు తరలిస్తుండగా వాడపల్లి చెక్ పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 210 గొర్రెలు, 4 డీసీఎంలు, 2 బొలెరో వాహనాలను సీజ్ చేశారు. సబ్సిడీ గొర్రెలను విక్రయించిన వారితో పాటు కొన్న వారిపైనా చీటింగ్ కేసు నమోదుకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఫార్వర్డ్ పోస్ట్‌ను సందర్శించిన నిర్మలా సీతారామన్...

జమ్మూకశ్మీర్‌: రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ జమ్మూకశ్మీర్ లో పర్యటిస్తున్నారు. కశ్మీర్‌లోని ఎల్వోసీ వద్ద ఉన్న ఓ ఫార్వర్డ్ పోస్ట్‌ను ఆమె సందర్శించారు. అక్కడ సైనికులతో మాట్లాడారు. అక్కడే ఉన్న ఆయుధాలను కూడా మంత్రి నిర్మల పరిశీలించారు.

బాలానగర్ లో 400 కిలోల అల్ఫాజోమ్ డ్రగ్ పట్టివేత...

హైదరాబాద్: బాలానగర్ లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. 400 కిలోల అల్ఫాజోమ్ డ్రగ్ ను పట్టుకున్నారు. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పారారీ అయ్యారు.

బతుకమ్మ ఆడకుండా దళితులను అడ్డుకున్న యాదవులు

నల్గొండ: మాడ్గులపల్లి మండలం కన్నేకల్ లో సద్దుల బతుకమ్మ ఆడకుండా యాదవులు అడ్డుకున్నారని దళితులు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా అడ్డుకోవడంతో పాటు కులం పేరుతో దూషించారని ఆరోపిస్తున్నారు. పోలీసులతో పాటు కలెక్టర్ కూ దళితులు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ ఉప్పుగూడలో విషాదం

హైదరాబాద్: ఉప్పుగూడలో అరుంధతి కాలనీలో విషాదం నెలకొంది. వైద్యం వికటించి 11 ఏళ్ల తరుణ్ మృతి చెందాడు. ఘటన అనంతరం వైద్యురాలు భవానీ పరార్ అయ్యింది.

జర్నలిస్టుల సంక్షేమ నిధిని పెంచుతాం: సీఎం కేసీఆర్

హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమ నిధిని పెంచుతామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇళ్లకు సంబంధించి జర్నలిస్టులకు నెలరోజుల్లో శుభవార్త చెబుతానని కేసీఆర్ పేర్కొన్నారు.

14:46 - September 29, 2017

బాలీవుడ్ లో వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ..తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నటీమణుల్లో 'విద్యా బాలన్' ఒకరు. ఈమె తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణీస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

ముంబై లోని బాంద్రాలో జరిగే ఓ సమావేశంలో 'విద్యా బాలన్' హాజరు కావాల్సి ఉంది. దీనితో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 'విద్యా' తన కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో ఆమె ప్రయాణీస్తున్న కారును మరో కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 'విద్యా' కారు బాగా డ్యామేజ్ అయినట్లు సమాచారం. ఈ ప్రమాదం నుండి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. ఈ వివరాలను డీఎన్ఏ పత్రిక బహిర్గతం చేసింది. ప్రస్తుతం విద్యాబాలన్ నటిస్తున్న 'తుమ్హారీ సులూ' సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో 'విద్యా' లేట్ నైట్ రేడియో జాకీ పాత్రను పోషిస్తోంది. నవంబర్ 24న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

14:38 - September 29, 2017

హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా భావించే సింగరేణి ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఆరోసారి జరుగుతున్న ఈ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు..ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టీజీబీకేఎస్ ను గెలిపించాలని పిలుపునిస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రంగ ప్రవేశం చేశారు. టీజీబీకేఎస్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్మికులపై వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఇతర కార్మిక సంఘాలపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. సింగరేణిలో జరుగుతున్న పరిణామాలకు కాంగ్రెస్, టిడిపి, ఇతరులే కారణమని విమర్శలు గుప్పించారు. వారసత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేశారు. కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలపై ఇచ్చిన హామీని అమలు చేసి తీరుతామని మరోసారి హామీనిచ్చే ప్రయత్నం చేశారు.

ఇతర సంఘాలపై విమర్శలు..
సింగరేణిలో జరిగిన విధ్వంసం అక్కడ పనిచేసే కార్మికులకు..ప్రజానీకానికి తెలుసన్నారు. ఏఐటీయూసీ, ఇతర సంఘాలు అన్ని కలిసిపోయాయని, జాతీయ సంఘం సాక్షిగా వారికి హక్కులు పోయినవన్నారు. 1989, 2000లో వారసత్వ ఉద్యోగాలు పోయే విధంగా ఈ సంఘాలు సంతకాలు పెట్టాయన్నారు. సంతకం చేయని సంఘం ఏదీ లేదని, కార్మికులున్న హక్కులను తీసేశాయన్నారు. వారసత్వ ఉద్యోగాల విషయం..సింగరేణి చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయన్నారు.

నాలెడ్జ్ లేదన్న కేసీఆర్..
ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో తనకు ఈ విషయంపై తనకు నాలెడ్జ్ లేదని, అనంతరం సింగరేణిపై తాను ఇతరులతో తెలుసుకోవడం జరిగిందన్నారు. అండర్ గ్రౌండ్ లో పనిచేసే కార్మికులకు ఆక్సిజన్ అందదని, మోకాళ్లు పగిలిపోతాయన్నారు. రిటైర్ అయిన సింగరేణి కార్మికులు పది సంవత్సరాలకు మించి బతకరని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.

ముఠాలు...
ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఒక ముఠా ఉందని మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్లడం జరిగిందని, ఉద్యోగాలకు సంబంధించిన ఒక ముఠా ఉందని ఈ ఒక్క ముఠా 17 కేసులు వేశాయన్నారు. ఈ ముఠా వివరాలు త్వరలో బయటపెడుతామని, కాంగ్రెస్ ఇతరులు కలిసి వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ విషయంలో రిటైర్డ్ జడ్జీలు, న్యాయవాదులతో మాట్లాడడం జరిగిందన్నారు.

కారుణ్య నియామకాలు..
వారసత్వ ఉద్యోగాల విషయపై కోర్టులో సరియైన విధంగా చెప్పలేకపోయారని, వారసత్వ ఉద్యోగాల విషయంలో కోర్టు చెప్పడం కరెక్టేనని పేర్కొన్నారు. దీనికి ఒకటి పద్ధతి ఉందని, కారుణ్య నియామకాలపై నియామకంపై చేస్తే బాగుంటుందని నిపుణులు వెల్లడించడం జరిగిందన్నారు. సింగరేణి కార్మికులకు వచ్చే ప్రత్యేక జబ్బులను లిస్టులో చేర్చడం జరుగుతుందని, 75 శాతం కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. కారుణ్య నియామకం..వారసత్వ ఉద్యోగాల్లో ఉద్యోగం వస్తే తీసుకోవచ్చని, లేనిపక్షంలో డబ్బులు తీసుకోనే ఆప్షన్ ఉందన్నారు. సర్వీసు ఉన్నంత వరకు జీతం తీసుకోవచ్చని, రూ. 12 లక్షలు ఉండేదని దీనిని 25లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. నెలసరీ వేతనం..రూ. 25వేలు ఇస్తామన్నారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వడ్డీ లేకుండా 6 లక్షల రూపాయల వరకు గృహ నిర్మాణం కోసం లోన్ అందిస్తామన్నారు.

వృత్తి పన్ను..ఇన్ కంట్యాక్స్..
వృత్తి పన్ను రద్దు, ఇన్ కంట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్స్ ఉండేవన్నారు. కార్మికులు రూ. 175 కోట్ల వృత్తి పన్ను కట్టే వారని, ఈ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదన్నారు. సింగరేణి కార్మికులు కట్టే రూ. 175 కోట్ల వృత్తి పన్ను రద్దు చేయడం జరిగిందని, ఇన్ కంట్యాక్స్ విషయంలో అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగిందని, వచ్చే శీతాకాల సమావేశాల్లో దీనిపై కేంద్రాన్ని నిలదీయడం జరుగుతుందన్నారు.

కార్మికులు చనిపోతే...
కార్మికులు చనిపోతే ప్రభుత్వం లక్ష రూపాయలు ఇచ్చేదని, ఎక్స్ గ్రేషియా పెంచాలని చెప్పినా ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదన్నారు. ఈ విషయంలో తాము గతంలో ఆందోళనలు చేయ్యడం జరిగిందని, అనంతరం లక్ష నుండి రూ. 6 లక్షలకు పెంచడం జరిగిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం రూ. 25 లక్షలకు పెంచడం జరిగిందని, ఎవరూ ఇది చేయలేదన్నారు.

ఏఐటీయూసీ అసమర్థ విధానాలు..
ఏఐటీయూసీ అసమర్థత విధానాల వల్ల 3,527 వారసత్వ ఉద్యోగాలు పెండింగ్ లో ఉండేవని, ఒక్కటే దెబ్బలో ఆర్డర్ ఇచ్చి వీరందరికీ ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందన్నారు. చాలా మంది కార్మికులను డిస్మిస్ చేస్తే వీరంతా నోర్మూసుకుని కూర్చొవడం జరిగిందని, డిస్మిస్ అయిన 500 మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందన్నారు.
ప్రస్తుతం చేసిన నిర్ణయాలకుజాతీయ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటిస్తాయా ? లేదా ? అనేది సూటిగా చెప్పాలని సీఎం కేసీఆర్ సూచించారు. 

'వారసత్వ ఉద్యోగాలపై పార్లమెంట్ లో లేవనెత్తుతాం'

హైదరాబాద్: సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాల అంశంపై శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ ఎస్ ఎంపీలు లేవనెత్తుతారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

'సింగరేణి కార్మికుల అనారోగ్యంపై గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు'

హైదరాబాద్: సింగరేణి కార్మికుల అనారోగ్యంపై గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అండర్ గ్రౌండ్ మైన్ లో పని చేసే కార్మికులకు ఆక్సిజన్ అందదని, సింగరేణి కార్మికులు అనారోగ్యంతో బాధపడుతుంటారన్నారు. సింగరేణి కార్మికుల అనారోగ్యంపై గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని మండిపడ్డారు.

'సింగరేణి కార్మికులకు వడ్డీ లేకుండా రూ.6లక్షలు'

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు వడ్డీ లేకుండా రూ. 6లక్షల వరకు గృహ నిర్మానం కోసం రుణాలు ఇస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

టీజీబీకేఎస్ ను గెలిపించుకోవాలి: కేసీఆర్

హైదరాబాద్: సింగరేణి ఎన్నికల్లో టీజీబీకేఎస్ ను గెలిపించుకోవాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దశాబ్ధాలుగా రెండు కార్మిక సంఘాలే గుర్తింపు సంఘాలుగా పని చేశాయన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు పోయేలా సంతకాలు పెట్టినవి ఈ సంఘాలేనని పేర్కొన్నారు. సమస్యలను అర్థం చేసుకోవడంలో గత సంఘాలు విఫలమయ్యాయన్నారు.

వారసత్వ ఉద్యోగాలపై విపక్షాలది అనవసర రాద్ధాంతం

హైదరాబాద్: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సింగరేణి కార్మికుల కష్టాలు, బాధలు మాకు తెలుసన్నారు. మేం చేసేదే చెప్తామని పేర్కొన్నారు.

బొబ్బిలికోటలో దసరా సంబరాలు

విజయనగరం: బొబ్బిలికోటలో దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కోటలో రాజవంశీకులు ఆయుధపూజ నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో బంగారు సింహాసనాన్ని ఊరేగించి శాస్త్రోక్తంగా మంత్రి సుజయ్ కృష్ణ సోదరులు ఆయుధ పూజ చేశారు.

50కి పెరిగిన ముంబై మృతుల సంఖ్య

ముంబై:ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్‌లో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 50కి పెరిగింది. చాలా ఇరుకుగా ఉండే పాదచారుల వంతెన కూలిపోతున్నట్లు వదంతులు రావడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే అసలు కారణం ఏమిటో అధికారికంగా ఇంకా నిర్థారణ కాలేదు.

ముంబై రైల్వేస్టేషన్‌ ప్రమాదం పై రాష్ట్రపతి దిగ్ర్భాంతి

ఢిల్లీ: ముంబై రైల్వేస్టేషన్‌లో జరిగిన ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోవడం విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్విటర్‌ ద్వారా తన సానుభూతిని తెలిపారు.

 

'ముంబై' తొక్కిసలాట మృతులకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా

ముంబై : ప్రభాదేవి రైల్వేస్టేషన్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు మహారాష్ట్ర మంత్రి వినోద్ తావ్‌డే ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆయన.. వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి తెలిపారు. ఒకేసారి వందలాది మంది ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైకి రావడంతో.. జరిగిన తొక్కిసలాటలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే అధికారులతో కలిసి విచారణ జరిపిస్తామని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

13:38 - September 29, 2017

అనంతపురం : ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రి ప్రజల కష్టలు చూడలేకే రాజీనామా చేస్తానని చెప్ప అని, కానీ సీఎం సమస్య తీర్చుడన్న ఆశాభవం ఉందని ఆయన అన్నారు. అందుకోసమే తన రాజీనామా చేయడం లేదని తెలిపారు.

మైలవరంలో మీడియాపై మంత్రి దేవినేని చిందులు

కృష్ణా: మైలవరంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ మీడియా పై అసహనం వ్యక్తం చేశారు. జనం పాల్గొనకపోవడంతో మీడియాపై చిందులు వేశారు. రోజూ తీసే మొఖాలే ఏం తీస్తావంటూ దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నంద్యాల మున్సిపల్ సమావేశం రసాభాస

కర్నూలు:నంద్యాల మున్సిపల్ సమావేశం రసాభాస అయ్యింది. డెంగ్యూ, విషజ్వరాలపై చర్చించాలంటూ భూమా వర్గం పట్టుపట్టింది. ఎజెండా ముగిశాక చర్చిద్దామన్న ఛైర్మన్ దీంతో గందరగోళం మధ్య మున్సిపల్ సమావేశం వాయిదా వేశారు.

13:33 - September 29, 2017

విశాఖ : జిల్లా జీ మాడుగుల మండలం చదురుమాడిలో దారుణం జరిగింది. ఓ కసాయి కొడుకు తల్లిదండ్రులు, తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు ముగ్గురిని పాడేరు ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం నింధితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నింధితుడి కోసం గాలింపు ప్రారంభించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

ముంబై తొక్కిసలాటలో మృతులకు ప్రధాని సంతాపం...

ఢిల్లీ:‘‘ముంబైలో తొక్కిసలాటవల్ల ప్రాణాలు కోల్పోయినవారందరికీ నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారి గురించి ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో ‘‘ముంబైలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ముంబైలోనే ఉన్నారు. ఆయన పరిస్థితిని తెలుసుకుని, సహాయ కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం 10.46 గంటల ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో 22 మంది మరణించారు. సుమారు 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కే ఈ ఎం ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు.

13:25 - September 29, 2017

పశ్చిమగోదావరి : జిల్లా అత్తిలి మండలం ఉరదలపాలెం ఓ ఉద్రిక్తత కొనసాగుతోంది. అగ్రవర్ణాలు, దళతుల మధ్య చేలరేగిన గొడవతో పరిస్థితి తీవ్రంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముందుజాగ్రత్తగా గ్రామంలో భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. బయటివ్యక్తులు గ్రామంలోకి రాకుండా ఆంక్షలు కూడా విధించారు. వివాదానికి కారణమైన ఆర్ అండ్ బీ స్థలాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివాదాస్పద స్థలానికి ఏ రావడానికి అనుమతులు లేవని, ఇప్పటికే అధికారులు ఈ స్థలానికి ఫెన్సింగ్ వేస్తున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. మూడు పికెట్స్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తునట్టు ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీ మృతి

వరంగల్ : వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీకి తీవ్ర రక్తస్రావం అవుతుండగా వరంగల్ కు వెళ్లమని ఆస్పత్రి సిబ్బంది పంపించారు. మార్గ మధ్యంలో గర్భిణీ మృతి చెందింది. మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు.

13:14 - September 29, 2017

ముంబై : ఎల్ఫిన్ స్టోన్ రైల్వేస్టేషన్ లోని పాదచారుల వంతెనపై తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 22కు చేరింది. గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిని చాలా సమయం తర్వాత సహాయ చర్యులు చేపట్టకపోవడంతో మృతుల సంఖ్య పెరగడానికి కారణమైంది. భారీ వర్షం రావడంతో స్టేషన్ లోకి ప్రజలు చోచ్చుకురావడం వల్ల ఈ ప్రమాదం జరినట్టు తెలుస్తోంది. అయితే ముంబైలాంటి మహానగరంలో ఎక్కువ మంది రైలల్లోనే ప్రయాణిస్తారు. కానీ ప్రయాణికులకు తగ్గట్టుగా పాదచారుల వంతెన లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా చెప్పుకొవచ్చు. మరికాసేపట్లో సంఘటన స్థలానికి రైల్వే మంత్రి పీయుష్ గోయాల్ చేరుకొనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

ఉదరాళ్లపాలెంలో ఇరువర్గాల ఘర్షణపై కేసు నమోదు:ఎస్పీ రవిప్రకాష్

ప.గో:ఉదరాళ్లపాలెంలో ఇరువర్గాల ఘర్షణపై కేసు నమోదు చేశామని '10టివి'తో జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. కొవ్వూరు డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని, ఘర్షణకు కారణమైన స్థలం ప్రైవేటుదని, ఇక్కడికి రావడానికి ఏ వర్గం వారికీ అనుమతులు లేవన్నారు. అధికారులు ఈ స్థలానికి కంచె వేస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. మూడు పికెట్లు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

డేరాబాబా కీలక అనుచరుడు అరెస్ట్...

ఢిల్లీ: డేరాబాబా కేసులో మరో కీలక నిందితుడిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. పంచకుల అల్లర్లలో హస్తమున్న డేరా సచ్చా సౌధా అనుచరుడు రామచంద్రను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు

 

12:44 - September 29, 2017

భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణిలో కార్మిక సంఘాల ప్రచారం హోరెత్తుతోంది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందేందుకు కార్మిక సంఘాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు రంగంలోకి దిగడంతో సింగరేణి ఎన్నికలు రాజకీయ రంగును పులుముకున్నాయి. సింగరేణి కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికల్లో తమ కార్మిక సంఘమే విజయం సాధిస్తుందని టీఆర్‌ఎస్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

వైసీపీలో చేరిన బాపట్ల మాజీ ఎంపీ చిమటా సాంబు

ప్రకాశం: వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో గురువారం రాత్రి హైదరాబాద్‌లో బాపట్ల మాజీ ఎంపీ చిమటా సాంబు, మాజీ పీడీసీసీ బ్యాంకు డైరెక్టర్‌ గడ్డం శ్రీనివాసరావు, టీడీపీ వేటపాలెం మండల మాజీ అధ్యక్షుడు కర్ణ శ్రీనివాసరావు తదితరులు పార్టీలో చేరారు.

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం దిశగా అడుగులు: వర్ల రామయ్య

విజయవాడ: పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం దిశగా అడుగులేస్తున్నామని హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ వర్ల రామయ్య చెప్పారు. లక్షా యాభై వేల రూపాయలతో పక్కా ఇళ్లు కట్టిస్తున్నామని పేర్కొన్నారు. 12 లక్షల 4 వేల గృహాల నిర్మానానికి అనుమతులు వచ్చాయని, గృహాల నిర్మాణాలకు 16 వేల కోట్లు ఖర్చు అవుతుందని, రెండేళ్లలో 10 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 2న లక్ష ఇళ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం విజవాడ మున్సిపల్ స్టేడియంలో సీఎం ప్రారంభిస్తారని వర్ల రామయ్య స్పష్టం చేశారు.

12:32 - September 29, 2017

హైదరాబాద్ : చంచల్ గూడ జైలు నుంచి పారిపోయేందుకు ముగ్గురు ఐఎస్ఐ ఉగ్రవాదుల యత్నించారు. వారి ప్రయత్నాన్ని అడ్డుకున్న జైలు సిబ్బంది ఉగ్రవాదులను హై సెక్యూరిటీ బ్లాక్ నుంచి నర్మదా బ్యారక్ లోకి తరలించారు. అధికారులు ఉగ్రవాదులకు 3నెలలపాటు ములాఖత్ నిషేధించారు. మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

నీటి విడుదలకు జీవో ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు: ఎంపీ జేసీ

అమరావతి: తాడిపత్రి ప్రజల నీటి కష్టాలు చూడలేక బాధాతప్త హృదయంతో రాజీనామా చేస్తానని ప్రకటించానని ఎంపి జేసీ దివాకర్ రెడ్డి వివరణ ఇచ్చారు. స్పందించి నీటి విడుదలకు జీవో ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి శుక్రవారం కోర్టులో హాజరు కావాల్సి ఉన్నందున వైఎస్ జగన్ పాదయాత్ర చేయలేడు అని జేసీ స్పష్టం చేశారు. జగన్ రాజకీయాలు మానుకుని కేసులను కొట్టేయించుకుని భార్య.. పిల్లలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాని, నా స్నేహితుని కొడుకు జగన్ చెబితే వినేవాడు కాదన్నారు. రోజా, విజయసాయిరెడ్డి సైలెంట్ అయిపోయారని, త్వరలో జగన్ కూడా సైలెంట్ అవురాని జోస్యం చెప్పారు.

12:15 - September 29, 2017

ముంబై : మహానగరంలో విషాదం చోటుచేసుకుంది. ఎల్ఫిన్ స్టోన్ రైల్వేస్టేషన్ లోని పాదచారుల వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 15మంది మృతి చెందారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. భారీ వర్షం రావడంతో స్టేషన్ లోకి ప్రజలు చోచ్చుకురావడం వల్ల ఈ ప్రమాదం జరినట్టు తెలుస్తోంది. అయితే ముంబైలాంటి మహానగరంలో ఎక్కువ మంది రైలులోనే ప్రయాణిస్తారు. కానీ ప్రయాణికులకు తగ్గట్టుగా పాదచారుల వంతెన లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా చెప్పుకొవచ్చు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:13 - September 29, 2017

పశ్చిమగోదావరి : జిల్లా అత్తిలి మండలం ఉరదలపాలెం ఓ ఉద్రిక్తత కొనసాగుతోంది. అగ్రవర్ణాలు, దళతుల మధ్య చేలరేగిన గొడవతో పరిస్థితి తీవ్రంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముందుజాగ్రత్తగా గ్రామంలో భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. బయటివ్యక్తులు గ్రామంలోకి రాకుండా ఆంక్షలు కూడా విధించారు. వివాదానికి కారణమైన ఆర్ అండ్ బీ స్థలాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

12:10 - September 29, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' న్యూ ఫిల్మ్ 'స్పైడర్' ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. దీనిపై భిన్నమైన టాక్స్ వినిపిస్తున్నాయి. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మహేష్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తాజాగా తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' ఈ చిత్రాన్ని వీక్షించి ప్రశంసల జల్లు కురిపించారు. 'సినిమా చాలా బాగుంది. యాక్షన్‌తోపాటు మంచి మెసేజ్‌ కూడా ఈ సినిమాలో ఉంది. మురుగదాస్‌ అద్భుతంగా ఈ సబ్జెక్ట్ ని హ్యాండిల్‌ చేశారు. మహేష్‌బాబు చాలా ఎక్స్ ట్రార్డినరీగా నటించారు. ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులకు అందించిన యూనిట్‌ సభ్యులందరికీ అభినందనలు' అంటూ రజనీ కామెంట్స్ చేశారు.

ఇక ఇదిలా ఉంటే 'స్పైడర్' విడుదలైన మొదటి రోజే భారీగా కలెక్షన్లు రాబట్టింది. మొదటి రోజు రూ. 51 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు టాక్. ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఓపెనింగ్స్ వచ్చాయని, ఓవర్సీస్ ప్రీమియర్స్ లోనే 1 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. మొదటిరోజు 51 కోట్లు కలెక్ట్ చేయడం హ్యాపీగా ఉందన్నారు. 

చిత్తూరు జిల్లా పెద్దపల్లిలో రౌడీషీటర్ల హత్య

చిత్తూరు: సీటీఎం మండలం పెద్దపల్లిలో రౌడీషీటర్లు అమర్ నాథ్, జగదీశ్వర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపేశారు.

ముంబై రైల్వే స్టేషన్ తొక్కిసలాట:15మంది మృతి

ముంబై: ముంబై ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15మంది మృతి చెందగా 50 మందికి పైగా ప్రయాణీకులు గాయపడినట్లు తెలుస్తోంది. భారీ వర్షం కారణంగా స్టేషన్ లోకి నీరు రావడంతో ఫుట్ ఓవర్ బ్రిడిపై తొక్కిసలాట జరిగి ఈ ఘటన చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

12:01 - September 29, 2017

ఎగ్జిమా..దీనినే తామర వ్యాధి అని కూడా అంటారు. మానిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే ఇతర సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇదొక చర్మ వ్యాధి. వాతావరణంలో వచ్చే మార్పులు ఈ వ్యాధికి కారణంగా చెప్పవచ్చు. అంతేగాకుండా వంశపారపర్యంగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. రకరకాలుగా ఈ వ్యాధి ఉంటుంది. కొంతమది శరీరంపై ఎర్రని మచ్చలు ఏర్పడితే..మరికొందరిలో చర్మం కమిలిపోయినట్లు కనిపిస్తుంటుంది. దురద కలిగించే ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు..అలాగే శరీరానికి సరిపడని సబ్బులు ఉపయోగించినప్పుడు దురద ఎక్కువగా వస్తుంటుంది. ఈ దురద వల్ల చిన్న చిన్న పొక్కులుగా మారుతాయి. చర్మం కూడా పొలుసులుగా రాలి పగిలినట్టు కనిపిస్తుంటుంది. చుండ్రు సమస్య అధికంగా ఉన్న వారిలో ఈ వ్యాధి వస్తుంది. రక్త పరీక్షల ద్వారా ఎగ్జిమా ఉందా ? లేదా ? అనేది డిసైడ్ చేస్తారు. ఈ వ్యాధి బారిన పడిన వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన సూచనలు..సలహాలు పాటిస్తే బెటర్. 

ఒంగోలు ఎన్టీఆర్ భవన్ లో టిడిపి సమన్వయ కమిటీ భేటీ

ప్రకాశం: ఒంగోలు ఎన్టీఆర్ భవన్ లో టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కరణం బలరాం, మాగుంట, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఒంగోలు పాల డెయిరీ సంక్షోభం, పీడీసీసీ బ్యాంక్ స్కామ్, తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

పిల్లల కిడ్నాప్ కు యత్నించిన ముగ్గురు అరెస్ట్...

అనంతపురం: కదిరిలో ముగ్గురు పిల్లల కిడ్నాప్ కు యత్నించిన ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

11:53 - September 29, 2017

ఇంటర్నెట్...ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతోంది. ఏ విషయాన్ని అయినా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసేస్తున్నారు. కొంతమంది ఇంటర్నెట్ ఉపయోగించుకుంటూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఇంటర్నెట్ లేకపోతే పనిచేయలేని వారు కూడా ఉంటుంటారు. కానీ అదే పనిగా ఇంటర్నెట్ ఉపయోగిస్తే మానసిక రుగ్మతలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈఈడీఆర్ఎన్ (ఎథిలాజికల్ ఎల్యూసివ్ డిజార్డర్స్ నెటవర్క్) దీనిపై అధ్యయనం చేసిందంట. ఎక్కువ మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారిలో ఆందోళన..చిరాకు..పరధ్యానం లాంటి సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని వెల్లడైంది.

ఇంటర్నెట్ ఉపయోగించడం వల్ల పలు అంశాలపై స్పందించాల్సి వస్తుంది. అంతేగాకుండా అనేక సున్నితమైన అంశాలను కూడా తెలుసుకుంటుంటారు. దీనివల్ల మానసిక..శారీరక రుగ్మతలకు దారి తీస్తుంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంటర్నెట్ వ్యసనంగా మారితే జీవితాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, అంబేద్కర్‌ బయోమెడికల్‌ రీసెర్చ్ సెంటర్‌, హర్యానాలోని నేషనల్‌ బ్రెయిన్‌ రీసెర్చ్ సెంటర్‌ నిపుణుల భాగస్వామ్యంతో దీనిపై అధ్యయనం చేస్తున్నారు. 

తెలుగు ప్రజలకు దశసరా శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశ ప్రజలకు జనసే అధినేత పవన్ కల్యాన్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ ఆట పాటలతో ఊరు వాడలను భక్తి పారవశ్యంతో ముంచెత్తిన ఆడపడుచులకు అభినందనలు తెలిపారు.

ముంబై రైల్వే స్టేషన్ తొక్కిసలాట:ముగ్గురి మృతి

ముంబై: ముంబై ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 25 మంది ప్రయాణీకులు గాయపడినట్లు తెలుస్తోంది.

ముంబై రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట

ముంబై: ఎలిఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణీకులు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

పరిటాల శ్రీరామ్ పెళ్లికి సీఎం కేసీఆర్

అనంతపురం: ఏపీ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. అక్టోబర్ 1న అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో పరిటాల శ్రీరామ్ పెళ్లి జరుగనుంది. ఈ పెళ్లి కి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు.

వేదావతి నదికి పోటెత్తిన వరద నీరు.. నిలిచిన రాకపోకలు..

కర్నూలు: గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కర్నూలు జిల్లాలోని వేదావతి నదికి వరద నీరు పోటెత్తింది. జిల్లాలోని హాలహర్వి మండలం గూళ్యెం వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్రా-కర్ణాటకల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హోళగుంద మండలం మార్లమడికి వద్ద వేదావతి నది పొంగి ప్రవహిస్తుండటంతో ఆ రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

10:46 - September 29, 2017

విశాఖ : ఎక్సైజ్‌ శాఖ దాడుల్లో ఇన్నాళ్లూ స్మగ్లర్లు, కూలీలే పట్టుపడుతున్నారు తప్ప సొంతశాఖ ఉద్యోగులు దొరక్క పోవడం గమనార్హం. ముఖ్యంగా అనకాపల్లి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలోకి వచ్చే ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా విస్తృతంగా జరుగుతోంది. దీనిని అరికట్టాల్సింది పోయి ఆ పరిధిలోని కొంతమంది సిబ్బంది, అధికారులపైనే ఆరోపణలు వస్తున్నాయి. గంజాయి రవాణాకు సహకరిస్తున్న సొంత శాఖ వారు దొరకలేదని కాదు..ఇప్పటికే ఎందరో పట్టుబడ్డారు..అందులో కొందరు తప్పించుకుతిరుగుతున్నారు....అనకపల్లి పరిధిలోని పాడేరు మొబైల్‌ సీఐ పెదకాపు శ్రీనివాస్‌ ఇప్పటికే పోలీసులకు చిక్కి సస్పెండయ్యారు. ఆరు నెలలుగా ఆయన పత్తా లేకుండా పోయారు. తాజాగా అనకాపల్లి ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్సు కానిస్టేబుల్‌ నాయుడు గంజాయి విక్రయాల్లో చిక్కుకున్నారు..విజయవాడలో గంజాయితో పట్టుబడ్డ నిందితులిచ్చిన సమాచారంతో కానిస్టేబుల్‌ నాయుడు పేరు బయటకొచ్చింది. దీనిపై ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారం వెలుగు చూడడంతో నాయుడు పరారీలో ఉన్నారు.

ఓ మంత్రిని ఆశ్రయించినట్టు
ఇక కానిస్టేబుల్‌ నాయుడు తను కేసు నుంచి బయటపడేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రిని ఆశ్రయించినట్టు తెలిసింది. మరోవైపు గంజాయి అక్రమ రవాణాలో పాడేరు మొబైల్‌ టీమ్‌ సీఐ పెదకాపుపై కేసు నమోదయింది. దీంతో ఆయనను గతంలోనే సస్పెండ్‌ చేశారు. దాదాపు ఆరు నెలల నుంచి ఆయన పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ఎక్సైజ్‌ సోమవారం స్టాట్యుటరీ నోటీస్‌ జారీ చేయనున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం శ్రీనివాస్‌ను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇక గంజాయి రవాణాపై అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు...సొంత శాఖవారే సహకరిస్తున్నారన్న నిజాలు తట్టుకోలేకపోతున్నారు....దీంతోనే ఉక్కుపాదం మోపేందుకు పక్కా ప్రణాళిక సిద్దం చేశారు...అనకాపల్లి కేంద్రంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ, అటవీ, వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఉద్యోగులు ఉంటారు. వీరు ప్రత్యేక దృష్టి సారించి అక్రమ గంజాయి సాగు, రవాణాలను అరికట్టేందుకు పాటుపడతారు. గంజాయి అక్రమ రవాణాలో సంబంధాలున్న ఎక్సైజ్‌ సిబ్బంది, అధికారుల జాబితాను ఇప్పటికే ఉన్నతాధికారులు సిద్ధం చేసినట్టు సమాచారం. త్వరలోనే వారిపై వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు విశాఖలో మకాం వేసినట్లు తెలుస్తోంది.

10:44 - September 29, 2017

విశాఖ : గంజాయికి కేంద్రంగా ఉన్న విశాఖ జిల్లాలో సరికొత్త మత్తు దందా కొనసాగుతుందా...ఇంతకాలం స్మగ్లర్లు...వివిధ ముఠాలు మాత్రమే అక్రమ రవాణా చేస్తున్నాయని తెలుసు...కాని జిల్లాలో ఎక్సైజ్‌ శాఖలోని కొందరు అక్రమార్కులే దందా చేస్తున్నట్లు అనుమానాలు పెరుగుతున్నాయి...గంజాయి అక్రమ సాగు, రవాణాను నియంత్రించాల్సిన వారే అందులో మునిగి తేలుతున్నారు. దొరికిన వారే దొంగలు అన్నట్టు జిల్లాలో కొంతమంది ఎక్సైజ్‌ అధికారులు గంజాయి అక్రమార్కులతో పోటీ పడుతున్నారు. గంజాయి స్మగ్లర్లు తమపై ఎవరైనా అధి కారులు దాడులు చేస్తారేమోనని భయపడుతుంటారు. అందువల్ల రవాణాలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ దాడులు చేయాల్సిన వారే వారితో కుమ్మక్కై పోవడంతో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జిల్లాలో గంజాయి సాగు, రవాణా యథేచ్ఛగా సాగిపోతున్నాయి.

లోపాయికారీగా నొక్కేస్తున్నారన్న ఆరోపణలు
జిల్లాలో కొన్నాళ్లుగా పట్టుబడుతున్న గంజాయిని ఎక్సైజ్‌ శాఖ యథాతథంగా చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. బహిరంగంగా పట్టుబడ్డ గంజాయిని మాత్రమే రికార్డుల్లో చూపిస్తున్నారు...ఇక మారుమూల ప్రాంతాల్లో దొరికిన గంజాయిని మాత్రం లోపాయికారీగా నొక్కేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. రహస్యంగా స్వాధీనం చేసుకున్న గంజాయిని తమకు అనువైన చోటికి జీపులు, వ్యాన్లు, లారీల్లో తరలిస్తున్నారు...ఆ తర్వాత దొరికింది దోచేసుకునే కొందరు సిబ్బంది బేరం పెట్టుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి...ఇక దొరికిన అదే గంజాయిని స్మగ్లర్లకు రహస్యంగా విక్రయిస్తున్నారు...ఇలా జిల్లాలోని ఎక్సైజ్‌ శాఖలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు కొంతమంది ఉద్యోగులు వ్యాపకంగా పెట్టుకున్నారు.

గంజాయి దాచేందుకు ప్రత్యేక భవనం
సాక్షాత్తూ దాడులు చేసే సిబ్బందే గంజాయిని తరలిస్తుంటే ఎవరు అడ్డుకుంటారు? దీంతో స్మగ్లర్లు నిర్భీతిగా గంజాయి రవాణాలో వేళ్లూనుకుపోతున్నారు.దీని అరకట్టేందుకు ఇప్పుడు ఎక్సైజ్ ఉన్నదికారలు కళ్లుతేరిచారు.. పట్టుకున్నగంజాయి ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితి ఉండటంతో గంజాయి దాచేందుకు ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్శస్తున్నారు...దీని ద్వారా మెజిస్ట్రీట్ ముందు ఎంత గంజాయి పట్టుకున్నారనేది తునీకలు వేసి సీచ్ చేసి తరువాత వాటిని ఆ భవనానికి తరలించనున్నట్లు ఎక్సైజ్ డేకర్టర్ తెలిపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ద్వారా వచ్చే ఆదాయం రుచి మరిగిన వారు దానిని వదులుకోలేకపోతున్నారు. జిల్లాలో గంజాయి రవాణాలో పాలుపంచుకునే వారెవరో ఉన్నతాధికారులకు తెలిసినా వారు వివిధ కారణాల వల్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న వాదన ఉంది... దీంతో స్మగ్లర్లతోపాటు ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది కూడా భారీగా అక్రమార్జన చేస్తున్నారు.

10:33 - September 29, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తాజా చిత్రం న్యూ లుక్..టీజర్..ఇతర విశేషాలు తెలుస్తాయని అభిమానులు ఆశించారు. దసరా పండుగ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ వారి ఆశలు నెరవేరడం లేదు. ఇటీవలే అనురుధ్ స్వరపరిచిన పాట టీజర్ ను మాత్రమే ఇటీవలే విడుదల చేశారు. మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ శ్రీనివాస్' దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా 'పవన్' సరసన 'క్తీరి సురేష్', 'అనూ ఇమ్మాన్యుయేల్' హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది.

ఇటీవలే విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న అనంతరం 'దసరా' పండుగ సందర్భంగా షూటింగ్ కు చ్రిత బృందం కొంత విరామం తీసుకున్నట్లు టాక్. అక్టోబర్ మొదటి వారంలో మళ్లీ షూటింగ్ మొదలు పెడుతారని తెలుస్తోంది. దసరా పండుగ సందర్భంగా పవన్ న్యూ లుక్..పోస్టర్ విడుదల చేస్తారని టాక్ వినిపించింది. కానీ అవన్నీ వట్టివేనని తేలిపోయాయి. దీపావళికి టీజర్..ఫస్ట్ లుక్ విడుదలవుతుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే వెయిట్ అండ్ సీ..

10:26 - September 29, 2017

నేపాల్ లో హిందూ మత గురువులు మూడేళ్ల బాలిక త్రిష్ణా శాక్యను తమ ఇష్ట దేవతగా ఎంపిక చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఒకసారి కుమారీగా ఎంపికైన బాలిక యుక్త వయస్సు వచ్చే వరకు దేవతగా ఉండనున్నారు. నాలుగేళ్ల యవస్సులో కుమారీగా మారిన 'ప్రీతి శక్యా' యుక్త వయస్సుకు చేరుకుంది. దీనితో తాజా ఎంపిక అవసరమైంది. నేపాల్ అధ్యక్షుడు ఆమోదం తెలుపడంతో ఎంపిక ప్రక్రియను చేపట్టారు.

క్రీ.శ. 12-18 శతాబ్దాల మధ్యలో నేపాల్ ను మల్ల రాజుల పరిపాలించాడు. ఆయన ఆరాధ్య దేవత 'తలెజు'. ఈ కుమారీలను మానవరూపంలో తమ ఇష్టదైవమైన 'తలెజు'గా భావిస్తారు. ఇక కుమారీల ఎంపికకు కొన్ని కఠిన పరీక్షలుంటాయి. మూడు వారాల పాటు కఠిన పరీక్షలు నిర్వహిస్తారు. అంతకంటే ముందు ఎలాంటి లోపాలు లేని కళ్లు ఉండాలి. దంతాలు ఉండాలి. అలాగే శరీరంపై ఎలాంటి గాయాలు ఉండకూడదు. అత్యంత ధైర్యసాహసాలు కలిగి ఉండాలి. బలి ఇచ్చిన పశువుల మధ్య ఓ రాత్రి అంతా ఉండాలి. ఇలాంటి కొన్ని కఠిన పరీక్షలు..ప్రత్యేక అర్హతలు కలిగి ఉండాల్సి ఉంటుంది.

ఇక కుమారీలను పటాన్, ఖాట్మాండు, భక్తపూర్ ల నుండే ఎంపిక చేయబడుతారు. గుత్తి సంస్థాన్ నిర్వాహణ కమిటీ (జీఎన్ఎంసీ) సిఫార్సుల మేరకు కుమారీ ఎంపిక జరుగుతుంది. కుమారీగా ఎన్నికైన అనంతరం రజస్వల కాగానే ఆమెలో దైవత్వం పోతుందని అక్కడివారి నమ్మకం. అప్పటి నుంచి మరో కుమారిని ఎన్నుకునేందుకు పరీక్షలు జరుగుతాయి. ఎంపిక అనంతరం కూడా కొన్ని కఠిన నియమ నిబంధనుంటాయి. రాజధాని ఖాట్మాండులోని పురాతన ఆలయంలో మత ఆచారాల ప్రకారం కుమారీలను ప్రత్యేక సంరక్షణలో ఉంచుతారు. వారు ఎరుపు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. 

జైలు నుంచి పారిపోయేందుకు ఐఎస్ఐ ఉగ్రవాదులు యత్నం

హైదరాబాద్: చంచల్ గూడ జైలు నుంచి పారిపోయేందుకు ముగ్గురు ఐఎస్ఐ ఉగ్రవాదులు యత్నించారు. అప్రమత్తమైన జైలు అధికారులు ఉగ్రవాదులను హై సెక్యూరిటీ బ్లాక్ నుంచి నర్మదా బ్యారక్ లోకి మార్చారు.

వృద్ధురాలి గొంతు కోసి గుర్తు తెలియని వ్యక్తులు..

వరంగల్ రూరల్ : నెక్కొండ మండలం పెద్దకొర్పోలు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు వృద్ధురాలు బిర్రు శాంతమ్మ (60) గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని..దుండగుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు

హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తే అవకాశముందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. శుక్రవారం కూడా రాష్ట్ర్రమంతటా వర్షాలు కురుస్తాయని..అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, శని, ఆది, సోమవారాలు పలు ప్రాంతాల్లో జల్లులతో కూడిన వానలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది..

ఉదరల పాలెంలో దళితులు-కాపుల మధ్య ఘర్షణ

ప.గో: అత్తిలి మండలం ఉదరలపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. నవరాత్రుల సందర్భంగా నిప్పులగుండం దగ్గర ఘర్షణ ఏర్పడింది. 4 రోజుల కిత్రం ప్రభుత్వ స్థలం విషయంలో మొదలైన వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. దళితులు-కాపుల రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాలకు చెందిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

10:07 - September 29, 2017

పశ్చిమగోదావరి : జిల్లా అత్తిలి మండలం ఉరదలపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి కాపులు, దళితులకు మధ్య వివాదం తలెత్తింది. నాలుగు రోజుల కింద ఆర్‌ అండ్‌ బీకి చెందిన కామన్‌ స్థలంలో దళితులు అంబేద్కర్‌ బ్యానర్‌ ఏర్పాటు చేశారు. ఇందుకు కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది అడ్డుతగిలారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తగా రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకున్నారు. కామన్‌సైట్‌ను ఇరువర్గాలు సమంగా వాడుకోవాలని సూచించారు. అప్పుడు తాత్కాలికంగా వివాదం సద్దుమణిగినా రాత్రి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన నిప్పుల గుండం దగ్గర మరోసారి వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.ఈ రాళ్లదాడిలో పలువురికి గాయాలు కాగా.. వారిని తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరువర్గాలు చెందిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

10:05 - September 29, 2017

అనంతపురం : ఆస్పత్రిలో మృత్యుఘోష ఆగలేదు. ఇవాళ మరో ఇద్దరు రోగులు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 16కు చేరింది. బుధవారం 10 మంది చనిపోగా.. గురువారం మరో నలుగురు రోగులు మృతి చెందారు. ఇవాళ మరో ఇద్దరు రోగులు చికిత్స పొందుతూ చనిపోయారు. అనంతపురం ధర్మాసుపత్రిలో రోగులు వరుసగా చనిపోతుండడంతో మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆస్పత్రికి సందర్శించారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు

తిరుమల : తిరుమలలో వైభవంగా శ్రీవారి పాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై భక్తులకు శ్రీనివాసుడు దర్శనమిస్తున్నాడు.

09:57 - September 29, 2017

పశ్చిమగోదావరి : తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని రాఘవాపురం, ఎండపల్లి, మల్లేశ్వరం గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడి మహిళలు 11 ఏళ్లుగా బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నారు. గ్రామ దేవత మరిడమ్మ ఆలయం వద్ద బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ ఆడటం ఎంతో ఆనందంగా ఉందని స్థానిక మహిళలు అంటున్నారు. 

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు మొత్తం 18 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. నడకదారి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2 గంటల సమయం..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 2గంటల సమయం పడుతున్నది.

తల్లిదండ్రులు, తమ్ముడి పై పెట్రోలు పోసి నిప్పుపెట్టాడు...

విశాఖ: జి.మాడుగుల మండలం చదురుమామిడిలో తల్లిదండ్రులు, తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు తనయుడు. అప్రమత్తమైన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

09:47 - September 29, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండిలోని శ్రీనివాసనగర్‌ కాలనీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో 12 అడుగులు బతుకమ్మను ఏర్పాటు చేశారు. కాలనీలోని మహిళలంతా దాని చుట్టూచేరి బతుకమ్మ ఆడారు. దాండియా ఆటలాడుతూ అర్థరాత్రి వరకు సంబరాలు చేసుకున్నారు. వర్షంపడుతున్నా సద్దుల బతుకమ్మ ఆడుతూ సంతోషంగా గడిపారు. మహిళలు, యువతులు రంగురంగుపూలతో బతుకమ్మలను పేర్చి వాటిచుట్టూరా బతుకమ్మ ఆడిపాడారు.  

09:43 - September 29, 2017

కృష్ణా : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ దుర్గమ్మ శ్రీమహిషా సురమర్దినీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్స్‌ నిండిపోయాయి. 

09:40 - September 29, 2017

అనంతలో ఆగని మృత్యుఘోష

అనంతపురం : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష ఆగడంలేదు. ఈ రోజు ఉదయం చికిత్స పొందతూ ఇద్దరు రోగులు మరణించారు. దీంతో మూడురోజుల్లో మరణల సంఖ్య 16కు చేరింది. ఆసుపత్రిని మంత్రి కాలువ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

09:34 - September 29, 2017

అనంతపురం : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష ఆగడంలేదు. ఈ రోజు ఉదయం చికిత్స పొందతూ ఇద్దరు రోగులు మరణించారు. దీంతో మూడురోజుల్లో మరణల సంఖ్య 16కు చేరింది. ఆసుపత్రిని మంత్రి కాలువ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

09:10 - September 29, 2017
09:06 - September 29, 2017

చిత్తూరు తృటిలో తప్పిన రోడ్డు ప్రమాదం

చిత్తూరు : జిల్లా చంద్రగిరి సమీపంలో రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. ఐటేపల్లి వద్ద నాలుగు బస్సులు ఢీకొన్నారు. ముందువెళ్తున్న బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 

08:33 - September 29, 2017

చిత్తూరు : జిల్లా చంద్రగిరి సమీపంలో రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. ఐటేపల్లి వద్ద నాలుగు బస్సులు ఢీకొన్నారు. ముందువెళ్తున్న బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

పశ్చిమగోదావరిలో జిల్లాలో ఉద్రిక్తత

పశ్చిమగోదావరి : జిల్లా అత్తిలి మండలం ఉరదలపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాపుల, దళితుల మధ్య భూ వివాదంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడిచేసుకున్నారు. రాళ్లదాడిలో పలువురికి గాయాలయ్యాయి. వారికి తణుకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

సింగరేణి కార్మికులకు బోనస్

హైదరాబాద్ : నేడు సింగరేణి కార్మికులకు బోనస్ చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆధికారులను ఆదేశించారు. లాభాల బోనస్, దీపావళి బోనస్ కలిపి చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

నేడు సీఎం చంద్రబాబుతో మిలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధుల భేటీ

గుంటూరు : నేడు అమరావతిలో సీఎం చంద్రబాబుతో మిలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. భూసార పరీక్షలపై గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

నేడు సూర్యప్రభ వాహనంపై ఊరేగనున్న శ్రీవారు

చిత్తూరు : తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఉదయం 9గంటలకు శ్రీవారు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 9గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగనున్నారు. 

08:25 - September 29, 2017

పశ్చిమగోదావరి : జిల్లా అత్తిలి మండలం ఉరదలపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాపుల, దళితుల మధ్య భూ వివాదంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడిచేసుకున్నారు. రాళ్లదాడిలో పలువురికి గాయాలయ్యాయి. వారికి తణుకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

08:10 - September 29, 2017

ప్రభుత్వం గిన్నీస్ బుక్ రికార్డ్ కోసమే అని, బతుకమ్మ అంటే బతునిచ్చే అమ్మ అని, బతుకమ్మ సంస్కృతిక ఉత్సవమని, బతుకమ్మ తో ఆడబిడ్డల అభివృద్ది కృషి చేయాలని, టీఆర్ఎస్ బతుకమ్మను ప్రచారం తప్ప సంస్కృతింగా చేయలేదని, పెళ్లైనా మహిళలకు టీఎస్ పీఎస్ సీ తండ్రి పేరుపై ఆదాయం సర్టిఫికేట్ తీసుకురావాలని షరుతులు విధించడం, తెలంగాణ ఉద్యమం కోసం బతుకమ్మను ఉపయోగించుకున్నారని నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య అన్నారు. ఏ రాష్ట్రం ఏర్పాడిన సంస్కృతికంగా ఏర్పడుతోందని, మహిళ గురించి ప్రభుత్వం గొప్పలు చెబుతుందని, కేబినెట్ లో ఒక మహిళకు చోటు కల్పించలేదని, ఆనాడు నైజంలపై బతుకమ్మ ఆడుతూ పోరాటం చేశామని, ప్రజల యొక్క ఆశలపై ప్రభుత్వం మైండ్ గేమ్ అడుతున్నారని కాంగ్రెస్ నేత కైలాష్ అన్నారు. బతుకమ్మ మన బతుకు చిత్రన్ని అవిష్కరిస్తాయని, తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మలో మమేకం అయిందని, మహిళ పట్ల వివక్ష లేదని, వారికి కోసం కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ స్కీంలు ప్రవేశాపెట్టాయిని టీఆర్ఎస్ నేత సత్యనారాయణ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:08 - September 29, 2017

హైదరాబాద్ : ఇంతకీ ఎవరీ బతుకమ్మ...? ఆమె పేరిట తెలంగాణ యావత్తు ఎందుకు పండుగ చేసుకుంటుంది..? ఈ ప్రశ్నకు తెలంగాణ పల్లెసీమల్లో రకరకాల సమాధానాలు వినిపిస్తాయి. భూస్వామి అఘాయిత్యానికి బలైన బాలికను తమ స్మృతిపథంలో కలకాలం బతికుండమని దీవిస్తూ జరుపుకునే పండుగ అని ఓ కథనం.. చోళులకు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలిగిన కుమార్తెను కష్టాల నుంచి బయట పడేసేందుకు బతుకమ్మగా పేరు మార్చగా ఆమె సౌభాగ్యవతి అయిందని.. అదే భాగ్యం తమకూ కలగాలని కోరుతూ మహిళలు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారన్న మరో కథనం ప్రచారంలో ఉన్నాయి. 

08:07 - September 29, 2017

హైదరాబాద్ : తెలంగాణ పల్లెసీమల్లో దసరా అంటే బతుకమ్మే. బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతే కాదు.. ఈ నేలపై పుట్టిన ఆడపడుచుల సృజనాత్మక శక్తికీ నిదర్శనం. తెలంగాణ మహిళల చేతులు పడగానే సుమనోహర సుమాలు సైతం అద్భుత ఆకృతులను సంతరించుకుంటాయి. నవ నాగరికతకు ఆద్యులమని భావించే వారిని సైతం తెలంగాణ ఆడబిడ్డల కళాత్మకత కట్టిపడేస్తుంది. తెలంగాణ ప్రకృతి సోయగాలకు నెలవు... అందునా శీతాకాలపు తొలి నాళ్లలో విరబూసిన పుష్ప శోభతో... ఈ నేల మరింత రమణీయంగా భాసిల్లుతుంది. ఇక్కడ ఊపిరులు పోసుకున్న వారు, ప్రకృతిని అమితంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా ఈ నేలపై పుట్టిన ఆడపడుచులు ప్రతి సంబరానికీ ప్రకృతినే ఆలంబనగా చేసుకుంటారు. అందుకే ఇక్కడి పర్వదినాల్లో ఎక్కువ శాతం ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనది బతుకమ్మ.

08:06 - September 29, 2017

హైదరాబాద్ : తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు జరిగిన బతుకమ్మ సంబురాలు ఘనంగా ముగిశాయి. ఈనెల 20న ఎంగిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిశాయి. ఈ తొమ్మిది రోజులు రకరకాల బతుకమ్మను పూజించారు.మొదటి రోజు ఎంగిపూల బతుకమ్మ, రెండో రోడు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాల్గవ రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ జరుపుకున్నారు. ఆరోజు బతుకమ్మ అలిగివెళ్లడంతో పెద్దగా ఉత్సవాలు నిర్వహించకపోడం ఆనవాయితీగా వస్తోంది. ఏడువ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ నిర్వహించిన తెలంగాణ మహిళలు, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. చెరువులు, కాల్వల్లో బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేర్చారు.

చెరువుల్లో నిమజ్జనం...
సిద్దిపేట జిల్లా కోమటి చెరువు వద్ద జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. హాస్య నటులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆడపడులు ఆట, పాటలతో సంబరాలు అంబరాన్ని అంటాయి. పోయిరా గౌరమ్మ, మళ్లీరా బతుకమ్మ అంటూ బతుకమ్మలకు కాల్వలు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. :ఉమ్మడి నల్గొండ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడకలు ఘనంగా జరిగాయి. నల్గొండ వల్లభరావు చెరువు, సూర్యాపేట సద్దెల చెరువు, భువనగిరి జూనియర్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వర్షంలోనే బతుకమ్మ ఆడి, పాడారు.

మనువరాలుతో ఎమ్మెల్యే కొండా సురేఖ
మెదక్‌ జిల్లా వేముల ఘాట్‌లో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. వర్షంలోనే మహిళలు బతుకమ్మలను పూజించి, ఆడి, పాడారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందు మండల కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఎమ్మెల్యే హనుమంతు షిండే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జుక్కల్‌ మండలంలో కూడా బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి. రంగల్‌ అర్బన్‌ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. కొత్తవాడలో నిర్వహించిన బతుకమ్మ వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ తన మనువరాలుతో కలిసి బతుకమ్మ ఆడారు. కరీమాబాద్‌ రంగ సముద్రంతోపాటు కాశిబుగ్గ, చిన్నవడ్డేపల్లి చెరువల వద్ద బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. బతుకమ్మ ఆడిపాడిన అనంతరం గంగమ్మ చెంతకు చేర్చారు.

బతుకమ్మ వేడుకల్లో విషాదం
నాగర్‌ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, ప్రజలు కలిసి బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రకృతి పూల పండుగ బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆట, పాటలతో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు అలరించాయి. జనగామ జిల్లా కలెక్టర్‌ దేవసేన, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య తలెత్తిన వివాదం బతుకమ్మ వేడుకల్లో కూడా కనిపించింది. కలెక్టర్‌ దేవసేన, ఎమ్మెల్య ముత్తిరెడ్డి వేర్వేరుగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. దేవసేన బాణాపురంలోని వెంకటేశ్వరాలయంలో బతుకమ్మ నిర్వహించగా, ముత్తిరెడ్డి బతుకమ్మ కుంటలో సంతంగా ఏర్పాటు చేశారు. దీంతో సద్దుల బతుకమ్మ ఎక్కడ ఆడాలతో తెలియక మహిళలు ఆయోమయానికి గురయ్యారు. మరోవైపు మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం ఇందుపల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పూలు కోసేందుకు చెరువులో దిగిన లింగన్న మృతి చెందాడు. దీంతో లింగన్న కుటుంబంలో విషాదం నెలకొంది. మృతులు నిరుపేద కావడంతో గ్రామస్తులు చందాలు వేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. 

08:04 - September 29, 2017

హైదరాబాద్ : శ్రీరాంనగర్‌లో బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు ఎం శ్రీనివాస్‌తోపాటు కాలనీ సంక్షేమ సంఘం ఉత్సవాలకు హాజరయ్యారు. వర్షంలో కూడా మహిళలు, పిల్లలు బతుకమ్మ ఆడి సందడి చేశారు. 

08:04 - September 29, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి గజవాహన సేవ కన్నుల పండువగా జరిగింది. గజవాహన సేవను చూసి తరించేందుకు భక్తులు తరలిరావడంతో తిరుమాడవీధులు కిటకిటలాడాయి. తిరుమలలో వర్షం కువరడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఏడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై విహరించనున్న శ్రీవారు.. సాయంత్రం చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారు. 

08:02 - September 29, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాలకు అల్పపీడీన ద్రోణి ప్రభావం తోడయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కరుస్తున్నాయి. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సరూర్‌నగర్‌, కొత్తపేట, మలక్‌పేట, ఎల్బీనగర్‌, నాగోల్‌, సికింద్రాబాద్‌, తిరుమలగిరి, అల్వాల్‌, కాప్రా తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాలు రోడ్లు జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగిపొర్లాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో మగ్గిపోయారు.

పిడుగుపాటుకు రైతు మృతి
మెదక్‌,సంగారెడ్డి, కామారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కూడా వర్షం కురిసింది. కుమ్రం భీం జిల్లాలోని లింగాపూర్‌, జైనూర్‌, వాంకిడి, ఆసిఫాబాద్‌, పెంచికల్‌పేట్‌, దహెగాం మండలాల్లో వర్షం పడింది. చింతమానేపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు మృత్యువాతపడ్డాడు. ఎద్దు కూడా ప్రాణాలు కోల్పోయింది. వర్షాలతో కడప జిల్లా పెద్దముడియం మండలం ఉలవపల్లెలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలో రెండురోజులుగా కురిసిన భారీ వర్షాలకు.. ఉలవపల్లె సమీపంలోని కాశివారివంక ఉద్ధృతంగా ప్రవహస్తోంది. వంకను దాటేందుకు యత్నించిన వీఆర్‌ఏ బిల్లా సుబ్బరాయుడు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఆతర్వాత ముళ్లపొదల్లో సుబ్బరాయుడు మృతదేహం చిక్కుకుని కనిపించింది.

నైరుతీ రుతువపనాలు తిరుగుముఖం
అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పుట్టపర్తిలో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువుల్లోకి నీరు చేరుతోంది. బోర్లలో నీటిమట్టం పెరుగుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ, తెలంగాణ, దక్షిణ కర్నాటక, కేరళ మినహా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో నైరుతీ రుతువపనాలు తిరుగుముఖం పట్టాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్‌లో సెప్టెంబర్‌ వరకు మన దేశంలో సగటు వర్షపాతంలో ఐదు శాతం లోటు నమోదైంది. వాయువ్య భారతదేశంలో అతితక్కువగా వర్షాలు కురిసినట్టు భారత వాతావణ శాఖ ప్రకటించింది. నైరుతీ రుతుపవనాల ఉపసంహరణ తర్వాత వచ్చేనెలలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

08:00 - September 29, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ చరిత్రలో సకలజనుల సమ్మెకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ పోరాటంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర వెలకట్టలేనిది. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చినా... ఆర్టీసీ కార్మికులకు మాత్రం నేటికీ న్యాయం జరగలేదు. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనని ఇతర శాఖల ఉద్యోగులు సకల జనుల సమ్మె కాలానికి వేతనంతో కూడిన సెలవును పొందారు. పోరును ముందుండి నడిపిన ఆర్టీసీ కార్మికులకు ఆ భాగ్యం దక్కలేదు.

మిగతా వారికి సమ్మె కాలానికి వేతనాలు దక్కాయి
ప్రభుత్వ, సింగరేణి, విద్యుత్‌ ఉద్యోగులకు సకల జనుల సమ్మె కాలానికి వేతనాలు దక్కాయి. రోజుకు రెండు వందల చొప్పున కన్సాలిడేటెడ్ పే పేరుతో వేతనం ఇచ్చారు. అయితే సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆర్టీసీ కార్మికులను మాత్రం ప్రభుత్వం విస్మరించింది. సకల జనుల సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులు కోల్పోయిన వేతనాన్ని.. సెలవులను తిరిగి ఇస్తామని సీఎం కేసీఆర్‌ గతంలో హామీ ఇచ్చారు. ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల సమయంలోనూ ఇదే విషయాన్ని అధికార పార్టీ నేతలు చెప్పారు. ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ సమ్మెకాల వేతనంపై ఏ రకమైన స్పష్టత రాలేదు. దీంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకల జనుల సమ్మె కాల వేతనమే కాదు.. ప్రస్తుతం ఇస్తున్న తెలంగాణ ఇంక్రిమెంట్ విషయంలోనూ మార్పులు చేయాలని కార్మికులు కోరుతున్నారు. 

07:58 - September 29, 2017

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పండుగలను, దేవుళ్లను రాజకీయకోణంలో చూస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఒకప్పుడు పోలవరాన్ని అడ్డుకున్న చంద్రబాబుకు ఇప్పుడు అదే వరంగా మారిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు ఆలస్యం అవుతుందో చంద్రబాబు చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. 

07:57 - September 29, 2017

ప్రకాశం : తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం ఇచ్చిన పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్ధానాలను మూడు విభాగాలుగా చేసుకుని.. మొదటి విభాగంలో అక్టోబర్ నుండి నవంబర్‌ వరకు పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు ఎల్.రమణ చెప్పారు. 

07:56 - September 29, 2017

చిత్తూరు : టీటీడీ చైర్మన్‌గా ఖరారైన పుట్టా సుధాకర్‌యాదవ్‌.. కడవ జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో మైదుకూరు నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారల్లో చురుగ్గాల పాల్గొంటున్న సుధాకర్‌యాదవ్‌ పేరును టీటీడీ చైర్‌పదవికి ఖరారు చేయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందని భావిస్తున్నారు.

వ్యూహాత్మకంగా అడుగులు
ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్‌ను ఇటు రాష్ట్రంతో పాటు అటు ఇతని సొంత జిల్లా కడపలో కూడా దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... టీటీడీ చైర్మన్‌ పేరు ఖరారు చేసే విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. మైదుకూరుకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చే క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం సుధాకర్‌యాదవ్‌ పేరును ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకురావడం ద్వారా కడప జిల్లాలో జగన్‌ను వైసీపీని దెబ్బకొట్టొచ్చన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు.

టీడీపీలోకి డీఎల్ రవీంద్రారెడ్డి
రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పావులు కదిపారు. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని రవీంద్రారెడ్డి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మైదుకూరు నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీచేసి ఓడిపోయిన పుట్టా సుధాకర్‌యాదవ్‌... పార్టీ కార్యక్రమంల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నుంచి పలువురు నేతలను టీడీపీలోకి తీసుకొచ్చి, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతున్న సుధాకర్‌యాదవ్‌ను ముందస్తుగానే బుజ్జగించేందుకు టీటీడీ చైర్మన్‌ పదవి ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మైదుకూరు నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న యాదవ ఓటర్లను టీడీపీ చేజారిపోకుండా చూసే క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్‌ పదవికి సుధాకర్‌యాదవ్‌ పేరును ఖరారు చేశారని వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో డీఎల్‌ రవీంద్రారెడ్డి పోటీ చేయలేదు. అంతకు ముందు జగన్‌పై ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన ఓడిపోయిన డీఎల్‌... గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసే అవకాశం వచ్చినా.... నిలబడేందుకు ముందుకురాలేదు. దీంతో టీడీపీ నాయకత్వ పుట్టా సుధాకర్‌యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. వైసీపీ రఘురామిరెడ్డితో పోరాడి ఓడిపోయారు. సుధాకర్‌యాదవ్‌ పార్టీకి చేసిన సేవలుకు గుర్తింపుగా, వచ్చే ఎన్నికల్లో డీఎల్‌కు అడ్డంరాకుండా ఉండేందుకు వీలుగా అన్ని కోణాల్లో ఆలోచించి ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ చైర్మన్‌ పదవికి సుధాకర్‌యాదవ్‌ పేరును ఖరారు చేశారని భావిస్తున్నారు. దసరా తర్వాత సుధాకర్‌యాదవ్‌ నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

జగన్‌ను దెబ్బకొట్టాలన్న వ్యూహంలో
సొంత జిల్లాలో జగన్‌ను దెబ్బకొట్టాలన్న వ్యూహంలో భాగంగానే ఇప్పటికే జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకుని మంత్రిపదవి కట్టబెట్టారు. బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే జయరాములును కూడా టీడీపీలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ నేత డీఎల్‌ రవీంద్రారెడ్డిని టీడీపీలో చేర్చుకోవడం ద్వారా సామాజికంగా జగన్‌ను దెబ్బకొట్టొచ్చన్న ఉద్దేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు వ్యూహం వచ్చే ఎన్నిల్లో ఎంతవరకు కలిసివస్తుందో చూడాలి. 

07:49 - September 29, 2017

గుంటూరు : తెలంగాణ తరహాలో ఏపీలో కూడా 12వ తరగతి వరకు తెలుగు భాష బోధనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై తర్వలో విధాన ప్రకటన చేయనున్నారు. భాష విషయంలో పొరుగు రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు బోధనను తప్పనిసరి చేశారు. తెలుగు భాషాభివృద్ధి చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్‌ స్కూళ్లలో మాతృభాష బోధన గాడితప్పుతోందన్న వాస్తవాన్ని గ్రహించిన ప్రభుత్వం తెలుగు పరిరక్షణకు నడుం బిగించింది. తెలుగు భాష అభివృద్ధి, సంస్కృతుల అధ్యయనంపై ప్రభుత్వం నియమించిన కమిటీ అందించిన నివేదికను పరిశీలించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి 12 వ తరగతి వరకు తెలుగును తప్పని చేసే అంశంపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. 

నేడు భారత్ లో యాపిల్ 8, 8ప్లస్ స్మార్ట్ ఫోన్ల విడుదల

ముంబై : ప్రముఖ మొబైల్ సంస్థ యాపిల్ తన కొత్త మాడళ్లను నేడు మార్కెట్ విడుదల చేయబోతోంది. ఇందులో యాపిల్ 8, 8ప్లస్ ఉన్నాయి. వీటి ప్రారంభ ధర రూ.64వేలుగా ఉంది.

నేడు జమ్మూలో పర్యటించినున్న నిర్మల సీతారామన్

 

ఢిల్లీ : నేడు జమ్మూలో రక్షణ శాఖ మంత్రి నిర్మసీతారామన్ పర్యటించనున్నారు. ఆమె ఈరోజు శ్రీనగర్ లో రేపు సియాచిన్ లో పర్యటిస్తారు.

Don't Miss