Activities calendar

30 September 2017

తిమ్మాపూర్ లో దసరా వేడుకల్లో ఘర్షణ

రాజన్న సిరిసిల్ల : చందుర్తి మండలం తిమ్మాపూర్ లో దసరా వేడుకల్లో ఇరువర్గాల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఎర్రకోట మైదానంలో ఘనంగా దసరా వేడుకలు

ఢిల్లీ: ఎర్రకోట మైదానంలో ఘనంగా దసరా వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

గవర్నర్ కు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. గవర్నర్ కు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు.

పుర వీధులలో ఊరేగుతున్న దుర్గామల్లేశ్వరులు

విజయవాడ:ఇంద్రకీలాద్రి నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు కొనసాగుతుంది.గజకర్ణ గోకర్ణ డప్పు వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా పుర వీధులలో దుర్గామల్లేశ్వరులు ఊరేగుతున్నారు. ఊరేగింపు కార్యక్రమాన్ని వన్ టౌన్ సీఐ కాశీ విశ్వనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

16:36 - September 30, 2017
16:35 - September 30, 2017
16:34 - September 30, 2017
16:26 - September 30, 2017

విశాఖ : ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవ సంబరానికి వేళైంది. ప్రతి ఏటా దసరా తర్వాత వచ్చే మంగళవారం రోజున అమ్మవారి సిరిమాను ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రాధాన్యతను సంతరించుకునే పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు....

విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఈ ఉత్సవాలలో ప్రధాన ఘట్టం సిరిమాను సంబరాలు. ప్రతి ఏటా దసరా తర్వాత వచ్చే మంగళవారం రోజున ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది అక్టోబర్‌ 3న సిరిమానోత్సవం జరగనుంది. సిరిమానుపై అమ్మవారికి ప్రతిరూపంగా ఆలయ పూజారి కూర్చొని భక్తులను ఆశీర్వదించే అపురూప ఘట్టమే ఈ సిరిమానోత్సవం. పట్టణంలోని పైడితల్లి అమ్మవారి చదురుగుడి నుండి కోట వరకు మూడుసార్లు తిరిగి రావడంతో ఉత్సవం ముగుస్తుంది.

కలలో సిరిమాను చెట్టు గురించి తెలిపే అమ్మవారు

అయితే ఈ సిరిమాను ఉత్సవానికి అవసరమైన చింతమాను ఎక్కడ ఉందన్న విషయాన్ని అమ్మవారు ఆలయ పూజారి కలలో కనిపించి చెబుతుంది. ఆ విధంగా ఈ ఏడాది డెంకాడ మండలం రెడ్డికపేట గ్రామంలో సిరిమాను చెట్టు ఉన్నట్టుగా గుర్తించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, చెట్టును నరికి మేళ, తాళాలతో దానిని హుకుంపేటలోని పూజారి ఇంటికి తరలించారు. ఇక్కడే చింతమానును సిరిమానుగా మలచే కార్యక్రమాన్ని చేపడతారు. వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ సిరిమానును, రథాన్ని తయారు చేస్తుంటాయి. దీంతో పాటు సిరిమాను వెంట నడిచే అంజలి రథం, తెల్ల ఏనుగు తయారీ పనులు పూర్తి చేస్తారు. అమ్మవారి సిరిమాను తయారు చేసే అవకాశం రావడం తమ అదృష్టంగా ఆ కుటుంబీకులు భావిస్తారు.

సిరిమానును అధిరోహించే పూజారులకు చరిత్ర

ఇక సిరిమానును అధిరోహించే పూజారులకూ వంశపారంపర్య చరిత్ర ఉంది. 1758లో పూసపాటి సంస్థానాధీశుడు ఆనందరాజు కాలం నుంచి అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. మొదటగా పతివాడ అప్పలనాయుడు ఈ ఉత్సవాలలో పూజారిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన వంశానికి చెందినవారే పూజారులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది వెంకట్రావు సిరిమానును అధిరోహించబోతున్నారు.

విజయనగరానికి లక్షలాది మంది భక్తులు...

ప్రతి ఏట సిరిమానోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది భక్తులు విజయనగరం చేరుకుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రల నుండి కూడా ఈ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు తరలివస్తారు. ఈసారి ఉత్సవ నిర్వహణను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఉత్సవానికి అవసరమైన సిరిమాను, ఇరుసుమానుల తయారీని డి.ఎఫ్‌.ఓ లక్ష్మణ‌్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. సిరులలిచ్చే కల్పవల్లి...పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 3న ఘనంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

16:23 - September 30, 2017

కర్నూలు : దసరా అంటే అంతటా సందడే... కానీ కర్నూలు జిల్లాలో జరిగే దసరా ఉత్సవానికి మరింత ప్రత్యేకత ఉంది. ఆలూరు నియోజకవర్గం, హోళగుంద మండలంలో దేవరగట్టులో దసరా రోజు జరిగే మాళమల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం... కర్రల సమరం అత్యంత వైభవంగా జరుగుతాయి. కాగడాల వెలుగులో జరిగే ఈ సమరానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.

కల్యాణం అనంతరం విగ్రహాల ఊరేగింపు

ప్రతి ఏటా విజయదశమి రోజు మాలమల్లేశ్వర కల్యాణం అనంతరం స్వామివారి విగ్రహాలను ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపునే బన్ని ఉత్సవం అనికూడా అంటారు. ముందుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. మాలమల్లేశ్వరుని ప్రియభక్తుడు గొరవయ్య కాలి తొడభాగంలో కత్తితో కోసి పిడికెడు రక్తం ధారపోస్తాడు. అనంతరం గొరవయ్య బసవన్న ఆలయం చేరుకుని భవిష్యవాణి వినిపిస్తారు. అక్కడి నుంచే జైత్రయాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో చేతిలో కర్ర , కాగడా పట్టి దేవుడి ముందు భక్తితో నృత్యం చేస్తారు.

ఉత్సవ విగ్రహాలు దక్కించుకునేందుకు పోటీ

పొడవాటి కర్రలకు ఇనుప రింగులు తొడిగి, కాగడాలు చేతపట్టి మాలమల్లేశ్వరుని ఊరేగింపుగా తీసుకొస్తుంటారు. ఈ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవాలనే ఉద్దేశంతో విరుపాపురం, సులువాయి, ఎల్లార్తి, హరికెర వాసులు పోటీ పడతారు. స్వామి ఉత్సవం మాదే అని మూడు గ్రామాల ప్రజలు దివిటీలు, కర్రలతో అడ్డుకుంటారు. ఆ ప్రయత్నంలో తలలు పగిలేలా కొట్టుకుంటారు.

అనాదిగా వస్తున్న ఆచారమంటున్న ప్రజలు

అయితే ఇలా కర్రలతో కొట్టుకోవడం హింస కాదని... ఇది అనాదిగా వస్తున్న తమ ఆచారమంటూ భక్తులు అంటారు. ఈ కర్రల సమరానికి సంబంధించిన అనేక కథలు ఉనికిలో ఉన్నాయి. 11వ శతాబ్దం నుంచి ఈ బన్నీ ఉత్సవం జరుగుతోందని ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు. కానీ ఈ ఉత్సవంలో ఎలాంటి రక్తపాతం జరగకుండా ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని జనవిజ్ఞాన వేదిక సభ్యులు అంటున్నారు. హింసకు తావివ్వకుండ సమరం సాఫిగా సాగేలా కోరుతున్నారు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు

బన్ని ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. మద్యం సేవించిన వారిని గుర్తించేందుకు బ్రీత్ అనలైజర్లను, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే వారిని గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను నూతనంగా వినియోగిస్తున్నామని ఎస్పీ చెబుతున్నారు. ఈ సంవత్సరం భద్రతా ఏర్పాట్లు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే

నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

కృష్ణా : నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. కార్యాలయం అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

15:49 - September 30, 2017

ఢిల్లీ : పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు గవర్నర్‌గా భన్వరిలాల్ పురోహిత్‌..

బీహార్‌ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్‌..అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా బీడీ మిశ్రాను నియమించింది. ఇక అస్సోం గవర్నర్‌గా ప్రొఫెసర్‌ జగదీష్‌ ముఖి...మేఘాలయా గవర్నర్‌గా గంగప్రసాద్‌కు అవకాశం కల్పించింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా జగదీష్‌ ముఖి స్థానంలో దేవేంద్రకుమార్‌ జోషిని నియమించింది.

15:48 - September 30, 2017

తూ.గో: రాజమహేంద్రవరంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు చేపడుతున్నారు.

15:46 - September 30, 2017

హైదరాబాద్: మొహరం సందర్భంగా హైదరాబాద్‌లో భద్రతను పటిష్టం చేశారు. పాతబస్తితోపాటు , చాదర్ ఘాట్, మౌలాలి ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఊరేగింపు సాగే రూట్లలో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘాపెట్టారు. అక్టోబర్ 1న మొహరం, దేవి నిమజ్జన కార్యక్రమం ఒకేసారి రావడంతో పోలీసులతోపాటు కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచారు.

హైదరాబాద్‌లో పోలీసుల నిఘా

హైదరాబాద్‌లో పోలీసు యంత్రాంగం నిఘాను పెంచింది. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచింది. సున్నిత ప్రాంతాల్లో సీసీకెమెరాలతో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. మొహరం, బీబీకాఅలం ఊరేగింపులో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టిన అధికారులు.. ప్రత్యేక బలగాలను అందుబాటులో ఉంకచారు. చార్మీనార్, ముర్గిచౌక్, రెయిన్ బజార్, యాకుత్ పూరా, డబీర్ పురా, పత్తర్‌ఘట్టి, హుస్సేనీఆలం, మొఘల్ పురా తదితర ప్రాంతాలతో పాటు అఫ్జల్ గంజ్, చాదార్ ఘాట్ ఏరియాల్లో బందోబస్తును పెంచారు.

సౌత్‌జోన్ కంట్రోల్‌రూం నుంచి పర్యవేక్షణ

ఊరేగింపుసాగే ప్రాంతాల్లో సౌత్‌జోన్ కంట్రోల్ రూం నుంచి భద్రతను పర్యవేక్షిస్తారు. డిజిటల్ సిసి కెమేరాల సహయంతో చార్మీనార్ ఏసిపి కార్యాలయం నుంచి భద్రతా ఏర్పాట్లు సమీక్షిస్తారు. మొహర్రం ఏర్పాట్లపై సాలార్జంగ్‌ మ్యూజియంలో ఇప్పటికే సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, డీసీపీ సత్యనారాయణ, చార్మీనార్, ముర్గిచౌక్ బందోబస్తు ఇన్ చార్జ్ ఏసిపిలు, సీఐలతో పాటు పలువురు ముస్లిం పెద్దలు హాజరయ్యారు.

పోలీసుల ఆధీనంలో పలు ప్రాంతాలు

అటు డబీర్ పురా నుంచి చాదార్ ఘాట్ వరకు మాక్ భద్రతా రిహార్సల్స్ నిర్వహించారు. ఇప్పటికే చార్మీనార్, మక్కామసీదు, గుల్జార్ హౌజ్, పత్తర్ గట్టి, మొఘల్ పురా ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు షాడో టీమ్స్ రంగంలోకి దించారు. మరోవైపు దేవీనవరాత్రులు పూర్తవడంతో అమ్మవారి విగ్రహాల నిమజ్జనం కూడా మొదలవనుంది. ఇటు మొహర్రం పండుగ, అటు దేవీనిమజ్జం రెండూ ఒకేసారి రావడంతో.. సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

15:43 - September 30, 2017

కృష్ణా : సాయంత్రం జరిగే తెప్పోత్సవానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌సవాంగ్‌ పేర్కొన్నారు. ఆయన '10టివి'తో మాట్లాడుతూ.. తెప్పోత్సవం ఏర్పాట్లు, భవానీ భక్తుల రద్దీపై విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోందని, రాజరాజేశ్వరి దేవీ దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర క్యూలన్‌లో బారులు తీరారని తెలిపారు. దీంతో అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని చెప్పారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

15:40 - September 30, 2017

సిద్ధిపేట : పరస్పర సహాయ, సహకారాలతోనే మత సామరస్యాన్ని కాపాడుకోవచ్చునన్నారు మంత్రి హరీష్‌రావు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. విజయదశమి పండుగ సందర్భంగా సిద్దిపేట కోటి లింగేశ్వర ఆలయంలోని జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. సిద్దిపేట ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 500 మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

15:39 - September 30, 2017

విజయవాడ: విజయ దశమి రోజున ఏ పని చేసినా తిరుగుండదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణ జిల్లా గన్నవరం సమీపంలో డెబ్బై ఐదు ఇంజనీరింగ్‌ పరిశ్రమల క్లస్టర్‌కి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరు సాంకేతిక పరిజ్ఞానం పై పట్టుసాధించాలని..ప్రతి ఇంట్లో ఒక్కరైనా డిజిటల్‌ అక్షరాస్యతపై అవగాహన కలిగిఉండాలని అన్నారు. ఏపీలో పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. వారికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని చంద్రబాబు అన్నారు.

15:37 - September 30, 2017

హైదరాబాద్: విజయదశమి సందర్భంగా క్యాంప్ ఆఫీస్‌లో సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ సతీసమేతంగా పూజలో పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ వాహన పూజ నిర్వహించారు.

పూర్ణాహుతితో ముగిసిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

విజయవాడ: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిసింది. 10 రోజుల్లో వివిధ అలంకారాల్లో ఉన్న దుర్గమ్మను 10 లక్షల మందికి పైగా దర్శించుకున్నారని ఈవో సూర్యకుమారి తెలిపారు. సాయంత్రం తెప్పోత్సవానికి అన్ని ఏర్పాటు పూర్తి చేశామని, దుర్గాఘాట్, పన్నమిఘాట్, ప్రకాశం బ్యారేజీ వద్ద తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఈవో పేర్కొన్నారు.

విజయవాడలో చలనచిత్ర ఫెడరేషన్ కార్యాయలం ప్రారంభం

విజయవాడ: చలనచిత్ర ఫెడరేషన్ కార్యాయలం ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో నటుడు బాలకృష్ణ, అంబికాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ...పర్వదినం రోజు ఏది ప్రారంభించినా విజయం అన్నారు. చలనచిత్ర రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడ స్టూడియోలు ఉండటానికి చిత్రపురి కాలనీ ఏర్పాటు వంటి ప్రనాళికలు ఉన్నాయన్నారు. యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని మా ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు. ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ ఉపాధి అవకాశాలు వస్తాయని, ఈ అంశంపై సీఎం చంద్రబాబు సలహా తీసుకొని నిర్ణయిస్తామన్నారు.

భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి

విజయవాడ: ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసింది. శ్రీ రాజరాజేశ్వర దేవి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. క్యూలైన్ లో మహిళలు, భవానీలు అల్లాడుతున్నారు. పోలీసులు, దుర్గగుడి అధికారులు వీఐపీల సేవలో తరిస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేస్తున్నారు.

ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో అగ్ని ప్రమాదం

ఖమ్మం: ప్రభుత్వాస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఆగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో రోగులు పరుగులు తీశారు.

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో కేస్ షీట్లు మాయం

కర్నూలు : ప్రభుత్వ ఆస్పత్రిలో కేస్ షీట్లు మాయం అయ్యాయి. గైనిక్ వార్డులో కేస్ షీట్లు మాయమయ్యాయి. మూడు రోజలు క్రితమే కేస్ షీట్లు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. కేస్ షీట్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఆస్పత్రి సిబ్బందిపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

13:37 - September 30, 2017

కర్నూలు : ప్రభుత్వ ఆస్పత్రిలో కేస్ షీట్లు మాయం అయ్యాయి. గైనిక్ వార్డులో కేస్ షీట్లు మాయమయ్యాయి. మూడు రోజలు క్రితమే కేస్ షీట్లు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. కేస్ షీట్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఆస్పత్రి సిబ్బందిపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:33 - September 30, 2017

విశాఖ : హౌరా ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. నర్సీపట్నం రైల్వేస్టేషన్ వద్ద రైలు నిలిచిపోయింది. అధికారులు మరమ్మతులు చేపట్టారు. రత్నాచల్ ఎక్స ప్రెస్ లో కొంతమంది ప్రయాణికులను తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:32 - September 30, 2017

విజయవాడ : అమరావతి అభివృద్ధిలో మరో అడుగు పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి... కాసేపు ముచ్చటిస్తే ఒత్తిడి తొలగిపోతుందని చెప్పారు. కుటుంబ సభ్యులతో మాట్లాడితే మనసుకు ఎంతో హాయిగా ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ప్రజలకు సీఎం చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు

విజయవాడ : అమరావతి అభివృద్ధిలో మరో అడుగు పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి... కాసేపు ముచ్చటిస్తే ఒత్తిడి తొలగిపోతుందని చెప్పారు. కుటుంబ సభ్యులతో మాట్లాడితే మనసుకు ఎంతో హాయిగా ఉంటుందని పేర్కొన్నారు. 

హౌరా ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం

విశాఖ : హౌరా ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. నర్సీపట్నం రైల్వేస్టేషన్ వద్ద రైలు నిలిచిపోయింది. అధికారులు మరమ్మతులు చేపట్టారు. కొంతమంది ప్రయాణికులను రత్నాచల్ ఎక్స ప్రెస్ లో తరలించారు. 

హైదరాబాద్ లో హోంగార్డ్ హల్ చల్

హైదరాబాద్ : నగరంలోని లాటాపేటలో హోంగార్డ్ హల్ చల్ చేశారు. మద్య సేవించి రక్షక్ వాహనంలో ఇద్దరు మిత్రులతో కలిసి షికారు. స్థానికులతో గొడవకు దిగారు. అడిగిన జనాలతో తాను సీఐని అంటూ బెదిరించారు. స్థానికులు వీడియో తీస్తుండగా పరారయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:14 - September 30, 2017

హైదరాబాద్ : నగరంలోని లాటాపేటలో హోంగార్డ్ హల్ చల్ చేశారు. మద్య సేవించి రక్షక్ వాహనంలో ఇద్దరు మిత్రులతో కలిసి షికారు. స్థానికులతో గొడవకు దిగారు. అడిగిన జనాలతో తాను సీఐని అంటూ బెదిరించారు. స్థానికులు వీడియో తీస్తుండగా పరారయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:35 - September 30, 2017

పటాస్ టీమ్ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా యాదమ రాజు, పటాస్ హరి మాట్లాడారు. తమ అనుభవాలను తెలిపారు. పలు జోక్ లు వేసి నవ్వించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:30 - September 30, 2017

భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణి ఎన్నికల గుర్తింపు సంఘం ప్రచారం ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష నేతలు, రాజకీయ పార్టీల నేతలు రంగంలోకి దిగడంతో ప్రచారం వాతావరణం వేడిక్కెంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ ఎస్ ప్రభుత్వం గెలుపు బాధ్యతలను కీలక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించింది. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే పల్లాజరారేశ్వర్ రెడ్డి సింగరేణి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:12 - September 30, 2017
12:10 - September 30, 2017

ఢిల్లీ : పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. తమిళనాడు గవర్నర్ గా భన్వరిలాల్ పురోహిత్, బీహార్ గవర్నర్ గా సత్యపాల్ మాలిక్, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బీడీ మిశ్రా, అస్సోం గవర్నర్ గా ప్రొఫెసర్ జగదీష్ ముఖి, మేఘాలయా గవర్నర్ గా గంగప్రసాద్ నియమితులయ్యారు. అండమాన్, నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ గా దేవేంద్రకుమార్ జోషిని నియమించారు. జగదీష్ ముఖి స్థానంలో దేవేంద్రకుమార్ ను నియమించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా చంద్రబాబు దుర్గమ్మను దర్శించుకున్నారు. చంద్రబాబు, లోకేష్, బ్రహ్మణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు పూర్ణకుంభంతో అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

 

11:24 - September 30, 2017

గాయనీలతో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. సింగర్స్ మోహన, సోనీ, ఉమా నేహ, రమ్య మెహరా ముచ్చటించారు. తమ అనుభవాలను తెలిపారు. బహుబలి, టెంపర్ వంటి పలు సినిమాల్లోని పాటలు పాడి వినిపించారు. వారు సినిమాల్లో పాడిన పాటలు పాడి అలరించారు. అంత్యాక్షరి సందర్భంగా పలు పాటలు పాడి వినిపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

తల్లిదండ్రులపై కొడుకు దాడి...తండ్రి మృతి

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని పలిమెల మండలం మోదేడులో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో తల్లిదండ్రులపై కొడుకు గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. తండ్రి నాగయ్య మృతి చెందారు. తల్లి సావిత్రి పరిస్థితి విషమంగా ఉది. చికిత్స నిమిత్తం ఆమెను మహాదేవపూర్ కు తరలించారు. 

 

ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

హైదరాబాద్ : ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. అరుణాచల్ ప్రదేశ్.. బీడీ మిశ్రా, బీహార్... సత్యపాల్ మాలిక్, మేఘాలయ..గంగాప్రసాద్, అసోం... ప్రొఫెసర్ జగదీశ్, తమిళనాడు గవర్నర్ గా భన్వరీలాల్ పురోహిత్ నియమితులయ్యారు. అండమాన్, నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ గా దేవేంద్రకుమార్ ను నియమించారు.

 

10:17 - September 30, 2017

విజయనగరం : ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవ సంబరానికి వేళైంది. ప్రతి ఏటా దసరా తర్వాత వచ్చే మంగళవారం రోజున అమ్మవారి సిరిమాను ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 

విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఈ ఉత్సవాలలో ప్రధాన ఘట్టం
సిరిమాను సంబరాలు. ప్రతి ఏటా దసరా తర్వాత వచ్చే మంగళవారం రోజున ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది అక్టోబర్‌ 3న సిరిమానోత్సవం జరగనుంది. సిరిమానుపై అమ్మవారికి ప్రతిరూపంగా ఆలయ పూజారి కూర్చొని భక్తులను ఆశీర్వదించే అపురూప ఘట్టమే ఈ సిరిమానోత్సవం. పట్టణంలోని పైడితల్లి అమ్మవారి చదురుగుడి నుండి కోట వరకు మూడుసార్లు తిరిగి రావడంతో ఉత్సవం ముగుస్తుంది. 

అయితే ఈ సిరిమాను ఉత్సవానికి అవసరమైన చింతమాను ఎక్కడ ఉందన్న విషయాన్ని అమ్మవారు ఆలయ పూజారి కలలో కనిపించి చెబుతుంది. ఆ విధంగా ఈ ఏడాది డెంకాడ మండలం రెడ్డికపేట గ్రామంలో సిరిమాను చెట్టు ఉన్నట్టుగా గుర్తించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, చెట్టును నరికి మేళ, తాళాలతో దానిని హుకుంపేటలోని పూజారి ఇంటికి తరలించారు. ఇక్కడే చింతమానును సిరిమానుగా మలచే కార్యక్రమాన్ని చేపడతారు. వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ సిరిమానును, రథాన్ని తయారు చేస్తుంటాయి. దీంతో పాటు సిరిమాను వెంట నడిచే అంజలి రథం, తెల్ల ఏనుగు తయారీ పనులు పూర్తి చేస్తారు. అమ్మవారి సిరిమాను తయారు చేసే అవకాశం రావడం తమ అదృష్టంగా ఆ కుటుంబీకులు భావిస్తారు. 

ఇక సిరిమానును అధిరోహించే పూజారులకూ వంశపారంపర్య చరిత్ర ఉంది. 1758లో పూసపాటి సంస్థానాధీశుడు ఆనందరాజు కాలం నుంచి అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. మొదటగా పతివాడ అప్పలనాయుడు ఈ ఉత్సవాలలో పూజారిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన వంశానికి చెందినవారే పూజారులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది వెంకట్రావు సిరిమానును అధిరోహించబోతున్నారు. 

ప్రతి ఏట సిరిమానోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది భక్తులు విజయనగరం చేరుకుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రల నుండి కూడా ఈ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు తరలివస్తారు. ఈసారి ఉత్సవ నిర్వహణను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఉత్సవానికి అవసరమైన సిరిమాను, ఇరుసుమానుల తయారీని డి.ఎఫ్‌.ఓ లక్ష్మణ‌్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.  సిరులలిచ్చే కల్పవల్లి...పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 3న ఘనంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

10:12 - September 30, 2017

ఖమ్మం : జిల్లాలోని అభయ ఆస్పత్రి డాక్టర్‌పై దాడి జరిగింది. టీఆర్‌ఎస్‌ నేతలు ఈ దాడికి పాల్పడ్డారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న టీఆర్‌ఎస్‌ నేతు పరార్శించేందుకు అనుమతి ఇవ్వలేదున్న నెపంలో డాక్టర్‌పై దాడి చేశారు. ఆస్పత్రిలోని ఫర్నిచర్‌, ఆపరేషన్‌ థియేటర్‌ను ధ్వంసం చేశారు.

ఇది ఖమ్మంలోని అభయ ఆస్పత్రి. ఈ ఆస్పత్రిలో ఒక టీఆర్‌ఎస్‌ నేతకు చికిత్సచేసి ఐసీయూలో ఉంచారు. చికిత్సపొందుతున్న నాయుకుణ్ని పరామర్శించేందుకు కొదరు టీఆర్‌ఎస్‌ నేతలు ఆస్పత్రికి వచ్చారు. ఐసీయూలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో సిబ్బంది ఆడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన టీఆర్‌ఎస్‌ నేత సిబ్బందిని తోసేసి నేరుగా ఐసీయూలోకి వచ్చి విధి నిర్వహణలో ఉన్న డాక్టర్‌తోపాటు వైద్య సిబ్బందిపై దాడి, దుర్భాషలాడారు. ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు.  

టీఆర్‌ఎస్‌ నేతల తీరును నిరసిస్తూ డాక్టర్‌పై దాడి చేసిన వారిపై కేసు పెట్టేందుకు ప్రదర్శనగా బయలుదేరిన వైద్యులు టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలకు వంతపాడిన పోలీసులు కూడా డాక్టర్లను అడ్డుకోవడంతో ఖాకీల తీరుపై మండిపడ్డారు. దాడిని ఖండించారు. 

దాడికి బాధ్యులైన టీఆర్‌ఎస్‌ నేతలపై చర్యలు తీసుకోవాలని అభయ ఆస్పత్రి డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. డాక్టర్లకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్‌పై దాడికి పాల్పడ్డ టీఆర్‌ఎస్‌ నేతలను అరెస్టు చేసే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. అభయ ఆస్పత్రి డాక్టర్‌పై టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన దాడిన పలు ప్రజా సంఘాల నేతలు ఖండించారు. 

10:04 - September 30, 2017

విజయవాడ : రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దుర్గామాతను ప్రార్థించినట్టు హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రజలపై దుర్గమ్మ చల్లని చూపులు ప్రసరించాలని ఆకాంక్షించారు. దుర్గామాత ఆశీస్సులతో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. బాలకృష్ణ ఈ ఉదయం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు. 

 

10:03 - September 30, 2017

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం స్వామిఅమ్మవార్ల తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలుపుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో నేడు మరో ఐదుగురు రోగులు మృతి

అనంతపురం : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నేడు మరో ఐదుగురు రోగులు మృతి చెందారు. ఇప్పటివరకు 21 మంది రోగులు మృతి చెందారు. 

వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారం

వరంగల్ రూరల్ : జిల్లాలోని నెక్కొండ మండలం నాగారం దారుణం జరిగింది. వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ, ఇద్దరు పిల్లలను నిర్బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులు నాగరాజు, సంతోష్ గా గుర్తించారు.

 

09:11 - September 30, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడాలు ప్రారంభమయ్యాయి. నీటి చౌర్యంపై మంత్రుల మధ్య మాటల యుద్ధం, అధికారులు మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది. పరస్పరం కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీని  కృష్ణానది యాజమాన్య బోర్డు కూడా ఎటూ తేల్చలేకపోతోంది. 
జల జగడాలు 
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ 
తెలంగాణ, ఏపీల మధ్య మళ్లీ జల జగడాలు పెరుగుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి ఏపీ వాడుకుంటున్నపై తెలంగాణ సర్కారు కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణపై ఏపీ ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేయడంతో  ఈ నీటి పంచాయితీని  ఎలా పరిష్కారించాలో తెలియక కృష్ణానది యాజమాన్య బోర్డు తల బాదుకుంటోంది.
టెలీమెట్రీ రికార్డులను ట్యాంపరింగ్‌ చేస్తున్న కాంట్రాక్ట్‌ ఏజెన్సీ 
పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ప్రభుత్వం ఎక్కువ నీటిని వాడుకుంటోందన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. వినియోగిస్తున్న నీటిని కొలిచేందుకు ఇక్కడ ఏర్పాటు చేసిన టెలిమెట్రీ  స్టేషన్‌లో నమోదవుతున్న సమాచారాన్ని కాంట్రాక్టు ఏజెన్సీ ట్యాంపరింగ్‌ చేస్తోందన్నది తెలంగాణ ఫిర్యాదు. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు భేటీలో ఇదే అంశాన్ని లేవనెత్తిన తెలంగాణ ప్రభుత్వం... సంబంధిత కాట్రాక్టు ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.  నీటి విడుదల రికార్డుల  ట్యాంపరింగ్‌ ఆధారాలను ప్రవేశపెట్టింది.  ఈ విషయాన్ని కాంట్రాక్టు సంస్థ ఒప్పుకున్నా... చర్యలు తీసుకునేందుకు  కేఆర్‌ఎంబీ సుముఖత వ్యక్తం చేయకపోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపడుతోంది.
కేఆర్‌ఎంబీ తీరుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం 
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌  వద్ద 12 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని టెలీమెట్రీ ధ్రువీకరించినా...  10 వేల క్యూసెక్కులుగానే  కాంట్రాక్ట్‌ సంస్థ నమోదు చేసింది. అయితే టెలిమెట్రీ  వ్యవస్థ ప్రయోగదశలోనే ఉన్నందున ఈ లెక్కలను పరిగణలోకి తీసుకోబోమని కేఆర్‌ఎంబీ సభ్యులు చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో  ఇకపై జలచౌర్యం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి చేతులు దులుపుకుంది. నీటి పంచాయితీ గురించి చర్చించేందుకు అక్టోబర్‌ 4 లేదా 5 తేదీల్లో తెలంగాణ, ఏపీ  నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లతో  మరోసారి సమావేశం కావాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. అప్పుడు తెలంగాణ, ఏపీ అధికారులు చేసే వాదనలపై కేఆర్‌ఎంబీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

 

08:58 - September 30, 2017

కృష్ణా : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరిరోజు అమ్మవారు  రాజరాజేశ్వరి దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. దీంతో క్యూలైన్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. మరోవైపు భవానీలు సైతం ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్నారు. భవానీ దీక్ష విరమణ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం...

 

08:56 - September 30, 2017

చిత్తూరు : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవెంకటేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా సాగుతోంది. రథోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. దేవేరులతో కలిసి సర్వాంగ సుందరంగా ముస్తాబైన మలయప్పస్వామి రథంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతున్నారు. వేలాది మంది భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ స్వామివారి రథోత్సవంలో పాల్గొంటున్నారు. 

 

08:48 - September 30, 2017

కర్నూలు : కక్షలు, కార్పణ్యాలకే కాదు.. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు నెలవు ఆ జిల్లా. 22వ శతాబ్దంలో అడుగుపెట్టినా... నాటి ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు కర్నూలు జిల్లా ప్రజలు. ముఖ్యంగా దసరా పండుగ అనగానే దేవరగట్టులోని మాళమల్లేశ్వరుని ఉత్సవంలో జరిగే కర్రల సమరం ఎంతో ప్రాచుర్యం. మాలమల్లేశ్వరుడి విశిష్టతపై టెన్ టీవీ ప్రత్యేక కథనం..

దసరా అంటే అంతటా సందడే... కానీ కర్నూలు జిల్లాలో జరిగే దసరా ఉత్సవానికి మరింత ప్రత్యేకత ఉంది. ఆలూరు నియోజకవర్గం, హోళగుంద మండలంలో దేవరగట్టులో దసరా  రోజు జరిగే మాళమల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం... కర్రల సమరం అత్యంత వైభవంగా జరుగుతాయి. కాగడాల వెలుగులో జరిగే  ఈ సమరానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 

ప్రతి ఏటా విజయదశమి రోజు మాలమల్లేశ్వర కల్యాణం అనంతరం స్వామివారి  విగ్రహాలను ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపునే బన్ని ఉత్సవం అనికూడా అంటారు. ముందుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. మాలమల్లేశ్వరుని ప్రియభక్తుడు గొరవయ్య కాలి తొడభాగంలో కత్తితో కోసి పిడికెడు రక్తం ధారపోస్తాడు. అనంతరం గొరవయ్య బసవన్న ఆలయం చేరుకుని భవిష్యవాణి వినిపిస్తారు. అక్కడి నుంచే జైత్రయాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో  చేతిలో కర్ర , కాగడా పట్టి దేవుడి ముందు భక్తితో నృత్యం చేస్తారు. 

పొడవాటి కర్రలకు ఇనుప రింగులు తొడిగి, కాగడాలు చేతపట్టి మాలమల్లేశ్వరుని ఊరేగింపుగా తీసుకొస్తుంటారు. ఈ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవాలనే ఉద్దేశంతో విరుపాపురం, సులువాయి, ఎల్లార్తి, హరికెర వాసులు పోటీ పడతారు. స్వామి ఉత్సవం మాదే అని మూడు గ్రామాల ప్రజలు దివిటీలు, కర్రలతో అడ్డుకుంటారు. ఆ ప్రయత్నంలో తలలు పగిలేలా కొట్టుకుంటారు.

అయితే ఇలా కర్రలతో కొట్టుకోవడం హింస కాదని... ఇది అనాదిగా వస్తున్న తమ ఆచారమంటూ భక్తులు అంటారు. ఈ కర్రల సమరానికి సంబంధించిన అనేక కథలు ఉనికిలో ఉన్నాయి. 11వ శతాబ్దం నుంచి ఈ బన్నీ ఉత్సవం జరుగుతోందని ఆలయ కమిటీ  సభ్యులు చెబుతున్నారు. కానీ ఈ ఉత్సవంలో ఎలాంటి రక్తపాతం జరగకుండా ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని జనవిజ్ఞాన వేదిక సభ్యులు అంటున్నారు. హింసకు తావివ్వకుండ సమరం సాఫిగా సాగేలా కోరుతున్నారు.

బన్ని ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. మద్యం సేవించిన వారిని గుర్తించేందుకు బ్రీత్ అనలైజర్లను, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే వారిని గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను నూతనంగా వినియోగిస్తున్నామని ఎస్పీ చెబుతున్నారు. ఈ సంవత్సరం భద్రతా ఏర్పాట్లు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. 

08:41 - September 30, 2017

నల్గొండ : ప్రభుత్వ, అధికార యంత్రాంగం చట్టాలను తుంగలో తొక్కుతూ నిరంకుశంగా వ్యవహరించడం బాధాకరమన్నారు టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్. భూ నిర్వాసితులందరికీ భూ సేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా చర్లగూడెం రిజర్వాయర్ వద్ద భూ నిర్వాసితుల ధర్నాలో కోదండరామ్ పాల్గొన్నారు. రైతులు కోరుతున్నట్లు ఎకరాకు రూ.15 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ..వారికి న్యాయం చేసిన తరువాతే ప్రాజెక్టు పనులు నిర్వహించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. 

 

 

08:36 - September 30, 2017
08:35 - September 30, 2017
08:34 - September 30, 2017

గుంటూరు : మానవ సంబంధాలు పెంచుకునేందుకు గేమ్‌ షోలు ఎంతగానో ఉపయోగపడుతాయని గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు అన్నారు. గుంటూరు సిటీ కేబుల్‌ ఆధ్వర్యంలో సిటీ హౌస్‌ గేమ్‌షో బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన గేమ్‌ షో విజేతలకు అర్బన్‌ ఎస్పీ, సిటీ కేబుల్‌ ఎండీ బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతిగా  కారును బహుకరించారు. మిగిలిన విజేతలకు రిఫ్రిజరేటర్‌, టీవీ లాంటి విలువైన బహుమతులు అందజేశారు. 

08:29 - September 30, 2017

మహబూబ్ నగర్ : ఆ క్షేత్రం ఆలయాల నగరం. అక్కడ అడుగుపెడితే చాలు వందల ఏళ్లనాటి ఆధ్యాత్మిక చరిత్ర కళ్లకు కడుతోంది. అద్భుతమైన శిల్ప సంపదతో ఆలయాలు దేదీప్యమానంగా ఆకట్టుకుంటాయి. ఓ వైపు తుంగభద్ర, కృష్ణమ్మల సంగమం...మరోవైపు ఉగ్రరూపంతో దర్శనమిచ్చే అమ్మవారు..ఇంకోవైపు నవబ్రహ్మ ఆలయాలు.. ఆలంపూర్ పట్టణసిగలో మణిముకటమై వెలసిన క్షేత్రమే జోగులాంబ ఆలయం. 

అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా...తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ ప్రదేశం ఒడ్డున అమ్మవారు జోగులాంబగా వెలిసింది. ఈ పుణ్యక్షేత్రం గతంలో హమతాపూర్, అమలాపూర్‌ పేర్లతో పిలవబడింది. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది ఆలంపూర్ పట్టణం. అలంపూర్ గద్వాలకు 61 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్ నగర్‌కు 90 కిలోమీటర్ల దూరంలో, కర్నూల్‌కు 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.  ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణసిగలో మణిముకటమై వెలసింది ఇక్కడి జోగులాంబ ఆలయం. 

ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14 వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునప్రతిష్టించారు.

ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మికం సంరంభం కనిపిస్తుంది. రోజూవారీ పూజలతో పాటు మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో చండీహోమాలు నిర్వహిస్తారు. ఇక దసరా సందర్భంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. మాఘశుద్ధ పంచమినాడు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవం జరుపుతారు. ఈ ఉత్సవాల్లో జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. 

ఇక్కడున్న నవబ్రహ్మేశ్వర ఆలయాలలో బాలబ్రహ్మేశ్వరాలయం ప్రధానమైంది. ఎర్రని ఇసుక రాతితో నిర్మాణమై ఆలయ శిఖరాలు విమాన నాగరిక శైలిని పోలి ఉన్నాయి. ఆలయ కుఢ్యాలపై పంచతంత్ర కావ్య కథా శిల్పా లు, ఆదిత్య హృదయం, రామాయణం, భారతం, భాగవతం తదితర ఇతిహాస, పురాణ ఘట్టాలకు సంబంధించిన చిత్రాలు, శిల్పాలు చెక్కబడ్డాయి. క్రీ.శ. 9 వ శతాబ్దానికి చెందిన సూర్యదేవాలయం జోగులాంబ ఆలయ ప్రాంగణంలో కలదు. ఇక్కడ విష్ణు మూర్తి కి చెందిన సుందరమైన విగ్రహాలు కలవు. అలాగే, శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన నరసింహ దేవాలయం కూడా ఉన్నది. ఆలంపూర్‌కు సమీపంలో పాపనాశనం కలదు. అక్కడ సుమారు 20 కి పైగా శివాలయాలు వివిధ ఆకారాలలో, పరిమాణాలలో ఉన్నాయి. ఇందులో పాపనాశేశ్వర ఆలయం ముఖ్యమైనది.

శ్రీరాజరాజశేశ్వరి దేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనం

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా దసరా శరన్నవరాత్రులు కొనసాగుతున్నాయి. శ్రీరాజరాజశేశ్వరి దేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇవ్వనుంది. దుర్గమ్మ దర్శనం కోసం ఇంద్రకీలాద్రిపై భవానీలు పోటెత్తారు.

 

తిరుమల నేడు 8వ రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమల : నేడు 8వ రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఉదయం 7 గంటలకు రథోత్సవం జరుగనుంది. 

07:03 - September 30, 2017

విజయవాడ : దసరా సందర్భంగా బొబ్బిలి కోటలో అలనాటి ఆయుధాలకు రాజకుటుంబ వారసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా ఆనవాయితిగా వస్తున్న సంప్రదాయాన్ని.. రాజ కుటుంబ వారసులైన  రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు, బేబీనాయన సోదరులు కుటుంబ సమేతంగా నిర్వహించారు. బొబ్బిలి యుద్దం నాటి ఆయుధాలను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.   

 

07:00 - September 30, 2017

కృష్ణా : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం దుర్గమ్మ శ్రీమహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 

 

ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న దసర శరన్నవరాత్రులు

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై నేటితో దసర శరన్నవరాత్రులు ముగియనున్నాయి. శ్రీరాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. 

 

06:50 - September 30, 2017

హైదరాబాద్‌ : నగరాన్ని భారీవర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం వరకు చిరు జల్లులు కురిసినా... ఆ తరువాత దట్టమైన మేఘాలు కమ్ముకొని జోరువాన కురిసింది. జూబ్లీ హిల్స్, మాదాపూర్, ఎల్బీ నగర్, దిల్‌సుఖ్ నగర్, ట్యాంక్‌ బండ్,  ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్, హబ్సిగూడ, అమీర్‌ పేట, సికింద్రాబాద్‌లో కుంభవృష్టి కురిసింది. పలుచోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. మాదాపూర్, గచ్చిబౌలి, శిల్పారామం ఎదుట రహదారులు చెరువులా మారాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడి... వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు.  వర్షంతో పండుగకు ఊళ్లకు వెళ్లుతున్న వారు ఇక్కట్లు పడుతున్నారు. 

06:43 - September 30, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో ఓ స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. స్థలం తమదంటే.. తమదని.. కాపు, దళిత సామాజిక వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. నాలుగు రోజుల క్రితం మొదలైన ఈ వివాదానికి ఇంకా తెరపడకపోవడంతో పోలీసులు భారీ బందోబస్తు 
ఉరదాళ్ళపాలెంలో ఉద్రిక్తత
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో  ఆర్ అండ్ బీకి చెందిన ఈ స్థలం రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. నిజానికి ఈ స్థలం ఏ సామాజిక వర్గానిది కాదు.. పూర్తిగా ప్రభుత్వ భూమి.. అయినా ఈ స్థలం ఇప్పుడు ఉరదాళ్ళపాలెంలో ఉద్రిక్తతకు కారణమైంది, 
స్థలాన్ని సమానంగా పంచిన రెవెన్యూ, పోలీసు అధికారులు
రోడ్డుకు పక్కనే ఉన్న 129 గజాల స్థలం దళితులు నివసిస్తున్న ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. ఇక ఈ స్థలానికి కిలోమీటరు దూరంలో కాపులు నివసిస్తుంటారు. ఇప్పటివరకు ఈ స్థలాన్ని అన్ని వర్గాల వారు వినియోగించారు అయితే కొంతకాలంగా దళిత, కాపు సామాజిక వర్గాల వారు ఇక్కడ పార్కు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాపు సామాజిక యువత కొద్ది రోజులుగా ఆ స్థలంలో పవన్  కల్యాణ్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక తమ నివాసాలకు దగ్గరగా అంబేడ్కర్ విగ్రహం ఉండటంతో అక్కడ అంబేడ్కర్ పార్కు ఏర్పాటు చేయాలని దళితులు భావించారు. అలా ఇరు వర్గాల వారు పవన్ కల్యాణ్, అంబేడ్కర్ బ్యానర్లను ఏర్పాటు చేసుకున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం వివాదం చెలరేగడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు ఇరు వర్గాలతో మాట్లాడి స్థలాన్ని సమానంగా వాడుకోమని పంచారు. అక్కడితో సమస్య  సమసిపోయిందని అందరూ భావించారు. 
గురువారం రాత్రి మళ్లీ ఇరు వర్గాల మధ్య వివాదం
అయితే గురువారం రాత్రి గ్రామంలో భవానీల నిప్పుల గుండం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మళ్లీ రెండు వర్గాల మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. దళితులకు కేటాయించిన స్థలంలో కాపు యువకులు వాహనాలు పార్కు చేయడంతో వివాదం మొదలైంది.  దళితులపై కాపులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు దళితులకు, ఒక కాపు వ్యక్తికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఘర్షణ పెరిగే అవకాశం ఉండటంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు. మరోవైపు మాలమహానాడు, కేవీపీఎస్ నేతలు తణుకు ఏరియా ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేశారు. 
గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
గ్రామంలో దళితులకు, కాపులకు గొడవ జరగడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గ్రామానికి వచ్చే రహదారుల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులను గ్రామంలోకి అనుమతించవద్దని జిల్లా ఎస్పీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. 
స్థలాన్ని స్వాధీనం చేసుకున్నరెవెన్యూ అధికారులు
మరోవైపు దళితులు, కాపుల మధ్య వివాదం కారణంగా ఆర్ అండ్ బీ స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టారు. రెండు వర్గాల నేతలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. మళ్లీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. 

దసరా సందర్భంగా నేడు మైసూర్ లో జంబూ సవారీ

కర్నాటక : నేడు విజయదశమి. దసరా సందర్భంగా నేడు మైసూర్ లో జంబూ సవారీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు సీఎం సిద్ధరామయ్య వేడుకలను ప్రారంభించనున్నారు. 

 

కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా

కృష్ణా : జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేట శివారులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.

Don't Miss