Activities calendar

01 October 2017

పిగుడుపాటుకు ఐదుగురు కూలీ పరిస్థితి విషమం...

జోగులాంబగద్వాల: వడ్డేపల్లి మండలం జూలకల్ లో పాలంలో పిగుడుపడి ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. 108లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

బనగానపల్లె విద్యుత్ కార్యాలయంలోకి నీరు

కర్నూలు: బనగానపల్లెలో ఎన్ ఆర్ బీసీ కాలవకు గండి పడింది. బనగానపల్లె విద్యుత్ కార్యాలయలంలోకి నీరు చేరడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో బనగానపల్లె అంధకారంలో వుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

షిర్డీ ఎయిర్ పోర్టు ప్రారంభం...

ముంబై : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ షిర్డీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు. షిర్డీ నుంచి ముంబైకి ఏలియన్స్ ఎయిర్ విమానాన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించారు రాష్ట్రపతి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

16:43 - October 1, 2017

కడప: ఏపీ సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు ఈనెల 10 నుంచి 12 వ తేదీ వరకు కడపలో జరుగనున్నాయి. వీటిని విజయవంతం చేసే అంశంపై చర్చించేందుకు కడప జిల్లా సిఐటియు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తారు. డిసెంబర్‌లో నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమంపై సమీక్షిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడకపోతే భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని సిఐటియు నాయకత్వం సమావేశంలో హెచ్చరించింది.

16:41 - October 1, 2017

మ‌హ‌బూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న కాళోజి విగ్రహాన్ని గుర్తు తెలియ‌ని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై కాళోజి వాకర్స్ అసోసియేష‌న్, టీ-జేఏసీ నాయ‌కులు మండిపడుతున్నారు. దుండ‌గులను క‌ఠినంగా శిక్షించాలంటూ ఆందోళ‌నకు దిగారు. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలను సేకరించే పనిలోపడ్డారు. నిందితుల కోసం గాలింపు చేప‌డుత‌న్నామ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై సర్వత్రా ఆందోళ‌న వ్యక్తం అవుతోంది.

ఏపీ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఆరా!

అనంత: పరిటాల శ్రీరాం వివాహ వేడుకలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. పరిటాల శ్రీరామ్ వివాహ వేడుకకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో పయ్యావులతో కేసీఆర్ ఏకాంత చర్చలు జరిపారు. హెలీప్యాడ్ వద్ద ఐదారు నిమిషాల పాటు చర్చ జరిపారు. వీరి చర్చల్లో ఏపీ రాజకీయాలపై, నందాల్య ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

 

16:04 - October 1, 2017

ద్వారకా తిరుమలకు పోటెత్తిన భవానీ భక్తులు

ప.గో: ద్వారకా తిరుమలకు భవానీ భక్తులు పోటెత్తారు. అధికారులు కనీస ఏర్పాట్లు చేయలేదని, కౌంటర్లలో ప్రసాదం కొరతతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దిగ్విజయంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు: టిటిడి ఈవో

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరిగాయిన టిటిడి ఈవో అనీల్ సింఘాల్ తెలిపారు. విజయవంతం చేసిన అన్ని విభాగాలకు అభినందనలు తెలిపారు. 8 రోజుల్లో 6,21,705 మంది శ్రీవారిని దర్శించుకున్నారని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దర్శన భాగ్యాం కల్పించామన్నారు. హువడీ ఆదాయం రూ.18 కోట్ల 70 లక్షల 29వేలు వచ్చిందన్నారు. ప్రసాదాలు, గదులు, హుండీ ద్వారా స్వామి వారికి మొత్తం రూ. 23 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 3,06,271, 76,366 మంది భక్తులకు వైద్య సేవలు అందిచామని పేర్కొన్నారు.

3వికెట్లు కోల్పోయిన ఆసీస్

నాగ్‌పూర్: ఇండియాతో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో ఆసీస్ 22.2 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఫించ్ 36 బంతుల్లో 6 ఫోర్లతో 32 పరుగులు చేసి పాండ్యా బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 25 బంతులు ఆడి 16 పరుగులు (1 ఫోర్) చేసి జాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుదిరిగాడు. అనంతరం వార్న‌ర్ (62 బంతుల్లో 53 ప‌రుగులు, 5 ఫోర్లు) అక్ష‌ర్ పటేల్ బౌలింగ్‌లో పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు.

15:04 - October 1, 2017

విజయనగరం: జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారం .. బడాబాబులకు కాసులు పండింస్తోంది. రోజు వందలాది లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. అయితే ఇదంతా ప్రభుత్వం చెబుతున్న ఉచిత ఇసుక పథకంలో భాగంగా మాత్రం కాదు. ఇసుక రేవుల్లోకి సామాన్యుడు అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది.

గోస్తని, చంపావతి, స్వర్ణముఖి, నాగావళి పరివాహకంలో భారీగా ఇసుక వ్యాపారం

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది..ఏ నదికి సంబంధించిన రేవుకాదు. రేవుల నుంచి పెద్దమొత్తంలా ఇసుకను తీసుకొచ్చిన ఇక్కడ డంప్‌చేసి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇసుక తీసుకోవచ్చన చెప్పడంతో.. బడాబాబులు ఇలా ఇసుక డంప్‌లను నిర్వహిస్తూ కోట్లరూపాయలు జేబుల్లో వేసుకుంటున్నారు. విజయనగరం జిల్లాలోని గోస్తని, చంపావతి, స్వర్ణముఖి, నాగావళి నదుల పరివాహక ప్రాంతాలనుంచి భారీ ఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ రేవులో చూసినా ఇసుక దొంగలే తిష్టవేశారని సామాన్యులు వాపోతున్నారు. ప్రభుత్వం ఉచితంగానే ఇసుకను తీసపుకోవచ్చని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. సామాన్యుడు ఒక్క ట్రాక్టర్‌ ట్రక్కు ఇసుక తీసుకోవాలంటే.. 4 నుంచి 5వేల రూపాయలు చేతిచమురు వదిలించుకోవాల్సి వస్తోంది. దీనిపై గతంలో సీఎం చంద్రబాబు సీరియస్‌గా స్పందించినా.. పరిస్థితిలో మార్పు రాలేదు. చివరికి రాష్ట్ర భూ గర్భ వనరుల శాఖా మంత్రి సుజయకృష్ణా రంగారావు స్వయంగా రేవు ప్రాంతాలను సందర్శించి.. ఇసుక అక్రమ తరలింపుపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా.. అదికారుల్లో ఉలుకూ పలుకూ లేకుండా పోయింది.

అక్రమ ఇసుక వెనుక అధికారపార్టీ నేతలు..!

ఈ అక్రమ ఇసుక తరలింపు వెనుక అధికారపార్టీనేతలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి అధికారుల అండదండలు కూడా తోడవడంతో ఇసుక దందాకు అడ్డేలేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్‌ కనుసన్నల్లోనే ఇసుక దందా సాగుతున్నట్టు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ ఇసుక తరలింపును అడ్డుకోవాలని విజయనగరం జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఇసుక దొంగలకు చెక్‌పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

15:02 - October 1, 2017

విజయవాడ: భవానీ భక్తులతో విజయవాడ ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. పరిసర ప్రాంతాలన్నీ దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఇవాళ కూడా అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు మాల విరమించేందుకు భవానీ భక్తులు తరలివస్తున్నారు. అయితే... లడ్డూల కొరతతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

15:00 - October 1, 2017

నెల్లూరు : బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు కావడంతో భక్తులు బారాషాహిద్‌ దర్గాకు పోటెత్తారు. రొట్టెల పండుగను 5 రోజుల పాటు భక్తి ప్రపత్తులతో నిర్వహించనున్నారు. ఈ పండుగలో రొట్టెలను పంపిణి చేయడం వల్ల కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. నెల్లూరు జిల్లా బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తున్నారు. స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు ఇచ్చిపుచ్చుకోవడంలో జనం తలమునకలయ్యారు. బారాషాహిద్ దర్గా దగ్గర రొట్టెలు పంచుతామని మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చెబుతున్నారు.

14:57 - October 1, 2017

హైదరాబాద్: పాతబస్తీలో బీబీ-కా-ఆలం ఊరేగింపు ప్రారంభమైంది. మొహర్రం సందర్భంగా నిర్వహిస్తున్న ఊరేగింపునకు 15 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 20వేల సీసీ కెమెరాలతో, పలు చోట్ల డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. మరోవైపు ఊరేగింపు నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామంటున్న సౌత్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

ప్రభుత్వానికి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన ముస్లిం మతగురువు

హైదరాబాద్‌ పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు ప్రారంభమైంది. ఈ ఊరేగింపునకు 15 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీబీకా ఆలం ఊరేగింపునకు సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ముస్లిం మతగురువు కృతజ్ఞతలు తెలిపారు.

వెబ్ సైట్లలో ఆర్టిస్టుల గురించి నీచంగా రాస్తున్నారు: మరళీ మోహన్

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో వెబ్ సైట్లలో ఆర్టిస్టుల గురించి నీచంగా రాస్తున్నారని మరళీ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వెబ్ సైట్ల పై ఎస్సీకి ఫిర్యాదు చేశామని ,సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయమైనా పదే పదే చూపిస్తున్నారని మురళీ మోహన్ పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 30 రోజుల పాటు సభ్యత్వ కార్యక్రమం చేపట్టామన్నారు. పేదవాళ్లు మెంబర్ షిప్ తీసుకోకపోయినా పర్వాలేదన్నారు. లక్షల్లో సంపాదిస్తున్న వారికి మొంబర్ షిప్ లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుడు రాతలు రాస్తున్న వెబ్ సైట్ల పై మూడేళ్ల జైలు శిక్షతో పాటు వెబ్ సైట్ ను కూడా బ్లాక్ చేస్తామని హెచ్చరించారు.

మూవీ ఆర్టిస్ట్ కు 25 ఏళ్లు పూర్తి : మా అధ్యక్షుడు శివాజీరాజా

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ కు 25 ఏళ్లు పూర్తి అయ్యాయని మా అధ్యక్షుడు శివాజీరాజా ప్రకటించారు. మృతిచెందిన ప్రొడక్షన్ మేనేజర్ చిరంజీవి కుటుంబానికి రూ6లక్షల చెక్ ను మా అసోసియేషన్ అందజేసినట్లు పేర్కొన్నారు. ఆర్థికంగా వెనకబడిన వారిని ఆదుకుంటున్నామని తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ తరపున వృద్ధాశ్రమం నిర్మించబోతున్నామని చెప్పారు. ఛైర్మన్ గా ఎస్ వి. కృష్ణా రెడ్డి నియమించబడ్డారని చెప్పారు.

బీబీకా ఆలం ఊరేగింపునకు భారీ భద్రత

హైదరాబాద్: బీబీకా ఆలం ఊరేగింపునకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 5వేలమంది పోలీసులతో గట్టి భద్రతను ప్రభుత్వం కల్పించింది. 8 కంపెనీల కేంద్ర బలగాలు, టాస్క్ ఫోర్స్, షీటీమ్స్ వంటి బలగాలు మోహరించాయి. డబీర్ పూర్ నుంచి చాదర్ ఘట్ వరకు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. భద్రతను పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఏనుగు పై బీబీకా ఆలం ఊరేగింపు ప్రారంభం

హైదరాబాద్: ఏనుగు పై బీబీకా ఆలం ఊరేగింపు ప్రారంభం అయ్యింది. లక్షల సంఖ్యలో షియా ముస్లింలు తరలివచ్చారు. ఇరాక్ లో ఇమామ్ హుస్సేన్ కుటుంబం త్యాగానికి ప్రతీకగా షియా ముస్లింలు మొహర్రం జరుపుకుంటున్నారు. రక్తాన్ని చిందిస్తూ ఇమామ్ హుస్సున్ ను షియాలు సందర్శిస్తున్నారు.

13:33 - October 1, 2017
13:25 - October 1, 2017
13:15 - October 1, 2017

పరిటాల శ్రీరామ్ వివాహ వేడుకల్లో కేసీఆర్..

అనంతపురం : ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహ వేడుకకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. మంత్రి పరిటాల సునీత స్వయంగా కేసీఆర్ కు స్వాగతం పలికారు. 

13:06 - October 1, 2017

కర్నూలు : ఎస్ఆర్ బీసీ కాల్వకు భారీగా గండిపడిపోయింది. దీనితో భారీ ఎత్తున్న నీరు పోటెత్తింది. బనగాపల్లిలోని నాలుగు ప్రాంతాల్లో నీరు చేరిపోయింది. ఆర్టీసీ బస్టాండు వద్దనున్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గండి పడకుండా ఉండేదుకు తీసుకోవాల్సిన అధికారులు చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. గండి పూడ్చే అవకాశం ఇప్పట్లో లేదని సమాచారం. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

వెంకటాపురానికి చేరుకున్న చంద్రబాబు..

అనంతపురం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెంకటాపురానికి చేరుకున్నారు. ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహ వేడుకలో ఆయన పాల్గొననున్నారు. 

జ్ఞాన మెడలో తాళి కట్టిన పరిటాల శ్రీరామ్..

అనంతపురం : ఏపీ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ - జ్ఞానల వివాహం ఘనంగా జరిగింది. జిల్లా వెంకటాపురంలో జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ నేతలు హాజరయ్యారు. 

బీబీకా ఆలం ఊరేగింపుకు భారీ బందోబస్తు..

హైదరాబాద్ : బీబీకా ఆలం ఊరేగింపుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 8 కంపెనీల కేంద్ర బలగాలు, టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, డాగ్ బాంబ్ స్వ్కాడ్స్ వంటి బలగాలను మోహరించారు. డబీర్ పూరా నుండి చాదర్ ఘాట్ వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 

12:07 - October 1, 2017

అనంతపురం : ఏపీ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ - జ్ఞానల వివాహం ఘనంగా జరిగింది. జిల్లా వెంకటాపురంలో జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ నేతలు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లు కూడా పాల్గొననున్నారు. వివాహానికి హాజరైన అతిథులకు మంత్రి సునీత స్వయంగా స్వాగతం పలికారు. దాదాపు మూడు లక్షల మంది ఈ వివాహ వేడుకకు హాజరౌతారని తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

పుట్టపర్తికి సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టపర్తికి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో ఆయన వెళ్లారు. ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహ వేడుకలో పాల్గొననున్నారు. 

శివాజీ గణేషన్ స్మారక మణి మండపం ప్రారంభం..

చెన్నై : శివాజీ గణేషన్ స్మారక మణి మండపం ప్రారంభమైంది. ఈ స్మారక మండపాన్ని డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రారంభించారు. సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, విశాల్, కార్తీ తదితరులు పాల్గొన్నారు. 

అలయ్ బలయ్ కు ఉప రాష్ట్రపతి, మోడీ సందేశం..

ఢిల్లీ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి మోడీ అలయ్ బలయ్ సందేశాన్ని పంపారు. అలయ్ బలయ్ ఈ ఏడాది కూడా విజయవంతం కావాలని ఆకాక్షించారు. 

11:31 - October 1, 2017

సింగరేణిలో ప్రభుత్వ పక్షం గెలువనీయవద్దు - కోదండరాం...

హైదరాబాద్ : సింగరేణిలో ప్రభుత్వం పక్షం గెలిపిస్తే సింగరేణి ప్రైవేటీకరం అవుతుందని టీజేఏసీ ఛైర్మన్, ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 

11:25 - October 1, 2017

హైదరాబాద్ : సింగరేణిలో ప్రభుత్వం పక్షం గెలిపిస్తే సింగరేణి ప్రైవేటీకరం అవుతుందని టీజేఏసీ ఛైర్మన్, ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో కోర్టు పలు సూచనలు చేసిందని...స్త్రీ..పురుషుల మధ్య బేధాలు చూడడం మౌలిక సూత్రానికి విరుద్ధమని..వికలాంగులను చిన్న చూపు చూడొద్దని సూచించడం జరిగిందన్నారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని..ఉత్తర్వులు జారీ చేసుకోవచ్చని కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. అనారోగ్య కారణాల వల్ల పనిచేయని ఉద్యోగి సంస్థల నిబంధనలకు లోబడి వారి వారసులకు ఉద్యోగం ఇవ్వవచ్చునని తెలిపారు. ఈ విషయంలో కేవలం ఉత్తర్వులను సరిచేస్తే సరిపోయేదని కానీ సుప్రీంకోర్టుకు వెళ్లాలని పేర్కొంటూ కాలయాపన చేస్తోందన్నారు. మళ్లీ కొత్త ఉత్తర్వులు ఎప్పుడొస్తాయో విషయం సీఎం కేసీఆర్ చెప్పలేదన్నారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం పూనుకొంటోందని, అందుకనే వారసత్వ ఉద్యోగాల విషయంలో వెనుకడుగు వేస్తోందన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల్లో దిగాల్సి ఉండేదని..కానీ మద్యం ఏరులై పారిస్తోందన్నారు. సింగరేణి ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుండి అక్కడ దసరా పండుగ జరుగుతోందని..మద్యం..మాంసంతో ముంచెత్తి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. కార్మికులు అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని, ప్రభుత్వ పక్షాన్ని గెలవనీయవద్దన్నారు. అధికార పక్షం గెలవడం అంటే ప్రైవేటు గెలిచినట్లు అని సింగరేణిని అందరం కాపాడుకోవాలని తెలిపారు.

జీవో 39ని రద్దు చేయాలి...
రైతు సమన్వయ సమితిల అంశంలో జీవో 39ని విడుదల చేశారని వెంటనే ఈ జీవోని రద్దు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ జీవో ఉండడం వల్ల గ్రామ పంచాయతీ..మహిళా సంఘాలు..సహకార సంఘాలు..వ్యవస్థలు బలపడడం సాధ్యం కాదన్నారు. అఖిలపక్షంతో చర్చించడం జరిగిందని, అన్ని పార్టీలు ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేసిందన్నారు. అందులో భాగంగా అక్టోబర్ 3వ తేదీన అఖిలపక్షం ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో ధర్నాలు..నిరసనలు..చేపడుతామని, దీనికి సత్యగ్రహ దీక్ష పేరు పెట్టడం జరిగిందన్నారు. 

బ్యాడ్మెంటన్ టోర్నీ ప్రారంభించిన లోకేష్..

గుంటూరు : జిల్లా క్లబ్ లో బ్యాడ్మెంటెన్ టోర్నీని ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు లోకేష్ బ్యాడ్మెంటెన్ ఆడారు. 

11:10 - October 1, 2017
11:09 - October 1, 2017

అనంతపురం : జిల్లాలోని వెంకటాపురంలో ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం జరుగనుంది. ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రయంలో భారీ ఏర్పాట్లు చేశారు. సీఎంలు వస్తుండడంతో పుట్టపర్తిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్..చంద్రబాబు నాయుడులు విడివిడిగా హెలికాప్టర్ లో వెంకటాపురానికి చేరుకోనున్నారు.

11:08 - October 1, 2017

నెల్లూరు : జిల్లాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజునే భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. స్థానికంగా ఉన్న చెరువులో స్నానమాచరించి రొట్టెలను పంచుకున్నారు. ఐదు రోజుల పాటు భక్తి ప్రవత్తులతో ఈ పండుగను జరుపుకోనున్నారు. రొట్టెలు పంచడం వల్ల తమ కోర్కెలు తీరుతాయని ప్రజల నమ్మకం. ఆరోగ్య..వైద్య..సౌభాగ్య..ధన..రకరకాల రొట్టెలకు పేర్లు ఉండనున్నాయి. ఈ పండుగ సందర్భంగా ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

పరిటల శ్రీరామ్ వివాహం..

అనంతపురం : ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం జరుగుతోంది. ఈ వివాహ వేడుకకు ఏపీ మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు తదితరులు హాజరయ్యారు. 

10:45 - October 1, 2017

తిరుమల బ్రహ్మోత్సవాలు..

చిత్తూరు : బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు చక్రస్నానం జరిగింది. స్వామివారిని చివరి రూపమైన అర్చా విగ్రహానికి చక్రస్నానం జరిపించిన అనంతరం ఆనంద నిలయానికి తిరుమలేశుడిని తరలించారు. 

కామినేనిని కలిసిన సీపీఎం నేతలు..

అనంతపురం : మున్సిపల్ గెస్ట్ హౌస్ లో మంత్రి కామినేని శ్రీనివాస్ రావును సీపీఎం నేతలు కలిశారు. ప్రభుత్వాసుపత్రిలో 124 జీవోను అమలు చేయాలని వినతిపత్రం సమర్పించారు. 

09:37 - October 1, 2017

ఎన్ఆర్ బీసీ ప్రధాన కాల్వకు గండి..

కర్నూలు : బనగాపల్లిలో ఎన్ఆర్ బీసీ ప్రధాన కాల్వకు గండి పడింది. నీరంతా వృథాగా పోతోంది. పెండేకంటినగర్ కాలనీల్లోకి నీరు చేరుతోంది. 

రొట్టెల పండుగ..

నెల్లూరు : బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు రొట్టెల పండుగ జరుగనుంది. తొలి రోజు భారీగా భక్తులు పోటెత్తారు. రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు సమీక్షించారు

09:04 - October 1, 2017

సూర్యాపేట : జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దలుచెర్వు గ్రామ సమీపంలో ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు-వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో మరో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కృష్ణాజిల్లా అవనిగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ఏపీ 16జెడ్ 0216 ఆవనిగడ్డకు చెందిన ఆర్టీసీ బస్సుగా గుర్తించారు. సత్తయ్య, ఏడుకొండలు, వరప్రసాద్ లు మృతులుగా గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

రోడ్డు ప్రమాదంపై బుద్ధ ప్రసాద్ దిగ్ర్భాంతి...

కృష్ణా : మునగాల (మం) మొద్దుల చెర్వు వద్ద రోడ్డు ప్రమాదంపై డిప్యూటి స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులతో ఫోన్ లో బుద్ధ ప్రసాద్ మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. 

తాకని సూర్యకిరణాలు..

శ్రీకాకుళం : అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్యకిరణాలు తాకలేదు. వర్షం కారణంగా సూర్యుడు కనిపించలేదు. దీనితో భక్తులు నిరాశగా వెనుదిరిగారు. మార్చి, అక్టోబర్ లో స్వామి వారిని సూర్యకిరణాలు తాకుతుంటాయి. 

08:18 - October 1, 2017

అనంతపురం : జిల్లాలోని వెంకటాపురంలో ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం జరుగనుంది. ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రయంలో భారీ ఏర్పాట్లు చేశారు. సీఎంలు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్..చంద్రబాబు నాయుడులు విడివిడిగా హెలికాప్టర్ లో వెంకటాపురానికి చేరుకోనున్నారు. 

శ్రీవారి చక్రస్నానం..

చిత్తూరు : తిరుమలలో శ్రీవారి చక్రస్నానం కార్యక్రమానికి ఆలయ అధికారులు, అర్చకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాసేపట్లో జరుగనున్న ఈ వేడుకను చూసేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. 

07:40 - October 1, 2017
07:39 - October 1, 2017
07:35 - October 1, 2017

ఢిల్లీ : దేశంలో ఐదు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తమిళనాడు గవర్నర్‌గా బన్వరీలాల్‌ పురోహిత్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు అండమాన్‌ నికోబార్‌ దీవులకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్‌ జగ్దీష్‌ ముఖీను తప్పించి ఆయన స్థానంలో రిటైర్‌ అడ్మిరల్‌ దేవేంద్రకుమార్‌ జోషిని నియమించారు. జగ్దీష్‌ ముఖీని అసోం గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. మేఘాయల గవర్నర్‌గా గంగా ప్రసాద్‌, బిహార్‌ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా బీ.డీ. మిశ్రాను నియమించారు. అయితే గత కొంత కాలంగా గవర్నర్‌ పదవి వస్తుందని ఎదురు చూస్తున్న టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహ్ములుకి ఈసారి కూడా నిరాశే ఎదురైంది.

07:33 - October 1, 2017

ముంబయి : ఎలిఫిన్స్‌టన్ స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 23కు చేరింది. ఈ ఘోర విషాదంలో శుక్రవారం 22 మంది మృతి చెందగా శనివారం మరొకరు చనిపోయారు. ఈ ఘటనలో మొత్తం 39 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు కేఈఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ముంబయి హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనకు రైల్వే అధికారులను బాధ్యులను చేయాలని పిటిషనర్ కోరారు.

07:30 - October 1, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం పుష్కరణిలో జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. చక్రస్నానానికి భారీగా భక్తులు తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు చెప్తున్నారు. 

07:28 - October 1, 2017

నెల్లూరు : జిల్లా అంటే మొదట గుర్తొచ్చే పండుగ రొట్టెల పండుగ.. ఈ పండుగకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. భక్తులు తమ కోరికలు తీరాలని ఇక్కడ కానుకలకు బదులు..రొట్టెలను పంచుతారు. ఒక్కో కోరికకు ఒక్కో రొట్టె ఉండటం మరో విశేషం. నెల్లూరులో ఐదురోజుల పాటు జరిగే బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగపై ప్రత్యేక కథనం..

నెల్లూరు జిల్లాకే విశిష్టతను తెచ్చిపెట్టే వైవిధ్య ఉత్సవమిది. కోరిన కోర్కెలు తీర్చే సంబరాల పండుగ.. ప్రతి ఏటా మొహర్రం సందర్భంగా ఈ పండుగ మూడు రోజులపాటు జరుగుతుంది. అయితే ఈ ఏడాది భక్తుల తాకిడిని బట్టి నాలుగు లేదా ఐదు రోజులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్‌ 1 నుంచి నాలుగో తేదీ వరకు రొట్టెల పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ పండుగ రోజు పేదలకు రొట్టెలు పంచితే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మిక. ఈ వేడుకకు 360 సంవత్సరాల చరిత్ర ఉంది. 1651లో సౌదీలోని మక్కా షరీఫ్ నుంచి 12 మంది వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో పలుచోట్ల మత విబేధాలు రాజుకున్నాయి. తమిళనాడులో వాలాజా రాజులపై దండెత్తటానికి బీజాపూరు సైన్యం బయల్దేరింది. వారితో పాటే ప్రచారానికి వచ్చిన మక్కావీరుల బృందం కూడా కదనరంగంలోకి దిగింది.వాలాజాకు నెల్లూరు మీదుగా వెళ్తుండగా..కొడవలూరు మండలం గండవరం దగ్గర తమిళనాడు సైన్యం ఎదురుపడింది. దీంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా జరిగిన యుద్దంలో 12 మంది వీరులు చనిపోయారు. వారి తలలు గండవరంలో తెగిపడ్డాయి. మొండాలు మాత్రం గుర్రాలపై నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు చేరినట్లు చరిత్ర చెబుతోంది.

స్వర్ణాల చెరువు దగ్గర నిత్యం దుస్తులు ఉతికే రజక దంపతులకు.. ఓరోజు రాత్రి కలలో అమరవీరులు కన్పించి.. నెల్లూరును పాలిస్తున్న ఆర్కట్ రాజు భార్య అనారోగ్యంతో ఉందని ఆమె రోగం నయమయ్యేందుకు ఓ సలహా ఇచ్చారట. తమ మృతదేహాలు కలిసిన స్వర్ణాల చెరువు మట్టిని తీసుకెళ్ళి ఆమెకు తీలకం దిద్దాలని చెప్పారట. కొన్ని రోజులకే ఆర్కట్‌ రాజు భార్య ఆరోగ్యం కుదుటపడటంతో.. దంపతులిద్దరు స్వర్ణాల చెరువు దగ్గరకొచ్చి దర్గాలు కట్టించి పూజలు చేశారు. తమతో తెచ్చుకున్న రొట్టెలు తిని, మిగిలిన వాటిని స్థానికులకు పంచారు. ఇక ఆ రోజు నుంచి స్వర్ణాల చెరువు దగ్గర రొట్టెలు తిని.. పక్కవారికి పంచడం ఆనవాయితీగా వస్తుందని స్థానికులు చెబుతుంటారు. తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని.. అందుకే బారాషాహీద్ దర్గాకు ప్రతి ఏటా వస్తామని భక్తులు చెబుతూ ఉంటారు. తమ కోర్కెలు తీరినందుకు గుర్తుగా ఏటా గోధుమ రొట్టెలను మొక్కులుగా చెల్లిస్తారు.

భక్తులు కోరుకునే కోర్కెల్లో కూడా రకరకాలుంటాయి. ముఖ్యంగా పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, సౌభాగ్యం, వ్యాపారం, విదేశీయానంతోపాటు సంతాన రొట్టెలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటితో పాటు వివిధ కోరికలను బట్టి రొట్టెలు పంచుతుంటారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..ఇక్కడ జరిగే రొట్టెల పండుగకు అన్ని మతాలవారూ తరలివస్తారు. ఈ రొట్టెల పండుగలో ప్రధానమైనది గంధమహోత్సవం. ఈ గంధ మహోత్సవం వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు తెల్లవార్లూ జాగారం చేస్తారు. మత పెద్దలు తెచ్చే గంధం కోసం భక్తులు ఎదురు చూస్తారు. గంధం తీసుకురాగానే భక్తులు దాన్ని అందుకునేందుకు పోటీపడతారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద బారాషహీద్ దర్గాలోని రొట్టెల పండగలోని ప్రధాన ఘట్టం గంధ మహోత్సవం. ఈ గంధాన్ని తమ దగ్గరుంచుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

కొత్తగా కోర్కెలు కోరుకునే వారు..అప్పటికే కోరిక తీరిన వారి చేతుల మీదుగా రొట్టెలను అందుకుంటారు. 5 రొట్టెలను తయారు చేసి ఒకదాన్ని ఇంట్లో ఉంచి, మిగతా నాలుగింటినీ దర్గా దగ్గరకు తెస్తారు. అక్కడి నుంచి చెరువు వద్దకు తీసుకెళ్తారు. నీళ్లను తలపై చల్లుకుని, కోర్కెలు నెరవేరాలంటూ వాటిని కొత్త వారికి అందిస్తారు. ఎన్ని కోర్కెలు కోరుకున్నా..ఒక్కో కోరికకు ఐదు రొట్టెలు పంచాలన్నది ఆచారం. రొట్టెలు పంచితే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. అలా కోర్కెలు తీరిన వారు కొత్తవారికి రొట్టెలను పంపిణీ చేస్తారు. మరోవైపు రొట్టెల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా జరుపుకుంటుండటతో.. భారీ ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనా వేస్తోంది. నెల్లూరు రొట్టెల పండుగలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాక..దేశ, విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అటు పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు చేపడుతున్నారు. 

ఘనంగా తెప్పోత్సవం...

విజయవాడ : దసరా మహోత్సవాల్లో ఆఖరి రోజు విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులను హంస వాహనంలో ఊరేగిస్తూ నిర్వహించిన ఈ వేడుక నేత్రపర్వంగా సాగింది. రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. 

07:10 - October 1, 2017

విజయవాడ : దసరా మహోత్సవాల్లో ఆఖరి రోజు విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులను హంస వాహనంలో ఊరేగిస్తూ నిర్వహించిన ఈ వేడుక నేత్రపర్వంగా సాగింది. రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై నుంచి ఉత్సవ మూర్తులను ఊరగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకువచ్చారు. ఇక్కడ పూజలు నిర్వహించిన అనంతరం మూడు సార్లు హంసవాహనం పై కృష్ణానదిలో తెప్పమీద ప్రదక్షిణలు చేశారు. వేలాది మంది భక్తులు దుర్గాఘాట్‌, పున్నమిఘాట్‌, ప్రకాశం బ్యారేజిపై నుండి ఈ ఉత్సవాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన లేజర్‌ షో అందరినీ ఆకట్టుకుంది. 

07:04 - October 1, 2017

హైదరాబాద్ : మొహరం సందర్భంగా హైదరాబాద్‌లో భద్రతను పటిష్టం చేశారు. పాతబస్తితో పాటు, చాదర్ ఘాట్, మౌలాలి ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఊరేగింపు సాగే రూట్లలో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. అక్టోబర్ 1న మొహరం, దుర్గామాత నిమజ్జన కార్యక్రమం ఒకేసారి రావడంతో పోలీసులతో పాటు కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచారు.

దుర్గామాత విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నట్టు హైదరాబాద్‌ పోలీస్‌కమిషనర్‌ మహేందర్‌రెడ్డి అన్నారు. ట్యాంక్‌బండ్‌ ఏరియాలో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయన్నారు. సికింద్రాబాద్‌ నుంచి అప్పట్‌ట్యాంక్‌బండ్‌ మీదుగా వచ్చే వాహనాలను సెయిలింగ్‌క్లబ్‌, కవాడీగూడ, లోయర్‌ట్యాంక్‌బండ్‌ మీదుగా మళ్లిస్తారు. కట్టమైసమ్మ, వాడీగూడ నుంచి వచ్చే వాహనాలను చిల్డ్రన్స్‌పార్క్‌, అప్పర్‌ట్యాంక్‌బండ్‌ మీదుగా అనుమతిస్తారు. డీబీఆర్‌మిల్స్ వద్ద ఎలాంటి వెహికిల్స్‌ను అనుమతించరు. అటు ఇక్బాల్‌మీనార్‌ నుంచి వచ్చే వాహనాలు .. సచివాలయం పాత గేటు ముందు నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, కట్టమైసమ్మ, నెక్లెస్‌రోడ్‌. మింట్‌కాంపౌండ్‌ మీదుగా వెళ్లాల్సి ఉంది. లిబర్టీ మీదుగా వచ్చే వెహికిల్స్‌ హైదరాబాద్‌నర్సింగ్‌హోం, ఐటీజంక్షన్‌ మీదుగా ఇక్బాల్‌ మీనార్‌ వద్ద యూటర్న్‌ తీసుకుని తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఇక మొహరం సందర్భంగా జరిగే బీబీకాఅలం ఊరేగింపులో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టిన పోలీస్‌ అధికారులు.. 1వ తేదీ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బీబీకా ఆలం ఊరేగింపు సాగే ప్రాంతాల్లో వాహనాలను రాకపోకలపై నియంత్రణ అమలు చేస్తున్నారు. ఆల్వాబీబీ వైపు నుంచి వచ్చే వెహికిల్స్‌ సునార్‌గల్లీ టీజంక్షన్‌, డబీర్‌పురా దర్వాజా, మీదుగా యాకుత్‌పురా వైపు వెళ్లాల్సి ఉంది. షేక్‌ఫయీజ్‌ కమాన్‌ మీదుగా వచ్చే వాహనాలు బజ్బార్‌హోటల్‌ నుంచి డబీర్‌పుర దర్వాజా మీదుగా చంచల్‌గూడవైపు మళ్లిస్తారు. అటు యాకుత్‌పురా రైల్వేస్టేషన్ నుంచి వచ్చే వారు పురానాహవేలీ క్రాస్‌రోడ్‌, పీలీగేట్‌, ఎస్‌జే రోటరీ క్లబ్‌మీదుగా వాళ్లాల్సి ఉంది. ఇక మొఘల్‌పురా వాటర్‌ట్యాంక్‌ నుంచి వచ్చే వాహనాలు చౌక్‌మైదాన్‌ఖాన్‌వద్ద హఫీజ్‌ డంకామసీద్‌, పారిస్‌కేఫ్‌, బీబీబజార్‌ వైపు మళ్లిస్తారని పోలీస్‌ అధికారులు తెలిపారు.

అటు గౌలీగూడకు వచ్చే ఆర్టీసీ బస్సులను రంగమహల్‌ మీదుగా వెళ్లాల్సి ఉంది. సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా కర్బలా మైదనాం వెళ్లే వాహనాలను చిల్డ్రన్స్‌పార్క్‌, కవాడీగూడ, బైబిల్‌హౌస్‌, ఆర్‌పీరోడ్‌ మీదుగా మళ్లించారు. ఇక ఆర్పీరోడ్‌ మీదుగా కర్బలామైదనాం వెళ్లే వెహికిల్స్‌.. బేగంపేట ట్రాఫిక్‌పోలీస్టేషన్‌, బైబిల్‌హౌస్‌, వయా ట్యాంక్‌బండ్‌ డీబీఆర్‌ మిల్స్‌వైపు మళ్లించారు. ఇక ఎంజీరోడ్‌ నుంచి సెంట్రల్‌ టెలిగ్రాఫ్‌ ఐలాండ్‌, రాణీగంజ్‌వైపు వన్‌వే మాత్రమే అనుతి ఉంది.

బీబీఆకాలం ఊరేగింపుసాగే ప్రాంతాల్లో సౌత్‌జోన్ కంట్రోల్ రూం నుంచి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. డిజిటల్ సిసి కెమేరాల సహయంతో చార్మీనార్ ఏసిపి కార్యాలయం నుంచి భద్రతా ఏర్పాట్లు సమీక్షిస్తారు. ఓవైపు దుర్గామాత విగ్రహాల నిమజ్జనం.. మరోవైపు మొహర్రం పండుగ ..తో హైదురాబాద్‌ అంతటా పండగ సందడి నెలకొంది. ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకున్నామని పోలీసులు అంటున్నారు. ప్రజలందరూ శాంతియుతంగా వారి వారి కార్యక్రమాలను నిర్వహించుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. 

06:59 - October 1, 2017

కర్నూలు : జిల్లా దేవరగట్టులో రక్తం చిందింది. దేవరగట్టులోని మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో జరిగిన కర్రల సమరంలో పలువురికి తలలు పగిలాయి. బన్నిఉత్సవం సందర్భంగా జరిగిన కర్రల పోరాటంలో 31 మందిగాయపడ్డారు. బాధితులను ఆదోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ఓవైపు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కర్రల సమరాన్ని మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా..భక్తులు యధావిధిగా కర్రల పోరాటానికి దిగారు. డ

06:58 - October 1, 2017

నల్గొండ : సూర్యాపేట జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దలుచెర్వు గ్రామ సమీపంలో ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు- వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో మరో 6గురి పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణాజిల్లా అవనిగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ఏపీ 16జెడ్ 0216 ఆవనిగడ్డకు చెందిన ఆర్టీసీ బస్సుగా గుర్తించారు. సత్తయ్య, ఏడుకొండలు, వరప్రసాద్ లు మృతులుగా గుర్తించారు. 

నేడు అధికారులతో బాబు సమీక్ష..

అనంతపురం : నేడు జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. పుట్టపర్తిలో పలు అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. 

సూర్యాపేటలో నలుగురు మృతి...

సూర్యాపేట : మునగాల (మం) మొద్దులచెరువు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ఏపీ 16జెడ్ 0216 ఆవనిగడ్డకు చెందిన ఆర్టీసీ బస్సుగా గుర్తించారు. సత్తయ్య, ఏడుకొండలు, వరప్రసాద్ లు మృతులుగా గుర్తించారు. 

నేటి నుండి విజయనగరం ఉత్సవాలు..

విజయనగరం : నేటి నుండి విజయనగరం ఉత్సవాలు జరుగనున్నాయి. అయోధ్య మైదానం, అనందగజపతి కళాక్షేత్రం, గురజాడ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. 

రాత్రి 11గంటల వరకు మద్యం అమ్మకాలు..

హైదరాబాద్ : నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఉదయం 10 నుండి రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలు కొనసాగనున్నాయి. 

పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ : నేడు మొహరం సందర్భంగా పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 నుండి రాత్రి 9గంటలకు వరకు ఆంక్షలు అమలు కానున్నాయి.

Don't Miss