Activities calendar

02 October 2017

15:04 - October 2, 2017

ఢిల్లీ: అమెరికాలో క్యాసినో నగరం లాస్‌ వేగాస్‌లోని ఓ రిసార్ట్‌లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మండలే బే హోటల్‌ వద్ద ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో 20మంది పౌరులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రిలో చేర్చారు. కంట్రి మ్యూజిక్‌ ఫెస్టివల్‌ జరుగుతున్న ప్రాంతంలో కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పులు జరిగిన వెంటనే ప్రజలు భయంతో పరుగులు తీశారు. కాల్పులు జరిపిన ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తి ని కాల్పి చంపేనట్లు సమాచారం.

15:00 - October 2, 2017

విశాఖ : జిల్లా పెందుర్తిలో గాంధీ జయంతి రోజు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమార్కులు యధేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్, పోలీసుల ఆదేశాలను బేఖాతర్‌ చేస్తున్నారు. మద్యం అమ్మకందార్లకు ముందస్తుగా కౌన్సెలింగ్, నోటీసులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది.

 

14:59 - October 2, 2017

విజయవాడ: గాంధీజయంతి సందర్భంగా..విజయవాడలో స్వచ్ఛతే సేవ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. లక్ష ఎన్టీఆర్‌ గృహ ప్రవేశాలను సభా వేదికగా చంద్రబాబు ఆవిష్కరించారు. రాష్ట్రంలో 22 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలని ఒక సంకల్పంగా పెట్టుకున్నామన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పెద్ద ఎత్తున మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

14:57 - October 2, 2017

హైదరాబాద్‌ : హుస్సేన్‌సాగర్‌ దగ్గర దుర్గామాత నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. హుస్సేన్‌సాగర్‌ దగ్గర ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ సిబ్బంది చెత్తను తొలగిస్తోంది. రేపు కూడా నిమజ్జనం కొనసాగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులంటున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:56 - October 2, 2017
14:54 - October 2, 2017

శ్రీకాకుళం: చుట్టూ పచ్చని పోలాలు, కొబ్బరి చెట్లు, ప్రకృతి రమణీయత కల్గి ఆహ్లాదకరమైన వాతవరణం ఉన్న ఈ గ్రామం పేరు కరణాల పేట. ఇది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఉంది.ఈ గ్రామంలో ఒకప్పుడు 50 కుటుంబాలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఒకే ఒక కుటుంబం నివాసముంటోంది. కుటుంబమంటే నలుగురో ఐదుగురో అనుకునేరు. కేవలం ఇద్దరే. ఆ ఇద్దరే ఈ గ్రామంలో నివాసముంటున్నది.

కొన్ని దశాబ్దాల కిందట గ్రామం ప్రజలతో కళకళలాడే గ్రామం....

అయితే కొన్ని దశాబ్దాల కిందట గ్రామం ప్రజలతో కళకళలాడేది. ఊరినిండా ప్రజలు ఉండేవారు. అంతా కలిసి మెలిసి ఉంటూ తమ తమ పనులు చేసుకునేవారు. ఆ తర్వాతే పరిస్థితి తారుమరయ్యింది. గ్రామంలో వర్షాలు కురవక పంటలు పండక ఉపాధి దొరకడం కష్టమైపోయింది. దీంతో గ్రామస్తులు ఒక్కొక్కరుగా వలసబాట పట్టారు. ఉపాధి వెతుక్కుంటూ గ్రామస్తులంతా ఇతర ప్రాంతాలకు తరలివెళ్తుండడంతో ఊరంతా ఖాళీ అయ్యింది. ప్రస్తుతం గ్రామంలో ప్రసాదరావు, లక్ష్మీ దంపతులు మాత్రమే నివాసముంటున్నారు. వీరు వ్యవసాయం వదులుకోలేక గ్రామన్ని వీడలేక అలాగే ఉండిపోయారు.

సంవత్సరంలో ఒకసారి జరిగే గ్రామ దేవత ఉత్సవాలకి

సంవత్సరంలో ఒకసారి జరిగే గ్రామ దేవత ఉత్సవాలకి మాత్రం ప్రజలంతా వస్తారు. ఎక్కడెక్కడో ఉన్నవారంతా ఆరోజు ఊరికి వస్తారు. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుంటారు. గ్రామస్తులతో రాకతో గ్రామమంతా సందడిగా మారిపోతుంది. ఆ తర్వాత మళ్లీ వారంతా గ్రామాన్ని వదిలి వెళ్తారు. గ్రామంలో కొన్ని మౌలిక వసతులతోపాటు రోడ్లు, మంచినీటి వసతి కల్పిస్తే కొన్ని కుటుంబాలు తిరిగివచ్చే అవకాశముంది.

వలసల జిల్లాగా పేరున్న సిక్కోలు జిల్లాలో ఇలాంటివి సాధారణమే

వలసల జిల్లాగా పేరున్న సిక్కోలు జిల్లాలో ఇలాంటివి సాధారణమే అయినప్పటికీ కరణాల పేటలో ఏకంగా 99శాతం కుటుంబాలు గ్రామన్ని విడిచి వెళ్లడం గ్రామం కనుమరుగయ్యే అవకాశం ఉంది.. కావున ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని గ్రామం కనుమరుగు కాకుండా కాపాడలని కోరుతున్నారు.

14:51 - October 2, 2017

హైదరాబాద్: న్యూస్ పేపర్స్ తో కొలాజ్ వర్క్ ఎలా తయారు చేయాలో సొగసులో చూపించారు అపర్ణ. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:45 - October 2, 2017
14:44 - October 2, 2017

హైదరాబాద్: పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ హత్యపై ప్రధాని మోదీ స్పందించాలని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. గౌరీహత్య వెనుక ఉన్న నిజానిజాలు దేశప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రధాని స్పందించకుంటే తనకు వచ్చిన జాతీయ అవార్డును వెనక్కు ఇచ్చేస్తానని ప్రకాశ్‌రాజ్‌ స్పష్టంచేశారు.

14:38 - October 2, 2017

పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నారు. వైవిధ్యమైన ఉత్పత్తులతో, సరికొత్త ఆలోచనలతో తమదైన ప్రత్యేకతను సాధించుకుంటున్నారు. పర్యావరణ హితంగా, పోషకాహార మిళితంగా సరికొత్త ప్రాడెక్ట్ తో మార్కెట్ లోకి ప్రవేశించిన ఓ మహిళా వ్యాపారవేత్త అనుభవాలతో మన ముందుకు వచ్చింది. వ్యాపారంలో దూసుకుపోతున్న ప్రజ్ఞ ఇవాల్టి స్ఫూర్తి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

లక్ష ఎన్టీఆర్ గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విజయవాడ: ఇందిరాగాంధీ స్టేడియం లక్ష ఎన్టీఆర్ గృహప్రవేశ కార్యక్రమాన్నిసీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎక్కడా అవినీతి జరగకూడదని చెప్పారు. పరిష్కార వేదిక కాల్ సెంటర్ కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. అవినీతి ఒక్క పైసా జరిగినా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. పరిష్కార వేదిక ద్వారా సమాచారం తీసుకుంటున్నామని తెలిపారు.

గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని స్పందించాలి: నటుడు ప్రకాశ్ రాజ్

హైదరాబాద్: గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని మోదీ స్పందించాలని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో నాకు వచ్చిన జాతీయ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని హెచ్చరించారు.

సీఎంజేజే వై చంద్రన్న బీమాని ప్రారంభించిన ఏపీ సీఎం

విజయవాడ: సీఎంజేజే వై చంద్రన్న బీమా పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. చంద్రన్న బీమా ద్వారా 2.20 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.

జన సంద్రంగా తిరుమల గిరులు..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. శ్రీవారు బ్రహ్మోత్సవాలు ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. దసరా పండుగ శనివారం రావడం..ఆదివారం..సోమవారం గాంధీ జయంతి సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో తిరుమలకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. 

పీఎంజేజేవై చంద్రన్న బీమా ప్రారంభం..

విజయవాడ : లక్ష ఇళ్లలో గృహ ప్రవేశం జరుగుతుండడం తనకు చాలా సంతోషంగా ఉందని, లక్ష కుటుంబాల్లో ఆనందం చూస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పీఎంజేజేవై చంద్రన్న బీమా ప్రారంభించిన అనంతరం బాబు ప్రసంగించారు.

13:29 - October 2, 2017

విజయవాడ : లక్ష ఇళ్లలో గృహ ప్రవేశం జరుగుతుండడం తనకు చాలా సంతోషంగా ఉందని, లక్ష కుటుంబాల్లో ఆనందం చూస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పీఎంజేజేవై చంద్రన్న బీమా ప్రారంభించిన అనంతరం బాబు ప్రసంగించారు. మహిళలకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, పేదల పెళ్లిళ్లకు తగిన సహాయం చేస్తున్నామన్నారు. పండుగలకు కానుకలు ఇవ్వడం జరుగుతోందని, విద్య...వైద్య..ఆరోగ్య విషయంలో పేద ప్రజల ఖర్చు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 17 లక్షల 40 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, కేంద్ర సహకారంతో ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి..క్రిస్మస్ రోజుల్లో ఎన్ని ఇళ్లు కట్టాలో చూస్తామని, అలాగే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 8వ తేదీన పెద్ద ఎత్తున ఇళ్లు కట్టడం జరుగుతుందని, కట్టిన ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 

13:25 - October 2, 2017

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. శ్రీవారు బ్రహ్మోత్సవాలు ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. దసరా పండుగ శనివారం రావడం..ఆదివారం..సోమవారం గాంధీ జయంతి సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో తిరుమలకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. దీనితో 60 కంపార్ట్ మెంట్లు నిండిపోయి నాలుగు కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో నిల్చొన్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 12గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా టిటిడి అధికారులు ఇతర పనులపై దృష్టి సారించారు. క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు అన్న, పానీయాలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే వసతి గదుల కోసం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంగా తిరుమల గిరిలు జనసంద్రంగా మారిపోయాయి. భక్తుల రద్దీ ఇదే విధంగా ఉంటుందని టిటిడి అధికారులు పేర్కొంటున్నారు. 

'జనగామ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు'..

జనగామ : నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలంటూ తలపెట్టిన యాత్రను విజయవంతం చేయాలని ప్రో.కోదండరాం పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే భూమి ఆక్రమించినట్లు కలెక్టర్ ఆరోపణలు చేశారని, నిబంధనలకు విరుద్ధంగా కుంట పనులు చేశారని తెలిపారు. కలెక్టర్ బదిలీపై ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారని, అదే జరిగితే కలెక్టర్ కు అండగా ఉంటామన్నారు. అవినీతి సహించబోమన్న సీఎం కేసీఆర్ జనగామ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని, రాజకీయాలు అంటే ప్రజల భూములు లాక్కొవడం కాదని ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలని సూచించారు. 

13:17 - October 2, 2017

విజయవాడ : స్వచ్చతే సేవలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ స్టేడియంలో స్వచ్చ సేవతే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇదే వేదికపై లక్ష ఎన్టీఆర్ గృహ ప్రవేశాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. స్వచ్చతే సేవలో అందరూ పాల్గొనాలని, 22 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలని సంకల్పించినట్లు తెలిపారు. మహిళల ఆత్మగౌరవం కాపాడే విధంగా మరుగుదొడ్లను నిర్మించడం జరుగుతోందన్నారు. 

13:08 - October 2, 2017

అమెరికా : అగ్ర రాజ్యంలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికాలో రోజు రోజుకీ గన్ కల్చర్ పెరిగిపోతుంది. తుపాకీ చేతిలో ఉన్న ప్రతివాడు పిచ్చివాడిలా మారిపోతున్నాడు. కారణం లేకుండానే తమ చేతుల్లో తుపాకులకు పని చెప్పి రక్తాన్ని కళ్ల చూస్తున్నారు. ప్రతి చిన్న సంఘటనకు తుపాకీ మోత మోగుతోంది. బుల్లెట్లు గుండెల్లో దిగుతున్నాయి. అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బార్..పబ్బు..ఎక్కడైనా ఆగంతకులు కాల్పులకు తెగబడుతున్నారు.

తాజాగా లాస్ వేగాస్ లో ఓ రిసార్ట్ లో ఓ ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కంట్రి మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆగంతకుడు అక్కడకు చేరుకుని కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా భయాందోళనలకు లోనైన వారు పరుగులు తీశారు. దీనితో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. 24 మందికి గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి కాల్పులు జరిపిన ఆగంతకుడి పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. 

అమెరికాలో కాల్పులు..

అమెరికా : లాస్ వేగాస్ లో ఓ రిసార్ట్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. 24 మందికి గాయాలయ్యాయి. కంట్రి మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

12:54 - October 2, 2017
12:33 - October 2, 2017

పెద్దపల్లి : రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ 1 ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన గేటు మీటింగ్ కార్యక్రమంలో ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులపై వరాల జల్లు కురిపించారు. పేరు మాత్రమే కారుణ్య నియామకాలని, రూల్స్ అన్నీ వారసత్వానికి సంబంధించినవేనని . మారు పేరుతో పనిచేస్తున్న కార్మికుల పేరు మార్చుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కార్మికులు ఇళ్లు కట్టుకోవడానికి వడ్డీలేని రుణాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు. 11 కొత్త భూగర్భ గనులు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్మికుల ఇళ్లకు ఏసీలు పెట్టుకొనేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2014, 2015, 2016 బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్ గా పర్మినెంట్ చేస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్ల శిక్షణ కాలాన్ని రెండేళ్లకు తగ్గించనున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. 

12:30 - October 2, 2017

మంగంపేట మండలంలో కలకలం...

జయశంకర్ భూపాలపల్లి : మంగంపేట మండలంలో ఓ పాస్టర్ చేసిన నిర్వాకంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పాస్టర్ ఇంటిలో ఓ పుర్రె ఉండడం కలకలం రేగింది. మం

ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం...

అనంతపురం : జిల్లా టి.కొత్తపల్లి, జక్కల చెరువు గ్రామాల్లో గాంధీ జయంతి సందర్భంగా జరుగుతున్న ఇళ్ల పంపిణీ కార్యక్రమం గందరగోళంగా మారింది. ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్న గుంతకల్లు ఎమ్మెల్యే, తహశీల్దార్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. 

12:28 - October 2, 2017

అనంతపురం : జిల్లా టి.కొత్తపల్లి, జక్కల చెరువు గ్రామాల్లో గాంధీ జయంతి సందర్భంగా జరుగుతున్న ఇళ్ల పంపిణీ కార్యక్రమం గందరగోళంగా మారింది. ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్న గుంతకల్లు ఎమ్మెల్యే, తహశీల్దార్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. పేదలకు కాకుండా టిడిపి కార్యకర్తలకే ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలకు న్యాయం జరగడం లేదని నిలదీశారు. అసలైన పేదలకు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నా గ్రామస్తులు వినిపించుకోలేదు. దీనితో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

12:26 - October 2, 2017

జయశంకర్ భూపాలపల్లి : మంగంపేట మండలంలో ఓ పాస్టర్ చేసిన నిర్వాకంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పాస్టర్ ఇంటిలో ఓ పుర్రె ఉండడం కలకలం రేగింది. మంగపేట మండలం నర్సాపూర్ గ్రామంలో ఓ చర్చీకి పాస్టర్ గా ఓ వ్యక్తి వ్యవహరిస్తున్నాడు. 9 నెలల క్రితం అతని భార్య దేవీ అనారోగ్యంతో మృతి చెందింది. సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించి శవపేటికలో మృతదేహాన్ని ఖననం చేశారు. భార్య మృతి చెందిన అనంతరం పాస్టర్ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. ముభావంగా ఉండడం..ఎవరితో మాట్లాడే వాడు కాదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సోమవారం భార్య పుర్రె తీసుకుని రావడం కలకలం రేపింది. గ్రామస్తులకు ఈ విషయం తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దేవుడి ఆదేశంతో తాను ఇలా చేయడం జరిగిందని, భార్య జ్ఞాపకార్థం తీసుకొచ్చానని పాస్టర్ పేర్కొంటున్నాడు. పోలీసులు పాస్టర్ ను విచారిస్తున్నారు. 

12:21 - October 2, 2017

విజయవాడ : కృష్ణా జిల్లాను ఓడీఎఫ్ జిల్లాగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్వచ్ఛత సేవ కార్యక్రమంలో బాబు పాల్గొని ప్రసంగించారు. 383 గ్రామాలు ఓడీఎఫ్ సాధించాలని, అన్ని గ్రామాలు ఓడీఎఫ్ వచ్చే విధంగా కృషి చేయాలని, 22లక్షల మరుగుదొడ్లు ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక్కో విద్యార్థి ఒక్కో మరుగుదొడ్డి కట్టించే విధంగా చూడాలని, డ్వాక్రా సంఘాలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అన్ని గ్రామాల్లో ఎల్ ఈడీ బల్బులు ఏర్పాటు చేయాలని, మంచినీరు ఇవ్వాలని ఇందుకు ఓ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. చెత్తా చెదారం సేకరించడం..పేడ సేకరించి ఎరువుగా తయారు సే బాధ్యత పంచాయతీ రాజ్ శాఖకు అప్పగించడం జరుగుతుందన్నారు. 

కృష్ణా జిల్లా ఓడీఎఫ్ జిల్లా..

విజయవాడ : ఇందిరా గాంధీ మున్సిపల్ స్వచ్ఛత సేవ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. కృష్ణా జిల్లాను ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించారు. 

11:43 - October 2, 2017

విజయవాడ : మార్పు మనలో రావాలని... ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామాభివృద్దికి సహకరించాలని ఏపీ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. స్వచ్చతే సేవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. . 16వేల లోటు బడ్జెట్ ఉన్నా గ్రామీణాభివృద్ధి కోసం ఎంతో ఖర్చు చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ తదితర వాటికి నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇంటింటికి నల్లా..వ్యక్తిగత మరుగుదొడ్డి..గ్రామ పంచాయతీల్లో ఉన్న అన్ని రోడ్లు యుద్ధ ప్రాతిపదిక నిర్మించాలని సూచించారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ. 10వేలు ఆదాయం సంపాదించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని, 12918 గ్రామ పంచాయతీలకు 2019 నాటికి ఏడు స్టార్లు వచ్చే విధంగా చూస్తామని తెలిపారు. 

బాబు టెలీకాన్ఫరెన్స్...

బాబు టెలీకాన్ఫరెన్స్... నీరు - ప్రగతి, వ్యవసాయంపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదరికం తొలగిపోవాలని, పరిశుభ్రమైన సమాజం నెలకొనాలని ఆకాక్షించారు. 

పాక్ కాల్పుల్లో ఇద్దరు మృతి..

పూంచ్ : పాక్ బలగాల కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్ సెక్టార్ లోని కేరీ, దిగ్వార్ లలో పాక్ దళాలు నేటి ఉదయం నుండి భారీగా మోర్టాల్ షెల్స్ ను ప్రయోగిస్తున్నాయి. భారత దళాలు భారీగా ఎదురు కాల్పులు ప్రారంభించాయి. పాక్ కాల్పుల్లో బాలుడు, బాలిక మృతి చెందారు. 

11:11 - October 2, 2017
11:09 - October 2, 2017

నెల్లూరు : బారా షాహీద్ దర్గా దగ్గర రొట్టెల పండుగ రెండో రోజుకు చేరుకుంది. దర్గాకు భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు. స్వర్ణాల చెరువులో స్నానమాచరించడానికి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది. స్నానం ఆచరించిన అనంతరం రొట్టెలు పంచుకున్నారు. ఉద్యోగ..సంతానం..చదువు..పెళ్లి..సంపాదన..పేరిట రొట్టెలను పంపిణీ చేస్తున్నారు. కానీ కొంతమందికి రొట్టెల కొరత ఏర్పడడంతో ఇక్కట్లకు గురవుతున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:08 - October 2, 2017

పెద్దపల్లి : బసంతనగర్ లోని అందుగులపల్లి వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన ఓ కుటుంబం కారులో కరీంనగర్ కు వెళుతోంది. అందుగులపల్లి వద్ద కారు డివైడర్ ను ఢీకొంది. అనంతరం మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో చిన్నారి కూడా ఉంది. ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగమే కారణమని తెలుస్తోంది. 

11:00 - October 2, 2017

బీజేపీ పాలనపై వ్యతిరేకత పెరిగిపోతోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. టెన్ టివితో ఆయన ముచ్చటించారు. కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అంతేగాక మతతత్వ శక్తులు పెరిగిపోతున్నాయి. దీనిపై సీపీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ? కాంగ్రెస్ పార్టీతో కలిసేది లేదనడం..బీజేపీని ఎలా ఎదుర్కొంటారు ? బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై స్పందన...మోడీ గత ఎన్నికల్లో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు రావడం..పేదల సంక్షేమం..పథకాలు..ఉచిత కరెంటు పలు హామీలు గుప్పిస్తున్నారు. పేదలకు కోసం అండగా ఉండే సీపీఎం వ్యూహం ఎలా ఉంటుంది ? సీపీఎం బలంగా ఉన్న కేరళ..పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. సీపీఎం ఎలా ఎదుర్కొంటుంది ? యూనివర్సిటీ ఎన్నికల్లో వామపక్ష గ్రూపులకు చెందిన సంఘాలు విజయం సాధించాయి. దీనిపై బీజేపీపై యువత వ్యతిరేకందా ఉందని భావించవచ్చా ? ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొంటున్నారు..మూడున్నరేళ్ల బాబు పాలనపై స్పందన ? తదితర విషయాలపై ఏచూరి విశ్లేషించారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:53 - October 2, 2017

తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పామా అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని యాదవ్ పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం..లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం వాస్తవమేనని, ఇంటింటికో ఉద్యోగం ఇచ్చి ఎక్కడ పనిచేయిస్తామని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తో టెన్ టివి అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాలు..ఇతరత్రా విశేషాలు తెలియచేశారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్..తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు, సనత్ నగర్ ఎమ్మెల్యే..ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. గతంలో టిడిపిలో పనిచేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రముఖ రాజకీయ నాయకుల్లో తలసాని ఒకరు. 1965, అక్టోబర్ 6వ తేదీన జన్మించారు. ఇంటికో గొర్రె..ఇతర సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం శుభపరిణామమని, కేసీఆర్ ఎంతో ఆలోచనతో పలు పథకాలు ప్రవేశ పెట్టడం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వాలు ఏమి పనిచేయలేదని, వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ఎన్నికల నేపథ్యంలో పనిచేయడం లేదని తెలిపారు. ఇంకా ఎలాంటి విశేషాలు వెల్లడించారో పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

పాక్ కాల్పుల్లో బాలుడు మృతి..

పూంచ్ : పాక్ బలగాల కాల్పుల్లో 9ఏళ్లు బాలుడు మృతి చెందాడు. మరో నలుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్ సెక్టార్ లోని కేరీ, దిగ్వార్ లలో పాక్ దళాలు నేటి ఉదయం నుండి భారీగా మోర్టాల్ షెల్స్ ను ప్రయోగిస్తున్నాయి. భారత దళాలు భారీగా ఎదురు కాల్పులు ప్రారంభించాయి. 

బాపూఘాట్ వద్ద గవర్నర్..కేసీఆర్..

హైదరాబాద్ : బాపూఘాట్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. గవర్నర్ నరసింహన్, సీం కేసీఆర్ లు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. 

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన..

అనంతపురం : హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. గాంధీ విగ్రహానికి బాలకృష్ణ నివాళులర్పించి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుల్హన్ మహిళ పథకం కింద 35 మంది మైనార్టీ మహిళలకు రూ. 50 వేల చొప్పున రూ. 17.8 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

 

పేరు మాత్రమే కారుణ్య నియామకాలు..

కరీంనగర్ : పేరు మాత్రమే కారుణ్య నియామకాలని, రూల్స్ అన్నీ వారసత్వానికి సంబంధించినవేనని . మారు పేరుతో పనిచేస్తున్న కార్మికుల పేరు మార్చుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కార్మికులు ఇళ్లు కట్టుకోవడానికి వడ్డీలేని రుణాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు. 11 కొత్త భూగర్భ గనులు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్మికుల ఇళ్లకు ఏసీలు పెట్టుకొనేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2014, 2015, 2016 బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్ గా పర్మినెంట్ చేస్తున్నట్లు తెలిపారు.

పెద్దపల్లి ఎంపీ కవిత ప్రచారం..

పెద్దపల్లి : రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ 1 ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన గేటు మీటింగ్ కార్యక్రమంలో ఎంపీ కవిత పాల్గొన్నారు. 

10:25 - October 2, 2017

విజయనగరం : ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారం..విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడి తల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పైడి తల్లి జాతరలో తొలి ఘట్టమైన తొలేళ్ల సంబరం కాసేపట్లో జరుగనుంది. అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఘటాలు..విచిత్ర వేషధారణలు ఆకట్టుకుంటున్నాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

09:25 - October 2, 2017

అనంతపురం : పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రైవేటు ఆసుపత్రిలు అందుబాటులోకి రావాలని ఏపీ మంత్రి కామినేని సూచించారు. జిల్లాలో నూతనంగా నిర్మించిన హర్షిత మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు. వంద పడకలతో ఆసుపత్రిని నిర్మించారు. ఆయనతో పాటు మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా ఉన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆధునాతన వైద్య సేవలతో ఆసుపత్రి ప్రారంభం కావడం శుభ పరిణామమని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. పరిధిలోని మండలాల్లోని ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్సకు ఉపయోగపడుతుందని, పేద ప్రజలకు అతి తక్కువ ధరకే మెరుగైన వైద్యం అందిస్తామని..వంద పడకల ఆసుపత్రిలో ఒక పడక కేవలం పేద ప్రజల కోసమేనని, నిత్యం పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. 

09:17 - October 2, 2017
09:07 - October 2, 2017

విజయవాడ : ఏపీ రాజధాని రైతులు సింగపూర్‌ టూర్‌కు రెడీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే వీరిని సింగపూర్‌ తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. సింగపూర్‌ దేశంలో నిర్మాణ రంగంలో అవలంభిస్తోన్న విధానాలు, టెక్నాలజీ తెలుసుకునేందుకు రైతులను పంపించడానికి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే వంద మందిని మాత్రమే తీసుకెళ్తామని... వసతి మాత్రమే భరిస్తామంటూ ప్రభుత్వం షరతులు పెట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టమైన దేశం సింగపూర్‌. ఆంధ్రుల అద్భుత రాజధానిని మరో సింగపూర్‌ తరహాలో నిర్మిస్తామని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ దగ్గర నుంచి స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి వరకు అనేక అంశాల్లో సింగపూర్‌తో కలిసి ఆయన ముందుకెళ్తున్నారు. ఎప్పుడూ సింగపూర్‌ జపం చేసే చంద్రబాబు... రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను సైతం సింగపూర్‌కు పంపించేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే వారిని సింగపూర్‌కు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రైతులకు ప్రభుత్వం తిరిగి ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేస్తే బావుటుంది, ఎలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చన్న అంశాలపై రైతులు అధ్యయనం చేయనున్నారు. అంతేకాదు.. నిర్మాణ రంగంలో సింగపూర్‌ ఎలాంటి సాంకేతికతను వినియోగిస్తుందన్న అంశాన్ని రైతులు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ టూర్‌ను ఏర్పాటు చేశారు.

సింగపూర్‌ పర్యటన కోసం ముందుగా వందమంది రైతులను మూడు బృందాలుగా తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి బృందం అక్టోబర్‌ 22 నుంచి 26 వరకు , రెండవ బృందం నవంబర్‌ 5 నుంచి 9 వరకు, ఇక మూడో బృందానని నవంబర్‌ 19 నుంచి 23 వరకు పర్యటించేలా సీఆర్‌డీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగపూర్‌కు వెళ్లడానికి ఆసక్తి ఉన్న రైతులంతా దరఖాస్తు చేసుకోవాలని సీఆర్‌డీఏ కోరుతోంది. ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించారు. సింగపూర్‌లో రైతులకు మూడు రోజులు వసతి, స్థానిక రవాణా సదుపాయాలను సీఆర్‌డీఏ కల్పించనుంది. అయితే ప్రయాణానికి సంబంధించిన విమాన చార్జీలు, వీసా ఫీజు , ఆరోగ్య బీమా ఖర్చులు రైతులే భరించాలని షరతు పెట్టింది. ఈ నిబంధనలు అంగీకరించే రైతులే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

రైతుల సింగపూర్‌ పర్యటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది హర్షం వ్యక్తం చేస్తోంటే... మరికొందరు సర్కార్‌ నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు. పాస్‌పోర్టు విషయంలో ఎక్కువ మంది రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 22వేల మంది రైతులు రాజధానికి భూములిస్తే వారిలో వందమందినే తీసుకెళ్లాలని భావించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్‌ పర్యటనలో వసతి సౌకర్యంతోపాటు రవాణా ఖర్చులనూ ప్రభుత్వమే భరించాలని రైతులు కోరుతున్నారు. ఎక్కువ మందిని రైతులను సింగపూర్‌ పర్యటనకు తీసుకెళ్లాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి రైతుల విన్నపాలను ప్రభుత్వం ఏమేరకు పట్టించుకుంటుందో వేచి చూడాలి.

పూంచ్ లో కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. పూంచ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో కాల్పులు జరుపడంతో ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. 

విజయ్ ఘాట్ లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి..

ఢిల్లీ : భారత రెండవ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ జయంతి సందర్భంగా విజయ ఘాట్ లో ఆయన సమాధికి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. 

08:36 - October 2, 2017

ముంబై : జీఎస్టీపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పన్ను శ్లాబులను కుదించే అవకాశం ఉన్నట్లు జైట్లీ సంకేతాలు పంపారు. హర్యానాలోని ఫరిదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ ఆదాయం సాధారణ స్థితికి వస్తే శ్లాబుల కుదింపు ప్రక్రియ ఉంటుందని జైట్లీ పేర్కొన్నారు. కానీ మొదట రెవెన్యూ ఆదాయం సాధారణ స్థితికి చేరితేనే శ్లాబులపై సమీక్ష ఉంటుందన్నారు. ప్రస్తుతం 5, 12, 18, 28 శ్లాబుల కింద వస్తువులపై పన్ను విధిస్తున్నారు. కొన్ని వస్తువులపై జీఎస్టీ పన్ను మినహాయింపు, లేదా పన్ను రేటు తగ్గించాలని వివిధ రాష్ట్రాల నుండి డిమాండ్స్ వస్తున్నాయి. ప్రధానంగా 28 శాతం ఉన్న పన్నుపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తుండడం..తాజాగా జైట్లీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

08:16 - October 2, 2017

గాంధీకి నివాళులర్పించిన మోడీ..వెంకయ్య..

ఢిల్లీ : గాంధీ జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి మోడీలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థన వేడుకల్లో వారు పాల్గొన్నారు. 

గ్యాస్ లోడ్ లారీని ఢీకొన్న కర్నాటక ఆర్టీసీ బస్సు..

కర్నూలు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్యాస్ లోడ్ తో వెళుతున్న లారీని కర్నాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

08:08 - October 2, 2017

కర్నూలు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్యాస్ లోడ్ తో వెళుతున్న లారీని కర్నాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కర్నాటక ఆర్టీసీ బస్సు బెంగళూరు నుండి హైదరాబాద్ కు వెళుతోంది. బస్సులో 50 మంది ప్రయాణీకులున్నారు. డోన్ సమీపానికి రాగానే గ్యాస్ లోడ్ తో వెళుతున్న లారీని బస్సు ఢీకొంది. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై సిలిండర్లు పడిపోయాయి. సిలిండర్లు పేలకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. 

08:00 - October 2, 2017

కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని..జీఎస్టీ వల్ల మరింత ఆర్థిక పరిస్థితి కుదేలయ్యిందని..ఇతర అంశాలపై బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా చేసిన విమర్శలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు ముంబైలో జరిగిన రైలు ప్రమాదంలో పలువురు మృత్యువాత పడడం విషాదాన్ని నింపింది.. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చలో సీహెచ్ బాబురావు (సీపీఎం), ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), కార్తీక్ రెడ్డి (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

07:39 - October 2, 2017

ఇప్పడు అందరి చూపు సింగరేణి ఎన్నికలపైనే. అయితే ఆ ఎన్నికల సాక్షిగా జరగాల్సిన చర్చ ప్రభుత్వం గతంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు...ప్రస్తుతం ఇస్తున్న హామీల అమలు నిజమా ? ఈ అంశం పై చర్చించడానికి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:36 - October 2, 2017

హైదరాబాద్ : వన్డే ర్యాంకిగ్స్‌లో టాప్‌ పొజిషన్‌ను భారత్‌ తిరిగి చేజిక్కించుకుంది. గెలుపుకు అవసరమైన వేళ ఆసీస్‌తో సిరీస్‌ చివరి వన్డేలో అత్యద్భుతంగా రాణించి నెంబర్‌ వన్‌ స్థానాన్ని పదిలం చేసుకొంది. కంగారులతో చివరి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. టీమ్‌ ఇండియా విక్టరీలో కీలకపాత్ర పోషించిన రోహిత్‌శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. ఐదు వన్డేల సిరీస్‌ను భారత్‌ 4-1 తో సొంతం చేసుకుంది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్‌ 109 బంతుల్లో 11ఫోర్లు, ఒక సిక్సర్‌తో 125 పరుగుల చేసి భారత్‌ గెలుపును సులభతరం చేశాడు. కంగారులపై ఉత్తమ ప్రదర్శనను మరోసారి పునరావృతం చేశాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 242 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ 53 పరుగులు చేయగా, ఆరోన్‌ ఫించ్‌ 32 పరుగులతో అర్ధశతక భాగస్వామ్యంతో శుభారంభం అందించారు. అయితే తర్వాత వచ్చిన స్మిత్‌ హ్యాండ్స్‌కాంబ్‌ స్పల్ప స్కోర్లకే వెనుదిరిగారు.. అయినా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్లు స్టోయినిస్‌, హెడ్‌ లు రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు సాధించిపెట్టారు. ఆఖర్లో టెయిలెండర్లు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.

నాలుగో వన్డేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లు చివరి వన్డేలో సమష్టిగా రాణించారు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై అక్షర్‌ పటేల్‌, కేదార్‌ జాదవ్‌, కుల్‌దీప్‌ తక్కువ పరుగులిచ్చి ఆసీస్‌ను కట్టడి చేశారు. అర్ధశతకంతో ప్రమాదకరంగా మారుతున్న వార్నర్‌ వికెట్‌ను తీసి అక్షర్‌పటేల్‌ భారత శిబిరంలో ఆనందం నింపాడు.ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనీయకుండా, జట్టును భారీ స్కోరు చేయకుండా బౌలర్లు అడ్డుకోగలిగారు. అక్షర్‌ 3 వికెట్లు తీయగా... బుమ్రా 2, హార్దిక్‌ పాండ్య, జాదవ్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్ తలో వికెట్‌ పడగొట్టారు.

243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రహానే, రోహిత్‌లు తొలి వికెట్‌కు 124 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి గట్టి పునాది వేశారు. 124 పరుగుల వద్ద నైల్‌ బౌలింగ్‌లో రహానె వికెట్లు ముందు దొరికిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సారథి కోహ్లీ తో కలిసి రోహిత్‌ విజయానికి బాటలు వేశాడు. ఈ క్రమంలోనే రోహిత్‌ తన కెరీర్‌లో 14వ శతకాన్ని సాధించాడు. అంతేకాక 6000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. భారత్‌ విజయానికి చేరువవుతున్న క్రమంలో వీరిద్దరూ ఒకే ఓవర్‌లో ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేదార్‌ జాదవ్‌, మనీశ్‌ పాండే మరో వికెట్‌ పడనీయకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. లక్ష్య ఛేదనలో కీలకంగా వ్యవహరించి జట్టును విజయతీరాలకు చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించిన రోహిత్‌ శర్మ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకున్నాడు. సిరీస్‌లో ఆల్‌ రౌండ్‌ ప్రతిభ కనబర్చిన హార్ధిక్‌ పాండ్యా మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ దక్కించుకున్నారు. మొత్తానికి కంగారులపై సిరీస్‌ సొంతం చేసుకొని క్రికెట్‌లో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది.

07:32 - October 2, 2017

చెన్నై : రాజకీయాల్లో గెలవాలంటే స్టార్‌డమ్‌, పేరు ప్రఖ్యాతులు, డబ్బు మాత్రమే సరిపోవరన్నారు తలైవా రజనీకాంత్. వీటన్నింటికన్నా అతీతమైనది ఏదో కావాలన్నారు. చెన్నైలో జరిగిన శివాజీ గణేశన్‌ స్మారక మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రజనీకాంత్‌ చెప్పిన ఈ విషయాలపై ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వేదికపై కోలీవుడ్ అగ్రనటులు రజనీకాంత్, కమల్‌ హాసన్‌ కనిపించారు. వీరితో పాటు కోలీవుడ్ నటులు ప్రభు, విశాల్, కార్తీ, రాధిక ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం స్మారక మందిరాన్ని ప్రారంభించారు. తమిళ సినీ రంగానికి శివాజీ గణేశన్‌ చేసిన సేవలను ప్రస్తావించిన రజనీకాంత్‌.. స్మారక మందిరం నిర్మించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రజనీకాంత్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. శివాజీ గణేశన్‌ ఎన్నికల్లో పోటీ చేసిన తన సొంత నియకవర్గంలో ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ పార్టీల పెట్టాలని నిర్ణయించుకున్న తన సహరుడు కమల్‌హాసన్‌ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాశంగా మారాయి. రాజకీయ నాయకుడిగా విజయం సాధించాలంటే కీర్తి ప్రతిష్ఠలు, డబ్బు మాత్రమే సరిపోవన్నారు. ఇంకా ఎక్కువ కావాలని, ఈ రహస్యం తనకు తెలియదని, బహుశా కమల్‌కు తెలుసని భావిస్తున్నానని రజనీకాంత్‌ వ్యాఖ్యానించడంతో సభలో చప్పట్లు మార్మోగాయి. రెండు నెలల క్రితమే కమల్‌ తనతో కలిసి పనిచేయాలని అడిగి ఉండాల్సిందన్నారు. జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ స్టార్‌ నటులిద్దరూ రాజకీయాల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై రాజకీయ నాయకులు, ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

07:29 - October 2, 2017

నెల్లూరు : రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. బారాషాహిద్‌ దర్గా జనసంద్రమైంది. కోరిన కోరికలు తీరాలని స్వర్ణాల చెరువులో భక్తులు స్నానాలు ఆచరించి రొట్టెలు పంచుకున్నారు. రొట్టెల పండుగకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నెల్లూరు జిల్లాకే విశిష్టతను తెచ్చిపెట్టే వైవిధ్య ఉత్సవం..రొట్టెల పండుగ. బారాషాహిద్‌ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఏటా మొహర్రం సందర్భంగా ఆరంభమయ్యే ఈ 5 రోజుల వేడుకకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే సంబరాల పండుగకు తొలిరోజు నుంచి భక్తులు పోటెత్తారు. ఈ పండుగను హిందూవులు, ముస్లింలు ఎంతో పవిత్రంగా, సంప్రదాయబద్దంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తుంటారు.

కొత్తగా కోర్కెలు కోరుకునే వారు..అప్పటికే కోరిక తీరిన వారి చేతుల మీదుగా రొట్టెలను అందుకుంటారు. నీళ్లను తలపై చల్లుకుని, కోర్కెలు నెరవేరాలంటూ వాటిని కొత్త వారికి అందిస్తారు. ఎన్ని కోర్కెలు కోరుకున్నా..ఒక్కో కోరికకు ఐదు రొట్టెలు పంచాలన్నది ఆచారం. తమ కోర్కెలు తీరినందుకు గుర్తుగా ఏటా గోధుమ రొట్టెలను మొక్కులుగా చెల్లిస్తారు. భక్తులు కోరుకునే కోర్కెల్లో కూడా రకరకాలుంటాయి. ముఖ్యంగా పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, సౌభాగ్యం, వ్యాపారం, విదేశీయానంతోపాటు సంతాన రొట్టెలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. స్వర్ణాల చెరువులో రొట్టెలు ఇచ్చిపుచ్చుకోవడంలో జనం తలమునకలయ్యారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాట్లపై కొందరు భక్తులు పెదవి విరుస్తున్నారు. క్యూ లైన్‌ పద్ధతి పాటించకుండా జనం దూసుకొస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. నెల్లూరు బారాషాహిద్‌ దర్గాలో జరిగే రొట్టెల పండుగకు 2 వేల మంది పోలీసులతో ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మరోవైపు మంత్రి నారాయణ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

07:26 - October 2, 2017

సంగారెడ్డి : మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ముగిసింది. అధికారులు లైసెన్స్ జారీ చేయడం, టెండర్లు దక్కినవారు వ్యాపారాన్ని ప్రారంభించడమే మిగిలింది. కాని ఓ షాపు యజమాని మాత్రం అత్యుత్సాహంతో అనుమతులు రాకుండానే నిర్మాణాలు చేపట్టాడు. దీంతో కాలనీవాసులు యజమానితో గొడవకు దిగారు. సంగారెడ్డి జిల్లా గణేష్‌ నగర్‌ కాలనీలోని కలెక్టరేట్‌కు కొద్ది దూరంలోనే మద్యం దుకాణం కోసం జరుపుతున్న నిర్మాణం. ఈ నిర్మాణానికి మున్సిపల్‌ శాఖ అనుమతి లేదు. ఎక్సైజ్‌ శాఖ కూడా లైసెన్స్‌ను మంజూరు చేయలేదు. కాని టెండర్‌ దక్కించుకున్న యజమాని మాత్రం అట్టహాసంగా నిర్మాణాలు ప్రారంభించాడు. అయితే పర్మిషన్‌ లేకుండా నిర్మాణాలు జరపడంతో మున్సిపల్‌ అధికారులు ఆదేశాలు ఇచ్చి ఈ నిర్మాణాలను కూల్చివేశారు. అప్పటికీ అధికారుల ఆదేశాలను పట్టించుకోని యజమాని తిరిగి మళ్లీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాడు. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ సిబ్బందిని పంపి నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియ చేపట్టారు.

అయితే అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్ల మధ్యలో దుకాణాలు ఏర్పాటు చేయడంపై గణేష్‌ నగర్‌ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని సమస్యలు పట్టించుకోని కౌన్సిలర్‌ గోవర్దన్‌ నాయక్‌ అక్రమ నిర్మాణాలకు ఎలా అనుమతిస్తారని వారు మండిపడ్డారు. కాలనీవాసులతో గొడవకు దిగిన మద్యం షాపు యజమాని నిర్మాణాన్ని ఎలా అడ్డుకుంటారంటూ ఎదురుతిరిగాడు. అనుమతులు తెచ్చుకున్నా నిర్మాణాలు ఆపడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. టెండర్ తెచ్చుకున్నందుకే పరిస్థితి ఇలా ఉంటే ఇక అనుమతులు ఇస్తే పరిస్థితి ఏంటి అని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. 

07:24 - October 2, 2017

హైదరాబాద్‌ : అధికారపార్టీ సాధారణ ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. కొత్తగా నమోదయ్యే ఓటర్లను ఆకట్టుకోవడంపై దృష్టి సారించింది. వీలైనంత ఎక్కువ మందిని ఓటర్లుగా చేర్పించాలని నిర్ణయించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా గులాబీనేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువత మద్దతు భారీగా కూడగట్టుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు కొత్త ఓటర్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఓటర్ల నమోదు ప్రక్రియ ముగిసినా.. పార్టీపరంగా కొత్త ఓటర్ల నమోదుపై పెద్దగా దృష్టి సారించలేదు. సెప్టెంబర్‌లో వరుసగా సెలవులు రావడంతో.. కొత్త ఓటర్ల నమోదుకు మరింత గడువు కావాలని అధికారపార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారిని కోరింది. ఈసీ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఓటర్ల నమోదుపై గ్రేటర్‌ గులాబీ నేతలంతా దృష్టి సారించాలని కేసీఆర్‌ ఆదేశించారు.

గ్రేటర్‌లో కొత్త ఓటర్లను ఎక్కువ మందిని చేర్పించేలా టీఆర్‌ఎస్‌ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం గ్రేటర్‌లోని టీఆర్‌ఎస్‌ నేతలు సమావేశం అయ్యారు. దీనికి మంత్రులు తలసాని, నాయిని నరసింహారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఓటు హక్కు కోసం అర్హత ఉన్న యువతను గుర్తించి వారందరినీ ఓటర్లుగా చేర్పించాలని నిర్ణయించారు. బూత్‌ల వారీగా ఓటర్లను నమోదు చేయాలని మంత్రి నాయిని నర్సింహారెడ్డి పార్టీ నేతలకు సూచించారు. పార్టీ కీలక నేతల సమావేశంపై దసరా పండుగ ఎఫెక్ట్‌ కనిపించింది. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కొత్త ఓటర్లను ఎన్‌రోల్‌ చేయాలనే ఉద్దేశ్యంతో సమావేశం ఏర్పాటు చేసినా.. మెజార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

07:20 - October 2, 2017

గుంటూరు : క్లబ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్‌ అకాడమీని మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించారు. నేటి నుంచి ఈనెల 6వ తేదీ వరకు ఆలిండియా సీనియర్‌ ర్యాకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ జరగనుంది. ఈ టోర్నమెంట్‌ను లోకేశ్‌ ప్రారంభించారు. గుంటూరులో తొలిసారి బ్యాడ్మింటన్‌ టోర్నీ జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు లోకేశ్‌. ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సహం ఇస్తుందని... గ్రామస్థాయిలో మినీ స్టేడియాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్కూల్‌ స్థాయి నుండి క్రీడలకు మరింత ప్రోత్సహం ఇస్తామన్నారు లోకేశ్‌. ఇక ఈ టోర్నీ ప్రారంభం సందర్భంగా లోకేశ్‌... కాసేపు బ్యాడ్మింటన్‌ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. 

07:19 - October 2, 2017

హైదరాబాద్ : సింగరేణి ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం... అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పొంగులేటి సుధాకర్ రెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా... అధికార పార్టీ... కార్మికులను ప్రలోభాలకు గురిచేస్తోందన్నారు. సింగరేణి కార్మికులు.. తమ హక్కులను కాపాడుకోవాలంటే.. టీఆర్ఎస్ బలపరిచిన కార్మిక సంఘాన్ని ఓడించాలని పొంగులేటి విజ్ఞప్తి చేశారు.

 

-------------------------

07:17 - October 2, 2017

కర్నూలు : కరెంట్‌ తీగలు తగిలి అన్నాచెల్లెలు మరణించిన విషాద ఘటన కర్నూల్‌ జిల్లా మునగాల మల్లాపురం గ్రామంలో చోటు చేసుకుంది. మొహర్రం పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలు షార్ట్‌ సర్క్యూట్‌ అవ్వడంతో.. అక్కడే ఉన్న తండ్రి పిల్లలకు షాక్‌ తగిలింది. ఈ ప్రమాదంలో గిరి, దస్తగిరమ్మ అనే అన్నాచెల్లెల్లు చనిపోయారు. వీరి తండ్రి దస్తగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతని పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. 

07:15 - October 2, 2017

హైదరాబాద్ : స్నేహభావాన్ని పెంపుందించుకునేందుకు ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో జరిగే అలయ్‌ బలయ్‌ వేడుక నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో కన్నుల పండుగగా జరిగింది. కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ నిర్వహించిన ఈ వేడుకలో ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షనేతలు పాల్గొన్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలయ్‌ బలయ్‌ నిర్వాహకులు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు వచ్చారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలైన డప్పు, వాయిద్యాలతో దత్తాత్రేయ ప్రాంగణంలోకి చేరుకున్నారు. అనంతరం డిప్యూటి సీఎం మహమూద్‌ అలీతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్యక్రమానికి కేంద్ర సహాయ హోం శాఖ మంత్రి హన్స్‌ రాజ్‌ గంగారాం, తెలంగాణ మంత్రులు ఈటల, నాయిని, శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్, టీజాక్ ఛైర్మన్ కోదండరాం, ఎంపీ జితేందర్ రెడ్డి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేత వీహెచ్ హాజరయ్యారు. మత సామరస్యాన్ని, స్నేహ భవాన్ని పెంపొందించడం కోసం అలయ్‌ బలయ్‌ కార్యక్రమం చేపట్టినట్లు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీల నేతలను ఏకం చేయడంలో అలయ్‌ బలయ్‌ ఎంతో దోహదపడిందన్నారు.

మానవతావాది అయిన దత్తన్నను కేంద్రం మంత్రి పదవి నుండి తొలగించడం తనను ఎంతో కలిచి వేసిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. బి.సీ నేత ఎదుగుదలను ఓర్వలేకే మంత్ర పదవి నుండి తొలగించారన్నారు. విభిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తులను ఒకే వేదికపై తెచ్చే అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు హన్స్‌ రాజ్‌ గంగారాం. అనివార్య కారణాల వల్ల కార్యక్రమానికి హాజరు కాలేక పోయామని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందేశం పంపారు. ప్రధాని మోదీ కూడా అలయ్ బలయ్ విశిష్టతను ప్రశంసిస్తూ.. తన సందేశాన్ని పంపించారు. కార్యక్రమంలో తెలంగాణ వంటకాలతో... స్థానిక సంస్కృతి సాంప్రదాయ కళా నృత్యాలు, వేషధారణలతో వివిధ కళాకారులు చేసిన ప్రదర్శనలు... ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

07:12 - October 2, 2017

అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌ స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌-జ్ఞానల వివాహం ఘనంగా జరిగింది. అనంతపురం జిల్లా వెంకటాపురంలోజరిగిన ఈ వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ముందుగా వివాహ వేదిక వద్దకు చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... పరిటాల శ్రీరామ్‌-జ్ఞానలకు అక్షింతలు వేసి, ఆశీర్వదించారు. ఆ తర్వాత వివాహ వేదిక వద్దకు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి పరిటాల సునీత సాదర స్వాగతం పలికారు. కేసీఆర్‌ వెంట రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. పరిటాల శ్రీరామ్‌-జ్ఞానలను కేసీఆర్‌ ఆశీర్వదించారు. అనంతరం కేసీఆర్‌ వెంకటాపురంలోని పరిటాల రవీంద్ర ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. పరిటాల సునీత, ఏపీ సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్‌ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు పలువురు రాజకీయ నాయకులు కేసీఆర్‌ వెంట ఉన్నారు.

సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబు సహా పలువురు సినీప్రముఖులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు శ్రీరామ్‌-జ్ఞానల వివాహానికి హీజరై వధూవరులను ఆశ్వీర్వదించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు... పరిటాల శ్రీరామ్‌కు ఫోన్‌ చేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. పరిటాల శ్రీరామ్‌ వివాహానికి హాజరైన కేసీఆర్‌... టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌తో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఐదు నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ రాజకీయాలపై కేసీఆర్‌ ఆరా తీసినట్టు సమాచారం. ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ నగరాపాలక సంస్థ ఎన్నికల్లో విజయానికి టీడీపీ అనుసరించిన వ్యూహంపై ఇద్దరు నేతలు చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయాలపై కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. 

07:09 - October 2, 2017

అనంతపురం : జిల్లాలో కియోకార్ల పరిశ్రమ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పుట్టపర్తి విమానాశ్రయంలో కియో ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. కార్ల పరిశ్రమపనులు జరుగుతున్న తీరును ఆరా తీశారు. ఈ సమావేశంలో కర్నూలుజిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

07:08 - October 2, 2017

కర్నూలు : జిల్లా బనగానపల్లె అంధకారంలో చిక్కుకుంది. ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాలువకు గండిపడటంతో పట్టణంలోకి నీరు పోటెత్తింది. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లోకి భారీగా నీరు చేరడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆదివారం మధ్యాహ్నం కాలువకు గండిపడటంతో పట్టణంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వీధులన్నీ నీరు చేరడంతో దుకాణాలు మూసివేశారు. వర్షంలేని వరద కర్నూలు జిల్లా బనగానపల్లె ప్రజలను భయాందోళనకు గురిచేసింది. పట్టణానికి సమీపంలోని శ్రీశైలం ప్రధాన కుడికాల్వకు గండిపడటంతో నీరంతా బనగానపల్లెను ముంచెత్తింది.

ఆర్టీసీ బస్టాండ్‌లోకి మోకాలిలోతు నీరుచేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సులన్నీ డిపోలోనే ఉండిపోయాయి. ప్యాపిలి రహదారిలో నీరు రోడ్డుకు అడ్డంగా ప్రవహిస్తుండటంతో ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీగా నీరు చేరడంతో బనగానపల్లెలో షాపులన్నీ మూతపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని గండి పూడ్చే పనులను పర్యవేక్షించారు. నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి అధికారులు పాణ్యం దగ్గర బైపాస్‌ కెనాల్‌ను మూసివేశారు. దీంతో కాల్వలో నీటిప్రవాహం నెమ్మదించింది. పలుచోట్ల కాల్వకట్టలు బలహీనపడినా.. ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడంకోక పోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు అంటున్నారు. బనగానపల్లె సమీపంలో మొదట స్వల్ప లీకేజీ ఏర్పడి సమయంలో అధికారులెవరూ పట్టించుకోలేదనే ఆరోపణలొస్తున్నాయి. నిర్లక్ష్యం ఫలితంగా నీరంతా వృధాగా పోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తిరుమలలో ఆర్జిత సేవల పునరుద్ధరణ..

చిత్తూరు : తిరుమలలో నేటి నుండి ఆర్జిత సేవలు పునరుద్ధరణ జరుగనుంది. నేడు శ్రీవారి ఆలయంలో బాగ్ సవారి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 

లక్ష గృహాల ప్రారంభం..

విజయవాడ : నేడు ఏపీలో లక్ష గృహాల ప్రారంభ కార్యక్రమం జరుగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 

ఆసుపత్రుల బంద్..

ఖమ్మం : పట్టణంలో ఆసుపత్రుల బంద్ కు ఐఎంఏ పిలుపునిచ్చింది. డాక్టర్లపై దాడులకు నిరసనగా ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు వైద్యులు ఒక రోజు సత్యాగ్రహం పాటించనున్నారు. 

పలు జిల్లాల్లో మంత్రి హరీష్ పర్యటన..

హైదరాబాద్ : నేడు జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. ఉదయం 10.15 గంటలకు పాలేరు పాత కాలువ ఆధునీకరణ పనులను ప్రారంభించనున్నారు. ఉదయం 11.30 గంటలకు జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో పాలెంవాగు ప్రాజెక్టు ప్రారంభం..మధ్యాహ్నం 02.30 గంటలకు కొత్తగూడెం జిల్లా అంజనాపురం దగ్గర కిన్నెరసాని లెఫ్ట్ కెనాల్ లను ప్రారంభించనున్నారు. 

భారత్ నెంబర్ 1..

హైదరాబాద్ : నాగ్ పూర్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్ లో 4-1తో భారత్ కైవసం చేసుకుంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తిరిగి నం.1 స్థానానికి భారత్ చేరుకుంది. ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేయగా భారత్ 3 మూడు వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. 

Don't Miss